
మన దేశంలో కొత్త మొబైల్స్‌తో పోటీగా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ విక్రయాలు జరుగుతున్నాయి. మొబైల్ పరికరాల పరిశ్రమ సంస్థ ఐసీఈఏ, పరిశోధన సంస్థ ఐడీసీ కలిసి విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశంలో సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 2025 నాటికి ఇప్పుడున్న దానికంటే రెట్టింపు స్థాయిలో పెరిగి 4.6 బిలియన్ డాలర్లకు(సుమారు రూ. 34,500 కోట్లు) ఉంటుందని అంచనా. వినియోగదారులు ఈ ఏడాదిలో 2.3 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ.17,250 కోట్లు) విలువ గల 25 మిలియన్ సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసినట్లు ఈ నివేదికలో తేలింది.
సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ సగటు ధర 94 డాలర్ల(సుమారు రూ. 7,050)గా ఉన్నట్లు నివేదిక తెలిపింది. "ఈ మార్కెట్ పెరుగుదల వల్ల ఈ-వ్యర్థాలు ఉత్పత్తి కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు" ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్(ఐసీఇఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రూ నివేదికను ప్రారంభించిన సందర్భంగా తెలిపారు. మొత్తం సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్‌లలో 95 శాతానికి పైగా ఎలాంటి డ్యామేజ్ కాకముందే విక్రయస్తున్నారని, మిగిలిన ఐదు శాతం స్మార్ట్‌ఫోన్‌లను రిపేర్ వచ్చినప్పుడు విక్రయిస్తున్నారు.
"వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అతిపెద్ద వాటా(90 శాతానికి పైగా)ను కలిగి ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ ల్యాప్ టాప్స్, స్మార్ట్ వాచ్స్, గేమింగ్ కన్సోల్స్, కెమెరాలు వంటి ఇతర పరికరాల విక్రయాలు కూడా క్రమంగా పుంజుకుంటున్నాయి" అని నివేదిక తెలిపింది. సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారుల్లో 78 శాతం మంది నెలవారీ ఆదాయం రూ.30,000 కంటే తక్కువగా ఉంటే, 18 శాతం మంది నెలవారీ ఆదాయం రూ.30,000-రూ.50,000గా ఉంటుందని నివేదిక అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment