వేదాంత రిసోర్సెస్..దేశంలో మెటల్ తయారీలో అతి పెద్ద కంపెనీల్లో ఒకటి. స్టీల్, కాపర్, అల్యూమీనియం తయారీలో దూసుకుపోతోంది. దేశంలో యువతకి పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తోన్న కంపెనీల్లో ఇది ఒకటి.
కిక్కిరిసిన జనం మధ్యన ట్యాక్సీలో చేసిన ప్రయాణం, అప్పుడు వినిపించిన మహ్మద్ రఫి గొంతుతో..వో కోన్‌సీ ముష్కిల్ హై (సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు) అనే పాట స్ఫూర్తి వేదాంత ప్రస్థానానికి నాందిగా నిలిచింది. ఇప్పుడు ఆ సంస్థ చిప్ సెట్లు, డిస్‌ప్లే తయారీ రంగంలోకి అడుగు పెట్టింది. లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది
వేదాంతా, తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్ కలిసి దేశంలో తొలి సెమీకండక్టర్ ప్లాంటును రూ.1.54 లక్షల కోట్లతో గుజరాత్‌లో నిర్మించనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, ఈ ప్లాంటులో ఫాక్సాకాన్ వాటా 38శాతం ఉండగా.. మిగిలిన సింహభాగం వేదాంతాదే.
ఈ నేపథ్యంలో వేదాంతా గ్రూప్ ఛైర్మన్ ఓ మీడియా ఇంటర్వ్యూలో అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ..చిప్ సెట్లు, డిస్‌ప్లే తయారీ ప్రారంభమైతే దేశంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు భారీగా తగ్గుతాయి. ‘ప్రస్తుతం మనం ల్యాప్ ట్యాప్ తీసుకుంటే దాని ధర రూ.లక్ష ఉంటే..డిస్‌ప్లే, చిప్ సెట్లను దేశీయంగా తయారు చేస్తే అదే ల్యాప్ ట్యాప్ ధర రూ.40వేలు అంతకంటే తక్కువే ఉండొచ్చు’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment