Netflix
-
ఎరుపు రంగు చీరలో లేడీ సూపర్ స్టార్ ..వైరల్‌గా పెళ్లినాటి పోటోలు
-
మూడు వారాల్లోనే ఓటీటీకి భారీ బడ్జెట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
'కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో తెలుగులోనూ బోలెడంత క్రేజ్ సంపాదించుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇటీవల ఆయన 'బఘీరా' అనే సినిమాకు స్టోరీ అందించాడు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. ఈ చిత్రంలో శ్రీమురళి, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించారు. డాక్టర్. సూరి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం విడుదలైన కేవలం మూడు వారాల్లోనే ఓటీటీకి వచ్చేస్తోంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబల్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఫుల్ యాక్షన్ మూవీగా వచ్చి బఘీరా ఓటీటీ ప్రియులను ఏ మాత్రం అలరిస్తుందో వేచి చూడాల్సిందే. Veeraru inna kalpanikaralla. Ooralli ondu hosa veera bandidane, avana hesare…Bagheera 🐆⚡️Watch Bagheera on Netflix, out 21 November in Kannada, Tamil, Telugu and Malayalam!#BagheeraOnNetflix pic.twitter.com/xxYzLzF0qD— Netflix India South (@Netflix_INSouth) November 20, 2024 -
నయనతారతో డేటింగ్.. నన్ను ఆ జంతువుతో పోల్చారు: విఘ్నేశ్ శివన్
కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ లేడీ సూపర్ స్టార్ నయనతారను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు ఆ తర్వాత వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఈ జంట సరోగసీ ద్వారా కవలలకు తల్లిదండ్రులయ్యారు. అయితే తాజాగా నయనతార తన జర్నీని డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ డాక్యుమెంటరీలో నయన్ భర్త విఘ్నేశ్ శివన్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. నయనతారతో డేటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఇందులో వివరించారు. తాను నయన్‌తో డేటింగ్లో ఉన్నప్పుడు పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందో తనకు తెలుసన్నారు. ఒక మృగాన్ని అందమైన అమ్మాయి ఎంచుకుంటే దానిని ఎవరూ ఆపలేరంటూ.. నన్ను కుక్కతో పోల్చారని విఘ్నేశ్ శివన్ వెల్లడించారు. కుక్కకు బిర్యానీ తినిపిస్తున్నారని చేసిన మీమ్‌లో మా ఇద్దరి చిత్రాలు ఉన్నాయని విఘ్నేశ్ తెలిపారు.అయితే తాను నయనతారతో డేటింగ్ చేయడంలో తప్పు ఏంటని ట్రోలర్స్‌ను విఘ్నేశ్ ప్రశ్నించాడు. బస్ కండక్టర్ సూపర్ స్టార్ (రజినీకాంత్) అయ్యారు.. మన జీవితంలో ఒక గొప్ప స్థానానికి చేరుకోవడం అంత తేలిక కాదని అన్నారు. మేమిద్దరం లవ్‌లో ఉన్నప్పుడు చాలా ట్రోల్స్ వచ్చాయని తెలిపారు. వాటిని నేను తేలిగ్గా తీసుకున్నప్పటికీ.. నయనతార గిల్టీగా ఫీలయిందని పేర్కొన్నారు. కొన్నిసార్లు నేను తన జీవితంలో భాగం కాకపోతే.. ఆమె మరింత సంతోషంగా ఉండేదన్న భావనతో కలిగిందని విఘ్నేశ్ శివన్ తెలిపాడు.నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీలో నయన్ తన ప్రేమ జీవితం, కెరీర్ ఆధారంగా తీసుకొచ్చారు. ఆమె తన అరంగేట్రం నుంచి సినీ ప్రయాణం చూపించారు. ఇందులో నాగార్జున, రానా దగ్గుబాటి, తాప్సీ పన్ను, రాధిక శరత్‌కుమార్, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా నటించారు. కాగా.. ఈ డాక్యుమెంటరీ రిలీజ్ తర్వాత ధనుశ్- నయనతార మధ్య వివాదం మొదలైంది. అనుమతి లేకుండా నానుమ్ రౌడీ ధాన్ మూవీ క్లిప్‌లను ఉపయోగించినందుకు నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపారు ధనుశ్. -
OTT: ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ ఎలా ఉందంటే?
నయనతార జీవిత ఆధారంగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తెరకెక్కించిన డ్యాక్యుమెంటరీ సిరీస్‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’. అమిత్ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నేటి(నవంబర్ 18) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక గంట ఇరవైరెండు నిమిషాల నిడివిగల ఈ డ్యాక్యుమెంటరీ సిరీస్ ఎలా ఉంది? అందులో ఏం చూపించారు?🔸నయనతార జీవితం మొత్తాన్ని ఓ బ్యూటిఫుల్ స్టోరీగా మలిచి తెరపై అందంగా చూపించే ప్రయత్నం చేసింది నెట్‌ఫ్లిక్స్🔸నయనతార చిన్నప్పటి ఫోటోలను చూపుతూ..ఆమె స్కూల్ డేస్ సీన్‌తో ఈ డ్యాక్యుమెంటరీ ప్రారంభం అవుతుంది.🔸ఆమెకు సినిమా చాన్స్ ఎలా వచ్చింది? మాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కి ఎలా ఎంట్రీ ఇచ్చిందనేది ఆయాన డైరెక్టర్లతో చెప్పించారు.🔸కెరీర్ తొలినాళ్లతో నయనతార పడిన ఇబ్బందులను, బాడీ షేమింగ్ చేసినప్పుడు తను పడిన మానసిక క్షోభను పంచుకున్నారు.🔸తన పర్సనల్ లైఫ్‌పై వచ్చిన కొన్ని విమర్శల కారణంగా సినిమా చాన్స్‌లు కోల్పోయినా.. తిరిగి ఎలా ట్రాక్‌లోకి వచ్చారనేది ఆసక్తికరంగా తెలియజేశారు.🔸శ్రీరామరాజ్యం సినిమాలో సీత పాత్రకు నయనతారను తీసుకున్నప్పడు వచ్చిన విమర్శలను చూసి ఆమె ఎంత బాధపడిందనే విషయాలను ఆయా దర్శక నిర్మాతలతో చెప్పించారు.🔸తనపై వచ్చిన విమర్శలన్నింటిని పక్కన పడేసి.. ‘లేడీ సూపర్ స్టార్’గా ఎలా ఎదిగారనేది ఆసక్తికరంగా చూపించారు.🔸ఫస్టాఫ్ మొత్తం నయనతార బాల్యం, సినీ కెరీర్‌ని చూపించి..సెకండాఫ్‌లో విఘ్నేశ్‌తో ప్రేమాయణం ఎలా మొదలైంది? వివాహ జీవితం ఎలా ఉందనేది చూపించారు.🔸‘నానుమ్ రౌడీ దాన్’సమయంలో వీరిద్దరి మధ్య ఎలాంటి సంభాషణలు జరిగాయి? విఘ్నేశ్‌కి నయన్ ఎలాంటి సపోర్ట్‌ని అందించింది? ఎలా ప్రేమలో పడిపోయారనేది చక్కగా చూపించారు.🔸పెళ్లికి ముందు వీరిద్దరి రిలేషన్షిప్ ఎలా కొనసాగిందో అనేది వారి మాటల్లోనే చూపించారు. ప్రేమలో ఉన్నప్పడు వారిపై వచ్చిన మీమ్స్ గురించి కూడా సరదాగా పంచుకున్నారు.🔸గ్లాస్ హౌస్‌లోనే నయనతార ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నారు? పెళ్లి రోజు వీరిద్దరు ధరించిన దుస్తుల వెనున ఉన్న కథ, వాటిని తయారు చేయడానికి డిజైనర్లు పడిన కష్టాలను చూపించారు.🔸ఇక ఈ డ్యాక్యుమెంటరీ చివరల్లో నయనతార-విఘ్నేశ్‌ల కవల పిల్లలను చూపిస్తూ.. ఆహ్లాదకరమైన ముగింపును ఇచ్చారు.🔸మొత్తంగా ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ సిరీస్ సరదాగా సాగుతూ.. నయనతార లైఫ్‌లో చోటు చేసుకున్న కొన్ని వివాదాలు.. విమర్శలను చూపిస్తూనే..వాటిని ఎదుర్కొని ఎలా ‘లేడీ సూపర్‌స్టార్’గా ఎదిగారనేది చూపించారు. -
ది కపిల్ శర్మ షో వివాదం.. సల్మాన్ ఖాన్ టీమ్ క్లారిటీ!
ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోన్న స్టార్ కమెడియన్ కపిల్ శర్మ షో.. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో. ఈ షోకు కపిల్ శర్మ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోకు ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అయితే ఇటీవల ఓ ఎపిసోడ్లో రవీంద్రనాథ్ ఠాగూర్ వారసత్వాన్ని అగౌరవపరిచేలా చూపించారంటూ ఓ వర్గం ఆరోపించింది. ఈ నేపథ్యంలో బొంగో భాషి మహాసభ ఫౌండేషన్ వారికి లీగల్ నోటీసులు పంపింది. ఈ షో తమను కించపరిచేలా ఉందని.. సాంస్కృతిక, మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉందని నోటీసుల్లో పేర్కొంది.అన్ని అవాస్తవాలే...అయితే ఈ వివాదం తర్వాత సల్మాన్ ఖాన్ టీమ్‌కు ఈ షోతో సంబంధాలు ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో వార్తలొచ్చాయి. ఆయనకు చెందిన ఎస్కేటీవీకి లీగల్ నోటీసులు వచ్చినట్లు రాసుకొచ్చారు. తాజాగా ఈ ఆరోపణలపై సల్మాన్ ఖాన్ టీమ్ స్పందించింది. అసలు ఆ షోతో సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మాపై వస్తున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదని స్టేట్మెంట్ విడుదల చేశారు.కాగా.. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికిందర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. -
‘దో పట్టి’ మూవీ సక్సెస్ పార్టీలో తారల సందడి (ఫొటోలు)
-
'అమరన్' ఓటీటీ రిలీజ్ వాయిదా.. కారణం అదేనా?
దీపావళికి హడావుడి లేకుండా రిలీజై హిట్ కొట్టిన సినిమా 'అమరన్'. తమిళ హీరో శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించారు. మేజర్ ముకందన్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ మూవీ తీశారు. విడుదలకు ముందు తెలుగులో పెద్దగా హైప్ లేదు కానీ థియేటర్లోకి వచ్చిన తర్వాత మాత్రం అద్భుతమైన రెస్పాన్ వచ్చింది.ప్రస్తుతం రూ.250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌కి చేరువలో 'అమరన్' ఉంది. దీంతో మూవీ టీమ్ ఆనందానికి అవధుల్లేవ్. ఎందుకంటే హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ మరీ ఈ రేంజ్ సక్సెస్ అయితే ఊహించలేదు. దీంతో ఈ చిత్ర ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు ప్లాన్ మార్చుకుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్.. తెలుగులోనూ)లెక్క ప్రకారం నెలరోజుల్లోనే 'అమరన్' ఓటీటీలోకి రావాల్సింది. అంటే డిసెంబరు తొలివారంలో స్ట్రీమింగ్ అయ్యేది. కానీ ఇప్పుడు అద్భుతమైన సక్సెస్ కావడంతో మరో 1-2 వారాలు తర్వాత స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ అనుకుంటోందట. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం డిసెంబరు మూడో వారంలోనే ఓటీటీలోకి 'అమరన్' వచ్చే అవకాశముంది.అడివి శేష్ 'మేజర్' తరహా కథతోనే 'అమరన్' సినిమా తీసినప్పటికీ.. ముకుందన్ భార్య వైపు నుంచి స్టోరీ చెప్పడం, అలానే సాయిపల్లవి యాక్టింగ్ సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లాయని చెప్పొచ్చు. ఈ సినిమా సక్సెస్ ఇప్పుడు సూర్య 'కంగువ' చిత్రానికి రిలీజ్ ముంగిట తలనొప్పిగా మారింది. థియేటర్లు అనుకున్నంతగా దొరకడం కష్టమే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత) -
నయనతార జీవితం పై నెట్ ప్లిక్స్ డాక్యుమెంటరీ ఫిలిం
-
ఓటీటీలో నయనతార లైఫ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలో నయనతార లైఫ్ స్టోరీ రానుంది. కొన్నిరోజుల క్రితం ఇందుకు సంబంధించిన పోస్టర్ వదిలారు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా నయన్ జీవితంలో ప్రేమ, పెళ్లి, పిల్లలు తదితర విషయాల్ని స్వయంగా ఆమెనే చెప్పింది. 'నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్' పేరుతో ఈ డాక్యుమెంటరీ తీశారు.ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్.. ఈ డాక్యుమెంటరీని డైరెక్ట్ చేశాడు. నవంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ట్రైలర్ చూస్తే.. నయన్ గురించి కన్నడ హీరో ఉపేంద్ర, తెలుగు హీరో నాగార్జున, తమిళ నటి రాధిక, తమిళ డైరెక్టర్స్ అట్లీ, నెల్సన్ మాట్లాడటం చూపించారు. చివర్లో దర్శకుడు విఘ్నేశ్.. నయనతారతో తన ప్రేమ ఎప్పుడు మొదలైందో చెప్పకనే చెప్పాడు.(ఇదీ చదవండి: పెళ్లయిన 13 ఏళ్లకు ప్రెగ్నెన్సీ.. తమిళ నటి పోస్ట్ వైరల్)నేను మనుషుల్ని త్వరగా నమ్మేస్తాను, నా గురించి పేపర్ లో వచ్చేవన్నీ చూసి అమ్మ చాలా భయపడేది లాంటి విషయాలు నయన్ చెప్పింది. అసలు మీ జీవితాన్ని నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంట్ సిరీస్‌గా ఎందుకు తీసుకురావాలని అనుకున్నారని అడగ్గా.. పక్కనోళ్ల హ్యాపీనెస్ చూసి, అందరూ హ్యాపీగా ఫీలవ్వాలని నేను అనుకున్నా. అందుకే దీనికి ఒప్పుకొన్నా అని చెప్పింది.నయన్ చెప్పడం బాగానే ఉంది గానీ అంత కన్విన్సింగ్‌గా అనిపించలేదు. అలానే నయనతార గతంలో తమిళ హీరో శింబు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారాలు నడిపింది. కాకపోతే అవి తర్వాత స్టేజీకి వెళ్లలేదు. బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఈ విషయాల్ని ఏమైనా ఈ సిరీస్‌లో చూపిస్తారా? లేదంటే విఘ్నేశ్‌తో ప్రేమ, పెళ్లి వరకు మాత్రమే చూపిస్తారా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: తమన్నా డిజాస్టర్ సినిమా.. ఏడాది తర్వాత ఓటీటీలోకి) -
క్రైమ్ థ్రిల్లర్‌తో వస్తోన్న మిల్కీ బ్యూటీ.. నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్!
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ముద్దుగుమ్మ ముంబయికి షిఫ్ట్ అయింది. దక్షిణాదిలో కేవలం ప్రత్యేక సాంగ్స్‌లో మాత్రమే కనిపిస్తోంది. గతేడాది జైలర్ మూవీ ఐటమ్ సాంగ్‌లో మెరిసిన తమన్నా.. ఇటీవల స్త్రీ-2 చిత్రంలో ప్రత్యేక సాంగ్‌తో అదరగొట్టింది.తాజాగా తమన్నా ప్రధాన పాత్రలో బాలీవుడ్లో తెరకెక్కించిన చిత్రం 'సికందక్ కా ముఖద్దర్'. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.నవంబర్ 29 నుంచి సికందర్ కా ముఖద్దర్ స్ట్రీమింగ్ కానుందని నెట్‌ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మూవీ పోస్టర్‌ను షేర్ చేసింది. ఈ చిత్రంలో తమన్నాతో పాటు అవినాష్ తివారీ, జిమ్మీ షెర్గిల్, రాజీవ్ మెహతా, దివ్య దత్తా, జోయా అఫ్రోజ్ కీలక పాత్రల్లో నటించారు.సికందర్ కా ముకద్దర్ కథేంటంటే..స్పెషల్ 26, బేబీ, 'ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ' వంటి చిత్రాలను రూపొందించిన డైరెక్టర్ నీరజ్ పాండే ఈ క్రైమ్ థిల్లర్‌కు దర్శకత్వం వహించారు. ఈ కథలో రూ.60 కోట్ల విలువైన వజ్రాన్ని ఎలా దొంగతనం చేశారు? దాన్ని వెతకడంతో పోలీసులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? దాదాపు 15 ఏళ్ల పాటు సాగిన ఈ కేసులో చివరికి ఏమైంది? ఆ కేసును పరిష్కరిస్తున్న పోలీసు ఆఫీసర్ చివరికి సక్సెస్ అయ్యాడా? లేదా? అన్నదే అసలు కథ. Teen aaropi, lekin kaun apradhi? Case jald hi khulega. Watch Sikandar ka Muqaddar, out 29 November, only on Netflix!#SikandarKaMuqaddarOnNetflix pic.twitter.com/apoIyTTe8p— Netflix India (@NetflixIndia) November 7, 2024 -
The Great Indian Kapil Show: చూతము రారండీ
వయసుతో సంబంధం లేకుండా మహిళల్లో పెద్దరికం ఉట్టిపడుతూ ఉంటుంది. చిన్నవాళ్ళయినా, పెద్దవాళ్ళయినా పెద్దరికం అన్నది మహిళలకు ఒక సొగసు. మళ్లీ మగవాళ్లు అలాక్కాదు. వాళ్లకెంత వయసు వచ్చినా కూడా మాటల్లో, చేతల్లో చిన్నవాళ్లే... మహిళలతో పోలిస్తే’!సుధామూర్తి వయసు 74. మూర్తి గారి వయసు 78. ఆమె ఆగస్టు 19 న పుడితే, ఆయన ఆగస్టు 20 న జన్మించారు. తేదీలను బట్టి చూసినా సుధ ఆయన కన్నా ఒకరోజు ‘పెద్దరికం ’ ఉన్నవారు. (తమాషాకు లెండి). సరే, సంగతి ఏమిటంటే... ఈ దంపతులిద్దరూ ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’కు ఆహ్వానం వస్తే వెళ్లారు. సాధారణంగా కపిల్ బాలీవుడ్ సెలబ్రిటీలను తన టాక్ షో కు పిలుస్తుంటారు. అందుకు భిన్నంగా ఈసారి ఈ బిజినెస్ దిగ్గజ దంపతుల్ని ఒప్పించి రప్పించారు. వారితో టాక్ షో సరదాగా నడిచింది. భర్త గురించి భార్యను, భార్య గురించి భర్తను కొన్ని ప్రశ్నలు అడిగారు యాక్టర్ కమ్ కమెడియన్ కపిల్ శర్మ. వాటిల్లో ఒక ప్రశ్న : ‘మొదటిసారి సుధాజీ మీ ఇంటికి వచ్చినప్పుడు మీకెలా అనిపించింది?’ అని అడిగారు కపిల్. దానికి మూర్తి గారు చాలా గంభీరంగా, నిజాయితీగా సమాధానం ఇచ్చారు. ‘ఆ ఫీలింగ్ ఎలా ఉందంటే.. ఒక స్వచ్ఛమైన గాలి పరిమళం నా శ్వాసలోనికి వెళ్లినట్లుగా...’ అన్నారు. ఆ మాటకు వెంటనే సుధామూర్తి... ‘అప్పుడు ఆయన వయసులో ఉన్నారు కదా’ అన్నారు జోకింగ్‌గా. దెబ్బకు ఆడియెన్స్ భళ్లుమన్నారు. నిజానికి సుధామూర్తి ఉద్దేశ్యం ఆడియెన్స్‌ని నవ్వించడం కాదు, భర్తలోని కవితాత్మక భావోద్వేగాన్ని కాస్త నెమ్మది పరచటం. పైగా అంతమంది ఎదుట భర్త తనను అంతగా ‘అడ్మైర్’ చెయ్యటంతో ఆమెలోని పెద్దరికం మధ్యలోనే కల్పించుకుని ఆయన్ని ఆపవలసి వచ్చినట్లుంది. ఆపకపోతే... ఇంకా ఏం చెబుతారో అని. అసలే వాళ్ళది లవ్ మ్యారేజ్. ఈ నెల 9న నెట్‌ఫ్లెక్స్‌లో స్ట్రీమ్ ఆయ్యే ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ ఎపిసోడ్లో మూర్తి గారి ఈ అమాయకత్వాన్ని, సుధామూర్తి పెద్దరికాన్ని కనులారా వీక్షించవచ్చు. (డాటర్ ఆఫ్ ఆలియ : రాహా ‘ఆహా’ అంటూ వింటుంది)ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ అంటే జోక్ కాదు, నిజాలు ఎవ్వరూ చెప్పరు: రాధిక ఆప్టే కష్టాలు -
ఓటీటీలో 'దేవర'.. అధికారిక ప్రకటన వచ్చేసింది
ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ సినిమా దేవర ఓటీటీ విడుదల విషయంలో అధికారికంగా ప్రకటన వచ్చేసింది. దసరా సందర్భంగా సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 500 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తారక్ సింగిల్‌గా నటించిన చిత్రాల్లో దేవరనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీతో జాన్వీకపూర్ తొలిసారి తెలుగు తెరపై మెరిసింది. ఇందులో సైఫ్ అలీఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్ వంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటించారు.దేవర ఓటీటీ విడుదల కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు నెట్‌ఫ్లిక్స్ శుభవార్త చెప్పింది. నవంబర్ 8న తెలుగుతో పాటు తమిళ్,కన్నడ,మలయాళంలో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా తెలిపింది. అయితే, హిందీ వర్షన్ మాత్రం నవంబర్ 22న ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించారు. అనిరుధ్ అందించిన సంగీతం ఈ మూవీకి ప్రధాన బలంగా నిలిచింది.కథేంటంటే..ఆంధ్ర - తమిళనాడు సరిహద్దు ప్రాంతం రత్నగిరి లోని ఎర్ర సముద్రం అనే గ్రామంలో జరిగే కథ ఇది. కొండపై ఉండే నాలుగు గ్రామాల సమూహమే ఈ ఎర్ర సముద్రం. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ( సైఫ్ అలీ ఖాన్), రాయప్ప( శ్రీకాంత్), కుంజర(షైన్ టామ్ చాకో) ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకుని అధికారుల కంట పడకుండా తీసుకొచ్చి మురుగ(మురళీ శర్మ)కి ఇవ్వడం వీళ్ల పని. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవర ఫిక్స్ అవుతాడు. దేవర మాట కాదని భైరవతో పాటు మరో గ్రామ ప్రజలు సముద్రం ఎక్కేందుకు సిద్ధం అవ్వగా... దేవర వాళ్లకు తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు. దీంతో దేవరని చంపేయాలని భైరవ ప్లాన్ వేస్తాడు. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఎర్ర సముద్రం ప్రజలు సముద్రం ఎక్కి దొంగ సరకు తీసుకురాకుండా ఉండేందుకు దేవర తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? అతని కొడుకు వర(ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైరవ మనుషులని చంపేస్తుంది ఎవరు? తంగం( జాన్వీ కపూర్)తో వర ప్రేమాయణం ఎలా సాగింది? గ్యాంగ్‌స్టర్ యతితో దేవర కథకు సంబంధం ఏంటి అనేదే మెయిన్ స్టోరీ. -
ఎన్టీఆర్ 'దేవర'.. ఆ రోజే ఓటీటీకి రానుందా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం దేవర పార్ట్-1. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన దేవర రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. శ్రీదేవి ముద్దుల కూతురైన జాన్వీ తనదైన గ్లామర్‌తో అలరించింది.బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ కోసం ఓటీటీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం దక్షిణాది ప్రేక్షకులకు ఈ వారం నవంబర్ 8 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వారంలోనే దేవర ఓటీటీకి వస్తే బాగుంటుందని సినీ ప్రియులు కోరుకుంటున్నారు. మరోవైపు బాలీవుడ్ ప్రేక్షకులకు నవంబర్ 22 నుంచి అందుబాటులోకి రానుందని టాక్.కాగా.. దేవరలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించారు. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్. శ్రుతి మారాఠే, చైత్ర రాయ్, షైన్ టామ్, మురళీ శర్మ, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో మెప్పించారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. యువసుధ, ఎన్టీఆర్ బ్యానర్లపై దేవర సినిమా తెరకెక్కించారు. పార్ట్-2 సూపర్ హిట్ కావడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. -
ఓటీటీలో 'దేవర' ఎంట్రీ సమయం వచ్చేసిందా..?
ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ సినిమా దేవర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయినట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. దసరా సందర్భంగా సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 500 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్స్ కూడా భారీగా లాభ పడ్డారని నాగవంశీ తెలిపారు.దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన దేవర బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఓటీటీలో కూడా నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు డీల్ కుదుర్చుకుంది. థియేటర్లలో రిలీజైన ఆరు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలనే ఓప్పందం దేవర మేకర్స్‌తో ఉన్నట్లు సమాచారం. దీంతో నవంబర్ 8న తెలుగుతో పాటు హిందీ,తమిళ్,కన్నడ,మలయాళం భాషలలో స్ట్రీమింగ్కు తీసుకురావాలని నిర్ణయించారట. ఈమేరకు బలంగా వార్తలు వస్తున్నాయి.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్, ప్రకాష్‌రాజ్ వంటి స్టార్స్ నటించారు. -
దీపావళి హిట్ సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు
దీపావళి సందర్భంగా విడుదలైన మూడు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. దీంతో థియేటర్లు అన్నీ ప్రేక్షకులతో సందడిగా కనిపిస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్', కిరణ్ అబ్బవరం 'క', శివ కార్తికేయన్ 'అమరన్' బిగ్ స్క్రీన్‌పైకి వచ్చేశాయి. మొదటిరోజు భారీ కలెక్షన్లతో రికార్డ్ క్రియేట్ చేశాయి. అయితే, ఇప్పుడు ఈ సినిమాలు ఏ ఓటీటీలో విడుదల కానున్నాయో తెలుసుకుందాం.లక్కీ భాస్కర్ (నెట్‌ఫ్లిక్స్ )మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం 'లక్కీ భాస్కర్'. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి ,సాక్షి వైద్య హీరోయిన్లుగా మెప్పించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ అంచనాలతో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. అయితే, వారి అంచనాలు నిజం చేసేలా సినిమా ఉందని చెప్పవచ్చు. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 12.7 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. అయితే, ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. అయితే, ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.అమరన్ (నెట్‌ఫ్లిక్స్)శివకార్తికేయన్- సాయి పల్లవి కాంబినేషన్లో విడుదలైన చిత్రం అమరన్. వీర సైనికుడు ముకుంద్ వరదరాజన్ ఇతివృత్తంతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. సాయి పల్లవి నటనకు ప్రేక్షకులు కంటతడి కూడా పెట్టేస్తున్నారు. దీపావళి సందర్భంగా ప్రేక్షకులముందుకు వచ్చేసిన ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా అమరన్ రూ. 34 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది. డిసెంబర్ మొదటి వారంలోనే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.కిరణ్ అబ్బవరం 'క' (ఓటీటీ పెండింగ్)కిరణ్ అబ్బవరం హీరోగా, నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన పీరియాడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘క’. సుజీత్–సందీప్ దర్శకత్వంలో చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా విడుదలైంది. కిరణ్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది. మొదటిరోజు 'క' సినిమా రూ. 6.18 కోట్లు రాబట్టింది. అయితే, ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఏ సంస్థ కొనుగోలు చేయలేదు. కానీ, ఆహా తెలుగు ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. నవంబర్ చివరి వారంలో ఓటీటీ విడుదల కావచ్చని సమాచారం. -
కన్నడ సినిమా రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్.. ఫస్ట్ మూవీ ఇదేనా..?
కన్నడ హీరో శ్రీ మురళి నటించిన తాజా చిత్రం బఘీర. దీపావళీ కానుకగా అక్టోబర్ 31న ఈ చిత్రం విడుదలైంది. అయితే, మొదటిసారి ఏ కన్నడ సినిమాకు దక్కిన క్రేజ్ ఈ చిత్రానికి దక్కిందని తెలుస్తుంది. డా. సూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటించారు. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో నిర్మించారు. అయితే, ఈ ప్రాజెక్ట్‌కు కథ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇవ్వడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.'బఘీర' కథను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అందించడంతో పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా రీచ్ అయింది. దీంతో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కూడా డిజిటల్ రైట్స్ తీసుకునేందుకు ఆసక్తి కనపరిచిందని తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఇంతవరకు ఏ కన్నడ చిత్రాన్ని డైరెక్ట్‌గా ఓటీటీ రైట్స్‌ను దక్కించుకోలేదు. అక్కడ పెద్దగా మార్కెట్ లేకపోవడంతో నెట్‌ఫ్లిక్స్ ఆసక్తి కనపరచలేదని సమాచారం. అయితే, ఇప్పుడు బఘీర హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు కన్నడ సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది.కన్నడ ఇండస్ట్రీకి చెందిన కాంతార సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇతర భాషలకు సంబంధించిన వర్షన్స్ అమెజాన్ ప్రైమ్‌లో రన్ అవుతున్నాయి. కన్నడ సినిమాలు ఒకప్పుడు ఇతర భాషలలో విడుదల కాకపోవడంతో ఓటీటీ సంస్థలు పెద్దగా ఆ ఇండస్ట్రీపై ఆసక్తి చూపలేదు. అయితే, కేజీఎఫ్ తర్వాత వారి సినిమాల మార్కెట్ పెరిగింది. దీంతో పాన్ ఇండియా రేంజ్లో కన్నడ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓటీటీ మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే బఘీర సినిమా డిజిటల్ రైట్స్ తొలిసారి నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందని కన్నడలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. -
'ఈ గేమ్ ఆడితే అందరం చస్తాం'.. భయపెట్టిస్తోన్న టీజర్!
ప్రస్తుతం సినీ ప్రియులు ఓటీటీలపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ సైతం సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ మరో క్రేజీ వెబ్ సిరీస్‌తో సిద్ధమైంది. 2021లో విడుదలైన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకుంది. కొరియన్లో తెరకెక్కించిన ఈ సిరీస్ ఇండియాలో క్రేజ్‌ను దక్కించుకుంది.ఈ వెబ్ సిరీస్ దక్కిన ఆదరణతో స్క్విడ్ గేమ్ సీజన్-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా సీజన్-2 టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తెలుగులోనూ విడుదలైన ఈ టీజర్ మరింత ఆకట్టుకుంటోంది. గ్రీన్ లైట్, రెడ్ లైట్ వంటి గేమ్స్ ఈ సీజన్లో చూపించనున్నారు. టీజర్లో సన్నివేశాలు చూస్తుంటే హారర్ థ్రిల్లర్ లాంటి ఫీలింగ్ వస్తోంది. గేమ్‌లో పాల్గొన్న వారంతా ప్రాణాలతో బయటపడతారా లేదా అన్నది తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ స్క్విడ్ గేమ్ సీజన్- 2 డిసెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
OTT Review: నాటి తీపి గుర్తుల నేటి సినిమా
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తెలుగు చిత్రం ‘సత్యం సుందరం’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.మనల్ని కొన్ని సినిమాలు ఆలోచింపజేస్తాయి. మరి కొన్ని సినిమాలు ఆవేశాన్నిస్తాయి. ఇంకొన్ని సినిమాలు ఆనందాన్నిస్తాయి. చాలా కొన్ని సినిమాలు మన మనసులో పదిలంగా నిలిచిపోతాయి. ఎందుకంటే పరోక్షంగానో, ప్రత్యక్షంగానో అవి మన గడిచిన జీవితపు గతాల తెరలను తొలగిస్తాయి కాబట్టి. అటువంటి వాటి కోవలో ముందుండే సినిమా ‘మెయ్యళగన్’. ఈ సినిమా తెలుగు వెర్షన్ ‘సత్యం సుందరం’ నెట్‌ఫ్లిక్స్ వేదికగా లభ్యమవుతోంది.దర్శకుడు సి. ప్రేమ్‌కుమార్ ఈ సినిమాని సినిమాలా తీయలేదు, మన గత జీవితాలను మళ్లీ మనకు పరిచయం చేశారంతే. ఒకరిద్దరు భారీ తారాగణం తప్ప పెద్ద కథ, పెద్ద సెట్లు, పెద్ద లొకేషన్లు ఇలాంటి ఆకర్షణలేవీ లేవు ఈ సినిమాలో. కానీ మనసున్న ప్రతి ఒక్కరినీ ఈ సినిమా మెప్పిస్తుందనడంలో సందేహమే లేదు. ప్రతి ఇంట్లో జరిగే ఓ సున్నితమైన అంశాన్ని కథగా తీసుకుని చాలా నేచురల్‌గా తెరకెక్కించారు దర్శకుడు. కథాపరంగా సత్యం ఉంటున్న ఇల్లు దాయాదుల గొడవల్లో పోతుంది. ఆ బాధతోనే సత్యం కుటుంబం ఉన్న ఊరిని ఉన్న పళంగా విడిచి వెళ్లిపోతుంది. ఇక్కడ నుండే సినిమా ్రపారంభమవుతుంది.పద్దెనిమిదేళ్ల తర్వాత సత్యం తన బాబాయి కూతురు పెళ్లి కోసం మళ్లీ ఆ ఊరులోకి బాధతోనే అడుగుపెట్టవలసివస్తుంది. పెళ్లిలో సత్యాన్ని అతని చుట్టం సుందరం కలుస్తాడు. కానీ సుందరాన్ని సత్యం గుర్తు పట్టడు. సుందరం మాత్రం సత్యం మీద వల్లమాలిన అభిమానాన్ని, ప్రేమను చూపిస్తాడు. అసలే ఆ ఊరితో ఉన్న చికాకుతో పాటు సుందరం ఎవరో గుర్తు రాకపోయినా అతను చూపించే ప్రేమ సత్యాన్ని మరింత మధనపెడుతుంది. మరి... ఆఖరికి సుందరం ఎవరో సత్యం గుర్తుపట్టాడా లేదా? అన్నది మాత్రం సినిమాలోనే చూడాలి. సత్యం పాత్రలో అరవిందస్వామి, సుందరం పాత్రలో కార్తీ తమ పాత్రలలో జీవించేశారు. సినిమా మొత్తం ఈ రెండు పాత్రల మీదే ఉంటుంది. పైన చెప్పుకున్నట్టు ఇది సినిమా కాదు... మన గతం. నాటి తీపి గుర్తుల నేటి సినిమా ఈ ‘సత్యం సుందరం’. వర్త్ టు వాచ్. – ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీలో నయనతార రియల్ లైఫ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సీనియర్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం ఫ్యామిలీతో బిజీగా ఉంది. డైరెక్టర్ విఘ్నేశ్ శివన్నను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మకు కవలలు జన్మించిన సంగతి తెలిసిందే. గతేడాది షారూఖ్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటించిన నయన్.. ఆ తర్వాత వచ్చిన అన్నపూరణి సినిమా వివాదానికి దారితీసింది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా పిక్స్ షేర్ చేసి అభిమానులకు అప్డేట్స్ ఇస్తోంది. అయితే తాజా ఫోటోలు చూసి నయన్ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ, సన్నబడటానికి లై పోసక్షన్ చేయించుకుందని సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: నా బుగ్గల్లో ప్లాస్టిక్ ఏం లేదు!)అయితే గతంలో తన సినీ ప్రయాణంపై ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ను రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో తన కెరీర్, పెళ్లితో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఇందులో చూపించనున్నట్లు తెలిపింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకునన్న నయన్ జీవితంపై తెరకెక్కించిన డాక్యుమెంటరీని ఓటీటీలో విడుదల కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ వెల్లడించింది. నవంబర్ 18 నుంచి ఈ డాక్యుమెంటరీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ బయోపిక్కు నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే టైటిల్ ఖరారు చేశారు. Thirai-layum natchathiram, vaazhkailayum natchathiram ✨Watch Nayanthara: Beyond The Fairy Tale on 18 November, only on Netflix!#NayantharaOnNetflix pic.twitter.com/5m9UbBNZ6M— Netflix India South (@Netflix_INSouth) October 30, 2024 -
ఓటీటీలో డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ‘ది బకింగ్హమ్ మర్డర్స్’ ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారిక ప్రకటన వెలువడింది. హన్సల్ మెహతా దర్శకత్వం వహంచిన ఈ చిత్రం సెప్టెంబరు 13న రిలీజ్ అయింది. '1992 స్కామ్' వంటి వెబ్ సిరీస్‌తో దర్శకుడు తన మార్క్ చూపించిన హన్సల్ మెహతా ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. అయితే, ఊహించినంతగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మెప్పించలేదు.బ్రిటిష్– ఇండియన్ డిటెక్టివ్ జస్మిత్ భామ్రా పాత్రలో కరీనా మెప్పించింది. క్రైమ్ థ్రిల్లర్‌గా పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. నవంబర్ 8న స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. హిందీ, ఇంగ్లీష్‌లో మాత్రమే ప్రస్తుతం అందుబాటులోకి రానుంది. తెలుగు వర్షన్ గురించి మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.ది బకింగ్‌హామ్ మర్డర్స్ రన్‌టైమ్ కేవలం 90 నిమిషాలు మాత్రమే ఉంటుంది. రూ. 50 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం రూ. 15 కోట్లు మాత్రమే రాబట్టింది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీస్‌ను ఇష్టపడే ప్రేక్షకులు మాత్రం ఓటీటీలో తప్పకుండా ఈ మూవీని ఇష్టపడుతారని చెప్పవచ్చు. -
ఓటీటీలో 'ఈ కలయిక కాస్త ఘాటు గురూ'.. తెలుగులో స్ట్రీమింగ్
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ది యూనియన్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. ఎక్కడైనా ప్రేమికులు చాలా ఏళ్ల తరువాత కలిస్తే, చాలా హాట్ హాట్‌గా ఉంటుంది. కానీ ఈ ‘ది యూనియన్’ సినిమాలో ΄పాత ప్రేమికులు కలిసిన తరువాత ఇంత ఘాటా అని చూసే ప్రేక్షకుడు నోరెళ్లబెట్టాల్సిందే. అంతలా ఏముందీ సినిమాలో ఓసారి విశ్లేషించుకుందాం. జూలియన్ ఫరియానో దర్శకత్వం వహించిన స్పై కామెడీ థ్రిల్లర్ సినిమా ‘ది యూనియన్’. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగులోనూ ఈ సినిమాని చూడవచ్చు. హేమాహేమీలైన హాలీబెర్రీ, మార్క్ వాబర్గ్, మైక్ కాల్టర్ నటించిన ఈ సినిమా పెద్దలకు మాత్రమే. ఇక ఈ సినిమా కథాంశానికొస్తే... కథానాయకుడు మైక్ మెకన్నా న్యూజెర్సీ నగరంలో ఓ సాధారణ బిల్డింగ్ కార్మికుడు. రోజువారీ కష్టంతో తన పనేదో తాను చూసుకుపోయే మనస్తత్వం గలవాడు. కాకపోతే కాస్తంత అమ్మాయిల పట్ల పిచ్చి ఎక్కువ. హాయిగా సాగుతున్న మైక్ జీవితంలో అనుకోని ఓ అవాంతరం తన హైస్కూల్ క్రష్ అయిన రోక్సేన్ హాల్ ద్వారా ఎదురవుతుంది. 25 ఏళ్ల తరువాత కలిసిన తన ప్రేమను గుర్తు చేసుకుంటూ డాన్స్ చేస్తూ స్పృహ తప్పుతాడు మైక్. అలా న్యూజెర్సీలో స్పృహ తప్పిన మైక్ తిరిగి కళ్లు తెరిచేసరికి లండన్‌లో ఉంటాడు. మరోపక్క ఓ బ్రీఫ్‌కేస్ కోసం ఇరాన్ తీవ్రవాదులు, నార్త్ కొరియా ఏజెంట్లు, రష్యన్ గూఢచారులు తెగ వెతికేస్తుంటారు. ఆ బ్రీఫ్‌కేస్‌లో చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని కోసం యూనియన్ అనే సంస్థ తమ ప్రతినిధులను చాలా మందినే పొగొట్టుకుంటుంది. అసలు ఆ బ్రీఫ్‌కేస్‌కి, కథానాయకుడు మైక్‌కి సంబంధం ఏంటి? 25 ఏళ్ల తరువాత మైక్ ప్రియురాలు రోక్సేన్ హేల్ అతన్ని ఎందుకు కలిసింది? కలిసిన తరువాత అతను లండన్‌లో ఉండడం ఏంటి? అయినా ఓ ప్రేమికుల కలయికలో ఇంత ఘాటైన ట్విస్టులా? వీటి సమాధానాల కోసం ‘ది యూనియన్’ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ప్రేక్షకుడిని గిలిగింతలు పెట్టిస్తూ ఆద్యంతం థ్రిల్లింగ్ కలిగిస్తుందనడంలో సందేహం లేదు. వీకెండ్ మస్ట్ వాచ్ మూవీ ‘ది యూనియన్’.– ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీలో 'సత్యం సుందరం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
కార్తి - అరవింద్ స్వామి కాంబినేషన్లో వచ్చిన సినిమా 'సత్యం సుందరం'. ఫీల్‌గుడ్ చిత్రంగా ప్రేక్షకుల నుంచి మించి రివ్యూస్‌నే దక్కించుకుంది. సూర్య-జ్యోతిక తక్కువ బడ్జెట్లో ఈ మూవీని నిర్మించారు. సెప్టెంబర్ 28న థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. దీంతో 'సత్యం సుందరం' అభిమానుల్లో సంతోషం కనిపిస్తుంది.తమిళంలో '96' వంటి ఫీల్ గుడ్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సి.ప్రేమ్‌కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదికైన నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. అక్టోబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ, కన్నడ బాషల్లో అందుబాటులో ఉండనుంది. థియేటర్లో చూడలేకపోయిన వారు తమ ఫ్యామిలీ, స్నేహితులతో తప్పక చూడాల్సిన సినిమాగా నెటిజన్లు చెప్పుకొచ్చారు. కథ అయితే, చాలా నెమ్మదిగా కొనసాగుతుంది. ఎలాంటి ట్విస్ట్‌లు లేకుండా సుమారు 3 గంటలపాటు ప్రేక్షకులను దర్శకుడు మెప్పించాడు. 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య, జ్యోతికలు దీనిని నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 60 కోట్లు రాబట్టిన 'సత్యం సుందరం' మంచి లాభాలను అందించారు. చిత్రంలో అరవింద్ స్వామి, కార్తి.. బావ-బావమరిదిగా నటించడం విశేషం. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 15 చిత్రాలు స్ట్రీమింగ్!
దసరా సెలవులు ముగిశాయి. ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. విజయదశమికి వేట్టయాన్, విశ్వం, జనక అయితే గనక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఈ సంగతి అటుంచితే మరో వీకెండ్ వచ్చేస్తోంది. అయితే ఈ వారంలో థియేటర్లలో పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు. ఈ వారం కేవలం చిన్న చిత్రాలు మాత్రమే బాక్సాఫీస్ బరిలో నిలిచాయి.దీంతో సినీ ప్రియులు ఓటీటీలవైపు చూస్తున్నారు. ఈ వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఓటీటీల్లో కాస్తా ఇంట్రెస్టింగ్ కలిగించే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి. ఈ వీకెండ్లో కుటుంబంతో కలిసి మీకు నచ్చిన సినిమాలను చూసి ఎంజాయ్ చేయండి.ఈ వీకెండ్ ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలునెట్ఫ్లిక్స్ ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైఫ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18 ద మ్యాన్ హూ లవ్డ్ యూఎఫ్ఓస్ (స్పానిష్ మూవీ) - అక్టోబర్ 18 ఉమన్ ఆఫ్ ద అవర్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 18అమెజాన్ ప్రైమ్ కల్ట్ (ఫ్రెంచ్ సిరీస్) - అక్టోబర్ 18 కడైసి ఉలగ పొర్ (తమిళ సినిమా) - అక్టోబర్ 18 లాఫింగ్ బుద్ధా (కన్నడ మూవీ) - అక్టోబర్ 18 స్నేక్స్ & ల్యాడర్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 18 ద డెవిల్స్ అవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18 ద ఆఫీస్ ఆస్ట్రేలియా (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18 ద పార్క్ మేనియక్ (పోర్చుగీస్ మూవీ) - అక్టోబర్ 18హాట్‌స్టార్ 1000 బేబీస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 18 రైవల్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18 రోడ్ డైరీ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 18జియో సినిమా క్రిస్పీ రిస్తే (హిందీ మూవీ) - అక్టోబర్ 18 హ్యాపీస్ ప్లేస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 19 హిస్టీరియా (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 19ఆహారైడ్ (తెలుగు డబ్బింగ్ సినిమా)- అక్టోబర్ 19బుక్ మై షో బీటల్ జ్యూస్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 18 -
తంగలాన్ ఓటీటీ విడుదలపై ప్రకటన చేసిన నిర్మాత
విక్రమ్- పా.రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా తంగలాన్. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్న ఈ మూవీ ఆగష్టు 15న విడుదల అయింది. అయితే, తంగలాన్ ఓటీటీ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో తంగలాన్ వేట కొనసాగించి ఇప్పటికే రెండు నెలలు పూర్తి అయింది. బాలీవుడ్లో కూడా విడుదలైన ఈ మూవీ అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి చిత్ర నిర్మాత ప్రకటన చేశారు.డైరెక్టర్ పా రంజిత్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నిర్మాత జ్ఞానవేల్ రాజా నిర్మించారు. అయితే, తంగలాన్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. కానీ, స్ట్రీమింగ్ విషయంలో మేకర్స్ నుంచి పలు అడ్డంకులు రావడంతో ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేయలేదని ఊహాగానాలు వినిపించాయి. ఈ విషయంపై తాజాగా జ్ఞానవేల్ రాజా క్లారిటీ ఇచ్చారు. 'దీపావళికి తంగలాన్ సినిమాను విడుదల చేయాలని వారు (నెట్‌ఫ్లిక్స్) నిర్ణయించారు. తంగలన్ పెద్ద సినిమా కాబట్టి పండుగ నాడు విడుదల చేస్తే బాగుంటదని తెలిపారు. అయితే, తంగలాన్ ఓటీటీ విడుదల విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. వాస్తవానికి సమస్య లేకున్నా కూడా.. సమస్య ఉందని చెప్పుకునే నేర్పు నేటి సోషల్‌మీడియా వార్తలకు ఉంది.' అని ఆయన తెలిపారు. అక్టోబర్ 31 లేదా నవంబర్ 1న తంగలాన్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కావడం ఖాయమని చిత్ర నిర్మాత పేర్కొన్నారు.కథేంటి..?గోల్డ్ హంట్ నేపథ్యంలో తంగలాన్ను తెరకెక్కించారు పా. రంజిత్. 1850లో బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో జరిగిన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్).. తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. మరి తంగలాన్ చివరకు బంగారం కనిపెట్టాడా? అరణ్య, ఆరతితో ఇతడికి ఉన్న సంబంధమేంటి అనేదే మెయిన్ స్టోరీ. ఈ మూవీకి సీక్వెల్ తంగలాన్ 2 ఉంటుందని విక్రమ్ వెల్లడించారు. -
కృతి సనన్, కాజోల్ 'దో పత్తి' ట్రైలర్ చూశారా..?
బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్, కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘దో పత్తి’. కృతి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కృతి సనన్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు దాటింది. అయితే, ఇప్పటి వరకు నటిగా మాత్రమే గుర్తింపు తెచ్చుకున్న ఆమె తొలిసారి ఈ చిత్రం ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. బ్లూ బటర్‌ఫ్లై ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించింది.అక్టోబర్ 25 నుంచి ‘దో పత్తి’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. హిందీతో పాటు తెలుగులో కూడా ఈ మూవీ అందుబాటులో ఉండనుంది. మిస్టరీ థ్రిల్లర్ కథతో రానున్న ఈ చిత్రంలో కాజోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 2015లో దిల్వాలే సినిమాలో కృతి సనన్, కాజోల్ ఇద్దరూ కలిసి తొలిసారి నటించారు. సుమారు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ 'దో పత్తి' సినిమాతో వెండితెరపై కనిపించనున్నారు.