Telangana High Court
-
తెలంగాణ హైకోర్టులో విషాదం.. కేసు వాదిస్తూ కుప్పకూలిన లాయర్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ హైకోర్టులో మంగళవారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. కేసు వాదించే సమయంలో ఓ సీనియర్ న్యాయవాది కుప్పకూలిపోయారు. అయితే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ఆయన మరణించారు. మృతి చెందిన సీనియర్ లాయర్ పేరు వేణుగోపాల్ రావు. ఓ కేసు విషయంలో ఆయన మంగళవారం వాదనలు వినిపిస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. న్యాయవాది మృతికి సంతాపంగా హైకోర్టులోని అన్ని బెంచ్‌లో విచారణ నిలిపి వేసి.. రేపటికి వాయిదా వేశారు. -
ఎన్నిసార్లు చెప్పినా మారరా?
సాక్షి, హైదరాబాద్: ‘ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా? అక్రమ నిర్మాణమని శుక్రవారం నోటీసులిచ్చి.. శనివారం హాజరుకు ఆదేశాలిచ్చి.. ఆదివారం కూల్చివేస్తారా? అంత తొందరేముంది? కూల్చి వేతలు చేపట్టే ముందు సహేతుక సమయం ఇవ్వాలి కదా?’ అని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ గ్రామంలోని తన ఆస్తుల కూల్చివేతను సవాల్ చేస్తూ సామ్రెడ్డి బాల్‌రెడ్డి హైకోర్టులో ఆదివారం హౌజ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా నోటీసులు చట్టవిరుద్ధమని, వాటిని రద్దు చేస్తూ ఆదేశాలివ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్‌కు న్యాయమైన అవకాశం ఇవ్వకుండా తదుపరి చర్యలు తీసుకోవద్దని హైడ్రాను ఆదేశించారు. అవసరమైన పత్రాలు సమర్పించడానికి పిటిషనర్‌కు ఒక వారం సమయం ఇచ్చారు. ముఖ్యంగా సెలవు దినాల్లో కూల్చివేతలు చేపట్టవద్దని, కాదని చేపడితే కఠిన చర్యలు ఉంటాయని హైడ్రాను హెచ్చరించారు. ఒక్కరోజులో పత్రాలు సమర్పించటం ఎలా సాధ్యం?..: తన ఆస్తులకు సంబంధించిన పత్రాలు సమర్పించేందుకు హైడ్రా ఒక్క రోజే సమయం ఇచ్చిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ‘అక్రమ నిర్మాణమని శుక్రవారం అధికారులు నోటీసులు జారీ చేశారు. వ్యక్తిగతంగా హాజరుకావాలని శనివారం సమయం ఇచ్చారు. ఆ వెంటనే ఆదివారం కూల్చివేత ప్రక్రియ చేపట్టారు. టైటిల్ లింక్ పత్రాలు, పట్టాదార్ పాస్‌బుక్, ఇతర అన్ని డాక్యుమెంట్లతో రావాలని ఆదేశించిన అధికారులు.. ఒక్క రోజే సమయం ఇచ్చారు. అధికారుల తీరు చట్టవిరుద్ధం. నోటీసులను నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వండి’ అని కోరారు. దీంతో హైడ్రా తీరుపై అసహనం వ్యక్తంచేసిన ధర్మాసనం.. వారంలోగా అధికారులకు డాక్యుమెంట్లు అందజేయాలని ఆదేశించింది. వాటిని పరిశీలించి చట్టప్రకారం చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిస్తూ విచారణను వాయిదా వేసింది. -
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజోయ్‌పాల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలను జస్టిస్ సుజోయ్‌పాల్‌కు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశా రు. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ అలోక్‌అరాధే బాంబే హైకోర్టు చీఫ్‌గా బదిలీ అయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేశారు. సీజే బదిలీతో ఏర్పడనున్న ఖాళీని హైకోర్టులో రెండవ సీనియర్ న్యాయ మూర్తిగా ఉన్న జస్టిస్ సుజోయ్పాల్తో భర్తీ చేశారు. రాజ్యాంగంలోని అధికరణ 223 ద్వారా వచ్చిన అధికారాల మేరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజోయ్‌పాల్‌ను రాష్ట్రపతి నియమించినట్టు న్యాయశాఖ పేర్కొంది. రాష్ట్రపతి తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు ఆయన సీజేగా కొనసాగుతారు. 2024 మార్చిలో తెలంగాణకు.. మధ్యప్రదేశ్‌లో 1964, జూన్ 21న జస్టిస్ సుజోయ్‌పాల్ జన్మించారు. బీకాం, ఎంఏ, ఎల్ఎల్బీ పూర్తిచేసి 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్రోల్ చేసుకున్నారు. సివిల్, రాజ్యాంగ, పారిశ్రామిక, సర్వీస్‌తోపాటు పలు బ్యాంకులు, మానవ హక్కుల కమిషన్, బోర్డులకు న్యాయవాదిగా పనిచేశారు. 2011, మే 27న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2014, ఏప్రిల్ 14న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ సుజోయ్‌పాల్ కుమారుడు మధ్యప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. దీంతో అక్కడి హైకోర్టు నుంచి బదిలీ చేయాలని ఆయన కోరుకోగా, రాష్ట్రపతి ఆమోదించారు. 2024, మార్చి 21న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. దాదాపు 10 నెలలుగా ఇక్కడ పనిచేస్తున్న ఆయన మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిబంధనల ఉల్లంఘన, గ్రూప్–1, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సహా పలు కీలక కేసులపై విచారణ చేపట్టారు. పలు కేసుల్లో తీర్పులు కూడా వెలువరించారు. కాగా, జస్టిస్ అలోక్‌అరాధే బదిలీతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 26కు చేరుకోనుంది. -
హరీష్‌రావు క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావు క్వాష్ పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని హరీష్ రావు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టనున్నారు.కాగా, తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చక్రాధర్ గౌడ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేసి హరీశ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో హరీష్‌రావు.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.పలుకుబడి ఉన్న నేత కావడంతో హరీశ్ రావు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు కోర్టులో అభిప్రాయపడ్డారు. ఆయనను అదుపులోకి తీసుకొని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో అదుపులోకి తీసుకొని విచారించాలని పోలీసుల కౌంటర్ దాఖలు చేశారు. ఈ అభ్యర్థనకు సంబంధించి హైకోర్టు కీలకమైన తీర్పు ఇవ్వనుంది. అవన్నీ అబద్ధారోపణలని, తనకు రాజకీయంగా నష్టం కలిగించేందుకే ఈ కేసు చేశారని హరీశ్ రావు తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఆరోపణల వల్ల తన వ్యక్తిత్వానికి, ప్రజా సేవకు మచ్చ తగలకుండా కోర్టు న్యాయం చేయాలని కోరారు. తన ఫోన్ ట్యాపింగ్‌కు ఎలాంటి ఆధారాలు లేవని, కేసును కొట్టివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు.ఇక, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హారీష్ రావును అరెస్ట్ చేయవద్దని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. క్వాష్ పిటిషన్ కొట్టివేయాలని కోర్టును కోరారు. దీంతో, నేడు మరోసారి క్వాష్ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టనుంది. హైకోర్టులో జరగనున్న విచారణపై రాష్ట్ర రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఈ కేసులో హైకోర్టు తీసుకునే నిర్ణయం హరీష్ రావు రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది. -
న్యాయవాది వెళ్లొచ్చు.. అయితే ఎలాంటి జోక్యం చేసుకోవద్దు!
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ల రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు హైకోర్టులో మరోసారి నిరాశే మిగిలింది. ఏసీబీ విచారణ సమయంలో తన వెంట న్యాయవాదిని అనుమతించాలని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేయగా.. న్యాయస్థానం పాక్షికంగా అనుమతించింది. కేటీఆర్ వెంట న్యాయవాది రామచందర్‌రావు విచారణకు వెళ్లవచ్చని, కానీ కేటీఆర్ పక్కన కూర్చోవద్దని పేర్కొంది. పక్కనే ఉన్న మరో గదిలో నుంచి న్యాయవాది వీక్షించవచ్చని స్పష్టం చేసింది. పిటిషనర్ (కేటీఆర్)కు తన న్యాయవాది కనిపించకుంటే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. ఏసీబీ అధికారుల దర్యాప్తును ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేటీఆర్ కోరగా.. దీనికి న్యాయస్థానం నిరాకరించింది. తనతోపాటు న్యాయవాదిని కూర్చోనివ్వాలంటూ.. గురువారం ఏసీబీ విచారణకు హాజరుకావాల్సి ఉన్న నేపథ్యంలో... దర్యాప్తు అధికారులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని, తనతోపాటు కూర్చొనేందుకు న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ కేటీఆర్ బుధవారం హైకోర్టులో లంచ్ మోహన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 6న తాను విచారణకు హాజరయ్యేందుకు వెళ్లగా.. వెంట న్యాయవాదిని అనుమతించలేదని వివరించారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ మధ్యాహ్నం 2.15 సమయంలో విచారణ చేపట్టారు. న్యాయవాదిని అనుమతించేందుకు సర్కార్‌కు ఉన్న అభ్యంతరమేమిటో చెప్పాలని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) తేరా రజనీకాంత్‌రెడ్డిని అడిగారు. వివరాలు తెలుసుకుని చెప్పాలంటూ విచారణను సాయంత్రం 4.15కు వాయిదా వేశారు. సాయంత్రం మరోసారి విచారణ చేపట్టారు. కేటీఆర్ తరఫున న్యాయవాది ప్రభాకర్‌రావు వాదనలు వినిపిస్తూ.. కేటీఆర్ వెంట న్యాయవాదిని అనుమతించాలని, విచారించే సమయంలో ఏసీబీ అధికారులు ఆడియో, వీడియో రికార్డు చేసేలా ఆదేశించాలని న్యాయమూర్తిని కోరారు. న్యాయవాది లైబ్రరీ గది నుంచి వీక్షించొచ్చు.. వాదనలు విన్న న్యాయమూర్తి.. అత్యంత క్లిష్టమైన క్రిమినల్ నేరాల విచారణలో మాత్రమే ఆడియా, వీడియో రికార్డింగ్‌కు ఆదేశాలు ఇవ్వగలమని పేర్కొన్నారు. అయితే న్యాయవాదిని అనుమతించవద్దన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చారు. విచారణలో జోక్యం చేసుకోనప్పుడు న్యాయవాదిని అనుమతిస్తే వచ్చే నష్టమేమిటని ప్రశ్నించారు. అయితే విచారణ సమయంలో పిటిషనర్ (కేటీఆర్), దర్యాప్తు అధికారి మాత్రమే గదిలో ఉండాలని స్పష్టం చేశారు. విచారించే సమయంలో న్యాయవాదికి కనబడేలా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. ఏసీబీ ఆఫీస్ దర్యాప్తు గదిని ఆనుకుని ఉన్న లైబ్రరీ గది కిటికీ నుంచి విచారణను వీక్షించే వీలు ఉందని ఏఏజీ వివరించారు. దీనికి న్యాయమూర్తి అంగీకరించారు. ఆ లైబ్రరీ గదిలో న్యాయవాది కూర్చొని కిటికీలోంచి వీక్షించవచ్చని తెలిపారు. కేటీఆర్ వెంట న్యాయవాది రామచంద్రరావు పిటిషనర్ వెంట విచారణకు ఎవరు హాజరవుతారో ముగ్గురు న్యాయవాదుల పేర్లు ఇవ్వాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. అలా పిటిషనర్ (కేటీఆర్) ముగ్గురు న్యాయవాదుల పేర్లు ఇవ్వగా.. అందులో రామచందర్‌రావు ఏసీబీ ఆఫీసులోకి వెళ్లవచ్చని న్యాయమూర్తి తెలిపారు. అయితే సదరు న్యాయవాది ఆ విచారణలో ఎలాంటి జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేశారు. ఆ సమయంలో విచారణాధికారులు వ్యవహరించే తీరును బట్టి మళ్లీ హైకోర్టుకు రావచ్చని తెలిపారు. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. -
ఏసీబీ విచారణ.. హైకోర్టులో కేటీఆర్ మరో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్.. తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రేపటి ఏసీబీ విచారణలో భాగంగా తనతో న్యాయవాదిని అనుమతించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో పిటిషన్‌కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పిటిషన్‌ను మధ్యాహ్నం హైకోర్టు విచారించనుంది. -
హైడ్రా మళ్లీ వీకెండ్ ఆపరేషన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) తన వీకెండ్ ఆపరేషన్లను పునఃప్రారంభించింది. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న 684 చదరపు గజాల ప్రభుత్వ స్థలంలో హైకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి అక్రమంగా నిర్మిస్తున్న ఐదు అంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు ఆదివారం కూల్చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం అక్కడ పర్యటించి పూర్వాపరాలు తెలుసుకున్నారు. హైడ్రా ఏర్పాటైన తొలినాళ్లలో దాదాపు ప్రతి వీకెండ్లోనూ ఓ అక్రమ నిర్మాణం కూల్చివేత ఉండేది. అక్రమ నిర్మాణాలెన్నో.. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో అనేక అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. 100 ఫీట్ల రోడ్డులో ఉన్న 684 చదరపు గజాల ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఐదు అంతస్తుల్లో ఓ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇది అక్రమ నిర్మాణమని గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు.. గత ఏడాది ఫిబ్రవరి 14న షోకాజ్ నోటీసులు, 26న స్పీకింగ్ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిని భవన యజమాని హైకోర్టు సవాల్ చేశారు. ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం అది అక్రమ నిర్మాణమని తేల్చి, కూల్చివేయాలని గత ఏడాది ఏప్రిల్ 19న ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ అధికారులు.. గత ఏడాది జూన్ 13న ఆ భవనం స్లాబ్‌కు అనేక చోట్ల పెద్ద పెద్ద రంధ్రాలు చేసి విడిచిపెట్టారు. వాటిని పూడ్చేసిన యజమానికి నిర్మాణం కొనసాగిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం దీనిపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఇటీవల సదరు అక్రమ నిర్మాణంపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. రాత్రి 8 గంటల వరకు.. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఏవీ రంగనాథ్, భవనాన్ని కూల్చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఉదయం ఆ భవనం వద్దకు చేరుకున్న ‘బాహుబలి క్రేన్’కూల్చివేత మొదలు పెట్టింది. రాత్రి 8 గంటల వరకు కూల్చివేత కొనసాగింది. అక్కడ పోలీసులు, హైడ్రా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భవనం ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో విద్యుత్ సరఫరా ఆపేయడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ ప్రాంతంలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన కట్టడాలన్నింటినీ కూల్చివేస్తామని హైడ్రా అధికారులు తెలిపారు. అనుమతిచ్చిన అధికారుల వివరాలపై ఆరా తీస్తున్నాం.. హైకోర్టు అక్రమం అని తేల్చినా భవన నిర్మాణం కొనసాగడానికి కారణమైన అధికారుల వివరాలు ఆరా తీస్తున్నాం. బాధ్యులపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం. అయ్యప్ప సొసైటీలో దాదాపు అన్నీ అక్రమ నిర్మాణాలే. ఆ భవనాలకు ఫైర్ ఎన్ఓసీ, భవన నిర్మాణ అనుమతి కూడా లేదు. అయ్యప్ప సొసైటీలో ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీతో కలిసి సమీక్షిస్తాం. హైకోర్టు నుంచి స్పష్టమైన కూల్చివేత ఉత్తర్వులు ఉన్న వాటిని తొలి దశలో కూల్చేస్తాం. – ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్. -
హైకోర్టులో ‘పుష్ప 2’ నిర్మాతలకు భారీ ఊరట
సాక్షి, హైదరాబాద్: పుష్ప–2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటపై చిక్కడపల్లి పోలీసులు దాఖలు చేసిన కేసులో మైత్రి మూవీస్ నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, యర్నేని నవీన్‌కు హైకోర్టు ఊరటనిచ్చింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు వారిని అరెస్టు చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘మైత్రి మూవీ మేకర్స్ పేరుతో సినిమా నిర్మాణ, పంపిణీ సంస్థను నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు 30కి పైగా సినిమాలను నిర్మించాం. అలాగే ‘పుష్ప 2’తో సహా 30 ఇతర సినిమాలను పంపిణీ చేశాం. సంధ్య థియేటర్ వద్ద డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాట కారణంగా ఊపిరాడక తన భార్య, కుమారుడు కుప్పకూలారని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో భాస్కర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. మహిళ మృతిచెందగా, బాలుడు చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంతో మాకు ఎలాంటి సంబంధం లేదు. నిర్మాతలైనంత మాత్రాన ఘటనకు బాధ్యులను చేస్తూ క్రిమినల్ కేసు నమోదు చేయడం చట్టవిరుద్ధం. మాపై ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలి’అని రవిశంకర్, నవీన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.సుజన విచారణ చేపట్టారు. పిటిషనర్ల పాత్ర సినిమా నిర్మాణానికి మాత్రమే పరిమితమని వారి తరఫు న్యాయ వాది వాదించారు. ఒక్కసారి బయ్యర్లకు విక్రయించిన తర్వాత వారి పాత్ర ఏమీ ఉండదని చెప్పారు. ఎటువంటి సంబంధంలేని నిర్మాతలపై క్రిమినల్ కేసు నమోదు చేయడం సరికాదని, ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్లను అరెస్టు చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
TG: గ్రూప్-2 వాయిదాపై హైకోర్టు కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలకు లైన్ క్లియరైంది. ఈ నెల 15,16 తేదీల్లో ఉన్న పరీక్షలను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.ఒకే తేదీల్లో గ్రూప్2, స్టాఫ్ సెలక్షన్ పరీక్షలుండడం వల్ల వాయిదా వేయాలని అభ్యర్థులు హైకోర్టుకు విన్నవించారు. వీరి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు గ్రూప్ 2 పరీక్ష తేదీల్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. కాగా, తెలంగాణలో 2016లో జరిగిన గ్రూప్ 2 పరీక్ష తర్వాత మళ్లీ ఇప్పుడు జరుగుతుండడం గమనార్హం. -
‘పుష్ప-2 బెనిఫిట్ షో కలెక్షన్లు ఏం చేస్తారు?’
హైదరాబాద్, సాక్షి: అల్లు అర్జున్-సుకుమార్ ‘పుష్ప-2’ చిత్ర విడుదలకు తెలంగాణ హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. సినిమా టికెట్ ధరల పెంపు వివాదంపై దాఖలైన పిటిషన్‌ను మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు.. ఈ మేరకు విడుదల చేసుకునేందుకు మైత్రీ మూవీ మేకర్స్‌కు అనుమతి ఇచ్చింది. అదే టైంలో బెనిఫిట్ ద్వారా వచ్చే వసూళ్ల వివరాలను తమకు తదుపరి విచారణలో అందజేయాలని ప్రొడక్షన్ హౌజ్‌ను ఆదేశించింది. పుష్ప 2 సినిమా టికెట్ ధరల పెంపు వివాదంపై హైకోర్టు విచారణ జరిగింది. బెనిఫిట్ షోపేరుతో రూ.800 వసూలు చేయడం అన్యాయమని, బెనిఫిట్ షో ద్వారా వచ్చే డబ్బును ఎక్కడికి మల్లిస్తున్నారో తెలియాల్సిన అవసరం ఉందని పిటిషనర్ సతీష్ కోరారు. అయితే..చివరి నిమిషంలో సినిమా విడుదలను అడ్డుకోలేమని చెబుతూ విడుదలకు హైకోర్టు క్లియరెన్స్‌చ్చింది. పూర్తి నివేదిక పరిశీలించి ఆదేశాలు ఇస్తామని పేర్కొంది. అలాగే.. టికెట్ ధరల పెంపు ప్రభుత్వ జీవోలను సైతం పరిశీలిస్తామన్న హైకోర్టు తెలిపింది. కౌంటర్ దాఖలు చేయడానికి నిర్మాత తరఫు న్యాయవాది సమయం కోరగా, తదుపరి విచారణను డిసెంబరు 17వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ నిర్దేశించిన విధంగానే టికెట్ల ధరలు కొనసాగనున్నాయి. అలాగే.. బెనిఫిట్ షో వసూళ్ల పూర్తి వివరాలు రెండు వారాల్లో సమర్పించాలని మైత్రి మూవీస్ కు హైకోర్టు స్పష్టం చేసింది.ఇక.. రాత్రి 10గం. షోవేస్తే.. అది అయిపోయే సరికి 1గం. అవుతుందని, తద్వారా పిల్లలకు నిద్ర లేకుండా పోతుందని, వాళ్లకు నిద్ర ఎంతో అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. వాదనలు ఇలా.. మొదటి 15రోజులు సైతం అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు: పిటిషనర్ తరఫు లాయర్భారీ బడ్జెట్‌తో సినిమా చిత్రీకరించడంతో టికెట్ ధరలు పెంచాల్సి వచ్చింది: మైత్రీమూవీ మేకర్స్ తరఫు లాయర్‘ప్రభుత్వమే టికెట్ రేట్లు పెంచడానికి అనుమతించి కదా’: హైకోర్టుటికెట్ రేట్ల పెంపు వల్ల అభిమానులపై భారం పడుతోంది. అర్ధరాత్రి 1 గంటకు, తెల్లవారుజామున నాలుగు గంటలకు షోలు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు: పిటిషనర్ తరపు న్యాయవాదిపెంచిన రేట్ల ద్వారా వచ్చిన ఆదాయం ఛారిటీ, సీఎం, పీఎం సహాయ నిధి ఖాతాలో వెళ్లడం లేదు. కేవలం నిర్మాత మాత్రమే లబ్ది పొందుతున్నాడు: పిటిషనర్ తరపు న్యాయవాదిటికెట్ ధరలతో పోలిస్తే థియేటర్లలో పాప్‌కార్న్, మంచి నీళ్ల బాటిళ్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు కదా. బెనిఫిట్ షోకు ఒక వ్యక్తి 10మంది కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తే రూ.8వేలు అవుతుంది కదా: హైకోర్టు న్యాయమూర్తిబెనిఫిట్ షో కేవలం హీరో అభిమానుల సంఘాలకు మాత్రమే. అందుకే రేట్లు పెంచారు: నిర్మాత తరపు న్యాయవాది పుష్ప ది రూల్ స్క్రీనింగ్‌కు తెలంగాణ సర్కార్ ఇచ్చిన అనుమతులుడిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలకే పడనున్న బెనిఫిట్ షోరాత్రి 9.30 షోకు టికెట్ ధరను అదనంగా రూ.800 వర్తింపు. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అదనంగా రూ.800 చెల్లించాల్సిందే.అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు కూడా అనుమతిడిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంపు.డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపు.డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు అనుమతి అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో రాబోతున్న పుష్ప 2 డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 12 వేల స్క్రీన్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. 2021 డిసెంబర్లో రిలీజ్ అయిన పుష్ప మొదటి భాగం సంచలనాలు సృష్టించగా.. ఇప్పుడు రెండో భాగం మీద భారీ అంచనాలే ఉన్నాయి. -
వచ్చే ఏడాది హైకోర్టు సెలవులివే..
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది సెలవుల జాబితాను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ విడుదల చేశారు. సంక్రాంతికి ఐదు.. దసరాకు ఐదు రోజులు, వేసవిలో నెల రోజులుంటాయని పేర్కొన్నారు. సాధారణ, ప్రభుత్వ, ఐచ్ఛిక సెలవులను కూడా వెల్లడించారు. సంక్రాంతి: జనవరి 16 (గురు), జనవరి 17 (శుక్ర) వేసవి: మే 5 నుంచి జూన్ 6 వరకు.. దసరా: సెపె్టంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు ప్రభుత్వ సెలవులు.. జనవరి: నూతన సంవత్సరం 1వ తేదీ, భోగి (13న), సంక్రాంతి (14న), కనుమ (15న) ఫిబ్రవరి: మహాశివరాత్రి (26న) మార్చి: హోలీ (14న), రంజాన్ (31న) ఏప్రిల్: బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి (5న), అంబేడ్కర్ జయంతి (14న),గుడ్‌ఫ్రైడే (18న) జూన్: బక్రీద్ (7న) జూలై: బోనాలు (21న) ఆగస్టు: వరలక్ష్మీ వ్రతం (8న), స్వాతంత్య్ర దినోత్సవం (15న), శ్రీకృష్ణాష్టమి (16న), వినాయక చవితి (27న) సెప్టెంబర్: ఈద్ మిలాదున్ నబీ(5న), దుర్గాష్టమి (30న) అక్టోబర్: మహర్నవమి (1న), గాంధీ జయంతి (2న), నరక చతుర్థశి (20న), దీపావళి (21న), స్పెషల్ హాలీడే (22న) నవంబర్: కార్తీక పౌర్ణమి (5న) డిసెంబర్: క్రిస్మస్ (25న), ఫాలోయింగ్ డే (26న) శని/ఆదివారాల్లో వస్తున్నవి.. గణతంత్ర దినోత్సవం: జనవరి 26న ఉగాది: మార్చి 30న శ్రీరామనవమి: ఏప్రిల్ 6న మొహరం: జూలై 6న బతుకమ్మ: సెప్టెంబర్ 21న ఇవికాక మహావీర్ జయంతి, బసవ జయంతి, బుద్ధ పూర్ణిమ.. లాంటి 12 ఐచ్ఛిక సెలవులను కూడా ప్రకటించారు. మరో మూడు ఐచ్ఛిక సెలవులు శని/ఆది వారాల్లో రానున్నాయి. -
ప్రాణాలు పోయినా పట్టించుకోరా?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలుíÙతమై విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులు చనిపోయినా పట్టించుకోరా? అని మండిపడింది. ‘ఒకే పాఠశాలలో మూడుసార్లు ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు అస్వస్థతకు గురైతే అధికారులు ఏం చర్యలు తీసుకున్నారు? విద్యార్థులు చనిపోతున్నా స్పందించకపోవడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా లేనట్లు అనిపిస్తోంది. హైకోర్టు ఆదేశాలిస్తేనే అధికారులు పని చేస్తారా?’అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యతాప్రమాణాలు పాటించడం లేదని, అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణకు కమిటీని నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ‘హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్’అధ్యక్షుడు కీతినీడి అఖిల్ శ్రీ గురుతేజ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావుతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఫుడ్ పాయిజన్‌తో ఎంత మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.. అధికారులు ఏం చేశారు.. బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి (డిసెంబర్ 2వ తేదీ) వాయిదా వేసింది. చట్టం అమలే లేదు.. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించటం లేదని పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ‘రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 8వ తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లలో ప్రధానమంత్రి పోషణ్ మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అమలు చేయడం లేదు. అర్హులైన మహిళలు, పిల్లలకు సమీకృత శిశు అభివృద్ధి సేవా పథకం (ఐసీడీఎస్) ప్రకారం మెనూ అందించడం లేదు. మాగనూర్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో ఈ నెల 20న 100 మంది.. 26న 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరోచోట చిన్నారి మృతి చెందింది. కరీంగనర్ జిల్లా గంగాధర్ మండలంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 షెడ్యూల్ 2 ప్రకారం నాణ్యత, పోషకాహార ప్రమాణాలు పాటించి మధ్యాహ్న భోజనం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలి’అని కోరారు. ఇంత నిర్లక్ష్యమా? ఫుడ్ పాయిజన్ ఘటనల విషయంలో అధికారుల తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘జిల్లా విద్యాశాఖాధికారులు నిద్రపోతున్నారా? వారికి కూడా పిల్లలు ఉన్నారు కదా! మానవత్వం లేకుండా వ్యవహరిస్తారా? నవంబర్ 20న, 24న, 26న.. ఒకే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయినా ఉన్నతాధికారులకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదా? ఇంత సాంకేతిక యుగంలో వారం క్రితం జరిగిన ఘటనపై వివరాలు లేవంటూ వాయిదా కోరతారా? ఘటన జరిగింది మారుమూల ప్రాంతంలో కూడా కాదు.. హైదరాబాద్‌కు కేవలం 70 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. జిల్లా విద్యాశాఖాధికారికి ఫోన్ లేదా? ఇది సిగ్గుపడాల్సిన విషయం. మమ్మల్నే నిర్ణయం తీసుకోమంటే వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేస్తాం. పాస్ ఓవర్ (స్పల్ప వాయిదా)కు గానీ, వాయిదాకుగానీ అంగీకరించం. వెంటనే ఏఏజీ వచ్చి సమాధానం చెప్పాలి’అని ఆదేశించింది. దీంతో భోజన విరామం తర్వాత ధర్మాసనం ముందు ఏఏజీ హాజరై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అన్ని జిల్లాల్లో ఆహార నాణ్యతను పరీక్షించండి పాఠశాలల్లో ఆహార కలుషితంపై కఠిన చర్యలు తీసుకొంటున్నామని ధర్మాసనానికి ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ తెలిపారు. ‘చిన్నారులే ఈ రాష్ట్ర ఆస్తులు, భవిష్యత్ ఆశాకిరణాలు. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. విద్యార్థుల కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోంది. ఈ నెల 20న ఉప్మా తిని విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే దాన్ని మార్చాం. ఫుడ్ పాయిజన్ ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రధానోపాధ్యాయుడు సహా బాధ్యులపై సస్పెన్షన్‌కు వెనుకాడం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం. ఫుడ్ పాయిజన్‌పై పూర్తి వివరాలతో నివేదిక అందజేస్తాం. రెండు రోజుల సమయం ఇవ్వండి’అని కోరారు. వాదనలు విన్న కోర్టు.. ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున ఆహార శాంపిల్ సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్లను ఆదేశించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం– 2013 షెడ్యూల్ 2 ప్రకారం నాణ్యత, పోషక విలువలను పరిశీలించాలని సూచించింది. ఇప్పటికే చోటుచేసుకొన్న ఫుడ్ పాయిజన్ ఘటనలతోపాటు భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఏం చర్యలు తీసుకున్నారో వివరంగా తెలుపుతూ డిసెంబర్ 2వ తేదీలోగా నివేదిక అందజేయాల ఆదేశించింది. -
హైదరాబాద్‌లో చెరువులపై పూర్తి పర్యవేక్షణ మాదే: హైకోర్టు
హైదరాబాద్: నగరంలోని అన్ని చెరువులపై పూర్తి పర్యవేక్షణ తమదేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. హెచ్ఎండీఏ పరిధిలో 3,532 చెరువులు ఉన్నాయని జులైలో విచారణ సందర్భంగా ప్రభుత్వం తెలపగా.. వాటన్నింటికీ బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ నిర్ధరించాలని హైకోర్టు ఆదేశించింది.రామమ్మ చెరువు బఫర్‌జోన్‌లో నిర్మాణాలు జరగకుండా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇవాళ హెచ్ఎండీఏ కమిషనర్ విచారణకు హాజరై.. ఇప్పటి వరకు 2,793 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ చేసినట్టు తెలిపారు. అలాగే.. 530 చెరువులకు తుది నోటిఫికేషన్లు పూర్తయినట్టు వెల్లడించారు. అయితే..మూడు నెలల్లోగా హైదరాబాద్ పరిధిలోని అన్ని చెరువులకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్ధరిస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు డిసెంబరు 30కి వాయిదా వేసింది. -
పట్నం నరేందర్‌రెడ్డి క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వు
సాక్షి,హైదరాబాద్: లగచర్ల దాడి ఘటనలో కింది కోర్టు ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులను క్వాష్ చేయాలంటూ పట్నం నరేందర్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.హైకోర్టులో పట్నం నరేందర్‌రెడ్డి వేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా భూసేకరణకు వ్యతిరేకంగా, ప్రజలను రెచ్చగొట్టే విధంగా నరేందర్ రెడ్డి మాట్లాడారని ప్రభుత్వ న్యాయవాది కోర్టులో వాదించారు. నరేందర్ రెడ్డి రెచ్చగొట్టడం వల్లే ప్రజలకు కలెక్టర్, ఇతర అధికారులపై దాడికి దిగారని అన్నారు. అందుకు తగిన ఆధారాల్ని వీడియోలను సీడీ రూపంలో కోర్టుకు అందించారు.అయితే, నిబంధనలకు విరుద్ధంగా పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారని ఆయన తరుఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదించారు. ఈ మేరకు ఫోటోలను కోర్టుకు సమర్పించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. -
తొలగింపు కుదరదు.. ఇకపై వద్దు
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ రాజ్యాంగ విరుద్ధమని, ఇకపై రెగ్యులరైజ్ చేయడం చెల్లదని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ (రెగ్యులరైజేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్) చట్టం 1994లోని సెక్షన్ 10ఏ చెల్లదని.. చట్టవిరుద్ధమైన ఈ సెక్షన్‌ను రద్దు చేస్తున్నామని తేల్చిచెప్పింది. ఏళ్లుగా పని చేస్తున్న, ఇప్పటికే క్రమబద్ధీకరించిన కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చట్ట ప్రకారం జరగాలని, క్రమబద్ధీకరణ కుదరదని చెప్పింది. నోటిఫికేషన్ల ద్వారా మాత్రమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని స్పష్టం చేసింది. క్రమబద్ధీకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను పాక్షికంగా అనుమతించినట్లు పేర్కొంది. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లను గతంలో ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. నిబంధనలకు విరుద్ధంగా వీరిని క్రమబద్ధీకరించారని, సెక్షన్ 10ఏను చేరుస్తూ తెచ్చిన జీవో 16 చట్టవిరుద్ధమంటూ పీజీ, పీహెచ్డీ పూర్తి చేసిన.. సెట్‌కు క్వాలిఫై అయిన పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో దాదాపు 5,544 మంది ఉద్యోగులకు ఊరట లభించింది. పిటిషనర్ల వాదన.. ‘జూనియర్, పాలిటెక్నిక్, డిగ్రీ లెక్చరర్ల పోస్టులను 1993, డిసెంబర్ 30న జీవో 302తో ప్రవేశపెట్టిన సర్వీస్ రూల్స్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ సర్వీస్ నిబంధనల్లోని రూల్ 3.. జూనియర్ లెక్చరర్ల పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చి లేదా పదోన్నతితో భర్తీ చేయాలని చెబుతోంది. డిగ్రీ లెక్చరర్లకూ ఇలాంటి నిబంధనే వర్తిస్తుంది. మేమంతా జూనియర్, డిగ్రీ లెక్చరర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులకు నిబంధనల మేరకు అర్హులం. జూనియర్, డిగ్రీ లెక్చరర్ల పోస్టులను కాలేజ్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసేలా ఆంధ్రప్రదేశ్ కాలేజ్ సర్వీస్ కమిషన్ చట్టం 1985ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అయితే, ఈ చట్టం 2001లో రద్దయింది. ఆ తర్వాత నుంచి పారదర్శక విధానం లేకుండా కాంట్రాక్టు విధానంలో ఎంపిక కమిటీ పోస్టులను భర్తీ చేయడం ప్రారంభించింది. 2002 తర్వాత నుంచి నేరుగా ఈ పోస్టులను భర్తీ చేయలేదు. ఈ క్రమంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ కోసం 2016, ఫిబ్రవరి 26న ప్రభుత్వం చట్టవిరుద్ధంగా సెక్షన్ 10ఏను చేరుస్తూ ప్రభుత్వం జీవో16ను తెచ్చింది. దీంతో అర్హతలు లేని వారు ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు’ అని పిటిషనర్లు వాదించారు. విద్యాశాఖ వాదన.. ‘పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 101 మేరకు.. నిర్ణీత వ్యవధిలో ఇప్పటికే ఉన్న చట్టాన్ని సవరణ చేసే, రద్దు చేసే వీలు సర్కార్‌కు ఉంది. 2014, జూన్ 2కు ముందున్న వారినే క్రమబద్దీకరణ, రిజర్వేషన్లు కూడా వర్తింపు.. ఇలా సెక్షన్ 10ఏలో ఆరు నిబంధనలు చేర్చి ఆ మేరకే క్రమబద్దీకరించాం. భవిష్యత్తులో మరిన్ని పోస్టులను భర్తీ చేయనున్నందున నిరుద్యోగ యువత అవకాశాలను జీవో 16 నిర్వీర్యం చేస్తుందన్న పిటిషనర్ల ఆందోళన సరికాదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా క్రమబద్దీకరణ జరిగిందనడం అర్థరహితం. జీవో 16 మేరకున్న పోస్టులను 2023, ఏప్రిల్ 30న జీవో 38 ద్వారా క్రమబద్దీకరించాం’ అని విద్యాశాఖ పేర్కొంది. 5,544 మందిని క్రమబద్దీకరిస్తే కొందరినే ప్రతివాదులుగా పేర్కొనడంపై అనధికారిక ప్రతివాదుల (క్రమబద్దీకరించిన వారు) తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని రిట్ పిటిషన్లను కొట్టివేయాలన్నారు. ధర్మాసనం ఏమందంటే.. ‘విద్యాసేవా నిబంధనలు చట్టబద్ధంగా ఉన్నందున వాటిని రద్దు చేయడం, సవరించడం ఒక్కపూటలో సాధ్యం కాదు. చట్టబద్ధమైన నియమాల అమలులో సెక్షన్ 10ఏ ప్రభావం ఉండకూడదు. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 101 ప్రకారం ఇప్పటికే ఉన్న ఏదైనా చట్టాన్ని సవరించడానికి, రద్దు చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. అయితే సెక్షన్ 10ఏను చొప్పించడం పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 101కు విరుద్ధం. అందువల్ల 10ఏను కొట్టివేయడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఉమాదేవి కేసులో రాజ్యాంగ ధర్మాసనం తీర్పుపై ఇరుపక్షాలు ఆధారపడ్డాయి. తీర్పును జాగ్రత్తగా చదివితే కాంట్రాక్టు ఉద్యోగులతో ఎలాంటి సంబంధం లేదని తేలింది. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను 2009లో నియమించి ఆ తర్వాత రెగ్యులరైజ్ చేశారు. ఇలా 15 ఏళ్లకు పైగా ఉద్యోగాల్లో ఉన్నారు. అటువంటి కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాలని ఆదేశించాలా లేక ప్రస్తుత పిటిషనర్లకు పోస్టులను ప్రకటించాలని సర్కార్‌ను ఆదేశించాలా అనేది మా ముందున్న ప్రశ్న. అయితే అన్ని పిటిషన్లలో క్రమబద్ధీకరించిన వారిని తొలగించాలని కోరలేదు. పోస్టులు భర్తీ చేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏళ్ల కింద నియమితులైన వారి అంశంలో జోక్యం కూడదని సుప్రీంకోర్టు గతంలో పేర్కొంది. అందుకే క్రమబద్దీకరణ అంశంలో జోక్యం చేసుకోవడం లేదు. కాంట్రాక్టు ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయనే కారణంతో గత నిర్ణయాలను రద్దు చేయడం లేదు’ అని ధర్మాసనం పేర్కొంది. -
జీవో 16పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్ : జీవో 16పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. క్రమబద్దీకరణ (రెగ్యూలరైజ్) ద్వారా ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న వారి తొలగింపునకు ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. సెక్షన్ 10ఏ ప్రకారం తీసుకొచ్చిన జీవో 16ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.విద్య, వైద్య శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యూలరైజ్ చేసింది. 2016లో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ జీవో 16ను సవాల్ చేస్తూ నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజేషన్ జీవోను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై జస్టిస్ సుజోయ్‌పాల్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా.. సుప్రీం కోర్టు తీర్పుకు, రాజ్యాంగంలోని 14, 16, 21 ఆర్టికల్‌కు ప్రభుత్వ నిర్ణయం విరుద్ధమన్న పిటిషనర్ల వాదనపై జస్టిస్ సుజోయ్ పాల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అనంతరం, క్రమబద్దీకరణ ద్వారా ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న వారి తొలగింపునకు ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది.దీంతో పాటు మిగిలిన ఖాళీలను చట్టప్రకారం భర్తీ చేయాలని సర్కార్‌కు ఆదేశించింది. పూర్తి వివరాలను ఆర్డర్ కాపీలో పేర్కొంటోమని వెల్లడించింది. ఇప్పటికే క్రమబద్ధీకరణ అయిన ఉద్యోగులకు తొలగించొద్దన్న హైకోర్టు.. ఇకముందు భర్తీ చేసే ఉద్యోగాలన్నీ చట్టప్రకారం చేయాలని ఆదేశించింది. ఇప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ కాకుండా నోటిఫికేషన్ల ద్వారా చేయాలని కోర్టు తీర్పును వెలువరించింది. -
పరువు నష్టం కలిగించే పోస్టులు తొలగించండి
సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లే వీడియోలను అప్లోడ్ చేయకుండా చర్యలు తీసుకోవాలని యూట్యూబ్‌ను హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ల పరువుకు నష్టం కలిగించే పోస్టులు తొలగించాలని స్పష్టం చేసింది. వ్యక్తిగత వేధింపులకు పాల్పడే వీడియోలు పెట్టడం తగదని మందలించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద హామీ ఇచ్చిన విధంగా ఏ పౌరుడినీ వేధించే కంటెంట్ ఉండకూడదని తేల్చిచెప్పింది. ‘మీమాంస విక్టిమ్స్’పేరుతో అనధికారిక ప్రతివాదులు పిటిషనర్లపై పెట్టిన వీడియోలు, ఫొటోలు, ఆడియో సందేశాలను వెంటనే బ్లాక్ చేయాలని యూట్యూబ్‌కు చెప్పింది. అలాగే పిటిషనర్ల పరువుకు నష్టం కలిగించే పోస్టు యూట్యూబ్‌లో పెట్టవద్దని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. తమ పరువుకు నష్టం కలిగించేలా ఉన్న వీడియోలు, ఫొటోలు, ఆడియో సందేశాలు యూట్యూబ్ నుంచి తొలగించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కోకాపేట్‌కు చెందిన ఎం.శివకుమార్, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రావణ్‌కుమార్ విచారణ చేపట్టారు. కావాలనే పోస్టులు పెట్టారు.. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న శివకుమార్ సూచన మేరకు మురళీకృష్ణ, సమత రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టి లాభం పొందారు. ఈ క్రమంలోనే శివకుమార్ తమ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారంటూ మురళి, సమతతోపాటు మరికొందరు క్రిమినల్ కేసు పెట్టారు. ఈ కేసు ట్రయల్ కోర్టు వద్ద పెండింగ్‌లో ఉంది. ‘మీమాంస విక్టిమ్స్’పేరుతో యూట్యూబ్ చానల్ సృష్టించిన మురళి, సమత.. శివ, అతని కుటుంబసభ్యుల ఫొటోలతో పరువు నష్టం కలిగించేలా నిరాధార ఆరోపణలతో 51 వీడియోలు, ఆడియోలు పోస్టు చేశారు. ఈ వేధింపులు భరించలేక శివ భార్య ఆత్మహత్యకు యత్నించింది. ఈ పోస్టులను తొలగించాలని యూట్యూబ్‌కు మెయిల్ పంపినా స్పందన లేదు. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు’ అని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఆ వివాదంపై వీడియోలు పెట్టడాన్ని తప్పుబట్టారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ ముఖ్య కార్యదర్శి, యూట్యూబ్, ఎ.మురళీకృష్ణ, సమతా శ్యామలకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ డిసెంబర్ 4లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. -
నాపై కేసు రాజకీయ ప్రేరేపితం: పట్నం
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, జిల్లా అధికారులపై దాడి ఘటనలో తన ప్రమేయం లేదని, రాజకీయ ప్రేరేపణతో తనపై కేసు నమోదు చేశారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురు వారం ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆధారాలు లేకుండా తనపై నమోదు చేసిన కేసును, వికారాబాద్ జిల్లా కొడంగల్ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆదేశాలను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. ‘బొమ్రాస్పేట్ స్టేషన్లో నమోదైన కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే నన్ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు కనీసం కారణాలను వెల్లడించలేదు. న్యాయవాదితో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. పోలీసులు తూతూ మంత్రంగా దాఖలు చేసిన రిమాండ్ డైరీని ట్రయల్ కోర్టు ఆమోదించి ఉత్తర్వులు జారీ చేసింది. టీఐఐసీ కోసం భూమి కోల్పోయే బాధితులే అధికారులపై దాడి చేశారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా, దురుద్దేశంతో, రాజకీయ కారణాలతో నమోదు చేసిన కేసులో విధించిన రిమాండ్‌ను రద్దు చేయాలి..’అని నరేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ ఈనెల 18న విచారణకు వచ్చే అవకాశం ఉంది. పోలీసులు కట్టుకథ అల్లారు కలెక్టర్, జిల్లా అధికారులపై దాడి ఘటనలో తన పాత్ర ఉందంటూ పోలీసులు కట్టు కథ అల్లారని నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆదేశాలతో రైతులను దాడులకు పురికొల్పినట్లుగా తాను నేరాంగీకార ప్రకటన ఇచ్చానని పోలీసులు చెబుతున్నట్లు తెలిసిందన్నారు. చర్లపల్లి జైల్లో ఉన్న నరేందర్‌రెడ్డి.. ఈ మేరకు గురువారం తన న్యాయవాదుల ద్వారా కొడంగల్ కోర్టును ఉద్దేశించి అఫిడవిట్ పంపించారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో మార్నింగ్ వాక్ చేస్తున్న తనను పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బలవంతంగా వికారాబాద్ పోలీసు శిక్షణ కేంద్రానికి తీసుకెళ్లి నిర్బంధించినట్లు తెలిపారు. ఆ తర్వాత పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కొన్ని కాగితాలపై సంతకాలు తీసుకుని కోర్టుకు తీసుకెళ్లారన్నారు. కోర్టులో ప్రవేశ పెట్టిన తర్వాత లగచర్ల ఘటనలో తాను ప్రథమ ముద్దాయిగా ఉన్నట్లు సమాచారం ఇచ్చినట్లు వివరించారు. తన అరెస్టు విషయంలో పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరించారని, అరెస్టు సమాచారాన్ని కనీసం తనకు కానీ, తన కుటుంబానికి కానీ ఇవ్వలేదని తెలిపారు. తాను అఫిడవిట్లో పేర్కొన్న వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని సరైన ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. బెయిల్ కోసం జిల్లా కోర్టులో పిటిషన్ అనంతగిరి: లగచర్ల ఘటనలో అరెస్టు అయిన తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నరేందర్‌రెడ్డి గురువారం వికారాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నరేందర్‌రెడ్డి తరఫున బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు పిటిషన్ వేశారు. దీనిపై ఈ నెల 18న విచారణ జరుగుతుందని న్యాయవాది శుభప్రద్ పటేల్ తెలిపారు. -
మార్గదర్శి విజ్ఞప్తికి అంగీకరించని హైకోర్టు!
హైదరాబాద్, సాక్షి: మార్గదర్శి కేసు విచారణ సందర్భంగా.. ఇవాళ తెలంగాణ హైకోర్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనను మీడియా ముందుకు వెళ్లనివ్వకుండా కట్టడి చేయాలని మార్గదర్శి భావించింది. అయితే.. అందుకు హైకోర్టు బ్రేకులు వేసింది. మార్గదర్శి కేసులో వాదనలు వినిపిస్తున్న ఉండవల్లి.. తరచూ మీడియా ముందుకు వచ్చి మార్గదర్శి అవినీతి తుట్టెను కదిలిస్తున్నారు. దీంతో ఆయనను మీడియా ముందుకు రానివ్వకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్ వేసింది మార్గదర్శి. అయితే.. విచారణ చేపట్టకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని ధర్మాసనం మార్గదర్శి లాయర్ సిద్ధార్థ లూథ్రాకు స్పష్టం చేసింది. ఈ తరుణంలో.. లూథ్రా తీరుపై ఉండవల్లి అరుణ్‌కుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.‘‘సుప్రీం కోర్టు సూచన మేరకు ఈ కేసులో హైకోర్టుకు సహకారం అందిస్తున్నా. నేను ఏ ఒక్కరి తరఫు లాయర్ కాదన్నది గుర్తుంచుకోవాలి. మీడియాతో నేను మాట్లాడి మూడు నెలలు దాటింది. మార్గదర్శి లాయర్ తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని అన్నారు.అనంతరం.. ఉండవల్లి వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. విచారణ జరపకుండా ఉండవల్లికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని మార్గదర్శి లాయర్‌కు తేల్చి చెప్పింది. అనంతరం విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయండి
సాక్షి, హైదరాబాద్/ముషీరాబాద్: రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కల్పనకు సేకరించే వివరాల కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ వి చారణను నవంబర్ 21కి వాయిదా వేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల బాధ్యతను బీసీ కమిషన్‌కు అప్పగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా బుధవారం విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. రిజర్వేషన్ల బాధ్యతను బీసీ కమిషన్‌కు అప్పగించడం సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జీల బెంచ్ తీర్పునకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్న అత్యున్నత న్యా యస్థానం మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి, రెండు వారాల్లో స్థాయీ నివేదిక న్యాయస్థానం ముందు ఉంచాలని స్పష్టం చేశారు. వాదనలు ఇలా..: పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది, మాజీ ఏజీ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. బీసీ కమిషన్నే ప్రత్యేక కమిషన్‌గా ప్రభుత్వం పేర్కొనడం డాక్టర్ కె.కృష్ణమూర్తి, వికాస్ కిషన్‌రావు గవాలి కేసుల్లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులకు విరుద్ధమని తెలిపారు. బీసీలకు కల్పించిన రిజర్వేషన్ల సమీక్ష నిమిత్తం బీసీ కమిషన్ ఏర్పాటవుతుందన్నారు. అయితే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కల్పన నిమిత్తం వాస్తవ గణాంకాల సేకరణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. మహారాష్ట్రలో బీసీ కమిషన్నే ప్రభుత్వం ప్రత్యేక కమిషన్‌గా నియమించగా, అది ఇచ్చిన మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టు రద్దు చేసిందన్నారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బాంథియా కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. బీసీ కమిషన్ ఇచ్చే నివేదిక రిజర్వేషన్ల పునఃసమీక్షకు తప్ప రాజకీయ రిజర్వేషన్ల కల్పనకు గణాంకాలుగా పరిగణించరాదని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు అమలు కోసమే జీవో: ఏజీ వాదనల అనంతరం న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేయగా, ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై పునరాలోచన చేసి మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించాలని అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి మధ్యాహ్నం న్యాయమూర్తిని కోరారు. రెండున్నర నెలల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన దశలో ఈ ఉత్తర్వులు సరికాదన్నారు. 2021లో ప్రభుత్వం జీవో 9 జారీ చేసిందని తెలిపారు. ఈ జీవో అమలు నిమిత్తం తిరిగి జీవో 47 జారీ చేస్తూ గణాంకాల సేకరణకు విధివిధానాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ జీవోలు జారీ చేసినందున సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని చెప్పడానికి వీల్లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పుల అమల్లో భాగంగా ప్రభుత్వం ఈనెల 9న జీవో 47 జారీ చేసిందన్నారు. ఈ జీవోను పిటిషనర్లు సవాలు చేయలేదని తెలిపారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది బీఎస్ ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయంగా వెనుకబడిన వర్గాల వాస్తవ గణాంకాల సేకరణకే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అనంతరం న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఏజీ అభ్యర్థనను తిరస్కరిస్తున్నామని చెప్పారు. ఒకవేళ అభ్యంతరాలుంటే కౌంటరుతోపాటు పిటిషన్ దాఖలు చేసుకోవాలని చెప్పారు. బీసీ కమిషన్నే ప్రత్యేక కమిషన్‌గా పరిగణించాలంటూ ఇచ్చిన జీవో 47 సరికాదని, ఇది సుప్రీంకోర్టు తీర్పులు, రాజ్యాంగంతో విభేదిస్తున్నట్లు స్పష్టంచేశారు. కాగా, హైకోర్టు తీర్పుపై ఆర్.కృష్ణయ్య హర్షం వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తీర్పును గౌరవించి వెంటనే నిపుణులతో కూడిన డెడికేటెడ్ కమిషన్‌ను నియమించాలని కోరారు. -
మార్గదర్శి కేసు.. వారి వివరాలిస్తే ఇబ్బందేంటీ?: హైకోర్టు
హైదరాబాద్, సాక్షి: మార్గదర్శి కేసుపై తెలంగాణ హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. సోమవారం చేపట్టిన విచారణలో జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావుల ధర్మాసనం చందాదారుల వివరాలు ఇవ్వడానికి మీకేంటి ఇబ్బంది? అని మార్గదర్శి న్యాయవాది సిద్దార్థ లూద్రాను ప్రశ్నించింది. అయితే.. న్యాయవాది లూద్రా స్పందిస్తూ.. సుప్రీంకోర్టు వివరాలు ఇవ్వాలని చెప్పలేదన్న కోర్టుకు తెలిపారు. ఉండవల్లి అరుణ కుమార్ వద్ద పేపర్ ఫార్మాట్లో వివరాలున్నాయి. ఆయన ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో అడుగుతున్నారు. ఇవ్వడానికి ఇబ్బందేంటో చెప్పండని హైకోర్టు ధర్మాసనం మరోసారి ప్రశ్నించింది. పిటిషనర్ నుంచి సూచనలు పొంది తెలియజేస్తామని న్యాయవాది లూద్రా అన్నారు. అన్ని వివరాలతో రావాలని ఆర్బీఐ, లూద్రాకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్–2 రామోజీరావు మృతిచెందారని తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్( పీపీ) హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక..తదుపరి విచారణ నవంబర్ 4వ తేదీకి హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.చదవండి: చందాలు ఎవరికి తిరిగిచ్చారో.. ఇవ్వలేదో వివరాల్లేవు -
ఆర్నెల్లు ఏం చేశారు?
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష వాయిదాకు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం నిరాకరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఇందులో జోక్యం చేసుకోవడానికి అప్పీళ్లలో ఎలాంటి మెరిట్స్ లేవని వ్యాఖ్యానించింది. అప్పిలెంట్ల (పిటిషన్ వేసిన అభ్యర్థులు) తీరును తప్పుబట్టింది. ‘ఫిబ్రవరిలో రీ నోటిఫికేషన్ ఇస్తే ఆగస్టులో సవాల్ చేస్తారా? ప్రిలిమ్స్ కూడా రాసి, ఫలితాలు విడుదల చేసిన తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా?’ అని ప్రశ్నించింది. మెయిన్స్‌కు అర్హత సాధించిన 31,383 మందిలో 90 శాతం పరీక్షల హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. వారి ఆశలపై నీళ్లు చల్లలేం. అధికారులు కూడా సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మరో రెండురోజుల్లో పరీక్ష అనగా ఇప్పుడు వాయిదా వేయడం సరికాదు. సింగిల్ జడ్జి అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే తీర్పునిచ్చారు. ఈ అప్పీళ్లను కొట్టివేస్తున్నాం..’ అని జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీళ్లు గ్రూప్–1 ప్రిలిమినరీ ‘కీ’లో తప్పులను, ఎస్టీ రిజర్వేషన్ల పెంపును, రీ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దామోదర్‌రెడ్డితో పాటు మరో ఏడుగురు హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. టీఎస్పీఎస్సీ వాదనలతో ఏకీభవిస్తూ పిటిషన్లను కొట్టివేశారు. సాంకేతిక అంశాలను నిపుణుల కమిటీలకే వదిలేయాలని కోర్టుల జోక్యం కూడదని తీర్పునిచ్చారు. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్లు రెండు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది. రీ నోటిఫికేషన్‌తో అర్హులు పెరిగారు.. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు శివ, సుధీర్ వాదనలు వినిపిస్తూ.. ‘రీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కమిషన్‌కు అధికారం లేదు. ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి 2024లో మళ్లీ ఇవ్వడంతో రెండేళ్లలో అర్హులు పెరిగారు. దరఖాస్తుల గడువు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచం అని చెప్పిన కమిషన్ రెండురోజులు పెంచింది. దీంతో దాదాపు 20 వేల దరఖాస్తులు పెరిగాయి. ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచారు. తొలి నోటిఫికేషన్ నాటికి ఈ రిజర్వేషన్లు 6 శాతమే. ఇది ఎస్టీలకు లబ్ధి చేకూర్చినా.. మిగతావారు పోస్టులు కోల్పోయే అవకాశం ఉంది. అప్పిలెంట్లు ప్రిలిమ్స్ ప్రాథమిక ‘కీ’ లోని 15 ప్రశ్నలపై అభ్యంతరాలు తెలిపారు. అయినా వాటిని నిపుణుల కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. 6 ప్రశ్నలు (41, 66, 79, 112, 114, 119) పూర్తిగా తప్పుల తడకగా ఉన్నాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని మెయిన్స్ వాయిదా వేయాలి. స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి ‘కీ’ రూపొందించాలి..’ అని కోరారు. ఇలానే ప్రశ్నలు అడగాలని టీఎస్పీఎస్సీని కోరలేరు.. టీఎస్పీఎస్సీ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ‘పిటిషనర్లు 8 మందిలో ఇద్దరు మెయిన్స్‌కు అర్హత సాధించారు. అయితే ‘కీ’పై ఒక్కరు మాత్రమే అభ్యంతరం తెలిపారు. అతను కూడా సరైన సమాధానమే ఇచ్చారు. ప్రశ్నలు ఎలా అడగాలి అనేది నియామక సంస్థ పరిధిలోని అంశం. రాజ్యాంగ బద్ధమైన సంస్థను ఇలానే ప్రశ్నలు అడగాలని ఎవరూ కోరలేరు. ‘కీ’ ఇలానే ఉండాలని కూడా నిర్ణయించలేరు. 6,175 అభ్యంతరాలను స్వీకరించాం. ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ నిర్ణయం మేరకే 2 ప్రశ్నలు తొలగించాం. మెయిన్స్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 90 శాతం మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. సాంకేతిక కారణాలతో దరఖాస్తులకు 2 రోజులు సమయం ఇచ్చాం. అప్పీళ్లలో మెరిట్ లేదు కొట్టివేయాలి..’ అని విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఏ ప్రశ్న సరైందో న్యాయస్థానాలు తేల్చలేవు ‘8 మంది అప్పిలెంట్లలో ఇద్దరు మాత్రమే ‘కీ’పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 15 ప్రశ్నలకు అభ్యంతరాలు తెలుపగా, నిపుణుల కమిటీ వాటిని పరిశీలించింది. ఇలా 6,147 అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే తుది ‘కీ’ విడుదల చేసింది. ఏ ప్రశ్న సరైంది.. ఏది కాదో.. న్యాయస్థానాలు తేల్చలేవు. నిపుణుల కమిటీనే నిర్ణయం తీసుకోవాలి. నోటిఫికేషన్లోనే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలంగాణ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చెప్పింది. అక్టోబర్‌లో మెయిన్స్ అని తెలిసినా పిటిషనర్లు ఆలస్యంగా కోర్టును ఆశ్రయించారు. రెండేళ్లలో రెండుసార్లు ప్రిలిమ్స్ రద్దయ్యింది. ఇటీవల జరిగింది మూడోది. ఇప్పుడు మెయిన్స్ కూడా వాయిదా వేస్తే అభ్యర్థుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంటుంది. గ్రూప్–1 ఒక ప్రహసనంలా మారుతుంది..’ అని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. నిరుద్యోగుల్లో నైరాశ్యం ఏర్పడుతోంది మానవ తప్పిదం కారణంగా కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చు. తొలిసారి గ్రూప్–1 ప్రిలిమ్స్ 5 లక్షల మంది రాశారు. రెండుసార్లు రద్దు తర్వాత 3 లక్షలే రాశారు. అభ్యర్థుల్లో నిరాసక్తత పెరిగిపోతోంది. నిరుద్యోగుల్లో తీవ్ర నైరాశ్యం ఏర్పడుతోంది. కొందరు అత్యాహత్యాయత్నాలకు కూడా పాల్పడుతున్నారు. ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి. లక్షల మంది మనోభావాలను అర్థం చేసుకోవాలి. ఆరుగురి కోసం వేలాది మందిని అసహనానికి గురి చేయడం సరికాదు. మెయిన్స్ వాయిదా వేయడం సాధ్యం కాదు. 2011లో మాదిరిగా ఆదేశాలిస్తే.. ఇక టీఎస్పీఎస్సీ ఈ గ్రూప్–1 పరీక్ష ఎప్పటికి పూర్తి చేస్తుందో తెలియదు. రీ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తున్నప్పుడు ప్రిలిమ్స్ ఎలా రాశారు? పోస్టులను పెంచే, తగ్గించే అధికారం కమిషన్‌కు ఉంటుంది. రీ నోటిఫికేషన్‌తో వచ్చిన నష్టం ఏంటి? రద్దు చేసి అదేరోజు మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చారు కదా? – జస్టిస్ షావిలి -
ఫోన్‌ట్యాపింగ్ కేసు.. హైకోర్టుకు మాజీ డీసీపీ
సాక్షి,హైదరాబాద్:ఫోన్ ట్యాపింగ్‌లో కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్‌రావు హైకోర్టులో శుక్రవారం(అక్టోబర్18) బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్‌రావు అరెస్టయి రిమాండ్‌లో ఉన్నారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్‌రావును పంజాగుట్ట పోలీసులు ఏ4గా చేర్చారు. రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. బెయిల్‌పై తదుపరి విచారణ ఈనెల 23కు హైకోర్టు వాయిదా వేసింది. ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మరో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్నారు. పోలీసులు ఆయనను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదీ చదవండి: స్పెల్లింగ్ చెబితే.. రేవంత్‌కు రూ.50 లక్షల బ్యాగ్ గిఫ్ట్ ఇస్తా: కేటీఆర్ -
కాట.. ఏపీబాట !
సాక్షి, సిటీబ్యూరో: ఊహించినట్లుగానే జీహెచ్ఎంసీ కమిషనర్ కాట ఆమ్రపాలి..ఆంధ్రప్రదేశ్ బాట పట్టక తప్పలేదు. తనను తెలంగాణలోనే కొనసాగించాలని మరికొందరు ఐఏఎస్ అధికారులతో పాటు క్యాట్‌ను ఆశ్రయించగా..అక్కడ చుక్కెదురుకావడంతో.. వెంటనే హైకోర్టు మెట్లెక్కినా, ఉపశమనం లభించలేదు. ముందైతే డీఓపీటీ ఆదేశాల కనుగుణంగా ఏపీలో రిపోర్ట్ చేయాలని హైకోర్టు పేర్కొనడంతో జీహెచ్ఎంసీ నుంచి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఐఏఎస్ అధికారులకు అనుకూలంగా క్యాట్ తీర్పునివ్వగలదని జీహెచ్ఎంసీ వర్గాలు భావించాయి. క్యాట్‌లో ఊహించని పరిణామం ఎదురవడంతో.. కనీసం హైకోర్టు అయినా మిగతా వారితోపాటు ఆమ్రపాలికి అనుకూలంగా ఆదేశాలివ్వగలదని ఆశించినప్పటికీ, హైకోర్టు సైతం ఏపీకి వెళ్లాలని స్పష్టం చేయడంతో జీహెచ్ఎంసీ వర్గాలు ఉస్సూరుమన్నాయి. ఇప్పుడిప్పుడే.. బల్దియా వ్యవహారాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయని భావిస్తున్న తరుణంలో కమిషనర్ మార్పుతో పరిస్థితులు మళ్లీ మొదటికి రానున్నాయి. దాదాపు 650 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన జీహెచ్ఎంసీలో ఆరుజోన్లు, 30 సర్కిళ్లు, వేల సంఖ్యలో ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తయితే పరిధికి తగ్గట్లే చెత్త సమస్యలు, తదితరమైనవి ఉన్నాయి. ప్రతిరోజూ ఇంటింటి నుంచి చెత్త సేకరణ సైతం సవ్యంగా జరగని దుస్థితినుంచి పరిస్థితుల్ని ఓ గాడిన పెట్టేందుకు ఆమ్రపాలికి సమయం సరిపోలేదు. జీహెచ్ఎంసీని అర్థం చేసుకొని, ఇప్పుడిప్పుడే ఒక్కో విభాగంపై పట్టు సాధిస్తున్న తరుణంలో అనూహ్యంగా వెళ్లాల్సి వచ్చింది. అసలే అస్తవ్యస్తంగా ఉన్న జీహెచ్ఎంసీలో సిబ్బంది జీతాల చెల్లింపుల నుంచి నిర్వహణ పనులకు సైతం నిధుల కటకట ఉంది. క్రమశిక్షణ లేని సిబ్బంది..బదిలీలైనా సీట్లను వదలని ఉద్యోగులు.. ఒప్పందాలున్నా పనులు సవ్యంగా చేయని కాంట్రాక్టు ఏజెన్సీలు..విధులకు చుట్టపుచూపుగా వచ్చిపోయే ఉద్యోగులు..వచ్చినా పనులు చేయకుండా కాలక్షేపం చేసే వాళ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే జీహెచ్ఎంసీలో సమస్యలకు అంతేలేదు. అంతర్గత బదిలీల్లోనూ ఆమ్రపాలినే మాయ చేసి కావాల్సిన సీట్లలో పాతుకుపోయిన వారు కూడా ఉన్నారు. ఈనేపథ్యంలో కొత్త కమిషనర్‌కు బాధ్యతల నిర్వహణ కత్తిమీద సామే కానుంది. జీహెచ్ఎంసీ విభజన, దాదాపు ఏడాది కాలంలో జరగనున్న పాలకమండలి ఎన్నికలు ఇలా చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. కమిషనర్‌గా ఇలంబర్తి ఈ నేపథ్యంలో ప్రభుత్వం జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తికి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) అప్పగించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇలంబర్తి గతంలో సెంట్రల్‌జోన్ (ఖైరతాబాద్) కమిషనర్‌గా పనిచేశారు. ఆ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఆయనకు జీహెచ్ఎంసీ కమిషనర్‌గా అదనపు బాధ్యతలప్పగించిందని జీహెచ్ఎంసీ వర్గాలు భావిస్తున్నాయి. -
వివరాలిస్తే.. అక్రమాలు తేలుస్తా..: ఉండవల్లి
సాక్షి, హైదరాబాద్: చందాదారులకు చెల్లింపులు చేపట్టామంటూ సుప్రీంకోర్టుకు మార్గదర్శి ఫైనాన్సియర్స్ 69,531 పేజీల వివరాలను అందజేసిందని.. అందులో ఇచ్చిన సమాచారమంతా తప్పుల తడక అని తెలంగాణ హైకోర్టుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలిపారు. తను అడిగిన మేరకు ఆ వివరాలు బుక్ రూపంలో కాకున్నా.. పెన్‌డ్రైవ్‌లో ఇచ్చినా అక్రమాలను తేలుస్తానన్నారు. ఆగస్టు 30న అఫిడవిట్ దాఖలు చేసినా ఇప్పటివరకు వివరాలు అందజేయలేదని వెల్లడించారు. అఫిడవిట్‌ను పరిశీలించి వివరాలు అందేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.చట్ట నిబంధలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అ«దీకృత నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018, డిసెంబర్ 31న తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశాయి. అలాగే తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు తీర్పును 2024, ఏప్రిల్ 9న కొట్టివేసింది. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ.. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని చెప్పింది. ఇంటిపేర్లు, అడ్రస్‌లు లేకుండానే.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు మార్గదర్శి ఫైనాన్షియర్ పిటిషన్లపై మరోసారి విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. విచారణ వర్చువల్‌గా హాజరైన ఉండవల్లి మాట్లాడుతూ ‘రిజిస్ట్రీ ప్రచురించిన నోటీసులను చందాదారులు చూసే అవకాశం తక్కువ. సుప్రీంకోర్టుకు మార్గదర్శి 69,531 పేజీల వివరాలు అందజేసింది. సుప్రీంకోర్టుకు ఇచ్చినదంతా తప్పుడు సమాచారమే. చాలా మందికి ఇంటిపేర్లు లేవు.. ఇంటిపేర్లు ఉన్నా.. వారి అడ్రస్‌లు లేవు. కొందరికి నాలుగైదు అడ్రస్‌లు చూపించారు.చందాలు తిరిగి ఎవరికి ఇచ్చారో.. ఇవ్వలేదో సరిగా వివరాల్లేవు. జ్యోతిరావు అనే వ్యక్తి రూ.35 లక్షలకు పైగా కట్టారు. ఆయన అడ్రస్‌కు సంబంధించి వివరాలు సరిగా లేవు. రిజిస్ట్రీ ప్రచురించిన పబ్లిక్ నోటీసును బాధితులు చూసే అవకాశం తక్కువ. కోర్టు నేరుగా తెలుసుకునేందుకు అవకాశం లేదు. అందుకే సుప్రీంకోర్టు నన్ను విచారణలో హైకోర్టుకు సహాయకుడిగా ఉండమని కోరింది’ అని పేర్కొన్నారు. ‘చందాల వసూలు అంతా అక్రమమేనని ఆర్బీఐ తేల్చిన విషయాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి.మార్గదర్శి చందాల వసూలంతా చట్టవిరుద్ధం, అక్రమేనని.. బాధ్యులను ప్రాసిక్యూట్ చేయాలని ఆర్బీఐ కౌంటర్ దాఖలు చేసింది. కాజ్లిస్ట్(కోర్టు విచారణ పిటిషన్ల జాబితా)లో నా పేరు ప్రచురించేలా రిజిస్ట్రీని ఆదేశించండి’ అని కోరారు. అనంతరం అరుణ్‌కుమార్ పేరు కాజ్‌లిస్ట్‌లో చేర్చాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. ఆయన అఫిడవిట్‌ను పరిశీలించి సమాచారం అందేలా చూడాలని స్పష్టం చేసింది. -
హైకోర్టునూ కూల్చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కూల్చివేత ఘటనపై హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘హైకోర్టును కూల్చివేయాలని తహసీల్దార్ లేఖ రాస్తే సిబ్బందిని, యంత్రాలను ఏర్పాటు చేస్తారా? మీకు చట్టం తెలియ దా? ఆదివారం, సూర్యాస్తమయం తరువాత కూల్చి వేత చేపట్టవద్దని విస్తృత ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు పాటించరా? చట్టం తెలియకపోతే ప్రభుత్వ న్యాయవాదులను అడిగి తెలుసుకోరా? మీడియా తో మాట్లాడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తారా?’అంటూ మండిపడింది. స్టే ఇచ్చిన ఆస్తిని సెలవు రోజు ఎందుకు కూల్చాల్సి వచ్చిందన్న దాని కి సమాధానం ఉందా అని ప్రశ్నించగా.. హైడ్రా కమిషనర్ రంగనాథ్, అమీన్పూర్ తహసీల్దార్ రాధ సమాధానం చెప్పలేదు. హైడ్రా ఏర్పాటు అభినందనీయమే అయినా పని తీరు మాత్రం అసంతృప్తికరమని వ్యాఖ్యానించింది. రాజకీయ నాయకులు చెప్పింది వింటే ఇబ్బందులు పడేది మీరే అన్న విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించింది. తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేస్తూ, అలోగా కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రా, తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేసింది. అప్పటివరకు ఆస్తిపై స్టేటస్ కో విధించింది. కమిషనర్, తహసీల్దార్ హాజరు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట్ గ్రామపంచాయతీ పరిధి సర్వే నంబర్ 165, 166లోని 270 గజాల స్థలంలో నిర్మాణానికి 2022, నవంబర్ 10న మహ్మద్ రఫీ భవన నిర్మాణ అనుమతి పొందారు. అయితే ఆ స్థలం సర్వే నంబర్ 164లో ఉందని, అది ప్రభుత్వ భూమి అంటూ అధికారులు అనుమతి రద్దు చేశారు. ఈ క్రమంలో నోటీసులు జారీ చేసి ఆదివారం ఆ స్థలంలోని నిర్మాణాన్ని కూల్చివేశారు. దీన్ని సవాల్ చేస్తూ రఫీ, గణేశ్ నిర్మాణ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. గత విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్, అమీన్పూర్ తహసీల్దార్ హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో సోమవారం తహసీల్దార్ నేరుగా, కమిషనర్ వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు వారు సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. ఆదివారం ఇంట్లో ఉండకుండా ఇదేంటీ? ‘వివాదాస్పద ఆస్తి సర్వే నంబర్ 165, 166లో ఉందని పిటిషనర్లు పేర్కొంటున్నారు. బిల్డింగ్ పర్మిషన్ 2022 నవంబర్‌లో తీసుకున్నారు. కానీ వాస్తవంగా అది సర్వే నంబర్ 164లో ఉంది. ఈ విషయం 2024 మార్చిలో తెలిసింది. ఏప్రిల్ 1న సర్వే చేశాం. ఏప్రిల్ 24న కలెక్టర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ రికార్ట్స్ కూడా సర్వే చేశారు. ఏప్రిల్ 2న పిటిషనర్లకు నోటీసులిచ్చాం. దానికి వారు ఏప్రిల్ 15, 18 తేదీల్లో వివరణ ఇచ్చారు. అనంత రం సెపె్టంబర్ 20న నోటీసు లు జారీ చేశాం. 22న ఉద యం హైడ్రా సాయంతో కూ ల్చివేత చేపట్టాం..’అని తహసీల్దార్ చెప్పారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. ‘పిటిషనర్ల వాద నలు విన్నారా? బిల్డింగ్ అనుమతి రద్దు పై, విద్యుత్ తొలగింపుపై స్టే ఉంది తెలుసా? చట్టప్రకారం ముందుకు వెళ్లమని చెప్పాం కదా? శనివారం సాయంత్రం 6.30 గంటలకు నోటీసులు అందితే.. ఆదివారం ఉదయం 7.30 గంటలకు కూల్చివేస్తారా? అసలు ఆదివారం మీకు సెలవు కదా.. ఇంట్లో ఉండకుండా, అత్యవసరంగా విధులకు హాజరై మరీ కూల్చివేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఐదు నెలలుగా ఆగుతూ వచ్చి ఒక్క రోజులో కూల్చివేత ఎందుకు? సెపె్టంబర్ 20న ఇచ్చిన ఆదేశాల్లో ఖాళీ చేయడానికి 48 గంటల సమయం ఇచ్చారు కదా. ఆ గడువు పూర్తయ్యే వరకు ఎందుకు ఆగలేదు? కలెక్టర్ ఆదేశాలిస్తే చెప్పండి ఆయననూ పిలుస్తాం. ప్రజాస్వామ్య దేశంలో సహజ న్యాయ సూత్రాలను పాటించాలని మీకు తెలియదా?..’అంటూ ప్రశ్నల వర్షం కురిపించగా, తహసీల్దార్ సమాధానం చెప్పలేకపోయారు.అనుమతులిస్తున్న అధికారులపై చర్యలేంటి? సబ్ రిజిస్ట్రార్ ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారు? పంచా యతీ/ మున్సిపల్ అధికారులు ఎందుకు అనుమతి ఇస్తున్నారు? విద్యుత్, నల్లా కనెక్షన్లు ఎలా ఇస్తున్నా రు? ఆస్తి పన్ను ఎందుకు వసూలు చేస్తున్నారు? ఇంతమంది అధికారులు ఇలా ఇష్టారాజ్యంగా అను మతి ఇస్తూ పోయిన తర్వాత అది చట్టవిరుద్ధమని ప్రజలకు చెప్పేదెవరు? సదరు అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారు? ఎక్కడికక్కడ అక్రమ మా ర్గంలో అనుమతులిస్తారు. కొన్నేళ్ల తర్వాత వచ్చి ఇది అక్రమమంటూ చట్టాన్ని పాటించకుండా కూల్చివేస్తారు. చివరకు ప్రజలను బాధితులను చేస్తారా?’అంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రజలే అన్నీ తెలుసుకోవాలంటే ఎలా?తహసీల్దార్ లేఖ మేరకు కూల్చివేతకు సిబ్బందిని, యంత్రాలను అందజేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టుకు తెలిపారు. దీంతో.. ‘తహసీల్దార్ హైకోర్టు, చారి్మనార్‌ను కూల్చివేయాలన్నా అలాగే పంపిస్తారా? చట్టాన్ని అమలు చేయరా? మీ స్టేటస్ ఏంటి? ఆదివారం కూల్చివేత చేపట్టవచ్చా? తహసీల్దార్ అడిగితే మీరు చట్టవిరుద్ధంగా సమకూరుస్తారా? సహకరిస్తారా? కోర్టు ఆదేశాలంటే లెక్కలేదా? అక్రమ నిర్మాణాలను మేం సమర్థించడం లేదు. కానీ చట్టాన్ని పాటించాలి కదా? హైడ్రా తీరు సంతృప్తికరంగా లేదు. కమిషనర్‌గా మీకే అవగాహన లేకపోతే ఎలా? జీవో 99 ప్రకారం హైడ్రాకు ఏం పాలసీ ఉంది?’అంటూ జడ్జి ప్రశ్నించారు. చట్టంపై తమకు గౌరవం ఉందని, ఔటర్ రింగ్ రోడ్డు లోపలే తమ పరిధి అని, ఇందులో దాదాపు 2,500 చెరువులు ఉన్నట్లు రంగనాథ్ తెలిపారు. కాగా ‘ఒక్క చెరువుకైనా తుది నోటిఫికేషన్ ఇచ్చి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ నిర్ధారించారా? మూసీపై మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటీ? పిటిషనర్ ఈ నెలలోనే హైడ్రాపై రిట్ పిటిషన్ వేశారు? మేం జోక్యం చేసుకోవడం లేదని మీ (హైడ్రా) కౌన్సిల్ చెప్పారు. అయినా కూల్చివేత చేపట్టారు. ప్రజలే అన్నీ విచారణ చేసుకుని కొనుగోలు చేయాలి.. వారికి చట్టాలపై అవగాహన ఉండాలంటే ఎలా? జైలుకు పంపిస్తేనే దారికొస్తారుహైడ్రా కార్యాలయం ఎక్కడని సంస్థ కౌన్సిల్ కటికం రవీందర్‌రెడ్డిని న్యాయమూర్తి ప్రశ్నించారు. ‘డిజాస్టర్ అంటే ఒక్క కూల్చివేతలే కాదు కదా.. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు హైడ్రా చేపడుతోందా? బతుకమ్మ కుంట, నల్లకుంట పరిస్థితి ఏంటీ? ఒక్క రాత్రిలో ఈ సిటీని మార్చలేం. చెరువులకు సంబంధించిన మెమైరీలను (చిత్రపటాలను) పరిశీలించి ఎఫ్టీఎల్ను నిర్ధారించాలని చెప్పాం. రెండేళ్లుగా కోరుతున్నా ఒక్క చెరువుకు కూడా ఎఫ్టీఎల్ తుది నోటిఫికేషన్ ఇవ్వలేదు. మీరు పబ్లిక్ సర్వెంట్స్ అనేది మర్చిపోవద్దు. చట్టాన్ని ఉల్లంఘిస్తామంటే మాత్రం కోర్టులు చూస్తూ కూర్చోవు. అక్రమాలకు పాల్పడిన, చట్టాన్ని గౌరవించని అధికారులను చంచల్‌గూడ, చర్లపల్లికి పంపిస్తే అప్పుడు దారికొస్తారు. కూల్చివేతలు చేపట్టేటప్పుడు పాటించాల్సిన విధానం ఏంటీ అనేది ప్రభుత్వ న్యాయవాదులను అడిగి తెలుసుకోవచ్చు కదా.. అది కూడా చేయరు. ఆదివారం కూల్చడం ముగ్గురు జడ్జిల తీర్పుకు విరుద్ధం..’అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలంటే తహసీల్దార్‌కు లెక్కలేదని పిటిషనర్ న్యాయవాది నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం.. అదీ ఉదయం 7.30 గంటలకే కావడంతో హౌస్ మోషన్ కూడా దాఖలు చేయలేకపోయామన్నారు. రెవెన్యూ శాఖ తరఫున జీపీ మురళీధర్‌రెడ్డి వాదనలు వినిపించారు. అనంతరం న్యాయమూర్తి విచారణ వాయిదా వేశారు. యుద్ధ ప్రాతిపదికన తొలగించడం లేదుప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే ముందుకు మూసీలో ఆక్రమణలపై రాష్ట్ర ప్రభుత్వం వెల్లడిమూసీ పరీవాహక ప్రాంతంలో ఆక్రమణల తొలగింపు యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం లేదని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీనిపై కమిటీని ఏర్పాటు చేశామని, బాధితులతో చర్చలు జరుపుతోందని ఏఏజీ తేరా రజనీకాంత్‌రెడ్డి వెల్లడించారు. ఇళ్లు కోల్పోయిన పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాత చట్టపరంగా ముందుకు వెళ్తామని చెప్పారు. మూసీ పరీవాహక ప్రాంతం వెంట ఉన్న ఇళ్లకు ‘రివర్ బెడ్’అంటూ రెడ్ కలర్‌తో మార్కింగ్ చేశారని, కూల్చివేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని పేర్కొంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ రూపంలో దాఖలైన ఈ పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు. మూసీ పరీవాహక ప్రాంతంలో ఆక్రమణల తొలగింపునకు ఏదైనా పాలసీ ఉందా? అని ప్రశ్నించారు. ఎఫ్టీఎల్ బయట నిర్మించుకున్న వారికి నోటీసులు ఎలా ఇస్తారని, ఎలాంటి చర్యలు చేపట్టినా చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఏఏజీ వాదనల అనంతరం.. ఎఫ్టీఎల్ నిర్ధారించిన తర్వాతే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణ అక్టోబర్ 16కు వాయిదా వేశారు. -
కాసేపట్లో హైకోర్టుకు 'హైడ్రా' కమిషనర్ రంగనాథ్
-
గ్రూప్–1పై తెలంగాణ హైకోర్టులో విచారణ
సాక్షి,హైదరాబాద్ : గ్రూప్–1పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో తెలంగాణ ప్రభుత్వం రెండోసారి గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది.పిటిషనర్ తరఫున జొన్నలగడ్డ సుధీర్ వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా..హైకోర్టు ప్రిలిమ్స్ మాత్రమే రద్దు చేసి తిరిగి పరీక్ష నిర్వహించాలని పిటీషనర్ వాదించారు. ఎస్టీ రిజర్వేషన్లు 6 నుంచి 10కి పెంచడానికి వీలులేదని తెలిపారు.అనంతరం, టీఎస్పీఎస్సీకి అన్ని అధికారలుంటాయని స్పెషల్ జీపీ (గవర్నమెంట్ ప్లీడర్)..చట్ట బద్ధంగా ఏర్పాటైన సంస్థ నియాకాల కోసం నిర్ణయం తీసుకోవచ్చని వెల్లడించారు. ఇరుపక్ష వాదనల విన్న కోర్టు తదుపరి విచారణ సోమవారానికి (అక్టోబర్1కి) వాయిదా వేసింది. -
ఇక్కడెందుకు పిటిషన్ వేశారు?
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పరీక్షకు సంబంధించి సింగిల్ జడ్జి వద్ద పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా, నేరుగా ఇక్కడ పిటిషన్ ఎందుకు వేశారని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది. రాజ్యాంగ పరమైన ఉల్లంఘనలు ఏమైనా ఉన్నాయని అడిగింది. విచారణను రేపటికి వాయిదా వేస్తూ, ఇక్కడే విచారణ జరపాలా.. లేక సింగిల్ జడ్జి వద్ద ఉన్న పిటిషన్లకు అటాచ్ చేయాలా అనేది తేలుస్తామని స్పష్టం చేసింది. 2024, ఫిబ్రవరి 19న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం టీఎస్పీఎస్సీ రూల్ ఆఫ్ లాను పాటించాలని, ప్రిలిమ్స్, మెయిన్స్.. అన్నింటా రిజర్వేషన్లు అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నల్లగొండ జిల్లా శాలిగౌరారానికి చెందిన పోగుల రాంబాబు సహా మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మహిళలు, దివ్యాంగుల కేటగిరీలోనూ సమాంతర రిజర్వేషన్లు పాటించాలని, అధికారులు వరి్టకల్‌గా రోస్టర్ పాయింట్లు నిర్ధారిస్తున్నారని, మెయిన్స్‌కు 1ః50 గా ఎంపిక చేశారని, దీనిలో కూడా సమాంతర రిజర్వేషన్ల ప్రకారం ఎంపిక చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ లోకస్ లేకుండానే రూల్‌ను చాలెంజ్ చేస్తూ పిటిషన్ వేశారని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. ‘చట్టబద్ధమైన రూల్స్ లేనప్పుడు సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ దాఖలు చేయాలి కదా, ఇక్కడ ఎందుకు’అని ప్రశ్నించింది. పిటిషనర్ న్యాయవాది సమయం కోరడంతో విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది. -
విద్యుత్ క్రయవిక్రయాలకు ఓకే
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. పవర్ ఎక్స్చేంజీల్లో విద్యుత్ క్రయవిక్రయాలు జరపకుండా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)పై గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా విధించిన ఆంక్షలపై స్టే విధించింది. ఎక్స్చేంజీల్లో విద్యుత్ క్రయవిక్రయాలు జరిపేందుకు టీజీఎస్పీడీసీఎల్కు అవకాశం కల్పించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యుత్ బిడ్డింగ్‌కు అనుమతించాలని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్ఎల్డీసీ)ను ఆదేశిస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 17కు వాయిదా వేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అత్యవసరంగా హైకోర్టులో కేసు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పీజీసీఐఎల్)కు రూ.261.31 కోట్ల చార్జీలను బకాయిపడినందుకు పవర్ ఎక్స్చేంజీల్లో విద్యుత్ క్రయవిక్రయాలు జరపకుండా టీజీఎస్పీడీసీఎల్పై గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా గురువారం ఉదయం ఆంక్షలు విధించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అత్యవసరంగా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి.. ఈ నిర్ణయంపై స్టే విధించాలని కోరింది. నిషేధంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, రాష్ట్రానికి మొత్తం విద్యుత్ కొనుగోళ్లు ఆగిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. రోజుకు 60 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోళ్లు నిలిచిపోతాయని.. వ్యవసాయం, పరిశ్రమలు, ఆస్పత్రులు, గృహాలు.. ఇలా యావత్ రాష్ట్రానికి ఇబ్బంది ఏర్పడుతుందని వివరించింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. కమిషన్ వద్ద పెండింగ్‌లో పిటిషన్ ప్రభుత్వం తరఫున ఏజీ ఏ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పీజీసీఐఎల్‌కు రూ.261.31 కోట్ల చార్జీల చెల్లింపు విషయంలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ) వద్ద కేసు పెండింగ్‌లో ఉండగా, ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. రూ.261.31 కోట్ల చెల్లింపులో తెలంగాణ ప్రభుత్వం విఫలమైనందునే లేట్ పేమెంట్ సర్‌చార్జీ నిబంధనల మేరకు ఆంక్షలు విధించినట్లు చెప్పారు. బకాయి పడిన మొత్తంలో 25 శాతం చెల్లించాలని గత ఫిబ్రవరిలో సూచించామని, అయినా చెల్లించలేదని పీజీసీఐఎల్ తరఫు న్యాయవాది తెలిపారు. గ్రిడ్ కంట్రోలర్‌కు అధికారం లేదు వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘రూ.261.31 కోట్ల చార్జీల చెల్లింపు వ్యవహారం సీఈఆర్సీలో పెండింగ్‌లో ఉన్నందున విద్యుత్ క్రయవిక్రయాలపై నిషేధం విధిస్తూ తెలంగాణ పేరును ప్రాప్తి పోర్టల్‌లో ప్రచురించే అధికారం గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు లేదు. అందువల్ల లేట్ పేమెంట్ సర్‌చార్జ్ నిబంధనల ప్రకారం ప్రాప్తి వెబ్సైట్లో ప్రచురణపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. ఈ ఆదేశాలను వెంటనే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర విద్యుత్ శాఖకు తెలియజేయాలని డీఎస్జీకి సూచిస్తున్నాం’ అని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
‘స్టేషన్‌ఘన్‌పూర్’కు ఉప ఎన్నిక అనివార్యమేనా..?
సాక్షిప్రతినిధి, వరంగల్ : స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పదవికి అనర్హత ముప్పు పొంచి ఉందా..? ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పదా.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై తెలంగాణ హైకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పుతో ఉమ్మడి జిల్లాలో ఇదే చర్చ నడుస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే.. సుమోటోగా కేసు స్వీకరించి మళ్లీ విచారణ ప్రారంభిస్తామని తీర్పులో హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనుచరవర్గంలో హాట్‌టాపిక్‌గా మారింది. అంతటా ‘అనర్హత’పైనే చర్చ..గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్లో గెలిచిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుతో పాటు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందగౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా మరో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో పాటు పలు రాష్ట్రాల్లోని న్యాయస్థానాల తీర్పులను, ఫిరాయింపు చట్టం నిబంధనలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చివరకు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని సోమవారం హైకోర్టు ఆదేశించించడం కలకలం రేపింది. దీంతో స్టేషన్ ఘన్పూర్ టికెట్ పొందడం మొదలు గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడం... తాజాగా హైకోర్టు తీర్పు వెలువడే వరకు పలుమార్లు కడియం శ్రీహరి పతాక శీరి్షకలకెక్కారు. హైకోర్టు తీర్పు మేరకు కడియం శ్రీహరిపై అనర్హత వేటు పడే అవకాశమే ఎక్కువుందన్న చర్చ ఒక పక్కన.. స్పీకర్ కార్యాలయం ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న చర్చ మరో పక్కన జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్టేషన్ ఘన్పూర్ నియోకవర్గానికి ఉప ఎన్నిక తప్పదా? అన్న ఉత్కంఠ బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది. విమర్శలు, ప్రతి విమర్శలు.. ఎవరి ధీమా వారిదే... బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత వేటుకు సంబంధించిన అంశంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు స్పందించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, డా.టి.రాజయ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరిలు ఎవరికీ వారుగా తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. వెంటనే చర్య తీసుకోవాలి..బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్న. నాలుగు వారాల్లో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు స్పీకర్ అనర్హత వేటు వేయాలి.– ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ మంత్రిడివిజన్ బెంచ్‌కు అప్పీలుకు వెళ్తాంనాకు కోర్టుపైన నమ్మకం వుంది.. డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్తాం. పార్టీ పెద్దలు, న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. సంబరాలు జరుపుకుంటున్న బీఆర్ఎస్ నేతలే పార్టీ ఫిరాయింపులకు మూల కారకులు. 2014 నుంచి 2023 మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఫిరాయింపులకు పాల్పడిన చరిత్ర బీఆర్ఎస్ది. – కడియం శ్రీహరి, ఎమ్మెల్యేనిబద్ధత ఉంటే శ్రీహరి రాజీనామా చేసి గెలవాలి..బీఆర్ఎస్ కార్యకర్తల కష్టంతో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి నిబద్ధత ఉంటే రాజీనామా చేసి కాంగ్రెస్ గుర్తుపై గెలవాలి. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజ్యాంగబద్ధంగా స్పీకర్ వ్యవహరించాలి. కడియం శ్రీహరి, కావ్యలు నియోజకవర్గానికి ఎంత చేసిన తక్కువే. నియోజకవర్గ ప్రజలకు వారు రుణపడి ఉండాలి. – డా.టి.రాజయ్య, మాజీ మంత్రి -
HYD: సాగర్‌లో నిమజ్జనం.. కాసేపట్లో హైకోర్టులో విచారణ
సాక్షి,హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం(సెప్టెంబర్10) మధ్యాహ్నం విచారణ జరగనుంది. సాగర్‌లో ప్లాస్టర్‌ఆఫ్‌పారిస్(పీవోపీ) విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని ఇప్పటికే ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలయ్యేలా చూడాలని పిటిషనర్ కోర్టును కోరారు. ఈ కేసులో హైడ్రాను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు.హుస్సేన్ సాగర్ పరిరక్షణ బాధ్యత హైడ్రాదే అయినందున ప్రతివాది ఆ సంస్థేనని పిటిషనర్ తెలిపారు. నిమజ్జనం పిటిషన్‌ను ఇవాళ లంచ్ విరామం తర్వాత మధ్యాహ్నం హైకోర్టు విచారించనుంది. సాగర్‌లో పీవోపీ వినాయక ప్రతిమల నిమజ్జనంపై హైకోర్టు ఏం నిర్ణయం వెలువరిస్తుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదీ చదవండి: కిల్లర్ డాగ్స్..! -
‘ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు'.. 4 వారాలు గడువు
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై దాఖలైన అనర్హత పిటిషన్ల స్టేటస్ ఏమిటో చెప్పేందుకు నాలుగు వారాల గడువిస్తున్నాం.. ఆలోగా వివరాలు అందజేయకుంటే మేమే తగిన ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుంది..’ అని స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు తేల్చిచెప్పింది. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, వివేకానంద, మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను స్పీకర్ ముందుంచాలని, విచారణ షెడ్యూల్ రూపొందించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు వివరాలను హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)కు అందజేయాలని ఆదేశిస్తూ సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ‘కైశమ్ మేఘచంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్ ఆఫ్ మణిపూర్’ కేసులో అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణీత గడువులోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం రిట్ అధికార పరిధి చాలా విస్తృతమైనది. తొందరపాటు చర్య అని, సాంకేతిక కారణాలతో కొట్టివేస్తే న్యాయం జరగదు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ నీతి, తత్వశా్రస్తానికి రాజ్యాంగ అథారిటీలు కట్టుబడి ఉండాలి. న్యాయ సమీక్ష అన్నదే కాదు.. అసలు సమస్యకు పరిష్కారం ఎప్పుడనేది తేలాలి. శాసనసభ కాలపరిమితి పూర్తయ్యే ఐదేళ్ల వరకు స్పీకర్ వేచిచూస్తూ ఉంటే కోర్టులు చేతులు దులుపుకుంటూ ఉండలేవు. ఇది రాజ్యాంగ, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం. అనర్హత పిటిషన్లలో నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ నిరాకరిస్తే పిటిషనర్లకు ఎటువంటి పరిష్కారం లభించదు. ‘కైశమ్ మేఘచంద్ర సింగ్’ కేసులోసుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. ఏజీ, అనధికార ప్రతివాదుల వాదనలను సమర్ధించదు..’ అని స్పష్టం చేసింది. మూడు పిటిషన్లపై విచారణ 2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున విజయం సాధించి, తర్వాత కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావును అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే విధంగా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున విజయం సాధించిన దానం నాగేందర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లో చేరారని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మరో పిటిషన్ వేశారు. అలాగే నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా స్పీకర్ సమయం ఇవ్వడం లేదంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి ఇంకో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి సుదీర్ఘ విచారణ చేపట్టారు. ఇరు పక్షాలకు చెందిన సీనియర్ న్యాయవాదుల వాదనలను కూలంకషంగా విన్నారు. గత నెల 10న రిజర్వు చేసిన తీర్పును సోమవారం వెలువరించారు. దానం, కడియం తరఫున సీనియర్ న్యాయవాదులు శ్రీరఘురాం, మయూర్‌రెడ్డి, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఆర్యామ సుందరం, గండ్ర మోహన్‌రావు విన్పించిన వాదనలను న్యాయమూర్తి తన తీర్పులో నమోదు చేశారు. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సిందే: పిటిషనర్లు ‘పదవ షెడ్యూల్‌ను ఉల్లంఘించిన వ్యక్తులను అనర్హులుగా ప్రకటించాలనే రాజ్యాంగ లక్ష్యానికి కట్టుబడి ఉండాలంటే, ఫిర్యాదు చేసిన తేదీ నుంచి మూడు నెలల వ్యవధిలో స్పీకర్ ముందు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలి. సాధారణంగా లోక్‌సభ, శాసనసభల జీవితకాలం ఐదేళ్లు. ఈ నేపథ్యంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచుకోకుండా సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు గతంలో తేల్చిచెప్పింది. మెజారిటీ ఉన్న పార్టీ తరఫు వ్యక్తి స్పీకర్ అవుతారు కాబట్టి, అధికార పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోకుండా పదవీ కాలం ముగిసే వరకు పెండింగ్‌లో ఉంచడం సరికాదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కైశమ్ మేఘచంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్ ఆఫ్ మణిపూర్ కేసులో స్పీకర్ రాజకీయ విధేయత కారణంగా అనుసరించిన పక్షపాత వైఖరిని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పుగా పేర్కొంది. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఒక పార్టీ నుంచి ఎన్నికవుతున్న స్పీకర్ వద్ద ఉంచాలా.. వద్దా..? అనే దానిపై పార్లమెంటు పునరాలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు సూచించింది. అసెంబ్లీ కార్యదర్శి కూడా పబ్లిక్ సర్వెంటే. స్పీకర్‌పై అందరికీ గౌరవం ఉంది. కానీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఆయన నిర్ణయం తీసుకోవడం లేదని భావిస్తున్నాం. రాజ్యాంగబద్ధ పదవిలో కూర్చొని రాజకీయ ఒత్తిళ్లకు లొంగడం సరికాదు. జిల్లా కోర్టులకు కూడా విచారణ ఇన్నిరోజుల్లో పూర్తి చేయాలని గడువు పెడుతున్నారు. అలాంటప్పుడు ట్రిబ్యునల్ చైర్మన్ (స్పీకర్) కింద ఆయన్ను ఆదేశించే అధికారం రాజ్యాంగ ధర్మాసనాలకు ఉంటుంది..’ అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. స్పీకర్‌కు కోర్టులు ఆదేశాలివ్వలేవు: ఏజీ ‘సుప్రీంకోర్టు వేర్వేరు తీర్పుల ప్రకారం స్పీకర్‌కు కోర్టులు ఆదేశాలు జారీ చేసేందుకు వీల్లేదు. స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసే అధికార పరిధి కోర్టులకు లేదు. స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన పది రోజులకే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. స్పీకర్‌కు కనీస గడువు కూడా ఇవ్వకుండానే న్యాయ సమీక్ష కోరడం చెల్లదు. తన వద్దకు వచ్చిన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ రాజ్యాంగం స్పీకర్‌కు ఇచ్చింది. రిట్ పిటిషన్లు దాఖలు చేయడంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలది తొందరపాటు చర్య. టీఆర్ఎస్ హయాంలో వేసిన అనేక అనర్హత పిటిషన్లను అప్పటి స్పీకర్ పరిష్కరించలేదు. ఎర్రబెల్లి దయాకర్‌రావు కేసులో పిటిషన్ చెల్లదని ఇదే కోర్టు గతంలో చెప్పింది. తాజా పిటిషన్లను కొట్టేయాలి..’ అని ఏజీ ఎ.సుదర్శన్‌రెడ్డి కోర్టును కోరారు. ఇదీ తీర్పు.. ‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏప్రిల్‌లో ఒక పిటిషన్, జూలైలో ఇంకో పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఆగస్టు 10 తీర్పు రిజర్వు చేశాం. ఇప్పటివరకు అనర్హత పిటిషన్లపై ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియదు. ఈ నేపథ్యంలో రిట్ పిటిషన్లలో ఉపశమనం పొందేందుకు పిటిషనర్లు అర్హులని ఈ కోర్టు అభిప్రాయపడుతోంది. స్పీకర్ కార్యాలయానికి రాజ్యాంగ హోదా, గౌరవం ఉంది. అనర్హత పిటిషన్లను వెంటనే రాష్ట్ర శాసనసభ స్పీకర్ ముందు ఉంచాలని స్పీకర్ కార్యదర్శిని ఆదేశిస్తున్నాం. ఇరుపక్షాల వాదనలు, డాక్యుమెంట్లు, వ్యక్తిగత వాదనలకు సంబంధించి నేటి నుంచి నాలుగు వారాల్లోగా షెడ్యూల్ నిర్ణయించాలి. నాలుగు వారాల్లో ఏం తేల్చకపోతే సుమోటోగా విచారణ చేపడతాం. తగిన ఆదేశాలను మేమే ఇస్తాం..’ అని పేర్కొంటూ న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి తీర్పు ఇచ్చారు. a -
హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం.. ‘హైడ్రా’ ప్రతివాదిగా కోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వినాయకచవితి నవ రాత్రుల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం అంశంపై హైకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై రేపు(మంగళవారం) విచారణ జరుగనుంది.కాగా, హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనం చేయవద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని పిటిషనర్ తన పిటిషన్లో కోరారు. ఈ క్రమంలో హైడ్రాను కూడా పిటిషనర్.. ప్రతివాదిగా చేర్చాలన్నారు. హుస్సేన్‌సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత కాబట్టి ప్రతివాదిగా చేర్చాలని కోర్టును పిటిషనర్ కోరారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌పై వాదనలను రేపు(మంగళవారం) వింటామని న్యాయస్థానం తెలిపింది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్‌లో రేపు వాదనలు జరుగనున్నాయి. -
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
-
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై నేడు హైకోర్టు తుది తీర్పు
-
తెలంగాణ హైకోర్టు ప్రత్యేకతలు.. (ఫొటోలు)
-
పాపం పండింది.. ఇక చిప్ప కూడే..
-
ఆ డిపాజిట్లు చట్టవిరుద్ధం
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను అడ్డు పెట్టుకుని రామోజీరావు సాగించిన ఆర్థిక అక్రమాలను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎట్టకేలకు బహిర్గతం చేసింది. రామోజీ నిస్సందేహంగా ఆర్థిక ఉగ్రవాదేనని రుజువైంది. చట్ట విరుద్ధంగా దశాబ్దాల తరబడి ఆర్థిక దోపిడీకి తెగించారని తేటతెల్లమైంది. 1997 నుంచి 2006 వరకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ ప్రజల నుంచి చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించినట్లు తెలంగాణ హైకోర్టుకు ఆర్బీఐ తాజాగా నివేదించింది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 (ఎస్)ను మార్గదర్శి యథేచ్ఛగా ఉల్లంఘించిందని తెలిపింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షి యర్స్‌ను ప్రాసిక్యూట్ చేయాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల ప్రకారం సీఆర్పీసీ సెక్షన్ 482 కింద క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన ప్పుడు ఆరోపిత నేరాలకు ప్రాథమిక ఆధారాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఆర్బీఐ చట్టాన్ని ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్న నేపథ్యంలో తమపై దాఖలైన కేసు కొట్టివేయాలంటూ మార్గదర్శి, రామోజీ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేయాలని హైకోర్టును ఆర్బీఐ అభ్యర్థించింది.సుప్రీం ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు పునర్విచారణ...చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు మార్గ దర్శి, దాని కర్త రామోజీరావులపై డిపాజిటర్ల పరి రక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అధీకృత అధికారి నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టి వేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31న తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అంతకు ముందు హైకోర్టు తీర్పులో కొంతభాగంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ మార్గదర్శి, రామోజీరావు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై ఈ ఏడాది ఏప్రిల్ 9న విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. హైకోర్టు తీర్పు ను రద్దు చేసింది. హైకోర్టు తీర్పును తప్పుబట్టింది. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. కేసు లోతు ల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించాలని స్పష్టం చేసింది. పునర్విచారణను ఆరు నెలల్లో ముగించాలని సూచించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ఇటీవల ఈ విచారణ మొదలు పెట్టింది. హైకోర్టులో నెంబర్ టూ స్థానంలో ఉన్న సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆర్బీఐని ప్రతివాదులుగా చేర్చి కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆర్బీఐ పూర్తి వివరాలతో తాజాగా కౌంటర్ దాఖలు చేసింది. ఆర్బీఐ కౌంటర్లో ముఖ్యాంశాలివీ...సెక్షన్ 45 ఎస్‌ను సుప్రీంకోర్టు గతంలోనే సమర్థించింది...‘1997లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్ట సవరణలో భాగంగా సెక్షన్ 45 ఎస్‌ను కూడా సవరించాం. ఓ వ్యక్తి వ్యక్తిగతంగా, సంస్థగా, వ్యక్తుల సమూహంతో కూడిన అన్ ఇన్కార్పొరేటెడ్లు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడాన్ని పూర్తిగా నిషేధించాం. చట్ట సవరణ వల్ల నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల వ్యాపారాన్ని సమర్థంగా నియంత్రించేందుకు మాకు అధికారం లభించింది. కంపెనీలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ లావాదేవీలు చేపట్టాలంటే మా నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సెక్షన్ 45 ఎస్ చట్టబద్ధతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 2000లో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సెక్షన్ 45 ఎస్‌ను సమర్థించింది. చట్టం ప్రకారం వ్యక్తులు, అన్ ఇన్ కార్పొరేటెడ్ కంపెనీలు చేసే వ్యాపారాన్ని సెక్షన్ 45 ఎస్ కింద ఆర్బీఐ నిషే«ధించలేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఆన్ ఇన్ కార్పొరేటెడ్ సంస్థలు తమ స్వీయ నిధులతో లేదా బంధువుల వద్ద రుణంగా తీసుకున్న నిధులతో లేదా ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న నిధులతో వ్యాపారం చేసుకోవచ్చు. అంతేగానీ ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేసి వాటి ద్వారా వ్యాపారం చేయడానికి వీల్లేదు’ అని ఆర్బీఐ తన కౌంటర్లో తేల్చి చెప్పింది.రెండేళ్ల జైలు.. రెండింతల జరిమానా‘చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారని భావించినప్పుడు ఆర్బీఐ లేదా రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లు పొంది ఆ డిపాజిట్ల వసూలు తాలుకూ డాక్యుమెంట్లన్నింటినీ తనిఖీ చేసే అధికారాన్ని సెక్షన్ 45 టీ కట్టబెడుతోంది. సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించినట్లు తేలితే ఆ వ్యక్తికి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు లేదా వసూలు చేసిన డిపాజిట్ల మొత్తానికి రెండింతల జరిమానా విధించవచ్చు. చట్టవిరుద్ధంగా డిపాజిట్ల సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధీకృత అధికారి సంబంధిత కోర్టులో ఫిర్యాదు దాఖలు చేయాల్సి ఉంటుంది. మార్గదర్శి వ్యవహారంలో కూడా అధీకృత అధికారి అలాగే ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదునే గతంలో హైకోర్టు కొట్టేసింది. దానిపైనే ఇప్పుడు హైకోర్టు విచారణ జరుపుతోంది’ అని ఆర్బీఐ పేర్కొంది.హెచ్‌యూఎఫ్‌కు సెక్షన్ 45 ఎస్ వర్తిస్తుంది...హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) లీగల్ పర్సన్ కాదు. ఇది కొందరు వ్యక్తుల సమూహం. కర్త ద్వారా ఈ హెచ్‌యూఎఫ్ పని చేస్తుంటుంది. దీన్ని వ్యక్తుల సమూహంగానే పరిగణించాల్సి ఉంటుంది. అందువల్ల హెచ్‌యూఎఫ్‌కు ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45 ఎస్ వర్తిస్తుంది. వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం ఏ రకమైన వ్యాపారం, కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న దానిపై సెక్షన్ 45 ఎస్ వర్తింపు ఆధారపడి ఉంటుంది. వ్యాపారం చేసేందుకు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడం ఈ సెక్షన్ కింద నిషిద్ధం. హెచ్‌యూఎఫ్ ఇలా డిపాజిట్లు వసూలు చేస్తే అది ఆర్బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించినట్లే అవుతుంది. ఈ కేసులో మొదటి ప్రతివాది అయిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ హెచ్యూఎఫ్గా ఆర్బీఐ చట్ట నిబంధనలకు తిలోదకాలు ఇచ్చింది. సెక్షన్ 45 ఎస్‌లో హెచ్యూఎఫ్ను చేర్చలేదని, తాము ఆ సెక్షన్ పరిధిలోకి రామని చెప్పడం సరికాదు. ప్రజల నుంచి డిపాజిట్ల స్వీకరణ నిషేధాన్ని ఆర్బీఐ పరిధిలోకి తేవడమే శాసనకర్తల ప్రధాన ఉద్దేశం. అందుకే ఆర్బీఐ చట్టంలో చాప్టర్ 3 బీ, 3 సీలను చేర్చింది’ అని రిజర్వ్ బ్యాంక్ తన కౌంటర్లో తెలిపింది.చట్ట విరుద్ధమన్న విషయాన్ని గతంలో హైకోర్టు పట్టించుకోలేదుహెచ్యూఎఫ్గా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం చట్ట విరుద్ధమన్న విషయాన్ని హైకోర్టు గతంలో పట్టించుకోలేదు. హెచ్‌యూఎఫ్ వ్యక్తుల సమూహం పరిధిలోకి వస్తుందన్న విషయాన్ని కూడా విస్మరించింది. ఇవన్నీ మార్గదర్శి, రామోజీరావు సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించారన్న విషయాన్ని రూఢీ చేస్తున్నాయి. చట్ట విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేసినందుకు వీరికి సెక్షన్ 45ఎస్ (1), 45 ఎస్ (2) వర్తిస్తాయి. చట్టవిరుద్ధంగా వ్యవహరించారనేందుకు ఇవన్నీ ప్రాథమిక ఆధారాలే. సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా వ్యవహరించినందుకు వారిని ప్రాసిక్యూట్ చేయాలి. ఈ వివరాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని మార్గదర్శి, రామోజీరావు దాఖలు చేసిన ఈ క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయాలి’ అని ఆర్బీఐ కౌంటర్లో అభ్యర్థించింది. కాగా రామోజీరావు ఇటీవల మరణించిన నేపథ్యంలో హెచ్‌యూఎఫ్ కర్తగా ఆ స్థానంలో ఆయన కుమారుడు చెరుకూరి కిరణ్‌ను చేర్చాలని (సబ్‌స్టిట్యూట్) కోరుతూ మార్గదర్శి ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 20న చేపట్టనున్నట్లు తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. అక్రమాలు బయటపడినందునే చెలరేగిన ‘ఈనాడు’ రామోజీ అక్రమ ఆరి్థక సామ్రాజ్యానికి ‘మార్గదర్శి’ పునాది కాగా.. ‘ఈనాడు’ ఆ అరాచకాలకు రక్షణ కవచంలా నిలుస్తోంది. మరి అలాంటి ‘మార్గదర్శి’ అక్రమాలను బట్టబయలు చేస్తే ఈనాడు సహిస్తుందా? అందుకే నాడు దివంగత వైఎస్సార్‌పై.. నేడు జగన్‌పై కట్టుకథలు అల్లుతూ దు్రష్పచారం చేస్తోంది. అక్రమాల సినిమాలో ఆయన త్రిపాత్రాభినయం ప్రజల సొమ్ము దోచుకునేందుకు రామోజీరావు త్రిపాత్రాభినయం చేశారు. ఆయన హెచ్‌యూఎఫ్ కర్తగా, ప్రొప్రైటర్‌గా, చైర్మన్‌గా మూడు వేర్వేరు పాత్రలలో అవసరాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తూ ఆర్బీఐకి మస్కా కొట్టారు. 18 ఏళ్లుగా నెట్టుకొచ్చారు మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావుపై చర్యలు కోరుతూ 2006 నవంబర్ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తొలి ఫిర్యాదు అందింది. నాంపల్లి కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు మొట్టికాయలు వేసినా.. ఆర్బీఐ తప్పుబట్టినా రామోజీరావు మాత్రం 18 ఏళ్లుగా తన అక్రమ దందాను కొనసాగిస్తూ వచ్చారు. సొంత ఆడిట్ కుదరదు.. ఎప్పుడో చెప్పిన సుప్రీంకోర్టు‘డిపాజిట్‌దారులకు సొమ్మును చెల్లించేశాం... మా ఆడిటర్లు లెక్క తేల్చేసి నివేదిక ఇచ్చారు’ అంటూ కనికట్టు చేసేందుకు యత్నించారు. ఆ కుతంత్రాన్ని పసిగట్టిన సుప్రీంకోర్టు.. ‘నేరం నాదే... దర్యాప్తు నాదే... తీర్పు నాదే’ అంటే కుదరదని, నిజాలు నిగ్గు తేలాల్సిందేనని స్పష్టం చేసింది. -
తెలంగాణ హైకోర్టులో మార్గదర్శికి ఎదురుదెబ్బ
-
సీట్లపెంపుపై సర్కార్‌దే తుది నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త కోర్సులను ప్రారంభించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం నిరభ్యంతర పత్రం జారీ చేయకుండా కొత్త కోర్సులు, సీట్ల పెంపు సాధ్యం కాదని తేల్చిచెప్పింది. కొత్త కోర్సులపై అంతిమ నిర్ణయం తమదేనన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. ఈ మేరకు శుక్రవారం తుది ఉత్తర్వులు జారీ చేసింది.బీటెక్, బీఈ కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ తదితర బ్రాంచీల సీట్ల పెంపునకు, కొన్ని కోర్సులను ఇతర కోర్సుల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ పలు ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టులో 28 పిటిషన్లు వేశాయి. నూతన కోర్సులకు జేఎన్టీయూహెచ్, ఏఐసీటీఈ అనుమతి ఇచ్చినా ప్రభుత్వం అనుమతి ఇవ్వట్లేదని పిటిషన్లలో పేర్కొన్నాయి. ఈ పిటిషన్లపై న్యాయమూర్తి సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు డి.ప్రకాశ్‌రెడ్డి, ఎస్.నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ ఎస్.రాహుల్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఎవరి వాదన ఏమిటంటే.. ‘ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సి వస్తుందనే ప్రభుత్వం కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వట్లేదు. రీయింబర్స్మెంట్ ఇబ్బందులు లేకుండా ప్రస్తుతమున్న పాత కోర్సులను కొత్త కోర్సులుగా మార్చుకొనేందుకు కూడా నిరాకరిస్తోంది. జేఎన్టీయూహెచ్, ఏఐసీటీఈ నివేదికలతో సీట్ల పెంపు, కోర్సుల విలీనంపై దరఖాస్తు చేసుకున్నా కారణమేదీ చెప్పకుండానే ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అనుమతి నిరాకరించారు’అని పిటిషనర్ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. మరోవైపు ఈ వాదనతో ప్రభుత్వ న్యాయవాది రాహుల్‌రెడ్డి విభేదించారు. ‘పిటిషన్లు వేసిన కాలేజీలకు జేఎన్టీయూహెచ్ షరతులతో ఎన్ఓసీ జారీ చేసింది.ఇది ఏఐసీటీఈకి దరఖాస్తు చేసుకోవడానికే వీలు కలి్పస్తుంది. అధ్యాపకులు, మౌలికసదుపాయాలు, ప్రభుత్వం ఆమోదం విశ్వవిద్యాలయ నిబంధనల మేరకు ఉంటుంది. సీట్ల పెంపు లాంటిది ఒక్క రీయింబర్స్‌మెంట్‌కే పరిమితం కాదు. విద్యార్థుల పెంపు వల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతాయి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల కింద అనుమతిస్తే విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుంది. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర పేద విద్యార్థులకు భారంగా మారుతుంది. ఇప్పటికే కొన్ని కాలేజీల్లోని కోర్సుల్లో 120 మంది విద్యార్థులున్నారు. ఇంకా పెంచాలని కోరడం సరికాదు.ఆ పిటిషన్లను కొట్టివేయాలి’అని రాహుల్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి విద్యాచట్టంలోని సెక్షన్ 20 ప్రకారం సీట్ల పెంపు, కోర్సుల విలీనంపై ప్రభుత్వానికే అధికారాలుంటాయని స్పష్టం చేశారు. కాలేజీల మధ్య అనారోగ్య పోటీని రూపుమాపడానికి తగిన నిర్ణయం తీసుకొనే అధికారం ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి ఉందని.. అందువల్ల ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని తీర్పు చెప్పారు. -
భవిష్యత్ తరాలను కాపాడాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా చెట్లు పెంచి భవిష్యత్ తరాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని హైకోర్టు గుర్తు చేసింది. ఆ బాధ్యతను మరిచిపోకుండా చర్యలు చేపట్టాలని, ఏం చర్యలు చేపట్టారో నివేదిక అందజేయాలని ఆదేశించింది. అలాగే ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)తో సంబంధం లేదన్న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎనిమిదేళ్లుగా విచారణ సాగుతున్నా జీహెచ్ఎంసీ ప్రతివాదో.. కాదో.. కూడా తెలియదా అని అసహనం వ్యక్తం చేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ఇలాగేనా వ్యవహరించేది అని ప్రశ్నించింది.తదుపరి విచారణ ఆగస్టు 1కి వాయిదా వేసింది. ‘పట్టణాలు, నగరాల్లో పార్కుల అవసరం ఎంతైనా ఉంది. ఉన్నవాటి పరిరక్షణతో పాటు లేని చోట్ల కొత్తగా ఏర్పాటు చేయాలి. చెట్లను కూడా అభివృద్ధి చేయాలి. ఆ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలి’అని కోరుతూ హైదరాబాద్ హిమాయత్‌సాగర్‌కు చెందిన కె.ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో 2016లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది.అడిషనల్ అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. 2023, ఆగస్టు చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 749 హెక్టార్లలో 8.37 లక్షల మొక్కలు నాటినట్లు అటవీ శాఖ నివేదిక ఇచ్చిందన్నారు. హైదరాబాద్‌లో పరిస్థితి ఏంటని సీజే ప్రశ్నించగా...నగర అధికారులు ఎవరూ అందుబాటులో లేరని, అయినా ఆ వివరాలు తెలుసుకుని చెబుతామన్నారు. వాదనలు విన్న ధర్మాసనం..తదుపరి విచారణలోగా దీనిపై నివేదిక అందజే యాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేసింది. -
పిల్లల ప్రాణాలు పోతున్నాయ్.. హైకోర్టు సీరియస్
హైదరాబాద్, సాక్షి: వీధి కుక్కల దాడుల్లో పిల్లలు చనిపోతున్నారని, ఉదాసీనంగా వ్యవహరించే అధికారుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హెచ్చిరించింది. ఈ అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై (PIL) బుధవారం విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. బాగ్ అంబర్‌పేటలో ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు చనిపోయాడు. అయితే ఈ ఉదంతాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ.. జీహెచ్ఎంసీ పరిధిలో తరచూ వీధి కుక్కల దాడి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విక్రమాదిత్య అనే న్యాయవాది హైకోర్టులో పిల్ వేశారు. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఇవాళ వీధి కుక్కల నియంత్రణ చర్యలపై నివేదిక ఇచ్చింది. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో కుక్కల నియంత్రలకు చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం తన కౌంటర్లో పేర్కొంది. అయితే.. ప్రభుత్వం దృష్టిసారించాల్సిన ఖరీదైన కాలనీలపై కాదని.. మురికివాడలపై అని సీజే ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు ప్రభుత్వం చూపించిన లెక్కలపైనా స్పందిస్తూ.. తమకు గణాంకాలు అక్కర్లేదని.. చర్యలు తీసుకుంటే చాలని సూచించింది. అయితే ఇందుకు సంబంధించిన రూల్స్ రూపొందించామని జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేయగా.. .. రూల్స్ ఎప్పుడూ ఉంటాయని, కుక్కల దాడుల్లో పిల్లలు చనిపోతున్నారని సీజే బెంచ్ వ్యాఖ్యానించింది. ఉదాసీనంగా వ్యవహరించే అధికారుల్ని వదిలిపెట్టమని హెచ్చరించిన ధర్మాసనం.. ఈ వ్యవహారాన్ని ఓ కేసుగా కాకుండా మానవీయ కోణంలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని అభిపప్రాయపడింది. వీధి కుక్కల నియంత్రణకు నిపుణుల కమిటీని వారంలోగా ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను జులై 18వ తేదీకి వాయిదా వేసింది. -
ఆర్టీసీ ఉద్యోగులకు ‘సహకార రుణాలు’
హైకోర్టు జోక్యం ఆర్టీసీ కార్మికుల్లో ఆనందం నింపింది. కొన్నేళ్ల తర్వాత మళ్లీ ‘ఉద్యోగుల సొంత నిధి’ నుంచి రుణాలందుకుంటున్నారు. పిల్లల చదువులు, సొంతింటిని సమకూర్చుకోవ టం, ఆస్పత్రి ఖర్చులు, ఇతర అవసరాలకు రుణం పొందుతున్నా రు.. కేవలం 40 రోజుల వ్యవధిలో ఏకంగా 9,500 మంది రూ.200 కోట్ల వరకు రుణాల రూపంలో పొందారు.సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సహకార పరపతి సంఘం(సీసీఎస్) పేరుకుపోయిన రుణ దరఖాస్తులను క్లియర్ చేసింది. రూ.355 కోట్ల మేర దరఖాస్తుదారులకు చెల్లింపులు చేసింది. అడపాదడపా స్వల్ప మొత్తం రుణాల రూపంలో ఇవ్వటం తప్ప ఇంత మొత్తంలో చెల్లించడం చాలా ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. ఇటు ఉద్యోగుల ఇంటి అవసరాలకు రుణాలు, పదవీ విరమణ పొందిన వారికి సెటిల్మెంట్లు, సీసీఎస్‌లో సభ్యత్వం రద్దు చేసుకున్న వారికి చెల్లింపులతో ఒక్కసారిగా సీసీఎస్ కార్యాలయం సందడిగా మారింది.హైకోర్టు జోక్యంతో...ప్రతినెలా ఉద్యోగుల జీతం నుంచి నిర్ధారిత మొత్తం మినహాయించి సీసీఎస్‌లో ఆర్టీసీ డిపాజిట్ చేస్తుంది. ఇలా పోగయ్యే మొత్తం నుంచి ఉద్యోగులకు రుణాలివ్వటం సీసీఎస్ విధి. ⇒ ఉద్యోగుల జీతాల నుంచి ఆ మొత్తాన్ని మినహాయిస్తూ దాన్ని కొన్నేళ్లుగా ఆర్టీసీ సొంతానికి వాడుకుంది. దీంతో సీసీఎస్ దివాలా దశకు చేరిన విషయం తెలిసిందే. దీంతో సీసీఎస్ పాలకవర్గం కొంతకాలంగా న్యాయపోరాటం చేస్తోంది. ⇒గతేడాది రూ.200 కోట్ల మొత్తాన్ని సీసీఎస్‌కు చెల్లించాలంటూ హైకోర్టు ఆదేశించింది. కానీ, కేవలం రూ.50 కోట్లు మాత్రమే చెల్లించటంతో సీసీఎస్ పాలకవర్గం కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. మిగతా రూ.150 కోట్లను వెంటనే చెల్లించాలంటూ ఏప్రిల్‌లో కోర్డు ఆర్టీసీని ఆదేశించింది. దీంతో ఆ నెల చివరలో ఆ మొత్తాన్ని ఆర్టీసీ జమ చేసింది. ⇒ది తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు నుంచి సీసీఎస్ మరో రూ.150 కోట్లు రుణం పొందింది. ఈ రూ.300 కోట్లను ఉద్యోగులకు రుణాలుగా, రిటైర్డ్ ఉద్యోగుల సెటిల్మెంట్లకు వినియోగించాలని నిర్ణయించింది. 9,500 దరఖాస్తులు ఏప్రిల్ చివరి నాటికి సీసీఎస్‌లో రుణాల కోసం 6,500 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ రెండున్నరేళ్లుగా పేరుకుపోయినవే. నిధులు సమకూరాయని తెలియగానే మరో 3 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వెరసి 9,500 దరఖాస్తుదారులకు రుణాల కింద రూ.200 కోట్లు సీసీఎస్ అందజేసింది. అప్పటివరకు వారి జీతాల నుంచి కోత పెట్టి సీసీఎస్‌లో జమ చేసిన మొత్తాన్ని రిటైర్మెంట్ సమయంలో చెల్లించాల్సి ఉంటుంది.కానీ నిధులు లేక ఏడాదిన్నరగా దాదాపు 1,200 మందికి చెల్లించలేదు. ఇప్పుడు వారికి కూడా సెటిల్ చేశారు. సీసీఎస్ ఆర్థిక పరిస్థితి దిగజారిపోవటంతో అందులో నుంచి తమ సభ్యత్వాన్ని రద్దు చేసి సెటిల్ చేయాల్సిందిగా మరో 3,200 మంది దరఖాస్తులు కూడా పెండింగ్‌లో ఉంటూ వచ్చాయి. వారందరికీ చెల్లించేశారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి ఆర్టీసీ జమ చేసిన నెలవారీ మొత్తం రూ.55 కోట్లను కూడా ఇందుకు వినియోగించారు. ఇక సీసీఎస్‌లో డిపాజిట్లు పెట్టిన రిటైర్డ్ ఉద్యోగులకు 9 నెలలుగా పేరుకుపోయిన వడ్డీ మొత్తం మరో రూ.9 కోట్లు కూడా చెల్లించారు. కేవలం 40 రోజుల వ్యవధిలో రూ.355 కోట్లు చెల్లించారు.ఇంకా రావాల్సినవి రూ.980 కోట్లురుణాలు ఇస్తున్నారని తెలిసి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు దరఖాస్తులు సమర్పించారు. పోగైన నిధులు రూ.355 కోట్లు ఖర్చయిపోవటంతో, ఇప్పుడు కొత్తగా వచ్చిన దరఖాస్తుల్లో 3 వేలు పెండింగ్ జాబితాలోకి చేరాయి. ఇంకా కొత్త దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. ఆర్టీసీ ప్రతినెలా సీసీఎస్‌కు చెల్లించే మొత్తం రూ.20 కోట్లు మాత్రమే. అన్ని దరఖాస్తులను క్లియర్ చేయాలంటే ఈ మొత్తం సరిపోదు. సీసీఎస్‌కు ఆర్టీసీ చెల్లించాల్సిన మిగతా బకాయిలు చెల్లిస్తే తప్ప ఇవి క్లియర్ అయ్యే సూచనలు కనిపించటం లేదు. ఇప్పటికీ, సీసీఎస్‌కు ఆర్టీసీ రూ.570 కోట్ల మొత్తం (అసలు) బకాయి ఉంది. దీనిపై చెల్లించాల్సిన వడ్డీ మరో రూ.410 కోట్ల వరకు ఉంటుందని అంచనా. వెరసి మరో రూ.980 కోట్ల వరకు ఆర్టీసీ బకాయి ఉన్నట్టు తేలుతోంది. విడతలవారీగానైనా ఈ మొత్తాన్ని చెల్లిస్తేనే మిగతా దరఖాస్తులు క్లియర్ అవుతాయి. -
జస్టిస్ శరత్, రేవంత్‌ల ఫోన్లు ట్యాపింగ్
సాక్షి, హైదరాబాద్: ‘ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వందల మంది జడ్జీలు, మాజీ మంత్రులు, జర్నలిస్టులు, న్యాయవాదులు.. ఇలా ఎంతో మంది ఫోన్ నంబర్లు, అడ్రస్‌లు, కాల్ రికార్డుల జాబితా అంతా సేకరించారు. వారి ఫోన్లు ట్యాప్ చేసి బీఆర్ఎస్కు అనుకూలంగా మార్చుకునే యత్నం చేశారు. హైకోర్టు జడ్జి జస్టిస్ కాజా శరత్ ఫోన్ కూడా ట్యాప్ అయింది. ఓ వ్యక్తిపై కేసులు లేకుండా చేసేందుకు టీవీ 5 సాంబశివరావు రూ.2 కోట్లు తీసుకున్నారు’ అని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఈ మేరకు బుధ వారం హైకోర్టులో అఫిడవిట్ సమర్పించింది.సుమోటోగా తీసుకున్న కోర్టు..గత ప్రభుత్వ హయాంలో హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ కాజా శరత్ ఫోన్ ట్యాప్ అయిందని.. జడ్జీల ఫోన్లను ట్యాప్ చేసినట్టు ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ నాయిని భుజంగరావు తన నేరాంగీకార వాంగ్మూలంలో పేర్కొన్నారని పత్రికల్లో వచ్చి కథనాలను హైకోర్టు సుమోటోగా విచారణకు చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు కూడా జారీ చేసింది. తాజాగా ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌ల ధర్మాసనం బుధవారం మధ్యాహ్న విరామం తర్వాత విచారణ చేపట్టింది.విచారణ 23వ తేదీకి వాయిదా..ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. ఫోన్ ట్యాపింగ్ కేసుపై అన్ని వివరాలతో కౌంటర్ దాఖలు చేశామని ధర్మాసనానికి వివరించారు. కేసు ఎప్పుడు నమోదు చేశారు? ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి? నిందితులెవరు? కేసు పురోగతి ఎంత వరకు వచ్చింది వంటి వివరాలు అందులో పేర్కొన్నామని.. కానీ ఇంకా రికార్డు కాలేదని చెప్పారు. ఈ వివరాలను రికార్డు చేయాలని కోర్టు అధికారులను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణలోగా కౌంటర్ వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో తాను కూడా బాధితుడినేనని, పోలీసు అధికారుల నుంచి తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నానని.. తనను ఈ పిటిషన్లో ఇంప్లీడ్ చేయాలంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన హయతుద్దీన్ వేసిన పిటిషన్‌పై నిర్ణయాన్ని కూడా ధర్మాసనం వాయిదా వేసింది.ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొన్న వివరావీ..‘‘నాయిని భుజంగరావు (ఏ3) వాంగ్మూలం మేరకు.. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్న విద్యార్థి సంఘాలు, కుల సంఘాల నాయకులు, జర్నలిస్ట్‌లు, జస్టిస్ కాజా శరత్, ఇతర హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వానికి సంబంధించిన కేసులను వాదిస్తున్న న్యాయవాదులు, పార్టీ నేతల వ్యక్తిగత జీవితం, చేసే పనులు తెలుసుకుని ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేలా ప్రభావితం చేశారు. బీఆర్ఎస్కు ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడల్లా అవతలి వారి ఫోన్లు ట్యాప్ చేసి బెదిరించేవాళ్లు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలకు ఎర కేసులో, టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ అంశం సమయంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ‘నేను కీలక వ్యక్తుల పేర్లు, ఫోన్ నంబర్లు సేకరించి ప్రణీత్‌కుమార్‌కు అందజేసేవాడిని. వారి ఫొటోలు, అడ్రస్‌లు సేకరించి చర్యలు తీసుకోవడం కోసం ఇంటెలిజెన్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులకు పంపేవాళ్లం’ అని భుజంగరావు చెప్పారు. టెలికం సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వివరాలు సేకరించినట్టు, ఫోన్ నంబర్ చెబితే వారి కాల్లకు సంబంధించి వివరాలు కూడా సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చినట్టు తెలిసింది. జస్టిస్ కాజా శరత్, ఆయన సతీమణి మాధవి నంబర్లు, కాల్ల వివరాలు, అడ్రస్‌లు జియో ఆఫీస్ నుంచి తెలుసుకున్నారు. కీలక వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్..సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడు కొండల్‌రెడ్డి, ఎనుముల తిరుపతిరెడ్డి, విజయ్‌రెడ్డి, కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఈటల రాజేందర్, ఈటల నితిన్, శివధర్‌రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్, రాఘవేందర్‌రెడ్డి, రోనాల్డ్ రోస్, ధర్మపురి అర్వింద్, ఎం.రమేశ్‌రెడ్డి, మేఘా శ్రీనివాస్‌రెడ్డి, మైనంపల్లి రోహిత్, పీడీ కృష్ణకిశోర్, ఐఏఎస్ దివ్య, తాటినేటి శశాంక్, రాజ్‌న్యూస్ సునీల్‌రెడ్డి, చిలుకా రాజేందర్‌రెడ్డి, కె.వెంకటరమణారెడ్డి, నరేంద్రనాథ్ చౌదరి, తీన్మార్ మల్లన్న (నవీన్), ఏఎంఆర్ ఇన్ఫ్రా మహేశ్‌రెడ్డి, వీరమళ్ల సత్యం, గాలి అనిల్‌కుమార్, రామసాయం సురేందర్‌రెడ్డి, కుందూరు రఘువీర్‌రెడ్డి, మేరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మేరెడ్డి స్వప్నిక, కాసాని జ్ఞానేశ్వర్, కొల్లే సరిత, అంజన్న (ఈటల గన్‌మన్), అనుమాండ్ల నరేందర్‌రెడ్డి, బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్, మనాల మోహన్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డితో పాటు మరికొందరి ఫోన్లను ట్యాప్ చేశారు.మధ్యవర్తిగా టీవీ 5 సాంబశివరావు..సంధ్య కన్వెన్షన్ శ్రీధర్‌రావు, టీవీ 5 సాంబశివరావులకు సంబంధించిన హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంక్ వివాదం ఉంది. ఈ పంచాయతీని సాంబశివరావు భుజంగరావు వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రావుపై చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయని, వాటి నుంచి బయటపడాలంటే రూ.15 కోట్లు బీఆర్ఎస్కు పార్టీ ఫండ్‌గా ఇవ్వాలని భుజంగరావు ఒత్తిడి తెచ్చారు. శ్రీధర్‌రావు రూ.13 కోట్లు విలువైన బీఆర్ఎస్ బాండ్లు కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించిన సాంబశివరావు రూ.2 కోట్లు తీసుకున్నారని భుజంగరావు వాంగ్మూలంలో పేర్కొన్నారు..’’ అని ప్రభుత్వం అఫిడవిట్లో తెలిపింది. వీటితోపాటు మరిన్ని వివరాలనూ వెల్లడించింది. -
ఆ 106 ఎకరాలు అటవీ శాఖవే.. ప్రైవేట్ వ్యక్తిది కాదన్న సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ/భూపాలపల్లి: అటవీశాఖకు ఓ వ్యక్తికి మధ్య చోటు చేసుకున్న భూ వివాదానికి 40 ఏళ్ల తర్వాత తెరపడింది. వరంగల్ జిల్లాలోని 106.34 ఎకరాల అటవీ భూమి ప్రైవేట్ భూమి కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.అత్యంత విలువైన ఆ భూమి అటవీశాఖకు చెందినదేనంటూ గురువారం తీర్పునిచ్చింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెడుతూ న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరే‹Ù, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన సుప్రీం ధర్మాస నం గురువారం కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ ప్రభుత్వానికి, ప్రైవేట్ వ్యక్తికి చెరో రూ.5 లక్షలు జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని జాతీయ న్యాయసేవల సంస్థ (నల్సా)కు రెండు నెలల్లోగా చెల్లించాలని ఆదేశించింది. వరంగల్ జిల్లా కొంపల్లిలోని సర్వే నంబర్ 171/3 నుంచి 171/7 వరకు ఉన్న 106.34 ఎకరాలు తమవేనని అబ్దుల్‌ఖాసీం తదితరులు ప్రకటించుకున్నారు. ఈ మేరకు 1981లో జాయింట్ కలెక్టర్‌ను ఆశ్రయించారు. జాయింట్ కలెక్టర్ నిరాకరించడంతో 1984లో ఆ భూమిని డీ నోటిఫై చేయాలంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. దీంతోపాటు వరంగల్ మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లారు. అక్కడ అనుకూలంగా ఆదేశాలు వచ్చినప్పటికీ ఉమ్మడి హైకోర్టు ఆ ఆదేశాలను కొట్టివేసింది. అనంతరం ఆ వ్యక్తి రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా.. తెలంగాణ హైకోర్టు ఆ వ్యక్తికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన జస్టిస్ సుందరేష్ ధర్మాసనం గురువారం ఆదేశాలు వెలువరించింది. భూమి తమదని చెప్పుకోవటానికి ఆ వ్యక్తులకు ఎలాంటి అర్హత లేదని స్పష్టం చేసింది. రివ్యూ పిటిషన్ సమయంలో తెలంగాణ హైకోర్టు, రెవెన్యూ అధికారులు సదరు వ్యక్తులకు అనుకూలంగా నివేదికలు ఇవ్వడం.. సుప్రీంకోర్టులోనూ అనుకూలంగా రిజాయిండర్ దాఖలు చేయడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. వాద, ప్రతివాదులకు జరిమానా విధిస్తూ అడవుల ప్రాముఖ్యత తెలుసుకోవాలని సూచించింది. అడవుల ప్రాధాన్యతను గుర్తించడంలో మనుషులకు ‘మతిమరుపు’ ఉంటుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. అడవులు నిస్వార్థంగా మాతృసేవ అందిస్తున్నప్పటికీ ప్రజలు నాశనం చేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అడవులను పరిరక్షించడం మనుషుల బాధ్యత అని వాటి క్షీణత వల్ల తామే నష్టపోతామన్న విషయాన్ని గుర్తెరగాలని సూచించింది. పర్యావరణ కేంద్రీకృత విధానాలను ప్రభుత్వాలు అనుసరించాలని తెలిపింది. అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులపై చర్యలు: డీఎఫ్ఓ ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా అఫిడవిట్లను దాఖలు చేసిన అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు డీఎఫ్ఓ వసంత తెలిపారు. ఈ కేసులో అటవీశాఖ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి, ఏఓఆర్ శ్రావణ్‌కుమార్ వాదించారు. ఈ కేసులో సుప్రీంకోర్టులో వాదనలు జరిగిన సందర్భంగా అటవీశాఖ ఆ భూములు తమ శాఖకే చెందుతాయని వాదించగా, రెవెన్యూ శాఖ మాత్రం ఆ భూమిపై ప్రైవేట్ వ్యక్తికే హక్కులున్నాయని అఫిడవిట్లు దాఖలు చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రం నుంచి రెండు ప్రభుత్వ శాఖలు విభిన్న వాదనలు వినిపించగా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒకే వాదనను దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని గత అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ఆదేశించినట్లు డీఎఫ్ఓ తెలిపారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ దాఖలు చేసిన అఫిడవిట్లో సదరు 106.34 ఎకరాలను అటవీ భూమిగా స్పష్టంచేశారు. ఈ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించి దాన్ని అటవీ భూమిగా గుర్తిస్తూ తీర్పు వెలువరించినట్లు వసంత తెలిపారు. ఆ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.300 కోట్ల వరకు ఉంటుంది. -
నీటి వనరుల రక్షణకు ఏం చర్యలు చేపట్టారు?
సాక్షి, హైదరాబాద్: నీటి వనరుల పరిధిలోని భూముల్లో అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న భూ కబ్జాదారులను అడ్డుకునేందుకు తీసుకున్న చర్యలు, వాటి పరిరక్షణకు ఏం చేస్తున్నారో వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, హోంశాఖ, ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శులు, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) కమిషనర్లు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ మహానగరం దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులు, కుంటలను ఇష్టారాజ్యంగా ఆక్రమిస్తూపోతున్నారని.. అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని.. ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే నీటి వనరులు లేని నగరంగా హైదరాబాద్ మారే ప్రమాదం ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై విచారణ చేపట్టి యుద్ధప్రాతిపదిక ప్రభుత్వం నీటి వనరుల రక్షణ చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నాలాలు, చెరువులు, కుంటల ఆక్రమణ, వాటి దుస్థితిని వివరించారు. ఈ లేఖను సీజే ధర్మాసనం సుమోటో పిల్‌గా విచారణ చేపట్టేందుకు స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, విచారణను వాయిదా వేసింది. -
జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వర్‌రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించండి
సాక్షి, న్యూఢిల్లీ: హైకోర్టులోని అదనపు న్యాయమూర్తులు జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాసరావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఇద్దరు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా సిఫారసు చేస్తూ 2024, ఫిబ్రవరి 13న హైకోర్టు కొలీజియం నిర్ణయించిందని తెలిపింది. ముఖ్యమంత్రి, గవర్నర్లు దీనికి తమ సమ్మతి తెలియజేశారని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ బీఆర్.గవాయిలతో కూడిన కొలీజియం సమావేశమై శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వర్‌రావులకు తగి న అర్హతలు కలిగి ఉన్నారని నిర్ణయించినట్టు వెల్లడించింది. తెలంగాణ హైకోర్టుకు చెందిన ఈ ఇద్దరు న్యాయమూర్తుల తీర్పులు పరిశీలించాలని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు కమిటీని సీజేఐ ఆదేశించారని.. ఆ కమిటీ ఆయా తీర్పులపై సంతృప్తి వ్యక్తం చేసిందని వివరించింది. -
దస్తగిరితో చంద్రబాబే పిటిషన్ వేయించారు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాశ్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ అప్రూవర్‌గా మారిన కిరాయి హంతకుడు దస్తగిరి పిటిషన్ వేయడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు దస్తగిరితో ఈ పిటిషన్ దాఖలు చేయించారని చెప్పారు. ఓ పక్క కేసు విచారణ సాగుతుండగా.. కడప నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి, వైఎస్ వివేకా కూతురు.. ఇద్దరూ అవినాశ్‌ను హంతకుడిగా చిత్రీకరించేందుకు శత విధాలా ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. అవినాశ్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఇదే కేసులో నిందుతుడు (ఏ–4) దస్తగిరి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు. అవినాశ్‌రెడ్డి తరఫున నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ వాదనలను సమర్థిస్తూ సీబీఐ, సునీత తరఫు న్యాయవాదులు వాదించారు. అన్ని పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేశారు. వారివి సంబంధం లేని వాదనలు సీబీఐ, సునీత తరఫు న్యాయవాదుల వాదనలు ఎంత మాత్రం సమర్థనీయం కాదని నిరంజన్ రెడ్డి చెప్పారు. ‘చట్టవిరుద్ధంగా అవినాశ్‌కు బెయిల్ ఇచ్చారని చెప్పడం ఈ వాదనలతో సంబంధంలేని అంశం. ఆ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కోర్టు అవినాశ్‌కు బెయిల్ ఇచ్చిన తర్వాత వాటిని ఆయన ఉల్లంఘించారా లేదా అన్న దానిపైనే వాదనలు సాగాలి. ఓ సీనియర్ న్యాయవాది, మరో పీపీ అనవసర వాదనంతా వినిపించారు. న్యాయస్థానం అవినాశ్‌కు విధించిన షరతుల్లో దేన్నీ ఆయన ఉల్లంఘించలేదు. కనీ వినీ ఎరుగని విధంగా బాధితులం అని చెప్పుకుంటున్న వారు అప్రూవర్‌తో కలసి నడుస్తున్నారు. క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు సంస్థలు ఇష్టం వచ్చినట్లు అప్రూవర్‌ను ప్రకటించకూడదని సుప్రీంకోర్టు హెచ్చరించినా.. దర్యాప్తు సంస్థే అతన్ని వెనుకేసుకుని వస్తోంది. వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, కిరాయి హంతకుడు దస్తగిరి కూడా చంద్రబాబు చెబుతున్నట్లు వ్యవహరిస్తున్నారు. వివేకాకు రెండో భార్య ఉందని, ఆమెతో కలిగిన కుమారుడికి, సునీతకు ఆస్తి తగాదాలు ఉన్నాయన్నది వాస్తవం. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయడంలేదు. వివేకాను నరికానని చెబుతున్న వ్యక్తికే సునీత మద్దతుగా నిలవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అతని బెయిల్‌ను రద్దు చేయాలని ఆమె కోరలేదు. ఎవరు ఏ పిటిషన్ వేసినా ఇంప్లీడ్ అవుతూ అవినాశ్‌ను ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని ఆమె విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సీబీఐ, సునీత, కిరాయి హంతుకుడు ఒకే బాటలో సాగుతూ అవినాశ్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తప్పుడు ఆరోపణలతో దస్తగిరి పిటిషన్ ‘ఇక్కడ దస్తగిరి తండ్రిపై దాడి చేశారని, జైలులో దస్తగిరిని చైతన్యరెడ్డి కలిశారని రెండు ఆరోపణలు చేస్తున్నారు. వీటికి ఒక్క ఆధారమూ లేదు. ఆరోగ్య శిబిరం నిర్వహించిన రోజు చైతన్యరెడ్డితో పాటు పదుల సంఖ్యలో వైద్యులు అక్కడికి వెళ్లారు. జైలు అధికారులంతా వారి వెంట ఉన్నారు. దస్తగిరిని చైతన్యరెడ్డి కలవడం అనేది అసాధ్యం అని జైలు అధికారులు చెబుతున్నారు. చైతన్యరెడ్డి జైలుకు రూ.20 కోట్లు తీసుకొచ్చాడని దస్తగిరి ఆరోపిస్తున్నారు. అంత మంది ఉండగా, అంత పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లడం సాధ్యం అవుతుందా? దీనికి, అవినాశ్‌కు ఏమిటి సంబంధం? అలాగే శివరాత్రి సందర్భంగా నామాల గుండు వద్ద దస్తగిరి తండ్రిపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, ఎన్నికల్లో దస్తగిరి పోటీ చేయకూడదని బెదిరించారన్నది ఆరోపణ. ఈ కేసుకూ అవినాశ్‌కు సంబంధం ఏమిటో కూడా ఆధారం లేదు. విచిత్రమేమిటంటే.. తనపై దాడి జరిగిందని పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేయలేదు. కుమారుడు దస్తగిరి ఒకరోజు తర్వాత చేశారు. ఈ కేసు ఎఫ్ఐఆర్లోనూ అవినాశ్ ప్రస్తావన లేదు. రోడ్డు ప్రమాదం కారణంగా దస్తగిరి తండ్రికి, యువకులకు మధ్య వివాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ అవినాశ్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నారు. ఇది సమర్థనీయం కాదు. దస్తగిరి పిటిషన్‌ను కొట్టివేయాలి’ అని నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
కాళేశ్వరంపై విచారణ వేసవి సెలవులు ముగిశాకే..
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మేడిగడ్డ పియర్ల కుంగుబాటుపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లలో విచారణను హైకోర్టు వేసవి సెలవుల (జూన్) తర్వాతకు వాయిదా వేసింది. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్‌తో పాటు బక్క జడ్సన్ మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రధానన్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం ఈ పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టింది. కేఏ.పాల్ వాదనలు వినిపిస్తూ.. ‘దేశంలోనే అత్యంత అవినీతి జరిగిన ప్రాజెక్టు కాళేశ్వరం. వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలి. తెలంగాణలోని 4 కోట్ల మందికి చెందిన రూ.లక్ష కోట్లకు సంబంధించిన అంశం ఈ ప్రాజెక్టు. సీబీఐ దర్యాప్తుతోపాటు భవిష్యత్‌లో ఎలాంటి ప్రాజెక్టు నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వినియోగించుకునేలా నిపుణుల కమిటీని కూడా వేయాలి. ఎన్నికలకు ముందు పలు సభలు, సమావేశాల్లో కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపిస్తామన్న సీఎం రేవంత్ అధికారంలోని రాగానే మాట మార్చారు. సీబీఐ విచారణ కోరకుండా.. రిటైర్డ్ జడ్జితో విచారణ అంటున్నారు’అని పేర్కొన్నారు. ఈ కేసులో సీఎం పార్టీ కాదని.. ఆయనపై చర్చ అవసరం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పాల్ వాదనలను ధర్మాసనం పలుమార్లు తప్పుబట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. -
‘హియర్ సే ఎవిడెన్స్’ సాక్ష్యంగా చెల్లదు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. హియర్ సే ఎవిడెన్స్ (నాకు మరొకరు చెప్పారని సాక్ష్యం చెప్పడం) చట్ట ప్రకారం సాక్ష్యంగా చెల్లదని, గూగుల్ టేక్ అవుట్ ప్రామాణికమని ఆ సంస్థే ధ్రువీకరణ ఇవ్వదని భాస్కర్‌రెడ్డి, ఉదయ్కుమారెడ్డి తరపు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్ రెడ్డి కోర్టుకు నివేదించారు. అలాంటి సాక్ష్యాలతో అరెస్టు సమర్థనీయం కాదని చెప్పారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు పక్షపాత వైఖరితో సాగుతోందని, కావాలనే ఈ కేసులో తమను ఇరికించారని, తమకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యం లేదని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘మూడో చార్జీషీట్ (ఈ కేసులో 2వ మధ్యంతర చార్జిషీట్) దాఖలు చేసే వరకు పిటిషనర్లపై ఎలాంటి ఆరోపణలు లేవు. ఆ తర్వాత నిందితులుగా చేర్చడంలో కుట్ర కోణం దాగి ఉంది. అవినాశ్‌రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన వారు కిరాయి హంతకుడు దస్తగిరి (ఏ–4) యథేచ్ఛగా తిరగడానికి మాత్రం పూర్తిగా సహకరిస్తున్నారు. హత్య వెనుక భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ ఉన్నారని గంగిరెడ్డి తనకు చెప్పారంటూ దస్తగిరి వాంగ్మూలం ఇవ్వగా.., గంగిరెడ్డి మాత్రం తాను అలా చెప్పలేదని స్పష్టం చేశారు. దస్తగిరి చెప్పిన విషయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న సీబీఐ.. ఇతరుల వాంగ్మూలాలను మాత్రం పట్టించుకోవడం లేదు’ అని పేర్కొన్నారు. ‘రెండున్నర నెలలు ఢిల్లీలో సీబీఐ కస్టడీలో ఉన్నానని దస్తగిరి చెప్పాడు. ఆ తర్వాతే అప్రూవర్‌గా మారి పిటిషనర్ల పేర్లు చెప్పాడు. దస్తగిరి బెయిల్‌కు సీబీఐ పూర్తిగా సహకరించింది. నాటి దర్యాప్తు అధికారి రాంసింగ్‌పై తీవ్ర ఆరోపణలున్నాయి. ఆయనపై సుప్రీం కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. దీంతో అత్యున్నత న్యాయస్థానం కేసు దర్యాప్తు బాధ్యత నుంచి ఆయన్ని తప్పించి, మరొకరిని నియమించింది. హత్య జరిగిన రోజున అవినాశ్‌రెడ్డికి భాస్కర్‌రెడ్డి ఫోన్ చేయడాన్ని కూడా సీబీఐ కుట్ర కోణంగా పేర్కొనడం సమంజసం కాదు. తండ్రి కుమారుడికి ఫోన్ చేయడం కూడా కుట్రేనా? కావాలనే ట్రయల్ కోర్టులో విచారణను సీబీఐ సాగదీస్తోంది. ముఖ్యంగా నాలుగు అంశాలను ఇక్కడ పరిశీలించాలి. ఇందులో మొదటిది పిటిషనర్లపై ఉన్నది ఆరోపణలు మాత్రమే. వాటికి సాక్ష్యాలు లేవు. రెండోది భాస్కర్‌రెడ్డి వయస్సు. ఆయన వయస్సు దాదాపు 72 ఏళ్లు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం మూడో అంశం. ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన ట్రయల్ కోర్టు పలుమార్లు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. ఆయనకు అత్యవసరమైతే 30 నిమిషాల్లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణకు చేర్చాలి. జైలులో ఉంటే అది సాధ్యం కాదు. ఆయనకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? నాలుగోది ఆయన్ని అరెస్టు చేసి సంవత్సరమయ్యింది. ఏడాదిగా జైలులో ఉంటున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని భాస్కర్‌రెడ్డితోపాటు ఉదయ్‌కుమార్‌కు బెయిల్ మంజూరు చేయాలి. ఇదే హైకోర్టు శివశంకర్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. అదే వీరికి కూడా వర్తిస్తుంది. సరైన సాక్ష్యాలు లేనప్పుడు నెలల తరబడి నిందితుల పేరుతో జైలులో ఉంచడం వారి హక్కులను హరించడం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పింది’ అని నిరంజన్‌రెడ్డి వాదించారు. అనంతరం సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. బెయిల్ పిటిషన్లపై తీర్పు రిజర్వు చేశారు. -
8న ‘కాళేశ్వరం’పై విచారణ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం.. మేడిగడ్డ పియర్ల కుంగుబాటుపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లలో వాదనలను సోమవారం(ఈనెల 8న) వింటామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్లలో ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు పిటిషన్ల తరఫు న్యాయవాదులకు చెబుతూ.. విచారణను వాయిదా వేసింది. మేడిగడ్డ రిజర్వాయర్ కుంగుబాటుకు కారకులెవరో తేల్చేందుకు.. పూర్తి అంశంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. ‘జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును సీబీఐకి బదలాయించాలి. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ రూ.86 వేల కోట్ల సేకరణ వ్యవహారంపై కూడా సీబీఐ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఎఓ)తో దర్యాప్తునకు ఆదేశాలివ్వాలి. మహదేవ్పూర్ పోలీసులు నమోదు చేసిన కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తేనే కుంగుబాటుకు అసలు కారణాలు బట్టబయలవుతాయి. నవంబర్ 1న నేషనల్ డ్యాం సేఫ్టీ కౌన్సిల్ ఇచ్చిన రిపోర్టును కూడా పరిగణనలోకి తీసుకుని బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలి. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఇతర రిజర్వాయర్ల భద్రతకు వీలుగా చర్యలు చేపట్టేలా నేషనల్ డ్యాం సేఫ్టీ కౌన్సిల్ ఉత్తర్వులు ఇవ్వాలి’అని కోరుతూ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, కాంగ్రెస్ నేత బక్క జడ్సన్‌తో పాటు మరో ఇద్దరు పిటిషన్లు(4 ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, ఒక రిట్ పిటిషన్) దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ నిర్ణయం తెలుసుకుని చెప్పండి సీబీఐకి అప్పగించే విషయం, పిటిషనర్ల వాదనపై ప్రభుత్వ నిర్ణయాన్ని తెలుసుకొని చెప్పాలని అడిషనల్ అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) ఇమ్రాన్ ఖాన్ ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయాన్ని ఏఏజీ.. ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పార్టీ ఇన్ పర్సన్ (అతనే వాదనలు వినిపిస్తారు)గా కేఏ పాల్ వాదిస్తూ వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. అయితే ప్రభు త్వ వాదన కూడా వినాల్సి ఉన్నందున ఉత్త ర్వులు ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది. తమ వాదనలు వినాలని పాల్, ఇతర పిటి షనర్ల లాయర్లు కోరగా ధర్మాసనం నిరాకరించింది. వ్యాజ్యాలను ఇప్పటికే పరిగణనలోకి తీసుకున్నామంటూ విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. గతేడాది ఎన్డీఎస్ఏ అధికారులు ప్రాజెక్టును సందర్శించి మేడిగడ్డ బ్యారేజీ పియర్ కుంగిపోవడానికి కారణాలపై ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ నివేదికను గత నెల విచారణ సందర్భంగా ప్రభుత్వం.. ధర్మాసనం ముందు ఉంచింది. -
మిగిలిన గురుకుల పోస్టులను మెరిట్‌తో భర్తీ చేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గురుకుల నియామకాల్లో మిగిలిపోయిన పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్స్ రిక్రూట్మెంట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చి న ఉత్తర్వులను పాటించాలని సూచించింది. దీనిపై తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. విచారణను వచ్చే నెల 22వ తేదీకి వాయిదా వేసింది. అభ్యర్థులు పోస్టులు వదులుకోవడంతో..: గురుకులాల్లో డిగ్రీ అధ్యాపకులు, జూనియర్ లెక్చరర్లు, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ తదితర పోస్టుల భర్తీ కోసం 2023 ఏప్రిల్ 5న తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్లు ఇచ్చి ంది. అయితే ఈ నియామకాలను అవరోహణ క్రమంలో ఎగువ స్థాయి పోస్టులను ముందు, దిగువ స్థాయి పోస్టులను తర్వాత) చేపట్టాల్సి ఉన్నా.. ఒకేసారి అన్ని ఉద్యోగాల భర్తీ చేపట్టింది. దీనితో మూడు, నాలుగు పోస్టులకు ఎంపికైన మెరిట్ అభ్యర్థులు ముఖ్యమైన పోస్టులను ఎంచుకోగా.. మిగతా పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఇలా మిగిలిన పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చిల్లంచర్లకు చెందిన విజయ్ మనోహర్‌తోపాటు మరో 20 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది హిమాగ్జి వాదనలు వినిపిస్తూ.. నోటిఫికేషన్ ఇచ్చి న పోస్టులన్నీ భర్తీ కాకుండా మిగిలిపోతే, వాటిని తదుపరి మెరిట్ అభ్యర్థులతో నింపవచ్చని గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. పిటిషనర్లు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్స్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఈ మేరకు వినతిపత్రం కూడా అందజేశారని కోర్టుకు విన్నవించారు. బోర్డు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారని.. మిగిలిన ఖాళీల్లో పిటిషనర్లను భర్తీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే తదుపరి గురుకుల నియామక ప్రక్రియపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు. -
తెలంగాణ కొత్త హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ శంకుస్థాపన చేశారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో సీజేఐతో పాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొన్నారు. నూతన హైకోర్టు భవనానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సీజేఐ అన్నారు. ప్రస్తుత హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో సకల హంగులతో 100 ఎకరాల్లో రాజేంద్రనగర్‌లో భవన నిర్మాణం చేపట్టనున్నారు. హైకోర్టుకు కేటాయించిన స్థలంలో ఆధునిక వసతులతో హైకోర్టు భవనంతో పాటు జడ్జిలకు నివాసాలను కూడా నిర్మించనున్నారు -
కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్.. హైకోర్టులో మరో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. దానం కాంగ్రెస్ చేరడం, సికింద్రబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరుగనుంది. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నగరానికి చెందిన రాజు యాదవ్ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్‌పై పోటీ చేసి దానం ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక, కొద్దిరోజుల క్రితమే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరారు. దీంతో, దానంకు కాంగ్రెస్ ఎంపీ సీటు ఆఫర్ చేసింది. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి దానం బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి పోటీ చేయడం రాజ్యాంగ విరుద్దం, చట్ట విరుద్దమంటూ పిటిషనర్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా దానం నాగేందర్‌పై స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే సమయంలో దానంపై అనర్హత వేయాల్సిందిగా కోరారు. కాగా, ఈ పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. దానం నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. జస్టిస్ విజయసేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే, దానం నాగేందర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని విజయారెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఓటర్లకు డబ్బులు పంచారని, ఈ విషయంలో కేసులు నమోదయ్యాయని కోర్టుకు వివరించారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం దానంకు నోటీసులు జారీ చేసింది. -
దానం నాగేందర్‌తో సహా పలువురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. దానం నాగేందర్ ఎన్నికను రద్దు చేయాలంటూ ఆయన ప్రత్యర్ధి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ ఓటర్లను ప్రలోభపెట్టారని పిటిషనర్ తరపున సుంకర నరేశ్ కోర్టుకు తెలిపారు. ఓటర్లకు డబ్బులు పంచడంతో పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. ఆయన సతీమణి పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలను నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదన్నారు. వాదనలు విన్న హైకోర్టు.. వివరణ ఇవ్వాలంటూ దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 18కి వాయిదా వేసింది. దానంతోపాటు పలువురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం నాగేందర్, కోవా లక్ష్మి, మాగంటి గోపీనాథ్, కూనంనేని, మధుసూదన్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు పంపింది. వీరంతా ఎన్నికల్లో తప్పుడు అఫడవిట్లు సమర్పించారని హైకోర్టులో వేర్వేరు పిటిషనలు దాఖలయ్యాయి. చదవండి: హస్తం గూటికి జీహెచ్ఎంసీ మేయర్? -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: అలంపూర్( జోగులాంబ గద్వాల) బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విజయుడి ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ బీఎస్పీ అభ్యర్థి ఆర్.ప్రసన్నకుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. ప్రసన్న కుమార్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఉండవల్లి మండలం పుల్లూరు గ్రామ పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ పదవికి విజయుడు రాజీనామా చేయకుండానే నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని పేర్కొన్నారు. తన వృత్తికి సంబంధించిన వివరాలను నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదన్నారు. రాజీనామా లేఖను, దానికి లభించిన ఆమోదం తదితర ఆధారాలు సమర్పించలేదన్నారు. నిబంధనల ప్రకారం నామినేషన్‌కు మూడు నెలల ముందు రాజీనామా సమర్పించాల్సి ఉందన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి బీఫామ్ అందుకున్న విజయుడు(ఫైల్ ఫొటో) వాదనలు విన్న న్యాయమూర్తి ఎన్నికపై వివరణ ఇవ్వాలంటూ విజయుడికి నోటీసులు జారీ చేస్తూ విచారణను ఏప్రిల్ 18వ తేదీకి వాయిదా వేశారు. ఎన్నికలకు ముందు సైతం ప్రసన్నకుమార్ ఇదే అంశంపై పిటిషన్ దాఖలు చేసినా, ఎన్నికల నోటిఫికేషన్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించిన విషయం విదితమే. విజయుడు బీఆర్ఎస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి.. 2023 శాసనసభ ఎన్నికల్లో అలంపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్‌పై 30,573 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: హైకోర్టులో ప్రణీత్‌రావుకు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో, ఆయనకు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది. కాగా, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం తన విచారణ జరగడం లేదంటూ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై నిన్న(బుధవారం) వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్‌పై నేడు తీర్పు వెల్లడించాల్సి ఉండగా.. గురువారం ప్రణీత్ రావు వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ సందర్బంగా కింది స్థాయి కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. ఇదిలా ఉండగా.. కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శ కాలను పాటించడం లేదని, పీఎస్‌లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు లేవని, విచారణ పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరడంతోపాటు పోలీస్ కస్టడీ ఇస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రణీత్ హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. ‘24 గంటలూ ప్రణీత్‌రావును పోలీసులు విచారిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాల్సి ఉన్నా.. దాన్ని పాటించడంలేదు. ప్రణీత్ పరువుకునష్టం కలిగించేలా అధికారులు వివరాలు మీడియాకు లీక్ చేస్తున్నారు’ అని చెప్పారు. అనంతరం పీపీ పల్లె నాగేశ్వర్రావు వాదిస్తూ.. ‘పిటిషనర్ న్యాయవాది వాదనలు సరికాదు. 2023లో అక్రమంగా ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ఇది చాలా తీవ్ర నేరం. నిబంధనల మేరకే ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తోంది. సాక్ష్యాలను అందించేందుకే రమేశ్ విచారణ జరిగే ప్రాంతానికి వచ్చారు తప్ప.. విచారణలో పాల్గొనలేదు’ అని చెప్పారు. ఈ వాదనలను విన్న హైకోర్టు ఈరోజు ప్రణీత్ రావు పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెల్లడించింది. -
Telangana: DME వాణి నియామకాన్ని రద్దు చేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (డీఎంఈ)గా ఎన్.వాణి నియామకాన్ని రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వాణిని డీఎంఈగా నియమించడాన్ని ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపల్ నరేందర్ కుమార్ హైకోర్టులో సవాల్ చేశారు. సర్వీసులో తనకంటే జూనియర్‌ను ఇన్ఛార్జిగా నియమించారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది కృష్ణయ్య వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఇన్‌ఛార్జి ప్రాతిపదికన కాకుండా అదనపు బాధ్యతలు లేదా శాశ్వత ప్రాతిపదికన డీఎంఈ పోస్టు భర్తీ చేయాలని తెలిపింది. నిబంధనల మేరకు కొత్త డీఎంఈను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చదవండి: విద్యార్ధులకు అలర్ట్.. తెలంగాణలో పాలిసెట్ వాయిదా -
ప్రణీత్ రావు పిటిషన్.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రణీత్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ప్రణీత్ రావు పిటిషన్‌పై వాదనలు ముగిసిన అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ సందర్భంగా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, పంజాగుట్ట ఇన్స్పెక్టర్ శోభన్ హాజరయ్యారు. హైకోర్టులో ప్రణీత్ రావు తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. ‘ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రణీత్ రావును ఆక్రమంగా అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు వాస్తవ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 వరకు విచారిస్తున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరగాలి. కానీ అలా జరగడం లేదు. ప్రణీత్ రావుకు ప్రతి రోజు మెడికల్ చెక్అప్ చేయించాలి. కస్టడీలో దర్యాప్తు విషయాలు మీడియాకు చెపుతున్నారు.కస్టడీ ఇప్పటికే నాలుగు రోజులు అయ్యింది. పోలీస్ స్టేషన్లో నిద్ర పోవడానికి ఎలాంటి సౌకర్యాలు లేవు’అని న్యాయవాది గండ్ర మోహన్‌రావు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు. ‘24 గంటలు ప్రణీత్ రావు ను పోలీస్ కస్టడీ లోకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. పోలీస్ స్టేషన్ లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మీడియా కు ఎలాంటి లీకులు ఇవ్వడం లేదు. ప్రణీత్ రావు అరెస్ట్ 13 మార్చిన మాత్రమే డీసీపీ ప్రెస్‌నోట్ ఇచ్చాడు. పోలీస్ అధికారులు మీడియాకు లీకులు ఇస్తారని చెప్పడం సరైంది కాదు. జూబ్లీహిల్స్ ఏసీపీ ఈ కేసులో ఐవో అధికారిగా ఉన్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తున్నాం. అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. అడిషనల్ ఎస్పీ రమేష్ ఎక్కడ కూడా ఈ కేసులో జోక్యం చేసుకోలేదు. ప్రణీత్ రావు బంధువులు అనుదీప్ అతని కౌన్సిల్ వాసుదేవన్ రోజు కలుస్తున్నారు. ఇంకా మూడు రోజులు ప్రణీత్ రావు పోలీస్ కస్టడీ ఉంది. దర్యాప్తు దశలో ఉన్న కేసులో ఇప్పుడు పిటిషన్ వేయ్యడం కరెక్ట్ కాదు. ప్రణీత్ రావు వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలి’అని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసినట్లు పేర్కొంది. ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రణీత్‌రావు.. కస్టడీ విషయంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించడం లేదని.. కస్టడీ ముగిసిన వెంటనే జైలుకు తరలించేలా ఆదేశాలివ్వాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అలాగే.. తనకు సరైన సదుపాయాలు కల్పించడం లేదంటూ పిటిషన్లో ఆరోపించారు. -
కలుషిత నీటితో కాయగూరలా?
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే కలుషిత నీటితో కాయగూరలు పండించడం, వాటి ని విక్రయించడంపై హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. పండించే వాళ్లు ఎవరైనా.. ఇది ఎంతమాత్రం సమర్థనీయం కాదని ఆక్షేపించింది. అలాంటి కాయగూరలు విక్రయించకుండా జీహెచ్ఎంసీ, సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అలాగే ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 13 చెరువుల రక్షణకు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) గాడి ప్రవీణ్‌కుమార్, రెవెన్యూ జీపీ శ్రీకాంత్‌రెడ్డి కమిటీ/అడ్వొకేట్ కమిషనర్లు అందించిన నివేదికపై చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం సూచించింది. ఆరు వారాలు సమయం ఇస్తున్నామని.. తదుపరి విచారణలోగా ఏం చర్యలు చేపట్టారన్న దానిపై కార్యాచరణ నివేదికను సమర్పించాలని చెప్పింది. విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు ఆక్రమణకు గురవుతున్నాయని, శిఖంను ఆక్రమించుకు ని నిర్మాణాలు చేపడుతున్నారని.. అయినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ గమన సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ సి.దయాకర్ 2007లో హైకోర్టుకు లేఖ రాశారు. దుర్గం చెరువు, సున్నం చెరువు, పెద్ద చెరువు, ఫీర్జాదిగూడ, దామర చెరు వు, దుండిగల్, చినరాయుని చెరువు, గంగారం పెద్ద చెరువు, మేడికుంట చెరువు, హస్మత్‌పేట, బావురుడ చెరువు ఆక్రమణలకు గురై పూర్తిగా కుంచించుకుపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లేఖను న్యాయస్థానం రిట్ పిటిషన్‌గా విచారణ స్వీకరించింది. గత విచారణ సందర్భంగా కమిటీని ఏర్పాటు చేసి.. 13 చెరువుల పరిస్థితిపై నివేదికను అందజేయాలని డీఎస్జీ, జీపీ కమిటీని ఆదేశించింది. ఈ పిటిషన్లపై ధర్మాసనం మరోసారి మంగళవారం విచారణ చేపట్టింది. కమిటీ నివేదికను పరిశీలించిన ధర్మాసనం.. ఆక్రమణలు సహా ఇతర వివాదాల పరిష్కారానికి ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని, ఎఫ్టీఎల్/బఫర్ నిర్ధారణ శాస్త్రీయంగా నిర్ణ యించాలని, శిథిలాలు, వ్యర్థాలు వేస్తే జరి మానా విధించే వ్యవస్థ ఉండాలని చెప్పింది. -
ఉద్యోగాల భర్తీకి తొలగిన న్యాయ చిక్కులు
తెలంగాణ రాష్ట్రం ఏర్ప డినంక నిరుద్యోగుల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలో పడినట్లు అయింది. నీళ్లు, నిధులు, నియామకాలే ఎజెండాగా సాగిన ఉద్య మంలో నిరుద్యోగులకు గత ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల అమలుపై విధానపరమైన నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడం వల్ల వేలాది ఉద్యోగాలు, ఉద్యోగ ప్రకటనలకే పరిమి తమై భర్తీకి నోచుకోలేదు. పక్క రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్‌లో 2016లోనే జీవో నెం. 40ని జారీ చేసి ఉద్యోగ నియామకాల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేస్తున్నారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం క్లిష్టమైనటువంటి మహిళా రిజర్వేషన్ అమలుపై హైకోర్టు ఆదేశానుసారంగా నిర్ణయం తీసుకొని ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన మహిళా కోటాకుసంబంధించిన జీవోలను రద్దు చేస్తూ, 3, 35నంబర్ల జీవోలను జారీ చేసి ఉద్యోగ నియామక ప్రక్రియలు కొనసాగే విధంగా మార్గాన్ని సుగుమం చేసింది. నూతన విధానంలో 100 పాయింట్ల రోస్టర్‌లో మహిళలకు ప్రత్యేక రోస్టర్ పాయింట్లను కేటాయించ కుండా ప్రతీ ఉద్యోగ ప్రకటనలో ఓసీ, బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ–డీ, బీసీ–ఈ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగుల, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలకు కలిపి మొత్తం 33.33 శాతం పోస్టు లను కేటాయించనున్నారు. అనగా ప్రతీ కేటగి రిలో ప్రతీ నాలుగు పోస్టుల్లో ఒక్క పోస్టు మహిళ లకు సమాంతరంగా కేటాయించ బడుతుంది. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 1992 నుండి నేటి వరకు ప్రధాన కేసులైన ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ అఫ్‌ఇండియా, రాజేష్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తదితర తీర్పుల్లో వర్టికల్ రిజర్వేషన్లుగాఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాలను; హారిజాంటల్ రిజ ర్వేషన్లుగా మహిళా, దివ్యాంగులు, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్సీసీ కోటాలను నిర్ధారించింది. అందులో వర్టికల్/ నిలువు/ సామాజిక మరియు హారిజాంటల్/ సమాంతర/ ప్రత్యేక రిజర్వేష న్లను ఏవిధంగా అమలు చెయ్యాలో స్పష్టం చేసింది. వర్టికల్ రిజర్వేషన్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 15(5), 15(6), 16(4), 16(6) ద్వారా కల్పిస్తున్నవి. కావున ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూ ఎస్ అభ్యర్థులు జనరల్ కేటగిరీ పోస్టులకు కూడా పోటీపడి ఎంపిక కావచ్చు. ఫలితంగా వారికి కేటాయించిన రిజర్వేషన్ శాతాన్ని మించి ఎంపిక కావచ్చు. ఆర్టికల్ 15(3)ను అనుసరించి సమాంతర రిజర్వేషన్ పద్ధతిలో మహిళలకు మొత్తం ఉద్యోగాల్లో 33.33 శాతం పోస్టులకు మాత్రమే ఎంపిక అవ్వడానికి ఆస్కారం ఉంది. మహిళలు జనరల్ కేటగిరీ పోస్టులకు ఎన్నికైనా వారిని కూడా ఈ 33.33 శాతం కిందకే తీసుకువస్తారు. అంటే మహిళలు 33.33 శాతానికి మించి ఎంపిక కాకూడదన్నమాట. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2009లో జూనియర్ సివిల్ జడ్జీల నియామకా లకు సంబంధించిన కేసు: కె. వెంకటేష్ వర్సెస్ గవర్నమెంట్ అఫ్ ఆంధ్రప్రదేశ్, 2020లో తెలంగాణ హైకోర్టు మాచర్ల సురేష్ వర్సెస్ స్టేట్ అఫ్ తెలంగాణ మధ్య జరిగిన కేసుల తీర్పుల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చెయ్యాలని ఆదేశించాయి. దిన పత్రికల్లో 2020 నుండి మహిళా రిజ ర్వేషన్ల సమస్యపై పతాక శీర్షికల్లో వార్తలు వచ్చి నప్పటికీ, గత తెలంగాణ ప్రభుత్వానికి విధాన పరమైన నిర్ణయం తీసుకోవడానికి సమయం లేకపోయింది. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ సమయంలో నిర్ణయం తీసుకొని 3, 35 నంబర్ల జీవోలను జారీ చేయడం స్వాగతించ వలసిన అంశం. - వ్యాసకర్త తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మొబైల్: 94909 59625 - కోడెపాక కుమార స్వామి -
మరో బెంగళూరు కానివ్వొద్దు.. తాగునీటి ఎద్దడిపై హైకోర్టు హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: వర్షపు నీటి నిల్వ విధానం (ఇంకుడు గుంతలు, ఆర్డబ్ల్యూఎస్హెచ్)పై సరైన చర్యలు చేపట్టకుంటే హైదరాబాద్ మరో బెంగళూరులా తాగునీటికి కూడా ఇబ్బందిపడే పరిస్థితి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకుడు గుంతలు లేని నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు కూడా నీటి వినియోగంపై అవగాహన కలిగించేలా పాఠ్యాంశాల్లో చేర్చాలని చెప్పింది. తాగునీటికి ఇబ్బంది ఉంటే గార్డెనింగ్ లాంటి వాటికి వినియోగాన్ని నియంత్రించాలంటూ సర్కారుకు పలు సూచనలు చేసింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా నీటికొరత ఉందని, ప్రధానంగా జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్‌లో తాగునీటికి ఇబ్బంది పడాల్సి వస్తోందని.. అధికారులు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ జర్నలిస్ట్ సుభాష్ చంద్రన్ 19 ఏళ్ల క్రితం హైకోర్టుకు లేఖ రాశారు. ఇందులోభాగంగా నీటి వినియోగాన్ని నియంత్రించడం, తాగునీటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీన్ని న్యాయస్థానం పిటిషన్‌గా మార్చి సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి కీలక సూచనలతో కూడిన నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌కు కాలం చెల్లిపోయిందని చట్టప్రకారం నిర్మాణాలకు అనుమతులిచ్చే విషయంలో నిబంధనలు పాటిస్తున్నామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సిద్ధివర్ధన పేర్కొన్నారు. తాగునీటి సంరక్షణ, నియంత్రణకు సంబంధించిన ఈ పిటిషన్ ద్వారా కోరిన ఉపశమనం.. తీసుకోవాల్సిన చర్యలు వేరని... ఈ నేపథ్యంలో కాలం చెల్లిందన్న వాదన సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ధర్మాసనం చేసిన సూచనలివీ... ► తాగునీటి పరిరక్షణ, పునర్వినియోగం, పంపిణీ లాంటి అంశాలను 3 నుంచి 5వ తరగతి పాఠ్యాంశాల్లో చేర్చే అంశాన్ని పరిశీలించాలి. 6వ తరగతి విద్యార్థులకు ఇదే అంశాలపై కొంత సిలబస్ స్థాయి పెంచి పాఠ్యాంశంగా చేర్చాలి. ► రాష్ట్రంలోని భూగర్భ జలాలను పరిశీలించి.. అవసరమైతే తాగునీటిని గార్డెనింగ్ వంటి పనులకు వినియోగించడంపై ఆంక్షలు విధించాలి. ► ఇంకుడు గుంతల్లేని నిర్మాణాలను గుర్తించడానికి, తగిన చర్యలు తీసుకోవడానికి పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి కసరత్తు చేయాలి. ► పట్టణ, స్థానిక సంస్థల్లో ఆర్డబ్ల్యూహెచ్ఎస్ నిబంధనలు అమల్లో ఉండేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి చర్యలు చేపట్టాలి. ► గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డబ్ల్యూహెచ్ఎస్ వ్యవస్థ అవశ్యకతను తెలియజేయడానికి సర్కారు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ► గతేడాది మార్చి 31న జారీచేసిన జీవో 49 అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీనికి అదనంగా చిన్న నిర్మాణాల్లో సైతం వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేసే అంశాన్ని అధ్యయనం చేసి చర్యలు చేపట్టాలి. ► వాల్టా చట్టంలోని నిబంధనల అమలుకు సెక్షన్ 11 ప్రకారం సంబంధిత విభాగం నోటిఫికేషన్ జారీచేయాలి. ► రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బోర్‌వెల్స్ నిబంధనల ప్రకారమే కొనసాగుతున్నాయా? లేదా? అనే అంశంపై భూగర్భ జలవనరులశాఖ పరిశీలన చేపట్టి చర్యలు తీసుకోవాలి. ► పంచాయతీరాజ్ చట్టం- 2018లోని సెక్షన్ 43 (6) (2) నిబంబధనలు అమలయ్యేలా పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి చర్యలు తీసుకోవాలి. -
తుది తీర్పు మేరకే గురుకుల లెక్చరర్ల నియామకాలు
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీ తుది తీర్పున కు లోబడే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ల అభ్యంతరాలపై వివరాలు తెలు సుకుని చెప్పాలని స్టాండింగ్ కౌన్సిల్‌ను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చే యాలంటూ.. విచారణను వాయిదా వేసింది. గురుకుల విద్యాసంస్థల్లో జూనియర్ లెక్చరర్ల భర్తీ కోసం గత సంవత్సరం ప్రభుత్వం నోటిఫి కేషన్ ఇచ్చింది. అయితే నోటిఫికేషన్లో ఇచ్చిన నిబంధనలు పాటించకుండా తమను పక్కకు పెట్టడాన్ని సవాల్ చేస్తూ జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన గంగాప్రసాద్‌తో పాటు మరో 9 మంది హైకోర్టులో పిటి షన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయ మూర్తి జస్టిస్ పుల్ల కార్తీ క్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యా యవాది చిల్లా రమేశ్ వాదనలు వినిపిస్తూ.. ‘జంతుశాస్త్రం, వృక్ష శాస్త్రం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఎంఎస్సీలో ఏ సబ్జెక్ట్ చేసి నా డిగ్రీలో మాత్రం సంబంధిత సబ్జెక్ట్ చేసి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దీంతో డిగ్రీలో జంతుశాస్త్రం, వృక్ష శాస్త్రం చదివి.. ఎంఎస్సీలో మరో సబ్జెక్ట్ చదివిన పిటిషనర్లు కూడా దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల అనంతరం ప్రకటించిన మెరిట్ లిస్ట్‌లో పిటిషనర్ల పేర్లు కూ డా ఉన్నాయి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత పిటిషనర్ల అర్హతపై నిపుణుల కమిటీ వేశామని.. నివేదిక వచ్చేదాకా ఆగాలని అధికా రులు సూచించారు. అయితే ఆ నివేదిక రాక ముందే పిటిషనర్లను పక్కకు పెట్టి ఇతరులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. ప్రభుత్వ తీరు సమర్థనీయం కాదు. మెరిట్ ప్రకారం పిటిషనర్లకు కూడా అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి’ అని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్టాండింగ్ కౌన్సిల్ ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేశారు. -
జీజేఆర్ క్రికెట్ టోర్నీ విజేత ‘హైకోర్టు’ జట్టు
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు న్యాయవాదుల క్రికెట్ అసోసియే షన్ ఆధ్వర్యంలో జరిగిన జీజేఆర్ టోర్నమెంట్ పోటీల్లో హైకోర్టు న్యాయవాదుల జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ విజేతగా నిలిచిన జట్టుకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా శనివారం కప్‌ను అందజేశారు. బోడుప్పల్‌లోని సాగర్ క్రికెట్ గ్రౌండ్, ఆరంఘర్లోని విజయానంద్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన పోటీల్లో నగరంలోని 13 కోర్టుల న్యాయవాదులు పాల్గొన్నారు. సెమీ ఫైనల్లో సిటీ సివిల్ కోర్టు న్యాయవాదుల జట్టు (78)పై హైకోర్టు టీమ్(79) విజయం సాధించింది. అనంతరం జరిగిన ఫైనల్లో హైకోర్టు జట్టు... హైదరాబాద్ మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు టీమ్‌పై గెలుపొందింది. మ్యాన్ ఆఫ్‌ది ఫైనల్లో బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా వి.మనోహర్, బెస్ట్ బౌలర్‌గా సాయిచందర్ నిలిచారు. ఈ కప్ అందజేత కార్య క్రమంలో బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ కె.సునీల్‌గౌడ్, కౌన్సిల్ సభ్యుడు జితేందర్‌రెడ్డి, కటకం శారద, శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు. -
బాబు మింగిన భూములు కక్కించిన తెలంగాణ హై కోర్టు
-
ఎమ్మెల్సీలపై మళ్లీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణలను నియమించాలంటూ రాష్ట్ర కేబినెట్ చేసిన సిఫార్సు లపై గవర్నర్ వ్యవహరించిన తీరు సరికాదని రాష్ట్ర హైకోర్టు పేర్కొంది. సదరు సిఫార్సులను తిరస్క రిస్తూ 2023 సెప్టెంబర్ 19న గవర్నర్ ఇచ్చిన ఆదేశా లను రద్దు చేసింది. దీంతోపాటు గవర్నర్ ఆదేశాల మేరకు కోదండరామ్, ఆమెర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ఈ ఏడాది జనవరి 27న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేసింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని.. మరోసారి ఎమ్మెల్సీల పేర్లను కేబినెట్ లో ప్రతిపాదించి గవర్నర్‌కు పంపాలని స్పష్టం చేసింది. ఈ మేరకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక వివాదంపై దాఖలైన పిటిషన్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటిల ధర్మాసనం గురువారం కీలక తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 (5) ప్రకారం.. కేబినెట్ సాయం, సలహా మేర కు గవర్నర్ వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంది. కేబినెట్ సిఫార్సు చేసిన వ్యక్తుల అర్హత, అనర్హత అంశాలను పరిశీలించడానికి గవర్నర్‌కు అధికారం ఉంటుందని.. కావాలంటే అవసరమైన పత్రాలు, సమాచారం కోరవచ్చని తెలిపింది. కేబినెట్ సిఫార్సులను పునఃపరిశీలనకు పంపే అధికారం కూడా ఉంటుందని స్పష్టం చేసింది. వాస్తవానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం కోర్టుకు గవర్నర్ జవాబుదారీ కాదని.. గవర్నర్‌కు కోర్టులు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేవని పేర్కొంది. కానీ హైకోర్టుకు న్యాయసమీక్ష చేసే అధికారం ఉంటుందని వివరించింది. ‘గవర్నర్ కోటా’ పిటిషన్లపై వాదనలను పరిశీలించాక.. రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగా తగిన చర్య తీసుకోవాలని భావించి తీర్పునిస్తున్నట్టు తెలిపింది. ఇక అప్పటి కేబినెట్ సిఫార్సులను అమలు చేయాలన్న పిటిషనర్ల డిమాండ్‌పై చర్చ అనవసరమని.. వారు గవర్నర్ తిరస్కరించడాన్ని మాత్రమే సవాలు చేశారని పేర్కొంది. ‘గవర్నర్ కోటా’వివాదం ఇదీ.. 2023 జూలై 31న భేటీ అయిన గత ప్రభుత్వ కేబినెట్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణల పేర్లను గవర్నర్‌కు సిఫార్సు చేసింది. గవర్నర్ ఈ సిఫార్సులను తిరస్కరిస్తూ సెప్టెంబర్ 19న ఆదేశాలు జారీ చేశారు. దీంతో గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు విచారణలో ఉండగానే.. కొత్త ప్రభుత్వ కేబినెట్ సిఫార్సు మేరకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, జర్నలిస్టు ఆమెర్ అలీఖాన్‌ల నియామకానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ ఏడాది జనవరి 27న ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నియామకాలను కూడా శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. రెండు అంశాలపైనా హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. కోదండరామ్, ఆమెర్ అలీఖాన్‌ను ప్రధాన పిటిషన్లో ఇంప్లీడ్ చేసింది. వారి ప్రమాణస్వీకారంపైనా స్టే ఇచ్చింది. తాజాగా తీర్పు వెలువరించింది. గవర్నర్ నిర్ణయం అభ్యంతరకరం! ‘‘దాసోజు శ్రవణ్ రాజకీయ నాయకుడన్న కారణంగా గవర్నర్ తిరస్కరించారు. తర్వాత నియామకమయ్యే వారు కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండాలి. కానీ నియామకమైన వారు కూడా రాజకీయ నాయకులే. అందులో ఒకరు రాజకీయ పార్టీనే నడిపిస్తున్నారు’’ అని హైకోర్టులో దాసోజు శ్రవణ్ తరఫున సీనియర్ న్యాయవాది ఆదిత్యా సోంధీ వాదనలు వినిపించారు. ‘‘గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వ అర్హతలకు.. పిటిషనర్ల నామినేషన్ తిరస్కరణ కారణాలకు పొంతన లేదు. మంత్రివర్గ సిఫార్సులను తిరస్కరించే అధికారం గవర్నర్‌కు లేదు. దీనిపై సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. గవర్నర్‌కు అభ్యంతరం ఉంటే పునః పరిశీలన కోసం వెనక్కి పంపవచ్చు. గవర్నర్ తిరస్కరణ కారణంగా హక్కును కోల్పోయిన పిటిషనర్‌కు కోర్టును ఆశ్రయించే అర్హత ఉంటుంది. శ్రవణ్, సత్యనారాయణల పేర్లను నెలల తరబడి పరిశీలించిన గవర్నర్.. కోదండరామ్, ఆమెర్ అలీఖాన్‌ల పేర్లను మాత్రం కొత్త కేబినెట్ సిఫార్సు చేసిన వెంటనే ఆమోదించింది’’ అని వివరించారు. కుర్ర సత్యనారాయణ తరఫున సీనియర్ న్యాయవాది మయూర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘మంత్రి మండలి సిఫార్సులను గవర్నర్ వెనక్కి పంపడానికి, తిరస్కరించడానికి తేడా లేదని పేర్కొనడం సరికాదు. ప్రభుత్వం సిఫార్సు చేసిన అభ్యర్థులపై గవర్నర్‌గా సంతృప్తి చెందడం వేరు.. ఓ వ్యక్తిగా సంతృప్తి చెందడం వేరు. పిటిషనర్ల పేర్లను గవర్నర్ వ్యక్తిగతంగా తిరస్కరించినట్టు కనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు. గవర్నర్.. రబ్బర్ స్టాంప్ కాదు.. ‘‘ఎవరికైనా రాజ్యాంగం అనేది సుప్రీం. దాన్ని ఎవరైనా అనుసరించాలి. భాషాపరమైన, సైన్స్ వంటి రంగాల్లో సేవలందించిన వారిని మంత్రి మండలి సిఫార్సు చేయాలి. అలా కాకుండా రాజకీయ విభాగాలకు చెందిన వారిని సిఫార్సు చేస్తే.. కారణాలను పేర్కొంటూ తిస్కరించే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. గవర్నర్ రబ్బర్ స్టాంప్ కాదు. గవర్నర్ తిరస్కరించిన తర్వాత వేరేవారి పేర్లు పంపడానికి ప్రభుత్వానికి అవకాశం ఉన్నా పంపలేదు. మంత్రి మండలి సిఫార్సులను వెనక్కి పంపిన గవర్నర్ చర్యలను అలహాబాద్, బాంబే హైకోర్టులు గతంలో సమర్థించాయి. కోదండరామ్, ఆమెర్ అలీఖాన్‌లను గవర్నర్ నేరుగా ఏమీ నియమించలేదు. మంత్రి మండలి సిఫార్సు చేసిన తర్వాత.. ఆయా రంగాల్లో వారు చేసిన సేవను పరిశీలించి ఆమోదముద్ర వేశారు’’ అని కోదండరామ్, అలీఖాన్‌ల తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ కోర్టుకు విన్నవించారు. ప్రభుత్వ సిఫార్సు మేరకే నియామకం.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఇద్దరి పేర్లను ఎమ్మెల్సీలుగా సూచిస్తూ జనవరి 24న ప్రభుత్వం సిఫార్సు చేసిందని, దాన్ని పరిశీలించాకే గవర్నర్ ఆమోదించారని వివరించారు. ఇదంతా చట్టప్రకారమే జరిగిందన్నారు. గతంలో ప్రభుత్వం చేసిన సిఫార్సులను పక్కకుపెట్టే అధికారం ఇప్పుడున్న సర్కార్‌కు ఉంటుందని స్పష్టం చేశారు. – గవర్నర్ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.అశోక్ ఆనంద్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. ‘‘గవర్నర్ నిర్ణయాలను కోర్టులు విచారించలేవు. రాజ్యాంగం గవర్నర్ విచక్షణాధికారాలకు పూర్తి రక్షణ కల్పించింది. గవర్నర్ విచక్షణ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మంత్రి మండలి సలహాపై.. మరొకటి సొంత విచక్షణాధికారం. ప్రజాప్రతినిధుల కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నుకునే అవకాశం ఎమ్మెల్యేలకు ఎలా ఉంటుందో.. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలను నియమించే విచక్షణాధికారాలు గవర్నర్‌కు ఉన్నాయి’’ అని వివరించారు. -
చంద్రబాబు చేసింది వెయ్యి కోట్ల భూకుంభకోణం
గ్రేటర్ హైదరాబాద్‌లో ఏ మూలనైనా ఎకరానికి వంద కోట్ల ధర ఉంది. అలాంటిది 850 ఎకరాలంటే దాదాపు లక్ష కోట్ల రుపాయల విలువ. కేవలం నాలుగు రోజుల్లోనే లక్ష కోట్ల విలువైన భూమిని పక్కదారి పట్టించడమంటే చంద్రబాబు ఘనత అర్థం చేసుకోవచ్చు. 1999-2004 మధ్య జరిగిన ఈ కుంభకోణాన్ని బయటకు రాకుండా చేయడానికి నానా పాట్లు పడ్డా.. చివరికి హైకోర్టు తీర్పు రావడంతో బాబు కుంభకోణమంతా బట్టబయలైంది. సాక్షి, హైదరాబాద్: ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంజీబీపీఎల్) కంపెనీ ఏర్పాటైన 4 రోజుల్లోనే 850 ఎకరాలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్న 2003 నాటి నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. కనీస విచారణ లేకుండా, అంతర్జాతీయ కంపెనీతో సంబంధాలు ఉన్నాయో లేదో తెలుసుకోకుండా, అత్యంత ఖరీదైన ప్రాంతంలో వేల కోట్ల విలువైన భూములను కారు చౌకగా ధారాదత్తం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పోర్ట్స్ అకాడమీ నిర్వహణ కోసం అంటూ ఏటా కోట్లాది రూపాయలు ముట్టజెప్పేందుకు, విద్యుత్, నీటి, సీవేజ్, డ్రైనేజీ సౌకర్యాలు 100 శాతం ఉచితంగా కల్పించేందుకు అంగీకరించడం గతంలో ఎప్పుడూ, ఎక్కడా చూడలేదంటూ విస్మయం వ్యక్తం చేసింది. గతంలో ఏ కంపెనీకీ అది ఏర్పాటైన 4 రోజుల్లో వందల ఎకరాలు అప్పగించినట్టుగా, నిర్వహణ ఖర్చులు, బిల్లుల మాఫీకి అంగీకరించినట్టుగా లేదని అభిప్రాయపడింది. 2007లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం విస్తృత ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకునే సదరు భూమిని వెనక్కు తీసుకుంటూ చట్టం చేసిందని స్పష్టం చేసింది. రాజ్యాంగంలో ఉన్న అధికారాల మేరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తి (పరిరక్షణ, రక్షణ, పునఃప్రారంభం) చట్టాన్ని తీసుకొచ్చిందని.. ఇది ఎంతమాత్రం ఆక్షేపణీయం కాదని తేల్చిచెప్పింది. ఐఎంజీ భారత్ (పిటిషనర్) పేర్కొంటున్నట్లుగా ఆర్టికల్ 14 ఉల్లంఘన ఎక్కడా జరగలేదని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ పిటిషన్లో ఎలాంటి మెరిట్ కనిపించలేదని, ఆ ఒప్పందాన్ని ఏవిధంగానూ సమర్ధించలేమని ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటిల ధర్మాసనం 18 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత గురువారం తీర్పు ఇచ్చింది. దీనిపై మీరు సీబీఐ విచారణ జరిపిస్తారా? లేక మమ్మల్నే ఆదేశించమంటారా? అంటూ రాష్ట్ర ప్రభు త్వాన్ని ఈ అంశంపైనే దాఖలైన ఓ పిల్ విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై వా రం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. యువతను క్రీడల్లో తీర్చిదిద్దడం కోసం అంటూ.. ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంజీబీపీఎల్) 2003, ఆగస్టు 5న ఏర్పాటైంది. కంపెనీ ఏర్పాటైన 4 రోజులకే అంటే ఆగస్టు 9నే చంద్రబా బు నేతృత్వంలోని నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఐఎంజీ భారత్‌తో ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. క్రీడల్లో రాష్ట్ర యువతను చాంపియన్లుగా తీర్చిదిద్దడం కోసం అంటూ ఈ ఎంవోయూ చేసుకుంది. ఇందులో భాగంగా స్పోర్ట్స్ అకాడెమీలను నిర్మించడం, అభివృద్ధి చేయడం, నిర్వహించడం కోసం అంటూ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి సర్వే నంబర్ 25లో 400 ఎకరాలు ఇచ్చేందుకు అంగీకరించింది. అలాగే రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం మామిడిపల్లి సర్వే నంబర్ 99/1లోని మరో 450 ఎకరాలు అప్పగించేందుకు కూడా ఒప్పందం చేసుకుంది. అంతేకాకుండా ఐఎంజీ భారత్ అంతర్జాతీయ స్థాయిలో ప్రధాన కార్యాలయాన్ని నిర్మించుకునేందుకు బంజారాహిల్స్ నుంచి మాదాపూర్ వెళ్లే మార్గంలో ఎకరం నుంచి 5 ఎకరాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు 2004, ఫ్రిబవరిలో గచ్చి»ౌలిలో ఎంతో విలువైన 400 ఎకరాలను స్వల్ప మొత్తానికి అంటే కేవలం రూ.2 కోట్లకే ఐఎంజీ భారత్‌కు అప్పగించింది (సేల్ డీడ్ చేసింది). అయితే 2006లో ప్రభుత్వ ఆస్తులను కాపాడే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. 2007లో దీన్ని చట్టబద్ధం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తి (పరిరక్షణ, రక్షణ, పునఃప్రారంభం) చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్ట ప్రకారం ఐఎంజీ భారత్‌తో అంతకుముందు ప్రభుత్వం చేసుకున్న ఎంఓయూ, ఆ మేరకు సేల్‌డీడ్ కూడా రద్దయ్యాయి. ఈ క్రమంలో 2007 చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం సంబంధిత లావాదేవీలు రద్దు చేయడమే కాకుండా ఐఎంజీ చెల్లించిన మొత్తాన్ని ఏడాదికి 12 శాతం వడ్డీతో తిరిగి ఇచ్చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే ప్రభుత్వ చట్టాన్ని సవాల్ చేస్తూ ఐఎంజీ భారత్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పూర్తి కేబినెట్ ఆమోదం లేదు: ఏజీ ‘పూర్తి కేబినెట్ ఆమోదం లేకుండా నాటి ప్రభుత్వం ఎంఓయూపై సంతకాలు చేసింది. ఆ సమయంలో భూమి విలువ ఎకరం రూ.13 లక్షలు ఉండగా, పిటిషనర్‌కు రూ.50 వేల స్వల్ప మొత్తానికే సరైన ఎలాంటి కారణం లేకుండా విక్రయించారు. ఐఎంజీ భారత్‌కు అమెరికన్ కంపెనీ అయిన ఐఎంజీతో ఎలాంటి సంబంధం లేదు. కానీ దానికి అనుబంధ సంస్థ అంటూ మోసగించారు. అందుకే తదుపరి ప్రభుత్వం ఎంవోయూను రద్దు చేసింది. పరిహారం ఇవ్వాలని కూడా నిర్ణయించింది. 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఒక్క ఐఎంజీ కోసమే కాదు. ఇది ఇతర భూ లావాదేవీలకు కూడా వర్తిస్తుంది. ఇలా చట్టం తీసుకొచ్చే అధికారం రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ ప్రకారం శాసనసభకు ఉంది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత 2007లో చేసిన చట్టం అమల్లోకి వచ్చింది..’అంటూ అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. కాగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ..‘ఒక ఐఎంజీ భారత్ కోసమే చట్టాన్ని తేవడం సమరి్థనీయం కాదు. ఎంవోయూను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదు..’అంటూ వాదించారు. ఎలాంటి విచారణ చేయకుండానే ఆమోదం: ధర్మాసనం ‘2003 ఆగస్టు 5న ఐఎంజీ భారత్ ఏర్పాటైన తర్వాతి రోజే, ఎలాంటి విచారణ చేసుకోకుండానే 6న నాటి యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం, కల్చలరల్ డిపార్ట్మెంట్ కంపెనీకి ఆమోదం తెలుపుతూ సర్క్యులర్ జారీ చేసింది. అదే రోజు నలుగురు మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీనికి ఆగమేఘాలపై గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత 9వ తేదీన ఎంవోయూ కుదుర్చుకున్నారు. స్పోర్ట్స్ అకాడెమీ, స్టేడియాల నిర్వహణకయ్యే ఖర్చు ఏడాదికి రూ.2.5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ అయితే ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని ఒప్పందంలో పేర్కొన్నారు. తొలి మూడేళ్లపాటు విద్యుత్, నీటి, సీవేజ్, డ్రైనేజీ బిల్లులనూ 100 శాతం తిరిగి చెల్లిస్తామని చెప్పారు. ఆ తర్వాత క్రమంగా దీన్ని తగ్గిస్తామని తెలిపారు. ముఖ్యంగా పిటిషనర్‌కు అంతర్జాతీయ క్రీడా సంస్థ (ఐఎంజీ, అమెరికా)తో సంబంధం గానీ, గతంలో క్రీడా రంగంలో అనుభవం గానీ లేవు. ఉన్నట్లుగా ఐఎంజీ ఎలాంటి పత్రాలను ప్రభుత్వానికి సమర్పించలేదు. ప్రభుత్వం రద్దయ్యాక 400 ఎకరాలకు సేల్‌డీడ్! 2003, నవంబర్ 14నే చంద్రబాబు ప్రభుత్వం రద్దయ్యింది. తర్వాత ఆపద్ధర్మ ప్రభుత్వంగా మాత్రమే కొనసాగింది. ఈ ఆపద్ధర్మ ప్రభుత్వ హయాంలోనే 400 ఎకరాలను నామమాత్రపు ధరకు ఐఎంజీ భారత్‌కు అప్పగిస్తూ సేల్‌డీడ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుల మేరకు చట్టం ద్వారా ఒక వ్యక్తి మాత్రమే ప్రభావితం అయినా, 2007లో భూములపై రాష్ట్ర శాసనసభకు ఉన్న అధికారాలతోనే చట్టాన్ని రూపొందించింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సరైన కారణాలు ఉన్నప్పుడు రాజ్యాంగం ప్రభుత్వానికి ఈ అధికారం కలి్పంచింది. జాగ్రత్తగా గమనిస్తే.. కంపెనీ ఏర్పాటైన కేవలం 4 రోజుల్లోనే వేల కోట్ల విలువచేసే వందల ఎకరాల భూములు అప్పగించారు. మరే ఇతర కంపెనీకి రాష్ట్రంలో అంత స్వల్ప సమయంలో ఇలా భూములు ధారాదత్తం చేయలేదు. పిటిషనర్‌కు పరిహారం కోరే హక్కు ఉంది. అయితే 2007లో తీసుకొచ్చిన చట్టాన్ని తన ఒక్క కంపెనీ కోసమే అంటూ సవాల్ చేయలేరు. ప్రజా ఆస్తుల పరిరక్షణకే వైఎస్ సర్కార్ చట్టం.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ప్రభుత్వం ఉల్లంఘించిందన్న వాదన కూడా సరికాదు. ప్రజల ఆస్తులను కాపాడటం కోసమే 2007లో వైఎస్ సర్కార్ చట్టం తీసుకొచ్చింది. అది ఎవరి వ్యక్తిగత అవసరాల కోసం కాదన్న విషయం గ్రహించాలి. కంపెనీ ఏర్పాటు చేసిన నాలుగు రోజుల్లో వేల కోట్ల భూములు గతంలో మరే ఇతర కంపెనీకి ప్రభుత్వం కేటాయించినట్లుగా ఐఎంజీ నిరూపించలేకపోయింది. అలాగే ప్రభుత్వం చేసిన చట్టం చెల్లుబాటును అడ్డుకునేందుకు ఇందులో ఎలాంటి ఉల్లంఘనలు కూడా జరగలేదు. సేల్ డీడ్‌ను రద్దు చేయకూడదనే వాదన ఆమోదానికి అర్హమైనది కాదు. ఎంఓయూనే రద్దయినప్పుడు సేల్‌డీడ్ అమల్లో ఉండటం సాధ్యం కాదు..’అంటూ ధర్మాసనం తన తీర్పులో వ్యాఖ్యానించింది. సీబీఐ విచారణకు లేఖ రాశామన్నారుగా.. ‘ఐఎంజీ భారత్‌కు భూముల అప్పగింతపై సీబీఐ విచారణ కోరుతూ గతంలో లేఖ రాశాం అన్నారు.. ఎంత వరకు వచ్చింది? మీరు విచారణ కోరతారా? లేక మమల్నే సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు ఇవ్వమంటారా?’అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణలోగా ఏదో ఒకటి చెప్పాలని ఆదేశిస్తూ, విచారణను వారం పాటు వాయిదా వేసింది. ఐఎంజీ భారత్‌కు భూముల కేటాయింపు, ఎంవోయూ, సేల్‌డీడ్.. ఇలా అన్ని అంశాలపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ)తో విచారణ జరిపించాలని కోరుతూ టి.శ్రీరంగారావుతో పాటు మరొకరు 2012లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ ఒప్పందం వెనుక పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేసే ప్రయత్నం జరిగిందని, దీని వెనుక ఉన్న కుట్రదారులెవరో తేల్చాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ పిటిషన్లను గురువారం మరోసారి సీజే ధర్మాసనం విచారించింది. సీబీఐకి అప్పగించే విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ అభిప్రాయం ధర్మాసనం కోరింది. ఆయన తమకు కొంత సమయం కావాలనడాన్ని, ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాత తెలియజేస్తాననడాన్ని తప్పుబట్టింది. ఇంకా ఎంతకాలం ఆగాలని, వారంలోగా ఏదో ఒకటి తేల్చిచెప్పాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. కాగా గతంలో ఇదే పిల్‌పై విచారణ సందర్భంగా ప్రభుత్వం కోరితే దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నామని న్యాయస్థానానికి సీబీఐ తెలియజేయడం గమనార్హం. -
850 ఎకరాల స్కాం.. చంద్రబాబుకు హైకోర్టు షాక్!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు హయాంలో ఓ సంస్థకు అక్రమంగా కేటాయించిన 850 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి సుధీర్ఘ కాలం తర్వాత తీర్పు వచ్చింది. 2004లో నాటి ఆపద్ధర్మ చంద్రబాబు ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులను తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ఆ కేటాయింపులను రద్దు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. వివరాల్లోకి వెళితే.. 2003లో బిల్లీ రావు అనే వ్యక్తి హైదరాబాద్, చుట్టుపక్కల క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి పేరుతో ఐఎంజీ భారత్ అనే సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థకు 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉండగానే 850 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా కారుచవకగా కేటాయించారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయి చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. నాటి చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమ భూ కేటాయింపులను గుర్తించిన వైఎస్సార్ ప్రభుత్వం 2006లో ఈ భూ కేటాయింపులను రద్దు చేసింది. దీంతో బిల్లీ రావు ఈ రద్దును సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లారు. అప్పటి నుంచి దీనిపై సుదీర్ఘ విచారణ కొనసాగగా తాజాగా చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ కూడిన తెలంగాణ హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. వైఎస్సార్ ప్రభుత్వం భూ కేటాయింపులను రద్దు చేయడాన్ని సమర్థిస్తూ బిల్లీ రావు పిటిషన్‌ను కొట్టేసింది. ఏకపక్షంగా భూ కేటాయింపులు చేసిన నాటి చంద్రబాబు ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. -
మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనకు ప్రాణ హాని ఉందని శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనకు 4+4 గన్మెన్లను కేటాయించాలని పిటిషన్లో కోరారు. శ్రీనివాస్‌గౌడ్ వేసిన పిటిషన్ మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థునను హైకోర్టు నిరాకరించింది. ప్రతి ఒక్కరికి ఈ విధంగా కేటాయించడం సాధ్యం కాదని హైకోర్టు పేర్కొంది. శ్రీనివాస్ గౌడ్‌కు గన్మెన్లు అవసరమో? లేదో? తెలపాలని హైకోర్టు డీజీపీని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలనీ హైకోర్టు డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు.. మార్చి 19కి వాయిదా వేసింది. -
51 ఏళ్ల అర్హతను పరిశీలించండి
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పోస్టుల రిక్రూట్మెంట్ కోసం గరిష్ట వయోపరిమితిని 46 ఏళ్ల నుంచి 51 ఏళ్లకు సడలించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)ని హైకోర్టు ఆదేశించింది. చాలా ఏళ్ల తర్వాత భర్తీ చేస్తున్న గ్రూప్–1 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం 46 ఏళ్లను అర్హతగా పేర్కొందని, దీనిని 51 ఏళ్ల వరకు పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన నిరుద్యోగి శ్రీనివాస్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందించలేదని, దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించామని చెప్పారు. గరిష్ట వయసు సడలింపు ఇస్తూ నోటిఫికేషన్లో మార్పు చేసేలా టీఎస్పీఎస్సీని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఫణిభూషణ్ వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నోటిఫికేషన్ల జారీలో చాలా జాప్యం జరిగిందన్నారు. దీంతో అనేక మంది గ్రూప్–1 పరీక్షలకు అర్హత కోల్పోయారని వివరించారు. ఈ దృష్ట్యా గరిష్ట వయోపరిమితిని పెంచాల్సిన ఆవశ్యకత ఉందని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ ఆంశంలో మెరిట్ జోలికి వెళ్లడంలేదని, ఫిబ్రవరి 2న పిటిషనర్లు ఇచ్చిన వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. 4 వారాల్లో దీనిపై నిర్ణయాన్ని తెలియజేయాలని స్పష్టం చేశారు. -
కారణాలు చూపకుండా పరిధి విభజన సరికాదు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని మూడు జిల్లా వినియోగదారుల కమిషన్ల ప్రాదేశిక అధికార పరిధిని నిర్ణయిస్తూ 2022 నాటి సర్క్యులర్‌ను పక్కన పెడుతూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. రాష్ట్ర కమిషన్ అధ్యక్షుల హోదాలో జిల్లా కమిషన్ల అధికార పరిధిని నిర్ణయించవచ్చన్న న్యాయస్థానం.. ఆ నిర్ణయం మాత్రం పారదర్శకంగా ఉండాలని వ్యాఖ్యానించింది. పరిధి మార్పు ఎందుకు చేస్తున్నారో స్పష్టమైన వివరణ ఉండాలని పేర్కొంది. జిల్లా కమిషన్ల న్యాయవాదుల సంఘం ఇచ్చి న వినతి పత్రానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబట్టింది. హైదరాబాద్‌లోని మూడు జిల్లా కమిషన్ల ప్రాదేశిక అధికార పరిధిపై 2022లో జారీ చేసిన సర్క్యులర్‌ను నిలిపివేస్తూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ గతేడాది ఏప్రిల్‌లో రాసిన లేఖను సవాల్‌చేస్తూ న్యాయవాది రాఘవేంద్రసింగ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ పి. శ్యామ్ కోసీ, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టి ఇటీవల తీర్చు చెప్పింది. హైదరాబాద్‌లోని మూడు జిల్లా కమిషన్లు నాంపల్లిలోని చంద్రవిహార్ నుంచి విధులు నిర్వహిస్తున్నాయి. కమిషన్–1లో కేసులు ఎక్కువగా ఉండగా మిగిలిన రెండు కమిషన్లలో కేసులు లేక మధ్యాహ్నంలోగానే విచారణ పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా వినియోగదారుల కమిషన్ న్యాయవాదుల సంఘం వినతి మేరకు కేసుల విభజన బాధ్యతను కమిషన్–1కి అప్పగిస్తూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ రిజిస్ట్రార్ లేఖ రాశారు. కేసుల విభజనలో వివక్ష చూపుతున్నారని పిటిషనర్ వాదించారు. దీనిపై స్పందించిన హైకోర్టు కేసుల సంఖ్య తక్కువగా ఉన్న విషయాన్ని వివరిస్తూ విభజన చేయవచ్చని, న్యాయవాదుల సంఘం ఇచ్చి న వినతిపై నిర్ణయం తీసుకోవడం తగదని స్పష్టం చేసింది. తగిన కారణాలు చూపకుండా... దానిపై వివరణ లేకుండా విభజన చేయడం సరికాదని స్పష్టం చేసింది. -
‘మా పార్కును కాపాడండి ప్లీజ్’
హైదరాబాద్, సాక్షి: నిత్యం తాము ఆడుకునే పార్కు కబ్జాకు గురవుతుందంటూ కొందరు చిన్నారులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ వాళ్లు లేఖ రాశారు. దీంతో లేఖను సుమోటోగా తీసుకుని.. ప్రజాప్రయోజన వ్యాజ్యంగా విచారణ చేపట్టింది హైకోర్టు. హైకోర్టుకు చిన్నారుల లేఖ ఆదిలాబాద్ పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో ఉన్న పార్క్ స్థలంలో కొంత భాగాన్ని కబ్జా చేసే యత్నం చేస్తున్నారంటూ 23 మంది చిన్నారులు హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. రోజూ తాము ఆడుకునే పార్క్‌ను ఎలాగైనా కాపాడాలంటూ లేఖలో సీజేను కోరారు. దీంతో.. కబ్జాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలు తెలపాలని సీఎస్, జిల్లా కలెక్టర్, పురపాలక సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిల్‌పై తదుపరి విచారణ మార్చి 7కు వాయిదా వేసింది. స్థలం సంగతేంటీ? అదిలాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో పిల్లలు అడుకునేందుకు 1.5 ఎకరాల పార్క్ స్థలాన్ని అప్పటి ప్రభుత్వం కేటాయించి పార్క్ నిర్మాణం చేపట్టింది. ఈ స్థలం కబ్జా చేస్తున్నారని 2022 సంవత్సరం ఫిబ్రవరిలో కౌన్సిలర్ అంబకంటి అశోక్ అప్పటి కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో కౌన్సిలర్ అప్పట్లోనే కోర్టును ఆశ్రయించాడు. దీంతో అప్పట్లో నిర్మాణం ఆగిపోయింది. దాని తర్వాత కూడా అధికారులు పార్కు అభివృద్ధి విషయంలో చర్యలు చేపట్టలేదు. దీంతో కొందరు మళ్ళీ ఆ స్థలంలో నిర్మాణం మొదలుపెట్టారు. దీనిపై తిరిగి కౌన్సిలర్, కాలనీవాసులతో కలిసి కమిషనర్ తో పాటు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. పెద్దల వల్ల కానిది పిల్లలు.! ఇదే కాలనీకి చెందిన 23 మంది పిల్లలు.. పార్కును కాపాడాలంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు 2023లో లెటర్ రాశారు. ఈ లేఖను అందుకున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ స్పందించడమే కాకుండా.. మరిన్ని వివరాలు కావాలంటూ యంత్రాంగాన్ని అడిగారు. తాము ఆడుకునే పార్కు కబ్జాకు గురవుతుందని, ఈ భూమిని కాపాడి పార్కును నిర్మించేలా ఆదేశాలివ్వాలని హైకోర్టు చీఫ్ జస్టిస్‌కి రాసిన లేఖలో చిన్నారులో కోరారు. ఆక్రమణలపై చర్యలు తీసుకోవాల్సిన అప్పటి కమిషనర్ శైలజ పట్టించుకోలేదని ఫిర్యాదు చేశారు. తాము ఆడుకునే పార్క్ స్థలాన్ని కాపాడాలని కోరారు. ఈ లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు.. కబ్జాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలు తెలపాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ జిల్లా ,కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఆక్రమణల కట్టడికి తీసుకున్న చర్యలను వివరించాలని ఆదేశించారు. తదుపరి విచారణ మార్చి 7 కు తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. -
TS High Court: పోలీసు స్టేషన్‌కు సరదాగా వస్తారా?
సాక్షి, హైదరాబాద్: పోలీసులు తమ ప్రవర్తనాశైలిని మార్చుకోవాలని, ప్రజల కోసమే వారు పనిచేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిని భయాందోళనకు గురిచేసేలా వ్యవహరించవద్దని, వారు పోలీస్ స్టేషన్‌కు సరదాగా రారన్న విషయం తెలుసుకోవాలని స్పష్టం చేసింది. అవసరమైతే పోలీసుల విధులేంటో వారికి తెలిసేలా ఆన్లైన్ విధానంలోనైనా అవగాహన తరగతులు నిర్వహించాలని డీజీపీని ఆదేశించింది. ఈ విషయాన్ని డీజీపీకి తెలియజేయాలని అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌కు సూచించింది. ఇప్పటికీ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పోలీసులు, న్యాయవాదులు, వైద్యుల వద్దకు ప్రజలు విధిలేకే వస్తారన్న విషయం గుర్తుంచుకుని మసలుకోవాలని చెప్పింది. తమ కేసు తీసుకోవడం లేదంటూ భవిష్యత్‌లో ఏ ఫిర్యాదుదారుడు కోర్టుకు రాకుండా చర్యలు చేపట్టాలని డీజీపీని ఆదేశించింది. తనపై వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై ఫిర్యాదు చేసినా కరీంనగర్ టూటౌన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదంటూ ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. గత విచారణ సందర్భంగా కరీంనగర్ టూటౌన్ ఎస్హెచ్ఓను వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించడంతో ఆయన హాజరయ్యారు. ఎస్హెచ్ఓ వివరణ ఇవ్వాల్సిందే... ఆ మహిళ ఫిర్యాదు మేరకు 14న ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఏఏజీ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యానికి క్షమాపణ కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఎస్హెచ్ఓ మాత్రం జాప్యంపై వివరణ ఇవ్వాల్సిందేనని తే ల్చిచెప్పింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓ మహిళ స్టేషన్లో ఉంటే ఎందుకు వచ్చారో కనుక్కోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని వ్యాఖ్యానించింది. స్టేషన్‌కు ఎవరూ సరదాగా రారన్న విషయాన్ని గ్రహించాలంది. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా తప్పుడు ఫిర్యాదుగా నిర్ధారణకు రావద్దని స్పష్టం చేసింది. మనమంతా చట్టానికి బద్ధులమై పనిచేస్తున్నామని, అందరూ దానికి కట్టుబడి ఉండాల్సిందేనని నొక్కి చెప్పింది. ప్రజలకు సేవలు అందించేలా స్టేషన్లలో ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని డీజీపీకి సూచించింది. ఎస్హెచ్ఓ వివరణ కోసం విచారణను వచ్చే నెల 4కు వాయిదా వేసింది. ఆలోగా ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యానికి కారణాలను తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పింది. -
జడ్జి కుమారుడిపై ఫిర్యాదు తీసుకోరా?
సాక్షి, హైదరాబాద్: ‘పోలీస్‌స్టేషన్.. ఏమన్నా పర్యాటక కేంద్రం అనుకుంటున్నారా? ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కాకుండా సందర్శనకు వస్తుంటారా? జ్యుడీషియల్ అధికారి కుమారుడిపై ఫిర్యాదు చేస్తే తీసుకోరా? దేశంలో ఎవరిపై ఫిర్యాదు చేసినా తీసుకోవాల్సిన బాధ్యత మీకుందని తెలియదా? ఓ మహిళ పోలీస్ స్టేషన్‌కు వచ్చి వేధింపుల ఆరోపణలు చేసి.. ఆ విషయంలో కరీంనగర్ జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కుమారుడిపై ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదో శుక్రవారం నేరుగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వండి. ఏ కారణాలతోనైనా న్యాయస్థానం ముందు హాజరుకాకుంటే బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తాం’ అని కరీంనగర్ టూటౌన్ ఎస్హెచ్ఓ ఓదెల వెంకట్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణను శుక్ర వారానికి వాయిదా వేసింది. సెషన్స్ జడ్జి కుమారుడిపై ఎఫ్ఐఆర్కు ఆదేశాలు కరీంనగర్ జిల్లాకు చెందిన రమ్య కోర్టులో ఆఫీస్ సబార్డి నేట్‌గా నియమితురాలయ్యారు. అయితే సెషన్స్‌జడ్జి కుమారుడు తనను వేధిస్తున్నాడంటూ ఆమె ఉన్నతాధికా రులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తన విద్యార్హత, ఉద్యోగావకాశాలకు సంబంధించిన సమాచారాన్ని దాచి పెట్టిందంటూ ఆమెను సర్వీసు నుంచి తొలగించారు. ఇదే విషయంపై ఆమె రెండు రోజుల క్రితం హైకోర్టును ఆశ్ర యించారు. సీజే ధర్మాసనం ముందుకు ఈ అంశం రావడంతో సదరు సెషన్స్ జడ్జి కుమారుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఎస్హెచ్ఓకు ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వ న్యాయవాది రూపేందర్కు హైకోర్టు స్పష్టం చేసింది. జిల్లా జడ్జి కుమారుడు.. చట్టానికి అతీతుడా? ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తాము ఆదేశించినా ఎఫ్ఐఆర్ నమోదు చేయక పోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కోర్టు ఆదేశాలను ఎస్హెచ్ఓకు సరిగా తెలియజేయలేదా? లేక ఆ మహిళ పీఎస్‌కు వచ్చినా ఫిర్యాదు తీసుకోలేదనే కారణంతో ఎస్హెచ్ఓను సమర్థించే ప్రయత్నం చేస్తున్నారా అని జీపీపై అసహనం వ్యక్తం చేసింది. ‘కోర్టు ఆదేశాలున్నా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో కరీంనగర్ టూటౌన్ ఎస్హెచ్ఓ నిర్లక్ష్యం ప్రదర్శించారు. పీఎస్‌లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మహిళను వేచి ఉండాల్సిందిగా కోరడం రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలను ఉల్లంఘించడమే. ఇది సమాజంలో అత్యంత దారుణమైన పరిస్థితి. నిందితుడు జిల్లా జడ్జి కుమారుడన్న కారణంగా ఎస్హెచ్ఓ నిందితుడిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. అతను చట్టానికి అతీతుడా? చట్టం ప్రకారం పరిపాలించే సమాజంలో ఇలాంటి వాటికి తావు లేదు. ఈ ఘటన మా మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేసింది’ అని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏఏజీని పిలిపించిన ధర్మాసనం..: విచారణ సందర్భంగా అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ)ని ధర్మాసనం కోర్టు హాల్‌కు పిలిపించింది. ‘కొందరు జీపీలపై ఆధారపడవద్దు. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించినా.. ఎస్హెచ్ఓ ఉల్లంఘించారు. అంతేకాదు ఫిర్యాదు దారుని ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పీఎస్‌లో నిరీక్షించేలా చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయమని సూచించే ధైర్యం కూడా మీ న్యాయాధికారులకు లేదు. ఇది నిజంగా దిగ్భ్రాంతికర విషయం’ అని వ్యాఖ్యానించింది. ఎస్హెచ్ఓను తమ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ.. విచారణ వాయిదా వేసింది. -
ప్రొ. కోదండరాం ప్రమాణ స్వీకారంపై నేడు క్లారిటీ
హైదరాబాద్, సాక్షి: గవర్నర్ కోటా కింద ఎంపికైన కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారంపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నియామకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. కోర్టు ఉత్తర్వులతో ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీ ఖాన్లు మండలి సభ్యులిగా ప్రమాణం చేయకుండా ఉండిపోయిన సంగతి తెలిసిందే. గవర్నర్ కోటా కింద కొత్తగా శాసనమండలి సభ్యులుగా నియమితులయ్యారు ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ ఆమెర్ అలీ ఖాన్లు. అయితే వీళ్ల నియామకాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ నేతలు. దీంతో యథాతథస్థితి కొనసాగించాలని (స్టేటస్కో) ఆదేశిస్తూనే.. కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం బ్రేకులు వేసింది. పిటిషన్ ప్రకారం.. గతంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను సిఫారసు చేస్తూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపింది. అయితే 2023 సెప్టెంబర్ 19న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వాటిని తిరస్కరించారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారం తనకున్న విస్తృత అధికారాల మేరకు ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లుగా గవర్నర్ ప్రకటించడాన్ని వారు సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం.. విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. పిటిషన్ల విచారణార్హతతో పాటు వాటిలోని వాస్తవాలు, సాంకేతిక అంశాలను పరిశీలిస్తామని చెప్పింది. ఈ పిటిషన్లపై విచారణ ముగిసే వరకు కొత్తగా గవర్నర్ కోటాలో ఎవరినీ నియమించకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేయగా తోసిపుచ్చింది. అలా గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వడం చట్టపరంగా సాధ్యం కాదని స్పష్టం చేసింది. ‘పెద్దమనుషుల ఒప్పందం’ (జెంటిల్మెన్ అగ్రిమెంట్) మాదిరి అందరూ హుందాతనం పాటించాలని సూచించింది. కొత్త నియామకాలపై స్టే ఇవ్వండి ఈలోపే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఫ్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ ఆమెర్ అలీ ఖాన్‌లను నియమిస్తూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ తమిళిసై ఉత్తర్వులు వెలువరించారు. దీంతో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ఇందుకు సంబంధించిన జీవో నంబర్ 12ను సవాల్ చేస్తూ హైకోర్టులో మధ్యంతర అప్లికేషన్ (ఐఏ)లు దాఖలు చేశారు. కొత్త నియామకాలను నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే కోదండరాం, అమేర్ అలీఖాన్‌లను ప్రధాన పిటిషన్లో ఇంప్లీడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఐఏలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. దాసోజు తరఫున సీనియర్ న్యాయవాది అదిత్యా సోదీ వాదనలు వినిపించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అంశం హైకోర్టులో విచారణ దశలో ఉండగా కొత్త వారిని నియమించడం సరికాదని ఆయన అన్నారు. పైగా కోర్టు ఉత్తర్వులు ఇచ్చేవరకు కొత్త నియామకాలు చేపట్టబోమని గవర్నర్ పేర్కొన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇది న్యాయస్థానం సూచించిన ‘పెద్దమనుషుల ఒప్పందం’ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఇద్దరి పేర్లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం సిఫారసు చేసిందని, వాటిని పరిశీలించిన తర్వాతే గవర్నర్ ఆమోదించారని తెలిపారు. వీరి నియామకం చట్టప్రకారమే జరిగిందని, స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీజే ధర్మాసనం దీనిపై స్టేటస్ కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కరోజుతో మారిన సీన్ వాస్తవానికి.. ఒక్కరోజు వ్యవధిలోనే సీన్ అంతా మారిపోయింది. కోదండరాం, ఆమెర్ అలీఖాన్‌లు ప్రమాణ స్వీకారం కోసం మండలికి వెళ్లారు. అయితే.. వారు వెళ్లే సమయానికి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన చాంబర్లో లేరు. దీంతో ఆయన రాక కోసం వారు కౌన్సిల్ హాల్లోనే చాలాసేపు ఎదురు చూశారు. అయినా చైర్మన్ రాకపోవడంతో వెనుదిరిగారు. అయితే ఆరోగ్యం బాగోలేనందున చైర్మన్ మండలికి రాలేకపోయారని, ఈ నెల 31న ప్రమాణ స్వీకారానికి రావాలని వారిద్దరికీ కౌన్సిల్ నుంచి సమాచారం అందింది. ఈలోపే స్టేటస్కో విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. -
ఎస్జీటీలుగా 2008–డీఎస్సీ అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ–2008 అభ్యర్థులను ఎస్జీటీలుగా నియమించే అంశాన్ని పునఃపరిశీలించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నాటి డీఎస్సీ మెరిట్ జాబితా ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని ఈ సమస్యకు ఏపీ సర్కార్ కొంత ఉపశమన నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడింది. అయితే తెలంగాణలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం సరికాదని వ్యాఖ్యానించింది. 2008– డీఎస్సీ నోటిఫికేషన్లో తమ కంటే తక్కువ అర్హత ఉన్న డీఎడ్ అభ్యర్థులకు 30 శాతం ఎస్జీటీ పోస్టులను రిజర్వు చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీఎడ్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ఒకే రకమైన పోస్టులకు అర్హత ఎక్కువున్న వారిని కాదని.. తక్కువ ఉన్న వారిని నియమించడం చట్టప్రకారం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు. ‘ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు చేసేటప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4)కు లోబడి క్లాసిఫికేషన్ చేయాలిగానీ.. ఇష్టం వచ్చి నట్లు నిర్ణయం తీసుకోవడం చెల్లదు. ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ–2008 బీఎడ్ అభ్యర్థుల విషయంలో ఆ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. వారికి 60 ఏళ్లు వచ్చే వరకు కాంట్రాక్టు ఉద్యోగాల్లో కొనసాగిస్తామని హామీ ఇవ్వడమే కాకుండా అమలు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కారణంగానే వివాదం ఏళ్లుగా కొనసాగుతోంది. కనీసం ఖాళీగా ఉన్న పోస్టుల్లో నాటి బీఎడ్ అభ్యర్థులను నియమిస్తే అందరికీ ఉపశమనం లభిస్తుంది’అని పేర్కొ న్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది గోవింద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘ఏపీ ప్రభుత్వం సంక్షేమ రాష్ట్రం. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే ఏ నిర్ణయమైనా తీసుకుంటుంది. ఇందులో భాగంగానే మానవతా ధృక్పథంతో అలోచించి అర్హులైన డీఎస్సీ 2008 అభ్యర్థులను కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమించింది’అని నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. బీఎడ్ అభ్యర్థులను ఉద్యోగాల్లో నియమించే అంశాన్ని పునః పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. -
వాస్తవాలను దాచిపెడతారా.. రూ.లక్ష కట్టండి పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: వాస్తవాలను దాచిపెట్టిన నలుగురు పిటిషనర్లకు హైకోర్టు రూ.లక్ష భారీ జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని లీగల్ సర్వీసెస్ కమిటీకి చెల్లించాలని స్పష్టం చేసింది. హైదరాబాద్ అంబర్‌పేటలోని సర్వే నంబర్ 57లో 2,432 చదరపు గజాల తమ స్థలంలో టీఎస్పీడీసీఎల్ జోక్యం చేసుకుని, ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తోందంటూ మల్లేష్ మరో ముగ్గురు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నగేష్ భీమపాక ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది రాపోలు భాస్కర్ వాదనలు వినిపించారు. విద్యుత్ సరఫరాలో ఏదైనా సమస్య వస్తే వాటిని పరిష్కరించేందుకు 2013లో నాటి జిల్లా కలెక్టర్ 300 గజాల జాగా కేటాయించారని టీఎస్పీడీసీఎల్ కౌంటర్లో తెలిపింది. అక్కడేమీ ఇల్లు లేదని, పిటిషనర్ల అధీనంలో స్థలం ఉందని వివరించింది. గతంలో సివిల్ కోర్టులో వేసిన దావాను పిటిషనర్లు వెనక్కు తీసుకున్నారని చెప్పింది. వాదనలు విన్న న్యాయమూర్తి.. సివిల్ కోర్టులో దావా వేసిన విషయాన్ని హైకోర్టుకు చెప్పలేదని పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యథాతథస్థితి ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. పిటిషన్‌ను కొట్టివేస్తూ, రెండు వారాల్లో రూ.లక్ష చెల్లించాలని తీర్పునిచ్చారు. -
హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే గండ్ర పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తమపై భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌లో గత నెల 16న నమోదైన కేసును కొట్టివేయాలంటూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, గండ్ర గౌతమ్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అక్రమంగా కేసు పెట్టారని.. తదుపరి విచారణపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భూపాలపల్లి పట్టణంలోని పుల్లూరి రామయ్యపల్లి శివారు చెరువు శిఖంలో అక్రమ నిర్మాణం చేపట్టారని నాగవెల్లి రాజలింగమూర్తి గత నెలలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతి, గండ్ర గౌతమ్‌రెడ్డి తదితరులపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా, గండ్ర దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. -
రుణాలు ఎగ్గొట్టి మా వద్దకా?
సాక్షి, హైదరాబాద్: దాదాపు రూ.వెయ్యి కోట్లు రుణాలను తీసుకుని ఎగ్గొట్టిన కేసులో ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజుకు తెలంగాణ హైకోర్టు గట్టి షాక్‌నిచ్చింది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్ఈసీ) తనను ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుడిగా ప్రకటించటాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ రఘురామకృష్ణంరాజునుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. తమ విచక్షణాధికారాలను ఇలాంటి రుణ ఎగవేతదారులకోసం వినియోగించడానికి సిద్ధంగా లేమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీనిపై మూడు వారాల్లో రివ్యూ కమిటీని ఆశ్రయించాలని, చట్టానికి అనుగుణంగా కమిటీ తగిన నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి ఇ చ్చి న ఆదేశాల్లో తాము జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణం కనిపించడం లేదని పేర్కొంది. రూ.500 కోట్లు దారి మళ్లింపు తమిళనాడులోని టుటికోరిన్ జిల్లా సత్తాంకుళం తాలూకా సత్తావినల్లూరు, పల్లక్కురిచి గ్రామాల్లో 660 మెగావాట్ల బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం ఇందు భారత్ పవర్‌కు రూ.2,655 కోట్ల రుణాన్ని ఆర్ఈసీ మంజూరు చేసింది. పనులు పరిశీలిస్తూ దశల వారీగా ఈ మొత్తాన్ని ఇస్తామని పేర్కొంది. 2014లో ఈమేరకు రూ.947.71 కోట్ల రుణాన్ని అందచేసింది. ఆ సమయంలో రఘురామకృష్ణంరాజు, ఆయన సతీమణి రమాదేవి ఇందు భారత్ డైరెక్టర్లుగా ఉన్నారు. అయితే ఇందులో దాదాపు రూ.500 కోట్లను ఇందు భారత్ ఇతర కంపెనీల్లోకి మళ్లించినట్లు ఆర్ఈసీ గుర్తించింది. దీంతో తదుపరి విడుదల కావాల్సిన రుణాన్ని నిలిపివేసి ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుడిగా ప్రకటించింది. 2015 ఆర్బీఐ మాస్టర్ సర్క్యులర్ ప్రకారం ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసింది. ఈ సర్క్యులర్ జారీ చేస్తే ఇతర ఏ బ్యాంకులూ రుణ ఎగవేతదారులకు ఎలాంటి రుణాలు ఇచ్చే అవకాశం ఉండదు. అన్ని అవకాశాలు ఇచ్చాకే పిటిషనర్లకు సర్క్యులర్ తమను రుణ ఎగవేతదారులుగా గుర్తించి 2022 జూన్ 16న సర్క్యులర్ జారీ చేయడాన్ని, క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ రఘురామకృష్ణంరాజు, రమాదేవి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి అన్ని అవకాశాలు ఇ చ్చి న తర్వాతే ఆర్ఈసీ కమిటీ పిటిషనర్లకు సర్క్యులర్ జారీ చేసిందని స్పష్టం చేశారు. చట్టప్రకారమే ఆర్ఈసీ వ్యవహరించిందని, ఆ సర్యు్కలర్లో జోక్యం చేసుకునేందుకు తమకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని స్పష్టం చేస్తూ రఘురామకృష్ణంరాజు, రమాదేవి పిటిషన్లను కొట్టి వేశారు. ఆర్ఈసీ రుణం మంజూరు చేసే నాటికి పిటిషనర్లు ఇద్దరూ డైరెక్టర్లుగా ఉన్నారన్న వాదనతో ఏకీభవించారు. సింగిల్ జడ్జి తీర్పుపై పిటిషనర్లు ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు వెలువరించింది. సింగిల్ జడ్జి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తీర్పునిచ్చారని, అందులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. రివ్యూ కమిటీని ఆశ్రయించకుండా తమ వద్దకు రావడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. రివ్యూ కమిటీ చట్టప్రకారం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేస్తూ రఘురామకృష్ణంరాజు, రమాదేవి, డి.మధుసూదన్‌రెడ్డి అప్పీళ్లలో వాదనలను ముగించింది.