భారతీయ సినిమాలు చైనాలో కూడా ఎక్కువ బిజినెస్ చేస్తున్నాయని తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా విజయ సేతుపతి నటించిన మహారాజా చిత్రం కూడా చైనాలో సత్తా చాటుతుంది. నవంబర్ 29న సుమారు 40 వేలకు పైగా థీయేటర్స్‌లలో ఈ చిత్రం విడుదలైంది. కరోనా తర్వాత చైనాలో విడుదలైన భారతీయన సినిమాలలో మహారాజా మాత్రమే అక్కడ రానిస్తుంది. మహారాజా చైనా రోజువారీ బాక్స్ ఆఫీస్ ర్యాంకింగ్స్‌లో ఐదవ స్థానంలో నిలిచింది.
చైనాలో మహారాజా రెండు రోజులకు రూ. 20 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే విషయాన్ని స్థానిక బాక్సాఫీస్ ట్రాకర్ అయిన ENT గ్రూప్ ప్రకటించింది. రెండు రోజులకు 2.3 లక్షల టికెట్లు అమ్ముడుపోయినట్లు ఆ సంస్థ తెలిపింది. చైనాలోని ప్రముఖ చలనచిత్ర సమీక్ష వెబ్‌సైట్‌లలో ఒకటైన డౌబన్‌లో మహారాజా సినిమాకు 8.7/10 రేటింగ్‌ను ఇచ్చింది. ఇటీవలి కాలంలో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచిందని అక్కడి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. అయితే, ఫైనల్‌గా చైనాలో సుమారు రూ. 300 కోట్లు రాబట్టవచ్చని అక్కడి ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
'మహారాజ' చిత్రాన్ని నితిలన్ సామినాథన్ తెరకెక్కించారు. విజయ్ సేతుపతి కెరీర్‌లో 50వ ప్రాజెక్ట్‌గా విడుదలైంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 100 కోట్లు పైగానే రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు చైనాలో దుమ్మురేపుతుంది.
Comments
Please login to add a commentAdd a comment