sangeet Ceremony
-
అద్భుత క్యాప్షన్‌తో సంగీత్ ఫొటోలు షేర్ చేసిన పీవీ సింధు (ఫోటోలు)
-
అనురాగ్ కశ్యప్ కూతురి సంగీత్ వేడుక..ప్రముఖుల సందడి (ఫోటోలు)
-
Sai Pallavi: పూజా కన్నన్ సంగీత్.. చెల్లితో కలిసి చిందేసిన సాయిపల్లవి (ఫోటోలు)
-
Justin Bieber: అనంత్-రాధికలతో స్టార్ సింగర్ హ్యాపీ మూమెంట్స్ (ఫోటోలు)
-
అనంత్ అంబానీ సంగీత్ వేడుకలో జాన్వీ కపూర్ (ఫొటోలు)
-
అనంత్ అంబానీ వేసుకుంది మామూలు డ్రెస్ కాదు! తెలిస్తే..
త్వరలో పెళ్లి చేసుకోబోతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ సంగీత్ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి అంబానీ స్నేహితులు, బంధువులతో పాటు, సినీ తారలు, క్రికెటర్లు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.సంగీత్ వేడుకలో కనిపించిన అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ ఇద్దరూ కూడా ప్రత్యేకమైన దుస్తులతో కనిపించారు. ఇవి మాస్టర్ కౌచర్స్ అబూ జానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన దుస్తులని తెలుస్తోంది. అనంత్ అంబానీ ధరించిన జాకెట్ బంగారంతో తయారైనట్లు తెలుస్తోంది. రాధిక మర్చెంట్ ధరించిన ఆఫ్ షోల్డర్ బ్లౌజ్, లెహంగా స్వరోవ్స్కి స్ఫటికాలతో అలంకరించారు.#WATCH | Anant Ambani and Radhika Merchant arrive at Jio World Centre in Mumbai for their 'Sangeet ceremony' pic.twitter.com/yzODKut59g— ANI (@ANI) July 5, 2024జూలై 12న ముకేశ్, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక వివాహం జరగనుంది. జూలై 14 వరకు వీరిద్దరి వివాహ వేడుకలు జరగనున్నాయి. వీరి పెళ్ళికి పలువురు పారిశ్రామిక వేత్తలు, ఇతర సెలబ్రిటీలు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. -
అనంత్ అంబానీ-రాధిక సంగీత్‌లో మెరిసిన బ్యూటీ క్వీన్స్
-
సంగీత్‌లో అదిరిపోయే స్టెప్పులేసిన అంబానీ కుటుంబం
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహ వేడుకల్లో భాగంగా ఇటీవల అంబానీ కుటుంబం ఘనంగా సంగీత్ జరుపుకుంది. ఈ సందర్భంగా ఇంటిల్లిపాది సభ్యులు డ్యాన్స్‌తో సందడి చేశారు. ఈ మేరకు విడుదలైన ఒక వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.అనంత్-రాధికల వివాహం జులై 12న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. జులై 13న ‘శుభ్ ఆశీర్వాద్’, జులై 14న ‘మంగళ్ ఉత్సవ్’ కార్యక్రమంతో వేడుకలు ముగియనున్నాయి. త్వరలో పెళ్లి పీటలెక్కే జంట ఇప్పటికే రెండుసార్లు అంగరంగ వైభవంగా ప్రీవెడ్డింగ్ వేడుకలు నిర్వహించుకుంది. ఇటీవల ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు దాదాపు 4500 కిలోమీటర్లు క్రూయిజ్‌లో ప్రయాణిస్తూ రెండో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. గతంలో ఈ జంట జామ్‌నగర్‌లో తమ మొదటి ప్రీవెడ్డింగ్ వేడుకలను జరుపుకున్నారు. ఇటీవల అంబానీ కుంటుంబం 50 పేద జంటలకు సామూహిక వివాహాలను కూడా జరిపించింది. అందుకు అవసరమైన పూర్తి ఖర్చులను భరించింది. వివాహాల అనంతరం కొత్త జంటలకు అవసరమయ్యే ఇంటి సామగ్రిని అందించింది.ఇదీ చదవండి: దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు రిలయన్స్ సిద్ధం..? -
అనంత్- రాధిక సంగీత్: జంటగా మెరిసిన క్రికెటర్లు.. హార్దిక్ మాత్రం ఒంటరిగా! (ఫోటోలు)
-
వరలక్ష్మి శరత్‌కుమార్ - నికోలయ్ సచ్దేవ్ సంగీత్ వేడుకల్లో ప్రముఖులు (ఫోటోలు)
-
'అనంత్, రాధిక' సంగీత్ ఫంక్షన్.. సందడి చేసిన ప్రముఖులు (ఫోటోలు)
-
అనంత్-రాధిక సంగీత్.. అదరగొట్టేందుకు స్టార్ సింగర్ రెడీ
అనంత్ అంబానీ, రాధి మర్చెంట్ వివాహ వేడుకలు ఇప్పటికే మొదలైపోయాయి. ఇటీవలే మామేరు సెలబ్రేషన్స్ పూర్తయ్యాయి. ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం సంగీత్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో యుఎస్ సింగర్ జస్టిన్ బీబర్ ప్రదర్శన ఉంటుంది. సంగీత్‌లో పాటలు పాడేందుకు బీబర్ రూ.83 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.ఈ రోజు సాయంత్రం జరగనున్న సంగీత్ కార్యక్రమంలో పాటలు పాడటానికి బీబర్ ముంబై చేరుకున్నారు. దీనికి సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో బీబర్ గులాబీ రంగు స్వెట్‌షర్ట్, ఎరుపు రంగు బకెట్ టోపీని ధరించి ఉండటం చూడవచ్చు.అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లిఅనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి ఈ నెల 12న పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే శుక్రవారం సాయంత్రం ముంబైలోని బీకేసీలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో సంగీత్ నిర్వహించనున్నారు. దీనికి కుటుంబం, బాలీవుడ్ ప్రముఖులతో పాటు ఇతర సెలబ్రిటీలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
పెళ్లికూతురు గారి రోలర్ స్కేట్స్ డ్యాన్స్
‘పెళ్లి కూతురు డ్యాన్స్’ అనేది మనకు కొత్తేమీ కాదు. అయితే అస్సాంకు చెందిన అమ్రిన్ ఖురానా ఒక అడుగు ముందుకు వేసి రోలర్ స్కేట్స్ ధరించి చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. ‘బార్ బార్ దేఖో’ సినిమా లోని ‘ఆస్మాన్’ పాటకు ఆమె చేసిన డ్యాన్స్‌కు నెటిజనులు ఫిదా అయ్యారు. ‘ఆల్ ఎబౌట్ డ్యాన్స్’ అనే డ్యాన్స్ స్కూల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో తక్కువ టైమ్‌లోనే 1.7 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘మైండ్ బ్లోయింగ్’ ‘ఎనర్జీ ప్యాక్డ్ డ్యాన్స్’ ‘బ్రైడ్ ఆన్ వీల్స్’... ఇలాంటి కామెంట్స్ మాట ఎలా ఉన్నా ‘పెళ్లి సమయంలో ఇలాంటి ప్రయోగాలు చేసి ప్రమాదాలు కొని తెచ్చుకోవడం ఎందుకు!’ అని మందలించిన వారు కూడా ఉన్నారు. -
శర్వానంద్ పెళ్లి వేడుకల్లో రామ్ చరణ్ సందడి.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, రక్షితా రెడ్డిల పెళ్లి వేడుక ఘనంగా జరుగుతోంది. రాజస్థాన్‌లో జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటి కానుంది. వీరి పెళ్లి వేడుకలకు లీలా ప్యాలెస్‌ను అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. అంతకుముందే కాబోయే వధూవరులిద్దరి కుటుంబాలు పెళ్లి సంబరాల్లో మునిగి తేలారు. (ఇది చదవండి: ‘మేమ్ ఫేమస్' నటుడిగా మంచి గుర్తింపుని ఇచ్చింది: కిరణ్ మచ్చ) శుక్రవారం రాత్రి జరిగిన హల్దీ, సంగీత్ వేడుకల్లో పలువురు తారలు కూడా పాల్గొన్నారు. శర్వానంద్ క్లోజ్ ఫ్రెండ్ రామ్ చరణ్ కూడా సంగీత్‌కు హాజరైన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. జైపూర్‌లో జరుగుతున్న ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు శర్వానంద్ స్నేహితులు రామ్ చరణ్, అఖిల్ అక్కినేని, రానా దగ్గుబాటితో పాటు పలువురు తారలు హాజరైనట్లు తెలుస్తోంది. కాగా.. శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే.. అతడు చివరగా ఒకే ఒక జీవితం చిత్రంలో నటించాడు. ప్రస్తుతం ఈ హీరో టాలెంటెడ్ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. (ఇది చదవండి: శర్వానంద్ పెళ్లి సందడి షురూ.. హల్దీ వేడుక వీడియో వైరల్) #RamCharan at his best friend #sharwanand wedding 🤩🤩 @alwaysramcharan pic.twitter.com/DENC7Fbhf8 — Telugu Box office (@TCinemaFun) June 2, 2023 Ram Charan at #Sharwanand and Rakshita 's Sangeet function 😍❤️#SharwaRakshitaWedding @ImSharwanand pic.twitter.com/37pcknNccz — ❤️ (@RakeShPrabhas20) June 2, 2023 Man Of The Masses @AlwaysRamCharan 🦁 Joined his Best Buddy @ImSharwanand's Wedding at JAIPUR ❤️✨🤩#GameChanger #SharwaRakshithaWedding pic.twitter.com/etjM8U1aNp — 𝐀𝐤𝐚𝐬𝐡𝐡 𝐑𝐂™ (@AlwaysAkashRC) June 2, 2023 #Congress TPCC State General Secretary Patel Ramesh Reddy Family With Man Of Masses #RamCharan 🦁🔥 pic.twitter.com/IM7vaIsGD0 — Raees (@RaeesHere_) June 2, 2023 -
కియారా వేసుకున్న ఈ డ్రెస్ డిజైన్ చేయడానికి అన్ని వారాలు పట్టిందా?
బాలీవుడ్ లవ్‌బర్డ్స్ కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హొత్ర ఇటీవలె పెళ్లిపీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్ జైసల్మేర్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో సిద్-కియారాల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇక రీసెంట్గా పెళ్లి, మెహందీ, సంగీత్.. ఇలా ఒక్కో వేడుకకు సంబంధించిన ఫోటోలను కియారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేస్తుంది. తాజాగా సంగీత్ వేడుకలో సిద్ధార్థ్‌తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఆ రాత్రి గురించి ఏం చెప్పాలి.. సమ్‌థింగ్ రియల్లీ స్పెషల్’ అంటూ రాసుకొచ్చింది. ఈ క్రమంలో కియారా అవుట్‌ఫిట్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. కంప్లీట్ గోల్డ్ అండ్ సిల్వర్ రంగులో ఉన్న ఈ లెహంగాకు 98,000కు పైగా క్రిస్టల్స్‌తో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. సుమారు 4,000 గంటలు (దాదాపు 24 వారాలు)కష్టపడి ఈ లెహంగాను తీర్చిదిద్దారు మనీష్ మల్హోత్రా అండ్ టీం.ప్రస్తుతం కియారా సంగీత్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
అతియాశెట్టి- కేఎల్ రాహుల్ సంగీత్ వేడుక.. ఫోటోలు వైరల్
-
పెళ్లి వాయిదా: సంగీత్ జరిపించిన ఫ్రెండ్స్
కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. కానీ కరోనా దెబ్బకు పెళ్లిళ్లు కూడా వాయిదా పడక తప్పట్లేదు. లేదూ.. పెళ్లి జరిగి తీరాల్సిందే అంటే 20 మంది కంటే ఎక్కువ ఉండటానికి వీల్లేదని అధికారులు షరతు విధిస్తున్నారు. దీంతో ఎంతో కోలాహలంగా జరగాల్సిన వివాహాలు గుట్టుచప్పుడుగా జరుగుతున్నాయి. ఇదిలావుంటే ఓ జంట మాత్రం పెళ్లికి ముందు జరగాల్సిన సంగీత్ కార్యక్రమాన్ని కూడా ఎంతో మందితో కలిసి సందడిగా, వైభవంగా జరుపుకుంది. దీనికి పోలీసులు ఎలా అనుమతిచ్చారని ఆశ్చర్యపోకండి. వాళ్లు సంగీత్ జరుపుకుంది ఆన్లైన్లో. గజల్ బవ అనే యువతికి హేమంత్ అనే వ్యక్తితో ఈ వీకెండ్లో వివాహం జరగాల్సి ఉంది. (సంగీత్ వేడుకల్లో బిగ్‌బాస్ భామ) అయితే ప్రస్తుత విషమ పరిస్థితుల వల్ల దాన్ని వాయిదా వేసుకున్నారు. కానీ ఆమె స్నేహితులు మాత్రం సంగీత్ పార్టీ జరగాల్సిందేనని సంకల్పించారు. ఈ తంతుకు ఆన్లైన్ వేదికగా మారింది. ఇంకేముందీ.. ఓ పంజాబీ పాటకు ఎవరింట్లో నుంచి వాళ్లు డ్యాన్స్ చేస్తూ సంగీత్ నిర్వహించారు. దీనిపై కాబోయే పెళ్లికూతురు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ వీడియోను ట్విటర్లో పంచుకుంది. నెటిజన్లు సైతం వారి వర్చువల్ సంగీత్‌ను అభినందించకుండా ఉండలేకపోతున్నారు. (బయటకొచ్చినందునే బతికిపోయారు) -
పెళ్లి వాయిదా: సంగీత్ జరిపించిన ఫ్రెండ్స్
-
హ్యాపీ బర్త్‌డే ఇషా : ‘సంగీత్’ పై ఆసక్తికర వార్త
సాక్షి, ముంబై: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, నీతాల ముద్దుల తనయ ఇషా అంబానీ వివాహం వేడుక అంశం మరోసారి వార్తల్లో కిచ్చింది. త్వరలోనే అంగరంగ వైభవంగా జరగనున్న ఇషా, ఆనంద్ పిరామల్ (ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ పిరామల్ ఇండస్ట్రీస్ చైర్మన్ అజయ్ పిరామల్ తనయుడు)మూడుముళ్ల సంబరానికి ముందస్తు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ఈ కార్పొరేట్ కుటుంబాలు ప్లాన్ చేశాయి. పెళ్లిలో ప్రధాన ఘట్టమైన సంగీత్ ను స్పెషల్ ఎట్రాక్షన్‌తో చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయనున్నాయని మీడియాలో పలు అంచనాలు గుప్పుమన్నాయి. డిసెంబర్ 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించనున్న సంగీత్ కార్యక్రమానికి ప్రముఖ పాప్ సింగర్ ప్రదర్శన ఇవ్వనున్నారట. అంతేకాదు ఇందుకు ఆమె భారీగా పారితోషికాన్ని కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రీ రాయల్ వెడ్డింగ్ బాష్‌ను ఉదయపూర్‌లో ప్లాన్ చేశారట. ప్రముఖ ఇంటర్నేషనల్ పాప్ స్టార్ బియాన్సే ఈ సంగీత్ కార్యక్రమంలో తన ప్రదర్శనతో హల్ చల్ చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకోసం ఆమెకు రూ.15 కోట్లు పారితోషికం ఆఫర్ చేశారని తెలుస్తోంది. కాగా డిసెంబర్10న ముంబైలో వీరు పెళ్లి పీటలెక్కనున్నారట. ఈ లవ్‌బర్డ్స్ నిశ్చితార్థ కార్యక్రమాన్ని గత నెలలో ఇటలీలో అధికారికంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు అక్టోబర్ 23 ఇషా అంబానీ 27వ పుట్టిన రోజు. -
సంగీత్‌లో అదరగొట్టిన చెస్ క్వీన్
సాక్షి, హైదరాబాద్ : చెస్ క్వీన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ హారిక ద్రోణవల్లి పెళ్లి పీటలెక్కుతోంది. రేపు(ఆగస్టు 19న) ఈమె వివాహం అంగరంగ వైభవంగా జరుగబోతుంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సివిల్ ఇంజినీర్ కార్తీక్ చంద్రను ఆమె పెళ్లాడుతోంది. హైదరాబాద్‌లో ఆమె సంగీత్ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. సంగీత్‌లో పాల్గొన్న ప్రముఖులు, సన్నిహితులు, క్లోజ్ ఫ్రెండ్స్ ఆట పాటలతో సందడి చేశారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు సైతం ఆమె కుటుంబ సభ్యులతో పాల్గొని, సంగీత్‌ను ఎంజాయ్ చేశారు. ఈ సంగీత్‌లో చెస్ క్వీన్ వేసిన స్టెపులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. చెక్ క్వీన్ అ..ఆ మూవీలోని ఓ సాంగ్‌కు డ్యాన్స్ వేసి అదరగొట్టారు. ఆహా నా పెళ్లంట.. ఓహోనా పెళ్లంట అనే పాటలకే వేసిన డ్యాన్స్‌లు కూడా సంగీత్‌ను సూపర్బ్ అనిపించాయి. హారిక జనవరి 12న గుంటూరులో జన్మించింది.చిన్నప్పటి నుంచే చెస్‌పై ఇష్టం పెంచుకున్న హారిక అద్భుతంగా రాణించింది. అండర్-9 నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించింది. ఆ తర్వాత పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఎన్నో పతకాలు సాధించింది. 2008లో జూనియర్ ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన హారిక.. 2011లో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా సంపాదించింది. కామన్వెల్త్, ఆసియా చాంపియన్‌గా కూడా నిలిచిన హారిక 2012, 2015, 2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలు సాధించింది. కోనేరు హంపి తర్వాత గ్రాండ్ మాస్టర్ హోదాను పొందిన రెండో మహిళా క్రీడాకారిణి రికార్డు కెక్కింది. -
పెళ్లి చేసుకోబోతున్న ప్రముఖచదరంగ క్రీడాకారిణి
-
సంగీత్ వేడుకలో తమన్నా
ముంబై: టాలీవుడ్ అందాల తార తమన్నా భాటియా సోదరుడి మెహందీ ఫంక్షన్లో తళుక్కున మెరిసింది. తమన్నా సోదరుడు, అమెరికాలో డాక్టర్‌గా పనిచేస్తున్న ఆనంద్ భాటియా వివాహం కృతికా చౌదరితో త్వరలో జరగనుంది. ఈ నేపథ్యంలో జూన్29న శుక్రవారం ముంబైలో అత్యంత ఉత్సాహంగా సంగీత్ వేడుక జరిగింది. ఈ సంగీత్ వేడుకలో అమ్మడు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలించింది. మెహిందీ చేతులతో మురిసిపోతూ, గార్జియస్ తమన్నా అభిమానులకు కనువిందు చేసింది. ప్రస్తుతం తమన్నా ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మిల్కీ బ్యూటీ తమన్నా అందం, అభినయంతో తెలుగు, తమిళ, హిందీ భాషలలో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రధానంగా బాహుబలి మొదటి భాగంలో అవంతిక పాత్ర ద్వారా పలువురిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. -
కుమార్తె సంగీత్ వేడుకలో ఇరగదీసిన రాధిక
తమిళసినిమా(చెన్నై): సినీనటి రాధిక కూతురు రెయాన, మిథున్ల వివాహ సంగీత్ వేడుక కార్యక్రమం శుక్రవారం రాత్రి స్థానిక నుంగంబాక్కంలోని తాజ్హోటల్లో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి దక్షిణాది సినీ ప్రముఖులు పులువురు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. లతారజనీకాంత్, భాగ్యరాజ్ పూర్ణిమ, సుహాసిని, త్రిష, రమ్యకృష్ణ, శోభన, మధుబాల, స్నేహ, ప్రసన్న, నమిత, ఐశ్వర్యాధనుష్, దర్శకుడు సుందర్.సి, కుష్బు, జయం రవి, లక్ష్మి మంచు, వెంకటేశ్, శ్రీకాంత్, వందన, శాంత కార్యక్రమానికి హాజరయ్యారు. సంగీత్ వేడుకలో భాగంగా పలువురు సినీతారలు ఉత్సాహంగా డాన్సులు చేశారు. ముఖ్యంగా పెళ్లికూతురి తల్లి రాధిక చేసిన నృత్యాలు అలరించాయి. -
కత్తి పట్టిన క్రికెటర్
రాజ్‌కోట్: గ్రౌండ్‌లోనే కాదు వెలుపల కూడా తాను అదుర్స్ అని టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా నిరూపించుకున్నాడు. ఫంక్షన్లో స్టెప్పులేసి అదరగొట్టాడు. ఇంతకీ ఫంక్షన్ ఎవరిది అంటారా? జడేజాదే. అసలు విషయం ఏంటంటే రీవా సోలంకితో ఇవాళ జడేజా వివాహం జరగనుంది. అందులో భాగంగా శనివారం రాత్రి సంగీత్ వేడుక నిర్వహించారు. జడేజా తనకు కాబోయే భార్యతో కలిసి చిందులేశాడు. అంతేకాదు కత్తితో విన్యాసాలు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఒంటి చేత్తో కత్తిని తిప్పుతూవుంటే అక్కడున్నవారు అతడిపై డబ్బులు విసిరి అభిమానం చాటుకున్నారు. బ్యాట్ తోనే కాదు కత్తితోనూ సత్తా చాటగలనని నిరూపించుకున్నాడు. ఫిబ్రవరి 5న రీవా సోలంకితో జడేజా ఎంగేజ్మెంట్ జరిగింది. ఇవాళ వారిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. ఐపీఎల్ లో గుజరాత్ లయన్స్ ఆడుతున్న జడేజా శనివారం ముంబైతో జరిగిన మ్యాచ్ లో లేడు. 21న సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లోనూ కొత్త పెళ్లికొడుకు ఆడకపోవచ్చని సమాచారం. ఆదివారం సాయంత్రం జరిగే రిసెప్షన్‌కు లయన్స్ జట్టు ఆటగాళ్లు హాజరయ్యే అవకాశం ఉంది. -
చిందేసిన జయప్రద, జయసుధ
హైదరాబాద్: సీనియర్ నటీమణులు జయప్రద, జయసుధ స్టెప్పులతో పాత రోజులను గుర్తు చేశారు. హుషారుగా డాన్స్ చేసి అలరించారు. మాజీ ఎంపీ జయప్రద తనయుడు సిద్ధార్థ వివాహ వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి సంగీత్ కార్యక్రమం నిర్వహించారు. శంషాబాద్ లోని సుచిర్ టింబర్ లీఫ్ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకకు సినిమా, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సమాజ్ వాది పార్టీకి చెందిన మాజీ నేత అమర్ సింగ్, సినీ నటుడు మోహన్ బాబు, ఆయన కుమార్తె మంచు లక్ష్మి, సంగీత దర్శకురాలు శ్రీలేఖ తదితరులు హాజరయ్యారు. నాటి అందాల తారలు జయసుధ, జయప్రద పదం కలిపి ఆటపాటలతో ఈవెంట్ కు జోష్ పెంచారు. నెల 27న హైదరాబాద్ లో సిద్ధార్థ, ప్రవల్లికా రెడ్డి వివాహం జరగనుంది. సిద్ధార్థ్ జయప్రద సోదరి కుమారుడు. జయప్రద అతడిని దత్తత తీసుకున్నట్లు సమాచారం. సిద్ధార్ధ్ తమిళంలో 'ఉయిరే ఉయిరే' అనే చిత్రంలో హీరోగా నటించాడు. ఈ చిత్రం నితిన్ హీరోగా నటించిన 'ఇష్క్' చిత్రానికి రీమేక్ కాగా అందులో అతడి సరసన హన్సిక కథానాయికగా నటించింది.