breaking news
Congress Party
-
కాంగ్రెస్ అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేకపోయింది: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న స్థాయిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయిందన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరుద్యోగులు పోషించిన పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. ప్రభుత్వానికి, నిరుద్యోగులకు మధ్య వారధిగా తాను పనిచేస్తానని రాజగోపాల్‌రెడ్డి చెప్పుకొచ్చారు.నిరుద్యోగుల ఆహ్వానం మేరకు హైదరాబాదులోని గన్ పార్క్‌లో నిరుద్యోగులతో కలిసి అమరవీరుల స్థూపానికి మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం, గన్‌పార్క్ దగ్గర రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘నిరుద్యోగులు అధైర్య పడకండి నిరసనలు ధర్నాలు మానుకోండి మీ సమస్యలు వినడానికి అవసరమైతే అశోక్ నగర్ చౌరస్తా, సెంట్రల్ లైబ్రరీకి, దిల్సుఖ్నగర్కి నేనే వస్తాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరుద్యోగులు పోషించిన పాత్ర వెలకట్టలేనిది. పదేళ్లలో నిరుద్యోగుల కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక గ్రూప్ వన్ కూడా వేయలేకపోయారు. బీఆర్ఎస్ పాలన కుటుంబ పాలనగా కొనసాగి అవినీతిమయంగా మారి దోచుకుని అప్పుల పాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు తెలంగాణ యువత కేసీఆర్ ఫామ్ హౌస్‌కు పంపించడానికి పోషించిన పాత్ర అమోఘమైనది. ప్రజా ప్రభుత్వం వచ్చాక 50వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. అనుకున్న స్థాయితో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయాం. నిరుద్యోగులకు అండగా ఉంటా అధైర్య పడకండి. చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. పేదల ప్రభుత్వం ఇది. ప్రజల ప్రభుత్వం సెప్టెంబర్ 17ను కూడా ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సోనియాగాంధీ కలలు కన్న తెలంగాణ రాష్ట్రం పదేళ్ల కాలంలో సాకారం కాలేదు. రాబోయే రోజుల్లో మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయిప్రతీ ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం అనేది సాధ్యమయ్యే పని కాదు. అయినా ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు చదువుకున్న యువత తమ కాళ్ల మీద నిలబడేలా ఉపాధి మార్గాలు చూపిస్తాం. మీకు న్యాయం జరిగే వరకూ మీ సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్య వారధిగా పని చేస్తాను. నిరుద్యోగులకు ధైర్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చా.. నిరుద్యోగులు అధైర్య పడకండి. నిరసనలు, నిర్బంధాలు ధర్నాలు అవసరం లేదు’ అని చెప్పుకొచ్చారు. -
మోదీ వీడియో.. కాంగ్రెస్‌కు ఝలక్
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి పాట్నా హైకోర్టు ఝలక్ ఇచ్చింది. ఇటీవల ప్రధాని మోదీ, ఆయన తల్లి హీరాబెన్‌పై కాంగ్రెస్ రూపొందించిన ఏఐ వీడియోపై పాట్నా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వెంటనే ఏఐ వీడియోను తొలగించాలని కాంగ్రెస్‌ను ఆదేశించింది.వివరాల ప్రకారం.. ప్రధాని మోదీ, ఆయన తల్లి హీరాబెన్‌పై కాంగ్రెస్ రూపొందించిన ఏఐ వీడియో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ బీహార్ యూనిట్ సోషల్ మీడియాలో ఈ వీడియోను ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై బీజేపీ, ఎన్డీయే మిత్రపక్షాలు తీవ్రంగా ఖండించాయి. దీంతో, బీజేపీ నేతలు పలుచోట్ల కాంగ్రెస్ పార్టీపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే దీనిపై విచారణ జరిపిన పాట్నా హైకోర్టు వాటిని వెంటనే తొలగించాలని కాంగ్రెస్‌ను ఆదేశించింది. ఈ సందర్బంగా చీఫ్ జస్టిస్ పీబీ బజంత్రి.. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుండి తొలగించాలని ఆదేశించారు.Bihar Congress posted this AI Generated Video about Narendra Modi and his mother.These people were screaming only a couple of weeks ago that they had nothing to do with abuse hurled at the Prime Minister's mother.Now they do this.Shocking behaviour. pic.twitter.com/rTsrZtpRFA— Sensei Kraken Zero (@YearOfTheKraken) September 11, 2025బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వ్యక్తిగత విమర్శలకు దిగడం తీవ్ర కలకలం సృష్టించింది. బీహార్ కాంగ్రెస్ విభాగం నేరుగా సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ ఏఐ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. సాహబ్ కలలో అమ్మ .. ఆ తర్వాత ఏం జరిగిందో చూసేయమంటూ.. ఆ వీడియో ఉంది. అందులో ప్రధాని మోదీని పోలిన క్యారెక్టర్.. ‘‘ఈరోజు ఓట్ల దొంగతనం(Vote Chori) అయిపోయింది.. ఇప్పుడు హాయిగా నిద్రపోవచ్చు అని కళ్లు మూసుకుంటుంది. ఆ వెంటనే హీరాబెన్‌ను పోలి ఉన్న పాత్ర కలలో ప్రత్యక్షమై.. "ఓట్ల కోసం నా పేరును ఉపయోగించడంలో ఎంత దూరం వెళ్తావు? రాజకీయాల్లో నీతిని మరచిపోయావా? అని అంటుంది. ఈ మాటలతో నిద్రపోతున్న వ్యక్తి ఆశ్చర్యంతో మెలకువకు వస్తాడు.ఈ వీడియోపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేస్తోంది. బీజేపీ ఎంపీ రాధా మోహన్ దాస్ అగర్వాల్ కాంగ్రెస్ విడుదల చేసిన AI వీడియోపై తీవ్రంగా స్పందించారు.. ఈ వీడియో రాజకీయాల్లో దిగజారిన స్థాయికి నిదర్శనమని అన్నారాయన. రాహుల్ గాంధీ సూచన మేరకే బీహార్ కాంగ్రెస్ యూనిట్ ఈ వీడియోను రూపొందించిందని ఆరోపించారాయన. ప్రధాని మోదీ ఎప్పుడూ కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచారని, కానీ ఇప్పుడు ఆయన తల్లి హీరాబెన్‌ను రాజకీయాల్లోకి లాగి మరీ కాంగ్రెస్ దాడి చేయడం బాధాకరం అని పేర్కొన్నారు. టెక్నాలజీని ఉపయోగించి దేశాన్ని తప్పుదోవ పట్టించడమే కాకుండా.. మోదీ సహా దేశంలోని ప్రజలందరి తల్లుల గౌరవాన్ని అవమానించడమే ఈ వీడియో ఉద్దేశమని విమర్శించారు. ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అయితే.. క్షమాపణలకు కాంగ్రెస్ నిరాకరిస్తోంది. ఇదేం వ్యక్తిగత దూషణ కాదని.. రాజకీయ విమర్శ మాత్రమే అని చెబుతోంది. వీడియోలో వ్యక్తీకరించిన సందేశం ప్రధానిగా మోదీ తన తల్లి పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారనే విమర్శ మాత్రమే అని అంటోంది. -
బీజేపీకి చరిత్రే లేదు.. కవిత ఎక్కడ పుట్టారు?: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ చేస్తున్న పనులకు సర్దార్ పటేల్ ఆత్మ క్షోభిస్తుంది.. సెప్టెంబర్ 17తో బీజేపీకి ఏం సంబంధం? అని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్రే లేదన్నారు. కవిత ఎపిసోడ్‌పై కూడా ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.తెలంగాణలో సెప్టెంబర్ 17పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17తో బీజేపీకి ఏం సంబంధం?. రజాకార్లను వ్యతిరేకించిన వారిలో ఒక్క బీజేపీ నేత అయినా ఉన్నాడా?. మహాత్మా గాంధీని చంపిన గాడ్సేపై ప్రేమ చూపించే బీజేపీని చూసి యువత ఏం నేర్చుకోవాలి. నెహ్రు సూచనల మేరకే పటేల్ సైన్యాన్ని పట్టుకొని వచ్చాడు. బీజేపీకి చెప్పుకోవడానికి చరిత్రనే లేదు. స్వాతంత్ర ఉద్యమంలో బీజేపీ పాత్ర లేదు.. సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర లేదు.కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఎలా అవుతుంది?. బీజేపీ కార్యక్రమం, రాజకీయ కార్యక్రమం ఇది. గుజరాత్‌లోని జునాఘడ్ కూడా సెప్టెంబర్ 17న ఇండియాలో విలీనం అయింది. జునాఘడ్ గురించి ఒక్క మాట మాట్లాడని బీజేపీ హైదరాబాద్ గురించి మాట్లాడడం రాజకీయం కాదా?. మోదీ వచ్చిన తర్వాత జరిగిన అనేక ఘటనలు ఎన్నికల ముందే జరిగాయి. ఎన్నికల ముందు జరిగిన ఘటనలపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఎన్నికలే ముఖ్యం అన్నట్టు బీజేపీ నాయకులు భావిస్తున్నారు. మోదీ ప్రధాని అయ్యాక వచ్చిన ఘటనలపై చర్చ జరిగి నిజాలు నివృత్తి కావాలి. పహల్గాం వద్ద మిలిటరీ ఫోర్స్ ఎందుకు తొలగించారు. పహల్గాం ఘటనలో మోదీ, అమిత్ షా ఫెయిల్యూర్.కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశంపై స్పందిస్తూ.. కోమటిరెడ్డి ఫ్యామిలీ బోల్డ్‌గా మాట్లాడుతారు. రాజగోపాల్ రెడ్డి అంశంపై నాకు కూడా ఫిర్యాదు రాలేదు. క్రమశిక్షణ కమిటీ సుమోటోగా తీసుకుంటుందని అనుకుంటున్నాను. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు.. ఎవరు పార్టీ పెట్టినా స్వాగతిస్తాం. కవిత ఎప్పుడు పుట్టారు?. కవిత పుట్టిన తేదీ ఎప్పుడు?. కవిత పార్టీ ఎప్పుడు పుట్టింది. జరిగింది విలీనం కాబట్టే కవిత విలీన దినోత్సవం చేస్తోంది. కాంగ్రెస్ లైన్ కరెక్ట్ కాబట్టి ఆ లైన్లో కవిత ఉంది’ అని చెప్పుకొచ్చారు. -
కృష్ణా, గోదావరి జలాలు, మూసీపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పదని కొనియాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర మరువలేనిదని చెప్పుకొచ్చారు. సామాజిక న్యాయం, ప్రజల ఆకాంక్షలే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. కృష్ణా, గోదావరి నీటి వాటాల విషయంలో రాజీపడటం లేదు అని స్పష్టం చేశారు.హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను సీఎం ఆవిష్కరించారు. అనంతరం, రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పది. ప్రజలకు మంచి చేయడం లక్ష్యంగా పని చేస్తున్నాం. మేము అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం. సామాజిక న్యాయం, ప్రజల ఆకాంక్షలే మా ప్రభుత్వ లక్ష్యం.బతెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర మరువలేనిది. మహిళలకు పెద్ద పీట వేస్తూ కోటి మందిని కోటీశ్వరులను చేయబోతున్నాం. మహిళల అభివృద్ధికి అండదండలు అందిస్తాం. స్వేచ్చ, సమానత్వంలో తెలంగాణ రోల్ మోడల్‌గా ఉంది. ప్రపంచ స్థాయి విద్యా అవకాశాలు అందుకోవడానికి విద్య ఒక్కటే మార్గం. భవిష్యత్ తెలంగాణ కోసం విద్యపై భారీగా పెట్టుబడి పెడుతున్నాం. విద్యతో పాటు క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని ఎఫ్ఆర్బీఎం నుంచి తొలగించాలి.అహంకారపు ఆలోచనలు, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి మా పాలనలో తావులేదు. రైతులు పండించిన ప్రతీ గింజను కొంటున్నాం. వరి కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి అసెంబ్లీలో బిల్లును ఆమోదించాం. ఆ బిల్లులకు చట్టబద్దత కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన సామాజికన్యాయ సాధన ప్రక్రియకు మీరు అడ్డుపడొద్దు. కృష్ణా, గోదావరి నీటి వాటాల విషయంలో రాజీపడటం లేదు. మన వాటా కోసం న్యాయ పోరాటం చేస్తున్నాం.హైదరాబాదే మన బలం.. హైదరాబాద్‌ను గేట్ ఆఫ్ వరల్డ్‌గా తీర్చి దిద్దుతాం. 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చుతాం. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చి దిద్దుతాం. వందేళ్ల వరకు నీటి సమస్య లేకుండా హైదరాబాద్‌కు గోదావరి నీళ్లు. మూసీ నదిని ప్రక్షాళన చేసి.. హైదరాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దుతాం. మూసీ చుట్టూ బ్రతుకుతున్న ప్రజలకు మెరుగైన జీవితం కల్పిస్తాం. మూసీ పరివాహక ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాం. మూసీ ప్రక్షాళనతో కొత్త ఆర్థిక వ్యవస్థ సృష్టిస్తాం. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా మూసీ నదిని మార్చుతాం. మూసీకి ఇరువైపులా ప్రపంచ స్థాయి కట్టడాలు నిర్మిస్తాం. మూసీ ప్రక్షాళనలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొంటాం. ఈ ఏడాది డిసెంబర్లో మూసీ అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం. 30వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మించబోతున్నాం. ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఫోర్తు సిటీకి అడ్డంకులు సృష్టిస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెప్పాలి’ అని కోరారు. -
బీహార్‌లో కూటమి పంచాయతీ.. సీట్ల పంపకాలపై కీలక భేటీ?
సాక్షి, న్యూఢిల్లీ: బీహార్‌లోని ప్రతిపక్ష ఇండియా కూటమిలో నెలకొన్న సీట్ల పంపకాల పంచాయితీని ఓ కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్ ఈ నెల 19న కీలక సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా మిత్రపక్షంగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఈ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో పోటీలో ఉంటామన్న ప్రకటన నేపథ్యంలో కూటమిలో గందరగోళం పెరిగిన నేపథ్యంలో ఈ భేటీని తలపెట్టినట్లు తెలుస్తోంది.ఆరోగ్య సమస్యల కారణంగా చాలా కాలంగా దూరంగా ఉన్న ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ ఈ సీట్ల చర్చల బాధ్యతను చేపట్టేందుకు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాను సమర్పించాలని ఆయన కోరారని, ఆ పార్టీకి 50–52 సీట్లు కేటాయించేందుకు ప్రతిపాదనలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ పోటీ చేయాలనుకుంటున్న స్థానాలతో పాటు, పొత్తుల్లో భాగంగా మిత్రపక్షాలకు ఇచ్చే స్థానాలపై ఈ భేటీలో ఓ స్పష్టత తేవాలని కాంగ్రెస్ భావిస్తోంది.ఆర్జేడీ కోరుకుంటున్న ఓ 25 స్థానాలపై కాంగ్రెస్ సైతం పట్టుబడుతుండటంతోనే సమస్య ఉత్పన్నమవుతోందని, దీనిపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉందని ఏఐసీసీ నేత ఒకరు తెలిపారు. ఇక ప్రస్తుత కూటమిలో వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)తో పాటు, 2020లో 19 సీట్లలో పోటీ చేసి 12 గెలుచుకున్న సీపీఐ(ఎంఎల్)లు ఇప్పుడు 40–45 సీట్లను అడుగుతున్నాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), పశుపతి కుమార్ పరాస్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ సైతం ఆర్జేడీతో చర్చలు జరుపుతుండగా, ఎంఐఎం సైతం కూటమిలో చేర్చుకోవాలని ఆర్జేడీని సంప్రదించినట్లు తెలుస్తోంది. వీటన్నింటి దృష్ట్యా సీట్ల పంపకాలపై ఓ స్పష్టతకు రావాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
మోసమే కాంగ్రెస్ నైజం
సాక్షి, హైదరాబాద్ : ప్రజలను మోసగించడమే కాంగ్రెస్ నైజమని, అబద్ధాలతో అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పాత రోజులను తిరిగి తెచ్చి పాలనా సామర్థ్యం లేక గత ప్రభుత్వంపై నెపం నెడుతోందని విమర్శించారు. పదేళ్లలో చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయామన్నారు. తెలంగాణభవన్‌లో మంగళవారం జరిగిన భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు, ఇతర నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఈ సమావేశంలో కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. దమ్ముంటే ఉప ఎన్నికలకు రావాలి పార్టీ మారిన ఎమ్మెల్యేలు పిరికివాళ్లుగా మారారని, కాంగ్రెస్‌కు దమ్ముంటే ఉప ఎన్నికలకు రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు. మంత్రి పొంగులేటి లక్కీలాటరీలో మంత్రి పదవి దక్కించుకొని అహంకారంతో మాట్లాడుతున్నారు..పాలేరులో ఎలా గెలుస్తారో చూద్దాం అని సవాల్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రల ను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బలంగా నిలబడుతుందని, కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై బీజేపీకి గౌరవం లేదు వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను తమ పార్టీ స్వాగతించడాన్ని విమర్శిస్తున్న బీజేపీ నేతలకు భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు పట్ల ఏ మాత్రం గౌరవం లేదని కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు మంగళవారం కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. పాక్ ప్రేరేపిత ఉగ్రదాడిలో చిందిన 26 మంది అమాయకుల నెత్తురు తడి ఇంకా ఆరకముందే ఆ దేశంతో క్రికెట్ ఆడేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోవడం ఆ పార్టీ నకిలీ జాతీయవాదం, కపట దేశభక్తికి తిరుగులేని సాక్ష్యంగా పేర్కొన్నారు. హైదరాబాద్ నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురి దేహాలను మూడు రోజులైనా గుర్తించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని కేటీఆర్ విమర్శించారు. -
రాహుల్ గాంధీపై షాషిద్ అఫ్రిది ప్రశంసలు
ఇస్లామాబాద్: పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్‌గాంధీ తన చర్చల ద్వారా అందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. వాళ్లు మాత్రం (బీజేపీని ఉద్దేశిస్తూ).. మరో ఇజ్రాయెల్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉన్న ఒక్క ఇజ్రాయెల్ సరిపోదా? అని దుయ్యబట్టారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆసియాకప్‌లో భారత్-పాక్‌లు తలపడ్డాయి. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లకు హ్యాండ్‌షేక్ ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేశారు. దీంతో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించారని వారిపై తగు చర్యలు తీసుకోవాలంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో పాటు పాక్ ప్రస్తుత ఆటగాళ్లు,మాజీ ఆటగాళ్లు భారత్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ క్రమంలో పాకిస్తాన్ మీడియా సంస్థ సామ్మాటీవీ ఆసియాకప్‌పై నిర్వహించిన ప్యానల్ డిస్కషన్లో షాహిద్ అఫ్రిది పాల్గొన్నారు. రాహుల్ గాంధీ మాత్రం పాజిటివ్ మైండ్‌సెట్ కలిగిన నాయకుడు. సమస్యల పరిష్కారం కోసం సంభాషణే మార్గమని ఆయన నమ్ముతారు. కానీ బీజేపీ మాత్రం ఘర్షణ, విభజన వైపు మొగ్గుచూపుతుంది. ఇప్పటికే ప్రపంచంలో ఒక ఇజ్రాయెల్ ఉంది. అది మత, భూభాగ, రాజకీయ వివాదాలతో నిండిన దేశం. మరొక ఇజ్రాయెల్‌ను సృష్టించాలన్నదే మీ ఉద్దేశమా? అని ప్రశ్నిస్తూ ఒక ఇజ్రాయెల్ చాలదా? ఇంకొకటి కావాలా?’ అంటూ షాహిద్ అఫ్రిది వ్యాఖ్యానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను అస్త్రంగా పలువురు బీజేపీ నేతలు రాహుల్‌గాంధీపై దుమ్మెత్తిపోస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి.. ఎక్స్ వేదికగా.. రాహుల్ గాంధీకి ఇప్పుడు కొత్త ఫ్యాన్‌బాయ్ దొరికాడు. అవమానానికి గురైన పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ! అంటూ పేర్కొన్నారు. మరో బీజేపీ నేత షెహ్జాద్ పూనావాలా కూడా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదు. భారత్‌ను ద్వేషించే ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీ. కాంగ్రెస్‌లో మిత్రులను కనుగొంటారు. జార్జ్ సోరస్ నుంచి షాహిద్ అఫ్రిదీ వరకు... ఐఎస్సీ అంటే ‘ఇస్లామాబాద్ నేషనల్ కాంగ్రెస్’ అని దుయ్యబట్టారు. 🚨This is Fear From Indian Army & Leadership.Operation Sindoor they will never forget. pic.twitter.com/p77IwsCSiz— Lt Colonel Vikas Gurjar 🇮🇳 (@Ltcolonelvikas) September 16, 2025 -
జూబ్లీహిల్స్‌తో ‘బిహార్’ మెలిక..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో ‘బిహార్ కూటమి’కి మెలిక పెట్టేందుకు ఆల్ ఇండియా మజ్లిస్–ఎ–ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) సిద్ధమవుతోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో మజ్లిస్ గత మూడు పర్యాయాలుగా అక్కడ పాగా వేసేందుకు ప్రయతి్నస్తూనే ఉంది. ప్రస్తుతం తెలంగాణలో అధికార కాంగ్రెస్‌కు మిత్ర పక్షం కానప్పటికీ... ప్రభుత్వ నిర్ణయాలకు సహకరిస్తూ వస్తోంది. అయితే తాజాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్, ఆర్జేడీ సారథ్యంలోని మహా కూటమి(ఇండియా)లో చేరేందుకు అసక్తి చూపుతున్నా....కూటమి నుంచి సానుకూల స్పందన రాక పోవడాన్ని మజ్లిస్ తీవ్రంగా పరిగణిస్తోంది. దీంతో కాంగ్రెస్ పాలిత ప్రాంతమైన తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలను సాకుగా చూపించి మహా కూటమిపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఒకవేళ అక్కడ కూటమిలో అవకాశం దక్కని పక్షంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్‌కు గుణ పాఠం చెప్పాలా..? లేక స్థానిక అవసరాల కోసం సహకరించాలా? అని సందిగ్దంలో పడినట్లు కనిపిస్తోంది. మజ్లిస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో దిగితే అధికార కాంగ్రెస్‌కు గెలుపు అంత సులువు కాదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ముస్లిం ఓటర్లు అధికం.. గత మూడు పర్యాయాలుగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో పాగా వేసేందుకు మజ్లిస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో సగానికి పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. తొలిసారిగా 2014లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బరిలో దిగి ఢీ.. అంటే ఢీ అనే విధంగా పోటీ పడి స్పల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన మజ్లిస్... ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార పక్షం బీఆర్ఎస్ దోస్తీ కోసం బరిలో దిగకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేకు మద్దతు ప్రకటించింది. కాగా 2023లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చి జూబ్లీహిల్స్ (Jubilee Hills) మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేపై స్నేహపూర్వక పోటీకి దిగి పరాజయం పాలైంది. రాష్ట్రంలో బీఆర్ఎస్కు అధికారం చేజారగా, కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో అధికార కాంగ్రెస్‌తో మజ్లిస్ స్నేహం కుదిరింది. తాజాగా సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.ఆ దిశగా ప్రయత్నాలుత్వరలో జరుగనున్న బిహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమిని ఓడించేందుకు కాంగ్రెస్, ఆర్జేడీ సారథ్యంలోని మహా కూటమి(మహా ఘట్బంధన్) లో చేరేందుకు ఏఐఎంఐఎం శతవిధాల ప్రయత్నిస్తోంది. సంస్థాగతంగా బలంగా ఉన్న సీమాంచల్‌లో ఆరు స్థానాలు కేటాయిస్తే కలిసి వస్తామని ఇప్పటికే ప్రకటించింది. మహా కూటమి తమతో కలిసిరాని పక్షంలో బిహార్‌లోని అన్ని నియోజకవర్గాల్లో మజ్లిస్ అభ్యర్థులను బరిలోకి దింపుతామని ఆ పార్టీ అధినేత ఒవైసీ ఇప్పటికే స్పష్టం చేశారు. వాస్తవంగా తెలంగాణ, మహారాష్ట్ర తర్వాత బిహార్‌ను పార్టీ విస్తరణకు అనుకూలంగా మజ్లిస్ భావిస్తోంది. తొలిసారిగా 2015 అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంచల్‌లోని ఆరు స్థానాల్లో తొలిసారి పోటీ చేసి విజయం సాధించలేక పోయినప్పటికి 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 20 సీట్లలో పోటీ చేసి ఐదు సీట్లను దక్కించుకుంది. ఐదుగురు శాసనసభ్యుల్లో నలుగురు పార్టీని వీడి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో చేరారు. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో పోటీ చేసినా.. ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇటీవల మహాకూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తూ ఇటీవల సాక్షాత్తు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్న్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు లేఖ రాశారు. రాబోయే ఎన్నికల్లో లౌకిక ఓట్లు చీలిపోయి మతతత్వ శక్తులు అధికారంలోకి వచ్చే అవకాశం ఇవ్వకూడదనే కూటమిలో చేరేందుకు ముందుకు వస్తున్నట్లు, గత అసెంబ్లీ లోక్‌సభ ఎన్నికల సమయంలో మహా కూటమిలో చేరాలనే ఆసక్తి కనబర్చామని కానీ తమ ప్రయత్నాలు ఫలించలేదు‘ అని లేఖలో పేర్కొన్నారు అయితే మహా కూటమి నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం వైపు నుంచి ఒత్తిడి తెచ్చేందుకు మజ్లిస్ సిద్దమైనట్లు సమాచారం. -
మంత్రి అయినంత మాత్రాన ఏదైనా చేయొచ్చా?
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మళ్లీ రచ్చకెక్కుతున్నాయి. పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య నెలకొన్న అంతర్గత విబేధాలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. తాజాగా రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి (వరంగల్ తూర్పు ఎమ్మెల్యే) కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. వరంగల్ నగరంలోని భద్రకాళి దేవస్థానం పాలకమండలి నియామకం సందర్భంగా ఏర్పడిన మనస్పర్థలు చినికి చినికి గాలి వానలా మారాయి. నాలుగైదు రోజులుగా ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటుండడం కాంగ్రెస్ పార్టీ కేడర్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. అధికార పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో చేసుకుంటున్న వ్యాఖ్యలు మరోసారి జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.రచ్చకెక్కుతున్న కాంగ్రెస్ రాజకీయాలునాలుగు నెలల క్రితం మంత్రి కొండా సురేఖ దంపతులు, ఎమ్మెల్యేల మధ్య మొదలైన మాటల యుద్ధం ఘర్షణ వాతావరణానికి దారి తీసింది. ఈసందర్భంగా మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీధర్‌రావు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ ఆరోపించారు. ఈమేరకు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ కొండా సురేఖ దంపతులపై సీఎం రేవంత్‌రెడ్డికి, టీపీసీసీకి ఫిర్యాదు చేశారు. ప్రాథమికంగా ఇరువర్గాలతో మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్.. పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు మల్లు రవికి అప్పగించారు. దీంతో ఆయన మంత్రి సురేఖ, కొండా మురళీధర్‌రావుతో పాటు ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడారు. సుమారు మూడు పర్యాయాలు మంత్రి, ఎమ్మెల్యేల మధ్యన నెలకొన్న వివాదం పరిష్కారం కోసం టీపీసీసీ, క్రమశిక్షణ సంఘం వేర్వేరుగా ప్రయత్నించింది. అయినప్పటికీ ఆ గొడవ సద్దుమణగకపోగా... ఒక దశలో ‘‘వారా.. మేమా’’ తేల్చాలని ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. దీంతో ఈ అంశంపై క్రమశిక్షణ సంఘం కూడా ఎటూ తేల్చలేకపోగా, సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ జోక్యం చేసుకుని మంత్రి, ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఆ తర్వాత కొంత స్తబ్ధత నెలకొన్నా పరిస్థితి నివురుగప్పిన నిప్పులానే ఉంది. అతిథుల మార్పు వెనుక?సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవానికి హాజరయ్యే మంత్రులు/ప్రముఖుల పేర్లను ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. అయితే ఉమ్మడి వరంగల్‌కు సంబంధించిన కొన్ని జిల్లాలకు ఈసారి స్వల్పంగా మార్పులు చేసింది. గతంలో వరంగల్ కలెక్టరేట్లో రెవెన్యూశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, హనుమకొండలో అటవీశాఖమంత్రి కొండా సురేఖ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకల్లో పాల్గొనేవారు. ప్రజాపాలన వేడుకల సందర్భంగా కొండా సురేఖను వరంగల్‌కు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని హనుమకొండ జిల్లాలకు మార్చారు. ఈ మార్పు వెనుక ఇటీవల ఎమ్మెల్యేలు వర్సెస్ మంత్రి సురేఖ మధ్య ఉన్న వివాదాలు కారణం కాకపోలేదన్న చర్చ జరుగుతోంది. కాగా ఈసారి ములుగులో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్‌లో ప్రభుత్వ విప్ జె.రామచంద్రునాయక్, జనగామలో ప్రభుత్వ విప్ బీర్ల వీ రయ్య, జయశంకర్ భూపాలపల్లిలో తెలంగాణ ఎస్టీ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ వేడుకల్లో ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.వ్యాఖ్యల కలకలంసీఎం, టీపీసీసీల జోక్యం తర్వాత గొడవలు సద్దుమణిగినట్లుగానే కనిపించినా.. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మధ్య వ్యాఖ్యలు కలకలంరేపాయి. భద్రకాళి ఆలయ పాలకమండలి కమిటీ సందర్భంగా ‘ఏది చేసినా నడుస్తోందని మంత్రి కొండా సురేఖ అనుకుంటున్నారని’ మంత్రిపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. ‘స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా భద్రకాళి ఆలయ పాలక మండలి సభ్యులను ఎలా నియమిస్తారు? అని ప్రశ్నించారు. దేవాదాయశాఖకు మంత్రి అయినంత మాత్రాన ఏదైనా చేయొచ్చా? నా నియోజకవర్గంలో మంత్రి పెత్తనం ఏంటి?’ అని నిలదీశారు. అంతా మంత్రి చేస్తే స్థానికంగా తాను ఉన్నది దేనికని.. ఇదే పద్ధతి అవలంబిస్తే తాను చూస్తూ ఊరుకోనని కూడా హెచ్చరించారు. ఇదే సందర్భంలో ‘నాయిని రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్ది ఎమ్మెల్యే అయ్యాడు. నాయిని వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్న. ఆయనపై నేను కామెంట్ చేయాలనుకోవడం లేదు. మంత్రి హోదాలో ఇద్దరు ధర్మకర్తలను కేటాయించుకునే స్వేచ్ఛ లేదా?’ అంటూ మంత్రి కొండా సురేఖ స్పందించారు. కేవలం తాము అధిష్ఠానం నుంచి వచ్చిన పేర్లను మాత్రమే భర్తీ చేశామని కూడా వివరించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన రాజేందర్ రెడ్డి.. ‘పూటకో పార్టీ మార్చిన ఘనత మంత్రి సురేఖది. 40 ఏళ్లుగా కాంగ్రెస్ కోసం నా రక్తం ధారపోశాను. 12 ఏళ్లు ఉమ్మడి జిల్లాకు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నా.. ఎవరైనా అదృష్టం ఉంటేనే ఎమ్మెల్యే అవుతారు. దురదృష్టవంతులు ఓడిపోతారు. మంత్రి బాధ్యతారహితంగా మాట్లాడడం సరికాదు’’ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. సొంత పార్టీ నాయకులపై బహిరంగ విమర్శలు చేసుకోవద్దని అధిష్టానం హెచ్చరిస్తుండగా.. ఇక్కడ మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్న చర్చ పార్టీ కేడర్‌లో జరుగుతోంది. -
బిహార్‌ను బీడీతో పోలుస్తారా!
పుర్నియా: బిహార్ అభివృద్ధిబాటన సాగుతుండగా ప్రతిపక్ష కాంగ్రెస్, ఆర్జేడీలు ఓర్వలేని తనంతో చులకనగా మాట్లాడుతున్నాయని ప్రధాని మోదీ మండిపడ్డారు. అవమానించడమే ప్రతిపక్ష నాయకులు పనిగా పెట్టుకున్నారని ధ్వజమె త్తారు. మోదీ సోమవారం బిహార్‌లోని పుర్నియా లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన బిహార్ అంటే బీడీ అంటూ ప్రతిపక్ష నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బిహార్‌లో తయారైన రైలింజిన్లు ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ విషయం కాంగ్రెస్, ఆర్జేడీ నేతలకు నచ్చడం లేదు. బిహార్‌లో అభివృద్ధి ఛాయలు కనిపించినప్పుడల్లా ఈ నేతలు చెలరేగిపోతున్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు ఏకమై బిహార్‌ను బీడీతో పోలుస్తూ సోషల్ మీడియా వేదికలపై చెలరేగిపోతున్నారు’అని ఆయన అన్నారు. ‘ఈ రెండు పార్టీల నేతలు సొంత కుటుంబసభ్యుల గురించే ఎప్పుడూ ఆందోళన చెందుతుంటారు. మీ కుటుంబం సంక్షేమం వారికి పట్టదు. కానీ, మోదీకి మీరందరూ కుటుంబ సభ్యులే. అందుకే సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అని మోదీ అంటున్నారు. మీ కుటుంబం, సంక్షేమం, మీ బాగోగుల గురించి శ్రద్ధ తీసుకుంటున్నారు’అని తెలిపారు. బిహార్, పశ్చిమబెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాల్లో అక్రమ వలసదారులకు ప్రతిపక్షాలు అండగా నిలుస్తున్నా యని, వీటి తీరుతో ఆయా రా ష్ట్రాల జనాభాలో తీరుతెన్నుల్లో తీ వ్రమైన మార్పులు సంభవిస్తున్నా యని ఆయన హెచ్చరించారు. ఆయా రాష్ట్రాల్లోని వారు తమ తోబుట్టువులు, కుమార్తెల ఆత్మ గౌరవం గురించి ఆందోళన చెందుతున్నారని తెలిపారు.దేశ భద్రత, వనరులను ప్రతిపక్షాలు ఫణంగా పెడుతున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. విదేశాల నుంచి అందుతున్న మద్దతుతో వలసదారులకు మద్దతుగా యాత్రలు నిర్వహిస్తూ నినాదాలు చేస్తూ నిస్సిగ్గుగా వ్యవహ రిస్తున్నారంటూ కాంగ్రెస్ చేపట్టిన ఓటర్ అధికార యాత్రనుద్దేశిస్తూ నిప్పులు చెరిగారు. ప్రతి చొరబాటుదారునూ దేశం నుంచి వెళ్లగొట్టేందుకు ఎన్డీఏ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రూ.40 వేల కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. పుర్నియా ఎయిర్‌పోర్టులో కొత్తగా అభివృద్ధి పర్చిన టెర్మినల్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. పుర్నియా–కోల్‌కతా మార్గంలో మొదటి విమానాన్ని జెండా ఊపి ప్రారంభించారు. మఖానా రంగం అభివృద్ధికి నేషనల్ మఖానా బోర్డు ద్వారా రూ.475 కోట్లు వెచ్చిస్తా మని ప్రకటించారు. భాగల్పూర్లో రూ.25 వేల కోట్లతో నిర్మించే ధర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు, రూ.2,680 కోట్ల కోసి–మెచి ఇంట్రా స్టేట్ రివర్ లింకు ప్రాజెక్టుకు శంకుస్థాపనలు చేశారు. -
ఆచార్య బాలకృష్ణకు అక్రమంగా భూ కేటాయింపు.. సీబీఐ దర్యాప్తుకు కాంగ్రెస్ డిమాండ్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ప్రభుత్వం రూ.30,000 కోట్లకు పైగా విలువ చేసే 142 ఎకరాల ‘వారసత్వ’ భూమిని యోగా గురువు రామ్‌దేవ్ సహాయకుడు ఆచార్య బాలకృష్ణకు కేవలం రూ. కోటి వార్షిక అద్దెతో కట్టబెట్టిందని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది.ఉత్తరాఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కరణ్ మహారా ఒక ప్రకటనలో ఆచార్య బాలకృష్ణకు భూములు కట్టబెట్టడం అనేది ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద అవినీతి కుంభకోణం అని అన్నారు. జార్జ్ ఎవరెస్ట్ ఎస్టేట్ పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులో జరిగిన ఈ కుంభకోణం బీజేపీ అనుసరించే క్రోనీ క్యాపిటలిజంనకు స్పష్టమైన నిదర్శనమని ఆయన ఆరోపించారు. జార్జ్ ఎవరెస్ట్ భూ కుంభకోణంపై హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరగాలన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉత్తరాఖండ్‌ను దోపిడీలకు నిలయంగా మార్చివేసిందని, ఈ భూ దందాపై కాంగ్రెస్ నిరంతర పోరాటం సాగిస్తుందన్నారు.2022 డిసెంబర్లో ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డు జారీ చేసిన టెండర్‌కు మూడు కంపెనీలు బిడ్డింగ్ చేశాయన్నారు. జాబితాలోని రాజాస్ ఏరోస్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, భారువా అగ్రి సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రకృతి ఆర్గానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లు రామ్‌దేవ్ సహచరుడు ఆచార్య బాలకృష్ణ ఆధీనంలో ఉన్నాయని మహారా ఆరోపించారు. ఇది టెండర్ నియమాల బహిరంగ ఉల్లంఘన అని ఆయన ఆరోపించారు. రాజాస్ ఏరోస్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 15 ఏళ్ల పాటు రూ. కోటి రూపాయల వార్షిక అద్దెకు ఇచ్చిన జార్జ్ ఎవరెస్ట్ ఎస్టేట్‌లోని 142 ఎకరాల భూమిని.. ప్రభుత్వం ఆసియా అభివృద్ధి బ్యాంకు నుండి రూ. 23.5 కోట్ల రుణం తీసుకొని అభివృద్ధి చేసిందని ఆయన తెలిపారు. ఈ భూ కుంభకోణంపై సీబీఐ లేదా రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలోని ప్యానెల్ దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
చొరబాటుదారులకు మద్దతా?
గౌహతి: విపక్ష కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదులకు, మన దేశంలోకి అక్రమంగా చొరబడుతున్నవారికి ఆ పార్టీ మద్దతిస్తోందని మండిపడ్డారు. మన సైన్యానికి అండగా ఉండడానికి బదులు నిస్సిగ్గుగా ముష్కర మూకలను వెనకేసుకొస్తోందని ధ్వజమెత్తారు. చొరబాటుదారులను, దేశ వ్యతిరేక శక్తులను కాంగ్రెస్ కాపాడుతోందని ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆ పార్టీ నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు రాజకీయాలే ముఖ్యమని, దేశ ప్రయోజనాలను ఆ పార్టీ ఏనాడూ కాపాడలేదని నిప్పులు చెరిగారు. చొరబాటుదారులు మనదేశంలోకి ప్రవేశించి, భూములు ఆక్రమించుకొని, ఇక్కడే తిష్టవేసి జనాభా స్థితిగతులను మార్చేస్తామంటే సహించే ప్రసక్తే లేదని, వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు. ప్రధాని మోదీ అస్సాంలో రెండో రోజు ఆదివారం పర్యటించారు. దరాంగ్ జిల్లాలోని మంగళ్‌దోయి, నుమాలీగఢ్లో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కామాఖ్య మాత ఆశీస్సుల వల్లే ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని, ఈ పవిత్రమైన నేలపై అడుగుపెట్టడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. అస్సాంతో, అస్సాం ప్రజలతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. ప్రధానమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే... తప్పో ఒప్పో ప్రజలే నిర్ణయిస్తారు ‘‘అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ నిన్ననే ఒక వీడియోను నాకు చూపించారు. పాటగాళ్లను, తైతక్కలాడేవాళ్లను బీజేపీ నెత్తిమీద పెట్టుకుంటోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఒకరు విమర్శిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. 2019లో అస్సాం గాయకుడు భూపేన్ హజారికాకు మేం భారతరత్న పురస్కారం ఇవ్వడాన్ని తప్పుపడుతూ ఆ మాజీ అధ్యక్షుడు మాట్లాడారు. 1962లో చైనా దురాక్రమణ సమయంలో అస్సాం ప్రజలకు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన గాయాలు ఇప్పటికీ మానలేదు. పైగా భూపేన్ హజారికాను కించపర్చడం ద్వారా ఆ గాయాలపై కాంగ్రెస్ ఉప్పు చల్లుతోంది. భూపేన్‌ను కించపర్చడం చూసి చాలా బాధపడ్డా. ప్రజలే నాకు యజమానులు. భూపేన్‌కు భారతరత్న ఇవ్వడం తప్పో ఒప్పో వారే నిర్ణయిస్తారు. ఆ మహా గాయకుడిని ఎందుకు అవమానించారంటూ కాంగ్రెస్‌ను ప్రజలు నిలదీయాలి. ‘నేషనల్ డెమొగ్రఫీ మిషన్’ అస్సాం ప్రజల కలలు నిజం చేయడానికి బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మన ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ అక్రమ వలసదారులను బయటకు పంపిస్తుండడం హర్షణీయం. భూములను వలసదారుల చెర నుంచి విడిపించి, మళ్లీ రైతులకు అప్పగిస్తున్నారు. ఆ భూముల్లో రైతులు, స్థానికులు వ్యవసాయ విప్లవం సృష్టిస్తున్నారు. చొరబాటుదారులు మన దేశంలోకి ప్రవేశించి, మన అక్కచెల్లెమ్మలను, తల్లులను అవమానిస్తామంటే చూస్తూ సహించాలా? జాతీయ భద్రతకు ముప్పుగా మారిన వారిని వదిలిపెట్టబోం. బయటకు తరిమికొట్టడం ఖాయం. చొరబాటుదారులకు సమాజంలో ఓ వర్గం నుంచి రక్షణ లభిస్తుండడం సిగ్గుచేటు. అక్రమంగా వలస వచ్చినవారి నుంచి అస్సాంను కాపాడేందుకు పోరాటం జరగాల్సిందే. చొరబాటుదారుల వల్ల మన దేశ జనాభాలో మార్పులు రాకుండా చూడడానికి ‘నేషనల్ డెమొగ్రఫీ మిషన్’ తీసుకొస్తున్నాం. ‘వికసిత్ భారత్’లో ఈశాన్య రాష్ట్రాలు కీలకం కాంగ్రెస్ పార్టీ అస్సాంను కొన్ని దశాబ్దాల పాటు పరిపాలించింది. బ్రహ్మపత్ర నదిపై కేవలం మూడు వంతెనలు నిర్మించింది. మేము పదేళ్లలో ఆరు వంతెనలు నిర్మించాం. మనదేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతోంది. అస్సాంలో 13 శాతం వృద్ధిరేటు నమోదైంది. డబుల్ ఇంజన్ సర్కార్ కృషి వల్లే ఇది సాధ్యమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అస్సాంను హెల్త్‌హబ్‌గా తీర్చిదిద్దుతున్నాయి. ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో ఈశాన్య రాష్ట్రాలకు కీలక పాత్ర పోషించబోతున్నాయి. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చుకోవాలన్న సంకల్పంతో దేశం మొత్తం ఐక్యంగా ముందుకు కదులుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో అనుసంధానం పెంచడానికి చర్యలు చేపట్టాం. ఏ ప్రాంతమైనా వేగంగా అభివృద్ధి చెందాలంటే అక్కడ బలమైన అనుసంధాన వ్యవస్థ ఉండాలి. 21వ శతాబ్దంలో 25 ఏళ్లు గడిచిపోయాయి. ఈ శతాబ్దంలో తదుపరి అధ్యాయం తూర్పు, ఈశాన్య భారతదేశానిదే. దేశీయంగానే చమురు, సహజ వాయువు ఉత్పత్తి ముడి చమురు, సహజ వాయువు దిగుమతులను తగ్గించుకోవడానికి చర్యలు ప్రారంభించాం. మన దేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న తరుణంలో ఇంధన అవసరాలు తీర్చుకోవడానికి విదేశాలపై ఆధారపడడం సరైంది కాదు. అందుకే ఈ పరిస్థితిని మార్చాలని సంకల్పించాం. దేశీయంగానే శిలాజ ఇంధనాలు, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచడానికి ప్రయతి్నస్తున్నాం. ఇంధనాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఆ దిశగా ఇథనాల్ ఒక చక్కటి ప్రత్యామ్నాయం అవుతుంది. ఆత్మనిర్భర్ భారత్‌కు ఇంధనం, సెమీకండక్టర్లు చాలా ముఖ్యం. వాటిని దేశీయంగానే తయారు చేసుకుంటే మనకు ప్రయోజనం’’ అని అన్నారు.ఆ గరళం గొంతులో దాచుకుంటా నన్ను చాలామంది దూషిస్తున్నారు. అవమా నించడమే పనిగా పెట్టుకున్నారు. వారు నన్ను ఎంతగా తిట్టినా పట్టించుకోను. నేను శివ భక్తుడిని. అన్నింటినీ భరిస్తా. ఆ గరళాన్ని గొంతులో దాచుకుంటా. కానీ, ప్రజలను అవమానిస్తే మాత్రం ఊరుకోను. ప్రజలే నా రిమోట్ కంట్రోల్. నాకు మరో రిమోట్ కంట్రోల్ లేదు. స్వదేశీ ఉత్పత్తులే కొనుగోలు చేయాలని దేశ ప్రజలను మరోసారి కోరుతున్నా. మన దేశం అభివృద్ధి చెందాలన్నా, మన పిల్లలకు మెరుగైన భవిష్యత్తు దక్కాలన్నా మన దేశంలో తయారైన వస్తువులు, సరుకులే ఉపయోగించుకోవాలి. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులే మన నిత్య జీవితంలో భాగం కావాలి. మోదీకి బహుమతిగా పెయింటింగ్లుఅస్సాం సభల్లో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని పలుమార్లు కొద్దిసేపు నిలిపివేశారు. కొందరు యువతీ యువకులు మోదీ, ఆయన మాతృమూర్తి హీరాబెన్ మోదీకి సంబంధించిన పెయింటింగ్‌లను సభల్లో ప్రదర్శించారు. వాటిని ఆయనకు బహుమతిగా అందజేయాలన్నదే వారి ఉద్దేశం. ఆ విషయం మోదీ గ్రహించారు. పెయింటింగ్‌ల వెనుక మీ పేరు, చిరునామా రాసి ఇవ్వండి అని కోరారు. వేదిక పైనుంచి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయా పెయింటింగ్‌లను తీసుకోవాల్సిందిగా తన భద్రతా సిబ్బందిని ఆదేశించారు. అలాగే తనకు లేఖ ఇవ్వడానికి ప్రయత్నించిన దివ్యాంగుడికి ఇబ్బంది కలిగించవద్దని ప్రజలకు సూచించారు.రూ.12,230 కోట్ల ప్రాజెక్టులు ప్రధానమంత్రి అస్సాంలో ఆదివారం రూ. 12,230 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందులో రూ.5,000 కోట్ల విలువైన ఇథనాల్ ప్లాంట్ కూడా ఉంది. వెదురుతో ఇక్కడ ఇథనాలు ఉత్పత్తి చేయబోతున్నారు. అలాగే రూ.7,230 కోట్ల విలువైన చమురు శుద్ధి కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. పాలీప్రొపైలీన్ ప్లాంట్ నిర్మాణానికి సైతం శంకుస్థాపన చేశారు. దరాంగ్ మెడికల్ కాలేజీకి పునాదిరాయి వేశారు. 2.9 కిలోమీటర్ల పొడవైన నరెంగీ–కురువా వారధి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. -
మీడియా ముందుకు రావొద్దు!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థలకు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ పిలుపునిచ్చింది. విభేదాలకు దూరంగా ఉండాలని హితవు పలికింది. అంతర్గత విభేదాల పేరుతో ఎవరైనా మీడియా ముందుకొచ్చి మాట్లాడితే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. కమిటీ చైర్మన్, ఎంపీ మల్లురవి అధ్యక్షతన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదివారం గాందీభవన్‌లో సమావేశమైంది. కమిటీ సభ్యులు అనంతుల శ్యాంమోహన్, కమలాకర్‌రావు తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులపై కమిటీ చర్చించింది. వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి సురేఖ, పార్టీ నేతలు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలపై రూపొందించిన నివేదికను.. సీఎం రేవంత్‌తోపాటు, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు అందజేయాలని కమిటీ నిర్ణయించింది. ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం వారికే ఇవ్వాలని తీర్మానించింది. సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణపై ఫిర్యాదు రావడంతో ఆయన వివరణ కోరింది. కమిటీ ముందుకు నర్సారెడ్డి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి తూంకుంట నర్సారెడ్డి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై తనపై వచ్చిన ఫిర్యాదుల గురించి వివరణ ఇచ్చారు. అనంతరం నర్సారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తనపై నమోదైన పోలీస్ కేసు గురించి కమిటీ వివరణ అడిగిందని చెప్పారు. తనపై ఫిర్యాదు చేసిన నాయకులు పార్టీకి సేవ చేసిన వారు కాదని, బీజేపీకి పనిచేసిన వారని చెప్పారు. అలాంటి వారు ఆరోపణలు చేస్తే కమిటీ తనను వివరణ ఎందుకు అడిగిందో అర్థం కావడం లేదన్నారు. గజ్వేల్‌తో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావుకు సంబంధం లేదన్నారు. రాజగోపాల్‌రెడ్డి అంశం మా దృష్టికి రాలేదు: చైర్మన్ మల్లురవి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గురించి తాము చర్చించలేదని మల్లురవి చెప్పారు. కమిటీ భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎవరి ప్రయోజనాల కోసమో క్రమశిక్షణ కమిటీలో చర్చ జరగదన్నారు. రాజగోపాల్‌రెడ్డి అంశం తమ దృష్టికి రాలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే అది క్రమశిక్షణ కమిటీకి వస్తుందని చెప్పారు. కాంగ్రెస్ నుంచి బయటకెళ్లిన వారంతా మళ్లీ పార్టీ గూటికి రావాలని కోరారు. పార్టీలో అంతర్గత విభేదాల పేరుతో రచ్చకెక్కితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మాజీ మంత్రి కేటీఆర్ తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డాడని ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో ఆయన ఏం చేశారో ఒక్కసారి చూసుకుని తమను ప్రశ్నించాలన్నారు. పదేళ్లలో ఎంతో మందిని చేర్చుకున్న ఆయన కూడా రాజీనామాలు చేయించారా అని ప్రశ్నించారు. అసలు ఆ ఎమ్మెల్యేలు తాము పార్టీనే మారలేదని చెపుతుంటే కేటీఆర్‌కు వచి్చన ఇబ్బందేంటో అర్థం కావడం లేదన్నారు. -
స్వయంగా పర్యవేక్షిస్తా
సాక్షి హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు చాలా అవసరమని, పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా గెలిపించాల్సిన గురుతర బాధ్యత ఇన్చార్జిలపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ ఉప ఎన్నిక కోసం పార్టీ నాయకత్వం ఇప్పటివరకు చాలా బాగా పని చేసిందని, ఇకపై ప్రతీరోజూ కీలకమని, ఈ ఉప ఎన్నికకు సంబంధించిన అన్ని వ్యవహారాలను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని ఆయన వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఆదివారం సాయంత్రం తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ, సాంస్కృతిక విభాగం చైర్మన్ వెన్నెల గద్దర్‌తో పాటు పార్టీ డివిజన్ ఇన్చార్జులుగా పనిచేస్తున్న కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్న ఈ సమావేశంలో.. ఉప ఎన్నికలో గెలుపునకు అవసరమైన కార్యాచరణపై ముఖ్యమంత్రి, పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలి.. పార్టీ నేతలందరూ సమన్వయంతో పనిచేసి, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ సూ చించారు. రాష్ట్ర ప్రభుత్వం అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటికి చేరేలా కృషి చేయా లని ఆదేశించారు. ’జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రతీ ఒక్కరు పని చేయాలి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రచా రం చేయాలి. పోలింగ్ బూత్‌ల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. నియోజకవర్గంలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న భరోసా కల్పించాలి. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించాలి. అభ్యర్థి ఎంపిక విషయం ఏఐసీసీ చూసుకుంటుంది. అభ్యర్థి ఎవరైనా పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిన బాధ్యత మీపై ఉంది. మీ పనితీరు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటా. పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి’ అని సీఎం స్పష్టం చేశారు. కాగా, ఈనెల 21వ తేదీ కల్లా నియోజకవర్గంలోని 407 పోలింగ్ బూత్‌లలో ప్రతి బూత్‌కు పదిమంది చురుకైన కార్యకర్తలను ఎంపిక చేసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడాలని సమావేశంలో నిర్ణయించారు. -
‘నేను శివభక్తుణ్ని.. ఆ విషాన్ని నేను హరించేస్తా’
దిస్పూర్: తనపై,తన తల్లి హీరాబెన్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను శివభక్తుణ్ని.. కాంగ్రెస్ విమర్శల విషాన్ని హరించేస్తా’అని స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ అసోంలో దరంగ్ జిల్లాలో ఆదివారం వేలకోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘నేను ఇలా మాట్లాడితే మోదీ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది. నన్ను ఎంత దూషించినా పట్టించుకోను. ఎందుకంటే నేను శివుని భక్తుడిని.. విమర్శల విషాన్ని హరించేస్తా. నా రిమోట్ కంట్రోల్ వాళ్లేకానీ దేశ ప్రజలపై దాడి చేస్తే మాత్రం మౌనంగా ఉండను. ప్రజలే నా దేవుళ్లు. నా బాధను వాళ్ల ముందు వ్యక్తం చేయకపోతే .. ఎవరి ముందు చేస్తాను. అందుకే వాళ్లే నా యజమానులు, నా దేవతలు, నా రిమోట్ కంట్రోల్. నాకు వేరే రిమోట్ కంట్రోల్ లేదు’ అని స్పష్టం చేశారు.చర్చకు దారితీసిన మోదీ రిమోట్ కంట్రోల్ వ్యాఖ్యలు అయితే, అస్సాం సభలో ప్రధాని మోదీ మరోసారి‘రిమోట్ కంట్రోల్’ వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ చేశారని మోదీ ఆరోపించారు. అలాగే, ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీ కుటుంబం రిమోట్ కంట్రోల్లో ఉన్నారని కూడా విమర్శించారు.2019లో ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రముఖ అస్సామీ సంగీత కళాకారుడు భూపెన్ హజారికాకు భారతరత్న అవార్డ్‌తో సత్కరించింది. ఆ అవార్డుపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే విమర్శలు గుప్పించారు. మోదీ గాయకులకు, నర్తకులకు అవార్డు ఇస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. అప్పట్లో తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో ఖర్గే క్షమాపణలు చెప్పారు. ఖర్గే.. భూపెన్ హాజారికాను ఉద్దేశిస్తూ చేసిన విమర్శలను రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ తనతో ప్రస్తావించినట్లు మోదీ తాజాగా సభలో గుర్తు చేశారు. అవును.. ఖర్గే అనుచితంగా మాట్లాడారుఅవును. భారత ప్రభుత్వం ఈ దేశపు ముద్దుబిడ్డ అస్సాం గర్వకారణం భూపేన్ హజారికాను భారతరత్నతో సత్కరించిన రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోదీ ఈ అవార్డును ‘గాయకులు, నృత్యకారులకు’ఇచ్చారని అన్నారంటూ అస్సాం సభలో మోదీ గుర్తు చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో.. బీజేపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి చర్చించారు. ఇటీవల రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రలో మోదీని, మోదీ తల్లిని కొందరు దూషించినట్లుగా ఓ వీడియోను విడుదల చేసింది. ఆ సమయంలో ఆ వీడియోపై ..మోదీ స్పందిస్తూ.. కాంగ్రెస్ తన తల్లి హీరాబెన్‌ను రాజకీయాల్లోకి లాగడం సరైందికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా బీహార్ కాంగ్రెస్ విభాగం సోషల్ మీడియాలో ఓ ఏఐ వీడియోను పోస్టు చేసింది. ఆ వీడియోను మోదీ, తల్లి హీరాబెన్‌ను ఉద్దేశించి ఉండటం తీవ్ర దుమారం రేగింది. కాంగ్రెస్ తనని వ్యక్తిగత హననం చేయడంపై ఇవాళ అస్సాంలో మోదీ స్పందించారు. -
పార్టీ ఫిరాయింపులు.. దానం విషయంలో కీలక ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్.. పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. దీంతో, వారంతా బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పారు. మరోవైపు.. ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మాత్రం బీఆర్ఎస్ నుంచి గెలిచినా కాంగ్రెస్‌లోనే ఉన్నట్టు తెలిపారు.హిమాయత్ నగర్ డివిజన్లో శనివారం పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ తాజాగా మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్ నుంచి ఇంకా నోటీసులు రాలేదు. స్పీకర్ నుంచి నోటీసులు వచ్చిన ఎమ్మెల్యేలు దానికి తగ్గట్టు సమాధానం ఇస్తున్నారు. నాకు నోటీసులు వచ్చాక లీగల్ ఒపీనియన్ తీసుకొని సమాధానం ఇస్తాను. ప్రస్తుతానికి తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అని స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా.. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్లో దానం నాగేందర్ పేరు ప్రముఖంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ గుర్తు మీద లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయడంతో దానంపై వేటు పడటం ఖాయమన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికీ ఆయన స్పీకర్ నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడానికి ఇదే ప్రధాన కారణమన్న చర్చ జరుగుతోంది. దీంతో దానం నాగేందర్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ ఆ స్థానానికి రాజీనామా చేస్తానని పట్టుపడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఖైరతాబాద్ సెగ్మెంట్‌కు రాజీనామా చేసి.. ఇప్పటికే ఖాళీ అయిన జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తానని కోరుతున్నారనే చర్చ నడుస్తోంది. అయితే జూబ్లీహిల్స్ బరిలో ఎవరిని నిలిపితే బాగుంటుందని.. అభ్యర్థి ఎంపిక కోసం హైకమాండ్ సర్వేల మీద సర్వేలు చేయిస్తురని సమాచారం. ఇక, ఏ సర్వేలో కూడా టికెట్ రేసులో ఉన్న నేతలు బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదని రిపోర్ట్ వచ్చిందని తెలుస్తోంది. -
ఐదు గంటల హడావుడి: ఖర్గే
న్యూఢిల్లీ: మణిపూర్‌లో ప్రధాని మోదీ పర్యటనపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీసం ఐదు గంటలు కూడా ఆయన మణిపూర్ ప్రజలతో గడపలేకపోయారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో వర్గవైషమ్యాలతో రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్న వారిని ఈ పర్యటనతో మోదీ ఘోరంగా అవమానించారన్నారు. మోదీ పర్యటనను ఆయన పిట్ స్టాప్‌గా అభివరి్ణంచారు. ‘రెండేళ్లకుపైగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనల్లో సుమారు 300 మంది చనిపోగా, 1,500 మంది గాయపడ్డారు. మరో 67 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇంత జరుగుతున్నా ఇప్పటివరకు అటువైపు కన్నెత్తి కూడా చూడని ప్రధాని మోదీ ఇప్పుడు హడావుడిగా ఇంఫాల్ నుంచి చురాచాంద్‌పూర్ వరకు రోడ్ షో చేపట్టడమేంటి?’అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. సహాయ శిబిరాల్లోని ప్రజల మొర ఆలకించకుండా పిరికితనంతో తప్పించుకోవడానికే మోదీ షో చేపట్టారని ఎక్స్‌లో ఖర్గే వ్యాఖ్యానించారు. పర్యటనకు వెళ్లిన మోదీ ఘనమైన స్వాగత కార్యక్రమాలను ఏర్పాటు చేయించుకోవడం బాధితుల గాయాలను మరింతగా పెంచడమేనన్నారు. ఇలాంటి చర్యలతో మోదీలో పశ్చాత్తాపం గానీ, అపరాధ భావన కానీ లేవని వెల్లడవుతోందన్నారు. మణిపూర్‌లో అశాంతి కొనసాగుతున్న గత 864 రోజుల సమయంలో 46 విదేశీ పర్యటనలు చేసిన మోదీకి, మన పౌరులతో రెండు సానుభూతి మాటలు పంచుకునే తీరికే దొరకలేదా అని ప్రశ్నించారు. మణిపూర్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా అసమర్థత బయటపడిందన్నారు. దీన్నుంచి తప్పించుకునేందుకు మాత్రమే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారని ఖర్గే ఆరోపించారు. మీ రాజ్యధర్మం ఎక్కడికి పోయిందంటూ 2002లో మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్‌పేయి అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖర్గే ప్రస్తావించారు. ఇలా ఉండగా, 28 నెలలుగా ఎదురుచూస్తున్న మణిపూర్ ప్రజలతో ప్రధాని మోదీ కనీసం ఐదు గంటలైనా గడపలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. ప్రచారానికి, విదేశాల్లో పర్యటనలకు ఉన్న సమయం ప్రజల మధ్య గడిపేందుకు ఆయనకు దొరకలేదా అని నిలదీశారు. -
మల్లికార్జున్ ఖర్గే (కాంగ్రెస్) రాయని డైరీ
తెలిసిన పదాలకే అర్థాలు వెతుక్కుంటున్నాను నేను! రాహుల్ గురించి నాకేం తెలియదని?!ఆయన నాతో ఒక్క నవ్వును మించి ఎక్కువ మాట్లాడరు. ఆ నవ్వుకు ‘‘నమస్తే ఖర్గేజీ’’ అని అర్థం; ఎక్కడికి వెళుతున్నదీ చెప్పరు.‘‘నా కోసం చూడకండి’’ అని అర్థం; ఎందుకు వెళుతున్నదీ చెప్పరు. ‘‘ఎక్కువగా ఆలోచించ కండి’’ అని అర్థం; ఎప్పుడు వచ్చేదీ చెప్పరు. ‘‘రావాలని నాకూ ఉంటుంది’’ అని అర్థం;ఏం చేయబోయేది చెప్పరు. ‘‘నాకైనా ఎలా తెలుస్తుంది?’’ అని అర్థం; ఎవరి గురించి,ఏం మాట్లాడబోయేదీ చెప్పరు. ‘‘మాటలు మనకు చెప్పి వస్తాయా ఖర్గేజీ?!’’ అని అర్థం.రాహుల్ మళ్లీ ఇవాళ కొన్ని గంటలుగా కనిపించటం లేదు! ఆయన కనిపించక పోవటానికి – కనిపించకపోవటానికి మధ్య ఆయన కనిపించే నిడివి ఈ మధ్య కాస్త ఎక్కువగా తగ్గుతున్నట్లు నాకు అనిపిస్తోంది!‘‘మీకేమైనా సమాచారం ఉందా వేణుగోపాల్?’’ అని అడిగాను. పార్టీ ఆఫీస్‌లో నేను, వేణుగోపాల్ మాత్రమే ఉన్నాం. ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ ఆయన. ‘మీకు తెలియకుండా నాకు తెలుస్తుందా ఖర్గేజీ!’ అన్నట్లుగా... నిస్సహాయంగా నా వైపు చూశారు వేణుగోపాల్. ఆయన్నిక ఎక్కువ సంఘర్షణకు గురి చేయదలచుకోలేదు నేను. ‘‘సరే! తాళం వేసుకుని మీరు వెళ్లండి’’ అని పైకి లేచాను. నాతో పాటే వేణుగోపాల్ కూడా పైకి లేచి, ‘‘ఖర్గేజీ! మీతో ఒక మాట’’ అన్నారు!!‘చెప్పండి వేణు...’’ అన్నాను.‘‘ఖర్గేజీ! మీరీ మధ్య ఒకే మాటను రెండు అర్థాలు వచ్చేలా మాట్లాడుతున్నారు. లేదా, మీరు మాట్లాడుతున్న ఒకే మాట రెండు అర్థాలు వచ్చేలా ఉంటోంది...’’ అన్నారు వేణుగోపాల్.‘‘ఏమిటా ‘ఒక మాట – రెండర్థాలు’ వేణుగోపాల్?!’’ అన్నాను. ‘‘ఖర్గేజీ! జునాగఢ్‌లో మీరు – ‘‘మొత్తం పెట్టె కుళ్లిపోక ముందే, చెడిపోయిన మామిడిపండ్లను తొలగించాలి...’’ అని అన్నారు.వెంటనే టీవీ ఛానెళ్ల వాళ్లు, ‘కాంగ్రెస్‌లో ఎవరా చెడిపోయిన మామిడి పండ్లు?!’ అని డిబేట్ మొదలు పెట్టేశారు. ఇప్పుడేమో, ‘తాళం వేసుకుని మీరు వెళ్లండి’ అని నాతో అన్నారు. అదృష్టవశాత్తూ ఇది టీవీ వాళ్లకు తెలిసే అవకాశం లేదు కనుక – ‘తాళం వేయమంటే ఏమిటర్థం? పార్టీ ఆఫీస్‌కు తాళం వేసేద్దాం అనేనా ఖర్గే అంటున్నది...’ అని డిబేట్ పెట్టే ప్రమాదం తప్పిపోయింది...’’ అన్నారు వేణు!‘‘నిజమే కానీ వేణుగోపాల్, ఒక మాటను పది మంది పది రకాలుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని చెప్పి, ఆ పది మందికీ ఒకే రకంగా అర్థం అయ్యేలా మాట్లాడాలంటే... ఒక్క మౌనంతో మాత్రమే కదా అది సాధ్యం అవుతుంది?’’ అన్నాను. అలా అంటున్నప్పుడు నాకు రాహుల్ గుర్తొచ్చారు. బహుశా అందుకేనా రాహుల్ నాతో గానీ, పార్టీలో మరొకరితో కానీ తక్కువ మాట్లాడి, ఎక్కువ మౌనంగా ఉంటారు?! ‘‘సీఆర్పీఎఫ్ వాళ్లు లెటర్ పంపించారు వేణుగోపాల్. సెక్యూరిటీకి ఇన్ఫార్మ్ చేయకుండా రాహుల్ బయట తిరుగు తున్నారని కంప్లైంట్. ఈ తొమ్మిది నెలల్లోనే ఇటలీ, వియత్నాం, ఖతార్, లండన్, దుబాయ్ మలేసియా ట్రిప్పులు వేశారట! ‘హై రిస్క్ కేటగిరీలో ఉన్న వీఐపీలు ప్రోటోకాల్‌ని వయలేట్ చేస్తే ఎలా?’ అంటున్నారు’’ అన్నాను.వేణుగోపాల్ మౌనంగా ఉన్నారు! బహుశా అది, వివేచనతో కూడిన మౌనం కావచ్చు. ‘‘మీరు వెళ్లండి వేణుగోపాల్! నేను కాసేపు ఉండి వస్తాను‘ అన్నాను, తిరిగి కూర్చుంటూ. ఆయన వెళ్లిపోయారు. నా చేతిలో సీఆర్పీఎఫ్ వాళ్లు పంపిన లెటర్ ఉంది. ‘‘మీ అబ్బాయి మాట వినటం లేదు’’ అని స్కూల్ హెడ్ మాస్టర్, పేరెంట్స్‌కి లెటర్ రాయగలరు. ‘‘మా అబ్బాయి మాట వినటం లేదు...’’ అని పేరెంట్స్ ఎవరికి లెటర్ రాయగలరు?! రాహుల్ సీఆర్పీఎఫ్కే కాదు, సీడబ్ల్యూసీకీ చెప్పి వెళ్లటం లేదని నేనెవరితో చెప్పుకోగలను?! ఎవరికి లెటర్ రాయగలను? -
నీ అభివృద్ధి కోసం పార్టీ మారావా...?: కేటీఆర్
జోగులాంబ గద్వాల్: తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో కూడా కేసీఆర్ అభివృద్ధి చేశారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గద్వాలను జిల్లా చేసింది.. మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. తమ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్‌లకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగుమార్చి ప్రారంభించిందన్నారు. ‘తెలంగాణ ఉద్యమంలో కూడ గద్వాల ముందుంది. కాంగ్రెస్ నాయకులు మాయామాటలు మాట్లాడుతున్నారు. రైలుకింద తలపెట్టిన చనిపోతా కాని కాంగ్రెస్‌లో చేరనన్న బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎందుకు మారాడు. నీ సొంత అభివృద్ధి కోసం పార్టీ మారావా ఎమ్మెల్యే. కాంగ్రెస్ హయంలో నియోజకవర్గానికి పార్టీ మారిన తర్వాత ఎమ్మెల్యే ఒక్క రూపాయ తెచ్చాడా?, కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు. సిగ్గులేని విధంగా రేవంత్ రెడ్డి సంకలచిక్కి సన్నాయినొక్కులు నొక్కుతున్నాడు స్దానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి. సుప్రీంకోర్టు సీరియస్‌గా ఉంది పార్టీ పిరాయింపు చేసిన పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయక తప్పదు.6 నుంచి 9 మాసాల్లో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక రావడం ఖాయం. గద్వాలలో బీఆర్ఎస్ అభ్యర్ది 50 వేల మెజారిటీతో గెలవటం ఖాయం. దొంగలముఠాలో బండ్ల చేరాడు..ఆయన్ను చిత్తుచిత్తుగా ఓడించాలి. స్కూటీలు మరిచి సీఎం లూఠీలు చేస్తున్నారు. స్దానిక సంస్ధల ఎన్నికల్లో పార్టీ అభ్యర్దులను గెలిపించాలి. ఉపఎన్నికల్లో డంకామోగించాలి’ అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. -
‘నాకు టికెట్‌తో పాటు మంత్రి పదవి కూడా ఇవ్వాలి’
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తాను పోటీలో ఉన్నానని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తాను సికింద్రాబాద్ ఎంపీగా రెండు సార్లు గెలిచానని, జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభవృద్ధి కోసం కృషి చేశానన్నారు. ఎంపీ ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేశానన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా తన మనసులోని మాటను వెల్లడించారు అంజన్ కుమార్ యాదవ్. ‘నా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలి. అందులో భాగంగా నాకు టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలిఉమ్మడి ఏపీ నుండి యాదవ సామాజికవర్గంకి మంత్రి పదవి కేటాయించారు. నాకన్న సీనియర్లు ఎవరు లేరు....నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. హైదరాబాద్ నుండి ప్రాతినిథ్యం లేదు కాబట్టి నాకు అవకాశం ఇచ్చి మంత్రి ఇవ్వాలి. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నేను ఉన్న ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి. జూబ్లీహిల్స్‌లో సర్వే చేస్తే అంజన్ కుమార్ యాదవ్ పేరు వస్తుంది’ అని పేర్కొన్నారు. -
మణిపూర్ సభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్ సెటైర్లు
తెగల మధ్య ఘర్షణలు.. తదనంతరం చెలరేగిన హింసతో చీకట్లో ఉండిపోయిన మణిపూర్‌ని ఇప్పుడు శాంతి-అభివృద్ధి అనే కొత్త ఉదయం తడుతోందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి పాలనలో ఉన్న ఆ రాష్ట్రంలో శనివారం ఆయన పర్యటించారు. వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థానం చేసిన అనంతరం.. చురాచంద్పూర్ పీస్ గ్రౌండ్ వేదికగా మోదీ ప్రసంగించారు. మణిపూర్ ఆశల భూమి. గతంలో హింస అనే చీకటి ఈ అందమైన ప్రాంతాన్ని కమ్మేసింది. కానీ ఇప్పుడు నమ్మకం, శాంతి, అభివృద్ధి అనే కొత్త వేకువ రాబోతోంది. హింసతో ఎవరికీ లాభం ఉండదు. మీ పిల్లల భవిష్యత్తు కోసం శాంతిని ఎంచుకోండి. శాంతి ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందని గుర్తించండి.. ..ఇవాళ ఇంఫాల్‌లో కొత్త విమానాశ్రయం, జిరిబాం-ఇంఫాల్ రైల్వే ప్రాజెక్టు, మెడికల్ కాలేజీలు, మహిళా హాస్టళ్లు, ఐటీ పార్కులు వంటి వేల కోట్ల రూపాయాల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించాం. మణిపూర్‌లో 60,000 పక్కా ఇళ్లు నిర్మించాం. 3.5 లక్షల ఇళ్లకు త్రాగునీటి సరఫరా అందిస్తున్నాం. మణిపూర్ అంతటా పక్కా ఇళ్లు నిర్మించాలన్నది మా అభిమతం. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ మణిపూర్ ప్రజలతోనే ఉంటుంది. గతంలో ఢిల్లీ నుంచి నిర్ణయాలు మణిపూర్‌కు రావడానికి నెలలు, సంవత్సరాలు పట్టేవి. ఓటు బ్యాంకు రాజకీయాలు ఈశాన్య భారతాన్ని ఇబ్బంది పెట్టాయి. కానీ గత 11 ఏళ్లుగా.. ఇక్కడి ఎన్నో సంక్షోభాలు పరిష్కారానికి నొచుకున్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వంతో నిర్ణయాలు అమలు కావడానికి ఎంతో సమయం పట్టదు. మీరు కలలు కనండి. మేము వాటిని నెరవేర్చేందుకు కృషి చేస్తాం. భారత్ త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించబోతోంది. అభివృద్ధిలో మణిపూర్ దేశంతో పాటు ముందుకు సాగుతుంది’’ అని అన్నారాయన. మోదీ ఇవాళ రూ.8,500 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు మణిపూర్‌లో శంకుస్థాపన చేశారు. ఇంఫాల్‌కు కొత్త ఎయిర్పోర్ట్, కొత్త హైవేలు, రైలు-రోడ్డు మార్గం అనుసంధానం, జిరిబమ్ ఇంఫాల్ మధ్య రైల్వే ప్రాజెక్టు, మెడికల్ కాలేజీలు ఉన్నాయి.ఈ కార్యక్రమం కంటే ముందు.. చురాచంద్పూర్లో హింసాత్మక ఘటనల కారణంగా నిరాశ్రయులైన వారిని కలిసి ప్రధాని మోదీ మాట్లాడారు. ఆ సమయంలో వాళ్లకు ఆయన ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లు, హక్కుల విషయంలో మైతేయి, కుకీ తెగల మధ్య 2023 మే నెలలో ఘర్షణలు మొదలై.. ఆ అల్లర్లలో హింస ప్రజ్వరిల్లింది. ఆ ఘర్షణల్లో 250 మంది దాకా మరణించారు. వేలాది మంది(60 వేల మందికిపైనే) నిరాశ్రయులయ్యారు. అప్పటి నుంచి అక్కడ ఇంటర్నెట్ సేవలపై ఆంక్షల కారణంగా.. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ నేపథ్యంతో.. వేల మంది ఇంకా తమ ఇళ్లకు చేరకుండా క్యాంపుల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ క్రమంలోనే బీరెన్ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన సీఎం పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది.ఇదిలా ఉంటే.. గతంలో.. మోదీ 2014లో ప్రధాని అయిన తర్వాత 2018లో ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌ను తొలిసారి సందర్శించారు. ఆ సమయంలో ఇంఫాల్ నగరంలో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే, 2022లో కూడా ఆయన మణిపూర్‌కు వర్చువల్ రూపంలో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం కోసం ప్రసంగించారు. హింసాత్మక ఘర్షణల తర్వాత మోదీ ఇక్కడ పర్యటించడం ఇవాళే తొలిసారి(29 నెలల తర్వాత). 2023 జూలై 20న, హింసపై తొలిసారి పార్లమెంటులో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కు పెట్టాయి. మోదీ పర్యటన.. మణిపూర్ ప్రజలను అవమానించడమే అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రధాని మోదీ మణిపూర్ పర్యటన పెద్ద విషయమేమీ కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మణిపూర్ చాలా కాలంగా సమస్యల్లో ఉంది. ఇప్పుడు ప్రధాని అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అది పెద్ద విషయం కాదు. ప్రస్తుతం దేశంలో అసలు సమస్య 'ఓటు దొంగతనం' (Vote Chori) అని పేర్కొన్నారాయన. ఇక.. మన ప్రధానుల సంప్రదాయం ఇది కాదంటూ మోదీ మణిపుర్ పర్యటనపై ప్రియాంక గాంధీ వాద్రా విమర్శలు గుప్పించారు. ‘‘రెండేళ్ల తర్వాత బాధితులను పరామర్శించడానికి వెళ్లడం బాధాకరం. ప్రమాదాలు, విషాదాలు జరిగినప్పుడు ప్రధానులు వెంటనే అక్కడకు వెళ్లే వాళ్లు. స్వాతంత్ర్యం నుంచి అందరూ ప్రధానులు ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ప్రధాని మోదీ మాత్రం రెండేళ్లు ఆలస్యంగా దాన్ని పాటిస్తున్నారు అంటూ ఆమె ఎద్దేవా చేశారు. -
మళ్లీ జనహిత పాదయాత్ర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనహిత పాదయాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. ఈ నెల 16వ తేదీన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి వస్తున్నారని, ఆ తర్వాత జనహిత పాదయాత్ర ప్రారంభమవుతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం నల్లగొండ, మహబూబ్‌నగర్‌లో ఈసారి యాత్ర జరగనుంది.ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల నేతలకు ఇప్పటికే టీపీసీసీ ఆదేశాలి్చంది. ఈ నెల 16న హైదరాబాద్‌కు రానున్న మీనాక్షి వారం పాటు ఇక్కడే ఉంటారని సమాచారం. జనహిత పాదయాత్రలో పాల్గొనడంతోపాటు ఈ దఫా పర్యటనలో ఆమె కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయి పార్టీ నాయకత్వానికి నామినేటెడ్ పోస్టుల కేటాయింపు ఈసారి క్లియర్ అవుతుందని సమాచారం. అందుకోసం ఆమె మరోమారు సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమవుతారని తెలుస్తోంది.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి వచ్చేవారంలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఇప్పటివరకు బస్తీలు, వార్డులవారీ సమావేశాలకు పరిమితమైనా వచ్చే వారంలో నియోజకవర్గ స్థాయిలో పెద్ద సభను నిర్వహించాలని, ఈ సభకు సీఎం రేవంత్‌తోపాటు మీనాక్షి, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, మంత్రులు పాల్గొనేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో స్థానిక నేతలతో పాటు ఇన్చార్జిలుగా ఉన్న మంత్రులు, కార్పొరేషన్ల చైర్మన్లతో కూడా మీనాక్షి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారని గాం«దీభవన్ వర్గాల సమాచారం.కాగా, పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్ పదవి చేపట్టి ఏడాది అవుతున్న సందర్భంగా ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో నిర్వహించ తలపెట్టిన బీసీల సమరభేరి సభ వాయిదా పడింది. భారీ వర్ష సూచన కారణంగా సభను వాయిదా వేశామని, తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే తెలియజేస్తామని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఇక, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాలపై చర్చించేందుకు ఎంపీ మల్లు రవి అధ్యక్షతన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదివారం భేటీ కానుంది. -
ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో.. లేదో?: మంత్రి
ఆదిలాబాద్ తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హామీలు ఇచ్చే పరిస్థితులో లేనని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందో.. లేదో అంటూ హాట్ కామెంట్స్ చేశారు ఒకవేళ తాను గెలిచినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనేది కచ్చితంగా చెప్పలేనన్నారు. బోథన్ను రెవెన్యూ డివిజన్ చేయమని వచ్చిన స్థానికుల వద్ద మంత్రి స్థానంలో ఉన్న జూపల్లి ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఎటువంటి హామీని ప్రజలకు ఇవ్వలేనని, వచ్చే ఎన్నికల్లో తాను గెలిచినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో.. రాదో అని అన్నారు. తాను కూడా గెలుస్తానో.. లేదో అనే విషయం కచ్చితంగా చెప్పలేని పరిస్థితుల్లో నియోజకవర్గానికి ఎటువంటి హామీ ఇవ్వలేనన్నారు మంత్రి జూపల్లి. -
సర్కార్ నడుపుతున్నారా?.. సర్కస్ నడుపుతున్నారా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సర్కార్ నడుపుతున్నారా?.. సర్కస్ నడుపుతున్నారా? అంటూ రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల నగరంలో నిన్న ఒక చిన్నారి తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్‌లో పడిపోయిందని.. అదృష్టవశాత్తూ పాప ప్రాణాలు దక్కాయి. చేసిన తప్పును దిద్దుకోవాల్సిన మున్సిపల్ శాఖలోని మూడు విభాగాలేమో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.‘‘తప్పు హైడ్రాది అని జీహెచ్ఎంసీ ప్రకటిస్తే.. తప్పు మాది కాదు జల మండలిది అని హైడ్రా చేతులు దులుపుకుంది. ఆ వెంటనే అసలు మాకేం సంబంధం లేదని జలమండలి చేతులెత్తేసింది!. మున్సిపల్ శాఖను కేవలం కాసుల వేటకు వాడుకోవడంలో రేవంత్ బిజీగా ఉంటే, ఆయన శాఖలోని విభాగాలేమో సమన్వయలేమితో నగరవాసులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి’’ అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.సర్కార్ నడుపుతున్నరా?సర్కస్ నడుపుతున్నరా?ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల నగరంలో నిన్న ఒక చిన్నారి తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. అదృష్టవశాత్తూ పాప ప్రాణాలు దక్కాయి. చేసిన తప్పును దిద్దుకోవాల్సిన మున్సిపల్ శాఖలోనిమూడు విభాగాలేమో ఒకరిపై ఒకరు… pic.twitter.com/y4AgJyiXir— KTR (@KTRBRS) September 12, 2025 -
హీరాబెన్-మోదీపై ఏఐ వీడియో.. బీజేపీ గుర్రు
బీహార్ ఎన్నికల ప్రచారం పోనుపోను వ్యక్తిగత విమర్శలకు కేరాఫ్‌గా మారేలా కనిపిస్తోంది. మొన్నీమధ్యే రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రలో మోదీని, మోదీ తల్లిని కొందరు దూషించినట్లుగా ఓ వీడియోను బీజేపీ వైరల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ సైతం తన తల్లి హీరాబెన్‌ను రాజకీయాల్లోకి లాగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా బీహార్ కాంగ్రెస్ విభాగం నేరుగా సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ ఏఐ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది.సాహబ్ కలలో అమ్మ .. ఆ తర్వాత ఏం జరిగిందో చూసేయమంటూ.. ఆ వీడియో ఉంది. అందులో ప్రధాని మోదీని పోలిన క్యారెక్టర్.. ‘‘ఈరోజు ఓట్ల దొంగతనం(Vote Chori) అయిపోయింది.. ఇప్పుడు హాయిగా నిద్రపోవచ్చు అని కళ్లు మూసుకుంటుంది. ఆ వెంటనే హీరాబెన్‌ను పోలి ఉన్న పాత్ర కలలో ప్రత్యక్షమై.. "ఓట్ల కోసం నా పేరును ఉపయోగించడంలో ఎంత దూరం వెళ్తావు? రాజకీయాల్లో నీతిని మరచిపోయావా? అని అంటుంది. ఈ మాటలతో నిద్రపోతున్న వ్యక్తి ఆశ్చర్యంతో మెలకువకు వస్తాడు.ఈ వీడియోపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేస్తోంది. బీజేపీ ఎంపీ రాధా మోహన్ దాస్ అగర్వాల్ కాంగ్రెస్ విడుదల చేసిన AI వీడియోపై తీవ్రంగా స్పందించారు.. ఈ వీడియో రాజకీయాల్లో దిగజారిన స్థాయికి నిదర్శనమని అన్నారాయన. రాహుల్ గాంధీ సూచన మేరకే బీహార్ కాంగ్రెస్ యూనిట్ ఈ వీడియోను రూపొందించిందని ఆరోపించారాయన. ప్రధాని మోదీ ఎప్పుడూ కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచారని, కానీ ఇప్పుడు ఆయన తల్లి హీరాబెన్‌ను రాజకీయాల్లోకి లాగి మరీ కాంగ్రెస్ దాడి చేయడం బాధాకరం అని పేర్కొన్నారు. టెక్నాలజీని ఉపయోగించి దేశాన్ని తప్పుదోవ పట్టించడమే కాకుండా.. మోదీ సహా దేశంలోని ప్రజలందరి తల్లుల గౌరవాన్ని అవమానించడమే ఈ వీడియో ఉద్దేశమని విమర్శించారు. ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.साहब के सपनों में आईं "माँ" देखिए रोचक संवाद 👇 pic.twitter.com/aA4mKGa67m— Bihar Congress (@INCBihar) September 10, 2025అయితే.. క్షమాపణలకు కాంగ్రెస్ నిరాకరిస్తోంది. ఇదేం వ్యక్తిగత దూషణ కాదని.. రాజకీయ విమర్శ మాత్రమే అని చెబుతోంది. వీడియోలో వ్యక్తీకరించిన సందేశం ప్రధానిగా మోదీ తన తల్లి పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారనే విమర్శ మాత్రమే అని అంటోంది. -
రాష్ట్రానికి పాలనా పక్షవాతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని పరిపాలనా పక్షవాతం (అడ్మినిస్ట్రేటివ్ పెరాలిసిస్) పట్టి పీడిస్తోందని బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. దాదాపు 22 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని మండిపడ్డారు. రూరల్..అర్బన్ సెక్టార్లలోనే కాదు.. అన్ని సెక్టార్లలో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ధ్వజమెత్తారు. గురువారం తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు సమన్వయకర్తగా నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో రాంచందర్‌రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ ఒక్క ప్రాజెక్టును కూడా సక్రమంగా ప్రారంభించలేదని, జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థ, భద్రతా చర్యల్లో విఫలమైందన్నారు. హైడ్రా చర్యల్లో భాగంగా ఎక్కడెక్కడ ఎవరెవరి ఆస్తులు కూల్చారు..సాధించిన ఫలితాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీగా ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతానికి పైగానే టికెట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు.ఫార్ములా ఈ–కార్ రేస్ అవకతవకలపై ఏసీబీ విచారణలో వెల్లడైన అంశాలను ప్రభుత్వం బయటపెట్టి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా రూ.1,000 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారన్నారు. అయితే అందుకు పూర్తి విరుద్ధంగా ఓయూ ఉద్యోగులకు ఈసారి నెల జీతమే ఆలస్యంగా వచి్చందన్నారు. జాబ్ కేలండర్ ప్రకటిస్తారు కానీ.. దానిని అమలు చేయడం లేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో పేపర్ లీకేజీలు జరిగితే కాంగ్రెస్ హయాంలో ‘హోప్ బ్రేకేజ్’జరుగుతోందన్నారు. కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించాలి కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌లపై కాకుండా నాణ్యత, అవినీతి, నిర్వహణ తదితర అంశాలు ముడిపడి ఉన్నందున మొత్తం ప్రాజెక్టుపైనే సీబీఐ విచారణ జరిపించాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. వందరోజుల్లో ఎన్నికల హామీలు అమలు చేస్తామని చెప్పి..రెండేళ్లు కావొస్తున్నా ఏమీ చేయకపోవడంతో ప్రజలు ఇకపై ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రెండునెలల్లో బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపాలంటున్న కాంగ్రెస్ నేతలు, మంత్రులు మరి స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్న పదిమంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల నోటీసులపై కాలపరిమితితో చర్యలెందుకు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు.కాంగ్రెస్ సర్కార్ ‘మిస్ మేనేజ్మెంట్’కారణంగానే తెలంగాణలో యూరియా కొరత ఏర్పడిందని ఒక విలేకరి వేసిన ప్రశ్నకు ప్రతిస్పందించారు. పార్టీలో అన్నీ సర్దుకుంటాయని, రాష్ట్ర కమిటీలో పరిమితంగా పోస్టులున్నందున అందరిని సంతృప్తి పరచలేమన్నారు. ఈ కమిటీలో చోటుదక్కని వారు ఎవరూ బాధపడొద్దని పార్టీలో ఇంకా 650 పోస్టులు ఉన్నాయని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల పార్టీ ముఖ్యనేతలపై చేసిన వ్యాఖ్యలపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ‘ఎవరు పడితే వారు చేసే వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు’అని అన్నారు. తన వెనుకాల ఎవరూ లేరని కేవలం ప్రధానమంత్రి మోదీ మాత్రం ఉన్నారని చెప్పారు. జర్నలిస్టులపై జరిగిన దాడులను ఖండిస్తున్నామని, జర్నలిస్టులు, న్యాయవాదుల రక్షణకు చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. -
243 సీట్లు.. 2,300 దరఖాస్తులు
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్‌లో సీఎం నితీశ్‌కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ పథక రచన చేస్తోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 243 స్థానాల్లో గెలుపు గుర్రాల కోసం వేట కొనసాగిస్తోంది. సీట్ల పంపకాల విషయంలో ఇండియా కూటమి ఆమోద ముద్ర వేసేవరకూ ఈ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కొనసాగనున్నది. ఆశావహుల నుంచి ఇప్పటికే 2,300పైగా దరఖాస్తులు అందాయి. దరఖాస్తుల ఆధారంగా పార్టీ బలం, బలహీనతలపై ఒక అవగాహనతోపాటు.. కొత్తగా ఎదుగుతున్న నేతలపై ప్రధానంగా దృష్టి సారించడమే రాష్ట్ర కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16న కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానున్నది. 14వ తేదీలోగా అభ్యర్థుల జాబితాను పంపాలని రాష్ట్ర పార్టీ కోరింది. 16న జరిగే సమావేశంలో ఈ పేర్లపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. ఒక్కో సీటుకు ముగ్గురు పోటీ: రాష్ట్ర పార్టీ ఎన్నికల కమిటీ మొత్తం 243అసెంబ్లీ స్థానా ల్లో ఒక్కో సీటు నుంచి ముగ్గురి పేర్లను సిద్ధం చేసి స్క్రీనింగ్ కమిటీకి పంపించనున్నది. ఈ నెల 19న జరగనున్న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో దరఖాస్తులను పరిశీ లించనున్నారు. అంతిమంగా ఒకరి పేరును ఎంపిక చేసి ఆమోదం కోసం ఢిల్లీలోని అధిష్టానానికి పంపించనున్నారు. ఇదే జాబి తాను యథాతథంగా లేదా కొద్ది మార్పులతో అధిష్టానం ప్రటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
సుప్రీంకోర్టు నోటీసులు.. యూటర్న్ తీసుకున్న తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలు
సాక్షి,హైదరాబాద్: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలు యూ టర్న్ తీసుకున్నారు. తాము కాంగ్రెస్‌లో చేరలేదని బీఆర్ఎస్లోనే ఉన్నామని స్పష్టం చేశారు.బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 31న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇదే అంశంపై తెలంగాణ స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. వారి వద్ద నుంచి వివరణ తీసుకున్నారు. స్పీకర్ పంపిన నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు కౌంటర్ దాఖలు చేశారు.కాంగ్రెస్‌లో చేరలేదు.. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌ను కలిశా.బీఆర్ఎస్కు నేను రాజీనామా చేయలేదు-పోచారం శ్రీనివాస్ రెడ్డిమా ఫోటోలను మార్ఫ్ చేశారు. నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా.నాది బీఆర్ఎస్ ఐడియాలజీ- బండ్ల కృష్ణ మోహన్ రెడ్డినేను బీఆర్ఎస్లోనే ఉన్నా.కాంగ్రెస్‌లో చేరానన్నది అబద్ధం- కాలే యాదయ్యనేను బీఆర్ఎస్లో కొనసాగుతున్నా. కాంగ్రెస్‌లో చేరలేదు. ఇప్పటికి బీఆర్ఎస్కే నా మద్దతు- గూడెం మహిపాల్ఇప్పటికి బీఆర్ఎస్లోనే ఉన్నా. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశా- అరికెపూడి గాంధీ వివరణిచ్చారు. -
కాంగ్రెస్ ప్రభుత్వానికి పరీక్షలు నిర్వహించడం రావడంలేదు: రామచందర్ రావు
-
ఓట్ల చోరీపై పోరాటం ఉధృతం చేస్తాం
రాయ్‌బరేలీ: ‘ఓటు చోర్, గద్దీ చోడ్’ నినాదం దేశమంతటా వినిపిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఓట్ల చోరీ బాగోతాన్ని భిన్నరూపాల్లో బయటపెడతామని చెప్పారు. ఓట్ల దొంగలు పదవుల నుంచి దిగిపోవాలని ప్రజలు నినదిస్తున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ పార్లమెంట్ నియోజక వర్గానికి చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలతో సమావేశమ య్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఓట్ల చోరీ ముమ్మాటికీ నిజమని తేల్చిచెప్పారు. ప్రజల ఓట్లను దొంగలించి గద్దెనెక్కినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మహారాష్ట్ర, కర్ణాటకలో జరిగిన ఓట్ల చోరీపై తమవద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కోటి మందిని కొత్తగా ఓటర్లుగా చేర్పించి బీజేపీ గెలిచిందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, హరియాణా, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున ఓట్ల దొంగతనం జరిగిందని మండిపడ్డారు. ఓట్ల చోరీపై పోరాటం మరింత ఉధృతం చేస్తామని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే రాజ్యాంగాన్ని, జాతీయ జెండాను కూడా కాపాడినట్లేనని రాహుల్ అన్నారు. దేశ సంపద ప్రజలందరికీ చెందుతుందని రాజ్యాంగం నిర్దేశిస్తున్నట్లు గుర్తుచేశారు. ఇదిలా ఉండగా, రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీతోపాటు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఫోటోలతో కూడిన పోస్టర్లు ఏర్పాటు చేశారు. ‘భారతదేశం చివరి ఆశ కలియుగ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు’ అంటూ వాటిపై నినాదాలు రాశారు. -
ఇంతకీ ఆ ఎమ్మెల్యేది ఏ పార్టీ : కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: కొందరు ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేదని దుస్థితిలో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గద్వాల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మీటింగ్‌లకు ఎందుకు రావడం లేదు?.కాంగ్రెస్ కండువా వేసుకుని సిగ్గులేకుండా బీఆర్ఎస్లో ఉన్నానంటున్నాడు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే వేటువేయాలి’అని డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం చర్చాంశనీయంగా మారింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో గత వారం తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. వీరి భేటీలో ఏం చర్చించారనే అంశం గురించి తెలియాల్సి ఉంది.‘ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్’ అంటే ఒప్పుకోం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.మూడు నెలల్లోగా ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ శాసనసభ స్పీకర్‌కు ఆదేశించింది. పదో షెడ్యూల్ ప్రకారం, స్పీకర్‌కు రాజ్యాంగ రక్షణ లేదని పేర్కొంది. తెలంగాణ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. తద్వారా స్పీకర్ నిర్ణయం ఆలస్యం చేయడం సరికాదని స్పష్టం చేసింది. ‘ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్’ అనే పరిస్థితిని అంగీకరించలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనర్హత పిటిషన్లను సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉంచడం సమంజసం కాదని పేర్కొంది.పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని సూచించింది.ఫిరాయింపులు ఎమ్మెల్యేలు వీళ్లేనా? 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్లో గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్‌లు ఉన్నారు.వీరిలో గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నారనేది ప్రశ్నార్ధకంగా మారింది. తాను ఇప్పటికీ గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని కృష్ణమోహన్‌రెడ్డి అంటుంటే.. కేటీఆర్ మాత్రం గద్వాల్ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌నని చెప్పుకుని.. పార్టీ కార్యక్రమాలకు ఎందుకు గైర్హాజరవుతున్నారని ప్రశ్నిస్తున్నారు. -
సెకండాఫ్‌లో సీఎం పోస్టు.. ఆ ఆశ ఇంకా సజీవంగానే!
డీకే శివకుమార్ (DK Shivakumar) వరుస ప్రకటనలతో కర్ణాటక రాజకీయాల్లో గందరగోళం కొనసాగుతూనే వస్తోంది. గతకొంతకాలంగా ‘సీఎం మార్పు’ అంశంపై రాజకీయం ఎంతకీ తెగట్లేదు. అలాగే రాజకీయ భవిష్యత్తుపై ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఐదేళ్లూ తానే ముఖ్యమంత్రినని సిద్ధరామయ్య చెబుతున్నా.. తన చేతుల్లో ఏమీ లేదని డీకే శివకుమార్ అంటున్నా అక్కడి రాజకీయాల్లో మాత్రం సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే.. తాజాగా డిప్యూటీ సీఎం శివకుమార్ దీనిపై మరోసారి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి కాలమే సమాధానం చెబుతుందని అన్నారాయన. ప్రపంచంలో ఏ మనిషైనా ఆశతోనే బతుకుతారని... ఆ ఆశే లేకుంటే జీవితమే లేదు. మీరడిగిన ప్రశ్నకు నేను కాదు.. కేవలం కాలమే దీనికి సమాధానం చెబుతుంది అని అన్నారాయన. ఇండియా టుడే కంక్లేవ్ సౌత్ 2025లో ఎదురైన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. సీఎం పదవి నిర్ణయం పార్టీ హైకమాండ్‌దేనని డీకే మరోసారి కుండబద్ధలు కొట్టారు. నేను.. నా నాయకత్వం, నేను.. నా పార్టీ, నేను .. సిద్ధరామయ్య. ఎవరైనా.. ఏ విషయంలో అయినా మా పార్టీ హైకమాండ్‌దే సంపూర్ణ అధికారం. వారు చెప్పినదానికే మేం కట్టుబడి ఉంటాం. మేము కర్ణాటక ప్రజలకు మంచి పాలన ఇవ్వాలని హామీ ఇచ్చాం. అదే మా ముఖ్య లక్ష్యం. అందుకోసం అందరం కలసి పని చేస్తాం అని అన్నారాయన.కాంగ్రెస్ ప్రభుత్వ బలం.. ఏ శివకుమార్ మీదో, సిద్ధారమయ్య మీదో, మరెవరి మీదో ఆధారపడి ఉండదు. అది ఐక్యత మీద ఆధారపడి ఉంటుంది. అది నిరంతర సమిష్టి విజయం. ప్రజలు మమ్మల్ని నమ్మారు. ఆ ఐక్యతే మాకు బలం అని అన్నారాయన. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2023 మే 20న అధికారంలోకి వచ్చింది. అంటే, ఇప్పటివరకు సరిగ్గా 1 సంవత్సరం 3 నెలలు (2025 సెప్టెంబర్ 9 నాటికి) పూర్తయ్యాయి. రెండున్నరేళ్ల అనంతరం ముఖ్యమంత్రి పీఠం మార్పు ఉంటుందని కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దాన్నే విశ్వసిస్తున్నారు.ఈ ప్రచారాన్ని సిద్ధరామయ్య మొదటి నుంచి తోసిపుచ్చుతున్నారు. అయితే తాను ముఖ్యమంత్రిని (Karnataka CM) కావాలని ప్రజలు కోరుకోవడంలో తప్పులేదంటున్న డీకే శివకుమార్.. అందుకు పార్టీ పెద్దల ఆశీర్వాదం కూడా ఉండాలంటున్నారు. -
42% రిజర్వేషన్లు ఇచ్చాకే ‘స్థానికం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ స్పష్టం చేశారు. కామారెడ్డిలో చేసిన బీసీ డిక్లరేషన్‌కు పార్టీ కట్టుబడి ఉందన్నారు. స్థానిక ఎన్నికల విషయంలో రిజర్వేషన్ల కల్పనే ప్రధానమని పార్టీ యోచిస్తోందని చెప్పారు. సోమవారం గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన టీపీసీసీ విస్తతస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో మీనాక్షి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ సమన్వయంతో పనిచేస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు 90 శాతం మంది ప్రజలకు అందుతున్నాయన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై వచ్చే నెల నుంచి పార్టీ దృష్టి సారిస్తుందని.. ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా నేతలంతా పనిచేయాలని పిలుపునిచ్చారు. వచ్చే వారంలో డీసీసీ కమిటీలు పూర్తవుతాయని.. గ్రామ శాఖ అధ్యక్షుల ఎంపికను 3 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఈ నెల 15న కామారెడ్డిలో బీసీల సమరభేరి సభను విజయవంతం చేయాలని మీనాక్షి పిలుపునిచ్చారు. చేరికలను ఆహ్వానించాలి: భట్టి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అజేయంగా నిలపడం కోసం పీసీసీ చీఫ్ చేసే ప్రతి పనికీ సీఎం రేవంత్‌తోపాటు మంత్రివర్గమతా అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. రాహుల్ గాం«దీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా నేతలంతా కలిసి పనిచేయాలన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరి సమాచారం తమ వద్ద ఉందని.. అందరికీ ఏదో ఒక రూపంలో న్యాయం జరుగుతుందని భట్టి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ప్రభుత్వ సంక్షేమ పథకాలపట్ల ఆకర్షితులై గ్రామ, మండల స్థాయి నుంచి వస్తున్న వివిధ పార్టీల నేతలను ఉద్యమంలాగా పార్టీలోకి ఆహ్వానించాలని కోరారు. మళ్లీ మనమే గెలుస్తాం: టీపీసీసీ చీఫ్ ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను పార్టీ నేతలు, కార్యకర్తలు తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ సూచించారు. 2029లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని.. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఖతమై రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తోపాటు టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ల చైర్మన్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఉమ్మడి జిల్లాల పార్టీ ఇన్చార్జీలు, జై బాపు–జై భీం కార్యక్రమాల కమిటీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బూత్‌స్థాయి వరకు నెట్వర్క్: మంత్రి పొన్నం టీపీసీసీ సమావేశం అనంతరం విప్ ఆది శ్రీనివాస్, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులతో కలిసి బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో భాగంగా పలు అంశాలపై చర్చించామని చెప్పారు. పీసీసీ చీఫ్‌గా మహేశ్‌గౌడ్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు పార్టీ నాయకత్వం అభినందనలు తెలిపిందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టడం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు, 15న కామారెడ్డిలో బహిరంగ సభ, జనహిత పాదయాత్ర, ఓట్ చోరీ తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీపక్షాన హైదరాబాద్ నుంచి పోలింగ్ బూత్‌స్థాయి వరకు నెట్వర్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పొన్నం వెల్లడించారు. వివిధ కారణాలతో పార్టీ వీడిన నేతలను మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవాలని భట్టి చేసిన ప్రతిపాదనను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిందన్నారు. -
జస్టిస్ సుదర్శన్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా..
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఢిల్లీలో రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టారు. మంగళవారం జరగనున్న ఎన్నికల్లో ఇండియా కూటమి ఉమ్మడి అభ్యరి్థ, తెలుగుబిడ్డ జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న ఆయన, రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమై ఎన్నికల వ్యూహాలపై కీలక చర్చలు జరిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు రేవంత్‌రెడ్డి క్షుణ్ణంగా దిశానిర్దేశం చేశారు.ముఖ్యంగా, ఇది రహస్య ఓటింగ్ పద్ధతిలో జరిగే ఎన్నిక కాబట్టి, దీనిని ఇండియా కూటమికి అనుకూలంగా ఎలా మలచుకోవాలనే దానిపై ప్రధానంగా చర్చించారు. మిగతా పారీ్టల ఎంపీలతో ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, అంతరాత్మ ప్రబోధం మేరకు ఓటు వేయాలని కోరుతూ ఎవరెవరితో సంప్రదింపులు జరపాలి అనే అంశాలపై సీఎం ఎంపీలకు స్పష్టమైన సూచనలు చేసినట్లు తెలిసింది.రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడిన అభ్యరి్థగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి ఓటు వేయడం చారిత్రక అవసరమని, ఈ విషయాన్ని ఇతర పార్టీల ఎంపీలకు కూడా నొక్కిచెప్పాలని సూచించారు. తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యే ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకునేలా ఎంపీలందరూ సమష్టిగా పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. మంగళవారం జరిగే పోలింగ్‌లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఎంపీలకు స్పష్టం చేశారు.రెండు రోజులు ఢిల్లీలోనే సీఎం.. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మంగళవారం జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికలను పర్యవేక్షిస్తారు. వీలును బట్టి పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించేందుకు ప్రధాని మోదీని కూడా కలిసే అవకాశాలున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం అపాయింట్మెంట్ను అడిగినట్టు తెలిసింది. ప్రధాని అపాయింట్మెంట్ లభిస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల గురించి కూడా సీఎం మాట్లాడే అవకాశముందని సమాచారం. మరోవైపు టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించనున్న బీసీల సమర భేరి సభకు ఏఐసీసీ పెద్దలను రేవంత్ ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. -
చుక్క నీరు తేలేదు! : సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పదేళ్లలో కృష్ణా, గోదావరి నదుల నుంచి చుక్క నీరు కూడా హైదరాబాద్‌కు తరలించలేదు. గత పాలకులు నగర ప్రజల దాహార్తిని పట్టించుకోలేదు. కాంగ్రెస్ తెచ్చిన గోదావరి జలాలను నెత్తి మీద చల్లుకుని తామే ఏదో చేసినట్టు కొందరు నమ్మించారు. నెత్తి మీద నీళ్లు చల్లుకున్నంత మాత్రాన వాళ్ల పాపాలు తొలగిపోవు..’ అని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. సోమవారం గోదావరి రెండు, మూడో దశ తాగునీటి సరఫరా, మూసీ నది పునరుజ్జీవం పథకాలకు గండిపేట వద్ద ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. నిజాం దూరదృష్టి వల్లే నగరానికి తాగునీళ్లు ‘శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను హైదరాబాద్‌కు తరలిస్తున్నాం. కానీ ఆ సంగతి మరిచిపోయి కొందరు మల్లన్నసాగర్ అని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ హయాంలో అప్పటి సీఎం వైఎస్సార్ చొరవతోనే కృష్టా, గోదావరి జలాలు హైదరాబాద్‌కు వచ్చాయి. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మరోసారి గోదావరి జలాల తరలింపునకు ముందడుగు పడింది. వందేళ్లకు పైగా ఈ నగరానికి తాగు నీరు అందుతోందంటే ఆనాటి నిజాం సర్కార్ దూరదృష్టే కారణం. నగరానికి ప్రతి ఏటా 3 శాతం చొప్పున వలసలు పెరుగుతున్నాయి. జనాభా కోటిన్నర దాటడంతో అందుకు తగ్గట్టుగా భవిష్యత్తు ప్రణాళికలు అవసరం..’ అని సీఎం పేర్కొన్నారు. ‘తుమ్మిడిహెట్టి’పై మహారాష్ట్రను ఒప్పిస్తాం ‘గోదావరిపై తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల కట్టి ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల రైతులకు సాగునీరు అందిస్తాం. దివంగత వైఎస్సార్ తుమ్మిడిహెట్టి వద్దే దీనిని ప్రారంభించారు. అయితే గత బీఆర్ఎస్ పాలకులు కాసుల కక్కుర్తితో తలను తొలగించి చేవెళ్ల, తాండూరు, పరిగికి సాగునీరు అందకుండా చేశారు. త్వరలో ఈ ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర సీఎంను కలిసి చర్చించి ఒప్పిస్తాం..’ అని రేవంత్ చెప్పారు. మూసీ ప్రక్షాళన చేసి తీరతాం.. ‘మూసీ మురికికూపంగా మారి విషం చిమ్ముతోంది. ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, భువనగిరి, ఆలేరు ప్రాంతాల్లో నీరు తాగితే పశువులే కాదు, మనుషుల ప్రాణాలు సైతం పోతున్నాయి. పుట్టబోయే బిడ్డలు కూడా అంగవైకల్యంతో పుడుతున్నారు. నల్లగొండ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు ఎలాగైనా సరే మూసీని పునరుజ్జీవింపజేయాలని స్థానికులు కోరారు. వారికిచ్చిన మాట ప్రకారం మూసీ ప్రక్షాళన చేసి తీరతాం. గోదావరి జలాల తరలింపు ద్వారా జంట నగరాల తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాకుండా మూసీ కాలుష్యాన్ని నివారించడం ద్వారా ఆ సమస్య నుంచి నల్లగొండ జిల్లా ప్రజలకు విముక్తి కల్పిస్తాం. ఫ్యాక్టరీల కాలుష్యం మూసీలో కలవకుండా నియంత్రిస్తాం. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు నిర్వాసితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది. హైదరాబాద్‌ను సుందర నగరంగా తీర్చిదిద్దుతాం..’ అని ముఖ్యమంత్రి అన్నారు. డిసెంబర్ 9న విజన్ డాక్యుమెంట్ విడుదల ‘వందేళ్లకు సరిపడా ప్రణాళికతో డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసి తెలంగాణ సమాజానికి అంకితం ఇవ్వబోతున్నాం. గేట్ వే ఆఫ్ హైదరాబాద్ ప్రాజెక్టు కోసం ప్రణాళికలు సిద్ధం చేశాం. రాబోయే పదేళ్లలో హైదరాబాద్‌ను అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. మహానగరాన్ని అభివృద్ధి చేయడంలో ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలి. ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో కలిసిరావాలి..’ అని సీఎం పిలుపునిచ్చారు. నియో పొలిస్ ట్రంపెట్ ఇంటర్ చేంజ్ ప్రారంభం కోకాపేట వద్ద నియో పొలిస్ ట్రంపెట్ ఇంటర్ చేంజ్‌ను సోమవారం సీఎం ప్రారంభించారు. అదేవిధంగా గండిపేట వద్ద హెదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో నిర్మించిన 16 రిజర్వాయర్లను కూడా ప్రారంభించారు. అనంతరం ప్రాజెక్టు ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ వెంకటస్వామి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. -
‘రండి.. మా పార్టీలో చేరండి’
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇతర పార్టీల నేతల్ని చేర్చుకునేందుకు పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయంటూ పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో మీనాక్షి నటరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు పార్టీలోకి వచ్చినా స్వాగతిస్తామన్న ఆమె.. త్వరలోనే నామినేటెడ్,కార్పొరేషన్ పోస్టులు భర్తీ చేస్తామని సూచించారు. అయితే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఆమె పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో చేసిన ప్రకటనల ఆధారంగా, ఇది కేవలం నేతలను చేర్చుకోవడమే కాకుండా, పార్టీలో అంతర్గత సమీకరణలను సమతుల్యం చేయడానికి కూడా ఒక వ్యూహంగా కనిపిస్తోంది. ఇందుకోసంపార్టీలోని నేతలను మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్నవారు,ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి వచ్చినవారు, అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరినవారు ఇలా మూడు వర్గాలుగా విభజించారు.వాటి ఆధారంగా పదేళ్లుగా పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యత, కేటగిరీల వారీగా నామినేటెడ్ పదవుల భర్తీ జరుగుతుంది. అంటే పార్టీలో ఉన్న కాలం, నిబద్ధత ఆధారంగా అవకాశాలు కల్పించనున్నారు. -
తెలంగాణ బీజేపీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు
సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణ బీజేపీకి చుక్కెదురైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా దాఖలైన పరువు నష్టం దావా కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో రాష్ట్ర బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.వివరాల ప్రకారం.. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తున్నారని, రిజర్వేషన్లను ఎత్తివేస్తారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రేవంత్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ.. సుప్రీంకోర్టులో పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా బీజేపీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్. గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు కోర్టులను వేదికగా చేసుకోవద్దు అని హితవు పలికారు. రాజకీయ నాయకులు వీటిని గట్టిగా ఎదుర్కోవాలి. రాజకీయపరమైన వ్యాఖ్యలు రాజకీయ స్ఫూర్తితోనే ఎదుర్కోవాలి అని వ్యాఖ్యానించారు. చివరగా.. పది లక్షల జరిమానా విధిస్తామని బీజేపీని హెచ్చరించారు. అనంతరం, పిటిషన్‌ను కొట్టివేశారు.ఇదిలా ఉండగా.. గతంలో ఇదే విషయంపై బీజేపీ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు సైతం కొట్టివేసింది. దీంతో, రాష్ట్ర బీజేపీ.. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాజాగా మరోసారి బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. -
ఆ పార్టీ అద్భుతాలు రేవంత్‌కే తెలియాలి!
రాజకీయంగా అనూహ్యంగా ఉన్నత స్థానానికి చేరుకున్న వ్యక్తుల్లో ఒకరైన రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి పీఠం అధిష్టించినా పాత వాసనలు మాత్రం పోగొట్టుకోలేక పోతున్నట్లు అనిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన ఒక్కోసారి ఆత్మరక్షణలో పడిపోతున్నారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో ఏర్పడ్డ సంక్షోభంలో తన పాత్ర లేదని చెప్పే ప్రయత్నంలో ఆయన ఆ పార్టీ నేతలపై కొన్ని అభ్యంతరకరమైన పదాలు ప్రయోగించడం, తెలుగుదేశం పార్టీని పొగడటం ఇలాంటిదే. కొందరి కుట్రల వల్ల తెలంగాణలో తెలుగుదేశం ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది కానీ అదో అద్భుతమైన పార్టీ అని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంతవరకూ ఓకే. కానీ అందుకు ప్రకృతి ప్రతీకారం తీర్చుకుందని, అన్ని దుర్మార్గాలు చేసిన మీరు (బీఆర్ఎస్) మాత్రం ఎలా మనుగడ సాగిస్తారని ప్రశ్నించడంపై ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ అంత గొప్ప పార్టీనే అయితే రేవంత్ ఎందుకు వదిలిపెట్టారు? దాన్ని వృద్ధిలోకి తీసుకురాకుండా కాంగ్రెస్‌లో చేరారు ఎందుకు? ఇదిలా ఉంటే.. ఆయా సందర్భాల్లో రేవంత్ టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పనిగట్టుకుని ప్రశంసించడం కాంగ్రెస్ నేతలు చాలామందికి రుచించడం లేదు. సీఎం కాబట్టి పెద్దగా ప్రశ్నించడం లేదని అంటున్నారు. కాంగ్రెస్‌లో ఒకసారి విమర్శించడం మొదలైందంటే గోల, గోల అవుతుందన్న సంగతి రేవంత్‌కు తెలియనిది కాదు. తెలంగాణలో గత ఎన్నికల్లో టీడీపీ పరోక్షంగా కాంగ్రెస్‌కు సహకరించిందన్నది వాస్తవం. కొంతమంది టీడీపీ జెండాలు పట్టుకుని ఏకంగా గాంధీభవన్‌కే వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో సత్సంబంధాలు ఉన్నాయని అంటారు. ఈ అంశం కూడా కలిసిరావడంతో రేవంత్ సీఎం కాగలిగారని చాలా మంది అభిప్రాయం. రేవంత్ టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరి ఎంపీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ లో చేరడానికి ముందుగా చంద్రబాబు అనుమతి తీసుకున్నారన్నది బహిరంగ రహస్యమే. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మిగిలి ఉన్న టీడీపీ అభిమానుల మద్దతు పొందడానికి ఆయన ఇలా మాట్లాడారా? స్థానిక ఎన్నికలలో కాని, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాని వారి సహకారం పొందడానికి ఈ వ్యూహంలో వెళుతున్నారా ? అన్న సంశయం వస్తుంది. అయితే రేవంత్ వ్యాఖ్యలు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు చికాకు తెప్పిస్తాయి. కాంగ్రెస్ సీఎంగా ఉండి టీడీపీని పొగుడుతుంటే నష్టం కదా? అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా, ఆ తర్వాత టీడీపీలోకి వచ్చాక, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండే వారు. రహస్య సంబంధాలు పెట్టుకున్నా, బయటికి మాత్రం ఘాటుగా మాట్లాడేవారు. కానీ రేవంత్ ఆ పార్టీతో ఏ స్థాయిలో సంబంధాలు కొనసాగిస్తున్నారో తెలియదు కాని, ఇలా వేరే పార్టీని బహిరంగంగా పొగడడమేమిటని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. 1982లో ప్రముఖ నటుడు ఎన్టీ రామారావు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నంత కాలం రాజకీయ పోరు కాంగ్రెస్, టీడీపీల మధ్యే సాగింది. రేవంత్ ఈ విషయాన్ని ఎలా విస్మరిస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో చంద్రబాబు వ్యూహం కారణంగానే టీడీపీ కనుమరుగైంది కానీ నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ల వల్ల కాదని కొందరి విశ్లేషణ. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనో, ఇరుకున పెట్టాలనో చంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయాలని ప్రయత్నించడం, దానికి రేవంత్‌ను వాడుకోవడం, పోలీసులు నిఘా పెట్టి పట్టుకుని కేసు పెట్టడం, రేవంత్ జైలుకు వెళ్లడం.. ఇదంతా చరిత్రే. ఆ తర్వాత కేసీఆర్‌తో రాజీలో భాగంగా చంద్రబాబు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను వదలుకుని ఏపీకి వెళ్లిపోయారు. పలితంగా ఆయనపై కేసు లేకుండా చేసుకోగలిగారు. ఇన్ని దుర్మార్గాలు చేసిన వారు ఎలా మనుగడ సాగించగలరని అనడం ద్వారా బీఆర్ఎస్కు ఇక భవిష్యత్తు లేదన్న అభిప్రాయం కలిగించారు. బిఆర్ఎస్ను చచ్చిన పాముతో పోల్చారు. ఒకసారి ఓడిపోతేనే ఏ పార్టీకైనా ఫ్యూచర్ లేకపోతే, కాంగ్రెస్ పదేళ్ల తర్వాత మళ్లీ ఎలా అధికారంలోకి వచ్చింది? కాంగ్రెస్ తెలంగాణలో 2014 నుంచి రెండుసార్లు ఓడిపోయింది. అయినా మూడోసారి విజయం సాధించింది. దేశంలోనే తిరుగులేని పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం మూడు రాష్ట్రాలకే పరిమితమైంది. 2014 నుంచి కేంద్రంలో అధికారానికి దూరమైంది. అంతమాత్రాన ఇక కాంగ్రెస్ దేశంలో ఉండదని చెప్పగలమా? 2024 ఎన్నికలలో కాంగ్రెస్ అధికారం రాకపోయినా, ప్రతిపక్ష హోదా సాధించే స్థితిలో గెలవగలిగింది కదా? తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందని కేసీఆర్ కూడా అనేవారు.అయినా ఇప్పుడు అధికారంలోకి ఎలా వచ్చింది? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తన లక్ష్యమని చెప్పే రేవంత్ రెడ్డి బీజేపీతో పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీని, దాని అధినేత చంద్రబాబును పదే, పదే ప్రశంసించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏపాటి మేలు జరుగుతుందో కూడా చెప్పాలి. వ్యక్తిగతంగా ఆయనకు ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో తెలియదు. కొద్ది రోజుల క్రితం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సభలో మాట్లాడుతూ రెండు రూపాయలకు కిలో బియ్యం స్కీమ్ ఎన్టీఆర్దని అని చెప్పారు. అది టీడీపీ వారు చెప్పుకోవలసిన విషయం. నిజానికి ఎన్టీఆర్ ఈ స్కీమ్ ప్రతిపాదించి ప్రచారం ఆరంభించగానే, ఆనాటి కాంగ్రెస్ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి రూపాయి తొంభై పైసలకే పేదలకు బియ్యం అందించే పథకాన్ని అమలు చేశారు. కాంగ్రెస్ వారు ఆ విషయం చెప్పుకోకుండా టీడీపీ స్కీమ్ అని వ్యాఖ్యానించడం ఏ మాత్రం తెలివి అవుతుంది. అలాగే అంతకుముందు ఒక కార్యక్రమంలో హైటెక్ సిటీ నిర్మాణం ప్రస్తావన తెచ్చి చంద్రబాబు ను మెచ్చుకున్నారు. చంద్రబాబు ఒక భవనం నిర్మించిన మాట నిజమే. కాని అంతకు ముందే నేదురుమల్లి జనార్ధనరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సాప్ట్ వేర్ టెక్నాలజీ పార్కు కు శంకుస్థాపన చేసిన విషయాన్ని కాంగ్రెస్ నేతలే మర్చిపోతే ఏమి చేయాలన్న అసంతృప్తి పార్టీలో ఏర్పడుతోంది. చంద్రబాబు తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ నరసింహరావు ఎక్స్‌ప్రెస్ హైవే వంటివి నిర్మించారు. రేవంత్ వైఎస్ ప్రస్తావనను తెస్తున్నప్పటికి, చంద్రబాబుకు ఇస్తున్న ప్రాధాన్యత మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి రేవంత్ రెడ్డి బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీలో తొలుత పనిచేశారు. తదుపరి టీఆర్ఎస్లో క్రియాశీలం అయ్యారు. జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా పోటీచేసి గెలిచారు. తదుపరి టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. లోక్‌సభ ఎన్నికలలో టీడీపీ పక్షాన 2014లో మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలని ఆయన ప్రయత్నించారు. ఆ సమయంలో విద్యా సంస్థల అధినేత మల్లారెడ్డికి టీడీపీ టిక్కెట్ లభించినప్పుడు పార్టీపై, నాయకత్వంపై రేవంత్ చేసిన విమర్శలు ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. అద్భుతమైన పార్టీ అయితే సొంత అల్లుడు ఎన్టీఆర్‌ను ఎందుకు కూలదోశారో చెప్పాలి. కొన్నిసార్లు వామపక్షాలు, మరికొన్నిసార్లు బీజేపీ, ఇంకోసారి కాంగ్రెస్‌తో, మరోసారి టీఆర్ఎస్తో టీడీపీ ఎలా పొత్తుపెట్టుకున్నదో, అది ఏపాటి అద్భుతమో చెప్పాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని లేఖ ఇచ్చి, ఆ తర్వాత తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని దెయ్యంతో పోల్చిన టీడీపీ ఎలా అద్భుతమో రేవంత్‌కే తెలియాలి. బీఆర్ఎస్పై రాజకీయ విమర్శలు చేయడం తప్పుకాదు. కాని వ్యక్తిగతంగా నేతలను ఉద్దేశించి చెత్తగాళ్లు అని వ్యాఖ్యానించడం సీఎం హోదాకు తగదని చెప్పాలి. బీఆర్ఎస్లో తాను సంక్షోభం సృష్టించలేదని చెబుతున్నప్పటికీ రాజకీయ వర్గాలలో మాత్రం నమ్మకం కుదరడం లేదు. బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోతుందని రేవంత్ భావిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ఆ ప్రయత్నం చేయడం తప్పుకాదు. కాని రాజకీయాలలో ఒక పార్టీ మనుగడ సాగించడానికి, కాలగర్భంలో కలిసిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. బీఆర్ఎస్ స్వయంకృతాపరాధం కాంగ్రెస్‌కు ,రేవంత్ కు కలిసి వచ్చింది. తనకు వచ్చిన అవకాశాన్ని ఎలా నిలబెట్టుకోవాలన్న దానిపై రేవంత్ దృష్టి పెడితే మంచిది. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కాంగి‘రేసు’ మల్లగుల్లాలు!
సాక్షి, హైదరబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక అభ్యర్థిత్వం ఖరారుపై మల్లగుల్లాలు పడుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో ఉపఎన్నిక కావడంతో సీరియస్‌గా తీసుకొని ప్రతి అడుగూ ఆచితూచి వేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కంటే ముందుగానే గెలుపు మార్గాలను సుగమం చేసుకునేందుకు ముగ్గురు మంత్రులు, 18 మంది కార్పొరేషన్ల చైర్మన్లను రంగంలోకి దింపి అభివృద్ధి మంత్రం జపిస్తోంది. ప్రత్యర్థుల రాజకీయ ఎత్తుగడలను గమనిస్తూ వారి ఊహలకు అందని విధంగా పావులు కదుపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదేస్థానంలో పోటీ చేసి ఓటమి పాలైన భారత క్రికెట్ జట్టు మాజీ కెపె్టన్ అజారుద్దీన్న్ తిరిగి బరిలో నిలిచేందుకు ఆసక్తి కనబర్చారు. అయితే మైనారిటీ అభ్యరి్థని బరిలోకి దింపితే హిందూత్వ ఎజెండాతో బీజేపీ బలపడే ప్రమాదం ఉందని భావించి టికెట్ రేసు నుంచి ఆయనను తప్పించి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసింది.మైనారిటీయేతర అభ్యర్థిని బరిలో నిలిపేందుకు సిద్ధమైంది. ఇటీవల హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ‘స్థానిక’అభ్యరి్థత్వాన్ని పరిశీలిస్తామని ప్రకటించి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. అయితే తాజాగా పారీ్టలో అంతర్గత విభేదాలు, కుమ్ములాటలు, కొత్త, పాత కేడర్ మధ్య ఆధిపత్య పోరు, అమాత్యుల ముందే అమీతుమీలకు దిగడం వంటి వ్యవహారాలు గుదిబండగా తయారయ్యాయి. టికెట్ రేసులో ఉన్న స్థానిక ఆశావహులు కూడా కేవలం మంత్రుల పర్యటన కార్యక్రమాలకే పరిమితమై ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరించడాన్ని పార్టీ తీవ్రంగా పరిగణించినట్లు కనిపిస్తోంది. దీంతో అభ్యర్థిత్వం ఎంపిక విషయంలో స్థానికత అంశంపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. బీసీ అభ్యర్థిత్వం వైపు మొగ్గు కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థిత్వంపై మొగ్గు చూపేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. తాజాగా అసెంబ్లీలో తీసుకున్న బీసీ రిజర్వేషన్ పెంపు నిర్ణయం పార్టీకి కలిసి వచ్చి ఉపఎన్నికల్లో లబ్ధి చేకూర్చే విధంగా బీసీ అభ్యరి్థత్వాన్ని పరిశీలిస్తోంది. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో విజయబావుట ఎగరవేయడమే లక్ష్యంగా గెలుపుగుర్రం అన్వేషణలో పడింది. ఒకవైపు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ఏకరవు పెడుతూ అన్నివర్గాల ప్రజలను మెప్పించేందుకు ప్రయత్నిస్తూనే, మరోవైపు బలమైన బీసీ అభ్యర్థిని బరిలో దింపేందుకు కసరత్తు చేస్తోంది. ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువనేత నవీన్ యాదవ్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యా దవ్, విద్యావేత్త భవానీశంకర్ తదితరులు ఆసక్తి కనబర్చుతున్నారు. వారి ఆరి్థక బలాబలాలు, రాజకీయ, కుటుంబ నేపథ్యం, ప్రజల్లో వారిపై గల పలుకుబడి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యరి్థత్వాన్ని పరిశీలిస్తోంది. అందరికీ అమోదయోగ్యంగా.. అందరికీ ఆమోదయోగ్యమైన, బలమైన అభ్యర్థి పేరును పరిశీలించేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. నియోజకవర్గంలో గెలుపు, ఓటములకు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, విద్యావంతులు, నివసించే పలు కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు కీలకమే. ఈ ప్రాంతాల ఓటర్లు సైతం ఆమోదించే అభ్యరి్థని రంగంలోకి దింపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీ అధిష్టానం ఈ ప్రాంతాల్లో పలువురి అభ్యరి్థత్వాలపై సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆశల పల్లకిలో... అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన నవయువ నిర్మాణ సంస్థ వ్యవస్థాపక చైర్మన్, యువనేత నవీన్ యాదవ్ టికెట్ తనకే దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. అగ్రనేతల నుంచి గ్రీన్ సిగ్నల్ ఉన్నట్లు ఆయన అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు. గతంలో రెండుసార్లు పోటీ చేసిన అనుభవం, స్థానిక పరిచయాలు కలిసి వస్తాయని ఆయన భావిస్తున్నారు. పార్టీ అధిష్టానం బీసీ అభ్యర్థత్వాన్ని పరిశీలిస్తుండటంతో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఐదేళ్లపాటు మేయర్‌గా సమర్థవంతంగా అందించిన సేవలు, నియోజకవర్గంలోని అన్ని వర్గాలతో ఉన్న పరిచయాలు తన అభ్యరి్థత్వం పరిశీలనకు బలం చేకూర్చవచ్చని ఆయన భావిస్తున్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ టికెట్‌పై ఆశలు పెట్టుకొని నియోజకవర్గంలో సుడిగాలిలా పర్యటిస్తున్నారు. రెండు పర్యాయాలు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి ప్రాతినిథ్యం వహించిన నేపథ్యంలో అసెంబ్లీ సెగ్మెంట్లోని పరిచయాలు, పదేళ్లపాటు డీసీసీ అధ్యక్ష బాధ్యతలు అభ్యరి్థత్వం పరిశీలనకు కలిసి రావచ్చని ఆయన ఆశలు పెట్టుకున్నారు. దివంగత నేత పీజేఆర్ శిష్యుడు, విద్యావేత్త భవానీశంకర్ కాంగ్రెస్ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. దశాబ్దాల కాలంగా పారీ్టకి అంకితభావంతో సేవలందిస్తున్నందున స్థానికులకు టికెట్ ఇవ్వదల్చుకుంటే తన పేరు పరిశీలించవచ్చని భావిస్తున్నారు. స్థానికంగా ప్రజల్లో పట్టు, కేబుల్ నెట్వర్క్, విద్యాసంస్థల కారణంగా పరిచయాలు మరింత కలిసి వచ్చే అంశాలుగా ఆయన భావిస్తున్నారు. -
సీఎం రేవంత్ రెడ్డితో ఫిరాయింపు ఎమ్మెల్యేలు కీలక భేటీ
-
ఓట్ల దొంగలకు... ఈసీయే కవచం!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఓట్ల దొంగలను స్వయానా కేంద్ర ఎన్నికల సంఘమే కాపాడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తంచేశారు. పదేళ్లుగా ఓటు చోరులను కాపాడే బ్యాక్ ఆఫీస్‌లాగా ఈసీ పని చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన సంస్థ ఓట్ల దొంగలకు రక్షణ కవచంలా మారిందని నిప్పులు చెరిగారు. కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గ ఓటర్ ఫ్రాడ్ కేసులో ఈసీ వైఖరిని ఆయన నిలదీశారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో ఖర్గే పోస్టు చేశారు. కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో ఓటర్ ఫ్రాడ్ కేసులో ఎన్నికల సంఘం వైఖరిని ఆయన తప్పుపట్టారు. కీలకమైన ఆధారాలను దాచిపెట్టారని విమర్శించారు. 2023లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలంద్ నియోజకవర్గంలో వేలాది ఓటర్ల పేర్లు తొలగించేందుకు నకిలీ ఫామ్–7 దరఖాస్తులు వాడినట్లు కాంగ్రెస్ బహిర్గతం చేసింది. దీనిపై కేసు నమోదు కాగా, దర్యాప్తులో 5,994 నకిలీ అప్లికేషన్లు బయటపడ్డాయి. ఇది చిన్న తప్పిదం కాదని, ఓటు హక్కును దోచుకోవడానికి పన్నిన పెద్ద కుట్ర అని ఖర్గే ధ్వజమెత్తారు. ఈ కేసులో నిందితులను గుర్తించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశాలు ఇచి్చంది. తొలుత ఎన్నికల సంఘం కొన్ని పత్రాలు సమరి్పంచినప్పటికీ ఇప్పుడు మాత్రం కీలక ఆధారాలను ఇవ్వకుండా వెనక్కి తగ్గిందని ఖర్గే ఆరోపించారు. ‘‘ఈసీ ఎందుకు వెనక్కి తగ్గింది? నకిలీ వోటర్ల వెనుక ఉన్న వారిని కాపాడేందుకేనా?’’ అని నిలదీశారు. బీజేపీ ఓటు చోరీ డిపార్టుమెంట్ అంటూ ఈసీని అభివర్ణించారు. సీఐడీ దర్యాప్తును నీరుగార్చడానికి బీజేపీ ఆదేశాల మేరకు ఈసీ పని చేస్తోందన్నారు. ఓటు హక్కు అంటే ప్రజాస్వామ్యానికి మూలం అని స్పష్టం చేశారు. ఆ హక్కును కాపాడాల్సిన ఎన్నికల సంఘమే ఓట్ల దొంగలతో చేతులు కలపడం ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు అని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన సంస్థే బలహీనపరుస్తోందని ఆక్షేపించారు. దేశానికి శత్రువు మోదీ ప్రధాని నరేంద్ర మోదీ మన దేశానికి శత్రువుగా మారారని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మోదీ మంచి స్నేహితులే అయినప్పటికీ ఆ స్నేహం వల్ల భారత్‌కు నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదన్నారు. ఆదివారం కర్ణాటకలోని కలబుర్గిలో ఖర్గే మీడియాతో మాట్లాడారు. భారత్‌పై అమెరికా విధించిన 50 శాతం టారిఫ్‌లను ప్రస్తావించారు. దీనివల్ల మన ప్రజలకు భారీ నష్టం జరుగుతుందన్నారు. ట్రంప్‌తో స్నేహం సంగతి పక్కనపెట్టి దేశ ప్రయోజనాలను కాపాడే విషయం ఆలోచించాలని మోదీకి హితవు పలికారు. దేశమే ప్రథమం, ఆ తర్వాతే స్నేహం అని తేలి్చచెప్పారు. జీఎస్టీలో సంస్కరణలతో నిజంగా పేదలకు మేలు జరిగితే స్వాగతిస్తామని వ్యాఖ్యానించారు. నేడు విపక్ష ఎంపీలకు ఖర్గే విందు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే విధానంపై సోమవారం విపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలకు అవగాహన కల్పించనున్నారు. పార్లమెంట్ పాత భవనంలోని సెంట్రల్ హాల్లో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విపక్ష ఎంపీలకు మల్లికార్జున ఖర్గే సోమవారం రాత్రి విందు ఇవ్వబోతున్నారు. -
ఏం చేద్దాం.. ఏం చెప్దాం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 9 మంది ఎమ్మెల్యేలు ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో దాదాపు గంటకు పైగా జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు, న్యాయ నిపుణులు కూడా హాజరు కావడం విశేషం. వీరి అనర్హత విషయంలో సుప్రీంకోర్టు డెడ్‌లైన్ విధించడం, సుప్రీం ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయింపుపై జవాబు చెప్పాలని అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన నోటీసుల గడువు ముగుస్తుండడం, మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆ పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో సీఎంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. సమావేశంలో తమ నియోజకవర్గాల అభివృద్ధి తమకు పాత కాంగ్రెస్ నేతలతో ఉన్న సమస్యల పరిష్కారం పైనే చర్చించామని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ వర్గాలు బయటకు చెబుతున్నప్పటికీ.. రాజకీయ వర్గాల్లో మాత్రం మరో చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టులో కేసు, స్పీకర్ జారీ చేసిన నోటీసుల విషయంలో వ్యూహాన్ని ఖరారు చేసేందుకు, ఎలా ముందుకు వెళ్లాలి? ఏం చెప్పాలి అనేది నిర్ణయించేందుకే ఈ భేటీ జరిగిందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. సమావేశంలో ఏఏజీ..! ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పాటు అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్‌రెడ్డి కూడా పాల్గొనడం విశేషం. కాగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మహీపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరికపూడి గాం«దీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, తెల్లం వెంకటరావు, కాలె యాదయ్యలు పాల్గొన్నారు. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరుకాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ భేటీలో ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు, స్పీకర్ ఇచ్చిన నోటీసులపై చర్చ జరిగింది. దీంతో పాటు ఈ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, స్థానిక కాంగ్రెస్ నేతలతో ఉన్న సమస్యలు తదితర అంశాలపై చర్చ జరిగింది. అయితే స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఎలా సమాధానం ఇవ్వాలన్న అంశంపై న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం.. తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్ లోనే ఉన్నామని, నియోజకవర్గ అభివృద్ధి నిమిత్తమే ముఖ్యమంత్రిని కలిసామనే రీతిలో సమాధానమివ్వాలనే నిర్ణయానికి ఎమ్మెల్యేలు వచ్చినట్టు తెలిసింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..అన్ని విషయాల్లో తాను అండగా ఉంటానని, పార్టీని, తనను నమ్మి వచ్చిన ఎమ్మెల్యేలను కాపాడుకునే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకాడబోమని భరోసా ఇచ్చినట్టు తెలిసింది. నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న పనులకు వీలున్నంత మేర నిధులు మంజూరు చేస్తామని, నియోజకవర్గాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని సూచించినట్టు సమాచారం. స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో పాటు పాత కాంగ్రెస్ నాయకత్వంతో సమన్వయంతో ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా కోర్టు కేసుల విషయంలో కూడా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చినట్టు సమాచారం. గతంలోనే కలవాలనుకున్నాం.. సమావేశం అనంతరం ఓ ఎమ్మెల్యే ’సాక్షి’తో మాట్లాడుతూ.. అందరం కలిసి సీఎంతో సమావేశం అవుదామని గతంలోనే నిర్ణయించుకున్నామని చెప్పారు. ఆ మేరకే ఆయన్ను కలిశామని, అనేక అంశాలపై చర్చించామని, సీఎం కూడా తమకు భరోసా ఇచ్చారని తెలిపారు. నియోజకవర్గాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్దామని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. -
అవసరమైతే ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్ధం: రాజ్‌గోపాల్‌రెడ్డి హాట్ కామెంట్స్
తెలంగాణలో రాజకీయాలు హాట్‌హాట్‌గా ఉన్నాయి. సొంత పార్టీలోనే నిరసన గళం వినిపిస్తోంది. తమ పార్టీలోని సొంత నాయకులపైనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న సందర్భాలు మరింత వివాదంగా మారుతున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్లో కవిత చేసిన కామెంట్స్‌తో ఆ పార్టీకి చెందిన నేతలు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక కాంగ్రెస్‌లో మునుగోడు ఎమ్మెలయే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎపిసోడ్. పార్టీలో ఆందోళన కల్గిస్తోంది. తనకు మంత్రి పదవి ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారని, ఇప్పటివరకూ తనకు మంత్రి పదవి ఇవ్వలేదనేది నిన్న మొన్నటి వరకూ రాజ్‌గోపాల్‌రెడ్డి నుంచి వచ్చిన మాట. ఇప్పుడు అదే రాజ్‌గోపాల్‌రెడ్డి పదవి కోసం ఎంత కాలమైనా ఎదురుచూస్తానంటున్నారు. కాకపోతే మునుగోడు ప్రజల కోసం ప్రభుత్వంపై పోరాటానికైనా సిద్ధమని వ్యాఖ్యానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. దీనిలో భాగంగా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ‘ మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోను. అవసరమైతే ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్ధం. మునుగోడు కోసం ఎంత త్యాగమైనా చేస్తా. ట్రిపుల్ ఆర్ నిర్వాసితులకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా. పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి హామీ ఇచ్చారు. ఆలస్యమైనా ఫర్వాలేదు.. ఎదురుచూస్తా’ అని పేర్కొన్నారు. ఒకవైపు మునుగోడు ప్రజల కోసం ప్రభుత్వం పోరాటం చేస్తానని, అదే సమయంలో తన మంత్రి పదవి కోసం ఎదురుచూస్తానంటూ సంయమనంతో మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పెద్దల్ని ఆలోచనలో పడేయడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మునుగోడు ప్రజల కోసం ఎంతటి త్యాగమైనా చేస్తానని, అవసరమై ప్రభుత్వంపై పోరాడటానికి సిద్ధమనే వ్యాఖ్యలు మరోసారి హీట్ పుట్టించేవిగా ఉన్నాయని, రాజ్‌గోపాల్‌రెడ్డి తన వ్యూహాన్ని మార్చుకున్నారనే దానికి ఈ వ్యాఖ్యలే నిదర్శమనేది రాజకీయ నిపుణుల అభిప్రాయం. -
తెలంగాణలో రాజకీయ ఉత్కంఠ..సీఎం రేవంత్‌తో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ
సాక్షి,తెలంగాణ: సీఎం రేవంత్‌రెడ్డితో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ భేటీలో పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇప్పటికే నోటీసులు పంపించారు. తాజా సీఎం రేవంత్ ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీలో సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్ నోటీసుల నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై చర్చిస్తున్నారు. ఈ భేటీలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం
-
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కాన్వాయ్‌కు తప్పిన పెను ప్రమాదం!
సాక్షి,కామారెడ్డి జిల్లా : మంత్రుల కాన్వాయ్‌లో అపశృతి చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ సభ ప్రాంగణ స్థలాన్ని పరిశీలించేందుకు తెలంగాణ మంత్రులు వెళ్లారు.ఈ క్రమంలో కొత్త బస్టాండ్ సమీపంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో షబ్బీర్ అలీ వాహనం టైర్ పేలింది. ఆ వాహనంలో షబ్బీర్ అలీ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. -
కాంగ్రెస్ చీఫ్ ఇంట్లో చోరీ.. ముసుగులతో వచ్చి.. వీడియో వైరల్
భోపాల్: మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎంపీ, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ ఇంట్లో దొంగతనం ప్రయత్నం జరిగింది. ఐదుగురు దుండగులు ముసుగు ధరించి ఆయన ఇంట్లోకి ప్రవేశించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల విషయమై బీజేపీ సర్కార్‌పై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.వివరాల ప్రకారం.. ఇండోర్‌లోని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జితు పట్వారీ నివాసంలోకి దొంగలు ప్రవేశించారు. ఐదుగురు వ్యక్తులు ముసుగు ధరించి వారు దొంగతనానికి ప్రయత్నించారని జితు పట్వారీ ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘శుక్రవారం అర్థరాత్రి ఇండోర్‌లోని ఎంపీ, కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ ఇంట్లో ఐదుగురికి పైగా దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. ముసుగు ధరించిన దుండగులు పట్వారీ కార్యాలయం మొత్తాన్ని కూడా సోదా చేశారు’ అని పోస్ట్ చేసింది.Indore में Congress प्रदेश अध्यक्ष Jitu Patwari के घर डकैती की कोशिश...#congress #mpnews #indorenews #latestnews #trendingnow #samaynow pic.twitter.com/dBYqzOHqty— Swatantra Samay (@SamaySwatantra) September 6, 2025ఇదే సమయంలో బీజేపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. పట్వారీ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పార్టీ తీవ్రంగా మండిపడింది. ఈ ఘటనపై జీతు పట్వారీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక, ఐదుగురు వ్యక్తులు జితు పట్వారీ ఇంట్లోకి ప్రవేశించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. #Breaking Attempted robbery at Madhya Pradesh #Congress President Jitu Patwari’s residence.Five masked men caught on cam pic.twitter.com/rFVbtrs1Cl— Aditi Bhardwaj (@Aditi14Bhardwaj) September 6, 2025 -
‘స్థానికం’పై కాంగ్రెస్‌లో తండ్లాట
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్షగా మారాయి. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన అంశం పార్టీకి కొరకరాని కొయ్యగా మారింది. అసలు ఎన్నికలకు వెళ్లాలో, వద్దో అర్థం కాని పరిస్థితుల్లో అధికార పార్టీకి చిక్కుకుంది. బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు సంబంధించి రాష్ట్రపతి వద్ద ఆర్డినెన్స్, గవర్నర్ వద్ద ఉన్న బిల్లుల భవితవ్యం ఎటూ తేలకపోవటంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో అధికార పార్టీ పడిపోయింది. ఒక దశలో వెంటనే ఎన్నికలకు వెళ్లాలని భావించినా.. తర్వాత ప్రభుత్వం మనసు మార్చుకుంది.గవర్నర్లు, రాష్ట్రపతి వద్దకు వెళ్లే బిల్లుల ఆమోదం విషయంలో సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు విచారణ తేలేవరకు వేచి ఉందామని నిర్ణయించింది. సుప్రీంకోర్టులో సానుకూల తీర్పు వస్తే తమ ఆర్డినెన్స్ చట్టం అవుతుందని, అప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో చట్టబద్ధత చేకూరుతుందనే ఆలోచనకు వచ్చింది. దీంతో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ), మంత్రివర్గ సమావేశం, పార్టీ అంతర్గత భేటీలు, సీఎం, పీసీసీ చీఫ్, ఇతర సీనియర్ మంత్రుల సమావేశాల్లో వచ్చిన అభిప్రాయాలన్నింటినీ పక్కన పెట్టి ఎన్నికలకు మరికొంత సమయం వేచి ఉండాలనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.కిందిస్థాయిలో గందరగోళంరాష్ట్ర పార్టీ నాయకత్వంతో పాటు ప్రభుత్వ పెద్దల ఆలోచన, నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి నాయకత్వాన్ని గందరగోళంలోకి నెడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికలకు వెళ్లడమేనన్న సంకేతాలు పార్టీ నుంచి వస్తుండగా, ఉన్నట్టుండి ఎన్నికలు వాయిదా పడతాయనే సమాచారంతో కార్యకర్తలు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఎన్నికలపై స్పష్టత లేకపోవడంతో స్థానికంగా వస్తున్న రాజకీయ విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇంత చేసిన తర్వాత పార్టీపరంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్లడం మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు. స్థానిక ఎన్నికల విషయంలో ఓ టైమ్‌లైన్ ఏర్పాటు చేసుకుని వెళ్లడమే మంచిదని సూచిస్తున్నారు.రేపు కార్యవర్గ సమావేశంస్థానిక ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయడంతో పాటు వారి అభిప్రాయాలు సేకరించేందుకు టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. గాంధీభవన్‌లో సోమవారం ఉదయం 11 గంటలకు పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ హాజరు కాను న్నారు. పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ ఉమ్మడి జిల్లాల ఇన్చార్జీలు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు ఇతర నాయకులకు ఈ సమావేశానికి రావాలని ఇప్పటి కే సమాచారం అందింది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పోస్టులు, పార్టీ కమిటీలు, జైబాపూ–జైభీం–జై సంవిధాన్ కార్యక్రమ నిర్వహణపై చర్చ జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
రాజ్‌గోపాల్‌రెడ్డి విషయంలో కొంత కన్ఫ్యూజన్: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో బ్రేకులే కాదు సడెన్ బ్రేకులు కూడా ఉంటాయని అంటున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కాళేశ్వరం సీబీఐ విచారణ, కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలపై ఆయన శుక్రవారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. సీబీఐతో కాకుండా రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయిస్తే బద్నాం చేసేవారు. సీబీఐ కంటే మరో మార్గం కనిపించడం లేదు. ఆ దర్యాప్తు సంస్థలోనూ అనేక లొసుగులు ఉన్నాయి. కానీ కాళేశ్వరం విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నాం అని అన్నారాయాన. అదే సమయంలో రాజ్‌గోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యవహారంపైనా స్పందించారు. ‘‘ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం కోమటిరెడ్డి బ్రదర్స్ కి అలవాటు. కానీ, రాజ్‌గోపాల్‌రెడ్డి విషయంలో కొంత కొంత కన్ఫ్యూజన్ ఉంది’’ అని అన్నారు. నాగేందర్ రిజైన్ చేసి పోటీ చేస్తానని చెప్తున్నారు. నాగేందర్ సభ్యత్వం పోతుందని అనుకోవడం లేదు. మంత్రి పదవి ఇస్తామంటే వద్దని చెప్పాను. నాకు కులమంటే అభిమానమే కానీ కుల పిచ్చి లేదు. బీసీలు కొన్ని రోజులు కులాన్ని పక్కన పెట్టాలి. వచ్చే ఎన్నికల్లోనూ రేవంత్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తాం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని మహేష్‌గౌడ్ అన్నారు. -
జీఎస్టీ 2.0.. కాంగ్రెస్ క్రెడిట్‌పై నిర్మలమ్మ చురకలు
వస్తు సేవల పన్ను (GST) 2.0 క్రెడిట్ ముమ్మాటికీ తమదేనంటున్న కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చురకలంటించారు. గతంలో జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని విమర్శించినవాళ్లే.. ఇప్పుడు GST 2.0కు క్రెడిట్ తీసుకుంటున్నారని అన్నారామె. గతంలో వస్తు సేవల పన్నును గబ్బర్ సింగ్ టాక్స్ అని అభివర్ణించిన ప్రతిపక్ష నేతలు.. ఇప్పుడు అదే పన్ను వ్యవస్థలో మార్పుల క్రెడిట్‌ను ఖాతాలో వేసుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ‘‘GST 2.0 అనేది ప్రజల కోసం, వ్యాపారాల కోసం తీసుకున్న నిర్ణయం. ఇది రాజకీయ విమర్శలకు సమాధానం కాదు. కానీ, గతంలో దీనిని ‘గబ్బర్ సింగ్ టాక్స్’ అని పిలిచినవాళ్లే ఇప్పుడు దీన్ని తమ విజయం అని చెప్పుకోవడం ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది అని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ అన్నారు.అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ పాలనలో దీన్ని ఎందుకు అమలు చేయలేకపోయిందో చెప్పాలి? అని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ పాలనలో GST అమలు చేయడం అసాధ్యమని భావించిందని, కానీ మోదీ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసి, ఇప్పుడు రెండో దశ సంస్కరణలు కూడా తీసుకువస్తోందని పేర్కొన్నారు.పన్ను శ్లాబ్‌ల సరళీకరణ, 5% & 18% ప్రధాన శ్లాబ్‌లు, 40% సిన్ టాక్స్ (తంబాకూ, లగ్జరీ వస్తువులపై) GST 2.0లో కీలక మార్పులని చెప్పొచ్చు. అయితే.. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి దీనిని ఆయుధంగా చేసుకునే ప్రతిపక్షాలు ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. జీఎస్టీ 2.0పై స్పందించిన కాంగ్రెస్ నేతలు.. ఇది రాహుల్ గాంధీ 2016లో సూచించిన 18% GST క్యాప్‌ను అనుసరించడమే అని పేర్కొన్నారు. GST 2.0లో సాధారణ వినియోగదారులకు ప్రయోజనం కలగాలన్న ఉద్దేశంతో తీసుకున్న చర్యలపై తమ పాత్రను గుర్తు చేశారు.ఇదిలా ఉంటే.. జీఎస్టీని గబ్బర్ సింగ్ టాక్స్ అని మొదటగా పిలిచిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ. 2017 అక్టోబర్‌లో గుజరాత్ గాంధీనగర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఈ వ్యాఖ్య చేశారు. జీఎస్టీలో 28% అత్యధిక పన్ను ఉంది, మూడు రిటర్న్ ఫారమ్‌లు ఉన్నాయి. ఇది ప్రజలపై భారం పెడుతోంది. ఇది గబ్బర్ సింగ్ టాక్స్లా ఉంది అని అన్నారాయన. బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ షోలేలోని విలన్ గబ్బర్ సింగ్ లాగా, ప్రభుత్వం ప్రజల వద్ద నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తోందన్న ఉద్దేశంతో ఆయన పై వ్యాఖ్య చేశారు. GST అమలులో బహుళ పన్ను శ్లాబ్‌లు, క్లిష్టమైన కంప్లయన్స్ విధానం ఉండటం వల్ల చిన్న వ్యాపారులు, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆ సమయంలో ప్రతిపక్షాలు ఆరోపించాయి కూడా. -
సీఎం సిద్ధరామయ్యకు బిగ్ రిలీఫ్
బెంగళూరు: కర్ణాటకలోని మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) భూ కేటాయింపుల కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఊరట లభించింది. ఈ వ్యవహారంలో సీఎం సిద్దరామయ్య, ఆయన కుటుంబ సభ్యులకు కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది. ముడా కేసులో వచ్చిన ఆరోపణలు అన్నీ నిరాధారమైనవి, అసత్యమైనవే అని జస్టిస్ పీ.ఎన్. దేశాయ్ నేతృత్వంలోని ఏకసభ్య విచారణ కమిషన్ తేల్చి చెప్పింది. ఈ మేరకు కమిషన్ నివేదిక సమర్పించింది. దీంతో, సిద్దరామయ్యకు ఉపశమనం లభించింది.వివరాల ప్రకారం.. కర్ణాటకలోని ముడా భూముల వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, కుటుంబ సభ్యులకు.. భూములు అక్రమంగా కేటాయించారన్న ఆరోపణలు వచ్చాయి. మొత్తం 14 స్థలాలు అక్రమంగా కేటాయించారని తీవ్ర విమర్శలు బయటకు వచ్చాయి. అయితే, విచారణలో ఈ ఆరోపణలకు ఏ మాత్రం ఆధారాలు లేవని, కనీసం చట్ట ఉల్లంఘన కూడా జరగలేదని పీ.ఎన్. దేశాయ్ కమిషన్ నివేదికలో పేర్కొంది. డీ-నోటిఫై అయిన భూములను ముడా తిరిగి వినియోగించుకున్నందుకు భూమి యజమానులకు పరిహారంగా స్థలాలు కేటాయించడమైందని, ఇది చట్ట ప్రకారమే జరిగిందని నివేదిక స్పష్టం చేసింది.దీంతో, ముడా కేసులో సీఎం సిద్దరామయ్య, ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలు అసత్యమని, నిరాధారమని విచారణ కమిషన్ స్పష్టంగా తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా ఇంతకుముందు ఈ కేసును పరిశీలించిన కర్ణాటక లోకాయుక్త కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా తెలిపింది. సరైన ఆధారాలు లేకపోవడం వల్లనే క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసినట్లు వెల్లడించింది. ఇక, తాజాగా ఈ విషయాన్ని న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్.కె. పాటిల్ వెల్లడించారు. నిన్న జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం విధాన సౌధలో మీడియాతో పాటిల్ మాట్లాడుతూ.. జస్టిస్ పీ.ఎన్. దేశాయ్ నేతృత్వంలోని కమిషన్ సమర్పించిన నివేదికకు రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా ఆమోదం తెలిపిందని చెప్పారు.The commission headed by retired judge P.N. Desai gives a clean chit to the family of Chief Minister Siddaramaiah in the MUDA 'scam'.@nagarjund with more details.#MUDAScam #ITVideo #Karnataka pic.twitter.com/IWfF00GVRc— IndiaToday (@IndiaToday) September 5, 2025ఇదిలా ఉండగా.. కొందరు ముడా అధికారుల పనితీరుపై కమిషన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 2020 నుంచి 2024 మధ్య పనిచేసిన కొంతమంది కమిషనర్లు నిబంధనలకు విరుద్ధంగా, తమకు ఇష్టమొచ్చినట్లు ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించారని పేర్కొంది. ఈ అక్రమాలపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీంతో, ప్రభుత్వం చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. -
ట్రంప్ టారిఫ్‌లా? బీహార్ ఎన్నికలా?: జీఎస్టీపై చిదంబరం ప్రశ్నలు
ఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయంపై ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం అంటూ కొందరు నేతలు కొనియాడగా.. మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇలా ప్రకటన చేయడంతో ఎలక్షన్ స్టంట్ అని కామెంట్స్ చేశారు.జీఎస్టీ సంస్కరణల గురించి కాంగ్రెస్ నాయకులు చిదంబరం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా చిదంబరం.. ‘వివిధ వస్తువుల రేట్ల తగ్గింపు స్వాగతించదగినది. కానీ, ఎనిమిది సంవత్సరాలుగా చాలా ఆలస్యం జరిగింది. జీఎస్టీ రూపకల్పన, రేట్లకు వ్యతిరేకంగా గత ఎనిమిది సంవత్సరాలుగా మేం పోరాడుతున్నాం. కానీ మా విన్నపాలు పట్టించుకోలేదు. బీహార్ ఎన్నికలకు ముందు ఇలా ప్రకటన రావడం అనుమానాలకు తావిస్తోంది. ఇది ట్రంప్ టారిఫ్‌లా కోసం చేశారా? లేక బీహార్ ఎన్నికల కోసమా? అని ప్రశ్నించారు.ఇదిలా ఉండగా జీఎస్టీ సంస్కరణల గురించి ఆల్ ఇండియా తృణముల్ కాంగ్రెస్ కూడా తీవ్రంగా స్పందించింది. ‘ప్రభుత్వంపై నిరంతర ఒత్తిడి తర్వాత సాధించిన సామాన్య ప్రజల విజయం’ అని అభివర్ణించింది. కేంద్రంలోకి బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసింది.మరోవైపు.. సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ధరల భారం దించుతూ జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని ప్రకటించిన దీపావళి కానుక దసరాకు ముందే వచ్చింది. ఇకపై జీఎస్టీలో 5, 18 శాతం పన్ను శ్లాబులే ఉంటాయి. 12 శాతం, 28 శాతం శ్లాబుల్లోని వస్తువులు 5, 18 శాతం శ్లాబుల్లోకి మారనున్నాయి. బంగారం, వెండి, వజ్రాభరణాలపై ప్రత్యేక పన్ను రేటు 3 శాతం ఇక ముందూ కొనసాగనుంది.సెప్టెంబర్ 22 నుంచే (దేవీ నవరాత్రి వేడుకలు మొదలయ్యే రోజు) కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. కేంద్రం ప్రతిపాదనలకు అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ‘సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని ఈ సంస్కరణలు చేపట్టాం. సామాన్యులు రోజువారీ వినియోగించే అధిక శాతం వస్తువులపై పన్ను రేట్లు గణనీయంగా తగ్గనున్నాయి. కార్మికుల ఆధారిత రంగాలకు చక్కని మద్దతు లభిస్తుంది. రైతులు, వ్యవసాయ రంగం, ఆరోగ్య రంగం ప్రయోజనం పొందుతాయి. ఆర్థిక వ్యవస్థలోని కీలక చోదకాలకు ప్రాధాన్యం ఇచ్చాం’ అని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. -
కాళేశ్వరం తలనొప్పి ఒక్క బీఆర్ఎస్కు మాత్రమే కాదు!
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణపై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వవైఖరి ప్రదర్శిస్తోందా? శాసనసభలో ఒకలా.. హైకోర్టులో ఇంకోలా వాదనలు వినిపించడం ఈ అనుమానానికి తావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ మెగా ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం ఆదివారం హడావుడిగా శాసనసభ పెట్టి సీబీఐ విచారణకు ఇవ్వాలని నిర్ణయిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు ఇప్పటికీ ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వ నిర్ణయం తరువాత విచారిస్తామని ప్రభుత్వం సీబీఐకు అప్పగిస్తున్నట్లు ప్రకటించడంతో హైకోర్టు కేసీఆర్, హరీశ్‌రావులపై తదుపరి చర్యలను నెల పాటు నిలిపివేసింది. ఈ కేసులో ఆడ్వకేట్ జనరల్ వాదన ఆసక్తికరంగా ఉంది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికకు, సీబీఐ విచారణకు సంబంధం లేదని, జాతీయ డామ్ సేఫ్టీ అధారిటీ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కోరామని ఆయన వెల్లడించారు. అదే నిజమైతే కమిషన్ నివేదికపై అసెంబ్లీ చర్చ ఎందుకన్న ప్రశ్న వస్తుంది. పైగా ఈ చర్చ జరిగిన తీరు చూస్తే బీఆర్ఎస్తోపాటు, కాంగ్రెస్, బీజేపీలు కూడా ఈ రొంపిలో చిక్కుకున్నట్లు అనిపిస్తోంది.శాసనభలో తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వాదనను గట్టిగా వినిపించి బీఆర్ఎస్ను ఆత్మరక్షణలో పడేసినట్లు అనిపించింది. కాని ఆ తర్వాత మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తన వాదనను సమర్థంగా వినిపించడంతో కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడిందా అనిపించింది. సీఎంతోపాటు పలువురు మంత్రుల ఆరోపణలకు హరీశ్ ధీటుగా ఆధారసహితంగా జవాబిచ్చారు. ఒక దశలో హరీశ్ ప్రసంగం కొనసాగకుండా చేయడంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత వారు ఘోష్ కమిషన్ నివేదిక చెత్త అని, అది పీసీసీ నివేదిక అంటూ విమర్శలు చేసి వాకౌట్ చేశారు. పిమ్మట మరికొందరు మాట్లాడిన అనంతరం ఈ నివేదికపై తదుపరి విచారణ చేసి చర్యలు తీసుకోవడానికిగాను సీబీఐకి అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేంద్ర సంస్థల నుంచి అప్పులు తీసుకున్న నేపథ్యంలో సీబీఐకి అప్పగిస్తున్నట్లు చెబుతున్నా అది సమర్థనీయంగా అనిపించదు. ఈ నిర్ణయం వ్యూహాత్మకమా? చిత్తశుద్దితో చేసిందా? అన్న చర్చ జరుగుతోంది. బీజేపీ కోర్టులోకి బాల్ నెట్టి లాభం పొందుదామన్నది కాంగ్రెస్ ప్రయత్నమా? కేంద్రం అనుమతించకపోతే బీజేపీ, బీఆర్ఎస్ల కుమ్మక్కు అని ప్రచారం చేయవచ్చు. అనుమతిస్తే దాని ప్రభావం బీఆర్ఎస్పై ఉండనే ఉంటుందన్నది కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తోంది. భవిష్యత్తులో బీజేపీ, బీఆర్ఎస్ల పొత్తు అవకాశాలపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో సీబీఐ తీరును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆ సంస్థ సహాయం కోరడం ఏమిటన్నది కొందరి ప్రశ్న. బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ కూడా ఇదే అంశంపై ఒక ప్రకటన చేశారు. దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వం చేతిలో అస్త్రాలుగా మారాయని గతంలో రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను కేటీఆర్ ప్రస్తావించారు. అదే సంస్థను రేవంత్ ఎలా విశ్వసిస్తున్నారని ప్రశ్నించారు. ఈ కోణంలో చూస్తే కాంగ్రెస్ కు కాస్త ఇబ్బందిగానే ఉండవచ్చు. సీబీఐ, ఈడీల కారణంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు సమస్యలు ఎదుర్కుంటున్నారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రేవంత్ కూడా కొన్ని రోజుల క్రితం సీబీఐని విమర్శిస్తూ స్పీచ్ ఇచ్చారు. కాని ఇప్పుడు ఆయనే బీఆర్ఎస్పై సీబీఐ అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. దీనిద్వారా రేవంత్ తన చేతిలోని ఆయుధాన్ని బీజేపీకి అప్పగించారా అన్న ప్రశ్న కూడా వస్తోంది.కేంద్రం సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే బీఆర్ఎస్ కాస్త ఇబ్బంది పడవచ్చు. సీబీఐ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్‌రావు తదితరులను అరెస్టు చేస్తుందా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేము కానీ.. ఈలోగా కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధినేత అసమ్మతి నేతగా మారి చేసిన ప్రకటన ఆ పార్టీలో ప్రకంపనలకు దారి తీసింది. హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌లకే కాళేశ్వరం స్కామ్ సంబంధం ఉన్నట్లు ఆరోపించారు. అయితే బీఆర్ఎస్ నుంచి కవితకు పెద్ద మద్దతు అయితే రాలేదు. అందరూ హరీశ్‌రావు వెంబడే నిలబడ్డారు. అయినా సరే.. కవిత వ్యాఖ్యలతో పార్టీకి కొంత నష్టమైతే జరిగింది. ఈ మొత్తం వ్యవహారం రాజకీయంగా తమకు ఉపయోగపడుతుందని భావిస్తే బీజేపీ కేంద్ర నాయకత్వం సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చు. కేసీఆర్‌కు సానుభూతి వస్తుందనుకుంటే ముందుకు వెళ్లకపోవచ్చు.లేదా బీఆర్ఎస్ను ఇరుకున పెట్టడానికి కూడా యత్నించవచ్చు. ఈ పరిణామాలేవీ తెలంగాణ బీజేపీకి అంతగా రుచించినట్లు అనిపించడం లేదు. ఒకప్పుడు బీజేపీ కాళేశ్వరంపై సీబీఐ విచారణ డిమాండ్ చేసేది. కాని ఇప్పుడు ఆ పక్షం ఈ పరిణామంతో కాస్త ఇబ్బంది పడినట్లు అనిపిస్తుంది. ఆ పార్టీ నేత మహేశ్ రెడ్డి సీబీఐ విచారణను స్వాగతించినట్లు కనిపించలేదు. ఎందుకింత హడావుడిగా ఒకరోజు సమావేశం పెట్టి ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. న్యాయ విచారణ పేరుతో కాలయాపన చేశారని, ముందుగానే ఈ కేసును సీబీఐకి అప్పగించి ఉండాల్సిందని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. సీబీఐ దర్యాప్తును చేపడితే బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న ఈయన పాత్రను కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ తప్పు పట్టింది. కమిషన్ విచారణ సందర్భంగా ఈటెల ప్రాజెక్టు నిర్మాణం కేబినెట్ ఆమోదంతోనే జరిగిందని చెప్పారు. కమిషన్ మాత్రం దానిని పరిగణనలోకి తీసుకున్నట్లు లేదు. పలువురు ఐఎఎస్ అధికారులు కూడా సీబీఐ విచారణ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఈ ఐదేళ్లు ఈ వ్యవహారం ఒక రాజకీయ రచ్చగా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.కాళేశ్వరం ప్రాజెక్టు పై ఆరోపణలు చేయడంలో కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఘోష్ కమిషన్ ఎక్కువ భాగం సాంకేతిక అంశాలకే పరిమితం అయినట్లు అనిపిస్తుంది. అవినీతి జరిగి ఉంటే ఏ రకంగా జరిగిందన్నదానిపై నివేదికలో పెద్దగా పరిశీలన లేదు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన తుమ్మిడి హెట్టి వద్ద నీరు తగినంత ఉన్నా, దానిని మార్చి మేడిపల్లి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్చించారన్నది ఘోష్ కమిషన్ వ్యాఖ్య. దానిని హరీశ్ రావు తోసిపుచ్చుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ప్రభుత్వం తప్పులు చేయలేదని కాదు. ఆ రోజుల్లో కేసీఆర్ తన మాటే శాసనంగా ప్రభుత్వాన్ని నడిపారు. సాంకేతికపరమైన అంశాలను కూడా ఆయనే డీల్ చేయడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తోంది. అదే రీతిలో పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఉంది. ఈ కమిషన్ కొంతమంది అధికారుల జోలికి అసలు వెళ్లకపోవడంపై కూడా విమర్శలు ఉన్నాయి. రేవంత్ కాని, మంత్రులు కాని ప్రధానంగా రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ కి సంబంధించి ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించే యత్నం చేశారు. రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ మేడిగడ్డను వ్యతిరేకించలేదని రిపోర్టులోని అంశాలను హరీశ్ ఎత్తిచూపారు. ఘోష్ కమిషన్ వద్ద ఉన్న ఈ కమిటీ రిపోర్టును హరీశ్ ఉటంకించడంతో ప్రభుత్వం ఇరుకునపడింది. ఆ మీదట.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ రిపోర్టు మీరే రాయించి ఉంటారని అనడంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడినట్లయింది. అలాగే మరో మంత్రి జూపల్లి కృష్ణారావు తుమ్మిడి హెట్టికి, మేడిగడ్డకు మధ్య గోదావరిలో కలిసే వాగులు, ఏరులు లేవని చేసిన వ్యాఖ్యకు సంబంధించి సమాధానం ఇస్తూ ఎన్ని వాగులు గోదావరిలో కలిసేది ఒక పెద్ద జాబితానే చదివారు. దాంతో జూపల్లి వాదన వీగిపోయింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతారామ ప్రాజెక్టు గురించి ప్రస్తావించడంతో ఆ రోజుల్లో టీఆర్ఎస్లో ఉండి ఆయనేమి మాట్లాడారో, ట్వీట్ చేశారో చూపించారు. జాతీయ డ్యామ్ భద్రత అధారిటీ విచారణ గురించి ఉత్తం చెప్పారు. అసలు ఆ అధారిటీ ని కేంద్రం ఏర్పాటు చేస్తూ బిల్లు తీసుకువచ్చినప్పుడు ఎంపీగా ఉన్న ఉత్తం దానిని వ్యతిరేకించారని, రాష్ట్రాల హక్కులను హరించడమే అన్నారని హరీశ్ రావు గుర్తు చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా మాట్లాడితే లక్ష కోట్ల దోపిడీ అంటూ రేవంత్, మంత్రులు మాట్లాడినా, అది ఏరకంగా జరిగిందన్నది వివరంగా చెప్పలేదు. ఏదో సాధారణ రాజకీయ విమర్శగానే చేశారు. దానికి హరీశ్ బదులు ఇస్తూ కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు మాత్రమే ప్రాజెక్టు కాదని, 15 రిజర్వాయిర్లు, కిలోమీటర్ల కొద్ది టన్నెళ్లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, మొదలైన వాటి జాబితాను వివరించారు. అసలు మొత్తం ప్రాజెక్టు వ్యయం లక్ష కోట్లు అయితే, లక్ష కోట్ల దోపిడీ అని ఆరోపించడంలో హేతుబద్దత కనిపించదు. అయితే మేడిగడ్డ వద్ద బారేజీ దెబ్బతింటే అసలు నీరు అందుబాటులో ఉండదని, అలాంటప్పుడు ఈ ప్రాజెక్టు నిరర్థకం అవుతుందని ఉత్తం అనడంలో కొంత అర్థం ఉంది.కాని ఆ బ్యారేజీలు పూర్తిగా దెబ్బతిని ఉంటే ఆ సమస్య వస్తుంది కాని, లేకుంటే వాటిని వాడుకునే అవకాశం ఉంటుంంది.దానిని రిపేరు చేసి వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం యత్నించకపోతే కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శలకు గురి అవుతుంది. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వం ఒకవైపు 18 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరు ఇస్తున్నట్లు చెబుతూ,మరోవైపు అందుకు విరుద్దంగా మాట్లాడుతోందని వ్యాఖ్యానించారు. ఈ మొత్తం చర్చలో ఈ నిర్మాణం చేసిన కాంట్రాక్టు సంస్థలను ఏ రాజకీయ పార్టీ పెద్దగా తప్పు పట్టకపోవడం గమనించవలసిన అంశమే.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కర్ణాటక రాజకీయం.. మహిళా ఎస్పీపై బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు
బెంగళూరు: కర్ణాటకలో ఓ బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. మహిళా పోలీస్ ఉన్నతాధికారిపై సదరు ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళా ఎస్పీని ఉద్దేశించి ఆమె కాంగ్రెస్ నేతల ఇంట్లో ‘పెంపుడు కుక్క’లా వ్యవహరిస్తున్నారు అని సంచలన ఆరోపణలు గుప్పించారు. దీంతో, ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై పోలీసు ఉన్నతాధికారులు మండిపడుతున్నారు.వివరాల ప్రకారం.. హరిహర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే బీపీ హరీశ్ మంగళవారం దావణగెరెలో రిపోర్టర్స్ గిల్డ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నేను సిట్టింగ్ ఎమ్మెల్యేని. ప్రజలు నన్ను గెలిపించారు. కానీ, నాపై పట్ల పోలీసులు వైఖరి భిన్నంగా ఉంది. దావణగెరె జిల్లా ఎస్పీ ఉమా ప్రశాంత్ నన్ను ఏదైనా కార్యక్రమంలో చూస్తే ముఖం చిట్లించుకుంటున్నారు. అదే కాంగ్రెస్‌కు చెందిన షామనూరు కుటుంబ సభ్యుల కోసం మాత్రం గేటు వద్ద పడిగాపులు కాస్తున్నారు. అచ్చం వాళ్లింట్లోని పోమరేనియన్ కుక్కలా ఆమె ప్రవర్తన ఉంది అంటూ తీవ్ర వ్యాఖ్యలతో విమర్శలు చేశారు.అంతటితో ఆగకుండా.. కొన్ని సంఘటనలను ఉదాహరణగా చూపుతూ హరిహర నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎస్పీ తనను పట్టించుకోకుండా, అగౌరవ పరిచారని అన్నారు. గాంధీ భవన్ వద్ద మండుటెండలో ఎంపీ ప్రభా మల్లికార్జున్ కోసం ఎస్పీ గంటల తరబడి ఎదురుచూశారు. నేనూ ప్రజాప్రతినిధినే, ఆమె కూడా ప్రజాప్రతినిధే. మరి ఈ వివక్ష ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉన్నవారి అండ చూసుకుంటే మంచిదని ఎస్పీ భావిస్తున్నారని, కానీ ఇదంతా తాత్కాలికమేనని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో, అక్కడున్న వారు, పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు.అనంతరం, ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. బీజేపీ ఎమ్మెల్యే హరీశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్వయంగా ఎస్పీ ఉమా ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం దావణగెరెలోని కేటీజే నగర్ పోలీస్ స్టేషన్లో హరీశ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.ఇదిలా ఉండగా.. షామనూర్ కుటుంబానికి దావణగెరెలో రాజకీయ పలుకుబడి ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షమనూర్ శివశంకరప్ప ఎమ్మెల్యేగా ఉండగా.. ఆయన కుమారుడు ఎస్ఎస్ మల్లికార్జున్ సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వంలో గనులు, భూగర్భ శాస్త్రం, ఉద్యానవన శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన కోడలు ప్రభా మల్లికార్జున్ పార్లమెంటు సభ్యురాలుగా(ఎంపీగా) కొనసాగుతున్నారు. -
కవిత వ్యాఖ్యలు, ఆరోపణలపై స్పందిస్తున్న నేతలు
తెలంగాణలో కవిత వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కవిత రాజీనామా రేవంత్ రెడ్డి, హరీష్‌రావు, సంతోష్ రావుపై ఆరోపణలు పలువురు నేతలపై వ్యాఖ్యలు చేయడంతో అధికార కాంగ్రెస్, పలువురు నేతలు స్పందిస్తున్నారు.బండి సంజయ్ కామెంట్స్..కాళేశ్వరంలో పక్కా అవినీతి జరిగింది.కేసీఆర్ కుమార్తెనే చెప్పింది.భూమ్మీద జరిగిన అతి పెద్ద అవినీతి కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్ట్.సీబీఐకి రెండేళ్ల నుంచి ఎందుకు ఇవ్వలేదో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేయాలి.కోర్టులో వాదించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫేయిల్ అయిపోయింది.కేంద్రానికి ఈరోజు సీబీఐ ఎంక్వైరీ కోరుతూ లేఖ రాసి చేతులు దులుపుకునే యత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది.ఫోన్ ట్యాపింగ్‌లో జడ్జీ నుంచి కేంద్ర మంత్రుల వరకూ ట్యాపింగ్ చేస్తే దాన్ని ఎందుకు మరి సీబీఐకి ఇవ్వలేదో చెప్పాలి.ఒక డెయిలీ సీరియల్లా నడిపిస్తున్నారు.విద్యుత్ కొనుగోళ్ల స్కాం విషయంలో రిపోర్ట్ ఏమైందో తెలియదు.కేసీఆర్ బిడ్డ అయితే ఏంది?బీఆర్ఎస్ అవినీతిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి కవిత ఇష్యూను తెరపైకి తెస్తున్నారు.ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్స్..తెలంగాణ రాష్ట్రాన్ని జలగల్లా ఐదుగురు కలసి దోచుకున్నారు.అందులో కవిత కూడా ఉంది.కవిత బయటకు వచ్చి అవినీతిపై మాట్లాడటాన్ని స్వాగతిస్తున్నా.సీబీఐకి వాంగ్మూలం ఇచ్చి కేసీఆర్ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి.బంగారు తెలంగాణ అంటే హరీష్ రావు, సంతోష రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ ఎట్లా అవుతుంది.హరీష్ రావు, ఈటెల రాజేందర్, సంతోష్ రావు అవినీతి చేస్తుంటే చూస్తూ కూర్చున్న కేసీఆర్ కూడా అవినీతి పరుడే.దోచుకున్న అవినీతి సొమ్ము పంపకాల్లో పంచాయతీతోనే కవిత బయటకు వచ్చిందికాళేశ్వరం విచారణ త్వరితగతిన పూర్తి చేసేలా కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపాలి.కవిత వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్కవిత రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు..ఒక ప్రతిపక్ష పార్టీ నేతతో సీఎం ఒప్పందం చేసుకుంటారా?.మీ నిస్సహాయతను మాపై చూపెట్టడం ఏంటి?ఇంటి పంచాయితీని కాంగ్రెస్ రుద్దుతున్నారు.హరీష్ రావుపై కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉంది..కాళేశ్వరంలో హరీష్ రావు పేరు కూడా ఉంది..బీఆర్ఎస్ పార్టీ మాకు ఎప్పుడు ప్రత్యర్థే.కవితను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడమా?.అది కలలో కూడా జరగదు. -
కర్ణాటక కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్.. బీజేపీలోకి కీలక నేతలు!
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. పలువురు కీలక నేతలు అధికార కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ల చోరీ ఆరోపణల నేపథ్యంలోనే నేతలు వ్యతిరేక గళం వినిపిస్తున్నారని తెలుస్తోంది.వివరాల ప్రకారం.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గీయుల రాజకీయాలు యూటర్న్ తీసుకుంటున్నాయి. ఇరువురి మద్దతుదారులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు అని బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ మాట్లాడుతూ.. మాజీ మంత్రి కేఎన్ రాజన్న బీజేపీలో చేరబోతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో తన తండ్రి రాజన్న పార్టీ మారుతున్నారని ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ రాజేంద్ర రాజన్న తీవ్రంగా స్పందించారు.ఈ క్రమంలో ఎమ్మెల్సీ రాజేంద్ర మాట్లాడుతూ.. బీజేపీలో చేరే బృందంలో బాలకృష్ణ ఉన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం పదవి కోసం పాకులాడుతున్న నేత(డీకే శివకుమార్) వెంట వెళ్లబోతున్నారని జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేరు ప్రస్తావించకుండానే రాజేంద్ర పలు విమర్శలు చేశారు. తన తండ్రికి వ్యతిరేకంగా ఆయన కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తాము సీఎం సిద్ధరామయ్యకు సన్నిహితులం కాబట్టే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. రాజన్న పదవి పోవడం వెనక కొందరి ‘రహస్య హస్తం’ ఉంది. కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ వల్లే పదవి దక్కింది. చివరివరకు అందులోనే కొనసాగుతాము అని వెల్లడించారు. ఇదే సమయంలో రాజన్న అసెంబ్లీలో ఆరెస్సెస్ గీతం పాడలేదని, చిన్నప్పటి నుంచి ఆయనకు ఆరెస్సెస్ శాఖల గురించి తెలియదని పరోక్షంగా డీకేకు చురకలంటించారు. రాజన్న సొంత భావజాలంతో పని చేసే వ్యక్తి అని కొనియాడారు.డీకే శివకుమార్ విధేయుడు హెచ్‌సీ బాలకృష్ణ ఇటీవల మాట్లాడుతూ.. మంత్రిగా రాజన్న ప్రవర్తన, వాడిన భాష ఆయన పతనానికి కారణమని విమర్శించారు. పదవి పోవడం వెనక ఎలాంటి కుట్ర లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వేరే పార్టీలోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. బీజేపీకి దరఖాస్తు కూడా పెట్టుకున్నారు అని సంచలన ఆరోపణలు చశారు. -
నేను క్షమించినా ప్రజలు క్షమించరు: మోదీ
పట్నా: బిహార్‌లో రాహుల్‌గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో మోదీ తల్లి దివంగత హీరాబెన్నుద్దేశిస్తూ కొందరు విపక్షనేతలు అవమానకరంగా మాట్లాడిన ఉదంతంపై ప్రధాని మోదీ తొలిసారిగా ఆవేదనాభరితంగా స్పందించారు. బిహార్‌లో మహిళల నైపుణ్యాభివృద్ధికి కృషిచేసే కొత్త ‘బిహార్ రాజ్య జీవిక నిధి సహకార సంఘ్ లిమిటెడ్’ను మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించి లక్షలాది మంది మహిళలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘ దివంగత నా మాతృమూర్తికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. రాజకీయాలకు దూరంగా ఉండిపోవడమే ఆమె చేసిన తప్పా? ఆమెను మాత్రమే దూషించాల్సిన అవసరం ఏమొచ్చింది?’’ అంటూ గద్గద స్వరంలో మోదీ తన ప్రసంగాన్ని మొదలెట్టారు.‘‘ నా తల్లిని అవమానించిన బిహార్ ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలను నేను క్షమిస్తానేమోగానీ దేశంలోని ప్రజలెవ్వరూ వారిని క్షమించబోరు. ఒకరి తల్లిని దూషించిన వారిని ఇంకొకరు పొరపాటున కూడా క్షమించబోరు. తల్లిపై దారుణదూషణోదంతంలో ఆర్జేడీ–కాంగ్రెస్ పార్టీలను బాధ్యులను చేయాల్సిన కనీస బాధ్యత బిహార్‌లోని ప్రతి ఒక్క కుమారుడిపై ఉంది. ఆర్జేడీ–కాంగ్రెస్ నేతలు ఏ వీధిలోకి వెళ్లినా, ఏ పట్టణంలో ప్రచారంచేసినా అక్కడ మాతృమూర్తులు, సోదరీమణులను అవమానిస్తే అస్స లు ఊరుకోబోమని, సహించబోమని గట్టిగా, స్పష్టంగా తెలిసేలా చేయండి’’ అని బిహార్ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు.‘‘ తల్లిపై దుర్భాషలాడిన ఆర్జేడీ–కాంగ్రెస్ నేతలను బిహార్‌లోని తల్లులు, సోదరసోదరీమణులు వీధుల్లోకి వచ్చిమరీ నిలదీయాలి. ఇలాంటివి అస్సలు సహించబోమని స్పష్టంచేయాలి. నన్ను విమర్శించే క్రమంలో తల్లిని, మహిళను తిడితే ఎవ్వరూ ఊరుకోబోరని, తిట్లదండకానికి తెరదించుతామని మీరంతా నిరూపించాలి’’ అని మహిళలకు మోదీ పిలుపునిచ్చారు. బిహార్ రాజ్య జీవిక నిధి సహకార సంఘ్ లిమిటెడ్ అనేది మహిళా స్వయంసహాయక బృందాలకు తక్కువ వడ్డీలకు రుణాలను అందిస్తూ వారి నైపుణ్యాభివృద్ధికి కృషిచేస్తుంది.జానకీమాతకు జన్మస్థలి‘‘బిహార్ అనేది జానకీమాతకు జన్మస్థలి. బిహార్ రాష్ట్రం ఎల్లవేళలా మహిళలను గౌరవిస్తుంది. ఆర్జేడీ–కాంగ్రెస్ సంయుక్త రాజకీయ కార్యక్రమం నా తల్లిని అవమానించేందుకు వేదికగా మారడం, అందునా బిహార్‌లో ఈ కార్యక్రమం జరగడాన్ని అస్సలు ఊహించలేదు. ఇది నిజంగా బిహార్ తల్లులు, సోదరీమణులను అవమానించడమే. ఇలాంటి నేతలను బిహార్ ప్రజలు అస్సలు క్షమించరు’’ అని మోదీ అన్నారు. ‘‘ ఆర్జేడీ పాలనా కాలంలో తల్లులు, మహిళలు ఎన్నో అవస్థలు పడ్డారు. నేరçస్తులు, రేపిస్టులు, హంతకులను ఆర్జేడీ ప్రభుత్వం కంటికిరెప్పలా కాపాడుకుంది. తమ కుటుంబసభ్యులు క్షేమంగా రోజూ ఇంటికి తిరిగొస్తారో లేదోనని బిహార్ మహిళలు బిక్కుబిక్కుమంటూ గడిపారు.అందుకే తర్వాత మహిళా ఓటర్లు ఆర్జేడీ సర్కార్‌ను ఇంటికి సాగనంపారు. నాడు ఆర్జేడీ కూటమిని ఇంటికి సాగనంపిన అదే మహిళాలు ఇప్పుడు నా తల్లికి జరిగిన అవమానాకి ప్రతీకారం తీర్చుకుంటారు. దర్భంగాలో జరిగిన దుర్ఘటన విపక్షాల కూటమి దారుణాలకు దర్పణం పడుతోంది. రాష్ట్రంలో మహిళలు దోపిడీ, అణచివేతకు గురవుతున్నారు’’ అని మోదీ అన్నారు. ‘‘ కొడుక్కి తన తల్లి అంటే దేవత, దైవంతో సమానం’’ అని భోజ్‌పురీ సామెతను రాబోయే నవరాత్రి, ఛాత్ పండుగలను పురస్కరించుకుని మోదీ గుర్తుచేశారు. ‘‘సూర్యభగవానుని మహిళారూపంలో ఏడుగురు దుర్గామాత అక్కచెల్లెళ్ల రూపంలో బిహార్ ప్రజలు పూజిస్తారు. అలాంటి ప్రజలకు కాంగ్రెస్–ఆర్జేడీ క్షమాపణలు చెప్పాల్సిందే’’ అని మోదీ అన్నారు.‘‘ దేశసేవకు నా జీవితాన్ని అంకితం చేస్తానని మా అమ్మతో చెప్పినప్పుడు ఆమె అందుకు అడ్డుచెప్పలేదు. పైగా దేశసేవ చేస్తానన్నందుకు అభినందించి ప్రోత్సహించారు. కుటుంబ బాధ్యతల నుంచి తప్పుకుంటానని చెబితే వారించలేదు. పేద తల్లి కుమారుడు అధికారాన్ని(ప్రధాని పదవిని) స్వీకరించడం పేరుగొప్ప నేతలకు అస్సలు నచ్చట్లేదు. మహిళలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతినీ వాళ్లు ఓర్వలేకపోతున్నారు. దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిగా ఆసీనులైన ద్రౌపదీముర్మును సైతం అవమానించడానికి వాళ్లు దుస్సాహసం చేశారు. నాకంటే 20 ఏళ్లు జూనియర్ అయిన(రాహుల్‌గాంధీ) ఓ వ్యక్తి ఓ పదిహేను రోజులు ఎస్ఐఆర్పై పోరు పేరు చెప్పి యాత్రచేశారు’’ అని రాహుల్‌గాంధీని పరోక్షంగా విమర్శించారు. -
కవిత సస్పెన్షన్‌పై టీపీసీసీ చీఫ్ రియాక్షన్
సాక్షి,హైదరాబాద్:ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో పార్టీ నుంచి కవితను స్పస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఈ క్రమంలో కవిత సస్పెన్షన్‌పై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. కవిత సస్పెన్షన్ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యవహారం.అందులో మేం తలదూర్చం.ఇది అంతా ఆస్తి పంపకాల్లో గొడవలా కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు కవిత అవసరం లేదు. ఎవరినీ మాపార్టీలో చేర్చుకోవాల్సి అవసరం లేదు’అని వ్యాఖ్యానించారు. -
‘మోదీ క్షమించినా.. బీహార్ వాళ్లను క్షమించదు’
తన మాతృమూర్తి హీరాబెన్‌పై అనుచిత వ్యాఖ్యల పేరిట వైరల్ అయిన వీడియోపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. తన తల్లికే కాదని.. దేశంలోని తల్లులందరికీ ఇది అవమానమేనని భావోద్వేగంగా మాట్లాడారు. బీహార్‌లో మహిళల కోసం బీహార్ రాజ్య జీవికా నిధి సాఖ్ సహకారి సంఘ్ లిమిటెడ్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ఆయన.. ఆ కార్యక్రమానికి హాజరైన 20 లక్షల మంది మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు.చనిపోయిన నా తల్లికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. అయినా అందులోకి లాగారు. కేవలం నా తల్లినే కాదు.. దేశంలోని ప్రతీ తల్లినీ, సోదరినీ కాంగ్రెస్, ఆర్జేడీలు అవమానించాయి అని అన్నారాయన. ఈ మాటలు నా తల్లిని మాత్రమే కాదు, దేశంలోని ప్రతి తల్లి, సోదరిని అవమానించాయి. మీరు కూడా ఈ మాటలు విన్న తర్వాత నాతోపాటు మీరూ ఎంతగా బాధపడి ఉంటారో నాకు తెలుసు అంటూ ఆయన భావోద్వేగంగా స్పందించారు. అనారోగ్యంతో బాధపడుతూ కూడా నా తల్లి కష్టపడడం ఆపలేదు. మా కోసం దుస్తులు తయారు చేయించేందుకు ప్రతి పైసా ఆదా చేసేది. దేశంలో కోట్లాది తల్లులు ఇలాగే త్యాగం చేస్తూ జీవిస్తున్నారు. తల్లి స్థానం దేవతలకంటే గొప్పది అని ప్రధాని అన్నారు. బీహార్‌లో కాంగ్రెస్–RJD వేదికపై వాడిన అసభ్య పదజాలం తన తల్లిని మాత్రమే కాదు, దేశంలోని ప్రతి తల్లి, సోదరిని అవమానించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ కుటుంబాల్లో పుట్టినవారు పేద తల్లుల బాధను, వారి కుమారుల పోరాటాన్ని అర్థం చేసుకోలేరు. వీరంతా బంగారు, వెండి చెంచాలతో పుట్టినవారు. బీహార్‌లో అధికారాన్ని తమ కుటుంబాల స్వంతంగా భావిస్తున్నారు. కానీ మీరు ఒక పేద తల్లి కుమారుడిని ప్రధాన సేవకుడిగా ఆశీర్వదించారు. ఇది ‘నామ్‌దార్’లకు జీర్ణించుకోవడం కష్టమైంది అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, RJD నేత తేజస్వీ యాదవ్‌లపై విమర్శలు చేశారు.నాపై అసభ్య పదజాలం వాడిన జాబితా చాలా పొడవుగా ఉంది. నన్ను నీచ్, గంది నాళీ కీ కీడా, పాము అని అంటున్నారు. ఇప్పుడు ‘తూ’ అని కూడా సంబోధిస్తున్నారు.. అంటూ రాహుల్ గాంధీ ర్యాలీలో తనను ‘తూ’ అని పిలిచిన విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఇలాంటి వ్యాఖ్యలకు మోదీ క్షమించినా.. బీహార్ ప్రజలు క్షమించబోరని అన్నారాయన.ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ బీహార్‌లో చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర సందర్బంగా.. దర్భంగలో మోదీ, ఆయన తల్లి హీరాబన్ను దూషించినట్లుగా ఓ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ ఘటనపై కేసు నమోదుకాగా.. ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు కూడా. -
వైఎస్ ఏం చేయలేదనీ...
ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ వంటి వారు ఎంత కృషి చేసినా 2003 ఆరంభం నాటికి కూడా ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ చావు బతుకుల్లోనే ఉండేది. తొమ్మిదేండ్ల చంద్రబాబు పాలనతో రాష్ట్రం ఆత్మహత్యల రాష్ట్రంగా మారిపోయింది. ఆ స్థితిలో ‘పాదయాత్ర’ అనే ప్రజాసమస్యల అవగాహనా యాత్రతో, ‘జైత్ర యాత్ర’ అనే పార్టీ చైతన్య యాత్రతో జనంలో నమ్మకాన్ని కలిగించి, కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసి, బలం చేకూర్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇక, 2004లో అత్యధిక మెజారిటీతో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారం పొందేట్లు చేశారు; సీఎం కూడా అయ్యారు. 2009 నాటి జనరల్ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించేటట్లు చేశారు.‘పల్లెబాట’, ‘నగర బాట’, ‘రైతు బాట’, ‘ప్రాజెక్టుల బాట’ వంటి కార్యక్రమాలతో ఎల్లప్పుడూ జనంలో ఉంటూ, పార్టీని మరింత బలోపేతం చేస్తూ అన్ని వర్గాల ప్రజల అవస రాల్ని తీర్చడానికి కృషి చేశారు. సీఎం కావడంతోటే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చారు. రైతుల విద్యుత్ బకాయిలు రద్దు చేశారు. సబ్సిడీపై పంట విత్తనాలు, గడ్డి విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల్ని ఇచ్చారు. విత్తనాల కోసం ‘సీడ్ విలేజ్’లను ఏర్పరచారు. పంటల బీమా పథకం ప్రవేశపెట్టారు. పంట నిల్వలకు ‘రైతు బంధు’ పథకాన్ని ప్రవేశపెట్టారు. రైతుల శిక్షణకై ‘పొలం బడి’ కార్యక్రమం చేపట్టారు. వ్యవసాయాభివృద్ధికై ‘వ్యవసాయ టెక్నాలజీ మిషన్’ ఏర్పరచారు. ‘పని గ్యారంటీ’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి పేదలకు జీవన సమస్య లేకుండా చేయడానికి కృషి చేశారు. మధ్యతరగతి గృహ అవసరాల్ని ‘రాజీవ్ గృహ కల్ప’ ద్వారా తీర్చ డానికి ప్రయత్నించారు.డ్వాక్రా సభ్యులైన మహిళలందరికీ పావలా వడ్డీకే రుణాలిచ్చి వారి కుటుంబాల ఆర్థిక అభివృద్ధికై కృషి చేశారు. ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐటీఐ లను నెలకొల్పారు. హైదరాబాద్‌లో బిట్స్ క్యాంపస్ ఏర్పాటు చేశారు. ‘జవహర్ నాలెడ్జ్ సెంట ర్’లు, ఇరవై ఒకటవ శతాబ్ది గురుకులాలు, పలు మెడికల్, డెంటల్, ఇంజినీరింగ్ కాలేజీల్ని ఏర్పరచారు. భారీ, మధ్యతరహా, చిన్నతరహా పరిశ్రమల స్థాపనకు కృషి చేశారు. వ్యవసాయేతర అవసరాలకు ఛార్జీలు పెంచకుండానే విద్యుత్ సరఫరా చేశారు. వ్యాపార, వాణిజ్యాల అభివృద్ధికై రోడ్ల సౌకర్యాల్ని పెంచారు. తీర జిల్లాల్లో ఓడరేవుల నిర్మాణానికై కృషి చేశారు. నగరాల్లో ‘108’ అంబులెన్సుల్ని, పల్లెల్లో ‘104’ అంబులెన్సుల్ని ఏర్పరచారు. ఇలా, పలు అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్ర రాజకీయాల్లో రాకెట్టులా దూసుకెళ్ళారు వైఎస్సార్. ఇంతటి అవగాహనతో ప్రజా సమస్యల పరిష్కారం జరిపి సామాన్య జనం కూడా మేమూ సంతోషంగా బతకగలం అనే ధీమా కల్పించిన వైఎస్ లేకపోవడం దురదృష్టకరం. అయితే, జనంలో ఆయనపై అభిమానం సడలస లేదనేది సుస్పష్టం. ఆయనపై గల విశ్వాసం, నమ్మకం, అభిమానం ఇప్పుడు జనం జగన్‌పై చూపుతున్నారు. డా‘‘ దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి వ్యాసకర్త రిటైర్డ్ ప్రొఫెసర్, చరిత్ర శాఖ, ఎస్వీ యూనివర్సిటీ -
హైడ్రోజన్ బాంబు త్వరలో పేలుస్తా!: రాహుల్ గాంధీ
పాట్నా: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. దేశంలో జరుగుతున్న ఓట్ల చోరీపై ఇప్పటికే అణుబాంబు పేల్చానని, త్వరలో హైడ్రోజన్ బాంబు పేలుస్తానని పేర్కొన్నారు. ఓట్ల దొంగతనంపై మరిన్ని నిజాలు బయటపెట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ముఖం చూపించలేని పరిస్థితి వస్తుందని, ఆయన తలెత్తుకోలేరని చెప్పారు. సోమవారం బిహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ ముగింపు సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఓట్ల చోరీని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని విప్లవాత్మక రాష్ట్రమైన బిహార్ యావత్ దేశానికి స్పష్టమైన సందేశం ఇచ్చిందని వెల్లడించారు. మహాత్మాగాం«దీని హత్య చేసిన దుష్ట శక్తులే నేడు రాజ్యాంగాన్ని హత్య చేయడానికి కుట్రలు సాగిస్తున్నాయని మండిపడ్డారు. రాజ్యాంగం జోలికి వస్తే సహించబోమని బీజేపీని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని, ఓటు హక్కును రక్షించడానికే యాత్ర చేపట్టానని, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, ఓటు చోర్, గద్దీ ఛోడ్ అంటూ వారు ముక్తకంఠంతో నినదించారని అన్నారు. రాహుల్ గాంధీ ఇంకా ఏం మాట్లాడారంటే... రేషన్ కార్డును, భూమిని లాక్కుంటారు ‘‘బీజేపీ నాయకులు మాకు నల్లజెండాలు చూపించారు. వారు ఒక విషయం తెలుసుకోవాలి. ఓట్లచోరీపై మహాదేవపురలో అణుబాంబు ప్రయోగించా. త్వరలో హైడ్రోజన్ బాంబు రాబోతోంది. అందుకోసం బీజేపీ నేతలు సిద్ధంగా ఉండాలి. ఓట్ల దొంగతనంపై బీజేపీ అసలు రంగు ఏమిటో ప్రజలకు తెలిసిపోతుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి దక్కాల్సిన విజయాన్ని బీజేపీ కూటమి దొంగిలించింది. ఇది వంద శాతం నిజం. బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి ఓట్ల చోరీకి పాల్పడ్డాయి. బిహార్ యువతకు చెప్పదల్చుకున్నది ఏమిటంటే.. ఓటు చోరీ అంటే హక్కుల చోరీ, రిజర్వేషన్ల చోరీ, ప్రజాస్వామ్యం చోరీ, ఉద్యోగాలు–ఉపాధి అవకాశాల చోరీ, విద్య చోరీ, భవిష్యత్తు చోరీ. కేవలం ఓటునే కాకుండా మీ రేషన్ కార్డును, భూమిని సైతం లాక్కొని అదానీకి, అంబానీకి కట్టబెట్టాలని చూస్తున్నారు’’ అని రాహుల్ గాంధీ బీజేపీపై నిప్పులు చెరిగారు. తప్పుడు విధానాలు నమ్ముకుంటున్న మోదీ: ఖర్గే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీరుపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో సోషలిజం గురించి మాట్లాడిన నితీశ్ ఇప్పుడు బీజేపీ–ఆర్ఎస్ఎస్ల ఒడిలో సేదతీరుతున్నారని ధ్వజమెత్తారు. పనికిరాని చెత్తను ఎక్కడ పారేస్తారో నితీశ్‌ను బీజేపీ–ఆర్ఎస్ఎస్లు అక్కడే పారేయడం తథ్యమని స్పష్టంచేశారు. ఓటర్ అధికార్ యాత్ర ముగింపు సభలో ఖర్గే మాట్లాడారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ నెగ్గడానికి ప్రధాని మోదీ ఓట్ల చోరీకి ఆలోచనతోనే ఉంటారని ఆరోపించారు. ఎన్నికల్లో విజయం కోసం బోగస్ ఓట్లను, తప్పుడు ప్రచారాన్ని, తప్పు డు హామీలు, తప్పుడు పథకాలను నమ్ముకుంటారని ఆయన తీవ్రంగా విమర్శించారు. -
‘కాంగ్రెస్,బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్‌ను ప్రజలు గమనిస్తున్నారు’
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్-బీజేపీ బంధం బయటపడిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్,బీజేపీ తీరును ప్రశ్నిస్తూ సోమవారం తెలంగాణ భవన్లో వేముల మీడియాతో మాట్లాడారు.సీబీఐ అంటే కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్. బీజేపీ ,సీఎం రేవంత్ రెడ్డి స్నేహ బంధం బయట పడింది. సభలో హరీష్ రావు మాట్లాడుతుంటే 10 మంది మంత్రులు 33 సార్లు అడ్డు తగిలారు. బీజేపీ సభ్యుడిని కాంగ్రెస్ ఉపయోగించుంది. ఎనిమిది మంది సభ్యులున్న బీజేపీకి 90 నిమిషాలు ఇచ్చారు. కాంగ్రెస్,బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్‌ను ప్రజలు గమనిస్తున్నారు. రేవంత్ స్క్రిప్ట్‌నే పాల్వాయి హరీష్ మాట్లాడారు. హరీష్‌రావు ప్రసంగాన్ని కాంగ్రెస్,బీజేపీ అడ్డుకుందని ఆరోపించారు. -
డిక్లరేషన్ కాదు.. డెడికేషన్ కావాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ చట్ట సవరణ బిల్లును ప్రతిపాదించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. నిజంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనుకుంటే కావాల్సింది డిక్లరేషన్లు కాదని, డెడికేషన్ అని అన్నారు. శాసనసభలో ఆదివారం పంచాయతీరాజ్, పురపాలక చట్ట సవరణ బిల్లులపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘కాంగ్రెస్ నేత రాహుల్‌గాందీ, ప్రధానమంత్రి అరగంటపాటు మాట్లాడుకుంటే అనుకున్న తరహాలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు నిజంగా న్యాయం చేయొచ్చు. అసెంబ్లీలో ఎన్ని గంటలు చర్చించినా ఉపయోగం ఉండదు. నిజంగా బీసీలకు న్యాయం చేయాలంటే ఈ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలి. ఈ విషయం ముఖ్యమంత్రికి, మంత్రులకు తెలుసు. తెలిసి కూడా చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో దీనిపై ఐదు నాలుకలు, ఐదు స్వరాలు వినిపిస్తున్నాయి. రాజ్యాంగబద్ధంగా సాధిస్తామని ఒకసారి, ఆర్డినెన్స్ ద్వారా అని ఇంకోసారి, పార్టీ పరంగా అని మరోసారి, రాహుల్‌గాంధీ ప్రధాని అయిన తర్వాత అని ఓసారి, ఇప్పుడేమో బిల్లు తెచ్చి చేస్తామని అంటున్నారు. ఇదంతా బీసీలు గమనించటం లేదనుకుంటున్నారా?’అని ధ్వజమెత్తారు. రిజర్వేషన్లకు 50 శాతం సీలింగ్ గత ప్రభుత్వంలో పెట్టారంటూ మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ‘స్థానిక సంస్థల్లో బీసీలకు 37 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిన బిల్లే రాష్ట్రపతి వద్ద ఇంకా పెండింగులో ఉంది. దాన్ని వెనక్కి తెప్పించి ఇప్పుడు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులను పంపాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో పంపిన ఆర్డినెన్స్‌పైనే సంతకం చేయని గవర్నర్, ఇప్పుడు బిల్లుపై సంతకం చేస్తారని ఎలా భావిస్తున్నారు? జిత్నీ ఆబాదీ ఉత్నా హఖ్, జిత్నీ భాగేదారీ ఉత్నీ హిస్సేదారీ’అని చెప్పే రాహుల్‌గాంధీ బీసీల రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదు’అని కేటీఆర్ నిలదీశారు. ఆర్థికంగా ఎదిగినప్పుడే న్యాయం.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వేలో బీసీల జనాభా 6 శాతం తగ్గిందని తేలినా దానిపై సమీక్షించలేదని కేటీఆర్ విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ‘రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వడంతోనే సామాజిక న్యాయం జరగదు. ఆర్థికంగా కూడా ఎదగాల్సి ఉంటుంది. ఎలాంటి లొసుగులు లేకుండా చట్టాలను చేస్తే ఏ న్యాయ వ్యవస్థ కూడా అడ్డుపడదు. భావ సారూప్యత లేకపోయినా ధ్యేయ సారూప్యతతో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే విషయంలో మేము చిత్తశుద్ధి, నిజాయితీగా ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నాం. మా ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచి్చన వెంటనే ప్రస్తుత ముఖ్యమంత్రి సన్నిహితుడైన గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి హైకోర్టుకు వెళ్లి దాన్ని అడ్డుకున్నారు’అని కేటీఆర్ విమర్శించారు. న్యాయ సమీక్షకు నిలబడని జీఓలతో బీసీల జీవితాలు ఎలా మారుస్తారో ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి దగ్గరికి రాష్ట్రం నుంచి అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలని సూచించారు. రిజర్వేషన్ల సాధనకు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేయాలని కోరారు. -
89 లక్షల ఫిర్యాదులు ఇచ్చినా ‘సర్’ పట్టించుకోలేదు!
బీహార్‌లో ‘సర్’ వేడి ఇంకా తగ్గలేదు. దొంగ ఓట్ల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన స్సెషల్ ఇన్సిటివ్ రివిజన్(సర్)పై కాంగ్రెస్ పదే పదే ఆరోపణలు చేస్తూనే ఉంది. దేశ వ్యాప్తంగా ఓట్ చోరీ జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్.. బీహిర్లో మళ్లీ సర్‌ను నిర్వహించాలని పట్టుబబుతోంది. ఈసీ ఏర్పాటు చేసిన సర్‌కు కాంగ్రెస్ 89 లక్షల ఫిర్యాదులు ఇచ్చినా వాటిని పట్టించుకోలేదని బీహార్ కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ఆరోపించారు. బూత్ లెవెల్ స్థాయిలో లక్షల్లో ఫిర్యాదులు ఇస్తే దానిని సర్ మాత్రం పరిగణలోకి తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదు కాబట్టే వాటిని వారు తీసుకోలేదన్నారాయన. దాంతో సర్‌ను కచ్చితంగా బీహార్‌లో తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీహార్‌లో ఇప్పటికే 60లక్షలకు పైగా ఓట్లను తొలగించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. దీనిపై ఈసీపై సైతం రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున విమర్శలకు దిగారు. కేంద్రంతో కలిసి ఈసీ చేస్తున్న ఓట్ చోరీ అంటూ ధ్వజమెత్తారు. దీనిలో భాగంగా ఆగస్టు 17వ తేదీన బీహార్‌లోని రోహ్తాస్ జిల్లా ససారామ్ నుంచి ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు రాహుల్ గాంధీ. ఈ రాహుల్ గాంధీ యాత్రకు ఇండియా కూటమి పూర్తి మద్దతు ఇచ్చింది. ఈ యాత్ర తిరిగి సెప్టెంబర్ 1వ తేదీ(సోమవారం) నుంచి పాట్నాలో ప్రారంభం కానుంది. -
తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్.. గన్‌పార్క్ వద్ద ఆందోళన
తెలంగాణలో కాళేశ్వరం కమిషన్‌పై రిపోర్టు నేపథ్యంలో సభలో వాడీవేడి చర్చ జరిగే..... -
ఎజెండాను రాత్రికి రాత్రే డిసైడ్ చేస్తామంటే ఎలా?: హరీష్‌రావు
హైదరాబాద్, సాక్షి: ప్రజా సమస్యలపై మాట్లాడకుండా.. రెండు రోజులే అసెంబ్లీ నిర్వహించి చేతులు దులుపుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. శనివారం బీఏసీ సమావేశం నుంచి అర్ధాంతరంగా బయటకు వచ్చిన ఆయన.. మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. శాసన సభలో వరదల పై చర్చించాలని కోరాం. ఫీజ్ రీయింబర్స్‌మెంటుపై మాట్లాడాలని కోరాం. యూరియా కొరత పై మాట్లాడాలి కోరాం. ప్రభుత్వ ఉద్యోగుల టీఏ, డీఏపై మాట్లాడాలనీ కోరాం. ప్రజా సమస్యలు మాట్లాడకుండా రెండు రోజులే సభ నిర్వహిస్తామని చెబుతున్నారు. మేం 15 రోజులు అసెంబ్లీని నిర్వహించాలని కోరాం. వరదపై మాట్లాడకుండా బురద రాజకీయం చేయాలని చూస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఎరువులపై చర్చించాలని ఇవాళ సభ నుంచి వాకౌట్ చేశాం. ప్రజా పాలన అంటే ప్రతిపక్షాల గొంతు నొక్కడమా..?. బీఏసీ సమావేశం అర్థం పర్థం లేకుండా పోయింది. రేపటి ఎజెండా ఏందో ఇప్పటి వరకు చెప్పలేదు. రాత్రికి చెబితే ప్రతిపక్ష ఎమ్మెల్యే లు ఎప్పుడూ ప్రిపేర్ అవ్వాలి. అందుకే బీఏసీ నుంచి వాకౌట్ చేశాం అని హరీష్‌రావు అన్నారు. ఇదిలా ఉంటే.. సభ ఎన్నిరోజులపాటు నిర్వహించాలన్నది రేపు(ఆదివారం) నిర్ణయిస్తామని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అంటున్నారు. ‘‘కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై రేపు సభలో చర్చ ఉంటుంది. బీసీ రిజర్వేషన్ల బిల్లు ను రేపు సభలో పెడతాం. బీఆర్ఎస్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలా? లేదా? అనేది స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. అన్ని అంశాలపై చర్చ చేయాలంటే.. నాలుగైదు రోజులు బ్రేక్ ఇచ్చి సభ నడుపుతాం. గణేష్ నిమజ్జనం ,వరదల నేపథ్యంలో.. మధ్య లో బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాం అని శ్రీధర్‌బాబు మీడియాకు తెలిపారు. -
తెలంగాణ పాలిటిక్స్‌లో ‘యూరియా’ వార్
సాక్షి, హైదరాబాద్: యూరియా కొరతపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. యూరియా కొరతపై అసెంబ్లీలో చర్చ పెట్టాలంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్ చేశారు. కొరతకు కారణం కేంద్రమో, రాష్ట్రమో తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. రైతుల కష్టాలపై చర్చించడానికి ప్రభుత్వానికి భయమెందుకు? అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు.‘‘వరద నష్టంపై చర్చించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎప్పటిలోగా ఎరువులు అందిస్తారో ప్రభుత్వం చెప్పాలి. రైతుల కష్టాలు వినే ఓపిక కూడా ప్రభుత్వానికి లేదా?. రైతుల ఇబ్బందులపై సీఎం సమీక్ష కూడా చేయరా?. యూరియా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తాం. అప్పటివరకు అసెంబ్లీని స్తంభింపజేస్తాం’’ అని హరీష్‌రావు హెచ్చరించారు.మరో వైపు, బీఆర్ఎస్ యూరియా కార్యక్రమం పట నాటకమంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. యూరియా కొరతకు కారణం.. రాష్ట్ర ప్రభుత్వమా? లేక కేంద్ర ప్రభుత్వమా మీకు తెలియదా? అంటూ ప్రశ్నించారు. యూరియా సరఫరా కేంద్ర ప్రభుత్వం పరిధిలో విషయమని పదేళ్ల మీ పాలనలో మీకు తెలియదా?. రైతుల ముసుగులో మీ ప్రేరేపిత ఉద్యమాలు ప్రజలు హర్షిస్తారా?. అధికారం లేదనే అక్కసుతో రేవంత్ ప్రభుత్వాన్ని బదనం చేయాలనే దిగజారుడు రాజకీయం ఎవరి కోసం?’ అంటూ తుమ్మల దుయ్బయట్టారు.‘‘జియో పాలిటిక్స్ వల్ల, దేశీయ ఉత్పత్తి డిమాండ్‌కు తగ్గట్టు లేక యూరియా కొరత ఉంటే రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎందుకు?. యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు ఎందుకు?. రేవంత్‌రెడ్డి పాలనలో మూడు పంట కాలాల్లో యూరియా కొరత లేనీ విషయం మీకు తెలియదా?. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల యూరియా కొరత ఉంటే సీఎం రేవంత్‌పై మీ శాపనార్థాలు ఏమిటి?. కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేస్తేనే తెలంగాణకు యూరియా పంపిణీ చేస్తున్నారు. రైతాంగం ప్రయోజనాల కంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు చేసే నాటకాలు రైతులు నమ్మే స్థితిలో లేరు’’ అంటూ మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బీఆర్ఎస్ వాకౌట్.. ముగిసిన బీఏసీ సమావేశం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు అప్డేట్స్.. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై చర్చకు కాంగ్రెస్ వ్యూహం.. కమిషన్ విచారణపై పీపీటీకి చాన్స్ ఇవ్వాలంటున్న బీఆర్ఎస్.. -
కాళేశ్వరమే ‘ఎజెండా’!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. సభలో వ్యవహరించాల్సిన తీరుపై అధికార కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ వ్యూహ, ప్రతివ్యూహాలతో సిద్ధమయ్యాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచి్చన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడికి అధికార పార్టీ సిద్ధమవుతోంది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార పక్షం నుంచి ఎదురయ్యే విమర్శల దాడిని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది.పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ద్వారా ప్రాజెక్టు గురించి పూర్తిగా వివరించేందుకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టనుందని తెలిసింది. ఇంకోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణను సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేసే అవకాశముంది. నాలుగు రోజులపాటు సమావేశాలు? శనివారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ ఉభయ సభల సమావేశాలు నాలుగు రోజులపాటు కొనసాగే అవకాశమున్నట్లు సమాచారం. తొలిరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు సంతాపం తెలిపిన అనంతరం అసెంబ్లీ వాయిదా పడనుంది. అనంతరం శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన వేర్వేరుగా బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశాలు జరుగుతాయి. స్పీకర్ అధ్యక్షతన జరిగే బీఏసీ భేటీలో అసెంబ్లీ సమావేశాలు జరిగే తేదీలు, రోజువారీ ఎజెండాను ఖరారు చేయనున్నారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ, బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, యూరియా కొరత, వరద నష్టం, ప్రభుత్వ పరంగా పునరావాసం, సహాయక చర్యలు, గురుకుల విద్యా సంస్థల్లో సమస్యలు వంటి అంశాలను ఎజెండాలో చేర్చాలని అధికార, విపక్షాలు పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయి. వినాయక నిమజ్జనం నేపథ్యంలో సమావేశాలను వీలైనంత త్వరగా ముగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత సమావేశాల్లోనే శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసే అవకాశముంది. ఈ మేరకు శనివారం స్పీకర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. కాళేశ్వరం అవినీతిపై ప్రజల్లోకి.. అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికను బహిర్గతం చేసే విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలు, కోర్టు కేసులు.. ఇలా అన్నింటికి ఈ సమావేశాల్లోనే జవాబు చెప్పేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బలంగా వాదిస్తూ అసెంబ్లీ రికార్డుల్లోకి ఎక్కించాలనేది అధికార పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇలా నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని భావిస్తోంది.ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళిక, నాణ్యత, నిర్వహణ విషయాల్లో నిర్లక్ష్యం కారణంగానే మేడిగడ్డ బరాజ్ కుంగిపోయిందని, ఈ ప్రాజెక్టు పరిధిలో నీటిని నిల్వచేయొద్దని ఎన్డీఎస్ఏ సూచించినందున ఈ ప్రాజెక్టును ఎలా వినియోగించుకోవాలనే అంశంపై అన్ని పార్టీల అభిప్రాయాలను ప్రభుత్వం కోరనుంది.ఘోష్ నివేదికపై చర్యల కంటే దానిపై చర్చ జరగడమే ప్రధానమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కమిషన్ నివేదిక ఆధారంగా దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేయడ మాత్రమే తమ ఉద్దేశం కాదని, అవసరమైతే బీజేపీ కోరుతున్నట్టు సీబీఐ విచారణకు కూడా వెనుకాడేది లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలోనే ఎండగట్టే వ్యూహంతో బీఆర్ఎస్ పీసీ ఘోష్ కమిషన్‌పై చర్చ, సిట్ ఏర్పాటు పేరిట ఇరకాటంలోకి నెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రయత్నాలను అసెంబ్లీ వేదికగానే తిప్పికొట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, సీనియర్ నేతలు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.రాష్ట్రంలో వరదల మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించటాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతోంది. ఘోష్ కమిషన్ నివేదికపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్.. సోమవారం మరోసారి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. న్యాయస్థానంలో విచారణ జరగమునుపే అసెంబ్లీలో నివేదికను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం తమపై బురద చల్లే ప్రయత్నంలో ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.అసెంబ్లీ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టుపై పీపీటీ ఇచ్చేందుకు అవకాశమివ్వాలని పట్టుబడుతోంది. ప్రభుత్వంలో అవినీతి, గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టు, నీటిపారుదల ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగింత వంటి అంశాలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని భావిస్తోంది. ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో జరిగే చర్చలో ప్రతిపక్ష నేత కేసీఆర్ పాల్గొంటారా లేదా అనే అంశంపై బీఆర్ఎస్ గోప్యత పాటిస్తోంది. ఎరువుల కొరత, వరద నష్టంపై ప్రభుత్వం స్పందన వంటి అంశాలపై చర్చ కోసం పట్టుబట్టే వ్యూహంపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. సీబీఐ విచారణకు బీజేపీ పట్టు కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు కోసం పట్టుబట్టాలని బీజేపీ శాసనసభా పక్షం నిర్ణయించింది. సీబీఐ విచారణ ద్వారానే నిజాలు నిగ్గు తేలుతాయని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సన్నద్ధమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ విచారణ కోసం మొదటి నుంచీ డిమాండ్ చేస్తున్న బీజేపీ.. అసెంబ్లీలోనూ అదే వైఖరిని కొనసాగించాలని నిర్ణయించింది. ఎన్డీఎస్ఏ నివేదికపై కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను కూడా తిప్పికొట్టాలని భావిస్తోంది. సిట్ ఏర్పాటులో ప్రభుత్వం చేస్తున్న తాత్సారాన్ని కూడా నిలదీయాలని బీజేపీ నిర్ణయించింది. కాగా ఎంఐఎం, సీపీఐ పార్టీలు అధికారపక్షానికి మద్దతుగా నిలవనున్నట్లు సమాచారం. -
ఇది కదా అసలు నిజం.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక ఆర్థిక పరిస్థితిపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందంటూ రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రతి నెలా రూ. 7,000 కోట్ల రుణ వడ్డీ చెల్లిస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ఈ వాదన తప్పని తేల్చిందని ఆయన స్పష్టం చేశారు. గత నాలుగు నెలల్లో సగటు నెలవారీ వడ్డీ చెల్లింపు కేవలం రూ. 2,300 కోట్లు మాత్రమేనని కేటీఆర్ ట్వీట్ చేశారు.అయితే, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక ఈ వాదన తప్పని తేల్చిందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారానికి పాల్పడుతుందంటూ కేటీఆర్ మండిపడ్డారు. వాస్తవానికి, గత నాలుగు నెలల్లో సగటు నెలవారీ వడ్డీ చెల్లింపు కేవలం రూ. 2,300 కోట్లు మాత్రమేనని (4 నెలల్లో రూ.9,355 కోట్లు) పేర్కొన్నారుకాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర రుణ భారాన్ని ఎక్కువ చేసి చూపిస్తుందంటూ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించే ఈ దుష్ప్రచారాన్ని వెంటనే ఆపాలని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజల జీవనం స్తంభించిపోయిందని కేటీఆర్ అన్నారు. ఈ వర్షాల వల్ల పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తినష్టం జరిగిందని, ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రజల కష్టాలను పట్టించుకోకుండా, విలాసవంతమైన, లాభదాయకమైన ప్రాజెక్టులపై సమీక్షలు నిర్వహిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.ప్రతి నెలా రూ. 7,000 కోట్ల రుణ వడ్డీ చెల్లిస్తోందని పూర్తిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు...గత నాలుగు నెలల్లో సగటు నెలవారీ వడ్డీ చెల్లింపు కేవలం రూ. 2,300 కోట్లు మాత్రమే - కేటీఆర్ కేసీఆర్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ అబద్ధాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ 👇… pic.twitter.com/6vKlTipJbF— KTR News (@KTR_News) August 29, 2025రూ.3,50,000 కోట్ల 2036 ఒలింపిక్స్ నిర్వహణ, రూ.1,50,000 కోట్ల మూసీ సుందరీకరణ, రూ.225 కోట్ల హైదరాబాద్ బీచ్ ప్రాజెక్టుల గురించి చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నారు. ప్రజల గోడును గాలికొదిలేసి, డబ్బు సంపాదించే పనులపైనే రేవంత్ అండ్ కో దృష్టి పెట్టిందని కేటీఆర్ దుయ్యబట్టారు. -
రాహుల్ క్షమాపణ చెప్పాలి
గౌహతి: చొరబాటుదార్ల కారణంగా అస్సాంలో జనాభా స్థితిగతుల్లో మార్పులు వస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆందోళన వ్యక్తంచేశారు. చొరబాటు సమస్యను అధ్యయనం చేయడానికి ప్రధాని మోదీ డెమొగ్రఫీ మిషన్‌ను ప్రకటించారని తెలిపారు. చొరబాటుదార్ల నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామంటూ హామీ ఇచ్చామని, అది కచి్చతంగా నిలబెట్టుకుంటామని తేల్చిచెప్పారు. అమిత్ షా శుక్రవారం అస్సాంలో పర్యటించారు. అస్సాం తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి గోలాప్ బొర్బోరా శత జయంతి వేడుకల్లో ప్రసంగించారు. ఏ ఒక్క చొరబాటుదారుడు మన దేశంలో ఉండడానికి వీల్లేదని స్పష్టంచేశారు. విదేశీయుల అక్రమంగా వచ్చి మన దగ్గర తిష్టవేస్తే సహించాలా? అని ప్రశ్నించారు. చొరబాటుదారులందరినీ బయటకు పంపించక తప్పదని అన్నారు. తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించడానికే ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)ను చేపట్టిందని, దానిపై రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని ప్రతిపక్షాలపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్షాలు ఓటర్ అధికార్ యాత్ర ముసుగులో చొరబాటుదార్ల బచావో యాత్ర చేస్తున్నాయని నిప్పులు చెరిగారు. ఏ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకైనా ఓటర్ల జాబితా గుండెకాయ లాంటిదని స్పష్టం చేశారు. బిహార్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఓటర్ అధికార్ యాత్ర సందర్భంగా ఆ పార్టీ నాయకులు ప్రధాని మోదీ తల్లిని అవమానించారని అమిత్ షా దుయ్యబట్టారు. రాహుల్ గాం«దీకి నిజంగా సిగ్గుంటే తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్‌కు వెళ్లొచ్చే నేతలు అస్సాంను పాలించాలా? తరచుగా పాకిస్తాన్‌కు వెళ్లొచ్చే నాయకులు అస్సాంను పరిపాలిస్తామంటే ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్‌కి పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయని పరోక్షంగా మండిపడ్డారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. రాజధాని గౌహతితో పంచాయతీ ప్రతినిధుల ర్యాలీలో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలు చొరబాటుదార్లకు, ఆక్రమణదార్లకు మద్దతిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిని ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చొరబాటుదార్లు అస్సాంలో వేలాది ఎకరాల భూమిని ఆక్రమించారని, వారిని వెళ్లగొట్టేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయతి్నస్తుండగా, కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. 1.29 లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వం ఆక్రమణదార్ల చెర నుంచి విడిపించిందని గుర్తుచేశారు. అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ వర్మ అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారని ప్రశంసించారు. ఆయన నాయకత్వంలో బీజేపీ మళ్లీ విజయం సాధిస్తుందని చెప్పారు. -
పట్నా కాంగ్రెస్ ఆఫీస్ వద్ద హైటెన్షన్
-
త్వరగా ఎన్నికలకు వెళ్లటమే మేలు!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఇంకా తేలలేదు. ఢిల్లీలో న్యాయ నిపుణులతో సంప్రదింపులతోపాటు గత రెండు రోజులుగా జరిగిన మంత్రుల బృందం భేటీ.. సీఎం, పీసీసీ అధ్యక్షుల సమ క్షంలో జరిగిన చర్చల్లోనూ తుది నిర్ణయానికి రాలేక పోయారు. ఈ నేపథ్యంలో మరో రెండుమూడు రోజుల తర్వాతే పార్టీ వైఖరి స్పష్టమవుతుందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.తొందరపాటు వద్దుస్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సంప్రదింపుల కోసం పీసీసీ ఏర్పాటు చేసిన మంత్రుల బృందం మూడు ప్రత్యామ్నాయాలను పార్టీ ముందుంచినట్టు తెలిసింది. ఈ మూడింటిని గురువారం జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ సమక్షంలో జరిగిన సమావేశంలో మంత్రుల బృందం వివరించింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రుల బృందం సభ్యులు మల్లు భట్టి విక్రమార్క, ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ధనసరి సీతక్కలు పాల్గొన్నారు. మూడు ఆప్షన్లపై చర్చించినా తుది నిర్ణయానికి రాలేకపోయారని తెలిసింది. అయితే, మెజారిటీ నాయకులు మాత్రం ప్రత్యేక జీవో ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తేనే మంచిదని అభిప్రాయపడ్డారు. బీసీ వర్గాలకు న్యాయం చేసే విషయంలో హడావుడిగా నిర్ణయం తీసుకునేదాని కంటే పార్టీ పరంగా ఎలా ముందుకెళ్లాలన్న దానిపై మరింత కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ నెల 30న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ ఈ అంశంపై చర్చించి మంత్రుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. బుధవారం గాంధీభవన్‌లో మంత్రుల బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో మీనాక్షి నటరాజన్, మహేశ్‌కుమార్‌గౌడ్‌తోపాటు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, సీతక్క, వాకిటి శ్రీహరి, పార్టీ నేతలు వి.హనుమంతరావు, పి. వినయ్‌కుమార్, ఈరవత్రి అనిల్ పాల్గొని ఢిల్లీ న్యాయ నిపుణులు ఇచ్చిన అభిప్రాయాల మేరకు మంత్రుల బృందం చేయాల్సిన సిఫారసులపై చర్చించారు. మంత్రుల బృందం సిఫారసులివే..!» స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేస్తూ రాష్ట్రపతి ఆమోదానికి పంపిన ఆర్డినెన్సుకు మరో నెలరోజుల్లో మూడు నెలలు పూర్తవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లుల ఆమోదం విషయంలో రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు కేసు కూడా ఈలోపు ఓ కొలిక్కి వస్తుంది. అప్పటివరకు వేచి చూస్తే బాగుంటుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున ప్రభుత్వ పక్షాన కొంత గడువు కోరుతూ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాలి. ఆర్డినెన్సు ఆమోదం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ పోరాటం చేయాలి. » వేచి చూసే అవకాశం లేకపోతే ప్రభుత్వ పరంగానే బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ప్రత్యేక జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలి. ఈ ఉత్తర్వులపై ఎవరైనా కోర్టులకు వెళితే కులగణన ఆధారంగా వచ్చిన శాస్త్రీయ గణాంకాలను కోర్టు ముందుంచి పోరాడాలి. కోర్టులు కూడా వెంటనే నిర్ణయం తీసుకోకుండా కేవియట్ దాఖలు చేయాలి. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లాలి. » ఈ రెండు ప్రతిపాదనలు కాదంటే పార్టీ పరంగానే 42 శాతం రిజర్వేషన్లను ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలి.సింఘ్వి సలహానే సరైందా..?గురువారం సీఎం రేవంత్ సమక్షంలో జరిగిన మంత్రుల బృందం సమావేశంలో వీలున్నంత త్వరగా ఎన్నికలు నిర్వహించడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. అయితే, పార్టీ పరంగా మరింత దృఢంగా వ్యవహరించాలని, బీసీ వర్గాలకు న్యాయం చేసే విషయంలో వెనక్కు తగ్గవద్దనే చర్చ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీ ఎంపీ, న్యాయ కోవిదుడు అభిషేక్ మనూ సింఘ్వి ఇచ్చిన సలహా మేరకు సుప్రీంకోర్టులో కేసు తేలేవరకు వేచి ఉండడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే ప్రభుత్వ పరంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి వెళ్లాలని ఎక్కువ మంది అభిప్రాయపడ్డట్లు సమాచారం. -
ఫుట్‌బాల్ ఆరోపణలను ఖండించిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి
-
స్థానిక ఎన్నికలపై డైలమా!
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికల విషయంలో డైలమా ఏర్పడింది. వాయిదా వేద్దామా? ప్రభుత్వ పరంగా బీసీలకు 42% కోటాపై జీవో ఇచ్చి ముందుకు వెళదామా అన్న దానిపై అధికార కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఈ అంశంపై జాతీయ స్థాయి న్యాయ నిపుణులతో పాటు పార్టీ హైకమాండ్‌తో కూడా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం చర్చలు జరిపినప్పటికీ ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీసీసీ నియమించిన మంత్రుల బృందం ఇచ్చే నివేదిక కీలకం కానుంది. మంత్రుల బృందం చేసే సిఫారసును ఈ నెల 30వ తేదీన జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మరోసారి కూలంకషంగా చర్చించిన తర్వాతే దీనిపై ఓ స్పష్టత వస్తుందని ప్రభుత్వ, కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎటూతేల్చుకోలేక..!: పంచాయతీ ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు అంశం ఎంతకీ తేలకపోవడం ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి సమస్యగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మెజారిటీ మంత్రులు ఎన్నికలకు వెళ్దాం అనే ఆలోచనలో ఉన్నారు. కానీ పార్టీలోని బీసీ నాయకత్వం రిజర్వేషన్ల కల్పనపై మాట నిలబెట్టుకుని ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని సూచిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మొదటి నుంచి 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలనే ఆలోచనతో ఉన్నారు. ఈ తర్జనభర్జనల నేపథ్యంలోనే న్యాయనిపుణుల సలహాలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పీసీసీ నియమించిన ఐదుగురు మంత్రుల బృందం ఢిల్లీలో పర్యటించి న్యాయ నిపుణులతో పాటు పార్టీ హైకమాండ్‌తో కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్టు తెలుస్తోంది. పార్టీ పరంగా ఇస్తే బూమరాంగ్ ఖాయం విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం..కులగణన చేస్తామని, ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రజలకు వాగ్దానం చేసి, ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తామని చెబితే బూమరాంగ్ కావడం ఖాయమని కాంగ్రెస్ హైకమాండ్ తేల్చిచెప్పింది. అవసరమైతే ఎన్నికల నిర్వహణకు కోర్టును మరింత సమయం కోరాలని సూచించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి పంపిన రెండు బిల్లులతో పాటు, 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌పై కేంద్ర ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడాన్ని తప్పుపడుతూ.. క్షేత్రస్థాయిలో బీజేపీని ఎండగట్టే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పినట్లు తెలిసింది. సోమవారం ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీలతో చర్చలు జరిపిన సీఎం, మంత్రుల బృందం.. మంగళవారం బిహార్‌లో ఓటర్ అధికార యాత్ర నిర్వహిస్తున్న రాహుల్గాందీతోనూ సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. బీజేపీని ఎండగట్టాల్సిందే.. ‘పార్గీ పరంగా సాధ్యం కాదు. ఒకవేళ ఇచ్చినా మళ్లీ గత అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితే రావొచ్చు. ఓడిపోయే సీట్లను బీసీలకు కేటాయించొచ్చు. ఇది బీసీలను మోసం చేయడమే..’ అని కుండబద్ధలు కొట్టినట్లు సమాచారం. ‘బీసీలకు రిజర్వేషన్ల అమలు ఇప్పుడు ఒక్క తెలంగాణ అంశమే కాదు.. యావత్ దేశానిది. రిజర్వేషన్లు అమలు చేయకుండా ఒకట్రెండు ధర్నాలు చేసి చేతులు ముడుచుకుంటే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి బీజేపీని మరింతగా ఎండగట్టాలి. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలి..’ అని హైకమాండ్ పెద్దలు గట్టిగా చెప్పినట్లు తెలిసింది.ఈ పరిస్థితుల్లోనే ప్రభుత్వ పరంగా బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లే అంశం తెరపైకి వచ్చింది. అయితే ఇది కోర్టులో నిలబడుతుందా లేదా? అనే సందేహం కూడా కాంగ్రెస్ నేతలను వెంటాడుతోంది. కోర్టును గడువు అడగండి..మళ్లీ ఆర్డినెన్స్ పంపండి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో న్యాయ కోవిదుల అభిప్రాయాలను తీసుకుని నివేదిక సమర్పించేందుకు గాను టీపీసీసీ నియమించిన మంత్రుల బృందం ఆదివారం ప్రజాభవన్‌లో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డితో సమావేశమై ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలు, న్యాయపరంగా ఉన్న ఇబ్బందులపై చర్చించింది. తాజాగా సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో సమావేశమైంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆలోచనలను కూడా వివరించింది. ఈ నేపథ్యంలో 42 శాతం రిజర్వేషన్లను అధికారికంగా అమలు చేయాలనే కోణంలోనే ముందుకు వెళ్లాలనుకుంటే ఎన్నికలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని సూచించినట్టు తెలిసింది. అదే విధంగా 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ కాలపరిమితి 3 నెలలు ముగిసిన తర్వాత మళ్లీ ఆర్డినెన్స్ చేసి, మరోమారు ఆమోదం కోసం గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపాలని చెప్పినట్లు సమాచారం. ఈలోపు హైకోర్టులో ఉన్న కేసులో ఆరు వారాల గడువు కోరుతూ కౌంటర్ దాఖలు చేయాలని, తద్వారా సుప్రీంకోర్టులో ఉన్న కేసుకు బలం చేకూరుతుందని, రెండోసారి మంత్రివర్గం పంపిన ఆర్డినెన్స్‌ను రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు ఆమోదించాల్సి ఉంటుందని ఆయన వివరించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అసెంబ్లీ సమావేశాల నిర్ణయంపై చర్చ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ఈ నెల 30వ తేదీ నుంచి నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. అసెంబ్లీ నిర్వహణకు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధం లేనప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండటం సాధ్యం కాదనే కోణంలోనే వీలున్నంత త్వరగా అసెంబ్లీ సమావేశాలను పూర్తి చేయాలన్న యోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఇదే నిజమైతే 30వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ జీవో విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణయిస్తుందని తెలుస్తోంది. ఒకవేళ ఎన్నికల వాయిదాకు కనుక మొగ్గు చూపితే హైకోర్టును గడువు అడిగే విధంగా కేబినెట్ నిర్ణయం ఉంటుందని సమాచారం ఏది ఏమైనా ఈ నెల 30వ తేదీన జరిగే రాష్ట్ర మంత్రివర్గ భేటీలో..అన్ని అంశాలను క్రోడీకరించి మంత్రుల బృందం ఇచ్చే సిఫారసుపై చర్చించిన అనంతరమే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయా? వాయిదా పడతాయా? అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. రాహుల్ యాత్రలో సీఎం, రాష్ట్ర నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందంటూ బిహార్‌లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్‌తో కలిసి రేవంత్‌రెడ్డి రోడ్‌షోలో పాల్గొన్నారు. రోడ్‌షోకు హాజరైన పార్టీ నేత ప్రియాంకగాం«దీని కూడా రాష్ట్ర నేతలు కలిశారు. -
క్షమాపణలు చెప్పడానికి సిద్ధం, కానీ.. : డీకే శివకుమార్
బెంగళూరు: కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ క్షమాపణలకు సిద్ధపడ్డారు. కానీ, ఆ క్షమాపణలు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కాదని.. నిజంగా ఎవరి మనోభావాలు అయినా దెబ్బతిని ఉంటే చెబుతానని అంటున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించటం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై బీజేపీ హర్షం వ్యక్తం చేయగా.. కాంగ్రెస్ నేతలంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఇదే పని వేరే ఎవరైనా చేసి ఉంటే.. ఈ పాటికి కాంగ్రెస్ చర్యలు తీసుకునే ఉండేదన్న కామెంట్లు బలంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తాజాగా డీకే స్పందించారు.‘‘బీజేపీని విమర్శించేందుకే నేను ఆ పాట పాడాను. కానీ కొందరు దీనిద్వారా రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటున్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారు. నేను ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని అనుకోవడం లేదు. ఈ వ్యవహారంతో ఎవరైనా బాధపడిఉంటే.. అందుకు చింతిస్తున్నాను. నేను క్షమాపణలు చెప్తాను. అయితే అవి రాజకీయ ఒత్తిడివల్ల చెప్పే క్షమాపణలు కాదు అని అన్నారాయన. అలాగే గాంధీ కుటుంబం (Sonia Gandhi family), కాంగ్రెస్ పార్టీపై తనకున్న నిబద్ధత తిరుగులేనిదని వ్యాఖ్యానించారు. నేను కాంగ్రెస్ వ్యక్తిగానే జన్మించా.. అలాగే మరణిస్తా. గాంధీ కుటుంబం నాకు దైవంతో సమానం. నేను వారి భక్తుడిని అని స్పష్టం చేశారు.ఇటీవల అసెంబ్లీలో చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనపై చర్చ నడిచింది. ఆ సమయంలో డీకే శివకుమార్ విపక్షాల విమర్శలకు బదులిస్తూ.. ఆర్ఎస్ఎస్ గేయాన్ని ఆలపించారు. ‘నమస్తే సదా వస్తలే మాతృభూమే’ అంటూ ఆయన నోట రావడంతో బీజేపీ సభ్యులు బల్లలు చరుస్తూ మద్దతిచ్చారు. సభ రికార్డుల నుంచి ఈ గీతాన్ని తొలగించరాదంటూ వారు నినదించారు. కాంగ్రెస్ వాళ్లు మాత్రం ఆ పరిణామాన్ని మౌనంగా చూస్తూ ఉండిపోయారు. -
కడియం శ్రీహరిపై మరోసారి తాటికొండ రాజయ్య వివాదస్పద వ్యాఖ్యలు
సాక్షి, జనగామ జిల్లా: స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నకిలీ ఎన్కౌంటర్లకు స్పెషలిస్ట్ కడియం శ్రీహరి అంటూ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో ఏఒక్కటి తన మార్క్ అని చెప్పడానికి లేని టాల్మాన్ అంటూ విమర్శలు గుప్పించారు. ఓర్వలేని తనంతో లెక్కచేయనితనంతో ఫ్రస్టేషన్‌కు లోనై ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్థితిలో ఉన్నాడని ఎద్దేవా చేశారు.బీజేపీలోకి రమ్మని పిలిచిన వెళ్లే జంపు జలానీలు తండ్రీ కూతుర్లని మండిపడ్డారు. అభివృద్ధి నినాదం అయితే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 1560 కోట్లు, హనుమకొండ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 6000 కోట్లు తీసుకొస్తే, అభివృద్ధి కోసం పార్టీ మారినని చెప్పుకుంటున్న కడియం శ్రీహరి 800 కోట్లు తెచ్చానని చెప్పుకోవడం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందన్నారు.ఓడిపోతాడనే భయంతో తక్కువ మెజారిటీతో మూడుసార్లు ఎమ్మెల్యే గెలవడం ప్రజా నాయకుడు అనిపించుకోడన్నారు. నియోజకవర్గంలో ఇక నుండి కడియం శ్రీహరి ఎత్తులు జిత్తులు, కుళ్ళు కుతంత్రాలు సాగవన్నారు. ఉప ఎన్నికలు వస్తాయని నేను అనుకోవడం లేదని, నువ్వే అనుకుని ఆగమాగం అవుతూ.. ఈరోజు లింగాల ఘన్‌పూర్‌లో మా పార్టీ కార్యక్రమాలను పోలీసుల ద్వారా రద్దు చేయించడం కడియం శ్రీహరి దుర్బుద్ధికి నిదర్శనం అంటూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణ అసెంబ్లీ స్పెషల్ సెషన్‌కు ముహూర్తం ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. కాళేశ్వరం నివేదిక సహా ఇతర అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమాచారం కానుంది. ఈ నెల 30 నుంచి ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 29న తెలంగాణ కేబినెట్ భేటీలో స్పెషల్ సెషన్‌కు సంబంధించిన ఎజెండా ఖరారు కానుంది. మూడు లేదంటే ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాళేశ్వరం కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించే యోచనలో ప్రభుత్వం ఉంది.ఇదిలా ఉంటే.. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ రూపొందించిన నివేదికను అసెంబ్లీలో చర్చించాకే తదుపరి చర్యలు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. నివేదికపై చర్చ నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
‘కోటా’ చిక్కుముడి విప్పేదెలా?
సాక్షి, న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుపై చట్టపరంగా ఎదురయ్యే చిక్కుముళ్లను విప్పేందుకు మంత్రుల బృందం పార్టీ పెద్దలు, న్యాయ నిపుణులతో భేటీ అయింది. రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఆమోదించిన రెండు బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లోనే ఉన్నందున దీనిని చట్టపరిధిలో పరిష్కరించే మార్గాలపై సమాలోచనలు చేసింది. ఒకవేళ జీవోలు ఇస్తే ఎదురయ్యే సవాళ్లు, దీనిని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన కార్యాచరణ, కులగణన ద్వారా వచ్చిన ఎంపిరికల్ డేటాను న్యాయవ్యవస్థల ముందుంచే అంశాలపై క్షుణ్ణంగా చర్చించింది. 50శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్న రాష్ట్రాలు, వాటిపై గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులు, రాజ్యాంగ నిబంధనలన్నింటిపైనా చర్చలు జరిపింది. రిజర్వేషన్లపై మార్గాన్వేషణ: 42 శాతం రిజర్వేషన్ల అమలు అంశంపై ఏర్పాటైన మంత్రుల కమిటీ సభ్యులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ సోమవారం ఢిల్లీలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో గంటపాటు భేటీ అయ్యారు. ఇప్పటికే విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులు రాష్ట్రపతి కోసం వేచి చూస్తున్న విషయాలతోపాటు, 2018లో చంద్రశేఖర్ రావు రిజర్వేషన్లను 50శాతానికి పరిమితి చేస్తూ చేసిన చట్టాన్ని తొలగించాలన్న ఆర్డినెన్స్‌పైనా చర్చించారు. ఈ బిల్లుల ఆధారంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 263 ప్రకారం బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ జీవో ఇవ్వడమా?, ఇస్తే ఈ ఉత్తర్వుల అమలును ఇతరులెవరూ కోర్టుకు వెళ్లి అడ్డుకోకుండా ముందుగానే కేవియట్ దాఖలు చేయడమా? అన్న అంశాలపై మంత్రులు సమాచాలోచనలు చేశారు. ఒకవేళ కోర్టులు అభ్యంతరం చెబితే కులగణన సర్వే ద్వారా సేకరించిన డేటాతో బీసీల జనాభా, వెనకబాటుతనాన్ని నిరూపించే అవకాశాలపైనా చర్చించారు. ఇప్పటికే 10శాతం ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ల కోసం చేసిన 103వ రాజ్యాంగ సవరణతో విద్య, ఉద్యోగాల్లో మొత్తం రిజర్వేషన్లు 50శాతం దాటడాన్ని సుప్రీంకోర్టు సమర్ధించిన దృష్ట్యా, సర్వే డేటాలోని అంశాలు తమకు కలిసి వస్తాయనే అభిప్రాయం వ్యక్తమైంది. 50 శాతం రిజర్వేషన్లు దాటితే సమానత్వపు హక్కు ఉల్లంఘన జరిగినట్లేనని, అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే 50శాతం పరిమితిని దాటవచ్చని సుప్రీంకోర్టు.. గతంలో మరాఠాల రిజర్వేషన్లపై తీర్పుఇచ్చిన నేపథ్యంలో ఎంపిరికల్ డేటాను ఎంతవరకు ప్రామాణికంగా చూపవచ్చనే అంశంపైనా చర్చించారు. హైకోర్టు విధించిన గడువు సెపె్టంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితుల్లో అదనపు గడువు కోరే అవకాశాలపైనా చర్చలు జరిగాయి. అయితే ఈ నెల 29న జరిగే కేబినెట్ భేటీలో చర్చించి తుది నిర్ణయం చేయనున్నారు. నేడు బిహార్‌కు సీఎం, మంత్రులు రానున్న బిహార్ ఎన్నికలకు ముందు జాతీయ ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందంటూ ఏఐసీసీ అగ్రనేత తలపెట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు పాల్గొననున్నారు. ఓట్ల చోరీపై రాహుల్ చేస్తున్న పోరాటానికి రాష్ట్ర నేతలు సంఘీభావం తెలపనున్నారు. రోడ్‌షోలో ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకగాంధీ సైతం పాల్గొనే అవకాశాలున్నాయి. -
‘మోసం చేసిందనిపిస్తే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి’
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ హామీలపై బీజేపీ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడారు.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లేనిపోని హామీ ఇచ్చింది. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ మాటలు నమ్మి ఆగం కావొద్దని ముందే చెప్పాం. అధికారంలోకి 100 రోజుల్లో ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. వాటి సంగతి ఏమైందని ప్రశ్నించారు. రైతు బంధు లేదు,రైతు భీమా లేదు. కాంగ్రెస్ మోసం చేసిందని భావిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పండి ’ అని పిలుపునిచ్చారు. -
రాహుల్ పై కాంగ్రెస్ సస్పెన్షన్ వేటు
-
తెలంగాణ BJP ఎంపీలపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నా: మహేష్ గౌడ్
-
నటి ఆరోపణలు.. ఎమ్మెల్యే రాహుల్‌కు బిగ్ షాక్
తిరువనంతపురం: కేరళలోని పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్‌కు బిగ్ షాక్ తగిలింది. రాహుల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు, పలువురు నేతల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. అంతకుముందు.. రాహుల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్(35) చుట్టూ లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒకరి తర్వాత ఒకరు రాహుల్ బాధితులమంటూ మీడియా ముందుకు వచ్చారు. ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్పై మలయాళ నటి రిని ఆన్ జార్జ్, రచయిత్రి హనీ భాస్కరన్ ఆరోపణలతో కేరళ కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం రేగింది. అధికార, ప్రతిపక్ష విమర్శల నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ మమ్కూటథిల్ రాజీనామా చేశాడు. తనను హోటల్ రూమ్‌కు రావాలని రాహుల్ వేధింపులకు గురిచేసినట్టు నటి రిని ఆరోపించారు.తర్వాత హిజ్రా ఒకరు రాహుల్‌పై సంచలన ఆరోపణలకు దిగారు. తనను అత్యాచారం చేస్తానంటూ రాహుల్ మమ్కూటథిల్ మెసేజ్‌లు పంపాడంటూ ట్రాన్స్ ఉమెన్ యాక్టివిస్ట్ అవంతిక ఆరోపిస్తోంది. ‘త్రిక్కకర ఉప ఎన్నిక సమయంలో ఓ మీడియా డిబేట్ జరుగుతుండగా రాహుల్‌ను కలిశాను. ఆ తర్వాత అతనికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాను. ఆపై అతను రాత్రింబవళు తెగ ఫోన్ చేసేవాడు. ఆ సమయంలో రాజకీయాలే ఎక్కువగా మాట్లాడేవాడు.అయితే పోను పోను అతని ప్రవర్తలో మార్పు వచ్చింది. అసభ్యమైన సందేశాలు పంపించడం మొదలుపెట్టాడు. ఒకరోజు నన్ను రేప్ చేయాలని ఉందంటూ మెసేజ్‌లు పెట్టాడు. భయంతో కాంగ్రెస్ నేతలకు నేను ఫిర్యాదుచేశా. కానీ, అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆఖరికి నన్ను కూడా వదలకుండా.. రేప్‌లు చేస్తానన్నోడిని రోల్ మోడల్‌గా తీసుకోవాల్సిన అవసరం ఈ సమాజానికి ఉందా? అని అవంతిక ప్రశ్నించింది. రాహుల్‌తో జరిగినట్లుగా చెబుతున్న చాటింగ్‌ను ఆమె మీడియా ముందు ప్రదర్శించింది. దీంతో, ఇటు మహిళల ఆరోపణలు, పార్టీ నుంచి, పలువురు నేతల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. తాజాగా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. -
‘బండి సంజయ్ సహా బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారు’
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారని సంచలన ఆరోపణలు చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో బీజేపీ ఎంపీల గెలుపుపై తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు. అలాగే, బీహార్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది అంటూ జోస్యం చెప్పారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా సాక్షి టీవీతో మాట్లాడుతూ.. తెలంగాణలో బండి సంజయ్ సహా, బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారు. ఆ మాటకు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు. మాకు తెలంగాణ బీజేపీ ఎంపీల గెలుపుపై అనుమానాలున్నాయి. ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాస్తాం. మా నిజామాబాద్ జిల్లాలోనూ దొంగ ఓట్లున్నాయి. అది నేను నిరూపిస్తాను. మహారాష్ట్రలో కోటి దొంగ ఓట్లు నమోదు చేశారు.నిజామాబాద్‌లోనూ మహారాష్ట్ర ప్రజలకు ఓట్లు ఉన్నాయి. కరీంనగర్లోనూ ఓ డబల్ బెడ్ రూమ్ ఇంట్లో 69 ఓట్లు ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. ఓట్లు చోరీ చేసే అవసరం కేవలం బీజేపీకే ఉంది. బీహార్ ఎన్నికల్లోనూ అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రజల్ని చైతన్యపర్చేందుకే రాహూల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. రాహుల్ పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తోంది. బీహార్‌లో కాంగ్రెస్ ప్రభంజనం రాబోతుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
మీ అభిప్రాయం ఏంటి?
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంలో కాంగ్రెస్ పార్టీ నియమించిన మంత్రుల కమిటీ కసరత్తు ప్రారంభించింది. ఆదివారం ప్రజాభవన్‌లో కమిటీ సమావేశమై రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి అభిప్రాయం తీసుకుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబులు హాజరయ్యారు. కరీంనగర్ పర్యటనలో ఉన్న మరో మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్లో కమిటీతో తన అభిప్రాయాన్ని పంచుకోగా, ఇంకో మంత్రి సీతక్క గైర్హాజరయ్యారు. సమావేశంలో భాగంగా కులగణన నుంచి బీసీ బిల్లును రాష్ట్రపతికి పంపేంతవరకు జరిగిన కార్యాచరణ, న్యాయపరంగా ఈ బిల్లు ఆమోదానికి తీసుకోవాల్సిన చర్యలు, రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసి ఎన్నికలకు వెళితే.. ఎదురయ్యే అడ్డంకులు తదితర అంశాలపై ఏజీ సుదర్శన్‌రెడ్డితో కమిటీ చర్చించింది. ఆయన అభిప్రాయాలను విన్న కమిటీ సోమవారం కులగణనపై నియమించిన నిపుణుల కమిటీ చైర్మన్ జస్టిస్ సుదర్శన్‌రెడ్డితోపాటు అభిషేక్ మనుసింఘ్వి తదితర ఢిల్లీలోని న్యాయ కోవిదుల అభిప్రాయాలను కూడా తీసుకొని ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఈ కమిటీ ఈనెల 26వ తేదీకల్లా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు నివేదిక సమర్పించాల్సి ఉంది. ఈ నివేదిక అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో తన వైఖరిని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించనుంది. ఆ తర్వాత ఈనెల 29న జరిగే కేబినెట్ భేటీలో ప్రభుత్వ నిర్ణయం వెల్లడి కానుంది. -
సురవరం పేరును శాశ్వతం చేస్తాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్/హిమాయత్‌నగర్/గాంధీ ఆస్పత్రి: తెలంగాణ ప్రజలకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందని, అందులో భాగంగానే దివంగత కమ్యూనిస్టు అగ్రనేత సురవరం సుధాకర్‌రెడ్డి పేరు శాశ్వతంగా నిలిచిపోయేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును ఉద్యాన వర్సిటీకి, జైపాల్‌రెడ్డి పేరును పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పెట్టామని, అలాగే సురవరం విషయంలో కూడా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శనివారం రాత్రి మరణించిన సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్‌రెడ్డి భౌతికకాయానికి ఆదివారం మఖ్దూమ్ భవన్లో సీఎం నివాళులర్పించారు. అనంతరం సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బాలూనాయక్, కాంగ్రెస్ నేతలు చిన్నారెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు. సురవరం మృతి తెలంగాణకు తీరని లోటు అని విచారం వ్యక్తంచేశారు. నిరాడంబర జీవితం గడిపిన సుధాకర్‌రెడ్డి ఏనాడూ తన సిద్ధాంతాలను విడిచిపెట్టలేదని కొనియాడారు. బూర్గుల రామకృష్ణారావు, సూదిని జైపాల్‌రెడ్డి తరహాలోనే సురవరం సుధాకర్‌రెడ్డి కూడా మహబూబ్‌నగర్ జిల్లాకు వన్నె తెచ్చారని అన్నారు. విద్యార్థి దశ నుంచి చివరి శ్వాస వరకు విలువలకు కట్టుబడి జీవించిన గొప్ప నాయకుడు సురవరం సుధాకర్‌రెడ్డి అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో సురవరం సుధాకర్‌రెడ్డి ఆలోచనలు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు, హరియానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, వినోద్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు సురవరం భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించి చిరస్మరణీయ ముద్ర వేసుకున్న సురవరం సుధాకర్‌రెడ్డి మరణం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేటీఆర్ అన్నారు. దేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందని బండారు దత్తాత్రేయ నివాళులర్పించారు. అధికార లాంఛనాలతో.. సురవరం సుధాకర్‌రెడ్డికి సీపీఐ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం మఖ్దూమ్భవన్లో సురవరంకు ప్రభుత్వం అధికార లాంఛనాలతో గౌరవ వందనం సమర్పించింది. అనంతరం మధ్యాహ్నం 3.20 గంటలకు ఆయన అంతిమయాత్ర మఖ్దూమ్భవన్ నుంచి నారాయణగూడ చౌరస్తా, చిక్కడపల్లి, ముషీరాబాద్ మీదుగా సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ గాంధీ మెడికల్ కాలేజీకి చేరింది. అంతిమయాత్రలో ముందు భాగంలో పోలీసు కవాతు ఉండగా, అనంతరం సీపీఐ వలంటీర్లు ఎర్ర జెండాల కవాతు, ప్రజానాట్య మండలి కళాకారుల విప్లవ తీతాలాపనల మధ్య యాత్ర కొనసాగింది. అనంతరం సుధాకర్‌రెడ్డి పార్థీవ దేహాన్ని ఆయన సతీమణి డాక్టర్ బి.వి.విజయలక్ష్మి, కుమారులు కపిల్, నిఖిల్ కలిసి గాంధీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఇందిర, ప్రొఫెసర్ రమాదేవి, ప్రొఫెసర్ సుధాకర్‌కు అప్పగించారు. సురవరం భౌతికకాయానికి ఎంబామింగ్ (రసాయనాల పూత) చేసి భద్రపరుస్తామని.. వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం వినియోగిస్తామని చెప్పారు. సురవరం తన కళ్లను ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేతలు డి.రాజా, కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, చాడ వెంకట రెడ్డి, కూనంనేని సాంబశివరావు, నెల్లికంటి సత్యం, పల్లా వెంకట్‌రెడ్డి, కె.శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ పెద్దిరాజు రవిచంద్ర, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బై ఎలక్షన్లతో కాంగ్రెస్‌కు బైబై
మియాపూర్: రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఉప ఎన్నికలు రానున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వానికి అవే బైబై ఎన్నికలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేసి ఉపఎన్నికల్లో పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ముందా? అని సవాల్ విసిరారు. మియాపూర్ నరేన్ గార్డెన్లో శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శంభీపురం రాజు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.2.80 లక్షల కోట్ల అప్పుచేసి అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు గడవకముందే రూ.2.20 లక్షల కోట్ల అప్పుచేసి ఒక్క మంచిపని కూడా చేయలేదని విమర్శించారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌ను మహా నగరంగా తీర్చిదిద్దామని చెప్పారు. కరోనా సమయంలో ఏడాదిపాటు ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఆదాయం రాకపోయినా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆగకుండా కొనసాగించామని తెలిపారు. ఇప్పుడు 20 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుతో 42 ప్లైఓవర్లు, నాలుగు అత్యాధునిక ఆస్పత్రులు, 36 మురుగునీటి శుద్ధి కేంద్రాలు నిర్మించిందని వెల్లడించారు. రేవంత్ ప్రభుత్వం ఒక్క కొత్త వంతెన గానీ మోరీని గానీ నిర్మించిందా? అని ప్రశ్నించారు. హైడ్రా అరాచకంతో హైదరాబాద్ అతలాకుతలం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన హైడ్రావల్ల హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుప్పకూలిందని కేటీఆర్ విమర్శించారు. హైడ్రా అరాచకాలతో నగరమంతా అతలాకుతలమైందని ఆరోపించారు. దుర్గంచెరువులో కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా? అని సవాల్ చేశారు. పేదల ఇళ్లు కూలగొడుతున్న హైడ్రా.. పెద్దల జోలికి మాత్రం వెళ్లడం లేదని మండిపడ్డారు. 20 నెలల్లో హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకం సృష్టించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తాము ఏ పార్టీలో ఉన్నామో కూడా చెప్పుకోలేకపోతున్నారని, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఈ కార్యక్రమానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రోజాదేవి రంగారావు, సిం«ధూ ఆదర్శ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బండి సంజయ్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణలోనూ దొంగ ఓట్లున్నాయి.దొంగ ఓట్లతోనే ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. దొంగ ఓట్లు లేకపోతే బండి సంజయ్ గెలిచేవారు కాదు. బండిసంజయ్ బీసీ కాదు.. దేశ్‌ముఖ్. కులం మతం లేకపోతే బీజేపీ గెలవదు. దేవుడి పేరుతో మేం ఎన్నడూ ఎన్నికలప్పుడే దేవుడే గుర్తుకొస్తాడు. బీఆర్ఎస్ మూడు ముక్కలైంది.నాల్గవ ముక్క కోసం ఇంకొకరు ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు తప్ప.. వేరే పార్టీకి అవకాశం లేదు’అని వ్యాఖ్యానించారు. -
‘నాలాగ పనిచేసే ఎమ్మెల్యే దొరకడం కష్టం’
హన్మకొండ జిల్లా: ఎవరు కుళ్లుకున్నా తన పని తాను చేసుకుపోవడమే తనకు తెలుసని ఎమ్మెల్యే కడియం శ్రీహారి స్పష్టం చేశారు. పని చేయని వారు దొంగలాగ పారిపోతారని, తాను పని చేశాను కాబట్టే ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానన్నారు. అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ప్రజలకు సూచించారు.ఈరోజు(ఆదివారం, ఆగస్టు 24వ తేదీ) జిల్లాలోని ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ‘ నాలాగ పనిచేసే ఎమ్మెల్యే దొరకడం కష్టం. నేను ఒక్క రూపాయి లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. అవినీతికి కాకుండా అభివృద్ధికి సహకరించండి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. -
సెప్టెంబర్తొలి వారంలో పదవుల బొనాంజా !
సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలకు వినాయక నిమజ్జనంలోపే పదవు ల బొనాంజా అందనుంది. ఈ మేరకు సెప్టెంబర్ మొదటివారంలోనే కార్పొరేషన్లకు డైరెక్టర్లు, బోర్డు సభ్యుల నియామకాలను పూర్తి చేయాలని సీఎం రేవంత్ సమక్షంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పీఏసీ భేటీ కంటే ముందు శనివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్‌తోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌లు ఈ భేటీలో పాల్గొన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ గురించి చర్చించారు. ఇప్పటికే జిల్లా పార్టీ ఇన్‌చార్జ్‌ల నుంచి వచ్చిన జాబితా వడపోతను త్వరితగతిన పూర్తిచేసి పలు కార్పొరేషన్లకు డైరెక్టర్లు, బోర్డు సభ్యుల నియామకాలను వినాయక నిమజ్జనం పూర్తయ్యేసరికి ప్రకటించాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన గురించి కాంగ్రెస్ పార్టీ ముందున్న ఆప్షన్లపై కూడా నేతలు చర్చించారు. హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంతోపాటు అసెంబ్లీ సమావేశపర్చడం, పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లను ప్రకటించి ముందుకెళ్లడం తదితర అంశాలపై చర్చించిన నేతలు పీఏసీ సమావేశంలో సభ్యుల ముందు ప్రతిపాదించాల్సిన అంశాలు, ఎజెండాపై నిర్ణయం తీసుకున్నారు. అండగా ఉందాంముఖ్య నేతల భేటీ అనంతరం 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ గురించి చర్చించేందుకుగాను మరో సమావేశం జరిగింది. ఈ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌లు పాల్గొన్నారు. ఫిరాయింపు కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, తదనుగుణంగా స్పీకర్ ప్రసాద్‌కుమార్ పలువురు ఎమ్మెల్యేలకు జారీ చేసిన నోటీసులు, పార్టీపరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చ జరిగినట్టు సమాచారం. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచేందుకు నమ్మకంతో వచ్చిన వారికి పార్టీ కూడా అండగా ఉండాలని, ఈ కేసు విషయంలో కాంగ్రెస్ పార్టీపరంగా ఎలా ముందుకెళ్లాలన్న దానిపై న్యాయ నిపుణులతో చర్చించాలని సూచించినట్టు తెలిసింది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలతో మాట్లాడాలని, వారికి భరోసా కల్పించడంతోపాటు కేసు విచారణ విషయంలో అవసరమైన అన్ని రకాల సాయాన్ని అందించాలని కూడా సీఎం రేవంత్ చెప్పినట్టు సమాచారం. -
‘స్థానిక’o పై కమిటీ
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలను వీలున్నంత త్వరగా నిర్వహించడానికే కాంగ్రెస్ పార్టీ మొగ్గుచూపుతోంది. ఈ విషయంలో కోర్టులకు వెళ్లి కేసులు వేయడం వల్ల కాలయాపన తప్ప ప్రయోజనం లేదని ఆ పార్టీలోని కీలక నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం గాందీభవన్‌లో జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ), సలహా కమిటీల సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది. సమావేశంలో భాగంగా పలువురు సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు కొందరు పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళదామని సూచించగా, మరికొందరు మాత్రం అధికారికంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తేనే మంచిదనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇదే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ హైకోర్టు ఇచి్చన గడువులోపు స్థానిక ఎన్నికలు పూర్తిచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అధికారికంగా ఇవ్వగలమా లేదంటే పార్టీపరంగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలా అనే అంశంపై న్యాయ నిపుణులతో సలహాలు, సంప్రదింపులు జరిపి పార్టీకి నివేదిక ఇచ్చేందుకుగాను ఐదుగురు మంత్రులతో ప్రత్యేక కమిటీని నియమించాలని పీఏసీ నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్‌రెడ్డిలతో చర్చించిన అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఈ కమిటీని అధికారికంగా ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్కలు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని, దేశంలోని న్యాయ నిపుణులు, పార్టీ నాయకులతో కమిటీ విస్తృతంగా చర్చించి ఈ నెల 26వ తేదీలోపు నివేదికను ఇస్తుందని మహేశ్‌గౌడ్ వెల్లడించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపిన బిల్లు ప్రకారం అధికారికంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించగలమా? లేదా పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించి ముందుకెళ్లాలా అనే అంశాలపై ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఆరు ప్రధాన అంశాలే ఎజెండాగా భేటీ సమావేశంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలు, హైకోర్టు కోర్టు తీర్పు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు గల ఆప్షన్లు, ఏఐసీసీ పిలుపు మేరకు ఓట్ చోరీ, గద్దీ చోడ్ ఉద్యమాన్ని రాష్ట్రంలో విస్తృతంగా చేపట్టడం, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలు, రాష్ట్రంలో యూరియా కొరత, రాజకీయ పరిణామాల గురించి చర్చించారు. సమావేశానికి ముందు ఏఐసీసీ చేపట్టిన ఓట్చోరీ ప్రచార లోగోను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఇండియాకూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ఎంపిక చేయడం పట్ల సమావేశం హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, వీహెచ్, కేకే, జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డి, మధుయాష్కీగౌడ్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్లతోపాటు పలువురు మంత్రులు, పీఏసీ సభ్యులు పాల్గొన్నారు. లోతుగా చర్చించి నిర్ణయం తీసుకున్నాం: డిప్యూటీ సీఎం భట్టి పీఏసీ భేటీ అనంతరం సీనియర్ మంత్రి ఉత్తమ్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్‌లతో కలిసి భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడారు. బీసీలకు స్థానిక సంస్థలతోపాటు విద్య, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పన, 50 శాతం రిజర్వేషన్ల పరిమితి గురించి పీఏసీ లోతుగా చర్చించిందని చెప్పారు. సెప్టెంబర్ 31 వరకు స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై సుదీర్ఘంగా పలువురు సభ్యుల అభిప్రాయాలను తీసుకున్నామన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో అధికారికంగా వెళ్లాలా... పార్టీ పరంగా వెళ్లాలా అనే అంశాలపై చర్చించడంతోపాటు, న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని, ఇందుకోసం కమిటీని నియమించాలని, ఈనెల 28వ తేదీలోపు కమిటీ నివేదిక ఇవ్వాలని పీఏసీ నిర్ణయించిందని చెప్పారు. కమిటీలో సభ్యులపై టీపీసీసీ అధ్యక్షుడు అధికారికంగా నిర్ణయం తీసుకుంటారన్నారు. న్యాయ నిపుణులతో కమిటీ చర్చించి పార్టీకి నివేదిక ఇచ్చిన అనంతరం కేబినెట్లో నిర్ణయం తీసుకొని స్థానిక ఎన్నికల విషయంలో ముందుకు వెళతామని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలు జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి మద్దతు తెలపాలని కోరుతూ పీఏసీలో తీర్మానించినట్టు వెల్లడించారు. దేశంలోని పౌరుల ఓటు హక్కును కాపాడడం, ఓట్ల చోరీని అరికట్టేందుకు బిహార్‌లో రాహుల్‌గాంధీ చేపట్టిన పాదయాత్రపై పీఏసీలో చర్చ జరిగిందని, ఆ పోరాటానికి పీఏసీ సంపూర్ణంగా మద్దతు తెలిపిందన్నారు. ఈనెల 26న పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు వెళ్లనున్నట్టు చెప్పారు. విస్తృతంగా చర్చిస్తాం: మంత్రి ఉత్తమ్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు, అటు విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల గురించి ఎలా ముందుకెళ్లాలన్న దానిపై మూడు ఆప్షన్లను పీఏసీ భేటీలో చర్చించామని చెప్పారు. ఈ విషయంలో విస్తృత స్థాయిలో పార్టీ నేతలతోపాటు న్యాయ నిపుణులతో మాట్లాడుతామని వెల్లడించారు. అభిషేక్ మనుసింఘ్వి, జస్టిస్ సుదర్శన్‌రెడ్డిలతోపాటు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌లను అధికారికంగా అభిప్రాయం అడుగుతామని తెలిపారు. ఘన విజయానికి అవకాశం: పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన అద్భుతమైన ఫలితాలనిస్తోందని, జనహిత పాదయాత్రలో భాగంగా వెళ్లినప్పుడు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించే అవకాశం ఇప్పుడు పార్టీకి ఉందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, పార్టీ గెలుపు కోసం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని చెప్పారు. బీసీలకు మేలు జరగాల్సిందే: సీఎం రేవంత్ పీఏసీ సమావేశంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో కేసీఆర్ తెచి్చన చట్టం ప్రకారం ఒక్కశాతం కూడా అదనంగా బీసీలకు రిజర్వేషన్ రాదని, కానీ బీసీలకు మేలు జరగాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. అందు కోసమే చట్టాన్ని సవరించి ఆర్డినెన్సు తెచ్చామని, ఆ ఆర్డినెన్సును గవర్నర్‌కు పంపితే ఆయన రాష్ట్రపతికి పంపారని చెప్పారు. రాష్ట్రపతికి పంపిన బిల్లులను 90 రోజుల్లో ఆమోదించాలన్న అంశంపై సుప్రీంకోర్టులో మన వాదనలను వినిపించేందుకు ఇద్దరు న్యాయవాదులను నియమించామని చెప్పారు. ఆ కేసులోనే రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బీసీ బిల్లు అంశం కూడా వస్తుందని, ప్రత్యేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని చెప్పారు. ఒకవేళ అలా వెళ్లే కేసు లిస్టు కావడానికే చాలా సమయం పడుతుందన్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ఎంపిక చేసినందుకుగాను మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్‌గాం«దీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 26న బిహార్‌లో రాహుల్‌గాంధీ నిర్వహిస్తున్న ఓట్చోరీ పాదయాత్రకు హాజరవుతానని, రాష్ట్రంలో కూడా ఓట్చోరీ ఉద్యమాన్ని విస్తృతంగా చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్ఎస్, బీజేపీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని, యూరియా ఇచ్చే పార్టీకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తానని కేటీఆర్ చెప్పడంలోనే వారి తీరు అర్థమవుతోందన్నారు. యూరియా కోసం తాను నాలుగుసార్లు కేంద్ర మంత్రులు నడ్డా, అనుప్రియా పటేల్‌లను కలిశానని వెల్లడించారు. -
ఏడు అంశాల అజెండాగా పీఏసీ సమావేశం
-
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ రైడ్స్.. నోట్ల కట్టలు.. నగల గుట్టలు
కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్రను ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) శనివారం అరెస్ట్ చేసింది. అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై గ్యాంగ్‌టక్‌లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. వీరేంద్ర పలు అక్రమ బెట్టింగ్ వెబ్సైట్లు నడుపుతున్నట్లు ఈడీ గుర్తించింది. ఆయన సోదరుడు కేసీ తిప్పేస్వామి దుబాయ్‌లో మూడు సంస్థలు ద్వారా గేమింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేలింది. గ్యాంగ్టాక్లో కాసినో స్థలాన్ని లీజుకు తీసుకునే ప్రయత్నంలో ఉన్న సమయంలో వీరేంద్రను అరెస్ట్ చేశారు.ఈ బెట్టింగ్ రాకెట్ కార్యకలాపాలు దుబాయ్ కేంద్రంగా సాగుతున్నట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. ఈ అరెస్టు క్రమంలో ముందుగా దేశవ్యాప్తంగా వీరేంద్రకు సంబంధించిన 30 ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో దాడులు జరిపింది. 22, 23(శుక్ర, శని) తేదీల్లో సిక్కిం, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవాతో సహా పలు రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి. గోవాలోని ఐదు ప్రముఖ కాసినోలపై కూడా దాడులు జరిగాయి. ఈ సోదాల్లో లెక్కల్లో చూపని భారీ మొత్తంలో నగదు, బంగారం బయటపడ్డాయి. ఈడీ సోదాల్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.తనిఖీల్లో సుమారు రూ. 12 కోట్ల నగదు, రూ. 6 కోట్ల విలువైన గోల్డ్ ఆభరణాలు, 10 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన నగదులో దాదాపు కోటి రూపాయల విలువైన విదేశీ కరెన్సీని కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. నాలుగు ఖరీదైన వాహనాలను సీజ్ చేయడంతో పాటు వీరేంద్రకు చెందిన 17 బ్యాంకు ఖాతాలను ఈడీ అధికారులు స్తంభింపజేశారు. రెండు బ్యాంక్ లాకర్లను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు.. బీఆర్ఎస్కు ప్లస్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ తాజాగా నోటీసులు ఇచ్చారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలలో నిన్న ఐదుగురికి నోటీసులు పంపించారు. నేడు మరో ఐదుగురికి నోటీసులు ఇవ్వనున్నట్టు సమాచారం.కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. కాగా, న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. స్పీకర్ నోటీసులతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. దీంతో, తెలంగాణ రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అయితే, స్పీకర్ నోటీసులతో ఫిరాయింపు నేతలు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుతారా? లేక రాజీనామా చేస్తారా? అనేది తేలాల్సి ఉంది.ఇక, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. అదేవిధంగా మరో నలుగురు ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ నుంచి నోటీసులు అందినట్లుగా సమాచారం. అయితే, స్పీకర్ ప్రసాద్ కుమార్ నోటీసులపై ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు వచ్చిన నోటీసులకు త్వరలోనే సమాధానమిస్తానని అన్నారు. తాను అసలు పార్టీ మారలేదని.. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లలేదని స్పష్టం చేశారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు.మరోవైపు.. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌కు ఇంకా స్పీకర్ నోటీసులు అందలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి జగిత్యాల ఎమ్మెల్యేగా గెలుపొందిన సంజయ్. ఆ తర్వాత కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అయితే, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకోకపోవడంతో ఎమ్మెల్యేకి నోటీసులపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకూ బీఆర్ఎస్కు రాజీనామా చేయని సంజయ్. దీంతో, సంజయ్‌కు నోటీసులు ఇస్తారా? లేదా? అని స్థానికంగా చర్చ నడుస్తోంది. -
‘స్థానిక’ ఎన్నికలకు ఎలా వెళ్లాలి?
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ శనివారం కీలక భేటీ నిర్వహించనుంది. స్థానిక ఎన్నికల అంశంలో నిర్ణయం తీసుకునేందుకు వీలుగా టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీతోపాటు సలహాకమిటీ సమావేశాన్ని కూడా సంయుక్తంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు గాంధీభవన్‌లో జరగనున్న ఈ కీలక సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో పార్టీపరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై నిర్ణయం తీసుకొని తమ వైఖరిని అధికారికంగా ప్రకటించనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లతోపాటు రాష్ట్ర మంత్రులు, రాజకీయ వ్యవహారాలు, సలహా కమిటీ సభ్యులు హాజరుకానున్నారు. ఎజెండా ఇదే....!గాంధీభవన్ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం ఐదారు కీలకాంశాలపై రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు చర్చించనున్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే విషయంలో హైకోర్టు తీర్పు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల గురించి నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి ముడిపడి ఉన్న బీసీల రిజర్వేషన్లను అమలు చేసే విషయంలో పార్టీ ఎలాంటి వైఖరి తీసుకోవాలన్న దానిపై కూడా నేతలు చర్చించనున్నారు. అయితే, బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గేది లేదని, చట్టపరంగా కల్పించలేని పక్షంలో పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. బీసీ రిజర్వేషన్ల విషయంలో తమ చిత్తశుద్ధిని ప్రజలకు వివరించడంతోపాటు ప్ర«తిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు అనుసరిస్తున ద్వంద్వ, అస్పష్ట వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరోమారు అసెంబ్లీని సమావేశపర్చాలని ప్రభుత్వాన్ని కోరే అంశాన్ని కూడా చర్చించనున్నారు. అయితే, ఈ విషయంలో పీఏసీలోని అందరి సభ్యుల అభిప్రాయాలను తీసుకొని, మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే టీపీసీసీ నిర్ణయించింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, ఏఐసీసీ పిలుపు మేరకు ఓటు చోరీ అంశంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహాలు, పార్టీ సంస్థాగత బలోపేతం, పెండింగ్‌లో ఉన్న గ్రామ, మండల, జిల్లా పార్టీ కమిటీల నియామకం, రాష్ట్రంలో యూరియా కొరత, ప్రతిపక్ష పార్టీల వైఖరి తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరగనుందని సమాచారం. -
‘ కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందనడానికి ఇదొక ఉదాహరణ’
ఢిల్లీ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామన్న తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ప్రశ్నించారు. బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందనడానికి ఇదొక ఉదాహరణ అని పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని విమర్శించారు ఎంపీ లక్ష్మణ్. ఇంకా ఆయనేమన్నారంటే.. ‘పీవీ నరసింహారావు , టి అంజయ్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానించింది. ఈ అవమానాన్ని తట్టుకోలేక తెలుగు ఆత్మగౌరవం బయటికి వచ్చింది. నాడు వెంకయ్య నాయుడుని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు సమర్థించలేదు? అని ప్రశ్నించారు. ‘ బ్లాక్ మార్కెట్ వల్ల యూరియా కొరత ఏర్పడింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కారణం. మార్వాడి గో బ్యాక్ నినాదం మంచిది కాదు. ఎవరు ఎక్కడైనా పని చేసుకునే అవకాశం ఉంది. ఏవైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించుకోవాలి .. పెద్దవి చేయకూడదు’ అని ఆయన స్పష్టం చేశారు. -
వీడియో: డిప్యూటీ సీఎం చర్యతో షాకైన ఎమ్మెల్యేలు
నిన్నగాక మొన్న ఆరెస్సెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. హఠాత్తుగా స్వరం మార్చారు. ఆరెస్సెస్ గీతాన్ని.. అదీ అసెంబ్లీలో సభ్యులందరి సమక్షంలో ఆలపించారు. ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు బళ్లలు చరుస్తూ ఆయన్ని ప్రొత్సహించగా.. ఊహించని ఈ పరిణామంతో కాంగ్రెస్ సభ్యులు మౌనంగా చూస్తూ ఉండిపోయారు.కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శుక్రవారం అసెంబ్లీలో ఆరెస్సెస్ గీతాన్ని ఆలపించారు. బెంగళూరు ఆర్సీబీ వేడుకల్లో తొక్కిసలాట ఘటనపై చర్చ సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రకరకాల కామెంట్లు, సెటైర్లు కనిపిస్తున్నాయి.చిన్నస్వామి తొక్కిసలాట ఘటనకు శివకుమారే బాధ్యుడంటూ బీజేపీ సభ్యులు అసెంబ్లీలో విమర్శలు గుప్పించారు. అయితే బెంగళూరు ఇంచార్జి మంత్రిగా, కర్ణాటక క్రికెట్ అసోషియేషన్ సభ్యుడి హోదాలో ఆర్సీబీ జట్టును కేవలం ప్రొత్సహించడానికే వెళ్లానని ఆయన వివరణ ఇచ్చారు. ప్లేయర్లను అభినందించి కప్‌ను ముద్దాడాక అక్కడితో తనతోనే తన పని అయిపోయిందని అన్నారాయన. అదే సమయంలో ఇలాంటి ఘటనలు వేరే రాష్ట్రాల్లోనూ జరిగాయని గుర్తు చేశారు.VIDEO | Karnataka Deputy CM DK Shivakumar (@DKShivakumar) recited the RSS’ Sangha Prarthana, ‘Namaste Sada Vatsale Matribhume’, while addressing the Assembly yesterday.(Source: Third party)(Full VIDEO available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/2CNsemZaq4— Press Trust of India (@PTI_News) August 22, 2025దీంతో.. ఆ సమయంలో, ప్రతిపక్ష నేత ఆర్. అశోక గతంలో డీకే శివకుమార్ ఆరెస్సెస్ చెడ్డీ (RSS యూనిఫాం) వేసుకున్నానని చేసిన వ్యాఖ్యను గుర్తు చేశారు. దీనికి స్పందనగా శివకుమార్ ఆరెస్సెస్ గీతం “నమస్తే సదా వత్సలే మాతృభూమే…” పాడారు. ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ జోక్యం చేసుకుని.. ‘‘ఈ లైన్లు రికార్డుల నుంచి తొలగించవద్దని ఆశిస్తున్నా’’ అని అన్నారు. దీంతో సభలో నవ్వులు పూశాయి.ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. రాహుల్ గాంధీ ఇప్పుడు ఎలా స్పందిస్తారు?.. ఇదే పని వేరే ఎవరైనా చేసి ఉంటే ఈ పాటికే కాంగ్రెస్ చర్యలు తీసుకునేదేమో అని ఒకరు కామెంట్ చేస్తే.. అర్జంట్‌గా డీకేఎస్‌కు సీఎం పీఠం అప్పజెప్పకపోతే కాంగ్రెస్ చీలిపోయే ప్రమాదం ఉందని మరొకరు.. ఇది నిజంగానే షాకింగ్ రాజకీయ పరిణామమని ఇంకొకరు కామెంట్ చేశారు. అయితే.. చర్చ తీవ్రతరం కావడంతో డీకే శివకుమార్ తన చర్యపై స్పందించారు.నేను జన్మతః కాంగ్రెస్ వాదిని. ఒక రాజకీయ నేతగా స్నేహితులు, ప్రత్యర్థులు ఎవరో తెలుసుకోవడం నాకు అవసరం. నేను వాళ్లను అధ్యయనం చేశాను. బీజేపీతో చేతులు కలపడం అనే ప్రశ్నే లేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం.. నాయకత్వం వహిస్తాను. జీవితాంతం కాంగ్రెస్‌లోనే కొనసాగుతాను అని స్పష్టత ఇచ్చారాయన.ఇదిలా ఉంటే.. పంద్రాగస్టు ఎర్రకోట ప్రసంగంలో ఆరెస్సెస్ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు స్పందించగా.. డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరెస్సెస్ ఒక సంస్థగా ఉన్నా, దాని నైతికతను ప్రశ్నించాల్సిన అవసరం లేదని అన్నారు.అయితే కాంగ్రెస్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని.. ఆరెస్సెస్‌తో పోల్చలేనిదని పేర్కొన్నారు. ఈ క్రమంలో.. ఆరెస్సెస్ చాలా కాలం జాతీయ జెండాను ఎగురవేయలేకపోయిందని, వాజ్‌పేయి ముందడుగు వేసిన తర్వాతే అది సాధ్యమైంది వ్యాఖ్యానించారు. -
మరిన్ని చిక్కుల్లో కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే!
కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్(35) చుట్టూ లైంగిక వేధింపుల ఆరోపణల ఉచ్చు మరింతగా బిగుస్తోంది. ఒకరి తర్వాత ఒకరు బాధితులమంటూ మీడియా ముందుకు వస్తున్నారు. తాజాగా.. హిజ్రా ఒకరు రాహుల్‌పై సంచలన ఆరోపణలకు దిగారు.తనను అత్యాచారం చేస్తానంటూ పాలక్కడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్ మెసేజ్‌లు పంపాడంటూ ట్రాన్స్ ఉమెన్ యాక్టివిస్ట్ అవంతిక ఆరోపిస్తోంది. ‘‘త్రిక్కకర ఉప ఎన్నిక సమయంలో ఓ మీడియా డిబేట్ జరుగుతుండగా రాహుల్‌ను కలిశాను. ఆ తర్వాత అతనికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాను. ఆపై అతను రాత్రింబవళు తెగ ఫోన్ చేసేవాడు. ఆ సమయంలో రాజకీయాలే ఎక్కువగా మాట్లాడేవాడు.అయితే పోను పోను అతని ప్రవర్తలో మార్పు వచ్చింది. అసభ్యమైన సందేశాలు పంపించడం మొదలుపెట్టాడు. ఒకరోజు నన్ను రేప్ చేయాలని ఉందంటూ మెసేజ్‌లు పెట్టాడు. భయంతో కాంగ్రెస్ నేతలకు నేను ఫిర్యాదుచేశా. కానీ, అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆఖరికి నన్ను కూడా వదలకుండా.. రేప్‌లు చేస్తానన్నోడిని రోల్ మోడల్‌గా తీసుకోవాల్సిన అవసరం ఈ సమాజానికి ఉందా? అని అవంతిక ప్రశ్నించింది. రాహుల్‌తో జరిగినట్లుగా చెబుతున్న చాటింగ్‌ను ఆమె మీడియా ముందు ప్రదర్శించింది.రాహుల్ మమ్కూటథిల్పై మలయాళ నటి రిని ఆన్ జార్జ్, రచయిత్రి హనీ భాస్కరన్ ఆరోపణలతో కేరళ కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం రేగింది. అధికార, ప్రతిపక్ష విమర్శల నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ మమ్కూటథిల్ గురువారమే రాజీనామా చేశాడు. అయితే.. ఈ ఆరోపణల్లో ఇప్పటివరకు ఎవరూ అతనిపై ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. ఇదే అంశాన్ని ప్రస్తావించిన రాహుల్.. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని శపథం చేశాడు. -
సమాఖ్య వ్యవస్థకు తూట్లు!
రాజకీయ అవినీతిని అంతం చేయటానికి, దేశంలో రాజ్యాంగ నైతికతను నెలకొల్పటానికి అని చెబుతూ లోక్‌సభలో బుధవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, అందుకు సంబంధించిన మరో రెండు బిల్లులపై దేశవ్యాప్తంగా సకారణంగానే నిరసనలు వ్యక్త మవుతున్నాయి. లోక్‌సభలో అయితే తీవ్ర వాగ్వివాదాలు, పరస్పర ఆరోపణలు వెల్లువెత్తాయి. బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తొలి వరస నుంచి మూడో వరసకు వెళ్లి ప్రసంగించాల్సి వచ్చిందంటే... ఆయనకు రక్షణ వలయంగా పార్లమెంటరీ భద్రత సేవలో ఉండే 12 మంది గార్డులు మోహరించాల్సి వచ్చిందంటే... బిల్లు ప్రతులు చించి పడేశారంటే... సభలో ఆగ్రహావేశాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రధాని మొదలుకొని ముఖ్యమంత్రులూ, మంత్రులూ అవినీతి ఆరోపణలపై అరెస్టయి, 30 రోజుల్లోగా బెయిల్‌పై విడుదల కాని పక్షంలో వెనువెంటనే పదవుల నుంచి తప్పించేందుకు ఉద్దేశించామని చెబుతున్న ఈ బిల్లులు చట్టాలైతే ప్రకటిత లక్ష్యాలను నిజంగా నెరవేరుస్తాయా అన్నది ప్రశ్నార్థకం. ఏ వ్యవస్థలోనైనా నేర న్యాయచట్టాలు పాలకుల అధికారాన్నీ, వారి రాజకీయ స్వప్రయోజనాలనూ ప్రతిఫలించినంతగా... న్యాయాన్ని ప్రతిబింబించవు. ఆచరణ సంగతి చెప్పనవసరమే లేదు. ఎక్కడి దాకానో ఎందుకు, ఆంధ్రప్రదేశ్‌లో తమ ఎన్డీయే కూటమి పాలన ప్రత్యర్థుల్ని వెంటాడి వేటాడి వేధిస్తున్న వైనం, తప్పుడు కేసులు బనాయిస్తున్న తీరు తెలియదా? కేవలం నిందగా, రుజువుకాని నేరంగా, ఒక ఆరోపణగా మాత్రమే ఉన్న దశలో బెయిల్ రాలేదన్న కారణంగా పదవులకు అనర్హులవుతారని చెప్పడం అంటే ప్రజల దృష్టిలో వారిని శాశ్వతంగా నేరం చేసిన వారుగా ముద్ర వేయటమే అవుతుంది. నేరం చేశారో లేదో తేలకుండా, శిక్షేమీ పడకుండా... విచారణ ప్రక్రియ దానికదే శిక్షగా మారటం మన దేశంలో కళ్లముందు కనబడుతున్న సత్యం. ఈ విషయంలో సీబీఐ, ఈడీ సంస్థలు అనేకసార్లు న్యాయస్థానాలతో చీవాట్లు తింటున్న వైనం తెలియంది కాదు. అలాంటపుడు ఈ సవరణ ద్వారా రాజ్యాంగాన్నే ఆయుధంగా మార్చాలని చూడటం ఎవరి ప్రయోజనాల కోసం?ఈ బిల్లులు కొందరంటున్నట్టు త్వరలో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇప్పుడున్న ‘వోట్ చోరీ’ నినాదాన్ని వెనక్కినెట్టి ‘అవినీతి నిర్మూలన’ ఎజెండాను అగ్రభాగాన నిలబెట్టి తాము మాత్రమే సచ్ఛీలురమనీ, ప్రత్యర్థులంతా అవినీతిపరులనీ ముద్రేయటానికా? నిజమే కావొచ్చు. ఆ మాటెలావున్నా ఇది దేశ ఫెడరల్ వ్యవస్థ అమరికను తీవ్రంగా దెబ్బ తీస్తుంది. రాష్ట్రాల్లో ఎన్డీఏ యేతర పక్షాల ప్రభుత్వాలను ఎన్నికల ముందు పడగొట్టడానికి ఈ చట్టాలను ఎడాపెడా దుర్వినియోగం చేసే వీలుంది. న్యాయసమీక్షకు అవకాశం ఉందనేది అర్థరహిత తర్కం. పెండింగ్ కేసులతో సతమతమవుతున్న న్యాయస్థానాల్లో కేసుల విచారణ పూర్తికావటానికి ఎంత సమయం పడుతున్నదో అందరికీ తెలుసు. సారాంశంలో నేరం రుజువయ్యేవరకూ ప్రతి ఒక్కరినీ నిర్దోషిగా పరిగణించాలన్న న్యాయశాస్త్ర సిద్ధాంతానికి ఇది తూట్లు పొడుస్తోంది.అవినీతి ప్రక్షాళనకు తొలి అడుగు వేయదల్చుకుంటే ముందు సీబీఐ, ఈడీ వంటి సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తినీయాలి. ఆ సంస్థల విశ్వసనీయతను పెంచాలి. అందుకోసం ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం చేసిందేమిటి? యూపీఏ హయాంలో సీబీఐకి ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ అనే ముద్రపడింది. సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానమే ‘పంజరంలో చిలుక’గా సంస్థను అభివర్ణించింది. గత పదకొండేళ్ల పాలనలో ఈ అపప్రథను తొలగించటానికి తీసుకున్న చర్యలేమిటో ఎన్డీఏ చెప్పగలదా? మొన్న మే నెలలో తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్‌పై ఈడీ దాడి చేసిన కేసులో ఆ సంస్థ అన్ని హద్దుల్నీ ఉల్లంఘించిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కటువుగా వ్యాఖ్యానించారు. నాలుగు నెలల క్రితం కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరి రాజ్యసభలో వెల్లడించిన గణాంకాలు దిగ్భ్రాంతిపరుస్తాయి. గత పదేళ్లలో ఈడీ 193 మంది రాజకీయ నాయకులపై కేసులు నమోదు చేయగా, వారిలో కేవలం ఇద్దరికి శిక్ష పడింది. ఆప్ సర్కారులో మంత్రిగా ఉండి అరెస్టయిన సత్యేంద్ర జైన్‌పై సీబీఐ నాలుగేళ్లు దర్యాప్తు జరిపి చివరకు అంతా సవ్యంగానే ఉన్నట్టు తేల్చి కేసును మూసేస్తున్నట్టు న్యాయస్థానానికి తెలిపింది. కానీ ఈలోగా ఆయన ఏడాదిన్నరపాటు జైల్లో మగ్గాల్సి వచ్చింది. అవినీతిని వ్యతిరేకించటమూ, ఈ బిల్లుల్ని సమర్థించటమూ ఒకటి కాదు. పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ లేకుండా ఈ బిల్లులు తీసుకురావటం గమనిస్తే ఇది కేవలం విపక్షాలను అవినీతిపరులుగా ముద్రేయటానికే అని అర్థమవుతుంది. పాలకులెవరైనా దుర్వినియోగానికి విస్తృతంగా అవకాశమున్న ఈ బిల్లుల్ని సంయుక్త పార్లమెంటరీ సంఘానికి (జేపీసీకి) పంపటం కాదు... పూర్తిగా వెనక్కి తీసుకోవాలి. -
హోటల్ రూమ్‌కు రావాల్సిందే.. నటికి రాజకీయ నేత వేధింపులు!
తిరువనంతపురం: కేరళలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మలయాళ నటి తాజాగా.. ఓ యువ రాజకీయ నాయకుడిపై వేధింపుల ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. దీంతో, ఆరోపణలు రాజకీయంగా చర్చకు దారి తీశాయి. బాధితురాలు సదరు వ్యక్తి పేరు చెప్పకపోయినప్పటికీ కాంగ్రెస్ నేతను టార్గెట్ చేసి బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.వివరాల ప్రకారం.. కేరళలో మలయాళ నటి రీనీ ఆన్ జార్జ్ తాజాగా సంaచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఆమె సోషల్ మీడియా పోస్టులో.. ‘కేరళకు చెందిన ఓ యువ రాజకీయ నాయకుడు తనను హోటల్‌కు రమ్ముంటున్నాడని అన్నారు. తనకు అభ్యంతరకరమైన సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నాడని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. గత మూడేళ్లుగా ఇలా జరుగుతోందన్నారు. అయితే, సదరు నేత వేధింపులకు సంబంధించి.. ఆ పార్టీలోని సీనియర్లకు ఈ విషయంపై ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిపారు. అయినా కూడా ఆయనపై చర్యలు తీసుకోకుండా.. ఉన్నత పదవులు ఇస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. సదరు నేత.. తనను మాత్రమే కాదు.. ఇప్పటి చాలా మంది యువతులను ఇలా వేధించినట్టు తనకు తెలుసంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే, పోస్ట్‌లో మాత్రం ఆమె ఎక్కడా.. అతడి పేరును, రాజకీయ పార్టీని ప్రస్తావించలేదు. దీంతో, నటి ఆరోపణలపై కేరళలో రాజకీయ దుమారం చెలరేగింది.Malayalam actor Rini Ann George accused Youth Congress state president and Palakkad MLA Rahul Mamkootathil of sending her offensive messages and of harassment. It has created a furore in Kerala politics! pic.twitter.com/puu1FRjOOP— Sreedhar Pillai (@sri50) August 21, 2025బీజేపీ మాత్రం ఆమె ఆరోపణలపై స్పందిస్తూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్ టార్గెట్ చేసింది. ఆయనే వేధింపులకు పాల్పడుతున్నారని కాషాయ నేతలు మండిపడుతున్నారు. రాహుల్ పేరు ప్రస్తావిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. తక్షణమే రాజీనామా చేయాలని బీజేపీ మార్చ్ నిర్వహించింది. కాగా, రాహుల్ మమ్కూటథిల్ ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాడు.ఇదిలా ఉంటే రచయిత్రి హనీ భాస్కరన్ కూడా రాహుల్ మమ్కూటథిల్పై ఆరోపణలు చేశారు. తనను కూడా వేధింపులకు గురి చేశాడని తెలిపింది. సోషల్ మీడియాలో పదే పదే సందేశాలు పంపి వేధించాడని ఆమె ఆరోపించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. యూత్ కాంగ్రెస్‌లో మహిళలను కూడా ఇలానే వేధించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సదరు కాంగ్రెస్ నేత వేధింపుల వ్యవహారం కేరళలో కొత్త చర్చకు దారి తీసింది. -
ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి, సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి గురువారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్, శరద్ పవార్, సంజయ్ రౌత్ తదితరులు పాల్గొన్నారు.దీనికి ముందు ఆయన పార్లమెంటు ప్రాంగణంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్, మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. నామినేషన్ల దాఖలుకు ఆగస్టు 21 చివరి తేదీ. ఆగస్టు 25లోపు అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవచ్చు. సెప్టెంబర్ 9న ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు కూడా అదే రోజున జరగనుంది. #WATCH | INDIA alliance Vice-Presidential nominee, former Supreme Court Judge B Sudershan Reddy pays tribute to freedom fighters and great leaders, ahead of filing nomination. pic.twitter.com/tH3Fjdx7KI— ANI (@ANI) August 21, 2025 -
ఉప రాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్ మద్దతు.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు బీజేపీకి అవసరం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. బీఆర్ఎస్ మద్దతు బీజేపీకి ఇవ్వాలని తాము అడగలేదున్నారు. ఇదే సమయంలో పార్లమెంట్లో కేంద్రం తెచ్చిన మూడు బిల్లుల విషయంలో ఇండియా కూటమి వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లులకు కాంగ్రెస్ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కొందరు నాయకులు బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం నైతిక విలువలను కాపాడేందుకు రాజ్యాంగ సవరణ తీసుకువస్తోంది. ఇందు కోసం లోక్‌సభలో బిల్లు పెట్టాం. దీన్ని ఏకపక్షంగా తీసుకురావాలని అనుకోవడంలేదు. ఈ బిల్లుపై చర్చ జరపాలని జేపీసీకి పంపాం. లోక్‌సభలో పెట్టిన బిల్లు వల్ల దోచుకున్న వారికి కొంత బాధ కలుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ కలుగుతుందో అర్థం కావడం లేదు. భవిష్యత్తులో జరిగే 3 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓటమి చెందుతుంది.లోక్‌సభలో నిన్ను కాంగ్రెస్ కూటమి తీరు దుర్మార్గం. తీవ్రమైన నేరాలపై అరెస్ట్ అయితే ప్రధాని, సీఎం, మంత్రులు పదవీచ్యుతులయ్యే విధంగా బిల్లు తెచ్చాం. రాజకీయాలతో సంబంధం లేని బిల్లు ఇది. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు ఎందుకు భయపడుతోంది. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నట్లు కాంగ్రెస్ పరిస్థితి ఉంది. కోర్టు తీర్పు తర్వాతే అమిత్ షా ఎన్నికల్లో పోటీ చేశారు. నైతిక విలువలు కట్టుబడి నాడు అమిత్ షా రాజీనామా చేశారు. ఆరోపణలు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా పదవి నుంచి తొలగి పోవాలి. జేపీసీ ముందు అగ్ని పరీక్ష జరగాలి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ ఆరు నెలలుగా పైగా జైలులో ఉన్నప్పుడు అక్కడే అధికారులతో రివ్యూ మీటింగ్‌లు పెట్టారని విమర్శించారు. జైలు నుంచే పాలన చేసి.. ప్రభుత్వ యంత్రాంగాన్ని భ్రష్టు పట్టించారన్నారు. తమిళనాడులో మంత్రి సెంథిల్ బాలాజీ జైలు కెళ్లినా రాజీనామా చేయలేదని తెలిపారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ మద్దతుపై మాట్లాడుతూ.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో మాకు బీఆర్ఎస్ మద్దతు అవసరం లేదు. వాళ్ళ మద్దతు ఎవరు అడిగారు. మేం అడగలేదు. 50వేల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు పంపుతున్నాం. తమిళనాడు పోర్టు నుంచి రవాణా జరుగుతుంది. ఇఫ్కో నుంచి 15 వేల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు వస్తుంది. తెలంగాణలో యూరియా లేదు అని మంత్రుల ప్రకటన వల్లే చాలా మంది స్టాక్ పెట్టుకున్నారు. ఈ సమస్యకు మంత్రుల ప్రకటనలే కారణం. దిగుమతుల సమస్యల వల్ల యూరియా కొంత ఆలస్యం జరిగింది’ అని చెప్పుకొచ్చారు. -
యూరియా సరఫరాలో ఎలాంటి కొరత లేదు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి యూరియా సరఫరాలో ఎలాంటి కొరత లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు ఆడుతోందని ఆయన మండిపడ్డారు. కేంద్రం యూరియా ఇవ్వడం లేదు కాబట్టే రాష్ట్రంలో కొరత నెలకొందని కాంగ్రెస్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తోందని, వాస్తవానికి కేంద్రం యూరియా సరఫరాను ఎక్కడా ఆపలేదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశంపై కాంగ్రెస్ నాయకులతో చర్చకు సిద్ధమని తాను గతంలోనే సవాల్ విసిరితే, దానిపై స్పందించడానికి ఆ పార్టీ నాయకులు ధైర్యం చేయలేదన్నారు. కేంద్రం 2025 రబీ సీజన్ (అక్టోబర్ 2024 – మార్చి 2025)లో తెలంగాణకు అవసరమైన 9.87 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా స్థానంలో 12.47 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేసిందని చెప్పారు.ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అమ్మినది 10.43 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమేనని, మిగిలిన 2.04 లక్షల టన్నులు ఖరీఫ్ సీజన్ ఓపెనింగ్ స్టాక్‌గా ఉందని చెప్పారు. ‘ఈ ఖరీఫ్ సీజన్ (ఆగస్టు 2025 వరకు)లో కావాల్సిన 8.30 లక్షల మెట్రిక్ టన్నులలో ఇప్పటివరకు 5.18 లక్షల మెట్రిక్ టన్నులను కేంద్రం సరఫరా చేసింది. కాబట్టి ఈ రోజు వరకు మొత్తం అందుబాటులో ఉన్న యూరియా 7.22 లక్షల మెట్రిక్ టన్నులు’అని తెలిపారు. తాను తెలిపిన ఈ వివరాలు తప్పని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని రాంచందర్‌రావు సవాల్ విసిరారు.అలా నిరూపించలేకపోతే వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామాకు సిద్ధం కావాలన్నారు. మంత్రి తుమ్మల ముందుగానే ‘స్టాక్ లేదు’అని అబద్ధాలు చెప్పడం.. ‘మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్’లో భాగమని అన్నారు. ఈ భయంతో రైతులు ఒక్కసారిగా షాపులకు చేరుకోవడం, దళారులు బ్లాక్ మార్కెట్ చేయడం వల్ల యూరియాకు కృత్రిమ కొరత ఏర్పడిందన్నారు.‘పంట విస్తీర్ణంలో గతేడాదితో పోల్చితే ఏ మార్పూ లేకపోయినా అదనపు యూరియా ఎక్కడికి వెళ్లింది? నిజంగా రైతుల వద్దకు చేరిందా, లేక బ్లాక్ మార్కెట్ మాఫియా చేతికి చేరుతోందా? దీనిపై మంత్రి తుమ్మల సమాధానం చెప్పాలి’అని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్వహణా లోపంతో కృత్రిమ కొరత సృష్టించిందని ఆరోపించారు. ఇఫ్కో, క్రిభ్కో, ఆర్సీఎఫ్ నుంచి 7,250 రేక్స్ యూరియా రాష్ట్రానికి వచ్చిందని, కరీకల్ పోర్ట్ దిగుమతుల నుంచి పదివేల మెట్రిక్ టన్నులు ప్రత్యేకంగా తెలంగాణకు వచ్చాయన్నారు.‘మార్వాడీ గోబ్యాక్’ వెనుక అర్బన్ నక్సల్స్..తెలంగాణలో శాంతి–భద్రతల పర్యవేక్షణలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని రాంచందర్‌రావు ధ్వజమెత్తారు. ‘మార్వాడీ గోబ్యాక్’నినాదాల వెనుక అర్బన్ నక్సల్స్ వంటి అనేక శక్తులు ఉన్నాయని ఆరోపించారు. బీసీ అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదు?కాంగ్రెస్ పార్టీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎందుకు ప్రకటించలేదని రాంచందర్‌రావు ప్రశ్నించారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి ఆత్మప్ర బోధం మేరకు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వి.హన్మంతరావు పేరును ప్రకటించాల్సింది కదా? అది ఎందుకు జరగలేదు’అని ప్రశ్నించారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికతో బీసీల పట్ల కాంగ్రెస్ వైఖరి ఏమిటో వెల్లడైందన్నారు. కాంగ్రెస్‌కు కేవలం బీసీల ఓట్లు మాత్రమే అవసరం తప్ప, వారి అభ్యున్నతి అవసరం లేదన్నారు. దీనితో బీసీవర్గాలకు రిజర్వేషన్ల పెంపుదల విషయంలో ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని మరోసారి స్పష్టమైందన్నారు. కాంగ్రెస్‌తో పాటు ఇండీ కూటమి ఎంపీలందరూ ఇప్ప టికైనా ఆత్మప్రబోధం మేరకు ఎన్డీఏ ఎంబీసీ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కి ఓటేయాలని కోరుతున్నామన్నారు. -
నింద మాటున ప్రభుత్వాలు కూల్చేస్తారా?
న్యూఢిల్లీ: నేరం రుజువుకాకపోయినా కేవలం నిందారోపణలు ఉన్నాయన్న సాకుతో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన విపక్షపాలిత ప్రభుత్వాలను పడగొడతారా? అంటూ పార్లమెంట్ సాక్షిగా మోదీ ప్రభుత్వంపై విపక్ష పార్టీలు ముప్పేటదాడి చేశాయి. విపక్షపాలిత రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్రతో ఈ మూడు బిల్లులను రూపొందించారని విపక్ష సభ్యులు లోక్‌సభలో ధ్వజమెత్తారు. బిల్లులను తక్షణం ఉపసంహరించుకోవాలని నినాదాలతో హోరెత్తించారు. అయితే బిల్లులను సమర్థిస్తూ అధికార పార్టీ సభ్యులు సైతం దీటుగా స్పందించడంతో లోక్‌సభలో ఒక్కసారిగా మాటల మంటలు రాజుకున్నాయి. అధికార, విపక్ష సభ్యుల వాగ్వాదం మధ్య వివాదాస్పద మూడు బిల్లులను ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫార్సుచేసింది. తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటూ ఏకధాటిగా 30 రోజులుగా కస్టడీలో గడుపుతున్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్రమంత్రులను పదవి నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన మూడు బిల్లులను లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టింది. వెనువెంటనే విపక్ష పార్టీలపాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోసేందుకే మోదీ సర్కార్ ఇలా అత్యంత వివాదాస్పద మూడు బిల్లులను తీసుకొచ్చిందంటూ బుధవారం లోక్‌సభలో విపక్షపార్టీల ఎంపీలు తీవ్ర ఆందోళనకు దిగారు. ఒకదశలో బిల్లు ప్రతులను చింపేసి ఆ ముక్కలను హోంమంత్రి అమిత్‌షా వైపు విసిరేశారు. ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ శిక్ష పడే తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ అరెస్టయి, కస్టడీలో ఏకధాటిగా 30 రోజులుగా ఉన్న సందర్భాల్లో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు ఉద్దేశిస్తూ ‘గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్(సవరణ)బిల్లు, 2025, రాజ్యాంగం(130వ సవరణ)బిల్లు, 2025, జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ(సవరణ)బిల్లు, 2025’బిల్లులను అమిత్‌షా లోక్‌సభలో ప్రవేశపెట్టగానే గొడవ మొదలైంది. అమిత్, వేణుగోపాల్ మధ్య మాటల యుద్ధం బిల్లు ప్రవేశపెట్టగానే అమిత్‌షానుద్దేశిస్తూ కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ మాటలతో విరుచుకుపడ్డారు. ‘‘రాజ్యాంగ మౌలికసూత్రాలను ఈ బిల్లులు ఉల్లంఘిస్తున్నాయి. 2010లో సోహ్రబుద్దీన్ షేక్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో ఆనాడు రాష్ట్ర హోం మంత్రిగా పదవి వెలగబెడుతూనే అమిత్‌షా అరెస్టయ్యారు. సీబీఐ అరెస్ట్‌తో మూడు నెలలు జైళ్లోనే గడిపారు. మరి ఈ నైతికత ఆనాడు మీకు లేదా?’’అని వేణుగోపాల్ సూటి ప్రశ్న వేశారు. దీనికి ఇతర సభ్యులు గొంతు కలిపారు. దీంతో అమిత్‌షా దీటుగా బదులిచ్చారు. ‘‘అదొక తప్పుడు కేసు. అయినాసరే అరెస్టయిన వెంటనే పదవికి త్యజించి నా నైతికతను నిరూపించుకున్నా. పదవికి రాజీనామా చేశా. కేసులో నిర్దోషిగా బయటపడేదాకా ఎలాంటి చట్టబద్ద పదవిని చేపట్టలేదు’’అని అన్నారు. మధ్యాహ్నం సభ రెండుగంటలకు మళ్లీ మొదలయ్యాక ఈ మూడు బిల్లులను సంయుక్త పార్లమెంట్ కమిటీకి సిఫార్సుచేస్తూ తీర్మానం చేసి మూజువాణి ఓటుతో ఆమోదించిన సందర్భంలో విపక్షసభ్యులు మళ్లీ లేచి నిలబడి నినాదాలుచేశారు. అప్పటికే ఈ మూడు బిల్లుల ప్రతులను కాంగ్రెస్ ఎంపీలు జ్యోతిమణి, ప్రణీత షిండే తోటి ఎంపీలకు పంచారు. తమ చేతికొచ్చిన బిల్లుల ప్రతులను తృణమూల్ కాంగ్రెస్ నేత కళ్యాణ్ బెనర్జీసహా పలువురు విపక్షసభ్యులు చింపేసి అమిత్‌షా వైపు విసిరేశారు. కొన్ని షా సీటు వద్ద పడ్డాయి. షా ముందున్న మైక్రోఫోన్‌ను లాగిపడేసేందుకు బెనర్జీ విఫలయత్నంచేశారు. దీంతో షాకు రక్షణగా కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజులు షా సీటు వద్దకు వచ్చి అడ్డుగా నిలబడ్డారు. వెల్‌లోకి దూసుకొచ్చిన టీఎంసీ మహిళానేత మహువా మొయిత్రాసహా విపక్షనేతల నినాదాలతో సభ మార్మోగింది. కొందరు బీజేపీ సభ్యులు సైతం వెల్‌లోకి దూసుకొచ్చి విపక్షసభ్యులతో వాగ్వాదానికి దిగారు. వీరిని బీజేపీ సభ్యుడునిషికాంత్ దూబే వారించి తమతమ సీట్ల వద్దకు పంపించారు. వివాదాస్పద బిల్లులను ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ ఎంఐఎ నేత అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ, ఆర్ఎస్పీ నేత ఎన్కే ప్రేమచంద్రన్, కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్, ఎస్పీ నేత ధర్మేంద్ర యాదవ్ మాట్లాడారు. తర్వాత సభ మూడు గంటలకు మొదలయ్యాక అమిత్ షాకు రక్షణగా పార్లమెంట్ సెక్యూరిటీ సరీ్వస్ నుంచి 12 మంది మార్షల్స్ వచ్చి పక్కనే నిలబడ్డారు. అయినాసరే విపక్షసభ్యులు బిల్లుల వ్యతిరేక నినాదాలను కొనసాగించారు. యావత్ ఘటనపై స్పీకర్ తీవ్రవిచారం వ్యక్తంచేశారు. ఇలాంటి ఉదంతాలు సభ గౌరవాన్ని తగ్గిస్తున్నాయని ఓం బిర్లా ఆవేదన వ్యక్తంచేశారు. ఎల్లవేళలా తెలుపురంగు టీ–షర్ట్ ధరించే లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ మూడు బిల్లులను వ్యతిరేకిస్తూ అందుకు నిరసనగా నలుపురంగు టీ–షర్ట్ ధరించారు. ఎవరేమన్నారంటే.. పోలీస్ రాజ్యంగా మారుస్తున్నారు ‘‘ఇలా మూడు అక్రమ చట్టాలను తెచ్చి భారత్‌ను పోలీస్ రాజ్యంగా మార్చాలనుకుంటున్నారు. సీబీఐ, ఈడీ వంటి ఏజెన్సీలు ఇష్టారీతిన అరెస్ట్చేసేందుకు మోదీ సర్కార్ మరింత స్వేచ్చనిస్తోంది. ఈ ఏజెన్సీలే జడ్జీలుగా, కార్యనిర్వాహక వ్యవస్థలుగా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ పోకడ ఎన్నికల ద్వారా కొలువుతీరిన ప్రభుత్వాలకు మరణశాసనం వంటిది. ఈ మూడు బిల్లులు హిట్లర్ పాలనలో నాజీ సైన్యం అధికారిక రహస్య పోలీస్ విభాగాన్ని గుర్తుకుతెస్తున్నాయి. విపక్షాలపాలిత రాష్ట్రప్రభుత్వాలను అస్థిరపరిచేందుకే బిల్లులను తెచ్చారు’’ – ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ రాజ్యాంగ మౌలికస్వరూపాన్ని నాశనంచేస్తున్నారు. ‘‘రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సర్వనాశనం చేసేలా ఈ మూడు బిల్లులను తీసుకొచ్చారు. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ప్రభుత్వం ఇప్పటికే దుర్వినియోగపరుస్తోంది. ఇక ఈ మూడు బిల్లులు చట్టాలుగా మారితే ఈ రాజకీయ దురి్వనియోగ వరదకు గేట్లు ఎత్తినట్లే అవుతుంది. ఈ ధోరణిని ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానం సైతం తూర్పారబట్టింది. కొత్త బిల్లులు రాజ్యాంగపరిరక్షణ అ్రస్తాలను నిర్వీర్యంచేస్తున్నాయి’’ – కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ ‘జైలు’పాలనపై నిర్ణయం ప్రజలదే ‘‘తమ పీఎం, సీఎం, మంత్రులు తీవ్ర నేరారోపణలతో అరెస్టయి జైలు ఉండి అక్కడి నుంచే పరిపాలించడం ఎంతవరకు సబబో ప్రజలే నిర్ణయించుకోవాలి. ప్రజాజీవితం గడిపే పాలకుల్లో తగ్గుతున్న నైతికతకు చెక్‌పెట్టేందుకే ఈ మూడు బిల్లులన తెచ్చాం. రాజకీయాలకు మళ్లీ సమగ్రత తేవడమే బిల్లుల లక్ష్యం. భవిష్యత్తులో పాలకులు తీవ్రనేరాలతో జైలుపాలైనా అక్కడి నుంచే పరిపాలిస్తారని రాజ్యాంగ నిర్ణేతలు ఆనాడు రాజ్యాంగ రచన సమయంలో ఊహించి ఉండరు’’ – బీజేపీ అగ్రనేత అమిత్ షా మధ్యయుగాలకు మోసుకెళ్తాయి ఈ మూడు బిల్లులు మళ్లీ దేశాన్ని మధ్యయుగాల నాటి దురవస్థకు తీసుకెళ్తాయి. ఈ బిల్లులు చట్టాలుమారితే ఖచ్చితం మనం మధ్యయుగాలకు వెళ్తాం. అక్కడ రాజు తనకు నచ్చని వ్యక్తులను పదవుల నుంచి పక్కకు తప్పిస్తాడు. ఆ పదవిలోని వ్యక్తి ముఖం కూడా నచ్చలేదంటే ఈడీ రంగప్రవేశంచేసి అరెస్ట్చేస్తుంది. నేరారోపణ రుజువుకాకపోయినా కేవలం 30 రోజులుగా జైళ్లో ఉన్నాడన్న కారణం చూపి.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన వ్యక్తి ప్రభుత్వాన్ని కూలదోస్తారు’’ – లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ అంత తొందరెందుకు? ‘అత్యున్నత పదవుల్లోని నేతలను తొలగించేందుకు ఉద్దేశించిన ఇంతటి కీలకమైన బిల్లులను ఎందుకు హడావిడిగా ప్రవేశపెడుతున్నారు? బిల్లుల గురించి ముందస్తు సమాచారం లేదు. హడావిడిగా బిల్లుల ప్రతులను సభలో నామామాత్రం కొద్దిమందికి పంపిణీ చేసి వెంటనే బిల్లులను లోక్‌సభ ముందుకు తెచ్చారు. సభా నిబంధనలను ఈ బిల్లుల విషయంలో అస్సలు పాటించలేదు’’ – ఆర్ఎస్పీ పార్టీ సభ్యుడు, ఎంపీ ఎన్కే ప్రేమ్‌చంద్రన్ ప్రజాస్వామ్యశకానికి పాతరేసే కుట్ర ‘‘భారత్‌లో ప్రజాస్వామ్య శకానికి ముగింపు పలికే దురుద్దేశంతో ప్రభుత్వం ఈ మూడు బిల్లులు తెచ్చింది. బిల్లులను తేవడం చూస్తుంటే సూపర్ ఎమర్జెన్సీ పీడకలను ప్రభుత్వ పెద్దలు సాకారంచేసుకునేందుకు వేసిన తొలి అడుగులా తోస్తోంది. దేశ న్యాయవ్యవస్థ స్వతంత్రను కాలరాసేందుకు ఈ బిల్లులను తెచ్చారు. ప్రజాస్వామ్యం, సమాఖ్య స్ఫూర్తిని సర్వనాశనంచేసే కుట్ర ఇది. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎంతకైనా తెగించి ఈ బిల్లులు చట్టాలుగా మారకుండా అడ్డుకుందాం’’ – టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ఇది ఇంగిజ్ఞానానికి సంబంధించింది ‘‘మీరు 30రోజులపాటు కస్టడీలో ఉండి కూడా మంత్రిగా పదవిలో కొనసాగుతానని వాదించడం ఎంత వరకు సమర్థనీయం? ఇది పూర్తిగా ఇంగితజ్ఞానానికి సంబంధించిన విషయం. ఈ మూడు బిల్లుల్లో నాకైతే ఎలాంటి తప్పు కనిపించట్లేదు. ఈ అంశం మినహా బిల్లుల్లో లోతైన అంశాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా సంయుక్త పార్లమెంట్ కమిటీలో చర్చించాల్సిందే. దేశ ప్రయోజనకర అంశాలు ఉన్నాయో లేదో తేల్చాలి’’ – తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ -
అప్పుడు లేని యూరియా కొరత.. ఇప్పుడే ఎందుకొచ్చింది?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గత రెండు నెలలుగా యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బుధవారం ఆయన నందినగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం తీరు వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు. పోలీసులను పెట్టి ఎరువులను అమ్మే పరిస్థితి వచ్చిందంటూ ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీశారు.‘‘తెలంగాణలో మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. మా పాలనలో యూరియా కష్టాలు రాకుండా సరఫరా చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎరువుల కొరత లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?. రేవంత్ ప్రభుత్వానికి పరిపాలనపై అవగాహన లేదు’’ అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.‘‘వర్షంలో తడుచుకుంటూ ఎరువుల కోసం రైతులు లైన్లలో నిల్చుంటున్నారు. రైతులకు మాత్రం ఎరువుల కొరత లేదని సీఎం చెప్తున్నారు. కాంగ్రెస్ చేతకానితనంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు. రేవంత్‌కు చిల్లర రాజకీయాలు చేయడం మాత్రమే తెలుసు’’ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. -
దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ గాంధీ దేశ యువతకు స్ఫూర్తి అని కొనియాడారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్ గాంధీ అమరుడు అయ్యారని రేవంత్ చెప్పుకొచ్చారు. రాజీవ్ గాంధీ స్పూర్తితో తెలంగాణలో పరిపాలన కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.నేడు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి. ఈ సందర్బంగా తెలంగాణ సెక్రటేరియట్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి రేవంత్, కాంగ్రెస్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్ గాంధీ అమరుడయ్యారు. దేశానికి సాంకేతిక నైపుణ్యాన్ని కృషి చేసిన పునాదులు వేసిన నేత రాజీవ్ గాంధీ. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం రాజీవ్ గాంధీ కల్పించారు.రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అవ్వగానే 21ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసే విధంగా అసెంబ్లీలో బిల్లు పెడతాం. దేశ కలలు సహకారం కావాలంటే రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాల్సిందే. స్థానిక సంస్థల్లో చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన నేత రాజీవ్ గాంధీ. సిలికాన్ వ్యాలీని ఈరోజు మహిళలలు నడుపుతున్నారు అంటే రాజీవ్ ఘనతే. నేటి యువతకు ఆయన స్పూర్తి ప్రదాత. రాజీవ్ స్పూర్తితో తెలంగాణలో పరిపాలన కొనసాగిస్తున్నాం. ఎస్సీ ఉప కులాల వర్గీకరణకు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అలాగే, మూసీ ప్రక్షాళనను మన ప్రభుత్వం చేయబోతోంది అని చెప్పుకొచ్చారు. -
ఉపరాష్ట్రపతి బరిలో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
‘ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు. ఏ పార్టీలో నాకు సభ్యత్వం లేదు. రాజకీయాలతో సంబంధం లేని వారిని ఎన్నుకోవాలని వాళ్లు భావించినట్లుంది. రాబోయే రోజుల్లో అన్ని పార్టీల ఎంపీలను వ్యక్తిగతంగా కలిసి, నా అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని, ఓటు వేయాలని కోరతా. దేశ ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించడానికి నిరంతరం కృషి చేస్తా’. – ఢిల్లీలో జస్టిస్ సుదర్శన్రెడ్డిసాక్షి, న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అనూహ్య నిర్ణయం తీసుకుంది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బూచిరెడ్డి సుదర్శన్‌రెడ్డి పేరును ఖరారు చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం ఇండియా కూటమి నేతలతో కలిసి ఈ మేరకు ప్రకటన చేశారు. దేశంలో రెండో అత్యున్నత పదవికి జరగనున్న ఈ ఎన్నికలను ‘సైద్ధాంతిక యుద్ధం’గా ఖర్గే అభివర్ణించారు. అందుకే విపక్షాలన్నీ ఐక్యంగా పోటీ పడుతున్నాయన్నారు. కాగా అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పక్ష అభ్యర్థి, తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్‌తో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పోటీ పడనున్నారు. సెప్టెంబర్ 9న జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం జస్టిస్ సుదర్శన్ రెడ్డి, రాధాకృష్ణన్‌లు బుధవారం తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. బుధవారం మధ్యాహ్నం సంవిధాన్ సదన్ (పార్లమెంటు పాత భవనం)లో ఇండియా కూటమి సమావేశం జరగనుంది. ఏకగ్రీవ నిర్ణయం మంగళవారం మధ్యాహ్నం ఖర్గే నివాసంలో, ఆయన అధ్యక్షతన జరిగిన ఇండియా కూటమి భేటీకి విపక్ష పార్టీల నేతలు శరద్‌పవార్, సంజయ్ రౌత్, కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, డెరిక్ ఓబ్రియెన్, కనిమొళి, తిరుచ్చి శివ, జాన్ బ్రిట్టాస్, ధర్మేంద్ర యాదవ్, ప్రమోద్ తివారీ, రజని పాటిల్, అరి్వంద్ సావంత్, ఎంఏ బేబీ తదితరులు హాజరయ్యారు. అంతా కలిసి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేరును విపక్ష కూటమి అభ్యర్థిగా ఖరారు చేస్తూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఇండియా కూటమి నుంచి వైదొలగిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా ఈ నిర్ణయానికి మద్దతు ప్రకటించింది. ఈ సమావేశానంతరం ఖర్గే విపక్షాల సంయుక్త ప్రకటనను మీడియాకు చదివి విన్పించారు. పేదల పక్షపాతి ‘సుదర్శన్ రెడ్డి దీర్ఘకాలం పాటు న్యాయ సేవలందించారు. దేశంలోని ప్రఖ్యాత, ప్రగతిశీల న్యాయవేత్తలలో ఒకరు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా విశిష్టమైన సేవలు అందించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం నిరంతరం పోరాడారు. ఆయన తీర్పుల్లో పేదల పక్షపాతం స్పష్టంగా కనిపిస్తుంది. రాజ్యాంగ పరిరక్షణ, ప్రాథమిక హక్కుల కాపాడేందుకు కృషి చేశారు. విపక్ష పార్టీలన్నీ ఒకే పేరుకు అంగీకారం తెలపడం సంతోషంగా ఉంది. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అభ్యర్థిత్వంపై ఏకగ్రీవ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యం సాధించిన గొప్ప విజయం. ఎప్పుడైతే ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ముప్పు ఎదురవుతుందో అప్పుడు విపక్షాలన్నీ ఏకమై ఇందుకు వ్యతిరేకంగా పోరాడతాయి..’అని ఖర్గే పేర్కొన్నారు. దక్షిణాది వర్సెస్ దక్షిణాది! జగ్దీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో అనివార్యమైన ఉప రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే చివరివరకు ప్రయతి్నంచింది. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలను రాధాకృష్ణన్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరింది. ఏ కూటమిలోనూ లేని వైఎస్సార్సీపీ, బీజేడీ వంటి పార్టీల అధినేతలతో ఈ మేరకు బీజేపీ నేతలు చర్చలు జరిపారు. మంగళవారం సైతం రాధాకృష్ణన్ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని బీజేపీ పిలుపునిచ్చింది. అయితే ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి దక్షిణాది రాష్ట్రానికే చెందిన రాజకీయేతర వ్యక్తిని బరిలో దింపాలని నిర్ణయించింది. ఊహించని విధంగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేరును తెరపైకి తెచ్చింది. తద్వారా ఉప రాష్ట్రపతి ఎన్నికను దక్షిణాది వర్సెస్ దక్షిణాది అన్నట్టుగా మార్చివేసింది. ఎన్డీయే తమ అభ్యర్థిగా..తమిళనాడుకు చెందిన, ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను బరిలోకి దింపిన నేపథ్యంలో.. డీఎంకే ఆయన వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎలక్టొరల్ కాలేజీలో ఎన్డీఏకే బలం ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి లోక్‌సభ, రాజ్యసభలో కలిపి మొత్తం 782 మంది ఓటర్లు ఉన్నారు. ఎవరైనా గెలవాలంటే 394 ఓట్లు అవసరం. కాగా ఎన్డీఏకు లోక్‌సభలో 293 మంది, రాజ్యసభలో 129 మంది సభ్యుల (మొత్తం 422) మద్దతు ఉంది. ఇండియా కూటమికి లోక్‌సభలో 234 మంది, రాజ్యసభలో 96 మంది (మొత్తం 330) మద్దతు ఉంది. ఇక ఏ కూటమికీ చెందనివారు 30 మంది ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం ఎన్డీఏ ఆధిక్యం సుస్పష్టంగా ఉన్నప్పటికీ, ఎన్నిక ఏకగ్రీవం కాకుండా ప్రతిపక్షాలు తమ అభ్యర్థిని బరిలోకి దింపాయి. వ్యవసాయ కుటుంబం నుంచి ఉన్నత స్థాయికి.. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి 1946 జూలై 8న రంగారెడ్డి జిల్లా కందుకూరు రెవెన్యూ మండలం ఇబ్రహీంపట్నం తాలూకా ఆకుల మైలారం గ్రామంలో బూచిరెడ్డి లక్ష్మీనారాయణరెడ్డి, అనసూయమ్మ దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. సుదర్శన్‌రెడ్డికి భార్య పద్మారెడ్డి, ఇద్దరు కుమారులు శశిధర్‌రెడ్డి, వంశీధర్‌రెడ్డి, కుమార్తె సుమిత (పస్తుతం అమెరికాలో) ఉన్నారు. ఆయన ఆకుల మైలారం గ్రామంతో పాటు యాచారం మండలం కురి్మద్దలోని తన బంధువుల ఇంట్లో ఉంటూ ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆ తర్వాత పదో తరగతి వరకు హైదరాబాద్ శాలిబండలోని రిఫైన్ ఎయిడెడ్ స్కూల్లో చదివారు. నగరంలోని వివేకవర్ధిని కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీలో ఎల్ఎల్బీ చదివారు. 1971లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాది కె.ప్రతాప్‌రెడ్డి వద్ద జూనియర్‌గా పనిచేశారు. సిటీ సివిల్ కోర్టు (హైదరాబాద్), ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పలు కేసుల్లో సమర్థవంతమైన వాదనలు వినిపించారు. 1988 ఆగస్టు 8న హైకోర్టులో రెవెన్యూ శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది (1988–1990)గా నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా స్వల్పకాలం విధులు నిర్వర్తించారు. ఏవీ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలోని విద్యా సంస్థలకు కార్యదర్శిగా, కరస్పాండెంట్‌గా పనిచేశారు. 1993–94 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1995 మే 2న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005 డిసెంబర్ 5న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 2007 జనవరి 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి.. 2011 జూలై 8న పదవీ విరమణ పొందారు. 2013లో లోక్‌పాల్, లోకాయుక్త చట్టం ఆమోదం పొందిన తర్వాత అదే ఏడాది గోవా తొలి లోకాయుక్తగా నియమితులయ్యారు. అయితే వ్యక్తిగత కారణాలతో అదే ఏడాది ఆ పదవి నుంచి వైదొలిగారు. అందరి మద్దతూ కోరతా – ఢిల్లీలో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి – ఘన స్వాగతం పలికిన విపక్ష పార్టీల ఎంపీలు జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలు చామల కిరణ్‌కుమార్ రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, రఘురాంరెడ్డి, మల్లు రవి, బలరాం నాయక్‌లతో పాటు రాజీవ్ శుక్లా సహా ఇతర విపక్ష పార్టీల ఎంపీలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి తనను ఎంపిక చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో అన్ని పార్టీల ఎంపీలను వ్యక్తిగతంగా కలిసి, తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా, ఓటు వేయాల్సిందిగా కోరతానని చెప్పారు. దేశ ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించడానికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలు చామల కిరణ్‌కుమార్ రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, రఘురామిరెడ్డి, మల్లు రవి, బలరాం నాయక్‌లతో పాటు రాజీవ్ శుక్లా సహా ఇతర విపక్ష పార్టీల ఎంపీలు ఘనస్వాగతం పలికారు. ఆకుల మైలారంలో ఆనందోత్సాహాలు కందుకూరు: జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన స్వగ్రామమైన ఆకుల మైలారంలో పండుగ వాతావరణం నెలకొంది. స్థానిక యువత బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. తమ గ్రామంలో పుట్టి పెరిగిన వ్యక్తి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికవడంతో ఆనందంగా ఉందని వారన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆయన.. గ్రామ పరిధిలోని మాలగూడ సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఓ ఇల్లు నిర్మించుకున్నారు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వరి పంట, పండ్ల తోటలు పరిశీలించి వెళ్తుంటారు. -
కొత్త రేషన్ కార్డు దారులకు సీఎం రేవంత్ శుభవార్త ..!
ఆదిలాబాద్: కొత్తగా రేషన్‌కార్డులు పొందిన వారికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. వచ్చే నెలలో వారికి సన్నబియ్యం అందించాలని నిర్ణయించింది. కార్డుదారుల సంఖ్యకనుగుణంగా అవసరమైన కోటా కేటాయించింది. సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యే పంపిణీలో వీరంతా లబ్ధి పొందనున్నారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తుంది.సెప్టెంబర్ కోటా పంపిణీకి ఏర్పాట్లు..రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకు సన్నబియ్యం అందిస్తోంది. వర్షాకాలం నేపథ్యంలో జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన కోటాను గత జూన్‌లో ఒకేసారి పంపిణీ చేసింది. ప్రస్తుతం ఆ గడువు ముగియడంతో సెప్టెంబర్ కోటా పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రేషన్ షాపులకు సంబంధించిన డైనమిక్ కీ రిజిస్ట్రార్ (డీకేఆర్) స్పష్టం కావడంతో జిల్లాకు అవసరమైన బియ్యం కోటా కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లా కోటా సరఫరాకు గాను నిజామాబాద్ జిల్లాను కేటాయించింది. జిల్లాలోని ఐదు ఎంఎల్ఎస్ పాయింట్లకు బియ్యం చేరనున్నాయి. మంగళవారం నుంచి సరఫరా ప్రారంభమయ్యే అవకాశమున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. అక్కడి నుంచి వాటి పరిధిలోని చౌక ధరల దుకాణాలకు చేరవేయనున్నారు.పెరిగిన కార్డులు.. బియ్యం కోటాపదేళ్ల నిరీక్షణ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ చేపట్టింది. అలాగే కొత్త స భ్యులను చేర్చేందుకు సైతం అవకాశం కల్పించింది. జిల్లాలో కొత్తగా 21,670 కార్డులు మంజూరయ్యా యి. వాటి పరిధిలో కార్డుదారులతో పాటు సభ్యులకు సంబంధించి 45,289 మంది చేరారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1,92,757 రేషన్‌కార్డులు ఉండగా వీటి పరిధిలో 6,61,103 మంది సభ్యులు న్నారు. తాజాగా జారీ చేసిన కార్డులతో ఈ సంఖ్య 2,14,427కు పెరిగింది. అలాగే యూనిట్ల సంఖ్య 11,14,002కు చేరింది. కార్డుల సంఖ్యతో పాటు బి య్యం కోటా కూడా పెరిగింది. ఇప్పటి వర కు ప్రతీ నెలా 4,180 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయిస్తుండగా పెరిగిన కార్డుల సంఖ్యకనుగుణంగా ఈ నెలకు 4,480 మెట్రిక్ టన్నులు కేటాయించారు. నూతన కార్డుదారులందరికీ సెప్టెంబర్ కోటా కింద 1వ తేదీ నుంచి బియ్యం అందజేయనున్నారు.బియ్యంతోపాటు సంచి కూడా ఫ్రీకార్డుదారులకు ఉచితంగా బియ్యంతో పాటు ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన పర్యావరణహితమైన సంచులను సైతం అందించాలని నిర్ణయించింది. వైట్‌కలర్‌లో ఉన్న ఈ బ్యాగుపైన సీఎం రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల ఫొటోలతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభయహస్తం ఆరు గ్యారెంటీల ప థకాల వివరాలు ముద్రించారు. రూ.50విలువ చేసే ఈ సంచిని బియ్యంతో పాటు ఉచితంగా అందజేయనున్నారు.ఈ బ్యాగులు సైతం జిల్లాకు చేరాయి.బియ్యం కోటా పెరిగిందిజిల్లాలో కొత్తగా జారీ చేసిన కార్డులకు అనుగుణంగా ప్రభుత్వం బియ్యం కోటా విడుదల చేసింది. జిల్లాకు అవసరమైన సన్నబియ్యంను నిజామాబాద్ నుంచి సరఫరా చేయనుంది. సోమవారం నుంచి జిల్లాకు వచ్చే అవకాశముంది. ఎంఎల్ఎస్ పాయింట్లకు చేరాక అక్కడి నుంచి షాపుల వారీగా సరఫరా చేసి సెప్టెంబర్ ఒకటి నుంచి కార్డుదారులందరికీ అందజేస్తాం.– వాజీద్‌అలీ, డీసీఎస్వో -
అడ్డుకుంటున్నది వారే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుకుంటున్నది ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాత్రమే అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బీసీల కలను సాకారం చేసేలా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా కసరత్తు చేసిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు, ప్రతిపాదనలకు మతం రంగు పులిమి బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ 2018లో చట్టాన్ని చేయడం ద్వారా అప్పటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రిజర్వేషన్లు పెంచే అవకాశం లేకుండా చేశారని విమర్శించారు. ఇప్పుడు రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు నిర్వహించాలంటే ఆ చట్టం అడ్డంకిగా మారిందని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 375 జయంతిని పురస్కరించుకుని రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేడుకలకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు ట్యాంక్‌బండ్‌కు సమీపంలో సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటుకు.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ తదితరులతో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. సర్వాయి పాపన్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం రవీంద్రభారతిలో సభికులనుద్దేశించి మాట్లాడారు. పర్యాటక ప్రాంతంగా ఖిలా షాపూర్ అభివృద్ధి ‘బహుజనుల సామ్రాజ్య స్థాపన కోసం పోరాడిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. అలాంటి వ్యక్తి నిర్మించిన ఖిలా షాపూర్ కోటను బీఆర్ఎస్ ప్రభుత్వం మైనింగ్ పేరుతో కాలగర్భంలో కలిపేందుకు కుట్ర చేసింది. మేం ఆనాడు కోటపైకి వెళ్లి చూసి.. దాన్ని కాపాడి చారిత్రక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పాం. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై దృష్టి పెట్టాం..’అని సీఎం తెలిపారు. బీజేపీకి ఆ ధైర్యం ఉందా? ‘రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, శాస్త్రీయంగా కుల సర్వే చేపట్టి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ కులాల గణాంకాలను తేల్చింది. రాష్ట్రంలో బీసీల జనాభా 56.33 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో విద్య, ఉద్యోగాలు, ఉపాధితో పాటు రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో రెండు వేర్వేరు చట్టాలు చేసి కేంద్రానికి పంపించాం. ఐదు నెలలు కావస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీంతో బిల్లులు ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ధర్నా చేశాం. ఈ ధర్నాకు బీజేపీ, బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయి. బీసీలంటే బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లులకు బీజేపీ మతం రంగు పులిమింది. మోదీ, కిషన్‌రెడ్డి వీటిని అడ్డుకుంటున్నారు. అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్‌లో ముస్లింలు బీసీ జాబితా ద్వారానే రిజర్వేషన్లు పొందుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో ముస్లింలను బీసీ జాబితా నుంచి తొలగించే ధైర్యం బీజేపీకి ఉందా? రాహుల్‌గాం«దీపై కోపం ఉంటే ఆయనపై చూపాలి కానీ ఆయన సిద్ధాంతాలపై చూపొద్దు..’అని రేవంత్ అన్నారు. తెలంగాణలోనూ ఓట్లు చోరీ చేసే కుట్ర.. ‘దేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దొంగ ఓట్ల కుట్రను రాహుల్‌గాంధీ బట్టబయలు చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ కేవలం నాలుగు నెలల్లో కోటి ఓట్లు నమోదు చేసింది. అంబేడ్కర్ పుట్టిన గడ్డ మీద రాజ్యాంగాన్ని అపహాస్యం చేసింది. దొంగ ఓట్లతోనే మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు దేశం నలుమూలలా ఓట్ల చోరీ జరుగుతోంది. ఓటు హక్కును దొంగిలించిన వారిని శిక్షించాలని రాహుల్‌గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. త్వరలో డిప్యూటీ సీఎంతో కలిసి ఆ పాదయాత్రలో పాల్గొని మద్దతు తెలియజేస్తా. ఇక్కడ కూడా ఓట్ల చోరీ చేసే కుట్ర జరుగుతోంది. అందరం కలిసికట్టుగా ఓట్ల చోరీకి పాల్పడేవారి భరతం పడదాం..’అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. బహుజనుల పిల్లలు రాజ్యాధికారం సాధించాలి ‘బహుజనుల పిల్లలంతా ఉన్నత చదువులు చదివి రాజ్యాధికారం సాధించాలి. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే సమాజం బాగుపడుతుంది. విగ్రహాలు.. వర్థంతులు, జయంతుల కోసం కాదు. ప్రతి ఒక్కరిలో వారి స్ఫూర్తిని రగిలించేందుకే విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నాం..’అని రేవంత్ అన్నారు. తెలంగాణ నిర్ణయాలు దేశానికే ఆదర్శం: భట్టి విక్రమార్క రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సామాజిక విప్లవానికి కూడా తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన కుల సర్వేను కేంద్రం నమూనాగా తీసుకుని కులగణనకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని, కానీ కొన్ని రాజకీయ పార్టీలు రకరకాలుగా ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు కోసం స్థలాన్ని ఇచ్చినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి రాష్ట్ర ప్రజల తరఫున భట్టి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. సర్వాయిపేట కోటను రూ.4.5 కోట్లతో పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. సర్వాయి పాపన్న గౌడ్ ఒంటరిగా పోరాటం చేయలేదని, బహుజనులందరితో కలిసి ఉద్యమించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. -
ఇదొక ‘చెత్త’ సర్కారు!.. కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పనితీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాఖల సమన్వయ లోపంతో ఎక్కడ చూసిన మురుగు నీరు, చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయని మండిపడ్డారు. వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘ఇదొక ‘చెత్త’ సర్కారు!. రాష్ట్ర మున్సిపల్ శాఖ, ఆరోగ్య శాఖల సమన్వయ లోపంతో ఎక్కడ చూసినా మురుగు నీరు, చెత్త కుప్పలతో హైదరాబాద్ నగరం, రాష్ట్రంలోని ఇతర పట్టణాలు కంపుకొడుతున్నాయి. ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి.బీఆర్ఎస్ హయాంలో వర్షాకాలానికి 2 నెలల ముందు నుంచే సీజనల్ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలపై మున్సిపల్ శాఖ, జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖలు సమీక్షా, సమన్వయ సమావేశాలు నిర్వహించి, ముందస్తు చర్యలు చేపట్టేవి. కానీ ఇప్పుడా పరిస్థితులు కనిపించడం లేదు. ప్రజలు ఈసురోమని అలమటిస్తుంటే పాలకులు మాత్రం ‘ఆర్ఆర్ ట్యాక్స్’ వసూళ్లలో బిజీగా ఉన్నారు!’ అంటూ కాంగ్రెస్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదొక "చెత్త" సర్కారు!రాష్ట్ర మున్సిపల్ శాఖ, ఆరోగ్య శాఖల సమన్వయ లోపంతో ఎక్కడ చూసినా మురుగు నీరు, చెత్తకుప్పలతో హైదరాబాద్ నగరం, రాష్ట్రంలోని ఇతర పట్టణాలు కంపుకొడుతున్నాయి. ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు… pic.twitter.com/AUkd9C4Bel— KTR (@KTRBRS) August 18, 2025అలాగే, అంతకుముందు.. రామంతాపూర్‌లో కరెంట్ షాక్ తగిలి ఐదుగురు మృతి చెందిన ఘటనపై కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో కేటీఆర్..‘రామంతపూర్ గోఖలేనగర్‌లో శ్రీ కృష్ణాష్టమి ఊరేగింపులో జరిగిన దుర్ఘటన అత్యంత విషాదకరం. కరెంట్ షాక్‌కు గురై ఐదుగురు యువకులు మరణించడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. పండుగ వేళ జరిగిన ఈ దుర్ఘటన చాలా బాధాకరమైనది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ అని అన్నారు.రామంతపూర్ గోఖలేనగర్‌లో శ్రీ కృష్ణాష్టమి ఊరేగింపులో జరిగిన దుర్ఘటన అత్యంత విషాదకరం. కరెంట్ షాక్‌కు గురై ఐదుగురు యువకులు మరణించడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. పండుగ వేళ జరిగిన ఈ దుర్ఘటన చాలా బాధాకరమైనది.మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా…— KTR (@KTRBRS) August 18, 2025 -
బాబు, రాహుల్ హాట్‌లైన్ బంధం నిజమే!
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కుమ్మక్కు అయినట్లేనా? రాహుల్ గాంధీ ఒకవైపు కేంద్రంలో బీజేపీతో పోరాడుతున్నట్లు హడావుడి చేస్తూ.. ఇంకోపక్క అదే ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని మాత్రం ప్రశ్నించడం లేదు ఎందుకన్న ప్రశ్న కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాహుల్ గాంధీకి మధ్య ఉన్న హాట్ లైన్ సంబంధాల గుట్టు రట్టు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా ఈ కథ నడుస్తోందని ఆయన వెల్లడించారు. అంటే చంద్రబాబు వ్యూహాత్మకంగా అటు బీజేపీతో పొత్తు, ఇటు కాంగ్రెస్‌తో రహస్య బంధం పెట్టుకున్నారన్న మాట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడింది కాని పెద్దగా ఫీల్ కాలేదనిపిస్తుంది. అందువల్లే ఇప్పుడు కూడా ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు. జగన్‌పై కొద్దిమంది కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో అక్రమాలు జరిగాయని, ఓట్ల చోరీ జరిగిందని, బీజేపీకి మేలు చేసేందుకు ఎన్నికల సంఘం అవకతవకలకు పాల్పడుతోందని ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ, ఇతర ముఖ్యమైన కాంగ్రెస్ నేతలు ఏపీ, ఒడిశాలల్లో జరిగిన ఎన్నికల తీరుపై ఎందుకు మాట మాత్రం కూడా ప్రస్తావించడం లేదన్నదానికి జవాబు దొరకడం లేదు. ఏపీలో పోలింగ్ నాటితో పోలిస్తే కౌంటింగ్ రోజు 12.5 శాతం ఓట్లు అధికంగా లెక్కవేశారని... అంటే సుమారు 49 లక్షల ఓట్ల మాయాజాలం జరిగిందని ఎన్నికల సంస్కరణల సంస్థ (ఎడిఆర్) ఒక నివేదికలో తెలిపింది.అయినా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఈ విషయం తెలియనట్లు నటిస్తోంది. అదే జగన్ మాత్రం హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపాలై, బీజేపీ గెలిచిన రోజే ఎన్నికల అక్రమాలపై తన నిరసన తెలిపారు. ఈవీఎంలు మానిప్యులేషన్‌కు గురవుతున్నాయిని, బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు జరపాలని సూచించారు. జగన్ అలా వ్యాఖ్యానించినా, ఒక్క కాంగ్రెస్ నేత కూడా ఆయనకు థ్యాంక్స్ చెప్పలేదు. ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన పత్రంలో ఈవీఎంల మాయ, ఓట్ల రిగ్గింగ్ తదితర కారణాలతో వైఎస్సార్సీపీ 88 సీట్లు కోల్పోయిందని వైఎస్సార్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మోడీ అంటే వెరచేవారైతే జగన్ ఈ విషయాన్ని ఇంత ధైర్యంగా చెప్పగలిగేవారా? వైఎస్సార్సీపీ నేతలు కొందరు వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలంటూ హైకోర్టుకు కూడా వెళ్లారు. కానీ ఎన్నికల అధికారులు వాటిని పది రోజులలోనే దగ్ధం చేయించిన విషయాన్ని వైఎస్సార్సీపీ ప్రపంచానికి చాటి చెప్పింది. ఇన్ని జరిగినా కాంగ్రెస్ మాత్రం పెదవి విప్పలేదు. ఈ ఆధారాలను రాహుల్ వాడుకోగలిగి ఉంటే ఆయన వాదనకు మరింత బలం చేకూరేది. ఈ విషయాలన్నిటిని కప్పిపుచ్చి రాహుల్ గాంధీకి జగన్ మద్దతు ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎంపీలు మాణిక్యం ఠాకూర్, చామల కిరణ్ కుమార్ రెడ్డిలు ఇప్పటికీ జగన్‌ను విమర్శించడానికి ప్రాధాన్యత ఇచ్చారే కాని, ఏపీలో ఎన్నికల అవకతవకలు జరిగాయా?లేదా? అన్నదానిపై తమ అభిప్రాయం చెప్పలేదు. మోడీ,అమిత్ షాలపై జగన్ విమర్శలు చేయడం లేదట. హర్యానాలో ఎన్నికల ఫలితాలపై జగన్ ఎవరిపై విమర్శలు చేసినట్లో తెలియడం లేదా? పైగా షర్మిల ఆధ్వరంలో జరిగే ర్యాలీలో జగన్ పాల్గొనాలని ఒక పిచ్చి సలహా పారేసి చంద్రబాబు పట్ల, బీజేపీ కూడా భాగస్వామి అయిన కూటమి పట్ల ఎంత విధేయత ఉందో ఈ కాంగ్రెస్ నేతలు మరోసారి చెప్పకనే చెప్పారనిపిస్తుంది.రాహుల్ గాంధీ చెప్పుడు మాటలు వింటారని గతంలో అనుకునేవారు. తల్లి సోనియాగాంధీ కూడా అదే తరహాలో వ్యవహరించిన కారణంగానే ఏపీలో కాంగ్రెస్ నాశనమైందని కేంద్రంలో అధికారం నిలబెట్టుకోవడంలో విఫలమైందని అంతా విశ్వసిస్తారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అనూహ్య మరణం తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన కుమారుడు జగన్ పట్ల కాంగ్రెస్ నాయకత్వం సరైన రీతిలో వ్యవహరించలేదు. జగన్‌ను ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తీర్మానం చేసినా, కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించకుండా, మరో సీనియర్ నేత రోశయ్యను ముఖ్యమంత్రిని చేసింది. తదుపరి అది తప్పు నిర్ణయమన్న భావనకు వచ్చిన అధిష్టానం ఆయనను మార్చి అప్పట్లో స్పీకర్‌గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా చేశారు. ఈ ఎంపికలో రాహుల్ గాంధీ పాత్ర అధికంగా ఉందని అంటారు.చిదంబరం వంటి నేతలను ప్రభావితం చేసి రాహుల్ తనకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా కిరణ్ వ్యూహం అమలు చేశారని అంటారు. ఆ పిమ్మట జగన్ తన సొంత పార్టీ పెట్టుకుని ముందుకు వెళ్లారు. దాంతో కక్షకట్టి ఆయనపై కేసులు పెట్టి జైలుకు పంపారు. ఇందులో చంద్రబాబు సహకారాన్ని కూడా తీసుకున్నారు. కిరణ్ ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడడం, చంద్రబాబు కోరుకున్నట్లు జగన్‌పై అక్రమ కేసులు పెట్టడం వంటివి కూడా చేశారు. తత్పలితంగా కాంగ్రెస్ తన సమాధికి తానే రాళ్లు పేర్చుకున్నట్లయింది. ఫలితంగా ఈ 15 ఏళ్లు అధికారానికి దూరం కావల్సి వచ్చింది. అధికారం పోయిన తరువాత కూడా వారిలో పెద్దగా మార్పేమీ రాలేదు. బీజేపీ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పరోక్ష స్నేహం చేస్తోందన్నది బహిరంగ రహస్యమే.ఏపీ కాంగ్రెస్‌లో కాస్తో, కూస్తో మిగిలి ఉన్న కేడర్ కూడా ఈ విషయాన్ని బలంగా నమ్ముతోంది. 2018లో తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసి ఓటమిపాలైన తర్వాత ఏపీలో ఆ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోలేదు. 2019లో ఏపీలో పరాజయం తర్వాత చంద్రబాబు కాంగ్రెస్‌ను పూర్తిగా వదలివేశారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉన్న సమయంలో ఆ పార్టీ అగ్రనేతలతో కలిసి ప్రచారాలు కూడా నిర్వహించారు. ఆ సందర్భంలో కాంగ్రెస్ నేతలు కొందరికి టీడీపీ నాయకత్వం నుంచి ఆర్థిక సహకారం కూడా లభించిందని చెబుతారు. 2019 ఓటమి తర్వాత కాంగ్రెస్‌ను వదలి బీజేపీ కూటమితో సాన్నిహిత్యం కోసం నానా పాట్లు పడ్డారు. అయినా ఎన్నడూ చంద్రబాబును రాహుల్ గాంధీ తప్పు పట్టలేదు. చివరికి 2024లో బీజేపీతో కలిసి చంద్రబాబు పోటీ చేసినా ఒకటి, అర సందర్భంలో తప్ప టీడీపీపై కాంగ్రెస్ అగ్రనేతలు విమర్శలు చేయలేదన్నది వాస్తవం. అలాగే సోనియాగాందీ, రాహుల్ గాంధీలతోపాటు ,కాంగ్రెస్ ముఖ్యనేతలెవరిని చంద్రబాబు కూడా విమర్శించరు. ఈ మధ్యకాలంలో ప్రధాని మోడీపై రాహుల్ ఎంత తీవ్ర ఆరోపణలు చేసినా, వాటిని ఖండించడానికి, మోడీకి అనుకూలంగా ప్రకటనలు ఇవ్వడానికి చంద్రబాబు పెద్దగా చొరవ చూపిన సందర్భాలు కనిపించవు. ఆపరేషన్ సిందూర్ వంటి కీలకమైన అంశంలో సైతం రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ పెద్ద ఎత్తున తప్పుపట్టినా చంద్రబాబు మాత్రం నోరెత్తలేదని బీజేపీ వర్గాలు చెబుతుంటాయి. మోడీతో కలిసి పాల్గొనే సభలలో మాత్రం ఆయనను చంద్రబాబు ఆకాశానికి ఎత్తుతుంటారు. మోడీ,అమిత్ షా వంటివారితో సంబంధం లేకుండా ఏపీలో నిత్యం జరిగే సభలలో మాత్రం చంద్రబాబు వారి ఊసే ఎత్తకుండా, మొత్తం తన గురించే ప్రచారం చేసుకుంటుంటారని, అయినా తమ నాయకత్వం చూసి చూడనట్లు పోతోందని బీజేపీ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని చేయడంలో, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలలో గెలిచాక ముఖ్యమంత్రి పదవి వచ్చేలా చేయడంలో చంద్రబాబు ప్రభావం కూడా ఉందని బీజేపీ వారికి కూడా తెలుసట. అయినా బీజేపీ వ్యూహాత్మకంగా ఏపీలో పొత్తు పెట్టుకుంది. తెలంగాణలో మాత్రం పొత్తుకు ఈ రాష్ట్ర నాయకులు అంత సుముఖంగా లేరని అంటున్నారు. అసలు ఏపీ కాంగ్రెస్‌లో చాలామందికి ఇష్టం లేకపోయినా వైఎస్ షర్మిలను పీసీసీ అధ్యక్షురాలిని చేశారు. ఆమె అచ్చంగా అధికారం కోల్పోయిన జగన్ పై విమర్శలు చేస్తూ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సపోర్టుగా వ్యవహరిస్తుంటారన్న అభిప్రాయం ఉంది. ఆమెకు మాణిక్యం ఠాకూర్ వంటి వారు వంతపాడుతున్నారు. ఏపీలో అనేక స్కామ్ లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నా ఆమె కాని, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కాని వాటి గురించి కాకుండా విపక్షంలో ఉన్న జగన్ పై విమర్శలు చేస్తుంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్ కొంతకాలం క్రితం ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడితే, షర్మిల తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఈవీఎంలకు బదులు బాలెట్ల వ్యవస్థను తీసుకురావాలని కోరుతుంటే ఈమె ఇలా ఎలా మాట్లాడతారో తెలియదు. ఈ కారణాలన్నిటి రీత్యానే రాహుల్ గాంధీపై జగన్ విమర్శలు చేశారు. చంద్రబాబుకు, రేవంత్‌కు ఉన్న సంబంధ బాంధవ్యాలు ఇప్పటికీ సజావుగానే కొనసాగుతున్నాయని కాంగ్రెస్ కేడర్ సైతం చెబుతుంటుంది.అందువల్ల రేవంత్ ద్వారా రాహుల్ గాంధీ, చంద్రబాబుల మధ్య హాట్ లైన్ నడుస్తోందని, వారి మధ్య నిత్య సంబందాలు ఉన్నాయని జగన్ అభిప్రాయపడ్డారన్నమాట. చిత్రమేమిటంటే చంద్రబాబుతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని కాంగ్రెస్ నేతలు అనడం లేదు. తాము చంద్రబాబు ఆద్వర్యంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంపై పోరాడతామని చెప్పడం లేదు. మళ్లీ జగన్ పైనే విమర్శలు చేసి చంద్రబాబును సంతోషపెట్టారనిపిస్తుంది. మరో వైపు ఒడిశాలో ఎన్నికల అక్రమాలపై బీజేడీ హైకోర్టుకు వెళుతోంది. అయినా రాహుల్ గాంధీ ఏపీ, ఒడిశాల గురించి మాట్లాడకుండా బీజేపీపై పోరాడుతున్నామని చెప్పడం వల్ల ఏమి ప్రయోజనం ఉంటుంది?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కాంగ్రెస్ ముందు మూడు ఆప్షన్లు!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరహాలోనే అధికార కాంగ్రెస్ కూడా 3 ఆప్షన్లను పరిశీలించనుంది. ఈ మూడు ఆప్షన్లలో ఎటువైపు మొగ్గుచూపాలనే అంశాన్ని తేల్చేందుకు ఈనెల 23న టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ భేటీలో 3 అంశాలపై చర్చించి మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకు పార్టీ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాలని యోచిస్తోంది. ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డితో టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ జరిపిన భేటీలో ఈ మేరకు నిర్ణయించినట్టు సమాచారం. ఎలా ముందుకెళ్దాం? స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం లేదు. పీసీసీ చీఫ్‌తో పాటు పార్టీలోని బీసీ ముఖ్య నేతలు ఓ వాదన వినిపిస్తుండగా, కొందరు మంత్రులు, మరికొందరు నేతలు మరో వాదన వినిపిస్తున్నారు. ముఖ్యంగా పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ చాలా స్పష్టంగా తన వైఖరిని తెలియజేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ, కేంద్రం నుంచి వచ్చే నిధుల కంటే బీసీలకు 42 %రిజర్వేషన్ల కల్పనే పార్టీకి ప్రధానమని, అవసరమనుకుంటే ఈ విషయంలో మరికొంత సమయం తీసుకుందామని ఆయన అంటున్నారు. ఆదివారం సీఎంతో జరిగిన సమావేశంలోనూ ఇదే అభిప్రాయాన్ని వెల్లడించినట్టు తెలుస్తోంది. మరోవైపు కొందరు మంత్రులు, నాయకులు మాత్రం ఇప్పటికే స్థానిక ఎన్నికలు ఆలస్యమయ్యాయని, మరింత జాప్యం చేయడం మంచిది కాదని, పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లను ప్రకటించి ముందుకు వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీ అయిన పీఏసీని సమావేశపరచి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనకు వచ్చారు. ఈ మూడు ఆప్షన్లు పీఏసీ ముందుకు.. పీఏసీ సమావేశంలో మూడు అంశాలపై చర్చ జరగనుండగా.. రిజర్వేషన్ల విషయం ఎటూ తేలనందున కోర్టును మరింత సమయం కోరుదామని, వీలుకాదంటే రివ్యూ పిటిషన్ దాఖలు చేసి మరోమారు ఢిల్లీకి వెళదామనే ప్రతిపాదన ఇందులో మొదటిది. మరోమారు అసెంబ్లీని సమావేశపరిచి అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రతిపక్ష పార్టీల వైఖరిని ఎండగట్టి ప్రజల ముందు పెట్టాలనేది రెండో ప్రతిపాదన. ఈ రెండూ కాదంటే నేరుగా పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లడం మూడోది. వీటిపై అందరి అభిప్రాయాలనూ క్రోడీకరించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సీఎంతో ముఖ్యుల భేటీ ఆదివారం జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్‌తో మహేశ్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీనియన్ నేత వి.హనుమంతరావులు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. ఈనెల 23న సాయంత్రం 5 గంటలకు గాం«దీభవన్‌లో పీఏసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కాగా 22న నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో జరిగే అమరవీరుల స్థూపావిష్కరణకు హాజరు కావాలని రేవంత్‌ను వీహెచ్ కోరారు. అయితే ఈ కార్యక్రమానికి వెళ్లాల్సిందిగా పీసీసీ చీఫ్‌కు సూచించిన ముఖ్యమంత్రి.. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వస్తారని వీహెచ్‌కు చెప్పినట్టు సమాచారం. -
అంతా రేవంత్ వల్లే.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేవలం తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫార్మాసిటీ భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న రేవంత్ రెడ్డి ఆకాంక్ష నెరవేరదన్నారు.ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసిన కేటీఆర్.. ఫార్మా సిటీ భూములను రియల్ ఎస్టేట్ కోసం వాడలేరని అసెంబ్లీలోనే రెండేళ్ల క్రితం హెచ్చరించానన్నారు. విజన్ లేని రేవంత్ వలన ప్రజాధనం వృధా అయ్యిందన్నారు. వేల కోట్ల రూపాయల ఫార్మా సిటీ పెట్టుబడులు వెనక్కి పోయాయి. లక్షల ఉద్యోగాల కల్పన ఆగిపోయింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఫార్మాసిటీకి భూములు ఇచ్చిన రైతన్నలు మోసపోయారంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు.గత కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టును రద్దు చేసి, దాని స్థానంలో ఫ్యూచర్ సిటీ అనే అవాస్తవ, ఊహాజనిత ప్రాజెక్టును ప్రవేశపెట్టారంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 56 గ్రామాల పరిధిలో హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం 20 వేల ఎకరాలతో ప్రతిపాదనలను తయారుచేసిందన్నారు. -
అఫిడవిట్ ఇస్తారా... క్షమాపణలు చెప్తారా?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు లోక్‌సభ నియోజకవర్గాల్లో లక్షలాది ఓట్లను తొలగించి పరోక్షంగా ఓటుహక్కును అపహరించారన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపణలను ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ తీవ్రంగా ఖండించారు. ‘‘ఆయన ఆరోపణల మేరకు ఓటు చోరీపై ఏడు రోజుల్లో సమగ్ర అఫిడవిట్ సమరి్పంచాలి. లేని పక్షంలో దేశప్రజలకు తక్షణం క్షమాపణ చెప్పాలి’’ అని ఆదివారం ప్రెస్ మీట్లో డిమాండ్ చేశారు. ‘‘ఓటు చోరీ ఆరోపణలు చేస్తున్న వారికి ఏడు రోజుల గడువిస్తున్నా. వారి ఆరోపణలపై ఆలోపు ప్రమాణపత్రం సమరి్పంచాలి. లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పడం మినహా మరో దారి లేదు. ఎలాంటి రుజువులూ లేకుండా మీరు చేస్తున్న ఈ ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలు. అబద్ధాలతో కొన్ని పార్టీలు ఈసీ భుజాల మీదుగా ఓటర్లకు తుపాకీ గురి పెడుతున్నాయి. ’’ అన్నారు. పారదర్శకంగా ఎస్ఐఆర్ బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ చేపట్టిన ఓటు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) అత్యంత పారదర్శకంగా సాగుతోందని సీఈసీ చెప్పారు. ‘‘దీనిపై కొన్ని విపక్షాలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నాయి. శాశ్వత స్థిరనివాసంలో ఒకటి, వేరే ప్రాంతానికి వలస వెళ్లడం వల్ల మరోటి... ఇలా కొందరికి రెండు ఓటర్ గుర్తింపు కార్డులు ఉండొచ్చు. ఇలాంటి తప్పిదాలను సరిచేసేందుకు పోలింగ్ యంత్రాంగం కృషిచేస్తోంది. ప్రతి ఎన్నికకు ముందూ ఓటరు జాబితాలో తప్పులు దిద్దడం ఈసీ విధి. సవరణపై సలహాలిచ్చేందుకు ఈసీ తలుపులు అందరికీ తెరచే ఉంటాయి’’ అని సీఈసీ అన్నారు. ‘‘అధికార, విపక్షాలనే తేడా లేకుండా అందరినీ ఈసీ ఒకేలా పరిగణిస్తుంది. విపక్ష పార్టీలపై ఎలాంటి వివక్షా ఉండదు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, ఆరోపణలు, ఫిర్యాదులు సెప్టెంబర్ 1 లోపే చేసేయండి. తర్వాత స్వీకరించబోం’’ అన్నారు.వాళ్ల ఇంటి నంబర్ సున్నాయే ‘‘దొంగ, నకిలీ ఓట్లను చేర్చి వాటి చిరునామాలో ఇంటి నంబర్‌ను సున్నాగా పేర్కొన్నట్టు రాహుల్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. ఇల్లు లేని, వంతెనలు, ఫుట్‌పాత్‌లు, వీధి దీపాలు, అనధికార కాలనీల్లో నివసించే వారికి నిర్దిష్టమైన చిరునామా, నంబర్ ఉండవు. అందుకే ఆ కాలమ్‌ను ఖాళీగా వదిలేయకుండా ఇంటి నంబర్‌ను ‘సున్నా’గా పేర్కొంటాం. ఓటేసేందుకు చిరునామా ముఖ్యంకాదు. ఓటరు ఏ బూత్‌లో ఓటేస్తాడనేదే ముఖ్యం’’ అన్నారు. ‘‘వేర్వేరు బూత్‌ల్లో ఒకే వ్యక్తి పేర్లు నమోదైనట్లు ఆరోపణలే తప్ప ఆ మేరకు ఇప్పటిదాకా ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు. గత ఆరు నెలల్లో బిహార్‌లో 22 లక్షల మంది ఓటర్లు చనిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఇవన్నీ గత 20 ఏళ్లలో సంభవించినవి. ఎస్ఐఆర్ వల్లే ఈ గణాంకాలు వెలుగు చూస్తున్నాయి. మెషీన్ రీడబుల్ ఓటర్ జాబితా ఫార్మాట్‌ను పార్టీలకు ఇచ్చే ప్రసక్తే లేదు. అలా ఇవ్వకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ ఫార్మాట్లో డేటా బయటికొస్తే ఓటర్ల గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదముంది’’ అని చెప్పారు. -
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం.. రాజగోపాల్‌రెడ్డిపై యాక్షన్!
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ప్రారంభమైంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చే చాన్స్ ఉంది.అంతకుముందు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి.. వరంగల్ కాంగ్రెస్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ..‘వరంగల్ పంచాయతీపై నలుగురిని అక్కడికి పంపాలని నిర్ణయం తీసుకున్నాం. వారు ఎవరెవరు అనేది పార్టీ సూచిస్తుంది. నేను మంటలు పెట్టడానికి లేను. చల్లార్చే పనిలో ఉన్నాను. నా పని ఫైరింజన్ చేసే పని. పీసీపీ చీఫ్ మహేష్ గౌడ్ నాతో మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్లపై చర్చ చేశారు.. పరిశీలిస్తాం’ అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పదే పదే ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తనకు మంత్రి పదవి ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరితే మంత్రి పదవి ఇస్తామని పార్టీ పెద్దలు చెప్పారని, కానీ మాట తప్పారని రాజగోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మంత్రి పదవి లభించలేదనే కారణంతో అసహనానికి గురైన రాజగోపాల్ రెడ్డి చాలా సార్లు తన అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించారు. -
కాళేశ్వరంపై మరో కుట్ర.. మోటర్లే టార్గెట్: హరీష్ రావు
సాక్షి, సిద్దిపేట: కాళేశ్వరం మోటర్లను నాశనం చేసే కుట్ర జరుగుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మోటర్లను నాశనం చేసి అది.. బీఆర్ఎస్పై నెపం వేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ మధ్య విభేదాలు ఉంటే మీరు మీరు చూసుకోండి.. కాళేశ్వరంపై బురద రాజకీయాలు మానుకోండి అంటూ ఘాటు విమర్శలు చేశారు.సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్ర ప్రభుత్వం రైతుల మీద పగ, ప్రతీకారం తీర్చుకుంది. నీళ్లను గేట్లు ఎత్తి సముద్రంలోకి వదులుతున్నారు. కడెం ప్రాజెక్టుకు 62వేల క్యూసెక్కుల వరద వస్తోంది. నేను వారం రోజుల క్రితమే మంత్రి ఉత్తమ్ కుమార్‌కు లేఖ రాశాను. సీఎం రేవంత్, ఉత్తమ్ కుమార్‌కు నీళ్ల విలువ తెలియదు. ప్రభుత్వం నడపడం చేతకావడం లేదు.. ఎందుకు ప్రాజెక్టుల నీళ్లను వృథా చేస్తున్నారు. ఎందుకు నీళ్లను సముద్రం పాలు చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ ద్వారా అన్నపూర్ణ, మిడ్ మానేరు, ప్రాజెక్టును నింపాలి. వేలాది మంది రైతులతో వెళ్లి మేమే మోటార్లు ఆన్ చేస్తాం. మీరు ఆన్ చేయకుంటే మేమే ఆన్ చేస్తాం.కాళేశ్వరంపై మరో కుట్ర చేస్తున్నారు.. మోటర్లను ఆన్ అండ్ ఆన్ చేయడం వలన మోటార్లు పనికి రాకుండా చేస్తున్నారు. కాళేశ్వరంపై బురద రాజకీయాలు మానుకోండి. ఆన్ చేసి ఆఫ్ చేయకూడడని బీహెచ్ఈఎల్ ఇప్పటికే హెచ్చరించింది. మోటర్లను నాశనం చేసి.. అది బీఆర్ఎస్పై వేయాలని కుట్ర చేస్తున్నారు. మీ మధ్య ఏమైనా విభేదాలు ఉంటే మీరే చూసుకోండి. దేవాదుల మోటార్లు ఆన్ చేయక వరంగల్‌కు నష్టం జరుగుతోంది. కమీషన్ పంచుకోవడానికి సమయం సరిపోవడం లేదు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
‘కాళేశ్వరం’ పేల్చివేత కుట్ర వెనుక కాంగ్రెస్, బీజేపీ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చివేసేందుకు జరి గిన కుట్ర వెనుక కాంగ్రెస్, బీజేపీ హస్తం ఉందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమా ర్ ఆరోపించారు. కేసీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేందుకు కాంగ్రెస్, బీజేపీ కుట్ర పన్నాయన్నారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2022లో రికార్డు స్థాయిలో గోదావరికి వరద వచ్చినా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు తట్టుకున్నాయ న్నారు. కానీ ఎవరో స్క్రిప్టు రాసినట్లుగా మేడిగడ్డలో ఒక్క పిల్లర్ మాత్రమే ఎందుకు కుంగిపోయిందని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. సిట్ ఏర్పాటు చేసి విచారణ జరపాలి‘మేడిగడ్డ కుంగితే పిల్లర్లకు ఎక్కడా పగుళ్లు రావని ఇంజనీరింగ్ నిపుణులు చెపుతున్నారు. మేడిగడ్డలో 20వ నంబర్ పిల్లర్‌ను ఎవరో పేల్చే కుట్రచేశారు. కుట్ర వెనుక ఉన్న అసాంఘిక శక్తులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డి.. ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది తేల్చాలి. ఘటన జరిగిన వెంటనే రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డి మొబైల్ ఫోన్ డేటా చెక్ చేస్తే వెంటనే దొరికేవాళ్లు. దీని వెనుక రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్‌రెడ్డి ఉన్నారా? లేదా? అనేది సిట్ ఏర్పాటు చేసి తేల్చాలి. లేదా అక్కడ తక్కువ స్థాయిలో ఏమైనా భూకంపాలు వచ్చాయా లేదా అనేది తేల్చాలి’ అని ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు.కాగా, 2023 అక్టోబర్ 21న రాత్రి మేడిగడ్డ బరాజ్ వద్ద పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చినట్లు మరుసటి రోజు మహదేవ్పూర్ పోలీసు స్టేషన్లో ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ఫిర్యాదు చేశారని ప్రవీణ్‌కుమార్ గుర్తు చేశారు. అయితే పేలుళ్ల కోణంలో పోలీసులు విచారణ జరపకపోగా, ఇప్పటి వరకు ఎవరి వద్దా స్టేట్మెంట్లు రికార్డు చేయలేద న్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాసిన వెంటనే వచ్చిన ఎన్డీఎస్ఏ మేడిగడ్డ పేలుళ్లపై ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. -
ఒక్కటి దాటినా కోతే!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వినియోగం నెలకు 200 యూనిట్లలోపు ఉంటే గృహజ్యోతి పథకం కింద లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ ఇస్తోంది. అయితే, ఈ పథకం లబ్ధిదారుల ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగి విద్యుత్ వినియోగం 200 యూనిట్లకు మించితే వారు పథకానికి అర్హత కోల్పోనున్నారా? అంటే అవుననే అంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వవర్గాలు. ఈ మేరకు గృహజ్యోతి పథకాన్ని కుదించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందనే చర్చ జరుగుతోంది. గృహజ్యోతి పథకం కింద ఇప్పటికే ఉన్న లబ్ధిదారుల సంఖ్యను కట్టడిచేయడంతోపాటు కొత్త లబ్ధిదారులు పెరగకుండా కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనికోసం ఈ పథకం కింద కొత్తగా వచ్చిన దరఖాస్తులను కూడా పక్కనపెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఉచిత విద్యుత్ వినియోగదారుల సంఖ్య ఏటా పెరుగుతూపోతే ఆర్థిక భారం భారీగా పెరిగిపోతుందన్న ఆందోళనతో లబ్ధిదారుల సంఖ్యను కుదించాలని సర్కారు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. 16 నెలల్లో 12 లక్షల మంది పెరిగారు.. గృహాలకు ప్రతినెలా 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక 2024 మార్చి నుంచి గృహజ్యోతి పథకం అమలును ప్రారంభించింది. 2023 డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం కింద దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఈ పథకం అమలవుతోంది. మొదట్లో 39 లక్షల మంది లబ్దిదారులను ఎంపిక చేశారు. ఆ తరువాత కూడా దరఖాస్తులు రావడంతో ఈ లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. దీంతో ప్రభుత్వంలో ఆందోళన వ్యక్తమైనట్టు తెలిసింది. పథకం ప్రారంభమైన 16 నెలల్లో కొత్తగా 12 లక్షల మంది చేరారు. అంటే జూలైలో ఈ పథకం కింద లబ్ధిదారులు 51.26 లక్షల మంది ఉన్నారు. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం సబ్సిడీ కింద ప్రతి నెలా రూ.185 నుంచి 200 కోట్ల వరకు రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం)కు చెల్లిస్తోంది. ఒక్క యూనిట్ ఎక్కువైనా.. విద్యుత్ వినియోగం ఆధారంగా 0–50 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.1.95 పైసలు, 51–100 యూనిట్ల వినియోగానికి యూనిట్‌కు రూ.3.10 చొప్పున బిల్లు వసూలు చేస్తారు. వినియోగం 100 యూనిట్లకు పెరిగితే 0–200 యూనిట్ల మధ్య వినియోగానికి ప్రతీ యూనిట్‌కు రూ.3.40 చొప్పున చెల్లించాలి. ప్రస్తుతం గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ పొందుతున్న వారిలో 0–50, 50–100 యూనిట్లను వినియోగించే పేదలే ఎక్కువ. వీరితోపాటు 100–200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకున్న లబ్ధిదారులందరికీ జీరో బిల్ వస్తోంది. అంటే 200 యూనిట్లలోపు కరెంటు వాడిన వారు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, 200 యూనిట్లు దాటి ఒక్క యూనిట్ ఎక్కువైనా వారు పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఒక నెలలో 201 యూనిట్లు విద్యుత్ వినియోగించి.. ఆ తరువాత నెలలో 200 యూనిట్లలోపు విద్యుత్ వాడినా వారికి ఈ పథకం వర్తిస్తోంది. ఇకపై ఏదైనా నెలలో 200 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగిస్తే వారిని శాశ్వతంగా ఈ పథకం కింద అనర్హులుగా పరిగణించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలో చర్చలు జరిగినట్టు తెలిసింది. తెల్ల కార్డులు 93 లక్షలు.. గృహజ్యోతి పథకం మార్గదర్శకాల ప్రకారం తెల్లరేషన్ కార్డు ఉన్నవారంతా అర్హులు. రాష్ట్రంలో దాదాపు 93 లక్షల తెల్లకార్డులు ఉన్నాయి. ప్రస్తుతం ఉచిత విద్యుత్ లబ్ధిదారులు 51.26 లక్షల మంది ఉన్నారు. అయితే, 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే అర్హుల సంఖ్య పెరిగితే.. ఆ మేరకు ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతుంది. సకాలంలో డిస్కంలకు ఆ నిధులు చెల్లించకుంటే ఆ సంస్థలు ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం ప్రతినెలా రూ.185 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు డిస్కంలకు సబ్సిడీగా చెల్లిస్తోంది. వినియోగదారుల సంఖ్య పెరిగితే సబ్సిడీ మొత్తం కూడా భారీగా పెరుగుతుంది. అందువల్ల 200 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగించే వారిని అనర్హులుగా ప్రకటిస్తే ఖజానాపై భారం గణనీయంగా తగ్గుతుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. -
బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య ఫ్లెక్సీ వార్.. రప్పా.. రప్పా అంటూ..
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రప్పా.. రప్పా అంటూ ఫ్లెక్సీల వార్ మొదలైంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి ఉత్తమ్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫొటోలతో పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది.వివరాల ప్రకారం.. సూర్యాపేటలో మరోసారి రప్పా రప్పా ఫీవర్ మొదలైంది. నెల రోజుల క్రితం మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు కౌంటర్‌గా తాజాగా కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇవాళ కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల ఇచ్చే కార్యక్రమానికి జగదీష్ రెడ్డి హాజరు కానున్నారు.ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌కు వెళ్లే దారిలో కాంగ్రెస్ కార్యకర్తలు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంత్రి ఉత్తమ్ ఫొటోతో ఎదురొస్తే రప్పా.. రప్పా అంటూ రాసుకొచ్చారు. ఫ్లెక్సీలు, హోర్డింగ్స్‌పై తెలంగాణ బెబ్బులి పులి - ఉత్తమ్ అన్న యువశక్తి అంటూ రాశారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట రాజకీయం ఆసక్తికరంగా మారింది. -
అధికారం కోసం ఎంతకైనా దిగజారుతుంది
న్యూఢిల్లీ: వెలుగులోకి వస్తున్న ఎన్నికల అక్రమాలను చూస్తే అధికారం కోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని అర్థమవుతోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నిప్పులు చెరిగారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో జెండా ఎగురవేసిన అనంతరం నాయకులు, శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. జోరున వర్షం కురుస్తుండగానే రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖ్యనేతలు జెండా వందనం కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ..బిహార్‌లో చేపట్టిన ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) పేరుతో బతికున్న వారిని సైతం చనిపోయినట్లుగా ధ్రువీకరించడం ద్వారా ప్రతిపక్షాలకు పడే ఓట్లను తొలగించారని ఆరోపించారు. తొలగింపునకు గురైన 65 లక్షల ఓట్లకు సంబంధించి బీజేపీ ఒక్క అభ్యంతరం కూడా వ్యక్తం చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. దీన్ని బట్టి చూస్తే ఎస్ఐఆర్తో లాభం కలిగేది బీజేపీకి మాత్రమేనని ఖర్గే వ్యాఖ్యానించారు. ఇలాంటి అక్రమాలు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయన్నారు. ఏ ప్రాతిపదికన ఓట్లను రద్దు చేసిందో తెలిపేందుకు ఈసీ సైతం సిద్ధంగా లేదని ఆరోపించారు. అధికారంలో కొనసాగేందుకు ఆ పార్టీ ఎంత అనైతికతకయినా సిద్ధమవుతోందని దీంతో స్పష్టమవుతోందని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం సాగిస్తుందే తప్ప, ఎన్నికల్లో విజయం కోసం కాదని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా కేంద్ర దర్యాప్తు విభాగాలైన ఈడీ, సీబీఐలతోపాటు ఆదాయపన్ను శాఖను సైతం బీజేపీ సర్కార్ బాహాటంగా దుర్వినియోగం చేస్తోన్న విషయాన్ని ప్రత్యక్షంగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే చెప్పిందని ఆయన అన్నారు. అలీన విధానం ద్వారా కూడగట్టుకున్న ప్రతిçష్టను బీజేపీ సర్కార్ హయాంలో మన దేశం కోల్పోవాల్సి వచ్చిందని ఖర్గే విమర్శించారు.వర్షంలో తడుస్తూ రాహుల్ జెండా వందనంఇందిరా భవన్ ప్రాంగణంలో పార్టీ చీఫ్ ఖర్గే జెండా ఎగురవేస్తుండగా ఆయన పక్కనే అగ్రనేత రాహుల్ గాంధీ వర్షంలో మిగతా వారితో కలిసి తడుస్తూనే నిలబడ్డారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో షేర్ చేసింది. ‘ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం. వీటి పరిరక్షణ కోసం ఇకపైనా పోరాడుతాం’అని ఆ పార్టీ పేర్కొంది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. -
‘మేం ఓట్ల చోరీ చేస్తే తెలంగాణ, కర్నాటకలో కాంగ్రెస్ గెలిచేదా?’
హైదరాబాద్: బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడితే తెలంగాణ, కర్నాటకలో కాంగ్రెస్ గెలిచేదా అని ప్రశ్నించారు కేంద్రమంత్రి, బండి సంజయ్. ఈరోజు(ఆగస్టు 15వ తేదీ) యూసఫ్‌గూడాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో కలిసి తిరంగా ర్యాలీని ప్రారంభించారు బండి సంజయ్, దీనిలో భాగంగా మాట్లాడిన బండి సంజయ్,. ‘ మీరు మార్వాడీ గో బ్యాక్ ఉద్యమాలు చేస్తే.. మేం హిందూ కుల వృత్తులను కాపాడుకునే ఉద్యమం చేస్తాం. రోహింగ్యాలు గో బ్యాక్ ఆందోళనలు చేస్తాం. మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం అనేది హిందూ సమాజాన్ని చీల్చే మహా కుట్ర. కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం చేస్తున్న డ్రామాలివి. పాతబస్తీని ఐఎస్ఐ అడ్డాగా మార్చిన రోహింగ్యాలపై ఎందుకు మాట్లాడటం లేదు?, హిందూ కుల వృత్తులను దెబ్బతీసేలా మటన్, డ్రైక్లీన్ షాపులు ఒక వర్గం వారే నిర్వహిస్తుంటే నోరెందుకు మెదపరు?, రోహింగ్యాల గో బ్యాక్ ఉద్యమాలు చేస్తాం. ఓట్ల చోరీకి, బీజేపీకి ఏం సంబంధం?మేం ఓట్ల చోరీ చేస్తే తెలంగాణ, కర్నాటకలో కాంగ్రెస్ గెలిచేదా?, ఇండీ కూటమికి 230 ఎంపీ సీట్లు వచ్చేవా?, కేంద్రంలో బీజేపీకి 240 ఎంపీ సీట్లు మాత్రమే ఎందుకు వస్తాయి?, రాహుల్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అందుకే కాంగ్రెస్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారింది’ అని మండిపడ్డారు. -
మూసీపై బ్రిడ్జీల నిర్మాణంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: మూసీ నదిపై వంతెనలు నిర్మించాలనే హైదరాబాద్ ప్రజల చిరకాల కోరిక కాంగ్రెస్ పాలనలో సాకారం కావట్లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. మూసీపై బ్రిడ్జీల నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న అలసత్వాన్ని గురువారం ఆయన ఒక ప్రకటనలో ఎండగట్టారు. ‘మూసీ నదిపై రాకపోకలను సులభతరం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో రూ.545 కోట్లతో 15 వంతెనలు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటి నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టున్నాయి’ అని పేర్కొన్నారు. ‘సింగూరు డ్యామ్‌కు డేంజర్ బెల్స్ మోగుతున్నాయని ఎన్డీఎస్ఏ చేసిన హెచ్చరికను పెడచెవిన పెట్టి ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తారా’ అని కేటీఆర్ ప్రశ్నించారు. కేటీఆర్‌కు సింగపూర్ తెలుగు సమాజం ఆహ్వానం సింగపూర్‌లోని తెలుగు సాంస్కృతిక సంస్థ ‘సింగపూర్ తెలుగు సమాజం’.. ఈ నెల 31న జరిగే తమ సంస్థ స్వర్ణోత్సవ వేడుకలకు రావాల్సిందిగా కేటీఆర్‌ను ఆహ్వానించింది. ఈ మేరకు కేటీఆర్‌కు సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి లేఖ రాశారు. -
క్యాండిల్ ర్యాలీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఖమ్మం జిల్లా: జిల్లా వేదికగా కాంగ్రెస్ పార్టీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. దేశ వ్యాప్తంగా ఓట్లు తొలగింపు అంశానికి సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంశాన్ని లేవనెత్తుతూ ఈరోజు(గురువారం, ఆగస్టు 14వ తేదీ) ఖమ్మం జిల్లాలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా చేపట్టిన క్యాండిల్ ర్యాలీలో మల్లు భట్టి విక్రమార్క సైతం పాల్గొన్నారు. దీనిపై మల్లు మాట్లాడుతూ.. ‘రాహుల్ గాంధీ దేశంలో ఓట్లకు సంబంధించిన సమాచారాన్ని, ఓట్లు ఉన్నవారివి తీసినట్లుగా ఆధారాలతో ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించారు. రాహుల్ గాంధీ అడుగుతున్న సాప్ట్ కాపీ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే...దానికి సమాధానం చెప్పకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నం జిల్లా కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ చేపట్టే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీనే చేస్తుంది. దేశానికి డిక్టేటర్షిప్ పరిపాలన తీసుకుని రావాలని బీజేపీ ప్రభుత్వం చూస్తుంది. ఎన్నికల కమిషన్ కూడా బీజేపీకి లొంగిపోయింది. దేశ ప్రజలు వాస్తవాన్ని గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి పౌరుడు ముందుకు రావాలి. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయి, వాటికి సంబంధించి ఆధారాలతో ఎలక్షన్ కమిషన్ ముందు ప్రవేశ పెట్టారు’ అని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. -
వారి సభ్యత్వాలు రద్దు!
సాక్షి, న్యూఢిల్లీ: గవర్నర్ కోటాలో తెలంగాణ శాసనమండలికి ఎన్నికైన ఫ్రొఫెసర్ కోదండరాం, అమేర్ అలీఖాన్‌ల సభ్యత్వాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. గతేడాది ఆగస్టు 14న సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును ధర్మాసనం తాజాగా సవరించింది. మధ్యంతర ఉత్తర్వు మేరకు తీసుకున్న చర్యలు ఏవైనా రద్దయినట్టేనని పేర్కొంది. మధ్యంతర ఉత్తర్వులోని.. ‘తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తున్నాం..’ అనే వాక్యాన్ని తొలగిస్తున్నట్లు తెలిపింది. దీంతో 2024 ఆగస్టు 16న ప్రొఫెసర్ కోదండరాం, అమేర్ అలీఖాన్‌లు ఎమ్మెల్సీలుగా చేసిన ప్రమాణ స్వీకారాలు రద్దయినట్టయ్యింది. గవర్నర్ కోటాకు సంబంధించి భవిష్యత్తులో జరిగే నామినేషన్లు సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. కోదండరాం, అమేర్ అలీఖాన్‌ల నామినేషన్‌ను సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై తాజాగా విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం మధ్యంతర తీర్పు ఇచ్చింది. వారు ఎమ్మెల్సీలుగా మండలిలో తిరిగి ప్రవేశించాలంటే మళ్లీ సిఫారసు చేయబడాలని జస్టిస్ విక్రమ్‌నాథ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండకూడదనే వాదనను తిరస్కరిస్తూ, ‘అప్పట్లో పిటిషనర్ల పేర్లు తిరస్కరించినప్పుడు కూడా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగానే ఉన్నాయి..’ అని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం ధర్మాసనం తదుపరి విచారణను సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది. సిఫారసులు.. తిరస్కరణ.. సిఫారసులు 2023 జూలైలో అప్పటి సీఎం కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం, దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణల పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సిఫారసు చేసింది. అయితే సెప్టెంబర్‌లో అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. వారికి రాజకీయ నేపథ్యం ఉండటాన్ని ప్రస్తావించడంతో పాటు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5)కు అనుగుణంగా వారి నియామకాలు లేవని పేర్కొంటూ వారి నామినేషన్లను తిరస్కరించారు. కాగా 2023 చివర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జనవరిలో ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్టు అమేర్ అలీ ఖాన్‌లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. ఈ నామినేషన్లతో పాటు, గవర్నర్ తమ నామినేషన్లను తిరస్కరించడాన్ని దాసోజు, కుర్ర హైకోర్టులో సవాలు చేశారు. ఈ నేపథ్యంలో 2024 మార్చిలో హైకోర్టు.. గవర్నర్ తిరస్కరణను రద్దు చేయడంతో పాటు కొత్త నామినేషన్లను కూడా కొట్టివేసింది. గవర్నర్ మంత్రివర్గ సలహా మేరకే వ్యవహరించాలని, సవరణలు కోరే హక్కు మాత్రమే ఉందని కోర్టు స్పష్టం చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లగా, 2024 ఆగస్టు 14న ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వుపై స్టే ఇచ్చింది. కోదండరాం, అమేర్ అలీ ఖాన్లు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసుకోవడానికి అనుమతించింది. అయితే వారి నామినేషన్లు తుది తీర్పుకు లోబడి ఉంటాయని తెలిపింది. తాజాగా బుధవారం జరిగిన వాదనల అనంతరం మధ్యంతర ఉత్తర్వును సవరించింది. మధ్యంతర ఉత్తర్వు ఆధారంగా తీసుకున్న అన్ని చర్యలు, అందులో ప్రమాణ స్వీకారాలు కూడా రద్దు అవుతాయని స్పష్టం చేసింది. ఇకపై ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం జరిగే ఏ కొత్త నామినేషన్లు అయినా, సెప్టెంబర్ 17న జరిగే విచారణ తర్వాత వచ్చే తుది తీర్పుపైనే ఆధారపడి ఉంటాయని తెలిపింది. కాగా గవర్నర్ తరఫున వాదించిన అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సిఫారసు మేరకే గవర్నర్ ఆమోదం తెలిపారని వాదించారు. పిటిషనర్లు తమ నామినేషన్ల అమలును కాదు, గవర్నర్ తిరస్కరణను సవాలు చేస్తున్నారని పేర్కొన్నారు. గవర్నర్ పూర్తిగా రాజ్యాంగపరమైన విధానాన్నే అనుసరించారని చెప్పారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది రంజిత్‌కుమార్ వాదించారు. గవర్నర్.. ‘హైకోర్టుకు నేనుజవాబు చెప్పాల్సిన అవసరం లేదు..’ అని చెప్పారని తెలియజేయగా, ‘చాలా దురదృష్టకరం’ అని జస్టిస్ విక్రమ్‌నాథ్ వ్యాఖ్యానించారు. -
సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా కింద కాంగ్రెస్ నియమించిన ఇద్దరు ఎమ్మెల్సీల ఎన్నిక చెల్లదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు చెంపపెట్టు అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు(కేటీఆర్) అన్నారు.‘‘గతంలో బీజేపీ.. గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసి బీఆర్ఎస్ పంపిన ఇద్దరు ఎమ్మెల్సీ ప్రతిపాదనలకు అడ్డుపడితే, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రక్రియ పెండింగ్‌లో ఉండగానే మరో ఇద్దరి పేర్లను సిఫారసు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. బీఆర్ఎస్ గతంలో నామినేట్ చేసిన బడుగు, బలహీనవర్గాలకు చెందిన దాసోజు శ్రవణ్, సత్యనారాయణల అభ్యర్థిత్వాలకు అడ్డుతగిలిన కాంగ్రెస్, బీజేపీల నిజస్వరూపం మరోసారి బట్టబయలైంది’’ అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ దుయ్యబట్టారు. ‘‘రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేని ఈ రెండు ఢిల్లీ పార్టీల అప్రజాస్వామిక విధానాలు ఎంతమాత్రం సాగనివ్వమని చాటిచెప్పిన గౌరవ న్యాయవ్యవస్థకు బీఆర్ఎస్ పక్షాన శిరస్సు వంచి సలాం చేస్తున్నాం’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.గవర్నర్ కోటా కింద కాంగ్రెస్ నియమించిన ఇద్దరు ఎమ్మెల్సీల ఎన్నిక చెల్లదని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్ కు చెంపపెట్టు. గతంలో బీజేపీ.. గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసి బీఆర్ఎస్ పంపిన ఇద్దరు ఎమ్మెల్సీ ప్రతిపాదనలకు…— KTR (@KTRBRS) August 13, 2025 -
ఏపీలోనే భారీ ఓట్ల చోరీ.. అయినా రాహుల్ గాంధీ మాట్లాడరేం?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఓట్ చోరీ వ్యవహారంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సూటి ప్రశ్నను సంధించారు. దేశంలో అత్యధికంగా ఓట్ల గోల్మాల్ జరిగింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనేనని.. అలాంటిది రాహుల్ గాంధీ ఏపీ గురించి ఎక్కడా ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారాయన. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో పులివెందుల, ఒంటిమిట్ట అక్రమ ఎన్నికలపై వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంలో ఓట్ల దొంగతనం వ్యవహారంపై ఇండియా కూటమికు మద్దతు గురించి జగన్‌కు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ.. గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగకముందు.. జరిగిన తర్వాత ఉన్న ప్రకటించిన ఓట్లకు.. లెక్కించిన ఓట్ల సంఖ్యకు సమారు 12.5శాతం వ్యత్యాసం ఉంది. ఆ మొత్తం 48లక్షల ఓట్లు. అంటే దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఏపీలో అత్యధికంగా ఓట్ల చోరీ జరిగింది. మరి ఓట్ల చోరీ గురించి అవకతవకలు జరిగాయని అంటున్న రాహుల్ గాంధీ.. దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు. ఎందుకు?.. ఎందుకంటే.. రేవంత్ ద్వారా చంద్రబాబు కాంగ్రెస్ అధిష్టానంతో టచ్‌లో ఉన్నారు. చంద్రబాబుతో రాహుల్ గాంధీ హాట్లైన్లో టచ్‌లో ఉన్నారు. అందుకే చంద్రబాబు గురించి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణికం ఠాకూర్ ఒక్క కామెంట్ కూడా ఎందుకు చేయరు?. ఏపీలో ఎన్నో స్కాంలు జరుగుతున్నాయి. వాటిని కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించదు అని వైఎస్ జగన్ అన్నారు.ఇదే విషయాన్ని ప్రెస్‌మీట్ అనంతరం జాతీయ మీడియా చానెల్‌తో మాట్లాడుతూ జగన్ వివరించారు. ఓట్ల గోల్‌మాల్‌పై మేం గతంలో కోర్టుకు వెళ్లాం. ప్రత్యేకించి ఒంగోలు ఓటింగ్ విషయంలో న్యాయ పోరాటం చేశాం అనే సంగతిని జగన్ గుర్తుచేశారు. అలాగే.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో 2013 నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, నాలుగోసారి అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారని, ఓటమి పాలైన అరవింద్ కేజ్రీవాల్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? అని రాహుల్ గాంధీని వైఎస్ జగన్ ప్రశ్నించారు. Amaravati, Andhra Pradesh: YSRCP President YS Jagan Mohan Reddy says, "12.5% is the difference in gap versus what was announced post-poll versus the actual number of votes that were counted. So this 12.5% is a huge gap. In fact, there's so much so the vote chori controversy what… pic.twitter.com/jVl9eTwB3C— IANS (@ians_india) August 13, 2025లోక్‌సభ ఎన్నికల్లో, అలాగే ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓట్ల చోరీ జరిగిందని, ఇందుకు బీజేపీకి ఈసీ సహకరించిందని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు దిగిన సంగతి తెలిసిందే. ఇది కేవలం ఎన్నికల కుంభకోణం మాత్రమే కాదని.. ప్రజాస్వామ్యానికి జరిగిన అతిపెద్ద ద్రోహం అంటూ పోరాటానికి సిద్ధమంటూ ప్రకటించారాయన. -
సోనియా గాందీతో అజారుద్దీన్ భేటీ
బంజారాహిల్స్: టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్ ఢిల్లీలో ఏఐసీసీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు సోనియాగాంధీతో మంగళవారం భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ గెలిచేందుకు చేపట్టిన ప్రణాళికలను వివరించారు. అనంతరం అజారుద్దీన్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో రాబోయే ఉప ఎన్నికల్లో ఎవరికి సందేహం అవసరం లేదని టికెట్ ను అధిష్టానం తనకే కేటాయిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో అభివృద్ధి పనులు చేస్తున్నదని, కాలనీవాసులకు బస్తీ వాసులకు ఉన్న సమస్యలను ఇప్పటికే గుర్తించి అధికారులకు చర్చించి నిధులు మంజూరు చేయించి పనులు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. గత పది సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని కాలనీలు బస్తీలు అభివృద్ధిలో వెనక పడ్డాయని నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గం లో వందలాది సిసి రోడ్డు, మురుగునీటి కాలువలు, వరద నీటి కాలువలు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని అన్నారు. -
రేవంత్‌ను సీఎం చేశారుగా..: రాజగోపాల్‌రెడ్డి
మునుగోడు: ‘నాకు మంత్రి పదవి ఇస్తామని పార్టీలో చేర్చుకున్నారు.. నేడు పదవి ఇచ్చేందుకు సమీకరణలు కుదరడం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అనడం సరైంది కాదు.. నన్ను పార్టీలో చేర్చుకునే సమయంలో సమీకరణలు ఎందుకు గుర్తుకు రాలేదు’అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. తన మంత్రి పదవిని ఎవరు అడ్డుకుంటున్నారో అందరికీ తెలుసని చెప్పారు. మంగళవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఎల్గలగూడెం గ్రామంలో కొత్త గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ..‘నేను ఏ పదవి కోరుకున్నా మునుగోడు ప్రజల కోసమే. నాకు పదవులపై ఎలాంటి ప్రేమ లేదు. మహబూబ్‌నగర్ నుంచి రేవంత్‌రెడ్డికి సీఎం పదవి ఇచ్చారు కదా.. మా అన్నదమ్ములిద్దరికి మంత్రి పదవి ఉంటే తప్పేంటి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు ముగ్గురు మంత్రులు ఉంటే.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలకు ముగ్గురు మంత్రులు ఉంటే తప్పేంటి. ఒక ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు అంటే.. ఇద్దరం సమర్థులం, పరిపాలన చేసే సామర్థ్యం కలిగిన వ్యక్తులం. అలాంటి వారికి పదవులు ఇస్తే ఎవరికి ఇబ్బంది. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న నాకు మంత్రి పదవి ఇవ్వకుండా సమీకరణల పేరుతో దాట వేస్తున్నారు. నాకు పదవి రాకపోతే జరిగే నష్టం మునుగోడు ప్రజలకు తప్ప నాకు కాదు. పదవులు ఇచ్చే నిర్ణయం అధిష్టానం చూసుకుంటుంది. నాకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో నేను ఎంతవరకైనా ఓపిక పడతా. కానీ, మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో నిధులు ఇవ్వకుండా అడ్డుపడితే ఊరుకునే ప్రసక్తి లేదు. నిధులు ఇవ్వకుంటే ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుతా. మరోమారు ఉద్యమానికి సిద్ధమై తీరుతా. అలా అని మునుగోడు ప్రజలు తలవంచుకునే పని అసలు చేయను. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ పాలన కొనసాగిస్తూ నిధులు ఇవ్వకుండా పక్షపాత వైఖరి ప్రదర్శిస్తుంటే చూసి ఊరుకోలేక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎంను మునుగోడు ప్రజల దగ్గరకు తీసుకొచ్చా. నా రాజీనామా కారణంగానే నియోజకవర్గానికి అప్పటి ప్రభుత్వం దాదాపు రూ.వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేస్తే ఇప్పుడిప్పుడే అభివృద్ధి జరుగుతుంది. ఇంకా మరింతగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు ఇవ్వకుంటే ఎంతటి త్యాగానికైనా సిద్ధమైతా. అందుకు ప్రతి ఒక్కరి సహాయ, సహకారాలు కావాలి. ప్రధానంగా కమ్యూనిస్టుల మద్దతు పూర్తిగా అందించాలి’. అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సభలో కొనసాగిన సవరణ సమరం
న్యూఢిల్లీ: బిహార్‌లో ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) అంశం మరోమారు పార్లమెంట్‌ను కుదిపేసింది. కొన్ని బిల్లులకు మోక్షం లభించడం మినమా సభలో కీలక అంశాలేవీ చర్చలకు నోచుకోలేదు. ఎస్ఐఆ ర్‌పై చర్చ జరపాలన్న డిమాండ్ నుంచి విపక్ష సభ్యులు మొండిపట్టు పట్టడంతో పలు మార్లు వాయిదాల తర్వాత లోక్‌సభ, రాజ్యసభలు ఆగస్ట్ 18వ తేదీకి వాయిదా పడ్డాయి. స్వాతంత్రదినోత్స వేడుకలను పురస్కరించుకుని పార్లమెంట్ ఉభయసభల్లో సభా కార్యక్రమాలకు ఆగస్ట్ 13 నుంచి 17వ తేదీదాకా తాత్కాలిక విరామం ఇచ్చారు.లోక్‌సభ మంగళవారం ఉదయం ప్రారంభంకాగానే విపక్షసభ్యులు ఎస్ఐఆర్ అనుకూల నినాదా లిస్తూ సభ సజావుగా సాగకుండా అడ్డుకున్నారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. దీంతో తర్వాత ఇదే పునరా వృతమైంది. దీంతో సభను మధ్యా హ్నం రెండు గంటలకు వాయి దావేశారు. ఇన్‌కమ్‌ట్యాక్స్ బిల్లులకు పార్ల మెంట్ ఆమోదం ఆరు దశా బ్దాలనాటి పాత ఇన్క మ్‌ట్యాక్స్ చట్టం,1961కు బదులుగా తీసుకొచ్చిన నూతన ఆదాయపన్ను చట్టా నికి పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది.కొత్త పన్ను రేట్లు మోపడంలేదని, కేవలం కఠిన పదాలను తొలగించి సరళమైన పదాలతో బిల్లును తీసు కొచ్చామని రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 1961నాటి చ ట్టంలో 819 సెక్షన్లు ఉంటే వాటి ని 536కు కుదించాం. పదేపదే ప్రస్తావిస్తూ ఉన్న పదాలతో పాటు కఠిన పదాలను తొలగించాం. దీంతో బిల్లులోని 5.12 లక్షల పదాలకు ఏకంగా 2.6 లక్షల పదాలకు తగ్గాయి. 39 కొత్త టేబుళ్లను, 40 కొత్త ఫార్ములా లను జతచేశాం’’ అని సీతారామన్ పేర్కొన్నారు. ట్యాక్సేషన్ ట్టాలు (సవరణ) బిల్లు, 2025సహా మొత్తంగా ఆరు బిల్లులను పార్లమెంట్ ఆమోదించింది. పేపర్లు చింపి.. అంతకముందు లోక్‌సభలో కొంత అనూహ్యఘటన చోటుచేసుకుంది. ఎస్ఐఆర్ సంబంధ నినాదాలు చేస్తూ విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి కొన్ని పేపర్లు చింపేసి అధ్యక్ష పీఠం వైపు చిందరవందరగా విసిరారు. దీనిపై ఎన్డీఏ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.మింతా దేవి ఫొటో టీ–షర్ట్లు ధరించి నిరసన35 ఏళ్ల బిహార్ మహిళా ఓటరు వయసును 124 ఏళ్లుగా ఎస్ఐఆర్లో పేర్కొనడాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో విపక్ష ఎంపీలు వినూత్న నిరసనకు దిగారు. మింతా దేవి ఫొటో ముద్రించిన తెలుపురంగు టీ–షర్ట్‌లను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ సహాపలువురు ఎంపీలు ధరించి ఈసీ, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలుచేశారు. 124 నాట్అవుట్ అని ఆ టీ–షర్ట్‌పై రాసి ఉంది.మన ఓటు, మన హక్కు, మన పోరాటం అనే బ్యానర్‌తో ముందుకు కదిలారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్సోనియాగాంధీ, టీఎంసీ నేత డిరేక్ ఓబ్రియాన్, డీఎంకే నేత టీఆర్ బాలు, ఎన్సీపీ(ఎస్పీ) సుప్రియాసూలే తదితర ఎంపీలు పార్లమెంట్ మకరద్వారం వద్దకు చేరుకుని ఎస్ఐఆర్ను తక్షణం నిలిపివేయాలని నినాదాలిచ్చారు. ఎస్ఐఆర్ అంశాన్ని విపక్ష ఎంపీలు పార్లమెంట్లో ప్రస్తావించడం ఇది 15వ రోజు. -
కాంగ్రెస్, బీజేపీ కుట్రలను బీఆర్ఎస్ ఎదుర్కోగలదా?
తెలంగాణకు చెందిన భారత రాష్ట్ర సమితిని బలహీన పరిచేందుకు కాంగ్రెస్, బీజేపీలు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌ల వైఖరి ఈ అనుమానానికి కారణమవుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్ష్యమిచ్చేందుకు సిట్ అధికారుల వద్దకు వెళ్లిన సందర్బంలో బండి సంజయ్ మీడియా వద్ద చేసిన వ్యాఖ్యలు వీటిని మరింత బలపరుస్తున్నాయి.ప్రత్యర్థులను బలహీనపరిచి తద్వారా తాము బలపడాలని కోరుకోవడం రాజకీయాల్లో కొత్తేమీ కాదు. ఇందుకు రకరకాల వ్యూహాలూ అమలు చేస్తూంటారు. తెలంగాణలోని ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు ఈ వ్యూహాలకు, కుట్రల బారిన పడుతున్నది భారత రాష్ట్ర సమితే. ఒక ప్రాంతీయ పార్టీగా రెండు జాతీయ స్థాయి పార్టీలను ఎదుర్కుంటూ ఉండటం దీనికి కారణం. 2014 నుంచి తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 2023 శాసనసభ ఎన్నికలలో ఓడింది.తొలి టర్మ్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రధాని నరేంద్ర మోడీకి మధ్య సత్సంబంధాలే ఉండేవి కానీ ఆ తరువాత ఇరువురు దూరమయ్యారు. సొంత జాతీయ పార్టీ యోచనతో కేసీఆర్ మహారాష్ట్రలో శాఖను ప్రారంభించారు. అయితే స్వరాష్ట్రం తెలంగాణలోనే ఓటమి పాలు కావడంతో ఆయన ప్లాన్లు తలకిందులయ్యాయి. దీంతో ఇతర రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలతో ఏర్పరచుకున్న సంబంధాలను కూడా పక్కన బెట్టవలసి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా 39 అసెంబ్లీ స్థానాలతో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండగలిగింది. కాని వీరిలో పది మంది కాంగ్రెస్‌లో చేరిపోయారు.ముఖ్యమంత్రి పదవి పొందిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను దెబ్బగొట్టే ఆలోచనతో కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోలు లావాదేవీలు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, గొర్రెల పంపిణీ వంటి వాటిపై దృష్టి పెట్టి విచారణకు ఆదేశాలు ఇచ్చింది. వీటన్నిటిలో కెసిఆర్ ను ఇరుకున పెట్టే వ్యూహం కనిపిస్తుంది. ప్రత్యేకించి కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో జ్యుడిషయల్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసులు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.2024 లో జరిగిన పార్లమెంటు ఎన్నికలు బీఆర్ఎస్కు పెద్ద పరీక్ష అయ్యాయి. ఆ పార్టీ పూర్తిగా పరాజయం చెందడంతో లోక్‌సభ ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కాంగ్రెస్, బీజేపీలు చెరో 8 సీట్ల చొప్పున విజయం సాధించి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి. బీఆర్ఎస్కు ఒక్క సీటు రాకపోవడం పెద్ద ఎదురుదెబ్బ అయ్యింది. అప్పటి నుంచి బీజేపీకి కూడా తెలంగాణపై ఆశలు పెరిగాయి. ఏ అవకాశం వచ్చినా బిజెపి నేతలు బీఆర్ఎస్పై విరుచుకుపడటం మొదలుపెట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు తామే ప్రత్యామ్నాయమన్నట్టు బీజేపీ నేతలు ప్రచారం మొదలుపెట్టారు.తాజాగా బండి సంజయ్ బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. పోన్ ట్యాపింగ్ కేసులో సాక్ష్యం ఇవ్వడానికి దర్యాప్తు అధికారుల బృందం ముందుకు వెళ్లి తన అభిప్రాయాలు తెలియచేశారు. ఏమి ఆధారాలు ఇచ్చారో తెలియదు కాని ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేసీఆర్, కేటీఆర్‌లు వ్యాపారుల నుంచి డబ్బు వసూలు చేస్తూ వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, హరీష్‌రావు, కవితలతోసహా పలువురి పోన్లను టాప్ చేశారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలలో, కేసీఆర్ కుటుంబంలో కలతలు సృష్టించడానికి సంజయ్ ఈ ఆరోపణలు చేశారా అన్న సందేహం వస్తుంది.ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే కేసీఆర్, కేటీఆర్‌లను ఈపాటికి జైలులో పెట్టేవాళ్లమని సంజయ్ వ్యాఖ్యానించారు. ఇది మరీ సీరియస్ కామెంట్. ఎవరినైనా జైలులో పెట్టడానికి నిర్దిష్ట ఆధారాలు ఉండాలి. అవేమి చూపకుండా ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం?. సిట్ అధికారులు కూడా కేంద్రమే ఈ కేసు విచారించాలని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాల ఫోన్లను కూడా టాప్ చేశారని అధికారులు సంజయ్ కు చెప్పారని ఒక పత్రిక రాసింది. ఇందులో వాస్తవం ఉంటే కేంద్రానికి, అందులోను హోం శాఖకు తెలియకుండా ఉండదు.కేంద్రంలోని వారి ఫోన్లు టాప్ అయి ఉంటే, దానిని కనిపెట్టడం కాని, సీబీఐకి అప్పగించడం కాని కేంద్రం చేతిలో పనే కదా అన్న ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంటుంది. కానీ బండి సంజయ్ తెలంగాణలో బీఆర్ఎస్ను వీక్ చేయడం కోసం, ఆ పార్టీ నేతలను భయపెట్టడానికి ఈ ఆరోపణలు చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ ఎనిమిది సీట్లు గెలుపొందినా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినంత వరకు బీఆర్ఎస్ పార్టీనే కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ బాగా పుంజుకుందన్న అభిప్రాయం కూడా ఉంది. దాంతో బీఆర్ఎస్ నేతలు నైతికంగా ఇబ్బంది పడేలా సంజయ్ మాట్లాడి ఉండవచ్చు.దానికి తోడు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కొందరు సిటింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. మరో విషయం చెప్పాలి. ఏపీకి బీజేపీ ఎంపీ సీ.ఎం.రమేష్‌కు చెందిన కాంట్రాక్ట్ కంపెనీకి రేవంత్ రెడ్డి భారీ కాంట్రాక్టు ఇప్పించారని కేటీఆర్ ఆరోపించారు. ఆ సందర్భంలో రమేష్ రియాక్ట్ అవుతూ తనవద్ద బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రతిపాదనను కేటీఆర్ చేశారని అన్నారు. కేటీఆర్ దాన్ని ఖండించినా అలాంటి ఆరోపణలు రావడం ఏ పార్టీకి అయినా కాస్త ఇబ్బందికరమైన వ్యవహారమే. సంజయ్ ప్రకటనను కూడా కేటీఆర్ తోసిపుచ్చి క్షమాపణ డిమాండ్ చేశారు.అలా చేయకపోతే లీగల్ నోటీసు ఇస్తానని అన్నారు. సంజయ్ చిల్లర ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాగా కాళేశ్వరం కమిషన్ నివేదిక రూపంలో కేసీఆర్, హరీష్ రావులను చికాకు పెట్టాలని కాంగ్రెస్ యత్నిస్తోంది. కేసీఆర్‌ను అరెస్టు చేయాలని అనుకోవడం లేదని రేవంత్ అన్నప్పటికీ, పరిణామాలు ఏ వైపు మళ్లుతాయో అప్పుడే చెప్పలేం. వీటన్నిటిని గమనిస్తే, బీఆర్ఎస్ను దెబ్బతీసి, ఆ స్థానాన్ని తాను ఆక్రమించాలని బీజేపీ వ్యూహాలు పన్నుతున్నట్లు అనిపిస్తుంది. ఆ అవకాశం బీజేపీకి రాకుండా చేసి, తనే లాభపడాలని కాంగ్రెస్ సహజంగానే యత్నిస్తుంది.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను ఎదుర్కోవడమే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వం ముందున్న సవాలు. ఈ రెండు పార్టీలలో ఏదో ఒకదానితో బీఆర్ఎస్కు సంబంధాలు ఉండి ఉంటే ఈ సమస్యలు అంతగా ఉండేవికావు. దేశవ్యాప్తంగా స్వతంత్రంగా ఉండే ప్రాంతీయ పార్టీలను అణచి వేయడానికి జాతీయ పార్టీలు యత్నిస్తున్నాయి. అందులో బీజేపీ మరీ ముందు ఉంటోందనిపిస్తుంది. ఉదాహరణకు ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టే వరకు బీజేపీ అమలు చేసిన వ్యూహాలు అన్నీ, ఇన్నీ కావు. ఆనాటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను సైతం జైలులో పెట్టింది. బీహారులో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఒకసారి బీజేపీ, మరోసారి కాంగ్రెస్‌తో జతకట్టి ప్రభుత్వాన్ని నడుపుకుంటున్నారు.అదే పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూటమితో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో మాత్రం ఎవరితో కలవడం లేదు.అక్కడ కాంగ్రెస్, సీపీఎంల స్థానాన్ని బీజేపీ ఆక్రమించేసింది. తమిళనాడులో కాంగ్రెస్‌తో డీఎంకే కూటమి కడితే, ఏఐఏడీఎంకే ఈ మధ్యనే బీజేపీతో కలిసింది. కర్ణాటకలో జేడీఎస్ కూడా కొంతకాలం కాంగ్రెస్‌తో, ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలో భాగస్వామి అయింది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ఒంటరిగానే ఉండడానికి సిద్దపడడంతో, బీజేపీ నాయకత్వం తనను తీవ్రంగా దూషించిన టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి వెనుకాడలేదు. కాకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చి తమను బతిమలాడేలా చేసుకున్నారు.దరిమిలా చంద్రబాబుపై ఎలాంటి కేసులు ముందుకు సాగలేదు. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ప్రత్యామ్నాయంగా వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే ఉండగలిగింది. ఇక్కడ కాంగ్రెస్ దాదాపు జీరో స్థాయిలో ఉండడం వల్లే ఇది సాధ్యమైంది. అయినప్పటికీ వైసీపీకి జనంలో పెరుగుతున్న ఆదరణను తగ్గించడానికి కూటమి పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి. తెలంగాణలో మూడు పార్టీలు ఆధిపత్య పోరులో ఉండడం వల్ల బీఆర్ఎస్ రెండు జాతీయ పార్టీలతో పోటీ పడవలసి వస్తోంది. ఈ రకంగా సాగుతున్న రాజకీయంలో వచ్చే మూడేళ్లు బీఆర్ఎస్ రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కుని నిలదొక్కుకోవలసి ఉంటుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘నాపై పెద్ద కుట్ర జరిగింది.. రాహుల్ గాంధీని కలుస్తా’
ఓట్ల చోరీ వ్యవహారంపై నోరుజారి పదవి కోల్పోయిన కర్ణాటక మాజీ మంత్రి కేఎన్ రాజన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పెద్ద కుట్ర జరిగిందని, తెర వెనుక ఉన్నవారి పేర్లను త్వరలో బయటపెడతానని అన్నారాయన. ఈ క్రమంలో ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలను కలిసి తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తానని పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సన్నిహితుడిగా కేఎన్ రాజన్నకు పేరుంది. అదే సమయంలో డీకే శివకుమార్‌తో పొసగదనే ప్రచారం ఉంది. అయితే ఓట్ల చోరీ వ్యవహారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. కాంగ్రెస్‌కే దెబ్బ వేసేలా ఉన్న ఆ వ్యాఖ్యలను అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో ఆయన్ని పదవి నుంచి తొలగించింది. అయితే.. ఈ వ్యవహారంలో పెద్ద కుట్ర జరిగిందని.. తాను బాధితుడిని మాత్రమేనని అంటున్నారాయన. ‘‘ఈ వ్యవహారంలో ఇప్పుడే వివరాలేం చెప్పలేను. రాజీనామా అనుకోండి.. నన్ను తప్పించారనుకోండి.. ఇంకా మీరు ఏమైనా రాసుకోండి. కానీ, ఈ తతంగం వెనుక పెద్ద కుట్రే జరిగింది. ఎవరు.. ఎందుకు చేశారనేది సరైన సమయం వచ్చినప్పుడు చెప్తా. త్వరలో ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ ప్రెసిడెంట్‌ను, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాలను కలిసి తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చి అపార్థాలను తొలగించే ప్రయత్నం చేస్తాను. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా నాతో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు అని మీడియాను ఉద్దేశించి అన్నారాయన. రాజన్న ఏమన్నారంటే.. ‘‘మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఓటర్ల జాబితా సవరణలు జరిగాయి. ఆ సమయంలో పార్టీ కళ్లు మూసుకుంది’’ అని రాజన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు రాహుల్ గాంధీ చేసిన ఓట్ చోరీ ఆరోపణలకు వ్యతిరేకంగా ఉండటంతో.. కాంగ్రెస్ హైకమాండ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. అదే సమయంలో డీకే శివకుమార్ వర్గీయులు సైతం ఈ వ్యాఖ్యలను వ్యతిరేకించారు. దీంతో మంత్రి పదవికి రాజీనామా చేయాలని అధిష్టానం కోరగా.. రాజన్న స్పందించలేదు. ఈ తరుణంలోనే సిద్ధరామయ్య సిఫారసుతో గవర్నర్ ఆయనను కేబినెట్ నుంచి తొలగించారు.కర్ణాటక తాజా రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. రాజన్న తొలగించే ఉద్దేశంలో సిద్ధరామయ్య లేరని, అయితే సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో తనకు మద్దతుగా వచ్చేవారితో కలిసి సిద్ధరామయ్యను కలిశాకే తన తదుపరి కార్యాచరణను రాజన్న ప్రకటిస్తారని సమాచారం. అదే సమయంలో.. కాంగ్రెస్ అధిష్టానం ఆయన కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఆయన గనుక మరోసారి నోరు జారితే తీవ్ర చర్యలు తీసుకోవాలని పార్టీ భావిస్తున్నట్లు బోగట్టా.కర్ణాటక తుమకూరు జిల్లాకి చెందిన రాజన్న(74)కు కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాల అనుబంధం ఉంది. సహకార సంఘాలకు ప్రాతినిధ్యం వహించిన ఆయన.. ఎమ్మెల్యే టికెట్ నిరాకరణతో 2004 ఎన్నికల్లో జేడీఎస్‌లో చేరి.. ఆ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆపై కాంగ్రెస్ గూటికి చేరి 2013, 2023 ఎన్నికల్లో మధుగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. డీకే శివకుమార్ వర్గంతో విభేదాలు ఉన్నప్పటికీ.. తనకు సన్నిహితుడైన రాజన్నకు సిద్ధరామయ్య సహకార సంఘ శాఖను కట్టబెట్టారు. -
ఆర్థిక వ్యవస్థను ఖతం పట్టించారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనలో తెలంగాణ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలు సంగతేమో కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మాత్రం గ్యా రెంటీగా ఖతం పట్టించిందని అన్నారు. కాగ్ ఇచ్చిన తాజా నివేదికలోని అంశాలను ప్రస్తావిస్తూ.. రేవంత్‌రెడ్డి ముఖ్య మంత్రి అయ్యాక తెలంగాణ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజా రిందని సోమవారం ఒక ప్రకటనలో కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే రూ.20,266 కోట్లు అప్పు ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. కాగ్ నివేదిక ప్రకారం, రాష్ట్ర ఆదాయం పడిపోవడంతో పాటు అప్పులు భారీగా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.20,266 కోట్లు ప్రభు త్వం అప్పుగా తీసుకుంది. వార్షిక ల క్ష్యంలో ఇది 37.5 శాతం. కొత్తగా ఏ రోడ్లు వేయకుండా, ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభించకుండా, విద్యార్థులకు కనీసం మంచి భోజనమైనా పెట్టకుండా ఈ నిధులను ఏం చేస్తున్నారు? పన్నేతర ఆదా యం కూడా దారుణంగా పడిపోయింది.బడ్జెట్లో అంచనా వేసిన దానిలో కేవలం 3.37 శాతం మాత్రమే వసూలు అ యింది. మిగులు బడ్జెట్‌తో ప్రారంభమైన తెలంగాణ, ఇప్పు డు రూ.10,583 కోట్ల రెవెన్యూ లోటును ఎదుర్కోవడం అసమర్థ పాలనకు నిదర్శనం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడి లో పెట్టడానికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉందో ప్రజలకు స్పష్టంగా చెప్పాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏ ఒక్క పథకం సరిగ్గా అమలు కావడం లేదు కాంగ్రెస్ పాలనలో పథకాల కోసం ప్రజలు పదే పదే దరఖాస్తు చేసుకోవడానికే సరిపోతుందని, ఒక్క పథకమూ నిర్దిష్టంగా అమలు కావడం లేదని కేటీఆర్ విమర్శించారు. తిక్కలోడు తిరునాళ్లకు పోతే..ఎక్కా దిగా సరిపోయిందన్న చందంగా ప్రభుత్వం తీరుందని సోమవారం ఎక్స్ వేదికగా ఆయన ఎద్దేవా చేశారు. ‘గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బీమా పథకం కింద 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు 1,11,320 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.5,566 కోట్ల పరిహారం అందించాం.కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బీమా ప్రీమియం చెల్లించలేదు. వేలాదిమంది రైతు కుటుంబాలు బీమా సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రతి ఏటా ఆగస్టు 14తో రైతుబీమా ప్రీమియం గడువు ముగుస్తుంది. ప్రభుత్వం ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించి రెన్యువల్ చేయడం ఆనవాయితీ. అయితే గడువు దగ్గరకు వచ్చిన తర్వాత రైతుబీమా కోసం రైతు స్వయంగా స్వీయ ధ్రువీకరణ (సెల్ఫ్ డిక్లరేషన్) పత్రం అందజేయాలని, తనతో పాటు నామినీ పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు కూడా అందజేయాలనే నిబంధన విధించారు. ప్రస్తుతం ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి కీలక సమయంలో రైతుబీమాకు రైతులు మళ్లీ దరఖాస్తు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం మూర్ఖత్వం. గతంలో మాదిరిగానే ప్రభుత్వం రైతు బీమా రెన్యువల్ చేయాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
ఈ వారంలోనే కార్పొరేషన్ డైరెక్టర్లు
సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయి నాయకత్వానికి ఈ వారంలోనే పదవుల పంపకానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లు, బోర్డులకు డైరెక్టర్లు, సభ్యుల నియామకాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ నిర్ణయించారు. దీంతో నామినేటెడ్ పదవుల కోసం మండల, జిల్లా స్థాయి కాంగ్రెస్ నేతల ఎదురుచూపులకు మోక్షం కలగనుంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీలో నెలకొన్న పరిణామాలపై చర్చించేందుకు మహేశ్‌కుమార్‌గౌడ్ సోమవారం జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. గంటన్నరకుపైగా సాగిన ఈ భేటీలో నామినేటెడ్ పదవులు, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, జనహిత పాదయాత్ర, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను పారీ్టపరంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాలపై చర్చించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై చర్చలో భాగంగా ఆ నియోజకవర్గంలోని ప్రజలకు పార్టీని మరింత దగ్గర చేసే కార్యాచరణ రూపొందించాలని.. మంత్రులతోపాటు పార్టీ నాయకత్వానికి కూడా మరిన్ని బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే జూబ్లీహిల్స్ ఓటర్ల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి మరింత విస్తృతంగా సర్వే నిర్వహించాలని కూడా ఇరువురు నేతలు ఓ నిర్ణయానికి వచ్చారు. మరోవైపు జనహిత పాదయాత్ర జరిగిన తీరు గురించి రేవంత్‌రెడ్డికి మహేశ్‌గౌడ్ వివరించారు. ఈ యాత్రలో ప్రభుత్వ పనితీరు గురించి సేకరించిన ప్రజాభిప్రాయాలను సీఎంకు తెలియజేశారు. ఈ నెల 23 తర్వాత రెండో విడత పాదయాత్ర ప్రారంభిస్తున్నానని.. వీలు చూసుకొని పాల్గొనాలని మహేశ్‌గౌడ్ విజ్ఞప్తి చేయగా రేవంత్ సానుకూలత వ్యక్తం చేశారని తెలిసింది. తనతోపాటు మంత్రివర్గం కూడా పాదయాత్రకు వస్తుందని ఆయన చెప్పినట్టు సమాచారం. -
ఇండియా కూటమి ర్యాలీ.. ఎంపీలు అరెస్ట్!
న్యూఢిల్లీ: ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ వరకూ ఇండియా కూటమి చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈరోజు(సోమవారం, ఆగస్టు 11వ తేదీ) పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకూ ర్యాలీకి పిలుపునిచ్చిన తరుణంలో ఇండియా కూటమి ఎంపీలు పాల్గొన్నారు. బీజేపీతో కలిసి ఎన్నికల కమిషన్ ఓట్ల చోరీకి పాల్పడుతుందని ఆరోపించిన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. ఆ క్రమంలోనే ఈసీ కార్యాలయానికి మార్చ్‌గా వెళ్లి మెమోరాండం ఇవ్వాలని పిలుపునిచ్చారు.దీనిలో భాగంగా ఆ ఎంపీలంతా పార్లమెంట్ భవనం నుంచి సుమారు కిలోమీటర్ దూరం మాత్రమే ఉన్న ఈసీ కార్యాలయానికి మార్చ్‌గా వెళ్లే క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీనిలో భాగంగా ఇండియా కూటమి ఎంపీలను అరెస్ట్ చేశారు. అనంతరం విడుదల చేశారు. అరెస్ట్ అయిన వారిలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్, శివసేన(ఎల్బీటీ) నేత ప్రియాంకా చతుర్వేది తదితరులు ఉన్నారు. ఈ అంశంపై రాహుల్ గాంధీ మీడియా మాట్లాడుతూ.. ‘ ఇది రాజకీయంగా చూడాల్సిన అంశం కాదు. మన రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన సమయం. ఈ పోరాటం ఏదో రాజకీయ దురుద్దేశంతో చేసేది ఎంతమాత్రం కాదు. ఇది కేవలం వన్ పర్సన్.. వన్ ఓట్ అనే దానిపైనే మా ఉద్యమం’ అని స్పష్టం చేశారు. తాము 300 ఎంపీలం కలిసి ఈసీ కార్యాలయానికి వెళ్లాలని అనుకుంటే తమకు అనుమతి ఇవ్వలేదన్నారు. కొంతమందిని మాత్రమే రమ్మంటున్నారని ఆయన మండిపడ్డారు. తమ పోరాటం బోగస్ ఓట్లపైనేనని, తమ వద్ధ డేటా ఉందని రాహుల్ మరోసారి స్పష్టం చేశారు.ఈసీని 30 మంది ఎంపీలు కలవొచ్చు..ఇండియా కూటమి ర్యాలీపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేవేశ్ కుమార్ మహ్లా స్పందించార. ఎలక్షన్ కమిషన్‌ను 30 మంది ఎంపీలు కలవొచ్చు అదే విషయాన్ని ఈసీ కూడా చెప్పింది. అంతే గానీ ర్యాలీగా 300 మంది ఎంపీలు ర్యాలీగా వెళితే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుందంది. ఆ క్రమంలోనే వారిని అదుపులోకి తీసుకున్నాం’అని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. -
ఢిల్లీలో ఇండియా కూటమి MPల ర్యాలీలో ఉద్రిక్తత
-
కాంగ్రెస్‌లో ట్విస్ట్.. కీలక పదవికి సీనియర్ నేత ఆనంద్ శర్మ రాజీనామా
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హస్తం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ.. విదేశీ వ్యవహారాల విభాగ అధ్యక్ష పదవికి ఆదివారం రాజీనామా చేశారు. తన రాజీనామాలో లేఖలో కీలక విషయాన్ని వెల్లడించారు. ఆ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించి సమర్థులైన యువ నేతలకు అవకాశం కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. దీంతో, రాజీనామాకు ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా? అనే చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆనంద్ శర్మ తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపించారు. ఈ సందర్భంగా తన లేఖలో ఆనంద్ శర్మ..‘ఈ బాధ్యతను నాకు అప్పగించినందుకు పార్టీ నాయకత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించి సమర్థులైన యువ నేతలకు అవకాశం కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని చెప్పుకొచ్చారు. ఇక, ఆనంద్ శర్మ.. ఏఐసీసీ విదేశీ వ్యవహారాల విభాగం అధ్యక్షుడిగా దశాబ్ద కాలం పనిచేశారు. పార్టీలో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఆనంద్ శర్మ.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా అంతర్జాతీయ వ్యవహారాలపై కాంగ్రెస్‌కు ప్రముఖ వ్యక్తిగా కొనసాగుతున్నారు. అయితే, ఆనంద్ శర్మ కాంగ్రెస్ సభ్యుడిగా కొనసాగనున్నారు.Former Union Minister and Congress leader Anand Sharma has resigned from the post of the Chairman of Foreign Affairs Department of AICC. He continues to be a member of CWC. (File photo) pic.twitter.com/RsIGBDgTOz— ANI (@ANI) August 10, 2025గతంలో ఇండో-యుఎస్ అణు ఒప్పందం చర్చలలో ఆయన గతంలో కీలక పాత్ర పోషించారు. నిర్మాణాత్మక పద్ధతిలో భారత్-ఆఫ్రికా భాగస్వామ్యం, మొదటి భారత్-ఆఫ్రికా శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు.. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ వైఖరిని చాటిచెప్పేందుకు విదేశాలకు వెళ్లిన అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధులలో ఆయన కూడా సభ్యుడిగా ఉన్నారు. 2008 ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత భారత్ వైఖరిని శర్మ ప్రపంచానికి స్పష్టంగా తెలియజేశారు. వాణిజ్య మంత్రిగా తన పదవీకాలంలో మొట్టమొదటి WTO ఒప్పందం, సమగ్ర వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేశారు. -
రెండుసార్లు ఓటేసిన మహిళ ఆధారాలివ్వండి
బెంగళూరు: గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓ మహిళ రెండుసార్లు ఓటే సిందంటూ చేసిన ఆరోపణలకు ఆధారాలను అందజేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కర్ణాట క చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) లేఖ రాశారు. షకున్ రాణి అనే మహిళ రెండుసార్లు ఓటేసినట్లు పోలింగ్ అధికారి ఇచ్చిన రికార్డులు చెబుతు న్నాయని రాహుల్ కొన్ని పత్రాలను ప్రదర్శించారు. ఓటరు ఐడీ కార్డును ఆమె రెండు సార్లు ఉపయోగించుకున్నారు. పోలింగ్ బూత్ టిక్ మార్కు వేశారు’అని అందులో ఉందని రాహుల్ ఆరోపించా రు. అయితే, తమ దర్యాప్తుపై షకున్ రాణి ఒక్క సారి ఓటేసినట్లు వెల్లడైందని సీఈవో తెలి పారు. టిక్ మార్కు పెట్టినట్లుగా రాహుల్ గాంధీ చూపిన ఓటరు జాబితా పోలింగ్ అధికారి అందజేసిందని కాదని సీఈవో స్పష్టం చేశారు. ‘షకున్ రాణి లేదా మరొకరు రెండు సార్లు ఓటేశారని ఆరోపిస్తూ మీరు చూపిన పత్రాలను మాకు అందజేయండి. పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతాం’అని రాహుల్‌కు రాసిన లేఖలో సీఈవో కోరారు. లోక్‌సభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, కర్ణాటకలో మహదేవపు రం అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని ఓటరు జాబితాలో దొంగ ఓట్లు నమోదయ్యా యని రాహు ల్ ఈసీ లక్ష్యంగా ఆరోపణలు చేయడం తెల్సిందే. -
సామరస్య మార్గమే సరి..
సాక్షి, హైదరాబాద్: పార్టీలోని అంతర్గత విభేదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించే దిశగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందుకెళుతోంది. నేతల మధ్య ఉన్న అభిప్రాయభేదాలతోపాటు పార్టీ లైన్‌ను దాటి మాట్లాడారని వచ్చిన ఫిర్యాదులను రాజీ మార్గంలో పరిష్కరిస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల మధ్య ఉన్న పంచాయితీని ఓ కొలిక్కి తెచ్చింది. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో పార్టీ లైన్ దాటి మాట్లాడారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వ్యవహారానికి కూడా ముగింపు పలికింది. రెండు గంటలకు పైగా భేటీటీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదివారం గాంధీభవన్‌లో సమావేశమైంది. చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సభ్యులు అనంతుల శ్యాంమోహన్, కమలాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా నేతల పంచాయితీపై చాలాసేపు చర్చించారు. మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి కూడా సమావేశానికి వచ్చి మరోమారు తన వాదనలు వినిపించారు. వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి తదితరులు ఇప్పటికే ఇచ్చిన సమాచారాన్ని కూడా కమిటీ పరిశీలించింది. దాదాపు రెండు గంటలపాటు ఇదే అంశంపై చర్చించి పరిష్కారాన్ని నిర్ణయించింది. జిల్లాలోని ఎమ్మెల్యేలతోపాటు పార్టీలోని ఇతర నాయకులందరితో కలిసి పనిచేస్తామని, తాను కానీ, తన సతీమణి సురేఖ కానీ వివాదాల జోలికి వెళ్లబోమని మురళి నుంచి లిఖితపూర్వక హామీ తీసుకున్నారు. వీడియో పంపిన అనిరుధ్రెడ్డిమహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి గతంలో బనకచర్ల ప్రాజెక్టు గురించి పార్టీలైన్ దాటి మాట్లాడారని వచ్చిన ఫిర్యాదుపై కూడా క్రమశిక్షణ కమిటీ చర్చించింది. గాంధీభవన్‌కు వచ్చి వెళ్లాలని అనిరుధ్‌రెడ్డిని కమిటీ కోరగా, ఆయన అందుబాటులో లేననని కమిటీకి సందేశం పంపారు. ఆయన మాట్లాడిన వీడియోను కూడా కమిటీకి పంపారు. ఈ వీడియోను పరిశీలించిన కమిటీ అనిరుధ్‌రెడ్డిపై ఫిర్యాదును కూడా కొట్టివేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇక, సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యాలపై కమిటీలో ఎలాంటి చర్చ జరగలేదు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన చోట్ల ఉన్న ఫిర్యాదులు, గజ్వేల్, గద్వాల లాంటి నియోజకవర్గాల్లో నెలకొన్న పరిణామాలపై అందరినీ పిలిపించి మాట్లాడి సమస్యలు పరిష్కరించాలనే భావనలో క్రమశిక్షణ కమిటీ ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ ఆదేశాలు పాటిస్తాం: కొండా మురళిక్రమశిక్షణ కమిటీతో సమావేశం ముగిసిన అనంతరం కొండా మురళి విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ ఆదేశాలను పాటిస్తామని చెప్పారు. జిల్లాలోని పార్టీ నేతలందరితో సమన్వయంతో ముందుకెళ్తామని తెలిపారు. తాము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని, ఇతర ఏ పార్టీలోనూ ఇమడలేమన్నారు. భేటీ అనంతరం మల్లురవి మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా నేతల మధ్య ఉన్న విభేదాల సమస్యను ఓ కొలిక్కి తెచ్చామని తెలిపారు. అనిరుధ్‌రెడ్డి వ్యవహారంపై తమ నిర్ణయాన్ని పీసీసీ దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. -
ఉప రాష్ట్రపతి అభ్యర్థిపై కాంగ్రెస్ కసరత్తు
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. విపక్షాలకు చెందిన ‘ఇండియా’కూటమి తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయా పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతు న్నారు. ఈ మేరకు గత గురువారం కూటమి నేతలతో ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం. ఉమ్మడి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కోసం నేతలతో విస్త్రృతం చర్చలు కొనసా గిస్తున్నారు. కాగా, నేడు సోమవారం రాత్రి ఢిల్లీ లోని హోటల్ తాజ్‌లో కూటమి పార్టీల పార్లమెంటు సభ్యులకు ఖర్గే విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చించి వారి అభిప్రాయాలను తీసుకుంటారు. అయితే, ఎన్డీఏ తన అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే విపక్షాల అభర్థిని ప్రకటించాలని ఇండియా కూటమిలోని ఒక వర్గం ఇప్పటికే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ఉభయసభల్లో 422 మంది, విపక్ష (ఇండియా) కూటమికి 313 మంది అనుకూలంగా ఉన్నారు. ఎన్డీఏ అభ్యర్థి విజయం ఖాయమని స్పష్టంగా తెలుస్తోంది. అయినా ఉభయ సభల్లో మెజారిటీ లేనప్పటికీ ఉప రాష్ట్రపతి ఎన్నికలో పోటీ చేయాని, బలం లేకున్నా బరిలో ఉండాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఫలితంతో సంబంధం లేకుండా బలమైన సందేశాన్ని పంపే ఉద్దేశంతోనే ఇండియా కూటమి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉమ్మడి అభర్థిని నిలబెట్టడంపై సమష్టి నిర్ణయం కోసం ప్రయత్నా లు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు అంటున్నాయి. -
కాంగ్రెస్‌కు అవినీతి గనిగా సింగరేణి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి అవినీతి గనిగా మారిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఉద్యోగ నియామకాలతో పాటు అన్నింట్లో కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ అంచనా వ్యయాలను రాత్రికి రాత్రే అమాంతం పెంచారని దుయ్యబట్టారు. సింగరేణిని కాపాడాలన్న ఉద్దేశంతో కేసీఆర్.. సంస్థలో రాజకీయ అవినీతిని అంతం చేశారని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ రాజకీయ అవినీతి పెరిగిందని దుయ్యబట్టారు.కార్మికులకు భరోసా ఇవ్వడానికి త్వరలో సింగరేణి యాత్ర చేపడతామని ప్రకటించారు. ఆదివారం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థ అయిన సింగరేణి జాగృతి, హెచ్ఎంఎస్ సంఘం కలిసి పనిచేయాలని నిర్ణయించారు. అనంతరం కవిత విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత సింగరేణిని కాపాడుకోవాలన్న కృతనిశ్చయంతో కేసీఆర్ ఎంతో కృషి చేశారని, ఇప్పుడు దాదాపు 40 వేల మంది ఉద్యోగులతో సింగరేణి కలకళలాడుతోందని అన్నారు. సింగరేణిలో భూగర్భ గనులను తెరవాలని డిమాండ్ చేశారు. ఇచ్చేది తక్కువ.. పైగా పన్ను: సింగరేణి కార్మికులకు ప్రభుత్వం ఇచ్చేది చాలా తక్కువగా ఉంటుందని, పైగా జీతంపై ప్రధాని మోదీ ఆదాయపు పన్ను కూడా విధిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. సింగరేణి ఉద్యోగులకు ఆదాయపు పన్ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 22 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫారసుల మేరకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత బోనస్ విషయంలో కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం వంచనకు గురి చేసిందని, లాభాల్లో 33 శాతం వాటా బోనస్‌గా ఇస్తున్నామని చెప్పి అసలు లాభాలనే తక్కువ చేసి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.సింగరేణి కార్మికులకు ఈ ఏడాది దసరా బోనస్‌గా లాభాల్లో 37 శాతం వాటా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. హెచ్ఎంఎస్ కార్మిక సంఘంతో కలసి సింగరేణి జాగృతి పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కలయిక భవిష్యత్తులో అన్ని వామపక్ష పార్టీల అనుబంధ సంఘాల ఐక్యతకు దారితీస్తుందని చెప్పారు. కాగా, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి (టీబీజీకేఎస్) తాను గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నానని, కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతీ ఒక్కరు కలసి పనిచేయాల్సిందేనని పేర్కొన్నారు. -
అటు బనకచర్ల.. ఇటు ఎమ్మెల్సీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై నిరంతరం విమర్శల వర్షం కురిపిస్తున్న బీఆర్ఎస్ పార్టీ.. తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలపై న్యాయ పోరాటం చేయాలని భావిస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్సీలను అనర్హులుగా ప్రకటించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించిన బీఆర్ఎస్ ‘గోదావరి బనకచర్ల’లింకు ప్రాజెక్టుపైనా దేశ అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లేందుకు సన్నద్ధమవుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పదిమంది ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అదే తరహాలో ఫిరాయింపు ఎమ్మెల్సీలపైనా కోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఢిల్లీకి చేరుకున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిరాయింపు ఎమ్మెల్సీలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం సుప్రీంకోర్టులో స్వయంగా పిటిషన్ దాఖలు చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కేటీఆర్‌తోపాటు ఢిల్లీకి వెళ్లిన బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు పిటిషన్ దాఖలుకు అవసరమైన పత్రాలు సిద్ధం చేస్తున్నారు. బనకచర్లపై బీఆర్ఎస్ న్యాయపోరాటం ఏపీ ప్రభుత్వం చేపడుతున్న గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్.. ఈ ప్రతిపాదనకు ఆదిలోనే అడ్డు చెప్పాలని భావిస్తోంది. బనకచర్ల లింకు ప్రాజెక్టును అడ్డుకొని తీరుతామని ప్రకటించిన బీఆర్ఎస్ అందుకు అవసరమైన కార్యాచరణపైనా దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. బనకచర్ల ద్వారా తెలంగాణకు జరిగే అన్యాయంపై ఇప్పటికే పార్టీ కేడర్‌కు, విద్యార్థి, యువజన విభాగం నాయకులకు బీఆర్ఎస్ అవగాహన కల్పించింది. ఇందులో భాగంగా హైదరాబాద్, మంచిర్యాలలో విద్యార్థి సదస్సులు కూడా నిర్వహించింది. ఓ వైపు క్షేత్ర స్థాయిలో బనకచర్లను అడ్డుకుంటూనే మరోవైపు న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. బనకచర్లపై సుప్రీంకు వెళ్లే యోచన! బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బనకచర్ల లింకు ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు ఆ పార్టీ సన్నద్ధమవుతోంది. నీటిపారుదల రంగానికి సంబంధించి సంపూర్ణ అవగాహన కలిగిన మాజీమంత్రి హరీశ్‌రావుకు కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు బాధ్యత అప్పగించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లిన హరీశ్‌రావు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి శుక్రవారం మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్‌కు వచ్చారు. కాగా బనకచర్ల ప్రాజెక్టుపై త్వరలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారని బీఆర్ఎస్ వర్గాల సమాచారం -
పాదయాత్ర నాదే... మీనాక్షిది కాదు
సాక్షి, హైదరాబాద్: జనహిత పాదయాత్ర నిర్వహించాలనుకున్నది తానేనని.. తమ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కాదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. కొందరు కావాలనే దాన్ని మీనాక్షి పాదయాత్రగా ప్రచారం చేశారన్నారు. శనివారం గాంధీ భవన్లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ నెల 23 తర్వాత జనహిత పాదయాత్ర మళ్లీ మొదలు పెడతామన్నారు. విడతలవారీగా జరిగే ఈ పాదయాత్రలో వీలు, సమయాన్ని బట్టి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు కూడా పాల్గొంటారని తెలిపారు. తొలివిడత పాదయాత్రలో ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తిగా కనిపించారన్నారు. 4–5 రోజుల్లో బీసీ రిజర్వేషన్లపై తదుపరి కార్యాచరణ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించనక్కర్లేదని మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. కేబినెట్ తీర్మానాలు, అసెంబ్లీలో బిల్లులు, కులగణన లాంటి వ్యవహారాలు ఆషామాషీగా జరగవని.. ప్రజలన్నీ అర్థం చేసుకుంటారన్నారు. ఢిల్లీలో తాము నిర్వహించిన ధర్నాకు రాహుల్, ఖర్గే రాకపోవడానికి షెడ్యూల్ కుదరకపోవడమే కారణమన్నారు. నాలుగైదు రోజుల్లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై బీసీ రిజర్వేషన్లపై తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తుందని చెప్పారు. తెలంగాణకు బీసీ నేత సీఎం అవుతారని.. అది కూడా తమ పార్టీలోనే కచి్చతంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. మా మధ్య విభేదాల్లేవు సీఎం రేవంత్‌రెడ్డికి, తనకు మధ్య విభేదాలున్నట్లు కొందరు విషప్రచారం చేస్తున్నారని.. అందులో నిజం లేదని మహేశ్‌గౌడ్ వివరించారు. సీఎంతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, అలా ఉండబట్టే బీసీ రిజర్వేషన్లపై ఇంతవరకు పోరాడగలిగామని చెప్పారు. పదేళ్లు తానే సీఎంగా ఉంటానని రేవంత్‌రెడ్డి చెప్పడంలో తప్పేమీ లేదన్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ యంత్రాంగంలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం కోసమే ఆయన ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారన్నారు. గతంలో పీసీసీ చీఫ్‌గా పనిచేసినప్పుడు.. ప్రస్తుతం సీఎంగా పనిచేస్తున్నప్పుడు రేవంత్‌రెడ్డిలో చాలా మార్పు వచ్చిందని చెప్పారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై కసరత్తు పూర్తయిందని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, అనిరు«ద్రెడ్డిల అంశాన్ని క్రమశిక్షణా కమిటీ పరిశీలిస్తుందన్నారు. జూబ్లీహిల్స్‌లో గెలుపు మాదే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తమ విజయం నల్లేరుపై నడకేనని మహేశ్‌గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే వారి కుటుంబ సభ్యులకు అవకా శం ఇచ్చే సంప్రదాయానికి తిలోదకాలిచ్చింది కేసీఆరేనని.. తాము జూబ్లీహిల్స్‌లో తప్పక పోటీ చేస్తా మ ని చెప్పారు. ఉపఎన్నిక నోటిఫికేషన్ రాగానే అభ్యర్థి ని ప్రకటిస్తామని మహేశ్కుమార్గౌడ్చెప్పారు. -
‘అందుకే బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించారు’
హైదరాబాద్: బీజేపీ-కాంగ్రెస్ రెండు ఒకటేనని, అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసు నత్తనడకన సాగుతుందన్న కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటరిచ్చారు. అసలు బీజేపీ-బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించారన్నారు. సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్‌ను ఒక బీసీ నుంచి, రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీ నుంచి కిషన్‌రెడ్డి లాక్కున్నారన్నారు. ఇక జూబ్లీహిల్స్‌శాసనసభ ఉప ఎన్నికలో భాగంగా తమ అభ్యర్థి గురించి ఇంకా సర్వే జరుగుతుందని ఆయన తెలిపారు. నోటిఫికేషన్ వచ్చాకే అభ్యర్థి ఎంపిక ఉంటుందన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే పోటీ పెట్టకుండా ఉండే సాంప్రదాయాన్ని కేసీఆర్ బ్రేక్ చేశారన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో తమ గెలుపు నల్లేరు మీద నడకేనని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. అదే మా తపనలోకల్ బాడీ ఎన్నికల అంశానికి సంబంధించి కాంగ్రెస్ మంచి సమన్వయంతో ఉందన్నారు మహేస్ గౌడ్. రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలనేది తమ తపన అని ఆయన పేర్కొన్నారు. గుజరాత్లో ఇస్తున్న ముస్లిం రిజర్వేషన్లను తెలంగాణలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జనహిత పాదయాత్ర తనదని,కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా ఆ పాదయాత్ర తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌ది కాదన్నారు. తమ ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆమోదించాకే ఆ పాదయాత్రను ప్రారంభించామన్నారు. -
బదులివ్వకుండా బెదిరింపులా?
బెంగళూరు: దేశంలో ముమ్మాటికీ ఓట్ల చౌర్యం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమాలపై తాను గణాంకాలు విడుదల చేసిన తర్వాత ప్రజలు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నారని చెప్పారు. దాంతో దిక్కుతోచని ఎన్నికల సంఘం సంబంధిత వెబ్‌సైట్‌ను మూసివేసిందని అన్నారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, బిహార్‌లో ఈసీ వెబ్సైట్లు మూతపడ్డాయని తెలిపారు. ఎన్నికల బాగోతాలపై ప్రజలంతా నిలదీయడం ప్రారంభిస్తే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుందని ఈసీకి బాగా తెలుసని వ్యాఖ్యానించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో శుక్రవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓటు అధికార్ ర్యాలీ’లో రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపీని చేతబూని ప్రసంగించారు. తాను చేసిన ఆరోపణలు నిజమని అంగీకరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని, ప్రమాణం చేయాలని ఎన్నికల సంఘం డిమాండ్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంట్లో భారత రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేశానని వ్యాఖ్యానించారు. మళ్లీ ఈసీ ఎదుట ప్రమాణం చేయాలా? అని మండిపడ్డారు. ఎన్నికల సంఘానికి రాహుల్ ఐదు ప్రశ్నలు సంధించారు. తనను బెదిరించడం పక్కనపెట్టి, వాటికి సమాధానం చెప్పాలని అన్నారు. రాహుల్ గాంధీ ఇంకా ఏం మాట్లాడారంటే... కొత్త ఓట్లన్నీ బీజేపీకే... ‘‘మోదీ గత లోక్‌సభ ఎన్నికల్లో 25 స్థానాల్లో రిగ్గింగ్ చేసి మళ్లీ ప్రధాని అయ్యారు. దేశవ్యాప్తంగా ఎల్రక్టానిక్ ఓటర్ డేటా మాకు అందజేస్తే.. ప్రధానమంత్రి పదవిని మోదీ చోరీ చేశారని నిరూపిస్తాం. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మా కూటమి మెజార్టీ సీట్లు గెల్చుకుంది. కేవలం నాలుగు నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నెగ్గింది. ఇది చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకలా జరిగిందో ఆరా తీస్తే కోటి మంది కొత్త ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసినట్లు తేలింది. 4 నెలల్లోనే కోటి మంది ఎలా ఓటర్లయ్యారు? ఆ కొత్త ఓట్లన్నీ బీజేపీకే పడ్డా యి. భారీ సంఖ్యలో కొత్త ఓటర్లు నమోదైన చోట బీజేపీ గెలుస్తోంది. దీని వెనుక మతలబు ఏమిటి? రాజ్యాంగంపై మోదీ దాడి కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 16 సీట్లు వస్తాయని అంచనా వేశాం. సర్వేలు కూడా ఇదే విషయం చెప్పాయి. కానీ, 9 సీట్లే వచ్చాయి. అక్కడ ఏదో మాయ జరిగినట్లు తేలిపోయింది. ఓటర్ల జాబితా సాఫ్ట్ కాపీ ఇవ్వాలని కోరితే ఎన్నికల సంఘం ఇవ్వలేదు. వీడియో రికార్డింగ్‌లు ఇవ్వాలని అడిగితే తిరస్కరించారు. తర్వాత చట్టాన్ని మార్చేశారు. ఎన్నికలు పూర్తయ్యాక 45 రోజుల్లో వీడియో ఆధారాలను తొలగిస్తామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన పూర్తి డేటా ఇవ్వాలి. లేనిపక్షంలో మహాదేవపుర స్థానంలో నిర్వహించినట్లుగానే ఇతర నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిశోధన చేస్తాం.ఎప్పటికైనా చర్యలు తథ్యం ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికైనా నిజాలు అంగీకరించాలి. అసలేం జరిగిందో చెప్పాలి. వాస్తవాలకు ముసుగేయాలనుకోవడం సరైంది కాదు. ఏదో ఒకరోజు మీరు మమ్మల్ని(ప్రతిపక్షం) ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నికల కమిషనర్ సహా ప్రతి అధికారీ ఈ విషయం గుర్తించుకోవాలి. రాజ్యాంగంపై దాడి చేసి తప్పించుకుంటామంటే కుదరదు. మీపై చర్యలు తీసుకోవడానికి సమయం పట్టొచ్చు. కానీ, ఎప్పటికైనా చర్యలు మాత్రం తథ్యం. అక్రమార్కులు ఒకరి తర్వాత ఒకరు దొరికిపోవడం ఖాయం. నేను చెప్పేది రాసి పెట్టుకోండి. రాజ్యాంగంపై దాడికి దిగితే మేము మీపై దాడి చేస్తాం’’ అని రాహుల్ ధ్వజమెత్తారు. ఈసీకి రాహుల్ 5 ప్రశ్నలు1. ఓటర్ల జాబితాలను డిజిటల్ మెషీన్ రీడబుల్ ఫార్మాట్లో ప్రజలకు ఎన్నికల సంఘం ఎందుకు ఇవ్వడం లేదు? 2.ఎన్నికలకు సంబంధించిన వీడియో ఆధారాలను ఎందుకు ధ్వంసం చేశారు? 3.ఓటర్ల జాబితాల్లో గోల్మాల్ ఎందుకు జరిగింది? 4.మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్ప కుండా ఈసీ మమ్మల్ని ఎందుకు బెదిరిస్తోంది? 5.ఎన్నికల సంఘం అధికార బీజేపీకి ఏజెంట్‌గా ఎందుకు పనిచేస్తోంది? -
Rahul Vs EC: ఈసీకి రాహుల్ ఐదు ప్రశ్నలు
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేశారు. ఎక్స్ వేదికగా ఈసీకి ఐదు ప్రశ్నలు సంధించారు. ఎన్నికల సంఘం బీజేపీతో చేతులు కలిపి, దేశంలో ఎన్నికలను ప్రభావితం చేస్తోందంటూ నిన్న (గురువారం) సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీకి మేలు చేయడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం పని చేస్తోందంటూ.. ఆధారాలతో సహా బయటపెట్టారు. ఓటర్ల జాబితాల్లో విచ్చలవిడిగా నకిలీ ఓటర్లను చేరుస్తోందని ఆరోపించారు.ఈ క్రమంలో ఇవాళ(శుక్రవారం) ఐదు ప్రశ్నలతో ఎన్నికల సంఘాన్ని నిలదీశారు. ‘‘డిజిటల్ ఓటర్ జాబితా ఎందుకు ఇవ్వడం లేదు?. సీసీ టీవీ ఆధారాలు ఎందుకు నాశనమయ్యాయి?. నకిలీ ఓట్ల నమోదును ఎందుకు అడ్డుకోలేపోతున్నారు?. ప్రతిపక్ష నేతలను ఎందుకు బెదిరిస్తున్నారు?. బీజేపీకి ఎన్నికల సంఘం ఏజెంట్‌గా మారిందా?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.चुनाव आयोग, 5 सवाल हैं - देश जवाब चाहता है:1. विपक्ष को डिजिटल वोटर लिस्ट क्यों नहीं मिल रही? क्या छिपा रहे हो?2. CCTV और वीडियो सबूत मिटाए जा रहे हैं - क्यों? किसके कहने पर?3. फर्जी वोटिंग और वोटर लिस्ट में गड़बड़ी की गई - क्यों?4. विपक्षी नेताओं को धमकाना, डराना - क्यों?… pic.twitter.com/P0Wf4nh5hc— Rahul Gandhi (@RahulGandhi) August 8, 2025కాగా, ఇవాళ (శుక్రవారం) బెంగళూరులో ఓట్ అధికార్ ర్యాలీ పేరిట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఓటర్ జాబితా అవకతవకలతోనే బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిందని, ఎన్నికల సంఘం రాజ్యాంగానికి గనుక కట్టుబడి ఉంటే తాము కోరిన వివరాలను అందించాలని రాహుల్ గాంధీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో మా సర్వే ప్రకారం.. 15 నుంచి 16 సీట్లు గెలుస్తుందని అంచనా వేశాం. కానీ, 9 మాత్రమే గెలిచాం. ఆ ఫలితాలను విశ్లేషించినప్పుడు.. నిజంగానే మేం ఓడిపోయామా? అనిపించింది. వెంటనే ఓటర్ల సాఫ్ట్ కాపీని ఇవ్వమని ఈసీని కోరాం. కానీ, ఈసీ అందుకు నిరాకరించింది. ఎన్నికల వీడియోలు కావాలని కోరినా.. రూల్స్ మారిపోయాయంటూ ఇవ్వడానికి ఒప్పుకోలేదంటూ రాహుల్ చెప్పుకొచ్చారు. -
Bandi Sanjay: నా దగ్గర ఉన్న సమాచారం మొత్తం సిట్ కు ఇస్తున్నాను
-
తెరపైకి కర్ణాటక ‘ఓట్ చోరీ’ స్టింగ్ ఆపరేషన్!
లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఓట్ల చోరీ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ కోసం ఈసీ ఓట్లను చోరీ చేసిందని, ఈవీఎంలపైనా అనుమానాలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలే చేశారాయన. ఈ క్రమంలో.. 2024 ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఒక్క మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోనే లక్షకుపైగా ఫేక్ ఓట్లు ఉన్నట్లు ఆయన ప్రకటించారు. అయితే.. రెండేళ్ల కిందట.. ఓ మీడియా సంస్థ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లోనూ ఈ అవకతవకలే బయటపడడం గమనార్హం. రాహుల్ గాంధీ ప్రెస్‌మీట్ నేపథ్యంలో ఆ మీడియా సంస్థ ఎడిటర్ ఇన్ చీఫ్ ధన్య రాజేంద్రన్ ఆ విషయాన్ని స్వయంగా తన ఎక్స్ ఖాతాలో గుర్తు చేశారు. అయితే ఆనాడు జరిగిన ఆ ఓట్ల చోరీ గురించి ఆమె మాటల్లోనే ఇలా.. ద న్యూస్ మినిట్ 2023లో నిర్వహించిన ఓ ఇన్వెస్టిగేషన్‌ను అందరికీ గుర్తు చేయాలని అనుకుంటున్నా. ఈ పరిశోధన కూడా బెంగళూరు సెంట్రల్‌లోని మహదేవపురతోపాటు ఇతర అసెంబ్లీ సెగ్మెంట్లపై దృష్టి పెట్టింది. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) నియమించిన ఒక స్వచ్ఛంద సంస్థ ఎన్నికల సంఘంతో కలిసి పనిచేస్తూ ఓటర్ల సమాచారం చోరీ చేసింది. ఆ ఎన్జీవో పేరు చిలుమే. ఇది ఎన్నికల నిర్వహణ సంస్థతోపాటు, డిజిటల్ సమీక్ష అనే మొబైల్ అప్లికేషన్‌ను కూడా నడిపేది. ఈ యాప్ ఓటర్ల సమాచారాన్ని క్రోడీకరించి రాజకీయ పార్టీలు, నేతలకు విక్రయించేది. ఒక బీజేపీ నేత కొనుగోళ్లను మేము సాక్ష్యంగా ఆనాడు చూపించాం కూడా. ఇందుకోసం బీజేపీ వార్డు కార్యాలయాల్లో చిలుమే తన కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేది. మా మనిషి ఒకరు ఆ శిక్షణ కేంద్రంలో చేరి అక్కడ ఫొటోలతో సహా ఆధారాలు కూడా సేకరించారు. ఇదెలా జరిగిందంటే.. ఈ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు.. బూత్ లెవల్ అధికారులుగా చెలామణి అవుతూ సమాచారం సేకరించారు. ఆ సేకరణ తర్వాత ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న శివాజీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ పెద్ద ఎత్తున ఓటర్ల తొలగింపునకు ఒత్తిడి తీసుకొచ్చింది. ఇదెలా జరిగిందంటే.. బీజేపీ సానుభూతి పరులు ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో సుమారు 26,000 ఫేక్ ఓటర్లు ఉన్నట్లు ఆరోపించారు. అవసరమైన పత్రాలను నింపకుండానే వాటి తొలగింపునకు పట్టుపట్టారు. చివరకు ఒక కోర్టు కేసు తరువాత ఏడువేల ఓట్లు తొలగించారు. అయితే ద న్యూస్ మినిట్ క్షేత్రస్థాయి పరిశీలన జరిపినప్పుడు.. తొలగించిన ఓటర్లలో చాలామంది అదే అసెంబ్లీ సెగ్మెంట్లో, అవే చిరునామాల్లో నివసిస్తున్నట్లు స్పష్టమైంది.అంతేకాదు.. మా స్టింగ్ ఆపరేషన్‌లో.. చిలుమే వ్యవస్థాపకుడు కృష్ణప్ప రవికుమార్ సొంతూరులో కొంతమంది వ్యక్తుల బ్యాంక్ అకౌంట్లలో రూ.1.4 లక్షల నుంచి రూ.40 వేల వరకూ డబ్బులు పడ్డాయి. వీటిల్లో ఎక్కువ శాతం ‘సీఎస్సీ ఈ-గవర్నెన్స్’ నుంచి వచ్చినవే ఉండేవి. ఆ ఊరి ప్రజలు డబ్బు విత్‌డ్రా చేసుకుని కృష్ణప్ప రవికుమార్‌కు ఇచ్చేవారు. ఈ సీఎస్సీ ఈ-గవర్నెన్స్ ఇండియా లిమిటెడ్ అనేది కేంద్ర ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా ఏర్పాటు చేసిన సంస్థ కావడం గమనార్హం. మా స్టింగ్ ఆపరేషన్ తర్వాత.. చాలామంది అరెస్ట్ అయ్యారు. మరికొందరిపై సస్పెన్షన్ వేటు పడింది. చిలుమేతో బీబీఎంపీ సంబంధాలు లేవని ప్రకటించుకుంది. శివాజినగర, చిక్పేట్, మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా సవరించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది కూడా. అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో గ్రామస్తుల అకౌంట్లలోకి డబ్బులెందుకు వచ్చాయి? చిలుమే సంస్థ సిద్ధం చేసిన ఓటర్ల జాబితాలు ఏమయ్యాయి? ఈ అంశంపై ప్రభుత్వ విచారణ సక్రమంగా జరగలేదు(కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ..)’’ అని ఆమె పోస్ట్ చేశారు.Just wanted to remind everyone of TNM's investigation in 2023- which also focused on assembly segments in Bangalore Central seat including Mahadevapura. We found that a Bengaluru NGO- recruited by the BBMP- working with the ECI- was stealing voter data. Chilume NGO also ran…— Dhanya Rajendran (@dhanyarajendran) August 7, 2025 -
ఘోష్ కమిషన్.. కాంగ్రెస్ దారెటు.. బీజేపీ కోర్టులోకి బంతి?
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘట్టంపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. బ్యారేజీ దెబ్బతిన్న విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. దాదాపు 16 నెలలు విచారణ చేసి ఒక నివేదిక సమర్పించారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావులతో పాటు పలువురు అధికారుల పాత్రను తప్పుపట్టింది.అలాగే ప్రస్తుతం బీజేపీ ఎంపీ, ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కూడా ఆక్షేపించింది. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తదితర మంత్రుల సమక్షంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివేదికలోని ముఖ్యమైన అంశాల సారాంశాన్ని ఒక ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కేసీఆర్ తన పార్టీ నేతల సమావేశంలో ఒక వ్యాఖ్య చేస్తూ అది కాంగ్రెస్ కమిషన్ అని ఆరోపించారు. ఈ నివేదిక పేరుతో కొన్ని అరెస్టులు కూడా జరగవచ్చని ఆయన అంచనా వేశారు. తదుపరి హరీష్ రావు బీఆర్ఎస్ పక్షాన మరో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో కమిషన్ చేసిన అబ్జర్వేషన్స్‌ను తప్పుపట్టారు. హరీష్ అలా చేయడం న్యాయ వ్యవస్థను కించపరచడమేనని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ఈ వాద ప్రతివాదాలలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అన్నదానిపై ఇప్పటికిప్పుడే ఒక అభిప్రాయానికి రాలేము.ఈ సందర్భంలో గతంలో ఆయా ప్రభుత్వాలపై వేసిన కమిషన్లతో ఎవరికి ఇబ్బంది కలగలేదనే చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారెవ్వరూ ఈ తరహా కేసులు ఎదుర్కోలేదు. చలన చిత్రాభివృద్ది సంస్థ అవకతవకలకు సంబంధించి జరిగిన కమిషన్ విచారణకు ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి హాజరయ్యారు. కమిషన్ నివేదికలో ఆయనను తప్పు పట్టలేదు. ఒక భూ సేకరణ స్కాంలో విచారణ జరుగుతున్న సమయంలోనే ఇంకో మాజీ సీఎం స్టే పొందారు. విభజన తర్వాత ఏపీలో రాజమండ్రి పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబే విచారణ సంఘాన్ని నియమించుకున్నారు. అందులో ఆయనను కమిషన్ ఆక్షేపించలేదు. ఇప్పుడు కేసీఆర్ ఈ విచారణ సంఘం నివేదికను ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరం. రేవంత్ ప్రభుత్వం ఆయనపై కేసు పెడుతుందా? అరెస్టు చేస్తారా?.ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్కాంలపై దర్యాప్తు జరిపించి అంతకుముందు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడుపై కేసులు పెట్టింది. కొన్ని కేసుల్లో ఆయన బెయిల్ తెచ్చుకోగా, ఒక కేసులో అరెస్టు అయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుందో అప్పుడే చెప్పలేం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లవలసి వచ్చింది. ఆ అనుభవం రీత్యా కేసీఆర్‌ను కూడా అరెస్టు చేస్తారా అన్న చర్చ ఉన్నప్పటికీ తాము కక్ష రాజకీయాలు చేయబోమని అంటున్నారు. పైగా కేసీఆర్‌కు ఫాం హౌసే ఒక జైలు అని, వేరే జైలు ఎందుకు అని వ్యాఖ్యానించి అరెస్టు జరగక పోవచ్చన్న సంకేతం ఇచ్చారు. ఇది ఒక్క కేసీఆర్‌కే వర్తిస్తుందా? హరీష్ రావు, ఇతర అధికారులకు కూడా వర్తిస్తుందా అన్నది చెప్పలేం. మేడిగడ్డ బ్యారేజీ పగుళ్లు ఇచ్చి కుంగిన ఘటన కేసీఆర్, హరీష్‌రావులకు, బీఆర్ఎస్కు అప్రతిష్ట తెచ్చిందన్నది వాస్తవం.అదే సమయంలో కేసీఆర్ లక్ష్య శుద్ధితోనే కాళేశ్వరం ప్రాజెక్టును సంకల్పించారని చెప్పాలి. కాకపోతే నిర్మాణం వేగంగా చేయాలన్న తొందరపాటులో ఆయన తీసుకున్న నిర్ణయాలు సమస్యలకు దారి తీసి ఉండవచ్చునని అనిపిస్తుంది. కమిషన్ పరిశీలనల్లో ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. కాళేశ్వరం నిర్మాణంపై ప్రభుత్వ స్థాయిలో కాకుండా, కేసీఆర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్నది ఒకటి. మంత్రివర్గం నుంచి పాలనాపరమైన అనుమతులు తీసుకోలేదన్నది ఇంకో పరిశీలన. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని చెప్పి, బరాజ్‌ను మేడిగడ్డకు మార్చడంలో నిజాయితీ కొరవడిందన్నది మరో వ్యాఖ్య. మేడిగడ్డ వద్ద నిర్మాణానికి రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ వ్యతిరేకత తెలిపినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కొందరు కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చే యత్నం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ తప్పుడు డిజైన్లు ఇచ్చిందన్నది వేరొక ఆరోపణ. అధిక వడ్డీకి రూ.84 వేల కోట్ల అప్పు చేయడాన్ని కూడా తప్పు పట్టారు. ఈ విషయాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. శాసనసభలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు చేపడతామని రేవంత్ రెడ్డి చెప్పారు.ఘోష్ కమిషన్ నివేదికను ఆధారం చేసుకుని బీఆర్ఎస్పై కాంగ్రెస్ దాడి పెంచింది. అయితే, వెంటనే ఏం చేయాలన్న దానిపై ఒక నిర్ణయానికి రాలేకపోయింది. అసెంబ్లీలో ఎటూ ఈ నివేదికను పెడతారు. అందులో ఆయా పార్టీల ఎమ్మెల్యేలు తమ వైఖరికి అనుగుణంగానే మాట్లాడుతారు తప్ప కొత్తగా చెప్పేది ఉంటుందా అన్నది సందేహం. అయినా అసెంబ్లీలో చర్చించడం మంచిదే. ఈ నివేదికలో కొంతమంది కీలక అధికారుల పాత్ర గురించి విస్మరించారన్న వాదన ఉంది. ప్రస్తుత సీఎస్‌గా ఉన్న రామకృష్ణారావు జోలికి కమిషన్ వెళ్లలేదని చెబుతున్నారు. బారేజ్ను మేడిగడ్డకు మార్చడం వల్ల ఆరు వేల కోట్ల నష్టం జరిగిందని కమిషన్ అభిప్రాయపడిందని కథనం. అయితే, కాళేశ్వరం ప్రాజెక్టుకు అయిన దాదాపు లక్ష కోట్ల వ్యయం వృథా అయినట్లే అన్నట్లు ముఖ్యమంత్రి మొదలు, మంత్రులు, కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తుండడం విశేషం. ఈ ప్రాజెక్టులో మరో రెండు బారేజీలు, కాల్వలు, టన్నెల్స్ తవ్వకం, రిజర్వాయర్ల నిర్మాణం వంటివి కూడా ఉన్న విషయాన్ని ప్రజలలోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారని అనిపిస్తుంది.స్థల ఎంపికపై నిపుణుల కమిటీ అభిప్రాయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో కేసీఆర్ వివరించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకువెళ్లనిచ్చిందన్న ప్రశ్న వస్తుంది. పైగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రాజెక్టుకు ప్రశంసించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పఢ్నవీస్ స్వయంగా ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరై కేసీఆర్‌ను మెచ్చుకున్నారు. మరో పాయింట్ ఏమిటంటే ప్రస్తుతం కాంగ్రెస్ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా, కాళేశ్వరం సబ్ కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆయన ఆ రోజుల్లో ఈ ప్రాజెక్టును సమర్థించినట్లే కదా!. దానిపై ఏం చెబుతారు?. ప్రాణహిత-చేవెళ్లకు ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చిన ఈ ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మాణం చేసి ఘనత తెచ్చుకోవాలన్న క్రమంలో కేసీఆర్ ప్రభుత్వం కొన్ని తప్పులు కూడా చేసినట్లు అర్దం అవుతుంది.అయితే, అవి పెద్ద తప్పులా? కాదా? అన్నది పరిశీలించాలి. ఈ నేపథ్యంలోనే రేవంత్ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది.. అది కూడా మంచిదే. మామూలుగా అయితే ఈ నివేదిక ఆధారంగా కేసులు పెట్టి ఉండవచ్చు. కానీ, అలా చేయకుండా అసెంబ్లీలో చర్చిస్తామని చెబుతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ ప్రాజెక్టుపై విచారణకు సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం అలా చేస్తుందా? అన్నది ఒక ప్రశ్న. తద్వారా ఈ బాల్‌ను బీజేపీ కోర్టులో వేస్తుందా? అలా జరిగితే కాంగ్రెస్ చేతిలో ఒక ఆయుధం పోయినట్లు అవుతుంది. కనుక ఆ పని చేయకపోవచ్చు. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయి ఇంతకాలమైనా ప్రభుత్వం మరమ్మతులకు సరైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీనివల్ల ప్రాజెక్టు నిరర్థకంగా మారే ప్రమాదం ఉంటుంది. ఉన్న ప్రాజెక్టును వినియోగించుకుంటూనే ప్రభుత్వం తదుపరి చర్యలకు వెళ్లితే మంచిదే.ఇక మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వాదన కూడా సమర్థంగానే ఉందని చెప్పాలి. ఇది ఏకపక్ష నిర్ణయం కాదని, అసెంబ్లీలో కూడా చర్చ జరిగిందని ఆయన అంటున్నారు. కేబినెట్ ఆమోదం కూడా ఉందన్నది ఆయన వాదన. మొత్తం 665 పేజీల రిపోర్ట్ కాకుండా సంక్షిప్త నివేదికను బహిర్గతం చేస్తే సరిపోతుందా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. తుమ్మిడి హెట్టి వద్ద నీటి లభ్యత సరిపడా లేదని కేంద్ర జల సంఘమే చెప్పిందని హరీష్ రావు వివరిస్తున్నారు. మరి కమిషన్ తన నివేదికలో అందుకు విరుద్దంగా ఎలా పెట్టిందో తెలియదు. అలాగే మంత్రివర్గ ఆమోదం ఉందన్న హరీష్ వాదనకు కేబినెట్ తీర్మానాలు చూపించాల్సి ఉంటుంది. అసెంబ్లీలో చర్చ జరిగిన మాట అయితే వాస్తవం. దానిని కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదా అన్నది చూడాలి. ఎన్నికల ముందు చోటు చేసుకున్న ఈ ఉదంతం బీఆర్ఎస్కు నష్టం చేసింది.ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలడం, పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిన ప్రమాదం వంటి వాటిని ఈ సందర్భంగా హరీష్, కేటీఆర్ తదితరులు ప్రస్తావిస్తున్నారు. గుజరాత్లో ఒక వంతెన కూలిన ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించిన ఉదంతాన్ని కూడా ఉటంకిస్తున్నారు. ప్రమాదాలు జరిగితే దానిని ముఖ్యమంత్రికి అంటగడితే, ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ఘటనకు రేవంత్, ఉత్తమ్ కుమార్ బాధ్యత వహిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైతే మరీ తీవ్రమైన చర్య తీసుకుంటుందా అన్నది సందేహమే. రాజకీయంగా తమకు ప్రయోజనం అనుకుంటేనే అలా చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ మాత్రం డిఫెన్స్ నుంచి అఫెన్స్ వెళ్లడానికి ప్రయత్నిస్తుంది.అందుకే కేసీఆర్ దీనిని కాంగ్రెస్ కమిషన్ నివేదిక అని ధ్వజమెత్తితే, కేటీఆర్ ఈ నివేదిక ఒక ట్రాష్ అని వ్యాఖ్యానించారు. హరీష్ రావు ఇది రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా.. ఏ మాత్రం అవకాశం ఉన్నా వెంటనే ఆ బారేజీకి రిపేర్లు చేయించి, నీటిని ప్రజలకు అందుబాటులోకి తేవడం ఉపయుక్తం అని చెప్పాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రేవంత్‌కు కేసీఆర్ ఫోబియా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ప్రసంగాల్లో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారని, ఆయనకు కేసీఆర్ ఫోబియా పట్టుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. కేసీఆర్ పేరును ప్రస్తావించకుండా ఉండలేని మానసిక రుగ్మత రేవంత్‌రెడ్డికి ఉన్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరిట ప్రజలను మోసం చేస్తూ కాలయాపన చేస్తు న్న కాంగ్రెస్ ప్రభుత్వం.. బీసీ డిక్లరేషన్‌లోని ఇతర హామీలను పూర్తిగా పక్కన పెట్టిందని అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు గురువారం కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌వన్నీ డ్రామాలే..: ‘42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని ఓట్లు వేయించుకున్న రేవంత్.. ఇప్పుడు రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత రిజర్వేషన్ల పెంపు జరుగుతుందన్నట్టుగా మాట్లాడుతున్నారు. గతంలో తెలంగాణ సాధించిన తర్వాతే తిరిగి వస్తానని ప్రకటించి ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ లక్ష్యాన్ని చేరుకున్నారు. అదే తరహాలో ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ బీసీ రిజర్వేషన్లు సాధించారో లేదో చెప్పాలి. ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్‌గాందీతో సీఎం రేవంత్ ఏకకాలంలో డ్రామా చేస్తున్నాడు. చంద్రబాబు కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టే డ్రామాలకు పాల్పడుతున్నాడు. చివరివరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని రేవంత్ చెప్తున్న మాటలు ఆయన డ్రామాలో భాగమే..’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు.. ‘బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ కండువాలు వేసుకుని దేవుడి కండువాలు కప్పుకున్నామని చెప్తున్నారు. వారు ఏ పార్టీలో ఉన్నారో రాష్ట్రంలో చిన్న పిల్లలను అడిగినా చెప్తారు. కానీ అసెంబ్లీ స్పీకర్‌కు మాత్రం ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తెలియడం లేదు. స్థానిక సంస్థల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అడ్డగోలుగా నిధులు సమకూర్చుకుంటోంది. గడిచిన 20 నెలల్లో సంపాదించిన అవినీతి సొమ్మును స్థానిక ఎన్నికల్లో పంచేందుకు ప్రణాళికలు వేసుకుంటోంది. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పదేళ్లు వెనక్కి పోయింది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతుబంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తుంది..’అని కేటీఆర్ అన్నారు. కార్యకర్తలకు న్యాయం చేస్తాం ‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేవలం తెలంగాణ అభివృద్ధిపై దృష్టి సారించడంతో పార్టీ కార్యకర్తలకు తగినంత న్యాయం చేయలేకపోయాం. పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను కాపాడుకుని వారికి అండగా నిలుస్తాం. పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించాలి. కొందరు చెప్తున్నట్లు బీఆర్ఎస్ ఏ పార్టీలోనూ విలీనమయ్యేది లేదు. తెలంగాణ ఉన్నంత కాలం గులాబీ కండువా ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీలను మట్టి కరిపించి మళ్లీ కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుందాం..’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్, పట్నం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇలా 'ట్రై' చేస్తే..
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి పంపిన కీలక బిల్లుపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఎన్నికల విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై సర్కారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో దీనిపై సీరియస్‌గా దృష్టి సారించింది. తదుపరి తీసుకోవాల్సిన కార్యాచరణపై సీనియర్ నేతలు, అధిష్టాన పెద్దలతో పలుమార్లు చర్చలు జరిపిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్లు.. మూడు ఆప్షన్లు ముందు పెట్టుకొని సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. కాగా అధిష్టానం ఫైనల్ చేసే ఆప్షన్ ఆధారంగా ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ముమ్మరంగా మంతనాలు: స్థానిక ఎన్నికల్లో, విద్యా ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు బుధవారం జంతర్ మంతర్ వేదికగా కాంగ్రెస్ మహాధర్నా నిర్వహించినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డిలతో గురువారం ఇక్కడ మంతనాలు జరిపారు. స్థానిక ఎన్నికలకు సంబంధించిన మూడు మార్గాలపై చర్చించారు. మూడు ఆప్షన్లు ఇలా..: 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుపై కేంద్రం నిర్ణయం చేసే వరకు వేచిచూడటం మూడు ఆప్షన్లలో మొదటిది కాగా.. 50 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన పాత జీవో ప్రకారం ఎన్నికలకు వెళుతూనే, కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం రెండోది. ఇక బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవో జారీ చేయడం మూడోది. ఈ మూడు ఆప్షన్లకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగినట్లు చెబుతున్నారు. అయితే రిజర్వేషన్లపై కేంద్ర నిర్ణయం వెలువడే వరకు వేచిచూస్తే,సెప్టెంబర్ 30లోగా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. అప్పుడు ఎన్నికల నిర్వహణకు కోర్టును మరింత గడువు కోరాల్సి ఉంటుంది. గడువు కోరేందుకు సహేతుక కారణాలు కూడా చూపాలి. అప్పుడైనా కోర్టు అంగీకరిస్తుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకమేనని నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఒకవేళ కోర్టు అంగీకరించినా అప్పటివరకు స్థానికంగా రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోవడం, కేంద్రం నుంచి అందాల్సిన నిధులకు ఎదరయ్యే అవాంతరాలను కూడా అంచనా వేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి అన్నట్టు సమాచారం. జీవో ఇస్తే..కోర్టులకెళితే.. ఒకవేళ 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవో ఇస్తే, దానిపై ఎవరు కోర్టులకెళ్లినా జీవో అమలు సాధ్యం కాదు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కంటి తుడుపుగా జీవో ఇచ్చారనే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాకాకుండా పాత జీవోలు అమలు చేస్తే బీసీ వర్గాలు ఎలా స్పందిస్తాయో కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా నిర్ణయం చేయాలన్నా..సొంత పార్టీలోనే అనేక అభ్యంతరాలు రావచ్చని కొందరు మంత్రులు అభిప్రాయపడినట్లు తెలిసింది. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లపై తొలుత పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ)లో చర్చించాల్సి ఉంటుందని, జిల్లాల వారీగా పార్టీ సమావేశాలను నిర్వహించి దీనిపై అవగాహన కల్పించడం, కొన్ని వర్గాల నేతలను ఒప్పించడం చాలా కీలకమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయని సమాచారం. కాగా బీసీ ధర్నా కవరేజీకి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన జర్నలిస్టులు గురువారం ఉదయం తనను మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంలోనూ ముఖ్యమంత్రి ఈ మూడు ఆప్షన్లపై చర్చ పెట్టి, అందులో ఏది మంచిదో సూచించాలని కోరడం గమనార్హం. రిజర్వేషన్ల అమలు ఆలస్యమైతే పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లతో ముందుకెళ్లాలనే సూచనలు రాగా, తాము అమలు చేసినా, ఇతర పార్టీలపై ఒత్తిడి తేవడం, వారిని ఒప్పించడం అంత సులువు కాదన్న తరహాలో సీఎం స్పందించినట్లు తెలిసింది. ఖర్గేతో మంతనాలు.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ సీఎం రేవంత్ ఈ విషయమై భేటీ అయ్యారు. పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో మంత్రులు, ఎంపీలతో కలిసి ఆయనతో సమావేశమై.. మహాధర్నా విజయవంతమైన తీరును వివరించారు. ఇండియా కూటమి పక్షాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించిందని ఖర్గే దృష్టికి తెచ్చారు. రిజర్వేషన్లు అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సహకరించాలని కోరారు. ఒకవేళ కేంద్రం స్పందన లేనిపక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఆయన మార్గదర్శనం కోరారు. దీంతో పార్టీ పరంగా రిజర్వేషన్ల అమలు కచ్చితంగా జరగాలనే అభిప్రాయాన్ని ఖర్గే వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. వచ్చే నెల 30 లోగా స్థానిక సమరం! – తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చే నెల 30వ తేదీలోగా గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులపై ఏమీ తేలని నేపథ్యంలో..మూడు ఆప్షన్లు పరిశీలిస్తున్నా.. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ముందుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిసింది. గ్రామపంచాయతీ పాలకమండళ్ల గడువు ముగిసి ఏడాదిన్నరకు పైగా, మండల, జిల్లా పరిషత్‌ల కాలపరిమితి పూర్తయి ఏడాదికి పైగా కావడంతో...కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సంఘం గ్రాంట్లు, ఇతర పథకాల కింద వచ్చే నిధులు ఆగిపోయాయి. తద్వారా గ్రామీణ స్థానిక సంస్థల్లో అభివృద్ధి కుంటుపడింది. ఈ నేపథ్యంలో ఈ సంస్థల పనితీరును చక్కదిద్దడంతో పాటు, గ్రామ స్థాయిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గాడిలో పెట్టడం, కోర్టు గడువు దృష్ట్యా వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. రాజకీయపార్టీ గుర్తులపై జరిగే మండల, జిల్లా పరిషత్ (ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు) ఎన్నికలను ముందుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమౌతున్నట్టుగా అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. అవి ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే యోచనతో ఉన్నట్టు సమాచారం. 8వ తేదీలోగా ఓటర్ల తుది జాబితా ఈ నెల 8వ తేదీలోగా గ్రామపంచాయతీల వారీగా ఓటర్ల తుది జాబితాలను (అసెంబ్లీ ఓటర్ల లిస్ట్‌ల ఆధారంగా) రూపొందించాలని జిల్లా కలెక్టర్లను పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. దీనికి సంబంధించి గ్రామపంచాయతీల పరిధిలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను గ్రామ కార్యదర్శులు సరిపోల్చి సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలను మండల అభివృద్ధి అధికారులు (ఎంపీడీవోలు), మండల పంచాయతీ అధికారులు (ఎంపీవోలు) పరిశీలించి పంపించాలని అధికారులకు పీఆర్‌శాఖ స్పష్టం చేసింది.