ఈ ఏడాది బాలీవుడ్ మూవీలు ఫుల్ స్వింగ్ మీదున్నాయి. ఇండియన్ ఆర్మీ సాహసాలు, నాటి వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి తెగువ, గల్లీ నుంచి వచ్చిన కుర్రాడు సాధించిన విజయాల నేపథ్యంలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. నిలకడ వసూళ్లతో రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి.
భారత ఆర్మీ చేపట్టిన సర్జికల్‌స్ట్రైక్ ఆధారంగా తెరకెక్కిన యూరీ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి.. 200కోట్లను కలెక్ట్ చేసి దాటేసి 250కోట్లకు పరుగెడుతోంది. వికాస్‌కౌశల్, యామీ గౌతమ్ లాంటి చిన్న నటులతో తెరకెక్కించిన ఈ మూవీ.. ఇప్పటికీ హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇక కంగనా రనౌత్ నటించిన మణికర్ణిక వివాదాల నడుమ భారీగా కలెక్షన్లను కొల్లగొడుతోంది. ఇప్పటికే ఈ మూవీ వంద కోట్లను కలెక్ట్ చేసింది. గతేడాది చివర్లో ‘సింబా’గా వచ్చిన రణ్‌వీర్ సింగ్.. దాదాపు 250కోట్లు కొల్లగొట్టాడు. మళ్లీ చిన్న గ్యాప్‌తో.. ‘గల్లీబాయ్’గా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసేస్తున్నాడు. వారం రోజుల్లోనే ఈ సినిమా వందకోట్లను కలెక్ట్ చేసేస్తుందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment