నీతా అంబానీ ధరించిన ఈ లాకెట్‌ స్పెషాల్టీ తెలిస్తే... ఆశ్చర్యపోతారు! | Nita Ambani Parrot Pendant Is Similar To Mysore Maharaja's Wedding Jewel | Sakshi
Sakshi News home page

నీతా అంబానీ ధరించిన ఈ లాకెట్‌ స్పెషాల్టీ తెలిస్తే... ఆశ్చర్యపోతారు!

Published Tue, Mar 18 2025 6:00 PM | Last Updated on Tue, Mar 18 2025 6:10 PM

Nita Ambani Parrot Pendant Is Similar To Mysore Maharaja's Wedding Jewel

రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ (nita ambani)  ఫ్యాషన్‌కి పెట్టింది పేరు. ప్రతీ సందర్భంలోనూ తన స్టైల్‌తో ఆకట్టుకుంటుంది.  అది  ట్రెడిషనల్‌ లుక్‌  అయినా  మెడ్రన్‌ లుక్‌ అయినా అందరి దృష్టినీ ఆకర్షించాల్సిందే. అది అత్యంత విలువైన చీర అయినా, ఖరీదైన డైమండ్‌ నగలైనా దానికొకి స్పెషాల్టీ ఉంటుంది. ఫ్యాషన్‌ (Fashion) నిపుణులు కూడా ఫ్యాఆమెను ప్రశంసలతో ముంచెత్తేలా చేస్తుంది. తాజాగా ఆమె ధరించిన హారంలోని  పెండెంట్‌ విశేషంగా నిలుస్తోంది.

నీతాఅంబానీఅందమైన దుస్తులు, విలాసవంతమైన ఆభరణాలతో అభిమానులను ఆశ్చర్యపర్చడం కొత్తేమీదు.  20 ఏళ్ల నాటి చిలుక లాకెట్టు (Parrot Pendant) ఇపుడు హాట్‌ టాపిక్‌గా నిలుస్తోంది. ఇది మైసూర్ మహారాజా యదువీర్ తన పెళ్లి రోజున ధరించిన దానితో  పోలీ ఉండటం విశేషం. ప్రాముఖ్యత కూడా చాలానే  ఉంది .

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎంపికైన  డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన  ప్రైవేట్ విందు కోసం నీతా అంబానీ  రెండు శతాబ్దాల నాటి, ప్యారెట్‌ లాకెట్‌తోపాటు, బ్లాక్‌, పర్పుల్‌, గ్రీన్‌  కలర్‌ కాంచీపురం చీరలో మెరిసారు. ఈ చీరలో 100 కంటే ఎక్కువ ముఖ్యమైన సాంప్రదాయ నమూనాలు ఉన్నాయి. ముఖ్యంగా న కాంచీపురంగొప్ప దేవాలయాల  ప్రేరణ, చారిత్రక ,ఆధ్యాత్మిక సారాంశం కలయికలో  దీన్ని తయారు చేశారు. ఈ చీరకున్న గ్రీన్‌, పర్పుల్‌ అంచులు  మొత్తం చీర రూపాన్ని హైలైట్ చేశాయి. అలాగే దీనికి మ్యాచింగ్‌గా  స్వదేశ్ నుండి వచ్చిన మణికట్టు మీద నిగనిగలాడే అంచులతో పూర్తి చేతుల బ్లౌజ్‌తో ధరించారు. చిన్న నల్ల హ్యాండ్‌బ్యాగ్‌ను కూడా దీనికి  జతచేసింది.  

ప్యారెట్‌ పెండెంట్‌
ఈ  విందులో నీతా అంబానీ ధరించిన  పచ్చ నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షించింది.  వజ్రాలు, కెంపులు , పచ్చలతో  ముత్యాలతో పొదిగిన చిలుక ఆకారపు  లాకెట్‌.   దీని మధ్యలో పొదిగిన  రూబీ  హార్ట్‌ హైలైట్‌ అని చెప్పవచ్చు.దీన్ని మొదట దక్షిణ భారతదేశంలో తయారు చేశారు.   దీన్ని మైసూర్ మహారాజు యదువీర్ చామరాజ వడియార్, యువరాణి త్రిషికా కుమారితో తన వివాహ సమయంలో ఇలాంటి రకమైన చిలుక లాకెట్టును ధరించాడు. లాకెట్టుకు లోతైన ప్రాముఖ్యత  ఏంటంటే.. లాకెట్టులోని పక్షి బొమ్మ వాస్తవానికి కామదేవుడి వాహనము (ప్రేమ దేవుడు).

అంతకుముందు నీతా అంబానీ మొఘల్ కాలం  పురాతన ఆభరణాలను ఎంచుకున్నారు. గత ఏడాది  నీతా అంబానీ మిస్ వరల్డ్ పోటీలో కనిపించారు. బ్లాక్‌ టోన్ సారీ,  క్లాసీ బాజుబంద్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ బాజుబంద్ వాస్తవానికి మొఘల్ చక్రవర్తి షాజహాన్ కల్గి అట.   దీని ధర రూ. 200  కోట్లు  అట.

అత్యంత అందమైన ఆభరణాలలో మరొకటి మిర్రర్ ఆఫ్ ప్యారడైజ్ డైమండ్ రింగ్. అనంత్ అంబానీ మంగళ్ ఉత్సవ్ వేడుకలో ఆమె దీనిని ధరించింది.  ఈ ఉంగరం బరువు 52.58 క్యారెట్లు, టేపర్డ్ బాగెట్-కట్ వజ్రాలను కలిగి ఉంటుంది.  దీని ధర రూ. 53 కోట్లు అని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement