Students
-
మళ్లీ ఫుడ్ పాయిజన్
నారాయణపేట: నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మరోసారి కలుషిత ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్న 40 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఉపాధ్యాయులు మొదట మాగనూర్ పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం 30 మంది విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం మక్తల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇందులో 9వ తరగతి విద్యార్థులు నేత్ర, దీపిక పరిస్థితి కొంత విషమంగా ఉండటంతో మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రి తరలించారు. తహసీల్దార్ పర్యవేక్షణలోనే వంట మాగనూర్ ఇన్చార్జి తహసీల్దార్ సురేష్ కుమార్, మధ్యాహ్న భోజనం ఇన్చార్జి, పాఠశాల ఉపాధ్యాయుడు రాఘవేంద్రచారి పర్యవేక్షణలోనే మధ్యాహ్న భోజనం తయారు చేయించారు. అయినప్పటికీ మళ్లీ ఫుడ్ పాయిజన్ కావడంతో అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే వంట చేసిన కార్మీకులను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. బయట చిరుతిళ్లు తిన్నారా? విద్యార్థులు స్కూల్ బయట ఉన్న బేకరీలు, దుకాణాల్లో చిరుతిళ్లు తినడంతోనే అస్వస్థతకు గురై ఉంటారని కలెక్టర్ సిక్తా పటా్నయక్ అనుమానం వ్యక్తం చేశారు. డీఎస్పీ లింగయ్య నేతృత్వంలో పోలీసులు రంగంలోకి దిగి మాగనూర్‌లోని పలు బేకరీలు, దుకాణాల్లో విచారణ చేపట్టారు. సీఎం దృష్టికి వెళ్లినా.. గత బుధవారం కలుషిత ఆహారంతో 100 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 17 మంది ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా అధికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ మరునాడే అన్నంలో మళ్లీ పురుగులు రావడం, అధికారులపై చర్యలు తీసుకోవడం వంటివి జరిగాయి. తాజాగా మళ్లీ ఫుడ్ పాయిజన్ కావడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులు వరుసబెట్టి అస్వస్థతకు గురవుతుండటంపై ప్రభుత్వం దృష్టిసారించాలని వారు కోరుతున్నారు. -
సార్.. ఈ అన్నం మాకొద్దు
కరీంనగర్/జగిత్యాలటౌన్: మధ్యాహ్న భోజనం తినలేకపోతున్నామంటూ రెండుచోట్ల విద్యార్థులు ఆందోళనకు దిగా రు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని పురాతన పాఠశాల వి ద్యార్థులు రోడ్డెక్కగా, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం ఆరెపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి చేరుకొని కలెక్టర్ సత్యప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్‌లోని పురాతన పా ఠశాలలో 400 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సో మవారం 217 మంది పాఠశాలకు హాజరయ్యారు. కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలోనే ఉన్న ఈ పాఠశాలలో వారంరోజులుగా ఉడికీఉడకని అన్నం పెడుతున్నారని, అడుగు భాగం మెత్తగా, ముద్దగా మారి మాడిపోతోందని, ఆ అన్నం ఎలా తినేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అరగంట పాటు ఆందోళన చేసినా ఉన్నతాధికారులెవరూ పాఠశాలకు రాలేదు. దీంతో విద్యార్థులు అన్నం తినకుండానే పడేశారు. ఆరెపల్లి పాఠశాలలో వంట మనిషిని మార్చాలని కోరుతూ కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. అన్నంలో పురుగులు, వెంట్రుకలు వస్తున్నాయని, రుచిలేని అన్నం వడ్డిస్తున్నారని, ప్రశ్నిస్తే ఇష్టమున్నచోట చెప్పుకోమంటూ వంట మనుషులు బెదిరిస్తున్నారని ప్రజావాణిలో గోడు వెళ్లబోసుకున్నారు. నాలుగు నెలలుగా అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. ప్రజావాణి ఆడిటోరియంలోకి వెళ్లి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించారు. వంటమనిíÙని తొలగించి సరైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని నిరసన విరమింపజేశారు. -
విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను చెల్లించక పోవడంతో విద్యార్థులు చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ప్రకాశం జిల్లా జె.పంగులూరులో ఫీజు రీయింబర్స్మెంట్ రాక, ఫీజులు కట్టలేక.. పనులకు వెళుతున్న ఓ విద్యార్థి దీనావస్థ నాకు వేదన కలిగించింది.విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతారా?’ అని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. తక్షణమే అమ్మకు వందనం, ఫీజు రీయింబర్స్‌మెంటుతోపాటు వసతి దీవెన డబ్బులు కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పిల్లల చదువులను దెబ్బతీసే చంద్రబాబు నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రానివ్వడం లేదని, చదువు పూర్తి చేసిన వారు బకాయిలు కడితేగానీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా 11 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని తెలిపారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..1 చంద్రబాబు కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను పిల్లల చదువులకు చెల్లించక పోవడంతో వారు చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. చంద్రబాబు వారిపై కక్షకట్టినట్టు వ్యవహరిస్తున్నారు.2 చంద్రబాబు అధికారంలోకి రాగానే అన్ని రంగాల్లోనూ తిరోగమనమే కనిపిస్తోంది. ముఖ్యంగా విద్యా రంగాన్ని దారుణంగా దెబ్బ తీశారు. అమ్మ ఒడిని, ఇంగ్లీష్ మీడియంను, 3వ తరగతి నుంచి టోఫెల్, 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్ఈ, సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు, బైజూస్ కంటెంట్, నాడు–నేడు.. ఇలా అన్నింటినీ రద్దు చేసి, 1–12 వ తరగతి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను దెబ్బ తీశారు. వసతి దీవెన, విద్యా దీవెన నిలిపేసి.. డిగ్రీ, ఇంజినీరింగ్, డాక్టర్ చదువులు చదువుతున్న వారినీ తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు.3 వైఎస్సార్సీపీ హయాంలో ప్రతి త్రైమాసికం పూర్తి కాగానే తల్లుల ఖాతాలో నగదు జమ చేసే వాళ్లం. ఇలా గత విద్యా సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం వరకు రూ.12,609 కోట్లు ఒక్క విద్యా దీవెనకే ఖర్చు చేశాం. తల రాతలను మార్చేది చదువులు మాత్రమేనని గట్టిగా నమ్ముతూ వైఎస్సార్సీపీ హయాంలో ఈ రెండు (విద్యా దీవెన, వసతి దీవెన) పథకాలకే రూ.18 వేల కోట్ల వరకు ఖర్చు చేశాం.4 ఎన్నికల కోడ్ కారణంగా జనవరి–మార్చి త్రైమాసికానికి, ఏప్రిల్‌లో వెరిఫికేషన్ చేసి మే నెలలో ఇవ్వాల్సిన ఫీజు డబ్బులు ఇవ్వనీయకుండా ఇదే కూటమి పారీ్టల వారు ఈసీకి ఫిర్యాదు చేశారు. పోనీ, ఎన్నికలు అయిన తర్వాత వీళ్లు జూన్‌లో అయినా ఇచ్చారా అంటే అదీ లేదు. అప్పటి నుంచి ఒక్క పైసా కూడా చెల్లించడం లేదు. ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన వసతి దీవెన పరిస్థితి కూడా అంతే. తర్వాత ఏప్రిల్–జూన్, జూలై–సెపె్టంబర్ త్రైమాసికాలకు సంబంధించి ఫీజుల చెల్లింపులో ఎలాంటి అడుగూ ముందుకు పడటం లేదు. ఇప్పుడు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికం కూడా సగం గడిచి పోయింది. దీంతో కలుపుకుంటే సుమారు రూ.2,800 కోట్లకుపైగా ఫీజులు రీయింబర్స్ చేయాల్సి ఉంది. మరో రూ.1,100 కోట్లు లాడ్జింగ్, బోర్డింగ్ ఖర్చుల కింద వసతి దీవెన బకాయిలు కూడా ఉన్నాయి. మొత్తంగా బకాయిలు పెట్టిన డబ్బులు డిసెంబర్ నాటికి రూ.3,900 కోట్లకు చేరుకుంటాయి. కానీ, ఈ ప్రభుత్వం తీరు చూస్తే మాటలేమో కోటలు దాటుతున్నాయి.. కాళ్లేమో గడప కూడా దాటడం లేదు.5 ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రానివ్వడం లేదు. చదువులు పూర్తి చేసిన వారికి బకాయిలు కడితేగానీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఇలా 11 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చేసేదిలేక తల్లిదండ్రులు అప్పులు చేయడమో, వాటిని తీర్చలేక ఆస్తులు అమ్ముకోవడమో చేయాల్సి వస్తోంది. ఏదారీ లేని వారు తమ పిల్లలను పనులకు తీసుకెళ్తున్నారు. చదువులకు నిలయమైన ఏపీలో దౌర్భాగ్యకర పరిస్థితులు ఇలా ఉన్నాయి.6 కూటమి ప్రభుత్వం వచ్చాక ఇసుక స్కాం, లిక్కర్ స్కాం, పేకాట క్లబ్బులు, మాఫియా సామ్రాజ్యాలు, ప్రైవేటీకరణ ముసుగులో స్కాములు చేస్తూ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ పోర్టులను దోచిపెట్టడాలు తప్ప పిల్లల చదువుల మీద శ్రద్ధ లేకుండా పోయింది. వెంటనే అమ్మకు వందనం, ఫీజు రీయింబర్స్మెంట్ సహా వసతి దీవెన డబ్బులు విడుదల చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. పిల్లల చదువులను దెబ్బతీసే చంద్రబాబు నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. -
విద్యార్థులకు ఇండిగో స్పెషల్ ఆఫర్..
దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ 'ఇండిగో' విద్యార్థుల కోసం 'స్టూడెంట్ స్పెషల్' అనే ప్రత్యేకమైన ఆఫర్ తీసుకువచ్చింది. ఇండిగో కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఫ్లైట్ టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో విద్యార్థులకు ప్రత్యేక ఛార్జీలు, అదనపు ప్రయోజనాలు లభించనున్నట్లు ప్రకటించింది.విమాన టికెట్ మీద 6 శాతం రాయితీ కల్పించడం మాత్రమే కాకుండా.. 10 కేజీల వరకు అదనపు లగేజ్ తీసుకెళ్లడానికి ఇండిగో అనుమతించింది. విద్యార్థులు కోసం తీసుకొచ్చిన ఈ స్పెషల్ ఆఫర్ ఈ ఆఫర్ ఎన్ని రోజుల వరకు అందుబాటులో ఉంటుందో.. స్పష్టంగా వెల్లడించలేదు.ఇదీ చదవండి: తెలంగాణలో బీజం.. ఇతర రాష్ట్రాలకు చేరే అవకాశంఇండిగో ప్రకటించిన ఈ స్పెషల్ ఆఫర్ కేవలం హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా గోవా, ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి మొత్తం 80 రూట్లలో నడిచే విమాన సర్వీసుల్లో అందుబాటులో ఉంటుంది. 21 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న విద్యార్థులు తమ స్కూల్ లేదా యూనివర్సిటీకి సంబంధించిన ఐడీ కార్డును కలిగి ఉండాలి. ఐడీ కార్డు కలిగిన వారు మాత్రమే ఈ ఆఫర్ ఉపయోగించుకోవడానికి అర్హులు. -
రిసార్ట్ శైలి జీవనమే లక్ష్యంగా ఐఖ్యా ఇన్ఫ్రా డెవలపర్స్ 'ఈ5వరల్డ్’ కు అంకురార్పణ
హైదరాబాద్, నవంబర్ 2024: ఐఖ్యా ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో ఐకేఎఫ్ ఫైనాన్స్ సహకారంతో హైదరాబాద్‌లో ఇరవై ఎకరాల విస్తీర్ణంలో లగ్జరీతో కూడిన రిసార్ట్ శైలి జీవనమే లక్ష్యంగా 'ఈ5వరల్డ్' కు అంకురార్పణ జరిగింది. ఈ వివరాలు తెలిపేందుకు బంజారాహిల్స్ లోని తాజ్ డెక్కన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఐకేఎఫ్ ఫైనాన్స్ వ్యవస్థాపకులు, ఈ5వరల్డ్ ప్రమోటర్ వీజీకే ప్రసాద్ మాట్లాడుతూ రిసార్ట్ స్టైల్ లివింగ్‌లో సరికొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తున్నామని చెప్పారు. ఇది లగ్జరీ, వెల్నెస్, నేచర్ సమతుల్యతతో డిజైన్ చేయబడిందన్నారు. ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిసార్ట్ ప్రత్యేకంగా రూపొందించామని తెలిపారు. ప్రీమియం సౌకర్యాలు కలవన్నారు. ప్రకృతి నుంచి స్ఫూర్తి పొందే ఆర్కిటెక్చర్ ఇక్కడ ప్రత్యేకత అన్నారు. దీనిని మూడు దశల్లో అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. మొదటి దశలో 1 నుంచి 5 ఎకరాలు, రెండో దశలో 2 నుంచి 10 ఎకరాలు, మూడో దశలో 3 నుంచి 5 ఎకరాలు అభివృద్ధి చేయనున్నామన్నారు. లగ్జరీ, వెల్నెస్, స్థిరమైన డిజైన్‌తో హైదరాబాదులో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తున్నామని చెప్పారు. ఇది పచ్చని వాతావరణంలో ప్రశాంతతతో కూడిన ఉన్నత స్థాయి రిసార్ట్ జీవనానికి నిలయంగా ఉండనుందన్నారు.ఐకేఎఫ్ ఫైనాన్స్ రూ. 2,356.99 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన విశ్వసనీయ ఆర్థిక సంస్థ అన్నారు. హైదరాబాద్‌లో లగ్జరీ లివింగ్‌ను మలుపు తిప్పేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. ఇది కేవలం ఒక లగ్జరీ రిసార్ట్ లివింగ్ కమ్యూనిటీ మాత్రమే కాదని, ఇది నాణ్యత, ఆవిష్కరణ, స్థిరమైన జీవనం తాలుకా నిబద్ధతను ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఆర్కిటెక్చర్ కీర్తి షా లగ్జరీ, నేచర్ కలయిక విజన్ అద్భుతమన్నారు. ఉన్నతమైన జీవన విధానానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. ఇక్కడ నివసించే వారికి లగ్జరీ జీవనంతో పాటు పర్యావరణ అనుకూల వాతావరణాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ లగ్జరీ రిసార్ట్స్‌కు ఎక్కువ డిమాండ్ ఉందన్నారు. పెట్టుబడిదారులు దీర్ఘకాలంలో వృద్ధిపై ఆసక్తి చూపిస్తున్నారన్నారు. పెట్టుబడిదారులకు ఫ్రాక్షనల్ ఓనర్షిప్ అందించే ప్రత్యేక అవకాశాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఈ మోడల్ ద్వారా పెట్టుబడిదారులు రిసార్ట్‌లో భాగస్వామ్యం పొందవచ్చన్నారు.ఈ సందర్భంగా ఓపస్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ రఘురాం వుప్పుటూరి మాట్లాడుతూ ప్రాక్షనల్ ఓనర్షిప్ ద్వారా దీనిని అందరికి చేరువ చేయనున్నామని చెప్పారు. రూ.10 లక్షలలోపు మొత్తంతో రిసార్ట్‌లో భాగస్వామ్యం పొందవచ్చన్నారు. ఇది కుటుంబాలు సమయం గడిపేందుకు ఒక వీకెండ్ గమ్యస్థలంగా కూడా ఉంటుందన్నారు. ఇందులో ఉన్న విస్తృతమైన సౌకర్యాలు అన్ని వయస్సులు, వర్గాలకు అనుకూలంగా రూపొందించబడ్డాయని చెప్పారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికి అనుకూలంగా ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో మూడు క్లబ్ హౌస్‌లు కలవన్నారు. వీటి విస్తీర్ణం 10,000, 30,000, 50,000 చదరపు అడుగులు అన్నారు. అందులో యోగా గదులు, వెల్నెస్ జోన్లు, స్విమ్మింగ్ పూల్స్, వినోద సౌకర్యాలు ఉన్నాయన్నారు. రెండు రెస్టారెంట్లు కలవన్నారు. ఈ రెస్టారెంట్లలో ప్రపంచ, స్థానిక వంటకాలు అందుబాటులో ఉంటాయన్నారు. తాజా, సేంద్రీయ పదార్థాలను ప్రధానంగా ఉపయోగించనున్నామని తెలిపారు. విశాలమైన పచ్చని ప్రదేశాలు, గ్రీన్ గార్డెన్స్, నీటి వనరులు, నడక మార్గాలు ఉన్నాయన్నారు. పిల్లల కోసం ప్రత్యేక అడ్వెంచర్ ప్రదేశాలు, పెద్దలు, వృద్ధుల కోసం నేచర్ ట్రైల్స్, వెల్నెస్ లాంజ్‌లు ఉన్నాయని తెలిపారు. ఈ కమ్యూనిటీ ప్రత్యేక మెంబర్షిప్ ప్యాకేజీలను కూడా అందిస్తుందని చెప్పారు. హైదరాబాద్ నివాసితులు ప్రపంచ స్థాయి సదుపాయాలు ఆస్వాదించే అవకాశం ఉందన్నారు.ఈ సందర్భంగా ఈ5వరల్డ్ సేల్స్, బ్రాండ్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఈ5వరల్డ్ హైదరాబాద్ వాసులు ఆనందించే ఒక ప్రత్యేక గమ్యస్థలంగా మారనుందన్నారు. ఇది వివిధ వయస్సులు, వర్గాల ప్రజల అవసరాలను తీర్చబోతుందన్నారు.ఈ సందర్భంగా ఆర్కిటెక్ట్, అర్బన్ ప్లానర్, ఈ5వరల్డ్ వ్యవస్థాపక సభ్యులు కీర్తి షా మాట్లాడుతూ ఈ5వరల్డ్ స్థిరమైన నిర్మాణం, వెల్నెస్ ఆధారిత జీవనశైలిలో ఉంటుందన్నారు. ఆధునిక సౌకర్యాలు ఆస్వాదిస్తూ.. ప్రకృతితో మళ్లీ కనెక్ట్ అయ్యేలా చేయడం మా లక్ష్యమన్నారు. మా స్టాండ్ ఏమిటంటే.. పర్యావరణానికి అనుకూలంగా ఉంటూ విలాసవంతమైన జీవనానికి ఒక నమూనాగా, సమకాలీన సౌకర్యాలతో సహజ ప్రకృతి దృశ్యాలను మిళితం చేయడం అన్నారు. ఈ5వరల్డ్ భారతదేశంలో పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపకల్పన చేసిన మొదటి రిసార్ట్ లివింగ్ కమ్యూనిటీగా నిలుస్తుందని తెలిపారు. ఈ వినూత్న పద్ధతిని క్యూలీడ్.ఏఐ డాక్టర్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో అమలు అవుతుందన్నారు. ఇందులో మార్కెట్ కమ్యూనికేషన్, ఉత్పత్తి మార్కెట్ సరిపోలిక, ఆదాయ అంచనాలు, వ్యూహాత్మక ప్రణాళిక వంటి ప్రతి అంశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సూచనలు ఉంటాయన్నారు. ఐకేఎఫ్ ఫైనాన్స్ ప్రమోటర్ల మద్దతుతో ఐఖ్యా ఇన్ఫ్రా డెవలపర్స్ లగ్జరీ రిసార్ట్ లివింగ్‌లో మొదటి ప్రయత్నంగా ఈ5వరల్డ్ కు పునాది పడింది. ఇది ఈ సంస్థ ఆర్థిక సేవలలో ఉన్న బలమైన పునాది నుంచి సహజ విస్తరణను ప్రతిబింబిస్తుంది. ఇది 1991లో స్థాపించబడింది. ఐకేఎఫ్ ఫైనాన్స్ నిరంతరం అగ్రగామిగా ఉంది. ఇది తన పోర్ట్‌ఫోలియోను వాహన, ఎంఎస్ఎంఈ, హౌసింగ్ ఫైనాన్స్‌లను కలుపుతూ విస్తరించింది. తొమ్మిది రాష్ట్రాలలో ప్రస్థానం కలిగి ఉంది. 613.76 కోట్ల రూపాయల అంచనా కలిగిన సమగ్ర టర్నోవర్‌తో ఐకేఎఫ్ ఫైనాన్స్ మద్దతుతో స్థిరత్వం, నాణ్యత, దీర్ఘకాలిక విలువకు హామీగా నిలుస్తుంది. ఈ సమావేశంలో బిజినెస్ కన్సల్టెంట్ దేవేంద్ర దాంగ్ పాల్గొన్నారు.ఐకేఎఫ్ ఫైనాన్స్ గురించిఐకేఎఫ్ ఫైనాన్స్ వీజీకే ప్రసాద్ చేత స్థాపించబడింది. పారదర్శకత, వృద్ధి, కస్టమర్ సేవల పట్ల నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా ఎదిగింది. కంపెనీ ట్రాక్ రికార్డ్ దాని తాజా వెంచర్ ఈ5వరల్డ్ హైదరాబాద్‌లో ప్రీమియర్ లైఫ్ స్టైల్ కు మద్దతు ఇస్తుంది.ఐకేఎఫ్ ఫైనాన్స్ వాహన ఫైనాన్సింగ్‌పై దృష్టి సారించడంతో ప్రారంభమైంది. భారతదేశంలో విభిన్న శ్రేణి ఆర్థిక ఉత్పత్తులను అందించే పవర్ హౌస్‌గా ఎదిగింది. ఆయన దూరదృష్టితో కూడిన నాయకత్వంలో ఐకేఎఫ్ ప్రతిష్టాత్మకమైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సుందరం ఫైనాన్స్, టెల్కో వంటి సంస్థలతో కలిసి పని చేస్తుంది. దీర్ఘకాల భాగస్వామ్యాలు, పరిశ్రమ నైపుణ్యాన్ని పెంపొందించుకుంది.మరింత సమాచారానికి దయచేసి సంప్రదించండి : 9959154371/ 9963980259 -
విద్యార్థులకు ఎలాంటి ఆర్థిక సాయం లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విద్యార్థులకు తమ ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సాయం చేయడంలేదని మంత్రి లోకేశ్ ఓ పక్క స్పష్టంగా చెబుతున్నారు. పోనీ, 2019–24 మధ్య గత ప్రభుత్వంలో విద్యార్థులకు ఎటువంటి మేలు జరిగిందో చెప్పడానికి కూటమి సర్కారుకు నోరు రావడంలేదు. అసలు సమాధానం చెప్పడానికే అంగీకరించలేదు. మంగళవారం శాసన సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం అనుసరించిన తీరిది. సభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, బి.విరూపాక్షి, డాక్టర్ దాసరి సుధ, ఎం. విశ్వేశ్వరరాజు అడిగిన ప్రశ్నకు మంత్రి సభలో చర్చించనేలేదు.రాతపూర్వకంగా సమాధానమిచ్చి ‘చెప్పినట్టే’ భావించాలని పేర్కొన్నారు. 2019–24 మధ్య కాలంలో లబ్ధిపొందిన విద్యార్థుల వివరాలు, విడుదల చేసిన మొత్తం ఎంతో చెప్పాలని సభ్యులు అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగానూ వివరాలు ఇవ్వలేదు. ‘ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు’ అంటూ సమాధానం దాటవేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సాయం అందించడం లేదని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ శాసన సభకు వివరించారు. తల్లికి వందనం అనే కొత్త పథకాన్ని రూపొందిస్తున్నామని, త్వరలో వివరణాత్మక మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపారు.గత ప్రభుత్వంలో డ్వాక్రాకు రూ.3,541.27 కోట్లుగత ఆర్ధిక సంవత్సరంలో సకాలంలో రుణాలు చెల్లించిన పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీ పథకం అమలు చేసే విషయంపై ప్రభుత్వం స్పష్టమైన జవాబు ఇవ్వలేదు. అంతకు ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏడాది పాటు సకాలంలో రుణాలు చెల్లించే వారికి ఏప్రిల్ నెలలో వడ్డీ డబ్బులు జమ చేసేది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల అనంతరం ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా ఆ వడ్డీ డబ్బులు చెల్లించలేదు.దీనిపై వైఎస్సార్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సభలో సమాధానం చెప్పకుండా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. వడ్డీ లేని రుణాల అమలుకు 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.950 కోట్లు సమకూర్చినట్టు చెప్పారు. 2019–24 మధ్య ఈ పథకం కింద డ్వాక్రా మహిళలకు రూ.3,541.27 కోట్లు చెల్లించినట్టు తెలిపారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి 2023–24లో రూ.1,400 కోట్లు చెల్లించాల్సి ఉండగా, నిధులు విడుదల కాలేదన్నారు.అంతర్ రాష్ట్ర ఉద్యోగుల మార్పిడిపై రెండు కమిటీలు: మంత్రి పయ్యావుల కేశవ్అంతర్ రాష్ట్ర ఉద్యోగుల మార్పిడిలో ఇబ్బందులను అధిగమించేందుకు ఇరు రాష్ట్రాల సీనియర్ అధికారులు, మంత్రులతో రెండు కమిటీలు వేసినట్టు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. వన్ టైం చర్యలో భాగంగా అంతర్ రాష్ట్ర బదిలీ కోసం తెలంగాణ ప్రభుత్వ సమ్మతి కోరామని, స్పందన రావాల్సి ఉందని అన్నారు. తెలంగాణ నుంచి 1,447 మంది ఉద్యోగులు ఏపీకి వచ్చేందుకు విల్లింగ్ ఇచ్చారని, ఇక్కడి నుంచి తెలంగాణకు వెళ్లేందుకు 1,942 మంది అంగీకరించగా, అక్కడి స్థానికత గలవారు 1,042 మంది ఉన్నట్టు చెప్పారు.రూ.284 కోట్లతో కాల్వల నిర్వహణ: జలవనరులశాఖ మంత్రి నిమ్మలగత ఐదేళ్లలో ప్రాజెక్టులు, డ్రెయిన్స్ సరిగా నిర్వహించలేదని, విధ్వంసం జరిగిందని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. సాగు నీటి కాల్వలపై ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. రిపేర్లు, అత్యవసర గండ్లు పూడ్చడం, గట్లు బలోపేతం చేపట్టలేదని, పులిచింతల గేట్లు, గుండ్లకమ్మ గేట్లు కొట్టుకు పోయాయని, అన్నమయ్యప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి 42 మంది ప్రాణాలు పోయాయన్నారు. లస్కర్లకు ఏడాది నుంచి జీతాలు ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో 1,040 లిఫ్టు పథకాలు ఉంటే 450 మూతపడ్డాయన్నారు.వీటి నిర్వహణకు ఏడాదికి రూ.983 కోట్లు కేటాయించాలని ప్లానింగ్ కమిషన్ సూచిస్తే ఐదేళ్లలో రూ.125 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. 2014–19 మధ్య క్యాపిటల్ హెడ్, మెయింటెనెన్స్ ఇతరత్రాకు రూ.5,091 కోట్లు కేటాయిస్తే గత ఐదేళ్లలో రూ.1,340 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. రూ. 284.04 కోట్లతో సాగునీటి కాల్వల నిర్వహణ చేపడతామని తెలిపారు. అడవిపల్లి రిజర్వాయర్‌పై ప్రాజెక్టు పూర్తయిందని, కానీ, రిజర్వాయర్‌కు నీటిని తీసుకొచ్చే కాల్వల పనులను గత ప్రభుత్వం చేపట్టలేదని మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు.గిరిజన డ్వాక్రా సంఘాలకు బకాయిల్లేవు : మంత్రి సంధ్యారాణిఐటీడీఏల పరిధిలోని డ్వాక్రా గ్రూపులకు 2019–24 మధ్య ప్రభుత్వం నుంచి ఎలాంటి బకాయిలు లేవని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు పి.విష్ణుకుమార్‌రాజు, డాక్టర్ వాల్మీకి పార్థసారధి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈమేరకు సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం గిరిజన యువతకు శిక్షణ ఇవ్వలేదని, కాఫీని ప్రోత్సహించలేదని అన్నారు.భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు: మంత్రి వాసంశెట్టి సుభాష్రాష్ట్రంలోని 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. వీరి నుంచి రూ.100 చొప్పున కార్మిక సంక్షేమ మండలికి చెల్లిస్తారని, ప్రస్తుతం బోర్డులో రూ.40.89 కోట్లు ఉన్నాయని తెలిపారు. 2007నుంచి క్లెయిమ్స్ పెండింగ్‌లో ఉన్నాయని, రూ.7.38 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. వీటిని పరిశీలించి ఇవ్వాలన్నారు. చేనేతకు గత టీడీపీ పథకాలన్నీఅమలు చేస్తాం: మంత్రి సవితగత ఐదేళ్లలో చేనేత కార్మికుల పరిస్థితి బాగాలేదని, కొన్నిచోట్ల ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత చెప్పారు. చేనేత కార్మికులకు నూలు, విద్యుత్, ఇంధనం, షెడ్ల నిర్మాణానికి రాయితీలు, శిక్షణ, ముడి సరుకు సరఫరా, అమ్మకాలు, మార్కెటింగ్‌పై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. చేనేతకు గత టీడీపీ పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పారు. 2019 తర్వాత వైఎస్ జగన్ నేతన్నలను మోసం చేశారన్నారు. 86 వేల మందికి నేతన్న నేస్తం అందించారని, అవన్నీ పార్టీ కార్యకర్తలకే ఇచ్చారన్నారు.ఆక్వాకు ఇంధన సబ్సిడీ ఇవ్వలేం: మంత్రి గొట్టిపాటి రవికుమార్ఆక్వా రైతులకు షరతుల్లేకుండా విద్యుత్ సబ్సిడీని వర్తింపజేసే ప్రతిపాదన ఏదీ లేదని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జోన్‌తో సంబంధం లేకుండా యూనిట్ రూ.1.50 కే విద్యుత్ ఇవ్వడంపై ప్రభుత్వం ఆలోచిస్తుందని, ప్రస్తుతం డిస్కంలు రూ.1.12 లక్షల కోట్ల అప్పులతో ఉన్నాయని తెలిపారు. 2019 నుంచి ట్రాన్స్ఫార్మర్ల కోసం ఆక్వా రైతుల నుంచి అందనంగా డబ్బులు వసూలు చేయలేదని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం జీవోలతో గందరగోళం సృష్టించిందన్నారు. డిస్కంలకు రూ.1,990 కోట్లు బాకీ పెట్టారని చెప్పారు. 2018–19లో 46,329 మంది రైతులకు విద్యుత్ సబ్సిడీ ఇస్తే.. 2022–23లో 31 వేల మందికి తగ్గిపోయిందన్నారు.మీరు కట్టింది ఏ చీర?ఎమ్మెల్యేని ఆరా తీసిన డిప్యూటీ స్పీకర్ చేనేత కార్మికులకు ప్రోత్సాహకాలపై మంత్రి సవిత సమాధానం చెప్పిన అనంతరం ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అనుబంధ ప్రశ్నపై మాట్లాడారు. రాష్ట్రంలో చేనేత రంగం సంక్షోభంలో ఉందని, ముడి సరుకుల ధరలు పెరిగిపోయాయని, ఉత్పత్తుల ధరలు పెరగట్లేదని అన్నారు. 50 శాతం మగ్గాలు మూతపడ్డాయన్నారు. నేతన్నలకు నెలకు నికర ఆదాయం రూ.10 వేలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, ముడిసరుకుపై సబ్సిడీ పెంచాలని, నేత కార్మికుల షెడ్లకు బడ్జెట్ ఇవ్వాలంటూ పలు సూచనలు చేశారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వారిస్తూ.. ప్రశ్నోత్తరాల సమయంలో సూచనలు ఇవ్వొద్దని అన్నారు. ఇప్పటికే ఎక్కువ చేశారంటూ అడ్డుకున్నారు. నెలలో ఒక రోజు చేనేత వస్త్రాలు వేసుకునేలా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సూచనలు చేయాలని మాధవి సూచించగా.. డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ ‘మీరు సభకు ఇప్పుడు చేనేత వేసుకున్నారా? మీ శారీ చేనేతేనా?’ అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ‘చేనేతే’ అని బదులివ్వడంతో ‘సంతోషం’అంటూ నిట్టూర్చారు.ఎంతమంది పిల్లలున్నా సహకార ఎన్నికల్లో పోటీ! ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న రైతులకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్), జిల్లా సహకారం కేంద్రం బ్యాంక్ (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సమాఖ్య (డీసీఎంఎస్) ఎన్నికల్లో పోటీకి అర్హత కలి్పస్తూ ఏపీ సహకార సంఘాల చట్టంలో సవరణలు చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం శాసన సభలో ప్రకటించారు. అదే విధంగా సహకార చట్టంలో రైతు భరోసా కేంద్రాల పేరును రైతు సేవా కేంద్రాలుగా మార్పు చేసినట్లు వివరించారు. ఈ సవరణలకు సంబంధించిన ఏపీ సహకార సంఘాల సవరణ బిల్–2024ను శాసన సభలో అచ్చెన్న ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో సభ బిల్లుకు ఆమోదం తెలిపింది. అదే విధంగా ఏపీ ఎక్సైజ్ సవరణ బిల్–2024, ఏపీ(ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్ ట్రేడ్ రెగ్యులేషన్) సవరణ బిల్–2024, ఏపీ మద్య నిషేధ సవరణ బిల్–2024ను అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సభలో ప్రవేశపెట్టారు. -
Students Hair Cuts: కాలేజీకి ఆలస్యంగా వచ్చారని విద్యార్థినుల జుట్టు కత్తిరింపు..
-
పరీక్షల వేళ.. ఫీజుల పేచీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలు మళ్లీ ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. పలు యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను బహిష్కరించాలని నిర్ణయించాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించే వరకూ ఆందోళన కొనసాగించాలని భావిస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఇంతకుముందే గత నెల 14 నుంచి నాలుగు రోజుల పాటు ప్రైవేటు కాలేజీలను యాజమాన్యాలు మూసివేశాయి. 17వ తేదీన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వారంలో బకాయిలు చెల్లిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో... ఆందోళన విరమిస్తున్నట్టు యాజమాన్యాలు ప్రకటించాయి. కానీ ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదని, దీనితో పరీక్షలు బహిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నట్టు ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మంగళవారం నుంచి, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 21 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు జరగాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, కాలేజీల తీరుపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 7 లక్షల మంది డిగ్రీ, పీజీ విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందంటూ.. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని, సిబ్బందికి వేతనాలు ఇవ్వడం కూడా కష్టంగా మారిందని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బకాయిలు చెల్లిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిందని గుర్తు చేస్తున్నాయి. ఇప్పటికే నాలుగైదు నెలలుగా సిబ్బందికి సరిగా వేతనాలు చెల్లించలేదని.. భవనాల అద్దె, ఇతర ఖర్చులకూ ఇబ్బంది నెలకొందని పేర్కొంటున్నాయి. పరీక్షలు జరగనివ్వండి ప్లీజ్: ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి ప్రైవేటు డిగ్రీ కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులతో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి చర్చలు జరిపారు. ఈ వివరాలను ఆయన మీడియాకు తెలిపారు. పరీక్షలు బహిష్కరిస్తే విద్యార్థులు ఆందోళన చెందే అవకాశం ఉందని.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఆందోళనకు దిగవద్దని కాలేజీలను కోరానని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం సీఎం కలవాలని సూచించినట్టు చెప్పారు. వారు పరిస్థితిని అర్థం చేసుకుంటానే నమ్మకం కలిగిందన్నారు. బకాయిలు చెల్లించాలి గత నెలలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి హామీ మేరకు ఆందోళన విరమించాం. కానీ ఆ హామీ నిలబెట్టుకోలేదు. కాలేజీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి. మా నిరసన తెలియజేయడానికే నవంబర్ 19 నుంచి కాలేజీల్లో నిరవధిక బంద్ పాటించాలని నిర్ణయించాం. – డాక్టర్ బొజ్జ సూర్యనారాయణరెడ్డి, ప్రైవేటు పీజీ, డిగ్రీ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు -
మూడేళ్లకు ముందుగానే ‘డిగ్రీ’
సాక్షి, అమరావతి: ఇక నుంచి ప్రతిభ కలిగిన విద్యార్థులు మూడేళ్ల డిగ్రీని రెండేళ్లలోనే పూర్తి చేయవచ్చు. వ్యక్తిగత అవసరాలు ఉంటే రెండేళ్ల తర్వాత కోర్సు నుంచి బయటకు వెళ్లి మళ్లీ ప్రవేశించి నాలుగేళ్లలో ముగించవచ్చు. ఈ మేరకు సంప్రదాయ డిగ్రీ విద్యలో సరళీకృత విధానానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రణాళికలు రూపొందిస్తోంది. సామర్థ్యం కలిగిన విద్యార్థులు వేగంగా చదువును పూర్తి చేసుకునేందుకు వీలుగా మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. ఇందులో ఒక విద్యార్థి కోర్సు వ్యవధిని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అంటే మూడేళ్ల డిగ్రీని రెండు లేదా రెండున్నరేళ్లలో, నాలుగేళ్ల డిగ్రీని మూడేళ్లలోనే పూర్తి చేయవచ్చు. మూడేళ్ల డిగ్రీని నాలుగేళ్లలో పూర్తి చేయవచ్చు. ఇటీవల చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరైన యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ్‌కుమార్ డిగ్రీ విద్యలో సరికొత్త మార్పులు తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. ఈ మార్పులను వచ్చే విద్యా సంవత్సరం(2025–26) నుంచి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.సమయం.. ఆర్థిక వనరులు ఆదా!నూతన జాతీయ విద్యావిధానం–2020తో దేశ ఉన్నత విద్యలో అనేక మార్పులు వచ్చాయి. తాజాగా సామర్థ్యం కలిగిన విద్యార్థులు తక్కువ వ్యవధిలో డిగ్రీ ప్రోగ్రామ్స్‌ను పూర్తి చేసుకునేందుకు వీలుగా ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ కామకోటి నేతృత్వంలోని కమిటీ యాక్సిలరేటెడ్, స్లో–పేస్డ్ డిగ్రీలపై సిఫార్సులు చేసింది. దీనికి యూజీసీ సైతం ఆమోదం తెలిపింది. త్వరలోనే పూర్తిస్థాయి మార్గదర్శకాలు వెలువడనున్నాయి. ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం ముందుగానే విద్యార్థి తన డిగ్రీ చదువును ముగించడం ద్వారా త్వరగా వర్క్ ఫోర్స్‌లోకి, ఉన్నత విద్యలోకి ప్రవేశించవచ్చని అంచనా వేస్తున్నారు. తద్వారా సమయంతోపాటు ఆర్థిక వనరులను ఆదా చేసుకోవచ్చు. విద్యార్థులు తమ విద్యను వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలతో సమతుల్యం చేసుకోవడానికి కూడా ఈ విధానం సహాయపడుతుందని యూజీసీ భావిస్తోంది.విద్య నాణ్యత దిగజారుతుందని విద్యావేత్తల ఆందోళన యూజీసీ ఇప్పటికే డిగ్రీ విద్యలో నిష్క్రమణ ఎంపికలను ప్రవేశపెట్టింది. ఈసారి విద్యాపరమైన సవాళ్ల ఆధారంగా విద్యార్థులు తమ ప్రోగ్రామ్స్ నుంచి బయటకు వచ్చి తిరిగి ప్రవేశించాలనుకునే వారికి అవకాశం ఇస్తోంది. ఇది ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న విద్యార్థులకు తమ జీవిత బాధ్యతలను సమతుల్యం చేసుకోవాడానికి అనువుగా ఉంటుందని భావిస్తోంది. అయితే డిగ్రీ ప్రోగ్రామ్స్‌లో ఇప్పటికే కోర్ కంటెంట్ తగ్గిపోతుందని, ఇలాంటి చర్యలతో విద్య నాణ్యత దిగజారుతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇది ఉపాధి సంక్షోభానికి దారి తీసిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీని నిర్వహిస్తున్న క్రమంలో కోర్సు కాల వ్యవధిని తగ్గించడం అంటే విద్య నాణ్యతను ప్రశ్నార్థకంలో పడేస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
హాస్టళ్లలో సం‘క్షేమం’ లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తరచూ ఆందోళన కలిగించే భయంకర ఘటనలు జరుగుతున్నాయని తెలిపింది. ఇలాంటి ఘటనలపై స్పందించకపోతే భవిష్యత్ తరాలపై అది తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపింది. ‘వివిధ సామాజిక, ఆర్ధిక నేపథ్యాల నుంచి వచ్చిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్స్ స్కూళ్లను ఏర్పాటు చేశారు. వీటిలో చదివే విద్యార్థులు భద్రంగా, సురక్షితంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత టీచర్లు, ప్రిన్సిపల్ది. రెసిడెన్షియల్ క్యాంపస్‌లో చదువుకునే అమ్మాయిలతో అక్కడ పనిచేసే సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించినా, వారిని లైంగికంగా వేధించినా అది పిల్లల తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తుంది. తద్వారా తమ పిల్లలను ఆ క్యాంపస్‌లో చేర్చడానికి వారు విముఖత చూపుతారు. సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ క్యాంపస్‌లలో భద్రమైన, సురక్షిత, పరిశుభ్ర వాతావరణం ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోతే విద్యా పరంగా గ్రామీణ, పట్టణ పిల్లల మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది’ అని పేర్కొంది. అనంతపురం జిల్లా నార్పల మండలం బి.పప్పూరు గ్రామానికి చెందిన కె.శంకరయ్య గుత్తిలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్లో వంట మనిషిగా పని చేస్తూ 2011 జూలై 24న ఓ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. అధికారులు విచారించి అతన్నిసర్వీసు నుంచి తొలగించారు. దీనిని సవాలు చేస్తూ 2014 ఫిబ్రవరిలో అతను హైకోర్టును ఆశ్రయించాడు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ తుది విచారణ జరిపి.. శంకరయ్యపై తీసుకున్న చర్యలు సబబే అని మూడు రోజుల క్రితం తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై లోతుగా స్పందిస్తూ ప్రాథమిక మార్గదర్శకాలు జారీ చేశారు. వీటి ఆధారంగా రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో కఠినంగా అమలయ్యే విధంగా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు. కర్నూలు జిల్లా కోసిగిలో మురుగుతో పందులకు ఆవాసంగా మారిన హాస్టల్ ప్రాంగణం హైకోర్టు సూచించిన ప్రాథమిక మార్గదర్శకాలు ఇలా.. ⇒ హాస్టల్ భవనం చుట్టూ సోలార్ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్‌తో ప్రహరీ నిర్మించాలి. తప్పనిసరిగా గేటు ఏర్పాటు చేయాలి. ⇒ హాస్టల్ ప్రాంగణంలో రాకపోకలను పర్యవేక్షించడంతో పాటు వాటిని ఎంట్రీ, ఎగ్జిట్ రిజిస్టర్లో నమోదు చేయాలి. ⇒ హాస్టల్ ప్రవేశ మార్గం, కారిడార్లు, కామన్ ఏరియాలు వంటి చోట్ల విద్యార్థుల వ్యక్తిగత గోపత్యకు భంగం కలగకుండా సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. అనధికారికంగా ఆ కెమెరాలను ఆపరేట్ చేయకుండా చర్యలు తీసుకోవాలి. ⇒ మరుగుదొడ్లను శుభ్రంగా నిర్వహించాలి. తగిన నీటి సదుపాయం కల్పించాలి. ⇒ భద్రతా సిబ్బంది సహా మొత్తం సిబ్బంది నేపథ్యాన్ని సమగ్రంగా పరిశీలన చేయాలి. తరచూ శిక్షణ, అవగాహన సెషన్లు ఏర్పాటు చేయాలి. ⇒ సిబ్బంది ముఖ్యంగా ఆడ పిల్లలతో సన్నిహితంగా మెలిగే వారికి లింగ సమానత్వం గురించి, సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా తగిన శిక్షణ ఇవ్వాలి. తద్వారా సమస్య ఏదైనా ఎదురైనప్పుడు ఆడ పిల్లలు ధైర్యంగా ముందుకు వచ్చే సురక్షిత వాతావరణం కల్పించడం సాధ్యమవుతుంది. ⇒ సిబ్బందికి స్పష్టమైన ప్రవర్తనా నియమావళిని నిర్ధేశించాలి. దుష్ప్రవర్తన, అసభ్య ప్రవర్తన, వేధింపులకు ఆస్కారం లేకుండా చూడాలి. ప్రవర్తనా నియమావళిని అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలి. ⇒ హాస్టల్ వాతావరణానికి అలవాటు పడేలా, వ్యక్తిగత సమస్యల నుంచి బయట పడేలా ఆడ పిల్లలకు మానసిక వైద్యులను అందుబాటులో ఉంచాలి. ఆత్మరక్షణకు వర్క్‌షాపులు నిర్వహించండి ⇒ హాస్టళ్లన్నీ జాతీయ శిశు సంరక్షణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ప్రతి చోట పోక్సో చట్టం అమలయ్యేలా చూడాలి. పోక్సో చట్టం కింద విధించే శిక్షల గురించి అందరికీ కనిపించే చోట పోస్టర్లు ఏర్పాటు చేయాలి. ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ఫిర్యాదు చేసేలా వ్యవస్థ ఉండాలి. ⇒ తల్లిదండ్రులు, స్థానిక అధికారులు, విద్యా నిర్వహకులు కలిసి ఆడ పిల్లలకు మద్దతుగా నిలిచే వ్యవస్థను సృష్టించాలి. ఆడ పిల్లలు తమను తాము రక్షించుకునేందుకు వీలుగా ఆత్మ రక్షణకు సంబంధించిన వర్క్‌షాపులను తరచూ నిర్వహించాలి. దీని వల్ల అభద్రతా పరిస్థితుల్లో ఆడ పిల్లలు మనోస్థైర్యంతో ధైర్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ⇒ హాస్టళ్లలో సమ వయసు్కలతో బృందాలను ఏర్పాటు చేయాలి. తద్వారా విపత్కర పరిస్థితుల్లో ఒకరి బాగోగులు మరొకరు చూసుకునే అవకాశం ఉంటుంది. భద్రత పరమైన చర్యలు సమర్థవంతంగా అమలవుతున్నాయా లేదా అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. లోపాలు ఉంటే వాటిని గుర్తించి సరిచేయాలి. ⇒ హాస్టళ్లలో ఉండే విద్యార్థులతో పాటు వారి కుటుంబాల నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉండాలి. తద్వారా మరింత మెరుగైన ఏర్పాట్లు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో సాయం చేసేందుకు వీలుగా చట్టాన్ని అమలు చేసే సంస్థలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉండాలి. ⇒ ఈ చర్యలన్నింటి ద్వారా రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఆడపిల్లల భద్రతకు పెద్దపీట వేసినట్లు అవుతుంది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా సమగ్ర, ఆదేశ పూర్వక మార్గదర్శకాల రూపకల్పనకు వీలుగా ఈ తీర్పు కాపీని మహిళ, శిశు సంక్షేమ శాఖకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశిస్తున్నాం.ఇప్పటికీ హాస్టళ్ల పరిస్థితిలో మార్పు లేదు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రికార్డులను కూడా పరిశీలించారు. అనంతరం తీర్పు వెలువరిస్తూ, పిటిషనర్ తీరును తీవ్రంగా ఆక్షేపించారు. శంకరయ్యది తీవ్ర దుష్ప్రవర్తన అని తేల్చారు. హాస్టల్లో నిద్రపోతున్న బాలికల పట్ల శంకరయ్య అనుచిత ప్రవర్తన గురించి ఓ టీచర్ అధికారులకు స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. నిద్రపోయే సమయంలో తలుపులేసుకోవడంతో పాటు తాళం కూడా వేసుకోవాలని బాలికలకు ఆ టీచర్ చెప్పారంటే శంకరయ్యది ఎలాంటి అభ్యంతరకర ప్రవర్తనో అర్థం చేసుకోవచ్చన్నారు. శంకరయ్యను సర్వీసు నుంచి తొలగిస్తూ అధికారులు ఇచ్చిన ప్రొసీడింగ్స్‌లో ఎలాంటి తప్పు లేదని, వాటిని సమర్ధిస్తున్నట్లు జస్టిస్ హరినాథ్ తన తీర్పులో పేర్కొన్నారు. ఈ ఘటన జరిగి 13 ఏళ్లు గడిచిపోయినప్పటికీ సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, స్కూళ్ల పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. -
కూటమి పాపం .. నిరుపేద విద్యార్థులకు శాపం
-
బూచోడు.. లక్షల మంది స్టూడెంట్స్ కి విలన్
-
56 మంది గురుకుల విద్యార్థులకు అస్వస్థత
సత్యవేడు: తిరుపతి జిల్లా సత్యవేడులోని గురుకుల పాఠశాలకు చెందిన 56 మంది విద్యార్థులు విషజ్వరంతో తీవ్ర అస్వస్థతకు గురై గురువారం ఆస్పత్రిలో చేరారు. సత్యవేడులోని జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో 414 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రెండు రోజుల క్రితం ఐదుగురు విద్యార్థులకు జ్వరం వచ్చింది. గురువారం మరో 51 మంది జ్వరాల బారిన పడ్డారు.దీంతో వారిని సత్యవేడు కమ్యూనిటీ వైద్యశాలలో చేర్పించారు. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం హాస్టల్లో భోజనానికి వెళ్లినపుడు వర్షాల్లో తడవడం, రెండు రోజుల క్రితం జ్వరం వచ్చిన వారు అందరితో కలసి ఉండడం వల్ల మిగిలిన వారికి కూడా విష జ్వరాలు సోకాయని వైద్యులు చెబుతున్నారు. జ్వర పీడిత విద్యార్థులను వేరుగా మరో గదిలో ఉంచాలని సూచించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులతో వైద్యశాల నిండిపోయింది. -
నాణ్యత లేకుంటే జైలే!: సీఎం రేవంత్
ఓటు హక్కుకు అర్హత 21 ఏళ్లుగా ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు 25 ఏళ్లకు లభించేది. ఇప్పుడు ఓటుహక్కుకు అర్హత 18 ఏళ్లకు తగ్గింది కాబట్టి పోటీ చేసే వయసును కూడా 21 ఏళ్లకు తగ్గించాలి. అప్పుడే ఎక్కువ మంది యువత రాజకీయాల్లోకి వస్తారు. – మాక్ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిసాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాలకు నాసిరకం బియ్యం, కూరగాయలు సరఫరా చేస్తే కాంట్రాక్టర్లతో ఊచలు లెక్కబెట్టిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కలుషిత ఆహారం సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వ గురుకులాల్లో నాసిరకం భోజనం వల్ల విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటోందని, దీన్ని దృష్టిలో ఉంచుకునే కేటాయింపులు పెంచామని తెలిపారు. విద్యార్థి నులకు కాస్మెటిక్ చార్జీలు సకాలంలో చెల్లిస్తున్నామన్నారు. కాంట్రాక్టర్ల బిల్లులు ఆపి అయినా, విద్యార్థులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని గ్రీన్ చానల్ ద్వారా సకాలంలో ఇవ్వాల్సిందిగా ఆదేశించామన్నారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఉన్నతాధికారులు వారానికి రెండుసార్లు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాలని సూచించారు. ఈ ఆదేశాలను నిర్లక్ష్యం చేసే వారికి భవిష్యత్ ప్రయోజనాల్లో ప్రాధాన్యత ఇవ్వబోమని చెప్పారు. ప్రజా ప్రతినిధులు కూడా స్కూళ్లకు వెళ్లాలన్నారు. కుల గణనపై కొంతమంది కుట్ర చేస్తున్నారని, దీన్ని విద్యార్థి లోకం సమర్థవంతంగా తిప్పికొట్టాలని కోరారు. జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గురువారం బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జిల్లాల నుంచి వచ్చిన బాలలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లపై విశ్వాసం పెంచాలి ‘ప్రభుత్వ స్కూళ్ల ప్రతిష్ట దెబ్బతింటోంది. గత ప్రభుత్వ హయాంలో ఐదు వేల పాఠశాలలు మూతపడ్డాయి. రాష్ట్రంలో 26 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతుంటే, 36 లక్షల మంది ప్రైవేటు స్కూళ్ళకు వెళ్తున్నారు. అన్ని సౌకర్యాలున్నా, అర్హులైన టీచర్లు ఉన్నా ఈ పరిస్థితి ఎందుకుందో ఆత్మ విమర్శ చేసుకోవాలి. కలెక్టర్లు, ఎస్పీలు స్కూళ్లకు వెళ్లాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు కూడా తమ పరిధిలోని ప్రభుత్వ స్కూళ్ళకు వెళ్ళాలి. విద్యార్థుల్లో విశ్వాసం కల్పించాలి. రెసిడెన్షియల్ స్కూళ్ళలో సన్న బియ్యంతో అన్నం పెట్టాలి. అందుకే రైతులకు రూ.500 బోనస్ ఇస్తున్నాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. విద్యా రంగానికి పెద్దపీట ‘విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. 20 వేలమంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాం. 35 వేలమంది టీచర్ల బదిలీలు పూర్తి చేశాం. 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. ప్రభుత్వ స్కూళ్ళకు ఉచిత విద్యుత్ ఇచ్చాం. వర్సిటీలకు వీసీలను నియమించాం. త్వరలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తాం. విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల కోసం విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశాం. గత సీఎం మనవడి కుక్క చనిపోతే డాక్టర్‌ను జైల్లో పెట్టారు. విద్యార్థులు చనిపోతే కనీసం కన్నీరు కూడా పెట్టలేదు..’అని రేవంత్ అన్నారు. ‘తెలంగాణకు విద్యార్థులే పునాదులని, తమ ప్రభుత్వం చేకూర్చే ప్రయోజనాలను అందరికీ తెలియజెప్పాల్సిన బాధ్యత వారిదేనని అన్నారు. భవిష్యత్‌లో ఎలాంటి వ్యసనాలకు బానిసలం కాబోమని, ఉన్నత విద్యలో రాణిస్తామని ప్రమాణం చేయాలని బాలలను సీఎం కోరారు. చదువులోనే కాదు.. క్రీడల్లో రాణించినా ఉద్యోగాలు ఇస్తామని సీఎం ప్రకటించారు. కుల గణన మెగా హెల్త్ చెకప్ లాంటిది ‘కులగణనను అడ్డుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఇది సమాజానికి మెగా ఆరోగ్య పరీక్ష వంటిది. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందాలన్నా, సామాజిక న్యాయం జరగాలన్నా, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అన్ని వర్గాలకు పెరగాలన్నా, నిధుల కేటాయింపు జరగాలన్నా కుల గణనే కీలకం. కులగణన ఆధారంగా భవిష్యత్తులో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అందుబాటులోకి తేవాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దీనిద్వారా ఎవరి ఆస్తులూ లాక్కోవడం జరగదు. సంక్షేమ పథకాలు అందకుండా పోవడం అంటూ ఉండదు. విద్యార్థులు కూడా కులగణన వివరాలు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి..’అని రేవంత్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ప్లానింగ్ బోర్డు చైర్మన్ చిన్నారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యా డైరెక్టర్ నర్సింహారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ పుస్తకాన్ని, తెలంగాణ విద్యా ప్రగతి సూచించే పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు పారితోషికం అందజేశారు ‘21 ఏళ్ళకే పోటీ చేసే హక్కు’తీర్మానం చేయండి ఎస్సీఈఆర్టీలో గురువారం జరిగిన అండర్ 18 విద్యార్థుల నమూన అసెంబ్లీ సమావేశ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయాల్లో పోటీ చేసే వయసును 25 ఏళ్ళ నుంచి 21 ఏళ్ళకు తగ్గించాలని, ఈ విధంగా చేసిన మాక్ అసెంబ్లీ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపాలని సూచించారు. రాష్ట్ర అసెంబ్లీలోనూ ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టాలని సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబుకు సూచించారు. ఓటు హక్కుకు అర్హత 21 ఏళ్ళుగా ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు 25 ఏళ్లకు లభించేదని, ఇప్పుడు ఓటు హక్కుకు అర్హత 18 ఏళ్ళకు తగ్గింది కాబట్టి పోటీ చేసే వయసును కూడా 21 ఏళ్ళకు తగ్గిస్తే ఎక్కువమంది యువత రాజకీయాల్లోకి వస్తారని సీఎం పేర్కొన్నారు. -
ముద్ద అన్నం.. తింటే కడుపు నొస్తోంది
తిమ్మాపూర్: ‘వారం రోజులుగా హాస్టళ్లలో అన్నం నాసిరకంగా ఉంటోంది. ముద్దలు ముద్దలుగా ఉండటంతో పాటు వాసన వస్తోంది. తినలేకపోతున్నాం. ఆకలవుతోందని తింటే కడుపునొస్తోంది. దీంతో చాలా మంది విద్యార్థులు ఆస్పత్రి పాలవుతున్నారు. హాస్టల్ అధికారులు విషయాన్ని బయటకు తెలియనివ్వడం లేదు. మేము అధికారులకు ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకోవడం లేదు.వారంరోజులుగా కడుపునిండా తిండిలేక నీరసించిపోతున్నాం’అంటూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ మహాత్మా జ్యోతిబాఫూలే బాలుర పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తల్లిదండ్రులతో కలిసి ఆందోళనకు దిగారు. బియ్యంలో కల్తీ లేదు: ప్రిన్సిపాల్ రామకృష్ణ కాలనీలోని జ్యోతిబాపూలే బాలుర గురుకులంలో 450 మంది విద్యార్థులు ఉన్నారు. ఈనెల ఒకటో తేదీ నుంచే గురుకుల భోజనం చార్జీలను ప్రభుత్వం 40 శాతం పెంచింది. తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. అయినా అధికారులు మెనూ మార్చకపోగా, నాసిరకంగా అన్నం పెట్టడంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారానికి రెండుసార్లు మాంసాహారం పెట్టాల్సి ఉండగా సరిగ్గా పెట్టడం లేదని, కోడిగుడ్లు వారానికి రెండు మూడే ఇస్తున్నారని తెలిపారు. వారం రోజులుగా ఓపిక పట్టిన విద్యార్థులు మంగళవారం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ప్రిన్సిపాల్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ భోజనం ఎలా తినాలని నిలదీశారు. మీ పిల్లలకు ఇలాగే పెడుతున్నారా అని ప్రశ్నించారు. సివిల్ సప్లయ్ అధికారులు నాసిరకం బియ్యం పంపుతున్నారని, దాంతో మెత్తగా అవుతోందని, బియ్యంలో ఎలాంటి కల్తీ లేదని, కావాలనే కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని ప్రిన్సిపాల్ వెంకటరమణ తెలిపారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గురుకులంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. మిగతా వాటి పరిస్థితి ఏంటని విద్యార్థి సంఘ నాయకులు ప్రశ్నిస్తున్నారు. -
Foreign Students: వుయ్ ఆర్ విదేశీ
భాగ్యనగరం.. రోజూ వేలాది మంది నగరానికి వస్తుంటారు. వారందరికీ హైదరాబాద్ పట్నం.. ఓ కల్పతరువులా మారుతోంది. ఎవరు వచి్చనా అందరినీ ఆదుకుంటుంది.. ఆదరిస్తుంటుంది. ఇలా రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు, వేరే రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఎంతో మంది వస్తుంటారు. వారందరినీ హైదరాబాద్ అక్కున చేర్చుకుంటోంది.. వ్యాపారం, పర్యాటకం కోసమే కాకుండా పై చదువుల కోసం కూడా ఇక్కడికి వస్తున్నారు. వీరందరినీ అమ్మలా ఆదరిస్తోంది భాగ్యనగరం.. వారంతా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, భాషపై ఎంతో మక్కువ చూపిస్తున్నారు. మన సంస్కృతిని అలవర్చుకుంటున్నారు. ఇక్కడి వారితో స్నేహం చేస్తూ.. కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు. వేర్వేరు దేశాల నుంచి.. వేర్వేరు సంస్కృతుల నుంచి తమ కలలను సాకారం చేసుకునేందుకు ఎల్లలు దాటి ఇక్కడికి వచ్చిన కొందరు విదేశీ విద్యార్థుల మనోగతం తెలుసుకుందాం.. దేశం కాని, దేశం.. భాష కాని భాష.. అనుకోకుండా కొందరు.. ఇష్టంతో కొందరు ఇలా ఎంతో మంది భాగ్యనగరం గడ్డపై అడుగుపెట్టారు. కొత్త వాతావరణం, కొత్త మనుషులు, కొత్త ఆహారం ఇక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న భయం.. అనుమానం.. వాటన్నింటినీ భాగ్యనగరం ప్రజలు, వాతావరణం పటాపంచలు చేశాయి. కొత్త, వింత అనుకున్న సంస్కృతి, సంప్రదాయమే ఇప్పుడు వారికి ఎంతో ఇష్టంగా మారిపోయింది. ఈ సంస్కృతిలో భాగమవుతున్నారు. ఎలాంటి భయం లేకుండా మాతృభూమిపై ఉన్నట్టుగా స్వేచ్ఛగా జీవిస్తున్నారు. తెలుగుతో పాటు ఉర్దూ భాషలపై మమకారం పెంచుకుని వాటిని నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడి పర్యాటక ప్రదేశాలను చూసి మురిసిపోతున్నారు. ఎంతోమంది స్నేహితులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజీల్లో విదేశీ విద్యార్థులకు డిగ్రీ, పీజీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సుల్లో చేరేందుకు వేలాది మంది ఇక్కడికి వచ్చి కాలేజీల్లో చేరుతున్నారు. నిజాం కాలేజీలోనే దాదాపు 300 మంది విద్యార్థులు ఏటా వస్తున్నారని చెబుతున్నారు. ఇక, వేరే కాలేజీలు, యూనివర్సిటీలు కలిపి 2 వేలకు పైగా విద్యార్థులు ఏటా వస్తున్నారు. నిబద్ధతతో నేర్చుకుంటారు.. ఇక్కడికి వచ్చే విదేశీ విద్యార్థులు పాఠాలను ఎంతో నిబద్ధతతో నేర్చుకుంటారు. ఏటా వందలాది మంది విద్యార్థులు వివిధ దేశాల నుంచి వస్తుంటారు. ఇక్కడ చదువుకుని వెళ్లిన వారు వారి బంధువులకు కూడా ఈ కాలేజీ గురించి చెప్పి ఇక్కడికి పంపిస్తుంటారు. అక్కడికి వెళ్లిన తర్వాత వారు మంచి ఉద్యోగాలు సాధించామని ఫోన్ చేసి చెబుతుంటారు. ఇక్కడి పిల్లలతో కలిసిపోతుంటారు. విదేశీ విద్యార్థులకు కాలేజీలో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా మేం చూసుకుంటాం. – ప్రొ.మహ్మద్ అబ్దుల్ అలీ, విదేశీ విద్యార్థలు కో–ఆర్డినేటర్, నిజాం కాలేజీ ఫీజులు కాస్త తక్కువ.. తమ దేశాలతో పోలిస్తే ఇక్కడ ఫీజులు కాస్త తక్కువగా ఉండటమే కాకుండా, చదువు కూడా క్వాలిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నారు. సుడాన్, తుర్కెమెనిస్తాన్, యెమెన్, సోమాలియా వంటి దేశాల నుంచి ఎక్కువగా వస్తుంటారని నిజాం కాలేజీ విదేశీ విద్యార్థుల కో–ఆర్డినేటర్ మహ్మద్ అబ్దుల్ అలీ తెలిపారు. స్థానిక విద్యార్థులు కూడా విదేశీ విద్యార్థులతో కలివిడిగా ఉంటూ, వారికి ఏ అవసరం ఉన్నా కూడా సాయపడుతున్నారు. భాష సమస్య ఉన్నా కూడా అందరూ కలిసిమెలిసి ఉంటామని, ఇంగ్లి‹Ùలో కమ్యూనికేట్ అవుతుంటామని నిజాం కాలేజీలోని పలువురు విదేశీ విద్యార్థులు పేర్కొన్నారు. తమకు ఇక్కడి వారు చాలా మంది స్నేహితులు ఉన్నారని, సెలవులు ఉన్నప్పుడు వారితో హైదరాబాద్‌లోని సందర్శనీయ ప్రదేశాలకు వెళ్లి వస్తుంటామని వివరించారు.సంస్కృతి చాలా ఇష్టం..హైదరాబాద్ సంస్కృతి అంటే చాలా ఇష్టం. మట్టిగాజులు, మెహందీ మా దేశంలో ఎవరూ వేసుకోరు. కానీ నాకు వాటిపై ఎంతో ఇష్టం పెరిగింది. అందుకే ఎప్పుడూ మెహందీ పెట్టుకుంటాను. గాజులు వేసుకుంటాను. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాల గురించి ఫ్రెండ్స్‌ను అప్పుడప్పుడూ అడిగి తెలుసుకుంటాను. భారత్‌కు ముఖ్యంగా హైదరాబాద్ రావడం చాలా సంతోషంగా ఉంది. – దుర్సుంజెమల్ ఇమ్రుజకోవా, బీఏ ఫస్ట్ ఇయర్, నిజాం కాలేజీ, తుర్క్మెనిస్తాన్సొంతూర్లో ఉన్నట్టే.. ఇక్కడ చదువుకున్న ఓ బంధువు నిజాం కాలేజీ గురించి చెబితే ఇక్కడ చేరాను. మొదట్లో ఇక్కడి వాతావరణం, ఆహరంతో కాస్త ఇబ్బంది పడేదాన్ని. కానీ ఇప్పుడు అలవాటైంది. స్టూడెంట్స్, ప్రొఫెసర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. స్నేహితులతో కలిసి ఓ ఫ్లాట్‌లో ఉంటాం. మా వంట మేమే చేసుకుంటాం. అప్పుడప్పుడూ ఇక్కడి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి.. హైదరాబాద్ రుచులను ఆస్వాదిస్తుంటాం. చారి్మనార్, గోల్కొండ కోట వంటి ప్రదేశాలకు చాలాసార్లు వెళ్లాం. – మహ్రీ అమన్దుర్దీయువా, బీఏ థర్డ్ ఇయర్, నిజాం కాలేజీ, తుర్క్మెనిస్తాన్చాలా సంతోషంగా ఉంది.. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మొదట్లో కాస్త ఇబ్బంది పడినా.. ఇప్పుడు అంతా సెట్ అయ్యింది. ఇక్కడి వారితో పాటు మా దేశం నుంచి వచి్చన ఫ్రెండ్స్‌తో టైం పాస్ చేస్తుంటాం. ఇక్కడి ఫుడ్, కల్చర్ చాలా నచి్చంది. – అనస్, బీఏ ఫస్ట్ ఇయర్, సూడాన్ -
గుడివాడ గురుకుల పాఠశాల విద్యార్థులతో మరుగుదొడ్లు కడిగించిన ప్రిన్సిపాల్
-
ఏపీలోనూ ‘కోటా ఫ్యాక్టరీ’లు
సాక్షి, అమరావతి: ఐఐటీ, నీట్ లాంటి పోటీ పరీక్షల శిక్షణకు రాజస్థాన్‌లోని కోటా నగరం ప్రసిద్ధి చెందింది. అక్కడ ప్రతి ఇల్లూ ఓ శిక్షణ సంస్థే. కోటా ఇన్స్టిట్యూట్స్లో శిక్షణ తీసుకుంటే ర్యాంక్ గ్యారంటీ అనే ప్రచారం బలంగా ఉండడంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల విద్యార్థులు వస్తుంటారు. అయితే అక్కడి పరిస్థితులు ఎంత దయనీయంగా ఉంటాయో ఇతరులకు తెలియదు. శిక్షణ కోసం కోటా వచ్చిన విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక గతేడాది 26 మంది ఆత్మహత్యకు పాల్పడగా ఈ ఏడాది ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు వదిలారు. వీరంతా 17–19 ఏళ్ల వయసువారే. ఇక సివిల్స్ శిక్షణకు బ్రాండ్ సిటీ లాంటి ఢిల్లీలో ఇటీవల ఓ పేరొందిన స్టడీ సర్కిల్‌ను వరద ముంచెత్తడంతో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందారు. తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి వీటికి భిన్నంగా ఏమీ లేదు. మన వద్ద కూడా అన్ని కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఇంటర్, పోటీ పరీక్షల్లో ర్యాంకుల కోసం విద్యార్థులపై ఇదే తరహా ఒత్తిడి నెలకొంది.పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థకోచింగ్ సెంటర్ కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ బిల్లు ఆధారంగా ప్రత్యేక చట్టాన్ని రాజస్థాన్ ప్రభుత్వం తేనుంది. శిక్షణ సంస్థలపై పర్యవేక్షణకు 12 మంది అధికారులతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి నేతత్వంలో పాఠశాల, వైద్య, సాంకేతిక విద్య కార్యదర్శులు, డీజీపీ సభ్యులుగా ఉంటారు. కోచింగ్ సంస్థల ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉంటారు. కోచింగ్ సెంటర్లు తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే రెండుసార్లు వరకు జరిమానా, ఆ తరువాత సంస్థ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తారు. విద్యార్థి శిక్షణ మధ్యలో మానేస్తే దామాషా ప్రకారం ఫీజు రీఫండ్ చేయాల్సి ఉంటుంది. కోటాలో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలపై అధ్యయనం అనంతరం ఐఐటీ, నీట్ ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ పేరుతో 16 ఏళ్లలోపు విద్యార్థులను చేర్చుకోవడం, సాధారణ పాఠశాలల్లో చేరిన వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించడంపై రాజస్థాన్ ప్రభుత్వం నిషేధం విధించింది.బలవన్మరణాలు..విశాఖ పీఎం పాలెంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో ఈ ఏడాది జనవరిలో 9వ తరగతి చదివే ఓ విద్యార్థికి టెన్త్ పాఠ్యాంశాలు బోధిస్తూ టెస్టుల పేరుతో తీవ్ర ఒత్తిడికి గురి చేయడంతో భరించలేక ప్రాణాలు తీసుకున్నాడు. గతేడాది ఫిబ్రవరిలో తిరుపతి జిల్లా గూడూరులో ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో తనిఖీల సందర్భంగా రికార్డులు సమర్పించాలని యాజమాన్యం ఒత్తిడి చేయడంతో 21 ఏళ్ల విద్యార్థి హాస్టల్ భవనంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు 2021లో ఏపీలో 523 మంది విద్యార్థులు వివిధ కారణాలతో బలవన్మరణాలకు పాల్పడినట్లు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి ఈ సంఖ్య మూడింతలు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2014 తరువాత 57 శాతానికి పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులపై మార్కులు, ర్యాంకుల ఒత్తిడి పెరగడంతో అంచనాలను అందుకోలేక సగటున వారానికి ఒక్కరు ప్రాణాలు కోల్పోతున్నట్లు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ తరహాలో ప్రత్యేక చట్టం తెచ్చి కార్పొరేట్ విద్యాసంస్థల వేధింపులను నియంత్రించాలని నిపుణులు సూచిస్తున్నారు. రాజస్థాన్‌లో ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయడంతో పాటు కోచింగ్ సెంటర్ల నియంత్రణకు ‘‘కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ బిల్లు–2024’’ పెద్ద ముందడుగుగా భావిస్తున్నారు. -
ఒడుపైన ఎత్తు.. ఒత్తిడే చిత్తు
సాక్షి, హైదరాబాద్: ఒకచోట అర్ధరాత్రి ఆత్మల్లా విహారం. మరోచోట ఆమని ఒడిలో చిన్నారుల్లా కేరింతలు. భయపెడుతూ, భయపడుతూ, భయాన్ని అధిగమించే సన్నివేశం ఒకటి. బాల్యంలోకి తీసుకెళ్లి బడి ఒత్తిడిని తగ్గించే కార్యక్రమం మరొకటి. దేశంలోని ఉన్నత విద్యా సంస్థలైన ఐఐటీల్లో విద్యార్థులకు మానసిక ఒత్తిడి, భయాన్ని తగ్గించేందుకు అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఐఐటీ భువనేశ్వర్‌లో ఏటా నిర్వహించే హాలోవీన్ నైట్, ఐఐటీ హైదరాబాద్ నిర్వహించే సన్‌షైన్ కార్యక్రమాలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి.ఐఐటీలో ఆత్మల రాత్రి అర్ధరాత్రి.. ఆత్మ మాదిరిగా వేషధారణ.. అక్కడక్కడ శవపేటికలు.. దెయ్యాల కొంపల్లా భవనాల అలంకరణ.. పుర్రెలతో డెకరేషన్.. మసక మసక చీకటితో కూడిన లైటింగ్.. ఐఐటీ భువనేశ్వర్‌లో ఏటా అక్టోబర్ చివరలో నిర్వహించే హాలోవీన్ నైట్ కార్యక్రమం దృశ్యాలివి. విద్యార్థులను తీవ్రమైన మానసిక ఒత్తిడి నుంచి బయటపడేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ విద్యాసంస్థలో నవంబర్ మూడో వారం నుంచి సెమిస్టర్ పరీక్షలు మొదలవుతాయి. ఈ పరీక్షల కోసం విద్యార్థులు రేయింబవళ్లు కష్టపడుతుంటారు. పుస్తకాలతో కుస్తీలు పడుతుంటారు. ల్యాప్‌టాప్‌లలో మునిగిపోతారు.ఈ క్రమంలో అనేక మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. కొందరైతే డిప్రెషన్లోకి వెళ్లిపోతుంటారు. ప్రధానంగా మొదటి సంవత్సరం విద్యార్థుల్లో ఈ భయం ఎక్కువగా ఉంటుంది. దీన్ని అధిగమించేందుకు ఈ ఉన్నత విద్యా సంస్థ ఏటా ఇలా హాలోవీన్ నైట్ (పిశాచాల రాత్రి) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటుంది. విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని పెంచేందుకు ఇందులో సీఎస్టీ (కౌన్సిలింగ్ సర్వీస్ టీం) అనే ప్రత్యేక విభాగం పనిచేస్తోంది. ఇందులో విద్యార్థులతో పాటు పాఠాలు బోధించే ఫ్రొఫెసర్లు, వ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా ఉంటారు.ఐఐటీహెచ్‌లో మెంటల్ హెల్త్ మంత్రాళ్లపై బోమ్మలు (స్టోన్ పెయింటింగ్).. మట్టితో వివిధ ఆకృతులు (క్లే థెరపీ).. ఇవన్నీ చూస్తుంటే ఏదో ప్లే స్కూల్లో చిన్నారులు చదువుకునే విధానంలా ఉంది కదా? కానీ, టెక్నాలజీ పరంగా దేశంలోనే అత్యున్న విద్యా సంస్థల్లో ఒకటైన హైదరాబాద్ ఐఐటీలో విద్యార్థులు ఒత్తిడిని అధిగమించేందుకు అవలంభిస్తున్న మార్గాలివి. సన్‌షైన్ పేరుతో పనిచేస్తున్న ప్రత్యేక విభాగం ఏటా అక్టోబర్‌లో మెంటల్ హెల్త్ మంత్ నిర్వహిస్తోంది. విద్యార్థులు చదువుల ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మ్యూజిక్ ఆర్ట్ థెరపీ, ఎమోస్నాప్.. హీల్ అవుట్ లౌడ్.. ఇలా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. ఈ సన్‌షైన్ విభాగంలో స్టూడెంట్ బడ్డీ, మెంటార్స్, కౌన్సిలర్లు, మానసిక వ్యక్తిత్వ నిపుణులు భాగస్వాములుగా ఉంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ యాప్‌నే అబివృద్ధి చేశారు. చాట్‌బాట్ రూపంలో ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒత్తిడిని జయించే మార్గాలను సలహాలను సూచనలు పొందేలా ఏర్పాట్లు చేశారు. ఐఐటీహెచ్‌లో తొలి నేషనల్ వెల్బీయింగ్ కాంక్లేవ్ హైదరాబాద్ ఐఐటీ వేదికగా తొలి నేషనల్ వెల్బీయింగ్ కాంక్లేవ్ శనివారం ప్రారంభమైంది. దేశంలోని అన్ని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిబుల్ఐటీలు, ఇతర ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, ఫ్రొఫెసర్లు ఈ సదస్సుకు హాజరయ్యారు. విద్యార్థులు ఒత్తి డిని జయించేందుకు ఆయా విద్యా సంస్థలు అవలంభిస్తున్న మార్గాలను వివరించేందుకు ప్రత్యేకంగా స్టాల్లను ప్రదర్శించారు. ఒత్తిడిని జయించేందుకు ఎంతో ఉపయోగం విద్యార్థులు మానసిక ఒత్తి డితో బాధపడుతు న్నట్లు తమ దృష్టికి వస్తే వెంటనే ఆ విద్యార్థితో స్టూడెంట్ గైడ్ మాట్లాడుతారు. అవస రం మేరకు ఆ విద్యార్థి పరిస్థితిని వ్యక్తిత్వ వికాస నిపుణుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను అధిగమించేలా చేస్తున్నాము. ఇందుకోసం మా విద్యా సంస్థల్లో సీఎస్టీ (కౌన్సిలింగ్ సరీ్వస్ టీం) పనిచేస్తోంది. – మంగిపూడి శ్రావ్య, బీటెక్ మెట్లర్జీ, ఐఐటీ భువనేశ్వర్ -
గందరగోళంగా 'ఉన్నత విద్య'
డాక్టర్ ధనశ్రీ.. బయోకెమిస్ట్రీ లెక్చరర్. కర్నూలు కేవీఆర్‌లో పనిచేసేవారు. లాంగ్ స్టాండింగ్ పేరుతో 2022–23లో గుంతకల్లు డిగ్రీ కాలేజీకి బదిలీ చేశారు. అక్కడ ఫైనలియర్లో కేవలం ఆరుగురు మాత్రమే విద్యార్థులున్నారు. వారు వెళ్లిపోయిన తర్వాత బయో కెమి్రస్టికి ఒక్క అడ్మిషన్ కూడా రాలేదు. విద్యార్థులు లేరు.. పైగా బయోకెమిస్ట్రి అక్కడ తొలగించారు. దీంతో ధనశ్రీ ఖాళీగా ఉన్నారు. పని ఉన్న కాలేజీకి బదిలీచేయాలని ఉన్నత విద్యాశాఖకు లేఖ రాయగా ఆమెను నంద్యాల డిగ్రీ కాలేజీకి బదిలీ చేశారు. అక్కడ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటే లేదు. దీంతో అక్కడ కూడా ఆవిడ పనిలేకుండా ఖాళీగా ఉన్నారు. కేవీఆర్, సిల్వర్ జూబ్లీలో బయో కెమిస్ట్రి విభాగంలో ఖాళీలున్నాయి, విద్యార్థులూ ఉన్నారు. కానీ, వారికి నాణ్యమైన బోధన అందడంలేదు. భారీ వేతనాలిచ్చి సబ్జెక్ట్‌లేని కాలేజీలో పనిలేకుండా అధికారులు ఉంచడం ఎందుకో!?డాక్టర్ రవిశంకర్ శర్మ.. గుంతకల్లు డిగ్రీ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్. గుంతకల్లులో ఉన్న పోస్టుల కంటే ఎక్కువగా ఫిజిక్స్ లెక్చరర్లు ఉన్నారు. దీంతో పనిలేకుండా ఖాళీగా ఉన్నానని, పత్తికొండలో పోస్టు ఖాళీగా ఉందని అక్కడికి పంపాలని రిక్వెస్ట్ పెట్టుకున్నారు. అయితే, శర్మను అనంతపురం డిగ్రీ కాలేజీకి బదిలీ చేశారు. అక్కడ కూడా ఉన్న పోస్టుల కంటే ఎక్కువగానే ఉన్నారు. అక్కడా ఆయన పనిలేక ఖాళీగా ఉన్నారు. పత్తికొండలో మాత్రం ఖాళీ పోస్టును భర్తీచేయలేదు. డాక్టర్ కోటేశ్వరరావు.. గుంటూరు డిగ్రీ కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్. 2022లో సర్దుబాటు పేరుతో ఇతన్ని బనగానపల్లిలో వేశారు. అక్కడ పూర్తిస్థాయిలో లెక్చరర్లు ఉన్నా అదనంగా నియమించారు. దీంతో ఏడాది పాటు పనిలేకుండా ఆయన ఖాళీగా ఉన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి అక్కడ నియమించాలని ఇక్కడ తనకు పనిలేదని కోరారు. ఏడాది తర్వాత ఆయన్ను తిరిగి డోన్‌కు పంపారు.డాక్టర్ ఫరీదా ఇంగ్లీషు లెక్చరర్. లాంగ్‌స్టాండింగ్ పేరుతో కేవీఆర్ నుంచి పాణ్యం డిగ్రీ కాలేజీకి బదిలీ చేశారు. అక్కడ పిల్లలు లేరు. పనిలేకుండా ఫరీదా కూడా ఖాళీగా ఉన్నారు. ఖాళీగా ఉన్నారని అక్కడి ప్రిన్సిపాల్ ఫరీదాకు వేతనం నిలిపేశారు. పిల్లలు లేనప్పుడు తానేం చేయాలని, తన అవసరం ఉన్న కాలేజీకి బదిలీచేయాలని ఆవిడ విన్నవించారు. కేవీఆర్‌లో ముగ్గురు కాంట్రాక్టు లెక్చరర్లు ఉన్నారు. రెగ్యులర్ పోస్టు ఉన్నప్పుడు కాంట్రాక్ట్ వారితో విద్యార్థులకు క్లాస్‌లు చెప్పించడం ఏమిటో!?.. ఈ నాలుగు ఉదాహరణలు పరిశీలిస్తే డిగ్రీ కాలేజీలో లెక్చరర్ల నియామకాలు, పనితీరు, విద్యార్థులకు అందుతున్న బోధన, వారి భవిష్యత్తుపై ఉన్నత విద్యాశాఖకు, ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఎంత డొల్లగా ఉందో స్పష్టమవుతోంది. సబ్జెక్ట్‌లేని చోట సబ్జెక్ట్ లెక్చరర్‌ను నియమించడం, పిల్లలులేని చోట వారిని ఉంచడం, అవసరమైన చోట ఖాళీలు పెట్టడం చూస్తే అసలు డిగ్రీ కాలేజీల పనితీరుపై, విద్యార్థుల భవిష్యత్తుపై ఉన్నతాధికారులకు ఏమాత్రం అవగాహనలేదని తేటతెల్లమవుతోంది. – సాక్షి ప్రతినిధి, కర్నూలుఫారిన్ సర్వీసులు చేసి వస్తే సరిహద్దులకే..⇒ ఓ లెక్చరర్ విజయనగరం జిల్లా ఎస్ఎస్ఏ ఏపీసీగా పనిచేశారు. తిరిగి అతను సొంతశాఖలోకి వస్తే ఖాళీలున్నా అతన్ని మాత్రం పార్వతీపురం డిగ్రీ కాలేజీకి బదిలీ చేశారు. ⇒ నంద్యాలలోని ఓ లెక్చరర్‌ను సర్దుబాటు పేరుతో విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురానికి బదిలీ చేశారు. చుట్టపక్కల కాలేజీల్లో ఖాళీలున్నా దూరానికి బదిలీ చేశారు.⇒ కర్నూలు జిల్లాలోని ఓ లెక్చరర్ కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎస్ఎస్ఏ ఏపీసీగా పనిచేశారు. కర్నూలు జిల్లాలో ఖాళీలు ఉన్నప్పటికీ కడప జిల్లాకు బదిలీ చేశారు. ⇒ కర్నూలు ఎస్ఎస్ఏ ఏపీసీగా పనిచేసిన ఓ కెమిస్ట్రీ లెక్చరర్‌ను కర్నూలులోని రెండు కాలేజీల్లో ఖాళీలున్నప్పటికీ నంద్యాల జిల్లా కోవెలకుంట్లకు బదిలీ చేశారు. డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తూ ఫారిన్ సర్విసుల కింద బయటకెళ్లిన వారందరినీ ఆయా జిల్లాల్లోని డిగ్రీ కాలేజీల్లో ఖాళీలున్నప్పటికీ ఉన్నత విద్యాశాఖాధికారులు వారిని రాష్ట్ర సరిహద్దుల్లోని డిగ్రీ కాలేజీలకు బదిలీ చేస్తున్నారు. దీనికి కారణం వారు ‘ఫారిన్ సర్విసు’లకు వెళ్లడమే. వారిపై ఉన్న కోపంతో దూర ప్రాంతాలకు బదిలీచేసే సమయంలో అక్కడ ఖాళీలున్నాయా? వారి సొంత జిల్లాల్లో ఉన్న ఖాళీల పరిస్థితి ఏంటి? ఆ ఖాళీలను అలాగే ఉంచితే అక్కడున్న విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? అని ఆలోచన చేయడంలేదు.దీంతో 13 జిల్లాల్లోని ఏ డిగ్రీ కాలేజీ లెక్చరర్ కూడా ‘ఫారిన్ సర్విసు’కు వెళ్లినా వారిని ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోకి బదిలీ చేశారని లెక్చరర్లు చర్చించుకుంటున్నారు. ఉన్నత విద్యాశాఖలో ఇటీవల బదిలీ అయిన ఓ ఉన్నతాధికారి పనిగట్టుకుని ఇదంతా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడ అధ్యాపకులు అవసరం? ఎక్కడ అవసరంలేదని గ్రహించకుండా కేవలం ఫారిన్ సర్వీసుకు వెళ్లారు కాబట్టి ‘శిక్ష’గా వీరిని దూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నట్లుగా ఉంది.రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నప్పుడు ‘కాంట్రాక్టు’ బోధన ఎందుకు?.. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో దాదాపు 2,400 మంది రెగ్యులర్ అధ్యాపకులున్నారు. 740 మంది కాంట్రాక్టు, వెయ్యిమంది వరకు ఎయిడెడ్ లెక్చరర్లు ఉన్నారు. యూనివర్శిటీ స్థాయి పొందిన కాలేజీలో పీహెచ్డీ చేసిన అధ్యాపకులే యూజీ, పీజీ విద్యార్థులకు బోధించాలి. అయితే, రెగ్యులర్ పోస్టులున్నా వారిని ఇతర జిల్లాల్లోని డిగ్రీ కాలేజీలకు బదిలీచేసి యూనివర్శిటీ పరిధిలో కాంట్రాక్టు లెక్చరర్లతో నడిపిస్తున్నారు. వీరిలో సింహభాగం లెక్చరర్లకు పీహెచ్డీ లేదు. రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నప్పుడు వారిని ఖాళీగా ఉంచి కాంట్రాక్టు లెక్చరర్లపై ఆధారపడటం ఏమిటని మిగిలిన అధ్యాపకులు ప్రశి్నస్తున్నారు. కమిషనరేట్‌లో ఏళ్ల తరబడి డిప్యుటేషన్.. మరోవైపు.. కమిషనరేట్‌లో నలుగురు లెక్చరర్లు డిప్యుటేషన్‌పై 15 ఏళ్లుగా కొనసాగుతున్నారు. వీరు ఉద్యోగానికి వచ్చింది విద్యార్థులకు చదువు చెప్పేందుకా? లేదంటే కమిషనరేట్‌లో డిప్యుటేషన్‌పై కొనసాగేందుకా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 15 ఏళ్లుగా వారిని ఓ స్థానంలో అదీ డిప్యుటేషన్‌పై ఎందుకు కొనసాగిస్తున్నారని తోటి లెక్చరర్లు ప్రశి్నస్తున్నారు. క్లస్టర్ యూనివర్సిటీపై శీతకన్ను.. కర్నూలు జిల్లా సిల్వర్ జూబ్లి కాలేజీని, నగరంలోని కాలేజీలను క్లస్టర్ యూనివర్సిటీగా గత ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే లక్ష్యంతో ఖాళీలు లేకుండా పోస్టులు కూడా భర్తీచేశారు. అయితే, ఇక్కడ ఉన్న వీసీ సాయిగోపాల్కు, ఉన్నత విద్యాశాఖ నుంచి ఇటీవల బదిలీ అయిన ఓ కీలక అధికారికి మధ్య వ్యక్తిగత విభేదాలతో ఈ కాలేజీ వారిని బయటికి పంపడం, బయటి వారిని ఇక్కడకు పంపకుండా ఖాళీలు ఉండేలా చేస్తున్నారని లెక్చరర్లు చర్చించుకుంటున్నారు. వీసీలకు, ఉన్నతాధికారులకు మధ్య విభేదాలతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు యూజీ, పీజీపై సమీక్షించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
సార్.. మా బడికి మాస్టార్ని పంపించండి!
పాడేరు: ‘అయ్యా.. కలెక్టర్‌గారు, పీఓ గారు.. మాకు చదువుకోవాలని ఉంది. దయచేసి మా బడికి మాస్టార్ని పంపించండి’.. అంటూ మండలంలోని జోడూరు గ్రామానికి చెందిన విద్యార్థులు ఐటీడీఏ ఎదుట ప్రధాన రహదారిపై మండేఎండలో బైఠాయించి తమ నిరసన తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని వంట్లమామిడి పంచాయతీ మారుమూల జోడూరు గ్రామంలో 28 మంది బడిఈడు పిల్లలున్నారు. కానీ, ఇక్కడ పాఠశాల లేదు. దీంతో ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ పాఠశాలను అధికారులు ఏర్పాటుచేశారు. సమీపంలో ఉన్న ఒంటిపాక పాఠశాలలో పనిచేస్తున్న సూరిబాబు అనే ఉపాధ్యాయుడిని జోడూరు గ్రామం పాఠశాలకు డిప్యూటేషన్‌పై నియమిస్తూ ఈ ఏడాది అక్టోబరు 17న విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. కానీ, నేటికి 20 రోజులు కావస్తున్నా ఆ ఉపాధ్యాయుడు జోడూరు పాఠశాలకు హాజరుకావడంలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకుడు పాలికి లక్కు ఆధ్వర్యంలో శుక్రవారం పాడేరుకు తరలివచ్చారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఐటీడీఏ వద్దకు చేరుకున్నారు. ఐటీడీఏ ముందే ప్రధాన రహదారిపై చుర్రుమనే ఎండలో బైఠాయించి నిరసన తెలిపారు. తమ గ్రామానికి తక్షణమే ఉపాధ్యాయుడిని నియమించాలని, 20 రోజులుగా బడికిరాని ఉపాధ్యాయుడు సూరిబాబుపై చర్యలు తీసుకోవాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం.. ఐటీడీఏ పీఓ అభిషేక్, జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావును కలిసి వినతిపత్రం ఇచ్చారు. -
ఫీజు పైసల్... ముందే వసూల్ !
సాయివర్ధన్ (పేరుమార్చాం) పాలీసెట్‌లో మెరుగైన ర్యాంకు సాధించి రంగారెడ్డి జిల్లా మీర్పేట్ సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో కన్వీనర్ కోటాలో సీటు దక్కించుకున్నాడు. కాలేజీలో రిపోర్టింగ్ చేసేందుకు వెళ్లిన ఆ విద్యార్థికి యాజమాన్యం షాక్ ఇచ్చింది. కన్వీనర్ కోటాలో సీటు వచ్చినా, ట్యూషన్ ఫీజు చెల్లించాలని, లేకుంటే అడ్మిషన్ ఇవ్వలేమని తెలియచెప్పింది. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదలైన తర్వాత, ఆ మొత్తాన్ని విద్యార్థి ఖాతాలో జమ చేస్తామని స్పష్టం చేయడంతో తప్పనిసరి పరిస్థితిలో రూ.52 వేల రూపాయలు చెల్లించి అడ్మిషన్ పొందాడు. వికారాబాద్ జిల్లాకు చెందిన టి.మానస (పేరుమార్చాం) డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈడీ) కోర్సు పూర్తి చేసింది. కన్వీనర్ కోటాలో సీటు వచ్చినా, యాజమాన్య ఒత్తిడితో ఫీజు చెల్లించింది. ఏడాది క్రితం కోర్సు పూర్తి కావడంతో ఒరిజినల్ సరి్టఫికెట్ల కోసం కాలేజీకి వెళితే ఫీజు బకాయిలు చెల్లించాలని చెప్పారు. దీంతో మళ్లీ డబ్బు కట్టింది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.46 వేలు ఇప్పటికీ అందలేదు.సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుకునే విద్యార్థులకు ఆర్థికభారం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేస్తోంది. దీని కింద అర్హత సాధించిన విద్యార్థులు ట్యూషన్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేకుండా నేరుగా కాలేజీలో ప్రవేశం పొంది కోర్సు పూర్తి చేయొచ్చు. కానీ ప్రస్తుతం కాలేజీల్లో పరిస్థితి తారుమారైంది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద అర్హత సాధించినా సరే... అడ్మిషన్ సమయంలో ట్యూషన్ ఫీజు పూర్తిగా చెల్లించాల్సిందే.సీనియర్ విద్యార్థులయితే విద్యాసంవత్సరం ప్రారంభంలోనే చెల్లించాలి. ప్రభుత్వం రీయింబర్స్ నిధులు కాలేజీకి విడుదల చేసినప్పుడు... సదరు విద్యార్థుల బ్యాంకు ఖాతాకు నిధులు బదిలీ చేయడమో... లేక చెక్కు రూపంలో విద్యారి్థకి అందిస్తామంటూ యాజమాన్యాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని వృత్తి విద్యాకాలేజీలు ఇదే తరహా ముందస్తుగా ఫీజు వసూళ్లు చేస్తున్నాయి. ఉచితంగా ఉన్నత చదువులు చదవాలనుకున్న విద్యార్థులకు తాజా పరిస్థితులు సంకటంగా మారాయి. ఏటా 12లక్షల దరఖాస్తులు రాష్ట్రంలో 5,539 పోస్టుమెట్రిక్ కాలేజీలున్నాయి. ఇందులో 2,641 జూనియర్ కాలేజీలు, 1,514 డిగ్రీ, పీజీ కాలేజీలున్నాయి. 235 ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలు కాగా, 217 పారా మెడికల్ కాలేజీలున్నాయి. ఇతర వృత్తివిద్యా కేటగిరీల్లో మిగిలిన కాలేజీలున్నాయి. వీటి పరిధిలోని 12 లక్షల మంది విద్యార్థులు ఏటా ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు ముందస్తు వసూళ్లకు దూరంగా ఉంటున్నా, వృత్తి విద్యా కళాశాలలు మాత్రం అడ్మిషన్ల సమయంలోనే ఫీజులు వసూలు చేస్తున్నాయి. ,ఇంత జరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. కనీసం కాలేజీలకు వెళ్లి ఫీజులపై తనిఖీలు కూడా చేయడం లేదు, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాంఫీజు రీయింబర్స్మెంట్ నిధుల చెల్లింపుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.1,550 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు చెల్లిపులు చేస్తున్నాం. మా కార్యాలయానికి విద్యార్థులు వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – చంద్రశేఖర్, బీసీ సంక్షేమశాఖ అదనపు సంచాలకులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి ముందస్తు ఫీజు వసూలపై సంక్షేమ శాఖల అధికారులు సీరియస్‌గా పరిగణించాలి. కాలేజీల వారీగా విచారణ చేపట్టాలి. అలా వసూళ్లకు పాల్పడిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థులెవరూ ముందస్తుగా ఫీజులు చెల్లించొద్దు. – ఆర్.కృష్ణయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బకాయిలు పేరుకుపోవడంతోనే ఈ పరిస్థితి ఫీజు రీయింబర్స్ నిధులు విడుదల చేయకపోవడంతోనే యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. సకాలంలో ఫీజు నిధులు విడుదల చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. – కందడి శ్రీరామ్, ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు -
విద్యార్థులతో ముఖాముఖి.. సీఎం రేవంత్ కీలక పిలుపు
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లా మధిర, వైరా నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, అందరికి విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. అందుకే డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచామని తెలిపారు.‘‘21 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాం. 11,062 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశాం. దేశ నిర్మాణంలో మీరు భాగస్వామ్యం కావాలి. సామాజిక న్యాయం అందించేందుకు ప్రభుత్వం కుల గణన సర్వే నిర్వహిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ప్రతీ నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నాం. వచ్చే అకడమిక్ ఇయర్‌లోగా నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. చదువుతో పాటు స్కిల్ ఉంటేనే ఉద్యోగాలు లభిస్తాయి. అందుకే విద్యార్థి, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం’’ అని సీఎం రేవంత్ తెలిపారు.టాటా ఇనిస్టిట్యూట్ సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నాం. సాంకేతిక నైపుణ్యంతో పాటు ప్రభుత్వం ఉద్యోగ భద్రతను కల్పిస్తోంది. చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి. విద్యార్థులు క్రీడల్లో రాణించాలని వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాం. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. ఇవాళ్టి విద్యార్థులు రేపటి పౌరులుగా మారి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. సచివాలయం రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. ఉన్నత చదువులు చదివి భవిష్యత్‌లో మీరు సచివాలయంలో అడుగు పెట్టాలని.. పరిపాలనలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నా’’ అని సీఎం చెప్పారు.‘‘గంజాయి, డ్రగ్స్ ఎక్కడ కనిపించినా 100కు డయల్ చేసి సమాచారం అందించండి. వ్యసనాలకు బానిసైతే జీవితాలు నాశనం అవుతాయి. ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతను అలవరచుకోవాలి. నవంబర్ 14న 15 వేల మంది విద్యార్థులతో ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం. అదే రోజు ఫేజ్-2 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేయబోతున్నాం’’ అని సీఎం రేవంత్ వెల్లడించారు. -
పీఎం-విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
ఢిల్లీ, సాక్షి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం- విద్యాలక్ష్మి పథకంతో పాటు పలు అంశాలకు ఆమోదం తెలిపింది. డబ్బు లేని కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు చదువుకు దూరం కావద్దనే పీఎం- విద్యాలక్ష్మి పథక లక్ష్యం. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు పీఎం-విద్యాలక్ష్మి ద్వారా ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది. నాణ్యత కలిగిన 860 ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పించనుంది. రూ. ఏడున్నర లక్షల వరకు రుణ సౌకర్యం అందించనుంది. ఈ పథకం ద్వారా 75 శాతం క్రెడిట్ గ్యారెంటీని కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. పీఎం-విద్యాలక్ష్మి ద్వారా ఏటా 22 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి పొందనున్నారు.#WATCH | Delhi: After the Union Cabinet meeting, Union Minister Ashwini Vaishnaw says, "FCI plays a very big role in the procurement of food. It has been decided today to significantly strengthen the Food Corporation of India (FCI)...Today, the cabinet has decided fresh equity… pic.twitter.com/TL26u6xS2G— ANI (@ANI) November 6, 2024 ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు రూ. 10,700 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఎఫ్‌సీఐ ఆపరేషన్ సామర్థ్యం పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడారు. ‘‘2004-14తో పోల్చితే 2014-24 మధ్య నాలుగు రెట్లు అధికంగా రైతులకు ఆహార సబ్సిడీ అందింది’’ అని అన్నారు. #Cabinet approves PM-Vidyalaxmi scheme to provide financial support to meritorious students so that financial constraints do not prevent any youth of India from pursuing quality higher educationUnder the scheme, any student who gets admission to a Quality Higher Education… pic.twitter.com/Z8C3fllXuo— PIB India (@PIB_India) November 6, 2024 -
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం.. రేపట్నుంచి అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. దరఖాస్తులు స్వీకరించేందుకు చివరి తేదీ నవంబర్ 20న చివరి తేదీ విధించింది. జనవరి ఒకటి నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు ప్రారంభించింది.