కట్టంగూర్: గుర్తుతెలియని దుండగులు ఏటీఎం కేంద్రంలోకి చొ రబడి మెషీన్‌ను గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి రూ.23లక్షలు అపహరించుకుపోయారు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాములలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన వివరాలిలా.. ఎస్‌బీఐ బ్యాంకు పక్కనే ఉన్న ఏటీఎం గదిలో రెండు యంత్రాలు ఉన్నా యి. ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారుజామున 2:30–3 గంటల సమయంలో ఏటీఎం కేంద్రం వద్దకు కారులో వచ్చారు.
మొద టగా ఓ వ్యక్తి చేతులకు గ్లౌజ్‌లు, తలకు టోపి, ముఖానికి దస్తీ కట్టుకొని నేరుగా వెళ్లి బయట ఉన్న సీసీ కెమెరాతో పాటు లోపల ఉన్న సీసీ కెమెరాలకు బ్లాక్ స్ప్రే చేశాడు. వెంటనే బయటకు వెళ్లి మరో ఇద్దరితో కలసి కారులో నుంచి గ్యాస్‌కట్టర్‌ను తీసుకొచ్చాడు. ఒక వ్యక్తి గ్లాస్ బయట నిలబడి ఉండగా ఇద్దరు వ్యక్తులు గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను కట్‌చేసి అందులో ఉన్న రూ.23లక్షలను తీశారు.
పక్కనే ఉన్న మరో ఏటీఎంను కూడా కట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాకపోవడంతో వెళ్లిపోయారు. ఈ ముగ్గురితో పాటు ఓ వ్యక్తి రోడ్డుపై మారణాయుధాలతో ఉండగా ఇంకో వ్యక్తి కారులో ఉన్నట్లు తెలిసింది. దుండగులు చోరీకి పాల్పడే ముందు ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కాగా రెండో ఏటీఎంలో ఉన్న రూ.40లక్షలు భద్రంగా ఉన్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. నల్లగొండ అడిషనల్ ఎస్పీ ప్రసాద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
హరియాణా గ్యాంగ్ పనేనా?
గత డిసెంబర్‌లో నల్లగొండ పట్టణంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో ఇదే తరహాలో హరియాణా గ్యాంగ్ చోరీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక్కడ కూడా ఆ గ్యాంగ్ పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment