
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహ వేడుకల్లో భాగంగా ఇటీవల అంబానీ కుటుంబం ఘనంగా సంగీత్ జరుపుకుంది. ఈ సందర్భంగా ఇంటిల్లిపాది సభ్యులు డ్యాన్స్‌తో సందడి చేశారు. ఈ మేరకు విడుదలైన ఒక వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
అనంత్-రాధికల వివాహం జులై 12న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. జులై 13న ‘శుభ్ ఆశీర్వాద్’, జులై 14న ‘మంగళ్ ఉత్సవ్’ కార్యక్రమంతో వేడుకలు ముగియనున్నాయి. త్వరలో పెళ్లి పీటలెక్కే జంట ఇప్పటికే రెండుసార్లు అంగరంగ వైభవంగా ప్రీవెడ్డింగ్ వేడుకలు నిర్వహించుకుంది. ఇటీవల ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు దాదాపు 4500 కిలోమీటర్లు క్రూయిజ్‌లో ప్రయాణిస్తూ రెండో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. గతంలో ఈ జంట జామ్‌నగర్‌లో తమ మొదటి ప్రీవెడ్డింగ్ వేడుకలను జరుపుకున్నారు. ఇటీవల అంబానీ కుంటుంబం 50 పేద జంటలకు సామూహిక వివాహాలను కూడా జరిపించింది. అందుకు అవసరమైన పూర్తి ఖర్చులను భరించింది. వివాహాల అనంతరం కొత్త జంటలకు అవసరమయ్యే ఇంటి సామగ్రిని అందించింది.
ఇదీ చదవండి: దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు రిలయన్స్ సిద్ధం..?
Comments
Please login to add a commentAdd a comment