
ఆగు.. నువ్వు మా షాప్‌లోకి అడుగు పెట్టద్దు!
పాతకాలం సంగతేమిటోగానీ ఈ కాలం దొంగలను కనిపెట్టడం చాలా కష్టం సుమీ. అమెరికా అంటే టెక్నాలజీకి పెట్టింది పేరు. ఆ టెక్నాలజీతో ఒక్క దొంగతనం జరగకుండా చూడవచ్చు. అయినప్పటికీ చిన్నాచితక దొంగతనాల వల్ల పెద్ద పెద్ద షాపులు సైతం బిక్కచచ్చిపోతున్నాయి.ఏంచేయాలో తోచక దిక్కులు చూస్తున్నాయి. షాప్‌లిఫ్టింగ్ అనేది అమెరికాలో పెద్ద సమస్యగా మారింది, ఒక నివేదిక ప్రకారం 2019 నుంచి 2023 మధ్య అమెరికా అంతటా షాప్ లిఫ్టింగ్ 93 శాతం పెరిగింది. గత సంవత్సరం కూడా తక్కువేమీ లేదు.
సౌత్ మెంఫిస్ వాల్ మార్ట్ నుంచి నూడుల్స్, ఇతర ప్యాకెట్లను దొంగిలించినందుకు అష్లే క్రాస్ అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. 37 ఏళ్ల క్రాస్ చిన్నాచితక దొంగతనాల్లో పెద్ద పేరు తెచ్చుకుంది. అష్లే క్రాస్‌ను మల్టీనేషనల్ రిటైల్ స్టోర్ వాల్‌మార్ట్ ‘అథరైజేషన్ ఆఫ్ ఏజెన్సీ’ జాబితాలో చేర్చింది. అమెరికాలోని ఏ వాల్ మార్ట్‌లోకీ అడుగు పెట్టకుండా ఆమెను నిషేధించారు.
‘మేము మా కస్టమర్‌లకు విలువ ఇస్తాం. వారు ఆహ్లాదకరమైన షాపింగ్ అనుభవాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటాం. అరుదుగా అయినప్పటికీ కొందరిని స్టోర్‌లలోకి స్వాగతించని సందర్భాలు ఉన్నాయి’ అని వాల్‌మార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.
చదవండి: దున్నకుండా.. కలుపు తీయకుండా.. రసాయనాల్లేకుండానే సాగు!
ఒక్కో గ్రాము ధర రూ. 53 వేల కోట్లు, అంత ‘మ్యాటర్’ ఏముంది?
Comments
Please login to add a commentAdd a comment