విజయ్ సేతుపతి హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘మహారాజా’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. పెద్దగా ప్రచారమే లేకుండా జూన్ 14న విడుదలైన ఈ చిత్రం.. మౌత్ టాక్‌తోనే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. కేవలం రూ. 20 కోట్లతో బడ్జెట్‌తో తెరకెక్కి.. రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తెలుగులోనూ ఈ చిత్రానికి మంచి వసూళ్లే వచ్చాయి. జులై 12 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ ప్రేక్షకులను కాదు.. ఓటీటీ ప్రియుల మనసును కూడా ‘మహారాజా’ దోచేశాడు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారం ట్రెండింగ్ జాబితాలో(ఇండియాలో) ‘మహారాజా’ తొలి స్థానం దక్కించుకుంది. ఈ విషయాన్ని చిత్రబృందం తెలియజేస్తూ.. ‘ప్రతిచోటా మహారాజ రికార్డులు సృష్టిస్తోంది’ అని ఆనందం వ్యక్తం చేసింది.
‘మహారాజా’ కథేంటంటే..
మహారాజా(విజయ్ సేతుపతి) ఓ బార్బర్. అతనికి భార్య, కూతురు ఉంటుంది. ఓ ప్రమాదంలో భార్య చనిపోవడంతో.. కూతురుతో కలిసి సిటీకి దూరంగా ఓ ఇంట్లో జీవిస్తుంటాడు. అతని కూతురు ప్రాణాలు కాపాడిన చెత్తబుట్టకు లక్ష్మి అని పేరు పెట్టి.. ఫ్యామిలీ మెంబర్‌లా చూసుకుంటాడు. అయితే ఓ రోజు నిండు గాయాలతో పోలీసు స్టేషన్‌కి వెళ్లి.. ముగ్గురు దుండగులు తన ఇంట్లోకి చొరబడి ‘లక్ష్మి’ని ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేస్తారు.
(చదవండి: అభిమానులతో పాటు మంచి మనసు చాటుకున్న సూర్య)
తన కూతురు ప్రాణాలను కాపాడిన ‘లక్ష్మి’ని ఎలాగైనా వెతికి పెట్టమని పోలీసులకు విజ్ఞప్తి చేస్తాడు. దాన్ని వెతికేందుకు పోలీసులకు రూ. 7 లక్షల లంచం ఇవ్వడానికి కూడా సిద్దపడతాడు. మరి ‘లక్ష్మి’ని ఎత్తుకెళ్లిన ఆ ముగ్గురు ఎవరు? వారికి మహారాజాతో ఉన్న వైరం ఏంటి? రూ. 500 వందల విలువ చేసే చెత్తబుట్ట(లక్ష్మి) కోసం రూ. 7 లక్షలు కూడా ఇవ్వడానికి కారణం ఏంటి? చివరకు లక్ష్మి దొరికిందా లేదా? అనేదే మిగతా కథ. ఈ చిత్రానికి నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించగా.. అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు .
This Maharaja’s on top, as he should👑
Watch Maharaja, now trending #1 on Netflix! #MaharajaOnNetflix pic.twitter.com/0DuJV9kavq— Netflix India South (@Netflix_INSouth) July 15, 2024
Comments
Please login to add a commentAdd a comment