OTT
-
ఓటీటీకి పూజా హెగ్డే డిజాస్టర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
బుట్టబొమ్మ పూజా హెగ్డే, బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ జంటగా నటించిన చిత్రం దేవా. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 31న థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఆదరణ కరవైంది. యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన దేవా అభిమానులను థియేటర్లలో రప్పించడంలో విఫలమైంది.అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఈనెల 28 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. ఈ మేరకు దేవా పోస్టర్‌ను పంచుకుంది.కాగా..2013లో మలయాళంలో 'ముంబై పోలీస్' అనే పేరుతో ఓ సినిమా వచ్చింది. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అదే సినిమాని తెలుగులో 'హంట్' పేరుతో సుధీర్ బాబు రీమేక్ చేశాడు. ఇక్కడ అంతగా వర్కవుట్ కాకపోవడంతో ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సినిమానే మళ్లీ హిందీలో షాహిద్ కపూర్ హీరోగా 'దేవా' పేరుతో తెరకెక్కించగా డిజాస్టర్‌గా నిలిచింది. మరీ ఓటీటీలోనైనా అభిమానులను ఏమేర అలరిస్తుందో వేచి చూడాలి.Bhasad macha 🥁🥁🥁 Trigger chala 🚨🚨🚨 Deva aa raha hai 🔥#DevaOnNetflix pic.twitter.com/9eHQGvnjWn— Netflix India (@NetflixIndia) March 27, 2025 -
అర్ధరాత్రి నుంచే ఓటీటీకి ముఫాసా.. ఎక్కడ చూడాలంటే?
చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరినీ అలరించిన చిత్రం ది లయన్ కింగ్. ఈ చిత్రంలో రాజ్యాన్ని పాలించే ముఫాసా, అతని తమ్ముడు స్కార్ పాత్రలు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అడవికి రాజుగా ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉంటారు. అతనికి సింబా అనే కుమారుడు జన్మిస్తాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో లయన్ కింగ్-2 కూడా వచ్చేసింది.అయితే గతేడాది లయన్ కింగ్ ప్రీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. ఈ సినిమాను అకాడమీ అవార్డ్ విజేత, దర్శకుడు బారీ జెంకిన్స్ తెరకెక్కించారు. గతేడాది డిసెంబరు 20న విడుదలైన ఈ సినిమా మొదటి వారంలో భారీ కలెక్షన్స్ రాబట్టింది. ముఫాసా ఎదగడానికి చేసిన ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించారు. తెలుగులో మహేశ్ బాబు.. ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పగా, హిందీలో షారుక్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.అయితే ముఫాసా: ది లయన్ కింగ్ మరికొద్ది గంటల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ అర్ధరాత్రి నుంచే జియోహాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది. మార్చి 26 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. Two lions, one destiny, bound by more than blood.#Mufasa: The Lion King, coming to #JioHotstar on March 26 in English, Hindi, Tamil and Telugu.#MufasaOnJioHotstar #JioHotstar #InfinitePossibilities pic.twitter.com/2mYE0RvhCL— JioHotstar (@JioHotstar) March 24, 2025 -
Ind Vs Pak టెస్ట్.. ముగ్గురి జీవితాలు.. ఓటీటీ సిరీస్ ట్రైలర్ రిలీజ్
క్రికెట్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఇప్పటికే పలు సినిమాలు, వెబ్ సిరీసులు వచ్చాయి. ఇప్పుడు అలాంటి కంటెంట్ తో వస్తున్న లేటెస్ట్ సిరీస్ 'టెస్ట్'. మాధవన్, నయనతార, సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో నటించారు. నేరుగా ఓటీటీలో రిలీజ్ కానున్న ఈ సిరీస్ ట్రైలర్ ని తాజాగా విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి పూజా హెగ్డే డిజాస్టర్ సినిమా)చెన్నైలో జరిగిన ఇండియా vs పాకిస్థాన్ టెస్టు మ్యాచ్.. ముగ్గురు వ్యక్తుల జీవితాల్ని ఎలా ప్రభావితం చేసిందనే కథతో ఈ సిరీస్ తీశారు. ఏప్రిల్ 4 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. (ఇదీ చదవండి: కారు ప్రమాదంలో నటుడు సోనూసూద్ భార్య) -
ఓటీటీలోకి పూజా హెగ్డే డిజాస్టర్ సినిమా
బుట్టబొమ్మ పూజా హెగ్డేకి (Pooja Hegde) టైమ్ అస్సలు కలిసి రావడం లేదు. రెండు మూడేళ్ల ముందు వరకు తెలుగు, తమిళంలో వరస సినిమాలు చేసింది. ఆచార్య, రాధేశ్యామ్, బీస్ట్ లాంటి వరస డిజాస్టర్స్ దెబ్బకు పూర్తిగా సౌత్ కి దూరమైపోయింది. హిందీలో ప్రయత్నిస్తే ఒకటి రెండు ఛాన్సులు వచ్చాయి గానీ ఆయా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన డిజాస్టర్స్ గా మిగిలాయి. ఈ ఏడాది జనవరి 31న రిలీజైన 'దేవా' (Deva OTT) సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది గానీ ఇదేమో ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఈ మూవీనే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.(ఇదీ చదవండి: కారు ప్రమాదంలో నటుడు సోనూసూద్ భార్య)2013లో మలయాళంలో 'ముంబై పోలీస్' పేరుతో ఓ సినిమా వచ్చింది. అప్పట్లో కాస్త కొత్తగా అనిపించడంతో హిట్ అయింది. దీన్ని తెలుగులో 'హంట్' పేరుతో సుధీర్ బాబు రీమేక్ చేశాడు. కానీ ఫ్లాప్ అయింది. దీన్నే మళ్లీ హిందీలో షాహిద్ కపూర్ హీరోగా 'దేవా' పేరుతో తీస్తే ఇక్కడ కూడా డిజాస్టర్ అయింది.ఇప్పుడు 'దేవా' సినిమా ఓటీటీలోకి రానుంది. మార్చి 28 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య థియేటర్లలో ఫ్లాప్ అయిన 'ఎమర్జెన్సీ' లాంటి మూవీస్ ఓటీటీలో హిట్ అవుతున్నాయి. మరి 'దేవా' కూడా అలా ఏమైనా ట్రెండింగ్ అవుతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మజాకా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
‘పొన్ మాన్’ మూవీ రివ్యూ : అప్పు ఎప్పుడైనా నిప్పే!
ఈ రోజుల్లో అప్పు చేయని వాళ్ళు చాలా తక్కువ. మరీ మధ్యతరగతి వాళ్ళు అవసరాల కోసం అప్పులకై తిప్పలు పడతారు. ఒకవేళ అప్పు దొరికినా దానిని తీర్చడం మరో ఎత్తు. ఈ కసరత్తు మీదనే పొన్ మాన్(ponman Movie) సినిమా రూపుదిద్దుకుంది. ఇదో మళయాళ సినిమా. జియో హాట్ స్టార్ వేదికగా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా లభ్యమవుతుంది. జ్యోతిష్ శంకర్ దీనికి దర్శకత్వం వహించారు. ప్రముఖ మళయాళ నటుడు బసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఓ ఫ్యామిలీ డ్రామా. కాని జీవితంలో నగదు లేదా డబ్బు రూపేణా అప్పు చేసిన ప్రతివారు చూడవలసిన సినిమా. అలా అని ఇదేదో మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాదు, ఓ ఫ్యామిలీ థ్రిల్లింగ్ డ్రామా అని చెప్పుకోవచ్చు. ఇక పొన్ మాన్ కథ విషయానికొస్తే కేరళ రాష్ట్రంలోని తీర ప్రాంతమైన కొల్లాంలో బ్రూనో అనే వ్యక్తి తో ఈ కథ మొదలవుతుంది. చెల్లెలు స్టెఫీ, తల్లితో పాటు ఓ చిన్న కుటుంబం బ్రూనోది. సంపాదన లేకున్నా రాజకీయలపై ఇష్టంతో ఓ పార్టీలో చేరతాడు బ్రూనో. తన నోటి దురుసుతనం వల్ల పార్టీ నుంచి సస్పెండ్ కూడా అవుతాడు. బ్రూనో తల్లి స్టెఫీకి త్వరగా పెళ్ళి చేయాలన్న తాపత్రయంలో పక్క ఊరిలోని మరియానోతో 25 సవర్ల బంగారం కట్నకానుకాలు ఇచ్చే విధంగా సంబంధం కుదురుస్తుంది. దానికి గాను అజేష్ అనే బంగారు బ్రోకర్ ను సంప్రదించి పెళ్ళికి ముందు బంగారం తీసుకుని పెళ్ళిలో వచ్చే చదివింపులతో తిరిగి నగదు రూపేణా అప్పు తీర్చేవిధంగా ఏర్పాటు చేస్తుంది. అజేష్ ఇచ్చిన నగలతో స్టెఫీ, మరియానో పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది. కాని అనుకోకుండా అంత డబ్బులు రావు. దీనితో అజేష్ తానిచ్చిన బంగారం కోసం పెళ్ళి వారితో పాటు స్టెఫీ అత్తగారింటికి వెళతాడు. స్టెఫీ మరియానో కరుడుగట్టిన రౌడీ. స్టెఫీ వేసుకున్న బంగారం అప్పుకు తెచ్చిందన్న విషయం అత్తవారింట్లో ఎవరికీ తెలియదు. ఈ సమయంలో అజేష్ తన బంగారం స్టెఫీ నుండి తీసుకోగలడా లేదా అన్నది మాత్రం పొన్ మాన్ చూస్తేనే తెలుస్తుంది. ఈ సినిమా మొత్తం థ్రిల్లర్ జోనర్ తో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లో నడుస్తుంది. అప్పు తీసుకునే ప్రతి వాళ్ళూ తీసుకునేటపుడు బరువుగాను తిరిగి ఇచ్చేటపుడు బాధ్యతగాను ఉంటే ఏ సమస్యా ఉండదు. అలా కాని పక్షంలో ఈ సినిమాలో చూపిన ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వర్త్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. -
ఓటీటీలోకి సూపర్ హిట్ హారర్ మూవీకి సీక్వెల్
హారర్ సినిమాలకు సెపరేట్ ప్రేక్షకులు ఉంటారు. సరిగ్గా తీయాలే గానీ భాషతో సంబంధం లేకుండా సూపర్ హిట్ చేసేస్తారు. అలా నాలుగేళ్ల క్రితం ఓటీటీలో రిలీజై అందరినీ భయపెట్టిన ఓ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. తాజాగా టీజర్ రిలీజ్ చేయడంతో పాటు స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు.(ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ గురువు కన్నుమూత)హిందీ నటి నుష్రత్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఛోరీ'. ఓ మారుమూల గ్రామంలోని పొలంలో జరిగే కథతో తీశారు. ఓ గర్భవతికి ఆమెకు ఆశ్రయం కల్పించి, చంపాలని చూసే ఓ మహిళ చుట్టూ తిరిగే స్టోరీతో తొలి భాగం తీయగా.. సదరు గర్భవతికి పుట్టిన కూతురి పడే కష్టాలతో సీక్వెల్ తీసినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.తొలి భాగంలో భయపెడుతూనే థ్రిల్ కి గురిచేసినట్లు.. ఈసారి కూడా థ్రిల్ పంచే సీన్స్ బోలెడు ఉన్నాయని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఏప్రిల్ 11 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మజాకా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
ఓటీటీలోకి 'మజాకా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తెలుగులో మిగతా సినిమాల మాటేమో గానీ కామెడీ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సంక్రాంతికి అలా వచ్చిన ఓ కామెడీ మూవీ ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లు సాధించింది. అదే 'సంక్రాంతికి వస్తున్నాం'. ఇది వచ్చిన కొన్నిరోజులకు థియేటర్లలోకి వచ్చిన మరో హాస్యభరిత చిత్రం 'మజాకా' (Mazaka Movie). ఇప్పుడు దీని ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది.రావు రమేశ్, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నక్కిన త్రినాథరావు దర్శకుడు. తండ్రి కొడుకుల ఒకేసారి ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్ తో తీసిన ఈ చిత్రంలో రీతూ చౌదరి, అన్షు (Anshu) హీరోయిన్లుగా నటించారు. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ గురువు కన్నుమూత)శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలోకి వచ్చిన మజాకా చిత్రానికి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. కంటెంట్ లో చిన్నచిన్న లోపాలే దీనికి కారణం. ఇకపోతే ఇప్పుడు ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 28 నుంచి జీ5లో (Zee 5 Ott) స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక పోస్టర్ రిలీజ్ చేశారు.'మజాకా' విషయానికొస్తే.. రమణ (రావు రమేశ్), కృష్ణ (సందీప్ కిషన్) తండ్రి కొడుకులు. చిన్నప్పుడే భార్య చనిపోవడటంతో మరో పెళ్లి చేసుకోకుండా కొడుకుని రమణ పెంచుతాడు. కానీ కృష్ణకి పెళ్లి చేయాలనేసరికి ఇంట్లో ఆడదిక్కు లేదని ఎవరూ పిల్లనివ్వరు. దీంతో రమణ.. యశోద (అన్షు)తో, కృష్ణ.. మీరా(రీతూవర్మ)తో ప్రేమలో పడతారు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: నన్ను దెబ్బ కొట్టేందుకు వాళ్లు కోట్లు ఖర్చు పెట్టారు: పూజా హెగ్డే) -
ఓటీటీలో ట్విస్ట్ ఇచ్చిన ధనుష్.. తెలుగులో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’
కోలీవుడ్ స్టార్ హీరో డైరెక్ట్ చేసిన ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’ చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’(Jabilamma Neeku Antha Kopama) పేరుతో తెలుగులో కూడా విడుదలైంది. పవీష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేశ్ మీనన్, రబియా ఖతూన్, రమ్యా రంగనాథన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో తమిళ్ వర్షన్ అందుబాటులో ఉంది. అయితే, తెలుగు స్ట్రీమింగ్ గురించి మేకర్స్ ప్రకటించలేదు. ఈ క్రమలో తాజాగా సింప్లీ సౌత్ ఓటీటీ సంస్థ ఈ మూవీ తెలుగు రైట్స్ కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అయితే, స్ట్రీమింగ్ ఎప్పుడు అనేది తెలుపలేదు. ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ మూవీ ఫిబ్రవరి 21న థియేటర్స్‌లోకి వచ్చేసింది. అయితే, రీసెంట్గా తమిళ్ వర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి త్వరలో తెలుగు వర్షన్ కూడా అందుబాటులోకి వస్తుందని అందరూ ఆశించారు. కానీ, తెలుగు స్ట్రీమింగ్ మాత్రం సింప్లీ సౌత్ ఓటీటీ వేదికగా అందుబాటులోకి రానున్నట్లు ఆ సంస్థ తెలిపింది. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఇండియాలో ఈ ఓటీటీ సంస్థకు అనుమతి లేదు. కానీ, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారు అందరూ ఈ చిత్రాన్ని సింప్లీ సౌత్ ఓటీటీలో చూడొచ్చు. కొద్దిరోజుల తర్వాత అమెజాన్, ఆహాలో ఈ సినిమా అందుబాటులోకి రావచ్చని సమాచారం ఉంది. -
వికటకవి సిరీస్‌కు ఉత్తమ దర్శకుడిగా ప్రదీప్.. ఈ సిరీస్ ఏ ఓటీటీలో ఉందంటే?
హిందూస్తాన్ టైమ్స్ ఓటీటీ ప్లే అవార్డ్స్ 2025 (OTTPlay Awards 2025) మూడవ ఎడిషన్ మార్చి 22న ముంబైలో ఘనంగా జరిగింది. అపరశక్తి ఖురానా, కుబ్రా సైత్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు అవార్డులు దక్కాయి. 'డిస్పాచ్' సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా మనోజ్ బాజ్‌పాయ్, 'భామ కలాపం 2' చిత్రానికిగానూ ఉత్తమ నటిగా ప్రియమణి, 'ది రాణా దగ్గుబాటి షో'తో ఉత్తమ టాక్ షో హోస్ట్‌గా రానా దగ్గుబాటితో సహా పలువురికి అవార్డులు ప్రదానం చేశారు. ఓటీటీలో బెస్ట్ డైరెక్టర్ అవార్డ్జీ5లో స్ట్రీమ్ అవుతున్న సూపర్ హిట్ సిరీస్ వికటకవి (Vikkatakavi Web Series)కి గాను ప్రదీప్ మద్దాలి ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. నిఖిల్ అద్వానీ (ఫ్రీడమ్ ఎట్ నైట్)తో కలిసి ఉత్తమ దర్శకుడు (వెబ్ సిరీస్) అవార్డును ప్రదీప్ మద్దాలి పంచుకున్నారు. అనంతరం ప్రదీప్ మద్దాలి.. హిందూస్తాన్ టైమ్స్ ఓటీటీ ప్లే అవార్డ్స్‌కు, అతని తల్లిదండ్రులకు, సిరీస్ యూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గుర్తింపుతో తనపై బాధ్యత మరింత పెరిగినట్లు చెప్పారు. ఆ ఘనత సాధించిన తొలి తెలుగు సిరీస్ ఇదే1970ల నాటి కల్పిత గ్రామమైన అమరగిరిలో ప్లేగు వ్యాధి నేపథ్యంలో ఆకట్టుకునే గ్రామీణ థ్రిల్లర్ వికటకవి. ఈ సిరీస్‌లో నరేష్ అగస్త్య డిటెక్టివ్ రామ కృష్ణగా నటించారు. మేఘా ఆకాశ్ మరో ప్రధాన పాత్రలో కనిపిస్తారు. వర్ధమాన దర్శకుడు ప్రదీప్ మద్దాలి.. ఇంజనీరింగ్, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించారు. '47 డేస్', 'సర్వం శక్తి మయం'తో టాలెంటెడ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వికటకవితో దర్శకుడిగా మరో స్థాయికి వెళ్ళారు. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ప్రదర్శించిన మొదటి తెలుగు వెబ్ సిరీస్ వికటకవి కావడం విశేషం.చదవండి: హీరో నితిన్‌పై హర్టయ్యా.. అవమానభారంతో షూటింగ్‌కు రానన్నా: హర్షవర్ధన్ -
ఓటీటీలో హారర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్
జీవా(jeeva), అర్జున్ సర్జా(arjun sarja) హీరోలుగా నటించిన 'అగత్యా' (Aghathiyaa) చిత్రం ఓటీటీలోకి వస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఫాంటసీ హారర్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. రాశీ ఖన్నా హీరోయిన్గా నటించిన పాన్ ఇండియా మూవీని ప్రముఖ గీత రచయిత పా.విజయ్ దర్శకత్వం వహించారు. డా.ఇషారి కె.గణేశ్, అనీశ్ అర్జున్దేవ్ నిర్మాతలు. ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఫిబ్రవరి 28న విడుదల అయింది. ట్రైలర్‌కు అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ, బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేదు.గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం.. సన్ నెక్స్ట్ వేదికగా మార్చి 28 నుంచి స్ట్రీమింగ్కు రానుందని ప్రకటన వచ్చేసింది. పాన్ ఇండియా రేంజ్లో తమిళ్,హిందీ,తెలుగు,మలయాళం, కన్నడలో విడుదలైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం ఎన్ని భాషలలో విడుదల అవుతుంది అనేది మాత్రం ఆ సంస్థ చెప్పలేదు. కానీ, అన్ని లాంగ్వేజెస్‌లో అగత్యా స్ట్రీమింగ్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో కూడా ఈ మూవీ అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది.కథేంటంటే..అగత్య(జీవా) ఓ ఆర్ట్ డైరెక్టర్. ఓ పెద్ద సినిమా చేసే చాన్స్ వస్తుంది. ఓ భారీ సెట్ వేసిన తర్వాత నిర్మాత షూటింగ్ నిలిపివేస్తాడు. దీంతో ప్రియురాలు వీణా(రాశీ ఖన్నా) ఇచ్చిన సలహాతో ఆ సెట్‌ని స్కేరీ హౌస్లా మార్చుతాడు. అయితే నిజంగానే ఆ బంగ్లాలో దెయ్యాలు ఉంటాయి. అసలు ఆ బంగ్లాలో ఉన్న దెయ్యాలు ఎవరు? ఓ ఆడ దెయ్యం అగత్యను ఎందుకు బయటకు పంపించాలనుకుంటుంది? అసలు 1940లో ఆ బంగ్లాలో ఏం జరిగింది? సిద్ద వైద్యం కోసం డాక్టర్ సిద్ధార్థ్(అర్జున్) ఎలాంటి కృషి చేశాడు? బ్రిటిష్ గవర్నర్ ఎడ్విన్ డూప్లెక్స్ చేసిన అరాచకం ఏంటి? అతని చెల్లెలు జాక్వెలిన్ పూవిలేకి సిద్ధార్థ్ చేసిన సహాయం ఏంటి? ఫ్రీడం ఫైటర్ నాన్సీకి అగత్యకు ఉన్న సంబంధం ఏంటి? కాన్సర్‌తో బాధపడుతున్న తల్లిని రక్షించుకునేందుకు అగత్యా ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. View this post on Instagram A post shared by SUN NXT (@sunnxt) -
ఉగాది, రంజాన్ స్పెషల్స్.. థియేటర్లో 5, ఓటీటీలో 6 క్రేజీ సినిమాలు
మార్చి చివరి వారంలో సినిమాల జాతర భారీగానే ఉండనుంది. తెలుగు సంవత్సరాది ఉగాది, రంజాన్ వరుసగా వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద చాలా సినిమాలు సందడి చేయనున్నాయి. దీంతో థియేటర్స్ అన్నీ కూడా కళకళలాడేందుకు సిద్ధంగా ఉన్నాయి. తెలుగు సినిమాలే కాకుండా ఇతర భాషల నుంచి కూడా భారీ మూవీస్ విడుదల కానున్నడంతో సినిమా అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పవచ్చు. ఇదే క్రమంలో ఓటీటీ నుంచి కూడా పలు హిట్ సినిమాలు స్ట్రీమింగ్కు రానున్నాయి.ధియేటర్స్‌లో విడుదలయ్యే సినిమాలు🎥 లూసిఫర్2- మార్చి 27🎥 వీర ధీర శూర- మార్చి 27🎥 రాబిన్‌హుడ్- మార్చి 28🎥 మ్యాడ్ స్క్వేర్- మార్చి 28🎥 సికందర్- మార్చి 30ఓటీటీ సినిమాలునెట్ఫ్లిక్స్🎥మిలియన్ డాలర్ సీక్రెట్ (రియాల్టీ షో) మార్చి 26🎥కాట్ (థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 26 🎥దేవా -మార్చి 29అమెజాన్ ప్రైమ్🎥హాలెండ్ (ఇంగ్లీష్) మార్చి 27🎥శబ్ధం (తెలుగు)- మార్చి 28🎥మలేనా - మార్చి 29జియో హాట్‌స్టార్🎥ముఫాసా: ద లయన్ కింగ్ (హిందీ/తెలుగు) మార్చి 26🎥ఓం కాళీ జై కాళి (తెలుగు/వెబ్ సిరీస్) - మార్చి 28జీ5🎥విడుదల పార్ట్-2 (హిందీ) మార్చి 28🎥మజాకా - మార్చి 28ఆహా🎥ది ఎక్స్టార్డనరీ జర్నీఆఫ్ ది ఫకీర్ (తెలుగు) మార్చి 26🎥మిస్టర్ హౌస్ కీపింగ్ ( తమిళ్)- మార్చి 25 -
ఓటీటీలో 25 ఏళ్ల తర్వాత స్ట్రీమింగ్ అవుతున్న సినిమా
సుమారు 25 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. 2000 ఏడాదిలో థియేటర్స్‌లో రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ 'మలేనా' ఓటీటీ ప్రియుల కోసం రానుంది. లూసియానో విన్సెంజోని కథ నుండి గియుసేప్ టోర్నాటోర్ రచించి దర్శకత్వం వహించిన ఈ శృంగార నాటక చిత్రం అప్పట్లో సంచలనం రేపింది. 73వ అకాడమీ అవార్డ్స్‌లో సత్తా చాటిన మలేనా.. బాక్సాఫీస్ వద్ద ఆరోజుల్లోనే రూ. 150 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం రెండు విభాగాల్లో ఆస్కార్‌కు కూడా నామినేట్ అయింది.'మలేనా' చిత్రం సడెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఈ మూవీ చూడాలంటే రూ. 99 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 29 నుంచి ఉచితంగా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. టైటిల్ పాత్రలో ఇటాలియన్ నటి మోనికా బెల్లూచి (Monica Bellucci) కనిపిస్తుంది. ఆమె ఒక ఆర్మీ ఆధికారి భార్యగా అద్భుతంగా నటించిందని చెప్పవచ్చు. 12 ఏళ్ల బాలుడి రెనాటో పాత్రలో గియుసేప్ సల్ఫారో (Giuseppe Sulfaro) మెప్పించాడు. సినిమా మొత్తం వీరిద్దరి మధ్య జరిగే ఆర్షణ, ప్రేమ చుట్టూ ఉంటుంది. ఒక అందమైన అమ్మాయి ఒంటరిగా జీవిస్తుంటే ఈ సమాజం ఏ విధంగా చిత్రీకరిస్తుంది అనేది ప్రధాన కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు.కథేంటి..?ఆ నగరంలో అత్యంత అందమైన యువతిగా మలేనా ఉంటుంది. ఆమె భర్త దేశ సరిహద్దుల్లో ఉద్యోగ రిత్యా ఉండటంతో ఆమెకు దగ్గర కావాలని చాలామంది ఆశ పడుతుంటారు. కానీ, తను మాత్రం వాటిని పట్టించుకోకుండా వెళ్లిపోతూ ఉంటుంది. ఈ క్రమంలో 12 ఏళ్ల బాలుడు రెనాటో కూడా ఆమెను ఇష్టపడుతాడు. అయితే, ఆమెను షాడోగా మాత్రమే వెంబడిస్తూ ఆమె విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. మెలేనాకు దగ్గర కావాలని కలలు కంటూ ఉంటాడు. ఇంతలో ఆమె భర్త మరణించారని వార్త రావడంతో ఆమెకు చాలా ఇబ్బందులు ఎదురౌతాయి.. వాటిని అధిగమించేందుకు ఆమె ఒక వేశ్యగా మారుతుంది. దీంతో నగరంలోని చాలామంది మహిళలు ఆమెను దూషించడం జరుగుతుంది. ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్న ఆమె ముందుకు ఒకరోజు సడెన్‌గా తన భర్త ప్రత్యక్షమౌతాడు. తాను మరణించలేదని, ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్తాడు. అయితే, ఒక వేశ్యగా మారిన ఆమెతో అతను కలిసి జీవిస్తాడా..? ఆమె ఎందుకు అలాంటి పని చేయాల్సి వచ్చింది..? ఆమెకు 12 ఏళ్ల రెనాటో చేసిన సాయం ఏంటి..? వంటి అంశాలతో పాటు సమాజంలో ఒంటరి మహిళ పట్ల ఉన్న అభిప్రాయాలు ఎలా ఉంటాయో ఇందులో చక్కడ చూపారు. ఈ కథ అంతా 1940 నాటి కాన్సెప్ట్‌తో చిత్రీకరించారు. -
ఓటీటీలో 'మజాకా'.. స్ట్రీమింగ్ వైరల్
సందీప్ కిషన్(Sundeep Kishan) హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపోందిన సినిమా ‘మజాకా’(Mazaka) . ఫిబ్రవరి 26న విడుదలైన ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ‘మజాకా’ నవ్వుల కోసమే... లాజిక్స్ కోసం కాదని చెప్పినట్లుగాను ఈ మూవీ ఉంటుంది. పూర్తి వినోదాన్ని అందించిన ఈ చిత్రంలో రావు రమేశ్( Rao Ramesh), రీతూవర్మ(Ritu Varma), అన్షు ప్రధాన పాత్రలలో నటించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేశ్ దండా, నిర్మాత అనిల్ సుంకర తెరకెక్కించారు.మజాకా సినిమా జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 28న ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు నెట్టింట ఒక పోస్టర్ వైరల్ అవుతుంది. సినిమా వినోదాత్మకంగా ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కూడా సందీప్ కిషన్, 'మన్మథుడు' పేమ్ అన్షు భారీగానే కష్టపడ్డారు. అయినప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 20 కోట్ల మేరకు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఓటీటీ డీల్ మాత్రం మంచి ధరకే కుదిరినట్లు తెలుస్తోంది.కథేంటంటే.. వెంకటరమణ అలియాస్ రమణ(రావు రమేశ్) ఓ ప్రైవేట్ ఉద్యోగి. అతని కొడుకు కృష్ణ(సందీప్ కిషన్) ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం కోసం వెతుకుతుంటాడు. రమణ మాత్రం ఇంట్లో ఆడదిక్కు లేదని.. కొడుక్కి త్వరగా పెళ్లి చేసి ఓ ఫ్యామిలీ ఫోటోని ఇంట్లో పెట్టుకోవాలని ఆశ పడుతుంటాడు. కానీ..ఆడదిక్కు లేని ఇంటికి పిల్లని ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రారు. దీంతో పెళ్లిళ్ల బ్రోకర్ ఇచ్చిన సలహాతో ముందుగా తానే పెళ్లి చేసుకొని..ఆ తర్వాత కొడుక్కి పిల్లని వెతుకుదామని ఫిక్స్ అవుతాడు. అదే సమయంలో బస్‌స్టాఫ్‌లో యశోద(అన్షు)ని చూసి ఇష్టపడతాడు.మరోవైపు కృష్ణ కూడా మీరా(రీతూవర్మ)తో ప్రేమలో పడతారు. ఇలా తండ్రికొడుకులిద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ఒకేసారి ప్రేమలో పడిపోతారు. వీరిద్దరి ప్రేమలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి? ఇంజనీరింగ్ చదివే కొడుకు ఉన్న రమణ ప్రేమను యశోద ఎలా ఒప్పుకుంది? పగతో రగిలిపోయే వ్యాపారవేత్త భార్గవ్ వర్మ(మురళీ శర్మ)తో వీరిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? చివరకు తండ్రికొడుకుల ఆశపడినట్లు ఇంట్లోకి ఫ్యామిలీ ఫోటో వచ్చిందా రాలేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలో ధనుష్ ఫస్ట్ హాలీవుడ్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
కోలీవుడ్ టాప్ హీరో ధనుష్ (Dhanush) నటించిన తొలి హాలీవుడ్ మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తుంది. 2019లో ఆయన నటించిన ‘ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ (The Extraordinary Journey of the Fakir) ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రం ‘యాపిల్ టీవీ+’లో ఇంగ్లీష్ వర్షన్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ప్రస్తుతం తెలుగులో అందుబాటులో రానుందన ఆహా ప్రకటించింది.ధనుష్ నటించిన ఈ చిత్రం ఆరేళ్ల తర్వాత ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ‘ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ చిత్రాన్ని మార్చి 26న తమ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల చేస్తున్నట్లు ఆహా ప్రకటించింది. అయితే, ‘ఆహా గోల్డ్’ సబ్స్క్రిప్షన్ ఉంటే ఈ నెల 25 నుంచే ఈ మూవీని చూడొచ్చని ఆ సంస్థ తెలిపింది. ఆహా గోల్డ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఈ మూవీని 24 గంటలు ముందుగానే చూడొచ్చు.కేవలం 92 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రాన్ని కెన్ స్కాట్ డైరెక్ట్ చేశాడు. రూ. 175 కోట్ల బడ్జెట్ తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజ్టార్గా మిగిలిపోయింది. కేవలం రూ. 30 కోట్ల వరకు మాత్రమే ఈ చిత్రం రాబట్టింది. ఈ చిత్రంలో అజాతశత్రు లవష్ పటేల్ అనే ఓ మెజీషియన్‌గా తన నటనతో ధనుష్ మెప్పించినప్పటికీ.. కథలో సరైన బలం లేకపోవడంతో ఫలితం దక్కలేదు.ముంబయికి చెందిన అజాతశత్రు అలియాస్ లవశ్ పటేల్‌గా ధనుష్ ఒక స్ట్రీట్ మెజీషియన్‌గా ఇందులో నటించారు. తనకు మ్యాజికల్ పవర్స్ ఉన్నాయని చెబుతూ అందరినీ నమ్మిస్తుంటాడు. ఈ క్రమంలో తన తల్లి మరణించడంతో తన తండ్రి కోసం పారిస్ వెళ్తాడు. అక్కడ ఒక యువతితో ప్రేమలో పడిన అజాతశత్రుకు ఊహించని ప్రమాదంలో చిక్కుకుంటాడు. అక్కడి నుంచి ఎలా బయటపడ్డాడు..? ఇష్టపడిన అమ్మాయితో ప్రేమ ఫలిస్తుందా..? తన తండ్రిని కలుస్తాడా..? అనేది సినిమాలో చూడండి.Dhanush’s #TheExtraordinaryJourneyOfTheFakir is streaming from Mar 26 on AHA. pic.twitter.com/s2gMrbxDFL— Christopher Kanagaraj (@Chrissuccess) March 22, 2025 -
ఓ తండ్రి కథ
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తెలుగు చిత్రం రామం రాఘవం ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.తల్లిదండ్రులకు పిల్లల మీద ఉండేది మమకారం. వారి మాట వినకూడదని పిల్లల మూర్ఖత్వం. జన్మనిచ్చిన తల్లి... జీవితాన్నిచ్చే తండ్రి తమ కన్నపిల్లల బంగారు భవిష్యత్తు కోసమే కాస్తంత కటువుగా మారతారు. ఆ కటుత్వం మాటున ఆప్యాయత, అనురాగాలుంటాయి. అవి అర్థం చేసుకోని పిల్లలు ఎంతో నష్టపోతారు. ఆ నేపథ్యంలో వచ్చిన సినిమానే ‘రామం రాఘవం’. తల్లి ప్రేమ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. తండ్రి ప్రేమను ఇంత లోతుగా చూపించిన సినిమా ఇదే. ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు సముద్రఖని అందించిన ఈ కథకు నటుడు ధన్‌రాజ్ దర్శకత్వం వహించారు. ‘రామం రాఘవం’ అనేది పిల్లలకు పెద్దలు చెప్పిన పాఠం అయితే, పిల్లలకు ఇదో గుణపాఠం. అంతలా ఏముందీ సినిమాలో ఓ సారి చూద్దాం. దశరథ రామం కోనసీమ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఓ నిజాయితీ గల అధికారి. తనలాగే తన కొడుకు రాఘవను నీతీ నిజాయితీతో నిండిన మంచి వ్యక్తిలా తీర్చిదిద్దాలనుకుంటాడు. కానీ రాఘవ చదువు కూడా కనీసం సరిగ్గా చదువుకోకుండా ఇంటా బయటా తండ్రికి తలవంపులు తెస్తుంటాడు.అంతేకాదు తనను మందలించిన తండ్రి మీద విపరీతమైన ద్వేషాన్ని పెంచుకుని ఆఖరికి తన తండ్రి అడ్డు తొలగించుకోవాలి అనుకుంటాడు. రాఘవ చేసిన ప్రతి తప్పును క్షమించి కాస్తంత మందలిస్తూ అంతులేని బాధను అనుభవిస్తుంటాడు రామం. ఆఖరికి రాఘవ తన తండ్రి కోసం చేసిన ప్రయత్నమేంటి? దాని వల్ల రాఘవ పొందిన లాభం ఏంటి? అన్నది మాత్రం ఓటీటీ వేదికైన సన్ నెక్ట్స్‌లో చూడాల్సిందే. నటుడిగా ధన్‌రాజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం.మరీ ముఖ్యంగా కామెడీ పాత్రలతో ప్రేక్షకులను బాగానే మెప్పించారు. నటుడిగా ధన్‌రాజ్ నాణేనికి ఓ వైపు మాత్రమే, ఈ సినిమాతో ధన్‌రాజ్ తన దర్శకత్వ ప్రతిభను ఘనంగా చాటారనే చెప్పుకోవాలి. ఓ పక్క కథను అందించి, కథలోని తండ్రి పాత్రకు ఊపిరి పోసింది సముద్రఖని అయితే మరో పక్క అదే కథకు దర్శకత్వం వహించి, కొడుకు పాత్రలో ఒదిగిపోయి ఆ కథకు జీవితాన్నిచ్చింది ధన్‌రాజ్.కొన్ని సినిమాలు ఆనందం కోసం చూస్తాం. ఇలాంటి సినిమాలు మాత్రం మన జీవితం కోసం చూడాలి. మరీ ముఖ్యంగా మీ తల్లిదండ్రుల కోసం చూడాలి. వీలైతే మీ తల్లిదండ్రులతో కలిసి ఈ ‘రామం రాఘవం’ చూడండి. – హరికృష్ణ ఇంటూరు -
మా సినిమాను ఓటీటీలు తిరస్కరించాయి.. ఎందుకంటే?: జాన్ అబ్రహం
బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం ఇటీవలే ఓ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. శివమ్ నాయర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ది డిప్లొమాట్ ఈనెలలోనే థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో విడుదలైన తొలివారంలోనే రూ.20 కోట్ల మార్క్ చేరుకునేందుకు దగ్గరలో ఉంది. ఈ సందర్భంగా హీరో జాన్ అబ్రహం ఓ ఆసక్తకర విషయాన్ని పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూకు హాజరైన జాన్ తన మూవీని కొనేందుకు ఎవరూ కూడా ముందుకు రాలేదని అన్నారు. స్టూడియోలతో పాటు ఓటీటీలు కూడా ఆసక్తి చూపలేదని వెల్లడించారు.ది డిప్లొమాట్పై జాన్ అబ్రహం మాట్లాడుతూ..'మొదట మా సినిమా స్టూడియోలు నమ్మలేదు. కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఓటీటీలను సంప్రదిస్తే వారు కూడా తిరస్కరించారు. ఎందుకంటే మా సినిమాను తక్కువ అంచనా వేశారు. ఎందుకంటే ఈ సినిమా నిర్మించిన నిర్మాణ సంస్థ సామర్థ్యంపై వారికి నమ్మకం లేదు. అందువల్లే మా సినిమాపై వారికి ఎలాంటి అంచనాలు లేవు. అయితే థియేటర్లలో రిలీజైన తర్వాత వారి నిర్ణయం తప్పు అని నిరూపించాం. జీరో నుంచి మొదలై ప్రేక్షకుల అభిమానం సాధించాం. మా చిత్రంపై సున్నా అంచనాలు ఉండటమే మాకు కలిసొచ్చింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత కొంతమంది వచ్చి గత పదేళ్లలో ఈ బ్యానర్లో ఉత్తమ చిత్రం ఇదే అని అన్నారని' వెల్లడించారుకాగా.. ది డిప్లొమాట్ చిత్రాన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించారు. భారతీయ దౌత్యవేత్త జేపీ సింగ్ జీవితం ఆధారంగా వచ్చిన ఈ సినిమాలో ఆయన పాత్రలో జాన్ కనిపించాడు. ఈ మూవీలో సాదియా ఖతీబ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని జాన్స్ జేఏ ఎంటర్టైన్మెంట్తో పాటు టీ సిరీస్, ఫార్చ్యూన్ పిక్చర్స్, సీతా ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. మార్చి 14న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.19 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. -
ఓటీటీలోకి వచ్చేసిన సుకుమార్ కూతురి సినిమా
'పుష్ప' సినిమాలతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ సుకుమార్(Director Sukumar)కి ఇద్దరు పిల్లలున్నారు. ఒకరు అబ్బాయి కాగా, సుకృతి (Sukrithi) అనే కుమార్తె కూడా ఉంది. ఈమె ప్రధాన పాత్రలో ఓ సినిమాలో నటించగా.. అది థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు ఆ మూవీ సడన్ గా ఓటీటీలోకి వచ్చేసింది.సుకుమార్ కూతురు సుకృతి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'గాంధీతాత చెట్టు' (Gandhi Tatha Chettu Movie ). ఇందులో ఈమె స్టూడెంట్ గా నటించింది. సుకుమార్ భార్య బబితనే మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి నిర్మించింది. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 24న థియేటర్లలో రిలీజైంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 9 సినిమాలు)ఈ సినిమాలో కంటెంట్ పర్లేదనే టాక్ వచ్చింది కానీ సంక్రాంతికి రిలీజైన మూవీస్ వల్ల 'గాంధీతాత చెట్టు' అనే చిత్రం ఒకటి రిలీజైందని తెలియనంత వేగంగా థియేటర్లలోకి వచ్చి వెళ్లిపోయింది. అలాంటిది దాదాపు రెండు నెలల తర్వాత ఇప్పుడు సడన్ గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఆసక్తి ఉంటే ఓ లుక్కేయండి.'గాంధీతాత చెట్టు' విషయానికొస్తే.. నిజామాబాద్ జిల్లా అడ్లూర్. గాంధీ మహాత్ముడి గుర్తుగా రామచంద్రయ్య (ఆనంద చక్రపాణి) ఓ చెట్టు నాటుతాడు. ఎప్పుడూ ఆ చెట్టు చెంతనే గడుపుతూ, అందులోనే తన ప్రాణం ఉందని చెబుతుంటాడు. గాంధీ సిద్ధాంతాల్ని నమ్మి అనుసరించే ఆయన... తన మనవరాలికి గాంధీ (సుకృతి) అని పేరు పెడతాడు. పేరే కాదు, గాంధీ సిద్ధాంతాల్ని బోధిస్తూ పెంచుతాడు. ఊరిలోనూ, కుటుంబంలోనూ చోటు చేసుకున్న పరిణామాల కారణంగా రామచంద్రయ్య తన భూమికి, చెట్టుకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడుతాయి. తర్వాత ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: బెట్టింగ్ ప్రమోషన్స్: ఒక్కో వీడియోకు ఎంత రెమ్యునరేషన్..?) -
ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 9 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి పెళ్లి కాని ప్రసాద్, టుక్ టుక్ తదితర కొత్త సినిమాలతో పాటు సలార్, ఎవడే సుబ్రమణ్యం లాంటి పాత మూవీస్ రీ రిలీజ్ అయ్యాయి. మరోవైపు ఓటీటీలోకి రెండు రోజుల్లో 12 మూవీస్ వచ్చేశాయి.(ఇదీ చదవండి: బెట్టింగ్ ప్రమోషన్స్: ఒక్కో వీడియోకు ఎంత రెమ్యునరేషన్..?)ఓటీటీల్లోకి ఈ శుక్రవారం వచ్చిన వాటిలో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ ఉన్నంతలో కాస్త ఆసక్తి కలిగిస్తుంది. అలానే ఆఫీసర్ ఆన్ డ్యూటీ, బ్రహ్మానందం మూవీస్ కూడా మీరు ప్రయత్నించొచ్చు. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీస్ ఉన్నాయంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజైన మూవీస్ (మార్చి 21)నెట్ ఫ్లిక్స్రిట్నర్ ఆఫ్ ద డ్రాగన్ - తెలుగు సినిమాలిటిల్ సైబీరియా - ఫినిస్ మూవీరివిలేషన్స్ - కొరియన్ సినిమాఆఫీసర్ ఆన్ డ్యూటీ - తెలుగు డబ్బింగ్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)ఖాకీ: ద బెంగాల్ ఛాప్టర్ - హిందీ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతుంది)అమెజాన్ ప్రైమ్నిలవుకు ఎన్ మేల్ ఎన్నాడీ కోబమ్ - తమిళ సినిమాస్కై ఫోర్స్ - హిందీ మూవీహాట్ స్టార్కన్నెడ - హిందీ సిరీస్ఆహాబ్రహ్మానందం - తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)రింగ్ రింగ్ - తమిళ మూవీ సన్ నెక్స్ట్బేబీ అండ్ బేబీ - తమిళ సినిమాఆపిల్ ప్లస్ టీవీబార్బరిక్ - ఇంగ్లీష్ సిరీస్(ఇదీ చదవండి: Tuk Tuk Movie: ‘టుక్ టుక్’ మూవీ రివ్యూ) -
తెలుగులో మిస్టరీ థ్రిల్లర్.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమాలు, సిరీసులు నేరుగా వీటిల్లో రిలీజ్ అవుతున్నాయి. కాకపోతే వాటిలో చాలా తక్కువ మాత్రమే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయని చెప్పొచ్చు. ఇక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ కి అయితే సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అలా ఈ జానర్ లో తీసిన లేటెస్ట్ సిరీస్ 'టచ్ మీ నాట్'. తాజాగా దీని ట్రైలర్ రిలీజ్ చేయండంతో పాటు స్ట్రీమింగ్ డేట్ కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు సినిమా)నవదీప్, దీక్షిత్ శెట్టి ('దసరా' ఫేమ్) కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ట్రైలర్ బట్టి చూస్తే.. స్కూల్ చదివే ఓ కుర్రాడి.. శవాన్ని ముట్టుకుని ఎవరు హత్య చేశారో చెప్పే అద్బుతమైన శక్తి ఉంటుంది. మరోవైపు పోలీస్ పాత్ర పోషించిన నవదీప్ మాత్రం ఈ కుర్రాడిపై కాస్త సందేహంగానే ఉంటాడు. మరి హంతకుడిని పట్టుకున్నారా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది.హాట్ స్టార్ లో ఈ సిరీస్ ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. రీసెంట్ టైంలో ఈ ఓటీటీలో వచ్చిన సిరీస్ లు పెద్దగా క్లిక్ కాలేదని చెప్పొచ్చు. మరి 'టచ్ మీ నాట్' ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?) -
ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు సినిమా
చాన్నాళ్ల తర్వాత బ్రహ్మానందం కీలక పాత్రలో నటించిన సినిమా 'బ్రహ్మానందం'. ఇందులో బ్రహ్మీతో పాటు ఆయన తనయుడు రాజా గౌతమ్, వెన్నెల తదితరలు నటించారు. గత నెలల థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?)బ్రహ్మానందం సినిమాని తాత-మనవడు మధ్య జరిగే ఎమోషనల్ కంటెంట్ తో తీశారు. కథ పరంగా బాగానే అనుకున్నారు కానీ సినిమాగా రిలీజ్ చేసిన తర్వాత ఎందుకో జనానికి సరిగా కనెక్ట్ కాలేదు. ఇలాంటివి ఓటీటీలో క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఆహా ఓటీటీలో గోల్డ్ యూజర్స్ కోసం స్ట్రీమింగ్ అవుతోంది. రేపటి (మార్చి 20) నుంచి యూజర్స్ అందరికీ అందుబాటులోకి వస్తుంది.'బ్రహ్మానందం' విషయానికొస్తే.. నటుడు కావాలనుకునే బ్రహ్మా (రాజా గౌతమ్).. ఢిల్లీలో నాటకం వేయాలని అనుకుంటాడు. కానీ దీనికి డబ్బులివ్వాల్సి ఉంటుంది. దీంతో తాత ఆనంద్ రామ్మూర్తి (బ్రహ్మానందం) పేరిట ఉన్న భూమి అమ్మాలని అడుగుతాడు. దీనికి తాత ఒప్పుకొంటాడు కానీ కొన్ని షరతులు పెడతాడు. ఇంతకీ అవేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: నటనకు గుడ్ బై.. హేమ ఇప్పుడేం చేస్తుంది?) -
ధనుశ్ డైరెక్షన్లో లవ్ స్టోరీ.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
పవిష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'జాబిలమ్మ నీకు అంత కోపమా'(తమిళంలో నిలవుకు ఎన్ మెల్ ఎన్నాడి కోబం). ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ (Dhanush) దర్శకత్వం వహించారు. ఈ మూవీ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీ గతనెల ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి బ్యానర్లో రిలీజ్ చేశారు.(ఇది చదవండి: ధనుశ్ డైరెక్షన్లో లవ్ ఎంటర్టైనర్.. ట్రైలర్ చూశారా?)అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈనెల 21 నుంచి అందుబాటులోకి తీసుకు రానున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనర్హన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. ఈ సినిమాను వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్లో స్తూరి రాజా, విజయలక్ష్మి కస్తూరి రాజా నిర్మించిన సంగతి తెలిసిందే. -
నేరుగా ఓటీటీకి మీరా జాస్మిన్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్స్ మీరా జాస్మిన్, నయనతార నటించిన చిత్రం 'ది టెస్ట్'. ఈ సినిమాతో నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో మాధవన్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్ చేశారు. చెన్నైలో జరిగిన ఓ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే కథనంతో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. వైనాట్ స్టూడియోస్ బ్యానర్లో ఈ మూవీని తెరకెక్కించారు.అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. మీరా జాస్మిన్ ఫోటోలు షేర్ చేస్తూ స్ట్రీమింగ్ డేట్‌ను రివీల్ చేసింది. ఏప్రిల్ 4వ తేదీ నుంచి టెస్ట్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు పోస్ట్ చేసింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీలో కూడా అందుబాటులో ఉండనుందని ట్విటర్ ద్వారా తెలిపింది.ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీరా జాస్మిన్ తెలుగువారికి సుపరిచితమే. రవితేజ భద్ర సినిమాతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. టాలీవుడ్లో గుడుంబా శంకర్, రారాజు, ఆకాశ రామన్న, గోరింటాకు, బంగారు బాబు, మహారథి లాంటి చిత్రాల్లో కనిపించింది. అయితే కొన్నేళ్లపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మీరా.. ఆ తర్వాత విమానం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం టెస్ట్ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది.Some things change, but our love for Meera Jasmine? Never 🥰Watch TEST, out 4 April in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi, only on Netflix!#TestOnNetflix pic.twitter.com/Sm1Neb2B4t— Netflix India South (@Netflix_INSouth) March 18, 2025 -
ఓటీటీలో హిట్ సినిమా 'డ్రాగన్' ఎంట్రీ
లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ నటించిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ (Return Of The Dragon) ఓటీటీ ప్రకటన అధికారికంగా వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 21న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అశ్వత్ మారిముత్తు, నిర్మాత అర్చనా కల్పతిలను డైరెక్టర్ శంకర్ కూడా మెచ్చుకున్నారు. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ సైతం ఈ మూవీని మెచ్చుకున్నారు.తెలుగు,తమిళ్,మలయాళం,కన్నడలో మార్చి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు పోస్టర్‌ను విడుదల చేశారు. కేవలం రూ. 35 కోట్లతో తెరకెక్కించిన డ్రాగన్ బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్ల మార్క్ కలెక్షన్లకు దగ్గరగా ఉంది. ‘లవ్‌టుడే’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రదీప్ రంగనాథన్ ఈ చిత్రంతో మరోసారి హిట్ అందుకున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ కీలకపాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.కథేంటి..?డి.రాఘవన్(ప్రదీప్ రంగనాథన్)(Pradeep Ranganathan) ఇంటర్మీడియట్లో 96 శాతం మార్కులతో పాస్ అయిన తర్వాత తాను ఇష్టపడిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆమె తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని చెబుతూ అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దీంతో రాఘవన్ బ్యాడ్ బాయ్‌గా మారిపోయి బీటెక్‌లో 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. రెండేళ్ల పాటు ఖాలీగా ఉండడంతో కాలేజీలో తనను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్)(Ashwath Marimuthu) బ్రేకప్ చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.దీంతో జీవితంలో ఎలాగైన సక్సెస్ కావాలని ఫేక్ సర్టిఫికేట్స్ వల్ల మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తనకున్న తెలివితో పెద్ద పొజిషియన్‌కి వెళ్తాడు. ఇల్లు, కారు కొంటాడు. బాగా ఆస్తులు ఉన్న అమ్మాయి పల్లవి (కయాదు లోహర్)తో పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుంది. లైఫ్ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఫేక్ సర్టిఫికెట్స్ గురించి ప్రిన్సిపల్‌కి తెలుస్తుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలౌతుంది. డ్రాగన్‌కు ప్రిన్సిపల్ పెట్టే కండీషన్స్ ఏంటి..? బీటెక్‌లో 48 సబ్జెక్టులను ఎలా పూర్తి చేశాడు. కాలేజీ డేస్‌లో తను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్) మరోసారి ఆయన జీవితంలోకి ఎందుకొస్తుంది..? ఉద్యోగం ఉందని చెప్పి పెళ్లి సెట్ చేసుకున్న పల్లవితో ఏడడుగులు వేస్తాడా..? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలో అదరగొట్టే సినిమా.. తెలుగులో కూడా స్ట్రీమింగ్
సోషల్‌మీడియాలో కొద్దిరోజుల క్రితం చైనాకు సంబంధించిన 'ట్విలైట్ ఆఫ్ ది వారియర్స్: వాల్డ్ ఇన్' ఈ సినిమా బాగా వైరల్ అయింది. గత ఏడాదిలో విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే ఈ చిత్రం భారత్ మినహా అన్ని దేశాల్లో ఓటీటీలో విడుదలైంది. ఇప్పుడు ఇండియాలో కూడా ఈ మూవీ స్ట్రీమింగ్కు రానున్నట్లు అధికారికంగా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మార్షల్ ఆర్ట్స్ సినిమాలతో మంచి గుర్తింపు పొందిన దర్శకుడు సోయ్ చియాంగ్ ఈ మూవీని తెరకెక్కించారు. మార్షల్ ఆర్ట్స్ సినిమాలను ఇష్టపడే వారిని ఈ మూవీ ఎంతమాత్రం నిరాశపరచదు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు.'ట్విలైట్ ఆఫ్ ది వారియర్స్: వాల్డ్ ఇన్' అమెజాన్ ప్రైమ్‌లో మార్చి 27న విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీలో కూడా స్ట్రీమింగ్ రానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం 1980ల నాటి హాంకాంగ్ నేపథ్యంలో సాగుతుంది. మాదకద్రవ్యాల సామ్రాజ్యంలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న యువకుడు ఎలాంటి పోరాటం చేశాడనేది ఇందులో ఉంటుంది. రూ. 330 కోట్ల బడ్జెట్‌తో (ఇండియన్ కరెన్సీ) తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 960 కోట్లు రాబట్టింది. హాంకాంగ్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండవ దేశీయ చిత్రంగా 'ట్విలైట్ ఆఫ్ ది వారియర్స్: వాల్డ్ ఇన్' నిలిచింది. పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో కూడా ఈ మూవీ సత్తా చాటింది. -
ఓటీటీలోకి హై వోల్టేజీ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రపంచంలోని చాలా భాషల సినిమాల్ని చూసే అవకాశం తెలుగు ప్రేక్షకులకు దక్కింది. అందుకు తగ్గట్లే ఆయా చిత్ర దర్శక నిర్మాతలు కూడా మిగతా భాషలతో పాటే తెలుగులోనూ డబ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఆస్కార్ రేసులో నిలిచిన ఓ హై వోల్టేజీ యాక్షన్ మూవీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది.(ఇదీ చదవండి: బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత రెమ్యునరేషన్?)గతేడాది మే 1న రిలీజైన యాక్షన్ మూవీ 'వాల్డ్ ఇన్'. హాంకాంగ్ తరఫున ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ పోటీల్లోకి వెళ్లింది. కానీ విజయం సాధించలేకపోయింది. దాదాపు 2 గంటల పాటు ఫుల్ ఆన్ యాక్షన్ సీన్లతో ఉండే ఈ మూవీని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషల్లో ఈ మూవీ మార్చి 27 నుంచి అందుబాటులోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. ఒకవేళ యాక్షన్ సినిమాలంటే ఇష్టముండి, తెలుగు డబ్బింగ్ తో చూడగలరనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. ఓ పాడుబడ్డ సిటీలో డ్రగ్స్ సామ్రాజ్యం బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ మూవీ తీశారు.(ఇదీ చదవండి: రూ.100 కోట్ల ఖరీదైన ఇల్లు కొన్న నయన్.. ఫోటోలు వైరల్) -
ఓటీటీలో భారీ యాక్షన్ మూవీ.. ఆ రోజు నుంచి ఫ్రీగా చూడొచ్చు
బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ నటించిన చిత్రం స్కై ఫోర్స్. ఈ యాక్షన్ మూవీని దర్శక ద్వయం సందీప్ కెవ్లానీ– అభిషేక్ అనిల్ కపూర్ తెరకెక్కించారు. జియో స్టూడియోస్, మాడ్డాక్ ఫిల్మ్స్, లియో ఫిల్మ్స్ యూకే ప్రొడక్షన్స్ పతాకాలపై జ్యోతి దేశ్‌పాండే, అమర్ కౌశిక్, భౌమిక్, దినేశ్ విజన్ దాదాపు రూ. 160 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. 1965లో జరిగిన ఇండియా–పాకిస్తాన్ వార్ నేపథ్యంలో భారతదేశపు మొదటి వైమానిక దాడి సంఘటనల ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. భారీ అంచనాల మధ్య రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకు వరకు కలెక్షన్లు రాబట్టింది.ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం రెంటల్ పద్ధతిలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ మూవీని చూడాలంటే అదనంగా రూ.249 అద్దె చెల్లించాల్సిందే. ఈ మూవీ కేవలం హిందీ వర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. సబ్‌టైటిల్స్‌తో ఇతర భాషల వారు కూడా చూడొచ్చు.అయితే ఈ సినిమాను ప్రేక్షకులకు ఉచితంగా అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. ఈనెల 21 నుంచి ఉచితంగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. కాగా... ఈ సినిమాలో వీర్ పహారియా, సారా అలీఖాన్, నిమ్రత్ కౌర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో కమాండర్ కేవో అహుజా పాత్రలో అక్షయ్ కుమార్, టి. విజయ పాత్రలో వీర్ పహారియా నటించారు. -
థియేటర్లో సినిమాల జోరు.. ఓటీటీలో ఏకంగా 15 చిత్రాలు/సిరీస్‌లు
థియేటర్లలో చిన్న సినిమాల హవా కొనసాగుతోంది. గతవారం కోర్ట్, దిల్రూబా సినిమాలు రిలీజవ్వగా ఈవారం మరికొన్ని చిన్న సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. అటు ఓటీటీలోనూ హిట్ చిత్రాలు, సిరీస్‌లు రిలీజయ్యేందుకు రెడీ అయ్యాయి. మరి ఈ వారం (మార్చి 17 నుంచి 23 వరకు) అటు థియేటర్లో, ఇటు ఓటీటీ (OTT)లో విడుదలయ్యే సినిమాలేంటో చూసేద్దాం..థియేటర్లో రిలీజయ్యే సినిమల జాబితా..🎥 షణ్ముఖ - మార్చి 21🎥 పెళ్లి కాని ప్రసాద్ - మార్చి 21🎥 కిస్ కిస్ కిస్సిక్ - మార్చి 21🎥 టుక్ టుక్ - మార్చి 21🎥 అనగనగా ఆస్ట్రేలియాలో - మార్చి 21🎥 ఆర్టిస్ట్ - మార్చి 21🎥 ది సస్పెక్ట్ - మార్చి 21ఇవే కాకుండా రెండు సూపర్ హిట్ సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయి. మార్చి 21న ప్రభాస్ 'సలార్: సీజ్ ఫైర్', నాని, విజయ దేవరకొండల 'ఎవడే సుబ్రహ్మణ్యం' చిత్రాలు ఎంపిక చేసిన థియేటర్లలో ప్రదర్శితం కానున్నాయి.ఓటీటీ విషయానికి వస్తే..నెట్ఫ్లిక్స్విమెన్ ఆఫ్ ది డెడ్ 2 (వెబ్ సిరీస్) - మార్చి 19ఆఫీసర్ ఆన్ డ్యూటీ - మార్చి 20బెట్ యువర్ లైఫ్ (వెబ్ సిరీస్) - మార్చి 20ఖాకీ: ది బెంగాల్ చాప్టర్ (వెబ్ సిరీస్) - మార్చి 20ది రెసిడెన్స్ (వెబ్ సిరీస్)- మార్చి 20లిటిల్ సైబీరియా - మార్చి 21రివిలేషన్స్ - మార్చి 21జియో హాట్స్టార్అనోరా (ఆస్కార్ విన్నింగ్ మూవీ) - మార్చి 17గుడ్ అమెరికన్ ఫ్యామిలీ (వెబ్ సిరీస్) - మార్చి 19కన్నెడ (వెబ్ సిరీస్) - మార్చి 21విక్డ్ - మార్చి 22ఆహాబ్రహ్మా ఆనందం - మార్చి 20అమెజాన్ ప్రైమ్డూప్లిసిటీ - మార్చి 20స్కై ఫోర్స్ - మార్చి 21అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్లూట్ కాంట్ (వెబ్ సిరీస్) - మార్చి 20చదవండి: అనారోగ్యంతో నటి 'బిందు' మృతి.. చివరిరోజుల్లో.. -
తండేల్‌ను వెనక్కి నెట్టిన ఎమర్జన్సీ.. సిల్లీ ఆస్కార్ అంటూ కంగనా కామెంట్స్!
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో నటించి, స్వీయదర్శకత్వం వహించిన చిత్రం ఎమర్జెన్సీ (Emergency Movie). చాలాసార్లు వాయిదాపడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు ఈ ఏడాది జనవరి 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.21 కోట్లు మాత్రమే రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ మూవీలో కంనగా ఇందిరా గాంధీ పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది.ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆడియన్స్‌ను అలరిస్తోంది. బాక్సాఫీస్ వద్ద విఫలమైన ఈ సినిమా ఓటీటీలో దూసుకెళ్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఇండియన్ సినిమాల జాబితాలో టాప్ ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతోంది. నాగచైతన్య మూవీ తండేల్, అజయ్ దేవగణ్ ఆజాద్ సినిమాలను వెనక్కి నెట్టేసింది.ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్స్ ఎమర్జన్సీ చిత్రాన్ని ఉద్దేశించి ట్వీట్స్ చేశారు. ఈ చిత్రాన్ని భారత్ నుంచి ఆస్కార్ పంపాలని పోస్ట్ చేశాడు. వీటికి సోషల్ మీడియా వేదికగా కంగనా రిప్లై ఇచ్చింది. ఇన్‌స్టా లో ట్వీట్స్‌ను షేర్ చేస్తూ తనదైన శైలిలో స్పందించింది. అమెరికా లాంటి దేశం ఇలాంటి సినిమాలను గుర్తించడానికి ఇష్టపడరు. వారు అభివృద్ధి చెందుతున్న దేశాలను అణచివేస్తారు. అదే ఈ ఎమర్జన్సీలో చూపించాను. వారి సిల్లీ ఆస్కార్ అవార్డ్‌ను వాళ్ల వద్దే ఉంచుకోనివ్వండి. మాకు నేషనల్ అవార్డులు ఉన్నాయని నెటిజన్‌కు రిప్లై ఇచ్చింది.బాలీవుడ్ చిత్ర నిర్మాత సంజయ్ గుప్తా కూడా ఈ చిత్రాన్ని ప్రశంసించారు. ఈ రోజు నేను ఎమర్జెన్సీ మూవీని చూశాను. చాలా స్పష్టంగా చెప్పాలంటే.. నేను ముందుగా అంచనా వేసినట్లుగా ఈ సినిమాను ప్లాన్ చేయలేదని అన్నారు. ఈ సినిమాలో కంగనా నటన, దర్శకత్వం రెండూ అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. దీనికి కంగనా బదులిస్తూ 'సినిమా పరిశ్రమ తన ద్వేషం, పక్షపాతాల నుంచి బయటపడాలి.. మంచి పనిని ఎప్పటికీ గుర్తించాలి సంజయ్ జీ.. మీరు ఆ అడ్డంకిని బద్దలు కొట్టినందుకు ధన్యవాదాలు అని పోస్ట్ చేసింది.కాగా.. నెట్‌ఫ్లిక్స్‌లో శుక్రవారం విడుదలైన ఎమర్జెన్సీ మూడు రోజుల్లోనే నెట్‌ఫ్లిక్స్ సినిమాల జాబితాలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. అజయ్ దేవగన్ ఆజాద్, నాగ చైతన్య తండేల్ చిత్రాలను అధిగమించింది. ఈ చిత్రం కంగనా రనౌత్ మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో నటించారు. 1975లో అప్పటి ప్రధానమంత్రి విధించిన 21 నెలల ఎమర్జెన్సీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్, మిలింద్ సోమన్, దివంగత నటుడు సతీష్ కౌశిక్ కూడా నటించారు. ఈ మూవీని జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి. -
నాని టైమ్ నడుస్తోంది.. ఈసారి రూ.54 కోట్ల డీల్!
ఇండస్ట్రీలో ఏ హీరోకి అయినా హిట్ ఫ్లాప్స్ సాధారణం. కానీ గత కొన్నేళ్లుగా వరస సినిమాలతో విజయాల్ని అందుకుంటున్న హీరోల్లో నాని ఒకడు. ఓవైపు హీరోగా హిట్స్ కొడుతూనే మరోవైపు నిర్మాతగానూ సూపర్ సక్సెస్ అందుకుంటున్నాడు. రీసెంట్ హిట్ 'కోర్ట్'.. నాని ప్రొడక్షన్ నుంచి వచ్చిందే.(ఇదీ చదవండి: హీరోయిన్ అమలాపాల్ కి ఖరీదైన కారు గిఫ్ట్.. రేటు ఎంతో తెలుసా?)ప్రస్తుతం తెలుగులో చాలా సినిమాలకు ఓటీటీ డీల్స్ జరగట్లేదు. దీంతో ఫైనల్ కాపీ సిద్ధమైన విడుదలకు నోచుకోవట్లేదు. అదే టైంలో నాని సినిమాలకు మాత్రం రిలీజ్ కి చాలారోజుల ముందే ఓటీటీ డీల్స్ క్లోజ్ అయిపోతున్నాయి. 'కోర్ట్'ని ఏకంగా రూ.8 కోట్లకు నెట్ ఫ్లిక్స్ తీసుకుందని టాక్.రీసెంట్ గా నాని హీరోగా 'ద ప్యారడైజ్' మూవీని ప్రకటించారు. దీని షూటింగ్ అసలు మొదలు కాలేదు కానీ ఓటీటీ డీల్ మాత్రం రూ.65 కోట్లకు జరిగిపోయిందట. నాని ఇప్పటికే పూర్తి చేసిన 'హిట్ 3' చిత్ర ఓటీటీ హక్కుల్ని ఇదివరకే నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని ప్రకటించారు. ఇకపోతే ఈ డీల్ రూ.54 కోట్ల జరిగిందని తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదంతా చూస్తుంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో నాని టైమ్ నడుస్తోంది. పట్టిందల్లా బంగారమవుతుందనిపిస్తోంది.(ఇదీ చదవండి: హీరో విశ్వక్సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ) -
కుడుంబస్థాన్ సినిమా రివ్యూ (ఓటీటీ)
ప్రేక్షకులు ఇప్పుడు చాలావరకు భారీ బడ్జెట్ సినిమాలంటే థియేటర్లకు వెళ్తున్నారు. మిగతా చిన్న చితకా మూవీస్ ని ఓటీటీల్లో చూసేందుకు ఇష్టపడుతున్నారు. అలా పరభాషా చిత్రాల్ని డబ్ చేసి డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. అలా కొన్నిరోజుల క్రితం జీ5లోకి వచ్చిన మూవీ 'కుడుంబస్థాన్'. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: భార్యని కూడా రేసులోకి దింపిన చైతూ)కథేంటి?నవీన్ (మణికందన్) ఓ యాడ్ కంపెనీలో పనిచేస్తుంటాడు. వెన్నెల (శాన్వి మేఘన) అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. వీళ్లిద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. కులాల వేరు కావడంతో పెద్దల నుంచి చాలా వ్యతిరేకత వస్తుంది. అయినా సరే నవీన్.. వెన్నెలని ఇంటికి తీసుకెళ్తాడు. అనుకోని పరిస్థితుల్లో ఓ రోజు నవీన్ ని ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఈ విషయం ఇంట్లో చెబితే ఇబ్బంది అవుతుందని దాన్ని దాచేందుకు చాలా ఇబ్బందులు పడతాడు. మోసానికి కూడా గురవుతాడు. మరి నవీన్ గురించి ఇంట్లో తెలిసిపోయిందా? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?ఇండస్ట్రీలో కథల కొరత ఉందని చాలామంది అంటూ ఉంటారు. కానీ తరచి చూస్తే మన చుట్టుపక్కలా బోలెడన్ని స్టోరీలు తారసపడతాయి. అలా ఓ మధ్య తరగతి కుర్రాడి జీవితంతో తీసిన సినిమానే 'కుడుంబస్థాన్'.నవీన్-వెన్నెల లేచిపోయి పెళ్లి చేసుకోవడంతో సినిమా మొదలవుతుంది. భార్యని ఇంట్లోకి తీసుకొస్తే.. తక్కువ కులం అమ్మాయి అని తల్లి సూటిపోటి మాటలతో దెప్పిపొడుస్తుంది. మరోవైపు తీర్థయాత్రల కోసం తల్లి.. కొడుకుని డబ్బులు అడుగుతుంది. తండ్రేమో ఇంటి బాగుచేయమని గోల చేస్తుంటారు. కొన్నాళ్లకు భార్యకు ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం తెలుస్తుంది. సరిగ్గా ఇలాంటి టైంలో ఉద్యోగం పోతుంది. తర్వాత జరిగే పరిణామాలే సినిమా.(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజైన వారానికే ఓటీటీలోకి హిట్ సినిమా)మీరు 'కుడుంబస్థాన్' చూస్తున్నంతసేపు నవ్వుతారు, భయపడతారు, ఆలోచిస్తారు. ఎందుకంటే నవీన్ పాత్రకు చాలామంది మధ్య తరగతి యువకులు రిలేట్ అవుతారు. డబ్బులు సంపాదించకపోతే తల్లి-భార్య-తండ్రి.. ఇలా ఏ ఒక్కరు గౌరవం ఇవ్వరు అనే విషయాన్ని చూపించిన విధానం మనసుకు గుచ్చుకుంటుంది.నవీన్ కి నసపెట్టే బావ ఒకడు ఉంటాడు. ఆ పాత్ర చూస్తున్నంతసేపు ఇలాంటివాడు మన ఇంట్లో ఒకడు ఉంటే అంతే సంగతిరా బాబు అనిపిస్తుంది. మరోవైపు హీరో కాస్త డబ్బులు సంపాదిద్దామని బేకరీ పెడతాడు. కొన్నాళ్లు బాగానే ఉంటుంది కానీ హీరో షాప్ ఎదురుగా మరో బేకరీ ఓపెన్ అవుతుంది. హీరో కష్టాలు మళ్లీ మొదటకొస్తాయి. సరేలే అని రియల్ ఎస్టేట్ విషయంలో ఒక కోటీశ్వరుడికి సాయం చేస్తే వాడేమో చెప్పిన దానికంటే తక్కువ డబ్బులిస్తాడు. ఇలా ప్రతిదగ్గర తన అహం వల్ల ఎలాంటి కష్టాలు పడ్డాడు. చివరకు తన అహాన్ని తీసి పక్కనబెట్టాడా లేదా అనేదే మూవీ.ఎవరెలా చేశారు?తమిళంలో మణికందన్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మధ్య తరగతి కుర్రాడిగా భలే సెట్ అవుతాడు. ఇందులోనూ నవీన్ పాత్రలో జీవించేశాడు. వెన్నెల పాత్ర చేసిన తెలుగమ్మాయి శాన్వి మేఘన కూడా సరిగ్గా సెట్ అయిపోయింది. ఇక హీరో తల్లిదండ్రులు, అక్క-బావ, ఫ్రెండ్ పాత్రధారులు తమకిచ్చిన పనికి పూర్తి న్యాయం చేశారు. సింపుల్ గా ఉంటూ నచ్చేసే ఓ ఫ్యామిలీ డ్రామా మూవీ చూడాలంటే 'కుడుంబస్థాన్' ట్రై చేయండి.-చందు డొంకాన(ఇదీ చదవండి: 'కోర్ట్'లో ఫెర్ఫార్మెన్స్ అదరగొట్టేసింది.. ఎవరీ 'జాబిలి'?) -
ఓటీటీలోకి 'బ్రహ్మానందం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ప్రస్తుతం ఒకటిఅరా అంటూ సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్యే తన పేరు మీదే తీసిన 'బ్రహ్మానందం' (Brahmanandam OTT) సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారు. ప్రమోషన్స్ బాగానే చేశారు కంటెంట్ ఓ మాదిరిగా ఉండటంతో జనాల దృష్టిలో పడలేదు.(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజైన వారానికే ఓటీటీలోకి హిట్ సినిమా)ఇకపోతే బ్రహ్మానందం సినిమా వచ్చి నెలరోజులైపోతోంది. ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ కాగా.. మార్చి 14న అంటే ఈ శుక్రవారమే వస్తుందనే హింట్ ఇచ్చారు. కానీ ఏమైందో ఏమో ఓటీటీలోకి రాలేదు. దీంతో ఏంటి విషయం అని ఆరా తీస్తే ఐదారు రోజులు ఆలస్యంగా డిజిటల్ స్ట్రీమింగ్ చేయాలని అనుకున్నట్లు తెలిసింది.అలా మార్చి 20 నుంచి ఆహా ఓటీటీలోకి 'బ్రహ్మానందం' మూవీ రానుందని క్లారిటీ ఇచ్చారు. ఇందులో బ్రహ్మానందంతో పాటు ఆయన కొడుకు రాజా గౌతమ్(Raja Gautham).. తాత-మనవడి పాత్రల్లో నటించడం విశేషం. ఫ్యామిలీ మూవీ కాబట్టి థియేటర్లలో పెద్దగా పట్టించుకోనప్పటికీ ఓటీటీలో క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది.(ఇదీ చదవండి: 'కోర్ట్' మూవీ హీరోయిన్.. ఎవరీ 'జాబిలి'?) -
థియేటర్లలో రిలీజైన వారానికే ఓటీటీలోకి హిట్ సినిమా
గత కొన్నేళ్లలో తీసుకుంటే మలయాళంలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ వస్తూనే ఉన్నాయి. కొన్నిరోజుల క్రితం 'రేఖాచిత్రం' (Rekhachithram OTT) అనే మూవీ ఓటీటీలో రిలీజై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు అలానే మరో చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. కాకపోతే థియేటర్లలో విడుదల వారానికే రాబోతుండటం విశేషం.ఓటీటీల చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమున్న కుంచకో బోబన్, ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రల్లో నటించిన థ్రిల్లర్ మూవీ 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ'(Officer On Duty OTT ). ఫిబ్రవరి 20న మలయాళంలో రిలీజై హిట్ అయింది. ఆ ఊపులోనే తెలుగులోనూ రిలీజ్ ప్లాన్ చేశారు. తొలుత మార్చి 7 అనుకుని 14వ తేదీకి వాయిదా వేశారు. తెలుగులో ఇది విడుదలైనట్లు కూడా చాలామందికి తెలియదు.(ఇదీ చదవండి: ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీ తెలుగు రివ్యూ)అలాంటిది ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. మార్చి 20 నుంచే నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని క్లారిటీ ఇచ్చారు. మలయాళ వెర్షన్ కి నెలరోజుల గ్యాప్ ఓకే కానీ తెలుగులో మరీ థియేటర్లలోకి వచ్చిన వారానికే ఓటీటీలోకి వచ్చేస్తోంది.'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' విషయానికొస్తే.. చైన్ స్నాచింగ్, ఫేక్ గోల్డ్ లాంటి కేసులను అవలీలగా ఛేదించే సీఐ హరిశంకర్(కుంచకో బోబన్) ఫేక్ గోల్డ్ కేసు ఎదురవుతుంది. ఆ కేసును సీరియస్‌గా తీసుకున్న హరిశంకర్ దర్యాప్తు ప్రారంభిస్తారు. ఆ సమయంలో సీఐ హరిశంకర్‌కు షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అంతే కాకుండా ఈ ఫేక్ గోల్డ్ కేసు కాస్తా ఓ అమ్మాయి ఆత్మహత్యకు దారితీస్తుంది. అసలు ఈ కేసుతో ఆ అమ్మాయికి గల సంబంధం ఏంటి? ఆ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుంది? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'కోర్ట్'లో ఫెర్ఫార్మెన్స్ అదరగొట్టేసింది.. ఎవరీ 'జాబిలి'?)Puthiya officer etheetund, stand in line and salute 🫡Watch Officer on Duty on Netflix, out 20 March in Malayalam, Hindi, Telugu, Tamil, Kannada#OfficerOnDutyOnNetflix pic.twitter.com/1Y8O7aK3ln— Netflix India South (@Netflix_INSouth) March 15, 2025 -
రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్!
సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ తేజ్ హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ ‘దక్ష’(Daksha). శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు వివేకానంద విక్రాంత్ దర్శకత్వం వహించారు. 2023లో థియేటర్లలో విడుదలై ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. బిసినీట్ (Bcineet OTT)తో పాటు హంగామా(Hungama OTT)లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో పాటు యూట్యూబ్‌లోనూ ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది.ఈ సందర్భంగా కో ప్రొడ్యూసర్ & యాక్టర్ తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ, ‘మాకు థియేటర్లో మంచి స్పందన లభించినట్లుగానే, ఇప్పుడు విడుదలైన ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల్లోనూ అదే స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. హారర్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు 'దక్ష' తప్పకుండా నచ్చుతుంది. దయచేసి పైరసీకి దూరంగా ఉండి, అధికారిక వేదికల ద్వారా మా సినిమాను వీక్షించండి. నిర్మాతలకు సహాయపడేలా ప్రతి రూపాయి విలువైనదని భావిస్తున్నాము. పైరసీకి పాల్పడిన కొన్ని ప్లాట్‌ఫారమ్‌లపై ఇప్పటికే కంప్లయింట్ నమోదుచేశారు’ అని తెలిపారు.దర్శకుడు వివేకానంద విక్రాంత్ మాట్లాడుతూ..‘మంచి కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్, వండర్ఫుల్ విజువల్స్ మా సినిమాకి ప్రధాన బలాలు. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు వస్తుంది’ అని తెలిపారు. -
ఇద్దరు యువతుల మధ్య ప్రేమ.. ఓటీటీలో వివాదాస్పద సినిమా
చిత్ర పరిశ్రమ ఏదైనా సరే.. బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన చిత్రాలు కచ్చితంగా చర్చనీయాంశంగా మారతాయి. అయితే సమాజంలో జరుగుతున్న ఘటనలనే తాము చిత్రాల్లో చూపిస్తున్నామన్నది దర్శక నిర్మాతల వాదనగా ఉంటుంది. కాగా లెస్బియన్ల ఇతి వృత్తంతో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. వాటి తరహాలో తాజాగా కోలీవుడ్‌లో రూపొందిన చిత్రం 'కాదల్ ఎన్నబదు పొదువుడమై'.. గతంలో లెన్స్ వంటి వైవిధ్యభరిత కథా చిత్రానికి జయప్రకాశ్ దర్శకత్వం వహించారు. ఆయన డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రమే 'కాదల్ ఎన్నబదు పొదువుడమై'.. అయితే, ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలైనప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఓటీటీలోకి సడెన్‌గా ఎంట్రీ ఇచ్చేసింది.గ్లోవింగ్ టంగ్ట్న్, మ్యాన్‌కైండ్ సినిమాస్, నిత్స్ ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రంలో జై భీమ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న లిజోమోల్ జోస్ లెస్బియన్‌గా నటించింది. తెలుగులో మంచి గుర్తింపు ఉన్న నటుడు వినీత్, రోహిణి కూడా ఈ మూవీలో కీలక పాత్రలలో కనిపించారు. ప్రేమికుల రోజు సందర్బంగా ఫిబ్రవరి 14వ తేదీన విడుదలైన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. 'టెంట్కొట్ట' ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, సబ్ టైటిల్స్‌తో కేవలం తమిళ వర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ చిత్రంపై నటి జ్యోతిక ప్రశంసలు కురిపించారు. మంచి సందేశంతో ఉన్న చిత్రాన్ని నిర్మించారంటూ ఆమె పేర్కొన్నారు.ఈ సిఇనమా లెస్బియన్ ఇతి వృత్తంతో కూడిన కథ కావడంతో చాలామంది హీరోయిన్లు నటించేందుకు ముందుకు రాలేదని దర్శకుడు జయప్రకాశ్ గతంలో తెలిపారు. అదే విధంగా మరి కొందరైతే దీన్ని మలయాళం, హిందీ భాషల్లో చేయమని, తమిళంలో వద్దని చెప్పారు. అలాంటి సమయంలో నిర్మాత జియోబేబీ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈయన ఇంతకు ముందు ది గ్రేట్ ఇండియన్ కిచ్చన్ వంటి హిట్ చిత్రాన్ని నిర్మించినట్లు దర్శకుడు తెలిపారు. ఇద్దరు యువతుల మధ్య ప్రేమ పుడితే ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించారు. అయితే, సినిమా విడదల తర్వాత చాలా వివాదస్పదంగా మారింది. సినిమాను బ్యాన్ చేయాలంటూ కూడా కొందరు కోరారు. ఇలా వివాదం చుట్టూ వైరల్ అయిన కాదల్ ఎన్నబదు పొదువుడమై చిత్రాన్ని టెంట్కొట్ట ఓటీటీ యాప్‌లో చూసేయండి. -
ఊహకందని... ఊహించలేని ఇన్వెస్టిగేషన్ ఇది
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘రేఖా చిత్రం’(Rekhachithram) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఇదో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఈ తరహా సినిమాలు ఇప్పటికే మనకు పరిచయమున్నా క్షణం కూడా మీ చూపును మరల్చకుండా చేస్తుంది ఈ సినిమా స్క్రీన్‌ప్లే. ‘రేఖా చిత్రం’ ఓ మలయాళ సినిమా. సోనీలివ్, ఆహాలో తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా ఉంది. ఈ సినిమాకి దర్శకుడు జోఫిన్ టి చాకో. కథ రాము సునీల్ అందించారు.ప్రముఖ నటులు ఆసిఫ్ అలీ, అనస్వరా రాజన్ ప్రధాన తారాగణంగా నటించారు. సినిమా చూసే ప్రేక్షకులను ఆద్యంతం ఉత్కంఠతతో, ఊహకందని ట్విస్టులతో ఉర్రూతలూగిస్తుంది. అంతలా ఈ సినిమాలో ఏముందో కథలోకి వెళ్లి తెలుసుకుందాం. వివేక్ అనే పొలీస్ ఆఫీసర్‌కి మలక్కపరా అనే ప్రాంతంలో కొత్తగా పొస్టింగ్ వస్తుంది. అప్పటిదాకా అది క్రైమ్ ఫ్రీ ఫారెస్ట్ ప్రాంతం. కానీ వివేక్ ఛార్జ్ తీసుకున్న వెంటనే ఓ ఆత్మహత్య జరుగుతుంది. ఆత్మహత్య చేసుకున్నది రాజేంద్రన్ అనే బిజినెస్‌మేన్.అది కూడా ఓ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. సెల్ఫీ వీడియోలో తాను కూర్చుని ఉన్న ప్రదేశంలో కొన్నేళ్ల క్రితం ఓ శవాన్ని మరో కొంతమందితో కలిసి పాతి పెట్టానని, ఆ బాధ తనను వేధిస్తుందని ఆత్మహత్య చేసుకుంటాడు. వివేక్ వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఆ ప్రాంతంలో తవ్వగా ఓ అస్థిపంజరం బయటపడుతుంది.అది ఓ అమ్మాయిదని ఫోరెన్సిక్ నివేదికలో తేలుతుంది. ఇప్పుడు వివేక్ చేతిలో రాజేంద్రన్ సెల్ఫీ వీడియో తప్ప ఈ అస్థిపంజరానికి సంబంధించిన ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు. మరి... వివేక్ ఈ కేసు ఎలా పరిష్కరించాడో సినిమాలోనే చూడాలి. పైన చెప్పుకున్నట్టు సినిమా మొత్తం ఊహించని ట్విస్టులతో క్లైమాక్సులో ఊహకందని మలుపుతో మతి పొగొడుతుంది. పెద్దవాళ్లు మాత్రమే చూడదగ్గ ఈ సినిమా వీకెండ్‌కు మంచి కాలక్షేపం. వర్త్‌ఫుల్ వాచ్ ఫర్ థ్రిల్లింగ్. – ఇంటూరు హరికృష్ణ -
కోర్ట్, దిల్రూబా సినిమాలు వచ్చేవి ఆ ఓటీటీలోనే!
హోలి పండగ (మార్చి 14) రోజు తెలుగులో రెండు సినిమాలు రిలీజయ్యాయి. అదే కోర్ట్ (Court: State Vs a Nobody), దిల్రూబా (Dilruba Movie). కోర్ట్ చిత్రంలో రోషన్, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రియదర్శి, శివాజీ, హర్షవర్ధన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. నాని సోదరి దీప్తి గంటా సహనిర్మాతగా వ్యవహరించారు. కోర్ట్ ఓటీటీ పార్ట్నర్ఈ సినిమా నచ్చకపోతే నా హిట్ 3 సినిమా చూడొద్దంటూ కోర్ట్ మూవీపై బలమైన నమ్మకం వ్యక్తపరిచాడు నాని. అతడి నమ్మకమే నిజమైంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్ విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. నాలుగైదు వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.(కోర్ట్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)దిల్రూబా ఓటీటీ పార్ట్నర్క బ్లాక్‌బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ దిల్రూబా. రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్. విశ్వ కరుణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మించారు. కాస్త మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటున్న ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని ఆహా సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ రన్‌ను బట్టి నెల రోజుల్లోనే దిల్రూబా ఆహాలోకి వచ్చే అవకాశం ఉంది.(దిల్రూబా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఓటీటీకి మిస్టరీ థ్రిల్లర్.. మరో సూక్ష్మదర్శిని కానుందా?
ఓటీటీలు వచ్చాక భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తున్నారు. ముఖ్యంగా మలయాళ చిత్రాలకు ఓటీటీల్లో ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ఈ ఏడాది ఓటీటీకి వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సూక్ష్మదర్శినికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో మలయాళ నటుడు బసిల్ జోసెఫ్ కీలక పాత్రలో నటించారు. ఈ మలయాళ థ్రిల్లర్ మూవీకి ఓటీటీలో ఊహించని స్పందన వచ్చింది. దీంతో ఓటీటీలో మలయాళ చిత్రాలకు ప్రేక్షకుల విపరీతంగా కనెక్ట్ అవుతున్నారు.ఈ నేపథ్యంలోనే మరో మిస్టరీ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. బసిల్ జోసెఫ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ప్రవీణ్ కూడు షప్పు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం మలయాళ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ మూవీని డార్క్ కామెడీ మర్డర్ మిస్టరీగా శ్రీరాజ్ శ్రీనివాసన్ దర్శకత్వంలో తెరకెక్కించారు.తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 11 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ప్రవీణ్ కూడా షప్పు మూవీ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఈ విషయాన్ని సోనీలివ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. కాగా.. ఈ చిత్రంలో సీనియర్ నటి రేవతి కీలక పాత్రలో కనిపించారు.Get ready for a dark comedy that unfolds the chaos-#PravinkooduShappu trailer out now! #PravinkooduShappu #PravinkooduShappuOnSonyLIV@basiljoseph25 @IamChandini #SoubinShahir #ChembanVinodJose #ShyjuKhalid #Chandini #SreerajSreenivasan pic.twitter.com/t8fMtcHKbt— Sony LIV (@SonyLIV) March 14, 2025 -
ఓటీటీలో తగ్గుతున్న వ్యూస్
-
ఓటీటీలో సడెన్‌గా 'ఎమర్జెన్సీ ' ఎంట్రీ
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో నటించి, స్వీయదర్శకత్వం వహించిన చిత్రం ఎమర్జెన్సీ (Emergency Movie). భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని కంగనానే నిర్మించారు. పలుమార్లు వాయిదాపడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.21 కోట్లు మాత్రమే రాబట్టింది. అయితే, సడెన్‌గా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. వాస్తవంగా ఎమర్జెన్సీ మూవీని మార్చి 17న నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్నట్లు కంగనా ప్రకటించింది. కానీ, అనుకున్న సమయంకంటే ముందే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేయడంతో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.ఎమర్జెన్సీ చిత్రం ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రకటించిన సమయం కంటే మూడు రోజులు ముందే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేయడంతో ఫ్యాన్స్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. 1975లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ టైమ్‌లో జరిగిన ఘటనలతో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రం కోసం నిర్మాతగా మారిన కంగనా రనౌత్ తన సొంత ఆస్తులను కూడా విక్రయించుకున్నారు. కంగనా ఇందులో ఇందిరాగాంధీగా నటించింది. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పడే, విశాక్ నాయర్, మిలింద్ సోమన్ సహా దివంగత నటుడు సతీశ్ కౌశిక్ ముఖ్య పాత్రలు పోషించారు. -
ఓటీటీకి అఖిల్ ఏజెంట్.. బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన సంస్థ!
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఏజెంట్'. 2023 ఏప్రిల్ 28న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా బోల్తా కొట్టింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్గా మెప్పించింది. అయితే అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని రూ . 70 కోట్లతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.అయితే ఈ మూవీ విడుదలై దాదాపు రెండేళ్లైన ఓటీటీకి రాలేదు. ఎట్టకేలకు ఈ నెల 14 నుంచి ఓటీటీకి రానుందని సోనిలివ్ ప్రకటించింది. అయితే అనుకున్న తేదీ కంటే ఒకరోజు ముందుగానే ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రోజు సాయంత్రం నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇంకేందుకు ఆలస్యం ఏజెంట్ మూవీని ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.Secrets, shootouts, and a mission that rewrites the rules.#Agent is now streaming on SonyLIV.#AgentOnSonyLIV #Agent @mammootty @akkineniakhil @_vaidyasakshi#SurenderReddy #DinoMorea @varusarath5@UrvashiRautela #Varalakshmi pic.twitter.com/iAONMsxtZn— Sony LIV (@SonyLIV) March 13, 2025 -
కుమారుడితో బ్రహ్మానందం నటించిన సినిమా.. ఓటీటీలో ఎప్పుడంటే?
దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ (Raja Gautam) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్రహ్మా ఆనందం. ఈ మూవీలో వీరిద్దరూ తాతామనవళ్లుగా యాక్ట్ చేశారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషించగా ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించాడు. సావిత్రి, ఉమేష్ కుమార్ సమర్పణలో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మసూద సినిమాల ఫేమ్ రాహుల్ యాదవ్ నక్కా నిర్మించాడు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆహాలో రేపటి (మార్చి 14) నుంచి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.కథేంటంటే?బ్రహ్మ అలియాస్ బ్రహ్మానందం (రాజా గౌతమ్) ఓ థియేటర్ ఆర్టిస్ట్. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోతాడు. ఎప్పటికైనా పెద్ద నటుడు కావాలన్నది తన లక్ష్యం. ఈ ప్రయత్నాల్లో ఉండగా ఢిల్లీలో ఓ నాటకం వేసే ఛాన్స్ దొరుకుతుంది. అయితే అక్కడ పాల్గొనాలంటే రూ.6 లక్షలు ఇవ్వాలని ఆ వేడుక నిర్వాహకుడు బ్రహ్మను డిమాండ్ చేస్తాడు. దానికోసం ప్రయత్నాలు చేసే క్రమంలో వృద్ధాశ్రమంలో ఉన్న తాత ఆనంద రామ్మూర్తి (బ్రహ్మానందం) తన దగ్గర ఆరెకరాల భూమి ఉందని చెప్తాడు. అది ఇవ్వాలంటే ఓ కండీషన్ పెడతాడు. మరి బ్రహ్మకు ఆ భూమి దక్కిందా? అతడిన ఎంతో ప్రేమించే తార (ప్రియ వడ్లమాని) తనను వదిలి ఎందుకు వెళ్లిపోయింది? చివరకు కలిశారా? బ్రహ్మ నటుడయ్యాడా? లేదా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!చదవండి: Court Movie Review: నాని ‘కోర్ట్’ మూవీ రివ్యూ -
ఓటీటీలో టాప్-10 కోర్ట్ రూమ్ మూవీస్.. ప్రతి క్షణం థ్రిల్లో థ్రిల్
హీరో నాని నిర్మించిన 'కోర్ట్' మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. లెక్కప్రకారం శుక్రవారం రావాలి కానీ తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల ప్రీమియర్లు వేయగా స్పందన బాగా వచ్చింది. పోక్సో కేసు గురించి చర్చిస్తూ తీసిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా గురించి అప్పుడే సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: Court Movie Review: నాని ‘కోర్ట్’ మూవీ రివ్యూ)సరే 'కోర్ట్' మూవీ గురించి కాసేపు పక్కనబెడితే ఇంతకుముందు కూడా ఇలా కోర్ట్ బ్యాక్ డ్రాప్ కథలతో పలు అద్భుతమైన సినిమాలు వచ్చాయి. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజైనవి ప్రస్తుతం పలు ఓటీటీల్లో ఉన్నాయి. అలాంటి వాటిలో టాప్-10 గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.జై భీమ్ - సూర్య స్వయంగా నటించి, నిర్మించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో తెలుగులోనే ఉంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీశారు. చూస్తుంటే అద్భుతమైన ఎక్స్ పీరియెన్స్ ఇస్తుంది.పింక్ - తెలుగులో 'వకీల్ సాబ్' పేరుతో దీన్ని రీమేక్ చేశారు. కమర్షియల్ ఎలిమెంట్స్ అని చెప్పి చెడగొట్టేశారు. హిందీలో తీసిన ఒరిజినల్ మూవీ 'పింక్'. చూస్తే మాత్రం మంచి హై ఇస్తుంది. హాట్ స్టార్ లో హిందీ వెర్షన్ ఉంది. ముల్క్ - హిందీలో తీసిన అవార్డ్ విన్నింగ్ కోర్ట్ రూమ్ డ్రామా మూవీ. టెర్రరిస్టుల వల్ల ఓ ముస్లిం కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందనేదే స్టోరీ. అమెజాన్ ప్రైమ్ లో హిందీలో చూడొచ్చు.నెరు - తెలుగులో డబ్ అయిన మలయాళ మూవీ ఇది. ఓ అంధురాలిపై అత్యాచారం జరుగుతుంది. అసలు అవకాశమే లేని చోట.. నిందితుడిని ఎలా శిక్షించారనేదే స్టోరీ. మోహన్ లాల్, ప్రియమణి ఉంటారు. హాట్ స్టార్ లో తెలుగులోనే ఉంది.జనగణమన - కోర్ట్ రూం డ్రామాల్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. ఒక్కో ట్విస్టు రివీల్ అయ్యే టైంలో మతిపోతుంది. పృథ్వీరాజ్ యాక్టింగ్ కేక. నెట్ ఫ్లిక్స్ లో తెలుగులోనే చూడొచ్చు.ఓ మై గాడ్ 2 - సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఎంత ముఖ్యమో చెప్పే సినిమా. కోర్ట్ సీన్స్ బాగుంటాయి. నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లో హిందీ వెర్షన్ అందుబాటులో ఉంది.సెక్షన్ 375 - రేప్ కేసు, దీన్ని ఎలా చెడు కోసం ఉపయోగించుకుంటున్నారు అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ తీశారు. అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ లో హిందీలో సినిమా చూడొచ్చు.జాలీ ఎల్ఎల్ బీ - ఓ సాధారణ లాయర్.. బాగా వైరల్ అయిన ఓ హిట్ అండ్ రన్ కేసుని వాదిస్తాడు. అవతల పేరు మోసిన లాయర్. చివరకు ఏమైందనేదే స్టోరీ. హిందీలో హాట్ స్టార్ లో ఉంది. నాంది - అల్లరి నరేశ్ కమ్ బ్యాక్ మూవీ ఇది. చేయని నేరానికి జైలుపాలైన ఓ సామాన్యుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, కోర్టులో వాదనలు ఎలా జరిగాయనేదే స్టోరీ. హాట్ స్టార్ లో తెలుగులోనే ఉంది.బంగారు తల్లి - 15 ఏళ్ల క్రితం జరిగిన మర్డర్ ని ఓపెన్ చేసి, కోర్ట్ లో వాదోపవాదాలు జరుగుతాయి. ఇంటెన్స్ కోర్ట్ రూమ్ డ్రామాలో జ్యోతిక లాయర్. ఆహా ఓటీటీలో తెలుగులోనే చూడొచ్చు. (ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 21 సినిమాలు స్ట్రీమింగ్) -
ఓటీటీల్లో ఈ శుక్రవారం 21 సినిమాలు స్ట్రీమింగ్
మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వారం థియేటర్లలోకి నాని నిర్మించిన 'కోర్ట్', కిరణ్ అబ్బవరం 'దిల్ రుబా' రాబోతున్నాయి. రెండింటిపైనా మంచి అంచనాలే ఉన్నాయి. ఏమవుతుందో చూడాలి? మరోవైపు ఓటీటీల్లో మాత్రం 20కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)ఓటీటీల్లో శుక్రవారం ఒక్కరోజే రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. రామం రాఘవం, ఏజెంట్, రేఖాచిత్రం, వనవాస్, పొన్ మ్యాన్ తదితర చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు సడన్ సర్ ప్రైజ్ అన్నట్లు కొత్త మూవీస్ కూడా వచ్చే అవకాశముంది.ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు (మార్చి 14న)సన్ నెక్స్ట్రామం రాఘవం - తెలుగు సినిమాసోనీ లివ్ఏజెంట్ - తెలుగు మూవీఆహారేఖాచిత్రం - తెలుగు సినిమాసీ సా - తమిళ మూవీఅమెజాన్ ప్రైమ్బీ హ్యాపీ - హిందీ సినిమాఒరు జాతి జాతకమ్ - మలయాళ మూవీనెట్ ఫ్లిక్స్ద ఎలక్ట్రిక్ స్టేట్ - ఇంగ్లీష్ మూవీకర్స్ ఆఫ్ ద సెవెన్ సీస్ - ఇండోనేసియన్ సినిమాఆడ్రే - ఇంగ్లీష్ మూవీఎమర్జెన్సీ - హిందీ సినిమాఆజాద్ - హిందీ మూవీలవ్ ఈజ్ బ్లైండ్: స్వీడన్ సీజన్ 2 - స్వీడిష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)ఆడాలసెన్స్ - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)జీ5వనవాస్ - హిందీ మూవీహాట్ స్టార్పొన్ మ్యాన్ - మలయాళ సినిమామోనా 2 - ఇంగ్లీష్ చిత్రంఆచారీ బా - హిందీ మూవీబుక్ మై షోమెర్సీ కిల్లింగ్ - తెలుగు సినిమాద సీడ్ ఆఫ్ సేక్రెడ్ ఫిగ్ - పెర్షియన్ మూవీకంపానియన్ - ఇంగ్లీష్ సినిమాఆపిల్ టీవీ ప్లస్డోప్ థీప్ - ఇంగ్లీష్ సిరీస్(ఇదీ చదవండి: 40 ఏళ్ల చరిత్ర గల 'రజినీకాంత్' థియేటర్ కూల్చివేత) -
ఓటీటీలోకి 'ముఫాసా'.. అధికారికంగా ప్రకటన
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ మొదలవడానికి ముందు ఓ హాలీవుడ్ చిత్రానికి తెలుగు డబ్బింగ్ చెప్పాడు. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు.(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)గతేడాది డిసెంబరు 20న రిలీజైన ఇంగ్లీష్ సినిమా 'ముఫాసా'. బ్లాక్ బస్టర్ 'లయన్ కింగ్' చిత్రానికి కొనసాగింపుగా దీన్ని తెరకెక్కించారు. మన దేశంలో ప్రాంతీయ భాషల్లోనూ రిలీజ్ చేశారు. తెలుగులో మహేశ్ బాబు.. ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పగా, హిందీలో షారుక్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.ప్రపంచవ్యాప్తంగా అలరించిన 'ముఫాసా'.. మార్చి 26 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. దీంతో మరోసారి సందడి చేసేందుకు మహేశ్ ఫ్యాన్స్ రెడీ. టీవీ, మొబైల్ ముందు పిల్లితో మరోసారి సందడి చేస్తారేమో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)It's time to experience the legend of Mufasa.#Mufasa: The Lion King, coming to #JioHotstar on March 26 in English, Hindi, Tamil and Telugu. #MufasaOnJioHotstar #JioHotstar #InfinitePossibilities pic.twitter.com/IqN5AxEucR— JioHotstar (@JioHotstar) March 12, 2025 -
6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
ఈ వీకెండ్ లో పలు కొత్త సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. సరే వాటి సంగతి పక్కనబెడితే ఓ తెలుగు మూవీ.. పెద్దగా హడావుడి లేకుండానే దాదాపు ఆరు నెలల తర్వాత స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఏ మూవీ? ఎందులో ఉందనేది చూద్దాం.స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు కథతో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. వాటిలో సూపర్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు(1974) ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. కొన్నిరోజుల క్రితం 'ఆర్ఆర్ఆర్'లోనూ రామ్ చరణ్ అల్లూరి గెటప్ లో కనిపించి అలరించాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)ఇక అల్లూరి జీవిత కథతో తీసిన ఓ తెలుగు సినిమా 'మన్యం ధీరుడు'. గతేడాది సెప్టెంబరులో ఇది థియేటర్లలో రిలీజైంది. కానీ ఈ చిత్రం ఒకటి ఉందని కూడా తెలియదు. అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. రంగస్థల నటుడు ఆర్.వి.వి.సత్యనారాయణ.. అల్లూరిగా నటించడమే కాకుండా తానే సినిమా నిర్మించారు. దాదాపు ఆరు నెలల తర్వాత ఇప్పుడు 'మన్యం ధీరుడు' సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే అద్దె విధానంలో అందుబాటులో ఉంది. రెండు రోజుల క్రితం ఇలానే 'తల', 'జాతర' మూవీస్ ఇదే ఓటీటీలోకి వచ్చాయి.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి క్రేజీ మిస్టరీ థ్రిల్లర్.. కేవలం తెలుగులో) -
'కన్నప్ప'తో మంచు విష్ణు అంత రిస్క్ చేస్తారా?
మంచు విష్ణు 'కన్నప్ప' నుంచి తొలి టీజర్ రిలీజైనప్పుడు ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువొచ్చాయి. కానీ కొన్నాళ్ల ముందు విడుదల చేసిన మరో టీజర్ కి మాత్రం పర్లేదు బాగుందనే టాక్ వచ్చింది. దీనికి తోడు రెండు పాటలు కూడా వినసొంపుగా అనిపించాయి. ఇలా ఓ మాదిరి బజ్ ఏర్పడింది. ఇలా 'కన్నప్ప' గురించి కాస్తోకూస్తో అంచనాలు పెరుగుతున్న టైంలో మంచు విష్ణు రిస్క్ తీసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత ట్రెండ్ లో భారీ బడ్జెట్ సినిమాలు చాలా వాటి ఓటీటీ డీల్స్ ముందే పూర్తవుతున్నాయి. తద్వారా పెట్టిన బడ్జెట్ కొంతమేర రికవర్ చేయొచ్చనేది నిర్మాతల ప్లాన్.(ఇదీ చదవండి: దళపతి విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు)కానీ 'కన్నప్ప' విషయంలో మాత్రం మంచు విష్ణు రిస్క్ తీసుకోవాలని ఫిక్సయ్యాడట. మూవీ రిలీజ్ కి ముందు డీల్ కుదుర్చుకుంటే ఓటీటీలు ఇచ్చినంత తీసుకోవాలి. అదే రిలీజ్ తర్వాత మూవీ హిట్ టాక్ తెచ్చుకుంటే మనం డిమాండ్ చేయొచ్చని విష్ణు ప్లాన్ అట. మరి ఇందులో నిజమెంతో?కన్నప్పలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారని టాక్. ఏప్రిల్ 25న థియేటర్లలోకి రానుంది. మరి బిగ్ స్క్రీన్ పై ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ 'ఛావా'.. డేట్ ఫిక్సయిందా?
గత కొన్నిరోజులుగా ప్రేక్షకుల మధ్య డిస్కషన్ కి కారణమైన మూవీ 'ఛావా'. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించిన ఈ పీరియాడికల్ సినిమాన ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తీశారు. ఫిబ్రవరిలో హిందీ వెర్షన్, మార్చి తొలివారంలో తెలుగు వెర్షన్ రిలీజైంది.(ఇదీ చదవండి: తమ్ముడి పెళ్లిలో సాయిపల్లవి డ్యాన్స్.. వీడియో వైరల్)హిందీలో ఎలా అయితే హిట్ టాక్ వచ్చిందో తెలుగులోనూ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో తొలి మూడు రోజులకే దాదాపు రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. శుక్రవారం వరకు కొత్త మూవీస్ ఏం లేవు కాబట్టి ఎన్ని కోట్లు వస్తాయో చూడాలి?సరే ఈ సంగతులన్నీ పక్కనబెడితే 'ఛావా' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ రెండో వారం నుంచి అంటే 11వ తేదీన అలా నెట్ ఫ్లిక్స్ లోకి రానుందని సమాచారం. మరి దక్షిణాది భాషల్లోనూ డబ్ చేస్తారా లేదా అనేది చూడాలి.(ఇదీ చదవండి: పెళ్లి రిసెప్షన్ లో ఫుల్ హ్యాపీగా సితార-నమ్రత-చరణ్) -
ఓటీటీలో 'డ్రాగన్' సినిమా.. పోస్టర్ వైరల్
కంటెంట్ బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా హిట్ కొట్టొచ్చని లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ మరోసారి నిరూపించాడు. ఆయన నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ (Return Of The Dragon) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే, తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 21న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.మార్చి 14న హిందీలో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ రిలీజవుతుండగా ఇంతలోనే ఓటీటీ గురించి ఒక పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. తెలుగు,తమిళ్,మలయాళం,కన్నడలో మార్చి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని షోషల్‌మీడియాలో పోస్టర్ షేర్ అవుతుంది. దీంతో అభిమానులు కూడా వైరల్ చేస్తున్నారు. అయితే, నెట్‌ఫ్లిక్స్ అధికారిక సోషల్‌మీడియా నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కేవలం రూ. 35 కోట్లతో తెరకెక్కించిన డ్రాగన్ బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్ల మార్క్ కలెక్షన్లకు దగ్గరగా ఉంది. కథేంటి..?డి.రాఘవన్(ప్రదీప్ రంగనాథన్)(Pradeep Ranganathan) ఇంటర్మీడియట్లో 96 శాతం మార్కులతో పాస్ అయిన తర్వాత తాను ఇష్టపడిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆమె తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని చెబుతూ అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దీంతో రాఘవన్ బ్యాడ్ బాయ్‌గా మారిపోయి బీటెక్‌లో 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. రెండేళ్ల పాటు ఖాలీగా ఉండడంతో కాలేజీలో తనను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్)(Ashwath Marimuthu) బ్రేకప్ చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.దీంతో జీవితంలో ఎలాగైన సక్సెస్ కావాలని ఫేక్ సర్టిఫికేట్స్ వల్ల మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తనకున్న తెలివితో పెద్ద పొజిషియన్‌కి వెళ్తాడు. ఇల్లు, కారు కొంటాడు. బాగా ఆస్తులు ఉన్న అమ్మాయి పల్లవి (కయాదు లోహర్)తో పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుంది. లైఫ్ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఫేక్ సర్టిఫికెట్స్ గురించి ప్రిన్సిపల్‌కి తెలుస్తుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలౌతుంది. డ్రాగన్‌కు ప్రిన్సిపల్ పెట్టే కండీషన్స్ ఏంటి..? బీటెక్‌లో 48 సబ్జెక్టులను ఎలా పూర్తి చేశాడు. కాలేజీ డేస్‌లో తను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్) మరోసారి ఆయన జీవితంలోకి ఎందుకొస్తుంది..? ఉద్యోగం ఉందని చెప్పి పెళ్లి సెట్ చేసుకున్న పల్లవితో ఏడడుగులు వేస్తాడా..? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(Return Of The Dragon Review ). -
మరో ఓటీటీలోకి క్రేజీ మిస్టరీ థ్రిల్లర్.. కేవలం తెలుగులో
ఓటీటీలో ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన సినిమా 'రేఖాచిత్రం'. పేరుకే మలయాళ సినిమా గానీ తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చేసింది. ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు మరో దానిలోనూ కేవలం తెలుగు వెర్షన్ అందుబాటులోకి రానుంది.మలయాళ దర్శకులు థ్రిల్లర్ సినిమాలు తీయడంలో స్పెషలిస్టులు. అలా ఈ ఏడాది జనవరి తొలి వారంలో 'రేఖాచిత్రం' మూవీని విడుదల చేశారు. రూ.10 కోట్లతో నిర్మిస్తే రూ.70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దాదాపు రెండు నెలల తర్వాత గత శుక్రవారం ఓటీటీలోకి వచ్చింది.(ఇదీ చదవండి: 'రేఖాచిత్రం' సినిమా రివ్యూ (ఓటీటీ))మన దగ్గర సోనీ లివ్ ఓటీటీలో చూసేవాళ్లు తక్కువని చెప్పొచ్చు. బహుశా ఇది గమనించారో ఏమో గానీ ఇప్పుడు ఆహా ఓటీటీలోకి 'రేఖాచిత్రం' తెలుగు వెర్షన్ ని రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. మార్చి 14 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు.'రేఖాచిత్రం' విషయానికొస్తే.. 40 ఏళ్ల క్రితం తాము ఓ అమ్మాయిని హత్య చేశామని చెప్పి ఓ పెద్దాయన ఆత్మహత్య చేసుకుంటాడు. అదేరోజు ఆ ఊరిలో ఎస్ఐగా జాయిన్ అయిన వివేక్ దర్యాప్తు మొదలుపెడతాడు. ఒక్కో ఆధారం వెతుకుతూ వెళ్లేకొద్ది దొంగ దొరుకుతాడు. ఇంతకీ హత్యకు గురైన అమ్మాయి ఎవరు? ఎందుకు చంపారనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
ఓటీటీలో సైన్స్ ఫిక్షన్ సినిమా.. ఇన్‌స్టా ఫేమ్ 'అమృత చౌదరి'కి ఫ్యాన్స్ ఫిదా
ప్రెజర్ కుక్కర్, లగ్గం వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సాయి రోనక్.. ఆయన నటించిన తెలుగు సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా రివైండ్ (Rewind Movie) సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ సోషల్‌మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న అమృత చౌదరి హీరోయిన్గా నటించింది. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నాలుగు నెలల తర్వాత మార్చి 10న ఓటీటీలో విడుదలైంది. తెలుగుతో పాటు హిందీ భాషలోనూ రివైంట్ చిత్రం అందుబాటులో ఉంది.సాయి రోనక్, అమృత చౌదరి కాంబినేషన్‌తో రివైండ్ చిత్రానికి మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో సురేశ్, సామ్రాట్, వైవా రాఘవ్, జబర్దస్త్ నాగి, అభిషేక్ విశ్వకర్మ, ఫన్‌బకెట్ భరత్.. తదితరులు కీలక పాత్ర పోషించారు. కళ్యాణ్ చక్రవర్తి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. శివరామ్ చరణ్ సినిమాటోగ్రాఫీ అందించగా ఆశీర్వాద్ లూక్ సంగీతం సమకూర్చాడు. ఈ మూవీ 2024 అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ఐఎమ్బీడీ రేటింగ్ 9.4 ఉండటం విశేషం.కథేంటి..?ఈ సినిమా కథ 2019-2024 మధ్య కాలంలో జరుగుతుంది. కార్తిక్(సాయి రోనక్) ఓ సాఫ్ట్వేర్. తన స్నేహితుడు సుబ్బు అపార్ట్మెంట్లో శాంతి(అమృత చౌదరి)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. తను పని చేసే ఆఫీసులోనే ఆమె కూడా జాయిన్ అవ్వడంతో పరిచయం పెంచుకుంటాడు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు కానీ బయటకు చెప్పుకోరు. ఓ రోజు శాంతి ఓ ముఖ్యమైన విషయం చెప్పాలంటూ కార్తిని కాఫీ షాపుకు రమ్మని చెబుతుంది. అదే రోజు శాంతి వాళ్ల తాతయ్య(సామ్రాట్) కనిపెట్టిన టైం మిషన్ సహాయంతో కార్తిక్ ట్రైమ్ ట్రావెల్ చేసి 2019 కాలం నాటికి వెళ్తాడు. ఆ తర్వాత కార్తిక్ జీవితంలో ఎలాంటి పరిణామాలు జరిగాయి? కార్తి ట్రైమ్ ట్రావెల్ చేయాలని ఎందుకు అనుకున్నాడు? శాంతి వాళ్ల తాతయ్య కనిపెట్టిన టైమ్ మిషన్ కార్తికి ఇంటికి ఎలా చేరిది? కార్తిక్ ప్లాష్‌బ్యాక్ స్టోరీ ఎంటి? చివరకు శాంతి, కార్తిక్‌లు ఒకటయ్యారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. View this post on Instagram A post shared by Amrutha Chowdary (@__amrutha__chowdary__) -
సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 2 తెలుగు సినిమాలు
ఓటీటీల్లో కొన్ని సినిమాలు చాలా హడావుడితో రిలీజ్ చేస్తారు. మరికొన్నింటిని మాత్రం ఎలాంటి ప్రకటన లేకుండా సింపుల్ గా స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చేస్తారు. అలా ఇప్పుడు రెండు తెలుగు సినిమాల్ని ఓటీటీలోకి అందుబాటులోకి తెచ్చారు. ఇంతకీ అవేంటి? ఎందులో చూడొచ్చు?కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన మూవీ 'తల'. తన కొడుకునే హీరోగా పెట్టి ఈ సినిమా తీశారు. ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ చేశారు. అసలు విడుదలైనట్లు కూడా తెలియనంత వేగంగా మాయమైపోయింది. ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)గతేడాది నవంబర్ 8న రిలీజైన 'జాతర' అనే సినిమా కూడా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ లోకి వచ్చింది. ఒక ఊరిలో ఉండే గంగమ్మ తల్లి దేవత బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. పేరున్న నటీనటులు లేకపోవడంతో ఇదొకటి ఉందని కూడా ఎవరికీ తెలియదు.అయితే ఈ రెండు తెలుగు సినిమాల్ని నేరుగా స్ట్రీమింగ్ చేసుంటే అయిపోయేది. కానీ రెంట్ విధానంలో ఎందుకు తీసుకొచ్చారనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్న. త్వరలో ఉచితంగా స్ట్రీమింగ్ అందుబాటులోకి తెస్తారేమో చూడాలి?(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి) -
ఓటీటీలో మరో ఫ్యామిలీ సిరీస్.. టీజర్ రిలీజ్
ఓటీటీలో మరో ఫ్యామిలీ సిరీస్ వచ్చేందుకు రెడీ అయిపోయింది. 90స్, ఎర్లీ 20స్ లో జరిగిన కథలతో ఇదివరకే పలు సినిమాలు, సిరీసులు రాగా.. ఇప్పుడు ఆ తరహా కాన్సెప్ట్ తోనే తీసిన 'హోమ్ టౌన్' సిరీస్ రానుంది. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఇది ఎలా ఉందంటే?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)ఇప్పుడంటే సోషల్ మీడియా అందరికీ కామన్ అయిపోయింది. కానీ ఫేస్ బుక్ వచ్చిన కొత్తలో ముగ్గురు టీనేజర్స్ ఎంత సందడి చేశారు? అటు స్కూల్, ఇటు ఇంట్లో పాటు క్రికెట్ గ్రౌండ్ లోనూ వీళ్లు ఎలా అల్లరి చేశారు? అనేది తెలియాలంటే 'హోమ్ టౌన్' సిరీస్ చూడాలి.ఆహా ఓటీటీలో ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. రాజీవ్ కనకాల, ఝాన్సీ తప్పితే పెద్దగా తెలిసిన ముఖాలు లేవు. కానీ టీజర్ చూస్తుంటే మాత్రం పర్లేదనిపించేలా ఉంది. 90స్ లో పుట్టి పెరిగిన వాళ్లు కనెక్ట్ అయ్యేలా ఉందనిపిస్తోంది. శ్రీకాంత్ పల్లె దర్శకుడు. నవీన్ మేడారం షో రన్నర్.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి) -
ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
మరో వారం వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల హడావుడి నడుస్తోంది. ఈ క్రమంలోనే ఈ వారం థియేటర్లలోకి 'కోర్ట్', 'దిల్ రుబా' అనే తెలుగు చిత్రాలతో పాటు 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' అనే డబ్బింగ్ మూవీ రిలీజ్ అవుతోంది. మరోవైపు 'యుగానికి ఒక్కడు' ఈ వారమే రీ రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి)ఇవి కాకుండా ఓటీటీల్లోకి కేవలం 9 సినిమాలు-వెబ్ సిరీసులు మాత్రమే స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో అఖిల్ 'ఏజెంట్', రామం రాఘవం, రేఖాచిత్రం చిత్రాలు కాస్త ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ ఏయే మూవీస్ ఏ ఓటీటీల్లోకి రాబోతున్నాయంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మార్చి 10-16 వరకు)సోనీ లివ్ఏజెంట్ (తెలుగు సినిమా) - మార్చి 14అమెజాన్ ప్రైమ్వీల్ ఆఫ్ టైమ్ 3 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - మార్చి 13బీ హ్యాపీ (హిందీ మూవీ) - మార్చి 14ఒరు జాతి జాతికమ్ (మలయాళ సినిమా) - మార్చి 14నెట్ ఫ్లిక్స్అమెరికన్ మ్యాన్ హంట్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - మార్చి 10హాట్ స్టార్పొన్ మ్యాన్ (మలయాళ సినిమా) - మార్చి 14మోనా 2 (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 14జీ5వనవాస్ (హిందీ సినిమా) - మార్చి 14సన్ నెక్స్ట్రామం రాఘవం (తెలుగు మూవీ) - మార్చి 14 ఆహారేఖాచిత్రం (తెలుగు సినిమా) - మార్చి 14ఆపిల్ టీవీ ప్లస్డోప్ థీప్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 14(ఇదీ చదవండి: గోదావరిలో అస్థికలు కలిపిన యాంకర్ రష్మీ) -
మమ్మీ ప్రేమ... భయంతో...
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘హలో మమ్మీ’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.హాలీవుడ్లో మమ్మీ సినిమాల పరంపర మీకు గుర్తుండే ఉంటుంది. పురాతన కాలంలో గ్రీకు సాంప్రదాయం ప్రకారం సజీవంగా మనుషులను రాతి కట్టడాల్లో పాతి పెట్టడంతో, అందులో చనిపోయిన వారి ఆత్మల రూపంలో తిరిగి వస్తే కథేంటి? అన్నదే హాలీవుడ్ మమ్మీల కథా కమామీషు. కాకపోతే ఈ ‘హలో మమ్మీ’ కథ మాత్రం పూర్తిగా వినూత్నం, వైవిధ్యం... మరీ ముఖ్యంగా వినోదాత్మకం. ఇదో హారర్ కామెడీ. వైశాఖ్ ఎలాన్స్ ఈ సినిమాకి దర్శకుడు.ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ మలయాళ సినిమా నిడివి రెండున్నర గంటలు. చూసినంతసేపు ఈ సినిమా ఓ పక్క కాస్త భయపెడుతూనే మరో పక్క గిలిగింతలు పెడుతుంటుంది. షరీఫ్, ఐశ్వర్య ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమా ఆద్యంతం వినోదభరితమనే చెప్పాలి. అంతలా ఏముందో ఈ సినిమా కథను ఓసారి తెలుసుకుందాం. స్టెఫీని బోనీ ప్రేమిస్తాడు. స్టెఫీ తన తండ్రి శామ్యూల్‌తో ఉంటుంది. స్టెఫీ తల్లి 20 ఏళ్ల క్రిందటే చనిపోతుంది.కానీ ఈ 20 ఏళ్లు స్టెఫీని ఆ తల్లి ఆత్మ రూపంలో అంటిపెట్టుకునే ఉంటుంది. ఎందుకంటే స్టెఫీ అంటే తల్లికి చాలా ఇష్టం. స్టెఫీ మీద ఈగ కూడా వాలనీయదు. అలాగే ఇంట్లో ఆత్మ రూపంలోనే బోలెడన్ని రూల్స్ పెడుతుంది. స్టెఫీ తల్లి ఆత్మ విషయం ఈ ప్రపంచంలో స్టెఫీకి, ఆమె తండ్రికి తప్ప మరెవరికీ తెలియదు.బోనీని స్టెఫీ ఇష్టపడినపుడు తన తల్లి విషయాన్ని బోనీకి చెబుతుంది. కానీ బోనీ వినిపించుకోడు. పెళ్లై స్టెఫీ ఇంట్లోకి అడుగుపెట్టిన తరువాత స్టెఫీ తల్లి ఆత్మ పరిచయమవుతుంది అతనికి. దాంతో బోనీ ఖంగు తింటాడు. ఇక అక్కడ నుండి కథ ఎలా మలుపులు తిరుగుతుందో ప్రైమ్ వీడియో ఓటిటీలోనే చూడాలి. కొన్ని కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. వాటిని మిస్ చేసుకోకూడదు. వర్త్‌ఫుల్ వాచ్... ఇంకెందుకు ఆలస్యం... ‘హలో మమ్మీ’ని పలకరించండి... భయంతో కాదు... ప్రేమతో... – ఇంటూరు హరికృష్ణ -
'పుష్ప 2' దెబ్బకు ఫ్లాప్.. ఇన్నాళ్లకు ఓటీటీలోకి ఆ సినిమా
కొన్నిసార్లు రాంగ్ టైంలో రిలీజ్ అవుతుండటం వల్ల కొన్నికొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయి. అలా 'పుష్ప 2'(Pushpa 2 Movie) తెగ ఆడేస్తున్నప్పుడు థియేటర్లలో విడుదలైన ఓ హిందీ మూవీ.. దాదాపు మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది?దిగ్గజ నటుడు నానా పాటేకర్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ సినిమా 'వనవాస్'.(Vanvaas Movie) గదర్, గదర్ 2 లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తీసిన అనిల్ శర్మ దీనికి దర్శకుడు. మంచి ఫిలాసఫీ, ఎమోషనల్ కంటెంట్ తో తీశారు కానీ పుష్ప 2 ఉత్తరాదిలో మంచి జోష్ లో ఆడేస్తున్నప్పుడు అంటే డిసెంబరు 20న థియేటర్లలో రిలీజ్ చేశారు. దీంతో పెద్దగా వసూళ్లు రాలేదు.(ఇదీ చదవండి: నానా పాటేకర్ పై హీరోయిన్ పెట్టిన మీటూ కేసు కొట్టేసిన హైకోర్ట్)దాదాపు మూడు నెలల తర్వాత ఇప్పుడు 'వనవాస్' మూవీ ఓటీటీ (Vanvaas OTT) తేదీ ఖరారు చేసుకుంది. మార్చి 14 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ఫ్యామిలీ, ఎమోషనల్ మూవీ చూడాలనుకుంటే దీనిపై ఓ లుక్కేయొచ్చు.'వనవాస్' విషయానికొస్తే.. ప్రతాప్ (నానా పాటేకర్)కి మతిమరుపు సమస్య. ఇతడి ముగ్గురు కొడుకులు ఆస్తి పంచుకునే విషయంలో గొడవ పడుతూ ఉంటారు. తండ్రి అడ్డొస్తున్నాడని చెప్పి అతడిని కాశీలో వదిలి వచ్చేస్తారు. అక్కడ ఈయనకు వీర్(ఉత్కర్ష్) పరిచయమవుతాడు. మరి ప్రతాప్ ని వీర్ ఇంటికి చేర్చాడా? చివరకు ఏమైందనదే స్టోరీ?(ఇదీ చదవండి: రష్మికని హింసించకండి.. నటి రమ్య కౌంటర్)Jo paraye bhi na kare, agar vo apne kar jaayein, toh apnon se bada paraya kaun?#Vanvaas premieres 14th March, only on #ZEE5. #ZEE5Global #VanvaasOnZEE5@nanagpatekar @khushsundar @Anilsharma_dir @1020_suman @iutkarsharma @rajpalofficial #SimratKaur @hemantgkher… pic.twitter.com/OXwXXh5aLf— ZEE5 Global (@ZEE5Global) March 9, 2025 -
ఓటీటీలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్
భాష ఏదైనా సరే థ్రిల్లర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయా చిత్రాలని ఓటీటీలో రిలీజైన తర్వాత తెలుగు ప్రేక్షకులు చూసేస్తుంటారు. అలా రీసెంట్ గా మలయాళం నుంచి 'రేఖాచిత్రం' మూవీ స్ట్రీమింగ్ లోకి రాగా.. ఇప్పుడు తమిళ డబ్బింగ్ చిత్రం ఒకటి వచ్చేసింది.(ఇదీ చదవండి: 'రేఖాచిత్రం' సినిమా రివ్యూ (ఓటీటీ))సీనియర్ నటుడు శరత్ కుమార్ 150వ సినిమాగా తీసిన 'ద స్మైల్ మ్యాన్' గతేడాది డిసెంబరులో థియేటర్లలో రిలీజైంది. పేరున్న నటీనటులు పెద్దగా లేకపోవడంతో సరిగా ఆడలేదు. తర్వాత ఓటీటీలోకి వచ్చింది గానీ తమిళ వెర్షన్ మాత్రమే తీసుకొచ్చారు. తాజాగా ఆహా ఓటీటీలో తెలుగు వెర్షన్ రిలీజ్ చేశారు.'ద స్మైల్ మ్యాన్' విషయానికొస్తే.. శరత్ కుమార్ ఓ పోలీస్ ఆఫీసర్. అనుకోకుండా ప్రమాదానికి గురై అల్జీమర్స్ వ్యాధి బారిన పడతారు. జ్ఞాపకాలన్నీ ఏడాది గుర్తుంటాయని డాక్టర్స్ చెప్పడంతో తన పరిష్కరించిన కేసుల గురించి పుస్తకంగా రాస్తారు. ఇందులో స్మైల్ మ్యాన్ కేసు గురించి మాత్రం సగమే రాస్తారు? ఇంతకీ స్మైల్ మ్యాన్ ఎవడు? ఎందుకు హత్యలు చేస్తున్నాడనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)) -
ఓటీటీలోకి సూపర్ హిట్ మలయాళ డార్క్ కామెడీ
మలయాళ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కొత్త మూవీ ఓటీటీలో రిలీజ్ కావడం లేటు. మనోళ్లు చూసేస్తుంటారు. వాళ్ల కోసమా అన్నట్లు ఇప్పుడు క్రేజీ డార్క్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. అధికారికంగా తేదీ కూడా ప్రకటించారు.రీసెంట్ టైంలో మలయాళ ఓటీటీల సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు బాసిల్ జోసెఫ్. స్వతహాగా ఇతడు దర్శకుడే కానీ ఈ మధ్య హీరో తరహా పాత్రలు పోషిస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. అలా రీసెంట్ గా 'పొన్ మ్యాన్' అనే మూవీతో వచ్చాడు. (ఇదీ చదవండి: 'రేఖాచిత్రం' సినిమా రివ్యూ (ఓటీటీ))జనవరి 30న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. డార్క్ కామెడీ కథ కావడం, బాసిల్ నటన దీనికి ప్లస్ అని చెప్పొచ్చు. ఇప్పుడీ చిత్రాన్ని హాట్ స్టార్ లో మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. తెలుగులోనూ రిలీజయ్యే అవకాశముంది.'పొన్ మ్యాన్' విషయానికొస్తే హీరో పేరు అజేష్ (బాసిల్ జోసెఫ్). పెళ్లిళ్ల కోసం బంగారాన్ని అద్దెకిస్తుంటాడు. తద్వారా చదివింపులుగా వచ్చిన డబ్బుల్ని తీసుకుంటూ ఉంటాడు. అలా ఓసారి ఓ అమ్మాయి కుటుంబానికి 25 సవర్ల బంగారం ఇస్తాడు. కానీ వాళ్లేమో తిరిగి 13 సవర్లు మాత్రమే ఇస్తారు. దీంతో గొడవ జరుగుతుంది. మరి చివరకు ఇది ఎక్కడ ముగిసిందనేదే స్టోరీ. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు) -
'రేఖాచిత్రం' సినిమా రివ్యూ (ఓటీటీ)
మలయాళ సినిమా అనగానే అందరికీ గుర్తొచ్చేవి థ్రిల్లర్స్. ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో థ్రిల్లర్ మూవీస్ తీస్తూనే ఉంటారు. అలా ఈ ఏడాది జనవరిలో థియేటర్లలో రిలీజై హిట్ కొట్టినంది 'రేఖాచిత్రం'. ఇప్పుడు దీని తెలుగు వెర్షన్ సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)కథేంటి?రాజేంద్రన్ (సిద్ధిఖ్) అనే ఓ పెద్దాయన.. మలకపార ప్రాంతంలోని అడవిలో గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. చనిపోవడానికి ముందు ఓ వీడియో రికార్డ్ చేస్తాడు. 40 ఏళ్ల క్రితం ఓ అమ్మాయిని హత్య చేశామని, మరో ముగ్గురితో కలిసి ఇప్పుడు కూర్చున్న చోటే ఆమెని పాతిపెట్టాం అని సదరు వీడియోని ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తాడు. అదేరోజు ఆ ఊరి ఎస్ఐగా వివేక్ (అసిఫ్ అలీ) జాయిన్ అవుతాడు. రాజేంద్రన్ చెప్పినట్లు అక్కడ తవ్వితే నిజంగానే ఓ అమ్మాయి ఎముకలు దొరుకుతాయి. అలా ఈ కేసు దర్యాప్తు మొదలవుతుంది. ఇంతకీ హత్యకు గురైన అమ్మాయి ఎవరు? ఆమెను ఎందుకు చంపారు? హత్య చేసిన వాళ్లు పట్టుబడ్డారా లేదా అనేదే స్టోరీ.ఎలా ఉందంటే?క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు తీయడం మలయాళీ దర్శకులకు వెన్నతో పెట్టిన విద్య. అలా అని 'రేఖాచిత్రం' ఏదో డిఫరెంట్ అని కాదు. ఎప్పటిలానే ఇదో మర్డర్ మిస్టరీ. కాకపోతే దీన్ని డీల్ చేసిన విధానం. సస్పెన్స్ ఎలిమెంట్స్ ని ఒక్కొక్కటిగా రివీల్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది.వివేక్ ఓ పోలీస్. కానీ డ్యూటీ టైంలో బెట్టింగ్స్ ఆడుతున్నాడని సస్పెండ్ చేస్తారు. కొన్నాళ్లకు ఓ మారుమూల పల్లెటూరికి ట్రాన్స్ ఫర్ చేస్తారు. సరిగ్గా జాయిన్ అయిన రోజే ఓ అమ్మాయి మర్డర్ కేసు. అది కూడా 40 ఏళ్ల క్రితం ఈమెని చంపి పాతిపెట్టి ఉంటారు. రాజేంద్రన్ అనే వ్యక్తి ఈ విషయాల్ని బయటపెట్టి చనిపోతాడు. దీంతో అసలు రాజేంద్రన్ ఎవరు? చనిపోయిన అమ్మాయి ఎవరు? ఆమెకు 1985లో రిలీజైన మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి 'కాతోడు కాతరం' సినిమాకు సంబంధం ఏంటనేది వివేక్ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఈ క్రమంలోనే పలు అడ్డంకులు కూడా ఎదురవుతాయి.సినిమా మొదలైన ఐదు నిమిషాలకే మర్డర్ గురించి తెలుస్తుంది. అలా మనల్ని దర్శకుడు కథలోకి నేరుగా తీసుకెళ్లిపోతాడు. స్టోరీ ఎక్కడా పరుగెట్టదు కానీ అనవసర సీన్ ఒక్కటీ ఉండదు. యువతి కాలిపట్టితో మొదలుపెట్టి.. ఒక్కో పాత్ర ఒక్కో లింక్ ని పట్టుకుని స్టోరీ తెలిసేకొద్ది యమ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.(ఇదీ చదవండి: Chhaava Review: ‘ఛావా’(తెలుగు వెర్షన్) మూవీ రివ్యూ)చనిపోయిన రాజేంద్రన్.. తనతో పాటు విన్సెంట్ కూడా హత్యలో భాగమని చెబుతాడు. నిజంగానే విన్సెంట్ హత్య చేశాడా? దీన్ని వివేక్ ఎలా నిరూపించడనేది చివరివరకు మనల్ని ఎంగేజ్ చేసే విషయం. చూస్తున్నంతసేపు ఎక్కడా మనం ఓ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ రాదు. మన చుట్టుపక్కలా జరుగుతున్నట్లే చాలా నేచురల్ గా ఉంటుంది. చివరకొచ్చేసరికి ఓ మంచి థ్రిల్లర్ సినిమా చూశామనే అనుభూతి మాత్రం కలుగుతుంది.ఓ యువతి హత్యకు మమ్ముట్టి సినిమా, షూటింగ్ తో లింక్ చేసి చూపించడం ఆసక్తికరంగా ఉంటుంది. హీరో మమ్ముట్టి అప్పటి లుక్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ టెక్నాలజీ ఉపయోగించి యువకుడిలా చూపించడం కూడా బాగుంది. ప్రతి పాత్రని పరిచయం చేసిన తీరు, ముగించిన తీరు చాలా ఆకట్టుకుంటుంది.ఎవరెలా చేశారు?ఓటీటీ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కాస్తోకూస్తో తెలిసిన అసిఫ్ అలీ, అనస్వర రాజన్.. వివేక్, రేఖ పాత్రల్లో ఇమిడిపోయారు. ఎక్కడ ఓవరాక్షన్ లేకుండా సింపుల్ గా చేసుకుంటూ వెళ్లిపోయారు. మిగిలిన ప్రతి పాత్రధారి తమ నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో పాటలు పెద్దగా లేవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరిపోయింది. మిగతా టెక్నీషియన్స్ తమకిచ్చిన పనికి న్యాయం చేశారు. తెలుగు డబ్బింగ్ బాగుంది. కుటుంబంతో కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేసే థ్రిల్లర్ మూవీ ఈ 'రేఖాచిత్రం'.-చందు డొంకాన(ఇదీ చదవండి: నా భర్తతో ఎలాంటి గొడవలు లేవు.. వీడియో విడుదల చేసిన కల్పన) -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. కింగస్టన్, ఛావాతో పాటు పలు సినిమాలు థియేటర్లలో రిలీజైనప్పటికీ దేనిపైన కూడా పెద్దగా అంచనాల్లేవు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం ఈ రోజు (మార్చి 07) ఒక్కరోజే ఏకంగా 30కి పైగా కొత్త సినిమాలు వచ్చేశాయి.(ఇదీ చదవండి: నా భర్తతో ఎలాంటి గొడవలు లేవు.. వీడియో విడుదల చేసిన కల్పన)ఓటీటీల్లో ఈ శుక్రవారం రిలీజైన సినిమాల్లో తండేల్, రేఖాచిత్రం, మనమే, కుడుంబస్థాన్, బాపు, స్కై ఫోర్స్, ఫతే, లైలా, రివైండ్ తదితర తెలుగు, హిందీ చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. గతకొన్నివారాల్లో ఎన్నడూ లేనిది ఈసారి చాలా తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్ లోకి వచ్చాయి. అవేంటో ఓ లుక్కేసేయండి.ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన సినిమాలు (మార్చి 07)నెట్ ఫ్లిక్స్తండేల్ - తెలుగు సినిమానదానియాన్ - హిందీ మూవీసోనీ లివ్రేఖాచిత్రం - తెలుగు డబ్బింగ్ మూవీఅమెజాన్ ప్రైమ్మనమే - తెలుగు సినిమాధుపాహియా - హిందీ సిరీస్జానీ మేరా నామ్ - హిందీ మూవీనో వేర్ టూ హైడ్ - డచ్ సిరీస్లవ్ లేస్ - ఇంగ్లీష్ సినిమానారాయణీంటే మూన్మమనక్కల్ - మలయాల సినిమాస్కై ఫోర్స్ - హిందీ మూవీరాయల్ - కన్నడ సినిమా NCIS - ఇంగ్లీష్ సిరీస్హాట్ స్టార్బాపు - తెలుగు మూవీబ్లోకో 181 - ఇటాలియన్ సిరీస్ఎల్స్ బెత్ - ఇంగ్లీష్ సిరీస్ఫతే - హిందీ సినిమాథగేస్ vs ద వరల్డ్ - హిందీ సిరీస్ద ఏజెన్సీ - ఇంగ్లీష్ సిరీస్ఆహాలైలా - తెలుగు మూవీఫైండర్ - తమిళ సినిమాకుళంతైగల్ మున్నేత్ర కళగం - తమిళ మూవీజీ5కుడుంబస్థాన్ - తెలుగు డబ్బింగ్ సినిమాగేమ్ ఛేంజర్ - తెలుగు మూవీసన్ నెక్ట్గణ - కన్నడ సినిమాఉత్సవం - తెలుగు మూవీద సీక్రెట్ ఆఫ్ ఉమెన్ - మలయాళ సినిమాబుక్ మై షోబారా బై బారా - హిందీ మూవీడొమినిక్ - తెలుగు డబ్బింగ్ సినిమాగ్రాఫ్టెడ్ - తెలుగు డబ్బింగ్ మూవీతారా: ద లాస్ట్ స్టార్ - నేపాలీ సినిమాలయన్స్ గేట్ ప్లేరివైండ్ - తెలుగు మూవీఆల్ ఐ సీ ఈజ్ యూ - ఇంగ్లీష్ సినిమాలోస్ మన్ మెలాటీ - తెలుగు డబ్బింగ్ మూవీద డామినేటర్ 3 - కొరియన్ మూవీ(ఇదీ చదవండి: 'వైరల్ ప్రపంచం' మూవీ రివ్యూ) -
ఓటీటీలో తండేల్.. ఏడిపించేస్తున్న బుజ్జితల్లి వీడియో సాంగ్
తండేల్ సినిమా (Thandel Movie)తో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. ప్రేమకథలతో హిట్లు అందుకోవడం చైకి కొత్తేమీ కాదు. కానీ సెంచరీ కొట్టడం మాత్రం ఇదే తొలిసారి. చందూ మొండేటి దర్శకత్వం వహించగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించారు. సాయిపల్లవి హీరోయిన్గా నటించిన తండేల్ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా కలెక్షన్స్ కొల్లగొట్టేసిన ఈ మూవీ సరిగ్గా నెల రోజులకు ఓటీటీలోకి వచ్చేసింది. నేడు (మార్చి 7) తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది.బుజ్జి తల్లి సాడ్ వర్షన్ఇటీవల బుజ్జితల్లి వీడియోసాంగ్‌ను రిలీజ్ చేసిన చిత్రబృందం నేడు బుజ్జితల్లి సాడ్ వర్షన్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. సినిమాలో ఈ సాంగ్ వచ్చేటప్పుడు ప్రేక్షకులు కంటతడి పెట్టుకుంటారు. ఏమి తప్పు చేశానే.. ఇంత శిక్ష వేశావె.. ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావె.. అంటూ సాగే ఈ పాట బ్రేకప్ అయిన వారికి మరింత కనెక్ట్ అవుతుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను జావెద్ అలీ అద్భుతంగా పాడారు. శ్రీ మణి గుండెల్ని మెలిపెట్టే లిరిక్స్ రాశారు. చదవండి: నా భర్తతో ఎలాంటి గొడవలు లేవు.. వీడియో విడుదల చేసిన కల్పన -
ఓటీటీలో భారీ యాక్షన్ సినిమా.. పాక్ గడ్డపై మన ఫైటర్ పోరాటం
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘స్కై ఫోర్స్’ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. వీర్ పహారియా, సారా అలీఖాన్, నిమ్రత్ కౌర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ మూవీని దర్శక ద్వయం సందీప్ కెవ్లానీ– అభిషేక్ అనిల్ కపూర్ తెరకెక్కించారు. జియో స్టూడియోస్, మాడ్డాక్ ఫిల్మ్స్, లియో ఫిల్మ్స్ యూకే ప్రొడక్షన్స్ పతాకాలపై జ్యోతి దేశ్‌పాండే, అమర్ కౌశిక్, భౌమిక్, దినేశ్ విజన్ సుమారు రూ. 160 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. 1965లో జరిగిన ఇండియా–పాకిస్తాన్ వార్ నేపథ్యంలో భారతదేశపు మొదటి వైమానిక దాడి సంఘటనల ఆధారంగా ‘స్కై ఫోర్స్’ సినిమాను తీశారు.ఈ చిత్రంలో కమాండర్ కేవో అహుజా పాత్రలో అక్షయ్ కుమార్, టి. విజయ పాత్రలో వీర్ పహారియా నటించారు. దినేష్ విజయ్, జ్యోతీ దేశ్ పాండే, అమర్ కౌశిక్, సాహిల్ ఖాన్ నిర్మించిన ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న విడుదల అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్కై ఫోర్స్ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఈ చిత్రాన్ని చూడాలంటే రూ.249 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఈ మూవీ కేవలం హిందీ వర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. సబ్‌టైటిల్స్‌తో ఇతర భాషల వారు కూడా చూడొచ్చు. స్కై ఫోర్స్ చిత్రానికి మౌత్ టాక్ పాజిటివ్‌గా వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 200 కోట్లకు వరకు కలెక్షన్లు రాబట్టింది.1965లో జరిగిన భారత్ - పాకిస్థాన్ వైమానిక యుద్ధం నేపథ్యంలో స్కై ఫోర్స్ సినిమా ఉంటుంది. ఆ యుద్ధ సమయంలో కనిపించకుండా పోయిన భారత వైమానిక దళం స్క్వాడ్రన్ లీడర్ అజ్జమడ బొప్పయ్య దేవయ్యకు సంబంధించిన సాహస పోరాటాన్ని ఈ సినిమా కథకు స్ఫూర్తిగా తీసుకున్నారు. పాకిస్థాన్ వైమానిక స్థావరానికి గుండెకాయలాంటి సర్గోదపై భారత్ ప్రతీకార దాడికి దిగినప్పుడు ఏం జరిగింది..? అనేది ఈ మూవీలో చూపారు. ఆ యుద్ధంలో దేవయ్య ధైర్య సాహసాలు, అతని పోరాట పటిమను ప్రపంచానికి చాటి చెప్పారు. విజయవంతంగా జరిగిన ఆ యుద్ధంలో రియల్ హీరో అజ్జమడ బొప్పయ్య దేవయ్య సాహసమనే చెప్పవచ్చు. ఆయన త్యాగం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని అధికారులు గుర్తుచేసుకుంటారు. ఆ పోరాటంలో పాల్గొన్న ఆయన మళ్లీ తిరిగిరాలేదు. కనుమరుగైపోయిన ఆయన పాకిస్థాన్ గడ్డపై ఏమయ్యాడో ఈ సినిమాలో చూడొచ్చు. ఆయన పాత్రలో వీర్ పహారియా నటించగా, ఆయన గురువైన వింగ్ కమాండర్ అహుజా పాత్రలో అక్షయ్ కుమార్ మెప్పించారు. అక్షయ్ పాత్రకి భారత వైమానిక దళ అధికారి, గ్రూప్ కెప్టెన్ ఓం ప్రకాశ్ తనేజా స్ఫూర్తి అని మేకర్స్ తెలిపారు. -
ఓటీటీలో సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన 'సోనూ సూద్' సినిమా
నెగటివ్ క్యారెక్టర్స్‌లో తనదైన విలనిజాన్ని పండించిన సోనూ సూద్ హీరోగా నటించిన బాలీవుడ్ చిత్రం 'ఫతే' సడెన్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రానికి సోనూయే దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు.‘ఫతే’ మూవీకి రచయిత కూడా సోనూనే కావడం విశేషం. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్హీరోయిన్గా నటించింది. నసీరుద్దీన్ షా, విజయ్ రాజ్, నాగినీడు కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్స్‌లో ఈ మూవీ సందడి చేసింది.సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఫతే చిత్రం సడెన్‌గా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ప్రస్తుతం కేవలం హిందీ వర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, మరో వారంలోపు తెలుగు వర్షన్లో కూడా ఈ చిత్రం రానుందని తెలుస్తోంది. ఈ మూవీతోనే డైరెక్టర్‌గా అరంగేట్రం చేసిన సోనూ ప్రేక్షకులను మెప్పించాడు. సైబర్ క్రైమ్‌లో ఎదురయ్యే సవాళ్ల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సుమారు రూ. 50 కోట్ల బడ్జెట్‌తో ఫతే చిత్రాన్ని సోనూసూద్ భార్య సోనాలి సూద్ నిర్మించింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 30 కోట్ల లోపే కలెక్షన్స్ రాబట్టింది.కథేంటి..?సైబర్ నేరాలు ఎలా జరుగుతాయో ఈ చిత్రంలో చూపించారు. పంజాబ్‌లోని ఒక గ్రామంలో పాల వ్యాపారం చేస్తున్న ఫతేహ్ సింగ్ (సోనూసూద్) వద్ద పని చేసే వ్యక్తి లోన్ యాప్ నిర్వాహుకల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ సంఘటన ఫతేహ్లో తీవ్రమైన ఆవేదన ఏర్పడుతుంది. అతని ఆత్మహత్యకు కారణం లోన్ యాప్ అని తెలుసుకుని లోతుగా పరిశీలిస్తాడు. ఈ క్రమంలో ఇదే లోన్ యాప్ వల్ల చాలమంది మరణించారని తెలుసుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో తన ఇంట్లో నివసించే నిమ్రత్ కౌర్ (శివజ్యోతి రాజ్‌పుత్)ను ఓ సైబర్ క్రైమ్ ముఠా కిడ్నాప్ చేస్తుంది. ఆమెను కాపాడే క్రమంలో ఫతేహ్కు అనేక సమస్యలు ఎదురౌతాయి. ఆమెను వారు ఎందుకు కిడ్నాప్ చేశారు..? ఆ లోన్ యాప్ సంస్థతో నిమ్రత్‌ను కిడ్నాప్ చేసిన ముఠాకు ఉన్న లింక్ ఏంటి..? పాల వ్యాపారం చేసే ఫతేహ్ గతమేంటి..? హ్యాకర్ ఖుషీతో (జాక్వెలైన్) ఫతేహ్కు ఉన్న సంబంధం ఏంటి..? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ చిత్రంలో మితిమీరిన హింస ఉంటుంది. సోనూసూద్ యాక్షన్ ఎపిసోడ్స్‌కు ఫిదా అవుతారు. ముఖ్యంగా సెకండాఫ్ బాగా నచ్చుతుంది. -
ఓటీటీ.. బంపర్ హిట్
డిజిటల్ స్ట్రీమింగ్ మీడియా సేవల (ఓటీటీ) ముందు నేడు సినిమా థియేటర్లు, టీవీలు చిన్నవైపోతున్నాయి. ప్రేక్షకుల సందడి లేక థియేటర్లు వెలవెలబోతుంటే.. వీక్షకులను కాపాడుకునేందుకు టీవీ చానళ్లు తంటాలు పడుతున్నాయి. వీటికి అందనన్నట్టుగా ఓటీటీ వేదికలు ఎక్స్‌ప్రెస్ వేగంతో దూసుకుపోతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియోస్టార్, యూట్యూబ్, జీ5, సోనీలివ్, ఆహా.. ఇలా ఓటీటీల జాబితా చాలా పెద్దదే. ఓటీటీ సేవలకు 4జీ టెలికం ఊతమిస్తే.. కరోనా విపత్తు ప్రేక్షకులకు మరింత చేరువ చేసిందని చెప్పుకోవాలి. బాహుబలుల కుస్తీపట్లకు వేదికైన ‘వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్’ (డబ్ల్యూడబ్ల్యూఈ) షోలకు అమెరికా తర్వాత ఎక్కువ మంది వీక్షకులు ఉన్నది భారత్‌లోనేనని నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ వెల్లడించారు. డబ్ల్యూడబ్ల్యూఈకి చెందిన రా, ఎన్ఎక్స్టీ, స్మాక్‌డౌన్ ఇలా ప్రతి ఫార్మాట్‌కు సంబంధించి షోలు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. 2019లోనే డబ్ల్యూడబ్ల్యూఈ ఫార్మాట్లను భారత్‌లో 5 కోట్ల మంది యూజర్లు వీక్షించడం గమనార్హం. చేతిలో స్మార్ట్‌టీవీ మాదిరిగా ఓటీటీ పరిశ్రమ విస్తరిస్తోంది. విస్తరణ వ్యూహాలు.. అమెజాన్ ప్రైమ్‌లో ఇప్పుడు ‘శివరాపల్లి’ వెబ్‌సిరీస్ అదరగొడుతోంది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ షోలలో ‘పంచాయత్’ ఒకటి. మొదట హిందీలో వచ్చిన ఈ షో ఆ తర్వాత తమిళంలోకి ‘తలైవెట్టియాన్ పాళయం’పేరుతో అనువదించగా, అక్కడా దుమ్ము దులుపుతోంది. ఆ తర్వాత శివరాపల్లి పేరుతో గత నెలలో విడుదలై క్రమంగా ఆదరణ పెంచుకుంటోంది. అమెజాన్ ప్రైమ్ ఇప్పుడు 8,500 టైటిళ్లను ఆఫర్ చేస్తోంది. కొత్తగా విడుదలైన సినిమాలను వేగంగా ప్రైమ్‌లోకి తీసుకొచ్చేందుకు ఎంత చెల్లించడానికైనా వెనుకాడడం లేదు. సెలబ్రిటీ షోల విషయంలోనూ దూకుడు ప్రదర్శిస్తోంది. సోనీ లివ్ ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్’, ‘రాకెట్ బోయ్స్’, షార్క్ ట్యాంక్ ఇండియా, మిలియన్ డాలర్ లిస్టింగ్ తదితర పాపులర్ షోలతో తన యూజర్లను 3.3 కోట్లకు పెంచుకోవడం గమనార్హం. 5.5 కోట్ల యూజర్లు కలిగిన జియోహాట్‌స్టార్ అయితే.. రిలయన్స్ జియోకి ఉన్న 42 కోట్ల కస్టమర్లకు చేరువయ్యేందుకు వ్యూహాలు అమలు చేస్తోంది. సాధారణంగా ఒక వెబ్‌సిరీస్‌లో 6–7 షోలు ఉంటే.. 100 వరకు ఎపిసోడ్లతో సి రీస్ తీసుకురావాలని నిర్మాతలను కోరుతోంది. తద్వారా యూజర్ ఎంగేజ్మెంట్ పెంచుకోవాలని అనుకుంటోంది. విలీనాలు.. కొనుగోళ్లుభారీ మార్కెట్, అదే సమయంలో గణనీయమైన పోటీ నేపథ్యంలో ఓటీటీ పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్న డిస్నీ హాట్‌స్టార్.. తనకు ప్రధాన ప్రత్యర్థిగా అవతరిస్తున్న జియో సినిమాస్‌తో చేతులు కలపడం పరిశ్రమలో స్థిరీకరణ దిశగా బలమైన అడుగులు పడినట్టయింది. పరిశ్రమలో ఇప్పుడు జియోహాట్‌స్టార్ నంబర్ 1 ప్లేయర్. జీతో విలీనం అయ్యేందుకు సోనీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. పోటీ పెరగడంతో అమెజాన్ లైట్ పేరుతో ఒక్కరు/ఇద్దరు సభ్యుల కుటుంబం కోసం తక్కువ చార్జీల నమూనాను తీసుకొచ్చింది. అలాగే, 2024లో ఎంఎక్స్ ప్లేయర్‌ను కొనుగోలు చేసి.. దీనిపై ఉచిత కంటెంట్‌ను అందుబాటులో ఉంచింది.భారీగా ఆదాయం.. 2024లో ఓటీటీ సంస్థలు రూ.35,600 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నాయి. ఇందులో యూజర్ల సబ్‌్రస్కిప్షన్ చార్జీలతోపాటు ప్రకటనల ఆదాయం కలిసి ఉంది. ఇందులో 40 శాతం యూట్యూబ్‌కే రావడం గమనార్హం. 2022లో 11.2 కోట్ల ఓటీటీ యూజర్లు కాస్తా, 2023లో 9.6 కోట్లకు తగ్గారు. దీంతో మరింత కంటెంట్‌తో, చౌక ప్లాన్లతో ఓటీటీలు 2024లో యూజర్లను 12.5 కోట్లకు పెంచుకున్నాయి. కెనక్టెట్ టీవీల (ఇంటర్నెట్ అనుసంధానం కలిగినవి) కొనుగోళ్లు పెరుగుతుండడం ఓటీటీలకు మరింత డిమాండ్‌ను తెచ్చి పెడుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్‌కు బదులు పెద్ద సైజు టీవీ తెరలపై షోలను వీక్షించేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. పరిశ్రమ ఆదాయం 2022లో రూ.21,600 కోట్లుగా ఉంటే, 2023లో రూ.30,300 కోట్లకు, 2024లో రూ.35,600 కోట్లకు వృద్ధి చెందింది. వృద్ధికి భారీ అవకాశాలు.. 90 కోట్ల టీవీ వీక్షకులతో పోల్చి చూస్తే.. 12.5 కోట్ల వీక్షకులు కలిగిన ఓటీటీ పరిశ్రమకు మరింత మందిని చేరుకునేందుకు గణనీయమైన అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో స్మార్ట్‌ఫోన్ యూజర్లు 2024 నాటికి 65 కోట్ల మంది ఉంటారని అంచనా. 5 కోట్ల కనెక్టెడ్ టీవీలు కూడా ఉన్నాయి. ఈ పరంగా చూస్తే ఓటీటీల విస్తరణకు దండిగా అవకాశాలున్నాయన్నది విశ్లేషుకుల అభిప్రాయం. తొమ్మిదేళ్ల క్రితం ఫస్ట్ గేర్‌లోకి ప్రవేశించిన ఓటీటీ పరిశ్రమ ప్రస్తుతం పట్టణ యూజర్లకు వేగంగా చేరువ కాగా, దేశంలోని ఇతర ప్రాంతాల వారికీ తమ కంటెంట్‌ను చేరువ చేయాల్సి ఉందంటున్నారు. ఇందుకు వీలుగా ప్రకటనలతో కూడిన తక్కువ సబ్‌్రస్కిప్షన్ ప్యాక్‌లు సాయపడతాయని చెబుతున్నారు. సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఓటీటీలో శర్వానంద్ 'మనమే'.. అఫీషియల్ ప్రకటన
శర్వానంద్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా, చైల్డ్ ఆర్టిస్టు విక్రమాదిత్య కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ఇది. సుమారు ఏడాది తర్వాత ఓటీటీలోకి రానుంది. ఈమేరకు తాజాగా ప్రకటన కూడా వచ్చేసింది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ, బాక్సాఫీసు వద్ద లాభాలను తెచ్చిపెట్టింది.శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా 'మనమే' సినిమా ఓటీటీ వివరాలను మేకర్స్ ప్రకటించారు. మార్చి 7న 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో ఈ చిత్రం విడుదల కానుందని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. మనమే చిత్రం విడుదల సమయంలో బాక్సాఫీస్ బరిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో శర్వానంద్‌కు ప్లస్ అయింది. మనమే కథా నేపథ్యం చాలా బాగుంటుంది. ఇందులో వినోదంతో పాటు భావోద్వేగాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి.హీరో శర్వానంద్ బైక్ రేసింగ్‌తో ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. శర్వా నంద్ హీరోగా అభిలాష్ కంకర్ డైరెక్షన్లో ‘రేజ్ రాజా’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో మోటారు బైకు రేసర్‌గా శర్వానంద్ నటిస్తున్నారు. 1990 నుంచి 2000ల మధ్య కాలంలో జరిగే ఈ స్పోర్ట్స్ మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే... స్పోర్ట్స్ డ్రామా జానర్లో సినిమాలు చేసిన అనుభవం శర్వానంద్‌కు ఉంది. ‘మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు (2015)’ మూవీలో రన్నింగ్ రేసర్‌గా, ‘పడి పడి లేచే మనసు (2018)’ మూవీలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా శర్వానంద్ నటించి, మెప్పించిన సంగతి తెలిసిందే. -
నటుడిగా మారిన సౌరవ్ గంగూలీ.. వెబ్ సిరీస్‌తో గ్రాండ్ ఎంట్రీ!
క్రికెటర్లు కాస్త యాక్టర్లు అవుతున్నారు. గతంలో గ్రౌండ్లో పోర్లు, సిక్సర్ల వర్షం కురపించిన స్టార్ క్రికెటర్లు..ఇప్పుడు తమ యాక్టింగ్‌తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడానికి రెడీ అవుతున్నారు. చేసేది చిన్నదే అయినా.. కథకు చాలా కీలకమైన పాత్రల్లో మెరవబోతున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ‘రాబిన్‌హుడ్’ సినిమాతో వెండితెర ఆరంగ్రేటం చేశాడు. ఇక ఇప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) కూడా నటుడిగా మారినట్లు తెలుస్తోంది. ఆయన ఓ వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర పోషించినట్లు బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి.పోలీసు పాత్రలో గంగూలీజీత్, ప్రోసెన్జిత్ ఛటర్జీ, శాశ్వత, పరంబ్రత ఛటర్జీ ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్ ‘ఖాకీ: ది బెంగాల్ చాప్టర్’ (ఖాకీ 2). మార్చి 20 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.ఇందులో గంగూలీ అతిథి పాత్రలో కనిపించనున్నారనే వార్తలు బాలీవుడ్లో వినిపిస్తున్నాయి. ఆయన పోలీసు డ్రెస్‌లో ఉన్న పిక్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వెబ్ సిరీస్‌లో గంగూలీ పోలీసు ఉన్నతాధికారిగా కనిపించబోతున్నారట. తెరపై కనిపించేది కాసేపే అయినా.. కథకి కీలకమైన పాత్ర అయిన ప్రచారం జరుగుతోంది.ప్రమోషన్ కోసమేనా?అయితే ఈ వెబ్ సిరీస్‌లో గంగూలీ నటించారనే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. అలా అని ఈ రూమర్‌ని ఖండించడమూ లేదు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత నీరజ్ పాండే ఈ గాసిప్‌పై స్పందిస్తూ..‘నేను చెప్పడం ఎందుకు..మార్చి 20న తర్వాత గంగూలీ నటించారో లేదే మీకే తెలుస్తుంది’ అని అన్నారు. దీంతో గంగూలీ నిజంగానే ఈ వెబ్ సిరీస్‌లో నటించారని కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతుంటే..మరికొంత మంది ఏమో సినిమా ప్రమోషన్లో ఆయన పాల్గొన్నారని, అందులో భాగంగానే పోలీసు యూనిఫాంలో కనిపించారని కామెంట్ చేస్తున్నారు. యదార్థ సంఘటనలతో ఖాకీ 2నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘ఖాకీ ది బిహార్ చాప్టర్’కు కొనసాగింపుగా ఖాకీ2 వెబ్ సిరీస్ తెరకెక్కింది. ప్రముఖ ఐపీఎస్ అధికారి అమిత్ లోథా జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ని తెరకెక్కించారు. మరోవైపు గంగూలీ జీవిత చరిత్రపై ఓ సినిమా తెరకెక్కబోతోంది. ప్రముఖ బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్‌రావు హీరోగా నటిస్తున్నాడు. -
ఓటీటీలో ముగ్గురు స్టార్స్ నటించిన సినిమా.. డైరెక్ట్‌గా స్ట్రీమింగ్
నయనతార(Nayanthara) నటించిన ‘ది టెస్ట్’(The Test) సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో (OTT) విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. వైనాట్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతారతో పాటు మాధవన్, సిద్ధార్థ్ (Siddharth) లీడ్ రోల్స్ చేశారు. మీరా జాస్మిన్ ఓ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాతో నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.నిర్మాత శశికాంత్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘ది టెస్ట్’ చిత్రం కొన్ని నెలల క్రితమే నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీంతో చిత్ర విడుదల కోసం నయనతార అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 4న ఈ చిత్రాన్ని థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. తమిళ్,తెలుగు,హిందీ,కన్నడ,మలయాళంలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.చెన్నైలో జరిగిన ఓ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే ప్రధాన కాన్సెప్ట్‌తో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో 'కుముధ' అనే పాత్రలో నయన్ కనిపించనుంది. ఇకపోతే ఇంతకుముందు కూడా నయనతార ప్రధాన పాత్రను పోషించిన మూకుత్తి అమ్మన్(అమ్మోరు తల్లి), నెట్రికన్ చిత్రాలు నేరుగా ఓటీటీలోనే విడుదల కావడం గమనార్హం. ఈ సినిమా తర్వాత నయన్ చేతిలో డియర్ స్టూడెంట్స్, అమ్మోరు తల్లి 2 చిత్రాలు ఉన్నాయి. -
ఓటీటీలోకి అదిరిపోయే థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్
ఓటీటీలోకి అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రానుంది. 'ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్' పేరుతో తెరకెక్కిన ఈ సిరీస్ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. ఇందులో జీత్, ప్రసేన్‌జిత్ ఛటర్జీ, శాశ్వత, పరంబ్రత ఛటర్జీ వంటి స్టార్స్ నటించారు. ఈ మూవీతో భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ నటుడిగా తెరంగేట్రం చేయనున్నారనే వార్తలు ఇప్పటికే వైరలవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సిరీస్ ట్రైలర్ ఈవెంట్లో నిర్మాత నీరజ్ పాండే పరోక్షంగా గంగూలీ ఉండొచ్చు అనే కామెంట్ చేశారు.'ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్' నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళంలో అందుబాటులో ఉండనుంది.2000 సంవత్సరంలో బెంగాల్‌లోని పరిస్థితులను చూపిస్తూ ఈ సిరీస్‌ను దర్శకుడు దేబాత్మ మండల్ తెరకెక్కించారు. గ్యాంగ్స్టర్లు, రాజకీయ నాయకులలో అధికార దాహం ఉంటే.. అక్కడి నగరంలో శాంతిని కాపాడటానికి పోలీసు అధికారులు చాలా కష్టపడుతుంటారు. అలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఐపీఎస్ అర్జున్ మైత్రా చట్టాన్ని కాపాడేందుకు ఎలాంటి పరిస్థితిలను ఎదుర్కొన్నారనేది ఇందులో చూపారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్ మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ కానుందని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘ఖాకీ ది బిహార్ చాప్టర్’కు కొనసాగింపుగా ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్ తెరకెక్కించారు. రెండేళ్ల క్రితం విడుదలైన ఈ సిరీస్ సంచలన విజయాన్ని అందుకుంది. బిహార్ ఐపీఎస్ అధికారి అమిత్ లోధా జీవితం ఆధారంగా ఖాకీ: ది బిహార్ చాప్టర్ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో వెబ్ సిరీస్‌గా రూపొందిన సంగతి తెలిసిందే. దీనికి ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది కూడా. వాస్తవానికి ఐపీఎస్ అధికారి అమిత్ ఒక గ్యాంగ్‌స్టర్ అశోక్ మెమతోను పట్టుకోవడానికి చేపట్టిన ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కించిందే ఈ వెబ్ సీరిస్. -
ఓటీటీలో రామం రాఘవం.. ఎప్పటినుంచంటే?
సముద్రఖని, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రామం రాఘవం (Ramam Raghavam Movie). ఈ సినిమాతో ధనరాజ్ దర్శకుడిగా మారాడు. ఎప్పుడూ కమెడియన్‌గా నవ్వించే ధనరాజ్ ఈ మూవీతో ఏడిపించే ప్రయత్నం చేశాడు. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తాజాగా ఓటీటీ(OTT)లోకి వచ్చేందుకు రెడీ అయింది. సన్ నెక్స్ట్లో మార్చి 14న విడుదల కానుంది. తెలుగుతోపాటు తమిళంలోనూ అందుబాటులోకి రానున్నట్లు సన్ నెక్స్ట్ (Sun NXT) అధికారికంగా ప్రకటించింది.కథేంటంటే?సబ్ రిస్ట్రార్ దశరథ రామం (సముద్రఖని) నిజాయితీపరుడు. కొడుకు రాఘవన (ధన్‌రాజ్)ను చాలా గారాబంగా పెంచుతాడు. డాక్టర్‌ను చేయాలని కలలు కంటాడు. కానీ అతడు మాత్రం చదువు ఆపేసి జల్సా చేస్తాడు. సులువుగా డబ్బు సంపాదించడం కోసం అనేక తప్పులు చేస్తాడు. అలా ఓసారి చిక్కుల్లోపడతాడు. అప్పుడు తండ్రే అతడిని పోలీసులకు అప్పగిస్తాడు. జైలు నుంచి బయటకు రాగానే తండ్రినే చంపాలని కుట్రపన్నుతాడు.. ప్రాణంగా ప్రేమించిన తండ్రిని రాఘవ ఎందుకు చంపాలనుకుంటాడు? అతడు చేసిన తప్పేంటి? కొడుకు కోసం రామం తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? అన్నది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే! The father and son journey unfolds in a manner you won’t anticipate... 😊✨Watch Ramam Raghavam streaming from March 14th 🔥[Ramam Raghavam, Samuthirakani, Dhanraj Koranani, Harish Uthaman,Satya, Vennela Kishore, Srinivas Reddy, Sunil, Prudhvi Raj]...#RamamRaghavam… pic.twitter.com/7jrkTU01SO— SUN NXT (@sunnxt) March 5, 2025 చదవండి: వెస్ట్రన్ దుస్తులు వేసుకోనివ్వడు, నాకు కన్యాదానం చేస్తానన్నాడు: అమీషా -
ఎట్టకేలకు మోక్షం.. ఓటీటీకి అఖిల్ ఏజెంట్ మూవీ
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన ఫుల్ యాక్షన్ చిత్రం 'ఏజెంట్'. 2023 ఏప్రిల్ 28న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్గా మెప్పించింది. అయితే అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని రూ . 70 కోట్లతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.అయితే ఈ మూవీ విడుదలై దాదాపు రెండేళ్లు కావొస్తోంది. కానీ ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. గతంలో సోనీలివ్‌లో స్ట్రీమింగ్కు రానుందని ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాలతో ఓటీటీ రిలీజ్ వాయిదా పడుతూనే ఉంది. గతంలో పలుసార్లు డేట్స్ అనౌన్స్ చేసినప్పటికీ స్ట్రీమింగ్కు రాకపోవడంతో అఖిల్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే తాజాగా అఖిల్ అభిమానులకు ఎట్టకేలకు ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది.(ఇది చదవండి: ఓటీటీకి అఖిల్ ఏజెంట్.. మళ్లీ ఏమైంది?)తాజాగా ఏజెంట్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ఖరారు చేశారు. మార్చి 14వ తేదీ నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోనీ లివ్ అధికారికంగా ప్రకటించింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sony LIV (@sonylivindia) -
ఇంకా ఎందుకు బతికున్నావ్.. ఎలుకల మందు తిను అన్నారు: నటుడు
సీరియల్స్, సినిమాల్లో మనం చూసేదంతా నటన అని తెలిసినా కొందరు అందులో లీనమైపోతారు. విలన్లను ద్వేషిస్తారు.. హీరోలను ఆరాధిస్తారు.. హీరోయిన్లను ఇష్టపడతారు. వారికి నచ్చిన పాత్రను ఎవరైనా ఏమైనా అన్నా, హేళన చేసినా అసలు తట్టుకోలేరు. ఇది తనకు అనుభవమైందంటున్నాడు నటుడు నిశాంత్ దహియా. సన్యా మల్హోత్రా, నిశాంత్ దహియా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మిసెస్ (Mrs Movie). మలయాళంలో వచ్చిన ద గ్రేట్ ఇండియన్ కిచెన్ (The Great Indian Kitchen)కు ఇది రీమేక్‌గా తెరకెక్కింది. అంచనాలను మించిపోయిన Mrsజీ5లో రిలీజైన ఈ మూవీ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమా రెస్పాన్స్ గురించి నిశాంత్ (Nishant Dahiya) మాట్లాడుతూ.. ఇంత ఆదరణ లభిస్తుందని అస్సలు ఊహించలేదు. ఎంతోమంది జనాలకు మా సినిమా చేరువైంది. ఒకరు సినిమా తెరకెక్కించేటప్పుడు ఇది కచ్చితంగా జనాలకు చేరాలన్న ఆశతోనే తమ పని కొనసాగిస్తారు. మిసెస్ నా అంచనాలను మించిపోయింది. నాకే కాదు ఈ సినిమాకు పనిచేసిన అందరి అభిప్రాయం కూడా బహుశా ఇదే అయి ఉంటుంది.ముందే చెప్పాలిగా!ఎక్కడెక్కడినుంచో నాకు మెసేజ్‌లు వచ్చేవి, అందుకు నేను చాలా గర్విస్తున్నాను. కేవలం యాక్షన్, అడ్వెంచర్ సినిమాలు చూసేవారు కూడా నాకు కాల్ చేసి మాట్లాడటంతో ఆశ్చర్యపోయాను. మీ భార్యలతో మాత్రం సినిమా చూడొద్దని ఒక్క ముందుమాట వేయాల్సిందని నా ఫ్రెండ్స్ అన్నారు. నేను పోషించిన దివాకర్ పాత్ర వల్ల ప్రేమ, ద్వేషం అన్నీ పొందాను. ఆడవాళ్లు నా రోల్‌ను ద్వేషిస్తున్నామంటూనే నా పనితనాన్ని మెచ్చుకున్నారు. కానీ మగవాళ్లు చాలా కోపంగా మెసేజ్‌లు చేశారు. బండబూతులు తిట్టారుమూర్ఖుడా.. వెళ్లి ఎలుకల మందు తిను, నువ్వు ఇంకా బతికే ఉన్నావా.. చావలేదా? అని ఆగ్రహించారు. ఇలాంటి అమ్మాయిలు మెసేజ్ చేసుంటే అర్థం చేసుకునేవాడిని. నా పాత్రను ద్వేషించారు.. అది వారి మనసుని బాధపెట్టడం వల్లే ఇలా మాట్లాడుండొచ్చు అనుకుంటున్నాను. ఇంకొకరైతే నేను నటుడిగా పనికిరానన్నారు. ఇలాంటి పాత్రలు ఎంపిక చేసుకోవడం దగ్గరే నా వైఫల్యం కనిపించిందన్నారు. ఎలాంటి రోల్స్ సెలక్ట్ చేసుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా? అని విమర్శించారు.అదే పెద్ద సమస్యకానీ రియాలిటీకి వస్తే.. మన చుట్టూ ఉన్న సమాజంలో 95% మంది మగవాళ్లు దివాకర్లాగే ఉన్నారు. ఇదే నిజం. చాలామందికి వారేం చేస్తున్నారో కూడా తెలీదు. మిసెస్ సినిమాలో రిచా వెళ్లిపోయాక దివాకర్ రెండో పెళ్లి చేసుకుంటాడు. అంటే దివాకర్‌కు, అతడి కుటుంబానికి సమస్య ఏంటో అర్థం కాలేదు. అదే అన్నింటికన్నా పెద్ద ప్రాబ్లమ్. గ్రేట్ ఇండియన్ కిచెన్ చూసినప్పుడు హీరోయిన్ భర్త పాత్రను ద్వేషించాను. చివరకు అది మిసెస్ రూపంలో మళ్లీ నా దగ్గరకే వచ్చింది. మొదట ఒప్పుకోలేదు. కానీ తర్వాత అంగీకరించాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: ఆ సినిమా చేసేందుకు సౌత్ హీరోలు ముందుకురావట్లేదు: దర్శకుడు -
అఫీషియల్: ఓటీటీలోకి 'లైలా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యంగ్ హీరో విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ 'లైలా'. వాలంటైన్స్ డే కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి తొలి ఆటకే డిజాస్టర్ టాక్ వచ్చింది. దానికి తోడు క్రింజ్ కామెడీ పేరుతో కంటెంట్ అయితే మరీ ఘోరం. అలాంటి ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా బోల్తా కొట్టిన ఈ సినిమాలో విశ్వక్ సేన్.. సోనూ మోడల్ అనే కుర్రాడి పాత్రతో పాటు అమ్మాయి గెటప్ లోనూ కనిపించాడు. అయితే లేడీ గెటప్ లో చెప్పిన డైలాగ్స్ డబుల్ మీనింగ్ తో ఉండటం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటానని విశ్వక్.. అందరికీ క్షమాపణలు చెప్పాడు.(ఇదీ చదవండి: భర్త కాదు కూతురితో సమస్య.. సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నంలో బయటపడుతున్న నిజాలు)సరే అదంతా పక్కనబెడితే ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైన 'లైలా'.. మూడు వారాలు తిరిగేసరికే అంటే మార్చి 7నుంచి ఆహా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అఫీషియల్ పోస్టర్ కూడా విడుదల చేశారు.లైలా మూవీతో భారీ డిజాస్టర్ అందుకున్న విశ్వక్ సేన్.. ప్రస్తుతం జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కేవీ తీస్తున్న ఫంకీ అనే సినిమాలో నటిస్తున్నాడు. మరి దీనితోనైనా హిట్ కొట్టి కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?) -
‘డబ్బా కార్టెల్’ వెబ్ సిరీస్ రివ్యూ
బాలీవుడ్ వెబ్ సిరీస్‌లకి ఓటీటీలో మంచి డిమాండ్ ఉంది. అందులోనూ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లపై ప్రేక్షకుల ఆసక్తి కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఈ మధ్యకాలంలో ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లే వస్తున్నాయి. అలా తాజాగా నెటిఫ్లిక్స్‌లో రిలీజైన మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీసే ‘డబ్బా కార్టెల్’(Dabba Cartel Review). షబానా అజ్మీ, జ్యోతిక, షాలినీ పాండే, నిమిషా సజియన్, అంజలి ఆనంద్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ లిస్ట్‌లో ఉంది.ఈ సిరీస్ కథ విషయానికొస్తే.. షీలా(షబానా ఆజ్మీ) కోడలు రాజీ(షాలినీ పాండే)‘లంచ్ బాక్స్’ పేరిట వ్యాపారం చేస్తుంటుంది. ఈ బిజినెస్‌లో మరో ఇద్దరు మహిళలు మాల(నిమిషా సజయన్), షాహిదా(అంజలి ఆనంద్) కూడా భాగస్వామ్యం అవుతారు. ఓ వ్యక్తి చేతిలో మోసపోయిన మాల..తప్పనిసరి పరిస్థితుల్లో లంచ్ బాక్స్‌లో ఆహారంతో పాటు గంజాయి కూడా సరఫరా చేసేందుకు అంగీకరిస్తుంది. ఈ విషయం రాజీకి తెలియగానే..మొదట నో చెప్పినా.. తర్వాత ఆమె కూడా గంజాయి సరఫరాకు ఓకే చెబుతుంది. కొన్నాళ్ల తర్వాత ఈ గంజాయి బిజినెస్ ఆపేద్దామని అనుకుంటారు. ఆ లోపే డ్రగ్స్ విక్రయించాలని వీరిపై ఒత్తిడి వస్తుంది. లంచ్ బాక్స్ మాత్రమే అందజేసే ఈ మహిళలు.. గంజాయి, డ్రగ్స్ సరఫరా ఎందుకు చేయాల్సి వచ్చింది? రాజీ చేస్తున్న స్మగ్లింగ్ గురించి అత్తయ్య షీలాకు తెలిసినా.. ఆమె ఎందుకు వారికి సపోర్ట్ చేసింది? చివరకు ఈ మహిళలు ఆ వ్యాపారాన్ని మానేశారా లేదా? వివా ఫార్మా కంపెనీ తయారు చేసిన ఓ మెడిసిన్ ప్రమాదకరమని ప్రపంచానికి చెప్పాలన్న డ్రగ్ ఇన్స్పెక్టర్ పాఠక్ (గజరాజ్ రావ్) ప్రయత్నం ఫలించిందా? ఫార్మా కంపెనీ ఉద్యోగి శంకర్(జిషు సేన్గుప్త) సతీమణి వరుణ(జ్యోతిక)తో రాజీ గ్యాంగ్‌కు ఉన్న సంబంధం ఏంటి? రాజీ గ్యాంగ్‌తో కలిసి ఎందుకు పని చేసింది? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో ‘డబ్బా కార్టెల్’ చూడాల్సిందే.కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో తప్పులు చేస్తుంటారు.ఒకసారి చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేయాల్సి వస్తుంది. అలా తప్పనిసరి పరిస్థితుల్లో తప్పులు చేసిన ఐదుగురు మహిళల కథే ‘డబ్బా కార్టెల్’. తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తే భవిష్యత్తులో ఎలాంటి చిక్కుల్లో పడతారనేది రాజీ, మాల పాత్రల ద్వార చక్కగా చూపించాడు దర్శకుడు హితేశ్ భాటియా. భార్యభర్తలు ఒకరి చేసే పని గురించి మరొకరికి పూర్తిగా తెలియాలి. భర్తకు తెలియకుండా భార్య..భార్యకు తెలియకుండా భర్త డబ్బు కోసం ప్రమాదకర పనులు చేస్తే ఎలా ఉంటుందనేది ఈ సిరీస్ ద్వారా చూపించారు. అలాగే ఫార్మా కంపెనీలో ఎలాంటి లొసుగులు ఉంటాయో కూడా కళ్లకు కట్టినట్లు చూపించారు. మొత్తం ఏడు ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కోటి దాదాపు ముప్పావు గంట వరకు ఉంటుంది.తొలి ఎపిసోడ్ కేవలం పాత్రల పరిచయానికే సరిపోయింది. రెండు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతుంది. సంతోష్ అనే వ్యక్తి బ్లాక్మెయిల్ చేసి.. డ్రగ్స్, గంజాయి అమ్మించడం.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయంతో రాజీ గ్యాంగ్ చేస్తున్న ఈ స్మగ్లింగ్ బిజినెస్ గురించి అత్తయ్య షీలాకి తెలిసిన తర్వాత కథనం మరింత ఉత్కంఠంగా సాగుతుంది.దర్శకుడు ఈ కథను వినోదభరితంగా నడిపించడంతో పూర్తిగా సఫలం కాలేదు. ఐదు ప్రధాన పాత్రలను ఆసక్తికరంగా మలచలేకపోయాడు. ట్విస్టులు కూడా ఊహకందేలా ఉంటాయి.డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పాత్రని ఇంకాస్త బలంగా చూపించాల్సింది. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుటుంది. సీజన్ 2కి స్కోప్ ఇస్తూ ఈ సిరీస్‌ని ముగించారు. నటీనటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్‌గా సిరీస్ పర్వాలేదు. అసభ్యకర సన్నివేశాలు తక్కువే ఉన్నా..బూతు డైలాగులు ఎక్కువగా ఉన్నాయి. ఫ్యామిలీలో కలిసి చూడడం కాస్త కష్టమే. ఓపిగ్గా చూద్దాంలే అనుకునే క్రైమ్ థ్రిల్లర్స్ లవర్స్‌ని ఈ సిరీస్ మెప్పిస్తుంది. -
ఓటీటీలో 'మణికంఠన్' హిట్ సినిమా తెలుగు వర్షన్ స్ట్రీమింగ్
రాజేశ్వరన్ కాళిసామి దర్శకత్వంలో మణికంఠన్, శాన్వీ మేఘన జంటగా నటించిన ‘కుడుంబస్తన్’ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. కోలీవుడ్‌లో ఆర్జే నుండి డబ్బింగ్ ఆర్టిస్ట్, స్క్రీన్ రైటర్, సెకండ్ హీరోగా మణికంఠన్ తన జర్నీ ప్రారంభించాడు. అయితే, జై భీమ్ సినిమాలో చేసిన చిన్న పాత్రే తనను హీరోగా నిలబెట్టింది. 2023లో రొమాంటిక్ కామెడీ మూవీ 'గుడ్ నైట్'తో హీరోగా ఫస్ట్ హిట్ మణికందన్ అందుకున్నాడు. ఆ తర్వాత లవర్ సినిమాతో మరో విజయాన్ని దక్కించుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో తను నటించిన 'కుడుంబస్తన్' విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అలా హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన హీరోగా మణికందన్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో తెలుగు వర్షన్ విడుదల కానుంది.కుడుంబస్తన్ సినిమా కోలీవుడ్‌లో భారీ విజయం దక్కించుకోవడంతో తెలుగు అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో తాజాగా జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈ చిత్రం విడుదలపై అధికారికంగా ప్రకటన చేసింది. మార్చి 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్కు రానుందని జీ5 పేర్కొంది. ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం,హిందీ భాషలలో స్ట్రీమింగ్కు రానుందని తెలిపింది. థియేటర్లో కేవలం తమిళ వర్షన్ మాత్రమే విడుదలైన కుడుంబస్తన్ ఓటీటీలో మాత్రం ఐదు భాషల్లో రిలీజ్ కావడం విశేషం.మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన్న ఈ చిత్రానికి రాజేశ్వరన్ కాళిసామి దర్శకత్వం వహించారు. జీవితంలో డబ్బు ముఖ్యం కాదని ఈ చిత్రం చాటిచెబుతుంది. చిన్న ఉద్యోగంతో కుటుంబ భారాన్ని మోస్తూ.. ఐఏఎస్ పరీక్షలకు సిద్ధమవుతున్న మధ్యతరగతి యువకుడి పాత్రలో మణికంఠన్ అదరగొట్టాడని చెప్పవచ్చు. కేవలం రూ. 10 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 30 కోట్లకు పైగానే రాబట్టినట్లు తెలుస్తోంది. అందుకే ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు మార్చి 7న తెలుగు వర్షన్‌ను జీ5లో చూసేయండి. -
మరో ఓటీటీకి ధనుశ్ హాలీవుడ్ మూవీ.. దాదాపు ఆరేళ్ల తర్వాత!
కోలీవుడ్ స్టార్ ధనుశ్ హీరోగా నటించిన హాలీవుడ్ చిత్రం 'ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్'. 2019లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ మూవీలో ధనుశ్ హాలీవుడ్లో అడుగుపెట్టారు. ఈ చిత్రం కోలీవుడ్ హీరో మెజీషియన్ పాత్రలో కనిపించారు. అయితే ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటి వరకు కేవలం యాపిల్ టీవీ ప్లస్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.తాజాగా ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ మూవీని మరో ఓటీటీలో సందడి చేయనుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వెల్లడించింది. ఈ మేరకు మూవీ పోస్టర్‌ను విడుదల చేసింది. అయితే ఎప్పటి నుంచి అనేది మాత్రం వెల్లడించలేదు. కాగా.. ఈ సినిమాకు కెన్ స్కాట్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరో ధనుష్ నటనకు హాలీవుడ్ సినీ జనాలు కూడా ఫిదా అయ్యారు. ఈ సినిమాలో ధనుష్ అజాత శత్రు అనే మెజీషియన్ పాత్రలో నటించారు. రొమైన్ ప్యుర్తోలస్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కించారు. -
ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు సినిమా
మరో కొత్త సినిమా పెద్దగా హడావుడి లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. గత నెల మొదటి వారంలో థియేటర్లలో రిలీజైన డబ్బింగ్ మూవీ 'పట్టుదల'.. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఎందులోకి వచ్చింది? దీని సంగతేంటి?తమిళ స్టార్ హీరో అజిత్, త్రిష హీరోహీరోయిన్లుగా నటించగా.. అర్జున్, రెజీనా కీలక పాత్రలు పోషించిన మూవీ 'విడామయూర్చి'. తెలుగులో 'పట్టుదల' పేరుతో ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజ్ చేశారు. అయితే తమిళంలో పాజిటివ్ టాక్ వచ్చింది కానీ తెలుగులో ఎవరూ పట్టించుకోలేదు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?)రోడ్ యాక్షన్ థ్రిల్లర్ కావడం, కంటెంట్ పెద్దగా కనెక్ట్ అయ్యేలా లేకపోవడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్ రాలేదు. కానీ హీరో అజిత్ కావడంతో కలెక్షన్స్ రూ.100 కోట్లు పైనే వచ్చాయి. ఇకపోతే ఈ మూవీ ఇప్పుడు ఐదు భాషల్లో స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. టైమ్ పాస్ చేద్దామనుకుంటే ఓ లుక్కేసేయండి.'పట్టుదల' కథ విషయానికొస్తే. అర్జున్ (అజిత్), కాయల్ (త్రిష) భార్యాభర్తలు. అజర్బైజాన్లో ఉంటారు. పిల్లలు లేరు, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుందామని అనుకుంటారు. విడిపోయే ముందు ఓ ఆఖరి రోడ్ ట్రిప్ కి రమ్మని అర్జున్, కాయల్ ని అడుగుతాడు. ఆ ప్రయాణంలో వాళ్లకి ప్రమాదాలు ఎదురవుతాయి. కాయల్ ని కిడ్నాప్ చేస్తారు. చివరికి ఏమయ్యిందనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం.. జీ5 చరిత్రలోనే రికార్డు) -
ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?
మార్చి తొలివారం వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల పరీక్షల హడావుడి నడుస్తోంది. అందుకే తెలుగు సినిమాలేం ఈసారి థియేటర్లలో రిలీజ్ కావట్లేదు. కానీ ఛావా, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, కింగ్ స్టన్ లాంటి డబ్బింగ్ చిత్రాలు.. ఈ వీకెండ్ లో బిగ్ స్క్రీన్ పై రిలీజ్ కానున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం.. జీ5 చరిత్రలోనే రికార్డు)మరోవైపు ఓటీటీలో కేవలం 11 సినిమాలు-వెబ్ సిరీసులే రాబోతున్నాయి. కానీ వీటిలో రేఖాచిత్రం అనే డబ్బింగ్ మూవీతో పాటు తండేల్, విడామయూర్చి, బాపు చిత్రాలు చూడదగ్గవే. ఇవి కాకుండా సర్ ప్రైజ్ రిలీజులు కూడా ఉండొచ్చు. ఇంతకీ ఈ వారం ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మార్చి 3-9వ తేదీ వరకు)నెట్ ఫ్లిక్స్విడామయూర్చి (తెలుగు డబ్బింగ్ మూవీ) - మార్చి 03తండేల్ (తెలుగు సినిమా) - మార్చి 07నదానియాన్ (హిందీ హిందీ మూవీ) - మార్చి 07అమెజాన్ ప్రైమ్దుఫాహియా (హిందీ సిరీస్) - మార్చి 07సోనీ లివ్రేఖాచిత్రం (తెలుగు డబ్బింగ్ మూవీ) - మార్చి 07ద వాకింగ్ ఆఫ్ ఏ నేషన్ (హిందీ సిరీస్) - మార్చి 07హాట్ స్టార్డేర్ డెవిల్: బార్న్ ఎగైన్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 04డెలి బాయ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 06బాపు (తెలుగు సినిమా) - మార్చి 07తగేష్ vs ద వరల్డ్ (హిందీ సిరీస్) - మార్చి 07బుక్ మై షోబారా బై బారా (హిందీ మూవీ) - మార్చి 07(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) -
ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం.. జీ5 చరిత్రలోనే రికార్డు
ఈ ఏడాది పొంగల్‌కు రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా (Sankranthiki Vasthunam Movie) ఓ రేంజ్లో అలరించింది. ఫ్యామిలీ ఆడియన్స్ తగ్గేదేలే అన్నట్లుగా థియేటర్లకు క్యూ కట్టారు. కడుపుబ్బా నవ్వుకుని ఎన్నాళ్లవుతుందో అన్నట్లుగా సినీప్రేక్షకులు ఒకటికి రెండుసార్లు సినిమా చూసి ఎంజాయ్ చేశారు. పోటీలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలున్నా వాటిని వెనక్కు నెట్టి విజేతగా నిలిచింది.ఓటీటీలో ప్రభంజనంవిక్టరీ వెంకటేశ్ (Venkatesh Daggubati) హీరోగా ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) హీరోయిన్గా నటించిన ఈ సినిమా మార్చి 1న అటు టీవీలో, ఇటు ఓటీటీలో రిలీజైంది. ఇంకేముంది, వన్స్ మోర్ అంటూ ఆడియన్స్ టీవీలకు అతుక్కుపోయారు. ఓటీటీ ప్రియులు జీ5లో సినిమా తెగ చూసేస్తున్నారు. కేవలం 12 గంటల్లోనే 100 మిలియన్లకు పైగా వ్యూ మినిట్స్ వచ్చాయని జీ5 అధికారికంగా ప్రకటించింది. 13 లక్షలమంది సినిమా వీక్షించారని పేర్కొంది. ఇంతకుముందు ఆర్ఆర్ఆర్, హనుమాన్ సినిమాల రికార్డులను సంక్రాంతికి వస్తున్నాం బద్ధలు కొట్టిందని వెల్లడించింది. జీ5 ప్లాట్ఫామ్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని పోస్టర్ రిలీజ్ చేసింది.సంక్రాంతికి వస్తున్నాం సినిమా..సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. వెంకీమామ భార్య భాగ్యంగా ఐశ్వర్య, మాజీ ప్రియురాలిగా మీనాక్షి చౌదరి, వెంకటేశ్ కొడుకు బుల్లిరాజుగా రేవంత్ భీమల అదరగొట్టారు. కొరికేత్త నిన్ను అంటూ బుల్లిరాజు చేసే కామెడీ కోసమైనా సినిమా చూడాల్సిందే అంటున్నారు. అన్నట్లు ఈ మూవీ ఓటీటీలో తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. HISTORY CREATED! The BIGGEST OPENING EVER on ZEE5 in just 6 hours!Experience the magic of #SankranthikiVasthunam Streaming Now in Malayalam | Hindi | Tamil | Kannada| Telugu @VenkyMama @AnilRavipudi @aishu_dil @Meenakshiioffl #BheemsCeciroleo #Dilraju #Shirish @YoursSKrishna pic.twitter.com/udEZi473ov— ZEE5 Telugu (@ZEE5Telugu) March 2, 2025 చదవండి: సినిమాలు తీయడం కంటే IAS అవడం ఈజీ: సందీప్ రెడ్డి వంగా -
నాగచైతన్య వందకోట్ల మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
తన పెళ్లి తర్వాత అక్కినేని హీరో నాగచైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైన ఈ మూవీలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించారు. మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ రియల్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మార్క్‌ను చేరుకుంది.బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్ తాజాగా స్ట్రీమింగ్ డేట్‌ను రివీల్ చేసింది. ఈనెల 7 నుంచి తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పోస్టర్‌ను విడుదల చేసింది.తండేల్ అసలు కథేంటంటే..శ్రీకాకుళం జిల్లాకు చెందిన 22 మంది మూడు బోట్లలో గుజరాత్ వెరావల్ నుంచి బయలుదేరి చేపల వేట సాగిస్తుండగా పొరపాటున పాకిస్థాన్ ప్రాదేశిక జలాల్లోకి వారు ప్రవేశించారు. అప్పుడు పాక్ వారిని అరెస్ట్ చేసి జైల్లో వేస్తుంది. తండేల్ కథకు ఇదే మూలం.. డి.మత్స్యలేశం గ్రామం నుంచే తండేల్ కథ మొదలౌతుంది. రాజు (నాగచైతన్య), సత్య (సాయి పల్లవి) ప్రేమికులుగానే మనకు పరిచయం అవుతారు. ప్రాణాలకు ఎదురీదుతూ సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు సురక్షితంగా తిరిగొస్తారనే నమ్మకం ఉండదు. వారు ఎప్పుడైతే తమ ఇంటికి చేరుతారో అప్పుడే కుటుంబ సభ్యులు ఊపిరిపోసుకుంటారు. ఇదే పాయింట్ సత్యలో భయం కలిగేలా చేస్తుంది. తను ప్రేమించిన రాజు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్తే.. ఏదైనా ప్రమాదం జరగవచ్చని అతన్ని వేటకు వెళ్లొద్దంటూ ఆమె నిరాకరిస్తుంది. అప్పటికే తండేల్ (నాయకుడు)గా ఉన్న రాజు.. సత్య మాటను కాదని వేట కోసం గుజరాత్ వెళ్తాడు. ఇక్కడ నుంచి అసలు కథ మొదలౌతుంది. సాధారణ కూలీగా ఉన్న రాజు తండేల్ ఎలా అయ్యాడు..? వేటకు వెళ్లొద్దని సత్య చెప్పినా కూడా రాజు గుజరాత్‌కు ఎందుకు వెళ్తాడు..? ఈ కారణంతో తన పెళ్లి విషయంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? అందుకు ఎదురైన కారణం ఏంటి..? వేటకు వెళ్లిన వారందరూ పాక్ చెరలో ఎలా చిక్కుకుంటారు..? రాజు మీద కోపం ఉన్నప్పటికీ వారందరినీ తిరిగి ఇండియాకు రప్పించేందుకు సత్య చేసిన పోరాటం ఏంటి..? చివరగా రాజు, సత్య కలుసుకుంటారా..? అనేది తెలియాలంటే 'తండేల్' మూవీని వీక్షించాల్సిందే.Prema kosam yedu samudhralaina dhaatadaniki osthunnadu mana Thandel! 😍❤️Watch Thandel, out 7 March on Netflix in Telugu, Hindi, Tamil, Kannada & Malayalam!#ThandelOnNetflix pic.twitter.com/GIBBYHnME9— Netflix India South (@Netflix_INSouth) March 2, 2025 -
మరో ఓటీటీలోకి వచ్చేసిన జోకర్ 2
హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వేల కోట్లు కొల్లగొట్టిన చిత్రం జోకర్. 2019 అక్టోబర్ 2న విడుదలైన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‌గా జోకర్ 2 (Joker: Folie à Deux) తెరకెక్కింది. మొదటి భాగాన్ని డైరెక్ట్ చేసిన టోడ్ ఫిలిప్స్ రెండో భాగాన్ని రూపొందించారు. 2024 అక్టోబర్ 2న జోకర్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో రెండు నెలల వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేసింది. డిసెంబర్ 13న హెచ్‌బీఓ మాక్స్‌లో ప్రత్యక్షమైంది. తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది. కాకపోతే రెంట్ పద్ధతిలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడీ మూవీ జియోహాట్‌స్టార్‌లోకి వచ్చేసింది. హెచ్‌బీఓ మాక్స్ ప్లాట్‌ఫామ్‌లోని కంటెంట్‌ను ఓటీటీ ఆడియన్స్‌కు అందించే వెసులుబాటు కల్పించింది జియో హాట్‌స్టార్. దీంతో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఉన్నవారు ఈ సినిమాను ఫ్రీగా చూసేయొచ్చు.సినిమా విషయానికి వస్తే.. టోడ్ ఫిలిప్స్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో జోక్విన్ ఫీనిక్స్ హీరోగా నటించాడు. లేడీ గాగా, బ్రెండన్ గ్లీసన్, కేథరిన్ కీనర్, స్టీవ్ కూగన్, హ్యారీ లాటే, జాజీ బీట్జ్ ముఖ్యపాత్రలు పోషించారు. లారెన్స్ షెర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా హిల్దుర్ గువనడోట్టర్ సంగీతం అందించాడు.ఏంటీ కథ?ఆర్థర్ ఫ్లెక్ అలియాస్ జోకర్ అనే సాధారణ వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన విలన్‌గా ఎలా మారాడన్నది మొదటి భాగంలో చూపించారు. వరుస హత్యల తర్వాత ఒక సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్న జోకర్ పోలీసుల పర్యవేక్షణలో ఉండటం, అతడి లవ్ స్టోరీ, తనలోని సంగీతాన్ని బయటపెట్టడం అనే అంశాల చుట్టూ రెండో భాగం ఉంటుంది.చదవండి: OTT: మరో వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పిన అదితిరావు -
OTT: మరో వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పిన అదితిరావు
బాలీవుడ్లో ‘జబ్ వియ్ మెట్, రాక్‌స్టార్, హైవే, లవ్ ఆజ్ కల్’ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించారు ఇంతియాజ్ అలీ. తాజాగా ఈ దర్శకుడు ‘ఓ సాథీ రే’ అనే వెబ్ సిరీస్‌తో అసోసియేట్ అయ్యారు. కానీ దర్శకుడిగా కాదు. రైటర్, షో రన్నర్‌గా చేస్తున్నారు. ఈ సిరీస్‌కు అరిఫ్ అలీ దర్శకత్వం వహిస్తున్నారు. లవ్, హ్యూమన్ ఎమోషన్స్ ప్రధానాంశాలుగా ఉన్న ఈ సిరీస్‌లో అదితి రావ్ హైదరీ (Aditi Rao Hydari), అర్జున్ రాంపాల్, అవినాష్ తివారీ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ‘‘ఈ రోజుల్లో అప్పటి వింటేజ్ లవ్ ఫీల్‌ని ఈ సిరీస్‌తో వీక్షకులు అనుభూతి చెందుతారు’’ అని మేకర్స్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. హీరో సిద్దార్థ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత అదితిరావు ఒప్పుకున్న మొదటి ప్రాజెక్ట్ ఇదే! ప్రస్తుతం అదితి.. ఓ సాథిరే సిరీస్‌తో పాటు హీరామండి 2 వెబ్ సిరీస్, లయనెన్స్ అనే హాలీవుడ్ సినిమా చేస్తోంది. అదితిరావు- సిద్దార్థ్ 2024లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: దేవుడు చూస్తున్నాడు.. అందుకే ఆ హీరోయిన్ పత్తా లేకుండా పోయింది -
అమ్మ కోసం చూడాల్సిన సినిమా
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం అప్పత్తా ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.నవ మాసాలు మోసి, కన్న బిడ్డపై తల్లికి జీవితాంతం మమతానురాగాలుంటాయి. కానీ అదే బిడ్డ తన తల్లిని తల్లిగా చూడక స్వార్థంతో హింసిస్తే ఆ తల్లి తిరిగి ఎలా ప్రవర్తిస్తుంది... ఇదే ఇతివృత్తంతో తీసిన సినిమా ‘అప్పత్తా’. నానమ్మ లేదా అమ్మమ్మ అని అర్థం. ఇంకా చె΄్పాలంటే ప్రేమతో పెద్దవాళ్లని పిలిచే పదం ‘అప్పత్తా’. ఇదో తమిళ సినిమా. ఈ సినిమాకి దర్శకులు ప్రియదర్శన్. ప్రముఖ నటి ఊర్వశి ఈ అప్పత్తా పాత్రలో నటించారు... కాదు కాదు జీవించారు. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అద్దం పట్టే ఓ ఫీల్ గుడ్ మూవీ ‘అప్పత్తా’. ఈ చిత్రకథ విషయానికొస్తే... ఓ చిన్న గ్రామంలో అప్పత్తా ఒక్కటే ఉంటుంది. ఎవరికైనా చిన్న ఇబ్బంది ఉన్నా వెంటనే తానున్నానని వాళ్లకి పరిష్కారం చూపుతూ నలుగురికీ సాయపడుతూ ఉంటుంది. అప్పత్తాకు కుక్కలంటే మాత్రం చచ్చేంత భయం. భర్తను పోగొట్టుకున్న ఈవిడ తన కష్టంతో కొడుకును చదివిస్తూ ఉంటుంది. కొడుకు పేరు శ్యామ్. అప్పత్తా ఊరగాయ పచ్చళ్లు బాగా చేస్తుంది. అప్పత్తా ఊరగాయలంటే ఆ చుట్టు పక్కల ఊళ్లల్లో బాగా ఫేమస్. ఆ ఊరగాయలతోనే తన బిడ్డను చదివించుకుంటూ ఉంటుంది. కానీ అదే ఊరగాయ వాసన, అలాగే ఆమె పేదరికం నచ్చని కొడుకు చదువు పేరుతో అప్పత్తాని వదిలి నగరానికి వెళతాడు. కానీ సిటీకి వెళ్లడానికి, అక్కడ ఉండడానికి అప్పత్తా ఇచ్చిన డబ్బులు వాడుకుంటాడు. శ్యామ్ సిటీలోనే సెటిలై ప్రేమ వివాహం చేసుకుంటాడు. కొన్నేళ్ల తరువాత సడెన్‌గా సిటీలో ఉన్న తన కొడుకు దగ్గర నుండి పిలుపు వచ్చి అప్పత్తా గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న కొడుకు ఇంటికి వెళుతుంది. సిటీకి మొట్టమొదటిసారిగా వచ్చిన తన తల్లిని కనీసం తీసుకురావడానికి కూడా వెళ్లని సదరు కొడుకు అప్పత్తాని ఎందుకు పిలిచాడంటే తన ఫ్యామిలీతో హాలిడే కోసం కొన్ని రోజులు బయటకు వెళుతూ ఇంట్లో ఉన్న కుక్కని చూసుకోవడానికి మనిషి కోసం ఆమెను రప్పించుకుంటాడు. అసలే కుక్కంటే భయపడే అప్పత్తా కొడుకు ఇంట్లో ఉన్న కుక్కని ఎలా ఎదుర్కొంటుంది? అన్నదే ఈ ‘అప్పత్తా’. సినిమా మొత్తం కామెడీగా సాగిపోతూ చివర్లో చక్కటి మెసేజ్ ఇచ్చారు దర్శకుడు. మనల్ని కనడానికి మన తల్లి పడ్డ బాధ మనకు తెలియకపోవచ్చు. కానీ మనల్ని పెంచి పోషించిన తల్లిని మాత్రం ఎప్పటికీ బాధపెట్టకూడదు. అందుకే ఇది అమ్మ కోసం చూడాల్సిన సినిమా. మస్ట్ వాచ్... ఫీల్ గుడ్ మూవీ. వాచిట్ ఆన్ జియో హాట్ స్టార్.– ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీకి వచ్చేసిన 'సంక్రాంతి వస్తున్నాం'.. ఆడియన్స్‌కు బిగ్ ట్విస్ట్!
ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్ రావిపూడి- వెంకటేశ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. పొంగల్ కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదలైంది.సంక్రాంతికి వస్తున్నాం మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావడంతో ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచే టీవీలతో పాటు జీ5లోనూ స్ట్రీమింగ్కు వచ్చేసింది. అయితే ఓటీటీ వర్షన్లో సినీ ప్రియులకు షాకిచ్చారు సంక్రాంతికి వస్తున్నాం మేకర్స్. ఈ సినిమా నిడివిని తగ్గించి విడుదల చేశారు. థియేటర్లలో 2 గంటల 24 నిమిషాలు ఉన్న ఈ చిత్రం.. ఓటీటీలో మాత్రం 2 గంటల 16 నిమిషాల రన్టైమ్తో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు ఎనిమిది నిమిషాల సీన్స్ తొలగించడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.అయితే థియేటర్ వర్షన్ నిడివి కారణంగా కొన్ని కామెడీ సన్నివేశాలను దర్శకుడు అనిల్ రావిపూడి తొలగించారని ఇటీవల వార్తలొచ్చాయి. అవి ఓటీటీలో యాడ్ చేస్తారంటూ భావించారు. ముఖ్యంగా సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో మీనాక్షి చౌదరి, వెంకటేశ్‌ల మధ్య కొన్ని కామెడీ సీన్స్‌ను యాడ్ చేయనున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ అలా జరగపోగా.. ఉన్న నిడివి కాస్తా తగ్గడంతో టాలీవుడ్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. -
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుక.. లైవ్ ఏ ఓటీటీలో చూడాలంటే?
ప్రతిష్టాత్మక సినీ ఆవార్డుల వేడుక-2025కు అంతా సిద్ధమైంది. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 97వ ఆస్కార్ అవార్డుల పండుగ ఆదివారం జరగనుంది. ఈ అవార్డులకు ఎంపికైన విజేతలను ఆ రోజు ప్రకటించనున్నారు. ఈ వేడుక కోసం వరల్డ్ వైడ్‌గా సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. అయితే ఎప్పటిలాగే ఈ సారి కూడా అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో ఈ వేడుకలు జరగనున్నాయి.(ఇది చదవండి: ఆస్కార్ నామినేషన్స్.. ఎంపికైన చిత్రాలివే.. ఫుల్ లిస్ట్ చూసేయండి) అయితే భారత కాలమానం ప్రకారం మనదేశంలో మార్చి 3వ తేదీ ఉదయం 5:30 నిమిషాలకు ఈ వేడుక వీక్షించే అవకాశముంది. మనదేశంలోని సినీ ప్రియులు ఈ వేడుక లైవ్‌లో చూడొచ్చు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌తో పాటు లైవ్ స్ట్రీమింగ్ కానుంది. అంతేకాకుండా స్టార్ మూవీస్, స్టార్ మూవీస్ సెలెక్ట్లోనూ ప్రత్యక్ష ప్రసారం కానుంది. కాగా.. ఇప్పటికే 97వ అకాడమీ అవార్డులకు నామినీలను ఈ ఏడాది జనవరి 23న ప్రకటించారు. ఈసారి హాలీవుడ్ చిత్రం ఎమిలియా పెరెజ్ అత్యధికంగా 13 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుంది. ఆ తర్వాత్ వికెడ్ మూవీ 10 విభాగాల్లో నామినేషన్లను సాధించింది. ఈ ఏడాది భారతీయ సినిమాలకు మాత్రం నిరాశే ఎదురైంది. -
రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'బాపు'
'బలగం' లాంటి మరో సినిమా అని ప్రచారం చేసిన సినిమా 'బాపు'. తెలంగాణ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ మూవీ గతవారమే థియేటర్లలోకి రాగా.. ఇప్పుడు సూపర్ ఫాస్ట్ గా ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారు. ఈ మేరకు అధికారికంగా స్ట్రీమింగ్ డేట్ కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'బాపు'. ఆమని, ధన్య బాలకృష్ణ, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటించారు. తెలంగాణలోని రైతుల ఆత్మహత్య నేపథ్య కథతో ఈ చిత్రం తీశారు. ప్రచారం వరకు ఓకే కానీ థియేటర్లలో అస్సలు జనాలు పట్టించుకోలేదు. దీంతో బిగ్ స్క్రీన్ పై రిలీజైన రెండు వారాలకే ఓటీటీలోకి తెచ్చేస్తున్నారు.ఫిబ్రవరి 21న థియేటర్లలో రిలీజ్ కాగా.. మార్చి 7న హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. మరీ రెండు వారాలకే ఇలా సినిమాల్ని ఓటీటీలోకి తీసుకొచ్చేస్తే.. చిన్న చిత్రాల్ని చూసేందుకు జనాలు థియేటర్లకు వెళ్లడం గ్యారంటీగా తగ్గించేస్తారు.(ఇదీ చదవండి: నాన్న ఫోన్ చేసేసరికి ప్రభాస్ భయపడ్డాడు: మంచు విష్ణు)'బాపు' విషయానికొస్తే.. తెలంగాణలోని ఓ గ్రామంలో మల్లయ్య (బ్రహ్మాజీ) పత్తి రైతు. వరసగా మూడేళ్లు పంట వేసి నష్టపోతాడు. ఈసారి కూడా అలానే జరుగుతుంది. ఆత్మహత్య చేసుకుంటే రూ.5 లక్షలు వస్తాయని అనుకుంటాడు గానీ ప్లాన్ వర్కౌట్ కాదు. 'మీరు చనిపోవడం ఎందుకు.. మీ బాపూ(తండ్రి) చనిపోయినా డబ్బులు వస్తాయి కదా' అని భార్య (ఆమని) సలహా ఇస్తుంది. అప్పుడు మల్లయ్య ఏం చేశాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: మలయాళం నుంచి మరో థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ) View this post on Instagram A post shared by JioHotstar Telugu (@jiohotstartelugu) -
అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసిన మరో బ్లాక్‌బస్టర్ సిరీస్
అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన సుడల్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. సస్పెన్స్, థ్రిల్లర్‌తో పాటు సామాజిక సందేశాన్ని, అవగాహనను కల్పించేలా తీసిన ఈ సిరీస్‌కు ఓటీటీ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. దర్శక ద్వయం పుష్కర్-గాయత్రి తీసిన ఈ వెబ్ సిరీస్‌ను వాల్వాచర్ ఫిల్మ్స్ నిర్మించింది. ఇక ఇప్పుడు సుడల్ రెండో సీజన్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. బ్రహ్మ, సర్జున్ కె.ఎమ్ దర్శకత్వం వహించిన సుడల్ సీజన్ 2పై ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.కథిర్, ఐశ్వర్య రాజేష్, గౌరీ కిషన్, సంయుక్త, మోనిషా బ్లెస్సీ, లాల్, శరవణన్, మంజిమా మోహన్, కయల్ చంద్రన్, చాందిని, అశ్విని వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. సామ్ సిఎస్ అందించిన సంగీతం ఈ సిరీస్‌కు మరో హైలైట్. ఇందులో 9 పాటలు, ఆర్ఆర్ సిరీస్‌ను ఎలివేట్ చేసేలా ఉంటాయి. టి-సిరీస్ ద్వారా మార్కెట్లోకి ఆల్బమ్ వచ్చేసింది. సుడల్ సీజన్ 1 సెటప్, సిరీస్ మేకింగ్, చివర్లో ఇచ్చిన ట్విస్ట్ అందరినీ కదిలించింది. ది వెరైటీ మ్యాగజైన్ ద్వారా 2022 టాప్ 10 బెస్ట్ ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్‌లలో సుడల్కి కూడా చోటు దక్కింది.పుష్కర్, గాయత్రి కథను చెప్పడంలో మాస్టర్లుగా మారిపోయారు. వీరు సీజన్ 2తో మరోసారి అందరినీ మెస్మరైజ్ చేసేందుకు వచ్చారు. సస్పెన్స్‌తో పాటుగా, భావోద్వేగాలు, సామాజిక సందేశం ఇచ్చేలా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ప్రస్తుతం సీజన్ 2 అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. -
ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వారంలో శివరాత్రి వచ్చివెళ్లింది. ఆ రోజు థియేటర్లలో రిలీజైన 'మజాకా' చిత్రానికి మిక్స్ డ్ టాక్ వచ్చింది. మరోవైపు ఈ శుక్రవారం శబ్దం, అగథ్య అనే రెండు డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలోకి వచ్చేశాయు.(ఇదీ చదవండి: నాన్న ఫోన్ చేసేసరికి ప్రభాస్ భయపడ్డాడు: మంచు విష్ణు)మరోవైపు ఓటీటీలో మాత్రం 20కి పైగా సినిమాలు-సిరీసులు ఒకేరోజు స్ట్రీమింగ్ లోకి వచ్చేశాయి. వీటిలో సుడాల్, డబ్బా కార్టెల్ సిరీస్ లతో పాటు లవ్ అండర్ కన్షట్రక్షన్ మూవీ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఈ రోజు ఏమేం చిత్రాలు ఏయే ఓటీటీల్లోకి వచ్చాయంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజైన సినిమాలు (ఫిబ్రవరి 28)అమెజాన్ ప్రైమ్సుడల్ సీజన్ 2 - తెలుగు సిరీస్మార్కో - హిందీ వర్షన్ సినిమా (ఇప్పటికే స్ట్రీమింగ్)నెట్ ఫ్లిక్స్అయితానా - స్పానిష్ సిరీస్డబ్బా కార్టెల్ - తెలుగు డబ్బింగ్ సిరీస్డెస్పికబుల్ మీ 4 - తెలుగు డబ్బింగ్ మూవీరూస్టర్స్ - డచ్ సిరీస్సోనిక్ ద హెడ్గేహగ్ 2- ఇంగ్లీష్ సినిమాస్క్వాడ్ 36 - ఫ్రెంచ్ చిత్రంటస్కమ్స్ - ఆఫ్రికన్ సిరీస్హాట్ స్టార్లవ్ అండర్ కన్షట్రక్షన్ - తెలుగు డబ్బింగ్ మూవీబీటల్ జ్యూస్ - ఇంగ్లీష్ సినిమాబజ్ - హిందీ మూవీదిల్ దోస్తీ ఔర్ డాగ్స్ - హిందీ చిత్రంద వాస్ప్ - ఇంగ్లీష్ సినిమాఆహాఎమోజీ - తెలుగు డబ్బింగ్ సిరీస్ఆపరేషన్ రావణ్ - తమిళ మూవీపరారీ - తమిళ సినిమాజీ 5సంక్రాంతికి వస్తున్నాం - తెలుగు సినిమా (మార్చి 1)బుక్ మై షోడెలివర్ అజ్ - తెలుగు డబ్బింగ్ సినిమాసైలెంట్ హవర్స్ - ఇంగ్లీష్ మూవీద గోల్డ్ స్మిత్ - తెలుగు డబ్బింగ్ సినిమావోల్ఫ్ మ్యాన్ - ఇంగ్లీష్ చిత్రం(ఇదీ చదవండి: OTT: 13 వారాలుగా ట్రెండింగ్‌లో తెలుగు సినిమా) -
ప్రమాదం... జాగ్రత్త
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ఆంబర్ అలర్ట్(Amber Alert) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.అమెరికా దేశానికి సంబంధించి పిల్లల కిడ్నాప్ సమయంలో తరచుగా వాడే పదం ఆంబర్ అలర్ట్. ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు ఇస్తే, వాళ్లు చెప్పే ఆనవాళ్లను బట్టి ఆ సమయంలో, ఆప్రాంతంలో ఉన్న ప్రతి వాహనదారుడికి ఈ ఆంబర్ అలర్ట్ మెసేజ్ వాళ్ల ఫోనులకు పంపించడం జరుగుతుంది. ఇది అమెరికా ప్రభుత్వం 1996 నుండి చేపడుతున్న అధికారిక చర్య.దీని వల్ల పిల్లల కిడ్నాప్‌కు ఉపయోగించే వెహికల్‌ను త్వరగా కనుక్కోగలుగుతారు. ‘ఆంబర్ అలర్ట్’ (2024) సినిమా నేపథ్యం కూడా అదే. 2012లో కూడా ఇదే పేరు, నేపథ్యంతో ఓ సినిమా విడుదలైంది. గత ఏడాది విడుదలైన ‘ఆంబర్ అలర్ట్’ వాస్తవ సంఘటనల ఇతివృత్తంగా రూపోందిన సినిమా. ఈ సినిమా కథ విషయానికొస్తే... పార్కులో ఆడుకుంటున్న షార్లెట్ అనే చిన్న పాపను ఓ ఆగంతకుడు కార్లో వచ్చి కిడ్నాప్ చేసుకుని తీసుకువెళతాడు.పాప పార్కులో ఆడుకునేటపుడు వాళ్ల అమ్మ తీసిన వీడియో వల్ల కిడ్నాపర్ కారు కొంచం వీడియోలో పడుతుంది. మరో పక్క షేన్ అనే క్యాబ్ డ్రైవర్ తన డ్యూటీ ముగించుకొని ఇంట్లో తన కోసం వేచి ఉన్న తన కొడుకు బర్త్ డే పార్టీకి త్వరగా వెళ్లబోతుంటాడు. అదే సమయంలో జాక్ అనే లేడీ తాను బుక్ చేసుకున్న క్యాబ్ వెళ్లిపోవడంతో షేన్ని తనను దారిలో వదలమని బ్రతిమాలుకుంటుంది.ఇద్దరూ తమ ప్రయాణం ప్రారంభించాక సడెన్‌గా ఇద్దరి ఫోన్లకు షార్లెట్ ఆంబర్ అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఇంతలో కిడ్నాపర్ డ్రైవ్ చేస్తున్న కారు వీళ్ల కంటబడుతుంది. ఆ తరువాత ఏం జరిగిందనేది ఓటీటీ వేదికగా ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ‘ఆంబర్ అలర్ట్’ మూవీలోనే చూడాలి. కెర్రీ బెల్లెస్సా దర్శకత్వంలో రూపోందిన ఈ సినిమా గ్రిప్పింగ్ అండ్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఓ మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ‘ఆంబర్ అలర్ట్’ చూడొచ్చు. – ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీకి ఓకే
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతీ చోప్రా డిజిటల్ ఎంట్రీ ఖరారైపోయింది. హిందీలో ఓ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పారామె. తాహిర్ రాజ్ బాసిన్, అనూప్ సోనీ, జెన్నిఫర్ వింగెట్, చైతన్య చౌదరి ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.‘రంగ్ దే బసంతి, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ వంటి సినిమాలకు రైటర్‌గా, ‘కుర్భాన్, అంగ్లీ’ సినిమాలకు దర్శకుడిగా పని చేసిన రెన్సిల్ డి. సిల్వా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధార్థ్ పి. మల్హోత్రా, సప్నా మల్హోత్రా ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ చిత్రీకరణ మొదలైంది. సిమ్లా నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఇది. ‘‘నా తొలి వెబ్ సిరీస్ చిత్రీకరణలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు పరిణీతి. -
పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్ రావిపూడి-విక్టరీ వెంకటేశ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో అదరగొట్టేసింది. పొంగల్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త రికార్డు సృష్టించింది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం ఓ రేంజ్లో అభిమానులను అలరించింది. దీంతో ఈ సినిమా ఓటీటీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం మేకర్స్ ఆడియన్స్‌ను షాకిచ్చారు. ఓటీటీ కంటే ముందు టీవీల్లో ప్రసారం చేయనున్నట్లు వెల్లడించారు. అయితే తాజాగా ఓటీటీపై మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. టీవీల్లో ప్రసారం చేయడంతో ఓకేసారి ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని జీ5లో విడుదల చేసిన ప్రోమోలో చూపించారు. మార్చి 1న సాయంత్రం 6 గంటల నుంచి జీ తెలుగుతో పాటు జీ5లోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. దీంతో సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 'సంక్రాంతి వస్తున్నాం' స్ట్రీమింగ్ కానుంది. -
OTTలో తెలుగు సినిమా.. నాలుగు నెలల తర్వాత స్ట్రీమింగ్
తెలుగు సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా రివైండ్ (Rewind Movie) ఓటీటీలోకి రాబోతోంది. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నాలుగు నెలల తర్వాత మార్చి 7న లయన్స్‌గేట్‌ప్లే (LionsgatePlay)లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు హిందీ భాషలోనూ అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది.రివైండ్ సినిమాసాయి రోనక్, అమృత చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ట్రైమ్ ట్రావెల్ చిత్రం రివైండ్. సురేశ్, సామ్రాట్, వైవా రాఘవ్, జబర్దస్త్ నాగి, అభిషేక్ విశ్వకర్మ, ఫన్‌బకెట్ భరత్.. తదితరులు కీలక పాత్ర పోషించారు. కళ్యాణ్ చక్రవర్తి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. శివరామ్ చరణ్ సినిమాటోగ్రాఫీ అందించగా ఆశీర్వాద్ లూక్ సంగీతం సమకూర్చాడు. ఈ మూవీ 2024 అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కథేంటంటే?రివైండ్ కథ 2019 - 2024 మధ్యకాలంలో జరుగుతుంది. కార్తీక్ (సాయి రోనక్) సాఫ్ట్వేర్ ఉద్యోగి. అతడి స్నేహితుడి అపార్ట్మెంట్లోని శాంతి (అమృత చౌదరి)ని చూసి ప్రేమలో పడిపోతాడు. హీరో పనిచేసే ఆఫీసులోనే ఆమె కూడా జాయిన్ అవడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఒకరంటే మరొకరికి ఇష్టం.. కానీ ఎవరూ బయటకు చెప్పుకోరు. ఓరోజు శాంతి ఓ ముఖ్యమైన విషయం చెప్పాలంటూ కార్తీని కాఫీ షాపుకు రమ్మంటుంది.సరిగ్గా అదే రోజు అతడి తాతయ్య (సామ్రాట్) కనిపెట్టిన టైం మిషన్ సాయంతో కార్తీక్ టైం ట్రావెల్ చేసి గతంలోకి వెళ్తాడు. తర్వాత ఏం జరిగింది? టైం ట్రావెల్లో అతడు ఏం తెలుసుకున్నాడు? చివరకు శాంతి, కార్తీక్ ఒక్కటయ్యారా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! Time is ticking, but can they change the past? ⏳🔥 #Rewind premieres exclusively on #LionsgatePlay this March 7th in Hindi & Telugu! pic.twitter.com/cNEZ0EzTWI— Lionsgate Play (@lionsgateplayIN) February 26, 2025 చదవండి: లావుగా ఉన్నానని హీరోయిన్గా పక్కనపెట్టేశారు: సోనాక్షి -
ఓటీటీలో 'షకీలా' బయోపిక్ స్ట్రీమింగ్.. అలాంటి కంటెంట్ కావడంతో..
నటి షకీలా జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘షకీలా’. 2021లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. రిచా చద్దా, పంకజ్ త్రిపాఠీ, ఎస్తర్ నోరన్హ, రాజీవ్ పిళ్లై, శివ రానా, కాజోల్ చుగ్, సందీప్ మలని కీలక పాత్రలు పోషించారు. ఇంద్రజీత్ లంకేశ్ దర్శకత్వంలో ప్రకాష్ పళని సమర్పణలో సమ్మి నన్వనీ, శరవణ ప్రసాద్ హిందీలో ‘షకీలా’ చిత్రాన్ని నిర్మించి, అన్ని భాషల్లో అనువదించారు. హిందీ, తమిళ,తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు.షకీలా సినిమా థియేటర్స్‌లో రిలీజైన ఐదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. సడెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుండటంతో ఈ వార్త ట్రెండ్ అవుతుంది. అయితే, కేవలం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు కూడా తెలుగు వర్షన్ కోసం ఎక్స్ పేజీలలో పోస్టులు పెడుతున్నారు. షకీలాకు ఉన్న క్రేజ్ వల్ల ఈ మూవీ విడుదలైన వెంటనే పైరసీ బారిన పడింది. ఏకంగా యూట్యూబ్‌లలో కూడా ఈ చిత్రాన్ని చాలామంది షేర్ చేశారు. దీంతో చిత్ర నిర్మాతలు కూడా భారీగా నష్టపోయారు. అయితే, తెలుగు వర్షన్ కూడా మరో రెండురోజుల్లో స్ట్రీమింగ్కు రావచ్చని తెలుస్తోంది.ఈ సినిమాతో షకీలా ప్రయాణం చాలామందిని ఆలోచింప చేస్తుంది. ఇండస్ట్రీలో నటిగా పేరు తెచ్చుకోవాలనుకున్న షకీలా.. శృంగార తారగా ఎలా మారింది అనేది చెప్పడంలో దర్శకుడు కాస్త తడబడటంతో ఈ మూవీకి పెద్ద మైనస్ అయింది. ఆపై ఇందులో ఎక్కువగా అడల్ట్ కంటెంట్ ఉండటంతో కూడా ఇబ్బందిగా మారింది. షకీలా పడ్డ కష్టాలు, సొంత కుటుంబ సభ్యుల నుండి ఆమెకు ఎదురైన అవమానాలు, మోసాలను చూపించారు. బోల్డ్ కంటెంట్ కారణంగా ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్ లభించినప్పటికీ, ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో సెన్సార్ బోర్డు కమిటీ ప్రశంసించింది. -
ఓటీటీ సినిమా.. కూతురి కల కోసం తండ్రి చేసిన పోరాటమే 'బి హ్యాపీ'
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ నటించిన 'బి హ్యాపీ' డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది. ఈ మేరకు అధికారికంగా స్ట్రీమింగ్ తేదీని కూడా ప్రకటించారు. ఈ చిత్రం చాలామంది హృదయాన్ని కదిలించేలా ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. రెమో డిసౌజా ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై లిజెల్ రెమో డిసౌజా ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా ఆయనే దర్శకత్వం వహించారు. ఇందులో అభిషేక్ బచ్చన్‌తో పాటు అమితాబ్ బచ్చన్, నోరా ఫతేహి, ఇనాయత్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. నాసర్, జానీ లివర్ మరియు హర్లీన్ సేథి సహాయక పాత్రల్లో నటించారు.'బి హ్యాపీ' చిత్రాన్ని మార్చి 14న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుందని అభిషేక్ బచ్చన్ ప్రకటించారు. ఈమేరకు ఆయన ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ మూవీ తండ్రి, కూతురు మధ్య ఉన్న అమితమైన ప్రేమను చూపుతుంది. ఒంటరి గా ఉన్న తండ్రి శివ్ ( అభిషేక్ బచ్చన్ ) అతని చురుకైన కుమార్తె ధారా (ఇనాయత్ వర్మ) మధ్య విడదీయరాని బంధానికి ప్రేక్షకులు ఫిదా అవుతారని చిత్ర యూనిట్ పేర్కొంది. దేశంలోనే అతిపెద్ద రియాలిటీ షో వేదికపై డ్యాన్స్ చేయాలనే ఆశతో ఉన్న కూతురి కలను ఒక తండ్రి ఎలా నెరవేర్చాలనుకుంటాడు అనేది ఈ మూవీ కాన్సెప్ట్. కానీ, ఊహించని సంక్షోభం వల్ల వారిద్దరికి ఎదురయ్యే కష్టాలు ఏంటి..? తన కూతురి ఆశయాన్ని నిజం చేసేందుకు ఆ తండ్రి ఏం చేశాడు..? విధిని కూడా సవాల్ చేసిన ఒక తండ్రి కథే 'బి హ్యాపీ' చిత్రం. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా మార్చి 14న విడుదల కానుంది. -
OTT: 13 వారాలుగా ట్రెండింగ్‌లో తెలుగు సినిమా
పండగను క్యాష్ చేసుకోవాలని ఎవరు మాత్రం అనుకోరు. అందుకే పోటీ ఉన్నా సరే పండక్కి వచ్చేందుకు సిద్ధవుతుంటారు. అలా గతేడాది దీపావళికి కిరణ్ అబ్బవరం 'క', శివకార్తికేయన్ 'అమరన్', దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' (Lucky Baskhar Movie) చిత్రాలు రిలీజయ్యాయి. అక్టోబర్ 31న విడుదలైన ఈ మూడు సినిమాలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద గండం గట్టెక్కడమే కాకుండా హిట్, సూపర్ హిట్ జాబితాలో చేరిపోయాయి. ఓటీటీలో టాప్ ప్లేస్‌లో..ఈ మూడు చిత్రాలు ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చేశాయి. లక్కీ భాస్కర్ చిత్రం నవంబర్ 28న నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో రిలీజైంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రసారమవుతోంది. అయితే మూడు నెలలుగా ఈ సినిమా ఓటీటీలో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది. 13 వారాలుగా నెట్‌ఫ్లిక్స్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతున్న తొలి దక్షిణాది సినిమా అంటూ సితార ఎంటర్టైన్మెంట్ పోస్టర్ రిలీజ్ చేసింది.చదవండి: కలర్ ఫోటో చేతులారా వదిలేసుకున్నా..: హీరోయిన్సినిమాలక్కీ భాస్కర్ సినిమా విషయానికి వస్తే.. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందించగా.. నిమిషా రవి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. #LuckyBhaskar’s mind game is spot on in the digital arena too 😎🔥First South Indian film to trend for 13 weeks straight on @netflix 💥A true downpour of love from the audience ❤️#BlockbusterLuckyBaskhar streaming in Telugu, Tamil, Malayalam, Kannada and Hindi Languages on… pic.twitter.com/nbrAEjhuZm— Sithara Entertainments (@SitharaEnts) February 26, 2025 చదవండి: Mazaka Review: ‘మజాకా’ మూవీ రివ్యూ -
ఆ ఓటీటీలోనే 'మజాకా' సినిమా
కామెడీ సినిమాలకు తెలుగులో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హీరో ఎవరైనా సరే మూవీ బాగుంటే చాలు ఆదరిస్తారు. అలాంటి నమ్మకంతో శివరాత్రి కానుకగా థియేటర్లలోకి వచ్చింది 'మజాకా'. సందీప్ కిషన్, రావు రమేశ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో రీతూ వర్మ, 'మన్మథుడు' పేమ్ అన్షు హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ చిత్ర ఓటీటీ వివరాలు కూడా బయటకొచ్చాయి.కొడుకుతో పాటు తండ్రి ప్రేమలో పడటం, అలా అమ్మాయిల వెనక తిరగడం అనే కాన్సెప్ట్ ట్రైలర్ లో చూపించారు. అలా 'మజాకా'.. ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. ప్రస్తుతానికైతే మిశ్రమ స్పందన వస్తోంది. వీకెండ్ వచ్చేసరికి అసలు టాక్ ఏంటనేది తెలుస్తుంది.(ఇదీ చదవండి: తేళ్లు, బొద్దింకలు తింటాను: తెలుగు హీరోయిన్)ఇక ఓటీటీ హక్కులు విషయానికొస్తే చాలారోజుల క్రితమే డీల్ పూర్తయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 మంచి రేటుకే డిజిటల్ రైట్స్ దక్కించుకుంది. నాలుగైదు వారాల ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. అంటే ఏప్రిల్ తొలి వారం ఈ మూవీ డిజిటల్ గా అందుబాటులోకి వచ్చే అవకాశముంది.'మజాకా' విషయానికొస్తే.. రమణ (రావు రమేశ్), కృష్ణ (సందీప్ కిషన్) తండ్రి కొడుకులు. చిన్నప్పుడే భార్య చనిపోవడటంతో మరో పెళ్లి చేసుకోకుండా కొడుకుని రమణ పెంచుతాడు. కానీ కృష్ణకి పెళ్లి చేయాలనేసరికి ఇంట్లో ఆడదిక్కు లేదని ఎవరూ పిల్లనివ్వరు. దీంతో రమణ.. యశోద (అన్షు)తో, కృష్ణ.. మీరా(రీతూవర్మ)తో ప్రేమలో పడతారు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: Mazaka Review: ‘మజాకా’ మూవీ రివ్యూ) -
శివరాత్రికి జాగారమా? ఈ సినిమాలు చూస్తూ భక్తి పారవశ్యం
శివరాత్రి వచ్చేసింది. దీంతో ఇప్పటికే శివాలయాలన్నీ కళకళలాడిపోతున్నాయి. శివుడి భక్తిలో మునిగిపోయేందుకు, రాత్రంతా జాగారం చేసేందుకు కోట్లాది మంది భక్తులు సిద్ధమైపోతున్నారు. రాత్రంతా గుడిలో ఉండలేం కానీ జాగారం చేస్తాం అనుకునే వాళ్లు.. తమ మనసు మరోచోటకు వెళ్లకూడదనుకుంటే శివుడి సినిమాలు చూస్తూ ఈ శివరాత్రిని పూర్తిచేయొచ్చు.(ఇదీ చదవండి: ఆ ఊరి పేరు 'ప్రభాస్'.. ఎక్కడో తెలుసా?)మరి తెలుగులో ఇప్పటివరకు శివుడు, ఆయనకు సంబంధించి చాలానే సినిమాలు వచ్చాయి. చిరంజీవి, ఎన్టీఆర్, కృష్ణంరాజు తదితరలు నటించిన పాత చిత్రాలతో పాటు రీసెంట్ టైంలో వచ్చిన మూవీస్ లోనూ శివుడి రిఫరెన్స్ ఉన్నవి కొన్ని ఉన్నాయి. ఇంతకీ వాటిని ఎక్కడెక్కడ చూడొచ్చంటే?శివరాత్రి స్పెషల్ మూవీస్శ్రీ మంజునాథ (యూట్యూబ్)అంజి (యూట్యూబ్)ఎన్టీఆర్ 'భూ కైలాస్' (యూట్యూబ్)ఖలేజా (అమెజాన్ ప్రైమ్ - సన్ నెక్స్ట్)ఢమరుకం (అమెజాన్ ప్రైమ్ - సన్ నెక్స్ట్)అఖండ (యూట్యూబ్ - హాట్ స్టార్)మహాభక్త సిరియాళ (హాట్ స్టార్)భక్త శంకర (హాట్ స్టార్)భక్త కన్నప్ప (యూట్యూబ్-అమెజాన్ ప్రైమ్)శివకన్య (యూట్యూబ్- అమెజాన్ ప్రైమ్)మహాశివరాత్రి (జీ5 - యూట్యూబ్)శివరాత్రి మహత్యం (జియో సినిమా- యూట్యూబ్)వీటితోపాటు భక్త మార్కండేయ, దక్షయజ్ఞం, ఉమాచండీ గౌరీశంకరుల కథ, కాళహస్తి మహత్యం, జగద్గురు ఆదిశంకర, మావూళ్లో మహాశివుడు, కార్తికేయ సినిమాల్ని కూడా చూస్తూ శివరాత్రి జాగారం చేసేయొచ్చు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'తండేల్'.. ప్లాన్ మారిందా?) -
ఓటీటీలో 'మద్రాస్కారణ్' తెలుగు వర్షన్.. రొమాంటిక్ సాంగ్‌లో నిహారిక
మెగా డాటర్ నిహారిక కొణిదెల తమిళ సినిమా తెలుగులో ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 10న 'మద్రాస్కారణ్' చిత్రం కోలీవుడ్‌లో విడుదలైంది. ఈ మూవీలో షేన్ నిగమ్, కలైయరాసన్ హీరోలుగా నటించారు. థియేటర్లలోకి వచ్చి నెల రోజులు కూడా గడవకముందే తమిళ్ వర్షన్ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఇప్పుడు తెలుగు వర్షన్‌ను మేకర్స్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.వాలిమోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బి.జగదీష్ నిర్మించారు. తమిళ్లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. విశాల్ మదగజరాజ మూవీ హిట్ టాక్ రావడంతో ఈ సినిమాకు కాస్త క్రేజ్ తగ్గింది. శివరాత్రి పండుగ కానుకగా ఫిబ్రవరి 26న 'ఆహా'లో 'మద్రాస్కారణ్' సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ కోసం సుమారు రూ. 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే, కోటి లోపే వసూళ్లను రాబట్టడంతో నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది.ఏడేళ్ల తర్వాత రొమాంటిక్ పాత్రతో రీఎంట్రీసుమారు ఏడేళ్ల తర్వాత 'మద్రాస్కారణ్' సినిమాతో తమిళ్లో నిహారిక రీఎంట్రీ ఇచ్చింది. 2018లో విజయ్ సేతుపతి నటించిన ఒక సినిమాతో ఆమె కోలీవుడ్‌కు పరిచయం అయింది. అయితే, ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఇప్పుడు మద్రాస్కారణ్ మూవీలో మీరా అనే యువతిగా గ్లామర్ రోల్లో నిహారిక కనిపించింది. ఒక రొమాంటిక్ సాంగ్‌లో కూడా ఆమె నటించింది. ఈ పాటలో అటు రొమాన్స్, ఇటు డ్యాన్సులో నిహారిక రెచ్చిపోయిందని చెప్పొచ్చు. తెలుగులో సినిమాల్లో నటించింది కానీ ఈ తరహా యాక్టింగ్ మాత్రం ఎప్పుడూ చేయలేదు. ఇందులోని సాంగ్ చూసి మెగా ఫ్యాన్స్ స్టన్ అయిపోయారు. ఎందుకంటే రొమాన్స్ .. ఆ రేంజులో ఉంది మరి! ఈ సినిమాతో హీరోయిన్గా హిట్టు కొట్టాలని నిహారిక ప్లాన్ చేసుకుంది. కానీ, ఫలితం మరోలా వచ్చింది. -
ఓటీటీలోకి బోల్డ్ వెబ్ సిరీస్.. ఇప్పుడు తెలుగులో
థియేటర్లలో అంటే సెన్సార్ ఇబ్బందులు ఉంటాయి. కానీ ఓటీటీలో మాత్రం ఇబ్బందులు ఉండవు. దీంతో బోల్డ్, రియలస్టిక్ పేరిట బూతులు, రొమాన్స్ కాస్త గట్టిగానే చూపించేస్తుంటారు. అలా ఇప్పుడు ఓ రొమాంటిక్ కామెడీ సిరీస్ తెలుగులో స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. డేట్ ప్రకటించడంతో పాటు టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'తండేల్'.. ప్లాన్ మారిందా?)ఆహా ఓటీటీలో 2022లో తమిళంలో రిలీజైన వెబ్ సిరీస్ 'ఎమోజీ'. మహత్ రాఘవేంద్ర, మానస చౌదరి, దేవిక ప్రధాన పాత్రలు పోషించారు. తమిళంలో హిట్ అయిన ఈ సిరీస్ ని ఇప్పుడు తెలుగులో ఫిబ్రవరి 28 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.లవ్ చేసుకున్న ఓ యువతీయువకుడు అనుకోని విధంగా విడిపోతారు. ఆ కుర్రాడి జీవితంలోకి మరో అమ్మాయి వస్తుంది. కొన్నిరోజులకు మాజీ లవర్ మళ్లీ ఇతడి జీవితంలోకి వస్తుంది. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. టీజర్ చూస్తే మాత్రం బోల్డ్ డైలాగ్స్, రొమాంటిక్ సీన్స్ కూడా కనిపించాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)Love, passion, and destiny. Will they find their way back? #Emoji Premiering February 28th, only on Aha#EmojionAha @Maanasa_chou @Devu_devika77 @Mahatofficial pic.twitter.com/XTqPqfAOPU— ahavideoin (@ahavideoIN) February 25, 2025 -
ఓటీటీలోకి 'తండేల్'.. ప్లాన్ మారిందా?
నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన సినిమా 'తండేల్'. ఈ నెల 7న థియేటర్లలో రిలీజైంది. హిట్ టాక్ తెచ్చుకుని రూ.100 కోట్ల కలెక్షన్స్ మార్క్ కూడా అందుకుంది. తాజాగా టీమ్ అంతా కలిసి సక్సెస్ పార్టీ కూడా చేసుకున్నారు. తండేల్ మూవీ రిలీజ్ రోజే పైరసీకి గురైంది. దీనిపై నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రస్తుతానికి థియేటర్లలో సినిమా రన్ అవుతోంది. కానీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ పై బజ్ వినిపిస్తోంది. అనుకున్న టైం కంటే ముందే డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.(ఇదీ చదవండి: సింగర్ పై 19 ఏళ్ల తర్వాత మరో కేసు పెట్టిన మొదటి భార్య!)తండేల్ మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. రీసెంట్ టైంలో 'పుష్ప 2' తప్పితే చాలా సినిమాల్ని ఈ ఓటీటీ సంస్థ.. నెల రోజులకు అటు ఇటుగా స్ట్రీమింగ్ చేసేస్తోంది. అలానే ఈ సినిమాని కూడా నెలకే ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మార్చి 6 నుంచే తండేల్.. ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. లేదంటే మార్చి 14న రావొచ్చని మాట్లాడుకుంటున్నారు.తండేల్ విషయానికొస్తే.. శ్రీకాకుళంలోని మత్సలేశం అనే ఊరికి చెందిన కొందరు జాలర్లు.. గుజరాత్ తీరంలో చేపలు పడుతుండగా, అనుకోకుంగా పాకిస్థాన్ నేవి చేతికి చిక్కారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. తర్వాత పాకిస్థాన్ జైల్లో కొన్నాళ్ల పాటు ఉన్నారు. భారత ప్రభుత్వం జోక్యంతో తిరిగి ఇళ్లకు చేరారు. ఈ స్టోరీకి ప్రేమకథని జోడించిన డైరెక్టర్ చందూ మొండేటి.. తండేల్ తీశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?) -
మూడేళ్ల తర్వాత మరో ఓటీటీకి టాలీవుడ్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
శ్రీవిష్ణు, అమృతా అయ్యర్ జంటగా నటించిన చిత్రం అర్జున ఫల్గుణ. ఈ మూవీ 2021 డిసెంబర్ 31న థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద అభిమానులను పెద్దగా మెప్పించలేకపోయింది. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం ఈ మూవీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.అయితే తాజాగా ఈ చిత్రం మరో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. ఈనెల 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో విడుదలైన దాదాపు మూడేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి తీసుకొచ్చారు మేకర్స్. కాగా.. ఈ చిత్రంలో నరేశ్, సుబ్బరాజు, మహేశ్, శివాజీ రాజా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిరంజన్ రెడ్డి, అవినాశ్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి ప్రియదర్శన్ సంగీతం అందించాడు. A heist, a twist, and a whole lot of laughs! 🎭💰 Don't miss #ArjunaPhalguna, now streaming on @PrimeVideoIN! 🤩#ArjunaPhalgunaOnPrime ▶️ https://t.co/zqJeq98baa@sreevishnuoffl @Actor_Amritha @DirTejaMarni @MatineeEnt #TeluguFilmNagar pic.twitter.com/wUFnuSfpD1— Telugu FilmNagar (@telugufilmnagar) February 24, 2025 అర్జున ఫల్గుణ అసలు కథేంటంటే..?డిగ్రీ అయిపోయి ఊర్లోనే ఉంటున్న ఐదుగురు స్నేహితులు అర్జున్(శ్రీవిష్ణు), రాంబాబు(రాజ్ కుమార్), తాడి(‘రంగస్థలం’మహేశ్), ఆస్కార్(చైతన్య గరికిపాటి), శ్రావణి(అమృత అయ్యర్)ల చూట్టూ ‘అర్జున ఫల్గుణ’కథ సాగుతుంది. వీరంతా చిన్నప్పటి నుంచి బెస్ట్‌ఫ్రెండ్స్. సిటీకి వెళ్లి పాతిక వేలు సంపాదించేకంటే.. ఊర్లో ఉండి పది వేలు సంపాదించుకుని తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనే వ్యక్తిత్వం వాళ్లది. వీరంతా ఊర్లోనే సోడా సెంటర్ పెట్టి డబ్బులు సంపాదించాలనుకుంటారు. దాని కోసం బ్యాంకు లోన్‌కు ట్రై చేస్తారు. రూ. 50 వేలు ఇస్తే లోన్ వస్తుందని చెప్పడంతో.. డబ్బుకోసం వీళ్లు ప్రయత్నాలు చేస్తారు. ఈక్రమంలో ఈ ఐదుగురు గంజాయి కేసులో పోలీసులకు పట్టుబడతారు. అక్కడి నుంచి వీరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? సరదాగా ఊర్లో తిరిగే వీళ్లు గంజాయి స్మగ్లింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ కేసు నుంచి ఈ ఐదుగురు ఎలా బయటపడ్డారు? అనేదే మిగతా కథ. -
చరిత్రలో మరిచిపోలేని జలియన్ వాలాబాగ్ ఉదంతం.. ట్రైలర్ చూశారా?
భారతీయుల గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని దారుణ ఉదంతం జలియాన్ వాలాబాగ్ ఊచకోత. అప్పటి బ్రిటీశ్ పరిపాలన కాలంలో 1919 ఏప్రిల్ 13న ఈ మారణహోమం జరిగింది. ఈ అత్యంత పాశవిక ఘటన ఆధారంగా వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ది వాకింగ్ ఆఫ్ ఏ నేషన్ పేరుతో రామ్ మాద్వానీ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు.తారుక్ రైనా, నిఖితా దత్తా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్ వచ్చేనెల మార్చి 7 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, మలయాళం, తమిళం భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. యధార్థ సంఘటనల ఆధారంగా వస్తోన్న వెబ్ సిరీస్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Find out the conspiracy behind the Jallianwala Bagh massacre, as a nation awakens. Creator | Director Ram Madhvani brings to you a show inspired by true events #TheWakingOfANation, Streaming on 7th March on Sony LIV pic.twitter.com/Q5qM8ZN8Cn— Sony LIV (@SonyLIV) February 24, 2025 -
ఎయిర్టెల్ కొత్త ఆఫర్.. ప్రముఖ ఓటీటీ ఫ్రీ
ఎయిర్టెల్ (Airtel) తమ కస్టమర్లకు కొత్త ఆఫర్ ప్రకటించింది. యాపిల్ టీవీ+, (Apple TV+) యాపిల్ మ్యూజిక్ (Apple Music) సేవలను అందించడానికి భారతీ ఎయిర్టెల్, యాపిల్ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. రూ.999తో ప్రారంభమయ్యే ప్లాన్లపై హోమ్ వై-ఫై వినియోగదారులందరికీ యాపిల్ టీవీ + కంటెంట్ ఉచితంగా లభిస్తుందని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది.ఇదే కాకుండా రూ .999 నుండి ప్రారంభమయ్యే ప్లాన్లపై పోస్ట్‌పెయిడ్ యూజర్లు యాపిల్ టీవీ + సదుపాయాన్ని పొందవచ్చు. 6 నెలల పాటు యాపిల్ మ్యూజిక్‌ను ఉచితంగా ఆస్వాదించవచ్చు. ఇందులో భారతీయ సంగీతంతోపాటు విదేశీ మ్యూజిక్ లిస్టింగ్ కూడా ఉంటుంది. ఎలాంటి కస్టమర్లు ఈ ప్రయోజనాన్ని పొందబోతున్నారు.. ఇందు కోసం వారు ఏ రీఛార్జ్ ప్లాన్ ను ఎంచుకోవాలో తెలుసుకుందాం.యాపిల్ మ్యూజిక్ ఉచిత సబ్స్క్రిప్షన్ఈ భాగస్వామ్యం కింద వినియోగదారులు యాపిల్ టీవీ+లోని అన్ని ఒరిజినల్ సిరీస్‌లు, సినిమాలను ఎటువంటి ప్రకటనలు లేకుండా యాక్సెస్ చేయవచ్చు. వీటిలో టెడ్ లాస్సో, సెవెరెన్స్, ది మార్నింగ్ షో, స్లో హార్స్, సిలో, ష్రింకింగ్, డిస్క్లయిమర్ వంటి అవార్డ్ విన్నింగ్ హిట్ సిరీస్‌లు ఉన్నాయి. వీటితో పాటు వోల్ఫ్స్, ది గోర్జ్ వంటి కొత్త సినిమాలు కూడా ఉన్నాయి. ఇది కాకుండా వినియోగదారులకు 6 నెలల పాటు యాపిల్ మ్యూజిక్ సర్వీస్ కూడా ఉచితంగా లభిస్తుంది. యాపిల్ టీవీ+, యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ కోసం ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవసరం లేదు.బెనిఫిట్స్ ఈ ప్లాన్లలో..రూ.1,099, రూ.1,599, రూ.3,999 ఎయిర్టెల్ వైఫై ప్లాన్లను ఎంచుకున్న వారికి వరుసగా 350కి పైగా టీవీ ఛానళ్లు, 200 ఎంబీపీఎస్, 300 ఎంబీపీఎస్, 1 జీబీపీఎస్ స్పీడ్ లభిస్తుంది. ఈ కొత్త ఆఫర్‌తో ఎయిర్టెల్ ఎంటర్టైన్మెంట్ పోర్ట్‌ఫోలియో మరింత బలంగా మారింది. ఇది ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5, జియో హాట్‌స్టార్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. దేశంలో డిజిటల్ కంటెంట్ అందించే పెద్ద సంస్థలలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. -
నెలలోపే ఓటీటీలోకి కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
తమిళ స్టార్ హీరోల్లో అజిత్ ఒకడు. రీసెంట్ టైంలో ఇతడి సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతున్నాయి. అలా ఈ నెల తొలివారంలో విడుదలైన మూవీ 'విడామయూర్చి'. తెలుగులో దీన్ని పట్టుదల పేరుతో రిలీజ్ చేశారు. ఇప్పుడు దీని ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయింది.ఫిబ్రవరి 6న తెలుగు-తమిళంలో రిలీజైన ఈ చిత్రానికి తొలిరోజే నెగిటివ్ టాక్ వచ్చింది. కాన్సెప్ట్ ఓకే అనుకున్నప్పటికీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కథ లేకపోవడంతో జనాలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ కలెక్షన్స్ రూ.100 కోట్లకు పైనే వచ్చాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సంక్రాంతి' హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?)ఈ సినిమా డిజిటల్ హక్కులు దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్.. నెలలోనే ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 6న మూవీ థియేటర్లలో రిలీజ్ కాగా.. మార్చి 3 అంటే వచ్చే సోమవారం నుంచే ఇది ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు ప్రకటించారు.సినిమా కథ విషయానికొస్తే.. అర్జున్ (అజిత్), కాయల్ (త్రిష) భార్యాభర్తలు. అజర్బైజాన్లో ఉంటారు. మనస్పర్థల కారణంగా విడిపోదామని నిర్ణయం తీసుకుంటారు. విడిపోయే ముందు భార్యని.. చివరగా రోడ్ ట్రిప్ వేద్దామని అర్జున్ అడుగుతాడు. దీంతో ఆమె ఒప్పుకొంటుంది. ఆ ప్రయాణంలో ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)Muyarchi thiruvinai aakum. Vidaamuyarchi ulagai vellum 💪🔥Watch Vidaamuyarchi on Netflix, out 3 March in Tamil, Hindi, Telugu, Kannada & Malayalam!#VidaamuyarchiOnNetflix pic.twitter.com/21OiHpF8AB— Netflix India South (@Netflix_INSouth) February 24, 2025 -
ఓటీటీలోకి వచ్చేస్తున్న డిజాస్టర్ సినిమా.. నెలలోపే?
రీసెంట్ టైంలో ఓ మాదిరి అంచనాలతో రిలీజై డిజాస్టర్ అనిపించుకున్న సినిమా లైలా. విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. వైవిధ్యం కోసం అమ్మాయి గెటప్ కూడా వేశాడు. కానీ కంటెంట్ మరీ తీసికట్టుగా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన ఫెయిల్యూర్ గా నిలిచింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేయబోతుందట.(ఇదీ చదవండి: సుకుమార్ చేయి వదలని ఐటమ్ బ్యూటీ.. వీడియో వైరల్)ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్ తదితర చిత్రాలతో కాస్త గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. ఈ మధ్య కాలంలో మాత్రం ప్రతి సినిమాతో నిరాశపరుస్తున్నాడు. గతేడాది రిలీజైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గామి, మెకానిక్ రాకీ చిత్రాలు ప్రేక్షకుల్ని నిరాశపరిచాయి. 'లైలా' అయినా సరే హిట్ అవుతుందేమో అనుకుంటే ఘోరమైన డిజాస్టర్ గా నిలిచింది.వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలో 'లైలా' రిలీజైంది. ఉదయం తొలి ఆట నుంచి టాక్ తేడా కొట్టేసింది. దీంతో రెండో రోజు నుంచి ఈ సినిమాకు వెళ్లే వారే కరువయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ రిలీజ్.. అనుకున్న టైం కంటే కాస్త ముందుకొచ్చిందని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)లైలా సినిమా డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. లెక్క ప్రకారం మార్చి 2వ వారంలో స్ట్రీమింగ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు తొలి వారంలోనే ఓటీటీలో రిలీజ్ అవకాశముందని సమాచారం. అంటే మార్చి 7న లేదా అంతకంటే ముందే 'లైలా' డిజిటల్ రిలీజ్ ఉండొచ్చట.'లైలా' కథ విషయానికొస్తే.. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో సోనూ(విశ్వక్ సేన్)కి బ్యూటీ పార్లర్ ఉంటుంది. ఓ రోజు అనుకోకుండా పాతబస్తీ పహిల్వాన్, ఎస్ఐ శంకర్ కి సోనూ టార్గెట్ అవుతాడు. వాళ్ల నుంచి తప్పించుకునేందుకు లేడీ గెటప్ వేసుకుని లైలా అవతారమేస్తాడు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సంక్రాంతి' హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?) -
ఓటీటీలోకి 'సంక్రాంతి' హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?
ఈసారి సంక్రాంతికి థియేటర్లలో రిలీజై అనుహ్యంగా హిట్ అయింది వెంకటేశ్ మూవీ. పండగ పేరుతో 'సంక్రాంతికి వస్తున్నాం' అని ప్రేక్షకుల్ని పలకరించారు. అనుహ్యమైన విజయాన్ని అందుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త రికార్డు సృష్టించింది.అయితే వెంకీమామ సినిమా ఓటీటీలోకి రావడానికి కంటే ముందే టీవీలో ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించి షాకిచ్చారు. మార్చి 1న సాయంత్రం టీవీలో ప్రసారం చేస్తున్నట్లు చెప్పడంతో మరి ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఆడియెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్ప్పుడు స్ట్రీమింగ్ పై ఓ రూమర్ వినిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)మార్చి 1న టీవీలో ప్రసారమైన సమయానికే ఓటీటీలోనూ రిలీజ్ చేయాలని సదరు సంస్థ నిర్ణయం తీసుకుందట. దీనిబట్టి చూస్తే మార్చి 1నే సాయంత్రం జీ5 ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 'సంక్రాంతి వస్తున్నాం' స్ట్రీమింగ్ కానుందని సమాచారం. కొన్నిరోజుల క్రితం సుదీప్ 'మ్యాక్స్' మూవీ కూడా ఇలానే టీవీ- ఓటీటీలో ఒకేసారి తీసుకొచ్చారు. మరి ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.'సంక్రాంతి వస్తున్నాం' కథ విషయానికొస్తే.. అమెరికాలో సెటిలైన సత్య అనే బడా వ్యాపారవేత్తని తెలంగాణ సీఎం కేశవ.. హైదరాబాద్ తీసుకొస్తాడు. కానీ అతడిని పాండే గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిస్తే ప్రభుత్వం పరువు పోతుందనే భయంతో సీక్రెట్ ఆపరేషన్ కి సిద్ధమవుతారు. దీనికోసం మాజీ పోలీస్ వైడీ రాజు (వెంకటేశ్)ని ఒప్పించే బాధ్యతని ఇతడి మాజీ ప్రేయసి మీనాక్షి (మీనాక్షి చౌదరి) తీసుకుంటుంది. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: నటికి ఏడు సార్లు అబార్షన్ కేసులో మరోసారి నటుడిపై విచారణ) -
ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. గతవారంలానే ఈసారి కూడా పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. ఉన్నంతలో సందీప్ కిషన్-రావు రమేశ్ నటించిన 'మజాకా'.. కాస్త ఆసక్తి రేపుతోంది. దీంతో పాటు తకిటి తదిమి తందాన, శబ్దం,అగాథియా తదితర చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.(ఇదీ చదవండి: నటికి ఏడు సార్లు అబార్షన్ కేసులో మరోసారి నటుడిపై విచారణ)మరోవైపు ఓటీటీల్లో 11 వరకు పలు సినిమాలు-వెబ్ సిరీసులు ఈ వారం స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో సుడాల్ సీజన్ 2, డబ్బా కార్టెల్, ఆశ్రమ్ తదితర వెబ్ సిరీసులు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. మరి ఏయే ఓటీటీల్లో ఏది రిలీజ్ కానుందంటే?\ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఫిబ్రవరి 24 - మార్చి 1)నెట్ఫ్లిక్స్డబ్బా కార్టెల్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఫిబ్రవరి 28అమెజాన్ ప్రైమ్జిద్దీ గర్ల్స్ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 27హౌస్ ఆఫ్ డేవిడ్ (ఇంగ్లీష్ సిరీస్) ఫిబ్రవరి 27సుడల్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఫిబ్రవరి 28సూపర్ బాయ్స్ ఆప్ మాలేగావ్ (హిందీ మూవీ) - ఫిబ్రవరి 28హాట్స్టార్సూట్స్: లాస్ ఏంజిల్స్(ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 24బీటిల్ జ్యూస్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 28లవ్ అండర్ కన్స్ట్రక్షన్ (మలయాళ సిరీస్) - ఫిబ్రవరి 28ది వాస్ప్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 28సైనా ప్లేస్వర్గం (మలయాళ మూవీ) - ఫిబ్రవరి 24ఎంఎక్స్ ప్లేయర్ఆశ్రమ్ 3 పార్ట్ 2 (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 27(ఇదీ చదవండి: విజయ్ సేతుపతి భారీ సాయం.. ఆయన పేరుతోనే నిర్మిస్తాం: ఆర్కే సెల్వమణి) -
ఆడవారి కష్టానికి అద్దం ఈ సినిమా..
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం మిసెస్(Mrs) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఈ సమాజంలో ఏ ప్రతిఫలం ఆశించకుండా ప్రతి రోజూ బాధ్యతతో కష్టపడుతున్న వారెవరైనా ఉన్నారు అంటే వారు మన ఇంటి ఆడవారు. 365 రోజులు ఏ సెలవు లేకుండా ఇంట్లో ఉన్న ఆరు నుండి అరవై ఏళ్ల వాళ్ల బాగోగులు ప్రతి నిత్యం అలుపెరగకుండా చూసుకునేవారే ఆడవారు. మరి ఇంతలా కష్టపడుతున్న వారికి కొన్ని బాధలు ఉంటాయి కదా. వాటి గురించి విచారించేదెవరు... ఆ కోణంలో ఆలోచింపజేసేదే ఈ ‘మిసెస్’ చిత్రం.2021లో విడుదలైన మలయాళ సినిమా ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’కి హిందీ రీమేక్‌గా ‘మిసెస్’ రూపొందింది. ఆరతి కడావ్ దీనికి దర్శకురాలు. బాలీవుడ్లో విలక్షణ నటిగా పేరొందిన సాన్యా మల్హోత్రా(Sanya Malhotra) ఈ సినిమాలోని ప్రధాన పాత్ర పొషించారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కనీసం ఓ క్షణమైనా తమ ఇంటి ఆడవారి కష్టం గురించి ఆలోచిస్తారు. అలా ఆలోచింపజేయడమే లక్ష్యంగా దర్శకురాలు ఈ సినిమాని రూపొందించారు. అంతలా ఏముందీ సినిమాలో ఓసారి చూద్దాం... రీచా ఓ చదువుకున్న ఆధునిక భావాలు కలిగిన అమ్మాయి. మంచి డ్యాన్స్ టీచర్ కూడా.తనకు సొంతంగా డ్యాన్స్ టీమ్ ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనలో ఉంటుంది. ఈ లోపల తల్లిదండ్రులు నిశ్చయించిన సంబంధంతో పెద్దల సమక్షంలో సంప్రదాయబద్ధంగా దివాకర్‌తో పెళ్లవుతుంది. దివాకర్ ఓ డాక్టర్. దివాకర్ది మరీ ఛాందస భావాలు కలిగిన కుటుంబం. ఇంటికి వచ్చిన కోడలితో ఇంటెడు చాకిరీ చేయించుకోవడమే కాక ఓ బానిస కన్నా చాలా హీనంగా చూస్తుంటారు. ప్రతి రోజూ అలారం పెట్టుకొని లేచి ఇంట్లో ఉన్న వాళ్లందరికీ వండి రాత్రి మళ్లీ నిద్రపొయేంతవరకు కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకురాలు. ఇంట్లో కనీసం వాసన కూడా భరించలేని ఓ ప్రదేశాన్ని తాను ఎంత నరకయాతన అనుభవిస్తూ శుభ్రం చేసిందో చూస్తే చూసిన ప్రేక్షకులకు గుండె బరువెక్కుతుంది.ఇంటి పెద్ద అయిన దివాకర్ తండ్రి బయటకు వెళ్లాలంటే ఆయన చెప్పులు కూడా చేత్తో తీసి, ముందు పెడితే తాపీగా వేసుకుని వెళతాడు. అటువంటి ఘోరమైన భావజాలమున్న ఈ కుటుంబంలోకి వచ్చిన రీచా ఎలా మనగలుగుతుంది? అలాగే తన డ్యాన్స్ డ్రీమ్ నెరవేర్చుకుంటుందా? లేదా అన్నది సినిమాలోనే చూడాలి. ఈ సినిమాలోని కథాంశం సమాజంలో ఉన్న ప్రతి గృహిణిది. ప్రతి రోజూ మీ కోసం కష్టపడుతున్న మీ వారి కోసం ఈ సినిమా చూడండి. ఆమె కష్టమేంటో మీ మనస్సుతో పాటు కళ్లకు కూడా తెలుస్తుంది. వర్త్‌ఫుల్ వాచ్. – ఇంటూరు హరికృష్ణ -
నామినేషన్స్ తో హీటెక్కిన డాన్స్ ఐకాన్ సీజన్ 2
ఓంకార్ హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సెన్సేషనల్ డ్యాన్స్ షో డ్యాన్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ పేరుకు తగినట్లే రోజు రోజుకూ హీటెక్కుతోంది. సెకండ్ ఎపిసోడ్ నామినేషన్స్ తో కార్యక్రమం మరింత ఉత్కంఠగా మారింది. టాప్ ప్లేస్ కోసం ఎవరు పోటీ పడతారు అనేది ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. గాలి, నీరు, ఆకాశం, అగ్ని, భూమి పేర్లతో పంచభూతాల్లాంటి ఐదుగురు కంటెస్టెంట్స్ విపుల్ కాండ్పాల్, సాధ్వి మజుందార్, బినితా చెట్రీ, షోనాలి మరియు బర్కత్ అరోరా తమ పర్ ఫార్మెన్స్ లు ఆకట్టుకుంటుండగా..వీరికి ఐదుగురు మెంటార్స్ గా మానస్, దీపిక, జాను లైరి, ప్రకృతి, యష్ మాస్టర్ వ్యవహరిస్తున్నారు. డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ సెకండ్ ఎపిసోడ్ నామినేషన్స్ ఉత్కంఠ కలిగిస్తూ సాగాయి. టీమ్ ఎర్త్ మెంటార్ ప్రకృతి కంబం.. మానస్ నాగులపల్లి టీమ్ 'ఫైర్' ని నామినేట్ చేసింది. రివేంజ్ గా ప్రకృతి మెంటార్ గా ఉన్న ఎర్త్ ని మానస్ నామినేట్ చేయడం హీట్ పెంచింది. యష్ మాస్టర్, దీపికా జానులైరి 'వాటర్' ను నామినేట్ చేయగా, ప్రతీకారంగా జనులైరి, దీపిక 'ఎయిర్' ను నామినేట్ చేసింది. యశ్ మాస్టర్ 'స్కై' మాత్రం నామినేషన్స్ నుంచి బయటపడింది. ఈ నామినేషన్స్ ప్రక్రియ రాబోయే రోజుల్లో డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ మరింత సస్పెన్స్ గా ఉండబోతున్నట్లు హింట్ ఇస్తోంది. -
'యుగానికి ఒక్కడు' రీ-రిలీజ్.. సీక్వెల్లో హీరో ఎవరో తెలుసా..?
కోలీవుడ్ హీరో కార్తీతో పాటు ఆండ్రియా, రీమాసేన్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఆయిరత్తిల్ ఒరువన్ (యుగానికి ఒక్కడు). ఇప్పుడు ఈ చిత్రం మరోసారి థియేటర్లోకి రానుంది. విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు సెల్వరాఘవన్ తెరకెక్కించారు. 2010లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా సినిమా ఉండటంతో తమిళ్‌తో పాటు తెలుగులో కూడా మంచి విజయాన్ని నమోదుచేసింది. హీరో కార్తీకి ఈ సినిమాతో పాపులారటీ వచ్చింది.యుగానికి ఒక్కడు(Yuganiki Okkadu) సినిమా రీరిలీజ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 15 ఏళ్ల తర్వాత చోలాస్ మళ్లీ తిరిగి వస్తున్నారని వారు ఒక పోస్టర్ విడుదల చేశారు. ఎపిక్ ఫాంటసీ మాస్టర్ పీస్ చూసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, అమెరికాలో మార్చి 14న ఈ చిత్రం రీరిలీజ్ కానుందని ప్రకటించారు. అయితే, ఇప్పటికే ఈ సినిమా తెలుగు వర్షన్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ్ వర్షన్ సన్‌నెక్ట్స్‌లో అందుబాటులో ఉంది.యుగానికి ఒక్కడు సీక్వెల్ ప్లాన్‘యుగానికి ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ ప్రకటన కూడా వచ్చేసింది. ఈ చిత్రానికి కొనసాగింపు ఉంటుందని దర్శకుడు సెల్వ రాఘవన్ అధికారికంగా గతంలోనే ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ధనుష్ హీరోగా నటించనున్నాడని కూడా ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌పై ధనుష్ కూడా స్పందించారు. ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఆలస్యమైనా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఆయన అన్నారు. యుగానికి ఒక్కడు కోసం రూ. 18 కోట్లు బడ్జెట్ అయింది. సీక్వెల్ కోసం సుమారు రూ. 150 కోట్లు దాటొచ్చని అంచనా ఉంది. -
మరో ఓటీటీలో క్రైమ్ సస్పెన్స్ సినిమా స్ట్రీమింగ్
అశ్విన్ బాబు, నందితా శ్వేత జంటగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’ మూవీ మరో ఓటీటీలోకి వచ్చేసింది. 2023లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అయతే, అమెజాన్ ప్రైమ్‌లో కూడా తెలుగు వెర్షన్లోనే హిడింబ మూవీ తాజాగా విడుదలైంది.ప్రముఖ యాంకర్ ఓంకార్ సోదరుడిగా అశ్విన్ బాబు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. రాజుగారి గది సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే, ఆ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ప్రాజెక్ట్‌లు ఏవీ ప్రేక్షకులను మెప్పించలేదు. ఆ చిత్రాలన్నింటికి ఓంకార్ దర్శకత్వం వహించడం గమనార్హం. అయితే, హిడింబ చిత్రాన్ని అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించారు. ఈ మూవీపై భారీ అశలు పెట్టకున్న మేకర్స్‌కు నిరాశే ఎదురైంది. అయితే, కలెక్షన్స్ పరంగా ఫర్వాలేదనిపించింది. అనుకున్న టార్గెట్ రీచ్ కావాడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్‌గా నిలిచిందని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి.కథేంటి..?హైదరాబాద్‌లో వరుగా అమ్మాయిలు కిడ్నాప్‌కు గురవుతుంటారు. దాదాపు 16 మంది అదృశ్యం అవ్వడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం కేరళ నుంచి ఐపీఎస్ ఆద్య(నందితా శ్వేతా)ను నగరానికి రప్పిస్తారు. అప్పటి వరకు ఈ కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారి అభయ్(అశ్విన్ బాబు)తో కలిసి ఆద్య విచారణ ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో కాలాబండలోని బోయ(రాజీవ్ పిళ్ళై) అనే కరుడుగట్టిన రౌడీ గురించి తెలుస్తుంది. ఆభయ్ రిస్క్ చేసి మరీ కాలాబండలో బందీగా ఉన్న అమ్మాయిలను విడిపిస్తాడు. అయినప్పటికీ నగరంలో వరుసగా అమ్మాయిలు కిడ్నాప్‌కి గురవుతుంటారు. మరి అమ్మాయిలను కిడ్నాప్ చేసేదెవరు? ఎందుకు చేస్తున్నారు? రెడ్ డ్రెస్ వేసుకున్న యువతులను మాత్రమే ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు? ఈ కేసుకు అండమాన్ దీవుల్లో ఉన్న గిరిజన తెగ హిడింబాలకు సంబంధం ఏంటి? చివరకు ఆద్యకు తెలిసిన నిజమేంటి? అనేదే మిగతా కథ. -
Kadhalikka Neramillai Review: వీర్యదానంతో బాబు పుడితే...
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం కాదలిక్క నేరమిల్లై ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ప్రేమ.. ఓ చక్కటి ఫీలింగ్. ప్రేమ తరువాత పెళ్లి... ఓ థ్రిల్లింగ్ ఈవెంట్... పెళ్లి తరువాత పిల్లలు... జస్ట్ స్ట్రగులింగ్... ఇక్కడ మొదలవుతుంది అసలు కథ. నేటి యువతరం పడుతున్న పాట్లు ఇవి. ఇన్ఫెర్టిలిటీ అనేది నేటి జనరేషన్‌తో పాటు వేగంగా విస్తరిస్తున్న సమస్య. చాప కింద నీరులా ఈ సమస్య మనకు తెలియకుండానే మన కుటుంబాలను, బంధాలను మానసికంగా వేధిస్తోంది. ఆ సమస్య మీదే కాస్త చిలిపిగా రాసుకున్న కథ ‘కాదలిక్క నేరమిల్లై’ (ప్రేమించడానికి సమయం లేదు). ఇది తమిళ సినిమా కానీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ లభ్యమవుతోంది. సినిమా అంతా చాలా సరదాగా సాగిపోతుంది. దర్శకురాలు కృతికా ఉదయనిధి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘జయం’ రవి, నిత్యా మీనన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే... 2017లో ఈ సినిమా కథ ప్రారంభమవుతుంది. ఆర్కిటెక్ అయిన శ్రియ తను ప్రేమించిన కరణ్‌ను తల్లిదండ్రులను ఎదిరించి రిజిష్టర్ మ్యారేజ్ చేసుకుంటుంది. పెళ్లైన కొద్ది సమయంలోనే కరణ్ మోసగాడు అని తెలిసి, విడిపోతుంది. కానీ శ్రియకు పిల్లలంటే మహా ఇష్టం. విడిపోయిన కరణ్‌తో అది సాధ్యపడదు కాబట్టి ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లలను కనాలని నిర్ణయించుకుంటుంది. మరో పక్క పెళ్లి, పిల్లలు అనే సిద్ధాంతానికి దూరంగా ఉన్న ఆర్కిటెక్ సిధ్ తన గర్ల్‌ఫ్రెండ్ నిరుపమతో విడిపోవాల్సి వస్తుంది. కొన్ని అనుకోని పరిస్థితుల్లో తాను ఓ స్వచ్ఛంద సంస్థకు వీర్యదానం చేస్తాడు. అనూహ్యంగా సిద్ వీర్యంతోనే శ్రియ ఓ పిల్లాడికి జన్మనిస్తుంది. ఆ పిల్లాడి పేరు పార్ధివ్. పార్ధివ్‌కు ఊహ తెలిశాక తన తండ్రి కోసం వెతుకుతూ ఉంటాడు. ఇదే టైంలో ఓ ప్రాజెక్టుకు సంబంధించి సిద్, శ్రియ చెన్నై నగరంలో కలుస్తారు. మరి... తన తండ్రి సిద్ అని పార్ధివ్ తెలుసుకుంటాడా? సిధ్‌ని పార్ధివ్ తండ్రిగా శ్రియ ఒప్పుకుంటుందా? అనేది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘కాదలిక్క నేరమిల్లై’ సినిమాలోనే చూడాలి. ఓ సున్నితమైన పాయింట్‌ని చక్కటి స్క్రీన్‌ప్లేతో సరదాగా తీసుకెళ్లారు దర్శకురాలు. మీకు సమయం ఉంటే ప్రేమ కోసం ప్రేమతో ఈ సినిమాని చూడండి. వర్త్‌ఫుల్ వాచ్. – ఇంటూరు హరికృష్ణ -
ఇదెక్కడి ట్విస్ట్.. మళ్లీ ఓటీటీకి వచ్చేసిన సూపర్‌హిట్ హారర్ థ్రిల్లర్
2018లో వచ్చి సూపర్ హిట్‌గా హారర్ థ్రిల్లర్ తుంబాడ్. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. గతేడాది సెప్టెంబర్‌లో ఈ మూవీని రీ రిలీజ్ చేయగా అద్భుతమైన వసూళ్లు సాధించింది. ఏకంగా రూ.31 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకు రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహించారు. అయితే రీ రిలీజ్‌కు ముందు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అందుబాటులో ఉండేది. కానీ ఊహించని విధంగా ఓటీటీ నుంచి ఈ చిత్రాన్ని తొలగించారు.అయితే తాజాగా ఆడియన్స్‌కు మరో ట్విస్ట్ ఎదురైంది. ఇటీవల థియేటర్లలో అలరించిన ఈ హారర్ థ్రిల్లర్ తుంబాడ్ మరోసారి సడన్‌గా ఓటీటీకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని మహరాష్ట్ర జానపద కథల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో హనీ ట్రెహాన్, అషర్ హక్, హ్యారీ పర్మార్, ప్రశాంత్ సింగ్ కీలక పాత్రల్లో నటించారు.తుంబాడ్ సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రానికి సీక్వెల్‌గా తుంబాడ్-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు నటుడు, నిర్మాత, సోహమ్ షా ఇప్పటికే ప్రకటించారు. -
కబాలి నటి క్రైమ్ థ్రిల్లర్.. నాలుగు నెలల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి మూవీతో అలరించిన నటి సాయి ధన్సిక. ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. అయితే ఇటీవల సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సాయి ధన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం 'దక్షిణ'. ఓ సైకో కిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గతేడాది అక్టోబర్‌లో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది.తాజాగా ఈ థ్రిల్లర్ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ రోజు నుంచే లయన్స్ గేట్ ప్లేలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో సాయి ధన్సిక ఏసీపీ పాత్రలో కనిపించింది. అమ్మాయిలను వరుస హత్యలు చేస్తోన్న ఆ సైకో కిల్లర్‌ను ఏసీపీ పట్టుకుందా? ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలేంటి? అసలు ఆ కేసును ఆమె ఎలా ఛేదించింది? అనేదే ఈ దక్షిణ మూవీ స్టోరీ. ఈ సినిమా థియేటర్లలో రిలీజైన దాదాపు నాలుగు నెలల తర్వాత ఓటీటీకి వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం క్రైమ్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే వారు ఎంచక్కా ఈ సినిమాను చూసేయండి. కాగా.. ఈ చిత్రానికి మంత్ర ఫేమ్ ఓషో తులసీరామ్ దర్శకత్వం వహించారు. Action, adrenaline, and pure thrill! 🔥💥#Dhakshina is now streaming on #LionsgatePlay – gear up for an action-packed ride. Watch now! 🎬🍿 pic.twitter.com/6JKiFKW1JR— Lionsgate Play (@lionsgateplayIN) February 21, 2025 -
ఓటీటీలోకి ఎమర్జెన్సీ.. సింపుల్‌గా డేట్ చెప్పేసిన కంగనా
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో నటించి, స్వీయదర్శకత్వం వహించిన చిత్రం ఎమర్జెన్సీ (Emergency Movie). పలుమార్లు వాయిదాపడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.21 కోట్లు మాత్రమే రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ విషయాన్ని కంగనా సింపుల్‌గా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించింది. ఎమర్జెన్సీ మార్చి 17న నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. థియేటర్లలో మిస్ అయినవారు ఎమర్జెన్సీ చిత్రాన్ని ఓటీటీలో చూసేయండి.ఎమర్జెన్సీ కథఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో విధించిన ఎమర్జెన్సీ, ఆపరేషన్ బ్లూస్టార్ వంటి సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో కంగనా.. ఇందిరాగాంధీగా నటించింది. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పడే, విశాక్ నాయర్, మిలింద్ సోమన్ సహా దివంగత నటుడు సతీశ్ కౌశిక్ ముఖ్య పాత్రలు పోషించారు. కంగనా ఈ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరించింది.చదవండి: ఛత్రపతి శివాజీగా ఆయన బాగా సెట్ అవుతారు: పరుచూరి గోపాలకృష్ణ -
ఓటీటీలో డిటెక్టివ్ థ్రిల్లింగ్ సినిమా స్ట్రీమింగ్
శివ కందుకూరి, రాశీ సింగ్ జంటగా పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భూతద్దం భాస్కర్ నారాయణ’(Bhoothaddam Bhaskar Narayana). స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై నిర్మించిన ఈ సినిమా ఈ గతేడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలోకి వచ్చిన ప్రేక్షకులకు ఈ సినిమా థ్రిల్‌ని పంచింది. ఆపై ఆహా ఓటీటీలోనూ అదే థ్రిల్‌ను కొనసాగించింది. ఇప్పుడు తాజాగా మరో ఓటీటీలోకి ఈ మూవీ ఎంట్రీ ఇచ్చింది.డిటెక్టివ్ థ్రిల్లర్స్ చిత్రాలకు టాలీవుడ్లో మంచి ఆదరణ ఉంది. మంచి కంటెంట్‌తో ఈ జానర్లో సినిమాను తెరకెక్కిస్తే.. ప్రేక్షకులు కచ్చితంగా విజయం అందిస్తారు. అందుకు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమానే మంచి ఉదాహరణ. అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమానే భూతద్ధం భాస్కర్ నారాయణ. ఒక క్రైమ్ థ్రిల్లర్‌కి పురాణాలతో ముడిపెట్టడం, దానిని దిష్టి బొమ్మ హత్యలకు లింక్ చేయడం ఈ సినిమాలోని ప్రత్యేకత. ఇప్పటికే ఆహా ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా ఈ మూవీ ఎంట్రీ ఇచ్చింది.కథేంటంటే..ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఎవరో సైకో కిల్లర్ మహిళల్ని హత్య చేసి వారి తలలను తీసుకొని..ఆ స్థానంలో దిష్టిబొమ్మలు పెడుతుంటాడు. ఈ కేసుని దిష్టిబొమ్మ హత్యలు పిలుస్తారు పోలీసులు. హంతకుడిని పట్టుకోవడం వారికి సవాల్‌గా మారుతుంది. ఈ కమ్రంలోనే రంగంలోకి దిగుతాడు లోకల్ డిటెక్టివ్ భాస్కర్ నారాయణ (శివ కందుకూరి). ఒక్క క్లూ కూడా వదలకుండా హత్యలు చేసే ఓ సీరియల్ కిల్లర్ కేసుని డిటెక్టి భాస్కర్ నారాయణ ఎలా పరిష్కరించాడు? అసలు సీరియల్ కిల్లర్ మనిషా రాక్షసుడా ? మహిళల తలలు నరికి ఆ స్థానంలో దిష్టి బొమ్మలు ఎందుకు పెడుతున్నాడు? ఈ కేసుతో పురాణాలకి ఉన్న లింకేంటి? దిష్టిబొమ్మల వెనుక ఉన్న కథేంటి? ఈ కేసులో ఎలాంటి నిజాలు వెలుగు చూశాయి.? అనేదే తెలియాలంటే భూతద్ధం భాస్కర్ నారాయణ చూడాల్సిందే. -
డైరెక్ట్‌గా ఓటీటీకి స్టార్ హీరో కుమారుడి సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) కుమారుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇబ్రహీం అలీ ఖాన్ హీరోగా వస్తోన్న చిత్రం నదానియన్(Nadaaniyan). ఈ మూవీలో జాన్వీ కపూర్ సిస్టర్ ఖుషీ కపూర్(khushi kapoor) హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే ఈ నదానియన్ మూవీని డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రివీల్ చేసింది. వచ్చేనెల మార్చి 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సినిమాకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది.కాగా.. ఈ సినిమాకు శౌనా గౌతమ్ దర్శకత్వం వహించారు. ఏ ధర్మాటిక్ ఎంటర్టైనర్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో సునీల్ శెట్టి, దియా మీర్జా, మహిమా చౌదరి కీలక పాత్రలు పోషించారు. కాలేజీ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది. ఇటీవల ఖుషీ కపూర్ లవ్యాపా మూవీతో ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. Kuch Kuch Hota Hai aisi Nadaaniyan dekh kar 🥰💕Watch Nadaaniyan, out 7 March, only on Netflix!#NadaaniyanOnNetflix pic.twitter.com/piwn818AFx— Netflix India (@NetflixIndia) February 20, 2025 -
జాగ్రత్త.. అలాంటి కంటెంట్ ప్రసారం చేయొద్దు
న్యూఢిల్లీ: ఓటీటీ, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌లు కఠిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా అశ్లీల కంటెంట్‌ను మితిమీరి ప్రసారం చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి ఫిర్యాదులకు చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు బుధవారమే కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది.ఓవర్ ది టాప్(OTT) ఫ్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌లు ఐటీ రూల్స్ (2021) నైతిక విలువలు(Code of Ethics) పాటించాల్సిందే. అలాగే చిన్నారులకు 'ఏ' రేటెడ్ కంటెంట్ అందుబాటులో లేకుండా చూడాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ‘‘ఓటీటీ ప్లాట్ ఫామ్ లు, సోషల్ మీడియాలోని అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌పై ఫిర్యాదులు వస్తున్నాయి. అలాంటి ఫిర్యాదులకు కఠిన చర్యలు తప్పవు. .. ఐటీ రూల్స్ లోని 2021 కోడ్ ఆఫ్ ఎథిక్స్ ను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. ఈ నిబంధనలు మితిమీరి ఏ కంటెంట్‌ను ప్రసారం చేయొద్దు’’ అని కేంద్రం హెచ్చరించింది. అలాగే వయసు ఆధారిత కంటెంట్ అందుబాటులో ఉండాలని, స్వీయనియంత్రణ కలిగి ఓటీటీలు నైతిక విలువలను పాటించాలని ఆదేశించింది. సంబంధిత శాఖ సలహాదారు కాంచన్ గుప్తా ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలియజేశారు.Advisory to OTT platforms against nisitha, indecency and obscenity:Ministry of Information & Broadcasting has issued an advisory to online curated content publishers (OTT platforms) and self-regulatory Bodies of OTT platforms, to ensure strict adherence to India’s laws and the… pic.twitter.com/xMjddk9ns0— Kanchan Gupta 🇮🇳 (@KanchanGupta) February 20, 2025ఇటీవల ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో ప్రముఖ యూట్యూబర్ రణ్ వీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇటు పార్లమెంట్ లోనూ చర్చ జరగ్గా..అటు సుప్రీం కోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సమయంలో యూట్యూబ్‌లాంటి ఫ్లాట్ఫారమ్లలో అభ్యంతరకర కంటెంట్‌పై నియంత్రణ ఉండాలంటూ సర్వోన్నత న్యాయస్థానం పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్
తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటీటీ (OTT)లోకి వచ్చేస్తోంది. కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా నటించిన థ్రిల్లర్ మూవీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. రవితేజ మహాదాస్యం, అనన్య నాగళ్ల జంటగా, శియా గౌతమ్ కీలక పాత్రలు పోషించారు. మోహన్ రచన, దర్శకత్వం వహించారు. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది.తాజాగా ఈ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. కామెడీ, థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు ఓటీటీలో ఓ లుక్కేయండి. షెర్లాక్ హోమ్స్ అన్న టైటిల్ ఎందుకు పెట్టారంటే.. ఈ సినిమాలో డిటెక్టివ్ తల్లి పేరు షర్మిలమ్మ, నాన్న పేరు లోకనాథ్, హీరో పేరు ఓం ప్రకాశ్. ఈ మూడు పేర్లలో ఫస్ట్ లెటర్ సౌండింగ్ అన్నీ కలిపి షెర్లాక్ హోమ్స్ అని పెట్టారు.(చదవండి: ఛావా ప్రభంజనం.. శివాజీ సినిమా వస్తే ఏమైపోతారో?)కథేంటంటే?రాజీవ్ గాంధీ హత్య జరిగిన రోజు (1991 మే 21న) శ్రీకాకుళం బీచ్‌లో మేరీ అనే యువతి దారుణ హత్యకు గురవుతుంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న సీఐ భాస్కర్ (అనీష్ కురివెళ్ల) వారం రోజుల్లో హంతకుడిని పట్టుకుంటానని, లేదంటే ఉద్యోగానికే రాజీనామా చేస్తానని శపథం చేస్తాడు. కానీ రాజీవ్ గాంధీ హత్య కేసు గురించి ఢిల్లీ నుంచి అధికారులు రావడంతో సీఐ పోలీస్ స్టేషన్లోనే ఉండాల్సి వస్తుంది. కేసు పరిష్కరించకపోతే పరువు పోతుందని దాన్ని ప్రైవేట్ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ (వెన్నెల కిషోర్)కి అప్పగిస్తాడు. ఈ హత్య వెనక మేరీ స్నేహితులు భ్రమరాంభ(అనన్య నాగళ్ల), ఆమె ప్రియుడు బాలు(రవితేజ మహద్యం), మేరిపై మోజు పడ్డ ఝాన్సీ, సస్పెండ్ అయిన పోలీసు అధికారి పట్నాయక్(బాహుబలి ప్రభాకర్)తో పాటు ముగ్గురు జాలర్లు ఉన్నట్లు అనుమానిస్తున్నాడు. వీరిలో మేరీని చంపిందెవరు? దానిక గల కారణమేంటి? షెర్లాక్ హంతకుడిని తనకిచ్చిన గడువులో పట్టుకుంటాడా? లేదా? అన్నది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే!చదవండి: జ్యోతికను తీసేయమన్నా.. నా మాట వినలేదు: బాలీవుడ్ నటి -
ఓటీటీలోకి ‘విశ్వదర్శనం’.. ఆకట్టుకుంటున్న ప్రోమో!
కళా తపస్వి కె.విశ్వనాథ్(K Viswanath).. తెలుగు సీనీ చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని పేరు ఇది. శంకరాభరణం, సిరిసిరి మువ్వ, సిరివెన్నెల, స్వాతి ముత్యం, శుభసంకల్పం.. ఇలాంటి ఎన్నో ఆణిముత్యాలాంటి చిత్రాలనిచ్చిన దర్శక దిగ్గజం ఆయన. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోయినా.. ఆయన సినిమాలు ఎప్పుడూ మనల్ని అలరిస్తూనే ఉంటాయి. ఇలాంటి గొప్ప దర్శకుడి జీవిత చరిత్రను వెబ్ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. జనార్దన మహర్షి దర్శకత్వం వహించిన ఈ డాక్యూమెంటరీకి ‘విశ్వదర్శనం’( Viswadharshanam )అనే టైటిల్‌ని ఖరారు చేశారు.తాజాగా ‘విశ్వదర్శనం’ ప్రోమోని విడుదల చేశారు. అందులో ఇండస్ట్రీలోని ప్రముఖులంతా కె.విశ్వనాథ్‌తో తమకున్న అనుబంధాన్ని వివరించనున్నారు.. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేదికగా ఇది రిలీజ్ కానున్నట్లు నిర్మాణసంస్థ వెల్లడించింది. ‘వెండి’తెర చెప్పిన ‘బంగారు’ దర్శకుడి కథ.. అంటూ దీన్ని ప్రకటించింది.కాగా,తెలుగు ప్రేక్షకులకు గొప్ప సందేశాత్మక చిత్రాలను అందించిన విశ్వనాథ్(92).. అనారోగ్యంతో గతేడాది ఫిబ్రవరిలో మరణించారు. 1930 ఫిబ్రవరి 19న జని్మంచిన విశ్వనాథ్..51 సినిమాలకు దర్శకత్వం వహించారు. మొదటిసారిగా 1965లో ఆత్మ గౌరవం సినిమాకు దర్శకత్వం వహించారు. చివరిసారిగా శుభప్రదం సినిమాకు దర్శకత్వం వహించారు. 1992లో పద్మశ్రీ, 2016లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
సుడల్ తెలుగు ట్రైలర్ విడుదల చేసిన నాగచైతన్య
తమిళ క్రైమ్ థ్రిల్లర్ 'సుడల్: ది వోర్టెక్స్' (Suzhal The Vortex) వెబ్ సిరీస్‌కు సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh), కదీర్ (Kathir) ప్రధాన పాత్రలో నటించిన ఈ థ్రిల్లర్ సిరీస్ ఫిబ్రవరి 28 నుంచి అమెజాన్ ప్రైమ్‌లోకి రానుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను టాలీవుడ్ హీరో నాగచైతన్య విడుదల చేశారు. 2022లో విడుదలై తమిళ వెబ్ సిరీస్ ‘సుడల్: ది వొర్టెక్స్’ సీక్వెల్‌గా పార్ట్2 తెరకెక్కింది. బ్రహ్మ జి - అనుచరణ్ మురుగేయాన్ దర్శకత్వం వహించగా.. విక్రమ్ వేదా చిత్రం ఫేమ్ గాయత్రి పుష్కర్ల ద్వయం నిర్మించింది. ఇందులో కదీర్, ఐశ్వర్యా రాజేశ్, ఆర్.పార్తిబన్, హరీశ్ ఉత్తమన్, శ్రియారెడ్డి కీలకపాత్రల్లో నటించారు. -
ఓటీటీలో 'కీర్తీ సురేష్' బాలీవుడ్ సినిమా.. ఉచితంగానే స్ట్రీమింగ్
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్- కీర్తీ సురేష్ జోడీగా నటించిన చిత్రం ‘బేబీ జాన్’.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయిన ఈ సినిమా భారీగా నష్టాలను మిగిల్చింది. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్ యాపిల్ పతాకాలపై జ్యోతీ దేశ్‌పాండే, మురాద్ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా గతేడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఇప్పటికే అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, రూ. 349 అద్దె చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అయితే, నేటి నుంచి ఈ చిత్రాన్ని ఉచితంగానే ఓటీటీలో చూసే అవకాశం ఉంది. హిందీ,తమిళ వర్షన్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ చిత్రం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో చూడొచ్చు.బేబీ జాన్‌తో కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అందువల్ల ఈ మూవీపై ఆమే చాలా ఆశలు పెట్టుకుంది. కానీ, ప్రేక్షకులకు ఈ సినిమాకు కనెక్ట్ కాలేదు. దీంతో తన ఫస్ట్ సినిమానే డిజాస్టర్‌గా మిగిలిపోయింది. 2016లో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'తేరి' సినిమాలో విజయ్ దళపతి, సమంత నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇదే కథతో బేబీ జాన్ రీమేక్ అయింది. సుమారు రూ. 160 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం రూ. 60 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. నెట్ పరంగా రూ. 40 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో భారీ డిజాస్టర్ లిస్ట్‌లో బేబీ జాన్ చేరిపోయింది. -
ఆర్థిక ఇబ్బందుల్లో సమంత వెబ్ సిరీస్.. వెలుగులోకి భారీ స్కామ్
టాలీవుడ్ హీరోయిన్ సమంత నటిస్తున్న ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే వెబ్ సిరీస్‌కు ఆర్థిక కష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. సమంత నటించిన ఖుషి 2023లో విడుదలైంది. ఈ మూవీ తర్వాత మరో చిత్రంలో ఆమె నటించలేదు. అయితే, గతేడాది ‘సిటాడెల్ హన్నీ బన్నీ’ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను సమంత పలకరించింది. ప్రస్తుతం సమంత చేతిలో ఉన్న ఏకైక ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. అయితే, ఇప్పుడీ వెబ్ సిరీస్‌కు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయని నెట్టింట వైరల్ అవుతుంది.నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో రక్త్ బ్రహ్మాండ్ ఒకటి. ఆదిత్య రాయ్ కపూర్, సమంత నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే ఈ ప్రాజెక్ట్ణు పర్యవేక్షిస్తున్నారు. వీరిద్దరూ రీసెంట్గా సిటాడెల్ సిరీస్‌ను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ప్రారంభించిన రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ షూటింగ్‌ను ఆర్థిక సమస్యల వల్ల తాత్కాలికంగా ఆపేశారని సమాచారం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్న ఒకరు బడ్జెట్ విషయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు బయటకొచ్చాయి. కోట్ల రూపాయల స్కామ్‌కు అతను పాల్పడినట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్, డి2ఆర్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ హారర్ ఫాంటసీ చిత్రీకరణ ఇప్పటి వరకు 25 రోజులు పూర్తి చేసుకుందట. ఇంకా చాలా షూటింగ్ షెడ్యూల్స్ ఉన్నాయట. కానీ, ఇప్పటికే సగం బడ్జెట్ ఖర్చయిపోయినట్లు తెలిసింది. ఓ ఆడిట్ ద్వారా ఈ విషయం బయటపడిందట.. అకౌంటింగ్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించడంతో షూటింగ్‌ను ఆపేశారని టాక్ ఉంది. నెట్‌ఫ్లిక్స్, డీ2ఆర్ ఫిల్మ్స్ దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాయని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.రక్త్ బ్రహ్మాండ్ షూటింగ్ పనులను రాజ్ అండ్ డీకే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. డైరెక్టర్ రాహి అనిల్ బార్వే, రైటర్ సీతా ఆర్ మేనన్ మేకింగ్ సమయంలో స్క్రీన్ ప్లేలను ఎప్పటికప్పుడు మార్చేస్తుండటంతో ఖర్చు భారీగా పెరుగుతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ తప్పుబడుతుంది. ఎంత ఖర్చు పెట్టడానికైనా నెట్ ఫ్లిక్స్ సిద్ధంగా ఉన్నప్పటికీ ఇలా స్క్రిప్ట్ మారుస్తూ ఉండటంతో కనిపించని స్థాయిలో దుబారా అవుతుందని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంటుందని యూనిట్ చెప్పుకొస్తుంది. -
మరో ఓటీటీలో వరుణ్ సందేశ్ సినిమా.. ఇప్పుడెందుకు ఈ బాదుడు..?
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన 'విరాజి' సినిమా మరో ఓటీటీలోకి వచ్చేసింది. హారర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది ఆగష్టు 2న విడుదలైంది. అయితే, కేవలం 20 రోజుల్లోనే ఆహా తెలుగు ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఆద్యాంత్ హర్ష డైరెక్షన్లో వరుణ్ డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. మహా మూవీస్, ఎమ్ 3 మీడియా పతాకంపై మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. రెండు డిఫరెంట్ లుక్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ విరాజితో కాస్త పర్వాలేదనిపించాడు.విరాజి చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో తాజాగా విడుదల చేశారు. అయితే, ఈ చిత్రాన్ని చూడాలంటే రూ. 99 రెంట్ చెల్లించాల్సి ఉంటుందని ఒక పోస్టర్‌తో ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయంపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఆహా తెలుగు ఓటీటీలో ఉచితంగా చూసే సౌలభ్యం ఉండగా మళ్లీ అదనంగా రెంట్ చెల్లించి చూడటం ఎందుకు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొత్త సినిమా అనుకొని విరాజి రైట్స్‌ను అమెజాన్ ఏమైనా కొనుగోలు చేసిందా అంటూ సెటైర్స్ వేస్తున్నారు. పాత సినిమాకు రూ. 99 రెంట్ బాదుడు ఎందుకు అంటూ ట్వీట్లు చేస్తున్నారు.ఓ పాత పిచ్చాసుపత్రిలో జరిగే కథ ఇది. అనుకోకుండా కొందరు యువకులు ఆ హాస్పిటల్‌కు వెళ్తారు. అక్కడ ఏం జరిగింది అనేది సినిమా. సస్పెన్స్ థ్రిల్లర్‌తో పాటు ఓ మంచి సందేశం కూడా ఈ చిత్రంలో ఉంటుంది. ఆండీ పాత్రలో వరుణ్ సందేశ్ సరికొత్తగా థియేటర్లలో మెప్పించారు. ఇప్పుడు ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రాన్ని చూసేయండి. విరాజి సినిమాలో వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, తదితరులు నటించారు. -
ఓటీటీలో చిన్నారులను మెప్పించే 'సైన్స్ ఫిక్షన్' సినిమా
పిల్లలను ఎంతగానో ఆలరించిన యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'ది వైల్డ్ రోబోట్' ఓటీటీలోకి వచ్చేసింది. క్రిస్ సాండర్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీ గతేడాది సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమాలో సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చాయి. సుమారు రూ. 2800 కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చినట్లు అంచనా ఉంది.ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న 'ది వైల్డ్ రోబోట్' చిత్రం తాజాగా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఇంగ్లీష్ వర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవతుంది. డ్రీమ్ వర్క్స్ యానిమేషన్ పతాకంపై జెఫ్ హెర్మాన్ ఈ చిత్రాన్ని రూ. 670 కోట్లతో నిర్మించారు. అయితే, సుమారుగా రూ. 2000 కోట్లకు పైగానే లాభాలు వచ్చాయి. సైన్స్ ఫిక్షన్ మూవీ ఇష్టపడే పెద్దలతో పాటు చిన్నారలను ఈ చిత్రం బాగా మెప్పిస్తుంది. -
ఈ వారం ఓటీటీలో 12 సినిమాలు/ సిరీస్‌లు రిలీజ్
వాలంటైన్స్ వీక్ అయిపోయింది. ఎన్నో ప్రేమ చిత్రాలు అటు థియేటర్లో, ఇటు ఓటీటీ (OTT)లో అలరించాయి. ఈ వారం కూడా అదే జోష్ కొనసాగేలా ఉంది. తెలుగు చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు సైతం థియేటర్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి ఫిబ్రవరి మూడో వారంలో థియేటర్, ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలేంటో చూసేద్దాం..థియేటర్లో రిలీజవుతున్న సినిమాలు..బాపు - ఫిబ్రవరి 21రామం రాఘవం - ఫిబ్రవరి 21రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ - ఫిబ్రవరి 21జాబిలమ్మ నీకు అంత కోపమా - ఫిబ్రవరి 21ఓటీటీ రిలీజెస్..జీ5క్రైమ్ బీట్ (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 21 జియో హాట్స్టార్ది వైట్ లోటస్: సీజన్ 3 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 17విన్ ఆర్ లూజ్ - ఫిబ్రవరి 19ఊప్స్! అబ్ క్యా? - ఫిబ్రవరి 20ఆఫీస్ (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 21నెట్ఫ్లిక్స్అమెరికన్ మర్డర్: గాబీ పెటిటో (డాక్యు సిరీస్) - ఫిబ్రవరి 17కోర్ట్ ఆఫ్ గోల్డ్ (డాక్యుమెంటరీ) - ఫిబ్రవరి 18జీరో డే (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 20డాకు మహారాజ్ - ఫిబ్రవరి 20 అమెజాన్ ప్రైమ్రీచర్ సీజన్ 3 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 20ఆపిల్ టీవీ ప్లస్సర్ఫేస్ సీజన్ 2 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 21హోయ్చోయ్చాల్చిత్రో: ద ఫ్రేమ్ ఫాటల్ - ఫిబ్రవరి 21చదవండి: ఓయ్.. బుజ్జి, బంగారం కాకుండా జింగిలేంటి?: హీరోయిన్ -
డాకు మహారాజ్ ఓటీటీ పోస్టర్.. ఆమె లేకపోవడంపై నెటిజన్స్ ఫైర్!
నందమూరి బాలకృష్ణ కొత్త ఏడాదిలో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద రాణించింది. దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటించారు. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఊర్వళి రౌతేలా ప్రత్యేక పాత్రలో మెరిసింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో మెప్పించారు.అయితే ప్రస్తుతం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిక్ల్ వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. అయితే నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసిన పోస్టర్ వల్లే వివాదం మొదలైంది. డాకు మహారాజ్లో కీలక పాత్ర పోషించిన ఊర్వశి రౌతేలా ఫోటో లేకపోవడంపై ఆమె ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్ మండిపడుతున్నారు. దబిడి దిబిడి సాంగ్‌లో అభిమానులను ఓ ఊపు ఊపేసిన ఊర్వశికి ఇచ్చే గుర్తింపు ఇదేనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.డాకు మహారాజ్ పోస్టర్‌ను ఉద్దేశించి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతదేశపు మొదటి మహిళను పోస్టర్ నుంచి తీసేస్తారా అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశాడు. ఊర్వశి రౌతేలా ఈ సినిమాలో ఉన్నారా?.. మరి పోస్టర్లో కనిపించడం లేదంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు. దబిడి దిబిడి సాంగ్ డ్యాన్స్ చేస్తూ పోస్టర్ బయటికి వెళ్లిపోయిందంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు. మొత్తానికి డాకు మహారాజ్ పోస్టర్లో బాలీవుడ్ భామ ఫోటో లేకపోవడం ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. Anagananaga oka raju.. cheddavalu andharu Daaku anevaalu… kaani maaku mathram Maharaaju! Watch Daaku Maharaaj, out on 21 Feb on Netflix! #DaakuMaharaajOnNetflix pic.twitter.com/xkljLJmQeJ— Netflix India South (@Netflix_INSouth) February 16, 2025 -
Chhaava OTT Release : ఓటీటీలోకి ‘ఛావా’.. ఎప్పుడు, ఎక్కడ?
ఛావా(Chhaava )..ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. విక్కీ కౌశల్, రష్మిక(Rashmika Mandanna) జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న థియేటర్స్‌లో రిలీజై హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్, ఆయన భార్య ఏసుబాయిగా రష్మిక నటించి మెప్పించారు. దాదాపు రూ.130 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ రోజే మంచి కలెక్షన్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.31 కోట్లు ఓపెనింగ్స్‌ని రాబట్టింది. ఈ ఏడాదిలో బాలీవుడ్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్(రూ.31 కోట్లు) సొంతం చేసుకున్న చిత్రంగా ఛావా నిలిచింది. అంతేకాదు విక్కీ కౌశల్ కెరీర్లోనే తొలి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఛావా రికార్డుకెక్కింది. ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సంపాదించుకోవడంతో ఓటీటీ రిలీజ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.భారీ ధరకు ఓటీటీ రైట్స్ఛావా చిత్రంపై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనాలు మరింత పెరిగాయి. సినిమాకు ఉన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకొని డిజిటల్ రైట్స్‌ని భారీ ధరకే కొనుగోలు చేసిందట ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్. యావరేజ్ టాక్ వస్తే నెల రోజుల్లో ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నారట. కానీ ఊహించని విధంగా భారీ హిట్ టాక్ రావడంతో ఓటీటీ రిలీజ్‌ని పోస్ట్‌పోన్ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు ఎనిమిది వారాల తర్వాత ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా పేర్కొంది. అంటే ఏప్రిల్ మూడో వారంలో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.ఛావా కథేంటంటే..ఛత్రపతి శివాజీ మరణం మరాఠా సామ్రాజ్యంపై మొగల్ చక్రవర్తి ఔరంగజేబు (అక్షయ్ ఖన్నా) కన్నేస్తాడు. వారిని ఎదుర్కొని తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు రంగంలోకి దిగుతాడు శంభాజీ మహారాజ్(విక్కీ కౌశల్). ఈ విషయం ఔరంగజేబుకు తెలిసి తానే స్వయంగా సైన్యంతో యుద్ధానికి బయల్దేరుతాడు. శక్తిమంతమైన మొగల్ సేనను శంభాజీ ఎలా ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? ఈ యుద్దంలో సంభాజీకి ఆయన సతీమణి మహారాణి ఏసుభాయి(రష్మిక) ఎలాంటి నైతిక మద్దతు ఇచ్చారు? చివరకు మొఘల్ అహంకారాన్ని తన పోరాటంతో ఎలా అణచివేశాడు? అనేది ఈ సినిమా కథ. -
మరో ఓటీటీకి వందకోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మాలీవుడ్ స్టార్ ఉన్ని ముకుందన్ (Unni Mukundan) హీరోగా నటించిన చిత్రం మార్కో(Marco Movie). మలయాళంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. కేవలం మలయాళంలోనే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అంతేకాకుండా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.తాజాగా ఈ మూవీ మరో ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ ఆహా వెల్లడించింది. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్టర్‌ను షేర్ చేసింది. అయితే ఆహాలో కేవలం తెలుగులో మాత్రమే అందుబాటులో ఉండనుంది. అయితే ఓవర్సీస్ అభిమానులకు మాత్రం ఈనెల 18 నుంచే స్ట్రీమింగ్ కానుంది. కాగా.. మార్కో చిత్రానికి హనీఫ్ అదేని దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు షరీఫ్ మహ్మద్ నిర్మాతగా వ్యవహరించారు. రవి బస్రూరు సంగీతం సమకూర్చారు. యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషించారు.మార్కో కథేంంటంటే?జార్జ్ (సిద్దిఖ్ఖీ) గోల్డ్ బిజినెస్ చేస్తుంటాడు. ఈ వ్యాపారంలో తనకు మించినవాళ్లు ఉండరు. సిండికేట్ ఏర్పాటు చేసి.. దాని లీడర్‌గా వ్యవహరిస్తుంటారు. అతని తమ్ముడు విక్టర్(ఇషాన్ షౌకాత్) అంధుడు. కానీ చాలా టాలెంటెడ్. విక్టర్ స్నేహితుడు వసీమ్‌ను ఓ ముఠా చంపేస్తుంది. దానికి సాక్షి ఉన్నాడని విక్టర్‌ను కూడా ఆ ముఠా దారుణంగా హత్య చేస్తుంది. విదేశాలకు వెళ్లిన జార్జ్ మరో తమ్ముడు(జార్జ్ వాళ్ల నాన్న పెంచిన వ్యక్తి) మార్కో(ఉన్ని ముకుందన్)కు ఈ హత్య విషయం తెలిసి వెంటనే వచ్చేస్తాడు. తను ప్రాణంగా ఇష్టపడే సోదరుడు విక్టర్ హత్యకు కారణమైనవారిని వదిలిపెట్టనని చర్చిలోనే ప్రమాణం చేస్తాడు. అసలు విక్టర్ని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? చివరకు మార్క్ వారిని ఎలా మట్టుపెట్టాడు?అనేదే మిగతా కథ.Get ready to experience the most violent and biggest film on Aha! #Marco storms in with action like never before. Streaming from Feb 21 only in Telugu, on Aha!Overseas streaming from Feb 18 ! pic.twitter.com/uHFHr7zH6f— ahavideoin (@ahavideoIN) February 16, 2025 -
నిరీక్షణకు తెరపడింది.. డాకు మహారాజ్ ఓటీటీ డేట్ ఫిక్స్
నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం డాకు మహారాజ్. ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12 థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో ప్రజ్ఞా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్‌లో మెరిశారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో మెప్పించారు. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ రావడంతో ఓటీటీ కోసం సినీ ప్రియులు, నందమూరి బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.గతంలోనే ఓటీటీకి వస్తుందని భావించినా అది జరగలేదు. తాజాగా ఓటీటీ విడుదల తేదీని ఫిక్స్ చేశారు. ఈ సినిమా రైట్స్ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ తేదీని రివీల్ చేసింది. ఈనెల 21 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది. దీంతో ఓటీటీకి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసిన అభిమానుల నిరీక్షణకు తెరపడింది. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.డాకు మాహారాజ్ కథేంటంటే..చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన విద్యావేత్త కృష్ణమూర్తి (సచిన్ ఖేడ్కర్)కి ఓ కాఫీ ఎస్టేట్ ఉంటుంది. దాన్ని స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు(రవి కిషన్) లీజుకు తీసుకొని కాఫీసాగు పేరుతో డ్రగ్స్, వన్య మృగాల అక్రమ రవాణ సాగిస్తుంటాడు. త్రిమూర్తులు, అతని తమ్ముడు కలిసి చేస్తున్న అరాచకాలు కృష్ణమూర్తికి తెలిసి పోలీసులను ఆశ్రయిస్తాడు. దీంతో త్రిమూర్తులు కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవితో పాటు ఫ్యామిలీ మొత్తాన్ని చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. చిన్నారి వైష్ణవికి ప్రాణ హానీ ఉందనే విషయం చంబల్ జైలులో ఉన్న మహారాజ్(బాలకృష్ణ)కు తెలుస్తుంది. తన అనుచరుల సహాయంతో అక్కడి నుంచి తప్పించుకొని కృష్ణమూర్తి ఇంటికి చేరుతాడు. నానాజీగా పేరు మార్చుకొని కృష్ణమూర్తి ఇంట్లో డ్రైవర్‌గా చేరతాడు. చిన్నారి వైష్ణవిని చంపేందుకు ప్రయత్నించిన వారందరిని మట్టుబెడుతూ కృష్ణమూర్తి ఫ్యామిలీకి రక్షణగా నిలుస్తాడు. అసలు ఈ మహారాజ్ ఎవరు..? అతని నేపథ్యం ఏంటి..? చిన్నారి వైష్ణవికి, మహారాజ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? సివిల్ ఇంజనీర్ సీతారాం(బాలకృష్ణ), చంబల్ డాన్ బల్వంత్ ఠాకూర్(బాబీ డియోల్) మధ్య ఉన్న వైర్యం ఏంటి..? నందిని(శ్రద్ధా శ్రీనాథ్), కావేరి(ప్రగ్యా జైస్వాల్) ఎవరు..? ఇవన్నీ తెలియాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే. Anagananaga oka raju.. cheddavalu andharu Daaku anevaalu… kaani maaku mathram Maharaaju! Watch Daaku Maharaaj, out on 21 Feb on Netflix! #DaakuMaharaajOnNetflix pic.twitter.com/xkljLJmQeJ— Netflix India South (@Netflix_INSouth) February 16, 2025 -
రూ.8 కోట్లు పెడితే రూ.75 కోట్లు.. ఓటీటీలో మిస్టరీ థ్రిల్లర్
ఓటీటీ (OTT)లో ఎప్పటికప్పుడు బోలెడన్ని సినిమాలు, సిరీస్‌లు రిలీజవుతూనే ఉన్నాయి. తాజాగా మలయాళ హిట్ మూవీ డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైంది. అసిఫ్ అలీ (Asif Ali), అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన రేఖాచిత్రం మూవీ (Rekhachithram Movie) ఓటీటీలో రిలీజవుతోంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీలివ్ (SonyLiv) సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'అందరూ మర్చిపోయిన నేరం.. పాతిపెట్టిన నిజాన్ని వెలికితీసే సమయం ఆసన్నమైంది. మార్చి 7న రేఖాచిత్రం సోనీలివ్‌లో చూసేయండి' అని ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. జనవరి 9న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. కేవలం రూ.8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన రేఖాచిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.75 కోట్లు వసూలు చేసింది.కథేంటంటే?మలక్కప్పర ప్రాంతంలో జరిగే ఘటనలు.. పోలీస్ ఇన్స్పెక్టర్ వివేక్‌ను కలవరపరిచే ఆత్మహత్య కేసు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే వివేక్ ఆ కేసుని ఎంతకీ ఛేదించలేకపోతాడు. ఎటు వెళ్లినా కేసు ఓ కొలిక్కి రాదు. చివరకు ఈ కేసు.. మరో కేసుకి లీడ్ ఇస్తుంది. సినిమా షూటింగ్, అందులో మిస్ అయిన ఓ వ్యక్తి.. పాతిపెట్టిన శవం దొరకడం వంటి ఘటనలతో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తుంటాయి. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేఖాచిత్రం ఓటీటీలో చూడాల్సిందే!రేఖాచిత్రం విషయానికి వస్తే.. అసిఫ్, అనస్వరతో పాటు మనోజ్ కె.జయన్, సిద్దిఖి, జగదీశ్, సాయికుమార్, హరిశ్రీ అశోకన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జాఫిన్ టి.చాకో దర్శకత్వం వహించాడు. ముజీబ్ మజీద్ సంగీతం అందించాడు.చదవండి: నోరు జారిన రష్మిక.. ఫైర్ అవుతున్న కన్నడ ప్రజలు! -
ప్రపంచ క్రికెట్ క్రీడాభిమానులకు కనువిందైన కానుక
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్తాన్(The Greatest Rivalry: India vs Pakistan) సిరీస్ ఒకటి. ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం.భారతదేశంలో సినిమా తరువాత ఏది ఇష్టం అంటే సగటు భారతీయుడు ఠక్కున చెప్పేది క్రికెట్ అనే. నాటి రేడియో రోజుల నుండి నేటి డిజిటల్ ప్రొజెక్షన్ రోజుల వరకు ఎదుగుతున్న సాంకేతికత కన్నా మెరుపు వేగంలో ఎదుగుతోంది ఈ క్రికెట్ అభిమానం. మరీ ముఖ్యంగా ఇండియా– పాకిస్తాన్ మ్యాచ్ అంటే దేశం మొత్తానికి ఆ రోజు అప్రకటిత సెలవు లాంటిది. దాయాదుల పోరు అని చాలామంది ముద్దుగా పిలుచుకునే ఈ మ్యాచ్ ఎప్పుడు ఎక్కడ జరిగినా ప్రపంచం నలుమూలల నుండి ఆకాశమంత ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్ ఇరు దేశాల క్రికెట్ ఆటపై ‘ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్తాన్’ అనే సిరీస్ రూపొందించింది. నాలుగు భాగాలతో ఉన్న ఈ సిరీస్‌లో భారతదేశం సాధించిన నాటి ప్రపంచ కప్ నుండి నేటి ప్రపంచ కప్ వరకు ప్రతిదీ విశ్లేషించిన ప్రయత్నం అత్యంత ప్రశంసనీయం. సిరీస్‌లో పత్రికా విలేకరుల నుండి పరోక్ష, ప్రత్యక్ష ఆటగాళ్లతో వివరించిన విధానం ఓ అద్భుతమనే చెప్పాలి. ఈ సిరీస్ ద్వారా ప్రపంచ క్రికెట్ క్రీడాభిమానులకు ఎన్నో వివరణలు, విశ్లేషణలు, రహస్యాలు దృశ్య రూపంలో అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం ఇండియా– పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే ఎంత ఉత్కంఠగా ఉంటుందో అంతకు వేయి రెట్లు ఉత్కంఠ, ఉత్సాహం ఈ సిరీస్ చూస్తున్నంతసేపు ప్రేక్షకులకు కలుగుతుందనడంలో సందేహమే లేదు.క్రికెట్ మ్యాచ్ టీవీలలో ప్రసారమనేది మామూలే కానీ, అదే క్రికెట్ వెనుక జరిగిన తతంగం చూపడమనేది వంద క్రికెట్ మ్యాచులు ఒకేసారి చూడడం లాంటిది. ఓటీటీ వేదికైన నెట్‌ఫ్లిక్స్ ఈ విషయంలో మాత్రం ప్రేక్షకుల నాడి సరిగ్గా పట్టుకుంది. ఈ సిరీస్ మొత్తం తెలుగులోనూ లభ్యం. కాబట్టి కాసేపు ఈ క్రికెట్ రైవల్రీ ఏంటో చూసేయండి. – ఇంటూరు హరికృష్ణ -
ప్రాణం లేని మనిషి ఈ సినిమా హీరో
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం జాలీ ఓ జిమ్ఖానా(Jolly O Gymkhana) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.కదలని బొమ్మ చిత్రమైతే, కదిలే బొమ్మ ఓ విచిత్రం. అటువంటి విచిత్రానికి వినోదం తోడైతే అదే మనం చూసే సినిమా. సినిమాలలో దర్శకుడు తన కాల్పనిక ధోరణితో ఓ కథను అనుకొని ఆ కథకు అనుగుణంగా పాత్రలను సృష్టించి ఆ పాత్రలచే ప్రేక్షకులకు విచిత్ర వినోదాన్ని అందిస్తాడు. ప్రస్తుతం వచ్చే సినిమాలలో ఔరా అని అబ్బురపరిచే సినిమాలనుండి అయ్యో అనే సినిమాల వరకూ పుష్కలంగా ఉన్నాయి. సన్ నెక్ట్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘జాలీ ఓ జిమ్ఖానా’(Jolly O Gymkhana) సినిమా ఔరా అనిపించే ఓ అద్భుతమని చెప్పాలి. ఈ సినిమాకి శక్తి చిదంబరం దర్శకత్వం వహించారు.ప్రముఖ కథానాయకుడు, కొరియోగ్రాఫర్ అలాగే దర్శకుడు అయిన ప్రభుదేవా(Prabhu Deva) ఈ సినిమాలోని ఓ ప్రధాన పాత్రలో నటించారు. ఇక అంతలా ఏముంది ఈ సినిమాలో... ఓసారి కథ గురించి చెప్పుకుందాం. భవానీ అనే అమ్మాయి తను చేసిన ఓ తప్పుకు ప్రాయశ్చిత్తంగా తన కథ చెప్పుకోడానికి ఓ చర్చిలోని ఫాదర్ దగ్గరకు రావడంతో ఈ సినిమా ప్రారంభమవుతుంది. తంగసామి తన కూతురు చెల్లమ్మ, మనవరాళ్ళైన భవానీ, శివానీ, యాజినీతో ఓ హోటల్ నడుపుతుంటాడు. తెన్ కాశీకి చెందిన రాజకీయవేత్త అడైక్కళరాజ్తో హోటల్లో జరిగిన ఓ ఘర్షణ వల్ల తంగసామి తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలవుతాడు.తంగసామి ఆపరేషన్ కోసం దాదాపు రూ. 25 లక్షల వరకు ఖర్చవుతుందని భవానీ అక్కచెల్లెళ్లకు చెబుతాడు డాక్టర్. అనూహ్యంగా ఆ డబ్బు భవానీ అకౌంట్లో డిపాజిట్ అయి, ఆపరేషన్ ఏ అవరోధం లేకుండా జరిగిపోతుంది. కానీ ఆ డబ్బు కోసం ఓ గ్యాంగ్ వీళ్ల వెంటపడి వేధిస్తూ ఉంటుంది. మరో పక్క ఇదే అడైక్కళరాజ్ ఓ కేస్ విషయమై న్యాయవాది పూన్గుండ్రన్తో పెద్ద విరోధం పెట్టుకొని ఉంటాడు. ఇంకో పక్క ఈ విషయం తెలిసిన తంగసామి హోటల్ విషయమై పూన్గుండ్రన్ని కలవమని భవానీ వాళ్లకి చెప్తాడు. భవానీ వాళ్ళు న్యాయవాదిని కలిసే సమయంలో అతను చనిపోయి ఓ హోటల్ గదిలో పడి ఉంటాడు. ప్రపంచానికి మాత్రం పూన్‌గుండ్రన్ బ్రతికే ఉన్న విషయం తెలుస్తుంది. మరి ఆడవాళ్ళైన భవానీ అక్కచెల్లెళ్ళు న్యాయవాది శవంతో తమ సమస్యను ఎలా పరిష్కరించుకున్నారన్నదే ఈ ‘జాలీ ఓ జిమ్ఖానా’ సినిమా. ఈ సినిమా ప్రారంభం నుండే సరదా సరదాగా సాగిపోతుంది. అనూహ్యమైన మలుపులకు చక్కటి వినోదం మేళవించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు దర్శకుడు. నాటి ఆడవాళ్లకు మాత్రమే సినిమాలోని అప్పటి నటుడు నగేశ్ నటించిన ఓ సన్నివేశం ఈ సినిమా కథకి ఓ స్ఫూర్తి అని చెప్పవచ్చు. సూపర్ ఎంటర్టైనర్ ఫర్ ది కంప్లీట్ ఫ్యామిలీ. వర్త్ టు వాచ్. – ఇంటూరు హరికృష్ణ -
ప్రేమికులూ.. ఓటీటీలో ఈ సినిమాలు అస్సలు మిస్ అవొద్దు!
ప్రేమికుల రోజు (February 14 - Valentine's Day) చాలామందికి స్పెషల్. ఆల్రెడీ ప్రేమలో ఉన్నవారు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూనో, కలిసి కాలక్షేపం చేస్తూనో సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రేమను వ్యక్తం చేయనివారు ఎలాగైనా ధైర్యం చేసి అవతలి వ్యక్తికి ప్రపోజ్ చేసేందుకు సిద్ధమవుతుంటారు. అసలు ప్రేమలోనే లేనివాళ్లు మేమెప్పుడూ ఆ జాబితాలో చేరుతామో ఏంటోనని నిట్టూర్పు విడుస్తారు. అయితే వీరందరినీ ఏకం చేసే శక్తి సినిమాకుంది. ప్రేమలో ఉన్నా, లేకపోయినా మీ మనసుల్ని మెలిపెట్టి, ఏడిపించి, నవ్వించి, గిలిగింతలు పెట్టే వెండితెర కథలు ఎన్నో.. అందులో కేవలం పదింటిని కింద ఇస్తున్నాం. ఇవి ఏయే ఓటీటీలో ఉన్నాయన్న వివరాలు కూడా పొందుపర్చాం. నచ్చితే మీరూ చూసేయండి..🎦 ఏ మాయ చేసావెజీ5, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లో అందుబాటులో ఉంది.🎦 ఆనంద్హాట్స్టార్లో అందుబాటులో ఉంది.🎦 రాజా రాణిహాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది.🎦 మళ్లీ మళ్లీ ఇది రాని రోజుహాట్స్టార్లో అందుబాటులో ఉంది.🎦 సీతారామంఅమెజాన్ ప్రైమ్‌లో ఉంది.🎦 మజిలీసన్ నెక్స్ట్, అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.🎦 ఆర్యసన్ నెక్స్ట్లో ఉంది.🎦 3నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.🎦 నువ్వొస్తానంటే నేనొద్దంటానాజియో టీవీ, సన్ నెక్స్ట్లో ఉంది.🎦 శ్యామ్సింగరాయ్నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది.చదవండి: రెండుసార్లు ప్రేమ.. నరకం చూపించారు.. నా ఎగ్స్ దాచిపెట్టా: ఐశ్వర్య రాజేశ్భార్య వేధింపులు తాళలేక సింగర్ ఆత్మహత్య -
OTT: పది రోజులుగా ఓటీటీలో ట్రెండ్ అవుతున్న వెబ్ సిరీస్
ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన కోబలి వెబ్ సిరీస్‌కు ఓటీటీలో మంచి ఆదరణ లభించింది. రవి ప్రకాష్, రాకీ సింగ్ ప్రధాన పాత్రలు పోషించగా.. తరుణ్ రోహిత్, శ్రీతేజ్, శ్యామల, యోగి ఖత్రి, శ్రీ పవన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రేవంత్ లేవాక దర్శకత్వం వహించారు. 'నింబస్ ఫిలిమ్స్', 'యు1 ప్రొడక్షన్స్', 'టి.ఎస్.ఆర్ మూవీ మేకర్స్' సంస్థలపై జ్యోతి మెగావత్ రాథోడ్, రాజశేఖర్ రెడ్డి కామిరెడ్డి, తిరుపతి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించారు. ఫిబ్రవరి 4న హాట్‌స్టార్‌లో రిలీజైన ఈ సిరీస్ ఏడు భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. ఇప్పటికీ నెంబర్ వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా గురువారం నాడు కోబలి సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నటుడు రవి ప్రకాష్ మాట్లాడుతూ.. "నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళయింది. కొత్తగా ఏదో ఒకటి చేయాలనే తపనతో 'కోబలి' మొదలుపెట్టాను. ఒక కాఫీ షాప్‌లో ఈ కథ విన్నాను. నచ్చింది. కానీ ఇది ముందుకు వెళ్తుందనే నమ్మకం కలగలేదు.ఎందుకంటే అంతా కొత్తవాళ్లే. ఈ కంటెంట్‌లో అమ్ముడు పోయే ముఖం ఒక్కటి కూడా లేదు. అయినప్పటికీ ఈ సిరీస్‌ను ప్రేక్షకులు ఆదరించారు. నిజాయితీగా పనిచేస్తే ఫలితం తప్పకుండా వస్తుందని నిరూపించారు" అంటూ చెప్పుకొచ్చారు. రాకీ సింగ్ మాట్లాడుతూ.. "చిన్న పాత్ర అయినా చేయడానికి ముందుకు వచ్చిన వెంకట్ గారికి థాంక్స్. కానీ సీజన్ 2 లో ఆయన పాత్ర ఎక్కువగా ఉంటుంది. అసలైన కథ అక్కడ మొదలవుతుంది. ఇది జస్ట్ ట్రైలరే" అన్నారు. సీనియర్ హీరో వెంకట్ మాట్లాడుతూ.. "నిజంగానే ఇందులో అంతా కొత్తవాళ్లే. కానీ హాట్ స్టార్ సంస్థ మమ్మల్ని నమ్మింది. ప్రేక్షకులు బాగా ఆదరించారు. 7 భాషల్లోనూ కోబలి మంచి విజయాన్ని అందుకుంది. రేవంత్, నాతో కూడా ఒక సినిమా చెయ్యి. అంతకు మించి నీ హార్డ్ వర్క్ గురించి పొగడలేను. స్టార్లు ఉంటేనే కంటెంట్ ని ప్రేక్షకులు ఆదరిస్తారు అనేది పాత మాట. ఇప్పుడు కాలం మారింది.కంటెంట్ బాగుంటే కొత్త, పాత తేడా లేదని ప్రేక్షకులు నిరూపిస్తూనే ఉన్నారు" అని చెప్పుకొచ్చారు. చదవండి: సుకుమార్ ఇంట వ్రతం.. ఫోటోలు షేర్ చేసిన తబిత -
సోషల్ మీడియాలో రిక్వెస్ట్‌లు వచ్చేవి
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలినీ వడ్నికట్టి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కృష్ణ అండ్ హిజ్ లీల’. రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం 2020లో డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజైంది. కాగా ఈ సినిమాను ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ టైటిల్‌తో ఈ 14న థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం విలేకరుల సమావేశంలో రానా మాట్లాడుతూ– ‘‘సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఎప్పుడూ రిక్వెస్ట్‌లు వచ్చేవి. ఒక రోజు సిద్ధు ఈ సినిమా గురించి చెప్పారు. ఈ సినిమా రిలీజ్‌కి వేలంటైన్స్ డే పర్ఫెక్ట్ టైమ్. నేను ఆడియన్స్‌కు డిఫరెంట్ కథలు చూపించేందుకు ఇష్టపడతాను. కథ ఎంత కొత్తగా ఉంది? ఆడియన్స్‌కు మనం ఏం చెబుతున్నాం? అనేది కూడా చూస్తాను’’ అని తెలిపారు. ‘‘థియేటర్స్‌లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ ఇది. ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేసి ఉంటే సిక్స్ టైమ్స్ ఎక్కువ వచ్చేది’’ అన్నారు సిద్ధు జొన్నలగడ్డ. ‘‘లాక్డౌన్ సమయంలో ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేయడం కుదర్లేదు. ఈ సినిమాతో అందరూ రిలేట్ అవుతారు’’ అని పేర్కొన్నారు రవికాంత్. -
ఓటీటీలో 'డాకు మహారాజ్' ఆలస్యం.. ఆ రూల్ పాటిస్తున్న బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన చిత్రం 'డాకు మహారాజ్'.. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే చాలాచోట్ల థియటర్ రన్ ముగిసింది. కానీ, ఓటీటీలో ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి రేసులో వచ్చిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఇప్పటికే ఓటీటీలో రన్ అవుతుంది. వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా మరో రెండు రోజుల్లో స్ట్రీమింగ్కు రావచ్చని చిత్ర యూనిట్ సమాచారం ఇచ్చింది. కానీ, డాకు మహారాజ్( Daaku Maharaaj) ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు మరింత సమయం పట్టేలా ఉంది.డాకు మహారాజ్ ఓటీటీ ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి రెండో వారంలో స్ట్రీమింగ్కు వస్తుందని నెట్టింట భారీగా వార్తలు వచ్చాయి. అయితే, అందులో నిజం లేదని తేలిపోయింది. డాకు మహారాజ్ ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. కానీ, స్ట్రీమింగ్ వివరాలను ఎక్కడా కూడా ప్రకటించలేదు. అందుకు ప్రధాన కారణం సినిమా నిర్మాతలతో చేసుకున్న ఒప్పందమే అని తెలుస్తోంది.డాకు మహారాజ్ సినిమా విడుదలైన రోజు నుంచి 50 రోజుల థియేటర్ రన్ పూర్తయిన తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలనే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిబంధనను చిత్ర యూనిట్ పాటిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు, హిందీ వర్షన్లో విడుదలైంది. అయితే, ఓటీటీ కోసం తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్‌లో ఉన్నారు. ఆ భాషలకు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయట. అవి పూర్తి అయ్యేందుకు మరింత సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఓటీటీ కోసం మరికొన్ని సీన్లు కూడా అధనంగా జోడించనున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా మార్చి 4న 'డాకు మహారాజ్' ఓటీటీ ఎంట్రీ ఉండొచ్చని తెలుస్తోంది.బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలకపాత్ర పోషించారు. వీరితో పాటు శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, రిషి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందించగా భారీ బడ్జెట్‌తో నాగవంశీ నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. -
మరో ఓటీటీకి శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శాండల్‌వుడ్ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ (Shiva Rajkumar) నటించిన యాక్షన్ థ్రిల్లర్ భైరాతి రణగల్ (Bhairathi Ranagal). గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. 2024లో శివరాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం ఇదే కావడం విశేషం. అయితే ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ ప్రియులకు అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. నర్తన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాహుల్‌బోస్, రుక్మిణి వసంత్, దేవరాజ్ కీలక పాత్రలు పోషించారు. అయితే తాజాగా భైరాతి రణగల్ మరో ఓటీటీకి రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ నెల 13 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు పోస్టర్‌ను విడుదల చేసింది.చికిత్స కోసం అమెరికాకు..ఈ మూవీ తర్వాతే శివరాజ్ కుమార్ అమెరికాకు వెళ్లి క్యాన్సర్ చికిత్స తీసుకున్నారు. క్యాన్సర్ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత యూఎస్ నుంచే అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. మీ అందరి ప్రేమతో త్వరగా కోలుకుని మీ ముందుకు వస్తానని శివరాజ్ కుమార్ అన్నారు. ఇటీవలే అమెరికా నుంచి బెంగళూరు చేరుకున్న ఆయనను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కలిసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
ఐశ్వర్య రాజేశ్ హిట్ సిరీస్ సీక్వెల్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?
ఈ మధ్య సీక్వెల్స్ అనేవి సర్వసాధారణమైపోయాయి. సినిమాలు, వెబ్ సిరీస్‌లు హిట్టయ్యాయంటే చాలు దానికి కొనసాగింపుగా రెండో భాగం, మూడో భాగం తీస్తూనే ఉన్నారు. తాజాగా తమిళ క్రైమ్ థ్రిల్లర్ 'సుడల్: ది వోర్టెక్స్' (Suzhal The Vortex) వెబ్ సిరీస్‌కు సీక్వెల్ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh), కదీర్ (Kathir) ప్రధాన పాత్రలో నటించిన ఈ థ్రిల్లర్ సిరీస్ ఫిబ్రవరి 28 నుంచి అమెజాన్ ప్రైమ్‌లోకి రానుంది. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియో అధికారికంగా వెల్లడించింది. ఇది చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.తమిళంలో వచ్చిన బెస్ట్ సిరీస్‌లో సుడల్ ఒకటి అని.. ఇన్నాళ్లకు రెండో పార్ట్ రిలీజ్ చేస్తుండటం సంతోషంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. సుడల్ మొదటి భాగం 2022లో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. పార్తీబన్, కదీర్, ఐశ్వర్య రాజేశ్, శ్రేయారెడ్డి ముఖ్యపాత్రలు పోషించారు. పుష్కర్-గాయత్రి జంట కథ అందించగా బ్రహ్మ అనుచరణ్ దర్శకత్వం వహించారు. రెండో భాగానికి కూడా వీళ్లే పని చేస్తున్నారు.సుడల్ కథేంటి?తమిళనాడులోని సాంబలూరు అనే చిన్న గ్రామంలో ప్రజలు సిమెంట్ ఫ్యాక్టరీపై ఆధారపడి జీవనం సాగిస్తారు. ఆ ఫ్యాక్టరీ ప్రారంభించిన సమయంలో ఓ అమ్మాయి కనిపించకుండా పోతుంది. దాదాపు పాతికేళ్ల తర్వాత ఫ్యాక్టరీ తగలబడుతుంది. అప్పుడు ఫ్యాక్టరీ యూనియన్ లీడర్ షణ్ముఖం (పార్తిబన్) కూతురు నీల కనిపించకుండా పోతుంది. మరి ఆ అమ్మాయిలు ఏమయ్యారు? నీల సోదరి నందిని (ఐశ్వర్య రాజేశ్) సొంతూరిని వదిలేసి కోయంబత్తూరులో ఎందుకుంటోంది? ఈ మిస్సింగ్‌ల వెనక నీల హస్తం ఉందా? అనే ఆసక్తికర అంశాలతో సిరీస్ ఉత్కంఠగా సాగుతుంది. ఈ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో ఉంటుంది. Some storms never settle.🌪️#SuzhalS2OnPrime, New Season, Feb 28 pic.twitter.com/sHDaA8sjW8— prime video IN (@PrimeVideoIN) February 11, 2025 చదవండి: తల్లి అయ్యాక పూర్తిగా మారిపోయాను.. నచ్చితేనే చేస్తా : హీరోయిన్ -
విలేజ్‌లో మిస్టరీ సినిమా.. ఓటీటీలో స్ట్రీమింగ్
రవితేజ నున్నా, నేహ జురెల్ హీరో హీరోయిన్గా నటించిన చిత్రం ‘రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి’. గతేడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం సుమారు పది నెలల తర్వాత సడెన్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మణికొండ రంజిత్ సమర్పణలో సత్యరాజు దర్శకత్వంలో ముత్యాల రామదాసు, నున్నా కుమారి నిర్మించిన ఈ చిత్రం ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌గా తెరకెక్కించారు.మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే కథతో వచ్చిన ‘రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి’ సడెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. హీరోయిన్ హత్యతో సినిమా కథ మొదలౌతుంది. ఆపై ఒక్కసారిగా ఊహించని మలుపు తిరుగుతుంది. ఆమెను కథానాయకుడే చంపాడని, పోలీసులు అతని కోసం వెతుకుతుంటారు. అసలు రాజు గారి అమ్మాయి ఎలా చనిపోయింది? నాయుడు గారి అబ్బాయే ఆమెను హత్య చేశాడా? హత్యకు కారణమేంటి? అనే ఇంపాక్ట్‌తో కథ ఉంటుంది. లవ్ స్టోరీకి మర్డర్ మిస్టరీ అంశాలను జోడించారు. కానీ, ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.చిన్న సినిమాగా విడుదలైన రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి టైటిల్‌ను షార్ట్ కట్లో రానా పేరుతో ప్రమోట్ చేశారు. ఐఎమ్‌డీబీలో 8.5 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో చాలామంది కొత్తవారే నటించారు. కానీ, నటన పరంగా వారికి మంచి మార్కులే పడ్డాయి. -
ఓటీటీకి 'సంక్రాంతికి వస్తున్నాం'.. ఇలాంటి ట్విస్ట్ ఊహించలేదు భయ్యా!
అయితే సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం కోసం ఓటీటీ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓటీటీకి ఎప్పుడొస్తుందా అని నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలై దాదాపుగా నెల రోజులు కావొస్తోంది. దీంతో సినీ ప్రియులంతా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్కు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ వచ్చేసింది. అయితే ఇక్కడ ఆడియన్స్‌కు బిగ్ ట్విస్టే ఇచ్చారు మేకర్స్. ఇంతకీ అదేంటో చూసేయండిట్విస్ట్ ఇచ్చిన మేకర్స్..అయితే ఓటీటీ రిలీజ్‌పై చిత్రబృందం నుంచి ఇప్పటి వరకైతే ఎలాంటి ప్రకటన రాలేదు. ఫిబ్రవరి రెండో వారంలోనైనా ఓటీటీకి వస్తుందేమోనని సినీ ప్రేక్షకులు భావించారు. కానీ స్ట్రీమింగ్కు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో కాస్తా నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఆడియన్స్‌కు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.ఓటీటీ రిలీజ్‌పై సస్పెన్స్..త్వరలోనే సంక్రాంతి వస్తున్నాం మీ ముందుకు వస్తుందని జీ తెలుగు ట్విటర్ ద్వారా వెల్లడించింది. మళ్లీ సంక్రాంతికి వైబ్స్‌ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఫస్ట్ టీవీలో వస్తున్నాం అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఓటీటీ కంటే ముందుగా టీవీలోనే వెంకీమామ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ప్రేక్షకులు చూసే అవకాశం దక్కింది. అయితే ఓటీటీ విడుదలపై మాత్రం ఎలాంటి తేదీని రివీల్ చేయలేదు. ఈ లెక్కను చూస్తే ఈ వారంలోనే టీవీల్లో సంక్రాంతికి వస్తున్నాం సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. Get ready to relive the Sankranthi vibe again 💥😁#SankranthikiVasthunnam Coming Soon On #ZeeTelugu #SankranthiKiVasthunnamOnZeeTelugu#WorldTelevisionPremiereSankranthikiVasthunnam#FirstTVloVasthunnam #TVbeforeOTT #SVonTV@VenkyMama @anilravipudi @aishu_dil @Meenakshiioffl… pic.twitter.com/pIP6UUoNIY— ZEE TELUGU (@ZeeTVTelugu) February 10, 2025 -
వాలంటైన్స్ వీక్.. ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు రిలీజ్
ఈ వారం ప్రేమికులకు ఎంతో స్పెషల్. చాక్లెట్ డే, కిస్ డే, ప్రపోజ్ డే, టెడ్డీ డే, హగ్ డే, వాలంటైన్స్‌డే అని రోజుకో రకంగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. మరి ఈ వారం (ఫిబ్రవరి 10- 16 వరకు) అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో రిలీజయ్యే సినిమాలేంటో చూసేద్దాం..థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు..లైలా - ఫిబ్రవరి 14బ్రహ్మా ఆనందం - ఫిబ్రవరి 14ఇట్స్ కాంప్లికేటెడ్ (గతంలో ఇది కృష్ణ అండ్ హిజ్ లీలా టైటిల్‌తో ఓటీటీలో రిలీజైంది) - ఫిబ్రవరి 14తల - ఫిబ్రవరి 14ఛావా - ఫిబ్రవరి 14ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, సిరీస్‌లు..అమెజాన్ ప్రైమ్ వీడియోమై ఫాల్ట్: లండన్ - ఫిబ్రవరి 13నెట్ఫ్లిక్స్బ్లాక్ హాక్ డౌన్ - ఫిబ్రవరి 10కాదలిక్క నేరమిల్లై - ఫిబ్రవరి 11ద విచర్: సైరెన్స్ ఆఫ్ ద డీప్ (యానిమేటెడ్ సిరీస్) - ఫిబ్రవరి 11డెత్ బిఫోర్ ద వెడ్డింగ్ - ఫిబ్రవరి 12ద ఎక్స్చేంజ్ సీజన్ 2 - ఫిబ్రవరి 13కోబ్రా కై సీజన్ 6, పార్ట్ 3 - ఫిబ్రవరి 13ధూమ్ ధామ్ - ఫిబ్రవరి 14మెలో మూవీ - ఫిబ్రవరి 14ఐయామ్ మ్యారీడ్.. బట్! - ఫిబ్రవరి 14హాట్స్టార్బాబీ ఔర్ రిషికి లవ్‌స్టోరీ - ఫిబ్రవరి 11ఆహాడ్యాన్స్ ఐకాన్ 2 (డ్యాన్స్ షో) - ఫిబ్రవరి 14జీ5ప్యార్ టెస్టింగ్ - ఫిబ్రవరి 14సోనీలివ్మార్కో - ఫిబ్రవరి 14హోయ్చోయ్బిషోహోరి - ఫిబ్రవరి 13లయన్స్‌గేట్ ప్లేసబ్సర్వియన్స్ - ఫిబ్రవరి 14చదవండి: హీరోలతో వన్స్‌మోర్.. హీరోయిన్లతో మాత్రం... అదన్నమాట సంగతి! -
ఓటీటీలో గ్లామర్ బ్యూటీ సినిమా.. సర్ప్రైజ్ స్ట్రీమింగ్
అప్సర రాణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ "తలకోన" ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది మార్చి 29న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. నటి అప్సర రాణికి సోషల్‌మీడియాలో భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఆమె నటించిన మూవీ సడెన్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇవడంతో నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటివరకు అప్సర రాణీ చేయని వెరైటీ సబ్జెక్ట్ కావడంతో సినిమాపై భారీగా బజ్ క్రియేట్ అయింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ కథ మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో ఉంటుంది.తలకోన సినిమా ఎలాంటి ప్రకటన లేకుండానే సడెన్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఈ సినిమా చూడాలంటే రూ. 99 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మూవీ కోసం ఆమె మరింత గ్లామర్‌గా కనిపించడమే కాకుండా భారీ యాక్షన్ సీన్స్‌లలో కూడా దుమ్మురేపింది. ఈ సినిమాకు ఐఎమ్‌డీబీలో 8.7 రేటింగ్ ఉండటం విశేషం. హీరోయిన్, ఆమె స్నేహితులు కలిసి తలకోన ఫారెస్ట్‌కి వెళ్లినప్పుడు ఏం జరిగింది..? అనేది కథాంశం. ప్రకృతికి విరుద్ధంగా వెళితే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు.ఈ చిత్రానికి నగేష్ నారదాసి దర్శకత్వం వహించారు. అక్షర క్రియేషన్స్ పతాకంపైదేవర శ్రీధర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో అశోక్ కుమార్, అజయ్ ఘోష్, విజయ కరణ్, రంగ రాజన్, రాజా రాయ్ యోగి కత్రి ప్రముఖ పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సుభాష్ ఆనంద్ సంగీతం అందించారు. -
ఓటీటీలో 'మహేశ్ బాబు' మేనల్లుడి సినిమా స్ట్రీమింగ్
'దేవకీ నందన వాసుదేవ' మూవీ ఓటీటీలోకి రానుంది. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది. 'హీరో' అనే సినిమాతో మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఇతడు మరోసారి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీనే ఈ 'దేవకీ నందన వాసుదేవ'. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ స్టోరీ అందించారు. మైథలాజికల్ యాక్షన్ సినిమాకు ఒక వర్గం ప్రేక్షకుల నుంచి పర్వాలేదనిపించింది. మేనల్లుడి కోసం మహేష్ బాబు కూడా ఇందులో నటించబోతున్నాడని నెట్టింట ప్రచారం దక్కడంతో ఈ సినిమాకు భారీ బజ్ క్రియేట్ చేసింది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.ఫిబ్రవరి 8 నుంచి 'దేవకీ నందన వాసుదేవ' చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్కు రానుంది. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కానీ, హిందీ వర్షన్లో మాత్రమే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. అదే సమయంలో కలర్స్ సినీప్లెక్స్ ఛానెల్లోనూ ఈ చిత్రం ప్రసారం కానుంది. తెలుగు మూవీ అయినప్పటికీ ఓటీటీ, టీవీలో మొదట హిందీ వర్షన్ రావడం విశేషం. అయితే, తెలుగు వర్షన్ కూడా ఫిబ్రవరి 8 నుంచే అందుబాటులోకి రావచ్చని నెట్టింట ప్రచారం జరుగుతుంది.ప్రశాంత్ వర్మ పేరుతో ఈ సినిమాని పాన్ ఇండియాలో కూడా ప్రమోట్ చేశారు. 'ఆదిపురుష్'లో హనుమంతుడిగా చేసిన దేవదత్తా.. ఇందులో విలన్‌గా చేశాడు. 'దేవకి నందన వాసుదేవ' సినిమాలో కృష్ణుడు, కంసుడు రిఫరెన్స్‌లతో కథను రాసుకున్నారు. సాయి మాధవ్ చాలా అద్భుతమైన డైలాగ్స్ రాశారు. ఎమోషనల్ డెప్త్ పట్టుకుని కథకి తగ్గట్టుగా మాటలందించారు. భీమ్స్ ఈ సినిమాకి తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో మెప్పించాడు. -
లెక్క సరిచేశాడు
ఓటీటీ(ott)లో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం హిసాబ్ బరాబర్(hisaab barabar) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఈ ప్రపంచంలో ఆశ లేని మనిషి ఉండడు. కానీ అత్యాశ మాత్రం అనర్ధదాయకం. అందరూ బాగుండాలి... అందులో మనముండాలి అనుకుంటే పర్లేదు. కొంతమంది మాత్రం నేను బాగు పడాలంటే పదిమంది నాశనం కావాలి అని అత్యాశకు లోనవుతుంటారు. అటువంటి వారు తమకు ఎవరూ ఎదురు రారు అనుకుంటూ విర్రవీగుతుంటారు. అలా విర్రవీగేవారికి ఓ సామాన్యడు ఇచ్చే అనుకోని ఝలక్కే ఈ ‘హిసాబ్ బరాబర్’ చిత్రం. జీ5 ఓటీటీ వేదికగా తెలుగులోనూ లభ్యమవుతోంది. ‘హిసాబ్ బరాబర్’ కథ విషయానికొస్తే... ఇది ఓ సామాన్యుడి కథ. రాధేమోహన్ శర్మ ఓ టికెట్ కలెక్టర్. అతనికి ఒక్కడే కొడుకు. భార్య విడిపోతుంది. ఇక రాధేమోహన్ కు అద్భుతమైన టాలెంట్ ఒకటుంది. అదే అతని లెక్కల చాతుర్యత.ఎటువంటి లెక్కనైనా అవలీలగా చెప్పేస్తాడు. చిన్న పైసా కూడా నష్టపోడు. అటువంటి రాధేమోహన్ బ్యాంకు అకౌంటులో అనూహ్యంగా ఓ 27 రూపాయలు తేడా వచ్చి కనపడకుండా పోతుంది. దాంతో బ్యాంకు అధికారులకు ఈ విషయమై ఫిర్యాదు చేస్తాడు. బ్యాంకు అధికారులు ఈ ఫిర్యాదును తాత్సారం చేస్తున్న విషయం గమనించి అదే బ్యాంకుకు సంబంధించిన ఇతరుల అకౌంట్లో కూడా 27 రూపాయలు కట్ అయినట్టు కనిపెడతాడు. రాధేమోహన్ కథ 27 నుండి మొదలై కొన్ని వేల కోట్ల దాకా వెళుతుంది. దీంతో ఇదో పెద్ద స్కామ్ అని నిర్ధారణకు వచ్చి పై అధికారులకు సమాచారమిస్తాడు. ఈ విషయం సదరు బ్యాంకు అధికారుల నుండి ఆ బ్యాంకు ఓనరుకు తెలుస్తుంది. ఇక ఆ పై బ్యాంకు ఓనరుకు రాధేమోహన్కు మధ్య యుద్ధం మొదలవుతుంది.కోట్లకు అధిపతి అయిన బ్యాంకు ఓనరును 27 రూపాయలు పోగొట్టుకున్న రాధేమోహన్ ఎలా ఎదుర్కొన్నాడనేది సినిమాలోనే చూడాలి. రూపాయి అయినా కోటి రూపాయలైనా దేని విలువ దానిదే, కాగితంలో నంబరు విలువను పెంచుతుందే కానీ కాగితమైతే మారదు. పైన చెప్పుకున్నట్టు ఎవరి కష్టం వారిది, ఎవరి ఫలితం వారిది. ఈ రోజు వరించిన విజయానికి ఆనందిస్తే రేపు అపజయాన్ని కూడా ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. ‘హిసాబ్ బరాబర్’ సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ మంచి సందేశంతో ముగుస్తుంది. రాధేమోహన్పాత్రలో ప్రముఖ నటుడు మాధవన్ జీవించారు. సినిమాలో తన లెక్కే కాదు అందరి లెక్క సరిచేశాడు. వీకెండ్‌కి వాచబుల్ మూవీ. – ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీలో 'ముఫాసా: ది లయన్ కింగ్' స్ట్రీమింగ్
హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘ది లయన్ కింగ్ (2019)’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ అనే చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. బారీ జెంకిన్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వాల్ట్ డిస్నీ పిక్చర్స్ పతాకంపై అడెలె రోమన్ స్కీ, మార్క్ సెరియాక్ ఈ సినిమాను నిర్మించారు. డిసెంబరు 20న విడుదలైన ఈ సినిమా ఇండియాలో కూడా ప్రేక్షకులను మెప్పించింది. సుమారు రూ. 1260 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 3,200 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఓటీటీకి రానున్నడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రం ఫిబ్రవరి 18న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రీమియర్ అవుతుంది. అయితే, రెంటల్ విధానంలో అధనంగా డబ్బు చెల్లించి ఈ చిత్రాన్ని చూసే అవకాశం ఉంటుంది. ఆపై ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ, ఫాండాంగోతో సహా వీడియో-ఆన్-డిమాండ్ (VOD) ప్రాతిపదికన అందుబాటులో ఉంటుంది. ఇక్కడ కూడా అదనంగా రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి మాత్రమే ఈ చిత్రాన్ని ఉచితంగా చూసే అవకాశం ఉంటుందని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు సంబంధించిన ఒకరు స్క్రీన్‌రాంట్ మీడియాతో తెలిపారు.ఇంగ్లిష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రంలో టైటిల్ రోల్‌కు టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో తెలుగు ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. హిందీ వెర్షన్లో ముఫాసా పాత్రకు షారుక్ ఖాన్, ముఫాసా చిన్నప్పటి పాత్రకు ఆయన కుమారుడు అబ్రం వాయిస్ అందించారు. ఈ చిత్రంలోని సింబా పాత్రకు షారుక్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ వాయిస్ ఇవ్వడం విశేషం. -
ఓటీటీ కంటే ముందే టీవీలోకి రాబోతున్న కన్నడ సూపర్ హిట్ మూవీ
ఈ మధ్యకాలంలో ఓ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా సరే నాలుగైదు వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలు అయితే థియేటర్లో రిలీజ్ అయిన రెండు వారాలకే ఓటీటీల్లోకి వదిలేస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత ఆ సినిమా టీవీల్లోకి వచ్చేస్తుంది. ముందు థియేటర్ తర్వాత ఓటీటీ, చివరిగా శాటిలైట్.. కొనుగోలు చేసినప్పుడు ఈ విధంగా ఒప్పందం చేసుకుంటారు. ఏ సినిమా అయినా సరే ఓటీటీలో స్ట్రీమింగ్ అయినా తర్వాతే టీవీల్లో ప్రసారం అవుతాయి. కానీ ఓ సూపర్ హిట్ సినిమా మాత్రం ముందుగానే టీవీల్లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.యూఐ బాటలో మ్యాక్స్కన్నడ స్టార్ 'కిచ్చా' సుదీప్(Kiccha Sudeep) హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'మ్యాక్స్'(Max Movie). వరలక్ష్మీ శరత్‌కుమార్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. క్రిస్మస్ కానుకగా గతేడాది డిసెంబర్ 25న థియేటర్స్‌లో రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి.. రికార్డు సృష్టించింది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు షాకిస్తూ.. టీవీకి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. అంటే ఓటీటీ కంటే ముందే ఈ సినిమా టీవీలో ప్రసారం కానుంది. ఈ మూవీ శాటిలైట్ హక్కులను జీ నెట్వర్స్ సొంతం చేసుకుంది. దీంతో ఈ మధ్యే జీ కన్నడ ఛానెల్ లో 'మ్యాక్స్' మూవీ త్వరలోనే అంటూ ఓ ప్రోమో తీసుకొచ్చింది. ఇది చూసి ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. ఈ మూవీ డిజిటల్ హక్కులకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనే విషయంలోనూ స్పష్టత లేదు. ఓటీటీ కంటే ముందే టీవీలో వచ్చే అవకాశం ఉంది. కన్నడలో మ్యాక్స్ ఒక్కటే కాదు మరో పెద్ద సినిమా కూడా నేరుగా టీవీల్లోకే రాబోతుంది. ఉపేంద్ర దర్శకత్వం వహించిన నటించిన ఈ చిత్రం కూడా జీ ఛానెల్లోనే ప్రసారం కానుంది. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన ప్రోమోలను రిలీజ్ చేసింది.మాక్స్ కథేంటంటే..సస్పెండ్ అయిన సీఐ అర్జున్ అలియాస్ మాక్స్(సుదీప్ కిచ్చా) తిరిగి తన డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు వస్తుంటాడు. అదే సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఇద్దరిని చితక్కొట్టి అరెస్ట్ చేస్తాడు. వారిద్దరు మంత్రుల కొడులని తర్వాత తెలుస్తుంది. ఆ మంత్రులు ఇద్దరు సీఎంను దించేందుకు కుట్ర పన్ని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. అదే రోజు రాత్రి పోలీసు స్టేషనల్లో ఉన్న మంత్రుల కొడుకులిద్దరు చనిపోతారు. వారిద్దరు ఎలా చనిపోయారు..? మినిస్టర్స్ కొడుకుల చనిపోయారనే విషయం బయటకు తెలియకుండా పోలీసులు ఆడిన డ్రామా ఏంటి? మాక్స్ దగ్గర బంధీగా ఉన్న మినిస్టర్స్ కొడుకులను బయటకు తెచ్చేందుకు క్రైమ్ ఇన్స్పెక్టర్ రూప(వరలక్ష్మీ శరత్ కుమార్), గ్యాంగ్‌స్టర్ గని(సునీల్) చేసిన ప్రయత్నం ఏంటి? తన తోటి సహచరుల ప్రాణాలను కాపాడేందుకు మాక్స్(Max Review) ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.#MaxTheMovie Coming soon Zee Kannada.@KicchaSudeep 👑 pic.twitter.com/7vSn4yX3Gs— 𝔸𝕒𝕕𝕚 𝕊𝕦𝕕𝕖𝕖𝕡𝕚𝕒𝕟 (@AadiSudeepian) February 1, 2025 -
ఓటీటీలో సెడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ 'బేబీ జాన్'
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించిన తాజా హిందీ చిత్రం ‘బేబీ జాన్’. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. కాలీస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తీ సురేష్, వామికా గబ్బి హీరోయిన్లుగా నటించారు. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్ యాపిల్ పతాకాలపై జ్యోతీ దేశ్‌పాండే, మురాద్ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న రిలీజ్ అయింది. అయితే బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా మిగిలింది. బేబీ జాన్‌తో కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అందువల్ల ఈ మూవీపై ఆమే చాలా ఆశలు పెట్టుకుంది. కానీ, ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ కాలేదు. దీంతో తన ఫస్ట్ సినిమానే డిజాస్టర్‌గా మిగిలిపోయింది.బేబీ జాన్ చిత్రం సడెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఈ చిత్రాన్ని చూడాలంటే అదనంగా రూ. 349 రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. వాలెంటైన్స్ డే నుంచి ఈ చిత్రాన్ని ఉచితంగా చూసేందుకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం హిందీ తమిళ్ వర్షన్లో మాత్రమే బేబీ జాన్ అందుబాటులో ఉంది. ఇంగ్లీష్‌తో పాటు మరో 9 భాషలలో సబ్ టైటిల్స్‌తో చూడొచ్చు. 2016లో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'తేరి' సినిమాలో విజయ్ దళపతి, సమంత నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇదే కథతో బేబీ జాన్ రీమేక్ అయింది. సుమారు రూ. 160 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం రూ. 60 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. నెట్ పరంగా రూ. 40 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో భారీ డిజాస్టర్ లిస్ట్‌లో బేబీ జాన్ చేరిపోయింది.బేబీ జాన్ కోసం గ్లామర్ డోస్ పెంచిన కీర్తిబేబీ జాన్ మూవీ సాంగ్‌లో కీర్తి సురేష్ కాస్త గ్లామర్ డోస్ పెంచింది. ఇప్పటి వరకు డీసెంట్ రోల్స్ చేస్తూ.. ఎక్కడా హద్దులు దాటకుండా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు వాటిని క్రాస్ చేసినట్లు నెట్టింట వైరల్ అయింది. దీంతో సినిమాకు మరింత బజ్ క్రియేట్ అయింది. బేబీ జాన్ తర్వాత బాలీవుడ్లో అక్క పేరుతో ఓ వెబ్‌సిరీస్‌లో కీర్తి సురేష్ నటిస్తోంది. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సీరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది: ప్రశాంత్ కార్తి
పృథ్వీ దండమూడి, విస్మయ శ్రీ, ప్రశాంత్ కార్తి, శత్రు, ఆడుకాలం నరేన్ ప్రముఖ పాత్రల్లో నటించిన చిత్రం ‘పోతుగడ్డ’. ఈ సినిమాకు రక్ష వీరమ్ దర్శకత్వం వహించారు. రాహుల్ శ్రీవాస్తవ్ కెమెరామెన్‌గా పని చేసిన ఈ చిత్రం ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. ఈ చిత్రంలో వెంకట్ అనే డిఫరెంట్ షేడ్స్ ఉన్న కారెక్టర్లో కనిపించిన ప్రశాంత్ కార్తి తన పాత్రకు వస్తోన్న స్పందన పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.కెమెరామెన్ రాహుల్ ద్వారా నాకు ఈ సినిమా అవకాశం వచ్చింది. అయితే ఈ చిత్రం కోసం గుబురు గడ్డం, పొడవాటి జుట్టు కావాలని అన్నారు. ఆ లుక్ కోసం ట్రై చేశాం. అయితే మధ్యలో కొన్ని కారణాల వల్ల నేను జుట్టు తీసేయాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా ఆఫర్ పోయినట్టే అనుకున్న టైంలో డైరెక్టర్ రక్ష నుంచి కాల్ వచ్చింది. నా ఒరిజినల్ లుక్‌ని చూసి బాగుంది.. ఇదే ఫైనల్ చేద్దామని అన్నారు. అలా నా లుక్ ఇందులో చాలా నేచురల్‌గా కనిపిస్తుంది.పోతుగడ్డ సినిమాలో నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సినిమా ఆరంభం, ముగింపులో తన పాత్రలోని షేడ్స్ కనిపిస్తాయి. ఆ వేరియేషన్ నాకు చాలా నచ్చింది. అందుకే ఈ చిత్రానికి వెంటనే ఓకే చెప్పాను. ఇక ఇందులో నా పాత్రకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని పాత్రలకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక ప్రత్యేకంగా నా పాత్రలోని వేరియేషన్, యాక్టింగ్ గురించి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. చంద్ర సిద్దార్థ, చంద్రశేఖర్ యేలేటి వంటి వారు ప్రశంసించడం ఆనందంగా ఉంది.పోతుగడ్డ షూటింగ్ మొత్తం కూడా నైట్ టైంలోనే జరిగింది. అది కూడా పూర్తి చలికాలంలోనే షూటింగ్ చేశాం. అంతటి చలిలోనూ మా టీంకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మా నిర్మాత అనుపమ గారు, మా దర్శకులు రక్ష గారు ఎంతో చక్కగా చూసుకున్నారు.టీం అంతా ఓ ఫ్యామిలీలా కలిసి ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాం. ఆర్టిసుల్ని, టెక్నీషియన్లి మా నిర్మాత గారు ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు. టీంను ఆమె సపోర్ట్ చేయడం వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. శ్రవణ్ భరద్వాజ్ గారి పాటలు, మార్కస్ గారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ ఆకట్టుకుంటోంది.పోతుగడ్డ సినిమాలో ఓ మంచి ప్రేమ కథ ఉంటుంది. యాక్షన్, ఎమోషన్స్ ఇలా అన్ని రకాల అంశాలు ఉంటాయి. రాజకీయం చుట్టూ కథ తిరిగినా కూడా ఓ అందమైన ప్రేమ కథను ఇందులో చూపించారు. ఎక్కడా బోర్ కొట్టించుకుండా అందరినీ ఎంటర్టైన్ చేసేలా మా సినిమా ఉంటుంది.రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ఓ యాక్షన్ ప్యాక్డ్ మూవీని చేస్తున్నాను. దాని వివరాలు త్వరలోనే ప్రకటిస్తాను. మరిన్ని ప్రాజెక్టులు చర్చల దశల్లో ఉన్నాయి. -
నెల రోజుల్లోపే ఓటీటీకి డాకు మహారాజ్.. ఆ డేట్ ఫిక్స్!
నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం డాకు మహారాజ్. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. బాబీ కొల్లి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ను సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లపరంగా బాక్సాఫీస్ వద్ద రాణించింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.56 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో బాలకృష్ణ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్ట్‌లో డాకు మాహారాజ్ స్థానం దక్కించుకుంది.తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఈ వారంలోనే డాకు మహారాజ్ ఓటీటీలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.కాగా.. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలకపాత్ర పోషించారు. వీరితో పాటు శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, రిషి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.#DaakuMaharaj OTT Release Sets to Premeire This Sunday on Netflix In Tamil Telugu Malayalam Kannada pic.twitter.com/SQbZvxNEqM— SRS CA TV (@srs_ca_tv) February 3, 2025 -
ఓటీటీలోకి బిగ్గెస్ట్ హిట్ సినిమా.. 'డార్క్' పేరుతో తెలుగులో స్ట్రీమింగ్
కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'బ్లాక్' తెలుగు వర్షన్ ఓటీటీలో విడుదలైంది. ఎలాంటి ప్రకటన లేకుంగానే సడెన్‌గా 'డార్క్' టైటిల్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ్లో భారీ కలెక్షన్లతో దుమ్మురేపిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో విడుదల కావడంతో ఈ వీకెండ్ చూసేయవచ్చని సినీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రంలో నటుడు జీవా(Jiiva), నటి ప్రియ భవానీశంకర్(Priya Bhavani Shankar) జంటగా నటించారు. ప్రొటాన్షియల్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఆర్.ప్రభు, ఎస్ఆర్.ప్రకాశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రానికి జీకే.బాలసుబ్రమణి దర్శకత్వం వహించారు.సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌తో పాటు మంచి థ్రిల్లర్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించారు. బ్లాక్ (డార్క్) చిత్రాన్ని రూ. 5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగానే రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అంతటి భారీ విజయం అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగు వర్షన్ 'డార్క్' పేరుతో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతంది. ఈ సినిమా మొత్తం జీవా, ప్రియా భవానీ శంకర్ పాత్రల చుట్టూ ఓ విల్లా నేపథ్యంలోనే సాగడం గమనార్హం. 'కోహెరెన్స్ 'అనే హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో దర్శకుడు బాలసుబ్రమణి డార్క్ మూవీని తెరకెక్కించినట్లు నెట్టింట భారీగా ప్రచారం జరిగింది.కథేంటి?వసంత్ (జీవా), అరణ్య (ప్రియా భవానీ శంకర్) భార్యభర్తలు. వీకెండ్ సరదాగా గడుపుదామని బీచ్ పక్కన తాము కొన్న కొత్త విల్లాలోకి వెళ్తారు. ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఇంకా పూర్తిగా పనులు జరగకపోవడం వల్ల వీళ్లు తప్పితే మరెవరు అక్కడ ఉండరు. పగలంతా బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే రాత్రి అవుతుందో విచిత్రమైన సంఘటనలన్నీ జరుగుతుంటాయి. భయపడి పారిపోదామని ఎంత ప్రయత్నించినా.. తిరిగి తిరిగి అక్కడికి వస్తుంటారు. మరోవైపు తమ ఎదురుగా ఉన్న విల్లాలో ఎవరో ఉన్నారని అనిపిస్తుంది. వెళ్లి చూస్తే అచ్చుగుద్దినట్లు తమలాంటి ఇద్దరు వ్యక్తులే కనిపిస్తారు. ఇంతకీ వాళ్లెవరు? ఇలా జరగడానికి కారణమేంటి అనేదే మిగతా స్టోరీ. -
ఓటీటీలో 'గేమ్ ఛేంజర్'.. అనుకున్న దానికంటే ముందే స్ట్రీమింగ్
రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'గేమ్ ఛేంజర్'. జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు. అయితే, సినిమా విడుదల రోజు నుంచే నెగటివ్ టాక్ రావడంతో భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. కలెక్షన్ల పోస్టర్ విషయంలోనూ తప్పుడు లెక్కలు వేశారంటూ పెద్ద ఎత్తున నెట్టింట ట్రోల్ జరిగిన విషయం తెలిసిందే.సినిమా విడుదలైన నెల రోజుల్లోనే గేమ్ ఛేంజర్ ఓటీటీలోకి వచ్చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఫిబ్రవరి 7న ఈ మూవీ విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. వాస్తవంగా ఈ చిత్రం విడుదలైన 30 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని డీల్ ఉంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 14న స్ట్రీమింగ్కు వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, అనుకున్న సమయం కంటే ముందే గేమ్ ఛేంజర్ చిత్రాన్ని అమెజాన్ విడుదల చేస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే, హిందీ వర్షన్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.కథేంటంటే..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి( శ్రీకాంత్) ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు పూర్తిగా మారిపోతాడు. రాష్ట్రంలో ఇకపై అవినీతి జరగొద్దని, నిజాయితీగా పని చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశిస్తాడు. సీఎం నిర్ణయం ఆయన కొడుకు, మైనింగ్ మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి(ఎస్జే సూర్య)కి నచ్చదు. ముఖ్యమంత్రికి తెలియకుండా అవినీతిని కొనసాగిస్తుంటాడు. అంతేకాదు తండ్రిని తప్పించి సీఎం సీటులో కూర్చోవాలని కుట్ర చేస్తుంటాడు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో ఐపీఎస్‌గా విధులు నిర్వర్తిస్తూ.. సివిల్స్ పరీక్ష మళ్లీ రాసి ఐఏఎస్‌గా సెలెక్ట్ అయిన రామ్ నందన్(రామ్ చరణ్).. విశాఖపట్నం కలెక్టర్‌గా బాధ్యతలు చేపడతాడు. జిల్లాలో అవినీతి, దౌర్జన్యాలు మానేయాలని రౌడీలకు, వ్యాపారులకు వార్నింగ్ ఇస్తాడు.ఈ క్రమంలో మంత్రి మోపిదేవి, కలెక్టర్ మధ్య వైరం ఏర్పడుతుంది. మరోవైపు సీఎం సత్యమూర్తి చివరి కోరిక అంటూ ఓ భారీ ట్విస్ట్ ఇస్తాడు. అదేంటి? అసలు సీఎం సత్యమూర్తిలో మార్పుకు గల కారణం ఏంటి? అప్పన్న(రామ్ చరణ్) ఎవరు? పార్వతి(అంజలి)తో కలిసి ఆయన పోరాటం ఏంటి? కలెక్టర్ రామ్‌కి అప్పన్నకు ఉన్న సంబంధం ఏంటి? సీఎం సీటు కోసం మోపిదేవి చేసిన కుట్రలను రామ్ ఎలా అడ్డుకున్నాడు? ఒక ఐఏఎస్ అధికారిగా తనకున్న పవర్స్‌ని ఉపయోగించి రాష్ట్ర రాజకీయాలను ఎలా మార్చాడు? దీపిక(కియారా అద్వానీ)తో రామ్ ప్రేమాయణం ఎలా సాగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.