Maharaja
-
నీతా అంబానీ ధరించిన ఈ లాకెట్ స్పెషాల్టీ తెలిస్తే... ఆశ్చర్యపోతారు!
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ (nita ambani) ఫ్యాషన్‌కి పెట్టింది పేరు. ప్రతీ సందర్భంలోనూ తన స్టైల్‌తో ఆకట్టుకుంటుంది. అది ట్రెడిషనల్ లుక్ అయినా మెడ్రన్ లుక్ అయినా అందరి దృష్టినీ ఆకర్షించాల్సిందే. అది అత్యంత విలువైన చీర అయినా, ఖరీదైన డైమండ్ నగలైనా దానికొకి స్పెషాల్టీ ఉంటుంది. ఫ్యాషన్ (Fashion) నిపుణులు కూడా ఫ్యాఆమెను ప్రశంసలతో ముంచెత్తేలా చేస్తుంది. తాజాగా ఆమె ధరించిన హారంలోని పెండెంట్ విశేషంగా నిలుస్తోంది.నీతాఅంబానీఅందమైన దుస్తులు, విలాసవంతమైన ఆభరణాలతో అభిమానులను ఆశ్చర్యపర్చడం కొత్తేమీదు. 20 ఏళ్ల నాటి చిలుక లాకెట్టు (Parrot Pendant) ఇపుడు హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ఇది మైసూర్ మహారాజా యదువీర్ తన పెళ్లి రోజున ధరించిన దానితో పోలీ ఉండటం విశేషం. ప్రాముఖ్యత కూడా చాలానే ఉంది .అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎంపికైన డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ప్రైవేట్ విందు కోసం నీతా అంబానీ రెండు శతాబ్దాల నాటి, ప్యారెట్ లాకెట్తోపాటు, బ్లాక్, పర్పుల్, గ్రీన్ కలర్ కాంచీపురం చీరలో మెరిసారు. ఈ చీరలో 100 కంటే ఎక్కువ ముఖ్యమైన సాంప్రదాయ నమూనాలు ఉన్నాయి. ముఖ్యంగా న కాంచీపురంగొప్ప దేవాలయాల ప్రేరణ, చారిత్రక ,ఆధ్యాత్మిక సారాంశం కలయికలో దీన్ని తయారు చేశారు. ఈ చీరకున్న గ్రీన్, పర్పుల్ అంచులు మొత్తం చీర రూపాన్ని హైలైట్ చేశాయి. అలాగే దీనికి మ్యాచింగ్‌గా స్వదేశ్ నుండి వచ్చిన మణికట్టు మీద నిగనిగలాడే అంచులతో పూర్తి చేతుల బ్లౌజ్‌తో ధరించారు. చిన్న నల్ల హ్యాండ్‌బ్యాగ్‌ను కూడా దీనికి జతచేసింది. ప్యారెట్ పెండెంట్ఈ విందులో నీతా అంబానీ ధరించిన పచ్చ నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. వజ్రాలు, కెంపులు , పచ్చలతో ముత్యాలతో పొదిగిన చిలుక ఆకారపు లాకెట్. దీని మధ్యలో పొదిగిన రూబీ హార్ట్ హైలైట్ అని చెప్పవచ్చు.దీన్ని మొదట దక్షిణ భారతదేశంలో తయారు చేశారు. దీన్ని మైసూర్ మహారాజు యదువీర్ చామరాజ వడియార్, యువరాణి త్రిషికా కుమారితో తన వివాహ సమయంలో ఇలాంటి రకమైన చిలుక లాకెట్టును ధరించాడు. లాకెట్టుకు లోతైన ప్రాముఖ్యత ఏంటంటే.. లాకెట్టులోని పక్షి బొమ్మ వాస్తవానికి కామదేవుడి వాహనము (ప్రేమ దేవుడు).అంతకుముందు నీతా అంబానీ మొఘల్ కాలం పురాతన ఆభరణాలను ఎంచుకున్నారు. గత ఏడాది నీతా అంబానీ మిస్ వరల్డ్ పోటీలో కనిపించారు. బ్లాక్ టోన్ సారీ, క్లాసీ బాజుబంద్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ బాజుబంద్ వాస్తవానికి మొఘల్ చక్రవర్తి షాజహాన్ కల్గి అట. దీని ధర రూ. 200 కోట్లు అట.అత్యంత అందమైన ఆభరణాలలో మరొకటి మిర్రర్ ఆఫ్ ప్యారడైజ్ డైమండ్ రింగ్. అనంత్ అంబానీ మంగళ్ ఉత్సవ్ వేడుకలో ఆమె దీనిని ధరించింది. ఈ ఉంగరం బరువు 52.58 క్యారెట్లు, టేపర్డ్ బాగెట్-కట్ వజ్రాలను కలిగి ఉంటుంది. దీని ధర రూ. 53 కోట్లు అని తెలుస్తోంది. -
చైనాలో మహారాజా జోరు.. నెల రోజుల్లోనే రికార్డ్!
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన చిత్రం మహారాజా. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని నితిలన్ సామినాథన్ తెరకెక్కించారు. విజయ్ సేతుపతి కెరీర్లో 50వ ప్రాజెక్ట్‌గా వచ్చిన మహారాజా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 100 కోట్లు పైగానే రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ప్రస్తుతం చైనాలోనూ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది.విజయ్ సేతుపతి లీడ్ రోల్లో నటించిన ఈ తమిళ యాక్షన్ థ్రిల్లర్ చైనాలోనూ విడుదలైంది. రెండు రోజుల్లోనే రూ.20 కోట్లు రాబట్టిన ఈ చిత్రం వంద కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తోంది. అక్కడ విడుదలైన నెల రోజుల్లోనే ఈ చిత్రం రూ. 100 కోట్ల మార్కుకు చేరువైంది. గత ఐదేళ్లలో చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా అవతరించింది. ఈ విషయాన్ని చైనా రాయబార కార్యాలయ అధికారి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇండియాలోని చైనా ఎంబసీ ప్రతినిధి యు జింగ్ ట్వీట్ చేశారు.చైనా అధికారి ట్వీట్.. 2018 తర్వాత చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచిందని యు జింగ్ పోస్టర్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం రూ.91.55 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు వెల్లడించింది. తూర్పు లడఖ్‌లో ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన ముగిసన తర్వాత చైనాలో విడుదలైన మొదటి భారతీయ చిత్రం మహారాజానే కావడం మరో విశేషం. చైనాలో ఈ చిత్రం తొలిరోజే రూ. 15.6 కోట్లు వసూళ్లు సాధించింది. ప్రముఖ చైనీస్ మూవీ రివ్యూ సైట్ డౌబన్‌లో ఈ చిత్రానికి 8.7/10గా అత్యధికంగా రేటింగ్ ఇచ్చింది. చైనాలో మహారాజా రెండు రోజులకు రూ. 20 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే విషయాన్ని స్థానిక బాక్సాఫీస్ ట్రాకర్ అయిన ENT గ్రూప్ ప్రకటించింది. రెండు రోజులకు 2.3 లక్షల టికెట్లు అమ్ముడుపోయినట్లు ఆ సంస్థ తెలిపింది. అలాగే ఇటీవల చైనాలో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రాలలో ఒకటిగా మహారాజా ఘనతను సొంతం చేసుకుంది. ఇదే జోరు కొనసాగితే మహారాజా త్వరలోనే చైనాలో సుమారు రూ. 300 కోట్లు రాబట్టవచ్చని అక్కడి ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.కాగా.. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన మహారాజాలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నట్టి నటరాజ్ కూడా నటించారు. ఈ కథ చెన్నైలోని మహారాజా అనే వ్యక్తి తన డస్ట్‌బిన్ కోసం పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించడం అనే కథాంశంతో తెరకెక్కించారు. ఇండియాలో జూన్ 14న విడుదలైన మహారాజా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగానే వసూలు చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలోనూ అందుబాటులో ఉంది. కాగా.. గతంలో అమీర్ ఖాన్ దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్, ఆయుష్మాన్ ఖురానా నటించిన అంధాధున్, రాణి ముఖర్జీ చిత్రం హిచ్కీ వంటి భారతీయ చిత్రాలు మాత్రమే చైనాలో మంచి ప్రదర్శన కనబరిచాయి.Maharaja has become the highest-grossing Indian film in China since 2018, reaching Rs 91.55 crore. Well done👍👍 pic.twitter.com/sq9SUY8D5F— Yu Jing (@ChinaSpox_India) January 5, 2025 -
చైనాలో 'మహారాజా' రెండు రోజుల కలెక్షన్స్.. భారీ రికార్డ్
భారతీయ సినిమాలు చైనాలో కూడా ఎక్కువ బిజినెస్ చేస్తున్నాయని తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా విజయ సేతుపతి నటించిన మహారాజా చిత్రం కూడా చైనాలో సత్తా చాటుతుంది. నవంబర్ 29న సుమారు 40 వేలకు పైగా థీయేటర్స్లలో ఈ చిత్రం విడుదలైంది. కరోనా తర్వాత చైనాలో విడుదలైన భారతీయన సినిమాలలో మహారాజా మాత్రమే అక్కడ రానిస్తుంది. మహారాజా చైనా రోజువారీ బాక్స్ ఆఫీస్ ర్యాంకింగ్స్‌లో ఐదవ స్థానంలో నిలిచింది.చైనాలో మహారాజా రెండు రోజులకు రూ. 20 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే విషయాన్ని స్థానిక బాక్సాఫీస్ ట్రాకర్ అయిన ENT గ్రూప్ ప్రకటించింది. రెండు రోజులకు 2.3 లక్షల టికెట్లు అమ్ముడుపోయినట్లు ఆ సంస్థ తెలిపింది. చైనాలోని ప్రముఖ చలనచిత్ర సమీక్ష వెబ్సైట్లలో ఒకటైన డౌబన్‌లో మహారాజా సినిమాకు 8.7/10 రేటింగ్‌ను ఇచ్చింది. ఇటీవలి కాలంలో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచిందని అక్కడి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. అయితే, ఫైనల్‌గా చైనాలో సుమారు రూ. 300 కోట్లు రాబట్టవచ్చని అక్కడి ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.'మహారాజ' చిత్రాన్ని నితిలన్ సామినాథన్ తెరకెక్కించారు. విజయ్ సేతుపతి కెరీర్లో 50వ ప్రాజెక్ట్‌గా విడుదలైంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 100 కోట్లు పైగానే రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు చైనాలో దుమ్మురేపుతుంది. -
చైనాలో దుమ్మురేపుతున్న విజయ్ సేతుపతి సినిమా..
-
నేటి ఆధునిక గృహాలలో నాటి ప్యాలెస్ కళ
మహారాజా ప్యాలెస్‌ల నుండి ఇకత్ డిజైన్ల వరకు ఆధునిక ఇళ్లలో భారతీయ కళల ప్రభావం అంతర్లీనంగా ఉంటోంది. క్లిష్టమైన ఎంబ్రాయిడరీ నమూనాల నుండి గ్రాండ్ ఆర్కిటెక్చరల్ మోటిఫ్‌ల వరకు, మనదైన వారసత్వం ఇంటీరియర్ డిజైన్‌లో కొంగొత్త నిర్వచనాన్ని చూపుతుంది.భారతీయ కళలు మ్యూజియంలు, గ్యాలరీలకు మించి విస్తరిస్తున్నాయి. ఇవి మనం నివాసం ఉండే ప్రాంతాలనూ ప్రభావితం చేస్తున్నాయి. క్లిష్టమైన ఎంబ్రాయిడరీ నమూనాల నుండి గ్రాండ్ ఆర్కిటెక్చరల్ మోటిఫ్‌ల వరకు, భారతీయ వారసత్వంలోని ఈ అంశాలు ఆధునిక ఇంటీరియర్ డిజైన్‌ను సరికొత్తగా చూపుతున్నాయి. భారతీయ కళ, సంప్రదాయాన్ని గౌరవించే సేకరణలు సమకాలీన గృహాలలోకి ప్రవేశించి, కలకాలం నిలిచేలా రిఫ్రెష్‌గా భావించే ఇంటీరియర్లను సృష్టిస్తున్నాయి. వారసత్వ ప్రేరేపిత డిజైన్లు సంప్రదాయంతో ఎంతో గొప్పగా ఉంటాయని రుజువు చేస్తున్నాయి. మహారాజ ప్యాలెస్–ప్రేరేపిత ఇంటీరియర్స్భారతీయ చరిత్ర మొత్తం వైభవంతో కూడిన కథలతో నిండి ఉంటుంది. హస్తకళతో పాటు ఎన్నో అంశాలకు ఉదాహరణలుగా నిలిచే రాజభవనాలు ఉన్నాయి. ఈ రీగల్–ప్రేరేపిత డిజైన్లు గ్రాండ్ మహారాజా ప్యాలెస్‌ల ఆర్చ్‌లు, మోటిఫ్‌లు, విలాసవంతమైన అలంకారాన్ని ప్రతిబింబిస్తాయి. అయితే ఇవి నేటి కాలపు అందానికి ప్రతీకగానూ ఉంటాయి. చికన్కరి సొగసుఇంటీరియర్ నిపుణుడు, మెరినో ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ మనోజ్ లోహియా మరింత వివరిస్తూ, ‘రీగల్ శ్రేణిలో గజముద్ర, వసంత, సంస్కృతి వంటి డిజైన్ లు ఉన్నాయి. ప్రతి ఒక్క అంశమూ రాజ వైభవంతో అలరారుతుంటుంది. ఆ తర్వాత భారతదేశ విభిన్న కళారూ΄ాలలో చికన్కరీ ఎంబ్రాయిడరీ ఓ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఈ డిజైన్లు అల్లికలతో ఉంటాయి. చేతితో తయారైన ఈ అల్లికలు సాగసుగానూ, అందుబాటులో ఉంటాయి. అలంకృత్ ఒక అలంకారమైన ఆభరణాన్ని పోలి ఉంటుంది. కర్ణిక భారతీయ చెవి΄ోగుల నుండి స్ఫూర్తిని పొందింది. సాంప్రదాయ హవేలీలలో కనిపించే ఈ తోరణాల కళ నేటి ఆధునిక ఇళ్లలోనూ కనిపిస్తుంది. వాస్తుశిల్పం కూడా ఆధునిక అమరికలో చక్కగా ఇమిడిపోయి గొప్ప వారసత్వ కళతో ఆకట్టుకుంటున్నాయి’ అని ఆయన వివరించారు.ఇకత్ వీవింగ్ డిజైన్స్ఇకత్ అనేది దాని అద్భుతమైన నమూనాలు, సజీవ రంగులకు ప్రసిద్ధి చెందిన ఒక శక్తివంతమైన కళారూపం. కొత్త మెటీరియల్‌లలో ఈ నమూనాలను పునఃరూపకల్పన చేయడం ద్వారా, ఆధునిక డిజైన్ సేకరణలు అదే శక్తి, చైతన్యంతో నింపుతున్నాయి. ఇంటీరియర్ డిజైనర్ శ్రీ మనోజ్ మాట్లాడుతూ– ‘ఇకత్ హస్తకళకు కేంద్రంగా ఉండే ఒక థ్రెడ్‌వర్క్. సముద్రపు అలల నమూనాలను తలపిస్తోంది. ప్రశాంతతను కలిగిస్తుంది. తరంగ్ పుష్పం సున్నితమైన అందాన్ని మిళితం చేస్తుంది. ఈ డిజైన్లు ఒక గదికి శిల్పకళాపరమైన అందాన్ని తీసుకువస్తాయి. సాంస్కృతిక వారసత్వం, ఆధునిక సౌందర్యాల మధ్య అంతరాన్ని తగ్గిస్తాయి’ అని తెలిపారు. (చదవండి: తప్పుని ఎత్తిచూపడం కంటే.. చక్కదిద్దడమే ఉత్తమం) -
మహారాజ సినిమా దుమ్మురేపడానికి రెడీ అవుతుంది
-
'మహారాజ' విజయం.. డైరెక్టర్‌కు లగ్జరీ కారు.. ఎవరిచ్చారో తెలుసా..?
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి నటించిన మహారాజ సినిమా రీసెంట్గా 100 రోజులు పూర్తి చేసుకుంది. దీంతో చెన్నైలో సెలబ్రేషన్స్ జరిగాయి. జూన్ 14న విడుదలైన ఈ చిత్రాన్ని దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీ ఓటీటీలో కూడా మంచి ఆదరణ లభించింది. సినిమా విజయం పట్ల మేకర్స్ ఫుల్ ఖుషి అయ్యారు.మహారాజా చిత్రాన్ని ది రూట్, థింక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. విజయ్ సేతుపతి 50వ చిత్రంగా కోలీవుడ్‌లో విడుదలైంది. రూ. 20 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 110 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో చిత్ర నిర్మాతలు 100 డేస్ ఫంక్షన్ జరిపారు. ఈ క్రమంలో దర్శకుడు నిథిలన్ స్వామినాథన్‌కు నిర్మాతలు సర్ప్రైజ్ ఇచ్చారు. బీఎండబ్ల్యూ కారును విజయ్ సేతుపతి చేతుల మీదుగా గిఫ్ట్‌గా అందించారు. ఇదీ చదవండి: బెయిల్ విషయంలో జానీ మాస్టర్‌కు షాకిచ్చిన పోలీసులుఈ క్రమంలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. నిథిలన్ స్వామినాథన్ మేకింగ్, రైటింగ్‌పై ప్రశంసలు కురిపించారు. సినిమాకు ఇంతటి గుర్తింపు రావడం వెనుక నిథిలన్ శ్రమ ఎక్కువుగా ఉందని కొనియాడారు. ఈ సినిమా చూసిన వారందరూ కూడా తనను ఎంతోమంది ప్రశంసించారని విజయ్ సేతుపతి గుర్తుచేసుకున్నారు. టీమ్ సహకారంతోనే మహారాజ సినిమా విజయం సాధ్యమైందని ఆయన తెలిపారు.తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై ఒక తండ్రి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడో అనే కథను దర్శకుడు చాలా ఆసక్తిగా చెప్పాడు. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగే మహారాజ చిత్రంలో విజయ్ సేతుపతితో పాటు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రతినాయకుడిగా కనిపించారు. మమతా మోహన్‌దాస్, అభిరామి, దివ్య భారతి కీలకపాత్రలలో మెప్పించారు. నెట్‌ఫ్లిక్స్‌లో మహారాజ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. -
హిందీ సినిమా రికార్డులు తిరగరాస్తున్న విజయ్ సేతుపతి..?
-
ఓటీటీలో 'మహారాజ' రికార్డ్.. నం.1 ప్లేస్
విభిన్న సినిమాలతో అలరించే విజయ్ సేతుపతి.. రీసెంట్గా 'మహారాజ' సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. అంచనాల్లేకుండా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. తెలుగు, తమిళంలో అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది. కొన్నిరోజులకు ఓటీటీలోకి రాగా, అక్కడ కూడా మైండ్ బ్లోయింగ్ వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఏకంగా సరికొత్త రికార్డ్ సృష్టించింది.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి సందడి మొదలు)'మహారాజ'లో విజయ్ సేతుపతి తప్పితే మరో పేరున్న యాక్టర్ ఎవరూ లేరు. సీరియస్ రివేంజ్ డ్రామా కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమాలో కథ ఓ మాదిరిగా ఉన్నప్పటికీ.. స్క్రీన్ ప్లేతో దర్శకుడు మేజిక్ చేశాడు. దీంతో తెలుగు, తమిళంలో హిట్ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన తర్వాత దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచింది.అలా దాదాపు ఆరు వారాల నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అయిన 'మహారాజ'.. ఈ ఏడాది సదరు ఓటీటీలో ఎక్కువమంది చూసిన సినిమాగా నిలిచింది. ఇప్పటివరకు 18.6 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. దీని తర్వాతి స్థానాల్లో క్రూ (17.9 మిలియన్లు), లాపతా లేడీస్ (17.1 మిలియన్లు), సైతాన్ (14.8 మిలియన్లు), ఫైటర్ (14 మిలియన్లు), యానిమల్ (13.6 మిలియన్లు), డుంకీ (10.8 మిలియన్లు) ఉన్నాయి.(ఇదీ చదవండి: ప్రధాని మోదీనే మించిపోయిన ప్రభాస్ హీరోయిన్) -
రూపాయి రెమ్యునరేషన్ తీసుకోలేదు.. ఇప్పుడేమో జాక్‌పాట్!
కొన్నిసార్లు ఊహించని విధంగా కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతుంటాయి. అలాంటి ఓ మూవీనే 'మహారాజ'. తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి లీడ్ రోల్ చేసిన ఈ చిత్రం.. థియేటర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చూసిన ప్రతిఒక్కరూ అద్భతహా అనే రేంజులో మెచ్చుకున్నారు. ఇంతలా పేరు తెచ్చుకున్న 'మహారాజ'లో నటించినందుకు గానూ సేతుపతి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. దీనికి ఓ కారణముందట!(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 20 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)వైవిధ్యమైన పాత్రలు చేసే విజయ్ సేతుపతి.. 'మహారాజ'లో సెలూన్ షాపులో పనిచేసే బార్బర్‌గా నటించాడు. మేకప్ లేకుండా డీ గ్లామర్‌గా కనిపించాడు. సమాజంలో ప్రస్తుతం చిన్నపిల్లలపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ పాయింట్‌కి చిన్నపాటి ట్విస్ట్ లింక్ చేసి తీసిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. అయితే నిర్మాతలు ఈ మూవీ కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో మాత్రమే తీయాలని ఫిక్స్ అయ్యారట. ఇదే విషయాన్ని సేతుపతిగా చెప్పగా ఓకే అన్నాడు.పైన చెప్పిన దానిబట్టి చూస్తే విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ తీసుకోకూడదు. 'మహారాజ' కోసం అదే చేశాడు. సినిమా హిట్ అయితే లాభాల్లో ఇస్తామని నిర్మాతలు చెప్పారట. ఈ లెక్కన చూసుకుంటే సినిమాకు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. సాధారణంగా సేతుపతి.. ఒక్కో మూవీ రూ.10-12 కోట్లు తీసుకుంటాడు. కానీ లాభాల్లో షేర్ అంటున్నారు కాబట్టి పారితోషికం కంటే రెట్టింపు మొత్తం అందుకుంటాడేమో అనిపిస్తోంది. అంటే సక్సెస్‌తో పాటు జాక్ పాట్ కొట్టేసినట్లే!(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా?) -
రెండు నెలలుగా టీడీపీ వేధింపులు: పిఠాపురం మహరాజ కుటుంబం
కాకినాడ, సాక్షి: అధికారం చేపట్టి నాటి నుంచి టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా అరాచకాలను కొనసాగిస్తున్నాయి. వైఎస్సార్సీపీ నేతల నుంచి సామాన్యుల దాకా కూటమి పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా.. పిఠాపురం మహారాజ కుటుంబం సైతం వేధింపులకు గురైనట్లు వెలుగులోకి వచ్చింది. పిఠాపురం మహారాజా మేనకోడలైన చంద్రలేఖ కుటుంబానికి టీడీపీ నుంచి వేధింపులు ఎదురవుతున్నాయట. తమ ఇంటిని ఖాళీ చేయాలని కొందరు బెదిరిస్తున్నట్లు ఇద్దరు కొడుకులతో ఆమె మీడియా ముందుకు వచ్చారు. ‘‘1970 నుంచి మా కుటుంబం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఇంట్లో మేం ఉంటున్నాం. ఆ ఆస్తి మీద కొందరు కన్నేశారు. ఆ ఇంటిని ఖాళీ చేయాలని, లేకుంటే.. ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు పెడతామని బెదిరిస్తున్నారు. .. ఈ దౌర్యన్యం వెనుక టీడీపీ నేతల సహకారం ఉంది. అందుకే ఫిర్యాదు చేసినా పోలీసులు సైతం పట్టించుకోవట్లేదు అని చంద్రలేఖ కుమారుడు మాధవరావు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జోక్యం చేసుకోవాలని సోషల్ మీడియా ద్వారా కోరాం. మాకు న్యాయం జరగకపోతే చావే శరణ్యం అంటోంది చంద్రలేఖ కుటుంబం. -
Maharaja: ఓటీటీలో ‘మహారాజా’ రికార్డు
విజయ్ సేతుపతి హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘మహారాజా’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. పెద్దగా ప్రచారమే లేకుండా జూన్ 14న విడుదలైన ఈ చిత్రం.. మౌత్ టాక్‌తోనే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. కేవలం రూ. 20 కోట్లతో బడ్జెట్‌తో తెరకెక్కి.. రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తెలుగులోనూ ఈ చిత్రానికి మంచి వసూళ్లే వచ్చాయి. జులై 12 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ ప్రేక్షకులను కాదు.. ఓటీటీ ప్రియుల మనసును కూడా ‘మహారాజా’ దోచేశాడు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారం ట్రెండింగ్ జాబితాలో(ఇండియాలో) ‘మహారాజా’ తొలి స్థానం దక్కించుకుంది. ఈ విషయాన్ని చిత్రబృందం తెలియజేస్తూ.. ‘ప్రతిచోటా మహారాజ రికార్డులు సృష్టిస్తోంది’ అని ఆనందం వ్యక్తం చేసింది.‘మహారాజా’ కథేంటంటే.. మహారాజా(విజయ్ సేతుపతి) ఓ బార్బర్. అతనికి భార్య, కూతురు ఉంటుంది. ఓ ప్రమాదంలో భార్య చనిపోవడంతో.. కూతురుతో కలిసి సిటీకి దూరంగా ఓ ఇంట్లో జీవిస్తుంటాడు. అతని కూతురు ప్రాణాలు కాపాడిన చెత్తబుట్టకు లక్ష్మి అని పేరు పెట్టి.. ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటాడు. అయితే ఓ రోజు నిండు గాయాలతో పోలీసు స్టేషన్‌కి వెళ్లి.. ముగ్గురు దుండగులు తన ఇంట్లోకి చొరబడి ‘లక్ష్మి’ని ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేస్తారు. (చదవండి: అభిమానులతో పాటు మంచి మనసు చాటుకున్న సూర్య)తన కూతురు ప్రాణాలను కాపాడిన ‘లక్ష్మి’ని ఎలాగైనా వెతికి పెట్టమని పోలీసులకు విజ్ఞప్తి చేస్తాడు. దాన్ని వెతికేందుకు పోలీసులకు రూ. 7 లక్షల లంచం ఇవ్వడానికి కూడా సిద్దపడతాడు. మరి ‘లక్ష్మి’ని ఎత్తుకెళ్లిన ఆ ముగ్గురు ఎవరు? వారికి మహారాజాతో ఉన్న వైరం ఏంటి? రూ. 500 వందల విలువ చేసే చెత్తబుట్ట(లక్ష్మి) కోసం రూ. 7 లక్షలు కూడా ఇవ్వడానికి కారణం ఏంటి? చివరకు లక్ష్మి దొరికిందా లేదా? అనేదే మిగతా కథ. ఈ చిత్రానికి నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించగా.. అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు .This Maharaja’s on top, as he should👑 Watch Maharaja, now trending #1 on Netflix! #MaharajaOnNetflix pic.twitter.com/0DuJV9kavq— Netflix India South (@Netflix_INSouth) July 15, 2024 -
మాస్ మహారాజ ఫిట్నెస్
-
థియేటర్లలో ఇండియన్-2.. ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలేవో తెలుసా?
మరో వీకెండ్ వచ్చేస్తోంది. సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఇండియన్-2 థియేటర్లలో సందడి చేయనుంది. మరోవైపు టాలీవుడ్లో సారంగదరియా లాంటి చిన్న సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నాయి. ప్రతి వారాంతం వచ్చిందంటే చాలు ఓటీటీ చిత్రాలు సైతం ఆడియన్స్‌ను అలరించేందుకు వచ్చేస్తున్నాయి.ఈ వీకెండ్లో విజయ్ సేతుపతి నటించిన హిట్ మూవీ మహారాజ, టాలీవుడ్ మూవీ జిలేబి ఓటీటీ స్ట్రీమింగ్కు రానున్నాయి. గతేడాది ఆగస్టులో విడుదలైన జిలేబి ఎట్టకేలకు ఓటీటీలో కి వచ్చేస్తోంది. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఈ వీకెండ్లో సందడి చేయనున్నాయి. మరి మీరు చూడాలనుకుంటున్న సినిమాలు ఏయే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్మహారాజ (మూవీ) - జూలై 12బ్లేమ్ ద గేమ్ (సినిమా) - జూలై 12ఎక్స్‌ప్లోడింగ్ కిట్టెన్స్ (కార్టూన్ సిరీస్) - జూలై 12హాట్స్టార్అగ్నిసాక్షి (తెలుగు సిరీస్) - జూలై 12 షో టైమ్ (వెబ్ సిరీస్) - జూలై 12ఆహాజిలేబి- జూలై 13జియో సినిమాపిల్ (హిందీ మూవీ) - జూలై 12సోనీలివ్36 డేస్ (హిందీ వెబ్ సిరీస్) - జూలై 12లయన్స్ గేట్ ప్లే డాక్టర్ డెత్: సీజన్ 2 (వెబ్ సిరీస్) - జూలై 12మనోరమ మ్యాక్స్మందాకిని (మలయాళ మూవీ)- జూలై 12 -
ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ.. ఎప్పుడంటే?
కంటెంట్ బాగుంటే ప్రచారాలు, ఆర్భాటాలు ఏవీ అవసరం లేదు. మౌత్ టాక్‌తోనే హిట్ సాధించేస్తాయి. అలా విజయ్ సేతుపతి నటించిన మహారాజ మూవీ కూడా పెద్దగా ప్రమోషన్స్ చేయకుండా థియేటర్లలో విడుదల చేశారు. ఆశ్చర్యంగా పాజిటివ్ టాక్‌తో రోజురోజుకూ కలెక్షన్స్ ఎక్కువయ్యాయి. అలా రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయింది.ఓటీటీలో..నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 14న తెలుగులో విడుదలైంది. ఇందులో మమతా మోహన్‌దాస్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ శుక్రవారం (జూలై) 12 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమ్ అవుతుందని పేర్కొన్నారు. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నామని ఓటీటీ ప్రియులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఓటీటీలో ఇంకెన్ని రికార్డులు తిరగరాస్తుందో చూడాలి!కథేంటంటే?మహారాజ (విజయ్ సేతుపతి) ఓ బార్బర్. ఓ రోజు యాక్సిడెంట్లో తన భార్య చనిపోగా ఓ ఇనుప చెత్త డబ్బా వల్ల కూతురు ప్రాణాలతో బయటపడుతుంది. ఆ చెత్త డబ్బాకు లక్ష్మి అని పేరు పెట్టి సొంత మనిషిలా చూసుకుంటాడు. ఓ రోజు లక్ష్మి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. తర్వాత ఏమైంది? లక్ష్మి దొరికిందా? లేదా? అనేది తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే! View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: రేణుకాస్వామి కేసులో దర్శన్, పవిత్రగౌడ నుంచి కీలక ఆధారాలు లభ్యం -
రూ. 100 కోట్లతో మహారాజా.. ఓటీటీ ఎంట్రీ ఎప్పుడంటే..?
విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజా చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా జూన్ 14న విడుదలైంది. నితిలన్ సామినాథన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. తన కూతురికి జరిగిన అన్యాయాన్ని ఒక సామాన్యుడు ఎలా ఎదుర్కొన్నాడు అనే పాత్రలో విజయ్ సేతుపతి అద్భుతంగా నటించాడు. అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, అభిరామి వంటి వారు కీలక పాత్రల్లో నటించారు.విజయ్ సేతుపతి కెరియర్లో మహారాజా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికే రూ. 100 కోట్ల క్లబ్లో చేరిపోయిన ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. నివేదికల ప్రకారం మహారాజా చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 19న OTT విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కానీ, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగు, తమిళ్ వర్షన్స్ రెండూ ఒకేరోజు విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. తెలుగుతో పాటు తమిళంలో కూడా బయర్స్‌కు లాభాల పంటను పడించిన ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్స్‌లలో సందడి చేస్తుంది. టాలీవుడ్లో అయితే, ఏకంగా రూ. 20 కోట్ల కలెక్షన్స్ దాటినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో ఓటీటీ విషయంలో కూడా మహారాజా సినిమాను మంచి రేటుతోనే నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. -
అప్పుడు భయం వేసింది: విజయ్ సేతుపతి
‘‘మహారాజ’ విడుదలకి ముందు హైదరాబాద్‌కి వచ్చాను. ఇక్కడ తెలుగు ప్రేక్షకులు నాపై చూపించిన ప్రేమాభిమానాలు చూసి కొంచెం భయం వేసింది. ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకున్నా. తెలుగు ప్రేక్షకులు అది నెరవేర్చడం ఆనందాన్నిచ్చింది. తెలుగు వారు నాపై చూపిన ప్రేమ చూస్తుంటే.. ఇది నా హోమ్టౌన్లానే అనిపిస్తోంది. నాకు ఈ అనుభూతిని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని హీరో విజయ్ సేతుపతి అన్నారు.నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మహారాజ’. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ చిత్రంలో మమతా మోహన్‌దాస్, అనురాగ్ కశ్యప్ ఇతర లీడ్ రోల్స్ చేశారు. సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి నిర్మించారు. ఈ మూవీని తెలుగులో ఎన్వీఆర్ సినిమా ఈ నెల 14న రిలీజ్ చేసింది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మహారాజ’ మూవీ థ్యాంక్స్ మీట్లో నితిలన్ సామినాథన్ మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకుల నుంచి మా ‘మహారాజ’కి లభిస్తున్న ఆదరణ చాలా ఆనందాన్నిచ్చింది’’ అన్నారు ‘‘మహారాజ’ని కుటుంబంతో కలసి చూడండి.. చాలా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు అతిథిగా పాల్గొన్న డైరెక్టర్ మారుతి. ‘‘ఈ మధ్య కాలంలో నేను చూసిన మంచి సినిమా ‘మహారాజ’’ అన్నారు మరో అతిథి గోపీచంద్ మలినేని. ‘‘ఈ సినిమా హిట్ ఏ రేంజ్‌కి వెళ్లి ఆగుతుందో చెప్పలేం’’ అన్నారు ఇంకో అతిథి బుచ్చిబాబు సాన. డైరెక్టర్ అనీల్ కన్నెగంటి, డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీరియస్‌గా ప్రయత్నించా.. ఎవరూ ఛాన్సివ్వలేదు: సేతుపతి
మహారాజ సినిమా తెలుగులో రిలీజ్ చేస్తున్న విషయం చాలామందికి తెలియదు. కొన్ని ప్రమోషన్లు చేసినా అందరికీ అది రీచవలేదు. అసలు మహారాజ సినిమా ఏంటి? ఇదెప్పుడు తీశారు? అని చాలామంది అనుకున్నారు. అయితే రిలీజైన రోజే ఈ సినిమా పేరు మార్మోగిపోయింది. మౌత్‌టాక్‌తోనే మహారాజ గురించి అందరికీ తెలిసొచ్చింది. విజయ్ సేతుపతి నటన, నితిలన్ సామినాథన్ డైరెక్షన్, అజనీష్ లోకనాథ్ బీజీఎమ్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఏ రోజుకారోజు వసూళ్లు పెంచుకుంటూ సూపర్ హిట్ దిశగా ముందుకు సాగుతోంది.రామ్‌చరణ్ సినిమాలో?జూన్ 14న ఈ ద్విభాషా(తమిళ, తెలుగు) చిత్రం రిలీజవగా.. సోమవారం నాడు చిత్రయూనిట్ హైదరాబాద్‌లో థాంక్యూ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు సేతుపతి ఓపికగా సమాధానాలిచ్చాడు. బుచ్చిబాబు-చరణ్(#RC16) మూవీలో ఏదైనా పాత్ర చేసే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు లేదని బదులిచ్చాడు. ఎటువంటి పాత్రలు పోషించడం ఇష్టమన్న క్వశ్చన్‌కు రొమాంటిక్ పాత్రలు చేయడం ఎక్కువ ఇష్టమన్నాడు.సీరియస్‌గా ట్రై చేశా..సైరా తర్వాత ఉప్పెన వరకు గ్యాప్ తీసుకున్నారు.. అలాగే పుష్ప సినిమా రిజెక్ట్ చేశారా? అన్న ప్రశ్నకు సేతుపతి స్పందిస్తూ.. నేను సీరియస్‌గా ప్రయత్నించాను సర్, కానీ నాకు ఎవరూ అవకాశాలివ్వలేదు. పుష్ప మూవీలో ఛాన్స్ నేను రిజెక్ట్ చేయలేదు. అయితే అన్నిసార్లు నిజాలే మాట్లాడకూడదు. కొన్నిసార్లు అబద్ధాలు చెప్పడం మంచిది అని పేర్కొన్నాడు.ఎప్పుడో చెప్పిన సేతుపతికాగా పుష్ప 1 షూటింగ్‌కు ముందే ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై 2020వ సంవత్సరంలోనే సేతుపతి క్లారిటీ ఇచ్చాడు. పుష్పలో భాగం కావాలని ఉన్నప్పటికీ డేట్స్ కుదరకపోవడం వల్లే ఆ ప్రాజెక్టు నుంచి వైదొలిగినట్లు పేర్కొన్నాడు. దర్శకుడు సుకుమార్‌ను కలిసి మరీ తన నిర్ణయాన్ని తెలిపినట్లు వెల్లడించాడు.చదవండి: పవిత్రకు ఇంత పెద్ద కూతురు ఉందా?.. మొదటి భర్త ఎవరో తెలుసా? -
'మహారాజ'.. విజయ్ సేతుపతి నన్ను తీసుకోవద్దన్నారు: నటి
'మహారాజ' సినిమాతో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హాఫ్ సెంచరీ కొట్టాడు. తన కెరీర్‌లోని 50వ సినిమా అయిన మహారాజకు నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించాడు. మమతా మోహన్‌దాస్, అనురాగ్ కశ్యప్, అభిరామి ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 14న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైంది. పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ఈ మూవీలో విజయ్ సేతుపతి కూతురు జ్యోతిగా సాచన నమిదాస్ అనే అమ్మాయి నటించింది. చివర్లో నేను..అయితే ఈ సినిమా కోసం సెలక్ట్ చేసినప్పుడు తనను తీసుకోవద్దని సేతుపతి సూచించాడట. తాజాగా ఈ విషయాన్ని సాచన బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. చాలామంది ఆడిషన్‌కు వచ్చారు. స్క్రీన్ టెస్ట్ సహా అంతా అయిపోయేసరికి చివర్లో నేను, మరో అమ్మాయి మిగిలాం. విజయ్ సేతుపతిగారు నన్ను వద్దని సూచించారు. మరో అమ్మాయిని తీసుకోమని సలహా ఇచ్చారు.నన్ను వద్దన్నారుకానీ దర్శకుడు నితిలన్ సర్ మాత్రం నేను చేస్తేనే బాగుంటుందని చెప్పి సినిమాలో తీసుకున్నారు. షూటింగ్ మొదలైన వారం రోజులకే నన్ను తీసుకుని మంచి పని చేశారని విజయ్ సేతుపతి తండ్రి డైరెక్టర్‌ను మెచ్చుకున్నారు. చాలామంది నేను ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నారు. కానీ ఈ మూవీ షూటింగ్ చేసేటప్పుడు నా వయసు 18 ఏళ్లు అని చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సేతుపతి సైతం సాచన నటనను మెచ్చుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈయన తమిళంలో మూడు సినిమాలు, హిందీలో ఒక చిత్రం చేస్తున్నాడు.చదవండి: ‘కార్తీక దీపం’నటికి చేదు అనుభవం.. డీఎస్పీ అంటూ ఫోన్ చేసి.. -
విజయ్ సేతుపతి 'మహారాజ' సినిమా రివ్యూ
విజయ్ సేతుపతి సూపర్ యాక్టర్. హీరో అని మాత్రమే కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ అదరగొట్టేస్తుంటాడు. ఇతడు 50వ సినిమా 'మహారాజ'. గత కొన్నిరోజుల నుంచి ప్రమోషన్స్ చేస్తూ ఈ చిత్రంతో కచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటానని సేతుపతి ధీమాగా చెబుతూ వచ్చాడు. తాజాగా ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. మరి సేతుపతి చెప్పినట్లు హిట్ కొట్టాడా? 'మహారాజ' ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?మహారాజ (విజయ్ సేతుపతి) ఓ బార్బర్. భార్య, కూతురు ఉంటారు. ఓ రోజు యాక్సిడెంట్లో భార్య చనిపోతుంది. కూతురిపై ఇనుప చెత్త డబ్బా పడటంతో ఆమె ప్రాణాలతో బయటపడుతుంది. తన కూతుర్ని కాపాడిన చెత్త డబ్బాకు లక్ష్మీ అని పేరు పెట్టి సొంత మనిషిలా చూసుకుంటారు. అయితే ఓ రోజు చెవిపై కట్టుతో పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన మహారాజ.. తన లక్ష్మీ కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? పోలీసులు లక్ష్మీని పట్టుకుని మహారాజకు అప్పగించారా లేదా అనేదే స్టోరీ. (Maharaja Movie Review)ఎలా ఉందంటే?కొన్ని సినిమాల గురించి ఏ మాత్రం ఎక్కువ మాట్లాడుకున్నా ట్విస్టులు రివీల్ అయిపోతాయి. చూసేటప్పుడు ఫీల్ మిస్ అవుతుంది. 'మహారాజ' సరిగ్గా అలాంటి సినిమానే. రెండున్నర గంటల సినిమానే గానీ ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. ఎందుకంటే సరదాగా మొదలైన మూవీ కాస్త మెల్లమెల్లగా సీరియస్ టోన్‌లోకి మారుతుంది. ఇంటర్వెల్ వచ్చేసరికి అసలు ట్విస్ట్ వస్తుంది. ఇక అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు ఊహకందని మలుపులు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి.హీరో భార్య, కూతురు ఓ ఇంట్లో కూర్చుని ఉండగా.. సడన్‌గా ఓ లారీ వచ్చి వాళ్లపైకి దూసుకెళ్తుంది. ఈ ప్రమాదంలో హీరో భార్య చనిపోతుంది. ఓ చెత్త డబ్బా వల్ల కూతురు బతుకుంది. దీని తర్వాత వర్తమానంలోకి వచ్చేస్తారు. అక్కడి నుంచి ఫస్టాప్ అంతా సరద సరదాగా వెళ్లిపోతూ ఉంటుంది. హీరో అసలు పోలీస్ స్టేషన్లో ఎందుకు అలా ఉండిపోయాడా? ఎందుకు అందరితో తన్నులు తింటున్నాడా అని డౌట్ వస్తుంది. కానీ ఎక్కడో ఓ మూల ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? అని డౌట్ వస్తుంది. కానీ మెల్లమెల్లగా స్టోరీలోకి వెళ్లేసరికి చూస్తున్న ఆడియెన్స్‌కి కిక్ వస్తుంది.ఏదో సినిమా తీస్తున్నాం కదా అని అనవసరంగా పాటలు, కమర్షియల్ అంశాల పేరిట ఫైట్స్ పెట్టలేదు. ఏదో ఎంత కావాలో ఏ సీన్ ఎక్కడుండాలో ఫెర్ఫెక్ట్ కొలతలతో తీసిన మూవీ 'మహారాజ' అని చెప్పొచ్చు. అలానే చూస్తున్నప్పుడు ఎక్కడా సినిమా చూస్తున్నామని అనిపించదు. మన పక్కింట్లో వాళ్ల జీవితం చూస్తున్నం అనిపించేంతలా సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతాం.ఎవరెలా చేశారు?విజయ్ సేతుపతి పాత్రే డిఫరెంట్. దేనికి కూడా త్వరగా రియాక్ట్ అవడు. చాలా నెమ్మదిగా ఎమోషనల్‌గా బరస్ట్ అవుతాడు. చూడటానికి మామూలుగా కనిపిస్తాడు గానీ ఒక్కోసారి ప్రేక్షకుల మైండ్ పోయాలా ప్రవర్తిస్తాడు. దీన్ని సేతుపతి పిక్టర్ ఫెర్ఫెక్ట్గా చేశాడు. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్‌గా చేశాడు. కృూరంగా కనిపిస్తూనే చివర్లో ఎమోషన్‌తో మనసు పిండేస్తాడు. మమతా మోహన్ దాస్, అభిరామి తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. ఇక ఒకటి రెండు సీన్స్‌లో కనిపించే భారతీ రాజా, ఎస్సైగా నటరాజన్ సుబ్రమణియం ఆకట్టుకున్నారు.టెక్నికల్ విషయాలకొస్తే.. స్క్రీన్ ప్లే రాసుకున్న డైరెక్టర్ అండ్ రామ్ మురళి అనే అతన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఫెర్ఫెక్ట్ మూవీ అందించారు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన అజనీష్ లోక్‌నాథ్ సీట్లలో కూర్చోబెట్టేశాడు. స్క్రీన్ ప్లేకి తగ్గట్లు ఎడిటింగ్ సరిగ్గా సరిపోయింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. అయితే ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు. ఎందుకంటే హింస, క్రైమ్ ఇందులో గట్టిగానే ఉంది. పాటలు, రొమాంటిక్ సాంగ్స్ కూడా ఇందులో ఉండవు. సో డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే వారికి మాత్రం 'మహారాజ' నచ్చేస్తుంది. సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్ మాత్రం అస్సలు రివీల్ చేయొద్దు. (Maharaja Movie Review In Telugu)-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
స్నేహం కోసమే ఆ పాత్రలు చేశాను
‘‘మహారాజ’ నా కెరీర్లో 50వ సినిమా. ఈ యాభై చిత్రాల ప్రయాణంలో దాదాపు 500 వందలకు పైగా కథలు విన్నాను. ఎంతోమందిని కలిశాను. హిట్స్, ఫ్లాప్స్ చూశాను. ఫలితం ఏదైనా అది గొప్ప అనుభవాన్ని ఇచ్చింది. నేనిప్పటివరకూ చాలా పాత్రలు చేశాను. అయితే ‘మహారాజ’లో నా పాత్ర నా గత సినిమాలకి వైవిధ్యంగా ఉంటుంది. ఈ స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా స్పెషల్‌గా ఉంటాయి’’ అని హీరో విజయ్ సేతుపతి అన్నారు. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మహారాజ’. మమతా మోహన్‌దాస్, అనురాగ్ కశ్యప్, అభిరామి ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. సుధన్ సుందరం, జగదీష్ పళనీసామి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ మూవీని ఏపీ, తెలంగాణలో ఎన్వీఆర్ సినిమా విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ– ‘‘మహారాజ’ కథ చాలా ఆసక్తిగా ఉంటుంది. అందుకే నా 50వ సినిమాగా ఈ కథ బాగుంటుందని చేశాను. నితిలన్ ఈ సినిమాని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. ‘కాంతార’కు సంగీతం అందించిన అజనీష్ లోకనాథ్ మా మూవీకి అద్భుతమైన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ‘మహారాజ’ని ఎన్వీఆర్ సినిమా వాళ్లు తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. నేను క్యారెక్టర్ రోల్స్ తక్కువే చేశాను. అది కూడా ఫ్రెండ్స్ కోసం చేశాను. ‘ఉప్పెన’లో చాలా బలమైన పాత్ర నాది. దర్శకుడు రంజిత్ కోసమే ‘మైఖేల్’లో ఓ క్యారెక్టర్ చేశాను. చిరంజీవిగారిపై ఉన్న ఇష్టంతో ‘సైరా’ చేశాను. అలాగే రజనీకాంత్ సార్, విజయ్, షారుక్ ఖాన్గార్లపై నాకున్న ఇష్టంతో వారి సినిమాల్లో చేశాను. మంచి కథ కుదిరితే తప్పకుండా దర్శకత్వం వహిస్తాను. తెలుగులో స్ట్రయిట్ సినిమాకి కథలు వింటున్నాను. ప్రస్తుతం తమిళ్లో మూడు సినిమాలు, హిందీలో ఓ చిత్రం చేస్తున్నాను’’ అన్నారు. -
స్టార్ హీరోతో మమతా మోహన్ దాస్.. డేటింగ్‌పై ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్లో యమదొంగ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన ముద్దుగుమ్మ మమతా మోహన్‌దాస్. మలయాళంతో పాటు తెలుగులోనూ నటించింది. వెంకటేశ్ సరసన చింతకాయల రవి చిత్రంలోనూ మెరిసింది. ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడిన మమతా సినిమాలకు దూరమైంది. చాలా ఏళ్లపాటు క్యాన్సర్‌తో పోరాడి కోలుకుంది. గతేడాది రుద్రంగి సినిమాతో టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చింది.ప్రస్తుతం కోలీవుడ్‌లో మహారాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వూలో ఆమె మాట్లాడారు. తన వ్యక్తిగత జీవితంపై గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమెను తన పెళ్లి గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందించారు.మమతా మోహన్ దాస్ మాట్లాడుతూ.. "నాకు మలయాళ చిత్ర పరిశ్రమలో వచ్చిన గుర్తింపుతో చాలా సంతోషంగా ఉన్నా. తాను నటించిన చిత్రాలకు ప్రశంసలు కూడా దక్కాయి. అందువల్లే తమిళం, తెలుగు సినిమాలు చేసే అవకాశం వచ్చింది. మలయాళ ప్రేక్షకులు నాకు అండగా ఉన్నారు. బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి, గౌరీ ఖాన్ నాపై ప్రశంసలు కురిపించారు.' అని అన్నారు.డేటింగ్ గురించి మాట్లాడుతూ..'గతంలో లాస్ఎంజిల్స్లో ఉన్నప్పుడు ఒకరితో డేటింగ్లో ఉన్నా. కానీ ఆ రిలేషన్ ఎక్కువకాలం నిలవలేదు. లైఫ్‌లో రిలేషన్ అనేది ఉండాలి. కానీ దానివల్ల వచ్చే ఒత్తిడిని నేను కోరుకోవడం లేదు. అయితే జీవితంలో రిలేషన్ అనేది కచ్చితంగా అవసరమని నేను అనుకోవడం లేదు. ఎవరితోనైనా డేటింగ్లో ఉన్నారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నా. నా లైఫ్ భవిష్యత్తులో ఎలా ఉండనుందో చూద్దాం. ప్రస్తుతం అయితే పార్ట్నర్ కోసం వెతుకుతున్నా. కాలంతో పాటే అన్ని విషయాలు ఎప్పుడో ఒకసారి బయటపడాల్సిందే' అని అన్నారు. మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు. కాగా.. ప్రస్తుతం మమతా నటించిన మహారాజా చిత్రంలో అనురాగ్ కశ్యప్, నట్టి నటరాజ్ కూడా ప్రముఖ పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జూన్ 14న థియేటర్లలో విడుదల కానుంది. -
విజయ్ సేతుపతి మహారాజా మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
మహారాజపై నమ్మకం ఉంది: విజయ్ సేతుపతి
‘‘మహారాజ’ నా కెరీర్లో 50వ సినిమా. ఈ మూవీ విజయంపై చాలా నమ్మకం ఉంది. తెలుగు ప్రేక్షకులను కూడా ఈ చిత్రం మెప్పిస్తుంది. థియేటర్స్‌కి వచ్చి చూడండి’’ అని విజయ్ సేతుపతి అన్నారు. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మహారాజ’. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ చిత్రంలో మమతా మోహన్ దాస్, అనురాగ్ కశ్యప్, అభిరామి ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలవుతోంది.ఈ మూవీని ఏపీ, తెలంగాణలో ఎన్ వీఆర్ సినిమా విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ‘మహారాజ’ ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో మమతా మోహన్ దాస్ మాట్లాడుతూ– ‘‘తమిళంలో కొంత గ్యాప్ తర్వాత నేను చేసిన సినిమా ‘మహారాజ’. విజయ్ సేతుపతిగారికి నేను పెద్ద అభిమానిని. ఆయనతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాలేదు’’ అన్నారు.‘‘విజయ్‌గారి 50వ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు నితిలన్ సామినాథన్ . ‘‘మహారాజ’ లో మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంది. విజయ్‌గారి నట విశ్వరూపం చూస్తారు’’ అన్నారు నిర్మాత ఎన్వీ ప్రసాద్. ఈ కార్యక్రమంలో నటి అభిరామి, డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడారు. -
మైసూరు మహారాజు వడయార్ ఘన విజయం
లోక్‌సభ ఎన్నికల్లో మైసూరు మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ ఘన విజయం సాధిచించారు. మైసూరు లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన వడయార్ సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థిపై 1,39,262 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు.ఈ ఎన్నికల్లో యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ మొత్తం 7,95,503 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎం.లక్ష్మణకు 6,56,241 ఓట్లు వచ్చాయి. మైసూరు రాజ్యాన్ని వడయార్ కుటుంబం 1339 నుంచి 1950 వరకు పాలించింది. స్వాతంత్ర్యం అనంతరం మైసూరు రాజు జయచామ రాజేంద్ర వడయార్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత 1974లో శ్రీకంఠదత్త నరసింహరాజ వడయార్ రాజు అయ్యారు.1984-1999 లో కాంగ్రెస్ తరఫున మైసూరు ఎంపీగా గెలుపొందిన ఆయన 2013లో కన్నుమూశారు.శ్రీకంఠదత్త నరసింహరాజ వడయార్ మరణం తర్వాత మైసూరు 27వ రాజుగా యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ పట్టాభిషిక్తుడయ్యారు. మసాచుసెట్స్ యూనివర్సిటీలో ఇంగ్లిష్ లిటరేచర్, ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేశారు. 2016లో దుంగార్పుర్ యువరాణి త్రిషికను వివాహం చేసుకున్నారు. -
నా లక్ష్మీ కనిపించట్లేదు.. విచిత్రమైన పాత్రలో సేతుపతి!
విజయ్ సేతుపతి ఓ నటుడు. నటుడు అని ఇంతలా ఎందుకు చెబుతున్నామంటే.. రొటీన్ రొట్టకొట్టుడు మూవీస్ కాకుండా హీరో, విలన్ తదితర పాత్రలు చేస్తూ మెప్పిస్తుంటాడు. ఇతడు ప్రధాన పాత్రలో నటిస్తున్న 50వ సినిమా 'మహారాజా'. సుదన్ సుందరం, జగదీష్ పళనిస్వామి సంయుక్తంగా నిర్మిస్తుండగా.. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అజనీష్ లోకనాథ్ సంగీతమందించాడు. ఈనెల 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే రీసెంట్గా ట్రైలర్ విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)ఈ మూవీలో విజయ్‌సేతుపతి.. ఓ సెలూన్ షాప్ ఓనర్. ఓసారి పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి తన లక్ష్మి కనిపించకుండా పోయిందని, ఎఫ్ఐఆర్ రాసి దాన్ని వెతికి పట్టుకోవాలని చెబుతాడు. ఇంతకీ కనిపించకుండా పోయిన లక్ష్మి ఎవరనేదే సస్పెన్స్. అయితే ఇందులో సేతుపతి ఫుల్ డీ గ్లామర్ లుక్‌తో కనిపించాడు. ట్రైలర్ చూస్తుంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నట్లున్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మరో వారం ఆగితే సరి!(ఇదీ చదవండి: ప్రభాస్ ఇంటి ఫుడ్‌ని మర్చిపోలేకపోతున్న హీరోయిన్.. ఐదేళ్లయినా సరే) -
రోల్స్ రాయిస్ కార్లతో వీధులు ఊడిపించిన భారతీయ రాజు!
రోల్స్ రాయిస్ కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు నుంచే కార్లను ఉత్పత్తి చేసిన ప్రముఖ బ్రాండ్ ఇది. అందులో ఇరవై శాతం కార్లు భారత్‌కే దిగమతి అయ్యేవట. అంటే ఆనాడే మన భారతీయుల రాజులకు ఆ కార్లంటే ఎంత మోజు ఉండేదో క్లియర్‌గా తెలుస్తోంది. అలాంటి లగ్జరియస్ కార్లతో ఓ భారతీయరాజు నగరంలోని వీధులను ఊడిపించేందుకు ఉపయోగించాడట. అంత ఫేమస్ కార్లను ఇలా చెత్తను ఊడ్చేందుకు ఉపయోగించాడో వింటే ఆశ్చర్యపోతారు. అంతేగాదే ఏకంగా ఆ కంపెనీ ఏ దిగొచ్చి క్షమాపణలు చెప్పి ఆరు సరికొత్త కార్లను ఇచ్చిందట. ఏంటా కథ చూద్దామా..!ఆ భారతీయ రాజు పేరు రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన ప్రముఖ మహారాజు జైసింగ్. ఆయన వీటిని కొనాలని అనుకుంటే.. ఒకేసారి మూడు రోల్స్ రాయిస్‌లను కొనుగోలు చేసేవారట. ఆ క్రమంలోనే 1920 సంవత్సరంలో అల్వార్ మహారాజు జైసింగ్ లండన్‌లోని మేఫెయిర్ ఏరియా వీధుల్లో తిరుగుతున్నారు. ఒకసారి సాధారణ వస్త్రధారణలోనే రోల్స్ రాయిస్ షోరూమ్‌లోకి వెళ్లారు. అయితే అక్కడ ఉన్న ఓ బ్రిటీష్ సేల్స్ మాన్ మహారాజా జై సింగ్‌ను చూసి చూడనట్లు వ్యవహారించాడు. దీన్ని అవమానంగా భావించిన మహారాజు వెంటనే తన హోటల్ గదికి వెళ్లిపోయారు.తరువాత జై సింగ్ తన సేవకులతో షోరూమ్‌కు కాల్ చేయించి.. అల్వార్ నగర రాజువారు కొన్ని కార్లను కొనుగోలు చేయబోతున్నట్లుగా తెలయజేశారు. దీంతో రాజు రాకను పురస్కరించుకుని షోరూమ్‌లోని సేల్స్ మెన్స్ అందరూ బారులు తీరడంతో పాటు రెడ్ కార్పెట్ పరిచారు. అప్పుడు రాజు షోరూమ్‌ను సందర్శించి.. అక్కడ ఆరు కార్లు ఉంటే అన్నింటినీ ఒకేసారి కొనుగోలు చేశారు. డెలివరీ ఛార్జీలతో సహా పూర్తి మొత్తాన్ని చెల్లించారు. ఇక్కడ నుంచే అసలు కథ మొదలయ్యింది. ఆయన అక్కడ జరిగిన అవమానాన్ని దృష్టిలో ఉంచుకని, ఆ ఆరు రోల్స్ రాయిస్ దేశంలో దిగుమతి అవ్వగానే వీధులను ఊడ్చేందుకు ఉపయోగించాలని మున్సిపాలిటీని ఆదేశించారు.అతి తక్కువ సమయంలోనే ఈ వార్త యావత్ ప్రపంచం అంతా వ్యాపించింది. అప్పటివరకు వరల్డ్ నంబర్ వన్ కార్ల తయారీ సంస్థగా ఉన్న రోల్స్ రాయిస్ గుడ్‌విల్, ఆదాయం ఒక్కసారిగా పతనం అయ్యాయి. దీంతో కంగుతిన్న రోల్స్ రాయిస్ వెంటనే తమ ప్రవర్తనకు క్షమాపణ చెబుతూ మహారాజా జై సింగ్ కు టెలిగ్రామ్ పంపింది. అంతేగాదు ఆయన ఆగ్రహం చల్లారేలా ఆరు సరికొత్త కార్లను ఉచితంగా అందించింది. దీంతో రోల్స్ రాయిస్ కంపెనీ క్షమాపణలు అంగీకరించిన రాజు జైసింగ్ చెత్తను సేకరించడానికి ఆ కార్లను వినియోగించడం మానేయాలని మున్సిపాలిటీకి సూచించారు. ఏదీఏమైన భారతీయ రాజు దెబ్బకు బ్రిటన్ రోల్స్ రాయిస్ కంపెనీ గడగడలాడింది కదూ.(చదవండి: ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!) -
మహారాజాగా విజయ్ సేతుపతి!
తమిళ సినిమా: బహుభాషా నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం మహారాజా. ఫ్యాషన్ స్టూడియోస్ సుధన్ సుందరం, ది రూట్ జగదీష్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొరంగు బొమ్మై చిత్రం ఫేమ్ నిధిలన్ కథా, దర్శకత్వం బాధ్యతలను వహిస్తున్నారు. నటి మమతా మోహన్ దాస్ నాయకిగా నటించిన ఇందులో బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్, నటి అభిరామి, నటుడు నట్టి, అరుల్ దాస్, సింగంపులి తదితరులు ముఖ్యపాత్ర పోషించారు. దినేష్ పురుషోత్తమన్ చాయాగ్రహణం, అద్నీష్ లోకనాథ్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం చెన్నైలోని ఒక హోటల్లో చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. నటుడు నట్టి మాట్లాడుతూ.. ఈ చిత్ర స్క్రీన్ ప్లే ఇకపై వచ్చే చిత్రాలకు ఒక ఉదాహరణగా ఉంటుందన్నారు. నటి అభిరామి మాట్లాడుతూ.. విజయ్ సేతుపతితో కలిసి నటించిన తొలి చిత్రం ఇదే అన్నారు. చురుకైన కళ్లు కలిగిన వ్యక్తి కమలహాసన్ తర్వాత విజయ్ సేతుపతినే అని పేర్కొన్నారు. ఇలాంటి ఒక స్పెషల్ చిత్రంలో తాను నటించడం సంతోషమని నటి మమతా మోహన్‌దాస్ పేర్కొన్నారు. మహారాజా రివెంజ్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. విజయ్ సేతుపతి 50వ చిత్రానికి తాను దర్శకుడు కావడం సంతోషమాన్ని నిధిలన్ పేర్కొన్నారు. చిత్ర కథానాయకుడు విజయ్ చతుపతి మాట్లాడుతూ.. అనుభవం, సహనం మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయన్నారు. అలాంటి అనుభవాన్ని కలిగించిన తన దర్శక నిర్మాతలకు, అభిమానులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. 50వ చిత్రం కచ్చితంగా తన సినిమా ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ఈ చిత్రం నిర్మాతలకు మూడు రెట్లు లాభాలు తెచ్చిపెడుతుందని దర్శకుడు చెప్పారని, అది పొగరు కాదని.. చిత్రంపై నమ్మకం అన్నారు. -
మహారాజా రెడీ
విజయ్ సేతుపతి కెరీర్లో 50వ మైలురాయిగా తెరకెక్కిన చిత్రం ‘మహారాజా’. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, నట్టి నటరాజ్ కీలక పాత్రలు పోషించారు. ప్యాషన్ స్టూడియోస్ సుధన్ సుందరం, ది రూట్–థింక్ స్టూడియోస్ జగదీష్ పళనిసామి సమర్పణలో రూపొందిన ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
తెలుగు సాంస్కృతిక వికాస రారాజు
పిఠాపురం మహారాజారావు వెంకట కుమార మహీపతి సూర్యారావు బహదూర్ (1885 –1965) ఆంధ్రదేశపు సంస్కరణ పోషణకు, సాంస్కృతిక కళా వికాసానికీ, సత్పరిపాలనకూ ఎనలేని కృషి చేశారు. తన గురువు దివాన్ మొక్కపాటి సుబ్బారాయుడు చూపిన అభ్యుదయ మార్గంలో అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతికై అలుపెరుగక పరిశ్రమించారు. వివిధ రంగాల్లో సూర్యారావు చేపట్టిన కార్యక్రమాలు ఎన్నదగ్గవి. దక్షిణాఫ్రికాలోని భారతీయుల కోసం గాంధీజీ పిలుపునందుకుని పాతిక వేలు అందించి, ఆనాటి జమీందార్లలో దేశభక్తికి ఊపిరులూదారు. రవీంద్రనాథ్ టాగూర్ స్థాపించిన ‘శాంతినికేతన్’ కలకత్తాలోని సిటీ కాలేజి; రాజమండ్రిలోని ఆస్తిక కళాశాల, టౌన్ హాలు నిర్మాణానికీ ఆర్థికంగా ఆయన అందించిన సేవలు అనన్యసామాన్యమైనవి. సంఘ సంస్కరణోద్యమానికి బాటలు వేసిన ‘బ్రహ్మసమాజం’ కార్యక్రమాలకు అన్ని విధాలా సాయం అందించారు. 1933లో బ్రహ్మసమాజ సూత్రధారి రాజా రామ్మోహన్రాయ్ శత వర్ధంతిని నిర్వహించారు. ఎన్నో మత సామరస్య, మానవీయ గ్రంథాల్ని ఈ సందర్భంగా ప్రచురించారు. అలాగే నాలుగవ అంతర్జాతీయ సర్వమత సమ్మేళనానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ గౌరవాన్ని పొందిన రెండవ భారతీయ రాజుగా ఘనత సాధించారు. ‘ఆంధ్ర సాహిత్య పరిషత్తు’ను మద్రాసులో స్థాపించి దానికి శాశ్వత నిధిని ఏర్పాటు చేశారు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ లాంటి సమగ్రమైన నిఘంటువు తెలుగులో కూడా అవసరమనే ఆశయంతో ‘సూర్యరాయాంధ్ర’ నిఘంటువు నిర్మాణాన్ని ఒక బృహత్కార్యంగా చేపట్టి తెలుగుజాతికి అందించారు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి అనాథ ఆశ్రమంగా ‘కరుణాలయం’ స్థాపించారు. నిమ్న వర్గాల పురుషుల పేరు చివర ‘గాడు’ను చేర్చి అవమానకరంగా పిలవడాన్ని నిషేధిస్తూ లెజిస్లేటివ్ కౌన్సిల్లో బిల్లును ప్రవేశపెట్టి విజయం సాధించారు. గాంధీజీ చేపట్టిన మద్యపాన నిషేధ ఉద్యమం కంటే ముందుగానే పిఠాపురం సంస్థాన పరిధిలో కల్లు తాగడాన్ని నిషేధించారు. కాకినాడలోని పీఆర్ కళాశాల ద్వారా దేశంలో అత్యున్నత విద్యనందించి చరిత్రలో ప్రత్యేకతను చాటుకున్నారు. తెలుగునాట సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఎనలేని కృషి చేసిన పిఠాపురం రాజాను స్మరించుకోవడం మన బాధ్యత. – ర్యాలి ప్రసాద్, చారిత్రక పరిశోధకులు (అక్టోబర్ 5న పిఠాపురం మహారాజా సూర్యారావు బహదూర్ జయంతి) -
సాంస్కృతిక పునరుజ్జీవన సారథి
కళా సాంస్కృతిక సారస్వత పిపాసిగా, ప్రజా తంత్రవాదిగా పేరొందిన పిఠాపురం మహారాజా రావువెంకట కుమార మహీపతి సూర్యారావు బహదూర్ (1885–1965) తెలుగు నేల మీద సాంస్కృతిక పునరుజ్జీవనానికి జీవితాంతం తోడ్పడిన మహామనీషి. అణగారిన వర్గాల ప్రజల కోసం అహర్నిశలు ఆలోచించిన అరుదైన మానవతావాది. యావత్ దేశానికి తన సేవలు అందించిన అజరామర కృషీవలుడు. స్వయంగా కవి, రచయిత, రసజ్ఞుడు, తత్వవేత్త అయిన సూర్యారావు జీవితం నిజానికి ఒక మహా సముద్రం. కందుకూరి వీరేశలింగం, చిలకమర్తి, రఘుపతి వెంకటరత్నం నాయుడు, మొక్కపాటి సుబ్బారాయుడు మొదలగు ఉద్దండుల సార«థ్యంలో అనేక రంగాల్లో సూర్యారావు చేసిన సేవలు ఎన్నదగ్గవి. దక్షిణాఫ్రికాలోని భారతీయుల కోసం గాంధీజీ విరాళాల కోసం ప్రపంచవ్యాప్తంగా పిలుపు ఇచ్చినపుడు పాతిక వేలు పంపిన రాజావారి పేరు ఆనాడే దేశవ్యాప్తంగా మారుమోగింది. రవీంద్రనాథ్ టాగోర్ శాంతినికేతన్, కలకత్తాలోని సిటీ కాలేజి మొదలు రాజ మండ్రిలోని ఆస్తిక కళాశాల, టౌన్ హాలు వరకూ ఆర్థికంగా ఆయన వితరణ పొందని చోటు లేదంటే అతిశయోక్తి కాదు. ఆధునిక సంఘ సంస్కరణోద్యమానికి గొప్ప తోడ్పాటు నిచ్చిన బ్రహ్మసమాజోద్యమ చరిత్రలో చెరగని ముద్ర సూర్యారావుది. దక్షిణ భారతదేశంలో ఈ ఉద్యమానికి ఎనలేని సేవచేసిన వ్యక్తి ఆయన. యావత్ దేశంలోనే తలమానికమనే విధంగా ఎంతో ఖర్చుపెట్టి కాకినాడలో బ్రహ్మసమాజ మందిరాన్ని నిర్మించి హేమచంద్ర సర్కార్ వంటి నేతని బెంగాల్ నుండి ముఖ్య అతిథిగా తీసుకు వచ్చిన రాజాగారు, వంగదేశ మేధావి పండిత శివనాథ శాస్త్రిగారు రచించిన ‘బ్రహ్మ సమాజ చరిత్ర’ అనే బృహత్తర గ్రంథాన్ని కాకుండా, 1933లో రాజారామ్మోహన్ రాయ్ శతవర్ధంతిని జరిపి ఎన్నో మత సామరస్య, మానవీయ గ్రంథాల్ని ప్రచురించారు. ఆధ్యాత్మిక సమానత్వాన్ని ఇతోధికంగా ప్రచారం చేసిన సూర్యారావు నాలుగవ అంతర్జాతీయ సర్వమత సమ్మేళనానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బరోడా మహారాజు మినహా ఈ ఖ్యాతిని అందుకున్న ఏకైక భారతీయ మహారాజు ఈయన మాత్రమే. వైజ్ఞానిక ప్రగతిని మనçస్ఫూర్తిగా ఆహ్వానించి తూర్పు, పాశ్చాత్య దేశాల సమన్వయాన్ని ఆకాంక్షించారు. అసంఖ్యాక విశిష్ట గ్రంథాలను ప్రచురించడం, అనేకమంది బుద్ధి జీవులకు తోడ్పాటును అందించడం చేసిన సూర్యారావు ఆంధ్ర సాహిత్య పరిషత్తును మద్రాసులో స్థాపించి దానికి శాశ్వత నిధిని ఏర్పాటు చేశారు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వంటిది తెలుగులో కూడా తీసుకురావాలనే సంకల్పంతో సూర్యరాయాంధ్ర నిఘంటువు వంటి అనితరసాధ్యమైన మహత్కార్యాన్ని చేబట్టి సుసాధ్యం చేసారు. ఆర్థికత కంటే ఆత్మగౌరవమే ప్రధానమని నమ్మిన సూర్యారావు ఆఖరు క్షణం వరకూ అలానే బతికారు. అనాథల కోసం దక్షిణ భారతదేశం లోనే మొట్టమొదటి ఆశ్రమంగా ‘కరుణాలయం’ స్థాపించారు. బహుజనుల కోసం కంటి తుడుపు చర్యలు కాకుండా, ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, బహుజనుల్ని పేరు చివర గాడు అని చేర్చి హీనంగా సంబోధించే సమాజంలో లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎంతోమంది ఛాందస సాంప్రదాయవాదులు వ్యతిరేకించినప్పటికీ గ్రామాల్లో ‘గాడు’ అనే పదంతో ఉత్పత్తి కులాల వార్ని, ముఖ్యంగా దళిత బహుజనుల్ని పిలవడాన్ని నిషేధించాలనే బిల్లును ప్రవేశపెట్టి దుమారం రేపారు. భాష, సాహిత్యం, సంగీతం, చిత్రకళ, తర్కం, తత్వశాస్త్రం, ఆధ్యాత్మికత, క్రీడలు, రాజకీయాలు, సేవా రంగం, సాంస్కృతిక కార్యక్రమాలు.. ఇలా అనేకానేక అంశాల్లో కృషిచేసి ఆంధ్రదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఎంతో కృషిచేసిన పిఠాపురం మహా రాజా సూర్యారావు కృషిని స్మరించుకోవడం సాంస్కృతిక పునర్వికాసాన్ని స్వాగతిస్తున్న ఆలోచనాపరులందరి కర్తవ్యం. (నేడు పిఠాపురం మహారాజా సూర్యారావు బహదూర్ జయంతి సందర్భంగా...) – గౌరవ్ -
పాక్‌లో రాజా రంజిత్ సింగ్ విగ్రహం ధ్వంసం
లాహోర్: సిక్కు వర్గానికి చెందిన మహారాజా రంజిత్ సింగ్ కంచు విగ్రహాన్ని తెహ్రీక్ ఈ లబ్బైక్ పాకిస్తాన్ (టీఎల్పీ) కార్యకర్త ధ్వంసం చేశాడు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సుకు చెందిన లాహోర్ ఫోర్ట్ వద్ద ఈ విగ్రహం ఉంది. పలు నినాదాలు చేస్తూ, విగ్రహాన్ని ఓ వైపు నుంచి కూల్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అనంతరం మరో వ్యక్తి వెళ్లి విగ్రహపు చేతిని ధ్వంసం చేయడం వీడియోలో కనిపించింది. 2019లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ఎత్తు 9 అడుగులు ఉంటుంది. సిక్కు సంప్రదాయ రూపంతో కత్తి పట్టుకొని గుర్రం మీద మహారాజ రంజిత్ సింగ్ కూర్చొని ఉంటారు. దీనిపై పాక్ ప్రభుత్వం స్పందించింది. సమాచార మంత్రి ఫవాద్ చౌధరి మాట్లాడుతూ.. ఇలాంటి నిరక్షరాస్యుల వల్ల అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు పోతోందని వ్యాఖ్యానించారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ సలహాదారు షబ్నాజ్ గిల్ మాట్లాడుతూ, నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నిందితున్ని ఇప్పటికే పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై భారత్ స్పందించింది. మైనారిటీల్లో భయం పోగొట్టడంలో పాక్ ప్రభుత్వం విఫలమైందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పాక్‌లో తరచుగా జరుగుతున్నాయని అన్నారు. విగ్రహాలు ధ్వంసం చేయడం ఇది మూడో ఘటన అని పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల్లో ఈ తీరు వల్ల భయాందోళనలు వ్యక్తమవుతున్నాయన్నారు. -
కరోనా : జైపూర్ మాజీ మహారాజా కన్నుమూత
జైపూర్: కోవిడ్-19 సమస్యలతో రాజస్థాన్ దౌసాకు చెందిన జైపూర్ మాజీ మహారాజా, మాజీ ఎంపీ పృథ్వీరాజ్ (84) బుధవారం సాయంత్రం కన్నుమూశారు. కోవిడ్-19 బారిన పడి కోలుకున్న ఆయనకు అకస్మాత్తుగా తీవ్ర గుండెపోటు రావడంతో తుదిశ్వాస తీసుకున్నారు. జైపూర్‌కు చెందిన పూర్వపు రాజకుటుంబానికి చెందిన పృథ్వీరాజ్ రాజస్థాన్‌ను ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ ఒకప్పటి జైపూర్ పాలకుల నివసించిన ప్రసిద్ధ రాంబాగ్ ప్యాలెస్ డైరెక్టర్‌గా ఉన్నారు. దివంగత అధికారిక జైపూర్ మహారాజా సవాయి మాన్ సింగ్, మాజీ మహారాణి కిషోర్ కన్వర్ కుమారుడు పృథ్వీరాజ్. 1962లో స్వతంత్ర పార్టీ టిక్కెట్‌పై దౌసా నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. రాజ కుటుంబానికి చెందిన చివరి వారసుడు అయిన పృథ్వీరాజ్ తదనంతర కాలంలో రాంబాగ్ ప్యాలెస్‌ను లగ్జరీ హోటల్‌గా మార్చారు. త్రిపుర యువరాణి అతని సవతి తల్లి గాయత్రీ దేవి మేనకోడలు దేవికా దేవిని వివాహం చేసుకున్నారు. ఆయనకు కుమారుడు విజిత్ సింగ్ ఉన్నారు. తన అంకితభావం, దక్షతతో క్లిష్ట వ్యవహారాలను సైతం చక్కబెట్టగల సమర్ధుడిగా పృథ్వీరాజ్ కీర్తి గడించారు -
మిమ్మల్నే మహారాజా!
మృగరాజు ముసలిదైపోయింది. చూపు తగ్గింది. వేటాడే ఓపిక సన్నగిల్లింది. దాంతో ఓ ఉపాయం ఆలోచించింది. తోడేలును పిలిచి, ‘‘నేను పెద్దవాడినయి పోయాను. వేటాడలేక పోతున్నాను. కాబట్టి ఏదో ఒక జంతువును నా దగ్గరకు తీసుకొస్తుండు. నీకూ వాటా ఇస్తాను. అన్నట్లు ఇప్పుడు నాకు దుప్పి మాంసం తినాలనుంది. బాగా బలిసిన దుప్పినొకదాన్ని తీసుకురా’’ అని ఆజ్ఞాపించింది. తోడేలు అందుకు ఒప్పుకుంది. వెంటనే బయల్దేరి ఒక దుప్పి దగ్గరకెళ్లి వినయంగా నమస్కరించి, ‘‘మహారాజా! కులాసానా?’’ అంటూ పలకరించింది. తనను కాదనుకుని అటూ ఇటూ చూడసాగింది దుప్పి. ఈ సారి ఇంకాస్త వినయంగా ‘‘మిమ్మల్నే మహారాజా’’ అంది నక్క. దాంతో అది పిలుస్తున్నది తననే అని నిర్ధారించుకుని, ‘‘ఊ! మేము బాగానే ఉన్నాం. ఏమిటి సంగతి?’’ అనడిగింది దుప్పి అప్పటికే తాను మహారాజయిపోయినట్లు! ‘‘మీకు తెలియందేముంది రాజా! మన మృగరాజుగారు పెద్దవారయ్యారు కదా. తన స్థానంలో మిమ్మల్ని రాజును చెయ్యాలని తీర్మానించుకున్నారు. మిమ్మల్ని సగౌరవంగా పిలుచుకుని రమ్మని చెప్పారు. ఆయన మనసు మార్చుకోకముందే బయల్దేరండి’’ అంటూ తొందర చేసింది. దుప్పికి తన బలంమీద, తెలివి తేటలమీద బాగా నమ్మకం. తోడేలు మాటలు నిజమేనని నమ్మింది. ముందు వెనకలు ఆలోచించకుండా కొమ్ములు దువ్వుకుంటూ వెంటనే బయల్దేరింది. తోడేలు దాన్ని సింహం ఉన్న గుహదాకా తీసుకొచ్చింది. తటపటాయిస్తున్న దుప్పితో, ‘‘మృగరాజు దగ్గరకు వెళ్లండి. మీకు కిరీటం తొడిగి, మీరు ఏమేం పనులు చేయాలో చెబుతారు’’ అంది తోడేలు. దుప్పి సింహం దగ్గరకు వెళ్లి తలవంచి నిలబడింది. సింహం ఒక్కసారిగా తన పంజా విసిరి దాని మెడ చీల్చి చంపేసింది. అది తినగా మిగిలిన మాంసంతో తోడేలు విందు చేసుకుంది. నక్క వినయాలు నిజమేననుకోవడం, అవతలివారు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మటం ఎవరికైనా, ఎప్పటికైనా ప్రమాదకరం. –డి.వి.ఆర్. -
అప్పుడలా వచ్చావే... ఇప్పుడు రావేం తండ్రీ !
‘నీ నగుమోము కనలేని...’ అని త్యాగయ్య కీర్తన చేస్తూ రాముడిని ‘రఘువరా!’ అని సంబోధించారు. అలానే ఎందుకు సంబోధించాల్సి వచ్చింది. ఇక్ష్వాకు వంశ సంభూతా.. అని కూడా పిలవవచ్చు. అలా పిలవలేదు. ఇక్ష్వాకు వంశం రఘు మహారాజు పుట్టిన తరువాత అది రఘువంశమయి పోయింది. కాళిదాసు రఘువంశ కావ్యంలో...‘‘త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మిత భాషిణాం యశసే విజగీషూణాం ప్రజాయై గృహమేధినాం..’’ అంటారు.రఘుమహారాజు అపారమైన ఐశ్వర్యాన్ని సంపాదించారట. దాచుకోవడానికి కాదు.. త్యాగాయ సంభృతార్థానాం... మళ్ళీ దాన్ని ఖర్చు పెట్టడానికి. నీరు నిలవ ఉంటే దుర్వాసన, సన్యాసి ఒకచోట ఉండిపోతే ప్రమాదం, సంచరిస్తూ ఉండాలి. ధనం ఒకచోట ఉండిపోతే దుర్గుణాలకు ఆలవాలం అవుతుంది. అందుకే అది కదులుతూ ఉండాలి. అందుకని అది దానం చేయడానికి సంపాదించాడు. ‘సత్యాయ మిత భాషిణాం’.. ఎక్కువ మాట్లాడితే అందులో అసత్యం ఉన్న వాక్కేదైనా దొర్లుతుందేమోనని తక్కువ మాట్లాడేవారట. యశసే విజగీషూణాం–అపారమైన దండయాత్రలు చేసి సామ్రాజ్య విస్తరణ చేసింది రక్తపాతం కోసం కాదు, క్షాత్రధర్మం కనుక రాజ్య విస్తరణ చేసి కీర్తిని సంపాదించడానికట. ప్రజాయై గృహమేధినాం–గృహస్థాశ్రమం వంశాన్ని నిలబెట్టడానికి కావలసిన సంతానం కోసమేనట. ఇటువంటి సుగుణాలు కలిగిన రఘు మహారాజు వంశంలో పుట్టిన నీవు రాఘవుడివై ఆ కీర్తిని మరింత వెలిగేటట్లు చేసావు.సత్యేన లోకాన్ జయతి దీనేన్ దానేన రాఘవ: గురూన్ శుశ్రూషయా వీరో ధనుషాయుధి శాత్రవాన్–నీ గుణాలేమిటో తెలుసా రామా! సత్యేన్ లోకాన్ జయతి.. సత్యంతో లోకాలన్నింటినీ గెలిచావు, సత్యమే రామచంద్రమూర్తి పౌరుషమంటారు వాల్మీకి. దానాలతో దీనులను గెలిచావు. గురువుకు కానుకలు ఇవ్వగలిగినవాడు లేడు కనుక నీవు నీ సేవలతో వారిని గెలిచావు. కోదండం పట్టుకున్నావా శత్రువనేవాడు లేకుండా చేయగలిగిన వీరత్వం నీది. అటువంటివాడివై రఘువంశంలో కీర్తి పెంచిన రామా! లోకాలను రక్షించడం కోసం కూర్మావతారమెత్తి అంతటి క్లేశాన్ని భరించావే, (మంధర పర్వతాన్ని వీపుమీద మోస్తూ), వరాలను పొందిన రావణుని దుష్ట ప్రవర్తన అణచడం కోసం దశరథమహారాజువారి యాగస్థలిలో ప్రత్యక్షమై ఆయనను తండ్రిగా ఎంచుకుని రాముడిగా జన్మనెత్తి ఎన్నెన్ని కష్టాలకోర్చావు, ఇంద్రుడి అహంకారాన్ని అణచడానికి శ్రీ కృష్ణుడిగా గోవర్థన పర్వతాన్ని ఏడురోజులు ఎత్తి పట్టుకుని గోవిందుడివై లోకాల్ని రక్షించావే....ఇన్ని చేసావు కదా... నేనవేవీ అడగలేదు కదా స్వామీ, నేనడిగినదేమిటి... నగుమోము కనలేని నాదుజాలీ తెలిసీ... ఒక్కసారి కనపడమని అడిగాను. కనపడితే నేనేమయినా అడుగుతాననుకుంటున్నావా... అలా అడిగేవాడిని కానే... అప్పుడు అన్నిసార్లు వచ్చిన వాడివి... ఇప్పుడు రాలేదంటే ఏమనుకోవాలి... నీ చుట్టూ ఉన్న వాళ్ళెవరయినా నా దగ్గరికి రాకుండా అడ్డుకుంటున్నారా... నీవారోజున గజేంద్రుడిని రక్షించడానికి ఆగమేఘాలమీద పరుగెడుతుంటే.. వారెవరూ నిన్ను ఆపలేదు కదా... అందువల్ల వారలా ఆపేవారు కూడా కాదు.. పైగా సంతోషంగా నీవెంట వచ్చేవాళ్ళే కదా... అయినా నా కోరికేమిటి? ఒక్కసారి ఆ సీతమ్మ తల్లితో కలిసి కోదండం చేతపట్టుకుని, లక్ష్మణుడు పక్కన నిలబడితే, హనుమ నీ పాదాల వద్ద కూర్చుని సేవిస్తుంటే... చిరునవ్వు నవ్వుతూ సంతోషంగా నావంక చూస్తే.. నీ దివ్యమంగళ స్వరూపాన్ని కన్నులతో తనివితీరా తాగేసి ఆ ఆనందం పట్టలేక నేను నువ్వయిపోయి నేను నీలో కలిసిపోవాలి. అందుకని నా ఆర్తిని గమనించి రావేం తండ్రీ... అని వేడుకుంటున్నాడు. గీతం, సంగీతం, ఆర్తి, భక్తి...అన్నీ కలిసిపోయిన దృశ్య ఆవిష్కరణ అది. -
శతవసంతాల కళాశాలకు మహారాజ వైభవం
విజయనగరం మహారాజా సంగీతసాహిత్య పోషణకు నిదర్శనాలు కోకొల్లలు. విజయనగరంలో ఆయన నిర్మించిన సంగీత కళాశాల నాటి కళావైభవాన్ని నేటికీ చాటుతోంది. ఒక చిన్న గాన సభగా మొదలైన ఈ కళాశాల నేటికి వందేళ్లు పూర్తి చేసుకుంది. ఈ వందేళ్లలో ఈ కళాశాల నుంచి ఎందరో కళాకారులు ఉద్భవించారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరవాత 1957లో ఈ కళాశాల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధీనంలోకి వచ్చింది. విద్యార్థులంతా ఆంగ్ల విద్యవైపు మొగ్గు చూపుతుండటంతో ఒక దశాబ్ద కాలంగా ఇక్కడ చదివే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ప్రిన్సిపాల్, ఒక టీచర్, ఒక విద్యార్థి స్థాయికి పడిపోయింది. ఐదుసంవత్సరాల ఓరియెంటల్ బిఎ చదవడానికి ఎవ్వరూ ముందుకు రాకపోతుండడంతో. కాలేజీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది.దాంతో కళాశాల ప్రిన్సిపాల్ ఉద్యమదీక్ష పూని కాలేజీ గత వైభవాన్ని పునరుద్ధరించడానికి నడుం బిగించారు. ‘‘సంస్కృతవిద్య కేవలం బ్రాహ్మణులకు మాత్రమే అనే ఒక భ్రమ ఉంది చాలామందిలో. ఆ భ్రమను తొలగించేలా... కులమతాలకు సంబంధం లేకుండా ఇక్కడ అందరికీ ప్రవేశం’’ అని కరపత్రాలు ప్రచురించి, కళాశాల చుట్టుపక్కల ఉన్న ఐదు జిల్లాలలో పంచారు. ఈ ఒక్కమాటతో అనూహ్య స్పందన వచ్చింది. ఒకటి నుంచి నలభై రెండుకు... కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల ఫీజులు కట్టడంతో విద్యార్థుల సంఖ్య ఒకటి నుంచి 42కు చేరింది. ఘన చరిత్ర... ఈ కళాశాలకు విజయరామ గజపతిరాజు శ్రీకారం చుట్టారు. తన ఆస్థానంలో ఉద్యోగిగా పనిచేస్తున్న చాగంటి జోగారావుగారి కుమారుడు గంగబాబు అంధుడు. ఆ బాలుడి కోసం 1919, ఫిబ్రవరి 5వ తేదీన విజయరామ గజపతిరాజు విజయనగర గాన పాఠశాలను ఏర్పాటుచేశారు. ఆ రోజుల్లో ఆ పాఠశాలకు హరికథా పితామహుడు అజ్జాడ అదిభట్ల నారాయణదాసు అధ్యక్షులయ్యారు. అనంతరం ప్రముఖ వాయులీన విద్వాంసులు పద్మశ్రీ ద్వారం వెంకటస్వామినాయుడు అధ్యక్షులయ్యారు. టౌన్ హాల్... విజయనగరం కోట వెనుక ప్రాంతంలోని నేటి ఈ కళాశాలను అప్పట్లో టౌన్‌హాల్ అని పిలిచేవారు. దక్షిణాదిన కర్ణాటక శాస్త్రీయ సంప్రదాయాలను పరిరక్షించే ఈ కళాశాలలో వీణ, గాత్రం, వయొలిన్, మృదంగం, సన్నాయి, డోలు వాద్యాలలో శిక్షణ ఇచ్చేవారు. విచిత్రమేమిటంటే ఈకళాశాలలో నాటినుంచి నేటివరకు హరికథకు స్థానం కల్పించలేదు. ప్రముఖులు... ఘంటసాల, గాయని పి. సుశీల, నూకల చినసత్యనారాయణ, శ్రీరంగం గోపాలరత్నం వంటి వారంతా ఈ కళాశాల విద్యార్థులే. సినీరంగంలో సంగీత దర్శకులుగా ప్రసిద్ధులైన సాలూరి రాజేశ్వరరావు ఇక్కడ నుంచి వచ్చిన మాణిక్యమే. సంగీత చూడామణి నేదునూరి కృష్ణమూర్తి, ద్వారం సత్యనారాయణ, ద్వారం దుర్గాప్రసాదరావు ఈ కళాశాల ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తం చేశారు. వయొలిన్... పాశ్చాత్య తంత్రీ వాద్యమైన ఫిడేలును కర్ణాటక సంగీతం వాయించడం ద్వారా ప్రపంచ ప్రఖ్యాతం చేశారు ద్వారం వెంకట స్వామినాయుడు. ఈ కళాశాల నూరేళ్లు పూర్తి చేసుకుంది. నూకల చినసత్యనారాయణ, శ్రీరంగం గోపాలరత్నం, ద్వారం భావనారాయణ, నేదునూరి కృష్ణమూర్తి, బురిడి అనురాధా పరశురాం... వంటివారంతా ఈ కళాశాలకు అధ్యక్షులుగా పనిచేశారు. దూరం నుంచి వచ్చిన విద్యార్థులకు మేలు కలిగిస్తూ, ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా సంగీతోత్సవాలను అధ్యాపక, విద్యార్థి బృందాలు నిర్వహిస్తున్నాయి. సాంస్కృతిక శాఖ సహకరిస్తోంది. ఈ కళాశాలలోని సంగీత దర్బార్ ఎంతో విలక్షణమైనది. ఎందరో విద్వాంసులు ఈ కళాశాలలో సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. హిందుస్థానీ, కర్ణాటక సంగీతాలు, భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చారు. పదిసంవత్సరాలు నిండిన వారెవరైనా సంగీత, నృత్యాలలో ప్రవేశించడానికి అర్హులు. ప్రతి సంవత్సరం ఇక్కడ కళాపరిచయం ద్వారా శిక్షణ పొందినవారికి ఈ సంగీత, నృత్యకళాశాలలో ప్రవేశం కల్పిస్తున్నారు. పది సంవత్సరాలు నిండినవారు ఎవరైనా సంగీత, నృత్యాల్లో విద్యార్థులుగా చేరే అవకాశం ఉంది. ఒడిషా వాసులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వారికి ఇది అందుబాటులో ఉంది. ఆదిభట్ల నారాయణదాసు, ద్వారం వెంకటస్వామినాయుడు, ద్వారం నరసింగరావు నాయుడు, ద్వారం భావనారాయణరావు, నేదునూరి కృష్ణమూర్తి, శ్రీరంగం గోపాలరత్నం, ద్వారం దుర్గాప్రసాదరావు, పి.వి.యస్. శేషయ్యశాస్త్రి, బురిడి అనురాధ పరశురాం (ప్రస్తుతం) ఈ కళాశాలకు ప్రధాన ఆచార్యులుగా ఉన్నారు. – జయంతి -
పహిల్వాన్ డోలు
అది చలికాలం. చల్లని నల్లని అమావాస్య రాత్రి. మలేరియా, కలరా రోగాలతో ఆ ఊరంతా భయాక్రాంతుడైన బాలుడి మాదిరి వణికిపోతూ ఉంది. నశించిపోయిన పాత వెదురు బోద గుడిసెల్లో చీకటి– నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఒకటే చీకటి స్తబ్దత.చీకటి రాత్రి కన్నీరు కారుస్తోంది. స్తబ్దత కరుణతో కూడిన వెక్కిళ్లనూ దుఃఖాన్నీ బలవంతంగా తన హృదయంలో నొక్కి పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి. భూమిపైన వెలుతురు అనే మాటే లేదు. ఆకాశంలో నుంచి ఊడబడాలని ఏ నక్షత్రమైనా అనుకున్నా దాని వెలుతురూ, శక్తి మార్గమధ్యంలోనే నశిస్తాయి. మిగతా నక్షత్రాలు దాని భావుకత, అసమర్థతను చూసి కిలకిలా నవ్వుకుంటాయి. నక్కల ఊళలు, గుడ్లగూబల భయంకరమైన కూతలు అప్పుడప్పుడూ నిశ్శబ్దాన్ని భంగపరుస్తున్నాయి. ఊరిలోని గుడిసెల నుంచి ఏడుపులు, వాంతులు చేసుకునే శబ్దాలు, ‘‘అయ్యో దేవుడా, ఓరి భగవంతుడా!’’ వంటి కేకలు మాత్రం వినపడుతున్నాయి. అమ్మా, అమ్మా అంటూ నీరసించిన గొంతులతో పిల్లల అరుపులు వినబడుతున్నాయి. కానీ వీటివల్ల రాత్రి స్తబ్దతలో ఎలాంటి మార్పులూ లేవు.పరిస్థితులను పసిగట్టే గొప్ప నేర్పు కుక్కలకుంటుంది. అవి పగలంతా గుట్టలపైన మూటల్లా ముడుచుకుని దిగులుగా పడి ఉంటాయి. రాత్రి వేళల్లో అన్నీ కలిసి ఏడుస్తుంటాయి. రాత్రిళ్లు ఈ విధంగా భయంకరంగా గడిచిపోతూ ఉంటే, దొమ్మరివాడి డోలు మాత్రం నిరంతరం మోగుతూ ఉండేది. సాయంత్రం అయినప్పటి నుంచి తెల్లారేదాకా ‘ఫట్.. థా గిడ్... థా.. ఫట్.. థా గిడ్.. థా.. ’ (అంటే.. రా, ఢీకొను రా, ఢీకొను) అనే శబ్దం ఒకే తాళగతిలో మోగుతూ ఉంటుంది. మధ్య మధ్యలో ‘చటాక్ చట్థా.. చటాక్.. చట్ థా’ (అంటే ఎత్తి కింద పారేయి.. ఎత్తి కింద పారేయి) అనే శబ్దాలు వినిపిస్తాయి. మృత్యుముఖంలో ఉన్న ఆ ఊళ్లో ఆ డోలు శబ్దాలే సంజీవని శక్తిగా పనిచేసేవి.లుట్టన్ సింగ్ పహిల్వాన్‌ను హోల్ ఇండియా ప్రజలకు తెలుసునని అంటూ ఉంటాడు. కానీ అతని హోల్ ఇండియా హద్దు ఒక జిల్లా వరకు మాత్రమే. ఆ జిల్లాలోని ప్రజలకందరికీ అతను తెలుసు.లుట్టన్ తల్లిదండ్రులు అతని తొమ్మిదేళ్ల వయసప్పుడే అతన్ని అనాథగా మిగిల్చి చనిపోయారు. అదృష్టం కొద్దీ అప్పటికే అతనికి పెండ్లి అయింది. లేకపోతే తల్లిదండ్రులతో పాటు అతనూ గతించేవాడు. విధవరాలైన అత్త అతన్ని పెంచి పెద్ద చేసింది. బాల్యంలో ఆవులను మేపుతూ, వాటి పాలు తాగుతూ, కసరత్తు చేస్తూ గడిపేవాడు. పల్లె ప్రజలు అతని అత్తను నానా విధాలుగా బాధించేవారు. వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే అతని బుర్రలో కసరత్తు నేర్చుకోవాలనే బుద్ధి పుట్టింది. క్రమం తప్పకుండా కసరత్తు చేయడం వల్ల బాల్యావస్థలోనే అతని ఛాతీ, బాహువులు బలిష్టంగా తయారయ్యాయి. పుష్టికరమైన కండరాలు ఏర్పడ్డాయి. యవ్వనంలోకి అడుగుపెడుతూనే పల్లెలోకెల్లా మంచి పహిల్వాన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రజలు అతనికి భయపడేవారు తాను రెండు వైపులా చేతులను నలభై ఐదు డిగ్రీల కోణంలో చాపి– పహిల్వాన్ల మాదిరిగా నడిచేవాడు. అతను కుస్తీ కూడా పట్టేవాడుఒకనాడు అతడు కుస్తీ చూడ్డానికి శ్యామ్‌నగర్ జాతరకు వెళ్లాడు. పహిల్వాన్ల కుస్తీలో వాళ్ల పట్టు విడుపులు చూస్తూ ఊరకుండలేకపోయాడు. యవ్వనపు వేడి, మదం వల్ల డోలు శబ్దాలకు అతని రక్తనాళాలు వేడెక్కాయి. ముందు వెనుకా చూడకుండా కుస్తీలో ‘‘సింహం పిల్ల’’తో సవాలు చేశాడుఆ సింహంపిల్ల అసలు పేరు చాంద్ సింగ్. వాడు పంజాబ్ నుంచి తన గురువు బాదల్ సింగ్ వెంట తొలిసారి శ్యామ్‌నగర్ జాతరకు వచ్చాడు. అందమైన యువకుడు. వచ్చిన మూడు రోజుల్లోనే పంజాబ్–పఠాన్ల పహిల్వాన్ల దళంలోని తన సరిజోడు పహిల్వాన్లందరినీ నేల కరిపించి, ‘‘సింహంపిల్ల’’ అనే బిరుదు పొందగలిగాడు. అతను కుస్తీ మైదానంలో లంగోటా బిగించి చెంగు చెంగున విజయగర్వంతో హర్షధ్వనులు చేస్తూ గుర్రంపిల్ల మాదిరిగా ఎగురుతూ ఉండేవాడు. అతని దెబ్బకు అక్కడి యువ పహిల్వాన్లు అందరూ కుస్తీ మాటంటేనే భయపడేవారు. తన బిరుదును నిలుపుకొనేందుకు చాంద్ సింగ్ మధ్య మధ్యలో కుస్తీకి ఎవరైనా ఉంటే రమ్మని కాలు దువ్వేవాడు. వేటలూ, కుస్తీలంటే చెవి కోసుకునే శ్యామ్‌నగర్ వృద్ధ మహారాజా చాంద్సింగ్ను తన దర్బారులో పహిల్వాన్‌గా ఉంచుకోవాలని అనుకుంటుండగానే లుట్టన్ ఆ సింహంపిల్లతో పోటీ పడతానని సవాలు చేశాడు. బిరుదు పొందిన చాంద్ సింగ్.. లుట్టన్ సవాలు విని నవ్వుకున్నాడు. వెంటనే డేగ మాదిరి అతని మీదకు లంఘించాడు.నిశ్శబ్దంగా ఉన్న ప్రేక్షకుల గుంపులో కలకలం మొదలైంది. ‘‘పిచ్చోడు.. పిచ్చి ముండాకొడుకు... చచ్చచ్చ.. చచ్చ’’... ఓహో! గొప్పోడే. లుట్టన్ చాకచక్యంగా దాడిని తప్పించుకుని లేచి నిలబడ్డాడు. మహారాజా కుస్తీని ఆపు చేయించి, లుట్టన్ను తన వద్దకు పిలిపించుకుని సముదాయించాడు. అతని ధైర్యసాహసాలను మెచ్చుకుంటూ పదిరూపాయల నోటు చేతికందించి ‘‘పో.. జాతర చూసి ఇంటికి పో..’’ అన్నాడు. ‘‘లేదు మహారాజా! కుస్తీ పడతాను. తమరు ఆజ్ఞాపించండి.’’‘‘పో.. పిచ్చోడా’’‘‘శరీరంలో శక్తి లేకపోయినా సింహంపిల్లతో కుస్తీ పట్టవచ్చావుటరా.. రాజావారు ఇంతగా నచ్చచెబుతున్నా కుస్తీ మానుకోకపోతే నీకు పుట్టగతులుండవు’’ అని మేనేజరు, భటులు అతన్ని బెదిరించారు.‘‘మీపై ఒట్టు దొరా! మీ ఆజ్ఞయే తరువాయి మహారాజా... కుస్తీ పట్టనివ్వండి దొరా. లేకపోతే ఇక్కడే ఈ రాతికి తల బద్దలుగొట్టుకుని చస్తాను’’ చేతులు జోడించి వేడుకున్నాడు. గుంపులో కలవరం మొదలైంది. పంజాబ్ పహిల్వాన్ల దళం కోపంతో లుట్టన్పై తిట్ల వర్షం కురిపించసాగింది. ప్రేక్షకుల్లో ఉత్సాహం పెరిగింది. వాళ్లల్లో కొందరు లుట్టన్ తరఫున కేకలు చేస్తూ అతన్ని కుస్తీ పట్టనివ్వండి అని అరిచారు. చాంద్ సింగ్ ఒక్కడే మైదానంలో నవ్వుకుంటూ నిలబడ్డాడు. మొదటి పట్టులోనే తన ప్రత్యర్థి శక్తి ఏమిటో అతనికి అర్థమైంది.రాజావారు గత్యంతరం లేక ఆజ్ఞ జారీ చేశారు. ‘‘సరే కుస్తీ పట్టండి.’’డోలు మోగటం మొదలైంది. ప్రేక్షకుల్లో మళ్లీ ఉత్సాహం పెరిగింది. గుంపులో కోలాహలం ప్రారంభమైంది. జాతరలోని దుకాణదారులందరూ దుకాణాలను మూసివేసి ‘‘చాంద్ సింగ్‌కి సమ ఉజ్జీ దొరికాడు. కుస్తీ జరుగుతూంది’’ అని పరుగెత్తుకుంటూ వచ్చారు.‘‘చట్ థా.. గిడ్ థా.. చట్ థా.. గిడ్ థా..’’ ఇంతవరకు మూగబోయిన డోలు పెద్ద శబ్దంతో మోగింది. ‘‘డాక్ డినా, డాక్డినా డాక్ డినా’’ (అంటే వాహా, భలే భలే) శబ్దం చేస్తూ డోలు మోగింది. చాంద్ సింగ్ లుట్టన్ సింగ్‌ను గట్టిగా నొక్కి పట్టాడు.‘‘అయిపోయే! లుట్టన్ సింగ్ బజ్జీ అయిపోయే! సింహంపిల్లతో ఢీకొనడం నవ్వులాటా మరి’’ అని ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. ‘చట్ గిడ్థా, చట్ గిడ్థా, థట్గిడ్థా’ (భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు) అంటూ డోలు మార్మోగింది. లుట్టన్ మెడపై మోచేతిని ఆనించి నేల పడేసే ప్రయత్నంలో చాంద్ సింగ్ ఉన్నాడు.‘అక్కడే పడెయ్యి’ అంటూ బాదల్ సింగ్ తన శిష్యుణ్ణి ఉత్సాహపరచాడు.లుట్టన్ కన్నులు బయటకొచ్చాయి. ఉఛ్ఛ్వాశ నిశ్వాసాలు ఎక్కువయ్యాయి. గుంపులోని ఎక్కువమంది జనం చాంద్సింగ్ పక్షం చేరి, అతన్ని ఉత్సాహపరుస్తున్నారు. లుట్టన్ పక్షాన డోలు మాత్రం మోగుతోంది. డోలు మోత ప్రకారం అతను తన ఉత్సాహాన్ని పెంపొందించుకుంటూ తలపడుతున్నాడు. ఉన్నట్టుండి డోలు నెమ్మదిగా మోగసాగింది.‘‘డక్ డినా– తిర్కిట్తినా, డక్డినా తిర్కిట్తినా’’ (అంటే పోటీ విరమించుకో, బయటకొచ్చేసేయి) అని లుట్టన్ సింగ్‌కు డోలు చేసిన ఈ శబ్దాలు వినపడ్డాయి. ఉన్నట్టుండి లుట్టన్ పట్టు నుంచి జారుకొని బయటకొచ్చి వెంటనే చాంద్సింగ్పైకి ఉరికి మెడ పట్టేశాడు. ‘‘శభాష్, భలే! మట్టిలో మాణిక్యానివిరా!’’‘‘సరే, ఆహా! బయటికొచ్చాడా?’’ అందువల్లనే కదా జనం లుట్టన్ వైపు మొగ్గారు.‘ఛటాక్ ఛట్ థా.. ఛటాక్ ఛట్ థా’ (ఎత్తి పడెయ్యి, ఎత్తి పడెయ్యి) అని గట్టిగా డోలు మోగింది. లుట్టన్ చాలా చలాకీగా ఎత్తుకు పై ఎత్తు వేసి చాంద్ సింగ్‌ను కింద పడేశాడు.‘థిగ్ థినా, థిగ్ థినా’ (వెల్లకిలా పడెయ్యి, వెల్లకిలా పడెయ్యి) అని డోలు మోగింది.లుట్టన్ సింగ్ శక్తినంతా బిగపట్టి చాంద్ సింగ్‌ను వెల్లకిలా పడేసి ఓడించాడు. ‘థాగిడ్ గిడ్, థాగిడ్ గిడ్, థాగిడ్ గిడ్’ (శభాష్ పహిల్వాన్, శభాష్ పహిల్వాన్, శభాష్ పహిల్వాన్) అని డోలు మోగింది.ప్రేక్షకులు ఎవరికి జేజేలు పలకాలో తెలియని స్థితిలో ఉన్నారు. వాళ్ల వాళ్ల ఇష్టానుసారం కొంతమంది ‘దుర్గా మాతకు జై’ అంటే మరికొందరు ‘మహావీరునికి జై’ పలికారు. మరికొందరు శ్యామానంద మహారాజుకు జై పలికారు. ఆఖరికి సామూహికంగా జేజేలతో ఆకాశం మార్మోగింది.విజయోత్సాహంతో లుట్టన్ ఎగురుతూ గంతులేస్తూ, తొడలు చరుస్తూ అందరి కంటే ముందు వాద్యగాళ్ల వద్దకు పరుగున వెళ్లి భక్తిపూర్వకంగా డోలుకు నమస్కరించాడు. తర్వాత పరుగున వెళ్లి రాజాగారిని పైకెత్తుకున్నాడు. రాజావారి విలువైన దుస్తులకు మట్టి అంటుకుంది. ‘అరె, అరే .. ఏమిటిది?’ మేనేజరుగారు మందలించారు. రాజావారు మాత్రం అతన్ని తన హృదయానికి హత్తుకొని ఆనంద పారవశ్యంతో ‘‘వర్ధిల్లు పహిల్వాన్ వర్ధిల్లు! నీవు ఈ రాజ్య గౌరవాన్ని నిలబెట్టావు’’ అన్నారు. పంజాబీ పహిల్వాన్లు చాంద్ సింగ్ కన్నీళ్లు తుడవసాగారు. రాజావారు లుట్టన్ సింగ్‌కు బహుమానాలు ఇవ్వటమేగాక అతన్ని ఆస్థానంలో నియమించుకున్నారు. అప్పటి నుంచి లుట్టన్ రాజాస్థానంలో పహిల్వాన్ అయ్యాడు. రాజావారు గౌరవంగా అతన్ని లుట్టన్ సింగ్ అని పిలువసాగారు. మిగతా ఆస్థాన పండితులకు అది నచ్చలేదు. ‘‘ప్రభూ! వీడి జాతి ఏమిటి? వీడిని సింగ్ అని పిలవడం బాగులేదు’ అన్నారు.మేనేజరు క్షత్రియుడు. తన క్లీన్షేవ్డ్ ముఖాన్ని చిట్లిస్తూ ముక్కులోని వెంట్రుకలను లాగసాగాడు. క్షణంలో ఒక వెంట్రుకను లాగేసి దాన్ని నలుపుకుంటూ ‘‘అవును మహాప్రభూ! ఇది అన్యాయమే’’ అన్నాడు.‘‘అతడు క్షత్రియుడు చేయవలసిన పనే చేశాడు’’ రాజావారు చిరునవ్వుతో అన్నారు. ఆ రోజు నుంచే లుట్టన్ సింగ్ పహిల్వాన్ కీర్తి ప్రతిష్ఠలు దూర తీరాలకు వ్యాపించాయి. కొద్ది సంవత్సరాల్లోనే అతడు పేరుగాంచిన పహిల్వాన్లను ఒక్కొక్కరినే మట్టికరిపించాడు. అప్పుడు కాలాఖాన్ అనే మరో పేరుపొందిన పహిల్వాన్ ఉండేవాడు. కాలాఖాన్ లంగోటీ బిగించి, ఆలే అని ప్రత్యర్థి పైకి ఉరికితే, ప్రత్యర్థికి వణుకు పుట్టేదని ప్రతీతి. లుట్టన్ సింగ్ అతన్ని కూడా ఓడించి వాళ్ల భ్రమలను తొలగించాడు.క్రమంగా అతను ప్రదర్శనశాలలో ఒక వస్తువుగా తయారయ్యాడు. జంతు ప్రదర్శనశాలలో ఇనుపబోను ఊపుతూ పులి గాండ్రించినట్లు అతను హా హూ.. హా హూ అని అరిచేవాడు. అతని అరుపులు విని, రాజావారి పులి అరుస్తోంది అనేవారు. జాతరలో అతను మోకాళ్ల వరకు అంగీ వేసుకుని, చిందరవందరగా తలపాగా కట్టి, మదించిన ఏనుగులా ఊగుతూ నడిచేవాడు. దుకాణదారులు తమ అంగడి వద్దకు పిలిచి, ‘‘పహిల్వాన్ గారూ! వేడి వేడి రసగుల్లాలు రెడీగా ఉన్నాయి.. నాలుగైదు ఆరగించండి’’ అని వేళాకోళం చేసేవారు.లుట్టన్సింగ్ పహిల్వాన్ చిన్నపిల్లాడి మాదిరి నవ్వుకుంటూ ‘అరే నాలుగైదు తింటే ఏమవుతుంది? తీసుకురా ఒకటి, రెండు శేర్లు’ అని అక్కడే కూర్చునేవాడు.రెండుశేర్ల రసగుల్లాలు తిని, పది పన్నెండు పాన్ చిలకల్ని నోట్లో కుక్కుకుని, గడ్డానికి పాన్ రసాన్ని కార్చుకుంటూ జాతరలో తిరిగేవాడు. జాతర నుంచి రాజ దర్బారుకి తిరిగొచ్చేటప్పటికి అతని ఆకృతే మారిపోయేది. కండ్లకు రంగుల అభ్రకపు కళ్లజోడు, చేతుల్లో నాట్యం చేసే బొమ్మ, నోట్లో ఇత్తడి పీకను ఊదుకుంటూ నవ్వుకుంటూ తిరిగొచ్చేవాడు. శారీరక వృద్ధి సామర్థ్యాలు పెంపొందుతున్నాయి గాని, బుద్ధి మాత్రం క్షీణిస్తూ చిన్నపిల్లల స్థాయికి చేరుకుంది. కుస్తీ మైదానంలో డోలు శబ్దం వింటూనే తన స్థూలకాయాన్ని ప్రదర్శించడం ప్రారంభించేవాడు. అతనికి సమ ఉజ్జీ దొరికేవాడే కాదు. ఒకవేళ ఎవరైనా అతనితో పోటీ పడాలంటే రాజావారు అనుమతించేవారు కాదు. అందువల్లే పాపం అతను నిరాశతో లంగోటీ బిగించి, దేహానికి మట్టి పూసుకుని, ఎగురుతూ గంతులేస్తూ ఉండేవాడు. తనను దున్నపోతు, ఆంబోతుగా నిరూపించుకుంటూ తిరిగేవాడు. ముసలివాడైన రాజు అతన్ని చూసి మురిసిపోయేవాడు.ఇలా పదిహేనేళ్లు గడిచిపోయాయి. పహిల్వాన్ మాత్రం అజేయుడిగా నిలిచిపోయాడు. కుస్తీ మైదానంలోకి లుట్టన్ సింగ్ తన ఇద్దరు కుమారులను తీసుకుని వచ్చేవాడు. పహిల్వాన్ అత్త ఎప్పుడో మరణించింది. ఇద్దరు పిల్ల పహిల్వాన్లకు జన్మనిచ్చిన కొద్ది రోజులకు అతని భార్య పరమపదించింది. ఇద్దరు పిల్లలూ తండ్రిని మించిన తనయులు అవుతారు అనేవారు.ఇద్దరినీ పిల్లవాళ్లుగా ఉన్నప్పుడే కాబోయే రాజ మల్లులుగా ప్రకటించారు రాజావారు. అందువల్ల వారి పోషణ భారమంతా రాజదర్బారే చూసేది. ప్రతిరోజూ ప్రాతఃకాలాన్నే పహిల్వాన్ స్వయంగా డోలు వాయిస్తూ పిల్లల చేత కసరత్తు చేయించేవాడు. మధ్యాహ్నంపూట విశ్రమిస్తూనే ఇద్దరికీ ప్రపంచజ్ఞానం బోధించేవాడు.‘‘డోలు ధ్వనులపై దృష్టి కేంద్రీకరించండి. నాకు గురువు ఎవ్వరూ లేరు. ఈ డోలే నా గురువు. ఈ డోలు ధ్వనుల ప్రభావం వల్లనే నేను పహిల్వాన్ కాగలిగాను. కుస్తీ మైదానంలోకి అడుగిడగానే డోలుకు నమస్కారం చేయాలి. తెలిసిందా.’’... ఈ మాదిరి ఎన్నో విషయాలు బోధించేవాడు. ఇవే కాకుండా రాజావారిని ఏవిధంగా సంతోషపరచాలి, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి మొదలైన విషయాలను వారికి బోధించేవాడు.కానీ ఏం లాభం? అతని బోధనలన్నీ వ్యర్థమయ్యాయి. రాజావారు స్వర్గస్తులయ్యారు. రాజ కుమారుడు విదేశాల నుంచి తిరిగొచ్చి రాజ్యపాలనా భారాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. నాన్నగారి కాలంలోని వైఫల్యాలన్నీ తొలగించి, కట్టుదిట్టాలు చేశాడు. కొన్ని కొత్త మార్పులు చేశాడు. ఆ మార్పుల కారణంగా పహిల్వాన్‌గిరీ ఊడిపోయింది. కుస్తీ మైదానాన్ని గుర్రపు పందేలా మైదానంగా మార్చారు.పహిల్వాన్లు కాబోయే రాజమల్లుల దినసరి భోజన ఖర్చు వివరాలు తెలియగానే ‘టెరిబుల్’ అన్నాడు కొత్త రాజు.రాజాస్థానంలో ఇంకెంత మాత్రం పహిల్వాన్ల అవసరం లేదని స్పష్టంగా హుకుం జారీ చేశాడు. పహిల్వాన్‌కు తన గోడు తెలుపుకునే అవకాశం సైతం దొరకలేదు.అదేరోజు డోలును మెడకు తగిలించుకుని కొడుకులను వెంట తీసుకుని పహిల్వాన్ తన ఊరు చేరుకున్నాడు. ఊరిలో ఒక మూల ఊరివారందరూ కలిసి ఒక గుడిసె వేయించి ఇచ్చారు. అక్కడే ఉంటూ ఊరి యువకులకు, పశువుల కాపర్లకు కుస్తీ నేర్పుతూ వచ్చాడు. తిండితిప్పలు ఊరిలో వాళ్లు చూసేవారు. ఉదయం, సాయంత్రం డోలు వాయిస్తూ శిష్యులకు, తన కొడుకులకు కుస్తీలోని పట్టు విడుపులు నేర్పేవాడు .ఆ ఊరిలోని రైతుల పిల్లలకూ, వ్యవసాయ కూలీల పిల్లలకూ సరైన తిండి లేదు. ఇక కుస్తీ ఎలా నేర్చుకోగలరు? క్రమక్రమంగా పహిల్వాన్ స్కూలు ఖాళీ అయింది. ఆఖరికి డోలు వాయిస్తూ తన ఇద్దరు కొడుకులకే కుస్తీలోని పట్టువిడుపులు నేర్పుతూ ఉండేవాడు. దినమంతా ఇద్దరు కొడుకులు కూలి నాలి చేసి సంపాదించిన సొమ్ముతోనే జీవితం గడిపేవాడు.ఉన్నట్టుండి ఆ ఊరికి ఆపద వచ్చిపడింది. అనావృష్టి. తిండి గింజల లేమి. ఆ తర్వాత మలేరియా, కలరా రెండూ కలసి పల్లెను సర్వనాశనం చేయసాగాయి.ఆ ఊరు ఒక విధంగా ఖాళీ అయింది. ఇండ్లకు ఇండ్లు ఖాళీ అయిపోయాయి. ప్రతిరోజూ ఇద్దరు ముగ్గురు శవాలుగా మారేవారు. పల్లెవాసుల్లో కలవరం మొదలైంది. రోజంతా కలవరం, వ్యాకులత, హృదయాన్ని కరిగించే ఏడుపులతో గడిచిపోగా, ప్రజల ముఖాల్లో సూర్యుని వెలుగుతో పాటు కొంచెం వెలుగు కనపడేది. సూర్యోదయం అవుతూనే ఏడుస్తూ, మొత్తుకుంటూ తమ ఇండ్ల నుంచి బయటికొచ్చి ఇరుగుపొరుగు వారితో, బంధువులతో కలసి పరస్పరం ధైర్యం చెప్పుకొనేవారు.‘‘ఇప్పుడు ఏడ్చి ఏమి లాభం కోడలా, పోయినవాడు పోయాడు. వాడు నీవాడు కాదనుకో. ముందు జరగవలసిన దానిని గురించి ఆలోచించుకో’’ అని..‘‘తమ్ముడూ! ఇంట్లో శవాన్ని పెట్టుకుని ఎంతకాలం ఏడుస్తావు? శవంపై కప్పేదానికి గుడ్డ కావాలంటావా, దాని అవసరం ఏమిటి? శవాన్ని నదిలో కలిపేసి రారాదా’’ అనే మాటలు ఊరంతా వినిపించేవి.సూర్యాస్తమయం అవుతూనే ఊరివారంతా తమ తమ గుడిసెల్లో దూరి నిశ్శబ్దంగా పడి ఉంటారు. అప్పుడు వాళ్లకు మాట్లాడే శక్తి కూడా ఉండదు. తల్లి పక్కనే ప్రాణాలు కోల్పోతున్న కొడుకును, కొడుకా అని పిలిచే ధైర్యం తల్లులకు ఉండదు.రాత్రి భీకర నీరవ స్తబ్దతను పహిల్వాన్ డోలు మాత్రమే గట్టిగా మోగుతూ సవాలు చేస్తుంది. సాయంకాలం నుంచి ఉదయం వరకు డోలు ఏదో విధంగా మోగుతూ ఆ పల్లెలో చావటానికి సిద్ధంగా ఉన్నవాళ్లకు, మందులూ మాకులూ లేక తిండితిప్పలు లేని మనుషులకు సంజీవని శక్తిగా పనికొచ్చేది. పిల్లల యువకుల వృద్ధుల శుష్క నేత్రాలలో అప్పుడప్పుడూ కుస్తీ మైదానంలోని దృశ్యాలు లీలగా తాండవిస్తాయి. స్పందన, శక్తి లేని నరాల్లో విద్యుత్తు ప్రవహిస్తుంది. ఆపే శక్తి లేకపోవచ్చు కాని, చనిపోయేవాళ్లు కళ్లు మూసే సమయంలో వాళ్లకు ఎలాంటి కష్టాన్నీ కలిగించకుండా, మృత్యుకూపంలోకి పోయేటప్పుడు ఎలాంటి భయం కలుగకుండా డోలు శబ్దాలు పనికొచ్చేవి. పహిల్వాన్ కొడుకులు యముని పాశంలో చిక్కుకొని భరించలేని బాధతో కొట్టుమిట్టాడుతూ ‘‘నాన్నా, ఎత్తిపడేయి’’ అన్న తాళాన్ని వాయించండి అన్నారు. ‘‘ఛటాక్– ఛట్థా, ఛటాక్– ఛట్థా’’ తాళాన్ని పహిల్వాన్ రాత్రంతా డోలుపై వాయిస్తూనే ఉన్నాడు. మధ్య మధ్యలో పహిల్వాన్ల భాషలో ‘వీరులారా! ప్రత్యర్థిని ఓడించండి’ అని ఉత్సాహపరుస్తున్నాడు.తెల్లవారేసరికి ఇద్దరు కొడుకులూ అపస్మారక స్థితిలో నేలపై పడి ఉండటం చూశాడు. ఇద్దరూ బోర్లా పడి ఉన్నారు. ఒకడు మట్టిలో కూరుకుపోయి ఉన్నాడు. దీర్ఘ ఉఛ్ఛ్వాశ తీసుకుని నవ్వే ప్రయత్నంలో పహిల్వాన్ ‘‘ఇద్దరు వీరులూ మట్టికరిచారా!’’ అన్నాడు.ఆ రోజు పహిల్వాన్ శ్యామానంద మహారాజా ఇచ్చిన పట్టు లంగోటా ధరించి ఉన్నాడు. శరీరమంతా మట్టి పులుముకొని కసరత్తు చేశాడు. తర్వాత ఇద్దరు కొడుకులను భుజాన వేసుకుని నదిలో పారేసి వచ్చాడు. ఈ విషయం విని పల్లెవాసులు ఆశ్చర్యచకితులయ్యారు. భయభ్రాంతులయ్యారు. ఇంత జరిగినప్పటికీ పహిల్వాన్ డోలు శబ్దాలు రోజూ మాదిరిగానే వినబడసాగాయి. ప్రజల్లో ధైర్యం పుంజుకోసాగింది. ‘‘ఇద్దరు కొడుకులు గతించారు. అయినప్పటికీ పహిల్వాన్ ధైర్యం చూడండి. అతని గుండెనిబ్బరం చూడండి’’ అని తమ సంతానాన్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు అనుకున్నారు.నాలుగైదు రోజుల తర్వాత ఒకనాటి రాత్రి డోలు శబ్దాలు వినబడలేదు. డోలు మూగబోయింది. రోగగ్రస్తులైన కొందరు శిష్యులు పోయి చూడగా, పహిల్వాన్ శవం వెల్లకిలా పడి ఉంది. రాత్రి నక్కలు బలిష్టమైన అతని ఎడమ తొడ మాంసం తినేశాయి. కడుపును కూడా చీల్చాయి.‘‘నేను చనిపోతే చితిపైన నన్ను వెల్లకిలా పడుకోబెట్టండి. నేను జీవితంలో ఎప్పుడూ బోర్లాపడలేదు. చితికి నిప్పంటించేటప్పుడు డోలు వాయించండి’’ అని అంటుండేవారు మన గురువుగారు అని కన్నీళ్లు తుడుచుకుంటూ అతని శిష్యుల్లో ఒకడన్నాడు.పక్కనే డోలు పడిఉంది. నక్కలు డోలును తినే వస్తువు కాదనుకొని దాని చర్మాన్ని చీల్చేశాయి. -
మంచే జరిగింది
ఒకసారి పరీక్షిత్తు మహారాజు వేటకు వెళుతూ తాత భీమసేనుడు గతంలో జరాసంధుణ్ణి చంపి తెచ్చిన బంగారు కిరీటాన్ని ధరించాడు. మణులు పొదిగిన ఆ కిరీటం ధరించగానే, ఆయనలో రజోగుణం ప్రవేశించింది. వేటాడి వేటాడి అలిసిపోయిన పరీక్షిత్తు, దాహంతో చుట్టూ చూశాడు. నిశ్చలంగా తపస్సులో లీనమైన శమీక మహర్షి కనిపించాడు. ఎన్నిసార్లు పిలిచినా పలకలేదన్న కోపంతో ఒక చచ్చిన పాముని తెచ్చి, ఆయన మెడలో వేశాడు. శమీక మహర్షి కొడుకు శృంగి, జరిగినదాన్ని తెలుసుకుని, తపస్సు చేసుకుంటున్న తండ్రిని అవమానించాడన్న కోపంతో, ఆనాటికి ఏడవ రోజున తక్షకుడు అనే సర్పం విషంతో రాజు మరణించాలని శపించాడు. పరీక్షిత్తు మహారాజుకు జరిగినదేమీ తెలియదు. రాజమందిరానికి రాగానే కిరీటం తీసి పక్కన పెట్టాడు. అప్పుడు ఆయనలో ఉన్న రజోగుణం తగ్గి, తాను చేసిన పనిని తలచుకొని పశ్చాత్తాపపడ్డాడు అయితే, దురదృష్టవశాత్తూ అప్పటికే జరగవలసిన అనర్థం అంతా జరిగిపోయింది. శమీక మహర్షి శిష్యులు వచ్చి అసలు విషయం తెలియజేశారు. మహారాజు ఉత్తమ సంస్కారం కలవాడు కనుక, తనకు మంచే జరిగిందనుకున్నాడు. మరణం ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికీ తెలియదు కనుక, భగవచ్చింతనలో సమయాన్ని సద్వినియోగ పరుచుకోవాలనుకున్నాడు. చివరకు ఒక మహర్షి ద్వారా జ్ఞానం పొంది, వైకుంఠం చేరాడు. పరీక్షిత్తు అసుర గుణాలు కలిగినవారి వస్తువులను వాడటం వల్ల, వివేకాన్ని కోల్పోయాడు. అదే ఆయనకు శాపమైంది. – డి.వి.ఆర్. -
ప్రభు, ఉదయ కాంబినేషన్లో ఉత్తరువు మహారాజా
ప్రముఖ నటుడు ప్రభు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి చాలా కాలమైంది.హీరోగా ఒక్క తమిళంలోనే నటించిన ఈయన ఇప్పుడు తెలుగు, కన్నడం, మలయాళం అంటూ బహుభాషా నటుడిగా ప్రాచుర్యం పొందారు. చాలా కాలం తరువాత మళ్లీ నటుడు ఉదయతో కలిసి ఉత్తరువు మహారాజా అనే చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. వీరిద్దరు ఇంతకు ముందు తిరునెల్వెల్లి చిత్రంలో కలిసి నటించారన్నది గమనార్హం.స్టార్ విజన్ పతాకంపై గణేశ్‌కుమార్ నిర్వహించనున్న ఈ చిత్రంలో కోవైసరళ, శ్రీమాన్, మన్సూర్ అలీశాఖాన్, మనోబాల, అజయ్త్న్రం, కుట్టిపద్మిని నటించనున్నారు. తమిళ్, హిందీ, బెంగాలీ చిత్రాలకు సహాయదర్శకుడిగా పని చేసిన ఆశీప్ క్రేసీ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారని చిత్ర హీరోల్లో ఒకరైన ఉదయ వెల్లడించారు. ఇందులో తాను త్రిపాత్రాభినయం చేయనున్నట్లు ఉదయ్ చెప్పారు. ముగ్గురు కథానాయికల ఎంపిక జరుగుతోందని, ఇది హాస్యంతో కూడిన సైకో థ్రిల్లర్ కథా చిత్రం అని తెలిపారు. దర్శకుడు కథనాన్ని విభిన్నంగా తీర్చిదిద్దారని అన్నారు. ఇతర చిత్రాలకు కచ్చితంగా భిన్నంగా ఈ చిత్రం ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మార్చి 24న కోవైలో చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. -
మనసున్న ‘మహారాజు’
అనాథ నుంచి అనాథశ్రమం వరకు.. దిక్కులేనివారికి ‘మహిమ మినిస్ట్రీస్’తో పెద్దదిక్కుగా.. ప్రశంసలు అందుకుంటున్న ఆర్డీ మహారాజు ‘‘చీకటి పడుతున్న వేళ ఓ చిన్నారిని ఎత్తుకుని ఓ యువతి ఆ ఆశ్రమానికి చేరుకుంది. నవమాసాలు మోసి కన్న కూతురికి నయంకాని రోగం ఉందని.. తనకు వివాహాం కాలేదని.. ఆ పసికందును చెత్త కుప్పలో పారవేయలేనంటూ ఆ ఆశ్రమంలో వదిలేసి వెళ్లింది.’’ ‘‘మరో పాపపేరు మమిశ. పుటుకతోనే గుడ్డి. అందురాలు అని కన్నవారు సైతం వదిలించుకుంటే ఆ చిన్నారి ఏడుపు విన్నవారు ఇక్కడికి తీసువచ్చి వదిలేశారు.’’ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరిది ఒక్కో గాథ. కావాలని కన్నవారు పేగుబందాన్ని తెంచుకోవడంతో అనాథలుగా మారిన వారే. వారి కష్టాలను గుర్తెరిగిన ఓ అనాథ తాను చిన్నతనంలో పడిన కష్టాలు వారికి రాకుడదని తలంచాడు. ఆస్తులు కూడబెట్టకున్నా.. అనాథలను చేరదీసి ఆత్మబంధువుగా మారాడు. మహిమ మినిస్ట్రీస్ అనే అనాథశ్రమాన్ని స్థాపించి వారికి పెద్దదిక్కుగా నిలిచాడు మంచి మనస్సున్న ఈ మహారాజు. - పటాన్చెరు పటాన్చెరు మండలం అమీన్‌పూర్‌లోని మహిమ మినిస్ట్రీస్ జిల్లా అంతటా ప్రాచుర్యం పొందిన అనాథశ్రమం. ఈ ఆశ్రమ నిర్వాహకుడు రేవు ధర్మాంగద మహారాజు ఓ అనాథ. పీజీ వరకు చదువుకున్న మహారాజు ఎన్నో కష్టాలు, ఛీదరింపులు.. చీత్కారాలను అనుభవిస్తూ ఎదిగారు. తాను పడిన కష్టాలు అనాథలుగా సమాజంలో ఏ ఒక్కరు పడకుడదనుకున్నాడు. అనుకున్నదే తడవుగా చదువులకు పులిస్టాఫ్ పెట్టాడు. ఆరేళ్ల క్రితం అమీన్పూర్ నరేంద్రనగర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని మినిస్ట్రీస్ అనే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి అనాథలను చేరదీస్తున్నాడు. వందలాది దిక్కులేని వారికి ఆసరాగా నిలుస్తున్నాడు. అనునిత్యం ఆశ్రమంలోని పిల్లల పెంపకంపైనే ఆయన దృష్టి ఉంటుంది. ప్రతి రోజు వారి భోజనాలు, బట్టలు కోసం చేస్తున్న కృషి ఓ యజ్ఞం వంటిదే. చందాల పేరుతో ఆయన ఏనాడు ఎవ్వరినీ యాచించలేదు. ప్రభుత్వం పథకాల కోసం చింతించలేదు. ఒక్క దరఖాస్తు కూడా పెట్టుకోలేదు. ఆశ్రమంలో జరుగుతున్న సేవ, అక్కడి పరిస్థితి తెలుసుకున్న మానవతావాదులు ఆ పిల్లలకు ఆహారం ఇస్తూ వచ్చారు. దాతలసాయంతో.. మహిమ మినిస్ట్రీస్ సంస్థలో 131 మంది పిల్లలు ఉన్నారు. అదే సంస్థలో ప్రభుత్వ అనుమతి తీసుకుని పిల్లలకు చదువులు చెప్పిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొందరు ప్రతి శని, ఆదివారాల్లో ఆశ్రమానికి వచ్చి తమ వంతు సహాయంగా సమయాన్ని వెచ్చిస్తున్నారు. పిల్లలతో ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేస్తున్నారు. అలాగే అనాథలుగా ఆశ్రమంలో అడుగుపెట్టిన వారిలో కొందరు శాశ్వతంగా ఇక్కడే ఉంటూ సేవలందిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. మరోవైపు పటాన్చెరు ప్రాంతంలోని చాలా మంది రాజకీయవేత్తలు, ఇతర సంస్థలు ప్రతినిధులు ఆ ఆశ్రమంలో తమ పుట్టిన రోజు, పెళ్లి రోజుల వేడుకలను నిర్వహిస్తున్నారు. వారికి తోచిన విధంగా అనాథలకు సహాయం చేస్తున్నారు. డెల్లాయిట్ సహాకారంతో ఆశ్రమంలో పిల్లల ఆవాసం కోసం భవంతుల నిర్మాణం చేపడుతున్నారు. ఇంకా కొన్ని సౌకర్యాలు పిల్లలను వేధిస్తున్నాయి. ప్రధానంగా ఆశ్రమంలో స్నానపు గదులు, ఇతర వసతులకు కొరతగా ఉంది. ‘అన్నా పిల్లలు పెద్దవాళ్లయారన్న.. వారికి ఇప్పుడున్న గదలు చాలడంలేదు. ఆడపిల్లలకు, మగపిల్లలకు వేర్వేరు గదులు కావాలన్నా’ అంటూ తన తపన ను ఆయనను కలిసిన వారితో పంచుకుంటున్నారు మహారాజు. అభినందనీయం ముస్కాన్ కార్యక్రమం కింద వీధిబాలలను, బాలకార్మికులను గుర్తించి మహిమ మినిస్ట్రీస్‌లో చేర్చుతున్నాం. ఈ ఆశ్రమంలో పిల్లలకు మంచి సేవలు అందుతున్నాయి. ప్రతి ఒక్కరూ అనాథ బాలబాలికలకు అండగా ఉండాలి. - అరుణ, న్యాయవాది, ఎల్పీఓ, ఇంటిగ్రేటడ్ చైల్డ్ ప్రొటెక్షన్ పొసైటీ సంగారెడ్డి ఆశ్రమం బాగుంది ఆశ్రమంలో కొంతకాలంగా ఉంటున్నా. తొమ్మిదో తరగతి చదువుతున్నా. మాకు ఎలాంటి కష్టం కలగకుండా చూసుకుంటున్నారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆశ్రమం మాకు అమ్మవడిలాంటిది. - రవి, విద్యార్థి, మహిమ మినిస్ట్రీస్ తృప్తిగా ఉంది ఎన్నోకష్టాలు పడుతున్నా. అయినా చిన్నారుల సంరక్షణతో అవన్నీ మరిచిపోయి ఎంతో తృప్తిగా ఉంది. వారికి మంచి విద్యాబుద్దులు నేర్పించి, ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నా. ఆస్తులు లేకపోయినా సేవకు అంకితమైన నాకు దాతలనుంచి అందుతున్న యూతనకు, వారి దాతృత్వ గుణానికి కృతజ్ఞతలు. -ఆర్డీ మహారాజు, మహిమ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు -
ఎయిరిండియా నుంచి రాజుగారికి గుడ్‌బై!!
భారతీయ విమానాలు అనగానే.. ఎయిరిండియా అనగానే ముందుగా గుర్తుకొచ్చేది తల ఒక పక్కకు వంచి, స్వాగతం పలుకుతున్నట్లుగా కనిపించే మహారాజు. ఆ సింబల్ ఎన్నాళ్లుగానో ఎయిరిండియాకు మస్కట్‌గా ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు అది మారిపోనుంది. మహారాజు స్థానంలో సామాన్యుడిని ఎయిరిండియా మస్కట్‌గా పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన పౌర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతి రాజుకు చెప్పినట్లు తెలుస్తోంది. ఎయిరిండియా ఆర్థిక పరిస్థితి గురించి వివరించడానికి ప్రధానిని కలిసినప్పుడు రాజుగారికి ఆయనీ విషయం చెప్పారు. దాదాపు 49వేల కోట్ల రుణాలు ఉండటంతో ఎయిరిండియా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. దీనిపై మంత్రితో పాటు ఆ శాఖ కార్యదర్శి అశోక్ లావాసా కూడా ప్రధానికి వివరించారు. దీన్నుంచి బయటపడాలంటే ఏ రకమైన సంస్కరణలు తేవాలన్న సూచనలను ఆయన శ్రద్ధగా ఆలకించారు. విమానాశ్రయాలకు హైవేలతోను, ఓడరేవులతోను అనుసంధానం ఉండటం, వాణిజ్య అవసరాల కోసం నగరాలకు సమీపంలో విమానాశ్రయాలను అభివృద్ధి చేయడం, సీసీ టీవీలను కేవలం భద్రత కోసమే కాక, విమానాశ్రయాల్లో పరిశుభ్రతను చూసేందుకూ వాడటం ద్వారా ఆదరణ, లాభాలు పెంచుకోవచ్చని ప్రధాని సూచించినట్లు ఓ ఉన్నతాధికారి చెప్పారు. -
చస్తే బతకడం ఎలాగ?
గ్రంథం చెక్క నేను శ్రీకాకుళం నుంచి విజయనగరం వచ్చిన కొత్తలో ఎక్కడ చూసినా... ప్రతి ఇంటిలోనూ అంగడిలోనూ ఆనందగజపతి మహారాజా వారి ఫోటోలు కనిపించేవి. అలాగే, సంభాషణల్లో తరచుగా బూతులు వినిపించేవి. ఆ తరువాత వినిపించేవి ఒకటి రెండు ఛలోక్తులు. అందులో ముఖ్యమయింది ‘ఒరే వీడు చస్తే మరి బతకడురా’ అని! దానినే కొంచెం మార్చి ‘‘చస్తే ఎలాగ బతకుతావురా!’’ అని! రామమోహన్‌రాయ్, కేశవ చంద్రసేన్ మొదలైన మహా పురుషుల జీవితాలు చూడడం తటస్థించింది. ఈ ఛలోక్తి కేవలం అర్థం లేనిది కాదేమో అన్న సంశయం కలగడం మొదలైంది. చచ్చినా బతికుండే వారున్నారని కొంచెం కొంచెం స్పష్టపడుతూ ఉంది. బతికున్నా చచ్చినవారితో సమానులు కొందరున్నారన్న దిక్కుకి ఊహ పోలేదు. అల్లసాని వారి - ‘కృష్ణరాయలతో దివి కేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబనగుచు’ అన్న పద్యం చూచినంత వరకూ ఆ దృష్టే కలుగలేదు. బతుకుతూ చావడం, చచ్చినా బతకడం... రెండు విషయాలు రానురాను స్ఫుటమవుతూ వచ్చాయి మనసులో. అంతేకాదు, మనిషి గట్టి ప్రయత్నం చేస్తే చచ్చినా బతికుండవచ్చునన్న మాటగూడ సుసాధ్యంగా కనబడుతూ వచ్చింది. (తాపీ ధర్మారావు ‘రాలూ-రప్పలూ’ నుంచి) -
గప్‌చుప్‌గా ఏడడుగులు
కొందరు హీరోయిన్లు పెళ్లిళ్లను ఆడంబరంగా చేసుకుంటే మరికొందరు నిరాడంబరంగా, మరీ కొందరు రహస్యంగా చేసుకుంటుంటారు. నటి అనిత ఈ మూడు విధానాలను అనుసరించకుండా గప్‌చుప్‌గా కార్యం ముగించేసుకోవడం విశేషం. తెలుగులో నువ్వు నేను వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ తమిళంలో మయూరమ్ చిత్రంతో తెరపైకొచ్చింది. వరుషమెల్లా వసంతం, శుక్రన్, నాయగన్ (కమల్ చిత్రం కాదు) మహరాజా తదితర చిత్రాల్లో నటించిన అనిత గోవాకు చెందిన రోహిత్ అనే బ్యాంకు అధికారి ప్రేమలో పడింది. వీరి ప్రేమకు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొన్ని రోజుల క్రితం వీరిద్దరూ గోవాలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి చిత్ర ప్రముఖులు ఎవ్వరినీ ఆహ్వానించలేదు. అనితతో సన్నిహితంగా ఉండేవాళ్లకు కూడా ఆమె పెళ్లి సమాచారం లేదట. దీంతో వారంతా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంత అత్యంత గోప్యంగా వివాహం చేసుకోవడానికి కారణమేమిటమ్మా అన్న ప్రశ్నకు అనిత బదులిస్తూ వివాహమనేది తన సొంత విషయం అంది. దాన్ని ఊరంతా చెప్పుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. అత్యంత సన్నిహితులకు మాత్రమే తెలియచేశానని చెప్పింది. అదే విధంగా నటనకు స్వస్తి చెప్పే విషయం గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అనిత అంది.