ప్రభు, ఉదయ కాంబినేషన్‌లో ఉత్తరువు మహారాజా
ప్రముఖ నటుడు ప్రభు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి చాలా కాలమైంది.హీరోగా ఒక్క తమిళంలోనే నటించిన ఈయన ఇప్పుడు తెలుగు, కన్నడం, మలయాళం అంటూ బహుభాషా నటుడిగా ప్రాచుర్యం పొందారు. చాలా కాలం తరువాత మళ్లీ నటుడు ఉదయతో కలిసి ఉత్తరువు మహారాజా అనే చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. వీరిద్దరు ఇంతకు ముందు తిరునెల్వెల్లి చిత్రంలో కలిసి నటించారన్నది గమనార్హం.స్టార్ విజన్ పతాకంపై గణేశ్‌కుమార్ నిర్వహించనున్న ఈ చిత్రంలో కోవైసరళ, శ్రీమాన్, మన్సూర్ అలీశాఖాన్, మనోబాల, అజయ్త్న్రం, కుట్టిపద్మిని నటించనున్నారు.
తమిళ్, హిందీ, బెంగాలీ చిత్రాలకు సహాయదర్శకుడిగా పని చేసిన ఆశీప్ క్రేసీ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారని చిత్ర హీరోల్లో ఒకరైన ఉదయ వెల్లడించారు. ఇందులో తాను త్రిపాత్రాభినయం చేయనున్నట్లు ఉదయ్ చెప్పారు. ముగ్గురు కథానాయికల ఎంపిక జరుగుతోందని, ఇది హాస్యంతో కూడిన సైకో థ్రిల్లర్ కథా చిత్రం అని తెలిపారు. దర్శకుడు కథనాన్ని విభిన్నంగా తీర్చిదిద్దారని అన్నారు. ఇతర చిత్రాలకు కచ్చితంగా భిన్నంగా ఈ చిత్రం ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మార్చి 24న కోవైలో చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.