TS: మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు కేసులో హై కోర్టు కీలక తీర్పు | TS ​​​​High Court Key Decision In Former Mla Shkeel Sons Case | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు కేసులో హై కోర్టు కీలక తీర్పు

Published Tue, Jan 9 2024 5:41 PM | Last Updated on Tue, Jan 9 2024 5:54 PM

Ts ​​​​​​High Court Key Decision In Former Mla Shkeel  Sons Case - Sakshi

సాక్షి,హైదరాబాద్‌ : ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసులో బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహైల్‌ను అరెస్ట్ చెయ్యొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 17న సోహైల్‌ పోలీసుల ముందు హాజరు కావాలని తెలిపింది. పంజాగుట్ట ప్రజాభవన్‌ వద్ద తనపై నమోదైన ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసు కేసు కొట్టివేయాలని సోహైల్‌ వేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారించింది. 

ర్యాష్ డ్రైవింగ్ కేసుకే తన క్లయింట్‌పై లుక్‌ అవుట్‌ నోటీసు జారీ చేశారని సోహైల్‌ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సొహైల్‌ 15 కేసులు ఉన్నట్టు చూపించారన్నారు. అయితే చేయని తప్పుకి దుబాయ్‌ ఎందుకు పారిపోయారని హైకోర్టు ప్రశ్నించింది. తప్పుడు కేసు పెట్టి ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే భయంతోనే సోహైల్‌ దుబాయ్‌ వెళ్లాడని న్యాయవాది కోర్టుకు బదులిచ్చారు. కేసు తదుపరి విచారణను కోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. 

కాగా పంజాగుట్టలోని ప్రజాభవన్‌ వద్ద గత  డిసెంబర్‌ 23న సోహైల్‌  కారు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రజాభవన్‌ ముందున్న బారికేడ్లను సోహైల్‌  కారు ఢీ కొట్టింది. ఘటన సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. ఘటన తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు సోహైల్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదు.  దీనిపై విమర్శలు రావడంతో పంజాగుట్ట సీఐని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సస్పెండ్‌ చేశారు. అప్పటికే దుబాయ్‌ పారిపోయిన సోహైల్‌ను అరెస్టు చేసేందుకు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు.  

ఇదీచదవండి..కాళేశ్వరంపై విజిలెన్స్‌ విచారణ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement