ఇంగ్లిష్ టీచర్ లేకపోవడంతో తానే స్వయంగా ఆంగ్లం బోధిస్తున్న తహసీల్దారు
చందంపేట: తహసీల్దార్ ఉద్యోగం అంటేనే ఊపిరిసలపనివ్వని విధి నిర్వహణతో ముడిపడి ఉంటుంది. అలాంటిది.. ఆ హోదాలో విధులు నిర్వహిస్తూనే.. పిల్లలకు ఆంగ్ల పాఠాలు బోధిస్తున్నారొక అధికారి. ఆయనే నల్లగొండ జిల్లా చందంపేట తహసీల్దార్ శ్రీనివాస్. ఆయన ఇటీవల మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను సందర్శించినప్పుడు విద్యార్థులతో ముచ్చటించారు. తమకు ఆంగ్ల ఉపాధ్యాయుడు లేక పాఠాలు చెప్పేవారే లేరని విద్యార్థినులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
తహసీల్దార్ శ్రీనివాస్ అప్పటికప్పుడే.. విద్యార్థినులకు కొద్దిసేపు ఆంగ్ల పాఠాలు బోధించారు. వారంలో ఒకరోజు సమయం కేటాయించి విద్యార్థులకు బోధిస్తున్నా రు. గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేసిన శ్రీనివాస్.. ఆ తర్వాత నాగర్‌కర్నూల్ జిల్లాలో ఏవోగా ఉద్యోగం చేస్తూ పదోన్నతిపై చందంపేట తహసీల్దార్‌గా వచ్చారు. ఒకప్పటి ఉపాధ్యాయ వృత్తి మిగిల్చిన అనుభవంతో.. చందంపేట కస్తూర్బా పాఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థులకు ఆంగ్ల పాఠాలు బోధిస్తున్నారు. శనివారం 10వ తరగతి విద్యార్థులకు పాఠాలు చెబుతూ కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment