Reliance Foundation
-
అమెరికాలో నీతా అంబానీకి అరుదైన గౌరవం (ఫోటోలు)
-
నీతా అంబానీకి అరుదైన గౌరవం
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీకి (Nita Ambani) అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. ఆమె దార్శనిక నాయకత్వం, సమాజానికి చేసిన అసాధారణ సేవకు గుర్తింపుగా మసాచుసెట్స్ విశిష్ట గవర్నర్ ప్రశంసాపత్రాన్ని ప్రదానం చేసింది. మసాచుసెట్స్ గవర్నర్ మౌరా హీలే చేతుల మీదుగా నీతా అంబానీ ఈ ప్రశస్తిని అందుకున్నారు.మసాచుసెట్స్ విశిష్ట గవర్నర్ ప్రశంసాపత్రం గురించి తెలియజేస్తూ భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా విద్య, ఆరోగ్య సంరక్షణ, క్రీడలు, కళలు, సంస్కృతి, మహిళా సాధికారత వంటి వివిధ రంగాలలో నీతా అంబానీ గణనీయమైన ప్రభావాన్ని చూపారంటూ రిలయన్స్ ఫౌండేషన్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా తెలిపింది."మా వ్యవస్థాపక చైర్పర్సన్ నీతా అంబానీని దార్శనిక నాయకురాలిగా, వితరణశీలిగా, అసలైన గ్లోబల్ గేమ్‌ఛేంజర్‌గా గుర్తిస్తూ మసాచుసెట్స్ గవర్నర్ మౌరా హీలే ప్రతిష్టాత్మక గవర్నర్ ప్రశంసాపత్రాన్ని ప్రదానం చేశారు" అని రిలయన్స్ ఫౌండేషన్ పోస్ట్‌లో వివరించింది.ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో నీతా అంబానీ చేతితో నేసిన అద్భుతమైన శికార్గా బనారసి చీర ధరించి పాల్గొన్నారు. భారతీయ కళా నైపుణ్యానికి ఉదాహరణగా నిలిచే ఈ చీర అధునాతన కడ్వా నేత నైపుణ్యం, సాంప్రదాయ కోన్యా హంగులను సంతరించుకుంది. నీతా అంబానీ ఈ చీరను ధరించడం ద్వారా భారతదేశ కళాత్మక వారసత్వ వైభవాన్ని మరోసారి అంతర్జాతీయంగా చాటారు. -
రిలయన్స్ స్కాలర్షిప్లో మెరిసిన తెలుగు విద్యార్థులు
రిలయన్స్ ఫౌండేషన్ (Reliance Foundation) ప్రఖ్యాత అండర్గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్లు (scholarship) 2024-25 బ్యాచ్‌కు సంబంధించిన ఫలితాలను తాజాగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా సుమారు లక్ష మంది ఈ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోగా 5,000 మంది ప్రతిభావంతులైన అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులను రిలయన్స్ ఫౌండేషన్ ఎంపిక చేసింది.విద్యలో నాణ్యత, నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించి యువత భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన రిలయన్స్ ఫౌండేషన్ పదేళ్లలో 50,000 స్కాలర్షిప్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు స్కాలర్షిప్ కార్యక్రమంగా గుర్తింపు పొందింది. విద్యను సమాన అవకాశాలను అందించేందుకు మార్గంగా మార్చేందుకు రిలయన్స్ ఫౌండేషన్ నిబద్ధతను ఈ ప్రోగ్రామ్ నొక్కిచెబుతోంది.దేశం నలుమూలల నుంచి ఎంపికైన 5000 మంది విద్యార్థులకు ట్యూషన్, హాస్టల్, ఇతర విద్యా ఖర్చుల కోసం ఈ కార్యక్రమం ద్వారా రూ. 2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఎంపికైన విద్యార్థుల్లో 70% మంది రూ. 2.5 లక్షల కంటే తక్కువ వార్షికాదాయం కలిగిన కుటుంబాలనుంచి రావడం విశేషం.రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల (Telugu states) విద్యార్ధులు తమ ప్రతిభతో 2024-25 బ్యాచ్‌లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. 850 మంది విద్యార్థులతో ఆంధ్రప్రదేశ్ దేశంలో 1వ స్థానంలో నిలవగా, 411 మంది విద్యార్థులతో తెలంగాణ 4వ స్థానం సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం 1,261 మంది అభ్యర్ధులు (25.22%) స్కాలర్షిప్ సాధించారు. -
రిలయన్స్ ఫౌండేషన్ ESA డే : విద్యార్థులతో ఉత్సాహంగా
రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఫౌండేషన్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ (ESA) డే వేడుకలు జియో హామ్లీస్ వండర్‌ల్యాండ్‌లో ఉత్సాహంగా జరిగాయి. ఈఎస్ఏ ప్రోగ్రాంలో భాగంగా వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలోని వెయ్యి మంది చిన్నారులతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. రిలయన్స్ ఫౌండేషన్ కహానీ, కాలా, ఖుషీ ప్రచారంలో భాగంగా ఈ విద్యార్థులకు ఆటలు, క్విజ్ పోటీలను ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.జియో వరల్డ్ గార్డెన్లో అజ్మీరా రియాల్టీతో కలిసి జియో ప్రెజెంట్స్ హామ్లీస్ వండర్‌ల్యాండ్‌లో జరిగే కార్నివాల్లో మాన్స్టర్ రైడ్, హామ్లీస్ విలేజ్, హాంటెడ్ సర్కస్, ఫెర్రిస్ వీల్, రంగులరాట్నాలు లాంటి పలు ఆకర్షణీయమైన గేమ్‌లు ఉన్నాయి.ముఖ్యంగా జంతు సంక్షేమ చొరవలో ‘వంటారా’ స్టాల్స్ ప్రత్యేకంగా కొలువు దీరాయి. వన్యప్రాణుల ఆవాసాలను సంరక్షించడం, చిక్కుకుపోయిన పక్షులను రక్షణ, రక్షించిన జంతువులను పోషించడం, జంతువులను అక్రమ రవాణా నుండి రక్షించడం వంటి పనుల్లో విద్యార్థులను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టనుంది. ఈ సందర్భంగా పిల్లలందరికీ రిలయన్స్ ఫౌండేషన్ క్యూరేటెడ్ వంటరా జంతు బొమ్మలు, విద్యా సామగ్రిని బహుమతిగా అందించింది.రిలయన్స్ 'వి కేర్' అనే చొరవలో భాగంగా రిలయన్స్ ఫౌండేషన్, ఈఎస్ఏ ద్వారా విద్యార్థులకు విద్యాక్రీడా రంగంలో అవకాశాలను కల్పించేలా వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. డిసెంబరులో జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమం, వెనుకబడిన వర్గాల పిల్లల సాధికారత, ఊహలు ఆకాంక్షలకు రెక్కలు తొడిగేలా ప్రోత్సాహాన్నిస్తుంది. -
నీతా అంబానీకి మరో అరుదైన గౌరవం
రిలయన్స్‌ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ మరో అరుదైన గౌరవాన్ని దక్కించు కున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ (ఐసిహెచ్)లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. అమెరికాలోని బోస్టన్‌లో జరగనున్న హార్వర్డ్(ICH)లో ప్రధాన వక్తగా పాల్గొంటారని ఇండియా కాన్ఫరెన్స్ ఆదివారం ప్రకటించింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పాఠశాలల్లోని విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించే అతి పెద్ద ఈవెంట్లలో ఇది కూడా ఒకటి. ఈ సంవత్సరం కాన్ఫరెన్స్ "భారతదేశం నుండి ప్రపంచానికి" అనే థీమ్‌తో ఈ ఏడాది కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో రెండు రోజుల పాటు విభిన్న రంగాలకు చెందిన 80 మంది ప్రముఖ వక్తలు పాల్గొంటారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం వివిధ గ్రాడ్యుయేట్ , అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించే అతిపెద్ద ఈవెంట్లలో ఇది ఒకటి. దాతృత్వం, విద్య ,సంస్కృతి రంగాల్లో విశేష సేవలందిస్తున్న నీతా అంబానీ తమ వార్షిక సదస్సులో కీలక ప్రసంగం చేస్తారని హార్వర్డ్ (ఐసిహెచ్)లోని ఇండియా కాన్ఫరెన్స్ ప్రకటించింది. శాంతి, శ్రేయస్సు, నూతన ఆవిష్కరణల్లో ప్రపంచ నాయకుడిగా భారతదేశం ఎదిగినతీరును ‘భారతదేశం నుండి ప్రపంచానికి' పేరుతో నీతా వివరిస్తారని ఐసీహెచ్ తెలిపింది. ఈవెంట్ 2025 ఫిబ్రవరి 15-16 తేదీల్లో బోస్టన్‌లో జరగనుంది. నీతా అంబానీ తన సామాజిక సేవల ద్వారా కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసిన ఘనతను దక్కించున్నారు. అలాగే నాలుగు దశాబ్దాల తరువాత ఇండియాలో ఒలింపిక్ సెషన్ నిర్వహించడంతోపాటు, 2036 ఒలింపిక్ క్రీడా వేదికగా భారత్నునిలపడం కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC)ఎంపికైన తొలి భారత మహిళ కూడా.ఇదీ చదవండి: కీర్తి సురేష్ పెళ్లి చీర : స్పెషల్‌గా కీర్తి ఏం చేసిందో తెలుసా? -
రిలయన్స్ ఫౌండేషన్ : పిల్లలకోసం మళ్లీ ‘కహానీ కాలా ఖుషీ’
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రిలయన్స్ ఫౌండేషన్ తన వార్షిక పథకాన్ని తిరిగి లాంచ్ చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న బాలలకుసాయం అందించేలా ‘ కహానీ కాలా ఖుషీ’ తిరిగిలాంచ్ చేసింది. ఇందులో భాగంగా రాబోయే కొద్ది వారాలలో భారతదేశం అంతటా కథలు చెప్పడం, ఇతర కార్యకలాపాల ద్వారా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా దాదాపు 22వేలమంది పిల్లలకు లబ్ది చేకూరనుంది.ఈ కార్యక్రమంలో రిలయన్స్ వ్యాపారాల్లోని ఉద్యోగి వాలంటీర్లు, భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు, సంఘాలు వెనుకబడిన నేపథ్యాల పిల్లలతో నిమగ్నమై ఉంటారు. గురువారం ముంబైలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 400 మంది రిలయన్స్ ఉద్యోగులు స్వచ్ఛందంగా 3,800 మంది పిల్లలను కథలు, కళలు, అవుట్డోర్ , ఇండోర్ గేమ్‌లు నిర్వహించి పిల్లలతో గడిపారు. రాబోయే రోజుల్లో, దేశవ్యాప్తంగా వందలాది మంది వాలంటీర్లు పిల్లలతో పాలుపంచుకుంటారు. మహారాష్ట్ర, తెలంగాణలో, ప్రీ-స్కూల్ పిల్లల కోసం 63 అంగన్వాడీలలో ఈ కార్యక్రమం ప్రారంభమైందని వెల్లడించిందినవంబర్ 14-16 మధ్య 1,100 కంటే ఎక్కువ అంగన్వాడీలలో 18 వేల మంది పిల్లలను చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. కహానీ కలా ఖుషి కార్యక్రమం పిల్లలలో కమ్యూనికేషన్ నైపుణ్యాలు , విశ్వాసాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. గత సంవత్సరం 25 నగరాల్లో 17,000 మంది పిల్లలకు చేరువైందని రిలయన్స్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. -
పిల్లలతో నీతా అంబానీ: కొత్త పథకంతో లక్ష మందికి మేలు
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు & ఛైర్పర్సన్ 'నీతా అంబానీ' బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్‌లో ప్రతి జీవితం విలువైనదని మేము విశ్వసిస్తున్నాము. ప్రతి బిడ్డ సంతోషంగా, ఆరోగ్యంగా పెద్ద కలలు కనడానికి, వాటిని సాకారం చేసుకోవడానికి అర్హులు అని వ్యాఖ్యానించారు.బాలల దినోత్సవం సందర్భంగా.. కొత్త ఆరోగ్య సేవా పథకాన్ని ప్రారంభించినట్లు నీతా అంబానీ ప్రకటించారు. పిల్లలు, కౌమారదశలో ఉన్న బాలికలు & మహిళలపై దృష్టి సారించి, అట్టడుగు వర్గాలకు చెందిన 1,00,000 మంది వ్యక్తులకు ఎటువంటి ఖర్చు లేకుండా అవసరమైన ఆరోగ్య పరీక్షలు మరియు చికిత్సలను అందించడం ఈ చొరవ లక్ష్యం అని పేర్కొన్నారు.ఈ సంవత్సరం, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి.. మా కొత్త ఆరోగ్య సేవా ప్రణాళికను ప్రవేశపెట్టడం గర్వకారణంగా ఉందని, నీతా అంబానీ పేర్కొన్నారు. అంతే కాకుండా.. 50,000 మంది పిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకు ఉచిత పరీక్షలు చేసి తగిన చికిత్సను అందించడం, 50వేల మంది మహిళలకు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్‌లతో పాటు 10,000 మంది కౌమార బాలికలకు గర్భాశయ క్యాన్సర్ వ్యాధి నిరోధక టీకాల వంటి వాటికి సంబంధించిన లక్ష్యాలను నీతా అంబానీ వెల్లడించారు.ప్రారంభం నుంచి రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ 1,50,000 కంటే ఎక్కువమంది పిల్లలతో సహా సుమారు 27 లక్షల కంటే ఎక్కువమంది భారతీయులకు సేవలందించింది. భారతదేశంలోని ప్రముఖ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్‌గా గుర్తింపు పొందిన ఈ సంస్థ నాణ్యమైన సేవలను అందిస్తోంది.బాలల దినోత్సవానికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో నీతా అంబానీ.. పిల్లలతో ముచ్చటించడం, పిల్లకు కేక్ తినిపించడం వంటివి కూడా చూడవచ్చు. అంతే కాకుండా రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ ద్వారా మేలు పొందిన వారు సంస్థకు కృతజ్ఞతలు చెప్పడం కూడా ఇక్కడ చూడవచ్చు. -
నూతన ఆరోగ్య సేవా ప్రణాళికను ప్రారంభించనున్న నీతా అంబానీ..ఏకంగా లక్షలాదిమంది..
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ నూతన ఆరోగ్య సేవా ప్రణాళికను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ 10 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ నూతన ఆరోగ్య సేవా ప్రణాళికను ప్రారంభించారు. అందులో భాగంగా సుమారు 50 వేల మంది పిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకు ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు, చికిత్స, 50 వేల మంది మహిళలకు రొమ్ము, గర్భాశయ కేన్సర్లకు ఉచిత స్క్రీనింగ్ పరీకలు, చికిత్స, అలాగే దాదాపు పదివేల మంది బాలికలకు ఉచిత గర్భాశయ కేన్సర్ వ్యాక్సినేషన్ వంటి సేవలను అందజేయనున్నట్లు నీతా అంబానీ ప్రకటించారు.ప్రతి భారతీయుడికి ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడానికి ఇలా సరసమైన ధరలో తమ రిలయన్స్ ఫౌండేషన్ వైద్యసేవలు అందిస్తోందన్నారు. ఇప్పటి వరకు తమ ఫౌండేషన్ ద్వారా మిలియన్లమందికి జీవితాలను ప్రసాదించి లెక్కలేనన్ని కుటుంబాల్లో కొత్త ఆశను అందించామని అన్నారు. అలాంటి ప్రతిష్టాత్మక సేవలందింస్తోన్న తమ రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ పదేళ్ల వార్షికోత్సవం సందర్భంగా అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలు, మహిళలకు మరిన్ని సేవలందించేలా ఇలా కొత్త ఆరోగ్య సేవా ప్రణాళికను ప్రారంబించామని అన్నారు. మంచి ఆరోగ్యం సంపన్న దేశానికి పునాది అని, అలాగే ఆరోగ్యవంతమైన స్త్రీలు, పిల్లలు సమాజానికి పునాది అని తాము విశ్వసిస్తున్నామని అన్నారు. కాగా, రిలయన్స్ పౌండేష్ గత దశాబ్ద కాలంలో 1.5 లక్షల మంది పిల్లలతో సహా 2.75 మిలియన్ల భారతీయులకు వైద్య సేవలను అందించింది. అత్యాధునిక వైద్యం అందించడంలో అత్యుత్తమైన ఆస్పత్రిగా నిలిచింది. అంతేగాదు ఐదు వందలకు పైగా అవయవ మార్పిడి తోపాటు కేవలం 24 గంటల్లో ఏకంగా ఆరు అవయవాల మార్పిడి చేసి బహుళ ప్రాణాలను కాపాడిని ఆస్పత్రిగా రికార్డు సృష్టించింది. ఇది భారతధేశంలోనే నెంబర్ వన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గుర్తింపు పొందింది. (చదవండి: బ్రెయిన్ స్ట్రోక్: ఇన్‌టైంలో వస్తే.. అంతా సేఫ్..!) -
ఒలింపిక్ పతక విజేతలతో నీతా అంబానీ: వైరల్ వీడియో
ముంబైలోని అంబానీ నివాసం యాంటిలియాలో ఆదివారం రాత్రి రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ అండ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసి) సభ్యురాలు నీతా అంబానీ 'యునైటెడ్ ఇన్ ట్రయంఫ్' ఈవెంట్లో భారతదేశ ఒలింపిక్స్, పారాలింపిక్స్ పోటీదారులకు ఆతిథ్యం ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ ఈవెంట్లో.. పారిస్ ఒలింపిక్స్ 2024 పతక విజేతలు మను భాకర్, నీరజ్ చోప్రాతో పాటు పారిస్ పారాలింపిక్స్ 2024 పతక విజేతలు నవదీప్ సింగ్, మోనా అగర్వాల్‌లతో నీతా అంబానీ ఫోటోకు ఫోజులిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన క్రీడాకారులు సత్కరించారు.Mrs Nita M Ambani, Founder and Chairperson of Reliance Foundation, welcomed the athletes to United in Triumph: an unprecedented evening that united India's Olympians and Paralympians and rejoiced and cherished their success. Speaking on the occasion, Mrs Ambani said, "Today is a… pic.twitter.com/7wxsO9TE0c— Reliance Industries Limited (@RIL_Updates) September 30, 2024సుమిత్తో పాటు నీరజ్ చోప్రా, మను భాకర్, మురళీకాంత్ పెట్కర్, దేవేంద్ర ఝఝరియా సహా భారతదేశ ఒలింపిక్ & పారాలింపిక్ ఛాంపియన్లు అంటిల్, నితేష్ కుమార్, హర్విందర్ సింగ్, ధరంబీర్ నైన్, నవదీప్ సింగ్, ప్రవీణ్ కుమార్, దీపా మాలిక్, సానియా మీర్జా, కర్ణం మల్లీశ్వరి, పుల్లెల గోపీచంద్, హర్భజన్ సింగ్ వంటి క్రీడా దిగ్గజాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.భారత మాజీ దిగ్గజ గోల్‌కీపర్ పిఆర్ శ్రీజేష్ తన కుటుంబంతో సహా ఆంటిలియాకు చేరుకున్నారు. పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన పారా షట్లర్లు సుహాస్ యతిరాజ్, నితేష్ కుమార్ కూడా ఈ ఈవెంట్‌ను హాజరయ్యారు.ఇదీ చదవండి: ఉద్యోగాల సృష్టికి ఏం చేయాలంటే?.. రఘురామ్ రాజన్యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ ఈవెంట్లో నీతా అంబానీ మాట్లాడుతూ.. భారతదేశం మొత్తం మన అథ్లెట్లను చూసి గర్విస్తోంది. మొదటిసారి భారత పారిస్ ఒలింపియన్లు, పారా ఒలింపియన్లు ఒకే వేదికపైకి చేరుతున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ తరపున, 'యునైటెడ్ వుయ్ ట్రయంఫ్' ఒక ఉద్యమంగా మారాలని కోరుకుంటున్నానని అన్నారు.Together as one, celebrating unity ✨✨ India’s star Paralympians & Olympians arrive at Reliance Foundation’s United In Triumph awards to celebrate spirit of Olympism together🤝🤝 #RFsports #UnitedinTriumph #Paris2024 #Paralympics2024 pic.twitter.com/7xVfxJ7lhV— RF Youth Sports (@RFYouthSports) September 29, 2024 -
ఏపీకి రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్ల విరాళం
ఆంధ్రప్రదేశ్ వరద బాధితులను ఆదుకునేందుకు రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్ల భారీ విరాళం అందించింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు నాయుడును రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బోర్డు సభ్యుడు పీఎంఎస్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మెంటార్ పీవీఎల్ మాధవరావులు కలిసి రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ తరపున రూ.20 కోట్ల చెక్‌ను అందజేశారు.ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ప్రధానంగా విజయవాడ నగరం పూర్తిగా మునిగిపోయింది. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. వరద బాధితులను ఆదుకునేందుకు పలు కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. అందులో భాగంగా రిలయన్స్ ఫౌండేషన్ కూడా ముందుకు వచ్చి భారీ సాయం అందించింది. -
సీఎం సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం ప్రకటించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.20 కోట్లు అందజేసింది. ఈమేరకు రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు చైర్పర్సన్ నీతా అంబానీ తరపున జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్‌ను అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రిలయన్స్ ఫౌండేషన్‌ను అభినందించారు. సీఎంని కలిసినవారిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బోర్డు సభ్యుడు పీఎంఎస్ ప్రసాద్, రిలయన్స్ గ్రూప్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మెంటార్ పీవీఎల్ మాధవరావు ఉన్నారు. -
లాల్‌బాగ్చాకు అనంత్ అంబానీ స్వర్ణకిరీటం
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ప్రఖ్యాతి గాంచిన లాల్బాగ్చా రాజా వినాయకుడికి రిలయన్స్ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రిలయన్స్ ఫౌండేషన్‌తో కలిసి భారీ విరాళం అందజేశారు. రూ.15 కోట్ల విలువైన 20 కిలోల స్వర్ణ కిరీటాన్ని తన ఆరాధ్య దైవానికి సమరి్పంచారు. లాల్బాగ్చా రాజా భారీ విగ్రహాన్ని గురువారం సాయంత్రం ఆవిష్కరించారు. అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్‌తో ఇటీవలే జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహం తర్వాత వస్తున్న తొలి వినాయక చవితి కావడంతో స్వర్ణ కిరీటాన్ని తన ఇష్ట దైవానికి అందించినట్లు తెలుస్తోంది. -
రిలయన్స్ స్కిల్లింగ్ అకాడమీ ప్రారంభం
దేశంలో జాబ్ మార్కెట్‌కు అనుగుణంగా యువతలో నైపుణ్యాలు పెంచేందుకు రిలయన్స్ ఫౌండేషన్ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీని ప్రారంభించింది. స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, విద్యా శాఖల సహాయ మంత్రి జయంత్ చౌదరి ఈ అకాడమీని ప్రారంభించారు.నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSDC) సహకారంతో రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహించిన ‘భవిష్యత్ ఉద్యోగాల కోసం యువతకు సాధికారత’ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో ఈ కొత్త చొరవను ఆవిష్కరించారు. స్కిల్ బిల్డింగ్, పర్సనలైజ్డ్ ఎక్స్పర్ట్ గైడెన్స్ అందించే ఫ్యూచర్ రెడీ కోర్సులను స్కిల్లింగ్ అకాడమీ అందిస్తుందని రిలయన్స్ ఫౌండేషన్ తెలిపింది. పరిశ్రమల అనుసంధానంతో కెరీర్ డెవలప్మెంట్కు తోడ్పాటునందిస్తుందని పేర్కొంది.నైపుణ్యాలను నేర్పించడం, పెంపొందించడం ద్వారా వచ్చే సంవత్సరంలో 6 లక్షల మంది భారతీయ యువతకు సాధికారత కల్పించడం అకాడమీ లక్ష్యమని వెల్లడించింది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) భాగస్వామ్యంతో రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీ తన కోర్సుల పరిధిని విస్తరిస్తుందని, స్కిల్ ఇండియా మిషన్‌కు మద్దతునిస్తుందని వివరించింది. -
5100 మందికి రూ.లక్షల్లో స్కాలర్షిప్లు
దేశంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు నీతా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్లు అందిస్తోంది. 2024-25 విద్యా సంవత్సరానికి తమ ప్రతిష్టాత్మక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులను ప్రారంభించినట్లు ప్రకటించింది.దేశ వృద్ధిలో కీలకమైన యువతను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించే ఉద్దేశంతో రిలయన్స్ ఫౌండేషన్ 2022లో స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా పదేళ్లలో 50,000 మందికి స్కాలర్షిప్లు అందించడం లక్ష్యం. 2024-25 విద్యా సంవత్సరానికి గానూ మొత్తం 5100 మందికి స్కాలర్షిప్లు అందించనుంది.ఈ విద్యా సంవత్సరంలో అందించే స్కాలర్‌షిప్‌లలో 5000 మంది అండర్ గ్రాడ్యుయేట్, 100 పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ అవకాశం కల్పిస్తోంది. ఈ స్కాలర్షిప్ కింద అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ.2లక్షల వరకు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ.6 లక్షల వరకు సాయం అందించనుంది. ఇందుకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి గడువు అక్టోబర్ 6వ తేదీ. -
నీతా అంబానీ తాగే వాటర్ అంత ఖరీదా? మరి రూ.49 లక్షల బాటిల్ సంగతేంటి?
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్, ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ అత్యంత స్టైలిష్ ఫ్యాషన్ ఐకాన్లలో ఒకరు. అందానికితోడు, వ్యాపార దక్షతకూడా ఆమె సొంతం. వివిధ దాతృత్వ , సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా ఉంటారు. అయితే నీతా బ్యూటీ సీక్రెట్ ఏంటి అనేది ఎపుడూ హాట్ టాపికే. ఇటీవల బ్యూటీ విత్ పర్పస్ హ్యుమానిటేరియన్ అవార్డు'కూడా దక్కించుకున్నారు. తాజాగా నీతా అంబానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీటిని తాగుతారని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.. అదేంటి అవి నీళ్లా? లేక బంగారమా? ఇదేంటీ విడ్డూరం అనుకుంటున్నారా? అయితే మీరీ స్టోరీ చదవాల్సిందే.నీతా అంబానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీటిని వాడతారని చాలా చోట్ల ప్రచారంలో ఉంది. ఎంతయినా రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ ముఖేష్ భార్య కదా. తనకు తక్కువేంటీ? అనుకునే వాళ్లున్నారు. తన సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేకంగా తయారు చేసిన నీళ్లను వాడతారని చెబుతారు. ఒక ప్రచారంలో ఆమె తాగే 750 మిల్లీలీటర్ల వాటర్ బాటిల్ ధర 27 వేల రూపాయలకు పైమాటే అని కూడా ప్రచారం చేఉశారు. ప్రపంచంలోనే ఖరీదైన నీళ్లు ఇవేనని, ఈ నీటిని తాగితే ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు బరువు నియంత్రణలోఉండి, చర్మం నిగారింపును సంతరించుకుంటుందని ఒత్తిడి దూరం అవుతుందని ప్రచారం చేశారు. ఈ నీరు ఎక్కడ పడితే అక్కడ దొరకదని, వసంతకాలంలో ఫిజి, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశంలో ఏర్పడే గ్లాసియర్ల నుంచి సేకరిస్తారని, దాంతోపాటు ఖనిజ లవణాలు కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయని, అందుకే ఈ వాటర్‌కు అంత క్రేజ్ ఉందని ప్రచారం చేశారు. దీనిపై ఓ సందర్భంలో నీతా అంబానీనే తెలిసిన వాళ్లు ఒకరు అడిగారు. మీ సౌందర్య రహస్యానికి, మీ ఉత్సాహానికి మీరు తాగే నీళ్లే కారణమా అని అడిగారు. ఆ ప్రశ్నవిని ఆశ్చర్యపోయిన నీతా అంబానీ.. ఖరీదైన నీళ్లంటూ జరుగుతున్న ప్రచారమంతా వట్టిదేనని తేల్చేశారట. రూ. 49 లక్షల వాటర్ బాటిల్ కథకాగా 2015లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఆమె ఓ వాటర్ బాటిల్‌లోతో కనిపించారు. ఈ బాటిల్ ధర సుమారు రూ.49 లక్షలు అంటూ మార్ఫింగ్ ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అయింది. అసలు కథ ఏంటంటే ప్రముఖ మెక్సికన్ డిజైనర్, ఫెర్నాండో అల్టామిరానో ఈ బాటిల్‌ను నిజంగానే బంగారంతో చేశారు. దాని పేరే అక్వాడి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఎ మొడిగ్లియాని. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. అయితే ఖరీదైన నీళ్లలాగే.. ఖరీదైన బాటిల్ గురించి కూడా నీతా ఏదో ఒక స్పష్టత ఇస్తారేమో. -
అంబానీ కొడుకు నిజంగా గ్రేట్.. అడవిని సృష్టించిన కొత్త పెళ్లికొడుకు.
-
Nita Ambani Birthday: ‘సంపూర్ణ’ సంపన్నురాలు!
Nita Ambani Birthday: రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్, వ్యాపారవేత్త నీతా అంబానీ నవంబర్ 1న 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. విద్యావేత్త, పరోపకారి, ఎంటర్‌ప్రిన్యూర్, కళలు, క్రీడల పోషకురాలైన నీతా అంబానీ రూ. 23 వేల కోట్ల నుంచి రూ. 24 వేల కోట్ల నెట్‌వర్త్ అంచనాతో పలు భారీ బిజినెస్ వెంచర్లకు నాయకత్వం వహిస్తున్నారు. నీతా అంబానీ ముంబైలోని గుజరాతీ కుటుంబంలో 1963 నవంబర్ 1న జన్మించారు. నీతా నర్సీ మోంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆమెకు భరతనాట్యంలోనూ ప్రవేశం ఉంది. ముఖేష్ అంబానీతో పరిచయానికి ముందు ఆమె టీచర్‌గా పనిచేసేవారు. ఆ తర్వాత 1985లో ముఖేష్ అంబానీని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ, ఒక కుమార్తె ఇషా అంబానీ ఉన్నారు. భారతీయ వ్యాపార రంగంలో మొదటి మహిళగా ప్రసిద్ధి చెదిన నీతా అంబానీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా ఎన్నికైన తొలి భారతీయ మహిళ ఆమెనే. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ ట్రస్టీల బోర్డులో చేరిన మొదటి భారతీయురాలు కూడా. జీవితంలో అనేక మైలురాళ్లను సాధించిన నీతా అంబానీ ఎంటర్ప్రిన్యూర్గానేకాక చురుగ్గా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక ప్రతిష్టాత్మక అవార్డులు, సత్కారాలు అందుకున్నారు. నీతా ఘనతలు ఇవే.. క్రీడల్లో మెరుగుదలకు సంబంధించి నీతా అంబానీ చేపట్టిన కార్యక్రమాలకు, అప్పటి భారత రాష్ట్రపతి ఆమెను 'రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ అవార్డు 2017'తో సత్కరించారు. అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా అందించే ఇండియన్ స్పోర్ట్స్ ఉత్తమ కార్పొరేట్ సపోర్టర్‌గానూ ఆమె అవార్డును అందుకున్నారు. ఇవి కాకుండా నీతా అంబానీ ఇటీవల యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరమ్ (USISPF) 2023 నుంచి గ్లోబల్ లీడర్షిప్ అవార్డును అందుకున్నారు. దాతృత్వం, కార్పొరేట్ సామాజిక బాధ్యతకు చేసిన కృషికి గాను ఆమెకీ అవార్డ్ దక్కింది. బిజినెస్ వెంచర్స్ నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్. సమ్మిళిత భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో 2010లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇక దేశంలో మహిళా సాధికారత కోసం పనిచేసే 'హర్ సర్కిల్' అనే ఇంటరాక్టివ్ డిజిటల్ ఉద్యమాన్ని కూడా స్థాపించారు నీతా అంబానీ. ఐపీఎల్లో అనేకసార్లు టోర్నమెంట్‌ను గెలుపొందిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఆమె సహ యజమాని. అలాగే ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్పర్సన్ కూడా. ఇది దేశ ఫుట్‌బాల్ చరిత్రలో విప్లవాత్మకమైన ఇండియన్ సూపర్ లీగ్‌ను ప్రారంభించింది. ముంబైలో 2003లో ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌ను స్థాపించిన నీతా అంబానీ దానికి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే కళలు, సాంస్కృతిక వైభవాన్ని ప్రోత్సహించేందుకు ముంబైలో ఇటీవల నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌ను నీతా ప్రారంభించారు. As a proud mother, Mrs. Nita Ambani cheered for her daughter Isha Ambani on the launch of a new retail space #JioWorldPlaza, the brand new neighbour of the #NitaMukeshAmbaniCulturalCentre in Mumbai. Mrs. Ambani’s attire takes inspiration from the traditional Indian saree drape. pic.twitter.com/8hHLQXVGm6 — Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) October 31, 2023 -
గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అందుకున్న నీతాఅంబానీ
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ నీతా అంబానీ 2023 సంవత్సరానికి గాను దాతృత్వం, కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరమ్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డును అందుకున్నారు. ఈ విషయాన్ని యూఎస్-ఇండియా ఎస్పీఎఫ్ తన ఎక్స్ ఖాతాలో తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్పర్సన్ నీతా అంబానీ మహిళాసాధికారత, పిల్లల విద్య, భారతీయ కళలు, క్రీడలను ప్రోత్సహించినందుకు ఈ అవార్డు ప్రదానం చేసినట్లు యూఎస్ఐఎస్పీఎఫ్ పేర్కొంది. అవార్డు తీసుకున్న సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ..రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే దాదాపు 7 కోట్ల ప్రజలకు సేవ చేశామన్నారు. సీఎస్ఆర్ ప్రవేశపెట్టక ముందే రిలయన్స్ సొంతంగా ‘కార్పొరేట్ మోరల్ రెస్పాన్స్‌బిలిటీ’ ద్వారా సేవలందించినట్లు చెప్పారు. దేశ ప్రయోజనం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. భారత్, యూఎస్ మధ్య బంధాలను మరింతగా పెంచడంలో ప్రధానపాత్ర పోషిస్తున్న యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌కు ఆమె కృతజ్ఞతలు చెప్పారు. USISPF was proud to honor Mrs. Nita M Ambani, Founder and Chairperson at @ril_foundation with the 2023 Global Leadership Award for Philanthropy and Corporate Social Responsibility. Mrs. Ambani is noted for her work in women's empowerment, education, promoting Indian arts & sports pic.twitter.com/rBuVQgvM97 — US-India Strategic Partnership Forum (@USISPForum) October 29, 2023 -
నీతా అంబానీకి మరో అరుదైన గౌరవం
రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్ నీతా అంబానీ మరో అరుదైన ఘనతను సొంతంచేసుకున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ బాంబే నుంచి ప్రతిష్టాత్మక సిటిజన్ ఆఫ్ ముంబై అవార్డు (2023-24)ను అందుకున్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, క్రీడలు, కళలు మరియు సంస్కృతికి అందించిన సేవలకు గాను రోటరీ క్లబ్ ఆఫ్ బొంబే ఈ అవార్డును ప్రదానం చేసింది. ఒక వ్యాపారవేత్తగా పరోపకారిగా నీతా అంబానీ సాధించిన మరో కీలక విజయం అంటూ అందరూ ఆమెకు అభినందనలు తెలిపారు. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ బోర్డు గౌరవ ట్రస్టీగా ఎన్నికైన తొలి భారతీయురాలిగా నీతా అంబానీ చరిత్ర సృష్టించారు. అలాగే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా ఎన్నికైన తొలి భారతీయ మహిళగా రికార్డు క్రియేట్ చేసిన నీతా అంబానీ, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భార్యగా మాత్రమే కాదు, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో సేవలందిస్తూ తనదైన ప్రత్యేకతను సాధించారు. ఇటీవల ముంబైలో ఆవిష్కరించిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ కళలకు సంబంధించి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన, కళాకారులకు ఇదొక అద్భుతమైన వేదికగా నిలుస్తోంది.అలాగే ముంబైలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ ద్వారా భారతీయులందరికీ అందుబాటు ధరలో ప్రపంచ స్థాయి వైద్య సేవల్ని అందిస్తోంది అలాగే రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 5,000 స్కాలర్షిప్లను అందిస్తుంది. Nita Ambani receives the prestigious citizen of Mumbai Award 2023-24 from the Rotary Club of Bombay – a recognition of her enduring contributions to creating transformative institutions in healthcare, education, sports, arts, and culture. pic.twitter.com/SQ7d4CxPAL — ANI (@ANI) September 27, 2023 అంతే కాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన క్రికెట్ జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్‌కు అంబానీ యజమానిగా కూడా రాణిస్తున్నారు. అంబానీ ఇండియన్ సూపర్ లీగ్‌ను ప్రారంభించిన ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ ఫౌండర్ చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు. పిల్లల అభివృద్ధికి తోడ్పడే 'అందరికీ విద్య మరియు క్రీడలు' కార్యక్రమానికి కూడా ఆమె సారథ్యం వహిస్తున్నారు. ఇంకా, ఎంఐ న్యూయార్క్ ఫౌండర్‌గా ప్రొఫెషనల్ అమెరికన్ T20 లీగ్ మేజర్ లీగ్ క్రికెట్ (MLC) ప్రారంభ ఎడిషన్‌ను గెలుచుకున్న ఘనత కూడా నీతా అంబానీకే దక్కింది. -
నీతా అంబానీ స్పెషల్ డైమండ్ వాచ్ చూశారా? ధర కోట్లలోనే
Nita Ambani Patek Philippe Nautilus Watchరిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్, ఫ్యాషన్ ఐకాన్ నీతా అంబానీ సాంప్రదాయ లుక్‌తో పాటు,సామాజిక కార్యక్రమాలు, అల్ట్రా- లగ్జరీ లైఫ్‌కి పెట్టింది పేరు. ఆమెకు సంబంధించి ఖరీదైన చీరలు, నగలు, చెప్పులు, లిప్‌స్టిక్,హ్యాండ్‌బ్యాగ్స్ ఇలా ప్రతి యాక్ససరీకి ఒక ప్రత్యేక ఉంటుంది. ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్యగానే కాదు, ఐపీఎల్ టీం ముంబై ఇండియన్స్‌కి యజమానిగా, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపక చైర్ పర్సన్‌గా, పరోపకారిగా నీతా అంబానీ పాపులర్. నీతా అంబానీ పటేక్ ఫిలిప్ నాటిలస్ వాచ్ ఆధునిక ఫీచర్లతో అద్భుతమైన డిజైన్‌తో నీతా అంబానీ పాటెక్ ఫిలిప్ నాటిలస్ 7118/1200ఆర్ వాచ్ లేటెస్ట్ బజ్‌గా నిలిచింది. 18k రోజ్ గోల్డ్ కేస్ , మ్యాచింగ్ బ్రాస్లెట్తో అందంగా కనిపిస్తోంది. చుట్టూ వజ్రాలు పొదిగిన పెర్ల్ డైమండ్-ఎంబెడెడ్ డయల్ స్పెషల్ లుక్ తీసుకొచ్చింది. గోల్డ్ ఒపలైన్ డయల్‌లో పాలిష్ చేసిన పింక్ హ్యాండ్స్, కౌంటర్లు కూడా ఉన్నాయి. ఈ పటేక్ ఫిలిప్ నాటిలస్ విలువ రూ. 1.05 కోట్లుగా తెలుస్తోంది. జాకబ్ & కో ఫ్లూర్స్ డి జార్డిన్ టూర్‌బిల్లాన్ పింక్ సఫైర్స్ వాచ్ విలువ రూ. 4.6 కోట్లు, అలాగే పటేక్ ఫిలిప్ ఆక్వానాట్ రోజ్ గోల్డ్ వాచ్ ధర రూ. 3.2 కోట్లు. ఇటీవల IPL మ్యాచ్‌లలో ఒకదానికి, నీతా అంబానీ తన IPL జట్టు ముంబై ఇండియన్స్ జెర్సీని ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఆమె చేతికి ఉన్న లగ్జరీ డైమండ్ వాచ్ ధరించిన ఫోటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేశాయి. ఖరీదైన బ్లూ కలర్ టాప్ ఎట్రాక్షన్ అని చెప్పవచ్చు. ఈ టాప్‌పై బంగారంతో ఎంబ్రాయిడరీ చేసిన 'MI'మనం చూడొచ్చు. దీంతోపాటు Audemars Piguet రాయల్ ఓక్ క్రోనోగ్రాఫ్ అమెథిస్ట్ డయల్ 26319OR వాచ్ ఖరీదు రూ. 3.1 కోట్లు. క్లీ డి కార్టియర్‌కు చెందిన మరో ఖరీదైన వాచ్ నీతా సొంతం. ఈ వాచ్ 18 క్యారెట్ గోల్డ్ అన్‌కట్ డైమండ్ బ్రాస్లెట్తో కూడిన రోజ్ కలర్ వాచ్. ఈ లగ్జరీ వాచ్‌లో ఫ్లింక్ సన్‌రే ఎఫెక్ట్ డయల్ అండ్ బ్లూ రోమన్ న్యూమరల్ అవర్ మార్కర్లు ఉన్నాయి. దీని ధర రూ.25 లక్షలకు పై మాటే. నీతా అంబానీ వాచ్ కలెక్షన్లో టాప్ -10 అత్యంత ఖరీదనవే కావడం విశేషం ఇంకా డైమండ్ నెక్లెస్‌లు, హ్యాండ్‌బ్యాగులు, కార్లు ఇలా లగ్జరీ లైఫ్ స్థయిల్,కాస్ట్లీ వస్తువుల కలెక్షన్ తో ఎప్పుడూ టాక్ఆఫ్ది టౌన్‌గా నిలుస్తారు. 1963 నవంబర్ 1 న జన్మించిన నీతా అంబానీ మధ్యతరగతి కుటుంబానికి చెందినది. ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన మహిళా పారిశ్రామికవేత్తల ఫోర్బ్స్ లిస్టులో నీతా అంబానీ చోటు సంపాదించు కున్నారు. ఇటీవల నీతా ముఖాష్ అంబానీ కల్చరల్సెంటర్(ఎన్ఎంఏసీసీ) ద్వారా భారతీయ కళలకు ప్రోత్సాహన్నిస్తున్నారు. -
ఒక్కొక్కరికి రూ. 2లక్షలు.. 5వేల విద్యార్థులకు అవకాశం - రిలయన్స్ ఫౌండేషన్
రిలయన్స్ ఫౌండేషన్ 2023-24 విద్యా సంవత్సరానికి 5,000 అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది. దీని కోసం అప్లై చేసుకోవాలనుకునే వారు 2023 అక్టోబర్ 15లోపు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కాలర్షిప్ అన్ని బ్రాంచ్‌లలోని మొదటి సంవత్సరం రెగ్యులర్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులందరికీ అందుబాటులో ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రిలయన్స్ ఫౌండేషన్ అందించే ఈ స్కాలర్షిప్ మెరిట్ ఆధారంగా చేసుకుని అందివ్వడం జరుగుతుంది. ఇందులో ఎంపికైన ఒక్కో విద్యార్థికి రూ. 2 లక్షల వరకు స్కాలర్షిప్ లభిస్తుంది. ఇందులో మహిళా విద్యార్థులకు, వికలాంగులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ప్రతిభ ఉన్న విద్యార్థులు డబ్బు గురించి ఆందోళన చెందకుండా చదువుకోవాలనే సదుద్దేశ్యంతో రిలయన్స్ సంస్థ ఈ స్కాలర్షిప్లను అందిస్తోంది. 2022 - 23 విద్యాసంవత్సరంలో కూడా సంస్థ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులను స్వీకరించింది. దీని కోసం అప్పుడు లక్ష మంది అప్లై చేసుకున్నారు. ఇందులో ఎంపికైన వారిలో 51 శాతం మహిళలు, 97 మంది వికలాంగులు ఉన్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: రూ.20 వేలతో మొదలై ప్రపంచ స్థాయికి.. వావ్ అనిపించే 'వందన' ప్రస్థానం! రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి www.scholarships.reliancefoundation.org వెబ్సైట్ సందర్శించవచ్చు. ఇందులో కేవలం ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. -
ఇషా అంబానీకి కొత్త బాధ్యతలు: కుమార్తెపై నీతా నమ్మకం అలాంటిది!
Isha Ambani రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె, రిలయన్స్ రిటైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇషా అంబానీ మరో కీలకమైన పదవికి ఎంపికైనారు. అంబానీ భార్య , రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్, ఛైర్ పర్సన్ నీతా అంబానీ ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్య, కళలు, క్రీడలు పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తూ, అనేక సామాజిక కార్యకలాపాలను నిర్వించే నీతా తన ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్‌ను మరింత విస్తరించనున్నారు. ఈ నేపథ్యంలోనే తన కొత్త వెంచర్ బాధ్యతలను కుమార్తె ఇషాకు అప్పగించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) 46వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) నీతా అంబానీ , నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్ ద్వారా ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌ను విస్తరించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇషా అంబానీ నేతృత్వంలో ఈ పాఠశాల భారతీయ ఆత్మతో భవిష్యత్తులో ఒక మోడల్ స్కూల్‌గా తీర్చిదిద్దనున్నట్టు కూడా వెల్లడించారు. రిలయన్స్ ఫౌండేషన్ రాబోయే 10 సంవత్సరాలలో రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ , పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌ల ద్వారా 50వేల మంది విద్యార్థులకు మద్దతు ఇవ్వనున్నామని, ఈ సంవత్సరంలోనే, సంస్థ 5000 స్కాలర్షిప్లను ప్రదానం చేశామని కూడా తెలిపారు. రిలయన్స్ రీటైల్ హెడ్‌గా దూసుకుపోతున్న ఇషా అంబానీ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌కి వైస్ చైర్పర్సన్ కూడా. ఇపుడిక నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్ బాధ్యతలను చేపట్టానున్నారు. అలాగే రిలయన్స్ రీటైల్‌కు సంబంధించి ఇప్పటికే పలు విదేశీ రిటైల్ బ్రాండ్లతో కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. -
రిలయన్స్ ఏజీఎం: గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నీతా అంబానీ కొత్త ప్లాన్స్
Reliance AGM Nita Amban NMACC 46వ రిలయన్స్ వాటాదారుల వార్షిక సమావేశంలో రిలయన్స్ ఫౌండేషన్ అధ్యక్షురాలు నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ సాధించిన విజయాలను, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. దేశ సంసృతినుంచి క్రీడల దాకా తమ ఫౌండేషన్ కృషిని వివరించారు. ముఖ్యంగా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సొసైటీ గురించి ప్రకటించారు. భారతీయ సంస్కృతి,కళ పట్ల తమ నిబద్ధతకు తాము లాంచ్ చేసిన ఎన్ఎంఏసీసీ అని తెలిపారు. రానున్న పదేళ్లలో 50వేల మంది విద్యార్థుల చదువు, భవిష్యత్తుకోసం పనిచేయనున్నాం.బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో కలిపి మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. 10 లక్షల మహిళల సాధికారత కోసం తాము బాగా కృషి చేయనున్నట్టు నీతా అంబానీ వెల్లడించారు. విద్య, క్రీడలు ఇప్పటివరకు 22 మిలియన్ల మంది యువకులకు చేరువయ్యాయని నీతా అంబానీ చెప్పారు ఈ సందర్భంగా బిల్ గేట్స్ దీనికి సంబంధించిన వివరాలను ప్రకటించారు. రానున్న పదేళ్లలో 50వేలమంది విద్యార్థుల చదువు, భవిష్యత్తుకోసం పనిచేయనున్నాం. ఈ సెంటర్‌ను లాంచ్ చేసినప్పటినుంచి 20లక్షలమంది ఈ సెంటర్‌ను సందర్శించి నట్టు తెలిపారు. అలాగే ఐపీఎల్ టీం గురించి మాట్లాడారు.హార్ధిక ప్యాండ్యా, బుమ్రా,తిలక వర్మ గురించి చెప్పారు. విదేశాల్లో ముఖ్యంగా విమెన్ ఐపీఎల్ టీం ప్రారంభించినట్టు తెలిపారు. అంతర్జాతీయ ఒలంపిక్ మెంబర్‌గా ఇండియాకు ఎలంపిక్ తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. రిలయన్స్ ఫౌండేషన్‌తో గేట్స్ ఫౌండేషన్ సహకారంపై మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం ఆవిష్కరణలు ఆకర్షణీయంగా ఉన్నాయి. అలాగే ఆ ఆవిష్కరణలను అత్యంత అవసరమైన వారికి అందించడంపై దృష్టి పెట్టడం కూడా బావుంది: బిల్ గేట్స్ అధిక-నాణ్యత, సరసమైన మందులు, వ్యాక్సిన్లను తయారు చేయడంలో భారతదేశం బ్రహ్మాండమైన ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉంది. రిలయన్స్‌తో ఫౌండేషన్ సహకారంతో మాదక ద్రవ్యాలు , పాయింట్-ఆఫ్-కేర్ డయాగ్నస్టిక్‌లను అభివృద్ధికి, కొత్త ఆవిష్కరణలు అమలుకు మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామనీ చెప్పారు. అంటు వ్యాధుల నిర్మూలనకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా తాము సంఘాలతో కలిసి పని చేయడం కూడా కొనసాగిస్తామని బిల్ గేట్స్ ప్రకటించారు. -
స్పెషల్ ఎట్రాక్షన్‌గా నీతా అంబానీ: చెప్పుల ధర రూ.7 లక్షలు
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్, భారత కుబేరుడు ముఖేష్ అంబానీ భార్య, నీతా అంబానీ తన డ్రెస్సింగ్ స్టయిల్‌తో ఆకట్టుకుంటారు. సంప్రదాయ బద్ధంగా చీర కట్టినా, పాశ్చాత్య దుస్తులైనా ఆమెది ప్రత్యేక శైలి. లక్షల ఖరీదు చేసే అత్యంత ఖరీదైన డిజైనర్ దుస్తులు ధరించినా ఆమెకు ఆమే సాటి. హై-ఎండ్ బ్రాండ్లను ఇష్టపడే ఫ్యాషన్ ఔత్సాహికులందరికీ నీతా అంబానీ వార్డ్రోబ్ ఒక రోల్‌మోడల్ తాజాగా నీతా అంబానీ న్యూయార్క్ వెకేషన్లో గూచీ కో-ఆర్డ్ సెట్ ఆకర్షణీయంగా నిలిచింది. నీతా లగ్జరీ లేబుల్ గూచీ నుండి బ్రౌన్-హ్యూడ్ ప్రింటెడ్ కో-ఆర్డ్ సెట్లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. అంబానీ ఫ్యాన్ పేజీ షేర్ చేసిన వివరాల ప్రకారం న్యూయార్క్ నగర వీధుల్లో ఫ్యాన్స్‌తో ఫోటోలకు పోజులిచ్చారు. ఇందులో ఓపెన్ ట్రెసెస్, డైమండ్ చెవిపోగులు, ఖరీదైన ఓరాన్ చెప్పులను ధరించడం అభిమానులను ఎట్రాక్ట్ చేసింది. నీతా గూచీ కో-ఆర్డ్ సెట్ విలువ రూ. 2.8 లక్షలు నీతా గూచీ కో-ఆర్డ్ సెట్ భారీ ధర 2.8 లక్షలు అట. సిల్క్-శాటిన్ జాక్వర్డ్ షర్ట్ ధర 2,128 డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 1,76,135. మరోవైపు, ఆమె మ్యాచింగ్ ట్రౌజర్ విలువ 1200 యూరోలు అంటే మన రూపాయిల్లో రూ. సుమారు 1,08,805. మొత్తం మీద నీతా అంబానీ కో-ఆర్డ్ సెట్ ఖరీదు రూ. 2,84,940 అని తెలుస్తోంది. ఓరాన్ చెప్పుల విలువ రూ. 6.5 లక్షలు నీతా అంబానీ ధరించి విలాసవంతమైన పాదరక్షల జత విలువ భారతీయ కరెన్సీలో దాదాపు 7 లక్షల రూపాయలు (రూ. 6,49,428). ఇక ఆమె చీరల విషయానికి వస్తే సాంప్రదాయ, నేత చీరలకు ముఖ్యంగా గుజరాతీ పటోలా చీరల ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇటీవల రూ. 1.7 లక్షలు విలువైన డిజైనర్ నవదీప్ తుండియా రూపొందించిన నీలం , ఎరుపు రంగు కలగలిసిన గుజరాతీ పటోలా మెరిసిన సంగతి తెలిసిందే. గార్జియస్ బిజినెస్ విమెన్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు నీతా అంబానీ లగ్జరీ లేబుల్ వైఎస్ఎల్ హీల్స్ ఎక్కువగా ధరిస్తారు. ఆమె వార్డ్‌రోబ్‌లో ఉన్న 6 ఖరీదైన వైఎస్ఎల్ హీల్స్ ఉన్నాయట. -
న్యూయార్క్ బుద్ధిస్ట్ ఆర్ట్ ఎగ్జిబిషన్: ప్రత్యేకతను చాటుకున్న నీతా అంబానీ
న్యూయార్క్‌లోని మెట్ మ్యూజియంలో జూలై 17న బౌద్ధ కళల ప్రదర్శన ప్రత్యేక ప్రివ్యూకు నీతా అంబానీ హాజరయ్యారు. మెట్ మ్యూజియంలో ప్రారంభ బౌద్ధ కళా ప్రదర్శన 'ట్రీ & సర్పెంట్: ఎర్లీ బౌద్ధ కళ ఇన్ ఇండియా, 200 BCE–400 CE' ప్రత్యేక ప్రివ్యూలో ఆమె తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ ఎగ్జిబిషన్ జూలై 21- నవంబర్ 13, 2023 వరకు మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ , ది మెట్ ఫిఫ్త్ అవెన్యూలో జరగనుంది. భారతదేశానికి కళను తీసుకురావడానికి ప్రపంచంలోని వివిధ మ్యూజియంలతో భాగస్వామ్యం కావాలని చూస్తున్నాం. ఎన్ఎంఏసీసీ లాంచ్ తరువాత గత 3 నెలల్లో, ప్రతిరోజూ 5000-6000 మందిని వస్తున్నారు. కేవలం రెండు ప్రదర్శనలను ఒకటిన్నర లక్షల మంది దర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఆసక్తికరమైన భారతీయ సంస్కృతి పట్ల ఆసక్తి పెరుగుతోందన్నారు నీతా అంబానీ.ఈ కార్యక్రమానికి నీతా అంబానీతో పాటు, భారతదేశంలోని యుఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి, యుఎస్‌లోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు ,న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్‌తో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం తర్వాత, నీతా భారతదేశాన్ని 'బుద్ధుని భూమి' అని అభివర్ణించారు. ఈ సందర్భంగా హాజరైన ప్రతి ఒక్కరూ 'బుద్ధం శరణం గచ్ఛామి' అనే పవిత్ర మంత్రాన్ని పఠించడంలో తనతో కలిసి రావాలని ఆమె అభ్యర్థించారు.200 BCE- 400 CE వరకు భారతదేశంలోని బౌద్ధ పూర్వపు మూలాలను హైలైట్ చేసే 140 వస్తువులను ఇక్కడ ప్రదర్శించనున్నారు., నాలుగు నెలల పాటు జరిగే ఈ ప్రదర్శనను ప్లాన్ చేయడానికి, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ది రాబర్ట్ హెచ్.ఎన్.హో ఫ్యామిలీ ఫౌండేషన్ గ్లోబల్, ఫ్రెడ్ ఐచానర్ ఫండ్ కలిసి పనిచేశాయి. నీతా 2016 నుండి మెట్ మ్యూజియంలో కీలకమైన భాగంగా ఉన్నారు. నవంబర్ 2019లో ఆమె గౌరవ ధర్మకర్తగా ,మెట్స్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ సభ్యురాలిగా ఎంపికయ్యారు. దీంతో మ్యూజియం ట్రస్టీల బోర్డులో చేరిన తొలి భారతీయురాలు నీతా కావడం విశేషం. #WATCH | We are looking at collaborating with various museums of the world to bring art to India. In last 3 months, after we opened NMACC, we saw footfall of 5000-6000 every day just for two exhibits we had over one and a half lakh people coming. India is at the right place and… pic.twitter.com/yga2AOeiUa — ANI (@ANI) July 19, 2023 -
నీతా అంబానీ మరో గ్రాండ్ ఈవెంట్.. సంగీత దిగ్గజాలతో ‘పరంపర’
రిలయన్స్ ఫౌండేషన్ స్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ మరో గ్రాండ్ ఈవెంట్‌కు తెరతీశారు. అనాదిగా వస్తున్న గురు శిష్య సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో 'పరంపర' అనే పేరుతో వారం రోజుల వేడుకను ప్రారంభించారు. భారతీయ శాస్త్రీయ సంగీతంలో సజీవ దిగ్గజాలు పద్మ విభూషణ్ పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, పండిట్ కార్తీక్ కుమార్, వారి శిష్యులు రాకేష్ చౌరాసియా, నీలాద్రి కుమార్‌లతో కలిసి నీతా అంబానీ జ్యోతి ప్రజ్వలన చేశారు. ధీరూభాయ్ అంబానీకి ఘన నివాళి కార్యక్రమంలో భాగంగా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ అయిన నీతా అంబానీ తన గురువు, మామ దివంగత ధీరూభాయ్ అంబానీకి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గురువుల ఔన్నత్యాన్ని వివరించారు. పవిత్రమైన గురు పూర్ణిమ రోజున, మనకు మొదటి గురువులైన తల్లిదండ్రులను గౌరవించుకుందామని పిలుపునిచ్చారు. తనకు అత్యంత స్ఫూర్తిదాయకమైన గురువులలో ఒకరైన ధీరూభాయ్ అంబానీతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. Mrs. Nita Ambani inaugurated, ‘Parampara’ a two day special celebration of the timeless guru-shishya legacy with a traditional lamp lighting ceremony accompanied by Pandit Hariprasad Chaurasia, Pandit Kartick Kumar & their illustrious disciples Rakesh Chaurasia and Niladri Kumar. pic.twitter.com/pTmWQk4f47 — Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) July 1, 2023 ఇదీ చదవండి: వైట్‌హౌస్‌లో మెరిసిన అంబానీ దంపతులు.. -
వైట్‌హౌస్ స్టేట్ డిన్నర్: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్, ఫౌండర నీతా అంబానీ భర్త, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతో కలిసి వైట్‌హౌస్‌లో గ్రేస్‌ఫుల్ లుక్‌తో మెరిసిన సంగతి తెలిసిందే. భారతప్రధానమంత్రి నరేంద్రమోదీ గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ ఇచ్చిన వైట్ హౌస్‌లో స్టేట్ డిన్నర్‌కు హాజరైన సందర్బంగా సాంప్రదాయబద్ధంగా అందమై న ఐవరీ కలర్ పట్టు చీరలో అందర్నీ ఆకట్టుకున్నారు. పూర్తిగా స్వదేశీ కళాకారులు రూపొందించిన బనారస్ పట్టు చీరను ధరించారు. దానికి సరిపోయే లేత గోధుమరంగు రంగు బ్లౌజ్, మ్యాచింగ్ మూడ వరుసల ముత్యాల హారం, పెర్ల్ నెక్లెస్, డైమండ్ పొదిగిన బ్యాంగిల్స్ , స్టడ్ చెవిపోగులతో తన ఫ్యాషన్ స్టయిల్‌ను చాటి చెప్పారు. బంగారు దారాలతో అందంగా చేతితో తయారు చేసిన సహజమైన పట్టు చీరను ఎంచుకోవడం విశేషం. (గిఫ్టెడ్ ఆర్టిస్ట్ నీతా అంబానీ అద్భుతమైన ఫోటోలు) ఎన్ఎంఏసీసీ అందించిన సమాచారం ప్రకారం రిలయన్స్ రిటైల్ విభాగం, రిలయన్స్ రిటైల్ ఆర్టిసన్-ఓన్లీ స్టోర్ ఫార్మాట్, స్వదేశ్, ముంబైలోని జియో మార్ట్‌లోని వారి ఇటీవల ప్రారంభించిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో ఈ చీరను తయారు చేశారు. అంతేకాదు యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ సహ-హోస్ట్ చేసిన స్టేట్ లంచ్‌లో గుజరాత్‌లోని పటాన్‌కు చెందిన ఎత్నిక్ పటోలా చీరను ధరించడం విశేషంగా నిలిచింది. ఈ గులాబీ రంగు పటోలా చీర పూర్తి చేయడానికి 6 నెలల పట్టిందట. భారతదేశ సంస్కృతి , సంప్రదాయం పట్ల ప్రేమ, ఫ్యాషన్ సెన్స్‌ను ఎపుడూ నిరూపించు కుంటూఉంటారు. స్పెషల్ కలెక్షన్స్‌కి ఆమె వార్డ్రోబ్ చాలా పాపులర్. దీనికి తోడు ఇటీ నీతా ముఖేష్ అంబానీ కల్చర్ సెంటర్ ద్వారా భారతీయ కళాకారులకు ప్రపంచ వేదికను కల్పించారు. నీతా అంబానీ వివిధ రంగాలలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా 2023లో ఫార్చ్యూన్ ఇండియా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ప్రతిష్టాత్మక అవార్డు గెల్చుకున్నారు. (ఇటలీలో లగ్జరీ విల్లా: రూ.40 లక్షల అద్దె సంపాదన, ఎవరీ సూపర్‌స్టార్?) Mrs. Nita Ambani’s sartorial choice – reflecting her vision of promoting Indian artisans – also found a place of pride at the State lunch co-hosted by U.S. Vice President Kamala Harris where she wore an ethnic Patola saree from Patan, Gujarat. pic.twitter.com/HXZWc19pfg — Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) June 24, 2023 -
ఈ ఫోటో ఎవరిదో గుర్తు పట్టగలరా? టాప్ హీరోయిన్ అయితే కాదు!
ఆసియా బిలియనీర్, వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ భార్య, నీతా అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అటు హుందాతనానికి, అటు ఫ్యాషన్‌కి ఐకాన్‌గా ఉంటారు. వ్యాపారవేత్తగా, నృత్యకారిణిగా, పరోపకారిగా అన్నింటికీ మించి తల్లిగా నీతా అంబానీ ప్రత్యేక ఆదరణను సొంతం చేసుకున్నారు. అన్ని విషయాల్లోనూ భర్త అంబానీతో ధీటుగా తనను తాను నిరూపించుకున్న సక్సెస్ఫుల్ ఉమన్ నీతా. మధ్యతరగతి గుజరాతీ కుటుంబంలో జన్మించిన నీతా చిన్నప్పటినుంచి భరతనాట్యంలో ప్రతిభావంతురాలైన కళాకారిణి రాణిస్తున్నారు. శాస్త్రీయ నృత్యంలో ఇప్పటికే తన ప్రతిభను చాటుకుంటూనే ఉన్నారు. పలు కుటుంబ వేడకుల సందర్బంగా డాన్స్‌తో ఆకట్టుకోవడం ఆమె స్టయిల్. తాజాగా నీతా అంబానీ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రదర్శన ఇస్తున్న ఫోటో ఒకటి ఇపుడు నెట్లో చక్కర్లు కొడుతోంది. Music is a universal language that transcends boundaries and unites us all. This World Music Day, immerse yourself in the symphony of diverse sounds at the #NitaMukeshAmbaniCulturalCentre where every note and rhythm weaves a tapestry of mesmerising harmony. pic.twitter.com/fN3KDcnm3Y — Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) June 21, 2023 నీతా అంబానీ భరతనాట్యం చేస్తున్న చిన్ననాటి చిత్రాలు చూస్తే అద్భుతం అనిపించకమానదు. సాంప్రదాయ దుస్తులు ధరించి నాట్యం చేస్తున్న ఫోటో స్పెషల్‌గా ఉంది. తన రెండు చేతులను తన నడుముపై ఉంచి సూపర్ క్యూట్‌గా ఉన్నారంటూ ఫ్యాన్స్ కమెంట్ చేశారు. అలాగే మరో రెండు ఫోటోల్లో నీతా భారీ నటరాజ్ విగ్రహం ముందు పవర్ ప్యాక్ ప్రదర్శన కళ్లు తిప్పుకోలేని ఎక్స్ప్రెషన్స్ అమూల్యమైన ఫ్రేమ్‌లో అందంగా ఇమిడిపోయిన ఫోటోలు విశేషంగా నిలుస్తున్నాయి. నీతా నర్సీ మోంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుండి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, టీచర్‌గా రూ. నెలకు 800 సంపాదించే వారట. ఆ తరువాత ముఖేష్ అంబానీని పెళ్లి చేసుకుని అతిపెద్ద కుటుంబ వ్యాపారంలో చేరారు. రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్ , ఐపీఎల్ క్రికెట్ జట్టు ముంబై ఇండియన్స్ యజమానిగా ఉన్నారు.అంతేకాదు కళారంగానికి సేవాలనే ఉద్దేశంతో ముంబైలో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌ను ఇటీవల లాంచ్ చేసినసంగతి తెలిసిందే. -
నీతా అంబానీ ఔదార్యం: బాధితులకు భారీ సాయం
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ దంపతులు ఒడిశా రైలు ప్రమాద బాధితులకు మద్దతు ప్రకటించారు. రిలయన్స్ ఫౌండేషన్ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు నీతా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రిలయన్స్ ఫౌండేషన్ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ అన్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే, తమ ప్రత్యేక విపత్తు నిర్వహణ బృందం వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యల్ని అందించిందన్నారు. రిలయన్స్ స్టోర్ల ద్వారా బాధిత కుటుంబాలకు వచ్చే ఆరు నెలల పాటు పిండి, పంచదార, పప్పు, బియ్యం, ఉప్పు, వంటనూనెతో సహా ఉచిత రేషన్ సరఫరాలను అందించ నున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు అంబులెన్స్‌లకు ఉచిత ఇంధనాన్ని, ప్రమాదంలో గాయపడిన వారికి ఉచిత మందులు, చికిత్సను అందించనున్నట్టు ప్రకటించింది. (మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్) ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిలయన్స్‌కు చెందిన దాతృత్వ విభాగం రిలయన్స్ ఫౌండేషన్. జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కనీసం 275 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడిన సంగతి తెలిసిందే. బాధితుల నష్టాన్ని పూడ్చలేం కానీ మరణించిన కుటుంబాలు ఈ విషాదం నుంచి కోలుకుని వారి జీవితాలను తిరిగి గాడిలో పెట్టుకునేలా, ముందుకు నడిచేలా చేసేందుకు సాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఈ లక్ష్యంతో 10-పాయింట్ల ప్రోగ్రామ్‌ను నీతా అంబానీ ప్రకటించారు. (ఆకాష్ అంబానీ ముద్దుల తనయ ఫస్ట్ పిక్ - వీడియో వైరల్) బాధితులకు అండగా పది పాయింట్ల ప్రోగ్రామ్ ►గాయపడిన వారి తక్షణ కోలుకోవడానికి అవసరమైన మందులు, ప్రమాదాల కారణంగా ఆసుపత్రిలో చేరిన వారికి వైద్య చికిత్స. ► విషాదం నుంచి కోలుకునేందుకు మద్దతు కోసం కౌన్సెలింగ్ సేవలు. ►జియో, రిలయన్స్ రీటైల్ ద్వారా మరణించిన వారి కుటుంబంలోని సభ్యునికి ఉపాధి అవకాశాలు ►వీల్చైర్లు, ప్రొస్థెసెస్తో సహా వైకల్యాలున్న వ్యక్తులకు సహాయ సహకారాలు అందించడం. ►కొత్త ఉపాధి అవకాశాలను కనుగొనడానికి బాధిత ప్రజలకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ. ►తమ కుటుంబంలోని ఏకైక సంపాదన సభ్యుడిని కోల్పోయిన మహిళలకు మైక్రోఫైనాన్స్ , శిక్షణ అవకాశాలు. ►ప్రమాదంలో ప్రభావితమైన గ్రామీణ కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కోసం ఆవు, గేదె, మేక, కోడి వంటి పశువులను అందించడం. ►మరణించిన కుటుంబ సభ్యునికి జియో ద్వారా ఒక సంవత్సరం పాటు ఉచిత మొబైల్ కనెక్టివిటీ -
5,000 మందికి రిలయన్స్ చేయూత.. ఒక్కొక్కరికీ రూ.2 లక్షల వరకు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న 5,000 మంది విద్యార్థులు రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లకు ఎంపికయ్యారు. 27 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల నుండి 2022–23 సంవత్సరానికి రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్లను ప్రదానం చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. ఎంపికైన అభ్యర్థులు రూ.2 లక్షల వరకు గ్రాంట్‌ని అందుకుంటారని వివరించింది. స్కాలర్షిప్స్ అందుకునే విద్యార్థుల్లో ఇంజనీరింగ్/టెక్నాలజీ, సైన్స్, మెడిసిన్, కామర్స్, ఆర్ట్స్, బిజినెస్/మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్, లా, ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ, ఆర్కిటెక్చర్, ఇతర ప్రొఫెషనల్ డిగ్రీలకు చెందినవారు ఉన్నారు. స్కాలర్స్‌లో 51 శాతం మంది బాలికలు. 4,984 విద్యా సంస్థలలో చదువుతున్న దాదాపు 40,000 మంది దరఖాస్తుదారుల నుండి కఠినమైన ప్రక్రియ ద్వారా వీరి ఎంపిక జరిగింది. ఇందులో ఆప్టిట్యూడ్ టెస్ట్, 12వ తరగతి మార్కు లు, ఇతర అర్హత ప్రమాణాల ఆధారంగా అర్హుల జాబితా రూపొందింది. పదేళ్లలో 50,000 మందికి స్కాలర్షిప్స్ అందజేయనున్నట్టు రిలయన్స్ ఫౌండేషన్ 2022 డిసెంబర్లో ప్రకటించింది. ఇదీ చదవండి: Ameera Shah: కూతురొచ్చింది! చిన్న ల్యాబ్‌ను రూ.వేల కోట్ల సంస్థగా మార్చింది.. -
International Womens Day: మహిళల కోసం హర్ సర్కిల్ ఎవిరీబాడీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హర్ సర్కిల్ ఎవిరీబాడీ పేరుతో ఓ ప్రాజెక్టును రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్పర్సన్ నీతా ఎం అంబానీ ఆవిష్కరించారు. మహిళల నిజ జీవిత కథలు, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా విభిన్న శరీర పరిమాణాలు, రూపాలను ప్రోత్సహించడం లక్ష్యంగా హర్ సర్కిల్ ఏడాదిపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఒక నిర్దిష్ట పరిమాణం, రంగు, ఆకృతిని కలిగి ఉండాలని ఆశించే అవాస్తవిక సౌందర్య ప్రమాణాలు, విష నిబంధనలను సవాలు చేసి విజేతలుగా నిలిచిన మహిళలను హర్ సర్కిల్ సామాజిక మాధ్యమం వేదికగా పరిచయం చేస్తారు. మహిళల కోసం భారత్‌లో అతిపెద్ద కంటెంట్, నెట్వర్కింగ్ వెబ్సైట్, యాప్ అయిన హర్ సర్కిల్‌ను 2021లో నీతా అంబానీ ప్రారంభించారు. 31 కోట్ల మందికి ఈ వేదిక చేరువైంది. వీరిలో 2.25 లక్షల మంది మహిళా వ్యాపారులు ఉన్నారు. -
ముఖేశ్ అంబానీ కుటుంబానికి ప్రాణ హాని...చంపేస్తామంటూ బెదిరింపు కాల్
ముంబై: ప్రముఖ పారిశ్రామిఖవేత్త రిలయన్స్ అధినేత ముఖేశ్ అబానీ కుటుంబానికి చంపేస్తామంటూ ఓ గర్తు తెలియని నెంబర్ నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. ఒక దుండగుడు రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి కాల్చేసి ఆస్పత్రిని బాంబుతో పేల్చేస్తానని, అలాగే రిలయన్స్ కుటుంబ సభ్యులను చంపేస్తానంటూ ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు రిలయన్స్ ఆస్పత్రికి బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఒక ల్యాండ్‌లైన్ నంబర్ నుంచి కాల్ వచ్చినట్లు తెలిపారు. ఆస్పత్రిని పేల్చేస్తానని బెదిరించడమే కాకుండా అంబాని కుటుంసభ్యులను కూడా చంపేస్తానని బెదరించాడని అన్నారు. ఐతే ఇలాంటి బెదిరింపు కాల్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌కి ఆగస్టు15న హెల్ప్‌లైన్ నెంబర్‌కు వచ్చాయి. ఆ ఘటనలో దుండగడు ఎనిమిది కాల్స్ చేశాడని అన్నారు. ఐతే కాల్ చేసిన వ్యక్తిని దహిసర్‌గా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు కూడా (చదవండి: చీతా హెలికాప్టర్ క్రాష్ ...పైలెట్ మృతి) -
అసోం వరదలు.. రూ.25 కోట్ల సాయం ప్రకటించిన రియలన్స్ ఫౌండేషన్
వరదల కారణంగా అతలాకుతలమైన అసోంకు బాసటగా నిలిచేందుకు రిలయన్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. వరద సాయం కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 కోట్ల సాయం అందిస్తున్నట్టు రియలన్స్ ఫౌండేన్ ప్రకటిచింది. రిలయన్స్ సాయం పట్ల అసోం ముఖ్యమంత్రి హేమంత బిశ్వశర్మ హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అసోంలో వరదలు ముంచెత్తాయి. వేలాది గ్రామాల్లో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. గత నెలరోజులుగా అసోంతో పాటు కేంద్ర ప్రభుత్వాలకు సహాకారం అందిస్తూ క్షేత్రస్థాయిలో తన వంతు సేవా కార్యక్రమాలను రిలయన్స్ ఫౌండేషన్ కొనసాగిస్తూ వస్తోంది. ముఖ్యంగా వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న కచర్, సిల్చర్, కలైన్, బర్కోలా జిల్లాలో బాధితుగలకు అండగా రిలయన్స్ ఫౌండేషన్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. చదవండి: 'ట్రెండ్స్' ఫెస్టివల్ సేల్,దుస్తులపై భారీ డిస్కౌంట్! -
నీతా అంబానీ చెబుతున్న సక్సెస్ సీక్రెట్స్, ఆర్థిక పాఠాలు
ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందటారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, నీతా దంపతుల విషయంలో అది నూటికి నూరుపాళ్లు నిజం అనిపిస్తుంది. ముకేశ్ అంబానీకి సహకారం అందిస్తూనే రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్‌గా అనేక సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు నీతా అంబానీ. అంబానీ కుటుంబంలో ఎప్పటి నుంచో ఉంటున్న ఆమె వ్యాపారంలో ఎదురయ్యే అనేక ఒడిదుడుకులు, వాటిని ఎదుర్కొనే తీరును దగ్గరగా చూసి ఉంటారు. అలా వచ్చిన అనుభంతో ఆమె ఇటీవల ట్విటర్ వేదికగా సక్సెస్ సీక్రెట్స్‌ని వరుసగా పంచుకుంటున్నారు. - చదువుకు జ్ఞానం తోడైనప్పుడు జీవిత గమనంలో సరైన మార్గంలో ప్రయాణిస్తాం - లక్ష్యాలను ఎప్పుడూ మార్చుకోకండి. లక్ష్యాలను చేరుకునే స్ట్రాటజీలను మార్చండి - ఒకరి కోసం నీ జీవితాన్ని మార్చుకోవద్దు - ఆదాయాన్ని మించి ఖర్చులు చేయోద్దు. అవసరం అనుకున్నప్పుడే డబ్బు ఖర్చు చేయండి - వ్యాపారంలో వచ్చిన నష్టాల గురించి బయటి వ్యక్తుల ముందు మాట్లాడకండి - బద్దకస్తులు, నిరక్ష్యంగా ఉండే వారే అదృష్టంపై ఆధారపడతారు - విజయం అనేది మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. సంతోషాన్ని ఇస్తుంది. నలుగురిలో గుర్తింపును కూడా తీసుకొస్తుంది - మథుమరైన సంభాషన విజయానికి రాచబాట పరుస్తుంది - సాకులు చెప్పడం మాని కష్టపడి పని చేస్తేనే విజయం వరిస్తుంది - మీకు నచ్చని వ్యక్తుల నుంచి సలహాలు తీసుకోకండి - సమయం విలువ తెలియని వారు తరుచుగా అపజయం పాలవుతుంటారు - ప్రతీ రోజు హ్యాపీ మూడ్‌లో నిద్ర లేవడం అనేది విజయానికి ఒక కొలమానం - మన కాళ్ల మీద మనం నిలబడాలి అనుకున్నప్పుడు ఇతరులపై ఆధారడకూడదు. ఇతరల మీద ఆధారపడి ప్రణాళికలు వేసే వాళ్లు ఎన్నటికీ స్థిరత్వం సాధించలేరు Don't change the goals, change the strategy. — NitaAmbani ☆ (@NitaMAmbani_) April 18, 2022 చదవండి: వేదాంత డైరీస్ 4: వ్యాపారంలో లెక్కలొక్కటే సరిపోవు.. మనసులు గెలవడమే ముఖ్యం -
జియో ఇన్స్టిట్యూట్స్ హెడ్‌గా గురుస్వామి రవిచంద్రన్
రిలయన్స్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న జియో ఇన్‌స్టిట్యూట్స్‌కి హెడ్‌గా గురుస్వామి రవిచంద్రన్‌ను నియమిస్తున్నట్టు రిలయన్స ప్రకటించింది. 2022 జులై 1న ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. కేరళాకి చెందిన గురుస్వామి తిరుచ్చి ఆర్ఈసీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలో బ్రౌన్ యూనివర్సిటీలో ఎమ్మెస్ పూర్తి చేసి అక్కడే పీహెచ్డీ పట్టా కూడా పొందారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది పొందిన అనేక ఇంజనీరింగ్ సంస్థలలో ఆయన పని చేశారు. గురుస్వామి నియామకం పట్ల రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ హర్షం వ్యక్తం చేశారు. గురుస్వామి నిర్దేశంలో జియో ఇన్స్టిట్యూట్ అనుకున్న లక్ష్యాలను చేరుకుంటుందని ఆశా భావం వ్యక్తం చేశారు. -
డిగ్రీ, పీజీ విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ శుభవార్త..!
డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ శుభవార్త తెలిపింది. భారత దేశాన్ని రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా ముందువరుసలో నిలిపేందుకు, విద్యార్ధులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దేందుకు ప్రముఖ రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. రిలయన్స్ ఫౌండేషన్ భారతదేశంలోని 100 మంది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ అందించనున్నట్లు తెలిపింది. కృత్రిమ మేధస్సు, కంప్యూటర్ సైన్సెస్, గణితం & కంప్యూటింగ్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో భారత దేశంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ చేస్తున్న విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ అందించనున్నట్లు సంస్థ పేర్కొంది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్లలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేయడానికి అర్హులు. దరఖాస్తు చేయడానికి ఎలాంటి ఎంట్రీ ఫీజు కూడా అవసరం లేదు. రేపటి ప్రపంచ నాయకులుగా మారే అవకాశం ఉన్న భారత ప్రతిభావంతులైన యువతను ప్రోత్సహించడం కోసం స్కాలర్ షిప్ ఇస్తున్నట్లు వెల్లడించింది. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా 60 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల వరకు గ్రాంట్ అందనుండగా, 40 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.6 లక్షల వరకు స్కాలర్ షిప్ అందించనున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహించే పరీక్షలో మెరిట్ ఉన్న అభ్యర్థులకు స్కాలర్ షిప్ అందించనున్నారు. మొదట 80 శాతం ఫండ్స్ ను కోర్సు ప్రారంభంలో అందిస్తే, మిగతా 20 శాతం మొత్తాన్ని విద్యార్థులు భవిష్యత్ అకాడమిక్ అవసరాల కోసం అందించనున్నారు. 2021లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), కంప్యూటర్ సైన్సెస్ కోర్సులో మొదటి సంవత్సరం చదువుతున్న 76 మంది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్ షిప్ ఇచ్చింది. రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్స్ దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలలో ఉన్న టాప్ సైన్స్ & ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నారు. అన్ని రకాల సామాజిక-ఆర్థిక నేపథ్యాల నుంచి దరఖాస్తు దారులను ఆహ్వానిస్తున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ తెలిపింది. ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి రిలయన్స్ ఫౌండేషన్ లింకు మీద క్లిక్ చేయండి. (చదవండి: ప్రతి రోజు రూ.44 పొదుపు చేస్తే.. రూ.27 లక్షలు మీ సొంతం..!) -
'మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్' లిస్ట్‌లో నీతా అంబానీ
Fortune India Most Powerful Woman 2021: రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్, చైర్పర్సన్ నీతా అంబానీ వ్యాపార రంగంలో అద్భుతాలు చేస్తున్నారు. లాక్ డౌన్ టైమ్‌లో కరోనా బాధితులకు ఉచితంగా సేవల్ని అందించినందుకు గాను ఆమెకు అరుదైన గౌరవం లభించింది. ఫార్చున్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన 'మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్' జాబితాలో రెండో స్థానంలో చోటు దక్కించుకున్నారు. దేశంలో కరోనా కారణంగా ఆస్పత్రులలో బెడ్ల కొరత ఏర్పడింది. అయితే ఆ బెడ్ల కొరత లేకుండా కోవిడ్ బాధితులకు నీతా అంబానీ అండగా నిలిచారు. రిలయన్స్ ఫౌండేషన్ బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్‌తో కలిసి ముంబైలో తొలిసారి 250 పడకల కోవిడ్ వార్డ్‌ను ఏర్పాటు చేయించి ట్రీట్మెంట్ ప్రారంభించారు. ఆక్సిజన్ కొరత లేకుండా 2,000 పడకలకు పెంచి ఉచితంగా ట్రీట్మెంట్ అందించేలా చేశారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి రోజూ 15,000 కంటే ఎక్కువగా కోవిడ్-19 టెస్టులు నిర్వహించేలా టెస్టింగ్ ల్యాబ్‌తో పాటు ప్రతిరోజూ లక్ష పీపీఈ కిట్లతో పాటు ఎన్-95 మాస్క్‌లను అందించారు. రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్‌గా ఉన్న నీతా అంబానీ జియో హెల్త్ హబ్ సాయంతో ఇప్పటివరకు 25 లక్షల మందికి కోవిడ్ టీకాలు అందేలా చేశారు. 100 జిల్లాలు, 19 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన నిరుపేదలకు, రోజూవారీ కూలీలకు, ఫ్రంట్‌లైన్ వర్కర్లతో సహా 8.5 కోట్లకు పైగా ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించి మానవత్వం చాటుకున్నారు. అయితే మహమ్మారి విలయం తాండవం చేస్తున్న సమయంలో బాధితులకు అండగా నిలిచినందుకు గాను ఫార్చున్ మ్యాగజైన్ దేశంలోనే 'మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్' జాబితాలో నీతా అంబానిని ఎంపిక చేసింది. చదవండి: ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబాలు ఇవే..! టాప్-10 లో ఇండియన్ ఫ్యామిలీ..! -
నీతా అంబానీ : తగ్గేదే..లే! ఈ విషయాలు మీకు తెలుసా?
సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపకురాలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ నీతా అంబానీ. రిలయన్స్ ఛైర్మన్ వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ భార్యగా కంటే, కుటుంబ వ్యాపారంలో పాలు పంచుకుంటూ, సంక్షేమ కార్యక్రమాలతోపాటు, దాతగా, వ్యాపారవేత్తగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. • 1985లో 20 ఏళ్ళ వయసులో ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీతో వివాహం • ఆకాష్, ఇషా, అనంత్ అనే ముగ్గురు పిల్లలు • ఫోర్బ్స్ 'ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన మహిళా వ్యాపారవేత్తల' జాబితాలో చోటు • ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లో సభ్యురాలు • నీతా అంబానీకి లగ్జరీ కార్లంటే మోజు • ఆడి ఏ9 కమేలియన్ అత్యంత విలాసవంతమైన కారున్న తొలి భారతీయ మహిళ • ఈ ప్రత్యేక ఎడిషన్ కారు ఖరీదు సుమారు 100 కోట్ల రూపాయలు • ఈ కారు డ్రైవర్ జీతం సంవత్సరానికి రూ. 24 లక్షలు. • నీతా అంబానీ కార్ల లిస్ట్‌లో రోల్స్ రాయిస్ ఫాంటమ్, బెంట్లీ ఫ్లయింగ్ స్పర్, మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, పోర్షే లాంటి మోడల్ కార్లు ఉన్నాయి. • నీతా అంబానీ డిజైన్స్ , స్టైల్స్ విషయంలో చాలా అప్డేట్గా ఉంటారు. నీతా జ్యుయల్లరీ కలెక్షన్ చూస్తే కళ్లు తిరగాల్సిందే. వేసింది మళ్లీ వేసేదే లే.. సాంప్రదాయ బంగారు ఆభరణాలు, హారాలు, వడ్డాణాలు వజ్రాల ఉంగరాలు, అరుదైన డైమండ్ చోకర్లు ఇలా కోట్లాది రూపాయల కలెక్షన్ ఆమె సొంతం. నీతా అంబానీ అత్యంత ఖరీదైన చెప్పులు, షూ కలెక్షన్ గురించి చాలా మందికి తెలియదు. వేసినవి మళ్లీ వేయకుండా లగ్జరీకి, రాయల్టీకి పెట్టింది పేరుగా ఉంటాయి. పెడ్రో, జిమ్మీ చూ, గార్సియా మార్లిన్ తదితర విలాసవంతమైన బ్రాండ్లను ఆమె వాడతారు. రూ.40 లక్షల చీర నీతా అంబానీ సారీ కలెక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతటి సెలబ్రిటీలైనా నీతా తరువాతే ఎవరైనా. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీరలలో ఒకటిగా పేరొందిన రూ.40 లక్షల చీరను ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతాల వివాహానికి ధరించడం విశేషం. జాకెట్టు వెనుక భాగంలో ఎంబ్రాయిడరీ చేసిన శ్రీకృష్ణుడి అందమైన చిత్రం హైలైట్‌గా నిలిచింది. ఈ చీరను చెన్నై సిల్క్స్ డైరెక్టర్ శివలింగం డిజైన్ చేశారు. కేవలం పట్టు చీరలు, బంగారంతో, చేతితో నేసిన చీరలే కాదు రియల్ డైమండ్స్, రూబీ, పుఖ్రాజ్, పచ్చ, ముత్యాలు, ఇతర మరెన్నో అరుదైన రత్నాలు పొదిగిన చీరలు ఆమె వార్డ్ రోబ్‌లో కొలువు దీరాయి. కళ్లు చెదిరే లిప్‌స్టిక్ కలెక్షన్ సాంప్రదాయ దుస్తులు, అరుదైన ఆభరణాలు, హై-బ్రాండ్ షూసే కాదు నీతా అంబానీకి లిప్‌స్టిక్‌లపై కూడా పిచ్చి ప్రేమ. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లిప్‌స్టిక్‌ల అరుదైన సేకరణ ఆమె సొంతం. లిపిస్టిక్ ప్యాకేజ్లే బంగారం, వెండితో తయారు చేసినవి అంటే ఆమె రేంజ్ అర్థం చేసుకోవచ్చు. నీతా అంబానీ లిప్‌స్టిక్ కలెక్షన్ విలువ రూ. 40 లక్షలట. కార్పొరేట్ జెట్ 2007లో, ముఖేశ్ అంబానీ తన అందమైన భార్య నీతాకు విలాసవంతమైన కార్పొరేట్ జెట్‌ను పుట్టినరోజు గిఫ్ట్‌గా ఇచ్చారు. దీని అంచనా ధర రూ. 240 కోట్లు. కస్టమ్-ఫిట్ చేసిన ఆఫీస్, ఒక ప్రైవేట్ క్యాబిన్, శాటిలైట్ టెలివిజన్ సెట్లు, వైర్లెస్ కమ్యూనికేషన్, మాస్టర్ బెడ్రూమ్, విలాస వంతమైన బాత్రూమ్లు ఇందులో ఉన్నాయి. మరో పుట్టినరోజుకు దుబాయ్ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన కారును బహుమతిగా ఇచ్చారు ముఖేశ్. 3 లక్షల వజ్రాలు పొదిగిన దీని ధర రూ.30 కోట్లు. కోట్ల విలువచేసే జపనీస్ టీ సెట్ పురాతన అరుదైన వస్తువుల పట్ల నీతా అంబానీకి అమితమైన ప్రేమ. జపాన్‌లోని పురాతన కత్తుల సెట్ తయారీదారులు నోరిటాకేకుచెందిన స్పెషల్ టీ సెట్ దీనికి ఉదాహరణ. దీని అంచనా ధర రూ. 1.5 కోట్లు. లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్‌లు ఫ్యాషన్ ఐకాన్‌గా డేన్సర్గా, డిజైనర్‌గా ఆకట్టుకునే 'కార్పొరేట్ లేడీ' నీతా అంబానీ లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్‌ల గురించి పత్ర్యేకంగా చెప్పుకోవాల్సిన పనేలేదు. కార్పొరేట్ మీట్ నుండి ఫ్యామిలీ ఈవెంట్ల వరకు, నీతా అంబానీకి అత్యంత ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్ ఉండాల్సిందే. ప్రపంచంలోనే ఖరీదైన బ్రాండ్స్ ఫెండి, సెలిన్ నుండి హెర్మేస్ వరకు ప్రతీదీ స్పెషల్ ఎట్రాక్షనే. దీంతోపాటు ఆమె ధరించే కార్టియర్, బల్గారీ, గూచీ లాంటి పాపులర్ బ్రాండ్ల వాచెస్ మరో ప్రత్యేక ఆకర్షణ ఫిట్‌గా ఉండేందుకు డైట్, వర్క్అవుట్స్ కఠినమైన డైట్ ప్లాన్ పాటిస్తారు నీతా. ఉదయాన్నే కొన్ని డ్రై ఫ్రూట్స్ , ఎగ్ వైట్ అల్పాహారం. మధ్యాహ్న భోజనంలో సూప్, తాజా ఆకుకూరలు, కూరగాయలను ఇష్టపడతారు. రాత్రి భోజనంలో కూరగాయలతో పాటు, మొలకలు, సూప్ తీసుకుంటారు. రోజంతా మధ్యలో పండ్లు తీసుకుంటారు. అంతేకాదు ఎంత రాత్రి అయినా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా వర్కౌట్ సెషన్‌ను అస్సలు మిస్ కారు. స్విమ్మింగ్, యోగా శాస్త్రీయ నృత్యం వంటి అనేక శారీరక వ్యాయామాలను చేస్తారు. తనను తాను హైడ్రేట్‌గా ఉంచుకునేందుకు డిటాక్స్ వాటర్‌తోపాటు, బీట్రూట్ రసాన్ని డిటాక్స్ వాటర్‌గా తాగడానికి ఇష్టపడతారు నీతా. బీట్రూట్ జ్యూస్ శరీరం నుండి హానికరమైన టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. అందుకే ఆమె చర్మం ఎపుడు మెరుస్తూ, తాజాగా ఉంటుంది. ఇంటి నుండి బయటకి అడుగుపెట్టిన ప్రతిసారీ ఆమెకు కొత్త చెప్పులు లేదా షూస్ ఉండాల్సిందే. అలాగే ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్ అయిన నీతా అడ్మిషన్ సీజన్లో అస్సలు ప్రయాణాలు పెట్టుకోరు. ఈ ప్రక్రియను వ్యక్తిగతంగా దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తారు. బాలికా విద్యా, మహిళా క్రీడాకారులకు అండగా నిలుస్తారు. దీంతోపాటు కరోనా సమయంలో అనేక చారిటీ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. - సాక్షి, వెబ్‌డెస్క్ ప్రత్యేకం -
మహిళల సాధికారికత కోసం రిలయన్స్ ఫౌండేషన్ భారీగా నిదుల కేటాయింపు
ముంబై: 'విమెన్ కనెక్ట్ చాలెంజ్" ఇండియా కింద భారతదేశ వ్యాప్తంగా మొత్తం పది సంస్థలు గ్రాంటీలు(మంజూరుకర్తలు)గా ఎంపిక చేశారు. రిలయన్స్ ఫౌండేషన్, యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ ఎయిడ్(USAID) కలసి విమెన్ కనెక్ట్ చాలెంజ్ ఇండియాను ప్రారంభించాయి. ఈ కార్యక్రమం కింద కేటాయించిన రూ.11 కోట్ల(1. 5 మిలియన్ డాలర్లకు పైబడిన మొత్తం)ను లింగ ఆధారిత డిజిటల్ వివక్షను తొలగించేందుకు ఉపయోగించనున్నారు. ఇందులో రిలయన్స్ ఫౌండేషన్ రూ.8.5 కోట్ల మేరకు($ 1.1 మిలియన్ డాలర్లకు పైగా మొత్తం) సమకూర్చనుంది.(చదవండి: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్!) లింగ ఆధారిత డిజిటల్ వివక్షను తొలగించేందుకు వివిధ వినూత్న పరిష్కారాలను రూపొందించే ప్రాజెక్టుల కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు. 17 రాష్ట్రాల్లో 3 లక్షల మందికి పైగా మహిళలు, బాలికలు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఇది సాంకేతికత ద్వారా మహిళల ఆర్థిక సాధికారికతను అధికం చేయనుంది. అనుదీప్ ఫౌండేషన్, టీర్ ఫూట్ కాలేజ్ ఇంటర్నేషనల్, సెంటర్ ఫర్ యూత్ అండ్ అండ్ సోషల్ డెవలప్ మెంట్, ప్రెండ్స్ ఆఫ్ విమెన్స్ వరల్డ్ బ్యాంకింగ్, నాంది ఫౌండేషన్, ప్రొఫెషనల్ అసిస్టెన్స్ ఫర్ డెవలప్ మెంట్ యాక్షన్, సొసైటీ ఫర్ డెవలప్ మెంట్ ఆబ్బర్నేటివ్స్, సాలిడారిడాడ్ రీజనల్ ఎక్స్ పర్టయిజ్ సెంటర్, టీఎన్ఎస్ ఇండియా ఫౌండేషన్, జెడ్ఎంక్యూ డెవలప్ మెంట్ ఈ సంస్థల్లో ఉన్నాయి. మహిళా రైతులు, ఆంత్రప్రె న్యూర్లు, స్వయం సహాయక బృందాల సభ్యుల సమస్యలను, సామాజిక, సాంస్కృతిక అడ్డంకులను అధిగమించేందుకు, లింగ ఆధారిత డిజిటల్ అంతరాన్ని తొలగించేందుకు ఈ పరిష్కారాలు తోడ్పడుతాయి.(చదవండి: ఈ గేమ్స్ ఆడుతున్నారా..! అయితే జర భద్రం..!) ఈ సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్, వ్యవస్థాపక చైర్ పర్సన్ శ్రీమతి నీతా ఎం అంబానీ మాట్లాడుతూ.. “ప్రతీ జీవనశైలిలో మహిళలను సంసిద్దులను చేసి, వారికి సాధికారికత కల్పించడం మా లక్ష్యం. మేం జియోను ప్రారంభించినప్పుడు, సమాన అవకాశాలు కల్పించే విప్లవం గురించి మేం కల కన్నాం. జియో ద్వారా మేం మన దేశవ్యాప్తంగా అందుబాటు ధరలకే ఇంటర్నెట్ అందిస్తున్నాం. భారతదేశంలో లింగ ఆధారిత డిజిటల్ వివక్షను తొలగించేందుకు యూఎస్ ఎయిడ్ సంస్థతో కలసి రిలయన్స్ ఫౌండేషన్ పని చేస్తోంది. అసమానతలను పరిష్కరించేందుకు, వాటిని తొలగించేందుకు సాంకేతికత అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. విమెన్ కనెక్ట్ చాలెంజ్ ఇండియా విజేతలుగా నిలిచిన పది సంస్థలకు నా అభినందనలు" అని అన్నారు. -
కేరళకు అండగా రిలయన్స్ ఫౌండేషన్
కరోనా కష్టకాలంలో రిలయన్స్ ఫౌండేషన్ దేశంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు తనవంతు సాయం అందజేస్తున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా రిలయన్స్ ఫౌండేషన్ కేరళ ప్రభుత్వానికి 2.5 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను ఉచితంగా అందించింది. ఈ సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రిలయన్స్ ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలపడటంతో పాటు ఈ సహాయం రాష్ట్ర వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రక్రియను బలోపేతం చేస్తుందని అన్నారు. వైరస్ నుంచి ప్రజలను రక్షించడానికి సామూహిక వ్యాక్సినేషన్ ప్రక్రియ అత్యంత ప్రభావవంతమైన మార్గం అని రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ తెలిపారు. "మిషన్ వ్యాక్సిన్ సురక్షలో భాగంగా మేము దేశవ్యాప్తంగా ఉచిత వ్యాక్సినేషన్లను అందిస్తున్నాం. ఈ 2.5 లక్షల ఉచిత వ్యాక్సినేషన్ మోతాదులతో రిలయన్స్ ఫౌండేషన్ కేరళ వాసులకు తోడుగా నిలిచినట్లు" ఆమె అన్నారు. ఈ కోవిడ్ వ్యాక్సిన్లను కేరళ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ కు అందజేసినట్లు ఫౌండేషన్ పేర్కొంది. ఎర్నాకుళం జిల్లా కలెక్టర్ జాఫర్ మాలిక్ కేరళ ప్రభుత్వం తరఫున వ్యాక్సిన్లు అందుకున్నారు. ఈ వ్యాక్సిన్లను కేరళ ఆరోగ్య శాఖ ద్వారా పంపిణీ చేసి నిర్వహిస్తామని రిలయన్స్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. కేరళ ప్రజలకు రిలయన్స్ ఫౌండేషన్ సహాయం చేయడం ఇదే మొదటిసారి కాదు. 2018 వరదల సమయంలో, ఫౌండేషన్ సీఎం సహాయ నిధికి ₹21 కోట్లు విరాళంఇచ్చింది. వరద సహాయక చర్యలు చేపట్టడంతో పాటు మందులు, నిత్యావసరాలు సరఫరా చేసింది. -
మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్న రిలయన్స్ ఫౌండేషన్..!
ముంబై: ప్రముఖ ప్రైవేటు దిగ్గజ కంపెనీ రిలయన్స్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. రిలయన్స్ ఫౌండేషన్ తరపున బలహీన వర్గ ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించనుంది. బృహణ్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్(బీఎమ్సీ), రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ముంబై నగరంలోని సుమారు 50 మురికివాడల్లో నివసిస్తోన్న ప్రజలకు దాదాపు మూడు లక్షల కరోనా వ్యాక్సిన్లను ఇవ్వనుంది. రిలయన్స్ ఫౌండేషన్ సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని పేర్కొంది. ఈ వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమాన్ని సర్ హెచ్.ఎన్.రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రి మూడు నెలలపాటు నిర్వహించనుంది. ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్ ధారావి, వర్లీ, వడాలా, కొలాబా, ప్రతీక్ నగర్, కామాతీపుర, మంఖుర్ద్, చెంబూర్, గోవండి, భండూప్తో సహా పరిసర ప్రాంతాల్లో రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహించనుంది. సర్ హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ అత్యాధునిక మొబైల్ వాహన విభాగాన్ని ముంబైలోని ఎంపిక చేసిన ప్రదేశాలలో వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమానికి రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహించనుంది. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా ఎం అంబానీ మాట్లాడుతూ..కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న నిరంతర పోరాటంలో రిలయన్స్ ఫౌండేషన్ దేశానికి అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. కరోనా వైరస్ నుంచి ప్రజలను రక్షించడానికి సామూహిక టీకా డ్రైవ్‌లే అతిపెద్ద ఆయుధమని తెలిపారు. ప్రతి ఒక్క భారతీయుడు వీలైనంత త్వరగా టీకాలను వేయించుకోవాలని పిలుపునిచ్చారు. కరోనాతో చేస్తోన్న యుద్ధంలో రిలయన్స్ ఫౌండేషన్ చేయగలిగినదంతా చేయడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. త్వరలోనే కరోనాను అంతంచేసి, మంచి రోజులు మళ్లీ మనకు వస్తాయనే నమ్మకం ఉందని నీతా అంబానీ అభిప్రాయపడ్డారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రిలయన్స్ ఫౌండేషన్ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దేశనలుమూలల్లో కరోనా టెస్టింగ్, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరాను ఉచితంగా చేసింది. అంతేకాకుండా సుమారు కోటి మాస్క్‌లు, ఏడున్నర కోట్ల భోజనాలు, కోవిడ్ రోగుల చికిత్స కోసం 2వేలకు పైగా వెంటిలేటర్ బెడ్స్‌ను పంపిణీ చేసింది. కరోనా పట్ల ప్రజల్లో చైతన్యం కల్పించడం కోసం అనేక కార్యక్రమాలను నిర్వహించింది. మిషన్ వ్యాక్సిన్ సురక్ష కార్యక్రమంలో భాగంగా రిలయన్స్ గ్రూప్స్‌లో పని చేస్తోన్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, డిపెండెంట్స్ కోసం సంస్థ ఇప్పటికే దాదాపు 10లక్షల వ్యాక్సిన్ డోసులను కేటాయించింది. -
Reliance: కోవిడ్‌తో మరణించిన ఉద్యోగి కుటుంబానికి 5 ఏళ్ల జీతం.. ఇంకా
కరోనా కష్టకాలంలో తమ ఉద్యోగులను ఆదుకునేందుకు రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మంచి నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌తో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఐదేళ్లపాటు ఆర్థికసాయం అందించేందుకు ముందుకొచ్చింది. అంతేకాదు వాళ్ల పిల్లల చదువుల బాధ్యతలను కూడా తీసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో రిలయన్స్ ఫౌండేషన్ తెలిపింది. ముంబై: ఉద్యోగుల సామాజిక భద్రత కోసం రిలయన్స్ ఒక అడుగు ముందుకేసింది. COVID-19 తో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబానికి 5 సంవత్సరాలు పూర్తి వేతనం ఇవ్వడంతో పాటు వారి పిల్లలకు విద్య అందించేందుకు రిలయన్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. అలాగే ఆఫ్ రోల్స్ ఎంప్లాయిల కుటుంబాలకు పదిలక్షల సాయం అందించాలని నిర్ణయించినట్లు చెబుతోంది. అలాగే సాయం అందించే విషయంలో బాధిత కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని, సాయం త్వరగతిన అందుతుందని హామీ ఇచ్చింది. ఈ మేరకు కొన్ని జాతీయ వెబ్‌సైట్స్ ఈ సాయం గురించి ప్రముఖంగా కథనాలు ప్రచురించాయి. కాగా, తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నాడు. సోషల్ మీడియాలో #WeappreciateReliance, #thanxReliance హ్యాష్ ట్యాగులతో రిలయన్స్ నిర్ణయాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు. కోవిడ్ లీవులు.. సాయం ఇక కోవిడ్ బారిన పడ్డ ఎంప్లాయిస్, వాళ్ల కుటుంబాలు పూర్తిగా కోలుకునేంతవరకు జీతాలతో కూడిన సెలవుల్ని రిలయన్స్ మంజూరు చేసింది. అలాగే కరోనాతో చనిపోయిన ఉద్యోగి భార్య, పేరెంట్స్, పిల్లల ఆస్పత్రి ఖర్చుల కోసం 100 శాతం ప్రీమియం చెల్లింపును రిలయన్సే భరించాలని నిర్ణయించుకుంది. ఇక చనిపోయిన ఉద్యోగి పిల్లలందరికీ గ్రాడ్యుయేషన్ వరకు దేశంలో ఏ ఇనిస్టిట్యూట్‌లోనైనా 100 శాతం ట్యూషన్ ఫీజు, హాస్టల్ సౌకర్యానికి అవసరమయ్యే ఖర్చులనూ రిలయన్స్ ఫౌండేషన్ అందించబోతోంది. ‘‘మనందరికీ మంచి రోజులు రాబోతున్నాయి. పోరాట పటిమను ఆపొద్దు. అందరం కలిసి కట్టుగా పోరాడదాం. మంచి రోజులు వచ్చేవరకు మన తోటి ఉద్యోగుల కుటుంబాలకు అవసరమైన ధైర్యం అందాలని ఆ దేవుడ్ని ప్రార్థిద్దాం. చేయూత నిద్దాం. జాగ్రత్తగా ఉండడండి’ అంటూ రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ తన ప్రకటన రిలీజ్ చేశారు. -
రెండు తెలుగు రాష్ట్రాలకు రిలయన్స్ మద్దతు
హైదరాబాద్: కోవిడ్-19కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వంతు మద్దతును అందించనుంది. ఇందులో భాగంగా కోవిడ్ సహాయక చర్యలకు ప్రభుత్వం ఉపయోగించే అత్యవసర సేవా వాహనాలు, అంబులెన్స్‌లకు రిలయన్స్ పెట్రోల్ బంకులు ఉచిత ఇంధనాన్ని అందించనున్నాయి. సంబంధిత ప్రభుత్వ అధికారులు జారీ చేసిన అనుమతి లేఖల ఆధారంగా అన్ని అత్యవసర సేవా వాహనాలు, అంబులెన్సులకు రోజుకు ఒక వాహనానికి గరిష్టంగా 50 లీటర్ల ఇంధనాన్ని రిలయన్స్ బంకులు ఉచితంగా అందిస్తాయి. ఈ సదుపాయం జూన్ 30 వరకు వర్తిస్తుంది అని సంస్థ పేర్కొంది. మరోవైపు ఆక్సిజన్ కొరత సమస్యను సమర్ధంగా ఎదుర్కొనేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు రిలయన్స్ తన వంతు సాయాన్ని అందిస్తోంది. ఈ మేరకు తెలంగాణకు 80 టన్నులు, ఆంధ్రప్రదేశ్ కు మరో 80 టన్నుల మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్ ను రిలయన్స్ సమకూర్చింది. ఆక్సిజన్ ఎక్సప్రెస్ ఈ కంటైనర్లను రిలయన్స్ జామ్‌నగర్ ప్లాంట్ నుంచి తీసుకువచ్చి హైదరాబాద్, గుంటూరు రైల్వే స్టేషన్లకు ఆదివారం నాటికి చేరవేసింది. కోవిడ్- 19పై దేశం చేస్తున్న పోరాటానికి మద్దతుగా రిలయన్స్ కుటుంబం చేతులు కలిపింది. కోవిడ్ -19తో చేస్తున్న పోరాటంలో దేశం విజయం సాధించేలా చేసేందుకు క్షేత్రస్థాయిలో బహుముఖ విధానాలతో కార్యక్రమాలను రిలయన్స్ చేపట్టింది. కరోనా సమయంలో భారతీయుల కష్టాలను తొలగించేందుకు నిర్విరామంగా ప్రయత్నించింది. వారు వేగంగా కోలుకునేందుకు సహాయపడింది. వైరస్ కలిగించిన ముప్పును అధిగమించేందుకు తన వనరులు, మానవశక్తి, ఉపకరణాలు... అన్నింటినీ రిలయన్స్ ఉపయోగిస్తోంది. రిలయన్స్ 1,000 మెట్రిక్ టన్నుల మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సీజన్ ను దేశవ్యాప్తంగా సమకూరుస్తోంది. ఇది భారతదేశ ఆక్సీజన్ ఉత్పత్తిలో 11 శాతం లేదా ప్రతీ 10 మంది రోగుల్లో ఒకరికి అవసరమైన దాంతో సమానం. మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సీజన్ రవాణాను సులభతరం చేసేందుకు గాను రిలయన్స్ 32 ఐఎస్ఓ కంటెయినర్లను దిగుమతి చేసుకుంది. భారతదేశంలో కోవిడ్ పై జరుగుతున్న పోరాటంలో తాను చేపట్టిన ఎన్నో కార్యక్రమాలతో రిలయన్స్ ఫౌండేషన్ ముందు వరుసలో నిలిచింది. రిలయన్స్ ఫౌండేషన్ భారతదేశ మొట్టమొదటి కోవిడ్ -19 కేర్ హాస్పిటల్ ను కేవలం రెండు వారాల్లోనే ఏర్పాటు చేసింది. మిషన్ అన్న సేవను ప్రారంభించింది. ఇప్పటి వరకూ 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పేదలకు, ఫ్రంట్ లైన్ సిబ్బందికి 5.5 కోట్లకు పైగా భోజనాలను సమకూర్చింది. చదవండి: ఫ్రీ అంబులెన్స్! మానవత్వం చాటుకున్న సాప్ట్ వేర్ ఉద్యోగి -
వెయ్యి పడకలతో కోవిడ్ ఆసుపత్రి: రిలయన్స్
సాక్షి, గాంధీనగర్: దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న వేళ దేశీయ అతిపెద్ద పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) పెద్దమనసు చాటుకుంది. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుజరాత్లో జామ్‌నగర్‌లో కరోనా రోగుల కోసం పెద్ద కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. 1000 పడకల కోవిడ్-19 ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు సంకల్పించింది. మొదటి దశలో 400 పడకలు ఒక వారంలో, మరో 600 పడకలు మరో వారంలో సిద్ధంగా ఉంటాయని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ ప్రకటించారు. (కరోనా విలయం: చూస్తే కన్నీళ్లాగవు: వైరల్ ట్వీట్) ఆర్ఐఎల్ చెందిన రిలయన్స్ ఫౌండేషన్ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఆక్సిజన్ సౌకర్యంతో ఈ కోవిడ్-19 ఆసుపత్రిని ఏర్పాటు చేస్తుంది. అంతేకాదు ఈ కోవిడ్ కేర్ ఫెసిలిటీలో అన్ని సేవలను ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. అత్యుత్తమైన, నాణ్యమైన సేవలను ఉచితంగానే అందిస్తామని నీతా అంబానీ చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అభ్యర్థనకు ప్రతిస్పందనగా ఆర్ఐఎల్ ఈ నిర్ణయం తీసుకుందని ఆమె తెలిపారు. వచ్చే ఆదివారం నాటికి జామ్‌నగర్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 400 పడకల ఆసుపత్రిని ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఆ తర్వాతి వారంలో 1000 పడకలకు ఆసుపత్రి సామర్థ్యాన్ని పెంచుతామన్నారు. కాగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 3.86లక్షల కొత్త కేసులు నమోదు కాగా, 3498 మంది మృత్యువాత పడ్డారు. గుజరాత్లో (గురువారం) కొత్తగా14,327 కేసులు నమోదు కాగా 180 కరోనాతో మృతి చెందారు. గుజరాత్లో ఎక్కువగా ప్రభావితమైన 10 జిల్లాల్లో మే 1 నుంచి 18-45 ఏళ్లలోపు వారికి టీకా డ్రైవ్ ప్రారంభ మవుతుందని సీఎం విజయ్ రూపానీ శుక్రవారం ప్రకటించారు. -
మహిళల కోసం ‘హర్ సర్కిల్’
న్యూఢిల్లీ: మహిళా సాధికారతకు మరింత తోడ్పాటునిచ్చే దిశగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ తాజాగా ’హర్ సర్కిల్’ పేరిట సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఆవిష్కరించారు. భిన్న సంస్కృతులు, వర్గాలు, దేశాలకు చెందిన మహిళ లు తమ ఆలోచనలను పంచుకునేందుకు ఇది వేదికగా ఉండగలదని ఆమె తెలిపారు. ఇందులో ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. జీవన విధానం, ఆరోగ్యం, ఆర్థికం, వినోదం, ఉద్యోగం, వ్యక్తిత్వ వికాసం తదితర అనేక అంశాలకు సంబంధించిన వీడియోలు, ఆర్టికల్స్ మొదలైనవి హర్ సర్కిల్ సబ్స్క్రయిబర్స్కు అందుబాటులో ఉంటాయని నీతా అంబానీ పేర్కొన్నారు. ప్రాథమికంగా ఇంగ్లీష్‌లో ఉండే హర్ సర్కిల్ క్రమంగా ఇతర భాషల్లో కూడా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. -
నిరుపేదల కోసం ‘రిలయన్స్’ ముందడుగు
ముంబై : సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే నీతా అంబానీ మరో అడుగు ముందుకేసి మిషన్ అన్న సేవ పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. కరోనా ఓడిపోతుంది..ఇండియా గెలుస్తుంది అనే నినాదంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెట్ కి చెందిన రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా పేద, వలస కూలీలకు అన్నదానం చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపకురాలు, ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ వెల్లడించారు. భారత్‌లో లాక్డౌన్ గడువును పొడిగించడంతో పేదలు, రోజువారీ కూలీల దయనీయ పరిస్థితులను చూసి చాలా బాధేసిందని అన్నారు. అందుకే వారికి ఆహారం అందించేందుకు మిషన్ అన్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రకటించారు. దీని ద్వారా 3 కోట్ల మంది నిరుపేదలకు భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే ఓ కార్పోరేట్ సంస్థ చేస్తున్న అతి పెద్ద అన్నదాన పంపిణీ కార్యక్రమం ఇదేనని పేర్కొన్నారు. కరోనాపై పోరులో తమవంతు సాయంగా అక్షరాల 535కోట్ల రూపాయల విరాళాన్ని అందించి దాతృత్వాన్ని చాటుకుంది రిలయన్స్ సంస్థ. -
ప్లాస్టిక్ బాటిల్స్‌కు కొత్త జీవితం: రిలయన్స్ రికార్డు
సాక్షి, ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన సేవా సంస్థ రిలయన్స్ ఫౌండేషన్ రికార్డు స్థాయిలో ప్లాస్టిక్ వేస్ట్‌ను సేకరించింది. రీసైకిల్ ఫర్ లైఫ్ ప్రచారంలో భాగంగా రీసైక్లింగ్ కోసం 78 టన్నుల వ్యర్థ ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించామని శుక్రవారం ప్రకటించింది. మూడు లక్షల మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు,ఇతర భాగస్వాముల ద్వారా ఈ రికార్డు కలెక్షన్ సాధ్యమైందని ఒక ప్రకటనలో రిలయన్స్ వెల్లడించింది. అక్టోబర్‌లో ప్రారంభించిన రీసైకిల్ ఫర్ లైఫ్ డ్రైవ్‌లో సంస్థ ఉద్యోగులు వారి పరిసరాల నుండి వ్యర్థ ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించి కార్యాలయాలకు తీసుకురావాలని విస్తృత ప్రచారం నిర్వహించింది. దీంతో దేశవ్యాప్తంగా రిలయన్స్, దాని అనుబంధ వ్యాపారాల నుంచి భారీ స్పందన లభించింది. పరిశుభ్రమైన, పచ్చని పుడమి కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చామని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ తెలిపారు. భవిష్యత్ తరాల కోసం మెరుగైన, ప్రకాశవంతమైన, శుభ్రమైన, పచ్చటి ప్రపంచాన్ని సృష్టించడమే లక్ష్యమన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమానికి రిలయన్స్ ఫౌండేషన్ కట్టుబడి వుందని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రాముఖ్యతను నమ్ముతున్నామన్నారు. క్రమం తప్పకుండా శుభ్రపరిచే కార్యకలాపాలకు మద్దతు ఇస్తుందని నీతా వెల్లడించారు. ‘రీసైకిల్ 4 లైఫ్’ ప్రచారంలో భాగంగా సేకరించిన వ్యర్థ ప్లాస్టిక్ సీసాలు రీసైకిల్ చేస్తామన్నారు. అలాగే వాడిన పెట్ బాటిల్స్‌తో పర్యావరణ అనుకూల, ఉత్పత్తులను, దుస్తులను తయారు చేస్తున్న విషయాన్నిఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. -
ఒకే మ్యాచ్‌లో 263 పాయింట్లు..
ముంబై: ప్రఖ్యాత నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) మొదటిసారి భారత్‌లో నిర్వహించిన ఎగ్జిబిషన్ తొలి మ్యాచ్‌లో పాయింట్ల వర్షం కురిసింది. అనుక్షణం ఉత్కంఠభరింతగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇండియానా పేసర్స్ 132–131తో కేవలం ఒక్క పాయింట్ తేడాతో సాక్రామెంటో కింగ్స్‌పై గెలిచింది. రెండో మ్యాచ్ నేడు జరుగుతుంది. 12 నిమిషాల చొప్పున నిడివితో నాలుగు క్వార్టర్లు జరిగాయి. తొలి క్వార్టర్ ముగిశాక పేసర్స్ 29–39తో, రెండో క్వార్టర్ ముగిశాక 59–72తో మూడో క్వార్టర్ ముగిశాక 92–97తో వెనుకంజలో ఉంది. నిర్ణాయక చివరి క్వార్టర్లో పేసర్స్ 26 పాయింట్లు స్కోరు చేయగా... కింగ్స్ 21 పాయింట్లు సాధించింది. దాంతో నిర్ణీత సమయానికి రెండు జట్లు 118–118తో సమఉజ్జీగా నిలిచాయి. దాంతో ఫలితం తేలడానికి అదనంగా ఐదు నిమిషాలు ఆడించగా... పేసర్స్ 132–131తో విజయాన్ని ఖాయం చేసుకుంది. అంతకుముందు రిలయెన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ మ్యాచ్ బాల్‌ను నిర్వాహకులకు అందజేశారు. స్కోరు వివరాలు ఇండియానా పేసర్స్: 132 (టీజీ వారెన్ 30, సబోనిస్ 21, జెరెమీ ల్యాంబ్ 20, బ్రాగ్‌డన్ 15, మైల్స్ టర్నర్ 11, మెక్‌డెర్మట్ 9); సాక్రామెంటో కింగ్స్: 131 (బడ్డీ హీల్డ్ 28, హ్యారిసన్ బార్నెస్ 21, డెరాన్ ఫాక్స్ 16, బొగ్డాన్ 14, నెమాంజా 14, మారి్వన్ బాగ్లే 12, హోమ్స్ 10). -
రిలయన్స్ ఫౌండేషన్ టీచర్ అవార్డులు
ముంబై : టీచింగ్ ప్రొఫెషనల్ ఒలింపియాడ్‌లో ప్రతిభ కనబరిచిన 1000 మంది ఉపాధ్యాయులను రిలయన్స్ ఫౌండేషన్ టీచర్ అవార్డులతో గౌరవించింది. అవార్డు విజేతలను యునెస్కో, యునిసెఫ్, సీబీఎస్ఈ బోర్డు ప్రతినిధులు సహా పలువురు ప్రముఖుల సమక్షంలో సత్కరించారు. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న వారిని ప్రోత్సహించేందుకు బోధనలో మెళుకువలు పెంచుకునేందకు రిలయన్స్ ఫౌండేషన్ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌పై వారికి శిక్షణ ఇస్తోంది. ఇక ఈ కార్యక్రమంలో ఇషా అంబానీ మాట్లాడుతూ రిలయన్స్ టీచర్ అవార్డుల ద్వారా ఈ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టీచర్లను గుర్తించి సత్కరించడం తమకు గర్వకారణమని చెప్పారు. దేశ భవిష్యత్‌ను నిర్ధేశించే యువతరాన్ని రూపొందించడంలో ఉపాధ్యాకులు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. దేశవ్యాప్తంగా మెరుగైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులకు అవసరమైన సాధనా సంపత్తిని సమకూర్చేందుకు రిలయన్స్ ఫౌండేషన్ కట్టుబడి ఉందని చెప్పారు. -
సెంటాతో రిలయన్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం
సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన దాతృత్వ సంస్థ రిలయన్స్ ఫౌండేషన్ బోధనా పద్ధతులు, ఉపాధ్యాయుల నైపుణ్యాలూ మెరుగు పర్చేందుకుగాను సెంటర్ ఫర్ టీచర్ అక్రిడిటేషన్(సెంటా)తో మల్టీ ఇయర్ కొలాబరేషన్ ఒప్పందంపై సంతకం చేసింది. దేశంలో విద్యాబోధనకు ప్రోత్సాహమిచ్చే లక్ష్యంతో బెంగళూరు కేంద్రంగా పనిచేసే సెంటాతో ఈ భాగస్వామ్యాన్ని కుదుర్చుంది. ఈ ఒప్పందంలో భాగంగా సెంటా ప్రతీ ఏడాది నిర్వహించే ‘టీచింగ్ ప్రొఫెషనల్స్ ఒలింపియాడ్(టీపీఓ)కు రిలయన్స్ ఫౌండేషన్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈ క్రమంలో 4వ టీపీఓ ఎడిషన్ పోటీ పరీక్షను డిసెంబర్ 8న నిర్వహిస్తున్నారు. దుబాయ్, అబుదాబిలతోపాటు, దేశవ్యాప్తంగా 46 నగరాల్లో ఈ పోటీ ఉంటుందని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ పోటీలో వెయ్యి మంది విజేతలకు నగదు బహుమతితోపాటు ఇతర ప్రోత్సాహకాలందివ్వనున్నట్టు తెలిపింది. ఉత్తమ నైపుణ్యాలున్న ఉపాధ్యాయుల్ని గుర్తించి వారినీ వారి బోధనా పద్ధతుల్ని వెలుగులోకి తేవడం ఈ పోటీ ప్రధాన ఉద్దేశమని చెప్పింది. రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ భారతదేశంలో విద్యాబోధనలో ఎదుర్కొంటున్న సవాళ్ళను పరిష్కరించే చర్యలకు మద్దతివ్వాలని రిలయన్స్ ఫౌండేషన్ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. విద్య, సాంకేతిక నాణ్యతను అందించడంలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్రను పోషిస్తారని ఇషా పేర్కొన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ మద్దతు నందించడం తమకు పెద్ద ప్రేరణ అని సెంటా వ్యవస్థాపకుడు సీఈవో రమ్య వెంకట రామన్ సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో టీపీఓ పేరుతో ఉపాధ్యాయుల నైపుణ్యాల్ని పరీక్షించి, ప్రోత్సాహాన్నందిస్తున్నట్టు చెప్పారు. టీపీఓ 2018 : ప్రాథమిక స్థాయినుంచి సీనియర్ సెకండరీ స్థాయిదాకా మొత్తం 21 సబ్జెక్టుల్లో ఉంటుంది. మిడిల్ స్కూల్, సెకండరీ, సీనియర్ సెకండరీ పరీక్ష ప్రస్తుతం ఇంగ్లీష్ మాధ్యమంలో ఉంటుంది. అలాగే ప్రైమరీ స్కూల్ టెస్ట్ ఇంగ్లీష్, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం, తెలుగు మాధ్యమాలలో అందుబాటులో ఉంది. -
కేరళకు రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం
సాక్షి, హైదరాబాద్ : భారీ వరదలతో అతలాకుతలమైన కేరళకు రిలయన్స్ ఫౌండేషన్ అండగా నిలిచింది. కేరళ సీఎం రిలీఫ్‌ఫండ్‌కు రూ. 21 కోట్ల విరాళం అందజేసింది. దాంతోపాటు రూ. 50 కోట్ల విలువైన వస్తువులను వరద బాధితులకు పంపిణీ చేయనున్నట్టు రిలయన్స్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన రిలయన్స్ రిటైల్, జియో సహకారంతో వరద బాధితులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నామని, వరద బాధిత ప్రాంతాల్లో ఇప్పటికే తమ ఫౌండేషన్ సహాయక చర్యల్లో నిమగ్నమైందని తెలిపింది. ఆగస్ట్ 14 నుంచి వయనాడ్, త్రిశూర్, అలప్పుళ, ఎర్నాకుళం సహా పలు జిల్లాల్లో తమ వాలంటీర్లు పనిచేస్తున్నారని వెల్లడించింది. కేరళలోని 160 ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లోని బాధితులకు రిలయన్స్ రిటైల్ తరఫున ఆహార పదార్థాలు, గ్లూకోజ్, శానిటరీ నాప్కిన్స్ వంటివి పంపిణీ చేస్తున్నామని పేర్కొంది. ఇక, కేరళలో వారం రోజుల పాటు ఉచిత వాయిస్, డేటా సేవలను అందించనున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. -
రిలయెన్స్ మీద అంత మోజెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని మూడు ప్రముఖ ప్రభుత్వం ఉన్నత విద్యా సంస్థలతోపాటు మరో మూడు ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలకు కూడా సోమవారం నాడు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ (ఘనత వహించిన లేదా అత్యున్నత)’ హోదాను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. ప్రైవేటు రంగంలో ఇంకా పురుడు కూడా పోసుకోని ‘జియో ఇనిస్టిట్యూట్’కు ఎలా ఈ హోదా కల్పిస్తారంటూ సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. ఒక్కసారిగా వెల్లువెత్తిన విమర్శలకు ఎలా సమాధానం చెప్పాలో తెలియక ముందుగా తికమక పడిన కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత ‘గ్రీన్ ఫీల్డ్’ క్యాటగిరీ కింద ఇచ్చామంటూ సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ప్రభుత్వం ప్రతిపాదనల ప్రకారం దేశంలోని పది ప్రభుత్వ, పది ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలకు ఈ ‘అత్యున్నత’ హోదాను కల్పించాల్సి ఉంది. నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ చేపట్టగా కేవలం ఆరు అంటే, మూడు ప్రభుత్వ, మూడు ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు మాత్రమే ఈ హోదాకు అర్హులయ్యాయని నలుగురు సభ్యుల ఎంపిక కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించిన మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్. గోపాలస్వామి ‘ఎకనామిక్స్ టైమ్స్’కు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా టాప్ 500 ఉన్నత విద్యా సంస్థల్లో వరుసగా పదేళ్ల పాటు స్థానం సంపాదించిన విద్యా సంస్థలనే తాము ప్రమాణంగా తీసుకున్నామని కూడా ఆయన చెప్పారు. మరి ఏ ప్రమాణాల మేరకు ఇంకా ఏర్పాటు చేయని ‘జియో ఇనిస్టిట్యూట్’కు ఎలా హోదా ఇచ్చారన్న ప్రశ్నకు ఆయన ఫోన్ మూగబోయింది. ప్రస్తుతం ఆయన మీడియాకే అందుబాటులో లేరు. రాజస్థాన్‌లోని పిలానిలో 1964లో ఏర్పాటైన ‘బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’కి, 1953లో ఏర్పాటైన ‘మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (కస్తూర్బా మెడికల్ కాలీజీని నిర్వహిస్తున్న)’తోపాటు జియో ఇనిస్టిట్యూట్‌కు ప్రభుత్వం హోదా కల్పించింది. ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ నేతృత్వంలో నిర్వహిస్తున్న రిలయెన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జియో ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు 2018, మార్చి నెలలో నీతూ అంబానీ ప్రకటించారు. అసలు ప్రమాణాలు ఏమిటీ? కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2016లో తన బడ్జెట్ ప్రసంగంలోనే ఈ అంశాన్ని తీసుకొచ్చారు. దేశంలో ఉన్నత విద్యను మరింత ప్రోత్సహించేందుకు 20 విద్యా సంస్థలకు ‘అత్యున్నత’ హోదా కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే 2017, ఆగస్టులో ఈ ప్రక్రియను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇందులో నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం విద్యా సంస్థలు బహుళ అంశాల్లో కోర్సులను నిర్వహించడమే కాకుండా పరస్పర ఆధారిత కోర్సులను కూడా నిర్వహించాలి. దేశీయ, విదేశీ విద్యార్థులకు కలిపి ఒక ఫ్యాకల్టీ తప్పనిసరిగా ఉండాలి. వర్ధమాన సాంకేతిక పరిజ్ఞానంపై సంస్థ పరిశోధన కొనసాగుతుండాలి. విద్యార్థుల సౌకర్యాలకు సంబంధించి ప్రపంచ స్థాయి ప్రమాణాలు ఉండాలి. దరఖాస్తు నాటికి ప్రతి 20 విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉండాలి. మరో ఐదేళ్ల కాలానికి ఆ సంఖ్య పది తగ్గాలి. ఇందులో ఏ ఒక్క ప్రమాణానికి జియో ఇనిస్టిట్యూట్ సరితూగదు కనుక ‘గ్రీన్‌ఫీల్డ్’ కేటగిరీ కింద ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. ‘గ్రీన్‌ఫీల్డ్’ కేటగిరీ అంటే ఏమిటీ? కేవలం ప్రైవేటురంగంలో కొత్తగా పెట్టబోయే ఉన్నత విద్యా సంస్థలకు అవకాశం ఇవ్వడం కోసం ఈ కేటగిరీ తర్వాత తీసుకొచ్చారు. ఈ కేటగిరీ కింద సంస్థను కాకుండా యూనివర్శిటీనే ఏర్పాటు చేయాలి. అందుకు కావాల్సినంత స్థలం, డబ్బుతోపాటు విద్యారంగంలో అనుభవం ఉండాలి. సొంత పెట్టుబడులు ఐదు వేల కోట్లతోపాటు పది వేల కోట్ల రూపాయల పెట్టుబడుల వరకు ప్రజా సంస్థల పూచికత్తు ఉండాలి. పది ప్రజా సంస్థలకు మించి ఈ పెట్టుబడులను సమకూర్చరాదు. పది వేల కోట్ల నుంచి కొంత సొమ్మును సంస్థ విస్తరణకు ఏటా ఖర్చు పెట్టాలి. ఐదేళ్ల నుంచి 15 ఏళ్లలోగా అత్యున్నత హోదాను, ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకునే ఆస్కారం ఉండాలి. అందుకు తగ్గ ప్రణాళిక ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యం సమర్థుడైన వైస్ ఛాన్సలర్ ఆధ్వర్యంలో కోర్ కమిటీ దరఖాస్తు నాటికే నియమితులై ఉండాలి. మరి, ఈ అర్హతలు ‘జియో’కు ఉన్నాయా? రిలయెన్స్ గ్రూప్ కనుక కావాల్సినంత స్థలం, డబ్బు ఉండవచ్చు. అనుభవం అంటే రాజాస్థాన్‌లోని ‘బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ని చూపించవచ్చేమో! ప్రజా సంస్థల పెట్టుబడులను కూడా మేనేజ్ చేయవచ్చు. వైస్ చాన్సలర్ టీమ్‌ను ఏర్పాటు చేయలేదు. యూనివర్శిటీ పునాదుల మాట అటుంచి ఎక్కడ ఏర్పాటు చేయాలో కూడా నిర్ణయం జరగలేదు. మరి జియోకు ఎలా ఇచ్చారని ఈ సంస్థతో పోటీపడిన మరో హోదా దక్కించుకోని సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. దరఖాస్తు చేసిన సంస్థల్లో పెద్ద పెద్ద యూనివర్శిటీలతో సంబంధం ఉన్న, వాటిల్లో అపార అనుభవం ఉన్న సంస్థలు ఉన్నాయి. వాటికి ఒక్క ప్రజా సంస్థల పెట్టుబడులు తప్పించి, జియోకన్నా ఎక్కువ ప్రమాణాలే ఉన్నాయని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని దరఖాస్తుదారులు చెబుతున్నారు. సహజంగా ప్రభుత్వ విద్యా సంస్థలకు విరాళాలిచ్చే ప్రజా సంస్థలు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎందుకు పెట్టుబడులు పెడతాయని వారు ప్రశ్నిస్తున్నారు. -
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అపూర్వ ఘనత
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ కేవలం లాభదాయకమైన కంపెనీగా మార్కెట్లో దూసుకుపోతుండటమే కాకుండా.. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజానికి తన వంతు కృషి అందిస్తోంది. ముఖ్యంగా రిలయన్స్ ఫౌండేషన్(ఆర్ఎఫ్), సీఎస్ఆర్ సంస్థ ద్వారా సమాజానికి గణనీయమైన సహకారాన్ని అందిస్తోంది. విజయంతంగా ఈ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలను అందిస్తుండటంతో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 2017 సంవత్సరానికి గాను గోల్డెన్ పీకాక్ అవార్డును గెలుచుకుంది. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా మాజీ జడ్జీ అరిజిత్ పాస్యత్ ఆధ్వర్యంలోని అవార్డుల జ్యూరీ గోల్డెన్ పీకాక్ అవార్డు 2017కి రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ఎంపికచేసింది. వ్యవస్థాపకురాలు, చైర్మన్ నీతా అంబానీ ఆధ్వర్యంలో రిలయన్స్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా 13,500 గ్రామాలు, 74 అర్బన్ ప్రాంతాల్లో 15 మిలియన్ మంది ప్రజలకు తన సేవా కార్యక్రమాలను అందిస్తోంది. రిలయన్స్ పౌండేషన్ విద్య, క్రీడలు, ఆరోగ్యం, గ్రామీణ పరివర్తన, పట్టణ పునరుద్దరణ, విపత్తు ప్రతిస్పందన, మహిళల సాధికారత, ప్రమోషన్ , భారతీయ సంస్కృతి పరిరక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. రిలయన్స్ తన కార్పొరేట్ సామాజిక కార్యక్రమాల కోసం మూడు మోడ్స్‌ను ఎన్నుకుంది. డైరెక్ట్ ఎంగేజ్మెంట్(నిపుణుల టీమ్ ద్వారా కార్యక్రమాలు అందించడం), పార్టనర్షిప్స్(భాగస్వామ్య సంస్థల ద్వారా అందించడం), లెవరేజింగ్ టెక్నాలజీ ద్వారా రిలయన్స్ తన సేవలను అందిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తన 40 ఏళ్ల ప్రస్తానంలో పలు మైలురాయిలను చేధించింది. రెండు దశాబ్దాలకు పైగా కంపెనీ తన దాతృత్వ కార్యక్రమాలతో సామాజిక విలువలను అందిస్తోంది. గోల్డెన్ పీకాక్ అవార్డులను నెలకొల్పి 25 ఏళ్లకు పైగా అయింది. స్థానికంగా, అంతర్జాతీయంగా అందించే ఉత్తమమైన సేవా కార్యక్రమాలకు గాను దీన్ని అందిస్తారు. మూడు స్థాయిల్లో ఇండిపెండెంట్ అసెసర్స్ అవార్డు దరఖాస్తుదారులను పరిశీలించిన అనంతరం, చివరికి గ్రాండ్ జ్యూరీ ఈ అవార్డు గ్రహీతలను ఎంపికచేస్తోంది. ఈ క్రమంలోనే 2017 గోల్డెన్ పీకాక్ అవార్డులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎంపికైంది. -
ఆమె కోసం అంబానీ ఇంటికి తారాలోకం
ముంబై : ఎవరామె? ఆమె బుడిబుడి అడుగులు నేర్చుకుంటున్న సమయంలోనే కన్నతండ్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అసలే పేదరికం. బతుకు గడవటం కష్టంగా మారిన పరిస్థితుల్లో సొంత ఊరు గోర్కీ(రష్యా)లోనే తల్లి ఓ పండ్ల దుకాణంలో పనిలో కుదిరింది. స్కూల్ నుంచి సరాసరి పండ్లకొట్టుకు వెళ్లి తల్లికి సాయం చేసేదా చిన్నారి. కొన్నేళ్లకి.. స్నేహితుల సహకారంతో తల్లికి సొంత పండ్ల దుకాణాన్ని పెట్టించింది. 15 ఏళ్ల వయసులోనే మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుని ఏజెన్సీలో పేరు నమోదు చేయించుకుంది. తొలినాళ్లలో చిన్నాచితకా బ్రాండ్లకు పనిచేసిన ఆమె రెండేళ్ల తర్వాత పారిస్ బాటపట్టింది. వివా మోడల్‌గా కాంట్రాక్టుపై సంతకం చేసిన తర్వాత ఇక వెనుదిరిగి చూడలేదు. టాప్ ఫ్యాషన్ షోలన్నింటిలో తనదైన ప్రతిభకనబర్చింది. పేరు తోపాటు భారీగా డబ్బునూ సంపాదించింది. ఆమె మరెవరోకాదు.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలైన మోడల్‌గా ఖ్యాతిపొందిన నటాలియా వొడియనోవా. సంపాదించిన డబ్బులో అధికభాగాన్ని పేదల కోసం ఖర్చుపెడుతూ గొప్ప వితరణశీలిగానూ పేరుతెచ్చుకుందామె. అంబానీ ఇంట్లో గ్రాండ్ పార్టీ : ‘నేకెడ్ హార్ట్’ ఫౌండేషన్ ద్వారా నటాలియా.. పలుదేశాల్లోని నగరాలు, పట్టణాల్లో పేదకుటుంబాలకు చెందిన పిల్లలకు అవసరమైన విద్య, ఆరోగ్య సౌకర్యాలు అందించే పనిలో ఉంది. ఫౌండేషన్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ముంబై వచ్చిన ఆమెను.. ‘రిచెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ ముఖేశ్ అంబానీ, ఆయన సతీమణి (రిలయన్స్ ఫౌండేషన్ చీఫ్) నీతా అంబానీలు ఇంటికి ఆహ్వానించారు. ఆమె గౌరవార్థం శనివారం రాత్రి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ముంబై షోషలైట్లతోపాటు బాలీవుడ్ తారాలోకం సైతం పార్టీలో పాలుపంచుకున్నారు. ఆ పార్టీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రముఖ నటి శ్రీదేవి కూతుళ్లు జాన్వీ, ఖుషీలు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, నీతా అంబానీ, వారి కూతురు ఇషా, కరీనా, కరిష్మా, జాక్వెలిన్, మలైకా, పద్మాలక్ష్మి, శ్రద్ధాకపూర్, కరణ్‌జోహార్, వరుణ్‌ధావన్, మనీశ్ మల్హోత్రా, అర్జున్ కపూర్, హృతిక్ రోషన్ తదితర స్టార్లు సందడిచేశారు. (ఫొటో స్లైడర్ చూడండి..) -
రిలయన్స్ ఫౌండేషన్ యంగ్ చాంపియన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం
-
కొన‘సాగుతున్న’ ఉత్కంఠ..
పొత్తు విషయంలో బీజేపీ మల్లగుల్లాలు * శివసేతో పొత్తుకు కొందరు నాయకుల విముఖత * ఒంటరిగానే ముందుకు పోవాలని సూచన * రెండు రోజుల్లో తేలనున్న సర్కారు భవితవ్యం.. ముంబై సెంట్రల్, న్యూస్‌లైన్: బీజేపీ ఎవరితో చేతులు కలిపి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనుందన్న విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకరోజు ఎన్సీపీతో చేతులు కలుపుతుందని, మరో రోజు శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని చర్చలు జోరుగా సాగుతున్నాయి. దీంతో రాష్ట్రంతో పాటు దేశ ప్రజల దృష్టి మహారాష్ట్ర రాజకీయాలపై కేంద్రీకృతమైంది. ప్రస్తుతం అందుకున్న వివరాల మేరకు బీజేపీ ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉందని తెలుస్తోంది. ఇది వీలుకానట్లయితే శివసేనతో కలిసి ఏర్పాటుచేయాలన్న యోచనలో ఉంది. సోమవారం తేలనున్న భవితవ్యం.... బీజేపీ శాసనసభ పక్ష నేతను ఎన్నుకోనున్నట్లు తెలిసింది. ఈ విషయంపై చర్చలు జరపడానికి రాజ్‌నాథ్ సింగ్, జె.పి. నడ్డాలు ముంబైకి రానున్నారు. శాసనసభ పక్ష నేతను ఎన్నుకుంటారు. శివసేనతో చర్చలు జరుపుతారు. ఏయే శాఖలు కేటాయించాలన్న విషయంపై నిర్ణయం తీసుకుంటారు. చర్చలు సఫలమైతే బుధవారం కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒంటరిగానే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు... రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 123 స్థానాలు దక్కించుకున్న బీజేపీ తక్కువ సంఖ్యా బలంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేసే విషయంపై బీజేపీ ఆసక్తి చూపడం లేదని, సేనతో దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు శివసేనతో కలిసి కూటమి ఏర్పాటు చేసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని చర్చలు జోరుగా సాగగా... మరోవైపు బీజేపీ మాత్రం శివసేనతో కాకుండా తక్కువ సంఖ్యా బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుపుతోందని, శివసేన మంత్రుల మినహా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోందని, మరోవైపు శివసేనతో నామమాత్రంగా చర్చలు సాగిస్తున్నట్లు రాజకీయ వర్గాలు తెలిపాయి. తక్కువ సంఖ్యాబలంతో ప్రభుత్వం ఏర్పాటైనా శివసేన, కాంగ్రెస్, లేదా ఎన్సీపీ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టలేవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే ఎన్సీపీ పరోక్షంగా మద్దతు తెలపవచ్చని బీజేపీకి చెందిన కొందరు నాయకులు ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఎన్సీపీ మద్దతు తీసుకున్నట్లయితే దేశంలో బీజేపీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందని బీజేపీకి చెందిన ఢిల్లీ నాయకులు, రాష్ట్రంలోని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఎన్సీపీ మద్దతు తీసుకున్నట్లయితే ఆ పార్టీలో కుంభకోణంలో ఇరుక్కున్న నాయకులకు కొమ్ము కాస్తుందనే అపవాదు వస్తుందని బీజేపీ నాయకులు అంటున్నారు. అందుకే ఎన్సీపీ మద్దతు ఇచ్చినా తీసుకోకూడదని అభిప్రాయపడుతున్నారు. మద్దతు తీసుకున్నా, అలాగే ప్రతిపక్షం, చిన్న పార్టీల మద్దతు తీసుకున్నాగానీ ప్రభుత్వం తక్కువ సంఖ్యాబలంతోనే ఉంటుంది. కాబట్టి తక్కువ సంఖ్యాబలంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలా? లేదా శివేసనతో కలిసి స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలా అనే విషయంపై చాలా మంది బీజేపీ నాయకులు తర్జనభర్జన పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో శివసేన మద్దతు తీసుకున్నట్లయితే ప్రభుత్వం స్థిరంగా ఉంటుందని, అలాగే ఐదేళ్ల వరకు ఎటువంటి ఢోకా ఉండదని బీజేపీకి చెందిన వినోద్ తావ్డే, పంకజా ముండే తదితర నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు శివసేన-బీజేపీ కూటమి తెగిపోయిన తర్వాత ఏవైతే ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగాయో వాటిపై దృష్టి పెట్టకుండా భవిష్యత్తు గురించి ఆలోచించాలని, పార్టీని బలోపేతం చేయడం, అలాగే ప్రజలకు ఇచ్చిన అభివృద్ధి హామీలను పూర్తి చేయాలని, దాని కోసం స్థిరమైన, భారీ సంఖ్యా బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరమని సదరు నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే శివసేనతో పొత్తు కూడితే ఆ పార్టీ నెత్తిపై కూర్చుంటుందని దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ ఖడ్సే, సుధీర్ మునగంటివార్ వంటి నాయకులు వాదిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో శివసేనతో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తులో వచ్చే స్థానిక ఎన్నికల్లో వారితో ఇబ్బందులు తప్పవని వారు అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. ఉద్ధవ్ గైర్హాజరు..... సర్ హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ ఏర్పాటుచేసిన కార్యక్రమానికి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే గైర్హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదితో కలిసి ఉద్ధవ్ చర్చించాల్సి ఉంది. కాగా, ఆయన గైర్హాజరుతో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై మరింత అయోమయం నెలకొంది. -
విద్యార్థులకు రిలయన్స్ ఉపకార వేతనాలు
ముంబై: అండర్ గ్రాడ్యుయేట్ చదువుతున్న 393 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ ఉపకార వేతనాలను అందించింది. వీరిలో 111 మంది మానసిక వికలాంగులు కూడా ఉన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ బుధవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో విద్యార్థులందరికీ ఉపకార వేతనాలను అందించారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చేయూతనందించే సంకల్పంతో 1996 నుంచి ప్రారంభించిన ధీరూ అంబానీ ఉపకార వేతనం కార్యక్రమం కింద ఇప్పటివరకు పది వేల మంది అభ్యర్థులు లబ్ధి పొందారు. వీరిలో రెండు వేల మంది మానసిక వికలాంగులు కూడా ఉన్నారని ఫౌండేషన్ సభ్యుడు ఒకరు తెలిపారు.