Nalgonda District
-
రాళ్ల గుట్టను ఢీకొన్ని కావేరి ట్రావెల్స్ బస్సు..
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రమాదానికి గురికావడంతో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ సమీపంలో కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి రాళ్ల గుట్టను బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. బాధితులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో బస్సు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. -
నల్లగొండ వాసికి సీశాబ్ బాధ్యతలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ పట్టణ వాసి కరణం ఉమామహేశ్వర్ రావుకి కేంద్ర విద్యా శాఖ కీలక బాధ్యతలు అప్పగించింది. జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్‌టీఐ, ఇతర విద్యా సంస్థల్లో సీట్ల భర్తీకి సంబంధించిన కీలక బాధ్యతలు నిర్వహించే సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు (సీశాబ్) చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కాగా, ఆయన ఈ బాధ్యతలు చేపట్టడం వరుసగా మూడోసారి కావడం విశేషం.నల్లగొండ పట్టణంలోని రామగిరికి చెందిన ఉమామహేశ్వర్రావు పదో తరగతి వరకు నల్లగొండలోని సెయింట్ ఆల్ఫోన్సస్ హైస్కూల్లో విద్యను అభ్యసించారు. ఇంటర్ హైదరాబాద్‌లోని నృపతుంగ జూనియర్ కళాశాలలో, బీటెక్ కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ (ఐఐటీ బెనారస్)లో ఎంటెక్ పూర్తి చేశారు. 1989లో ఖరగ్‌పూర్ ఐఐటీలో పీహెచ్డీ పూర్తిచేశారు. సీశాబ్ ఆధ్వర్యంలోనే సీట్ల భర్తీకేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇనిస్టిట్యూషన్స్ (జీఎఫ్‌టీఐ) తదితర విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ముఖ్యంగా ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్‌టీఐ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొనసాగే ఇతర విద్యాసంస్థల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి 6, 7 విడతల్లో సీశాబ్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. -
సప్తగిరుల దేవరాద్రి
దేవరకొండ ఖిలాకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. తెలంగాణలో ఉన్న కోటలన్నింటిలో దేవరకొండ కోట తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకుంది. 13వ శతాబ్దంలో నిర్మితమైన దేవరకొండ ఖిలాకు సురగిరి అనే పేరుంది. అంటే దేవతల కొండ అని దీని అర్థం. కోట చుట్టూ ఎనిమిది చోట్ల ఆంజనేయస్వామి రూపాన్ని చెక్కి కోటను అష్ట దిగ్బంధనం చేశారని ప్రతీతి. ఎంతో ప్రాచుర్యం పొందిన దేవరకొండ ఖిలాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. అయినా పాలకులు దీనిపై దృష్టి పెట్టకపోవడంతో నిరాదరణకు గురవుతోంది. – దేవరకొండకోట చుట్టూ 360 బురుజులు.. కాలక్రమేణా కోట గోడలు బీటలు వారినా.. నిర్మాణ శైలి నేటికీ అబ్బురపరుస్తోంది. పది కిలోమీటర్ల పొడవు, 500 అడుగుల ఎత్తులో ఏడు కొండల మధ్య నిర్మితమైన దేవరకొండ కోట శత్రుదుర్బేధ్యంగా ఉండేది. మట్టి, రాళ్లతో కట్టిన గోడలు నేటికీ నాటి నిర్మాణ కౌశలాన్ని చాటుతున్నాయి.7 గుట్టలను చుట్టుకొని ఉన్న శిలా ప్రాకారంలో 360 బురుజులు, రాతితో కట్టిన 9 ప్రధాన ద్వారాలు, 32 ప్రాకార ద్వారాలు, 23 పెద్ద బావులు, 53 దిగుడు బావులు, కోనేర్లు, కొలనులు, సైనిక నివాసాలు, ధాన్యాగారాలు, సభావేదికలు, ఆలయాలు ఇలా.. ఎన్నో.. ఎన్నెన్నో. ప్రతీ నిర్మాణం వెనుక ఓ చారిత్రక గాథ పలకరిస్తుంటుంది.రాజదర్బార్ ఉన్న కోట ద్వారాలకు రెండు వైపులా పూర్ణకుంభాలు, సింహాలు, తాబేళ్లు, చేపలు, గుర్రాలు వంటి ఆకృతులు ఇక్కడ రాతిపై చెక్కబడి ఉన్నాయి. కోట సమీపంలో నరసింహ, ఓంకారేశ్వర, రామాలయం వంటి పురాతన దేవాలయాలు దర్శనమిస్తాయి. ఇక్కడి శిల్పకళా సంపద చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. పద్మనాయకుల రాజధానిగా.. 15వ శతాబ్దంనాటి ఈ కోటకు సంబంధించి ఎన్నో విశేషాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 700 ఏళ్ల కిందట 13వ శతాబ్దంలో కాకతీయులకు సామంతులుగా ఉండి.. ఆ తర్వాత స్వతంత్రులైన పద్మనాయకుల రాజధానిగా దేవరకొండ కీర్తి గడించింది. అనపోతనాయుడు, రెండవ మాదానాయుడి కాలంలో కోట నిర్మాణం జరిగింది.మాదానాయుడి వారసులు దేవరకొండని, అనపోతనాయుడి వారసులు రాచకొండను రాజధానిగా చేసుకొని క్రీ.శ 1236 నుంచి 1486 వరకు పాలన కొనసాగించారు. తర్వాత ఈ కోటను బహమనీ సుల్తానులు, కుతుబ్‌షాహీలు వశం చేసుకున్నారు. సందర్శకుల తాకిడి.. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ఖిలా (Devarakonda Fort) సందర్శనకు హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. సెలవు రోజుల్లో ఈ ప్రాంతం బిజీగా ఉంటుంది. అంతే కాకుండా హైదరాబాద్ నుంచి పలు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, విదేశీయులు సైతం కోటను సందర్శించి ఇక్కడి శిల్పకళా సంపదను చూసి ముగ్దులవుతున్నారు. చదవండి: చెరువులకు చేరింది సగంలోపు చేప పిల్లలేఇక తొలి ఏకాదశి, మహా శివరాత్రి పర్వదినాల్లో దేవరకొండ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున కోటకు చేరుకొని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈ కోట సింహద్వారంపై చెక్కబడిన పూర్ణకుంభం చిహ్నం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ చిహ్నంగా తీసుకోవడం గమనార్హం.పర్యాటక ప్రాంతంగా మార్చితే.. ఖిలాను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నది ఇక్కడి ప్రాంత ప్రజల చిరకాల కోరిక. దేవరకొండ ఖిలా గతమెంతో ఘనచరిత్ర కలిగి నాటి శిల్పకళా సంపదకు నిలువెత్తు రూపంగా నిలిచింది. ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తే దేవరకొండతోపాటు చుట్టుపక్కల పట్టణాలు సైతం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతాయి. ఈ ఖిలా విశిష్టత సైతం నలుమూలల వ్యాప్తి చెందుతుందని ఇక్కడి ప్రజల కోరిక. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖిలా ఆవరణలో పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ప్రస్తుతం పార్క్ నిర్మాణ పనులు పూర్తయినట్టు అధికారులు పేర్కొంటున్నారు.దేవరకొండ ఖిలాకు చేరుకునేదిలా.. దేవరకొండ ఖిలా హైదరాబాద్‌కు 110 కిలోమీటర్లు, నాగార్జునసాగర్‌కు 45 కి.మీ, నల్లగొండ నుంచి సాగర్‌కు వెళ్లే దారిలో కొండమల్లేపల్లి పట్టణం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్, నల్లగొండ, సాగర్ నుంచి దేవరకొండకు నేరుగా బస్సు సౌకర్యం ఉంది. -
నల్లగొండ టూటౌన్ సీఐ డానియల్ పై వివాహేతర సంబంధం ఆరోపణలు
-
పీఎస్‌కు వచ్చిన వివాహితను ట్రాప్ చేసిన సీఐ.. ప్లాట్ కొనిస్తా అంటూ..
నల్లగొండ క్రైం: తన భార్యతో నల్లగొండ పట్టణ టూటౌన్ సీఐ డానియల్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తి ఎస్పీ శరత్చంద్ర పవార్‌కు శనివారం ఫిర్యాదు చేశాడు. సదరు సీఐ తన భార్యతో కాపురం చేయనీయకుండా మనోవేధనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదు విషయాన్ని బాధితుడు విలేకరులకు తెలిపాడు. వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణానికి చెందిన దంపతులు వారి సొంత ఇంటిని విక్రయించుకున్నారు. దానికి సంబంధించిన దస్తావేజులు తీసుకునేందుకు పట్టణంలో ఓ బ్యాంకు వెళ్లారు. ఆ తర్వాత భార్య పట్టణంలోని టూటౌన్ సీఐ వద్దకు వెళ్లి తనపై పలు ఆరోపణలతో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సీఐ డానియల్ ఆమెతో చనువు పెంచుకుని తన భార్యకు తరచూ ఫోన్, చాటింగ్ చేస్తూ.. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని బాధితుడు తెలిపాడు. తనను పదేపదే స్టేషన్‌కు పిలిపించి బెదిరించారని.. ఊళ్లో ఉన్న పొలం అమ్ముకుని వస్తే కేసులు తీసివేస్తామని, భార్యతో విడాకులు ఇప్పిస్తానని వేధించాడని పేర్కొన్నాడు.తన భార్యకు ప్లాటు కొనిస్తానని, డబ్బులు ఇస్తానని నమ్మబలికి లోబరుచుకున్నాడని ఆరోపించాడు. తన భార్య సెల్‌ఫోన్ తనిఖీ చేయగా సీఐతో చాటింగ్‌లు చేసిన విషయం తెలిసిందని.. ఈ చాటింగ్ తదితర ఆధారాలతో ఎస్పీకి ఫిర్యాదు చేశానని బాధితుడు తెలిపాడు. తన భార్య, సీఐతో తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నాడు. కాగా.. ఈ ఘటనపై సీఐ డానియల్ స్పందిస్తూ తనపై చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదని తెలిపారు. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా తనపై నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు.ఫిర్యాదుపై విచారణ చేస్తున్నాం– ఎస్పీ శరత్చంద్ర పవార్సీఐపై వచ్చిన ఫిర్యాదుపై నల్లగొండ డీఎస్పీ విచారణ చేస్తున్నారని, ఫోన్ చాటింగ్ పరిశీలిస్తున్నామని ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. డీఎస్పీ నివేదిక ఆధారంగా సీఐపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
రైతుభరోసాపై మరోసారి ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి
-
మోదీకిదే నా సవాల్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: గత 75 ఏళ్లలో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ, ఏ ప్రభుత్వం, ఏ సీఎం కూడా తొలి ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలు ఇవ్వలేదని.. దీనిపై తాను సూటిగా ప్రధాని మోదీకే సవాల్ విసురుతున్నానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మోదీ పాలనలో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా మొదటి ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇస్తే లెక్క చూపాలని... ఢిల్లీ నడిబజార్లో క్షమాపణ చెప్పి తలవంచుకొని వస్తానని సవాల్ చేశారు. గెలిస్తే ఉప్పొంగడం, ఓడిపోతే కుంగిపోవడం తెలంగాణ సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచిదా, కేసీఆర్ ఎందుకు బయటికి రావడం లేదని సీఎం ప్రశ్నించారు. దీనిపై కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించారు. శనివారం సాయంత్రం నల్లగొండ జిల్లా కేంద్రంలోని గంధంవారిగూడెంలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే... ’’కేసీఆర్, బీఆర్ఎస్ వారు మాట్లాడిన ప్రెస్మీట్ల కాగితాలు తీసుకెళ్లి ఈటల రాజేందర్, కిషన్‌రెడ్డి అవే నకలు కొడుతున్నారు. కిషన్‌రెడ్డి, ఈటల మారాలి. ఆ దొంగల సోపతి పడితే మీరు కూడా దొంగల బండి ఎక్కుతారు. అటే పోతారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా.. అడ్డగోలుగా మాట్లాడవద్దు. ఏది పడితే, ఎలా పడితే అలా మాట్లాడితే చెల్లదు. మీరు కేసీఆర్‌లా తయారుకాకండి. మోదీ పాలనలో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా మొదటి ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇస్తే లెక్క చూపండి. మోదీకి సవాల్ చేస్తున్నా.. ఢిల్లీ నడిబజార్లో మీకు క్షమాపణ చెప్పి తలవంచుకొని వస్తా. లేకపోతే నా లెక్క అప్పజెబుతా. మీ నాయకులు, మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించండి. అప్పుడే ఈ దేశ ప్రధానమంత్రిగా మీ గౌరవం పెరుగుతుంది. అంతేకాదు మేం తొలి ఏడాదే 25.50 లక్షల మంది రైతుల రుణమాఫీ చేశాం. రూ.21 వేల కోట్లు వారి ఖాతాల్లో వేశాం. మోదీ, కేసీఆర్ మీరు ఎప్పుడైనా చేశారా? సవాల్ విసురుతున్నా. మోదీ అధికారంలో ఉన్నప్పుడైనా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనైనా ఒక్క ఏడాదిలోనే ఇలా రుణమాఫీ చేస్తే.. నేను మా మంత్రులతో సహా వచ్చి క్షమాపణ చెబుతాం. కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోండి.. గెలిస్తే ఉప్పొంగడం, ఓడిపోతే కుంగిపోవడం తెలంగాణ సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచిదా? కేసీఆర్ ఎందుకు బయటికి రావడం లేదు? ఎందుకు మాట్లాడటం లేదు? అధికారంలో ఉంటే చలాయిస్తాం, ఓడిపోతే ఫామ్‌హౌస్‌లో పడుకుంటామంటే ఎలా? దీనిపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? మేం ఎన్నికల్లో పోటీ చేయలేదా? ఓడినా, గెలిచినా ప్రజల్లో ఉండలేదా? రెండుసార్లు మీరు గెలిచారు. మేం ఓడిపోయాం.. అయినా జానారెడ్డిలాంటి పెద్దలు ప్రజల్లో ఉండి, అసెంబ్లీలో పాలకపక్షానికి సూచనలు, సలహాలు ఇస్తూ, తప్పిదాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు.మా ఎమ్మెల్యేలను గుంజుకున్నా, సీఎల్పీ హోదాను తొలగించినా మొక్కవోని ధైర్యంలో భట్టి విక్రమార్క కొట్లాడారు. ఇప్పుడు సంవత్సరం పూర్తయినా మీరు ప్రతిపక్ష నాయకుడిగా మీ పాత్ర పోషించారా? అసెంబ్లీకి వచ్చారా? ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, టీఆర్ఎస్ అధ్యక్షుడిగా, పదేళ్లు సీఎంగా మీకున్న అనుభవాన్ని, మీ వయసును తెలంగాణ ప్రజల కోసం ఏ ఒక్కరోజైనా వినియోగించారా? ఆలోచించాలి. ఆత్మపరిశీలన చేసుకోవాలి. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీగా ఉంచడం పట్ల తెలంగాణ సమాజానికి ఏం సమాధానం చెబుతారు? గాలి బ్యాచ్‌ని ఊరి మీదకు వదిలారు.. ప్రభుత్వ నిర్ణయాలు మీకు నచ్చకపోతే, ప్రజలకు కష్టం వస్తే ప్రజలపక్షాన మాట్లాడాల్సింది పోయి ఒక గాలి బ్యాచ్‌ను తయారు చేసి ఊరి మీదికి వదిలారు. వారేం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో ఎప్పుడైనా విన్నారా? ప్రతి అభివృద్ధి పనిని అడ్డుకుంటున్నారు. ఉద్యోగాలు ఇవ్వొద్దన్నప్పుడు, గ్రూప్–4, గ్రూప్–1 పరీక్షలు పెట్టవద్దన్నప్పుడు, డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేయాలన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళుతుంది? కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉంటే.. కేసీఆర్ రూ.7 లక్షల కోట్లు అప్పుతో మాకు అప్పగించారు. అప్పులకు ప్రతి నెలా రూ.6,500 కోట్ల చొప్పున ఏడాదికి రూ.65 వేల కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తోంది. నాడు ‘ఔటర్’ రోడ్డు.. ఇప్పుడు ‘రీజనల్’ రోడ్డు నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డు వేశారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా రీజనల్ రింగు రోడ్డు తీసుకువచ్చి అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. 50వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీగా కొత్త నగరాన్ని నిర్మించుకుని, పెట్టుబడులు తెచ్చి.. నిరుద్యోగులకు, ఇంజనీర్లకు, డాక్టర్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత మాదే. మూసీ కాలుష్యంతో మనుషులు జీవించలేని పరిస్థితి నల్లగొండ ప్రాంతానికి రాబోతోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. అందుకే మూసీలో గోదావరి జలాలను పారించేందుకు, పారిశ్రామిక కాలుష్యం నుంచి కాపాడేందుకు ప్రక్షాళన చేపట్టాం. అడ్డం వచ్చే వారి సంగతి ప్రజలే చూసుకోవాలి..’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ ఇచ్చింది వైఎస్సార్ కాదా? ‘‘వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చెప్పినప్పుడు.. కొందరు కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందన్నారు.ఆ మాటలు తప్పు అని నిరూపించి రైతులకు ఉచిత కరెంటును ఇచ్చారు. దేశంలోనే మొదటిసారిగా రైతులకు ఉచిత కరెంటు ఇస్తూ, వారి రూ.1,200 కోట్ల కరెంటు బిల్లులను మాఫీ చేస్తూ, వేల మంది రైతులపై విద్యుత్ చౌర్యం కేసులను ఎత్తివేస్తూ.. ఒక్క సంతకంతో హామీలు అమలు చేశారు. మేం ఆయనను ఆదర్శంగా తీసుకుని వ్యవసాయానికి 24 గంటల ఇస్తున్నాం. ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. వైఎస్సార్ రాజీవ్ ఆరోగ్యశ్రీని అమల్లోకి తెస్తే... కేసీఆర్ వచ్చి నిరీ్వర్యం చేశారు. మేం వచ్చాక ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం. వరి వేస్తే ఉరేనని కేసీఆర్ అన్నారు. మేం వరి సాగు చేయాలని చెప్పడమేకాదు సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తున్నాం.’’ తెలంగాణను దేశానికే రోల్‌మోడల్‌గా చేస్తాం : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి నల్లగొండ: రాబోయే నాలుగేళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే రోల్ మోడల్‌గా నిలబెడతామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్లగొండ ప్రజాపాలన విజయోత్సవ సభలో వారు మాట్లాడారు. తమ ప్రభుత్వం ఓవైపు రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు అమలు చేస్తూనే, మరోవైపు అప్పులు తీర్చుకుంటూ ముందుకుసాగుతోందని భట్టి విక్రమార్క చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకులాలను పెట్టిందే తప్ప నిర్వహణను పట్టించుకోలేదని.. తాము యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ గురుకులాలను నియోజకవర్గానికి ఒకటి చొప్పున నిర్మిస్తున్నామని చెప్పారు. గత సర్కారు యాదాద్రి పవర్ ప్లాంట్ మొదలుపెట్టిందే తప్ప పర్యావరణ అనుమతులు తీసుకోలేకపోయిందని.. తాము అనుమతులు తెప్పించి, నిధులిచ్చి పనులు వేగవంతం చేశామని తెలిపారు. నల్లగొండ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం: ఉత్తమ్ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం సొరంగ మార్గాన్ని ప్రారంభిస్తే బీఆర్ఎస్ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆ ప్రాజెక్టును పూర్తిచేసి మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుందన్నారు. కార్యకర్తల కష్టం, త్యాగంతో తాము ఈ స్థాయిలో ఉన్నామని.. వారికి ఏ కష్టం వచి్చనా అండగా ఉంటామని చెప్పారు. ఎస్ఎల్బీసీ.. ఇక ఆర్ఆర్ ప్రాజెక్టు: కోమటిరెడ్డి ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని ఇక నుంచి ఆర్ఆర్ (రాజశేఖర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి) ప్రాజెక్టుగా పేరు పెట్టుకున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. నాడు వైఎస్సార్ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గానికి శంకుస్థాపన చేస్తే.. ఇప్పుడు సీఎం రేవంత్ ఆ ప్రాజెక్టు పూర్తికి నిధులు ఇస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కాళేశ్వరం పేర కూలేశ్వరం ప్రాజెక్టు కట్టారని.. నల్లగొండ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసినందుకే జిల్లా ప్రజలు బీఆర్ఎస్ను పాతాళానికి తొక్కారని వ్యాఖ్యానించారు. -
నల్గొండ ప్రజలకు అనుమానం వస్తే బండకేసి కొడతారు..
-
ఉదయ సముద్రం ప్రాజెక్టు ప్రారంభోత్సవం
-
ఐదుగురి ప్రాణాలు తీసిన.. నైట్ అవుట్ సరదా
-
పోలీసు వాహనాలను ఢీకొట్టి.. అంబులెన్స్ తో పరార్
-
నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన
-
నేడు నల్లగొండ జిల్లాలో సీఎం పర్యటన
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు శంకుస్థా పన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలలో దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేసిన ఉదయసముద్రం ఎత్తిపోతల పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. లక్ష ఎకరాలకు సాగునీరందించే ఈ ప్రాజెక్టులో భాగంగా అప్రోచ్ కెనాల్, టన్నెల్, సర్జ్‌పూల్, పంప్‌హౌస్, మోటార్ల ట్రయల్ రన్, రిజర్వాయర్ నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో రిజర్వాయర్‌లోకి నీటి ఎత్తిపోతకు సంబంధించిన పైలాన్‌ను రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. నల్లగొండ నియోజక వర్గంలో చేపట్టబోయే మరో మూడు ఎత్తిపోతల పథకాలకు అక్కడే సీఎం శంకుస్థాపన చేస్తారు. అనంతరం దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మించిన 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామ ర్థ్యం గల యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లో పూర్తయిన యూనిట్ –2ను ప్రారంభి స్తారు. సాయంత్రం నల్లగొండ పట్టణం ఎస్ఎల్ బీసీలో మెడికల్ కాలేజీ భవనాన్ని ప్రారంభిస్తారు. అదే విధంగా నర్సింగ్ కాలేజీ, లైబ్రరీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు పట్టణంలో చేపట్టబో యే పలు అభివృద్ధి పనులకు సీఎం అక్కడే శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఎస్ఎల్బీసీ గ్రౌండ్లో నిర్వహించే బహి రంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులుముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో చేపట్టిన ఏర్పా ట్లను శుక్రవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్ పరిశీలించి, అధికా రులతో సమీక్షించారు. దామరచర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటును ఉత్తమ్, తుమ్మల, పొన్నం సందర్శించారు. నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంల వద్ద ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్న పైలాన్ ను, రిజర్వాయర్‌ను మంత్రులు ఉత్తమ్, కోమటి రెడ్డి, పొన్నం పరిశీలించారు. నల్లగొండలోని మెడిక ల్ కళాశాలను, సభా ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలు పార్టీలకతీతంగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని వారు కోరారు. -
నల్లగొండ జిల్లా పెదఅడిశర్లపల్లి మోడల్ స్కూల్ లో ఫుడ్ పాయిజన్
-
తెలంగాణలో మళ్లీ ఫుడ్ పాయిజన్.. బాలికలకు అస్వస్థత
సాక్షి, పెద్దఅడిశర్లపల్లి: తెలంగాణలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా అధికారుల్లో మార్పు కనిపించడం లేదు. తాజాగా నల్లగొండ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కారణంగా మోడల్ స్కూల్ హాస్టల్లో బాలికలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి ఐదుగురు బాలికలు ఆసుపత్రిలో చేరగా.. ఈరోజు మరో ఇద్దరు కడుపు నొప్పితో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో, బాలికల సంఖ్య ఏడుకు చేరుకుంది. వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలోని దుగ్యాల మోడల్ స్కూల్ బాలికల వసతి గృహంలో విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగా వాంతులు, తీవ్రమైన కడపు నొప్పి రావడంతో వారికి వెంటనే దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం రాత్రి పరామర్శిచారు. ఈ ఘటనకు సంబంధించిన విషయాలపై ఆరా తీశారు. విద్యార్థినలకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడతూ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరగలేదని.. రెండు మూడు రోజులుగా విద్యార్థులు సరిగా ఆహారం తీసుకోకపోడంతో నీరసంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. అయితే, బాలికలు మాత్రం.. తాము తిన్న ఆహారం కారణంగానే అస్వస్థతకు గురైనట్టు చెబుతున్నారు.దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో అస్వస్థతకు గురైన విద్యార్థినులు తాజాగా సాక్షి టీవీతో మాట్లాడుతూ..‘మూడు రోజుల నుంచి భోజనం సరిగా ఉండటం లేదు. ఎస్వోకి చెప్పినా పట్టించుకోవడం లేదు. అన్నం సరిగా ఉడకడం లేదు. సగం ఉడికించిన అన్నం పెట్టడంతో అదే తినాల్సి వస్తోంది. మూడు రోజుల నుంచి కడుపునొప్పి వస్తోంది. మాకు పెట్టే భోజనంలో నాణ్యత ఉండటం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. విద్యార్థినిలు అస్వస్థతకు గురికావడంతో దేవరకొండ ప్రభుత్వాసుపత్రి ఎదుట పలు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులకు సరైన ఆహారం అందించాలని డిమాండ్ చేశారు. -
అప్పు డబ్బులు తిరిగి అడిగినందుకు గొంతు కోసి చంపేశాడు
లింగోజిగూడ: అప్పు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇమ్మన్నందుకు వ్యక్తి గొంతు కోసి హత్య చేసిన ఘటన హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం దోనకొండకు చెందిన యక్కలి కాశీరావు (37), భార్య సుమలత, ఇద్దరు పిల్లలతో కలిసి హయత్‌నగర్ భాగ్యలత అరుణోదయ నగర్లో రెండున్నరేళ్లుగా ఉంటున్నాడు. కాశీరావు స్థానికంగా కార్ల క్రయ విక్రయాలు చేస్తుంటాడు. కాశీరావు కిరాయికి ఉంటున్న ఇంట్లోని మొదటి అంతస్తులోనే నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల కేంద్రానికి చెందిన బ్యాచ్లర్లు పెద్దగాని శేఖర్, పెద్దగాని సాయి, ఐతరాజు శంకర్లు అద్దెకి ఉంటున్నారు. వీరిలో సాయి, శంకర్ హయత్‌నగర్‌లోని బొమ్మలగుడి సమీపంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కాశీరావు, పెద్దగాని శేఖర్ ఇద్దరూ కలిసి కార్ల వ్యాపారం ప్రారంభించారు. 2023లో రూ.1.5 లక్షలు ఒకసారి, రూ. 3.60 లక్షలు మరోసారి కాశీరావు వద్ద శేఖర్ అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పు డబ్బులు ఇవ్వాలని శేఖర్ గదికి వెళ్లి కాశీరావు అడుగుతుండేవాడు. ఈ విషయమై వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో సాయి, శంకర్ వ్యక్తిగత పనిపై గదిలోంచి బయటకు వెళ్లారు. 10 గంటల సమయంలో కాశీరావు.. పైఅంతస్తులో ఉన్న శేఖర్ గదికి వెళ్లాడు. 20 నిమిషాలు గడుస్తున్నా కాశీరావు కిందకు రాలేదు. 10.20 గంటల సమయంలో శేఖర్ రక్తపు మరకలతో కిందకు దిగి వచ్చాడు. అక్కడే దుస్తులు ఆరేస్తున్న కాశీరావు భార్య సుమలతతో.. ‘నీ భర్తను చంపేశాను’ అంటూ వెళ్లిపోయాడు. సుమలత వెంటనే పైఅంతస్తులోని గదికి వెళ్లి చూడగా.. మెడ భాగంలో బలమైన గాయాలతో కాశీరావు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. భర్తను పైకి లేపాలని సుమలత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అతడు అప్పటికే మృతి చెందినట్లు గ్రహించిన సుమలత స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించింది. అప్పు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడుగుతున్నాడనే కోపంతోనే గొడపడిన శేఖర్.. కాశీరావును గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సుమలత ఫిర్యాదు మేర కు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు శేఖర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
నల్గొండ జిల్లాలో మోడల్ స్కూల్లో ఫుడ్‌పాయిజన్
-
నల్గొండ జిల్లా కేంద్రంగా సైబర్ మోసాలు
-
బీఆర్ఎస్ నేత అరెస్ట్.. కారణం ఇదే!
సాక్షి, నల్లగొండ: సైబర్ మోసం కేసులో మిర్యాలగూడకు చెందిన బీఆర్ఎస్ నేత అన్నభిమోజు నాగార్జున చారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై కేంద్రంగా సాగుతున్న సైబర్ మోసాలతో నాగార్జునకు లింకులు ఉన్నట్టు గుర్తించారు. ఈ మోసాలకు దుబాయ్ నుంచి లింకులు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.వివరాల ప్రకారం.. ముంబై కేంద్రంగా సాగుతున్న సైబర్ మోసాలతో మిర్యాలగూడకు చెందిన నాగార్జున చారికి లింకు ఉన్నందన కారణంగానే ఆయనతో పాటు నాగేంద్రచారిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మిర్యాలగూడకు చెందిన కొందరి బ్యాంక్ అకౌంట్ల నుంచి లక్షల్లో నగదు బదిలీ అయినట్టు పోలీసులు గుర్తించారు. లావాదేవీలు జరిగిన బ్యాంకు ఖాతాదారులను అదుపులోకి తీసుకుని విచారించగా నాగార్జున చారి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.అమాయకుల పేర్లపై బ్యాంకు అకౌంట్లు తెరిపించిన నాగార్జున చారి. వారి ఖాతాల ద్వారా నగదు బదిలీ చేయించి కమీషన్లు ఇస్తూ అందులో తాను వాటా తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈ సైబర్ మోసానికి దుబాయ్ తో సైతం లింకులు ఉన్నాయని సమాచారం. ఈ వ్యవహారంపై మూడు రోజులుగా సీసీఎస్ పోలీసుల విచారణ కొనసాగుతోంది. భారీగా నగదు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు. -
నల్లగొండ జిల్లా కేతేపల్లిలో రోడ్డు ప్రమాదం
-
పట్టణాల్లో ఐటీ వెలవెల!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి పట్టణాలు, నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐటీ హబ్‌లు వెలవెలబోతున్నాయి. లక్ష చదరపు అడుగుల నుంచి 1.75 లక్షల చదరపు అడుగుల్లో రూ. 50 కోట్ల నుంచి రూ. 90 కోట్ల వ్యయంతో నిర్మించిన భవనాలన్నీ కంపెనీలు పెద్దగా రాకపోవడంతో ఎక్కువ శాతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అట్టహాసంగా వాటిని ఏర్పాటు చేశారు. కానీ ఆ తరువాత సరైన నిర్వహణ లేదు. గతేడాది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఐటీ హబ్‌లపై దృష్టిపెట్టకపోవడంతో మొదట్లో కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీల్లో చాలా వరకు వివిధ కారణాలతో వెనక్కి వెళ్లిపోతున్నాయి.సంప్రదింపులు జరిపే వారేరీ? తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్్క) నేతృత్వంలో 2019 నుంచి ఒక్కో పట్టణంలో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేసినా కంపెనీలతో సంప్రదింపులు జరిపే వారు లేక ప్రధాన కంపెనీలేవీ ముందుకు రావడం లేదు. నల్లగొండ, మహబూబ్‌నగర్, సిద్దిపేట, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, సూర్యాపేట పట్టణాల్లోని ఐటీ హబ్‌లకు చిన్నాచితక కంపెనీలు వచ్చినా యువతకు పెద్ద ఎత్తున వేతనాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో వాటిల్లో చేరే వారు కరువయ్యారు.ఇక హనుమకొండలోని మడికొండలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్‌లో దిగ్గజ ఐటీ సంస్థ టెక్ మహీంద్ర ఒక బ్రాంచీని ఏర్పాటు చేసినా ఆ తర్వాత అనివార్య కారణాలతో దాన్ని మూసేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొదట్లో కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీల్లో చాలా వరకు వెనక్కి వెళ్లిపోవడంతో ఐటీ హబ్‌లు అలంకారప్రాయంగా మారుతున్నాయి. ఫలితంగా జిల్లా కేంద్రాల్లో నివసించే యువతకు స్థానికంగానే ఐటీ కొలువులు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది.అడ్డగోలుగా అద్దెలు.. ప్రభుత్వ స్థలాల్లో, ప్రభుత్వ నిధులతో ఐటీ హబ్‌ల నిర్మాణం జరిగింది. వాటి నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించడంతో వారు ఇష్టానుసారంగా భవనాల అద్దెలను నిర్ణయిస్తున్నారు. దీంతో వాటిలో కార్యాలయాల ఏర్పాటుకు కంపెనీలు ముందుకు రావడం లేదు. నల్లగొండ తదితర పట్టణాల్లో నిర్మించిన ఐటీ హబ్‌లలో ఒక చదరవు అడుగుకు (ఎస్ఎఫ్టీ) అద్దె రూ. 1,400కుపైగా నిర్ణయించడంతో అప్పట్లో పలు కంపెనీలు ముందుకు రాలేదన్న విమర్శలు ఉన్నాయి. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లోనే ఎస్ఎఫ్టీకి రూ.2 వేలు మొదలు 7 వేల వరకు ఉండగా జిల్లాల్లోని ఐటీ హబ్‌లలో అంతమొత్తం వెచి్చంచేందుకు కంపెనీలు ముందుకురావట్లేదు. స్కిల్ సెంటర్లన్నా ఏర్పాటు చేయాలి.. ఐటీ హబ్ భవనాల్లో ఇప్పటివరకు సగం అంతస్తుల్లోనూ కంపెనీలు ఏర్పాటు కాలేదు. ఈ నేపథ్యంలో వాటిని సది్వనియోగపరచుకునేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం రూ. కోట్లు వెచి్చంచి స్కిల్ సెంటర్ల నిర్మాణానికి చర్యలు చేపడుతుండటంతో ఐటీ టవర్లను స్వాధీనం చేసుకొని స్కిల్ సెంటర్లకు వినియోగించుకోవాలని ప్రజాప్రతినిధులు సూచిస్తున్నారు.పేరొందిన కంపెనీలు రావాలియువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే పేరొందిన ఐటీ కంపెనీలను పట్టణాలకు తీసుకురావాలి. ప్రభుత్వం అందుకు కృషి చేయాలి. – దుర్గాప్రసాద్, కట్టంగూరు -
వీల్‌ఛైర్‌తో విల్ పవర్‌కి అసలైన అర్థం ఇచ్చాడు!
‘శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది’ అనే మాటకు ఈ యువకుడే నిదర్శనం. నల్లగొండ జిల్లా చందంపేట మండలం ధర్మతండాకు చెందిన రమావత్ కోటేశ్వర్ నాయక్ చిన్నప్పుడే పోలియో బారిన పడ్డాడు. ఒక కాలు సహకరించకపోయినా తాను కల కన్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. చదువుకునే రోజుల్లోనే ఆటలపై ఆసక్తి పెంచుకున్న కోటేశ్వర్ వీల్ ఛైర్ హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, క్రికెట్లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ నేటి యువతలో క్రీడా స్పూర్తిని నింపుతున్నాడు...నేరేడుగొమ్ములోని గిరిజన హాస్టల్లో ఉండి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు, దేవరకొండలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఆ తరువాత హైదరాబాద్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేశాడు. ఉస్మానియా యూనివర్సీటీలో పీజీ చేస్తున్న సమయంలో వీల్‌ఛైర్ స్పోర్ట్స్‌లో కోటేశ్వర్ నాయక్ ప్రతిభను కోచ్ గ్యావిన్స్ సోహెల్ ఖాన్ గుర్తించాడు. వీల్‌ఛైర్ హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్‌లో శిక్షణ ఇచ్చాడు. గురువు ఇచ్చిన శిక్షణతో తనలోని ప్రతిభకు మెరుగులు దిద్దుకున్న కోటేశ్వర్ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు.మెరుగైన ప్రదర్శనతో 2019లో తొలిసారి భారత జట్టుకు ఎంపికైన కోటేశ్వర్ పట్టాయ (థాయ్‌లాండ్)లో జరిగిన ఆసియా ఓషియానియా చాంపియన్ షిప్లో మన దేశం తరుపున బరిలో దిగాడు. 2022లో నోయిడాలో వీల్ ఛైర్ బాస్కెట్ బాల్ వరల్డ్ ఛాంపియన్ షిప్లో సిల్వర్ మెడల్ సాధించాడు. 2022లో పోర్చుగల్ జరిగిన వీల్ ఛైర్ హాండ్‌బాల్ యూరోపియన్ అండ్ వరల్డ్ ఛాంపియన్ షిప్లో మన దేశం తరపున ప్రాతినిధ్యం వహించాడు. అందులో ఒక మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ టైటిల్ సొంతం చేసుకున్నాడు. 2023లో ఏసియా కప్ పోటీలు నేపాల్‌లోని ఖాట్మాండులో జరిగాయి. అందులో బెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు.చదవండి: సెలబ్రిటీలు మెచ్చిన స్టార్గ్వాలియర్లో ఈనెల 9 నుంచి 15 వరకు జరిగిన వీల్ ఛైర్ బాస్కెట్ బాల్ నాలుగో నేషనల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో కెప్టెన్ గా కోటేశ్వర్ నేతృత్వంలోని టీమ్ సెమీ ఫైనల్ వరకు వెళ్లింది. ఇటీవల చెన్నైలో జరిగిన సౌత్‌జోన్ వీల్‌ఛైర్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో కోటేశ్వర్ కెప్టెన్సీలో జట్టు సిల్వర్ మెడల్ సాధించింది.ఒలింపిక్స్ నా లక్ష్యంఒలింపిక్స్లో మన దేశం తరపున ఆడి పతకం సాధించాలన్నదే నా లక్ష్యం. ఇందుకు నిరంతర సాధన, కఠోర శ్రమ అవసరం. దీనికి తోడు పోటీలో రాణించాలంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన వీల్‌ఛైర్ అవసరం తప్పనిసరి. దీనికి ఏడు నుంచి ఎనిమిది లక్షలు అవుతుంది. ఇందుకు ప్రభుత్వం సహకరించాలి. – కోటేశ్వర్ నాయక్ – చింతకింది గణేష్, సాక్షి, నల్లగొండ -
కన్ను పడితే కబ్జా.. నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ భూములు మాయం
నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు మాయమవుతున్నాయి. ప్రధానంగా మిర్యాలగూడ డివిజన్లోని రెండు మండలాల్లో వేల ఎకరాల అటవీ భూములను కాజేశారు. ప్రభుత్వ స్థలాలు, శిఖం, సీలింగ్ భూములను కూడా వదలడం లేదు. స్వాతంత్య్ర సమరయోధుల పేరుతో కొందరు ప్రభుత్వ భూములను కాజేయగా.. మరికొందరు అక్రమంగా ధరణిలో పేర్లు నమోదు చేయించి.. సీలింగ్ భూములను సైతం కాజేశారు. భూములు అన్యాక్రాంతమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.– సాక్షి ప్రతినిధి, నల్లగొండరాజకీయ పలుకుబడితో కబ్జాలు కృష్ణపట్టె పరిధిలోకి వచ్చే మిర్యాలగూడ డివిజన్లోని దామరచర్ల, మిర్యాలగూడ, అడవిదేవుల పల్లి మండలాల్లో కబ్జాల పర్వం జోరుగా సాగుతోంది. రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని కొందరు ఈ దందాకు దిగారు. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఈ కబ్జాల పర్వం కొనసాగగా, ఇ ప్పటికీ కబ్జాలు ఆగడం లేదు. కఠినంగా వ్యవహరించాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంతో కబ్జాలు కొనసాగుతూనే ఉన్నాయి. 5వేల హెక్టార్లకు పైగా అడవి మాయంఒక్క దామరచర్ల మండలంలోనే దాదాపు 9వేల హెక్టార్ల అటవీ భూమి ఉండగా.. అందులో దాదాపు 5వేల హెక్టార్లకు పైగా అటవీ భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులే చెబుతున్నారు. అదే మండలంలోని వజీరాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ పరిధిలో 855.69 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ భూమి ఉండగా, అందులోనూ కబ్జాలు జరిగాయి. రాజగట్టు బ్లాక్ పరి«ధిలో 309.91 హెక్టార్ల భూమి ఉండగా, దానిని నాగార్జునసాగర్ రిజర్వాయర్ ముంపు బాధి తులకు పునరావాసం కింద కేటాయించారు.ఫార్మ్– డి పట్టాలు జారీ చేశారు. సాగునీటి సదుపాయం లేకపోవడంతో బాధితులు సాగు చేయకపోవడంతో అధికారులతో కుమ్మక్కైన కొందరు దొంగ పట్టాలు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు తెలిసింది. వీర్లపాలెం బ్లాక్ పరిధిలో 2,389.72 హెక్టార్ల అటవీ భూమిలో దాదాపు 500 హెక్టార్ల భూమిని రాజకీయ పలుకు బడితో కొందరు ఆక్రమించుకున్నారు. దిలావర్పూర్ బ్లాక్ పరిధిలో 1,679.42 హెక్టార్ల అటవీ భూమి ఉండగా 200 హెక్టార్ల భూమి ఆక్రమణకు గురైనట్లు అటవీ శాఖ యంత్రాంగం గుర్తించింది. మొల్కచర్ల బ్లాక్ పరిధిలో 2726.26 హెక్టార్ల భూమి ఉండగా 724.10 హెక్టార్ల భూమిని సాగర్ ముంపు బాధితులకు కేటాయించారు. ఆ భూములను కూడా కొందరు రాజకీయ నాయకుల అండదండలతో ఆక్రమించుకొని ఎలాంటి అనుమతులు లేకుండానే రోడ్లు కూడా వేసుకున్నట్లు తెలిసింది. కేజేఆర్ కాలనీ పరిధిలో దాదాపు వంద ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. 4542 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాదామరచర్ల మండలంలోనే 4542 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. వాటిలో తప్పుడు పట్టాలను సృష్టించారు. స్వాతంత్య్ర సమరయోధుల పేరుతో ఈభూములను కబ్జా చేయడం గమనార్హం. చట్ట విరుద్ధంగా ఇచ్చిన పట్టాలపై 2010లోనే ఆర్డీవో విచారణ జరిపి దొంగ పట్టాలను రద్దు చేశారు. అవి రద్దయి 15 ఏళ్లు కావస్తున్నా.. నేటికీ భూములు కబ్జాదారుల అధీనంలోనే ఉన్నాయి. దామరచర్ల పీఏసీఎస్‌లో 12 మంది 18 నకిలీ పట్టాలను సృష్టించి రూ.కోట్లు రుణంగా పొందారు. ఉల్సాయిపాలెం పరిధిలోని 145 సర్వే నంబర్లోని వందల ఎకరాల ప్రభుత్వ భూమిలో అధికారులు అక్రమంగా పట్టాలు జారీ చేశారు.మిర్యాలగూడలోనూ భారీగా కబ్జాలుమిర్యాలగూడ మండలం రుద్రారం గ్రామ రుద్రప్ప చెరువు 310 ఎకరాల్లో ఉండగా, అందులో 140 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. తాళ్లగడ్డ ఇందిరమ్మ కాలనీ వద్ద 66, 67 సర్వే నంబర్లలో 3.22 ఎకరాల భూమిని గత ప్రభుత్వ హయాంలో అప్పటి అధికార పార్టీ నాయకులు ప్లాట్లుగా చేసి విక్రయించారు. ప్రస్తుతం ఆ భూమి కబ్జాపై విచారణ కొనసాగుతోంది. పట్టణ శివారు లోని చింతపల్లి, హైదలాపురంలో సర్వే నంబరు 5లో స్వాతంత్య్ర సమరయోధుల పేరిట సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేశారు.నార్కట్‌పల్లి – అద్దంకి రహదారిపై 626 సర్వే నంబరులో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఒక ప్రజాప్రతినిధి ఆక్రమించినట్లు ఆరోపణలున్నాయి. పట్టణం నడి బొడ్డులోని పాత బస్టాండ్ ఎదురుగా రూ.కోట్ల విలువైన దేవాదాయ శాఖ భూమిని నకిలీ దత్తత పత్రాలు సృష్టించి కాజేసినట్లు ఆరోపణలున్నాయి. పట్టణంలోని బస్టాండ్ పక్కనే 4 గుంటల ప్రభుత్వ భూమిని బడా వ్యాపారి ఆక్రమించుకున్నట్లు ఆరోప ణలున్నాయి. అడవిదేవులపల్లి మండలంలో 900.04 హెక్టార్ల భూమి ఉండగా అందులో దాదాపు 600 హెక్టార్లు కబ్జాకు గురైనట్లు అధికారులు భావిస్తున్నా రు. రాజకీయ నాయకులు, కొందరు ప్రజాప్రతి నిధుల అండదండలతో కొందరు ఆ భూముల్లో వరి, బత్తాయి తోటలు సాగు చేస్తున్నారు.తాత్కాలిక చర్యలతో ఆగని కబ్జాలు..దామరచర్ల మండలంలోని యాదాద్రి పవర్‌ప్లాంట్‌కు సమీపంలో తాళ్లవీరప్పగూడెం వద్ద 66వ సర్వే నంబరులో 15.08 ఎకరాలు, 67వ సర్వే నంబరులో 8.29 ఎకరాల భూమి జాబిశెట్టి శేషమ్మ పేరుతో ఉండగా 1997లో సీలింగ్ యాక్టు ప్రకారం పట్టాదారు నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే ధరణిలో కొందరు ఆ భూములపై పట్టాలు పొందారు. అంబటి రామాంజనేయులు 6 ఎకరాలు, వింజం ముసలయ్య 5.29 ఎకరాలు, సాధినేని శ్రీనివాస్‌రావు 2.25 ఎకరాలు, రాయికింది దివ్య 3 ఎకరాలు, నాలావత్ కమిలి 3 ఎకరాలు, ఇండియా సిమెంట్స్ 1 ఎకరం పట్టా పొందారు. ఈ పట్టాలను రద్దు చేసి, ఇటీవల భూములను స్వాధీనం చేసుకుంటున్నట్లు రెవెన్యూ అధికారులు ప్రకటించారు. మిర్యాలగూడ పట్టణ శివారు పందిళ్లపల్లి చెరువు 480 ఎకరాల్లో ఉంది. ఆ భూములను కబ్జా చేసేందుకు కొందరు కంచె నిర్మించగా అధికారులు దానిని తొలగించారు. అప్పుడప్పుడు అధికారులు చర్యలు చేపడుతున్నా కబ్జాలు మాత్రం ఆగడం లేదు. -
నల్గొండ జిల్లాలో విషాదం..
-
‘బిర్యానీలో ఈగ’ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్!
సాక్షి, నల్గొండ జిల్లా: చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులో విలేజ్ ఆర్గానిక్ హోటల్ బిర్యానీలో ఈగ వ్యవహారంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఫుల్లుగా తిని బిల్లు ఎగ్గొట్టేందుకు బిర్యానీలో ఈగ అంటూ నలుగురు బ్యాచ్ నాటకం ఆడారు. తినడం పూర్తయ్యాక పథకం ప్రకారం వెంట తీసుకెళ్లిన నూనెలో ఫ్రై చేసిన ఈగను బిర్యానీలో పెట్టారు. ఆ తర్వాత బిర్యానీలో ఈగ అంటూ నాటకానికి తెరలేపారు. ఫుడ్ సెక్యూరిటీ అధికారులకు ఫోన్ చేసి నానా హంగామా సృష్టించారు. వాట్సాప్ గ్రూపులో వీడియోను ఆ బ్యాచ్ షేర్ చేసింది.హోటల్ పై విమర్శలు రావడంతో సిబ్బంది... సీసీ ఫుటేజ్ పరిశీలించారు. ఈగను బయటకు తీసి బిర్యానీ వేసి కలుపుతున్నట్లు ఫుటేజీలో స్పష్టమైంది. గతంలోనూ పలు హోటల్స్ లో ఇదే రకంగా నాటకాలు ఆడినట్లు బ్యాచ్‌పై ఆరోపణలు ఉన్నాయి. సూర్యాపేట సమీపంలో ఓ ప్రముఖ హోటల్లోనూ ఇదేవిధంగా బిల్లు ఎగ్గొట్టినట్లు సమాచారం.ఇదీ చదవండి: ‘వారి పేర్లు డైరీలో రాసి పెట్టుకుంటున్నాం’