ఆన్లోలేని సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు విమానాల్లో నిషేధం | planes to allow mobiles and laptops which are on | Sakshi
Sakshi News home page

ఆన్లోలేని సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు విమానాల్లో నిషేధం

Published Tue, Jul 8 2014 3:57 PM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

ఆన్లోలేని సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు విమానాల్లో నిషేధం - Sakshi

ఆన్లోలేని సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు విమానాల్లో నిషేధం

వాషింగ్టన్: విమానాశ్రయాల్లో తనిఖీని కూడా తప్పించుకోగలిగే సరికొత్త బాంబులను సిరియా, యెమెన్ దేశాల ఇస్లామ్ మిలిటెంట్లు తయారుచేస్తున్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో అమెరికా మరింత అప్రమత్తమైంది. అమెరికాకు నేరుగా విమాన సదుపాయం ఉన్న వివిధ దేశాల్లోని విమానాశ్రయాల్లో భద్రతను పెంచేందుకు మరిన్ని చర్యలు తీసుకుంది. పవర్ ఆన్‌చేయని సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను విమానాల్లో అనుమతించబోమని, సదరు ఎలెక్ట్రానిక్ పరికరాలు కలిగిఉంటే, విమానం ఎక్కే ముందుగా మరింత నిశితంగా తనిఖీలకు సిద్ధపడాలని అమెరికా స్పష్టంచేసింది.

తమతో తీసుకెళ్లే ఎలెక్ట్రానిక్ పరికరాలు పనిచేస్తున్నవేనని, అవి పేలుడు వస్తువులు కాదని రుజువు చేసుకునేందుకు వీలుగా, ప్రయాణికులు వాటిని ఆన్‌చేసి ఉంచవలసిందిగా విదేశాల విమానాశ్రయాల్లోని తనిఖీ అధికారులు కోరతారని అమెరికా రవాణా భద్రతా శాఖ పరిపాలనా విభాగం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. చార్జింగ్‌లేని ఎలెక్ట్రానిక్ పరికరాలతో విమానంలో ప్రయాణానికి అనుమతించబోమని కూడా స్పష్టంచేసింది.

 అమెరికాకు నేరుగా విమాన సదుపాయం ఉన్న కొన్ని దేశాల్లోని విమానాశ్రయాల్లో మరిన్ని భద్రతా చర్యలను అమలుచేయాలని అమెరికా భద్రతా వ్యవహారాల మంత్రిత్వ శాఖ గతవారమే రవాణా భద్రతా శాఖను ఆదేశించింది. విమాన ప్రయాణికులకు అత్యున్నతస్థాయి భద్రతపై పూచీకోసం, భద్రతా చర్యలను ఎప్పటికప్పుడు సవరించుకుంటూ ఉంటామని అమెరికా రవాణా భద్రతా శాఖ తెలిపింది. మధ్యప్రాచ్యం, యూరప్ ప్రాంతాల్లోని ఉగ్రవాదుల నుంచి తాజాగా ఎదురవుతున్న మ్పుపును ఎదుర్కొనేందుకే ఈచర్యలు చేపట్టినట్టు పేర్కొంది. విమానాశ్రయాల్లో ఎలెక్ట్రానిక్ పరికాలపై తనిఖీలను ముమ్మరంచేయడంపై అమెరికా అవసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని బ్రిటన్, ప్రాన్స్, జర్మనీ ఇప్పటికే స్పష్టం చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement