Teaching
-
గ్రూపు రాజకీయాల ధాటికి.. విద్యార్థుల భవిష్యత్తు గాలికి!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు ట్రిపుల్ ఐటీ అక్రమాలకు అడ్డాగా మారింది. టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల అండదండలతో ఇందులోని అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఇక్కడ నిబంధనలకు వ్యతిరేకంగా కొందరు గెస్ట్ ఫ్యాకల్టీలు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కొట్టేశారు. ఇప్పుడు వీరు విద్యార్థుల భవిష్యత్తును గాలికొదిలేసి గ్రూపు రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. అడ్డదారుల్లో 40 మందికి పదోన్నతులు.. ట్రిపుల్ ఐటీలో 2017లో టీచింగ్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ విడుదలైంది. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా, రికమండేషన్ ద్వారా 40 మంది గెస్ట్ ఫ్యాకల్టీలుగా రిక్రూట్ అయ్యారు. ఏడాది తిరగకుండానే వీరిలో నలుగురికి మినహా మిగిలిన వారందరికీ 2018లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు వచ్చేశాయి. అధికారిక ఉత్తర్వులు, గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదంలేకుండానే వీరి డిజిగ్నేషన్ మార్చేశారు. గెస్ట్ ఫ్యాకల్టీల్లో ఒకరు అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ హోదాలో పదోన్నతులకు బరితెగించినట్లు ఆరోపణలున్నాయి.ఆనాడు అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదా పొందిన వారంతా ప్రస్తుతం ఏవోగా, ఫైనాన్షియల్ ఆఫీసర్ (ఎఫ్ఓ)గా, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్‌గా, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్‌గా ప్రత్యేక హోదాలను అనుభవిస్తున్నారు. ఆ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌కు స్నేహితుడైన ఓ వ్యక్తిని అడ్డదారుల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా తీసుకొచ్చి అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను చేసి స్టోర్స్ పర్చేజ్ ఇన్చార్జిగా కూడా అదనపు బాధ్యతలప్పగించారు. అండగా నిలిచిన జగన్ సర్కారు.. ట్రిపుల్ ఐటీలో 2018లో కాంట్రాక్టు టీచింగ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈసారి మాత్రం నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియ నడిపారు. ఇందులో సెలెక్ట్ అయిన వారిని తొలగించాలన్న కుట్రతో ఎల్లో గ్యాంగ్ 2019లో వీరిని సాగనంపి మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు రావాలని చెప్పినట్లు సమాచారం. అప్పుడే అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం వీరిని కొనసాగించడంతో ఎల్లో గ్యాంగ్ పప్పులు ఉడకలేదు.అయినప్పటికీ ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారమిచ్చి కోవిడ్ సమయంలో వీరిని నిలిపివేశారు. విషయం తెలుసుకున్న నాటి సీఎం వైఎస్ జగన్ వారికి న్యాయం చేసి ఉద్యోగాల్లో కొనసాగించారు. ట్రిపుల్ ఐటీలోని కాంట్రాక్టు ఉద్యోగులందరికీ జీతాలు పెంచుతూ జీవో ఇవ్వగా దాన్ని కూడా ఎల్లో గ్యాంగ్ దురి్వనియోగం చేసింది. 2017లో ఎంపికై గెస్ట్ ఫ్యాకల్టీలుగానే మిగిలిపోయిన నలుగురికి.. 2018లో నిబంధనల ప్రకారం ఎంపికైన కాంట్రాక్టు ఫ్యాకల్టీలకు జీతాలు పెంచకుండా కుట్రలు చేసినట్లు ఆరోపణలున్నాయి. నేడు కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నాఒంగోలు ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న అక్రమాలతో అన్యాయానికి గురైన కాంట్రాక్టు ఉద్యోగులు సోమవారం నూజీవీడు ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నారు. మరోవైపు.. ట్రిపుల్ ఐటీ కాలేజీలో తిష్టవేసిన ఎల్లో గ్యాంగ్ ఆగడాలను అరికట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ మంత్రి అండదండలతో వీరు రెచ్చిపోతున్నారన్న ఆరోపణలున్నాయి. విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా రాజకీయాలకు పాల్పడుతున్నారన్న విమర్శలూ ఉన్నాయి. డిజిగ్నేషన్ మార్పు నేరుగా చేయకూడదు.. ఇది ఎప్పట్నుంచో ఉన్న సమస్య. సాంకేతిక కారణాలవల్ల దీనిపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. గత నెల 28న గవరి్నంగ్ కౌన్సిలింగ్ సభ్యుల సమావేశం జరిగింది. గెస్ట్ ఫ్యాకల్టీలకు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా డిజిగ్నేషన్ మార్పు నేరుగా చేయకూడదని, ఇంటర్నల్ కమిటీ వేసిన తర్వాతే చేయాలన్న సూచనలున్నాయి. అయితే, 110 జీఓ ద్వారా 2018 ఫ్యాకల్టీల సమస్యలు పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నందున ధర్నా జరగకపోవచ్చు. – డాక్టర్ భాస్కర్ పటేల్, డైరెక్టర్, ట్రిపుల్ ఐటీ, ఒంగోలు -
వేతన పెరుగుదలలో టీచింగ్ లీడర్లదే హవా!
వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో కంపెనీలకు నాయకత్వ వాహిస్తున్న వారికి మెరుగైన వేతనాలున్నాయని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ కంపెనీలను విజయపథంలో నడిపించడంలో సమర్థవంతమైన నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందనేది రహస్యమేమీ కాదు. అయితే స్టార్టప్ లీడర్లు, ముఖ్యంగా టీచింగ్ రోల్స్‌లో ఉన్నవారు వేతనాల విషయంలో 80 శాతం ముందంజలో ఉన్నారని నిపుణులు చెబుతున్నారు.బోధించే నాయకుల ప్రాముఖ్యతస్టార్టప్ల్లో టీచింగ్ లీడర్లు అంటే సంస్థల్లో మెంటార్షిప్, ఎడ్యుకేషనల్ బాధ్యతలను చేపట్టేవారు. ఈ వ్యక్తులు తమ బృందాలకు నాయకత్వం వహించడమే కాకుండా సహోద్యోగుల నైపుణ్యాలు, జ్ఞానాన్ని పెంపొందించడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అలా చేయడం ద్వారా నిరంతర అభ్యాసం, నూతన ఆవిష్కరణలకు దోహదపడుతుంది. స్టార్టప్‌ల సుస్థిరతకు ఇది ఎంతో అవసరం అవుతుంది.ఇదీ చదవండి: ఇంటి ఓనర్ మహిళ అయితే ఎన్ని ప్రయోజనాలో..ఫైనాన్షియల్ రివార్డులుస్టార్టప్ల్లో టీచింగ్ లీడర్లకు ఇచ్చే ఆర్థిక రివార్డులు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరుగుతున్నాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం బోధనా బాధ్యతలను చేపట్టే నాయకులు, అటువంటి కార్యకలాపాల్లో పాల్గొనని ఒకే స్థాయి తోటి ఉద్యోగులతో పోలిస్తే వేతన ప్యాకేజీలపరంగా 80 శాతం ముందుంజలో ఉంటున్నారు. ఈ వేతన పెంపునకు కొన్ని కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.సంస్థ విలువను పెంచడం: టీచింగ్ లీడర్లను సంస్థకు సంబంధించిన అమూల్యమైన ఆస్తులుగా పరిగణిస్తారు. ఎందుకంటే వారు టీమ్ మొత్తం అభివృద్ధికి దోహదం చేస్తారు. ఇతర ఉద్యోగుల్లో నైపుణ్యాలు పెంచి స్టార్టప్ పనితీరును ప్రభావితం చేస్తారు.ప్రతిభను నిలుపుకోవడం: బలమైన టీచింగ్ లీడర్లు ఉన్న స్టార్టప్‌లు టాప్ టాలెంట్‌ను ఆకర్షించడానికి, దాన్ని నిలుపుకోవడానికి మొగ్గు చూపుతాయి. ఉద్యోగులు కంపెనీ ఎదిగేందుకు సహకరిస్తూ, టర్నోవర్ వ్యయాలను తగ్గించే అవకాశం ఉంటుంది.మెరుగైన నాయకత్వ నైపుణ్యాలు: టీచింగ్ లీడర్లు సహజంగానే అధునాతన నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించుకుంటారు. ఇతరులకు మార్గనిర్దేశం చేయడం ద్వారా వారు తమ కమ్యూనికేషన్, సమస్యా పరిష్కార సామర్థ్యాలను మెరుగుపరుస్తారు. -
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆధారిత బోధన. వచ్చే ఏడాది నుంచి 5 వేల స్కూళ్లలో షురూ!
-
ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ ఆధారిత బోధన
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో సరికొత్త తరహాలో బోధనకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో వర్చువల్ రియాలిటీ విధానంలో పాఠాలు చెప్పేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఎక్‌స్టెప్ ఫౌండేషన్ సహకారం తీసుకోనుంది. ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఫౌండేషన్‌కు వెళ్లి అక్కడ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. ఏ తరహా మౌలిక వసతులు, ఏఐ ఆధారిత టూల్స్ కావాలో తెలుసుకున్నారు. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలో కొన్ని స్కూళ్ళను ఎంపిక చేసి..వచ్చే విద్యా సంంవత్సరం నుంచే దీనిని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రూపొందించిన ఓ నివేదికను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి త్వరలో ప్రభుత్వానికి సమరి్పంచనున్నారు. సరి చేసుకునే వరకు సూచనలు! రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ స్కూళ్ళున్నాయి. ఇందులో తొలి విడతగా 5 వేల స్కూళ్ళను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే కంప్యూటర్లు, ఇంటర్నెట్ అనుసంధానం ఉన్న స్కూళ్ళ జాబితాను పరిశీలిస్తున్నారు. 5వ తరగతి మొదలు కొని 10వ తరగతి వరకూ ఏఐ ఆధారిత బోధన ఉంటుందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రోగ్రామ్స్ రూపొందిస్తారు. ప్రధాన సర్వర్ల నుంచి ఆయా స్కూళ్ళకు వీటిని అనుసంధానం చేస్తారు. టీచర్ ఒక పాఠం చెప్పిన తర్వాత ఏఐ ఆధారిత ప్రశ్నలు గూగుల్ క్రోం ద్వారా విద్యార్థులకు పంపుతారు. వీటికి ఆన్లైన్లోనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తప్పులుంటే సరి చేసుకునే వరకూ ఏఐ టెక్నాలజీ విద్యారి్థకి సూచనలు చేస్తుంది. వర్చువల్ రియాలిటీ విధానంలో.. ఏఐ సాంకేతికత అందుబాటులోకి వస్తే విద్యార్థి స్వయం అనుభవం మాదిరి పాఠం నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు విత్తనం మొలకెత్తడం, వృద్ధి చెందడానికి సంబంధించి థియరీ మాత్రమే పుస్తకాల్లో ఉంటుంది. వర్చువల్ విధానంలో విద్యారి్థకి కెమెరా లెన్స్ పరికరం ఇస్తారు. దీన్ని ధరించిన తర్వాత విత్తనం తానే నాటి, అది దశల వారీగా ఎలా ఎదుగుతుందో పరిశీలిస్తున్న అనుభూతి పొందుతాడు. అదే విధంగా ఎర్రకోట గురించి పాఠం చెప్పేప్పుడు, టిప్పు సుల్తాన్ యుద్ధంపై బోధన చేసేప్పుడు అక్కడే ఉండి చూస్తున్నట్టుగా చేయడం ఏఐ టెక్నాలజీతో సాధ్యమవుతుందని చెబుతున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో పఠనాసక్తి పెరగడంతో పాటు, జ్ఞాపక శక్తి మెరుగయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మౌలిక సదుపాయాలే కీలకం డిజిటల్ బోధన కోసం గతంలో 3 వేల పాఠశాలల్లో లే»ొరేటరీలు ఏర్పాటు చేశారు. 10 వేల స్కూళ్ళకు కంప్యూటర్లు ఇచ్చారు. 8 వేల స్కూళ్ళకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. కానీ ఏఐ ఆధారిత బోధనకు మరింత అత్యాధునిక మౌలిక వసతులు అవసరం. ఇప్పుడున్న నెట్ స్పీడ్ పది రెట్లు పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. సర్వర్ల నుంచి వేగంగా ప్రోగ్రామింగ్ అందుకోగల మాడ్యూల్స్‌ను రూపొందించాల్సి ఉంటుంది. దీనికి తోడు ప్రభుత్వ స్కూళ్ళల్లో టీచర్లకు ఏఐపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంది. గతంలో ఇచ్చిన కంప్యూటర్లు చాలా స్కూళ్లలో వాడకుండా పక్కన పడేశారు. తాజాగా ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామాల్లో ఉండే యువతను ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నారు. ఏఐతో మెరుగైన బోధన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు స్కూళ్ల కంటే మెరుగైన విద్యా ప్రమాణాలు నెలకొల్పేందుకు ప్రయతి్నస్తున్నాం. ఇందులో భాగంగానే ఏఐ టెక్నాలజీతో విద్యా బోధన అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనిపై త్వరలోనే కార్యాచరణ చేపట్టాలని భావిస్తున్నాం. – ఈవీ నర్సింహారెడ్డి (పాఠశాల విద్య డైరెక్టర్) మంచి ఫలితాలకు అవకాశం ఉంది అమెరికాలో గూగుల్ క్రోం ద్వారానే అసైన్మెంట్స్ ఇస్తున్నారు. మూల్యాంకనం చేపడుతున్నారు. ఏఐ వాడకంలో అక్కడి స్కూళ్ళు ముందంజలో ఉన్నాయి. మన విద్యార్థులు గణితంలో అక్కడివారి కంటే మెరుగ్గా ఉంటారు. కాబట్టి ఏఐ టెక్నాలజీతో మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంది. – సంక్రాంతి రవికుమార్ (అమెరికాలో ఏఐ బోధన పరిశీలించిన టీచర్) అడ్మిషన్లు పెరుగుతాయి ఏఐ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్తే ప్రభుత్వ స్కూళ్ళల్లో అడ్మిషన్లు పెరుగుతాయి. పోటీ ప్రపంచాన్ని తట్టుకునేందుకు ఇది మంచి మార్గం. దీనిపై టీచర్లకు సరైన శిక్షణ ఇవ్వాలి. – పింగిలి శ్రీపాల్‌రెడ్డి (టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు) -
ఎన్ని అడ్డంకులొచ్చినా...సంకల్పమే మీ బలం!
నూతన సంవత్సరంలో చాలా మంది ఎన్నో గొప్ప లక్ష్యాలను పెట్టుకుంటారు. కానీ ఆ లక్ష్యాలను సాధించేందుకు కావాల్సినంత సంకల్ప బలం వారిలో ఉండదు. అందుకే మధ్యలోనే ఆ లక్ష్యాలను వదిలిపెడతారు. కొన్నిసార్లు మీ మనసే ఎన్నో సాకులను వెతుకుతుంది. మీ లక్ష్యాన్ని ఓడించాలని చూస్తుంది. అందుకే మీ మనసును చెదరని సంకల్ప బలంతో నింపండి. నేను ఎన్ని అడ్డంకులు ఉన్నా విజయాన్ని సాధిస్తాను! నేను లక్ష్యాన్ని చేరతాను అని పదే పదే మనసులో అనుకోండి! అనుకుందే ఆచరణలో పెట్టండి. మీరు చేయాల్సిన కృషితో పాటు దృఢమైన సంకల్ప శక్తి కూడా ఉండాలి. ఎత్తైన పర్వతాల నడుమ ఒక సుందరమైన లోయ వద్ద ఒక చిన్న ప్రవాహం ఉండేది. అది మహా సముద్రాన్ని చేరాలని కలలు కంటూ ఉండేది. తన ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రతిసారీ దారిలో రాళ్లు, దట్టమైన అడవులు, ఎత్తైన కొండచరియలు ఎదురవడంతో ఆ చిన్న ప్రవాహం వెనుదిరిగి వెనకకు వెళ్లి΄ోయేది.‘‘నీకు ఇది సాధ్యం కాదు,’’ అని దారిలోని పెద్ద రాళ్లు చెప్పేవి. ‘‘నువ్వు చాలా చిన్నగా, బలహీనంగా ఉన్నావు నువ్వు చేయలేవు’’ అని ఆ చిట్టి ప్రవాహాన్ని నిరుత్సాహ పరిచేవి. ఒకనాడు చిట్టి ప్రవాహం చాలా దిగులుగా, ఇక ఎప్పటికీ తన కలను నెరవేర్చుకోలేనన్న బాధతో, సందేహంతో ఉండటాన్ని వృక్షమాత గమనించింది. వృక్ష మాత ప్రవాహంతో ఇలా చెప్పింది, ‘‘ఇలా బాధ పడినంత మాత్రాన నీ లక్ష్యాన్ని నీవు చేరగలవా..?? నువ్వు బాధ పడటం వల్ల ఏ ఉపయోగం లేదు! మహా సముద్రాన్ని చేరాలనే నీ తపననే నీ శక్తిగా మలుచుకో..నీ సంకల్పాన్ని బలపరుచుకో.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుదిరగననే వజ్ర సంకల్పం చేసుకో!’’ అని చిట్టి ప్రవాహానికి కొండంత ధైర్యమిచ్చి, విజయోస్తు! అని దీవించి పంపింది వృక్ష మాత. ఆ ధైర్యంతో, ప్రవాహం తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అది ముందుకు వెళ్లాలని సంకల్పించుకుంది. పెద్ద రాళ్ళు ఎదురైనప్పుడు వాటి మధ్యనున్న చిన్న సందులనే మార్గంగా చేసుకుంది. ఎండ తీవ్రతకు ఆవిరైపోయే పరిస్థితి వచ్చినప్పుడు, మేఘాలకెగసి అక్కడి నుండి నదిగా భువికి తిరిగి వచ్చింది. ఒకప్పటి చిట్టి ప్రవాహమే ఇప్పుడు మహా ప్రవాహమై చివరికి మహాసముద్రంలో లీనమైంది. ‘‘నీ లక్ష్యాన్ని నీవు సంకల్ప శక్తితో సాధించావు’’ అని వృక్ష మాత హర్షించింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా చెదరని సంకల్ప బలంతో ముందుకు సాగండి. లక్ష్యాన్ని సాధించడంలో ఇటువంటి మనఃస్థితి ఉంటే ఏ పనిలోనైనా నిస్సందేహంగా విజయాన్ని సాధించవచ్చు. ఈ యావత్ విశ్వంలో మీరు సాధించలేనిది ఏదీ లేదు! – మాతా ఆత్మానందమయిఆధ్యాత్మిక గురువు -
47 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: విద్యా బోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం గురుపూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందించనుంది. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం రవీంద్ర భారతిలో గురుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది. గురువారం సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సహా పలువురు మంత్రులు, రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఉపాధ్యాయులు, లెక్చరర్లు, విశ్వవిద్యాలయ అధ్యాపకులు కలిపి మొత్తం 113 మందికి ప్రభుత్వం పురస్కారాలు ఇవ్వనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 12 మంది హెచ్ఎంలు, 23 మంది స్కూల్ అసిస్టెంట్లు, 12 మంది ఎస్జీటీలు, ఉన్నత విద్యలో పనిచేస్తున్న 55 మందిఅధ్యాపకులు, ఇంటర్ విద్యలో పనిచేస్తున్న 11 మంది లెక్చరర్లు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. పురస్కారాలకు ఎంపికైన వారు వీరే..ప్రధానోపాధ్యాయులు: టి భాస్కర్ (పాఠశాల/జిల్లా: తెల్లాపూర్, సంగారెడ్డి), మెస నరేందర్ (ఆలూరు, నిజామాబాద్), ఏవీ సత్యవతి–రిటైర్డ్ (నయాబజార్, హైదరాబాద్), ఎస్.కె. తాజ్‌బాబు (రాయదుర్గ్, రంగారెడ్డి), టి సునీత (కోటకొండ, నారాయణ్‌పేట్), బి. బాపూరెడ్డి (కుషాయిగూడ, మల్కాజ్గిరి), పి.శంకర్‌గౌడ్ (యాప్రాల, వనపర్తి), పి. పద్మజ (కసనగోడ, నల్లగొండ), కె.నర్సయ్య (అంకోలి, ఆదిలాబాద్), కె.ఇందుమతి(హసన్‌పర్తి, హనుమకొండ), డాక్టర్ ప్రభు దయాల్ (రామాపురం, కొత్తగూడెం), జి. రాజన్న (హనుమకొండ).స్కూల్ అసిస్టెంట్లు: కె. నర్సింహులు (ఇబ్రహీంనగర్, మహబూబ్‌నగర్), కొంక అనురాధ (కొత్తూరు, వరంగల్), కూన రమేశ్ (చిచోలి–బి, నిర్మల్), ముద్దుకృష్ణ (దుబ్బ, నిజామాబాద్), జె. రాజశేఖర్‌రావు (చిన్నముద్దునూర్, నాగర్‌కర్నూల్), ఎస్.సురేందర్ (అన్నారం, మంచిర్యాల), సీహెచ్ షర్మిల (అలుబాక, ములుగు), ఎం.రమేశ్ (బ్రాహ్మణపల్లి, పెద్దపల్లి), జి.రాజయ్య (మొగుళ్ళపల్లి, భూపాలపల్లి), జి.అంజన్‌కుమార్ (ఎనీ్టపీసీ జ్యోతినగర్, పెద్దపల్లి), కృష్ణకాంత్ నాయక్ (మిర్యాలగూడ, నల్లగొండ), సీహెచ్ గిరిప్రసాద్ (తిమ్మాపురం, సూర్యాపేట), ఎన్.అమరేందర్ రెడ్డి (కొంపల్లి, భూపాలపల్లి), పి.శంకర్‌గౌడ్ (శివనగర్, సిరిసిల్ల), జి.వెంకటేశ్వర్లు (పెద్దగోపతి, ఖమ్మం), కె.సత్యం(కందానెల్లి, వికారాబాద్), టి.స్వర్ణలత (పాల్వంచ, కామారెడ్డి), వి.రామకృష్ణ(చిన్నమల్లారెడ్డి, కామారెడ్డి), పి.రూపారాణి (సిరిసినగండ్ల, సిద్దిపేట), ఆర్.కృష్ణప్రసాద్ (నాగ్‌పూర్, మెదక్), హెచ్.విజయకుమార్ (ముడిమనిక్, సంగారెడ్డి), కె.కృష్ణయ్య(కుత్బుల్లాపూర్, రంగారెడ్డి). ఎస్జీటీలు: జె. శ్రీనివాస్ (అక్కపల్లిగూడ, మంచిర్యాల), వై.వెంకటసురేశ్ కుమార్ (రామంచ, సిద్దిపేట), పి.రఘురామరావు (జీడీపల్లి, నాగర్‌కర్నూల్), దాసరి శంకర్ (పీచర్ల, నిర్మల్), పల్సి శ్రీనివాస్ (భైంసా, నిర్మల్), కె సుధాకర్ (తిడుగు, జనగాం), డి.కవిత(పెద్ద రాజమూర్, మహబూబ్‌నగర్), ఎం. క్రాంతికుమార్ (సింగన్నగూడ, సిద్దిపేట), కె. నాగేశ్వరి (పటేల్‌గూడ, సంగారెడ్డి), దల్లి ఉమాదేవి (ఆర్ఎన్ గుట్ట, భద్రాద్రి కొత్తగూడెం), జి. శ్రీనివాస్ (కీసరగుట్ట, మల్కాజ్గిరి), ఎంఎ అలీమ్ (గద్వాల్, నిజామాబాద్) -
వీక్లీ వస్తారు సారు..తహసీల్దారు మాస్టారు!
చందంపేట: తహసీల్దార్ ఉద్యోగం అంటేనే ఊపిరిసలపనివ్వని విధి నిర్వహణతో ముడిపడి ఉంటుంది. అలాంటిది.. ఆ హోదాలో విధులు నిర్వహిస్తూనే.. పిల్లలకు ఆంగ్ల పాఠాలు బోధిస్తున్నారొక అధికారి. ఆయనే నల్లగొండ జిల్లా చందంపేట తహసీల్దార్ శ్రీనివాస్. ఆయన ఇటీవల మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను సందర్శించినప్పుడు విద్యార్థులతో ముచ్చటించారు. తమకు ఆంగ్ల ఉపాధ్యాయుడు లేక పాఠాలు చెప్పేవారే లేరని విద్యార్థినులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు.తహసీల్దార్ శ్రీనివాస్ అప్పటికప్పుడే.. విద్యార్థినులకు కొద్దిసేపు ఆంగ్ల పాఠాలు బోధించారు. వారంలో ఒకరోజు సమయం కేటాయించి విద్యార్థులకు బోధిస్తున్నా రు. గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేసిన శ్రీనివాస్.. ఆ తర్వాత నాగర్‌కర్నూల్ జిల్లాలో ఏవోగా ఉద్యోగం చేస్తూ పదోన్నతిపై చందంపేట తహసీల్దార్‌గా వచ్చారు. ఒకప్పటి ఉపాధ్యాయ వృత్తి మిగిల్చిన అనుభవంతో.. చందంపేట కస్తూర్బా పాఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థులకు ఆంగ్ల పాఠాలు బోధిస్తున్నారు. శనివారం 10వ తరగతి విద్యార్థులకు పాఠాలు చెబుతూ కనిపించారు. -
మనబడి ‘ఐబీ’కి అనుకూలం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన, బహు భాషలు మాట్లాడే విద్యార్థులు, చదువులో తమ అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు తొట్రుపాటు లేకుండా ఆత్మవిశ్వాసంతో ఉపాధ్యాయులను ప్రశ్నించే తీరు.. ఎదుటివారితో మర్యాదగా మాట్లాడేతత్వం, పిల్లల్లో సహకార గుణం, క్లాస్‌రూమ్‌లో విద్యార్థులు –టీచర్ల మధ్యనున్న అన్యోన్యత తదితర అంశాలు అంతర్జాతీయ విద్యావేత్తలను ఆశ్చర్యపరిచాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2025 జూన్ మొదలు ఐబీ సిలబస్‌ను ఒకటో తరగతి నుంచి ప్రభుత్వం అమలుచేయనున్న నేపథ్యంలో.. ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) ప్రతినిధులు ఫిబ్రవరి 26 నుంచి ఈనెల ఏడో తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా.. ఇప్పటికే రాష్ట్రంలో అమలుచేస్తున్న ఏపీ విద్యా సంస్కరణలు, విద్యార్థుల్లో నేర్చుకునే తత్వం వారిని ఆశ్చర్యపరిచాయి. తాము పరిశీలించిన పాఠశాలల్లో చక్కటి వాతావరణం, మెరుగైన మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పాఠశాల పరిశుభ్రతపై కేంద్రీకృత పరిశీలన, పాఠశాలల పనితీరు.. సమీక్షలో రోజువారి యాప్స్ వినియోగం, కేంద్రీకృత మానిటరింగ్ సిస్టం, టోఫెల్ శిక్షణ, కంటెంట్ అనుసంధానం, అటల్ టింకరింగ్ ల్యాబ్స్, గ్రంథాలయాల వినియోగం, మెరుగైన అసెస్మెంట్, యూనిఫారం, ద్విభాషా పాఠ్యపుస్తకాలు, పోషకాలతో కూడిన నాణ్యమైన మధ్యాహ్న భోజనం, టాయిలెట్ల నిర్వహణపై ఆ ప్రతినిధులు ప్రభుత్వాన్ని, విద్యాశాఖను అభినందించారు. విద్యార్థుల్లో నేర్చుకునే తత్వంపై అభినందన.. ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్ అమలుచేసే స్కూళ్లల్లో విద్యార్థుల వ్యక్తిగత ప్రొఫైల్‌కు అధిక ప్రాధాన్యతనిస్తారు. బహు భాషలు, విద్యేతర అంశాలపై దృష్టిపెడతారు. వివిధ రకాల భాషలు మాట్లాడే పిల్లలు ఒకేచోట కలిసి ఉన్నప్పుడు ఒకరికొకరు సహకరించుకునే గుణం తప్పనిసరిగా ఉండేలా చూస్తారు. ఇలాంటి వాతావరణాన్ని ఏపీ ప్రభుత్వ స్కూళ్లల్లో గుర్తించినట్లు వారు తెలిపారు. తెలుగు, ఉర్దూ, తమిళం, కన్నడ, ఒరియాతో పాటు సవర, కొండ, కోయ, సుగాలి, ఆదివాసి, కువి వంటి గిరిజన భాషలు మాట్లాడే పిల్లలు కలిసి ఉన్నప్పుడు వారివారి భాషలను గౌరవించుకోవడం, ఇతర భాషలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపడాన్ని ఐబీ ప్రతినిధులు గమనించి అభినందించారు. తరగతి గదులలో బహుభాషావాదం, ఉపాధ్యాయ–విద్యార్థి సంబంధం, విద్యార్థుల మధ్య ఆత్మవిశ్వాసం, పాఠశాల విద్యా వ్యవస్థపై సమాచారాన్ని పంచుకోవడంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతరులు ఆసక్తి చూపిన తీరు ఐబీ విద్యా విధానానికి దగ్గరగా ఉన్నట్లు ఆ ప్రతినిధులు తెలిపారు. ఇక ఐబీ అమలు విషయంలో ఏపీ పాఠశాల విద్యాశాఖకు అవసరమైన మౌలిక సదుపాయాలున్నాయని, ఉపాధ్యాయులకూ తగిన అర్హతలు ఉన్నాయన్నారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచ పోకడలను అర్థంచేసుకునేందుకు, అవకాశాలను అందుకునేందుకు ఐబీ పాఠ్యాంశాలను సులభంగా అనుసరించగలరన్న నమ్మకాన్ని వారు వ్యక్తంచేశారు. మరోవైపు.. ఐబీ బృందం పర్యటనకు సంబంధించిన పూర్తి నివేదికను జూన్‌లో ప్రభుత్వానికి అందజేయనుంది. నివేదిక ఆధారంగా ఉపాధ్యాయులకు, విద్యాశాఖ సిబ్బంది శిక్షణనివ్వాలని అధికారులు నిర్ణయించారు. -
ఏపీ విద్యార్థులకు మరో శుభవార్త
సాక్షి, అమరావతి: విదేశాలకు వెళ్లి చదువుకోలేని పేద, మధ్య తరగతి విద్యార్థులకు సువర్ణావకాశం కల్పిస్తోంది జగనన్న సంక్షేమ ప్రభుత్వం. ఈ క్రమంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించేందుకు శ్రీకారం చుట్టింది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల్లో భాగంగా ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్’తో ఒప్పందం చేసుకుంది. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎడెక్స్ ఆన్లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నారు. .. ఇప్పటికే ఎడెక్స్, ఉన్నత విద్యాశాఖ సంయుక్తంగా టీచింగ్, లెర్నింగ్ కోసం కొత్త టెక్నాలజీ, బోధన విధానాలను రూపొందించాయి. హార్వర్డ్, ఎంఐటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనావిుక్స్, కొలంబియా, న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక వర్సిటీల నుంచి వివిధ కోర్సుల్లో ఏపీ విద్యార్థులు సర్టిఫికేషన్లు సులభంగా పొందొచ్చు. తద్వారా మంచి వేతనాలతో కూడిన జాతీయ, అంతర్జాతీయ ఉద్యోగాలను సాధించేలా ప్రోత్సహిస్తోంది. 12 లక్షల మందికి లబ్ధి ఆంధ్రప్రదేశ్‌లోని 12 లక్షల మందికి పైగా విద్యార్థులు వరల్డ్ క్లాస్ వర్సిటీలు, ఇతర విద్యాసంస్థలు అందించే రెండు వేలకు పైగా ఎడెక్స్ ఆన్లైన్ కోర్సులను, రెగ్యులర్ కోర్సులతో పాటు ఉచితంగా చదువుకోవచ్చు. అనంతరం ఎడెక్స్, అంతర్జాతీయ వర్సిటీల నుంచి సర్టిఫికెట్లు అందుకుంటారు. ఇక్కడ ప్రపంచంలోని అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయాలు, సంస్థలకు చెందిన అత్యుత్తమ అధ్యాపకులతో బోధన లభిస్తుంది. ప్రపంచంలోని శాస్త్ర, సాంకేతిక రంగాలతో పాటు సామాజిక, సాంఘిక శాస్త్రాలకు సంబంధించి వివిధ సబ్జెక్టులను పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉచితంగా నేర్చుకోవచ్చు. ఈ కోర్సుల్లో ఎక్కువ వర్టికల్స్ పెట్టడం ద్వారా విద్యార్థి నచ్చిన వర్టికల్స్ చదువుకునేలా ప్రణాళిక రూపొందించింది. విదేశాలకు వెళ్లి అక్కడి మేటి కాలేజీల్లో చదువుకోలేని ఎంతో మంది విద్యార్థులకు మేలు చేకూరనుంది. కరిక్యులమ్‌లో భాగంగా ఎడెక్స్ కోర్సులకు అంతర్జాతీయ వర్సిటీలే ఆన్లైన్లో ఎగ్జామ్స్ నిర్వహించి సర్టిఫికెట్లు అందిస్తాయి. ఆ క్రెడిట్స్ మన కరిక్యులమ్‌లో భాగమవుతాయి. తద్వారా ఏపీ విద్యార్థులు గ్లోబల్ స్టూడెంట్స్‌గా ఎదుగుతారు. ప్రొఫెషనల్, సంప్రదాయ డిగ్రీ విద్యలో లోటుపాట్లను సరిచేసి స్కిల్ ఓరియెంటెడ్ కోర్సులను అందించడం ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధిలో ఎడెక్స్ ఎంతో ఉపయోగపడనుంది. -
AP: పేదల చెంతకు శ్రీమంతుల చదువులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా విధానంలో మరో విప్లవాత్మక ఘట్టం ఆవిష్కృతమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన సహా అనేక సంస్కరణలు తెచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేటు పాఠశాలల్లో శ్రీమంతుల పిల్లలు చదువుకునే ‘ఇంటర్నేషనల్ బాకలారియెట్’ (ఐబీ) సిలబస్‌ను కూడా పేద పిల్లలకు చేరువ చేస్తున్నారు. ఐబీ సిలబస్ అమలుపై బుధవారం సాయంత్రం ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) అధికారులతో ఐబీ ప్రతినిధులు ఒప్పందం చేసుకోనున్నారు. దీంతో మన ప్రభుత్వ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడి నెగ్గేలా తీర్చిదిద్దడంలో మరో కీలక అడుగు పడనుంది. 2024 – 25 విద్యా సంవత్సరంలో ఐబీ బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. వారిలో బోధన సామర్థ్యం, నైపుణ్యం పెంచేలా ఈ శిక్షణ ఉంటుంది. టీచర్లతో పాటు మండల, జిల్లా విద్యాధికారులు, ఎస్సీఈఆర్టీ, డైట్ సిబ్బంది, ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ బోర్డు సిబ్బందికి ‘ఐబీ’పై అవగాహన, సామర్థ్యం పెంచేలా శిక్షణనిస్తారు. దీంతో వారంతా ప్రతిష్టాత్మక ఐబీ గ్లోబల్ టీచర్ నెట్‌వర్క్‌లో భాగమవుతారు. 2025 జూన్ నుంచి ఒకటో తరగతిలో ఐబీ సిలబస్ బోధన ప్రారంభమవుతుంది. ఏటా ఒక్కో తరగతికి ఈ సిలబస్‌ను పెంచుతూ 2035 నాటికి 10వ తరగతి, 2037కి 12వ తరగతిలో అమలు చేస్తారు. పరీక్షల అనంతరం ఐబీ బోర్డు, ఏపీఎస్సీఈఆర్టీ ఉమ్మడిగా సర్టిఫికెట్‌ను ప్రదానం చేస్తాయి. ఈ సర్టిఫికెట్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు సైతం ఉంటుంది. 2019 నుంచే గ్లోబల్ సిటిజన్స్ ప్రణాళిక ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను గ్లోబల్ విద్యార్థులుగా తీర్చిదిద్దే ప్రక్రియను వైఎస్ జగన్ ప్రభుత్వం 2019 నుంచే ప్రారంభించింది. ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులు ఉత్తమంగా ఎదిగేందుకు 56 నెలల్లో దాదాపు రూ.73 వేల కోట్లు విద్యా సంస్కరణల కోసం వెచ్చించింది. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లకంటే మిన్నగా తీర్చి దిద్దుతోంది. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద తదితర విప్లవాత్మక కార్యక్రమాలను అమలు చేసి విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసింది. ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిష్ మీడియంలో బోధన ప్రారంభించింది. మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. పాఠశాలలను సీబీఎస్ఈ బోర్డుకు అనుసంధానించింది. విద్యార్థులకు బైలింగ్యువల్ టెక్టŠస్ బుక్స్ నుంచి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వరకు 9 వస్తువులతో కూడిన జగనన్న విద్యా కానుక కిట్‌ను అందిస్తోంది. పిల్లల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచడంతో పాటు సులభంగా ఇంగ్లిష్ అర్థమయ్యేలా మార్పులు చేసింది. నాలుగు నుంచి 12వ తరగతి వరకు ఉచిత బైజూస్ కంటెంట్, 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు బైజూస్ కంటెంట్‌తో ఉచిత ట్యాబ్స్ పంపిణీ చేసింది. హై స్కూల్ స్థాయిలో ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన కోసం 62 వేల ఐఎఫ్‌పీలు ఏర్పాటు చేస్తోంది. ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలు, ఇంగ్లిష్ ల్యాబ్స్ ఏర్పాటు చేసింది. ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లిష్‌లో నైపుణ్యం సాధించేందుకు మూడో తరగతి నుంచి టోఫెల్ శిక్షణనిస్తోంది. ఐబీ సిలబస్‌ను సులభంగా అర్థం చేసుకునేందుకు, అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునేందుకు ఈ మార్పులు దోహదం చేస్తాయి. ఐబీ విద్యా బోధనలో ఎన్నో ప్రత్యేకతలు ఐబీ విద్య ప్రపంచంలోనే అత్యుత్తమ బోధన పద్ధతిగా గుర్తింపు పొందింది. బట్టీ చదువులకు స్వస్తి చెబుతూ థియరీతో పాటు ప్రాక్టికల్ అప్లికేషన్ పద్ధతిలో బోధన సాగుతుంది. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది. ప్రస్తుత, భావితరాల అవసరాలకు అనుగుణంగా సిలబస్, బోధన, మూల్యాంకనం ఉంటుంది. చదువుతోపాటు ప్రాక్టికల్స్, విద్యార్థుల్లో నైపుణ్యాల (స్కిల్స్)కు ప్రాధాన్యతనిస్తారు. సంగీతం, నృత్యం, క్రీడలు వంటి ఇతర అంశాల్లోనూ తర్ఫీదు ఇస్తారు. ఇంటర్ డిసిప్టీనరీ కాన్సెప్ట్ (వాస్తవిక జీవిత అంశాలు) ఆధారంగా బోధన సాగుతుంది. ఈ సిలబస్‌ను అభ్యసించిన విద్యార్థులు ఇతరులతో పోలిస్తే ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో మూడు రెట్లు అధికంగా ప్రవేశాలు పొందుతున్నారు. ప్రపంచస్థాయి ఉద్యోగావకాశాలను సైతం వేగంగా అందుకుంటున్నారు. -
పేదరిక నిర్మూలన చదువు ద్వారానే సాధ్యం: సీఎం జగన్
-
నమస్కారం అంటే..!
గురువు గారికి తిరిగి ప్రత్యుపకారం చేస్తాను... అనడం సాధ్యమయ్యే విషయం కాదు. గురువు విషయంలో చేయగలిగినది ఏమిటి.. అంటే ...‘జలజాతేక్షణు? దోడితెచ్చితివి నా సందేశముం జెప్పి; నన్/నిలువం బెట్టితి; నీ కృపన్ బ్రతికితిన్ నీ యంత పుణ్యాత్మకుల్/గలరే; దీనికి నీకు? బ్రత్యుపకృతిం గావింప నే నేర; నం/జలిం గావించెద; భూసురాన్వయమణీ! సద్బంధుచింతామణీ!‘ అంటుంది రుక్మిణీ దేవి భాగవతంలో. అంతటి ఉపకారం చేసిన నీకు ప్రత్యుపకారం నేనేం చేయగలను.. అంజలి ఘటించడం తప్ప... అంటుంది. అంటే రెండు చేతులు కలిపి జోడించి శిరస్సు తాటించి నమస్కరించడం. ఈ ఐదు వేళ్ళతో కూడుకున్న చెయ్యి–కర్మేంద్రియ సంఘాతం. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు పదింటిని, బుద్ధిస్ధానమయిన 11వదయిన శిరస్సును కలిపి మీ పాదాల దగ్గర న్యాసం చేస్తున్నాను... అని చెప్పడానికి నమస్కారం చేస్తారు. ఈ తలలో వచ్చిన ఎన్నో ఆలోచనలను, ఈ చేతులతో ఎన్నో చేయకూడని పనులను చేసి మనుష్య జన్మ పాడుచేసుకున్నా. మీ వాక్కులు అగ్నిహోత్రం. నాలో ఉన్న అజ్ఞానాన్ని దహించి నేను ప్రయాణించాల్సిన మార్గాన్ని చూపించి నన్ను రక్షించండి... అని చెప్పడానికి అంజలి ఘటిస్తారు. అంతటి గొప్పరూపం గురువు. సనాతన ధర్మంలో భగవంతుడే గురువుగా కూడా ఉంటాడు. గురువు ఒకడు, భగవంతుడు ఒకడు కాదు. నిజానికి భగవంతుడే గురువు. శైవసంప్రదాయంలో దక్షిణామూర్తి చాలా చాలా గొప్ప గురువు. ఆయన నోటితో మాట్లాడకుండా చిన్ముద్రపట్టి కూర్చున్నాడు. ఆయన గురువు. అలాగే వైష్ణవ సంప్రదాయంలో శ్రీకృష్ణపరమాత్మ జగద్గురువు.‘కృష్ణం వందే జగద్గురుమ్!’. అమ్మవారు గురు మండల రూపిణి. సమస్త గురుమండల రూపిణి జగన్మాతయే. భగవంతుడు ఏ అవతారంలో మనముందుకొచ్చినా గురువుపట్ల అమిత గౌరవంతో ప్రవర్తిస్తాడు. 16 గుణాలు పరిపూర్ణంగా కలిగిన నరుడెవరు? – అంటే రామచంద్రమూర్తిని చూపించాడు నారద మహర్షి సంక్షేప రామాయణంలో. అంతటి గొప్ప రాముడు కూడా గురువుకు నమస్కరించి తలవంచుకుని నిలబడ్డాడు. ఏదో యాంత్రికమైన నమస్కారం కాదు. నమస్కారం చేసేటప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎలా నమస్కారం చేయాలో తెలుసుకుని చేయాలి. సాష్టాంగ నమస్కారం చేయాలన్నా, అభివాదం చేయాలన్నా ఒక పద్దతి ఉండాలి. రెండు చేతులు కలిపి తలతాకించి నమస్కారం చేయడం కూడా నమస్కారమే. అలాకాక, ప్రణిపాతం.. కర్ర ఎలా నేలమీద పడిపోతుందో అలా పడిపోవడం. అంటే ఎంత కింద పడిపోవాలో అంత పడిపోయాను. ఇంతకన్నా కిందపడే అవకాశం లేదు. ఇప్పుడు నన్ను పైకెత్తడం మీ చేతుల్లో ఉంది... అన్న భావనతో చేస్తే ప్రణిపాతం. అంటే అహంకారం వదిలి పెద్దలముందు పడిపోవడం. రామచంద్రమూర్తి అలా గురువుగారి ముందు నిలబడి నమస్కరించి నేను రాకుమారుడిని కాదు, కింకరుడిని.. సేవకుడిని, మీరేది ఆజ్ఞాపిస్తే అలా చేయడానికి సంసిద్ధంగా ఉన్నా.. ఆజ్ఞాపించండి. అన్నాడు.. గురువుల, పెద్దల విషయంలో అలా మసలుకోవాలనేది సనాతన ధర్మం మనకు ఇచ్చిన సందేశం. గురువు గారికి తిరిగి ప్రత్యుపకారం చేస్తాను... అనడం సాధ్యమయ్యే విషయం కాదు. గురువు విషయంలో చేయగలిగినది ఏమిటి.. అంటే ... ‘జలజాతేక్షణు? దోడితెచ్చితివి నా సందేశముం జెప్పి; నన్/నిలువం బెట్టితి; నీ కృపన్ బ్రతికితిన్ నీ యంత పుణ్యాత్మకుల్/గలరే; దీనికి నీకు? బ్రత్యుపకృతిం గావింప నే నేర; నం/జలిం గావించెద; భూసురాన్వయమణీ! సద్బంధుచింతామణీ!‘ అంటుంది రుక్మిణీ దేవి భాగవతంలో. అంతటి ఉపకారం చేసిన నీకు ప్రత్యుపకారం నేనేం చేయగలను.. అంజలి ఘటించడం తప్ప... అంటుంది. అంటే రెండు చేతులు కలిపి జోడించి శిరస్సు తాటించి నమస్కరించడం. ఈ ఐదు వేళ్ళతో కూడుకున్న చెయ్యి–కర్మేంద్రియ సంఘాతం. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు పదింటిని, బుద్ధిస్ధానమయిన 11వదయిన శిరస్సును కలిపి మీ పాదాల దగ్గర న్యాసం చేస్తున్నాను... అని చెప్పడానికి నమస్కారం చేస్తారు. ఈ తలలో వచ్చిన ఎన్నో ఆలోచనలను, ఈ చేతులతో ఎన్నో చేయకూడని పనులను చేసి మనుష్య జన్మ పాడుచేసుకున్నా. మీ వాక్కులు అగ్నిహోత్రం. నాలో ఉన్న అజ్ఞానాన్ని దహించి నేను ప్రయాణించాల్సిన మార్గాన్ని చూపించి నన్ను రక్షించండి... అని చెప్పడానికి అంజలి ఘటిస్తారు. అంతటి గొప్పరూపం గురువు. సనాతన ధర్మంలో భగవంతుడే గురువుగా కూడా ఉంటాడు. గురువు ఒకడు, భగవంతుడు ఒకడు కాదు. నిజానికి భగవంతుడే గురువు. శైవసంప్రదాయంలో దక్షిణామూర్తి చాలా చాలా గొప్ప గురువు. ఆయన నోటితో మాట్లాడకుండా చిన్ముద్రపట్టి కూర్చున్నాడు. ఆయన గురువు. అలాగే వైష్ణవ సంప్రదాయంలో శ్రీకృష్ణపరమాత్మ జగద్గురువు.‘కృష్ణం వందే జగద్గురుమ్!’. అమ్మవారు గురు మండల రూపిణి. సమస్త గురుమండల రూపిణి జగన్మాతయే. భగవంతుడు ఏ అవతారంలో మనముందుకొచ్చినా గురువుపట్ల అమిత గౌరవంతో ప్రవర్తిస్తాడు. 16 గుణాలు పరిపూర్ణంగా కలిగిన నరుడెవరు? – అంటే రామచంద్రమూర్తిని చూపించాడు నారద మహర్షి సంక్షేప రామాయణంల.. అంతటి గొప్ప రాముడు కూడా గురువుకు నమస్కరించి తలవంచుకుని నిలబడ్డాడు. ఏదో యాంత్రికమైన నమస్కారం కాదు. నమస్కారం చేసేటప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎలా నమస్కారం చేయాలో తెలుసుకుని చేయాలి. సాష్టాంగ నమస్కారం చేయాలన్నా, అభివాదం చేయాలన్నా ఒక పద్దతి ఉండాలి. రెండు చేతులు కలిపి తలతాకించి నమస్కారం చేయడం కూడా నమస్కారమే. అలాకాక, ప్రణిపాతం.. కర్ర ఎలా నేలమీద పడిపోతుందో అలా పడిపోవడం. అంటే ఎంత కింద పడిపోవాలో అంత పడిపోయాను. ఇంతకన్నా కిందపడే అవకాశం లేదు. ఇప్పుడు నన్ను పైకెత్తడం మీ చేతుల్లో ఉంది... అన్న భావనతో చేస్తే ప్రణిపాతం. అంటే అహంకారం వదిలి పెద్దలముందు పడిపోవడం. రామచంద్రమూర్తి అలా గురువుగారి ముందు నిలబడి నమస్కరించి నేను రాకుమారుడిని కాదు, కింకరుడిని.. సేవకుడిని, మీరేది ఆజ్ఞాపిస్తే అలా చేయడానికి సంసిద్ధంగా ఉన్నా.. ఆజ్ఞాపించండి. అన్నాడు.. గురువుల, పెద్దల విషయంలో అలా మసలుకోవాలనేది సనాతన ధర్మం మనకు ఇచ్చిన సందేశం. (చదవండి: అలవాటుని అధిగమించటం అతికష్టం!) -
పిల్లల ట్యాబ్‌లపై పచ్చ వైరస్ దాడి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ప్రతి విద్యార్థీ ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకోవాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయం. ఇందుకోసం రాష్ట్ర విద్యా రంగంలో వినూత్న సంస్కరణలు చేపట్టారు. కనీవినీ ఎరుగని రీతిలో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారుస్తూ, అత్యాధునిక బోధన పద్ధతులు ప్రవేశపెడుతున్నారు. ఇందులో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు అత్యాధునిక ట్యాబ్‌లను ఉచితంగా అందిస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమంపైనా పచ్చపత్రికలు విషం చిమ్ముతున్నాయి. ట్యాబ్‌లు పాడైపోయాయని, పాఠాలు అప్లోడ్ చేయలేదని, పిల్లలకు ఆ పాఠాలు సరిగా అర్థంకావడంలేదని మంగళవారం ఓ పచ్చ పత్రిక అసత్య కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలోని అంశాలు పూర్తిగా అవాస్తవాలేనని ప్రభుత్వం ఖండించింది. దీనికి సంబంధించిన వాస్తవాలను వెల్లడించింది. ♦ గత సంవత్సరంలో 8 వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు పూర్తిగా పంపిణీ అయ్యాయి. వీటిలో 9 వ తరగతి పాఠాలు కూడా అప్పుడే అప్లోడ్ చేసి అందించారు. ♦ ట్యాబ్‌లో ఉన్న బైజూస్ కంటెంట్ మల్టిపుల్ లాంగ్వేజ్‌లో ఉంది కనుక విద్యార్థులకు, టీచర్లకు అర్థం కాకపోవడం అనేది జరగదు. విద్యార్థులు ఆంగ్ల పదాలను సులువుగా ఉచ్చరించగలుగుతారు. సాంకేతిక పదాలను సులభంగా తెలుసుకోగలుగుతున్నారు. తద్వారా పై తరగతుల్లోకి వెళ్లినప్పుడు ఇబ్బంది లేకుండా పాఠాలు అర్థం చేసుకోగలుగుతున్నారు. ♦ విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌లో సెక్యూరిటీ ప్యాచ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. దీనివల్ల అవాంఛనీయ సైట్లు, నాన్ అకడమిక్ అంశాలు ట్యాబుల్లో వచ్చే అవకాశమే లేదు. ♦ పగిలిపోయిన ట్యాబ్‌లను గ్రామ, వార్డు సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ ద్వారా సేకరించి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించి ఇస్తున్నారు. స్క్రీన్లు పాడైపోయిన వాటికి త్వరలో నూతన స్క్రీన్ వేయించి పంపిణీ చేస్తారు. ♦ అన్ని ట్యాబ్‌లలో ఎస్డీ కార్డులు ఉన్నాయి. ఎస్డీ కార్డు లేకుండా ఏ విద్యారి్థకీ ట్యాబ్ పంపిణీ జరగలేదు. ♦ టీచర్లందరికీ మూడు దఫాలుగా బైజూస్ కంటెంట్, ట్యాబ్ వినియోగంపై శిక్షణ ఇచ్చారు. ♦ ప్రతి వారం పిల్లలు ఎంత సమయం ట్యాబ్ మీద వెచ్చిస్తున్నారు? ఏయే అంశాలను నేర్చుకుంటున్నారు? వారి పజ్ఞానం ఏ మేరకు మెరుగుపడిందో టీచర్లు పరిశీలిస్తున్నారు. అవసరమైన సూచనలు చేస్తున్నారు. పిల్లలు త్వరగా నేర్చుకొనేలా ట్యాబ్‌లు విద్యార్థులు పాఠాలను తరగతి గదిలోను, ఇళ్ల వద్ద కూడా అనువైన సమయంలో అభ్యసించేందుకు ప్రభుత్వం ఈ ట్యాబ్‌లు ఇస్తోంది. విద్యార్థులకు సబ్జెక్టులపై లోతైన అవగాహన కలి్పంచేలా 8 నుంచి 10వ తరగతి వరకు అత్యుత్తమమైన బైజూస్ డిజిటల్ కంటెంట్‌ను వీటిలో అప్లోడ్ చేసి అందిస్తోంది. ఈ పాఠాలు గ్రాఫులు, మ్యాపులతో పాటు త్వరగా అర్థమయ్యే రీతిలో వీడియోలతో పిల్లలను ఆకర్షించేలా, మరింత శ్రద్ధగా చదువుకొనేలా చేస్తున్నాయి. వారికి పాఠాలు చెప్పే టీచర్లకు కూడా ట్యాబ్‌లు ఇస్తోంది. ఇప్పటికే రెండు విద్యా సంవత్సరాలు వరుసగా వీటిని ప్రభుత్వం పంపిణీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.20 లక్షల మంది విద్యార్థులు, టీచర్లకు వీటిని ఇచ్చారు. స్కూల్లో ఉపాధ్యాయుడు చెప్పిన అంశాలు సరిగా అర్థంకాకపోయినా వాటిని ట్యాబ్‌ల ద్వారా ఇళ్ల వద్దే పిల్లలు నేర్చుకోగలుగుతున్నారు. వీటి ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలు గతంలోకంటే ఎంతో మెరుగయ్యాయని పలు పరిశీలనల్లో తేలింది. -
ఇంటికే ‘ఈ–పాఠం’
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో ఇప్పటికే అనేక విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మరిన్ని చర్యలకు శ్రీకారం చుడుతోంది. విద్యార్థి ఎక్కడున్నా నేర్చుకునేలా పాఠాలను అందిస్తోంది. పాఠ్యాంశాలు విద్యార్థికి మరింత అర్థమయ్యేలా, వివిధ మాధ్యమాల ద్వారా నేర్చుకునేలా ఆంధ్రప్రదేశ్ విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఏపీ ఎస్సీఈఆర్టీ) వీడియో కంటెంట్‌ను రూపొందించింది. ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన ప్రభుత్వ ఉపాధ్యాయులతో మూడు నుంచి 9వ తరగతి వరకు అన్ని పాఠ్యాంశాలను సిద్ధం చేసింది.ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల (ఐఎఫ్‌పీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ బోధనను అందిస్తోంది. మరోవైపు అవే పాఠాలను ట్యాబ్‌ల ద్వారా ఇంటి వద్ద కూడా నేర్చుకునేలా బైజూస్ కంటెంట్‌ను అప్లోడ్ చేసి అందించింది. వీటితోపాటు ఆయా తరగతుల అన్ని పాఠ్యాంశాలకు నిపుణులైన ఉపాధ్యాయులతో 366 వీడియోలను రూపొందించిన ఎస్సీఈఆర్టీ వాటిని యూట్యూబ్ (ఆంధ్రప్రదేశ్ ఈ–పాఠశాల చానల్)లోనూ అప్లోడ్ చేసింది.వీటిని మొబైల్ ఫోన్లోనూ చూసే అవకాశం కల్పించింది. ఈ వీడియోలను విద్యార్థి ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఎక్కడ కావాలంటే అక్కడ చూడొచ్చు. తద్వారా బడిలో ఉపాధ్యాయులు బోధించినప్పుడు విస్మరించిన, మరిచిపోయిన అంశాలను తిరిగి మననం చేసుకోవచ్చు. ఐదు డీటీహెచ్ చానళ్ల ద్వారా ప్రసారం టీవీలకు అలవాటుపడిన విద్యార్థుల్లో కూడా చదువుపై ఆసక్తి కలిగించేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంది. డిజిటల్ పాఠాలను డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) విధానంలో ప్రసారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదు ఈ–విద్య డీటీహెచ్ చానళ్లను కేటాయించింది. వీటిలో ఒకటి నుంచి ఐదు తరగతులకు ఒక చానల్ వినియోగిస్తున్నారు. మిగిలిన నాలుగు చానళ్లను ఆరు నుంచి 9వ తరగతి పాఠ్యాంశాల ప్రసారానికి కేటాయించారు. ఎస్సీఈఆర్టీ రూపొందించిన విద్యా క్యాలండర్, పాఠ్యప్రణాళిక ప్రకారం.. ఆయా నిర్మిత తేదీల్లో డీటీహెచ్ చానళ్లలో ఆ నెల పాఠ్యాంశాలను నిరంతరం ప్రసారం చేస్తారు. ఇలా 100 శాతం కంటెంట్‌తో ఈ–విద్య డీటీహెచ్ చానళ్ల ద్వారా పూర్తి స్థాయి పాఠాలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రైమరీ, జూనియర్ విభాగాల్లో టోఫెల్‌ను ప్రవేశపెట్టడంతో ఆయా పాఠాల బోధనకు మరో మూడు డీటీహెచ్ చానళ్లను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు పాఠశాల విద్యాశాఖ మౌలిక వసతుల కల్పన కమిషనర్ కాటమనేని భాస్కర్ ‘సాక్షి’కి తెలిపారు. మొబైల్ యాప్ సైతం.. ఆన్లైన్లో కూడా విద్యార్థులు పాఠాలు చదువుకునేందుకు, ఉపాధ్యాయులు చెప్పినవి వినేందుకు అనువుగా ‘ఈ–పాఠశాల’ మొబైల్ యాప్‌ను సైతం అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఐఎఫ్‌పీ, ట్యాబ్, డీటీహెచ్, యూట్యూబ్, మొబైల్ యాప్.. ఇలా అన్ని మాధ్యమాల్లోనూ ఒకే తరహా కంటెంట్, బోధన ఉండేలా వీడియోలను రూపొందించారు. దీంతో విద్యార్థి ఎలాంటి గందరగోళం లేకుండా తన తరగతి పాఠాలను ఈ ఐదు మాధ్యమాల్లో సులువుగా నేర్చుకోవచ్చు. అన్ని కేబుల్ నెట్‌వర్క్‌ల్లోనూ ప్రసారం బడిలో ఉపాధ్యాయులు బోధించే అన్ని పాఠాలను ఈ–కంటెంట్ రూపంలోకి మార్చాం. నిష్ణాతులైన సబ్జెక్టు ఉపాధ్యాయులతో సిలబస్ వారీగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వీడియో పాఠాలు రూపొందించాం. ఈ–పాఠశాల చానళ్లను అందించేందుకు ప్రైవేటు టీవీ నెట్వర్క్ ప్రొవైడర్లు కూడా అంగీకరించారు. ఇప్పటికే కొన్నిచోట్ల ప్రసారమవుతున్నాయి. త్వరలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంట్లో టీవీ ద్వారా విద్యార్థులు పాఠాలు వినొచ్చు. అలాగే యూట్యూబ్‌లో కూడా ఎప్పుడైనా వీటిని చూడొచ్చు. – కాటమనేని భాస్కర్, కమిషనర్, పాఠశాల విద్యాశాఖ మౌలిక వసతులు 3 నుంచి 9 తరగతి వరకు వీడియో కంటెంట్ పాఠశాల విద్యార్థులకు అవసరమైన సబ్జెక్టుల్లోని కంటెంట్‌ను ఇప్పటికే బైజూస్ రూపొందించి విద్యాశాఖకు అందించింది. వీటిని యధావిధిగా విద్యార్థులకు ఐఎఫ్‌పీల ద్వారా బోధించడంతోపాటు ట్యాబ్‌ల్లోనూ అప్లోడ్ చేశారు. అయితే, ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులకు లాంగ్వేజెస్‌తోపాటు కొన్ని సబ్జెక్టుల వీడియో పాఠాలను ఎస్సీఈఆర్టీ రూపొందించింది. ఇందులో ప్రధానంగా మూడో తరగతి విద్యార్థులకు.. తెలుగు, ఇంగ్లిష్ , మ్యాథ్స్, ఈవీఎస్, నాలుగు, ఐదు తరగతులకు.. తెలుగు, ఇంగ్లిష్ , ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు.. తెలుగు, ఇంగ్లిష్ , హిందీ సబ్జెక్టుల్లో వీడియో పాఠాలను అందుబాటులోకి తెచ్చింది. యూట్యూబ్‌లో పాఠాలు అందరికీ అందుబాటులో ఉండగా.. ప్రైవేటు నెట్వర్క్ ప్రొవైడర్లు చాలా ప్రాంతాల్లో డీటీహెచ్ చానళ్లను అందించడం లేదు. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన డీటీహెచ్ చానళ్లను అన్ని ప్రైవేటు కేబుల్ నెట్వర్క్ సంస్థలు కూడా అందించేలా పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను రూపొందించనుంది. -
అమ్మ కుట్టీ అమ్మ కుట్టీ... వెళ్దాం ఛలో ఎలి.కుట్టీ
అవసరమే కాదు ఆసక్తి కూడా కొత్త భాషను దగ్గర చేస్తుందని మలయాళ భాషను గడగడా మాట్లాడే ఎలిజెబెత్ కీటోన్‌ను చూస్తే అర్థమవుతుంది. జార్జియా (యూఎస్)కు చెందిన ఎలిజబెత్ ఇంగ్లీష్ టీచర్. కొత్త భాషలు నేర్చుకోవడం అంటే ఇష్టం. సౌత్‌కొరియా ఆ తరువాత యూఏఈలో ఇంగ్లీష్ పాఠాలు చెప్పింది. దుబాయ్‌లో ఉన్నప్పుడు మలయాళీ కుర్రాడు అర్జున్‌తో ఎలిజబెత్‌కు పరిచయం అయింది, ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లయింది. ఇక అప్పటి నుంచి శ్రీవారి మాతృభాషను నేర్చుకోవాలని డిసైడై పోయింది ఎలిజ బెత్. ‘30 రోజుల్లో మలయాళం’లాంటి ఔట్‌డేటెడ్ పుస్తకాలు, మార్గాలు తప్ప కొత్తవి కనిపించలేదు. దీంతో కోళికోద్లో ఉన్న ఒక టీచర్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో మలయాళం భాష నేర్చుకోవడం మొదలుపెట్టింది. అయితే సాంకేతిక కారణాల వల్ల అది మధ్యలోనే ఆగిపోయింది. దీంతో తనదైన స్టైల్లో సొంతంగా నోట్స్ రాసుకొని, డూడుల్స్ తయారు చేసుకొని మలయాళ భాషపై పట్టు సంపాదించింది. ‘ఎలి.కుట్టీ’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తి ఉన్నవారికి మలయాళం నేర్పుతోంది. -
అభూతకల్పనతో ఈనాడు ఒప్పందం
సాక్షి, అమరావతి: విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనతో ఈనాడుకు గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయింది. వర్సిటీల్లో బోధన పోస్టుల నియామకాల అంశం కోర్టులో ఉన్నంత కాలం ఒక్క పోస్టు కూడా ప్రభుత్వం భర్తీ చేయట్లేదని మొసలి కన్నీరు కార్చిన రామోజీ.. ఇప్పుడు ఒప్పంద ఉద్యోగులకు భద్రత లేదంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అభూతకల్పనలు, అవాస్తవాలతో ఒప్పందం చేసుకుని విషపూరిత రాతలతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. ఇందులో భాగంగానే ‘ఒప్పంద అధ్యాపకుల ఉద్యోగాలకు జగన్ ఎసరు’ అంటూ అసత్య కథనాన్ని అచ్చేశారు. దీనిని ఉన్నత విద్యామండలి గురువారం ఓ ప్రకటనలో ఖండించింది. 3,295 పోస్టుల భర్తీ ప్రభుత్వం ఉన్నత విద్యపై ప్రత్యేక దృష్టి సారించింది. చంద్రబాబు హయాంలో చేసిన తప్పులను సరిదిద్దుతూ బోధన సిబ్బంది నియామకాలు చేపడుతోంది. వర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,295 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిని జీర్ణించుకోలేని రామోజీరావు ఒప్పంద ఉద్యోగులకు భద్రత కరువైందంటూ ఊహాజనిత వార్తను అచ్చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో 20 వర్సిటీల్లో దాదాపు 3,046 మంది ఒప్పంద అధ్యాపకులు పని చేస్తున్నారు. వీరిలో అత్యధిక శాతం సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రోగ్రామ్‌లలో ఉన్నారు. వర్సిటీల్లో కొత్తగా చేపడుతున్న అధ్యాపక నియామకాలన్నీ రెగ్యులర్ పోస్టుల్లోనివే. అందువల్ల సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రోగ్రామ్‌లలో పని చేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు ఎటువంటి ఇబ్బందీ లేదు. వెయిటేజీతో భరోసా వర్సిటీల్లో పోస్టుల భర్తీలోనూ ఒప్పంద అధ్యాపకులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెయిటేజీ రూపంలో భరోసా కల్పించారు. దీనిపై త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ వెయిటేజితో చాలా మంది ఒప్పంద అధ్యాపకులు రెగ్యులర్‌గా మారతారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గతంలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసింది. అయితే వర్సిటీల్లో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి. చాలా వర్సిటీల్లో ఒప్పంద అధ్యాపకులను నియమించేటప్పుడు రిజిర్వేషన్ విధానాన్ని అవలంభించలేదు. రోస్టర్ పద్ధతిని పాటించలేదు.ఏ వర్సిటీ కూడా యూజీసీ నిర్దేశించిన పద్ధతుల్లో ఒప్పంద అధ్యాపకులను నియమించలేదు. కొన్ని వర్సిటీల్లో ఎవరు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు పని చేస్తున్నారు, ఎవరు రెగ్యులర్ పోస్టులకు పని చేస్తున్నారో కూడా తెలియదు. ఆ వ్యత్యాసాన్ని పాటించలేదు. మరీ ముఖ్యంగా ఆర్థిక శాఖ ఆమోదాన్ని పొందలేదు. వీటన్నింటీకి తోడు కోర్టు ఉత్తర్వులు వీరిని రెగ్యులరైజ్ చేయడానికి ప్రతిబంధకాలుగా మారాయి. అంతేగానీ ఎవరికీ అన్యాయం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. రాష్ట్రంలోని వర్సిటీల్లో పని చేస్తున్న పలువురు ఒప్పంద అధ్యాపకులు రెగ్యులర్ అవుతారు. మిగతా వారు ఇప్పుడున్నట్లుగానే కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతారు. ఎవరి ఉద్యోగాలకూ ఎటువంటి ఇబ్బందీ ఉండదు. పైగా కాంట్రాక్టు ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా వెయిటేజీని ప్రస్తావిస్తుంటే వారి ఉద్యోగాలు పోతాయంటూ ఈనాడు దుర్మార్గపు రాతలు రాయడం సిగ్గుచేటు. -
వినూత్న రీతిలో విద్యార్థులకు విద్యాబోధన
-
టీచర్‌గా మారిపోయిన నిత్యామీనన్.. వీడియో వైరల్
హీరోయిన్ నిత్యామీనన్ ఇప్పుడు టీచర్‌గా మారిపోయింది. ఇదేదో సినిమా షూటింగ్ కోసం కాదండోయ్. నిజంగానే పంతులమ్మగా మారిపోయి పిల్లలకు పాఠాలు చెప్పిందీ అందాల తార. ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్న నిత్యామీనన్ షూటింగ్ అనంతరం దగ్గర్లోని గవర్నమెంట్ స్కూల్‌కి వెళ్లింది. అక్కడి పిల్లలతో కాసేపు సరదాగా మాట్లాడిన ఆమె ఆ తర్వాత వారికి పాఠాలు చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. కృష్ణాపురం గ్రామంలోని ఈ పిల్లలతో న్యూ ఇయర్ డే ఆనందంగా గడిచిందంటూ నిత్యామీనన్ తన పోస్టులో రాసుకొచ్చింది. పల్లెటూర్లలో ఉండే చిన్నారులు బాల్యాన్ని ఎంతో ఆనందంతో గడుపుతారని, వాళ్ల చుట్టూ ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటానంటూ పేర్కొంది. ఇక నిత్యామీనన్ టీచింగ్ క్లాసులు చూసి ఫిదా అయ్యామంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) -
ఇలా కూడా పాఠాలు చెప్పొచ్చు.. ఈ పెద్దసారు తీరు చూస్తే ఆశ్చర్యపోతారు
-
ప్రతి విద్యార్థికీ ఉపాధి లభించాలి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు ఉపాధి కల్పించేలా ప్రస్తుత బోధన విధానంలో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఈ దిశగా విశ్వవిద్యాలయాల ఉప కులపతులు కార్యాచరణ చేపట్టాలని సూచించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి, టీసీఎస్, టీఎస్ ఆన్లైన్ నేతృత్వంలో ‘ఉపాధి అవకాశాల పెంపునకు సాధికార విద్య’ అనే అంశంపై సోమవారం హైదరాబాద్‌లో సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సబిత మాట్లాడుతూ, డిగ్రీలతో బయటకొచ్చే ప్రతి విద్యార్థికీ ఉపాధి లభించేలా చూడాలన్నారు. నైపుణ్యత పెంచడం ద్వారానే ఇది సాధ్యమని తెలిపారు. విద్యార్థులు హైదరాబాద్‌లోని కొన్ని కాలేజీల్లోనే ప్రవేశాలు కావాలని కోరుకుంటున్నారని, అలా కాకుండా అన్ని కాలేజీల్లోనూ ప్రవేశాలు కోరుకునే విధంగా ఆయా కాలేజీల్లో బోధన విధానంలో మార్పు తేవాలని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఏడు లక్షల మందికి రాష్ట్రంలో ఉపాధి కల్పించినట్టు తెలిపారు. నైపుణ్యమే ముఖ్యం నైపుణ్యంతో కూడిన విద్యతోనే ఉపాధి అవకాశాలుంటాయని ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టు్టగా ఇంటర్న్‌షిప్ ఉండాలన్నారు. మార్కులకు ప్రాధాన్యం ఇవ్వకుండా మంచి ప్రాజెక్టు వర్క్‌పైనే దృష్టి పెట్టాలని సూచించారు. డిగ్రీ చేతికి రాగానే ఉపాధి వెంట పరుగులు పెట్టేకన్నా, పరిశ్రమల స్థాపనపై దృష్టి పెట్టాలని చెప్పారు. 20ఏళ్ళ నాటి పుస్తకాలతోనే ఇంకా బోధన సాగుతుండటం శోచనీయమని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. నేటి అవసరాలకు అనుగుణంగా విద్య సాగాలని పేర్కొన్నారు. విద్యలో నాణ్యత, పరిణతి పెరగాల్సిన అవసరం ఉందని టీసీఎస్ భారత విభాగం ముఖ్య అధికారి గోపాలకృష్ణ జీఎస్ఎస్ తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి అనేక కొత్త కోర్సులను ప్రవేశపెట్టిందని మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. హానర్స్, బీఎస్సీలో డేటా సైన్స్ వంటి కోర్సులను ఉదహరించారు. మండలి వైఎస్ చైర్మన్ ప్రొఫెసర్ వి వెంకటరమణ, పలు యూనివర్శిటీల వీసీలు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఛత్తీస్‌గఢ్‌కు మన పాఠాలు!
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు తెలంగాణ ఆచార్యులు బోధించనున్నారు. ఇందుకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య సూత్రప్రాయమైన అంగీకారం కుదిరింది. త్వరలోనే ఈ మేరకు ఒప్పందం కూడా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించనుంది. దీనిపై ఇప్పటికే రెండు రాష్ట్రాలకు చెందిన విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పలు దఫాలుగా చర్చించారు. ఉన్నత విద్యలో జేఎన్టీయూహెచ్ తీసుకొస్తున్న సంస్కరణలు ఛత్తీస్‌గఢ్ వర్సిటీలను ఆకర్షించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తమ రాష్ట్రంలో నెలకొన్న ప్రొఫెసర్ల కొరతను కూడా ఆ రాష్ట్రం పరిగణలోనికి తీసుకుంది. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించేందుకు జేఎన్‌టీయూహెచ్‌ని సరైన భాగస్వామిగా ఎంచుకుంది. ముందుగా బీబీఏ డేటా అనలిస్ట్ కోర్సును ప్రారంభించాలని భావిస్తోంది. ఆ తర్వాత మరికొన్ని కోర్సులకు మన రాష్ట్ర అధ్యాపకుల తోడ్పాటు తీసుకునే అవకాశం ఉంది. కోర్సు నిర్వహణ, ఇతర అంశాలపై మరింత లోతుగా చర్చించాల్సి అవసరం ఉందని, ఆ తర్వాత అఖిల భారత సాంకేతిక విశ్వవిద్యాలయంతో పాటు మరికొన్ని సంస్థల అనుమతి తీసుకోవాల్సి ఉందని జేఎన్టీయూహెచ్ అధికారులు తెలిపారు. డిమాండ్ దృష్ట్యానే.. బీబీఏ డేటా అనలిస్ట్ కోర్సు గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఈ–కామర్స్ వ్యవస్థ బలపడుతున్న నేపథ్యంలో ఈ రంగంలో నిపుణుల అవస రం ఉందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. భారత్‌లో డేటా అనలిస్ట్ పూర్తి చేసిన విద్యార్థులు అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో మంచి వేతనాలతో ఉపాధి పొందుతు న్నారు. మన దేశంలోనూ డేటా అనలిస్టుల కొరత 60 శాతం వరకూ ఉందని ఇటీవల సర్వేలు పేర్కొన్నాయి. దీన్ని దృష్టి లో ఉంచుకుని గత రెండేళ్ళుగా బీబీఏ డేటా అనలిస్ట్ కోర్సు ను అంతర్జాతీయ ప్రమాణాలతో జేఎన్టీయూహెచ్ అభివృద్ధి చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోనూ బీబీఏ డేటా అనలిస్ట్ కోర్సుకు మంచి డిమాండ్ వస్తోంది. అయితే అక్కడ నిష్ణాతులైన అధ్యాపకుల కొరత కారణంగా ఈ కోర్సుకు అన్ని కాలేజీల్లోనూ అనుమతి ఇవ్వలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణతో భాగస్వామ్యానికి ఛత్తీస్‌గఢ్ సిద్ధమైంది. కోర్సు నిర్వహణ ఎలా? ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కాలేజీల్లో బీబీఏ అనలిస్ట్ కోర్సులో ప్రవేశాల ప్రక్రియను ఆ రాష్ట్రమే నిర్వహిస్తుంది. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా జేఎన్టీయూహెచ్కు లాగిన్ అవుతారు. ఇక్కడ ఎంపిక చేసిన ప్రొఫెసర్లు ఆన్లైన్ ద్వారా వారికి బోధన చేస్తారు. దీనికి అనుగుణంగా రెండుచోట్లా ఒకే తరహా సిలబస్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. పరీక్షలు కూడా ఆన్లైన్లోనే చేపట్టినప్పటికీ, మూల్యాంకన విధానం మాత్రం తామే చేపడతామని ఛత్తీస్‌గఢ్ అధికారులు అంటున్నారు. దీనిపై భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. బోధించే అధ్యాపకులే మూల్యాంకనం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇలావుండగా ఈ కోర్సు నిర్వహణ కారణంగా జేఎన్టీయూహెచ్కు ఆదాయం పెరిగే అవకాశం ఉందని, అవసరమైతే కోర్సుకు సంబంధించిన సర్టిఫికెట్ ఇచ్చే అంశాలపైనా ఆలోచిస్తున్నట్టు జేఎన్టీయూహెచ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మన అధ్యాపకులకు మంచి గుర్తింపు ఛత్తీస్‌గఢ్ కోరిక మేరకు బీబీఏ డేటా అనలిస్ట్ కోర్సుకు అవసరమైన బోధన తోడ్పాటు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. దీనివల్ల మన అధ్యాపకులకు మంచి గుర్తింపు ఉంటుంది. అయితే కోర్సు నిర్వహణపై సమాలోచనలు జరుగుతున్నాయి. అన్ని రకాల అనుమతులు వచ్చిన తర్వాత ప్రారంభించే యోచనలో ఉన్నాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి (జేఎన్టీయూహెచ్ వీసీ) -
రెండో ఏడాది నుంచే ఫీల్డ్ స్టడీ
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్య ఈ ఏడాది నుంచి సరికొత్తగా ఉండబోతోంది. మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు అన్ని కాలేజీలూ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. విశ్వవిద్యాలయాలు సైతం ఇప్పటికే బోధన ప్రణాళిక తీరు తెన్నులను కాలేజీలకు పంపాయి. విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకుండా స్వీయ అనుభవంతో బోధన ఉండబోతోందని యూనివర్సిటీలు స్పష్టం చేస్తున్నాయి. మార్కెట్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా విజ్ఞానం అందిపుచ్చుకునేందుకు కృషి చేయాలని అంటున్నాయి. ఉద్యోగులు కావాల్సిన కంపెనీలు నాలుగో సంవత్సరంలో కాకుండా ముందు నుంచే విద్యార్థులపై దృష్టి పెట్టబోతున్నాయి. వారిలో నైపుణ్యానికి పదును పెట్టే రీతిలో ప్రాజెక్టు వర్క్స్‌ను ఎంపిక చేసినట్టు కొన్ని కాలేజీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు తెలిపాయి. రెండో ఏడాది నుంచే... అన్ని బ్రాంచీల విద్యార్థులకు మొదటి సంవత్సరం పుస్తక విషయ పరిజ్ఞానం ఆధారంగానే కొనసాగుతుంది. రెండో ఏడాది నుంచి ప్రాజెక్టు రిపోర్టులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ నాల్గవ సంవత్సరంలో మాత్రమే ఈ ప్రక్రియ ఉండేది. అదికూడా విద్యార్థులు ఇష్టానుసారం ఏదో ఒక ప్రాజెక్టు సమర్పించేవాళ్లు. ఈ క్రమంలో విద్యార్థులు ఎవరో తయారు చేసిన ప్రాజెక్టులను కొని తెచ్చుకోవడం ఆనవాయితీగా మారింది. దీనివల్ల విద్యార్థికి డిగ్రీ చేతికొచ్చినా విషయ పరిజ్ఞానం పెద్దగా ఉండేది కాదు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వృత్తి నైపుణ్యం ఉండటం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రెండో ఏడాది నుంచే ప్రాజెక్టు రిపోర్టులను పక్కాగా తయారు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్టు విశ్వవిద్యాలయాల వైస్చాన్స్లర్లు చెబుతున్నారు. ఎంపిక చేసిన ప్రముఖ కంపెనీలకు సెకండియర్ విద్యార్థి వెళ్లాలి. అక్కడి నిపుణులతో మమేకమై సరికొత్త టెక్నాలజీపై ఆలోచన చేయాలి. విద్యార్థిలో విషయ పరిజ్ఞానం ఉందని, ప్రాజెక్టు రిపోర్టు సరికొత్తదేనని సంబంధిత సంస్థలు ధ్రువీకరించాలి. అప్పుడే ప్రాజెక్టు రిపోర్టును విశ్వవిద్యాలయాలు ఆమోదిస్తాయి. ఇదేవిధంగా నాల్గో సంవత్సరంలోనూ మరింత లోతైన అవగాహనతో ఆవిష్కరణ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల విద్యార్థి సంపూర్ణమైన స్వీయ పరిజ్ఞానం పొందుతాడని విశ్వవిద్యాలయాలు భావిస్తున్నాయి. కంప్యూటర్ కోర్సులపై దృష్టి రాష్ట్రంలో 90 వేల మంది ఇంజనీరింగ్‌లో చేరగా, ఇందులో 64 శాతం కంప్యూటర్ సైన్స్, ఐటీ బ్రాంచీలకు చెందిన వారున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ తదితర కంప్యూటర్ కోర్సులకు ప్రాధాన్యత పెరిగింది. ఇంజనీరింగ్ విద్యలో కేవలం బేసిక్ నాలెడ్జ్ మాత్రమే నేర్చుకోవడం ఇప్పటివరకూ జరిగింది. ఇక నుంచి తొలి ఏడాదిలోనే అంతర్జాతీయంగా వాడుకలో ఉన్న కోడింగ్ విధానంపై తర్ఫీదు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల అనుసంధానంతో కంప్యూటర్ కోర్సుల్లో లోతైన ప్రాక్టికల్ అనుభవాన్ని పొందుపరిచే దిశగా ఈ ఏడాది నుంచి బోధన ప్రణాళిక ఉండబోతోందని వర్సిటీలు స్పష్టం చేస్తున్నాయి. కోడింగ్‌పై సరైన అవగాహన ఉందనేది ప్రాజెక్టు రిపోర్టుల ద్వారా విద్యార్థి నిరూపించుకోవాలి. ప్రాజెక్టు రిపోర్టులే కీలకం ఈ ఏడాది నుంచి సెకండియర్‌లో ప్రాజెక్టు నివేదికలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. దీనివల్ల విద్యార్థి నాణ్యమైన ఇంజనీర్‌గా బయటకొచ్చే వీలుంది. ఎంతోమంది ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నా, విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్లకే మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. ఆ దిశగానే సరికొత్త బోధన ప్రణాళికకు శ్రీకారం చుడుతున్నాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, జేఎన్టీయూ వీసీ -
సాహో... ప్రొఫెసర్ శాంతమ్మ!
‘‘కుదిరితే పరిగెత్తు..లేకపోతే నడువు..అదీ చేతకాకపోతే పాకుతూ పో..అంతేకాని ఒకేచోట అలా కదలకుండా ఉండిపోకు’’..అంటూ మహాకవి శ్రీశ్రీ చెప్పిన మాటలను ఆమె అక్షరాలా అమలు చేస్తున్నారు. 93 ఏళ్ల వయసులోనూ మొక్కవోని దీక్షతో రోజూ రానూపోనూ 140 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ విద్యార్థులకు ఫిజిక్స్ పాఠాలు చెబుతున్నారు. కాలం ఎంతో విలువైనదని..దానిని ఎప్పుడూ, ఎవరూ వృథా చేయకూడదని చెబుతున్న ఆమె పేరు ప్రొఫెసర్ చిలుకూరి శాంతమ్మ. పంచే కొద్దీ జ్ఞానం పెరుగుతుందని నమ్మే శాంతమ్మ గురించి తెలుసుకోవాలని ప్రయత్నించగా విజయనగరం జిల్లా సెంచూరియన్ యూనివర్శిటీలో రెండు ఊత కర్రల సాయంతో నడుస్తూ... విద్యార్థులకు భౌతిక శాస్త్ర పాఠాలు బోధిస్తూ కనిపించారామె. వయసు మీదపడిందనే సంకోచం ఏమాత్రం ఆమెలో కనిపించలేదు. ఈ వయసులోనూ సంపూర్ణ ఆరోగ్యంతో అధ్యాపకురాలిగా సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న శాంతమ్మ తన జీవన ప్రయాణం గురించి ‘సాక్షిప్రతినిధి’కి చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘మా స్వస్థలం కృష్ణాజిల్లా మచిలీపట్నం..1929 మార్చి 8న జన్మించాను. నా తండ్రి సీతారామయ్య, న్యాయ వ్యవస్థలో పనిచేసేవారు. నేను ఐదు నెలల పసికందుగా ఉన్నప్పుడే ఆయన మా నుంచి దూరమయ్యారు. మా అమ్మ వనజాక్షమ్మ మాత్రం 104 ఏళ్లు జీవించారు. రాజమండ్రి, మదనపల్లి ప్రాంతాల్లో నా పాఠశాల విద్యాభ్యాసం గడిచింది. విశాఖపట్నం మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏవీఎన్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాను. అప్పుడే మహారాజా విక్రమ్ దేవ్ వర్మ నుండి భౌతికశాస్త్రంలో బంగారు పతకాన్ని అందుకున్నాను. ఫిజిక్స్ అంటే అంత ఇష్టం. అందులోనే బీఎస్సీ ఆనర్స్ చేశాను. ఆంధ్రా యూనివర్సిటీ నుండి మైక్రోవేవ్ స్పెక్ట్రోస్కోపీలో పీహెచ్‌డీకి సమానమైన డీఎస్సీ పూర్తి చేసి, ఆ తర్వాత 1956లో ఆంధ్రా యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో ఫిజిక్స్ లెక్చరర్‌గా చేరాను. లెక్చరర్ నుండి ప్రొఫెసర్, ఇన్వెస్టిగేటర్, రీడర్ వరకూ అనేక బాధ్యతలు నిర్వర్తించాను. ఇవన్నీ చేసే సరికి తెలియకుండానే 60 ఏళ్ల వచ్చేశాయి. 1989లో తప్పనిసరై పదవీ విరమణ చేశాను. విద్యార్థులకు ఇంకా పాఠాలు చెప్పాలనిపించింది. మళ్లీ ఆంధ్రా యూనివర్సిటీలో గౌరవ అధ్యాపకురాలిగా చేరాను. అక్కడే ఆరేళ్లు గడిచిపోయింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలలో పరిశోధనాత్మక ఇన్‌ఛార్జ్‌గా కూడా పనిచేశాను. పాఠాలు భోదిస్తూ... వృత్తిలో భాగంగా చాలా దేశాలు వెళ్లొచ్చాను. యూఎస్, బ్రిటన్, కెనడా, స్పెయిన్‌తో సహా అనేక దేశాల్లో జరిగిన సమావేశాలకు హాజరయ్యాను. అటామిక్ స్పెక్ట్రోస్కోపీ, మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించిన అంశాలపై చేసిన విశ్లేషణ 2016లో వెటరన్ సైంటిస్ట్స్ క్లాస్‌లో అనేక అవార్డులతో పాటు బంగారు పతకాన్ని సాధించిపెట్టింది. 12 మంది విద్యార్థులు నా పర్యవేక్షణలో పీహెచ్డీ పూర్తి చేశారు. నా భర్త చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి కొన్నేళ్ల క్రితం చనిపోయారు. మూడేళ్లు ఆయన మంచంపైనే ఉన్నారు. అంతకు ముందు వరకూ రోజూ నన్ను ఎక్కడికైనా ఆయనే తీసుకువెళ్లేవారు. ఆయన తెలుగు ప్రొఫెసర్ కావడంతో నాకు ఉపనిషత్తుల గురించి బోధించేవారు. ఆయన వల్లనేమో పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులపై కూడా ఆసక్తి ఏర్పడింది. భగవద్గీత శ్లోకాలను ఆంగ్లంలోకి అనువాదం చేసి ‘భగవద్గీత ది డివైన్ డైరెక్టివ్‘ అనే పుస్తకాన్ని రచించే వరకూ వెళ్లింది. వయసుతో వచ్చే సమస్యలు నన్నేమీ చేయలేకపోయాయి. రెండు మోచిప్పలకూ శస్త్ర చికిత్స జరిగి ఇరవై ఏళ్లయ్యింది. అయినా ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాను. చనిపోయేవరకూ చదువు చెప్పాలనేది నా సంకల్పం. నేను క్లాస్ తీసుకుంటే విద్యార్థులెవరూ మిస్ అవ్వరు. అలాగే క్లాస్‌కి ఆలస్యంగా వెళ్లడం నా డిక్షనరీలో లేదు. సెలవు రోజుల్లోనూ ప్రత్యేక క్లాసులకు వస్తుంటాను. ఎందుకంటే యూనివర్శిటీలోని విద్యార్థులే నా పిల్లలు. పొద్దున్న 4 గంటలకే నిద్ర లేస్తాను. విశాఖపట్నంలో బయలుదేరి విజయనగరం చేరుకుంటాను. ఇక్కడి సెంచూరియన్ యూనివర్శిటీలో రోజుకు కనీసం ఆరు క్లాసులు తీసుకుంటాను. చిత్రమేమిటంటే ఆంధ్రా యూనివర్శిటీ మాజీ వీసీ, ఇప్పుడు సెంచూరియన్ యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజు నా దగ్గరే చదువుకున్నారు. ప్రపంచంలోనే పెద్ద వయసు ప్రొఫెసర్‌ను నేనేనట. గిన్నిస్‌బుక్ వాళ్లకు నా పేరును సూచిస్తానని నా శిష్యుడు రాజు ఈ మధ్యనే అన్నారు. మాది ఆరెస్సెస్ నేపథ్యం ఉన్న కుటుంబం... డబ్బు, ఆస్తిపాస్తులపై మమకారం లేదు. మా వారు ఇంటిని కూడా వివేకానంద మెడికల్ ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చేద్దామంటే సరే అన్నారు. ఇప్పుడు అద్దె ఇంటిలో ఉంటున్నాను. మావారికి ఆరోగ్యం బాగోలేనప్పడు ఒక అబ్బాయి నాకు తోడుగా ఉండేవాడు. అతనిని చదివించి, పెళ్లి చేశాను. అతనికి ముగ్గురు పిల్లలు.. అతనితోపాటు అతని భార్య, పిల్లలు కలిపి ఇంట్లో మొత్తం ఆరుగురం. అందరం అదే అద్దె ఇంటిలో జీవిస్తున్నాం’’. – బోణం గణేష్, సాక్షి, అమరావతి. ఫొటోలు: డి.సత్యనారాయణమూర్తి, విజయనగరం. -
సరికొత్తగా ఇంజనీరింగ్ బోధన
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యాబోధనకు కొత్త పాఠ్య ప్రణాళికను పరిచయం చేయబోతున్నారు. ఈ దిశగా ఉన్నత విద్యా విభాగం కసరత్తు చేస్తోంది. సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ నేతృత్వంలో ఇటీవల కొత్త పాఠ్య ప్రణాళిక రూపకల్పనపై వీసీలతో సమావేశం జరిగింది. మారుతున్న ప్రపంచంతో పోటీ పడేలా సాంకేతిక విద్యా బోధన ప్రణాళిక ఉండాలని నవీన్ మిత్తల్ సూచించారు. జాతీయ విద్యా విధానంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించినట్టు పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే..: ఇటీవల జేఎన్టీయూ పాలక మండలి సమావేశంలో కొత్త పాఠ్య ప్రణాళికపై చర్చించింది. కొత్త పాఠ్య ప్రణాళికకు ఆమోదం తెలుపుతున్నట్టు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు తాము సిద్ధమని తెలిపింది. ఉస్మానియా యూనివర్సిటీ సహా రాష్ట్రంలోని అన్ని వర్సిటీలూ ఇదే దారిలో పయనించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఒకేసారి రెండు డిగ్రీలు: ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక విద్యతో పాటు, ఇతర కోర్సులు చేస్తే తప్ప ఉపాధి లభించే అవకాశం కనిపించడం లేదు. చాలామంది ఇంజనీరింగ్ తర్వాత క్యాంపస్ నియామకాలు లేకపోతే ఇతర కోర్సులు లేదా మేనేజ్మెంట్ (ఎంబీఏ) కోర్సులు చేస్తున్నారు. అయితే, ఇంజనీరింగ్ చేస్తూనే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వంటి కోర్సులు చేసేందుకు వీలుగా వర్సిటీలు తమ బోధన విధానాన్ని మార్చుకోబోతున్నాయి. దీంతో పాటు తమకు నచ్చిన సబ్జెక్టును అదనంగా జాతీయంగా, అంతర్జాతీయంగా, ఆన్లైన్ ద్వారా చేసేందుకు అనుమతించాలని యూనివర్సిటీలు భావిస్తున్నాయి. ఒక విద్యార్థి ఇంజనీరింగ్ రెండో ఏడాది పూర్తిచేసి, ఆపేస్తే.. దాన్ని డిప్లొమా పూర్తి చేసినట్టు భావించాలని నూతన విద్యా విధానం పేర్కొంటోంది. ఇందుకు అనుగుణంగా మార్పులు చేసేందుకు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అంతర్జాతీయంగా విద్యా ప్రమాణాలను గ్రేడ్లుగా పరిగణిస్తారు. టెన్త్ వరకూ ఒక గ్రేడ్, ఇంజనీరింగ్, డిప్లొమా వేర్వేరు గ్రేడులుగా ఉంటాయి. ఈ విధానానికి అనుగుణంగా ఇంజనీరింగ్ రెండేళ్లు చేస్తే డిప్లొమా కోర్సుగా భావించాలని జేఎన్టీయూహెచ్ పాలక మండలి నిర్ణయించింది. -
‘ఏ టు జెడ్’ పట్టు చిక్కేలా..
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని సర్కారు నిర్ణయించడంతో.. విద్యాశాఖ కసరత్తును వేగవంతం చేసింది. ద్విభాషా (ఇంగ్లిష్, తెలుగు) బోధనకు అనుగుణంగా పుస్తకాలను ముద్రించే ప్రక్రియ వేగం పుంజుకుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆంగ్ల మాధ్యమంలో బోధనపై టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు సుమారు 20వేల మంది రిసోర్స్ పర్సన్స్‌ను విద్యా శాఖ ఎంపిక చేసింది. ప్రస్తుతానికి ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం కోసం పెద్దగా మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరమేమీ లేదని.. బోధనకు ఉపాధ్యాయులను సమాయత్తం చేయడమే ప్రధాన అంశమని అధికారులు చెప్తున్నారు. దశలవారీగా టీచర్లు ఆంగ్లంపై పట్టుసాధించేలా చేయడంపైనే దృష్టిపెట్టినట్టు పేర్కొంటున్నారు. పెరిగిన పోటీ చాలా వరకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమాన్ని కోరుకుంటున్నారు. ఈ కారణంగానే పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నామని చెప్తున్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లల్లో 30 లక్షల మంది విద్యార్థులుంటే.. అందులో 95 శాతం ఆంగ్ల మాధ్యమంలోనే చదువుతుండటం గమనార్హం. రాష్ట్రంలో 26,072 ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తంగా 22.93 లక్షల మంది చదువుతున్నారు. ఇందులో ఇంగ్లిష్ మీడియం వారి సంఖ్య 10.21 లక్షలే. వీరికి కూడా ఇంగ్లిష్ మీడియం బోధన అరకొరగా సాగుతోంది.\\ తెలుగులోనే పాఠాలు చెప్తున్న పరిస్థితి. విద్యార్థులకు సరిగా అర్థంకాకపోవడమే దీనికి కారణమంటూ టీచర్లు సాకులు చెప్తున్నారన్న విమర్శలున్నాయి. నిజానికి చాలామంది ఉపాధ్యాయులు ఇంగ్లిష్‌లో బోధన అంటే భయపడుతున్నారని ఇటీవల విద్యాశాఖ సర్వేలో వెల్లడైంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే.. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి, వారిలో భయం పోగొట్టాలని.. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా బోధించేలా చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఎక్కువ రోజులు శిక్షణ.. గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఉపాధ్యాయులకు ఎక్కువ రోజులు ఇంగ్లిష్‌పై శిక్షణ ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 2009లో సక్సెస్ స్కూళ్లు పెట్టినప్పుడు 13 రోజులే శిక్షణ ఇచ్చారు. తమకు కనీసం 3 నెలలైనా శిక్షణ అవసరమని టీచర్లు చెప్తున్నారు. దీంతో వీలైనంత త్వరగా శిక్షణ మొదలుపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. సగానికిపైగా టీచర్లకు శిక్షణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1.03 లక్షల మంది ఉపాధ్యాయులున్నారు. అందులో 60 వేల మంది వరకు ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో బోధిస్తున్న స్కూళ్లలో పనిచేస్తున్నారు. వీరిలో చాలామంది తగిన శిక్షణ లేకున్నా ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులే(ఎస్జీటీలే) అని విద్యాశాఖ పరిశీలనలో గుర్తించింది. హైస్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ) ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నారు. విద్యాశాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం.. 23 వేల మంది ఎస్జీటీలు, 27 వేల మంది స్కూల్ అసిస్టెంట్లు, మరో 5 వేల మంది భాషా పండితులు ఇంగ్లిష్‌లో పాఠాలు చెప్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధించని వారితోపాటు ఇప్పటికే బోధిస్తున్నవారిలోనూ కొందరికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని అధికారవర్గాలు గుర్తించాయి. -
పరిశోధనా? ఉపరితల శోధనా?
కార్యకారణాలేమైనా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇన్నాళ్ళకు కళ్ళు తెరిచినట్టుంది. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పాఠాలు చెప్పేందుకు ఆయా రంగాల నిపుణులను వినియోగించుకోవాలని నిర్ణయించడం మంచిదే. ఎంత అనుభవం, నైపుణ్యం ఉన్నా – పీహెచ్డీ పట్టా కానీ, జాతీయ అర్హతా పరీక్ష (నెట్)లో కృతార్థులై కానీ ఉంటే తప్ప అధ్యాపకులుగా పనిచేయడానికి వీలు లేదన్న షరతుకు వెసులుబాటు లభించింది. సివిల్ సర్వీసులలో లాగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్ ఆచార్య పదవుల్లోకి లేటరల్ ఎంట్రీ వచ్చినట్టయింది. ఈ కొత్త విధానంతో పాటు, కొంతకాలంగా ఉద్యోగానికీ – పీహెచ్‌డీకీ ముడిపెట్టిన ప్రహసనంపై ఇప్పుడు చర్చ రేగింది. నిజానికి డాక్టోరల్ థీసిస్ (పీహెచ్డీ) అనేది నిర్ణీత అంశాన్ని లోతుగా తెలుసుకోవాలనే ఆసక్తితో, మనసు పెట్టి చేయాల్సిన పని. ఉద్యోగార్హత కోసం చేసే మొక్కుబడి వ్యవహారం కాదు. అలాగే, నాణ్యమైన బోధన చేయాలంటే పీహెచ్డీ చేసి తీరాలని అనుకోవడం బోడిగుండుకూ, మోకాలికీ ముడిపెట్టడమే! అద్భుతంగా పాఠం చెప్పగలిగినవాళ్ళందరూ పరిశోధకులై ఉంటారనుకున్నా, ఉత్తమ పరిశోధకులైనంత మాత్రాన అర్థమయ్యేలా పాఠం చెప్పే నేర్పు ఉంటుందనుకున్నా పొరపాటు. విధాన నిర్ణేతలు ఈ చిన్న తర్కం మర్చిపోయారు. పీహెచ్డీ చేయకున్నా, దాదాపు 40 గౌరవ డాక్టరేట్లొచ్చిన అబ్దుల్ కలామ్ ఎంత అద్భుత బోధకులో గుర్తు చేసుకోవాలి. అధ్యాపకులుగా ఎంపిక కావాలన్నా, ఇప్పటికే అధ్యాపక వృత్తిలో ఉన్నవారు ఆ పనిలోనే కొనసాగాలన్నా పీహెచ్డీ చేసి తీరాల్సిందే అని కొన్నేళ్ళ క్రితం పెట్టిన నిబంధన నిర్హేతుకమనేది అందుకే! ఒకప్పుడు ఉద్యోగానికి పీహెచ్డీ తప్పనిసరి కాదు. 2021 జూలై నుంచి యూనివర్సిటీ బోధనకు పీహెచ్డీ తప్పనిసరి చేసింది యూజీసీ. కరోనాతో తేదీని 2023 వరకు పొడిగించారు. కానీ, ఉన్నత విద్యాబోధనలో ఉండాలంటే పీహెచ్డీ సాధించాల్సిందేనని మెడ మీద కత్తి పెడితే ప్రయోజనం ఉంటుందా? ఒకప్పుడు డాక్టరేట్ అంటే అదో విశిష్ట సాధన. గౌరవ డాక్టరేట్లు, కష్టపడి పరిశోధన చేసి పీహెచ్డీ పట్టాతో పేరు ముందు వచ్చే డాక్టర్ అనే మూడక్షరాలు సమాజంలో విశేష గౌరవం. ఆ మోజు పెరిగేసరికి పేరు లేని విదేశీ సంస్థల మొదలు ప్రైవేట్ విద్యా లయాల దాకా అనేకుల గౌరవ డాక్టరేట్లు ఇవాళ అంగడి సరుకయ్యాయి. గౌరవ డాక్టరేట్లను పేరు ముందు ఇంటి పేరులా వాడరాదన్నది విస్మరించిన వేళ అసలు డాక్టరేట్కే గౌరవం లేకుండా పోయే ప్రమాదం వచ్చింది. 1920లలో మన దగ్గర కొన్ని డజన్ల మందే పీహెచ్డీ స్కాలర్లుండేవారు. ఇవాళ అమెరికాలో ఏటా 64 వేలకు పైగా డాక్టరేట్లు వస్తుంటే, 24 వేల మంది పీహెచ్డీ స్కాలర్లతో మనం ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నాం. 2010తో పోలిస్తే 2017లో పీహెచ్‌డీలో చేరేవారి సంఖ్య రెట్టింపు దాటింది. 2000 నాటికి దేశంలో డాక్టరేట్ ప్రదానం చేసే సంస్థలు 326. కానీ, 2017 కల్లా వాటి సంఖ్య 912 అయిందంటే పీహెచ్డీ ఎంత వేలంవెర్రిగా మారిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి, నిరంతర అధ్యయనం, క్షేత్రస్థాయి పర్యటనలు, ప్రొఫెసర్ల మార్గదర్శనం, విశ్వవిద్యాలయాల్లో పరిశోధన పత్రాల సమర్పణ – అంతా ఒక సీరియస్ జ్ఞానార్జన. కానీ, ఇవాళ పరిశోధకులకే కాదు... వారికి దిశా నిర్దేశ విధుల్లో ఉన్న చాలామందిలోనూ విషయ పరిజ్ఞానం హుళక్కి. ఇప్పటికే పలు విశ్వవిద్యాలయ శాఖలు పీహెచ్డీ స్కాలర్లను టోకున బయటకు పంపే కర్మాగారాలయ్యాయి. అనేకచోట్ల అజ్ఞాత రచయితల సహకారం, గ్రంథ చౌర్యం, నాసిరకం పరిశోధనాంశాలు, పత్రాలతో ప్రమాణాలు నానాటికీ తీసికట్టు అయ్యాయి. నాలుగు వాక్యాలు రాయలేనివాళ్ళు, నాలుగు మాటలు సదస్సులో మాట్లాడలేనివాళ్ళూ నేడు పీహెచ్డీ పట్టాదారుల్లో ఉంటున్నారన్నది నిష్ఠురమైన నిజం. ఉద్యోగానికీ, ఉద్యమంగా చేయాల్సిన పరిశోధనకూ లింకు పెట్టడం మన విధాన నిర్ణేతల ఘోర తప్పిదం. దానివల్లే పీహెచ్డీ ప్రవేశాలు 50 శాతం పెరిగాయి. ప్రమాణాలు పాతాళానికి చేరాయి. కనీసం మూడు నుంచి అయిదేళ్ళ కఠోర శ్రమతో తపించి చేయాల్సిన పరిశోధనపై తపన లేనివాళ్ళు కూడా ఉద్యోగం కోసం వట్టి ఉపరితల శోధకులవుతున్న దౌర్భాగ్యం. ఆర్ట్స్ మొదలు సైన్స్ దాకా అనేకచోట్ల ఇదే పరిస్థితి. ఏటా 60 లక్షల మంది గ్రాడ్యుయేట్లు, 15 లక్షల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు వస్తున్న దేశంలో నిఖార్సయిన పరిశోధక విద్యార్థుల శాతం ప్రశ్నార్థకమే. విశ్లేషణాత్మక శోధన, వర్తమాన ప్రాసంగికత లోపించి, పునరుక్తులతో, సర్వే ఆధారిత సిద్ధాంతాలుగా తూతూ మంత్రపు ఉపరిశోధనలు పెరిగిపోయాయని తాజా నివేదికల మాట. వెరసి, జ్ఞానార్జనలో సరికొత్త అంశాలు వెలికి తీయాల్సిన పరిశోధన మౌలిక లక్ష్యం, లక్షణం నిర్వీర్యమైపోతున్నాయి. మౌలిక పరిశోధన మృగ్యమై, ఎంతసేపటికీ చూచిరాతలు, ఎత్తిపోతలతోనే వివిధ శాఖల్లో పీహెచ్డీ సిద్ధాంత గ్రంథాలు సిద్ధమవుతున్నట్టు ఆరోపణ. గ్రంథ చౌర్యాన్ని కనిపెట్టే సాఫ్ట్‌వేర్‌ను కొన్నేళ్ళ క్రితం ప్రవేశపెట్టారు. కానీ, ఆ ఒక్క పనితో పీహెచ్‌డీల నాణ్యత పెరుగుతుందా? చిత్తశుద్ధి లేని పీహెచ్‌డీతో నిర్ణీత విద్యాశాఖకు కలిగే ప్రయోజనం ఏమిటి? అలాంటి వారు బోధకులైతే విద్యా ర్థులకు వచ్చిపడే విజ్ఞానం ఏముంటుంది? ఇప్పటికైనా నిష్ప్రయోజనమైన ఈ డిగ్రీల తంతును వదిలించుకొని, నిఖార్సయిన పరిశోధనలను యూజీసీ, మానవ వనరుల అభివృద్ధిశాఖ ప్రోత్సహిస్తే మేలు. ప్రహసనప్రాయంగా మారిన ‘నెట్’ లాంటి వాటి పైనా పునఃసమీక్ష అవసరం. పీహెచ్డీ లేకున్నా, అనుభవజ్ఞులైన వారి సేవలు తీసుకోవాలన్న తాజా నిర్ణయం అందుకే స్వాగతనీయం. -
ఉపాధ్యాయుడి బాగోతం బట్టబయలు.. జీతం లక్ష.. కానీ తనకు బదులుగా..
చింతూరు (తూర్పుగోదావరి): ఆ అయ్యవారి జీతం అక్షరాలా లక్ష రూపాయలు పైగా ఉంది. నెల తిరిగేసరికి ఆ డబ్బులు లక్షణంగా తీసుకుంటున్నాడు. జీవితం హ్యాపీగా గడుపుతున్నాడు. కానీ తన కనీస కర్తవ్యమైన బోధనను మాత్రం విస్మరించాడు. చిన్నారులకు పాఠాలు చెప్పడానికి విముఖత చూపుతున్నాడు. మారుమూల గిరిజన గ్రామం కదా! తనను ఎవరేం చేస్తారని అనుకున్నాడేమో! అస లు పాఠశాలకే వెళ్లడం లేదు. ఇందుకు ఎటువంటి అనుమతీ కూడా తీసుకోలేదు. పైగా తనకు బదులుగా పాఠాలు చెప్పడానికి ఓ యువకుడిని తానే దర్జాగా నియమించేశాడు. రోజూ కొంత డబ్బులు కూడా చెల్లిస్తున్నాడు. ఈ అయ్యవారి బాగోతం ఎట్టకేలకు బట్టబయలైంది. చదవండి: Kachidi Fish: తగ్గేదేలే.. కచ్చిడి కచ్చిడే!.. ధర ఎంతంటే? చింతూరు మండలంలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దున ఉన్న మారుమూల గిరిజన గ్రామం ఇరకంపేట. ఇక్కడి గిరిజన ప్రాథమిక పాఠశాల(జీపీఎస్)లో 52 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరిలో ఒకరు లాంగ్‌లీవ్‌లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మరో రెగ్యులర్ ఉపాధ్యాయుడు ముచ్చిక రెడ్డి పాఠశాలకు తప్పనిసరిగా విధులకు హాజరు కావాల్సి ఉంది. ఏడుగురాళ్లపల్లిలో నివాసం ఉంటున్న అతడు పాఠశాలలో విధులకు హాజరు కావడం లేదు. ఈ విషయం బయటకు పొక్కడంతో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు చిచ్చడి మురళి, వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు కలసి శనివారం ఆ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ, ఉపాధ్యాయుడు ముచ్చిక రెడ్డి పాఠశాలకు గైర్హాజరవుతున్నాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రూ.లక్షకు పైగా జీతం తీసుకుంటున్న ఆ ఉపాధ్యాయుడు తన బదులు అదే గ్రామానికి చెందిన యువకుడు ముచ్చిక రవికుమార్‌ను అనధికారికంగా నియమించుకున్నాడని, అతడికి రోజుకు రూ.150 చొప్పున చెల్లిస్తూ, విద్యార్థులకు పాఠా లు చెప్పిస్తున్నాడని తెలిపారు. రవికుమార్ కూడా ఈ విషయాన్ని అంగీకరించాడని చెప్పారు. ఉపాధ్యాయుడు గైర్హాజరవుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి గ్రామస్తులు తీసుకువెళ్లినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని తెలిపారు. ఉపాధ్యాయుల వైఖరి ఇలాగే ఉంటే విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితులు నెలకొంటాయన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్‌తో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లానని మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సవలం అమల, వైస్ ఎంపీపీ యడమ అర్జున్, ఎంపీటీసీ సభ్యుడు సున్నం నాగరాజు, సర్పంచ్‌లు సవలం సత్తిబాబు, పాయం చంద్రయ్య, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ యగుమంటి రామలింగారెడ్డి పాల్గొన్నారు. -
బడి బాటలో పిల్లలు... బదిలీల బాధలో టీచర్లు
సాక్షి, హైదరాబాద్: దాదాపు మూడు వారాల తర్వాత పునః ప్రారంభమవుతున్న విద్యాసంస్థలకు టీచర్ల ఆందోళన ఇబ్బందిగా మారుతోంది. ఈ సెలవుల సమయంలోనే జోనల్ వ్యవస్థకు సంబంధించిన బదిలీల ప్రక్రియ పూర్తికాగా.. పలు అంశాలపై విభేదిస్తూ టీచర్లు ఆందోళన బాట పట్టారు. ప్రధానోపాధ్యాయలు మల్టీజోనల్ బదిలీల్లో హేతుబద్ధత లేదంటూ కోర్టుకెళ్లగా.. స్థానికత, మరికొన్ని అంశాలపై ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా దశలవారీ ఆందోళనలకు పిలుపునిచ్చాయి. సోమవారం నుంచి ఈ నిరసనలను తీవ్రతరం చేయాలని ఉపాధ్యాయ ఐక్యపోరాట కమిటీ నిర్ణయించింది. ఫిబ్రవరి 5వ తేదీన హైదరాబాద్‌లో మహాధర్నాకు పిలుపునిచ్చింది. 317 జీవోలో ప్రధాన సమస్యలను పరిష్కారిస్తామని ప్రభుత్వం చెప్పినా.. ఇంతవరకు అధికారిక ఆదేశాలేవీ రాలేదు. పరస్పర బదిలీలు, ఒంటరి మహిళల ఆప్షన్లు, సీనియారిటీలో అన్యాయం వంటి పలు అంశాలపై ప్రభుత్వం తుది నిర్ణ యం ప్రకటించాల్సి ఉంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ 317 జీవో వేడి పుట్టిస్తోంది. బదిలీలను వ్యతిరేకిస్తూ లెక్చరర్లు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో బోధనకు ఇబ్బంది ఉంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానోపాధ్యాయుల కొరతతో.. రాష్ట్రవ్యాప్తంగా 4,379 ప్రధానోపాధ్యాయుల పోస్టులుంటే.. ప్రస్తుతం 2,423 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మరో 1,956 హెచ్ఎం పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. 45 శాతం పోస్టుల ఖాళీ ఒక సమస్య అయితే.. ప్రస్తుతం మల్టీ జోనల్ బదిలీల్లో 98 మందిని ట్రాన్స్ఫర్ చేశారు. వారంతా బదిలీలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది విధుల్లో చేరలేదు కూడా. ఇక రాష్ట్రంలో మొత్తం 591 మండలాల్లో 528 మండల విద్యాధికారుల పోస్టులున్నాయి. ఇందులో 20 మంది మాత్రమే రెగ్యులర్‌గా పనిచేస్తున్నారు. మిగతా వారంతా ఇన్చార్జులే. దీనికి తోడు 317 జీవో కారణంగా దాదాపు 15 వేల మంది ఉపాధ్యాయులు స్థానికేతర జిల్లాలకు వెళ్లాల్సి వచ్చింది. వారు ఇంతవరకూ క్లాసులకు హాజరవ్వలేదు. కొత్తగా విద్యార్థులను పరిచయం చేసుకుని బోధన చేయాల్సి ఉంటుంది. అందులోనూ కొందరు టీచర్లు పరస్పర బదిలీల కోసం నిరీక్షిస్తున్నారు. వీటన్నింటితో బోధనకు మరికొంత ఆలస్యం పట్టే అవకాశం ఉంది. దీంతో విద్యా బోధన ఎలా జరుగుతుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
సిలబస్ టెన్షన్.. బుర్రకెక్కింది అంతంతే...
సాక్షి, హైదరాబాద్: మళ్లీ ఆన్లైన్ బోధన నేపథ్యంలో సిలబస్ పూర్తి కావడం ప్రశ్నార్థకంగా తయారైంది. ఒకవైపు ఉపాధ్యాయులు, మరోవైపు విద్యార్థుల్లో సిలబస్ టెన్షన్ మొదలైంది. కరోనా నేపథ్యంలో పాఠశాలల పునఃప్రారంభం ఆలస్యం కావడంతో ఉన్నత తరగతులకు సిలబస్ 40 శాతం మించలేదు. గురుకుల విద్యాసంస్థల్లో పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ఇక ప్రభుత్వ విద్యా సంస్థల్లో సిలబస్ కనీసం 20 నుంచి 30 శాతం మించలేదు. గత నెల రోజులుగా ఉపాధ్యాయుల బదిలీల వ్యవహారం ప్రత్యక్ష బోధనపై తీవ్ర ప్రభావం చూపించింది. బుర్రకెక్కింది అంతంతే... ఈ విద్యా సంవత్సరం కూడా పాఠ్యాంశాలపై విద్యార్థులు పట్టు సాధించలేక పోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మొదటి మూడు నెలలు ఆన్లైన్ విధానంలో బోధన కొనసాగగా, ఆ తర్వాత నాలుగు నెలల క్రితం విద్యా సంస్థలు పునఃప్రారంభమై ప్రత్యక్ష బోధనకు శ్రీకారం చుట్టారు. అక్టోబర్ నాటికి పూర్తయిన సిలబస్ ఆధారంగా గత నెలలో ఎస్ఏ– 1 పరీక్షలు నిర్వహించగా పాఠ్యాంశాలపై విద్యార్థుల పట్టు అంతంత మాత్రంగా బయటపడింది. కనీసం పదో తరగతి విద్యార్థులు సైతం పాఠ్యాంశాలపై పెద్దగా పట్టు సాధించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రాజెక్టులకే పరిమితం పదో తరగతి మినహా మిగతా తరగతుల విద్యార్థులు పాఠ్యాంశాలకు బదులు ప్రాజెక్టులకు పరిమితమయ్యారు. పాఠ్యాంశాల బోధన పక్కనపెట్టి ప్రాజెక్టులు ఇవ్వడం సర్వసాధారణమైంది. వాస్తవానికి సిలబస్ 30 శాతం కూడా మించలేదు. ఇక ప్రభుత్వ పాఠశాల పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. గత రెండేళ్లుగా చదువులు సరిగా సాగకపోవడంతో విద్యార్థులు పాఠ్యంశాలపై పట్టు సాధించలేకపోయారు. ఇక ఆన్లైన్ తరగతులే.. ► కరోనా మూడో దశ ఉద్ధృతి నేపథ్యంలో విద్యా సంస్థలు మళ్లీ ఆన్లైన్ సిద్ధమయ్యాయి, సోమవారం నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు వాట్సాప్ సందేశాలు పంపించాయి. తరగతుల షెడ్యూలు కూడా ప్రకటించాయి. (చదవండి: హైదరాబాద్‌లో ఊపందుకున్న రియల్టీ జోరు) ► సంక్రాంతి సెలవులు ఆదివారంతో ముగియడంతో తాజా కరోనా పరిస్థితుల దృష్ట్యా విద్యాసంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. విద్యార్థులు నష్టపోకుండా ఆన్లైన్ తరగతులను నిర్వహించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో విద్యా సంవత్సరం ఆరంభంలో మొదట మూడు నెలల పాటు ఆన్లైన్ పద్ధతిలో కొనసాగినా బోధన వైరస్ ప్రభావం తగ్గుదలతో గత నాలుగు నెలలక్రితం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో అప్పటి నుంచి ప్రత్యక్ష బోధన కొనసాగుతోంది. గత నెల చివరి అంకం నుంచి వైరస్ విజృంభిస్తుండటంతో ప్రత్యక్ష బోధన ప్రశ్నార్థకంగా తయారైంది. దీంతో ముందస్తుగా సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. వైరస్ ఉద్ధృతి తగ్గక పోవడంతో సెలవులు పొడిగిస్తూ ఆన్లైన్ తరగతులకు వెసులుబాటు కల్పించింది. (చదవండి: తెలంగాణ కేబినెట్ భేటీ: కొత్త చట్టం కోసం..) -
స్కూల్లో ఐదుగురు టీచర్లు.. పాఠాలు బోధించిన ఉత్తమ సర్పంచ్..
సాక్షి, నెన్నెల (ఆదిలాబాద్): ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ, గ్రామాభివృద్ధికి పాటు పడటమే కాదు.. విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ, వారికి దగ్గరుండి భోజనం వడ్డిస్తూ శభాష్ అనిపించుకోంటోంది గొళ్లపల్లి సర్పంచ్ ఇందూరి శశికళ. సాధారణంగా సర్పంచ్‌లు గ్రామ సమస్యల పరిష్కారానికి పని చేస్తూ ఉంటారు. అందుకు భిన్నంగా టీచరమ్మగా మారి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతూ, వారి అభ్యున్నతికి చొరవ చూపుతోంది. ఆమె పని తీరును మెచ్చుకొని జిల్లా కలెక్టర్ భారతిహోళ్లీకేరి 2020లో మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తమ మహిళా సర్పంచ్‌గా పురస్కారం ప్రదానం చేసి ప్రత్యేకంగా అభినందించారు. వివరాల్లోకి వెళ్తే.. నెన్నెల మండలం గొల్లపల్లి సర్పంచ్ ఇందూరి శశికళ ఎంఎస్సీ బీఈడీ పూర్తి చేసింది. గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో 1–5 తరగతుల విద్యార్థులు 86మంది ఉన్నారు. మొత్తం ఐదుగురు టీచర్లు ఉండగా, ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై మరో చోటికి పంపించారు. మంగళవారం ముగ్గురు ఉపాధ్యాయులలో ఇద్దరు లీవ్‌లో ఉండగా, ఆ సర్పంచ్ పాఠశాలకు వెళ్లి పిల్లలకు ఆంగ్లమాధ్యమంలో బోధిస్తూ, దగ్గరుండి భోజనం వడ్డించారు. అటు రాజకీయంగా ఊరికి సేవలు చేస్తూ, ఇటు పిల్లలకు విద్యాదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులు లేక బోధన సాగకపోవడంతో విద్యాబోధన చేస్తున్నానని సర్పంచ్ పేర్కొంది. -
ఆన్లైన్.. కొత్త సారు.. ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ
ఆన్లైన్ క్లాస్ జరుగుతోంది.. టీచర్ సౌర కుటుంబం గురించి పాఠం చెప్తున్నారు.. గ్రహాలు, ఇతర అంశాల గురించి టీచర్ వివరిస్తున్న కొద్దీ.. స్క్రీన్‌పై ఒక్కొక్కటిగా స్పష్టంగా అర్థమయ్యేలా కనిపిస్తున్నాయి. కిడ్నీ పాఠం చెప్తున్నప్పుడు కిడ్నీ లోపలి భాగాలు, కణాల తీరు.. విత్తనం మొక్కగా మారే పాఠం వివరిస్తున్నప్పుడు విత్తనంలో జరిగే మార్పుల నుంచి మొక్క ఎదిగేదాకా.. స్పష్టంగా ఫోన్ తెరపై కనిపిస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరంలో మన ముందుకు కొత్త టీచర్లు వస్తున్నారు. ఆన్లైన్ పాఠాలైనా సరే.. తరగతి గదిలో కన్నా మెరుగ్గా నేర్పించనున్నారు. విద్యార్థుల నైపుణ్యాలను, అవగాహనను మరింత పెంచేలా అద్భుతంగా బోధించనున్నారు. వారే ‘డిజిటల్ టీచర్లు..’ వారికి తోడ్పడే సరికొత్త విధానాలే అగుమెంటెడ్, వర్చువల్ రియాలిటీలు. పాఠశాలల్లో కాస్త మౌలిక సదుపాయాలు, విద్యార్థుల దగ్గర ఇంటర్నెట్తో కూడిన స్మార్ట్‌ఫోన్/ట్యాబ్లెట్ ఉంటే చాలు. తక్కువ ఖర్చుతోనే అత్యుత్తమ విద్య అందించేందుకు వీలయ్యే అద్భుతమైన యాప్‌లు, వెబ్సైట్లు, సాంకేతిక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. కరోనా కారణంగా రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్లు, ఆంక్షలతో విద్యా బోధనపై ప్రభావం పడింది. దానితో ఆన్లైన్ విద్యా విధానంపై విస్తృతంగా పరిశోధనలు జరిగి.. మెరుగైన బోధనా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే పలు పాఠశాలల్లో ఈ విధానాలపై చేసిన ప్రయోగాలు మంచి ఫలితాలను ఇచ్చాయి కూడా. రెండు సాంకేతికతలతో.. ఆన్లైన్ బోధన అంటే ఇప్పటిదాకా చాలా మందికి తెలిసినది ఏమిటంటే.. తరగతి గదిలో టీచర్ పాఠం చెబుతుంటే, విద్యార్థులు సెల్ఫోన్లోనో, కంప్యూటర్లోనో చూస్తూ వినడమే. విద్యార్థికి పాఠం అర్థమవుతోందా? అసలు వింటున్నారా? లేదా? ఏదైనా సందేహం తీర్చుకోవాలనుకుంటున్నారా? అనేది తెలియడం కష్టమే. అంతేకాదు విద్యార్థులకు ఎంతమేర అర్థమైందన్నది బేరీజు వేసేందుకు పరీక్షలు లేకపోవడం మరో సమస్య. కానీ కొత్తగా అందుబాటులోకి వచ్చిన యాప్స్, వెబ్సైట్లు, ఇతర ఆన్లైన్ విధానాలతో ఈ పరిస్థితి సమూలంగా మారబోతోంది. ఈ క్రమంలో ప్రధానంగా అగుమెంటేషన్, వర్చువల్ రియాలిటీ అనే రెండు పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ► అగుమెంటేషన్ విధానంలో టీచర్ పాఠం చెప్తుండగానే.. విద్యార్థులు ఆయా అంశాలను అనుభవ పూర్వకంగా పరిశీలించగలిగే అవకాశం ఉం టుంది. ఉదాహరణకు మొక్క ఎదుగుదల పా ఠం చెబుతుంటే.. విత్తనం నుంచి మొక్కగా, చెట్టుగా ఎలా మారుతుందనే దృశ్యాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. టీచర్ నేరుగా మొక్కల మధ్య ఉండి పాఠం చెప్పినట్టుగా అనుభూతి కలుగుతుంది. ► వర్చువల్ రియాలిటీ విధానంలో కీలక అంశాలను అత్యంత సులువగా అర్థమయ్యేలా బోధించవచ్చు. ఉదాహరణకు టీచర్ సౌర కుటుంబం గురించి పాఠం చెప్తున్నప్పుడు.. టీచర్ ఒక్కో అంశాన్ని వివరిస్తున్న కొద్దీ దానికి సంబంధించిన చిత్రాలు కనిపిస్తుంటాయి. ప్రాక్టికల్‌గా ఆ అంశం తెలుసుకునే అనుభూతి వస్తుంది. సైన్స్ సబ్జెక్టుల్లో దీని ప్రాధాన్యత ఎక్కువ. కిడ్నీ గురించి చదివేటప్పుడు కిడ్నీని లోపలి నుంచి పరిశీలిస్తున్న అనుభూతి ఉంటుంది. అందుబాటులో ఎన్నో యాప్స్, వెబ్‌సైట్స్.. ► విద్యార్థులకు సులువైన రీతిలో విద్యా బోధన కోసం ఎన్నో యాప్స్, వెబ్‌సైట్స్ అందుబాటులోకి వచ్చాయి. పాఠశాలల్లో టీచర్లు ఆ యాప్స్/వెబ్‌సైట్స్‌లో తాము బోధించే పాఠాలను ముందే రూపొందించుకోవచ్చు. బోధిస్తున్న సమయంలో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా కాన్సెప్టులను, గ్రాఫిక్స్‌ను, చిత్రాలను.. త్రీడీ, అగుమెంటెడ్, వర్చువల్ రియాలిటీ పద్ధతుల్లో సిద్ధం చేసుకోవచ్చు. ► ఎడ్ పజిల్ యాప్ ద్వారా టీచర్ పాఠం చెప్తున్నప్పుడు విద్యార్థులను మధ్యలో ప్రశ్నలు అడిగే సాంకేతికత ఉంటుంది. అందులో ఎంత మంది అలర్ట్‌గా ఉన్నారనేది టీచర్ పసిగట్టవచ్చు. వారి సామర్థ్యాలను అంచనా వేయవచ్చు. ► ఆన్లైన్ వీడియో పాఠాలు వినే సమయంలో ఎడ్‌మోడో యాప్ ద్వారా.. విద్యార్థి ఏమేర విన్నాడనేది అంచనా వేయవచ్చు. ఇందుకోసం మధ్యలో కొన్ని ప్రశ్నలు వేస్తారు. సమాధానం చెబితేనే వీడియో ముందుకు కదులుతుంది. ► ప్లిప్గ్రిడ్ అనే మరో సాంకేతికత ద్వారా టీచర్ ఒక ప్రశ్న వేస్తే ఎవరెవరు ఏమేం సమాధానాలు చెప్పారనేది విడివిడిగా నమోదవుతుంది. టీచర్ వాటిని విశ్లేషించుకునే అవకాశం ఉంటుంది. ► నియర్‌పాడ్ యాప్/వెబ్సైట్ అద్భుతమైన విద్యా బోధనకు తోడ్పడుతుంది. బ్లాక్‌బోర్డ్ అవసరమే లేకుండా.. దాదాపు బోధన అంతా పూర్తిచేసేందుకు వీలు కల్పిస్తుంది. టీచర్ బోధించడంతోపాటు ఏదైనా రాసినా, ప్రశ్న వేసినా విద్యార్థులు తరగతి గదిలోనే ఉండి నేర్చుకున్న అనుభూతిని కలిగించగలుగుతుంది. అదే విధంగా విద్యార్థుల అవగాహన, నైపుణ్యాలను, వారు ఎంత అప్రమత్తంగా ఉంటున్నారన్నది ఎప్పటికప్పుడు గమనించే వీలుంటుంది. ► వీటితోపాటు పాఠాలపై విద్యార్థుల ఒపీనియన్ పోల్స్, వీకెండ్ ఎగ్జామ్స్, నెలవారీ అసెస్మెంట్ వంటివీ యాప్‌ల ద్వారా సాధ్యమవుతాయి. ► ఇక విద్యార్థుల మానసికోల్లాసాన్ని పెంచే మ్యూజికల్, ఏరోబిక్స్ మిక్స్, నృత్యం, ఆర్ట్స్ అండ్ క్రాప్ట్ట్, చిత్ర లేఖనం, పజిల్స్ అండ్ రిడిల్స్, మ్యాప్ పాయింటింగ్, ఫ్యాక్ట్స్ ఆఫ్ ది వరల్డ్, ఫోనిక్స్, కథలు చెప్పడం వంటివాటికీ ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. పాఠాలు ఆసక్తిగా ఉన్నాయి కరోనా సమయంలో హైదరాబాద్‌లో పెద్దమ్మ వాళ్ల ఇంటికి వచ్చాను. వారి అబ్బాయి, నేను ఇద్దరం ఒకే తరగతికావడంతో.. అతడి ఆన్లైన్ క్లాసుల పాఠాలన్నీ నేను కూడా విన్నాను. మా దగ్గర చెప్పే పాఠాల కంటే ఇక్కడ సులువుగా అర్థమయ్యాయి. సైన్స్ క్లాసులు చాలా బాగున్నాయి. నిజంగా నేను మొక్కల దగ్గరే ఉండి తెలుసుకున్నాననే ఫీలింగ్ వచ్చింది. – సాయి ప్రణీత్, పదో తరగతి విద్యార్థి, వరంగల్ విద్యార్థుల్లో నైపుణ్యం పెరిగింది.. హైదరాబాద్‌లోని బ్రూక్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్లో కరోనా సమయంలో అత్యాధునిక సాంకేతికత, కొత్త యాప్స్‌తో ఆన్లైన్ బోధన నిర్వహించారు. విద్యార్థుల్లో 83శాతం మంది గతం కన్నా మెరుగైన రీతిలో విద్యా ప్రమాణాలు కనబర్చినట్టు తేల్చారు. ‘‘తొలుత 64 శాతం మంది విద్యార్థులు ఆన్లైన్ క్లాసులను శ్రద్ధగా వినకపోవడం గమనించాం. దీనిని యాప్ ద్వారా పసిగట్టి వారిని ప్రోత్సహించాం. 53 శాతం మందిలో మార్పు వచ్చింది. చాలా మంది లెర్నింగ్ లాస్ లేకుండా ప్రతిభ చూపుతున్నారు’’ అని బ్రూక్‌ఫీల్డ్ స్కూల్ డైరెక్టర్ రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఉచితంగా అందించగల సాంకేతికతతో విదేశాల్లో విద్యకు సంబంధించిన ఆన్లైన్ సాంకేతికతను అందరికీ అందుబాటులో ఉండేలా (ఓపెన్ ప్లాట్‌ఫాంపై) అందుబాటులోకి తెచ్చా రు. ఆ యాప్స్ అన్నీ మనం వాడుకోవచ్చు. ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు 550 పాఠశాలల్లో టీచర్లకు దీనిపై శిక్షణ ఇచ్చాం. వీటిద్వారా బోధించినప్పుడు మంచి ఫలితాలు వస్తున్నాయని పాఠశాలల యాజమాన్యాలు చెప్తు న్నాయి. ఇందులో శిక్షణ, మౌలిక సదుపాయాల కోసం తప్ప పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. విద్యార్థులను పరిశోధన స్థాయికి తీసుకెళ్లే సరికొత్త బోధనగా దీన్ని చూడాలి. – పన్నేరు భానుప్రసాద్, సీఈవో, సూపర్ టీచర్ ఎడ్యు రిఫామ్స్ బోధనలో సరికొత్త విప్లవం.. మా విద్యాసంస్థల్లో 4 వేల మంది చదువుతున్నారు. వారందరికీ కొత్త టెక్నాలజీతో ఆన్లైన్ బోధన నిర్వహించాం. చాలా మంది విద్యార్థులు ప్రత్యక్ష బోధనకన్నా ఈ క్లాసులు బాగున్నాయని అంటున్నారు. పిల్లల్లో నైపుణ్యాలు గతంలో కన్నా ఎక్కువగా కన్పిస్తున్నాయి. ముఖ్యంగా సైన్స్, గణితం వంటి సబ్జెక్టుల్లో త్రీడీ టెక్నాలజీ సరికొత్త విప్లవం సృష్టిస్తోంది. కరోనా కాలమనే కాదు.. భవిష్యత్‌లో దీనిని కొనసాగించాలని భావిస్తున్నాం. – ఆర్.పార్వతీరెడ్డి, హార్వెస్ట్ స్కూల్ ప్రిన్సిపాల్, ఖమ్మం -
భర్త బాధ్యతలో సగం..
వేంసూరు: గృహిణిగా ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. భర్త ఏకోపాధ్యాయుడిగా పనిచేస్తున్న పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తోంది. విద్యార్థుల భవిష్యత్ కోసం ఉచితంగా బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది ఉషారాణి. వేంసూరు మండలం అమ్మపాలెం ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 7వ తరగతుల వరకు 60 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ నక్కా మోహన్‌రావు ఒక్కరే ఏడు తరగతులకు విద్యాబోధన చేస్తున్నారు. (చదవండి: పాత కార్లు, సైకిల్ విడిభాగాలతో... ఏకంగా విమానాన్ని తయరు చేశాడు!!) ఏడు తరగతులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు మోహన్‌రావు పాఠాలు బోధించడంతో మానసికంగా, శారీరంగా అలసిపోయి ఇంటికి వస్తున్నాడు. ఇది గమనించిన ఆయన సతీమణి ఉషారాణి భర్తకు సాయంగా నిలవడంతో పాటు విద్యార్థులకు పాఠాలు బోధించాలనే సంకల్పంతో తాను కూడా పాఠశాలకు వెళ్లోంది. డీఈడీ చదవడంతో లాక్డౌన్ తరువాత పాఠశాల తెరిచిన దగ్గరి నుంచి నేటి వరకు తన భర్తతో పాటు తన రెండేళ్ల చిన్నారిని కూడా పాఠశాలకు తీసుకువెళ్లి ఎలాంటి పారితోషికం తీసుకోకుండా విద్యార్థులకు సేవ చేస్తోంది. ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఇద్దరూ కలిసి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తున్నారు. (చదవండి: రెండు సింహాలు విమానాశ్రయం నుంచి తప్పించుకుని పెద్ద హంగామా సృష్టించాయి!) -
బుద్ధుని బోధలు: ధ్యాన బలం
అది కార్తీక పున్నమి రోజు. ఆకాశం నిర్మలంగా ఉంది. వెన్నెల ప్రకాశిస్తోంది. జేతవనంలోని బౌద్ధారామం దీపాలతో దేదీప్యమానంగా ఉంది. ఆరోజు ఉదయం నుండి ఎందరెందరో భిక్షువులు జేతవనానికి వస్తూనే ఉన్నారు. మరలా మూడునెలల తర్వాత ఆరామం భిక్షువులతో నిండుగా కళకళలాడుతోంది. బౌద్ధ భిక్షువులకు ఆషాఢపున్నమి నుండి కార్తీక పున్నమి వరకూ వర్షావాసకాలం. ఈ నాలుగు నెలల కాలంలో ఓ మూడు నెలలు ఆషాఢ పున్నమి నుండి ఆశ్వయుజ పున్నమి వరకూ, లేదా శ్రావణ పున్నమి నుండి కార్తీక పున్నమి వరకూ గల మూడు నెలల కాలంలో భిక్షువులు గ్రామాల వెంట తిరుగుతూ భిక్ష స్వీకరించకూడదు. సాధ్యమైనంత వరకూ గ్రామాలకు జనావాసాలకూ దూరంగా వనాలలోనో, కొండ గుహల్లోనో ఏకాంతంగా గడపాలి. ధ్యానసాధన పెంపొందించుకోవాలి. తమని తాము తీర్చిదిద్దుకోవాలి. ఆ మూడు మాసాల సాధన ఫలితాల్ని వచ్చాక మిగిలిన భిక్షువులతో పంచుకోవాలి. ఇక ఆనాటినుండీ తిరిగి చారిక చేస్తూ ధమ్మ ప్రచారానికి వెళ్ళిపోవాలి. అలా వర్షావాసం గడిపి వచ్చినవారిలో ఇద్దరు మిత్రులు ఉన్నారు. ఒకరు సుమేధుడు. రెండోవాడు తిష్యుడు. ఇద్దరూ వచ్చి బుద్థునికి నమస్కరించారు. ఒక పక్క నిలబడ్డారు. ‘భిక్షువులారా! మీ వర్షావాసం సుఖంగా గడిచిందా? మీ సాధన చక్కగా సాగిందా? అని అడిగాడు. ఇద్దరూ భగవాన్ అంతా చక్కగా జరిగింది అని నమస్కరిస్తూ తలలు ఊపారు. అప్పుడు బుద్ధుడు ముందుగా ‘తిష్యా! నీవు ఏం చేశావు?’ అని అడిగాడు. తిష్యుడు కాస్త ముందుకి వచ్చి ‘భగవాన్! నేను ఉన్నచోట వనం చాలా సుందరంగా ఉంది. అక్కడ ఒక కొలను ఉంది. ఆ కొలనులో రకరకాల తామరలు ఉన్నాయి. నా ధ్యాసనంతా తామరపూలపై కేంద్రీకరించాను. ఆ పూల మీద వాలే తుమ్మెదలు, రంగు రంగు రెక్కల సీతాకోక చిలుకలూ వాటి ఝుంకారాలపై మనస్సు నిలిపాను. ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ గడిపాను అన్నాడు. ‘మరి నీవు సుమేధా?’ అని సుమేధుణ్ణి అడిగాడు. ‘భగవాన్! నేను ఆ ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ ధ్యానసాధన చేసి ఏకాగ్రతని, ఎరుకని సాధించాను. ధ్యానంలో మరోమెట్టుకు చేరాను’ అని తాను పొందిన స్థితిని వివరించాడు. అప్పుడు బుద్ధుడు– ‘భిక్షువులారా! భిక్షువులు ధ్యానసాధనలో బలహీనులు కాకూడదు. ధ్యానబల సంపన్నులు కావాలి. బలమైన గుర్రమే యుద్ధంలో విజయం సాధిస్తుంది. పోటీలో గెలుపొందు తుంది. భిక్షువులు కూడా అంతే. ధ్యానబల సంపన్నుడైన భిక్షువే దుఃఖ నివారణా మార్గంలో ముందుంటాడు. గొప్ప భిక్షువుగా రాణిస్తాడు. నిర్వాణపథాన్ని పూర్తిగా దాటగలుగుతాడు. తిష్యా! ఇక నీ సమయాన్ని ఎప్పుడూ వృథా చేసుకోకు. బలాన్ని పోగొట్టుకోకు అని చెప్పాడు. ఆ తర్వాత వర్షావాస కాలంలో తిష్యుడు కూడా ధ్యానబలాన్ని సాధించాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
TS: అంగన్వాడీల్లో ‘ఇంటి భాష’లో బోధన
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు ఇంట్లో మాట్లాడే భాషలోనే బోధన చేపట్టాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ నిర్ణయించింది. ఈ కేంద్రాలకు వచ్చే పిల్లలకు మరింత సులభంగా బోధన, అభ్యసన కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. వీలైనంత త్వరలో దీనిని అమలు చేయాలని శిశు సంక్షేమ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో బోధన, అభ్యసనకు సంబంధించిన పుస్తకాలు, వర్క్‌బుక్‌లు అన్నీ తెలుగులో, ఒకట్రెండు ఇంగ్లిష్‌లో ఉంటున్నాయి. వీటి ద్వారా మైనార్టీలు, గిరిజనులు అధికంగా ఉండే అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు బోధన చేస్తున్నప్పటికీ వారు ఇంట్లో మాట్లాడే భాషలో చెప్పే అంశాలనే వేగంగా అర్థం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా మైనార్టీలు, గిరిజన తెగలున్న ఆవాసాలు, ఏజెన్సీలు తదితర ప్రాంతాల్లో పిల్లల మాతృ భాషలోనే బోధన సాగిం చాలని క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆ దిశలో చర్యలు తీసుకుంటోంది. రెండు రోజుల కిందట జరిగిన సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ ఈ మేరకు శిశు సంక్షేమ శాఖ కమిషన్‌కు ఆదేశాలు జారీ చేశారు. భాషల వారీగా కేంద్రాల గుర్తింపు.. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో 31,711 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల పరిధిలో 17.04 లక్షల మంది పిల్లలు నమోదు కాగా, రోజుకు సగటున 6 లక్షల మంది హాజరవుతున్నట్లు శిశు సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. తాజా నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలు, మైనార్టీలు అధికంగా ఉండే ప్రాంతాలను గుర్తించి వారి మాతృభాషలో బోధన నిర్వహించేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ముస్లిం మైనార్టీ ప్రాంతాల్లోని అంగన్వాడీల్లో ఉర్దూ, గిరిజన తండాల్లో లంబాడ, ఏజెన్సీ ప్రాంతాల్లో గోండు, కోయ, కొలామ్ భాషల్లో పుస్తకాలను ముద్రించి పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో సీడీపీఓలకు ఒక ప్రణాళికను తయారు చేసి పంపించింది. ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక భాషల్లో పుస్తకాలను ముద్రించి ఆశ్రమ పాఠశాలల్లో అందుబాటులోకి తెచ్చారు. దీంతో గిరిజన సంక్షేమ శాఖ సహకారాన్ని తీసుకునేందుకు సంబంధిత అధికారులతో శిశు సంక్షేమ శాఖ చర్చలు జరుపుతోంది. వీలైనంత త్వరలో సమగ్ర ప్రణాళిక రూపొందించి పిల్లల మాతృ భాషలో బోధనను ప్రారంభించాలని ఆ శాఖ భావిస్తోంది. -
చిత్రం చెప్పే పాఠాలు.. ఒక్కసారి చూస్తే మర్చిపోలేని విధంగా..
ప్రభుత్వ పాఠశాలల్లోకి అడుగుపెడితే చాలు అక్కడ గోడలపై ఉన్న బొమ్మలే విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్నట్టు ఉంటాయి. విద్యార్థుల్లో ఆలోచనాశక్తిని పెంపొందిస్తూ పాఠాలను గుర్తుపెట్టుకునేలా ప్రభావితం చేస్తున్నాయి. అందమైన రంగుల్లో ఒక్కసారి చూస్తే మర్చిపోలేని విధంగా తరగతి గదుల్లో, బయట గోడలపై రూపొందించిన పాఠ్యాంశాల చిత్రాలు ప్రభుత్వ పాఠశాలల ఖ్యాతిని మరింత పెంచుతున్నాయి. నాడు–నేడు పేరుతో అభివృద్ధి చేసిన పాఠశాలలు వీటికి వేదికగా నిలుస్తున్నాయి. భీమవరం(ప్రకాశం చౌక్): ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి వాటి రూపురేఖలనే మార్చేసింది. నాడు అధ్వానంగా ఉన్న పాఠశాలలు నేడు అద్భుతంగా రూపుదిద్దుకున్నాయి. కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఏర్పాటుచేసిన అధునాతన వసతులు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పాఠశాల గేటు దగ్గర నుంచి తరగతి గదుల వరకు అన్నిచోట్లా వేయించిన పాఠ్యాంశాల బొమ్మలు విద్యార్థుల్లో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. నాడు–నేడు ద్వారా తొమ్మిది రకాల పనులు పాఠశాలల్లో చేపట్టగా అందులో ముఖ్యమైనది గోడలపై వేసిన చిత్రాలు. వీటి ద్వారా పాఠశాల తరగతి గదుల్లో, బయట గోడలపై ముఖ్యమైన పాఠ్యాంశాలను బొమ్మల రూపంలో వేయించారు. విద్యార్థులు తాము చదువుకున్న పాఠాలను ఎప్పటికీ మర్చిపోకుండా ఈ బొమ్మలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. టీచర్లు కూడా తరగతి గదుల్లోని బొమ్మల ద్వారా పాఠాలను బోధిస్తూ విద్యార్థుల్లో పాఠ్యాంశాలపై ఆసక్తి రేకెత్తించేందుకు కృషిచేస్తున్నారు. ఈ బొమ్మలు విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు వచ్చేలా చేయడంలో ఎంతో ప్రభావితం చేస్తున్నాయి. ఒక్కో పాఠశాలకు సుమారు రూ.20 వేల నుంచి రూ.30 వేల వ్యయం పశ్చిమ గోదావరి జిల్లాలో నాడు–నేడు ఫేజ్–1లో సుమారు 1100 పాఠశాలలను నాడు నేడు ద్వారా అభివృద్ధి చేశారు. అందులో భాగంగా ఒక్కో పాఠశాలకు సుమారు రూ.20 వేల నుంచి రూ.30 వేలతో ఆయా పాఠశాలల్లో గోడలపై చిత్రాలు వేయించారు. అంశాలివీ... పాఠశాలల తరగతి గదుల గోడలపై అక్షరాలు, అంకెలు, మానవ శరీర నిర్మాణం, జీర్ణకోశ, ప్రకృతి, మ్యాప్‌లు, అంతరిక్షం తదితర వాటిని వేయగా బయట గోడలపై స్వచ్ఛభారత్, కవులు, రచయితలు, క్రీడలు, ట్రాఫిక్, యోగా ఉపయోగాలు, శరీర అంతర్గత భాగాలైన గుండె, ఊపిరితిత్తులు, మెదడు తదితరాల నిర్మాణాలు, జాతీయ జెండా, దేశ నాయకుల చిత్రాలు, జాతీయ చిహ్నాలు తదితరాలను బొమ్మల రూపంలో వేయించారు. ఉపయోగాలివీ... ►పాఠశాలలపై విద్యార్థుల్లో సానుకూల దృక్పథం పెరుగుతుంది ►విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచుతుంది. ►ఆహ్లాదకర వాతావరణంలో, ఉత్సాహంగా పాఠాలు నేర్చుకుంటారు. ►బోధన, అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడతాయి. ►చదివిన పాఠాలు ఎప్పటికీ గుర్తుంటాయి. ►విద్యార్థుల్లో మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయి. ►ముఖ్యంగా ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లాలనే ఆసక్తిని పెంచుతాయి. ఎంతో ప్రభావితం చేస్తున్నాయి జిల్లాలో నాడు–నేడు ఫేజ్–1లో సుమారు 1100 పాఠశాలలను అభివృద్ధి చేశాం. వాటిలో చేపట్టిన తొమ్మిది కాంపోనెంట్ పనుల్లో ఒకటి గోడలపై చిత్రాలు. తరగతి గదుల లోపల, బయట పాఠ్యాంశాలను బొమ్మల రూపంలో వేయించాం. అవి విద్యార్థుల్లో సరికొత్త మార్పులు తీసుకువస్తున్నాయి. బొమ్మలు విద్యార్థుల్లో పాఠశాలకు రావాలనే ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపుతూ విజ్ఞానాన్ని, వికాసాన్ని పెంచుతున్నాయి. చదువుకున్న పాఠాలు ఎప్పటికీ మార్చిపోకుండా గుర్తుండేలా దోహదపడుతున్నాయి. – సీవీ రేణుక, జిల్లా విద్యాశాఖాధికారి, ఏలూరు పాఠాలను గుర్తుపెట్టుకుంటున్నారు పాఠశాల తరగతి గదుల్లో వేసిన పాఠ్యాంశాల బొమ్మల ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తుంటే వారు బాగా గుర్తుపెట్టుకుంటున్నారు. బొమ్మల ద్వారా చెప్పే పాఠాలను ఎప్పటికీ మర్చిపోలేరు. పాఠ్యాంశంలోని ముఖ్యమైన అంశాలను చిత్రాలుగా గోడలపై వేయడం చాలా బాగుంది. విద్యార్థులకు ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయి. కొన్ని చిత్రాలు వారిలో విజ్ఞానాన్ని, అవగాహనను పెంచుతుంటే మరికొన్ని మానసిక ఉల్లాసాన్ని ఇస్తున్నాయి. – ఎ.రాణీ నాగరత్నం, ఉపాధ్యాయురాలు, మహాత్మాగాంధీ ప్రాథమిక పాఠశాల, భీమవరం -
తెలంగాణలో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనకు రావాలని విద్యార్థులను బలవంతం చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ప్రత్యక్ష తరగతులకు హాజరుకాని వారిపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తెలిపింది. ఆన్లైన్ ద్వారా ప్రత్యక్ష బోధనపై విద్యా సంస్థలదే నిర్ణయం అని హైకోర్డు పేర్కొంది. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవద్దని కోర్టు పేర్కొంది. ప్రత్యక్ష బోధన నిర్వహించే పాఠశాలలకు మార్గదర్శకాలు జారీ చేయాలని కోర్టు విద్యాశాఖను ఆదేశించింది. వారంలోగా మార్గదర్శకాలు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. గురుకులాలు, రెడిడెన్షియల్ స్కూళ్లలో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు స్టే విధించింది. గురుకులాలు, విద్యాసంస్థల్లో వసతి గృహాలు తెరవొద్దని కోర్టు ఆదేశించింది. గురుకులాలు, హాస్టళ్లలో వసతులపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 4కి కోర్టు వాయిదా వేసింది. ఇవీ చదవండి: Banjara Hills: భర్తతో విడిపోయి, మరొకరితో సహజీవనం.. బాలికపై అత్యాచారం పహాడీషరీఫ్: 38 రోజుల్లో నాలుగు హత్యలు, హడలెత్తుతున్న స్థానికులు -
హైఎండ్ స్కిల్స్ నేర్పించే కంపెనీలకు పాలసీలో ప్రాధాన్యత
-
ఇక ఆన్లైన్లో.. పిల్లల పాఠాలు
భువనేశ్వర్: రాష్ట్రంలో ‘యూట్యూబ్’లో పాఠాల బోధన వ్యవస్థ అంచెలంచెలుగా విస్తరిస్తోంది. ఉన్నత పాఠశాల తరగతులకు ఈ వ్యవస్థను ఇటీవల ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విధానం 1వ తరగతి నుంచి 8వ తరగతి ప్రాథమిక పాఠాల బోధనలో కూడా అమలవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 21వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు ఈ తరగతులకు యూట్యూట్‌లో పాఠాలు నిర్వహిస్తారు. ఈ విధానాన్ని తొలి విడతలో 8 జిల్లాలు ఖుర్దా, బలంగీరు, కటక్, కేంద్రాపడ, గంజాం, పూరీ, ఢెంకనాల్, సుందరగడ్లలో ప్రవేశపెడతారు. ఈ విధానంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజూ 3 పిరియడ్లు నిర్వహిస్తారు. ఒక్కో పిరియడ్ 30 నిమిషాలు. ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు యూట్యూట్ బోధన సాగుతుంది. వారాంతపు రెండు రోజులు శని, ఆదివారాలు సెలవు. ఒడిశా పాఠశాల విద్యా అథారిటీ (ఒసెపా) ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. జిల్లా విద్యాధికారులు, జిల్లా ప్రాజెక్టు సమన్వయకర్తలు యూట్యూబ్ పాఠాల కార్యక్రమం బాధ్యతలు నిర్వహిస్తారు. జిల్లా విద్యాధికారులు యూట్యూబ్ తరగతి గదులు ఏర్పాటు చేస్తారు. 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు నిత్యం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, 4వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. పాఠాల నిర్వహణకు ప్రత్యేక కమిటీ యూట్యూబ్ పాఠాల నిరంతర నిర్వహణను ప్రత్యేక కమిటీ పర్యవేక్షిస్తుంది. జిల్లా విద్యాధికారు (డీఈఓ)ల ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ప్రత్యేక కమిటీ యూట్యూబ్ పాఠాలు బోధించే ఉపాధ్యాయునికి సహాయకారిగా వ్యవహరిస్తుంది. నిత్యం యూట్యూబ్ పాఠాలకు హాజరైన విద్యార్థుల వివరాలు, బోధనలో ఒడిదుడుకులు వగైరా అంశాల్ని కమిటీ పరిశీలిస్తుంది. తరగతుల తర్వాత విద్యార్థుల సందేహాలను వాట్సాప్, వాయిస్ కాల్ ఆధ్వర్యంలో సంధిత ఉపాధ్యాయులు నివృత్తి చేస్తారు. పాఠశాల ఉపాధ్యాయులు సబ్జెక్టు, క్లాస్‌వారీగా వర్క్షీట్లు తయారు చేసి విద్యార్థులకు అందజేస్తారు. వాటి ఆధారంగా విద్యార్థులు సాధించిన మార్కుల వివరాల్ని భద్రపరచాల్సి ఉంటుంది. ఈ వివరాల్ని సమితి, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు సమీక్షిస్తారు. రోజువారీ తరగతుల వివరాలు జిల్లా విద్యాధికారి ఆధీనంలో ఉంటాయి. చదవండి: Zomato Girl: ఆకలి చూపిన ఉపాధి -
హ్యాట్సాఫ్ ఎస్ఐ: గోడెక్కిన చదువు
తిర్యాణి(ఆసిఫాబాద్): విద్యార్థికి, ఉపాధ్యాయులకు మధ్య కరోనా అడ్డుగోడగా నిలవగా.. అక్షరాలకు, విద్యార్థులకు మధ్య నేనున్నానంటూ ఓ ఎస్ఐ ముందుకు వచ్చారు. కరోనా కారణంగా బడికి తాళం పడితే, ఆయన వీధినే బడిగా మార్చారు. ఆయా గూడేల్లో ఉన్న ప్రహరీలపై అక్షరాలు, అంకెలు రాయించి వినూత్న బోధనకు శ్రీకారం చుట్టారు. గత విద్యాసంవత్సరం ప్రభుత్వం ఆన్లైన్ తరగతులకు అనుమతి ఇచ్చినా మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చాలా గ్రామాలకు నెట్వర్క్ సిగ్నల్స్ లేక విద్యాబోధన సాగలేదు. తిర్యాణి మండలంలో 60 శాతానికిపైగా గ్రామాల్లో అదే దుస్థితి. గతంలో నేర్చుకున్న అంశాలనూ విద్యార్థులు క్రమంగా మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని గ్రహించిన తిర్యాణి ఎస్సై రామారావు తన స్వంత ఖర్చుతో మండలంలోని 30 ఆదివాసీ గూడేల్లోని కూడళ్ల వద్ద గోడలపై తెలుగు, ఇంగ్లిష్ వర్ణమాల, గుణింతాలు, అంకెలు రాయించారు. పైతరగతి విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కింది తరగతి విద్యార్థులకు వీటిని నేర్పించే ఏర్పాటు చేశారు. ఆదివాసీ విద్యార్థుల కోసం పోలీసులు గోడలపై ఇలా రాయించడం అభినందనీయమని ఆయా గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హ్యాట్సాఫ్ ఎస్ఐ గారూ..! చదవండి: Corona Vaccine: పోస్టాఫీసులో టీకా నమోదు -
టీచర్ ఐడియా సూపర్: విద్యార్థుల వద్దకే పాఠాలు
ప్రభుత్వ స్కూళ్లలో సరిగ్గా చదువు చెప్పరని చాలామంది అభిప్రాయం. ప్రభుత్వ టీచర్లు అందరూ అలా లేకపోయినప్పటికీ కొంతమంది వల్ల ఏర్పడిన అభిప్రాయంతో తల్లిదండ్రులు పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లల్లో చదివించడానికే ఇష్టపడుతుంటారు. అయితే మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఓ ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తోన్న మాష్టారు ‘ప్రజలవద్దకే పాలన’ లాగా విద్యార్థుల ఇళ్లవద్దకు వెళ్లి చదువు చెబుతున్నారు. కరోనా కారణంగా విద్యాసంస్థలన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆన్లైన్ క్లాస్‌లు నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలామంది ఆన్లైన్ తరగతులను వింటున్నప్పటికీ, ఆర్థిక స్థితిగతులు సహకరించని కారణంగా కొంతమంది వీటికి హాజరు కాలేకపోతున్నారు. ఆన్లైన్ క్లాసుల ఖర్చు భరించలేని నిరుపేద పిల్లలకు విద్యనందించాలనే ఉద్దేశ్యంతో చంద్ర శ్రీవాత్సవ అనే టీచర్ వినూత్న ఐడియాతో.. విద్యార్థుల ఇళ్లవద్దకు వెళ్లి పాఠాలు చెబుతున్నారు. దీనికోసం ఆయన తన స్కూటర్ మీద మినీ స్కూల్, లైబ్రరీని ఏర్పాటు చేసుకున్నారు. స్కూటర్‌కు గ్రీన్బోర్డు తగిలించి, మినీ లైబ్రరీలో పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్ పెట్టుకుని సాగర్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో స్కూటర్ స్కూల్ మీద ప్రయాణిస్తూ విద్యార్థులకు బోధిస్తున్నారు. అయితే కరోనా వ్యాపించకుండా ఉండేందుకు ఆయన విద్యార్థుల ఇళ్ల పరిసర ప్రాంతాల్లోని చెట్ల కింద బ్లాక్‌బోర్డును ఏర్పాటు చేసి మైక్‌లో పాఠాలు చెబుతున్నారు. అంతేగాకుండా కొన్ని పాఠ్య పుస్తకాలు, కథల పుస్తకాలను ఉచితంగా అందిస్తున్నారు. విద్యార్థులు ఆ పుస్తకాలు చదవడం అయిపోయిన తరువాత వాటిని తిరిగి మాష్టారికి ఇచ్చేస్తున్నారు. మైక్‌లో పాఠాలు చెప్పడం, వారు వాటిని తిరిగి పలకడం వంటివి పిల్లలకు చాలా సరదాగా ఉండడంతో ఎంతో ఆసక్తిగా మాష్టారు చెప్పే పాఠాలు వింటున్నారు. ‘‘తమ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని.. రోజూ తమ పిల్లలకు తరగతులు బోధిస్తున్న చంద్ర శ్రీవాత్సవ మాష్టారుకు రుణపడి ఉంటాము’’ అని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు. చంద్ర శ్రీవాత్సవ మాట్లాడుతూ..‘‘ఎక్కువ మంది విద్యార్థులు నిరుపేద కుటుంబాలకు చెందిన వారు. స్మార్ట్‌ఫోన్ కొనుక్కోలేని పరిస్థితి వారిది. అందువల్ల వారు ఆన్లైన్ తరగతులు వినలేకపోతున్నారు. అంతేగాకుండా విద్యార్థులు నివసించే కొన్ని ప్రాంతాల్లో నెట్వర్క్ సదుపాయం కూడా లేదు. ఈ పరిస్థితుల్లో వారు చదువుకోవడం కష్టం. అందుకే ఇలా స్కూటర్ మీద తిరుగుతూ పాఠాలు చెబుతున్నాను’’ అని ఆయన చెప్పారు. ఈ మాష్టారు పిల్లలకేగాక ఎంతో మంది టీచర్లకు, తల్లిదండ్రులకు ప్రేరణగా నిలుస్తున్నారు. ఇటువంటి మాష్టార్లు ఊరికి ఒకరిద్దరున్నా.. నేటి బాలలు రేపటి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారు. -
కలికిరి సైనిక్ స్కూల్లో టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న కలికిరి సైనిక్ స్కూల్.. ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 23 ► పోస్టుల వివరాలు: హెడ్మాస్టర్–01, ప్రీ ప్రైమరీ టీచర్లు–03, ప్రైమరీ టీచర్లు–06, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్–01, మ్యూజిక్/ డ్యాన్స్ టీచర్–01, స్పెషల్ ఎడ్యుకేటర్–01, పీఈటీ–01, హెడ్ క్లర్క్–01, అకౌంట్ క్లర్క్–01, డ్రైవర్–01, ఆయాలు–04, ఎంటీఎస్–02. ► హెడ్ మాస్టర్: అర్హత: గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.35,000 చెల్లిస్తారు. ► ప్రీ ప్రైమరీ టీచర్లు: అర్హత: ఇంటర్మీడియట్, ఎన్టీటీసీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.20,000 చెల్లిస్తారు. ► ప్రైమరీ టీచర్లు: అర్హత: గ్రాడ్యుయేషన్, డీఈఈటీ/బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. సీటెట్/టెట్ అర్హత కలిగి ఉండాలి. వేతనం నెలకు రూ.20,000 చెల్లిస్తారు. ► ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్: అర్హత: బీఎఫ్ఏ, టీటీసీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ. 20,000 చెల్లిస్తారు. ► మ్యూజిక్/డ్యాన్స్ టీచర్: అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ. 20,000 చెల్లిస్తారు. ► స్పెషల్ ఎడ్యుకేటర్: అర్హత: గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ. 20,000 చెల్లిస్తారు. ► పీఈటీ: అర్హత: ఇంటర్మీడియట్/ యూజీడీపీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ. 20,000 చెల్లిస్తారు. ► హెడ్‌క్లర్క్: అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు. ► అకౌంట్ క్లర్క్: అర్హత: బీకాం ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు. ► డ్రైవర్: అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు. ► ఆయా: అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణుల వ్వాలి. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు. ► ఎంటీఎస్: అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణుల వ్వాలి. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్,రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ► దరఖాస్తులకు చివరి తేది: 10.04.2021 ► వెబ్సైట్: www.sskal.ac.in ఏపీ పౌరసరఫరాల శాఖలో ఖాళీలు.. దరఖాస్తు చేసుకోండి -
అతని బుల్లెట్ గాయం..వికలాంగ విద్యార్థులకు వరం!
జీవితం అందరికీ పూలపాన్పులా ఉండదు. మనం వెళ్లే దారిలో ముళ్లు, రాళ్లు గుచ్చుకుంటాయి. వాటిని తీసేస్తూ..గాయాలు చిత్రవధ చేస్తున్నా ముందుకుసాగాల్సిన గడ్డు పరిస్థితులు ఎన్నో ఎదురవుతాయి. వీటన్నింటినీ దాటుకుని జీవితాన్ని నిలబెట్టుకునే వారు మన సమాజం లో ఎందరో ఉన్నారు. ఈ కోవకు చెందినవారే కశ్మీర్‌కు చెందిన జావేద్ అహ్మద్ తక్. ఉగ్రదాడి లో తన జీవితాన్నీ కోల్పోయినప్పటికీ నిరాశా నిస్పృహలలో కూరుకుపోకుండా తన జీవితాన్నీ నిలబెట్టుకుని.. తనలాగా అంగవైకల్యంతో బాధపడుతోన్న పిల్లలకు చదువు చెబుతూ ధైర్యాన్ని నూరిపోస్తున్నారు జావేద్. అది 1997 జావేద్ బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అనంతనాగ్‌లో తన అంకుల్ ఇంట్లో జావేద్ ఉండగా అర్ధరాత్రి ఆ ఇంటిపై ముష్కరులు దాడిచేశారు. ఆ సమయంలో తన కజిన్‌ను కాపాడేందుకు ప్రయత్నించిన జావేద్‌కు బుల్లెట్ తగిలింది. బుల్లెట్ వెన్నుపూసకు తగలడంతో మూత్రపిండాలు, క్లోమం, పేగులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఆసుపత్రిలో ఒక సంత్సరంపాటు చికిత్స తీసుకున్న తరువాత 1998లో జావేద్ డిశ్చార్జ్ అయ్యాడు. ఆ తరువాత కూడా కదలలేని పరిస్థితుల్లో మరో మూడేళ్లు మంచానికే పరిమితమయ్యాడు. అలా మంచం మీద ఉన్న జావేద్‌కు తన ఇంటిపక్కన పిల్లలు అరుస్తూ ఆడుకుంటున్న శబ్దాలు వినపడేవి. అలా వింటూ 2000 సంవత్సరంలో ఆ పిల్లలందరికి ఉచితంగా చదువు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అప్పటినుంచి తనను తాను మోటివేట్ చేసుకుంటూ..పిల్లలకు ఎలా చదువు చెప్పాలి వంటి అంశాలపై ఆలోచించి ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలనుకున్నాడు. జెబాఅపా.. 2006లో అంగవైకల్యంతో బాధపడే పిల్లల కోసం ఒక అద్దె భవనంలో ‘జెబాఅపా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌క్లూసివ్ ఎడ్యుకేషన్’ పేరిట స్కూలును ప్రారంభించాడు జావేద్. తన బంధువులు, స్నేహితులు చుట్టపక్కల ఊళ్లలోని అంగవైకల్యం కలిగిన పిల్లలను జెబాఅపాలో చేర్చేవారు. జావేద్ మరికొంతమంది టీచర్లను నియమించుకుని స్కూలును నడపడం ప్రారంభించాడు. స్కూల్‌తోపాటు తనూ.. మధ్యలో ఆపేసిన చదువును కొనసాగించాడు. ఈ క్రమంలోనే 2007లో కశ్మీర్ యూనివర్సిటీలో సోషల్ వర్క్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. మొదట్లో ప్రాథమిక తరగతులకే పరిమితమైన జెబా స్కూలు తరువాత ఎనిమిదో తరగతివరకు పొడిగించారు. 120 మంది వికలాంగ విద్యార్థులు 25 మంది టీచర్లతో స్కూలును విజయవంతంగా నడిపిస్తున్నారు. స్పెషల్లీ ఏబుల్డ్ (వికలాంగులు) విద్యార్థులు కావడం తో వారికి ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా చదువు చెప్పడంతోపాటు, స్పీచ్ థెరపిస్టులతో పాఠాలు నేర్పిస్తున్నారు. సిలబస్‌ను ప్రత్యేకంగా రూపొందించి, పిల్లలకే కాకుండా టీచర్లకు కూడా జావేద్ శిక్షణ ఇస్తున్నాడు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందకపోయినప్పటికీ దాతలు ఇచ్చిన విరాళాలు, ఎన్జీవోల సాయంతో స్కూల్‌ను నడుపుతున్నట్లు జావేద్ చెప్పాడు. జావేద్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు ఉన్నత చదువులు చదవడంతోపాటు, క్రీడల్లోనూ రాణిస్తూ పతకాలను సాధిస్తున్నారు. హ్యుమానిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ జావేద్ ఒక్క స్కూలేగాక హ్యుమానిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్‌ను కూడా సంస్థను స్థాపించి వైద్యం కొనుక్కోలేని నిరుపేద మహిళలకు ఉచితంగా వైద్యాన్నీ అందిస్తున్నారు. పుస్తకాలు, యూనిఫామ్, స్టేషనరీ వంటి వాటిని సేకరించి నిరుపేద విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నారు. కరోనా సమయంలోనూ ఈ ఆర్గనైజేషన్ ద్వారా అనేక సహాయ కార్యక్రమాలను చేపట్టారు. తన జీవితంలో జరిగిన ఒక అతిపెద్ద విషాద ఘటనను ఎంతో ధైర్యంగా ఎదుర్కొని.. సమాజానికి మేలు చేసేందుకు కృషి చేస్తోన్న జావేద్‌ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. జావేద్ మాట్లాడుతూ...‘‘ప్రారంభంలో మా స్కూలుకు బాలికలను పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడేవారు కాదు. తర్వాత వారితో నేను మాట్లాడి ఒప్పించడంతో ఎంతో ధైర్యంగా అమ్మాయిలను స్కూలుకు పంపిస్తున్నారు. ప్రస్తుతం స్కూల్లో 200 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వీరికోసం రెండు బస్సులు కొనుగోలు చేశాం. అవి సరిపోవడం లేదు. అందువల్ల కొంతమంది పిల్లలకి స్కూల్ వద్ద వసతి కల్పిస్తున్నాం. అనేక అవరోధాలు ఎదుర్కొంటూ ఒక్కో వసతిని స్కూలుకు సమకూరుస్తున్నాం. హయ్యర్ సెకండరీ లెవల్‌కు స్కూలు ఎదుగుతుంది’’ అని ఆశిస్తున్నట్లు జావేద్ చెప్పాడు. ‘‘బుల్లెట్ గాయం వల్ల నేను జీవితాన్నే కోల్పోయాను. ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా కింద కేవలం 75 వేల రూపాయలను ఇచ్చింది. కానీ ఆ సమయంలో నా చికిత్సకు లక్షల్లో ఖర్చయింది. ఆ విషాదం జరగాలని రాసి ఉంటే ఏం చేయగలం. అది జరిగిపోయింది. అక్కడే ఆగిపోతే మిగతా జీవితం కూడా చీకటైపోతుంది. అందుకే నాలాగా ఇబ్బంది పడే వికలాంగులకు చేయూతనిస్తూ ముందుకు సాగుతున్నాను’’ అని జావేద్ చెప్పాడు. -
పడిలేచిన ‘ప్రగతి’!
అవయవాలన్నీ బాగున్నప్పటికీ కష్టపడకుండా ఎవరో ఒకరి మీద ఆధారపడి జీవిస్తుంటారు కొందరు. రెండు చేతులు కోల్పోయిన ఓ అమ్మాయి మాత్రం ఎవరి మీదా ఆధారపడకుండా, తన పనులు తానే చేసుకుంటూ, ఖర్చులకోసం సొంతంగా సంపాదిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన ప్రగతి దురదృష్ట వశాత్తు రెండు చేతులను కోల్పోయింది. 2010లో ప్రగతి అనుకోకుండా విద్యుత్ సరఫరా అవుతున్న వైర్‌ను పట్టుకోవడంతో..∙రెండు చేతులు కాలిపోయాయి. చికిత్సలో భాగంగా చేతులను మోచేయి వరకు డాక్టర్లు తొలగించారు. దీంతో తన రోజువారి పనులు చేసుకోవడానికి కూడా ప్రగతి చాలా కష్టపడేది. అయినా ఎలాగైనా ఎవరిసాయం తీసుకోకుండా బతకాలనుకుంది. క్రమంగా తన ఆత్మవిశ్వాసం పెంపొందించుకుని మొబైల్ ఫోన్, కంప్యూటర్లను ఆపరేట్ చేయడం నేర్చుకుంది. అంతేగాకుండా ఒకపక్క విద్యార్థులకు పాఠాలు చెబుతూ మరోపక్క బ్యాంక్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ‘‘ఎన్ని కష్టాలు ఎదురైనా అమ్మాయిలు తమ కలల్ని నిజం చేసుకోవడంలో వెనక్కి తగ్గకుండా కష్టపడి సాధించాలి’’ అని ప్రగతి చెప్పింది. మొదట్లో తన పనులు తాను చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. క్రమంగా పనులు చేసుకోవడం మొదలు పెట్టాను. అలా పనులు చేసుకోవడం వల్ల ఏదైనా చేయగలను అనిపించింది. ఈ క్రమంలోనే ఫోన్ ఆపరేట్ చేయగలిగాను. తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉద్దేశ్యంతో టీచర్‌గా పనిచేస్తూ సంపాదిస్తున్నానని, భవిష్యత్తులో బ్యాంక్ ఉద్యోగం పొందడమే తన కలని ప్రగతి చెప్పింది. -
ఆశ్రమ విద్యార్థులకు సీతక్క పాఠాలు
కొత్తగూడ: ములుగు ఎమ్మెల్యే సీతక్క మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు పాఠాలు బోధించారు. శనివారం పాఠశాలను సందర్శించిన ఆమె.. అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పదో తరగతి సాంఘిక శాస్త్రంలోని ‘ఎవరి అభివృద్ధి?’ అనే పాఠాన్ని విద్యార్థులకు బోధించారు. ప్రజల అభిప్రాయం మేరకు అభివృద్ధి సాధించినప్పుడే సమసమాజం సాధ్యమవుతుందని విద్యార్థులకు వివరించారు. -
పాఠం అర్థమవుతోందా!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లోని పిల్లల కోసం తలపెట్టిన ఆన్లైన్/వీడియో పాఠాలను విద్యార్థులు ఏమేరకు అర్థం చేసుకుంటున్నారో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా పరిశీలన చేపట్టాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. ఇందుకోసం ఆన్లైన్ బోధనపై విద్యార్థుల అభిప్రాయం(ఫీడ్‌బ్యాక్) ఏమిటో తెలుసుకునేందుకు ప్రత్యేక ఫార్మాట్‌ను గురుకుల సొసైటీలు రూ పొందించాయి. ఆన్లైన్, వీడియో పాఠాల ద్వారా అర్థమవుతున్న తీరుపై టీచర్లు నేరుగా విద్యార్థులతో మాట్లాడతారు. ఈమేరకు ఫార్మాట్లో నిర్దేశించిన ప్రశ్నలను విద్యార్థులను అడిగి తెలుసుకుని ఆమేరకు ఫార్మాట్‌ను పూర్తి చేయాలి. సబ్జెక్టుల వారీగా పరిశీలన బాధ్యతలను సొసైటీలు ఆయా సబ్జెక్టు టీచర్లకు అప్పగించాయి. నిర్దేశించిన ఫార్మాట్‌ను పూరించేందుకు సబ్జెక్టు టీచర్లు నేరుగా విద్యార్థికి ఫోన్ చేసేందుకు వీలుగా ఇప్పటికే ఫోన్ నంబర్ల జాబితాను సేకరించారు. గురుకుల సొసైటీలు తొలుత టీశాట్ ద్వారా వీడియో పాఠాలను మొదలుపెట్టగా..ఆ తర్వాత పాఠశాలల వారీగా విద్యార్థుల వాట్సాప్ నంబర్లను సేకరించి ఆయా సబ్జెక్టు టీచర్లు ఆన్లైన్ పాఠాలను జూమ్ యాప్‌ల ద్వారా బోధించారు. ప్రభుత్వం కూడా యాదగిరి చానల్ ద్వారా వీడియో పాఠాలను ప్రారంభించింది. పూర్తిస్థాయిలో తెరవకపోవడంతోనే... వాస్తవానికి ఈపాటికే సమ్మెటీవ్, ఫార్మెటీవ్ పరీక్షలు నిర్వహించి పిల్లల సామర్థ్యాలను పరిశీలించాలి. కానీ విద్యాసంస్థలను పూర్తిస్థాయిలో తెరవకపోవడం, విద్యార్థులు బడులకు రాకపోవడంతో పరీక్షలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో పిల్లలకు ఏమేరకు పాఠాలు అర్థమవుతున్నాయో తెలిస్తే మరింత మెరుగైన పద్ధతుల్లో బోధన కార్యక్రమాలు సాగించవచ్చని గురుకుల సొసైటీలు యోచిస్తున్నాయి. ఈ నెలాఖరులోగా సబ్జెక్టు టీచర్లంతా నిర్దేశించిన ఫార్మాట్‌కు తగినట్లుగా పరిశీలన చేసి నివేదికలను పాఠశాలలో సమర్పించాలి. అనంతరం వాటిని జిల్లాస్థాయిలో క్రోడీకరించి సొసైటీ కార్యాలయానికి సమర్పిస్తారు. అక్కడ రాష్ట్రస్థాయిలో మరోసారి క్రోడీకరించిన తర్వాత పరిశీలనపై ఓ అంచనాకు రావచ్చని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా ఈ ప్రక్రియ ఈనెలాఖరుకల్లా పూర్తికానుంది. -
బోధనపై ప్రత్యేక దృష్టి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో విద్యా బోధనపై ప్రత్యేక దృష్టి సారించింది. ఉపాధ్యాయుల ఖాళీల స్థానంలో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను (విద్యా వలంటీర్లు) తాత్కాలిక ప్రాతిపదికన నియమించనుంది. కోర్టు కేసుల నేపథ్యంలో డీఎస్సీ–2018 నియామకాలు ఆలస్యం కావడం, ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీలతో పాటు నెలవారీ పదోన్నతులతో జిల్లాలో పోస్టులు చాలా వరకు ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. అలాగే విద్యా శాఖలో ప్రభుత్వం తీసుకుంటున్న నూతన సంస్కరణలు, అమ్మఒడి పథకం అమలుతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య జిల్లాలో గరిష్టంగా పెరిగింది. దీంతో జిల్లాలో ఉపాధ్యాయుల ఖాళీల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ లోటును భర్తీ తీర్చడానికి విద్యా వలంటీర్లను నియమించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రక్రియ పూర్తయితే జిల్లాలో ఉపాధ్యాయుల కొరత తీరనుంది. పోస్టులకు ప్రతిపాదనలు ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి ప్రకారం జిల్లాలో 998 మంది విద్యా వలంటీర్లు అవసరమని జిల్లా విద్యాశాఖ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు నివేదించింది. ప్రాథమిక పాఠశాలల్లో 291, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 369, ఉన్నత పాఠశాలల్లో 338 వలంటీర్లు అవసరమని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రతిపాదించిన వలంటీర్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించేందుకుప్రభుత్వం నుంచి అనుమతి కోసం జిల్లా విద్యాశాఖ ఎదురు చూస్తోంది. సెకండరీ గ్రేడ్ టీచర్ కేడర్‌లో నియమితులైన వారికి నెలకు రూ.5 వేలు, స్కూల్ అసిస్టెంట్లకు రూ.7 వేలు చొప్పున గౌరవ వేతనాన్ని చెల్లించనున్నారు. ఇలా ఎంపికైన విద్యా వలంటీర్లు ప్రస్తుత విద్యాసంవత్సరం ముగిసే వరకూ లేదా డీఎస్సీ–2018 నియామకాలు చేపట్టే వరకూ కొనసాగించే అవకాశం ఉందని జిల్లా అధికారులు తెలిపారు. టీడీపీ నిర్వాకం వల్లే డీఎస్సీ ఆలస్యం 2018 డీఎస్సీ నియామకాలు గత ప్రభుత్వ నిర్వాకమే అని ఉపాధ్యాయ అభ్యర్థులు చెందుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మూడేళ్ల తర్వాత ఎన్నికల ముందు నిరుద్యోగులను ప్రలోభ పెట్టేందుకు నిర్వహించిన డీఎస్సీ–2018లో లోపాల కారణంగా అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. 2018 డీఎస్సీ ఆన్లైన్ పరీక్షా విధానంలో విడతల వారీగా నిర్వహించి నార్మలైజేషన్ ప్రకటించకుండా ఫలితాలు విడుదల చేయడంతో అభ్యర్థుల మధ్య విభేదాలకు దారితీసింది. ఆన్లైన్ విధానంలో ఒకే అర్హత ఉన్న అభ్యర్థులకు వేర్వేరు పేపర్లలో పరీక్షలు నిర్వహించారు. దీంతో సులువుగా ఉన్న పేపర్ అభ్యర్థులకు ఎక్కువ మార్కులు రావడంతో, మిగిలిన పేపర్ అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో జాతీయ స్థాయి ఆన్లైన్ పరీక్షల్లో అమలు చేసే నార్మలైజేషన్ డీఎస్సీ ఫలితాల్లో అమలు చేయాలని వారంతా కోర్టుకు వెళ్లడంతో డీఎస్సీ–2018 ఆలస్యం అయ్యింది. ఈ కోర్టు కేసు తేలితేనే ప్రభుత్వానికి కొత్త డీఎస్సీ ప్రకటించేందుకు అవకాశం ఉన్నట్లు విద్యావేత్తలు చెబుతున్నారు. 2018 డీఎస్సీలో 626 పోస్టులు భర్తీ చెయ్యాల్సి ఉన్నా.. కోర్టు కేసుల కారణంగా కేవలం 144 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. మిగి లిన 482 పోస్టులు ఇంకా ఖాళీలుగానే చూపిస్తున్నాయి. ప్రభుత్వానికి నివేదిక పంపించాం జిల్లాలో ఇటీవల ఏర్పడిన ఉపాధ్యాయుల ఖాళీల దృష్ట్యా విద్యాబోధనకు ఆటంకం కలగకుండా సమీప పాఠశాల నుంచి ఉపా«ధ్యాయులను సర్దుబాటు చేశాం. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పతికి అనుగుణంగా జిల్లాలో ఆయా పాఠశాలలకు అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు అవసరమని అనుమతుల కోసం ప్రభుత్వానికి నివేదించాం.– రామలింగేశ్వరరెడ్డి,జిల్లా విద్యాశాఖాధికారి -
ఫ్రీడం స్కూళ్లు: చదువు, పరీక్షలు మన ఇష్టం
సాక్షి, హైదరాబాద్: ఫ్రీడం స్కూల్.. అక్కడ పిల్లలకు పాఠ్యాంశ పుస్తకాలుండవు.. టీచర్లు గంటల తరబడి బ్లాకు బోర్డుపై బోధించే పద్ధతి కనిపించదు. బట్టీ పట్టే విధానం అస్సలుండదు. ఇదీ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పాఠశాలల్లో తీసుకొచ్చిన సరికొత్త కాన్సెప్ట్. విద్యార్థులపై ఒత్తిడి లేని విధంగా బోధన, అభ్యసన సాగాలనే లక్ష్యంతో ఎస్సీ గురుకుల సొసైటీ సరికొత్తగా ‘ఫ్రీడం స్కూల్’విధానాన్ని తీసుకొచ్చింది. గురుకులం నిర్వహణంతా సొసైటీ ఆధ్వర్యంలోనే సాగినప్పటికీ.. ఇక్కడ నిర్వాహకులు, బోధకులు, పరీక్షల విధానం, కార్యాచరణ అంతా విద్యార్థుల అభీష్టం మేరకే నడుస్తుంది. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడమే ఉపాధ్యాయుల పని. మిగతా కార్యక్రమాలన్నీ విద్యార్థుల ఆలోచనలు, సూచనల మేరకే నడుస్తాయి. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే అమల్లో ఉన్న ఈ విధానంపై పూర్తిగా అధ్యయనం చేసిన ఎస్సీ గురుకుల సొసైటీ.. రాష్ట్రంలో 23 గురుకుల పాఠశాలల్లో 6, 7, 8, 9 తరగతుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఈ విధానం విజయవంతమైతే అన్ని గురుకుల పాఠశాలల్లో అమలు చేయాలని సొసైటీ భావిస్తోంది. పెన్ను, పేపర్ లేని పరీక్షలు సాధారణంగా బడికి వేళ్లే పిల్లలకు పాఠ్యాంశ పుస్తకాలుంటాయి. వీటి ప్రకారం నిర్దేశించిన తేదీల్లో బోధన చేపడతారు. ఆమేరకు అభ్యసన పూర్తి చేసిన విద్యార్థులకు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి, అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు. కానీ ఫ్రీడం స్కూల్ విధానంలో ఈ పద్ధతులేవీ కనిపించవు. ఒక్కో క్లాస్ 90 నిమిషాల పాటు ఉంటుంది. ప్రతి రోజూ 4 íపీరియడ్లు మాత్రమే ఉంటాయి. ప్రతి తరగతిలో 40 మంది విద్యార్థులుంటారు. ప్రతి నలుగురు విద్యార్థులతో ఒక బృందం చొప్పున క్లాస్‌రూముల్లో 10 బృందాలుంటాయి. ప్రతి బృందానికి ఒక లీడర్ ఉంటారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలకు బదులుగా మాడ్యూల్స్ ఉంటాయి. వీటిలోని అంశాలపై విద్యార్థులే పరస్పరం వేర్వేరుగా, బృందంగా చర్చలు జరపడం, లోతుగా పరిశోధించడం లాంటివి చేస్తారు. ప్రతి మాడ్యూల్లో అం శం, దాని తాలూకూ చరిత్ర ఉం టుంది. వీటిపై గ్రూప్ డిస్కర్షన్స్తో పాటు మాడ్యూల్‌లోని అంశాలపై స్కిట్లు రూపొందించడం, డిబేట్, క్విజ్ ఏర్పాటు చేయడం లాంటివి చేస్తారు. దీంతో ప్రతి అంశంపై విద్యార్థులకు లోతైన జ్ఞానం వస్తుంది. ఇక్కడి విద్యార్థులకు సాధారణ స్కూల్లో నిర్వహించే పరీక్షలుండవు. ఇక్కడ జరిగే పరీక్షల్లో విద్యార్థులు పెన్ను, పేపర్లను వినియోగించరు. స్కిట్స్, డిబేట్స్, క్విజ్, డ్రామా లాంటి అంశాలతోనే వారికి మార్కులు పడతాయి. బోధన, అభ్యసన అంశాలు, పరీక్షల నిర్వహణకు విద్యార్థుల ఆమోదం తప్పనిసరి. తరగతి గదిలో మెజార్టీ విద్యార్థుల అభిప్రాయం మేరకు ఆరోజు కార్యక్రమాలు సాగుతాయి. ఈ స్కూళ్లు ఎక్కడెక్కడంటే.. రాష్ట్రవ్యాప్తంగా 23 గురుకుల పాఠశాలలను ఫ్రీడం స్కూల్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. బోథ్, బెల్లంపల్లి, మంచిర్యాల, హయత్‌నగర్, సరూర్‌నగర్, కొందుర్గు, శంషాబాద్, ఆర్కేపురం, చేవెళ్ల, నార్సింగి, షేక్‌పేట్, చొప్పదండి, తిరుమలాయపాలెం, వెల్దండ, గద్వాల్, ఆర్.ఆర్.గూడెం, సిద్దిపేట్ రూరల్, ములుగు, చండూరు, వేల్పుర్, వరంగల్ ఈస్ట్, అడ్డగూడురు, చౌటుప్పల్ గురుకుల పాఠశాలల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ పాఠశాలల నిర్వహణపై ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తున్న సొసైటీ క్రమక్రమంగా వాటిని మెరుగుపర్చేందుకు సరికొత్త కార్యాచరణ ప్రణాళికలు తయారు చేస్తున్నారు. -
అగ్నికి పుటం పెట్టినట్టే...
త్యాగరాజుగారి కుమార్తె సీతామహాలక్ష్మికి కుప్పుసామయ్యతో వివాహం అయింది. విందు తరువాత ఆ సాయంత్రం చిన్న సంగీత గోష్ఠి ఏర్పాటు చేసారు. కేరళనుంచి వడివేలు అని ఒక సంగీత విద్వాంసుడొచ్చాడు. శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు వచ్చారు. శొంఠి వేంకట రమణయ్య కీర్తన చేసారు. తరువాత శ్యామశాస్త్రి చేసారు. గురువు శొంఠి వేంకట రమణయ్యగారు...‘‘త్యాగయ్యా! నీవు కూడా ఒక కీర్తన పాడవోయ్!’ అన్నారు. గురువుగారి సన్నిధిలో ఇంతమంది పెద్దలను చూసి త్యాగరాజు మనసులో ఏమనుకున్నారు...‘చాలు, నాకున్న ఒక్క బాధ్యత కూతురు పెళ్ళి. అది కూడా తీరిపోయింది. ఇంక నాకేం కావాలి తండ్రీ, ఎప్పటినుంచో నా జీవితంలో మిగిలిపోయింది ఏమిటో తెలుసా...‘‘నగుమోము కనలేని నాదు జాలీ తెలిసీ..’’ స్వామీ రామచంద్రా! నువ్వు ఆ సీతమ్మతో కలిసి నవ్వుతూ ఒక్కసారొచ్చి దర్శనమివ్వవా! నీ పాదారవిందాలకు నమస్కరించే అదృష్టాన్ని ప్రసాదించవా, కూతురు పెళ్ళయిపోయిందంటే... నా జీవితం కూడా అయిపోయింది. పెద్దవాడినైపోతున్నా...’’.మనమయితే ఇంట్లో పిల్ల పెళ్ళయిపోయిందనగానే ... నెలరోజుల నుంచి నిద్రలేదు. హాయిగా విశ్రాంతి తీసుకుందాం అనుకుంటాం. కానీ వాగ్గేయకారుల ఆర్తి చూడండి. వారికి ఆక్రోశం వచ్చినా, బాధ కలిగినా... అగ్నికి పుటం పెట్టిన బంగారం లాంటి కీర్తన వస్తుంది. ‘ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా..!!!’ అన్నారు రామదాసుగారు. అలాగే త్యాగయ్య ఎంత రసస్ఫోరకమైన పదబంధాలతో ఆర్తిగా పిలుస్తున్నారో తన రాముడిని... భగవంతునిలో మనసు నిలిపి రమిస్తూ, మనసు అంతరాంతరాల్లోంచి సత్యస్ఫురణంగా దొర్లిన అదెంత గొప్ప కీర్తనో ...‘నగుమోము కనలేని నాదు జాలి తెలిసీ... నను బ్రోవరాదా, శ్రీరఘువర(నీ నగుమోము): నగరాజధర నీదు పరివారులెల్ల: ఒగి బోధనజేసే వారలు కారే యటులుండుదురే: ఖగరాజు నీయానతి విని వేగ చన లేడో –గగనానికిలకు బహుదూరంబని నాడో– జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు –వగజూపకు తాళను నన్నేలుకోరా త్యాగరాజనుత నీ (నగుమోము)’’ పాంచభౌతికమైన శరీరంతో రావలసిన అవసరం లేని పరమాత్మను... ‘‘స్వామీ, ఇలా నిన్ను చూడలేకపోతే ఉండలేం’ అని ఆర్తితో ఎలుగెత్తి కీర్తించిన సాధుపుంగవులకోసం ఆయన పాంచభౌతిక శరీరాన్ని తీసుకుని ఈ నేత్రంతో చూడడానికి వీలుగా వచ్చినవాడు. ‘‘తండ్రీ, రక్షణయే నీ ప్రథమ కర్తవ్యం కదా! అపారమైన కరుణామూర్తివే! ఈవేళ నేనెంత అలమటించి పోతున్నానో...’’ అంటూ త్యాగయ్య తాదాత్మ్యం చెందాడు. ఆ తాదాత్మ్యతలో వాగ్గేయకారుల హృదయాల్లోంచి ఎలాటి అద్భుతమైన భావాలు పలుకుతాయో... ఒకనాడు నీవు కొండ భరించావు, ఒకనాడు కొండను ధరించావు. ఎవరు? రఘువరా..! పిలిచిందెవరిని? త్యాగరాజుకి ఆరాధ్యదైవం రామచంద్రమూర్తిని. ఇక్ష్వాకువంశంలో పుట్టిన రాముడిని కొండ భరించినవాడిగా, కొండ ధరించినవాడిగా కీర్తిస్తున్నారు. కొండను భరించింది కూర్మావతారం. కొండను ధరించింది కృష్ణావతారం. త్యాగయ్య పిలుస్తున్నదేమో.. రామచంద్రమూర్తిని. ఈ ముగ్గురికీ భేదం లేదా??? - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
గిరిపుత్రులకు ఈ–పాఠాలు!
గిరిపుత్రుల బడి అత్యాధునిక హంగులు సంతరించుకుంది. పాఠ్యాంశ బోధనలో నూతన ఒరవడికి తెరలేపింది. ఆన్లైన్ పాఠాలు, డిజిటల్ తరగతులకు భిన్నంగా లైవ్ టీచింగ్‌ను గిరిజన సంక్షేమ శాఖ అందుబాటులోకి తెచ్చింది. ప్రత్యేక సదుపాయాలతో ఏర్పాటు చేసిన స్టూడియో ద్వారా ఈ–పాఠ్యాంశ బోధన మొదలుపెట్టింది. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న ఈ విధానాన్ని మరింత ఆధునీకరిస్తూ పాఠ్యాంశ బోధనను సరికొత్తగా ఆవిష్కరిస్తోంది. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఈ–పాఠ్యాంశ బోధన అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా 50 పాఠశాలల్లో ఈ–స్టూడియో బోధన కొనసాగుతోంది. నేరుగా శాటిలైట్ లింకుతో ఈ ప్రక్రియను విజయవంతంగా అమలు చేస్తోంది. పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించడంలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ లైవ్ టీచింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేంద్రం మంజూరు చేసిన నిధుల నుంచి రూ.11 కోట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులను వినియోగించి ఈ–స్టూడియో, డిజిటల్ క్లాస్రూమ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. – సాక్షి, హైదరాబాద్ బోధన ఇలా.. ప్రస్తుతం 50 ఆశ్రమ పాఠశాలల్లో ఈ–స్టూడియో ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు. రోజుకు 5 తరగతులుంటాయి. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రోజుకో లైవ్ టీచింగ్ 45 నిమిషాల పాటు సాగుతుంది. దీంతో ప్రతి తరగతికి రోజుకో సబ్జెక్టు బోధిస్తారు. దాన్ని వీక్షించేందుకు స్కూల్లో డిజిటల్ స్క్రీన్, ప్రొజెక్టర్, రిసీవర్, డిష్, ల్యాప్‌టాప్ తదితరాలతో ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఈ–స్టూడియో ద్వారా జరిగే పాఠ్యాంశ బోధన స్కూల్లోని డిజిటల్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. బోధకుడికి సంబంధించి చిన్న స్క్రీన్‌లో వీడియో డిస్ప్లే అవుతూనే.. బ్యాక్‌గ్రౌండ్‌లో పాఠ్యాంశానికి సంబంధించిన యానిమేషన్ కనిపిస్తుంది. సందేహాల నివృత్తి.. పాఠ్యాంశ బోధన ప్రక్రియలో విద్యార్థులకు సందేహాలు వస్తే వాటిని లైవ్‌లోనే అడిగే వీలుంటుంది. పాఠ్యాంశాన్ని వింటున్న ప్రతి విద్యార్థి దగ్గర ఓ బజర్ ఉంటుంది. అందులో వివిధ రకాల బటన్లు ఉంటాయి. సందేహాలు, సమాధానాలు, స్పష్టత తదితరాలకు అనుగుణంగా విద్యార్థులు ఆ బటన్లు నొక్కుతుంటారు. అంశం అర్థం కాకపోతే బటన్ నొక్కితే వారిని లైవ్‌లోకి తీసుకొస్తారు. ఎక్కువ మందికి సందేహాలు వస్తే పాఠ్యాంశాన్ని తిరిగి అర్థమయ్యేలా బోధిస్తారు. తక్కువ సందేహాలు లేవనెత్తితే వాటికి అక్కడికక్కడే సూచనలు చేస్తూ కీలకాంశాలను రిపీట్ చేస్తారు. ఈ–స్టూడియో కేంద్రంగా.. లైవ్ టీచింగ్ కోసం మాసబ్‌ట్యాంక్‌లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా ఈ–స్టూడియోను ఏర్పాటు చేశారు. అక్కడ టీచింగ్ రూమ్‌తో పాటు కంట్రోల్ రూమ్ ఉంది. పాఠ్యాంశ బోధనలో భాగంగా టీచర్ బోధిస్తున్న సమయంలోనే అందుకు సంబంధించిన యానిమేషన్లు ప్లే చేసేలా వీడియో మిక్సర్ ఉంది. అందుకు తగిన ఆడియోను జోడించేందుకు ఆడియో కంట్రోల్ ఉంటుంది. వీటిని స్టూడియో ఇంజనీర్లు పర్యవేక్షిస్తారు. క్షేత్రస్థాయిలో విద్యార్థులు సందేహాలను లేవనెత్తినప్పుడు క్షణాల్లో వారిని లైవ్‌లోకి తీసుకొస్తారు. ఈ–స్టూడియోలో ఐదుగురు నిపుణులతో పాటు ఇంజనీర్లు ఉంటారు. ప్రతి స్కూల్లో ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటారు. పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతోంది లైవ్ పాఠాలతో పిల్లల్లో ఏకాగ్రత, ఆసక్తి పెరుగుతోంది. సాధారణంగా క్లాస్‌రూంలో బోర్డుపై ముఖ్యమైన అంశాలను రాస్తూ వివరిస్తాం. ఇక్కడ డిజిటల్ బోర్డుపై యానిమేషన్ల ద్వారా వివరించడంతో పాటు ముఖ్యమైన అంశాలను డిజిటల్ బోర్డుపై రాసే వీలుంటుంది. బోర్డుపై యానిమేషన్లను చూపడంతోనే విద్యార్థులకు విషయం అర్థమవుతుంది. మరింత లోతుగా బోధించే అవకాశం ఉంటుంది. డిజిటల్ బోధనతో విద్యార్థులు మరింత ఏకాగ్రతతో పాఠాన్ని వింటున్నారు. అర్థం కాని అంశముంటే వెంటనే బజర్ నొక్కుతున్నారు. విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. – శ్రీకాంత్, టీచర్ బోధనకు సమాంతరంగా వీడియోలు ఆన్లైన్ బోధనలో యానిమేషన్లు కీలకం. బోధనకు తగినట్లుగా సమయానుకూలంగా వాటిని ప్లే చేయాలి. దీంతో ప్రతి పాఠ్యాంశానికి సంబంధించిన పాయింట్లతో వీడియోలు సిద్ధం చేసుకోవడంతో పాటు వాటి నిడివిని ఖచ్చితంగా అంచనా వేయాలి. అందుకు ముందురోజే ఏర్పాట్లు చేసుకుంటాం. బోధన ప్రక్రియ సాగుతున్నంత సేపు పరిశీలిస్తాం. – చంద్రకాంత్, స్టూడియో ఇంజనీర్ త్వరలో మరో 35 పాఠశాలల్లో.. ఈ–స్టూడియోను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాం. ఈ విద్యా సంవత్సరంలో కచ్చితంగా అమలు చేయాలన్న లక్ష్యంతో 50 పాఠశాలల్లో ఏర్పాటు చేశాం. త్వరలో మరో 35 స్కూళ్లలో అందుబాటులోకి తెస్తాం. కేంద్రం ఇటీవల రూ.2.85 కోట్లు విడుదల చేసింది. ఆశ్రమ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో డిజిటల్ బోధన తీసుకొస్తాం. కొత్త విధానంలో బోధన ప్రక్రియ ప్రారంభ దశలో ఉంది. – నవీన్ నికోలస్,గిరిజన సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ -
నో గ్రాంట్..
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలను పునః ప్రారంభించి రెండు నెలలు దాటినా నేటికీ ఈ ఏడాదికి సంబంధించి పాఠశాలల నిర్వహణకు నిధులను విడుదల చేయలేదు. గత ఏడాది ఖర్చు పెట్టకుండా ఉన్న రూ.10.80 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తీసుకుంది. దీంతో పాఠాలు బోధించేందుకు సైతం చాక్‌పీస్‌లు లేక ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. నేటికీ అధిక శాతం పాఠశాలల్లో రిజిస్టర్లు నిర్వహించని పరిస్థితి. కొన్ని పాఠశాలల్లో విధిలేని పరిస్థితుల్లో ప్రధానోపాధ్యాయుల వేతనాల్లో నుంచి ఖర్చు చేస్తున్నారు. పాఠశాలల నిర్వహణకు ఎప్పుడో 2006లో ఇచ్చే గ్రాంట్లను నేటికీ ఇస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోని పాలకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు(టౌన్): ప్రభుత్వ పాఠశాలల్లో రిజిష్టర్ల నిర్వహణకు, బోధన సామగ్రి కోసం ఖర్చు చేసేందుకు ఇప్పటివరకు నిధులు రాకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 3,425 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లో ప్రాథమిక 2,646, ప్రాథమికోన్నత 363, ఉన్నత 416 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 3,34,609 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి ఏటా విద్యా సంవత్సర ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ నిధులను విడుదల చేస్తుంది. ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి ఒక్కో స్కూల్‌కు రూ.5వేలు, ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.12వేలు, ఉన్నత పాఠశాలలకు రూ.7వేల వంతున నిధులను కేటాయిస్తుంది. ఈ నిధులతో పాఠశాలల్లో చాక్‌పీస్‌లు, స్కేళ్లు, డస్టర్లు, రిజిస్టర్లు, కాగితాలు తదితర వాటిని కొనుగోలు చేసేందుకు వినియోగిస్తారు. ఇంతే మొత్తాన్ని గత 2006వ సంవత్సరం నుంచి విడుదల చేస్తున్నారు. అదే విధంగా స్కూల్ నిర్వహణా గ్రాంటు కింద మూడు తరగతి గదులు ఉన్న పాఠశాలకు రూ.5వేలు, అంతకంటే ఎక్కువ తరగతి గదులు ఉన్న పాఠశాలలకు రూ.10వేలు వంతున నిధులు కేటాయిస్తున్నారు. ఈ నిధులతో మరుగుదొడ్ల, కుర్చీల రిపేర్లు, వాటర్‌పైపులు తదితర సమస్యల పరిష్కారం కోసం వినియోగించనున్నారు. దీంతో పాటు ప్రతి టీచర్‌కు రూ.5వేల చొప్పున నిధులును కేటాయించాల్సి ఉంది. వీటితో పాటు ప్రతి కాంప్లెక్స్‌కు రీసోర్స్ సెంటర్‌కు రూ. 22వేలు, మండల రీసోర్స్ సెంటర్‌కు రూ. 80వేలును కేటాయిస్తున్నారు. అయితే రెండేళ్లుగా టీచర్‌కు ఇచ్చే రూ.5వేల నిధులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు ఏ మాత్రం సరిపోవడం లేదని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. గ్రాంట్‌ను పెంచమని ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా పెడచెవిన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది రూ.10.80 కోట్ల నిధులు వెనక్కి ప్రతి ఏటా స్కూల్ గ్రాంట్ నిధులును ఆగస్టులోపు విడుదల చేయాల్సి ఉంది. గత ఏడాది కొన్ని పాఠశాలలకు అక్టోబర్, మరికొన్ని పాఠశాలలకు నవంబర్ నెలల్లో నిధులను విడుదల చేశారు. అయితే 2017–18కు సంబంధించి, అంతకంటే ముందు మిగిలి ఉన్న నిధుల్లో ఖర్చు చేయని రూ.10.80 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. పాఠశాలల నిర్వహణకు విడుదల చేసిన నిధులను సర్వశిక్ష అభియాన్ అధికారులు సకాలంలో ఖర్చు చేయడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. పాఠశాలల అవసరాలకు ఇచ్చే నిధులను ఇతర వాటికి వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రాంట్ నిధులు వెనక్కి పోవడంతో చాక్‌పీస్‌లు, రిజిష్టర్, తెల్ల కాగితాలు ఏవైనా కొనాలన్నా, పాఠశాలల్లో మరమ్మతులు నిర్వహించాలన్నా, చీపుర్లు సైతం కొనాలన్నా ప్రధానోపాధ్యాయుల జేబుల నుంచి ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. మరుగుదొడ్లు నిర్వహణ ప్రైవేటు ఏజెన్సీలకు.. పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్వహణ ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనిపై విధి విధానాలను రూపొందించింది. త్వరలో దీనిపై ఉత్తర్వులు రానున్నట్లు సర్వశిక్ష అభియాన్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి దాకా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2015 విద్యా సంవత్సరం నుంచి నిధులు కేటాయిస్తుంది. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే స్కావెంజర్లకు రూ.1500, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.2,500, ఉన్నత పాఠశాలల్లో రూ.4వేలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది నుంచి డీఆర్డీఏ ద్వార వేతనాలు అందజేసే వారు. ఈ విద్యా సంవత్సరం నుంచి డీఆర్డీఏ వేతనాలను నిలిపివేసింది. దీంతో సర్వశిక్ష అభియాన్, డీఆర్డీఏ అధికారుల మధ్య సమన్వయం లోపించింది. మాకు సంబంధం లేదని ఎస్ఎస్ఏ అధికారులు చెబుతుంటే, తమకు సంబంధం లేదని డీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. నిధులు దారి మళ్లించడం దారుణం బడ్జెట్ ద్వారా మంజూరైన నిధులను వెనక్కి తీసుకోవడం, దారి మళ్లించడం చాలా దారుణం. ప్రభుత్వం చర్యలతో పాఠశాలల నిర్వహణ చాలా ఇ బ్బందిగా మారింది. ఉపాధ్యాయుల జేబుల్లో నుం చి డబ్బులు తీసి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్కావెంజర్స్‌కు జీతాలు ఇవ్వకపోవడంతో వాళ్లు రావడం లేదు. పాఠశాలల్లో నిర్వహణ సరి గాలేదని విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేస్తున్నారు. దీనిని ఖండిస్తున్నాం. –మోహన్‌దాస్, రాష్ట్ర కౌన్సిలర్, ఏపీటీఎఫ్ ఈ ఏడాది నిధులు విడుదల కాలేదు పాఠశాలల నిర్వహణకు సంబంధించి ఇంకా నిధులు విడుదల కాలేదు. గత ఏడాది, అంతకు ముందు వివిధ పనులకు కేటాయించిన నిధులకు సంబంధించి ఖర్చు పెట్టకుండా మిగిలిన నిధులు రూ.10.80 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీజ్ చేసింది. పాఠశాలల నిర్వహణకు ఇబ్బందులు లేకుండా ఆయా హెచ్ఎంలు ఖర్చు పెడుతున్నారు. నిధులు వచ్చిన తరువాత వారికి తిరిగి ఇచ్చేస్తాం. –విశ్వనాథ్, ప్రాజెక్ట్ అధికారి, సర్వశిక్ష అభియాన్ -
పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న పాఠమా
ప్రతి పొద్దూ ఇలా ఉండాలి. కాంతిమంతంగా.అజ్ఞానాన్ని పారద్రోలేలా. ధనిక, పేద.. అందరికీ.. ‘వెన్నెల’ సమానం అనేలా! సికింద్రాబాద్ ఆల్వాల్‌లోని వెంకటాపురంలో ఉంది ఆ పాఠశాల. పాఠశాల బయట బోర్డుపై బోధివృక్షం, దానికి పైగా అర్ధచంద్రాకారంలో ‘మహాబోధి విద్యాలయ’ అనే పేరు, దాని కింద స్కూల్‌ని స్థాపించిన సంవత్సరం (1992) ఉంటుంది.బోధివృక్షం ఆ పాఠశాల గుర్తు. అంబేడ్కర్ విద్యానికేతన్ ట్రస్ట్ ఆ పాఠశాలను నడుపుతోంది. సమాజంలో మహిళ స్థానం ఎలా ఉండాలని అంబేడ్కర్ ఆశించారో ఆ లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తున్న ప్రయత్నం కనిపిస్తుంటుంది మహాబోధి విద్యాలయలో. అంబేడ్కర్ ఒక సందర్భంలో ‘ఒక సమాజాన్ని అంచనా వేయాలంటే ముందుగా ఆ సమాజంలో మహిళలు సాధించిన అభ్యున్నతిని చూడాలి. వారి పురోగమనం మీదనే సమాజం అభివృద్ధి ఆధారపడి ఉంటుంది’ అన్నారు. అందుకు అనుగుణంగానే ఇక్కడ బోధన జరుగుతోంది. ఈ పాఠశాలలో బోధనా సిబ్బంది అంతా మహిళలే. మొత్తం 27 మందిలో ప్రిన్సిపాల్, పిఈటీ టీచర్, వాచ్‌మన్... ఈ ముగ్గురు మాత్రమే మగవాళ్లు. మిగిలిన 24 మంది మహిళలే. సహనమూర్తులు కనుకనే ఈ పాఠశాలలోని విద్యార్థులలో ఎక్కువ మంది అల్పాదాయ వర్గాల వాళ్లే. ఒక్కొక్కరిదీ ఒక్కోరకమైన కుటుంబ స్థితి. వీరిలో సింగిల్ పేరెంట్ సంరక్షణలో పెరుగుతున్న పిల్లలు కూడా ఉన్నారు. తండ్రి వేరే మహిళను పెళ్లి చేసుకోవడంతో తల్లి కష్టపడి పని చేసుకుని పిల్లల్ని పెంచుకుంటూ ఉంటుంది. అలాంటి ఇళ్లల్లో పరిపూర్ణమైన కుటుంబంలో ఉండే భరోసాపూరిత వాతావరణం ఉండదు. ఆ ప్రభావం పెరిగే పిల్లల మీద తప్పకుండా ఉంటుంది. అంచేత ఆ పిల్లలకు వాళ్ల ఇంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చదువు చెప్పాలి. ఒకవేళ ఒక విద్యార్థి హోమ్‌వర్క్ చేయకపోతే కారణాన్ని కనుక్కోవాలి. తల్లితోపాటు పనికి వెళ్లడం, నీళ్లు పట్టుకోవడానికి వెళ్లి ఆ పని పూర్తయ్యే సరికి కాలనీలో కరెంట్ పోవడం.. ఇలాంటివెన్నో కారణాలు ఉంటాయి. అవేవీ కాకపోతే ఆ రోజు రాత్రి వాళ్ల నాన్న మద్యం తాగి వచ్చి తల్లిని కొట్టడం, పిల్లల్ని కొట్టినంత పని చేసి బెదరగొట్టడం వంటిది జరిగి ఉంటుంది. అలాంటి పిల్లల్ని హోమ్‌వర్క్ చేయలేదనే కారణంగా కఠినంగా శిక్షిస్తే ఇక స్కూలుకి కూడా దూరమై, వీధుల్లో తిరగడానికి వెళ్లడమే కాకుండా, వాళ్ల వంటి పిల్లల్నే వెతుక్కుని ఆకతాయితనానికి అలవాటు పడే ప్రమాదం ఉంటుంది. అలాంటివారు స్కూలుకి వెళ్లమని ఎంత ఒత్తిడి చేసినా వెళ్లనని మొండికేస్తారు, పద్నాలుగు, పదిహేనేళ్లు వచ్చేసరికి తల్లికి ఎదురు తిరగడం కూడా అలవాటవుతుంది. ఇన్ని ఉంటాయి. ‘‘వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చదువు చెప్పాలంటే అంత సహనం ఉండేది మహిళలకే’’ అంటారు స్కూలు నిర్వాహకురాలు వెన్నెల. మూడవ బిడ్డకు సగమే ఫీజు ‘‘సింగిల్ పేరెంట్ సంరక్షణలో ఉండే పిల్లలతోపాటు అమ్మమ్మ, నాయనమ్మ సంరక్షణలో ఉండే పిల్లలు కూడా ఉంటారు. వాళ్లకు ఎదురయ్యే ఇబ్బందులు కొన్ని ఉంటాయి. ఆ సంగతి కూడా టీచర్‌కు తెలిసి ఉంటే విద్యార్థి పట్ల చూపించే ఆదరణ వేరుగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే టీచర్ తల్లిలా పిల్లల్ని గుండెల్లో పెట్టుకుని చదువు చెప్పాలి’’ అంటున్నారు వెన్నెల. ‘‘అలాగే ఇద్దరు పిల్లలను పెంచి, పోషించి, చదివించడానికి ఈ రోజుల్లో తల్లిదండ్రులు తలకిందులవుతున్నారు. అలాంటిది మూడవ బిడ్డను చదివించడమంటే వాళ్లు తలకు మించిన భారంగానే ఉంటుంది. దాంతో ముగ్గురిలో ఒకరిని చదువు మాన్పించి పనుల్లో పెట్టేస్తుంటారు. ముగ్గురిలో ఎవరో ఒకరు చదువును నష్టపోతుంటారిలా. అందుకే మూడవ బిడ్డకు ఫీజులో సగం రాయితీ ఇవ్వాలనుకున్నాం. ఈ రాయితీ వర్తించాలంటే మొదటి ఇద్దరినీ చదివిస్తూ ఉండాలి. పెద్దవాళ్లను చదువు మాన్పించి పనికి పంపిస్తున్న వాళ్లకు ఈ రాయితీ వర్తించదనే కండిషన్ కూడా పెట్టాం. బాలికలకు ప్రాధ్యానం ‘‘ఈ పాతికేళ్లలో పది వేలకు పైగా విద్యార్థులు మా స్కూల్లో పదవ తరగతి పూర్తి చేసుకుని పై చదువులకు వెళ్లారు. వారిలో దాదాపు ఐదు వేల మంది బాలికలు ఉండడం మాకు గర్వంగా అనిపించే విషయం. మా స్టూడెంట్స్ ఇళ్లలో అబ్బాయిని స్కూలుకి పంపించి, అమ్మాయిని ఇంట్లో పనులకు ఆపిన కుటుంబం ఒక్కటీ లేకుండా చూడగలిగామనేది మహిళగా నాకు పెద్ద సంతృప్తి. మా నాన్న (విప్లవ గాయకుడు గద్దర్) ఈ స్కూల్ స్థాపించిన ఉద్దేశం నెరవేరుస్తున్నాననే సంతోషం కూడా. మా స్కూల్ స్టాఫ్ అంతా అదే భావాలతో పని చేస్తుండడంతోనే ఇది సాధ్యమైంది’’ అని వివరించారు వెన్నెల. ఆదర్శాన్ని వల్లించడం కాకుండా ఆచరణలో చూపిస్తోంది మహాబోధి విద్యాలయ. ఇంట్లో పరిస్థితులు సరిగా లేని పిల్లల్ని హోమ్‌వర్క్ చేయలేదనే కారణంగా కఠినంగా శిక్షిస్తే ఇక స్కూలుకి కూడా దూరమై, ఆకతాయితనానికి అలవాటు పడే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి వారిని చక్కదిద్ది దారిలో పెట్టే సహనం మహిళా టీచర్లకు మాత్రమే ఉంటుంది. – వెన్నెల, స్కూలు నిర్వాహకురాలు – వాకా మంజులారెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కేజీబీవీల్లో 12వ తరగతి
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఉన్న కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) ఇకపై 12వ తరగతి వరకు విద్యా బోధన కొనసాగనుంది. ఇప్పటివరకు 6, 7, 8 తరగతుల్లోనే నివాస వసతితో కూడిన విద్యను అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇకపై 12వ తరగతి వరకు విద్యను అందించాలని నిర్ణయించింది. దీంతో సామాజిక, ఆర్థిక పరిస్థితులతో డ్రాపవుట్స్‌గా మిగిలిపోతున్న నిరుపేద కుటుంబాలకు చెందిన బాలికలకు 12వ తరగతి వరకు చదువుకునే వీలు కలగనుంది. సొంతంగా 9, 10 తరగతులు కొనసాగిస్తున్న రాష్ట్రం... కేజీబీవీల్లో ఇప్పటివరకు 8వ తరగతి వరకే బోధన అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుండగా తెలంగాణలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా 9, 10 తరగతులను కూడా కొనసాగిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 391 కేజీబీవీల్లో 73 వేల మంది బాలికలు చదువుతుండగా వారి చదువు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 212 కోట్లు వెచ్చిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మండలాల్లో 110 మండలాలు విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నట్లు కేంద్రం 2017లో గుర్తించి మరో 84 కేజీబీవీలను మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలో కేజీబీవీల సంఖ్య 475కు చేరింది. కేంద్రం తాజా నిర్ణయంతో వాటన్నింటిలో బాలికలకు నివాస వసతితో కూడిన ఇంగ్లిష్ మీడియం విద్య 12వ తరగతి వరకు అందనుంది. అమల్లోకి వచ్చిన కేబ్ సబ్‌కమిటీ సిఫార్సులు... దేశవ్యాప్తంగా బాలికా విద్యకు ప్రోత్సాహం అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసి నివేదిక అందించేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చైర్మన్‌గా సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (కేబ్) సబ్ కమిటీని కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ గతేడాది ఏర్పాటు చేసింది. అస్సాం మంత్రి హేమంత బిస్వాశర్మ, జార్ఖండ్ మంత్రి నీరా యాదవ్ సభ్యులుగా, కేంద్ర మానవ వనరులశాఖ అదనపు కార్యదర్శి రీనారాయ్ సభ్య కార్యదర్శిగా ఏర్పాటైన ఈ కమిటీ పలు దఫాలుగా వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ఇటీవలే నివేదిక సమర్పించింది. కేజీబీవీలను 12వ తరగతి వరకు కొనసాగించాలని నివేదికలో సిఫారసు చేసింది. దీనిపై కేంద్ర కేబినెట్ సానుకూలంగా స్పందించింది. కేంద్రం నిర్ణయంతో నిరుపేద బాలికలకు విద్యావకాశాలు మెరుగుపడతాయని కడియం శ్రీహరి పేర్కొన్నారు. -
వినూత్న బోధన
అల్లాదుర్గం(మెదక్): గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య గాడి తప్పుతుంటే, ఈ ఉపాధ్యాయుడు ప్రాణం పోస్తున్నాడు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో ప్రాథమిక విద్య అస్తవ్యస్తంగా మారుతోంది. ఆ పాఠశాలలో ఉన్న ఒకే ఉపాధ్యాయుడు ఐదు తరగతులకు బోధించడం ఇబ్బందిగా మారుతుంది. ఐతే ఆయనకు వినూత్నమైన ఆలోచన తట్టింది. సేల్ఫోన్ సహాయంతో ఐదు తరగతులకు పాఠాలు బోధిస్తున్నాడు. ఆయన ఒక తరగతిలో బోధిస్తూ , మిగితా వాటిలో ఫోన్ ద్వారా యూట్యూబ్‌లోని వీడియోలను డౌన్లోడ్ చేసి దానికి సౌండ్ బాక్స్‌లను అనుసంధానం చేసి పలు తరగతుల్లో ఉంచడం ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాడు. యూట్యూబ్ నుంచి తెలుగు వర్ణమాల, గుణితాలు, పద్యాలు, ఆంగ్ల వర్ణమాల నంబర్లను డౌన్లోడ్ చేసుకుని వాటి ద్వారా చార్ట్‌లను తయారు చేసి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధిస్తున్నాడు. బ్లూటూత్ ద్వారా కనెక్షన్.. అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ తండా (మాణిక్యరాజ్‌తండా) ప్రాథమిక పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలకు దీటుగా విద్యబోధన జరుగుతోంది.ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని సెల్‌ఫోన్‌కు చిన్న సౌండ్ బాక్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు తరగతులు బోధిస్తున్నాడు. ఒక్క ఉపాధ్యాయుడు ఐదు తరగతులు బోధించడం గగనంగా మారింది.దీంతో పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు చిట్టిబాబుకు ఈ ఐడియా వచ్చింది. ఫోన్‌కు బ్లూటూత్ ద్వారా చిన్న చిన్న సౌండ్ బాక్స్ ఏర్పాటు చేశారు. అఆలు రాస్తు చెబుతుంటే అందులో విద్యార్థులు వింటూ నేర్చుకుంటున్నారు. విద్యార్థులు చక్కగా వింటూ పలకడం, రాయడం చేస్తుండటంతో ఉపాధ్యాయుడి వినూత్న ప్రయోగం విజయవంతమైంది. ఉపాధ్యాయుడి రూపొందించిన వివిధ రకాల చార్ట్‌లు పాఠశాల గోడలపై అతికించిన చార్ట్‌లు సులువుగా నేర్చుకుంటున్నారు.. రాష్ట్రంలోనే ఈ విధంగా విద్యబోధన చేయడం ఏ ప్రభుత్వ పాఠశాలలో కనిపించదు. కూడికలు, తీసివేతలు, గుణితాలు, సంయుక్త అక్షరాలు, వివిధ రకాల చాట్లు 500 వరకు ఆయన తయారు చేశాడు. విద్యార్థులకు చార్ట్‌లు ఇచ్చి కూడికలు, తీసివేతలు, గుణితాలు చేయాలని చేప్తూ విద్యార్థులకు బోధిస్తున్నాడు. అలాగే రైమ్స్ పద్యాలు విద్యార్థులు సులువుగా నేర్చుకుంటున్నారు. బొమ్మల కథలు విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయి. ఇంగ్లిష్ పదాలు, కాకుర్తాలు ఫోన్లో వింటూ నేర్చుకుంటున్నారు. ఇబ్బందిగా ఉండేది.. ఐదు తరగతులకు ఒక్కడినే బోధించాంలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ ఐడియా ద్వారా విద్యబోధన సులువు అయ్యింది. ఫోన్లో అక్షరాలు రాయడం, పలకడంతో విద్యార్థులు శ్రద్ధగా వింటూ నేర్చుకుంటున్నారు. 3 , 4 తరగతుల విద్యార్థుల కోసం చార్ట్‌లు తయారు చేసి , విద్యార్థుల ముందు పెట్టడంతో వారే వాటిని చూసుకుని గణితం, తెలుగు, సైన్స్ పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇలా ప్రతి పాఠశాలకు ప్రభుత్వం ల్యాప్‌ట్యాప్, ట్యాబ్ పంపిణీ చేస్తే ఇలాంటి బోధనతో విద్యార్థులు సులువుగా నేర్చుకుంటారు. – చిట్టిబాబు, ఉపాధ్యాయుడు, గడిపెద్దాపూర్‌తండా -
పెద్ద సారూ.. పాఠం చెప్పరు!
పెద్ద సార్లు పని తప్పించుకుంటున్నారు! పాఠాలు బోధించకుండా వేరే వ్యాపకాల్లో మునిగి తేలుతున్నారు. పలువురు హెడ్మాస్టర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పుస్తకాలు పట్టట్లేదు.. పిల్లలకు పాఠాలు చెప్పట్లేదు. వాస్తవానికి ఇతర ఉపాధ్యాయులతో పాటు ప్రధానోపాధ్యాయుడు సైతం విద్యార్థులకు తప్పనిసరిగా పాఠాలు బోధించాలి. కానీ జిల్లాలో చాలా పాఠశాలల్లో హెచ్ఎంలు బోధనకు దూరంగా ఉంటున్నారు. ఇతర వ్యాపకాల్లో బిజీగా మారడంతో విద్యాబోధన గాడి తప్పుతోంది. ఫలితంగా విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే, వివిధ పనుల ఒత్తిళ్ల కారణంగా పాఠాలు బోధించడం లేదని కొందరు హెచ్ఎంలు బహిరంగంగానే చెబుతుండడం విశేషం. కామారెడ్డి టౌన్: హెడ్మాస్టర్లు పాఠ్యాంశాల బోధనకు మంగళం పాడేశారు. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన హెచ్ఎంలు.. ఇతర వ్యాపకాలతో గడుపుతున్నారు. జిల్లాలో దాదాపు 80 శాతం మంది ప్రధానోపాధ్యా యులు బోధనకు దూరంగా ఉంటుండగా, కేవలం 20 శాతం మంది మాత్రమే నిజాయతీగా పాఠాలు చెబుతున్నట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు. ఎనిమిది పీరియడ్లు బోధించాలి జిల్లాలో 730 ప్రాథమిక, 217 ప్రాథమికోన్నత, 314 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 4,916 టీచర్ పోస్టులకు గాను 4,077 మంది విధులు నిర్వహిస్తున్నారు. 819 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్నత పాఠశాలల్లో 307 మంది హెడ్మాస్టర్లు పని చేస్తున్నారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం ప్రతీ ప్రధానోపాధ్యాయుడు తప్పనిసరిగా వారానికి 8 పీరియడ్లు బోధించాలి. 6 నుంచి 10వ తరగతి వరకు ఏదో ఒక పీరియడ్ 45 నిమిషాల పాటు బోధించాల్సి ఉంటుంది. అయితే, స్కూల్ టైం టేబుల్లో తమకు పీరియడ్లు ఉన్నాయని చూపించుకుంటున్నారే తప్పితే చాక్‌పీస్ పట్టి పాఠాలు చెప్పింది లేదు. కొందరు ఒకటి, రెండుపీరియడ్లు బోధించి మమ అనిపిస్తుంటే, మరికొందరైతే, తరగతి గదుల ముఖమే చూడట్లేదు. 307 మంది హెచ్‌ఎంలలో 80 శాతం మంది అసలు పాఠ్యపుస్తకాలు, బ్లాక్‌బోర్డు, చాక్పీస్ను పట్టడం లేదని ఆరోపణలున్నాయి. కేవలం 20 శాతం మంది మాత్రమే పాఠాలు బోధిస్తున్నట్లు సమాచారం. ఉపాధ్యాయులు రానప్పుడు వారి స్థానంలో బోధిస్తూ తమ పీరియడ్లుగా బోధించినట్లుగా రికార్డుల్లో చూపిస్తున్నారు కానీ ప్రత్యేకంగా వారు తీసుకోవాల్సిన పీరియడ్లును మాత్రం తీసుకోవడం లేదు. ఉపాధ్యాయ సంఘాలు, ఇతర పనుల్లో..... జిల్లాలో పదికి పైగానే ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల్లో హెచ్ఎంలు సైతం పెద్ద నాయకులుగా ఉన్నారు. దీంతో సంఘాల పనుల్లో బిజీబిజీగా ఉంటున్న హెడ్మాస్టర్లు పాఠాలు ఎగ్గొడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంఘాల పేరుతో ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని విధులను విస్మరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, కొందరు హెచ్ఎంలు వ్యాపారాలు, ఫైనాన్స్‌లు, రియల్ దందాలను నిర్వహిస్తున్నారు. తమ సొంత పనుల్లో బిజీగా ఉంటూ బోధనలను విస్మరిస్తున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పట్టించుకోని ఉన్నతాధికారులు ఉపాధ్యాయ సంఘాల పేరుతో ఉన్నతాధికారులనే శాసించే స్థాయికి కొందరు చేరడంతో వారి విషయంలో అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో అసలు హెచ్ఎంలు పాఠాలను బోధించకున్నా పట్టనట్లు వ్యవహిస్తున్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క స్కూల్లోనూ హెచ్ఎంలు బోధించేలా చర్యలు తీసుకున్నట్లు లేదు. వాస్తవానికి విద్యా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి విద్యార్థులు, ఉపాధ్యాయులను విచారిస్తే హెచ్ఎంల బండారం బట్టబయలవుతుంది. కానీ, అధికారులు మాత్రం విచారణకు వెనుకడుగు వేస్తున్నారు. హెచ్ఎంలు తప్పనిసరిగా బోధించాలి ప్రభుత్వ పాఠశాలల్లో హెచ్ఎంలు సైతం వారానికి తప్పకుండా ఎనిమిది పీరియడ్లు బోధించాలి. కొత్త జిల్లా కావడంతో వారు కాస్త పని ఒత్తిడిలో ఉన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా తప్పనిసరిగా పాఠాలు బోధించాలి. పాఠాలు చెప్పని వారిపై చర్యలు తీసుకుంటాం. – మదన్మోహన్, డీఈవో, కామారెడ్డి -
కంప్యూటర్ విద్య అంతేనా?
సిరిసిల్లఎడ్యుకేషన్: కాలానికనుగుణంగా సాధారణ విద్యతోపాటు కంప్యూటర్ విద్యనందుకోవాల్సిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కంప్యూటర్ విద్యాబోధనకు దూరమయ్యారు. గతంలో పలు సంస్థలు కంప్యూటర్ విద్యను ప్రభుత్వ పాఠశాలలో బోధన చేశాయి. వాటి ఒప్పంద గడువు తీరడమో..ప్రభుత్వం వారికి అవకాశం ఇవ్వకపోవడమే తెలియదు కానీ ఎలాగోలా పాఠశాలలో గతంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌లన్నీ నేడు బూజుపట్టాయి. విద్యను బోధించడానికి అవసరమైన బోధనకులను విద్యాశాఖ గౌరవవేతనం ఇచ్చి నియమించినా పరిస్థితి ఈ విద్యాసంవత్సరం లేదు. 902 కంప్యూటర్స్ వృథా.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు కంప్యూటర్ విద్యనందించడానికి గతంలో పలు సంస్థలు ముందుకువచ్చాయి. జిల్లాలో 82 పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్‌లు ఉండగా, ఒక్కో ల్యాబ్‌లో 11 కంప్యూటర్స్ కలిపి 902 కంప్యూటర్స్ అందుబాటులో ఉన్నట్లు గణాంకాలున్నాయి. సిబ్బంది లేకపోవడంతో మూలనపడ్డాయి. టీచర్లే బోధన చేసేందుకు సిద్ధం అయినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని అవసరమైన 223 కొత్త కీబోర్డులు, 102 మౌస్‌లను 48 పాఠశాలలకు విద్యాశాఖాధికారులు అందించారు. కంప్యూటర్ ఇన్స్‌స్ట్రక్టర్స్ ఎక్కడా..? ప్రస్తుత సీసీఈ విధానంతో ఉన్న రికార్డులు, పరీక్షల నిర్వహణ, ప్రయోగాలు చేయడానికే సమయం లేదంటే మళ్లీ కంప్యూటర్ విద్యను బోధించడం సాధ్యం కాదనే అభిప్రాయాలున్నాయి. గతంలో ఎన్ఐఐటీ వాళ్లకు కంప్యూటర్ విద్య అందించడానికి ఇచ్చిన విధానం మాదిరి మళ్లీ ఏదేని సంస్థతో కంప్యూటర్ విద్యను అందించేందుకు విద్యాసంవత్సరం ఆరంభంలో చేయాలని సూచిస్తున్నారు. కాకిలెక్కలు.. ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో కలిపి 82 సెంటర్లు ఉన్నాయని గణాం కాలున్నాయి. ప్రస్తుతం కాగితాలపై 902 కంప్యూటర్స్ ఉన్నాయన్న గణాంకాలుంటే క్షేత్రస్థాయి పరిశీలనలో మాత్రం 50 పాఠశాలలో కంప్యూటర్స్ కేంద్రాలుండగా ఒక్కో దానిలో 11 చొప్పున 550 కంప్యూటర్స్ ఉన్నట్లు ఆయా పాఠశాలల నిర్వాహకులు చెబుతున్నారు. పరికరాలు వచ్చిన మాట వాస్తవమే కంప్యూటర్లకు అవసరమైన కొన్ని పరికరాలు వచ్చిన మాట వాస్తవమే. అవసరమైన వాటికి వాడాలని పంపిణీ జరిగింది. బోధన చేయడానికి ప్రస్తుతం ప్రత్యేక శిక్షకులు లేరు. మన జిల్లాలోనే కాదు అన్ని జిల్లాలో ఇదే పరిస్థితి. డిజిటల్ పాఠాలను చెప్పే క్రమంలో ఉపాధ్యాయులకు కొంత శిక్షణ అందింది. వారే ప్రస్తుతం బోధన చేస్తున్నారు. సిబ్బంది విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. – డాక్టర్ రాధకిషన్, డీఈవో, రాజన్న సిరిసిల్ల -
ఇంజినీరింగ్ బోధనకు ఐఐటీ పట్టభద్రులు
న్యూఢిల్లీ: వెనుకబడిన ప్రాంతాల్లోని ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులకు బోధించేందుకు ఎన్ఐటీ, ఐఐటీలకు చెందిన 1225 మంది పట్టభద్రులను ఎంపికచేసినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. వీరంతా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న 53 ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల్లో మూడేళ్లపాటు బోధన చేస్తారని వెల్లడించారు. తమ మంత్రిత్వ శాఖ ఇచ్చిన పిలుపుమేరకు ఐఐటీలు, ఎన్‌ఐటీల్లోని 5వేల మంది ఎంటెక్, పీహెచ్డీ పట్టభద్రులు స్పందించారని, వీరి నుంచి 1,225 మందిని ఎంపిక చేశామని చెప్పారు. వీరికి నెలకు రూ.70వేలు వేతనంగా చెల్లిస్తామన్నారు. అర్హులైన అధ్యాపకులు దొరక్కపోవటంతో వెనుకబడిన ప్రాంతాల్లోని ఈ కళాశాలల్లోని 60% బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
రాందేవ్ శిష్యురాలికి ఫత్వా
రాంచీ : యోగా శిక్షణ తక్షణం ఆపాలంటూ రఫియా నాజ్‌కు ముస్లిం సంస్థలు ఫత్వా జారీ చేశాయి. ఒక ముస్లింగా జన్మించి.. యోగా శిక్షణ ఎలా ఇస్తావంటూ మత సంస్థలు ఆమెను ప్రశ్నించాయి. యోగా ట్రయినింగ్ ఇవ్వడం తక్షణం ఆపాలని.. లేదంటే ప్రాణాలకు హాని తప్పదని సదరు సంస్థలు రఫియా నాజ్‌ను హెచ్చరించాయి. ముస్లింల సంస్థల హెచ్చరికల నేపథ్యంలో రఫియాకు కట్టుదిట్టమైన భద్రతను జార్ఖండ్ ప్రభుత్వం కల్పించింది. మత సంస్థల హెచ్చరికలపై జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ ప్రధానకార్యదర్శి సంజయ్ కుమార్ స్పందించారు. రఫియాకు ఎలాంటి హానీ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు శాఖను ఆదేశించారు. రఫియా నాజ్‌కు ఆమె కుటుంబ సభ్యులకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాంచీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కుల్దీప్ ద్వివేదీ తెలిపారు. రఫియా నాజ్ పలు సందర్భాల్లో యోగా గురు రామ్‌దేవ్‌తో కలిసి వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె యోగా మెళుకువలు నేర్పేవారు. -
సిబ్బంది లేకే ఇబ్బంది!
సమస్యల వలయంలో తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్ నుంచి పాత బాలప్రసాద్ : తెలంగాణ యూనివర్సిటీలో బోధన, బోధ నేతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఏళ్ల తరబడి సిబ్బంది నియామకాలు చేపట్టక పోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. యూనివర్సిటీలో ప్రస్తుతం 18 విభాగాలు, 26 కోర్సులు నడుస్తున్నాయి. తెయూకు డిచ్‌పల్లిలో మెయిన్ క్యాంపస్, భిక్కనూర్‌లో సౌత్ క్యాంపస్, సారంగపూర్‌లో ఎడ్యుకేషన్ క్యాంపస్‌లు ఉన్నాయి. తెయూ టీచింగ్ విభాగంలో ప్రస్తుతం 71 మంది రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. వీరితోపాటు 52 మంది అకాడమిక్ కన్స ల్టెంట్లు విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవలే 59 పోస్టులను మంజూరు చేసింది. త్వరలోనే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసే అవకాశాలున్నాయి. 77లో ఆరుగురు మైనస్.. తెయూలో 77 మంది రెగ్యు లర్ ఫ్యాకల్టీ ఉండగా వారిలో ప్రస్తుతం 71 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఒకరు అనారోగ్యంతో మృతి చెందగా మరొకరు పదవీ విరమణ చేశారు. ఇద్దరు డిప్యుటేషన్‌పై ఇతర యూనివర్సిటీలకు వెళ్లగా, ఇద్దరు రాజీనామా చేశారు. 67 రెగ్యులర్ పోస్టులు ఖాళీగా ఉండగా, 52 మంది అకాడమిక్ కన్సల్టెంట్లు పనిచేస్తున్నారు. పెరిగిన కోర్సులకు మరో 63 అధ్యాపక పోస్టులు మంజూరు కావాల్సి ఉంది. అన్ని కోర్సుల్లోనూ సిబ్బందిలేక ఇబ్బందులే.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మాథ్స్, బీఈడీ, ఎంఈడీ, ఎల్ఎల్ఎం, కెమిస్ట్రీ రెండేళ్ల పీజీ కోర్సులకు రెగ్యులర్ ఫ్యాకల్టీ లేక కేవలం అకాడమిక్ కన్సల్టెంట్లతోనే తరగ తులు నిర్వహిస్తున్నారు. అప్లయిడ్ స్టాటిస్టిక్స్ కోర్సు ఎనిమిదేళ్లుగా కేవలం ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్‌తోనే కొనసాగుతోంది. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు ఐఎంబీఏ అకాడమిక్ కన్సల్టెంట్లతోనే కొనసాగుతున్నది. భిక్క నూర్ సౌత్ క్యాంపస్‌లో ఒకప్పుడు రాష్ట్రంలోనే పేరొం దిన ఆర్గానిక్ కెమిస్ట్రీ కోర్సును ఓయూ నుంచి తెయూ కు బదిలీ అయిన తర్వాత ఒక రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అకాడమిక్ కన్సల్టెంట్లతో నిర్వహిస్తున్నారు. గతంలో ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేసిన విద్యార్థులు 30కి 30 మంది సీఎస్ఐఆర్ ఫెలోషిప్‌తోపాటు మంచి ఉద్యోగాలు సాధించేవారు. ప్రస్తుతం డిచ్పల్లి మెయిన్ క్యాంపస్‌లో ఆర్గానిక్ కెమిస్ట్రీ కోర్సును ప్రవేశపెట్టడంతో రెగ్యులర్ ఫ్యాకల్టీ మొత్తం ఇక్కడే ఉండి పోయారు. -
బోధనపై శ్రద్ధ ఏదీ?
పదవుల కోసం మంత్రుల చుట్టూ ప్రదక్షిణ జేఎన్టీయూలో తగ్గిన ఆవిష్కరణలు, పేటెంట్లు జేఎన్టీయూ : పేరు గొప్ప, ఊరు దిబ్బ అనే చందంగా తయారైంది జేఎన్టీయూ పరిస్థితి. ఉన్నత విద్యకు దిశానిర్దేశం చేయాల్సిన అధ్యాపకులు కరవవుతున్నారు. జేఎన్టీయూలో బోధన సిబ్బంది కొరతగా ఉంది. దీనికితోడు పదవులపై ఉన్న శ్రద్ధ బోధన, పరిశోధనపై చూపడంలేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. జేఎన్టీయూ అనంతపురం పరిధిలో పరిశోధనలు, ఆవిష్కరణలు, పేటెంట్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో లేకపోవడం ఇందుకు ఉదాహరణ. తీసికట్టుగా సాంకేతిక విద్య.. జేఎన్టీయూ ఏర్పడి ఇప్పటికి 8 ఏళ్లు కావస్తోంది. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం బీటెక్ కోర్సులకు 15 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు, పీజీ కోర్సులయితే 12 మంది విద్యార్థులకు ఓ అధ్యాపకుడు తప్పనిసరి. ఇందులోనూ 1 : 2 : 6 నిష్పత్తిలో బోధనా సిబ్బంది ఉండాలి. అంటే ఒక ఫ్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ఫ్రొఫెసర్లు, ఆరుగురు అసిస్టెంట్ ఫ్రొఫెసర్లు బీటెక్ కోర్సులకు ఉండాలని నిబంధన. పోçస్తు గ్రాడ్యుయేట్ పోస్టులకు 1 : 1 : 2 నిష్పత్తిలో ఒక ఫ్రొఫెసర్, ఒక అసోసియేట్ ఫ్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ఫ్రొఫెసర్ ఉండాల్సి ఉంది. జేఎ¯ŒSటీయూ ప్రారంభమైన కొత్తలో 72 పోస్టుల భర్తీకి అనుమతి లభించినప్పటికీ 34 పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. కొత్తగా ఏర్పడిన కలికిరి కళాశాలకు పోస్టులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఆర్థిక పరమైన అనుమతులు లేవని నియామకాల పట్ల వర్శిటీ యాజమాన్యం తాత్సారం చేసింది. బోధన పోస్టుల సంఖ్య ప్రస్తుతం జేఎ¯ŒSటీయూలో 80 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్తగా 134 ఖాళీలకు అనుమతి లభిం చింది. మొత్తం 214 పోస్టుల భర్తీపై వర్శిటీ యం త్రాంగం ఎప్పుడు భర్తీ చేస్తుందో తెలియని పరిస్థితి. పడకేసిన పరిశోధన బోధన సిబ్బంది కొరత వల్ల పీహెచ్డీ కోర్సు చేయాలనుకున్న విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం ఉన్నవారిలో అదనపు పదవులు ఉన్నా, తరగతులు తప్పనిసరిగా తీసుకొనే వారు కొందరే ఉన్నారు. అసలు తరగతులు వైపు చూడకుండా అదనపు పదవిలోనే కొనసాగుతున్న అసిస్టెంట్ , అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంటెక్ ప్రాజెక్ట్‌లు , పీహెచ్డీ ప్రాజెక్ట్ థీసిస్ అధ్యాపకులు పరిశీలన చేయడానికి నెలల తరబడి విద్యార్థులు వేచి ఉండాల్సిన పరిస్థితి. అయినప్పటికీ వర్సిటీ యాజమాన్యం చూసిచూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. -
ఆంగ్ల మాధ్యమంపై ఊగిసలాట
భీమవరం టౌన్ : మున్సిపల్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ విద్యాబోధన ఊగిసలాటలో పడింది. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల యాజమాన్య పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రవేశపెట్టాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంలో మంత్రులు, అధి కారుల వ్యాఖ్యలు గందరగోళానికి గురి చేస్తున్నాయి. మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధన ఉంటుం దని పేర్కొనగా.. విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు ఉంటాయని ప్రకటించారు. ఈ పాఠశాలల్లో జూన్ 11 నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ఏ మాధ్యమంలో విద్యాబోధన చేస్తారనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత మాత్రం రాలేదు. తొలుత తెలుగు, ఆంగ్ల మాధ్యమాలకు సంబంధించి పాఠ్య పుస్తకాల కోసం ఇండెంట్ ఇవ్వాలంటూ ఉన్నతాధికారులు నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలొచ్చాయి. అందుకు అనుగుణంగానే జిల్లా అధికారులు ఇండెంట్ పెట్టారు. అనంతరం కేవలం ఆంగ్లమాధ్యమ పాఠ్య పుస్తకాలకు మాత్రమే ఇండెంట్ ఇవ్వాలంటూ ఆదేశించారు. దీంతో ఏం చేయాలో తెలియక జిల్లా అధికారులు ఇండెంట్ ఇవ్వకుండా మిన్నకుండిపోయారు. మెప్మా సహకారంతో.. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన దిశగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సన్నద్ధం చేసేం దుకు ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సహకారం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల మహిళలతో మున్సిపాలిటీల వారీగా అధికారులు సమావేశాలు నిర్వహించారు. మున్సిపల్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన అమలు చేస్తున్నామని, పిల్ల లందరినీ ఆ పాఠశాలల్లో చేర్పించాలంటూ ఇంటింటా ప్రచారం చేయించారు. ఆంగ్ల మాధ్యమంపై మక్కువతోనే తల్లిదండ్రులు తమ పిల్లలను కాన్వెంట్లకు పంపుతున్నారన్నది ప్రభుత్వ భావన. ఈ నేపథ్యంలోనే ఆంగ్లంలో బోధనతోపాటు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా 6 నుంచి 10వ తరగతి వరకు కెరీర్ ఫౌండేషన్ కోర్సుల ద్వారా విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తామని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. అయితే, ఆంగ్లమాధ్యమ బోధనకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేవు. పాఠశాలల్లో తగిన సౌకర్యాలు లేవు. మరోవైపు ఆంగ్లమాధ్యమ బోధనకు ఉపాధ్యాయులు సైతం సన్నద్ధంగా లేదు. ప్రభుత్వ పరంగా పాఠశాలల్లో చేసిన ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఏమీ లేవు. ఆంగ్లంలో బోధించేందుకు వీలుగా ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదు. పట్టణాల వారీగా పాఠశాలల సంఖ్య ఇలా.. పట్టణం ప్రాథవిుక ప్రాథవిు ఉన్నత కోన్నత పాఠశాలలు భీమవరం 35 01 06 ఏలూరు 38 04 07 నరసాపురం 20 05 06 నిడదవోలు 11 01 03 పాలకొల్లు 22 00 06 తాడేపల్లిగూడెం 19 01 06 తణుకు 14 02 01 మొత్తం 159 14 35 మాతృభాషలో బోధనే మంచిది ప్రాథమిక స్థాయి నుంచి మాతృభాషలో బోధన అవసరం. దీనివల్ల విద్యార్థుల్లో మానసిక వికాసం పెరుగుతుంది. తొలుత మాతృభాష, తరువాత హిందీ, ఆ తరువాత అంతర్జాతీయ భాషలో బోధన అవసరమని కొఠారి కమిషన్ సూచించింది. – ఎంఐ విజయకుమార్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి రెండు మాధ్యమాలూ ఉండాలి మున్సిపల్ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం బోధన ఒక్కటే పెడతామనడం సరికాదు. తెలుగులోనూ బోధన ఉండి తీరాలి. రెండూ ఉంటేనే విద్యార్థులు తమకు నచ్చిన మాధ్యమంలో చేరతారు. – టి.సత్యనారాయణమూర్తి, జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ కార్యదర్శి పిల్లలు బడికి దూరమవుతారు బలవంతంగా ఆంగ్లమాధ్యమాన్ని రుద్దితే అర్థంకాక పిల్లలు స్కూలు ఎగ్గొట్టే ప్రమాదం ఉంది. మాతృభాషతోపాటు ఆంగ్ల మాధ్యమ బోధన కూడా అవసరమే. పూర్తిగా ఆంగ్లమాధ్యమ బోధన సరికాదు. – షేక్ సాబ్జీ, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాతృభాష బోధన అవసరం విద్యాహక్కు చట్టం ప్రకారం మాతృభాషలోనే బోధన ఉండాలి. 6వ తరగతి నుంచి ఆంగ్లమాధ్యమంలో బోధన చేస్తే బాగుంటుంది. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో బోధన ఉండి తీరాలి. – కోడి వెంకట్రావు, ప్రధానోపా«ధ్యాయుడు, భీమవరం -
టీచర్‌గా మారిన రకుల్ ప్రీత్ సింగ్
-
టీచర్‌గా మారిన టాప్ హీరోయిన్
టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టీచర్ అవతారం ఎత్తింది. ఆమె ఒక వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరో వైపు సోషల్ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటుంది. తాజాగా మంచు లక్ష్మీ స్థాపించిన ‘టీచ్ ఫర్ చేంజ్’ సంస్థ కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్ లోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి విద్యార్ధులకు రకుల్ ప్రీత్ ఇంగ్లీష్ పాఠాలను భోధించింది. ఇంగ్లీష్‌లో వ్యతిరేక పదాల గురించి చెప్పడంతో పాటు విద్యార్ధులకు ఇంగ్లీష్ స్పీకింగ్ యాక్టివిటీ గురించి వివరించిందట. బీ ద చేంజ్, టీచ్ ఫర్ చేంజ్ అనే సందేశాన్ని ఇచ్చేందుకు రకుల్ ఆ పాఠశాలకు వెళ్లింది. టీచ్ ఫర్ చేంజ్ సంస్థకు తాను పూర్తి మద్దతిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా తాను చదువుకున్న రోజులను ఆమె గుర్తు చేసుకొని మురిసిపోయింది. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఫోటోలు దిగింది. విద్యార్థులకు పాఠాలు చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన లక్ష్మీ మంచు, చైతన్యకు థ్యాంక్స్ అంటూ రకుల్ ట్విట్ చేసింది. మరోవైపు రకుల్ రాకతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. Had d most amazing time with these kids yest! Thanks @LakshmiManchu n #chaitanya .dre is somethin abt their smiles -
టీచర్‌గా మారిన టాప్ హీరోయిన్
-
అంగన్వాడీల్లో ఆంగ్లవిద్య బోధన
ఆర్జేడీ శారద ఆలూరు రూరల్ : అంగన్వాడీ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో ఆంగ్లవిద్యను అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఐసీడీఎస్ రీజనల్ డైరెక్టర్ శారద తెలిపారు. సోమవారం ఆలూరు ఐసీడీఎస్ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ పద్ధతిన కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వీరేష్‌ను పరామర్శించేందుకు పీడీ అరుణతో కలిసి ఆలూరుకు వచ్చారు. అనంతరం స్థానిక సీడీపీఓ కోటేశ్వరితో కలిసి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాయలసీమ జిల్లాల్లో మొత్తం 17,062 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఆయా జిల్లాల్లో ఇప్పటివరకు 2,300 అంగన్వాడీ కేంద్రాల్లో ఎల్కేజీ, యూకేజీ కోర్సులను ప్రారంభించామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో రాబోవు రోజుల్లో బయోమెట్రిక్ విధానాన్ని కూడా అమలు చేస్తామన్నారు. వివిధ కారణాలచేత కోడిగుడ్లు , ప్రభుత్వం సరఫరాచేసే పాలప్యాకెట్లు చెడిపోయినట్లయితే వాటిని వెంటనే పారవేసి విషయాన్ని సంబంధిత సూపర్వైజర్లకు, సీడీపీఓలకు తెలియజేయాలన్నారు. వేసవికాలం ప్రారంభమైన నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలు మధ్యాహ్నం వరకే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. -
మెరుగైన విద్యాబోధనకు కృషి చేయండి
కలెక్టర్ ముత్యాలరాజు నెల్లూరు (వేదాయపాళెం) : జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు మరింత మెరుగైన విద్యాబోధన చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు అన్నారు. నగరంలోని కలెక్టర్ బంగ్లాలో శనివారం సాయంత్రం ఆయన విద్య, సాంఘిక సంక్షేమ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి ఉత్తీర్ణత ఫలితాల శాతం గణనీయంగా పెరిగేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలోని బోధన ఉపాధ్యాయులకు ఒక్కొక్క సబ్జెక్ట్‌కు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించారు. సర్వశిక్షా అభియాన్ ఉపాధ్యాయులను ప్రత్యేక బోధకులుగా నియమించి శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. 8,9,10 తరగతులకు విద్యార్థులకు వర్క్ బుక్‌లు సిద్ధం చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో ఒక ప్రత్యేక అధికారిని నియమించి విద్యా ప్రమాణాలపై వారితో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. వచ్చే నెలలో జరిగే ‘మనబడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. ప్రభుత్వ నిధులే కాకుండా దాతల విరాళాలతో పాఠశాలలో తగిన మౌలిక వసతులు మెరుగు పరచాలన్నారు. ‘మనబడి పిలుస్తోంది’ కార్యక్రమంలో చదువుకున్న వికలాంగులకు ఉచితంగా ట్రై సైకిళ్లు అందజేయాలని ఆదేశించారు. సాంఘిక సంక్షేమశాఖ డీడీ మధుసూదన్‌రావు, గిరిజనాభివృద్ధి సంస్థ అధికారి గిరిధర్, సర్వశిక్షా అభియాన్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. పది మండలాల్లో పురోగతి సాధించాలి జిల్లాలో ఆత్మగౌరవం పథకం కింద బహిరంగ మల,మూత్ర విసర్జన రహిత గ్రామాలుగా 220 పంచాయతీలను ప్రకటించాల్సి ఉందని కలెక్టర్ ముత్యాలరాజు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 716 గ్రామ పంచాయతీలు ఓడీఎఫ్ గ్రామాలుగా గుర్తించినట్లు తెలిపారు. పెళ్లకూరు, దుత్తలూరు, మనుబోలు, నెల్లూరు, పొదలకూరు, కోవూరు, విడవలూరు, కొండాపురం, నాయుడుపేట, ఆత్మకూరు మండలాల పురోగతి సాధించాలని కోరారు. ఆత్మగౌరవం పథకం కింద జనవరి నుంచి లబ్ధిదారులకు రూ.31 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉండగా ప్రస్తుతం రూ. 25 కోట్లు విడుదలయ్యాయని, రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారని తెలిపారు. మిగతా రూ.6 కోట్లు వారం రోజులలోపు లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతుందన్నారు. -
ప్రభుత్వ బోధనా ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు
డీఎంఈ డాక్టర్ సుబ్బారావు జీజీహెచ్ తనిఖీ వైద్యసేవలపై సమీక్ష కాకినాడ వైద్యం: ప్రభుత్వ బోధనా ఆస్పత్రుల్లో నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నట్టు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ ఎన్.సుబ్బారావు తెలిపారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో శుక్రవారం సూపరింటెండెంట్ ఛాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యులు ఉండడంతోపాటు సేవలు మెరగవ్వడంతో వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్ ఇచ్చామన్నారు. మార్చి నెల తర్వాత అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు 20 శాతం పెరిగాయని ఆయన తెలిపారు. జీజీహెచ్‌కి వచ్చే రోగుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రూ. 40 కోట్లతో మదర్,ఛైల్డ్ బ్లాకులు నిర్మిస్తున్మాన్నారు. మార్చి నెలాఖర్లోగా రూ. 40 కోట్ల వైద్య పరికరాలను కొనుగోలు చేసేందుకు పరిపాలనామోదం ఇచ్చామని తెలిపారు. మత్తు, డయాబెటిస్ట్, గైనకాలిజిస్ట్, న్యూరాజిస్ట్ వైద్యుల కొరత ఉందని, అదనపు పోస్టుల మంజూరుకు చర్యలు తీసుకున్నామన్నారు. జీజీహెచ్‌లో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్పు (పీపీపీ) తరహాలో సీటీస్కాన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ఆయన తెలిపారు. సూపరింటెండెంట్ డాక్టర్ వై.నాగేశ్వరరావు పాల్గొన్నారు. రోగులకు నాణ్యమైన సేవలు అందించాలి ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ ఎన్.సుబ్బారావు వైద్యులను ఆదేశించారు. ఆయన శుక్రవారం కాకినాడ ప్రభుత్వ సామాన్య బోధనా ఆస్పత్రిని అకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, ఎమర్జన్సీ వార్డులను సందర్శించారు. అందుతున్న వైద్య సేవలపై రోగుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం సూపరింటెండెంట్ ఛాంబర్లో వైద్య విభాగాధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఓపీ వేళలు, ఎమర్జన్సీ విధుల్లో వైద్యులు అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యుల భర్తీకి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ డాక్టర్ వై. నాగేశ్వరరావు కోరారు. ఆయన పలు అంశాలను ఐఎంఈ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహాలక్ష్మి, డాక్టర్ రాఘవేంద్రరావు, సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ టీఎస్ఆర్ మూర్తి , వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు. -
ఇదేం ‘సంక్షేమం’!
వసతి గృహాలు.. సమస్యల నిలయాలు కరువైన మౌలిక వసతులు చలికి వణుకుతున్న విద్యార్థులు పలుచని దుప్పట్లతో తప్పని తిప్పలు విడుదల కాని డైట్.. కాస్మోటిక్ చార్జీలు జగిత్యాల : జిల్లాలోని సంక్షేమ వసతిగృహాలు..సమస్యలకు నిలయాలుగా మారాయి. మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు... ఐదు నెలల నుంచి విడుదల కాని డైట్ బిల్లులతో హాస్టల్ వార్డెన్లు అవస్థలు పడుతున్నారు. హాస్టళ్లలో సమస్యల మధ్య బోధనసాగిస్తూ విద్యార్థులు.. వంట సామగ్రి కోసం రూ.లక్షల్లో అప్పులు చేస్తూ వార్డెన్లు కాలం వెళ్లదీస్తున్నారు. ఐదు నెలల నుంచి..కనీసం కాస్మోటిక్ ఛార్జీలు కూడా విడుదల చేయకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వసతి గృహాల్లో 9, పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు చెబుతున్న ట్యూటర్లకు గతేడాది నుంచి వేతనాలు విడుదల కాలేదు. దీంతో ట్యూటర్లు మొక్కుబడిగా చదువులు చెబుతూ.. క్రమంగా తమ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 40 హాస్టళ్లుండగా.. వాటిలో తొమ్మిది వసతి గృహాలు అద్దె భవనాల్లో కొనసాగడం గమనార్హం. దీంతో పాటు..హాస్టళ్లలో వైద్యాధికారులు విజిట్ చేయకపోవడంతో విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తప్పడంలేదు. చలి, జ్వరాలతో బాధపడుతూ.. విద్యార్థులే బయటి నుంచి మందులు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ.. చదివే మూ డో తరగతి నుంచి ఏడో తరగతి విద్యార్థులకు డైట్ అలవెన్సు కింద ఒక్కొక్కరికి ప్రతి నెల రూ. 750లు ఇస్తుంది. ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ. 850, పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు రూ. 1050ల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. దీంతో పాటు ప్రీమెట్రిక్ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ప్రతి నెల రూ.62ల చొప్పున కాస్మోటిక్ ఛార్జీలు ఇస్తుంది. అందులో రూ.51 సబ్బు, ఇతర వస్తువుల కోసం, రూ.11 హెయిర్ కట్టింగ్ కోసం ఇస్తుంది. వి ద్యార్థినిలకు రూ.75లు ఇస్తుంది. ఇందులో సబ్బులు, పౌడర్, నూనె కోసం రూ.50లు, నాప్కిన్, ఇతర వస్తువుల కోసం రూ.25లు ఇస్తుంది. జిల్లాలోని అన్ని హాస్టళ్లకు ప్రభుత్వమే బియ్యం సరఫరా చేస్తోంది. కూరగాయలు, నిత్యావసర వస్తువులన్నీ సంబంధింత వార్డెన్లే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే.. జిల్లాలో ఏహాస్టల్కు డైట్ అలవెన్సులు ఈ ఏడాది జూలై నుంచి విడుదల కాలేదు. ఇప్పటి వరకు ప్రీమెట్రిక్ హాస్టళ్లలో చదివే ఒక్కోవిద్యార్ధికి సగటున రూ.800 చొప్పున లెక్కిస్తే.. నాలుగొందల మందికి కలిసి రూ.1.60 కోట్లు, వెయ్యి మంది పోస్ట్‌మెట్రిక్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1050 చొప్పున రూ.52.50 లక్షలు మొత్తం రూ.2.12 కోట్లు ఇవ్వాల్సి ఉంది. నిధులు విడుదల కాకపోవడంతో హాస్టల్ వార్డెన్లు బయట అప్పు చేసి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. అలాగే.. కాస్మొటిక్ ఛార్జీల కింద నాలుగొందల మంది విద్యార్ధినీవిద్యార్థులకు సగటున రూ. 67 చొప్పున లెక్కిస్తే.. నాలుగు నెలల కాలంలో రూ. 10.72 లక్షలు బకాయి ఉంది. ఇది ఇలాఉంటే జిల్లాలో తొమ్మిది వసతి గృహాలు ఇంకా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. చలికి వణుకుతూ జిల్లాలోని అనేక హాస్టళ్లలో విద్యార్థులు చలికి వణుకుతున్నారు. సాయంత్రమైతే చాలు కిటికీలకు లేని తలుపుల ద్వారా వీచే చల్లనిగాలుల నుంచి తమను తాము కాపాడుకునేందుకు ఇబ్బందులుపడుతున్నారు. విద్యాసంవత్సరం ముగింపు దశలో ఉన్నా.. ఇంకా పంపిణీ కాని దుప్పట్లు.. పలు చోట్ల పంపిణీ చేసిన పలుచని చెద్దర్లకు బదులు ఇంటి నుంచి తమ వెంట తెచ్చుకున్న దుప్పట్లు కప్పుకుంటున్నారు. ఒకే దుప్పట్లో ఇద్దరేసి విద్యార్థులు జారుకుంటున్నారు. కనీస కార్పెట్లు కూడా కరువవడంతో చాపలు పర్చుకుని నిద్రిస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం ఆరుగంటల మొదలు.. ఉదయం 7 గంటల వరకు విద్యార్థులు హాస్టళ్లలో చలితో పోరాటం చేయడం నిత్యాకృత్యమైంది. ఈ కనీసం కిటికీలకు తలుపులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో బయటి నుంచి చలి నేరుగా విద్యార్థులు నిదించే గదుల్లోకి ప్రవేశిస్తోంది. ఉదాహరణకు.. మల్లాపూర్ మండల కేంద్రంలో.. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న గిరిజన మినీ గురుకులంలో చదివే విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు వర్ణాతీతము. గురుకులంలో ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులకు ఒకేసారి ఒక దుప్పటి, కార్పెట్, ప్లేట్లు ఇస్తారు. అదీ 30 మందికి మాత్రమే. 30 దాటితే.. ఆపై విద్యార్థులు సొంతంగా కొనుక్కోవాల్సిందే. దుప్పట్లు.. కార్పెట్లు పొందిన సదరు విద్యార్ధి ఐదో తరగతి చదువు పూర్తి చేసుకుని తిరిగి వెళ్లే వరకు మళ్లీ ఎలాంటి పంపిణీ చేయరు. ఐదేళ్ల వరకు.. వీటిని వరకు కాపాడుకోవడం విద్యార్ధి బాద్యత. ఒకవేళ దుప్పట్లు చిరిగిపోయినా.. ఇంటి నుంచి తెచ్చుకోవాల్సిందే. కోరుట్ల పట్టణంలోని అల్లమయ్యగుట్ట వద్ద ఉన్న ప్రభుత్వ సమగ్ర హాస్టల్ గదుల వెంటిలేటర్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. మెట్పల్లి పట్టణంలోని ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు కప్పుకోవడానికి చెద్దర్లు ఉన్నా, అవి చలిని ఆపేంత స్థాయిలో మందంగా లేవు. దీంతో విద్యార్థులు చెద్దర్లను కప్పుకున్నా వణుకుతున్నారు. ధర్మపురి మండల కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో చదివే విద్యార్థులదీ ఇదే పరిస్థితి. వెల్గటూరు మండంలలోని ఎండపెల్లి గ్రామంలో సాంఘీక సంక్షేమ హాస్టల్లో కిటికీలకు తలుపులు లేక విద్యార్థులు చలికి ఇబ్బం దులు పడుతున్నారు. పెగడపల్లి మండల కేంద్రంలో ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన బీసీ, ఎస్సీ బాలుర వసతి గృహాల్లో ఈ విద్యా సంవత్సరం రగ్గులు పంపిణీ చేయలేదు. దీంతో చలి తీవ్రతకు చాలా మంది విద్యార్థులు రాత్రి పూట వారి వారి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణానికి చెందిన ఓ హాస్టల్వార్డెన్ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ నాణ్యమైన విద్య కోసం తల్లిదండ్రులు త మ పిల్లలను వసతిగృహాల్లో చేర్పిస్తున్నారు. అలాంటి విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాద్యతా ప్రభుత్వానిదే. వారికి రావల్సిన కాస్మోటిక్ ఛార్జీలు, డైట్ నిధులు వెంటనే విడుదల చేయాలి. హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి. అప్పుడే విద్యార్థులు విద్యలో ముందడుగు వేస్తారు. ’అన్నారు. -
బోధన అంటే బాధ ఎందుకో?
‘ అన్ని వైద్య విభాగాల్లో మధ్యాహ్నం రెండు గంటలపాటు పీజీ వైద్యులకు బోధన జరిగేలా చూడాలి’ – ఇటీవల జీజీహెచ్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, బోధనతీరుపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసిన వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) చేసిన హెచ్చరిక ఇది. అయితే ఈ హెచ్చరికను జీజీహెచ్ బోధనా సిబ్బంది బేఖాతరు చేస్తూ మా ‘పని’ మాదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో వైద్య విద్యార్థులకు బోధన చేయాల్సిన బోధనా సిబ్బంది తమ తీరు మార్చుకోవడం లేదు. క్రమం తప్పకుండా క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించాల్సిన బాధ్యత వీరిపై ఉన్నప్పటికీ తమ సొంత ఆస్పత్రుల్లో ప్రైవేటు ప్రాక్టీస్‌లకు ఇస్తున్న ప్రాధాన్యత బోధనకు ఇవ్వడం లేదు. మధ్యాహ్నానికే ఇళ్లకు.. జీజీహెచ్‌లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వహించాల్సిన వైద్యులు మధ్యాహ్నానికే ఆస్పత్రి నుంచి వెళ్ళిపోతున్నారు. మామూలుగా అయితే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఓపీ, రోగులకు వైద్య సేవలు అందించి మధ్యాహ్నం గంట సేపు భోజన విరామం తరువాత 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య విద్యార్థులకు క్లాసులు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే జీజీహెచ్‌లో మాత్రం ఒకటి, రెండు వైద్య విభాగాల్లో తప్ప మిగతా విభాగాల్లో ఎక్కడా బోధన చేస్తున్నట్లు కనిపించడం లేదు. ప్రొఫెసర్ వేధింపుల వల్ల పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈకేసులో నిందితురాలిగా ఉన్న ప్రొఫెసర్ లక్ష్మి ప్రస్తుతం రిమాండ్‌లోనే ఉన్నారు. ఇంత జరిగినా జీజీహెచ్‌లో పనిచేసే వైద్యులకు చీమ కుట్టినట్లయినా లేదనే విమర్శలు వస్తున్నాయి. జీజీహెచ్‌లోని వివిధ వైద్య విభాగాల్లో జరుగుతున్న బోధన, ఇతర అంశాలపై దృష్టి సారించాల్సిన వైద్య అధికారులు సైతం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటంతో బోధనా సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జీజీహెచ్‌లో కొద్దిమంది ప్రొఫెసర్లు మినహా మిగతా వారంతా సొంత క్లీనిక్‌లు నడుపుతూ ప్రైవేటు ప్రాక్టీస్‌లు చేసుకుంటున్నారు. దీనిపై గతంలో విజిలె¯Œ్స నివేదిక ఆధారంగా 19 మందికి ఇంక్రిమెంట్లు కట్ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ వీరి తీరులో మాత్రం ఎటువంటి మార్పు రాకపోవడం శోచనీయం. డీఎంఈ తనిఖీల్లో బయటపడ్డ నిర్వాకం.. ఇటీవల గుంటూరు జీజీహెచ్‌లోని పలు వైద్య విభాగాలలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో డీఎంఈ డాక్టర్ సుబ్బారావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్కడ జరుగుతున్న విషయాలపై ఆరా తీశారు. ఆ సమయంలో ప్రతి వైద్య విభాగంలో వైద్య బోధన జరగాల్సి ఉండగా రెండు, మూడు విభాగాల్లో మినహా మిగతా విభాగాల్లో జరగడం లేదన్న విషయాన్ని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది కనీసం జీజీహెచ్‌లో కూడా లేకుండా బయటకు వెళ్ళి ప్రైవేటు ప్రాక్టీసులు చేసుకుంటున్నట్లు గుర్తించారు. దీనిపై డీఎమ్ఈ ఇలాగైతే వైద్య విద్యార్థులతో సత్సంబంధాలు ఎలా మెరుగుపడతాయంటూ సిబ్బందిపై మండిపడ్డారు. బాధ్యతగా ఉండాలని అధికారులను ఆదేశించారు. డీఎమ్ఈ తనిఖీకి వచ్చిన మరుసటి రోజు నుంచి షరా మామూలుగానే వైద్యులంతా మధ్యాహ్నానికే ఇంటిబాట పడుతుండటం కనిపించింది. జీజీహెచ్ ఉన్నతాధికారులు ఇప్పటిౖకెనా దృష్టి సారించి సాయంత్రం 4 గంటల వరకూ వైద్యులు జీజీహెచ్‌లో ఉండేలా చూస్తే అటు వైద్య విద్యార్థులకు, రోగులకు మేలు జరుగుతుందని పలువురు అంటున్నారు. -
‘మన్మోహన్ సింగ్ కొలువులో చేరొచ్చు’
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవ అధ్యాపకుడిగా బాధ్యతలు చేపట్టవచ్చని మంగళవారం పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది. ఆయన రాజ్యసభ సభ్యత్వంపై ఈ కొత్త బాధ్యతల ప్రభావం ఉండబోదని తెలిపింది. జవహార్ లాల్ నెహ్రూ చైర్ ప్రొఫెసర్షిప్ బాధ్యతలు చేపట్టేందుకు రావాలని, తీరిక ఉన్న సమయాల్లోనే తమ విద్యార్థులకు, అధ్యాపకులకు బోధించాలని కోరుతూ పంజాబ్ యూనిర్సిటీ మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ను కోరింది. దీంతో ఆయన ఈ ఏడాది జూలై నెలలోనే అలా చేయవచ్చా లేదా అనేది తెలుసుకునేందుకు రాజ్యసభ చైర్మన్‌ను సంప్రదించారు. భారత రాజ్యంగంలోని 102(1)(ఏ) నిబంధన తాను ఆ బాధ్యతలు చేపట్టేందుకు అనుమతి ఇస్తుందా లేదా సలహా ఇవ్వాలని కోరారు. ఈ నిబంధన ప్రకారం పార్లమెంటు ఉభయ సభల్లోని ఏ సభలో సభ్యుడు అయినా.. ఆ వ్యక్తి ఆదాయం వచ్చే ఇతర ఏ ప్రభుత్వ సంస్థలో విధులు నిర్వర్తించరాదు. దీనిపైనే వివరణ కోసమే చైర్మన్ ను సంప్రదించారు. అయితే, గౌరవ అధ్యాపక బాధ్యతలు మాత్రమే చేపడుతున్నందన మాజీ ప్రధాని వాటిని నిరభ్యంతరంగా స్వీకరించవచ్చని, ఆయన రాజసభ సభ్యత్వానికి ఎలాంటి ఢోకా లేదని పార్లమెంటు కమిటీ స్పష్టం చేసింది. మన్మోహన్సింగ్ పంజాబ్ యూనివర్సిటీలోనే ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశారు. అనంతరం 1963 నుంచి 65 మధ్యలో ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా మరోసారి ఆయన అదే యూనివర్సిటీలో తన విజ్ఞానాన్ని పంచేందుకు అవకాశం దక్కనుంది. ఈ బాధ్యతలు చేపట్టే వ్యక్తికి వర్సిటీ తరుపున విమానంలో బిజినెస్ క్లాస్ టికెట్, ఓ కారు, డ్రైవర్, వసతి, రోజుకు రూ.5,000లు గౌరవంగా అందిస్తారు. చర్చల ద్వారా ఆయన విద్యార్థులతో, అధ్యాపకులతో బోధన చేస్తారు. -
బట్టీ చదువులకు స్వస్తి..
-బోధనోపకరణాలతో సత్ఫలితాలు – విద్యార్థుల్లో నూతనోత్సాహం భీమడోలు:బట్టీ చదువులకు స్వస్తి పలికి బోధనోపకరణాలను వినియోగం ద్వారా వచ్చే జ్ఞాపకశక్తి జ్ఞాప్తిలో ఉంటుంది. బోధనోపకరణాల ద్వారా విద్యాబోధన సత్ఫలితాలిస్తోంది. విద్యార్థులను హత్తుకొనే విధంగా ఉపాధ్యాయులు బోధనోపకరణాలతో బోధిస్తేపాఠశాలలు సృజనాత్మకత కేంద్రాలుగా మారుతాయి. నో కాస్ట్, లో కాస్ట్ నినాదంతో ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యే రీతిలో చార్టులు, నమూనాలు, ప్రదర్శనలు, తోరణాల చూపడం వల్ల చిన్నారులను హృదయాలను కట్టి పడేస్తాయి. దీనితో బీ,సీ గ్రేడు గల విద్యార్థులు డ్రాపవుట్స్ కాకుండా నిరంతరం పాఠశాలో చదువుకునే ఉత్సాహం అందుతోంది. ఇక పాఠశాలకు డుమ్మాకొట్టేవారే ఉండరు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా విద్యామేళాను నిర్వహించారు. అందులో ఉపాధ్యాయులు ప్రదర్శించిన బోధనోపకరణాల ద్వారా విద్యాబోధన విద్యార్థుల్లో నృజనాత్మకతను పెంపొందిస్తుంది. క్లిష్టమైన గణితం, సామాన్యశాస్త్రాలు, ఇంగ్లీషు సబ్జెక్టుల్లో విద్యార్థులు పట్టు సాధించేందుకు ఈ మేళా దోహద పడుతుంది. జిల్లా విద్యాశాఖ ఈ ఏడాది అక్టోబర్‌లో మండల స్థాయిలో ఏర్పాటు చేసిన విద్యామేళాలు సర్కార్ బడుల్లో నాణ్యమైన విద్యాబోధన మరింత మెరుగుపడుతుంది. కొంత కాలంగా స్తబ్ధతగా ఉన్నా ఈ విధానానికి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఊపందుకుంది. దీనితో విద్యాశాఖ, సర్వశిక్షాభియాన్ అధికారులు చర్యలు చేపట్టడంతో ఉపాధ్యాయులు సైతం ఆ తరహాలోనే స్పందించి నమూనాలు రూపొందించడంతో పాఠశాలల్లో ఆసక్తిదాయకమైన విద్యాబోధన కొనసాగుతుంది. చార్టులు, గోడ పత్రికల ద్వారా పలు అంశాలను విద్యార్థులు ఉపాధ్యాయులు బో«ధిస్తున్నారు. తరగతి గదుల్లో కఠినమైన గణితం, పదాలు, వాక్యాలు, అక్షర తోరణాలను గోడలకు అతికించడం ద్వారా విద్యార్థులకు ప్రధానాంశాల వారీగా అంశాలు వివరిస్తున్నారు. బట్టీ విధానానికి స్వస్తి పలికే క్రమంలో అందుబాటులోని పలు వస్తువుల ద్వారా ఆకృత్తులను రూపొందించి విద్యార్థులు మరింత అర్థమయ్యే విధంగా కళ్లముందుగా వాటి అర్థాలు చెబుతున్నారు. కృత్యాలను రూపొందించడం ద్వారా విద్యార్థుల్లో పోటీ తత్వం పెంపొందుతుంది. ఈ ప్రయోగాత్మకంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు అంశాలను బోధిస్తే శాశ్మతకాలం గుర్తుండిపోతాయి. అక్టోబర్‌లో మండల స్థాయిలో జరిగిన బోధనోపకరణాల మేళలో ఉత్తమ బోధన ఉపకరణాలను రూపొందించిన ఉపాధ్యాయులను గుర్తించి వారిని ప్రోత్సహిస్తే మరింత ప్రయోజనం చేకూరుతుందని ఉపాధ్యాయ లోకమంటుంది. ఆ ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలతో పాటు ఆ ఉపకరణాలను జిల్లా స్థాయిలో ప్రదర్శించే వి«ధంగా ఉన్నతాధికారులు చర్యలు చేపడితే వారికి మరింత ఆదర్శంగా తీర్చిదిద్దవచ్చునంటుంన్నారు. సులభంగా అÆర్థమవుతోంది.. ఉపకరణాల ద్వారా విద్యాబోధన చేయడం వల్ల సులభంగా అర్థమవుతుంది. తద్వారా సమయం వృథా కాదు. పట్టును సా«ధిస్తారు చింతాడ శిరీషా, 3వ తరగతి, నెం.3, పోలసానిపల్లి చిరకాలం గుర్తుంటాయి విద్యార్థుల్లో నైపుణ్యాలను సాధించుకోవడానికి ఈ తరహా బోధన దోహద పడుతుంది. బోధనోపకరణాల బోధన ద్వారా సంజ్ఞలు చిరకాలంగా నిలిచి ఉండిపోతాయి. ఈ విధానం వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుంది. సబ్జెక్టులపై పూర్తి పట్టును సాధిస్తారు. 05కె.శ్యామలా, నెం.3, టీచర్, పోలసానిపల్లి జిల్లా పాఠశాలల్లో విద్యార్థుల వివరాలు పాఠశాలల సంఖ్య విద్యార్థులు ఉన్నత 447 66797 ప్రాధమికోన్నత 274 1,00,545 ప్రాధమిక 2546 1,44,376 -
పాఠశాలల్లో 15 నుంచి డిజిటల్ క్లాసులు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలో 20 ఉన్నత పాఠశాలల్లో ఈ నెల 15వ తేదీ నుంచి డిజిటల్ తరగతులను ప్రారంభించనున్నట్లు డీవైఈఓలు పి.మౌలాలి, శివరాముడు, వెంకటరామిరెడ్డి తెలిపారు. ఆదివారం సర్వ శిక్షా అభియాన్ సమావేశ మందిరంలో డిజిటల్ క్లాసు రూం నిర్వహణ కోసం ఎంపిక చేసిన ప్ర«ధానోపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్‌ఎంఎస్‌ఏ డీవైఈఓ పి.మౌలాలి మాట్లాడుతూ..స్కూల్ గ్రాంట్ల నుంచి డిజిటల్ క్లాసు రూంలకు కావాల్సిన ప్రొజెక్టర్లు, స్క్రీన్లు, ఇతర విడిభాగాలను అమర్చుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మాకంగా అమలు చేస్తున్న ప్రాజెక్టులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ కార్పొరేట్ సేవలను అందించే భాగంలోనే డిజిటల్క్లాసు రూంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. త్వరలోనే డిజిటల్ క్లాసు రూంలో బోధన చేసే సబ్జెక్టు టీచర్లకు బోధన పై శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో నిడ్జూరు హెచ్ఎం మారుతి, ఆర్‌ఎంఎస్‌ఏ అధికారులు పాల్గొన్నారు. -
సంప్రదాయాలకు అనుగుణంగా బోధించాలి
– హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ శివశంకరరావు నిడదవోలు : పూర్తిస్థాయిలో అక్షరాస్యత సాధించడంలో స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ బి.శివశంకరరావు అన్నారు. పట్టణంలో రోటరీ ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం క్లబ్ అధ్యక్షుడు కేదారిశెట్టి రవికుమార్ అధ్యక్షతన నిర్వహించిన రోటరీక్లబ్ అక్షరాస్యత జిల్లా సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ సంస్కతి సంప్రదాయాలను కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అనాధిగా వస్తున్న సంప్రదాయాలకు అనుగుణంగా పిల్లలకు విద్యాభోదన చేయాలని సూచించారు. మంచి ఎరువులతో కూడిన విద్యను అందించడంతో పాటు ముందుగా ప్రాథమిక విద్యను అందించాలని కోరారు. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు మాట్లాడుతూ పాఠశాలల్లో ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం కంప్యూటర్ ద్వారా విద్యాబోధన, వయోజన విద్య, వీధి బాలల గుర్తింపు ద్వారా అక్షరాస్యత సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు జూనియర్ సివిల్ జడ్జి డి.సత్యవతి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆర్.వెంకటేశ్వర శర్మ, సెమినార్ చైర్మన్ రోటేరియన్ నీలం నాగేంద్రప్రసాద్, జోనల్ కో–ఆర్డినేటర్ వడ్లమని జవహార్, ఎల్.సత్యనారాయణ, సరిత లునాని, జీకే శ్రీనివాస్, ఏవీ రంగారావు, భూపతి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బోధన పద్దతిలో మెళుకువలు పాటించాలి
నేలమర్రి(మునగాల): ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించే విధానంలో మెళుకువలు పాటించి నాణ్యమైన విద్యను అందించాలిని మండల విద్యాధికారి వసుకుల రామారావు కోరారు. మండలంలోని నేలమర్రి జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం స్కూల్ కాంప్లెక్స్ సమావేశం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వై. వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు తమ వి«ధుల పట్ల శ్రద్ధ వహించాలన్నారు. ఈ సమావేశంలో 11పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీ ఆర్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
బొమ్మలతో బోధన
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : తరగతి గదిలో పాఠాలు చెబితే విద్యార్థులకు అర్థం కావడం కష్టమే. అదే బొమ్మలతో బోధిస్తే. విద్యార్థుల మనస్సుకు హత్తుకుంటుంది. వారికి పాఠ్యాంశం సులభంగా అర్థమవుతుంది. అందుకే ఆ బాటను అనుసరిస్తున్నారు రాజమహేంద్రవరంలోని ఉపాధ్యాయులు మంగారాణి, నరేష్. వీరు పాఠ్యాంశాలకు తగ్గట్టుగా బొమ్మలను తామే తయారు చేసుకొని బోధనలో వినియోగిస్తూ పలువురికి మార్గదర్శకులుగా ఉన్నారు. పిల్లలకు పాఠాలు చెబితే అవి వారి బుర్రలోకి మాత్రమే ఎక్కవచ్చు. ఆ విధానంలో బట్టీ తప్పదు. కానీ పాఠ్యాంశంపై వారికి అవగాహన కలిగిస్తే.. అదీ బొమ్మల ద్వారా.. అప్పుడు అది వారి హృదయాల్లో నాటుకుపోతుంది. అందుకే ఉపాధ్యాయులు బోధనోపకరణాలను తయారుచేసుకుని బోధించాలని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. అయితే కొందరే ఆ బాటలో నడుస్తున్నారు. వారిలో అగ్రగణ్యులు రాజమహేంద్రవరంలోని నాగరాజా ఎలిమెంటరీ పాఠశాల ఉపా«ధ్యాయిని మంగారాణి, వీరభద్రపురం మున్సిపల్ స్కూలు ఉపాధ్యాయుడు నరేష్. వీరు పాఠ్యాంశాలకు సంబంధించిన బొమ్మలను తయారు చేసుకొని విద్యార్థులకు విషయం గుర్తుండేలా బోధిస్తున్నారు. మంగారాణి అయితే ఒక బ్లాగునే ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఒకటి, రెండో తరగతి విద్యార్థులకు కావాల్సిన పాఠాలు, బోధనోపకరణాలు ఉన్నాయి. యూ ట్యూబ్‌లో మంగారాణి అనే పేరుతో ఒక పేజీని ఏర్పాటుచేసుకుని పాఠాల వీడియోలు, తరగతిలో కృత్యాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు. వీటిలో జెడ గేయం, ఎగిరే చిలుక పాఠ్యాంశాలెన్నో పొందుపర్చారు. అలాగే విద్యార్థులకు పాఠాలే కాదు పలు అంశాల్లో పరిశోధనల దిశగా అడుగులు వేసేందుకు కృషిచేస్తున్నారు నరేష్. ఆయన విద్యార్థులకు పాఠాలను బోధిస్తూనే వివిధ రకాల ప్రాజెక్టుల రూపకల్పనను స్వయంగా విద్యార్థులతో చేయిస్తున్నారు. వీరిని మిగిలిన ఉపాధ్యాయులందరూ ఆదర్శంగా తీసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. తరగతి గది ఉత్తేజపరేదిగా ఉండాలి విద్యార్థులను ఉత్తేజపరిచేది తరగతి గది. అక్కడనుంచే వారిలో దాగిఉన్న నైపుణ్యాన్ని బయటకు తీయాలి. అలా జరగాలంటే ముందుగా వారు నిత్యం బడికి వచ్చేలా, పాఠాలపై శ్రద్ధ చూపేలా కృషిచేయాలి. అదే జరిగితే వారిలో దాగిఉన్న ప్రతిభ దానంతటదే బయటకు వస్తుంది. అందుకే వారిని విద్యవైపు ఆకర్షితులను చేసేందుకు పలు బోధనోపకరణాలను తయారుచేస్తున్నాను. దీనిపై ఒక పుస్తకాన్ని రూపొందిస్తున్నాను. – ఎం. మంగారాణి, నాగరాజా మున్సిపల్ స్కూలు, రాజమహేంద్రవరం ప్రతిభను వెలికితీయాలి ప్రతీ విద్యార్థిలోను నైపుణ్యం ఉంటుంది. దాన్ని వెలికితీయాలి. అప్పుడే వారు పురోగతి సాధిస్తారు. నూతన విధానాలతో విద్యాబోధన చేయాలనే తపనతో సొంతంగా బోధనోపకరణాలను తయారు చేసుకుంటూ వారికి విద్యాబోధన చేస్తున్నాను. ఇందులో భాగంగానే పలు ప్రాజెక్టులు, అంశాలను స్వయంగా వారితోనే చేయిస్తున్నాను. – నరేష్, వీరభద్రపురం మున్సిపల్ స్కూలు, రాజమహేంద్రవరం -
కర్నూలు ఉపాధ్యాయునికి జాతీయ అవార్డు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జార్ఖండ్‌లోని ఇండియన్ సైన్స్ అండ్ మ్యాథమాటిక్స్ అందజేసే డాక్టర్ అదినాథ్ లహరి మెమోరియల్ జాతీయ పురస్కారానికి జిల్లా ఉపాధ్యాయుడు కే.విజయకుమార్ ఎంపికయ్యారు. ఈయన ప్రస్తుతం కర్నూలు ఎస్ఆర్సీసీ ఉన్నత పాఠశాలలో సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ప్రత్నామ్నాయ బోధనోపకరణాల రూపకల్పన, రెడ్ రిబ్బన్‌క్లబ్, నేషనల్ గ్రీన్ కోర్, చెకుముకి సైన్స్ క్లబ్, పర్యావరణంపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించడంతోపాటు రాష్ట్ర, జాతీయ సెమినార్లలో పాల్గొనడంతో విజయకుమార్‌ను జాతీయ అవార్డు వరించింది. ఈ నెల 25న జార్ఖండ్‌లోని వైద్యనాథ్‌లో కేంద్ర, శాస్త్ర సాంకేతిక, గనుల శాఖమంత్రి హర్షవర్దన్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకోనున్నారు. -
సులభరీతిలో బోధన జరగాలి
గుర్రంపోడు : ఉపాధ్యాయులు విద్యార్థులకు సులభరీతిలో విద్యాబోధన చేయాలని పిట్టలగూడెం జెడ్పీ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ హెచ్ఎం హిమజ అన్నారు. శుక్రవారం కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయుల శిక్షణా సమావేశంలో మాట్లాడారు. సమావేశాల్లో టీచర్లు రిసోర్స్ పర్సన్ల ద్వారా మెరుగైన బోధనకు కృషిచేయాలన్నారు. ఆటలు, చిత్రపటాలు, అభినయాల ద్వారా ఆకర్షితులై సులభంగా అర్థం చేసుకోగలుగుతారని అన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత ఉండేలా హెచ్ఎంలు బాధ్యత వహించాలని అన్నారు. సమావేశంలో రిసోర్స్ పర్సన్లు మారం జగదీశ్వర్‌రెడ్డి, ఉమాదేవి, టీచర్లు పాల్గొన్నారు. -
బోధనలో మార్పు అవసరం
– పక్కాగా సీసీఈ మెథడ్ అమలు – హెచ్ఎంల సమావేశంలో డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కంటిన్యూవస్ కాంప్రెహెన్సివ్ ఎవాల్యేషన్(సీసీఈ) పద్ధతిని పకడ్బందీగా అమలు చేయాలని డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. సీసీఈ మెథడ్ అమలు నేపథ్యంలో విద్యార్థులు బట్టి విధానానికి స్వస్తి పలకాల్సి ఉంటుందని, ఇందుకోసం ఉపాధ్యాయుల బోధన తీరులో మార్పు రావాలన్నారు. బీక్యాంపు బాలికోన్నత పాఠశాలలో శనివారం కర్నూలు డివిజన్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సీసీఈ పద్ధతిపై అవగాహన కల్పించారు. సీసీఈ పద్ధతిలో 80 మార్కులు రాత పరీక్షకు(ఎక్సట్రనల్స్), 20 మార్కులు ప్రాజెక్టువర్కుకు(ఇంటర్నల్స్) ఉంటాయన్నారు. ఇందులో ఇంటర్నల్ మార్కులను నిబంధనల మేరకు సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయుడే ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వాటిపై డిసెంబర్, జనవరినెలల్లో ప్రత్యేక బందాలతో విచారణ జరిపిస్తామని తెలిపారు. విద్యార్థులు బట్టీ విధానం నుంచి బయట పడేలా చూడాలన్నారు. ఇందుకోసం సబ్జెక్టుపై విద్యార్థికి పూర్తిస్థాయి అవగాహన కల్గేలా బోధించాలన్నారు. అప్పుడే వారు పరీక్షల్లో మంచిమార్కులు తెచ్చుకొని ముందుకు వెళ్తారన్నారు. మెరిట్ విద్యార్థులను దత్తత తీసుకోండి.. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో ప్రతి పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులు పదికి పది గ్రేడ్ తెచ్చుకునేలా చర్యలు తీసుకోవాలని, అలాంటి విద్యార్థులను దత్తత తీసుకుని చదివించాలని డీఈఓ.. హెచ్ఎలకు సూచించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను గాడిలో పెట్టాలన్నారు. ప్రతిరోజు ఎంతమంది విద్యార్థులు భోజనం చేశారన్న వివరాలను ఫోన్ ద్వారా సీఎం డ్యాస్ బోర్డుకు పంపాలన్నారు. పాఠశాల ఆవరణాలు, మైదానాల్లో మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. అనంతరం రిసోర్సు పర్సన్లు గోవిందరెడ్డి, తైమూరు సీసీఈ పద్ధతిపై అవగాహన కల్పించారు. డీవైఈఓలు మౌలాలి, తహెరాసుల్తానా, డీసీఈబీ కార్యదర్శి ఓంకార్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
మద్రసాలలో పాఠ్యాంశాల బోధనకు కృషి
ఇన్చార్జి డీఈఓ విజయలక్ష్మి నెల్లూరు (టౌన్) మద్రసాలల్లో ఖురాన్ ఇతర మత గ్రంథాలతో పాటు ఇంగ్లిష్, తెలుగు, గణితం, సైన్స్ తదితర సాధారణ పాఠ్యాంశాలను బోధించి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా ఇన్చార్జి డీఈఓ విజయలక్ష్మి తెలిపారు. గురువారం సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో మద్రసాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మద్రసాలలో 2016–17 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం నుంచి సాధారణ విద్యను బోధించేందుకు ఆసక్తి గల వారినుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. మండలాల వారిగా మద్రాసాలను తప్పకుండా తనిఖీలు చేస్తామన్నారు. ఆ సమయంలో ఎలాంటి లోపాలు కనిపించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏఎల్ఎస్ కో–ఆర్డినేటర్ మేరీరాణి మాట్లాడుతూ శుక్రవారం నుంచి జిల్లా కార్యాలయంలో దరఖాస్తులో అందుబాటులో ఉంటాయన్నారు. వాటిని పూర్తిచేసి ఈనెల 30వ తేదీలోపు కార్యాలయంలో అందజేయాలన్నారు. వివరాలు కోసం 9440373616, 7093900557లో సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో సర్వశిక్ష అభియాన్ ఏఏఎంఓ ఖాదర్‌బాషా, ఏఎంఓ హమీద్, సీఎంఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ఒక చోట విద్యార్థులు లేరు మరో చోట టీచర్లు లేరు
ప్రభుత్వ పాఠశాలల తీరిది.. జిల్లాలోని సర్కారు బడులు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు మెరుగైన బోధన అందించి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు. ఉపాధ్యాయులున్న చోట విద్యార్థులు లేకపోవడం.. టీచర్లు ఎక్కువగా ఉన్న చోటకు విద్యార్థులు రాకపోవడంతో పాఠశాలల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల తాజా పరిస్థితిపై ప్రత్యేక కథనం. వందకు ఒక్కడు జామతండా (నెల్లికుదురు) : మండలంలోని జామతండా ప్రాథమిక పాఠశాలలో 5 తరగతులు ఉన్నారుు. ఈ పాఠశాలలో వంద మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నారుు. పాఠశాలకు ఒకే గది ఉండడంతో కొందరిని వరండాలో, మరి కొందరిని గదిలో కూర్చోబెట్టి ఉపాధ్యాయుడు లింగమూర్తి తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం 2012-13లో ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ పట్టింపులేనితనంతో పనులు నత్తనడకన సాగుతున్నారుు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని తండావాసులు కోరుతున్నారు. 84 మందికి ఇద్దరు ఉపాధ్యాయులు మహబూబాబాద్ : విద్యార్థులు లేక కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఖాళీగా కూర్చుం టుండగా.. మరికొన్ని బడుల్లో టీచర్ల కొరత పట్టిపీడిస్తుంది. మానుకోట పట్టణ పరిధిలోని నందమూరినగర్కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో 1 నుంచి 5 తరగతుల్లో 84 మంది విద్యార్థులుండగా.. ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. పాఠశాలకు పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరవుతున్నప్పటికీ ఉపాధ్యాయులు తగినంత మంది లేకపోవడంతో బోధన కుంటుపడుతోంది. పాఠశాలలో మూడు తరగతి గదులు ఉం డగా, అందులో ఒక గదిని స్టాఫ్‌రూంకు కేటారుుంచగా మిగిలిన గదుల్లోనే 5 తరగతులను నిర్వహిస్తున్నారు. పాఠశాల పక్కనే ఉన్న మునిసిపాలిటీ బావికి జాలి ఏర్పాటు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీర్చి పిల్లలకు మెరుగైన బోధన అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఖాళీగా కొర్రతండా ప్రాథమిక పాఠశాల జనగామ : విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధుల బాధ్యతారాహిత్యం కారణంగా మండలంలోని పలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెలపోతున్నారుు. మండలంలోని గానుగుపహాడ్ శివారు కొర్రతండా ప్రాథమిక పాఠ శాలకు కొన్ని నెలల నుంచి విద్యార్థులు రావడం లేదు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమంలో ఐదుగురు విద్యార్థులు చేరారు. అరుుతే పాఠశాల పునఃప్రారంభం రోజు నుంచి విద్యార్థుల సంఖ్య పెరగకపోవడంతో బడిబాటలో పేర్లు నమోదు చేసుకున్న ఐదుగురిలో ముగ్గురు విద్యార్థులు గానుగుపహాడ్ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లారు. దీంతో ఉన్న ఇద్దరు విద్యార్థులు కూడా కొద్ది రోజులుగా గైర్హాజరవుతుండడంతో తరగతి గదులు బోసిపోయి కనిపిస్తున్నాయి. విద్యార్థులు లేని కారణంగా ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయుల్లో వెంకటేశ్వర్లు అనే టీచర్‌ను డిప్యూటేషన్‌పై పెదరామన్‌చర్ల పాఠశాలకు పం పించారు. మరో ఉపాధ్యాయుడు ఖదీర్ రోజు పాఠశాలకు వచ్చి ఖాళీగా కూర్చుని వెళ్తున్నారు. కాగా, తరగతి గదుల్లో సొసైటీ అధికారులు గన్నీ బ్యాగులను నిల్వ చేయడం గమనార్హం. ఎర్రగొల్లపహాడ్లోనూ అంతే.. మండలంలోని ఎర్రగొల్లపహాడ్ పెద్దతండా పరిధిలోని పీఎస్‌కు ఒక్క విద్యార్థి కూడా రావడం లేదు. అడవికేశ్వాపూర్ శివారు దోనాబాయి తండా పాఠశాలకు విద్యార్థులు రావడం లేదనే కారణంతో ఇక్కడ పనిచేస్తున్న ఏకైక ఉపాధ్యాయురాలు సెలవుపై వెళ్లడంతో బుధవారం పాఠశాలకు తాళం పడింది. అడవికేశ్వాపూర్ శివారు బాకర్నగర్ తండా పాఠశాలకు కేవలం నలుగురు విద్యార్థులు మాత్రమే వస్తున్నట్లు తెలుస్తుంది. దోనాబాయి తండాలో విద్యార్థులు రావడంలేదని ఉపాధ్యాయురాలు కవిత సెలవుపై వెళ్లినట్లు ఎంఈఓ భద్రొద్దీన్ తెలిపారు. 73 మందికి అంతే.. దుగ్గొండి : మండలంలోని రేకంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 2013-14లో విద్యార్థులు లేక మూతపడింది. దీంతో 2014-15లో గ్రామస్తులు తమ ఊరికి చెందిన విద్యార్థులు సుమారు 54 మందిని చేర్పించి పాఠశాలకు ప్రా ణం పోశారు. అరుుతే 54 మందికి ఒకే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉండటంతో గ్రామస్తులు మరో ముగ్గురు ప్రైవేట్ ఉపాధ్యా యులను నియమించుకున్నారు. వారికి తలాకొంత చందాలు వేసుకుని వేతనాలు చెల్లించారు. ఈ క్రమంలో పాఠశాలకు చెందిన 10 మంది విద్యార్థులు 5వ తరగతిలో తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఎంట్రెన్స్ రాసి సీట్లు సాధించారు. ప్రస్తుతం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 73కు చేరినా ప్రభుత్వం అదనపు ఉపాధ్యాయులను నియమించలేదు. దీంతో ఒక్క ఉపాధ్యాయుడే అంతమంది విద్యార్థులకు పాఠాలు బోధించడం కష్టంగా మారిందని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను తీర్చాలని వారు కోరుతున్నారు. టీచర్లు ఎక్కువ.. విద్యార్థులు తక్కువ మండల పరిధిలోని చాపలబండ ప్రభుత్వ పాఠశాల కొన్ని నెలల క్రితం 8వ తరగతి వరకు అప్‌గ్రేడ్ అయింది. ఈ పా ఠశాలలో ఆరుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అరుుతే విద్యార్థుల సంఖ్యను 58గా రికార్డుల్లో చూపుతున్నప్పటికి వాస్తవంగా ఇక్కడ 8 తరగతులకు 34 మందే హాజరువుతున్నట్లు సమాచారం. ‘వెంకటాపురం’ వెలవెల తొర్రూరు : మండలంలోని వెంకటాపురం హరిజనకాలనీ లో కొన్నేళ్ల క్రితం ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేశా రు. ఇందులో 1 నుంచి 5 తరగతులు ఉన్నారుు. రెండేళ్ల నుంచి ఇక్కడి పాఠశాలకు విద్యార్థులు రావడంలేదు. దీంతో పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరిని వేరే స్కూల్‌కు బదిలీ చేశారు. ఇటీవల బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేపట్టినప్పటికీ ఒక్క విద్యార్థి కూడా పాఠశాలకు రాకపోవడం గమనార్హం. కాగా, పాఠశాల పునః ప్రారంభంలో ఐదుగురు విద్యార్థులు అడ్మిషన్ పొందినప్పటికీ వారు ఒక్క రోజు హాజరుకాలేదని ఉపాధ్యాయురాలు రత్నకుమారి తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఉందని.. అందుకే తమ పిల్లలను అక్కడికి పంపిస్తున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఆరుగురు విద్యార్థులు.. ఇద్దరు టీచర్లు కేసముద్రం : ప్రభుత్వ పాఠ శాలల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని కేసముద్రంస్టేషన్ శివారు బ్రహ్మంగారితండా ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారు. ఈ పాఠశాలకు సొంతభవనం లేకపోవడంతో తండాలోని ఓ అద్దె ఇంటిలో తరగతులు నిర్వహిస్తున్నారు. ధన్నసరి శివారు బోడతండాలోని ప్రాథమిక పాఠశాలలో ఆరుగురు విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తుండడం గమనార్హం. బుధవారం మధ్యాహ్నం పాఠశాలను ‘సాక్షి’ సం దర్శించగా ఆ సమయంలో ఉపాధ్యాయులు కనిపించలేదు. ఒక ఉపాధ్యాయుడు రాలేదని, మరొకరు వచ్చి మధ్యాహ్నమే వెళ్లిపోవడంతో పిల్లలు ఇంటికి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఇటు కొంచెం.. అటు కొంచెం సంగెం : మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. విద్యార్థులు ఎక్కువగా ఉన్నచోట ఉపాధ్యాయులు లేరు. టీచర్లు ఎక్కువగా ఉన్న చోట విద్యార్థులు లేకపోవడంతో విద్యాభివృద్ధి కుంటుపడుతోంది. మండలంలో 42 ప్రాథమిక, 7 ప్రాథమికోన్నత పాఠశాలు ఉన్నాయి. వీటన్నింటిలో 102 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా.. 3,343 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గవిచర్ల ప్రాథమిక పాఠశాలలో 160 మంది విద్యార్థులకు నలుగురు ఉపాధ్యాయులే పాఠాలు బోధిస్తున్నారు. తిమ్మాపురం ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. కాగా, నల్లబెల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 25 మంది విద్యార్థులకు ఐదుగురు టీచర్లు, ఆశాలపల్లి ప్రాథమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులకు 4గురు టీచర్లు, నల్లబెల్లి శివారు బాలునాయక్ తండాలో 12 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. విద్యార్థుల కోసం ఎదురుచూపులు మహబూబాబాద్ రూరల్ : మండలంలోని పలు పాఠశాలలకు విద్యార్థులు రాకపోవడంతో వెలవెలబోతున్నారుు. మండలంలోని శనిగపురం శివారు కుమ్మరికుంట్ల తండా ప్రాథమిక పాఠశాలకు కొన్ని నెలల నుంచి విద్యార్థులు హాజరుకావడంలేదు. దీంతో ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు పిల్లల కోసం నిత్యం ఎదురుచూస్తూ ఖాళీగా కూర్చుంటున్నారు. వేంనూరు శివారు చిన్నకిష్టాపురం ప్రాథమిక పాఠశాలకు కూడా విద్యార్థులు రావడం లేదు. ఈ గ్రామానికి చెందిన విద్యార్థులను తల్లిదండ్రులు వేంనూర్ యూపీఎస్‌కు పంపిస్తున్నారు. అయోధ్య పం చాయతీ పరిధిలోని వెంక్యాతండా ప్రాథమిక పాఠశాలలో, లక్ష్మీపురం గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం తండా పీఎస్‌లో కూడా విద్యార్థులు లేరు. వీఎస్ లక్ష్మీపురం శివారు దేవులతండా, ఎర్రబోడు తండా పాఠశాలల్లో ఇద్దరు చొప్పున విద్యార్థులు ఉండడం గమనార్హం. బేతోలు ఉర్దూ మీడియం పాఠశాలలో కూడా విద్యార్థులు లేరు. మల్యాల శివారు దేవులతండా పాఠశాలకు తరగతి గదులు లేకపోవడంతో విద్యార్థులు రావడం లేదని తెలిసింది. రామోజీ తండా, మాధవాపురం శివారు తేజావత్తండా, సీసీ తండా, తూర్పుతండా, రెడ్యాల శివారు టేకులతండా గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా లేరు. 200 మంది.. ఐదుగురు టీచర్లు మడికొండ : నగర శివారులోని మడికొండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 200 మంది విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులు మాత్రమే బోధనలు చేస్తున్నారు. ఈ పాఠశాలలో గత ఏడాది 70 మంది విద్యార్థులు ఉండగా.. ప్రస్తుత విద్యాసంవత్సరం ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంతో 130 మంది ఆడ్మిషన్లు పొందారు. మడికొండ సమీపంలోని ధర్మసాగర్ మండల కేంద్రం నుంచి కూడా 10 మంది విద్యార్థులు స్కూల్‌కు వస్తున్నారు. పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులు, తరగతి గదులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు తక్షణమే ఉపాధ్యాయుల నియూమకం చేపట్టి విద్యార్థులకు మెరుగైన బోధనలు అందించాలని స్థానికులు కోరుతున్నారు. 60 మందికి సింగిల్ టీచర్ నర్సింహులపేట : మండలంలోని బొజ్జన్నపేట పీఎస్‌లో 60 మంది విద్యార్థుల కు ఒక్క ఉపాధ్యాయురాలు మా త్రమే పాఠాలు బోధిస్తున్నారు. యూపీఎస్గా ఉన్న బొజ్జన్నపేట స్కూల్‌ను ఉపాధ్యాయుల కొరతతో కారణంగా పీఎస్‌కు కుదించారు. దీంతో 1 నుంచి 5 తరగతులకు ఒకే ఉపాధ్యాయురాలు పాఠాలు చెబుతోంది. విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఉద్యోగాలు
పుదుచ్చేరి నిట్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు పుదుచ్చేరిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. పోస్టు: ఫ్యాకల్టీ, అసిస్టెంట్ లైబ్రేరియన్, జూనియర్ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్ విభాగాలు: ఫ్యాకల్టీ: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, నాన్ -టీచింగ్: ఎలక్ట్రికల్, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇంటర్వ్యూ తేదీలు: జూన్ 30, జూలై 1, 2, 3 వివరాలకు: www.nitpy.ac.in రాయ్‌పూర్ ఎయిమ్స్‌లో ట్యూటర్/క్లినికల్ ఇన్స్ట్రక్టర్ రాయ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) ట్యూటర్/ క్లినికల్ ఇన్స్ట్రక్టర్ (నర్సింగ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది: జూలై 14 ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా వివరాలకు: www.aiimsraipur.edu.in విజయనగరం జిల్లాలో 39 పోస్టులు విజయనగరం జిల్లా సెలక్షన్ కమిటీ.. వ్యవసాయశాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో బహుళ ప్రయోజన విస్తరణాధికారి (ఎంపీఈఓ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఖాళీలు: 39 అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్, హార్టికల్చర్, డ్రైల్యాండ్ అగ్రికల్చర్ ) చేసిన వారికి తొలి ప్రాధాన్యత ఉంటుంది. వయసు: జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండి 40 సంవత్సరాలలోపు ఉండాలి. దరఖాస్తుకు చివరి తేది: జూన్ 25 వివరాలకు: www.vizianagaram.nic.in -
గ‘లీజు’
అప్పుడు ఐదేళ్లు .. ఇప్పుడు 35 ఏళ్లు కనుమరుగుకానున్న జిల్లా ఆస్పత్రి టీచింగ్ ఆస్పత్రిగా మారనున్న వైనం ప్రభుత్వాస్పత్రిని ప్రైవేటు వైద్య సంస్థలకు అప్పగిస్తూ గత ఏడాది వివాదాస్పద నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో తప్పటడుగేసింది. ఐదేళ్లు ఉన్న లీజు కాలాన్ని 35 ఏళ్లకు పొడిగిస్తూ సోమవారం విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీనివెనుక ప్రభుత్వ పెద్దలకు భారీ మొత్తంలో ముడుపులందాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిత్తూరు (అర్బన్): జిల్లా కేంద్రంలో పేద రోగుల ఆలనాపాలనా చూసే ప్రభుత్వాస్పత్రి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీన్ని పూర్తిస్థాయిలో ప్రయివేటు పరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ‘లీజు’ ఒప్పందానికి తెరతీయడం విమర్శలకు తావిస్తోంది. ఆ ఒప్పందం వెనుక మార్కెట్లో ఎంబీబీఎస్‌పై ఇప్పటికీ క్రేజ్ ఉంది. యాజమాన్య కోటా కింద పేరొందిన పలు ఆస్పత్రులు ఒక్కో సీటుకు రూ.2 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు డొనేషన్లు కట్టించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అపోలో వైద్య సంస్థలు చిత్తూరులో పాగావేసేందుకు పావులు కదిపాయి. కానీ ఇక్కడ పక్కా ఆస్పత్రి భవనం లేకపోవడంతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో ప్రాక్టీస్ చేసుకునేందుకు సిద్ధపడ్డాయి. ఈ మేరకు ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాయి. ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు బోధన, ప్రాక్టికల్స్ చేయడానికి అనుమతివ్వాలని విన్నవించా యి. దీనిపై సర్కారు సానుకూలంగా స్పందించింది. గ‘లీజు’ ఒప్పందం అపోలో వైద్య సంస్థల అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని లీజు ప్రాతిపదికన ఇచ్చేందుకు సిద్ధపడింది. ఈ మేరకు గత ఏడాది ఆస్పత్రి భవనాన్ని ఐదేళ్లకు లీజుకిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఐదేళ్ల తర్వాత అపోలో సంస్థ చిత్తూరు ఆస్పత్రిని వదలి వెళ్లాలి. క్లీనికల్ అటాచ్మెంట్ సమయంలో ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటు చేసిన పరికరాలు, ఇతర సాంకేతిక వ్యవస్థను సైతం అలాగే వదిలేయాలి. ఇలాచేస్తే అపోలో వైద్య సంస్థకు భారీగా నష్టం వాటిల్లే పమాదం ఉంది. అలా జరగకుండా ఉండేందుకు ఐదేళ్ల కాలాన్ని 35 ఏళ్లకు పొడిగిస్తూ ప్రభుత్వం లీజు ఒప్పందం కుదుర్చుకుంది. దీనివెనుక కొందరు ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లు స్పష్టమవుతోంది. వారికి భారీ మొత్తంలో ముడుపులందాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి స్థాయిలో పాగా ఇప్పటికే చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో అపోలో వైద్యులు, సిబ్బంది వైద్యసేవలందిస్తున్నారు. ఇక మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) బృందం చిత్తూరు ఆస్పత్రిని సందర్శించి అనుమతి ఇచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో ఇక్కడ పాగా వేసేందకు పావులు కదుపుతోంది. అక్కడ అలా.. కర్ణాటక రాష్ట్రంలో ఇదే తరహాలో ప్రభుత్వాస్పత్రిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తొలుత ఐదేళ్లు లీజుకు ఇచ్చారు. లీజుకాలం పూర్తయింది. కానీ ప్రభుత్వాస్పత్రిని ఖాళీ చేయలేదు. చిత్తూరు ఆస్పత్రిలో కూడా అదే తరహాలో అపోలో వైద్య సంస్థలు శాశ్వతంగా పాగా వేయనున్నాయి. ఈ మే రకు రాష్ట్ర ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. -
అక్కడ పాఠం.. ఇక్కడ శ్రవణం
కార్పొరేషన్ స్కూళ్లలో ఆన్లైన్ విద్యాబోధన పెలైట్ ప్రాజెక్ట్‌గా పది స్కూళ్లు మేలో తరగతులు ప్రారంభం ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్ వీరపాండియన్ విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ పాఠశాలల్లో ఆన్లైన్ విద్యాబోధన అందుబాటులోకి రానుంది. రాబోయే రోజుల్లో ఉపాధ్యాయులు లేకుండానే బోధన చేయొచ్చు. ఒక పాఠశాలలో చెప్పే పాఠాలను మిగతా స్కూళ్ల విద్యార్థులు వినొచ్చు. ఏవైనా అనుమానాలొస్తే మైక్రోఫోన్ల ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కార్పొరేషన్ ఏర్పాట్లు పూర్తిచేసింది. పది స్కూళ్లలో పెలైట్ ప్రాజెక్ట్‌గా ఈ ఏడాది అమలుచేయనున్నారు. తొలిగా టెన్త్ విద్యార్థులకు బోధన చేయాలని నిర్ణయిం చారు. 2016-17 విద్యాసంవత్సరం నుంచి ఆన్లైన్ విధానాన్ని అమల్లోకి తేనున్నారు. ఇందుకుగాను తరగతి గదుల్లో స్పీకర్లు, ప్రొజెక్టర్లను ఏర్పాటుచేశారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో ఆన్లైన్ బోధనపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేందుకు కసరత్తు ప్రారంభిం చారు. మే నుంచి ఈ విధానాన్ని అమలుచేయనున్నారు. హైదరాబాద్‌కు చెందిన సిస్కో, ఈ-సెంట్రిక్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. గోల్డెన్‌మైల్ ప్రాజెక్ట్‌గా దీనికి నామకరణం చేశారు. సక్సెస్ అయితే మిగతా స్కూళ్లలో.. ఆన్లైన్ విద్యాబోధన ఏర్పాట్లను కమిషనర్ వీరపాండియన్ మంగళవారం పరిశీలించారు. సూర్యారావుపేటలోని కర్నాటి రామ్మోహనరావు స్కూల్లో అమర్చిన సాంకేతిక పరికరాలను చూశారు. ఆన్లైన్ ద్వారా బోధన పద్ధతుల్ని ఈ-సెంట్రిక్ ప్రతినిధి కార్తీక్ కమిషనర్‌కు వివరించారు. ఉపాధ్యాయులు సెలవుల్లో ఉన్నా విద్యార్థులకు ఇబ్బంది లేకుండా బోధన సాగించవచ్చన్నారు. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా పది పాఠశాలల్లో ప్రవేశపెడుతున్నామని కమిషనర్ పేర్కొన్నారు. ఈ స్కూళ్లన్నీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటాయని, వీటికోసం రూ.40 లక్షలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. విజయవంతమైతే మిగతా పాఠశాలల్లోనూ ఈ విధానాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. నగరంలో ఎంపికచేసిన పాఠశాలలు ఇవే బీవీఎస్ రెడ్డి స్కూల్, ఏపీఎస్ఆర్ఎంసీ స్కూల్ - కృష్ణలంక, వీఎంసీ హైస్కూల్, గోవిందరాజు ఇమాన్యుల్ ట్రస్ట్ స్కూల్ - పటమట, బీఎస్ఆర్కే హైస్కూల్ - మొగల్రాజపురం, కర్నాటి రామ్మోహనరావు స్కూల్ - సూర్యారావుపేట, టి.మల్లికార్జున స్కూల్ -మాచవరం, పీవీఆర్ స్కూల్, టి.వెంకటేశ్వరరావు నగరపాలక సంస్థ పాఠశాల - దుర్గాపురం, ఏకేటీపీ స్కూల్, సత్యనారాయణపురం. -
వినయాన్ని నేర్చుకోవడానికి సిలబస్ ఉంటుందా!
విద్య - విలువలు గురువు తాను తెలుకున్న విషయాలను తన విద్యార్థులకు, తన శిష్యులకు అర్థమయ్యేటట్టు బోధించడానికి ఎంతో కిందకు దిగివచ్చి తేలికైన ఉపమానాలతో వివరిస్తాడు. అవతలివాడికి అర్థం కావాలని, వాడూ తనతో సమాన స్థాయికి ఎదగాలని ఏ విధమైన స్వార్థమూ లేకుండా బోధిస్తాడు. అలా చేయడం త్యాగం. అందుకే గురువు బోధనలను వర్షపుధారలతో పోలుస్తారు. ఈ విత్తనం మొలకెత్తాలి, ఇది మొలకెత్తకూడదన్న వివక్ష వర్షపుధారకు ఉండదు. అది అన్నింటిపైనా సమానంగా కురుస్తుంది. కొన్ని మొలకెత్తుతాయి, కొన్ని మొలకెత్తవు. రాతినేల మీద ఉన్న విత్తనం మొలకెత్తే అవకాశం ఉండదు. మట్టిలో ఉన్న విత్తనానికి తడి తగిలితే చాలు, మొలకెత్త్తేస్తుందంతే. అలాగే శిష్యుడిలో కూడా ఆర్ద్రత అనేది ఉండాలి. తడి తగలాలి. అంటే గురువుగారి నోటి వెంట వచ్చిన మాటలను ప్రయోజనాత్మకంగా మలచుకోగలిగిన శక్తి శిష్యుడిలో ఉండాలి. అది లేనప్పుడు రాతినేల మీది విత్తనంలాగా నిష్ప్రయోజనం అవుతుంది. ఇలా మొలకెత్తడానికీ, మొలకెత్తకపోవడానికీ మధ్యలో వచ్చిన సమస్య ఏమిటి? అని అంటే... వినయం లేకుండుట అని చెప్పాలి. ఎప్పుడు గురువుగారి దగ్గరకు వెళ్లినా, అది పాఠశాల, కళాశాల, వేదాధ్యయనం... ఏదైనా కావచ్చు. ఎక్కడైనా కావచ్చు. మొట్టమొదట జ్ఞాపకం చేసుకోవలసింది...‘గురువు ముందు నేను లఘువును’ అని. అంటే ‘ఆయన కంటే నేను చిన్నవాడిని, ఆయన అన్నీ తెలిసున్నవాడు, సర్వజ్ఞుడు, ఆయన మాట్లాడతాడు, నేను వింటాను’ అన్న స్పృహ. అంతే తప్ప గురువుగారి దగ్గరకు వెళ్లి తాను అవసరానికి మించి మాట్లాడటం గానీ, ఆయన విజ్ఞానం ఏ పాటిదని అర్థం వచ్చేటట్లుగా ఆయనను తేలిక చేస్తూ ప్రవర్తించడం గానీ ఎన్నడూ పనికిరాదు. గురువు ఎంత రాగద్వేషాలు లేకుండా, ఎంత పక్షపాత రహితుడై ఉంటాడంటే విజ్ఞానాన్ని అందించడంలో తరతమ భేదాలు పాటించడు. ద్రోణాచార్యులవారు గురుకులాన్ని నిర్వహిస్తున్న కాలంలో... ద్రోణాచార్యుడిని సంహరించగలిగిన కొడుకు కావాలని ద్రుపదుడు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞ వాటికలోంచి పుట్టాడు ధృష్టద్యుమ్నుడు. ఆయనకు విలువిద్య నేర్పించవలసి వచ్చింది. గురువుగా తన స్థానానికి ఏ పక్షపాతం లేకుండా చూడడం కోసం తనని చంపడమే లక్ష్యంగా పెట్టుకుని శిష్యుడిగా వచ్చినవాడికి విద్యనంతటినీ ద్రోణాచార్యుడు బోధించాడు. తన సొంత కొడుకైన అశ్వత్థామకు కూడా నేర్పని బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని, ఉపసంహారాన్ని ఆయన అర్జునుడికి నేర్పించాడు. ఒకప్పుడు ప్రపంచం మొత్తంమీద విద్యాభ్యాసానికి ఆలవాలమైన భూమి ఒక్క భారతదేశం మాత్రమే. పతంజలి దగ్గర వ్యాకరణ భాష్యం నేర్చుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు నర్మదా నదిని దాటి దక్షిణదేశానికొచ్చి ఆయన దగ్గర ఉండి ఆరోగ్య సూత్రాలు, బ్రహ్మసూత్రాలు నేర్చుకున్నారని పతంజలి చరిత్ర చదివితే తెలుస్తుంది. అలా చదువుకునేటప్పుడు ఎప్పుడూ కూడా మొట్టమొదటగా గురుశిష్యుల మధ్య ఉండాల్సినది వినీత-వినీయ సంబంధమే. గురువు దగ్గర మొదట వినయం నేర్చుకుంటాడు. వినయం నేర్చుకోవడానికి సిలబస్ అంటూ ఏదీ ఉండదు. పాఠ్యాంశాలుండవు. వినయంగా ఉండాలనుకుంటేనో, అహంకారంతో ఉండకూడదకుంటేనో వినయం రాదు. వినయం రావడానికి ఒకే ఒక్క కారణం ఉంటుంది. ఎన్ని తెలిసి ఉన్నవాడైనా ‘నాకు తెలిసినది ఏపాటి?’ అన్న మనస్తత్త్వం ఉన్నప్పుడు వాడంత వినయశీలి లోకంలో మరొకడుండడు. వాడు నిరంతర విద్యార్థి. నాకు తెలియనిది ఏముంది? అన్నాడనుకోండి. అంతే. ఇక పాత్రత ఉండదు. అహంకారం విస్తృతంగా పైకి లేచిపోతుంది. దాన్ని తొక్కేయడమే వినయానికి పాత్రత. ‘నాకు తెలిసినదేపాటి!’ అని మనస్సాక్షిగా ప్రకటించడం అంత తేలికైన విషయమేమీ కాదు. ‘నేను తప్ప రామాయణం మీద ఇంత బాగా ఎవరు ప్రవచనం చేయగలరు’ అన్నాననుకోండి! మరుక్షణంలో నాలో అహంకారం ప్రబలుతుంది. శ్రీరామాయణంలో ఒక శ్లోకంలోని ఒక పాదంలో ఉన్న ఒక పదానికి వ్యాఖ్యానం చేస్తూ, దర్శనం చేస్తూ తరించిపోయిన మహాపురుషులున్నారు. ‘శ్రీరామ’ అని మూడుసార్లు అనవలసిన అవసరమేముంది. ఒక్కసారి చాలు’ అని సిద్ధాంతీకరించినవారున్నారు. అలాంటి వారి ముందు నాకు తెలిసున్నదేపాటి. 24 వేల శ్లోకాలు నాకేం కంఠగతం కావు. ఎంత పెద్ద భారతం, తెలుగు, సంస్కృతాలలో ఎన్ని భారతాలు, ఎన్ని పద్యాలు, ఎన్ని వ్యాఖ్యానాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, వాటికి భాష్యాలు, నాలుగు వేదాలు... ఇవన్నీ చదువుకోవడానికి నా జీవితకాలం ఎక్కడ సరిపోతుంది! నాకేం తెలుసని అహంకరించను! అన్నీ తెలిసినవాళ్లు మేం ఎంతటివాళ్లం అని నిలబడ్డారు. శంకరభగవత్పాదుల కన్నా జ్ఞాని ఎవరూ లేరు. అన్నీ తెలిసున్నా, ఆయన ‘ఈశ్వరా! నేను పశువును. నీవు పశుపతివి. చాలదా మనకు ఈ సంబంధం’ అన్నారు. అంతటి శంకరులే నాకేం తెలుసని అంటుంటే... ఏదో తెలిసున్న ఒక చిన్న విషయాన్ని పట్టుకుని, ఏదో సిలబస్ చదువుకుని, పేరు పక్కన మూడు నాలుగు అక్షరాలు వచ్చి చేరగానే నాకన్నా గొప్పవాళ్లు లేరనుకోవడం హాస్యాస్పదమౌతుంది. అందుకే ఎప్పుడూ స్మరించ వలసింది... ‘నాకు తెలిసినది ఎంత కనుక!’ - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అవగాహన పెంచేదే అసలు చదువు
విశ్లేషణ ‘చరిత్రను తెలుసుకుందాం.. వాటి ఆనవాళ్లు కాపాడుకుందాం’ పేరుతో చేపట్టిన ప్రయోగం సరికొత్త బోధనా తీరుకు బీజం వేయడం వంటిదే. సహకార బోధన (కొలాబిరేటివ్ టీచింగ్) పద్ధతికి ఇది నిదర్శనం. పిల్లలను చుట్టూ ఉన్న పరిస్థితులతో మమేకం చేస్తూ బోధిస్తే విద్యావికాసం పరిపూర్ణంగా ఉంటుందన్న ఉద్దేశంతో యాజమాన్యం ఈ ప్రయోగం చేయించింది. ఉపాధ్యాయుడు బోధిం చడం, విద్యార్థులు శ్రద్ధగా వినడం - ఇప్పటి వరకు మనం అనుసరిస్తున్న బోధనా పద్ధతి ఇదే. సామాజిక పరిస్థితులు మారాయి. బడిపిల్లల అల వాట్లు, అభిరుచులు, ఆలో చనా ధోరణి కూడా మారాయి. అందుకే సంప్రదా యక ‘చాక్ అండ్ టాక్’ పద్ధతికి స్వస్తి పలకవలసిన సమయం వచ్చింది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత విద్యారంగంలో గణనీయమైన మార్పులు సంభవించాయి. అందుకే అభివృద్ధి చెందిన దేశాలు చాలా వరకు పాఠశాల స్థాయిలోనే పరిశోధనాత్మక విద్యా విధానానికి శ్రీకా రం చుట్టాయి. బోధన, అవగాహన, పరిశోధనలకు ప్రాధాన్యం ఇచ్చే విధానంతో విద్యను మలచుకో వడానికి అక్కడ వేగంగా ప్రయత్నం జరుగుతోంది. నిజానికి పాఠ్యాంశాన్ని యథాతథంగా బోధించడం కంటే, సామాజిక పరిస్థితులకు అన్వయించి చెప్పడం వల్ల పిల్లలకు సులభంగా విషయం అర్థమవుతుంది. ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ కొయ్యబొమ్మలకే కాదు, విద్యార్థులలో చక్కని సృజనను పెంచడానికి కృషి చేస్తున్న స్థలంగా చెప్పుకోవచ్చునని ఈ మధ్య రుజువు చేసుకుంది. ఆ పట్టణంలోని ఒక పాఠశాల ‘చరిత్రను తెలుసుకుందాం.. వాటి ఆనవాళ్లు కాపా డుకుందాం’ పేరుతో చేపట్టిన ప్రయోగం సరికొత్త బోధనా తీరుకు బీజం వేయడం వంటిదే. సహకార బోధన (కొలాబిరేటివ్ టీచింగ్) పద్ధతికి ఇది నిద ర్శనం. పిల్లలను చుట్టూ ఉన్న పరిస్థితులతో మమేకం చేస్తూ బోధిస్తే విద్యావికాసం పరిపూర్ణంగా ఉంటుం దన్న ఉద్దేశంతో యాజమాన్యం ఈ ప్రయోగం ఏర్పాటు చేసి, చూడడానికి రావలసిందని నన్ను ఆహ్వానించింది. ఎనిమిదో తరగతి విద్యార్థులను మూడు బృందాలుగా విభజించి ఖిలాగుట్ట, శ్యామ్గఢ్, బత్తిస్గఢ్, ఇతర ప్రాంతాలకు పంపారు. అక్కడకు వెళ్లివచ్చిన పిల్లలు తాము తెలుసుకుని వచ్చిన కొత్త విషయాలను, ఆసక్తికరమైన అంశాలను సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో సాటి విద్యార్థులకు వివరించారు. నిర్మల్‌లోనే ఉన్న శ్యామ్గఢ్కు ఆ పేరు ఎలా వచ్చింది? సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని కాలంలో నిర్మించిన ఖిల్లాగుట్ట ప్రత్యేకత ఏమిటి? ఎవరు నిర్మించారు? వేయి ఉరుల మర్రి ప్రాంతానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? రాంజీ గోండు ఎవరు? ఆయనను ఎవరు ఉరి తీశారు? రాంజీతో మరో వేయి మందిని ఆ మర్రికే ఎందుకు ఉరి తీశారు? నాటి పరిస్థితులు ఏమిటి? వంటి పుస్తకాలలో లేని పలు అంశాలను క్షేత్రస్థాయి పర్యటనలో పరిశోధన ద్వారా వారు స్వయంగా తెలుసుకుని వచ్చారు. పరిసరాలతో మమేకం చేయకుండా విద్య గరిపితే అది అసహజంగా ఉంటుంది. అన్నం ఎలా వస్తుందని అడిగితే, సూపర్మార్కెట్లో తెచ్చిన బియ్యం వండితే వస్తుందని చెప్పారంటే, అది పిల్లల తప్పుకాదు. రైతు కష్టిస్తేనే వరి చేలు పండుతాయనీ, ఫలితంగానే బియ్యం వస్తుందనీ వారికి తెలియ కుండా చేయడం ఆందోళన కలిగించే అంశమే. మన ప్రధాన పంటను గురించే విద్యార్థులకు సరైన అవగా హన కలిగించలేకపోతున్నాం. కాబట్టి వైట్‌హౌస్, పారిస్ ఫ్యాషన్ టెక్నాలజీల కంటే ముందు విద్యార్థు లకు పరిసరాలు, వాటి ప్రాముఖ్యం గురించి చెప్పాలి. సామాజిక అవగాహన పెంచాలి. డిజిటల్ పాఠశాలల్లో బోధనా పద్ధతులలో కొన్ని మార్పులు వచ్చినా అవి ఇంకా బడుగు బలహీన వర్గాల పిల్లల దాకా రాలేదు. సర్కారీ బడులలో కూడా దానిని ప్రవేశపెడితే మంచి ఫలితాలు వస్తాయి. చాక్ అండ్ బోర్డ్ పద్ధతి నుంచి ప్రొజెక్టర్ అండ్ టేబుల్ బోధనా విధానానికి మారామని అనుకున్నా అది కూడా అధిక సంఖ్యలో పిల్లలకు అందుబాటులో లేదు. దీనితో అంతరాలు పెరుగు తున్నాయి. కొన్ని పాఠశాలల్లో ఉన్నప్పటికీ బోధన ఆంగ్లంలోనే జరుగుతూ ఉండడంతో ఆకళింపు చేసుకోలేక విద్యార్థులు సతమతమవుతున్నారు. కాబట్టి మాతృభాషను పూర్తి స్థాయిలో అమలు చేస్తూనే, ఆంగ్లంలో తర్ఫీదునివ్వడం మేలు. నిజానికి ప్రైవేటు విద్యాసంస్థలు విస్తరించిన తరువాత అనారోగ్యకర పోటీ ఏర్పడి చదువు స్వరూపమే మారింది. విద్యార్థులను జ్ఞానం చుట్టూ కాకుండా, మార్కుల చుట్టూ తిప్పుతున్నారు. అవగాహనను బట్టి కాకుండా మార్కులను బట్టి విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసే విపరీత ధోరణులు ప్రవేశించాయి. దీనితో మార్కులు సాధించాలంటూ తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి అధికమైంది. ఈ పరిస్థితి మారాలి. పిల్లలను స్వతహాగా ఆలోచించేటట్టు చేయాలి. అప్పుడే వారి సామర్థ్యం తెలుస్తుంది తప్ప, గైడ్లను ఆశ్రయించి భట్టీయం వేయడం వల్ల ప్రయోజనం ఉండదు. పిల్లలు చాలామంది ఇప్పటికీ భాష, భావ వ్యక్తీకరణల విషయంలో వెనుకబడి, పెద్ద చదువులు ఉన్నా నైపుణ్యాలు లేక అరకొర వేతనాలకే పని చేస్తున్నారు. కొలాబిరేటివ్ టీచింగ్‌తో ఈ సమస్యను అధిగమించవచ్చు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల స్థాయిలోనే పరిశోధనాత్మకత మీద అవగాహన పెంచాలి. (వ్యాసకర్త విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు: చుక్కా రామయ్య) -
‘ఉర్దూ టీచర్లూ.. సంస్కృతం బోధించండి!’
బుండీ: ఉర్దూ బోధిస్తున్న 40 మంది టీచర్లను సంస్కృతం బోధించాలంటూ రాజస్తాన్ ప్రభుత్వం వారిని వివిధ స్కూళ్లకు బదిలీ చేసింది. దీనిపై విమర్శలు రావడంతో నాలుక కరుచుకుని దిద్దుబాటు చర్యలకు దిగింది. ఉర్దూ విద్యార్థులు లేని బుండీ, ఝలావర్, బరన్‌లోని పాఠశాలల్లో ఉన్న ఉర్దూ టీచర్లను వేరే ప్రాంతాల్లోని మాధ్యమిక పాఠశాలల్లో సంస్కృతం బోధించాలని బదిలీ చేశామని మాధ్యమిక విద్యాశాఖ(కోట) డెరైక్టర్ డీడీ మురళీ లాల్ తెలిపారు. ఈ బదిలీల్లో పొరపాటు జరిగిందని, దీన్ని సరిదిద్దుకుంటామని చెప్పారు. -
పనులన్నీ టీచర్లకే...
బోధనకు ఆటంకంగా బోధనేతర పనులు సాక్షి, హైదరాబాద్: ఎన్నికలొస్తే వారే కావాలి.. సర్వేలూ వారే చేయాలి.. శిక్షణలకు హాజరుకావాలి.. మధ్యాహ్న భోజనం నుంచి విద్యార్థుల హాజరుదాకా లెక్కలు రాయాలి.. అనధికారిక పనుల నుంచి అధికారిక విధుల వరకూ అన్నీ చేయాలి.. నివేదికల మీద నివేదికలు రూపొందించాలి.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పరిస్థితి ఇది. పాఠశాలలు ప్రారంభమైంది మొదలు వారికి సవాలక్ష పనులు, బోధనేతర కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఏర్పాట్లు.. ఇలా ఇన్ని ఒత్తిళ్ల మధ్య, గుక్కతిప్పుకోలేని పరిస్థితిలోనూ ప్రభుత్వ ఉపాధ్యాయులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. బోధనేతర కార్యక్రమాలతో ఏటా 35 నుంచి 45 రోజుల వరకు వృథా అవుతున్నా సిల బస్‌ను పూర్తిచేస్తూ.. పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో టీచర్లకు వేరే బాదరబందీలేమీ ఉండవు. ఉదయం బడికి వెళ్లారంటే విద్యాబోధనపైనే దృష్టి. అయినా ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఫలి తాలను సాధిస్తున్నారు. అదే ప్రభుత్వ టీచర్లకు బోధనేతర పనులు అప్పగించకుండా ఉంటే.. మరింత అద్భుత ఫలితాలు సాధించవచ్చని ఉపాధ్యాయ సం ఘాలు, మేధావులు స్పష్టం చేస్తున్నారు. అంతేగాకుండా ప్రభుత్వ పాఠశాలలపై పిల్లల తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచవచ్చని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ విధానాలను మార్చుకుని, ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేస్తే సర్కారీ విద్యను ఎదురులేని వ్యవస్థగా తీర్చిదిద్దవచ్చని.. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రభుత్వ టీచర్లకు తప్పని తిప్పలివి.. ⇒ పాఠశాల సంసిద్ధత కార్యక్రమం. ⇒ చదువుల పండుగ పేరిట వారం నుంచి 15 రోజుల వరకు కార్యక్రమాల నిర్వహణ, నివేదికల రూపకల్పన. ⇒ ఏటా గ్రామంలో బడి ఈడు పిల్లలు ఎంత మంది ఉన్నారు, ఎంత మంది స్కూళ్లలో ఉన్నారు, డ్రాపవుట్స్ ఎంత, నమోదు కాని విద్యార్థులు ఎంత మంది అనే వివరాలు సేకరించడం. వెబ్‌పోర్టల్ నివేదికలు పొందుపరచడం. గ్రాంట్స్ ఎన్ని వచ్చాయి, ఎంత వాడుకున్నారు, ఎంత మిగిలిందనే వాటిపై నివేదికల రూపకల్పన. ⇒ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల వారీగా విద్యార్థులు రోజు ఎంత మంది పాఠశాలకు వస్తున్నారు, ఎంత మంది మధ్యాహ్న భోజనం చేశారు, వినియోగించిన బియ్యమెంత, ఖర్చయిందెంత? వంటి వివరాలపై రోజువారీ నివేదికలు రూపొందించడం. వాటితోపాటు బియ్యం నిల్వలపై నివేదికల రూపకల్పన, ఆన్లైన్లో నమోదు చేయడం. వీటిపై మళ్లీ 15 రోజులకోసారి, నెలకోసారి నివేదికలు అందజేయడం. ⇒ ఇక ఫిజికల్ డెరైక్టర్లు, పీఈటీలు లేని పాఠశాలల్లో పిల్లలతో డ్రిల్ పీరియడ్‌లో ఆటలు ఆడిపించడం టీచర్ల బాధ్యతే. ⇒ 75 శాతం స్కూళ్లలో క్లర్క్‌లు, రికార్డు అసిస్టెంట్లు లేనందున జీతాల బిల్లులు, నివేదికల రూపకల్పన పనులు టీచర్లే నిర్వహిస్తున్నారు. ఏటా ఆగస్టు వచ్చిందంటే పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాల సేకరణ పనులు వారికే. ⇒ జిల్లా స్థాయిలో కంప్యూటర్లు పెట్టి 10 నుంచి 20 మంది సబ్జెక్టు టీచర్లతోనే డీఈవో కార్యాలయాల్లో నెలల తరబడి అనధికారిక పనులు చేయిస్తుంటారు. కౌమార విద్యపై వారం పదిరోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు. ⇒ సబ్జెక్టు రిసోర్స్ పర్సన్ల పేరుతో ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తారు. వారు ఆ తరువాత కొన్ని మండలాల్లో శిక్షణలు ఇస్తారు. దీనికే ఏటా 20 రోజుల సమయం పోతోంది. ఇలా ఒక్కో సబ్జెక్టుకు 15 మంది వరకు శిక్షణ ఇస్తారు. ప్రత్యేకంగా ఇంగ్లిషు బోధనపై 15 నుంచి 25 రోజుల శిక్షణ. ఇలాంటి శిక్షణలన్నీ పాఠశాలలు కొనసాగే రోజుల్లోనే ఉంటాయి. ⇒ పరీక్షలకు ముందు ఎస్సెస్సీ పరీక్ష పేపర్లను జిల్లా కేంద్రాల నుంచి స్కూళ్లకు, మండలాల పీఎస్‌లకు పంపించేందుకు రూట్ ఆఫీసర్, అసిస్టెంట్ రూట్ ఆఫీసర్ విధులు. పరీక్షలకు ముందు 20 రోజుల పాటు బార్ కోడింగ్ ఆఫీసర్ విధులకు వెళ్లడం. ⇒ 13 రోజుల పాటు ఇంటర్ పరీక్షల ఇన్విజిలేషన్ డ్యూటీలు. ⇒ వీటన్నింటికీ అదనంగా ఎన్నికల విధులు, సర్వేలు, ఓటర్ల జాబితా సవరణ పనులు.. వీటికి ముందుగా శిక్షణలు బోధనేతర పనులతో ఒత్తిడి టీచర్లకు బోధనేతర పనులను అప్పగించవద్దు. అలాంటివాటితో సమయం వృథా అవుతోంది. ఆ ఒత్తిడిలో పనిచేస్తూ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. అదే బోధనేతర పనులను తొలగిస్తే మరింత బాగా పని చేయగలుగుతారు. అద్భుత ఫలితాలు వస్తాయి. - వెంకట్‌రెడ్డి, పీఆర్టీయూ అధ్యక్షుడు నివేదికలు తగ్గించాలి టీచర్లకు నివేదికలు రూపొందించడం వంటి పనులను అప్పగించడాన్ని తగ్గించాలి. వాటికే ఎక్కువ సమయం పోతోంది. తద్వారా బోధనలో సమస్యలు తలెత్తుతున్నాయి. బోధనేతర పనులను తగ్గిస్తే మరింత బాగా పనిచేస్తారు. మంచి ఫలితాలు వస్తాయి.. - నర్సిరెడ్డి, యూటీఎఫ్ అధ్యక్షుడు సెలవుల్లోనే శిక్షణ ఇవ్వాలి ఉపాధ్యాయులకు సెలవు రోజుల్లో మాత్రమే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. దానివల్ల బోధనకు ఆటంకం ఉండదు. పిల్లలకు నాణ్యమైన విద్య లభించాలంటే ఇదే మార్గం. లేకపోతే బోధనలో ఇబ్బందులు తప్పవు.. - అబ్దుల్లా, పండిత పరిషత్ అధ్యక్షుడు బోధనేతర పనులొద్దు.. ఉపాధ్యాయులను తరగతి గదులకే పరిమితం చేయాలి. వీడియో కాన్ఫరెన్స్‌లు, టెలీకాన్ఫరెన్స్‌లు, నివేదికలు రూపొందించడం, కంప్యూటరీకరించడం వంటి పనులకు వారిని వినియోగించొద్దు. పాఠశాల సమయంలో వారికి ఎలాంటి శిక్షణలు ఇవ్వొద్దు. - కొండల్‌రెడ్డి, టీపీటీఎఫ్ అధ్యక్షుడు ‘ఇంటర్’ విధులకే 15 రోజులు పాఠశాలల్లో బోధనేతర కార్యక్రమాలకు చాలా సమయం వృథా అవుతోంది. వీటికి అదనంగా ఇంటర్ పరీక్షల ఇన్విజిలే షన్ విధులకు 15 రోజుల సమయం పోతోంది. ఇంకా రకరకాల సర్వేలు, నివేదికల పేరుతో బోధనకు అవాంతరం కలుగుతోంది. వాటిన్నింటిని తగ్గించాలి.’’ - హర్షవర్ధన్‌రెడ్డి, పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షుడు బడిలో ఉంటేనే నమ్మకం టీచర్లు బడిలో ఉండి, రోజూ పాఠాలు చెబితేనే ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెరుగుతుంది. శిక్షణలు, ఇతర పనుల పేరుతో బోధనకు దూరంగా ఉంచితే టీచర్లపై సదభిప్రాయం పోతోంది. ప్రభుత్వ విధానాలను సవరించాలి. అప్పుడే టీచర్లపై తల్లిదండ్రుల్లో మంచి అభిప్రాయం వస్తుంది.’’ - రాజిరెడ్డి, ఎస్టీయూ అధ్యక్షుడు -
విశ్వవిద్యాలయాలకు పూర్వ వైభవం
ఖాళీల భర్తీకి తెలంగాణ సర్కారు కసరత్తు యూనివ ర్సిటీల వారీగా వివరాల సేకరణ వచ్చే విద్యా సంవత్సరం నాటికి భర్తీ చేయాలన్న యూజీసీ వర్సిటీలను బలోపేతం చేస్తాం.. వీసీలను నియమిస్తాం: జగదీశ్‌రెడ్డి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు మళ్లీ పూర్వవైభవం రానుంది. బోధన, బోధనేతర సిబ్బంది కొరతతో కునారిల్లుతున్న యూనివర్సిటీలను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరాదరణకు గురైన విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసే దిశగా కసరత్తు ప్రారంభించింది. సివిల్స్ విద్యార్థులకు ఉపయోగపడేలా ఇప్పటికే డిగ్రీ సిలబస్‌లో మార్పులు చేసేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టగా.. సిబ్బందిని నియమిం చడం ద్వారా యూనివర్సిటీలను బలోపేతం చేయాలని సర్కారు యోచిస్తోంది. మరోవైపు అన్ని వర్సిటీలకు పూర్తిస్థాయి వైస్ చాన్స్లర్లను(వీసీ) నియమించేందుకు కూడా చర్యలు చేపడుతోంది. ఈ నెలాఖరుకల్లా వీసీల నియామక ప్రక్రియను చేపట్టాలని తొలుత భావించినా.. వచ్చే నెలలో అన్ని వర్సిటీలకు వీసీలను నియమించాలని విద్యా మంత్రి జగదీశ్‌రెడ్డి నిర్ణయించారు. మరోవైపు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అన్ని విశ్వవిద్యాలయాల్లోని ఖాళీలనూ భర్తీ చేయాలని ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్సిటీల వారీగా ఖాళీల వివరాలను సేకరించి వాటి భర్తీకి చర్యలు చేపడతామని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలంటేనే చిన్నచూపు.. విద్యా రంగంలో పరిశోధనలకు ప్రాధాన్యం పెంచేందుకు, ఉన్నత విద్యను విస్తరింపజేసేందుకు ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2008 నుంచి 2009 మధ్య కాలంలో జిల్లాకో విశ్వవిద్యాలయం ఉండేలా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశారు. అయితే ఆయన మరణానంతరం విశ్వవిద్యాలయాలను పట్టించుకున్న నాథుడే లేడు. గడిచిన ఐదేళ్లలో విశ్వవిద్యాలయాలను గాలికి వదిలేశారు. దీంతో ప్రతి యూనివర్సిటీలో అరకొర సిబ్బందే మిగిలారు. రిటైర్ అయిన వారి స్థానంలో కొత్తవారిని నియమించలేదు. తెలంగాణలోనూ ఇదే దుస్థితి నెలకొంది. తెలంగాణలోని ఏడు రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయాలకు 2,202 మంజూరైన పోస్టులు ఉంటే.. ప్రస్తుతం వాటిల్లో 1,122 మంది మాత్రమే బోధన సిబ్బంది ఉన్నారు. కొత్త పోస్టులను అసలు మంజూరే చేయలేదు. పాలమూరు విశ్వవిద్యాలయం ప్రారంభంలో ఇచ్చిన 28 పోస్టులను కూడా పూర్తిగా భర్తీ చేయలేదు. కేవలం ఎనిమిది మంది పూర్తిస్థాయి అధ్యాపకులతో వర్సిటీని నడపాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు వర్సిటీల్లో పనిచేస్తున్న సగం మందికి, రిటైర్ అయిన వారికి అవసరమైన వేతనాల బడ్జెట్లోనూ కోతలు విధించారు. రాష్ట్ర విభజన తర్వాత బడ్జెట్లో పాత విధానంలో కేటాయింపులు చేసినా, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అదనంగా నిధులను మంజూరు చేసింది. బోధన సిబ్బంది నియామకం ద్వారా వర్సిటీలను బలోపేతం చే సేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బోధనేతర సిబ్బందీ అరకొరే.. అన్ని యూనివర్సిటీల్లో బోధన సిబ్బందే కాదు.. బోధనేతర సిబ్బంది కూడా అరకొరగానే ఉన్నారు. శాతవాహన విశ్వవిద్యాలయంలో 44 బోధనేతర సిబ్బంది పోస్టులు మంజూరైనవి ఉంటే 21 మందే పని చేస్తున్నారు. ఉస్మానియాలో 1,175 వరకు మంజూరైన పోస్టులుంటే 400 మంది పని చేస్తున్నారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో 14 మందికిగాను నలుగురే పని చేస్తున్నారు. మిగతా వర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. -
టెన్షన్ వద్దు
vip రిపోర్టర్ కాగిత శామ్యూల్ ఇన్చార్జి డీఈవో పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో బోధన ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇన్చార్జి డీఈవో శామ్యూల్ ‘సాక్షి’ విఐపీ రిపోర్టర్‌గా మారారు. మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని నీరుగట్టువారిపల్లె శ్రీవివేకానంద మున్సిపల్ ఉన్నత పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. పలు సూచనలు ఇచ్చారు. ఇన్చార్జి విద్యాశాఖాధికారి కాగిత శామ్యూల్ జిల్లాలోని సర్కారు బడుల పనితీరు, సౌకర్యాలు, ప్రభుత్వ పథకాల అమలు గురించి తెలుసుకోవాలన్నారు. అధికారిగా వెళితే ముందుగానే సమాచారం తెలుసుకుని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జాగ్రత్త పడతారు. విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు తెలియవు. ఆకస్మిక తనిఖీకి వెళ్లినా అక్కడేం జరిగిందనేది పూర్తిగా బయటకు రాదు. విషయం రాబట్టాలంటే రొటీన్‌కు భిన్నంగా ఏదో ఒకటి చేయాలని అనుకున్నారు. వెంటనే ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారిపోయారు. మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని నీరుగట్టువారిపల్లె శ్రీవివేకానంద మున్సిపల్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, పదో తరగతి పరీక్షల్లో మెరుగైనా ఫలితాల కోసం ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాఠశాలలో గడిపారు. పర్యటనలో ఆయన జరిపిన సంభాషణలు.. ప్రజెంటేషన్ : చిట్టెం సుధాకర్, మాడా చంద్రమోహన్ పదో తరగతి తరగతి గది: ఇన్చార్జి డీఈవో : మీ పాఠశాలలో పదో తరగతి సిలబస్ పూర్తయ్యిందా? విద్యార్థిని(గాయత్రి): అన్ని సబ్జెక్టుల్లో సిలబస్ పూర్తి చేశారు. టీచర్లు సబ్జెక్టుల వారీగా రివిజన్ చేస్తున్నారు. ఇన్చార్జి డీఈవో : మీ సెక్షన్లో ఎంతమంది ఉన్నారు? విద్యార్థిని : 52 మంది ఉన్నారు సార్ ఇన్చార్జి డీఈవో: టీచర్లు అన్ని సబ్జెక్టులు అర్థమయ్యేలా చెప్పారా? విద్యార్థిని(లక్ష్మి) : చెప్పారు సార్, ప్రతి రోజూ స్టడీ అవర్స్ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఇన్చార్జి డీఈవో : నీకు ఏ సబ్జెక్టు ఇష్టం? విద్యార్థిని (వాణి ప్రసన్న) : బయాలజీ సార్ ఇన్చార్జి డీఈవో : కష్టమైన సబ్జెక్టు ఏది? విద్యార్థిని : ఫిజిక్స్ సార్ ఇన్చార్జి డీఈవో : ఎందుకు కష్టం? మీసార్లు సరిగా చెప్పడం లేదా ? అర్థం కావడం లేదా? విద్యార్థి(అరవింద్): ఫిజిక్స్‌లో ఫార్ములాలు ఉంటాయి సార్ ఇన్చార్జి డీఈవో: కష్టమైనా ఇష్టంగా చదివితే మంచి మార్కులు వస్తాయి. సరే.. నీవు స్కూలుకు ఎన్ని గంటలకు వస్తావు? విద్యార్థి(అరవింద్) : ఉదయం 6 గంటలకు వచ్చి 7.30 వరకు స్టడీ అవర్స్, మళ్లీ ఇంటికి వెళ్లి 8.30కు వచ్చి సాయంత్రం 7.30 వరకు ఉంటాం. ఇన్చార్జి డీఈవో : ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూలులో ఉంటే బోర్ కొట్టదా? విద్యార్థిని(నందిని): ఇంటికి వెళ్లి కొంతసేపు రిలాక్స్ అవుతాం? ఇన్చార్జి డీఈవో : ఇంటికి వెళ్లి టీవీలో సినిమాలు, సీరియల్స్ చూస్తారా? విద్యార్థిని(నందిని) : కొద్దిసేపు చూస్తాం. ఇన్చార్జి డీఈవో : నీవు టీవీలో ఏం చూస్తావు? విద్యార్థిని(భువనేశ్వరి) : న్యూస్ చూస్తాను సార్ ఇన్చార్జి డీఈవో : నీవు ఏం చూస్తావమ్మా? విద్యార్థిని(జోత్స్న): మ్యూజిక్ చానల్లో పాటలు చూస్తాను. ఇన్చార్జి డీఈవో : ఎందుకు చూస్తావు? విద్యార్థిని: రిలాక్స్ కావడానికి మ్యూజిక్ అవసరం సార్ ఇన్చార్జి డీఈవో : నీవు ఎంత సేపు టీవీ చూస్తావు? విద్యార్థి (సునీల్‌కుమార్) : గంటసేపు చ ూస్తాన్ సార్. ఇన్చార్జి డీఈవో : అంతసేపు చూడటం వల్ల పాఠాలపై శ్రద్ధ పోతుంది. కొద్దిసేపు చూసిన తర్వాత పాఠాలు చదవాలి. సీరియల్స్, సినిమాలు కొద్ది రోజులు పక్కన పెట్టండి.రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలో, ఇంటికి వెళ్లిన తర్వాత చదువుకోవడంతో పాటు ఆరోగ్యం కూడా చూసుకోవాలి. ఆరోగ్యం చూసుకుంటే మంచి మార్కులు వస్తాయి. పరీక్షలు రాబోతున్నాయి కదా మీకు భయం లేదా? విద్యార్థి (అరవింద్) : భయంగా ఉంది. మొదటిసారి రాస్తున్నాం కదా సార్. ఇన్చార్జి డీఈవో : అందుకోసమే ఇన్స్పైర్ వంటి కార్యక్రమాలు పెట్టాం. ఇప్పటి నుంచి ఇష్టంగా చదివి బాగా రాస్తే మంచి మార్కులు వస్తాయి. ఇంతకీ ఇన్స్పైర్ కార్యక్రమం ఉపయోగకరంగా ఉందా? విద్యార్థిని (దుర్గ) : ఉపయోగపడింది సార్. ఇన్చార్జి డీఈవో : ఇన్‌స్పైర్‌కు ఎవరైనా ఎంపికయ్యారా? హెచ్ఎం (శ్రీనివాసులు) : మా విద్యార్థి అరవింద్ జిల్లాలో మొదటి స్థానం వచ్చారు. ఇన్చార్జి డీఈవో : వెరీగుడ్, బాగా చదవాలి. (అంటూ మెమెంటోను విద్యార్థికి అందజేశారు) రెండు నెలల్లో పబ్లిక్ పరీక్షలు రాబోతున్నాయి. ఇప్పటి నుంచి ఇష్టపడి చదవండి. మంచి మార్కులు సాధిస్తారు. ఆల్ ది బెస్ట్..! ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం ఇన్చార్జి డీఈవో : పదో తరగతి పరీక్షల కోసం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి? హెచ్ఎం (శ్రీనివాసులు) : ఉపాధ్యాయులందరూ కలిసి ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నాం. సబెక్టుల వారీగా శిక్షణ ఇప్పిస్తున్నాం. ఇన్చార్జి డీఈవో: ఈసారి మంచి ఫలితాలు వచ్చేలా అందరూ కష్టపడాలి. పదో తరగతి విద్యార్థిని తండ్రికి ఫోన్ చేసి.. ‘‘హలో.. నేను డీఈవోను మాట్లాడుతున్నా.. మీ పాప చదివే పాఠశాలలో ఉన్నా. మీ పాప ఎలా చదువుతుందో కనుక్కుంటున్నా.. మీ పాపను బాగా చదివించండి.. టీవీ సీరియల్స్‌ను చూపించకండి.. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించేందుకు ఇన్స్పైర్ కార్యక్రమం అమలు చేస్తున్నాం. వెనుబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. గతంలో మదనపల్లె డివిజన్లో మాత్రమే ఇన్స్పైర్ కార్యక్రమం అమలవుతుండగా ఈ ఏడాది జిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలో పరీక్షలు నిర్వహించాం. ఇందులో ఉత్తమ మార్కులు సాధించిన దాదాపు 800 మంది విద్యార్థులకు సెలవుల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి అత్యుత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించాం. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నాం’’ డీఈవోతో ఎస్ఎంసీ (స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ) చైర్మన్.. వెంకటరమణ (ఎస్ఎంసీ చైర్మన్) : సార్ పాఠశాలలో బాలికలకు మరుగుదొడ్లు అసరానికి సరిపడా లేవు. కేవలం ఆరు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. అలాగే విద్యార్థులకు అదనపు గదులు నిర్మించాల్సి ఉంది. క్రీడా మైదానం అవసరం. ప్రతియేటా పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇన్చార్జి డీఈవో: తప్పకుండా ఉన్నతాధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తాను. మధ్యాహ్న భోజన వంటగది పరిశీలన ఇన్చార్జి డీఈవో : ఏమ్మా.. ఈ రోజు అన్నం, కూరలు ఏం చేస్తున్నావు? వంట ఏజెన్సీ నిర్వాహకురాలు(భూదేవి) : సార్ అన్నం, బీన్సు సాంబార్ చేస్తున్నాం. ఇన్చార్జి డీఈవో: ఎంతమంది విద్యార్థులకు వండుతున్నావు? ఏజెన్సీ నిర్వాహకురాలు : 1,200 మంది విద్యార్థులకు సార్ ఇన్చార్జి డీఈవో : వారంలో కోడిగుడ్లు ఎన్నిసార్లు ఇస్తున్నారు? ఏజెన్సీ నిర్వాహకులు : రెండుసార్లు సార్ ఇన్చార్జి డీఈవో: రెండుసార్లు తప్పకుండా ఇవ్వాలి. అన్నం ఇంకా బాగా ఉడకాలి (అన్నం రుచి చూస్తూ).. సాంబారులో ఎంత పప్పు వేశావమ్మ? ఏజెన్సీ నిర్వాహకులు : 7 కేజీలు సార్ ఇన్చార్జి డీఈవో : పప్పు తక్కువ వేశారు. నాణ్యమైన కూరలు ఇవ్వాలి. ఏజెన్సీ నిర్వాహకులు :అలాగే సార్ ఇన్చార్జి డీఈవో : మధ్యాహ్న భోజనం కోసం ప్రత్యేక నిధులు కేటాయించారు. నాణ్యత లేకుంటే క్షమించే ప్రసక్తే లేదు. మజ్జిగ ఇస్తున్నారా? ఏజెన్సీ నిర్వాహకులు : ఇవ్వలేదు సార్. ఇన్చార్జి డీఈవో : వంట చేసేందుకు డబ్బులు అందాయా? ఏజెన్సీ నిర్వాహకులు : లేదు సార్. ఇన్చార్జి డీఈవో : త్వరలో బడ్జెట్ వస్తుంది. అందేలా చర్యలు తీసుకుంటాం. మెను ప్రకారం భోజనం అందించాలి. శుచితో పాటు శుభ్రత పాటించాలి. డీఈవో హామీలు పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రత్యేక ప్రణాళిక నాణ్యతతో కూడిన విద్యే లక్ష్యం తగిన తరగతి గదుల నిర్మాణం -
కేయూ ప్రొఫెసర్ రవీందర్‌కు అరుదైన గౌరవం
రాయల్ కెమికల్ సొసైటీ ఫెలోగా ఎంపిక వరంగల్: కాకతీయ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ వడ్డె రవీందర్ ప్రతిష్టాత్మకమైన రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ఫెలోగా ఎంపికయ్యారు. తెలంగాణ వర్సిటీల నుంచి ప్రథమంగా రవీందర్‌కు ఈ గౌరవం లభించింది. మూడు దశాబ్దాలకుపైగా బోధన, పరిశోధనల అనుభవం ఉన్న ప్రొఫెసర్ రవీందర్ 115 పరిశోధన పత్రాలను సమర్పించారు. రెండు పుస్తకాలు రచించారు. ఆయన పేరున రెండు పేటెంట్లు ఉన్నాయి. 2010లో రాష్ర్ట ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు, 2013లో అప్కాస్ట్ డీఎస్టీ ఆఫ్ సెన్సైస్ అవార్డు అందుకున్నారు. పలు విదేశీ వర్సిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. కాగా, కేయూలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో రవీందర్‌కు రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ మెడల్, సర్టిఫికెట్, బ్యాడ్జీని ఐఐసీటీ డెరైక్టర్ లక్ష్మీకాంతం అందజేశారు. -
వారంలో ఒక్కరోజు అంతా పాఠాలు చెప్పండి: మోడీ
భారతదేశ భావికలలన్నీ మోస్తున్న పిల్లలతో మాట్లాడే అవకాశం లభించినందుకు గర్విస్తున్నానని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. గురుపూజోత్సవం సందర్భంగా ఆయన ఢిల్లీ మానెక్షా ఆడిటోరియంలో విద్యార్థులతో ముఖాముఖిలో మాట్లాడారు. ఒక్క పశ్చిమ బెంగాల్ తప్ప మిగిలిన దేశంలోని 18 లక్షల పాఠశాలల్లో ఈ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ''ఎప్పటికప్పుడు మారుతుండాలి. ఎలా మారాలో అందరూ ఆలోచించాలి. చాలా సమర్థులైన విద్యార్థులు ఎందుకు ఉపాధ్యాయులు కావాలనుకోవడం లేదో అంతా చూడాలి. మంచి టీచర్లకు చాలా డిమాండ్ ఉంది. భారత్ యువదేశం. మన దేశం నుంచి మంచి టీచర్లను ఎగుమతి చేయగలమన్న విశ్వాసం మనం ఇవ్వలేమా? నేను కూడా మంచి ఉపాధ్యాయుడినయ్యి.. దేశానికి సేవ చేయగలనన్న భావన విద్యార్థులలో నెలకొల్పలేమా? సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి మంచి సేవ చేశారు. ఆయన తన జయంతి చేయొద్దని, ఉపాధ్యాయ దినోత్సవం చేయాలని దేశానికి చెప్పారు. గొప్పవాళ్లందరి జీవితాలను తీర్చిదిద్దడంలో తల్లి, గురువులే ప్రధానపాత్ర పోషిస్తారు. చిన్న గ్రామంలో ఎవరికైనా మంచి గౌరవం ఉందంటే.. అది కేవలం ఉపాధ్యాయుడికే. ఇంట్లో అమ్మానాన్నలకు చెప్పుకోలేని విషయాలు కూడా ఉపాధ్యాయులకు చెప్పుకోగలం. టీచర్లంటే విద్యార్థుల పాలిట హీరోలు. మీరు ఎంత పెద్ద స్థానంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా కూడా.. వారంలో ఒక్క రోజు.. ఒక్క గంట పాటు వెళ్లి ఏదో ఒక పాఠశాలలో పాఠాలు బోధించండి. అన్ని రకాల శక్తులు కలిసి విద్యార్థులకు తమ విజ్ఞనాన్ని అందిస్తే మంచిది. మంచి లక్ష్యాలు ఉంటే.. పరిస్థితులు ఏ ఒక్కరినీ ఆపలేవు. భారతదేశంలో పిల్లలకు కావల్సినంత సామర్థ్యం ఉంది. మీలో ఎంతమందికి ప్రతిరోజూ చెమట పడుతుంది? ఒక్కళ్లకు కూడా లేదు కదూ.. ఆటపాటలు లేకపోతే జీవితం అసంపూర్ణమే. ఈ వయసులో కనీసం రోజుకు నాలుగైదు సార్లు ఒంటినిండా చెమట పట్టాలి. అస్తమాను పుస్తకాలు చదవడం, టీవీలు, కంప్యూటర్లు చూడటం.. ఇదే జీవితం కాదు.. దీనికంటే చాలా ఉంది. తరగతి పుస్తకాలు కాకుండా ఇతర పుస్తకాలు చదివేవాళ్లు ఎంతమంది ఉన్నారు? జీవిత చరిత్రలు ఎంతమంది చదువుతారు... ఇది చాలా తక్కువే. ఇప్పుడు పనులన్నీ గూగుల్ గురువే చేస్తారు. ఏ సమస్య ఉన్నా గూగుల్ గురువే చెబుతుంది. అది సరికాదు. గురుముఖతః నేర్చుకుంటే మంచిది'' అని ఆయన చెప్పారు. -
ఇదేమి శిక్షణ ? - ప్రత్యేక చర్చ
-
కొత్త బడి గంటలు
- ఉదయం 9 గంటలకే తరగతులు ప్రారంభం - అమలు కావల్సింది రాష్ట్ర పరిధి పాఠశాలల్లోనే.. మంచిర్యాల సిటీ : కేంద్ర ప్రభుత్వం 2009లో అమలు చేసిన విద్యాహక్కు చట్ట ప్రకారం బడిగంటలు మారనున్నాయి. ప్రస్తుతం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పనివేళలు ఒక్కో రకంగా ఉన్నాయి. కొత్తగా అన్నిపాఠశాలలు ఒకే సమయానికి ప్రారంభమై ఒకే సమయానికి విద్యార్థులను విడుదల చేయాలనే నిబంధనలు రాబోతున్నాయి. ఉదయం 9 గంటలకే తరగతులు ప్రారంభించి సాయంత్రం 4.30 గంటలకు విద్యార్థులను విద్యాహక్కు చట్టం ప్రకారం విడుదల చేయాలి. ఈ సవృయాన్ని ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర పరిధిలోని కేంద్రీయ విద్యాలయం, నవోదయ, ఆదర్శ, సాంఘీక సంక్షేమ, గురుకుల పాఠశాలలతోపాటృ ప్రైవేటు పాఠశాలలు అమలు చేస్తున్నాయి. కేవలం రాష్ట్రప్రభుత్వం పరిధిలోని మండల, జిల్లా పరిషత్ పాఠశాలలు అమలు చేయడం లేదు. తరగతుల నిర్వహణ సమయాల్లో మార్పులు జరగాల్సి ఉన్నప్పటికీ నేటికి విద్యాహక్కు నిబంధనలు అమలు కావడం లేదు. బడి వేళలను మార్చాల్సిందే అంటూ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలను కొన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తుండగా, మరికొన్ని సమర్థిస్తున్నాయి. బోధన ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులకు తరగతులు బోధించడానికి రోజుకు ఏడున్నర గంటల చొప్పున వారానికి 45 గంటల సమయాన్ని కేటాయించాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో బోధించడానికి ఏడాదికి 800 గంటలు, ఉన్నత పాఠశాలల్లో ఒక 1000 గంటలు కేటాయించాలని చట్టం చెబుతోంది. ఇబ్బందులు కొత్త సమయసారిణి అమలు అయితే విద్యార్థులకు మేలు జరుగుతుంది. కొత్త బడిగంటల ప్రకారం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఏడున్నర గంటలు పనిచేయనున్నాయి. ఉపాధ్యాయులు సమయాన్ని పాటించినచో విద్యార్థులకు మేలు చేసినవారవుతారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా బోధన, బోధనేతర సిబ్బందితోపాటు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉండాల్సిన మౌలిక వసతులను ఏర్పాటు చేసినపుడే కొత్త బడి గంటలకు న్యాయం జరుగుతుంది. ప్రధానంగా రవాణా సౌకర్యాలు మెరుగుపర్చాలి. అన్ని రూట్లకు బస్ సౌకర్యం కల్పిస్తే ప్రభుత్వం అనుకున్నట్లు లక్ష్యం నెరవేరుతుంది. కొన్ని రూట్లలో కార్పొరేట్ పాఠశాలు బస్ సౌకర్యం కల్పిస్తున్నాయి. రహదారులు మెరుగ్గా ఉన్న ప్రాంతాలకు కనీసం ఆర్టీసీ బస్ వేయిస్తే సులువవుతుంది. -
వినూత్న పద్ధతులే.. ప్రాధాన్యతకు కారణం
గెస్ట్ కాలమ్ ‘ఐఐటీ-ముంబైలో చేరడమే ఆశయం’.. ‘ఐఐటీ-ముంబైలో సీఎస్ఈ చదవాలనుకుంటున్నాను’.. ‘ఐఐటీ-ముంబైలో ఏ బ్రాంచ్ వచ్చినా చేరతా ను’.. ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీలలో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకర్లలో అత్యధిక విద్యార్థుల మాట ఇదే. పదహారు ఐఐటీలల్లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో సీటు లక్ష్యంగా అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించిన విద్యార్థులు.. తొలి గమ్యంగా ఐఐటీ-ముంబైని ఎంపిక చేసుకుంటున్నారు. కారణం... ఈ క్యాంపస్‌లో బోధన, పరిశోధన తదితర అంశాల్లో అనుసరిస్తున్న వినూత్న పద్ధతులే అంటున్నారు ఐఐటీ-ముంబై డెరైక్టర్.. ప్రొఫెసర్ దేవాంగ్ వి. ఖఖర్. జేఈఈ అడ్వాన్స్డ్-2014 మొదటి దశ సీట్ అలాట్మెంట్ వివరాలు మంగళవారం విడుదల కానున్న నేపథ్యంలో.. ఐఐటీ-ముంబై విశిష్టతలు, విద్యార్థులకు అందుబాటులో ఉన్న సదుపాయాలపై ప్రొఫెసర్ దేవాంగ్ వి. ఖఖర్తో ఇంటర్వ్యూ... ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకర్లలో అధికులు ఐఐటీ-ముంబైకే తొలి ఓటు అంటున్నారు? దీనిపై మీ అభిప్రాయం? ఈ ఏడాది అనే కాదు.. గత కొన్నేళ్లుగా ఐఐటీ ఎంట్రెన్స్ ర్యాంకర్లకు తొలి ప్రాధాన్యంగా ఐఐటీ-ముంబై నిలుస్తోంది. జేఈఈ-2013 గణాంకాలు పరిశీలిస్తే జాతీయస్థాయిలో టాప్-10లో ఎనిమిది మంది, టాప్-100లో 67 మంది ముంబై క్యాంపస్‌లో అడుగుపెట్టారు. ఐఐటీ-ముంబైకి ఇంత ప్రాధాన్యం లభించడానికి కారణం? ముఖ్యంగా బోధన, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు నిరంతరం చేపడుతున్న విశిష్టమైన కొత్త విధానాలే. విద్యార్థులు మెరుగైన పరిజ్ఞానం పొందేందుకు నిపుణులైన ఫ్యాకల్టీని నియమిస్తున్నాం. మొత్తం ఫ్యాకల్టీలో 98 శాతంపైగా పీహెచ్డీ ప్రొఫెసర్లే. వారు కూడా అంతర్జాతీయంగా అనేక జర్నల్స్, పబ్లికేషన్స్‌లో, అంతర్జాతీయ అనుభవం ఉన్నవారే. ఫ్యాకల్టీ- స్టూడెంట్ నిష్పత్తిని 1:13లో ఉంచుతున్నాం. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తోంది. దీంతోపాటు ఆర్ అం డ్ డీ విషయంలో కూడా ఐఐటీ-ముంబై శరవేగంగా పురోగతి సాధిస్తోంది. గత మూడేళ్లలో సగటున 42 శాతం వృద్ధి సాధించింది. 2013-14 సంవత్సరంలో ఆర్ అండ్ డీ ద్వారా రూ. 217.17 కోట్లు లభించాయి. అంతేకాకుండా 72 పేటెంట్లు ఫైల్ చేయడం జరిగింది. 2008-09తో పోల్చితే ఇది 400 శాతం అధికం. పరిశోధన - అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర? ఆర్ అండ్ డీ కార్యకలాపాల్లో అన్ని స్థాయిల విద్యార్థులు పాల్పంచుకునే అవకాశం కల్పిస్తున్నాం. పరిశోధన కార్యకలాపాల్లో నేరుగా భాగస్వామ్యం ఉన్న విద్యార్థులను.. అనుభవజ్ఞులైన స్కాలర్స్‌తో సంప్రదింపుల దిశగా ప్రోత్సహిస్తున్నాం. ఇందుకోసం జాతీయ, అంతర్జాతీయ సెమినార్లకు హాజరయ్యేందుకు కూడా ఆర్థిక సహకారం అందిస్తున్నాం. ఇలా.. 2012-13లో 254 మంది విద్యార్థులకు అంతర్జాతీయ సెమినార్లకు హాజరయ్యేందుకు నిధులు సమకూర్చాం. అంతేకాకుండా విదేశీ యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్స్.. పరిశ్రమ వర్గాలతో పటిష్టమైన ఒప్పందాలు వంటివి కూడా ఐఐటీ-ముంబైని ముందంజలో నిలుపుతున్నాయి. అండర్-గ్రాడ్యుయేట్స్ కోసం ప్రత్యేకంగా తీసుకుంటున్న చర్యలు? కొత్తగా అడుగుపెట్టే విద్యార్థుల విషయంలో ప్రధానంగా పరిగణించాల్సిన అంశం సిలబస్ పరంగా మౌలిక అంశాలపై నైపుణ్యాలు అందించడం. ఇందుకోసం ప్రత్యేకంగా స్టూడెంట్ మెంటార్ ప్రోగ్రామ్ విధానానికి రూపకల్పన చేశాం. ఇది బీటెక్ మొదటి, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ప్రోగ్రామ్. ఫ్యాకల్టీ కో-ఆర్డినేటర్ పర్యవేక్షణలో సీనియర్ స్టూడెంట్స్‌ను భాగస్వాములను చేస్తూ ఈ ప్రోగ్రామ్ రూపొందించాం. ద్వితీయ సంవత్సరం పూర్తయిన తర్వాత కూడా మెంటార్షిప్ అవసరమైన విద్యార్థులకు ఆయా డిపార్ట్మెంట్ల స్థాయిలో ఇది అందుబాటులో ఉంటుంది. సీఎస్ఈ పట్ల అత్యధిక ఆదరణ ఉండటానికి కారణం? ఐఐటీ-ముంబైలోని సీఎస్ఈ డిపార్ట్మెంట్ దేశంలోనే అతి పెద్ద డిపార్ట్మెంట్గా చెప్పొచ్చు. ఫ్యాకల్టీ వ్యక్తిగత పరిశోధన, పరిశ్రమల సహకారంతో పరిశోధన కార్యకలాపాలు జరుగుతున్నాయి. సీఎస్ఈ విభాగంలోనే పది రీసెర్చ్ ల్యాబ్స్ ఉన్నాయి. రీసెర్చ్‌లో కేవలం ఉన్నత స్థాయి కోర్సు విద్యార్థులనే కాకుండా ఈ బ్రాంచ్‌కు చెందిన విద్యార్థులందరినీ భాగస్వాములను చేస్తున్నాం. కోర్సుతో సంబంధం లేకుండా విద్యార్థుల ఆలోచనలను స్వీకరిస్తున్నాం. ఆచరణ సాధ్యమయ్యేవాటి విషయంలో ఆర్ అండ్ డీ కార్యకలాపాలకు ఉపక్రమిస్తున్నాం. అకడెమిక్ ఎక్స్‌లెన్స్ దిశగా తీసుకుంటున్న చర్యలు? కొత్త కోర్సుల ఆవిష్కరణ, ఎప్పటికప్పుడు సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ రూపకల్పన, ల్యాబ్స్‌కు నిరంతరం మార్పులు చేర్పులు చేయడం వంటివి అకడెమిక్ ఎక్స్‌లెన్స్‌లో ప్రధానమైనవి. కేవలం క్లాస్ రూం టీచింగ్-లెర్నింగ్‌కే పరిమితం కాకుండా ఆన్లైన్ మెటీరియల్, వీడియో లెక్చర్స్ సదుపాయం వంటి టెక్నాలజీ బేస్డ్ లెర్నింగ్ విధానాలను కూడా అమలు చేస్తున్నాం. వీటి ద్వారా విద్యార్థులకు నిరంతరం నైపుణ్యాలు అందించేందుకు కృషి చేస్తున్నాం. విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకాలు? ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించే క్రమంలో ఇన్స్టిట్యూట్, పూర్వ విద్యార్థుల సొసైటీల ఆధ్వర్యంలో పలు స్కాలర్‌షిప్స్‌ను అందిస్తున్నాం. గతేడాది 210 మందికి స్కాలర్షిప్స్ ఇచ్చాం. కరిక్యులం విషయంలో మార్పులు.. చేర్పులు? పరిశ్రమ ప్రస్తుత అవసరాలు, కొత్తగా ఆవిష్కృతమవుతున్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ.. వాటికి సరితూగే విధంగా కరిక్యులంలో నిరంతరం మార్పులు చేస్తున్నాం. ఇందుకోసం పరిశ్రమ వర్గాలతో నిరంతర సంప్రదింపులు సాగిస్తున్నాం. ఫలితంగా కోర్సు పూర్తయి సర్టిఫికెట్ చేతికొచ్చే సమయానికి ప్రతి విద్యార్థికి జాబ్-రెడీ స్కిల్స్ అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. పరిశ్రమలు, ఇన్‌స్టిట్యూట్స్‌తో ఉన్న ఒప్పందాలు? రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీకి సంబంధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. బోయింగ్, జర్మన్ డెవలప్మెంట్ కోఆపరేషన్, నోకియా సీమెన్స్ నెట్వర్క్స్ తదితర.. వందకుపైగా విదేశీ విద్యా సంస్థలతో కలిసి ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తున్నాం. దేశంలోనూ ఓఎన్జీసీ, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ తదితర ప్రభుత్వ సంస్థలతోపాటు టీసీఎస్, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి మరెన్నో ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని పరిశోధన- అభివృద్ధి, కరిక్యులం డెవలప్మెంట్ వంటివి చేపడుతున్నాం. ఇటీవల కాలంలో చాలామంది ఇండస్ట్రీ, ఇన్స్టిట్యూట్స్ ఒప్పందాలకు ప్రాధాన్యమిస్తున్నారు. దీనికి కారణం? ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సంస్థల మధ్య అనుసంధానం అవసరమవుతోంది. అంతర్జాతీయంగా అన్ని సంస్థలు సరిహద్దులతో సంబంధం లేకుండా విస్తరిస్తున్నాయి. పర్యవసానంగా వారి వాస్తవ అవసరాలు తీర్చే విధంగా ఆర్ అండ్ డీ ఆవిష్కరణలు, ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ల ఆవశ్యకత ఏర్పడుతోంది. అకడెమిక్ స్థాయిలోనే వాటికి పునాది వేసే విధంగా పలు సంస్థలు ఇన్‌స్టిట్యూట్స్‌తో చేతులు కలుపుతున్నాయి. ఐఐటీ-ముంబై కూడా స్టూడెంట్ - ఫ్యాకల్టీ ఎక్స్ఛేంజ్ కోణంలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ (అమెరికా), ది స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూజెర్సీ, బ్రౌన్ యూనివర్సిటీ వంటి అంతర్జాతీయ ఇన్‌స్టిట్యూట్స్‌తో ఎక్స్ఛేంజ్ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్, బోధన ప్రాధాన్యం.. ఈ విషయాల్లో ఐఐటీ-ముంబై అనుసరిస్తున్న విధానాలు? నేటి అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే విద్యార్థుల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్‌ను అకడెమిక్ స్థాయి నుంచే పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ విషయంలో ఐఐటీ-ముంబై శరవేగంగా కదులుతోంది. ఎంటర్ప్రెన్యూరియల్ స్కిల్స్ పెంపొందించే విషయంలో.. సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పేరుతో ప్రత్యేకంగా టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభించాం. గత పదేళ్లలో ఈ సెంటర్ ద్వారా 50కి పైగా కొత్త కంపెనీలు రూపుదిద్దుకున్నాయి. బ్యాచిలర్ స్థాయి నుంచే ఎంటర్ప్రెన్యూరియల్ స్కిల్స్ అందించే క్రమంలో.. బీటెక్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను మైనర్ ప్రోగ్రామ్‌గా త్వరలోనే ప్రారంభించనున్నాం. అకడెమిక్‌గా అంతర్జాతీయ గుర్తింపు ఉన్నప్పటికీ.. ర్యాంకింగ్స్ పరంగా వెనుకంజలో ఉండటానికి కారణం? ర్యాంకింగ్స్‌లో అన్ని విషయాలను పరిశీలించాలి. అకడెమిక్ విభాగాల కు సంబంధించిన ర్యాంకుల్లో ఐఐటీ-ముంబై, ఇతర ఐఐటీల స్కోరు మెరుగ్గానే ఉంటోంది. అయితే ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ, స్టూడెంట్స్, స్టూడెంట్-ఫ్యాకల్టీ రేషియో, ప్రచురితమైన రీసెర్చ్ పేపర్స్ తదితర అంశాల కారణంగా ప్రపంచ ర్యాంకుల్లో కొంత వెనుకంజలో ఉంటున్నాం. వీటిని కూడా తీవ్రంగా పరిగణిస్తూ క్రమేణా మెరుగుపడేందుకు కృషి చేస్తున్నాం. కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా ఈ విభాగానికి గల భవిష్యత్తుపై మీ అభిప్రాయం? కెమికల్ ఇంజనీరింగ్ ఎవర్గ్రీన్ అండ్ ఇంపార్టెంట్. కేవలం కెమికల్ రంగంలోనే కాకుండా ఫార్మా, బయో కెమికల్, బయోటెక్నాలజీ, పాలిమర్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, మెటీరియల్స్ ప్రాసెసింగ్ తదితర ఎన్నో విభాగాల్లో కెమికల్ ఇంజనీర్ల అవసరం ఉంది. కాబట్టి ఈ బ్రాంచ్ ఎంపిక విషయంలో ఆందోళన చెందక్కర్లేదు. ఐఐటీ-ముంబైలో అడుగుపెట్టే విద్యార్థులకు మీరిచ్చే సలహా? బోధన, అభ్యసనం, పరిశోధన తదితర కోణాల్లో సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాలకు సంబంధించి అకడెమిక్‌గా ఐఐటీ-ముంబై ఎన్నో అవకాశాలను కల్పిస్తోంది. విద్యార్థులు దీన్ని అందిపుచ్చుకోవాలి. అంతేకాకుండా విద్యార్థులను ఒత్తిడికి దూరం చేసే విధంగా సోషల్ సర్వీస్ తదితర ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా జరుగుతుంటాయి. వీటిలోనూ ఉత్సాహంగా పాల్పంచుకోవాలి. అప్పుడే సామాజిక స్పృహ కూడా ఏర్పడి బాధ్యత గల పౌరులుగా రూపొందుతారు. -
సిబ్బంది కొరతే శాపమా?
కేఎంసీలో సీట్ల కొనసాగింపునకు ఎంసీఐ ససేమిరా కలెక్టర్ లేఖ రాసినా...స్పందించని గత ప్రభుత్వం పునఃపరిశీలనపై జిల్లా వాసుల ఆశలు డిప్యూటీ సీఎం స్పందించాలని వినతి ఎంజీఎం : వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాల(కేఎంసీ)తో పాటు అనుబంధ టీచింగ్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యసిబ్బంది కొరతే.. కేఎంసీలో 50 సీట్ల రద్దు నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. కేఎంసీ, ఎంజీఎంలో వైద్య సిబ్బంది కొరత, పరికరాల లేమిపై ‘సాక్షి’ దినపత్రికలో గతంలో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. వీటిపై స్పందిం చిన జిల్లా కలెక్టర్ కిషన్ స్పందించి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వైద్యసిబ్బంది నియమించాలని కోరుతూ లేఖ రాసినా ఎవరూ పట్టించుకోలేదు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) అధికారులు కేఎంసీలో గత నెల 9, 10వ తేదీలోల నిర్వహించిన తనిఖీల సందర్భంగా పలు లోపాలను గుర్తించారు. అనంతరం వారు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో కూడా సిబ్బంది కొరత విషయాన్ని పేర్కొనడంతో కేఎంసీలోని యాభై సీట్లు రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది. 54 మంది వైద్యుల కొరత కాకతీయ మెడికల్ కళాశాలతో పాటు ఎంజీఎం ఆస్పత్రిలో మొత్తం వివిధ విభాగాల్లో 266 మంది వైద్యులు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అయితే, కేవలం 212 మంది వైద్యులే ఉండగా.. మిగతా 54 మంది వైద్యులను నియమించాలని స్వయంగా కలెక్టర్ కిషన్ మూడు నెలల క్రితం లేఖ రాశారు. 17 ప్రొఫెసర్ పోస్టులు, 04 అసోసియేట్ ప్రొఫెసర్లు పోస్టులతో పాటు 30 అసిస్టింట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండగా, మరికొన్నింటిని కూడా ప్రభుత్వం భర్తీ చేయలేదు. దీంతో ఎంసీఐ బృందం కేఎంసీ కళాశాలలో 5 శాతం సిబ్బంది కొరత ఉందని నివేదికలో పేర్కొంది. పత్తా లేని సూపర్ స్పెషాలిటీ పోస్టులు 1956లో 80 పడకలతో స్థాపించిన ఎంజీఎం ఆస్పత్రిని 1976 ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకుని 690 పడకలుగా అభివృద్ధి చేసి కాకతీయ మెడికల్ కళాశాలకు అనుసంధానం చేసింది. అనంతరం 2005లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి వేయి పడకల ఆస్పత్రిగా ఎంజీఎంను అప్‌గ్రేడ్ చేస్తూ సూపర్‌స్పెషాలిటీ సేవలకు నాంది పలికారు. కానీ ఇప్పటి వరకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలకు సంబంధించి ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకపోవడంతో అటు వైద్యవిద్యార్థులతో పాటు ఇటు రోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. సూపర్‌స్పెషాలిటీ సేవలైనా న్యూరాలజీ, ఎండ్రోక్రైనాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, న్యూరోసర్జరీ, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పిడియాట్రిక్ సర్జరీ వంటి విభాగాల్లో నెప్రాలజీ, యూరాలజీ డిపార్టుమెంట్లలో ఒక్కో ప్రొఫెసర్ పోస్టు తప్ప మిగతావన్నీ ఖాళీ గానే ఉన్నాయని ఆస్పత్రి వర్గాలు డీఎంఈ పుట్ట శ్రీనివాస్ సైతం ఇటీవల నివేదిక సమర్పించారు. డిప్యూటీ సీఎం చొరవ కోసం ఎదురుచూపు వరంగల్‌లోని కేఎంసీతో పాటు టీచింగ్ ఆస్పత్రిగా ఉన్న ఎంజీ ఎంలో వెంటనే సిబ్బంది నియామకాలు చేపడితేనే కేఎంసీలో సీట్లు రద్దయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. దీనిపై జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం, రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తాటికొండ రాజయ్య చొర చూపాలని.. ఆ తర్వాత ఎంసీఐ బృందం పునఃపరిశీలన జరిగితే తప్ప సీట్లు దక్కవని వైద్యులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్, డెరైక్టర్ పబ్లిక్ హెల్త్ ద్వారా కేఎంసీలో సిబ్బంది కొరతను తీర్చి మెడికల్ సీట్లను కాపాడాల్సిన బాధ్యతను ప్రజాప్రతినిధులు తీసుకోవాలని ఓరుగల్లు ప్రాంత విద్యార్థులు కోరుతున్నారు. -
ఆదర్శం అపహాస్యం
ఈ ఏడాదీ వసతి లేకుండానే ప్రవేశాలు మూడేళ్లుగా కొనసాగుతున్న భవన నిర్మాణాలు స్థల అన్వేషణలోనే రావికమతం వసతిగృహం పాఠశాలల్లో విద్యార్థులకు తప్పని అవస్థలు ప్రైవేటుసంస్థలకు దీటుగా పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో మెరుగైన రీతిలో విద్యా బోధన చేయాలన్న లక్ష్యం నీరుగారిపోతోంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదర్శ పాఠశాలలు ఆపహాస్యమవు తున్నాయి. హాస్టల్‌తో కలిపి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి, తరగతులు ప్రారంభించి ఏడాదవుతున్నా నేటికీ వసతి సమకూరలేదు. దీంతో విదార్థులు డేస్కాలర్‌గా పాఠశాలకు వెళ్లేందుకు అనాసక్తి కనబరుస్తున్నారు. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీషు మీడియంలో ప్రత్యేక బోధనకు అప్పటి ప్రభుత్వం ఆదర్శపాఠశాలలు ఏర్పాటు చేసింది. ఆశయం బాగున్నా..ఆచరణలో మాత్రం వీటి పరిస్థితి మూడు అడుగులు ముందుకు, ఆరు అడుగులు వెనక్కు చందంగా మారింది. నర్సీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలోని నర్సీపట్నం మండలం వేములపూడి, రావికమతం మండలం మరుపాక, తేగాడ కశింకోట మండలం, మంచాల చీడికాడ మండలం, పాటిపల్లి మునగపాక మండలాల్లో ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేసింది. వీటిల్లో విద్యార్థులకు వసతిని కల్పించి తరగతులు ప్రారంభించాలని అప్పట్లో సంకల్పించింది. మొదటి ఏడాది పాఠశాల భవనాల నిర్మాణం సైతం పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో అప్పట్లో తరగతులు వాయిదా వేశారు. పాఠశాల భవనాలు పూర్తికావడంతో తదుపరి ఏడాది నుంచి తరగతులు ప్రారంభించారు. అప్పుడు తీరిగ్గా వసతిగృహ నిర్మాణాలు ప్రారంభించారు. అవి పూర్తికాకుండానే వసతి కల్పిస్తామంటూ విద్యార్థులను మభ్యపెట్టి ప్రవేశాలు పూర్తిచేశారు. దీంతో చదువులు బాగుంటాయన్న ఆశతో విద్యార్థులు తరగతుల్లో చేరారు. ఈ భవనాలు నేటికీ పూర్తికాలేదు. ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యమే కారణమని సంబంధిత ఇంజినీరింగు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా రావికమతం మండలం మరుపాక పాఠశాల వసతి గృహానికి నేటికీ స్థల సమస్య వేధిస్తోంది. మిగిలిన నాలుగు చోట్ల భవనాలు నిర్మాణాలు కొనసాగుతున్నాయి. దీంతో విద్యార్థులు గతేడాదంతా ఇళ్ల నుంచి రాకపోకలు సాగించారు. ఆయా మండలాలకు చెందనివారి పరిస్థితి దయనీయంగా ఉంది. వసతి ఉంటుందని భావించి, పాఠశాలల్లో చేరిన విద్యార్థులు రోజూ తరగతులకు హాజరయ్యేందుకు అవసరమైన ప్రయాణ సాధనాలు లేక నానా ఇబ్బందులు పడ్డారు. వీటిని పట్టించుకోకుండా అధికారులు ఈ ఏడాది సైతం ప్రవేశాలకు చర్యలు చేపట్టారు. ఆరో తరగతిలో ఒక్కో పాఠశాలలో 80 మంది చొప్పున ఐదింట 400 మందికి మంగళవారం ప్రవేశాలు కల్పించారు. ఇంటర్మీడియట్లో ప్రవేశానికి ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకుంటున్నారు. గతేడాది పరిస్థితే ఈ ఏడాదీ పునరావృతం కానుండడంతో ఏం చేయాలో పాలుపోక విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ భవనాలు నిర్మాణం పూర్తికాకపోవడంతో హాస్టల్ వసతి కల్పించడం లేదన్నారు. ఇవి పూర్తయిన వెంటనే వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. -
విదేశీ విద్య
బోధన, పరిశోధన రంగాల్లో మెరుగైన విద్యను అందించడంలో ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలు ప్రపంచంలోనే ముందు వరుసలో నిలుస్తున్నాయి. తరగతి గది బోధనతోపాటు కావాల్సిన స్కిల్స్ పెంపొందించుకునేలా.. ప్రాక్టికల్స్‌కు పెద్దపీట వేయు డం ఇక్కడి విద్యా విధానంలోని ప్రత్యేకత. స్టడీ అబ్రాడ్‌లో అమెరికా తర్వాత భారతీయుులకు బెస్ట్ డెస్టినేషన్‌గా నిలుస్తున్న ‘ఆస్ట్రేలియా ఎడ్యుకేషన్’ పై ఫోకస్.. కోర్సులు: ముఖ్యంగా ఏవియేషన్, హోటల్ మేనేజ్మెంట్ అండ్ హాస్పిటాలిటీ, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఫిజియోథెరపీ, మెడిసిన్ అండ్ లైఫ్ సెన్సైస్‌లో ఎన్విరాన్మెంటల్ హెల్త్, ఫోరెన్సిక్ అండ్ ఎనలిటికల్ సైన్స్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్ కోర్సులు; ఐటీ అండ్ కంప్యూటర్ సైన్స్, స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్, మెడికల్ రేడియాలజీ కోర్సులు మంచి ఆదరణ పొందుతున్నాయి. కోర్సులు... అర్హతలు: స్కూల్స్: ఆస్ట్రేలియాలో స్కూల్ విద్యకు స్కూళ్లను బట్టి వేర్వేరు అర్హతలు ఉన్నాయి. అకడమిక్ ప్రతిభ, సామర్థ్యం ఆధారంగా ఎంపిక ఉంటుంది. అండర్గ్రాడ్యుయేట్ కోర్సులు: ఆస్ట్రేలియా సీనియర్ సెకండరీ సర్టిఫికెట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (మనదేశంలో 10+2/ఇంటర్మీడియెట్) ఉత్తీర్ణత. కొన్నిటికి ప్రత్యేక అర్హతలు తప్పనిసరి. పీజీ కోర్సులు: ఈ కోర్సుల్లో చేరాలంటే.. సంబంధిత డిగ్రీ లేదా పని అనుభవం, పరిశోధన సామర్థ్యం ఉండాలి. ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెక్టార్లో సర్టిఫికెట్, డిప్లొమా అండ్ అడ్వాన్స్డ్ డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉంటారుు. ఈ కోర్సులకు నిర్దేశించిన అర్హతలతోపాటు పని అనుభవం ఉండాలి. హయ్యర్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా, అసోసియేట్ డిగ్రీ, అడ్వాన్స్డ్ డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్, గ్రాడ్యుయేట్ డిప్లొమా, మాస్టర్స్ బై కోర్సు వర్క్ ఉంటారుు. పోస్ట్‌గ్రాడ్యుయేట్ రీసెర్చ్‌లో భాగంగా.. మాస్టర్స్ బై రీసెర్చ్ డిగ్రీ, డాక్టోరల్ డిగ్రీ ఉంటాయి. వీటితోపాటు ఆయా కోర్సులకు అనుగుణంగా జీఆర్ఈ/టోఫెల్/ జీమ్యాట్/ఐఈఎల్టీఎస్ స్కోర్లు తప్పనిసరి. ప్రవేశం: ఆస్ట్రేలియాలో ఏటా రెండుసార్లు ఫిబ్రవరి/మార్చి, సెప్టెంబర్/నవంబర్లలో అకడెమిక్ సెషన్ మొదలవుతుంది. ప్రవేశించదలచుకున్న సెషన్‌కు కనీసం ఏడాది ముందుగా అభ్యర్థులు సన్నాహాలు ప్రారంభించాలి. అడ్మిషన్ ఖరారైన వెంటనే వీసా దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాలి. ఇందుకోసం సంబంధిత ఇన్స్టిట్యూట్ జారీచేసే లెటర్ ఆఫ్ ఆఫర్ లేదా ఎలక్ట్రానిక్ ఎన్రోల్మెంట్ లెటర్ ఆధారంగా ఆస్ట్రేలియా ఎంబసీను సంప్రదించాలి. దరఖాస్తు: విద్యార్థులు నేరుగా ఇన్స్టిట్యూట్ల వెబ్సైట్ల నుంచి దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకుని పూర్తిచేసి సంబంధిత చిరునామాకు పంపాలి. సాధారణంగా హైస్కూల్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ వరకు సర్టిఫికెట్లు... రిఫరెన్స్ లెటర్, పర్సనల్ లెటర్‌ను జత చేయాలి. ఇప్పటికే ఉద్యోగం చేస్తూ స్టడీ లీవ్‌ను వినియోగించుకునేవారు తప్పనిసరిగా తమ యజమానిచ్చే రిఫరెన్స్ లెటర్‌ను చూపించాలి. పీహెచ్డీ, లేదా మాస్టర్స్ డిగ్రీ బై రీసెర్చ్‌కి దరఖాస్తు చేసే అభ్యర్థులు.. తాము రీసెర్చ్ చేయదలచిన అంశానికి గల ప్రాముఖ్యత, తమకున్న ఆసక్తి తదితర వివరాలతో రీసెర్చ్ ప్రపోజల్‌ను మూడు నుంచి ఐదు పేజీలలో రాసి దరఖాస్తుకు జత చేయాలి. వీసా: ఆస్ట్రేలియాలో మూణ్నెల్ల కంటే ఎక్కువ కాలవ్యవధి ఉన్న కోర్సులనభ్యసించాలనుకునేవారు విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీటిని ఆ దేశ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అండ్ సిటిజన్‌షిప్(డీఐఏసీ) మంజూరు చేస్తుంది. విద్యార్థి చేరిన కోర్సు... కామన్వెల్త్ రిజిస్టర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ కోర్సెస్ ఫర్ ఓవర్సీస్ స్టూడెంట్స్(సీఆర్ఐసీఓఎస్)లో నమోదై ఉంటేనే వీసా దరఖాస్తును పరిగణనలోకి తీసుకుంటారు. వీసా కోసం ఐఈఎల్‌టీఎస్‌కు ప్రత్యామ్నాయాలుగా టోఫెల్, పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ స్కోర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రముఖ యూనివర్సిటీలు: ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌ల్యాండ్ ఉపయోగకరమైన వెబ్సైట్లు www.studyinaustralia.gov.au www.aei.gov.au www.immi.gov.au www.studiesinaustralia.com www.india.embassy.gov.au -
పరిశోధన, బోధన.. ‘నెట్’తో సాకారం
పరిశోధన, బోధన.. ‘నెట్’తో సాకారం సబ్జెక్టులో పరిశోధన చేయాలనే తపన... విశ్వ విద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అధ్యాపక వృత్తిలో కెరీర్‌ను కొనసాగించాలనుకునే లక్ష్యం ఉన్న వారికి సాధారణ విద్యార్హతలతో పాటు... నిర్దేశించిన అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత తప్పనిసరి. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ -నెట్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది. నెట్ విధానం, సన్నద్ధమయ్యేందుకు ప్రణాళిక వ్యూహాల పూర్తి వివరాలు. 95 సబ్జెక్టులకు నెట్: ఏటా జూన్, డిసెంబర్ నెలల్లో రెండుసార్లు నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష -నెట్‌కు యూజీసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈసారి పొలిటికల్ సైన్స, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పాపులేన్ స్టడీస్, జాగ్రఫీ, కంప్యూటర్ సైన్స అండ్ అప్లికేషన్, ఎలక్ట్రానిక్ సెన్సైస్ వంటి 95 సబ్జెక్టులలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నెట్‌ను నిర్వహిస్తుంది. ఇందులో అర్హత సాధించి అగ్రస్థానంలో నిలిచిన వారికి పరిశోధన దిశగా ప్రోత్సహించేందుకు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్ఎఫ్)ను ప్రదానం చేస్తారు. జేఆర్ఎఫ్ కటాఫ్‌కు దిగువన ఉన్నవారు యూజీసీ నిబంధంన ప్రకారం లెక్చరర్‌షిప్‌నకు అర్హులవుతారు. మన రాష్ట్రం విషయానికి వస్తే... ఎక్కువ మంది విద్యార్థులు తెలుగుతో పాటు చరిత్ర, అర్థశాస్త్రం, తత్వశాస్త్రం, సోషియాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులలో నెట్‌కు హాజరవుతున్నారు. డిస్క్రిప్టివ్ నుంచి ఆబ్జెక్టివ్‌కు: నెట్‌కు సంబంధించి మూడు పేపర్లు ఉంటాయి. రాత పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. అంతకుముందు డిస్క్రిప్టివ్ రూపంలో ఉన్న పేపర్-2,3లను 2012 జూన్ నుంచి ఆబ్జెక్టివ్ పద్ధతిలోకి మార్చారు. మూడు పేపర్లకు ఒకే రోజు పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం పేపర్-1,2లు, మధ్యాహ్నం పేపర్-3 ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమంలో ఉంటుంది. సెషన్ పేపర్ మార్కులు {పశ్నలు సమయం మొదటి 1 100 60 ఉ.9.30-10.45 మొదటి 2 100 50 ఉ.10.46-12.00 రెండో 3 150 75 మ.1.30-4.00 పేపర్-1 పేపర్-1 అన్ని సబ్జెక్ట్‌ల విద్యార్థులకు ఒకేలా ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. ఇందులోని మొత్తం 60 ప్రశ్నల్లో 50 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాయాలి. 50 కంటే ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన పక్షంలో మొదట గుర్తించిన 50 ప్రశ్నలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని మార్కులను కేటాయిస్తారు. పేపర్-1లో బోధనా సామర్థ్యం (టీచింగ్ ఆప్టిట్యూడ్), ఉన్నత విద్యా వ్యవస్థ, పర్యావరణం, భావ ప్రసారం (కమ్యూనికేషన్), లాజికల్ రీజనింగ్ (తార్కిక సామర్థ్యం), విశ్లేషణ శక్తి, గ్రహణశక్తి (కాంప్రెహెన్షన్) నైపుణ్యాలు, డేటా ఇంటర్ ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీపై సమకాలీన అంశాల మీద ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. సిలబస్ పరిధి విస్తృతంగా ఉంటుంది. పేపర్-2, 3: అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు ఆధారంగానే ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. ఈ ప్రశ్నపత్రం కూడా అభ్యర్థి ఆప్షన్ సబ్జెక్టు ఆధారంగానే ఉంటుంది. సబ్జెక్ట్‌పై లోతైన అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలను అడిగే అవకాశం ఉంది. పేపర్ 2, 3లలో అడిగే ప్రశ్నల స్వభావం క్లిష్టంగా ఉంటుంది. వాటి పరిధి ఎక్కువ. కాబట్టి అభ్యర్థులు అకడమిక్ పరంగా లోతైన కోణంలో సాధన సాగించాలి. ఒక్కో అధ్యాయాన్ని పూర్తి చేస్తున్నప్పుడే సంబంధిత అంశంపై మోడల్ పేపర్లను సాధన చేస్తే ఉపయుక్తంగా ఉంటుంది. ఇలా మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేస్తే అవగాహనతోపాటు వేగంగా సమాధానాన్ని గుర్తించే నైపుణ్యం అలవడుతుంది. అవగాహన అవసరం: సిలబస్ పరిధి ఎక్కువ అందువల్ల ముందుగా సిలబస్‌పై ఒక అవగాహనకు రావడం మంచిది. ఆబ్జెక్టివ్ విధానం కావడం వల్ల అన్ని అంశాల నుంచి ప్రశ్నలు రావచ్చు. ఈ నేపథ్యంలో ఏ అంశాన్నీ విడిచి పెట్టకుండా విస్తృత స్థాయిలో ప్రిపరేషన్ సాగించాలి. ప్రిపరేషన్‌ను విశ్లేషణాత్మకంగా సాగిస్తేనే ఎంతటి కష్టమైన ప్రశ్నకైనా సమాధానం గుర్తించవచ్చు. ప్రిపరేషన్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్రమాన్ని అనుసరించాలి. అర్హత మార్కులు: ప్రతి పేపర్లో నిర్దేశించిన అర్హత మార్కులు ఇలా ఉన్నాయి. కేటగిరీ పేపర్-1 పేపర్-2 పేపర్-3 జనరల్ 40 40 75 ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ 35 35 60 తుది జాబితా: అభ్యర్థులు నిర్దేశించిన అర్హత మార్కులు సాధించినప్పటికీ మోడరేషన్ కమిటీ నిర్ధారించే కటాఫ్ మార్కుల ఆధారంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జె.ఆర్.ఎఫ్), లెక్చరర్షిప్ను ప్రదానం చేస్తారు. అందుబాటులో ఉన్న జేఆర్ఎఫ్ల సంఖ్యను, అభ్యర్థుల ఉత్తీర్ణతను పరిగణనలోకి తీసుకుని తుది కటాఫ్‌ను నిర్ణయిస్తారు. యూజీసీ రెండు రకాల మెరిట్ లిస్ట్‌లను రూపొందిస్తుంది. మొదట్ లిస్ట్‌లో లెక్చరర్‌షిప్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ రెంటికీ అర్హత సాధించిన అభ్యర్థులకు చోటు కల్పిస్తారు. రెండో లిస్ట్‌లో కేవలం లెక్చరర్‌షిప్‌కు అర్హత సాధించిన వారి పేర్లు మాత్రమే ఉంటాయి. నెట్లో ఎంపికైతే: నెట్లో క్వాలిఫై కావడం ద్వారా దేశంలోని అన్ని డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలలో తత్సమాన ఇన్స్టిట్యూట్లలో లెక్చరర్,అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. డిగ్రీ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే నెట్ క్వాలిఫై అయి ఉండాలి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌నకు ఎంపికైన అభ్యర్థులకు ఐదేళ్ల పాటు ఫెలోషిప్ లభిస్తుంది. ఐఐటి, ఐఐఎస్సీ వంటి ఇన్స్టిట్యూట్లలో పరిశోధన కోర్సుల్లో చేరడానికి నెట్ లేదా జేఆర్‌ఎఫ్‌గల వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. నోటిఫికేషన్ సమాచారం: అర్హత: జనరల్ అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్‌లో 55 శాతం, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వారికి 50 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమానం. మాస్టర్స్ డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.వయసు: జూనియర్ రీసెర్చ్ ఎపెలోషిప్నకు జూన్ 1, 2014 నాటికి 28 ఏళ్లకు మించరాదు. రిజర్వ్డ్ అభ్యర్థులకు యూజీసీ నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది. లెక్చరర్ షిప్‌నకు మాత్రం ఎలాంటి వయోపరిమితి లేదు. రిజిస్ట్రేషన్ ఫీజు: జనరల్: రూ.450; ఓబీసీ:రూ.225; ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ: రూ.110 బ్యాంక్‌లో చలాన్ రూపంలో మాత్రమే తీయాలి. డి.డి, ఐపీఓ, మనీయార్డర్ రూపంలో చెల్లుబాటు కాదు. దరఖాస్తువిధానం: www.ugcnetonline.in లేదా www.ugc.ac.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ హార్డ్ కాపీని ప్రింట్అవుట్ తీసుకోవాలి. దీంతోపాటు బ్యాంక్ చలాన్, సంబంధిత సర్టిఫికెట్లను జతచేస్తూ నిర్దేశించిన చిరునామాకు పంపాలి. ముఖ్యతేదీలు: ఆన్లైన్ దరఖాస్తుకు, చలాన్ తీసుకునేందుకు చివరితేదీ: మే, 05, 2014. చలాన్ (ఎస్.బి.ఐలో మాత్రమే) ద్వారా ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: మే 07, 2014 దరఖాస్తు, అటెండెన్స్ రశీదు, అడ్మిట్‌కార్డుల ప్రింట్అవుట్ తీసుకోవడానికి చివరి తేదీ: మే 10, 2014 కోఆర్డినేటింగ్ వర్సిటీలో ప్రింట్అవుట్ ధరఖాస్తు సంబంధిత సర్టిఫికెట్ల స్వీకరణకు చివరి తేదీ: మే 15,2014 పరీక్ష తేదీ: జూన్ 29 2014 వెబ్సైట్: www.ugc.ac.in రాష్ట్రంలో కోఆర్డినేటింగ్ యూనివర్సిటీలివే: ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం వెబ్సైట్: www.andhrauniversity.edu.in నాగార్జున యూనివర్సిటీ -గుంటూరు వెబ్సైట్: www.nagarjunauniversity.ac.in ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్ వెబ్సైట్: www.osmania.ac.in వెంకటేశ్వర యూనివర్సిటీ- తిరుపతి వెబ్సైట్: www.svuniversity.in ప్రతీ అంశమూ ప్రామాణికమే... యూజీసీ నెట్ పరీక్షకు సన్నద్ధమయ్యేవారు ప్రతీ అంశాన్నీ ప్రామాణికంగానే పరిగణించాలి. అభ్యర్థులు పేపర్-1 నిర్లక్ష్యం చేయడం సరికాదు. పేపర్-1లో పాసైతేనే మిగతా రెండు పేపర్లను మూల్యాంకనం చేస్తారన్న విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఆప్షనల్ సబ్జెక్ట్‌పై పట్టు ఉన్న వారు పేపర్-1పై శ్రద్ధ చూపాలి. పేపర్-1లో ఎక్కువ అంశాలు ఉన్నాయి. ఇందుకోసం యూజీసీ-నెట్ టాటామెక్ గ్రెహిల్స్, యూజీసీ-నె ట్ ఉప్కార్ పబ్లికేషన్స్ పుస్తకాలను చదివితే ప్రయోజనకరంగా ఉంటుంది. పేపర్-2,3కు... డిగ్రీ, పీజీ సబ్జెక్ట్ పుస్తకాలను చదవాలి. కనీసం వారానికి ఒకసారి మోడల్ పేపర్లను సాధన చేయాలి. ముఖ్యంగా పేపర్-2,పేపర్-3లు ఆప్షన్ సబ్జెక్టులు కాబట్టి అందులో మెరుగైన స్కోర్ సాధించడానికి ఆస్కారముంటుంది. కానీ పేపర్-1 మాత్రం కొంచెం క్లిష్టంగానే ఉంటుంది. సమకాలీన అంశాలతోపాటు, గ్రూప్- 1, 2 స్థాయిలో అడిగే లాజికల్ రీజనింగ్, కాంప్రహెన్షివ్, జి.కె,సైన్స్ అండ్ టెక్నాలజీ విషయాలపై ప్రశ్నలను అడుగుతున్నారు. వీటికి ప్రామాణిక పుస్తకాలను చదివితే ప్రయోజనముంటుంది. ఆయా సబ్జెక్ట్‌ల సిలబస్ వెబ్సైట్లలో దొరుకుతుంది. మన రాష్ట్రం నుంచి ఎక్కువ మంది తెలుగు సబ్జెక్టునే ఎంచుకుంటారు. ఇలాంటి వారంతా ఛందస్సు, అలంకారాలు, బాల,ప్రౌఢ వ్యాకరణం, ధ్వని, రసం, అర్ఘ సంకోచం, అర్థ వ్యాకోచం, జానపద సాహిత్యం, శాసనాలు, ఆధునిక సాహిత్యం, దళిత-స్త్రీ వాద సాహిత్యం అధ్యయనం చేయాలి. ముఖ్యంగా భాషపై పట్టు సాధించడానికి కనీసం 5 కావ్యాల వ్యాఖ్యానాలు చదివితే చాలా వరకు లాభిస్తుంది. పాతపేపర్లను సాధన చేస్తే ఏ ప్రశ్న ఎలా అడుగుతున్నారన్న విషయం తెలుస్తుంది. ఒక ప్రశ్నకు ఇచ్చిన బహుళైచ్ఛిక సమాధానాల నుంచి మరో మూడు ప్రశ్నలను తయారు చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. పేపర్-1పై సెంట్రల్ యూనివర్సిటీలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. దీన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలి. -బి.భుజంగరెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు విభాగం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. డిసెంబర్ 2013 తెలుగు పేపర్- విశ్లేషణ 2013 డిసెంబర్లో జరిగిన పరీక్ష విధానం పరిశీలిస్తే ..పేపర్-1 నుంచి లోతైన పరిజ్ఞానంపై ప్రశ్నలను అడిగారు. ఉదాహరణకు... The first multilingual news agency of India was... Samachar B A.P.I. Hindusthan Samachar Samachar Bharathi Ans: C వివరణ: హిందూస్థాన్ సమాచార్ 1948లో ఏర్పాటయింది. దీని వ్యవస్థాపకుడు ఎస్.ఎస్ ఆప్టే. తెలుగు, బెంగాళీ, ఒడియా, అస్సామీ, మలయాళం, ఉర్దూ, పంజాబీ, గుజరాత్, హిందీ, మరాఠీ మొత్తం పది భాషలతో ఈ న్యూస్ ఏజెన్సీ ఆవిర్భవించింది. 1975లో ఎమర్జెన్సీ అనంతరం ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, యునెటైడ్ న్యూస్ ఆఫ్ ఇండియా, భారతీయ సమాచార్‌లో హిందూస్థాన్ సమాచార్ ఏజెన్సీ విలీనమైంది. ఇక తెలుగు పరీక్ష పేపర్లను పరిశీలిస్తే... పేపర్-2లో కింది వాటిలో సరైన జతను గుర్తించండి? ఎ) శ్రీనాథుడు- వసుచరిత్ర బి) రామరాజ భూషణుడు-శృంగార నైషధం సి) అల్లసాని పెద్దన- మనుచరిత్ర డి) తెనాలి రామకృష్ణుడు- ఆముక్తమాల్యద జవాబు: సి వివరణ: వసుచరిత్రను రామరాజభూషణుడు రచించాడు. ఈయననే భట్టుమూర్తి అని కూడా అంటారు. శృంగార నైషధాన్ని శ్రీనాథుడు, ఆముక్తమాల్యదను శ్రీకృష్ణదేవరాయలు రాశారు. తెనాలి రామకృష్ణుడు పాండురంగమహాత్మ్యం, ఉద్భటారాధ్య చరిత్ర, ఘటికాచల మహాత్మ్యంను రచించాడు. ఈ ప్రశ్నను బట్టి కవులు, రచనలపై పట్టు సాధించాల్సి ఉందని అర్థమవుతోంది. పేపర్-3 నుంచి మరో ప్రశ్న.. నాగుల చవితి ఎప్పుడు వస్తుంది? ఎ) చైత్ర శుద్ధ చవితి బి) వైశాఖ శుద్ధ చవితి సి) మార్గశిర బహుళ చవితి డి) కార్తీక శుద్ధ చవితి జవాబు: ఎ వివరణ: ఈ ప్రశ్న చాలాసులభంగానే అనిపిస్తుంది. కానీ చాలామంది సరైన సమాధానం గుర్తించలేరు. తెలుగు పండగలు ఎప్పుడు వస్తాయో తెలుసుకోవాలి. అలాగే తెలుగు నెలలు, రుతువులు, నక్షత్రాలు, తిథులు, సంప్రదాయాలు కూడా తెలిసి ఉండాలని స్పష్టమవుతోంది. మొత్తంగా పేపర్-2,3లను పరిశీలిస్తే ప్రధానంగా నాలుగు విభాగాల నుంచి మాత్రమే ప్రశ్నలు వచ్చాయి. 2013 డిసెంబర్ నాటి తెలుగు పేపర్లో ఏయే అంశాల నుంచి ఎన్ని ప్రశ్నలను అడిగారో పరిశీలిస్తే... ప్రశ్నరకం పేపర్-2 పేపర్-3 బహుళైచ్ఛిక 10 20 ఒకే వర్గానికి చెందిన రెండు సమాధానాలు 10 18 నిర్దేశం-హేతువు 05 12 కాలక్రమాల వరుస 10 11 జతపరచుట 10 14 అపరిచిత పద్యం 05 - మొత్తం 50 75 -
ఇంజనీరింగ్ ఎంట్రెన్స్‌లు..
జేఈఈ మెయిన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో బీఈ/బీటెక్/బీఆర్క్/బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే జేఈఈ మెయిన్‌తోపాటు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలోనూ ర్యాంక్ సాధించాలి. అర్హత: 2012, 2013లో కనీసం 45 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం) ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణులు మాత్రమే అర్హులు. 2014 మార్చిలో పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారూ అర్హులే. వయోపరిమితి: అక్టోబర్ 1, 1989 తర్వాత జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, శారీరక వికలాంగులకు వయో పరిమితిలో ఐదేళ్లు సడలింపు ఉంటుంది. ప్రవేశం కల్పిస్తున్న సంస్థలు: 30 ఎన్ఐటీలు, 5 కేంద్ర ప్రభుత్వ సంస్థలతోపాటు కొన్ని రాష్ట్రాలు, కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు కూడా మెయిన్ ర్యాంకింగ్‌ను పరిగణనలోకి తీసుకొంటున్నాయి. ఇవేకాకుండా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (తిరువనంతపురం) జేఈఈ మెయిన్ ర్యాంక్ ఆధారంగా యూజీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. పరీక్ష విధానం: పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది. బీఈ/బీటెక్ కోర్సుల కోసం పేపర్-1 రాయాలి. ఇది ఆన్లైన్/పెన్-పేపర్ విధానాల్లో ఉంటుంది. బీఆర్క్/బీప్లానింగ్ కోర్సుల కోసం పేపర్-2 రాయాలి. ఇది కేవలం పేపర్- పెన్ ఆధారిత పరీక్ష. పేపర్-1లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలపై మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలుంటాయి. మూడు విభాగాలపై సమాన స్థాయిలో ప్రశ్నలుంటాయి. పేపర్-2లో మ్యాథమెటిక్స్, ఆప్టిట్యూడ్ టెస్ట్, డ్రాయింగ్ టెస్ట్ ఉంటాయి. ఒక్కో పేపర్ పరీక్ష కాల వ్యవధి మూడు గంటలు. ప్రవేశం: ర్యాంక్ ఆధారంగా. ఈ క్రమంలో జేఈఈ మెయిన్ ర్యాంక్‌కు 60 శాతం వెయిటేజ్, ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజ్ ఇచ్చి మెరిట్ లిస్ట్ తయారుచేస్తారు. ఆన్లైన్ పరీక్ష తేదీ: ఏప్రిల్ 9, 11, 12, 19 వెబ్సైట్: http://jeemain.nic.in జేఈఈ అడ్వాన్స్డ్ 16 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలతోపాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ - ధన్బాద్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశించాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించాలి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించాలంటే జేఈఈ మెయిన్ పేపర్-1లో మొదటి 1,50,000 మంది ర్యాంకర్లలో చోటు దక్కించుకోవాలి. ప్రవేశం పొందాలంటే జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్‌తోపాటు ఆయా రాష్ట్రాల ఇంటర్ బోర్డ్ పరీక్షల్లో టాప్-20 పర్సంటైల్‌లో నిలవాలి. వయో పరిమితి: అక్టోబర్ 1, 1989 తర్వాత జన్మించి ఉండాలి. పరీక్ష విధానం: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ వ్యవధి మూడు గంటలు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలపై మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలుంటాయి. అభ్యర్థి విషయావగాహన శక్తిని, తార్కిక, విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల ప్రారంభం: మే 4 నుంచి మే 9 వరకు పరీక్ష తేదీ: మే 25, 2014, వెబ్సైట్: www.jeeadv.iitd.ac.in ఎంసెట్ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ/ప్రైవేట్ కళాశాలల్లో బీఈ/బీటెక్, ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీఎన్‌వైఎస్, బీఎస్సీ (అగ్రికల్చర్), బీవీఎస్సీ, బీఎస్సీ (హార్టికల్చర్), బీఫార్మసీ ఫార్మ్ డీ వంటి కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్ నిర్వహిస్తారు. అర్హత: ఇంజనీరింగ్ విభాగానికి 45 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం) మార్కులతో ఇంటర్ ఎంపీసీ, మెడికల్ విభాగానికి 50 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ, ఇంగ్లిష్ ఉత్తీర్ణత. పరీక్ష: ఇంజనీరింగ్ విభాగంలో పరీక్ష రాసేవారికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలపై 160 ప్రశ్నలుంటాయి. మ్యాథ్స్ నుంచి 80, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 40 ప్రశ్నల చొప్పున అడుగుతారు. మెడికల్/అగ్రికల్చర్ విభాగంలో.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలపై ప్రశ్నలుంటాయి. ప్రతి భాగంలో 40 ప్రశ్నల చొప్పున మొత్తం ప్రశ్నలు 160. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. వ్యవధి మూడు గంటలు. అపరాధ రుసుంతో ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 18, 2014 పరీక్ష తేదీ: మే 22, 2014, వెబ్సైట్: www.apeamcet.org సీవోఎంఈడీకే కర్ణాటకలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో బీఈ కోర్సుల్లో ప్రవేశానికి కన్సార్టియం ఆఫ్ మెడికల్, ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక (సీవోఎంఈడీకే) యూజీఈటీ నిర్వహిస్తోంది. అర్హత: 45 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత. పరీక్ష: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లపై మొత్తం 180 ప్రశ్నలు ఉంటాయి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 12, 2014 పరీక్ష తేదీ: మే 11, 2014, వెబ్సైట్: www.comedk.org బిట్‌శాట్ పిలానీ, హైదరాబాద్, గోవాలో ఉన్న బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ క్యాంపస్‌ల్లో ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశానికి బిట్‌శాట్ నిర్వహిస్తారు. అర్హతలు: 75 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత. ఒక్కో సబ్జెక్టులో కనీసం 60 శాతం మార్కులుండాలి. పరీక్ష: మూడు గంటల వ్యవధిలో కంప్యూటర్ బేస్డ్ విధానంలో జరిగే పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ, లాజికల్ రీజనింగ్, మ్యాథమెటిక్స్‌లపై మొత్తం 150 ప్రశ్నలుంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులుంటాయి. ఎంపిక: మెరిట్ ఆధారంగా.. పరీక్ష తేదీలు: మే 14 నుంచి మే 29 వరకు వెబ్సైట్: www.bitsadmission.com ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కాంచీపురంలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బీటెక్ కోర్సులో ప్రవేశానికి ప్రతిఏటా ప్రవేశ పరీక్ష (ఎస్‌ఆర్‌ఎంఈఈ)ను నిర్వహిస్తోంది. అర్హతలు: 70 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత. ఎంపిక: ఎస్‌ఆర్‌ఎంఈఈ ర్యాంక్ ఆధారంగా. పేపర్-పెన్సిల్ పరీక్ష తేదీ: ఏప్రిల్ 27, 2014 కంప్యూటర్ బేస్డ్ పరీక్ష: ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 22 వరకు వెబ్సైట్: www.srmuniv.ac.in వీఐటీ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ విశ్వవిద్యాలయ హోదా పొందిన వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి వీఐటీఈఈఈను నిర్వహిస్తోంది. అర్హతలు: 60 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత. పరీక్ష: కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో 120 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. నెగెటివ్ మార్కులు లేవు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ఎంపిక: వీఐటీఈఈఈ ర్యాంక్ ఆధారంగా. పరీక్ష తేదీలు: ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 20 వరకు వెబ్సైట్: www.vit.ac.in నాటా దేశంలోని ప్రముఖ ఆర్కిటెక్చర్ కళాశాలల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) కోర్సుల్లో ప్రవేశాలకు నాటా (నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్) రాయాలి. దీన్ని న్యూఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రతి ఏటా నిర్వహిస్తోంది. అర్హత: మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్‌గా 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత. పరీక్ష విధానం: పరీక్ష రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం పేపర్ బేస్డ్ డ్రాయింగ్ టెస్ట్ కాగా, రెండో భాగం ఆన్లైన్ టెస్ట్. పరీక్షలో అభ్యర్థి డ్రాయింగ్ స్కిల్స్, పరిశీలన దృక్పథం, సెన్స్ ఆఫ్ ప్రొపర్షన్, యాస్థటిక్ సెన్సివిటీ, క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీని పరీక్షిస్తారు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 31. పరీక్ష తేదీలు: మొదటి దశ మార్చి 14 - మే 25 వరకు, రెండో దశ జూన్ 1 - ఆగస్టు 31 వరకు. వెబ్సైట్: www.nata.in -
వైద్య విద్య ప్రవేశ పరీక్షలు
ఏఐపీఎంటీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత వైద్య, దంత కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి సీబీఎస్ఈ నిర్వహించే పరీక్ష.. ఆలిండియా ప్రీ-మెడికల్/ప్రీ డెంటల్ టెస్ట్. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న వైద్య, దంత కళాశాలల్లో 15 శాతం సీట్లను భర్తీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్ సెంట్రల్ పూల్‌లో చేరనందువల్ల ఈ రాష్ట్రాల విద్యార్థులు అర్హులు కాదు. అయితే ఈ ఏడాది నుంచి ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కళాశాల - పుణె, బెనారస్ హిందూ యూనివర్సిటీ ఏఐపీఎంటీ ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నందువల్ల మన రాష్ట్ర విద్యార్థులు పరీక్ష రాయొచ్చు. ప్రవేశం ఈ రెండింటికి మాత్రమే పరిమితం. అర్హతలు: 50 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత, వయోపరిమితి: డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. 25 ఏళ్లు మించరాదు. పరీక్ష విధానం: మూడు గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో మొత్తం 180 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలన్నీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలజీ)ల నుంచి అడుగుతారు. పరీక్ష తేదీ: మే 4, 2014, వెబ్సైట్: www.aipmt.nic.in సీఎంసీ-వెల్లూర్ దేశంలోనే మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ.. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్(సీఎంసీ)-వెల్లూర్. ఎంబీబీఎస్‌లో ప్రవేశానికి ప్రతి ఏటా ప్రవేశపరీక్ష నిర్వహిస్తోంది. అర్హత: 60 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత. వయోపరిమితి: డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. ఎంపిక: మొదటి దశలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. రెండు గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల నుంచి ప్రశ్నలడుగుతారు. ప్రతి సబ్జెక్టు నుంచి 60 ప్రశ్నలుంటాయి. దీంతోపాటు జనరల్ ఎబిలిటీ టెస్ట్‌ను కూడా నిర్వహిస్తారు. ఇందులో సాధించిన ర్యాంకు ఆధారంగా ఇంటర్వ్యూకు పిలుస్తారు. పరీక్ష తేదీ: మే 23, 2014 వెబ్సైట్: www.cmch-vellore.edu శ్రీరామచంద్ర యూనివర్సిటీ చెన్నైలో ఉన్న శ్రీరామచంద్ర యూనివర్సిటీ ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రతి ఏటా ప్రవేశపరీక్షను నిర్వహిస్తోంది. కోర్సులు: ఎంబీబీఎస్, బీడీఎస్ అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత. వయోపరిమితి: నిర్దేశిత తేదీనాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. ఎంపిక: ప్రవేశపరీక్ష ద్వారా, దరఖాస్తులకు చివరి తేదీ: మే 15, 2014 ప్రవేశపరీక్ష: జూన్ 1, 2014 వెబ్సైట్: www.sriramachandra.edu.in సీవోఎంఈడీకే సీవోఎంఈడీకే నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత. పరీక్ష విధానం: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్‌లపై 240 ప్రశ్నలు అడుగుతారు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 12, 2014 పరీక్ష తేదీ: మే 11, 2014 వెబ్సైట్: www.comedk.org జిప్మర్ - పుదుచ్చేరి మన రాష్ట్రం నుంచి ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యే పరీక్షల్లో ఒకటి.. జిప్మర్ ఎంబీబీఎస్ ఎంట్రెన్స్ ఎగ్జామ్. పుదుచ్చేరిలో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రతి ఏటా ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలకు పరీక్ష నిర్వహిస్తోంది. వివరాలు.. అర్హత: 50 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం) మార్కులతో ఇంటర్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/బయోటెక్నాలజీ, ఇంగ్లిష్) ఉత్తీర్ణత. వయోపరిమితి: 17 ఏళ్లు నిండి ఉండాలి. పరీక్ష విధానం: రెండున్నర గంటల వ్యవధిలో ఆన్లైన్లో మల్టిపుల్ చాయిస్ విధానంలో నిర్వహించే పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు. నెగెటివ్ మార్కులు లేవు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మే 2, 2014 పరీక్ష తేదీ: జూన్ 8, 2014, వెబ్సైట్: http://jipmer.edu.in డీవై పాటిల్ మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ పుణెలో ఉన్న డాక్టర్ డీవై పాటిల్ విద్యాపీఠ్ ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా ప్రవేశపరీక్షను నిర్వహిస్తోంది. వివరాలు.. అర్హత: 50 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం) ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత. ఎంపిక: ప్రవేశపరీక్ష ద్వారా. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలుంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు. దరఖాస్తు విధానం: దరఖాస్తును వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ: మే 10, 2014 పరీక్ష తేదీ: మే 24, 2014, వెబ్సైట్: www.dypatil.ac.in ఎంజీఐఎంఎస్- వార్ధా మహారాష్ట్రలో వార్ధాలో ఉన్న మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎంజీఐఎంఎస్) ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు ప్రతి ఏటా పరీక్షను నిర్వహిస్తోంది. అర్హత: మొదటి ప్రయత్నంలోనే 50 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత. వయోపరిమితి: నిర్దేశిత తేదీనాటికి 17 ఏళ్లు మించరాదు. ఎంపిక: ప్రవేశపరీక్ష ఆధారంగా.. పరీక్ష తేదీ: ఏప్రిల్ 20, 2014, వెబ్సైట్: www.mgims.ac.in ఆల్ ఇండియా ప్రీ వెటర్నరీ టెస్ట్ వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ప్రీ-వెటర్నరీ టెస్ట్(ఏఐపీవీటీ)ను నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వెటర్నరీ(జమ్మూ-కాశ్మీర్ మినహా) కళాశాలల్లో బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ (బీవీఎస్సీ - ఏహెచ్) కోర్సులో 15 శాతం సీట్లను భర్తీ చేస్తారు. అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ, ఇంగ్లిష్ ఉత్తీర్ణత. పరీక్ష విధానం: ఏఐపీవీటీని ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఫిజిక్స్ 60 ప్రశ్నలు, కెమి్రస్ట్రీ 60 ప్రశ్నలు, బయూలజీ (బోటనీ అండ్ జువాలజీ) 80 ప్రశ్నలు. వీటికి మూడు గంటల్లో సమాధానాలను గుర్తించాలి. ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కులు. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులుంటాయి. పరీక్ష తేదీ: మే 10, 2014. వివరాలకు: www.vci.nic.in మణిపాల్ మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ కర్ణాటకలోని మణిపాల్ యూనివర్సిటీ ఎంబీబీఎస్, బీడీఎస్, బీఫార్మ్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రతి ఏటా జాతీయస్థాయిలో ఆన్లైన్ పరీక్షను నిర్వహిస్తోంది. అర్హత: 55 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ. పరీక్ష విధానం: రెండున్నర గంటల వ్యవధిలో ఆన్లైన్లో నిర్వహించే పరీక్షలో 200 ప్రశ్నలుంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. ఫిజిక్స్ నుంచి 50 ప్రశ్నలు, కెమిస్ట్రీ నుంచి 50 ప్రశ్నలు, బయాలజీ నుంచి 70 ప్రశ్నలు, ఇంగ్లిష్ అండ్ జనరల్ ఆప్టిట్యూడ్‌ల నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. ఆన్లైన్ పరీక్ష తేదీలు: ఏప్రిల్ 14 - మే 15 వరకు వెబ్సైట్: www.manipal.edu అమృత విశ్వవిద్యాపీఠం కోయంబత్తూరు, కోచిల్లో క్యాంపస్‌లున్న అమృత విశ్వవిద్యాపీఠం ప్రతి ఏటా ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశానికి ప్రవేశపరీక్షను నిర్వహిస్తోంది. అర్హత: ఒకే ప్రయత్నంలో 60 శాతం మార్కులతో 10+2 బైపీసీ, ఇంగ్లిష్ ఉత్తీర్ణత. వయోపరిమితి: డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండి 23 ఏళ్లు మించరాదు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 25, 2014 ప్రవేశ పరీక్ష తేదీ: మే 18, 2014 వెబ్సైట్: www.amrita.edu -
లా ప్రవేశ పరీక్షలు
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) ఇంజనీరింగ్ కోర్సులకు జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్; మేనేజ్మెంట్ కోర్సులకు క్యాట్, ఈ కోవలోనే లా కోర్సులకు క్లాట్. దేశవ్యాప్తంగా 14 న్యాయ విద్యాలయాలు, యూనివర్సిటీల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్ఎల్బీ, బీఎస్సీ ఎల్ఎల్బీ, బీబీఏ ఎల్ఎల్బీ, బీకాం ఎల్ఎల్బీ, బీఎస్‌డబ్ల్యు ఎల్ఎల్బీ కోర్సుల్లో ప్రవేశానికి క్లాట్‌ను నిర్వహిస్తారు. అర్హతలు: 45 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం) మార్కులతో 10+2 ఉత్తీర్ణత. వయోపరిమితి: జూలై 1, 2014 నాటికి 20 ఏళ్ల లోపు వయసును కలిగి ఉండాలి. పరీక్ష: రెండు గంటల వ్యవధిలో జరిగే పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున మొత్తం మార్కులు 200. ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, లీగల్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్‌లపై ప్రశ్నలుంటాయి. ఎంపిక: క్లాట్ ర్యాంకు ఆధారంగా.. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 15, 2014, పరీక్ష తేదీ: మే 11, 2014 వెబ్సైట్: www.clat.ac.in ఆలిండియా లా ఎంట్రెన్స్ టెస్ట్ (ఏఐఎల్ఈటీ) ఐదేళ్ల బీఏ ఎల్ఎల్బీ (ఆనర్స్) కోర్సులో ప్రవేశానికి ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ ఏటా ఏఐఎల్ఈటీని నిర్వహిస్తోంది. సీట్లు: 80, అర్హతలు: 50 శాతం మార్కులతో 10+2 ఉత్తీర్ణత. వయోపరిమితి: జూలై 1, 2014 నాటికి 21 ఏళ్ల లోపు ఉండాలి. పరీక్ష: గంటన్నర వ్యవధిలో నిర్వహించే పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 150 మార్కులుంటాయి. ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ (కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్), లీగల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌ల నుంచి ప్రశ్నలడుగుతారు. ఎంపిక: ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా.. దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్‌లైన్ విధానాల్లో. దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 7, 2014 ప్రవేశపరీక్ష తేదీ: మే 4, 2014 వెబ్సైట్: http://nludelhi.ac.in లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ (ఎల్‌శాట్) -ఇండియా ఐదేళ్ల బీఏ ఎల్ఎల్బీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నిర్వహించే ఎల్‌శాట్ ప్రామాణిక పరీక్ష విధానాన్ని అమెరికాకు చెందిన లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్(ఎల్ఎస్ఏసీ) రూపొందించింది. అర్హత: 45 శాతం మార్కులతో 10+2 ఉత్తీర్ణత. పరీక్ష విధానం: పేపర్-పెన్సిల్ విధానంలో నిర్వహించే పరీక్షలో ఎనలిటికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ (1, 2), రీడింగ్ కాంప్రహెన్షన్‌లపై మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటల 20 నిమిషాలు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2014 పరీక్ష తేదీ: మే 18, 2014 వెబ్సైట్: www.pearsonvueindia.com/isatindia లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (లాసెట్) మన రాష్ట్రంలో ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సులో ప్రవేశానికి ఏటా లాసెట్‌ను నిర్వహిస్తారు. అర్హత: 45 శాతం మార్కులతో 10+2 ఉత్తీర్ణత. వయోపరిమితి: డిసెంబర్ 31 నాటికి 20 ఏళ్లు మించరాదు. పరీక్ష విధానం: గంటన్నర వ్యవధిలో నిర్వహించే పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున మొత్తం మార్కులు 120. పరీక్షలో మూడు భాగాలు ఉంటాయి. అవి.. జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ (30 ప్రశ్నలు), కరెంట్ అఫైర్స్ (30 ప్రశ్నలు), ఆప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా (60 ప్రశ్నలు). దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 26, 2014 పరీక్ష తేదీ: జూన్ 8, 2014, వెబ్సైట్: www.aplawcet.org -
ఇంటర్ తర్వాత.. ఉజ్వల భవితకు 24ఎంట్రెన్స్‌లు
విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన దశ ఇంటర్మీడియెట్. కెరీర్‌కు పునాది పడేది ఇక్కడే. దేశవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్‌ను పూర్తిచేసుకొని ఉన్నత విద్య దిశగా అడుగులేస్తున్నారు. మన రాష్ట్రంలో వీరి సంఖ్య దాదాపు 10 లక్షలు. ఇంటర్ ఉత్తీర్ణులైన వారికి లెక్కలేనన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్, మెడిసిన్, బీడీఎస్, బీఫార్మసీ, ఫార్మ్‌డీ, అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, ఫిషరీసైన్స్, బీఆర్క్, హోటల్ మేనేజ్మెంట్, లా వంటి కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే ప్రవేశపరీక్షలనే మైలురాళ్లను దాటాలి. ఈ నేపథ్యంలో ఇంటర్ తర్వాత.. ముఖ్యమైన ప్రవేశపరీక్షలను తెలుసుకుందాం. ఎయిమ్స్ - న్యూఢిల్లీ 1956లో పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా పేరుగాంచింది. దీనికి న్యూఢిల్లీలో ప్రధాన క్యాంపస్ ఉంది. ఈ ఏడాది నుంచి కొత్తగా మరో ఆరు ఎయిమ్స్‌ల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. అవి.. పాట్నా (బీహార్), భోపాల్ (మధ్యప్రదేశ్), జోధ్‌పూర్ (రాజస్థాన్), రిషికేశ్ (ఉత్తరాఖండ్), భువనేశ్వర్ (ఒడిశా), రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్). వీటిల్లో ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశానికి ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం సీట్లు: ఎయిమ్స్ - ఢిల్లీలో 72, మిగిలినవాటిలో ఒక్కోదానిలో 100 చొప్పున సీట్లుంటాయి. అర్హతలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం) మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత. వయోపరిమితి: డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. పరీక్ష విధానం: ఆన్లైన్/ఆఫ్‌లైన్ విధానాల్లో నిర్వహిస్తారు. మూడున్నర గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో అడుగుతారు. ఫిజిక్స్ (60 ప్రశ్నలు), కెమిస్ట్రీ (60 ప్రశ్నలు), బయాలజీ (బోటనీ అండ్ జువాలజీ 60 ప్రశ్నలు), జనరల్ నాలెడ్జ్ (20)లపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు. అదేవిధంగా తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులుంటాయి. ఒక్కో ప్రశ్నకు సరైన సమాధానాలకిచ్చే మార్కుల్లోంచి 1/3 మార్కులను తగ్గిస్తారు. ఎంపిక: ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంక్ ఆధారంగా.. మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రం: హైదరాబాద్ పరీక్ష తేదీ: జూన్ 1, 2014, వెబ్సైట్: www.aiims.edu -
తెయూలో నియామకాలపై విచారణ..?
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్: తెలంగాణ యూనివర్సిటీలో చే పట్టిన టీచింగ్, నాన్ టీచింగ్ నియామకాలకు సంబంధించి వీసీ అక్బర్‌అలీఖాన్‌పై వెల్లువెత్తిన ఆరోపణలపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తీవ్రంగా స్పందించారు. ఆరోపణలపై హైకోర్టు రిటైర్ట్ జడ్జి శ్రీరాములు నేతృత్వంలో కమిటీని నియమించినట్లు సమాచారం. ఈమేరకు శుక్రవారం సాయంత్రం ఉన్నత విద్యాశాఖను ఆదేశించినట్లు తెలిసింది. పాలకమండలి ఆమో దం లేకుండానే ఏకపక్షంగా అర్ధరాత్రి నియామకాలు జరపడంపై గవర్నర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఉన్నత విద్యాశాఖ నుంచి స్పష్టత తీసుకోకుండానే తెయూ వీసీ అక్బర్రాత్రికి రాత్రే చేపట్టిన నియామక ప్రక్రియ వి వాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. జరిగింది ఇదీ... డిచ్పల్లి మండల కేంద్రం శివారులో ఉన ్న తెలంగాణ యూనివర్సిటీలో 103 బోధన, 7 బోధనేతర సిబ్బంది నియామకాలకు 2012, మే 25న నోటిఫికేషన్ వెలువడింది. 2012 అక్టోబర్- నవంబర్ నెలలో హైదరాబాద్‌లోని వ్యవసాయ యూనివర్సిటీ గెస్ట్‌హౌస్‌లో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలను స్థానికంగా నిర్వహించకుండా హైదరాబాద్‌లో నిర్వహించడంపై వీసీపై అప్పట్లోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నియామకాల్లో అర్హతలు లేనివారికి కాల్‌లెటర్లు పంపించారని, రోస్టర్ పాయింట్లు పాటించలేదని, పలువురు అభ్యర్థుల వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయినా ఇవేమీ పట్టించుకోకుండా వీసీ మొండిగా నియామకాలను చేపట్టారు. ఇంటర్వ్యూల్లో అర్హత సాధించిన 54 మందికి 2013, ఫిబ్రవరి 1న నియామక పత్రాలు అందజేశారు. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ విషయమై అప్పటి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో నియామకాలను నిలిపివేశారు. వీటన్నింటిపై విద్యార్థిసంఘాలు, అకడ మిక్ కన్సల్టెంట్లు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మిన్నీ మాథ్యూతో పాటు ఉన్నత విద్యామండలి అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. అనంతరం కోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదులపై స్పందించిన ప్రభుత్వం నియామకాలను నిలిపివేస్తూ, ఆరోపణలపై ద్విసభ్య విచారణ కమిటీని నియమించింది. ఆంధ్రా యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ప్రసాద్‌రావు, కాకతీయ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భాస్కర్‌రావును కమిటీ సభ్యులుగా నియమించింది. ఈ ద్విసభ్య కమిటీ విచారణ జరిపి నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు నివేదిక అందజేసినట్లు సమాచారం. అదే సమయంలో కోర్టు సైతం నియామక ప్రక్రియను నిలిపివేయాలని 2013, మార్చి13న స్టే ఇచ్చింది. దీంతో ఈ ఏడాది జనవరి 3న హైకోర్టు స్టే ఎత్తివేసింది. ఈ సమాచారం సాయంత్రం వర్సిటీ అధికారులకు అందింది. స్టే తొలగింపు సమాచారం అందిన వెంటనే వీసీ అక్బర్ అలీఖాన్, రిజిస్ట్రార్ లింబాద్రిలు హుటాహుటిన అదేరోజు అర్ధరాత్రి వర్సిటీ పరిపాలనా భవనానికి చేరుకుని నియామక పత్రాలను సిద్ధం చేశారు. 54 మంది అభ్యర్థులకు సమాచారం అందజేసి వర్సిటీకి పిలిపించుకున్నారు. వీరిలో 48 మంది విధుల్లో చేరారు. ఇప్పటి వరకు ఈ నియామకాలకు వర్సిటీ పాలక మండలి అనుమతి లభించలేదు. దీంతో విధుల్లో చేరిన బోధన సిబ్బందికి జీతాలు ఇవ్వడంలో రెండు నెలల పాటు జాప్యం చేశారు. ఇప్పటికీ కొత్తగా విధుల్లో చేరిన అధ్యాపకులు ఇంకా అభద్రతా భావంతోనే పనిచేస్తున్నారు. -
నటించడం కంటే బోధించడమే ఇష్టం: అనుపమ్ ఖేర్
ముంబై: అనుపమ్ ఖేర్.. బాలీవుడ్ అభిమానులకు సుపరిచితమైన విలక్షణ నటుడు. ప్రతిభావంతుడైన నటుడిగా తనదైన ముద్ర వేశారు ఖేర్. అయితే నటించడం కంటే పాఠాలు చెప్పడాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తానని ఆయన చెబుతున్నారు. శుక్రవారం 60వ అడుగుపెట్టిన అనుపమ్ ఖేర్ తను అనుభవాలను వెల్లడించారు. 'నటించడం కంటే పాఠాలు చెప్పడాన్నే అమితంగా ప్రేమిస్తాను. ఇతరుల నుంచి తీసుకోవడం కంటే ఇవ్వడం గొప్పది. నటన చేర్చుకోవడానికి ప్రత్యేకించి పాఠ్యప్రణాళిక అంటూ ఉండదు. యువతరం నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా' అని అనుపమ్ ఖేర్ అన్నారు. మూడు దశాబ్దాలుగా బాలీవుడ్లో విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. -
సైన్స్ మెథడాలజీలో టెట్, డీఎస్సీ అభ్యర్థులకు శిక్షణ
జీవశాస్త్ర బోధన ఉపగమాలు- పద్ధతులు 1. ఎక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తి ఆ జ్ఞానాన్ని ఆశించే వ్యక్తులకు సమర్థవంతంగా అందిం చడాన్ని ఏమంటారు? ఎ) ప్రవర్తన బి) అభ్యసన సి) బోధన డి) అన్వేషణ 2. అనుభవం ద్వారా విద్యార్థిలో ప్రవర్తనా మార్పులను కలిగించే ప్రక్రియ..? ఎ) బోధన బి) అభ్యసన సి) శిక్షణ డి) క్రమశిక్షణ 3. జీవశాస్త్రంలో వాడుతున్న ఆగమన, నిగ మన ఉపగమాలను ప్రత్యేక బోధనా పద్ధతు లుగా ఉపయోగిస్తున్న శాస్త్రం? ఎ) రసాయన శాస్త్రం బి) భౌతిక శాస్త్రం సి) సాంఘిక శాస్త్రం డి) గణిత శాస్త్రం 4. ‘బోధనా పద్ధతులు విద్యార్థికి కేవలం జ్ఞానా న్ని ప్రసాదించేవే కాకుండా, ఆశించిన విలు వలు, చక్కటి దృక్పథాలు, పని చేయడంలో అభ్యసనాన్ని కలిగించేలా ఉండాలి’ అని చెప్పినవారు..? ఎ) కొఠారి బి) తారాదేవి రిపోర్ట సి) లక్ష్మణస్వామి మొదలియార్ డి) రామస్వామి అయ్యంగార్ 5. ‘ప్రాథమిక దశలో విజ్ఞానశాస్త్రం.. వ్యవసా యం, పరిశ్రమల మధ్య సన్నిహిత సంబం ధానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేలా ఉండా లి’ అని పేర్కొన్నవారు..? ఎ) కొఠారి కమిషన్ బి) మొదలియార్ కమిషన్ సి) తారాదేవి రిపోర్ట డి) ఎన్సీఈఆర్టీ 6. ఆగమన పద్ధతిలో విషయాలను ఎలా తెలుసుకుంటారు..? ఎ) మూర్త విషయాల నుంచి - అమూర్త విషయాలు బి) అమూర్త నుంచి - మూర్త విషయాలు సి) సాధారణ నుంచి - ప్రత్యేకాంశాలు డి) సామాన్య సూత్రాల నుంచి - నిర్దిష్ట విషయాలు 7. మనోవిజ్ఞాన పద్ధతి కానిది? ఎ) అన్వేషణ పద్ధతి బి) ప్రాకల్పన పద్ధతి సి) ఆగమన పద్దతి డి) నిగమన పద్ధతి 8. ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతి? ఎ) ప్రాకల్పన పద్ధతి బి) ప్రయోగ పద్ధతి సి) శాస్త్రీయ పద్ధతి డి) ఉపన్యాస ప్రదర్శన పద్ధతి 9. ఏ పద్ధతిలో త్వరగా పాఠ్యాంశాన్ని బోధించి సిలబస్‌ను పూర్తి చేయవచ్చు? ఎ) అన్వేషణ పద్ధతి బి) ఉపన్యాస పద్ధతి సి) ప్రాకల్పన పద్ధతి డి) కృత్య పద్ధతి 10. ఉపన్యాస పద్ధతి ఏ సందర్భానికి సరైంది? ఎ) ప్రయోగాలు చేసేటప్పుడు బి) పాఠ్యాంశం పూర్తిగా బోధించడానికి సి) ఉన్ముఖీకరణకు డి) మూల్యాంకనానికి 11. విద్యార్థులకు కిరణజన్య సంయోగక్రియలో ఇై2 ఆవశ్యకత అనే ప్రయోగాన్ని ఉపా ధ్యాయుడు చేసి చూపించాడు. ఇది ఏ బోధనా పద్ధతి? ఎ) అన్వేషణ పద్ధతి బి) ప్రాకల్పన పద్ధతి సి) ఉపన్యాస ప్రదర్శన పద్ధతి డి) పైవేవీ కావు 12. ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ప్రదర్శించే ఉపకరణాలు ఎలా ఉండాలి? ఎ) చిన్నవిగా బి) బరువుగా సి) పెద్దవిగా డి) తేలికగా 13. హ్యూరిస్టో అనే గ్రీకు మాటకు అర్థం? ఎ) బిగ్గరగా అరవడం బి) ఆలోచించడం సి) ఆచరణ డి) అన్వేషణ 14. అన్వేషణ పద్ధతికి నాంది పలికినవారు? ఎ) కొఠారి బి) మైకేల్ జాన్ సి) జె.జె.థామ్సన్ డి) హెచ్.ఐ.ఆర్మస్ట్రాంగ్ 15. ‘అన్వేషణ పద్ధతిలో జ్ఞానానికి ద్వితీయ స్థానం ఇచ్చారు. అందుకు ఇది ఉపయోగ కరమైన పద్ధతి కాదు’ అని పేర్కొన్నవారు? ఎ) హెచ్.ఐ.ఆర్మస్ట్రాంగ్ బి) జె.జె.థామ్సన్ సి) మైకేల్ జాన్ డి) పైవేవీ కావు 16. ‘అన్వేషణ పద్ధతి అనేది శాస్త్రీయ విధానంలో శిక్షణ ఇచ్చేదిగా ఉండాలి, కానీ జ్ఞానం పొందడం దీని పరమార్థం కాదు’ అని తెలిపినవారు? ఎ) వెస్టవే బి) థామ్సన్ సి) ఆర్మస్ట్రాంగ్ డి) మైకేల్ జాన్ 17. అన్వేషణ పద్ధతిలో సోపానాలు ఏ క్రమంలో ఉంటాయి? ఎ) వివరించడం, ప్రయోగాలు, నిర్వచిం చడం, ముగింపు బి) నిర్వచించడం, ప్రయోగాలు, వివ రించడం, ముగింపు సి) ముగింపు, నిర్వచించడం, ప్రయో గాలు, వివరణ డి) వివరణ, ప్రయోగాలు, నిర్వచించడం, ముగింపు 18. విత్తనాలు మొలకెత్తే విధానం అనే అంశా న్ని బోధించడానికి అనువైన పద్ధతి? ఎ) అన్వేషణ పద్ధతి బి) నియోజన పద్ధతి సి) ఉపన్యాస పద్ధతి డి) ప్రాకల్పన పద్ధతి 19. కింది వాటిలో అన్వేషణ పద్ధతిలోని పరిమితి? ఎ) ఆత్మవిశ్వాసం బి) తక్కువ కాలంలో సిలబస్‌ను పూర్తి చేయడం సి) వ్యక్తిగత శ్రద్ధ ఉండకపోవడం డి) విషయాలను తమకు తాము నేర్చుకోకపోవడం 20. సమస్య ఎక్కడ ఉత్పన్నమైందో దాని సహజ వాతావరణంలో ఏ పద్ధతిలో ఆ సమస్య పరిష్కారమవుతుంది? ఎ) ఉపన్యాస పద్ధతిలో బి) ప్రాజెక్ట్ పద్ధతిలో సి) అన్వేషణ పద్ధతిలో డి) నియోజన పద్ధతిలో 21. ఒక సంకల్పం కానీ, ఒక ప్రయోజనం కానీ ఉండి సహజ వాతావరణ పరిస్థితుల్లో చేసే క్రియ లేదా ప్రణాళిక? ఎ) అన్వేషణ బి) నియోజనం సి) ప్రాజెక్ట్ డి) పరికల్పన 22. పాఠశాలలో కానీ, పాఠశాల వెలుపల కానీ విద్యార్థులు ఒక అంశాన్ని సమగ్రంగా కార్యరూపంలో ఆచరించి, ఆచరణ ద్వారా సాధించే విధానం..? ఎ) అన్వేషణ బి) నియోజనం సి) ప్రాజెక్ట్ డి) పరికల్పన 23. ప్రాజెక్ట్ పద్ధతిని విద్యారంగంలో ప్రవేశ పెట్టాలని సూచించిన తొలి వ్యక్తి? ఎ) జాన్ డ్యూయి బి) బల్లార్‌డ సి) హెన్రీ డేవిడ్ డి) హెచ్.కిల్ ప్యాట్రిక్ 24. {పాజెక్ట్ అంటే సహజ వాతావరణంలో పూర్తి చేసే సమస్య అని చెప్పినవారు? ఎ) బల్లార్‌డ బి) కిల్ ప్యాట్రిక్ సి) పార్కర్ డి) జాన్ డ్యూయి 25. {పాజెక్ట్ అంటే పాఠశాలలో దిగుమతైన నిజ జీవిత భాగం అని చెప్పినవారు? ఎ) కిల్ ప్యాట్రిక్ బి) స్టీవెన్సన్ సి) బల్లార్‌డ డి) పార్కర్ 26. లక్ష్యాల ప్రయోజనం కోసం విద్యార్థి స్వయంగా తీసుకునే నిర్మాణాత్మక ప్రయ త్నం లేదా ఆలోచనే ప్రకల్పన.. అని తెలి పినవారు? ఎ) బల్లార్‌డ బి) పార్కర్ సి) థామస్ అండ్ లాంగ్ డి) కిల్ ప్యాట్రిక్ 27. {పాజెక్ట్ పద్ధతిలో ఉన్న సోపానాల్లో లేనిది? ఎ) పరిస్థితిని కల్పించడం బి) వ్యూహరచన సి) నివేదికను తయారు చేయడం డి) వివరించడం 28. {పాజెక్ట్లను జె.ఎ.స్టీవెన్సన్ ఎన్ని విధాలుగా వర్గీకరించాడు? ఎ) 1 బి) 2 సి) 3 డి) 4 29. కిల్ ప్యాట్రిక్ వర్గీకరణలో.. తోటను పెంచ డం ఏ రకమైన ప్రాజెక్ట్? ఎ) ఉత్పత్తి ప్రాజెక్ట్ బి) భౌతిక సంబంధ ప్రాజెక్ట్ సి) వినియోగ ప్రాజెక్ట్ డి) సమస్యా ప్రాజెక్ట్ 30. విద్యార్థులకు పని-అనుభవం ఏ పద్ధతి ద్వారా నెరవేరుతుంది? ఎ) ఉపన్యాస పద్ధతి బి) ఉపన్యాస ప్రదర్శన పద్ధతి సి) నియోజన పద్ధతి డి) ప్రాజెక్ట్ పద్ధతి 31. పక్షుల వలస అనే పాఠ్యాంశానికి ఏ బోధనా పద్ధతి అనువైనది? ఎ) అన్వేషణ పద్ధతి బి) ఉపన్యాస పద్ధతి సి) ప్రయోగ పద్ధతి డి) ప్రాకల్పన పద్ధతి 32. కింది పాఠ్యాంశాల్లో ప్రాకల్పన పద్ధతికి అనువైనది? ఎ) జీర్ణక్రియ బి) శ్వాసక్రియలో ై2 విడుదల సి) కోళ్ల పెంపకం డి) శాస్త్రవేత్తల చరిత్ర 33. ఏ పద్ధతిలో బోధించాలంటే విద్యార్థుల సం ఖ్య తక్కువగా ఉండాలి? ఎ) ఉపన్యాస బి) ఉపన్యాస-ప్రదర్శన సి) ప్రయోగ పద్ధతి డి) నియోజన పద్ధతి 34. శాస్త్రీయ పద్ధతిలోని సోపానాల్లో మొద టిది? ఎ) దత్తాంశ సేకరణ బి) సమస్యను గుర్తించడం సి) ప్రాకల్పనను ప్రతిపాదించడం డి) సాధారణీకరణం 35. ఉపగమాలు, బోధనా పద్ధతులు అనేవి..? ఎ) ఒకటే బి) భిన్నమైనవి సి) సంబంధం లేనివి డి) పరస్పర సంబంధం ఏర్పడనివి 36. {పత్యేక సత్యాల నుంచి సాధారణ సత్యా లను రూపొందించడమే ఆగమనం అని తెలిపినవారు? ఎ) బల్లార్‌డ బి) ఫౌలర్ సి) జీవన్ డి) కిల్ ప్యాట్రిక్ 37. మల్లెకు సువాసన ఉంటుంది. సన్నజాజికి, విరజాజికి కూడా సువాసన ఉంటుంది. ఈ విషయాలను పరిశీలించడం ద్వారా రాత్రి వికసించే పూలలో సువాసన ఉంటుందని సాధారణీకరించడం దేనికి ఉదాహరణ? ఎ) ప్రాకల్పన పద్ధతి బి) అన్వేషణ పద్ధతి సి) ఆగమన పద్ధతి డి) నిగమన పద్ధతి 38. శాస్త్రీయ పద్ధతిలోని సోపానాలను పేర్కొ న్నవారు? ఎ) కార్ల పియర్సన్ బి) ఫౌలర్ సి) కిల్ ప్యాట్రిక్ డి) జీవన్ 39. సత్యాన్వేషణలో శాస్త్రజ్ఞులు అనుసరించే పద్ధతి? ఎ) అన్వేషణ పద్ధతి బి) ప్రాకల్పన పద్ధతి సి) శాస్త్రీయ పద్ధతి డి) పైవన్నీ 40. ఆమ్లాలు నీలి లిట్మస్‌ను ఎరుపురంగుకు మారుస్తాయి. ఈ విషయాన్ని ఏఇ కు అన్వయించి చెప్పి నిర్ధారిస్తే అది ఏ ఉపగమం? ఎ) ఆగమన బి) పరికల్పన సి) అన్వేషణ డి) నిగమన 41. ఏ లాటిన్ పదానికి ‘బిగ్గరగా చదవడం’ అనే అర్థం ఉంది? ఎ) ల్యాక్టో బి) రిక్టర్ సి) లెక్టేర్ డి)లాఫ్టర్ 42. ఉపన్యాస పద్ధతికి ఉన్న ప్రయోజనాల్లో ఇది ఒకటి? ఎ) శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వొచ్చు బి) ఆచరణ ద్వారా అభ్యసనం సాధ్యం సి) స్పష్టమైన భావ ప్రకటనకు తోడ్పడుతుంది డి) విద్యార్థుల విషయంలో వ్యక్తిగత శ్రద్ధ చూపే వీలుంది 43. ఆక్సిజన్ తయారీ విధానాన్ని తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడు స్వయంగా ప్రయోగం చేసి చూపాడు. అతడు ఏ బోధనా పద్ధతిని అవలంబించినట్లు? ఎ) ఉపన్యాస పద్ధతి బి) అన్వేషణ పద్ధతి సి) ఉపన్యాస-ప్రదర్శన పద్ధతి డి) ప్రాజెక్ట్ పద్ధతి 44. మంచి ప్రదర్శనకు ఉన్న లక్షణాల్లో లేనిది? ఎ) ప్రణాళిక బి) లక్ష్యాల స్పష్టత ఉండాలి సి) ప్రదర్శనలో విద్యార్థుల సహకారం తీసుకోకూడదు డి) ఉపకరణాలు చిన్నవిగా ఉండకూడదు సమాధానాలు 1) సి; 2) ఎ; 3) డి; 4) సి; 5) ఎ; 6) ఎ; 7) డి; 8) డి; 9) బి; 10) సి; 11) సి; 12) సి; 13) డి; 14) డి; 15) బి; 16) ఎ; 17) బి; 18) డి; 19) డి; 20) బి; 21) సి; 22) సి; 23) డి; 24) బి; 25) సి; 26) సి; 27) డి; 28) బి; 29) బి; 30) డి; 31) బి; 32) సి; 33) సి; 34) బి; 35) బి; 36) సి; 37) సి; 38) ఎ; 39) సి; 40) డి; 41) సి; 42) సి; 43) సి; 44) సి;