dance
-
అస్సాం సత్రియా చారిత్రాత్మక అరంగేట్రం
యాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళాలో అస్సాం సత్రియా సంస్కృతిని ప్రదర్శించనున్నారు. మజులిలోని ఔనియాతి సత్రం నుంచి 40 మంది సభ్యుల బృందం సాంప్రదాయ సత్రియా నృత్యం, సంగీతం, నాటకాన్ని ప్రదర్శిస్తుంది, ఇది రాష్ట్ర ఆధ్యాత్మిక, కళాత్మక వారసత్వంలోకి ఒక ప్రత్యేకమైన విండోను అందిస్తుంది. ఈ ప్రదర్శనలలో శ్రీమంత శంకరదేవుని భక్తి నాటకం రామ్ విజయ్ భావోనా, దిహా నామ్ (సామూహిక గానం), సాంప్రదాయ బోర్గీత్, ఖోల్, సింబల్స్, ఫ్లూట్, వయోలిన్, దోతర వంటి వాయిద్యాలతో కూడిన నృత్యం ఉంటుంది. ఈ బృందం పురుష (పారశిక్ భాంగి), స్త్రీ (స్త్రీ భాంగి) నృత్య శైలులను ప్రదర్శిస్తుంది. 2000 సంవత్సరంలో భారతదేశ శాస్త్రీయ నృత్య రూపాలలో ఒకటిగా గుర్తింపు పొందిన సత్రియాను 15వ శతాబ్దంలో శ్రీమంత శంకరదేవుడు నృత్యం, నాటకం, సంగీతం ద్వారా శ్రీకృష్ణుని బోధనలను వ్యాప్తి చేయడానికి భక్తి మార్గంగా ప్రవేశపెట్టారు. కుంభమేళాలో ప్రదర్శనలు సత్రియాకు కేంద్రంగా ఉన్న గొప్ప కథ చెప్పడం, ఆధ్యాత్మిక ఇతివృత్తాలను ప్రతిబింబిస్తాయి. ఔనియాతి సత్రం సత్రాధికార్ పీతాంబర్ దేవ్ గోస్వామి, అస్సాం సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిష్టాత్మక వేదికపై ప్రాతినిధ్యం వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ బృందం జనవరి 31 నుండి ఫిబ్రవరి 10, 2025 వరకు ప్రయాగ్‌రాజ్‌లో ఉంటుంది. భగవత్ పఠనాన్ని నిర్వహిస్తుంది. ఈ భాగస్వామ్యం అస్సాంకు ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఇది జనవరి 13 నుండి ఫిబ్రవరి 26, 2025 వరకు జరిగే పవిత్ర కుంభమేళాలో ప్రపంచ ప్రేక్షకులతో దాని సాంస్కృతిక సంప్రదాయాలను పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. (చదవండి: సేఫ్ లడకీ దేశాన్ని చుట్టేస్తోంది!) -
డాకు మహారాజ్ స్టెప్స్ పై ఊర్వశీ రౌతేలా స్ట్రాంగ్ కౌంటర్..
-
హృతిక్ రోషన్ vs జూనియర్ ఎన్టీఆర్ భీభత్సమైన డ్యాన్స్ పోటీ
-
డాకు మహారాజ్లో ఊర్వశి రౌతేలా.. బాలయ్యతో మరోసారి చిందులు!
బాలయ్య నటించిన లేటేస్ట్ మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి తొలి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈనెల 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. బాబీ కొల్లి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ను సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.అయితే ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో కనిపించింది. అంతేకాకుండా దబిడి దిబిడి అంటూ సాగే ఐటమ్ సాంగ్‌లో బాలయ్య సరసన మెప్పించింది. ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్లింది.సాంగ్‌పై విమర్శలు..డాకు మహారాజ్‌లోని దబిడి దిబిడి సాంగ్‌పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఊర్వశి రౌతేలాతో అలాంటి స్టెప్పులు ఏంటని పలువురు నెటిజన్స్ ప్రశ్నించారు. ఈ పాట కొరియోగ్రఫీ అత్యంత చెత్తగా ఉందంటూ మండిపడ్డారు. యంగ్ హీరోయిన్‌తో బాలయ్య అలాంటి స్టెప్పులు వేయడమేంటని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు.పట్టించుకోని ఊర్వశి రౌతేలా..అయితే సోషల్ మీడియాలో ఎన్ని విమర్శలు వస్తున్నా పిచ్చ లైట్ అంటోంది బాలీవుడ్ భామ. తాజాగ ఇన్‌స్టా వేదికగా మరో వీడియోను పోస్ట్ చేసింది. డాకు మహారాజ్ సక్సెస్ పార్టీలో బాలయ్యతో కలిసి దబిడి దిబిడి సాంగ్‌కు స్టెప్పులు వేస్తూ కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఊర్వశి రౌతేలాపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఊర్వశి రౌతేలా తన ఇన్‌స్టాలో రాస్తూ..' డాకు మహారాజ్ సక్సెస్ బాష్. దబిడి దిబిడి సాంగ్ 20 మిలియన్ల వ్యూస్ సాధించినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ న్యూయర్‌లో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అభిమానులకు తమన్ ఇచ్చిన గిఫ్ట్ ఇదే' అంటూ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
నృత్య పోటీల్లో..శ్రీరాధాకృష్ణ ‘హై’లైట్
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): “గోదావరి నీటిని తాగితే కళాకారులవుతారు’ అనేది నానుడి. దీనిని నిజం చేస్తూ అనేక మంది సంగీత, నృత్య కళాకారులు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మరికొందరు సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. చరిత్ర పుటల్లో తమదైన ముద్రను వేసి రాజమహేంద్రవరం ఖ్యాతిని నలుదిశలా చాటుతున్నారు. ఆ కోవలోకే శ్రీరాధాకృష్ణ కళాక్షేత్రం చేరింది. ఈనెల 2న మలేషియాలోని టీఎంసీ ఆడిటోరియంలో జరిగిన పోటీల్లో 14 బహుమతులను గెలుచుకుని ఇక్కడి కళాకారులు ప్రతిభ చాటారు. ఇందులో ప్రథమ బహుమతి ఉండటం విశేషం. మలేషియాలోని స్వర్ణ మరియమ్మన్ కుచాంగ్ వారు ఇంటర్నేషనల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ పోటీలను ఆన్లైన్ ద్వారా నిర్వహించారు.ఇందులో 13 దేశాల నుంచి 615 మంది కళాకారులు పాల్గొన్నారు. గాత్రం, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, క్లాసికల్ డ్యాన్స్, సెమీ క్లాసికల్ వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించారు. దీన్లో శ్రీరాధాకృష్ణ కళాక్షేత్రం నుంచి 68 మంది విద్యార్థులు పాల్గొని 14 మంది బహుమతులు గెలుచుకున్నారు. ఆన్లైన్లో పోటీలు మలేషియాలో జరిగిన ఈ పోటీల్లో ఆన్లైన్ ద్వారా కళాకారులు తమ ప్రతిభను కనబరిచారు. వీటిని రికార్డ్ చేసుకున్న నిర్వాహకులు అన్నీ పరిశీలించాక బహుమతులు ప్రకటించారు.స్థానిక శ్రీరాధాకృష్ణ క్షేత్రం మొత్తం 14 బహుమతులు దక్కించుకుంది. ఇందులోమొదటి బహుమతి కూచిపూడి నాట్యానికి రాగా, ఐదు ద్వితీయ బహుమతుల్లో రెండు గాత్రం, ఒకటి సెమీ క్లాసికల్, రెండు కూచిపూడికి వచ్చాయి. తృతీయ బహుమతులు రెండు కూచిపూడి నృత్యానికి, సెమీ క్లాసికల్‌కు రెండు, గాత్రానికి ఒకటి వచ్చాయి. ఇవి కాకుండా కన్సొలేషన్ బహుమతులు సెమీ క్లాసికల్‌కు ఒకటి, కూచిపూడి నృత్యానికి రెండు వచ్చాయి. ఆయా బహుమతులను మలేషియా నుంచి కొరియర్లో మంగళవారం కళాక్షేత్రానికి వచ్చాయి. ఈ బహుమతులను శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర నిర్వాహకులు డాక్టర్ జి.వి. నారాయణ, డాక్టర్ ఉమా జయశ్రీ కళాకారులకు అందజేశారు.చదువుతో పాటు డ్యాన్స్ కూడా... నేను పదో తరగతి చదువుతున్నా. ఆరేళ్ల నుంచి కూచిపూడితో పాటు కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నా. మలేషియాలో జరిగిన పోటీల్లో సీనియర్ విభాగంలో ప్రథమ బహుమతి వచ్చిoది. నాట్యాచార్యులు ఉమ జయశ్రీ నాట్య సాధన చేస్తున్నా. అలాగే చదువుకూ సమయం కేటాయిస్తున్నా. – చెరుకుమిల్లి సిరిచందన నాట్యం అంటే ప్రాణం నేను ఏడో తరగతి చదువుతున్నాను. నాకు నృత్యం అంటే ప్రాణం. మలేషియాలో జరిగిన పోటీలో ద్వితీయ బహుమతి వచి్చంది. నేను 2024లో కశీ్మర్ నుంచి కన్యాకుమారి వరకూ ప్రతి ప్రముఖ దేవాలయంలో నృత్య నీరాజన కార్యక్రమంలో పాల్గొన్నా. – కె.హర్షిత కావ్య అనేక బహుమతులు వచ్చాయి నేను ఐదోతరగతి చదువుతున్నాను. మలేషియా పోటీలో సెమీ క్లాసికల్ జూనియర్ కేటగిరీలో ద్వితీయ స్థానం సాధించా. 2023 జూన్‌లో శ్రీరాధాకృష్ణ కళాక్షేత్రం వారు నిర్వహించిన హనుమాన్ చాలీసాను 14 గంటల 2 నిమిషాల పాటు 101 మంది కళాకారులతో కలసి నృత్యం చేసినందుకు గోల్డెన్ స్టార్, భారత్ వరల్డ్ రికార్డ్, గిన్సిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందా. – ధర్నాలకోట శరణ్య -
లండన్‌లో శివతాండవం
నాట్యం అనేది ఆహ్లాదానికే కాదు మానసిక వికాసానికి కూడా అనుకుంటే... నాట్యం అంటే సంతోషమే కాదు మానసికస్థైర్యం కూడా అనుకుంటే... నాట్యం అనేది ఆనందతరంగమే కాదు పర్యావరణహిత చైతన్యం అంటే గుర్తుకు వచ్చే పేరు.... సోహిని రాయ్ చౌదరి....సోహిని రాయ్ చౌదరి తండ్రి సుబ్రతో రాయ్ సితార్ విద్వాంసుడు. తల్లి ఉమారాయ్ చౌదరి శిల్పి. కోల్‌కత్తాలోని వారి ఇంటిలో ఎప్పుడూ కళాత్మక వాతావరణం ఉండేది. నాలుగు సంవత్సరాల వయసులోనే నృత్యకారిణిగా కాళ్లకు గజ్జె కట్టింది సోహిని రాయ్ చౌదరి. భరతనాట్యం నుంచి మోహినియాట్టం వరకు ఎన్నో నృత్యాలలో ప్రావీణ్యం సాధించింది.‘మన వైదిక సిద్ధాంతాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ మానవతావాదం, మంచి గురించి చాటి చెప్పాయి. కోవిడ్, ఆర్థికమాంద్యం, యుద్ధంలాంటి అనిశ్చిత కాలాల్లో అవి మనకు ధైర్యాన్ని ఇస్తాయి. ఇతరులకు సహాయపడేలా ప్రేరణ ఇస్తాయి. జీవితానికి సానుకూల దృక్పథాన్ని ఇచ్చే శక్తి మన పవిత్ర తత్వాలలో ఉంది’ అంటుంది సోహిని. వాతావరణ మార్పులపై ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఎన్నో సదస్సులలో సోహిని రాయ్ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.‘వేదమంత్రాలతో కూడిన నా నృత్యప్రదర్శన ప్రకృతి గురించి, మన జీవితాల్లో దాని ప్రాముఖ్యత గురించి తెలియజేసేలా ఉంటుంది. పశుపతిగా శివుడు, అడవులు, జంతువులు, పర్యావరణాన్ని పరిరక్షించేవాడు. ప్రకృతిని మనుషులు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో, విధ్వంసం సృష్టిస్తున్నారో చెప్పడానికి, ప్రకృతితో సన్నిహిత సంబంధాల కోసం శివతాండవం చేస్తున్నాను’ అంటున్న సోహిని రాయ్ ‘గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ కూడా అందుకుంది.ప్రపంచవ్యాప్తంగా భారతీయ కళలు, సంస్కృతికి సోహిని రాయ్ చౌదరి అంబాసిడర్‌గా మారింది. యూకేలోని ఇండియన్ హైకమిషన్‌కు చెందిన నెహ్రూ సెంటర్లో సోహిని చేసిన శివతాండవం ప్రేక్షకులను ఆకట్టుకుంది. శివతాండవంతోపాటు శివుడి గురించి రుషి దాస్ గుప్తా చెప్పిన విలువైన మాటలను వినిపించింది. మార్కండేయ పురాణం, శివపురాణాలలో నుంచి ఒక కథను ఎంపిక చేసుకొని దాన్ని నృత్యరూపకంగా మలుచుకుంది. లండన్ తరువాత అమెరికా, రష్యా, జర్మనీ, స్పెయిన్... మొదలైన దేశాల్లోనూ ప్రదర్శనలు ఇవ్వబోతోంది.‘డ్యాన్సింగ్ విత్ ది గాడ్స్’ పేరుతో తొలి పుసక్తం రాసిన సోహిని రాయ్‌కు రచనలు చేయడం అంటే కూడా ఎంతో ఇష్టం. ఆమె రచనల్లో మహిళా సాధికారత నుంచి రంగస్థలం వరకు, నృత్యోద్యమం నుంచి దేవదాసీల దుస్థితి వరకు ఎన్నో అంశాలు ఉంటాయి. శక్తివాదాన్ని ప్రధానంగా చేసుకొని ఎన్నో రచనలు చేసింది.‘ఇండియన్ స్టేజ్ స్టోరీస్: కనెక్టింగ్ సివిలైజేషన్స్’ పేరుతో సోహినిరాయ్ రాసిన పుస్తకం భారతీయ రంగస్థలం ఆత్మను పట్టిస్తుంది. ఈ పుస్తకం ద్వారా మన నాగరికతలోని గొప్ప సాంస్కృతిక, సంప్రదాయల గురించి తెలియజేసే ప్రయత్నం చేసింది. యూరప్‌లోని పద్ధెనిమిది యూనివర్శిటీలలో విజిటింగ్ప్రోఫెసర్గా పనిచేసింది. ‘సూఫీ తత్వం, రూమీ కవిత్వం, ఠాగూరు మానవతావాదంలో నాకు మహిళాసాధికారత కనిపిస్తుంది’ అంటున్న సోహినిరాయ్ చౌదరి తన నృత్య కళను సామాజిక ప్రయోజనం కోసం ఉపయోగిస్తోంది. -
హూప్ హూప్ హుర్రే...ఈ కుట్టీ ఎవరో తెలుసా?
ఆ సన్నటి పెద్ద రింగును ‘హూప్’ అంటారు. పిల్లలు సరదాగా నడుము చుట్టూ దానిని తిప్పుతారు. సర్కస్‌లో హూప్తో చేసే ఫీట్లు ఉండేవి. కాని ఇప్పుడు హూప్ డాన్స్ ఫిట్‌నెస్‌కు ఒక దారిగా ఉంది. సరదాగా ఉంటూనే శరీరాన్ని విపరీతంగా కదిలించే ఈ డాన్స్‌లో దేశంలోనే నంబర్1గా ఉంది ఈష్నా కుట్టి. ఆమె పరిచయం.‘మూవ్మెంట్ థెరపీ గురించి ఇప్పుడు ఎక్కువమంది మాట్లాడుతున్నారు సైకాలజీలో. అంటే శరీర కదలికల వల్ల స్వస్థత పొందడం. హూపింగ్తో మూవ్మెంట్ థెరపీ చేయవచ్చు. హూపింగ్ వల్ల కండరాలు శక్తిమంతమవుతాయి. గుండె బాగవుతుంది. యాంగ్జయిటీ, స్ట్రెస్ మాయమవుతాయి. హూపింగ్లో ఆట ఉంది. వ్యాయామం ఉంది. నృత్యం ఉంది. మూడూ కలగలసిన హూపింగ్ స్త్రీల ఫిట్‌నెస్‌కు బాగా ఉపయోగం’ అంటుంది ఈష్న కుట్టి.ఢిల్లీలో స్థిరపడ్డ మలయాళ కుటుంబంలో జన్మించిన 25 ఏళ్ల ఈష్న కుట్టి ఇప్పుడు భారతదేశంలో నెంబర్ 1 హూపర్గా గుర్తింపు పొందింది. హూప్ లేదా హులా హూప్ అని పిలిచే ‘టాయ్ రింగ్’తో విన్యాసాలు చేసేవారిని హూపర్స్ అంటారు. (20 ఏళ్ల క్రితం అనాథల్నిచేసిన అమ్మ: వెతుక్కుంటూ వచ్చిన కూతురు, కానీ..!)మన దేశంలో ఎప్పటినుంచో హూపింగ్ ఉన్నా 1950లలో ఆట వస్తువుగా దీని తయారీ మొదలయ్యాక వ్యాప్తిలోకి వచ్చింది. నడుమును తిప్పుతూ హూప్‌ను నడుము చుట్టూ తిప్పడంతో మొదలెట్టి మెరుపు వేగంతో హూప్‌ను కదిలిస్తూ ఎన్నో విన్యాసాలు చేయొచ్చు. ఇలా చేయడాన్ని ‘ఫ్లో ఆర్ట్’లో భాగంగా చూస్తారు. బంతులు ఎగరేయడం, జగ్లింగ్ చేయడం.. ఇవన్నీ ఫ్లో ఆర్ట్ కిందకే వస్తాయి. హూపింగ్ కూడా.చిన్న వయసులోనే...‘చిన్నప్పుడు మా బంధువు ఒకామె హూప్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. కాసేపు ఆడుకోవడానికి ట్రై చేసి మానుకున్నాను. కాని ఒకరోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు ప్రాక్టీసు చేశాను. మెల్లగా వచ్చేసింది. దాంతో ఎవరూ లేనప్పుడుప్రాక్టీసు కొనసాగించాను. మెల్లమెల్లగా హూప్ నా శరీరంలో భాగమైపోయింది’ అంటుంది ఈష్న. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో సైకాలజీ చదివిన ఈష్న ‘టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్’లో ‘డిప్లమా ఇన్ డాన్స్ మూవ్మెంట్ థెరపీ’ కూడా చేసింది. ‘సైకాలజీ, హూపింగ్ తెలియడం వల్ల మనిషికి ఉత్సాహం, ఆరోగ్యం కలిగించడానికి ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నాను’ అంటుంది ఈష్న.తిహార్ జైలులో...తిహార్ మహిళా జైలులో ఖైదీలకు ఆరు నెలల పాటు హూపింగ్ నేర్పించడానికి వెళ్లింది ఈష్న. ‘జైలుకు వెళ్లి ఖైదీలను కలవడం ఎవరికైనా కష్టమే. కాని అక్కడ ముప్పై నుంచి 60 ఏళ్ల వరకూ ఉన్న మహిళా ఖైదీలకు హూపింగ్ నేర్పించాను. వారు హూప్ రింగ్‌తో రేయింబవళ్లు ప్రాక్టీసు చేసేవారు. నేను వెళ్లినప్పుడల్లా ఆ ముందుసారి కన్నా మరింత ఉత్సాహంగా, హుషారుగా కనిపించారు’ అంది ఈష్న.ఇలా చేయాలి‘సౌకర్యవంతమైన బట్టలు, సరైన ఫ్లోర్ ఉంటే హూప్తో మీరు ఎన్ని విన్యాసాలైనా సాధన చేయొచ్చు. మార్కెట్లో హూప్ రింగ్‌లు 28 ఇంచ్‌ల నుంచి 39 ఇంచ్‌ల వరకూ దొరుకుతాయి. వాటితోప్రాక్టీసు చేయడమే. ఈ ఆటలో పోటీలేదు పోలిక లేదు. అందుకే మన ఇష్టం వచ్చినట్టు ఆడవచ్చు. ఒకరకంగా బయటకు రాని స్త్రీలకు బెస్ట్ ఆటవిడుపు’ అంటుంది ఈష్న. మన దేశంలో హూపింగ్ నేర్పించే టీచర్లు తక్కువ కనుక ఆమె తరచూ నగరాలు తిరుగుతూ స్త్రీలకు క్యాంప్స్ నిర్వహిస్తూ నేర్పిస్తూ ఉంటుంది. ‘హూప్ రింగ్ మీ బెస్ట్ ఫ్రెండ్ కాగలదు. మీ మంచి చెడుల్లో అది పక్కనే ఉంటే భావోద్వేగాలు అదుపులో ఉంటాయి’ అంటున్న ఈష్నకు ఇటీవల కార్పొరేట్ ఈవెంట్స్‌లో షో చేయమని ఆహ్వానాలు అందుతున్నాయి. డబ్బు కూడా బాగా వస్తోంది. షోలలో ఆమె చేసే హూపింగ్ నోరెళ్లబెట్టేలా ఉంటుంది. ఒక్క రింగు ఆమె జీవితాన్నే మార్చేసింది. మీ జీవితాన్ని కూడా మార్చొచ్చు. -
ఇలాన్ మస్క్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్: ట్రంప్‌తో డ్యాన్స్ (ఫోటోలు)
-
సంక్రాంతికి వస్తున్నాం.. బ్యాట్ పట్టి, స్టెప్పులేసిన వెంకీమామ (ఫోటోలు)
-
డైరెక్టర్ పెళ్లిలో సందడి చేసిన హీరోయిన్.. ట్రైన్లో వెళ్తూ చిల్
బాలీవుడ్ భామ నోరా ఫతేహి ఓ పెళ్లిలో సందడి చేసింది. ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ అనూప్ సర్వే పెళ్లికి హాజరైంది. అయితే ఈ వివాహా వేడుకలో పాల్గొనేందుకు రైలులో ప్రయాణించింది ముద్దుగుమ్మ. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ముంబయిలోని దాదర్ రైల్వే స్టేషన్లో ఉన్న వీడియోను పంచుకుంది.ట్రైన్లో రత్నగిరి చేరుకున్న నోరాకు ఘనస్వాగతం లభించింది. ఆ తర్వాత డైరెక్టర్ హల్దీ వేడుకలో నోరా ఫతేహీ డ్యాన్స్ కూడా చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. డైరెక్టర్ అనూప్ సర్వేతో తనకు ఎనిమిదేళ్లుగా పరిచయం ఉందని నోరా ఫతేహీ తెలిపింది. 2017 నుంచి తన సినీ ప్రయాణంలో ఉన్నాడని రాసుకొచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే నోరా ఫతేహి చివరిసారిగా మడ్గావ్ ఎక్స్‌ప్రెస్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె ధృవ సర్జా నటిస్తోన్న కేడీ - ది డెవిల్తో కన్నడలో అరంగేట్రం చేస్తోంది. View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
కాలానుగుణంగా కోలాటం : ప్రొద్దుటూరు మహిళల విజయం
‘చీరలంటే చీరలు... చీరల మీద చిలకలు/ రైకలంటే రైకలు... రైకల మీద రంగులు’‘జానపదమైనా సరే–‘అబ్బబ్బా దేవుడూ... అయోధ్య రాముడు సీతమ్మ నాథుడు... శ్రీరామచంద్రుడు’... ఇలా ఆధాత్మికమైనా సరే–ఈ జనరేషన్ ఆ జనరేషన్ అనే తేడా లేకుండా ఆబాలగోపాలం కోలాటం సంబరాల సందడిలో ఉత్సాహతరంగమై ఎగరాల్సిందే.తెలుగు వారి సాంస్కృతిక చిరునామాలలో ఒకటి... కోలాటం. కళ అనేది పుస్తకాల్లో కాదు ప్రజల మధ్య, ప్రజలతో ఉంటేనే నిత్యనూతనంగా వెలిగిపోతుంది. ఈ ఎరుకతో కోలాటానికి పూర్వ వైభవం తేవడానికి ముందుకు కదిలారు ప్రొద్దుటూరు మహిళలు.కడప జిల్లా ప్రొద్దుటూరులోని మహిళలు కోలాట నృత్యానికి కొత్త హంగులను జోడించి ఆ కళకు మరింత ఆదరణ వచ్చేలా కృషి చేస్తున్నారు. బండి మల్లిక ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన మాస్టర్ సాయి భరత్ దగ్గర కోలాటంలో శిక్షణ తీసుకుంది. తనలాగే శిక్షణ తీసుకున్న దాదాపు నాలుగు వందలమందితో ‘సావిత్రి బాయి పూలే అభ్యుదయ మహిళా కోలాట బృందం’ ఏర్పాటు చేసింది. అందరినీ ఒకే తాటి పైకి...కోలాటం సంప్రదాయ స్ఫూర్తిని పదిలంగా కా΄ాడేలా పూలమాలలు, లెజిన్స్, భజన తాళాలు... మొదలైన వాటితో అన్నమాచార్య కీర్తనలతో నృత్యప్రదర్శనలు చేస్తూ కోలాటానికి కొత్త శోభను తీసుకువస్తున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో కోలాటం నేర్చుకున్న వారు ఎవరికి వారు బృందాలుగా వుండడంతో వారందరినీ ఒకేతాటిపై తీసుకువచ్చి కొత్తగా ఏదైనా సాధించాలనే ఆలోచన మల్లికకు వచ్చింది.వండర్స్ బుక్ ఆఫ్ రికార్డ్‌లోకి దశావతార కోలాటంపశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల క్షేత్రంలో 222 మంది మహిళలు కోలాటంతో దశావతార జానపద నృత్య ప్రదర్శన చేశారు. ‘గోవిందుడేలరాడే.. గోపాలుడేలరాడే.. మా అయ్య ఏలరాడే..’ అనే పాటతో ఆకట్టుకున్నారు. ఈ ప్రదర్శన తో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ‘వండర్స్ బుక్ ఆఫ్ రికార్డ్’లో చోటు సాధించారు. కాలంతో పాటు ప్రవహించాలి...ప్రొద్దుటూరుకు మాత్రమే పరిమితం కాకుండా హైదరాబాద్, తిరుచానూరు, శ్రీకాళహస్తి, ఒంటిమిట్ట, అరుణాచలంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో, తిరుమల తిరుపతి ఆలయాల బ్రహ్మోత్సవాలలో తమ కోలాటంతో కనుల పండగ చేస్తున్నారు బృందం సభ్యులు.‘కాలేజీలో పనిచేస్తూనే సాయంత్రం వేళల్లో, సెలవుల్లో కోలాటం నేర్చుకున్నాను. శారీరక, మానసిక ఉల్లాసానికి ఉపకరించే కళ ఇది. ్ర΄ాచీన జానపద కళలకు జీవం పోయాలనే లక్ష్యంతో కోలాటం ఆడుతున్నాం. ఈ కళ నిలువ నీరులా ఉండకూడదు. కాలంతోపాటు ప్రవహించాలి. ప్రతి తరం సొంతం చేసుకోవాలి’ అంటుంది ‘గౌతమి ఇంజినీరింగ్ కాలేజీ’లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న భూమిరెడ్డి నాగమణి.ఇక అయోధ్య రాముడి దగ్గరికి... ‘దశావతారం’ కోలాట నృత్య ప్రదర్శనకు ప్రత్యేక గుర్తింపు లభించడం సంతోషంగా ఉంది. ప్రదర్శనల కోసం ఎవరి దగ్గరా డబ్బు తీసుకోకుండా సొంత ఖర్చులతో దేవస్థానాలలో ప్రదర్శనలు చేస్తున్నాం. బయట ఎక్కడా ప్రదర్శనలు చేయం. అయోధ్యలో కోలాటం ప్రదర్శన చేయడానికి అనుమతి కోసం ప్రయత్నిస్తున్నాం. ఈ తరం పిల్లలు కూడా కోలాటానికి దగ్గర కావాలి. ఏ కళా దానికి అదే దూరం కాదు. సంప్రదాయ కళలకు చేరువ కావడం అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది. ఒక్కరిద్దరు కాకుండా కళాకారులందరూ ఐక్యంగా కృషి చేస్తే ఎంత అద్భుతం సృష్టించవచ్చో నిరూపించాం. – బండి మల్లిక అరుణాచల కొండల్లో... అలుపెరగని కోలాటంబండి మల్లిక నేతృత్వంలో తమిళనాడులోని అరుణాచలంలో గిరి ప్రదక్షణ సందర్భంగా ‘సావిత్రి బాయి పూలే కోలాట బృందం’లోని 111 మంది మహిళా కళాకారులు 14 కిలోమీటర్లు కోలాటాన్ని ప్రదర్శించారు. కోలాట కర్రలతో అన్నమయ్య, శివనామస్మరణ కీర్తనలకు లయబద్ధంగా నృత్యం చేశారు. సాయంత్రం 6.30 గంటలకు మొదలైన కోలాట నృత్యం మరుసటి రోజు ఉదయం 3.40 గంటల వరకు కొనసాగింది. ఏకధాటిగా తొమ్మిది గంటల పాటు గిరి నృత్య ప్రదక్షిణలో అలసిపోకుండా కోలాటం పూర్తి చేసిన వీరి ప్రతిభ ఉత్తర అమెరికాలోని ‘తానా బుక్ ఆఫ్ రికార్డు’ లో నమోదైంది. ‘భారత్ టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ లోనూ చోటు సాధించారు. – మోపూరు బాలకృష్ణారెడ్డి సాక్షి ప్రతినిధి, కడపఫొటోలు: షేక్ మహబూబ్ బాషా, ప్రొద్దుటూరు. -
స్టూడెంట్స్‌తో మహిళా ప్రొఫసర్ క్రేజీ డ్యాన్స్ : వీడియో హల్చల్
సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్స్‌కు క్రేజ్ ఎక్కువ. సూపర్ హిట్ సాంగ్‌కు రీల్స్ చేసినా, డ్యాన్స్ చేసిన ఇక రచ్చ రచ్చే. తాజాగా కొచ్చిన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ పుష్ప -2 సినిమాలో హిట్ సాంగ్ కి చేసిన డ్యాన్సింగ్ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఇన్‌స్టాలో షేర్ అయిన ఈ వీడియో ఇప్పటికే 70 లక్షలకుపైగా వ్యూస్‌ను సంపాదించింది.కొచ్చిన్ (Cochin)యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CUSAT)లో వేడుకలు ఘనంగా జరుగు తున్నాయి. ఇందులో భాగంగా విద్యార్థినిలు డ్యాన్స్ చేయడం మొదలు పెట్టారు. అప్పటిదాకా ప్రశాంతంగా చూస్తూ కూర్చున్న మహిళా ప్రొఫెసర్ విద్యార్థినిలతో జత కలిసి స్టెప్పులు వేయడం మొదలు పెట్టారు. తన చేతిలోని బ్యాగ్‌ను కుర్చీపై పెట్టి మరీ రంగంలోకి దిగి పోయారామె. అమ్మాయిలతో సమానంగా జోరుగా డ్యాన్స్ చేశారు. అదీ చీరలో.. సూపర్ స్టెప్స్‌తో తమకు పోటీగా మేడమ్ తమతో జత కట్టడం చూసిన విద్యార్థినులు మరింత ఉత్సాహంగా డాన్స్ ఇరగదీశారు. ఏ పాటకో తెలుసా?పుష్ప 2: ది రూల్ మూవీలోని ‘పీలింగ్స్’ సాంగ్‌కు మైక్రోబయాలజీ ప్రొఫెసర్,డిపార్ట్మెంట్ హెడ్ (HOD), అయిన పార్వతి వేణు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “మీ హెచ్ఓడీ మేడమ్ మీ కంటే ఎక్కువ వైబర్గా ఉన్నప్పుడు” అనే క్యాప్షన్‌తో షేర్ అయిన ఈ వీడియోను నెటిజన్లు ఉత్సాహంగా కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by @ottta_mynd -
అభిరామం నృత్యంతో చెప్పే రామాయణం : ఎవరీ ఐశ్వర్య హరీష్!
ఇతిహాసమైన రామాయణం అందం, భక్తి, సంక్లిష్టతలను ఐశ్వర్య హరీష్ ప్రదర్శించే భరతనాట్యం అన్వేషిస్తుంది. శాస్త్రీయ నృత్యాన్ని బహుభాషా కథనాలతో మిళితం చేసి మన ముందు ప్రదర్శిస్తుంది. రామాయణంలో తెలియని మరో కోణాన్ని ఆవిష్కరించడానికి ‘అభిరామం’ ప్రదర్శనను ఎంచుకున్నాను అని చెబుతుంది. ఐశ్వర్య హరీష్ పుట్టుకతోనే నృత్యకారిణి అని చెప్పవచ్చు. ఐదు తరాలుగా ఆ ఇంట నృత్యకళాకారులే ఉన్నారు. ఆ విధంగా చాలా చిన్న వయస్సు నుండి తన తల్లి ద్వారా శిక్షణ పొందుతూ ఐశ్వర్య తన స్వంత నృత్య కథల గురించి కలలు కంటూ పెరిగింది. ఇటీవల ముంబయ్‌లో ప్రఖ్యాత నేషనల్ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్‌సిపిఎ)లో ప్రదర్శన ద్వారా అబ్బురపరిచిన ఐశ్వర్య రామాయణాన్ని నృత్యంగా ఎందుకు ఎంచుకున్నానో వివరించింది.నృత్యంతో అన్వేషణ‘‘రాముడు నా ఇష్ట దేవత. నా చిన్నప్పుడు రాముని గంభీరమైన రూపం, అతనిపై పాట, పద్యం, నృత్యం ఏది నేర్చుకున్నా అది నన్ను ఉత్తేజపరిచింది. ఇటీవల, వ్యక్తిగత ఆధ్యాత్మిక సాధనగా వాల్మీకి రామాయణాన్ని దాని అనువాదంతో పాటు చదవడం ప్రారంభించాను. చదివేటప్పుడు కథలో ఇంకా ఏవో తెలియని అంశాల సారంశాం ఉందని గ్రహించాను. చాలా అన్వేషించని కోణాలు ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్లోనూ రసాలు ఎక్కువ. ఇది నాకు నృత్యంలో అన్వేషించాలనే ఆలోచనను ఇచ్చింది. రామాయణానికి చాలా వెర్షన్లు ఉన్నాయి. అందుకే నా పరిశోధన విస్తృతం చేశాను. దీంతో అనేక అవకాశాలు నాకు లభించాయి. అన్ని వెర్షన్లు కథాంశం చెక్కుచెదరకుండా ఉన్నప్పటికీ, ప్రతి ఒక్కటి విభిన్న దృష్టి, రుచిని కలిగి ఉన్నాయి. ఉదాహరణకు– వాల్మీకి రామాయణం రాముడిని మానవ శ్రేష్ఠతగా చూస్తే, అధ్యాత్మ రామాయణం అతనిని అంతిమ భగవంతునిగా, అద్భుతంగా చూసింది. రామాయణంలో సీత పాత్రకు భిన్నమైన టేకింగ్ ఉంది.ఆత్మను కదిలించాలిఅభిరామం నృత్య రూపకం వివిధ రామాయణ గ్రంథాల నుండి సేకరించిన ఆరు అరుదైన ఎపిసోడ్లను వర్ణిస్తుంది. రామాయణం భారతీయ మనస్తత్వంలో చాలా పాతుకుపోయింది కాబట్టి, నేను కథ టైమ్‌లైన్‌ను నిర్వహించాలనుకున్నాను. రాముడి కథ ప్రతి మట్టిని దాని స్వంత ఫ్లేవర్‌లో తాకింది. నేను దానిని ఉపదేశాత్మకంగానో, సాదాసీదాగానో స్తుతించేలనుకోలేదు. శృంగార భక్తి కోణాన్ని కొనసాగించాను. అదే నన్ను మొదటి స్థానంలో ప్రాజెక్ట్‌లోకి తీసుకువచ్చింది. ఎక్కడి నుంచైనా ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని, దానిని మరో కోణంలో వివరిస్తే అది వినోదభరితంగా ఉండాలి అలాగే ఆత్మను కదిలించాలి. ప్రేక్షకుల ఊహల మైదానంలో ఆ అంశం తిరగాలి. నేను ఎంచుకున్న కథ మాత్రమే కాదు నా డ్యాన్స్ ఎలిమెంట్‌ను కూడా కోల్పోకూడదు. దీన్ని మరింత థియేట్రికల్ ప్రెజెంటేషన్‌గా మార్చాలనుకున్నాను. ఆకర్షించిన అంశాలుమొదట వాల్మీకి రామాయణాన్నే చదివాను. మా అమ్మ అప్పటికే తులసీదాస్ రచనలపై కొంత పరిశోధన చేసింది. అలా తులసి రామాయణం నుండి నాకు నచ్చిన అంశాలను సేకరించడానికి అది ఒక కిటికీలా ఉపయోగపడింది. కౌసల్య తన నవజాత శిశువుతో చేసిన మొదటి సంభాషణ నన్ను అమితంగా ఆకర్షించింది. అదేవిధంగా, రావణుడి పాత్రను చూస్తే విష్ణువు దైవిక బలాన్ని ఎదుర్కోవడంలో పూర్తి జ్ఞానంతో అతను సీతను అపహరించాడు. రావణుడు మోక్షానికి తన ఏకైక సాధనం – భగవంతుడి చేతిలో మరణం ఇదేనని గ్రహించాడు. తులసీరామాయణం రాముడు, సీత స్వయంవరం, వారి కలయిక గురించి చాలా అందంగా, సుందరంగా కవితాత్మకంగా అన్వేషించబడింది. రావణుడి సోదరి శూర్పణఖ సీతను అపహరించడానికి, ఆమె చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి తన సోదరుడిని ప్రేరేపించడం ద్వారా రామాయణంలో మలుపు తిరిగింది. అరుణాచల కవి తమిళంలో రామనాటకంలో ఈ క్యారెక్టరైజేషన్‌ని చాలా అందంగా చూపించాడు, రాక్షసి బెంగను అనుభూతి చెందాడు. ప్రొడక్షన్లో ఇది మూడో ఎపిసోడ్‌గా తీసుకోబడింది. కథను ఇలా ముందుకు తీసుకెళ్తుంటే హనుమంతుని అద్భుతమైన చర్యలు, సెయింట్ పురందర దాసు కన్నడ పద్యాల పదునుగా బయటకు వచ్చాయి. తల్లే గురువుమా అమ్మ నా గురువుగా ఉండటం నాకు దొరికిన అద్భుతమైన ఆశీర్వాదం. చిన్నతనం నుండే సాంప్రదాయ సంగీతం, నృత్యం, కథల రూపంలో ఉండే సాహిత్యం, ఏదైనా సాధించాలనే కల, క్రమశిక్షణతో కూడిన ఆలోచనలతో ఉన్నాను. పరిపూర్ణత గురించి ఎప్పుడూ చర్చలు ఉండకూడదు. అలాగే, నాణ్యతలో ఎప్పుడూ రాజీ పడకూడదు. ఇది నా వారసత్వాన్ని చెక్కుచెదరకుండా కొనసాగించే సవాల్, మరింత పరిపూర్ణత కోసం పట్టుదలతో కూడిన బాధ్యత. దానిని స్వీకరించి ముందు తరాలకు ఇవ్వాలనే నిబద్ధతో కృషి చేస్తున్నాను. కూర్పులో సవాల్ప్రతి ఎపిసోడ్ లోనూ కథనంలో మార్పు లేకుండా అందులోని అందాన్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాం. సంగీతం, నృత్యం అన్నీ వేర్వేరు వ్యక్తులచే కం΄ోజ్ చేయబడ్డాయి. కౌసల్య వాత్సల్యమైనా, రాముడు– సీతల శృంగారమైనా, సీత వైభవం, హనుమంతుడి సుందరకాండ ఇలా ప్రతీది ‘అందం’లోని అంశమే ఈ నృత్యంలో ప్రత్యేకంగా నిలుస్తుంది’’ అని వివరిస్తుంది ఐశ్యర్వ. -
స్కూలు యాన్యువల్ డే : ఆరాధ్య సందడి, ముద్దుల్లో ముంచెత్తిన ఐశ్వర్య
ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షిక దినోత్సవం వేడుకల్లో స్టార్ కిడ్స్ సందడి చేశారు. బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య, బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్‌కాన్ చిన్న కుమారుడు అబ్ రామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.గురువారం (డిసెంబరు 19) జరిగిన ఈ ఈవెంట్లో ఆరాధ్య బచ్చన్ తన షోను అందర్ని కట్టి పడేసింది. ఆమె నటనకు ఐశ్వర్య, అభిషేక్‌తోపాటు, తాత అమితాబ్ బచ్చన్ కూడా గర్వంతో ఉప్పొంగి పోయారు. ముఖ్యంగా మాజీ ప్రపంచ సుందరి ఐశర్య తన కుమార్తె నటనకు ఫిదా అయిపోయింది. ఈమెమరబుల్ మూమెంట్స్‌ను కెమెరాలో బంధిస్తూ కనిపించింది. ఆ తరువాత ఆరాధ్యను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ముద్దులతో ముంచెత్తింది.And Aaradhya’s final bow - trust her parents to cheer the loudest as always pic.twitter.com/phf29fiGG3— Bewitching Bachchans (@TasnimaKTastic) December 19, 2024మరోవైపు భార్యబిడ్డలను ఇలా చూసిన అభిషేక్ మురిసిపోయారు. ఇక మనవరాలు క్రిస్మస్ ప్రదర్శనకు గర్వంతో చిరునవ్వులు చిందించారు అమితాబ్. షో ముగియగానే ప్రేక్షకుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. అలాగే తన కుమారుడు అబ్రామ్ ప్రదర్శనకు షారూఖ్‌ఖాన్ కూడా ఉత్సాహంగా క్లాప్స్ కొట్టారు. మురిపెంగా వీడియోలు తీసుకుంటూ కనిపించారు. కరీనా సైఫ్ అలీఖాన్, దంపతుల కుమారుడు కూడా తైమూరు కూడా అద్భుత ప్రదర్శనతో అలరించాడు. ఈ వార్షికోత్సవ వేడుకులకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.మరోవైపు ఆరాధ్య పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో ఐశ్వర్య, అభిషేక్ జంటగా కనిపించడం, ఇద్దరూ అమితాబ్‌ను వేదికపైకి జాగ్రత్తగా తీసుకెళ్లిన దృశ్యాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఐశ్వర్య, అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నారనే పుకార్లకు పూర్తిగా చెక్ పడినట్టైంది. < View this post on Instagram A post shared by mamaraazzi (@mamaraazzi) -
అశ్లీల నృత్యాల ఘటనలో 24 మంది అరెస్టు
నిడమర్రు: ఏలూరు జిల్లా బావాయిపాలెంలో జనసేన నేతల అశ్లీల నృత్యాల బాగోతంలో 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఈ వ్యవహారానికి సూత్రధారి అయిన జనసేన పార్టీ క్రొవ్విడి గ్రామ అధ్యక్షుడు వాకమూడి ఇంద్రకుమార్, మరో 21 మంది యువకులు, ఇద్దరు హిజ్రాలు ఉన్నట్లు గణపవరం సీఐ సుభాష్ గురువారం తెలిపారు. ఈ అశ్లీల నృత్యాల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీఆర్వో భుజంగరావు ఫిర్యాదు మేరకు బుధవారం రాత్రి కేసు నమోదు చేశామని చెప్పారు. అరెస్టయిన వారిపై బీఎన్ఎస్ సెక్షన్ 292, 296 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇదీ జరిగింది: ఈ నెల 12వ తేదీ రాత్రి బావాయిపాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లులో వాకమూడి ఇంద్రకుమార్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ వేడుకలకు హాజరైన వారిలో పలువురు మద్యం సేవించారు. భీమవరానికి చెందిన ఇద్దరు హిజ్రాలతో కలిసి అశ్లీల నృత్యాలు చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు ఈ నృత్యాలను మిల్లులో ఉన్న ధాన్యం బస్తాల పైనుంచి సెల్ఫోన్లో రహస్యంగా చిత్రీకరించి, బుధవారం సోషల్ మీడియాలో పెట్టినట్లు చర్చ జరుగుతోంది. ఈ విషయం తెలిసి జనసేన నేతలు టీడీపీ వారిపై ఆగ్రహంతో ఉన్నారు. ఇదే తొలిసారి: ఈ ప్రాంతంలో ఇలా అశ్లీల నృత్యాలు నిర్వహించడం ఇదే తొలిసారి. ఇదే కొనసాగితే జనసేన నాయకుల ఆగడాలు ఎలా ఉంటాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి వారిని ప్రోత్సహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు వైఖరిని నియోజకవర్గ ప్రజలు తప్పుపడుతున్నారు. మరోపక్క ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన ఇంద్రకుమార్‌ను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ఆ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మల దొరబాబు ప్రకటించారు. -
కాబోయే భర్తతో కలిసి పీవీ సింధు డ్యాన్స్ ప్రాక్టీస్(ఫొటోలు)
-
నృత్యంతో సేవ చేస్తున్న భారత సంతతి యువ కళాకారిణి
18 ఏళ్ల నర్తకి విశాఖ విజన్ 2020కి సహాయం చేయడానికి ఈ యేడాది నవంబర్ చివరిలో ఆస్ట్రేలియాలో భరతనాట్యాన్ని ప్రదర్శించింది. విశాఖ ప్రస్తుతం ప్రతిష్టాత్మక వాపా (వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్)లో బ్యాచిలర్ ఆఫ్ డ్యాన్స్ అభ్యసిస్తోంది. భారతదేశంలో చిదంబరం ఖసురేష్, షీజిత్ కృష్ణ, బ్రాగా బెస్సెల్ల వద్ద భరతనాట్యంలో శిక్షణ పొందింది.ఆస్ట్రేలియాలో పుట్టిపెరిగిన విశాఖ భారతీయ నృత్యాన్ని జీవిత లక్ష్యంగా మార్చుకుంది. భారతీయ మూలాలుండటం వల్ల తనలో శాస్త్రీయ నృత్యం శ్వాసగా మారిపోయింది అంటోంది. ‘భావోద్వేగ మేల్కొలుపు – నవరస మోహన’ అనేది మన రోజువారీ పరస్పర చర్యలను ప్రభావితం చేసే, నిర్దేశించే భావోద్వేగాల తొమ్మిది వ్యక్తీకరణలపై ఆధారపడింది. వీటిని విశాఖ పుణికి పుచ్చుకుంది. సామాజిక మేల్కొలుపును కలిగించేలా ‘నిస్వార్ధ జీవి చెట్టు’ గురించి తన ప్రదర్శనలో వర్ణించింది.113 ఏళ్ల వృద్ధురాలు తిమ్మక్క, చెట్లతో ఆమెకు ఉన్న అనుబంధం ఈ కథనంలో అల్లుకుపోయింది. కళా ప్రక్రియలలో విస్తరించిన అద్భుతమైన భాగంగా దీనిని చెప్పవచ్చు. ఇది సామాజిక సందేశాన్ని దాని ప్రధాన భాగంలో ప్రసారం చేయడంలో శైలులు, భాష, ఫార్మాట్లను మిళితం చేసింది. ఆహ్లాదకరంగా ఉండటంతోపాటు ఆలోచింపజేసేటటువంటి, ప్రక్రియలో సరిహద్దులను చెరిపేసింది.‘భారతదేశంలో చెట్లను నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలనే అవగాహన, ప్రతి వ్యక్తి సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం.. ఎప్పుడూ మా ఇంట్లో ఒక మంత్రంగా ఉంటుంది. అందువల్ల ఈ నృత్యం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది’ అని చెబుతుంది విశాఖ. భారతీయ–ఆస్ట్రేలియన్ యువ కళాకారిణిగా ఆమె జీవితంలో భరతనాట్యానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో ఈ సందర్భంగా వివరించింది. పాశ్చాత్య నృత్య సమాజంలో భరతనాట్య నర్తకిగా నన్ను బయటి వ్యక్తిగానే చూసేవారు. కానీ ఇప్పుడు అందరిచేత ‘నృత్యం ఆత్మ ప్రదర్శించే భాష, ఇది కేవలం సమకాలీనమైనది కాదు, ఇది శరీరం, ఆత్మ కదలిక’ అని చెబుతుంది విశాఖ. (చదవండి: అత్యంత అరుదైన పెంగ్విన్..!) -
అక్కినేనివారి కోడలు.. ఆనందంలో స్టెప్పులు అదుర్స్.. వీడియో వైరల్!
ఇటీవలే అక్కినేనివారి ఇంట పెళ్లి వేడుక జరిగింది. ఈనెల 4న అక్కినేని హీరో నాగచైతన్య- హీరోయిన్ శోభిత ధూళిపాళ మెడలో మూడు ముళ్లు వేశారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరిపెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీ తారలు పాల్గొన్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను నాగార్జున తన ట్విటర్ ద్వారా షేర్ చేశారు.అయితే పెళ్లికి ముందు శోభిత డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. పెళ్లి కూతురిగా ముస్తాబయ్యే సమయంలో తెలుగు సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అల్లు అర్జున్ సరైనోడు చిత్రంలోని బ్లాక్‌బస్టర్ బ్లాకబస్టరే అంటూ సాగే పాటకు తనదైన స్టైల్లో చిందులు వేసింది. This video of #SobhitaDhulipala proves happiest brides are the prettiest #NagaChaitanya #viralvideo #GalattaIndia pic.twitter.com/9MUHLG0K35— Galatta India (@galattaindia) December 10, 2024 -
పిల్లలతో కలిసి స్కూల్లో డ్యాన్స్ చేసిన అమ్మ
-
రీలు చేసింది, క్షమాపణ చెప్పింది
-
కొండకోనల్లో నృత్య సౌందర్యం
మాటలు లేని కాలంలో ఆదివాసీలు లయబద్ధంగా వేసిన గెంతులే నేడు ప్రపంచదేశాల్లో గొప్ప నృత్యంగా వెలుగొందుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటైన గిరిజనుల కొమ్ముకోయ నృత్యం అత్యంత పురాతన కళారూపంగా ప్రసిద్ధి చెందింది. కోయ జాతి గిరిజనులు మాత్రమే చేసే ఈ నృత్యం దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది. ఈ నృత్యం పేరు చెబితే చింతూరు మండలంలోని కోయజాతికి చెందిన కళాకారులు గుర్తుకువస్తారు.చింతూరు: సంస్కృతి, సంప్రదాయంలో భాగమైన కొమ్ముకోయ నృత్యంతో తమ ప్రత్యేకతను దేశం నలుమూలలా చాటుతున్నారు కోయజాతికి చెందిన గిరిజన కళాకారులు. ఈ నృత్యం పేరు చెబితే అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని తుమ్మలకు చెందిన గిరిజన కళాకారులు ముందుగా గుర్తుకొస్తారు. సొంత శుభకార్యాలతో ప్రారంభమైన ఈ నృత్యం రాష్ట్రంలో వివిధ పండుగల సందర్భంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఓ భాగమైంది. అనంతర కాలంలో ఇతర రాష్ట్రాల్లో జరిగే సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు కామన్వెల్త్ గేమ్స్, ఐపీఎల్ ప్రారంభం, ముగింపు సంబరాల్లో సైతం ఈ నృత్యం ఎంతో ప్రాచుర్యం పొందింది. 20 బృందాలు... తుమ్మలతోపాటు బుర్కనకోట, సరివెల, వేకవారిగూడెం, సుద్దగూడెం తదితర గ్రామాలకు చెందిన గిరిజన కళాకారులు సైతం ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో సుమారు 20 బృందాల వరకు ఉన్నాయి. ఈవెంట్‌ను బట్టి ఒక్కో బృందంలో 20 నుంచి 40 మంది మహిళలు, పురుషులు ఉంటారు. ⇒ గిరిజన సంస్కృతికి తగ్గట్టుగా దుస్తులు ధరించి పురుషులు అడవి బర్రె కొమ్ములను పోలిన ఆకృతులు, నెమలి ఈకలతో కూడిన తలపాగా చుట్టుకుని, పెద్ద డోలు పట్టుకుని దానిని వాయిస్తూ ఉంటారు. మహిళలు తలకు రిబ్బన్ చుట్టుకుని అందులో ఈకలను పెట్టుకుని, కాళ్లకు గజ్జెలు కట్టుకుని పురుషుల డోలు వాయిద్యానికి అనుగుణంగా నాట్యం చేస్తుంటారు. ముందు నెమ్మదిగా ప్రారంభమయ్యే ఈ నృత్యం క్రమేపీ పుంజుకుంటుంది. ⇒ నృత్యం ముగింపులో పొట్టేళ్ల మాదిరిగా పురుషులు తమ కొమ్ములతో ఒకరినొకరు గుద్దుకోవడం ప్రత్యేక ఆకర్షణ. దుస్తుల అలంకరణ వైవిధ్యంగా ఉంటుంది. పురుషులు ఎర్ర దుస్తులు ధరిస్తే మహిళలు పచ్చ దుస్తులు ధరిస్తారు. సాంస్కృతిక విభాగాల ఆధ్వర్యంలో.. సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దేశంలో, రాష్ట్రంలో జరిగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో కొమ్ముకోయ నృత్య కళాకారుల ప్రదర్శనలకు అవకాశం కల్పిస్తున్నారు. వివిధ పండుగల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా వీరు పాల్గొంటున్నారు. ⇒ మన్యంలో చిత్రీకరించే కొన్ని సినిమాల్లో సైతం కొమ్ముకోయ నృత్య ప్రదర్శనకు చోటు దక్కింది. పుష్ప–2, గేమ్‌చేంజర్, దేవదాసు–2, ఊరిపేరు భైరవకోన, దొంగలబండి, అమ్మాయినవ్వితే.. శ్లోకం వంటి చిత్రాల్లో తమ ప్రదర్శనకు అవకాశం వచ్చినట్టు నృత్య కళాకారులు తెలిపారు.⇒ రోజుకు రూ.వెయ్యి: ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు రవాణా ఖర్చులు, వసతి కల్పించడంతో పాటు ఒక్కొక్కరికీ రోజుకు రూ. వెయ్యి చొప్పున చెల్లిస్తారని వారు పేర్కొన్నారు. ఒకొక్క కళాకారుడు ఏడాదికి సుమారు రూ.20 నుంచి రూ.30 వేల వరకు ఆదాయం పొందుతుంటారు. ⇒ ఎంతో ఖ్యాతి పొందినా కళాకారులు మాత్రం వ్యవసాయం, కూలిపనులపై కూడా ఆధారపడుతుంటారు.ప్రస్థానమిలా..చింతూరు మండలం తుమ్మ లకు చెందిన పట్రా ముత్యం తమ గ్రామానికి చెందిన కొంత మంది కళాకారులతో కలసి ఓ బృందాన్ని ఏర్పాటుచేసి వివిధ పాంతాల్లో ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా కొమ్ముకోయ నృత్య ప్రస్థానం ప్రారంభమైంది. ఆయన మృతి అనంతరం అతని కుమారుడు రమేష్ సంప్రదాయ వృత్తిగా ఈ నృత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఐటీడీఏ సహకరించాలి కొమ్ముకోయ నృత్యం ద్వారా ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను దేశవ్యాప్తంగా చాటుతున్న తమకు సహకారం అందించాలి. ఐటీడీఏ ద్వారా తమకు మరిన్ని అవకాశాలు కల్పిస్తే తాము ప్రదర్శనలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. – పట్రా రమేష్, కొమ్ముకోయ కళాకారుడు, తుమ్మల ఎంతో ఆదరణ ఆదివాసీ సంస్కృతిలో భాగంగా ప్రకృతి ఒడిలో తాము నేర్చుకున్న ఈ నృత్యానికి ఇతర ప్రాంతాల్లో ఎంతో ఆదరణ లభిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ప్రదర్శనల ద్వారా అక్కడి సంస్కృతిని తాము తెలుసుకునే అవకాశం కలుగుతోంది. ప్రభుత్వం నుంచి మాలాంటి కళాకారులకు పూర్తిస్థాయిలో సహకారంఅందించాలి. – వుయికా సీత, కొమ్ముకోయ నృత్య కళాకారిణి -
ఆరు నాట్యరీతుల అద్భుత సమాగమం
ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకేసారి ఒకే వేదికపై ఆరు రకాల నృత్యరీతులను అత్యంత అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకులను రంజింపజేసింది.. అమ్రిత కల్చరల్ ట్రస్టు వారి నాట్యతోరణం కార్యక్రమం. నగరంలోని శిల్పకళావేదికలో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సాగిన ఈ కార్యక్రమానికి ప్రాంగణం సామర్థ్యాన్ని మించి ప్రేక్షకులు రావడంతో మొత్తం కిక్కిరిసిపోయింది. భరతనాట్యం, కూచిపూడి, మోహినీ అట్టం, కథక్, ఒడిస్సీ, ఆంధ్రనాట్యం లాంటి నృత్యరీతులకు చెందిన కళాకారిణులు ఒక్కో విభాగంలో 6 నుంచి 10 మంది చొప్పున తమ తమ నాట్యాలను ప్రదర్శించారు. అనంతరం మొత్తం కళాకారిణులు అందరూ కలిసి ఒకేసారి చేసిన జుగల్బందీ ప్రేక్షకులను కట్టిపడేసింది.ప్రముఖ నాట్యగురువులు కళాకృష్ణ (ఆంధ్రనాట్యం), అనితా గుహ (భరతనాట్యం), చావలి బాల త్రిపురసుందరి (కూచిపూడి), నీనా ప్రసాద్ (మోహినీ అట్టం), శామా భాటే (కథక్), బిచిత్రానంద స్వైన్ (ఒడిస్సీ), పేరిణి కుమార్ (పేరిణి నాట్యం-ఆంధ్రనాట్యం) తదితరుల సారథ్యంలో ఈ కళాకారులంతా తమ తమ ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. అమ్రిత కల్చరల్ ట్రస్టును పగడాల రాజేష్, భార్గవి దంపతులు ప్రారంభించారు. దీని యాజమాన్య కమిటీలో సీతా ఆనంద్ వైద్యం, రేవతి పుప్పాల, సురేంద్రనాధ్ తదితర దిగ్గజాలు ఉన్నారు.భారతీయ సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ... అన్ని ప్రాంతాలకు చెందిన నృత్య కళారీతులను ప్రోత్సహించేలా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు అమ్రిత కల్చరల్ ట్రస్టును అభినందించకుండా ఉండలేకపోతున్నామని కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలంగాణ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజా రామయ్యర్, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, ఆదాయపన్ను శాఖ మాజీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ పి.వి. రావు అన్నారు. నృత్య ప్రదర్శనల్లో పాల్గొన్న కళాకారిణులందరికీ ఈ రంగంలో అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి టీవీ నరసింహారావు, పద్మశ్రీ పద్మజారెడ్డి, కోటి సూర్య ప్రభ, శిల్పారెడ్డి, టీవీ9 రజనీకాంత్, పద్మశ్రీ ఉమామహేశ్వరి, మాదాల రవి, ఆశ్రిత వేముగంటి తదితరులు పాల్గొన్నారు.(చదవండి: Mouni Roy:కథక్‌తో ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. మెస్మరైజ్ చేసిన నటి) -
ఎల్లో చీరలో ’క్రష్మిక’ లుక్, ఆ స్టయిలే వేరు సామి (ఫోటోలు)
-
డబ్బు కోసం కాదు, మోక్షం కోసం : నృత్యం బాధ నుంచి పుడుతుంది!
‘నృత్యశాస్త్రం నుంచి నృత్యం పుట్టదు. హృదయంలో కలిగే భాధ నుండి ఉద్భవిస్తుంది’ అంటారు కూచిపూడి నృత్యకారిణి, దేవదాసి నృత్యంలో ప్రావీణ్యత గల యశోదా ఠాకోర్. ఇటీవల ఆమె విదేశాల్లో దేవదాసీ నృత్యాన్ని ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కళావంతుల సంఘంచే స్వరపరిచి రూపొందించిన దానిని యశోద మరింత అందంగా ఆవిష్కరిస్తారు. ఒక ప్రేమికురాలు కృష్ణుడిని కోల్పోవడంపై కలిగిన ఆందోళనను అద్భుతంగా వర్ణిస్తుంది. కథానాయిక తనవాడైన వ్యక్తిని పొడవాటి వస్త్రాలతో కట్టివేయాలనే కోరికను అణుచు కుంటూ ఎటూ వెళ్లొద్దని వేడుకోవడాన్ని కళ్లకు కడుతుంది. యు.కెలోని గ్లెన్బర్గ్లో జరిగిన వేడుకలో ప్రదర్శన అనంతరం....ఈ నృత్యం వేరొకరి జీవితంపై రూపొందించిందిదేవదాసీ నృత్యం భారతదేశ చరిత్ర, రాజకీయాలలో ఎలా ప్రధానంగా ఉంటూ వచ్చిందో ఠాకోర్ వివరించారు. ‘భారత శాస్త్రీయ కళలు క్లిష్టమైన పరిస్థితులలో కొన్నిసార్లు అట్టడుగుకు చేరుకున్నాయి. కొన్ని హింసాత్మక చరిత్రలనూ పరిచయం చేశాయి. దక్షిణాదిన వ్యాపించి ఉన్న దేవదాసి సంఘాలు తమ కళతో తరతరాలుగా దేవాలయాలు, జమీందార్లను ఆశ్రయించాయి. దేవదాసీ కళాకారులు తమ కుటుంబ సభ్యులతో వాయిద్యాలతో ప్రదర్శనలను నిర్వహించారు. వారు భూమి, ఆస్తి, ఆభరణాలకు యజమానులు కాకపోయినా సంరక్షకులుగా ఉండేవారు. ఒక కళారూపానికి బాధ్యత వహించే శక్తిమంతమైన ప్రదర్శనకారులు ఇప్పటికీ ఉన్నారు. కానీ సామ్రాజ్యపాలన, కొత్త జాతీయవాద ఎజెండా ఈ ప్రదర్శనకారులకు కఠినమైన రోజులను తెచ్చిపెట్టింది. జాతీయవాద – వలసవాద పితృస్వామ్యాల మధ్య ప్రదర్శన కళలు సంప్రదాయాలలోని లైంగికశక్తితో అణగదొక్కడానికి వ్యవస్థ మొగ్గు చూపింది. మధ్యతరగతి డ్రాయింగ్ రూమ్‌లలో ’సంస్కృతి’ని కొత్తగా చూపడానికి దేశీయ రూపాలను ప్రభావవంతంగా శుద్ధి చేసింది. కోల్‌కతాలోని ఝుమూర్ నృత్య కథలో, కథక్ వంటి నృత్య రూపాల ప్రసిద్ధ చరిత్రలలో కూడా ఇది గమనించవచ్చు. దీంతో దేవదాసీ అవమానకరమైన, బలహీనమైన వ్యక్తిగా ఎదిగింది.హృదయాన్ని కదిలించేలా!లోతుగా చీలి΄ోయిన కుల సమాజంలో బ్రిటీషర్ల కాలంలో ఈ కళలు అక్షర రూపంలోకి వచ్చాయి. 1947లో దేవదాసీ నిర్మూలన చట్టం రావడంతో ఈ కళాకారులు ప్రదర్శన చేసే హక్కును కోల్పోయారు. ప్రదర్శకులుగా వారి శ్రమ, నైపుణ్యం పూర్తిగా కనిపించకుండా పోవడంతో దేవదాసీలు వ్యభిచారంలోకి నెట్టబడ్డారు. పెత్తందార్లు, ΄ోలీసుల నుండి వేధింపులకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఒంటరి మహిళలు కావడంతో వారి కుటుంబాలు అనిశ్చిత పరిస్థితుల్లోకి నెట్టబడ్డాయి. ఒకప్పుడు గౌరవనీయమైన మాతృకగా, అన్నదాతగా ఉన్న దేవదాసీలు ఇప్పుడు లేమితో జీవన ΄ోరాటం చేస్తున్నారు. కడుపులోని కేన్సర్ మెలిపెడుతుంటే ఆకలిని చంపుకోవడానికి బీడీలు కాల్చే మహిళలు నాకు తెలుసు. డబ్బు కోసం కాదు, మోక్షం కోసం నృత్యం చేయాలి... దేవదాసీ నిర్మూలన చట్టం వల్ల కొంతమంది మహిళలు తమ కళను కోల్పోతే, మరికొందరు సిగ్గుతో కుటుంబాలను, సంబంధాలను విచ్ఛిన్నం చేసే మార్గాల్లో తమను తాము దూరం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఒక చట్టాన్ని ఆమోదించినప్పుడు ఆ కళ పై ఆధారపడి జీవించే వారికి ఏం జరుగుతుందో ఎవరికీ పట్టదు. దేవదాసీలు ప్రజా జీవితం నుండి తొలగించిన తర్వాత వారి కళ మాత్రం ‘గౌరవనీయమైన’ శరీరాలపై నాటబడింది. మీరు వెళ్లిపొండి, మీ కళను మాత్రం తీసుకుంటాము అన్నట్టుగా చేశారు. ఉన్నత–కులాల పురుషులు ఈ నృత్య రూపాలను స్వీకరించి, ఆధిపత్యం చెలాయించారు. వాటి మూలాలను మాత్రం చెరిపివేశారు. దేవదాసీల ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టి, నృత్యాన్ని మాత్రం ’క్లాసికల్’ నిబంధనలలో ఉంచారు. కళ‘డబ్బు కోసం కాదు, మోక్షం కోసం జీవిస్తుంది. నాట్యం నాట్యశాస్త్రం నుండి రాదు, హృదయం లోని భాధ నుండి ఉత్పన్నం అవుతుంది’ అంటారు యశోదా ఠాకూర్. ఇదీ చదవండి: రంభా ప్యాలెస్ గురించి తెలిస్తే.. ఇప్పుడే టికెట్ బుక్ చేసుకుంటారు! -
నిరసన డ్యాన్సులు..