సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనకు రావాలని విద్యార్థులను బలవంతం చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ప్రత్యక్ష తరగతులకు హాజరుకాని వారిపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తెలిపింది. ఆన్‌లైన్ ద్వారా ప్రత్యక్ష బోధనపై విద్యా సంస్థలదే నిర్ణయం అని హైకోర్డు పేర్కొంది. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవద్దని కోర్టు పేర్కొంది. ప్రత్యక్ష బోధన నిర్వహించే పాఠశాలలకు మార్గదర్శకాలు జారీ చేయాలని కోర్టు విద్యాశాఖను ఆదేశించింది.
వారంలోగా మార్గదర్శకాలు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. గురుకులాలు, రెడిడెన్షియల్ స్కూళ్లలో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు స్టే విధించింది. గురుకులాలు, విద్యాసంస్థల్లో వసతి గృహాలు తెరవొద్దని కోర్టు ఆదేశించింది. గురుకులాలు, హాస్టళ్లలో వసతులపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 4కి కోర్టు వాయిదా వేసింది.
ఇవీ చదవండి:
Banjara Hills: భర్తతో విడిపోయి, మరొకరితో సహజీవనం.. బాలికపై అత్యాచారం
పహాడీషరీఫ్: 38 రోజుల్లో నాలుగు హత్యలు, హడలెత్తుతున్న స్థానికులు
Comments
Please login to add a commentAdd a comment