బట్టీ చదువులకు స్వస్తి.. | students interested in tlm | Sakshi
Sakshi News home page

బట్టీ చదువులకు స్వస్తి..

Published Mon, Oct 31 2016 5:44 PM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM

బట్టీ చదువులకు స్వస్తి..

బట్టీ చదువులకు స్వస్తి..

 -బోధనోపకరణాలతో సత్ఫలితాలు
– విద్యార్థుల్లో నూతనోత్సాహం
భీమడోలు:బట్టీ చదువులకు స్వస్తి పలికి బోధనోపకరణాలను వినియోగం ద్వారా వచ్చే జ్ఞాపకశక్తి జ్ఞాప్తిలో ఉంటుంది. బోధనోపకరణాల ద్వారా విద్యాబోధన సత్ఫలితాలిస్తోంది.  విద్యార్థులను హత్తుకొనే విధంగా ఉపాధ్యాయులు బోధనోపకరణాలతో బోధిస్తేపాఠశాలలు  సృజనాత్మకత కేంద్రాలుగా మారుతాయి. నో కాస్ట్, లో కాస్ట్‌ నినాదంతో ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యే రీతిలో చార్టులు, నమూనాలు, ప్రదర్శనలు, తోరణాల చూపడం వల్ల చిన్నారులను హృదయాలను కట్టి పడేస్తాయి. దీనితో బీ,సీ గ్రేడు గల విద్యార్థులు డ్రాపవుట్స్‌ కాకుండా నిరంతరం పాఠశాలో చదువుకునే ఉత్సాహం అందుతోంది.  ఇక పాఠశాలకు డుమ్మాకొట్టేవారే ఉండరు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా విద్యామేళాను నిర్వహించారు.  అందులో ఉపాధ్యాయులు ప్రదర్శించిన బోధనోపకరణాల ద్వారా విద్యాబోధన విద్యార్థుల్లో నృజనాత్మకతను పెంపొందిస్తుంది. క్లిష్టమైన గణితం, సామాన్యశాస్త్రాలు, ఇంగ్లీషు సబ్జెక్టుల్లో విద్యార్థులు పట్టు సాధించేందుకు ఈ మేళా దోహద పడుతుంది. జిల్లా విద్యాశాఖ ఈ ఏడాది అక్టోబర్‌లో మండల స్థాయిలో ఏర్పాటు చేసిన విద్యామేళాలు సర్కార్‌ బడుల్లో నాణ్యమైన  విద్యాబోధన మరింత మెరుగుపడుతుంది. కొంత కాలంగా స్తబ్ధతగా ఉన్నా ఈ విధానానికి జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో ఊపందుకుంది. దీనితో విద్యాశాఖ, సర్వశిక్షాభియాన్‌ అధికారులు చర్యలు చేపట్టడంతో ఉపాధ్యాయులు సైతం ఆ తరహాలోనే స్పందించి నమూనాలు రూపొందించడంతో పాఠశాలల్లో ఆసక్తిదాయకమైన విద్యాబోధన కొనసాగుతుంది.  చార్టులు, గోడ పత్రికల ద్వారా పలు అంశాలను విద్యార్థులు ఉపాధ్యాయులు బో«ధిస్తున్నారు. తరగతి గదుల్లో కఠినమైన గణితం,  పదాలు, వాక్యాలు, అక్షర తోరణాలను గోడలకు అతికించడం ద్వారా విద్యార్థులకు ప్రధానాంశాల వారీగా అంశాలు వివరిస్తున్నారు. బట్టీ విధానానికి స్వస్తి పలికే క్రమంలో అందుబాటులోని పలు వస్తువుల ద్వారా ఆకృత్తులను రూపొందించి విద్యార్థులు మరింత అర్థమయ్యే విధంగా కళ్లముందుగా వాటి అర్థాలు చెబుతున్నారు. కృత్యాలను రూపొందించడం ద్వారా విద్యార్థుల్లో పోటీ తత్వం పెంపొందుతుంది. ఈ ప్రయోగాత్మకంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు అంశాలను బోధిస్తే శాశ్మతకాలం గుర్తుండిపోతాయి. అక్టోబర్‌లో మండల స్థాయిలో జరిగిన బోధనోపకరణాల మేళలో ఉత్తమ బోధన ఉపకరణాలను రూపొందించిన ఉపాధ్యాయులను గుర్తించి వారిని ప్రోత్సహిస్తే మరింత ప్రయోజనం చేకూరుతుందని ఉపాధ్యాయ లోకమంటుంది. ఆ ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలతో పాటు ఆ ఉపకరణాలను జిల్లా స్థాయిలో ప్రదర్శించే వి«ధంగా ఉన్నతాధికారులు చర్యలు చేపడితే వారికి మరింత ఆదర్శంగా తీర్చిదిద్దవచ్చునంటుంన్నారు. 
 
సులభంగా అÆర్థమవుతోంది..
ఉపకరణాల ద్వారా విద్యాబోధన చేయడం వల్ల సులభంగా అర్థమవుతుంది. తద్వారా సమయం వృథా కాదు. 
పట్టును సా«ధిస్తారు
చింతాడ శిరీషా, 3వ తరగతి, నెం.3, పోలసానిపల్లి
చిరకాలం గుర్తుంటాయి
 
విద్యార్థుల్లో నైపుణ్యాలను సాధించుకోవడానికి ఈ తరహా బోధన దోహద పడుతుంది. బోధనోపకరణాల బోధన ద్వారా సంజ్ఞలు చిరకాలంగా నిలిచి ఉండిపోతాయి. ఈ విధానం వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుంది. సబ్జెక్టులపై పూర్తి పట్టును సాధిస్తారు.
 
05కె.శ్యామలా, నెం.3, టీచర్,  పోలసానిపల్లి 
 
 
 
జిల్లా పాఠశాలల్లో విద్యార్థుల వివరాలు 
 
పాఠశాలల               సంఖ్య                        విద్యార్థులు 
 
ఉన్నత                      447                66797
 
ప్రాధమికోన్నత         274                1,00,545
 
ప్రాధమిక             2546                 1,44,376 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement