rash driving
-
బైక్ యువతి చేష్టలకు బలైపోయిన బస్సులు
-
తాగి రోడ్లపై రచ్చ
-
బలుపుకు బ్రాండ్ అంబాసిడర్ ఈ కార్ డ్రైవర్
-
HYD: బంజారాహిల్స్‌లో పోర్షే కారు బీభత్సం
సాక్షి,హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో గురువారం అర్ధరాత్రి పోర్షే కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి కేబీఆర్ పార్కు ప్రహరీ గోడను ఢీకొట్టింది. కేబీఆర్ పార్క్ ఫుట్ పాత్ దాటి ప్రహరీ గోడ గ్రిల్‌ను ధ్వంసం చేసి చెట్టును ఢీకొట్టి కారు ఆగిపోయింది. ప్రమాదం అనంతరం డ్రైవర్ కారును వదిలి అక్కడి నుంచి పరారయ్యాడు. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో కారును అక్కడి నుంచి తొలగించారు. ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం -
Hyderabad: ర్యాష్ డ్రైవ్.. తగ్గేదేలే!
సాక్షి, హైదరాబాద్: ఉన్నట్టుండి నడిరోడ్డుపై వాహనాలు స్తంభించిపోతాయి. కొన్నిచోట్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతుంది. ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారులకు అసలు ఏం జరిగిందో తెలియదు. ఇలాంటి పరిస్థితికి చాలా సందర్భాల్లో కారణం ఒకటే ఉంటుంది. అదే రోడ్‌రేజ్. వేగంగా వస్తూ అదుపుతప్పి ఎదురుగా వచ్చే వాహనాన్ని స్వల్పంగా ఢీకొట్టడం.. దీంతో తగ్గేదేలె... అన్నట్టుగా ఇరువాహనాల చోదకులు ఢీ అంటే ఢీ అనే లెవల్లో ఘర్షణ పడుతుంటారు. తప్పు తమది కాదంటే తమది కాదంటూ తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు. తీవ్రమైన ఆగ్రహావేశాలకు గురవుతుంటారు. ఆకస్మికంగా తలెత్తే ఈ కోపం తరచూ భౌతికదాడులకు దారితీస్తోంది. ఫలితంగా ఇతర వాహనదారుల సమయం గంటలకొద్దీ ట్రాఫిక్‌లోనే హరించిపోతుంది. ఈ రోడ్‌రేజ్ ఘటనలు గ్రేటర్లో ప్రతిరోజు వందలకొద్దీ చోటుచేసుకుంటున్నాయి. రవాణాశాఖ అంచనాల ప్రకారం... రోడ్డు ప్రమాదాలకు అధిక వేగం, ర్యాష్ డ్రైవింగ్, రోడ్రేజ్లే కారణాలు. నగరంలో రోజుకు 20 ప్రమాదాలు చోటుచేసుకొంటే వాటిలో కనీసం ఏడు ర్యాష్ డ్రైవింగ్, రోడ్‌రేజ్ కారణాలని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈగో దెబ్బతినడమే కారణమా... 👉 వారం రోజుల క్రితం సికింద్రాబాద్– అమీర్‌పేట్ రహదారిలోని ఫ్లై ఓవర్‌పై ఓ కారు వేగాన్ని నియంత్రించే క్రమంలో ముందున్న ఆటోరిక్షాను తాకింది. ఈ ఉదంతంలో దానికి ఎలాంటి నష్టం జరగకపోయినా సదరు ఆటోవాలా తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు, కారు నడిపే వ్యక్తిని అసభ్యంగా దూషించాడు. కారు యజమాని సైతం అదేస్థాయిలో ఆటోవాలాపై విరుచుకుపడ్డాడు. ట్రాఫిక్ రద్దీ కారణంగా వాహనాన్ని అదుపు చేసే క్రమంలో స్వల్పంగా తాకిందని కారు యజమాని వివరణ ఇచ్చాడు. ఖరీదైన కారు ఉన్న తాను ఆటోవాలాకు సారీ చెప్పడమేమిటని భావించాడు. కానీ, అతడు క్షమాపణ చెప్పకపోవడంతో ఆటోవాలా ఈగో దెబ్బతిన్నది. ఈ ఘర్షణ చినికి చినికి గాలివానగా మారడంతో వాహనాలు స్తంభించాయి. చివరకు ట్రాఫిక్ పోలీసులు జోక్యం చేసుకోవలసి వచి్చంది. 👉ఏడాది క్రితం అత్తాపూర్‌లో ఒక క్యాబ్వాలాపై కూడా రోడ్‌రేజ్ దాడి జరిగింది. ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన ఓ కారు క్యాబ్‌ను ఢీకొట్టబోయి త్రుటిలో నిలిచిపోయింది. ఆ క్షణంలో తీవ్రమైన భయాందోళనకు గురైన క్యాబ్‌డ్రైవర్ వారితో గొడవకు దిగాడు. కారులో ఉన్నవాళ్లు సైతం తాము వాహనాన్ని కాస్త దూరంగానే ఆపామని, ఢీకొట్టలేదని వాదనకు దిగారు. క్యాబ్వాలా వెనక్కి తగ్గకపోవడంతో కారులోఉన్నవారు అతనిపై దాడి చేసి పరారయ్యారు. 👉 ఈవిధంగా నగరంలో ఎక్కడో ఒక చోట రోడ్‌రేజ్ ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటికీ పోలీసు రికార్డుల్లో పెద్దగా నమోదు కావడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. కేవలం సర్దుబాటుతో సద్దుమణిగే దానికి కూడా ఆకస్మిక కోపానికి గురికావడం ఆందోళనకరంగా మారుతోంది.ప్రాణాలు హరిస్తున్నారు..ర్యాష్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలపైన నమోదయ్యే కేసుల్లో రోడ్‌రేజ్ కచి్చతంగా ఉంటుంది. కొద్ది రోజుల క్రితం అల్వాల్ శ్రీనివాస్‌నగర్ కాలనీలో ఒక ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై దీపక్ అనే వ్యక్తి వెళ్తున్నాడు. అదేమార్గంలో జి.ఆంజనేయులు అనే ఓ పెద్దాయన రోడ్డుదాటుతున్నాడు. కానీ, ఆకస్మికంగా తనముందు నుంచి బండి వేగంగా దూసుకెళ్లడంతో భయాందోళనకు గురయ్యాడు. వాహనదారుడిపైన ఆగ్రహం వ్యక్తం చేశాడు. తప్పిదాన్ని గ్రహించి క్షమాపణ చెప్పి వెళ్లాల్సిన దీపక్ సీనియన్ సిటీజన్తో ఘర్షణకు దిగడమే కాకుండా కిందకు తోసివేయడంతో తలకు బలమైన గాయమైంది. రెండు వారాలపాటు చికిత్స తీసుకున్నా ఫలితం దక్కలేదు. చివరకు ఆ పెద్దాయన కన్నుమూశాడు. ఈ సంఘటనపైన పోలీసులు కేసు నమోదు చేశారు.ఇవీ రోడ్రేజ్లో భాగమే.. 👉 వేగంగా వాహనం నడుపుతూ ఇతర వాహనదారులను, పాదచారులను భయభ్రాంతులకు గురిచేయడం 👉 అదేపనిగా హారన్ మోగించడం 👉 ర్యాష్ డ్రైవింగ్.. 👉 హిట్ అండ్ రన్ 👉 రహదారిభద్రత నిబంధనల మేరకు ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. కానీ, రోడ్రేజ్పై ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. -
శంషాబాద్-బెంగళూరు హైవేపై స్కూల్ బస్సు బీభత్సం
-
ప్లీజ్.. నన్ను కొట్టొద్దు.. వేడుకున్న రవీనా టండన్
గతేడాది కేజీఎఫ్-2లో అలరించిన స్టార్ నటి రవీనా టాండన్. ఆ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. చివరిసారిగా పట్నా శుక్లా అనే చిత్రంలో లాయర్‌గా కనిపించింది. ప్రస్తుతం రవీనా గుడ్ చాడి, వెల్కమ్ బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ బాలీవుడ్ నటి వివాదంలో చిక్కుకుంది. తన కారు డ్రైవర్ చేసిన పనికి రవీనాపై దాడికి యత్నించారు. దీంతో తనను కొట్టవద్దంటూ వారిని వేడుకున్నారామె. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలుసుకుందాం. ముంబయిలో రవీనా టాండన్, తన డ్రైవర్లో కలిసి వెళ్తుండగా రోడ్డుపై వెళ్లున్న కొందరిని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న వారిలో ఒక్కరు గాయపడ్డారు. దీంతో వారి కుటుంబసభ్యులంతా కలిసి డ్రైవర్‌పై గొడవకు దిగారు. అ తర్వాత రవీనా టాండన్ కారు దిగి గాయపడిన వారిపై వాగ్వావాదానికి దిగింది. దీంతో వారంతా ఒక్కసారిగా రవీనా టాండన్‌పైకి దూసుకొచ్చారు. దీంతో ఆమె దయచేసి నన్ను కొట్టవద్దని వారిని వేడుకుంది. వీడియోలను రికార్డ్ చేయవద్దని అక్కడున్న వారిని కోరింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విస్తృతంగా వైరలవుతోంది.అయితే మరోవైపు గాయపడిన కుటుంబసభ్యులు రవీనా టాండన్ తమపై దాడి చేసిందని ఆరోపిస్తున్నారు. తమపై అన్యాయంగా దాడి చేసిందని అన్నారు. పోలీసులు కూడా మాకు న్యాయం చేయలేదని..రవీనా టాండన్ మా అమ్మను కొట్టారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. మా అమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయని బాధితుడు పేర్కొన్నారు. చివరికీ ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరింది. Actress Raveena Tandon's driver accused of rash driving & crashing into 3 women in Bandra, Mumbai. Injured's family claim Raveena in an inebriated state got off the car along with her driver & further assaulted the victims on the road. Crowds turned aggressive leading to heated… pic.twitter.com/PdbgLMueFz— Nabila Jamal (@nabilajamal_) June 2, 2024What's this #RaveenaTondon aunty!? pic.twitter.com/qA1IWAB1qf— 𝙍𝙎𝙆 (@RSKTheMonsters) June 2, 2024 -
ప్రాణం తీసిన ర్యాష్ డ్రైవింగ్! క్షణకాలంలో ఇద్దరూ..
కరీంనగర్: అజాగ్రత్తగా బైక్‌లు నడపడంతో ఎదురెదురుగా ఢీకొని వేల్పుల అవినాశ్‌కుమార్(16), పూరెళ్ల అభిలాశ్(18) దుర్మర ణం చెందారు. మిత్రులతో సర్కస్ తిలకించేందుకు వెళ్లిన వీరిద్దరూ అనూహ్యంగా మృతిచెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ప్రమాదం శుక్రవారం అర్ధరాత్రి పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లోకపేటలో చోటుచేసుకుంది. జూలపల్లి ఎస్సై వెంటకృష్ణ కథనం ప్రకారం.. జూలపల్లి మండలం కాచాపూ ర్కు చెందిన అవినాశ్‌కుమార్, పెద్దపల్లికి చెందిన అభిలాశ్, వేల్పుల రమేశ్, పంబాల మనోజ్, దాడి రామ్‌చరణ్, కొలిపార రాంచరణ్ మిత్రులు. ఎలిగేడు మండలం ముప్పిరితోటలో ప్రదర్శిస్తున్న సర్కస్ చూసేందుకు ఈ ఆరుగురు మిత్రులు రెండు బైక్‌లపై రాత్రి బయలుదేరి వెళ్లారు. సర్కస్ తిలకించాక అవే బైక్‌లపై ఇంటిదారి పట్టారు. ఈక్రమంలో ఎలిగేడు మండలం లోకపేట శివా రులోని వంతెన వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ఓ బైక్ అవినాశ్‌కుమార్, అభిలాశ్ బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో అవినాశ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. అభిలాశ్‌ను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. వీరిని ఢీకొ న్న మరోబైక్ నడుపుతున్న ముప్పిరితోటకు చెందిన మాదారపు వెంకట్రావు తీవ్రంగా గాయపడగా, కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఇతడి పరిస్థితి విషమంగా ఉంది. మిగతా స్నేహితులు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అవినాశ్ తండ్రి మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రెండు కుటుంబాల్లో తీరని విషాదం.. పెద్దపల్లికి చెందిన పూరెళ్ల శ్రీనివాస్ – కవిత దంపతుల చిన్నకుమారుడు అభిలాశ్. వీరిది నిరుపేద కుటుంబం. అభిలాశ్ ఇంటర్‌పూర్తి చేశాడు. స్నేహితులతో సర్కస్ చూసేందుకు వెళ్లి వస్తూ మృతిచెందడంతో కుటుంబసభ్యులు విలపిస్తున్నారు. జూలపల్లి మండలం కాచాపూర్‌కు చెందిన అవినాశ్ కుమార్ పెద్దాపూర్ ఆదర్శ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. చిన్నతనంలోనే తల్లి మృతి చెందింది. తండ్రి మల్లేశం అన్నీ తానై చదివిస్తున్నాడు. మిత్రులతో కలిసి సర్కస్ చూసేందుకు వెళ్లి కానరాని లోకాలకు వెళ్లడంతో తండ్రి కన్నీరుమున్నీరవుతున్నాడు. ఇవి చదవండి: అనుమానాస్పదస్థితిలో యువకుడి విషాదం! -
మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ కేసులో మరో ట్విస్ట్
-
ప్రముఖ రియల్టర్ కార్తికేయ మ్యాడంపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ రాష్ డ్రైవింగ్ కేసు దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది. లంబోర్గిని కారు నడిపింది ప్రముఖ రియాల్టర్ కార్తికేయ మ్యాడం అని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. ఇటీవల ‘ఎక్స్’ ట్విటర్లో వీడియో పోస్ట్ గుర్తించి పలు సెక్షన్ల కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. కారు రిచ్ మౌంట్ వెంచర్స్ సంస్థ అధినేత కార్తికేయ మీద ఉన్నట్లు తేలడంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రెండు నెలల క్రితం కారు జూబ్లీ హిల్స్ నుంచి బంజారా హిల్స్ వైపు కార్తీకేయ కారు నడిపినట్లు విచారణలో వెల్లడింది. ప్రస్తుతం కార్తికేయ దుబాయిలో ఉన్నట్లు సమాచారం. కార్తీకేయ మీద చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం.. ఒకరి మృతి.. కేసు నమోదు -
‘రోడ్డు ప్రమాదం’ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: పంజగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలోని ప్రజాభవన్ ఎదురుగా గత నెల ఆఖరివారంలో చోటు చేసుకున్న ‘బీఎండబ్ల్యూ కారు ప్రమాదం’కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అమీర్ నిందితుడిగా మారారు. కుమారుడు రహీల్ అమీర్‌ను ఈ కేసు నుంచి తప్పించేందుకు చేసిన కుట్రకు ఆయనే సూత్రధారని దర్యాప్తు అ«ధికారులు తేల్చారు. ఈ ‘ఎస్కేప్ ఎపిసోడ్’లో మాజీ ఎమ్మెల్యే సహా పదిమంది పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అసలేం జరిగిందంటే.. రహీల్ అతడి స్నేహితుడితో పాటు ఇద్దరు యువతులతో కలిసి గత నెల 24వ తేదీ తెల్లవారుజామున బీఎండబ్ల్యూ కారులో (టీఎస్ 13 ఈటీ 0777) బేగంపేట వైపు నుంచి పంజగుట్ట వైపు వస్తున్నారు. ఆ సమయంలో కారును రహిల్నే నడుపుతున్నాడు. తెల్లవారుజామున 2.45 గంటల ప్రాంతంలో ఈ కారు ప్రజాభవన్ ఎదురుగా ఉన్న ఫ్లై ఓవర్ వద్ద బారికేడ్లను మితిమీరిన వేగంతో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు, బారికేడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కావడంతో అందులో ఉన్న నలుగురూ సురక్షితంగా బయటపడ్డారు. అక్కడకు చేరుకున్న పంజగుట్ట పోలీసులు రహీల్‌ను ఠాణాకు తీసుకువచ్చారు. ఈలోపు విషయం ఫోన్ ద్వారా దుబాయ్‌లో ఉన్న తండ్రి షకీల్‌కు రహీల్ చెప్పాడు. ఆయన రంగంలోకి దిగి తన కుమారుడి స్థానంలో తన ఇంట్లో డ్రైవర్ అబ్దుల్ ఆరిఫ్‌ను ఉంచాలని పథకం వేశారు. దీన్ని అమలులో పెట్టడం కోసం రహీల్ స్నేహితులైన అర్బాజ్, సాహిల్‌తో పాటు మరి కొందరిని రంగంలోకి దింపారు. అర్బాజ్, సోహైల్‌లు మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంటికి వెళ్లి అక్కడున్న ఆరిఫ్‌ను తీసుకుని పంజగుట్ట ట్రాఫిక్ ఠాణా వద్దకు వచ్చారు. పోలీసులూ సహకరించడంతో అప్పటికే సిద్ధం చేసుకున్న పథకం ప్రకారం రహీల్ స్థానంలో ఆరిఫ్‌ను ఉంచారు. సీసీ ఫుటేజ్‌తో అసలు వాస్తవం వెలుగులోకి ఈ అంశంపై అనుమానాలు వ్యక్తం కావడంతో కొత్వాల్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సమగ్ర విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన వెస్ట్‌జోన్ డీసీపీ ఎం.విజయ్‌కుమార్ సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పరిశీలించడంతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో అసలు కథ వెలుగులోకి వచ్చి పంజగుట్ట ఇన్స్పెక్టర్గా పని చేసిన దుర్గారావుపై సస్పెన్సన్ వేటు పడింది. ఆరిఫ్‌ను అప్పుడే అరెస్టు చేసి రహీల్‌పై అదనపు సెక్షన్ల కింద ఆరోపణలు చేర్చారు. ఈ ఎస్కేప్ వ్యవహారం దర్యాప్తు నేపథ్యంలో షకీల్‌తో పాటు అర్బాజ్, సాహిల్, మరో ఏడుగురి పాత్ర తాజాగా వెలుగులోకి వచి్చంది. దీంతో అర్బాజ్, సోహైల్‌ను సోమవారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ కేసులో షకీల్‌ను నిందితుడిగా చేరుస్తూ కోర్టుకు సమాచారం ఇచ్చారు. నిందితులపై అదనపు సెక్షన్లతో కేసులు ఇప్పటికే రహీల్‌పై లుక్ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ అయి ఉంది. తాజాగా షకీల్‌తో పాటు రహీల్ ఎస్కేప్‌కు సహకరించి, దుబాయ్ పారిపోయిన మరో ఇద్దరి పైనా బుధవారం జారీ చేశారు. తొలుత పంజగుట్ట పోలీసులు ఆరిఫ్పై మూడు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. సమగ్ర దర్యాప్తులో వెలుగులోకి వచి్చన అంశాల నేపథ్యంలో నిందితులపై ఐపీసీ, ఎంవీ యాక్ట్ల్లోని మరో 14 సెక్షన్లను జోడించారు. -
ప్రజాభవన్ యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: ప్రజాభవన్(పాత ప్రగతి భవన్) ముందు జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును పంజాగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. తన కొడుకు సాహిల్ అలియాస్ రాహిల్ దుబాయ్‌కు పారిపోయేందుకు షకీల్ సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాద ఘటన తర్వాత.. సాహిల్ దుబాయ్ పారిపోయేందుకు మొత్తం పది ముంది సహాయం చేసినట్లు అనుమానిస్తున్నారు. అందులో ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఇందులో షకీల్ కూడా తన కొడుకు కోసం సహకరించినట్లు గుర్తించారు. ఇక.. ఇప్పటికే సాహిల్ అలియాస్ రాహిల్‌పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అతన్ని దుబాయ్ నుంచి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజా భవన్ ముందు సాహిల్ గత నెల 23వ తేదీన కారుతో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌తో ప్రజాభవన్ ఎదుట బారీకేడ్లను తన కారుతో ఢీకొట్టాడు. ఘటన సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఇక.. కారు ప్రమాద విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిపైనా వేటు వేశారు. ఇదీ చదవండి: మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో హై కోర్టు కీలక తీర్పు -
TS: మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో హై కోర్టు కీలక తీర్పు
సాక్షి,హైదరాబాద్ : ర్యాష్ డ్రైవింగ్ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహైల్‌ను అరెస్ట్ చెయ్యొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 17న సోహైల్ పోలీసుల ముందు హాజరు కావాలని తెలిపింది. పంజాగుట్ట ప్రజాభవన్ వద్ద తనపై నమోదైన ర్యాష్ డ్రైవింగ్ కేసు కేసు కొట్టివేయాలని సోహైల్ వేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారించింది. ర్యాష్ డ్రైవింగ్ కేసుకే తన క్లయింట్‌పై లుక్ అవుట్ నోటీసు జారీ చేశారని సోహైల్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సొహైల్ 15 కేసులు ఉన్నట్టు చూపించారన్నారు. అయితే చేయని తప్పుకి దుబాయ్ ఎందుకు పారిపోయారని హైకోర్టు ప్రశ్నించింది. తప్పుడు కేసు పెట్టి ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే భయంతోనే సోహైల్ దుబాయ్ వెళ్లాడని న్యాయవాది కోర్టుకు బదులిచ్చారు. కేసు తదుపరి విచారణను కోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. కాగా పంజాగుట్టలోని ప్రజాభవన్ వద్ద గత డిసెంబర్ 23న సోహైల్ కారు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రజాభవన్ ముందున్న బారికేడ్లను సోహైల్ కారు ఢీ కొట్టింది. ఘటన సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. ఘటన తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు సోహైల్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. దీనిపై విమర్శలు రావడంతో పంజాగుట్ట సీఐని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సస్పెండ్ చేశారు. అప్పటికే దుబాయ్ పారిపోయిన సోహైల్‌ను అరెస్టు చేసేందుకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇదీచదవండి..కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ -
‘ప్రజాభవన్’ ఘటనలో కొత్త కోణం
హైదరాబాద్, సాక్షి: బేగంపేట ప్రజాభవన్ వద్ద ఈ నెల 23న చోటుచేసుకున్న ర్యాష్ డ్రైవింగ్ కేసులో.. ప్రధాన నిందితుడు సాహిల్‌ను తప్పించి మరొకరిని నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఉదంతంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడిని ఎలా తప్పించారనే విషయం ఇప్పుడు వెలుగు చూసింది. ప్రమాదం జరిగిన రోజున రాత్రి విధుల్లో ఉన్న ఇన్స్పెక్టర్ దుర్గారావు.. ఘటనాస్థలం నుంచి సాహిల్‌ను కారులో పంజాగుట్ట ఠాణాకు తీసుకొచ్చారు. కానిస్టేబుల్‌కు అప్పగించి, పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు బ్రీత్ఎనలైజర్ పరీక్ష కోసం పంపారు. ఈక్రమంలో నిందితుడు తప్పించుకొని, అప్పటికే బయటున్న కారులో ఇంటికి వెళ్లాడు. తమ డ్రైవర్‌ను తన స్థానంలో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు పంపాడు. అతడితో ప్రమాద సమయంలో తానే కారు నడిపినట్టు వాంగ్మూలం ఇప్పించేలా పురిగొల్పాడు. ఈ విషయం సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగు చూశాక కూడా ఉన్నతాధికారులకు ఇన్స్పెక్టర్ అసలు విషయం చెప్పకుండా గోప్యత పాటించినట్టు తేలింది. నిందితుడు తప్పించుకొని ముంబయికి, అక్కడి నుంచి దుబాయ్ పారిపోయేందుకు సహకరించినట్టు అధికారులు అంచనాకు వచ్చారు. దర్యాప్తును పక్కదారి పట్టించడంలో ఇన్స్పెక్టర్ కీలకంగా వ్యవహరించినట్టు పంజాగుట్ట ఠాణా సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారాలు సేకరించారు. ఉద్దేశపూర్వకంగానే చేసినట్టు గుర్తించాకనే.. ఇన్స్పెక్టర్ దుర్గారావును సస్పెండ్ చేసినట్టు సమాచారం. ఈవ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉందనే విషయమై ఆరా తీస్తున్నారు. ఇదీ చదవండి: మోస్ట్‌వాంటెడ్‌గా నాడు షకీల్.. నేడు సాహిల్!! -
పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో బిగ్ ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: ప్రజాభవన్ యాక్సిడెంట్ కేసు దర్యాప్తులో పోలీసుల నిర్వాకం బయటపడింది. ప్రమాదం తర్వాత సోహైల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సోహైల్‌ను అదుపులోకి తీసుకోవడంతో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరులు పీఎస్‌కు వచ్చారు. షకీల్ కొడుకును విడిపించుకుపోయారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సోహైల్‌కు బదులు మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంట్లో పనిమనిషి అబ్దుల్ అసిఫ్‌ను కేసులో పోలీసులు చేర్చారు. ప్రమాద సమయంలో కారు అబ్దుల్ నడిపినట్లు కేసు నమోదు చేశారు. దుబాయ్ నుంచి షకీల్ ఈ వ్యవహారం అంతా నడిపినట్లు తెలుస్తోంది. మరోవైపు పంజాగుట్ట సీఐ దుర్గారావుకు అస్వస్థతకు గురయ్యారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు వ్యవహారంలో సీఐ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఐను బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రికి తరలించారు సీఐ, నైట్ డ్యూటీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. సోహైల్‌తో రాత్రి ఫోన్ మాట్లాడిన స్నేహితులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. కాగా షకీల్ కొడుకు కారుతో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నెల 23న ప్రజాభవన్ ఎదుట బారీకేడ్లను ఆయన ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఘటన సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. అయితే సోహైల్‌ను తప్పించి మరొకరు డ్రైవ్ చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కారు ప్రమాద విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.ఈ ఘటనపై హైదరాబాద్ సీపీ విచారణకు ఆదేశించారు.షకీల్ కొడుకు సోహైల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. షకీల్ కొడుకు ర్యాష్ డ్రైవింగ్ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ర్యాష్ డ్రైవింగ్ చేసింది షకీల్ కొడుకు సోహైల్‌గా తేల్చారు. అయితే ఎఫ్ఐఆర్లో మరొకరి పేరు చేర్చారు. దీంతో నిందితుడు సోహైల్‌కు సహకరించిన పోలీసులు ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది. ప్రమాద సమయంలో సోహైల్‌తోపాటు ఉన్న ఫ్రెండ్స్ ఎవరు? పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎందుకు చేయలేదనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సోహైల్‌కు సహకరించి తప్పుడు కేసు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
కారు డ్రైవ్ చేసింది షకీల్ కొడుకే: డీసీపీ విజయ్
సాక్షి, హైదరాబాద్: ర్యాష్ డ్రైవింగ్‌తో ప్రజా భవన్ వద్ద బారికేడ్లను ఢీ కొట్టిన కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహిల్ పేరును కూడా చేర్చినట్లు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. కేసులో మాజీ ప్రజాప్రతినిధి తనయుడ్ని తప్పించారని ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో.. డీసీపీ సాక్షి ద్వారా స్పందించారు. ‘‘ప్రజా భవన్ వద్ద న్యూ ఇయర్ కోసం ఏర్పాటు చేసినటువంటి బ్యారికేట్స్ ను అతివేగంగా వచ్చి ఓ బీఎండబ్ల్యూ కారు ఢీ కొట్టింది. కారులో ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు యువతులు ఉన్నారు. వీళ్లంతా స్టూడెంట్స్. కారు డ్రైవ్ చేసింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహిల్. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. మిగతా వారిని అదుపులోకి తీసుకున్నాం’’ అని డీసీపీ విజయ్‌కుమార్ సాక్షికి తెలిపారు. ఆపై షకీల్ ఇంట్లో డ్రైవర్‌గా పని వేసే వ్యక్తి.. తానే డ్రైవ్ చేసినట్లుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. పోలీసుల్ని తప్పుదోవ పట్టించే యత్నం చేశాడు. కానీ, సీసీ ఫుటేజీ, ఘటన దర్యాప్తు ద్వారా రహిల్ వాహనం నడిపినట్లు నిర్ధారించుకున్నాం. రహిల్‌పై గతంలో జూబ్లీహిల్స్‌లో ఓ యాక్సిడెంట్ కేసు నమోదు అయ్యింది (ఆ కేసులో ఓ బాలుడు కూడా మృతి చెందాడు). ఆ కేసు పూర్వాపరాలను కూడా గమనిస్తాం. అదుపులోకి తీసుకున్న వ్యక్తుల్ని కోర్టులో ప్రవేశపెడతాం అని డీసీపీ సాక్షితో అన్నారు. -
ర్యాష్ డ్రైవింగ్ కు మహిళ బలి
-
వాహనదారులూ బీ అలర్ట్: కొంపముంచుతోంది అదే!
ప్రతీ రోజు దేశం నలుమూలల్లో చోటుచేసుకునే అనేక వాహన ప్రమాదాలు వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటాయి. స్వయం కృతాపరాధంతో ప్రాణాలను పోగొట్టుకుంటున్న సంఘటనలు కలిచి వేస్తాయి. డ్రైవింగ్‌పై క్రేజ్ తో స్పీడ్‌గా వెళ్లడం థ్రిల్ కావచ్చు, కానీ అది ప్రమాదకరం. మన ప్రాణాలకే కాదు ఇతరులకు కూడా. గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూసే ఓపిక లేకపోవడం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్మార్ట్ఫోన్లు ఉపయోగించడం ఈ రోజుల్లో సాధారణమై పోయింది. ‘‘స్పీడ్ థ్రిల్స్.. బట్ కిల్స్’’ అనే మాటల్ని తాజా ప్రభుత్వ ఒక సంచలన నివేదిక మరోసారి గుర్తు చేసింది. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన “భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు 2022” నివేదిక ప్రకారం, భారతదేశంలో గత సంవత్సరం రోడ్డు ప్రమాదాలు 12 శాతం పెరిగాయి. రోడ్డు ప్రమాదాలకు అత్యంత ప్రమాదకరమైన సంవత్సరంగా 2022 నిలిచింది. ప్రతీ పది లక్షల జనాభాకు 122 మంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్నారు. 1970 నుంచి ఇదే అత్యధిక రేటు దేశవ్యాప్తంగా ప్రమాదాలు , మరణాల వెనుక అతివేగం ప్రధాన కారణాలలో ఒకటిగా తేలింది. 2022లో 11.9శాతం పెరిగి 4,లక్షల 61వేల 312 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా 2021లో వీటి సంఖ్య 4 లక్షల 12వేల 432గా ఉంది. 1 లక్షా 68వేల 491 మంది ప్రాణాలు కోల్పోయారు. 4 లక్షల 43వేల 366 మంది గాయపడ్డారు. గత ఏడాదితో పోలిస్తే మరణాలు 9.4 శాతం ఎగిసి క్షతగాత్రుల సంఖ్య 15.3శాతం పెరిగింది. 2022లో 3.3 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలకు దారితీసిన కారణాల్లో అతివేగంతో పాటు, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. 2022లో, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, అతివేగం కారణంగా 71.2 శాతం మంది మరణించారు, ఆ తర్వాత స్థానం రాంగ్ సైడ్ డ్రైవింగ్ది (5.4శాతం) అని నివేదిక పేర్కొంది. ఇక మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల దాదాపు 10వేల ప్రమాదాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.అంతేకాదు రెడ్‌సిగ్నల్ జంప్ వల్ల యాక్సిడెంట్లు గణనీయంగా పెరిగాయి. 2021లో ఇవి 2,203గా ఉంటే 2022లో 82.55 శాతం పెరిగి 4,021 ప్రమాదాలు నమోదైనాయి. 2022లో హెల్మెట్ ధరించని బైక్ ప్రమాదాల్లో 50వేల మంది మరణించారు. వీరిలో 71.3 శాతం మంది ( 35,692) డ్రైవర్లు, 14,337 (28.7శాతం) వెనుక కూర్చున్న వారు అని నివేదిక పేర్కొంది. -
బండ్లగూడ కారు ప్రమాదం.. సినిమాను తలపించే ట్విస్టులు.. పోలీసులే షాకయ్యారు!
సాక్షి, హైదరాబాద్: బండ్లగూడ హైదర్షాకోట్ వద్ద రోడ్డు పక్కన ఉదయం పూట వాకింగ్ చేస్తున్న ఇద్దరి ప్రాణాలను కారు ప్రమాదం బలితీసుకున్న సంగతి తెలిసిందే. ఘటనకు సంబంధించిన పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రాణాలు తీసిన బద్రుద్దీన్ ఖాదిరి దగ్గర అసలు డ్రైవింగ్ లైసెన్స్ లేదని పోలీసులు గుర్తించారు. యాక్సిడెంట్ చేసి పారిపోయిన బద్రుద్దిన్, ఫ్రెండ్స్ గ్యాంగ్ కనీసం గాయపడ్డ వారి గురించి సమాచారం కూడా ఇవ్వలేదు. షాకైన పోలీసులు.. బద్రుద్దిన్ వెంట గణేష్, మహమ్మద్ ఇబ్రహీం, ఫైజన్ అనే వ్యక్తులు ఉన్నారు. యాక్సిడెంట్ జరగ్గానే డామేజ్ అయిన కారులోంచి జంప్ అయ్యారు. అప్పటికప్పుడు మరో ఫ్రెండ్‌కు వీరు కాల్ చేశారు. కాసేపటి తర్వాత మరో మిత్రుడు AP 09 BJ 2588 నెంబర్ గల కారుతో స్పాట్‌కు వచ్చాడు. అక్కడ నుంచి నేరుగా మొయినాబాద్ ఫాంహౌజ్‌కు పారిపోయారు. యాక్సిడెంట్ చేశామన్న స్పృహ లేకుండా పార్టీకి ఏర్పాట్లు చేసుకున్న ఆ గ్యాంగ్‌ను చూసి.. ఫాంహౌజ్‌కు వెళ్లిన పోలీసులు షాక్ తిన్నారు. అప్పటికే ఫుడ్, డ్రింక్స్, స్టఫ్ రెడీ చేసుకుంటున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేని బద్రుద్దిన్కు కారు ఎలా ఇచ్చారన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరిగిందంటే? మైనార్టీ తీరి మేజర్ అయ్యాననే ఆనందంతో ఉన్న యువకుడు రాత్రంతా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. పుట్టిన రోజు వేడుకలను మొయినాబాద్‌లోని ఫాంహౌస్‌లో మరికొందరితో కలిసి చేసుకోవడానికి స్నేహితులతో కలిసి కారులో దూసుకుపోతున్నాడు. మితిమీరిన వేగంతో దూసుకువస్తున్న కారు లంగర్‌హౌస్–కాళిమందిర్ మార్గంలోని హైదర్షాకోట్ వద్ద మలుపు తిప్పుతూ అదుపు తప్పింది. బ్రేక్ వేయగా రోడ్డుపై ఉన్న ఇసుక ఫలితంగా స్కిడ్ అయి వాకింగ్ చేస్తున్న నలుగురిపై నుంచి దూసుకుపోయింది. కారు ఎడమ వైపు భాగం బలంగా తగలడంతో తల్లీకూతుళ్లు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు వాకర్స్ తీవ్రంగా గాయపడ్డారు. పౌరుల ప్రాణాలు గాలిలో దీపంలా ఈ ఘటన నగరవాసుల భద్రతను ప్రశ్నిస్తోంది. పౌరుల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయనే ఆవేదన ఉదయిస్తోంది. ఏ వైపు నుంచి ఏ వాహనం ఎంత వేగంగా వస్తుందో తెలియని పరిస్థితుల్లో.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందేనని.. నగరంలో ఇలాంటి ప్రమాదాలు షరామామూలుగా మారాయని పలువురు ఆక్రందన వ్యక్తంచేస్తున్నారు. కారును వేగంగా నడిపి ఉదయం పూట వాకింగ్ చేస్తున్న అభమూ శుభమూ తెలియని ఇద్దరి ప్రాణాలను బలిగొన్న బద్రుద్దిన్ గ్యాంగ్‌ను కఠినంగా శిక్షించాలంటూ పలువురు ట్వీట్లు చేస్తున్నారు. -
బండ్లగూడ యాక్సిడెంట్లో కొత్త ట్విస్ట్
సాక్షి, క్రైమ్: బండ్లగూడ సన్‌సిటీ దగ్గర ఈ వేకువ జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిర్లక్ష్యంగా కారు నడిపి రెండు ప్రాణాల్ని బలిగొన్న బద్రుద్దీన్ ఖాదిరి దగ్గర అసలు డ్రైవింగ్ లైసెన్స్ లేదని పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. తన పుట్టినరోజు జరుపుకునేందుకు స్నేహితులతో వెళ్తున్న క్రమంలోనే ఈ యాక్సిడెంట్‌కు కారణం అయ్యాడు ఆ టీనేజర్. ఇక ప్రమాదానికి కారణమైన హోండా సివిక్ కారు పద్దతి ప్రకారం చేతులు మారలేదని తెలుస్తోంది. గతంలో ఈ కారును మహ్మద్ ఇయాజ్ అనే వ్యక్తి ఆన్లైన్లో అమ్మేశాడు. ఓఎల్ఎక్స్ డీలర్ నుంచి మరో వ్యక్తి ఆ కారు కొనుగులు చేయగా.. సదరు వ్యక్తి నుంచి బద్రుద్దీన్ ఖాదిరి కారు కొనుగోలు చేశాడు. అయితే.. ఇప్పటివరకూ ఆ హోండా సివిక్కారు పేపర్లు, అడ్రస్ మారలేదు. దీంతో ఇయాజ్‌ను సైతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు హైదరాబాద్ శివారు బండ్లగూడలో కారు బీభత్సం సృష్టించింది. హైదర్ షాకోట్ ప్రధాన రహదారిపై ఆర్మీ స్కూలు వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మార్నింగ్ వాక్కు వెళ్తున్న నలుగురిని బండ్లగూడ జాగీర్ సన్ సిటీ వద్ద AP09 BJ 2588 నెంబర్ గల హోండా సివిక్ ఎర్ర కలర్ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో తల్లీకుమార్తెలు మృతిచెందగా.. మృతులను అనురాధ(38), మమత(26)గా గుర్తించారు. మరో మహిళ మాళవిక తీవ్రంగా గాయపడ్డారు. బాధితులది బండ్లగూడ లక్ష్మీనగర్. గాయపడిన మాళవికను మెహిదీపట్నంలోని ఓ ఆస్పత్రిలో చేర్చించి.. చికిత్స అందిస్తున్నారు. బర్త్‌డే వేడుకల కోసం వెళ్తూ.. బద్రుద్దీన్ ఖాదిరి తన మిత్రులతో కలిసి తన 19వ పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు మొయినాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. బద్రుద్దీన్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్నట్లుగా తెలుస్తోంది. నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రాణాలను తీసిన కేసులో బద్రుద్దీన్ నార్సింగి పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. VIDEO: रफ्तार का कहर! मौत बनकर पीछे से आई बेकाबू कार, रौंदती निकली 3 जिंदगियां#Hyderabad #Bandlaguda #Accident #Death #MorningWalkDeath #मौत pic.twitter.com/Ldr9Id1NIO — Divyansh Rastogi (@DivyanshRJ) July 4, 2023 ఇదీ చదవండి: వాహనాలను తొక్కుంటూ 10 మందిని బలిగొన్న ట్రక్కు -
గర్ల్ ఫ్రెండ్ కోసం 160 కి.మీ వేగంతో కారు నడిపి.. చివరికి
ఫ్లోరిడా: అమెరికాలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన శిక్షలు ఎదుర్కోవాలి. తన గర్ల్‌ఫ్రెండ్‌ని సరైన సమయానికి ఇంటర్వ్యూకి తీసుకువెళ్లాలని గంటకి 160కి.మీ. వేగంతో కారు నడిపిన వ్యక్తి ఇప్పుడు కటకటాలు ఊచలు లెక్కపెడుతున్నాడు. ఫ్లోరిడాకు చెందిన జెవన్ పీర్ జాక్సన్ (22) గంటకి 65కి.మీ. వేగంతో మాత్రమే ప్రయాణించే జోన్లో నిబంధనల్ని బేఖాతర్ చేశాడు. ఏకంగా 160 కి.మీ వేగంతో కారు నడిపాడు. మార్గం మధ్యలో కొన్ని వాహనాలను కూడా ఢీ కొట్టబోయి తృటిలో ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. జాక్సన్ ఢీ కొట్టబోయిన ఒక వాహనంలో పోలీసు వాహనంతో పాటు ముగ్గురు చిన్నారులున్న మరో వాహనం ఉండడంతో అతని చుట్టూ ఉచ్చు బిగిసింది. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించడమే కాకుండా, చిన్న పిల్లలకి హాని జరగబోయిందన్న కేసు పెట్టిన పోలీసులు జాక్సన్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారు. అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. -
బంజారాహిల్స్‌లో కారు బీభత్సం!
సాక్షి, హైదరాబాద్ (బంజారాహిల్స్): మద్యంతో పాటు గంజాయి సేవించి అదుపుతప్పిన వేగంతో కారులో దూసుకువచ్చిన ఇద్దరు యువకులు బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్రంగా, పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన ముదిగొండ అనూష్ రావు (22), కొత్తపేటకు చెందిన పవన్ కళ్యాణ్‌రెడ్డి (22) స్నేహితులు. శనివారం రాత్రి శంషాబాద్‌లోని ఓ పబ్‌లో మద్యం తాగారు. గంజాయి కూడా తీసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో శంషాబాద్ నుంచి వీరిద్దరూ కారులో ఇంటికి బయలుదేరారు. మత్తులో డ్రైవింగ్.. సిగరెట్లలో గంజాయి నింపుకొని తాగుతూ అదుపుతప్పిన వేగంతో బంజారాహిల్స్ రోడ్ నెం.2 నుంచి దూసుకెళ్తున్నారు. మాదాపూర్‌లోని సౌండ్స్ అండ్ స్పిరిట్స్ పబ్‌లో సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్‌కు చెందిన అజ్మత్, విజయ్‌కుమార్ బౌన్సర్లుగా పని చేస్తున్నారు. విధులు ముగించుకొని తెల్లవారుజామున బైక్‌పై బంజారాహిల్స్ రోడ్ నెం.2 నుంచి వెళ్తుండగా క్రీమ్‌స్టోన్ వద్ద వెనక నుంచి వేగంగా వచ్చిన అనూష్ రావు కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అజ్మత్కు తలకు తీవ్ర గాయాలు కావడంతో సికింద్రాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. విజయ్‌కుమార్ స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో అనూష్‌రావు స్కూటర్‌ను ఢీకొట్టి పక్కకు తిప్పే క్రమంలో అక్కడ మరో కారును ఢీకొట్టాడు. ఆ కారు రోడ్డుకు అడ్డం తిరగడంతో వెనకాల వస్తున్న మరో కారు ఢీకొట్టింది. ఇలా నాలుగు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారందరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా బీభత్సం సృష్టించింది. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రోడ్డు ప్రమాదానికి కారకులైన అనూష్‌రావు, పవన్ కళ్యాణ్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేశారు. ఇద్దరూ మద్యం తాగినట్లు గుర్తించారు. మద్యం, గంజాయితో పాటు డ్రగ్స్ కూడా తీసుకొని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారులో గంజాయి నింపిన సిగరెట్లతో పాటు 50 గ్రాముల గంజాయి కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరి రక్త నమూనాలు, వెంట్రుకల నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించినట్లు పోలీసులు తెలిపారు. అనూష్ రావు, పవన్ కళ్యాణ్‌రెడ్డిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారును సీజ్ చేశారు. పోలీసుల దర్యాప్తులో ఈ కారు అనూష్ రావు తల్లి పేరు మీద ఉన్నట్లుగా తేలింది. చదవండి: నల్గొండ కాంగ్రెస్‌లో కలకలం.. కోమటిరెడ్డి ఆడియో లీక్! -
బైక్‌ను ఢీకొట్టిను లగ్జరీ కారు.. మూడు కి.మీలు రోడ్డుపై ఈడ్చుకెళ్లి..
గురుగ్రామ్: ఓ కారు డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు పక్కనే పార్క్ చేసి ఉన్న బైక్‌ను ఢీకొట్టాడు. అనంతరం, కారు బ్యానెట్‌కు బైక్ లాక్ అవడంతో కారు డ్రైవర్ బైక్‌ను అలాగే ఈడ్చుకుంటూ దాదాపు మూడు కిలోమీటర్లు వెళ్లాడు. అనంతరం, కారును వదిలేసి పరారయ్యాడు. ఈ ప్రమాదంలో బైకర్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కాగా, ఈ షాకింగ్ ఘటన గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బౌన్సర్ మోను తన విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో రాత్రి 11.30 గంటల ప్రాంతంలో రోడ్డుపై పార్క్ చేసిన తన బైకును తీస్తుండగా హోండా సిటీ కారు ఒకటి హైస్పీడ్‌తో దూసుకొచ్చింది. పార్క్ చేసి ఉన్న బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోను తృటిలో తప్పించుకున్నాడు. క్షణాల వ్యవధిలో కారు.. బైక్‌ను రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లిపోయింది. ఇంతలో మోను కారు ఆపాలంటూ అరిచిన కారు డ్రైవర్ మాత్రం ర్యాష్ డ్రైవింగ్‌తో బైకును మూడు కిలోమీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ క్రమంలో రోడ్డు వెళ్తున్న వాహనదారులు కారును ఆపాలని ఎంత ప్రయత్నించిన అవేవీ పట్టించుకోకుండా డ్రైవర్ స్పీడ్‌గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. తర్వాత.. కారు రోడ్డుపైనే వదిలేసి పరారయ్యాడు. #BigExclusive कार के पीछे उठती चिंगारियों का ये कोई #फिल्मी सीन नहीं है, ये कार सवार गुरुग्राम की सड़क पर बाइक को कई किलोमीटर घसीटते हुए ले जा रहा है ।#roadrage #roadaccident #car #bike #gurugram #haryana #viral #video pic.twitter.com/ledRpF8JYA — Metro News (@MetroNewsHindi) February 3, 2023 అనంతరం, మోను వెంటనే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు నంబర్ ఆధారంగా నిందితుడిని ఫరీదాబాద్‌కు చెందిన సుశాంత్ మెహతాగా గుర్తించారు. ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు గురుగ్రామ్ పోలీసులు సుభాష్ బోకెన్ తెలిపారు. -
రెచ్చిపోయిన కాలేజీ విద్యార్థులు.. టయోటా కార్లతో స్టంట్స్ చేస్తూ..
కాలేజీకి వెళ్లి చదువుకోవాల్సిన విద్యార్థులు రోడ్లపై రెచ్చిపోయారు. రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ స్టంట్లు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటన ఢిల్లీ శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఢిల్లీ సరిహద్దులోని గ్రేటర్ నోయిడాలో ఉన్న అమిటీ యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు తమ ఖరీదైన కార్లతో హల్చల్ చేశాడు. నడిరోడ్డుపై కార్లతో స్టంట్లు చేశారు. కొందరు విద్యార్థులు నోయిడాలోని సెక్టార్ 126లో రెండు తెలుపు రంగు టయోటా ఫార్చ్యూనర్ కార్లతో ఖాళీ రోడ్లపై విన్యాసాలు చేశారు. పంజాబీ ర్యాప్ పాటను హోరెత్తిస్తూ ప్రమాదకరంగా 360 డిగ్రీల స్టంట్లు చేశారు. ఒక పార్కింగ్ స్థలంలో కూడా ఒక కారుతో స్టంట్స్ చేస్తూ అక్కడున్న వారిని భయాందోళనలకు గురిచేశారు. ఇక, విద్యార్థుల కారు స్టంట్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడయాలో వైరల్‌గా మారి పోలీసులకు చేరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. అయతే, సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఆ విద్యార్థులు ఖరీదైన కార్లతో ఈ విన్యాసాలు చేసినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. కాగా, విద్యార్థుల ప్రవర్తనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. NOIDA एमिटी यूनिवर्सिटी में रहीशजादों की स्टंटबाजी, फॉर्च्यून से ड्रिफ्ट मरते वीडियो वायरल PS 126@noidapolice@noidatraffic @Uppolice pic.twitter.com/4W9hVh8zBm — हिमांशु शुक्ला (@himanshu_kanpur) December 23, 2022 -
పవన్ పై పోలీస్ కేసు నమోదు
-
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు
సాక్షి, గుంటూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కేసు నమోదయ్యింది. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో శుక్రవారం రోజున పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 336, రెడ్‌విత్ 177ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదయింది. ఇప్పటం గ్రామం వెళ్లే సమయంలో కారుపై కూర్చోని వెళ్లడం, కార్ ర్యాష్ డ్రైవింగ్‌పై ఫిర్యాదు అందడంతో పోలీసులు ఈ మేరకు స్పందించారు. హైవేపై పవన్ కాన్వాయ్‌ని పలు వాహనాలు అనుసరించడంపై కూడా కేసు ఫైల్ చేశారు. తెనాలి మారిస్పేటకు చెందని శివ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పవన్ కల్యాణ్, కారు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (జనసేన నాయకుల ఓవరాక్షన్.. దెబ్బకు జారుకున్నారు) -
వీడియో: అంత బలుపెందుకు భయ్యా.. హైస్పీడ్‌లో బైకును ఢీకొట్టి..
అతి వేగం ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. అయితే, హై స్పీడ్‌లో ఉన్న ఓ కారు డ్రైవర్ రెచ్చిపోయాడు. నా కారుకే అడ్డు వస్తారా అనుకున్నాడో ఏమో.. రెండు బైకులకు కారుతో ఢీకొట్టి.. ఓ బైక్‌ను ఏకంగా కిలోమీటర్ దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. ఈ క్రమంలో తన కారుకు అడ్డుగా వచ్చిన రెండు బైకులను ఢీకొట్టాడు. అనంతరం.. కింద పడిపోయిన ఓ బైకును తన కారు ముందు భాగమైన బంపర్ కింద పెట్టుకుని దాదాపు కిలోమీటర్ దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ క్రమంలో బైక్.. రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్తుండగా రోడ్డుమీద మెరుపులు సైతం రావడం విశేషం. ఇంతలో మరో బైక్‌పై బైకర్లు ఇద్దరూ కారును వెంబడించి వీడియో తీశారు. వారిని గమనించిన కారు డ్రైవర్ కారును మరింత స్పీడ్‌తో డ్రైవ్ చేశాడు. ఇక, ఓ చోట కారును ఆపిన బైకర్లు.. డ్రైవర్‌ను కిందకు దిగాలని అడిగినప్పటికీ అతడు దిగేందుకు నిరాకరించాడు. అనంతరం.. ఈ ఘటనపై ఇందిరాపురం పరిధిలోని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఈ ప్రమాదంలో బైకర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. కాగా, ఈ ప్రమాదం శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. वीडियो चौकाने वाली हैं #Ghaziabad में सड़क पर दीवाली की चरखी नही बल्कि बाइक सवार 2 को टक्कर मारने के बाद कारचालक गाड़ी के अगले हिस्से में फंसी बाइक को 1 किमी तक घसीट ले गया जिससे चिंगारियां निकल रही है। ।घटना इंदिरापुरम के मंगल चौक की है pic.twitter.com/8RAJvBt1hl — Ankit Tiwari (@Unknowankitt) November 5, 2022 -
ర్యాష్ డ్రైవింగ్: జొమాటో హాట్‌లైన్ నంబర్ లాంచ్
న్యూఢిల్లీ: డెలివరీ పార్ట్నర్లు ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తున్న పక్షంలో ప్రజలు తమకు ఫిర్యాదు చేసేందుకు వీలుగా కొత్త డెలివరీ బ్యాగ్‌లను ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని ఆన్లైన్ ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. తమ బ్యాగ్‌లపై ‘హాట్‌లైన్ ఫోన్ నంబర్‘ ముద్రించి ఉంటుందని ట్వీట్ చేశారు. వేగంగా డెలివరీలు చేయాలంటూ తాము పార్ట్నర్లను ఒత్తిడి చేయమని ఆయన పేర్కొన్నారు. సత్వరం అందిస్తే ప్రోత్సాహకాలు ఇవ్వడం, లేకపోతే పెనాల్టీలు విధించడం వంటివి ఏమీ ఉండవని గోయల్ స్పష్టం చేశారు. అసలు వారికి ఎస్టిమేటెడ్ డెలివరీ కూడా చెప్పం. ఈ నేపథ్యంలో తమ డె లివరీ పార్ట్నర్లు ఎవరైనా వేగంగా నడుపుతుంటే. తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. తద్వారా రోడ్లపై ట్రాఫిక్‌ను రద్దీ లేకుండా నివారించాలని ఆయన కోరారు. 10 నిమిషాల్లోనే ఇన్స్టంట్ డెలివరీ సర్వీసులు ప్రారంభిస్తున్నామని గతంలో ప్రకటించినప్పుడు డెడ్‌లైన్ పేరిట డెలివరీ పార్ట్నర్లపై ఒత్తిడి పెంచుతున్నారంటూ జొమాటోపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో గోయల్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. As promised earlier, we have started rolling out delivery bags which mention a hotline phone number to report rash driving by our delivery partners. Please remember – we don’t incentivise our delivery partners for on time deliveries, nor do we penalise them for late ones. (1/2) pic.twitter.com/Jic36Rt1qn — Deepinder Goyal (@deepigoyal) November 2, 2022 -
ర్యాష్ డ్రైవింగ్‌తో రెచ్చిపోయిన కౌన్సిలర్ కొడుకు.. కానిస్టేబుల్‌పైనే దాడి!
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు ఎంత చెబుతున్నా కొందరు వాహనదారులు మాత్రం రూల్స్ బ్రేక్ చేస్తూనే ఉన్నారు. జరిమానాలు విధించినా ఏ మాత్రం మారడం లేదు. అంతేకాదు, తాజాగా కొందరు పోకిరీలు ర్యాష్ డ్రైవింగ్ చేసి ఏకంగా ట్రాఫిక్ పోలీసుపైనే దాడికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. తమిళనాడులోని సేలంలో అస్తంపట్టి పోలీసు స్టేషన్లో అశోక్(30) కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, తన డ్యూటీ ముగియడంతో అశోక్ బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. ఇంతలో ఓ చోట ముగ్గురు వ్యక్తులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ అశోక్‌కు కనిపించారు. దీంతో, అశోక్ వారి బైక్‌ను ఫాలో అయ్యి ఓ చోట ఆపాడు. అనంతరం, వారిని ఎందుకు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారంటూ నిలదీశాడు. ఈ సందర్భంగా రెచ్చాఇపోయిన యువకులు.. కానిస్టేబుల్ అశోక్‌తో వాగ్వాదానికి దిగారు. అనంతరం, సివిల్ డ్రెస్‌లో ఉన్న అశోక్‌పై దాడి చేశారు. ముగ్గురు యువకులతో పాటు అక్కడే ఉన్న వారి మరో ఇద్దరు అనుచరులు కూడా అశోక్‌పై దాడికి తెగబడ్డారు. దీంతో, దాడి నుంచి తేరుకున్న అశోక్.. వారిలో నలుగురిని పట్టుకున్నాడు. ఈ విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు వారిని అప్పగించారు. పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన నిందితులను అబ్దుల్ రెహమాన్, రికాన్‌పాషా, అస్లాం అలీ, రిజ్వాన్‌గా గుర్తించారు. దీంతో, కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పారిపోయిన ఐదో వ్యక్తి కోసం వెతుకుతున్నారు. కౌన్సిలర్ సదాజ్ కుమారుడు అబ్దుల్ రెహమాన్ అని పోలీసులు తెలిపారు. Pulled up for rash driving, 5 thrash off-duty cop in Tamil Nadu's Salem | Video pic.twitter.com/Mw7aAcXGtg — Times No1 (@no1_times) October 29, 2022 -
నా కారునే ఆపుతావా అంటూ ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి
సాక్షి, పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం టూ టౌన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కుమార్‌పై సంతోష్ అనే వ్యక్తి దాడి చేశాడు. ట్రాఫిక్‌లో అతి వేగంగా వెళ్తున్న కారును కానిస్టేబుల్ కుమార్ అడ్డుకున్నాడు. సంతోష్ అనే వ్యక్తి కారుదిగి నా కారునే ఆపుతావా అంటూ కానిస్టేబుల్‌పై దాడికి దిగాడు. దీంతో టూటౌన్ పోలీసులు సంతోష్‌ను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: (కాలేజీ బస్సు డ్రైవర్‌తో ప్రేమ పెళ్లి.. తల్లికి ఆరోగ్యం బాగోలేదని చెప్పి..) -
యువకుడి బైక్ రేసు.. వెరైటీ శిక్ష విధించిన హైకోర్టు
సాక్షి, చెన్నై: బైక్ రేసులో దూసుకెళ్లిన ఓ యువకుడికి హైకోర్టు వినూత్న శిక్ష విధించింది. నెల రోజులు స్టాన్లీ ఆసుపత్రి అత్యవసర చికిత్సా విభాగంలో వార్డుబాయ్‌గా పనిచేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. వివరాలు.. చెన్నై నగరంలో, శివారుల్లోని బైపాస్, ఎక్స్‌ప్రెస్ వే, ఈసీఆర్ మార్గాల్లో రాత్రుల్లో యువత బైక్ రేసు పేరిట దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. వీరిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్న ఈ యువకులు మాత్రం తగ్గడం లేదు. ఈ పరిస్థితుల్లో మార్చి 21వ తేదీ బైక్ రేసులో దూసుకెళ్లిన కొరుక్కుపేటకు చెందిన ప్రవీణ్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బెయిల్ పిటిషన్‌ను హైకోర్టులో ఆ యువకుడి తరపు న్యాయవాదులు దాఖలు చేశారు. గురువారం పిటిషన్ విచారణకు వచ్చింది. ప్రవీణ్‌కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు, అతడికి వినూత్న శిక్షను విధించింది. మానసిక పరివర్తన కోసమే.. బైక్ రేసులో దూసుకెళ్లే యువకుల కారణంగా రోడ్డున వెళ్తున్న వారు ఎందరో ప్రమాదాల బారిన పడుతున్నారని న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల్లో గాయపడ్డ వారిని ఆస్పత్రుల్లోని అత్యవసర చికిత్సా విభాగాలకు తరలించడం జరుగుతోందని, అక్కడ వారు పడే వేదన వర్ణాణాతీతం అని పేర్కొన్నారు. అందుకే ప్రవీణ్ చెన్నై స్టాన్లీ ఆసుపత్రి అత్యవసర చికిత్స విభాగంలో నెల రోజులు వార్డు బాయ్‌గా పనిచేయాలని ఆదేశించారు. ప్రమాదాల బారిన పడే వారి బాధల్ని చూసైనా ఇతడిలో మార్పు వచ్చేనా అన్న అంశాన్ని ప్రస్తావిస్తూ విచారణను వాయిదా వేశారు. -
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు దాసరి అరుణ్
-
ర్యాష్ డ్రైవింగ్... టాలీవుడ్ హీరోపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: మోతాదుకు మించి మద్యంతాగి బస్తీల్లో అదుపుతప్పిన వేగంతో కారును నడుపుతూ రోడ్డు పక్కన వాహనాలను ఢీకొట్టిన ఘటనలో సినీనటుడు దాసరి అరుణ్‌కుమార్(47)పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–71లో నివసించే దాసరి అరుణ్‌కుమార్ బుధవారం సాయంత్రం తన మారుతి స్విఫ్ట్ కారులో ఫిలింనగర్ క్లబ్‌కు షటిల్ ఆడేందుకు వెళ్లాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో స్నేహితుడు ప్రశాంత్ మరొకరితో కలిసి రాత్రి 11 గంటల వరకు మద్యం సేవించాడు. కొంతకాలంగా మద్యం సేవించిన అనంతరం మత్తులో తన ఇంటిదారి మరిచిపోతున్నాడని కుటుంబ సభ్యులు తెలుపడంతో స్నేహితులు రాత్రి మద్యం తాగిన తర్వాత అరుణ్‌కుమార్ కారు ఎక్కగానే వెనుకాల అనుసరిస్తూ వెళ్లారు. అయితే కొద్దిదూరం వెళ్లేసరికి అరుణ్‌కుమార్ కారును స్పీడ్‌గా బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12 వైపు పోనిచ్చాడు. వెనుకాల స్నేహితులు గుర్తించే లోపే కారును అదుపుతప్పిన వేగంతో తీసుకెళ్తూ బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12 కమాన్లోపల సయ్యద్‌నగర్ బస్తీలోకి వెళ్లాడు. 11.20 గంటల ప్రాంతంలో సయ్యద్నగర్బస్తీలో రోడ్డు పక్కన ఆపిన ఐదు వాహనాలను ఢీకొట్టాడు. ఒక్కసారిగా అధిక శబ్ధం, వాహనాలను ఢీకొడుతున్న శబ్ధాలతో స్థానికులు అక్కడికి పరుగులు తీసి చాకచక్యంగా అరుణ్ నడుపుతున్న కారును ఆపారు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు అరుణ్ ప్రయత్నించగా స్థానికులంతా చుట్టుముట్టి కారును ఆపారు. బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారు నడుపుతున్న వ్యక్తి సినీహీరో దాసరి అరుణ్గా గుర్తించారు. అదే రాత్రి అరుణ్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి కారు సీజ్ చేశారు. వెంటనే మద్యం మోతాదు పరీక్షలు నిర్వహించగా 405 బీఏసీగా తేలింది. బాధితులు సయ్యద్ అఫ్జల్అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరుణ్‌పై ఐపీసీ సెక్షన్ 279, 336, ఎంవీ యాక్ట్ 185 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అట్రాసిటీకేసుపై విచారణ దాసరి అరుణ్‌కుమార్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు గత ఏడాది ఆగస్టు 16వ తేదీన నమోదైంది. ఈ కేసులో విచారణ నిమిత్తం గురువారం బంజారాహిల్స్ పోలీసులు అరుణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రెండు గంటల పాటు ఆ కేసుకు సంబంధించి విచారణ జరిగింది. -
ఎన్టీఆర్ పార్కు ముందు బీభత్సం.. హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ పార్క్ ముందు ఆదివారం ఉదయం ఓ కారు భీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి అదుపు తప్పి పార్క్ ఎదురుగా ఉన్న హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లింది. దీంతో ఆ కారులో ఉన్న ముగ్గురు యువకుల స్వల్ప గాయాలయ్యాయి. ఈ సమాచారం తెలుసుకున్న సైఫాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని చికిత్స నిమిత్తం గాయపడ్డ ముగ్గురిని సోమజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. యువకులు ఖైరతాబాద్‌కు చెందిన నితిన్, స్పత్రిక్, కార్తీక్ గుర్తించారు. నాలుగు రోజుల క్రితమే కారు కొన్నారని, ఖైరతాబాద్ నుంచి అఫ్జల్ గంజ్‌లో టిఫిన్ చేయడానికి వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: కన్నీళ్లకే కన్నీళ్లొచ్చే: పసిప్రాయంలో తల్లి.. తర్వాత తండ్రి.. ఇప్పుడు అన్న.. -
సిటీలో స్పోర్ట్స్ బైకుల క్రేజు.. అయితే, ఇక్కడో విషయం గమనించాలి..
‘సిటీ రహదారులు స్పోర్ట్స్ బైక్స్ వినియోగానికి అనుకూలంగా లేవు. రోడ్ల విస్తీర్ణం, వాహనాల రాకపోకలు రేసింగ్‌కు ఏ మాత్రం తగవు. కొన్ని ప్రత్యేక నిబంధనలతో కూడిన ప్రాంతాల్లోనే స్పోర్ట్స్ బైక్‌లు, కార్లు వినియోగించాలి. అందుకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన సౌకర్యాలూ ఉండాలి...’ అని చెబుతున్నారు హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాండురంగా నాయక్. తాజాగా హీరో సాయిధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైకు ప్రమాదానికి గురై..ఆయన గాయపడిన నేపథ్యంలో నగర రహదారులపై స్పోర్ట్స్ బైకుల వినియోగం, రాత్రి వేళల్లో బైకు రేసింగ్‌ల అంశాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. సాక్షి, హైదరాబాద్: నగర రహదారులపై స్పోర్ట్స్ బైకులు గంటకు 120 నుంచి 150 కి.మీ వేగంతో పరుగులు తీస్తున్నాయి. ఇవి ఇప్పుడు యువతలో క్రేజ్‌గా మారాయి. ఏటా వేల కొద్ది హై ఎండ్ కార్లు, బైకులు రోడ్డెక్కుతున్నాయి. వీటి ఖరీదు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటోంది. వీటి సంఖ్య ప్రస్తుతం 10,500 వరకు ఉన్నట్లు ఆర్టీఏ అధికారి ఒకరు తెలిపారు. ఇటీవలి కాలంలోనే 3 వేలకు పైగా హై ఎండ్ కార్లు ఆర్టీఏలో రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. పెరుగుతున్న హై ఎండ్ మోజు.. నగరంలో ఏటేటా హై ఎండ్ వాహనాలు గణనీయంగా పెరుగుతున్నాయి. 500 నుంచి 2000 సీసీల సామర్థ్యం కలిగిన స్పోర్ట్స్ వాహనాలు నగరంలో భారీ సంఖ్యలో వాడుతున్నారు. సినీ తారలు, సంపన్నుల పిల్లలు ఈ బైక్స్‌పై దూసుకెళ్తూ బెంబేలెత్తిస్తున్నారు. ప్రమాదాలకు గురై ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. కొంత కాలంగా కోవిడ్ దృష్ట్యా బైక్ రేసింగ్‌లు సద్దుమణిగినా ఇటీవలి కాలంలో తిరిగి మొదలయ్యాయని తెలుస్తోంది. జాగ్రత్తలు లేకే.. బైక్ రేసింగ్‌లో పాల్గొనే యువత సరైన జాగ్రత్తలు పాటించడం లేదు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. దీంతోనే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలోనూ బైకు రేసింగ్ ప్రమాదాల్లో పలువురు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. అదుపు తప్పి... సినీ హీరో సాయిధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ నడుపుతూ ఐకియా వద్ద ప్రమాదానికి గురైన ఉదంతంలో వేగాన్ని అదుపు చేయలేకపోవడం వల్లనే ఘటన జరిగినట్లు ఆర్టీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. తను వాహనం నడుపుతున్న మార్గంలో ఆటో, మరో కారు కూడా వెళుతున్నట్లు గమనించారు. వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఆయన బైకు అదుపుతప్పి కింద పడిపోయింది. ఆ ప్రాంతంలో ఇసుక, మట్టి ఉండడం వల్ల కూడా బైకు అదుపు తప్పినట్లు తెలుస్తోంది. రూ.కోట్లు కుమ్మరించినా... ► గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో బల్దియా కొత్త రోడ్ల నిర్మాణం.. నిర్వహణల కోసం దాదాపు రూ.1100 కోట్లు ఖర్చు చేసింది. అయినా చినుకుపడితే గుంతలతో ప్రమాదాలు తప్పడం లేవు. రోడ్లపై గుంతలున్నా, కంకర ఉ న్నా, ఇసుక ఉన్నా పట్టించుకుంటున్నవారు లేరు. ►జీహెచ్ఎంసీ ఇంజనీర్ల కంటే ప్రైవేటు ఏజెన్సీలైతే ఎప్పటికప్పుడు నిర్వహణ బాగుంటుందని భావించి ప్రధాన రహదారుల్లోని 709 కి.మీ.ల మేర నిర్వహణకు ప్రైవేటుకిచ్చారు. అయినా ఫలితం కన్పించడం లేదు. ప్రధాన రోడ్లయినా, గల్లీ రోడ్లయినా, నిర్వహణ ఎవరిదైనా రోడ్డెక్కితే చాలు ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లే ని పరిస్థితులు నెలకొన్నాయి. వేగంగా వెళ్లే వాహనాలతోపాటు నెమ్మదిగా వెళ్లేవారు సైతం గుంతల్లో పడి ఆస్పత్రుల పాలయ్యే పరిస్థితి ఉంది. ► కొత్త రోడ్లు, రోడ్ల నిర్వహణ పేరిట గడచిన ఐదేళ్లలో రూ.2520 కోట్లు ఖర్చు చేశారు. అయినా అదే దుస్థితి. ఏళ్లు గడుస్తున్నా, కోట్లు ఖర్చవుతునా భాగ్యనగర రహదారుల దుస్థితి మారడం లేదు. ► గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో వెరసి 70 లక్షలకు పైగా వాహనాలుండగా, వీటిల్లో 70 శాతానికి పైగా ద్విచక్రవాహనాలే. వాహనాలు పెరుగుతున్నాయి. కానీ రోడ్లు బాగుపడటం లేవు. ► రోడ్లు అద్దాల్లా ఉంచుతామని స్వీపింగ్ మెషిన్లను వినియోగిస్తూ ఏటా దాదాపు రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నారు. -
నిర్లక్ష్యం,అతివేగం.. అంతేనా వృద్ధురాలిని ఢీకొట్టి..
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు పాటించడమేమో గానీ.. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, సీటు బెల్టు, హెల్మెట్ పెట్టుకోకపోవడం లాంటి కారణంగానే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. అయినా వాటిని బేఖాతరు చేస్తూ కొందరు పెడచెవిన పెడుతూ రోడ్డుపై ఇష్టారీతిన వాహనాలను నడుపుతున్నారు. రోడ్డుపై వాహనదారులు డ్రైవింగ్ చేసే సమయంలో నిర్లక్ష్యపు ధోరణిని వీడాలని, మితిమీరిన వేగంతో వాహనాలు నడపకూడదని అధికారులు ఎంత మొత్తుకున్నా ప్రజలు వినిపించుకోవడం లేదనే చెప్పాలి. ఇటీవల ముగ్గరు యువకులు రోడ్డు పై అతి వేగంతో ద్విచక్రవాహనాన్ని నడపడమే కాకుండా, ఓ ప్రమాదానికి కారకులయ్యారు. చివరకి కటకటాలపాలయ్యరు. వివరాల్లోకి వెళితే.. జూలై 11న నార్సింగి సమీపాన ముగ్గురు యువకులు ట్రాఫిక్ రూల్స్‌ను పూర్తిగా పక్కన పెట్టి, ఇష్టారీతని డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నారు. అంతేగాక ఆ బండిని మొదటి కుర్చున్న వ్యక్తి కాకుండా రెండో వ్యక్తి బైకుని నడుపుతున్నాడు. దీని బట్టి అర్థం చేసుకోవచ్చు వారి వారి నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందని. ఆ సమయంలోనే ఓ వృద్ధరాలు అటుగా రోడ్డు పక్కన నుంచి వెళ్తుంటే ఆమెను ఢీకోట్టి మరీ వెళ్లిపోయారు. కనీసం కింద పడిని వ్యక్తి ఎలా ఉందో, ఏమైందో అని కూడా చూడకుండా బండిని ఇంకా వేగంగా కదిలించేశారు. అదృష్టవశాత్తు ఆ వృద్ధరాలు స్వల్ప గాయాలతో బయటపడింది. ఇదంతా ఆ చుట్టు పక్కల సీసీ కెమరాలో రికార్డు కావడంతో పోలీసులు ఆ బైకుపై ప్రయాణించిన వారిలో ఇద్దరు దొరకగా వారిపై కేసు నమోదు చేశారు. ఓ సారి ఈ ప్రమాదాలు చిట్టాను పరిశీలిస్తే 2019 నుంచి 2021 మే వరకు ప్రతీ ఏటా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. -
బీట్ అధికారి వచ్చీరాని డ్రైవింగ్.. ఒకరు మృతి, మరొకరికి..
సాక్షి, మాచారెడ్డి (నిజామాబాద్): డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో అటవీశాఖ బీట్ అధికారి నవీన్ కార్యాలయ జీపు నడుపుతూ ఒకేరోజు రెండు బైక్‌లను ఢీ కొట్టడంతో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం మాచారెడ్డిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బీట్ అధికారి నవీన్ తోపాటు మరికొందరు అటవీ అధికారులు విధుల్లో భాగంగా బుధవారం సాయంత్రం ఎల్లంపేటకు వెళ్లి మాచారెడ్డికి వస్తున్నారు. అక్కాపూర్ సమీపంలో ఎల్లంపేట గ్రామానికి చెందిన సంతోష్ అనే యువకుడు మాచారెడ్డి నుంచి ఎల్లంపేటవెళ్తుండగా ఎదురుగా వస్తున్న అటవీశాఖ వాహనం ఢీ కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. గాయాలతో బాధపడుతున్న సంతోష్‌ను అదే వాహనంలోఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. అయితే గజ్యానాయక్ తండా గ్రామపంచాయితీపరిధిలోని గొట్టం చెరువు తండాకు చెందిన అజ్మీరా రాములు (30) అక్కాపూర్రోడ్డులో ఉన్న రెండెకరాల భూమిని కౌలుకు చేస్తున్నాడు. ఆయన తన బైక్పైపొలం దగ్గరకువెళ్తుండగా అతివేగంగావస్తున్న ఈ అటవీశాఖ వాహనం ఢీ కొట్టడంతో కింద పడిపోయిన రాములు కాళ్లుచేతులు విరిగాయి. గాయాలతో బాధపడుతున్న రాములను కూడా అదే వాహనంలో చికిత్స నిమిత్తం కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాద్‌లోని ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడచికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వివరించారు.అతి వేగం, అజాగ్రత్తగా వాహనం నడిపి ఒకరి మృతికి కారణమైన అధికారినికఠినంగా శిక్షించాలని, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గజ్యానాయక్ తండా చౌరస్తాలోని రేంజ్ కార్యాలయం ఎదుట కామారెడ్డి–సిరిసిల్లా రహదారిపై 3 గంటల పాటు ఆందోళన చేశారు. దీంతో కిలోమీటర్మర ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపోయాయి. కామారెడ్డి రూరల్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ అంజినాయక్, అటవీశాఖ అధికారులు ఆందోళనాకారులను సముదాయించారు. మృతుడు రాములుకు భార్యవనిత, రెండేళ్ల కుమారుడు, తొమ్మిదినెలల కూతురు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లాఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మాచారెడ్డి ఎస్సై శ్రీనివాస్‌రెడ్డితెలిపారు. -
నాగోల్‌లో కారు బీభత్సం.. హోంగార్డుకు తీవ్ర గాయాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నాగోల్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం కారు బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి నగరంలో కర్ఫ్యూ అమల్లో ఉన్న నేపథ్యంలో నాగోల్ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న TS08AA0117 నంబర్ గల కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో డ్రైవర్ కారు ఆపకుండా అతివేగంతో అక్కడి నుంచి దూసుకెళ్లాడు. దీంతో అక్కడ తనఖీలు చేస్తున్న పోలీసులు సెట్ ద్వారా అలర్ట్ చేయడంతో ఎల్బీనగర్లో కారును ఆపేందుకు అక్కడే విధుల్లో ఉన్న హోంగార్డ్ రమేష్ ప్రయత్నించాడు. అయితే అతి వేగంతో దూసుకొచ్చిన కారు డ్రైవర్ రమేష్‌ను ఢీకొట్టి క్షణాల్లో అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ ఘటనలో హోంగార్డు రమేష్‌కు తీవ్రగాయాలు కావడంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలసుకున్న రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆస్పత్రికి వెళ్లి హోంగార్డును పరామర్శించి, ఘటనపై ఆరా తీశారు. -
నిజాంపేటలో తాగుబోతుల రాష్ డ్రైవింగ్ కు ASI బలి
-
పాతబస్తీలో కారు బీభత్సం..
-
హైదరాబాద్‌లో కారు బీభత్సం..
సాక్షి, హైదారబాద్: పాతబస్తీలో కారు బీభత్సం సృష్టించింది. మిశ్రీగంజ్‌లో ఇంటి ముందు కూర్చోని ఇద్దరు చిన్నారులు ఆడుకుంటుండగా రివర్స్‌లో వారిపైకి కారు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి రెండు కాళ్లు విరిగిపోయాయి. మరో బాలుడు తృటిలో తప్పించుకున్నాడు. కాగా కారును మహిళ డ్రైవ్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆమె ఇటీవలే యూఏఈ నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మలక్‌పేట్‌లో కారు బీభత్సం.. వృద్దుడిపై కేసు
సాక్షి, హైదరాబాద్: మలక్ పేట్ డీమార్ట్ ఎదురుగా కారు బీభత్సం సృష్టించింది. 72 ఏళ్ల వృద్ధుడు హోండా సిటీ కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ సమీపంలోని ఓ టీ కొట్టులోకి దూసుకెళ్లాడు. ఈ ఘటన మంగళవారం స్థానికంగా కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. దీంతో కారు డ్రైవింగ్ చేసిన వృద్ధుడు రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పోలీసులు గుర్తించారు. అనంతరం అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
ముంచుతున్న మంచు!
సాక్షి, అమరావతి: గతనెల 4న తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ వద్ద చెన్నై నుంచి భువనేశ్వర్‌కు కార్ల లోడుతో వెళ్తున్న ఓ కంటైనర్ కాల్వలోకి దూసుకెళ్లింది. ఎన్‌హెచ్–16పై రావులపాలెం–రాజమహేంద్రవరం మధ్య ఏటిగట్టు జంక్షన్లో జరిగిన ఈ ప్రమాదంలో లారీ డ్రైవరు ఎస్కే అబ్దుల్, క్లీనర్ ఎస్కే డానేష్ హక్‌లు మృతిచెందారు. తెల్లవారుజామున మంచు కారణంగా జంక్షన్ వద్ద ములుపు కనిపించకపోవడంతోనే ఈ దుర్ఘటన జరిగింది. లఇలా రాష్ట్రంలో గత సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 440 వరకు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 67 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో 250కు పైగా జాతీయ రహదారులపైన జరగ్గా 42 మంది మరణించారు. ఈ ప్రమాదాలకు మితిమీరిన వేగం, డ్రంకెన్ డ్రైవ్, రోడ్డు ఇంజనీరింగ్ లోపాలు ఓ కారణమైతే.. తెల్లవారుజామున మంచు కూడా ఓ ప్రధాన కారణమని రవాణా శాఖ అధ్యయనంలో తేలింది. దీంతో రవాణా శాఖా అధికారులు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. డ్రైవరును ఆపి ముఖం కడుక్కోడానికి నీళ్లివ్వడం, టీ అందించడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డిసెంబరు, జనవరి నెలల్లో మంచు కారణంగా అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని అంచనా వేసిన అధికారులు టోల్గేట్లు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో పోలీసులతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. వీటన్నింటి కోసం ఇటీవలే రూ.120 కోట్లు మంజూరు చేశారు. దీంతో ఎలక్ట్రానిక్ బోర్డులు, రోడ్లపై డైవర్షన్ బోర్డులను రేడియం స్టిక్కర్లతో ఏర్పాటుచేస్తున్నారు. భారీ వాహనాలతో ప్రమాదాలు జాతీయ రహదార్లపై ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) విశ్రాంతి స్థలాలు సరిగ్గా ఏర్పాటుచేయకపోవడంతో రోడ్ల వెంబడే భారీ వాహనాలు నిలిపి ఉంచుతున్నారు. మంచులో కనిపించక వెనుక నుంచి అతివేగంతో వస్తున్న వాహనాలు వీటిని ఢీకొంటున్నాయి. దీంతో అక్కడికక్కడే మరణిస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో పదుల సంఖ్యలో జరిగాయి. మరోవైపు.. నిబంధనల ప్రకారం ఐదు గంటల కంటే ఎక్కువసేపు వాహనాన్ని డ్రైవరు నడపకూడదు. రెండో డ్రైవర్ విధిగా ఉండాలి. కానీ, వాహన యజమానులు రెండో డ్రైవరును పంపకపోవడంతో ప్రమాదాలు అధికమయ్యాయి. ప్రమాదాల నివారణకు నీళ్లు, టీ అందిస్తున్నాం గతేడాది గుంటూరు జిల్లాలో ఒక్క డిసెంబరులోనే మూడు రోజుల వ్యవధిలో పొగమంచు కారణంగా తెల్లవారుజామున 15 మరణాలు చోటుచేసుకున్నాయి. పోలీసుల సహకారంతో ఆ సమయంలో వాహనాలను ఆపి డ్రైవర్లను ముఖం కడుక్కోమని సూచిస్తున్నాం. ఇందుకు నీటిని సమకూరుస్తున్నాం. అలాగే, వారంలో మూడుసార్లు డ్రైవర్లకు టీ అందిస్తున్నాం. – మీరా ప్రసాద్, గుంటూరు డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ పొగమంచు వల్ల.. కంటిచూపుపై ప్రభావం పొగమంచు వల్ల కంటి చూపుపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సాధారణ వెలుగు కంటే మంచులో ప్రయాణం అంటే 40 శాతం చూపు తగ్గిపోతుంది. అదే 40 ఏళ్లు పైబడిన డ్రైవరుకు చత్వారం సమస్య తోడవుతుంది. ఎదురుగా వచ్చే వాహనాల లైటింగ్వల్ల కూడా చూపు తగ్గుతుంది. దీనికి తోడు తెల్లవారుజామున కళ్లు మూతపడతాయి. ఆ సమయంలో డ్రైవర్లకు విశ్రాంతి అవసరం. – డాక్టర్ నరేంద్రరెడ్డి, సూపరింటెండెంట్, కర్నూలు ప్రాంతీయ కంటి ఆస్పత్రి రావులపాలెం–రాజమహేంద్రవరం మధ్య కాల్వలోకి దూసుకెళ్లిన కంటైనర్ -
అదే ఎక్కువగా ప్రాణాలు తీస్తోంది!
సాక్షి, అమరావతి: మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆంధప్రదేశ్‌లో గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 82 శాతం మంది ఈ రెండు కారణాలతో దుర్మరణం చెందారు. ఒక్క మితిమీరిన వేగం కారణంగానే రోడ్డు ప్రమాదాల్లో 72 శాతం మంది మృతి చెందినట్టు కేంద్ర రవాణా శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. అధిక వేగం కారణంగా సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్.. దేశంలో 8వ స్థానంలో నిలిచింది. దక్షిణాదిలో ఏపీ నాలుగో స్థానంలో ఉండగా.. తమిళనాడు 2, కర్ణాటక 3, తెలంగాణ 7, కేరళ 13 స్థానాల్లో ఉన్నాయి. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఈ ప్రమాదాల్లో 80 శాతంపైగా సవ్యంగా, నేరుగా ఉన్న రోడ్లపైనే జరిగాయి. అదికూడా పగటి సమయంలో వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు జరిగినవే కావడం గమనార్హం. దీనిబట్టి రాష్ డ్రైవింగ్ ఎంతలా ప్రమాదాలకు కారణం అవుతుందో అర్థమవుతోంది. రోజుకు 9 మంది మృతి రోడ్డు ప్రమాదాలకు మరో కారణం తాగి నడపడం. డ్రంకన్ డ్రైవింగ్ కారణంగా గతేడాది ఏపీలో 1,345 ప్రమాదాలు జరిగి 85 మంది మృతి చెందారు. ఇక రక్షణ పరికరాలైన హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగించకపోవడంతో రోడ్డు ప్రమాదాల్లో 43 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. హెల్మెట్ ధరించకపోవడంతో 1707 మంది బైకర్లు, 678 మంది రైడర్లు మృతి చెందారు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో 395 మంది డ్రైవర్లు, 451 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. రక్షణ పరికరాలు వాడకపోవడం వల్ల రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో రోజుకు 9 మంది చనిపోతున్నారు. పల్లె దారుల్లోనూ మృత్యుఘంటికలు గ్రామీణ ప్రాంతాల్లోనూ రోడ్డు ప్రమాదాలు అధికంగా నమోదవుతున్నట్టు గణాంకాలు వెల్లడించాయి. రూరల్‌లో 70 శాతం ప్రమాదాలు చోటు చేసుకోగా 76 శాతం మరణాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, మరణాల్లో ఏపీ 7వ స్థానంలో ఉంది. పట్టణ ప్రాంత రోడ్డు ప్రమాదాల్లో 9వ స్థానంలో ఉన్నట్టు కేంద్ర రవాణా శాఖ వెల్లడించింది. పరిమిత వేగం, ట్రాఫిక్ నియమాలు పాటించడం, హెల్మెట్, సీటు బెల్ట్ ధరించడం ఎంతో ముఖ్యమో ఈ గణాంకాలను బట్టి అర్థమవుతోంది. (చదవండి: ప్రేమ హత్యలే అధికం!) -
సినీ హీరో రాజశేఖర్‌కు గాయాలు
శంషాబాద్ రూరల్: శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ హీరో రాజశేఖర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆయన ప్రయాణిస్తున్న టీఎస్07 ఎఫ్‌జడ్1234 నంబర్ గల బెంజ్ కారు బోల్తా పడి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ఆయనకు పెను ప్రమాదం తప్పింది. అయితే వాహనం మాత్రం పూర్తిగా ధ్వంసమైంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజశేఖర్ మంగళవారం రాత్రి ఫిలింసిటీ నుంచి హైదరాబాద్‌కు తన బెంజ్ కారులో డ్రైవింగ్ చేసుకుంటూ బయలుదేరారు. అర్ధరాత్రి 12.50 గంటల సమయంలో పెద్ద అంబర్పేట్ జంక్షన్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపైకి చేరుకున్నారు. అక్కడి నుంచి సుమారు 38 కి.మీ. దూరం ప్రయాణం చేసిన తర్వాత శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ శివారులోకి రాగానే సుమారు 1.15 గంటల ప్రాంతంలో కారు అదుపు తప్పింది. కుడి వైపున ఉన్న డివైడర్‌పై చెట్లను ఢీకొంటూ సుమారు 70 మీటర్ల దూరం వరకు దూసుకెళ్లి రోడ్డు అవతలి వైపున బోల్తా పడింది. కారు రోడ్డు అవతలి వైపు బోల్తా పడిన సమయంలో అటుగా వేరే వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో బయటపడిన రాజశేఖర్ అటుగా వస్తున్న వేరే కారులో గచ్చిబౌలి వైపు వెళ్లిపోయారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే సమాచారం అందడంతో అప్పటికప్పుడే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ రాజశేఖర్ లేకపోవడంతో కారును స్టేషన్‌కు తరలించారు. అతివేగమే కారణం... హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి ర్యాష్ డ్రైవింగే కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఐపీసీ 336, 279 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఔటర్‌పైకి ఎక్కిన అరగంటలోపే ప్రమాదానికి గురి కావడాన్ని బట్టి కారు వేగం గంటకు 120 కి.మీ. నుంచి 140 కి.మీ. మధ్యలో ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే కారు టైరు కూడా పగిలిపోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చన్న దానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనిపై రోడ్డు ట్రాన్స్‌పోర్టు అధికారుల నివేదిక ఆధారంగా ఈ విషయంపై నిర్ధారణకు రానున్నట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు. ఇక రాజశేఖర్ వాహనంపై ఓవర్‌స్పీడ్‌కు సంబంధించి 23 ట్రాఫిక్ చలాన్లున్నాయని చెప్పారు. -
‘వాహన’ నేరాలకూ ఐపీసీ వర్తింపు: సుప్రీం
న్యూఢిల్లీ: వాహనాలను అధిక వేగంతో నడపడం, బాధ్యతారాహిత్యమైన డ్రైవింగ్ వంటివి మోటారు వాహన చట్టాన్ని అతిక్రమించి చేసే నేరాలు. అయితే మోటారు వాహన చట్టాన్ని అతిక్రమించిన వారు భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)ని కూడా అతిక్రమించినట్లేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ రెండూ వాటి పరిధుల్లో చక్కగానే పనిచేస్తున్నాయని, ప్రమాదాల సమయంలో చట్టరీత్యా ఎదుర్కోవాల్సిన విచారణలో కూడా రెండూ సరిగ్గానే ఉన్నాయని అ. మోవా చట్టానికి చెందిన కేసులను ఐపీసీ కింద పరిగణించలేమంటూ 2008 డిసెంబరు 22న గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పును విచారిస్తూ సుప్రీంకోర్టు ఆదివారం ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం ఈ కేసును విచారించింది. మోటారు చట్టంలో ఐసీపీని ప్రవేశ పెట్టొద్దంటూ అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, మిజోరాం, అరుణాచల్, గౌహతి హైకోర్టు ఇచ్చిన సూచనలను పక్కన పెట్టింది. మోటారు చట్టం చెప్పలేదు... బాధ్యతారాహిత్యమైన డ్రైవింగ్, అధిక వేగం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల్లో మరణించినా, తీవ్రంగా గాయపడినా వారికి పడాల్సిన శిక్షపై మోటారు చట్టంలోని చాప్టర్ 8 క్షుణ్నంగా వివరించలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే ఐపీసీ సెక్షన్ 279, 304 పార్ట్–2, 304ఏ, 337, 338లు వివరించాయని తెలిపింది. మోటారు చట్టంలోని చాప్టర్ 8 వాటి వల్ల జరిగే ప్రమాదాలన్నింటిని కలిపి చెప్పిందని పేర్కొంది. వాహన చట్టంలోకి ఐపీసీ అవకాశం ఇస్తే క్రిమినల్ చట్టం కూడా మోటారు చట్టంలో ప్రవేశిస్తుందని తెలిపింది. -
విజయవాడ కరకట్ట మీద కారు బీభత్సం
సాక్షి, విజయవాడ: నగరంలోని అయోధ్యనగర్ కరకట్ట వద్ద కారు బీభత్సం సృష్టించింది. అదుపులేని వేగంతో దూసుకుపోతే రెండు ఆటోలను ఢీకొట్టింది. అంతేకాకుండా అక్కడే ఉన్న బాలుడిని సైతం కారు గుద్దేసింది. దీంతో 13 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. అయినా, ఏమాత్రం పట్టించుకోకుడా కారు ఆపకుండా డ్రైవర్ వెళ్లిపోయాడు. కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా దురుసుగా వాహనాన్ని నడపడంతోనే బాలుడు మృతి చెందాడని స్థానికులు చెప్తున్నారు. -
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద కారు బీభత్సం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద సోమవారం అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఓ వ్యక్తి కారును వేగంగా నడుపుతూ.. సిగ్నల్ వద్ద యూటర్న్ తీసుకోవడానికి ప్రయత్నించడంతో.. వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహయంతో కారును తొలగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలో డ్రైవర్‌కు పెద్దగా గాయాలు కాలేదని తెలుస్తోంది. -
ర్యాష్ డ్రైవింగ్‌పై ప్రశ్నిస్తే.. పోలీసుల బిడ్డలమంటూ..
సాక్షి, హైదరాబాద్ : పోలీసు బైకుపై ముగ్గురు యువకులు అతివేగంగా బంజారాహిల్స్ రోడ్ నెం.12లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ స్థానికుల కంటపడ్డారు. పోలీస్ శాఖ కోట్లు ఖర్చు పెట్టి ప్రజల బందోబస్తు పటిష్టం చేయడానికని కొత్త వాహనాలు కొనిపెడుతుంటే, వారు మాత్రం తమకు తెలిసినవారికి, పిల్లల చేతికిచ్చి దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వ వాహనాన్ని దుర్వినియోగం చేస్తూ ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న యువకులను వీడియా తీస్తూ వివరాల కోసం ఆరా తీస్తే, చెప్పేది పోయి గర్వంగా తాము పోలీస్ బిడ్డలమంటూ దాడిచేయడానికి ప్రయత్నించారు. మాములుగా క్షమించాల్సిన తప్పులను కూడా భూతద్దంలో చూసే మన పోలీసుల్లో కొందరు తమ పిల్లలకు ట్రాఫిక్ నిబంధనలు నేర్పించడంలో మాత్రం విఫలమవుతున్నారు. సాటి తల్లితండ్రులకు సమావేశాలు నిర్వహించి యువత- ర్యాష్ డ్రైవింగ్‌పై అవగాహన కల్పిస్తున్న పోలీసులు ఇలాంటి ఘటనల్లో ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాలి. -
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం..
-
జూబ్లీహిల్స్‌లో కారుతో మందుబాబుల బీభత్సం!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జుబ్లీహిల్స్‌లో మందుబాబులు కారుతో బీభత్సం సృష్టించారు. మితిమీరిన వేగంతో దూసుకుపోతూ.. మెట్రోపిల్లర్‌ను ఢీకొట్టారు. అదృష్టం బాగుండి సమయానికి ఎయిర్బెలూన్లు తెరుచుకోవడంతో కారులోని ముగ్గురు వ్యక్తులకు ప్రాణాపాయం తప్పింది. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు-36 నుంచి కొండాపూర్‌కు వెళ్తుండగా ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు తాగిన మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. మద్యం మత్తులో ఉండటం, అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్ల కారు స్టీరింగ్ అదుపుచేయలేక.. రోడ్డు మీద బీభత్సం సృష్టించారు. మితిమీరిన వేగంగా అజాగ్రత్తగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. ఈ ప్రమాదంలో ఏకంగా కారు డ్రైవింగ్ సీటు వైపున్న టైరు ఊడిపోయింది. కారులో ఉన్న కొండాపూర్‌కు చెందిన జయంత్, పవన్‌తోపాటు మరో వ్యక్తికి తీవ్ర గాయలయ్యాయి. అదృష్టం బాగుండి సమయానికి ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ముగ్గురికీ ప్రాణాపాయం తప్పింది. గాయపడ్డ ముగ్గురిని మాదాపూర్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేసుకొని విచారణ చేపట్టారు. -
ర్యాష్ డ్రైవింగ్‌తో మహిళ హల్చల్
చిక్కడపల్లి: అతివేగంగా కారు నడిపిన ఓ మహిళ పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన సంఘటన ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో చోటు చేసుకుంది. బంజారాహిల్స్‌కు చెందిన దీపాకురానా శుక్రవారం మధ్యాహ్నం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి అశోక్‌నగర్‌వైపు హోండా సిటీ కారులో అతివేగంగా వెళుతూ అశోక్‌నగర్ చౌరస్తా వద్ద బైక్‌పై వెళుతున్న గుర్తుతెలియని వ్యక్తిని ఢీకొట్టి అదే వేగంతో ముందుకు వెళ్లింది. దీంతో స్థానికులు చిక్కడపల్లి పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే స్పందించి కారును వెంబడించి ఆపేందుకు ప్రయత్నించగా, ఆమె ఆపకపోవడంతో మధ్య మండలం కంట్రోల్‌రూమ్ ద్వారా సమాచారం అందుకున్న సైఫాబాద్ పోలీసులు కారును ఐమ్యాక్స్ థియేటర్ వద్ద నిలిపివేశారు. దీంతో ఆమె పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతోపాటు గతంలో సైబరాబాద్ కమిషనర్‌గా విధులు నిర్వహించి, ప్రస్తుతం కేంద్ర సర్వీస్‌లో ఉన్న ఉన్నతాధికిరి సమాచారం అందించింది. దీంతో ఆయన వెంటనే సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ సీఐ గంగారాంకు ఫోన్‌చేసి సదరు మహిళ వద్ద వ్యక్తిగత వివరాలు తీసుకుని వదిలిపెట్టమని ఆదేశించినట్లు సమాచారం. దీంతో సీఐ ఆమెను వదిలివేశారు. సదరు మహిళ తనను కారుతో ఢీకొట్టినట్లు ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు పేర్కొనడం గమనార్హం. -
ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
హైదరాబాద్: మద్యం మత్తులో ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా కారు నడిపి, ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఓ మహిళ తీవ్ర గాయాలపాలై మృతిచెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఐఆర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం టోలిచౌకీలో నివాసముండే మహ్మద్ ఇక్రమ్‌అలీ (26) ఓ కాల్సెంటర్లో పనిచేస్తూ 20 రోజుల క్రితమే ఉద్యోగం మానేశాడు. ఆదివారం రాత్రి బార్కాస్‌లో జరిగిన పార్టీలో పీకలదాకా మద్యం తాగాడు. సోమవారం ఉదయం ఇంటికి కారులో బయలుదేరాడు. మద్యం మత్తులో ఉన్న అలీ ఔటర్‌పై దారితప్పి గచ్చిబౌలి, గౌలిదొడ్డి మీదుగా అతివేగంగా గోపన్‌పల్లి వైపు వెళ్లాడు. ఉదయం 6.30 గంటల సమయంలో గౌలిదొడ్డిలోని ప్రభుత్వ పాఠశాల వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా 60 మీటర్ల దూరంలో పార్క్‌చేసి ఉన్న స్కూటర్‌ను ఢీకొట్టి ఓ ఇంట్లోకి దూసుకుపో యింది. ఇంటి గోడలు ధ్వంసం కావడంతో ఇంట్లో ఉన్న మధుబాయ్(45) అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించగా, చికిత్సపొందుతూ కొద్దిసేపటికే మృతి చెందింది. హౌస్‌కీపింగ్ పనులు చేసుకునే మధుబాయ్ భర్త సట్వాజీ 2010లోనే మృతి చెందాడు. వారికి ఐదుగురు సంతానం. నిందితుడు ఇక్రమ్ అలీని స్థానికులు పోలీ సులకు అప్పగించారు. బ్రీత్ ఎనలైజర్ ద్వారా నిందితుడిని పరీక్షించగా ఆల్కహాల్ శాతం 168 ఎంఎల్‌గా నమోదైంది. పోలీసులు అలీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నెల్లూరులో కారు బీభత్సం.. పలువురికి తీవ్ర గాయాలు
సాక్షి, నెల్లూరు : నగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. పెట్రోల్ బంకులోనుంచి వేగంగా వచ్చిన కారు జనంపైకి దూసుకెళ్లటంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం నెల్లూరు నగరంలోని బొల్లినేని ఆసుపత్రి సమీపంలో చోటుచేసుకుంది. వివరాల మేరకు.. ఈ ఉదయం బొల్లినేని ఆసుపత్రి సమీపంలోని పెట్రోల్ బంకులోంచి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు పదిమంది వ్యక్తులపైకి దూసుకెళ్లింది. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. కారు అంతటితో ఆగకుండా అక్కడి ఆటోలపైకి, బైకులపైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. సంఘటన జరిగిన సమయంలో జనం తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. కారు వేగంగా నడిపి ప్రమాదానికి కారణమైన వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రాష్ డ్రైవింగ్‌పై సుప్రీం కీలక తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ : వాహన ప్రమాద బీమా విషయంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. అజాగ్రత్తగా రాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదానికి గురైన వారికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ వర్తించదని స్పష్టం చేసింది. దిలీప్ భౌమిక్ వర్సెస్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ కేసును జస్టిస్ ఎన్వీ రమణ, ఎస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ మేరకు గతంలో త్రిపుర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. కేసు వివరాలు.. తన రాష్ డ్రైవింగ్ కారణంగా త్రిపురకు చెందిన దిలీప్ భౌమిక్ 2012, మే 20న జరిగిన కారు ప్రమాదంలో మరణించాడు. దిలీప్ మృతికి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి నష్ట పరిహారాన్ని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు కోర్టులో దావా వేశారు. విచారించిన త్రిపుర హైకోర్టు మృతుని కుటుంబ సభ్యులకు 10.57 లక్షల రూపాయలు చెల్లించాలని బీమా కంపెనీని ఆదేశించింది. ఈ తీర్పుపై బీమా కంపెనీ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి వాదనలు వినిపించింది. సొంత తప్పిదం వల్లే కారు ప్రమాదానికి గురై దిలీప్ మరణించాడని పేర్కొంది. మోటార్ వెహికల్స్ చట్టం ప్రకారం దిలీప్ థర్డ్ పార్టీ కిందకి రాడని సుప్రీం కోర్టుకు విన్నవించింది. ఈ వాదనలతో ఏకీభవించిన సుప్రీం కోర్టు అజాగ్రత్తగా డ్రైవింగ్ చేసి ప్రాణాలు కోల్పోయిన దిలీప్ భౌమిక్ మృతికి బీమా కంపెనీ ఎలాంటి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని తీర్పునిచ్చింది. కానీ, వ్యక్తిగత ప్రమాద బీమా పరిహారంగా మృతుని కుటుంబానికి రెండు లక్షల రూపాయలు (వడ్డీ అదనం) చెల్లించాలని తెలిపింది. అయితే, రాష్ డ్రైవింగ్ వల్ల ప్రమాదానికి గురైన ఇతరులకు (థర్డ్ పార్టీ) నష్టపరిహారం చెల్లించే విషయంలో ఈ తీర్పు ఎటువంటి ప్రభావం చూపించబోదని సుప్రీం వెల్లడించింది. -
ర్యాష్ డ్రైవింగ్
జగిత్యాలక్రైం : రయ్..రయ్‌మంటూ కుర్రకారు జోష్.. ఆటోలను ఎలా నడిపిన తమను అడిగేవారు లేరనే ఆటోవాలాల ధీమ.. జగిత్యాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రాత్రయితే చాలు రోడ్లపైకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. బైక్‌పై ముగ్గురేసి యువకులు ఎక్కి హైస్పీడ్‌లో వెళ్తూ సడన్‌గా బ్రేక్‌లు వేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. మధ్యాహ్నం వేళ పోలీసుల నిఘా ఉంటున్నప్పటికీ రాత్రయితే వీరు జోష్ పెంచుతున్నారు. ఎక్కువ శబ్దాలు వచ్చే వాహనాలతో విపరీతమైన వేగంతో వెళ్తున్న వీరి సరదా ఎదుటి వారి ప్రాణాలమీదికి తెస్తుంది. రాత్రి వేళల్లో.. అర్ధరాత్రి ఆటోలు ఎక్కే ప్రయాణికులకు ఆటోవాలాలు తమను గమ్యస్థానాలకు క్షేమంగా చేరుస్తారన్న భరోసా లేకుండా పోతుంది. కొందరు ఆటోవాలాలు నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించుకొని వేగంగా నడుపుతుండడంతో ప్రయాణికులు జంకుతున్నారు. మెల్లగా వెళ్లాలని చెప్పినా పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోయారు. రాత్రి వేళల్లో పోలీసుల నిఘా కరువవడంతోనే వీరి ఆగడాలు శృతిమించుతున్నాయి. నిఘా ఎక్కడా ? రోడ్లపై కొందరు ఆటోవాలాలు, ద్విచక్రవాహనదారులు, కార్లు, జీపులు ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తున్న ప్రధాన చౌరస్తాల వద్ద పోలీసులు, పెట్రోలింగ్ పోలీసులు వీరిని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ర్యాష్ డ్రైవింగ్ చేసేవారిపై పోలీసులు చర్యలు తీసుకుంటే వారిలో మార్పు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. జిల్లాకేంద్రంలో న్యూసెన్స్‌కు పాల్పడేవారిపై ‘ఈ పెట్టి’ కేసులు ఎలా నమోదు చేస్తున్నారో వీరిపై అలాంటి కేసులు పెట్టాలని పలువరు అభిప్రాయపడుతున్నారు. ర్యాష్ డ్రైవింగ్‌పై పోలీసులు నిఘా పెట్టాలని కోరుతున్నారు. భద్రత కల్పించాలి ఆటోలో ప్రయాణించే వారికి భద్రత కల్పించాలి. ముఖ్యంగా ఒంటరిగా ఆటోలో వెళ్తే క్షేమంగా ఇంటికి చేరుతామన్న నమ్మకం కోల్పోతున్నారు. కొందరు ఆటోడ్రైవర్లు రాత్రివేళల్లో ప్రయాణికుల నుంచి రెట్టింపు కంటే ఎక్కువగా ఆటోచార్జీలు వసూలు చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారికి పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించాలి. – కాటిపల్లి మునీందర్‌రెడ్డి, తిమ్మాపూర్ చర్యలు తీసుకుంటాం జిల్లా కేంద్రంలో రాత్రిపూట ఆటోల వేగాన్ని నియ ంత్రించేందుకు చర్యలు చేపడతాం. రాత్రివేళల్లో పెట్రోలింగ్ నిర్వహించే సిబ్బందితో నిఘా పెట్టించి వేగంగా వెళ్లే ఆటోలు, ద్విచక్రవాహనదారులపై చ ర్యలు తీసుకుంటాం. ప్రయాణికులను ఇబ్బదిపెట్టినట్లు ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. – ఆరోగ్యం, ట్రాఫిక్ ఎస్సై, జగిత్యాల -
ఒక్క కారు ఎంత పని చేసిందో..
అసలే బేగంపేట్– పంజగుట్ట మార్గం.. ఆపై పీక్ అవర్స్.. ఇంకేముంది వాహనదారులు చుక్కలు చూశారు. సోమవారం ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో బేగంపేట్ ఫ్లైఓవర్‌పై కారు డివైడర్‌ను ఢీకొట్టి.. దాని మధ్యలో ఆగిపోయింది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు మూడు గంటలైనా పరిస్థితి అదుపులోకి రాలేదు. సాక్షి, సిటీబ్యూరో/సనత్‌నగర్: ఓ వ్యక్తి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వేల మందిని ఇబ్బందుల పాలు చేసింది. అతడి కారు ఫ్లైఓవర్‌పై డివైడర్ ఎక్కడంతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. బేగంపేటలో సోమవారం ఉదయం ఈ ఉదంతం చోటు చేసుకుంది. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించడానికి ట్రాఫిక్ పోలీసులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. పోలీసులు సదరు వాహనచోదకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత నెల 18న చోటు చేసుకున్న ‘జీహెచ్ఎంసీ లారీ బ్రేక్‌డౌన్ పరేషాన్’ను పూర్తిగా మరువక ముందే మరో ‘జామ్’జాటం చోటు చేసుకుంది. నగరంలోని రహదారుల్లో బేగంపేట–పంజగుట్ట మార్గం అత్యంత కీలకమైంది. దీనికి సరైన ప్రత్యామ్నాయం లేకపోవడంతో పాటు సైబరాబాద్‌లోని ఐటీ సెక్టార్‌కు వెళ్లి వచ్చే వాహనాలతో సాధారణ రోజుల్లోనే ట్రాఫిక్ భారీగా ఉంటుంది. వారంలో తొలి పనిదినమైన సోమవారం ఈ ఇబ్బందులు మరీ ఎక్కువ. ప్రస్తుతం కొన్ని మెట్రో స్టేషన్స్ వద్ద పనులు జరుగుతుండటంతో మరికొంత ఇబ్బంది కలుగుతోంది. సోమవారం ఓ వ్యక్తి నిర్లక్ష్యం వాహనచోదకుల నరకానికి కారణమైంది. జనప్రియ లేక్ ప్రాంతానికి చెందిన దివ్యాన్ష కోహిల్ సోమవారం ఉదయం బేగంపేట నుంచి పంజగుట్ట వైపు వెళుతుండగా అతడి ఐ–20 కారు బేగంపేట ఫ్లైఓవర్‌పై వరుణ్ మోటార్స్ వద్ద అదుపు తప్పడంతో సిమెంట్ దిమ్మెలతో కూడిన కొలాబ్సబుల్ డివైడర్‌ను ఢీ కొట్టింది. అప్పటికే వేగంగా ఉన్న కారు దిమ్మెలు తప్పుకోవడంతో ఆ మధ్య నుంచి డివైడర్ పైకి ఎక్కి ఆగిపోయింది. ట్రాఫిక్ పోలీసులు స్పందించి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ముత్తుకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న ఆయన ట్రాఫిక్ క్రమబద్దీకరించడానికి ప్రయత్నించారు. ఫ్లైఓవర్‌పై పంజగుట్ట వైపునకు వెళ్లే ట్రాఫిక్ ఆగిపోగా... రెండో వైపు నుంచి వెళ్తున్న వాహనచోదకులు కారును చూసేందుకు వెహికిల్స్ ఆపుతూ/నెమ్మదిగా పోనివ్వడంతో ఆ వైపు సైతం ట్రాఫిక్ ఆగిపోయింది. దీంతో ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ క్రేన్‌ను రప్పించి వాహనాన్ని దూరంగా తరలించారు. ఈ విషయమై దివ్యాన్ష్‌ను ప్రశ్నించగా... తనకు ఆ సమయంలో కళ్లు తిరిగాయని, అందుకే కారు అదుపు తప్పిందని చెప్పుకొచ్చాడు. నిర్లక్ష్యంగా వాహనం నడపటంతో పాటు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమైన అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బేగంపేట ఇన్స్పెక్టర్ అశోక్‌రెడ్డి తెలిపారు. ‘కారు–డివైడర్’ ఘటనతో బేగంపేట మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. అటు సికింద్రాబాద్... ఇటు పంజగుట్ట రూట్లో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దాదాపు మూడు గంటల పాటు వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ప్రధాన రహదారిని విడిచి గల్లీల నుంచి వెళ్లాలని పలువురు భావించడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగి వాటిలోనూ ట్రాఫిక్ ఆగిపోయింది. కొన్నిచోట్ల శాంతిభద్రతల విభాగానికి చెందిన పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు శ్రమించారు. ఛిద్రమైన రోడ్లు, ఆగిపోయిన ట్రాఫిక్ కారణంగా వాహనాల మైలేజ్ కూడా ఘోరంగా పడిపోయింది. -
విజయవాడలో ర్యాష్ డ్రైవింగ్.. డ్రైనేజ్ గోతిలో పడ్డారు!
సాక్షి, విజయవాడ : నగరంలో యువత పెడధోరణులు తొక్కుతోంది. డ్రైవింగ్ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. ర్యాష్ డ్రైవింగ్‌తో తోటి వాహనదారులను ఇబ్బందిపెట్టడమే కాదు.. కొన్ని సందర్భాల్లో ప్రాణాల మీదకు తెచ్చుకుంటోంది. తాజాగా నగరంలో ఇలాంటి ర్యాష్ డ్రైవింగ్ కారణంగా కారు కరెంట్ పోల్‌ను ఢీకొట్టి డ్రైనేజీ గోతిలో పడింది. అదృష్టం బాగుండి.. ఈ ఘటనలో ఎవరికీ పెద్దగాయాలు కాలేదు. తృటిలో ప్రమాదం తప్పింది. పిన్నమనేని పాలిక్లీనిక్ వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టడంతో వాటర్ ఇంజన్ రెండు ముక్కలైంది. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. డ్రైనేజ్ గోతిలో పడిన వారిని స్థానికులు సురక్షితంగా బయటకు తీశారు. కారులోని యువకుడు మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్టు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి పాల్పడటమే కాదు.. అక్కడికి తన స్నేహితులను పిలిచి యువకుడు హల్చల్ చేశాడు. తననెందుకు వీడియో తీస్తున్నారంటూ కారు డ్రైవ్ చేస్తున్న యువకుడు ప్రశ్నించాడు. ఇంత జరిగినా ట్రాఫిక్ పోలీసులు అసలేం పట్టించుకోలేదు. -
సిటీ బస్సు డ్రైవర్లకు అడ్డు అదుపు లేదు..
సాక్షి, సిటీబ్యూరో: ఒక నిమిషం పాటు ఒక సిటీ బస్సు రోడ్డు మధ్యలో నిలిస్తే ఏమవుతుందో తెలుసా...కనీసం అరకిలోమీటర్ వరకు వాహనాలు నిలిచిపోతాయి. 10 నిమిషాల పాటు ట్రాఫిక్ రద్దీ నెలకొంటుంది. అలాంటిది ఒకేసారి 1000 బస్సులు వేర్వేరు చోట్ల రోడ్డు మధ్యలో నిలిచిపోతే ఎలా ఉంటుంది. కచ్చితంగా మొత్తం అన్నిచోట్లా కలిపితే...500 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించినట్లవుతుంది. విలువైన పనిగంటలు వృథా అవుతాయి. ఉదయాన్నే విధులకు హాజరుకావలసిన సిటీజనులు రోడ్లపైనే పడిగాపులు కాయాల్సి వస్తుంది. సిటీ బస్సుల అడ్డగోలు నిర్వహణ, విచక్షణా రహితమైన డ్రైవింగ్, యథేచ్ఛగా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కారణంగా నగరంలో ఉదయం, సాయంత్రం అదే పరిస్థితి నెలకొంటోంది. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రేటర్లో ప్రతి రోజు తిరిగే 3550 బస్సులు ఒకరకమైన ట్రాఫిక్ టెర్రర్ను సృష్టిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా తిరిగే మరో లక్ష ఆటో రిక్షాలు ఈ ట్రాఫిక్ టెర్రర్‌కు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ విషయాలే వెల్లడయ్యాయి. యథేచ్చగా ‘బే’ఖాతరు... నగరంలో సుమారు 2 వేల బస్టాపులు, మరో 500 బస్‌బేలు ఉన్నాయి. ఇవి కాకుండా రెతిఫైల్, దిల్సుఖ్నగర్, సనత్‌నగర్, కోఠి, కాచిగూడ, ఫలక్‌నుమా, తదితర ప్రాంతాల్లో బస్స్టేషన్లు ఉన్నా యి. బస్స్టేషన్లలో నిలిచే బస్సులు మినహాయించి మిగతా వాటిలో 80 శాతం రోడ్లపైనే ఆపేస్తున్నారు. బస్టాపులు, బస్‌బేలకు దూరంగా రోడ్డు మధ్యలో ఆపుతున్న అడ్డదిడ్డంగా నడిపేబస్సులు వల్ల ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోతుంది.వాహనాల రాకపోకలు, ఇరుకు రోడ్ల కారణంగా నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ రెతిఫైల్ బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్, గురుద్వారా, తదితర ప్రాంతాల్లో అడ్డగోలుగా తిరిగే బస్సులు ఆ ట్రాఫిక్ రద్దీని మరింత విషవలయంగా మారుస్తున్నాయి. ఉదాహరణకు రెతిఫైల్ వద్ద ‘యు’ టర్న్ తీసుకొనేందుకు అవకాశం లేదు. కానీ బస్సులన్నీ అక్కడే యూటర్న్ తీసుకోవడం వల్ల తీవ్రమైన రద్దీ నెలకొంటోంది. ఉప్పల్ నల్లచెరువు నుంచి ఉప్పల్ క్రాస్ రోడ్డు వరకు రెండు వైపులా ఆరు బస్టాపులు ఉన్నాయి. ఈ బస్టాపుల్లో కాకుండా రోడ్డు మధ్యలో నిలిపివేయడం వల్ల రెండు వైపులా బోడుప్పల్ చౌరస్తా నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు కనీసం 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోతుంది. హబ్సిగూడ, తార్నాక, సికింద్రాబాద్, హిమాయత్‌నగర్, దిల్‌షుఖ్‌నగర్, కోఠీ, ఆబిడ్స్, తదితర అన్ని ప్రాంతాల్లో బస్‌బేలు, బస్టాపులు ఉన్నప్పటికీ రోడ్లపైనే దర్జాగా ఆపేస్తున్నారు. ఎక్కేదెలా దిగేదెలా.... ఏ బస్సు ఎక్కడ ఎప్పుడు ఆగుతుందో తెలియదు.ఎప్పుడు కదులుతుందో తెలియదు. దీంతో ప్రయాణికులు బస్సెక్కాలన్నా, దిగాలన్నా కష్టంగానే ఉంటుంది. బస్టాపులో నించున్న ప్రయాణికులు వాహనాలను దాటుకొని రోడ్డు మధ్యలో ఉన్న బస్సును చేరుకోవాలి. కానీ అప్పటికే ఆ బస్సు ఆగి. ముందుకు కదులుతుంది. బస్సు దగిన వాళ్లు ట్రాఫిక్ మధ్యలోంచి రోడ్డు చివరకు రావడం కూడా దుస్సాధ్యంగా మారింది. మరోవైపు ఒకటెనుక ఒకటి వరుసగా వచ్చే నాలుగైదు బస్సులు ఒకేసారి రోడ్డు మధ్యలోనే ఆగిపోవడం వల్ల వాహనదారులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. బస్టాపులో బస్సు నిలిపి ప్రయాణికులను ఎక్కించుకొనేందుకు అవకాశం ఉన్నప్పటికీ చాలా మంది డ్రైవర్లు ఏ మాత్రం లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా రోడ్లపైనే ఆపేస్తున్నారు.అడ్డగోలు డ్రైవింగ్ కారణంగా ప్రతిరోజు లక్షలాది మంది వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ సంస్థాగతమైన క్రమశిక్షణాచర్యలు తీసుకోవడంలో ఆర్టీసీ ఘోరమైన ఉదాసీనతను ప్రదర్శిస్తోంది. దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్య మరింత నరకప్రాయంగా మారింది. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ భయానకంగా మారుతుంది. అమీర్‌పేటలో ఇలా.. కేసులంటే లెక్కలేదు... బస్‌బేల్లో బస్సులు ఆపకపోవడం వల్ల అనేక చోట్ల అవి ఆటోరిక్షాలకు అడ్డాలుగా మారాయి. బస్‌బేల్లో ఆటోలు ఉండడం వల్లనే బస్సులు రోడ్లపైన ఆపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.కానీ బస్సులను సక్రమంగా బస్టాపుల్లో,బస్‌బేల్లో నిలపకపోవడం వల్లనే ఆటోలు పాగా వేస్తున్నాయని పోలీసులు, ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై ప్రతి నెలా సగటున 1000 నుంచి 1500 కేసులు నమోదవుతున్నాయి. వీటిలో విచక్షణారహితమైన పార్కింగ్, రోడ్డు మధ్యలో నిలిపే బస్సులే 60 శాతం ఉన్నాయి.35 శాతం సిగ్నల్ జంపింగ్ కేసులు ఉంటే మరో 5 శాతం వరకు సెల్‌ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన కేసులు ఉన్నాయి. ఇవి కేవలం పోలీసులు నమోదు చేసినవి. కానీ పోలీసుల దృష్టిలో పడకుండా ఇష్టారాజ్యంగా నిబంధనలు ఉల్లంఘించే నడిపే డ్రైవర్లు, బస్సులు ప్రతి రోజు వెయ్యికి పైగా ఉంటాయని అంచనా. అమలుకు నోచని క్యూరెయిలింగ్... ముంబయి తరహాలో సిటీ బస్సుల రాకపోకలపైన నియంత్రణ, ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాన్ని కల్పించే లక్ష్యంతో క్యూ రెయిలింగ్‌ల ఏర్పాటు కోసం జరిపిన అధ్యయనం అటకెక్కింది.నగరంలోని కూకట్పల్లి,ఈఎస్ఐ,కేపీహెచ్‌బీ,ఎన్ఎండీసీ,సరోజినీదేవి ఆసుపత్రి,నానల్‌నగర్,బాపూనగర్,లకిడికాఫూల్, నాంపల్లి, గృహకల్ప,లోతుకుంట,బోయిన్పల్లి,తదితర చోట్ల బస్‌బేలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. బస్‌బేల పరిస్థితి ఇది... నగరంలో తిరిగే బస్సులు : 3550 వివిధ మార్గాల్లో ఉన్న బస్టాపులు : 2000 బస్షెల్టర్లు : 1307 ప్రస్తుతం ఉన్న బస్ బేలు : 500 జీహెచ్ఎంసీ ప్రతిపాదించిన బస్‌బేలు :220 క్యూరెయిలింగ్ కోసం ప్రతిపాదించినవి : 14 కొత్తగా కట్టించిన బస్‌బేలు : లేవు -
మద్యం మత్తులో మాజీ కార్పొరేటర్ కొడుకు బీభత్సం..
సాక్షి, హైదరాబాద్ : నగరంలో శుక్రవారం అర్ధరాత్రి తెలుగు తల్లి విగ్రహం వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులు హిమాయత్‌నగర్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలివి.. మద్యం మత్తులో ఓ వ్యక్తి ర్యాస్ డ్రైవింగ్ చేయడంతో కారు ప్రమాదానికి గురైంది. ఆ కారు నడిపిన వ్యక్తి మాజీ కార్పొరేటర్ మధు గౌడ్ కుమారుడు అక్షయ్ కుమార్ గౌడ్ అని గుర్తించారు. మధు గౌడ్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తమ్ముడు. మద్యం సేవించిన అక్షయ్ బాధితులను పట్టించుకోకుండా అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ప్రమాదంలో గాయపడిన వారు కావాడిగూడకు చెందిన సాయి, ఆకేశ్ గౌడ్లుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ర్యాష్ డ్రైవింగ్.. మహిళ మృతి
సాక్షి, ఆదిలాబాద్ : ఆటో డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలివి.. బస్టాండ్ సమీపంలో ఓ వ్యక్తి రోడ్డు క్రాస్ అవుతున్నాడు. అదే సమయంలో అటువైపుగా ఓ ఆటో వేగంతో దూసుకొచ్చింది. రోడ్డు క్రాస్ అవుతున్న వ్యక్తిని తప్పించబోయి ఆటో డివైడర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ సంఘటన స్థలంలోనే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. రోడ్డు క్రాస్ అవుతున్న వ్యక్తిని ఆటో ఢీకొట్టడంతో అతడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ర్యాస్ డ్రైవింగ్ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అంతేకాక ప్రమాద సమయంలో అక్కడున్న కొందర్ని అడిగి సమాచారం సేకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆటో డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలి
-
హనుమాన్ ఆలయాన్ని ఢీకొట్టిన బైక్
పర్లాకిమిడి: గుసాని సమితి కత్తలకవిటి గ్రామం వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. జంగాలపాడు గ్రామం నుంచి మోటార్ సైకిల్‌పై బయలుదేరిన ముగ్గురు యువకులు వేగంగా వెళ్తూ కత్తలకవిటి గ్రామం మలుపు వద్ద ఉన్న హనుమాన్ మందిరాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న చిన్మయపాత్రో(20) సంఘటనా స్థలంలో మృతిచెందాడు. మరో ఇద్దరు తీవ్రగాయాలపాలవడంతో పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన వారిలో ఆర్.చందు, మిన్నా నాయక్‌ను మెరుగైన వైద్యం కోసం పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రి నుంచి బరంపురం ఎంకేసీజీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. బరంపురం మెడికల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరో వ్యక్తి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా అతి వేగమే చిన్మయ పాత్రో ప్రాణం తీసిందని సంఘటనా స్థలంలోని గ్రామస్తులు తెలిపారు. గురండి పోలీసులు కేసును నమోదు చేసుకుని విచారిస్తున్నారు. -
బ్రేక్ వేయబోయి వృద్ధుడిని బలిగొని..
సాక్షి, న్యూఢిల్లీ : డ్రైవింగ్ నేర్చుకుంటున్న యువతి బ్రేక్ వేయబోయి ఎక్సలేటర్ నొక్కడంతో ఎదురుగా వస్తున్న వృద్ధుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆ మహిళకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని పోలీసులు పేర్కొన్నారు. కీర్తి వల్లభ్ అనే 72 సంవత్సరాల వృద్ధుడు వాకింగ్ చేస్తుండగా సంతోషి దేవి (29) అనే మహిళ డ్రైవింగ్ చేస్తూ కారు అదుపుతప్పడంతో వృద్థుడిపైకి దూసుకెళ్లింది. వల్లభ్ చేతులు పైకెత్తి ఆమెను వారించినా తొందరపాటులో బ్రేక్ వేయబోయి ఎక్సలేటర్‌ను ప్రెస్ చేయడంతో వాహనం ఆయనను ఢీ కొంది. ఈ ఘటనలో వల్లభ్ మరణించగా సంతోషిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ మరణానికి కారణమయ్యారనే ఆరోపణలు నమోదు చేశారు. కారు ఆమె భర్తది కావడంతో ఆయనపైనా పోలీసులు చర్యలు చేపట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. బ్రేక్ వేయబోయిన తాను భయంతో ఎక్సలేటర్‌ను ప్రెస్ చేసినట్టు విచారణలో సంతోషి దేవి పోలీసులకు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో వల్లభ్ కుమార్తె ఇంట్లో లేరని, పోలీసులకు ఎవరూ సమాచారం అందించలేదని సమాచారం. ఇరుగుపొరుగు వారు తనకు ఫోన్ ద్వారా సమాచారం అందచేయడంతో భర్తతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నామని వల్లభ్ కుమార్తె చెప్పారు.ప్రమాదంలో గాయపడిన తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించారని వైద్యులు నిర్ధారించారని చెప్పారు. ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించడంతో సంతోషి దేవిని పోలీసులు ఆమె నివాసంలో అరెస్ట్ చేశారు. -
బెయిల్‌పై ఈశాన్యరెడ్డి విడుదల
సాక్షి, హైదరాబాద్: ర్యాష్ డ్రైవింగ్‌తో ప్రాణాన్ని బలితీసుకున్న కేసులో చంచల్‌గూడ మహిళా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఈశాన్యరెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మంగళవారం సాయంత్రం జైలు నుంచి విడుదలైంది. కుషాయిగూడ డీఏఈ కాలనీలో ఆదివారం రాత్రి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తిపై కారు ఎక్కించి అతని మృతికి కారణమైన ఇంజినీరింగ్ విద్యార్థిని ఈశాన్యరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ మహిళ జైలుకు తరలించారు. ఎట్టకేలకు ఆమెకు బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలైంది. -
ఆ యువతుల్లో మద్యం తాగింది ఒక్కరే!
సాక్షి, హైదరాబాద్: అతివేగంగా కారు నడిపి, ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న చర్మకారుడిని హత్యచేసిన యువతుల ఉదంతం నగరంలో కలకలం రేపుతున్నది. కుషాయిగూడ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి దర్యాప్తు వివరాలను సీఐ చంద్రశేఖర్ మీడియాకు వివరించారు. ఎలా జరిగింది?: ఏఎస్‌రావ్ నగర్లో స్నేహితులతో కలిసి పార్టీలో పాల్గొన్న నలుగురు యువతులు.. అర్ధరాత్రి తర్వాత స్కోడా కారులో కుషాయిగూడవైపు కదిలారు. అతివేగంగా కారును నడుపుతూ ఫుట్‌పాత్‌పైకి దూసుకొచ్చారు. దీంతో ఫుట్‌పాత్‌పై నిద్రించిన అశోక్ అనే చర్మకారుడు(చెప్పులు కుట్టుకునే వ్యక్తి) దుర్మరణం చెందాడు. పక్కనున్న మరో వ్యక్తికీ గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థిలికి చేరుకుని యువతులను అదుపులోకి తీసుకున్నారు. నలుగురు యువతుల్లో ఓ సీఐ కూతురు: ‘‘ఘటన జరిగినప్పుడు ఈశాన్య రెడ్డి అనే యువతి డ్రైవింగ్ సీటులో కూర్చున్నారు. కారు రిజిస్ట్రేషన్ కూడా ఆమె పేరుమీదే ఉంది. కారులో మలక్‌పేట్ సీఐ గంగారెడ్డి కూతురు హారికా రెడ్డితోపాటు మరో ఇద్దరు యువతులు ఉన్నారు. ఆ నలుగురిలో ఒక్కరు మాత్రమే మద్యం సేవించి ఉన్నారు. ప్రాధమిక దర్యాప్తు అనంతరం ఐపీసీ సెక్షన్ 304కింద కేసు నమోదుచేశాం. అశోక్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంపాం’’ అని కుషాయుగూడ సీఐ చంద్రశేఖర్ మీడియాతో అన్నారు. -
మద్యం మత్తులో ఓవర్ స్పీడుతో కారు నడిపి..
-
ఎస్పీ ఆఫీసు ఎదుటే కారు బీభత్సం
సాక్షి, కాకినాడ: పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ ఇండికా కారు హల్ చల్ చేసింది. సాక్షాత్తూ ఎస్పీ కార్యాలయం ఎదుట పోలీసులను ఢీకొడుతూ ఓ గుర్తు తెలియని వ్యక్తి కారును నడపటం కలకలం రేపింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ట్రాఫీక్ పోలీసులు తాజాగా విడుదల చేశారు. ఆదివారం సాయంత్రం 4:45 గంటల ప్రాంతంలో ఎస్పీ ఆఫీసు ఎదుట పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. వారి వద్ద నుంచి తప్పించుకునే యత్నంలో ఇండికా కారు డ్రైవర్ పోలీసుల పైనుంచి దూసుకుపోయింది. కారు ఆపడం లేదని గ్రహించిన ఓ పోలీసు బారికేడ్ అడ్డు పెట్టినా అతడిని ఢీకొడుతూ డ్రైవర్ ఆ కారును నడిపాడు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ కి గాయాలు అయ్యాయి. బానుగుడి వైపు వెళ్తున్న కారును ట్రేస్ చేసిన పోలీసులు ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కొందరు బైకర్స్ కారును ట్రేస్ చేసేందుకు పోలీసులకు లిఫ్ట్ ఇవ్వడం వీడియోలో కనిపిస్తుంది. -
పోలీసులు తనిఖీలలో కారుతో హల్ చల్
-
మద్యం మత్తులో టెక్కీ ర్యాష్ డ్రైవింగ్..
-
టెక్కీ ర్యాష్ డ్రైవింగ్.. ఆటో డ్రైవర్ మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగుతున్న తాగుబోతు డ్రైవర్ల ఆగడాలు మాత్రం రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. టెక్కీ నవీన్ మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించాడు. టెక్కీ ర్యాష్ డ్రైవింగ్‌తో ముందుగా వెళ్తున్న ఆటోను ఢీకొట్టాడు. ప్రమాద సమయంలో కారు ఆటోను కొంతదూరం అలానే ముందుకు ఈడ్చుకెళ్లింది. తీవ్ర గాయాలైన ఆటో డ్రైవర్ రఫిక్ ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్‌లు తెరుచుకోవడంతో టెక్కీ ప్రాణాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. బేగంపేట పోలీసులు టెక్కీ నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు బావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
రచ్చ రచ్చ చేసి ఇలా దొరికిపోయారు
-
రచ్చ రచ్చ చేసి ఇలా దొరికిపోయారు
కాన్సాస్ : సినిమాను తలపించే రేంజ్లో చేజ్ జరిగింది. అయితే, అదెదో దొంగలనో.. ఉగ్రవాదులనో కాదు.. డ్రగ్స్ మత్తులో తూలుతున్న ముగ్గురు యువకులను. కళ్లు చెదిరే హైస్పీడ్ డ్రైవింగ్‌తో ఏ వాహనాలను దాటవేసుకుంటూ వెళుతున్నామో అనే అంశాన్ని కూడా లెక్కచేయకుండా చూసేవారికి ఒళ్లు జలదరించేంత వేగంతో వెళుతున్న వారిని పోలీసులు తరిమారు. దాదాపు పన్నెండు నిమిషాలపాటు ఈ వేట కొనసాగింది. చివరకు పోలీసుల ధాటికి తట్టుకోలేక వారు లొంగిపోయారు. ఎక్కడ తమవైపు బుల్లెట్లు దూసుకొని వస్తాయో అని వెంటనే కారు డోర్లు తీసి నేలపై పడుకున్నారు. దీంతో ఒకరు కాదు ఇద్దరు కాదు బృందాలుగా వచ్చిన పోలీసులు వారిని మొకాళ్లతో తొక్కిపట్టి చేతులు వెనక్కి విరిచి చేతులకు బేడీలు తగిలించారు. ఈ దృశ్యాలు కాన్సాస్‌లో రోడ్లపై నమోదయ్యాయి. పోలీసులు వివరాల ప్రకారం ఆ యువకులంతా కూడా ఫుల్లుగా మత్తులో ఉన్నారు. డ్రైవింగ్ చేసే క్రమంలో కొన్నివాహనాలను ఢీకొట్టారు. మధ్యలో మూడు చోట్ల డ్రగ్స్ ప్యాకెట్లు పడేశారు. చేజింగ్ ఎలా చేశారో ఈ వీడియోలో మీరే చూడండి. -
కారు స్వైరవిహారం: ఇద్దరు పిల్లలకు గాయాలు
సాక్షి, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నెమలిపేటలో ఓ కారు స్వైరవిహారం చేసింది. ఇద్దరు పిల్లలను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. పిల్లలు గాయపడడంతో ఆ కారుని ఆపడానికి ప్రయత్నించిన రెండు వాహనాలను కూడా ఢీకొట్టి కారును నడుపుతున్న వ్యక్తి తప్పించుకుని వెళ్లిపోయాడు. పారిపోతున్న వాహనదారుడిని అశ్వారావుపేటలో స్థానికులు అడ్డగించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని ప్రభుత్వ వైద్యుడు రాజశేఖర్ గా గుర్తించారు. -
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం
సాక్షి, హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లో శనివారం అర్ధరాత్రి తృటిలో పెనుప్రమాదం తప్పింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి అతివేగంగా కారునడుపుతూ డివైడర్‌ను ఢీకొట్టాడు. తర్వాత కారు అదుపుతప్పి గాల్లో పల్టీలు కొట్టి కరెంట్ స్తంభాన్ని కూడా ఢీకొట్టింది. కారు వేగానికి కరెంటు స్తంభం కూలిపోయింది. ఈ సంఘటన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. సంఘటనా స్థలంలో కారు వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. ఈ కారును ఫరీద్ అనే డ్రైవర్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గురైన కారు నెంబర్ - టీఎస్ 07 యూఏ 0509. కాగా, ఇటీవలే మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ కారణంగా జూబ్లీహిల్స్ రోడ్ నెం 10 లో రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వేగంగా వచ్చిన కారు స్కూటీని ఢీకొట్టడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరు యువతులు తీవ్రంగా గాయపడ్డారు. -
మద్యం సేవించి సీఐ ర్యాష్ డ్రైవింగ్
సాక్షి, హైదరాబాద్: ఓ సీఐ మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేసిన సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. సికింద్రాబాద్ రైల్వే సీఐ చంద్రయ్య మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేశారు. మితి మీరిన వేగంతో ప్రమాణిస్తూ ముగ్గురిని గాయపరిచారు. బాధితుల ఫిర్యాదుతో పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. -
బేగంపేటలో యువతి వీరంగం!
-
బేగంపేటలో యువతి వీరంగం!
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని బేగంపేటలో ఓ యువతి హల్చల్ చేసింది. రద్దీగా ఉన్న రోడ్డుపై తన కారుతో ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేసుకుంటూ వాహనదారుల పైకి దూసుకెళ్లగా.. క్షణాల్లో అప్రమత్తమైన నలుగురైదు వాహనదారులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్ పై ప్రశ్నించినందుకు ఓ సిగ్నల్ వద్ద ట్రాఫిక్ పోలీసుల ఎదుటే యువతి వీరంగం చేసింది. తనను ప్రశ్నించిన వాహనదారులను బూతులు తిట్టడంతో పాటు వారిపై దాడికి పాల్పడింది. అక్కడే ఉన్న ఓ వాహనదారుడు యువతి చర్యలను వీడియో తీయడంతో విషయం బయటకు వచ్చింది. హౌ డేర్ యూ అంటూ ఓ వాహనదారుడిపై ట్రాఫిక్ పోలీసు ఎదుటే దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. ట్రాఫిక్ పోలీసు సర్దిచెబుతున్నా.. ఆగ్రహంగా తనను అడ్డుకుని ప్రశ్నించిన వారిపై ఇష్టారీతిన నోరు పారేసుకుంటూ వెళ్లి తన కారు ఎక్కింది. అక్కడి నుంచి యువతి సైనిక్ పురి వైపుగా వెళ్లినట్లు సమాచారం. ఆ యువతి ఎవరు.. ఆమె మద్యం సేవించి వాహనం నడిపిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. యువతిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు చర్యలు తీసుకుంటామన్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేసి.. ఆపై పోలీసు ఎదుటే వీరంగం -
అంబటి రాయుడి రౌడీయిజం
-
ర్యాష్ డ్రైవింగ్: మాజీ క్రికెటర్‌పై కేసు
కటక్: అతివేగంగా కారు నడిపి పలు వాహనాలను ఢీకొట్టటంతో పాటు ఒకరు గాయపడటానికి కారణమైన మాజీ క్రికెటర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒడిశా రంజీ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ హలధర్ దాస్ ఆదివారం సాయంత్రం కటక్‌లో బైపాస్‌రోడ్‌లోని ఛాహతాఘాట్ వద్ద అతివేగంగా కారు నడిపి పలు వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో వాహనాలు ధ్వంసం కావటంతో పాటు ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బిదనాసి పోలీసులు హలధర్దాస్ను విచారించారు. హలధర్దాస్ కారు కూడా ఘటనలో దెబ్బతిందని పోలీసులు తెలిపారు. ఒడిశా రంజీ టీంకు 2006 నుంచి 2009 వరకు ఆయన కెప్టెన్‌గా ఉన్నారు. 2008 లో ఆ రాష్ట్ర జట్టుకు నాయకత్వం వహించారు.