వేదాంత గ్రూప్ ఫౌండర్ కమ్ చైర్మన్ అనిల్ అగర్వాల్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారాడు. యువతలో స్ఫూర్తి నింపేందుకు తన జీవిత అనుభవాలను పంచుకుంటున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇంగ్లీష్ ఒక్క ముక్క రాకుండా ముంబైలో తాను అడుగు పెట్టినప్పటి నుంచి ఈ రోజు ముప్పై వేల కోట్ల రూపాయల అధిపతిగా మారే వరకు జరిగిన ప్రస్థానాన్ని వివరిస్తున్నారు. తాను కన్న కలలు, వాటిని సాకారం చేసుకోవడంలో ఎదురైన సవాళ్లను, వాటిని తాను అధిగమించిన తీరును పూసగుచ్చినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో తన మససుకు నచ్చిన ఓ సినిమా గురించి ఆయన చెప్పారు.
జోయా అక్తర్ దర్శకత్వంలో 2019లో రణ్‌వీర్‌సింగ్ కథానాయకుడిగా వచ్చిన గల్లీబాయ్ సినిమా క్లిప్‌ను ఆయన ట్విటర్‌లో షేర్ చేశారు. ఇందులో గల్లీబాయ్ ర్యాపర్‌గా ఎదిగే క్రమాన్ని చక్కగా వెండితెరపై ఆవిష్కరించారు. ధైర్యం ఉన్న వాళ్లే కలలు కంటారని వాటిని నెరవేర్చుకునే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయని ఆఖరికి సొంత తండ్రి కూడా నమ్మని సమయంలోనూ మురాద్ (రణ్‌వీర్‌సింగ్) ధైర్యం కోల్పోకుండా తన లక్ష్యాన్ని చేరుకున్నాడని వివరించారు. గల్లీబాయ్ నిజంగా స్ఫూర్తిని నింపే సినిమా అంటూ అనిల్ అగర్వాల్ ప్రశంసించారు.
This was truly a moving scene. In a world that constantly tries to tie you down, dreaming big is an act of courage. Gully Boy was a reminder to anyone who has nursed a dream, any dream.
— Anil Agarwal (@AnilAgarwal_Ved) June 14, 2022
Don't lose hope kyunki apna time aayega! https://t.co/1ZTaKeW17T
Comments
Please login to add a commentAdd a comment