దురంధర్ పాటకు గన్ డ్యాన్స్.. చిక్కుల్లో కాంగ్రెస్ నేత | Congress leader dances with gun to Dhurandhar song | Sakshi
Sakshi News home page

దురంధర్ పాటకు గన్ డ్యాన్స్.. చిక్కుల్లో కాంగ్రెస్ నేత

Feb 11 2026 11:26 AM | Updated on Feb 11 2026 12:02 PM

Congress leader dances with gun to Dhurandhar song

కర్ణాటకకు చెందిన ఓ కాంగ్రెస్ నేత చిక్కుల్లో పడ్డారు. ఓ ప్రైవేట్ పార్టీకి వెళుతున్న సందర్భంలో చేతిలో పిస్తోలు పట్టుకొని ఇటీవల సూపర్‌ హిట్టైన దురంధర్ చిత్రంలోని ఓ పాటకు డాన్స్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు అతనిపై విచారణ చేపట్టారు.

మథీన్ పటేల్ అనే  కాంగ్రెస్ నేత అక్కడి కల్బుర్గి నియోజకవర్గ ఎమ్మెల్యేలకు అత్యంత సన్నిహితుడు. అయితే ఆయన ఇటీవల ఓ ప్రైవేట్ పార్టీకి హాజరయ్యారు. ఈ క్రమంలో  ఆయన ఫంక్షన్‌లోకి వస్తుండగా ఆయన అనుచరులు నానా హంగామా చేశారు. గన్స్‌తో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం మథీన్ పటేల్‌ సైతం చేతిలో రివాల్వార్‌తో ఫోజులిచ్చారు.

ఇటీవల విడుదలై సూపర్‌ హిట్టైన దురందర్ చిత్రంలోనే ఓ ఫేమస్ పాటకు డ్యాన్స్ చేశారు. అయితే ఇది సామాజిక మాధ్యమాల్లో వైరలై పోలీసుల దాకా చేరడంతో  ఆయనపై విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో కల్బుర్గి పోలీస్ కమిషనర్ శరణప్పా ఈ అంశంపై స్పందించారు.

మథీన్ పటేల్ పట్టుకున్న ఆయుధాలు నకిలీవా లేదా లైసెన్స్‌డ్‌కు చెందినవా అనే విషయాలు పరిశీలిస్తున్నాం. అదేవిధంగా ఆ ఫంక్షన్‌లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారా అనే అంశాన్ని తెలుసుకుంటున్నాం. ఒకవేళ ఆ గన్స్‌ లైసన్స్ లేనివైతే ఆయనపై చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ తెలిపారు.

ఆ వీడియోలో, మథీన్ పటేల్  బ్లాక్ కలర్  SUVలో ఎంట్రీ ఇస్తారు. ఆయన అనుచరులు గన్స్‌తో స్వాగతం పలుకుతారు. అనంతరం వారితో కలిసి గన్స్‌తో డాన్స్ చేస్తాడు. ఈ సన్నివేశం ఇటీవల రిలీజైన దురంధర్ చిత్రంలోని రెహమాన్ డకైట్ (అక్షయ్ ఖన్నే) ఎంట్రీ లాగానే ప్లాన్ చేశారు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement