Wedding
-
భార్యని పరిచయం చేసిన హీరో శ్రీసింహా
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహా పెళ్లి చేసుకున్నాడు. దుబాయిలో డిసెంబర్ 14న డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. నటుడు, రాజకీయ నాయకుడు మురళీమోహన్ మనవరాలు రాగ మాగంటితో సింహా కొత్త జీవితం ప్రారంభించాడు. పెళ్లి ఫొటోలు అనధికారికంగా కొన్ని బయటకొచ్చాయి. కానీ ఇప్పుడు శ్రీ సింహా స్వయంగా తన భార్య గురించి స్పెషల్ పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు: అల్లు అర్జున్)'ఇప్పటికి ఆరేళ్లయింది. ఎప్పటికీ ఇలానే' అని రాసిపెట్టడంతో పాటు 'రాసిపెట్టుంది' అని య్యాష్ ట్యాగ్ ఒకటి పెట్టాడు. దీనిబట్టి చూస్తుంటే గత ఆరేళ్లుగా రాగ మాగంటితో ప్రేమలో ఉన్న శ్రీ సింహా.. కొన్నాళ్ల క్రితం పెద్దల్ని ఒప్పించాడు. కొన్నిరోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగ్గా.. ఈ నెల 14న దుబాయిలోని ఓ ఐలాండ్‌లో పెళ్లి జరిగింది. ఇందులో రాజమౌళి డ్యాన్స్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి.మురళీ మోహన్‌కు కొడుకు రామ్ మోహన్ కుమార్తె రాగ. విదేశాల్లో బిజినెస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం రాగ కూడా తన కుటుంబానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటోంది. శ్రీసింహ విషయానికి వస్తే 'యమదొంగ' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాడు. 'మత్తు వదలరా' రెండు చిత్రాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్ తదితర సినిమాల్లోనూ హీరోగా నటించాడు. కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవకు ఇంకా పెళ్లి కాలేదు. ఈలోపే చిన్నబ్బాయికి పెళ్లి జరిగిపోయింది.(ఇదీ చదవండి: సినిమా వాళ్లు స్పెషలా?: సీఎం రేవంత్) View this post on Instagram A post shared by Sri Simha Marakathamani (@simhakoduri) -
రాయల్‌గా రాజస్తానీ టచ్‌తో
సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు ఆదివారం వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. పారిశ్రామికవేత్త వెంకట దత్తసాయిని సింధు పెళ్లాడుతున్నారు. రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో ఈ పెళ్లి జరుగు తోంది. ఉదయ్ సాగర్ సరస్సు మధ్యలో ఉన్న ప్రముఖ లగ్జరీ హోటల్ ‘రఫల్స్’ను సింధు పెళ్లి కోసం ప్రత్యేకంగా సిద్ధం చేశారు. రాజసం ఉట్టిప డేలా పెళ్లి వేదికను అలంకరించారు. అతిధులను వేదికకు తీసుకువచ్చే పడవలను కూడా ప్రత్యేక రీతిలో తీర్చిదిద్దారు. డెకరేషన్ అంతా రాజస్తానీ శైలిలో సంప్రదాయం, రాజసాల మేళవింపుగా ఉందని చెబుతున్నారు. విందులోనూ మేవారీ రుచులతో కూడిన రాజస్తానీ వంటకాలను వడ్డించినట్లు తెలిసింది. వధూవరుల కుటుంబ సభ్యు లు, అత్యంత సన్నిహితుల మధ్య మూడు రోజులపాటు సాగే ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా శుక్రవారం ‘హల్దీ’సంబరాలు నిర్వహించగా, శనివారం ‘మెహందీ, సంగీత్’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం ‘వరమాల’కార్యక్రమం జరుగుతుంది. రాత్రి 11.30 గంటల ముహూర్త సమయాన సంప్రదాయ రీతిలో పెళ్లి తంతును నిర్వహిస్తామని సింధు తండ్రి పీవీ రమణ వెల్లడించారు. తమ వివాహానికి ప్రధాని సహా దేశవ్యాప్తంగా పలు వురు ప్రముఖులను సింధు కుటుంబం ఆహ్వానించింది. అయితే పెళ్లికి పరిమిత సంఖ్యలో ఆత్మీ యులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది.మంగళవారం నాడు హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరు కానున్నారు. ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడ ల్లో రెండు పతకాలు, వరల్డ్ చాంపియన్‌షిప్ సహా పలు అగ్రశ్రేణి టోర్నీల్లో విజేతగా నిలిచిన సింధు.. భారత బ్యాడ్మింటన్‌లో అతి పెద్ద స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా కాలంగా స్నేహం..సింధు, దత్తసాయి కుటుంబాల మధ్య చాలా కాలంగా స్నేహం ఉంది. ఇటీవలే వీరి పెళ్లిని ఇరు కుటుంబాలు ఖాయం చేశాయి. హైదరా బాద్‌కు చెందిన డేటా మేనేజ్మెంట్ సొల్యూ షన్ సంస్థ ‘పొసి డెక్స్ టెక్నాలజీస్’ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా దత్తసాయి పని చేస్తున్నారు. ఆయన తండ్రి, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్ ఎస్)లో ఉన్నతాధికారిగా పని చేసి రిటైర్ అయిన జీటీ వెంకటేశ్వర రావు.. ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. పొసిడెక్స్ టెక్నాలజీస్ ఇటీవలి వరకు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ‘ధరణి’పోర్టల్‌ను నిర్వహించింది. డేటా సైన్స్‌లో మాస్టర్స్ చేసిన దత్తసాయి స్వయంగా క్రీడాభిమాని. జేఎస్ డబ్ల్యూ సంస్థలో పని చేసినప్పుడు ఐపీఎల్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంబంధించిన ఆపరే షన్స్‌ను దత్తసాయి పర్యవేక్షించాడు. జనవరి నుంచి సింధు వరుసగా వేర్వేరు టోర్నమెంట్లలో పాల్గొనే అవకాశం ఉండటంతో డిసెంబర్లోనే పెళ్లి చేయాలని నిర్ణయించారు. -
సోనియా పెళ్లిలో బిగ్‌బాస్ 8 సెలబ్రిటీస్.. మొత్తం రచ్చ రచ్చ (ఫొటోలు)
-
సందేహాలను నివృత్తి చేసే.. దుల్హా–దుల్హన్
గతంలో పెళ్లి జరగాలంటే వధూవరులను పెద్ద నాన్నలు, బాబాయ్‌లు, మామలు, పెద్దమ్మలు, మేనత్తలు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి అబ్బాయి లేదా అమ్మాయి నచి్చతే వారి గుణగణాలు తెలుసుకొని కుటుంబ పరిస్థితి తెలుసుకొని పెళ్లి జరిపించేవారు. వివాహం జరిగిన తర్వాత భర్తతో ఎలా మసలుకోవాలి?, అత్తగారింట్లో ఎలా ఉండాలి? ఇలాంటివన్నీ అమ్మమ్మలు, తాతలు, నానమ్మలు కొత్తగా పెళ్లయిన వారికి చెప్పేవారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కరువై యాంత్రిక జీవనం కొత్తగా పెళ్లయిన వారినే కాకుండా పెళ్లికి ముందు కూడా వధూవరులను, పెళ్లి తర్వాత భార్యా, భర్తలను మనస్పర్థలకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టోలిచౌకిలో నివసించే ఇలియాస్ షంషి అనే వ్యక్తి ‘దుల్హా–దుల్హన్’ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చాడు. దీని గురించిన మరిన్ని విశేషాలు..! టోలిచౌకి బాల్‌రెడ్డినగర్ కాలనీలో ఏర్పాటు చేసిన దుల్హా–దుల్హన్ ఫ్యామిలీ ఇన్స్టిట్యూట్కు మంచి స్పందన లభిస్తోంది. ఈ ఇన్స్టిట్యూట్లో కొత్తగా పెళ్లి చేసుకోబోయేవారు ఎలా ఉండాలి అనే దానిపై 15 అంశాల్లో నిర్వాహకుడు ఇలియాస్ షంషి శిక్షణ ఇస్తున్నారు. హైదరాబాద్‌లోనే కాకుండా బెంగళూరు, చెన్నై, గుజరాత్, ఢిల్లీ, కోల్‌కతాతో పాటు దుబాయ్, కెనడా, అమెరికాలో కూడా షంషి ప్రారంభించిన ఆన్లైన్ క్లాస్‌లకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. పెళ్లంటే ఏంటి?, పెళ్లిలో మంత్రాల అర్థం ఏంటి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి?, పెళ్లి ఎందుకు?, బాధ్యతలు, భర్తతో మనస్పర్థలు వస్తే వాటిని ఎలా పరిష్కరించుకోవాలి?, భార్య అంటే ఎలా ఉండాలి?, భర్త చేయాల్సినవి, చేయకూడనివి ఏంటి?, మీరు మంచి భర్తగా ఎలా ఉండొచ్చు తదితర అంశాలపై షంషి శిక్షణ ఇస్తున్నారు. సందేహాలను నివృత్తి చేస్తూ.. హోమ్ మేనేజ్మెంట్, భర్త మనసును ఎలా గెలుచుకోవాలి, భార్య మనసును ఎలా గెలుచుకోవాలి ఇలాంటివన్నీ ఈ ట్రైనింగ్‌లో భాగమయ్యాయి. పెళ్ళికి ముందు వధూవరులు వస్తే వారు అడిగే ప్రశ్నలకు సందేహాలను నివృత్తి చేస్తూనే పెళ్లి తర్వాత మంచి భర్తగా, లేదా మంచి భార్యగా ఎలా ఉండాలి అన్న అంశాలపై ఈ శిక్షణ కొనసాగుతున్నది.మంచి స్పందన మేం ఈ సంస్థను ఏర్పాటు చేసినప్పుడు స్పందన అంతంత మాత్రంగానే ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ మా సంస్థకు రెస్పాన్స్ పెరుగుతోంది. అమెరికా, దుబాయ్, కెనడా తదితర ప్రాంతాల నుంచి కూడా మేం నిర్వహించే ఆన్లైన్ క్లాస్‌లకు అభ్యర్థులు హాజరవుతున్నారు. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత భార్యా, భర్తల బంధం ఎంత బలంగా ఉండాలో ఈ శిక్షణ ద్వారా సూచిస్తున్నాం. ఇప్పటి వరకూ వేలాది మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. మూడు నెలల పాటు ఈ ఆన్లైన్ శిక్షణ ఉంటుంది. అంతే కాదు బెస్ట్ మదర్ అనిపించుకోవడం ఎలా అన్నదానిపై కూడా మా శిక్షణ కొనసాగుతున్నది. ఇటీవల పెళ్లికి ముందే చిన్న చిన్న విషయాల్లో వధూవరులకు మనస్పర్థలు వచ్చి పెళ్లిళ్లు ఆగిపోతున్న ఘటనలూ చూస్తున్నాం. దుల్హన్ కోర్సులో ఈ విషయాలన్నింటికీ సమాధానాలు లభిస్తున్నాయి. యువతీ, యువకులకు వేర్వేరుగా ఈ క్లాసులు ఉంటాయి. ముఖ్యంగా భార్య, భర్తల బంధం బలంగా ఉండాలంటే ఎలా ఉండాలో చూపిస్తున్నాం. – ఇలియాస్, షంషీ, ట్రైనర్ ఫ్యామిలీ ఇన్స్టిట్యూట్ 2019లో ఏర్పాటు.. ప్రతిరోజూ పాతిక మంది వరకూ ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యే ఈ ఫ్యామిలీ ఇన్స్టిట్యూట్ 2019లో ఏర్పాటైంది. ఇప్పటి వరకూ వేల సంఖ్యలో యువతీ, యువకులకు శిక్షణతో పాటు తగిన సూచనలు జారీ చేశారు షంషి. భార్యా, భర్తల మధ్య ఏదైనా గొడవ వస్తే వాటిని పరిష్కరించే దిశలోనే ఆయన అడుగులు వేస్తున్నారు. ఎవరికైనా ఇలాంటి సలహాలు, సంప్రదింపులు కావాలంటే తమ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావొచ్చు అని కూడా పేర్కొంటునారు. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత మేం చెప్పబోయే అంశాలు ఏమిటి అన్న దానిపై వివరిస్తూ స్పష్టంగా వెబ్సైట్లో పొందుపరిచారు. -
పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. ఫొటోలు వైరల్
ఈసారి బిగ్‌బాస్ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది సోనియా ఆకుల. అయితే హౌస్‌లో ఎక్కువ వారాలు ఉండకుండానే ఎలిమినేట్ అయి బయటకొచ్చేసింది. గతనెలలో నిశ్చితార్థం చేసుకున్న ఈమె.. ఇప్పుడు గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంది. యష్‌తో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ వేడుకకు బిగ్‌బాస్ 8లో పాల్గొన్న కంటెస్టెంట్స్ చాలామంది హాజరయ్యారు. నూతన వధూవరుల్ని దీవించారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)శుక్రవారం రాత్రి రిసెప్షన్ జరగ్గా.. శనివారం వేకువజామున 3 గంటలకు అలా పెళ్లి జరిగింది. బిగ్‌బాస్ ఫ్రెండ్స్ పలువురు రిసెప్షన్ ఫొటోలు పోస్ట్ చేశారు. పెళ్లి ఫొటోలు ఇంకా బయటకు రావాల్సి ఉంది.తెలంగాణలోని మంథనికి చెందిన సోనియా.. యాంకర్, నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆర్జీవీ తీసిన ఒకటి రెండు సినిమాల్లో నటించింది. అలా బిగ్‌బాస్ 8లోకి వచ్చింది. ప్రారంభంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంది. కానీ నిఖిల్-పృథ్వీతో నడిపిన లవ్ ట్రాక్ ఈమెపై విపరీతమైన నెగిటివిటీ తీసుకొచ్చింది. దీంతో ఎలిమినేట్ అయిపోయింది.బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడే తన ప్రియుడు యష్ గురించి బయటపెట్టింది. అతడికి ఆల్రెడీ పెళ్లి అయిందని, కాకపోతే తన భార్యకు విడాకులు ఇచ్చేశాడని.. త్వరలో తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పింది. ఇప్పుడు నవంబర్ 21న నిశ్చితార్థం చేసుకుంది. ఇప్పుడు పెళ్లి చేసుకుంది. వివాహానికి హాజరైన వాళ్లలో జెస్సీ, అమర్ దీప్-తేజస్విని, బేబక్క, రోహిణి, టేస్టీ తేజ, కిరాక్ సీత తదితరులు ఉన్నాయి. బిగ్‌బాస్ 8 విన్నర్ నిఖిల్ మాత్రం మిస్ అయ్యాడు. మరి కావాలనే రాలేదా? లేకపోతే వేరే కారణాల వల్ల మిస్సయ్యాడో!(ఇదీ చదవండి: ఉపేంద్ర 'యూఐ' సినిమా రివ్యూ) View this post on Instagram A post shared by Rohini (@actressrohini) View this post on Instagram A post shared by Tasty Teja (@tastyteja) -
జీవితంలో పెళ్లే చేసుకోనన్న హీరోయిన్.. కీర్తి సురేశ్ గురించి ఏమందంటే? (ఫోటోలు)
-
కీర్తి సురేశ్ పెళ్లికి ఇంతమంది హీరోహీరోయిన్లు వెళ్లారా? (ఫొటోలు)
-
మురళీమోహన్ మనవరాలి పెళ్లిలో ఆర్ఆర్ఆర్ కొరియోగ్రాఫర్ (ఫోటోలు)
-
కర్నూల్లో జగన్ కోసం జన కోలాహలం (ఫొటోలు)
-
పదేళ్ల ప్రణయం తర్వాత పెళ్లి పీటలెక్కిన లవ్‌బర్డ్స్
-
పెళ్లెప్పుడో చెప్పిన 'హనుమాన్' హీరోయిన్
'హనుమాన్' సినిమాతో ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా లాంటి వాళ్లకు బాగానే పేరొచ్చింది గానీ హీరోయిన్ అమృత అయ్యర్‌కి అంత గుర్తింపు రాలేదనే చెప్పాలి. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఈమెకు ఎందుకో సరైన బ్రేక్ దొరకట్లేదు. ఇప్పుడు 'బచ్చలమల్లి' మూవీపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. అల్లరి నరేశ్ హీరోగా నటించిన ఈ సినిమా.. ఈ శుక్రవారం (డిసెంబర్ 20)న థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: 'వరుడు' హీరోయిన్ భానుశ్రీ ఇంట్లో విషాదం)'బచ్చలమల్లి' ప్రమోషన్స్‌లో భాగంగా అమృత అయ్యర్‌కి పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. ఎందుకంటే ఈ ఏడాది తక్కువలో తక్కువ 40 మందికి పైగా సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నారు. రకుల్, నాగచైతన్య, కీర్తి సురేశ్.. ఇలా టాప్ హీరోహీరోయిన్లు చాలామంది పెళ్లి బంధంలో అడుగుపెట్టారు. ఇప్పుడు అమృత కూడా వివాహ చేసుకునేందుకు సిద్ధమే. ఆ విషయాన్నే ఇప్పుడు చెప్పింది.'2025లో కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని మాత్రం అస్సలు చేసుకోను. ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తినే చేసుకుంటా. ఇద్దరిదీ ఒకే ఫీల్డ్ అయితే పెళ్లి తర్వాత సమస్యలు వస్తాయని నా అభిప్రాయం. ఇండస్ట్రీ కాకుండా వేరే ఫీల్డ్ అయితే మాట్లాడుకోవడానికి బోలెడన్ని విషయాలు ఉంటాయి' అని అమృత అయ్యర్ చెప్పింది.(ఇదీ చదవండి: మళ్లీ గాయపడిన స్టార్ హీరో ప్రభాస్) -
క్రిస్టియన్ సంప్రదాయంలోనూ కీర్తి సురేశ్ పెళ్లి (ఫొటోలు)
-
పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో.. దుబాయ్‌లో గ్రాండ్ వెడ్డింగ్
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు, హీరో శ్రీసింహ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. దుబాయ్‌లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో వీరిద్దరు టాలీవుడ్ నటుడు మురళిమోహన్ మనవరాలు రాగా మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. అంతకుముందు ప్రీ వెడ్డింగ్ వేడుక్లలో దర్శకధీరుడు రాజమౌళి డ్యాన్స్ చేస్తూ అలరించారు. దీనికి సంబంధించిన పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా.. శ్రీసింహ విషయానికి వస్తే.. ఇతడు 'యమదొంగ' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్ తదితర సినిమాల్లో హీరోగా యాక్ట్ చేశాడు. 'మత్తు వదలరా' సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. -
శోభిత పెళ్లి ఫోటోలు షేర్ చేసిన సమంత.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ (ఫొటోలు)
-
‘వివాహ ఆహ్వానం’
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ నెల 22న జరిగే తన పెళ్లికి హాజరు కావాల్సిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేసింది. సింధుతో పాటు తల్లిదండ్రులు పీవీ రమణ, విజయ ఆమె వెంట ఉన్నారు. వెంకటదత్తసాయితో రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో సింధు వివాహం జరగనుంది. -
గ్రాండ్‌గా మురళీమోహన్ మనవరాలితో కీరవాణి కొడుకు పెళ్లి వేడుక (ఫోటోలు)
-
వైభవంగా జరిగిన నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం - హాజరైన ప్రముఖులు (ఫోటోలు)
-
చిరకాల ప్రియుడ్ని పెళ్లాడిన నటి, మోడల్ కృతిక అవస్థి (ఫొటోలు)
-
లేడీ లవ్‌తో నిఖా : నటుడి పెళ్లి సందడి (ఫోటోలు)
-
2024లో ఇంతమంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నారా? (ఫొటోలు)
-
Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి ఫోటోలు చూశారా?
-
పెళ్లితో ఒక్కటైన కీర్తి సురేష్, ఆంటోనీ తాటిల్ (ఫోటోలు)
-
గోవాలో కీర్తి సురేశ్ పెళ్లి వేడుక.. ఫోటో పంచుకున్న హీరోయిన్!
హీరోయిన్ కీర్తి సురేశ్ వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. ఈనెల 12న తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు ఆంటోనీ తటిల్‌ను పెళ్లాడనుంది. ఇప్పటికే కీర్తి సురేశ్ తన పెళ్లి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. గోవాలో జరగనున్న వీరి పెళ్లి వేడుకకు సంబంధించి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. తాజాగా కీర్తి సురేశ్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఫోటోను షేర్ చేసింది. ఇప్పటికే ఇరువురి కుటుంబ సభ్యులంతా గోవాలో ల్యాండైనట్లు తెలుస్తోంది. కాగా.. 15 ఏళ్లుగా వీరిద్దరు రిలేషన్లో ఉన్నారు.రెండు సంప్రదాయాల్లో వివాహం..ఇరు కుటుంబాల సమ్మతితో రెండు మతాలను సంప్రదాయాలనూ గౌరవించే విధంగా ఆంటోనీ, కీర్తి సురేష్ వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈనెల 12వ తేదీ ఉదయం హిందూ మత సంప్రదాయ ప్రకారం, అదేరోజు సాయంత్రం చర్చిలో క్రిస్టియన్ మత సాంప్రదాయ ప్రకారం కీర్తి సురేష్, ఆంటోనీ పెళ్లి రెండు సార్లు జరగనుందని తెలిసింది. వీరి వివాహ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం. కాగా.. కీర్తి సురేశ్ ప్రస్తుతం హిందీలో బేబీ జాన్ మూవీతో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. -
పెళ్లి పనుల్లో పీవీ సింధు బిజీ బిజీ.. ఫోటోలు వైరల్
-
పెళ్లి మీది.. ఫండ్ మాది
మన సంస్కృతిలో వివాహానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. జీవితాన్ని మలుపు తిప్పే అతి ముఖ్యమైన పెళ్లి వేడుక చిరకాలం గుర్తుండిపోయేలా నిర్వహించుకోవలాన్న ఆకాంక్ష పెరుగుతోంది. కలిగిన కుటుంబాలు సహజంగానే పెళ్లిళ్లకు ఘనంగా ఖర్చు చేస్తుంటాయి. ఆ మధ్య రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తన చిన్న కుమారుడి వివాహానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారో గుర్తుండే ఉంటుంది. అంబానీ రేంజ్ కాకపోయినా.. తమ పరిధిలో భారీ బడ్జెట్‌తో వివాహం చేసుకునేందుకు ఎక్కువ మంది ముందుకొస్తున్న ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.మిలీనియల్స్ (1981–1996 మధ్య జన్మించిన వారు), జెనరేషన్ జెడ్ (1996–2009 మధ్య జన్మించిన వారు) యువతీయువకులు వివాహం విషయంలో కేవలం తల్లిదండ్రుల ఆర్థిక సామర్థ్యంపైనే ఆధారపడాలని అనుకోవడం లేదని ఇండియాలెండ్స్ సర్వేలో వెల్లడైంది. వ్యక్తిగత రుణం (పర్సనల్ లోన్) తీసుకుని, బాలీవుడ్ స్టైల్లో లేదా డెస్టినేషన్ వెడ్డింగ్ (తమకు నచ్చిన వేరే ప్రాంతంలో)కు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా 20 పట్టణాల పరిధిలో వివాహంపై 1,200 మంది మిలీనియల్స్ అభిప్రాయాలను ఇండియాలెండ్స్ సర్వే తెలుసుకుంది.42 శాతం మంది తమ వివాహానికి తామే సొంతంగా నిధులు సమకూర్చుకోవాలనే ప్రణాళికతో ఉన్నట్టు తెలిసింది. ఇందులోనూ 41 శాతం మంది తమ పొదుపు నిధులను వాడుకోవాలని అనుకుంటుంటే.. 26 శాతం మంది పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. మరో 33 శాతం మంది పెళ్లి ఖర్చు విషయంలో ఇంకా ఎలాంటి ప్రణాళికతో లేనట్టు వెల్లడైంది. ఇప్పటికీ 82 శాతం పెళ్లిళ్లు వ్యక్తిగత పొదుపు సొమ్ములతోనే పూర్తవుతుండగా.. ఆస్తులు విక్రయించి 6 శాతం మేర, మరో 12 శాతం పెళ్లి వేడుకలు అప్పులతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెళ్లిళ్ల సర్వే వివరాలతో ‘వెడ్డింగ్ స్పెండ్స్ రిపోర్ట్ 2.0’ను ఇండియాలెండ్స్ విడుదల చేసింది.ముందుకొస్తున్న సంస్థలు..వివాహాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా భావించడం, ఖర్చుకు వెనుకాడని ధోరణి ఈ మార్కెట్లో బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలకు భారీ అవకాశాలు కలి్పస్తున్నాయి. పెళ్లి సంబంధాలకు వేదిక అయిన మ్యాట్రిమోనీ డాట్ కామ్ దీన్ని ముందే గుర్తించి.. వెడ్డింగ్లోన్ డాట్ కామ్ పేరుతో ఇటీవలే ఒక ప్రత్యేక పోర్టల్ ప్రారంభించింది. వివాహం కోసం వధూవరులు లేదా తల్లిదండ్రులు ఈ ప్లాట్‌ఫామ్ సాయంతో రుణం తీసుకోవచ్చు. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, టాటా క్యాపిటల్, ఎల్అండ్టీ ఫైనాన్స్‌తో ఈ సంస్థ జట్టుకట్టింది.‘‘అన్సెక్యూర్డ్ పర్సనల్ రుణాల్లో 25–30 శాతం మేర వివాహాల కోసమే తీసుకుంటున్నట్టు మా అధ్యయనంలో తెలిసింది. గడిచిన రెండేళ్లలో ఈ డిమాండ్ 20 శాతం మేర పెరిగింది’’అని మ్యాట్రిమోనీ డాట్ కామ్ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ ఝా తెలిపారు. యాక్సిస్ బ్యాంక్ అయితే తనఖా లేకుండానే వివాహ రుణాలు అందిస్తోంది. సులభతర చెల్లింపులతో ఆన్లైన్లో రుణాలను మంజూరు చేస్తున్నట్టు బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ అర్జున్ చౌదరి చెప్పారు. వెడ్డింగ్లోన్ డాట్ కామ్ ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం, పర్సనల్ లోన్స్, రివాల్వింగ్ క్రెడిట్ లైన్ పేరుతో 3 రకాల ఉత్పత్తులను ఆఫర్ చేస్తోంది. ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం అన్నది రుణ గ్రహీత సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాతో అనుసంధానమై ఉంటుంది.పెరిగిపోయిన వ్యయాలు వివాహాలకు ఖర్చులు పెరిగిపోతుండడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. 68 శాతం మంది రూ.లక్ష నుంచి రూ.5 లక్షల మధ్య రుణం తీసుకోవాలని అనుకుంటున్నారు. సగటు వివాహ వేడుక వ్యయం రూ.36.5 లక్షలకు పెరిగినట్టు ‘వెడ్‌మీగుడ్’ అనే వెడ్డింగ్ ప్లానర్ చెబుతోంది. ఇక డెస్టినేషన్ వెడ్డింగ్ వేడుక కోసం చేసే ఖర్చు రూ.51 లక్షలకు పెరిగినట్టు తెలిపింది. 2023తో పోలి్చతే ఈ వ్యయాలు 7 శాతం వరకు పెరిగాయి. ముఖ్యంగా కల్యాణ మంటపం, క్యాటరింగ్ చార్జీలు 10 శాతం వరకు పెరిగాయి. పెళ్లి ఘనంగా చేసుకునేందుకు నిధుల లోటును అడ్డంకిగా మెజారిటీ యువతరం భావించడం లేదు. రుణాల లభ్యత పెరిగిపోవడమే ఇందుకు కారణం. మారిన ధోరణి.. గతంలో తెలిసిన వారి వద్ద, స్థానిక రుణదాతల నుంచి వివాహం కోసం అప్పు తీసుకునే వారు. ఇప్పుడు ఈ మార్కెట్ సంఘటితంగా మారి బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల వైపు మళ్లుతోంది – ప్రవీణ్ ఖండేల్వాల్, సీఏఐటీ వ్యవస్థాపకులురూ.15,000 ఆదాయం ఉంటే చాలు.. నెలవారీ రూ.15,000 ఆదాయం ఉన్న వారు సైతం రూ.50,000 నుంచి రూ.40 లక్షల వరకు రుణాలు పొందొచ్చని యాక్సిస్‌బ్యాంక్ అధికారి తెలిపారు. వివాహ రుణాలపై వడ్డీ రేటు 10 శాతం నుంచి ప్రారంభమవుతోంది.