Vijay Sethupathi
-
చైనాలో 'మహారాజ' విడుదల.. ఇదే జరిగితే రూ. 500 కోట్లు..!
విజయ్ సేతుపతి సూపర్ హిట్ సినిమా 'మహారాజ' ఇప్పుడు చైనాలో విడుదల కానుంది. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయ్ సేతుపతి కెరీర్లో 50వ ప్రాజెక్ట్‌గా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 100 కోట్లు పైగానే రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు చైనాలో రిలీజ్‌కు రెడీ అయింది.ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మహారాజ చిత్రం.. ఇప్పుడు చైనాలో ఏకంగా 40వేల స్క్రీన్స్‌లలో విడుదల కానుంది. నవంబర్ 29న యి షి ఫిల్మ్స్, అలీబాబా పిక్చర్స్ సంయుక్తంగా చైనాలో భారీ ఎత్తున ఈ మూవీని రిలీజ్ చేస్తున్నాయి. ఈ మూవీలోని సెంట్మెంట్కు చైనా సినీ అభిమానులు కనెక్ట్ అయితే భారీగా కలెక్షన్స్ రావడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. కనీసం అక్కడ రెండు వారాలపాటు థియేటర్లో సినిమా రన్ అయితే సుమారు రూ. 500 కోట్లు రావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.మహారాజా కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. మంచి ట్విస్ట్‌లతో ఈ చిత్రాన్ని దర్శకుడు నిథిలిన్ సామినాథన్ అద్భుతంగా ప్రేక్షకులకు చూపించాడు. ఒక ఇండియన్ సినిమా చైనాలో ఇంత పెద్ద ఎత్తున విడుదల కానున్నడంతో అభిమానులు హర్షిస్తున్నారు. ఓ ఇండియన్ మూవీ చైనాలో ఇంత భారీగా రిలీజ్ కావడం ఇప్పటి వరకూ ఏ భారతీయ సినిమాకూ ఈ రికార్డ్ దక్కలేదు. -
విడుదల షురూ
విజయ్ సేతుపతి, సూరి లీడ్ రోల్స్‌లో నటించిన ‘విడుదల 2’ సినిమా డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ‘విడుదల పార్ట్ 1’ చిత్రం 2023లో విడుదలై తమిళ్, తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వెట్రిమారన్ ‘విడుదల 2’ తెరకెక్కించారు. విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవానీ శ్రీ ముఖ్య తారలుగా నటించారు.ఈ సినిమా తెలుగు విడుదల హక్కులను నిర్మాత చింతపల్లి రామారావు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా చింతపల్లి రామారావు మాట్లాడుతూ–‘‘మంచి వాణిజ్య విలువలున్న ‘విడుదల 2’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నందుకు సంతోషంగా ఉంది. ‘విడుదల పార్ట్ 1’ లా ‘విడుదల 2’ కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వేల్ రాజ్, సంగీతం: ఇళయరాజా. -
'విడుదల 2' తెలుగు హక్కులు నిర్మాత చింతపల్లి రామారావుకే
వెట్రిమారన్ 'విడుదల' సినిమా గతేడాది రిలీజైంది. తెలుగు, తమిళ భాషల్లో మంచి ఆదరణ దక్కించుకుంది. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన ఈ చిత్ర సీక్వెల్‌ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్ర తెలుగు థియేటర్ హక్కుల్ని ప్రముఖ నిర్మాత చింతపల్లి రామారావు దక్కించుకున్నారు. ఈ మేరకు మూవీ టీమ్‌ని కలిశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ.. 'విడుదల 2' సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నందుకు సంతోషంగా ఉంది. విజయ్ సేతుపతి, సూరి నటన హైలైట్‌గా ఉండనుందని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: Bigg Boss 8: గౌతమ్‌కి 'అమ్మతోడు' సవాలు.. ఈసారి నామినేషన్స్‌లో ఎవరెవరు?) -
నగ్నంగా నటించిన ఆండ్రియా.. హిట్ సినిమా సీక్వెల్ విడుదలకు చిక్కులు
కోలీవుడ్ సంచలన దర్శకుడు మిష్కిన్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం పిశాచి–2. 2014లో ఈయన దర్శకత్వంలో రూపొంది మంచి విజయాన్ని సాధించిన పిశాచి చిత్రానికి ఇది సీక్వెల్‌గా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, పలు అడ్డంకులు రావడంతో ఈ ప్రాజెక్ట్‌కు బ్రేకులు పడ్డాయి.రాక్‌ఫోర్ట్ పతాకంపై మురుగానందం నిర్మించిన పిశాచి–2 చిత్రంలో నటి ఆండ్రియా ప్రధాన పాత్రలో నటించింది. నటుడు విజయ్ సేతుపతి గౌరవ పాత్రలో నటించారు. అయితే, ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వద్దొంటూ ఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ కంపెనీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ సంస్థ నుంచి ఒక సినిమా హక్కులను పొందిన రాక్‌ఫోర్ట్ ఇరువురి ఒప్పందం ప్రకారం రూ. 4.85 కోట్లు తమకు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. ఈ అంశంపై విచారణ జరిపిన కోర్టు ఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ వారికి రాక్‌ఫోర్డ్ సంస్థ అధినేతలు డబ్బు చెల్లించిన తర్వాతే పిశాచి-2 చిత్రాన్ని విడుదల చేసుకోవచ్చని కోర్టు తెలిపింది.ఆ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం. వడ్డీతో సహా ఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ వారికి రూ. 1.85 కోట్లు చెల్లించాలని కోర్టు తెలిపింది. అంత వరకు పిశాచి 2 విడుదలను నిషేధించాలని తెలిపింది. ఈ కేసు న్యాయమూర్తి జికె ఎలండ్రైయన్ ఎదుట విచారణకు వచ్చింది. నవంబర్ 18వరకు ఈ కేసును కోర్టు వాయిదా వేసింది. ఈ తేదీలోగా ప్రతిస్పందించాలని రాక్పోర్ట్ ఎంటర్టైన్మెంట్ను కోర్టు ఆదేశించబడింది.ఈ చిత్రంలో నగ్నంగా నటించిన ఆండ్రియాఈ చిత్రంలో నటి ఆండ్రియా పూర్తి నగ్నంగా నటించిందని తెలుస్తోంది. అందుకు ఆమె భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసిందనే ప్రచారం కూడా వైరల్ అవుతుంది. దీనిపై దర్శకుడు మిష్కిన్ స్పందిస్తూ చిత్రం కోసం నటి ఆండ్రియాను నగ్నంగా చిత్రీకరించిన విషయం నిజమేనన్నారు. అందుకు ఆమె అధిక పారితోషికం డిమాండ్ చేయడం కూడా సహజమేనని పేర్కొన్నారు. అయితే, ఆమె నగ్నంగా నటించిన సన్నివేశాలను చిత్రీకరించలేదని, ఫొటోలు మాత్రమే తీసినట్లు పేర్కొన్నారు. అవి కూడా ఆమె సన్నిహితురాలు అయిన ఫొటోగ్రాఫర్‌తోనే తీయించామని, ఆ సమయంలో మిస్కిన్ అక్కడ లేనని పంచుకున్నారు. అయితే చిత్రాన్ని పిల్లలు కూడా చూడాలన్న ఉద్దేశంతో నగ్న ఫొటోలను చిత్రంలో పొందుపరచలేదని తెలిపారు. -
విజయ్ సేతుపతితో జాతీయ నటి ఫిక్స్... షూటింగ్ ప్రారంభం
కథానాయకుడు, ప్రతినాయకుడు అనే వ్యత్యాసం చూపకుండా పాత్ర నచ్చితే నటించడానికి సిద్ధమవుతున్న అరుదైన నటుడు విజయ్ సేతుపతి. తాజాగా బిగ్‌బాస్ రియాల్టీ గేమ్నూ యాంకరింగ్ చేస్తున్న ఈయన ఇప్పుడు నూతన చిత్రంలో నటించడానికి సిద్ధం అయ్యారు. ఈయన జంటగా జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత నటి నిత్యామీనన్ నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రానికి పాండిరాజ్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఈయన ఇంతకుముందు పసంగ, మెరీనా. కేడి బిల్లా కిలాడి రంగ, పసంగ –2, ఇది నమ్మ ఆలు, కథాకళి, కడైకుట్టి సింగం వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. కాగా ఈయన తన తాజా చిత్రాన్ని విజయ్ సేతుపతి, నిత్యామీనన్ జంటగా తెరకెక్కిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్ మంగళవారం తిరుచెందూరులో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అక్కడ సముద్రతీరంలో విజయ్ సేతుపతి తదితర నటీనటులతో సన్నివేశాలను తదుపరి తూత్తుకుడి రామేశ్వరం ప్రాంతాల్లో షూటింగులు నిర్వహించనున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు వారు పేర్కొన్నారు. -
'హిట్ సినిమాకు సీక్వెల్.. వాయిదా ప్రసక్తే లేదు'
కోలీవుడ్ హాస్యనటుడు సూరి కథానాయకుడుగా పరిచయమైన చిత్రం 'విడుదలై'.. వెట్రిమారన్ దర్శకత్వంలో ఆర్ఎస్ ఇన్ ఫోటెయిన్మెంట్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో నటుడు విజయ్ సేతుపతి కీలకమైన పాత్రలో మెప్పించారు. ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. విడుదలై–2 చిత్రంలో విజయ్ సేతుపతి, సూరి, నటి మంజు వారియర్‌తో పాటు బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్, కిషోర్, కెన్ కరుణాస్, రాజీవ్ మీనన్, గౌతమ్ మేనన్ బోస్ వెంకట్, భవాని శ్రీ, విన్సెంట్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతాన్ని వేల్ రాజ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా ఇటీవలే చిత్ర డబ్బింగ్ కార్యక్రమాలను చైన్నెలో ప్రారంభించినట్లు నిర్మాతల వర్గం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రెండవ భాగంలో నటి మంజు వారియర్, నటుడు విజయ్ సేతుపతితో కలిసి నటించిన ముఖ్యమైన సన్నివేశాలు చోటుచేసుకుంటాయన్నారు. వారి ప్రతిభావంతమైన నటన ఈ చిత్రంపై మరింత అంచనాలను పెంచిందన్నారు. అయితే, సినిమా వాయిదా పడుతుందని జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని చిత్ర యూనిట్ పేర్కొంది. ముందుగా ప్రకటించిన తేదీలోనే మూవీని రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. కాగా వి.మణికంఠన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న విడుదలై– 2 చిత్రాన్ని డిసెంబర్ 24 తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. -
మొదలైన తమిళ బిగ్‌బాస్.. 18 మందిలో ఆ ఇద్దరు మాత్రం (ఫొటోలు)
-
Bigg Boss 8: పాపం.. వచ్చిన 24 గంటల్లోనే ఎలిమినేట్
ఇప్పటికే బిగ్‌బాస్ 8 తెలుగులో మొదలైపోయింది. ఐదు వారాలు గడిచిపోయాయి. వచ్చిన కంటెస్టెంట్స్‌లో పసలేకపోయేసరికి వైల్డ్ కార్డ్స్ పేరిట మరో ఎనిమిది మందిని తీసుకొచ్చారు. దీని సంగతి పక్కనబెడితే తమిళంలోనే తాజాగా (అక్టోబర్ 6) బిగ్‌బాస్ 8వ సీజన్ మొదలైంది. ఈసారి విజయ్ సేతుపతి హోస్ట్. అయితే వచ్చిన 24 గంటల్లోనే ఎలిమినేషన్ అని చెప్పి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.తమిళం గత సీజన్ వరకు కమల్‌హాసన్ హోస్ట్‌గా ఉన్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఈసారి తప్పుకొన్నాడు. దీంతో విజయ్ సేతుపతి కొత్త హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. షో మొదలై ఒకరోజే అయింది కాబట్టి ఇప్పుడే హోస్టింగ్ గురించి ఇంకా ఏం చెప్పలేం. కానీ ఈసారి షో మొదలైన 24 గంటల్లో ఒకరు ఎలిమినేట్ అవుతారని చెప్పి బాంబ్ పేల్చాడు.(ఇదీ చదవండి: చిచ్చు పెట్టిన బిగ్‌బాస్.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు?)తాజాగా తమిళ బిగ్ బాస్ తొలిరోజు ప్రోమోలో ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది చూపించారు. 'మహారాజ' సినిమాలో విజయ్ సేతుపతితో కలిసి నటించిన సచన అనే అమ్మాయి ఈసారి హౌసులోకి వచ్చింది. ఆమెనే ఇప్పుడు ఎలిమినేట్ చేసినట్లు చూపించారు. కనీసం వారమైనా అయితే కదా ఎవరు ఎలా ఫెర్ఫార్మ్ చేశారు? ఎలిమినేట్ చేయడానికి కారణాలైనా కనిపిస్తాయి. ఇలాంటివి ఏం లేకుండా ఈ ఎలిమినేషన్ ఎందుకో? బిగ్‌బాస్ తలతిక్క నిర్ణయం వెనక మరేదైనా మతలబు ఉందా అనేది చూడాలి?ఇక తమిళ బిగ్‌బాస్ 8లోకి వచ్చిన వాళ్లలో నటి మహాలక్షి భర్త రవీందర్ ఒకడు. రెండేళ్ల క్రితం వీళ్ల పెళ్లి సెన్సేషన్ అయిపోయింది. ఇతడితో పాటు దర్శ గుప్తా, సత్య, దీపక్, ఆర్జే అనంతి, సునీతో గోగోయ్, జెఫ్రీ, రంజిత్, పవిత్ర జనని, సౌందర్య, అరుణ్ ప్రసాద్, తర్షిక, వీజే విశాల్, అన్షిదా, అర్ణవ్, ముత్తుకుమార, జాక్వెలిన్ హౌసులోకి వచ్చారు. వీళ్లలో చాలామంది టీవీ నటులే ఉండటం విశేషం.(ఇదీ చదవండి: జానీ మాస్టర్ దగ్గర ఛాన్స్.. నా కూతురిని పంపొద్దన్నారు: నైనిక తల్లి) -
'మహారాజ' విజయం.. డైరెక్టర్‌కు లగ్జరీ కారు.. ఎవరిచ్చారో తెలుసా..?
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి నటించిన మహారాజ సినిమా రీసెంట్గా 100 రోజులు పూర్తి చేసుకుంది. దీంతో చెన్నైలో సెలబ్రేషన్స్ జరిగాయి. జూన్ 14న విడుదలైన ఈ చిత్రాన్ని దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీ ఓటీటీలో కూడా మంచి ఆదరణ లభించింది. సినిమా విజయం పట్ల మేకర్స్ ఫుల్ ఖుషి అయ్యారు.మహారాజా చిత్రాన్ని ది రూట్, థింక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. విజయ్ సేతుపతి 50వ చిత్రంగా కోలీవుడ్‌లో విడుదలైంది. రూ. 20 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 110 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో చిత్ర నిర్మాతలు 100 డేస్ ఫంక్షన్ జరిపారు. ఈ క్రమంలో దర్శకుడు నిథిలన్ స్వామినాథన్‌కు నిర్మాతలు సర్ప్రైజ్ ఇచ్చారు. బీఎండబ్ల్యూ కారును విజయ్ సేతుపతి చేతుల మీదుగా గిఫ్ట్‌గా అందించారు. ఇదీ చదవండి: బెయిల్ విషయంలో జానీ మాస్టర్‌కు షాకిచ్చిన పోలీసులుఈ క్రమంలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. నిథిలన్ స్వామినాథన్ మేకింగ్, రైటింగ్‌పై ప్రశంసలు కురిపించారు. సినిమాకు ఇంతటి గుర్తింపు రావడం వెనుక నిథిలన్ శ్రమ ఎక్కువుగా ఉందని కొనియాడారు. ఈ సినిమా చూసిన వారందరూ కూడా తనను ఎంతోమంది ప్రశంసించారని విజయ్ సేతుపతి గుర్తుచేసుకున్నారు. టీమ్ సహకారంతోనే మహారాజ సినిమా విజయం సాధ్యమైందని ఆయన తెలిపారు.తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై ఒక తండ్రి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడో అనే కథను దర్శకుడు చాలా ఆసక్తిగా చెప్పాడు. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగే మహారాజ చిత్రంలో విజయ్ సేతుపతితో పాటు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రతినాయకుడిగా కనిపించారు. మమతా మోహన్‌దాస్, అభిరామి, దివ్య భారతి కీలకపాత్రలలో మెప్పించారు. నెట్‌ఫ్లిక్స్‌లో మహారాజ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. -
బిగ్‌బాస్ హౌస్‌లో బిగ్‌మ్యాన్.. ఫ్యాన్స్‌ను మెప్పిస్తాడా?
బిగ్‌బాస్ తమిళ్ సీజన్-8 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈసారి కొత్త హోస్ట్ కంటెస్టెంట్స్ అందరినీ ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. గత ఏడు సీజన్స్ కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరించగా.. ఈ సారి కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి సరికొత్తగా కనిపించారు. హోస్ట్‌గా అందరితో నవ్వులు పూయించారు. అయితే ఈ సారి బిగ్‌బాస్ హౌస్‌లో తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్ హౌస్‌లో అడుగుపెట్టారు. గతంలో నటి మహాలక్ష్మిని పెళ్లాడిన ఆయన పలుసార్లు వార్తల్లో నిలిచారు. వీరిద్దరి పెళ్లిపై సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయి. డబ్బు కోసమే రవీందర్‌ను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందంటూ ఆమెను నెటిజన్లు ట్రోల్ చేశారు. అంతేకాదు రవీందర్ భారీకాయం చూసి అతడిని బాడీ షేమింగ్ చేశారు నెటిజన్లు.గతంలో ఎక్కువగా వివాదాలతోనే ఫేమస్ అయిన రవీందర్ చంద్రశేఖరన్ తాజా తమిళ సీజన్లో బిగ్‌బాస్ హోస్లో అడుగుపెట్టారు. ఆదివారం ప్రారంభమైన ఈ షోలో మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ ఏడాది కొత్త హోస్ట్ విజయ్ సేతుపతి రావడంతో తమిళ బిగ్‌బాస్ సీజన్‌పై మరింత ఆసక్తి పెరిగింది. #பிக்பாஸ் இல்லத்தில்.. #Fatman 😎 Bigg Boss Tamil Season 8 #GrandLaunch - இப்போது ஒளிபரப்பாகிறது.. நம்ம விஜய் டிவில.. #Nowshowing #BiggBossTamilSeason8 #TuneInNow #VijayTelevision #VJStheBBhost #VijaySethupathi #AalumPudhusuAattamumPudhusu #BiggBossTamil pic.twitter.com/LvYMbNhS1C— Vijay Television (@vijaytelevision) October 6, 2024 -
బిగ్‌బాస్ సీజన్-8.. కంటెస్టెంట్స్ వీళ్లేనా.. లిస్ట్ వైరల్!
టాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులను బిగ్‌బాస్ షో అలరిస్తోంది. ఈ షో ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. అయితే గతేడాది కంటే ఈసారి కాస్తా ఆడియన్స్‌కు ఇంట్రెస్ట్ తగ్గినట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ షో తమిళంలోనూ ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైంది. తమిళ బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌కు విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో కమల్ హాసన్ హోస్ట్‌గా ఉండగా.. బిజీ షెడ్యూల్ కారణంగా ఈసారి ఆయన తప్పుకున్నారు.ఈ నెల ఆరో తేదీ నుంచి తమిళ ఆడియన్స్‌ను అలరించేందుకు బిగ్‌బాస్ సీజన్-8 వచ్చేస్తోంది. ఈ ఆదివారం నుంచే విజయ్ టీవీ ప్రసారం కానుంది. విజయ్ టీవీలో రాత్రి 9.30 నుంచి 10.30 గంటల వరకు ప్రసారం ఈ షో ప్రసారం చేయనున్నారు. అంతేకాకుండా ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనూ ఈ రియాలిటీ షోను చూడొచ్చు. కాగా.. ఇప్పటికే మేకర్స్ బిగ్‌బాస్ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు.కంటెస్టెంట్స్ జాబితా వైరల్!బిగ్‌బాస్ తమిళ్ సీజన్-8లో కంటెస్టెంట్స్ గురించి పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. ప్రముఖంగా నటుడు వీటీవీ గణేశ్ వినిపిస్తోంది. ఆయనతో పాటు సునీతా గొగోయ్, పాల్ డబ్బా అలియాస్ అనీష్, అన్షిత అక్బర్షా, కేఆర్ గోకుల్, ఐశ్వర్య, అరుణ్ ప్రసాద్, దార్శిక, సౌందర్య నంజుండన్, విజే విశాల్ పేర్లు టాప్-10లో ప్రధానంగా వినిపిస్తున్నాయి. తాజా నివేదిక ప్రకారం దాదాపు 16 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత మరో ముగ్గురు-నాలుగు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇవ్వనున్నారు.புது வீடு புது மனுசங்க, சண்ட போடுவாங்களா தெரியாது., ஆனா கண்டிப்பா சமாதானமா இருக்க மாட்டாங்க.. எதுவா இருந்தாலும் நான் Ready..🔥#GrandLaunch of Bigg Boss Tamil Season 8 - அக்டோபர் 6 முதல் மாலை 6 மணிக்கு நம்ம விஜய் டிவில.. 😎 #VJStheBBhost #Vijaysethupathi #BiggBossTamilSeason8 pic.twitter.com/gTjpbrL1x9— Vijay Television (@vijaytelevision) October 1, 2024 -
విజయ్ సేతుపతికి ఊహించలేనంత రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన 'బిగ్‌బాస్'
దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ తెచ్చుకున్న రియాలిటీ షో 'బిగ్‌బాస్'.. ఇప్పటికే తెలుగులో సీజన్-8 ప్రారంభమైంది. అక్టోబర్ 6 నుంచి తమిళ్లో సీజన్-8 మొదలుకానుంది. అయితే, ఇప్పటి వరకు హోస్ట్‌గా ఉన్న కమల్ హాసన్ ఈ సీజన్‌కు కాస్త బ్రేక్ ఇచ్చాడు. ఈసారి విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చిన్న టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ కోసం విజయ్ సేతుపతి ఎంత రెమ్యునరేషన్ తీసుకోనున్నారని పెద్ద చర్చే జరుగుతుంది.విజయ్ సేతుపతి ఇటీవలే మహారాజ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. సుమారు రూ.120 కోట్లకు పైగా ఈ చిత్రం కలెక్షన్లు రాబట్టింది. దీంతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఆయన మార్కెట్ కూడా పెరిగింది. ఈ విజయం తర్వాత బిగ్‌బాస్ తమిళ్ 8వ సీజన్ హోస్టింగ్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 100 రోజుల పాటు సాగే ఈ బిగ్ బాస్ సీజన్‌కు భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు సమాచారం. ప్రతి శనివారం, ఆదివారం మాత్రమే ఆయన బిగ్‌బాస్‌లో కనిపిస్తారు. అందుకుగాను సుమారు రూ. 60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనున్నారని ప్రచారం జరుగుతుంది. విజయ్ సేతుపతి ఒక్కో సినిమాకు రూ. 15 నుంచి రూ. 20 కోట్ల వరకు తీసుకుంటారు. ఏదైనా ఒక యాడ్‌లో నటిస్తే రూ. 1కోటి వరకు ఛార్జ్ చేస్తారని టాక్. బిగ్‌బాస్ స్ట్రీమింగ్ అవుతున్న సమయంలో చాలా యాడ్స్ వస్తుంటాయి. అలా చూస్తే విజయ్ సేతుపతికి ఇచ్చే రెమ్యునరేషన్ చాలా తక్కువే అని చెప్పవచ్చు. సేతుపతి మంచి నటుడే కాదు మంచి వక్త కూడా. బిగ్ బాస్ షోకి హోస్ట్ గా ఆయన ఎంపిక పర్ఫెక్ట్ అని అంటున్నారు అభిమానులు. మక్కల్ సెల్వన్ తదుపరి సీజన్లకు కూడా వ్యాఖ్యాతగా కొనసాగుతాడని, భవిష్యత్తులో రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కమల్ హాసన్ బిగ్‌బాస్ కోసం రూ. 120 కోట్ల వరకు రెమ్యునరేషన తీసుకునే వారని ప్రచారం ఉంది. -
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'ను ఢీ కొట్టనున్న విజయ్ సేతుపతి సినిమా
దర్శకుడు వెట్రిమారన్ రూపొందించిన "విడుదల పార్ట్ 1" బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది. నటుడు సూరికి ఈ మూవీ ఎంతో పేరు తెచ్చింది. సెకండ్ పార్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన 'విడుదల పార్ట్ 2' రిలీజ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. ఆర్ఎస్ ఇన్ఫోటైన్ మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాలతో తెలుగు, తమిళంలో దీనిని తెరకెక్కిస్తున్నారు.ఇటీవల మహారాజ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ సేతుపతి. 'విడుదల పార్ట్ 2'లో కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగులో ఈ సినిమాకు మంచి ఆదరణ రావడంతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అయితే, ఈ సినిమా రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని ఢీ కొట్టాల్సి ఉంది. శంకర్ డైరెక్షన్లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన ఈ చిత్రాన్ని క్రిస్టమస్ కానుకగా విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా కూడా డిసెంబర్ 6న విడుదల కానుంది. ఇలా రెండు బిగ్ ప్రాజెక్ట్‌ల మధ్య 'విడుదల పార్ట్ 2' సినిమా రిలీజ్ కానుంది. Mark your calendars! Maverick director #VetriMaaran’s #ViduthalaiPart2 is coming to theatres on December 20, 2024.#ViduthalaiPart2FromDec20An @ilaiyaraaja Musical @sooriofficial @elredkumar @rsinfotainment @GrassRootFilmCo @ManjuWarrier4 @BhavaniSre @anuragkashyap72… pic.twitter.com/3GQUpSXOvw— VijaySethupathi (@VijaySethuOffl) August 29, 2024 -
హిందీ సినిమా రికార్డులు తిరగరాస్తున్న విజయ్ సేతుపతి..?
-
ఓటీటీలో 'మహారాజ' రికార్డ్.. నం.1 ప్లేస్
విభిన్న సినిమాలతో అలరించే విజయ్ సేతుపతి.. రీసెంట్గా 'మహారాజ' సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. అంచనాల్లేకుండా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. తెలుగు, తమిళంలో అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది. కొన్నిరోజులకు ఓటీటీలోకి రాగా, అక్కడ కూడా మైండ్ బ్లోయింగ్ వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఏకంగా సరికొత్త రికార్డ్ సృష్టించింది.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి సందడి మొదలు)'మహారాజ'లో విజయ్ సేతుపతి తప్పితే మరో పేరున్న యాక్టర్ ఎవరూ లేరు. సీరియస్ రివేంజ్ డ్రామా కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమాలో కథ ఓ మాదిరిగా ఉన్నప్పటికీ.. స్క్రీన్ ప్లేతో దర్శకుడు మేజిక్ చేశాడు. దీంతో తెలుగు, తమిళంలో హిట్ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన తర్వాత దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచింది.అలా దాదాపు ఆరు వారాల నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అయిన 'మహారాజ'.. ఈ ఏడాది సదరు ఓటీటీలో ఎక్కువమంది చూసిన సినిమాగా నిలిచింది. ఇప్పటివరకు 18.6 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. దీని తర్వాతి స్థానాల్లో క్రూ (17.9 మిలియన్లు), లాపతా లేడీస్ (17.1 మిలియన్లు), సైతాన్ (14.8 మిలియన్లు), ఫైటర్ (14 మిలియన్లు), యానిమల్ (13.6 మిలియన్లు), డుంకీ (10.8 మిలియన్లు) ఉన్నాయి.(ఇదీ చదవండి: ప్రధాని మోదీనే మించిపోయిన ప్రభాస్ హీరోయిన్) -
విజయ్ సేతుపతి మంచి మనసు.. సినీ పరిశ్రమలో ప్రశంసలు
తమిళ చిత్రసీమలో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి. తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల విడుదలైన మహారాజా సినిమా మంచి విజయం సాధించింది. తమిళంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు మహారాజా సినిమాతో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంలో విజయ్ సేతుపతి సినీరంగంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆర్టిస్టులకు, వారి కుటుంబాలకు తనవంతు సాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో, హాస్యనటుడు తెనాలి కుటుంబానికి అండగా విజయ్ సేతుపతి నిలిచాడు.చాలా చిత్రాలలో హాస్య పాత్రల్లో నటించిన ఆయన విజయ్ సేతుపతి చిత్రాల్లో కూడా నటించారు. ఆయన కుమారుడు విన్నరసన్ డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీలో ఫిజియోథెరపీ చదివేందుకు ట్యూషన్ ఫీజు చెల్లించలేకపోతున్నాడని తెలుసుకున్న నటుడు భావ లక్ష్మణన్.. ఆ విషయాన్ని విజయ్ సేతుపతికి చేరవేశాడు. దీంతో విజయ్ సేతుపతి వెంటనే కాలేజీ ఫీజు రూ.76 వేల రూపాయలు చెల్లించాడు. అంతేకాకుండా ప్రతి ఏడాది ఫీజు చెల్లిస్తానని కూడా చెప్పడంతో వారు సంతోషించారు. ఈ సందర్భంగా నటుడు తెనాలి మాట్లాడుతూ.. నా కుటంబానికి సాయం చేసిన విజయ్ సేతుపతిని భవిష్యత్తులో ఎప్పటికీ మరిచిపోలేమని తెలిపారు. ఈ వార్త విజయ్ సేతుపతి అభిమానులను సంతోషపెట్టింది. ఆర్థికంగా చితికిపోయిన చాలామంది చిన్న ఆర్టిస్టులకు అండగా నిలిచేందుకు విజయ్ సేతుపతి ముందుకు వచ్చారు. ఈ చర్యకు సినీ పరిశ్రమలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. -
బిగ్‌బాస్ హోస్ట్‌గా ఆ స్టార్ హీరోనే.. !
బుల్లితెరపై అత్యంత ప్రేక్షాదరణ కలిగిన రియాలిటీ షోలల్లో బిగ్‌బాస్ రేంజ్ వేరు. ఏ భాషలోనైనా బిగ్‌బాస్‌కు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఈ షోపై అప్పుడే చర్చ మొదలైంది. అసలు ఈ సీజన్లో ఎవరు హోస్ట్‌గా ఉండబోతున్నారన్న విషయంపై కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. తమిళ బిగ్‌బాస్ హోస్ట్‌గా కమల్ హాసన్ తప్పుకోవడంతో ఎవరు వస్తారన్న ఆసక్తి ఆడియన్స్‌లో నెలకొంది.ఈ నేపథ్యంలోనే మరో కోలీవుడ్ స్టార్ హీరో వినిపిస్తోంది. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ లిస్ట్‌లో హీరో శింబు పేరు కూడా వినిపించింది. కానీ చివరికీ విజయ్ సేతుపతినే ఫైనల్ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.విజయ్ సేతుపతి ఎందుకంటే..తమిళ బిగ్‌బాస్ సీజన్-8కు విజయ్ సేతుపతిని ఎంపిక చేయాలన్న నిర్ణయానికి అదే ప్రధాన కారణమని తెలుస్తోంది. గతంలో ఆయన సన్ టీవీ ప్రముఖ షోలకు హోస్ట్‌గా వ్యవహరించారు. మాస్టర్ చెఫ్ షోతో పాటు మరో కార్యక్రమానికి ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అందువల్ల రియాలిటీ షోకు హోస్ట్‌గా పనిచేయడం ఆయనకు కొత్తేమీ కాదు. అందుకే ఆ అనుభవం బిగ్‌బాస్‌కు పనికొస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. కాగా.. బిగ్ బాస్ సీజన్- 8 అక్టోబర్ నెలలో ప్రారంభం కానుంది. త్వరలో కొత్త హోస్ట్‌తో ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. కాగా.. బిజీ షెడ్యూల్ కారణంగా కమల్ హాసన్ ఈ షో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. -
'బిగ్‌బాస్ 8' కొత్త హోస్ట్.. స్టార్ హీరో ప్లేసులో మరో హీరో?
మరికొన్ని రోజుల్లో బిగ్‌బాస్ కొత్త సీజన్ మొదలవుతుంది. తెలుగులో ఎప్పటిలానే నాగార్జున ఉన్నాడు. తమిళంలో మాత్రం కమల్ తప్పుకొన్నాడు. రీసెంట్‌గానే పోస్ట్ పెట్టడంతో ఆడియెన్స్ షాకయ్యారు. దీంతో నెక్స్ట్ హోస్ట్ ఎవరా అని మొన్నటి నుంచి సస్పెన్స్‌గానే ఉంది. తాజాగా ఈ విషయమై ఓ క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: స్టార్ షట్లర్ శ్రీకాంత్‌తో ఆర్జీవీ మేనకోడలు నిశ్చితార్థం)బిగ్ బాస్ షో తెలుగు-తమిళంలో ఒకేసారి స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగులో ఈసారి సరికొత్తగా ఉండనుందని రీసెంట్గా రిలీజ్ చేసిన ప్రోమోతో చెప్పుకొచ్చారు. ఇక తమిళంలో మాత్రం కమల్ స్థానంలో విజయ్ సేతుపతి పేరుని పరిశీలిస్తున్నారు. హీరో శింబుని కూడా అనుకున్నారు. కానీ మూవీ కమిట్మెంట్స్ వల్ల కుదరలేదని, సేతుపతి ఫైనల్ అయ్యిందని అంటున్నారు.మరోవైపు విజయ్ సేతుపతి, శింబు కాదని ఏకంగా నయనతార హోస్టింగ్ చేయనుందనే రూమర్ కూడా వస్తోంది. సేతుపతి లేదా నయనతార.. వీళ్లెవరైనా సరే పాన్ ఇండియా క్రేజ్ ఉన్న సెలబ్రిటీలే. మరి వీళ్లలో బిగ్ బాస్ తమిళ కొత్త హోస్ట్‌గా ఎవరు ఫిక్స్ అవుతారనేది చూడాలి?(ఇదీ చదవండి: చైతూ-శోభిత లవ్ స్టోరీ.. సీక్రెట్ బయటపెట్టిన శోభిత చెల్లి!) -
తమిళ 'బిగ్‌బాస్'హోస్ట్ రేసులో ముగ్గురు స్టార్ హీరోలు
తమిళ 'బిగ్‌బాస్' రియాల్టీ షో కోసం కొత్త హోస్ట్ వచ్చేస్తున్నాడు. ఏడు సీజన్ల వరకు లోకనాయుడు కమల్ హాసన్ హోస్ట్‌గా సక్సెస్‌ఫుల్‌గా నడిపారు. కమల్ ఇమేజ్‌తో ఈ షో పట్ల కోలీవుడ్‌లో మంచి బజ్ ఉంది. అక్కడ రేటింగ్స్ కూడా బాగానే బిగ్ బాస్ రాబట్టాడు. మరో కొద్దిరోజుల్లో సీజన్ 8 ప్రారంభం కానుంది. ఇలాంటి సమయంలో కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సీజన్ నుంచి తాను హోస్ట్‌గా పనిచేయడంలేదని ప్రకటించారు. దీంతో కొత్తగా ఆ స్థానంలోకి ఎవరు వస్తారని బిగ్ బాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.2017లో తమిళ్లో ప్రారంభమైన బిగ్ బాస్ తొలి సీజన్ నుంచి హోస్ట్‌గా కమల్ హాసన్ ఉన్నారు. అయితే, వచ్చే సీజన్లో తాను హోస్ట్‌గా కొనసాగడంలేదని చెప్పారు. తను ఒప్పుకున్న సినిమాలు ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కమల్ వెల్లడించారు. కమల్ స్థానాన్ని భర్తి చేసేందుకు కోలీవుడ్ హీరో శింబు బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2022లో కమల్ హాసన్ తాత్కాలికంగా బిగ్ బాస్ నుంచి వైదొలిగినప్పుడు శింబు బిగ్ బాస్ అల్టిమేట్ షోను హోస్ట్ చేశాడు. ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్ షోను హోస్ట్ చేసేందుకు శింబు రానున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై శింబు మేనేజర్ ఇలా తెలిపాారు. 'బిగ్ బాస్ షోకు నటుడు శింబు హోస్ట్ చేయబోతున్నాడన్న సమాచారంలో నిజం లేదని.. ఈ విషయమై తనను ఎవరూ సంప్రదించలేదని' ఆయన చెప్పారు. శింబు తర్వాత విజయ్ సేతుపతి, సూర్య పేర్లు ఆ లిస్ట్‌లో కనిపిస్తున్నాయి. సరికొత్తగా రమ్యకృష్ణ పేరును కూడా బిగ్ బాస్ యూనిట్ పరిశీలిస్తుందట. మరొ కొద్దిరోజుల్లో ఈ అంశంపై క్లారిటీ రానుంది. -
'మహారాజ'కు రజనీకాంత్ ఫిదా.. దర్శకుడిని ఇంటికి పిలిచి ఆతిథ్యం
విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘మహారాజ’ సినిమాపై చాలామంది ప్రశంసలు కురిపించారు. ఆయన సీనీ కెరీర్లో 50వ మైలురాయిని అందుకున్న చిత్రంగా రికార్డ్ క్రియేడం చేయడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. సినీ విమర్శకుల చేత కూడా మెప్పించే విధంగా కథ ఉండటంతో అభినందనలు దక్కాయి. సస్పెన్స్, సెంటిమెంట్‌తో అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ నిథిలన్ స్వామినాథన్ ప్రతిభకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన్ను సూపర్‌స్టార్ రజనీకాంత్ అభినందించారు.మహారాజ సినిమాలో దర్శకుడి ప్రతిభ ఎంతమేరకు ఉందో విజయ్ సేతుపతి నటన కూడా అంతే స్థాయిలో ఉంది. సినిమా మొత్తం తన భుజాలపై మోసి అద్భుతమైన నటుడిగా మళ్లీ నిరూపించుకున్నారు. కేవలం రూ. 20 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు రాబట్టింది. ఇంతటీ హిట్ అందుకున్న మహారాజ చిత్రాన్ని తాజాగా రజనీకాంత్ చూశారు. ఈ సందర్భంలో దర్శకుడు నితిలన్ సామినాథన్ను తన నివాసానికి ఆహ్వానించి ప్రశంసించారు. ఆ సమయంలో రజనీతో దిగిన ఫోటోలను దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ తన ఎక్స్ పేజీలో షేర్ చేశారు. రజనీకాంత్ చూపించిన ప్రేమకు ఆయన ఫిదా అయ్యారు. ఆ విషయాలను నిథిలన్ ఇలా పంచుకున్నారు. ప్రియమైన సూపర్ స్టార్ రజనీకాంత్ సార్, మిమ్మల్ని కలుసుకునే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ఈ సమావేశంలో మీ అనుభవాల నుంచి నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. మీ మాటలు బంగారు అక్షరాలతో వ్రాసిన నవల చదివినట్లుగా ఉన్నాయి. వాటి నుంచి నేను తమిళ సినిమా ప్రపంచంలో మరో జీవితాన్ని చవిచూస్తాను. మీ జీవితానుభవ విషయాలు నాతో పంచుకుని చాలా సంతోషాన్ని ఇచ్చారు. మీ వినయం, ఆతిథ్యానికి నేను ఎప్పటికీ మరిచిపోలేను. మహారాజా సినిమా మిమ్మల్ని ఎంతగా ఆకట్టుకుందో తలచుకుంటేనే ముచ్చటగా ఉంది. చిరకాలం ఆనందంగా ఉండాలని నన్ను ఆశీర్వదించారు. మరోసారి ధన్యవాదాలు తలైవా..' అని దర్శకుడు నితిలన్ సామినాథన్ పోస్ట్ చేశారు. దీంతో చాలామంది నెటిజన్లు లైకులు, కామెంట్లు విసురుతున్నారు. తలైవాను కలుసుకునే అవకాశం దక్కినందుకు కంగ్రాట్స్ అంటూ ఆయన్ను అభినందిస్తున్నారు. -
రూపాయి రెమ్యునరేషన్ తీసుకోలేదు.. ఇప్పుడేమో జాక్‌పాట్!
కొన్నిసార్లు ఊహించని విధంగా కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతుంటాయి. అలాంటి ఓ మూవీనే 'మహారాజ'. తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి లీడ్ రోల్ చేసిన ఈ చిత్రం.. థియేటర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చూసిన ప్రతిఒక్కరూ అద్భతహా అనే రేంజులో మెచ్చుకున్నారు. ఇంతలా పేరు తెచ్చుకున్న 'మహారాజ'లో నటించినందుకు గానూ సేతుపతి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. దీనికి ఓ కారణముందట!(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 20 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)వైవిధ్యమైన పాత్రలు చేసే విజయ్ సేతుపతి.. 'మహారాజ'లో సెలూన్ షాపులో పనిచేసే బార్బర్‌గా నటించాడు. మేకప్ లేకుండా డీ గ్లామర్‌గా కనిపించాడు. సమాజంలో ప్రస్తుతం చిన్నపిల్లలపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ పాయింట్‌కి చిన్నపాటి ట్విస్ట్ లింక్ చేసి తీసిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. అయితే నిర్మాతలు ఈ మూవీ కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో మాత్రమే తీయాలని ఫిక్స్ అయ్యారట. ఇదే విషయాన్ని సేతుపతిగా చెప్పగా ఓకే అన్నాడు.పైన చెప్పిన దానిబట్టి చూస్తే విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ తీసుకోకూడదు. 'మహారాజ' కోసం అదే చేశాడు. సినిమా హిట్ అయితే లాభాల్లో ఇస్తామని నిర్మాతలు చెప్పారట. ఈ లెక్కన చూసుకుంటే సినిమాకు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. సాధారణంగా సేతుపతి.. ఒక్కో మూవీ రూ.10-12 కోట్లు తీసుకుంటాడు. కానీ లాభాల్లో షేర్ అంటున్నారు కాబట్టి పారితోషికం కంటే రెట్టింపు మొత్తం అందుకుంటాడేమో అనిపిస్తోంది. అంటే సక్సెస్‌తో పాటు జాక్ పాట్ కొట్టేసినట్లే!(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా?) -
విజయ్ సేతుపతి ‘ట్రైన్’ కోసం.. ‘శ్రుతి’ గానం
తమిళ సినిమా: నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం మహారాజా మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అందులో ఒకటి ట్రైన్ చిత్రం. నటి డింపుల్ హైయతీ నాయకిగా నటిస్తున్నారు. ఆర్.దయానంద, నాజర్, దర్శకుడు కేఎస్.రవికుమార్, వినయ్ రాయ్, భావన, యోగిబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీ.క్రియేషన్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిష్కిన్ దర్శకత్వం వహించడంతో పాటు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నాలుగు పాటలు చోటు చేసుకుంటాయని, అందులో ఓ పాటను దర్శకుడు మిష్కిన్ నే పాడినట్లు సమాచారం. కాగా మరో పాటను ఆయన కోరిక మేరకు నటి శ్రుతిహాసన్ పాడటానికి సమ్మతించినట్లు తెలిసింది. కథానాయకిగా బిజీగా ఉన్న ఈమె అప్పుడప్పుడూ పాటలను కూడా పాడుతున్న విషయం తెలిసిందే. అలా ట్రైన్ చిత్రం కోసం ఈ బ్యూటీ పాడనున్న పాట ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం. కాగా డార్క్ థ్రిల్లర్ కథా చిత్రంగా రూపొందుతున్న ట్రైన్ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నట్లు తెలిసింది. కాగా దర్శకుడు మిష్కిన్ ఈ చిత్రానికి ముందు పిశాచి – 2 చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం ఇంకా విడుదల కాలేదు. కాగా ఆ చిత్రాని కంటే ముందు ట్రైన్ చిత్రం తెరపైకి రానుందని సమాచారం. -
Maharaja: ఓటీటీలో ‘మహారాజా’ రికార్డు
విజయ్ సేతుపతి హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘మహారాజా’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. పెద్దగా ప్రచారమే లేకుండా జూన్ 14న విడుదలైన ఈ చిత్రం.. మౌత్ టాక్‌తోనే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. కేవలం రూ. 20 కోట్లతో బడ్జెట్‌తో తెరకెక్కి.. రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తెలుగులోనూ ఈ చిత్రానికి మంచి వసూళ్లే వచ్చాయి. జులై 12 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ ప్రేక్షకులను కాదు.. ఓటీటీ ప్రియుల మనసును కూడా ‘మహారాజా’ దోచేశాడు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారం ట్రెండింగ్ జాబితాలో(ఇండియాలో) ‘మహారాజా’ తొలి స్థానం దక్కించుకుంది. ఈ విషయాన్ని చిత్రబృందం తెలియజేస్తూ.. ‘ప్రతిచోటా మహారాజ రికార్డులు సృష్టిస్తోంది’ అని ఆనందం వ్యక్తం చేసింది.‘మహారాజా’ కథేంటంటే.. మహారాజా(విజయ్ సేతుపతి) ఓ బార్బర్. అతనికి భార్య, కూతురు ఉంటుంది. ఓ ప్రమాదంలో భార్య చనిపోవడంతో.. కూతురుతో కలిసి సిటీకి దూరంగా ఓ ఇంట్లో జీవిస్తుంటాడు. అతని కూతురు ప్రాణాలు కాపాడిన చెత్తబుట్టకు లక్ష్మి అని పేరు పెట్టి.. ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటాడు. అయితే ఓ రోజు నిండు గాయాలతో పోలీసు స్టేషన్‌కి వెళ్లి.. ముగ్గురు దుండగులు తన ఇంట్లోకి చొరబడి ‘లక్ష్మి’ని ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేస్తారు. (చదవండి: అభిమానులతో పాటు మంచి మనసు చాటుకున్న సూర్య)తన కూతురు ప్రాణాలను కాపాడిన ‘లక్ష్మి’ని ఎలాగైనా వెతికి పెట్టమని పోలీసులకు విజ్ఞప్తి చేస్తాడు. దాన్ని వెతికేందుకు పోలీసులకు రూ. 7 లక్షల లంచం ఇవ్వడానికి కూడా సిద్దపడతాడు. మరి ‘లక్ష్మి’ని ఎత్తుకెళ్లిన ఆ ముగ్గురు ఎవరు? వారికి మహారాజాతో ఉన్న వైరం ఏంటి? రూ. 500 వందల విలువ చేసే చెత్తబుట్ట(లక్ష్మి) కోసం రూ. 7 లక్షలు కూడా ఇవ్వడానికి కారణం ఏంటి? చివరకు లక్ష్మి దొరికిందా లేదా? అనేదే మిగతా కథ. ఈ చిత్రానికి నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించగా.. అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు .This Maharaja’s on top, as he should👑 Watch Maharaja, now trending #1 on Netflix! #MaharajaOnNetflix pic.twitter.com/0DuJV9kavq— Netflix India South (@Netflix_INSouth) July 15, 2024 -
ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ.. ఎప్పుడంటే?
కంటెంట్ బాగుంటే ప్రచారాలు, ఆర్భాటాలు ఏవీ అవసరం లేదు. మౌత్ టాక్‌తోనే హిట్ సాధించేస్తాయి. అలా విజయ్ సేతుపతి నటించిన మహారాజ మూవీ కూడా పెద్దగా ప్రమోషన్స్ చేయకుండా థియేటర్లలో విడుదల చేశారు. ఆశ్చర్యంగా పాజిటివ్ టాక్‌తో రోజురోజుకూ కలెక్షన్స్ ఎక్కువయ్యాయి. అలా రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయింది.ఓటీటీలో..నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 14న తెలుగులో విడుదలైంది. ఇందులో మమతా మోహన్‌దాస్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ శుక్రవారం (జూలై) 12 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమ్ అవుతుందని పేర్కొన్నారు. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నామని ఓటీటీ ప్రియులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఓటీటీలో ఇంకెన్ని రికార్డులు తిరగరాస్తుందో చూడాలి!కథేంటంటే?మహారాజ (విజయ్ సేతుపతి) ఓ బార్బర్. ఓ రోజు యాక్సిడెంట్లో తన భార్య చనిపోగా ఓ ఇనుప చెత్త డబ్బా వల్ల కూతురు ప్రాణాలతో బయటపడుతుంది. ఆ చెత్త డబ్బాకు లక్ష్మి అని పేరు పెట్టి సొంత మనిషిలా చూసుకుంటాడు. ఓ రోజు లక్ష్మి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. తర్వాత ఏమైంది? లక్ష్మి దొరికిందా? లేదా? అనేది తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే! View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: రేణుకాస్వామి కేసులో దర్శన్, పవిత్రగౌడ నుంచి కీలక ఆధారాలు లభ్యం -
విజయ్ సేతుపతి సరసన...
హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టు, విలన్... ఇలా విభిన్న పాత్రలతో విలక్షణ నటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు విజయ్ సేతుపతి. ఇటీవల విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘మహారాజ’ సినిమా విడుదలై, బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హీరోగా తమిళ దర్శకుడు పాండిరాజ్ ఓ కథను రెడీ చేశారట. గతంలోనే ఈ కథను విజయ్ సేతుపతికి వినిపించారట పాండిరాజ్. ఈ సినిమాలో నిత్యా మీనన్‌ను హీరోయిన్గా అనుకుంటున్నారని కోలీవుడ్ సమాచారం. ఇదిలా ఉంటే... రెండేళ్ల క్రితం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో డైరెక్ట్‌గా విడుదలైన ‘19 (1)(ఎ)’ సినిమాలో విజయ్ సేతుపతి, నిత్యామీనన్ స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. ఈ ఇద్దరూ పాండిరాజ్ సినిమా కోసం మరోసారి స్క్రీన్ షేర్ చేసుకునే చాన్స్ ఉంది.