వాద్రా కారుని ప్రమాదకరంగా ఓవర్ టేక్ చేసిన వ్యక్తి అరెస్ట్! | Businessman fined for 'dangerously' overtaking Robert Vadra's car | Sakshi
Sakshi News home page

వాద్రా కారుని ప్రమాదకరంగా ఓవర్ టేక్ చేసిన వ్యక్తి అరెస్ట్!

Published Fri, Jan 10 2014 12:34 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

వాద్రా కారుని ప్రమాదకరంగా ఓవర్ టేక్ చేసిన వ్యక్తి అరెస్ట్! - Sakshi

వాద్రా కారుని ప్రమాదకరంగా ఓవర్ టేక్ చేసిన వ్యక్తి అరెస్ట్!

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ప్రయాణిస్తున్న కారును అతివేగంగా, అతి ప్రమాదకరంగా ఓవర్ టేక్ చేసిన స్థానిక వ్యాపారస్టుడికి పోలీసులు జరిమానా విధించారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ప్రయాణిస్తున్న కారును అతివేగంగా, అతి ప్రమాదకరంగా ఓవర్ టేక్ చేసిన స్థానిక వ్యాపారస్టుడికి పోలీసులు జరిమానా విధించారు. ఓక్లా నుంచి వాద్రా తన కారులో వస్తుండగా అగ్నేయ ఢిల్లీలోని అమర్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగిందని పోలీసు వర్గాలు తెలిపాయి. స్థానిక వ్యాపారస్తుడు పశ్చిమ్ విహార్ ప్రాంతానికి చెందిన సురభ్ రస్తోగిగా గుర్తించారు. 
 
మారుతి రిట్జ్ కారులో రస్తోగి లాజ్ పత్ నగర్ నుంచి మోతి మిల్స్ కు వెళుతూ వాద్రా కారును అతివేగంగా ప్రమాదకర రీతిలో సుడులు తిప్పుతూ ఓవర్ టేక్ చేసినట్టు పోలీసుల కేసు నమోదు చేశారు. మితీ మీరిన వేగంతో కారును నడుపుతున్న వ్యక్తిపై వాద్రా భద్రతా సిబ్బంది ఫిర్యాదు చేశారు. దాంతో మోటార్ వెహికిల్ యాక్టు కింద సెక్షన్ 184 ప్రకారం రస్తోగికి అరెస్ట్ చేసి జరిమానా విధించారు. ఆతర్వాత రస్తోగిని విడుదల చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement