
ఇప‍్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. చాలా చిత్రాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నప్పటికీ.. మరికొన్ని మాత్రం నేరుగా ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. అలా ఇప్పుడో హిందీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ ఏంటా మూవీ? ఎప్పుడు రాబోతుంది?
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్)
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'జ్యూయల్ థీఫ్'. టైటిల్ చూడగానే అర్థమైందనుకుంటా. మనీ హైస్ట్ లా ఇందులోనూ రెడ్ సన్ అనే రూ.500 కోట్ల విలువైన డైమండ్ కొట్టేయాలని హీరోకి విలన్ పనిఅప్పజెబుతాడు. తర్వాత ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ.
వార్, పఠాన్ తదితర చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ పెంచుకున్న సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి నిర్మాత. రాబీ గ్రేవాల్, కుకీ గులాటీ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 25 నుంచి ఇది నేరుగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని తాజాగా ప్రకటించారు.
(ఇదీ చదవండి: సల్మాన్ చేతికి 'రామ్ జన్మభూమి' వాచ్.. రేటు ఎంతంటే?)
