![Radhika Ambani Dance Moves Going Viral At Best Friend's Sangeet Ceremony](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/Radhikaambani_anant.jpg.webp?itok=RVHLKMZ8)
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కోడలు, అనంత్ అంబానీ భార్య రాధికా అంబానీ తన డ్యాన్స్‌తో అందర్నీ మెస్మరైజ్ చేసింది. బెస్ట్ ఫ్రెండ్ సంగీత్ వేడుకలో రాధిక అంబానీ తనదైన శైలిలో ఆకట్టుకుంది. స్టైలిష్ లుక్‌తో అందర్నీ కట్టి పడేసింది. స్నేహితులు కృష్ణ పరేఖ్, యష్ సింఘాల్ సంగీత్ వేడుకలో అనంత్ అంబానీ,రాధికా అంబానీతో కలిసి తమ స్నేహితులతో కలిసి సందడి చేశారు. అంతేకాదు అనార్కలి డిస్కో చలి అంటూ ప్రెండ్స్‌తో కలిసి సూపర్ స్టెప్పులేసింది రాధిక. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.
రాధికా అంబానీ తన స్నేహితుల బృందంతో కలిసి విలాసవంతమైన సంగీత్ వేడుకలో నృత్యం చేసింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఇటీవల ముంబైలో ట్రైడెంట్ ఒబెరాయ్ హోటల్‌లో జరిగిన విలాసవంతమైన సంగీత్ వేడుకలో 'అనార్కలి డిస్కో చలి'కి తన అద్భుతమైన స్టెప్పులేసింది. 2012 చిత్రం హౌస్‌ఫుల్ 2 మూవీలోని ఈ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఈ వివాహానికి రాధిక అంబానీ స్టైలిష్ లుక్ మరో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. సిల్వర్ కలర్ లెహెంగాలో అందంగా ముస్తాబైంది. డైమండ్ బ్యాంగిల్స్ , చెవిపోగులతో తన లుక్ మరింత గ్రాండ్‌గా ఉండేలా జాగ్రత్తపడింది.
దిల్ ధడక్నే దో చిత్రంలోని గల్లన్ గుడియాన్ లాంటి పాటలకు కూడా ఆమె ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ కనిపించింది. మరో వీడియోలో, ఆమె భర్త అనంత్ అంబానీ, వరుడు యష్ సింఘాల్, వారి స్నేహితులతో కలిసి నృత్యం చేస్తూ కనిపించారు.
ఇదీ చదవండి: సబీర్ భాటియా లవ్ స్టోరీ : స్టార్ హీరోయిన్‌తో లవ్? కానీ పెళ్లి మాత్రం!
కాగా వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ చ శైలా మర్చంట్ దంపతుల కుమార్తెరాధికా మర్చంట్. అలాగే అంబానీముఖేష్ , నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీని ప్రేమించి పెళ్లి చేసుకుంది.వివాహం తర్వాత తన అంబానీ ఇంటి పేరుతో కలిపి రాధికా అంబానీగా మారిపోయింది. యూరప్‌లో క్రూయిజ్‌తో సహా రెండుసార్లు ప్రీ వెడ్డింగ్ వేడుకల పాటు గత ఏడాది జూలై 12న అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇది "ఇండియాస్ వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్"గా నిలిచింది. ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక డిసెంబరులో రిలీజ్ చేసిన " మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ 2024" జాబితాలో అనంత్-రాధికా అంబానీ కపుల్‌ని చేర్చడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment