Gully Boy
-
30 వేల కోట్ల రూపాయల అధిపతికి నచ్చిన ‘గల్లీ’ సినిమా
వేదాంత గ్రూప్ ఫౌండర్ కమ్ చైర్మన్ అనిల్ అగర్వాల్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారాడు. యువతలో స్ఫూర్తి నింపేందుకు తన జీవిత అనుభవాలను పంచుకుంటున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇంగ్లీష్ ఒక్క ముక్క రాకుండా ముంబైలో తాను అడుగు పెట్టినప్పటి నుంచి ఈ రోజు ముప్పై వేల కోట్ల రూపాయల అధిపతిగా మారే వరకు జరిగిన ప్రస్థానాన్ని వివరిస్తున్నారు. తాను కన్న కలలు, వాటిని సాకారం చేసుకోవడంలో ఎదురైన సవాళ్లను, వాటిని తాను అధిగమించిన తీరును పూసగుచ్చినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో తన మససుకు నచ్చిన ఓ సినిమా గురించి ఆయన చెప్పారు. జోయా అక్తర్ దర్శకత్వంలో 2019లో రణ్‌వీర్‌సింగ్ కథానాయకుడిగా వచ్చిన గల్లీబాయ్ సినిమా క్లిప్‌ను ఆయన ట్విటర్లో షేర్ చేశారు. ఇందులో గల్లీబాయ్ ర్యాపర్‌గా ఎదిగే క్రమాన్ని చక్కగా వెండితెరపై ఆవిష్కరించారు. ధైర్యం ఉన్న వాళ్లే కలలు కంటారని వాటిని నెరవేర్చుకునే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయని ఆఖరికి సొంత తండ్రి కూడా నమ్మని సమయంలోనూ మురాద్ (రణ్‌వీర్‌సింగ్) ధైర్యం కోల్పోకుండా తన లక్ష్యాన్ని చేరుకున్నాడని వివరించారు. గల్లీబాయ్ నిజంగా స్ఫూర్తిని నింపే సినిమా అంటూ అనిల్ అగర్వాల్ ప్రశంసించారు. This was truly a moving scene. In a world that constantly tries to tie you down, dreaming big is an act of courage. Gully Boy was a reminder to anyone who has nursed a dream, any dream. Don't lose hope kyunki apna time aayega! https://t.co/1ZTaKeW17T — Anil Agarwal (@AnilAgarwal_Ved) June 14, 2022 చదవండి: ఆనంద్ మహీంద్రాకు ఆర్బీఐ బంపరాఫర్! -
అతి చిన్న వయసులో ర్యాపర్ మృతి.. ఇదే చివరి వీడియో
Gully Boy Fame Rapper MC Tod Fod Dies At Age 24 This Is The Last Video: బాలీవుడ్ ర్యాపర్ ధర్మేష్ పర్మార్ అకాల మరణం చెందాడు. ఎంసీ టాడ్ ఫాడ్గా పాపులారిటీ సంపాదించుకున్న ధర్మేష్ 24 ఏళ్ల వయసులో మరణించాడు. అయితే ఎంసీ టాడ్ ఫాడ్ మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. యంగ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'గల్లీ బాయ్'లో ఇండియా 91 ట్రాక్ కోసం ర్యాప్ చేశాడు ధర్మేష్. ర్యాపర్ టాడ్ ఫాడ్ మృతిపట్ల ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అతని అకాల మరణం పట్ల చింతిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో గల్లీ బాయ్ మూవీలో నటించిన రణ్వీర్ సింగ్, సిద్ధాంత్ చతుర్వేది ర్యాపర్ దర్మేష్ పర్మార్‌కు నివాళులు అర్పించారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ర్యాపర్ టాడ్ ఫాడ్ ఫొటో షేర్ చేస్తూ హార్ట్ బ్రోకెన్ ఎమోజీని యాడ్ చేశాడు రణ్వీర్ సింగ్. అలాగే ర్యాపర్‌తో జరిగిన సంభాషణ స్క్రీన్ షాట్‌ను పంచుకుంటూ 'రెస్ట్ ఇన్ పీస్ భాయ్' అని రాసుకొచ్చాడు సిద్ధాంత్ చతుర్వేది. 'మీరు చాలా త్వరగా వెళ్లిపోయారు. మన మార్గాలు వేరయ్యాయి. కానీ మీరు చేసినదానికి కృతజ్ఞతతో ఉండగలను. రెస్ట్ ఇన్ పీస్ బంటాయి.' అని గల్లీ బాయ్ మూవీ డైరెక్టర్ జోయా అక్తర్ పోస్ట్ చేశారు. జోయా అక్తర్ నిర్మాణ సంస్థ టైగర్ బేబీ ఫిల్మ్స్ నివాళులు తెలిపింది. View this post on Instagram A post shared by Zoya Akhtar (@zoieakhtar) ఎంసీ టాడ్ ఫాడ్ సభ్యుడిగా ఉన్న 'స్వదేశీ బ్యాండ్' తన అధికార పేజీలో అతని త్రోబ్యాక్ ప్రదర్శన వీడియోను షేర్ చేసింది. 'ఈ రాత్రే టాడ్ ఫాడ్ స్వదేశీ మేళాలో తన చివరి ప్రదర్శన ఇచ్చారు. అతని లైవ్ మ్యూజిక్ థ్రిల్, ప్యాషన్‌ను అనుభూతి చెందాలంటే మీరు అక్కడ ఉండాల్సింది. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేరు. మీరు ఎల్లప్పుడూ మీ సంగీతంతో జీవిస్తారు.' అంటూ రాసుకొచ్చింది స్వదేశీ బ్యాండ్. View this post on Instagram A post shared by Swadesi (@swadesimovement) -
ఆ నటుడితో పీకల్లోతు ప్రేమలో బిగ్‌బి మనవరాలు!
Navya Naveli Nanda Serious Relation With Gully Boy Actor Siddhant Chaturvedi : బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా ప్రేమ వ్యవహరం మరోసారి వార్తల్లో నిలిచింది. నవ్య సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆమెకు సంబంధించిన విషయాలు తరచూ వార్తల్లోకెక్కుతుంటాయి. ఇప్పటికే ఆమె బాలీవుడ్ యువ నటుడు మీజాన్ జాఫేరీ ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. ఇక దీనిపై మీజాన్ తండ్రి జావేద్ స్పందిస్తూ వాళ్లు మంచి స్నేహితులు మాత్రమే అని క్లారిటీ ఇచ్చాడు. చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతోన్న మరో బాలీవుడ్ ప్రేమ జంట అలాగే మీజాన్ కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నవ్వ, తాను మంచి స్నేహితులమంటూ వారిద్దరి రిలేషన్‌పై వస్తున్న వార్తలను ఖండించాడు. దీంతో ఈ పుకార్లకు ఫుల్స్టాప్ పడింది. ఈ నేపథ్యంలో నవ్వ మరో నటుడితో ప్రేమలో ఉన్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. ‘గల్లీబాయ్’ సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధాంత్ చతుర్వేది-నవ్యలు పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారని, ఇద్దరు సీరియస్ రిలేషన్లో ఉన్నట్లు బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేగాక వీరిద్దరూ కలిసి సీక్రెట్‌గా ప్రేమ వ్యవహరం నడిపిస్తున్నట్లు సన్నిహితుల నుంచి సమాచారం. చదవండి: నా కొడుకువైనందుకు గర్వంగా ఉంది: అమితాబ్ కాగా నవ్య తాను సినిమాల్లో నటించనని స్పష్టం చేస్తూ ఇటీవల వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన ఫ్యామిలీ బిజినెస్‌తో పాటు మహిళా ఆరోగ్యానికి సంబంధించిన ఓ ఫౌండేషన్‌లో మెంబర్‌గా వ్యవహరిస్తోంది. ఇక సిద్దాంత్ చతుర్వేది ‘గల్లీబాయ్’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులకు ఆకట్టుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతడు ‘బంటీ అండ్ బాబ్లీ 2’ మూవీలో నటిస్తున్నాడు. ఇందులో సైఫ్ అలీ ఖాన్, రాణి ముఖర్జీలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
నా కోసం కూడా అవార్డు కొనాలి కదా!
బాలీవుడ్లో సినిమా అవార్డులను ప్రతిభ ఆధారంగా కాకుండా డబ్బులిచ్చి కొనుక్కుంటారన్నా ఆరోపణల్ని 'గల్లీబాయ్' ఫేం నటుడు విజయ్ వర్మ ఖండించారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ.. ''గల్లీబాయ్ చిత్రానికి గానూ ఈ ఏడాది 13 ఫిల్మఫేర్ అవార్డులు దక్కాయి. దీనిపై కొద్దిమంది లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. చిత్ర బృందం డబ్బులిచ్చి అవార్డులు కొనుగోలు చేసి ఉంటే మరి నాకోసం కూడా ఓ అవార్డును కొనుగోలు చేయాలి కదా? మరి నాకెందుకు అవార్డు రాలేదు? వివిధ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో నేను నామినేట్ అయినటప్పటికీ ఇప్పటి వరకు ఒక్క అవార్డు కూడా దక్కలేదు. ఒకవేళ నిజంగానే గల్లీబాయ్ బృందం డబ్బులిచ్చి అవార్డులు కొని ఉంటే ఉత్తమ సహాయ నటుడి పాత్రకు నాకు కూడా అవార్డు దక్కి ఉండేది కదా? మరి 13 అవార్డులు కొన్నప్పుడు నాకోసం కొనకుండా ఉంటారా? వాళ్లు నాతో చాలా ప్రాజెక్టులు చేశారు. మరి ఈ స్నేహంతోనైనా అవార్డు కొని ఉండేవారు కదా'' అంటూ ప్రశ్నించారు. కేవలం ఒక్కరు మాత్రమే గల్లీబాయ్ సినిమా అవార్డులకు సంబంధించి తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నార్నారు. అవార్డులపై చేస్తోన్న ఆరోపణలు నిరాధారణమైనవంటూ కొట్టిపారేశారు. చిత్ర యూనిటల్కు తాను అండగా ఉంటానని తెలిపారు. (దానికంటే అవార్డు పెద్దది కాదు) గల్లీబాయ్ చిత్రంలో డ్రగ్ పెడ్లర్‌గా విజయ్ అద్భుతమైన నటనకు పలు ప్రశంసలు దక్కాయి. ఇక బాలీవుడ్లో బందుప్రీతి (నెపోటిజం )పై వస్తోన్న విమర్శలపై స్పందించడానికి ఇష్టపడలేదు. కానీ ఒక సమస్యను అడ్రస్ చేసినప్పుడు దాన్ని నిజంగా పరిష్కరించాలన్న ఉద్దేశం ఉండాలే కానీ ఒకరిపై ఒకరు బురద చల్లాలనుకోవడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. గల్లీ బాయ్ చిత్రానికి ఈ ఏడాది 13 అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. ఉత్తమ దర్శకుడిగా జోయా, ఉత్తమ నటుడిగా రణ్‌వీర్‌సింగ్, ఉత్తమ నటిగా ఆలియా భట్ సహా వివిధ అవార్డులు దక్కాయి. సుశాంత్ మరణానంతరం బాలీవుడ్లో ఎప్పటినుంచో ఉన్న నెపోటిజంపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో పాటు అవార్డులు అంశంలోనూ పక్షపాత దోరణి ఉంటుందని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. (సుశాంత్ కెరీర్‌ను బాలీవుడ్ మాఫియా నాశనం చేసింది) View this post on Instagram #1YearOfGullyBoy This film gave me new wings to fly. Thank u @zoieakhtar and thank u #GullyBoy #gratitude #vadevadewowwow A post shared by Vijay Varma (@itsvijayvarma) on Feb 13, 2020 at 11:01pm PST -
బూసాన్‌కు గల్లీబాయ్
ఈ ఏడాది భారతదేశం తరపున ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన ‘గల్లీబాయ్’ ప్రస్తుతం సౌత్ కొరియాకు వెళ్లనుంది. సౌత్ కొరియాలో జరగనున్న బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ‘గల్లీ బాయ్’ ఎంపికైంది. ఈ చిత్రోత్సవాల్లో ‘రిక్వెస్ట్ సినిమా స్క్రీనింగ్’ విభాగంలో ఈ సినిమా ఎంపికైంది. జోయా అక్తర్ దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్, ఆలియా భట్ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ఇది. ముంబై మురికి వాడల్లో నివసించే ర్యాపర్ కథే ఈ చిత్రం. -
నా బయోపిక్‌లో ఆయనే హీరో: యువరాజ్
సినిమాల్లో ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతుంటుంది. ప్రస్తుతం సినిమాల్లో నడుస్తున్న ట్రెండ్ బయోపిక్స్. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఇప్పుడు ఈ ట్రెండే నడుస్తుంది. ఫేమస్ పర్సనాలిటీల లైఫ్ స్టోరీలను తెరమీదకు తీసుకురావడానికి పోటీపడుతున్నారు. సినిమా స్టార్, బిజినెస్ మాన్, పొలిటీషియన్లతో పాటు క్రికెటర్ల లైఫ్ స్టోరీస్ కూడా బయోపిక్‌ల రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్ల బయోపిక్‌లు తెరకెక్కగా, ఇప్పుడు ఇండియన్ గ్రేట్ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ కూడా రూపొందిస్తున్నారు. ఇప్పుడు అదే కోవలో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్ కూడా తన బయోపిక్‌లో నటించే హీరో ఎవరో తెలియజేశారు. చదవండి: యువ కోచ్‌ను కబలించిన కరోనా ఈ మధ్య ఓ ఇంటర్యూలో యువీ కూడా బయోపిక్‌పై మాట్లాడుతూ.. ‘వాస్తవానికి నా బయోపిక్‌లో నేనే నటిస్తాను. కానీ దీన్ని బాలీవుడ్ చిత్రంగా తెరకెక్కిస్తారు కనుక హీరోను డైరెక్టర్ సెలెక్ట్ చేస్తారు. నాకైతే సిద్దాంత్ చతుర్వేది మంచి ఆప్షన్. ‘గల్లీబాయ్' చిత్రంలో అతను చేసిన షేర్ పాత్ర అద్భుతంగా ఉంది. ఆ చిత్రంలో అతన్ని అలా చూడటం బాగా నచ్చింది' అని యువీ తెలిపారు. తన జీవితాన్ని తెరపై చూపించడానికి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ‘గల్లీ బాయ్' చిత్రంతో సిద్ధాంత్‌కు దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఐపీఎల్ నేపథ్యంలో తెరకెక్కిన ఇన్సైడ్ ఎడ్జ్ వెబ్ సిరీస్‌లో కూడా సిద్దాంత్ నటించారు. ఈ సిరీస్‌లో టీమిండియా వెటరన్ బౌలర్ శ్రీశాంత్‌ను పోలి ఉండే ప్రశాంత్ కనుజ పాత్ర పోషించారు. ఇది కూడా అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. కాగా.. గతేడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యువీ భారత క్రికెట్‌కు ఎనలేని సేవలు అందించాడు. ముఖ్యంగా 2011 ప్రపంచకప్‌లో ధోని సేన టైటిల్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించారు. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లో రాణించి మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచారు. అనంతరం ప్రాణాంతక క్యాన్సర్‌ను జయించిన యువరాజ్.. మళ్లీ బ్యాట్ పట్టి మెరుపులు మెరిపించారు. ఇలా భారత్ క్రికెట్లో తన ఆటతో అభిమానుల గుండెల్లో చెరుగని ముద్రవేసుకొని ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు. చదవండి: ప్రేక్షకులు లేకుండానే గ్రాండ్‌ప్రి ఈవెంట్లు -
'గల్లీ బాయ్'కి అవార్డుల పంట
బాలీవుడ్లో ఏటా అట్టహాసంగా నిర్వహించే ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ 65వ అమెజాన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2020 వేడుకకు బాలీవుడ్ నటీనటులు తరలివచ్చారు. ఈ వేడుకకు నిర్మాత కరణ్‌జోహార్, నటుడు విక్కీ కౌశల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అసోంలోని గువాహటిలో ఉన్న ఇందిరా గాంధీ అథ్లెటిక్ స్టేడియంలో ఈ వేడుకను నిర్వహించారు. 2019లో బాలీవుడ్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారికి అవార్డులు ప్రధానం చేశారు. రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించిన ‘గల్లీ బాయ్’ సినిమా ఏకంగా 13 అవార్డులను సొంతం చేసుకుంది. ఫిలిం ఫేర్ వేడుకలో రణ్వీర్ సింగ్, కార్తీక్ ఆర్యన్, మాధురీ దీక్షిత్ తమ డ్యాన్సులతో అదరగొట్టారు. ఇక ఈ అవార్డ్స్‌లో 'గల్లీ బాయ్' సినిమా ఎక్కువ అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ దర్శకురాలిగా జోయా అక్తర్, ఉత్తమ నటుడుగా రణ్వీర్ సింగ్, ఉత్తమ నటిగా ఆలియాభట్, ఉత్తమ సహాయ నటుడుగా సిద్ధాంత్ చతుర్వేది. అవార్డులను గెలుచుకున్నారు. .@akshaykumar brings the house down with his unreal energy at the #AmazonFilmfareAwards. @AmazonFashionIn @amazonIN pic.twitter.com/naUGM7RtLi — Filmfare (@filmfare) February 15, 2020 65వ అమెజాన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ విజేతలు.. ఉత్తమ నటుడు – రణ్వీర్ సింగ్ ఉత్తమ నటి – ఆలియా భట్ ఉత్తమ చిత్రం – గల్లీ బాయ్ ఉత్తమ డైరెక్టర్ – జోయా అక్తర్ (గల్లీ బాయ్) ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) – సోంచిడియా, ఆర్టికల్ 15 ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – ఆయుష్మాన్ ఖురానా (ఆర్టికల్ 15) ఉత్తమ నటి (క్రిటిక్స్) – తాప్సి, భూమి పెడ్నేకర్ (సాండ్ కి ఆంఖ్) ఉత్తమ సహాయ నటుడు – సిద్ధాంత్ చతర్వేది (గల్లీ బాయ్) ఉత్తమ సహాయనటి – అమృతా సుభాష్ (గల్లీ బాయ్) ఉత్తమ లిరిక్స్ – డివైన్, అంకుర్ తివారి (సాంగ్ : అప్నా టైమ్ ఆయేగా) బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ – గల్లీ బాయ్, కబీర్ సింగ్ ఉత్తమ నేపథ్య గాయని – శిల్పా రావ్ (సాంగ్: ఘుంగ్రూ) ఉత్తమ నేపథ్య గాయకుడు – అర్జీత్ సింగ్ (సాంగ్: కలంక్ నహి) ఉత్తమ తొలిపరిచయ నటుడు – అభిమన్యు దస్సాని (మర్ద్ కో దర్ద్ నహీ హోతా) ఉత్తమ తొలిపరిచయ నటి – అనన్య పాండే (స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2) ఉత్తమ తొలి పరిచయ దర్శకుడు – ఆదిత్య ధార్ (ఉరి: ది సర్జికల్ స్ట్రైక్) ఉత్తమ యాక్షన్ – పాల్ జెన్నింగ్స్, ఓ సీ యంగ్, పర్వేజ్ షేక్, ఫ్రాంజ్ స్పిల్హాస్ (వార్) ఉత్తమ కొరియోగ్రాఫర్ – రెమో డిసౌజా (సాంగ్ : ఘర్ మోరే పర్దేశియా) ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ – కర్ష్ కాలే, ది సాల్వేజ్ ఆడియో కలెక్టివ్ (గల్లీ బాయ్) ఉత్తమ కాస్ట్యూమ్ – దివ్య గంభీర్, నిధి గంభీర్ (సోంచిడియా) ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – జాయ్ ఓజా (గల్లీ బాయ్) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – సుజన్నే కప్లాన్ మేర్వాన్‌జి (గల్లీ బాయ్) ఉత్తమ ఎడిటింగ్ – శివకుమార్ వి పనికెర్ (ఉరి: ది సర్జికల్ స్ట్రైక్) ఉత్తమ వీఎఫ్ఎక్స్ – షెర్రీ భార్దా, విశాల్ ఆనంద్ (వార్) ఉత్తమ సౌండ్ డిజైన్ – విశ్వదీప్ ఛటర్జీ, నిహార్ రంజన్ సామల్ (ఉరి: ది సర్జికల్ స్ట్రైక్) ఉత్తమ స్క్రీన్‌ప్లే – రీమా కగ్తి, జోయా అక్తర్ ఉత్తమ మాటల రచయిత – విజయ్ మౌర్య (గల్లీ బాయ్) -
అంత బాగా చేశానా!
‘గల్లీ బాయ్’ సినిమా విడుదలై ఏడాది అవుతోంది. 40 కోట్లు పెట్టి తీస్తే, 240 కోట్లు వచ్చాయి! అందులో అలియా భట్ నటన కోట్ల రూపాయల్ని మించిపోయింది. ఏడాదిగా అందరూ అలియాను ప్రశంసిస్తున్నవారే. ఆస్కార్ అవార్డుల నామినేషన్‌కు ఎంపికై, నామినేషన్‌ను దక్కించుకోక పోయినప్పటికీ.. ‘‘గల్లీ బాయ్ అలియాకు ఆస్కార్ లాంటిదే’ అని అలియాకు అభిమానులు అయినవారు, కానివారు కూడా అంటుంటే అలియా ఆ ‘భారాన్ని’ మోయలేకపోతున్నారు. ‘‘నిజంగా నేను అంత బాగా చేశానా అనిపిస్తోంది. ఇంకొక సందేహం కూడా వస్తోంది. ఈ అభినందనలకు నేను అర్హురాలినేనా అని! నాక్కూడా ఆ సినిమాలో నా పాత్ర నచ్చింది కానీ, ప్రేక్షకులకు మరీ ఇంత బాగా నచ్చడమే నన్ను ఆత్మన్యూనతకు గురి చేస్తోంది’’ అని బుధవారం ముంబై మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అన్నారు అలియా. అలియా సెల్ఫ్ క్రిటిక్. స్వీయ విమర్శ చేసుకుంటారు. ఎవరైనా విమర్శించినా సంతోషంగా స్వీకరిస్తారు. గల్లీ బాయ్‌లో అంత బాగా చేశాక కూడా.. ‘డిడ్ ఐ వర్క్ హార్డ్’ అని తనను తను ప్రశ్నించుకుంటున్నారంటే.. ఇప్పుడు ఆమె చేస్తున్న ‘సడక్ 2’లో మరింత బాగా నటించబోతున్నారనే అనుకోవాలి. -
ఈసారీ ఆస్కారం లేదు!
మరో ఏడాది. మరో నిరాశ. మరో నిరుత్సాహం. ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్‌ని అందుకోవాలనే ఆశ అలానే మిగిలిపోనుంది. 92వ ఆస్కార్ అవార్డులకి ఈ ఏడాది మన దేశం నుంచి అఫీషియల్ ఎంట్రీగా నిలిచిన హిందీ చిత్రం ‘గల్లీ బాయ్’ ఆస్కార్ విడుదల చేసిన షార్ట్ లిస్ట్‌లో చోటు సాధించలేకపోయింది. ఆస్కార్ ఆశల్ని తొలి దశలోనే తుంచేసింది. ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్ పోటీల్లో మన దేశం తరఫున నిలబడటానికి ఈ ఏడాది 28 సినిమాలు పోటీపడ్డాయి. ప్రపంచంవ్యాప్తంగా ఈ విభాగంలో 91 సినిమాలు ఆయా దేశాలు నుంచి నామినేట్ చేశారు. మన దేశం తరఫున ‘గల్లీ బాయ్’ని పంపాం. రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జోడీగా జోయా అక్తర్ తెరకెక్కించిన చిత్రం ‘గల్లీ బాయ్’. ర్యాపర్ కావాలనుకునే ముంబై మురికివాడ కుర్రాడిగా ఇందులో రణ్వీర్ కనిపించారు. ర్యాపర్‌గా తన కలను ఎలా చేరుకున్నాడు అన్నది కథ. 40 కోట్లతో తీస్తే 200 కోట్లకు పైగా వసూలు చేసింది ‘గల్లీ బాయ్’. అయితే ఆస్కార్ నామినేషన్ దక్కించుకోలేదు. 91 సినిమాలను ఫిల్టర్ చేసి పది సినిమాలకు కుదించి షార్ట్ లిస్ట్‌ను ప్రకటించింది ఆస్కార్. ఈ పది సినిమాల జాబితాలోకి ‘గల్లీ బాయ్’ ప్రవేశించలేకపోయాడు. 92వ ఆస్కార్ అవార్డులకు సంబంధించిన నామినేషన్స్ షార్ట్ లిస్ట్‌ను మంగళవారం ప్రకటించింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. 9 విభాగల ఈ జాబితాలో విభాగానికో పది సినిమాలను షార్ట్‌లిస్ట్ చేసి ప్రకటించారు. ఉత్తమ విదేశీ చిత్రం, డాక్యుమెంటరీ మూవీ, డాక్యుమెంటరీ షార్ట్, మేకప్ అండ్ హెయిర్ స్టయిల్, మ్యూజిక్ (ఒరిజినల్ స్కోర్), మ్యూజిక్ (ఒరిజినల్ సాంగ్), లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్, యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో ఎంపికయిన చిత్రాల జాబితాను విడుదల చేసింది. ఆ తర్వాత ఒక్కో విభాగంలో 5 సినిమాలను తుది జాబితాగా పరిగణించి ఒక్క సినిమాకి అవార్డు ప్రదానం చేస్తారు. ఆస్కార్ నామినేషన్ ఓటింగ్స్ వచ్చే ఏడాది జనవరి 2న ప్రారంభం కానున్నాయి. జనవరి 7 వరకూ ఓటింగ్ నడుస్తూనే ఉంటుంది. ఆ జాబితాను జనవరి 13న ప్రకటిస్తారు. దాని తర్వాత జనవరి 30న తుది జాబితాకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మొదలువుతుంది. ఫిబ్రవరి 4 వరకూ ఈ ఓటింగ్ సాగుతుంది. ఐదు రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 9న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. హాలీవుడ్ అండ్ హైల్యాండ్ సెంటర్లో జరగబోయే 92వ ఆస్కార్ వేడుక ఏబీసీ టెలివిజన్‌లో ప్రసారం కానుంది. సుమారు 225 దేశాల్లో ఆస్కార్ వేడుక ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఆస్కార్ అవార్డులు సినిమా ప్రియులకు పండుగే. కానీ హాలీవుడ్ చిత్రాల కోసం ఏర్పాటు చేసుకున్న ఈ ఫంక్షన్‌ను అన్ని దేశాల వాళ్లు ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇన్ని వందల సినిమాల్లో ఒక్క దేశం ఆస్కార్ దక్కించుకోకపోతే చిన్నబోవాల్సిన అవసరం ఏంటి? అనే వాదనలూ ఉన్నాయి. ‘ఆస్కార్ అవార్డులు ప్రపంచ స్థాయివేం కాదు. చాలా లోకల్ అవార్డులు’ అని అభిప్రాయపడ్డారు కొరియన్ సినిమా ‘ప్యారసైట్’ దర్శకుడు బాంగ్ జూన్–హో. ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది. మన ప్రయత్నం మనం చేద్దాం. ఫలితం ఆస్కార్ ఓటింగ్‌కి వదిలేద్దాం! ప్రతి ఏడాది ఇస్తూ వస్తున్న ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీను ఈసారి ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్‌గా పేరు మార్చారు. ఈ ఏడాది ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఎంపికయిన సినిమాలు. 1. ది పెయింటెడ్ బర్డ్ (చెక్ రిపబ్లిక్), 2. ట్రూత్ అండ్ జస్టిస్ (ఎస్టోనియా), 3. లెస్ మిసరబుల్స్ (ఫ్రాన్స్), 4. దోస్ హూ రిమైండ్ (హంగేరి), 5. హనీ ల్యాండ్ (నార్త్ మెకడోనియా), 6. కోర్పస్ క్రిస్టీ (పోల్యాండ్), 7. ‘బీన్ పోల్ (రష్యా), 8. అట్లాంటిక్స్ (సెనెగల్), 9. ప్యారసైట్ (సౌత్ కొరియా), 10. పెయిన్ అండ్ గ్లోరీ (స్పెయిన్). మార్వెల్ వర్సెస్ డీసీ ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ కామిక్ బుక్స్ నుంచి సూపర్ హీరోల సినిమాలు తీసి బస్టర్స్ సాధి స్తుంటాయి నిర్మాణ సంస్థలు. కానీ ఆ సినిమాలను పెద్దగా పరిగణలోకి తీసుకోదు ఆస్కార్. టెక్నికల్ విభాగాల్లో కొన్నిసార్లు అవార్డు ఇచ్చి వెన్ను తట్టింది కానీ సూపర్ హీరో సినిమాలంటే ఆస్కార్‌కి చిన్న చూపే. అయితే ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన సూపర్ హీరో ‘అవెంజర్స్ ఎండ్ గేమ్, జోకర్, కెప్టెన్ మార్వెల్’ వివిధ విభాగాల్లో నామినేషన్లు దక్కించుకున్నాయి. మార్వెల్ సంస్థ నుంచి వచి్చన ‘ఎండ్ గేమ్’ బెస్ట్ మ్యూజిక్ (ఒరిజినల్ స్కోర్), విజువల్ ఎఫెక్ట్స్ విభాగల్లో, ‘కెప్టెన్ మార్వెల్’ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో నామినేట్ అయ్యాయి. డీసీ సంస్థ ఆస్కార్ బాధ్యతను ‘జోకర్’ భుజాలపై ఉంచింది. ఒరిజినల్ స్కోర్, మేకప్ అండ్ హెయిర్ స్టయిల్ విభాగాల్లో ‘జోకర్’ సినిమా నామినేట్ అయింది. చాన్స్ ఎవరికి? ప్యారసైట్ ఈ ఏడాది ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ దక్కే ఛాన్స్ ఎక్కువగా సౌత్ కొరియా చిత్రం ‘ప్యారసైట్’కి ఉందని విశ్లేషకుల అంచనా. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ఈ సినిమా ఉత్తమ చిత్రంగా నిలిచింది. ప్రస్తుతానికైతే చాలామంది హాట్ ఫేవరెట్ ‘ప్యారసైట్’. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. -
కాపీ సినిమాకు ఆస్కార్ ఎందుకివ్వాలి?
బాలీవుడ్లో హీరోయిన్ కంగనా రనౌత్ ఎంత ఫేమసో.. ఆమె సోదరి రంగోలీ చందేల్ అంతకన్నా పాపులర్. గతంలో హృతిక్‌రోషన్, దర్శకుడు క్రిష్, మహేశ్‌భట్, తాప్సీ, కరణ్ జోహార్, అలియా భట్ ఇలా ఎందరిపైనో మాటల దాడికి దిగింది రంగోలీ. తాజాగా ఆమె సినీ నటులను కాకుండా ఓ బాలీవుడ్ సినిమాను టార్గెట్ చేసింది. భారత్ తరపున ఆస్కార్ నామినేషన్‌కు ఎంపికైన గల్లీబాయ్ ఆస్కార్ రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గల్లీబాయ్ చిత్రంపై రంగోలీ తీవ్ర విమర్శలు చేసింది. ‘8 మైల్ అనే హాలీవుడ్ సినిమా ఆధారంగా ‘గల్లీబాయ్’ తెరకెక్కించారు. సినిమా బాగుందని ప్రచారం చేయడానికి సినీ విమర్శకులకు ఎంతిచ్చారో ఎవరికి తెలుసు? యురి, మణికర్ణిక వంటి సినిమాల్లాగా ఇది ఒరిజినల్ కథ కాదు. హాలీవుడ్ నుంచి కాపీ కొట్టిన చిత్రమే గల్లీబాయ్. అలాంటి సినిమాకు వాళ్లెందుకు అవార్డు ఇస్తారు’ అని రంగోలీ ప్రశ్నించింది. కాగా రణవీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన ‘గల్లీబాయ్’ ఫిబ్రవరి 14న విడుదలైన సంగతి తెలిసిందే. జోయా అక్తర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.238 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. భారత్ తరపున ఆస్కార్ నామినేషన్‌కు ఎంపికైంది. కానీ సోమవారం ప్రకటించిన టాప్ టెన్ చిత్రాల్లో చోటు దక్కకపోవడంతో ఆస్కార్ చేజారినట్టైంది. ఇక మదర్ ఇండియా, సలాం బాంబే, లగాన్ చిత్రాల తర్వాత మరే భారత సినిమా ఆస్కార్‌ను అందుకోలేకపోయాయి. -
ఇక 'గల్లీ బాయ్'కు ఆస్కార్ లేనట్టే!
ముంబై: ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ జోయా అక్తర్ తెరకెక్కించిన 'గల్లీ బాయ్' ఆస్కార్ రేసులో లేదు. సోమవారం 92వ ఆస్కార్ అవార్డులకు సంబంధించి ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విడుదల చేసిన టాప్ -10 అర్హత చిత్రాల లిస్ట్‌లో గల్లీబాయ్ పేరు లేదు. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ కింద ఆస్కార్‌కు అర్హత సాధించిన 91 చిత్రాల్లో చివరకు కేవలం 10 మాత్రమే ఆస్కార్ బరిలో నిలిచాయి. బాలీవుడ్ నటులు రణవీర్ సింగ్, అలియా భట్ జంటగా కలిసి నటించిన గల్లీ బాయ్ చిత్రం 92వ ఆస్కార్ అవార్డ్స్‌కు భారత్ తరఫున ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఎంపికైంది. కానీ ఆస్కార్ అవార్డుకు ఎంపిక చేసిన 10 చిత్రాల్లో గల్లీబాయ్ చోటు దక్కించుకోలేదు. కాగా ఫిబ్రవరి 9న ఆస్కార్ అవార్డుల కార్యక్రమం జరగనుంది. ఆస్కార్ బరికి ఎంపిక చేసిన పది చిత్రాలు: 1) ది పెయింటెడ్ బర్డ్ (చెక్ రిపబ్లిక్) 2) ట్రూత్ అండ్ జస్టిస్ (ఎస్టోనియా) 3) లెస్ మిజరబుల్స్ (ఫ్రాన్స్) 4) దోజ్ హు రిమెయిన్డ్ (హంగరీ) 5) హనీలాండ్ (నార్త్ మాసిడోనియా) 6) కార్పస్ క్రిస్టి (పోలాండ్) 7) బీన్పోల్ ( రష్యా) 8) అట్లాంటిక్స్ (సెనెగల్) 9) పారాసైట్ (దక్షిణ కొరియా) 10)పెయిన్ అండ్ గ్లోరీ (స్పెయిన్) -
ఆస్కార్స్‌కు గల్లీ బాయ్
‘అప్నా టైమ్ ఆయేగా!’... గల్లీ బాయ్ సినిమా ట్యాగ్‌లైన్ ఇది. అంటే ‘మన టైమ్ కూడా వస్తుంది’ అని అర్థం. ప్రఖ్యాత ర్యాప్ సింగర్ కావాలని కలలు కంటాడు ముంబై మురికివాడల్లో నివసించే మురాద్ అనే సాధారణ గల్లీ బాయ్. మురాద్ అంటే కోరిక అని అర్థం. తను బలంగా కోరుకున్నదాని కోసం కష్టపడి శ్రమిస్తాడు. ఏదో రోజు తన టైమ్ కూడా వస్తుందని నమ్ముతాడు. తను కలలు కన్నట్టే, కోరుకున్నట్టే టైమ్ వస్తుంది. ‘గల్లీ బాయ్’ పేరుతో ఫేమస్ ర్యాపర్ అవుతాడు. ఇప్పుడు ఆ గల్లీ బా యే 92వ ఆస్కార్‌కు మన దేశం తరఫున ‘ఉత్తమ విదేశీ చిత్రం’ విభాగంలో ఎంపిక అయ్యాడు. ఇ ప్పుడు ఆ గల్లీ బాయే ప్రపంచ ప్రఖ్యాత అవార్డ్ అయిన ఆస్కార్‌ను మనకు తీసుకురావాలని చాలామంది మురాద్. జోయా అక్తర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గల్లీ బాయ్’. ఆలియా భట్ కథానాయిక. 18 పాటలున్న ఈ సినిమా ఆల్బమ్‌లో దాదాపు 7 పాటలు రణ్వీర్ సింగ్ పాడటం (ర్యాప్ చేయడం) విశేషం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 92వ ఆస్కార్ అవార్డులకు రేస్ మొదలైంది. ఆస్కార్స్‌కు పంపబోయే చిత్రాలను ఎంపిక చేసే పనిలో పడ్డారు అందరూ. మన దేశం నుంచి ఈ ఏడాది ‘ఉత్తమ విదేశీ చిత్రం’ విభాగానికి పోటీపడే చిత్రానికి కోల్‌కత్తాలో ఎంపిక జరిగింది. 28 చిత్రాలు పోటీపడగా, ‘గల్లీ బాయ్’ ఫైనల్‌గా నిలిచింది. నటి, దర్శకురాలు అపర్ణా సేన్ ఆధ్వర్యంలో ఈ సెలక్షన్ జరిగింది. పోటీపడ్డ చిత్రాలు: హిందీ చిత్రాలు ‘అంధాధూన్, ఆర్టికల్ 15, బదాయి హో, బద్లా, కేసరి, గల్లీ బాయ్, ద తస్కెన్ట్ ఫైల్స్, ఉరి : ద సర్జికల్ స్ట్రయిక్, గోదే కో జలేబీ కిలానే లే జా రియా హూ, తెలుగు చిత్రం ‘డియర్ కామ్రేడ్’ మలయాళ చిత్రాలు ‘అండ్ ది ఆస్కార్ గోస్ టూ.., ఉయిరే, ఒలు, తమిళ సినిమాలు ఒత్త సెరుప్పు సైజ్ 7, వడ చెన్నై, సూపర్ డీలక్స్, మరాఠీ చిత్రాలు బాబా, ఆనంది గోపాల్, బందీషాలా, మై గాట్ : క్రైమ్ నెం 103/2005, అస్సామీ చిత్రం బుల్ బుల్ కెన్ సింగ్, గుజరాతీ చాల్ జీవీ లాయియే, గుజరాతీ సినిమా హెల్లోరి, కురుక్షేత్ర (కన్నడ), నేపాలీ చిత్రం పహూనా: ద లిటిల్ విజిటర్స్, బెంగాలీ చిత్రాలు తరీఖ్ : ఏ టైమ్‌లైన్, కోంతో, నగర్కీర్తన్లను పరిశీలనలోకి తీసుకున్నారు. బుధవారం మొదలైన ఈ ప్రక్రియ శనివారం సాయంత్రం వరకూ సాగింది. ఈ 28 సినిమాల్లో ఆయుష్మాన్ ఖురానా నటించిన మూడు సినిమాలు (అంధాధూన్, బదాయి హో, ఆర్టికల్ 15) ఉండటం విశేషం. ఈ సంవత్సరం ఉత్తమ చిత్రంగా ‘అంధాధూన్’, ఉత్తమ నటుడిగా ఆయుష్మాన్ ఖురానా జాతీయ అవార్డుకి ఎంపిక అయ్యారు. తెలుగు నుంచి కామ్రేడ్ ఒక్కడే గత ఏడాది తెలుగు నుంచి ‘రంగస్థలం, మహానటి’ సినిమాలు ఉత్తమ విదేశీ చిత్రానికి ఎంపికవ్వడం కోసం పోటీ పడ్డాయి. ఈసారి తెలుగు నుంచి ‘డియర్ కామ్రేడ్’ ఒక్క సినిమానే ఈ 28 సినిమాల్లో ఉంది. విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ నిర్మించాయి. -
ఆస్కార్ బరిలో ‘గల్లీబాయ్’
బాలీవుడ్ యంగ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన గల్లీ భాయ్ చిత్రం 92వ ఆస్కార్ అవార్డ్స్‌కు భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ఫరాన్ అక్తర్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది. రణ్వీర్ సింగ్, అలియా భట్ ప్రధాన పాత్రలో జోయా అక్తర్ తెరకెక్కించిన చిత్రం గల్లీ భాయ్. ఇందులో రణ్వీర్ మంచి సింగర్ కావాలని కలలు కంటుంటాడు. కానీ అతను ముంబై మురికి వాడల్లో తిరిగే సామాన్య వ్యక్తి కావడంతో అందరూ తక్కువగా చూస్తుంటారు. అతన్ని హేళన చేస్తూ మాట్లాడుతారు. చదువుకొమ్మని కాలేజ్‌కి పంపిస్తే పాటలు అంటూ రోడ్లపై తిరుగుతున్నాడని రణ్వీర్ తండ్రి కూడా కోప్పడతాడు. చివరకూ ఆ యువకుడు ఇండియాలోనే టాప్ ర్యాపర్‌గా ఎదిగిన తీరును ఈ మూవీలో చూపించారు. -
ర్యాప్‌దే హవా
బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ కెరీర్లో ‘గల్లీభాయ్’ వన్నాఫ్ ది బెస్ట్ మూవీస్‌గా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ర్యాప్, హిప్ హాప్ మ్యూజిక్ ఫ్లేయర్‌గా రణ్వీర్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఇటీవల ఈ రకం సంగీతానికి మంచి ఆదరణ దక్కుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో తన సంస్థ ఇంక్ ఇంక్ ద్వారా ర్యాప్, హిప్హాప్ సంగీతాన్ని ప్రోత్సహించాలని రణ్వీర్ నిర్ణయించుకున్నారు. ‘‘హిందుస్తానీ ర్యాప్, హిప్ హాప్ సంగీతానికి మంచి రోజులొచ్చాయి. ఈ సంగీత ప్రపంచానికి ర్యాప్ అవసరం కూడా. తమ స్వతంత్ర భావాలను వ్యక్తపరచడానికి ర్యాప్ సంగీతాన్ని ఓ గొప్ప పరికరంలా యువత వాడుకుంటోంది. ఎక్కడికి వెళ్లినా ర్యాప్ హవా కనిపిస్తోంది’’ అన్నారు రణ్వీర్. -
‘ఆమెతో నాకు పోటీ ఏంటి.. చిరాగ్గా?’
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనసులో ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు కంగనా. ముఖ్యంగా బాలీవుడ్లో ఉన్న బంధుప్రీతి గురించి విమర్శలు చేయడంలో ముందు వరుసలో ఉంటారు కంగనా. తాజాగా ఈ ‘క్వీన్’ భామ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలియా భట్ ఓ సగటు హీరోయిన్ అని.. ఆమెతో తనకు పోటీ ఏంటని ప్రశ్నించారు. ఇంగ్లీష్ మ్యాగజైన్ ఒకటి 2019లో ఇప్పటి వరకూ వచ్చిన చిత్రాల్లో ఉత్తమ హీరోయిన్ ఎవరనే అంశం గురించి ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్‌లో కంగనా మణికర్ణిక సినిమాతో పోటీపడగా.. అలియా భట్ గల్లీ బాయ్ సినిమాతో కంగనాకు పోటీగా నిలిచారు. అయితే ఈ ఓటింగ్‌లో కంగనానే ఉత్తమ హీరోయిన్గా గెలిచినట్లు సదరు మీడియా ప్రకటించింది. ఈ విషయాన్ని కంగనా దగ్గర ప్రస్తావించగా... ‘నాకు పోటీగా అలియా ఉందనే విషయం తల్చుకుంటేనే నాకు చాలా చిరాగ్గా ఉంది. గల్లీ బాయ్ చిత్రంలో ఆమె నటన సగటు హీరోయిన్ యాక్టింగ్లానే ఉంది. మిగతా సినిమాల్లో ఎలా నటించిందో ఈ చిత్రంలోనూ అలానే యాక్ట్ చేసింది. కానీ మణికర్ణిక చిత్రంలో నేను మహిళా సాధికారితను తెలిపేలా.. మంచి నటన కనబరిచాను. అలాంటిది నాతో అలియా పోటీపడటం నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి మీడియా ఇలాంటి సినీ స్టార్ల పిల్లలను ప్రోత్సాహించడం మానుకుంటే మంచిది. లేదంటే మన పరిశ్రమ ప్రమాణాలు ఎన్నటికి మెరుగవ్వవు’ అని తెలిపారు. -
కలెక్షన్స్‌లో దూసుకుపోతున్న బాలీవుడ్ మూవీలు
ఈ ఏడాది బాలీవుడ్ మూవీలు ఫుల్ స్వింగ్ మీదున్నాయి. ఇండియన్ ఆర్మీ సాహసాలు, నాటి వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి తెగువ, గల్లీ నుంచి వచ్చిన కుర్రాడు సాధించిన విజయాల నేపథ్యంలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. నిలకడ వసూళ్లతో రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. భారత ఆర్మీ చేపట్టిన సర్జికల్‌స్ట్రైక్ ఆధారంగా తెరకెక్కిన యూరీ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి.. 200కోట్లను కలెక్ట్ చేసి దాటేసి 250కోట్లకు పరుగెడుతోంది. వికాస్కౌశల్, యామీ గౌతమ్ లాంటి చిన్న నటులతో తెరకెక్కించిన ఈ మూవీ.. ఇప్పటికీ హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇక కంగనా రనౌత్ నటించిన మణికర్ణిక వివాదాల నడుమ భారీగా కలెక్షన్లను కొల్లగొడుతోంది. ఇప్పటికే ఈ మూవీ వంద కోట్లను కలెక్ట్ చేసింది. గతేడాది చివర్లో ‘సింబా’గా వచ్చిన రణ్వీర్ సింగ్.. దాదాపు 250కోట్లు కొల్లగొట్టాడు. మళ్లీ చిన్న గ్యాప్‌తో.. ‘గల్లీబాయ్’గా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసేస్తున్నాడు. వారం రోజుల్లోనే ఈ సినిమా వందకోట్లను కలెక్ట్ చేసేస్తుందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. -
తేరా టైం ఆయేగా - కేంద్రమంత్రి హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్, అలియా జంటగా నటించిన బాలీవుడ్ మూవీ గల్లీబాయ్ లోని అప్నా టైం ఆయేగా పాటను రైల్వే మంత్రి పియూష్ గోయల్ బాగా వాడేశారు. ఇదే సాంగ్ థీమ్ తో ‘తేరా టైం ఆయేగా’ అంటూ రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక చేశారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న రైల్వే ప్రయాణికులను ఉద్దేశించి ‘తేరా టైం ఆయేగా అంటూ ఫన్ ట్రాక్‌తో రూపొందించిన సాంగ్ ఇపుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. దీన్ని స్వయంగా పీయూష్ గోయల్ తన ట్విటర్లో షేర్ చేశారు. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్న అప్నా టైం పాట తరహాలో టికెట్ లేని ప్రయాణం నేరం అనే అవగాహనను ప్రయాణీకుల్లో కల్పించేందుకు ప్రయత్నించారు. దీంతో ‘తేరాం టైం’ రీమిక్స్ సాంగ్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైలులో టీసీ టిక్కెట్లు తనిఖీ, టిక్కెట్లు లేని వారికి జరిమానా విధింపు, ప్రయాణికుల ఫొటోలతో కూడిన సాంగ్ ట్రాక్ మ్యూజిక్ వీడియోను పీయూష్ గోయల్ ట్విట్టర్లో షేర్ చేశారు. ‘టికెట్ లేకుండా ప్రయాణం చేయకండి... యూటీఎస్ యాప్, ఏటీవీఎం మెషీన్ల ద్వారా టికెట్లను కొనుగోలు చేయండి’ అంటూ, దక్షిణ మధ్య రైల్వే ప్రకటనతో పాట పూర్తవుతుంది. Tera Time Aayega pic.twitter.com/3JI8SoPx3u — Piyush Goyal (@PiyushGoyal) February 18, 2019 -
‘గల్లీ బాయ్’ రీమేక్‌లో మెగా హీరో
రణ్వీర్ సింగ్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన మ్యూజికల్ డ్రామా గల్లీ బాయ్. జోయా అక్తర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ముఖ్యంగా సినిమాలో రణ్వీర్ పోషించిన రాప్ సింగర్, గల్లీ బాయ్ పాత్రకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇతర భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తెలుగులోనూ గల్లీ బాయ్‌ని రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ హీరోలు ఈ యూత్‌ఫుల్ రీమేక్‌లో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర లహరి షూటింగ్లో బిజీగా ఉన్న సాయి ధరమ్ తేజ్ ఈ రీమేక్‌లో నటించేందకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. మరి నిజంగానే ఈ మెగా హీరో గల్లీ బాయ్ రీమేక్‌ను పట్టాలెక్కిస్తాడో లేదో చూడాలి. -
4 రోజుల్లో 50 కోట్లు రాబట్టిన ‘గల్లీ బాయ్’
ముంబై: రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించిన తాజా సినిమా ‘గల్లీ బాయ్’.. దేశీ ర్యాప్ కల్చర్ సంగీత నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ప్రేమికుల రోజు సందర్భంగా గత గురువారం విడుదలైన ఈ సినిమా నాలుగురోజుల్లో 51.15 కోట్లు రాబట్టింది. వీకెండ్లో చివరిరోజైన ఆదివారం కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టి మొదటి ఐదు రోజుల్లో రూ. 70 కోట్లు దాటే అవకాశముందని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విటర్లో తెలిపారు. మొదటి నాలుగు రోజుల్లో ఈ సినిమా వరుసగా గురువారం రూ. 19.40 కోట్లు, శుక్రవారం రూ. 13.10 కోట్లు, శనివారం రూ. 18.65 కోట్లు వసూలు చేసిందని ఆయన తెలిపారు.