ఈ రాశి వారికి ప్రముఖుల నుంచి ఆహ్వానాలు.. పనుల్లో కొంత పురోగతి | Rasi Phalalu: Daily Horoscope On 9 March 2025 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ప్రముఖుల నుంచి ఆహ్వానాలు.. పనుల్లో కొంత పురోగతి

Published Sun, Mar 9 2025 5:34 AM | Last Updated on Sun, Mar 9 2025 10:40 AM

Rasi Phalalu: Daily Horoscope On 9 March 2025 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం,శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి: శు.దశమి ఉ.10.46 వరకు తదుపరి ఏకాదశి, నక్షత్రం: పునర్వసు రా.2.16 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: ప.2.28 నుండి 4.00 వరకు, దుర్ముహూర్తం: సా.4.34 నుండి 5.22 వరకు, అమృత ఘడియలు: రా.12.01 నుండి 1.36 వరకు.

సూర్యోదయం        :  6.17
సూర్యాస్తమయం    :  6.04
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: పలుకుబడి పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి. కీలక విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. పనుల్లో కొంత పురోగతి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కవచ్చు.

వృషభం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. పనులు హఠాత్తుగా వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

మిథునం: శుభవార్తలు అందుతాయి. మిత్రుల నుంచి ధనలబ్ధి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. కొత్త పరిచయాలు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కర్కాటకం: నిర్ణయాలలో పొరపాట్లు. వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహం: నూతన పరిచయాలు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

కన్య: వ్యతిరేక పరిస్థితుల నుంచి బయటపడతారు. విద్యార్థుల ఆశలు నెరవేరతాయి. ఆకస్మిక ధనలాభం. ముఖ్యమైన పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

తుల: పనులు మధ్యలో వాయిదా. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో విభేదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా సాగతాయి.

వృశ్చికం: సన్నిహితులతో కలహాలు. కొత్త రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. శ్రమకు ఫలితం ఉండదు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

ధనుస్సు: వ్యవహారాలలో పురోగతి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు విస్తరణ. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

మకరం: నూతన పరిచయాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆశ్చర్యకర సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యసాధన.

కుంభం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా సాగవు. అనుకోని ప్రయాణాలు. రుణదాతల ఒత్తిడులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు అవాంతరాల మధ్య సాగుతాయి.

మీనం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. శ్రమాధిక్యం. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement