
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ప్రఖ్యాతి గాంచిన లాల్‌బాగ్చా రాజా వినాయకుడికి రిలయన్స్ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రిలయన్స్ ఫౌండేషన్‌తో కలిసి భారీ విరాళం అందజేశారు. రూ.15 కోట్ల విలువైన 20 కిలోల స్వర్ణ కిరీటాన్ని తన ఆరాధ్య దైవానికి సమరి్పంచారు.
లాల్‌బాగ్చా రాజా భారీ విగ్రహాన్ని గురువారం సాయంత్రం ఆవిష్కరించారు. అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్‌తో ఇటీవలే జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహం తర్వాత వస్తున్న తొలి వినాయక చవితి కావడంతో స్వర్ణ కిరీటాన్ని తన ఇష్ట దైవానికి అందించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment