
న్యూఢిల్లీ : ప్రస్తుత ఈడీ ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా.. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించబోతున్నారు. త్వరలోనే క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానని ఆయన తన మనసులోని మాటను వెల్లడించిన సంగతి తెలిసిందే. హరియాణాలో భూకుంభకోణాలు, మనీ లాండరింగ్ అభియోగాలను ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్రాపై ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈడీ కేసుల నుంచి నిర్దోషిగా బయటపడిన అనంతరం తాను రాజకీయాల్లోకి వస్తానని, రాజకీయాల్లో పెద్ద పాత్ర పోషించాలని భావిస్తున్నానని వాద్రా ఇప్పటికే తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లో నామినేషన్లు దాఖలు చేసిన తర్వాత తాను ప్రచారగోదాలోకి దిగుతానని, కాంగ్రెస్ పార్టీ తరఫున తాను ప్రచారం చేయనున్నానని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment