Theft
-
చాక్లెట్లు దొంగలించిందని చంపేశారు !
రావల్పిండి: పాకిస్తాన్లో పేదరికం కారణంగా చిన్నతనంలోనే బాలకార్మికులుగా ఇంటిపని చేసే చిన్నారుల్లో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో చాక్లెట్లు దొంగతనం చేసిందని ఆరోపిస్తూ 13 ఏళ్ల బాలికను ఆ ఇంటి యాజమానులు చితకబాదడంతో గాయాలపాలై ఆ అమ్మాయి చనిపోయిన ఘటన ఆగ్నేయ పాకిస్తాన్లో గత బుధవారం సాయంత్రం జరిగింది. రావల్పిండిలో నమోదైన ఈ కేసులో యజమాని రషీద్ షఫీఖ్, ఆయన భార్య సనా, వాళ్ల ఖురాన్ బోధకుడినీ పోలీసులు అరెస్ట్‌చేశారు. బాలిక కాళ్లు, చేతులు, చీలమండ పలు చోట్ల విరిగినట్లు పోస్ట్‌మార్టమ్ ప్రాథమిక నివేదికలో తేలింది. సమగ్ర నివేదిక ఇంకా రావాల్సి ఉంది. బాలిక ఇఖ్రా పనిచేస్తున్న యజమాని దంపతులకు 8 మంది సంతానం. వాళ్ల బాగోగులు, ఇంటి పనులు చూసుకునేందుకు రెండేళ్ల క్రితం వాళ్లింట్లో ఇఖ్రా పనికి కుదిరింది. జీతంగా నెలకు దాదాపు రూ.2,430 ఇచ్చేవారు. చాక్లెట్లు దొంగతనం చేసిందని ఆరోపిస్తూ ఇఖ్రాను దారుణంగా హింసించారని పోలీసులు అనుమానిస్తున్నారు. తలకు తీవ్రగాయమైనట్లు సంబంధిత వీడియోల్లో తెలుస్తోంది. అన్నపానీయాలు ఇవ్వకుండా కడుపు మార్చారని, కట్టేసి కొట్టారని, చపాతీలు చేసే కర్రతో కొట్టడంతో పుర్రె పగిలిందని వార్తలొచ్చాయి. బాలిక మరణవార్త తెల్సి దేశవ్యాప్తంగా వేలాది మంది బాలల హక్కుల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇఖ్రాకు న్యాయం జరగాలని డిమాండ్‌చేశారు. తన బిడ్డ మరణాన్ని 45 ఏళ్ల రైతు సనా ఉల్లాహ్ ఏడుస్తూ చెప్పారు. ‘‘నా కుమార్తె ఆరోగ్యం బాలేదని పోలీసులు ఫోన్‌చేసి ఆస్పత్రికి రమ్మన్నారు. వచ్చి చూస్తే ఆస్పత్రి బెడ్‌పై ఇఖ్రా చలనంలేకుండా పడి ఉంది. కొద్దిసేపటికి ప్రాణాలు కోల్పోయింది. నాకున్న అప్పు తీర్చుకునేందుకు గతిలేక ఇఖ్రాను పనికి పంపించాను’’అంటూ తండ్రి దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చారు. తండ్రి అప్పులు తీర్చేందుకు, ఇంట్లో ఖర్చులకు పనికొస్తాయనే ఉద్దేశ్యంతో ఇఖ్రా ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే పనులకు వెళ్లడం మొదలెట్టింది. పేదరికంలో మగ్గిపోతున్న బాలకార్మికుల కుటుంబాలు ఇలాంటి సందర్భాల్లో న్యాయం కోసం తుదికంటా పోరాటం చేయడం పాకిస్తాన్లో చాలా అరుదు. నిందితులను దేవుడే క్షమిస్తాడని మనసును రాయి చేసుకుని ఆ దోషులు నష్టపరిహారంగా ఇచ్చే ఏంతో కొంత మొత్తాలను తీసుకుని కోర్టుల బయటే రాజీ కుదుర్చుకోవడం పాకిస్తాన్లో పరిపాటిగా మారింది. ఇఖ్రా కేసు సైతం చివరకు ఇలాంటి ‘పరిష్కారం’దిశలో పయనిస్తుందని పలువురు సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. యూనిసెఫ్ గణాంకాల ప్రకారం పాకిస్తాన్లో 33,00,000 మంది బాలకార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లో ఇంటిపనుల్లో నిమగ్నమైన మొత్తం 85 లక్షల మంది కార్మికుల్లో అత్యధిక శాతం మంది మహిళలు, బాలికలేనని అంతర్జాతీయ కార్మిక సంఘం(ఐఎల్ఓ) పేర్కొంది. -
మహిళ చేతివాటం, దెబ్బకి బ్యాన్ చేసిన వాల్‌మార్ట్
పాతకాలం సంగతేమిటోగానీ ఈ కాలం దొంగలను కనిపెట్టడం చాలా కష్టం సుమీ. అమెరికా అంటే టెక్నాలజీకి పెట్టింది పేరు. ఆ టెక్నాలజీతో ఒక్క దొంగతనం జరగకుండా చూడవచ్చు. అయినప్పటికీ చిన్నాచితక దొంగతనాల వల్ల పెద్ద పెద్ద షాపులు సైతం బిక్కచచ్చిపోతున్నాయి.ఏంచేయాలో తోచక దిక్కులు చూస్తున్నాయి. షాప్‌లిఫ్టింగ్ అనేది అమెరికాలో పెద్ద సమస్యగా మారింది, ఒక నివేదిక ప్రకారం 2019 నుంచి 2023 మధ్య అమెరికా అంతటా షాప్ లిఫ్టింగ్ 93 శాతం పెరిగింది. గత సంవత్సరం కూడా తక్కువేమీ లేదు.సౌత్ మెంఫిస్ వాల్ మార్ట్ నుంచి నూడుల్స్, ఇతర ప్యాకెట్లను దొంగిలించినందుకు అష్లే క్రాస్ అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. 37 ఏళ్ల క్రాస్ చిన్నాచితక దొంగతనాల్లో పెద్ద పేరు తెచ్చుకుంది. అష్లే క్రాస్‌ను మల్టీనేషనల్ రిటైల్ స్టోర్ వాల్‌మార్ట్ ‘అథరైజేషన్ ఆఫ్ ఏజెన్సీ’ జాబితాలో చేర్చింది. అమెరికాలోని ఏ వాల్ మార్ట్లోకీ అడుగు పెట్టకుండా ఆమెను నిషేధించారు.‘మేము మా కస్టమర్లకు విలువ ఇస్తాం. వారు ఆహ్లాదకరమైన షాపింగ్ అనుభవాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటాం. అరుదుగా అయినప్పటికీ కొందరిని స్టోర్లలోకి స్వాగతించని సందర్భాలు ఉన్నాయి’ అని వాల్‌మార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: దున్నకుండా.. కలుపు తీయకుండా.. రసాయనాల్లేకుండానే సాగు!ఒక్కో గ్రాము ధర రూ. 53 వేల కోట్లు, అంత ‘మ్యాటర్’ ఏముంది? -
కేడీల ఆట కట్టించిన హైదరాబాద్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నారాయణగూడ పోలీసుస్టేషన్ పరిధిలో నివసించే కేడియా ఆయిల్స్ కంపెనీ యజమాని రోహిత్ కేడియా (Rohit Kedia) ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. బిహార్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముగ్గురు నిందితులు దాదాపు రూ.40 కోట్ల విలువైన సొత్తు దోచుకుపోగా... అత్యంత వేగంగా స్పందించిన పోలీసులు 20 గంటల్లో వారిని పట్టుకున్నారు. ఈ నిందితుల్లో ఒకరు గతేడాది దోమలగూడ పోలీసుస్టేషన్ (Domalguda Police Station) పరిధిలో స్నేహలత దేవిని చంపి, రూ.కోటి విలువైన సొత్తు దోపిడీకి పాల్పడిన కేసులో వాంటెడ్‌గా ఉన్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) పేర్కొన్నారు. తూర్పు మండల డీసీపీ బాలస్వామి, అదనపు డీసీపీలు అందె శ్రీనివాసరావు, జె.నర్సయ్యలతో కలిసి గురువారం ఐసీసీసీలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్వాల్ వివరాలు వెల్లడించారు. కుమార్తె పెళ్లి పనుల కోసం.. రాజేంద్రనగర్‌లో కేడియా ఆయిల్స్ కంపెనీ నిర్వహిస్తున్న రోహిత్ కేడియా హిమాయత్ నగర్లో నివసిస్తున్నారు. ఆయన కుటుంబం వద్ద దాదాపు 20 మంది పనివాళ్లు ఉన్నారు. దాదాపు ఎకరం విస్తీర్ణంలో ఉండే వీరి ఇంటి ప్రాంగణంలోనే పనివాళ్ల కోసం మూడంతస్తుల భవనం నిర్మించారు. రోహిత్ ఇంట్లో బిహార్‌లోని బిరోల్ గ్రామానికి చెందిన సుశీల్ ముఖియా రెండేళ్ల పాటు పని చేసి ఏడాది క్రితం మానేశాడు. ఇటీవల రోహిత్ కుమార్తె వివాహం నిశ్చయం కావడంతో పాటు దుబాయ్‌లో డెస్టిషన్ మ్యారేజ్ చేయాలని నిర్ణయించారు. పెళ్లి పనుల కోసం సహాయంగా ఉండటానికి సుశీల్‌ను సంప్రదించిన రోహిత్ 15 రోజుల క్రితం పిలిపించారు. ఇదే ఇంట్లో పని చేసే పశ్చిమ బెంగాల్ మహిళ బసంతి ఆర్హికి ఇతడితో గతంలోనే వివాహేతర సంబంధం ఉంది. నేరగాడితో గతంలో ఉన్న పరిచయంతో.. సుశీల్‌తో పాటు బసంతి సైతం మిగిలిన పని వాళ్లతో కలిసి రోహిత్ ఇంటి ప్రాంగణంలోని భవనంలోనే ఉంటున్నారు. కుమార్తె వివాహం కోసం రోహిత్ ఫ్యామిలీ మొత్తం గత వారం దుబాయ్ వెళ్లింది. ఇదే అదనుగా భావించిన సుశీల్.. ఆ ఇంటిని దోచేయడానికి ఢిల్లీలో ఉండే తన స్నేహితుడు మోల్హు ముఖియాను నగరానికి పిలిపించాడు. గత ఏడాది దోమలగూడ పరిధిలో స్నేహలత అనే వృద్ధురాలిని హత్య చేసిన బిహారీలు రూ.కోటి సొత్తు దోచుకుపోయారు. ఈ కేసులో ఆమె ఇంట్లో పని చేసే మహేష్ ముఖియాతో పాటు మోల్హు, రాహుల్ నిందితులుగా ఉన్నారు. దోపిడీ జరిగిన ఎనిమిది నెలలకు మహేష్ చిక్కినా.. మిగిలిన ఇద్దరూ పరారీలోనే ఉండిపోయారు. మోల్హు నేర చరిత్ర తెలిసిన సుశీల్ తాజా నేరం కోసం ఢిల్లీ తలదాచుకున్న అతడిని పిలిపించాడు. వీరిద్దరూ కలిసి మంగళవారం తెల్లవారుజామున సర్వెంట్స్ బిల్డింగ్ నుంచి రోహిత్ ఇంట్లోకి ప్రవేశించారు. అల్మారాలు, లాకర్లు పగులకొట్టి 710 గ్రాముల వజ్రాలతో కూడిన ఆభరణాలు, 1.4 కేజీల స్వర్ణాభరణాలు, రూ.19.63 లక్షలు, 24 దేశాల కరెన్సీ, 215 గ్రాముల వెండి అపహరించారు.మూడు నగరాలకు ప్రత్యేక బృందాలు... మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో రోహిత్ ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని రోహిత్ మేనేజర్ అభయ్ కేడియా గుర్తించారు. వెంటనే నారాయణగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసును ఛేదించడానికి నారాయణగూడ పోలీసు, టాస్క్‌ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయి. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా నిందితులు ముగ్గురూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లారని, అక్కడ నుంచి ఢిల్లీ వెళ్తే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎక్కారని గుర్తించారు.చదవండి: సైబర్ నేరాలతో రూ.88.58 లక్షల కోట్లు దోపిడీ దీంతో మూడు ప్రత్యేక బృందాలు భోపాల్, నాగ్‌పూర్, పట్నాలకు వెళ్లి కాపుకాశాయి. డీసీపీ బాలస్వామి మహారాష్ట్ర పోలీసులతో తనకు ఉన్న పరిచయాలను వినియోగించి ఈ నిందితుల సమాచారం ఇచ్చారు. దీంతో మంగళవారం రాత్రి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ నాగ్‌పూర్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. నగర పోలీసులు, అక్కడి జీఆర్పీ అధికారులతో కలిసి సోదాలు చేశారు. ముగ్గురు నిందితులతో పాటు చోరీ సొత్తు మొత్తం స్వాదీనం చేసుకుని నగరానికి తీసుకువచ్చారు.ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇస్తాంరోహిత్ కేడియా ఇంటి నుంచి చోరీ అయిన సొత్తులో వజ్రాలే 3,300 క్యారెట్లు ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ఒక్కో క్యారెట్ రూ.1.12 లక్షలు పలుకుతోంది. ఈ ప్రకారం చూస్తే వీటి విలువే రూ.37 కోట్ల వరకు ఉంది. వీటితో పాటు భారీగా విదేశీ కరెన్సీ, బంగారం, నగదు చోరీకి గురయ్యాయి. సొత్తు మొత్తం రికవరీ చేసి వీడియో కాల్ ద్వారా దుబాయ్‌లో ఉన్న యజమానికి చూపించి ఖరారు చేసుకున్నాం. భారీ సొత్తు చోరీ, రికవరీపై ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇవ్వాలని నిర్ణయించాం. నగదు, సొత్తును యజమాని వారి వద్ద డిక్లేర్ చేశారా? లేదా? అనేది ఆ అధికారుల విచారణలో వెలుగులోకి వస్తుంది. – సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ -
కిలాడీ పనిమనిషి
కర్ణాటక: ఏడాదిన్నర కాలంగా పని చేస్తున్న ఇంటిలోని గుట్టుమట్లను తెలుసుకుంది, ఓ రోజు బంగారు, నగదు చోరీ చేసి, చివరకు కటకటాల పాలైన పనిమనిషి ఉదంతమిది. వివరాలు.. పరప్పన అగ్రహార ఠాణా పరిధిలోని ఓ ఇంటిలో నిందితురాలు పనిచేసేది. చాలా బంగారు ఆభరణాలు, నగదు ఉండటాన్ని గమనించిన కిలాడీలో దుర్బుద్ధి పుట్టింది. బంగారు నగలు, నగదు మాయం చేసి ఏమీ తెలియనట్లు పని చేసుకుంటోంది. సొత్తు కనబడకపోవడంతో ఇంటి యజమాని ఆమెపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు కాగానే భర్త, అతని అన్నతో కలిసి నిందితురాలు పరారైంది. పోలీసులు గాలింపు జరిపి ముగ్గురినీ అరెస్టు చేశారు. వారి నుంచి రూ.22 లక్షల విలువ చేసే 273 గ్రాముల బంగారం, నగదును స్వాదీనపరచుకున్నారు. -
2,500 ఏళ్లనాటి బంగారు హెల్మెట్‌ను... ఎత్తుకెళ్లారు
ఎస్సెన్ (నెదర్లాండ్స్): నెదర్లాండ్స్‌లో దొంగలు ఏకంగా వేల ఏళ్లనాటి బంగారు హెల్మెట్‌పైనే కన్నేశారు. ఎలాగైనా చేజిక్కించుకోవాలనుకున్నారు. చివరికి అనుకున్నది సాధించారు. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను బాంబులతో బద్ధలుకొట్టి మరీ దోచుకెళ్లిపోయారు. అది ఏకంగా 2,500 ఏళ్లనాటి బంగారు హెల్మెట్! దాంతో ఈ దొంగతనం సంచలనం సృష్టించింది. ప్రాచీన వస్తు ప్రదర్శన కోసం తమ దేశం నుంచి నెదర్లాండ్స్ పట్టుకుపోయిన అత్యంత విలువైన వస్తువులు చోరశిఖామణుల పాలబడటంతో రొమేనియా సైతం దిగ్భ్రాంతికి గురైంది. నెదర్లాండ్స్‌లోని ఎస్సెన్ నగరంలోని డ్రెంట్స్ పురాతన వస్తుప్రదర్శనశాలలో ఈ భారీ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం తెల్లవారుజామున ముసుగులు ధరించిన దొంగలు మ్యూజియం వద్దకొచ్చి బయటివైపు ఉన్న భారీ తలుపును రంధ్రాలు పెట్టే మెషీన్, ఇనుప రాడ్లతో ఎలాగోలా తెరిచారు. అక్కడే లోపలివైపు ఇంకో భారీ తలుపు ఉంది. అత్యంత పటిష్టంగా ఉన్న దీనిని మామూలుగా తెరవడం సాధ్యంకాదని దొంగలకు తెలుసో ఏమో, ముందుజాగ్రత్తగా పెద్ద బాంబును వెంట తెచ్చుకున్నారు. తలుపుకు బాంబు అమర్చి పేల్చేశారు. తునాతునకలైన ద్వారం గుండా ఎంచక్కా లోపలికి వెళ్లి అక్కడ అత్యంత ప్రాచీనమైన నాలుగు వస్తువులను తీసుకుని ఉడాయించారు. వెలకట్టలేని హెల్మెట్ చోరీకి గురైన వాటిల్లో 2,500 ఏళ్ల క్రితం నాటి పుత్తడితో చేసిన హెల్మెట్ ఉంది. క్రీస్తుపూర్వం 50వ సంవత్సరంలో దీనిని తయారు చేశారని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. దాదాపు 907 గ్రాముల బరువైన ఈ హెల్మెట్‌ను రొమేనియాలో వంద సంవత్సరాల క్రితం ఒక కుగ్రామంలో కనుగొన్నారు. ‘హెల్మెట్ ఆఫ్ కోటోఫెనెస్టీ’గా పిలుచుకునే దీనిని పూర్వకాలంలో ఉత్సవాలు, సంబరాల్లో ఉపయోగించేవారు. హెల్మెట్ ముందుభాగంలో పెద్ద కళ్లను చెక్కారు. దుష్టశక్తుల బారిన పడకుండా కాపాడుతుందని ఆనాటి జనం విశ్వసించేవారు. జంతు వధ చేస్తున్నట్లుగా హెల్మెట్ వెనుకవైపు చెక్కారు. రొమేనియా సంస్కృతి సంబంధించి ఇది వెలకట్టలేని ప్రాచీన కళాఖండమని చోరీ తర్వాత రొమేనియా ప్రభుత్వం ఆవేదన వ్యక్తంచేసింది. దీంతోపాటు డేసియన్ల రాజ్యానికి చెందిన అలనాటి రాయల్ బ్రేస్లెట్సహా మూడు వస్తువులనూ దొంగలు పట్టుకెళ్లిపోయారు. రోమన్లు రొమేనియాను పాలించడానికి ముందు రాజ్యమేలిన డేసియన్ల సంస్కృతిని కళ్లకుకట్టేందుకు ఆనాటి వస్తువులను ఒక దగ్గరకు చేర్చి నెదర్లాండ్స్ ప్రభుత్వం ఒక ప్రదర్శనను ఏర్పాటుచేసింది. గత ఏడాది జూలై నుంచి ఈ ప్రదర్శన కొనసాగుతోంది. కీలకమైన హెల్మెట్‌ను సైతం రొమేనియా నుంచి తెప్పించిమరీ ప్రదర్శనకు ఉంచగా అది కాస్తా ఇప్పుడు దొంగలపరమైంది.చోరుల కోసం వేట మొదలు మళ్లీ అప్పజెప్తామని చెప్పి బుకారెస్ట్ నగరంలోని ‘నేషనల్ హిస్టరీ మ్యూజియం ఆఫ్ రొమేనియా’ నుంచి తీసుకొచ్చిన ప్రాచీన వస్తువులు పోవడంతో నెదర్లాండ్స్ ప్రభుత్వం ఈ చోరీ ఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా వాళ్లను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. వారం క్రితం చోరీకి గురైన ఒక కారు ఈ మ్యూజియం దగ్గర కాలిపోయిన స్థితిలో ఉండటం చూసి ఈ రెండు చోరీలకు ఏమైనా సంబంధం ఉందేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. కొట్టుకొచ్చిన కారులో ఇక్కడికొచ్చిన దొంగలు ఆ తర్వాత పారిపోతూ నాలుగు మైళ్ల దూరంలో కారును వదిలేసి తగలబెట్టిపోయారని పోలీసులు భావిస్తున్నారు. కొట్టేసిన కారుకు నకిలీ నంబర్ ప్లేట ఉండటం చూస్తుంటే ఇదేదో ఆరితేరిన దొంగలముఠా పనిగా అనుమానిస్తున్నారు. ‘‘ మా మ్యూజియం 170 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ ఇలాంటి చోరీ ఘటన చూడలేదు. నిజంగా ఇది దురదృష్టకరం’’ అని ఎస్సెన్లోని డ్రెంట్స్ మ్యూజియం డైరెక్టర్ హ్యారీ ట్యూపన్ అన్నారు. -
మారలేదు.. ఇక మారడని..!
మధిర: బస్సులో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారడంతో తల్లిదండ్రులను ఎదిరించి మరీ మతాంతర వివాహం చేసుకుంది. ఇంతలోనే భర్త పెళ్లిముందు చెప్పినట్లు ఉద్యోగం చేయటంలేదని, పలు చోరీ కేసుల్లో నిందితుడని తెలియడంతో తల్లడిల్లిపోయింది. తప్పుడు పనులు ఆపేయాలని, కష్టపడి బతుకుదామని చెప్పిచూసింది. అయినా అతడిలో మార్పు రాకపోవటంతో అవమాన భారం భరించలేక ఇద్దరు కుమార్తెలను హత్య చేసి, తానూ బలవన్మరణానికి పాల్పడింది. గుండెను మెలిపెడుతున్న ఈ ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురం గ్రామంలో చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లాకు చెందిన మౌనిక అలియాస్ ప్రెజా (30) ఐదేళ్ల క్రితం విజయవాడ నుంచి మధిరకు బస్సులో వస్తుండగా.. మధిర మండలం నిదానపురానికి చెందిన షేక్ బాజీ ఆమె పక్క సీట్లో కూర్చున్నాడు. అక్కడ వారిమధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మౌనిక తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోకపోవటంతో ఆమె బాజీతో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. వీరికి మెహక్ (4), మెనురూల్ (3) అనే కుమార్తెలు ఉన్నారు. నిదానపురంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.అవమానంతో అసాధారణ నిర్ణయం.. ఉద్యోగం చేస్తున్నానని చెప్పిన బాజీ.. నిజానికి పలు చోరీ కేసుల్లో నిందితుడని మౌనికకు తెలిసింది. దీంతో చోరీలు మానేయాలని భర్తకు నచ్చజెప్పింది. అయినా అతడిలో మార్పు రాలేదు. బాజీపై ఈ నెల 22న (బుధవారం) ఖమ్మం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు విచారణ ప్రారంభించారు. బోనకల్ మండలం మోటమర్రిలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం నిదానపురం చేరుకున్న పోలీసులు.. బాజీ చోరీ చేస్తుండగా సీసీ కెమెరాల్లో రికార్డయిన వీడియో, ఫొటోలు ఆమెకు చూపించారు. దీంతో ఆమె గుండె పగిలిపోయింది. ఆ బాధలోనే కఠిన నిర్ణయం తీసుకుంది. అద్దెకు తీసుకున్న రేకుల షెడ్డు ఇనుప పైపునకు చీరలను కట్టి ఇద్దరు కుమార్తెలకు ఉరి వేసింది. ఆపై మరో చీరతో ప్రెజా సైతం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో వైరా ఏసీపీ రెహమాన్, మధిర సీఐ మధు, ఎస్సై లక్ష్మీభారవి అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. -
పెళ్లింట్లో భారీ చోరీ
అనంతపురం: పెళ్లింట్లో దొంగలు పడ్డారు. సుమారు రూ.3.50 కోట్ల విలువైన బంగారం, రూ.20 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. అనంతపురం నగరంలోని ఓ ఇంట్లో బుధవారం వేకువజామున ఈ భారీ చోరీ జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. అనంతపురం మండలం కాట్నేకాలువ గ్రామానికి చెందిన కొండ్రెడ్డి వెంకటశివారెడ్డి నగరంలో స్థిరపడ్డారు. భూములు అధికంగా ఉండడంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కొండ్రెడ్డి వెంకటశివారెడ్డి, కవిత దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఏలూరుకు చెందిన బుసిరెడ్డి ఆదినారాయణరెడ్డి కుమారుడితో ఆమెకు వివాహం నిశ్చయమైంది. ఫిబ్రవరి 7న అనంతపురం ఎంవైఆర్ కల్యాణ మండపంలో వివాహం జరిపేందుకు నిశ్చయించారు. ఈ నేపథ్యంలోనే పెళ్లి కుమార్తెకు బహుమతిగా ఇవ్వనున్న బంగారం, వెంకటశివారెడ్డి, కవిత దంపతులకు చెందిన బంగారంతో పాటు వెంకట శివారెడ్డి అత్త, మామ, వియ్యంకుల బంగారు ఆభరణాలు కలిపి సుమారు 5 కిలోల బంగారాన్ని ఇంట్లోని లాకర్లో ఉంచారు. కాగా.. శివారెడ్డి దంపతులు తెలంగాణలో ఉన్న తమ బంధువుల్ని పిలిచేందుకు వెళ్లగా.. ఇదే అదునుగా భావించిన దొంగలు బుధవారం వేకువజామున 4 గంటలకు ఇంట్లోకి చొరబడ్డారు. ఊచలు తొలగించి ఇంట్లోకి వెళ్లి తొలుత బీరువా తాళాలు పగులగొట్టారు. అందులో ఉన్న లాకర్ తాళం తీసుకుని.. లాకర్లోని సుమారు ఐదు కిలోల బంగారాన్ని, బీరువాలోని రూ.20 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. మొత్తం ఐదుగురు దొంగల ముఠా చోరీలో పాల్గొన్నట్టు సీసీ కెమెరాల ఫుటేజీలను బట్టి తెలుస్తోంది. ఇంట్లో సీసీ కెమెరాలు లేనప్పటికీ ఎదురింటి సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి. మరో రెండు ఇళ్లలోనూ చోరీ కాగా.. వెంకటశివారెడ్డి ఇంటి పక్కనే ఉంటున్న డిప్యూటీ కమిషనర్ ఇంట్లో రూ.75 వేలు, మిస్టర్ ఛాయ్ నిర్వాహకుడు ఇంట్లోనూ చోరీ జరిగింది. వీరు ఇంకా ఇళ్లకు చేరుకోకపోవడంతో అందులో ఎంత మొత్తం చోరీ జరిగిందనే అంశంపై స్పష్టత రాలేదు. ఘటన స్థలంలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. ఈ చోరీ వెనుక తెలిసిన వారి హస్తం ఉందా? లేక రాటుదేలిన దొంగల ముఠా పనా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పొన్నాల ఇంట భారీ చోరీ
హైదరాబాద్, సాక్షి: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లక్షన్నర నగదుతో పాటు భారీగా అభరణాలు దొంగలు దోచుకెళ్లారు. ఫిలిం నగర్ పోలీసులకు ఈ ఘటనపై పొన్నాల సతీమణి అరుణాదేవి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
తిరుమల: బంగారు బిస్కెట్ చోరీ ఘటన కీలక మలుపు
తిరుమల: తిరుమల (Tirumala) పరకామణిలో బంగారు బిస్కెట్ (Gold biscuit) చోరీ ఘటన కీలక మలుపు తిరిగింది. ఇటీవల 100 గ్రాముల బంగారు బిస్కెట్ దొంగలిస్తూ పట్టుబడిన నిందితుడిని తిరుమల వన్‌టౌన్ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తిరుపతికి చెందిన వీరిశెట్టి పెంచలయ్య శ్రీవారి పరకామణిలో అగ్రిగోస్ కంపెనీ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగిగా రెండేళ్ల నుంచి పనిచేస్తున్నారు.ఇతను తొందరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఏడాదిగా పరకామణిలోని గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉంచే బంగారు వస్తువులను దొంగలిస్తూ వస్తున్నాడు. ఈ మేరకు అతనిపై నిఘా ఉంచగా.. ఈనెల 11న మధ్యాహ్నం గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉన్న 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ను దొంగలించి దానిని ట్రాలీకి ఉన్న పైపుల్లో దాచిపెట్టాడు. తనిఖీ సమయంలో టీటీడీ భద్రతా సిబ్బంది గుర్తించడంతో పెంచలయ్య పరారయ్యాడు.ఈ విషయమై టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తిరుమల వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. విచారణలో మొత్తం 555 గ్రాముల బంగారు బిస్కెట్లు, బంగారు ఆభరణాలు మొత్తం 655 గ్రాములు, 157 గ్రాముల వెండి వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు.ఇదీ చదవండి: అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి -
కేరళలో చోరీ..సికింద్రాబాద్‌లో షెల్టర్!
సాక్షి, సిటీబ్యూరో: కేరళలోని తిరునల్వేలి జిల్లా మూలక్రాయ్పట్టిలో ఉన్న జ్యువెలరీ దుకాణంలో రెండు కేజీలకు పైగా బంగారు ఆభరణాలు చోరీ చేసి, నాలుగున్నర నెలలుగా పరారీలో ఉన్న రామకృష్ణన్‌ను అక్కడి పోలీసులు శనివారం సికింద్రాబాద్‌లో అరెస్టు చేశారు. విచారణలో భాగంగా ఆ సొత్తును తాను తల్లి మీనాక్షి వద్దే ఉంచానని చెప్పాడు. దీంతో ప్రత్యేక బృందం తిరునల్వేలి సమీపంలోని రెట్టార్కులం గ్రామంలోని వారి ఇంటిపై దాడి చేసి సొత్తు స్వా«దీనం చేసుకున్నారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక మీనాక్షి ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. అక్కడ చోరీ చేసి సిటీకి వచ్చి... మూలక్రాయ్పట్టికి చెందిన వి.రెహ్మాన్ అక్కడే కొన్నేళ్లుగా జ్యువెలరీ దుకాణం నిర్వహిస్తున్నారు. ఆ సమీపంలోని రెట్టార్కులం గ్రామానికి చెందిన రామకృష్ణన్ ప్రైవేట్ ఉద్యోగి. జల్సాలకు అలవాటుపడిన ఇతగాడు కొన్నేళ్లుగా తిరునల్వేలి చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు పట్టబడకపోవడంతో పోలీసు రికార్డుల్లోకి ఎక్కలేదు. గత ఏడాది ఆగస్టులో ఇతడి కన్ను రెహా్మన్ నిర్వహిస్తున్న జ్యువెలరీ దుకాణంపై పడింది. ఆ నెల 22 రాత్రి షెల్డర్ పగులకొట్టి లోపలకు ప్రవేశించిన రామకృష్ణన్ 2.22 కేజీల బంగారం, రూ.3 లక్షల నగదు తస్కరించాడు. ఆ సొత్తును బయటకు తీయకుండా దాచి ఉంచి, కొన్నాళ్లు తన స్వస్థలానికి దూరంగా ఉంటే పోలీసులకు చిక్కనని భావించాడు. స్నేహితుడిది అంటూ తల్లికి ఇచ్చు... మర్నాడు దుకాణం తెరిచిన వెంటనే కనిపించిన సీన్‌తో తన దుకాణంలో జరిగిన చోరీ విషయం రెహా్మన్ గుర్తించాడు. దీనిపై మూలక్‌రాయ్‌పట్టి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు కోసం తిరునల్వేలి ఎస్పీ నేతృత్వంలో తొమ్మిది ప్రత్యేక బృందాలు ఏర్పడ్డాయి. గుర్తించిన జ్యువెలరీ దుకాణం నుంచి తస్కరించిన నగదు తన వద్ద ఉంచుకున్న రామకృష్ణన్ బంగారం మాత్రం నేర్పుగా ప్యాక్ చేశాడు. రెట్టార్కులంలోని తల్లికి దీన్ని ఇచ్చి ఇంట్లో ఉంచాలని సూచించాడు. దుబాయ్ వెళ్తున్న తన స్నేహితుడు కొన్ని విలువైన వస్తువులు ప్యాక్ చేసి, భద్రపరచాలని ఇచ్చాడంటూ ఆమెను నమ్మించాడు. నగదుతో గత ఏడాది ఆగస్టు 23న కేరళ నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. హో టళ్లలో బస, ఖరీదైన మద్యం, ఆహారం, జల్సాలతో మూడు నెలల్లోనే రూ.3 లక్షలు ఖర్చు చేసేశాడు. నిర్మాణం వద్ద కాపలాదారుడిగా పని... దీంతో సికింద్రాబాద్‌లోని ఓ నిర్మాణం వద్ద కాపలాదారుడిగా ప్రైవేట్ ఉద్యోగంలో చేరాడు. కనీసం ఏడాది పాటు ఇక్కడ తలదాచుకుని ఆపై స్వస్థలానికి వెళ్లాలని భావించాడు. ఆ తర్వాత తల్లి వద్ద ఉన్న సొత్తును విక్రయించి సొమ్ము చేసుకోవాలని అనుకున్నాడు. సికింద్రాబాద్‌లో కొత్త ఫోన్ నెంబర్ తీసుకున్న రామకృష్ణన్ దాన్ని వినియోగించి తల్లి మీనాక్షితో మాట్లాడటం మొదలెట్టాడు. మూలక్‌రాయ్‌పట్టి చోరీ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందాలు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా రామకృష్ణన్‌ను నిందితుడిగా గుర్తించాయి. అయితే అతడి ఆచూకీ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో తల్లి ఫోన్‌పై నిఘా ఉంచాయి. ఆమెకు సికింద్రాబాద్‌లో ఉన్న నెంబర్ నుంచి ఫోన్లు వస్తున్నట్లు గుర్తించాయి. దీంతో శనివారం ఇక్కడకు వచి్చన ఓ స్పెషల్ టీమ్ రామకృష్ణన్‌ను పట్టుకుంది. ప్రాథమిక విచారణలోనే అతగాడు విషయాలన్నీ బయటపెట్టాడు.తీవ్ర అవమానంగా భావించిన మీనాక్షి.. నిందితుడిని తీసుకుని కేరళ బయలుదేరిన పోలీసులు జ్యువెలరీ దుకాణంలో చోరీ చేసిన సొత్తు అతడి తల్లి వద్ద ఉందనే విషయాన్ని అక్కడి టీమ్‌కు చెప్పారు. దీంతో ఓ బృందం ఆదివారం ఉదయం రెట్టార్కులం గ్రామంలోని రామకృష్ణన్ ఇంట్లో దాడి చేసి 2.22 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామంతోనే తన కుమారుడు దొంగగా మారాడనే విషయం మీనాక్షికి తెలిసింది. దీనికి తోడు గ్రామంలో అందరూ చూస్తుండగా పోలీసులు తమ ఇంట్లో సోదాలు చేయడం, చోరీ బంగారం రికవరీ చేయడాన్ని తీవ్ర అవమానంగా భావించింది. దీంతో పోలీసులు వెళ్లి కొద్దిసేపటిలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుస్టేషన్‌కు వచ్చి తిరిగి వెళ్లిన ఆమె భర్త ఈ విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ‘సోమవారం రామకృష్ణన్‌ను రెట్టార్కులం తీసుకువెళ్లి మీనాక్షి అంత్యక్రియలు పూర్తి చేయించాం. ఆపై కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించాం. అతడు ఇలాంటి మరికొన్ని నేరాలు చేసినట్లు అనుమానం ఉంది. కస్టడీలోకి తీసుకుని ఆ కోణంలో విచారిస్తాం’ అని తిరునల్వేలికి చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి ఫోన్ ద్వారా తెలిపారు.తిరునల్వేలిలో జ్యువెలరీ దుకాణాన్ని దోచేసిన రామకృష్ణన్ గత ఏడాది ఆగస్టులో చోటు చేసుకున్న ఈ భారీ దొంగతనం సొత్తు తల్లికి ఇచ్చి నగరానికి వచ్చి ప్రైవేట్ ఉద్యోగిగా మకాం సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పట్టుకున్న అక్కడి కాప్స్ అతడి ఇంటి నుంచి సొత్తు సీజ్, అవమానంతో తల్లి ఆత్మహత్య -
విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్!
-
నేరాల్లో మరో కోణం!
సాక్షి, అమరావతి /హైదరాబాద్: చిల్లర దొంగతనాలు మొదలు రూ.కోట్లు కాజేసిన సైబర్ కేటుగాళ్ల ఉదంతాల వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది కాలంలో వివిధ నేరాలు చోటుచేసుకున్నాయి. అందుకు సంబంధించి బోలెడు ఎఫ్ఐఆర్లు సైతం నమోదయ్యాయి. కానీ వాటిలో కొన్ని విచిత్రమైన కేసులు పోలీసులను ఆశ్చర్యపరిచాయి. ఇంతకీ ఆ విచిత్ర కేసులేమిటంటే.. సైనేడ్ హత్యలుగుంటూరు జిల్లాలో ఓ తల్లీ కూతురు, వారి స్నేహితురాలు పాల్పడ్డ సైనేడ్ హత్యలు సంచలనం రేపాయి. ఈ ఏడాది సెప్టెంబరులో నాగూర్ బి అనే మహిళ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తుతో మొత్తం కుట్ర బయటపడింది. తెనాలికి చెందిన ముడియా రమణమ్మ, ఆమె కూతురు వెంకటేశ్వరి, వారి స్నేహితురాలు గునగప్ప రజినీ ముందస్తు పన్నాగంతో నాగూర్‌బీ అనే మహిళతో పరిచయం పెంచుకున్నారు. ఆమె బంగారం కాజేయాలని భావించారు.నాగూర్‌బీని నమ్మించి ఆటోలో ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లారు. దారిలో ఆటో డ్రైవర్‌తో బ్రీజర్ కొనిపించారు. ఆ బ్రీజర్‌లో సైనేడ్ కలిపి నాగూర్బీతో బలవంతంగా తాగించి హత్య చేశారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను కాజేశారు. పోలీసుల దర్యాప్తులో ఈ ముఠా అంతకుముందు కూడా ఇదే రీతిలో చేసిన హత్యలు కూడా బయటపడ్డాయి. నాగమ్మ అనే మహిళ నుంచి వెంకటేశ్వరి రూ.20 వేలు అప్పు తీసుకుంది. ఆ అప్పును ఎగవేసేందుకు సైనేడ్ కలిపిన కూల్ డ్రింక్ తాగించి నాగమ్మను హత్య చేసింది. 2022లో వెంకటేశ్వరి తన అత్త సుబ్బలక్ష్మిని కూడా ఇలానే సైనేడ్ కలిపిన కూల్ డ్రింక్ తాగించి హత్య చేసింది. తెనాలికి చెందిన మోషే అనే వ్యక్తి తన భార్యను తీవ్రంగా వేధించేవాడు. అతని ఇన్సూరెన్స్, పెన్షన్ డబ్బులు పంచుకోవాలనే ఒప్పందంతో రమణమ్మ, వెంకటేశ్వరి.. మోషే భార్యతో కలసి అతడిని హత్య చేశారు. రమణమ్మ, వెంకటేశ్వరి, రజినీ, ఆటో డ్రైవర్‌తోపాటు సైనేడ్ విక్రయించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.దొంగ నోట్లు ఆశ చూపి..‘రూ.లక్ష ఇస్తే రూ.3 లక్షల దొంగనోట్లు ఇస్తాం’ అని ఆశ చూపించి స్నేహితుడిని హత్య చేసిన ఉదంతం కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. కర్నూలు జిల్లా ఆస్పరిలో పెంటయ్య అనే రైతు అప్పుల పాలయ్యాడు. తన పొలాన్ని రూ.17.50 లక్షలకు విక్రయించాడు. ఆ సొమ్మును కాజేయాలని అతని స్నేహితులు బోడిగుండ నరసింహుడు, హనుమంతు భావించారు. ‘రూ.లక్ష ఇస్తే రూ.3 లక్షల దొంగనోట్లు ఇస్తాం... దాంతో నీ అప్పులన్నీ తీరిపోతాయి’ అని ఆశ చూపించారు. డబ్బులు పట్టుకుని ఆలూరు మండలం హళేబీడుకు రమ్మన్నారు. వారి మాటలు నమ్మిన పెంటయ్య రూ.7.50 లక్షలు తీసుకుని వెళ్లారు.అక్కడ స్నేహితులు ఆయనతో సైనైడ్ కలిపిన మద్యాన్ని బలవంతంగా తాగించి హత్య చేశారు. పెంటయ్య మృతదేహాన్ని సమీపంలోని పంపయ్య ఆచారి అనే వ్యక్తి పొలంలో పూడ్చి పెట్టారు. అందుకుగాను ఆచారికి కొంత సొమ్ము ముట్టజెబుతామన్నారు. రెండు రోజుల తర్వాత దుర్వాసన వస్తుండటంతో బోడిగుండ నరసింహుడు, హనుమంతు, పంపయ్య ఆచారీలు ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి ఆటోలో ఆస్పరి మండలంలోని చిన్న హోతూరు వంక వద్దకు తీసుకెళ్లి ముళ్ల పొదల్లో పడేసి వెళ్లారు. మృతదేహాన్ని సమీప గ్రామస్తులు గుర్తించడంతో పోలీసులు కేసు నమోదైంది. బోడిగుండ నరసింహుడు, హనుమంతు, పంపయ్య ఆచారీలను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.డామిట్.. కథ అడ్డం తిరిగింది!వదిన ఆస్తిని కాజేయడం కోసం భీమవరంలో ఓ వ్యక్తి పన్నిన ‘మృతదేహం పార్సిల్’ పన్నాగం విస్మయ పరిచింది. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలానికి చెందిన శ్రీధర్ వర్మకు ఇద్దరు భార్యలతోపాటు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. తన రెండో భార్య రేవతి తల్లిదండ్రుల ఆస్తిపై అతను కన్నేశాడు. ఆ ఆస్తిలో తన రెండో భార్య అక్కకు కూడా వాటా ఉంది. దాంతో ఆమె వాటాను కూడా దక్కించుకోవడం కోసం ఓ ఎత్తుగడ వేశాడు. ఆమె (వదిన) నిర్మిస్తున్న ఇంటి కోసం రెండుసార్లు క్షత్రియ ఫౌండేషన్ పేరుతో నిర్మాణ సామగ్రిని పంపించాడు. మూడోసారి నిర్మాణ సామగ్రి పేరుతో ఓ మృతదేహాన్ని పార్సిల్ చేసి పంపాడు. అందుకోసం తన ప్రియురాలితో కలసి తన గ్రామానికి చెందిన మద్యానికి బానిసైన యువకుడిని హత్య చేశాడు.అతని మృతదేహాన్ని తన వదిన ఇంటికి పార్సిల్ పంపాడు. రూ.1.30 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ పార్సిల్లో ఓ లేఖ రాసి పెట్టాడు. ఆ పార్సిల్ చూడగానే వదిన భయపడి తనకు ఫోన్ చేసి పిలుస్తుందని.. ఆమెకు సహకరించినట్టుగా నటించి రూ.1.30 కోట్లు సర్దుబాటు పేరుతో ఆమె ఆస్తిని దక్కించుకోవాలన్నది శ్రీధర్ వర్మ పన్నాగం. అయితే తీవ్ర ఆందోళన చెందిన ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. దీంతో మొత్తం కుట్ర బట్టబయలైంది. కాగా, ఆస్తి మొత్తం దక్కాక ఇద్దరు భార్యలను కూడా వదిలించుకుని ప్రియురాలు సుష్మాతో ఉడాయించాలని శ్రీధర్ వర్మ భావించాడు. దీంతో శ్రీధర్ వర్మ, అతని రెండో భార్య రేవతి, ప్రియురాలు సుష్మాలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.మద్యంపై మక్కువతో.. పనిచేస్తున్న సంస్థలకు సున్నం పెట్టే వాళ్లు.. అన్నం పెట్టిన ఇంట్లోనే కన్నం వేసిన వాళ్ల గురించి అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. సాధారణంగా ఆయా నేరాల్లో సొమ్ము కాజేయడమే నిందితుల ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది. కానీ జూబ్లీహిల్స్ రోడ్ నం.10లోని ఆర్యూ పబ్‌లో పనిచేసే వినీత్‌కుమార్ అనే సెక్యూరిటీ గార్డు వెరైటీ చోరీకి పాల్పడ్డాడు. ఖరీదైన విదేశీ మద్యం తాగడం కోసం ఇద్దరు స్నేహితులతో కలిసి అర్ధరాత్రి దాటాక పబ్‌లోకి ప్రవేశించి రాయల్ సెల్యూట్, చివాస్ రీగల్, మొహిట్ చాన్ దాన్ బాటిళ్లను ఎత్తుకెళ్లాడు. పనిలో పనిగా పారిపోవడానికి ఉపయోగపడుతుందని రూ.2 లక్షల నగదు కూడా కొట్టేశాడు.మాస్టార్‌కు ఎదురైన ప్రేమ వేధింపులుబస్టాప్ లాంటి ప్రదేశాల్లో రోడ్‌సైడ్ రోమియోల ఆగడాల గురించి.. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే కీచకులుగా మారిన ఉదంతాల గురించి అప్పుడప్పుడూ వింటుంటాం. కానీ హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న ఓ గురువుపై మనసు పారేసుకున్న ఓ యువతి తన ప్రేమను నిరాకరించాడన్న కోపంతో ఆయనపై క్షక్షగట్టింది. లెక్చరర్‌తోపాటు ఆయన కుమార్తె ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసింది. దీనిపై బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించడంతో ఆ యువతి చివరకు జైలుపాలైంది.హుస్సేన్‌సాగర్‌లో ‘90 ఎంఎల్’స్టోరీసాధారణంగా ప్రేమ వ్యవహారాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. కానీ ఓ మందుబాబు మాత్రం మద్యం మత్తులో హుస్సేన్‌సాగర్‌లోకి దిగి ‘చుక్క’కావాలంటూ పోలీసులకు చుక్కలు చూపించాడు. నడుము లోతు నీళ్లున్న ప్రాంతంలో అతడు నిల్చుని ఉండటాన్ని చూసిన పర్యాటకులు ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నాడనుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకున్న ఓ కానిస్టేబుల్ నీటిలోకి తాడు విసిరి, దాన్ని పట్టుకుని పైకి రావాల్సిందిగా యువకుడిని కోరాడు. కానీ అందుకు నిరాకరించిన మందుబాబు.. తనకు ‘90 ఎంఎల్’ ఇస్తేనే బయటకు వస్తానంటూ మొండికేశాడు. చివరకు గంటన్నరపాటు సాగిన డ్రామా అనంతరం పోలీసులు అతన్ని బయటకు రప్పించారు.‘అతడి’పైనా అత్యాచార యత్నంయువతులు, మహిళలపై అత్యాచారాలు, అత్యాచారయత్నాలకు సంబంధించిన కేసులు నేటికీ నమోదవుతుండటం చాలవన్నట్లు ఇద్దరు మహిళలు ఓ పురుషుడిపై అత్యాచారయత్నం చేయడం, నగ్నంగా వీడియోలు తీసి అతన్ని బెదిరించడం సనత్‌నగర్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సదరు వ్యక్తికి మసాజ్ థెరపిస్టుగా పరిచయమైన ఓ మహిళ.. భరత్‌నగర్ కాలనీకి చెందిన మరో మహిళను పరిచయం చేసింది. ఇద్దరూ కలిసి అతన్ని భరత్‌నగర్ కాలనీలోని మహిళ ఇంటికి తీసుకెళ్లి మసాజ్ పేరుతో దుస్తులు విప్పించి అత్యాచారానికి యత్నించారు. అతడు నిరాకరించడంతో నగ్న వీడియోలను తీసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి కొంత డబ్బు గుంజారు. ఆపై ఇంకా డబ్బివ్వాలని డిమాండ్ చేయడంతో ఈ ‘లైంగిక వేధింపులు’తట్టుకోలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.ఆమె అలా... అతడు ఇలాభిన్న మనస్తత్వాలుగల భార్యభర్తల్ని మనం చూస్తూనే ఉంటాం. హైదరాబాద్ లోని రామాంతపూర్‌లో నివసించే ఓ ‘విపరీత’జంట వ్యవహారం ఉప్పల్ ఠాణా అధికారుల దృష్టికి వచ్చింది. గతంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో హౌస్ కీపర్‌గా పనిచేసిన మహిళ మద్యానికి బానిసగా మారింది. నిత్యం మద్యం తాగి రోడ్లపై న్యూసెన్స్ చేస్తూ పోలీసులకు చిక్కేది. అంతటితో ఆగకుండా ఏకంగా పోలీసుస్టేషన్‌కే వచ్చి న్యూసెన్స్ చేసి వెళ్తుండటం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఆమె భర్త కూడా తక్కువేం కాదు.. చుట్టుపక్కల కాలనీల్లోని ఇళ్ల గోడలు దూకి చెప్పులు, బూట్లు చోరీ చేసేవాడు. సీసీ కెమెరాల ఆధారంతో ఒకరోజు అతని ఇంటిపై దాడి చేసిన స్థానికులు వందల జతల పాదరక్షలు గుర్తించి పోలీసులకు అప్పగించారు. -
కొట్టేస్తే కొట్టేశారు గానీ.. పేదలకు పంచండి
లండన్: బ్రిటన్‌లోని యార్క్ నగరంలో క్రిస్మస్ మార్కెట్లో అమ్మడానికి రుచికరమైన పలు రకాల తాజా తినుబండారాలతో వ్యాన్ సిద్ధంగా ఉంది. వ్యాన్‌ను వాణిజ్యసముదాయానికి తరలించేలోపు దానిని ఎవరో దొంగలించారు. విషయం తెల్సుకున్న దాని యజమాని, పాకశాస్త్ర ప్రవీణుడు టామీ బ్యాంక్స్ ఒకింత బాధపడ్డారు. ప్రేమానురాగాలను కలిపి వంటచేసే చెఫ్‌లకు తాము వండిన ఆహార పదార్ధాలను ఇతరులకు వడ్డించడంలోనే ఆనందం, తృప్తి ఉంటాయి. టామీకి సైతం ఆ ఆనందమే ఎక్కువ. అందుకే తాను తయారుచేసిన పదార్థాలను దొంగలు ఎక్కడ పడేస్తారోననే బాధ ఎక్కువైంది. అందుకే వాటిని నేలపాలు చేయకుండా క్షుద్భాదతో తల్లడిల్లే పేదలకు పంచాలని బహిరంగ ప్రకటన చేశారు. బ్యాంక్స్‌కు యార్క్‌షైర్ కౌంటీలో ఒక పబ్‌తోపాటు రెండు రెస్టారెంట్లు ఉన్నాయి. స్వతహాగా వంటవాడైన బ్యాంక్స్ తన రెస్టారెంట్లలో కొన్ని ప్రత్యేకమైన ఆహారపదార్థాలను స్వయంగా తయారుచేస్తారు. తమ వ్యాన్ దొంగతనంపై తాజాగా ఆయన ఒక వీడియోను ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్‌చేశారు. ‘‘ చిన్న వ్యాన్‌లో ఖరీదైన తినుబండారాలున్నాయి. స్టీక్, ఏల్, బీర్లు, టర్కీ, బట్టర్‌నట్ స్క్వాష్ పై, కేక్‌లు ఉన్నాయి. వాటి మొత్తం విలువ ఏకంగా రూ. 27,00,000 పైమాటే. వ్యాను అప్పనంగా దొరికిందన్న ఆనందంలో ఇంత ఖరీదైన ఆహారపదార్ధాలను పోతూపోతూ దారిలో పడేయకండి. పేదలకు పంచి వారి ఆకలి మంటలు తీర్చండి’’ అని వేడుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘‘ఆహారం విలువ తెలిసిన నిజమైన చెఫ్’ అంటూ బ్యాంక్స్‌ను కొందరు నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తారు. బ్రిటన్‌లో సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఆహారపదార్ధాల చోరీలో ఇది తాజా ఘటనగా పేరొందింది. రెండు నెలల క్రితం లండన్‌లోని నీల్స్ యార్డ్ పాల ఉత్పత్తుల కేంద్రం వద్ద ఇలాంటి భారీ చోరీ జరిగింది. ఫ్రాన్స్‌కు చెందిన ఒక భారీ రిటైర్ సంస్థకు హోల్‌సేల్ పంపిణీదారుగా ప్రకటించుకుంటూ ఒక దొంగ ఈ డైరీకి వచ్చి ఏకంగా 48,488 పౌండ్ల బరువైన చీజ్‌ను దర్జాగా పట్టుకెళ్లిపోయాడు. దీని మార్కెట్ విలువ ఏకంగా రూ.3.30 కోట్లు. బ్రిటిష్, అంతర్జాతీయ పోలీసులు వేట మొదలెట్టి ఆ 63 ఏళ్ల పెద్దాయనను పట్టుకున్నాసరే చీజ్ జాడను మాత్రం కనిపెట్టలేకపోయారు. -
కూకట్‌పల్లిలో భారీ చోరీ
మూసాపేట: కూకట్‌పల్లిలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..టంగుటూరుకు చెందిన మధుసూదన్‌రావు, సంధ్యారాణి దంపతులు కూకట్పల్లి జయానగర్‌లోని శ్రీ సీతా ప్యాలెస్ అపార్టుమెంట్లో నివాసం ఉంటున్నారు. కొద్దిరోజులుగా వీరు అవసరాల నిమిత్తం వేరే ప్రాంతంలో ఉంటున్నారు. గురువారం సాయంత్రం మధుసూదన్‌రావు ఇంటికి వచ్చి దుస్తులు తీసుకొని వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం డ్రైవర్ ఫోన్‌చేసి ఇంటి తలుపు తీసి ఉందని ఫోన్ చేసి చెప్పగా వెంటనే ఇంటికి వచ్చి చూసిన మధుసూదన్‌రావు దొంగతనం జరిగిందని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.గురువారం రాత్రి సుమారు 11.47 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు మెట్ల మార్గంలో ఫ్లాట్‌లోకి వెళ్లినట్లు సీసీకెమెరాలో నమోదైంది. దొంగలు బెడ్రూమ్లోని డ్రెస్సింగ్ టేబుల్ అద్దం వెనుక ఉన్న బీరువా తాళాలు తీసుకొని..బీరువాలో ఉన్న సుమారు కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. 82 తులాల బంగారు నగలు, రూ.10 లక్షల విలువ చేసి డైమండ్ నెక్లెస్, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం 7.30 ప్రాంతంలో వాచ్మెన్ మొక్కలకు నీరు పోసేందుకు వెళ్లగా..ఫ్లాట్ డోర్ తెరిచి ఉందని గమనించి డ్రైవర్‌కు తెలియజేశాడు. వెంటనే డ్రైవర్ యజమానికి తెలపటంతో వారు వచ్చి చూసుకోగా బంగారు నగలు దొంగతనం అయినట్లు గమనించారు. కాగా డ్రెస్సింగ్ టేబుల్ అద్దం వెనుక ఉన్న తాళాన్ని తీసుకొని దొంగతనం చేయటంతో తెలిసిన వారి పనై ఉండవచ్చని బాధితులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఓ దొంగతనం.. ఆపై పంచాయితీ..
వట్పల్లి (అందోల్): దొంగతనం విషయంలో పంచాయితీకి పిలవడంతో తల్లీకుమారుడు ఆత్మహత్యా యత్నం చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సంగారెడ్డికి చెందిన ఓ వ్యక్తి అందోలు మండలం చింతకుంట గ్రామంలో జరిగిన విందుకు ఆదివారం టాటా ఏస్ వాహనంలో వచ్చాడు. సోమవారం తిరిగి వెళ్లిపోదామని నిర్ణయించుకొని వాహనాన్ని గ్రామంలోని ఖాళీ ప్రదేశంలో నిలిపాడు. అదే గ్రామానికి చెందిన తాగుడుకు బానిసైన వడ్ల శ్యామ్ (21) ఆ వాహనాన్ని అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎత్తుకెళ్లాడు. కౌడిపల్లి మండలం బుజరంపేట గ్రామ శివారుకు వెళ్లగానే వాహనం కాల్వలో ఇరుక్కుపోయింది. దానిని బయటకు తీసే ప్రయత్నంలో భారీ శబ్ధం రావడంతో చుట్టుపక్కల వారు లేచి దొంగ దొంగ అని అరిచారు. దీంతో శ్యామ్ వెంటనే సమీపంలోని ఓ బైక్‌ను తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. బుజరంపేట గ్రామస్తులు దుంపలకుంటలోని సీసీ ఫుటేజీని పరిశీలించి వడ్ల శ్యామ్‌ను గుర్తించారు. గ్రామ పెద్దలతో సమావేశమై శ్యామ్‌ను తమకు అప్పగించాలని, లేకపోతే వాహనాన్ని ఇచ్చేది లేదని హెచ్చరించారు. అనంతరం శ్యామ్ తండ్రి యాదయ్యను పిలిపించి జరిగిన విషయాన్ని వివరించారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం శ్యామ్ అతడి తల్లిదండ్రులు యాదయ్య, బాలమణి (46), చిన్నమ్మ మమత బుజరంపేటకు పంచాయితీకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. తండ్రి, చిన్నమ్మ బస్‌లో బయలుదేరగా, శ్యామ్ తల్లి బాలమణితో బైక్‌పై బయలుదేరాడు. చింతకుంట బ్రిడ్జిపైకి రాగానే బైక్‌ను ఆపి మొదట శ్యామ్ మంజీరా నీళ్లలోకి దూకగా, అనంతరం తల్లి దూకింది. విషయం తెలుసుకున్న జోగిపేట, చిలప్‌చెడ్ పోలీసులు వేర్వేరుగా గాలింపు చర్యలు చేపట్టినా వారి ఆచూకీ లభ్యం కాలేదు. -
మంత్రి శ్రీధర్‌బాబు నివాసంలో సెల్‌ఫోన్ చోరీ
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డు నెంబర్.12లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో ఉంటున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నివాసంలో సెల్‌ఫోన్ చోరీకి గురైంది. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో క్వార్టర్ నెంబర్–7లో మంత్రి శ్రీధర్‌బాబు ఉంటున్నారు. గత నెల 31వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి ఇంట్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పీఏ సతీ‹Ùకుమార్ లక్ష్మీపూజ నిర్వహించాడు. పూజ అనంతరం రాత్రి 9.30 గంటలకు ఆయన ఫోన్ కోసం చూడగా కనిపించలేదు. అన్ని ప్రాంతాలు వెతికినా ఉపయోగం లేకుండా పోయింది. మంత్రి ఇంట్లో పూజలకు ఎంతోమంది అతిథులు వచ్చారని, ఎలా చోరీకి గురైందో తెలియదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పూజల్లో నిమగ్నమై ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు సెల్‌ఫోన్ చోరీ చేసి ఉంటారని పేర్కొన్నారు. దీపావళి తర్వాత వారం రోజులుగా తాను విధి నిర్వహణలో బీజీగా ఉన్నానని, దీంతో శనివారం ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. -
HYD: ట్రావెల్ బస్సులో భారీ చోరీ.. పోలీస్‌స్టేషన్‌కు ప్రయాణికులు
సాక్షి,రంగారెడ్డి : ఏపీలోని మండపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో శుక్రవారం(నవంబర్ 8) తెల్లవారుజామున భారీ చోరి జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళా బ్యాగులో నుంచి రూ.15లక్షల విలువైన బంగారు ఆభరణలను ఎవరో దొంగిలించారు.తన బ్యాగులో ఉండాల్సిన బంగారం కనిపించలేదని మహిళ చెప్పడంతో తొలుత డ్రైవర్ బస్సును హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద ఆపేశాడు. అనంతరం బస్సును అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు స్టేషన్‌కు తరలించాడు.బస్సులో ప్రయాణం చేసిన మొత్తం 40 మంది ప్రయాణికులు ఉదయం 6 గంటల నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్‌లోనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చోరీకి సంబంధించి బాధిత మహిళ ఫిర్యాదుతో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: మానవ అక్రమ రవాణా కేసులో ఆరుగురికి జీవిత ఖైదు -
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ.. విలువైన పత్రాలు మాయం!
సాక్షి, కొమురంభీం జిల్లా: కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామంలోని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. బీరువా తాళాలు పగులగొట్టి విలువైన పత్రాలు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.తన ఇంట్లో జరిగిన చోరీ ఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పందించారు. తెలంగాణలో దోపిడీ దొంగల పాలన నడుస్తుందని మండిపడ్డారు. నిన్న సిర్పూర్-కాగజ్ నగర్ కోసిని గ్రామంలోని తన ఇంట్లో దొంగలు పడ్డారని.. కొన్ని విలువైన డాక్యుమెంట్లు దొచుకోని పోయారని తెలిపారు. దీని వెనక ఉన్న కుట్ర కోణాన్ని కూడా శోధించాల్సిందిగా డీజీపీని ఆయన కోరారు.తెలంగాణ లో దోపిడి దొంగల పాలన నడుస్తున్నది. ఇది ముమ్మాటికీ నిజం. నిన్న సిర్పూర్-కాగజ్ నగర్ కోసిని గ్రామంలోని మా స్వగృహం లో దొంగలు పడ్డారు. కొన్ని విలువైన డాక్యుమెంట్లు దొచుకోని పోయారు.దీని వెనక ఉన్న కుట్ర కోణాన్ని కూడా శోధించాల్సిందిగా @TelanganaDGP గారిని కోరుతున్న.My home in… pic.twitter.com/A5ewLPMzCa— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) October 31, 2024 -
స్టోక్స్ పాక్ పర్యటనలో ఉన్నవేళ.. కుటుంబానికి భయానక అనుభవం
ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. పలు ఆభరణాలతో పాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. స్టోక్స్ పాకిస్తాన్ పర్యటనలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ సారథి సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.ముసుగు దొంగలు తన ఇంట్లో ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారని స్టోక్స్ తెలిపాడు. ఆ సమయంలో తన భార్య, ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారని.. అదృష్టవశాత్తూ వారికి ఎలాంటి హానీ జరగలేదన్నాడు. ఈ పని ఎవరు చేశారో తెలియాల్సి ఉందని.. త్వరగా దొంగలను పట్టుకోవడంలో తమకు సహకరించాలని కోరాడు. పాక్ పర్యటనలో ఉన్న సమయంలోఏదేమైనా కష్ట సమయంలో తన కుటుంబానికి పోలీసులు అండగా ఉన్నారని.. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. ఈ మేరకు.. ‘‘అక్టోబరు 17, గురువారం.. ముసుగు ధరించిన కొందరు వ్యక్తులు నార్త్ ఈస్ట్‌లో గల కాసిల్ ఈడెన్ ఏరియాలో ఉన్న మా ఇంట్లోకి చొరబడ్డారు. నా భార్యా పిల్లలకు భయానక అనుభవంర్యా నగలు, విలువైన వస్తువులు ఎత్తుకుపోయారు. అందులో మా కుటుంబానికి అతి ముఖ్యమైన వస్తువులు కూడా ఉన్నాయి. దొంగలను పట్టుకునేందుకు దయచేసి నాకు సహాయం చేయండి. నిజానికి ఈ దుర్ఘటన జరిగినపుడు నా భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. అయితే, వారిపై దొంగలు ఎలాంటి భౌతిక దాడికి పాల్పడలేదు. కానీ.. ఆ సమయంలో వారి మనఃస్థితి ఎంత ఆందోళనకరంగా ఉంటుందో.. దాని ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.అందుకే ఫొటోలు షేర్ చేస్తున్నానా ఇంట్లో చోరీకి గురైన వస్తువుల ఫొటోలు విడుదల చేస్తున్నాను. వాటిని ఎవరైనా సులువుగా గుర్తించవచ్చు. తద్వారా దొంగలను పట్టుకునే వీలు కలుగుతుంది. మాకెంతో ముఖ్యమైన వస్తువులు పోయినప్పటికీ.. కేవలం వాటిని రికవరీ చేసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ పోస్టు పెట్టడం లేదు.ఈ పని చేసిన దుండగులు ఎవరో కనిపెట్టడం కోసమే వాటి ఫొటోలు షేర్ చేస్తున్నా. విపత్కరకాలంలో మా కుటుంబానికి స్థానిక పోలీసులు అండగా నిలిచారు. వారి మేలు మర్చిపోలేనిది. ఆ దొంగలను పట్టుకునేందుకు మేమంతా తీవ్రం శ్రమిస్తున్నాం’’ అని స్టోక్స్ ఎక్స్ వేదికగా తన ఆవేదనను పంచుకున్నాడు.పాక్ చేతిలో ఘోర ఓటమికాగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు స్టోక్స్ ఇటీవల పాకిస్తాన్ పర్యటనకు వెళ్లాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా తొలి మ్యాచ్‌కు అతడు దూరంగా ఉన్నాడు. అయితే, ఆ తర్వాత అతడు తిరిగి వచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్.. ఆఖరి రెండు టెస్టుల్లో పాకిస్తాన్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. తద్వారా సిరీస్‌ను 1-2తో కోల్పోయింది.చదవండి: Aus A vs Ind A: రుతు, నితీశ్ డకౌట్.. అభిమన్యు, ఇషాన్ విఫలంpic.twitter.com/1nEmNcrnjQ— Ben Stokes (@benstokes38) October 30, 2024 -
ఇనుప ఖనిజం అక్రమ ఎగుమతి కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఏడేళ్ల జైలు
బెంగళూరు: బెళెకెరి నౌకాశ్రయంలోని ఇనుప ఖనిజం దొంగతనం, అక్రమ ఎగుమతి కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ కృష్ణ సాయిల్‌కు ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.6 కోట్ల భారీ జరిమానా విధించింది. ప్రజాప్రతినిధులపై కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానం సాయిల్‌తోపాటు ఆరుగురికి జైలు శిక్ష, భారీగా జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. శ్రీ మల్లికార్జున షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీగా ఉన్న సాయిల్(58) తాజా పరిణామంతో ఎమ్మెల్యే పదవికి అనర్హుడయ్యే అవకాశముంది. బళ్లారి గనిలో అక్రమంగా వెలికి తీసిన ఇనుప ఖనిజాన్ని 2010లో బెళెకెరి పోర్టులో అధికారులు నిల్వ ఉంచారు. దీనిపై కన్నేసిన సాయిల్, మరికొందరు కోట్లాది రూపాయల ఖనిజాన్ని దొంగచాటుగా చైనాకు ఎగుమతి చేశారు. తాజాగా దోషులుగా తేలిన వారిలో ప్రైవేట్ కంపెనీల నిర్వాహకులతోపాటు పోర్టుల డిప్యూటీ కన్జర్వేటర్ మహేశ్ జె బిలియె కూడా ఉన్నారు. ఈ నెల 24వ తేదీన తీర్పు వెలువడిన వెంటనే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు సాయిల్, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. -
విజిబుల్ పోలీసింగ్‌తోనే చోరీలకు విరుగుడు
విజిబుల్ పోలీసింగ్‌పై దృష్టి వరంగల్ జిల్లా నర్సంపేటలో కొద్దిరోజుల క్రితం తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. పెద్ద మొత్తంలో నగదు, బంగారం పోయింది. అయితే నిందితులను పట్టుకున్నాం. ఇటీవల వరంగల్ వెస్ట్‌జోన్ పోలీసులు ఇద్దరు దొంగలను పట్టుకొని వారి నుంచి రూ.22.56 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో చోరీల నివారణకు విజిబుల్ పోలీసింగ్ పెంచుతున్నాం. ఠాణాల వారీగా కూడా సమీక్షిస్తున్నాం. ఎవరైనా విధులు సరిగా నిర్వర్తించకపోతే సదరు సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. – అంబర్ కిశోర్ ఝా, పోలీసు కమిషనర్. వరంగల్ సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో విజిబుల్ పోలీసింగ్‌ను పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు వరంగల్ పోలీసు కమిషనరేట్‌తో పాటు మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో నమోదవుతున్న చోరీల సంఖ్య ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకమైన ఈ విజిబుల్ పోలీసింగ్‌లో.. ముఖ్య నగరాలు, పట్టణాలతో పాటు గ్రామాల్లో పోలీసులు, పెట్రోకార్, బ్లూకోల్ట్ సిబ్బంది.. తరచూ పర్యటిస్తూ నిఘా పెంచితే దొంగల్లో భయం పుడుతుంది. అదే సమయంలో ప్రజల్లో భద్రత భావం పెరుగుతుంది. ఇలా విజిబుల్ పోలీసింగ్‌తో దొంగతనాలతో పాటు నేరాలు తగ్గే అవకాశముంది. సిబ్బంది.. పెట్రోలింగ్ పెరగాలి ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో విస్తరించిన వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 150 చోరీలు జరిగాయి. మహబూబాబాద్‌లో 182, ములుగు 131, భూపాలపల్లి 78 చోరీ కేసులు నమోదయ్యా యి. గతేడాదితో పోల్చుకుంటే వీటి సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళనకరంగా మారింది. కానీ.. చోరీ కేసుల ఛేదనలో కీలకమైన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో సిబ్బంది కొరత వల్ల కూడా దొంగలు పేట్రేగిపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. డిటాచ్మెంట్ ఇన్స్పెక్టర్ల నియామకం లేకపోవడం కూడా చోరీలు పెరగడానికి కారణంగా కనిపిస్తోంది. ఇంకోవైపు సమయాల్లో ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలోని పోలీసులు పెట్రోలింగ్ పూర్తి స్థాయిలో చేయకపోవడం దొంగలకు వరంగా మారిందన్న విమర్శలున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ తరహాలోనే విజిబుల్ పోలీసింగ్ ద్వారానే నేరాలను పూర్తిస్థాయిలో అరికట్టాలన్న పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలు క్షేత్రస్థాయిలో అంతగా అమలు కాకపోవడంతో దొంగతనాలు పెరిగేందుకు అస్కారం ఏర్పడింది. ఇంకా చాలావరకు చిన్నచిన్న దొంగతనాల కేసులు నమోదు కాలేదన్న విమర్శలున్నాయి. -
HYD: మల్కాజ్‌గిరిలో సెల్ఫోన్లు మాయం..ఎందుకంటే..
సాక్షి,హైదరాబాద్:మల్కాజ్‌గిరిలో మొబైల్ దొంగలు హల్చల్ చేశారు. ఆనంద్‌బాగ్‌లో పాల కోసం వెళ్లిన వ్యక్తి నుంచి ఫోన్ చోరీ చేశారు. ఈస్ట్ ఆనంద్ బాగ్ లోని మార్కెట్‌కు వచ్చిన మరో వ్యక్తి నుంచి కూడా సెల్‌ఫోన్ కొట్టేశారు. ప్రజల దృష్టి మళ్లిస్తూ మొబైల్స్ చోరీ చేస్తున్నారని బాధితులు మాల్కాజ్‌గిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.చోరీలపై సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మాల్కాజ్‌గిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నరు.ఇదీ చదవండి: బంజారాహిల్స్ పబ్.. ప్రతి దానికి ఓ రేటు -
బంగ్లాలో మోదీ గిఫ్ట్ చోరీ.. భారత్ తీవ్ర స్పందన
ఢిల్లీ: జేశోరేశ్వరి కాళీమాత ఆలయానికి ప్రధాని మోదీ బహూకరించిన కిరీటం చోరీపై తాజాగా భారత విదేశాంగ శాఖ స్పందించింది. జేశోరేశ్వరి కాళీమాత ఆలయానికి ప్రధాని మోదీ బహూకరించిన కిరీటం చోరీకి గురికావడం పట్ల తీవ్రంగా ఖండించింది. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి అపవిత్ర చర్యలకు పాల్పడుతున్నారని మండిపడింది.‘‘ఢాకాలోని తంతిబజార్‌లో పూజా మండపంపై దాడి, జేశోరేశ్వరి కాళీమాత ఆలయంలో చోరీ జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది చాలా బాధాకరం. బంగ్లాదేశ్‌లోని హిందువులు సహా మైనారిటీలు, వారి ప్రార్థన మందిరాల భద్రత, మనోభావాలను దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలను తీసుకోవాలని ఆ దేశ ప్రభుత్వాన్ని కోరుతున్నాం’’ అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. కాగా, 2021 మార్చిలో బంగ్లాదేశ్‌లో పర్యటించిన ప్రధాని.. కాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బంగారు కిరీటాన్ని గిఫ్ట్‌గా అందించిన సంగతి తెలిసిందే. బంగ్లాలోని సత్ఖీరా జిల్లా ఈశ్వరీపూర్‌లోని ఈ కాళీ ఆలయం శక్తి పీఠాల్లో ఒకటి. స్థానిక కళాకారులు మూడు వారాల పాటు శ్రమించి దీన్ని తయారుచేశారు.ఇదీ చదవండి: 50 ఏళ్లలో తొలిసారి సహారా ఎడారిలో వరదలు.. ఫోటోలు వైరల్ -
పని చేసిన సంస్థకే కన్నం.. రూ.6 కోట్ల విలువైన నగలతో ఉడాయించిన ఉద్యోగులు
సాక్షి,హైదారాబాద్ : పని చేసిన సంస్థకే కన్నం వేశారు ఉద్యోగులు. రూ.6 కోట్ల విలువైన నగలతో ఉడాయించారు. నగల్ని మాయం చేసిన ప్రబుద్ధుడితో పాటు అతనికి సహకరించిన సిబ్బంది గురించి పోలీసులు ఆరాతీస్తున్నారు. బంజారాహిల్స్ శ్రీ కృష్ణ జ్యువెలర్స్ షోరూంలో భారీ చోరీ జరిగింది. రూ.6 కోట్ల విలువైన బంగారు నగలు మాయమయ్యాయి. అయితే అదే షోరూంలో ప్రస్తుతం, గతంలో పనిచేసిన ఉద్యోగులకు దుర్బుద్ది పుట్టి అందరూ ఓ ముఠాగా ఏర్పడ్డారు. భారీ చోరీకి పాల్పడ్డారు. చోరీ జరిగినప్పటి నుంచి మేనేజర్ సూకేతు షా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మేనేజర్ సుకేతు షాతో పాటు ఉదయ్ కుమార్, చింటు, సత్య, అజయ్, టింకు, చంద్ర, శ్రీకాంత్ బబ్బూరిలపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. కేసులో ట్విస్ట్..మరోవైపు రూ..6 కోట్ల నగల మాయం కేసులో కీలక పాత్రపోషించిన మేనేజర్, తన భర్త సూకేతు షా కనిపించడం లేదంటూ అతని భార్య బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీ కృష్ణ జ్యువెలర్స్ మేనేజ్మెంట్ వేధింపుల కారణంగానే తన భర్త అదృశ్యం అయ్యాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. లెటర్‌తో పాటు,ఓ వీడియోను సైతం పోలీసులకు అందించారు. -
కోర్టుకు హాజరై వెళ్తూ మళ్లీ చోరీ
మంచిర్యాలక్రైం: వివిధ దొంగతనాల కేసులో కోర్టులో హాజరయ్యేందుకు వచ్చి తిరిగివెళ్తూ మరోసారి చోరీకి పాల్పడి పోలీసులకు పట్టుబడ్డారు. మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్పెట్ గ్రామానికి చెందిన మాసు అన్నపూర్ణ, రాధ, శనిగరం పూలమ్మ అనే ముగ్గురు మహిళలు గతంలో వరంగల్‌లోని మట్టెవాడ, బెల్లంపల్లి వన్‌టౌన్, జమ్మికుంట పోలీసుస్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడి జైలుకి వెళ్లారు. బెల్లంపల్లి వన్‌టౌన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో గత నెల 30న మంచిర్యాల జిల్లా కోర్టుకు హాజరయ్యారు.తిరిగి వెళ్తూ మంచిర్యాలలోని శ్రీవైష్ణవి జువెల్లరీ షాపులో ఆభరణాలు కొనుగోలుదారులుగా వెళ్లారు. అక్కడ వెండిపట్టీలు చూస్తూ రూ.45వేల విలువైన పది జతలు దొంగిలించారు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టి మహిళలు దొంగతనానికి పాల్పడినట్లుగా సీసీపుటేజీ ఆధారంగా గుర్తించారు. ప్రత్యేక బృందంతో ఇస్పెట్ గ్రామానికి వెళ్లి ముగ్గురిని అదుపులోకి తీసుకుని పట్టీలను రికవరీ చేశారు. ఈ మేరకు ఈ ముగ్గురిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు. -
డిప్యూటీ సీఎం ఇంట్లో భారీ చోరీ
బంజారాహిల్స్ (హైదరాబాద్): ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఆయన ఇంట్లో పని చేస్తున్న బిహార్‌కు చెందిన వ్యక్తి, తన స్నేహితుడితో కలిసి దాదాపు రూ.20 లక్షల విలువైన సొత్తు, నగదు ఎత్తుకుపోయాడు. ఈ మేరకు అందిన ఫిర్యాదు నేపథ్యంలో..బంజారాహిల్స్ పోలీసులు అన్ని రాష్ట్రాల రైల్వే పోలీసు (జీఆర్పీ) అధికారులను అప్రమత్తం చేయడంతో.. పశ్చిమబెంగాల్లోని ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్లో వారిద్దరూ పట్టుబడ్డారు. భట్టి విక్రమార్క ప్రస్తుతం ప్రజా భవన్లో నివసిస్తున్నారు. అయితే ఆయనకు బంజారాహిల్స్ రోడ్ నం.14లోని బీఎన్ రెడ్డికాలనీలో విల్లా ఉంది. బిహార్‌కు చెందిన రోషన్‌కుమార్ మండల్ (28) ఆ ఇంట్లో పని చేస్తూ అక్కడే ఉంటున్నాడు.ఇంటి హాల్లో పడుకుంటూ వాచ్‌మన్‌గా, సర్వెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. భట్టి ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లడాన్ని అవకాశంగా తీసుకున్న రోషన్ దొంగతనానికి పథకం వేశాడు. తన స్వస్థలం నుంచి స్నేహితుడైన ఉదయ్ కుమార్ ఠాకూర్‌ను పిలిపించాడు. ఇద్దరూ కలిసి మంగళవారం మధ్యాహ్నం విల్లా పడక గది తాళాలు పగులకొట్టారు. అందులోని బీరువాలో ఉన్న నగదు, బంగారు, వెండి వస్తువులు, విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు తస్కరించారు. అదే రోజు రాత్రి సికింద్రాబాద్ నుంచి రైలు మార్గంలో బిహార్‌కు బయలుదేరారు. అయితే అదే ఇంట్లో భట్టి వ్యక్తిగత సహాయకులు కూడా ఉంటుంటారు.గురువారం విల్లాలో రోషన్ కనిపించకపోవడంతో ఇల్లంతా వెతుకుతూ మొదటి అంతస్తుకు వెళ్లారు. అక్కడ ప్రధాన బెడ్రూమ్ తాళాలు పగులగొట్టి ఉండటం, చోరీ జరగడాన్ని గుర్తించారు. వెంటనే భట్టి పీఏ భాస్కర శర్మకు సమాచారం అందించారు. వెంటనే విల్లాకు వచ్చిన ఆయన రోషన్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో ఆయన బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజ్‌లను పరిశీలించగా రోషన్, ఉదయ్ ఓ బ్యాగ్‌తో వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. వీళ్లు రైల్లో వెళ్లారని గుర్తించిన పోలీసులు పశి్చమ బెంగాల్, బిహార్‌ల్లో ఉన్న అన్ని రైల్వేస్టేషన్ల జీఆర్పీ అధికారులకు సమాచారం ఇచ్చారు.నగరం నుంచి తొలుత భువనేశ్వర్ వెళ్లిన నిందితులిద్దరూ అక్కడి నుంచి భువనేశ్వర్–హౌరా జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. ఈ రైలు గురువారం సాయంత్రం ఖరగ్‌పూర్ స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నం.7కు చేరుకోగా అందులో తనిఖీలు చేస్తున్న జీఆర్పీ సిబ్బంది బ్యాగ్‌తో ఉన్న రోషన్, ఉదయ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి చోరీ సొత్తు, సొమ్ము స్వాధీనం చేసుకుని నగర పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో శుక్రవారం ఖరగ్‌పూర్ వెళ్లిన ఎస్సై రాంబాబు నేతృత్వంలోని బృందం శనివారం సాయంత్రానికి నిందితుల్ని ఇక్కడకు తీసుకురానుంది. -
భట్టివిక్రమార్క ఇంట్లో చోరీ..నిందితుల అరెస్ట్
సాక్షి,హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్14లో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీకి పాల్పడ్డ నిందితులు పోలీసులకు చిక్కారు. పశ్చిమబెంగాల్లోని ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్లో నిందితులను బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు.చోరీకి పాల్పడ్డవారిని బిహార్‌కు చెందిన రోషన్ కుమార్ మండల్,ఉదయ్‌కుమార్ ఠాకూర్‌గా గుర్తించారు. వీరి నుంచి రూ.2.2లక్షల నగదు,100 గ్రాముల బంగారం, విదేశీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇదీ చదవండి: మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు -
మోహన్‌బాబు ఇంట్లో చోరీ.. హౌజ్ బాయ్ అరెస్ట్
పహాడీషరీఫ్(హైదరాబాద్): సినీ నటుడు మంచు మోహన్‌బాబు ఇంట్లో చోరీ జరిగిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. నిందితుడిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ గురువారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..జల్పల్లి గ్రామ శివారులో మోహన్‌బాబుకు నివాసం (మంచు టౌన్షిప్) ఉంది. ఇంటి ఆవరణలోనే వ్యక్తిగత కార్యదర్శులు, సెక్యూరిటీ సిబ్బంది, పనివారి కోసం వేర్వేరు గదులు సైతం ఉన్నాయి. ఈ నెల 22న మోహన్‌బాబు ఆదేశాల మేరకు పర్సనల్ సెక్రటరీ (పీఎస్) కిరణ్‌కుమార్ తిరుపతిలోని ఎంబీయూ యూనివర్సిటీ నుంచి రూ.10 లక్షల నగదు తీసుకొని రాత్రికి మంచు టౌన్‌షిప్‌కు చేరుకున్నాడు. రాత్రి కావడంతో ఉదయాన్నే డబ్బులు మోహన్‌బాబుకు ఇద్దామని భావించి తన గదిలో ఉంచాడు. ఈ టౌన్‌షిప్‌లోనే అనంతపురం జిల్లా నల్లమాడ మండలం ఎర్రవంకపల్లి గ్రామానికి చెందిన గణేశ్ నాయక్ (24) హౌజ్ బాయ్‌గా పని చేస్తున్నాడు. కిరణ్ డబ్బులు తెచ్చిన విషయం ముందే తెలుసుకున్న గణేశ్ అతడు నిద్రపోయాక, తలుపు నెట్టి డబ్బులు కాజేసి పరారయ్యాడు. ఉదయాన్నే లేచి చూడగా డబ్బుతో పాటు గణేష్ కూడా కనిపించలేదు. సీసీ కెమెరాలు పరిశీలించగా అతడే డబ్బు తీసుకెళ్లినట్లు నిర్ధారణ అయ్యింది. మోహన్‌బాబు సూచన మేరకు కిరణ్ 23వ తేదీన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రాచకొండ సీపీ సుదీర్‌బాబు సూచనలతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు తిరుపతిలో ఉన్నట్లు గుర్తించి ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపి బుధవారం పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అతని వద్ద నుంచి రూ.7,36,400ల నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాదీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. -
ప్రముఖ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ
ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. ఈయనకు చెందిన జల్పల్లిలోని ఫామ్‌హౌస్‌లో నాయక్ అనే వ్యక్తి పనిమనిషిగా చేస్తున్నాడు. ఇతడే దాదాపు రూ.10 లక్షలు దొంగిలించి ఉడాయించాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి రాచకొండ సీపీకి మోహన్ బాబు ఫిర్యాదు చేయగా.. పోలీసులు విచారణ చేపట్టారు. అలా తిరుపతిలో నాయక్‌ని అదుపులోకి తీసుకున్నారు.(ఇదీ చదవండి: యూట్యూబర్ హర్షసాయిపై కేసు.. నిజాలు బయటపెట్టిన యువతి)గతంలో ఇదే ఇంటికి సంబంధించిన హోమ్ టూర్ వీడియోని మంచు లక్ష్మి తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసింది. విలాసవంతమైన ఈ ఇంటిలో దొంగతనం జరగడం ఇదే కొత్తం కాదు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు ఒకటి రెండు జరిగాయి.ఇకపోతే తెలుగులో హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బోలెడన్ని సినిమాలు చేసిన మోహన్ బాబు.. చివరగా 'సన్నాఫ్ ఇండియా' చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం సొంత బ్యానర్లో భారీ బడ్జెట్‌తో 'కన్నప్ప' తీస్తున్నారు. మంచు విష్ణు హీరోగా నటిస్తుండగా ప్రభాస్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎప్పటికప్పుడు పోస్టర్స్ వదులుతున్నారు. త్వరలో రిలీజ్ డేట్ కూడా ప్రకటించే అవకాశముంది.(ఇదీ చదవండి: 'భారతీయుడు' హీరోయిన్ విడాకులు.. భర్తకు ఇష్టం లేకపోయినా!) -
Ganesh laddu: గణేష్ లడ్డూ చోరీ
జీడిమెట్ల: గణేష్ లడ్డూతో పాటు రూ.24 వేల నగదు, 2 మొబైల్ ఫోన్లు చోరీకి గురైన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సుభాష్ నగర్ డివిజన్ డీపీ కాలనీలో వరసిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో గణేష్ మండపం ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి మండపంలోకి ప్రవేశించిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు గణపతి వద్ద ఉన్న 8,2 కిలోల లడ్డూతో పాటు అక్కడే నిద్రిస్తున్న వారి జేబుల్లో రూ.24 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లను దొంగలు ఎత్తుకెళ్లారు. యూత్ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరీష్ తెలిపారు. కాగా లడ్డూను ఎత్తుకెళ్తున్న వ్యక్తి ఫొటో సీసీ కెమెరాకు చిక్కింది. -
పారని మంత్రి సుభాష్ పాచిక
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ద్రాక్షారామం జగనన్న కాలనీలో ఇసుక చోరీ వ్యవహారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరుల మెడకే చుట్టుకుంది. ఈ వ్యవహారం నుంచి తన అనుచరులను తప్పించేందుకు మంత్రి రెండు రోజులుగా చేస్తున్న తీవ్ర ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆయన అనుచరులే ఇసుకను చోరీ చేశారని తేటతెల్లమవటంతో చేసేది లేక అధికార యంత్రాంగం కేసు నమోదు చేసింది. మంత్రి ప్రధాన అనుచరుల్లో ఒకరైన టీడీపీ నేత దొంగల శ్రీధర్, మరి కొందరిపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఇదే విషయాన్ని రామచంద్రపురం ఆర్డీవో ఎస్.సుధాసాగర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 26న ద్రాక్షారామ జగనన్న కాలనీ లేఅవుట్–04లో జరిగిన ఇసుక దోపిడీపై ‘జగనన్న కాలనీలో టీడీపీ దొంగలు’ అనే శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిం ది. ఈ కథనం అధికారులను, అధికార పార్టీ నేతలను పరుగులు పెట్టించింది. ఈ కేసు నుంచి మంత్రి సుభాష్ అనుచరుడు దొంగల శ్రీధర్‌ను తప్పించే ప్రయత్నాన్ని కూడా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిం ది. అయినా అతనిపైన, ఇతర అనుచరులపైన కేసు నమోదు కాకుండా మంత్రి సుభాష్ తీవ్రంగా ప్రయతి్నంచారు. అధికార బలాన్ని ఉపయోగించారు. మంత్రి ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇసుక వ్యవహారంలో తమ పార్టీ నేతల ప్రమేయం లేదని చెప్పేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఇదంతా వైఎస్సార్సీపీ నేతల పనేనంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ బెడిసికొట్టాయి. ఆయన మీడియా సమావేశం పెట్టిన రెండు గంటలకే అధికారులు దొంగల శ్రీధర్‌పై కేసు నమోదు చేశారు. ఆయనే ఇసుక చోరీలో నిందితుడని స్పష్టం చేశారు. కాగా, ఈ ఇసుక దోపీడిపై పోలీసులు కేసు నమోదు చేసిన వాసంశెట్టి బాల, కాండ్రేగుల సాయిరాంలను టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు మంత్రి సుభాష్ ప్రకటించారు. ప్రధాన అనుచరుడైన దొంగల శ్రీధర్‌పై మంత్రి ఏ రకమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. -
చోరీ చేశాడని.. కారం దట్టించారు!
అరారియా(బిహార్): దొంగతనం చేశాడని ఓ వ్యక్తిని తాళ్లతో బంధించి..అతడి మలద్వారంలోకి మిరప కారం జొప్పించారు. బిహార్‌లోని అరారియాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పోలీసులు నిందితుల్లో ఒకరిని గుర్తించి, అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఇస్లామియానగర్కు చెందిన కొందరు దొంగతనం చేశాడంటూ ఓ వ్యక్తిని తాళ్లతో నిర్బంధించారు. అతడి ప్యాంటు విప్పి, బలవంతంగా ముందుకు వంచారు. ఒక వ్యక్తి అతడి మల ద్వారంలో మిరప కారం పోసి, పెన్సిల్‌తో లోపలికి కూరాడు. అక్కడే ఉన్న కొందరు ఈ వ్యవహారాన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది పోలీసుల కంటబడింది. దర్యాప్తు చేపట్టి మహ్మద్ సిఫత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతడే బాధితుడి ప్యాంటు బటన్లను విప్పి, మోకాళ్ల వరకు కిందికి లాగాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, మిగతా వారి కోసం గాలింపు చేపట్టారు. ఘటనపై ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ స్పందించారు. రాష్ట్రంలో తాలిబన్ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. -
నూజివీడు ట్రిపుల్ ఐటీలో చోరీ
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోని స్టాఫ్ క్వార్టర్స్‌లో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. క్యాంపస్‌లో ఉన్న ఓ1 బ్లాక్‌లోని 401 ఫ్లాట్‌లో దొంగలు పడి బంగారు ఆభరణాలను, వెండి వస్తువులు, నగదు దోచుకెళ్లారు. గడులను తొలగించి లోనికి ప్రవేశించిన దొంగలు ప్లాట్లోని బీరువాలు, కప్‌బోర్డులు తెరిచి వాటిల్లోని వస్తువులను చిందరవందరగా పడేశారు. ఈ క్వార్టర్లో సీఎస్ఈ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న బి.పద్మ కుటుంబం నివాసముంటోంది.ఆమెకు వారం రోజులుగా డెంగీ జ్వరం కావడంతో నూజివీడులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భర్త ఆమెకు తోడుగా ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ఈ ఘటనలో రూ.1.95 లక్షల నగదు, రెండు కాసుల బంగారం వస్తువులు, 750 గ్రాముల వెండి వస్తువులను చోరీ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఫ్లాట్ నం.203లో కూడా చోరీ జరిగింది. అయితే ఆ కుటుంబం ఊరినుంచి వస్తే గానీ ఏమేమి చోరీకి గురయ్యాయో తెలియదు. ట్రిపుల్ఐటీ ఏర్పాటు చేసిన 16 ఏళ్లల్లో తొలిసారిగా జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. దీంతో బ్లాక్‌లో ఉన్న మిగిలిన ఫ్లాట్ల వారు ఆందోళన చెందుతున్నారు. ఏలూరు నుంచి క్లూస్‌టీం వచ్చి ఆధారాలను సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్యాంపస్‌లో 8వేల మంది విద్యార్థులు, వెయ్యిమంది ట్రిపుల్ ఐటీ సిబ్బంది ఉంటున్నారు.ప్రతి షిప్టులో 56 మంది సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నా చోరీ జరగడం విస్మయాన్ని కలిగిస్తోంది. కాగా, సెక్యూరిటీ పాయింట్లు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ సరిహద్దుల వద్ద కాకుండా ఎక్కడో ఏర్పాటు చేయడం గమనార్హం. -
‘ఆమె‘ను ఆకట్టుకునేందుకు.. ఓ టీనేజర్ ఘనకార్యం!
ఢిల్లీ : ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అన్న చందంగా.. ఇంట్లో తన నగల్ని దొంగతనం చేసిన కుమారుడేనని ఓ తల్లి గుర్తించ లేకపోయింది. ఖరీదైన నగలు మాయమవ్వడంతో పోలీసుల్ని ఆశ్రయించింది ఆ తల్లి. చివరికి ఏమైందంటే? వివరాల్లోకి వెళితే..ఆగస్ట్ 3 న, ఢిల్లీ - నజాఫ్‌గఢ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ ‘‘సార్.. సార్ మా ఇంట్లో దొంగతనం జరిగింది. ఆగస్ట్ 2 ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయంలో అగంతకులు మా ఇంట్లో చొరబడి నా రెండు గోల్డ్ చైన్లు, చెవి కమ్మలు, ఒక ఉంగరాల్ని దొంగతనం చేశారు‘‘ అని ఫిర్యాదు చేసింది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలి ఇంటిని, ఇంటి పరిసరాల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీటీవీ పుటేజీని చెక్ చేశారు. కానీ అందులో ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. బాధితురాలి ఇంటి పక్కనే ఉన్న ఇళ్లల్లో సోదాలు జరిపారు. స్థానికులను ఆరా తీశారు. అయినా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని డీసీపీ అంకిత్ సింగ్ తెలిపారు. చివరగా బంగారు నగలు మాయం అవ్వడంపై బాధితురాలి కుటుంబ సభ్యుల్ని విచారించారు. పోలీసుల విచారణలో దొంగతనం జరిగిన తర్వాత 9వ తరగతి చదువుతున్న బాధితురాలి కుమారుడి అందుబాటులో లేకపోవడంతో పోలీసుల్లో అనుమానం మొదలైంది. వెంటనే పోలీసులు బాలుడి స్కూల్, అతడి స్నేహితుల్ని విచారించగా..దొంగతనం చేసిందనే బాధితుడి కుమారుడేనని నిర్ధారణకు వచ్చారు. బాలుడి కోసం ధరంపూర్, కక్రోలా, నజాఫ్‌గఢ్ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో బాలుడు పోలీసుల్ని తప్పించుకున్నాడు. చివరికి తన ఇంటి సమీపంలో పోలీసుకు చిక్కినట్లు డీసీపీ అంకిత్ సింగ్ వెల్లడించారు.పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. అమ్మ బంగారాన్ని తానే దొంగతనం చేసినట్లు కుమారుడు అంగీకరించాడు. బంగారాన్ని అమ్మగా వచ్చిన రూ. 50 వేలతో ఐఫోన్ కొని 9వ తరగతి చదివే తన స్నేహితురాలికి గిప్ట్గా ఇచ్చినట్లు అంగీకరించాడు. ఇక ఆ బంగారాన్ని కొనుగోలు చేసిన నగల వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో బాధితురాలి భర్త అనారోగ్య సమస్యలతో కొద్ది కాలం క్రితం మరణించారు. కుమారుడికి చదువు అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. పలుమార్లు ఇదే విషయంపై సదరు మహిళ కుమారుడిని మందలిస్తుండేంది. ఈ తరుణంలో 9 వ తరగతి చదువుతున్న తన స్నేహితురాలు పుట్టిన రోజు. ఆమెను ఆకట్టుకునేందుకు.. ఆమె పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా చేయాలని అనుకున్నాడు. ఇందుకోసం నగదు కావాలని కన్న తల్లిని కోరాడు. ముందు చదువుపై దృష్టిసారించాలని అతడికి సూచించింది. ఈ నేపథ్యంలో ఇంట్లోని చెవి దిద్దులు, చేతి ఉంగరంతోపాటు చైన్లు తీసుకు వెళ్లి.. స్థానికంగా ఉన్న వేర్వేరు బంగారం దుఖాణాల్ని విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో.. కుమారుడి ముందే తల్లిపై థర్డ్ డిగ్రీనా?
సాక్షి,హైదరాబాద్ : దళిత మహిళపై పోలీసుల దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. దళిత మహిళపై ఇంత దాష్టీకమా? అని ప్రశ్నించారు. ‘ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన?. దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా?మహిళా అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అసలేం జరిగిందంటేదాదాపు రెండు వారాల క్రితం షాద్‌నగర్ పట్టణంలో తాళం వేసి ఉన్న నాగేందర్ ఇంట్లో 20 తులాల బంగారం, 2 లక్షల నగదు చోరీకి గురైంది. చోరీకి గురైన నగలు తమ ఇంటి సమీపంలో ఉన్న ఓ మహిళ తీసిందేమోనన్న అనుమానం ఉందని నాగేందర్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జులై 24న షాద్‌నగర్ పట్టణంలోని రోజువారీ కూలీ, స్థానికంగా ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. అంతకంటే ముందు ఆమె భర్తని అదుపులోకి తీసుకున్న పోలీసులు చిత్రహింసలకు గురి చేసి విడిచి పెట్టారు. ఆ తర్వాత బాధితురాల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆరుగంటల పాటు ఆమెను వేధించారు. చేయని దొంగతనాన్ని చేసినట్లు ఒప్పుకోవాలని షాద్‌నగర్ ఎస్సై (డిటెక్టివ్) రామిరెడ్డి బాధితురాలిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అనంతరం మధ్యరాత్రి 2గంటల సమయంలో విడిచి పెట్టారు. తీవ్రగాయాల పాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దళిత మహిళపై ఇంత దాష్టీకమా?ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన? దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా?మహిళా అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా? నిక్కర్ తొడిగి, బూటు కాళ్లతో తన్నటమా..! ఇంత కర్కశత్వమా... సిగ్గు సిగ్గు..!కొడుకు ముందే చిత్ర… pic.twitter.com/d9ERDZnHJo— KTR (@KTRBRS) August 5, 2024దళిత మహిళపై ఇంత దాష్టీకమా?దళిత మహిళపై ఇంత దాష్టీకమా?.ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన?. దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా?.మహిళా అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా?.నిక్కర్ తొడిగి, బూటు కాళ్లతో తన్నటమా!. ఇంత కర్కశత్వమా... సిగ్గు సిగ్గు..!.కొడుకు ముందే చిత్ర హింసలా?రక్షించాల్సిన పోలీసులతోనే రక్షణ లేని పరిస్థితా?. ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో...మహిళలంటే ఇంత చిన్నచూపా..!.ఓ వైపు మహిళలపై అత్యాచారాలు, అవమానాలు మరోవైపు దాడులు, దాష్టీకాలు..!.యథా రాజా తథా ప్రజా అన్నట్లు ముఖ్యమంత్రే స్వయంగా ఆడబిడ్డలను అవమానిస్తుంటే.. పోలీసులు మాత్రం మేమేమీ తక్కువ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆడబిడ్డలపై లాఠీఛార్జీలు, దాడులకు తెగబడుతున్నారు. ఆడబిడ్డల ఉసురు ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. వాళ్లను గౌరవించకపోయినా ఫర్వాలేదు. ఇలా దౌర్జన్యాలు మాత్రం చేయకండి’ అని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. -
దళిత మహిళపై పోలీసుల కర్కశత్వం
షాద్‌నగర్ రూరల్: దొంగతనం కేసులో విచారిస్తామంటూ తీసుకొచ్చిన ఓ దళిత మహిళపై పోలీసులు కర్కషంగా వ్య హరించారు. అంతేకాకుండా ఆమె మైనర్ కుమారుడిపై సై తం విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఆలస్యంగా వె లుగులోకి వచ్చిన ఈ ఘటన సైబరాబాద్ పరిధిలోని రంగా రెడ్డి జిల్లా షాద్‌నగర్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జూలై 24న చోరీ : షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఫరూఖ్‌నగర్ ఎస్సీ కాలనీలో నివాసం ఉండే నాగేందర్ ఇంట్లో గత నెల 24న దొంగతనం జరిగింది. తన ఇంట్లో 24 తులాల బంగారంతో పాటు, రూ.2 లక్షల నగదు చోరీ జరిగిందని, దీనికి కాలనీకి చెందిన సునీత, భీమయ్య దంపతులే కారణమంటూ ఆయన షాద్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీసుకొచ్చి.. చితకబాది : కేసు విచారణలో భాగంగా పోలీసులు భీమయ్య అతని భార్య సునీతతో పాటు 13 ఏళ్ల వారి కుమారుడిని గత నెల 30న షాద్‌నగర్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. దొంగతనాన్ని ఒప్పుకోవాలని డీఐ రామిరెడ్డితోపాటు ఇతర పోలీసు సిబ్బంది తనను, భర్తను విచక్షణారహితంగా కొట్టారని సునీత ఆరోపించింది. కాగా, తల్లి ముందే మైనర్ కొడుకును సైతం పోలీసులు దారుణంగా చితకబాది వారిని అర్ధరాత్రి ఇంటికి పంపించారు. కాగా, పోలీసులు కొట్టిన దెబ్బలకు తాళలేక సునీత నడవడానికి కూడా ఇబ్బందిపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆమెను మరుసటిరోజు స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. చివరకు ఈ విషయం బయటకు తెలియడంతో దళిత సంఘాల నేతలు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సాయంతో ఆదివారం సునీతను షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విచారణకు ఆదేశం : దళిత మహిళపై పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పం కావడం, ఎస్సీ, ఎస్టీ కమిషన్ జోక్యం చేసుకోవడంతో ఉన్నతాధికారులు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పరామర్శ : దళిత మహిళపై పోలీసులు చేసిన దాడి విషయాన్ని తెలుసుకున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతంలు షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి బాధితురాలు సునీతను పరామర్శించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ.. మహిళ అని చూడకుండా పోలీసులు సునీతను కొట్టడం సరికాదని అన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళకు న్యాయం చేయాలన్నారు. సైబరాబాద్ కార్యాలయానికి అటాచ్ : దొంగతనం కేసులో దళిత మహిళ, మైనర్ బాలుడిని షాద్‌నగర్ పోలీసులు చితకబాదిన ఘటనపై ఆదివారం సాయంత్రం సైబరాబాద్ సీపీ మహంతి స్పందించారు. షాద్‌నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ (డీఐ) రామిరెడ్డిని సైబరాబాద్ కార్యాలయానికి అటాచ్ చేశారు. షాద్‌నగర్ ఘటనపై సీఎం రేవంత్ సీరియస్ సమగ్ర విచారణకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: బంగారం చోరీ కేసులో ఓ దళిత మహిళ, ఆమె భర్తపై షాద్‌నగర్ పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించి చిత్ర హింసలకు గురి చేసిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం దృష్టికి ఈ విషయం వెళ్లడంతో ఆయన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఘటనతో సంబంధం ఉందని భావించిన వారిని వెంటనే అక్కడి నుంచి తప్పించి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేయాలని ఆదేశించారు. ఘటనకు బాధ్యులైన వారు ఎవరూ తప్పించుకోలేరని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. బాధితులకు న్యాయం చేయడంతోపాటు వారికి అండగా ఉంటామని హామీఇచ్చారు. దళిత మహిళపై దౌర్జన్యం హేయమైన చర్య: మాజీ మంత్రి హరీశ్‌రావు దళిత మహిళపట్ల పోలీసులు కర్కషంగా వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకోవాలని దళిత దంపతులను చిత్రహింసలకు గురిచేయడం మానవ హక్కుల ఉల్లంఘనకు నిదర్శనమన్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
రాజమండ్రి ఏటీఎం నగదు చోరీ కేసు: నిందితుడిని 12 గంటల్లో పట్టేశారు..
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రిలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు చెందిన రూ.2.2 కోట్ల చోరీ కేసును 12 గంటలలోపే పోలీసులు ఛేదించారు. నిందితుడు అశోక్ పోలీసులకు చిక్కాడు. అదుపులోకి తీసుకున్ పోలీసులు నగదను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని మీడియా ముందుకు ప్రవేశపెట్టి.. ఎస్పీ నర్సింహ కిశోర్ ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు.హెచ్డీఎఫ్సీ ఏటీఎంలలో డబ్బులు నింపే ఏజెన్సీ తరఫున అశోక్ పనిచేస్తున్నాడని.. పక్కా ప్రణాళికతో బ్యాంకు సిబ్బంది, సెక్యూరిటీ కళ్లు గప్పి నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే ఐదు ప్రత్యేక బృందాలతో గంటల వ్యవధిలో కేసును ఛేదించినట్లు ఎస్పీ చెప్పారు. నిందితుడు విలాసాలకు అలవాటు పడ్డాడని తెలిపారు. సాంకేతిక, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు.డిగ్రీ చదివిన మాచరమెట్లకు చెందిన వాసంశెట్టి అశోక్‌కుమార్.. రాజమండ్రిలోని ఏటీఎంలలో నగదు నింపే హెచ్‌టీసీ అనే ప్రైవేటు ఏజెన్సీ సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. నగరంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు సంబంధించిన 11 ఏటీఎంల్లో నగదు నింపేందుకు శుక్రవారం మధ్యాహ్నం ఏజెన్సీ ఇచ్చిన రూ.2,20,50,000 చెక్కును దానవాయిపేట హెచ్డీఎఫ్సీ శాఖకు వెళ్లి నగదుగా మార్చాడు. ఆ సొమ్ము ఇనుప పెట్టెలో సర్దుకుని వ్యక్తిగత కారులో పరారయ్యడు.అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో కారును వదిలి పరారైన అశోక్‌ను స్వగ్రామం కపిలేశ్వరం మండలం మాచర్ల మెట్ట గ్రామంలోని తన ఇంట్లో తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు అశోక్ తన ఊళ్లో గుండు చేయించుకుని తిరిగినట్లు సమాచారం. పోలీసులు నిందితుడి సెల్‌ఫోన్‌ను ట్రాక్ చేసి పట్టుకున్నారు. -
ఈ దొంగతనమనేది ఒక పెద్ద జబ్బు.. చివరికి?
‘నాకు 45 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను. హ్యాపీ ఫ్యామిలీ మాది. నాకున్న సమస్యను ఎలా చెప్పాలో తెలియడం లేదు. సిగ్గుగా ఉంది. అదేంటంటే.. కొన్నాళ్లుగా చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నా. కొలీగ్స్ బ్యాగ్స్లోంచి చిన్నచిన్న వస్తువులు తీసుకుంటున్నా. ఫ్రెండ్స్ ఇళ్లకు వెళ్లినా వాళ్లకు తెలియకుండా ఏదో ఒకటి దొంగిలిస్తున్నా. స్పూన్, ఫోర్క్లాంటి వాటికీ కక్కుర్తి పడుతున్నా.ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా చేసుకోలేకపోతున్నా. మొన్న సూపర్ మార్కెట్లో దొరికిపోయేదాన్నే. అదృష్టవశాత్తు బయటపడ్డా. గూగుల్‌లో బ్రౌజ్ చేస్తే ఇది క్లెప్టోమేనియా అనే మానసిక సమస్య అని తెలిసింది. దీనికి పరిష్కారం ఏంటి? దీన్నుంచి నేను బయటపడ్డం ఎలా?’ అంటూ తన పరిస్థితిని వివరించింది మాధవి.నిజమే మాధవి చెప్పినదాన్ని బట్టి అవన్నీ క్లెప్టోమేనియా లక్షణాలే. ఆమె సమస్యను ఎనలైజ్ చేయడానికి ఆమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవలసి వచ్చింది. మాధవి స్వస్థలం బెంగళూరు. బాగా చదవాలని, అన్నిట్లో ఫస్ట్ ఉండాలని చిన్నతనం నుంచే నూరిపోశారు పేరెంట్స్. వాళ్లను సంతోషపెట్టేందుకు కష్టపడి చదివి వాళ్లు కోరుకున్నట్లే అన్నీట్లో ఫస్ట్ ఉండేది ఆమె.ఆ క్రమంలో చాలా ఒత్తిడి అనుభవించింది. చదువైపోయి, మంచి ఉద్యోగమూ సాధించింది. కెరీర్ కూడా బాగుంది. అయినా ఆమెలో ఏదో స్ట్రెస్, ఇన్సెక్యూరిటీ, సెల్ఫ్ క్రిటిసిజం. రెండేళ్ల నుంచి క్లెప్టోమేనియాతో బాధపడుతోంది. తప్పని తెలిసినా కంట్రోల్ చేసుకోలేని స్థితి ఆమెది. ఎవరైనా పట్టుకుంటే అవమానమనే భయం, సిగ్గు, ఆందోళనతో చితికిపోతోంది. ఈ ఆందోళన తగ్గించుకోవడానికి మళ్లీ దొంగతనం చేస్తోంది. అలా చేస్తేనే తనకున్న ఆందోళన తగ్గుతోందట.మెదడులో మార్పులే కారణం... సాధారణంగా ఎవరైనా విలువైన వస్తువులు దొంగిలిస్తారు. కానీ ఏమాత్రం విలువలేని చిన్నచిన్న వస్తువులను దొంగిలించకుండా ఉండలేకపోవడం క్లెప్టొమేనియా ప్రధాన లక్షణం. ఆ తర్వాత భయం, ఆందోళన, అపరాధభావం. వాటినుంచి తప్పించుకునేందుకు మళ్లీ మరో దొంగతనం. ఇదో వలయంలా సాగుతుంది. క్లెప్టోమేనియాకు కచ్చితమైన కారణాలు తెలియవు. మెదడులోని మార్పులు కారణం కావచ్చని, లేదా ఒత్తిడిని అధిగమించేందుకు దొంగతనం అలవాటు కావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.అయితే మెదడులో సెరటోనిన్ అనే రసాయనానికి ఈ రుగ్మతకు సంబంధం ఉందని తెలుస్తోంది. అలాగే చిన్నచిన్న వస్తువులను దొంగిలించినప్పుడు వచ్చే ఎగ్జయిట్మెంట్ మెదడులో డోపమైన్ విడుదలకు కారణం కావచ్చు. దాంతో అలాంటి ఎగ్జయిట్మెంట్ కోసం మళ్లీమళ్లీ దొంగతనం చేస్తుంటారు. ఇంకా మెదడులోని ఓపియాయిడ్ వ్యవస్థ కూడా కారణం కావచ్చు. అలాగే ఇబ్బందికరమైన కోరికల వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించుకునేందుకు కూడా దొంగతనం చేయవచ్చు.చికిత్స తప్పనిసరి అవసరం..అరుదుగా ఉండే ఈ రుగ్మత గురించి ఎవరికైనా చెప్పుకుంటే అవమానమని చాలామంది చికిత్సకు దూరంగా ఉంటారు. ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ క్లెప్టోమేనియాను స్వయంగా అధిగమించడం కష్టం. దానికి కచ్చితంగా చికిత్స అవసరం. ఇందులో మందులు లేదా సైకోథెరపీ, లేదా రెండూ అవసరమవుతాయి.అనారోగ్యకరమైన, ప్రతికూల ప్రవర్తనలను, నమ్మకాలను గుర్తించి, వాటిని ఆరోగ్యకరమైన వాటితో భర్తీ చేయడంలో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఉపయోగపడుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో దొంగతనం చేయాలని ట్రిగ్గర్ అవుతుందో గుర్తించాలి. కాగ్నిటివ్ రీ స్ట్రక్చరింగ్,సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్, కౌంటర్ కండిషనింగ్, కోవర్ట్ సెన్సిటైజేషన్, ఎవర్షన్ థెరపీ టెక్నిక్స్ ద్వారా మాధవి మూడు నెలల్లో తన సమస్య నుంచి బయటపడగలిగింది.అయితే ఇది మళ్లీ వచ్చే అవకాశం ఉన్నందువల్ల నెలకు లేదా రెండు నెలలకు ఒకసారి రివ్యూ సెషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఆమె ఫాలో అయింది. ఇప్పుడు మాధవి ఏ దొంగతనాలూ చేయకుండా ప్రశాంతంగా జీవిస్తోంది. – సైకాలజిస్ట్ విశేష్ -
రైలు దొంగ.. సినిమాల్లో సీన్లు చూసి..
చీరాల రూరల్/నెల్లూరు (క్రైమ్): విలాసాలు, వ్యసనాలకు బానిసయిన ఓ యువకుడు ఇంటర్నెట్లో సినిమాలు చూసి “రైలు దొంగ’గా అవతారమెత్తి.. కటకటాలపాలయిన ఘటన బాపట్ల జిల్లా చీరాల రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. శుక్రవారం రైల్వే డీఎస్పీ సి.విజయభాస్కర్‌రావు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరులోని తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు గ్రామానికి చెందిన పెదాల వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీ అలియాస్ వెంకటేష్ వ్యసనాలకు, విలాసవంతమైన జీవనానికి అలవాటుపడ్డాడు. కూలీ ద్వారా సంపాదించిన మొత్తం తన అవసరాలకు సరిపోకపోవడంతో ఈజీ మార్గంలో మనీ సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం సినిమాల్లో రైళ్లలో దొంగతనాలు చేసే సీన్లు చూసి ప్రేరణ పొంది దొంగగా అవతారమెత్తాడు.రైళ్లల్లో తిరుగుతూ ప్రయాణికులు ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో వారి బ్యాగ్‌లు, బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్, సెల్ఫోన్లను అపహరించేవాడు. ఇటీవల చీరాలలో రైలు దొంగతనాలు అధికం కావడంతో గుంతకల్లు రైల్వే జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె.చౌడేశ్వరి ఆదేశాల మేరకు.. ఒంగోలు జీఆర్పీ సీఐ కె.భుజంగరావు ఆధ్వర్యంలో చీరాల జీఆర్పీ ఎస్ఐ సీహెచ్.కొండయ్య తన సిబ్బందితో కలిసి దర్యాప్తు ప్రారంభించారు.సాంకేతికత ఆధారంగా నిందితుడు వెంకటేశ్వర్లును గుర్తించారు. గురువారం రాత్రి చీరాల రైల్వేస్టేషన్లో నాలుగో నంబర్ ప్లాట్‌ఫారంపై నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి రూ.3.81 లక్షల విలువచేసే 62 గ్రాముల బంగారు ఆభరణాలు, ఐదు సెల్ఫోన్లు, నాలుగు ల్యాప్‌టాప్‌లు, ఐప్యాడ్, మూడు వాచ్‌లను స్వాధీనం చేసుకున్నారు. -
ఈ దొంగ యమా రిచ్!.. ఆడి కారు.. ఖరీదైన ఫ్లాటు..
సాక్షి, హైదరాబాద్: రోహిత్ కనూభాయ్ సోలంకి..ముంబై శివార్లలో రూ.కోటి ఖరీదైన ఫ్లాట్‌లో నివసిస్తుంటాడు. ఆడి హైఎండ్ కారులో సంచరిస్తుంటాడు. ఓ నగరాన్ని టార్గెట్ చేసుకుంటే అక్కడకు వెళ్లి స్టార్ హోటల్లో బస చేస్తాడు. సంపన్నుల ప్రాంతాలను గూగుల్ ద్వారా గుర్తిస్తాడు. అక్కడ పగలు రెక్కీ చేసి తాళం వేసున్న ఇళ్లల్లో రాత్రిళ్లు పంజా విసరుతాడు. ఈ ఖరీదైన దొంగను గత వారం గుజరాత్‌తోని వల్సాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. విచారణ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోనూ రెండు నేరాలు చేసినట్లు అంగీకరించాడు. దీంతో ఇక్కడి పోలీసులకు త్వరలో సమాచారం ఇవ్వనున్నట్లు వల్సాద్ ఎస్పీ కరణ్ రాజ్ వాఘేలా ‘సాక్షి’కి తెలిపారు. మహారాష్ట్రకు చెందిన సోలంకి ప్రస్తుతం ముంబ్రాలోని ఖరీదైన సొంత ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు. తన పేరును అర్హాన్గా మార్చుకున్న ఇతగాడు ఓ మైనార్టీ యువతిని వివాహం చేసుకున్నాడు. ఆమెతో తాను సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని చెప్తూ... కొన్నేళ్లుగా చోరీలు చేస్తున్నాడు. క్యాంపుల పేరుతో తరచు ఇల్లు వదిలి వెళ్లే ఇతగాడు కేవలం ప్రధాన నగరాలనే టార్గెట్‌గా చేసుకుంటాడు. విమానంలో అక్కడకు చేరుకుని స్టార్ హోటల్లో బస చేస్తాడు. గూగుల్ ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న సంపన్న వర్గాలు నివసించే ప్రాంతాలను గుర్తిస్తాడు. హోటల్‌కు చెందిన క్యాబ్‌ను బుక్ చేసుకునే ఇతగాడు పగటి పూటి అందులోనే తిరుగుతూ తాను ఎంచుకున్న ప్రాంతాల్లో రెక్కీ చేస్తాడు. తాళం వేసున్న ఇళ్లను గుర్తించి ఆ ప్రాంతాలకు సంబంధించిన లోకేషన్స్‌ను తన వాట్సాప్‌లోకి షేర్ చేసుకుంటాడు. రాత్రి వేళ కాలినడకన బయలుదేరి..సమీపంలోని ఏదో ఒక దుకాణం నుంచి చిన్న రాడ్డు, స్క్రూడ్రైవర్ వంటివి ఖరీదు చేస్తాడు. వీటిలో టార్గెట్ చేసుకున్న ఇంటి తాళాలు పగులకొట్టి నగదు, సొత్తు స్వాహా చేస్తాడు. చోరీ సొత్తును తీసుకుని మాత్రం రైలులోనే ముంబైకి చేరుకుంటాడు. ఇంటికి చేరుకునేలోపే దాన్ని అమ్మి, క్యాష్ చేసుకుని, బ్యాంక్ ఖాతాలో వేసుకుంటాడు. ఇలా గడిచిన కొన్నాళ్లల్లో గుజరాత్‌లోని వల్సాద్, వాపి, సూరత్, పోర్బందర్, సెల్వాల్లతో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్‌ల్లో 19 నేరాలు చేశాడు. వీటిలో రెండు హైదరాబాద్‌లో చేసినవే. వల్సాలో జరిగిన వాపిలో జరిగిన రూ.లక్ష నగదు చోరీ కేసును వల్సాద్ జిల్లా పోలీసులు దర్యాప్తు చేశారు. సాంకేతిక ఆధారాలతో పాటు సోలంకి బస చేసిన హోటల్, ప్రయాణించిన విమానం టిక్కెట్ తదితర వివరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ముంబ్రాలోని అతడి ఫ్లాట్ వద్ద కాపుకాసిన పోలీసులు గత వారం అరెస్టు చేశారు. విచారణ నేపథ్యంలో జల్సాలకు అలవాటుపడిన ఇతగాడు ముంబైలోని నైట్ క్లబ్స్‌లో భారీ మొత్తం ఖర్చు చేస్తాడని తేలింది. మాదకద్రవ్యాలకు సైతం అలవాటుపడి బానిసగా మారిన సోలంకి ఏకంగా నెలకు రూ.1.5 లక్షలు వాటికే వెచి్చస్తాడని పోలీసులు గుర్తించారు. వల్సాద్ ఎస్పీ కరణ్ రాజ్ వాఘేలా ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ...‘రోహిత్ సోలంకిని విచారించిన నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని హైదరాబాద్‌ల్లో రెండేసి చోరీలు చేసినట్లు వెలుగులోకి వచి్చంది. అయితే ఏ ప్రాంతంలో చేశాడనేది అతడు స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడు ఆయా నగరాల్లో సంచరించిన తేదీలతో పాటు ఇతర వివరాలను సాంకేతికంగా గుర్తిస్తున్నాం. ఆపై ఆ అంశాలకు అక్కడ పోలీసులకు తెలుపుతాం. డ్రగ్స్‌కు బానిసైన సోలంకిని రీహాబ్కు పంపాలని యోచిస్తున్నాం’ అని పేర్కొన్నారు. -
హైదరాబాద్ లో అర్థరాత్రి దొంగల బీభత్సం..
-
‘ప్లేట్’ ఫిరాయిస్తే కేసే!
ట్రాఫిక్ ఉల్లంఘనులు నగరంలో రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. జరిమానాలు తప్పించుకోవడానికి నిఘా నేత్రాలు, ట్రాఫిక్ కెమెరాలకుతమ వాహన నంబర్ చిక్కకుండా ఉండేందుకు వాటిని ‘కవర్’ చేస్తున్నారు. దీనికోసం నంబర్ ప్లేట్స్‌కు మాస్కులు తొడగటం, వంచేయడం, విరిచేయడం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి ఉల్లంఘనులపై పోలీసులు మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధిస్తూ వచ్చారు. అయితే ఈ తరహా ఉల్లంఘనుల్లో మార్పు రాకపోవడం, స్నాచింగ్స్, చోరీలకు పాల్పడేవారు సైతం ఇదే బాటపట్టడంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్స్ మూసేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. గత నెలలోనే 35 కేసులు నమోదు చేయించారు. - సాక్షి, హైదరాబాద్ఈ–చలాన్లు తప్పించు కోవాలనే ఉద్దేశంతో..ఈ– చలాన్లు తప్పించుకోవడానికే నంబర్ ప్లేట్లు మూసేసే వారే ఎక్కువగా ఉంటున్నారు. ప్రస్తుతం నగరవ్యాప్తంగా నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానాలు అమలవుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది తమ చేతిలో ఉన్న డిజిటల్ కెమెరాలతో, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అధికారులు జంక్షన్లతోపాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాల ఫొటోలు నంబరు ప్లేట్స్‌తో సహా చిత్రీకరిస్తున్నారు.వీటి ఆధారంగా ఆయా ఉల్లంఘనులకు ఈ–చలాన్లు జారీ చేస్తున్నారు. ఈ విధానంలో ఉల్లంఘనులు వినియోగించిన వాహన రిజిస్ట్రేషన్ నంబర్, దాని ఆధారంగా సేకరించే రిజిస్టర్డ్ చిరునామానే కీలకం. కొందరు తమ వాహనాలకు సంబంధించిన నంబర్ ప్లేట్లను వివిధ రకాలుగా కవర్ చేస్తూ ట్రాఫిక్ కెమెరాలకు చిక్కుకుండా చేస్తున్నారు. కొందరు నేరగాళ్లు సైతం నంబరు ప్లేట్లు కనిపించకుండా చేసి నేరాలకు పాల్పడుతున్నారు. నగరంలో ఇలా జరిగిన కొన్ని నేరాలను కొలిక్కి తేవడానికి పోలీసులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.ముందు వాటి కంటే వెనుకవే ఎక్కువవాహనాల నంబర్ ప్లేట్స్ ఎదుటి వారికి, సీసీ కెమెరాలకు చిక్కకుండా కవర్ చేయడం అనేది కార్లు వంటి తేలికపాటి వాహనాల కంటే ద్విచక్ర వాహనాలకే ఎక్కువగా కనిపిస్తోంది. రోడ్లపై ఈ తరహా నంబర్ ప్లేట్‌ను పోలీసులు గుర్తించి ఆపడానికి ప్రయత్నిస్తే బైక్స్ మాదిరిగా ఫోర్ వీలర్స్ వాహనాలు తప్పించుకొని వెళ్లిపోలేవు. దీంతో వారు అలాంటి చర్యల జోలికివెళ్లరు. ద్విచక్ర వాహనాల్లోనూ 90 శాతం వెనుక వైపు నంబర్ ప్లేట్‌కే రూపురేఖలు లేకుండా చేస్తున్నారు.క్షేత్రస్థాయిలో స్పెషల్ డ్రైవ్స్ చేసేప్పుడు రహదారులపై కొన్ని వాహనాలను తనిఖీ చేస్తారు. ముందు ఉండే నంబర్ ప్లేట్ వారికి స్పష్టంగా కనిపిస్తుండటంతో ఆ వాహనాలను ఆపి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అదే వెనుక నంబర్ ప్లేట్ అయితే వాహనం ముందుకు వెళ్లిపోయాకే ట్రాఫిక్ పోలీసులకు కనిపిస్తుంది. ఇలా ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయడం మొదలెట్టారు. గత నెల వరకు ఐపీసీలోని సెక్షన్ 420 ప్రకారం నమోదు చేయగా, ఈ నెల నుంచి బీఎన్ఎస్లోని సెక్షన్ 318 వినియోగించనున్నారు. ఈ కేసుల్లో నేరం నిరూపణ అయితే ఏడేళ్ల వరకు జైలు లేదా జరిమానా విధించే అవకాశం ఉంది.ఉద్దేశపూర్వకంగా చేసిన వారిపైనే కేసులుఅనివార్య కారణాల వల్ల, పొరపాటుగా వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు డ్యామేజ్ అవుతుంటాయి. మరికొందరికి తమ నంబర్ ప్లేట్ డ్యామేజ్ అయిన విషయం తెలిసినా పని ఒత్తిడి, నిర్లక్ష్యం వంటి కారణాలతో దాన్ని సరి చేసుకోరు. స్పెషల్ డ్రైవ్‌లో ఇలాంటి వాహనాలు చిక్కితే వారికి చలాన్ ద్వారా జరిమానా మాత్రమే విధిస్తున్నారు. కొందరు మాత్రం నేరాలు చేయాలని, ఈ–చలాన్‌కు చిక్కకూడదనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్లను డ్యామేజ్ చేయడం, వాటిపై ఉన్న నంబర్లు మార్చడం, వంచేయడం, స్టిక్కర్లు వేసి మూసేయడం చేస్తున్నారు. ఇలాంటి వారిపై మాత్రమే శాంతిభద్రతల విభాగం పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేయిస్తున్నాం. – పి.విశ్వప్రసాద్, అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) -
1300 ఏళ్ల నాటి మేజిక్ ఖడ్గం మాయం : అందోళనలో స్థానికులు
ప్రపంచంలోకెల్లా అత్యంత పదునైందిగా పేరుగాంచిన కింగ్ ఆర్థర్‌కు చెందిన ఖడ్గం అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. భూమికి 32 అడుగుల పైన పాతిపెట్టిన పౌరాణిక ఖడ్గం చోరీకి గురై ఉంటుందా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.ది టెలిగ్రాఫ్ కథనం రోకమడోర్ పట్టణంలో 1,300 ఏళ్లుగా ఎత్తయిన బండరాయిలోకి సగం దిగబడిన విశేషం ఖడ్గం చోరీకి గురైందని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఖడ్గం అదృశ్యం కావడం స్థానికుల్లో కలవరం రేపింది. ఎందుకంటే దొంగ దానిని తస్కరించాలంటే కఠినమైన రాతి ఉపరితలంపై 32 అడుగులు ఎక్కవలసి ఉంటుంది. అంత ఎత్తుకు ఎక్కి ఆ ఖడ్గాన్ని దొంగిలించడం ఎలా సాధ్యమైంది అనేది ఇపుడు హాట్ టాపిక్.. శతాబ్దాలుగా రోకామడోర్ పట్టణానికి అతిపెద్ద టూరిస్ట్ అట్రాక్షన్‌గా నిలుస్తోందని పట్టణ మేయర్ డోమినిక్ లెన్ ఫెంట్ చెప్పారు.ఈ ఖడ్గం విశేషాలుస్థానిక స్థల పురాణం ప్రకారం ఆ ఖడ్గానికి అతీంద్రియ శక్తులు ఉన్నాయి. డురండల్గా పిలిచే ఆ ఖడ్గానికి ఫ్రెంచ్ ఎక్స్ క్యాలిబర్ అని కూడా పేరుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పదునైన కత్తి, నాశనంలేనిది. ఒక్క దెబ్బతో రాయిని కూడా చీల్చగల సామర్థ్యం దీని సొంతం. 11వ శతాబ్దానికి చెందిన ది సాంగ్ ఆఫ్ రోలాండ్ అనే పురాణ పద్యం కత్తి అద్భుత లక్షణాలను వివరించింది.ఈ పద్యం తాలూకు కాపీ ప్రస్తుతం ఆక్స్ ఫర్డ్ లోని బోడ్లియన్ లైబ్రరీలో ఉంది.ది లెజెండ్ ఆఫ్ ఎక్సాలిబర్: పురాణ ఖడ్గం ఎక్సాలిబర్ కింగ్ ఆర్థర్ యాజమాన్యంలోనిది. దీనికి అనేక మాంత్రిక సామర్థ్యాలున్నట్లు ది సన్ రిపోర్ట్ చేసింది.మధ్యయుగ పురాణం ప్రకారం, 8వ శతాబ్దంలో నాటి రోమన్ చక్రవర్తి రాజు చార్లెమాగ్నే ఒక దేవదూత నుండి డురాండల్ను అందుకున్నాడు. దీన్ని తరువాత సైనికాధికారి రోలాండ్ కిచ్చాడు. యుద్ధంలో తన మరణానికి ముందు, రోలాండ్ ఈ ఖడ్గాన్ని శత్రువులు దానిని స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు రాళ్ళపై దానిని పగలగొట్టడానికి ప్రయత్నించినా ఫలించలేదు. చివరకు దాన్ని కాపాడేందుకు గాలిలోకి విసిరాడు. అయితే ఇది అద్భుతంగా వందల కిలోమీటర్లు ప్రయాణించి, రోకామడోర్ రాక్ ఫేస్‌లో దిగబడినట్లు చెబుతారు. -
రూ.25 లక్షల విలువైన చేపల్ని చోరీ చేసిన టీడీపీ శ్రేణులు
ఏర్పేడు: తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని పెనుమల్లంలోని పంచాయతీ చెరువులో రూ.25 లక్షల విలువైన చేపల్ని టీడీపీ కార్యకర్తలు దొంగిలించారని లీజుదారు ఘొల్లుమంటున్నాడు. ఈ మేరకు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. పెనుమల్లంలోని పంచాయతీ చెరువుకు గత ఏడాది అక్టోబర్‌లో పంచాయతీ అధికారులు లీజు వేలం నిర్వహించారు. పంచాయతీ పరిధిలోని నడుమూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు మునిరాజా రూ.50 వేల లీజుకు చేపల చెరువును దక్కించుకున్నాడు. సుమారు రూ.5 లక్షలు వెచ్చించి చేప పిల్లల్ని కొనుగోలు చేసి చెరువులో వేసి పెంచుతున్నాడు. చేపల చెరువు కాలపరిమితి ఆదివారంతో ముగియనుంది. కాగా.. టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యంగా చెరువులోని చేపల్ని వలలతో పట్టుకుని తీసుకుపోయారు. ఇదేమిటని అడిగినందుకు చెరువు వద్దకు వస్తే తాట తీస్తామని బెదిరించడంతో బాధితుడు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. చెరువులోని సుమారు రూ.25 లక్షల విలువైన చేపలను టీడీపీ కార్యకర్తలు పట్టుకుని వెళ్లారని బాధితుడు వాపోయాడు. ఈ విషయంపై ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి శివప్రసాద్‌ను వివరణ కోరగా.. ఆదివారం వరకు చేపల చెరువుకు కాలపరిమితి ఉందని, సమస్యపై చర్చించి న్యాయం చేస్తామని చెప్పారు. -
యూపీలో మహిళా చోరులు!
లక్నో: ముసుగులు ధరించిన మహిళలు ఆయుధాలు చేతబూని భారీ దొంగతనానికి పూనుకున్నారు. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి దర్జాగా ప్రవేశించి కేవలం 50 నిమిషాల్లో ఉన్నదంతా ఊడ్చేసి గోతాముల్లో నింపుకుని వెళ్లిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. ఈ నెల ఏడో తేదీన తెల్లవారుజామున 3 గంటలకు ఆషియానా పోలీస్‌స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ సందీప్ గులాటి ఇంట్లో ఈ మహిళా దొంగలు చొరబడ్డారు. ఒకరిద్దరు ఆయుధాలతో బయట కాపలాగా ఉండిపోగా మిగతా వారు ఇంట్లో సీలింగ్ ఫ్యాన్లు సహా ప్రతి వస్తువు తీసుకుని ఐదు బస్తాల నిండా దర్జాగా నింపుకుని నెమ్మదిగా వెళ్లారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
‘సిగ్నల్’ చోరీ
సాక్షి, అమరావతి: దేశంలో సెల్‌ఫోన్ సిగ్నల్ సమస్య పెరుగుతోంది. ఫోన్ చేస్తే మధ్యలోనే కాల్ డ్రాప్ అవుతోంది. ఒక్కోసారి సిగ్నల్ ఉన్నట్టే ఉంటుంది.. కానీ ఫోన్ మాత్రం కలవదు. ఇవన్నీ తమ వల్ల వచ్చిన సమస్యలు కావని.. సెల్ టవర్లపై దొంగలు చేతివాటం ప్రదర్శిస్తుండటంతో తలెత్తిన సమస్యలని నెట్వర్క్ ఇంజనీర్లు, టెలికాం సంస్థలు చెబుతున్నాయి. గత 6 నెలల్లో దేశవ్యాప్తంగా 17 వేల రేడియో రిమోట్ యూనిట్లు(ఆర్ఆర్యూ) చోరీకి గురయ్యాయి. టెలి కమ్యూనికేషన్స్‌లో ట్రాన్స్ రిసీవర్‌గా ఆర్ఆర్యూ ఉపయోగపడుతుంది. ఇది ట్రాన్స్మిషన్ పనితీరును, మొబైల్ సిగ్నల్ల స్వీకరణను మిళితం చేస్తుంది. ఆర్‌ఆర్‌యూలు చోరీకి గురవుతుండటంతో సిగ్నల్ సమస్యలు పెరిగిపోతున్నాయని టెలికాం నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా దొంగతనాలతో దేశవ్యాప్తంగా టెలికాం కంపెనీలు రూ.800 కోట్ల మేర నష్టాలను చవిచూశాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దొంగిలించిన ఆర్ఆర్ యూనిట్లును చైనా, బంగ్లాదేశ్ తదితర దేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెల్యులార్ ఆపరేటర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ).. ఆర్ఆర్యూ దొంగతనాలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. దేశ డిజిటల్ భవిష్యత్‌కు ఉపయోగపడే కీలక మౌలిక సదుపాయాలను రక్షించడానికి కఠిన చర్యలు అవసరమని అభిప్రాయపడుతోంది.ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ.. గతేడాది అక్టోబర్ నుంచి ఈ తరహా దొంగతనాలు పెరిగాయి. గుజరాత్‌తో పాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, హరియాణా, ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. -
ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో చోరీ
కూడేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎం సెంటర్లో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈ ఘటన అనంతపురం జిల్లా, కూడేరు మండలంలో చోటుచేసుకుంది. ఏటీఎంను పగులగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు, అందులోని రూ.18,41,300 నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కూడేరులో దళితవాడకు ఎదురుగా అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారి పక్కన అనంతపురం సాయినగర్‌లోని స్టేట్ బ్యాంకు ప్రధాన శాఖ ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కట్టర్‌తో ఏటీఎంను కట్ చేశారు. మిషన్‌లో ఉంచిన నగదు చోరీ చేశారు. అదే సమయంలో మిషన్‌లో షార్ట్ సర్క్యూట్ సంభవించి పైభాగం కాలిపోయింది. శబ్దం కూడా రావడంతో స్థానికుడొకరు బయటకు వచ్చి చూడగా.. ఏటీఎం సెంటర్ నుంచి కొందరు కార్లో వెళ్లిపోవడం, సెంటర్లో నుంచి పొగ రావడం గమనించాడు. కొంత సమయం తర్వాత విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. సీఐ శివరాముడు ఏటీఎం సెంటరును పరిశీలించారు. చోరీ జరిగిందని నిర్ధారించుకుని సమాచారాన్ని బ్యాంకు అధికారులకు అందించారు. సంబంధిత అధికారులు వచ్చి పరిశీలించారు. నగదు నిల్వ, విత్‌డ్రాలకు సంబంధించి ప్రధాన కార్యాలయం నుంచి డేటా తీసుకున్నారు. రూ.18,41,300 చోరీకి గురైనట్టు పోలీసులకు తెలిపారు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో భారీ చోరీ
-
HYD: మినిస్టర్ క్వార్టర్స్‌లో చోరీ
హైదరాబాద్, సాక్షి: అది నగరంలో వన్ ఆఫ్ ది వీవీఐపీ ఏరియా. ఏకంగా రాష్ట్ర మంత్రుల నివాస ప్రాంగణాలు ఉండే చోటు. కాబట్టి, భద్రత కూడా కట్టుదిట్టంగానే ఉంటుందని అంతా భావిస్తాం. అయితే.. అలాంటి చోట చోరీ జరగడం చర్చనీయాంశంగా మారింది. బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్‌లో దొంగతనం జరిగింది. క్వార్టర్స్ ప్రాంగణంలో ఉంచిన నిర్మాణ సామాగ్రిని గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. అర్ అండ్ బీ అధికారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిర్మాణ సామాగ్రిలో తలుపుల్ని, స్టీల్‌ను దుండగులు మాయం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే.. అత్యంత పటిష్ట భద్రత ఉండే మంత్రుల నివాస ప్రాంగణంలో ఈ చోరీ జరగడంతో స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది కిందిస్థాయి అధికారుల పనే అయ్యి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
హైదరాబాద్‌లో చోరీ.. సూడాన్‌కు స్లగ్మింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఇటీవల సెల్‌ఫోన్ చోరీలు పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న టాస్‌్కఫోర్స్ పోలీసులు చోరీలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్–సూడాన్ మధ్య ఉన్న అంతర్జాతీయ నేర బంధం వెలుగులోకి వచి్చంది. ఇక్కడ చోరీకి గురైన స్మార్ట్ఫోన్లను థర్మకోల్ బాక్సుల్లో పార్సిల్ చేసి సూడాన్‌కు స్మగ్లింగ్ చేస్తున్న వ్యవస్థీకృత ముఠా వ్యవహారాలు బయట పడుతున్నాయి. గత నెల ఆఖరి వారంలో 17 మందిని అరెస్టు చేసి 703 సెల్ఫోన్లు స్వా««దీనం చేసుకున్న టాస్‌్కఫోర్స్ పోలీసులు.. తాజాగా మరో 31 మందిని పట్టుకుని వీరి నుంచి రూ.2 కోట్ల విలువైన 713 ఫోన్లు సీజ్ చేశారు. ఈ ముఠాల వ్యవహారంపై టాస్క్‌ఫోర్స్ డీసీపీ ఎస్.రష్మి పెరుమాళ్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. చోరీ చేసి.. వ్యాపారులకు విక్రయం హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన చిన్న చిన్న ఉద్యోగులు, చిరు వ్యాపారులు, ఆటోడ్రైవర్లు ఓ ముఠాగా ఏర్పడ్డారు. విలాసాలకు అవసరమైన డబ్బును తేలిగ్గా సంపాదించడానికి సెల్ఫోన్ల చోరీలు చేయాలని పథకం వేశారు. రద్దీ ప్రాంతాల్లో తిరుగుతూ అదును చూసుకుని ప్రజల సెల్ఫోన్లు చోరీ చేస్తారు. వాటిని జగదీశ్ మార్కెట్ సహా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సెల్‌ఫోన్ మార్కెట్లలో కొందరు వ్యాపారులకు విక్రయిస్తుంటారు. ఆపై వాటిని ఏం చేస్తున్నారు? ఇలా చోరీ చేసిన ఫోన్లలో దాదాపు అన్నీ లాక్ చేసే ఉంటాయి. వీటిని అన్‌లాక్ చేయడం కోసం ప్రత్యేకంగా కొందరు సెల్‌ఫోన్ టెక్నీíÙయన్లు పని చేస్తున్నారు. వీళ్లు చోరీ ఫోన్ల లాక్‌లు తీయడంతో పాటు అవసరమైన వాటి ఐఎంఈఐ నంబర్లు ట్యాంపర్ చేస్తుంటారు. అంటే.. తక్కువ ఖరీదు ఉండే బేసిక్ ఫోన్లకు చెందిన ఐఎంఈఐ నంబర్లను ఖరీదైన ఫోన్లలో వేసి పోలీసుల సాంకేతిక ని«ఘాకు చిక్కకుండా చేస్తారు. ఆపై ఆ ఫోన్లను వ్యాపారులు సూడానీయులకు అమ్మేస్తున్నారు. ఆ దేశంలోని వ్యాపారులతో సంబంధాలు కలిగి ఉండే వీళ్లు.. సెకండ్ హ్యాండ్ ఫోన్ల పేరుతో థర్మకోల్ బాక్సుల్లో పార్సిల్ చేసి, తప్పుడు పత్రాలతో సముద్ర మార్గంలో అక్కడకు పంపేస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌లో ఎవరెవరు ఏం చేస్తున్నారు? హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆటోడ్రైవర్లు.. సయ్యద్ ఘయాజ్ హషి్మ, మహ్మద్ దస్తగిర్, సయ్యద్ సాజిద్, సయ్యద్ షరీఫ్, సయ్యద్ సలావుద్దీన్, టైల్స్ వర్కర్లు మహ్మద్ హమీద్, షేక్ మునావర్, వెల్డింగ్ వర్కర్లు షేక్ అన్సార్, మహ్మద్ ఖాన్, డెకరేషన్ వర్కర్ మహ్మద్ అంజాద్, వంట పని చేసే మహ్మద్ ఖాలిద్, పెయింటర్ మహ్మద్ మహమూద్ అలీ, చిరుద్యోగి సోహైల్ ఖాన్, కూరగాయల వ్యాపారి మహ్మద్ ముస్తాక్ ఫోన్లు చోరీ చేస్తారు. మొబైల్ వ్యాపారులైన షేక్ షాజవాజ్ ఖాన్, మహ్మద్ ఆసిఫ్ అహ్మద్, మహ్మద్ గౌస్, మహ్మద్ అర్షద్ మొయినుద్దీన్, మహ్మద్ నవీదుద్దీన్ సల్మాన్, మహ్మద్ నజీరుద్దీన్, మహావీర్ జైన్, మహ్మద్ అబ్దుల్ సిరాజ్, మజీద్ ఖాన్, అబ్దుల్ హజీమ్, షేక్ జావేద్ అలీ ఈ చోరీ ఫోన్లు కొంటారు. వీటిని సయ్యద్ రహీమ్, మహ్మద్ అర్బాజ్ ఖాన్, నజీముద్దీన్, సాదిక్ అహ్మద్ అన్‌లాక్ చేస్తుండగా.. ఇవన్నీ తక్కువ ధరకు కొనే సూడానీ మూసా హసన్ తమ దేశానికి స్మగ్లింగ్ చేస్తున్నాడు. నానల్‌నగర్‌లో ఉండే మూసా మొబైల్ విడిభాగాల వ్యాపారం చేస్తున్నాడు. స్మగ్లింగ్ వ్యవహారంలో మూసానే కీలకంగా వ్యవహరిస్తున్నాడు. -
దొంగగా మారిన ఆలయ వాచ్‌మ్యాన్.. 12 తులాల బంగారంతో పరార్
మహారాష్ట్రలో వింత చోరీ ఘటన చోటుచేసుకుంది. ఆలయానికి కాపలాగా నియమించిన వాచ్‌మ్యాన్ దొంగగా మారి, విలువైన ఆభరణాలు కొల్లగొట్టాడు.వివరాల్లోకి వెళితే ఠాణే జిల్లాలోని కల్యాణ్‌ను ఆనుకునివున్న ఉల్లాస్‌నగర్ కాళీమాత ఆలయంలో వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తున్న వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. ఆలయ వాచ్‌మ్యాన్ రమేష్ రావల్ తన స్నేహితునితో కలిసి 12 తులాల బంగారం దొంగిలించి పరారయ్యాడు. ఈ నేరం నుంచి తప్పించుకునేందుకు రమేష్రావత్ తనతో పాటు ఆలయంలోని సీసీటీవీని కూడా ఎత్తుకెళ్లిపోయాడు. ఈ ఘటనపై కళ్యాణ్‌లోని విఠల్వాడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీసు అధికారి అనిల్ పడ్వాల్ ప్రత్యేక బృందాన్ని నియమించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఆలయంలో బంగారం చోరీ కావడం స్థానికులను కలవరానికి గురిచేసింది. చోరీకి పాల్పడిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.కాగా రమేష్ రావల్ మూడు రోజుల క్రితమే ఆలయ కాపలాదారుగా చేరాడు. ఆలయ ధర్మకర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ కాళీమాత ఆలయం 65 ఏళ్ల నాటిదని ఆలయ పూజారి తెలిపారు. ఆలయ ప్రధాన కార్యదర్శి సూర్జిత్ బర్మన్ మాట్లాడుతూ నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలన్నదే తమ డిమాండ్ అని తెలిపారు. -
మూడేళ్ల చిన్నారిపై విద్యుత్ చౌర్యం కేసు
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఈ ప్రాంతానికి చెందిన మూడేళ్ల చిన్నారిపై విద్యుత్ చౌర్యం కేసు నమోదైంది. పెషావర్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ (పెస్కో), వాటర్ అండ్ పవర్ డెవలప్మెంట్ అథారిటీ (వాప్డా) సంస్థల ఫిర్యాదు మేరకు ఈ చిన్నారిపై కేసు నమోదు చేశారు.తరువాత ఆ చిన్నారిని అడిషనల్ సెషన్స్ జడ్జి కోర్టులో హాజరు పరిచారు. ఈ ఉదంతానికి సంబంధించిన అఫిడవిట్‌ను పరిశీలించిన న్యాయమూర్తి కేసును కొట్టివేశారు. కాగా ఆ చిన్నారి ఏమి చేసిందనే దానిపై పెస్కో, వాప్డా అధికారులు స్పష్టత ఇవ్వలేదు. పాక్‌కు చెందిన విద్యుత్ పంపిణీ సంస్థలలో విద్యుత్ చౌర్యం కారణంగా జాతీయ ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతోంది. విద్యుత్ పంపిణీ సంస్థల అధిక వసూళ్లపై పాక్‌లోని పంజాబ్ ఇంధన శాఖ ఏప్రిల్ 7న ఆందోళన చేపట్టింది.లాహోర్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ, ఫైసలాబాద్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ, ముల్తాన్ ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ, గుజ్రాన్వాలా ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ, ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీలు ప్రభుత్వ శాఖల నుంచి అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నాయని విద్యుత్ శాఖ పేర్కొంది. -
వీడు మాములోడు కాదు.. 100 రోజులు, 200 విమానాలు కట్ చేస్తే..!
కేటుగాళ్లకే కేటుగాడు.. చోరకళలో మహాముదురు. గత ఏడాది కాలంలో200 విమానాలు ఎక్కి, 100 రోజుల పాటు దేశంలో వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. చేతివాటం చూపించి ఏకంగా లక్షలు కొట్టేశాడు. పోలీసులకు చుక్కలు చూపించాడు. కట్ చేస్తే.. పోలీసుల చేతికి చిక్కి కటకటాల వెనక్కి చేరాడు. అసలు స్టోరీ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.ఢిల్లీలోని పహర్‌గంజ్ ప్రాంతానికి చెందిన రాజేశ్ కపూర్ చోరీలోతనకు తానే తోపు అనుకున్నాడు. మొదట రైళ్లలో చోరీ చేసేవాడు. చాలాకాలానికి అక్కడ దొరికిపోవడంతో ఇక విమానాల్ని ఎంచుకున్నాడు. ఒకదాని తరువాత మరొకటి దర్జాగా లక్షల రూపాయల విలువచేసే బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను కొట్టేసేవాడు. కానీ ఎప్పటికైనా పాపం పండుతుంది అన్నట్టు. మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ పోలీసుల పని అంత ఈజీగా అవ్వలేదు. ఢిల్లీ, హైదరాబాద్, అమృత్సర్ విమానాశ్రయాల్లోని కొన్ని గంటల సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేసిన తర్వాత రాజేష్ కపూర్‌ను పట్టుకున్నట్టు వెల్లడించారు.ఢిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ ఉషా రంగరాణి అందించిన సమాచారం ప్రకారం, లగ్జరీ ప్రయాణికుడిలాగా పోజు కొడుతూ విమానాల్లో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులు ముఖ్యంగా మహిళలు, వృద్ధులును ట్రాప్ చేసి చోరీ చేయడంలో రాజేశ్ ఆరితేరిపోయాడు.కనెక్టింగ్ ఫ్లైట్స్‌లో ప్రయాణించే వారిని టార్గెట్ చేసి చోరీలు చేసేవాడు. ప్రయాణికులతో మాటలు కలిపి వారికి సాయం చేస్తున్నట్టు నటించి నగలు, విలువైన వస్తువులు దోచేసేవాడు. ఏప్రిల్‌లో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ మహిళ ఐజిఐ విమానాశ్రయం నుంచి యూఎస్‌కి కనెక్టింగ్ ఎయిరిండియా విమానంలో ఆమె బ్యాగు నుంచి రూ. 7 లక్షల విలువైన నగలు కొట్టేశాడు. అంతేకాదు అమెరికాకు చెందిన వర్జిందర్‌జిత్ సింగ్ కూడా ఇతని బాధితుడే. అమృత్సర్ నుంచి ఢిల్లీ వచ్చి కనెక్టింగ్ ఫ్లైట్‌లో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళుతున్న వర్జిందర్‌జిత్ సింగ్ క్యాబిన్ బ్యాగ్ నుండి రూ. 20 లక్షల విలువైన వస్తువులు దొంగిలించాడు.మోడస్ ఒపరాండీ అమాయకంగా కనిపించే వృద్ధులు, మహిళా ప్రయాణీకులే ప్రధాన టార్గెట్. వారి బ్యాగేజీ డిక్లరేషన్ స్లిప్‌లోని సమాచారాన్ని దొంగచాటుగా పసిగడతాడు. బోర్డింగ్ గేట్ వద్ద వారితో మాటలు కలుపుతాడు. విమానంలో వారి పక్కకే తన సీటు మార్పించుకుంటాడు. వారి లగేజీ సర్దడానికి సాయం చేస్తున్నట్టు నటించి, సమయం చూసి అక్కడి నుంచి జారుకుంటాడు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు టికెట్ బుకింగ్ సమయంలో అతడు నకిలీ ఫోన్ నంబర్ ఇచ్చాడని పోలీసులు గుర్తించారు.ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, చండీగఢ్, బెంగళూరు, ముంబై, అమృత్సర్ విమానాశ్రయాల్లోని అనేక మంది మహిళా ప్రయాణికుల బ్యాగుల్లోని దొంగిలించిన వస్తువులను కరోల్ బాగ్‌లోని శరద్ జైన్ అనే నగల వ్యాపారికి విక్రయించేవాడట. అంతేకాదు పహర్‌గంజ్‌లోని అతని ఇంటి నుండి పెద్ద మొత్తంలో బంగారం వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.గెస్ట్ హౌస్ ఓనర్న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ఢిల్లీ పహర్గంజ్లో రాజేష్‌కి ‘రికీ డీలక్స్’ అనే గెస్ట్ హౌస్ ఉంది. ఇందులో మూడో అంతస్తులో అతడు నివసిస్తున్నాడు. మనీ క్స్చేంజ్ బిజినెస్‌తో పాటు ఢిల్లీలో మొబైల్ రిపేర్ షాప్ నడుపుతున్నాడు. -
కెనడా చర్రితలోనే భారీ చోరీ : 400 కిలోల గోల్డ్, విదేశీ కరెన్సీ భారత సంతతికి చెందిన వ్యక్తి అరెస్ట్
టొరంటోలోని ప్రధాన విమానాశ్రయంలో 36 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన వ్యక్తి భారీచోరికి పాల్పడ్డాడు. భారత్ నుంచి ఇటీవల టొరొంటోకు వచ్చిన అర్చిత్ గ్రోవర్‌ను అధికారులు ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. కెనడా చరిత్రలోనే భారీ చోరీగా నమోదైంది. సుమారు 400 కిలోల బంగారం బిస్కెట్లు, విదేశీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో చోరీ కేసులో మరో ఐదుగురిని అరెస్టు చేసిన తర్వాత మరో భారత సంతతి నిందితుడిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఇతగాడిపై ఇప్పటికే అరెస్టు వారెంట్ జారీ అయింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గత ఏడాది (2023) ఏప్రిల్ 17 22 మిలియన్లకు పైగా కెనడియన్ డాలర్ల విలువైన 400 కేజీల బంగారు బిస్కెట్లు, విదేశీ కరెన్సీని ఉన్న ఎయిర్ కార్గో కంటైనర్‌ని నకిలీ పత్రాలను ఉపయోగించి తస్కరించినట్టు పీల్స్ ప్రాంతీయ పోలీసులు తెలిపారు. జ్యూరిచ్ నుండి టొరంటోలోని పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్ కెనడా విమానంలో బంగారం, కరెన్సీ తో కంటైనర్ వచ్చింది. దీన్ని చాకచక్యంగా ఓ ప్రత్యేక స్థలానికి తరలించారు. ఆ మరుసటి రోజే చోరీ జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కెనడా వ్యాప్తంగా వారెంట్ జారీ చేశారు. ఈ మేరకు అర్చిత్ గ్రోవర్‌ను టొరంటోలోని విమానాశ్రయంలో అరెస్టు చేసి అభియోగాలు మోపారు. ముఖ్యంగా భారత సంతతికి చెందిన పరమ్‌పాల్ సిధూ (54), అమిత్ జలోతా (40), అమ్మద్ చౌదరి (43), అలీ రజా (37), ప్రసత్ పరమలింగం (35)ను పోలీసులు అరెస్టు చేశారు. ఎయిర్ కెనడా సంస్థలో పనిచేసిన మరో భారత సంతతి వ్యక్తి సిమ్రన్ ప్రీత్ పనేసర్ (31), మిసిసాగా ప్రాంతానికి చెందిన అర్సలాన్ చౌదరి (42)లపై కూడా అరెస్టు వారెంట్ లు కూడా జారీ అయ్యాయి. ఈ చోరీలో ఎయిర్ కెనడాకు చెందిన ఇద్దరు మాజీ ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసులో నిందితులుగా ఉన్న సిధూ, పనేసర్లు తమ వద్ద పనిచేశారని ఎయిర్ కెనడా సంస్థ ప్రతినిధి వెల్లడించారు. -
Simhachalam: దర్శనానికి వచ్చి ఉంగరం దొంగిలిస్తారా..?
సింహాచలం: ‘శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దర్శనానికి వచ్చి ఆయన ఉంగరాన్నే దొంగిలిస్తారా? మర్యాదగా దొంగిలించిన ఉంగరాన్ని ఇచ్చేయండి.. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం..’అని సింహాచలం కొండకి వచ్చిన పలువురు భక్తులను దేవస్థానం స్థానాచార్యులు ప్రశ్నించే సరికి వారంతా కంగుతిన్నారు. ‘మేం దొంగల్లా కనిపిస్తున్నామా.! స్వామి దర్శనానికి వస్తే ఉంగరాన్ని దొంగతనం చేశారంటారేంటి? పైగా తాళ్లతో బంధించి తీసుకొస్తారా..’అంటూ భక్తులు ఆవేశంతో స్థానాచార్యులపై గర్జించారు. ‘చూడండీ.. మీరు దొంగతనం చేసినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి. పోలీసులు తీసుకెళ్లకముందే దొంగిలించిన ఉంగరాన్ని మర్యాదగా ఇచ్చేయండి.’ అంటూ స్థానాచార్యులు మరింత గర్జించి అడగటంతో భక్తుల కళ్లంట నీళ్లు గిర్రున తిరిగాయి.దేవస్థానం అర్చకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విజయనగరానికి చెందిన భక్తురాలు తాము ఉంగరం తీయలేదని ఎంత చెబుతున్నా వినకుండా మీరే దొంగ అంటూ పదే పదే ప్రశ్నించడంతో వారంతా ఆగ్రహంతో చిందులు వేశారు. పైగా చేతికున్న ఉంగరాలను చూపెట్టమని.. దొంగిలించిన ఉంగరంలా ఇవి ఉన్నాయంటూ స్థానాచార్యులు అడగటంతో భక్తుల నోటి మాట రాలేదు. చివరికి ఇదంతా వినోదోత్సవంలోని ఘట్టమని తెలుసుకుని భక్తులంతా సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. తమకు మాత్రమే దక్కిన భాగ్యంగా భావించి ఆనందభరితులయ్యారు. ఇదీ సింహగిరిపై బుధవారం నవ్వుల సందడిగా జరిగిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి వినోదోత్సవం. స్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో పోయిన ఉంగరం వెతికే ఘట్టాన్ని బుధవారం ఉదయం వినోదోత్సవంగా నిర్వహించారు. ఏడు పరదాల్లో దాగి ఉన్న స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని రాజగోపురం వద్ద పల్లకీలో అధిష్టింపజేశారు. స్వామి దూతగా పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు కర్ర, తాడు పట్టుకుని దర్శనానికి వచ్చిన పలువురు భక్తులను ఉంగరం దొంగిలించారంటూ తాళ్లతో బంధించి రాజగోపురం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ దొంగిలించిన ఉంగరాన్ని ఇవ్వాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.టెక్కలికి చెందిన భక్తులను ప్రశి్నస్తున్న స్థానాచార్యులు ఉత్సవం గురించి తెలియని వాళ్లు కన్నీటిపర్యవంతం చెందారు. ఉత్స వం గురించి తెలిసిన వాళ్లు నవ్వుతూ సమాధానం చెప్పారు. ఈ తరుణంలోనే స్వామిపై ఉన్న ఒక్కొక్క పరదాను తొలగించారు. చివరికి స్వామి చివరి పరదాలోనే ఉంగరం దొరికింది. ఎస్.కోట మండలం బొద్దాంకి చెందిన నూతన దంపతులు ఈశ్వరరావు, మాధవి, ఆరిలోవ ప్రాంతానికి చెందిన మౌళీ, గౌతమి, ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యారి్థనులు హిమజ, ప్రత్యూష, లావణ్య, శ్వేత అశ్విని, టెక్కలికి చెందిన అక్కాతమ్ముళ్లు జీవిత, నవీన్‌కుమార్‌లను పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు తాళ్లతో బంధించి తీసుకురాగా వారిని స్థానాచార్యులు ప్రశ్నించారు. విజయనగరం జిల్లా దాసన్నపేటకి చెందిన రోజా అనే మహిళ తన కుమార్తె మిక్కి, అల్లుడు కిశోర్, మనవలతో కలిసి సింహగిరికి రాగా వారిని తాళ్లతో బంధించారు. వాళ్ల చేతికి ఉన్న ఉంగరం.. దొంగిలించిన ఉంగరంగానే ఉందని స్థానాచార్యులు, అర్చకులు అనుమా నం వ్యక్తం చేయడంతో వారంతా వాదనకు దిగారు. నా కూతురుకు, అల్లుడికి నిశి్చతార్థం రోజు పెట్టిన ఉంగరాలు ఇవని, దొంగిలించినవి కాదని స్థానాచార్యులతో రోజా వాదించారు. ఇదిలా ఉండగా దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఇరగవరపు రమణాచార్యులు, ఆలయ కొత్వాల్ నాయక్ లంక సూరిబాబు, ఆలయ ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లు, సూపరింటెండెంట్ వెంకటరమణ, ట్రస్ట్‌బోర్డు మాజీ సభ్యుడు గంట్ల శ్రీనుబాబు సైతం దొంగలుగా పట్టుపట్టారు. తొలుత స్థానాచార్యులను కూడా తాళ్లతోనే బంధించి తీసుకురావడం విశేషం. అదే సమయంలో సింహగిరి వచ్చిన భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు వినోదోత్సవంలో పాల్గొని.. స్వామిని దర్శించుకున్నారు. -
HYD: యువతి హైడ్రామా.. రాజేంద్రనగర్ చోరీ కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్ దొంగతనం కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఒక యువతి ఆడిన నాటకాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఆన్లైన్ గేమ్‌లో డబ్బులు పోగొట్టుకొని యువతి చోరీ డ్రామాకు తెరతీసింది. ఉదయం తాను వాష్ రూమ్‌కి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు ఉన్నారని తెలిపిన యువతి.. పట్టుకునే క్రమంలో తనను తోసేసి పారిపోయారంటూ వెల్లడించింది. స్థానికులు సమాచారంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అసలు విషయాన్ని బయటపెట్టారు. పథకం ప్రకారమే ఆమె ఇంట్లో బీరువాలో ఉన్న బట్టలు ఇతర వస్తువులను చిందరవందరగా పడేసింది. ఆన్లైన్లో గేమ్స్ ఆడి 25 వేలు పొగొట్టుకుని భయంతో డ్రామా క్రియేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇదీ చదవండి: ‘డెత్’లైన్ గేమ్స్! -
కర్రలతో కొట్టి.. గాయాలపై కారం చల్లి
కొత్తగూడ: చోరీకి పాల్పడ్డాడనే అనుమానంతో ఓ దళిత యువకుడిని కర్రలతో చావకొట్టి.. రక్తం కారుతున్న గాయాలపై కారం చల్లి చిత్ర హింసలు పెట్టిన అమానవీయఘటనకు సంబంధించిన వీడియో శనివారం కలకలం రేపింది. బాధితుడి కథనం మేరకు.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం జంగవానిగూడెం(రాంపూర్) గ్రామానికి చెందిన యువకుడు వంకాయల కార్తీక్‌ను అదే మండలం పొగుళ్లపల్లి గ్రామానికి చెందిన టెంట్‌హౌస్ యజమాని గద్ద అశోక్ పనికి పెట్టుకున్నాడు. ఈ క్రమంలో డీజే(సౌండ్ బాక్స్)లో ఉపయోగించే యాంప్లిఫైయర్ చోరీకి గురైందని, దాన్ని ఖానాపూర్‌లో విక్రయించారని యజమాని అశోక్ గుర్తించాడు. దీంతో అశోక్ కొందరు వ్యక్తులను తీసుకుని ఈ నెల 19వ తేదీన జంగవానిగూడెం వెళ్లి కార్తీక్‌తో పని ఉందని చెప్పి కారులో ఎక్కించుకుని పొగుళ్లపల్లి సమీప అటవీప్రాంతానికి తీసుకెళ్లి కర్రలతో చితకబాదారు. తప్పించుకుని పారిపోయే క్రమంలో మళ్లీ పట్టుకుని పొగుళ్లపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకువచ్చారు. ఒంటిపై షర్ట్ విప్పి కార్యాలయ కిటికీకి కట్టి కర్రలతో బాదారు. రక్తం కారుతుండగా గాయాలపై కారం చల్లుతూ చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటనను మొత్తం వీడియో తీశారు. స్పృహ కోల్పోయిన కార్తీక్‌ను ఇంటి వద్ద వదిలేశారు. గాయాలతో మూలుగుతున్న యువకుడిని బంధువులు నర్సంపేట పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కార్తీక్‌పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 20వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలపై కేసులు టెంట్‌హౌస్ యజమాని ఫిర్యాదు మేరకు కార్తీక్‌పై చోరీ కేసు, కార్తీక్‌పై దాడి చేసిన ఘటనలో అశోక్‌తోపాటు మరికొంత మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ విషయాన్ని గోప్యంగా ఉంచారు. సమాచారం తెలుసుకున్న దళిత సంఘాలు మహబూబాబాద్ డీఎస్పీకి ఫిర్యాదు చేయడంతో శుక్రవారం రాత్రి దాడి ఘటన వివరాలు బయటికి వచ్చాయి. -
ఐఫోన్ పోగొట్టుకున్నారా? ..సుప్రీం కోర్టు కీలక తీర్పు!
దొంగతనాలకు గురైన ఐఫోన్లకు సంబంధించి భారత సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో కస్టమర్లు పోగొట్టుకున్న ఐఫోన్లను కనుగొనడంలో యాపిల్ ఇండియా బాధ్యతకు సంబంధించిన కీలక సమస్యను దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించింది. యాపిల్ సంస్థకు వ్యతిరేకంగా ఒడిశా స్టేట్ కన్స్యూమర్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ తస్కరణకు గురైన ఐఫోన్లను ప్రత్యేక గుర్తింపు సంఖ్యలతో ట్రేస్ చేసే బాధ్యత యాపిల్ కంపెనీకి లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొందని లైవ్ లా అనే వార్తా సంస్థ నివేదించింది. వినియోగదారుల కమిషన్ ఆదేశాలపై యాపిల్ ఇండియా దాఖలు చేసిన అప్పీల్‌ను న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారించింది. థెఫ్ట్ ఇన్సూరెన్స్‌తో ఐఫోన్‌ను కొనుగోలు చేసిన వినియోగదారుడు తన ఫోన్ చోరీకి గురైనట్లు పోలీసులకు, యాపిల్ ఇండియాకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు ప్రారంభమైంది. అయితే పోయిన ఐఫోన్‌ను ట్రాక్ చేయడానికి ఆపిల్ ఇండియా ఎటువంటి చర్య తీసుకోలేదు. దీంతో వినియోగదారుడు ఫిర్యాదు దాఖలు చేయడంతో జిల్లా వినియోగదారుల ఫోరమ్ బాధితుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ నిర్ణయంపై యాపిల్ ఇండియా ఒడిశా స్టేట్ కన్స్యూమర్ కమిషన్‌కు అప్పీల్ చేసింది. దొంగతనానికి గురైన ఫోన్‌ను ప్రత్యేక గుర్తింపు సంఖ్యలతో ట్రేస్ చేయాల్సిన బాధ్యత ఐఫోన్ తయారీదారుగా యాపిల్ ఇండియాకు ఉందని ఒడిశా స్టేట్ కన్స్యూమర్ కమిషన్ తీర్పు పేర్కొంది. ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ యాపిల్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఒడిశా రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశాన్ని అన్యాయమని పేర్కొంటూ దానిని తోసిపుచ్చింది. అయితే బాధితుడికి యాపిల్ ఇండియా పరిహారాన్ని పరిగణనలోకి తీసుకుంటూనే దొంగతనానికి గురై ఫోన్లను కనుగొనవలసిందిగా ఆపిల్ ఇండియాను కోరడం అసమంజసమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
వేల కార్లు చోరీ, నకిలీ జడ్జి అవతారం, 2 వేల క్రిమినల్స్ రిలీజ్
చదివింది లా. కానీ వృత్తి మాత్రం దొంగతనం.చేతివ్రాత నిపుణుడు, గ్రాఫాలజీలో కోర్సు కూడా చేసాడు. కానీ చోరీలు చేయడంలో అతని ట్రాక్ రికార్డ్ చూస్తే ఔరా అంటారు. పోలీసులను సైతం బురిడీ కొట్టించడంలో అతని తర్వాతే మరెవ్వరైనా. దొంగతనంలో ఈ విధంగా ఆరితేరిన ప్రపంచంలోనే తొలి, ఏకైక వ్యక్తి. నకిలీ పత్రాలను ఉపయోగించి ఏకంగా జడ్జ్ అయిపోయాడు. 2000 మంది నేరస్థులను విడుదల చేశాడు. ఆశ్చర్యంగా ఉంది కదా..ఈ స్టోరీ ఏంటో తెలుసుకుందాం రండి. అతగాడి పేరే ధన్ రామ్ మిట్టల్...అత్యంత దుర్మార్గపు దొంగ. ఓ కారు దొంగతనం సందర్బంగా ధనిరామ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతను చెప్పిన విషయాలు విని పోలీసులు సైతం ఖంగుతిన్నారు. జడ్డిగా, ట్రాన్స్ పోర్టు అధికారిగా, రైల్వే స్టేషన్ మాష్టరుగా పక్కనున్నోడికి కూడా అనుమానం రాకుండా తన దందా కొనసాగించాడు. 1960 ప్రాంతంలో రోహ్ తక్ కోర్టులో క్లర్కుగా విధులు నిర్వర్తించాడు. క్లర్కుగా పనిచేస్తున్న సమయంలో అక్కడి జడ్జి రెండు నెలలు లీవులో ఉన్నాడు. దీంతో నకిలీ పత్రాల సాయంతో ఏకంగా తానే జడ్జి అవతారం ఎత్తేశాడు ధన్ రామ్. ఈ రెండు నెలల కాలంలో దాదాపు 2 వేలమంది నేరస్థులును విడుదల చేశాడు. అంతే కాదు చాలా మందిని జైల్లో కూడా పెట్టాడు.ఆ తర్వాత విషయం బయటపడే సమయానికి మనోడు పరార్. తర్వాత ఆయన కేసులన్నింటినీ మరోసారి విచారించి తీర్పులు వెలువరించారు. అతని కోసం పోలీసులు ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఆ తర్వాత రీజనల్ ట్రాన్స్‌పోర్టు అధికారిగాను అవతారమెత్తి కారు డాక్యుమెంట్లపై ఫోర్జరీ సంతకాలు పెట్టేశాడు. రోహ్ తక్ రైల్వే స్టేషన్ లోనే రైల్వే అధికారులను సైతం బురిడీ కొట్టించి స్టేషన్ మాష్టరు కొలువు దక్కించుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇతని అరాచకాలకు లెక్కే లేదు. 25 ఏళ్ల వయసులో దొంగతనాల ద్వారా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. దొంగతనం రుచిమరిగిన అతగాడు ఇక అక్కడనుంచి వరసగా దొంగతనాలతో పోలీసులకు చుక్కలు చూపించాడు. కానీ ధని రామ్ 1964లో తొలిసారి జైలుకి వెళ్లాడు. కథ ఇక్కడితో అయి పోలేదు. వరుసగా అరెస్టులవుతూ , విడుదలవుతూ అలా ఇప్పటివరకు 25 సార్లు అరెస్టు అయిన ధని రామ్ అత్యధికంగా అరెస్టయిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్. సమీప ప్రాంతాలలో కార్ల దొంగతనంలో కూడా మహా ముదురు. ఏ కారును పడితే ఆ కారును దొంగిలించడు. కేవలం ఎస్టీమ్, మారుతి 800, హుందాయ్ శాంత్రో తదితర సెక్యూరిటీ అలారం లేని కార్లను మాత్రమే దొంగతనం చేస్తుంటాడు. అదీ పట్టపగలు. వాటిని సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్మేస్తాడు. ఒకవేళ పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లినా తగ్గేదేలే అంటాడు. మళ్లీ అదే తంతు. 81 సంవత్సరాలు మీద పడ్డా కూడా.. ఇప్పుడెక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. ధని రామ్ ఎప్పటికి చోరీలకు ఫుల్ స్టాప్ పెడుతాడో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. -
ఖరీదైన వస్తువులు పోతున్నాయ్.. ఆందోళనలో భారతీయ సీఈఓలు
యూకే షాడో ఫారిన్ సెక్రటరీ డేవిడ్ లామీ, భారతీయ వ్యాపారవేత్తల మధ్య జరిగిన సమావేశంలో.. లండన్‌లో రోలెక్స్ వాచ్ దొంగతనాల అంశాన్ని ప్రస్తావించారు. సమావేశాలకు లేదా వ్యాపార అవసరాల నిమిత్తం లండన్ వెళ్లినప్పుడు తమవెంట ఖరీదైన వస్తువులు కూడా తీసుకెళ్తారు. అలాంటి వస్తువులు దొంగతనానికి గురైనట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల సమావేశంలో వెల్లడించారు. లగ్జరీ వాచ్‌లు, మొబైల్స్ ఫోన్స్, హ్యాండ్ బ్యాగులు సైతం దొంగలిస్తున్నారని పలు కంపెనీల సీఈఓలు ఆవేదన వ్యక్తం చేశారు. 2022తో పోలిస్తే.. గతేడాది దొంగతనాలు భారీగా పెరిగిపోయాయి. 2023లో దొంగతనాలు ఏకంగా 27 శాతం పెరిగినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. 2022లో 52 వేల దొంగతనాలు నమోదవగా, 2023లో 72 వేల కేసులు నమోదైనట్లు మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించారు. గత ఐదేళ్లలో లండన్‌లో దాదాపు 29,000 వాచీ దొంగతనాలు జరిగినట్లు సమాచారం. ఈ ఏడాది జాతీయ ఎన్నికలకు ముందు బ్రిటన్‌లో పెరుగుతున్న నేరాలు ఇప్పుడు రాజకీయ సమస్యగా మారాయి. ఇదీ చదవండి: 'వీసా లేకుండా ఎంట్రీ' - ఇరాన్ నాలుగు షరతులు ఇవే.. లండన్ పర్యటనకు వచ్చినప్పుడు భద్రత లేకపోతే మేము ఎందుకు రావాలని సీఈఓలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీనిపైన ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకోవాలి, బ్రిటన్ ప్రభుత్వం మా ఇబ్బందులను గుర్తించాలని వ్యాపారవేత్తలు వెల్లడించారు. ఈ దొంగతనాలను తగ్గించడానికి లండన్ పోలీసులు అండర్‌కవర్ ఆపరేషన్ నిర్వహించి తగ్గించడానికి పూనుకున్నట్లు కూడా అధికారులు తెలిపారు. -
Delhi: చెల్లి మీద కోపం.. సొంత ఇంట్లోనే అక్క దొంగతనం
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో వింత నేరం జరిగింది. సొంత ఇంట్లోనే దొంగతనం చేసి తన తల్లి బంగారు నగలు, నగదు ఎత్తుకుపోయింది ఓ మహిళ.తన కంటే తన చెల్లికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న కారణంతోనే అక్క శ్వేత సొంత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వివరాల్లోకి వెళితే ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌కు చెందిన కమలేశ్ అనే మహిళ తన ఇంట్లో చోరీ జరిగిందని జనవరి 30న పోలీసులకు ఫిర్యాదు చేసింది. లక్షల విలువైన నగలతో పాటు రూ.25 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు దర్యాప్తు స్టార్ట్ చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించగా కమలేశ్ ఇంటి సమీపంలో ఒక మహిళ బురఖా వేసుకుని అనుమానాస్పదంగా తిరగడం కనిపించింది. బురఖా వేసుకున్న మహిళను శ్వేత(31)గా పోలీసులు తేల్చారు. శ్వేత స్వయానా కమలేశ్ కూతురు కావడం గమనార్హం. జనవరి మొదటి వారంలోనే ఇంటి నుంచి బయటికి వెళ్లి వేరుగా ఉంటున్న శ్వేత తల్లిని చూడటానికి వచ్చినపుడు తొలుత బీరువా తాళం చెవులు కాజేసి మరోసారి తల్లి లేనపుడు వచ్చి నగలు, నగదు ఎత్తుకెళ్లింది. తన కంటే చెల్లినే బాగా చూసుకుంటున్నారన్న కోపంతోనే ఈ దోపిడీకి పాల్పడినట్లు శ్వేత విచారణలో ఒప్పుకుంది. -
ఫామ్‌హౌస్‌లపై విజిలెన్స్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) నష్ట నివారణ చర్యలపై దృష్టి సారించింది. ఫామ్‌హౌస్‌ల ముసుగులో కరెంట్ చౌర్యానికి పాల్పడుతున్న అక్రమార్కులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. ఈ మేరకు ఔటర్ రింగ్ రోడ్డుకు అటు ఇటుగా ఉన్న వ్యవసాయ క్షేత్రాలు, వాటిలోని విద్యుత్ బోర్లు, భారీ నిర్మాణాలు, రిసార్టులు, క్రీడా మైదానాలు, క్లబ్ హౌస్‌ల్లో విద్యుత్ విజిలెన్స్ బృందాలు తనిఖీలు ప్రారంభించాయి. వాటికి సరఫరా అవుతున్న కరెంట్‌పై ఆరా తీయడంతోపాటు వ్యవసాయం ముసుగులో కరెంట్ దోపిడీకి పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు సంస్థకు వాటిల్లిన నష్టాలను జరిమానా రూపంలో తిరిగి రాబట్టడమే కాకుండా ఆయా వినియోగదారులకు లోడును బట్టి మీటర్లు కూడా జారీ చేస్తున్నారు. సాగు ముసుగులో వ్యాపారాలు హైదరాబాద్ శివార్లలో పలువురు సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు పెద్దఎత్తున వ్యవసాయ భూములు కొనుగోలు చేశారు. వాటి చుట్టూ భారీ ప్రహరీలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కొంతమంది వాటిలో పండ్లు, కూరగాయలు, పూలతోటలు సాగు చేస్తుండగా, మరికొంత మంది ఫామ్‌హౌస్ పేరుతో విలాసవంతమైన భవనాలు నిర్మించి సినిమా షూటింగ్‌లు, బర్త్‌డే పార్టీలు, వీకెండ్ పార్టీలకు అద్దెకు ఇస్తున్నారు. మరికొంతమంది ఏకంగా రిసార్ట్లు, క్లబ్ హౌస్ లు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేశారు. వీరు ప్రభుత్వం వ్యవసాయ బోర్లకు కల్పించిన ఉచిత విద్యుత్ సదుపాయా న్ని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు. కొంతమందైతే ఏకంగా బోర్ల నుంచి నీటిని తోడి ట్యాంకర్ల ద్వారా హోటళ్లు, వసతి గృహాలు, బహుళ అంతస్తుల భవనాలకు సరఫరా చేసి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. పంటసా గు ముసుగులో కరెంట్ చౌర్యానికీ పాల్పడుతున్నారు. ఫలి తంగా డిస్కం పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోతోంది. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకే.. గ్రేటర్‌లోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో మొత్తం 61,40,795 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 50,99,190 గృహ, 8,22,821 వాణిజ్య, 36,440 పారిశ్రామిక, 1,82,344 ఇతర (వ్యవసాయ కనెక్షన్లు రంగారెడ్డి జిల్లాలో 1,17,417 ఉండగా, మేడ్చల్‌లో 21,491 వరకు) కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం రోజుకు సగటున 2,500 మెగావాట్ల విద్యుత్ వినియోగమవుతోంది. వేసవిలో ఈ డిమాండ్ 3800 నుంచి 4000 మెగావాట్లు దాటుతోంది. అయితే డిస్కం సరఫరా చేస్తున్న విద్యుత్‌కు, మీటర్ రీడింగ్ నమోదు ద్వారా నెలవారీగా సంస్థకు వస్తున్న బిల్లులకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోంది. ఇప్పటికే గృహ, వాణిజ్య కనెక్షన్లపై అంతర్గత తనిఖీలు చేపట్టిన డిస్కం తాజాగా వ్యవసాయ కనెక్షన్లపైనా ఆరా తీస్తోంది. దీంతో అధికారులు సర్కిళ్ల వారీగా విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేసి, తనిఖీలు చేయిస్తున్నారు. డీఈకి షోకాజ్ నోటీసులు ఇటీవల డిస్కం సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి ముషారఫ్ ఫరూఖీ నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు అంతర్గత నష్టాలపై ప్రధానంగా దృష్టిసారించారు. క్షేత్రస్థాయిలోని ఇంజనీర్లను పరుగెత్తించడంతో పాటు ఆయ న కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫిర్యాదులకు స్పందించని ఇంజనీర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గచ్చిబౌలి డీఈ సహా పలువురు ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిసింది. ఉద్యోగ సంఘాల ముసుగులో ఏళ్ల తరబడి విద్యుత్ బిల్లులు చెల్లించకుండా పెద్ద మొత్తంలో బిల్లుల ఎగవేతకు పాల్పడిన యూనియన్లపై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. డిస్కం సరఫరా చేస్తున్న ప్రతీ యూనిట్‌ను పక్కాగా లెక్కించేందుకు ఫీడర్లకు సెన్సర్లను ఏర్పాటు చేసే యోచనలో సీఎండీ ఉన్నట్లు సమాచారం. -
Golriz Ghahraman: దొంగతనం ఉదంతంలో న్యూజిలాండ్ మహిళా ఎంపీ రాజీనామా
వెల్లింగ్టన్: దుకాణాల్లో వస్తువులు దొంగలించిందన్న ఆరోపణలపై న్యూజిలాండ్ మహిళా ఎంపీ గోలిజ్ గ్రాహమన్ తన ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆక్లాండ్, వెల్లింగ్టన్ నగరాల్లోని బొటిక్, షాపింగ్‌మాల్‌లో మూడు సార్లు దొంగతనానికి పాల్పడినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. షాపింగ్‌మాల్‌లో అత్యంత ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్, డ్రెస్‌ను ఆమె దొంగలిస్తున్న సీసీటీవీ ఫుటేజీలు బహిర్గతం కావడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసు దర్యాప్తు కొనసాగుతుండటంతో గోలిజ్ తన ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన చర్యకు బేషరతు క్షమాపణలు చెప్పారు. గతంలో ఆమె మానవహక్కుల కేసులు వాదించే లాయర్‌గా పేరు తెచ్చుకున్నారు. తర్వాత రాజకీయాల్లో చేరి గ్రీన్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. ఇరాన్ నుంచి వలసవచ్చి 2017 సంవత్సరంలో న్యూజిలాండ్‌లో ఎంపీ అయిన తొలి వలస వ్యక్తిగా రికార్డులకెక్కారు. -
Crime: పొలాల్లో మాయం.. OLXలో ప్రత్యక్షం!
హైదరాబాద్, సాక్షి: పొలాల గట్ల వెంట.. వ్యవసాయ బావుల వద్ద సేదతీరే ట్రాక్టర్లే వాళ్ల టార్గెట్. గుట్టుచప్పుడు కాకుండా మాయం చేసి.. రాత్రికి రాత్రే రాష్ట్రం దాటించేస్తారు. ఆపై సెకండ్ హ్యాండ్ కింద ఆన్లైన్లోనే దర్జాగా వాటిని అమ్మేస్తారు. అయితే దొంగ ఎప్పటికైనా దొరకాల్సిందే కదా. హైదరాబాద్ శివారుల్లో చోటు చేసుకున్న సరికొత్త చోరీల కేసుల్ని పోలీసులు ఎట్టకేలకు చేధించగలిగారు. ట్రాక్టర్ ట్రాలీలను చోరీ చేస్తున్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. వ్యవసాయ కూలీలుగా పని చేసే సంపంగి మహేష్.. ఉర్సు వెంకన్నలు ఆర్థిక ఇబ్బందులతో దొంగతనాలకు దిగారు. రాత్రుల్లో బావుల వద్ద ఉంచిన ట్రాక్టర్ ట్రాలీలను ఎత్తుకెళ్లి.. రాత్రికి రాత్రే రాష్ట్రం దాటించేవారు. ఆ తర్వాత వాటిని నేరుగా అమ్మితే దొరికిపోతామని ఓఎల్ఎక్స్ తరహా ఆన్లైన్ సైట్లలో అమ్మకానికి ఉంచారు. అలా అమ్మేయగా వచ్చిన డబ్బుతో విలాసాలకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో.. మాడ్గుల్ మండలం(రంగారెడ్డి జిల్లా) పరిధిలో డిసెంబర్ 31న ట్రాక్టర్ దొంగతనం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేయగా దొంగలు దొరికిపోయారు. వాళ్ల దగ్గరి నుంచి సుమారు 20 లక్షలు విలువ చేసే 13 ట్రాక్టర్ ట్రాలీలను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ కమిషనరేట్ లో 10 దొంగతనాలు.. నల్గొండలో ఒకటి.. నాగర్ కర్నూల్లో ఒక కేసు నమోదైనట్టు పోలీసులు వెల్లడించారు. -
HYD: లలితా జ్యువెలరీ చోరీ కేసులో వీడిన మిస్టరీ
హైదరాబాద్, సాక్షి: ప్రముఖ జ్యువెలరీ స్టోర్ లలితాలో జరిగిన చోరీ మిస్టరీ వీడింది. సేల్స్‌మెన్ దృష్టి మళ్లించి ఓ మహిళ నగలు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఈ మిస్టరీని పోలీసులు చేధించారు. ఆ కిలాడీ లేడీని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నగరంలోని చందానగర్ లలితా జ్యువెలరీ స్టోర్ బ్రాంచ్‌లో డిసెంబర్ 31వ తేదీన నగలు కనిపించకుండా పోయాయి. దీంతో చోరీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. స్టోర్‌లో పలువురిని విచారించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినా.. తొలుత లాభం లేకపోయింది. దీంతో ఈ కేసు మిస్టరీగా మారింది. అయితే పదే పదే ఫుటేజీలను గమనించిన క్రమంలో.. మెరుపు వేగంతో నగలు మాయం చేసిన ఓ మహిళ కనిపించింది. ఖతర్నాక్ కిలాడీ ఈ కేసులో చోరీకి పాల్పడిన మహిళను సరూర్ నగర్‌కు చెందిన గౌతమిగా గుర్తించారు. విశేషం ఏంటంటే.. గౌతమి నగరంలో 13 చోరీ కేసుల్లో నిందితురాలు. రద్దీగా ఉండే జ్యువెల్లరీ షాపులే లక్ష్యంగా చేసుకుని చేతివాటం ప్రదర్శిస్తూ వస్తోంది. క్షణాల్లో దొంగతనాలు చేసి మాయమైపోవడంలో దిట్ట అయిన గౌతమిని మొత్తానికి పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. -
వైన్ షాప్‌లో దొంగతనం.. రూ.4లక్షలకు పైగా నగదు ఇంకా మద్యం బాటిళ్లు!
రాజాపేట: గుర్తుతెలియని వ్యక్తులు వైన్ షాపులో చొరబడి నగదు, మద్యం ఎత్తుకెళ్లారు. ఈ ఘటన రాజాపేట మండలంలోని పొట్టిమర్రి గ్రామ పరిధిలో జరిగింది. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొట్టిమర్రి గ్రామ పరిధిలో మాధవరెడ్డి అనే వ్యక్తి అరుణాచల వైన్ షాపును నిర్వహిస్తున్నాడు. కాగా మంగళవారం రాత్రి 10 గంటలకు రోజుమాదిరిగానే వైన్ షాపునకు తాళాలు వేసి వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం అటుగా వెళ్తున్న గ్రామస్తులు వైన్ షాపులో దొంగలు పడినట్లు గుర్తించి మాధవరెడ్డికి సమాచారం ఇచ్చారు. వెంటనే షాపు వద్దకు చేరుకున్న మాధవరెడ్డి చోరీ జరిగిన విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. దీంతో ఏసీపీ శివరాంరెడ్డి, సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్ఐ సుధాకర్‌రెడ్డి క్లూస్ టీంను రప్పించి పరిసరాలను పరిశీలించారు. రూ.4,21,000 నగదుతో పాటు సుమారు మద్యం బాటిళ్లు చోరీకి గురైనట్లు వైన్ షాపు నిర్వాహకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. -
కంప్యూటర్ మాయం
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యామండలికి సంబంధించి కీలకమైన డేటా ఉన్నట్టు భావిస్తున్న కంప్యూటర్ కనిపించకుండాపోయింది. 2014 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫైళ్లు యథాతథంగా ఉంచాలని సీఎస్ ఆదేశించిన రోజే ఈ ఘటన జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామని మండలి వైస్‌చైర్మన్(వీసీ) అహ్మద్ తెలిపారు. ఏం జరిగిందో పరిశీలిస్తున్నామని మండలి కార్యదర్శి శ్రీనివాస్ చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణను ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. వైస్ చైర్మన్ వెంకటరమణ బాసర ట్రిపుల్ ఐటీ ఇన్చార్జ్ వీసీగా కూడా ఉన్నారు. ఈ కారణంగా ఆయన మండలి కార్యాలయానికి వచ్చి పోతున్నట్టు సిబ్బంది చెబుతున్నారు. అందులో ఏముందో...? కీలకమైన ఫైళ్లు స్టోర్ చేసేందుకు అత్యాధునిక సాంకేతిక సామర్థ్యమున్న కంప్యూటర్ను 2017లో కొనుగోలు చేశారు. అయితే, గత ఏడాది నుంచి అది పనిచేయడం లేదని కొందరు అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే దీనిని స్క్రాప్‌గా నమోదు చేసి, స్టోర్ రూంలో ఉంచామంటున్నారు. దీని స్థానంలో వేరే కంప్యూటర్ కొనుగోలు చేసినట్టు అధికారులు తెలిపారు. అయితే ఫైళ్లు భద్రపరచాలన్న ఆదేశాలొచ్చిన రోజు కంప్యూటర్ కనిపించడం లేదని అధికారులు వీసీ అహ్మద్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన హడావిడిగా సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అసలు అందులో ఏముంది? పనిచేయకపోయినా పాత డేటా హార్డ్ డిస్్కలో ఉండే అవకాశం లేదా? హార్డ్‌డిస్క్ ఎక్కడుంది? అందులో డేటాను ఏం చేశారు? పనికి రాని కంప్యూటర్ తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని సిబ్బందిని కోరారు. అయితే, ఈ సమావేశానికి మండలి కార్యదర్శి హాజరుకాలేదని చెబుతున్నారు. దోస్త్ డేటా ఉన్నట్టేనా? ఆన్లైన్ ద్వారానే ఉన్నత విద్యామండలి డిగ్రీ ప్రవేశాలను భర్తీ చేస్తుంది. ఈ డేటా అంతా కంప్యూటర్లో పొందుపరుస్తారు. దీంతోపాటు మండలి ఆదేశాలు, డిగ్రీ కాలేజీల అనుమతులు ఇందులో ఉంటాయి. ప్రొఫెసర్ లింబాద్రి వీసీ–1గా ఉన్నప్పుడు, వెంకటరమణ వీసీ–2గా ఉన్నారు. లింబాద్రి మండలి చైర్మన్ అయిన తర్వాత అహ్మద్‌ను మండలి వైస్‌చైర్మన్‌గా నియమించారు. ఈ నేపథ్యంలో వెంకటరమణ వీసీ–2 నుంచి వీసీ–1 మారుస్తూ అప్పటి విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. ఇది మండలిలో తీవ్ర వివాదానికి దారి తీసింది. వీసీ–1, వీసీ–2 మధ్య రగడ తారస్థాయికి చేరింది. ఈ సమయంలోనే దోస్త్ వ్యవహారాలపై ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం మారడం, వీసీ–1గా ఉన్న వెంకటరమణను తీసేయడం, ఇదే సమయంలో దోస్త్‌కు సంబంధించిన కంప్యూటర్ మాయం కావడం అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇంతకీ దోస్త్ మొదలైనప్పట్నుంచీ డేటా ఉందా? అనే సందేహం మండలివర్గాల నుంచే వినిపిస్తోంది. -
‘మహాలక్ష్మి’కి భద్రత!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ వసతి కల్పించటంతో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. అదనంగా 13 లక్షల ప్రయాణికులు పెరగటంతో బస్సులు చాలక ఆర్టీసీకి కొత్త సమస్య ఎదురుకాగా, అది చాలదన్నట్టు ఇప్పుడు మరో ఇబ్బంది తలెత్తింది. బస్సులతోపాటు బస్టాండ్లు కూడా బాగా రద్దీగా మారటంతో ఒక్కసారిగా దొంగల బెడద తీవ్రమైంది. రోజురోజుకు బస్టాండ్లలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ప్రయాణికుల బ్యాగులు, సెల్ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను మాయం చేస్తున్నారు. వీటిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులూ పెరుగుతున్నాయి. బస్టాండ్లలో భద్రత ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో పోలీసు రక్షణ కావాలని ఆర్టీసీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. సొంతంగానే సెక్యూరిటీ.. గతంలో ఆర్టీసీ బస్టాండ్లలో పోలీసు భద్రత ఉండేది. పోలీసు శాఖ హోంగార్డులను కేటాయించింది. కానీ ఆ తర్వాత పోలీసు శాఖలోనే సిబ్బంది కొరత ఏర్పడటంతో వారిని ఉపసంహరించుకుని సొంత అవసరాలకు వాడుకుంటోంది. అప్పటి నుంచి ఆర్టీసీ సొంతంగానే సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటోంది. కానీ డిపోలు, బస్టాండ్లలో నియోగించేంత సంఖ్యలో సిబ్బంది లేరు. ఇప్పుడు కూడా పోలీసు శాఖ నుంచి హోంగార్డులను కేటాయించే పరిస్థితి ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆర్టీసీ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రారంభించినట్టు తెలిసింది. ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోంది. అన్ని బస్టాండ్లలో సీసీటీవీ కెమెరాలు దొంగలు రెచ్చిపోతుండటంతో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. పోలీసుకు ఫిర్యాదు చేస్తే ఆధారాల కోసం వారు సీసీటీవీ ఫుటేజీలు కోరుతున్నారు. కానీ అన్ని బస్టాండ్లలో సీసీటీవీ కెమెరాలు లేవు. ఇటీవల ఎండీ నిర్వహించిన సమావేశంలో అన్ని రీజియన్ల నుంచి దొంగతనాల అంశం చర్చకు వచ్చింది. దీంతో ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు కావాలో కూడా అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్లతోపాటు బస్సులు నిలిపే ప్రధాన రోడ్లలోని పాయింట్ల వద్ద కూడా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. అన్నిచోట్లా సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. 60 కొత్త బస్సులు సిద్ధం మహాలక్ష్మి పథకం అందుబాటులోకి రాకముందే కొన్ని కొత్త బస్సులకు ఆర్టీసీ ఆర్డరిచ్చింది. మార్చి నాటికి 2 వేల బస్సులు రానుండగా తొలివిడతలో 60 బస్సులు సిద్ధమయ్యాయి. ఏసీ, నాన్ ఏసీ స్లీపర్, రాజధాని, ఎక్స్‌ప్రెస్ బస్సులు వీటిల్లో ఉన్నాయి. వీటిని బుధవారమే రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించాల్సి ఉంది. కానీ, ఆ కార్యక్రమం రద్దయింది. మరో రెండుమూడు రోజుల్లో వాటిని ప్రారంభించనున్నట్టు తెలిసింది. -
రైల్వే స్టేషన్లో చీకట్లు... లగేజీలు చోరీ, పడిపోయిన ప్రయాణికులు!
అది మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ రైల్వేస్టేషన్.. తాము ఎక్కబోయే రైలు కోసం ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. ఇంతలో హఠాత్తుగా స్టేషన్లో కరెంట్ పోయింది. ప్రయాణికులకు మొదట ఏమీ అర్థం కాలేదు. చాలా సేపు ఇదే పరిస్థితి నెలకొనడంతో స్టేషన్లో గందరగోళం ఏర్పడింది. జబల్పూర్ ప్రధాన స్టేషన్‌లోని విద్యుత్ వ్యవస్థ మొత్తం కుప్పకూలడంతో ప్లాట్‌ఫారమ్ నంబర్ వన్ నుంచి ప్లాట్‌ఫామ్ ఆరు వరకు స్టేషన్ ఆవరణ అంతా అంధకారమయం అయ్యింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో టికెట్ కౌంటర్ కూడా మూతపడింది. ఇది చూసిన ప్రయాణికులు నానా హంగామా చేశారు. ఈ ఘటన జరిగి రెండు రోజులైనా దీనికి బాధ్యులెవరనేది అధికారులు తేల్చలేదు. స్టేషన్ మొత్తంమీద గంటల తరబడి విద్యుత్ లేకపోవడంతో చాలా మంది ప్రయాణికుల సామాను చోరీకి గురయ్యింది. చీకటిమాటున దొంగలు రెచ్చిపోయారు. చీకటిలో ఎదుట ఏమున్నదో తెలియక పలువురు ప్రయాణికులు నడిచేటప్పుడు పడిపోయారు. ఈ ఘటన అనంతరం సంబంధిత శాఖ ఇంజినీర్లు మరమ్మతులు చేపట్టారు. గంట తరువాత తిరిగి విద్యుత్ పునరుద్ధరణ జరిగింది. స్టేషన్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్యానెల్లో లోపం కారణంగా, ప్లాట్‌ఫారమ్‌తో సహా మొత్తం స్టేషన్ ప్రాంగణం, వివిధ రైల్వే విభాగాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనరేటర్‌ను ఉపయోగించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు ప్యానల్‌కు మరమ్మతులు చేసిన తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరిగింది. ఇది కూడా చదవండి: ఒడిశా, బీహార్ గుణపాఠాల తర్వాత రైల్వేశాఖ ఏం చేస్తున్నదంటే.. -
రైలు నుంచి జారి పడి వ్యక్తి అక్కడిక్కడే మృతి
గద్వాల్ క్రైం: ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి ఒకరు మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం, నాపాడు జిల్లా, బాబుపలికి చెందిన గౌరి శంకర్(40) మంగళవారం ఉదయం 7 గంటలకు యశ్వంత్‌పూర్ నుంచి కోర్బా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైల్లో భార్య లంబేసాగర్, 6 ఏళ్ల కుమారుడితో బెంగుళూరుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గద్వాల్ రైల్వేస్టేషన్ దాటిన అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో పూడూరు రైల్వేస్టేషన్ సమీపంలో వెళ్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు గౌరిశంకర్ జారి కిందపడడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ తెలిపారు. తాగిన మైకంలో కిందపడి.. జడ్చర్ల టౌన్: పట్టణానికి చెందిన విష్ణు (26) బుధవారం వీరశివాజీనగర్లోని మద్యం దుకాణం సమీపంలో ఉన్న డ్రెయినేజీ పక్కన పడి మృతిచెందాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మద్యానికి బానిసయ్యాడు. తాగిన మైకంలో పడిపోగా.. బుధవారం ఉదయం స్థానికులు గుర్తించి బంధువులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి చూడగా అప్పటికే చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. అంత్యక్రియలకు వెళ్తూ మరొకరు.. జడ్చర్ల టౌన్: సమీప బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు రైల్వే ప్లాట్‌ఫారంపై పడి మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాసులు (52) మహబూబ్‌నగర్‌లో సమీప బంధువు చనిపోవడంతో బుధవారం అంత్యక్రియలకు హాజరయ్యేందుకు రైలులో బయలుదేరాడు. జడ్చర్లలో ఉన్న కుమార్తెను తీసుకెళ్లేందుకు స్టేషన్లో రైలు ఆగకముందే దిగేందుకు ప్రయత్నించి ప్లాట్‌ఫారంపై పడి అక్కడికక్కడే మృతిచెందాడు. రైల్వే పోలీసులు పంచనా మా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాదేపల్లి ఆస్పత్రికి తరలించారు. ఇంటి తాళం పగలగొట్టి బంగారం, నగదు అపహరణ చారకొండ: మండల కేంద్రంలో ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి బంగారం, వెండి, నగదు చోరీకి పాల్పడ్డారు. ఎస్ఐ రవి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కొప్పుల బాల్నారయ్య ఈనెల 4న తమ కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్లారు. తిరిగి 5వ తేదీన ఇంటికి వచ్చారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంట్లో దాచిన రెండు చైన్లు, పూసలదండా, రింగులు, బంగారు నగలు నాలుగు తులాలు, వెండి ఆభరణాలు, రూ.98 వేల నగదు చోరీకి గురయ్యాయి. బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
ఏకంగా రోడ్డునే దోచేశారు: అవాక్కవుతున్న నెటిజన్లు, వైరల్ వీడియో
బిహార్‌లో మరో వింత చోరీ వైరల్‌గా మారింది. ఏకంగా నిర్మాణంలో ఉన్న రోడ్డునే లూటీ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిహార్ రాష్ట్రంలోని జెహనాబాద్‌లో ఈ షాకింగ్ దొంగతనం చోటు చేసుకుంది. ఈ వైరల్ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహంతో స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపించారు. జెహనాబాద్ గ్రామానికి ముఖ్యమంత్రి గ్రామ సడక్ యోజన కింద రహదారిని నిర్మిస్తున్నారు. కాంట్రాక్టర్ కార్మికులతో కాంక్రీట్ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టారు. కాంట్రాక్టర్లు పాక్షికంగా పూర్తి చేసినా సిమెంట్ పనులను మాత్రం ప్రారంభించలేదు. దీంతో అదును చూసి గ్రామస్తులంతా కలిసి నిర్మాణంలో ఉన్న రోడ్డును లూటీ చేశారు. కొత్తగా వేసిన కాంక్రీటు రోడ్డుకు సంబంధించిన కాంక్రీటు, ఇసుక, చిప్స్ మొత్తాన్ని క్షణాల్లోనే ఖాళీ చేసేశారు. ఒకరికొకరు పోటీ పడి మరీ తన పని కానిచ్చారు. పాక్షికంగా నిర్మించిన రహదారి నిర్మాణ సామగ్రిని దొంగిలించినట్లు గుర్తించినట్లు అధికారులు ధృవకరించారు. జిల్లా కేంద్రానికి మంచి కనెక్టివిటీని అందించాలనే లక్ష్యంతో స్థానిక RJD ఎమ్మెల్యే సతీష్ కుమార్ రెండు నెలల క్రితం రహదారికి శంకుస్థాపన చేశారు. అయితే సిమెంట్ పనులు పూర్తి కాకుండానే గ్రామస్తులు చోరీ చేశారని సతీష్ ఆరోపించారు. దీనిపై మఖ్దుంపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసామన్నారు. ఇది ఇలా ఉంటే అయితే రోడ్డు వేయకముందే అడ్డగోలుగా దోచుకున్నారనీ ఈ రహదారిని ఇంకా మూడు కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉందని వారు చెప్పారు. వాస్తవానికి ఇది స్థానిక పాలనా యంత్రాంగం నిర్లక్ష్యం, వైఫల్యమేనని గ్రామానికి చెందిన కొంతమంది విమర్శించారు. అయితే బిహార్‌లో ఇలాంటి వింత వింత చోరీలు ఇదే మొదటిసారి కాదు. గతంలో రైల్వే ట్రాక్స్ దొంగిలించారు. మరోసారి రైల్వే ఇంజిన్ మాయమైంది. ఆ తరువాత ఏకంగా వంతెననే ఎత్తుకుపోయారు. ఇపుడు మరో దొంగతనంతో తమ రికార్డును తామే అధిగమించారు. ప్రస్తుతం కాంక్రీటు రోడ్డు చోరీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటువంటి దొంగలపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వారిని 5 సంవత్సరాల పాటు అన్ని ప్రభుత్వ సౌకర్యాలకు దూరంగా ఉంచాలంటూ నెటిజన్లు కమెంట్ చేశారు. बिहार में लोगों ने मुख्यमंत्री की सड़क ही लूट ली! जहानाबाद के मखदूमपुर के औदान बीघा गांव में मुख्यमंत्री सड़क ग्राम योजना के तहत सड़क बनाई जा रही थी. दावा है कि ढलाई के समय लोग पूरा मटेरियल ही लूट ले गये. बताया जा रहा कि इससे पहले भी ये सड़क ऐसे ही लूट ली गई थी. (@AdiilOfficial) pic.twitter.com/ZCBiStXr5Y — Utkarsh Singh (@UtkarshSingh_) November 3, 2023 -
ఏకంగా బస్‌షెల్టర్‌నే మాయం చేశారు
శివాజీనగర: ఇనుప వంతెనలు, భారీ వస్తు సామగ్రిని మాయం చేస్తున్న దొంగల కళ్లు..ఇప్పుడు బస్ షెల్టర్‌పై పడ్డాయి. బెంగళూరు నగరం నడిబొడ్డున నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి దగ్గర్లో ఉన్న సిటీ బస్ షెల్టర్‌ను దొంగలు ఎత్తుకుపోయారు. ఒక ప్రైవేటు సంస్థ విరాళంగా అందజేసిన రూ.10 లక్షలతో స్థానిక కన్నింగ్హం రోడ్డులో బెంగళూరు మెట్రో సిటీ బస్ సంస్థ (బీఎంటీసీ) ఏడాదిన్నర క్రితం స్టీల్, ఇనుప రాడ్లు, షీట్లతో బస్‌షెల్టర్‌ను ఏర్పాటు చేసింది. కొన్నిరోజులుగా అక్కడ బస్సు షెల్టర్ స్థానం ఖాళీగా కనిపిస్తుండటంతో అధికారులే తొలగించి ఉంటారని స్థానికులు భావించారు. సదరు ప్రైవేటు సంస్థకు విషయం తెలిసి కార్పొరేషన్ అధికారులను ఆరా తీశారు. ఈ విషయం బయటకు రావడంతో స్థానికులు వారం క్రితం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలు, ఇతర ఆధారాలతో పోలీసులు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. -
చోరీ చేశావంటూ తోటి విద్యార్థుల నింద.. విద్యార్థి ఆత్మహత్య
మందమర్రి రూరల్/ నెన్నెల: డబ్బు చోరీ చేశావంటూ తోటి విద్యార్థులు వేసిన నింద భరించలేకపోయాడు. పదేపదే డబ్బు విషయమై ప్రశ్నించడంతో అవమానంగా భావించిన ఓ విద్యార్థి పురుగుల మందు తాగాడు. ఆస్పత్రికి తరలించగా, చిక్సిత పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్యాంపటేల్, హాస్టల్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. నెన్నెల మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన కామెర ప్రభాస్(20) మందమర్రి జోన్–2లోని ఎస్సీ బాలుర వసతిగృహంలో ఉంటూ మంచిర్యాలలోని సీవీ. రామన్ కాలేజీలో బీకాం మొదటి సంవత్సరం చదువుతున్నాడు. హాస్టల్లో తోటి విద్యా ర్థులు రూ.1,100 పోయాయంటూ ఈ నెల 2వ తేదీన ప్రభాస్ బ్యాగు తనిఖీ చేయగా, అందులో డబ్బులు లభించాయి. ఆ సమయంలో ప్రభాస్ లేకపోవడంతో వచ్చాక డబ్బులు తీశావా అంటూ ప్రశ్నించారు. తాను తీయలేదని చెప్పాడు. కాసేపటి తర్వాత ప్రభాస్ బ్యాగు చూసుకొని అందులో తన డబ్బులు లేవని, ఎవరు తీశారని ప్రశ్నించాడు. దీంతో తోటి విద్యార్థులు బ్యాగులో ఉన్న రూ.1,100 తామే తీశామని, అవి ఎక్కడివని ఎదురు ప్రశ్నించారు. దీంతో తనకు తెలిసిన అమ్మాయి గూగుల్ పే ద్వారా పంపించిందని ఓసారి, హాస్టల్ సమీపంలోని దుకాణ నిర్వాహకుల ఫోన్ ద్వారా పంపించిందని మరోసారి చెప్పాడు. దుకాణానికి వెళ్లి అడగ్గా సరైన సమాధానం లభించలేదు. డబ్బులు పంపించినట్టుగా స్క్రీన్ షాట్ పంపిస్తే నమ్ము తామని చెప్పగా.. 3వ తేదీన తీసుకొస్తానన్నాడు. ఆ రోజు ఇదే విషయమై తోటి విద్యార్థులు మళ్లీ ప్రశ్నించగా, అమ్మాయి కలవలేదని, ఫోన్‌లిఫ్ట్ చేయలేదని చెప్పగా, స్క్రీన్ షాట్ చూపిస్తేనే డబ్బులు ఇస్తామని మళ్లీ చెప్పారు. దీంతో 4వ తేదీన ఉదయం హాస్టల్ నుంచి స్వగ్రామమైన జోగాపూర్‌కు వచ్చి శీతల పానీయంలో పురుగుల మందు కలుపుకొని తాగాడు. ఇరుగుపొరుగు వారు ప్రశ్నించడంతో అవమానపర్చిన విషయం చెప్పాడు. 108 అంబులెన్స్‌లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వా స్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతిచెందాడు. మృతుడి అన్న రాజశేఖర్ ఫిర్యాదు మేరకు హాస్టల్ వార్డెన్‌తోపాటు ఐదుగురు విద్యార్థులపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. కాగా, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ మంచిర్యాల ప్రభుత్వాస్పత్రి ఎదుట విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. -
రాత్రికి రాత్రే రూ. 10 లక్షల బస్ షెల్టర్ మిస్సింగ్: షాక్‌లో పోలీసులు
కర్నాటకలోని బెంగళూరు నగరంలో మరో బస్షెలర్ట్ మాయం కావడం కలకలం రేపింది. సిలికాన్ సిటీ కన్నింగ్‌హామ్ రోడ్లో నిర్మించిన వారం రోజులకే రూ. 10 లక్షల విలువైన ఈ షెల్టర్ ఉన్నట్టుండి కనపించకుండా పోయింది. బస్ట్ స్టాండ్ మాయం ఏంటి అనిఆశ్చర్య పోతున్నారా? ఇక్కడ బస్ షెల్టర్ అదృశ్యమవడం ఇదే తొలిసారి కాదు. ఇలాంటి వరుస సంఘటనలు ఇక్కడ నమోదుకావడం గమనార్హం. ముప్పయేళ్ల నాటి HRBR లేఅవుట్లోని బస్టాండ్ మార్చిలో రాత్రికి రాత్రే మాయమైంది. ఇపుడు మరో బస్టాండ్. స్టెయిన్లెస్-స్టీల్ స్ట్రక్చర్‌తో, రద్దీగా ఉండే కన్నింగ్‌హామ్ రోడ్లో బస్ షెల్టర్ ఆగస్ట్ 21న ఏర్పాటు చేయగా ఆగస్ట్ 28న కనిపించకుండా పోయింది. ఈ సంఘటన జరిగిన నెల తర్వాత బస్ట్ స్టాప్తోపాటు, స్టీల్ స్ట్రక్చర్ దొంగతనంపై సెప్టెంబర్ 30న ఫిర్యాదు దాఖలైంది. దీంతో బెంగళూరు పోలీసులు బిఎమ్‌టిసి బస్ షెల్టర్ల నిర్మాణాల కంపెనీ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ రవిరెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సమీపంలోని భవనాల నుండి CCTV ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ బస్ షెల్టర్‌ను బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (BMTC) నిర్మించింది. ఇది బెంగళూరు సిటీ పోలీస్ కమీషనర్ కార్యాలయం వెనుక, విధాన సౌధ నుండి కేవలం 1 కి.మీ దూరంలో ఉండటం పోలీసులకు మరింత సవాల్‌గా మారింది. ఇక ఇలాంటి వరుస సంఘటల విషయానికి వస్తే..అంతకుముందు 1990లో లయన్స్ క్లబ్ విరాళంగా ఇచ్చిన కళ్యాణ్‌నగర్ బస్టాండ్ అదృశ్యమైంది. మరేదో వ్యాపార సముదాయ నిర్మాణం కోసం ఈ చోరీ జరిగిందని ఆ ప్రాంత నివాసితులను ఉటంకిస్తూ మీడియా నివేదికను ఉటంకిస్తూ ఇండియా టుడే నివేదించింది. 2015లో హారిజన్ స్కూల్ సమీపంలోని దూపనహళ్లి బస్ స్టాప్ రాత్రిపూటఅదృశ్యమైందని నివేదిక పేర్కొంది. గతంలో 2014లో రాజరాజేశ్వరినగర్‌లోని బీఈఎంఎల్ లేఅవుట్ 3వ స్టేజీలో 20 ఏళ్ల నాటి బస్టాప్ కనిపించకుండా పోయింది. -
టీటీడీ బస్సు చోరీ కేసు నిందితుడి అరెస్ట్
తిరుమల/తిరుపతి లీగల్ : టీటీడీ ఉచిత ధర్మరథం ఎలక్ట్రిక్ బస్సు చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు నేరవిభాగం ఏఎస్పీ విమలకుమారి తెలిపారు. మంగళవారం స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, హయత్‌నగర్ మండలం అనంజపూర్ గ్రామంలోని నీలావర్ గణపతి కుమారుడు నీలావర్ విష్ణు (20) గతనెల 24వ తేదీన తిరుమల బ్రహ్మోత్సవాలకు వచ్చాడు. టీటీడీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం దగ్గర ఉంచిన రూ.1.44 కోట్ల విలువైన టీటీడీ ఉచిత ధర్మరథం ఎలక్ట్రిక్ బస్సును చోరీ చేసి తీసుకెళ్లాడు. నిందితుడు అదేరోజు పోలీసులకు భయపడి నాయుడుపేట చెన్నై రహదారిపై బస్సును వదిలి పారిపోయాడు. అతని కోసం పోలీసులు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో గాలించి సోమవారం సాయంత్రం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అరెస్ట్ చేశారు. కాగా, ఈ కేసులో అరెస్టయిన నిలావర్ విష్ణు తల్లిదండ్రులు మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు వలసి వచ్చి జీవిస్తున్నారు. 2015లో విష్ణు తండ్రి భార్యను హత్యచేసి జైలుకు వెళ్లాడు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన పోలీసులకు జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి రివార్డులను ప్రకటించగా.. ఏఎస్పీ వారికి అందజేశారు.ఇదిలా ఉండగా నిందితుడు నీలావర్ విష్ణుకు ఈనెల 17వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తిరుపతి రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోటేశ్వరరావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. -
ఫ్లాష్ లూటీ...
ఫిలడెల్ఫీయా: నిత్యం నిఘా నీడన ఉండే అమెరికాలో దొంగల ముఠా పేట్రేగిపోయింది. చూడ్డానికి.. షాపింగ్‌మాల్స్‌లో ఫ్లాష్‌మాబ్ పేరిట డ్యాన్స్‌లు, అవగాహన కార్యక్రమాలు చేసే బృందంలా కనిపిస్తూ ఒక్కసారిగా దుకాణాలపై తెగబడి అందిన కాడికి దోచేశారు. అమెరికాలోని ఫిలడెల్ఫీయా నగరం ఈ చోరీల ఘటనకు వేదికైంది. ఒక్కటి కాదు చాలా స్టోర్స్‌లో టీనేజర్లు ఇలా ఒకే తరహాలో దొంగతనాలకు పాల్పడ్డారు. మంగళవారం రోజు జరిగిన ఈ చోరీల తాలూకు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అత్యంత ఖరీదైన ఐఫోన్లుసహా యాపిల్ కంపెనీకి చెందిన పలు ఎల్రక్టానిక్ ఉపకరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. మాస్‌్కలు, హూడీలు ధరించిన దాదాపు 100కుపైగా టీనేజర్లు యాపిల్ స్టోర్, ఫూట్లాకర్, లూలూలెమెన్ స్టోర్లలో చొరబడి బ్యాగుల నిండా వస్తువులను తీసుకెళ్లారు. విషయం తెల్సుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను విశ్లేíÙంచి 20 మందికిపైగా టీనేజర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కొన్ని ఆయుధాలనూ స్వాదీనం చేసుకున్నారు. అయితే, వస్తువును దొంగిలించినా వాడుకోలేని(యాంటీ–థెఫ్ట్) ఫీచర్ ఉన్న కొన్ని యాపిల్ సంస్థ వస్తువులను దొంగలు అక్కడే వదిలేసివెళ్లారని ఫాక్స్ న్యూస్ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. గత నెలలో డ్రైవర్ ఎడ్డీ ఐరీజెర్రీని ఫిలడెల్ఫీయా పోలీస్ అధికారి కాల్చిచంపిన కేసులో రిటెన్హౌజ్ స్క్వేర్ వద్ద శాంతియుత ర్యాలీ జరిగిన కొద్దిసేపటికే అక్కడా ఇలా రిటైల్స్టోర్పై దాడి జరిగింది. అయితే ఆ నిరసనకారులతో ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని ఫిలడెల్ఫీయా పోలీసులు స్పష్టంచేశారు. -
జరిమానా చెల్లించేందుకు కోర్టులోనే చోరీ
సంగారెడ్డి అర్బన్: కోర్టు విధించిన జరిమానా చెల్లించేందుకు అదే కోర్టులో గంజాయిని దొంగతనం చేసిన నిందితుడి నిర్వాకమిది. సంగారెడ్డి డీఎస్పీ రమేష్ కుమార్ కథనం మేరకు.. ఈ నెల 19వ తేదీన కోర్టు హాలులోని న్యాయమూర్తి చాంబర్లో ఓ కేసుకు సంబంధించిన గంజాయి సంచిని సీజ్ చేసి ఉంచారు. గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి గంజాయి సంచిని ఎత్తుకెళ్లారు. దీనిపై కోర్టు సీనియర్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ, షూ గుర్తుల ఆధారంగా నిందితుడు మగ్దూమ్‌నగర్‌కు చెందిన షేక్ మహబూబ్‌గా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. నిందితుడు ఇదివరకు ఒక దొంగతనం, యాక్సిడెంట్ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. 14 ఏళ్లుగా స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో ఎవరైనా నిందితులకు బెయిల్ జామీను కావాలంటే డబ్బులు తీసుకొని పూచీకత్తు ఇస్తుంటాడు. అందులో భాగంగా సంగారెడ్డి టౌన్ పీఎస్ పరిధిలో జరిగిన ఓ ఏటీఎం దొంగతనం కేసులో నిందితులకు జామీను ఇచ్చాడు. అయితే వారు కోర్టుకు రానందున మహబూబ్ రూ.30వేలు కట్టాల్సి వచ్చింది. ఈ డబ్బు ఎలా కట్టాలో తెలియక కోర్టు హాలులో ఉన్న గంజాయి మూటను అమ్మి డబ్బు చేసుకోవాలని భావించి దొంగతనం చేశాడు. గంజాయి మూటను స్వాదీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. -
ఢిల్లీలోని జ్యువెలరీ షోరూంలో రూ.25 కోట్ల నగలు చోరీ..
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీ జంగ్‌పురలోని ఉమ్రావ్ జ్యువెలరీ షాపులో భారీ స్థాయిలో చోరీ జరిగింది. దొంగలు నాల్గవ అంతస్తులో టెర్రస్‌పై నుండి లోపలికి చొరబడిన దొంగలు నేరుగా లాకర్ రూముకు పెద్ద కన్నం వేసి సుమారు రూ.25 కోట్లు విలువ చేసే నగలను ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దొంగలు మొదట పకడ్బందీగా రెక్కీ నిర్వహించారని చాలా తెలివిగా సీసీ కెమెరాలు పనిచేయకుండా ఆపేసి చోరీకి పాల్పడ్డారని అన్నారు. సోమవారం నగల షోరూంకు సెలవని తెలుసుకుని అదేరోజు దొంగతనానికి పాల్పడ్డారన్నారు. దొంగలు నాలుగో అంతస్తు టెర్రస్‌పై నుండి లోపలికి చొరబడి మొదట సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసి అక్కడి నుండి గ్రౌండ్ ఫ్లోర్‌లోని స్ట్రాంగ్ రూముకి చేరుకొని లాకర్‌కు పెద్ద రంధ్రం చేసి సుమారు రూ.20-25 కోట్లు విలువ చేసే నగలను దోచుకెళ్లారు. వీటితోపాటు డిస్ప్లేలో ఉంచిన నగలను కూడా ఎత్తుకెళ్లిపోయారని తెలిపారు. ఆదివారం రాత్రి షోరూంకు తాళాలు వేసి వెళ్ళిపోయిన యజమాని మంగళవారం షోరూం తెరిచి చూసే సరికి దొంగతనాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. సీసీటీవీ కేబుల్ కట్ చేయక ముందు ఫుటేజీలో రికార్డయినంత వరకు పరిశీలిస్తూ దర్యాప్తును ప్రారంభించినట్లు తెలిపారు పోలీసులు. సోమవారం హర్యానాలో కూడా ఇదే తరహాలో ఒక దొంగతనం జరిగింది. కోఆపరేటివ్ బ్యాంకులోకి ప్రవేశించిన దొంగలు గ్యాస్ కట్టర్‌తో గోడకి కన్నం చేసి మొత్తం నగదును, నగలను దోచుకెళ్లారు. రెండు దొంగతనాలు ఒకే తీరుగా జరగడంతో దొంగతనం చేసింది ఒక్కరేనా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. #WATCH | Delhi: "We closed the shop on Sunday and when we opened it on Tuesday after an off on Monday, we saw that there was dust in the whole shop and there was a hole in the wall of the strong room... We think they (thieves) have looted everything... There was jewellery worth… pic.twitter.com/75H9or8Wxe — ANI (@ANI) September 26, 2023 ఇది కూడా చదవండి: సుప్రీంలో కల్వకుంట్ల కవితకు ఊరట -
బిహార్‌లో పోలీసు స్టేషన్లో దొంగతనం
పట్నా: దొంగలు ఏకంగా పోలీసు స్టేషన్‌ను టార్గెట్ చేశారు. రాత్రిపూట లోపలికి ప్రవేశించి, మద్యం సీసాలు ఎత్తుకెళ్లారు. బిహార్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ పోలీసు స్టేషన్లో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. బిహార్‌లో మద్యంపై నిషేధం అమల్లో ఉంది. అక్రమ రవాణా జరుగుతున్న మద్యం సీసాలను పోలీసులు స్వా«దీనం చేసుకొని ఈ స్టేషన్‌లోని స్టోర్‌రూమ్‌లో భద్రపర్చారు. శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. చిమ్మచీకట్లో దొంగలు చాకచక్యంగా గోడదూకి లోపలికి అడుగుపెట్టారు. స్టోర్‌రూమ్‌లో ఐదు పెట్టెలు, ఒక సంచిలో ఉన్న మద్యం బాటిళ్లను చోరీ చేశారు. విచిత్రం ఏమిటంటే ఈ సంఘటన జరుగుతున్నప్పుడు పోలీసు సిబ్బంది స్టేషన్లోనే ఉన్నారు. అసలు విషయం మరుసటి రోజు బయటపడింది. దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసుల నిర్లక్ష్యంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. -
తిరుమలలో టీటీడీ ఎలక్ట్రిక్ బస్సు మిస్సింగ్