laptops
-
కొత్త ఏఐ ల్యాప్‌టాప్‌లు.. ప్రత్యేకత ఏంటో తెలుసా..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం వాడుతున్న ఎలక్ట్రానిక్ వస్తువుల్లో చాలామార్పులు వస్తున్నాయి. ప్రధానంగా యూత్ ఎక్కువగా వినియోగించే ల్యాప్‌టాప్‌ల సామర్థ్యం పెంచేందుకు కంపెనీలు చాలా మార్గాలు అన్వేషిస్తున్నాయి. ఇంట్లో, ఆఫీసులో ఎక్కడైనా పనిచేయడం అనివార్యమైంది. దాంతో ఉద్యోగస్థులు, స్టూడెంట్లు ఇలాంటి వాటిపై చాలా ఆసక్తి చూపిస్తున్నారు. వీరి అవసరాలు దృష్టిలో ఉంచుకొని ల్యాప్‌టాప్ తయారీ కంపెనీలు వాటి వేగాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా ల్యాప్‌టాప్‌లు మరింత వేగంగా, సమర్థంగా పనిచేయడానికి వాటిలో కృత్రిమ మేధ (ఏఐ) ఫీచర్లనూ జోడిస్తున్నారు. అయితే అలా ఇంప్లిమెంట్ చేస్తున్న ఏఐల వర్క్‌లోడ్ ఒక్కోసారి అధికమై ప్రాసెసర్లపై భారం పడుతుంది. దాన్ని తగ్గించేందుకు కంపెనీలు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నాయి. ల్యాప్‌టాప్‌ల్లో ఏఐ వర్క్‌లోడ్స్ సాఫీగా, అంతరాయం లేకుండా పనిచేయటానికి న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (ఎన్పీయూ) అమర్చుతున్నారు. సీపీయూ, జీపీయూతోపాటు ఎన్పీయూ సైతం వీటిలో వాడుతున్నారు. దాంతో ఎన్పీయూ ఉన్న ల్యాప్‌టాప్‌లు హైబ్రిడ్ వర్క్‌కల్చర్‌కు తగ్గట్టుగా వేగంగా, సమర్థంగా పనిచేస్తాయని తయారీ సంస్థలు చెబుతున్నాయి. తాజాగా ప్రముఖ ల్యాప్‌టాప్ తయారీ సంస్థ హెచ్‌పీ ఎన్పీయూ ఫీచర్ ఉన్న ఏఐ ఆధారిత గేమింగ్ ల్యాప్‌టాప్ ఒమెన్ ట్రాన్సెండ్ 14, ఎన్వీఎక్స్ 360 14 మోడల్‌ను విడుదల చేసింది. ఇవి వేగంగా, సమర్థంగా పనిచేస్తూ వినియోగదారుల అవసరాలను తీరుస్తాయని హెచ్‌పీ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ ఇప్సితా దాస్‌గుప్తా చెప్పారు. హెచ్పీతోపాటు మరిన్ని కంపెనీలు ఏఐ ఆధారిత ల్యాప్‌టాప్‌లను మార్కెట్లో విడుదల చేశాయి. వాటికి సంబంధించిన వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. హెచ్‌పీ ఒమెన్ ట్రాన్సెండ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్: విండోస్ 11 హోమ్ ఇంటెల్ కోర్ ఆల్ట్రా 9 ప్రాసెసర్ 14 అంగుళాల డిస్ప్లే 11.5 గంటల బ్యాటరీ బ్యాకప్ 1.637 కేజీల బరువు ఎన్వీడియా జీఈఫోర్స్ ఆర్టీఎక్స్ 4060 గ్రాఫిక్కార్డు ప్రారంభ ధర అంచనా: రూ.1,74,999 హెచ్‌పీ ఎన్వీఎక్స్ 360 14 ఆపరేటింగ్ సిస్టమ్: విండోస్ 11 హోమ్ గ్రాఫిక్ మెమరీ: జీడీడీఆర్6 గ్రాఫిక్ మెమరీ కెపాసిటీ: 4 జీబీ ప్రాసెసర్: ఇంటెల్ i7 ప్రాసెసర్ జనరేషన్: 13వ తరం ఎస్ఎస్డీ: 1 టీబీ ర్యామ్: 16 జీబీ గ్రాఫిక్ ప్రాసెసర్: NVIDIA GeForce RTX 3050 ప్రారంభ ధర అంచనా: రూ.99,999 ఎంఎస్ఐ ప్రెస్టీజ్ 16 ఏఐ ఈవో బీ1ఎం ఆపరేటింగ్ సిస్టమ్: విండోస్ 11 హోమ్ స్క్రీన్: 16 అంగుళాలు ప్రాసెసర్: ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ఇందులో ఎన్పీయూ, ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ సదుపాయాలు ఉన్నాయి. బరువు: 1.5 కిలోలు. ధర సుమారు: 1,19,990 ఆసుస్ ఆర్ఓజీ జెఫిరస్ G14 ఆపరేటింగ్ సిస్టమ్: విండోస్ 11 హోమ్ గ్రాఫిక్ మెమరీ: జీడీడీఆర్6 గ్రాఫిక్ మెమరీ కెపాసిటీ: 12 GB ప్రాసెసర్: AMD రైజెన్ 9 ఆక్టా కోర్ ఎస్ఎస్డీ: 1 టీబీ ర్యామ్: 32 GB DDR5 గ్రాఫిక్ ప్రాసెసర్: NVIDIA GeForce RTX 4080 ధర సుమారు: 2,49,990 ఇదీ చదవండి: ఆకాశవీధిలో 15.4 కోట్ల ప్రయాణికులు ఆసుస్ జెన్‌బుక్ 14 ఓలెడ్ ఆపరేటింగ్ సిస్టమ్: విండోస్ 11 హోమ్ ప్రాసెసర్: ఇంటెల్ కోర్ i7 ఎస్ఎస్డీ: 512 GB ర్యామ్: 16 జీబీ LPDDR5 గ్రాఫిక్ ప్రాసెసర్: ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ ఐరిస్ X గ్రాఫిక్స్ ధర సుమారు: రూ.99,990 -
కంటెంట్ క్రియేటర్ల కోసం బెస్ట్ ల్యాప్టాప్స్ ఇవే! ధరలు ఎలా ఉన్నాయంటే?
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో చాలామంది సొంతంగా ఎదగాలని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారిలో కొందరు కంటెంట్ క్రియేట్ చేసుకోవడం లేదా యూట్యూబ్ క్రియేట్ చేసుకోవడం చేస్తూ ఉంటారు. అలాంటి వారి అవసరాలకు, ప్రత్యేకించి 'కంటెంట్ క్రియేటర్ల'కు ఉపయోగపడే HP ల్యాప్‌టాప్‌ల గురించి ఇక్కడ తెలుసుకుందాం. హెచ్‌పీ ఎన్వీ ఎక్స్360 15 హెచ్‌పీ కంపెనీ కంటెంట్ క్రియేటర్ల కోసం రూపొందించిన ల్యాప్‌టాప్‌లలో ఒకటి 'ఎన్వీ ఎక్స్360 15'. ఇది 15.6 ఇంచెస్ ఓఎల్ఈడీ టచ్ డిస్ప్లే కలిగి వారి వినియోగానికి తగిన విధంగా మార్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అంటే స్క్రీన్‌ను 360 డిగ్రీలు తిప్పవచ్చు. ఇది NVIDIA GeForce RTX 3050 లేదా AMD Radeon గ్రాఫిక్స్‌తో సరికొత్త 13వ జెన్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్లు లేదా AMD రైజెన్ 5 పొందుతుంది. ఈ ల్యాప్‌టాప్ HP ఆన్లైన్ స్టోర్లలో, ఈకామర్స్ సైట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 78999. హెచ్‌పీ స్పెక్టర్ ఎక్స్360 14 హెచ్‌పీ స్పెక్టర్ ఎక్స్360 14 కూడా అద్భుతమైన పనితీరుని అందించే ఉత్తమమైన ల్యాప్‌టాప్. ఇది కూడా OLED డిస్ప్లేను పొందుతుంది. దీని ధర రూ. 169999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ల్యాప్‌టాప్ HP ఆన్లైన్ స్టోర్లలో మాత్రమే కాకుండా, ఈకామర్స్ సైట్లలోనూ లభిస్తుంది. పర్ఫామెన్స్ మాత్రమే కాకుండా.. న్యూరల్ ప్రాసెసింగ్ కూడా కలిగి ఉంటుంది. వీడియో ఎడిటింగ్ వంటి వాటికి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. హెచ్‌పీ స్పెక్టర్ ఎక్స్360 16 రూ. 179999 ప్రారంభ ధర వద్ద లభించే ఈ హెచ్‌పీ స్పెక్టర్ ఎక్స్360 16 ల్యాప్‌టాప్ HP ఆన్లైన్ స్టోర్లలో, ఈకామర్స్ సైట్లలో లభిస్తుంది. మంచి డిజైన్ కలిగిన ఈ ల్యాప్‌టాప్ 16 ఇంచెస్ డిస్ప్లే కలిగి హై-రిజల్యూషన్ వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్ వంటి వాటికి ఉపయోగపడుతుంది. ఇదీ చదవండి: మెదడులో చిప్ పనిచేస్తోంది.. నిజమవుతున్న మస్క్ కల! హెచ్‌పీ పెవిలియన్ ప్లస్ 16 మంది డిజైన్, కంటెంట్ క్రియేటర్లకు అవసరమైన ఫీచర్స్ కలిగిన ఈ హెచ్‌పీ పెవిలియన్ ప్లస్ 16 ల్యాప్‌టాప్ 2560 x 1600 రిజల్యూషన్, 400 నిట్ల బ్రైట్‌నెస్‌ని అందించే 16 ఇంచెస్ డిస్ప్లే ప్యానెల్ పొందుతుంది. ఇది ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్, 16.0 GB ర్యామ్ వంటి వాటిని పొందుతుంది. దీని ప్రారంభ ధర రూ. 124999. ఇది కూడా HP ఆన్లైన్ స్టోర్లలో, ఈకామర్స్ సైట్లలో లభిస్తుంది. -
స్మార్ట్‌ఫోన్ కోసం న్యూక్లియర్ బ్యాటరీ.. ఛార్జింగ్ లేకుండా 50 ఏళ్లు పని చేస్తోంది!
సాధారణంగా బ్యాటరీలు ఎక్కువకాలం మన్నవు. ఇటీవలికాలంలో బాగా వాడుకలోకి వచ్చిన లీథియం అయాన్ బ్యాటరీల మన్నిక సైతం రెండు మూడేళ్లకు మించి ఉండదు. పైగా వాటిని రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. లీథియం అయాన్ బ్యాటరీలను మూడువందల నుంచి ఐదువందల సార్లు రీచార్జ్ చేసుకుంటే, అక్కడితో వాటి ఆయుష్షు తీరిపోతుంది. బ్యాటరీల మన్నికను గణనీయంగా పెంచే దిశగా చైనాకు చెందిన శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు సాగించి, మొత్తానికి విజయం సాధించారు. ఏకంగా 50 ఏళ్లు మన్నికను ఇవ్వగల న్యూక్లియర్ బ్యాటరీని రూపొందించారు. ఫొటోలో కనిపిస్తున్న ఈ బ్యాటరీని చైనా కంపెనీ ‘బీటావోల్ట్’ శాస్త్రవేత్తలు తయారు చేశారు. రక్షణ అవసరాల కోసం దీర్ఘకాలిక మన్నిక గల బ్యాటరీల రూపకల్పన కోసం ‘బీటావోల్ట్’ చేపట్టిన ప్రయోగాలకు రెండేళ్ల కిందట ఆస్ట్రేలియన్ కంపెనీ ‘ఫోస్ ఎనర్జీ’ 2.3 మిలియన్ డాలర్ల (రూ.19.15 కోట్లు) ఆర్థిక సాయం అందించింది. ప్రస్తుతం నమూనాగా ఈ బ్యాటరీని రూపొందించిన చైనా శాస్త్రవేత్తలు భవిష్యత్తులో స్మార్ట్ఫోన్లు, లాప్టాప్ల కోసం కూడా ఉపయోగపడే దీర్ఘకాలిక న్యూక్లియర్ బ్యాటరీలను తయారు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
CES 2024: హెచ్‌పీ నుంచి సరికొత్త గేమింగ్ ల్యాప్‌ట్యాప్‌లు
ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ హెచ్‌పీ సరికొత్త గేమింగ్ ల్యాప్‌ట్యాప్‌లను ఆవిష్కరించింది. లాస్ వెగాస్‌లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES 2024)లో తమ OMEN, HyperX సబ్-బ్రాండ్ల కింద కొత్త గేమింగ్ పోర్ట్‌ఫోలియోను పరిచయం చేసింది. కంపెనీ కొత్త లాంచ్‌లలో గేమర్లకు గేమింగ్, ఇతర క్రియేటివ్ టాస్క్‌ల కోసం ఒమెన్ ట్రాన్సెండ్ 14 (Omen Transcend 14) గేమింగ్ ల్యాప్‌టాప్ ఉంది. దీంతోపాటు 240Hz రిఫ్రెష్ రేట్‌తో 2.5K OLED డిస్ప్లేతో OMEN ట్రాన్స్‌సెండ్ 16-అంగుళాల ల్యాప్‌టాప్‌ను కూడా హెచ్‌పీ ఆవిష్కరించింది. HP Omen 16 అంగుళాల గేమింగ్ ల్యాప్‌టాప్, Victus 16 అంగుళాల గేమింగ్ ల్యాప్‌టాప్ రెండూ సరికొత్త Intel i7 HX ప్రాసెసర్‌ను కలిగి ఉంటాయి. హెచ్‌పీ ఒమెన్ ట్రాన్సెండ్ 14 ముఖ్యమైన ఫీచర్లు.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో గేమింగ్, కంటెంట్ క్రియేషన్‌కు అనువైన IMAX కూడిన సర్టిఫైడ్ 2.8K OLED డిస్ప్లే లాటిస్-లెస్ స్కై-ప్రింటెడ్ RGB కీబోర్డ్ ఎక్కడికైనా తీసుకెళ్ళేందుకు వీలుగా 1.6 కేజీల బరువుతో తేలికనది 140W ఛార్జింగ్ అడాప్టర్‌తో 11.5 గంటల బ్యాటరీ లైఫ్ NVIDIA GeForce RTX 4070 GPUతో ఇంటెల్ అల్ట్రా 9 185H ప్రాసెసర్ -
సంగీతం నేర్పే ‘స్మార్ట్ ఉకులెలె’.. ఎలా పనిచేస్తుందంటే?
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త విషయాలు నేర్చుకోవడం సులువు అవుతోంది. తెలియని అంశాలను నేర్చుకోవడానికి చాలామంది క్రమశిక్షణతో ప్రయత్నం చేస్తున్నారు. అందుకు కొంత సమయం పట్టినా చివరకు సాధిస్తున్నారు. గతంలో సంగీతం నేర్చుకోవాలంటే ప్రత్యేక తరగతులకు వెళ్లాల్సివచ్చేది. అందుకు కొంత డబ్బు, సమయం ఖర్చయ్యేది. అయితే ప్రస్తుతం టెక్నాలజీని ఉపయోగించి సంగీతాన్ని నేర్పే యాప్స్, ఇన్స్ట్రుమెంట్లు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా జియోమీ సంస్థ అలాంటి ఓ పరికరాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. గిటార్‌లా కనిపించే ఈ బుల్లి వాద్యపరికరం ఉకులెలె. ఈ పోర్చుగీసు సంప్రదాయ పరికరాన్ని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్‌గా తయారు చేసిన చైనీస్ కంపెనీ జియోమీ ఇటీవల ‘పాపులెలె 2 ప్రో స్మార్ట్’ పేరుతో మార్కెట్లోకి తెచ్చింది. సంగీతంలో కొత్తగా సరిగమలు నేర్చుకుంటున్న వారు సైతం దీనిపై తేలికగా కోరుకున్న పాటలు పలికించేలా దీన్ని తీర్చిదిద్దారు. స్మార్ట్‌ఫోన్ లేదా లాప్టాప్ ద్వారా కోరుకున్న పాటను ఎంపిక చేసుకుని, యాప్ ద్వారా దీనిని అనుసంధానం చేసుకుంటే చాలు. ఈ ఉకులెలె ఫింగర్ బోర్డులో పాటలోని సంగీతానికి తగిన స్వరస్థానాలలో ఎల్ఈడీ లైట్లు వెలుగుతాయి. ఎల్ఈడీ లైట్ల వెలుగు ఆధారంగా వేళ్లను కదుపుతూ దీనిని వాయిస్తే, ఎలాంటి పాటైనా భేషుగ్గా పలుకుతుంది. దీనిని వాయించడంలో మొదట్లో కొద్దిగా తడబడినా, సంగీతం రానివారు సైతం దీనికి పదిహేను నిమిషాల్లోనే అలవాటు పడిపోతారని, తేలికగా పాటలు వాయించగలుగుతారని జియోమీ కంపెనీ చెబుతోంది. సంప్రదాయ ఉకులెలెను కలపతో తయారు చేస్తారు. ఈ స్మార్ట్ ఉకులెలెను సింథటిక్ ఫైబర్‌తో కొద్దిపాటి డిజైన్ మార్పులతో తయారు చేశారు. దీని ధర 279 డాలర్లు (రూ.23,264) మాత్రమే! -
110 సంస్థలకు అనుమతులు
న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు వంటి ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు 110 సంస్థలకు కేంద్రం అనుమతినిచి్చంది. యాపిల్, డెల్, లెనొవొ, హెచ్‌పీ ఇండియా సేల్స్, అసూస్ ఇండియా, ఐబీఎం ఇండియా, షావోమీ టెక్నాలజీ ఇండియా, శాంసంగ్ ఇండియా ఎల్రక్టానిక్స్ మొదలైనవి వీటిలో ఉన్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. అనుమతుల కోసం మొత్తం 111 దరఖాస్తులు వచి్చనట్లు వివరించారు. అయితే, ’నిరాకరణ జాబితా’లో ఉన్న ఒక హైదరాబాద్ సంస్థకు మాత్రం అనుమతి లభించలేదని పేర్కొన్నారు. దేశీయంగా తయారీని ప్రోత్సహించే దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నిర్దిష్ట ఐటీ హార్డ్‌వేర్ దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే, సరఫరా వ్యవస్థ దెబ్బతినకుండా అనుమతులకు లోబడి దిగుమతి చేసుకునే వెసులుబాటు కలి్పంచింది. నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఆథరైజేషన్ విధానం 2024 సెపె్టంబర్ వరకు అమల్లో ఉంటుంది. అక్టోబర్ 31న పరిశ్రమ వర్గాలతో సమావేశమైన డీజీఎఫ్టీ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్) అనుమతుల ప్రక్రియ గురించి వివరించారు. ’నిరాకరణ జాబితా’లో ఉన్న సంస్థలకు అనుమతులు లభించవు. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటూ ఎగుమతి నిబంధనలను పాటించని సంస్థలు, డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) కేసులు ఎదుర్కొంటున్న కంపెనీలు ఈ జాబితాలో ఉంటాయి. ఐటీ హార్డ్‌వేర్ సంబంధ దిగుమతులు గత ఆర్థిక సంవత్సరం 8.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 5.33 బిలియన్ డాలర్ల విలువ చేసే ల్యాప్‌టాప్‌లు సహా పర్సనల్ కంప్యూటర్లు దిగుమతయ్యాయి. అత్యధికంగా చైనా (5.11 బిలియన్ డాలర్లు), సింగపూర్ (1.4 బిలియన్ డాలర్లు), హాంకాంగ్ (807 మిలియన్ డాలర్లు) నుంచి ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తులు దిగుమతవుతున్నాయి. -
హెచ్‌పీ నుంచి రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్‌లు
న్యూఢిల్లీ: హెచ్‌పీ సంస్థ రీఫర్బిష్డ్ (మరమ్మతులు చేసి పునర్వినియోగానికి అనుకూలంగా మార్చిన) ల్యాప్‌టాప్‌లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. స్టార్టప్‌లు, ఫ్రీలాన్సర్లు, విద్యార్థులు, సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్థలకు అందుబాటు ధరలకే ల్యాప్‌టాప్‌లు అందించే లక్ష్యంతో వీటిని తీసుకొచి్చనట్టు తెలిపింది. హెచ్‌పీ ధ్రువీకృత భాగస్వాములు రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్‌లను రిటైల్ కస్టమర్లు, వ్యాపార సంస్థలకు విక్రయించనున్నట్టు ప్రకటించింది. విక్రయానంతర సేవలను కూడా వారే అందిస్తారని తెలిపింది. -
కంప్యూటర్ల దిగుమతి ఆంక్షలపై ఆందోళన
న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లపై దిగుమతి ఆంక్షలు విధించాలన్న భారత్ నిర్ణయంపై అమెరికా, చైనా, కొరియా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జెనీవాలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) సమావేశంలో ఈ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయని ఓ అధికారి తెలిపారు. నిర్ణయం అమలులోకి వచ్చిన తర్వాత భారత్‌కు అమెరికా చేసే ఎగుమతులతో సహా ఈ ఉత్పత్తుల వాణిజ్యంపై ప్రభావం చూపుతుందని అమెరికా పేర్కొన్నట్టు జెనీవాకు చెందిన అధికారి వెల్లడించారు. భారత నిర్ణయం ఎగుమతిదారులు, అంతిమ వినియోగదా రులకు అనిశి్చతిని సృష్టిస్తోందని అమెరికా పేర్కొంది. అయితే ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల దిగుమతులకు లైసెన్స్ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం గత వారం స్పష్టం చేసింది. దిగుమతులను కేవలం పర్యవేక్షిస్తామని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ వెల్లడించారు. ల్యాప్టాప్స్, టాబ్లెట్ పీసీలు, కంప్యూటర్లను నవంబర్ 1 నుండి లైసెన్సింగ్ విధానంలో ఉంచుతామని 2023 ఆగస్టులో ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ల్యాప్‌టాప్‌ల దిగుమతికి లైసెన్స్ అవసరం లేదు
న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల దిగుమతులకు లైసెన్స్ అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. దిగుమతులను కేవలం పర్యవేక్షిస్తామని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ వెల్లడించారు. ల్యాప్టాప్స్, టాబ్లెట్ పీసీలు, కంప్యూటర్లను నవంబర్ 1 నుండి లైసెన్సింగ్ విధానంలో ఉంచుతామని 2023 ఆగస్టులో ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్య లు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. దిగుమతిదారులను నిశితంగా గమనిస్తామని, తద్వారా దిగుమతులను పర్యవేక్షించవచ్చన్నారు. -
భారత్‌కు థామ్సన్ ల్యాప్టాప్స్
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్ తయారీలో ఉన్న థామ్సన్.. భారత ల్యాప్టాప్స్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రారంభ, మధ్య, ప్రీమియం విభాగాల్లో 2024 మార్చి నాటికి ల్యాప్‌టాప్స్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం యూఎస్, ఫ్రాన్స్, యూరప్‌లో వీటిని విక్రయిస్తోంది. అలాగే భారత్‌లో తయారైన స్మార్ట్ టీవీలు, ఇతర ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలని కంపెనీ నిర్ణయించింది. భారత్‌లో థామ్సన్ బ్రాండ్ లైసెన్స్ కలిగిన సూపర్ ప్లాస్ట్రానిక్స్ రూ.300 కోట్లతో అత్యాధునిక ప్లాంటును ఉత్తర ప్రదేశ్‌లోని హాపూర్ వద్ద స్థాపిస్తోంది. ప్లాంటు అందుబాటులోకి వస్తే టీవీల తయారీలో సూపర్ ప్లాస్ట్రానిక్స్ వార్షిక సామర్థ్యం 20 లక్షల యూనిట్లకు చేరుతుంది. 15 ఏళ్ల విరామం తర్వాత 2018లో సూపర్ ప్లా్రస్టానిక్స్ భాగస్వామ్యంతో థామ్సన్ భారత్‌లో రీఎంట్రీ ఇచి్చంది. స్మార్ట్ టీవీలతోపాటు వాషింగ్ మెషీన్స్, ఎయిర్ కండీషనర్స్, చిన్న ఉపకరణాలను భారత్‌లో విక్రయిస్తోంది. టాప్–5లో భారత్.. అంతర్జాతీయంగా భారత్‌ను టాప్–5లో నిలబెట్టాలని లక్ష్యంగా చేసుకున్నట్టు థామ్సన్‌ను ప్రమోట్ చేస్తున్న యూఎస్‌కు చెందిన ఎస్టాబ్లి‹Ù్డ ఇంక్ సేల్స్ డైరెక్టర్ సెబాస్టియన్ క్రాంబెజ్ తెలిపారు. ‘భారత్‌లో తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని యూరప్‌లోని భాగస్వాములను ప్రోత్సహిస్తాం. వారు డబ్బులు ఆదా చేయడంతోపాటు ఇక్కడి ఉత్పత్తులు పోటీ ధరలో లభిస్తాయి. నాణ్యత కూడా బాగుంది. వారు భారత్ నుండి ఉత్పత్తులను కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇటువంటి అవకాశాలు టీవీలకు మాత్రమే పరిమితం కాదు. ల్యాప్టాప్స్, స్మార్ట్‌ఫోన్స్‌కు కూడా విస్తరించే అవకాశం ఉంది’ అని వివరించారు. సూపర్ ప్లా్రస్టానిక్స్‌కు భారత్‌లో కొడాక్, బ్లాపంక్ట్, వైట్ వెస్టింగ్‌హౌజ్ టీవీ, వైట్ వెస్టింగ్‌హౌజ్ (ఎలక్ట్రోలక్స్) బ్రాండ్ల హక్కులు సైతం ఉన్నాయి. -
‘న్యూస్‌క్లిక్’లో పోలీసుల సోదాలు
న్యూఢిల్లీ: చైనా అనుకూల సమాచారాన్ని భారత్‌లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు భారీ స్థాయిలో నగదును స్వీకరించిందన్న ఆరోపణలపై ఆన్లైన్ న్యూస్‌పోర్టల్ ‘న్యూస్‌క్లిక్’పై ఢిల్లీ పోలీసులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. సంస్థకు సంబంధించిన ఆఫీసులతోపాటు అందులో పనిచేసే జర్నలిస్టులు, సిబ్బందికి సంబంధించిన ఇళ్లలోనూ పోలీసులు విస్తృతస్థాయిలో తనిఖీలు చేపట్టారు. న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకులు, ఎడిటర్–ఇన్–చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థా, హెచ్ఆర్ చీఫ్ అమిత్ చక్రవర్తిని మొదట ప్రశ్నించిన పోలీసులు ఆ తర్వాత ఇద్దరినీ అరెస్ట్‌చేశారు. 100 ప్రాంతాల్లో ఏకంగా 500 మంది ఢిల్లీ పోలీసులు ఒకేసమయంలో దాడిచేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ముంబైలలో ఈ సోదాలు జరిగాయి. సోదాలు చేయాల్సిన వ్యక్తులను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరీలో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి చెందిన ఢిల్లీలోని నివాసంలోనూ సోదాలు జరిగాయి. ఆయనకు సహాయకునిగా ఉండే శ్రీనారాయణ్ కుమారుడు సుమిత్ ఇదే న్యూస్‌క్లిక్‌లో పనిచేస్తుండటంతో ఏచూరీ ఇంట్లోనూ పోలీసు తనిఖీలు కొనసాగాయి. దీంతో ఏచూరి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీలోని సంస్థ ముఖ్య కార్యాలయంలోని వారిని ప్రశ్నించాక ఆ ఆఫీస్‌కు పోలీసులు సీలువేశారు. విదేశీ ప్రయాణాలు, పౌరసత్వ(సవరణ) చట్టంపై షాహీన్‌బాగ్ వద్ద చెలరేగిన ఆందోళనలు, రైతుల ఉద్యమాలు తదితరాలపై జర్నలిస్టులను 25 అంశాలపై ప్రశ్నించామని పోలీసులు వెల్లడించారు. న్యూస్‌క్లిక్‌కు నిధులు ఎలా వస్తున్నాయనే కోణంలో గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యూస్‌క్లిక్ కార్యాలయాల్లో సోదాలు చేయడం తెల్సిందే. ఈ విషయంలో ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు అందించిన సమాచారంతోనే మంగళవారం ఢిల్లీ పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం, నేరమయ కుట్ర సెక్షన్ల కింద కొత్తగా కేసు నమోదుచేసి దాడులు చేశారు. ఈ సందర్భంగా పలువురి నుంచి ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, హార్డ్ డిస్‌్కలు, ఫ్లాష్ డ్రైవ్‌లను స్వాదీనం చేసుకున్నారు. ఆగస్ట్ 17న అత్యంత కఠిన ఉగ్రవ్యతిరేక చట్టం, చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక )చట్టంకింద నమోదైన కేసు ఆధారంగానే కొత్తను నమోదుచేసి దర్యాప్తు వేగవంతం చేశారు. చైనాతో సంబంధం ఉన్న కొన్ని సంస్థల నుంచి గత మూడేళ్లకాలంలో రూ.38.05 కోట్ల నగదు న్యూస్‌క్లిక్ పోర్టల్‌కు ముట్టిందని ఈడీ ఆరోపిస్తోంది. ఈ నగదులో కొంత మొత్తం పాత్రికేయులు గౌతమ్ నవ్లఖా, తీస్తా సీతల్వాడ్లకు చేరినట్లు ఆరోపిస్తోంది. విపక్షాల తీవ్ర విమర్శలు మీడియా స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపుతున్నారంటూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, సమాజ్‌వాదీ సహా పలు విపక్ష పార్టీలు ప్రభుత్వ తీరును తూర్పారబట్టాయి. ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాసహా పలు మీడియా సంఘాలు పోలీసు దాడులను ఖండించాయి. మోదీ సర్కార్‌ను విమర్శించే పాత్రికేయులపై ప్రభుత్వం కత్తిగట్టిందని ఆక్షేపించాయి. -
గూగుల్ - హెచ్‌పీ భాగస్వామ్యంలో క్రోమ్‌బుక్..ధర ఎంతంటే?
గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్, కంప్యూటర్ల తయారీ సంస్థ హెచ్‌పీ భాగస్వామ్యంలో హెచ్‌పీ సాయంతో క్రోమ్‌బుక్ తయారీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా తొలిసారి భారత్‌లో క్రోమ్‌బుక్‌లు తయారు చేసేందుకు హెచ్పీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. తద్వారా భారతీయ విద్యార్ధులకు అనువుగా, బడ్జెట్ ధరలో సురక్షితమైన కంప్యూటింగ్ అవకాశాలు మెరుగవుతాయి’ అని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. We’re partnering with HP to manufacture Chromebooks in India - These are the first Chromebooks to be made in India and will make it easier for Indian students to have access to affordable and secure computing. https://t.co/PuzZnck1wo — Sundar Pichai (@sundarpichai) October 2, 2023 చెన్నై సమీపాన ఫ్లెక్ ఫెసిలిటీ ప్లాంట్ వద్ద సెప్టెంబర్ 2నుంచి క్రోమ్‌బుక్‌ల తయారీ ప్రారంభమైందని హెచ్‌పీ అధికార ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే 2020 నుంచి ఫ్లెక్ ఫెసిలిటీ ప్లాంట్‌లో పలు రకాల లాప్‌టాప్‌లు, డెస్క్ టాప్ కంప్యూటర్లను హెచ్‌పీ తయారు చేస్తుందని పేర్కొన్నారు. కాగా రెండు దిగ్గజ సంస్థల భాగస్వామ్యంలో విడుదల కానున్న క్రోమ్ బుక్ ధర రూ.15,990 నుంచి ప్రారంభం కానుంది. -
ఐటీఐ లిమిటెడ్ కొత్త ల్యాప్‌టాప్‌లు - ప్రత్యర్థులకు గట్టి పోటీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికమ్యూనికేషన్స్ పరికరాల తయారీలో ఉన్న ప్రభుత్వ రంగ ఐటీఐ లిమిటెడ్ స్మాష్ బ్రాండ్ పేరుతో ల్యాప్‌టాప్‌లు, మైక్రో పర్సనల్ కంప్యూటర్ల విభాగంలోకి ప్రవేశించినట్టు ప్రకటించింది. ఇంటెల్ కార్పొరేషన్‌తో కలిసి అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో వీటిని తయారు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇంటెల్ ఐ3, ఐ5, ఐ7 తదితర ప్రాసెసర్లతో ఉపకరణాలు రూపుదిద్దుకున్నాయని ఐటీఐ పేర్కొంది. ‘స్మాష్ ఉత్పత్తులను ఇప్పటికే మార్కెట్లో ప్రవేశపెట్టాం. ఏసర్, హెచ్‌పీ, డెల్, లెనొవో వంటి ఎంఎన్సీ బ్రాండ్స్‌తో పోటీపడి అనేక ఆర్డర్లు దక్కించుకున్నాం. 12,000 పైచిలుకు పీసీలను కస్టమర్లు వినియోగిస్తున్నారు’ అని సంస్థ సీఎండీ రాజేశ్ రాయ్ తెలిపారు. కాగా, తాజా ప్రకటన నేపథ్యంలో ఐటీఐ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో సోమవారం 20 శాతం ఎగసి రూ.149.40 వద్ద స్థిరపడింది. -
ల్యాప్‌టాప్, కంప్యూటర్ దిగుమతులపై కేంద్రం మరో ముందడుగు!
న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్, కంప్యూటర్ దిగుమతుల విషయంలో వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక అడుగు ముందుకేసింది. దిగుమతిదారులకు లైసెన్సులను సజావుగా అందించడానికి కావాల్సిన ప్రమాణాల రూపకల్పనలో డైరెక్టరేట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నిమగ్నమైంది. ల్యాప్‌టాప్, కంప్యూటర్లపై ప్రభుత్వం దిగుమతి ఆంక్షలు విధించడంతో దిగుమతిదారులు నవంబర్ 1 నుండి డీజీఎఫ్టీ నుంచి లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. తయారీ కంపెనీ గత పనితీరును ప్రామాణికంగా తీసుకుని గతంలో లైసెన్సు జారీ చేసేవారు. దిగుమతుల ఆంక్షల కారణంగా భారత్‌కు ఉత్పత్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే అంశంపై నిశితంగా నిఘా ఉంచేందుకు దోహదపడతాయి. భవిష్యత్ వృద్ధి ఆశయాల కోసం ఎలక్ట్రానిక్స్ తయారీని కీలక ప్రాధాన్యతగా భారత్ గుర్తించింది. చైనా వెలుపల తమ కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తున్న ప్రపంచ దిగ్గజ కంపెనీల నుండి పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తున్న తరుణంలో ఈ నిర్ణ యం దేశీ య తయారీని ప్రోత్సహిస్తుంది. ల్యాప్‌టాప్‌లు, పీసీలు, సర్వర్స్ తయారీ కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద ఫాక్స్‌కాన్ గ్రూప్, హెచ్‌పీ, డెల్, లెనోవోతో సహా 38 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. భారత్‌లో ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తుల దిగుమతుల విలువ 2022–23లో 8.8 బిలియన్ డాలర్లు. ఇందులో పీసీలు/ల్యాప్‌టాప్‌ల వాటా 5.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా పీసీలు/ల్యాప్‌టాప్‌ల ఎగుమతులు 163 బిలియన్ డాలర్లు. ఇందులో చైనా ఏకంగా 81 శాతం వా టా దక్కించుకుంది. లెనోవో, యాపిల్, డెల్, హెచ్ పీ అత్యధికంగా చైనాలో తయారు చేస్తున్నాయి. -
యాపిల్, శాంసంగ్ కీలక నిర్ణయం! ఇక్కడ తయారీ లేనట్లే..
ప్రపంచంలో అతిపెద్ద టెక్ కంపెనీలైన యాపిల్ (Apple), శాంసంగ్ (Samsung) భారత్‌లో తమ ఉత్పత్తుల తయారీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాయి. భారత్‌లో ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం అందిస్తున్న ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్‌కు ఈ రెండు టెక్ దిగ్గజాలు దరఖాస్తు చేయలేదు. ఐటీ హార్డ్‌వేర్ పీఎల్ఐ స్కీమ్‌లో పాల్గొనేందుకు డెల్, లెనోవో, హెచ్పీతో సహా దాదాపు 40 ఎలక్ట్రానిక్స్ కంపెనీలు అంగీకరించాయి. అయితే యాపిల్, శాంసంగ్ కంపెనీలు మాత్రం వద్దనుకున్నాయి. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. ఆ రెండు కంపెనీలు పీఎల్ఐ స్కీమ్‌ను వద్దనుకోవడానికి ప్రాథమిక కారణం స్మార్ట్ఫోన్లతో పోలిస్తే భారతదేశంలో ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లకు మార్కెట్ చాలా తక్కువగా ఉండటమే. ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌లో భారత్‌లో ఉన్నది కేవలం 2.4 శాతం మాత్రమే. కానీ స్మార్ట్ఫోన్లకు మాత్రం భారత్‌లో అత్యధిక మార్కెట్ ఉంది. పైగా యాపిల్, శాంసంగ్ కంపెనీ ప్రధాన ఉత్పత్తులు ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు కావు. కాబట్టి చైనా, వియత్నాం వంటి దేశాల నుంచి తయారీ కేంద్రాలను భారత్‌కు తరలించడం ఆర్థికంగా అంత లాభదాయకం కాదు. ఎక్కువ ఆదాయం వాటి నుంచే.. యాపిల్ కంపెనీకి ఆదాయం ప్రధానంగా ఐఫోన్ ఉత్పత్తుల నుంచే వస్తోంది. మాక్‌లు, ఐపాడ్ల నుంచి వచ్చే ఆదాయం గణనీయంగా చాలా తక్కువ. అందువల్లే ఈ సంస్థ భారత్‌లో మాక్‌లు, ఐపాడ్ల తయారీకి మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. మరోవైపు శాంసంగ్ ప్రభుత్వ ఇన్‌వాయిస్‌లలోని వ్యత్యాసాలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటుంది. ఇది ఆ కంపెనీ పీఎల్ఐ స్కీమ్‌లో పాల్గొనకపోవడానికి కారణం కావచ్చు. ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) PLI 2.0 స్కీమ్ భారత్‌లో తయారు చేసే ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఆల్ ఇన్ వన్ పర్సనల్ కంప్యూటర్లు, సర్వర్, అల్ట్రా-స్మాల్ ఫామ్ ఫ్యాక్టర్ పరికరాలతో సహా వివిధ సాంకేతిక ఉత్పత్తులను కవర్ చేస్తుంది. చాలా కంపెనీలు దీని కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రభుత్వం బడ్జెట్‌కు మించి దరఖాస్తులు వచ్చాయి. -
ఇక కెమెరాలు, ప్రింటర్లు.. మరిన్ని కీలక ఎలక్ట్రానిక్ పరికరాలపై ఆంక్షలు!
పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల దిగుమతులకు లైసెన్స్ తప్పనిసరి చేసిన భారత ప్రభుత్వం ఇప్పుడు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కూడా అలాంటి ఆంక్షలు విధించే ఆలోచనలో ఉంది. ఈ ఉత్పత్తులలో కెమెరాలు, ప్రింటర్లు, హార్డ్ డిస్క్‌లు, టెలిఫోనిక్, టెలిగ్రాఫిక్ పరికరాల భాగాలు ఉండవచ్చని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఆ నివేదిక ప్రకారం, స్థానిక మార్కెట్లో ఈ ఉత్పత్తులకు అత్యధిక డిమాండ్ ఉండటంతో విదేశాల నుంచి పెద్డఎత్తున దిగుమతులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఉత్పత్తి అవకాశాలను ప్రోత్సహించాలంటే ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని దీనిపై అవగాహన ఉన్న వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వస్తువుల దిగుమతులు 2023 ఆర్థిక సంవత్సరంలో 10.08 బిలియన్ డాలర్లను అధిగమించాయి. ఇతర వస్తువులపైనా సమీక్ష! పైన పేర్కొన్న ఉత్పత్తులతో పాటు, అధిక దిగుమతి అవుతున్న ఇతర వస్తువులను ప్రభుత్వం సమీక్షిస్తున్నట్లు సమాచారం. వీటిలో యూరియా, యాంటీబయాటిక్స్, టర్బో-జెట్లు, లిథియం-అయాన్ అక్యుమ్యులేటర్లు, శుద్ధి చేసిన రాగి, యంత్రాలు, యాంత్రిక ఉపకరణాలు, సోలార్, ఫొటోవోల్టాయిక్ సెల్స్, అల్యూమినియం స్క్రాప్, పొద్దుతిరుగుడు విత్తన నూనె, జీడిపప్పు ఉన్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో, భారత్ మొత్తం సరుకుల దిగుమతులు 16.5 శాతం పెరిగి 714 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ దిగుమతులు పెరగడం వల్ల దేశం కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 2 శాతానికి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 1.2 శాతంగా ఉండేది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అగ్రిమెంట్-1 (ITA-1) పరిధిలోకి వచ్చే 250 ఉత్పత్తుల దిగుమతులపై ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఐటీఏ-1 జాబితాలో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, కంప్యూటర్లు, టెలికాం పరికరాలు, సెమీకండక్టర్లు, సెమీకండక్టర్ తయారీ, యాంప్లిఫైయర్లు, టెస్టింగ్ పరికరాలు, సాఫ్ట్వేర్, సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్లు సహా అనేక రకాల హై-టెక్నాలజీ వస్తువులు ఉన్నాయి. -
మళ్ళీ లైసెన్స్ రాజ్యమా?
ఎప్పుడో వదిలేసిన పాత విధానాలను ఇప్పుడు మళ్ళీ తెస్తే... కొత్త ఫలితాలు వస్తాయా? కేంద్ర ప్రభుత్వం మాత్రం వస్తాయనే అనుకుంటున్నట్టు ఉంది. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతిపై ప్రభుత్వం గత వారం హఠాత్తుగా షరతులు పెట్టడాన్ని చూస్తే, మళ్ళీ 1970ల నాటి ప్రభుత్వ విధానాలు గుర్తొస్తున్నాయి. జాతీయ భద్రత కారణంగా చైనా, కొరియాల నుంచి ఈ దిగుమతులను నియంత్రించాలని ప్రభుత్వ భావన. లైసెన్సు తీసుకుంటేనే అనుమతిస్తా మని సర్కార్ చెబుతోంది. అయితే, వెల్లువెత్తిన విమర్శలు, వ్యక్తమైన ఆందోళనలతో ప్రస్తుతానికి మూడు నెలల పాటు నవంబర్ 1 దాకా ఈ షరతులను వాయిదా వేసింది. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికే ఈ నిబంధనలని పాలకుల మాట. కానీ, షరతులతో అది సాధ్యమవుతుందా? చైనాను లక్ష్యంగా చేసు కొని పెడుతున్న ఈ నిషేధం తీరా భారతీయులకే నష్టం కలిగిస్తుందన్న విశ్లేషణలూ ఉన్నాయి. దేశంలో ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులు ఏటా 6.25 శాతం వంతున పెరుగుతున్నాయి. 2022 – 23లో 533 కోట్ల డాలర్ల విలువైన ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లను దిగుమతి చేసుకున్నాం. అందులో 75 శాతం చైనావే. ఇప్పుడు పౌరుల డిజిటల్ భద్రత రీత్యా ఈ దిగుమతులపై షరతులు పెడుతున్నామంటున్నారు. ఆ సాకు చూపడానికి కారణం ఒకటే! జాతీయ భద్రత కారణమైతేనే బహుళ పక్ష వాణిజ్య ఒప్పందాల్లో దిగుమతులపై షరతులు పెట్టే వీలుంటుంది. దేశీయ ఉత్పత్తులను కాపు కాసుకోవడం కారణమంటే రచ్చ తప్పదు. అయితే, ఎంత జాతీయ భద్రతను సాకుగా చూపినప్పటికీ, ఈ దిగుమతుల షరతులకు అవతలి వైపు నుంచి ట్యారిఫ్ల ప్రతిచర్యలు, దీర్ఘకాలిక వివాదాలు ఎలాగూ తప్పవు. పరిశ్రమతో ఎలాంటి సంప్రతింపులూ జరపకుండానే హడావిడి నిర్ణయం తీసుకొని, సుస్థిర వ్యవస్థను హఠాత్తుగా మార్చడంతో వచ్చిపడే ఇబ్బందులు సరేసరి. ప్రస్తుత నిబంధనల ప్రకారం మన దేశంలోని కంపెనీలు ల్యాప్‌టాప్‌లను యథేచ్ఛగా దిగుమతి చేసుకోవచ్చు. రానున్న కొత్త రూల్స్‌తో ప్రత్యేక లైసెన్స్ ఉంటే కానీ, దిగుమతి సాధ్యం కాదు. 2020లో కలర్ టీవీల దిగుమతి పైనా భారత్ ఇలాంటి షరతులే పెట్టడం గమనార్హం. అలాగే, మొబైల్‌ఫోన్లపైనా అధిక ట్యారిఫ్‌లు విధించింది. పలు స్మార్ట్‌ఫోన్ సంస్థలు భారత్‌లోనే విడిభాగా లను కూర్చి, తయారు చేస్తున్నాయి. కానీ, కంప్యూటర్ల సంగతలా కాదు. చైనా సంస్థ లెనోవా మినహా యాపిల్, డెల్, సామ్సంగ్, షియామీ తదితర ఉత్పత్తులన్నీ దిగుమతులే! కంప్యూటర్ల దిగుమతికి లైసెన్స్ దెబ్బతో ఈ సంస్థల గంపగుత్త ఆర్డర్లపై దెబ్బ పడుతుంది. కలర్ టీవీల్లా కాక కంప్యూటర్లు విద్య, పరిశోధన, పౌరసేవల్లో కీలకం. విద్యారంగంలో విప్లవాత్మక మార్పుకై ఈ మధ్యే రిలయన్స్ సంస్థ రూ. 20 వేల లోపలే లభించే జియోబుక్‌ను తెచ్చింది. అదీ చైనా తయారీయే! రిలయన్స్ ఇప్పుడిక పాలకుల నుంచి ప్రత్యేక లైసెన్స్ తెచ్చుకోకుంటే, దిగుమతి చేసుకోలేదు. షరతుల వార్తలతో ఈ వారం కంప్యూటర్ల అమ్మకాలు 25 శాతం పెరిగాయి. చివరకు కొరత ఏర్పడి, ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. ఇప్పటికే కోవిడ్ వల్ల సరఫరా వ్యవస్థల్లో ఇబ్బందులు, సెమీ కండక్టర్ సంక్షోభం సతమతం చేస్తున్నాయి. షియామీ, రియల్‌మి, వన్‌ప్లస్ లాంటి కొత్త ఉత్పత్తులతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారతీయ ట్యాబ్ మార్కెట్ ఈ షరతులతో మరిన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా, ఐటీ సేవల కేంద్రంగా పేరున్న దేశం కంప్యూటర్ల దిగుమతులపై షరతుల పాట పాడడం ఎలా చూసినా అనూహ్యమే! ప్రజలపై ప్రభావం చూపుతూ, దీర్ఘకాలిక ఆర్థిక పర్యవసానాలున్న నిర్ణయాలను తీసుకొనే ముందు పాలకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వంలోని ఆర్థిక శాస్త్రవేత్తలతో సంప్రతింపులు జరిపివుంటే పాలకులు ఈ హఠాన్నిర్ణయం తీసుకొనేవారు కాదు. దేశీయ ఉత్పత్తి పెంచడం, దిగుమతులపై ఆధారపడడం తగ్గించడం, విశ్వసనీయ హార్డ్‌వేర్‌ను అందుబాటులో ఉంచడం మంచి లక్ష్యాలే. కానీ, వాటి కోసం పాత లైసెన్స్ రాజ్యానికి తిరోగమించాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఫలానా చైనా ఉత్పత్తుల వల్ల భద్రతలో ముప్పుందని భావిస్తే, ఆ దేశ ఉత్పత్తులకు అడ్డుకట్ట వేస్తే సరి. అలాకాక మొత్తం వ్యవస్థను లైసెన్సుల అగచాట్లలోకి నెట్టాల్సిన పని లేదు. అనేక కష్టాలు భరించాకే లైసెన్స్ రాజ్యబంధనాల్ని వదిలించుకున్నామని విస్మరించలేం. సులభంగా లైసెన్సులు ఇస్తామంటున్నా, ఆశ్రితపక్షపాతం సహా సమస్యలు మామూలే! ఇవాళ మనది సేవల రంగంతో పురోగమిస్తున్న ఆర్థికవ్యవస్థ. అందులో కీలకమైన కంప్యూటర్ హార్డ్వేర్ల కొరతతో దీర్ఘకాలిక నష్టమే. దేశీయోత్పత్తిని పెంచేందుకు ఉత్పత్తితో ముడిపడ్డ ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకాన్ని 2020లో ప్రారంభించిన కేంద్రం వివిధ రంగాలకు దాన్ని విస్తరించినా, ఐటీ హార్డ్‌వేర్ రంగంలో ఆశించినంత భాగస్వామ్యం రావట్లేదు. కేటాయింపులు రెట్టింపు చేసినా అదే పరిస్థితి. అలాగని, దిగుమతులపై షరతులు, లైసెన్స్ రాజ్యం పెడితే దేశీయ ఉత్పత్తి పెరుగుతుందనుకోవడం అవివేకం. ఆ సంగతి గత చరిత్ర నిరూపించింది. అపార ఇంజనీరింగ్ ప్రతిభ, తక్కువ వేతనానికే మెరుగైన సేవలు ఇస్తున్నా మనం అంతర్జాతీయ ఉత్పత్తి సేవల భాగస్వామ్యంలో ఎందుకని, ఎక్కడ వెనుకబడిపోయామో మథనం సాగాలి. ఆ విధాన లోపాన్ని సరిచేసుకోవాలి. ప్రతి వెయ్యిలో 15 మందికే కంప్యూటర్ చేరిన దేశంలో షరతులతో ఆ లోటు పెరుగుతుందా, తరుగుతుందా? ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యపై సమగ్ర దృష్టి పెట్టాలి. సంబంధింత పక్షాలతో క్షుణ్ణంగా చర్చించాలి. అనివార్యమైతే తప్ప అనవసర షరతులతో నష్టమని గుర్తించాలి. లేదంటే భారత పురోగతి మరోసారి కుంటుపడుతుంది. -
నవంబర్ నుంచి కంప్యూటర్లపై ఆంక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్ పీసీల దిగుమతులపై విధించిన ఆంక్షల అమలును మూడు నెలలు వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. దిగుమతులపై విధించిన ఆంక్షలు నవంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) వెల్లడించింది. ఎల్రక్టానిక్స్ కంపెనీలు ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్ పీసీలను భారత్‌కు దిగుమతి చేసుకోవాలంటే నవంబర్ 1 నుంచి ప్రభుత్వ లైసెన్స్ తప్పనిసరి. కాగా, లైసెన్స్ కలిగిన కంపెనీలు మాత్రమే ఈ పరికరాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని, ఉత్తర్వులు వెంటనే అమలులోకి తీసుకువస్తున్నట్టు ఆగస్ట్ 3న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు వెలువరించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంతో పరిశ్రమ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. కంప్యూటర్లలో అంతర్గత భద్రత లొసుగులతో కార్పొరేట్ కంపెనీలు, వ్యక్తుల డేటాకు ముప్పు ఏర్పడే ప్రమాదం పొంచి ఉందన్న కారణంతో తప్పనిసరి లైసెన్స్ విధానానికి కేంద్ర ప్రభుత్వం తెరతీసింది. -
కంప్యూటర్ల దిగుమతిపై నియంత్రణ
న్యూఢిల్లీ: దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు, భద్రతాపరమైన కారణాల రీత్యా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు అలాగే కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై కేంద్రం గురువారం నియంత్రణలు విధించింది. చైనా, కొరియా వంటి దేశాల నుంచి దిగుమతులను కట్టడి చేసేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. నియంత్రణలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ఇకపై ఈ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు దిగుమతిదారులు ప్రభుత్వం నుంచి అనుమతి, లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నియంత్రణల విధింపునకు పలు కారణాలు ఉన్నప్పటికీ పౌరుల భద్రతను పరిరక్షించడం అన్నింటికన్నా ప్రధానమైనదని ఆయన వివరించారు. ఆంక్షలు విధించడమనేది దిగుమతులను పూర్తిగా నిషేధించే ఉద్దేశంతో తీసుకున్నది కాదని, వాటిని నియంత్రించడం మాత్రమే లక్ష్యమని చెప్పారు. దీనివల్ల దేశీయంగా ధరలేమీ పెరగబోవని తెలిపారు. కొన్ని మినహాయింపులు ఉంటాయి.. ‘ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఆల్–ఇన్–వన్ పర్సనల్ కంప్యూటర్లు, అల్ట్రా చిన్న స్థాయి కంప్యూటర్లు, సర్వర్ల దిగుమతులపై తక్షణమే నియంత్రణలు అమల్లోకి వస్తాయి‘ అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఒక నోటిఫికేషన్లో తెలిపింది. అయితే, కొన్ని సందర్భాల్లో మినహాయింపులు ఉంటాయని పేర్కొంది. ఆగస్టు 3 కన్నా ముందుగానే లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేసిన కన్సైన్మెంట్లను దిగుమతి చేసుకోవచ్చని వివరించింది. ఆగస్టు 4 నుంచి దిగుమతిదారు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే ఆర్అండ్డీ, టెస్టింగ్, రిపేర్ అండ్ రిటర్న్ తదితర అవసరాల కోసం కన్సైన్మెంట్కు 20 ఐటమ్‌ల వరకు దిగుమతి చేసుకునేందుకు లైసెన్సు తీసుకోనక్కర్లేదని వివరించింది. ఈ–కామర్స్ పోర్టల్స్ ద్వారా కొనుగోలు చేసే ఒక ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, పీసీ, లేదా అల్ట్రా స్మాల్ ఫారం ఫ్యాక్టర్ కంప్యూటర్లకు కూడా మినహాయింపులు వర్తిస్తాయి. అయితే, వాటికి వర్తించే సుంకాలను చెల్లించాల్సి ఉంటుంది. దిగుమతులపై ఆంక్షల వల్ల దేశీయంగా ఆయా ఉత్పత్తుల రేట్లు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. బిలియన్ డాలర్ల కొద్దీ దిగుమతులు.. 2022–23లో భారత్ 5.33 బిలియన్ డాలర్ల విలువ చేసే పర్సనల్ కంప్యూటర్లు .. ల్యాప్‌టాప్‌లను, 553 మిలియన్ డాలర్ల విలువ చేసే ప్రత్యేక డేటా ప్రాసెసింగ్ మెషీన్లను దిగుమతి చేసుకుంది. భారత్‌లో ఎక్కువగా హెచ్‌సీఎల్, డెల్, ఎల్జీ ఎల్రక్టానిక్స్, లెనొవొ, యాపిల్, హెచ్‌పీ, శాంసంగ్ తదితర ఎల్రక్టానిక్ దిగ్గజాల ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. భారత్ ఈ తరహా ఉత్పత్తులను ఏటా 7–8 బిలియన్ డాలర్ల మేర దిగుమతి చేసుకుంటోంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీíÙయేటివ్ (జీటీఆర్ఐ) నివేదిక ప్రకారం భారత్ చైనా నుంచి దిగుమతి చేసుకునే వాటిల్లో 65 శాతం వాటా ఎల్రక్టానిక్స్, యంత్రాలు, ఆర్గానిక్ రసాయనాలు ఉంటున్నాయి. రోజువారీ ఉపయోగించే మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్‌లు, సోలార్ సెల్ మాడ్యూల్స్ మొదలైన వాటి కోసం ఎక్కువగా చైనాపైనే ఆధారపడాల్సి ఉంటోంది. దీన్ని తగ్గించుకునే దిశగా దేశీయంగా ఎల్రక్టానిక్స్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. -
ఆకస్మిక ఆంక్షలు: షాక్‌లో దిగ్గజ కంపెనీలు, దిగుమతులకు బ్రేక్!
ల్యాప్‌టాప్‌లు,కంప్యూటర్ల దిగుమతులపై కేంద్రం నిర్ణయం చైనా కంపెనీలతో సహా ,ఆపిల్, శాంసంగ్,హెచ్‌పీ లాంటి దిగ్గజ కంపెనీలకు షాకిచ్చింది. ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్ సమీపిస్తున్న తరుణంలో చైనా లైసెన్సు లేకుండానే చిన్న టాబ్లెట్ల నుంచి ఆల్ ఇన్ వన్ పీసీల దిగుమతులపై ఆంక్షలు ఆయా కంపెనీల ఆదాయంపై భారీగా ప్రభావం చూపనుంది. ల్యాప్‌టాప్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, మేకిన్‌ఇండియా, స్థానిక ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా ప్రభుత్వ ఈ చర్య తీసుకుంది. (పల్సర్ బైకా? మజాకా..రూ.35 వేల కోట్ల ఆస్తి..ఎవరా హీరో?) లైసెన్స్‌లను తప్పనిసరి చేయడంతో ప్రపంచంలోని అతిపెద్ద పీసీ మేకర్స్, ఇతర కంపెనీలు ఇబ్బందుల్లో పడ్డాయి. భారతదేశానికి ల్యాప్‌టాప్‌లు టాబ్లెట్ల కొత్త దిగుమతులను నిలిపివేశాయి. అయితే ఆకస్మిక లైసెన్సింగ్ ప్రకటించడం పరిశ్రమను అతలాకుతలం చేసిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. విదేశీ సంస్థల బహుళ-బిలియన్ డాలర్ల వాణిజ్యానికి ఇది భారీ గండి కొడుతుందని అంచనా. రానున్న దీపావళి షాపింగ్ సీజన్,బ్యాక్-టు-స్కూల్ కాలం సమీపిస్తున్నందున డిమాండ్ పుంజుకోనున్న టైంలో లైసెన్సులను ఎలా త్వరగా పొందాలనే దానిపై సంస్థలు మల్లగుల్లాలు పడుతున్నాయి. (తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ) గ్లోబల్ ఇన్వెంటరీ, అమ్మకాల వృద్ధిని పునఃప్రారంభించడానికి కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్న తయారీదారులకు ఈ అవసరం అదనపు తలనొప్పిని సృష్టిస్తుందనీ, ఫలితంగా దేశీయ లాంచ్‌లు ఆలస్యం కావడానికి లేదా విదేశీ సరుకులపై ఇప్పటికీ ఎక్కువగా ఆధారపడే కంపెనీల్లో ఉత్పత్తి కొరతకు దారితీయవచ్చనేది ప్రధాన ఆందోళన. కాగా దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు, భద్రతాపరమైన కారణాల రీత్యా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు అలాగే కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై ముఖ్యంగా చైనా, కొరియా వంటి దేశాల నుంచి దిగుమతులను కట్టడి చేసే ఉద్దేశంతో తీసుకున్న ఈ నియంత్రణలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు.2022–23లో భారత్ 5.33 బిలియన్ డాలర్ల విలువ చేసే పర్సనల్ కంప్యూటర్లు .. ల్యాప్‌టాప్‌లను, 553 మిలియన్ డాలర్ల విలువ చేసే ప్రత్యేక డేటా ప్రాసెసింగ్ మెషీన్లను దిగుమతి చేసుకుంది. భారత్‌లో ఎక్కువగా హెచ్‌సీఎల్, డెల్, ఎల్జీ ఎల్రక్టానిక్స్, లెనొవొ, యాపిల్, హెచ్‌పీ, శాంసంగ్ తదితర ఎల్రక్టానిక్ దిగ్గజాల ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. మరోవైపు దేశీయంగా ఎల్రక్టానిక్స్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు ఇతర హార్డ్‌వేర్ తయారీదారులను ఆకర్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రస్తుతం 170 బిలియన్ రూపాయల ($2.1 బిలియన్) ఆర్థిక ప్రోత్సాహక ప్రణాళిక కోసం దరఖాస్తులను కోరుతున్న సంగతి తెలిసిందే. -
ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, కంప్యూటర్ల దిగుమతులు: సంచలన నిర్ణయం
Restrictions on Imports కేంద్ర ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు కంప్యూటర్ల దిగుమతిపై తక్షణమే ఆంక్షలు విధించింది. దీనికి సంబంధించి నేడు (ఆగస్ట్ 3 న) వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. పరిమితులు విధించిన దిగుమతులకు చెల్లుబాటు అయ్యే లైసెన్స్‌తో దిగుమతికి అనుమతి ఉంటుందని పేర్కొంది.బ్యాగేజీ నిబంధనల ప్రకారం దిగుమతులపై పరిమితులు వర్తించవు ఈ దిగుమతులపై ప్రభుత్వం తక్షణమే అమలయ్యేలా ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఆల్-ఇన్-వన్ పర్సనల్ కంప్యూటర్లు ,అల్ట్రా స్మాల్ ఫారమ్ ఫ్యాక్టర్ కంప్యూటర్లు, సర్వర్ల దిగుమతులపై హెచ్ఎస్ఎన్ 8741 కింద ఈ పరిమితులు విధిస్తున్నట్టు వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో వెల్లడించింది. (శుభవార్త: భారీగా పడిన వెండి, మురిపిస్తున్న పసిడి) బ్యాగేజీ నిబంధనల ప్రకారం దిగుమతులపై ఆంక్షలు వర్తించవని మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్యాగేజీ నియమాలు భారత సరిహద్దులోకి ప్రవేశించే లేదా బయటికి వచ్చే ప్రతి ప్రయాణీకుడు కస్టమ్స్ నిబంధనలు పాటించాలి. అలాగే పోస్ట్ లేదా కొరియర్. దిగుమతులు వర్తించే విధంగా సుంకం చెల్లింపునకు లోబడి ఉంటాయి. అలాగే విదేశాల్లో రిపేర్ అయిన వస్తువులను తిరిగి దిగుమతి చేసుకునేందుకు సంబంధించి, వాటి రిపేర్‌కి ఇవ్వడానికి, తిరిగి తీసుకోవడానికి సంబంధించిన దిగుమతులకు లైసెన్స్ అవసరం లేదని నోటిఫికేషన్ స్పష్టం చేసింది. (టమాటా షాక్: ఇప్పట్లో తగ్గేదే లేదు, కారణాలివిగో..!) సెర్చ్ అండ్ డెవలప్మెంట్, టెస్టింగ్, బెంచ్‌మార్కింగ్ ఇతర సమయాల్లో దిగుమతిదారులు దిగుమతి లైసెన్స్ అవసరం లేకుండా సరుకుకు 20 వస్తువులను తీసుకురావచ్చు. అయితే, ఈ ఐటెమ్‌లు తప్పనిసరిగా నిర్దిష్ట ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగింలాలి. తిరిగి విక్రయించడానికి లేదు. ఉద్దేశించిన ప్రయోజనం నెరవేరిన తర్వాత, ఉత్పత్తులను నాశనం చేయాలి లేదా తిరిగి ఎగుమతి చేయాలి. -
ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇస్తామని మోసాలు
సాక్షి, హైదరాబాద్: విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెర తీస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఇతర ప్రైవేటు వ్యక్తులతో ఉచితంగా ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తున్నట్టు ఫోన్ సందేశాలను పంపుతున్నారు. వాటిలో వివరాలు నమోదు చేయాలంటూ కొన్ని యూఆర్ఎల్ లింక్‌లను జత చేస్తున్నారు. ఇవి నిజమైనవని ఎవరైనా నమ్మి ఆ లింక్‌లను తెరిస్తే అందులో ప్రాథమిక సమాచారం, ఆధార్, ఫోన్, బ్యాంకు ఖాతా నంబర్లు.. ఇలా పూర్తి సమాచారాన్ని కొల్లగొడుతున్నారు. ఫోన్లోకి మాల్వేర్ను మనకు తెలియకుండానే ఇన్స్టాల్ చేస్తున్నారు. ఇలా వారి వలకు ఎవరైనా చిక్కితే సంబంధిత వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను కొల్లగొడుతున్నట్టు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ అధికారులు హెచ్చరించారు. ఉచిత ల్యాప్‌టాప్‌ల పేరిట వచ్చే సందేశాలను నమ్మవద్దని వారు కోరుతున్నారు. స్టే సేఫ్ ఆన్లైన్ క్విజ్ ఆన్లైన్ మోసాలపై అవగాహన.. పోటీల గడువు ఈనెల 31 సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ మోసాల బారిన పడకుండా అవగాహన పెంచేందుకు కేంద్ర హోంశాఖ వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ‘స్టే సేఫ్ ఆన్లైన్..’ నేపథ్యంతో ఆన్లైన్ క్విజ్ పోటీలు నిర్వహిస్తోంది. పోటీలకు ఈనెల 31 వరకు గడువుందని అధికారులు పేర్కొన్నారు. ఆన్లైన్ క్విజ్‌లో పాల్గొనదలచిన వారు https://www.mygov.in/staysafeonline లింక్ పై క్లిక్ చేస్తే అదనపు వివరాలు తెలుస్తాయని వెల్లడించారు. టెలిగ్రామ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, https://t.me/ ssoindia లింక్ ద్వారా గ్రూప్‌లో చేరొచ్చు. ఈ ఆన్లైన్ క్విజ్‌లో పాల్గొనే వారికి ఒక్కొక్కరికి 10 ప్రశ్నలు ఇస్తారు.. 5 నిమిషాల వ్యవధిలో వీటికి సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. క్విజ్‌లో టాప్ 10లో నిలిచే విజేతలకు ఒక్కొ క్కరికి రూ.10 వేల చొప్పున నగదు పురస్కా రం ఇవ్వనున్నారు. క్విజ్‌లో పాల్గొని 50 శాతానికి పైగా మార్కులు సాధించిన వారికి డిజిటల్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. -
Realme 5th Anniversary Sale:స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్స్
సాక్షి,ముంబై: రియల్మీ ఐదో వార్షికోత్సవ సేల్‌ను ప్రకటించింది. రియల్మే మార్కెట్లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కంపెనీ ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తోంది. రియల్మీ అఫీషియల్ వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ప్లాట్ఫామ్ల్లో కూడా ఈ యానివర్సరీ సేల్ సందర్భంగా రియల్మీ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు సహా , ఇతర రియల్మీ ప్రొడక్టులపై ప్రత్యేక ఆఫర్లు లభించనున్నాయి. మే 3 వరకు కస్టమర్లు భారీ ఆఫర్లను అందుకోవచ్చు. స్మార్ట్ఫోన్లు రియల్మీ జీటీ నియో 3టీ సుమారు రూ.8,000 డిస్కౌంట్‌తో రూ.19,999కే లభ్యం. ఫ్లాగ్షిప్ రియల్మీ జీటీ 2 ప్రో.. రూ.14వేల డిస్కౌంట్‌తో రూ.35,999కు లభిస్తోంది. ఈ సేల్‌లో రియల్మీ 10 ప్రో 5జీ, రియల్మీ 10 మొబైళ్లపై రూ.2,000 వరకు ఆఫర్ ఉంది. దీంతోపాటు రియల్మీ 9ఐ 5జీ, రియల్మీ సీ55, రియల్మీ సీ30 ,రియల్మీ సీ35, రియల్మీ జీటీ2, రియల్మీ 9 ప్రో+ 5జీ సహా మరిన్ని మొబైళ్లపై ఈ సేల్ సందర్భంగా డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ల్యాప్టాప్స్: రియల్మీ బుక్ స్లిమ్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ ల్యాప్‌టాప్ డిస్కౌంట్‌తో ప్రస్తుతం రూ.47,999, రియల్మీ బుక్ స్లిమ్ ఇంటెల్ కోర్ ఐ3 ల్యాప్‌టాప్ రూ.32,999కు ఫ్లిప్‌కార్ట్ ఈ ఆఫర్లతో ల్యాప్‌టాప్‌లు లభ్యం. స్మార్ట్ టీవీలు రియల్మీ 32, 43 అంగుళాల 4కే యూహెచ్డీ టీవీలపై రూ.3,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. రియల్మీ స్మార్ట్ టీవీ నియో 32 ఇంచుల టీవీ రూ.1,000 డిస్కౌంట్‌తో రూ.11,999కే అందుబాటులో ఉంది. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!) It's your time to grab the leap-forward deals! Don't miss the chance to catch the 5th-anniversary bonanza at https://t.co/HrgDJTHBFX. Head straight to the website now! pic.twitter.com/pVaIJliwPU — realme (@realmeIndia) May 1, 2023 -
ప్రైమ్బుక్ చవక ల్యాప్‌టాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ తాజాగా విద్యార్థుల కోసం ప్రైమ్బుక్ 4జీ ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది. ఆన్‌డ్రాయిడ్–11 ఆధారిత ప్రైమ్‌ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇది పనిచేస్తుంది. మీడియాటెక్ ఎంటీకే8788 ప్రాసెసర్, 11.6 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, వైఫై, బ్లూటూత్, 4జీ సిమ్ స్లాట్, ఫుల్ హెచ్డీ 2 ఎంపీ కెమెరా ఏర్పాటు ఉంది. బరువు 1.065 కిలోలు. ఒక ఏడాది ఆన్సైట్ వారంటీ ఉంది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుపరిచారు. 10 గంటలకుపైగా బ్యాటరీ బ్యాకప్ ఉంటుందని కంపెనీ తెలిపింది. 200 జీబీ వరకు మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బ్యాంక్, స్టూడెంట్ ఆఫర్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఆరు నెలల ఉచిత చందా, నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్లతో రూ.11,827 వరకు అదనంగా ఆదా చేసుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్ వివరించింది. ధర వేరియంట్‌నుబట్టి 4జీబీ/64 జీబీ రూ. 16,990, అలాగే 4జీబీ/128 జీబీ రూ.18,990 ఉంది. ఈ ల్యాప్‌టాప్ దేశీయంగా తయారైంది. విద్యార్థుల కోసం ఉద్ధేశించిన ల్యాప్టాప్స్ విక్రయా లు తమ వేదికపై గడిచిన మూడేళ్లలో 1.5 రెట్లు పెరిగాయని ఫ్లిప్‌కార్ట్ లార్జ్ అప్లయాన్సెస్, ఎలక్ట్రానిక్స్ వైస్ ప్రెసిడెంట్ హరి కుమార్ తెలిపారు. -
చిప్‌ల వేడికి చిప్‌తోనే చెక్.. కంప్యూటర్లలో వేడి పెరిగితే సమస్య ఏమిటి?
మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ ఉన్నట్టుండి ఆగిపోతోందా? విపరీతంగా వేడెక్కి సక్రమంగా పనిచేయడం లేదా? లోపలున్న ఫ్యాన్లు, హీట్ సింక్లతో ప్రయోజనం ఉండట్లేదా? ఈ ప్రశ్నలన్నింటికీ మీరు అవునని జవాబు చెబుతుంటే ఈ కథనం మీ కోసమే. ఎందుకంటే.. ఫ్యాన్ల అవసరమే లేకుండా ఓ భారతీయ అమెరికన్... పీసీ, ల్యాప్‌టాప్‌లను చల్లబరిచేందుకు ఓ వినూత్న టెక్నాలజీని ఆవిష్కరించాడు కాబట్టి! కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లకూ.. వేడికి అవినాభావ సంబంధం ఉంది. అవి పనిచేస్తుంటే ప్రాసెసర్ వేడెక్కుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆ వేడిని తొలగించకపోతే పీసీ, ల్యాప్‌టాప్‌ల పని సామర్థ్యం తగ్గడమే కాకుండా కొన్ని సందర్భాల్లో లోపలి సర్క్యూట్లు కాలిపోవచ్చు. ఈ సమస్యలను అధిగమించేందుకు తొలినాళ్ల నుంచి ఫ్యాన్లు ఉపయోగిస్తుండగా ఇటీవలి కాలంలో హీట్ సింకు ల్లాంటివి ఏర్పాటు చేస్తున్నారు. కానీ వాటితో ప్రయోజనం అంతంతగానే ఉంటోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా స్టార్టప్ సంస్థ ఫ్రోర్ సిస్టమ్స్ గత నెలలో జరిగిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ప్రదర్శించిన ఎయిర్‌జెట్ టెక్నాలజీ ఆధారిత పరికరం అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కూడా ఒక చిప్లాంటిదే. కాకపోతే వేడిని తొలగించేందుకే ఉపయోగపడుతుంది. కొన్ని ఎయిర్‌జెట్ చిప్‌లను కంప్యూటర్/ల్యాప్‌టాప్‌లలో ఏర్పాటు చేసుకుంటే అత్యంత సమర్థంగా వేడిని తొలగించుకోవచ్చని ఇండియన్–అమెరికన్, ఫ్రోర్ సంస్థ సీఈవో డాక్టర్ మాధవపెద్ది శేషు చెబుతున్నారు. డాక్టర్ సూర్య పి. గంటితో కలసి ఆయన ఫ్రోర్ సిస్టమ్స్‌ను స్థాపించారు. వేడి పెరిగితే సమస్య ఏమిటి? వేడిని ఎప్పటికప్పుడు తొలగించకపోతే కంప్యూటర్ల సామర్థ్యం తగ్గిపోతుంది. అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాల్లోనూ మైక్రోప్రాసెసర్లు ఉపయోగిస్తున్నాం. వాటి వేగం పెరిగిన ప్రతిసారీ అవి ఉత్పత్తి చేసే వేడి కూడా ఎక్కువ అవుతుంది. నిపుణుల అంచనాల ప్రకారం ఇది గరిష్టంగా 70 శాతం వరకూ ఉండవచ్చు. పైగా 13 అంగుళాల సైజుండే అత్యాధునిక 4.8 గిగాహెర్ట్ ్జప్రాసెసర్ నోట్‌బుక్ 56 వాట్ల విద్యు త్ ఖర్చు చేస్తుంది. దీనివల్ల ఎక్కువవుతున్న వేడిని ఫ్యాన్లు, హీట్‌సింక్, పైపుల్లాంటివి తొలగించలేవు. ఫలితంగా ప్రాసెసర్లు కాలిపోకుండా వాటి వేగాన్ని తగ్గించేలా కంపెనీలు ఏర్పాట్లు చేశాయి. ప్రత్యేకతలెన్నో.. ఎయిర్‌జెట్ టెక్నాలజీతో ఇప్పుడు రెండు చిప్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఎయిర్‌జెట్ మినీ కేవలం 270 మిల్లీమీటర్ల వెడల్పు, 41.5 మిల్లీమీటర్ల పొడవు, 2.8 మిల్లీమీటర్ల ఎత్తు ఉంటుంది. కానీ ఒకే ఒక్క వాట్ విద్యుత్‌ను వాడుకుంటూ ఇది 5.25 వాట్లకు సరిపడా వేడిని తొలగించగలదు. కొంచెం పెద్దదైన ఎయిర్‌జెట్ ప్రో 31.5 మి.మీ. వెడల్పు, 71.5 మి.మీ. పొడవు ఉంటుంది. ఇది వాడే విద్యుత్ 1.75 వాట్లు కాగా.. తొలగించగల వేడి 10.75 వాట్లకు సరిపడా ఉంటుంది. ఈ రెండు చిప్‌ల నుంచి వెలువడే శబ్దం దాదాపుగా శూన్యమనే చెప్పాలి. ఎందుకంటే ఇవి గరిష్టంగా 24 డెసిబెల్స్ స్థాయిలోనే శబ్దం చేస్తాయి. వీటి బరువు 13 నుంచి 22 గ్రాముల మధ్యే ఉండటం విశేషం. 13 అంగుళాల నోట్‌బుక్‌లో 4 ఎయిర్‌జెట్ మినీలను ఉపయోగిస్తే మైక్రోప్రాసెసర్ సామర్థ్యం 100 %వరకూ పెరుగుతుందని, 15 అంగుళాల నోట్‌బుక్‌లో 3 ఎయిర్‌జెట్ ప్రోలను వాడటం ద్వారా సామర్థ్యం 50% పెంచవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ పరికరాలు డస్ట్ ప్రూఫ్ కావడం వీటి ప్రత్యేకత. క్యూ కడుతున్న దిగ్గజ సంస్థలు.. ఫ్రోర్ సిస్టమ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న మైక్రోపాసెసర్ల తయారీ సంస్థ ఇంటెల్... భవిష్యత్తులో తాము తయారు చేయబోయే ల్యాప్‌టాప్‌లలో ఎయిర్‌జెట్ సాంకేతికతను ఉపయోగిస్తామని ప్రకటించింది. క్వాల్‌కాం... ఫ్రోర్ సిస్టమ్స్‌లో పెట్టుబడులు పెట్టింది. ప్రపంచంలోని 10 చిప్ తయారీ సంస్థల్లో ఐదు సంస్థలు ఇప్పటికే ఫ్రోర్ సిస్టమ్స్‌తో జట్టుకట్టాయి. అయితే ఎయిర్‌జెట్ మినీ, ప్రో ఇంకా ఉత్పత్తి దశలోనే ఉన్నందున వాటి ధరల వివరాలు తెలియరాలేదు. – సాక్షి, హైదరాబాద్ ప్రపంచంలోనే తొలిసారి వినూత్న పరిష్కారం వేడి సమస్యను ఎదుర్కొనేందుకు ఫ్రోర్ సిస్టమ్స్ సిద్ధం చేసిన ఎయిర్‌జెట్ టెక్నాలజీ ప్రపంచంలోనే తొలి సాలిడ్ స్టేట్ కూలింగ్ టెక్నాలజీ. ఇందులో రెండు పొరలుంటాయి. పైనున్న పొరలో సూక్ష్మ రంధ్రాలు ఏర్పాటు చేశారు. కింద రాగితో చేసిన పొర ఉంటుంది. రెండింటికీ మధ్యలో కంపించే త్వచాల్లాంటివి ఉంటాయి. ఈ వైబ్రేటింగ్ మెంబ్రేన్స్ వేడిని గ్రహించినప్పుడు వేగంగా కంపిస్తాయి. ఫలితంగా అక్కడున్న వేడిగాలి ఒత్తిడికి గురై కిందనున్న రాగిపొర వద్దకు చేరుకుంటుంది. కొంత వేడిని ఈ రాగిపొర గ్రహిస్తుంది...మిగిలిన వేడిగాలి చిప్‌కు గొట్టంలాంటి ఏర్పాటు ద్వారా బయటకు ప్రయాణిస్తుంది. ఫ్యాన్లు చేసే పనే ఇక్కడ మెమ్స్ మెంబ్రేన్స్ చేస్తున్నాయన్నమాట. -
అమెజాన్ రిపబ్లిక్ డే సేల్: స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్‌పై బ్లాక్‌బస్టర్ డీల్స్
సాక్షి,ముంబై: ఇ-కామర్స్ మేజర్ అమెజాన్ ఇండియా రిపబ్లిక్ డే సేల్ 2023 తేదీలను ప్రకటించింది. 2023 సంవత్సరానికి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా జనవరి 19 నుండి జనవరి 22 వరకు తగ్గింపు ధరల్లో పలు ఉత్పత్తులను అందించనుంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్స్‌పై 40 శాతం వరకు తగ్గింపును, ల్యాప్‌టాప్‌లు , స్మార్ట్‌వాచ్‌లపై 75 శాతం తగ్గింపును అందిస్తుంది. అలాగే ఎప్పటిలాగానే అమెజాన్ ప్రైమ్ మెంబర్లు జనవరి 18 నుండే ఈ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ఈ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో బ్లాక్‌బస్టర్ డీల్స్, బడ్జెట్ బజార్, ప్రీ-బుకింగ్, రాత్రి 8 గంటల డీల్స్‌తో పాటు కొత్త లాంచ్‌లు కూడా ఉంటాయని అమెజాన్ ఇండియా వెల్లడించింది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2023 సందర్భంగా ఆపిల్, శాంసంగ్, వన్‌ప్లస్, వివో, రియల్మీ, ఒప్పో, షావోమీ లాంటి బ్రాండ్ల బెస్ట్ స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన డీల్స్‌ను సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు ఎలక్ట్రానిక్స్, దుస్తులు తదితరాలపై కూడా తగ్గింపు ఉంటుంది. ప్రస్తుతం ప్రైమ్ ఫోన్ పార్టీ" సేల్ నడుస్తోంది. బ్యాంకు కార్డ్ వినియోగదారులకు ఆఫర్లు ఎస్బీఐ కార్డ్ యూజర్ల EMI లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. హెచ్డీఎఫ్సీ కార్డ్ లావాదేవీలపై 10 శాతం (రూ. 1,000 వరకు) తక్షణ క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది. -
అర్ధరాత్రి ఐటీ అధికారుల ల్యాప్‌టాప్‌పై హైడ్రామా.. అసలేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, బంధువులు, భాగస్వాముల ఇళ్లలో, విద్యా సంస్థల్లో ఐటీ అధికారుల దాడులు ముగిశాయి. భారీగా నగదుతో పాటు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో పన్ను ఎగవేతకు సంబంధించిన కీలక సమాచారం లభించినట్లు తెలిసింది. కాగా, అర్ధరాత్రి ఐటీ అధికారుల ల్యాప్ టాప్‌పై హైడ్రామా చోటుచేసుకుంది. మొదట ఆసుపత్రిలో ఐటీ అధికారి రత్నాకర్ ల్యాప్‌టాప్ వదిలివెళ్లారు. రత్నాకర్‌ను బోయిన్పల్లి పీఎస్‌కు మంత్రి మల్లా రెడ్డి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో ఉండిపోయిన ల్యాప్‌టాప్‌ను మల్లా రెడ్డి అనుచరులు పీఎస్‌కు తీసుకుని వచ్చారు. అప్పటికే పోలీస్ స్టేషన్‌ను కేంద్ర బలగాలు తమ ఆధీనంలో ఉంచుకున్నాయి. ల్యాప్‌టాప్‌ను లోపలికి తీసుకెళ్లేందుకు మల్లారెడ్డి అనుచరులు ప్రయత్నించారు. బోయినపల్లికి చెందిన కానిస్టేబుల్.. ల్యాప్‌టాప్‌ను లోపలికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానిస్టేబుల్‌ను అడ్డుకున్న కేంద్ర బలగాలు.. ల్యాప్‌టాప్‌ను బయటే పెట్టించాయి. బోయినపల్లి పీఎస్ గేటు ముందే ల్యాప్‌టాప్‌ను మంత్రి అనుచరులు వదిలి వెళ్లారు. మల్లారెడ్డిపై ఐటీ అధికారులు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీస్ స్టేషన్‌ను కేంద్ర బలగాలు ఖాళీ చేశాయి. కేంద్ర బలగాలు వెళ్లిన తర్వాత ల్యాప్‌టాప్‌ను బోయినపల్లి పీఎస్ లోపలికి పోలీసులు తీసుకెళ్లారు. ప్రస్తుతం బోయినపల్లి పీఎస్‌లోనే ల్యాప్‌టాప్ ఉంది. చదవండి: మంత్రి మల్లారెడ్డికి ఐటీ నోటీసులు.. సోదాల్లో ఎంత నగదు దొరికిందంటే? -
వావ్.. 15వేలకే జియో ల్యాప్‌టాప్, సేల్స్ షురూ
సాక్షి,ముంబై: తక్కువ ధరలు ఇంటర్నెట్‌సేవలు, ఫీచర్ ఫోన్లు అందించిన టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఇపుడిక బడ్జెట్ ధరలో ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. ‘జియోబుక్’ పేరుతో లాంచ్ చేసిన ఈ ల్యాప్‌టాప్ ధర ధర రూ.15,799గా నిర్ణయించింది. అయితే బ్యాంక్ ఆఫర్లతో ఇంకాస్త తక్కువకే దీన్ని సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా బడ్జెట్ ధరలో ల్యాప్‌టాప్‌కోసం ఎదురుచూస్తున్న సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండేలా జియోబుక్ రూ. 15,000 కంటే తక్కువ ధరకే అందిస్తోంది.(TwitterDeal మస్క్ బాస్ అయితే 75 శాతం జాబ్స్ ఫట్? ట్విటర్ స్పందన) ఎంబెడెడ్ జియో సిమ్ కార్డ్, 4జీ సిమ్‌కు సపోర్ట్‌తో వచ్చిన ఈ ల్యాప్‌టాప్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 8 గంటల పాటు పని చేస్తుందని కంపెనీ వెల్లడించింది. JioOS ఆధారిత జియోబుక్‌లో థర్డ్ పార్టీ యాప్స్‌కు యాక్సెస్ ఉంది. జియో తన తొలి ల్యాప్‌టాప్ ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరించింది. మొదట రూ.19,500కి ధర నిర్ణయించినా, ప్రస్తుతం ధరను తగ్గించడంతోపాటు బ్యాంకు కార్డులపై ఆఫర్లు అందిస్తోంది. పలు బ్యాంకు కార్డు కొనగోళ్లపై రూ. 5,000 వరకు తక్షణ తగ్గింపు, క్రెడిట్ కార్డ్‌లపై ఫ్లాట్ 3 వేల తగ్గింపు ఆఫర్, అలాగే క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 5,000 తగ్గింపును అందిస్తోంది. డెబిట్ కార్డ్ హోల్డర్లు కూడా కొంత తగ్గింపు ఉంది. ఆసక్తి గల కొనుగోలుదారులు రిలయన్స్ డిజిటల్ వెబ్సైట్లో చెక్ చేయవచ్చు. జియోబుక్ స్పెసిఫికేషన్స్ 11.6 అంగుళాల డిస్ప్లే 1366×768 పిక్సెల్స్ రిజల్యూషన్ Adreno 610 GPU స్నాప్‌డ్రాగన్ 665 SoC ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్( 128 జీబీవరకు విస్తరించుకునే అవకాశం 2 మెగాపిక్సెల్‌తో కూడిన ఫ్రంట్ కెమెరా 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ యూఎస్బీ 2.0 పోర్ట్, 3.0 పోర్ట్, హెచ్‌డీఎం పోర్ట్ సపోర్ట్ -
వరల్ఢ్లోనే తొలి ఫోల్డ్ ల్యాపీ, ప్రీబుకింగ్‌పై అదిరిపోయే ఆఫర్
సాక్షి, ముంబై: ఇండియాలో ల్యాప్‌టాప్ సిరీస్‌లతో ఆకట్టుకుంటున్న ఆసుస్ తాజాగా ఫోల్డబుల్ ల్యాప్‌టాప్‌ను పరిచయం చేసింది. హై బ్రిడ్ ల్యాపీలతో యూజర్లను ఎట్రాక్ట్ చేస్తున్న ఆసుస్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ‘ఆసుస్ జెన్ 17 ఫోల్డ్ ఓలెడ్’ ను తీసుకొచ్చింది. ప్రపంచంలోనే తొలి ఫోల్డింగ్ ల్యాప్‌టాప్ అని చెబుతున్న కంపెనీ దీని ధరను రూ. 3,29, 990గా నిర్ణయించింది. ల్యాప్‌టాప్ కోసం ప్రీబుకింగ్స్‌ను కూడా షురూ చేసింది. ప్రీ-బుకింగ్ ఆఫర్ ప్రీ-బుకింగ్ చేసిన వారికి ఏకంగా 55 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ముందస్తు బుకింగ్ చేసుకున్న వారికి ఈ ల్యాప్‌టాప్ రూ.2,84,290 కే లభిస్తుంది. అక్టోబర్ 14 నుంచి నవంబర్ 9 వరకు ప్రీ బుకింగ్‌కు అవకాశం ఉంది. జెన్‌బుక్ 17 ఫోల్డ్ నవంబర్ 10న విడుదల కానుంది ఆసుస్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌తో ఇతర రీటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా 4.8 అంగుళాల స్క్రీన్‌ను వర్చువల్ కీ బోర్డు, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన సాధారణ కీ బోర్డు ద్వారా యూజర్లు తమ అవసరాలకు అనుగుణంగా ట్యాబ్, డిస్ప్లేలా వాడుకోవచ్చు. ఈ కొత్త లాపీలో ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, ట్యాబ్లెట్, రీడర్, ఎక్స్టెండెడ్ అనే ఐదు స్క్రీన్ మోడ్స్ ఉండటం మరో విశేషం. అంతేకాదు మల్టీ స్క్రీన్ ఫీచర్‌తో డిస్ప్లేని ఒకేసారి మూడు స్క్రీన్లుగా వాడుకోవచ్చు. కేవలం నలుపు రంగులో మాత్రమే వచ్చిన ఈ ల్యాపీలో 500 జీబీ ఎస్ఎస్డీ ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఉచితం. 65W AC ఫాస్ట్ ఛార్జర్ మద్దతుతో 75 WHrs బ్యాటరీ సగటు వినియోగం 10 గంటలు. ఆసుస్ జెన్ 17 ఫోల్డ్ ల్యాపీ స్పెసిఫికేషన్స్ 17.3 అంగుళాల థండర్‌బోల్ట్ 4k డిస్ప్లే 12.5 అంగుళాల ఫోల్డ్ స్క్రీన్ 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్ కార్డ్ 5 ఎంపీ ఏఐ కెమెరా డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో నాలుగు స్పీకర్స్ నాలుగు యూఎస్బీ-సీ పోర్ట్ -
‘లక్ష రూపాయల ల్యాప్‌టాప్..రూ.40వేలకే ఇవ్వొచ్చు’!
వేదాంత రిసోర్సెస్..దేశంలో మెటల్ తయారీలో అతి పెద్ద కంపెనీల్లో ఒకటి. స్టీల్, కాపర్, అల్యూమీనియం తయారీలో దూసుకుపోతోంది. దేశంలో యువతకి పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తోన్న కంపెనీల్లో ఇది ఒకటి. కిక్కిరిసిన జనం మధ్యన ట్యాక్సీలో చేసిన ప్రయాణం, అప్పుడు వినిపించిన మహ్మద్ రఫి గొంతుతో..వో కోన్సీ ముష్కిల్ హై (సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు) అనే పాట స్ఫూర్తి వేదాంత ప్రస్థానానికి నాందిగా నిలిచింది. ఇప్పుడు ఆ సంస్థ చిప్ సెట్లు, డిస్ప్లే తయారీ రంగంలోకి అడుగు పెట్టింది. లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది వేదాంతా, తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్ కలిసి దేశంలో తొలి సెమీకండక్టర్ ప్లాంటును రూ.1.54 లక్షల కోట్లతో గుజరాత్లో నిర్మించనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, ఈ ప్లాంటులో ఫాక్సాకాన్ వాటా 38శాతం ఉండగా.. మిగిలిన సింహభాగం వేదాంతాదే. ఈ నేపథ్యంలో వేదాంతా గ్రూప్ ఛైర్మన్ ఓ మీడియా ఇంటర్వ్యూలో అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ..చిప్ సెట్లు, డిస్ప్లే తయారీ ప్రారంభమైతే దేశంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు భారీగా తగ్గుతాయి. ‘ప్రస్తుతం మనం ల్యాప్ ట్యాప్ తీసుకుంటే దాని ధర రూ.లక్ష ఉంటే..డిస్ప్లే, చిప్ సెట్లను దేశీయంగా తయారు చేస్తే అదే ల్యాప్ ట్యాప్ ధర రూ.40వేలు అంతకంటే తక్కువే ఉండొచ్చు’ అని పేర్కొన్నారు. -
‘ముసలితనానికి కారణమేంటి’..అదే పనిగా సెల్ ఫోన్ వాడుతున్నారా?
మనుషుల్ని ప్రేమించాలి..వస్తువుల్ని వాడుకోవాలి. కానీ అలా కాకుండా మనుషుల్ని వాడుకుంటూ..వస్తువుల్ని ప్రేమిస్తున్న యుక్త వయస్సు వారు తొందరగా ముసలోళ్లు అవుతున్నారంటూ షాకింగ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్.. మనిషి జీవితంలో భాగమైంది. అది లేకపోతే ఏదో కోల్పోయామనే భావన కలుగుతోంది. స్మార్ట్ ఫోన్‌తో పాటు ఇయర్ ఫోన్స్,స్మార్ట్ వాచ్, ల్యాప్‌ట్యాప్‌తో పాటు ఇతర గాడ్జెట్స్‌పై అదే అభిప్రాయం ఉంటే ప్రమాదమని తెలుస్తోంది. ఎందుకంటే వాటివల్ల మానవళి మనుగడకు ముప్పు వాటిల్లుతున్నట్లు..ముఖ్యంగా గాడ్జెట్స్ వల్ల వయస్సు మీద పడి అనేక సమస్యల్లో చిక్కుకుంటున్నట్లు అమెరికాకు చెందిన ‘ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీ’ అధ్యయనంలో తేలింది. ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్ ( Frontiers in Aging) అనే జర్నల్‌లో స్మార్ట్ ఫోన్, ల్యాప్ ట్యాప్స్‌తో పాటు ఇతర గాడ్జెట్స్ నుంచి అతిగా వినియోగించడం వల్ల.. వాటి నుంచి ప్రతిభించించే నీలి రంగు వెలుతురు వల్ల త్వరగా యుక్త వయస్సు నుంచి వృద్ధాప్యంలోకి జారుకుంటున్నట్లు ఒరెగాన్ యూనివర్సిటీ ప్రతినిథులు తెలిపారు. ప్రతి రోజు టీవీ, ల్యాప్ ట్యాప్స్, స్మార్ట్ ఫోన్స్ వినియోగంతో మితిమీరిన కాంతి మనుషులు శరీరంపై పడుతుంది. తద్వారా శరీర కారణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు మా రీసెర్చ్‌లో తేలింది. చర్మం, కొవ్వు కణాల నుంచి నాడికణాల (ఇంద్రియ న్యూరాన్లు) వరకు దుష్ప్రభావం చూపుతుందని యూనివర్సినీ ప్రొఫెసర్ జాడ్విగా గిబుల్టోవిచ్ చెప్పారు. చదవండి👉 మార్చుకోం : ఐఫోన్14 సిరీస్ విడుదలపై భారతీయులు ఏమంటున్నారంటే! -
పీసీ మార్కెట్ జోరు.. 37 లక్షల సేల్స్, తగ్గేదేలే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్‌లో పర్సనల్ కంప్యూటర్స్ (పీసీ) విపణి జోరు మీద ఉంది. ఏప్రిల్–జూన్‌లో 37 లక్షల యూనిట్ల డెస్క్‌టాప్స్, నోట్‌బుక్స్, వర్క్ స్టేషన్స్ అమ్ముడయ్యాయి. 2021తో పోలిస్తే ఇది 17.8 శాతం అధికం అని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) వెల్లడించింది. ఐడీసీ ప్రకారం.. మొత్తం విక్రయాల్లో 26 లక్షల యూనిట్లతో నోట్‌బుక్స్ విభాగం తన హవాను కొనసాగిస్తోంది. అయితే గడిచిన మూడు త్రైమాసికాల్లో నోట్‌బుక్స్ సగటున 30 శాతం వృద్ధి చెందితే 2022 ఏప్రిల్–జూన్‌లో ఇది 7.3 శాతానికే పరిమితం అయింది. 10 లక్షలకుపైగా డెస్క్‌టాప్స్ కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. ఒక మిలియన్ యూనిట్లు దాటడం వరుసగా ఇది రెండవ త్రైమాసికం. ప్రభుత్వ విభాగాల నుంచి ఆర్డర్లు రావడం ఈ స్థాయి అమ్మకాలకు కారణం. ఆన్లైన్ బిగ్ సేల్ప్సై ఆశలు.. డెస్క్‌టాప్స్ విక్రయాల విషయంలో గడిచిన మూడు త్రైమాసికాలతో పోలిస్తే ఎంటర్ప్రైస్ విభాగం తక్కువగా 14.9 శాతం వృద్ధి చెందింది. చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల నుంచి ఆర్డర్లు రెండు త్రైమాసికాల కంటే తక్కువగా నమోదైంది. అధిక ద్రవ్యోల్బణం, మాంద్యం భయం, డాలర్ ధర హెచ్చుతగ్గులు ముఖ్యంగా స్టార్టప్‌లలో పీసీల సేకరణను నెమ్మదించాయి. పెద్ద సంస్థలు ఆలస్యంగా కొనుగోలు చేస్తున్నాయి. రాబోయే ఆన్లైన్ బిగ్ సేల్స్ వినియోగదారుల విభాగంలో ఆశాకిరణంగా ఉండవచ్చు. అయితే వాణిజ్య విభాగంలో ప్రభుత్వ సంస్థల నుంచి బలమైన ఊపు, ఎంటర్ప్రైసెస్ నుంచి ఇప్పటికే ఉన్న ఆర్డర్లు సానుకూల అంశం. స్టోర్లకు కస్టమర్ల రాక.. కొన్ని త్రైమాసికాలుగా ఆన్లైన్ సేల్స్ క్రమంగా తగ్గుతున్నాయి. ఆఫ్‌లైన్ స్టోర్లకు కస్టమర్ల రాక గణనీయంగా పెరుగుతోంది. పాఠశాలలు తెరవడం ప్రారంభించడంతో పీసీ మార్కెట్ వృద్ధి తగ్గింది. తద్వారా రిమోట్ లెర్నింగ్ డిమాండ్ తగ్గిందని ఐడీసీ ఇండియా పీసీ డివైసెస్ సీనియర్ మార్కెట్ అనలిస్ట్ భరత్ షెనాయ్ తెలిపారు. ‘కళాశాలల ప్రారంభం ఆలస్యమైంది. కళాశాలల ప్రమోషన్లతో తిరిగి అమ్మకాలు ఊపందుకుంటాయని విక్రేతలు ఇప్పటికీ ఆశిస్తున్నారు. ఆన్లైన్ అమ్మకాలు కూడా 2022 మూడవ త్రైమాసికం చివరిలో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. అధిక నిల్వలు ఆందోళన కలిగించే విషయం. రాబోయే కొద్ది నెలల్లో సరుకు నిల్వల దిద్దుబాటు అనివార్యం’ అని వివరించారు. ముందంజలో హెచ్‌పీ పీసీల అమ్మకాల్లో హెచ్‌పీ ముందంజలో ఉంది. ఏప్రిల్–జూన్ కాలంలో 30.8 శాతం మార్కెట్ వాటాతో 11.53 లక్షల యూనిట్లను ఈ సంస్థ విక్రయించింది. రెండవ స్థానంలో ఉన్న డెల్ వాటా 21.6 శాతంగా ఉంది. ఈ కంపెనీ 8.07 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించింది. లెనోవో 19.6 శాతం వాటాతో 7.34 లక్షల యూనిట్లను విక్రయించింది. ఏసర్ గ్రూప్ 8.9 శాతం వాటాతో 3.32 లక్షలు, ఆసస్ 6.1 శాతం వాటాతో 4.86 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించాయి. చదవండి: ద్రవ్యోల్బణం: అధికారులతో ఆర్బీఐ గవర్నర్ భేటీ.. కీలక అంశాలు ఇవే! -
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్: భారీ డిస్కౌంట్స్
సాక్షి, ముంబై: ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ ఏడాది కూడా బిగ్ బచత్ ధమాల్ సేల్‌ను ప్రారంభించింది. జూలై 1 నుంచి 3వ తేదీ వరకు ఈ ధమాకా సేల్ కొనసాగనుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. దీంతోపాటు ఫోన్ ఉపకరణాలు, ల్యాప్‌టాప్‌లు, గాడ్జెట్లు, దుస్తులు, గృహోపకరణాలను కూడా తగ్గింపు ధరల్లో అందిస్తోంది. భారీ తగ్గింపులతో పాటు, తన కస్టమర్లకు నోకాస్ట్ ఈఎంఐ, ఉచిత డెలివరీ కూడా ఉంది. అలాగే వినియోగదారుల షాపింగ్ సౌలభ్యం కోసం, ఫ్లిప్‌కార్ట్ కొత్త పేజీని సృష్టించింది. ఈజీగా ఇక్కడ పూర్తి సమాచారాన్ని పొందొచ్చు. వివో ఎక్స్ 70 ప్రో: 8జీబీ ర్యామ్, 128 స్టోరేజ్ వేరియంట్ రూ.46,990. అందమైన ఫోటోలకు కేరాఫ్ ఎడ్రస్ ఈ ఫోన్. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు ఇన్-బిల్ట్ గింబల్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అందిస్తుంది. మోటరోలా ఎడ్జ్ 20 ప్రొ 5జీ: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో ఈ మొబైల్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,999కి అందుబాటులో ఉంది. దీనివాస్తవ ధర 45,999. స్మార్ట్‌ఫోన్‌లో 108+16 +8ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో లభ్యమవుతున్న ఈ ఫోన్ ఫోటోలంటే ఇష్టపడే వారికి కూడా ఇది మంచి ఆప్షన్. పోకో 5జీ ప్రొ: బడ్జెట్ ధరలో లభించే 5జీ స్మార్ట్‌ఫోన్. 6 జీబీ వేరియంట్ ధర 14,499లకే లభ్యం. దీని అసలు ధర 16,499. ఐఫోన్ 12 మినీ: ఐఫోన్ 12 మినీ 128 జీబీ స్టోరేజ్ మోడల్ ఈ సేల్‌లో రూ. 49,999కి అందుబాటులో ఉంది. దీని వాస్తవ ధర 59,900. ఐఫోన్ 13 లాంటి ఇతర ఆపిల్ ఫోన్లపై డిస్కౌంట్లు ఉన్నాయి. పోకో ఎఫ్4 5జీ: పోకో లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ పోకో ఎఫ్4 5జీ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.27,999కి అందుబాటులో ఉంది. దీంతోపాటు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే, అదనంగా 3 వేల తగ్గింపు లభిస్తుంది. -
యూజర్లకు అలర్ట్..ఈ ల్యాప్‌టాప్‌లలో జూమ్ యాప్ సేవలు బంద్!
కరోనా కారణంగా వరల్డ్ వైడ్‌గా జూమ్ యాప్ పాపులర్ అయిన విషయం తెలిసిందే. స్కూల్ విద్యార్ధులకు ఆన్లైన్ క్లాసుల నుంచి ఆఫీస్‌లో నిర్వహించే ఆన్లైన్ మీటింగ్స్ వరకు..ఇలా అన్నీ జూమ్ యాప్‌లో జరిగేవి.ఈ తరుణంలో జూమ్ యాప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆగస్ట్ నుంచి క్రోమ్ బుక్స్ ల్యాప్‌ట్యాప్‌లలో తమ సేవల్ని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ల్యాప్ ట్యాప్స్ కంటే లిమిటెడ్ సపోర్ట్‌తో గూగుల్ క్రోమ్‌బుక్స్(ల్యాప్ ట్యాప్ తరహాలో) ను విడుదల చేసింది. వీటిలో విండోస్ సపోర్ట్ చేయదు. గూగుల్ ప్రత్యేకంగా తయారు చేసిన క్రోమా ఓఎస్ మాత్రమే వినియోగించుకోవచ్చు. క్రోమ్ బుక్స్‌కు సపోర్ట్ చేసే జుమ్‌లాంటి యాప్స్‌తో పాటు ఇతర యాప్స్‌ను వినియోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలో 2020 ప్లాన్‌లో భాగంగా యూజర్లకు ఫస్ట్ క్లాస్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను గూగుల్ అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. జూమ్ తరహాలో గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకునే అవసరం లేకుండా డైరెక్ట్‌గా సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసుకొని మనకు కావాల్సిన యాప్స్‌ను ఇన్స్టాల్ చేసుకునే టెక్నాలజీపై దృష్టిసారించింది. అందుకే 2020లో తొలిసారిగా ప్రకటించిన వ్యూహానికి అనుగుణంగా, క్రోమా ఓఎస్ ఆధారిత క్రోమ్‌బుక్‌లలో క్రోమ్ యాప్‌లను లిపివేయనుంది. వాటిలో జూమ్ యాప్ కూడా ఉంది. ప్రోగ్రెసీవ్ వెబ్ యాప్స్‌కు మాత్రమే అనుమతిస్తుండగా..గూగుల్ నిర్ణయంతో..జూమ్ సైతం క్రోమ్ బుక్స్‌లో సేవల్ని నిలిపివేస్తున్నట్లు చెప్పింది. ఒకవేళ క్రోమ్ బుక్స్‌లో జూమ్ యాప్ కావాలనుకుంటే జూమ్ ఫర్ క్రోమ్ పీడబ్ల్యూఏ వాడాలని జూమ్ సంస్థ క్రోమ్‌బుక్ యూజర్లను కోరింది. చదవండి👉ఈ యూట్యూబర్ల నెలవారీ సంపాదన తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది! -
ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్
సాక్షి, ముంబై: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్ ప్రకటించింది. జూన్ 11నుంచి మొదలైన ఈ సేల్ 17వ తేదీవరకు కొనసాగనుంది. తాజాగా ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ 2022 సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ ఆన్లైన్ వినియోగదారుల కోసం డీల్‌లు, డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తోంది. ఎండ్ ఆఫ్ సీజన్ సేల్‌లో భాగంగా ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లతో సహా ఎలక్ట్రానిక్స్‌పై డిస్కౌంట్స్ ప్రకటించింది. ప్రధానంగా లెనోవా, ఆసుస్, హెచ్‌పీ, షావోమీ, ఎంఎస్ఐ ఏసర్ లాంటి ప్రముఖ బ్రాండ్ల ల్యాప్టాప్స్ తగ్గింపు ధరలలో అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం తక్షణ తగ్గింపు. అలాగే పేటీఎం Paytm వాలెట్ , యూపీఐ లావాదేవీలపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. వినియోగదారులు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను కూడా పొందవచ్చు. ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఆసుస్ వివో బుక్ కే15 ఓఎల్ఈడీ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం రూ. 52,990కే లభ్యం. ఎంఆర్పీ ధర రూ.78,990. అంటే సుమారు 32 శాతం తగ్గింపు. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం తగ్గింపు, రూ. 18,100 దాకా ఎక్స్ఛేంజ్ ఆఫర్ లెనోవా థింక్‌బుక్ 13ఎస్ ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్‌లో భారీ తగ్గింపు లభిస్తున్న వాటిల్లో ఇది కూడా ఒకటి. 51 శాతం డిస్కౌంట్‌తో లెనోవా థింక్‌బుక్ 13ఎస్ ను కేవలం 54,990 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. దీనికి ఎంఆర్పీ ధర రూ. 1,12,608. దీనికి 10 శాతం తగ్గింపు, ఎక్స్చేంజ్ ఆఫర్ అదనం. రెడ్‌మీబుక్ ప్రో ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 28శాతం డిస్కౌంట్‌తో రూ. 42,990 ధరకే లభిస్తోంది రెడ్‌మీబుక్ ప్రో. దీని ఎంఆర్పీ ధర రూ. 59,990. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లపై 10 శాతం తగ్గింపు. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. ఎంఎస్ఐ మోడ్రన్ 14 ఈ ల్యాప్‌టాప్‌ను రూ. 43,990 అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం తగ్గింపును 18,100 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభ్యం. -
భారతీయులకు టెక్ దిగ్గజం హెచ్‌పీ శుభవార్త!!
ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్‌పీ భారతీయులకు శుభవార్త చెప్పింది. దేశీయంగా హెచ్‌పీ ల్యాప్‌ట్యాప్‌లను తయారు చేయడం ప్రారంభించినట్లు తెలిపింది. దేశీయం ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్‌ల తయారీని ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటీవ్(పీఎల్ఐ) స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ పథకం సత్పలితాలను ఇస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ పథకంలో భాగంగా హెచ్ పీ సంస్థ మన దేశంలో డెస్క్‌టాప్ లు, మినీ డెస్క్‌టాప్‌లు, డిస్ప్లే మానిటర్లు, ల్యాప్‌టాప్‌లను తయారు చేయడం ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ గణాంకాల ప్రకారం..2020నుంచి హెచ్‌పీ భారత్‌లో 58.7శాతం వృద్ధితో 31.5శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండగా..2021లో వాణిజ్య విభాగంలో హెచ్‌పీ మార్కెట్ వాటా 57.5శాతం నుంచి 60.1శాతానికి వృద్ధి చెందింది. వినియోగం విభాగాల్లో 30శాతం నుంచి 32.9శాతానికి పెరిగినట్లు తెలిపింది. అయితే ఇప్పుడు ఆ మార్కెట్‌ను మరింత పెంచేందుకు భారీ ఎత్తున ల్యాప్‌టాప్‌లను తయారు చేస్తుంది. హెచ్‌పీ ఎలక్ట్రానిక్స్ మ్యానిఫ్యాక్చర్ కంపెనీ ఫ్లెక్స్ కంపెనీతో చేతులు కలిపింది. తమిళనాడులో చెన్నైకి చెందిన శ్రీపెరంబుదూర్‌లోని హెచ్‌పీ తయారీ యూనిట్లను పెంచేందుకు భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నట్లు హెచ్‌పీ ఇండియా మార్కెట్ మేనేజింగ్ డైరెక్టర్ కేతన్ పటేల్ అన్నారు. వాస్తవానికి హెచ్‌పీ భారత్‌లో కమర్షియల్ డెస్క్ టాప్‌లను తయారు చేస్తుంది. అయితే తాజా పెట్టుబడలతో హెచ్‌పీ ఎలైట్ బుక్స్, ప్రో బుక్స్, హెచ్‌పీ జీ8 సిరీస్ నోట్‌బుక్స్‌తో పాటు భారీ ఎత్తున ల్యాప్‌టాప్‌లను తయారు చేస్తున్నట్లు హెచ్ పీ వెల్లడించింది.. -
గేమింగ్ ప్రియులకు అమెజాన్ శుభవార్త.. ల్యాప్టాప్స్ మీద అదిరిపోయే డిస్కౌంట్..!
పముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ గేమింగ్ ప్రియులకు మంచి శుభవార్త తెలిపింది. గేమింగ్ ఔత్సాహికుల కోసం గేమింగ్ గాడ్జెట్లపై అనేక డీల్‌లు, ఆఫర్లను అందించడానికి అమెజాన్ ఈరోజు 'గ్రాండ్ గేమింగ్ డేస్ సేల్‌ని ప్రకటించింది. అమెజాన్ ఈ 'గ్రాండ్ గేమింగ్ డేస్' సేల్‌ని ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు నిర్వహిస్తుంది. Lenovo, Acer, Asus, LG, HP, Sony, Dell, Corsair, Cosmic byte, JBL వంటి మొదలైన ప్రముఖ బ్రాండ్ కంపెనీలు గేమింగ్ ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు & మానిటర్లు, అధునాతన హెడ్ఫోన్లు, గేమింగ్ కన్సోల్లు, గ్రాఫిక్ కార్డ్‌లపై మంచి డీల్‌లను అందిస్తుంది. వినియోగదారులు గేమింగ్ ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ కన్సోల్లు, గ్రాఫిక్స్ కార్డ్‌లు, మానిటర్లు వంటి వాటిపై గరిష్టంగా 50 శాతం తగ్గింపును పొందవచ్చు. Acer Nitro 5 గేమింగ్ ల్యాప్‌టాప్: Intel Core i5 11th gen ప్రాసెసర్‌తో పనిచేసే Acer Nitro 5 గేమింగ్ ల్యాప్‌టాప్‌లో శక్తివంతమైన 8జీబీ DDR4SD RAM, 512GB SSD, Nvidia GeForce GTX 1650 గ్రాఫిక్ కార్డ్ ఉంటాయి. ఈ ల్యాప్‌టాప్ మల్టీ టాస్కింగ్ కి సపోర్ట్ చేస్తుంది. దీని డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 144 Hzగా ఉంది ఈ గేమింగ్ ల్యాప్‌టాప్ ₹62,490కి అందుబాటులో ఉంది. HP Victus FHD గేమింగ్ ల్యాప్‌టాప్: HP Victus గేమింగ్ ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ R7-5800H ప్రాసెసర్, Nvidia RTX 3050 4GB DDR6 డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ సహాయంతో పనిచేస్తుంది. ఆఫర్లో భాగంగా ఈ గేమింగ్ బీస్ట్ రూ.20,000 తక్కువతో ₹83,990కి లభిస్తుంది. ఇలా వినియోగదారులు గేమింగ్ ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ కన్సోల్లు, గ్రాఫిక్స్ కార్డ్‌లు, మానిటర్లు వంటి వాటిపై భారీగా తగ్గింపును పొందవచ్చు. (చదవండి: హైదరాబాదీలకు శుభవార్త! నగరంలో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు) -
జియోబుక్ ల్యాప్‌టాప్ గురించి అదిరిపోయే అప్డేట్..!
రిలయన్స్ జియో త్వరలో తన తొలి ల్యాప్‌టాప్‌ను దేశంలో లాంచ్ చేసేందుకు సిద్దం అవుతుంది. ఇందుకు సంబంధించిన ఒక ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఒక కొత్త నివేదిక ప్రకారం.. జియోబుక్ పేరుతో రాబోతున్న ఈ ల్యాప్‌టాప్‌కు హార్డ్ వేర్ ఆమోదపత్రం ఇటీవలే లభించింది. ఈ ల్యాప్‌టాప్ విండోస్ 10 ఓఎస్ సహాయంతో నడవనున్నట్లు ఆ నివేదిక తెలిపింది. అయితే ఈ ల్యాప్‌టాప్‌ను ఎమ్'డోర్ డిజిటల్ టెక్నాలజీ అనే చైనీస్ కంపెనీ తయారు చేస్తోంది. ఆ కంపెనీతో జియో చేతులు కలిపి తమ బ్రాండ్‌తో మార్కెట్లోకి లాంఛ్ చేయనున్నారు. ఇది ఏఆర్ఎమ్ సహాయంతో పనిచేస్తుందని ఆ నివేదిక పేర్కొంది. అంటే జియో ల్యాప్ టాప్ సరసమైన ఆఫర్ కావచ్చు. టెలికామ్ ప్రొవైడర్ యొక్క జియోఫోన్ వ్యూహం ఏదైనా ఉంటే ఇది అర్ధవంతంగా ఉంటుంది. జియోఫోన్ నెక్స్ట్ లాగా, జియో ల్యాప్‌టాప్ కూడా అతి తక్కువ ధరలో కస్టమర్లకు అందుబాటులో రానుంది. ఈ ల్యాప్‌టాప్ ఏఎమ్‌డీ లేదా ఇంటెల్ x86 ప్రాసెసర్లతో వస్తుందని సమాచారం. ఈ ల్యాప్‌టాప్‌తో పాటు టాబ్లెట్, స్మార్ట్ టీవీ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కానీ, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. (చదవండి: ఆ కంపెనీ ఉద్యోగులకు బంపరాఫర్.. ఇక ఎక్కడి నుంచైనా పని చేయొచ్చు..!) -
వామ్మో! సెకండ్ హ్యాండ్ మొబైల్స్ మార్కెట్ విలువ ఇన్ని కోట్లా..!
మన దేశంలో కొత్త మొబైల్స్‌తో పోటీగా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ విక్రయాలు జరుగుతున్నాయి. మొబైల్ పరికరాల పరిశ్రమ సంస్థ ఐసీఈఏ, పరిశోధన సంస్థ ఐడీసీ కలిసి విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశంలో సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 2025 నాటికి ఇప్పుడున్న దానికంటే రెట్టింపు స్థాయిలో పెరిగి 4.6 బిలియన్ డాలర్లకు(సుమారు రూ. 34,500 కోట్లు) ఉంటుందని అంచనా. వినియోగదారులు ఈ ఏడాదిలో 2.3 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ.17,250 కోట్లు) విలువ గల 25 మిలియన్ సెకండ్ హ్యాండ్ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసినట్లు ఈ నివేదికలో తేలింది. సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ సగటు ధర 94 డాలర్ల(సుమారు రూ. 7,050)గా ఉన్నట్లు నివేదిక తెలిపింది. "ఈ మార్కెట్ పెరుగుదల వల్ల ఈ-వ్యర్థాలు ఉత్పత్తి కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు" ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్(ఐసీఇఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రూ నివేదికను ప్రారంభించిన సందర్భంగా తెలిపారు. మొత్తం సెకండ్ హ్యాండ్ స్మార్ట్ఫోన్లలో 95 శాతానికి పైగా ఎలాంటి డ్యామేజ్ కాకముందే విక్రయస్తున్నారని, మిగిలిన ఐదు శాతం స్మార్ట్ఫోన్లను రిపేర్ వచ్చినప్పుడు విక్రయిస్తున్నారు. "వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో స్మార్ట్ఫోన్లు ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అతిపెద్ద వాటా(90 శాతానికి పైగా)ను కలిగి ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ ల్యాప్ టాప్స్, స్మార్ట్ వాచ్స్, గేమింగ్ కన్సోల్స్, కెమెరాలు వంటి ఇతర పరికరాల విక్రయాలు కూడా క్రమంగా పుంజుకుంటున్నాయి" అని నివేదిక తెలిపింది. సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారుల్లో 78 శాతం మంది నెలవారీ ఆదాయం రూ.30,000 కంటే తక్కువగా ఉంటే, 18 శాతం మంది నెలవారీ ఆదాయం రూ.30,000-రూ.50,000గా ఉంటుందని నివేదిక అంచనా వేసింది. (చదవండి: షోరూంలో అవమానం.. ఇంటికే బొలెరో డోర్ డెలివరీ!) -
వచ్చేస్తోంది..అమెజాన్ 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్'..! 70 శాతం మేర తగ్గింపు!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో సేల్ తో ముందుకు వచ్చింది. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా పలు రకాల ప్రొడక్ట్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' పేరుతో స్మార్ట్ఫోన్లు, ఇతర గాడ్జెట్లపై డిస్కౌంట్లు అందిస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ఈ సేల్ జనవరి 17నుండి ప్రారంభం కానుండగా..ప్రైమ్ మెంబర్లకు 24 గంటల ముందు అంటే జనవరి 16 నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక ప్రత్యేకంగా ఇప్పటికే కొన్ని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్‌పై అమెజాన్ డిస్కౌంట్లు అందిస్తుండగా..రెడ్మీ,వన్ ప్లస్, శాంసంగ్, ఐక్యూ, టెక్నోవంటి స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. వీటితో పాటు ఇతర స్మార్ట్ ఫోన్ లపై గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' లో ఆఫర్లను అందుబాటులోకి తీసుకొని రానుంది. అమెజాన్ త్వరలో ప్రారంభించనున్నగ్రేట్ రిపబ్లిక్ డే సేల్' ఈ బ్రాండ్ ఫోన్లపై డిస్కౌంట్లను అందించనుంది. వీటితో పాటు అదనంగా మరికొన్ని ఫోన్లను డిస్కౌంట్లో సొంతం చేసుకోవచ్చు. ►రెడ్మీ నోట్ 10ఎస్ ధర రూ. 16,999 కంటే తక్కువ ►వన్‌ప్లస్ నార్డ్ 2పై డిస్కౌంట్లతో ►రెడ్ మీ 9ఏ స్పోర్ట్స్ రూ. 8,499 కంటే తక్కువ ►రెడ్మీ 9 యాక్టీవ్ రూ.రూ. 10,999 కంటే తక్కువ ►వన్ ప్లస్ నార్డ్ సీఈ ఫోన్ పై డిస్కౌంట్లతో ►శాంసంగ్ గెలాక్సీ ఎం 32 ధర రూ. 23,999లోపు ►శాంసంగ్ గెలాక్సీ ఎం 12 ధర రూ.12,999 కంటే తక్కువ ►డిస్కౌంట్లో రెడ్ మీ నోట్ 11టీ ►టెక్నో స్పార్క్ 8టీ ధర రూ.12,999లోపు ►శాంసంగ్ గెలాక్సీ ఎం 32 5జీ ధర రూ.10,999 నుంచి రూ. 15,999 మధ్యలో ఉంది ►ఐక్యూ జెడ్ 5 ధర రూ. 29,990 కంటే తక్కువ ►రెడ్మి 10 ప్రైమ్ రూ. 10,999 నుంచి రూ. 13,999 వరకు ఉంది ►వన్ ప్లస్ 9ఆర్ పై డిస్కౌంట్లు ►ఐక్యూ జెడ్ 3 రూ. 22,990 కంటే తక్కువ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆఫర్లు అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఇతర ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్‌లపై డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొని రానుంది. ఉదాహరణకు..ల్యాప్‌టాప్‌లు, హెడ్సెట్,స్మార్ట్‌వాచ్‌లు 70 శాతం డిస్కౌంట్లో పొందవచ్చు. శాంసంగ్, ఎల్జీ, షావోమీ టీవీలు, ఇతర ఉపకరణాలపై గరిష్టంగా 60 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లపై ఆఫర్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో షాపింగ్ చేసే కస్టమర్లు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లు, ఈఎంఐ సౌకర్యంతో పాటు అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. బజాజ్ ఫిన్సర్వ్ కార్డ్,అమెజాన్ పే, ఐసీఐసీఐ కార్డ్‌లపై నో కాస్ట్ ఈఎంఐ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డులపై ఎక్ఛేంజ్ ఆఫర్లను పొందవచ్చు. ఎక్ఛేంజ్ ఆఫర్లో రూ.16,000 వరకు తగ్గింపు పొందవచ్చని అమెజాన్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. చదవండి: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో ఎస్బీఐ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్స్..! -
మేడిన్ ఇండియా ల్యాప్‌టాప్‌లు, పీసీలు
న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్‌లు సహా వివిధ రకాల పర్సనల్ కంప్యూటర్లను భారత్‌లో తయారు చేయడం ప్రారంభించినట్లు టెక్ దిగ్గజం హెచ్‌పీ వెల్లడించింది. ప్రభుత్వ విభాగాలు కూడా కొనుగోలు చేసే విధంగా వీటిలో కొన్ని ఉత్పత్తులకు అర్హతలు ఉన్నాయని పేర్కొంది. గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్ (జీఈఎం) పోర్టల్ ద్వారా ప్రభుత్వ విభాగాలు ఆర్డరు చేసేందుకు ఇవి అందుబాటులో ఉంటాయని హెచ్‌పీ ఇండియా మార్కెట్ ఎండీ కేతన్ పటేల్ తెలిపారు. ‘భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించినప్పట్నుంచి చురుగ్గా పనిచేస్తున్నాం. కోట్ల కొద్దీ ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిలో మా వంతు పాత్ర పోషిస్తున్నాం. మేకిన్ ఇండియా ప్రోగ్రాంకి అనుగుణంగా మేము దేశీయంగా తయారీని చేపట్టాము. మా తయారీ కార్యకలాపాలను మరింతగా విస్తరించడం ద్వారా స్వావలంబన భారత కల సాకారం కావడంలో అర్ధవంతమైన పాత్ర పోషించగలమని ఆశిస్తున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో కమర్షియల్ డెస్క్‌టాప్‌ల తయారీ కోసం ఫ్లెక్స్ సంస్థతో 2020 ఆగస్టులో హెచ్‌పీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనికి అనుగుణంగా తమిళనాడు రాజధాని చెన్నైకి దగ్గర్లోని శ్రీపెరంబుదూర్‌లోని ఫ్లెక్స్ ప్లాంటులో పీసీలు, ల్యాప్‌టాప్‌లు ఉత్పత్తి అవుతున్నాయి. తొలిసారిగా విస్తృత శ్రేణి .. హెచ్‌పీ ఎలీట్‌బుక్స్, హెచ్‌పీ ప్రోబుక్స్, హెచ్‌పీ జీ8 సిరీస్ నోట్‌బుక్స్ వంటి విస్తృత శ్రేణి ల్యాప్‌టాప్‌లను భారత్‌లో తయారు చేయడం ఇదే తొలిసారని సంస్థ పేర్కొంది. డెస్క్‌టాప్ మినీ టవర్స్ (ఎంటీ), మినీ డెస్క్‌టాప్స్ (డీఎం), స్మాల్ ఫార్మ్ ఫ్యాక్టర్ (ఎస్ఎఫ్ఎఫ్) డెస్క్‌టాప్స్, ఆల్–ఇన్–వన్ పీసీలు మొదలైన వాటిని కూడా తయారు చేస్తున్నట్లు తెలిపింది. ఇంటెల్, ఏఎండీ ప్రాసెసర్ల ఆప్షన్లతో వీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు హెచ్‌పీ పేర్కొంది. ఫ్లెక్స్ ఫ్యాక్టరీ.. చెన్నై పోర్టుకు దగ్గర్లో ఉండటం వల్ల నిర్వహణపరమైన సామర్థ్యాలు మెరుగ్గా ఉంటాయని, ల్యాప్‌టాప్‌లు..ఇతర పీసీ ఉత్పత్తులకు అవసరమైన ముడివస్తువులను సమకూర్చుకోవడం సులభతరంగా ఉంటుందని తెలిపింది. -
ఏసర్ ల్యాప్‌ట్యాప్స్‌పై భారీ తగ్గింపు...! ఏకంగా రూ. 40 వేల వరకు..!
తైవాన్‌కు చెందిన ప్రముఖ ల్యాప్‌ట్యాప్ తయారీదారు ఏసర్ భారత్‌లో ఇయర్ ఎండ్ సేల్‌ను ప్రారంభించింది. ‘లూట్ అవర్ స్టోర్ సేల్’ పేరుతో గేమింగ్ ల్యాప్టాప్స్, ఉపకరణాలపై, కంప్యూటర్ గాడ్జెట్స్‌పై ఏసర్ భారీ ఆఫర్లను ప్రకటించింది. గేమింగ్ ల్యాప్‌ట్యాప్స్‌పై సుమారు రూ. 40 వేల వరకు, గేమింగ్ ఉపకరణాలపై 67శాతం మేర తగ్గింపును ఏసర్ ప్రకటించింది. ఈ సేల్ ఏసర్ అధికారిక వెబ్సైట్లో డిసెంబర్ 16-17 వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. చదవండి: వారం రోజుల పాటు బ్యాటరీ వచ్చే స్మార్ట్‌ఫోన్..! సరికొత్త ఆవిష్కరణకు సిద్ధమైన ఐబీఎమ్, శాంసంగ్ ఏసర్ ల్యాప్‌ట్యాప్స్ రూ. 23,990 నుంచి తక్కువ ధరలోనే ప్రారంభంకానున్నాయి. అంతేకాకుండా నో-కాస్ట్ ఈఎంఐ, ఉచిత డెలివరీ, బ్రాండ్ వారంటీని ఏసర్ అందిస్తుంది. ఏసర్ మానిటర్స్ రూ. 7,690 నుంచే ప్రారంభం కానున్నాయి. ఎంపిక చేసిన మోడళ్లపై రెండు సంవత్సరాల వారంటీ, ఒక ఏడాది పాటు యాక్సిడెంటర్ డ్యామేజ్ ప్రొటెక్షన్‌ను కొనుగోలుదారులు పొందవచ్చును. ఈ సేల్‌లో భాగంగా ఏసర్ నైట్రో హెడ్‌సెట్స్, బ్యాక్‌ప్యాక్స్, అడాప్టర్స్‌పై 67 శాతం వరకు తగ్గింపును ఏసర్ అందించనుంది. దాంతో పాటుగా ఎక్సేచేంజ్ ఆఫర్లను కూడా ఏసర్ అందిస్తోంది. ఏసర్ ట్యాబ్ కొనుగోలుపై రూ. 2,999 విలువైన ఏసర్ నైట్రో హెడ్‌ఫోన్స్‌ను కొనుగోలుదారులు ఉచితంగా పొందవచ్చును. ఈ టాబ్లెట్ ధర రూ. 11,999. చదవండి: వచ్చేసింది ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్..! శాంసంగ్ కంటే తక్కువ ధరకే..! -
ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న జియోబుక్ ల్యాప్‌టాప్ ఫీచర్స్ ఇవే!
భారత్ టెలికాం రంగంలో తక్కువ ధరకే ఇంటర్నెట్ అందించి రిలయన్స్ జియో రికార్డు సృష్టించిన సంగతి మనకు తెలిసిందే. అలాగే, కొద్దిరోజుల క్రితం దీపావళి పండుగా సందర్భంగా 4జీ మొబైల్ మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో కొత్త ప్రోడక్ట్ ను ఎలక్ట్రానిక్ మార్కెట్లోకి తీసుకొనిరాబోతుంది. జియో త్వరలో తక్కువ ధరకే ‘జియోబుక్’ పేరుతో ల్యాప్‌టాప్‌లు కూడా తీసుకొస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దానికి సంబందించిన పనులు కీలక దశకు చేరుకున్నాయని తెలుస్తుంది. మీడియాటెక్ ఎమ్టీ8788 ప్రాసెసర్ ద్వారా నడిచే "జియోబుక్" ల్యాప్‌టాప్ ఈ మధ్య గీక్ బెంచ్‌లో కనిపించింది. ఈ ల్యాప్ టాప్ 2జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 11 మీద పనిచేయనున్నట్లు చెబుతున్నారు. ఇంతకు ముందు ల్యాప్‌టాప్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) సర్టిఫికేషన్ పోర్టల్‌లో కనిపించింది. రిలయన్స్ జియో మరో ల్యాప్‌టాప్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్, స్నాప్ డ్రాగన్ ఎక్స్12 4జీ మోడెం చేత పని చేయనున్నట్లు తెలుస్తుంది. గీక్ బెంచ్‌లో జియోబుక్ సింగిల్ కోర్ స్కోరు 1,178, మల్టీ కోర్ స్కోరు 4,246 సాధించింది. ఈ ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్స్ చూస్తే ప్రధానంగా పాఠశాల విధ్యార్ధులను దృష్టిలో పెట్టుకొని తీసుకొస్తున్నట్లు కనిపిస్తుంది. జియోబుక్ స్పెసిఫికేషన్స్ స్పెసిఫికేషన్ల పరంగా.. జియోబుక్ 1,366x768 పిక్సెల్స్ రిజల్యూషన్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్12 4జీ ఎల్టీఈ మోడెమ్ డిస్ప్లేని కలిగి ఉంది. ల్యాప్‌టాప్ తయారీ ఖర్చు తగ్గించడం కోసం ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్ తీసుకొనిరానున్నారు. ఇది 11 నానో మీటర్ టెక్నాలజీతో పని చేస్తుంది. ఒక మోడల్లో 2జీబీ ఎల్పిడిడిఆర్ 4ఎక్స్ ర్యామ్ తో పాటు 32జీబీ ఇఎంఎంసి స్టోరేజ్ ఉంది. మరో మోడల్లో 4జీబీ ఎల్పిడిడిఆర్ 4ఎక్స్ ర్యామ్, 64జీబీ ఇఎంఎంసి 5.1 స్టోరేజ్ ఉన్నాయి. ఇందులో వీడియోల కోసం మినీ హెచ్డీఎంఐ, 5గిగా హెడ్జ్ వైఫై సపోర్ట్, బ్లూటూత్, 3 యాక్సిస్ యాక్సెలెరోమీటర్, క్వాల్‌కోమ్ ఆడియో చిప్‌లను వినియోగించనున్నారు. జియో ల్యాప్‌టాప్‌లను కూడా తక్కువ ధరలోనే తీసుకొస్తుందని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. -
Andhra Pradesh: 6.53 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే సాంకేతిక పరిజ్ఞానం అందించడం, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఇంటి నుంచే ఆన్లైన్ అభ్యసనం కొనసాగించడానికి వీలుగా ప్రభుత్వం వారికి ఉచిత ల్యాప్‌టాప్‌లు అందించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) ద్వారా టెండర్లను ఆహ్వానించింది. ఇప్పటికే టెండర్లపై జ్యుడీషియల్ ప్రివ్యూ పరిశీలన కూడా పూర్తయ్యింది. 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతూ జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన కింద లబ్ధి పొందుతున్న విద్యార్థులకు ఆ పథకాలకు ప్రత్యామ్నాయంగా ల్యాప్‌టాప్‌లను అందించనుంది. విద్యార్థుల అభీష్టం మేరకు ఆ పథకాల కింద నగదుకు బదులుగా ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేయనుంది. తమకు ల్యాప్‌టాప్‌లు కావాలని 6.53 లక్షల మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చారు. 2021–22 విద్యా సంవత్సరంలో 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనున్న 6,53,144 ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏపీటీఎస్‌కు నోడల్ ఏజెన్సీగా బాధ్యతలు అప్పగించింది. జగనన్న అమ్మఒడి కింద 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు 5,42,365 బేసిక్ వెర్షన్ ల్యాప్‌టాప్‌లు అందిస్తారు. ఇక ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ చదివే విద్యార్థులకు జగనన్న వసతి దీవెన కింద ఇస్తారు. వీరికోసం ఒక రకం కాన్ఫిగరేషన్‌తో 19,853 ల్యాప్‌టాప్‌లను, వేరే కాన్ఫిగరేషన్‌తో మరో 90,926 ల్యాప్‌టాప్‌లను అందిస్తారు. చదవండి: (తిరుపతి కేంద్రంగా ‘జియో నెక్ట్స్’.. ఇప్పుడేమంటారు తమ్ముళ్లూ..) బ్రాండెడ్ కంపెనీల ల్యాప్‌టాప్‌లు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించి జగనన్న అమ్మఒడి కింద 44.48 లక్షల మంది తల్లులు లబ్ధి పొందుతున్నారు. వీరికి ఏటా రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. వారిలో 5.42 లక్షల మందికిపైగా నగదుకు బదులు తమ పిల్లలకు ల్యాప్‌టాప్‌లు కావాలని ఆప్షన్ ఇచ్చారు. ఇక జగనన్న వసతి దీవెన కింద ఏటా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్ధులకు రూ.15 వేలు, డిగ్రీ విద్యార్థులకు రూ.20 వేలు ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం కింద 15.50 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ల్యాప్‌టాప్‌ల్లో సమస్యలు వస్తే కంపెనీలు వారంలో వాటిని పరిష్కరించేలా ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు విధించింది. విద్యార్థులు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదులు అందించాలి. లెనోవో, హెచ్‌పీ, డెల్, ఏసర్ వంటి బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌లను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ప్రభుత్వం అందించనుంది. హైస్కూల్ విద్యార్థులకు అందించే ల్యాప్‌టాప్‌ల ప్రత్యేకతలు.. 4జీబీ రామ్, 500 జీబీ హార్డ్ డిస్క్, 14 అంగుళాల స్క్రీన్, విండోస్ 10 (ఎస్డీఎఫ్ మైక్రోసాఫ్ట్), ఓపెన్ ఆఫీస్ (ఎక్సెల్ వర్డ్, పవర్ పాయింట్) కాన్ఫిగరేషన్లతో మూడేళ్ల వారెంటీతో అందిస్తారు. గ్రామీణ విద్యార్థులకు ఎంతో మేలు 9వ తరగతి నుంచే ల్యాప్‌టాప్‌లు అందించడం వల్ల విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సులువుగా పొందొచ్చు. ప్రపంచ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇది ఎంతో మేలు. – ఇమంది పైడిరాజు, హెచ్ఎం, జెడ్పీ హైస్కూల్, అడవివరం, విశాఖపట్నం జిల్లా కరోనా వంటి సమయాల్లో చదువులకు ఇబ్బంది ఉండదు కరోనా సమయంలో స్కూళ్లు ఆన్లైన్ పాఠాలను అందించినా ల్యాప్‌టాప్‌లు లేక వాటిని అందిపుచ్చుకోలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లు ఇస్తుండడంతో ఇబ్బందులు తప్పుతాయి. – వి.సునీత, పేరెంట్, జెడ్పీ హైస్కూల్, చంద్రంపాలెం, చినగదిలి, విశాఖపట్నం జిల్లా డిజిటల్ పాఠాలు అందుబాటులోకి వస్తాయి ల్యాప్‌టాప్‌ల వల్ల మాకు డిజిటల్ పాఠాలు అందుబాటులోకి వస్తాయి. ఆన్లైన్లో పాఠాలను అందించినప్పుడు ఫోన్లలో కంటే ల్యాప్‌టాప్‌లే అనువుగా ఉంటాయి. – సీహెచ్ జ్యోత్స్న, జెడ్పీహెచ్ఎస్ అనంతవరం డిగ్రీ విద్యార్థులకు అందించే రెండు రకాల మోడళ్ల ప్రత్యేకతలు.. మోడల్–1.. ప్రాసెసర్: ఇంటెల్ పెంటియమ్ సిల్వర్ సిరీస్, ఏఏండీ అథ్లాన్ (3000 సిరీస్) లేదా సమానమైన 4 జీబీ డీడీఆర్ రామ్ ►500 జీబీ హార్డ్ డ్రైవ్ ►14 అంగుళాల హై–డెఫ్ డిస్ప్లే (1366 గీ 768) ►వై–ఫై, బ్లూటూత్ ►వెబ్‌క్యామ్ (0.3 ఎంపీ/వీజీఏ సమానమైనది) ►విండోస్ 10 ఓఎస్ ►ఆఫీస్ 365 స్టూడెంట్ ప్యాక్ ►మూడేళ్ల వారంటీ (ల్యాప్‌టాప్, బ్యాటరీ, అడాప్టర్, యాంటీ వైరస్ రక్షణ) ►ఎండీఎం సాఫ్ట్వేర్ ►బ్యాక్‌ప్యాక్/క్యారీ బ్యాగ్ మోడల్–2.. ప్రాసెసర్: ఇంటెల్ కోర్ ఐ3, ఏఏండీ రైజెన్ 3 (3250) లేదా సమానమైనది. ►8 జీబీ డీడీఆర్ ర్యామ్ ►500 జీబీ లేదా అంతకంటే ఎక్కువ హార్డ్ డ్రైవ్ ►14 అంగుళాల హై–డెఫ్ డిస్ప్లే (1366 గీ 768) ►వై–ఫై, బ్లూటూత్ ►వెబ్‌క్యామ్ (0.3 ఎంపీ/వీజీఏ సమానమైనది) ►విండోస్10 ఓఎస్ ►ఆఫీస్ 365 స్టూడెంట్ ప్యాక్ ►మూడేళ్ల సమగ్ర వారంటీ (ల్యాప్‌టాప్, బ్యాటరీ అడాప్టర్, యాంటీ వైరస్ రక్షణ) ►ఎండీఎం సాఫ్ట్వేర్ ►బ్యాక్‌ప్యాక్/క్యారీ బ్యాగ్ -
అమెజాన్ సేల్, బ్రాండెడ్ ల్యాప్ ట్యాప్స్‌పై అదిరిపోయే డిస్కౌంట్స్
ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2021' కొనసాగుతుంది. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ప్రారంభించిన ఈ సేల్‌లో అమెజాన్ పలు రకలా గాడ్జెట్స్, స్మార్ట్ ఫోన్, ల్యాప్‌ట్యాప్‌లపై భారీ ఆఫర్లు, అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తుంది. తాజాగా బ్రాండెడ్ ల్యాప్‌ట్యాప్స్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఆసుస్ వివో బుక్ 14 ఆసుస్ వివో బుక్ 14పై అమెజాన్ డిస్కౌంట్స్ అందించింది. 16: 9 యాస్పెట్ రేషియోతో 14అంగుళాలు 1920*1*1,080 స్క్రీన్, పీక్ బ్రైట్ నెస్ కోసం 220 నిట్స్, ఇంటెల్ కోర్ ఐ5 10జనరేషన్ ప్రాసెసర్, 8జీబీ డీడీఆర్4 ర్యామ్‌తో పాటు 12జీబీ వరకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. 512జీబీ ఎం.2 ఎన్వీఎంఈ పీసీఐఈ 3.0 ఎస్ఎస్డీ ఫీచర్లు ఉండగా 1.6కేజీల బరువు ఉండే ఈ ఆసుస్ వివో బుక్ 14ను బ్యాటరీ లైఫ్ 6గంటల వరకు వినియోగించుకోవచ్చు. విండోస్10 సపోర్ట్ చేస్తున్న వివోబుక్ 14ను ఫ్రీగా విండోస్ 11కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఇక దీని ధర రూ.56,776 ఉండగా రూ.41,990కే సొంతం చేసుకోవచ్చు. హెచ్‌పీ 15 15.6 అంగుళా ఫుల్ హెచ్డీ (1920*1,080)డిస్ప్లే, పీక్ బ్రైట్ నెస్ కోసం 220నిట్స్, ఏఎండీ రైజాన్3 3250యూ ప్రాసెసర్, 8జీబీ డీడీఆర్4 ర్యామ్(16జీబీ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు) 256జీబీ పీసీఐఈ ఎన్వీఎంఈ ఎం.2 ఎస్ఎస్డీ, ఏఎండీ ర్యాడ్ఆన్ గ్రాఫిక్స్, యూఎస్బీ సీపోర్ట్ తోపాటు సూపర్ స్పీడ్ యూఎస్బీ టైప్ ఏ-పోర్ట్‌ను అందిస్తుంది. ఇక హెచ్‌పీ 15 మార్కెట్ ధర రూ.46,055 ఉండగా అమెజాన్‌లో రూ.38,990కే సొంతం చేసుకోవచ్చు. లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 15.6 అంగుళాల (1366*768పిక్సెల్స్) డిస్ప్లే ,ఏఎండీ రైజాన్3 3250యూ ప్రాసెసర్, 8జీబీ డీడీఆర్4 ర్యామ్ (12జీబీ వరకు అప్ గ్రేడ్)256జీబీ ఎస్ఎస్డీ, 1.85ల వెయిట్‌తో ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 10గంటల పాటు వినియోగించుకోవచ్చు. అంతేకాదు ర్యాపిడ్ ఛార్జింగ్ టెక్నాలజీ సౌకర్యం ఉంది. గంటలో 80శాతం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. దీని ధర రూ.55,890 ఉండగా రూ.36,490కే అమెజాన్ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. డెల్ ఇన్స్ప్రాన్ 3501 డెల్ ఇన్ స్ప్రాన్ 3501 స్పోర్ట్స్ 15.6అంగుళాల (1920*1080 పిక్సెల్స్) యాంటీ గ్లేర్ ఎల్ఈడీ డిస్ప్లే, ఇంటెల్ కోర్ ఐ3 10జెనరేషన్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్ 256జీబీ ఎం.2 పీసీఐఆ ఎన్బీఎంఈ ఎస్ఎస్డీ, యూహెచ్ డీ గ్రాఫిక్స్ విండోస్ 10సపోర్ట్ చేస్తుంది. ఈ ల్యాప్ ధర రూ.44,634 ఉండగా అమెజాన్‌లో రూ.38,390కే సొంతం చేసుకోవచ్చు. హెచ్‌పీ క్రోమ్ బుక్ ఎక్స్360 హెచ్‌పీ క్రోమ్ బుక్ ఎక్స్360 14అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే, ఇంటెల్ కోర్ ఐ3 జెనరేషన్ ప్రాసెసర్, 4జీబీ డీడీఆర్4 ర్యామ్ అండ్ 64జీబీ ఎస్ఎస్డీ, ఇక ఈ క్రోమ్‌బుక్ సింగిల్ ఛార్జింగ్‌ను 13గంటల పాటు వినియోగించుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ రీడర్, బ్యాంగ్ అండ్ ఒలుఫ్సెన్ ట్యూన్ చేసిన ఫింగర్ ప్రింట్ రీడర్,స్పీకర్లు ఉండగా క్రోమ్ ఓఎస్ సపోర్ట్ చేస్తుంది. దీని బరువు 1.65కేజీలు ఉండగా దీని ధర రూ.57,610 ఉండగా అమెజాన్ సేల్ లో రూ.38,990కే సొంతం చేసుకోవచ్చు. -
ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్: స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌ట్యాప్స్‌పై డిస్కౌంట్లు
దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ప్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ తర్వాత బిగ్ దివాళీ సేల్స్‌ను ప్రకటించింది. ఈ సేల్స్ నేటి నుంచి ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా పరిమితంగా పలు స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లపై భారీ డిస్కౌంట్లు అందించింది. రియల్ మీ జీటీ మాస్టర్ ఎడిషన్ పై దివాళీ సేల్‌లో ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్ ప్రకటించింది. మార్కెట్ లో ఫోన్ ధర రూ.25,999 ఉండగా ఈ సేల్ లో రూ.21,999కే అందిస్తుంది. ఫ్లిప్ కార్ట్ దివాళీ సేల్‌లో ఐఫోన్ 12 పై రూ.11,000 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఫోన్ ధర రూ.65,900ఉండగా ఆఫర్లో రూ.54,999కే సొంతం చేసుకోవచ్చు. ఆపిల్ ఐఫోన్ 12 మినీని రూ.37,999కే కొనుగోలు చేయొచ్చు. మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ .59,900గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ ఆఫర్లలో భాగంగా శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 62 రూ .17,999 కి అందుబాటులో ఉంది. ఏసర్ ఆస్పైర్ 7 ల్యాప్ ట్యాప్ ధర రూ.54 వేలకు పైగా ఉండగా దివాళీ సేల్ లో రూ. 49,990కే లభిస్తుంది. -
'బిగ్ దివాళీ సేల్',మీ కోసం బోలెడు ఆఫర్లు ఉన్నాయ్!
'బిగ్ దివాళీ సేల్' పేరుతో అక్టోబర్ 17(ఆదివారం) నుంచి ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ దివాళీ సేల్‌లో పలు ప్రొడక్ట్‌లపై 80శాతం, 70శాతం డిస్కౌంట్లో అందిస్తుంది. వీటితో పాటు పలు బ్యాంకుల డెబిట్ కార్డ్, క్రెడిట్ ట్రాన్సాక్షన్లపై డిస్కౌంట్లను అందిస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ అధికారికంగా తెలిపింది. ఫ్లిప్ కార్ట్ దివాళీ సేల్ -2021 ♦ ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్ 2021 అక్టోబర్ 17తో ప్రారంభమై అక్టోబర్ 23తో ముగియనుంది ♦ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్ ప్రత్యేకంగా ఒకరోజు ముందే అంటే అక్టోబర్ 16, 12am నుంచి ప్రారంభం కానుంది. ♦ మిగిలిన కొనుగోలు దారులు అక్టోబర్ 17, 12 am నుంచి ప్రారంభం కానుంది. ♦ ఈ బిగ్ దివాళీ సేల్ అక్టోబర్ 23 మధ్యాహ్నం 11.59గంటలకు ముగియనుంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో పలు బ్యాంక్ ఆఫర్లు ఇలా ఉన్నాయి ♦ ఎస్బీఐ క్రెడిట్ నుంచి ప్రొడక్ట్ కొనుగోలు చేసినా ఈఏఎంఐ సౌకర్యంతో పాటు 10శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ♦ యాక్సెస్ బ్యాక్ , ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల వినియోగంతో 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ ♦ పేటీఎం యూపీఐ ట్రాన్సాక్షన్లపై ప్రత్యేక క్యాష్ బ్యాక్ ఆఫర్లను పొందవచ్చు. ♦ గతేడాది ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌పై రూ.7,500వరకు డిస్కౌంట్ అందించింది. ఆ ఆఫర్ ఈ ఏడాది కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ♦ ఫోన్ పే యూజర్లు సైతం ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ ఆఫర్లలలో సొంతం చేసుకోవచ్చు ♦ పలు ప్రముఖ బ్యాంకుల క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌లపై నోకాస్ట్ ఈఎంఐ సౌకర్యం అందుబాటులో ఉంది. ♦ డెబిట్ కార్డ్‌లపై ఈఎంఐ సౌకర్యం ♦ బజాజ్ ఫిన్ సర్వ్ కార్డ్ పై నోకాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది. ♦ ల్యాప్ ట్యాప్ అండ్ గేమింగ్ కంప్యూటర్ పై ఆఫర్లు ♦ గేమింగ్ ల్యాప్‌టాప్ ఏసర్ ప్రిడేటర్(Acer Predator), ఎంఎస్ఐ గేమింగ్ మానిటర్ పై రూ.50వేల వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ♦ హై ఫర్మామెన్స్ ల్యాప్ ట్యాప్‌లపై 40శాతం ఆఫర్ ♦ వర్క్ అండ్ ఎంటర్ టైన్మెంట్ ల్యాప్ ట్యాప్స్‌పై 50శాతం ఆఫర్ ♦ ఆపిల్ మాక్‌బుక్ ఎయిర్ ల్యాప్‌ట్యాప్స్‌పై రూ.20వేల వరకు ఆఫర్ లో పొందవచ్చు. 70, 80శాతం డిస్కౌంట్లు బిగ్ దివాళీ సేల్ సందర్భంగా పలు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్స్‌పై 80శాతం డిస్కౌంట్స్ సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్, యాక్ససరీస్‌పై 80శాతం డిస్కౌంట్స్, టీవీ, గృహోపకరణాలపై 75శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. చదవండి: వచ్చేస్తోంది..ఫ్లిప్‌కార్ట్ దివాళీ సేల్..! 80 శాతం మేర భారీ తగ్గింపు..! -
ఈ ల్యాప్ ట్యాప్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్ ఆఫర్ కూడా..
ల్యాప్ ట్యాప్ కొనుగోలుదారులకు బంపర్ ఆఫర్. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఏసర్ స్విఫ్ట్3 ల్యాప్ ట్యాప్‌పై అమెజాన్ భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. అంతేకాదు వీటితో పాటు అమెజాన్ సేల్‌లో కొత్తగా విడుదలైన వెయ్యికి పైగా కొత్త గాడ్జెట్స్‌పై ఆఫర్లను అందిస్తుంది. 'ఏసర్ స్విఫ్ట్ 3' ఫీచర్లు ఏసర్ స్విఫ్ట్3 ల్యాప్‌ట్యాప్ 64బిట్,విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌కు సపోర్ట్ చేస్తుంది. 1920x1080పి రెజెల్యూషన్‌తో 14 అంగుళాల ఫుల్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే,18జీబీ డీడీఆర్4 ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డీ, ఏఎండీ రైజెన్5 5500యూ హెక్సా-కోర్ ప్రాసెసర్‌ను అందిస్తుంది. హైక్వాలిటీ వీడియోల్ని రెండరింగ్ చేసేందుకు వీలుగా ఏఎండీ రేడియన్ గ్రాఫిక్స్, ఫాస్ట్‌గా డేటాను స్టోర్ చేసేందుకు ఎస్ఎస్డీ డ్రైవ్ కూడా ఉంది. వీటితో పాటు కలర్ కాంట్రాస్ట్ కోసం ఎల్ఈడీ బ్యాక్ కంఫైవ్యూ టెక్నాలజీని అందిస్తుంది.సెక్యూరిటీ పర్పస్ కోసం ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ,వాయిస్ అలర్ట్ ఇచ్చేందుకు అలెక్సా సౌకర్యం కూడా ఉంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు ఇక ఏసర్ స్విఫ్ట్3 ల్యాప్ ట్యాప్ ధర రూ.89,999 ఉండగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ.30వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. పాత ల్యాప్‌ట్యాప్‌పై ఎక్ఛేంజ్ కింద రూ.18,100 వరకు ఆఫర్ పొందవచ్చు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే 10శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్‌ను రూ.1,750 వరకు పొందవచ్చు.సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్, ఈఎంఐపై రూ.1,750, ఈఎంఐ సౌకర్యం లేని ట్రాన్సాక్షన్లపై రూ. 1,500 డిస్కౌంట్, రూపే క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ రూ. 500వరకు,ఆర్బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై రూ.1,750 వరకు, ఈఎంఐ సౌకర్యం లేని ట్రాన్సాక్షన్లపై రూ.1,500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. చదవండి: ఈ ఆఫర్‌ను అస్సలు మిస్ చేసుకోవద్దు -
ఈ ఆఫర్‌ను అస్సలు మిస్ చేసుకోవద్దు
ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు వరుస బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.ప్రముఖ రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ రిపోర్ట్ ప్రకారం ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్ కార్ట్లు నాలుగు రోజుల్లో రూ.20250 కోట్ల బిజినెస్ నిర్వహించినట్లు తెలిపింది. ముఖ్యంగా ఈ నాలుగు రోజుల వ్యవధిలో 50శాతం గాడ్జెట్స్, గృహోపకరణాల్ని కొనుగులు చేసినట్లు తన రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా అమెజాన్ పలు ల్యాప్‌ట్యాప్స్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. యాపిల్ మాక్‌బుక్ ఎయిర్ గతేడాది యాపిల్ సంస్థ ఎం1 ఎస్‌ఓఎస్‌తో యాపిల్ మాక్ బుక్ ఎయిర్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.92,000 వేలు ఉండగా..ఫెస్టివల్ సేల్‌లో రూ.79,900కే సొంతం చేసుకోవచ్చు.ఇక పీ3 వైడ్ కలర్లో 13.3 అంగుళాల రెటీనా డిస్ప్లే, 8కోర్ సీపీయూ, 8కోర్ జీపీయూ, 16కోర్ న్యూరాల్ ఇంజిన్ ఫీచర్లు ఉన్నాయి. 8జీబీ మెమరీ ఎస్ఎస్డీ స్టోరేజ్‌ను అందిస్తుంది. ఏసర్ నైట్రో 5 15.6 అంగుళా 144హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్‌తో హెచ్డీ క్వాలిటీ డిస్ ప్లే 11జనరేషన్ మోడల్ ఇంటెల్ కోర్ ఐ5 - 11400 హెచ్ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్..32 ఎక్స్‌పాండబుల్, 4జీబీ జీడీడీఆర్6 వీ ర్యామ్‌తో ఎన్విడియా జిఫోర్స్ ఆర్టీఎక్స్ 3050, 256జీబీ పీసీఐఆ జెన్3 ఎన్వీఎంఈ ఎస్ఎస్డీ, 1 టెరాబైట్ 2.5 అంగుళాల ఆర్పీఎం హెచ్‌డీడీతో అందుబాటులోకి వచ్చింది. మార్కెట్లో దీని ధర రూ.లక్ష ఉండగా సేల్ లో రూ.69,990కే లభిస్తుంది. విక్టస్ బై హెచ్‌పీ 16.1 అంగుళా ఫుల్ హెచ్డీ క్వాలిటీతో మైక్రో ఎడ్జ్ స్క్రీన్ బ్రైట్ 250నిట్స్‌తో వస్తుంది. 5జనరేషన్ ఏఎండీ రైజెన్ 55600హెచ్ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, నివిడియా జీఈఫోర్స్ జీటీఎక్స్ 1650 గ్రాఫిక్స్ కార్డ్, 512జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్‌తో మార్కెట్లో లభ్యం అవుతుండగా..ఈ ధర రూ.76,020 ఉంది.ఈ ఫెస్టివల్ సేల్‌లో రూ.61,990కే సొంతం చేసుకోవచ్చు. ఆసుస్ వివోబుక్ 14(2021) అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ఆసుస్ వివోబుక్ 14 (2021 మోడల్) రూ.41,990కే లభిస్తుంది. 11జనరేషన్‌తో ఇంటెల్ కోర్ ఐ3-1115జీ4 ప్రాసెసర్, 8జీబీ డీడీఆర్4 ర్యామ్‌తో..256జీబీ ఎం.2 ఎన్వీఎంఈ పీసీఐఈ ఎస్ఎస్డీ ఫీచర్లు ఉన్నాయి. 2.5 అంగుళాలున్న ఈ వివోబుక్ ప్రస్తుతానికి విండోస్10లో పనిచేస్తుంది.విండోస్ 11కి అప్ గ్రేడ్ చేసుకునే సౌకర్యం ఉందని ఆసుస్ వివోబుక్ ప్రతినిధులు తెలిపారు. లెనోవో ఐడియాపా స్లిమ్5 300నిట్స్ బ్రైట్ నెస్‌తో 15.6 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్యానల్‌ను అందిస్తుంది. 11జెనరేషన్ ఇంటెల్ టైగర్ లేక్ కోర్ ఐ5-1135జీ7 ప్రాసెసర్, 16జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డీ ఫీచర్లు ఉండగా...విండోస్10కి సపోర్ట్ చేస్తుంది. ఉచితంగా విండోస్11కి అప్‌గ్రేడ్ అవ్వొచ్చు.ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్స్ ఉన్న ఈ లెనోవో ఐడియాపాడ్ స్లిమ్5 ధర రూ.62,990గా ఉంది. -
నోకియా నుంచి నయా ల్యాప్‌టాప్, స్మార్ట్‌టీవీలు లాంచ్..! ధర ఎంతంటే...?
Nokia Launched New Laptop, Smart TV's: నోకియా భారత మార్కెట్లో విక్రయాలను మరింత పెంచేందుకుగాను సరికొత్త వ్యూహాలతో ముందుకువస్తోంది. కస్టమర్లకు మరింత దగ్గరయ్యేందుకు తాజాగా నోకియా ప్యూర్‌బుక్ ఎస్ 14 ల్యాప్‌టాప్, కొత్త నోకియా స్మార్ట్ టీవీ సిరీస్ మోడళ్లను కంపెనీ ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యంతో భారత మార్కెట్లోకి మంగళవారం రోజున లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు అక్టోబర్ 3 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. నోకియా ప్యూర్‌బుక్ ఎస్ 14 విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తోంది. ఈ ల్యాప్‌టాప్‌లో 11 జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. కాగా నోకియా స్మార్ట్ టీవీ మోడల్స్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ సహాయంతో పనిచేస్తాయి. 50-ఇంచ్, 55-ఇంచ్ డిస్ప్లే పరిమాణాలలో నోకియా స్మార్ట్‌టీవీలను రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌టీవీలు ఫుల్ హెచ్డీ, అల్ట్రా హెచ్డీ, క్యూఎల్ఈడీ వేరింయట్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. ధర ఏంతంటే...? నోకియా ప్యూర్‌బుక్ ఎస్ 14 ల్యాప్‌టాప్ ధర రూ. 56, 990. నోకియా 50ఇంచ్ అల్ట్రా హెచ్డీ 4కే స్మార్ట్‌టీవీ ధర రూ. 44,999., కాగా అల్ట్రా హెచ్డీ 4కే క్యూఎల్ఈడీ ధర రూ. 49, 999గా నోకియా నిర్ణయించింది. నోకియా 55ఇంచ్ అల్ట్రా హెచ్డీ 4కే స్మార్ట్‌టీవీ ధర రూ. 49,999., కాగా అల్ట్రా హెచ్డీ 4కే క్యూఎల్ఈడీ ధర రూ. 54, 999గా నోకియా నిర్ణయించింది. ఈ స్మార్ట్ టీవీ సెట్లు జేబీఎల్ స్పీకర్స్‌తో పనిచేస్తాయి. 2జీబీ ర్యామ్+ 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఈ స్మార్ట్‌టీవీలు లభిస్తాయి. నోకియా ప్యూర్‌బుక్ ఎస్ 14 స్పెసిఫికేషన్లు విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ బరువు 1.4 కిలోలు 11 జెన్ ఇంటెల్ కోర్ i5 CPU డాల్బీ అట్మోస్ సపోర్ట్ 14-అంగుళాల ఫుల్-హెచ్డి ఐపిఎస్ డిస్ప్లే 16జీబీ ర్యామ్ + 512జీబీ NVMe ఎస్ఎస్డీ యూఎస్బీ టైప్-సి పోర్ట్, హెచ్డీఎమ్ఐ పోర్ట్ -
ఆర్ఎంపీ డాక్టర్.. విలాసవంతమైన జీవనానికి అలవాటుపడి..
సాక్షి, హైదరాబాద్: అతను ఆర్ఎంపీ డాక్టర్.. విలాసవంతమైన జీవనానికి అలవాటుపడిన అతడికి వైద్యం చేస్తే వచ్చే డబ్బులు సరిపోలేదు. సులువుగా డబ్బులు సంపాదించేందుకు దొంగతనాల బాటపట్టాడు.. రాత్రి వేళల్లో ల్యాప్‌టాప్‌తో బస్సుల్లో ప్రయాణించే వారినే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తుంటాడు. మంగళవారం ఉదయం వనస్థలిపురంలోని పనామా క్రాస్‌రోడ్‌లో ల్యాప్‌టాప్ బ్యాగ్‌లతో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని ఎల్బీనగర్ సీసీఎస్ ఏసీపీ క్రైమ్ ఆర్.శేఖర్‌రెడ్డి, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.5 లక్షల విలువ చేసే 16 ల్యాప్‌టాప్‌లు, 5 సెల్ఫోన్లు, 2 పవర్ బ్యాంక్, ఒక వాచ్ స్వాధీనం చేసుకున్నారు. ► భద్రాచలం పట్టణంలోని జగదీష్ కాలనీకి చెందిన గుడికాడి నవీన్ కుమార్(41) ఖమ్మం జిల్లా పాల్వంచలోని లక్ష్మిదేవునిపల్లిలో ఆర్ఎంపీ డాక్టర్‌గా స్థిరపడ్డాడు. లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడిన ఇతను డబ్బు కోసం చోరీలు చేస్తుంటాడు. రాత్రి సమయాల్లో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు ప్రయాణిస్తుంటాడు. ల్యాప్‌టాప్ బ్యాగ్‌లతో బస్‌లలో ప్రయాణించడాన్ని గమనిస్తుంటాడు. వారితో పాటు తోటి ప్రయాణికుడిగా బస్ ఎక్కుతాడు. హైదరాబాద్‌లోని శివారు ప్రాంతాలకు బస్ చేరుకుంటుందనగా ల్యాప్‌టాప్ బ్యాగ్‌లను లాక్కొని రన్నింగ్ బస్ నుంచి సెకనులో దిగేసి పారిపోతాడు. లేదంటే దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం వంటి ప్రాంతాల్లోని బ్యాచ్లర్స్ రూమ్స్‌లలోకి చొరబడి ల్యాప్‌టాప్స్‌ను దొంగిలిస్తుంటాడు. ► చోరీలో భాగంగా గత నెల 8వ తేదీన ఫిర్యాదుదారుడు, అతని స్నేహితుడు ఇద్దరూ కలిసి నర్సరావుపేట నుంచి నిజాంపేట వెళ్లేందుకు హైదరాబాద్ బస్ ఎక్కారు. వాళ్లు పనిచేసే కంపెనీ ఇచ్చిన హెచ్‌పీ, డెల్ ల్యాప్‌టాప్‌లను తీసుకొని బస్‌లో కూర్చున్నారు. వాళ్ల మొబైల్ ఫోన్లను కూడా అదే బ్యాగ్‌లో పెట్టేసి పడుకున్నారు. ఇది గమనించిన నిందితుడు నవీన్ కుమార్ అదే బస్‌లో ఎక్కాడు. రిజర్వేషన్ చేసుకుంటే వివరాలు తెలిసిపోతాయని.. టికెట్‌కు సరిపోయే డబ్బులు చెల్లించి వారి పక్కనే కూర్చున్నాడు. బస్ ఆటోనగర్‌కు సమీపిస్తున్న సమయంలో నిందితుడు ల్యాప్‌టాప్ బ్యాగ్‌లతో దిగి పారిపోయాడు. మరుసటి రోజు ఉదయం చూసుకునేసరికి ల్యాప్‌టాప్ బ్యాగ్‌లు కనిపించకపోయేసరికి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ► గతంలో నవీన్ కుమార్ మీద వనస్థలిపురం, ఎల్బీనగర్, మీర్‌పేట, సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లలో 5 కేసులు నమోదయ్యాయి. చదవండి: అటవీ ప్రాంతంలో పేకాట.. -
జియో నుంచి మరో సంచలనం..! త్వరలోనే లాంచ్..!
టెలికాం రంగంలో సంచలనాలను నమోదు చేసిన జియో ఇప్పుడు మరో సంచలనానికి తెరతీయనుంది. రిలయన్స్ 44 వ ఏజీఎమ్ సమావేశంలో అతి తక్కువ ధరకే జియో ఫోన్ నెక్ట్స్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో పాటుగా జియోబుక్ ల్యాప్‌టాప్‌ను కూడా ప్రకటిస్తుందని అంచనా వేశారు. ఏజీఎమ్ సమావేశంలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ జియోబుక్ గురించి ఏలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా భారత మార్కెట్లలోకి జియోబుక్ ల్యాప్‌టాప్‌ను మరి కొద్ది రోజుల్లోనే లాంచ్ చేయనుందనే ఊహగానాలు వస్తున్నాయి. చదవండి: భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..! ఫోట్కర్టసీ: ఎక్స్‌డీఏ డెవలపర్స్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్సైట్లో సర్టిఫికేషన్ కోసం జియోబుక్ ల్యాప్‌టాప్ వచ్చినట్లు తెలుస్తోంది. జియో నుంచి రాబోయే ల్యాప్‌టాప్ మూడు వేరియంట్లు బీఐఎస్ సర్టిఫికేషన్ సైట్లో కంపెనీ లిస్ట్ చేసింది. కాగా జియో ల్యాప్‌టాప్ లాంచ్ డేట్ మాత్రం కన్ఫర్మ్ అవ్వలేదు. జియోబుక్ 4జీ ఎల్టీఈ కనెక్టివిటీతో వస్తుందని తెలుస్తోంది. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 4జీబీ ఎల్పీడీడీఆర్ఎక్స్ ర్యామ్, 64 జీబీ రామ్ స్టోరేజ్‌తో రానుంది. జియోబుక్ ధర ఇంకా తెలియాల్సి ఉండగా తక్కువ ధరల్లోనే జియోబుక్ ఉంటుందని టెక్ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.జియోబుక్ సర్టిఫికేషన్‌లో భాగంగా మూడు వేరియంట్లతో NB1118QMW, NB1148QMW, NB1112MM బీఐఎస్ వెబ్సైట్లో లిస్ట్ ఐనట్లు టిప్‌స్టార్ ముకుల్ శర్మ వెల్లడించారు. జియోబుక్ ల్యాప్‌టాప్ స్పెఫికేషన్లు అంచనా..! జియోబుక్ ల్యాప్‌టాప్ హెచ్డీ (1,366x768 పిక్సెల్స్) డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 664 ఎస్ఓసీ ప్రాసెసర్ 4జీబీ ర్యామ్+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మినీ హెచ్డీఎమ్ఐ కనెక్టర్ డ్యూయల్‌బ్యాండ్ వైఫై బ్లూటూత్ సపోర్ట్ ప్రీ ఇన్స్టాల్డ్ జియో యాప్స్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఆఫీస్ చదవండి: Smartphone: స్మార్ట్ఫోన్లు పేలుతున్నాయ్.. జాగ్రత్తలు మన చేతుల్లో కూడా! -
మొబైల్ ఫోన్ ఎగుమతులు మూడు రెట్లు
న్యూఢిల్లీ: భారత్ మొబైల్ ఫోన్ ఎగుమతుల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (2021–22, ఏప్రిల్–జూన్)లో మూడు రెట్లు పెరిగింది. రూ.4,300 కోట్లుగా నమోదయ్యింది. 2020 ఇదే కాలంలో ఎగుమతుల విలువ దాదాపు రూ.1,300 కోట్లు. ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ఒక నివేదికలో ఈ విషయాలను తెలిపింది. ఈ రంగంలో రికవరీ, వృద్ధి అంశాలను తాజా గణాంకాలు సూచిస్తున్నట్లు నివేదిక వివరించింది. నివేదికలో ముఖ్యాంశాలు ►మొబైల్ హ్యాండ్సెట్ తయారీ పరిశ్రమ నిరంతరం వృద్ధి పథంలో కొనసాగుతోంది. కోవిడ్–19 సెకండ్‌వేవ్‌లోనూ ఫలితాలను నమోదుచేసుకుంది. ►ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎగుమతులు సైతం మొదటి త్రైమాసికంలో 100 శాతం పెరిగి విలువలో రూ.20,000 కోట్లను అధిగమించింది. ►ఇక ఇదే కాలంలో మొబైల్ ఫోన్ల దిగుమతుల విలువ భారీగా తగ్గి రూ.3,100 కోట్ల నుంచి రూ.600 కోట్లకు పతనమైంది. 2014–15 అల్‌టైమ్ కనిష్ట స్థాయి ఇది. ►కాగా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్ల దిగుమతుల విలువ మాత్రం మొదటి త్రైమాసికంలో 50 శాతంపైగా పెరిగి రూ.6,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్లకు ఎగసింది. మరింత పురోగతికి చర్యలు... మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ రంగంలో మరింత పురోగతి సాధించడానికి కృషి చేస్తున్నాం. ఇందుకు తగిన విధాన కల్పనకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. భారీగా ఈ విభాగాల్లో ఉత్పత్తులను పెంచాలన్నది ప్రధాన లక్ష్యం. ప్రపంచ దేశాల్లో అవసరాల్లో 25 శాతం భారత్ వాటా కావాలన్నది సంకల్పం. – పంకజ్ మొహింద్రూ, ఐసీఈఏ చైర్మన్ చదవండి : ఏడాదిలో మరింత పెరగనున్న ఇళ్ల ధరలు! -
పర్సనల్ కంప్యూటర్లు ప్రియం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిప్సెట్ కొరత ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తోంది. దీని ప్రభావం పర్సనల్ కంప్యూటర్ల (పీసీ) విభాగంపై స్పష్టంగా కనపడుతోంది. ఆన్లైన్ తరగతులు, ఇంటి నుంచి పని విధానం కారణంగా డిమాండ్ విపరీతంగా ఉన్నప్పటికీ సరఫరా ఆ స్థాయిలో జరగడం లేదు. ఇదే అదనుగా తయారీ కంపెనీలు ధరలను 50 శాతంపైగా పెంచాయి. లో ఎండ్ మోడళ్ల ఉత్పత్తిని దాదాపు నిలిపివేశాయి. రూ.50,000లోపు ధరలో ల్యాప్‌టాప్‌లు దొరకట్లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వినియోగదార్లు తప్పనిసరి పరిస్థితుల్లో ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, ఆల్ ఇన్ వన్స్ కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఏప్రిల్–జూన్ కాలంలో దేశవ్యాప్తంగా 32 లక్షల యూనిట్ల పీసీలు అమ్ముడైనట్టు సమాచారం. నిలిచిపోయిన సరఫరా.. ల్యాప్‌టాప్స్‌లో కొన్ని నెలల క్రితం వరకు రూ.17–25 వేల ధరల శ్రేణి వాటా 70 శాతం దాకా ఉండేది. రూ.26–40 వేల ధరల విభాగం 20 శాతం, రూ.40 వేలపైన ధరల్లో లభించే హై ఎండ్ మోడళ్ల వాటా 10 శాతం నమోదయ్యేది. ప్రస్తుతం పరిస్థితి తారుమారైంది. మార్కెట్ అంతా హై ఎండ్ మోడళ్లతోనే నిండిపోయింది. వీటికి కూడా 40–50 శాతం కొరత ఉంది. ఇక లో ఎండ్ మోడళ్లు అయితే కానరావడం లేదు. 100 శాతం నగదు ఇచ్చి కొనేందుకు వినియోగదార్లు సిద్ధపడ్డా పీసీ దొరకడం లేదు. ఇటువంటి పరిస్థితి పరిశ్రమలో ఇదే తొలిసారి అని ఐటీ మాల్ ఎండీ అహ్మద్ తెలిపారు. లో ఎండ్ ల్యాప్టాప్స్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని చెప్పారు. పేరుతోపాటు ధర కూడా.. కంపెనీలు ఎప్పటికప్పుడు మోడళ్ల పేరు మారుస్తున్నాయి. కొత్త స్టాక్ వచ్చిందంటే మోడల్ పేరు మారుతోంది. అంతేకాదు ఫీచర్లు మారకపోయినా ధరలను సవరిస్తున్నాయి. చిప్సెట్ కొరతను అడ్డుపెట్టుకుని పూర్తిగా హై ఎండ్ మోడళ్లవైపే మొగ్గు చూపుతున్నాయంటే కంపెనీలు ఏ స్థాయిలో వ్యూహాత్మకంగా పనిచేస్తున్నాయో అవగతమవుతోంది. కనీస ధరలు ల్యాప్‌టాప్ రూ.18 వేలది కాస్తా రూ.30 వేలకు చేరింది. హై ఎండ్‌లోనూ ధర 20 శాతంపైగా అధికమైంది. డెస్క్‌టాప్ రూ.25 వేల నుంచి రూ.38 వేలకు, ఆల్ ఇన్ వన్ రూ.30 వేల నుంచి రూ.43 వేలు అయింది. ప్రింటర్ల విషయంలో ఇంక్జెట్ రూ.2 వేల నుంచి రూ.4,500లు, లేజర్‌జెట్ రూ.9 వేలది కాస్తా రూ.16 వేలపైమాటే ఉంది. ధర పెరిగినా ప్రింటర్లు దొరకడం లేదు. -
అమెజాన్ మరో సేల్..! ఈసారి ల్యాప్‌ట్యాప్, టీవీలపై భారీ తగ్గింపు...!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన కస్టమర్లకోసం మరో సేల్‌ను అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్ ఇండియా 'గ్రాండ్ గేమింగ్ డేస్' సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ ఆగస్టు 22 నుంచి ఆగస్టు 24 వరకు కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. గ్రాండ్ గేమింగ్ సేల్స్‌లో భాగంగా ల్యాప్టాప్స్, టీవీలు డెస్క్‌టాప్‌లు, మానిటర్లు, అధునాతన హెడ్ఫోన్లు, గేమింగ్ కన్సోల్లు, గ్రాఫిక్ కార్డులు, లెనోవో, ఏసర్, ఆసూస్, ఎల్జీ, హెచ్‌పీ, సోనీ వంటి ప్రముఖ బ్రాండ్ టీవీలకు ఆఫర్లు, డీల్స్‌ను అమెజాన్ తన కస్టమర్లకు ఆఫర్ చేయనుంది. చదవండి: China Stands With Taliban: తాలిబన్లతో చైనా దోస్తీ..! భారీ పన్నాగమేనా..! డెల్, కోర్సెయిర్, కాస్మిక్ బైట్, జేబీఎల్ మరిన్ని కంపెనీల ఉత్పత్తులపై సుమారు 30 శాతం మేర తగ్గింపును ప్రకటించాయి. అధిక ర్యామ్, అధిక రిఫ్రెష్ రేట్ ఉన్న టీవీలపై కూడా 30 శాతం తగ్గింపును అమెజాన్ తన కస్టమర్లకు అందిస్తోంది. అదనంగా కొనుగోలుదారలు ఎంచుకున్న మోడళ్లపై తగ్గింపుతో పాటు నో-కాస్ట్ ఈఎమ్ఐ, ఎక్సేఛేంజ్ ఆఫర్లను కూడా పొందవచ్చును. పలు ల్యాప్‌టాప్‌లపై అమెజాన్ అందిస్తోన్న ఆఫర్లు హెచ్‌పీ కంపెనీకి చెందిన విక్టస్ 15.6-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ గేమింగ్ ల్యాప్‌టాప్ రూ. 66,990 కి అందుబాటులో ఉంది. ఏసర్ కంపెనీకి చెందిన నైట్రో 5 ఏఎన్515-56 గేమింగ్ ల్యాప్‌టాప్ రూ. 69,990 అందుబాటులో ఉంది . ఎమ్ఎస్ఐ కంపెనీకి చెందిన బ్రావో 15 ఎఫ్‌హెచ్‌డీ మోడల్‌ను రూ. 74,990 అందుబాటులో ఉంది. లెనోవా ఐడియా ప్యాడ్ ల్యాప్‌టాప్‌ను రూ . 67, 557 కు లభించనుంది. పలు టీవీలపై అమెజాన్ అందిస్తోన్న ఆఫర్లు.. సోనీ బ్రావీయా 55 ఇంచ్ 4కే అల్ట్రా హెచ్డీ ఎల్ఈడీ గూగుల్ టీవీ రూ. 83,990కు అందుబాటులో ఉండనుంది. రెడ్మీ 55 ఇంచ్ 4కే అల్ట్రా హెచ్డీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీను రూ . 45,999కు అందుబాటులో ఉండనుంది. చదవండి: Elon Musk-Jeff Bezos: ఎలన్ మస్క్‌కు పెద్ద దెబ్బే కొట్టిన జెఫ్‌బెజోస్...! -
Asus Chromebook: మార్కెట్లో బాహుబలి ల్యాప్ ట్యాప్
ఖరీదైన ల్యాప్‌ట్యాప్ లను చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా అవి పగిలే పోయే అవకాశం ఉంది. కానీ తాజాగా మార్కెట్లో విడుదలైన ఆసుస్ బాహుబలి ల్యాప్ ట్యాప్ మాత్రం కింద పడినా పగలదు.ఇందుకోసం ప్రత్యేకమైన ఎక్విప్ మెంట్‌ను యాడ్ చేసినట్లు ఆసుస్ ప్రతినిధులు తెలిపారు. తైవాన్ ఎల్రక్టానిక్స్ దిగ్గజం ఆసుస్ తన ప్రాడక్ట్‌ల విడుదలతో ఇండియన్ మార్కెట్లో సందడి చేస్తోంది. ఈ ఏడాది జులై నెలలో ఆసుస్ క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్ క్రోమ్‌బుక్ ఫ్లిప్ సీ214, క్రోమ్‌బుక్ సీ423, క్రోమ్‌బుక్ సీ523, క్రోమ్‌బుక్ సీ223 విడుదలతో హాట్ టాపిగ్గా మారింది. అయితే తాజాగా కింద పడినా డ్యామేజీ అవ్వకుండా ఉండేలా క్రోమ్‌బుక్ డిటాచబుల్ సీజెడ్1 (Asus Chromebook Detachable CZ1)ను విడుదల చేసింది. ఆసుస్ క్రోమ్‌బుక్ డిటాచబుల్ సీజెడ్1 స్పెసిఫికేషన్స్ 500 గ్రాముల బురువు ఉండే ఆసుస్ క్రోమ్‌బుక్ డిటాచబుల్ సీజెడ్1.. ఇంట్లో వినియోగించే డెస్క్, లేదంటే డైనింగ్ టేబుల్ పై నుంచి కింద పడినా పగలదు. పైగా కింద పడినా ప్రొటెక్ట్ చేసేలా నాలుగు వైపుల రబ్బర్ ట్రిమ్‌తో వస్తుందని ఆసుస్ ప్రతినిధులు తెలిపారు. వీటితో పాటు గూగుల్ అస్టిస్టెంట్ వాయిస్ రికగ్నయిజేషన్ తో వినియోగదారుల్ని అలసరిస్తుండగా..1920x1200 పిక్సెల్స్,10.1 ఫుల్ హెచ్డీ, ఎల్సీడీ డబ్ల్యూయూఎక్స్‌జీఏ టచ్‌స్క్రీన్ డిస్ప్లే, 16:10 యాస్పెక్ట్ రేషియో,100 శాతం ఎస్ఆర్జీబీ, 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ పాటు క్రోమ్ ఓఎస్‌తో వస్తోంది. మీడియాటెక్ కంపానియో 500 (ఎంటీ8183) ప్రాసెసర్, ఆర్మ్ మాలి-జీ72 ఎంపీ3 జీపీయూ చిప్సెట్ తో వస్తుండగా 4జీబీ ర్యామ్, 128 జీబీ ఈఎంఎంసీ స్టోరేజీ చేసుకోవచ్చు. యూఎస్బీ టైప్-సీ పోర్టు, 3.5ఎంఎం జాక్, 1.5ఎంఎం కీట్రావెల్ కీబోర్డు తో పాటు టైపింగ్‌కు అనువుగా ఉండేలా ఎర్గో లిఫ్ట్ డిజైన్‌తో ఆకర్షిస్తుంది. 8 మెగాపిక్సెళ్ల రేర్ కెమెరా , 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 15 సెకన్ల పాటు చార్జింగ్ చేస్తే 45 నిమిషాల పాటు వినియోగించుకోవచ్చు. 27డబ్ల్యూహెచ్ఆర్ బ్యాటరీతో వస్తున్నఈ క్రోమ్‌బుక్‌ను 11 గంటల వరకు నిర్విరామంగా వినియోగించుకునేలా బ్యాటరీ సదుపాయం ఉన్నట్లు ఆసుస్ తెలిపింది. ఆసుస్ క్రోమ్‌బుక్ డిటాచబుల్ అడ్జెస్ట్ మెంట్ కోసం స్టాండ్ తో వస్తుండగా..ఈ మోడల్ ధర ఎంతో తెలియాల్సి ఉంది. చదవండి : ఆపిల్ లాంచ్ చేయబోయే కొత్త ప్రాడక్ట్స్ ఇవే?! -
అదిరిపోయే ఫీచర్లతో రియల్ మీ ఫస్ట్ ల్యాప్ ట్యాప్
కరోనా కారణంగా స్మార్ట్ ఫోన్, గాడ్జెట్ల వినియోగం బాగా పెరిగింది. ఓ వైపు స్కూల్స్, మరోవైపు ఆన్ లైన్ క్లాసులతో వెరసీ గాడ్జెట్స్ వినియోగించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఆయా టెక్ సంస్థలు వినియోగదారులకు అభిరుచికి అనుగుణంగా స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ ట్యాప్స్‌ను విడుదల చేస్తున్నాయి. తాజాగా.. చైనా స్మార్ట్ ఫోన్ దిగ్జజం 'రియల్ మీ' ఇండియాలో 'రియల్ మీ స్లిమ్ బుక్' పేరుతో తొలి ల్యాప్ ట్యాప్‌ను విడుదల చేసింది. రియల్ మీ బుక్ స్లిమ్ స్పెసిఫికేషన్స్ తక్కువ ధర, ఒకే సారి జామ్-ప్యాక్డ్ (ఎక్కువ ట్యాబ్‌లు ఓపెన్ చేసి వినియోగించేలా) సామర్ధ్యం, ఖరీదైన కాంపోనెంట్స్(ల్యాప్ ట్యాప్‌లోని భాగాలు)తో హైట్ 3:2, 14 అంగుళాల స్క్రీన్, 2160*1440 ఫిక్సెల్, 2కే రెజెల్యూషన్‌తో ఆకట్టుకుంటుంది. దీంతో పాటు ఇండియాలో డెల్ ఇన్ స్ప్రాన్, హెచ్‌పీ గేమిండ్, లెనోవో బీక్యూఐన్ లో వినియోగించే ఆమ్లోడ్ డిస్ ప్లే కాకుండా.. ప్రత్యేకంగా ఫోటోగ్రాఫర్స్, స్కెచ్ ఆర్టిస్ట్, గ్రాఫిక్స్ డిజైనర్స్ వినియోగించే ఎల్సీడీ( లిక్విడ్ క్రిస్టల్ డిస్ ప్లే) ఐపీఎస్ ప్యానల్ టెక్నాలజీ, 90శాతం స్క్రీన్ రేషియో, ఇంటెల్ 11జనరేషన్, కోర్ ఐ3, కోర్ ఐ5 ప్రాసెస్, 8జీబీ లో పవర్ డబుల్ డేటా రేట్ మెమెరీ, 512జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ సౌకర్యం ఉండగా.. ఈ ల్యాప్ ట్యాప్ ప్రస్తుతం విండోస్ 10ను వినియోగించుకోవచ్చు. విండోస్ 11 విడుదలైతే ఉచితంగా అప్ డేట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. కనెక్టవిటీ కోసం సీ టైప్ 3.0 యూఎస్బీ పోర్ట్, టైప్ సీ యూఎస్బీ 4 థండర్ బోల్ట్ పోర్ట్, టైప్ ఏ యూఎస్బీ 3.0, హెడ్ ఫోన్ జాక్, వైఫై 6, స్టెరో స్పీకర్స్, ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 11గంటలు నిర్విరామంగా వినియోగించుకునేలా 54 డబ్ల్యూహెచ్ బ్యాటరీ, 65డబ్ల్యూ యూఎస్బీ సీ టైప్ ఛార్జర్, 30డబ్ల్యూ డ్రార్ట్ ఛార్జ్, రియల్ మీ ఫోన్ సాయంతో ల్యాప్ ట్యాప్ తో పాటు డెస్కెట్యాప్కు కనెక్ట్ చేసుకోవచ్చు. రియల్ మీ బుక్ స్లిమ్ ధర ఇండియన్ మార్కెట్ లో అందుబాటులో ఉన్న ఈ ల్యాప్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ తో వస్తుండగా.. 8జీబీ ర్యామ్ అండ్ 256 స్టోరేజ్‌తో ఉన్న ల్యాప్ ట్యాప్ ధర రూ.46,999 ఉండగా కోర్ ఐ3 మోడల్ ల్యాప్ ట్యాప్ 8జీబీ ర్యామ్ 512 జీబీ స్టోరేజ్ ఉన్న ల్యాప్ ట్యాప్ ధర రూ.59,999కే వస్తున్నట్లు రియల్ మీ ఇండియా తెలిపింది. -
పాత ఫోన్లు, లాప్‌ట్యాప్‌లు అమ్మేస్తారా? ఇది మీకోసమే..
సాక్షి, వెబ్‌డెస్క్: వేల రూపాయలు పెట్టి కొన్న గాడ్జెట్లు నెలలు తిరగకుండానే ఓల్డ్ మోడల్ అవుతున్నాయి. ఇయర్ ఫోన్స్ మొదలు స్మార్ట్ఫోన్ల వరకు , కీబోర్డు మొదలు టచ్ ల్యాప్‌టాప్‌ల వరకు వెంట వెంటనే అప్డేట్ వెర్షన్లు వచ్చేస్తున్నాయి. కొత్త వెర్షన్ వస్తువు కొందామంటే.. పాతది ఏం చేయాలని? ఎలా రీజనబుల్ ధరకు అమ్మేయాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఈ సమస్యను తీరుస్తూ.. పాత ఎలక్ట్రానిక్ వస్తువుల కొనడమే పనిగా ఈ-కామర్స్‌లోకి అడుగుపెట్టింది క్యాషిఫై. పాతవి అమ్మాలంటే మార్కెట్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ విషయంలో వెనువెంటనే మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల విషయంలో ఇది మరీ ఎక్కువ. వారం తిరక్కుండానే కొత్త ఫీచర్లతో తక్కువ ధరలో మంచి ఫోన్లు వస్తున్నాయి. దీంతో కొత్త ఫోన్లు చాలా త్వరగా ఓల్డ్ వెర్షన్ అయిపోతున్నాయి. వీటిని అమ్మి కొత్తది తీసుకుందామంటే మనకు తెలిసిన మార్కెట్లో సరైన ధర రావడం కష్టంగా మారింది. ఇలాంటి వారికి చక్కని వేదికగా మారింది క్యాషిఫై. ఈ-కామర్స్‌కు కొత్త భాష్యం చెబుతూ రీ-కామర్స్‌గా పాత ఎలక్ట్రానిక్ వస్తువులని ప్రజల నుంచి కొనుగోలు చేస్తుందీ వెబ్ పోర్టల్. రీ-కామర్స్ ఇది ఈ-కామర్స్ కాదు.. రీ-కామర్స్. అంటే పాత వస్తువుల్ని కొనడమే వీళ్ల పని. ఎలక్ట్రానిక్స్ కేటగిరీలో ఫీచర్ ఫోన్లు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్, స్మార్ట్‌వాచ్, స్మార్ట్ స్పీకర్, డీఎస్ఎల్ఆర్ కెమెరా, ఇయర్‌బడ్స్ తదితర వస్తువులన్నీ ఈ సైట్లో అమ్మే అవకాశం ఉంది. క్యాషిఫై వెబ్‌సైట్‌కి వెళ్లి అక్కడున్న ఆప్షన్లను అనుసరిస్తే మీ దగ్గరున్న ప్రొడక్టుకి ఎంత ధర వస్తుందో తెలియజేస్తుంది. ఆ తర్వాత మరికొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాక.. ఫైనల్ ధర ఎంతో నిర్ధారిస్తుంది. అందుకు ప్రొడక్టు ఓనర్ అంగీకరిస్తేనే డీల్ ముందుకు వెళ్తుంది. ఎక్సేంజీ కంటే మేలు ప్రముఖ ఈ కామర్స్ సైట్లలో సైతం ఎక్సేంజ్ ఆఫర్లు రెగ్యులర్‌గా ఉంటాయి. అయితే ఎక్సేంజ్ ఆఫర్లలో కంపెనీలు పాత ఫోన్లకు చాలా తక్కువ ధరను ఆఫర్ చేస్తుంటాయి. పైగా అన్ని రకాల పాత మోడళ్లపై ఎక్సేంజీ ఆఫర్ వర్తించవు. అంతేకాదు మనకు నచ్చిన వస్తువలపై ఎక్సేంజీ ఆఫర్ ఉండకపోవచ్చు. ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా క్యాషిఫైలో పాత గాడ్జెట్స్ అమ్మేయోచ్చు. ఆఫ్‌లైన్‌లో కూడా ఇప్పటి వరకు ఆన్లైన్లోనే వ్యాపారం చేస్తూ వచ్చిన క్యాషిఫై తాజాగా ఆఫ్‌లైన్‌లోకి వచ్చింది. రిటైల్ చైయిన్ యూనిషాప్తో ఒప్పందం చేసుకుంది. దీంతో ఢిల్లీ, బెంగళూరు, ముంబై ఏరియాల్లో 60కి పైగా రిటైల్ షాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా టైర్ టూ సిటీలకు కూడా విస్తరించేలా క్యాషిఫై ప్రణాళిక సిద్దం చేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ ఆఫ్‌లైన్ సౌకర్యం హైదరాబాద్‌ని పలకరించే అవకాశమూ ఉంది. -
రెడ్ మీ నుండి ఫస్ట్ ల్యాపీ.. ఎలా ఉందో తెలుసా?
Xiaomi First Laptop: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ నేడు తొలిసారి రెడ్మీ ల్యాప్‌ట్యాప్ లను మార్కెట్లో విడుదల చేయనుంది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్ ట్యాప్‌ల వినియోగం పెరిగి పోతుండడంతో ఆయా టెక్ సంస్థలు వినియోగదారులకు అనుగుణంగా గాడ్జెట్స్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. యూజర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. తాజాగా, షియోమీ సంస్థ 'రెడ్ మీ బుక్' పేరుతో రెండు మోడళ్లను ల్యాప్ ట్యాప్‌లను విడుదల చేస్తున్నట్లు అధికారంగా ప్రకటించింది. గతేడాది రెడ్ మీ బ్రాండ్ పేరుతో భారీ ఎత్తున పవర్ బ్యాంక్స్, ఇయర్ బడ్స్, స్మార్ట్ బ్రాండ్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది స్మార్ట్ టీవీలను లాంఛ్ చేసింది. ఇప్పుడు అదే బ్రాండ్ పేరుతో ల్యాప్ ట్యాప్‌లను విడుదల చేయడం టెక్ మార్కెట్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. రెడ్ మీ బుక్ ల్యాప్ ట్యాప్ ఫీచర్స్ ప్రస్తుతం ఉన్న విండోస్ - 10 తో పాటు త్వరలో అప్ డేట్ కానున్న విండోస్ -11ను అప్ గ్రేడ్ చేసుకునే విధంగా రెడ్ మీ బుక్ ల్యాప్‌ట్యాప్ ను డిజైన్ చేశారు. దీంతో పాటు 15 అంగుళాల స్క్రీన్ సైజ్, 1920*1080 పిక్సెల్స్ రెజెల్యూషన్‌తో ఫుల్ హెచ్డీ డిస్ప్లే, వెబ్ క్యామ్ కోసం లైట్ బెజెల్స్‌ను ఏర్పాటు చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, వీ 5.0 బ్లూటూత్, సీ టైప్ 3.1యూఎస్బీ, యూఎస్బీ టైప్ -ఏ,యూఎస్ బీ 2.0, ఆడియో జాక్, రెండు స్టెరో స్పీకర్స్ ఉన్నాయి. ఈ ల్యాప్ ట్యాప్‌లో మరో ఇంట్రస్టింగ్ ఫీచర్ ఏంటంటే ఇంటెల్ లెవెన్త్ జనరేషన్ లో ఐ3,ఐ5 ప్రాసెసర్ తో పనిచేయనుంది. 8జీబీ ర్యామ్, 512జీబీ సాలిడ్ స్టేట్ డ్రైవ్ (ఎస్ఎస్డీ), 65 వాట్ల ఛార్జర్, ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 10 గంటల పాటు వినియోగించుకోవచ్చేని రెడ్ మీ పేర్కొంది. కాస్ట్ ఎంత ఉండొచ్చు ప్రస్తుతం ల్యాప్ ట్యాప్ స్పెసిఫికేషన్లు అందుబాటులోకి వచ్చినా ధరపై షియోమీ సంస్థ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. టెక్ నిపుణులు మాత్రం రెడ్ మీ బుక్ ల్యాప్ ట్యాప్‌లు రూ.50వేల లోపు ఉంటాయని అంచనా వేస్తున్నారు. -
వసతి దీవెనకు బదులు ల్యాప్‌టాప్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న పేద విద్యార్థులకు వారి సమ్మతిని అనుసరించి ‘జగనన్న వసతి దీవెన’ స్థానంలో ల్యాప్‌టాప్‌లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులను డిజిటల్ దిశగా నడిపించడంతోపాటు కరోనా వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు అభ్యసనాన్ని కొనసాగించేందుకు వీలుగా ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయనున్నారు. విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరు చేస్తున్న ప్రభుత్వం వారికి భోజన వసతి సదుపాయాల కోసం జగనన్న వసతి దీవెన కింద ఏటా రూ.20 వేల వరకు అందిస్తున్న సంగతి తెలిసిందే. 2021–22 విద్యా సంవత్సరంలో జగనన్న వసతి దీవెన కింద ఇచ్చే నగదుకు బదులు ల్యాప్‌టాప్‌లు కావాలని కోరుకొనే వారికి వీటిని అందించనున్నారు. వీరికి రెండు రకాల కంప్యూటర్లను వారి అభీష్టాన్ని అనుసరించి పంపిణీ చేయిస్తారు. వాటిలో ఒకటి బేసిక్ కన్ఫిగరేషన్‌తో ఉన్నది కాగా రెండోది అడ్వాన్సుడ్ కన్షిగరేషన్‌తో కూడుకున్నది. ఈ ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు సంబంధించి ఏపీటీఎస్ ద్వారా విధివిధానాలు ఖరారు చేయనున్నారు. అలాగే ఈ ల్యాప్‌టాప్‌లలో ఏమైనా లోపాలు తలెత్తితే విద్యార్థులు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేసిన వారం రోజుల్లో ఆయా కంపెనీలు సమస్యను పరిష్కరించాలి. రెండు రకాల మోడళ్లకు సంబంధించిన కన్ఫిగరేషన్ సమాచారాన్ని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్యాశాఖ) ఉత్తర్వుల్లో పొందుపరిచారు. -
ల్యాప్ ట్యాప్ కొనాలనుకుంటున్నారా, అయితే ఈ బ్రాండ్ బాగుంటుందంట
వర్క్‌ఫ్రమ్ హోమ్, ఆన్లైన్లో మనీ ఎర్నింగ్ కోసం మంచి ల్యాప్‌ట్యాప్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా?! మనకి డెల్,హెచ్‌పీ,లెనెవో, ఆసుస్ ల్యాప్ ట్యాప్‌ల గురించి మాత్రమే తెలుసు. అయితే మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న ల్యాప్‌ట్యాప్..పై వాటికంటే బాగుంటుందని టెక్ నిపుణలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ రెడ్ మీ లేటెస్ట్ గా 5జీస్మార్ట్ ఫోన్లు రెడ్ మీ నోట్ 10 ఫ్యామిటీ, షియోమీ రెడ్ నోట్‌మీ 10టీ విడుదల చేసి వినియోగదారుల్ని అట్రాక్ట్ చేస్తుంది. అయితే త్వరలో షియోమీ సంస్థ రూ.13,999వేరియంట్ తో స్మార్ట్ ఫోన్లను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఆ స్మార్ట్ ఫోన్ తో పాటు పవర్ బ్యాంక్స్, రెడ్ మీ ఆడియో, స్మార్ట్ టీవీ, ఫిట్నెస్ బ్రాండ్ 'రెడ్‌మీబూ' పేరుతో ల్యాప్‌ట్యాప్‌ను విడుదల చేయనున్నట్లు షియోమీ రియల్ మీ ఇండియా సీఈఓ మురళికృష్ణన్ తెలిపారు. అయితే దీని స్పెసిఫికేషన్ ఎలా ఉన్నాయనే విషయంపై చర్చించలేదు. త్వరలోనే ఇండియాలో విడుదల చేస్తున్నట్లు చెప్పడం ఆసక్తికరంగా మారింది. షియోమి ల్యాప్ ట్యాప్‌లు షియోమి ల్యాప్ ట్యాప్‌లను విడుదల చేయడం ఇది తొలిసారేమీ కాదు. గతంలో రెడ్మి నోట్‌బుక్14 హారిజోన్,రెడ్మి నోట్‌బుక్14 (ఐసి), రెడ్మి నోట్‌బుక్14, రెడ్మి నోట్ బుక్ 14 ఇ-లెర్నింగ్ ల్యాప్‌ట్యాప్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు, రెడ్మీ నోట్‌బుక్ ప్రో14, రెడ్మి నోట్‌బుక్ అల్ట్రా15 అనే రెండు కొత్త ల్యాప్‌టాప్‌లను విడుదల చేయడం ద్వారా కంపెనీ తన ల్యాప్‌టాప్‌ల అమ్మకాలు మరింత విస్తృతంగా జరిపేందుకు యోచిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.రాబోయే ల్యాప్‌టాప్‌లు రెడ్‌మిబుక్ ప్రో 14 రీబ్రాండెడ్ వెర్షన్లుగా భావిస్తున్నారు. మరి త్వరలో విడుదల కానున్న రెడ్‌మీబూ ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సి ఉంది. చదవండి: ఇన్ స్టాగ్రామ్,ఈ సూపర్ ఫీచర్ గురించి మీకు తెలుసా?! -
ఆన్లైన్ అధ్యయనం.. తిప్పలు తప్పట్లేదు
మూసాపేట: బ్లాక్ బోర్డ్, చాక్‌పీస్, డస్టర్ అంటూ తరగతి గదుల్లో తోటి విద్యార్థుల మధ్య సరదాగా చదువుకోవాల్సిన విద్యార్థులకు ఆండ్రాయిడ్ మొబైల్, ప్లే స్టోర్, ఇంటర్నెట్ వంటి కొత్త యాప్‌లతో కుస్తీ పడుతూ చదువుకోవాల్సి వస్తోంది. కరోనా మహమ్మారితో అన్ని రంగాలు కుదేలవటమే కాక విద్యార్థులు సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రెండు సంవత్సరాలుగా పరీక్షలు నిర్వహించకుండానే ఉత్తీర్ణులుగా ప్రకటించి పై తరగతులకు అనుమతించారు. ఈ సంవత్సరం కూడా కరోనా వ్యాప్తితో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పేద కుటుంబానికి చెందిన వారే కావటంతో వారి వద్ద ఆండ్రాయిడ్ మొబైల్ లేకపోవటం, టీవీలు కొంత మందికి లేకపోవటం, మరి కొందరు కేబుల్ బిల్లు చెల్లించక పోవటంతో ప్రతి రోజు తరగతులను వినేందుకు అవకాశం లేకుండా పోయింది. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు ఎదురుగా ఉండి పాఠాలు బోధిస్తేనే అంతంత మాత్రంగా అర్థం చేసుకునే ఈ చదువులు ఆన్లైన్లో టీవీల ముందు, సెల్ఫోన్లో వింటే వారికి అర్థం కావటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ►మూసాపేటలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 435 మంది విద్యార్థులు ఉండగా 10వ తరగతిలో 75 మంది ఉన్నారు. ► ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు పేద కుటుంబాల వారు కావటంతో మొబైల్ లేకపోవటం, టీవీల అందరి వద్ద లేకపోవటంతో పాఠాలకు దూరమవుతున్నారు. ► తరగతి గదుల్లో ఉండి చదివే చదువులకు ఆన్లైన్లో చదివే చదువులకు వ్యత్యాసం ఉండటమే కాకుండా విద్యార్థులకు అర్థం కాక సతమతమవుతున్నారు. ► ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు విద్యార్థులను పరీక్షిస్తూ మొబైల్లో టిశాట్ యాప్ ద్వారా, టీవీలో డీడీ యాదగిరి చానల్లో పాఠాలు వినాలని అందుకు సంబంధించిన టైం టేబుల్‌ను కూడా విద్యార్థులకు అందిస్తున్నారు. ► ఇదే విధంగా ఆన్లైన్లో చదివి 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరైతే మాత్రం ఉత్తీర్ణత శాతం పడిపోయే అవకాశం ఉంది. అంతే కాక ఉన్నత చదువులకు వెళ్లటానికి అక్కడి పాఠాలు అర్థమయ్యే పరిస్థితి ఉండదు. ► అయితే ఆన్లైన్ పాఠాలు వింటూ తమ ఇంటి సమీపంలో ఉన్నత చదువులు చదివిన వారి వద్ద సందేహాలను నివృత్తి చేసుకుని కష్టపడి చదివితేనే ఉత్తీర్ణత సాధించుకోవచ్చు. ► అలా కాకుండా గతంలో మాదిరి ఇంట్లో వింటూ వదిలేసి ఉంటే మాత్రం అర్థం కాకపోవటమే కాక పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి ఉంటుందని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ► మొబైల్ విద్యార్థుల చేతుల్లో ఉండటంతో ఇంటర్నెట్లో కొత్త కొత్త గేమ్‌లు, సినిమాలు, వీడియోలకు అలవాటు పడుతున్నారు. చదువు సంగతి పక్కన పెడితే మొబైల్‌కు అలవాటు పడి ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ► అదే విధంగా కళ్లకు సంబంధించి జబ్బులు ప్రబలుతుండటం, మరి కొంతమంది విద్యార్థులు ఆన్లైన్ పాఠాల పేర్లతో మొబైల్లో గేమ్స్, సినిమాలు చూస్తున్నారని వారి భవిష్యత్ గురించి భయంగా ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
ఈ ఒక్క ఛార్జర్‌తో అన్నింటికీ చెక్..! ధర ఎంతంటే..
స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్స్ మన నిత్యజీవితంలో ఒక భాగమయ్యాయి. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్, హెడ్ ఫోన్స్‌కు వేరవేరుగా బ్యాటరీ ఛార్జర్లను మనతో పాటు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్లి మనం క్యారీ చేసే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కు ఛార్జర్లు మర్చిపోయామంటే అంతే సంగతులు.. తిరిగి దగ్గరలో ఉన్న ఎలక్ట్రానిక్ షాప్‌కు వెళ్లి కొత్తది కొనుకోవాల్సిందే. మనలో చాలామంది ఈ సమస్యను ఎదుర్కొన్నవాళ్లమే.. తాజాగా షావోమి రిలీజ్ చేసిన ఛార్జర్‌తో వీటన్నింటికీ చెక్ పెట్టవచ్చును. షావోమి మార్కెట్లోకి 67W సోనిక్ఛార్జ్ 3.0 ను సోమవారం రోజున మార్కెట్లోకి రిలీజ్ చేసింది. షావోమి రిలీజ్ చేసిన కొత్త ఛార్జర్ యుఎస్బీ టైప్-ఎ నుంచి యుఎస్బీ టైప్-సి సపోర్ట్ చేయనుంది. కాగా ఛార్జర్లో ఒకే యుఎస్బి టైప్-ఎ పోర్ట్ ఉండడం గమనార్హం, కానీ షావోమి ఈ ఛార్జర్‌తో స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హెడ్ఫోన్లు , మరెన్నో పలు పరికరాలను ఛార్జ్ చేయగలదని షావోమి పేర్కొంది. ఛార్జర్ అనేక పరికరాలను వేగంగా ఛార్జ్ చేయడానికి 67W అవుట్‌పుట్‌ను అందిస్తుంది.షావోమి ఈ ఏడాది ప్రారంభంలో 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తూ ఎంఐ 11 అల్ట్రాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌కు 55W ఫాస్ట్ ఛార్జర్‌ను కొనుగోలుదారులకు షావోమీ అందిస్తోంది. షావోమి సోనిక్ఛార్జ్ 3.0 క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0తో వస్తోంది. భారత్‌లో ఎంఐ 67W సోనిక్ ఛార్జ్ 3.0 ఛార్జర్ ధర రూ .1,999 గా నిర్ణయించారు. ఈ ఛార్జర్‌ను షావోమి అధికారిక వెబ్సైట్ నుంచి, ఎంఐ హోమ్ స్టోర్స్‌లో అందుబాటులో ఉండనుంది. ఛార్జర్‌కు 100 సెం.మీ 6A టైప్-సీ కేబుల్‌తో రానుంది. Mi 67W SonicCharge 3.0 Charger Combo#Mi67WCharger #SonicCharge3 Sale Starts Today at 12PM - https://t.co/Sb9Dw2mkHN Available on https://t.co/D3b3QtmvaT, Mi Home and Offline Stores. pic.twitter.com/N9WO1HsuVn — Mi India (@XiaomiIndia) July 12, 2021 -
9, 10 తరగతుల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు అమ్మఒడి పథకం కింద ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. డ్యుయెల్ కోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్ డిస్క్, 14 ఇంచ్‌ల స్క్రీన్, విండోస్ 10 (ఎస్టీఎఫ్ మైక్రోసాఫ్ట్), ఓపెన్ ఆఫీస్ (ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్)ల కాన్ఫిగరేషన్‌తో ల్యాప్‌టాప్‌లు అందించనుంది. వీటికి మూడేళ్ల వారెంటీ ఉంటుంది. అమ్మఒడి ఆర్థిక సాయానికి బదులు తమకు ల్యాప్‌టాప్‌లు కావాలని కోరుకునే విద్యార్థులకు వీటిని అందిస్తుంది. ల్యాప్‌టాప్‌లకు మెయిన్టెనెన్స్ సమస్యలు ఎదురైతే ఫిర్యాదు ఇచ్చిన వారంలోపు పరిష్కరించేలా సదరు కంపెనీకి షరతు విధిస్తున్నారు. ఫిర్యాదులను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించాల్సి ఉంటుంది. -
జెట్ ఎయిర్వేస్ సిబ్బందికి బంపర్ ఆఫర్!
న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియలో భాగమైన జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకోనున్న కంపెనీ సంస్థ సిబ్బందికి ఫోన్ లేదా ఐప్యాడ్ లేదా ల్యాప్‌టాప్‌ను ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా నగదును సైతం చెల్లించేందుకు ప్రతిపాదించింది. జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) అనుమతించిన రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా జెట్ ఎయిర్వేస్ సిబ్బందిలో కనీసం 95 శాతం టేకోవర్‌కు అనుకూలంగా ఓటింగ్ చేయవలసి ఉంటుంది. ఇలాగైతేనే జెట్ ఎయిర్వేస్ కొనుగోలు బిడ్‌కు క్లియరెన్స్ లభించనుంది. జలాన్ కల్రాక్ కన్సార్షియం జెట్ ఎయిర్వేస్ను కొనుగోలు చేసేందుకు బిడ్‌ను గెలుపొందిన సంగతి తెలిసిందే. కంపెనీ సిబ్బంది(ఉద్యోగులు, కార్మికులు) ప్రయోజనాల నేపథ్యంలో టేకోవర్ ప్రక్రియకు ఈ నెల 5న ప్రారంభమైన వోటింగ్ ఆగస్ట్ 4వరకూ కొనసాగనుంది. గత నెల 22న ఎన్సీఎల్టీ కొన్ని షరతులతో జలాన్ కల్రాక్ కన్సార్షియంకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా కంపెనీ సిబ్బందికి కొన్ని రకాల లబ్ధిని చేకూర్చేందుకు కన్సార్షియం ఆమోదించింది. ఈ అంశాలను జెట్ ఎయిర్వేస్ వెబ్సైట్లో పొందుపరిచారు. రుణ భారం, నష్టాలతో కుదేలైన జెట్ ఎయిర్వేస్ 2019 ఏప్రిల్ 17న మూత పడింది. తదుపరి 2019 జూన్ 20న దివాలా చర్యలు ప్రారంభమయ్యాయి. ఆఫర్ ఇలా..: జెట్ ఎయిర్వేస్ సిబ్బంది(కార్మికులు)కి టేకోవర్ కంపెనీ ఫోన్ లేదా ఐప్యాడ్ లేదా ల్యాప్‌టాప్‌ను ఇచ్చేందుకు సన్నద్ధమైంది. అంతేకాకుండా రూ. 22,800 చొప్పున నగదును చెల్లించనుంది. ఇక ఉద్యోగులకు ఒక్కొక్కరికీ రూ.11,000 చొప్పున అందించనుంది. జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకునేందుకు జలాన్ కల్రాక్ కన్సార్షియం మొత్తంగా నగదు రూపేణా రూ. 1,375 కోట్లను వెచ్చించనుంది. -
రియల్మీ నుంచి ల్యాప్‌టాప్..ఆపిల్ మాక్‌బుక్‌ను పోలి ఉన్న ఫినిషింగ్..!
కోవిడ్-19 మహమ్మారి రాకతో ల్యాప్‌టాప్‌ల మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందింది. ప్రజలు ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోంకే పరిమితమవ్వడంతో ల్యాప్‌టాప్ సేల్స్ భారీగా పెరిగాయి. ఆసుస్, డెల్, హెచ్‌పి, లెనోవో వంటి ల్యాప్‌టాప్ కంపెనీల కొనుగోళ్లలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా ఈ కంపెనీలు భారీగా లాభాలను ఆర్జించాయి. దీంతో ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా ల్యాప్‌టాప్‌ల తయారీపై దృష్టిసారించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్మీ కూడా ల్యాప్‌టాప్ ఉత్పత్తిపై దృష్టిసారించింది. కాగా త్వరలోనే రియల్మీ నుంచి ల్యాప్‌టాప్ రిలీజ్ అవుతుందని కంపెనీ సీఈఓ మాధవ్ శేత్ ట్విటర్లో పోస్ట్చేశాడు. 2008 లో స్టీవ్ జాబ్స్ మొదటి తరం మాక్‌బుక్ ఎయిర్‌ను ఎలా ఆవిష్కరించారనే విషయాన్ని గుర్తుచేస్తూ, పేపర్‌బ్యాగ్‌లో ఉన్న రియల్మీ ల్యాప్‌టాప్ ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేశాడు. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమీకు చెందిన ల్యాప్‌టాప్‌లకు పోటీగా, రియల్మీ ల్యాప్‌టాప్‌ను రిలీజ్ చేయనుంది. రియల్మీ కంపెనీ భారత్, యూరప్ సీఈవో మాధవ్శేత్ తన ట్విటర్ ఖాతా నుంచి హల్లో వరల్డ్ అనే ఒక క్రిప్టిక్ మెసేజ్‌ను తెలుపుతూ చిత్రాన్ని పోస్ట్ చేశాడు. కాగా చిత్రంలో రియల్మీ ల్యాప్‌టాప్ ఆపిల్ మాక్‌బుక్ మాదిరిగానే ఫినిషింగ్ కల్గి ఉన్నట్లుగా తెలుస్తోంది.ల్యాప్‌టాప్ బాడీ అల్యూమినియం లేదా ప్లాస్టిక్‌తో తయారుచేశారనే విషయంలో కాస్త అస్పష్టత నెలకొంది. 01001000B 01100101B 01101100B 01101100B 01101111B 00100000B 01010111B 01101111B 01110010B 01101100B 01100100B 00100001B 00000000B#realme new product category has a message for you! Can you decode it & guess the product name that will add up to your #TechLife? pic.twitter.com/PhPcvn0668 — Madhav Max 5G (@MadhavSheth1) June 9, 2021 చదవండి: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ వచ్చేశాయి.. మొబైల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..! -
ప్రీమియం ఫీచర్లతో ఆసస్ ల్యాప్టాప్స్: ధర ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్: టెక్నాలజీ రంగ కంపెనీ తైవాన్‌కు చెందిన ఆసస్ జెన్‌బుక్ శ్రేణిలో డ్యువో 14, ప్రో డ్యువో 15 ఓఎల్ఈడీ మోడళ్లను భారత్‌లో ప్రవేశపెట్టింది. డ్యూయల్ డిస్ప్లే వీటి ప్రత్యేకత. డ్యూయల్ స్క్రీన్ టెక్నాలజీతో, ప్రీమియం అనుభవంతో ప్రొఫెషనల్ వినియోగదారుల వర్క్‌ను మరింత సులభం చేస్తుందని కంపెనీ తెలిపింది. జెన్‌బుక్ ప్రో డ్యువో 15 ఓఎల్ఈడీకి 15.6 అంగుళాల 4కే యూహెచ్డీ నానోఎడ్జ్ టచ్ డిస్ప్లే, స్టైలస్ సపోర్ట్‌తో సెకండరీ 14.1 అంగుళాల స్క్రీన్‌ప్యాడ్ పొందుపరిచారు. 32జీబీ ర్యామ్, 1టీబీ సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ (ఎస్ఎస్డీ), ఇంటెల్ కోర్ ఐ 9 ప్రాసెసర్‌తో వస్తున్న దీని ధర రూ.2,39,990. (ఆరేళ్లలో కోటి స్మార్ట్ఫోన్లు) జెన్‌బుక్ డ్యువో 14 మోడల్‌కు 14 అంగుళాల ఎల్ఈడీ బ్యాక్‌లైట్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 12.65 అంగుళాల స్క్రీన్‌ప్యాడ్ ఏర్పాటు ఉంది. 2 జీబీ ర్యామ్‌తో ఎన్విడియా జిఫోర్స్ ఎంఎక్స్ 450 గ్రాఫిక్స్ కార్డ్ కూడా లభ్యం. విండోస్ 10 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇవి పనిచేస్తాయి. ధర రూ.99,990. లభ్యత : జెన్‌బుక్ డ్యువో 14 కొనుగోలుకు అందుబాటులో ఉండగా, ప్రో డుయో 15 వచ్చే నెలలో అందుబాటులోకి రానుంది. -
ఎలక్ట్రానిక్ వస్తువులపై ఫ్లిప్‌కార్ట్ లో అదిరిపోయే ఆఫర్స్
కొత్త మొబైల్, ఎలక్ట్రానిక్, దుస్తువులు కొనాలనుకునే వారికి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ శుభవార్త అందించింది. బిగ్ సేవింగ్ డేస్ 2021 సేల్ పేరుతో ఫ్లీప్కార్ట్ మరో కొత్త సేల్ ని తీసుకొనివచ్చింది. ఈ సేల్ మార్చి 24 నుంచి మార్చి 26 వరకు కొనసాగుతుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల మాత్రం నేటి నుంచి సేల్ లో పాల్గొనవచ్చు. మూడు రోజుల పాటు జరిగే సేల్ లో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై అద్భుతమైన ఆఫర్స్ అందిస్తుంది. ఎస్బిఐ వినియోగదారులు క్రెడిట్ కార్డ్ ద్వారా ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే వారికీ 10 శాతం అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అమెజాన్ మాత్రం మొబైల్ ప్రియుల కోసం అమెజాన్ "ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్"ను తీసుకొచ్చింది. ఈ సేల్ నేటి(మార్చి 22) నుంచి మార్చి 25 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో రియల్ మీ, పోకో, ఆపిల్ కు సంబందించిన ఉత్పత్తుల ఉన్నాయి. చదవండి: కొత్త మొబైల్ కొనాలనుకునే వారికి శుభవార్త! -
గ్రామాల్లో అన్ లిమిటెడ్ ఇంటర్నెట్: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్లు, అమ్మఒడి పథకంలో ఆప్షన్‌గా ల్యాప్‌టాప్‌ల పంపిణీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గ్రామాలకు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ నెట్వర్క్ అందించాలని, అంతరాయాలు లేకుండా నెట్వర్క్ అందించాలని అధికారులకు సూచించారు. ఏ స్థాయి కనెక్షన్ కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని సీఎం పేర్కొన్నారు. చదవండి: బాబు అపహాస్యం.. జగనన్న ఆపన్న హస్తం గ్రామాల్లో నెట్వర్క్ పాయింట్ వద్ద ఇంటర్నెట్ లైబ్రరీ.. తద్వారా సొంత ఊళ్లలోనే వర్క్ ఫ్రం హోం సదుపాయాలు ఏర్పాటు చేయాలని.. ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. విద్యార్థులకిచ్చే ల్యాప్‌టాప్‌లపైనా ఆలోచన చేయాలని సీఎం సూచించారు. వచ్చే ఏడాది అమ్మఒడి చెల్లింపుల నాటికి ల్యాప్‌టాప్‌లు ఇచ్చేందుకు సిద్ధం కావాలన్నారు. ల్యాప్‌టాప్ చెడిపోయిందని గ్రామ/వార్డు సచివాలయాల్లో ఇస్తే వారం రోజుల్లో మరమ్మతులు చేసి ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. చదవండి: వింత వ్యాధిపై సీఎం జగన్ సమీక్ష -
మళ్లీ 11 ఏళ్ళకి నోకియా ల్యాప్‌టాప్
భారతదేశంలో ప్యూర్‌బుక్ సిరీస్‌లో భాగంగా నోకియా ప్యూర్‌బుక్ ఎక్స్ 14ని మొట్టమొదటి నోకియా ల్యాప్‌టాప్‌గా తీసుకొస్తునట్లు ఫ్లిప్‌కార్ట్‌లో అప్డేట్ వచ్చిన అప్డేట్ ద్వారా తెలుస్తుంది. నోకియా ప్యూర్‌బుక్ సిరీస్‌ను భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు గత వారం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) వెబ్‌సైట్‌లోని జాబితాలో కొన్ని నోకియా ల్యాప్‌టాప్‌లను తీసుకొస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఇప్పుడు దానికి సంబంధించిన వివరాలు మొదటగా బయటకు వచ్చాయి. దీనిలో ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, డాల్బీ అట్మాస్ వంటి ఫీచర్స్ తో వస్తుంది.(చదవండి: 499కే 10000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్) నోకియా ప్యూర్‌బుక్ ఎక్స్ 14 ఫీచర్స్ నోకియా ప్యూర్‌బుక్ ఎక్స్ 14 వేరియంట్ లో ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ అందించనున్నారు. మైక్రోసైట్ ప్రకారం డాల్బీ విజన్ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ యొక్క బరువు 1.1 కిలోగ్రాములు. నోకియా ల్యాప్‌టాప్ చిత్రంలో యుఎస్బి 3.0 మరియు హెచ్డిఎంఐ పోర్ట్‌లు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. నోకియా ప్యూర్‌బుక్ ఎక్స్ 14ను ఎప్పుడు తీసుకొస్తున్నారో ఫ్లిప్‌కార్ట్ వెల్లడించలేదు. నోకియా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) వెబ్సైట్లో లిస్టింగ్ చేసిన ప్రకారం మొత్తం 9 మోడళ్ళు తీసుకొస్తున్నారు. ఇందులో 5 మోడళ్లను i5 ప్రాసెసర్ సపోర్ట్ తీసుకొస్తుండగా, మిగతా నాల్గింటిని i3 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. ఇవి పదో తరం ఇంటెల్ ప్రాసెసర్లు అయ్యే అవకాశం ఉంది. కొత్త ల్యాప్‌టాప్‌లు నోకియా బ్రాండింగ్‌ను కలిగి ఉన్నప్పటికీ థర్డ్ పార్టీ చేత తయారుచేసినట్లు సమాచారం. ఫ్లిప్ కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులో ఉండనున్నాయి. -
ఆన్‘లైన్’లో పడని చదువులు
సాక్షి, వరంగల్ : కరోనా దెబ్బకు కుదేలవ్వని రంగం లేదు. ఆర్థిక వ్యవస్థ పడకేయగా, చదువులు అటకెక్కాయి. విద్యారంగానికి ఎదురవుతున్న సవాళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగా ఆన్లైన్ పద్ధతిలో విద్యాబోధన జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 1న ప్రారంభించిన ఈ ఆన్లైన్ తరగతులు కొంతవరకు ప్రయోజనం చేకూర్చినా... గ్రామీణ, గిరిజన, మారుమూల, ప్రాంతాల విద్యార్థులను చేరలేకపోయాయి. నెట్వర్క్ సమస్యతో గ్రామీణ విద్యార్థులకు ఆన్లైన్ బోధన అందట్లేదు. తాజాగా ప్రథమ్ సంస్థ దేశవ్యాప్తంగా సర్వేచేసి రూపొందించిన విద్యావార్షిక స్థితి నివేదిక (ఏఎస్ఈఆర్) ఇదే చెబుతోంది. ఈ నివేదిక ఆధారంగా డిజిటల్ విద్య స్థితిగతులెలా ఉన్నాయంటే.. డిజిటల్ బోధనకు భారీ ఖర్చు తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు డిజిటల్ బోధన కోసం టీవీలు, స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌లతో పాటు ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు అధిక మొత్తంలో ఖర్చు చేశారు. 2018 ఏఎస్ఈఆర్ నివేదిక ప్రకారం 45.8 శాతం మంది విద్యార్థులకు స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉండగా 2020 నివేదిక ప్రకారం ఇది 74 శాతానికి పెరిగింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో స్మార్ట్ఫోన్ల వినియోగం 37.6 నుండి 68.1 శాతానికి పెరిగింది. మొత్తంగా తెలంగాణలో 90.5 శాతం మంది విద్యార్థులకు టీవీలు, 74 శాతం విద్యార్థులకు స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. కరోనా కాలంలో డిజిటల్ బోధనలో పాఠాలు వినేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు టీవీలు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు రూ.2,500 కోట్లు వెచ్చించినట్లు నివేదిక తెలిపింది. వేధిస్తున్న నెట్వర్క్ సమస్య రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు, టీవీల సంఖ్య గణనీయంగా పెరిగినా గ్రామాలు, తండాలు, మారుమూల ప్రాంతాల్లో విద్యార్థులను నెట్వర్క్ సమస్య వేధిస్తోంది. ఫైబర్ ఆప్టికల్ (భారత్ నెట్) ద్వారా ప్రతీ గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినా.. అదంతా మాట లకే పరిమితమవుతోంది. కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ నెట్వర్క్ సమస్యతో రాష్ట్రంలోని చాలామంది విద్యార్థులకు డిజిటల్ బోధన అందని ద్రాక్షగా మారిందని ఏఎస్ఈఆర్ నివేదిక పేర్కొంటోంది. -
నోకియా లవర్స్ కి గుడ్ న్యూస్
ఒకప్పుడు ఫీచర్ ఫోన్ల విభాగంలో టాప్ కంపెనీగా పేరొందిన నోకియా సంస్థ నుంచి ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు రానున్నాయి. గతంలో మైక్రోమిక్కో సిరీస్ క్రింద ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు, మినీ ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చింది నోకియా. కానీ తర్వాత మార్కెట్ లో పోటీ దృష్ట్యా తిరోగమనాన్ని చూసింది. నోకియా బ్రాండ్ నుంచి వచ్చిన చివరి మినీ ల్యాప్‌టాప్ నోకియా బుక్లెట్ 3జీ ఇది 2009లో వచ్చింది. ఇప్పుడు తాజాగా భారతదేశంలో కొత్త సిరీస్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నోకియా బ్రాండ్‌తో హెచ్ఎండి గ్లోబల్ సంస్థకు చెందిన ల్యాప్‌టాప్‌లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్సైట్లో గుర్తింపు కోసం అప్లికేషన్ పెట్టుకుంది. దింతో మన దేశంలో తిరిగి అధికారికంగా ల్యాప్‌టాప్‌లను విడుదల చేయనున్నట్లు సమాచారం.(చదవండి: టాప్ - 10 ట్రెండింగ్ ఫోన్స్ ఇవే!) టిప్‌స్టర్ ముకుల్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం, నోకియా ల్యాప్‌టాప్‌లు ఒకే సిరీస్ కింద తొమ్మిది వేర్వేరు మోడళ్లలో రానున్నాయి. ఈ మోడళ్లు వచ్చేసి NKi510UL82S, NKi510UL85S, NKi510UL165S, NKi510UL810S, NKi510UL1610S, NKi310UL41S, NKi310UL42S, NKi310UL82S, NKi310UL85S. ఈ ల్యాప్‌టాప్‌లకు సర్టిఫికేషన్ ఇచ్చినట్టు BIS వెబ్సైట్లో కనిపిస్తోంది. కానీ దీనికి సంబంధించిన అధికారిక సమాచాన్ని నోకియా వెల్లడించలేదు. త్వరలోనే ఈ మోడళ్లు మార్కెట్లోకి రానున్నాయని నోకియామోబ్ వెబ్సైట్ తెలిపింది. ఇందులో ఐ5 ప్రాసెసర్‌తో ఐదు ల్యాప్‌టాప్ మోడళ్లను, i3 చిప్సెట్తో నాలుగు మోడళ్లను రూపొందించనట్లు అంచనా. ఈ పేర్లలో యుఎల్‌కు ముందు 10వ సంఖ్య ఉన్నందున ఈ ల్యాప్‌టాప్‌లు విండోస్ 10తో నడవనున్నాయి. మోడల్ నంబర్లలో మొదటి రెండు అక్షరాలైన ఎన్ కేలు- నోకియా బ్రాండ్‌ను సూచిస్తున్నాయి. తరువాతి అక్షరాలైన ఐ5, ఐ3లు ప్రాసెసర్‌ను సూచిస్తున్నాయి. బిఐఎస్ వెబ్‌సైట్‌లోని లిస్టింగ్ ప్రకారం నోకియా ల్యాప్‌టాప్‌లను చైనా కంపెనీ అయిన టోంగ్‌ఫాంగ్ లిమిటెడ్ తయారు చేసింది. నోకియా ఈ ల్యాప్‌టాప్‌లను భారతదేశంలో విడుదల చేయడంపై అధికారిక ప్రకటన చేయలేదు. -
ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్ హబ్‌గా భారత్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్ పీసీల తయారీ కేంద్రంగా భారత్ మారడం ద్వారా ప్రపంచ మార్కెట్లో గణనీయమైన వాటాను పొందవచ్చు. విధానపర జోక్యంతో వీటి తయారీ పరిశ్రమ దేశంలో 2025 నాటికి రూ.7.5 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఇండియన్ సెల్యులార్, ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) బుధవారం వెల్లడించింది. ఈ సామర్థ్యం భారత పరిశ్రమకు ఉందని ధీమా వ్యక్తం చేసింది. ఇదే జరిగితే ప్రపంచ ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్స్ తయారీ పరిశ్రమలో భారత వాటా ప్రస్తుతమున్న 1 శాతం నుంచి 26 శాతానికి చేరుతుందని తెలిపింది. కొత్తగా 5 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని పేర్కొంది. అలాగే రూ.5.62 లక్షల కోట్ల మేర విదేశీ మారకం భారత్‌కు వస్తుంది. రూ.7,500 కోట్ల విలువైన పెట్టుబడులూ ఉంటాయని ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్ల తయారీ అవకాశంపై ఐసీఈఏ–ఈవై రూపొందించిన నివేదిక తెలిపింది. ఇదీ ఎలక్ట్రానిక్స్ మార్కెట్.. భారత్‌లో ఎల్రక్టానిక్స్ మార్కెట్ రూ.4.87 లక్షల కోట్లకు చేరుకుంది. ఇందులో అత్యధిక వాటా మొబైల్ ఫోన్లదేనని అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మొహింద్రూ తెలిపారు. ‘ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్ల విషయంలో ఇప్పటికీ దిగుమతులపై భారత్ ఆధారపడింది. అయిదేళ్లలో ల్యాప్టాప్స్ దిగుమతులు 42 శాతం ఎగసి రూ.31 వేల కోట్లు దాటింది. ఈ దిగుమతుల్లో చైనా వాటా ఏకంగా 87 శాతముంది. ఐటీ ఉత్పత్తుల్లో మొబైల్ ఫోన్ల తర్వాత ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్ వరుసలో ఉన్నాయి. 2019 జాతీయ ఎల్రక్టానిక్స్ విధానం ప్రకారం.. 2025 నాటికి దేశంలో ఎల్రక్టానిక్స్ తయారీ రూ.30 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇందులో మొబైల్ ఫోన్ల విభాగం నుంచి రూ.14.2 లక్షల కోట్లు సమకూరనుంది’ అని వివరించారు. వ్యయాలు తగ్గితే.. దేశంలో ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్ పీసీల మార్కెట్ చాలా చిన్నది. ఇక్కడ తయారైనవి అధికంగా యూఎస్, యూరప్ తదితర దేశాలకు ఎగుమతి కోసం ఉద్ధేశించినవి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఎల్రక్టానిక్స్ రంగానికి బూస్ట్‌నిస్తోంది. వ్యయాలు తగ్గితే ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్ తయారీ అధికమవుతుంది. మొబైల్స్ తయారీలో ఉన్న భారతీయ సంస్థలకు ట్యాబ్లెట్స్ ఉత్పత్తిలో అపార అవకాశాలు ఉన్నాయి. అధిక విద్యుత్ టారిఫ్, పన్నులు, వ్యాపారానికి అనువైన పరిస్థితుల విషయంలో తయారీ సంస్థలకు అడ్డంకులు ఉన్నాయి. దీంతో వియత్నాం, చైనాలతో పోలిస్తే 10–20 శాతం తక్కువ పోటీలో ఉన్నాం. దీర్ఘకాలంలో ఈ సమస్యలను భారత్ పరిష్కరించాలి. ఎగుమతుల వృద్ధికి ప్రోత్సాహకాలను అందించాలి అని నివేదిక వెల్లడించింది. -
ల్యాప్‌టాప్స్‌పై 40 శాతం వరకు డిస్కౌంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ల్యాప్టాప్స్ అమ్మకాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తొలి స్థానంలో ఉన్న ఐటీ మాల్.. దీపావళి నేపథ్యంలో హెచ్‌పీ, డెల్, లెనోవో, ఏసర్, ఆసస్, అవిటా బ్రాండ్ల ల్యాప్‌టాప్స్‌పై 40 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. అలాగే స్క్రాచ్ కార్డుపై రూ.2,500 నుంచి రూ.50,000 వరకు నగదు, ల్యాప్‌టాప్, మొబైల్స్ వంటి బహుమతులు గెలుచుకోవచ్చు. రూ.5,000 వరకు విలువైన యాక్సెసరీస్ కూడా ఉచితంగా అందుకోవచ్చని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. పరిశ్రమలో తొలిసారిగా 70–80% కొత్త మోడళ్లు కొలువుదీరాయని చెప్పారు. కంపెనీలు 10 శాతం వరకు ధరలను తగ్గించడం వినియోగదార్లకు ప్రయోజనం అన్నారు. జీరో డౌన్ పేమెంట్, జీరో వడ్డీ ఆఫర్ చేస్తున్నామని చెప్పారు. ధరల శ్రేణి రూ.20,000లతో మొదలుకుని రూ.7 లక్షల వరకు ఉంది. -
సోనూ సూద్‌కు మరో ఆఫర్
ముంబై: దేశంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో సోనూ సూద్ ప్రజల మనస్సులు గెలుచుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఏసర్ ఇండియా అనే ప్రముఖ ల్యాప్‌టాప్ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారని సంస్థ ప్రకటించింది. ఏసర్‌లో ఉన్న సాంకేతికతను వినియోగదారులకు వివరించడంలో సోనూ సూద్ కీలక పాత్ర పోషిస్తారని సంస్థ తెలిపింది. మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా డిజిటల్ సాంకేతికతతో ఏసర్ ఇండియా అకట్టుకుంటుందని సంస్థ పేర్కొంది. ఏసర్ ఇండియా ఎండీ హరీష్ కోహ్లి స్పందిస్తూ.. తమ సంస్థకు సోనూ సూద్ లాంటి మానవతావాది, రియల్ హీరో బ్రాండ్ ప్రమోషన్ చేయడం సంతోషకరమని అన్నారు. వినియోగదారులకు సరికొత్త సాంకేతికతను అందించడానికి ఏసర్ ఇండియా కృషి చేసినట్లు హరీష్ కోహ్లి పేర్కొన్నారు. మరోవైపు దేశంలో టెక్నాలజీని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లెందుకు సోనుసూద్ లాంటి టాలెంటడ్ నటుడు తమ సంస్థ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడం సంతోషకరమని ఏసర్ ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫిసర్ సుదీర్ గోయల్ పేర్కొన్నారు. కరోనా సమయంలో సోనూ సూద్ చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఏసర్ ఇండియా 1976లో స్థాపించబడింది. మెరుగైన సేవలతో ప్రపంచ వ్యాప్తంగా ఏసర్ ఇండియా దిగ్గజ కంపెనీల జాబితాలో చేరింది. ప్రస్తుతం160 దేశాలలో ఏసర్ తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. (చదవండి: ‘నన్ను విమర్శించే బదులు ఎవరికైన సాయం చేయండి’) -
ఉచితంగా ల్యాప్‌టాప్, ఫోన్లు ఇవ్వాలి
న్యూఢిల్లీ: పేద విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు నేర్చుకొనేందుకు ఎలక్ట్రానిక్ సాధనాలు, ఇంటర్నెట్ ప్యాకేజీ ఉచితంగా కల్పించాలని, అలా చేయకపోవడం వివక్షేనని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఎలక్ట్రానిక్ సాధనాలు, ఉపకరణాలు లేవనే పేరుతో ఒకే తరగతిలో విద్యార్థులను వేర్వేరుగా చూస్తే, అది పేద విద్యార్థుల్లో న్యూనతాభావాన్ని పెంచుతుందని, అది వారి హృదయాలను గాయపరుస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, అణగారిన వర్గాలు ఆన్లైన్ విద్యావకాశాలు పొందేలాగా చూడాల్సిన బాధ్యత పాఠశాల యాజమాన్యాల మీద ఉందని తెలిపింది. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు ఉచితంగా అందించాలని ఆదేశించింది. ‘జస్టిస్ ఫర్ ఆల్’ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ మన్మోహన్, జస్టిస్ సంజీవ్ నరూలాల ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని సమానత్వ హక్కుని నిరాకరించడమేనని, విద్యాహక్కు చట్టానికి కూడా వ్యతిరేకమైనదని కోర్టు స్పష్టం చేసింది. పేద విద్యార్థులకు ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అందించే ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ కమిటీ చర్యలు చేపట్టాలని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలను ఆదేశించింది. (చదవండి: మాస్క్ లేదని ఫైన్.. 10 లక్షల పరిహారం) -
మాయాజూదం 'ఆన్లైన్ రమ్మీ'!
లాక్డౌన్ రోజుల్లో కృష్ణా జిల్లా నూజివీడులో ఓ బ్యాంకు ఉద్యోగి రూ.కోటికి పైగా మోసానికి పాల్పడ్డాడు. అంత పెద్ద మొత్తం ఆయన ఏం చేశారని ఆరా తీసిన పోలీసులు విస్తుపోయారు. ఆయన ఏకంగా రెండు నెలల్లో రూ.కోటికిపైగా ఆన్లైన్ రమ్మీ ఆడి ఓడిపోయారు. విజయనగరంలో ఓ వ్యాపారి పెద్ద ఎత్తున రుణాలు చేసి పరారయ్యాడు. ఆయన షాపు, ఇళ్లు అమ్మినా సరే అప్పులు తీరలేదు. ఆ వ్యాపారి అప్పులన్నీ కూడా ఆన్లైన్ రమ్మీ ఆడటానికే అని తెలిసి ఆ కుటుంబం లబోదిబోమంది. ఆన్లైన్ రమ్మీ మాయాజాలం అంటే అదే మరి. ఇలా ఒకరు ఇద్దరు కాదు.. దేశంలో కోట్లాది మందిని ఆన్లైన్ రమ్మీ భూతం కమ్మేస్తోంది. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల చిన్ని తెరలపై ఆడే ఈ 13 ముక్కల పేకాట వ్యసనం ఎందరో బతుకులను పల్టీ కొట్టిస్తోంది. అటువైపు ఆడుతోంది ఎవరో తెలియని ఈ మాయాజూదంలో ఇటువైపు ఆటగాళ్ల బ్యాంకు ఖాతాలు ఖాళీ అయిపోతున్నాయి. సాక్షి, అమరావతి: స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్ ఓపెన్ చేయగానే ఆకర్షణీయమైన ప్రకటనలు కనిపిస్తాయి. ‘ఆన్లైన్ రమ్మీ ఆడండి... ఒక్క ఆటతో లక్షాధికారి కండి’ అన్న రీతిలో ప్రకటనలు ఇస్తున్నారు. ఓసారి ఆడి చూద్దాం.. అని పలువురు ఆకర్షితులవుతున్నారు. ముందే బ్యాంకు అకౌంట్, ఇతర వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ► మొదట కొన్ని ఆటలు గెలిచినట్టే ఉంటుంది. ఆ తర్వాత నుంచి వరుసగా ఓడిపోతుంటారు. అవతల ఎవరో వ్యక్తి ఇంత గెలిచారు.. అంత గెలిచారు.. అని స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటుంది. దాంతో తామెందుకు గెలవలేం అని భావిస్తూ ఉన్న డబ్బులతోపాటు అప్పటికప్పుడు అప్పులు చేసి మరీ ఆడి కుదేలవుతున్నారు. మళ్లీ చేరడంలోనే మాయాజాలం ప్రత్యక్షంగా ఆడే రమ్మీ ఆటలో ఒకరు అవుట్ అయిపోతే మళ్లీ పందెం కాసి ఆటలో కలవచ్చు. అలా ఎవరు కలుస్తారో ఆడేవాళ్లకు తెలుస్తుంది. కానీ ఆన్లైన్ రమ్మీలో అక్కడే మతలబు ఉంటోంది. ప్రతి ఆటలో ఒకరో ఇద్దరో త్వరగా అవుట్ అయిపోయి మళ్లీ కలుస్తారు. అక్కడ ఎవరు కలుస్తారో తెలీదు. చివరికి ఆలా కలిసిన వారే ఆట గెలుస్తుంటారు. ► కొన్ని సార్లు ఒకరే ఒకటి కంటే ఎక్కువ ఆటల్లో ఒకేసారి కలిసి ఆడుతున్న ఉదంతాలు కూడా ఉన్నాయని కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ► అసలు అటువైపు మనుషులే ఉండరని, కంప్యూటర్లే ఆడతాయని.. అంతా ఆన్లైన్లో మాయాజాలంతో బురిడీ కొటిస్తారని సైబర్ నిపుణులు చెబుతుండటం గమనార్హం. రాష్ట్రాల వారీగా నిషేధమే మార్గం ► ‘గేమ్ ఆఫ్ స్కిల్స్’ పేరిట ఆన్లైన్ రమ్మీకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దాంతో ముంబయి, బెంగళూరు తదతర కేంద్రాల నుంచి దేశమంతటా ఆన్లైన్ రమ్మీ నిర్వహణ సంస్థలు జోరుగా వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి. ► కావాలని ఆడి మోసపోతుండటంతో బాధితుల నుంచి అధికారికంగా ఫిర్యాదులు తక్కువగా ఉంటున్నాయి. సాంకేతికంగా సంక్లిష్టమైన వ్యవహారం కావడంతో మోసాలను పోలీసులు నిరూపించడం కష్టసాధ్యమవుతోందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. కానీ రాష్ట్రాలు తమ పరిధిలో ఆన్లైన్ రమ్మీని నిషేధించడానికి అవకాశం ఉంది. ► కొన్ని రాష్ట్రాలు ఆన్లైన్ రమ్మీని నిషేధించాయి. ఆన్లైన్ రమ్మీ నియంత్రణ విధివిధానాలను రూపొందించాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. ► సిక్కిం, నాగాలాండ్ రాష్ట్రాలు ఆన్లైన్ రమ్మీకి అధికారికంగా ఆనుమతి ఇచ్చాయి. మిగిలిన రాష్ట్రాలు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం ప్రకటించ లేదు. అంటే ఆ రాష్ట్రాల్లో అనుమతి ఉన్నట్టుగానే పరిగణిస్తున్నారు. నిషేధిస్తే కట్టడి ఇలా.. ► నిషేధించిన రాష్ట్రాల్లోని వారిని ఆన్లైన్ రమ్మీ సంస్థలు ఆడించకూడదు. ఆటగాళ్ల ఐపీ అడ్రస్ చూస్తే వారు ఏ రాష్ట్రానికి చెందిన వారో తెలుస్తుంది. నిషేధిత రాష్ట్రాల వారు ఉంటే వారిని ఆటకు ఆనుమతించకూడదు. ► నిషేధం లేకపోవడంతో తాము మోసపోయామని బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పెద్దగా ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మోసం చేశారని నిరూపించడం కష్టం. ► నిషేధం విధిస్తే ఆన్లైన్ సంస్థలు ఆ రాష్ట్రాల వారిని అసలు ఆడించనే కూడదు. ఆడించినట్టు తెలిస్తే కేసు నమోదు చేయవచ్చు. ఆన్లైన్ రమ్మీ నిర్వహణ సంస్థ ఏ రాష్ట్రంలో ఉన్నా సరే అక్కడికి వెళ్లి మరీ కేసు దర్యాప్తు చేసి దోషులను శిక్షించవచ్చు. ఏటా రూ.7,500 కోట్లు హుష్‌కాకీ ► ఆన్లైన్ గేమింగ్ ఫెడరేషన్ వివరాల ప్రకారం దేశంలో 20కి పైగా సంస్థలు ఆన్లైన్ రమ్మీ యాప్‌లు నిర్వహిస్తున్నాయి. 2020 జనవరి నాటికి దేశంలో దాదాపు 30 కోట్ల మంది ఆన్లైన్ రమ్మీ ఆడుతున్నారు. ఆన్లైన్ గేమింగ్ ఫెడరేషన్ లెక్కల ప్రకారం దేశంలో ఆన్లైన్ రమ్మీలో ఏటా రూ.7,500 కోట్లు చేతులు మారుతున్నాయి. రమ్మీ సంస్థలు అధికారికంగా దాదాపు రూ.2,500 కోట్లు తమ ఆదాయంగా చూపిస్తున్నాయి. ► మరి మిగిలిన రూ.5 వేల కోట్లు ఎటు వెళ్తున్నాయని సైబర్ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఆ మొత్తం ఆన్లైన్ రమ్మీలో గెలిచిన వారికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆన్లైన్ రమ్మీ ఆడుతున్న 30 కోట్ల మందిలో కనీసం ఒక శాతం మంది అధికారిక ఖాతాలు, ఆదాయ పన్ను వివరాల్లో అయినా ఆ మొత్తం కనిపించాలి కదా అన్నదే సైబర్ నిపుణుల సందేహం. ► తాము ఓడిపోయాం.. అవతల ఎవరో గెలిచారు అని ఆడిన వాళ్లు భావిస్తూ ఉంటారు. అవతల గెలిచిన వారు ఎవరూ ఉండరని, కొన్ని సంస్థలే కంప్యూటర్ల ద్వారానో.. తమ మనుషుల ద్వారానో ఆడిస్తూ మోసానికి పాల్పడుతూ ఆ రూ.5 వేల కోట్లు కొల్లగొడుతున్నాయన్నది సైబర్ నిపుణుల సందేహం. స్వీయ నియంత్రణ, పెద్దల పర్యవేక్షణే మార్గం ఆన్లైన్ రమ్మీ వ్యసనానికి బానిస కాకుండా ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించడమే ఉత్తమ పరిష్కార మార్గం. ఒకసారి ఆ ఆటకు అలవాటు పడితే బయట పడటం చాలా కష్టం. కాబట్టి ఒక్కసారి కూడా ఆడాలని ప్రయత్నించకూడదు. ఆన్లైన్ ఆటల సందర్భంగా తమ బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ నంబర్లు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పకూడదు. ఈ దిశగా పిల్లలకు అవగాహన కల్పించాలి. వ్యసనపరులకు కౌన్సెలింగ్ ఇప్పించాలి. – పీవీ సునీల్ కుమార్, సీఐడీ అదనపు డీజీ -
వినియోగంలో ల్యాప్‌టాప్
సాక్షి,హైదరాబాద్: కరోనా.. కల్చర్‌ను, వర్క్ కల్చర్‌నూ మార్చేసింది. సంప్రదాయ పనివిధానాలకు ప్రత్యా మ్నాయాలను ముందుకు తెచ్చింది. ప్రజారవాణా వ్యవస్థలు నిలిచిపోవడంతోపాటు ఇంటి నుంచి బయటకు లేదా ఆఫీసుకు వెళ్లలేని పరిస్థితి. ఎలాగోలా వెళ్లితే ఎక్కడ కరోనా బారిన పడతామోనన్న భయాలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం, రిమోట్ డెస్క్ వంటి పని పద్ధతులను వివిధ రంగాల సంస్థలు, ఉద్యోగులు ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ల్యాప్‌ట్యాప్‌లు, నోట్‌బుక్‌ల వినియోగం పెరిగింది. దీంతో వీటికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. కరోనాకు ముందు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ మార్కెట్లో నోట్బుక్లు, ల్యాప్‌ట్యాప్‌లకు డిమాండ్ నామమాత్రంగా ఉండేది. ఇప్పుడవి హాట్‌కేకుల్లా అమ్ముడుపోతుండటంతో కొన్ని కంపెనీలు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాయి. అయితే వాటి కూడా స్టాక్ అయిపోవడంతోపాటు దేశంలో ఎక్కడ స్టాక్ ఉందో వెతికి పట్టుకుని వినియోగదారులకు అందించేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఏకంగా కొత్త ప్లాంటు ప్రారంభం ఒక కంపెనీ మరో సంస్థ సహకారంతో తమిళనాడులో ఏకంగా ఒక కొత్త ప్లాంటునే ప్రారంభించింది. దీనిని బట్టి ల్యాప్‌ట్యాప్‌లకు డిమాండ్ ఏ మేరకు పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అమెజాన్ ఇండియా ఇటీవల నిర్వహించిన ప్రైమ్‌డే సేల్‌లోనూ ల్యాప్‌ట్యాప్ అమ్మకాలే టాప్‌లో నిలిచాయి. ఏప్రిల్–జూన్ మధ్యకాలంలో లాక్డౌన్ ఉన్నప్పటికీ దాదాపు 20 శాతం మేర షిప్మెంట్లలో వృద్ధి నమోదైనట్టు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(ఐడీసీ) గణాంకాలను బట్టి వెల్లడైంది. డెస్క్‌టాప్‌లు అమ్మకాలు తగ్గుముఖం నోట్‌బుక్‌ల అమ్మకాల్లో 105.5 శాతం వృద్ధి నమోదైంది. మరోవైపు ల్యాప్‌టాప్‌లు/నోట్‌బుక్‌ల వైపు వినియోగదారులు ఎక్కువగా మొగ్గు చూపడంతో డెస్క్‌టాప్‌ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి, దీంతో వీటి షిప్మెంట్ కూడా 46 శాతం తగ్గినట్టు ఐడీసీ సమాచారం బట్టి తెలుస్తోంది. ఐటీ సర్వీసెస్, గ్లోబర్ ఎంటర్ ప్రైజెస్, కన్సల్టింగ్ కంపెనీలు నోట్‌బుక్‌ల కోసం భారీ ఆర్డర్లు ఇవ్వడంతోపాటు డెస్క్‌టాప్‌ల కొనుగోళ్లను గణనీయంగా తగ్గించినట్టు వెల్లడైంది. 91% పెరిగిన ల్యాప్‌టాప్‌ల వినియోగం కోవిడ్ మహమ్మారి సందర్భంగా భారత్‌లో 91 శాతం మేర ల్యాప్‌టాప్‌లు ఉపయోగించేవారు పెరిగినట్టు లెనోవ్ సంస్థ ఇటీవల నిర్వహించిన ఓ పరిశీలనలో వెల్లడైంది. కస్టమర్లు తమ పాత ల్యాప్‌టాప్‌లను హై పెర్ఫార్మెన్స్ డివైజెస్‌గా అప్డేట్ చేసుకోవడంతోపాటు వ్యక్తిగత గోప్యత, డేటా భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్టుగా స్పష్టమైంది. దీంతో ఈ కేటగిరిలో ల్యాప్‌టాప్‌లు, నోట్‌బుక్‌ల మార్కెట్ వృద్ధి అవకాశాలు మరింత పెరిగాయి. -
పిల్లలు మొబైల్ వదలడం లేదు..!
సాక్షి, అమరావతి: కోవిడ్–19 వైరస్ నేపథ్యంలో తప్పనిసరైన ఆన్లైన్ తరగతులతో పిల్లలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు మరింతగా అతుక్కుపోతున్నారు. వీరు ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లతోనే గడిపే సమయం రెట్టింపుకావడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ప్రధాన నగరాలు, పట్టణాల్లోని 5 – 15 ఏళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులతో ‘ఓఎల్ఎక్స్ ఇండియా’ సంస్థ ఇటీవల సర్వే నిర్వహించింది. (ఆటలను మింగేసిన కరోనా..) ఆ సర్వేలోని ప్రధాన అంశాలు.. ► తమ పిల్లలు విపరీతంగా ల్యాప్‌టాప్, మొబైల్లకు అతుక్కుపోతున్నారని 84 శాతం మంది తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ► రోజుకు కనీసం 5 గంటలసేపు తమ పిల్లలు ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లతో ఉంటున్నారని 54 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు. ► పిల్లలకు అనవసరమైన, విద్యా సంబంధంకాని విషయాలు, అందుబాటులోకి వస్తున్నాయని 57 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు. తమకు తెలియకుండానే ఆ సమాచారానికి ఆకర్షితులైపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ► అయినప్పటికీ, 57 శాతం మంది తల్లిదండ్రులు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. తమ పిల్లలకు ఎలాంటి అనవసరమైన, ప్రమాదకరమైన విషయాలు అందుబాటులో ఉండకుండా చేసేందుకు ఉన్న ఆప్షన్లను వాడుకోవడం లేదు. ► టీనేజీ పిల్లల తల్లిదండ్రుల్లో 50 శాతం మంది తమ పిల్లల ఆన్లైన్ చదువులు, బ్రౌజింగ్ మీద ఎలాంటి నియంత్రణ చూపడం లేదు. ► ప్రమాదకరమైన సైట్లు అందుబాటులో లేకుండా జాగ్రత్తలు పాటించడం లేదు. 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల లోపు పిల్లలున్న తల్లిదండ్రుల్లో 50 శాతం మంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. (లాక్డౌన్ ఎఫెక్ట్: పీసీలకు పెరిగిన గిరాకీ) -
లాక్డౌన్ ఎఫెక్ట్: పీసీలకు పెరిగిన గిరాకీ
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా వివిధ దశల్లో లాక్డౌన్ ఆంక్షలు అమలయ్యాయి. దీంతో చాలామంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం విధానానికి మళ్లారు. అటు పలు కాలేజీలు, విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాసెస్ విధానాన్నిఎంచుకున్నాయి. ఈ కారణంగా ల్యాప్‌టాప్‌లు, టాబెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా మార్కెట్ లీటర్ లెనోవో ల్యాప్‌లాప్‌లు, నోట్‌బుక్‌లకు భారీగా విక్రయించింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలయిన ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కేవలం 45 రోజుల్లోనే దేశంలో 2.9 మిలియన్ పీసీలు అమ్ముడయ్యాయని పరిశోధనా సంస్థ కెనాలిస్ తెలిపింది. వీటిలో డెస్క్‌టాప్‌లు, నోట్బుక్లు, టాబ్లెట్లు వర్క్స్టేషన్లు ఉన్నాయని ప్రకటించింది. ఇది నమ్మశక్యం కాని విషమయని కెనాలిస్ రీసెర్చ్ అనలిస్ట్ వరుణ్ కన్నన్ చెప్పారు. ఈ త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన ల్యాప్‌టాప్‌ల ఎగుమతి 33 శాతం తగ్గిందన్నారు. 8,18,000 పీసీలను విక్రయించిన లెనోవో మార్కెట్ లీడర్‌గా నిలిచింది. టాబ్లెట్ విభాగంలో కూడా ఇదే దూకుడును ప్రదర్శించింది. త్రైమాసికంలో మొత్తం విక్రయాల్లో 29 శాతం వాటాను ఈసమయంలో సాధించింది. 629,000 యూనిట్లతో హెచ్‌పీ రెండవ స్థానంలో ఉంది. మూడో స్థానంలో డెల్ వుంది. డెస్క్‌టాప్‌ల కంటే నోట్‌బుక్‌లకు ప్రాధాన్యత లభించినట్టు కెనాలిస్ పేర్కొంది. గత ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోలిస్తే, లెనోవా మార్కెట్ వాటా 27.4 శాతం నుంచి 44.2 శాతానికి, హెచ్‌పి మార్కెట్ వాటా 17.3 శాతం నుంచి 23.2 శాతానికి పెరిగింది. డెల్ 10.0 శాతం నుంచి 12.7 శాతం వరకు పెరిగింది. ఎసెర్ మార్కెట్ వాటా 7.1 శాతం నుంచి 5.6 శాతానికి పడిపోగా, శాంసంగ్ తన మార్కెట్ వాటా రెట్టింపు చేసుకుంది. గత ఏడాది 2.4 శాతం నుంచి 5.8 శాతానికి పుంజుకుంది. లాక్డౌన్ ఆంక్షల కారణంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ లాంటి దిగ్గజ కంపెనీల ఉద్యోగులు ఇంటి నుండే పనిచేస్తున్నారు. కోవిడ్-19 సంక్షోభంతో పలుటెక్ సంస్థలతో పాటు, చాలా కార్పొరేట్ సంస్థలు వర్క్ ఫ్రం హోం విధానానికే ప్రాధాన్యత ఇవ్వవచ్చని, అలాగే రాబోయే త్రైమాసికాల్లో ఆన్లైన్ లెర్నింగ్‌కే ఎక్కువ మొగ్గుచూపే అవకాశ ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా బాగా క్షీణించిన పీసీ పరిశ్రమకు ఈ బూస్ట్ సరిపోదని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ : అదిరిపోయే డీల్స్
సాక్షి, ముంబై : ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ విక్రయాలను ప్రారంభించింది. నేటి (మంగళవారం) నుంచి ఈ నెల 27వ తేదీ వరకు స్పెషల్ సేల్ కొనసాగనుంది. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అనేక ఆఫర్లను అందిస్తోంది. ఈ ఐదు రోజుల అమ్మకాల్లో వివిధ ఉత్పత్తులపై 'అత్యల్ప ధరలను' అందిస్తున్నామని కంపెనీ ప్రకటించింది. శాంసంగ్, ఆపిల్ ఐ ఫోన్లతోపాటు స్మార్ట్ టీవీలను తగ్గింపు ధరలకు అందిస్తోంది. అలాగే క్రెడిట్ , డెబిట్ కార్డుదారులకు 10 శాతం తక్షణ తగ్గింపును అందించేందుకు ఫ్లిప్‌కార్ట్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో జతకట్టింది. దీంతోపాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయన్ని కూడా అందిస్తోంది. ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ఇంకా ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్, బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్, ట్యాబ్లెట్ పీసీలు, ఐప్యాడ్లు, ఫిట్నెస్ బ్యాండ్లు, స్మార్ట్‌వాచ్‌లు తదితర ఉత్పత్తులపై కస్టమర్లు రాయితీలు, ఆఫర్లను పొందవచ్చు. సోనీ బ్రావియా 65 అంగుళాల 4 కె స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ అమ్మకంలో 63 శాతం తగ్గింపుతో 97,999 రూపాయలకే లభ్యం (ఎంఆర్పి 2,64,900 రూపాయలు). హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ వినియోగదారులు 10 శాతం తక్షణ తగ్గింపు పొందవచ్చు. పాత టీవీ మార్పిడి ద్వారా మరో 7,000 రూపాయలు తగ్గింపు. ఐఫోన్ ఎక్స్ ఎస్ 64జీబీ ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఎస్ 64 జీబీ 58,999కే లభ్యం. అసలు ధర 62,999 రూపాయలు. పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్చుకుంటే అదనపు తక్షణ తగ్గింపుగా 13,950 రూపాయలు. వివో జెడ్ 1 ఎక్స్ వివో జెడ్ 1 ఎక్స్ (8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్) 16,990 రూపాయలు (ఎంఆర్పి 24,990 రూపాయలు) పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్పిడి చేసుకుంటే అదనపు డిస్కౌంట్‌గా 13,950 రూపాయలు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుదారులు 10 శాతం అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. గూగుల్ పిక్సెల్ 3 ఏ ధర : 29,999 రూపాయలు. (ఎంఆర్పి రూ .39,999) శాంసంగ్ గెలాక్సీ ఏ80 (8జీబీ+128జీబీ స్టోరేజ్) రూ.30వేల తగ్గింపు ధరతో 21,999 రూపాయలకు లభ్యం సాన్సుయ్ 55 అంగుళాల 4 కె క్యూఎల్ఇడి స్మార్ట్ టీవీ ధర 42,999 రూపాయలు. (ఎంఆర్పి 72,590 రూపాయలు). పాత టీవీని మార్పిడి చేసినప్పుడు 7,000 రూపాయలు డిస్కౌంట్ కానన్ ఇఓఎస్ 3000 డి డిఎస్ఎల్ఆర్ బిగ్ సేవింగ్ డేస్ అమ్మకంలో 18,999 రూపాయలు. (ఎంఆర్పి 29,495 రూపాయలు) -
ల్యాప్‌టాప్, స్మార్ట్ఫోన్లకు భలే గిరాకీ
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవంతో అన్ని దేశాలు లాక్డౌన్లు విధించాయి. కరోనా ఎక్కువగా చిన్నారులు, వృద్ధులకు వేగంగా వ్యాపిస్తుందని నిపుణుల సూచిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రస్తుత తరుణంలో చిన్నారులకు ట్యాబ్లెట్ ఫోన్, ల్యాప్‌టాప్‌ల ద్వారా విద్యకు సంబంధించిన అంశాలను నేర్పించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం రూ.10,000 నుంచి 15,000 ఖరీదు చేసే ట్యాబ్లెట్ ఫోన్లకు అధిక గిరాకీ ఉందని స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ దిగ్గజం లెనివో ఇండియా డైరెక్టర్ పంకజ్ హర్జై తెలిపారు. కాగా ట్యాబ్లెట్ ఫోన్లకు అధిక డిమాండ్ నెలకొనడంతో చిన్నారులకు అలరించే సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటామని హర్జై స్పష్టం చేశారు. ట్యాబ్లెట్ ఫోన్లకు అధిక డిమాండ్ ఉందని మహేష్ టెలికం సంస్థకు చెందిన వ్యాపారి మనీష్ ఖత్రి పేర్కొన్నారు. కాగా మార్కెట్లో నెలకొన్న పోటీ నేపథ్యంలో ల్యాప్‌టాప్ తయారీ సంస్థలు తక్కువ ఖర్చుతో అత్యధిక క్వాలిటీ గల ల్యాప్‌టాప్‌లను అందిస్తున్నాయి. ప్రస్తుతం ల్యాప్‌టాప్ తయారీ సంస్థలు రూ.20,000నుంచి రూ.30,000 ధరకు ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రముఖ రీసెర్చ్ డైరెక్టర్ నవకేందర్ సింగ్ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌కు ముందు తల్లిదండ్రులు విద్యార్థులకు స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు కొనివ్వడానికి మొగ్గు చూపేవారు కాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. (చదవండి: 'మీరిచ్చే ఆఫర్ ఆరేళ్ల పిల్లాడికి బాగుంటుంది') -
అద్భుతమైన ఎంఐ నోట్‌బుక్స్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ : చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమి నోట్‌బుక్ లను గురువారం భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఎంఐ నోట్ బుక్ 14 పేరుతో తీసుకొచ్చింది. అందరూ ఎదురు చూసినట్టుగానే హారిజన్ ఎడిషన్ ను కూడా లాంచ్ చేసింది. వీటి ప్రారంభ దరలు రూ.54999, రూ. 41999గా ఉంచింది. ఈ ప్రారంభ ధరలు జూలై 16 వరకు మాత్రమే చెల్లుతాయని కంపెనీ ప్రకటించింది. అయితే గుడ్ న్యూస్ ఏమింటంటే ఈ రెండింటిపైనా రూ. 2వేల తగ్గింపును అందిస్తోంది. హెచ్ డీఎఫ్ సీ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వినియోగదారులకు ఈ ఆఫర్ వర్తించనుంది. అలాగే 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. జూన్ 17 నుంచి అమెజాన్, షావోమి ఆన్ లైన్, ఆఫ్ లైన్ స్టోర్లలో కొనుగోలుకు లభ్యం. అద్భుతమైన డిజైన్, 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ,ఇంటెల్ కోర్ 10 వ జెన్ ప్రాసెసర్ల (కోర్ ఐ 7 , కోర్ ఐ 5)తో అయిదు వేరియింట్లతో ల్యాప్ టాప్ విభాగంలోకి షావోమి దూసుకొచ్చింది. ఎంఐ నోట్‌బుక్ ధరలు ఎంఐ నోట్‌బుక్ 14 (256 జీబీ): రూ .41,999 ఎంఐ నోట్‌బుక్ 14 (512 జీబీ): రూ .44,999 ఎంఐ నోట్‌బుక్ 14 (ఎన్ విడియా జిపియుతో 512 జీబీ) : రూ .47,999 ఎంఐనోట్‌బుక్ 14 హారిజన్ ఎడిషన్ (కోర్ ఐ 5): రూ 54,999 ఎంఐ నోట్‌బుక్ 14 హారిజన్ ఎడిషన్ (కోర్ ఐ 7): రూ .59,999 -
ఉప్పు.. పప్పు.. ల్యాప్‌టాప్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 పుణ్యమాని ప్రపంచవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోం ప్రాచుర్యం పెరుగుతోంది. లాక్డౌన్ లేకున్నా... నిబంధనలు సడలిస్తున్నా కూడా కంపెనీలు ఎక్కువ మంది ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయించడానికే ప్రాధాన్యమిస్తున్నాయి. దీంతో డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లు కూడా మెల్లగా నిత్యావసరాల జాబితాలోకి చేరిపోతున్నాయి. ఫలితంగా... నిబంధనలు సడలించిన వెంటనే ఈ షాపులకు కస్టమర్ల తాకిడి పెరిగింది. ఐటీ సహా పలు రంగాల్లోని ఉద్యోగులకు ఇళ్లలో కూడా డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ తప్పనిసరి అవుతున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. రానున్న రెండేళ్లూ డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌ల అమ్మకాలు బాగా పెరుగుతాయనేది వారి అంచనా. 15–40 శాతం దాకా డిస్కౌంట్లు నిజానికి లాక్‌డౌన్‌కు ముందు ఉత్పత్తులపై ఎలాంటి డిస్కౌంట్లూ లేవు. ఇపుడు మాత్రం పలు కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకోవటానికి గిఫ్ట్ కార్డులు, డిస్కౌంట్లు వంటివి ఇస్తున్నాయి. హెచ్‌పీ, డెల్, లెనోవో, ఏసర్, ఆసస్ వంటి కంపెనీలు వ్యక్తిగత కొనుగోలుదార్లకు 15 శాతం దాకా తగ్గింపు ఆఫర్ ఇస్తున్నాయి. అలాగే స్క్రాచ్‌కార్డ్‌తో మొబైల్, ట్యాబ్లెట్ వంటి బహుమతులను, రూ.50,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను, ఎంపిక చేసిన మోడళ్లపై రూ.8,000 విలువ చేసే యాక్సెసరీస్‌ను కొన్ని సంస్థలు అందిస్తున్నాయి. 25 పైన యూనిట్లు కొనుగోలు చేసే ఇన్స్టిట్యూషనల్ కస్టమర్లకయితే చాలా కంపెనీలు తమ డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లపై 40 శాతం దాకా... యాక్సెసరీస్‌పై 25 శాతం దాకా డిస్కౌంట్ ఇస్తున్నాయి. మారిన బ్యాంకుల వ్యూహం.. వ్యక్తిగత కొనుగోలుదార్ల కోసం గతంలో బ్యాంకులు, రుణ సంస్థలు స్పెషల్ స్కీములు ఆఫర్ చేసేవి. ఆరు నెలల్లో గనుక తిరిగి తీర్చేసేలా ఉంటే ఎలాంటి వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేసేవి కాదు. డౌన్ పేమెంట్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని, 6 శాతం వడ్డీ వసూలు చేస్తున్నామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి ఒకరు చెప్పారు. ప్రైవేటు బ్యాంకులైతే ప్రాసెసింగ్ ఫీజు రూ. 500తో పాటు డౌన్ పేమెంట్ 35% ఉండాలన్న నిబంధన విధిస్తున్నాయి. దీంతో పూర్తి నగదు చెల్లించి ఉపకరణాన్ని కొనేందుకే ఎక్కువ మంది కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు. అమ్మకాలు డబుల్... లాక్‌డౌన్‌కు ముందుతో పోలిస్తే నిబంధనలు సడలించాక అమ్మకాలు రెట్టింపయినట్లు దేశంలోని టాప్ సెల్లర్స్‌లో ఒకరైన ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ చెప్పారు. ‘‘ఇన్స్టిట్యూషనల్ సేల్స్ కూడా గణనీయంగా పెరిగాయి. విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాసులు మొదలుపెడితే డిమాండ్ అనూహ్యంగా ఉంటుంది. మొత్తం విక్రయాల్లో ల్యాప్‌టాప్‌లు 85%, డెస్క్‌టాప్‌లు 15% వరకు ఉంటున్నాయి. వీటిలో కూడా రూ.35–50 వేల శ్రేణి ల్యాప్‌టాప్‌లు, రూ.25–50 వేల శ్రేణి డెస్క్‌టాప్‌ల సేల్స్ ఎక్కువ’’ అని ఆయన చెప్పారు. తయారీ, సరఫరా సమస్యల కారణంగా ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌ల ధర కంపెనీని బట్టి 5–12% పెరిగినట్లు తెలియజేశారు. ఇక హార్డ్ డిస్క్, ర్యామ్, అడాప్టర్ల వంటి యాక్సెసరీస్ ధరలు రెట్టింపయ్యాయి. ‘‘అయినా కస్టమర్లు వెనుకాడడం లేదు. సర్వీస్ రిక్వెస్టులూ పెరిగాయి’’ అని చెప్పారు. -
పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు
న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో పేద విద్యార్థులు ఇంటి నుంచే ఆన్లైన్లో చదువు కొనసాగించేందుకు వీలుగా ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లను ఉచితంగా అందివ్వాలంటూ దాఖలైన పిల్‌పై ఢిల్లీ హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులిచ్చింది. లాక్డౌన్ సమయంలో పిల్లలకు ఆన్లైన్లోనే తరగతులు నిర్వహించాలంటూ ఢిల్లీలోని 10 ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూళ్లు తీసుకున్న నిర్ణయ ప్రభావం సుమారు 50వేల మంది నిరుపేద విద్యార్థులపై పడిందనీ, వీరికి ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు, హై స్పీడ్ ఇంటర్నెట్ సమకూర్చుకునే స్తోమత లేదని ‘జస్టిస్ ఫర్ ఆల్’అనే ఎన్జీవో పేర్కొంది. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం జూన్ 10వ తేదీలోగా స్పందించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులిచ్చింది. -
అమెజాన్ సేల్ : వాటిపై అదిరిపోయే ఆఫర్లు
సాక్షి,ముంబై: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో మరోసారి తగ్గింపుధరలు, ఆఫర్ల పండుగ మొదలైంది. గణతంత్ర దినోత్సవం (రిప్లబిక్ డే) అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్-2020 పేరుతో స్పెషల్ విక్రయాలను చేపట్టింది. జనవరి 22 వరకు కొనసాగే సేల్ ఈ రోజు (శనివారం) అర్థరాత్రి నుంచే ప్రైమ్ మెంబర్లకు అందుబాటులోకి తేనుంది. ప్రధానంగా వివిధ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లతోపాటు, పలురకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై తగ్గింపు ధరలను ప్రకటించింది. స్మార్ట్ఫోన్లపై 40శాతం దాకా, ల్యాప్‌ట్యాప్‌లు, కెమెరాలపై 60 శాతం తగ్గింపు లభించనుంది. దీంతో ల్యాప్‌టాప్‌లపై రూ.35వేల దాకా, కెమెరాలపై రూ. 10,000 వరకూ ప్రత్యేక తగ్గింపు లభించనుంది. దీంతోపాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ కూడా అదనం. వన్‌ప్లస్ 7టీ, వన్‌ఫ్లస్ 7టీ ప్రొ, రెడ్మినోట్ 8 ప్రొ, ఒప్పో ఎఫ్ 11 వివో యూ 20లపై ఈ తగ్గింపు ధరల్లో అందుబాటులో ఉంటాయి. ప్రధానంగా ఒప్పో ఎఫ్ 11 భారీగా పదివేల దాకా డిస్కౌంట్ ధరలో లభించనుంది. ప్రస్తుత సేల్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ. 13,990 కే కొనుగోలు చేయవచ్చు. -
ల్యాప్‌టాప్‌ల కొను‘గోల్మాల్’..!
సాక్షి, నూజివీడు: ఆర్జీయూ కేటీ పరిధిలోని ట్రిపుల్ ఐటీలలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే కాంట్రాక్ట్ అధ్యాపకుల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు వార్తలు రాగా.. ఇప్పుడు శ్రీకాకుళం, ఒంగోలు, ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలకు సంబంధించిన ల్యాప్‌టాప్ కొనుగోళ్లలో కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగినట్లు విజిలెన్స్ గుర్తించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన వైస్ చాన్స్‌లర్, వీసీ కార్యాలయంలో పనిచేసిన కొంతమంది కాంట్రాక్టు అధికారులు, అప్పటి ఆయా ట్రిపుల్‌ఐటీల డైరెక్టర్లు, ల్యాప్‌టాప్‌ల కొనుగోలు నిమిత్తం నియమించిన కమిటీ సభ్యులు ఈ తతంగంలో ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి ఒక కంపెనీకి అనుకూలంగా టెండర్ చేసి ఈ దోపిడీకి పాల్పడినట్లు సమాచారం. రూ. 8,500 అదనంగా.. శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీలకు ఒక్కోక్కటికీ 3,500, ఇడుపులపాయ ట్రిపుల్ఐటీకి 4వేలు.. మొత్తం 11,000 ఏఎండీ ప్రాసెసర్లు కల్గిన ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేశారు. వీటి ధర ఆన్లైన్లో రూ.20వేలు ఉండగా, ఆర్జీయూకేటీ అధికారులు మాత్రం రూ.28,500లకు కొన్నారు. సింగిల్ టెండర్ రాగా దానినే ఆమోదించారు. ఇంత ధర పెట్టి కొనుగోలు చేసినా.. ల్యాప్‌టాప్‌లు చాలా నాసిరకంగా ఉన్నాయని, ఏఎండీ ప్రాసెసర్ కావడంతో ఏమాత్రం పనిచేయడం లేదని విద్యార్థులు, ఫ్యాకల్టీ పేర్కొనడం గమనార్హం. నూతన ల్యాప్‌టాప్‌ల కంటే 2011, 2012 సంవత్సరాలలో కొనుగోలు చేసిన ల్యాప్‌టాప్‌లే బాగా పనిచేస్తున్నాయని విద్యార్థులు పేర్కొంటున్నారు. రిపీట్ ఆర్డర్‌పై ఆరా..! ముందుగా శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీలకు ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు టెండర్లు పిలిచి 7వేల ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయగా, ఆ తర్వాత ఒంగోలు ట్రిపుల్ఐటీకి మాత్రం 4వేల ల్యాప్‌టాప్‌లను రిపీట్ ఆర్డర్‌పై కొనుగోలు చేయడం గమనార్హం. అప్పట్లో నూజివీడుకు కూడా రిపీట్ ఆర్డర్‌తో కొనుగోలు చేయాలని అప్పటి వైస్‌చాన్స్‌లర్ డైరెక్టర్‌పై తీవ్ర ఒత్తిడి చేసినప్పటికీ అందుకు ఒప్పుకోలేదు. తాను చెప్పిన మాట వినలేదనే ఆ తర్వాత నూజివీడు డైరెక్టర్‌కు రెండోసారి రెన్యువల్ చేయకుండా పంపించేశారు. దీనిపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. టెండర్ ఫైనలైజ్ అయినా రద్దు.. దీనికి ముందు 2017లో ల్యాప్‌టాప్ టెండర్‌ను పిలువగా, ఒక కంపెనీ న్యూజనరేషన్ ప్రాసెసర్‌తో 6 ఏళ్ల గ్యారెంటీతో బై బ్యాక్ పద్ధతిలో రూ.30,400ల ధరకు కోట్ చేయడం జరిగింది. అంతే కాకుండా వీటిని మార్చేటప్పుడు రూ.5,200లతో తానే కొనుగోలు చేస్తానని కూడా ఆ కంపెనీ పేర్కొంది. దీనికి సంబంధించిన టెండర్ కూడా ఫైనలైజ్ అయిన తర్వాత అప్పటి వీసీ ఈ టెండర్‌ను రద్దు చేసి మరలా టెండర్ పిలిచారు.దీనిపైనా అధికారులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. బెంచ్‌మార్కు టెస్ట్‌లు లేకుండానే.. ఏ కంపెనీకి చెందినవైనా తప్పనిసరిగా వాటి పనితీరును పరిశీలించేందుకు బెంచ్‌మార్కు టెస్ట్‌లు నిర్వహించాల్సి ఉంటుంది. 11వేల ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసేముందు ఇక్కడ ఎలాంటి బెంచ్‌మార్కు టెస్ట్‌లు జరపకుండా నాసిరకం ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసి విద్యార్థులకు అంటగట్టేశారు. అయితే విజిలెన్స్ విచారణ కొనసాగుతుండటంతో మరిన్ని విషయాలు బహిర్గతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ల్యాప్‌టాప్స్‌పై భారీ క్యాష్‌బ్యాక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దసరా, దీపావళి పండుగల సీజన్లో ల్యాప్‌టాప్ తయారీ కంపెనీలు ఆఫర్లతో పోటీపడుతున్నాయి. కస్టమర్లు రూ.50,000 వరకు ఇన్స్టాంట్ క్యాష్‌బ్యాక్ దక్కించుకోవచ్చు. 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్ సైతం అందుకోవచ్చు. అష్యూర్డ్ గిఫ్ట్స, రివార్డులు, బోనస్ పాయింట్లు అదనం. వడ్డీ లేని వాయిదాల్లో ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయవచ్చు. నెలవారీ వాయిదా రూ.1,400లతో ప్రారంభం అవుతుంది. హెచ్‌పీ, డెల్, లెనోవో, ఏసర్, ఆసస్ కంపెనీలు కొత్త మోడళ్లతో రంగంలోకి దిగాయని ఖైరతాబాద్‌లోని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. సీజన్ కోసం కంపెనీలు ఇప్పటికే 25 దాకా కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాయని చెప్పారు. -
లెనొవొ ‘యోగా ఎస్940’
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ పర్సనల్ కంప్యూటర్ (పీసీ) తయారీ కంపెనీ ‘లెనొవొ’ తాజాగా పలు అధునాతన ఉత్పత్తులను ఆవిష్కరించింది. ఐడియాప్యాడ్ టాబ్లెట్లు, యోగా ఆల్ ఇన్ వన్ డెస్క్‌టాప్‌లు, అల్ట్రా–స్లిమ్ నోట్‌బుక్‌లను బుధవారం విడుదలచేసింది. ‘యోగా ఎస్940’ పేరిట కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత అల్ట్రా స్లిమ్ పీసీని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వీటి ధరల శ్రేణి రూ.23,990– 1,69,990 వరకు ఉన్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా లెనొవొ ఇండియా ఎండీ, సీఈఓ రాహుల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది పీసీ మార్కెట్లో 30–40% వృద్ధి ఉండొచ్చు. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు లిమిటెడ్ నుంచి ఈ త్రైమాసికంలో ఆర్డర్ లభిస్తుందని భావిస్తున్నాం’ అని చెప్పారు. -
ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ ల్యాప్‌టాప్
సాక్షి, న్యూఢిల్లీ : ఇప్పటివరకూ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు, టీవీలను చూశాం. తాజాగా మడతపెట్టే ల్యాప్‌టాప్‌లురానున్నాయి. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకున్న చైనా టెక్ కంపెనీ లెనోవో ప్రోటోటైప్ ఫోల్డబుల్ ల్యాపీని ఆవిష్కరించింది. ఇది ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ పీసీ అని లెనోవో ఒక ప్రకటనలో వెల్లడించింది. ల్యాప్‌టాప్ ఆకారంలో మడవటానికి వీలుగా వుంటుందీ డివైస్. ఫోల్డబుల్ స్క్రీన్‌తో ఫుల్ ప్లెడ్జ్డ్ ల్యాప్‌టాప్ అని కంపెనీ తెలిపింది. ‘థింక్ ఫ్యాడ్ ఎక్స్1’ అని పేరుతో దీన్ని లాంచ్ చేసింది. ఇక ఫీచర్స్ విషయానికొస్తే..13.3 అంగుళాల పరిమాణంలో తీర్చిదిద్దారు. 9.3 ఇంచీల స్క్రీన్, ఇంటెల్ ప్రాసెసర్, యూఎస్బీ పోర్ట్స్, ఇన్ఫ్రార్డ్ కెమెరా, స్టీరియో స్పీకర్స్, హై-రిజల్యూషన్ డిస్ ప్లే, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రధాఫీచర్లుగా ఉన్నాయి. 2020 నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నామని పేర్కొంది. ధర వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించిపోయినప్పటికీ, మూడు నుంచి 4వేల డాలర్ల మధ్య ఉంటుందని అంచనా. ఈ డివైస్‌కు సంబంధించిన దీంతో ల్యాప్‌టాప టెక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. -
షావోమి సరికొత్త ల్యాప్టాప్స్ లాంచ్
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి రెండుకొత్త ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసింది. ఎంఐ నోట్‌బుక్ ఎయిర్ ప్రొడక్ట్‌తో ల్యాప్‌టాప్ విభాగంలోకి కూడా ప్రవేశించిన షావోమీ తాజాగా ఈసిరీస్‌లో భాగంగా రెండు డివైస్‌లను చైనాలో విడుదల చేసింది. 13.3 అంగుళాలు , 15.6-అంగుళాల డిస్ప్లేలతో రెండు డివైస్‌లను ప్రారంభించింది. 8న జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్లను, గ్లాస్ టచ్‌ప్యాడ్, బ్యాక్లిట్ కీ బోర్డు ఈ కొత్త ల్యాప్‌టాప్‌ల్లో అమర్చింది. 1. ఎంఐ నోట్‌బుక్ ఎయిర్ 13.3 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1920x1080 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఇంటెల్ యూహెచ్డీ గ్రాఫిక్స్ 620 కార్డు 8జీబీ ర్యామ్,128జీబీ స్టోరేజ్ ఫ్రంట్ఫేసింగ్ కెమెరా 40వాట్స్బ్యాటరీ ధర రూ. 41,500 2. ఎంఐ నోట్‌బుక్ ఎయిర్ 15.6 అంగుళాల డిస్ప్లే 1080x1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 4జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ 1 టీబీ దాకా విస్తరించుకునే అవకాశం ధర : సుమారు రూ .35,500 భారతీయ మార్కెట్లో ఈ పరికరాలు ఎపుడు లాంచ్ అయ్యేది ఇంకా ప్రకటించలేదు. -
స్క్రీన్ టైమ్ తగ్గితే మార్కులు పెరుగుతాయి!
స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, టెలివిజన్ల ముందు పిల్లలు గడిపే సమయాన్ని రోజుకు రెండు గంటలకు పరిమితం చేయగలిగితే పిల్లల మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని అంటున్నారు అమెరికన్ శాస్త్రవేత్తలు. దీంతోపాటు తగినంత శారీరక వ్యాయామం, నిద్ర కూడా అవసరమేనని వీరు తేల్చారు. అమెరికాలోని దాదాపు ఐదు వేల మందిపై తాము పరిశోధన చేశామని డాక్టర్ జెరెమీ వాల్‡్ష తెలిపారు. అమెరికన్ పిల్లలు రోజుకు 3.6 గంటలపాటు టీవీ, స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ల ముందు గడుపుతున్నారని చెప్పారు. ఇలా కాకుండా స్క్రీన్ టైమ్‌ను రెండు గంటలకు పరిమితం చేయడం పిల్లలతోపాటు కౌమార వయసులో ఉన్న వారికీ అత్యవసరమని చెప్పారు. అమెరికాలో ప్రతి 20 మంది పిల్లల్లో ఒక్కరు మాత్రమే ఈ పద్ధతులు పాటిస్తున్నారని చెప్పారు. స్క్రీన్ టైమ్‌ను తగ్గించి నిద్రపోయే సమయాన్ని పెంచడం ద్వారా మెదడు బాగా పనిచేస్తున్నట్లు తెలిసిందని, శారీరక వ్యాయామం ప్రభావం నేరుగా మెదడుపై పెద్దగా లేదని వివరించారు. ఎనిమిది నుంచి 11ఏళ్ల మధ్య వయసు పిల్లలు రోజుకు కనీసం తొమ్మిది గంటలపాటు నిద్రపోవడం మేలని సూచించారు. నిద్ర, స్క్రీన్టైమ్ తగ్గడాల ఫలితం మార్కుల్లో కనిపిస్తూంటే.. వ్యాయామం ప్రభావం దష్టి కేంద్రీకరించే సామర్థ్యం, జ్ఞాపకశక్తి, రియాక్షన్ టైమ్లపై కనిపిస్తున్నట్లు అధ్యయనంలో తెలిసిందని చెప్పారు. -
పేటీఎం మాల్ సేల్ : ల్యాప్‌టాప్‌లపై ఆఫర్లు
సాక్షి, న్యూఢిల్లీ: పేటీఎం మాల్ మళ్లీ డిస్కౌంట్ ధరలకు తెరతీసింది. ఇటీవలి అన్లైన్ సేల్స్‌తో వినియోగదారులను ఆకట్టుకున్న సంస్థ దాజాగా 'ఫ్లాష్ సేల్ వీక్' ను తిరిగి ప్రారంభించింది. ఇందులో ల్యాప్‌టాప్‌లపై క్యాష్ బ్యాక్‌లు ఇతర ఆఫర్లను అందిస్తోంది. వారం రోజుల పాటుఈ సేల్ నిర్వహించనున ఈ సేల్‌లో దేశంలో టాప్ సెల్లింగ్ ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లను, ఈఎంఐ ఆఫర్లను అందిస్తోంది. సెప్టెంబర్ 24 -30 వరకు పేటీఎం మాల్ ప్రతి రోజూ సాయంత్రం 4-8 గంటలదాకా ఫ్లాష్ సేల్ వీక్ కొనసాగనుంది. ముఖ్యంగా హెచ్‌పీ, డెల్, యాసెర్, ఆసుస్, లెనోవో బ్రాండ్ల ల్యాప్‌టాప్‌లను ఈ సేల్‌లో విక్రయిస్తోంది. రూ. 5,000 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఇంటెల్ కోర్ ఐ5, 8జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ స్పేస్, 15.6 అంగుళాల డిస్ప్లే , టర్బో బూస్ట్ టెక్నాలజీతో రూపొందించిన ల్యాప్‌టాప్‌ను రూ. 39,490కే ఆఫర్ చేస్తోంది. దీ ని వాస్తవ ధర రూ. 45,889. అదే విధంగా, లెనోవా ఇడిప్యాడ్ 320 (ఇంటెల్ ఐ3 ప్రాసెసర్, 4జీబీర్యామ్, 1 టిబి హార్డ్ డిస్క్ డ్రైవ్) కొనుగోలుపై 27శాతం డిస్కౌంట్, 3,500 రూపాయల క్యాష్‌బ్యాక్‌తో రూ. 21,490లభిస్తుంది. దీని ధరను వాస్తవ ధర రూ. 34,490. వీటితోపాటు డెల్, యాసెర్, ఆసుస్ లాంటి ఇతర ప్రముఖ బ్రాండ్ల ల్యాప్‌లాప్‌లపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. -
ఐఫోన్ ఎక్స్‌పై భారీ ఆఫర్
ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్‌లు, మార్కెటింగ్ ఆఫర్లతో పేటీఎం మాల్ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దీనిలో భాగంగా ఈ సంస్థ ‘ఫ్రీడం క్యాష్‌బ్యాక్ సేల్’ను నిర్వహిస్తోంది. ఆగస్టు 8 నుంచి ప్రారంభమైన ఈ సేల్, ఆగస్టు 15 వరకు కొనసాగనుంది. ఈ ఫ్రీడం క్యాష్‌బ్యాక్ సేల్‌లో భాగంగా ఐఫోన్ అభిమానుల కోసం ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన ఐఫోన్ ఎక్స్(64జీబీ)ను కేవలం 67,298 రూపాయలకే విక్రయిస్తోంది. దీని అసలు ధర 92,798 రూపాయలుగా ఉంది. ఫ్రీడం క్యాష్‌బ్యాక్ సేల్‌లో ఐఫోన్ ఎక్స్‌పై ఫ్లాట్ 10వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది. దీంతో ఐఫోన్ ఎక్స్(64జీబీ) పేటీఎం మాల్లో రూ.82,798కి అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు తమ క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే అదనంగా మరో 1,250 రూపాయల క్యాష్‌బ్యాక్ ఇస్తోంది. పాత ఫోన్ల ఎక్స్చేంజ్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఐఫోన్ ఎక్స్ ధర మరో రూ.14,250 తగ్గుతోంది. దీంతో మొత్తంగా ఐఫోన్ ఎక్స్ 64జీబీ వేరియంట్ ధర 67,298 రూపాయలకు దిగొస్తోంది. మరోవైపు పేటీఎం మాల్ నిర్వహిస్తున్న సేల్‌లో ల్యాప్‌టాప్‌లపై ఏకంగా 20 వేల రూపాయల వరకు ధర తగ్గించింది. ఇంటెల్ కోర్ ఐ3, 4జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ స్పేస్, ఏడాది పాటు యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కలిగిన లెనోవో ఐడియాప్యాడ్ 320 ధర పేటీఎం మాల్లో రూ.22,490కు తగ్గింది. అదేవిధంగా ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ స్పేస్ కలిగిన డెల్ వోస్ట్రో 3578 ల్యాప్‌టాప్‌పై ఫ్లాట్ 6000 వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. ఎంఎస్ఐ జీఎల్63 8ఆర్ఈ-455ఐఎన్ గేమింగ్ ల్యాప్‌టాప్‌పై రూ.20వేల క్యాష్‌బ్యాక్‌ను పేటీఎం మాల్ తన కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది. 13 శాతం తగ్గింపు, 11000 రూపాయల క్యాష్‌బ్యాక్ ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎంక్యూడీ42హెచ్ఎన్/ ల్యాప్‌టాప్‌పై కస్టమర్లకు అందుతుంది. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రొ కోర్ ఐ5 ల్యాప్‌టాప్‌పై 10 వేల రూపాయల క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. -
పేటీఎం మాల్ ‘ఫ్రీడం క్యాష్‌బ్యాక్’ సేల్
ఈ-కామర్స్ కంపెనీలన్నీ వరుసబెట్టి స్వాతంత్య్ర దినోత్సవ సేల్స్‌ను ప్రకటిస్తున్నాయి. అమెజాన్ నేటి నుంచి తన ‘ఫ్రీడం సేల్’ను ప్రారంభించగా.. ఫ్లిప్‌కార్ట్ ‘ది బిగ్ ఫ్రీడం సేల్'ను రేపటి నుంచి నిర్వహించబోతుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌కు పోటీగా.. పేటీఎం మాల్ కూడా ‘ఫ్రీడం క్యాష్‌బ్యాక్’ సేల్‌ను ప్రకటించింది. పేటీఎం మాల్ సేల్ నిన్నటి(ఆగస్టు 8) నుంచే ఈ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ ఆగస్టు 15 వరకు కొనసాగనుంది. ఎవరైతే కొత్తగా ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారికి ఇది సరియైన సమయమని తెలుస్తోంది. పేటీఎం మాల్ ల్యాప్‌టాప్‌లపై ఏకంగా 20 వేల రూపాయల వరకు ధర తగ్గించింది. ఇంటెల్ కోర్ ఐ3, 4జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ స్పేస్, ఏడాది పాటు యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కలిగిన లెనోవో ఐడియాప్యాడ్ 320 ధర పేటీఎం మాల్లో రూ.22,490కు తగ్గింది. అదేవిధంగా ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ స్పేస్ కలిగిన డెల్ వోస్ట్రో 3578 ల్యాప్‌టాప్‌పై ఫ్లాట్ 6000 వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. ఎంఎస్ఐ జీఎల్63 8ఆర్ఈ-455ఐఎన్ గేమింగ్ ల్యాప్‌టాప్‌పై రూ.20వేల క్యాష్‌బ్యాక్‌ను పేటీఎం మాల్ తన కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది. 13 శాతం తగ్గింపు, 11000 రూపాయల క్యాష్‌బ్యాక్ ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎంక్యూడీ42హెచ్ఎన్/ ల్యాప్‌టాప్‌పై కస్టమర్లకు అందుతుంది. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రొ కోర్ ఐ5 ల్యాప్‌టాప్‌పై 10 వేల రూపాయల క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. అంతేకాక, ఆపిల్, హెచ్‌పీ, ఏసర్ వంటి పలు ప్రముఖ బ్రాండ్లపై కూడా డిస్కౌంట్లు ఉన్నాయి. పైన పేర్కొన్న ఆఫర్లు మాత్రమే కాక, మిడ్నైట్ సూపర్ డీల్స్‌ను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు పేటీఎం మాల్ ఆఫర్ చేస్తోంది. ప్రతి రెండు గంటలకు ఒకసారి కూడా ఫ్లాష్ సేల్స్, అద్భుతమైన డీల్స్‌తో అందుబాటులో ఉన్నాయి. ఎవరైతే ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా పేమెంట్లు జరుపుతారో, వారికి అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నట్టు పేటీఎం మాల్ తెలిపింది. -
లెనోవో కొత్త అల్ట్రా స్లిమ్ ల్యాప్‌టాప్‌లు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ కంప్యూటర్స్ ఉత్పత్తుల తయారీదారు లెనోవో రెండు కొత్త ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసింది. అల్ట్రా స్లిమ్ పోర్ట్‌ఫోలియో ఐడియా ప్యాడ్ డివైస్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. లెనోవో ఐడియా ప్యాడ్ 530ఎస్, ఐడియా ప్యాడ్ 330ఎస్ పేరిట ఈ ల్యాప్‌టాప్‌లను అందుబాటులో ఉంచింది. లెనోవో ఐడియా ప్యాడ్ 530 ఎస్ పీచర్లు:14 ఇంచుల డిస్ప్లే, 8వ జనరేషన్ కోర్ ఐ5/ఐ7 ప్రాసెసర్, ఎన్వీడియా ఎంఎక్స్ 150/ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్, 16 జీబీ వరకు ర్యామ్ సపోర్ట్, 512 జీబీ ఎస్ఎస్డీ, విండోస్ 10 ఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, 8 గంటల బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.67,990గా ఉంది. లెనోవో ఐడియాప్యాడ్ 330ఎస్ ఫీచర్లు: 15.6/14 ఇంచుల డిస్ప్లే, ఇంటెల్ 8వ జనరేషన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఎన్వీడియా జిఫోర్స్ జీటీఎక్స్1050/ఏఎండీ రేడియాన్ 535 గ్రాఫిక్స్, 16 జీబీ వరకు ర్యామ్ సపోర్ట్, 256 జీబీ ఎస్ఎస్డీ, 1 టీబీ హార్డ్ డిస్క్ డ్రైవ్, 7 గంటల బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.35,990 గా ఉంది. నిరంతరం నూతనమైన, డివైస్‌లను ఆవిష్కరించడంలో తన నిబద్దతను అల్ట్రా-స్లిమ్ పోర్ట్‌ఫోలియో మరోసారి నిరూపించిందని కస్టమర్ బిజినెస్ అండ్ ఇకామర్స్ లెనోవో ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ తాదానీ తెలిపారు. భారతీయ మార్కెట్ కోసం సరసమైన ధరల్లో, అల్ట్రా పోర్టబుల్ ల్యాప్‌టాప్‌లను తీసుకువస్తున్నామని, తద్వారా తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికి అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. -
అమెజాన్‌లో ఫోన్ లేదా ల్యాప్‌టాప్ కొంటున్నారా...
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో మొబైల్ ఫోన్ కానీ, ల్యాప్‌టాప్ కానీ లేదా ఇతర ఏదైనా ఖరీదైన వస్తువు కొంటున్నారా? అయితే ఇక నుంచి డెలివరీని ధృవీకరించడానికి ఆరు అంకెల ఓటీపీ అవసరమట. మరింత సురక్షితమైన షాపింగ్ అనుభవాన్ని అందించడం కోసం అత్యంత విలువైన ఆర్డర్లకు వన్ టైమ్ పాస్వర్డ్(ఎటీపీ)ని ఇవ్వడం ప్రారంభించింది అమెజాన్ ఇండియా. ఈ ఓటీపీని డెలివరీ ఏజెంట్లు డివైజ్‌లో నమోదుచేసి, డెలివరీని ధృవీకరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని కేటగిరీల్లో ఎక్కువ విలువున్న ఉత్పత్తుల కోసం ఈ కొత్త ఓటీపీ ఫీచర్‌ను అమెజాన్ ఇండియా తీసుకొచ్చింది. ఆర్డర్‌ను ధృవీకరించడానికి అమెజాన్ ఇండియానే ఆరు అంకెల ఓటీపీని మెసేజ్ రూపంలో అందిస్తోంది. ఈ ఓటీపీని డెలివరీ ఏజెంట్ల డివైజ్‌లో కస్టమర్లు నమోదు చేసి, తమ ప్రొడక్ట్‌ను తీసుకోవాలి. ఈ విషయాన్ని అమెజాన్ అధికార ప్రతినిధి గాడ్జెట్స్ 360కి ధృవీకరించారు. ‘కస్టమర్ సెంట్రిక్ కంపెనీ అయిన అమెజాన్, కస్టమర్లందరికీ సురక్షితంగా డెలివరీని అందజేసేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కొన్ని ఆర్డర్లకు ప్రస్తుతం ఓటీపీ ఆధారిత డెలివరీ మెకానిజం తీసుకొచ్చాం. కస్టమర్ రిజిస్ట్రర్ చేసిన మొబైల్ నెంబర్‌కు లేదా ఈమెయిల్ అడ్రస్‌కు ఈ ఓటీపీ పంపుతాం. దీన్ని డెలివరీని అంగీకరించినట్టు తెలుసుకునేందుకు వాడుతున్నాం’ అని అధికార ప్రతినిధి చెప్పారు. ఈ నెల మొదట్లోనే అమెజాన్ ఇండియా తన ఐదో వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా డిజిటల్ పేమెంట్ ద్వారా తమ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్‌లో వెయ్యి రూపాయలకు మించి కొనుగోలు చేసిన వారికి 250 రూపాయల క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. గత రెండేళ్ల కాలంలో భారత్‌లో ఎక్కువగా సందర్శించిన సైట్‌ల్లో అమెజాన్.ఇన్ను నిలిపినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని అమెజాన్ ఇండియా సైట్లో సీఈవో జెఫ్ బెజోస్ లేఖ పోస్టు చేశారు. -
గంటల తరబడి వాటి ముందే గడపటంతో...
ప్రపంచం అరచేతిలోకి వచ్చేసింది... మీతో మాకేం పని అంటూ.. పక్కన వారిని ఏ మాత్రం పట్టించుకోకుండా.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లలోనే మునిగి తేలుతున్నారు చాలామంది. కాలు కదపకుండా.. కూర్చున్న దగ్గర్నుంచే అన్ని పనులు చకాచకా చేసేసుకుంటున్నారు. ప్రజంటేషన్ దగ్గర్నుంచి బిల్లు చెల్లింపుల వరకు అన్నింటిన్నీ ఒకే ఒక్క క్లిక్‌తో పూర్తి చేసుకుంటున్నారు. బుడిబుడి అడుగులు వేసే చిన్నారులు సైతం స్మార్ట్ఫోన్లను వదలడం లేదు. స్మార్ట్ఫోన్లతో ఆడటం, గంటల తరబడి వీడియోలను, కార్టూన్లను చూడటం చేస్తున్నారు. ఇలా చేయడంతో పిల్లలు తాత్కాలిక ఉత్సాహాన్ని పొందుతున్నారేమో కానీ.. ఆరోగ్యానికి, ఇది ఏ మాత్రం మంచి కాదని అంటున్నారు నిపుణులు. ఒక్క పిల్లలకే కాకుండా.. మీపై కూడా ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుందట. స్క్రీన్ ముందే గంటల తరబడి గడపటం వల్ల మీరు మీ కుటుంబంతో గడిపే అమూల్యమైన క్షణాలను కోల్పోతారట. డిజిటల్ స్క్రీన్ ముందే గంటల తరబడి గడపటం వల్ల వచ్చే అనర్థాలు.... డిజిటల్ స్క్రీన్ ముందు కూర్చుని గంటల కొద్దీ పనిచేయడంతో కేవలం కళ్లు మాత్రమే కాక... మొత్తంగా ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం పడనుందట. అవేమిటో ఓ సారి చూద్దాం.. రేడియేషన్ పెరగడం : ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లను ఎక్కువగా వాడటంతో, వాటి నుంచి వచ్చే రేడియేషన్... క్యాన్సర్ బారిన పడే ప్రమాదాలను పెంచుతాయట. ఈ ప్రమాద బారిన పడకుండా ఉండేందుకు రోజుల్లో ఒక్క గంట లేదా రెండు గంటలు మాత్రమే డిజిటల్ స్క్రీన్కు పరిమితమవుతూ.. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సంరక్షించుకోవడం చాలా మంచిదంటున్నారు నిపుణులు. అలసట : సోషల్ మీడియాలో అప్డేట్లను చెక్ చేసుకుంటూ.. ఇంటర్నెట్ను బ్రౌజ్ చేయడం వల్ల కాస్త విశ్రాంతిని పొందవచ్చని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ పలు పరిశోధనలు, అధ్యయనాల ప్రకారం.. ఇంటర్నెట్(ముఖ్యంగా సోషల్ మీడియా), ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వాడకం మిమ్మల్ని తీవ్ర అలసటకు గురిచేస్తుందని తెలిసింది. అంతేకాక డిప్రెషన్లోకి వెళ్లేలా చేస్తుందట. చిన్నారులపై కూడా గాడ్జెట్ల వాడకం తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, వారి నిద్రకు భంగం కలిగించి, వారి ప్రవర్తనలో సమస్యలను తెచ్చి పెడుతుందని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. నిద్ర రుగ్మతలు : మనం ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే, ఆరోగ్యకరమైన నిద్రను అలవాటు చేసుకోవాలి. పెద్దలకు రోజూ తప్పనిసరిగా రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. కానీ స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లపై ఎక్కువగా సమయాన్ని వెచ్చించడం వల్ల, చాలామంది(ముఖ్యంగా టీనేజర్లు, యువత) మూడు నుంచి నాలుగు గంటలు నిద్రపోవడానికే చాలా కష్టపడుతున్నారు. దీంతో నిరంతరం నిద్ర లేమి ఏర్పడి, ఊబకాయం, హైపర్‌టెన్షన్, మధుమేహం, గుండెకు సంబంధించిన వ్యాధుల బారిన పడుతున్నారు. సంబంధాలు సన్నగిల్లడం : గత దశాబ్ధం లేదా రెండు దశాబ్దాల నుంచి అనూహ్యంగా బ్రేకప్‌లు, పెళ్లిళ్లు విఫలమవడం, విడాకుల సంఖ్య పెరగడం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కపుల్స్ ఒకరినొకరు అర్థం చేసుకోలేక చాలా సతమతమవుతున్నారు. ఈ సమస్యలకు ప్రధాన పరిష్కారం ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకోవడమే. కానీ ఇటీవల చాలా మంది తమ భాగస్వామికి కొంత సమయం కూడా కేటాయించకుండా.. గాడ్జెట్లలో మునిగి తేలుతున్నారు. దీంతో ముఖాముఖిగా సమస్యపై చర్చించుకోవడం, అర్థవంతమైన సంభాషణను కొనసాగించడం వంటి వాటిల్లో విఫలమవుతూ వస్తున్నారు. ఈ ప్రభావంతో సంబంధ బాంధవ్యాలు సన్నగిల్లుతున్నాయని తెలిసింది. దీనికి పరిష్కారంగా డిజిటల్ స్క్రీన్‌పై వెచ్చించే సమయాన్ని తగ్గించి, కుటుంబంతో సంతోషంగా గడపాలని సూచిస్తున్నారు నిపుణులు. దీంతో మీ భాగస్వామితో మీ బంధాన్ని కూడా మరింత బలోపేతం చేసుకోవచ్చట. మీ భంగిమల్లో తీవ్ర మార్పులు : రోజంతా స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌తో గడపటం తీవ్ర అనారోగ్యానికి కారణమవుతుందట. అంతేకాక శారీరక పనులు కూడా తగ్గిపోతాయట. దీంతో మెడ నొప్పి, భుజాలు లాగడం, వెన్నుపోటు వంటి సమస్యలు పెరిగి, సరిగ్గా నిల్చులేక, కూర్చోలేక సతమతమవుతారని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఇటీవల స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో మీ అవసరాలు పెరిగినప్పటికీ.. వాటితో మీరు పని చేయనప్పుడైనా స్క్రీన్లను ఆపివేసి కాస్త పక్కన పెట్టేస్తే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. ఆ సమయంలో మీ చిన్నారులతో మాట్లాడుతూ వారితో సరదాగా గడిపితే, మానసిక, శారీరక ఒత్తిడి నుంచి విముక్తి పొందవచ్చట. -
లెనోవో సూపర్ ల్యాప్టాప్స్ : ‘థిన్ అండ్ లైట్’
సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ ల్యాప్‌టాప్ తయారీ సంస్థ లెనోవో భారీగా ల్యాప్‌టాప్‌లను, టాబ్లెట్ల (2018) ను లాంచ్ చేసింది. ‘థిన్ అండ్ లైట్’ అంటూ ఎక్స్,ఎల్, టీ సిరీస్‌లలో ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లను భారతీయ వినియోగదారులకోసం వీటిని విడుదల చేసింది. వినియోగదారులకు కోసం థింక్ పోర్ట్‌ఫోలియోలో వివిధ మోడళ్లలో లేటెస్ట్ 8 వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్లతో సరికొత్త శ్రేణిలో వీటిని ప్రారంభించింది. వీటిల్లో థింక్‌పాడ్ ఎక్స్, టీ, ఎల్ సిరీస్‌లో పలు మోడల్స్‌ను లాంచ్ చేసింది. ఎక్స్ సిరీస్‌లో ఎక్స్ 1, ఎక్స్1 కార్బన్, ఎక్స్ 1 యోగా సహా ఇతర డివైస్‌లను లాంచ్ చేసింది. ఐ ట్రాకింగ్ విత్ ఐ ఆర్ కెమెరా, సెక్యూరిటీ తమ డివైస్ల ప్రత్యేకత అని కంపెనీ చెబుతోంది. ఇక ఆడియో, డిస్ప్లే విషయానికి వస్తే డాల్బీ విజన్ హెచ్డీఆర్, 500నిట్స్ ఫీచర్లను జోడించింది. డాల్బీ విజన్ హెచ్డీఆర్ సపోర్టుతో మొట్టమొదటి థింక్ ఎక్స్1 కార్బన్, ఎక్స్ 1 యోగా డివైస్‌లను లాంచ్ చేసినట్టు కంపెనీ చెప్పింది. అంతేకాదు ప్రపంచంలో అతి తేలికైన 14 ఇంచెస్ బిజినెస్ ల్యాప్‌టాప్‌గా చెబుతోంది. అల్ట్రా లైట్ కార్బన్ ఫైబర్ తో రూపొందించిన ఈ డివైస్‌లో 1920 x 1080 రిజల్యూషన్, 16జీబీ ర్యామ్, 8వ జనరేషన్ ఇంటెల్‌కోర్ ప్రాసెసర్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ముఖ్యంగా14 అంగుళాల శ్రేణిలో అతి తక్కువ బరువు వుండే ఎక్స్ 1 ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ .1,21,000 నుంచి రూ.1,26,000 వరకు ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ పెన్, గ్లోబల్ ఎల్టీవీ సామర్ధ్యంతో వస్తున్న ఇది ప్రపంచంలో ఏకైక కన్వర్టిబుల్ ల్యాప్‌టాప్‌గా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. థింక్ ప్యాడ్ ఎక్స్ సిరీసలో ఎక్స్ 280, ఎక్స్ 330 ధరలు రూ. 73,000 నుండి రూ .87,000 వరకు ఉండనున్నాయి. ఎల్ సిరీస్‌లో ఎల్ 580, ఎల్ 480, ఎల్ 380 ధరలు రూ .54,000 నుంచి రూ. 65,000 వరకు ఉన్నాయి. టీ సిరీస్‌లో, టీ 580 (74వేల రూపాయలు), టీ480ఎస్ (86వేల రూపాయలు), టీ 480 (69వేలు రూపాయలు) లను అందుబాటులో తెచ్చింది. -
మరో సంచలనానికి జియో రెడీ
న్యూఢిల్లీ : సంచలనాలకు మారుపేరుగా రిలయన్స్ జియో మార్కెట్లో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. టెలికాం సర్వీసులు, స్మార్ట్ఫోన్లు, 4జీ ఫీచర్ ఫోన్ వంటి వాటితో ఇప్పటికే మార్కెట్లో తిరుగులేకుండా ఉన్న జియో.. ల్యాప్‌టాప్‌లతో మరో సంచలనానికి తెరతీయబోతోందని తెలుస్తోంది. తన ఆర్పూ(యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్)ను పెంచుకోవడం కోసం సిమ్ కార్డుతో ల్యాప్‌టాప్‌ను ప్రవేశపెట్టాలని చూస్తోంది. దీనిపై ఇప్పటికే అమెరికా చిప్ దిగ్గజం క్వాల్‌కామ్‌తో ముఖేష్ అంబానీకి చెందిన ఈ కంపెనీ చర్చలు కూడా జరిపిందని తెలిసింది. బిల్ట్-ఇన్ సెల్యులార్ కనెక్షన్స్తో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే ల్యాప్‌టాప్‌లను ఇది మార్కెట్లోకి ప్రవేశపెడుతుందని రిపోర్టులు పేర్కొన్నాయి. క్వాల్కామ్ ఇప్పటికే 4జీ ఫీచర్ ఫోన్ కోసం జియోతో కలిసి పనిచేస్తోంది. ‘జియోతో మేము మాట్లాడాం. డేటా, కంటెంట్‌తో కూడిన ఒక డివైజ్‌ను వారు తేవాలనుకుంటున్నారు’ అని క్వాల్కామ్ టెక్నాలజీస్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ సీనియర్ డైరెక్టర్ మిగ్యుల్ న్యున్స్ చెప్పారు. ఈ చీప్‌మేకర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) బ్రాండ్ స్మార్ట్రాన్‌తో కూడా పనిచేస్తోంది. సెల్యులార్ కనెక్టివిటీతో స్నాప్‌డ్రాగన్ 835 అందించే ల్యాప్‌టాప్‌లను ఇది ప్రవేశపెట్టబోతోంది. ఈ చర్చలను స్మార్ట్రాన్ కూడా ధృవీకరించింది. గ్లోబల్‌గా హెచ్‌పీ, ఆసుస్, లెనోవో వంటి కంపెనీలతో కూడా క్వాల్కామ్ పనిచేస్తోంది. అయితే ఈ విషయంపై స్పందించడానికి రిలయన్స్ జియో నిరాకరించింది. ఆపరేటర్లు తమ ఆర్పూను పెంచుకోవడానికి తర్వాత డివైజ్‌లు, సెల్యులార్ కనెక్టెడ్ ల్యాప్‌టాప్‌లేనని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డివైజస్, ఎకోసిస్టమ్స్ రీసెర్చ్ డైరెక్టర్ నైల్ షా అన్నారు. కౌంటర్‌పాయింట్ డేటా ప్రకారం ప్రతేడాది భారత్‌లో 50 లక్షల ల్యాప్‌టాప్‌లు అమ్ముడుపోతున్నాయని తెలిసింది. వీటిని సెల్యులార్ నెట్‌వర్క్‌లకు కనెక్ట్ చేస్తే, వీటి విలువ పెరిగి, ఈ రంగంలో వృద్ధిని నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. వైఫై హాట్స్పాట్లతో పోలిస్తే, సెల్యులార్ కనెక్టివిటీ ఎక్కువ భద్రంగా ఉంటుందని తెలిపారు. -
కంప్యూటర్‌తో పరీక్షలు
న్యూఢిల్లీ: 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల్లో దివ్యాంగ విద్యార్థులు (ప్రత్యేక అవసరాలున్నవారు) కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు వాడుకోవడానికి సీబీఎస్ఈ అనుమతించింది. ఈ ఏడాది నుంచే ఈ వెసులుబాటు అమల్లోకి రానున్నట్లు ఒక అధికారిక ప్రకటన వెలువడింది.పరీక్షా కేంద్రంలో సదరు విద్యార్థి కంప్యూటర్ వినియోగించుకోవచ్చని సిఫార్సు చేస్తూ అర్హుడైన వైద్యుడు సర్టిఫికేట్ జారీచేయాల్సి ఉంటుంది. అలా సిఫార్సు చేయడానికి తగిన కారణాలను అందులో పేర్కొనాలి. విద్యార్థి ఈ సర్టిఫికేట్‌ను పరీక్షా సమయంలో సమర్పించాలి. సమాధానాలు టైప్ చేయడానికి, ప్రశ్నలను వినడానికి, వాటిని పెద్ద అక్షరాల్లో చూడటానికి మాత్రమే కంప్యూటర్ వినియోగాన్ని పరిమితం చేయాలని సీబీఎస్ఈ పేర్కొంది. విద్యార్థి ఫార్మాట్ చేసిన కంప్యూటర్/ల్యాప్‌టాప్‌ను తానే సొంతం గా వెంట తెచ్చుకోవాలని వెల్లడించింది. కంప్యూటర్ టీచర్ ఆ కంప్యూటర్ను పరీక్షించిన తరువాతే పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్ దాన్ని అనుమతించాలని తెలిపింది. ఆ కంప్యూటర్‌కు ఇంటర్నెట్ ఉండొద్దని షరతు విధించింది. పరీక్ష రాసే సహాయకుడి బదులు ప్రశ్నా పత్రం చదివి వినిపించే రీడర్ కావాలన్నా తీసుకునే ప్రతిపాదనకూ సీబీఎస్ఈ అంగీకరించింది. -
'ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే ఆఫర్స్' : 80 శాతం డిస్కౌంట్స్
దేశీయ అతిపెద్ద ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే ఆఫర్ల వెల్లువ ప్రారంభించబోతుంది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా 'ది ఫ్లిప్‌హార్ట్ డే' సేల్ నిర్వహించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. సర్ప్రైజ్లతో రోజంతా అలరించనున్నట్టు పేర్కొంది. ఈ సేల్‌లో భాగంగా హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై 14 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్‌ను అందించనుంది. యూజర్లు ఎవరైతే 'ది ఫ్లిప్‌హార్ట్ డే' ఆఫర్లో సైన్-అప్ అవుతారో వారికి వస్త్రాలు, బ్యూటీ, యాక్ససరీస్, హోమ్ డెకర్లపై 14 శాతం అదనపు డిస్కౌంట్‌ను అందించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఒకవేళ ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, పవర్ బ్యాంకులు, టాబ్లెట్లు, ఇతర యాక్ససరీస్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి, 80 శాతం డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. అయితే డిస్కౌంట్లు ఆఫర్ చేసే ఉత్పత్తుల పేర్లను మాత్రం కంపెనీ రివీల్ చేయలేదు. మొబైల్ ఫోన్లపై కూడా 'గ్రేట్ డీల్స్' ఉంటాయని పేర్కొంది. ఈ కేటగిరీ ఉత్పత్తుల పేర్లను కూడా వెల్లడించలేదు. బ్యూటీ, టాయ్స్, స్పోర్ట్స్, బుక్స్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్లనుపొందవచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. టీవీ, హోమ్ అప్లియెన్స్‌పై 70 శాతం వరకు, ఫర్నీచర్, డెకర్, ఫర్నీషింగ్ వాటిపై 40 శాతం నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేయనున్నట్టు కంపెనీ పేర్కొంది. కనీసం 40 శాతం, 50 శాతం, 60 శాతం డిస్కౌంట్లతో 'ఫెంటాస్టిక్ డీల్స్' ను అందుబాటులో ఉంచుతామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. -
భారీ మొత్తంలో లెనోవో ల్యాప్‌టాప్‌లు రీకాల్
న్యూఢిల్లీ : పేలుళ్ల ఘటనలతో ఇన్నిరోజులు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటే.. తాజాగా ల్యాప్‌టాప్‌లు కూడా ఈ ఘటనల బారిన పడుతున్నాయి. పేలుళ్ల కారణాలతో చైనీస్ తయారీదారి లెనోవో భారీ మొత్తంలో ల్యాప్‌టాప్‌లను రీకాల్ చేసింది. థింక్‌ప్యాడ్ ల్యాప్‌టాప్‌లను రీకాల్ చేసినట్టు లెనోవో ప్రకటించింది. 78వేల యూనిట్ల థింక్‌ప్యాడ్ ఎక్స్1 కార్బన్ ఐదో జనరేషన్ ల్యాప్‌టాప్‌లను కంపెనీ రీకాల్ చేసినట్టు అమెరికాలోని కన్జ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ కూడా వెల్లడించింది. ఓవర్‌హీట్‌తో బ్యాటరీలు పాడైపోతున్నాయని తెలిపింది. దీంతో పేలుళ్ల ఘటనలు సంభవిస్తున్నాయని, వెంటనే ఈ బ్యాటరీలను రీఫైర్ చేయాల్సి ఉందని చెప్పింది. మొత్తం 78వేల యూనిట్ల రీకాల్‌లో 55,500 యూనిట్ల రీకాల్ కెనడాలోనే జరిగింది. లెనోవో థింక్‌ప్యాడ్ ఎక్స్1 కార్బన్ ల్యాప్‌టాప్ ఐదవ జనరేషన్‌కు చెందింది. ఇది సిల్వర్, బ్లాక్ రంగుల్లో మార్కెట్లోకి వచ్చింది. రీకాల్ చేసిన ఈ 78వేల యూనిట్ల ల్యాప్‌టాప్‌లు 2016 డిసెంబర్ నుంచి 2017 డిసెంబర్ మధ్యలో తయారుచేశారు. థింక్‌ప్యాడ్ ఎక్స్1 కార్బన్ 5వ తరం యూజర్లు వెంటనే https://support.lenovo.com/X1C_5GEN_RECALL లింక్‌ను క్లిక్ చేసి, తమ ల్యాప్‌టాప్‌లు రీకాల్ జాబితాలో ఉన్నాయో లేదో తెలుసుకోవాలని కంపెనీ సూచించింది. ఒకవేళ ఈ జాబితాలో యూజర్ల ల్యాప్‌టాప్ ఉంటే, వెంటనే దాన్ని వాడటం ఆపివేయాలని హెచ్చరించింది. ఇటీవలే ముంబైలో వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ లో ఉండగా పేలింది. ఈ పేలుడు ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఆ కంపెనీ అధికారికంగా స్పందించలేదు. -
ప్రీమియం ప్రయాణికులకు ల్యాప్‌టాప్‌లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ రూట్లలో బిజినెస్ తరగతి ప్రయాణికులను ఆకర్షించేందుకు ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రీమియం ప్రయాణికులకు ల్యాప్‌టాప్‌లు కూడా అందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సంస్థ సీఎండీ ప్రదీప్ సింగ్ ఖరోలా తెలియజేశారు. దీనివల్ల బిజినెస్ తరగతిలో ప్రయాణికుల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉందన్నారు. సాధారణంగా ఈ తరగతిలో సగానికి సగం సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ‘దూర ప్రాంతాలకు వెళ్లే ఫ్లయిట్స్‌లో బిజినెస్ తరగతి సీట్లు.. కంపెనీకి మంచి ఆదాయం తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇందులో సుమారు యాభై శాతం సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. మెరుగైన సేవలు అందించడం ద్వారా దీన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ ఆన్–ఫ్లయిట్ ఎంటర్టైన్మెంట్ అంశం సరిగ్గా లేని పక్షంలో... దానికి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాం. ఇందులో భాగంగా బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు ల్యాప్‌టాప్‌లు అందించే అవకాశాలు కూడా ఉన్నాయి‘ అని ఖరోలా తెలిపారు. అయితే, ఇన్–బిల్ట్ వీడియో స్క్రీన్లు పనిచేయనప్పుడు మాత్రమే ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలా? లేక ప్రీమియం ప్రయాణికులందరికీ అదనపు సౌకర్యం కింద వీటిని అందించాలా? అన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారాయన. ఫిబ్రవరిలో మూడు కొత్త విమానాలు.. అమెరికాలోని లాస్ ఏంజెలిస్కి నేరుగా ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభించడంపై ప్రయత్నాలు జరుగుతున్నాయని, అమెరికాతో పాటు ఆస్ట్రేలియాలోని దూరప్రాంతాలకు మరిన్ని సర్వీసులు నడిపే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. అటు ఫిబ్రవరి నాటికి మూడు కొత్త బోయింగ్ 777 విమానాలు అందుకుంటామన్నారు. -
ఎస్సీఎస్టీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు
సాక్షి, బెంగళూరు: పీయూసీ, ఆ తర్వాత ఉన్నత విద్యను అభ్యసించే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 31వేల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందజేసే కార్యక్రమాన్ని సీఎం సిద్ధరామయ్య బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. కాగా, ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీలకు పరిమితమైన ఈ పథకాన్ని వెనకబడినవర్గాలకు చెందిన వారితో పాటు ఇతర అన్ని వర్గాల్లోని పేద ప్రతిభావంత విద్యార్థులకు త్వరలోనే విస్తరించనున్నట్లు సీఎం సిద్ధరామయ్య ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 1.5లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని చెప్పారు. విధానసౌధలోని బాంక్వెట్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బెంగళూరు, బెంగళూరు గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సీఎం సిద్ధరామయ్య ల్యాప్‌టాప్‌లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సంపన్నులు తమ పిల్లలకు ల్యాప్‌టాప్‌లను కొని ఇవ్వగలరు. అయితే నిరుపేదలు ల్యాప్‌టాప్‌లను పిల్లలకు కొనివ్వాలంటే అది వారికి శక్తికి మించిన పని. ఈ నేపథ్యంలోనే నిరుపేద కుటుంబాల్లోని ప్రతిభావంత విద్యార్థులకు సైతం ఉత్తమ శిక్షణ లభించే దిశగా ల్యాప్‌టాప్‌లను ఉచితంగా అందజేసే కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు. -
నేటి అర్థరాత్రి నుంచే ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్
సాక్షి, న్యూఢిల్లీ : ఫ్లిప్‌కార్ట్ నాలుగు రోజులు పండుగ నేటి అర్థరాత్రి నుంచే ప్రారంభం కాబోతుంది. భారీ డిస్కౌంట్లతో 'బిగ్ బిలియన్ డేస్' సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ నిర్వహించబోతుంది. నేటి అర్థరాత్రి నుంచి సెప్టెంబర్ 24 వరకు ఇది జరుగుతుంది. అన్ని కేటగిరీలపై 90 శాతం వరకు డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. భారీ ఎత్తున్న డిస్కౌంట్లతో పాటు, ఫ్యాషన్, దుస్తులు, షూలు, గాడ్జెట్లు, హోమ్ అప్లియెన్స్‌పై ఎక్స్‌క్లూజివ్ డీల్స్‌ను అందిస్తోంది. తొలిసారి ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్ల కోసం డెబిట్ కార్డుపై ఈఎంఐ ఆప్షన్లను ఎంపికచేసుకునే స్పెషల్ స్కీమ్‌ను ప్రవేశపెడుతోంది. ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్స్ అదనంగా 10 శాతం ఇన్స్టాంట్ సేవింగ్స్‌ను పొందనున్నారు. ఫోన్లపై ఆఫర్లు... బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 7ను కేవలం రూ.29,990కే అందించబోతుంది. దీని మార్కెట్ ధర 46వేల రూపాయలు. కొత్తగా లాంచ్ అయిన హానర్ 6 ఎక్స్, హానర్ 8 ప్రొలపై ఈ నాలుగు రోజులు స్పెషల్ డీల్స్‌ను అందుబాటులో ఉంచుతుంది. వస్త్రాలు... మహిళలు, పురుషుల వస్త్రాలపై కంపెనీ 50 శాతం నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషిన్లు వంటి వాటిపై 70 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. అంతేకాక గేమింగ్ ల్యాప్‌టాప్‌లను సగం ధరకే అందించనున్నట్టు తెలిపింది. ఇవి మాత్రమే కాక, బిగ్ బిలియన్ సేల్‌లో ఉత్పత్తులు, బ్రాండులపై నో కాస్ట్ ఈఎంఐ, ప్రొడక్ట్ ఎక్స్చేంజ్, బై బ్యాక్ గ్యారెంటీ, బై నౌ పే లేటర్ వంటి ఫైనాన్సింగ్ ప్రొగ్రామ్‌లను ప్రవేశపెడుతోంది. -
అక్కడ ల్యాప్‌టాప్‌లు కేజీల్లో అమ్ముతారు..!
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా పండుగ సమయాల్లో షాపింగ్‌మాల్స్ భారీ ఆఫర్లు ప్రకటిస్తాయి. ఆషాఢం సేల్, శ్రావణ మాసం సేల్ పేరుతో కేజీల చొప్పున దుస్తులు అమ్మడం చూస్తుంటాం. అలా కేజీల్లో ల్యాప్‌టాప్‌లు అమ్మితే ఎలా ఉంటుంది. మనకు కావాల్సిన ల్యాప్‌టాప్‌ను అతి తక్కువ ధరలో మన సొంతం చేసుకోవచ్చు అనుకుంటాం కదా. అయినా ల్యాప్‌టాప్‌లు ఎక్కడైనా కేజీల్లో అమ్ముతారా అని సందేహమే అవసరం లేదు. ఢిల్లీలో ఉన్న నెహ్రూ ప్లేస్ ల్యాప్‌టాప్ మార్కెట్లో అతి తక్కువ ధరకే లాప్‌టాప్‌లు కిలోల చొప్పున అమ్ముతారు. ఇది భారతదేశంలోనే కాక ఆసియాలో అతిపెద్ద, చౌకైన ల్యాప్‌టాప్ మార్కెట్. ఇక్కడ కిలో రూ.5-7 వేలకే ల్యాప్‌టాప్ కొనుక్కోవచ్చు. ఈ నెహ్రూ ప్లేస్‌లో దుకాణాలు వందల్లో ఉన్నాయి, ఈ మార్కెట్లో కేవలం ల్యాప్‌టాప్‌లు మాత్రమే కాదు, స్మార్ట్ఫోన్లు, ఇతర కంప్యూటర్, మొబైల్ యాక్ససరీస్ కూడా తక్కువ ధరలలో లభిస్తాయి. అయితే వాటిని కొనుగోలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు పరీక్షించి తీసుకోవాలి. లేకపోతే వినియోగదారుడి చెవిలో పూలు పెట్టడం ఖాయం. -
పేటీఎం ఇండిపెండెన్స్ డే సేల్: భారీ క్యాష్‌బ్యాక్‌లు
ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు తమ బంపర్ డిస్కౌంట్ సేల్స్‌ను ప్రకటించిన అనంతరం.. మీకంటే మీమేమనా తక్కువా అని పేటీఎం మాల్ కూడా భారీ డీల్స్‌ను ప్రకటించింది. ఇండిపెండెన్స్ డేకి ముందస్తుగా పేటీఎం మాల్ తన యాప్, వెబ్సైట్లో స్మార్ట్ఫోన్లు, గ్యాడ్జెట్లపై భారీ డిస్కౌంట్లకు తెరతీసింది. మంగళవారం నుంచి అంటే ఆగస్టు 8 నుంచి ఆగస్టు 15 వరకు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, అప్లియెన్స్, అప్పీరల్స్, యాక్ససరీస్ వంటి అన్ని ఉత్పత్తులపైనా క్యాష్‌బ్యాక్ ఆఫర్లను, డిస్కౌంట్లను అందించనున్నట్టు ఈ మాల్ వెల్లడించింది. ఈ సేల్ సందర్భంగా ఉత్పత్తులపై 80 శాతం వరకు తగ్గింపు, ఇంకా 20వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌లను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. ఈ సేల్‌లో అతిపెద్ద హైలెట్, ఐఫోన్ 7పై 8000 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేయడం. అంతేకాక ఐఫోన్ ఎస్ఈపై కూడా ఫ్లాట్ 15 శాతం డిస్కౌంట్, రూ.3000 క్యాష్‌బ్యాక్‌ను పేటీఎం అందిస్తోంది. దీంతో 27,200 రూపాయలుగా ఉన్న ఐఫోన్ ఎస్ఈ ధర 19,990కి దిగొచ్చింది. అంతేకాక షాపింగ్ ఓచర్లను, అదనంగా 5000 రూపాయల విలువ గల క్యాష్‌బ్యాక్ ఓచర్లను అందిస్తోంది. వీటిని విమానాలు, అప్పీరల్స్, మొబైల్ యాక్ససరీస్‌పై వాడుకోవచ్చు. ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్ స్మార్ట్ఫోన్లు రూ.3000, రూ.3500 క్యాష్‌బ్యాక్‌లతో పేటీఎం మాల్లో లిస్టయ్యాయి. షావోమి ఇటీవల లాంచ్‌చేసిన ఎంఐ మ్యాక్స్ 2 కూడా పేటీఎం తన మాల్లో అందుబాటులో ఉంచింది. లెనోవో, మైక్రోమ్యాక్స్, వివో స్మార్ట్ఫోన్లపై కనీసం 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ఇక ల్యాప్‌టాప్‌ల విషయానికి వస్తే, ఆపిల్, హెచ్‌పీ, లెనోవో బ్రాండ్లపై రూ.20వేల వరకు క్యాష్‌బ్యాక్‌లను అందించనున్నట్టు పేటీఎం మాల్ చెప్పింది. ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ 13 అంగుళాల దానిపై ఫ్లాట్ రూ.10వేల క్యాష్‌బ్యాక్, లెనోవో ఐడియాప్యాడ్ 320పై రూ.5000 క్యాష్‌బ్యాక్‌లను పేటీఎం లిస్టు చేసింది. అదేవిధంగా టీవీలు, వాషింగ్ మిషన్లపై 20వేల రూపాయల మేర క్యాష్‌బ్యాక్‌లను ఆఫర్ చేస్తోంది. మిక్సర్ గ్రైండర్స్, ఫ్యాన్లపై 20 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఉంది. ఇలా పేటీఎం మాల్లో అందించే చాలా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
అమెరికా ఆఫీసుల్లో వాటిపై నిషేధం
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలోని తమ దౌత్య కార్యాలయాల్లోకి సందర్శకులు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఐప్యాడ్లు లాంటి పరికరాలను తీసుకురాకుండా అమెరికా నిషేధం విధించింది. గురువారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తున్నట్లు పేర్కొంది. చెన్నై కేంద్రంలో అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలను ఇప్పటికే నిషేధించారు. ప్రపంచవ్యాప్తంగా తమ అన్ని కేంద్రాల్లోనూ అమెరికా ఇలాంటి చర్యలే చేపట్టింది. యూఎస్ ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రతను పెంచేందుకే ఈ మార్పులు చేస్తున్నామని ఢిల్లీ దౌత్య కార్యాలయం అధికార ప్రతినిధి వెల్లడించారు. వ్యక్తిగత ఎలక్ట్రానిక్ వస్తువులు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఐప్యాడ్లతో పాటు నెట్బుక్స్, క్రోమ్‌బుక్స్, ఐపాడ్లు, కిండిల్స్, మ్యాక్‌బుక్స్‌లను కూడా అనుమతించబోమని స్పష్టం చేశారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా దౌత్య కార్యాలయాల్లోకి సందర్శకులను మొబైల్ఫోన్లతో అనుమతిస్తామని చెప్పారు. చెన్నై కార్యాలయంలో మొబైల్ఫోన్లను కూడా అనుమతించబోమన్నారు. సందర్శకుల ఎలక్ట్రానిక్ వస్తువులు కార్యాలయం వెలుపల పెట్టుకునేందుకు ఎటువంటి ఏర్పాట్లు లేవని వెల్లడించారు. -
ఎస్ఐ కుమారుడు చోరీల బాట
= ల్యాప్‌టాప్‌లు చోరీ చేసి విక్రయాలు = నలుగురి అరెస్ట్ బనశంకరి : తండ్రి బాధ్యయుతమైన పోలీసు వృత్తిలో ఉన్నాడు. కుమారుడు మాత్రం చోరీలబాట బట్టాడు. కొంతమందిని చేరదీసి హాస్టళ్లలోకి చొరబడి ల్యాప్‌టాప్‌లు చోరీ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ల్యాప్‌ట్యాప్‌ల చోరీ కేసులో హెచ్ఏఎల్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ కుమారుడు చేతన్ తోసహా నలుగురిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 54 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ కుమారుడైన చేతన్.. శరవణ, బషీర్, నవీన్ తో కలిసి ఆరునెలుగా హాస్టల్స్, పీజీల్లోకి చొరబడి ల్యాప్‌ట్యాప్‌లు, సెలఫోన్లు చోరీ చేసేవారు. అనంతరం వాటిని అందంగా ప్యాక్ చేసి జేసీ రోడ్డు ప్రాంతంలో విక్రయించేవారు. దొంగతనాలకు సొంత బైకులో వెళితే పట్టుబడతామనే భయంతో అద్దెకు బైక్‌లను వినియోగించేవారు. చోరీలపై కేసు దర్యాప్తు చేపట్టిన హెచ్ఏఎల్ పోలీసులు సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించి బైకు నంబర్ గుర్తించి దర్యాప్తు చేపట్టారు. అద్దె బైకు దుకాణానికి చేతన్ ఇచ్చిన సెల్‌నంబర్‌పై ఆరా తీసి మెజస్టిక్‌లో లాడ్జిలో నిద్రిస్తున్న చేతన్ ను బుధవారం వేకువజామున అరెస్ట్ చేశారు. విచారణ చేపట్టి మిగిలిన ముగ్గురిని సైతం అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా చేతన్ రెండేళ్లుగా ఇంటికి రాలేదని, ల్యాప్‌టాప్ చోరీల కేసులో పలుమార్లు జైలుకెళ్లి రెండు నెలల క్రితం జామీనుపై విడుదలై పాత ప్రవృత్తిని కొనసాగిస్తున్నట్లు తెలిసింది. -
కొత్త ప్రపంచం 9th April 2017
-
కొత్త ప్రపంచం 2nd April 2017
-
అమెరికాకు విమానాల్లో.. ల్యాప్‌టాప్‌లు.. కెమెరాలు నిషేధం
⇔ 8 ముస్లిం దేశాలపై అమెరికా ఆంక్షలు ⇔10 విమానాశ్రయాలు..9 ఎయిర్‌లైన్స్‌పై ప్రభావం ⇔ఉగ్రవాద దాడుల భయంతోనే ఆంక్షలన్న ట్రంప్ సర్కారు వాషింగ్టన్: మొన్న 7 ముస్లిం ఆధిక్య దేశాల నుంచి ప్రయాణాలపై నిషేధం.. ఇప్పుడు ఎనిమిది ముస్లిం దేశాల నుంచి వచ్చే విమానాల క్యాబిన్లలోకి కెమెరాలు, ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలపై ఆంక్షలు. వలసలపై నిషేధంతో ఏర్పడ్డ వివాదం నుంచి బయటపడకముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సర్కారు మంగళవారం తీసుకున్న నిర్ణయం మరో వివాదానికి తెరతీసింది. ఈ సారి ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఎనిమిది దేశాల్లోని పది అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణికులపై కొత్త ఆంక్షలు విధించారు. కెమెరాలు, ల్యాప్‌టాప్‌ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను విమానం క్యాబిన్ బ్యాగుల్లో పెట్టి తీసుకురావొద్దంటూ కొత్త ఉత్తర్వులో పేర్కొన్నారు. అమెరికా తరహాలోనే బ్రిటన్ ఆరు ముస్లిం ఆధిక్య దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల క్యాబిన్ బ్యాగేజీపై నిషేధం విధించింది. (ఈజిప్టు), దుబాయ్, అబుదాబీ(యూఏఈ), ఇస్తాంబుల్(టర్కీ), దోహ(ఖతార్), అమ్మన్(జోర్డాన్), కువైట్ సిటీ, కాసాబ్లాంకా(మొరాకో), జెడ్డా, రియాద్(సౌదీఅరేబియా) నగరాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి అమెరికా వచ్చే ప్రయాణికులకు తాజా నిబంధనలు వర్తిస్తాయి. దీంతో అమెరికా వచ్చే 50కిపైగా విమానాల ప్రయాణికులు ఇబ్బంది ఎదుర్కోనున్నారు. ఈజిప్ట్ ఎయిర్, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్, ఎతిహాద్ ఎయిర్వేస్, కువైట్ ఎయిర్వేస్, ఖతార్ ఎయిర్వేస్, రాయల్ ఎయిర్ మొరాక్, రాయల్ జోర్డానియన్ ఎయిర్‌లైన్స్, సౌదీఅరేబియన్ ఎయిర్‌లైన్స్, టర్కిష్ ఎయిర్‌లైన్స్‌పై నిబంధనల ప్రభావం పడనుంది. తొమ్మిది విమానయాన సంస్థలకు తాజా నిబంధనల గురించి మంగళవారం సమాచారం అందజేశామని, రానున్న 96 గంటల్లో వీటిని అమలు చేయాలని సూచించామని అమెరికా ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. ఉగ్రదాడుల భయంతోనే కొత్త అధికారిక ఉత్తర్వును జారీచేశామంటూ తమ నిర్ణయాన్ని సర్కారు సమర్ధించుకుంది. భద్రతా కారణాలతోనే స్మార్ట్‌ఫోన్ కంటే పెద్దవైన ఐప్యాడ్లు, కిండల్స్, ల్యాప్‌టాప్‌లు వంటి పరికరాలను సెక్యూరిటీ లేదా బోర్డింగ్ సమయానికంటే ముందే అందజేయాలని అమెరికా అధికారులు వెల్లడించారు. దీంతో ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఈరీడర్లు, పోర్టబుల్ డీవీడీ ప్లేయర్లు, ఎలక్ట్రానిక్ గేమింగ్ డివైజ్‌లు, ప్రింటర్లు, స్కానర్లు మొదలైన ఎలక్ట్రానిక్ పరికరాలను ప్రయాణ సమయంలో కార్గోలోనే ఉంచుతారు. ఎలక్ట్రానిక్ పరికరాల సాయంతో పేలుడు పదార్థాల రవాణాకు ఉగ్రవాదులు వాణిజ్య విమానాలను వినియోగిస్తున్నారనే సమాచారంతో నిబంధనలు రూపొందించామని అధికారులు చెప్పారు. ఈ నిబంధనలతో అమెరికాకు చెందిన విమానయాన సంస్థలపై ఎటువంటి ప్రభావం పడబోదని, ఆ సంస్థలు 9 విమానాశ్రయాల నుంచి అమెరికాకు సర్వీసులు నడపడం లేదని వారు స్పష్టం చేశారు. అమెరికా తరహాలోనే బ్రిటన్ అమెరికా నిషేధం విధించిన కొద్ది గంటలకే టర్కీ, లెబనాన్, జోర్డాన్, ఈజిప్టు, ట్యునిసియా, సౌదీ అరేబియాలకు చెందిన 14 విమానయాన సంస్థలపై బ్రిటన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ దేశాల నుంచి బ్రిటన్‌కు వచ్చే విమానాల్లోకి సాధారణ సైజుకి మించిన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, డీవీడీ ప్లేయర్స్‌ను అనుమతించమని ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధి పేర్కొన్నారు. వాటిని విమాన క్యాబిన్ బ్యాగేజీగా తీసుకురాకుండా ముందుగానే అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. భారతీయులపై ప్రభావం తాజా నిర్ణయంతో ఆంక్షలు విధించిన తొమ్మిది విమానాశ్రయాల నుంచి ప్రయాణించే భారతీయులపై ప్రభావం పడనుంది. రోజూ వందల మంది భారతీయులు దుబాయ్, అబుదాబీ, కువైట్, ఇస్తాంబుల్ నగరాల నుంచి అమెరికాకు వెళ్తుంటారు. అయితే నిషేధంపై తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని విమానయాన శాఖ అధికారులు వెల్లడించారు. భారత్ నుంచి నేరుగా అమెరికాకు వెళ్లే ప్రయాణికులకు ఈ నిబంధన వర్తించవని చెప్పారు. ఎయిరిండియా విమానాలు నేరుగా అమెరికా వెళ్తాయని అందువల్ల తమ ప్రయాణికులపై ఎలాంటి ప్రభావం పడదని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. -
అమెజాన్ చోరీ కేసులో సిబ్బందే నిందితులు
♦ రూ.17 లక్షల విలువైన 33 ల్యాప్‌టాప్‌ల రికవరీ ♦ ఐదుగురు నిందితుల అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు ♦ సమావేశంలో వివరాలు వెల్లడించిన డీసీపీ పద్మజా కొత్తూరు(రంగారెడ్డి జిల్లా): గిడ్డంగిలో పనిచేసే సిబ్బంది, కొరియర్ నిర్వాహాకులే ఇటీవల అమెజాన్ గిడ్డంగిలో 36 ల్యాప్‌టాప్‌లను చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. శంషాబాద్ మండలం పాల్మాకుల ఔటర్ రింగురోడ్డు సమీపంలో పక్కా సమాచారంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరంచారు. సంఘటనకు సంబంధించిన వివరాలను శంషాబాద్ డీసీపీ పద్మజా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పెంజర్ల గ్రామంలో ఉన్న అమెజాన్ ఆన్లైన్ గిడ్డంగిలోని ఎలక్ట్రానిక్స్ స్టోర్‌లో 20 హెచ్‌పీ, 16 ఆపీల్ ల్యాప్‌టాప్‌లు చోరికి గురైనట్లు సెక్యూరిటీ ఇన్చార్జి నాగసుబ్బారెడ్డి ఈ నెల 15వ తేదిన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు గిడ్డంగిలో విధులు నిర్వహించే కొందరిని విచారించారు. సిబ్బందే నిందితులు : రాసుల మహేష్, పాండు, చంద్రకాంత్, కృష్ణలు అమెజాన్ గిడ్డంగిలో విధులు నిర్వహిస్తున్నారు. వారు గతి కొరియర్ సంస్థకు చెందిన రాజు, సునీల్‌కుమార్‌లతో కలిసి చోరీకి పథకం రచించారు. ఇందులో భాగంగా మొదటిసారి 20 హెచ్‌పీ, రెండవ సారి 16 ఆపీల్ ల్యాప్‌టాప్‌లను ఎవ్వరికీ అనుమానం రాకుండా కస్టమర్స్‌కు అందించే పార్సిల్స్లోనే పెట్టి బయటకు తీసుకొచ్చారు. తర్వాత పార్సిల్స్‌ను విప్పి 36 ల్యాప్‌టాప్‌లను తమ దగ్గర ఉంచుకున్నారు. ఇదే సమయంలో స్టోర్‌లో ల్యాప్‌టాప్‌లు కనిపించకపోవడంతో నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు..విచారణలో భాగంగా వీరిపై పోలీసులకు అనుమానం వచ్చింది. అమెజాన్‌లో విధులు నిర్వహిస్తున్న మహేష్, పాండు, కృష్ణ, గతి కొరియర్ సంస్థకు చెందిన రాజు, సునీల్కుమార్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి సుమారు రూ. 17 లక్షల 9 వేల విలువ ఉన్న 20 హెచ్‌పీ, 13 ఆపీల్ ల్యాప్‌టాప్‌లను స్వాదినం చేసుకున్నారు. కాగా మరో నిందితుడు చంద్రకాంత్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. సంస్థకు నోటీసు జారీ : అతిపెద్ద ఆన్లైన్ సంస్థగా పేరు ఉన్నప్పటికీ భద్రత పరంగా సరైన చర్యలు తీసుకోని కారణంగా అమెజాన్ గిడ్డంగి నిర్వాహాకులకు నోటీసు జారి చేయనున్నట్లు డీసీపీ తెలిపారు. అంతేకాకుండా ఇక మీదట ఇలాంటి చోరీలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. -
అధునాతన పద్ధతిలో కానిస్టేబుళ్లకు శిక్షణ
జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ ఆదిలాబాద్ : పోలీసు కానిస్టేబుళ్లకు అధునాతన పద్ధతిలో ఇవ్వనున్నట్లు ఎస్పీ ఎం.శ్రీనివాస్ తెలిపారు. సోమవారం పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లోని సమావేశ మందిరంలో శిక్షణ కేంద్రంలోని ఇండోర్, ఔట్‌డోర్ ఫ్యాకల్టీ పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ త్వరలో ప్రారంభం కానున్న నూతన పోలీసు కానిస్టేబుళ్లకు పోలీసు శిక్షణ కేంద్రంలో 9 నెలల శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి ఎంపికైన నాలుగు జిల్లాల అధికారులు జిల్లాకు చేరుకున్నట్లు తెలిపారు. వీరు అంబర్‌పేట్‌లోని ప్రధాన శిక్షణ కేంద్రంలో రెండు నెలల పాటు శిక్షణ తీసుకున్నారని పేర్కొన్నారు. మైదానంలో పరేడ్ శిక్షణ ఇచ్చే అధికారుల్లో ఆర్ఐ–1, ఏఆర్ ఎస్సై 4, ఏఆర్ హెడ్‌కానిస్టేబుళ్ల 27, సివిల్ ఎస్సైలు 4, హెడ్‌కానిస్టేబుళ్లు 12 మంది ఉంటారని తెలిపారు. ప్రిన్సిపల్‌గా అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి, వైస్ ప్రిన్సిపల్‌గా కె.సీతారాములు ఉంటారని పేర్కొన్నారు. పోలీసు శాఖలో కానిస్టేబుల్ వృత్తి ఎంతో కీలకమని అన్నారు. ఫ్యాకల్టీ అధికారులకు స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో డీఎస్పీ సమక్షంలో పరేడ్ శిక్షణ చేయిస్తూ రాబోయే శిక్షణ కార్యక్రమానికి సన్నద్ధం కావాలని సూచించారు. సివిల్ ఎస్సైలు చట్టంలోని భారతీయ శిక్షా స్మృతి, సాక్షాధారాలు, చట్టం పరిపాలన తదితర అంశాలపై రోజు పరీక్షలు నిర్వహించాలని సూచించారు. సరైన సామర్థ్యం చూపిన వారికి ప్రశంస పత్రాలు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా శిక్షణ సమయంలోనే కానిస్టేబుళ్లకు ల్యాప్‌టాప్‌లు అందించి కంప్యూటర్ పరిజ్ఞాణంతో ఆధునికంగా సిద్ధం చేస్తుందన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి, డీఎస్పీ కె.సీతారాములు, ఆర్ఐ బి.జెమ్స్, ఎస్.సురేంద్ర, ఎస్సైలు గంగాధర్ విష్ణు ప్రకాష్, సక్రీయనాయక్, ఏఆర్ ఎస్సైలు హబీబ్ బేగ్ పాల్గొన్నారు. -
ల్యాప్‌టాప్‌ల దొంగ అరెస్టు
పట్నంబజారు: విద్యార్థులు ఉండే గదులను టార్గెట్‌గా చేసుకుని ల్యాప్‌ట్యాప్‌లు, సెల్ఫోన్లు చోరీకి పాల్పడిన దొంగను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. నగరంపాలెంలోని సీసీఎస్ స్టేషన్లో అడిషనల్ ఎస్పీ బీపీ తిరుపాల్, డీఎస్పీ పి. శ్రీనివాస్‌లు బుధవారం విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కారంపూడి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన పూల శివకృష్ణ చెడువ్యసనాలకు బానిసగా మారి తల్లిదండ్రులకు తెలియకుండా గుంటూరు వచ్చి నివాసం ఉంటున్నారు. గతంలోని గార్డెన్స్ సెంటరులో విద్యార్థుల రూములో దూరి ల్యాబ్‌ట్యాప్, సెల్ఫోన్ల చోరీ చేశాడు. పాతగుంటూరు, నెహ్రూనగర్‌లో రెండు ద్విచక్ర వాహానాలు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం లక్ష్మీపురంలోని బాలుర వసతిగృహాం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న శివకృష్ణను నిలిపి ద్విచక్ర వాహానంకు సంబందించిన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని అడగటంతో పొంతన లేని సమాధానాలిచ్చాడు. దీనితో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించటంతో చోరీలకు పాల్పడుతున్నట్లు అంగీకరించాడు. అతని నుంచి రూ.2 లక్షలు విలువ చేసే రెండు ద్విచక్ర వాహనాలు, సెల్ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవటంతో ప్రతిభ కనబరిచిన సిబ్బంది వి.అనిల్, విజయ్, ఐటికోర్ బాలాజీ, శ్రీధర్‌ను అభినందించి రివార్డుల కోసం సిఫార్సులు చేసినట్లు తెలిపారు. -
రైలు ప్రయాణికులకు మరో సౌకర్యం
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులకు 92 పైసలకే ప్రమాద బీమా అందిస్తున్న ఐఆర్సీటీసీ ఇప్పుడు మరో బీమా పథకం ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. రైలు ప్రయాణికుల వద్ద ఉన్న సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లు వంటి గాడ్జెట్స్‌కు బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఐఆర్సీటీసీ అధికారులు, బీమా అధికారులకు మధ్య తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తప్పుడు దావాలపై బీమా కంపెనీలు ఆందోళన వ్యక్తం చేశాయని, తాము వారితో తమ ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకున్నామని ఐఆర్సీటీసీ చైర్మన్, ఎండీ ఏకే మనోచా గురువారమిక్కడ తెలిపారు. తొలి దశలో ఈ బీమా సౌకర్యాన్ని క్రెడిట్ కార్డు వినియోగదారులు, ప్రభుత్వ ఉద్యోగులకు అందించాలని ఐఆర్సీటీసీ భావిస్తోంది. -
లాప్టాప్ దొంగల అరెస్టు
విజయవాడ : వేర్వే రు కేసుల్లో లాప్‌టాప్‌లు దొంగిలించిన ఇద్దరు నిందితులను సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1.20 లక్షల విలువ చేసే నాలుగు లాప్టాప్లను పోలీసులు స్వా«ధీనం చేసుకున్నారు. గవర్నర్‌పేటలో ఎన్టీఆర్ కాంప్లెక్స్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన తంగుడు అఖిల్ ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. అతను తన మిత్రుల వద్ద మూడు లాప్టాప్లను ఈ నెల 15న అపహరించాడు. వాటిని అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఇబ్రహీంపట్నానికి చెందిన చిట్టెల శ్యామ్‌ప్రసాద్ గత నెల 29వ తేదీ గవర్నర్‌పేట పోలీస్‌స్టేçÙన్ పరిధిలో మహాలక్ష్మి టవర్స్‌లో లాప్టాప్ అపహరించాడు. దాన్ని విక్రయించే ప్రయత్నంలో ఎన్టీఆర్ కాంప్లెక్స్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. -
లాప్టాప్ దొంగల అరెస్టు
లాప్టాప్ దొంగలు, అరెస్టు, ల్యాప్‌ట్యాప్‌లు స్వాధీనం విజయవాడ : వేర్వేరు కేసుల్లో లాప్‌టాప్‌లు దొంగిలించిన ఇద్దరు నిందితులను సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1.20 లక్షల విలువ చేసే నాలుగు లాప్టాప్లను పోలీసులు స్వా«ధీనం చేసుకున్నారు. గవర్నర్‌పేటలో ఎన్టీఆర్ కాంప్లెక్స్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన తంగుడు అఖిల్ ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. అతను తన మిత్రుల వద్ద మూడు లాప్టాప్లను ఈ నెల 15న అపహరించాడు. వాటిని అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఇబ్రహీంపట్నానికి చెందిన చిట్టెల శ్యామ్‌ప్రసాద్ గత నెల 29వ తేదీ గవర్నర్‌పేట పోలీస్‌స్టేçÙన్ పరిధిలో మహాలక్ష్మి టవర్స్‌లో లాప్టాప్ అపహరించాడు. దాన్ని విక్రయించే ప్రయత్నంలో ఎన్టీఆర్ కాంప్లెక్స్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. -
యాపిల్ కు మరో బ్యాడ్ న్యూస్
శాన్ ఫ్రాన్సిస్కో : ఇప్పటికే ఐఫోన్ అమ్మకాల పడిపోయి నిరాశలో ఉన్న యాపిల్ కు మరో బ్యాడ్ న్యూస్. గ్లోబల్ గా యాపిల్ ల్యాప్ టాప్ లు, డెస్క్ టాప్ కంప్యూటర్ల అమ్మకాలు పడిపోయాయట. గతేడాదితో పోలిస్తే 2016 రెండో త్రైమాసికంలో మ్యాక్ కంప్యూటర్ల అమ్మకాలు 4 నుంచి 8శాతం క్షీణించాయని రీసెర్చ్ సంస్థలు వెల్లడించాయి. అదేవిధంగా యాపిల్ మేజర్ ప్రత్యర్థులు మాత్రం పీసీ వ్యాపారాల్లో వృద్ధిని బాగానే నమోదుచేశాయని తెలిపాయి. స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ల జోరుతో పీసీ మార్కెట్ పడిపోతున్నప్పటికీ, 2014-15 కాలంలో యాపిల్ తన మ్యాక్ కంప్యూటర్ అమ్మకాలను స్థిరమైన పెరుగుదలను సాధిస్తూ మార్కెట్ ను ఎంజాయ్ చేసింది. కానీ గతేడాది చివరి నుంచి మ్యాక్ యూనిట్ల అమ్మకాలు తిరోగమనంలో పడిపోయాయి. ఈ విషయాన్ని యాపిల్ ఇంకే స్వయంగా తన రిపోర్టులో పేర్కొంది. జూన్ త్రైమాసికం ముగింపు వరకు మ్యాక్ అమ్మకాలు 44లక్షల నుంచి 46 లక్షల వరకు పడిపోయాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గ్లోబల్ గా స్మార్ట్ ఫోన్, గాడ్జెట్ ల జోరుతో, పీసీ వ్యాపారాలు గత నాలుగేళ్లుగా పతనమవుతూ వస్తున్నాయి. గ్లోబల్ గా గత త్రైమాసికంలో పీసీల సరుకు రవాణా 624 లక్షల వరకు పడిపోయింది. ఈ పతనం గతేడాదితో పోలిస్తే 4.5శాతం అధికమని ఇంటర్ నేషనల్ డేటా కార్పొరేషన్ విశ్లేషకులు పేర్కొన్నారు. పీసీ తయారీ దిగ్గజంగా ఉన్న లెనోవా కూడా తన సరుకు రవాణాను 2శాతం కోల్పోయింది. అయితే హెచ్ పీ, డెల్, ఏస్ యూఎస్ మాత్రం గత త్రైమాసికంలో తమ సరుకు రవాణా వృద్ధిని పెంచుకున్నాయని రీసెర్చ్ సంస్థలు వెల్లడించాయి. ఆరోగ్యకరమైన అమెరికా మార్కెట్, గూగుల్ క్రోమ్ సాప్ట్ వేర్ తో నడిచే కొత్త ల్యాప్ టాప్ లపై వినియోగదారుల ఆసక్తి, సీజనల్ కొనుగోలులు వాటి పీసీ మార్కెట్ల వృద్దికి దోహదం చేశాయని వెల్లడించాయి. ఎనిమిది వరుస త్రైమాసికాల్లో మ్యాక్ కంప్యూటర్ల జోరును కొనసాగించిన యాపిల్ కు, ఐఫోన్ల దెబ్బ, పీసీ ల దెబ్బ రెండూ తలనొప్పులుగా మారుతున్నాయి. -
'అక్టోబర్ 6న కొత్తపార్టీ'
గాంధీనగర్ (విజయవాడ): ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ 30వ వార్షికోత్సవం సందర్భంగా అక్టోబర్ ఆరో తేదీన నవ్యాంధ్ర పార్టీ పెడుతున్నట్లు మహాసభ ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావు చెప్పారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మహాసభ సమావేశం జరిగింది. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా నవ్యాంధ్ర పార్టీ పనిచేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల పాఠశాలల్లో టాయిలెట్లు లేవని, చంద్రబాబు మాత్రం హెచ్ఎంలకు ల్యాప్‌ట్యాప్‌లు ఇస్తానంటూ ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎంకు ధైర్యముంటే ఒక రోజు సాంఘిక సంక్షేమ హాస్టల్లో నిద్రచేయాలని సవాల్ విసిరారు. ప్రభుత్వ విద్యను నాశనం చేయడం ద్వారా దళితులను విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతోందని పద్మారావు అభిప్రాయపడ్డారు. సీఎం పాలన దళితులకు వ్యతిరేకంగా సాగుతోందని ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 150 అడుగుల విగ్రహానికి స్థలం కేటాయించకుండా 14 నెలలుగా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. -
బీబీఎం చదివి చోరీల బాట
హిమాయత్‌నగర్: ల్యాప్‌టాప్‌ల చోరీకి పాల్పడుతున్న ఓ బీబీఎం గ్రాడ్యుయేట్‌ను నారాయణగూడ పోలీసులు పట్టుకొని 12 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. క్రైం ఎస్ఐ కిష్టయ్య తెలిపిన వివరాల ప్రకారం... కర్నూలు జిల్లా బనగానపల్లికి చెందిన ఎం.శ్రీనివాసులురెడ్డి (25) బీబీఎం చదివాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేసినా రాకపోవడంతో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. నగరంలోని ప్రైవేట్ హాస్టళ్లలో ఉంటూ విద్యార్థుల ల్యాప్‌టాప్‌లు చోరీ చేస్తున్నాడు. వీటిని కర్నూలు తీసుకెళ్లి విక్రయిస్తున్నాడు. స్నేహితులతో తాను సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్‌ల వ్యాపారం చేస్తున్నానని చెప్పుకొనేవాడు. ఇదిలా ఉండగా..ఈనెల 3న హిమయత్‌నగర్ తెలుగు అకాడమీ సమీపంలోని ఫేమస్ బాయ్స్ హాస్టల్లో ఉంటున్న ఉప్పుతోళ్ల శ్రీనాథ్ తన ల్యాప్‌టాప్ చోరీకి గురైందని నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో నిఘా పెట్టిన పోలీసులు శ్రీనివాసులురెడ్డిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొని విచారించగా దిల్సుఖ్నగర్, ఎస్సార్‌నగర్, నారాయణగూడ పీఎస్‌ల పరిధిలో మరో 11 ల్యాప్‌టాప్‌లు చోరీ చేసినట్టు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి 12 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. -
యాంటీ వైరస్... సేఫ్ బ్రౌజింగ్..
నెట్ ఉపయోగించాలంటే ఉండాల్సిందే పీసీకే కాదు మొబైల్‌కూ తప్పనిసరి టెక్నాలజీతోపాటు అప్‌గ్రేడ్ అవుతున్న సాఫ్ట్వేర్లు రూ.350 నుంచి రూ.3 వేల ధరల్లో వెర్షన్లు ల్యాప్‌టాప్‌లో ఏదో ముఖ్యమైన పనిచేస్తుంటాం అంతలోనే సిస్టమ్ స్లో అయిపోతే... కంప్యూటర్లో ఏదో అప్లికేషన్ ఫిల్ చేస్తుంటాం అంతలోనే డేటా మిస్ అయిపోతే... ఇలాంటి ఇబ్బందులను విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు అందరూ ఎదుర్కొనే ఉంటారు. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టడానికి యాంటీ వైరస్‌లే సరైన టానిక్ అని నిపుణులు చెబుతున్నారు. పీసీలు, ల్యాప్‌టాప్‌లకే కాదు స్మార్ట్‌ఫోన్ మొబైల్స్‌కు యాంటీ వైరస్ యాప్స్ నగరంలో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంటర్నెట్లో ఉచితంగా లభించే సాఫ్ట్వేర్ కన్నా.. సెలెక్టెడ్ కంపెనీలకు చెందిన యాంటీవైరస్‌ను ఇన్స్టాల్ చేసుకుంటే సేఫ్ బ్రౌజింగ్‌ను మన సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు. విజయనగరం టౌన్:ఇంటికి గొళ్లెం ఎలానో సిస్టమ్, మొబైల్‌కు యాంటీ వైరస్ అలాగని చెప్పవచ్చు. యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం ద్వారా తెలియకుండా మనల్ని ఇబ్బందిపెట్టే వైరస్ అయితే సేఫ్... లేదంటే సిస్టమ్ నెమ్మదిస్తుంది. మనం స్టోర్ చేసిన సమాచారం పోవచ్చు. చివరకు పూర్తిగా పీసీ పాడైపోవచ్చు. ఆధునిక మానవుడి ప్రతి పనినీ సులభతరం చేస్తున్న టెక్నాలజీని.. వినాశనానికి ఉపయోగిస్తుంటారు హ్యాకర్లు, వైరస్ రూపకర్తలు. అయితే యాంటీ వైరస్ ఉపయోగించడం ద్వారా పీసీ లేదా ల్యాప్‌టాప్‌ను సెక్యూర్డ్‌గా ఉంచుకోవచ్చు. దీనికి సంబంధించిన యాంటీ వైరస్ సాఫ్ట్వేర్లు నగరంలోని డాబాగార్డెన్స్, జగదాంబ, ద్వారకానగర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ స్టోర్స్, స్పేర్‌పార్టుల షాపుల్లోలభిస్తున్నాయి. ఎన్నో స్పెసిఫికేషన్లు క్యాన్ఫర్స్కై.కె7, అవాస్టా... ఇలా ఎన్నో రకాల యాంటీ వైరస్ సాఫ్ట్వేర్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. అంతేకాక ఇంటర్నెట్లో అనేక కంపెనీల సాఫ్ట్వేర్లు వివిధ స్పెసిఫికేషన్లతో కనిపిస్తుంటాయి. అయితే వాటిలో ఏ కంపెనీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలనే విషయంపై చాలామందికి సందేహాలు ఉంటాయి. మొబైల్, పీసీ కాన్ఫిగరేషన్ ఉపయోగాన్ని బట్టీ ఏ యాంటీ వైరస్ తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. సాధారణంగా రూ.350 నుంచి రూ.3 వేల వరకు వివిధ కంపెనీల యాంటీ వైరస్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో సింగిల్ నుంచి 50 కంప్యూటర్లకు వినియోగించే ప్యాక్‌లు సైతం లభిస్తాయి. ధర పెరిగే కొద్ది యాంటీ థెఫ్ట్, ఫోన్ లేదా సిస్టమ్ వేగంగా పనిచేసేలా చేయడం, అనుమానాస్పద ఫైల్స్, మెయిల్స్ సైట్స్‌పై అలర్ట్ చేయడం, స్కాన్ చేసే సదుపాయాలు పొందొచ్చునని డాబాగార్డెన్స్‌లో ఉన్న అనిల్ యాంటీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అధినేత సత్యనారాయణ తెలిపారు. ూ మూలపడేయాల్సిన పరిస్థితి స్మార్ట్ ఫోన్ల ధరలు అందుబాటులోకి రావడంతో అందరూ వినియోగిస్తున్నారు. కానీ అందులో ఉపయోగించాల్సిన యాంటీ వైరస్ సాఫ్ట్వేర్లపై ఎవరికీ అవగాహన ఉండట్లేదు. వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఫోన్లను కొన్ని రోజులకే మూలన పడేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సిస్టమ్ లేదా ల్యాప్‌టాప్ అయితే మరమ్మతు చేయించి మళ్లీ వాడే అవకాశం ఉన్నా.. ఫార్మాట్, రీబూట్ చేసిన తర్వాత పనివేగం నెమ్మదిస్తుంది. తెలిసింది గోరంత... మన దేశంలో యాంటీ వైరస్ వినియోగం గణాంకాలు చూస్తే ఔరా అనిపిస్తాయి. మొత్తం యూజర్లలో కేవలం 13 శాతమే లెసైన్స్డ్ యాంటీ వైరస్ సాఫ్ట్వేర్లను ఉపయోగిస్తున్నారు. 50 శాతంమందికి పైగా యాంటీ వైరస్ ఇన్స్టాల్ చేసుకోవాలన్న సంగతే తెలియడం లేదు. ఓ ప్రఖ్యాత వెబ్సైట్ చేసిన పరిశీలనలో ఈ వాస్తవాలు వెలుగుచూశాయి. ధరను బట్టే ప్రొటెక్షన్ సాధారణంగా ఏ వస్తువైనా ధరను బట్టే నాణ్యత ఉంటుంది. అదే ఎలక్ట్రానిక్స్ అయితే ధరను బట్టి ఫీచర్స్ పెరుగుతాయి. వైరస్ సోకడం వల్ల బ్యాకప్ పోవడం, డేటా లాస్ అవ్వడం వంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అలా జరిగితే సిస్టమ్‌ను రీబుట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసినా బ్యాకప్ డేటా మిస్ అవుతాం. అందుకే సిస్టమ్‌కు యాంటీ వైరస్ తప్పకుండా ఉండాలి. నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నది కాకుండా నేరుగా కంపెనీవి వాడితే మరింత బాగుంటుంది. -సురేష్ కుమార్, హార్డ్‌వేర్ ఇంజనీర్, విజయనగరం -
చర్లపల్లి జైల్లో ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు స్వాధీనం
హైదరాబాద్: చర్లపల్లి జైలులో ఖైదీలనుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లను శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్దెల చెరువు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ నుంచి ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అలాగే ఎంఐఎ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న మహ్మద్ పహిల్వాన్ తో పాటు, అండర్ ట్రయల్ ఖైదీ నుంచి కూడా ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. స్వైన్‌ఫ్లూ నివారణలో భాగంగా హోమియో మందులు పంపిణీచేస్తుండగా వారి వద్ద ఏడు సెల్ఫోన్లు, మూడు ల్యాప్‌టాప్‌లు బయటపడినట్టు చర్లపల్లి పోలీసులు పేర్కొన్నారు. -
ఐ ఫోన్ల పౌచ్‌లో బండరాయి..ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్ : ఐ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తక్కువ ధరకు విక్రయిస్తామని, దృష్టి మరలిచి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేసి, రూ. లక్షా 3 వేల నగదు, లక్షా 57 వేలు విలువ చేసే వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. పంజగుట్ట ఏసీపీ కార్యాలయంలో అదనపు డీసీపీ కె.ఆర్.నాగరాజు, ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎస్ఆర్ నగర్ డీఐ శంకర్ వివరాల ప్రకారం... ఉత్తర్‌ప్రదేశ్ పసంద గ్రామానికి చెందిన మహ్మద్ అబ్బాస్(31), మహ్మద్ మెహందీ హసన్ (35) గతలో వస్త్రవ్యాపారం చేశారు. నగరంలో దుస్తులు కొని తమ స్వస్థలంలో విక్రయించేవారు. వీరి గ్రామంలో 80 శాతం మంది చోరీలు చేస్తూ జీవిస్తారు. కాగా, వీరికి వ్యాపారంలో నష్టాలు రావడంతో తాము కూడా అదే బాట పట్టాలని నిర్ణయించుకున్నారు. ఒక ఐఫోన్, యాపిల్ ల్యాప్‌టాప్ కొనుగోలు చేసి వాటిని పట్టుకొని నగరానికి వచ్చారు. దానిని విక్రయిస్తామని విద్యార్థులకు చూపిస్తారు. డబ్బులు అత్యవసరమై రూ. 40 వేల ఫోన్‌ను రూ. 20 వేలకే విక్రయిస్తున్నామని చెప్తారు. కొనుగోలుదారుల దృష్టి మరల్చి ఐఫోన్ ఉన్న పౌచ్‌ను జేబులో పెట్టుకొని.. దాని స్థానంలో బండారాయి ఉన్న పౌచ్‌ను చేతిలో పెట్టి డబ్బు తీసుకొని ఉడాయిస్తారు. ఇదే విధంగా ల్యాప్‌టాప్‌లు విక్రయిస్తామని మోసం చేస్తున్నారు. నిన్న ఉదయం ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో వాహన తనిఖీలు చేపట్టిన క్రైం ఎస్ రవికుమార్ ద్విచక్రవాహనంపై వెళ్తున్న వీరిపై అనుమానం కలిగి అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపెట్టారు. అబ్బాస్, హసన్‌ల నుంచి నగదు, బైక్, ల్యాప్‌టాప్, యాపిల్ ఫోన్, ఒక బండరాయి, పది ఖాళీ ఐఫోన్ పౌచ్‌లు స్వాధీనం చేసుకున్నారు. -
అదుపులో శంకరాపురం గ్యాంగ్
పంజగుట్ట: తమిళనాడు రాష్ట్రం శంకారాపురం గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు సభ్యులను ఎస్సార్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద సుమారు 2.4 లక్షల విలువచేసే 8 ల్యాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. పలు ఆసక్తి కరమైన అంశాలు వెలుగుచూశాయి. పంజగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎస్సార్ నగర్ డీ.ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం .... అందరూ దొంగలే.. తమిళనాడు రాష్ట్రం వెల్లూరు మండలం శంకరాపురం గ్రామంలో అందరూ దొంగలే. గ్యాంగ్ లోని సభ్యులు కొంత మంది నగరానికి వచ్చి నగర పొలిమేరలు, బస్‌స్టాండ్, రైల్వేస్టేషన్ల సమీపాల్లో నివాసం ఏర్పరుచుకుంటారు. వీరు ఎక్కువగా హాస్టల్స్, అపార్ట్మెంట్స్ ఉన్న స్థలాలను ఎంపికచే సుకుంటారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో గ్యాంగ్ లోని సభ్యులు ఇద్దరిద్దరిగా విడిపోయి చోరీలకు పాల్పడుతుంటారు. గాఢనిద్రలో ఉన్న సమయంలో హాస్టల్స్, అపార్ట్మెంట్లలో డోర్లు తెరచి చేతికి దొరికింది దొరికినంత దోచుకుంటారు. అందరూ మరుసటిరోజు ఉదయం 11 గంటలకు కలుసుకుంటారు. ఎవరైనా రాకపోతే వారు పోలీసులకు చిక్కిన ట్లే. వెంటనే మిగిలిన సభ్యులు అరగంట లోపే అక్కడ నుంచి పారిపోతారు. పోలీసులకు చిక్కిన వారు ఉదయం 11 గంటల వరకు మూగవాడిలా నటిస్తారు. లేకపోతే తెలుగు, ఇతర భాషలు రానట్లు నటించి కేవలం తమిళంలోనే మాట్లాడుతారు. వీరు నోరు తెరచి మిగిలిన సభ్యుల పేర్లు చెప్పేలోపే వారు అక్కడ నుంచి పరారవుతారు. దొంగిలించిన సొత్తును తమిళనాడులోని ప్రాంతంలోనే పచ్చి కొప్పం నటరాజ్ అనే వ్యక్తికి తక్కువ ధరకు విక్రయిస్తారు. నటరాజ్ దొరికితే భారీ మెత్తంలో సోమ్ము రీకవరీ అయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. గ్రామానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నామని పోలీసులు చెప్పారు. అదుపులో ఇద్దరు.. శంకరాపురానికి చెందిన వెంకటస్వామి సుబ్రమణ్యం (24), బాలాజీ మురుగణ్ (20) లతో పాటు మరో ఐదుగురు కొద్దిరోజుల క్రితం నగరానికి వచ్చి శంషాబాద్ మండల్ బుద్వేల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. వారంతా నగరంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఎస్సార్ నగర్ డీ.ఐ శంకర్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఎస్సార్ నగర్ ఆదిత్యా ట్రేడ్ సెంటర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆటోలో వెంకటస్వామి, బాలాజీ అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. శంషాబాద్‌కు వెళ్లగా అప్పటికే గ్యాంగ్ లోని సభ్యులు పరారయ్యారు. వారి నుంచి 8 ల్యాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. -
సిటీజన్స్ స్క్రీన్ జంకీస్
గ్రేటర్లో సగం మంది రోజుకు ఎనిమిది గంటలపాటు డిజిటల్ స్క్రీన్లకు అతుక్కు పోతారట. ల్యాప్‌టాప్, పర్సనల్ కంప్యూటర్, టీవీ, ట్యాబ్లెట్, మొబైల్ వీటిల్లో ఏదో ఒక తెరతో కుస్తీపడుతూ... కళ్లను తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్నట్లు తాజా ఆన్లైన్ సర్వేలో వెల్లడైంది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే... ఈ విషయంలో మన సిటీ ముంబైతో పోటీపడుతోంది. ప్రముఖ కళ్లజోళ్ల సంస్థ టైటాన్ ఐవేర్ డివిజన్ ఆన్లైన్లో నిర్వహించిన ‘స్క్రీన్ జంకీ పోల్’లో పలు మెట్రో నగరాలకు చెందిన వెయ్యిమంది నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలిపారు. జాతీయ స్థాయిలో మొత్తంగా 41 శాతం మంది ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్ల వంటివి వినియోగిస్తున్నట్టు తేలింది. సర్వేలో మరికొన్ని ఆసక్తికర విషయాలు... ల్యాప్‌టాప్, పర్సనల్ కంప్యూటర్, టీవీ, ట్యాబ్లెట్ వంటి విభిన్న రకాల తెరలను వీక్షిస్తున్న వారు ఢిల్లీలో కేవలం 11 శాతం మాత్రమే ఉన్నట్లు తేలింది. వారాంతంలో మాత్రం ఇది 41 శాతానికి చేరుకోవడం విశేషం. ఇందులో ట్యాబ్లెట్స్ వినియోగించే వారే అధికం. - ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోవాసుల్లో 25 శాతం మంది మాత్రం రోజులో ఎక్కువ గంటలు టీవీని వీక్షించి కాలక్షేపం చేస్తున్నారు. - ఇక వీకెండ్లో డిజిటల్ తెరలను వీక్షిస్తున్న వారు ఢిల్లీలో 41 శాతం, అహ్మదాబాద్‌లో 68 శాతం, లక్నోలో 64 శాతం మంది. - భువనేశ్వర్‌లో 47 శాతం మంది మొబైల్స్, స్మార్ట ఫోన్లు వినియోగిస్తున్నారు. - లక్నోలో ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు వినియోగించేందుకు 50 శాతం మంది మక్కువ చూపుతున్నారు. - ట్యాబ్లెట్స్ వినియోగంలో దేశరాజధాని ఢిల్లీ వాసులు టాప్‌లో ఉన్నారు. పోలింగ్‌లో పాల్గొన్న వారిలో 7 శాతం మంది ట్యాబ్లెట్స్‌పై మనసు పారేసుకోవడం విశేషం. అతిగా వాడితే కళ్లకు చేటే.. గంటల తరబడి ఆయా తెరలతో కుస్తీపడుతున్న వాళ్లకు కళ్లకు సంబంధించిన సమస్యలు తప్పవని కంటి వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆయా తెరలపై పనిచేయాల్సి వచ్చినపుడు,వీక్షిస్తున్నప్పుడు కళ్లకు చేటు చేయని నాణ్యమైన కళ్లజోళ్లు ధరించాలని సూచిస్తున్నారు. తరచూ కంటికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు. -
మమ్ములను కూడా మోసం చేసిండ్లు
శాయంపేట : రాజీవ్ యువకిరణాలు, తక్కువ ధరకు ల్యాప్‌టాప్‌లు, వాషింగ్‌మిషన్ల స్కీమ్‌తో ఓ ముఠా మహిళలను మోసగించిన వైనంపై ‘మహిళా సంఘాలకు కుచ్చుటోపి’ శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం కథనం ప్రచురితం కావడంతో బాధిత మహిళలు ఐకేపీ కార్యాలయానికి చేరుకున్నారు. వీరిలో మండలంలోని మైలారం, పత్తిపాక, వసంతాపూర్, శాయంపేటకు చెందిన సుమారు 50 మంది ఉన్నారు. తమను కూడా ఇలాగే మోసగించి.. డబ్బులు తీసుకెళ్లారని తమ గోడు వెల్లబోసుకున్నారు. అందులో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. కొంతమంది భర్తలకు తెలియకుండా తమ ఇంట్లో దాచుకున్న డబ్బులు చెల్లించగా.. మరికొంత మంది తమ కుమారులు పనిచేసి తీసుకొచ్చిన జీతాలను వారికి ముట్టజెప్పారు. కాగా అందరు కలిసి తమకు జరిగిన అన్యాయాలను ఒకరికొకరు చెప్పుకున్నారు. -
అఖిలేష్ లాప్ టాప్ లో మోడీ సీడీలు!
లక్నో: రాజకీయంగా విభేధిస్తున్నప్పటికి ఉత్తరప్రదేశ్ లో ప్రధాని నరేంద్రమోడీకి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ప్రచారం చేయకతప్పడం లేదు. ఉపాధ్యయ దినోత్సవం సందర్భంగా మోడీ ప్రసంగాన్ని లక్షలాది మంది విద్యార్ధులకు చేరేలా తగిన సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. మోడీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా విద్యార్ధులకు అందేలా తగిన చర్యలు తీసుకునే ఏర్పాటు చేయాలని యూపీ మాధ్యమిక విద్యాశాఖకు విభాగానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశాయి. ఇప్పటికే యూపీ లో పంపిణీ చేసిన మోడీ ప్రసంగ సీడీలను లాప్ టాప్ లో చూపించాలని అధికారులకు రాష్ట్ర ప్రధానాధికారి నవీత్ సెహగల్ సూచించారు. ఈ మేకు పాఠశాలకు, మాధ్యమిక విద్యాశాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. -
రండి బాబూ.. రండి!
శాతవాహన యూనివర్సిటీ : పూలమ్మిన చోటే కట్టెలమ్మిన చందంగా మారింది ఇంజినీరింగ్ కళాశాలల పరిస్థితి. వీటిల్లో ప్రవేశాలకు గతంలో ఎగబడిన విద్యార్థులు.. ఇప్పుడు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ ఏడాది జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో వివిధ కోర్సుల సీట్లు నిండడమే గగనం అంటున్నారు. ఈ క్రమంలో పలు కళాశాలల యాజమాన్యాలు చేస్తున్న ఫీట్లు ఆశ్చర్యపరుస్తున్నాయి. విద్యార్థులను తమ కళాశాలల్లో చేర్చే బాధ్యతను పూర్వవిద్యార్థులకు అప్పగిస్తున్నాయి. ఇందుకు ప్రతిఫలంగా డబ్బులు, ల్యాప్‌టాప్‌లు, ఐఫోన్ తదితరాలను సమర్పించుకుంటున్నాయి. విద్యార్థులకూ ఎంతో కొంత ముట్టజెబుతున్నాయి. ఇవేవీ మేనేజ్మెంట్ సీట్లు కావు మరి. స్నేహం చేస్తారు.. సలహా ఇస్తారు.. వెబ్ కౌన్సెలింగ్‌కు వెళ్లే విద్యార్థులను ట్రాప్ చేసేందుకు పూర్వవిద్యార్థులను దింపుతున్నాయి పలు కళాశాలలు. ఒక్కో పూర్వ విద్యార్థి కనీసం ఐదుగురిని చేర్చాలని టార్గెట్ విధించినట్లు తెలిసింది. వీరు విద్యార్థులతో మాటమాటా కలిపి.. పలానా కళాశాలో చేరితే భవిష్యత్ బాగుంటందని, తామూ అక్కడే చదివామని హైప్ పెంచుతున్నారు. ఇంకా కళాశాలలో చదువుతున్న వారే ఈ పనిచేస్తే.. వారికి ఇంటర్నల్స్‌లో అధిక మార్కులు వేస్తామంటూ ప్రోత్సహిస్తున్నాయి. సర్టిఫికె ట్ల వెరిఫికేషన్ పూర్తయిన వారి నుంచి వన్‌టైం పాస్‌వర్డ్‌ను సైతం తస్కరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. గుర్తింపు నిలుపుదలపై యాజమాన్యాలు సీరియస్ ఇటీవల తనిఖీల్లో జిల్లాలోని ఏడు ఇంజినీరింగ్ , ఆరు ఫార్మసీ కళాశాలకు గుర్తింపు నిలుపుదల చేయడంపై యాజమాన్యాలు సీరియస్‌గా ఉన్నాయి. ఇంజినీరింగ్ సీట్లు తగ్గిస్తే సరేకానీ ఇలా కళాశాలలను ప్రవేశాలకు అనుమతి నిరాకరించడం దారుణమంటున్నాయి. తనిఖీల తీరుపై కోర్టులో పిటిషన్ వే శామని, గుర్తింపు నిలుపుదలపై ఈ నెల 21న వివరణ ఇవ్వాలని అధికారులను జడ్జి ఆదేశించారని కళాశాలల యాజమాన్యాలు పేర్కొన్నాయి. ఉత్తమ ఫలితాలు సాధించిన కళాశాలలుగా పేరున్న వాటిని తొలగించడం విడ్డూరంగా చెప్పుకుంటున్నారు. కాగా, కళాశాలల అనుమతుల నిలుపుదలలో రాజకీయాలు ఇమిడి ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థులూ.. ఆందోళన వ ద్దు కళాశాలల గుర్తింపు అంశంపై విద్యార్థులు ఆందోళన చెందొద్దని కౌన్సెలింగ్ కేంద్రం సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కె.ప్రేమ్‌కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని వెబ్ ఆప్షన్లు ఎన్నుకోవడానికి ఉన్న కేంద్రాల్లో ఆన్లైన్లో కనిపించే కళాశాలలకే గుర్తింపు ఉన్నట్లని స్పష్టం చేశారు. వన్‌టైమ్ పాస్వర్డ్ విషయంలో గోప్యత పాటించాలని కోరారు. గుర్తింపు ఉన్న కళాశాలలివే... జ్యోతిష్మతి-1, జ్యోతిష్మతి -2, జేఎన్టీయూ కొండగట్టు, జేఎన్టీయూ మంథని, హుజూరాబాద్ కి ట్స్ ఇంజినీరింగ్ కళాశాల, పెద్దపల్లి మధర్ థెరిస్సా, కరీంనగర్ నిగమ ఇంజినీరింగ్ కళాశాల, వాగేశ్వరి-1, వాగేశ్వరీ-2, వివేకానంద ఇంజినీరింగ్ కళాశాలలకు గుర్తింపు ఉంది. ఫార్మసీలో కరీంనగర్ శాతవాహన కళాశాలకు మాత్రమే అనుమతి ఉందని కౌన్సెలింగ్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ తెలిపారు. ఇది సోమవారం వరకు ఉన్న సమాచారమని, సలహాలు, సూచనల కోసం 96666 70193 సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. -
ఆన్లోలేని సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు విమానాల్లో నిషేధం
వాషింగ్టన్: విమానాశ్రయాల్లో తనిఖీని కూడా తప్పించుకోగలిగే సరికొత్త బాంబులను సిరియా, యెమెన్ దేశాల ఇస్లామ్ మిలిటెంట్లు తయారుచేస్తున్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో అమెరికా మరింత అప్రమత్తమైంది. అమెరికాకు నేరుగా విమాన సదుపాయం ఉన్న వివిధ దేశాల్లోని విమానాశ్రయాల్లో భద్రతను పెంచేందుకు మరిన్ని చర్యలు తీసుకుంది. పవర్ ఆన్చేయని సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను విమానాల్లో అనుమతించబోమని, సదరు ఎలెక్ట్రానిక్ పరికరాలు కలిగిఉంటే, విమానం ఎక్కే ముందుగా మరింత నిశితంగా తనిఖీలకు సిద్ధపడాలని అమెరికా స్పష్టంచేసింది. తమతో తీసుకెళ్లే ఎలెక్ట్రానిక్ పరికరాలు పనిచేస్తున్నవేనని, అవి పేలుడు వస్తువులు కాదని రుజువు చేసుకునేందుకు వీలుగా, ప్రయాణికులు వాటిని ఆన్‌చేసి ఉంచవలసిందిగా విదేశాల విమానాశ్రయాల్లోని తనిఖీ అధికారులు కోరతారని అమెరికా రవాణా భద్రతా శాఖ పరిపాలనా విభాగం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. చార్జింగ్లేని ఎలెక్ట్రానిక్ పరికరాలతో విమానంలో ప్రయాణానికి అనుమతించబోమని కూడా స్పష్టంచేసింది. అమెరికాకు నేరుగా విమాన సదుపాయం ఉన్న కొన్ని దేశాల్లోని విమానాశ్రయాల్లో మరిన్ని భద్రతా చర్యలను అమలుచేయాలని అమెరికా భద్రతా వ్యవహారాల మంత్రిత్వ శాఖ గతవారమే రవాణా భద్రతా శాఖను ఆదేశించింది. విమాన ప్రయాణికులకు అత్యున్నతస్థాయి భద్రతపై పూచీకోసం, భద్రతా చర్యలను ఎప్పటికప్పుడు సవరించుకుంటూ ఉంటామని అమెరికా రవాణా భద్రతా శాఖ తెలిపింది. మధ్యప్రాచ్యం, యూరప్ ప్రాంతాల్లోని ఉగ్రవాదుల నుంచి తాజాగా ఎదురవుతున్న మ్పుపును ఎదుర్కొనేందుకే ఈచర్యలు చేపట్టినట్టు పేర్కొంది. విమానాశ్రయాల్లో ఎలెక్ట్రానిక్ పరికాలపై తనిఖీలను ముమ్మరంచేయడంపై అమెరికా అవసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని బ్రిటన్, ప్రాన్స్, జర్మనీ ఇప్పటికే స్పష్టం చేశాయి. -
విదేశీ విమానాశ్రయాల్లో అమెరికా తనిఖీలు
సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తదితర పరికరాల సోదాపై ప్రత్యేక దృష్టి వాషింగ్టన్: విమానాశ్రయాల్లో తనిఖీని కూడా తప్పించుకోగలిగే సరికొత్త బాంబులను సిరియా, యెమెన్ దేశాల ఇస్లామ్ మిలిటెంట్లు తయారుచేస్తున్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో అమెరికా మరింత అప్రమత్తమైంది. అమెరికాకు నేరుగా విమాన సదుపాయం ఉన్న వివిధ దేశాల్లోని విమానాశ్రయాల్లో భద్రతను పెంచేందుకు మరిన్ని చర్యలు తీసుకుంది. పవర్ ఆన్చేయని సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను విమానాల్లో అనుమతించబోమని, సదరు ఎలెక్ట్రానిక్ పరికరాలు కలిగిఉంటే, విమానం ఎక్కే ముందుగా మరింత నిశితంగా తనిఖీలకు సిద్ధపడాలని అమెరికా స్పష్టంచేసింది. తమతో తీసుకెళ్లే ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేస్తున్నవేనని, అవి పేలుడు వస్తువులు కాదని రుజువు చేసుకునేందుకు వీలుగా, ప్రయాణికులు వాటిని ఆన్‌చేసి ఉంచవలసిందిగా విదేశాల విమానాశ్రయాల్లోని తనిఖీ అధికారులు కోరతారని అమెరికా రవాణా భద్రతా శాఖ పరిపాలనా విభాగం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. చార్జింగ్లేని ఎలక్ట్రానిక్ పరికరాలతో విమానంలో ప్రయాణానికి అనుమతించబోమని కూడా స్పష్టంచేసింది. -
లెనవూ కొత్త ల్యాప్‌టాప్‌లు..
కొత్త సరకు చైనీస్ కంప్యూటర్ తయారీ సంస్థ లెనవూ తాజాగా సరికొత్త ల్యాప్‌టాప్, ఆల్ఇన్వన్ పీసీలను భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వీటిల్లో లెనవూ జీ40/50 ఎంట్రీలెవెల్ ల్యాప్‌టాప్. ఇందుకు తగ్గట్టుగానే వీటిల్లో ఇంటెల్ కోర్ ఐ3, లేదా ఏఎండీ ఏ8 బీమా ప్రాసెసర్లు ఉంటాయి. గ్రాఫిక్స్ కోసం 2జీబీ ఎన్విడియా జీఈఫోర్స్ జీటీ820ఎం ప్రాసెసర్‌ను, జీ50లో జీటీ840ఎం ప్రాసెసర్‌ను ఉపయోగించింది. స్క్రీన్‌సైజు 14, 15.6 అంగుళాలు. రెండింటిలోనూ 16 జీబీ డీడీఆర్3ఎల్ ర్యామ్, ఒక టెరాబైట్ హార్డ్‌డిస్క్‌లు ఉన్నాయి. అవసరమైతే ఒక టెరాబైట్ హైబ్రిడ్ డ్రైవ్‌ను ఎంచుకోవచ్చు. వీటి ధర రూ.22,900 వరకూ ఉండవచ్చు. ఇక మధ్యమశ్రేణిలో లెనవూ జెడ్50 పేరుతో మరో ల్యాప్‌టాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.దీని స్క్రీన్‌సైజు 15.6 అంగుళాలు. రెండు గిగాహెర్ట్జ్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఎనిమిది గిగాబైట్ల డీడీఆర్3ఎల్ ర్యామ్, ఒక టెరాబైట్ హార్డ్‌డిస్క్/ 500 జీబీ హైబ్రిడ్ డిస్క్‌ల ఆప్షన్స్ ఉన్నాయి. జీ40/జీ50, జెడ్ 50ల బ్యాటరీలు నాలుగు నుంచి 5 గంటలపాటు పనిచేస్తాయని కంపెనీ చెబుతోంది. ఇక సీ260 ఆల్ ఇన్వన్ పీసీ విషయం చూద్దాం. దాదాపు 20 అంగుళాల స్క్రీన్‌సైజుతో వచ్చే ఈ పీసీలో 2.41 గిగాహెర్ట్జ్ క్లాక్‌స్పీడ్‌తో పనిచేసే ఇంటెల్ పెంటియమ్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ర్యామ్ 8 జీబీ, హర్డ్‌డిస్క్ సామర్థ్యం ఒక టెరాబైట్. ఇవికాకుండా లెనవూ కొత్తగా రూ.60వేలు విలువ చేసే యోగా -2 కన్వర్టిబుల్‌ను, రూ.42 వేల ఖరీదు చేసే ఫ్లెక్స్-2ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ పీసీలు, ల్యాప్‌టాప్‌లన్నీ విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తాయి. -
నలుగురు కాదు వంద
రాష్ట్రంలోని కిడ్నీ ఏజెంట్ల సంఖ్య ఇది దేశవ్యాప్తంగా వెయ్యికిపైగానే ప్రధాన సూత్రధారి ప్రశాంత్‌సేఠ్, ఆలం కోసం వేట సాక్షి, హైదరాబాద్ : దినేష్ మృతితో కిడ్నీ రాకెట్ గుట్టు విప్పిన సీసీఎస్ పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. పోలీసుల అదుపులో ఉన్న విజయవాడ, పశ్చిమగోదావరి, నల్లగొండ, హైదరాబాద్‌కు చెందిన కిడ్నీ ఏజెంట్లు శ్రీనివాస్, కిరణ్, వెంకటేశ్వర్లు, సురేష్లను విచారించగా పోలీసులకు దిమ్మ తిరిగిపోయే నిజాలు వెలుగు చూశాయి. మన రాష్ట్రంలోనే వందకుపైగా కిడ్నీ క్రయవిక్రయాలు జరిపే ఏజెంట్లు ఉన్నారని వెంకటేశ్వర్లు వద్ద లభించిన ల్యాప్‌టాప్‌లో తేలింది. వీరంతా శ్రీలంక రాజధాని కొలంబో వెళ్లి కిడ్నీ ఇచ్చి వచ్చిన వారే కావడం గమనార్హం. మరింత ఆదాయం గడించేందుకు ఏజెంట్లుగా మారిన వీరు తెలిసిన వారికి గాలం వేసి ప్రధాన సూత్రధారి ద్వారా శ్రీలంకకు పంపిస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో కలిపితే వెయ్యికిపైగా ఏజెంట్లు ఉంటారని తెలిసింది. ప్రధాన సూత్రధారులు మాత్రం ఒడిశా, చెన్నైకి చెందినవారని పోలీసుల విచారణలో తేలింది. దినేష్ మృతిపై విచారణ కోసం తమ దేశం వస్తే పూర్తి సహకారం అందిస్తామని సీసీఎస్ పోలీసులకు శ్రీలంక పోలీసులు తెలిపారు. కిడ్నీ అమ్మేవారిని బ్రోకర్లు వారి పాస్‌పోర్టుపై విజిటింగ్ వీసా కింద స్టాంపింగ్ వేయించి శ్రీలంక తీసుకెళ్తున్నారు. విజిటింగ్ వీసాపై వెళ్లిన వ్యక్తి అనారోగ్యానికి గురైతే అక్కడి డాక్టర్లు ఆకస్మిక వైద్యం అందించవచ్చు. అంతేగాని ఆరోగ్యంగా ఉన్న అతని నుంచి కిడ్నీ తీయడం నేరం. ఈ కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. మన రాష్ట్రం నుంచి ఇలా వెళ్లి కిడ్నీ అమ్ముకున్న వారందరి పాస్‌పోర్టులపై విజిటింగ్ వీసా అని స్టాంపింగ్ వేసి ఉంది. ప్రశాంత్‌సేఠ్ ఆఫర్ లెటర్.... ‘హలో.. నేను ప్రశాంత్ సేఠ్‌ని.. కిడ్నీ అమ్మాలనుకున్నారా.. నేను అన్ని విధాల సహాయపడతా. ఆపరేషన్ మాత్రం ఇరాన్, సింగపూర్, శ్రీలంక దేశాలలో మాత్రమే చేయిస్తా. పాస్‌పోర్టు, ట్రావెల్స్ ఖర్చులు, భోజనం, వసతితో పాటు సకల సౌకర్యాలు నేనే కల్పిస్తా. అడిగినంత డబ్బు కూడా ఇస్తా. నా గురించి నచ్చిన వారు నా మెయిల్ లేదా సెల్ నంబర్‌ను సంప్రదించండి’ అని దినేష్ మెయిల్‌కు ప్రశాంత్‌సేఠ్ మార్చి 9న ఆఫర్ లెటర్ పంపాడు. ప్రశాంత్ కోసం వేట... రాష్ట్రంలో ఉన్న కిడ్నీ ఏజెంట్లకు ప్రశాంత్సేఠ్తో పాటు చెన్నైకి చెందిన ఆలం ప్రధాన సూత్రధారులని తేలింది. దీంతో వారి కోసం సీసీఎస్ పోలీసులు వేట ప్రారంభించారు. ఆలం కాశ్మీర్‌కు పారిపోయాడని నిర్ధారించుకున్న పోలీసులు ప్రశాంత్‌సేఠ్ కోసం ప్రత్యేక పోలీసు బృందంతో గాలిస్తున్నారు. -
జోరుగా డిజిటల్ ప్రచారం
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లు, డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌ల వంటి ఇంటర్నెట్ ఎనేబుల్డ్ డివైస్‌ల్లో ప్రకటనలు జోరుగా పెరుగుతున్నాయి. ఈ డిజిటల్ ప్రచార వ్యయం ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది 15 శాతం వృద్ధితో 13,753 కోట్ల డాలర్లకు పెరగవచ్చని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ, ఈమార్కెటీర్ అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు.. 2012లో మొత్తం ప్రచార వ్యయంలో ఐదవ వంతుగా ఉన్న డిజిటల్ ప్రచార వ్యయం 2018 నాటికి మూడో వంతుకు పెరుగుతుంది. 2018 కల్లా డిజిటల్ ప్రచార వ్యయం 20,401 కోట్ల డాలర్లకు, మొత్తం మీడియా ప్రచార వ్యయం 65,630 కోట్ల డాలర్లకు చేరతాయి. రానున్న సంవత్సరాల్లో మీడియా ప్రచార వ్యయం 5% స్వల్ప వృద్ధినే సాధిస్తుంది. డిజిటల్ ప్రచార వ్యయంలో దేశాల వారీగా చూస్తే అమెరికా, ప్రాంతాల వారీగా చూస్తే దక్షిణ అమెరికాలు అధికంగా ఖర్చు చేస్తున్నాయి. మొత్తం ప్రపంచవ్యాప్త డిజిటల్ వ్యయంలో 40 శాతం దక్షిణ అమెరికా ప్రాంతానిదే కావడం విశేషం. ఈ విషయంలో ఆసియా-పసిఫిక్ ప్రాంతం వాటా 29%గా, పశ్చిమ యూరప్ దేశాల వాటా గణనీయంగా ఉండగా, ఇతర ప్రాంతాల వాటా స్వల్పంగా ఉంది. ఇక మొత్తం మీడియా ప్రచార వ్యయంలో డిజిటల్ ప్రచార వ్యయం వాటా ఇంగ్లాండ్‌లో అధికంగా ఉంది. ఈ విషయంలో 48 శాతం మార్కెట్ వాటాతో ఇంగ్లాండ్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో డెన్మార్క్(40 శాతం), ఆస్ట్రేలియా(38%), అమెరికా(28 శాతం) ఉన్నాయి. -
వెబ్... డబ్బు!
* ఆన్లైన్ షోలకు పెరుగుతున్న ఆదరణ * యోగా నుంచి వంటల వరకు ‘వీడియో ఆన్ డిమాండ్’ * సెల్, టాబ్లెట్ యూజర్లు లక్ష్యంగా కంపెనీల కార్యక్రమాలు నూతన టెక్నాలజీతో పాటే కొత్త ఆదాయ మార్గాలూ అందుబాటులోకి వస్తాయి. ఆన్లైన్లో సినిమాలను, వీడియోలను ప్రజలు వీక్షించడం కూడా కంపెనీలకు ఆదాయ మార్గమే. డిట్టో టీవీ సాధించిన విజయమే ఇందుకు నిదర్శనం. మొబైల్ ఫోన్లూ, టాబ్లెట్లూ, ల్యాప్‌టాప్‌లలో 60 భారతీయ టీవీ చానళ్లను డిట్టో టీవీ ప్రసారం చేస్తోంది. కలర్స్, సోనీ, జీటీవీ ఆన్లైన్ వంటివి ఈ చానళ్ల జాబితాలో ఉన్నాయి. విశేషం ఏంటంటే, ప్రారంభించిన ఏడాది వ్యవధిలోనే డిట్టో టీవీ చందాదారుల సంఖ్య 2.92 లక్షలకు చేరడం. వీరంతా నెలకు రూ.10 నుంచి రూ.100 వరకు చెల్లించే యాక్టివ్ యూజర్లు. రూ.6,350 కోట్ల జీ గ్రూప్‌నకు చెందిన ఓవర్ ది టాప్(ఓటీటీ) విభాగమే డిట్టో టీవీ. దేశీయ అతిపెద్ద మ్యూజిక్ కంపెనీ టీ-సిరీస్‌కు గత మార్చిలో రూ.450 కోట్ల ఆదాయం రాగా అందులో 90%కి పైగా నాన్ ఫిజికల్ ఫార్మాట్ల ద్వారా వచ్చింది. ఇందులో... మ్యూజిక్‌ను ప్రసారం చేసినందుకు రెస్టారెంట్లు చెల్లించింది కొద్దిమొత్తం కాగా గానా.కామ్, యూట్యూబ్ తదితరాల్లో స్ట్రీమింగ్, డౌన్లోడ్ సేవల ద్వారా భారీ మొత్తం సమకూరింది. యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించే చానల్‌గా మూడేళ్లకుపైగా టీ-సిరీస్ కొనసాగుతోంది. 22 కోట్ల మంది ఆన్లైన్ ... ఆధునిక మొబైల్ ఫోన్లతో పాటు మెరుగైన బ్యాండ్‌విడ్త్ కూడా అందుబాటులోకి రావడంతో దేశంలో ఆన్లైన్లో వీడియోలను చూసే వారి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. సెక్యూరిటీ గార్డుల నుంచి స్టూడెంట్ల వరకు వివిధ రంగాలకు చెందిన 22.70 కోట్ల మందికిపైగా ప్రజలు ఆన్లైన్లో ఉన్నారు. సినిమాలు, క్రికెట్ మ్యాచ్‌లు, టీవీ షోలు, యోగా శిక్షణ, వంట పాఠాలు.. ఇలా పలు రకాల కార్యక్రమాలను వీక్షిస్తున్నారు. గత నెలలో 5.90 కోట్ల మంది కనీసం ఒక వీడియో సైట్‌ను చూశారని కామ్‌స్కోర్ అనే డిజిటల్ అనాలిటిక్స్ కంపెనీ అంచనా. వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చు. ఎందుకంటే, సెల్ఫోన్లలో ఇలాంటి కార్యక్రమాలను వీక్షించే వారి సంఖ్యను కామ్‌స్కోర్ పరిగణనలోకి తీసుకోలేదు మరి. గతేడాది టీవీ ప్రోగ్రామ్‌లను చూసిన వారి సంఖ్యతో పోలిస్తే... ఆన్లైన్లో వీడియోలను వీక్షించిన వారి సంఖ్య 8 శాతం లోపే. ఆన్లైన్ వీడియో వీక్షకుల సంఖ్య ఏటేటా 10 శాతానికి పైగా వృద్ధి చెందుతోంది. 2011-12లో గూగుల్ ఇండియా ఆర్జించిన ఆన్లైన్ వీడియో ప్రకటనల ఆదాయం రూ.800 కోట్లు. తర్వాతి ఏడాది అది రూ.వెయ్యి కోట్లకు పెరిగింది. వీడియో వీక్షణకు జనం చెల్లించిన సొమ్ము కూడా రూ.వెయ్యి కోట్ల వరకు ఉంది. ఆన్లైన్లో వీడియోలను చూసే వారిలో దాదాపు సగం మంది మొబైల్ ఫోన్లలోనే వీక్షిస్తున్నారని హంగామా డిజిటల్ మీడియా సీఈఓ నీరజ్ రాయ్ తెలిపారు. భవిష్యత్తులో యూట్యూబ్‌తోనే పోటీ.. దేశీయ ఇంటర్నెట్ వినియోగదారుల్లో సగం మంది మొబైల్ ఉపయోగించేవారేననీ, వీరిలో అధికులు తొలిసారి వినియోగదారులేననీ అవెండస్ క్యాపిటల్ కంపెనీ అంచనా. వర్ధమాన దేశాల్లో వీరి సంఖ్య 20-25 శాతమే కావడం గమనార్హం. అంటే, ఆన్లైన్ వీడియోలు తిలకించే వారిలో కొత్తతరం వారే అధికమన్నమాట. పరిచయస్తులు మీకో ఫేస్బుక్ క్లిప్ పంపారనుకోండి... దాన్ని మీరు చూడడం ఖాయం కదా. ఆ విధంగా ఆన్లైన్ వీడియో వీక్షకుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. మీడియా హౌస్‌లు అందించే ప్రధాన కార్యక్రమాలు పెరగడానికీ, ఆన్లైన్ చార్టుల్లో టీవీ షోలు అగ్రస్థానంలో ఉండడానికీ కారణం ఇదేనని కామ్‌స్కోర్ ఇండియా సీనియర్ డెరైక్టర్ కేదార్ విశ్లేషించారు. ‘మరో ఐదేళ్ల తర్వాత స్టార్ టీవీ, జీ టీవీలతో మాకు పోటీ ఉండదు. యూట్యూబే ప్రధాన పోటీదారు అవుతుంది...’ అని వయాకామ్18 సీఈఓ రాజ్ నాయక్ అంటున్నారు. ఫలానా వీడియో క్లిప్పింగ్ కావాలని కోరే వారిని దృష్టిలో పెట్టుకుని ఎయిర్టెల్ వంటి కంపెనీ రూపాయికే వీడియో క్లిప్పింగ్ ఆఫర్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఆన్లైన్లో లైవ్ వీడియోలను చూసే వారి సంఖ్య, ఫలానా వీడియో కావాలని కోరే వారి సంఖ్య దాదాపు సమానంగా ఉంటున్నాయి. యోగా శిక్షణ నుంచి వంటకాల తయారీ వరకు వివిధ రకాల కార్యక్రమాలను వీక్షకులు కోరుతున్నారు. మొబైల్ ఫోన్ల వినియోగదారులు 10-15 నిమిషాల నిడివి ఉండే వీడియోలను కోరుతుండగా టాబ్లెట్ వినియోగదారులు 30-40 నిమిషాల వీడియోలను సైతం చూస్తున్నారు. -
ల్యాప్‌టాప్‌లతో పోటీ పడలేకపోతున్నట్యాబ్లెట్స్
ఎక్కడికి కావాలంటే అక్కడకు సునాయాసంగా తీసుకువెళ్లే అవకాశం ఉన్నప్పటికీ ట్యాబ్లెట్స్ ల్యాప్ టాప్‌లతో పోటీ పడలేకపోతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం ఎంత కొత్త పుంతలు తొక్కినా నెట్ వినియోగంలో మాత్రం ల్యాప్ టాప్‌లు తమ సత్తాను చాటుతూ ప్రథమ స్థానంలో నిలుస్తున్నాయి. మార్కెట్లోకి ఎన్ని ట్యాబ్లెట్స్ వచ్చినా యువత మాత్రం ల్యాప్‌టాప్‌లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగానికి ట్యాబ్లెట్స్ కంటే ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లనే ఎక్కువ మంది ఎంచుకుంటున్నారని డెలాయిట్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇంటర్నెట్ కోసం 69 శాతం మంది ల్యాప్‌టాప్‌లపై, 64 శాతం మంది స్మార్ట్ఫోన్లపై ఆధారపడుతున్నారు. కేవలం 24 శాతం మంది ట్యాబ్లెట్లను వాడుతున్నారని సర్వే ద్వారా తెలిసింది. హైదరాబాద్ సహా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణే, అహ్మదాబాద్ నగరాల్లోని రెండు వేల మంది వినియోగదార్లపై డెలాయిట్ ఆన్లైన్ సర్వే నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించింది. ల్యాప్ టాప్‌లో ట్యాబ్లెట్ కంటే బ్యాటరీ, మోమోరీలతోపాటు ప్రాసెసర్ స్పీడ్ బాగా కలిసి వస్తాయని ఐటి నిపుణులు సైతం చెపుతున్నారు. ఇక స్మార్ట్‌ఫోన్ వినియోగదార్లలో 60 శాతం మంది డేటా కోసం మొబైల్ నెట్‌వర్క్‌ను వినియోగిస్తుండగా, ల్యాప్‌టాప్ వినియోగిస్తున్న వారిలో 80 శాతం మంది ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్‌ను వాడుతున్నారు. విభిన్న డేటా ప్లాన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ చాలా మంది మొబైల్ కస్టమర్లు వైఫైకి మళ్లుతున్నారు. ట్యాబ్లెట్ కొనుగోలు సమయంలో కస్టమర్లకు బ్రాండ్ తొలి ప్రాధాన్యత కాగా, మన్నిక, ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాటరీ జీవిత కాలం, డిజైన్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అదే స్మార్ట్‌ఫోన్లకైతే బ్యాటరీ సామర్థ్యం కీలకపాత్ర పోషిస్తోంది. డిజైన్, మన్నిక, బ్రాండ్, ఆపరేటింగ్ సిస్టమ్, కెమెరా సామర్థ్యం తర్వాతి ప్రాధాన్యతలని డెలాయిట్ వెల్లడించింది. ఐతే ల్యాప్‌టాప్‌లలో ఇవన్నీ ఉండటం వాటికి బాగా కలిసివచ్చే అంశమని నిపుణులు చెబుతున్నారు. s.nagarjuna@sakshi.com -
ట్యాబ్లెట్స్‌లో ఇంటర్నెట్ వాడకం తక్కువే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ వినియోగం విషయంలో ట్యాబ్లెట్స్ కంటే ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లనే ఎక్కువ మంది ఎంచుకుంటున్నారని డెలాయిట్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇంటర్నెట్ కోసం 69 శాతం మంది ల్యాప్‌టాప్‌లపై, 64 శాతం మంది స్మార్ట్ఫోన్లపై ఆధారపడుతున్నారట. కేవలం 24 శాతం మంది ట్యాబ్లెట్లను వాడుతున్నారట. హైదరాబాద్ సహా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణే, అహ్మదాబాద్ నగరాల్లోని 2 వేల మంది వినియోగదార్లపై డెలాయిట్ ఆన్లైన్ సర్వే నిర్వహించింది. స్మార్ట్‌ఫోన్ వినియోగదార్లలో 60 శాతం మంది డేటా కోసం మొబైల్ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నారు. ల్యాప్‌టాప్ వినియోగిస్తున్న వారిలో 80 శాతం మంది ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్‌ను వాడుతున్నారు. విభిన్న డేటా ప్లాన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ చాలా మంది మొబైల్ కస్టమర్లు వైఫైకి మళ్లుతున్నారట. 12 నెలలుగా అంచనాలకు మంచి మొబైల్ బిల్లు వస్తోందని సర్వేలో పాల్గొన్న 60 శాతం మంది తెలిపారు. ఇక ట్యాబ్లెట్ కొనుగోలు సమయంలో కస్టమర్లకు బ్రాండ్ తొలి ప్రాధాన్యత కాగా, మన్నిక, ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాటరీ జీవిత కాలం, డిజైన్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అదే స్మార్ట్‌ఫోన్లకైతే బ్యాటరీ సామర్థ్యం కీలకపాత్ర పోషిస్తోంది. డిజైన్, మన్నిక, బ్రాండ్, ఆపరేటింగ్ సిస్టమ్, కెమెరా సామర్థ్యం తర్వాతి ప్రాధాన్యతలని డెలాయిట్ వెల్లడించింది. -
పీసీలకు ట్యాబ్లెట్లు ప్రత్యామ్నాయం కాదు
న్యూఢిల్లీ: పర్సనల్ కంప్యూటర్ల(డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్)కు ట్యాబ్లెట్ ఇప్పుడప్పుడే ప్రత్యామ్నాయం కాదని సైబర్‌మీడియారీసెర్చ్(సీఎంఆర్) సర్వేలో తేలింది. ఎక్కడికైనా వెళ్లేటప్పుడు సోషల్ నెట్వర్కింగ్ సైట్లు, వినోద సంబంధిత కంటెంట్‌ను యాక్సెస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతోనే ట్యాబ్లెట్లను కొనుగోలు చేస్తున్నామని సీఎంఆర్ సర్వేలో పాల్గొన్నవారిలో నలుగురిలో ముగ్గురు చెప్పారు. భారత్‌లోని 20 నగరాల్లో 3,600 మందిపై నిర్వహించిన ఈ సర్వే వెల్లడించిన ఇతర ముఖ్యాంశాలు..., ట్యాబ్లెట్ ప్రధాన కంప్యూటర్ డివైస్‌గా మారేందుకు సమయం పడుతుందని 78%మంది పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత ట్యాబ్లెట్లకు ప్రాధాన్యత ఇస్తామని 87% మంది అన్నారు. రోజుకు రెండు గంటలకు పైగా ట్యాబ్లెట్‌ను ఉపయోగించే వారి సంఖ్య 51 శాతంగా ఉంది. ఈ సమయం భవిష్యత్తులో పెరగే అవకాశాలున్నాయి. చాటింగ్, మెసేజింగ్, ఇమెయిల్ సర్వీసుల కోసం ఒక్క రోజులో ట్యాబ్లెట్‌ను పలుమార్లు ఉపయోగించే వారు 40 శాతంగా ఉన్నారు. -
టాబ్లెట్స్ పై పెరుగుతున్న యువత మోజు: సర్వే
డెస్క్ టాప్, ల్యాప్ టాప్స్ కనుమరుగయ్యే పరిస్థితి ఇప్పట్లో లేదని అని సైబర్ మీడియా రీసర్చ్ ఇండియా వెల్లడించింది. మార్కెట్ లోకి ఎన్నో మొబైల్ కంప్యూటర్ వచ్చినా.. డెస్క్ టాప్, ల్యాప్ టాప్ ల ప్రాముఖ్యత తగ్గలేదని సర్వేలో వెల్లడైంది. ఇటీవల 'టాబ్లెట్స్ యూసేజ్ అండ్ ఆడాప్షన్ ట్రెండ్స్ 2013' అనే అంశంపై సైబర్ మీడియా రీసెర్స్ ఇండియా 20 భారతీయ నగరాల్లో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అత్యధికంగా వినియోగదారులు టాబ్లెట్స్ కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారని సర్వేలో వెల్లడైంది. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్, వినోదాత్మక సమాచారాన్ని పొందేందుకు, ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంట తీసుకు వెళ్లడానికి టాబ్లెట్స్ సౌకర్యంగా ఉన్నాయని సీఎంఆర్ సర్వేలో వెల్లడైంది. అయితే 78 శాతం మంది టాబ్లెట్స్ కన్నా.. డెస్క్ టాప్, ల్యాప్ టాప్ లనే యువత ఇష్టపడుతున్నారని సర్వే సమాచారం. సెప్టెంబర్-నవంబర్ 2013లో మొత్తం 3600 మందిలో 13 ఏళ్ల నుంచి 55 ఏళ్ల లోపు టాబ్లెట్ వినియోగదారులు 2400, వినియోగించని వారిని 1200 మందిని ఎంచుకుని సర్వే నిర్వహించారు. ఆండ్రాయిడ్ టాబ్లెట్స్ కు 87 శాతం మొగ్గు చూపగా, 10 శాతం మంది ఆపిల్ ఐపాడ్ ను వినియోగానికి యువత ఇష్టపడుతున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. టాబ్లెట్స్ వినియోగించని వారు కూడా కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా చాటింగ్, మెసెజ్, ఈమెయిల్ వినియోగానికే టాబ్లెట్స్ వినియోగిస్తున్నారని సీఎంఆర్ ఇండియా తెలిపింది. -
ఉచితంగా ల్యాప్‌టాప్‌లు
ముంబై: అసంఘటిత రంగాల కార్మికుల ఓట్లు రాబట్టుకోవడానికి కాంగ్రెస్ అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇళ్లలో పనిచేసే వాళ్లు, నిర్మాణరంగ కార్మికుల పిల్లలకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని పృథ్వీరాజ్ చవాన్ సర్కారు భావిస్తోంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇది వరకే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వడం తెలిసిందే. మొదటిదశలో లక్షమంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామని మహారాష్ట్ర కార్మికశాఖ వర్గాలు తెలిపాయి. ఎన్నికల ముహూర్తం సమీపిస్తున్నందున వీటి పంపిణీ పథకాన్ని వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఇళ్ల పనిమనుషుల పిల్లలకు మొదటిదశలో ఐదువేల ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయడానికి రూ.25 కోట్లు కేటాయించాలని కార్మికశాఖ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పనిమనుషుల సంక్షేమార్థం ఏర్పాటైన బోర్డు వద్ద నిధులు లేకపోవడంతో కార్మికశాఖ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. ‘బస్తాలు మోసే కూలీలు, నిర్మాణరంగ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన బోర్డులు వద్ద మాత్రం తగినన్ని నిధులున్నాయి. కాబట్టి అవి కూలీలు, నిర్మాణరంగ కార్మికుల సంతానానికి అవి త్వరలోనే ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి’ అని కార్మికశాఖ అధికారి ఒకరు వివరించారు. కాలేజీ విద్యార్థులకు మొదటిదశలోనే ల్యాప్‌టాప్‌లు అందజేస్తామని, తదనంతరం హైస్కూలు విద్యార్థులకు వర్తింపజేస్తామని వివరించారు. అయితే నౌకర్ల పిల్లలకు ఈ పథకం వర్తింపజేయాలంటే ముందు ఇళ్ల పనుమనుషులు బోర్డులో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. వీరిని గుర్తించి వివరాలు నమోదు చేయడం కష్టసాధ్యమేనని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రైవేటుసంస్థల సాయం తీసుకుంటామని ఆయన వివరించారు. -
కార్మికుల పిల్లలకు ల్యాప్‌టాప్‌లు
ట్యాబ్లెట్లు కూడా పంపిణీ చేయాలని నిర్ణయించిన సర్కార్ ఈ మేరకు కార్మిక శాఖకు ఆదేశాలు అర్హుల వివరాలను సేకరించే పనిలో అధికారులు. కార్మికుల పిల్లలు ఉన్నత చదువులు చదివేందుకు వీలుగా ఆధునిక సాంకేతికతకు అలవాటుపడేలా చేయాలని రాష్ట్ర సర్కార్ యోచిస్తోంది. వీరికి ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ పథకానికి ఎంతమంది విద్యార్థులు అర్హులనే వివరాలను సమర్పించాలని కార్మిక శాఖను కోరింది. ఈ మేరకు భవన నిర్మాణం పనులు నిర్వహించే కార్మికుల పిల్లలతో పాటు మథాడి (కూలీ), డొమాస్టిక్ హెల్పర్ల చిన్నారుల బయోడేటా సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ఈ మూడు బోర్డుల్లో రిజిస్ట్రేషన్ నమోదుచేసుకున్న ఉద్యోగుల పిల్లలకు మాత్రమే ఈ పరికరాలను పంపిణీ చేస్తామని కార్మిక శాఖ అధికారి తెలిపారు. అయితే ఈ ప్రణాళిక ఇంకా ప్రారంభ దశలోనే ఉందన్నారు. కార్మికుల పిల్లల్లో నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఈ ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు దోహదపడుతాయన్న ఉద్దేశంతోనే అందజేసేందుకు సిద్ధమయ్యామని చెప్పారు. ఐదు నుంచి పదో తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్న కార్మికుల పిల్లలు టాబ్లెట్ పొందేందుకు అర్హులని, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లతోపాటు ఇంటర్నెట్ కనెక్షన్లను కూడా ఇస్తామని తెలిపారు. ఈ పరికరాలను పొందేందుకు అర్హత కలిగిన పిల్లలు ఊహించినదానికంటే అధిక సంఖ్యలో ఉండటంతో తాము ప్రాధాన్యతను బట్టి వీటిని పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. వృత్తి విద్యా కోర్సులు చేస్తున్న విద్యార్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఎంతో దోహదపడుతాయి పిల్లల ఉత్సాహాన్ని పెంచేందుకు ఈ పథకం దోహదపడుతుందని కార్మిక శాఖ మంత్రి హసన్ ముష్రిఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరో మూడు వారాల్లో ఈ పనులు పూర్థిస్థాయిలో ప్రారంభమవుతాయన్నారు. ఇదిలావుండగా మహారాష్ట్రలో నిర్మాణాలు, డొమెస్టిక్, మథాడికి చెందిన బోర్డులలో దాదాపు ఆరు లక్షలకు పైగా కార్మికులు నమోదు చేసుకున్నారు. డొమెస్టిక్ వెల్ఫేర్ బోర్డు మినహా మిగతా ఈ రెండు బోర్డులకు సంక్షేమ నిధుల ద్వారా రుణాలు వస్తున్నాయి. దీంతో ఈ రెండు బోర్డులు ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నాయని కార్మిక శాఖ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.