Saif Ali Khan
-
డైరెక్ట్‌గా ఓటీటీకి స్టార్ హీరో కుమారుడి సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) కుమారుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇబ్రహీం అలీ ఖాన్ హీరోగా వస్తోన్న చిత్రం నదానియన్(Nadaaniyan). ఈ మూవీలో జాన్వీ కపూర్ సిస్టర్ ఖుషీ కపూర్(khushi kapoor) హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే ఈ నదానియన్ మూవీని డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రివీల్ చేసింది. వచ్చేనెల మార్చి 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సినిమాకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది.కాగా.. ఈ సినిమాకు శౌనా గౌతమ్ దర్శకత్వం వహించారు. ఏ ధర్మాటిక్ ఎంటర్టైనర్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో సునీల్ శెట్టి, దియా మీర్జా, మహిమా చౌదరి కీలక పాత్రలు పోషించారు. కాలేజీ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది. ఇటీవల ఖుషీ కపూర్ లవ్యాపా మూవీతో ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. Kuch Kuch Hota Hai aisi Nadaaniyan dekh kar 🥰💕Watch Nadaaniyan, out 7 March, only on Netflix!#NadaaniyanOnNetflix pic.twitter.com/piwn818AFx— Netflix India (@NetflixIndia) February 20, 2025 -
ఖరీదైన అపార్ట్మెంట్ కొన్న సైప్ అలీ ఖాన్ మాజీ భార్య.. ఎన్ని కోట్లంటే?
ప్రముఖ బాలీవుడ్ నటి అమృతా సింగ్ ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. ముంబయిలోని జుహూ ప్రాంతంలో ఈ లగ్జరీ ఫ్లాట్‌ను కొన్నట్లు తెలుస్తోంది. ఈ విలాసవంతమైన అపార్ట్మెంట్ విలువ దాదాపు రూ.18 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. కాగా.. అమృతా సింగ్ బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌ను పెళ్లాడారు. ఆ తర్వాత కొన్నేళ్ల తర్వాత వీరిద్దరు విడిపోయారు. వీరిద్దరికీ సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు.కాగా.. అమృతా సింగ్ బేతాబ్ (1983) చిత్రంతో అరంగేట్రం చేశారు. ఈ సినిమాతోనే బాలీవుడ్లో ఫేమ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత మార్డ్, నామ్, చమేలి కి షాదీ, రాజు బన్ గయా జెంటిల్మన్ వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్నారు. కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె కలియుగ్, షూటౌట్ ఎట్ లోఖండ్వాలా వంటి చిత్రాలతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఐనా చిత్రంలో ఆమె నటనకు గానూ ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది, తరువాత ఆమె 2 స్టేట్స్ మూవీలో ఆమె పాత్రకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. -
కత్తితో దాడి.. నా కుమారుడి మాటలకు కన్నీళ్లు వచ్చాయి: సైఫ్ అలీఖాన్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) దుండగుడి చేతిలో తీవ్రంగా గాయపడిన రోజు ఏం జరిగిందో మొదటిసారి ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. దొంగతనం కోసం వచ్చిన వ్యక్తితో తనను కత్తితో పొడిచిన సమయంలో తాను పెద్దగా కంగారుపడలేదని చెప్పారు. అయితే, కొంత సమయం తర్వాత ఎక్కువ నొప్పి రావడంతో ఆ గాయం తీవ్రత ఎంతో తెలిసింది. ఆ సమయంలో తన కుమారుడు తైమూర్ మాటలను సైఫ్ గుర్తు చేసుకున్నారు.'నాపై దాడి జరిగిన తర్వాత తీవ్రమైన నొప్పితో బాధపడ్డాను. నా వెన్నులో బలమైన కత్తితో దాడి చేశాడని తెలిసింది. ఆ సమయంలో కరీనా చాలా కంగారు పడింది. ఏం చేయాలో తనకు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. మా కుటుంబ సభ్యలకు అందరికీ కాల్స్ చేస్తూ ఉంది. కానీ, అర్ధరాత్రి కావడంతో ఎవరూ రెస్పాన్స్ కావడం లేదు. అప్పుడు ఇద్దరం ఒకరినొకరం చూసుకున్నాం. వెంటనే ఆసుపత్రికి బయలుదేరాలని ఆమె పిచ్చిగా కాల్స్ చేస్తూ ఉంది. కరీనా పరిస్థితి గమనించే నేనే తనకు ధైర్యం చెప్పాను. నాకు ఏం కాదని తెలిపాను. ఆ సమయంలో తైమూర్ నా దగ్గరకు వచ్చి.. నాన్నా.. నువ్వు చనిపోతావా..? అని అడిగాడు. అప్పుడు నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. అలాంటిది ఏమీ జరగదు అమ్మ ఉంది కదా అని చెప్పాను. చికిత్స కోసం వెళ్తుండగా నేనూ వస్తానంటూ తైమూర్ కూడా ఆసుపత్రికి వచ్చాడు. ఆ సమయంలో నేను కూడా వాడిని తీసుకొని వెళ్లాలని అనుకున్నాను. నాకు ఏమైనా జరిగితే నా కుమారుడు నా పక్కనే ఉండాలని ఆ సమయంలో అనిపించింది.' అని ఆయన అన్నారు.ముంబై బాంద్రాలోని సైఫ్ అలీఖాన్ నివాసంలో జనవరి 16న తెల్లవారుజామున 2.30 గంటలకు ఆయనపై దాడి జరిగింది. దుండగుడు సైఫ్ చిన్న కుమారుడు జేహ్ గదిలోకి వెళ్లడం గమనించిన కేర్‌టేకర్ కేకలు వేయగా సైఫ్ అక్కడికి చేరుకున్నాడు. ఆ సమయంలో పెనుగులాట జరిగింది. ఈక్రమంలోనే సైఫ్ గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
నెట్‌ఫ్లిక్స్‌తో సినిమాలు.. ఈవెంట్లో పాల్గొన్న ప్రముఖ నటీనటులు (ఫోటోలు)
-
సైఫ్ అలీఖాన్ కుమారుడి తొలి సినిమా.. నేరుగా ఓటీటీలో రిలీజ్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) తనయుడు ఇబ్రహీం అలీఖాన్ నటుడిగా బిగ్ స్క్రీన్కు పరిచయం కాబోతున్నాడు. ఎంతోమంది స్టార్ కిడ్స్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) బ్యానర్లో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి నడానియన్ (Nadaaniyan) అన్న టైటిల్ ఖరారు చేశారు. దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో సునీల్ శెట్టి, దియా మీర్జా, జుగల్ హన్సరాజ్, మహిమా చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఓటీటీలో రిలీజ్ కానున్న ఫస్ట్ మూవీఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అయితే రిలీజ్ ఎప్పుడన్నది చెప్పకుండా త్వరలోనే అంటూ సస్పెన్స్‌లో ఉంచింది. ఈ సినిమాతో షావునా గౌతమ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈయన 'రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ' సినిమాకు కరణ్ జోహార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు.ఇబ్రహీం..సైఫ్ అలీఖాన్, అతడి మాజీ భార్య అమృతా సింగ్ తనయుడే ఇబ్రహీం. మొదటి భార్యకు విడాకులిచ్చిన అనంతరం సైఫ్.. హీరోయిన్ కరీనా కపూర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి తైమూర్, జెహంగీర్ అని ఇద్దరు కుమారులు సంతానం. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: అంకుల్ అనొద్దన్నాడు.. కావాలంటే అలా పిలవమన్నాడు: కీర్తి సురేశ్ -
‘సైఫ్’పై దాడి చేసింది ఒక్కడు కాదా..? రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు
ముంబయి:బాలీవుడ్ నటుడు సైఫ్‌అలీఖాన్‌పై దాడి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సైఫ్‌పై దాడి కేసులో అరెస్టయిన బంగ్లాదేశ్ జాతీయుడు షరిఫుల్ ఇస్లామ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ దాడిలో ఇస్లామ్ ఒక్కడే కాకుండా మరికొందరి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇస్లామ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.ఈ కేసులో జనవరి 19న ఇస్లామ్‌ను పోలీసులు ముంబయిలోని థానెలో అరెస్టు చేశారు. ఇస్లామ్‌కు కోర్టు జనవరి 29దాకా కస్టడీ విధించింది. తమ విచారణలో ఇస్లామ్ నోరు విప్పడం లేదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.దాడి జరిగిన రోజు సైఫ్ ఇంట్లో ఉన్న అందరు పనివాళ్లు వేసుకక్ను బట్టలను ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరారు. కేవలం సైఫ్ రక్తమే వాటిపై ఉందా ఇంకెవరిదైనా ఉందా అనే విషయం తెలుసుకోవడానికి పోలీసులు పనివాళ్ల దుస్తులను కోరినట్లు తెలుస్తోంది.ఇక ఇస్లామ్‌కు సిమ్‌కార్డు అందించిన జహంగీర్ షేక్ అనే వ్యక్తి కోసం ముంబయి పోలీసులు ఆదివారం(జనవరి26) కోల్‌కతా వెళ్లారు. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన తర్వాత ఇస్లామ్ కొన్ని రోజులపాటు కోల్‌కతాలో ఉన్నట్లు పోలీసులు కనిపెట్టారు.కాగా, జనవరి 16వ తేదీ రాత్రి 2 గంటలకు సైఫ్‌అలీఖాన్‌పై ముంబై బాంద్రాలోని అతడి ఇంట్లోనే దుండగుడు దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్‌కు ఆరు కత్తిపోటు గాయాలయ్యాయి. ఈ గాయాలకు చికిత్స తీసుకున్న సైఫ్ ఇప్పటికే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తనపై దాడికి ముందు పనిమనిషిపై దాడి చేసిన దుండగుడు తనను కోటి రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్లు సైఫ్ ఇప్పటికే పోలీసులకు తెలిపారు. -
‘సైఫ్’ కేసులో అరెస్టుతో జీవితం నాశనమైంది: ఆకాశ్
ముంబయి: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ఇటీవల కత్తితో దాడి చేసిన కేసులో తొలుత అరెస్టయిన అనుమానితుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసులో తొలుత ఆకాశ్ కనోజియా అనే అనుమానితుడిని ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ రైల్వేస్టేషన్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల తదుపరి విచారణలో అసలు నిందితుడు ఆకాశ్ కాదని తేలడంతో పోలీసులు అతడిని వదిలిపెట్టారు. సైఫ్ కేసులో అరెస్టు తర్వాత తన జీవితం సర్వనాశనమైందని ఆకాశ్ పేర్కొన్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న తాను ఉద్యోగం కోల్పోవడం, పెళ్లి సంబంధం చెడిపోవడంతో పాటు తన కుటుంబం ఎన్నో అవమానాలు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశాడు. సైఫ్ కేసులో ప్రధాన అనుమానితుడినని చెబుతూ మీడియాలో నా ఫొటోలు వేశారు. ఫొటోలు చూసిన మా కుటుంబం షాక్‌కు గురైంది.నాకు కాబోయే భార్యను కలిసేందుకు వెళ్తుండగా దుర్గ్‌లో నన్ను అదుపులోకి తీసుకొని రాయ్‌పూర్‌కు తరలించారు. అక్కడికి వచ్చిన ముంబయి పోలీసులు నాపై దాడి కూడా చేశారు’ అని ఆకాశ్ తెలిపాడు. పోలీసులు విడిచిపెట్టిన తర్వాత ఉద్యోగం కూడా పోయిందని, నాతో వివాహం వద్దని అమ్మాయి తరఫు కుటుంబీకులు నిర్ణయించుకున్నారని చెప్పాడు. అయితే తనపై ఇప్పటికే రెండు కేసులు ఉన్నమాట నిజమేనన్నాడు. ఇటీవల సైఫ్‌అలీఖాన్‌పై ముంబయి బాంద్రాలోని ఆయన నివాసంలోనే దాడి జరిగిన విషయం తెలిసిందే. దొంగతనానికి వచ్చిన దుండగున్ని అడ్డుకుంటుండగా అతడు సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన సైఫ్ లీలావతి ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. ఈ కేసులో నిందితుడితో దగ్గరి పోలికలు ఉండడంతో పోలీసులు ఆకాశ్‌ను ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో అరెస్టు చేసి తర్వాత నాలిక్కరచుకొని వదిలిపెట్టారు. -
సైఫ్ అలిఖాన్పై దాడి కేసులో ఊహించని ట్విస్ట్!
ముంబై: దుండగుడి దాడిలో గాయపడిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసు విచారిస్తున్న ముంబై పోలీసులు (mumbai police) దుండగుడు సైఫ్‌పై దాడి చేసిన ప్రదేశం నుంచి ఫింగర్ ప్రింట్స్ (fingerprints) సేకరించారు. ఆ వేలిముద్రలకు.. ఈ కేసులో నిందితుడైన షరీఫుల్ఇస్లాం వేలిముద్రలతో మ్యాచ్ కావడం లేదని తేలింది.జాతీయ మీడియా కథనాల ప్రకారం.. దొంగతనం చేసే ప్రయత్నంలో నిందితుడు షరీఫుల్ఇస్లాం సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడికి యత్నించాడు. అయితే హైప్రొఫైల్ కేసు కావడంతో ముంబై పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా సైఫ్ ఇంటినుంచి 19 సెట్ల వేలిముద్రల్ని సేకరించారు. ఆ వేలి ముద్రలు షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలతో సరిపోలడం లేదని నిర్ధారించారు.ముంబై పోలీసులు సైఫ్ ఇంట్లో దొరికిన వేలిముద్రలను సీఐడీ ఫింగర్ ప్రింట్ బ్యూరోకి పంపారు. అక్కడ వేలిముద్రల్ని పరిశీలించగా..షరీఫుల్ ఫింగర్ ప్రింట్లతో సరిపోలడం లేదని సిస్టమ్ జనరేటేడ్ రిపోర్ట్‌లో తేలింది. దీంతో ఫింగర్ ప్రింట్ పరీక్షల్లో ఫలితం నెగిటీవ్‌గా వచ్చింది. ఫలితం నెగిటివ్ అని సీబీఐ అధికారులు ముంబై పోలీసులకు సమాచారం అందించారు. తదుపురి పరీక్షల కోసం సైఫ్ ఇంటినుంచి మరిన్ని వేలిముద్రల నమోనాల్ని సేకరించిన పోలీసులు మరోసారి సీఐడీ విభాగానికి పంపినట్లు సమాచారం.దాడి జరిగిందిలా.. సైఫ్ వాంగ్మూలం ప్రకారం.. ‘సైఫ్ అలీ ఖాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అందులో.. ‘నేను,నా భార్య కరీనా కపూర్ ఖాన్ 11వ అంతస్తులో బెడ్ రూమ్‌లో ఉన్నాం. ఆ సమయంలో మా ఇంట్లో సహాయకురాలు ఎలియామా ఫిలిప్ బిగ్గరగా కేకలు వేసింది. దుండగుడు (మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్) నా చిన్న కుమారుడు జహంగీర్ ( జెహ్) నిద్రిస్తున్న గదిలోకి చొరబడ్డాడు. కత్తితో అగంతకుడు జెహ్ను బెదిరించాడు. కోటి రూపాయిలు ఇవ్వాలని ఫిలిప్‌ను డిమాండ్ చేశాడు. దుండగుడు కత్తితో బెదిరించడంతో జెహ్ ఏడ్వడం మొదలపెట్టాడు. వెంటనే, దుండగుడి నుంచి జెహ్ను రక్షించేందుకు ఫిలిప్ ప్రయత్నించింది. ఈ క్రమంలో దుండగుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు.ఫిలిప్ కేకలు విన్న నేను జెహ్ రూంకు వెళ్లి చూడగా.. ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతోంది. జెహ్ను రక్షించేందుకు నేనూ దుండగుడిని నిలువరించే ప్రయత్నం చేశా. అప్పుడే దుండగుడు నా వీపు భాగం,మెడ, చేతులపై పలుమార్లు కత్తితో పొడిచాడు. నా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దుండగుడి నుంచి జెహ్ను రక్షించిన సహాయకులు మరో రూంలోకి తీసుకెళ్లారు’ అని పోలీసులకు వివరించారు.ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు సైఫ్ అలీఖాన్‌ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. దుండగుడు కత్తితో దాడి చేయడంతో సైఫ్ అలీఖాన్‌కు రెండు చోట్ల లోతుగా గాయలయ్యాయి. కత్తి దాడి రెండు మిల్లీమీటర్ల మేర తృటిలో తప్పి వెన్నెముక పక్కన కత్తి పోట్లు దిగబడినట్లు వైద్యులు తెలిపారు. మెడ, చేతిపై గాయాలకు చికిత్స అనంతరం జనవరి 21న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. సైఫ్‌పై దాడి ఘటనపై పోలీసులు విచారించారు. విచారణలో దొంగతనం చేయాలని ఉద్దేశ్యంతో దుండగుడు సైఫ్ ఇంట్లో చొరబడినట్లు పోలీసులు తెలిపారు. దండుగుడు బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌గా గుర్తించారు. సైఫ్‌పై దాడి అనంతరం దుండగుడు షెహజాద్ తప్పించుకున్నాడు. థానేలో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. -
సైఫ్‌పై దాడి కేసులో నా కుమారుడిని ఇరికించారు: నిందితుడి తండ్రి
'పొట్టకూటి కోసం వచ్చిన నా కొడుకు నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడి చేయలేదు. కావాలనే అతడ్ని ఈ కేసులో ఇరికించారు' అంటున్నాడు నిందితుడి తండ్రి. సైఫ్ అలీఖాన్ ఇంట్లో చొరబడి దాడి చేసిన వ్యక్తిని పోలీసులు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌గా గుర్తించిన విషయం తెలిసిందే! నిందితుడిని బంగ్లాదేశ్ వాసిగా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. జనవరి 29వరకు పోలీసుల కస్టడీకి ముంబై కోర్టు అనుమతిచ్చింది.తిరిగి వచ్చేయాలనుకున్నాడుఈ క్రమంలో నిందితుడి తండ్రి మహ్మద్ రుహుల్ అమీన్ ఫకీర్ సంచలన ఆరోపణలు చేశారు. ఓ మీడియాతో ఫోన్‌కాల్‌లో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు బాగోలేనందున నా కుమారుడు మధ్యవర్తి సాయంతో ఇండియాకు వచ్చేశాడు. ఉద్యోగావకాశాల కోసం గతేడాది ఏప్రిల్‌లో భారత్‌లో ప్రవేశించాడు. కావాల్సినంత సంపాదించుకున్నాక తిరిగి బంగ్లాకు వచ్చేయాలనుకున్నాడు.ముంబైలో ఎందుకంటే?ముందుగా పశ్చిమ బెంగాల్‌లోని ఓ హోటల్లో పని చేశాడు. బెంగాల్ కంటే ముంబై రెస్టారెంట్లలో ఎక్కువ జీతం కావడంతో తర్వాత ముంబైకి షిఫ్ట్ అయ్యాడు. తరచూ మాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు. చివరిసారిగా శుక్రవారం నాతో ఫోన్లో మాట్లాడాడు. ప్రతి నెల పదో తారీఖున అతడికి జీతం పడుతుంది. అలా నాకు రూ.10 వేలు పంపాడు. తన ఖర్చుల కోసం రూ.3 వేలు ఉంచుకున్నాడు. మేము పేదవాళ్లమే కానీ నేరస్తులం కాదు. బంగ్లాదేశ్‌లో అతడు బైక్ టాక్సీ నడిపేవాడు.అన్యాయంగా ఇరికిస్తున్నారునా కొడుకును అరెస్ట్ చేశారని సోషల్ మీడియా ద్వారా తెలిసింది. సీసీటీవీ ఫుటేజీలో ఉన్నది నా కొడుకు కాదు. మీరంతా పొరబడుతున్నారు. అతడెప్పుడూ తన జుట్టు అంత పొడవుగా ఉంచుకునేవాడు కాదు. ఎవరో కావాలనే ఈ కేసులో నా కొడుకును ఇరికిస్తున్నారు. అధికారులు నా కొడుకే నిందితుడు అని పొరబడుతున్నారు. మాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఇండియాలో మాకు తెలిసినవారెవరూ లేరు. మాకు ఎటువంటి సపోర్ట్ లేదు. నా కొడుకు నిర్దోషిగా వస్తాడని ఎదురుచూస్తున్నాం అని చెప్పుకొచ్చాడు.సైఫ్‌పై దాడికాగా జనవరి 16న ముంబైలోని ఇంట్లో సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. దొంగతనం కోసం ఇంట్లోకి చొరబడిన నిందితుడు సైఫ్ చిన్న కుమారుడు జెహంగీర్ గదిలో చొరబడ్డాడు. అతడిని చూసిన పనిమనిషి గట్టిగా కేకలు వేయడంతో సైఫ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. నిందితుడిని అడ్డుకునే క్రమంలో అతడు సైఫ్‌ను ఆరుసార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు.సైఫ్‌ను కాపాడిన ఆటో డ్రైవర్తీవ్ర గాయాలతో ఉన్న సైఫ్.. కుమారుడు తైమూర్‌తో కలిసి ఆటోలో ఆస్పత్రికి వెళ్లాడు. ఆటో డ్రైవర్ సైతం రక్తంతో తడిసిన సైఫ్‌ను చూసి రూపాయి కూడా తీసుకోలేదు. తీవ్రగాయాలపాలైన సైఫ్ ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. వెన్నెముకలో విరిగిన 2.5 అంగుళాల కత్తి మొనను సర్జరీ చేసి తొలగించారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుల్.. బిజోయ్ దాస్‌గా పేరు మార్చుకుని భారత్‌లో అక్రమంగా చొరబడ్డాడని గుర్తించారు.చదవండి: విజయ్‌తో చేయి కలిపేందుకు అడుగులేస్తున్న త్రిష -
సైఫ్ అంతత్వరగా ఎలా కోలుకున్నారంటే..
ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్(54)పై జరిగిన దాడి గురించి దేశమంతా చర్చించుకుంది. పదునైన ఆయుధంతో ఆయనపై దాడి జరగ్గా.. సర్జరీ తదనంతరం వారం తిరగకముందే ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే.. అంత త్వరగా ఆయన కోలుకుని డిశ్చార్జి కావడం, పైగా ఆయనే స్వయంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోవడంపై ఆసక్తికరమైన చర్చ నడిచింది. ఈ క్రమంలో.. ఓ డాక్టర్ పోస్ట్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan)పై నిజంగానే దాడి జరిగిందా?.. నెట్టింట జోరుగా గిన చర్చ ఇది. ఇక మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే, సంజయ్ నిరుపమ్ లాంటి ప్రముఖ నేతలు సైతం సైఫ్ దాడి ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆస్పత్రి నుంచి సైఫ్ బయటకు వచ్చేశారు. ఆయనకేం జరగనట్లు ఉంది. ఆయనపై నిజంగానే దాడి జరిగిందా? లేదంటే నటిస్తున్నారా?’’ అంటూ కామెంట్లు చేశారు. ఆఖరికి మీమ్స్ పేజీలు సైతం ఈ పరిణామాన్ని వదల్లేదు. అయితే ఆశ్చర్యకరరీతిలో వైద్యులు సైతం ఈ చర్చలో భాగమై తమవంతు అనుమానాలను బయటపెట్టారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి ఆ అనుమానాల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేశారు.‘‘సుమారు 80 ఏళ్ల వయసున్న ఓ పెద్దావిడకు ఫ్రాక్చర్ కారణంగా వెన్నెముకకు సర్జరీ జరిగింది. పైగా ఆమె మడమకు కూడా ఫ్రాక్చర్ అయ్యింది. అయినా కూడా ఆమె వాకర్ సాయంతో నడవగలిగింది. ఆ వీడియోనే ఆయన నెట్లో షేర్ చేశారు. పైగా ఆవిడ ఎవరో కాదట.. స్వయానా ఆయన తల్లేనట!‘‘సైఫ్‌కు నిజంగానే సర్జరీ జరిగిందా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. వాళ్లలో కొందరు డాక్టర్లు కూడా ఉన్నారు. అలాంటివాళ్లందరి కోసమే ఈ ఉదాహరణ. ఇది 2022 నాటి వీడియో. మా అమ్మకు ఉదయం సర్జరీ అయితే.. సాయంత్రానికే ఆమె నడిచారు. అలాంటప్పుడు ఆవిడ కంటే తక్కువ వయసున్న వ్యక్తి(సైఫ్‌ను ఉద్దేశించి..) నిలబడి నడవలేరంటారా?.. అని ఆయన ప్రశ్నించారు.For people doubting if Saif Ali Khan really had a spine surgery (funnily even some doctors!). This is a video of my mother from 2022 at the age of 78y, walking with a fractured foot in a cast and a spine surgery on the same evening when spine surgery was done. #MedTwitter. A… pic.twitter.com/VF2DoopTNL— Dr Deepak Krishnamurthy (@DrDeepakKrishn1) January 22, 2025సైఫ్‌కు అయిన గాయాలు.. ఆయనకు జరిగిన శస్త్రచికిత్సతో పోలిస్తే మా అమ్మ పరిస్థితి మరీ దారుణం. దాడిలో గాయపడ్డ సైఫ్‌కు వెన్నెముక వద్ద గాయం, ఫ్లూయెడ్ లీకేజీ జరిగాయి. అత్యవసర సర్జరీతో వెన్నెముక భాగంలో ఇరుక్కుపోయిన కత్తి భాగాన్ని తొలగించారు. ఆ ఫ్లూయెడ్ లీకేజీని సరిచేశారు. అలాగే మా అమ్మకు వెన్నెముకలోనే ఫ్రాక్చర్ అయ్యింది. అయినా కూడా మరుసటి రోజే డిశ్చార్జి చేశారు. ఈరోజుల్లో బైపాస్ సర్జరీ చేయించుకున్నవాళ్లే.. మూడో, నాలుగో రోజుకి చక్కగా నడుస్తూ మెట్లు ఎక్కేస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాకు వచ్చే ముందు కాస్త విషయ పరిజ్ఞానం పెంచుకోండి’’ అంటూ చురకలటించారాయన.మెడికల్ రిపోర్ట్ ప్రకారం.. జనవరి 16వ తేదీ అర్ధరాత్రి సమయంలో సైఫ్‌పై దాడి జరిగింది. నిందితుడు ఆయన్ని ఆరుసార్లు కత్తితో పొడిచాడు. వీపులో, నడుం భాగంలో, మెడ, భుజం, మోచేతి భాగంలో ఆయనకు గాయాలయ్యాయి. దీంతో ఆయనకు ఎమర్జెన్సీ సర్జరీలు చేశారు. ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచాక ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు మార్చారు.‘‘సైఫ్ మాట్లాడగలుగుతున్నారు. నడవగలుగుతున్నారు. చేయి, మెడపై గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేశాం. శరీరం నుంచి పదునైన వస్తువును బయటకు తీశాం. వెన్నెముకకు ఎటువంటి ప్రమాదం లేదు. ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చాం. ప్రస్తుతం ఆహారం తీసుకుంటున్నారు. రెండుమూడు రోజుల తర్వాత డిశ్చార్జి చేస్తాం’’ అని జనవరి 18న ముంబై లీలావతి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. చెప్పినట్లుగానే మూడు రోజుల అబ్జర్వేషన్ తర్వాత ఆయన్ని డిశ్చార్జి చేశారు. -
‘నాపై దుండగుడు కత్తితో ఇదిగో ఇలా దాడి చేశాడు’.. పోలీసులకు సైఫ్ వాంగ్మూలం!
ముంబై : తనపై దుండగుడు జరిపిన దాడి గురించి బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు బాంద్రాలోని సైఫ్ నివాసానికి వెళ్లి దాడి వివరాల్ని సేకరించినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తనపై దుండగుడు ఏ విధంగా దాడి చేసింది. తాను ఎలా ప్రతిఘటించిన విధానాన్ని సైఫ్ వివరించినట్లు సమాచారం.జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ‘సైఫ్ అలీ ఖాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అందులో.. ‘నేను,నా భార్య కరీనా కపూర్ ఖాన్ 11వ అంతస్తులో బెడ్ రూమ్‌లో ఉన్నాం. ఆ సమయంలో మా ఇంట్లో సహాయకురాలు ఎలియామా ఫిలిప్ బిగ్గరగా కేకలు వేసింది. దుండగుడు (మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్) నా చిన్న కుమారుడు జహంగీర్ ( జెహ్) నిద్రిస్తున్న గదిలోకి చొరబడ్డాడు. కత్తితో అగంతకుడు జెహ్ను బెదిరించాడు. కోటి రూపాయిలు ఇవ్వాలని ఫిలిప్‌ను డిమాండ్ చేశాడు. దుండగుడు కత్తితో బెదిరించడంతో జెహ్ ఏడ్వడం మొదలపెట్టాడు. వెంటనే, దుండగుడి నుంచి జెహ్ను రక్షించేందుకు ఫిలిప్ ప్రయత్నించింది. ఈ క్రమంలో దుండగుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు.ఫిలిప్ కేకలు విన్న నేను జెహ్ రూంకు వెళ్లి చూడగా.. ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతోంది. జెహ్ను రక్షించేందుకు నేనూ దుండగుడిని నిలువరించే ప్రయత్నం చేశా. అప్పుడే దుండగుడు నా వీపు భాగం,మెడ, చేతులపై పలుమార్లు కత్తితో పొడిచాడు. నా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దుండగుడి నుంచి జెహ్ను రక్షించిన సహాయకులు మరో రూంలోకి తీసుకెళ్లారు’ అని పోలీసులకు వివరించారు.ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు సైఫ్ అలీఖాన్‌ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. దుండగుడు కత్తితో దాడి చేయడంతో సైఫ్ అలీఖాన్‌కు రెండు చోట్ల లోతుగా గాయలయ్యాయి. కత్తి దాడి రెండు మిల్లీమీటర్ల మేర తృటిలో తప్పి వెన్నెముక పక్కన కత్తి పోట్లు దిగబడినట్లు వైద్యులు తెలిపారు. మెడ, చేతిపై గాయాలకు చికిత్స అనంతరం జనవరి 21న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. సైఫ్‌పై దాడి ఘటనపై పోలీసులు విచారించారు. విచారణలో దొంగతనం చేయాలని ఉద్దేశ్యంతో దుండగుడు సైఫ్ ఇంట్లో చొరబడినట్లు పోలీసులు తెలిపారు. దండుగుడు బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌గా గుర్తించారు. సైఫ్‌పై దాడి అనంతరం దుండగుడు షెహజాద్ తప్పించుకున్నాడు. థానేలో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.ఇదిలా ఉంటే, సైఫ్ అలీ ఖాన్ బాంద్రా ఫ్లాట్ నుండి సేకరించిన వేలిముద్రలు షరీఫుల్‌తో సరిపోలినట్లు నిర్ధారించబడింది. నిందితుడు భవనంలోని పదకొండవ అంతస్తుకు ఎక్కేందుకు ఉపయోగించిన డక్ట్ పైపుపై,గది డోర్ హ్యాండిల్, బాత్రూమ్ డోర్‌పై వేలిముద్రల్ని గుర్తించారు. అయితే, సైఫ్ అలీఖాన్ ఇంటిలోని సీసీటీవీ ఫుటేజీలోని దుండగుడు, తన కుమారుడు షెహజాద్‌లు ఒకరు కాదని. ఇద్దరు వేర్వేరుగా ఉన్నారని షెహజాద్ తండ్రి రూహుల్ అమీన్ వాదిస్తున్నాడు. -
సైఫ్ పూర్వీకుల రూ.15 వేల కోట్ల ఆస్తుల పరిస్థితేంటి?
భోపాల్: బ్రిటిషర్లకాలంలో ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ ప్రాంతాల్లో పటౌడీ సంస్థానాన్ని పాలించిన హమీదుల్లాహ్ రాజకుటుంబానికి చెందిన రూ.15,000 కోట్ల విలువైన ఆస్తులు ఎవరి పరం కానున్నాయనే ప్రశ్న తలెత్తింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పూర్వీకులకు చెందిన ఈ ఆస్తులు ఇప్పుడు ఎవరికి చెందుతాయనే అంశం మరోసారి తెరమీదకొచ్చింది. సైఫ్ వాళ్ల నానమ్మ.. పటౌడీ సంస్థానానికి అసలైన వారసురాలని సీనియర్ న్యాయవాది జగదీశ్ ఛవానీ వాదిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ వాదన దీనికి భిన్నంగా ఉంది. ‘‘ స్వాతంత్య్రం వచ్చేనాటికి భోపాల్ కేంద్రంగా పాలిస్తున్న పటౌడీ సంస్థానానికి ముహమ్మద్ హమీదుల్లాహ్ చివరి నవాబ్‌గా ఉన్నారు. ఆయన తదనంతరం ఆయన పెద్దకుమార్తె అబీదా సుల్తాన్ బేగమ్‌కు ఈ ఆస్తులు దక్కుతాయి. అయితే స్వాతంత్య్రం వచ్చాక విభజన సమయంలో ఆమె పాకిస్తాన్‌కు వలసవెళ్లారు. ఈ లెక్కన ఇప్పుడు వారసులు భారత్‌లో లేరు. అందుకే శత్రు ఆస్తుల చట్టం కింద ఆ ఆస్తులన్నీ ఇప్పుడు కేంద్ర హోం శాఖ పరిధిలోని భారత శత్రు ఆస్తుల సంరక్షణ సంస్థ(సీఈపీఐ) పర్యవేక్షణలోకి వస్తాయి’’ అని మోదీ సర్కార్ చెబుతోంది. ప్రభుత్వ వాదనను లాయర్ ఛవానీ కొట్టిపారేశారు. ‘‘ పెద్దకుమార్తె అబీదా పాకిస్తాన్‌కు వెళ్లిన తర్వాత 1960లో హమీదుల్లాహ్ మరణించారు. దాంతో ఆస్తి వారసత్వంగా తనకే వస్తుందని రెండో కుమార్తె సాజిదా సుల్తాన్ బేగమ్ భారత ప్రభుత్వాన్ని కోరారు. అందుకు సమ్మతిస్తూ 1962 జనవరి 10న కేంద్రం ఒక ఉత్తర్వు జారీచేసింది. ఈ లెక్కన సాజిదా అసలైన వారసురాలు. ఆమె నుంచి వారసత్వంగా సాజిదా కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ(టైగర్ పటౌడీ) ఆయన తదనంతరం సైఫ్ అలీ ఖాన్ ఆ ఆస్తులకు హక్కుదారు అవు తారు’’ అని ఛవానీ వాదించారు. తమ ఆస్తులను శత్రు ఆస్తులుగా లెక్కకట్టొద్దని, మోదీ ప్రభుత్వం తెచ్చిన శత్రు ఆస్తుల(సవరణ, ధృవీకరణ) చట్టాన్ని సవాల్ చేస్తూ టైగర్ పటౌడీ భార్య, అలనాటి బాలీవుడ్ నటి షర్మిలా ఠాకూర్ 2015లో మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గత ఏడాది డిసెంబర్ 13న జస్టిస్ వివేక్ ఆగ్రావాల్ విచారణ చేపట్టారు. సైఫ్ తల్లి షర్మిలా వేసిన పిటిషన్‌ను ప్రభుత్వ న్యాయవాది తప్పుబట్టారు. ఇప్పుడు శత్రు ఆస్తుల చట్టం,1968 లేదు. దాని స్థానంలో 2017లో కొత్త చట్టమొచ్చింది. ఏమైనా ఫిర్యాదులుంటే సంబంధిత అప్పీలేట్ అథారిటీ ముందు గోడు వెళ్లబోసుకోండి’’ అని సూచించారు. దీనిపై జడ్జీ స్పందిస్తూ.. ‘‘ వాస్తవాలను పరిగణించాక సైఫ్ కుటుంబం ముంబైలోని సీఈపీఐ ఆఫీస్‌లో అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల గడువు ఇస్తున్నాం’’ అని జడ్జి వ్యాఖ్యానించారు. ఆరోజు జడ్జి ఇచ్చిన గడువు ఇప్పడు ముగిసిపోయింది. గడువులోపు సైఫ్ కుటుంబం ముంబై సీఈపీఐ ఆఫీస్‌లో అప్పీల్ చేయలేదు. జనవరి 16వ తేదీన కత్తిపొట్లకు గురై ఆస్పత్రి పాలైన సైఫ్ బాగోగులు చూడటంలోనే వాళ్ల కుటుంబానికి ఉన్న పుణ్యకాలం గడిచిపోయింది. ఇప్పుడు వాళ్లకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందా? లేదా అనేదే అసలు ప్రశ్న. ‘‘ దాడి జరిగిందన్న కారణం చూపి హైకోర్టు గడువు పొడిగించాలని కోరతాం’’ అని న్యాయవాది చెప్పారు. -
సైఫ్‌పై దాడి.. విచారణలో మరికొన్ని కీలక విషయాలు
ముంబై : బాలీవుడ్ నటుడు సైఫ్ అలిఖాన్పై దాడి ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సైఫ్‌పై దాడి అనంతరం నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం, ముంబై కస్టడీలో ఉన్న నిందితుడికి సంబంధించి పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు.‘ సైఫ్ దాడి చేసిన వ్యక్తి బంగ్లాదేశీ అని పోలీసులు నిర్ధారించారు. షరీఫుల్ మేఘాలయ మీదుగా భారత్‌లోకి ప్రవేశించాడని పోలీసులు గతంలో చెప్పారు. తాజాగా, షరీఫుల్ బంగ్లాదేశీయుడేనని నిర్ధారించేలా గుర్తింపు కార్డులు లభ్యమయ్యాయని తెలిపారు. మొదటి గుర్తింపు కార్డులో షరీఫుల్ మార్చి 3, 1994న జన్మించాడని మహ్మద్ రూహుల్ ఇస్లాం కుమారుడని తెలిపే ఆధారాలు ఉన్నాయి. రెండవ గుర్తింపు కార్డు.. లెర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్. ఇది షరీఫుల్ దక్షిణ-మధ్య బంగ్లాదేశ్‌లోని బారిసాల్ ప్రాంత నివాసి అని సూచిస్తోంది. లైసెన్స్ నవంబర్ 2019లో జారీ చేయగా.. ఫిబ్రవరి 2020లో గడువు ముగియాల్సి ఉండగా.. డ్రైవింగ్ లైసెన్స్ ప్రాక్టికల్ పరీక్ష కోసం మార్చి 18, 2020కి హాజరయ్యాడు. ఇప్పటికే.. 12వ తరగతి వరకు చదివిన షరీఫుల్ ఏడు నెలల క్రితం మేఘాలయ మీదుగా భారత్‌లోకి ప్రవేశించాడని పోలీసులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో కొంతకాలం ఉన్నాడని, అనుమానం రాకుండా నిందితుడు తన పేరును బిజోయ్ దాస్‌గా మార్చుకుని స్థానిక నివాసి ఆధార్ కార్డును ఉపయోగించి మొబైల్ ఫోన్ సిమ్ కార్డును కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. -
ఏంటి సైఫ్? అర లక్ష ఏం సరిపోతుంది? కనీసం రూ.11 లక్షలైనా..: సింగర్
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)ను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి అతడి ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‌పై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపదలో ఆదుకున్న నీకు ఏమిచ్చినా తక్కువే అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇప్పటికే సైఫ్ సదరు ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానాను కలిసి అతడికి కృతజ్ఞతలు తెలిపాడు. రూ.50 వేల నగదును బహుమానంగా ఇచ్చాడు. అలాగే ముంబైకి చెందిన ఓ సంస్థ కూడా రానాకు రూ.11 వేల రివార్డు అందించింది.రూ.1 లక్ష సాయం ప్రకటించిన సింగర్తాజాగా సింగర్ మికా సింగ్.. ఆటో డ్రైవర్‌కు రూ.1 లక్ష సాయం ప్రకటించాడు. ఈమేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టాడు. ఇండియా ఫేవరెట్ సూపర్‌స్టార్‌ను కాపాడిన అతడికి కనీసం రూ.11 లక్షలైనా రివార్డుగా ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సమయానికి హీరోలా వచ్చి కాపాడాడు. దయచేసి అతడి వివరాలు ఎవరైనా నాకు తెలియజేస్తారా? అతడు చేసిన మంచి పనికి మెచ్చుకోలుగా రూ.1 లక్ష సాయం చేయాలనుకుంటున్నాను అని పేర్కొన్నాడు.అతడు రియల్ హీరోసైఫ్ అర లక్ష సాయం చేశాడని రాసున్న పోస్ట్‌ను షేర్ చేస్తూ.. సైఫ్ భాయ్, దయచేసి అతడికి రూ.11 లక్షలివ్వు. అతడు రియల్ హీరో. ముంబై ఆటోవాలా జిందాబాద్ అని రాసుకొచ్చాడు. కాగా జనవరి 16న సైఫ్ అలీఖాన్ ఇంట్లో ఓ దుండగుడు చొరబడ్డాడు. సైఫ్ చిన్నకుమారుడి జెహ్ దగ్గర అతడిని చూసిన పనిమనిషి గట్టిగా కేకలు వేసింది. ఆ శబ్దం విని కిందకు వచ్చిన సైఫ్.. దుండగుడిని అడ్డుకున్నాడు. ఈ క్రమంలో అతడు తన దగ్గరున్న కత్తితో నటుడిని పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు.(చదవండి: రామ్‌గోపాల్‌వర్మకు మూడు నెలల జైలు శిక్ష)ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్తీవ్ర గాయాలతో రక్తమోడుతున్న సైఫ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సమయానికి కారు కూడా అందుబాటులో లేదు. దీంతో అతడు నడుచుకుంటూ రోడ్డు మీదకు రాగా ఓ ఆటో డ్రైవర్ అతడిని చూసి హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సకాలంలో సైఫ్‌కు చికిత్స అందడంతో ప్రాణాపాయం తప్పింది. సైఫ్ శరీరంపై ఆరు చోట్ల గాయాలవగా వెన్నెముక దగ్గర 2.5 అంగుళాల కత్తిమొనను వైద్యులు సర్జరీ చేసి తొలగించారు.నిందితుడి అరెస్ట్నటుడిపై దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు. అతడిని బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్‌గా గుర్తించారు. భారత్‌కు వచ్చాక బిజయ్ దాస్‌గా పేరు మార్చుకున్నాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు.చదవండి: ఐటీ దాడులపై స్పందించిన వెంకటేశ్, అనిల్ రావిపూడి -
సైఫ్‌పై నిజంగానే దాడి జరిగిందా? యాక్టింగా?
నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. చివరకు నిందితుడు పట్టుబడడంతో ప్రతిపక్షాల విమర్శలకు పుల్‌స్టాప్ పడింది. అయితే ఈ ఘటనపై తాజాగా మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు.ఘటన జరిగాక ఐదు రోజులకు నటుడు సైఫ్ ముంబై లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే ఈ పరిణామం ఆధారంగా నితేష్ రాణే తన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే దాడి జరిగిందా? లేక ఆయన నటించారా? అని ప్రశ్నించారాయన. పనిలో పనిగా ప్రతిపక్షాలను ఆయన తిట్టిపోశారు.పుణేలో జరిగిన ఓ ఈవెంట్లో రాణే మాట్లాడుతూ.. ఆస్పత్రి నుంచి ఆయన బయటకు వచ్చేటప్పుడు చూశా. ఆయన్ని నిజంగానే పొడిచారా? లేకుంటే నటిస్తున్నారా? అనే అనుమానం కలిగింది నాకు అని అన్నారు. అలాగే ఈ విషయంలో ప్రతిపక్షాలు చేసిన రాద్ధాంతం కూడా నాకు అలాగే అనిపించింది. కేవలం ఖాన్ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే వాళ్లు స్పందిస్తారా?.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై స్పందించరా? అని ప్రశ్నించారాయన.సుప్రియా సూలే.. సైఫ్ అలీ ఖాన్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. షారూక్ కొడుకు గురించి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ గురించి బాధపడ్డారు. కానీ, ఓ హిందూ నటుడి కష్టాల గురించి ఆమె ఏనాడైనా ఆలోచించారా?. అన్నారు.గతంలో బంగ్లాదేశీయులు ముంబై ఎయిర్‌పోర్టు వరకే పరిమితమయ్యారు. ఇప్పుడు ఏకంగా ఇళ్లలో చొరబడుతున్నారు. బహుశా వాళ్లు ఆయన్ని(సైఫ్)ను తీసుకెళ్లడానికే వచ్చి ఉంటారేమో! అని రాణే సెటైర్ వేశారు.మహా మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే తనయుడే ఈ నితీశ్ నారాయణ రాణే. శివసేనతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి.. కాంగ్రెస్, ఆపై బీజేపీలో చేరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కనకవల్లి నియోజకవర్గం నుంచి గెలుపొంది హ్యాటట్రిక్ ఎమ్మెల్యే ఘనత అందుకున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.నితీశ్ నారాయణ రాణేకు వివాదాలూ కొత్తేం కాదు. 2009లో మరాఠీ చిత్రం ‘జెండా’లో తన తండ్రి నారాయణ రాణే పాత్రను అభ్యంతరకంగా చూపించారంటూ నిరసనలకు దిగి తొలిసారి ఆయన మీడియాకు ఎక్కారు. ఆపై ఓ చిరువ్యాపారిపై హత్యాయత్నం చేశారనే కేసు నమోదు అయ్యింది. 2013లో ముంబైని గుజరాతీలు విడిచివెళ్లిపోవాలంటూ మోదీకి వ్యతిరేకంగా ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. అదే ఏడాదిలో గోవాలో ఓ టోల్‌బూత్‌ను ధ్వంసం చేసిన కేసులో అరెస్టయ్యారు. 2017లో ఓ ప్రభుత్వ అధికారిపైకి చేపను విసిరిన కేసులో, 2019లో ఓ అధికారిపై దాడి చేసిన కేసులో అరెస్టై జైలుకు కూడా వెళ్లారు. తాజాగా.. కిందటి నెలలో కశ్మీర్‌ను మినీ పాకిస్థాన్‌గా అభివర్ణించి విమర్శలు ఎదుర్కొన్నారు. ఆపై కేరళ అంటే అందరికీ ఇష్టమేనంటూ మాట మార్చారు. -
సైఫ్ అలీ ఖాన్ కు మరో షాక్?
-
ఆటో డ్రైవర్‌ను కలిసిన సైఫ్ అలీఖాన్.. ఎంత నగదు ఇచ్చారంటే?
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ తన ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‌ను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సైఫ్‌పై దాడి జరిగిన తర్వాత ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానా తన ఆటోలోనే లీలావత్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు. సకాలంలో ఆస్పత్రికి చేరుకోవడంతో సైఫ్‌కు ప్రాణాపాయం తప్పింది. దీంతో ఆటో డ్రైవర్‌ను పలువురు అభినందించారు.ఈనెల 16న సైఫ్ ఇంట్లోకి చోరీకి యత్నించిన వ్యక్తి హీరోపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ అలీ ఖాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వెంటనే సైఫ్ ఆస్పత్రికి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ సమయంలో సైఫ్‌ను ఆటోలో ముంబయిలోని లీలావతికి తీసుకెళ్లారు భజన్ సింగ్. ఆ సమయంలో అతనెవరో తాను గుర్తు పట్టలేదన్నారు. సకాలంలో ఆస్పత్రికి చేర్చడమే తన లక్ష్యంగా ఆటో నడిపినట్లు భజన్ సింగ్ వెల్లడించారు. అయితే సైఫ్ ప్రాణాలు కాపాడిన భజన్ సింగ్‌కు ముంబయికి చెందిన ఓ సంస్థ రూ.11 వేల రివార్డ్ అందించింది. సైఫ్ ఆర్థిక సాయం..తన ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‌కు సైఫ్ అలీ ఖాన్ ఆర్థిక సాయమందించారు. తనవంతుగా రూ.50 వేలను భజన్ సింగ్ రానాకు అంద జేశారు. ఈ సందర్భంగా ఆపద సమయంలో తనను రక్షించినందుకు అతనికి సైఫ్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే అంతకు ముందు తన ఆటోలో వచ్చింది సైఫ్ అలీఖాన్ అని తెలియదని.. వారి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని భజన్ సింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.నిందితుడి అరెస్ట్.. సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందిచతుడి ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన మహమ్మద్ షరీఫుల్‌గా అతన్ని గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన కోర్టులో హాజరు పరచగా ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది. దీంతో పోలీసులు అతనితో పాటు సైఫ్ ఇంటికి వెళ్లి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. -
పటౌడీ ఆస్తుల కేసు.. సైఫ్ ఫ్యామిలీకి బిగ్ షాక్ తప్పదా?
ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ తన ఇంట్లోనే దాడికి గురై వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఆరు రోజుల చికిత్స తర్వాత కోలుకుని ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే తాజాగా ఆయన కుటుంబానికి మరో షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఆయన కుటుంబానికి చెందిన రూ.15,000 కోట్ల ఆస్తులను మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది.2011లో సైఫ్ అలీఖాన్(Saif Ali khan) తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మృతి చెందారు. ఆ తర్వాత సైఫ్‌కు భోపాల్ నవాబ్‌గా బిరుదు లభించింది. ప్రస్తుతం పటౌడీ కుటుంబానికి సైఫ్ అలీ ఖాన్ వారసుడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పటౌడీ కుటుంబానికి చెందిన ఆస్తులు ఉన్నాయి. అదే సమయంలో అక్కడి ఆస్తుల గురించి ఎప్పటి నుంచో వివాదాలు కోర్టులో నడుస్తూనే ఉన్నాయి. సైఫ్ అలీ ఖాన్, షర్మిలా ఠాగూర్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులు అక్కడ ఉన్నాయి. కోహెఫిజా నుండి చిక్లోడ్ వరకు విస్తరించి ఉన్నాయి. ఆ కుటుంబానికి చెందిన సుమారు 100 ఎకరాల భూమిలో దాదాపు లక్షన్నర మంది నివసిస్తున్నారు. అయితే.. ఆ చారిత్రక భూమిపై ఎనిమీ ప్రాపర్టీ కేసులో గత 10 ఏళ్లుగా కొనసాగుతున్న స్టే ఇప్పుడు ముగిసింది. ఆస్తిపై దావా వేయడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు సైఫ్ కుటుంబానికి 30 రోజుల సమయం ఇచ్చింది. అయినా సైఫ్ అలీ ఖాన్ కుటుంబం ఎటువంటి దావా వేయలేదు. కానీ ఇప్పుడు ఆ గడువు ముగిసిపోవడంతో.. తర్వాత ఏం జరగనుందా? అనే ఉత్కంఠ మొదలైంది. ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్(Enemy Property Act) 1968 ప్రకారం విభజన తర్వాత పాకిస్థాన్‌కు వెళ్లిన వ్యక్తులు భారత్‌లో వదిలిపెట్టిన ఆస్తులపై కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుంది.ఈ చట్టం ప్రకారం భోపాల్ చివరి నవాబు ఆస్తులను ప్రభుత్వం నియత్రించాలని ప్రయత్నించింది. అయితే.. సైఫ్ కుటుంబం ఈ నిర్ణయాన్ని 2015లో సవాల్ చేశారు. దీంతో.. కోర్టు స్టే విధించింది. అయితే తాజాగా ఆ స్టేను కోర్టు ఎత్తేసింది. దీంతో ప్రభుత్వం ఆ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. పటౌడీ చివరి నవాబు పెద్ద కుమార్తె యువరాణి అబిదా సుల్తాన్ ఎప్పుడో పాకిస్థాన్ వెళ్లారు. అందువల్ల నవాబు ఆస్తిని శత్రువు ఆస్తిగా(ఎనిమీ ప్రాపర్టీ) ప్రకటించారు. అయితే.. నవాబ్ మరణం తరువాత అతని రెండో కుమార్తె మెహర్ తాజ్ సాజిదా సుల్తాన్ బేగం భోపాల్ వారసత్వ చట్టం 1947 ప్రకారం ఎస్టేట్‌కు వారసురాలుగా ప్రకటించారు. ఇప్పుడు పిటిషన్ వేసిన పటౌడీ కుటుంబంలోని సైఫ్ అలీ ఖాన్, షర్మిలా ఠాకూర్‌వంటివారు సాజిదా(Sajida) వారసులు. ఈ నేపథ్యలో ఆస్తిపై తమకూ హక్కు ఉందని సైఫ్ ఫ్యామిలీ కోర్టులో దావా వేసింది. వారసత్వ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా డివిజెన్ బెంచ్‌లో ఉత్తర్వులను పటౌడీ కుటుంబం సవాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
సైఫ్ అలీఖాన్‌కు సెక్యూరిటీగా 'జై లవకుశ' నటుడి టీమ్
బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ముంబైలోని ఆయన స్వగృహంలో ఈ నెల 16న సైఫ్‌పై దుండగుడు దాడి చేసి, కత్తితో గాయపరచిన సంగతి తెలిసిందే. అదే రోజు అక్కడి లీలావతి హాస్పిటల్లో చేరిన సైఫ్ కోలుకోవడంతో వైద్యులు మంగళవారం డిశ్చార్జ్ చేశారు. వారంరోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించారు. ప్రస్తుతం జరిగిన సంఘటనల దృష్ట్యా సైఫ్ కుటుంబం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. సైఫ్‌పై దాడి చేసిన బంగ్లాదేశ్‌కి చెందిన దుండగుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడు.(ఇదీ చదవండి: చిత్ర పరిశ్రమలో ఉండటం ఇష్టం లేదు.. కారణం ఇదే: నిత్య మేనన్)సైఫ్ అలీఖాన్ రక్షణ కోసం బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ (Ronit Roy) ఎంట్రీ ఇచ్చారు. కొన్నేళ్లుగా ముంబైలో ఆయన సెక్యూరిటీ ఏజెన్సీని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సైఫ్‌ఫై దాడి జరిగిన తర్వాత వారు వెంటనే తమ కుటుంబానికి రక్షణగా వ్యక్తిగత సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు సైఫ్ కుటుంబం పూర్తిగా రోనిత్ రాయ్ సెక్యూరిటీలో ఉంది. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'మేం కొద్దిరోజులుగా సైఫ్‌తోనే ఉన్నాం.. ఆయన ఆరోగ్యం కుదుటపడింది. ఎలాంటి ఇబ్బంది లేదు' అని తెలిపారు.రోనిత్ రాయ్ నటుడు మాత్రమే కాదు వ్యాపారవేత్త కూడా.. బాలీవుడ్లో సుమారు 50కి పైగా చిత్రాల్లో నటించిన రోనిత్ తెలుగులో కూడా పలు సినిమాల్లో కీలకపాత్రలలో కనిపించాడు. ఎన్టీఆర్ ‘జై లవకుశ’, విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాల్లో ఆయన పాత్రలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్లో 2018 థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్రంలో చివరగా ఆయన కనిపించాడు. డైరెక్టర్ పూరి కోరిక మేరకు 2022లో లైగర్ సినిమాలో ఆయన నటించాడు. జనవరి 16న సైఫ్ ఇంట్లోకి బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ (30) చొరబడిన సంగతి తెలిసిందే. అతడిని అడ్డుకునేందుకు సైఫ్ ప్రయత్నించగా అతనికి ఆరు చోట్ల కత్తి గాయాలయ్యాయి. ఆయన చేతికి, మెడకు, వెన్నుకు తీవ్రమైన కత్తిపోటు గాయాలయ్యాయి. రక్తపు గాయాలను లెక్కచేయకుండా తన వెన్నులోకి దిగిన కత్తి ముక్కతోనే లీలావతి ఆసుపత్రిలో చేరాడు. డాక్టర్లు శస్త్రచికిత్స ద్వారా ఆ కత్తిని తొలగించారు. దొంగను సైఫ్ గట్టిగా బంధించడం వల్లే కత్తితో దాడి చేసినట్లు ఒక పోలీసు అధికారి వెళ్లడించారు. -
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి.. ఆటో డ్రైవర్‌కు పారితోషికం ఎంత ఇచ్చారంటే? (ఫోటోలు)
-
Saif Ali Khan: ఆసుపత్రి నుంచి సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్
-
ఆస్పత్రి నుంచి సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్
ముంబయిలోని లీలావతి ఆస్పత్రి నుంచి సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్ అయ్యారు. ఈనెల 16 న ఆయనపై దొంగతనానికి వచ్చిన వ్యక్తి దాడి చేయడంతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైఫ్ ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు ఐదు రోజులు పాటు ఆస్పత్రిలో చికిత్సపొందిన సైఫ్ ఇంటికి చేరుకున్నారు. కాగా.. ఈనెల 16న తెల్లవారు జామున సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగింది. ఆయన ఇంట్లోకి చొరబడిన దుండగుడు.. హీరోపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత తన కుమారుడితో కలిసి ఆటోలోనే ఆస్పత్రికి చేరుకున్నారు. సైఫ్‌ను పరిశీలించిన వైద్యులు ఆయన సకాలంలో చికిత్స అందించారు. దాదాపు ఐదు రోజుల పాటు సైఫ్ ఆస్పత్రిలోనే ఉన్నారు. నిందితుడి అరెస్ట్..ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ షరీఫుల్‌గా పోలీసులు గుర్తించారు. ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించిన షరీఫుల్ తన పేరును విజయ్ దాస్‌గా మార్చుకుని తిరుగుతున్నారు. కేవలం దొంగతన కోసమే అతను సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించినట్లు నిందితుడు వెల్లడించారు. పోలీసు కస్టడీ.. నిందితుడిని అరెస్ట్ చేసిన కోర్టులో హాజరు పరచగా పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఐదు రోజుల పాటు పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది. -
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న సైఫ్.. బిల్ ఎంతో తెలుసా..?
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ఆసుపత్రి నుంచి నేడు డిశ్చార్జ్ కానున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాడని లీలావతి ఆసుపత్రి(Lilavati Hospital) వైద్యులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 2 తర్వాత ఆయన డిశ్చార్జ్ అవుతారని వారు తెలిపారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయని తెలిపారు. దాడిలో భాగంగా సైఫ్ వెన్నెముకకు తీవ్రగాయం అయింది. దీంతో సర్జరీ చేసిన వైద్యులు వెన్నెముక నుంచి కత్తిని తొలగించారు.సైఫ్‌పై దాడి కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ప్రధాన నిందితుడైన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను విచారించిన పోలీసులు క్రైమ్‌సీన్ రీక్రియేషన్ కోసం నిందితుడిని సైఫ్ ఇంటి వద్దకు తీసుకెళ్లారు. నిందితుడి వేలిముద్రలను కూడా తీసుకున్నారు. ఫోరెన్సిక్ అధికారులు కూడా సైఫ్ ఇంటికి వెళ్లి దాడి జరిగిన ప్రదేశంలో నిందితుడి వేలిముద్రలు గుర్తించారు. ఇదే విషయాన్ని ఒక అధికారి కూడా ప్రకటించారు. ఇంట్లోని కిటికీలతో పాటు లోపలికి వచ్చేందుకు ఉపయోగించిన నిచ్చెనపై కూడా నిందితుడి వేలిముద్రలు ఉన్నాయన్నారు.(ఇదీ చదవండి: ప్రియురాలిని పెళ్లి చేసుకున్న ప్రముఖ దర్శకుడు)ఈ నెల 16న సైఫ్ ఇంటికి చోరీకి వెళ్లిన నిందితుడు మహ్మద్ షరీఫుల్ బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు ప్రకటించారు. దాడి తర్వాత తమ దేశానికి పారిపోయే ప్లాన్‌లో ఉండగా పట్టుకున్నట్లు వారు తెలిపారు. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో సైఫ్ చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సైఫ్ పూర్తి ఆసుపత్రి బిల్ రూ. 40 లక్షలు దాటినట్లు తెలుస్తోంది. అయితే, ఆయనకు ఇన్సూరెన్స్ ఉండటం వల్ల సదరు కంపెనీ వాళ్లు ఇప్పటి వరకు రూ.25 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది.సైఫ్‌పై దాడి జరిగిన సమయంలో అతన్ని ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ కూడా ఆ సమయంలో తండ్రితో పాటు ఉన్నాడు. అయితే, ఆటో డ్రైవర్ వారి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని తెలిపారు. కానీ, సైఫ్‌ను రక్షించినందుకు అతనికి ముంబయిలోని ఓ సంస్థ రూ.11 వేల రివార్డ్ ప్రకటించింది. సైఫ్ నేడు డిశ్చార్జ్ అయిన తర్వాత తనకు ఏమైనా సాయం చేయవచ్చని తెలుస్తోంది. -
దయచేసి ఇలాంటివి ఆపండి.. కరీనా కపూర్ ఆవేదన
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనలో ఆయన సతీమణి కరీనా కపూర్(Kareena Kapoor Khan) ఆవేదనతో ఒక పోస్ట్ చేశారు. ఈ ఘటనలో చాలామంది పూర్తి విషయాలు తెలుసుకోకుండానే అసత్యప్రచారాలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటన గురించి ప్రధాన మీడియాతో పాటు సోషల్‌మీడియాలో క్రియేట్ చేసిన వీడియోను ఓ బాలీవుడ్ నటుడు షేర్ చేయడంతో కరీనా తాజాగా రియాక్ట్ అయ్యారు.బాలీవుడ్ మీడియాలో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) గురించి చాలా కథనాలతో పాటు పలు వీడియోలు ప్రసారం చేస్తున్నారు. కొందరైతే ఏకంగా సైఫ్ ఇంటి చుట్టూ నిత్యం కెమెరాలతో తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఆయన కుటుంబం గురించి ఉన్నవీలేనివి కల్పించి ప్రచారాలు చేస్తున్నారు. తన కుమారులు తైమూర్, జెహ్ కోసం ఆయన కొత్త బొమ్మలు తెచ్చారని, చాలా సంతోషంగా పిల్లలతో సైఫ్ అలీఖాన్ ఆడుకుంటున్న ఫోటోలు ఇవిగో అంటూ షేర్ చేశారు. (ఇదీ చదవండి: త్రిష,టొవినో యాక్షన్ థ్రిల్లర్ సినిమా తెలుగులో విడుదల)ఈ వార్తలు చూసిన కరీనా కపూర్ ఆవేదనతో ఒక పోస్ట్ చేసింది. 'దయచేసి ఇలాంటివి ఆపండి. మమ్మల్ని వదిలేయండి' అంటూ వేడుకుంది. అయితే, కొన్ని క్షణాల్లోనే ఆమె దాన్ని డిలీట్ చేయడం గమనార్హం. ఇప్పటికే మీడియా వర్గాలు, ఫ్రీలాన్సర్లు సంయమనం పాటించాలని కరీనా కోరింది. తమ ప్రకటన లేకుండా ఊహాజనిత కథనాలకు దూరంగా ఉండాలని ఆమె కోరింది. ప్రస్తుతం తామె ఎంతో కఠినమైన రోజులను ఎదుర్కొంటున్నామని పరిస్థితిని అర్థం చేసుకుంటారని రిక్వెస్ట్ చేసింది. ఆ ఘటన నుంచి తేరుకునేందుకు వీలుగా తమ కుటుంబానికి కొంత సమయం ఇవ్వాలని ఆమె కోరింది.ఈ నెల 16న సైఫ్ ఇంటికి చోరీకి వెళ్లిన షరీఫుల్ ఇస్లాం షెహ్జాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫరీగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన అతను తమ దేశానికి పారిపోయే ప్లాన్‌లో ఉండగా పోలీసులు పట్టుకున్నారు. దాడిలో గాయపడిన సైఫ్ స్వల్ప శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న విషయం తెల్సిందే. -
సైఫ్ అలీఖాన్‌పై దాడి.. పారిపోవాలనుకున్నాడు
ముంబై: దొంగతనం కోసం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లో చొరబడి పెనుగులాటలో ఆయనను పొడిచి పారిపోయిన బంగ్లాదేశ్‌కు చెందిన నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెహ్జాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫరీక్ దాడి తర్వాత తన స్వదేశానికి వెళ్లిపోవాలని భావించాడు. పోలీసులు విచారణలో ఇలాంటి పలు అంశాలు తాజాగా వెల్లడయ్యాయి. గత గురువారం దాడిలో గాయపడిన సైఫ్ స్వల్ప శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న విషయం తెల్సిందే. విదేశీయులు, పాస్‌పోర్ట్ చట్టాల కింద కేసు నమోదు తాను ఏడు నెలల క్రితం బంగ్లాదేశ్ నుంచి వచ్చినట్లు షరీఫుల్ ఒప్పుకున్నాడు. అతని ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్‌నూ పోలీసులు సంపాదించారు. దాంతో అతని బంగ్లాదేశ్‌లోని ఘలోకతి జిల్లావాసిగా రూఢీఅయింది. అక్రమంగా భారత్‌లో చొరబడ్డ నేరానికి అతనిపై విదేశీయుల చట్టం, పాస్‌పోర్ట్ చట్టం కింద సైతం కేసు నమోదుచేశారు. భారతీయ పాస్‌పోర్ట్ సంపాదించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో ఎలాగైనా డబ్బు బాగా సంపాదించి స్వదేశం వెళ్లిపోవాలని ప్లాన్ వేశాడు. అందుకే ఐదునెలలు ముంబైలో హౌస్‌కీపింగ్ వంటి చిన్నాచితకా పనులు చేసిన అతను వాటిని పక్కనబెట్టి దొంగతనాలకు సిద్ధమయ్యాడు. ఇందులోభాగంగానే సైఫ్ ఇంట్లో చొరబడ్డాడు. అయితే తాను దాడి చేసింది బాలీవుడ్ నటుడిపై అనే విషయం తనకు టీవీల్లో వార్తల్లో చూసేదాకా తెలియదని పోలీసు విచారణలో ఫరీఫుల్ చెప్పాడు. సీసీటీవీ ఫుటేజీలోని తన ఫొటో న్యూస్‌ఛానెళ్లలో ప్రసారం కావడంతో భయపడిపోయాడు. సెలబ్రిటీపై దాడి నేపథ్యంలో పోలీసులు ఎలాగైనా తనను పట్టుకుంటారని భయపడి మళ్లీ బంగ్లాదేశ్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈలోపే పోలీసులు పట్టుకోగలిగారు.ఎలా పట్టుకోగలిగారు? వర్లీలో గతంలో తాను పనిచేసిన పబ్ ప్రాంగణంలో జనవరి 16న నిద్రించిన నిందితుడు ఆరాత్రి హఠాత్తుగా మాయమై నేరుగా సైఫ్ ఇంట్లోకి వచ్చి దాడి చేసి తర్వాత బాంద్రా రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు. తర్వాత దాదర్‌కు, ఆ తర్వాత వర్లీకి వెళ్లాడు. చివరకు థానే ప్రాంతంలో ఉన్నప్పుడు పోలీసులకు పట్టుబట్టాడు. సైఫ్ ఇంటి సమీప ప్రాంతాల్లోని అన్ని సీసీటీవీ కెమెరాలను చూసినా ఇతను ఏ దిశగా వెళ్లాడనే బలమైన క్లూ పోలీసులకు దొరకలేదు. దీంతో పాత సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా జనవరి 9వ తేదీన అంధేరీ వద్ద బైక్‌పై వెళ్తున్న వీడియోలో ఇతడిని గుర్తించారు. బైక్ యజమానిని ప్రశ్నించగా బైక్‌పై వెళ్లింది తనకు తెల్సిన ఒక నిర్మాణరంగ మేస్త్రీ దగ్గర పనిచేసిన కూలీ అని సమాధానమిచ్చాడు. దీంతో పోలీసులు ఆ మేస్త్రీని విచారించారు. గతంలో చిన్నాచితకా పనుల కోసం వర్లీ ప్రాంతంలోని మేస్త్రీ దగ్గరకు వచ్చి పని ఉంటే చెప్పాలని తన ఫోన్‌నంబర్ ఇచ్చి ఫరీఫుల్ తర్వాత థానె వెళ్లిపోయాడు. ఈ విషయం పోలీసులకు తెల్సి మేస్త్రీని విచారించగా షరీఫుల్ మొబైల్ నంబర్‌ను అందజేశాడు. తాజాగా శనివారం షరీఫుల్ వర్లీ సెంచురీ మిల్ వద్ద బుర్జీపావ్, వాటర్ బాటిల్ కొన్నప్పుడు ఈ నంబర్‌తో చేసిన గూగుల్‌పే లావాదేవీతో ఫోన్ లొకేషన్‌ను పోలీసులు పసిగట్టారు. అయితే అప్పటికే అతను థానెలోని దట్టమైన మడ అడవుల్లోకి పారిపోయాడని తెల్సి వేట మొదలెట్టారు. చిట్టచివరకు ఆదివారం తెల్లవారుజామున హీరానందానీ ఎస్టేట్ దగ్గరి లేబర్క్యాంప్ సమీప అడవిలో పట్టుకోగలిగారు. ఆరోజు ఘటన తర్వాత దొరక్కుండా తప్పించుకునేందుకు షరీఫుల్ వెంటనే దుస్తులు మార్చేశాడు. అయితే వెంట తెచ్చుకున్న బ్యాక్‌ప్యాక్ సైతం ఒకరకంగా ఇతడిని పట్టించింది. ఆ ప్రాంతంలో అదే బ్యాక్‌ప్యాక్ వేసుకున్న, అదే పోలికలున్న వ్యక్తులను విచారించి షరీఫుల్‌ను పోల్చుకోగలిగారు. దాడి రోజున ఏం జరిగిందో తెల్సుకునేందుకు నిందితుడిని సద్గురుశరణ్ బిల్డింగ్‌లోని సైఫ్ ఫ్లాట్‌కు తీసుకెళ్లి పోలీసులు అతనితో సీన్ రీక్రియేషన్ చేయించే వీలుంది. -
సైఫ్ అలీ ఖాన్‌ను గుర్తు పట్టలేదు.. డబ్బులు కూడా తీసుకోలేదు: ఆటో డ్రైవర్
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సైఫ్ ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఇంట్లో చోరికి యత్నించిన షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్‌ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని 30 ఏళ్ల బంగ్లాదేశీయునిగా(Bangladesh) పోలీసులు గుర్తించారు. అతని అసలు పేరు షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్. భారత్ వచ్చాక బిజయ్ దాస్‌గా పేరు మార్చుకున్నాడని అధికారులు తెలిపారు.అయితే దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్‌ను ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ తండ్రిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆటో డ్రైవర్ వారి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని తెలిపారు. అయితే సైఫ్‌ను రక్షించినందుకు అతనికి ముంబయిలోని ఓ సంస్థ రూ.11 వేల రివార్డ్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ భజన్ సింగ్ ఆ రోజు రాత్రి జరిగిన విషయాన్ని వెల్లడించారు. తాను ఆటోలో వెళ్తండగా ఓ మహిళ ఆగండి అంటూ గట్టిగా అరిచిందని.. దీంతో వెంటనే యూ టర్న్ తీసుకుని బిల్డింగ్ గేట్ దగ్గరికి వచ్చానని తెలిపాడు. అక్కడి రాగానే ఆ వ్యక్తి దుస్తులంతా ఎర్రగా రక్తంతో తడిసిపోయి ఉన్నాయి.. అప్పుడు సమయం దాదాపు 2 గంటల 45 నిమిషాలవుతోందని అతను వివరించాడు. రోడ్డు పూర్తిగా నిర్మానుష్యంగా ఉండడంతో.. బాంద్రా వెస్ట్ నుంచి టర్నర్ రోడ్, హిల్ రోడ్ ద్వారా లీలావతి హాస్పిటల్‌కు చేరుకున్నాం. వారివెంట వచ్చిన పిల్లవాడు మధ్యలో కూర్చున్నాడు.. అతని కుడి వైపున గాయపడిన వ్యక్తి (సైఫ్) కూర్చున్నాడు.. కానీ రాత్రి కావడంతో నేను అతన్ని గుర్తించలేకపోయాను.. వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేరుకోవడమే లక్ష్యంగా ఆటోను నడిపినట్లు వెల్లడించారు. -
సైఫ్ ఇంట్లోకి దొంగోడు ఎలా చేరాడో, ఎలా తప్పించుకున్నాడో తెలుసా?
-
సైఫ్ అలీఖాన్‌కు తెలీకుండా భార్యనే నిద్రమాత్రలిచ్చింది: చిత్రనిర్మాత
బాలీవుడ్ నటీనటుల వ్యక్తిగత జీవితాలు ఎప్పుడూ టాక్ ఆఫ్ ది కంట్రీగా మారుతూనే ఉంటాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ మీద జరిగిన హత్యాయత్నం తదనంతర పరిణామాలు సైఫ్ వ్యక్తిగత జీవితాన్ని మరోసారి వార్తల్లోకి ఎక్కించాయి. ప్రస్తుతం నటుడు సైఫ్ అలీఖాన్ భార్య కరీనాకపూర్ అయినప్పటికీ ఆయనకు ఇది తొలి వివాహం కాదు. ఆయన తొలుత సహ నటి అమృతా సింగ్‌ను వివాహం చేసుకుని 13 సంవత్సరాల పాటు దాంపత్య జీవితం గడిపారు. ఆ తర్వాత కొన్ని మనస్పర్ధల కారణంగా ఈ జంట చివరకు 2004లో విడాకులు తీసుకున్నారు.ఇదిలా ఉంటే గతంలో అమృతా సింగ్ తన భర్తకు నిద్రమాత్రలు ఇచ్చిందనే విషయం చాలా కాలం క్రితమే వెల్లడైనప్పటికీ మరోసారి ఇప్పుడు ఆ విషయం హల్చల్ చేస్తోంది. చిత్రనిర్మాత, సూరజ్ బర్జాత్యా ఒకసారి ఒక చిత్రం షూటింగ్లో ఉన్నప్పుడు సైఫ్ అలీఖాన్ గురించి పలు విషయాలను వెల్లడించారు. అందులో భాగంగానే సైఫ్ అలీఖాన్‌కి అమృతా సింగ్ నిద్రమాత్రలు ఇచ్చిన విషయాన్ని కూడా ఆయన బయటపెట్టారు.దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... ఈ సంఘటన హమ్ సాథ్ సాథ్ హై చిత్రం షూటింగ్ సమయంలో జరిగింది ఈ చిత్రంలో సైఫ్‌తో పాటు కరిష్మా కపూర్, సల్మాన్ ఖాన్, సోనాలి బింద్రే, మోహ్నీష్ బహ్ల్, టబు కీలక పాత్రల్లో నటించారు. హమ్ సాత్ సాథ్ హై సెట్స్‌లో మేకర్స్ ఆశించినట్టుగా ఖచ్చితమైన షాట్‌ను ఖచ్చితంగా చేయడానికి వీలుగా సైఫ్ అలీ ఖాన్ సరైన పరిస్థితిలో లేడు. అతనికి కారణాలేమో తెలీదు కానీ అంతకు ముందు రాత్రి నిద్ర సరిగా లేకపోవడంతో చాలా రీటేక్‌లు ఇవ్వాల్సి వచ్చింది.‘‘హమ్ సాథ్ సాథ్ హై’ షూటింగ్ సమయంలో సైఫ్ అలీఖాన్ వ్యక్తిగత జీవితం చాలా హెచ్చు తగ్గులు ఎదుర్కొంది. అందుకే ఎప్పుడూ టెన్షన్లో ఉండేవాడు. ఈ చిత్రంలోని ‘సునో జీ దుల్హన్’ పాట షూటింగ్ సమయంలో సైఫ్ అలీఖాన్ పలు మార్లు రీటేక్‌లు తీసుకుంటున్నాడు. ఆ పాత్రను ఎలా పండించాలా అని ఆలోచిస్తూ అతను రాత్రంతా నిద్రపోలేదు. నేను అతని మొదటి భార్యతో మాట్లాడినప్పుడు ఈ విషయం నాకు తెలిసింది’’ అంటూ సూరజ్ బర్జాత్యా గుర్తు చేసుకున్నారు.అప్పుడు ఆయన సైఫ్ అలీఖాన్ భార్య అమృతాసింగ్కు ఓ సలహా ఇచ్చాడు. ’’అతను రాత్రంతా నిద్రపోవడం లేదని తెలిసి నేను అమృతకు ఓ సలహా ఇచ్చాను. అదేంటంటే... సైఫ్‌కు తెలియకుండా నిద్రమాత్రలు ఇవ్వాలని. నా సలహా ను అనుసరించి అమృత అతనికి తెలియకుండా నిద్రమాత్రలు ఇచ్చింది’’ అంటూ ఆయన చెప్పారు. దాంతో అతని సన్నివేశాలు చాలా వరకూ ఆ మరుసటి రోజు ఏర్పాటు చేశారట. కేవలం ఒక్క టేక్‌లో పాట చాలా బాగా కంప్లీట్ చేశాడు. దాంతో షూటింగ్లో అందరూ షాక్ అయ్యారు’’ అన్నారాయన.హమ్ సాథ్ సాథ్ హై చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద భారీ వాణిజ్య విజయాన్ని సాధించింది భారతీయ చలనచిత్రంలో ఐకానిక్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. సైఫ్ అలీ ఖాన్ 2004లో అమృతాసింగ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత, అతను 2012లో బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. -
సైఫ్ అలీఖాన్‌పై దాడి.. నిందితుడిని పట్టించిన హోటల్ బిల్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) నివాసంలో దూరి ఆయన్ను కత్తితో పొడిచింది 30 ఏళ్ల బంగ్లాదేశీ(Bangladesh) అని పోలీసులు ప్రకటించారు. అతని అసలు పేరు షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ కాగా.. భారత్ వచ్చాక బిజయ్ దాస్‌గా పేరు మార్చుకున్నాడని అధికారులు తెలిపారు. అయితే, ప్రస్తుతం అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడిని పట్టుకునేందుకు సహాయపడిన మనీ ట్రాన్సెక్షన్ వివరాలు వైరల్ అవుతున్నాయి.సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన వెంటనే ముంబై పోలీసులు అలెర్ట్ అయ్యారు. థానే జిల్లా ఘోడ్‌బందర్ రోడ్డులోని హీరానందానీ ఎస్టేట్ వద్ద అతన్ని అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచిన వారు 24వ తేదీ దాకా కస్టడీకి తీసుకున్నారు. దీని వెనక అంతర్జాతీయ కుట్రను తోసిపుచ్చలేమని కోర్టు అభిప్రాయపడటంతో ఆ కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. అయితే, బిజయ్ దాస్‌ను పోలీసులు ఎలా పట్టుకున్నారు అనేది నెట్టింట వైరల్ అవుతుంది.పరోటా, వాటర్ బాటిల్ కొనుగోలు చేయడంతో..సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన తర్వాత బిజయ్ దాస్ తన హోటల్ వద్దకు వచ్చినట్లు మహ్మద్ అనే వ్యక్తి పోలీసులుకు చేరవేశాడని తెలుస్తోంది. అతని తీరు కాస్త అనుమానంగా ఉన్నట్లు అతను పోలీసులకు చెప్పాడట. చాలా ఆందోళనగా తన హోటల్ వద్దకు వచ్చి పరోటా, వాటర్ బాటిల్ కొనుగోలు చేశాడని, అందుకుగాను యూపీఐ పేమెంట్ చేశాడని మహ్మద్ చెప్పినట్లు కథనాలు వచ్చాయి. యూపీఐ ద్వారా డబ్బు పంపడంతో నిందితుడి నంబర్ తెలుసుకున్న పోలీసులు లొకేషన్ ట్రేస్ చేయడం ఆపై అతను ఠానేలో ఉన్నట్లు తెలుసుకున్నట్లు సమాచారం. పోలీసులను చూసి అతడు అక్కడినుంచి పారిపోవాలని చూడగా.. ఒక్కసారిగా చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ఈ గాలింపులో దాదాపు 600 పైగానే సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించినట్లు తెలుస్తోంది.ఐదు నెలలుగా ముంబైలో... బంగ్లాదేశ్‌లోని ఝలోకాటికి చెందిన నిందితుడు ఐదు నెలలుగా ముంబైలో హౌస్ కీపింగ్ ఏజెన్సీలో ఉద్యోగం, చిన్నాచితకా పనులు చేస్తున్నాడు. దొంగతనం చేయడమే అతని ఉద్దేశమని ప్రాథమికంగా తేలినట్టు పోలీసులు చెప్పారు. ‘‘తాను దొంగతనానికి వెళ్తున్నది ఓ బాలీవుడ్ స్టార్ ఇంట్లోనని అతనికి తెలియదు. ఏడో అంతస్తు దాకా మెట్ల ద్వారా వెళ్లాడు. తర్వాత పైప్ ద్వారా 12వ అంతస్తుకు పాకి కిటికీ గుండా సైఫ్ ఇంటి బాత్రూంలోకి దూరాడు. అందులోంచి బయటికి రాగానే బయట కనిపించిన సిబ్బందిపై దాడి చేసి రూ.కోటి డిమాండ్ చేశాడు. అతన్ని సైఫ్ ముందు నుంచి పట్టుకున్నాడు. దాంతో సైఫ్ వీపుపై పొడిచాడు. తర్వాత నిందితుడిని గది లోపలే ఉంచి తాళం వేశారు. అతను లోనికి వెళ్లిన దారిలోనే పరారయ్యాడు. ఉదయం దాకా బాంద్రా బస్టాప్‌లో పడుకున్నాడు. లోకల్ ట్రైన్లో వర్లీకి చేరుకున్నాడు. అతని బ్యాగు నుంచి సుత్తి, స్క్రూ డ్రైవర్, నైలాన్ తాడు స్వాదీనం చేసుకున్నాం’’ అని వివరించారు. నిందితున్ని కోర్టుకు హాజరుపరిచిన సమయంలో అతని తరఫున వాదించడానికి ఇద్దరు లాయర్లు పోటీ పడటం విశేషం. -
అది సైఫ్ అలీఖాన్ ఇల్లు అని తెలీదు: అజిత్ పవార్
ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై జరిగిన దాడి ప్రత్యేకంగా టార్గెట్ చేసిన దాడి కాదని స్పష్టం చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajit Pawar). అతనొక దొంగ అని, కేవలం దొంగతనం కోసమే సైఫ్ ఇంటికి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఆ దొంగ బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తి అని, అతను దొంగతనంలో భాగంగానే ఆ ఇంట్లో చొరబడినట్లు తెలిపారు. అసలు అది సైఫ్ ఇల్లు అనే విషయం ఆ దొంగకు తెలీదన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు తమ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని వ్యాఖ్యానించడం సరైంది కాదన్నారు. ముంబైలో లా అండ్ ఆర్డర్ విఫలమైందంటూ ప్రత్యర్థి పార్టీలు పదే పదే ఆరోపణలు చేయడం తగదన్నారు.‘అతను బంగ్లాదేశ్ నుంచి ముంబైకి వచ్చాడు. తొలుత కోల్‌కతాకు చేరుకుని ఆ తర్వాత ముంబై(Mumbai)కి వచ్చాడు. దొంగతనం కోసం ఒక ఇంటిని ఎంచుకున్నాడు. అది సైఫ్ అలీఖాన్ ఇల్లు అనే విషయం అతనికి తెలీదు. ఈ ఘటనను అడ్డుపెట్టుకుని మాపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం’ అని అజిత్ పవార్ మండిపడ్డారు.కాగా, సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడింది బంగ్లాదేశీయుడని ముంబై పోలీసులు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గత అర్ధరాత్రి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితుడి పేరు విజయ్ దాస్ అని ముందుగా ప్రచారం జరిగింది. దీంతో ఈ ఉదయం మీడియా సమావేశం నిర్వహించిన ముంబై డీసీపీ జోన్ 9 దీక్షిత్ గెడం పూర్తి వివరాలు వెల్లడించారు.నిందితుడి పేరు మహ్మద్ షరీఫుల్ షెహజాద్. విజయ్ దాస్‌గా అందరికీ తన పేరును చెప్పుకుంటున్నాడు. ఆరు నెలల కిందట నకిలీ పత్రాలతో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డాడు. నగరంలో మారు పేర్లతో తిరుగుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాడు. కొన్నాళ్లుగా నగరంలోని ఓ బార్లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. దొంగతనం కోసమే నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను స్వాధీనం చేసుకున్నాం.కొన్ని రోజుల పాటు ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పని చేశాడు. ఆ టైంలోనే సైఫ్ ఇంటికి వెళ్లినట్లు అనుమానాలున్నాయి. ప్రస్తుతం ఖర్ పోలీస్ స్టేషన్లో అతని విచారణ జరుగుతోందని తెలిపారాయన. కాగా.. సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. థానే కాసర్వదవల్లి ఎస్టేట్‌లోని మెట్రో నిర్మాణ స్థలంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు.‘‘జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగ్గా, దానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందతుడ్ని అరెస్ట్ చేశారు. -
సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడి అరెస్ట్
-
సైఫ్‌పై దాడి.. నిందితుడు బంగ్లాదేశీ: ముంబై పోలీసులు
ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడింది బంగ్లాదేశీయుడని ముంబై పోలీసులు అధికారికంగా ప్రకటించారు. గత అర్ధరాత్రి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నిందితుడి పేరు విజయ్ దాస్ అని ముందుగా ప్రచారం జరిగింది. దీంతో ఈ ఉదయం మీడియా సమావేశం నిర్వహించిన ముంబై డీసీపీ జోన్ 9 దీక్షిత్ గెడం పూర్తి వివరాలు వెల్లడించారు. నిందితుడి పేరు మహ్మద్ షరీఫుల్ షెహజాద్. విజయ్ దాస్‌గా అందరికీ తన పేరును చెప్పుకుంటున్నాడు. ఆరు నెలల కిందట నకిలీ పత్రాలతో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డాడు. నగరంలో మారు పేర్లతో తిరుగుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాడు. కొన్నాళ్లుగా నగరంలోని ఓ బార్లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. దొంగతనం కోసమే నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను స్వాధీనం చేసుకున్నాం. కొన్ని రోజుల పాటు ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పని చేశాడు. ఆ టైంలోనే సైఫ్ ఇంటికి వెళ్లినట్లు అనుమానాలున్నాయి. ప్రస్తుతం ఖర్ పోలీస్ స్టేషన్లో అతని విచారణ జరుగుతోందని తెలిపారాయన. కాగా.. సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. థానే కాసర్వదవల్లి ఎస్టేట్‌లోని మెట్రో నిర్మాణ స్థలంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. ‘‘జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. 30 ఏళ్ల మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించాం. అతడిని నిన్న(శనివారం) అరెస్ట్ చేశాం. దొంగతనం చేయాలనే ఉద్దేశంతో అతడు సైఫ్ నివాసంలోకి వెళ్లాడు. అతడిని న్యాయస్థానం ఎదుట హాజరు పరిచి కస్టడీ కోరుతాం. దీనికి సంబంధించిన తదుపరి విచారణ చేపడతాం. ప్రాథమిక విచారణలో అతడిని బంగ్లాదేశీయుడిగా గుర్తించాం. నిందితుడు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించాడు. భారత్ వచ్చాక విజయ్ దాస్‌గా పేరు మార్చుకున్నాడు. ఆరు నెలల క్రితం ముంబయి వచ్చాడు. భారతీయుడని చెప్పడానికి అతడి వద్ద సరైన ఆధారాలు లేవు’’ అని తెలిపారు.#WATCH | Saif Ali Khan Attack case | Mumbai: DCP Zone 9 Dixit Gedam says, "There is primary evidence to anticipate that the accused is a Bangladeshi. He does not have valid Indian documents. There are some seizures that indicate that he is a Bangladeshi national...As of now, we… pic.twitter.com/aV22IhKF30— ANI (@ANI) January 19, 2025ఇదిలా ఉంటే.. బాంద్రాలోని సైఫ్ నివాసంలో గురువారం (జనవరి 16) తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. సైఫ్, అతడి కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. దుండగుడు సైఫ్ చిన్న కుమారుడు జేహ్ గదిలోకి వెళ్లాడు. దుండగుడిని చూసిన జేహ్ కేర్‌టేకర్ కేకలు వేయగా సైఫ్ అక్కడికి చేరుకొన్న సమయంలో పెనుగులాట జరిగింది. ఈక్రమంలో సైఫ్ గాయపడ్డారు. ఆరుచోట్ల కత్తి గాయాలయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన క్షేమంగా ఉన్నారని వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చారు. ప్రస్తుతం సైఫ్ లీలావతి ఆస్పత్రిలోనే ఉన్నారు. దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్న ముంబయి పోలీసులు దాదాపు 20 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపులు చేపట్టారు. దాదాపు మూడు రోజుల తర్వాత అతడిని అరెస్ట్ చేశారు. -
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి.. అసలైన నిందితుడి అరెస్టు
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడికి పాల్పడిన అసలైన నిందితుడిని ముంబై పోలీసులు(Mumbai Police) అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి మహారాష్ట్రలోని థానే జిల్లాలో అతన్ని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. సైఫ్‌పై దాడికి పాల్పడిన వ్యక్తి విజయ్ దాస్‌గా పోలీసులు గుర్తించారు. ఈ కేసు ఆపరేషన్‌లో భాగంగా పోలీసులు పలు బృందాలుగా విడిపోయి విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో థానే జిల్లాలోని హీరానందని వద్ద జరుగుతున్న మెట్రో నిర్మాణ సమీపంలో ఉన్న ఒక లేబర్ క్యాంప్‌లో దాస్ ఆశ్రయం పొందాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్ నివాసి అయిన విజయ్ దాస్ గతంలో సైఫ్-కరీనా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక పబ్‌లో హౌస్ కీపింగ్ సిబ్బందిగా పనిచేశాడని వారు తెలిపారు. నిందితుడు మొదట అక్కడి పరిసర ప్రాంతాల్లో పని చేయడం వల్ల సులువుగా ఇంట్లోకి వెళ్లే మార్గాలను తెలుకున్నట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. అతని అరెస్టు తరువాత, తదుపరి విచారణ కోసం దాస్‌ను ముంబైకి తరలించారు.అంధేరీ వెస్ట్ స్టేషన్ వెలుపల దొరికిన అతని సీసీటీవీ ఫుటేజీ సహాయంతో నిందితుడిని చేరుకోగలిగామని క్రైమ్ బ్రాంచ్ వర్గాలు వెల్లడించాయి. అక్కడ అతని స్నేహితుడు తీసుకెళ్లారు. ఆ ఫుటేజీ సహాయంతో, పోలీసులకు మొదటి క్లూ లభించింది. అంటే దాస్ స్నేహితుడిని తీసుకెళ్లడానికి స్టేషన్ వెలుపలికి వచ్చిన అతని మోటారుసైకిల్ నంబర్ సాయంతో అతని వాహనాన్ని కనిపెట్టారు. అతన్ని విచారించిన తర్వాత దాస్‌ను పోలీసులు చేరుకోగలిగారు. దాస్‌ను పట్టుకునేందుకు కాసర్వదలి పోలీసులు ముంబై టీమ్‌కు సహకరించారు.ప్రాథమిక విచారణలో నిందితుడు తక్కువ వ్యవధిలో త్వరగా డబ్బు సంపాదించాలనుకుంటున్నట్లు పోలీసులకు వెల్లడించాడు. నిందితుడు పశ్చిమ బెంగాల్‌కు చెందినవాడు. అయితే, ముంబైలో వర్లీ కోలివాడ సమీపంలో ఉండేవాడు. సైఫ్‌పై దాడి వల్ల అరెస్టు భయంతో ఇటీవలే థానే హీరానందానీకి అతను మకాం మార్చాడు. వెస్ట్ రీజియన్ అదనపు పోలీసు కమిషనర్ పరంజిత్ దహియా, డీసీపీ జోన్ 09 దీక్షిత్ గెడం ఆధ్వర్యంలో దయా నాయక్ నేతృత్వంలోని క్రైమ్ బ్రాంచ్ టీమ్ యూనిట్ -9 నిందితుడిని కనిపెట్టింది. ఆదివారం ఉదయం 9 గంటలకు ముంబయి డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆపై ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు. -
సైఫ్‌పై దాడి ఘటన.. అనుమానితుడి అరెస్ట్
దుర్గ్: నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించి ఆయనపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన దర్యాప్తులో కీలక పరిణామం సంభవించింది. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ రైల్వే స్టేషన్‌లోని ఓ రైలులో ఉన్న అనుమానితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని లోకమాన్య తిలక్ టెరి్మనస్(ఎలీ్టటీ)నుంచి కోల్‌కతా వెళ్లే జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న అతడిని ఆకాశ్ కైలాశ్ కనోజియా(31)గా గుర్తించారు. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో అనుమానితుడొకరు జ్ఞానేశ్వరి ట్రెయిన్లో ఉన్నట్లు ముంబై పోలీసులు శనివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో దుర్గ్ రైల్వే పోలీసులను అలెర్ట్ చేశారు. అనుమానితుడి సెల్ ఫోన్ లొకేషన్‌తోపాటు అతడి ఫొటోను షేర్ చేశారు. వెంటనే స్పందించిన దుర్గ్ పోలీసులు ముందుగానే అతడిని పట్టుకునేందుకు రాజ్‌నంద్‌గావ్ స్టేషన్ పోలీసులను అప్రమత్తం చేశారు. అయితే, రాజ్‌నంద్‌గావ్‌లో ఆగిన సమయంలో అక్కడి పోలీసులు అనుమానితుడిని గుర్తించలేకపోయారు. దీంతో, ఆ రైలు చేరుకునే సమయానికి దుర్గ్ రైల్వే స్టేషన్లో రెండు బృందాలను సిద్ధం చేశారు. మొదటి జనరల్ బోగీలో ఉన్న ఆకాశ్‌ను వెంటనే గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. అతడి ఫొటోను ముంబై పోలీసులకు పంపి నిర్థారణ చేసుకున్నారు. గురువారం తెల్లవారు జామున సైఫ్‌పై కత్తితో దాడి చేసిన అనంతరం భవనంమెట్ల మార్గం గుండా దిగుతున్న నిందితుడి ముఖం సీసీ ఫుటేజీలో స్పష్టంగా రికార్డవడం తెలిసిందే. ముంబై పోలీసులు విమానంలో రాయ్‌పూర్ వెళ్లి ఆకాశ్ కైలాశ్‌ను కస్టడీకి తీసుకుంటారని అధికారులు తెలిపారు. -
సైఫ్‌ను ఆవేశంతో పొడిచాడు.. నా నగల జోలికి వెళ్లలేదు: కరీనా
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి (Saif Ali Khan Attack) ఘటనలో ఆయన సతీమణి, హీరోయిన్ కరీనా కపూర్ (Kareena Kapoor) స్టేట్మెంట్ను బాంద్రా పోలీసులు రికార్డు చేశారు. ఈ ఘటన గురించి కరీనా పోలీసులతో మాట్లాడుతూ.. దొంగతనానికి వచ్చిన వ్యక్తి ఎంతో ఆవేశంగా ఉన్నాడంది. అతడిని సైఫ్ అడ్డుకోవడంతో కోపంతో పలుమార్లు కత్తితో పొడిచాడని పేర్కొంది. తన నగలు బయటే ఉన్నప్పటికీ వాటిని తీసుకునేందుకు ప్రయత్నించలేదని తెలిపింది. ఈ దాడి తర్వాత సోదరి కరిష్మా వచ్చి తన ఇంటికి తీసుకెళ్లిందని వివరించింది.ఏం జరిగిందంటే? ముంబైలోని బాంద్రాలో నివాసముంటున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గురువారం తెల్లవారుజామున ఓ దుండగుడు చోరీకి ప్రయత్నించాడు. సైఫ్ చిన్నకుమారుడు జెహ్ గదిలో నక్కిన అతడిని పనిమనిషి గుర్తించి కేకలు వేయడంతో సైఫ్ పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. దుండగుడిని అడ్డుకునే క్రమంలో అతడు విచక్షణారహితంగా సైఫ్‌ను కత్తితో పొడిచి మెట్లమార్గం గుండా పరారయ్యాడు.సమయానికి కారు కూడా అందుబాటులో లేకపోవడంతో ఓ ఆటోలో సైఫ్ అలీఖాన్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడిని పరిశీలించిన వైద్యులు రెండు లోతైన కత్తిపోట్లు సహా మొత్తం ఆరు కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. వెన్నెముకలో 2.5 అంగుళాల కత్తి మొన విరిగినట్లు గుర్తించి ఆపరేషన్ ద్వారా తొలగించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది.నిందితుడి కోసం గాలింపుసైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి ఘటనపై పోలీసులు 20 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలిస్తున్నారు. మొదట నిందితుడు దొరికాడని, అతడు దొంగతనం కోసమే నటుడి ఇంట్లోకి చొరబడినట్లు వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని పోలీసులు స్పష్టతనిచ్చారు. దాడి జరగడానికి రెండు రోజుల క్రితం సైఫ్ ఇంట్లో పని చేసిన కార్పెంటర్‌ను విచారించి వదిలేశామని తెలిపారు. ఇక విచారణలో భాగంగా ఇప్పటికే 30 మంది స్టేట్మెంట్స్ను పోలీసులు రికార్డు చేశారు. శుక్రవారం ఒక్కరోజే 15 మందిని విచారించారు. శనివారం నాడు మధ్యప్రదేశ్‌లోని ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.సినిమాసైఫ్ అలీఖాన్ హిందీలో అనేక సినిమాలు చేశాడు. హీరోగా, విలన్‌గా మెప్పించాడు. పలు సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించాడు. తెలుగులోనూ రెండు సినిమాలు చేశాడు. ప్రభాస్ 'ఆదిపురుష్'లో లంకేశ్‌గా నటించాడు. గతేడాది వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ 'దేవర మూవీ'లో విలన్‌గా మెప్పించాడు.చదవండి: Saif Ali Khan: హైప్రొఫైల్ కేసులో ఇంత అలసత్వమా? -
Saif Ali Khan: హైప్రొఫైల్ కేసులో ఇంత అలసత్వమా?
ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో ముంబై పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగి రెండ్రోజులు గడిచినప్పటికీ.. ఇప్పటికీ నిందితుడి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. మరోవైపు.. నిందితుడు మాత్రం పక్కాగా తప్పించుకుంటూ తిరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై దాడి కేసులో ముంబై పోలీసుల(Mumbai Police)పై ఇటు సినీవర్గాల, అటు రాజకీయ వర్గాల నుంచి విపరీతమైన ఒత్తిడి నెలకొంది. ఘటన జరిగి 50 గంటలు దాటిపోయినా.. నిందితుడిని, అతనితో సంబంధం ఉన్నవాళ్లెవరినీ పోలీసులు ట్రేస్ చేయలేకపోయారు. సెలబ్రిటీల విషయంలోనే ఇలా ఉంటే.. మా పరిస్థితి ఏంటని? సాధారణ ప్రజలు సైతం ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు సోషల్‌మీడియాలో ముంబై పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మరోవైపు నిందితుడు తప్పించుకుంటున్న తీరూ పోలీసులను మరింత ఇబ్బందికి గురి చేస్తోంది.తాజాగా సైఫ్‌పై దాడి చేసిన దుండగుడి(Saif Attacker)కి సంబంధించిన మరో ఫొటో బయటకు వచ్చింది. దాడి జరిగిన రోజు.. తల కవర్ అయ్యేలా బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నట్లుగా ఫొటోలను తొలుత మీడియాకు పోలీసులు విడుదల చేశారు. ఆపై కొన్నిగంటల వ్యవధిలో విడుదల చేసిన ఫుటేజీలో బ్లూ షర్ట్ కనిపించింది. ఇప్పుడు తాజాగా రిలీజ్చేసిన ఫొటోల్లో పసుపు రంగు దుస్తుల్లో కనిపించాడు. బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలోని దొరికిన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలుగా తెలుస్తోంది. దీంతో.. అక్కడ రైలెక్కి నగరంలోని మరో చోటుకి నిందితుడు పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఘటన జరిగిన కొన్ని గంటలకు ఓ దుకాణానికి వెళ్లి హెడ్‌ఫోన్స్ కొన్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.Mumbai, Maharashtra: Officers from the Crime Branch visited the Kabutarkhana area in Dadar and collected CCTV footage from a mobile shop named "Iqra" from where he purchased headphones after attacking actor Saif Ali Khan pic.twitter.com/ILxBjsD7eZ— IANS (@ians_india) January 18, 2025ఈ క్రమంలో ముంబైలోని అన్ని రైల్వే స్టేషన్ల వెంట సీసీకెమెరాలను జల్లెడ పడుతున్నారు. ప్రస్తుతానికి నిందితుడి కోసం గాలింపు చేపడుతున్న బృందాల సంఖ్యను 35కి పెంచారు.ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. దుండగుడ్ని తొలిగా చూసింది సైఫ్ ఇంట పని చేసేవాళ్లు. దీంతో బాంద్రా పోలీసులు వాళ్ల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. నిందితుడి గురించి ఆనవాళ్లను వాళ్ల నుంచి సేకరించారు. సుమారు 35-40 ఏళ్ల మధ్య వయసు ఉండొచ్చని, ఐదున్నర అడుగుల ఎత్తు, ఛామనఛాయ రంగు ఉన్నట్లు వెల్లడించారు. ఇక.. దాడిపై సైఫ్ భార్య కరీనా కపూర్(Kareena Kapoor)తో పాటు ఇతర కుటుంబ సభ్యుల నుంచి కూడా పోలీసులు వాంగ్మూలం సేకరించారు. అది అరెస్ట్ కాదు!సైఫ్‌పై దాడి ఘటన కేసులో ముంబై పోలీసులు ఇప్పటికే వందకుపైగా మందిని విచారించారు. క్రిమినల్ రికార్డులు ఉన్న మరికొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఓ కార్పెంటర్‌ను పోలీసులు విచారణ కోసం తీసుకొచ్చారు. అయితే సైఫ్ కేసులో నిందితుడు అరెస్ట్ అయ్యాడంటూ.. మీడియా హడావిడి చేసింది. అయితే అతను కేవలం అనుమానితుడు మాత్రమేనని, కేవలం విచారణ జరిపి వదిలేశామని, ఈ కేసులో ఇంతదాకా ఎలాంటి అరెస్ట్ చేయలేదని, అలాంటిది ఏమైనా ఉంటే తామే స్వయంగా ప్రకటిస్తామని ముంబై పోలీసులు స్పష్టత ఇచ్చారు. మరోవైపు ఈ కేసులో వస్తున్న విమర్శలను సీఎం దేవంద్ర ఫడ్నవీస్ ఖండించారు. పోలీసులు అన్నికోణాల్లో.. అన్నివిధాలుగా దర్యాప్తు చేస్తున్నారని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.FIR ప్రకారం..ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్(54)పై బుధవారం అర్ధరాత్రి దాటాక 2గం.30ని. ప్రాంతంలో ఆయన నివాసంలోనే దాడి జరిగింది. ఈ ఘటనపై ఆయన కుటుంబం బాంద్రా పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఎఫ్ఆర్లో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.దుండగుడు ఆ రాత్రి సైఫ్ చిన్నకొడుకు జెహ్ గదిలోకి ప్రవేశించాడు. వెంటనే.. ఆ చిన్నారి సహాయకురాలు సాయం కోసం కేకలు వేసింది. ఆ అరుపులతో గదిలోకి వచ్చిన సైఫ్‌కి దుండగుడికి మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో తన దగ్గర ఉన్న పదునైన కత్తితో సైఫ్‌ను ఆరుసార్లు పొడిచాడు. ఆ వెంటనే మరో ఇద్దరు సహాయకులపైనా దుండగుడు హాక్సా బ్లేడ్‌తో దాడి చేసి పారిపోయాడు.రక్తస్రావం అయిన సైఫ్‌ను తనయుడు ఇబ్రహీం, ఇతర కుటుంబ సభ్యులు ఓ ఆటోను పిలిపించి.. లీలావతి ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి 3గం. టైంలో సైఫ్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. వెన్నెముకకు దగ్గరగా కత్తి ముక్క దిగడంతో సర్జరీ చేసి దానిని తొలగించారు. ఆయనకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు ప్రకటించారు.ఇదీ చదవండి: ముంబైలో దాడులకు గురైన సెలబ్రిటీలు వీళ్లే! -
చాలా సిగ్గుపడుతున్నా.. సైఫ్‌కు క్షమాపణలు చెప్పిన ఊర్వశి రౌతేలా
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌కు నటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) క్షమాపణలు చెప్పారు. సైఫ్‌పై జరిగిన దాడిని చాలామంది సినీ ప్రముఖులు తవ్రంగా ఖండించారు. కానీ, డాకు మహారాజ్ (Daaku Maharaaj) సక్సెస్‌లో ఉన్న ఊర్వశి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సైఫ్‌పై జరిగిన దాడి గురించి కామెంట్ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని అంటూనే తన చేతికి ఉన్న వ్రజపు ఉంగరాన్ని చూపుతూ మాట్లాడటం విమర్శలకు దారి తీసింది. దీంతో ఆమె క్షమాపణలు చెబుతూ సోషల్‌మీడియాలో ఒక నోట్ విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో 'సింగం అగైన్' తెలుగు వర్షన్ స్ట్రీమింగ్)'డియర్ సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) సర్.. మీకు క్షమాపణలు చెబుతూ పంచుకుంటున్న ఈ పోస్ట్ చేరుతుందని ఆశిస్తున్నాను. ఒక ఇంటర్వ్యూలో మీ గురించి మాట్లాడుతున్న సమయంలో నేను వ్యవహరించిన తీరుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. ఆ ఇంటర్వ్యూలో నేను మాట్లాడుతున్న సమయంలో మీరు ఎదుర్కొంటున్న సమస్య తీవ్రత గురించి నాకు తెలియదు. డాకు మహారాజ్ విజయం వల్ల వచ్చిన సంతోషంలో నేను ఉన్నాను. ఆ సక్సెస్ వల్ల నాకు వచ్చిన బహుమతుల గురించి మాట్లాడాను. మీపై జరిగిన దాడి తీవ్రత గురించి తెలుసుకున్న తర్వాత సిగ్గు పడుతున్నాను. నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. కష్ట సమయంలో మీరు చూపిన తెగువ, ధైర్యం చాలా గొప్పది' అని పేర్కొన్నారు.సైఫ్‌పై ఊర్వశి చేసిన కామెంట్లు'డాకు మహారాజ్' విజయం వల్ల తనకు చాలామంది బహుమతులు పంపించారని ఊర్వశి ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. అదే సమయంలో తనకు వచ్చిన బహుమతులను సైఫ్ దాడికి ముడిపెట్టి మాట్లాడడటం వల్ల ఆమె విమర్శలు ఎదుర్కొన్నారు. 'సైఫ్‌పై దాడి దురదృష్టకరం. నేను నటించిన డాకు మహారాజ్ రూ.105కోట్లు వసూళ్లతో మంచి విజయం సాధించింది. నాకు మా అమ్మ డైమండ్ ఉంగరం కానుకగా ఇచ్చింది. మా నాన్న ఖరీదైన రోలెక్స్ వాచ్ ఇచ్చారు. అయితే, వాటిని ధరించి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకుంటే ఎవరైనా మనపై అలా దాడి (సైఫ్) చేస్తారనే భయం ఉంటుంది' అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ట్రోల్స్ రావడంతో ఊర్వశీ తాజాగా క్షమాపణలు చెప్పారు. సైఫ్ అలీ ఖాన్ దాడి జరిగింది దొంగతనం కోసమే కావడంతో ఆమె వ్యాఖ్యలు కూడా ఆ సంఘటనను గుర్తు చేస్తూ మాట్లాడటం వల్ల విమర్శలు వచ్చాయి. -
సైఫ్ అలీఖాన్ పై దాడి ఘటనలో పోలీసుల దర్యాప్తు
-
దుండగుడి కోసం వేట
ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడికి పాల్పడిన దుండగుడిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు వేట ముమ్మరం చేశారు. ప్రత్యేకంగా 35 పోలీసు బృందాలు ఆగంతకుడి కోసం గాలిస్తున్నాయి. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోందని, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని ఉన్నతాధికారులు తెలిపారు. దర్యాప్తుపై హోం శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. ‘పోలీసుల దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే చాలా ఆధారాలు లభించాయి. దుండగుడిని త్వరలో వారు పట్టుకుంటారు’అని తెలిపారు. ఇందుకు సంబంధించి వారిస్ అలీ సల్మానీ అనే ఓ కార్పెంటర్‌ను ప్రశ్నిస్తున్నట్లు అంతకుముందు ముంబై పోలీసులు ప్రకటించారు. ఘటనకు ముందు రెండు రోజులపాటు అతడు సైఫ్ ఫ్లాట్‌లోనే పనులు చేశాడన్నారు. విచారణ అనంతరం అతడికి దాడితో సంబంధం లేదని తేలడంతో వదిలేశామన్నారు. ఆగంతకుడికి ఎలాంటి నేర ముఠాలతోనూ సంబంధం లేదని అందిన ఆధారాలను బట్టి తెలుస్తోందని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని బట్టి అతడు 1.37 గంటల సమయంలో మెట్ల ద్వారా ఇంట్లోకి చేరుకున్నట్లు వెల్లడైందన్నారు. అతడుదొంగతనానికి వెళ్లింది సైఫ్ ఇంట్లోకి అనే విషయం కూడా అతడికి తెలిసుండకపోవచ్చని చెప్పారు. కాగా, సైఫ్‌పై దాడి ఘటనతో అండర్ వరల్డ్ గ్యాంగ్‌లకు సంబంధం లేదని మహారాష్ట్ర హోం శాఖ ఉప మంత్రి యోగేశ్ కదమ్ స్పష్టం చేశారు. బెదిరింపులు వచ్చినట్లుగా సైఫ్ అలీ ఖాన్ సైతం ఎన్నడూ పోలీసులకు చెప్పలేదని, భద్రత కల్పించాలని కోరలేదని కూడా మంత్రి తెలిపారు. ఆయన అడిగితే భద్రత నిబంధనల మేరకు కలి్పంచి ఉండేవారమన్నారు. దాడి ఘటనకు చోరీ యత్నం మాత్రమే కారణమని వివరించారు. ఇలా ఉండగా, సైఫ్ ఇంట్లో చోరీకి యతి్నంచిన దుండగుడే ఈ నెల 14వ తేదీన బాలీవుడ్ మరో స్టార్ నటుడు షారుఖ్ ఖాన్ నివాసం వద్ద రెక్కీ కూడా నిర్వహించినట్లు ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు. సైఫ్ కోలుకుంటున్నారు: ఆస్పత్రి వర్గాలు తీవ్ర కత్తి పోట్లకు గురైన సైఫ్ అలీ ఖాన్ కోలుకుంటున్నారని లీలావతి ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఆయన కొద్దిసేపు నడిచారని, వెన్నెముకకు తీవ్ర గాయమైనందున బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించామని పేర్కొంది. ఆయనకు ఎలాంటి సమస్యా లేకుంటే మూడు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ డాంగే చెప్పారు. ‘ఓ వైపు రక్తమోడుతూనే ఆయన ఆస్పత్రి లోపలికి సింహంలా నడుచుకుంటూ వచ్చారు. పక్కన కుమారుడు ఆరేడేళ్ల తైమూర్ మాత్రమే ఉన్నాడు’’ అంటూ గురువారం వేకువజామున సైఫ్ చూపిన గుండెనిబ్బరాన్ని మెచ్చుకున్నారు డాక్టర్ డాంగే. నేను, సైఫ్ అలీ ఖాన్.. గురువారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో రక్తంతో తడిచిన కుర్తాతో తాను తీసుకెళ్లిన వ్యక్తి నటుడు సైఫ్ అలీ ఖాన్ అనే విషయం లీలావతి ఆస్పత్రికి వెళ్లేదాకా తనకు తెలియదని ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా చెప్పారు. ఆస్పత్రి గేటు వద్దకు వెళ్లాక అక్కడి గార్డుతో.. స్ట్రెచర్ తీసుకురా, నేను..సైఫ్ అలీ ఖాన్‌ను అని ఆయన చెప్పాకనే ఆ విషయం తెలిసిందని రాణా శుక్రవారం ముంబైలో మీడియాకు తెలిపారు. ‘సైఫ్ ఉంటున్న సద్గురు శరణ్ అపార్టుమెంట్ సమీపం నుంచి వెళ్తుండగా ఒక మహిళ, మరికొందరు తన ఆటోను ఆపారు. అనంతరం రక్తంతో తడిచిన కుర్తాతో ఓ వ్యక్తి ఆటోలో కూర్చున్నారు. ఆయనతోపాటు 8 ఏళ్ల బాలుడు, ఓ యువకుడు, మహిళ కూర్చున్నారు. మొదట వాళ్లు హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి వెళ్లాలనుకున్నారు. కానీ, సైఫ్ లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో, అక్కడికే ఆటోను పోనిచ్చాను. అక్కడికెళ్లాక సైఫ్ ఆస్పత్రి గేట్ వద్ద గార్డును పిలిచారు. దయచేసి స్ట్రెచర్ తీసుకురా..నేను, సైఫ్ అలీ ఖాన్ అని అన్నారు. అప్పుడు సమయం దాదాపు మూడైంది. ఏడెనిమిది నిమిషాల్లో అక్కడికి చేరుకున్నాం’అని రాణా వివరించారు. అప్పటి దాకా ఆయన సైఫ్ అలీ ఖాన్ అనే సంగతి గమనించలేదని చెప్పారు. -
‘సైఫ్’పై దాడి ఘటన..మంత్రి కీలక ప్రకటన
ముంబయి:బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) మీద దుండగుడి దాడి ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra Government) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు మహారాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి యోగేశ్ కదమ్(Yogesh Kadam) పుణెలో శుక్రవారం(జనవరి17) మీడియాతో మాట్లాడారు. సైఫ్ దాడి వెనుక చోరీ ఉద్దేశం మాత్రమే కనిపిస్తోందని కదమ్ పేర్కొన్నారు. ఈ దాడి అండర్‌వరల్డ్ గ్యాంగ్‌ల ప్రమేయం ఏమీ లేదన్నారు. సైఫ్‌పై దాడి చేసినట్లుగా భావించి ఓ అనుమానితుడి ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. సీసీటీవీలో కనిపించిన వ్యక్తి ముఖానికి దగ్గర పోలికలు ఉన్న ఈ యువకుడికి నేర చరిత్ర ఉందన్నారు.అయితే, సైఫ్‌పై దాడి ఘటనతో అతడికి సంబంధం లేదని గుర్తించినట్లు చెప్పారు.కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కేసులో మరో వ్యక్తిపై కూడా పోలీసులు నిఘా ఉంచారని చెప్పారు. దుండగుల నుంచి బెదిరింపు వచ్చినట్లు సైఫ్ నుంచి పోలీసులకు ఎటువంటి సమాచారం లేదని,సెక్యూరిటీ కూడా అడగలేదని చెప్పారు.ఒకవేళ భద్రత కోరితే నిబంధనల ప్రకారం కల్పిస్తామన్నారు. మరోవైపు సైఫ్ శరీరం నుంచి పదునైన వస్తువును బయటకు తీసినట్లు లీలావతి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆయన వెన్నెముకకు తృటిలో ప్రమాదం తప్పిందన్నారు. ఆయన మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని తెలిపారు.గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు ముంబై బాంద్రా ప్రాంతంలోని సైఫ్ ఇంట్లోనే అతడిపై దాడి జరిగింది. అర్ధరాత్రి చోరీకి యత్నించిన దుండగుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా సైఫ్‌పై కత్తితో దాడి చేసి పారిపోయాడు. అనంతరం తీవ్ర గాయాలతో సైఫ్ లీలావతి ఆస్పత్రిలో చేరారు.ఇదీ చదండి: ఫస్ట్ టార్గెట్ సైఫ్ కాదట.. -
ఫైర్ ఎగ్జిట్ మెట్ల ద్వారా ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు
-
ఆ స్టార్ హీరో ఇంట్లో చోరీకి ప్లాన్.. వర్కవుట్ కాకపోవడంతో సైఫ్ ఫ్లాట్‌లో!
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) దాడి ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు తొలుత.. స్టార్ హీరో షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) ఇంట్లో దొంగతనం చేసేందుకు ప్లాన్ వేసుకున్నాడట! షారూఖ్ నివాసమైన మన్నత్‌లో జనవరి 14న చోరీకి పథకం రచించాడట! కానీ అక్కడ భద్రత ఎక్కువగా ఉండటంతో ఇంట్లోకి ప్రవేశించలేకపోయాడని తెలుస్తోంది. దీంతో అతడు పటిష్ట భద్రత లేని సైఫ్ అలీఖాన్ ఇంటిని ఎంచుకున్నాడు.ఏం జరిగిందంటే?బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనతో చిత్రపరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎక్కువగా సంపన్నులు నివాసముండే బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి జనవరి 16న గుర్తు తెలియని దుండగుడు దూరాడు. సైఫ్ చిన్న కుమారుడు జెహ్ (Jehangir Ali Khan) గదిలో మాటువేసిన దుండగుడి కదలికలను గమనించిన పనిమనిషి బిగ్గరగా కేకలు వేసింది. ఆ శబ్దాలు వినిపించి నిద్ర నుంచి మేల్కొన్న సైఫ్ పరుగెత్తుకుంటూ ఆ గదిలోకి వచ్చాడు. దుండగుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఈ పెనుగులాటలో దుండగుడు సైఫ్‌ను విచక్షణారహితంగా కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. ఆరు కత్తిపోట్లతో రక్తమోడుతున్న సైఫ్‌ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కారు కూడా సిద్ధంగా లేకపోవడం శోచనీయం. దీంతో నటుడి పెద్ద కుమారుడు ఇబ్రహీం ఆటోలో తండ్రిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభించడంతో ప్రాణాపాయం తప్పింది. వెన్నెముకలో 2.5 అంగుళాల కత్తి మొన విరగ్గా ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పది బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. 36 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. దొంగతనం కోసమే దుండగుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.చదవండి: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి.. దుండగుడి డిమాండ్ ఏంటంటే.? -
సైఫ్ అలీ ఖాన్ కేసులో నిందితుడు అరెస్ట్
-
సైఫ్ అలీ ఖాన్‌పై దాడికి పాల్పడిన నిందితుడు అరెస్ట్
బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్(54)పై(Saif Ali Khan) దాడిచేసిన వ్యక్తిని ముంబై పోలీసులు కొంతసమయం క్రితం అరెస్ట్ చేశారు. సైఫ్‌పై దాడి ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే బాంద్రా పోలీసులు(Bandra Police) రంగంలోకి దిగారు. సుమారు 36 గంటల్లో అతన్ని బాంద్రా ప్రాంతంలోనే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందుతుడిని పోలీసులు విచారిస్తున్నారు. రాత్రిపూట ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు దొంగతనం కోసం వచ్చి హత్యాయత్నానికి పాల్పడడంతో సెక్షన్ 331(4), సెక్షన్ 311 కింద అతనిపై పోలీసులు కేసు పెట్టారు. సైఫ్‌పై దాడి ఘటనలో మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో వారు విచారణ జరుపుతున్నారు. (ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' ప్రసారం చేసిన కేబుల్ ఆపరేటర్ ఆరెస్ట్)దొంగతనం కోసమే దుండగుడు సైఫ్ ఫ్లాట్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. అయితే, తాజాగా నిందితుడు పట్టుబడటంతో మరిన్ని వివరాలు వెళ్లడి అయ్యే ఛాన్స్ ఉంది. సైఫ్, కరీనా దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి తమ ఫ్లాట్‌లో నిద్రిస్తున్న సమయంలో అలికిడి వినిపించింది. అప్పటికే సైఫ్ చిన్నకుమారుడు జహంగీర్ గదిలో మాటువేసిన దుండగుడి కదలికలను పనిమనిషి గమనించి బిగ్గరగా కేకలు వేసింది. అలారం మోగించింది. దాంతో అతడు ఆమెపై కత్తి దూశాడు. ఈ శబ్దాలు వినిపించి నిద్ర నుంచి మేల్కొన్న సైఫ్ అలీ ఖాన్ ఆ గదిలోకి వచ్చి దుండగుడిని అడ్డుకొనేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలోనే సైఫ్‌పై కత్తితో విచక్షణారహితంగా నిందితుడు పొడిచాడు. -
ముంబైలో బాలీవుడ్ ప్రముఖులపై ఇన్ని దాడులు జరిగాయా!
బాలీవుడ్ (Bollywood) ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై జరగిన దాడితో చిత్ర పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎంతో సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఇంతటి ఘోరం జరగడంతో వారు ఆశ్చర్యపోతున్నారు. గ్యాంగ్‌స్టర్స్‌తో ఒకప్పుడు నిండిపోయిన ముంబైలో కొన్నేళ్ల తర్వాత ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అయితే, గతంలో కూడా ఇలాంటి దాడులో బాలీవుడ్ నటీనటులపై జరిగాయి.పంజాబ్‌ను ఓ ఊపు ఊపిన సింగర్ చమ్కీలాపై తూటాల వర్షంభారతీయ సంగీత చరిత్రలో చమ్కీలా కథకు ప్రత్యేకమైన అధ్యాయముంది. వివాహేతర సంబంధాలు, మత సంఘర్షణలు, మద్యపానం, వరకట్నాలు, మాదకద్రవ్యాలు.. ఇలా ప్రతి సమస్యపైనా పాట కట్టి.. ప్రజలను ఆలోచింపచేసేవాడు చమ్కీలా.. 1988 మార్చి 8న మధ్యాహ్నం 2 గంటలకు మెహసంపూర్ సమీపంలోని ప్రదర్శనకు వెళ్తుంటే.. ముసుగులేసుకున్న కొందరు దుండగులు బైక్స్ మీదొచ్చి చమ్కీలా కారుకు అడ్డుపడ్డారు. మరుక్షణమే తుపాకులతో తూటాల వర్షం కురిపించారు. ఆ దాడిలో చమ్కీలా(27), అమర్‌జోత్ అక్కడికక్కడే కన్నుమూశారు. ఆ సమయంలో అమర్‌జోత్ గర్భవతి. సంఘటనా స్థలంలో ఉన్న కొందరు గ్రామస్థులు.. ఆ దుండగులను వెంబడించినా దొరకలేదు. దాంతో ఎవరు చంపారు? అనేది నేటికీ మిస్టరీగా మిగిలిపోయింది. నిజానికి ఈ హత్యకేసుపై చాలా ఊహాగానాలున్నాయి. అప్పటి ఖలిస్తాన్ ఉద్యమానికి వ్యతిరేకంగా పాటలు రాసినందుకే సిక్కు ఉగ్రవాదులు చమ్కీలాను చంపేశారని కొందరి అభిప్రాయం.క్యాసెట్ కింగ్‌పై కాల్పులు‘క్యాసెట్ కింగ్’ అని పిలిచే టీ-సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్‌ను 1997 ఆగస్టు 12న దుండగులు కాల్చి చంపారు. ఆ సమయంలో ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సబర్బన్ అంధేరీలోని శివాలయాన్ని ప్రతిరోజూ రెండుసార్లు (ఉదయం, సాయంత్రం) దర్శించుకునేవారు. ఈ హత్య కేసులో చాలా మందిని అరెస్ట్ చేసి విచారించారు. గుల్హన్ కుమార్ హత్య కేసులో ప్రముఖ సంగీత దర్శకుడు నదీంను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. గుల్హన్ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై ఆయనను విచారించారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది.బుల్లెట్ల గాయాలతోనే ఆసుపత్రికి వెళ్లిన స్టార్ హీరో తండ్రి2000వ సంవత్సరం రోషన్ కుటుంబానికి చేదు గుర్తులనే మిగిల్చింది. హృతిక్ రోషన్ తొలి చిత్రం కహో నా.. ప్యార్ హై అతనికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. అయితే కొద్ది రోజులకే వారికి పెద్ద ప్రమాదమే ఎదురైంది. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్‌పై ముంబైలోని అతని కార్యాలయం వెలుపల అండర్ వరల్డ్‌తో సంబంధం ఉన్న కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఆ సమయంలో అతనికి రెండు బుల్లెట్లు తగిలినప్పటికీ ఎంతో వీరోచితంగా తన కారులోనే డ్రైవింగ్ చేసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లగలిగాడు. అలా ప్రాణాలతో ఆయన బటయపడ్డాడు.షారూఖ్ ఖాన్‌కు పలుమార్లు హెచ్చరికలుబాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్‌ను చంపేస్తామంటూ ఇప్పటికే పలు బెదిరింపులు వచ్చాయి. 1990ల్లో షారుక్‌ను అండర్‌వరల్డ్ టార్గెట్ చేసింది. గ్యాంగ్‌స్టర్ అబూసలేం అనేకసార్లు షారుఖ్‌కు వార్నింగ్స్ ఇచ్చాడు. కానీ, ఖాన్ మాత్రం చాలా ధైర్యంగా వారికి వ్యతిరేకంగా పోరాడారు. సల్మాన్ ఖాన్‌కు ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో హెచ్చరికలు రావడం తెలిసిందే. అలాంటి హెచ్చరికే వారి నుంచి షారుఖ్ ఖాన్‌కు కూడా గతంలో వచ్చింది. రూ.50 లక్షలు ఇవ్వకుంటే షారుఖ్‌ను చంపేస్తామంటూ బాంద్రా పోలీసుల సెల్‌ఫోన్‌కు మెసేజీ వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు చెందిన ఫైజాన్ ఖాన్ అనే లాయర్ పేరుతో ఉన్న ఫోన్ నుంచి ఆ మెసేజీ వచ్చినట్లు గుర్తించారు.ప్రీతీజింటా ధైర్యం2001 సమయంలో అండర్వరల్డ్కు వ్యతిరేకంగా బాలీవుడ్ నటి ప్రీతీజింటా కోర్టులో సాక్ష్యం చెప్పింది. ఆ సమయంలో తను నటించిన 'చోరీచోరీ చుప్కే చుప్కే' సినిమాకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఆమె ఎదుర్కొంది. ఈ సినిమాకు పెట్టుబడులు పెట్టిన నిర్మాత నజీమ్ రిజ్వీతో పాటు ఫైనాన్షియర్ భరత్ షా అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్ ఛోటా షకీల్ నుంచి వచ్చిన డబ్బుతో సినిమా తీసినట్లు అభియోగాలు మోపారు. ఈ కేసు విచారణ సమయంలో రూ.50లక్షల కోసం తనను డిమాండు చేస్తూ బెదిరింపులు వచ్చాయని కోర్టులో ఆమె చెప్పారు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, రాకేష్ రోషన్, మహేష్ మంజ్రేకర్ వంటి వారితో సహా ఇతర బాలీవుడ్ ప్రముఖులకు కూడా ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చాయి. కానీ, ప్రీతీ మాత్రమే కోర్టుకు తెలిపింది. అండర్‌వరల్డ్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఆ సినిమా ప్రొడ్యూసర్ నసీం రిజ్వీ, ఫైనాన్సర్ భరత్ షాలు జైలుకెళ్లారు. -
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి.. దుండగుడి డిమాండ్ ఏంటంటే.?
బాలీవుడ్ ప్రముఖ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సైఫ్ అలీ ఖాన్(54)పై గుర్తుతెలియని దుండగుడు కత్తితో దాడికి దిగాడు. డబ్బు కోసమే ఇదంతా చేశాడని తెలియడంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముంబైలో ఎక్కువగా సంపన్నులు నివాసం ఉండే బాంద్రా వెస్ట్ (Bandra West) ప్రాంతంలో ఉన్న సద్గురు శరణ్ భవనం 12వ అంతస్తులో సైఫ్ సొంత ఫ్లాట్‌లోకి తెల్లవారుజామున 2 గంటలకు ఒక దుండగుడు దూరడం ఆపై సైఫ్ అలీ ఖాన్‌పై విచక్షణంగా దాడి చేయడంతో ఈ ఘటనలో నటుడికి తీవ్రగాయాలయ్యాయి.కోటి రూపాయలు డిమాండ్మహారాష్ట్ర రాజధాని ముంబైలో (Mumbai) గురువారం తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) ఇంట్లోకి చొరబడి దాడి చేసిన వ్యక్తి మొదట కోటి రూపాయలు డిమాండ్ చేశాడని అక్కడి పనివారు తెలిపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జీన్స్, టీ–షర్టు ధరించిన దుండుగుడు సైఫ్ చిన్నకుమారుడు జహంగీర్ గదిలోకి ప్రవేశించాడు. తొలుత తనను గమనించి కేకలు వేసిన పని మనిషి ఎలియామ ఫిలిప్స్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో ఆమెను బంధించాడు. కోటి రూపాయలు ఇస్తేనే వదిలేస్తానంటూ బేరం పెట్టాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న సైఫ్ అదేమీ పట్టించుకోకుండా అతడిని ధైర్యంగా ఎదిరించాడు. ఈ క్రమంలో దుండగుడు కత్తితో విచక్షణారహితంగా సైఫ్‌ను పొడిచి తక్షణమే మెట్ల మార్గం గుండా పరారయ్యాడు.తీవ్రంగా గాయపడిన సైఫ్‌ను ఆసుత్రికి అతి కష్టం వీద తరలించారు. కారు అందుబాటులో లేకపోవడంతో సైఫ్‌ను ఆయన కుమారుడు, సహాయకులు ఆటోలో ఆసుపత్రికి తరలించారు. న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ డాంగే, కాస్మోటిక్ సర్జన్ డాక్టర్ లీనా జైన్, అనస్థీషియాలజిస్టు డాక్టర్ నిషా గాంధీ శస్త్రచికిత్స చేశారు. సైఫ్‌కు ఆరు చోట్ల గాయాలైనట్లు వారు తెలిపారు. మెడ, వెన్నుముక భాగంలో సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, త్వరలో పూర్తిస్థాయిలో కోలుకుని ఇంటికి చేరుకుంటారని వెల్లడించారు.దుండుగుడి ఆచూకీ కనిపెట్టడానికి పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అతడి ఫోటోను విడుదల చేశారు. బాంద్రా పోలీసులు అతన్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. దొంగతనం కోసం వచ్చి హత్యాయత్నానికి పాల్పడడంతో సెక్షన్ 331(4), సెక్షన్ 311 కింద కేసు పెట్టారు. సాక్ష్యాధారాల కోసం సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. సైఫ్‌పై దాడి తర్వాత దుండగుడు మెట్లు దిగి పారిపోయినట్లు గుర్తించారు. -
నిలకడగా సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం
ముంబై: బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రముఖ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సైఫ్ అలీ ఖాన్(54)పై గుర్తుతెలియని దుండగుడు కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో నటుడికి తీవ్రగాయాలయ్యాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో సంపన్నులు నివాసం ఉండే బాంద్రా వెస్ట్ ప్రాంతంలో ఉన్న సద్గురు శరణ్ భవనం 12వ అంతస్తులో సైఫ్ సొంత ఫ్లాట్‌లో గురువారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సమయంలో ఇంట్లో సైఫ్ భార్య కరీనాకపూర్ ఖాన్‌తో కుమారులు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. దుండగుడి దాడిలో గాయపడి రక్తమోడుతున్న సైఫ్‌ను ఆయన పెద్ద కుమారుడు ఇబ్రహీం, పనిమనుషులు వెంటనే ఆటోలో సమీపంలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభించడంతో ప్రాణాపాయం తప్పింది. రెండు బలమైన కత్తిపోట్లు సహా మొత్తం ఆరు చోట్ల గాయాలయ్యాయని డాక్టర్లు చెప్పారు. వెన్నుముక నుంచి 2.5 అంగుళాల కత్తి మొనను ఆపరేషన్ ద్వారా తొలగించారు. సైఫ్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలిపారు. సైఫ్‌పై దాడిపట్ల బాలీవుడ్ నటులతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కత్తితో దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు భద్రత కల్పించాలని కోరారు. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండాపోయిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రత్యేక బృందాలతో గాలింపు సైఫ్‌పై దాడి ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బాంద్రా పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. రాత్రిపూట ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడంతోపాటు దొంగతనం కోసం వచ్చి హత్యాయత్నానికి పాల్పడడంతో సెక్షన్ 331(4), సెక్షన్ 311 కింద కేసు పెట్టారు. సాక్ష్యాధారాల కోసం సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. సైఫ్‌పై దాడి తర్వాత దుండగుడు మెట్లు దిగి పారిపోయినట్లు గుర్తించారు. వీపున తగిలించుకున్న ఓ బ్యాగ్‌తో అతడు పారిపోతున్న దృశ్యాలు ఆరో అంతస్తులో తెల్లవారుజామున 2.33 గంటల సమయంలో రికార్డయ్యాయి. స్థానికంగా మొబైల్ ఫోన్ల డేటాను పోలీసులు వడపోశారు. దుండుగుడి ఆచూకీ కనిపెట్టడానికి పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అతడి ఫోటోను విడుదల చేశారు. దుండగుడి దాడిలో సైఫ్ పనిమనిషికి సైతం గాయాలయ్యాయి. దుండగుడితో జరిగిన పెనుగులాటలో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. బాధితురాలి నుంచి పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. స్టేట్మెంట్ రికార్డు చేశారు. అసలేం జరిగింది? దొంగతనం కోసమే దుండగుడు సైఫ్ ఫ్లాట్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. సైఫ్, కరీనా దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి తమ ఫ్లాట్‌లో నిద్రిస్తున్న సమయంలో అలికిడి వినిపించింది. అప్పటికే సైఫ్ చిన్నకుమారుడు జహంగీర్ గదిలో మాటువేసిన దుండగుడి కదలికలను పనిమనిషి గమనించి బిగ్గరగా కేకలు వేసింది. అలారం మోగించింది. దాంతో అతడు ఆమెపై కత్తి దూశాడు. ఈ శబ్దాలు వినిపించి నిద్రనుంచి మేల్కొన్న సైఫ్ అలీ ఖాన్ ఆ గదిలోకి వచ్చి దుండగుడిని అడ్డుకొనేందుకు ప్రయతి్నంచాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చాలాసేపు పెనుగులాట జరిగింది. వాగ్వాదం చోటుచేసుకుంది. సైఫ్‌ను దుండగుడు కత్తితో విచక్షణారహితంగా పొడిచి తక్షణమే మెట్ల మార్గం గుండా పరారయ్యాడు. ఫైర్ ఎగ్జిట్ ద్వారా అతడు సైఫ్ ఫ్లాట్‌లో ప్రవేశించినట్లు పోలీసులు చెప్పారు. సైఫ్ కుమారుడి గదిలో నాలుగు గంటలపాటు నిశ్శబ్దంగా నక్కి ఉండి, అవకాశం కోసం ఎదురు చూశాడని, అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగతనానికి ప్రయతి్నంచాడని తెలిపారు. కారు అందుబాటులో లేకపోవడంతో సైఫ్‌ను ఆయన కుమారుడు, సహాయకులు ఆటోలో ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాధితుడికి న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ డాంగే, కాస్మోటిక్ సర్జన్ డాక్టర్ లీనా జైన్, అనస్థీషియాలజిస్టు డాక్టర్ నిషా గాంధీ శస్త్రచికిత్స చేశారు. ఆరు చోట్ల గాయాలైనట్లు తెలిపారు. మెడ, వెన్నుముక భాగంలో సర్జరీ చేశారు. ఎడమ చెయ్యి, మెడ కుడి భాగంలో రెండు లోతైన గాయాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, త్వరలో పూర్తిస్థాయిలో కోలుకుంటారని వెల్లడించారు. నిప్పులు చెరిగిన ప్రతిపక్షాలు మహారాష్ట్రలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణిస్తున్నాయని ఎన్సీపీ(శరద్ పవార్ అధ్యక్షుడు శరద్ పవార్ ఆరోపించారు. బాంద్రాలో ఇటీవలే ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడని, ఇప్పుడు సైఫ్‌పై దాడి జరిగిందని చెప్పారు. ఇవన్నీ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయని తెలిపారు. హోంశాఖ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వద్దే ఉందని, శాంతిభద్రతల పరిరక్షణపై ఇకనైనా దృష్టి పెట్టాలని సూచించారు. ముంబైలో ఎవరికీ రక్షణ లేదని శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. -
సైఫ్అలీఖాన్కు కత్తిపోట్లు: కరీనా, సైఫ్ లగ్జరీ బంగ్లా ఇదే (ఫోటోలు)
-
Saif Ali Khan: రాజవంశం.. రూ.100 కోట్ల ఇల్లు.. రూ.800 కోట్ల ప్యాలెస్
-
సైఫ్ అలీ ఖాన్ కేసులో కీలక పరిణామం.. సీసీటీవీల్లో నిందితుడి దృశ్యాలు
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోని సీసీ ఫుటేజ్‌ను పోలీసులు రిలీజ్ చేశారు. అందులో నిందితుడు మెట్లపై నుంచి దిగుతున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఇవాళ తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. అసలేం జరిగిందంటే..బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై ఇవాళ తెల్లవారుజామున దాడి జరిగింది. ముంబయిలోని ఆయన నివాసంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సైఫ్.. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒంటిపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. ఆయనకు సర్జరీ చేయగా.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.ముంబై పోలీసుల కథనం ప్రకారం.. తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించగా.. ఆయన సిబ్బంది గట్టిగా అరవడంతో మేల్కొన్న సైఫ్.. ఆ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఆ దొంగ సైఫ్ అలీఖాన్‌ను కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాడపడ్డ సైఫ్‌ని కుటుంబ సభ్యులు హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. -
సైఫ్‌పై దాడి.. ఘాటుగా స్పందించిన సీఎం ఫడ్నవిస్
నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి ఘటన గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, అన్ని వివరాలను ఎప్పటికప్పుడు పోలీసులు వెల్లడిస్తున్నారని చెప్పారు. అయితే.. ఈ ఘటన ఆధారంగా ప్రతిపక్షాలు చేస్తున్న తీవ్ర విమర్శలకు ఆయన అంతే ఘాటుగా బదులిచ్చారు. మహారాష్ట్రలో శాంతి భద్రతలు నానాటికీ క్షీణిస్తున్నాయని, వరుసగా ప్రముఖులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ప్రతిపక్షాలు ఫడ్నవిస్ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. మరోవైపు.. ఈ విమర్శలకు సినీ ప్రముఖుల గొంతు కూడా తోడైంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నాం ఎమర్జెన్సీ చిత్ర ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆ చిత్ర నటి కంగనా రనౌత్‌తో మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంలో ఆయన్ని సైఫ్‌పై దాడి గురించి మీడియా ప్రశ్నించింది. దేశంలో ఉన్న మెగాసిటీ(Megacities)ల్లో ముంబై అత్యంత సురక్షితమైన నగరం. నగరంలో ఈ మధ్యకాలంలో కొన్ని ఘటనలు జరిగిన మాట వాస్తవం. వాటిని అంతే తీవ్రంగా మేం వాటిని భావించి దర్యాప్తు జరిపిస్తున్నాం. అలాగని.. ఏదో ఒక ఘటనను పట్టుకుని ముంబై ఏమాత్రం సురక్షితం కాదని అనడం సరికాదు. ఇది ముంబై ప్రతిష్టను దెబ్బ తీసే అంశం. ముంబైను మరింత సురక్షితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది’’ అని అన్నారు. మహారాష్ట్ర హోం శాఖ ప్రస్తుతం ఫడ్నవిస్ వద్దే ఉంది.#WATCH | Mumbai: Maharashtra CM Devendra Fadnavis on the attack on actor Saif Ali Khan says, “Police have provided all the details. What kind of attack this was, the motive behind it, and the intention are all before you.”#SaifAliKhan #DevendraFadnavis #Mumbai pic.twitter.com/L7hGKE8XnE— Organiser Weekly (@eOrganiser) January 16, 2025ముంబై మహానగరంలో అత్యంత విలాసవంతమైన ఏరియాగా బాంద్రాకు ఓ పేరుంది. వీవీఐపీలు ఉండే ఈ ఏరియాలో కట్టుదిట్టమైన పోలీస్ పహారా కనిపిస్తుంటుంది కూడా. అలాంటి ప్రాంతంలో..గత అర్ధరాత్రి అలజడి రేగింది. ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) ఇంట్లోకి చొరబడి చోరీకి యత్నించాడు ఓ దుండగుడు. ఈ క్రమంలో జరిగిన సైఫ్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆయన్ని లీలావతి ఆస్పత్రికి తరలించారు. రెండు కత్తిపోట్లు లోతుగా దిగడం, వెన్నెముకకు దగ్గరగా కత్తికి దిగడంతో ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. అయితే ఆయనకు ప్రమాదం తప్పిందని, రెండ్రోజుల తర్వాత డిశ్చార్జి చేసే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రమాదంలో సైఫ్‌తో పాటు ఆయన ఇంట్లో పని చేసే మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమెకు చికిత్స అందించి వైద్యులు ఇంటింకి పంపించేశారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసుకున్న బాంద్రా(Bandra Police) పోలీసులు.. నిందితుడిని దాదాపుగా గుర్తించినట్లు తెలుస్తోంది. అతన్ని పట్టుకునేందుకు ఏడు బృందాలను రంగంలోకి దింపాయి.ఊహాజనిత కథనాలొద్దుఈ ఘటనపై మీడియా, అభిమానులు సంయమనం పాటించాలని సైఫ్ టీం కోరుతోంది. ‘‘సైఫ్ ఇంట్లో చోరీకి యత్నం జరిగింది. ఈ క్రమంలో ఆయనపై దాడి జరిగింది. సైఫ్ భార్య కరీనా కపూర్, ఇతర కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారు. ఆయనకు గాయాలయ్యాయి. శస్త్రచికిత్స జరిగి ఆయన కోలుకుంటున్నారు. కాబట్టి.. అంతా సంయమనం పాటించాలి. కల్పిత కథనాలు రాయొద్దు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్లు అందించే సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందజేస్తాం’’ అని ఆయన టీం తెలిపింది. -
సైఫ్ ఇంటికి ప్రముఖ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్.. ఇంతకీ ఆయనెవరో తెలుసా?
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై (Saif Ali Khan) గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముంబయలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.అయితే దర్యాప్తులో భాగంగా ప్రముఖ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ సైఫ్ ఇంటిని పరిశీలించారు. దాడి ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. ఇప్పటికే ఈ దాడిలో ఇద్దదు నిందితులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే సైఫ్ ఇంటిని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ (Daya Nayak) కూడా ఉన్నారు. బాంద్రాలోని సైఫ్ ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వచ్చిన ఆయన ఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. కాగా.. ముంబయి అండర్‌వరల్డ్‌ను గడగడలాడించిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా దయా నాయక్‌కు పేరుంది.అసలు ఎవరీ దయా నాయక్..కర్ణాటకలోని ఉడిపి దయా నాయక్ స్వస్థలం. 1979లో ఆయన ఫ్యామిలీ ముంబయి షిఫ్ట్ అయింది. అక్కడే అంధేరిలోని కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత 1995లో పోలీస్ పరీక్షల్లో విజయం సాధించారు. మొదటిసారి ముంబయిలోని జుహు పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా విధుల్లో చేరారు.దయా నాయక్ ఉద్యోగంలో చేరేసరికి అండర్‌వరల్డ్ పేరుతో ముంబయిలో హత్యలు, డ్రగ్స్, హవాలా సహా ఎన్నో నేరాలు ఎక్కువగా ఉండేవి. ఈ క్రమంలోనే చోటా రాజన్ గ్యాంగ్‌లోని ఇద్దరిని కాల్చి చంపడంతో దయా నాయక్ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. డిపార్ట్మెంట్లోనూ ఆయన పేరు ఓ రేంజ్లో వినిపించింది. అండర్ వరల్డ్ నెట్‌వర్క్‌కు పనిచేస్తున్న దాదాపు 80 మందిని దయా నాయక్ ఎన్కౌంటర్ చేసినట్లు సమాచారం.सैफ अली खान पर हमले पर मुंबई पुलिस अधिकारी दया नायक ने कहा...#SaifAliKhan #KareenaKapoorKhan #SaraAliKhan #IbrahimAliKhan #MumbaiPolice #mumbaiattack #DayaNayak pic.twitter.com/RVCEl7qzxJ— CNBC-AWAAZ (@CNBC_Awaaz) January 16, 2025 -
సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులిటెన్
-
Saif Ali Khan: వెన్నెముకలో విరిగిన కత్తి.. నటుడికి ప్లాస్టిక్ సర్జరీ
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)పై దాడి ఘటనలో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేసేందుకు వచ్చిన వ్యక్తి నిన్న రాత్రే ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రంతా ఇంట్లోనే దాక్కున్న దొంగ తెల్లవారుజామున దొంగతనానికి ప్రయత్నించాడు. సైఫ్ అలీ ఖాన్ పిల్లల బెడ్రూమ్ దగ్గరే దుండగుడు పనిమనిషితో ఘర్షణ పడినట్లు తెలుస్తోంది.ఆరుసార్లు పొడిచి..ఆ అలికిడి గమనించిన నటుడు దుండగుడిని అడ్డుకునే క్రమంలో తోపులాట జరిగింది. ఈ సమయంలో దొంగ సైఫ్ అలీఖాన్‌ను ఆరుసార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సమయానికి కారు రెడీగా లేకపోవడంతో రక్తమోడుతున్న తండ్రిని ఇబ్రహీం అలీ ఖాన్ (Ibrahim Ali Khan) ఆటోలో తీసుకెళ్లాడు. ఉదయం మూడున్నర గంటల ప్రాంతంలో లీలావతి ఆస్పత్రిలో చేర్పించారు.చదవండి: ఇంట్లో దోపిడీయత్నం.. హీరో సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి!వెన్నెముకకు సర్జరీఅతడిని పరీక్షించిన వైద్యులు సైఫ్ వెన్నెముకలో కత్తి మొన విరిగినట్లు గుర్తించారు. వెన్నెముక నుంచి 2.5 అంగుళాల పొడవైన కత్తి మొనను సర్జరీ ద్వారా తొలగించారు. మెడపై అయిన లోతైన గాయానికి ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సైఫ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.సీసీటీవీ ప్రకారం..సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం.. ఘటన జరగడానికి రెండు గంటల ముందు వరకు ఎవరూ ఇంట్లోకి ప్రవేశించలేదని పోలీసులు వెల్లడిస్తున్నారు. దీన్ని బట్టి దొంగ నిన్న రాత్రే ఇంట్లోకి చొరబడ్డాడని చెప్తున్నారు. దీంతో సైఫ్ శత్రువులు ప్లాన్ ప్రకారం అతడిపై దాడి చేయించారా? లేదా తెలిసినవాళ్లే ఈ పని చేయించారా? అని పలువురూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హీరోగా ఎన్నో సినిమాలు చేసిన సైఫ్ అలీ ఖాన్ ఇటీవల నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అలరిస్తున్నాడు. తెలుగులో దేవర సినిమాలో విలన్‌గా నటించాడు.సైఫ్ వ్యక్తిగత విషయానికి వస్తే..సైఫ్ అలీ ఖాన్ 1991లో అమృతా సింగ్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి సారా, ఇబ్రహీం అని ఇద్దరు సంతానం. సైఫ్- అమృత 2004లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సైఫ్.. కరీనాను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య 10 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. ఈ జంటకు తైమూర్, జెహ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.చదవండి: బ్లాక్‌బస్టర్ పొంగల్.. కలెక్షన్స్ ఎంత వచ్చాయంటే? -
‘సెలబ్రిటీలకే ఇలా జరిగితే సామాన్యుల గతేంటి?’
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి.. యావత్ దేశాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతి గురి చేసింది. అటు సినీ, ఇటు ఇతర రంగాల ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. అయితే ఇప్పుడి ఘటన మహారాష్ట్రలో రాజకీయ అలజడికి కారణమైంది.సైఫ్ అలీఖాన్ దాడి ఘటనను ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాలయంటూ దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఉద్దవ్ సేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘సెలబ్రిటీలకే భద్రత కరువైనప్పుడు ముంబైలో సామాన్యుల సంగతి ఏంటి?’’ అంటూ ట్వీట్ చేశారామె.ముంబైలో వరుసగా ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. మరో హై ప్రొఫైల్ వ్యక్తిపై దాడి జరగడం నిజంగా నగరానికి సిగ్గుచేటు. ముంబై పోలీసులు, హోం మంత్రిత్వ శాఖ పని తీరును ఈ ఘటన కచ్చితంగా ప్రశ్నిస్తుంది అని అన్నారామె. ఈ క్రమంలో సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్య ఉదంతంతో పాటు సల్మాన్ ఖాన్ ఇంటిపై జరిగిన దాడి ఘటనను ఆమె ప్రస్తావించారు.My comment on the latest murderous attack in Mumbai. https://t.co/a2aD1ymRGr pic.twitter.com/MohkfAN01d— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) January 16, 2025బాబా సిద్ధిఖీ కుటుంబం న్యాయం కోసం ఎదురు చూస్తోంది. సల్మాన్ ఖాన్ ఇక లాభం లేదనుకుని ఇంటినే బుల్లెట్‌ఫ్రూఫ్‌గా మార్చేసుకున్నారు. ఇప్పుడు ప్రముఖులు ఉండే బాంద్రాలో సైఫ్‌పై దాడి జరిగింది. అలాంటప్పుడు ముంబైలో ఇంకెవరు సురక్షితంగా ఉంటారు?.. ఆయన త్వరగా కోలుకోవాలి అని ఆమె అన్నారు.మరోవైపు.. పవార్ ఎస్పీపీ సైతం ఈ పరిణామంపై స్పందించింది. సైఫ్ అలీ ఖాన్ లాంటి ప్రముఖ వ్యక్తిపై ఆయన ఇంట్లోనే దాడి చేసినప్పుడు.. సామాన్యుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతాయని ఆ పార్టీ ప్రతినిధి క్లైడ్ కాస్ట్రో ట్వీట్ చేశారు.Attack on Saif Ali Khan is a cause for concern because if such high profile people with levels of security can be attacked in their homes, then what could happen to common citizens?Fear of law seems to be at a low in Maharashtra due to leniencies in the past couple of years— Clyde Crasto - क्लाईड क्रास्टो 🇮🇳 (@Clyde_Crasto) January 16, 2025సైఫ్‌పై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. కాంగ్రెస్ ఎంపీ వర్షా గైక్వాడ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ ముంబైలో ఏం జరుగుతోంది?. ప్రముఖులుండే నివాసాల మధ్య.. అదీ అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఒక నటుడి ఇంట్లోనే దాడి జరగడం శోచనీయం. ఇలాంటప్పుడు సామాన్యుడు ఈ ప్రభుత్వం నుంచి ఇంకేం ఆశిస్తాడు? అని అన్నారామె. తుపాకీ మోతలు, దొంగతనాలు, కత్తిపోట్లు.. ముంబైలో నిత్యకృత్యం అయిపోయాయి. అసలు ముంబైలో ఏం జరుగుతోంది?. వీటికి ప్రభుత్వం నుంచి సమాధానాలు రావాలి అని అన్నారామె.एक पद्मश्री विजेता लोकप्रिय अभिनेता जो एक हाइ प्रोफाइल सोसायटी में बांद्रा जैसे सुरक्षित माने जाने वाले इलाके में रहते हैं, उनके घर में घुसकर कोई उनको चाकू मारकर चला जाता है, ये कितनी भयानक घटना है! महाराष्ट्र में कानून व्यवस्था की आए दिन धज्जियां उड़ रही है। बांद्रा में एक नेता… pic.twitter.com/EV13yNkQnq— Prof. Varsha Eknath Gaikwad (@VarshaEGaikwad) January 16, 2025అయితే.. తీవ్ర విమర్శల వేళ బీజేపీ స్పందించింది. ఘటనను రాజకీయం చేయొద్దని.. పోలీసులు దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనకు పోలీసులే బాధ్యత వహించాలని అన్నారాయన. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, బాధ్యులెవరైనా ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని, పోలీసులు ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారాయన.ఇక.. మీడియా, అభిమానులు సంయమనం పాటించాలని సైఫ్ టీం కోరుతోంది. ‘‘సైఫ్ ఇంట్లో చోరీకి యత్నం జరిగింది. ఈ క్రమంలో ఆయనపై దాడి జరిగింది. సైఫ్ భార్య, ఇతర కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారు. ఆయనకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరుగుతోంది. కాబట్టి.. అంతా సంయమనం పాటించాలి. కల్పిత కథనాలు రాయొద్దు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్లు అందించే సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందజేస్తాం’’ అని ఆయన టీం తెలిపింది.గురువారం తెల్లవారుజామున బాంద్రా(Bandra)లోని సైఫ్ నివాసంలో 2-2.30 గంటల మధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. సైఫ్, ఆయన కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు. అది గమనించిన సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంట్లో పని చేసే మరో మహిళకూ గాయాలైనట్లు సమాచారం. వీరిద్దరినీ లీలావతి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీలో ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలుస్తోంది. ఈ ఉదయం స్నిఫర్ డాగ్స్ సహకారంతో ఏడు బృందాలు దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇంట్లో పని మనిషి సహకారంతోనే దుండగుడు లోపలికి ప్రవేశించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అతడ్ని విచారించే అవకాశం కనిపిస్తోంది.మరోవైపు.. సైఫ్‌కు ఆరు కత్తిపోట్లు అయ్యాయని, రెండు లోతుగా దిగాయని, వెన్నుపూస అతిసమీపంలో మరో గాయం కావడంతో సర్జరీ అవసరం పడిందని లీలావతి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. 3గం. సమయంలో సైఫ్‌ను ఆస్పత్రికి తెచ్చారు. ఆయనకు తీవ్ర రక్త స్రావం జరిగింది. సర్జరీ జరిగాక ఎప్పటికప్పుడు ఆయన హెల్త్‌బులిటెన్ విడుదల చేస్తామని, ఊహాజనిత కథనాలు ఇవ్వొద్దని వైద్యులు మీడియాను కోరారు. 54 ఏళ్ల సాజిద్ అలీఖాన్ పటౌడీ అలియాస్ సైఫ్ అలీ ఖాన్.. బాలీవుడ్ యాక్టర్‌గా సుపరిచితుడే. ప్రముఖ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, నటి షర్మిలా ఠాగూర్ల తనయుడు ఈయన. 1993లో పరంపర చిత్రంతో ఆయన హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఇటీవల ఎన్టీఆర్ దేవర చిత్రంతో టాలీవుడ్లోకి డెబ్యూ ఇచ్చి అలరించారు. -
సైఫ్ అలీఖాన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా: మెగాస్టార్ చిరంజీవి
-
దేవర విలన్ కు ఎన్టీఆర్ పరామర్శ
-
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి
-
సైఫ్ అలీఖాన్‌పై దాడి.. షాకయ్యా: జూనియర్ ఎన్టీఆర్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై దాడి జరగడం కలకలం రేపుతోంది. ముంబైలోని ఆయన ఇంట్లో గురువారం తెల్లవారుజామున ఓ వ్యక్తి సైఫ్‌ను కత్తితో పలుమార్లు పొడిచి పారిపోయాడు. ఈ దాడిలో ఆయనకు ఆరుచోట్ల గాయాలయ్యాయి. అందులో రెండు చోట్ల లోతైన గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆనయ్ను లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెన్నెముక పక్కనే తీవ్రగాయం కావడంతో వైద్యులు నటుడికి సర్జరీ చేస్తున్నారు. దొంగతనం చేసే క్రమంలోనే..ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుడు దొంగతనానికి వచ్చాడా? లేదా పక్కా మర్డర్ ప్లాన్‌తోనే సైఫ్‌పై దాడి చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటనపై కరీనా కపూర్ (Kareena Kapoor) టీమ్ ఓ లేఖ విడుదల చేసింది. సైఫ్- కరీనా ఇంట్లో ఓ దుండగుడు చోరీకి ప్రయత్నించాడు. అతడిని అడ్డుకునే క్రమంలో సైఫ్ చేతికి గాయమైంది. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంట్లోని మిగతా సభ్యులు క్షేమంగానే ఉన్నారు. పోలీసుల విచారణ జరుగుతోంది అని లేఖలో పేర్కొన్నారు.షాక్‌కు గురయ్యాఇదిలా ఉంటే సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడిపై టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) స్పందించాడు. సైఫ్ సర్‌పై జరిగిన దాడి గురించి విని షాక్‌కు గురయ్యాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. చిరంజీవి (Chiranjeevi) సైతం సైఫ్ పరిస్థితిపై విచారం వ్యక్తం చేశాడు. సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి నన్నెంతగానో కలిచివేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని ట్వీట్ చేశాడు.హీరో నుంచి విలన్‌గా..సైఫ్ అలీఖాన్ ఒకప్పుడు హీరోగా బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాడు. కానీ ఇటీవల మాత్రం ఎక్కువగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతోనే మెప్పిస్తున్నాడు. హీరోకి సమానంగా ఉండే విలన్ పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించిన దేవర చిత్రంలో విలన్‌గా నటించాడు. ఈ చిత్రంలో భైరవ పాత్రలో యాక్ట్ చేశాడు. వచ్చాయి. ప్రస్తుతం సైఫ్ ఓ భారీ ప్రాజెక్ట్‌కి సైన్ చేసినట్లు తెలుస్తోంది. Shocked and saddened to hear about the attack on Saif sir.Wishing and praying for his speedy recovery and good health.— Jr NTR (@tarak9999) January 16, 2025చదవండి: ఇంట్లో దోపిడీయత్నం.. హీరో సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి! -
ఇంట్లో దోపిడీయత్నం.. హీరో సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి!
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై దాడి జరిగింది. ముంబైలోని ఆయన నివాసంలో గురువారం తెల్లవారు జామున గుర్తు తెలియని ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సైఫ్.. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒంటిపై ఆరు చోట్ల గాయాలైనట్లు తెలుస్తోంది. వైద్యులు సర్జరీ చేస్తున్నారని, ఆ తరువాతే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి బయటకు చెబుతారని బాలీవుడ్ మీడియా పేర్కొంది. చోరీ కోసం వచ్చి దాడి!ముంబై పోలీసుల కథనం ప్రకారం.. సైఫ్ అలీకాన్ ఇంట్లో గురువారం తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో భారీ చోరీ జరిగింది. ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించిన విషయంలో ఆయన సిబ్బంది గుర్తించింది. శబ్దం రావడంతో నిద్ర నుంచి మేల్కొన్న సైఫ్.. సిబ్బందితో కలిసి ఆ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ దొంగ సైఫ్ అలీఖాన్‌ను కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాడపడ్డ సైఫ్‌ని కుటుంబ సభ్యులు హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. సైఫ్ ఒంట్లో తీవ్రంగా గాయాలయ్యాయని.. సర్జరీ అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా, పిల్లలు ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. చోరీనా.. కుట్రనా?సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడిన దుండగుడు..పరారీలో ఉన్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ‘దాడి జరిగిందనే సమాచారం తెలిసిన వెంటనే మేము సైఫ్ అలీఖాన్ నివాసానికి వెళ్లాం. అప్పటికే దుండగుడు పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన సైఫ్‌కి లీలావతి ఆస్పత్రికి తరలించారు. తన ఒంటిపై కత్తి పోట్లు పడ్డాయా లేదా అనేది అస్పష్టంగా ఉంది. దుండగుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశాం. ఇప్పటికే అతని కోసం గాలింపు చర్యలు ప్రారంభించాం’ అని ముంబై పోలీసు అధికారి తెలిపారు. నిందితుడు దొంగతనం కోసమే వచ్చాడా లేదా దాడి వెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ దిగ్భ్రాంతిసైఫ్ అలీఖాన్ దాడిపై హీరో ఎన్టీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిందనే విషయం తెలిసి షాక్‌కు గురయ్యయానని, ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా, ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ చిత్రంలో సైఫ్ విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి దేవర 2 చిత్రంలోనూ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. Shocked and saddened to hear about the attack on Saif sir.Wishing and praying for his speedy recovery and good health.— Jr NTR (@tarak9999) January 16, 2025 విలన్‌గా రాణిస్తున్న సైఫ్ అలీఖాన్ఒకప్పుడు హీరోగా బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన సైఫ్ అలీఖాన్..ఇటీవల నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో మెప్పిస్తున్నారు. హీరోకి సమానంగా ఉండే విలన్ పాత్రలు చేస్తూ తనదైన నటనతో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల దేవర చిత్రంలో విలన్‌గా నటించాడు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో భైరవ పాత్రను సైఫ్ పోషించాడు. సినిమా రిలీజ్ తర్వాత సైఫ్ పాత్రకి మంచి ప్రశంసలు వచ్చాయి. ప్రస్తుతం సైఫ్ ఓ భారీ ప్రాజెక్ట్‌కి సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక వ్యక్తిగత విషయానికొస్తే.. 1991లో, సైఫ్ అలీ ఖాన్ అమృతా సింగ్‌ను వివాహం చేసుకున్నాడు. సైఫ్, అమృతలకు ఇద్దరు పిల్లలు - సారా, ఇబ్రహీం. 2004లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సైఫ్ కరీనాను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య 10 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. ఈ జంటకు తైమూర్, జెహ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. -
రాజ్ కపూర్ 100వ జన్మదినోత్సవం కార్యక్రమంలో బాలీవుడ్ తారలు సందడి (ఫొటోలు)
-
మా ఇంటిదేవతకు హ్యాపీ బర్త్‌డే : బాలీవుడ్ బ్యూటీ సంబరాలు (ఫొటోలు)
-
హైదరాబాద్ : సుదర్శన్ థియేటర్లో ‘దేవర’ మూవీ 50 రోజుల వేడుక (ఫొటోలు)
-
ప్యాలెస్‌ను అలా మార్చేద్దామనుకున్నా.. కానీ ఒప్పుకుంటేగా!
ది ఫేమస్ పటౌడీ ప్యాలెస్‌ను మ్యూజియంగా మార్చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ పుకారు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ చెవిలో పడింది. నాకు తెలియకుండా ప్యాలెస్‌ను ఎక్కడ అమ్మేస్తున్నారని సైఫ్ షాకయ్యాడు. తన ఇల్లుకు మనసులో ప్రత్యేక స్థానం ఉందన్నాడు.మా నాన్న నవాబుఆయన మాట్లాడుతూ.. చారిత్రాత్మకంగా చూసుకుంటే ఈ ప్యాలెస్ ఎంతోమందికి చెందినది. మా నాన్న (క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్) నవాబు. ఈ ప్యాలెస్‌లో తనకు నచ్చినట్లు బతికాడు. అయితే కాలం మారుతుండేకొద్దీ నాకు ఓ ఆలోచన వచ్చింది. ఈ ఇంటిని హోటల్‌కోసం అద్దెకు ఇస్తే ఎలా ఉంటుందనుకున్నాను. అందుకు ఒప్పుకోలేదుఅందుకు మా నానమ్మ అస్సలు ఒప్పుకోలేదు. ఇలాంటి పిచ్చి పనులు చేయకని మందలించింది. ఈ ఇంటికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. అది నేను గర్వంగా ఫీలవుతాను. మా నానమ్మ-తాతయ్య, నాన్న జ్ఞాపకాలతో హౌస్‌ను నింపేయాలనుకున్నాను. నేను అనుకుంది దాదాపు పూర్తి కావొచ్చింది అని పేర్కొన్నాడు.ప్యాలెస్ హైలైట్స్పటౌడీ ప్యాలెస్ విషయానికి వస్తే దీన్ని సైఫ్ తాతయ్య ఇఫ్తికర్ అలీ ఖాన్ పటౌడీ నిర్మించాడు. ఇందులోని ప్రతి గది, అలంకరణ వస్తువులు రాజదర్పాన్ని ప్రదర్శిస్తాయి. దాదాపు 10 ఎకరాల్లో విస్తీర్ణమై ఉన్న ఈ ప్యాలెస్‌లో 150 గదులున్నాయి. ప్రస్తుతం దీన్ని సైఫ్ కుటుంబం వెకేషన్ కోసం వాడుతోంది. ఎక్కువగా సినిమా షూటింగ్‌లు జరుగుతూ ఉంటాయి. బ్లాక్‌బస్టర్ మూవీ యానిమల్ కూడా ఈ రాజభవనంలోనే తెరకెక్కింది.చదవండి: దేవర.. నీ రాక కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు -
రాహుల్ ధైర్యవంతుడు, నిజాయితీ కలిగిన నేత: సైఫ్ ప్రశంసలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రశంసలు కురిపించారు. విమర్శలను ఎలా ఎదుర్కొవాలో తెలిసిన ధైర్యవంతమైన రాజకీయ నాయకుడని కొనియాడారు. అలాంటి ధైర్యవంతులైన, నిజాయితీ కలిగిన నేతలంటే తనకు ఇష్టమని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న సైఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్.. వీరిలో ఎవరూ ధైర్యవంతులని, ఎవరు భవిష్యత్తులో దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలరని మీరు భావిస్తున్నట్లు అడగ్గా.. ముగ్గురూ ధైర్యవంతులైన రాజకీయ నాయకులేనని అన్నారు. అయితే గతంలో రాహుల్‌పై వచ్చిన విమర్శలను ఆయన ఎంతో ధీటుగా ఎదుర్కొన్నారని తెలిపారు.చదవండి: మోదీని కాదు నన్ను ప్రధానిని చేస్తామన్నారు.. నితిన్ గడ్కరీ‘రాహుల్‌గాంధీ తీరు నన్ను ఎక్కువగా ఆకట్టుకుంటోంది. గతంలో ఆయన చేసే పనులను, చెప్పే మాటలను కొంతమంది అగౌరవపర్చిన సందర్భాలున్నాయి. అలాంటి స్థితి నుంచి ఆయన తనను తాను ఎంతగానో మార్చుకున్నారు. చాలా కష్టపడి తన పనుల ద్వారా విమర్శలను తిప్పికొట్టాడు. మళ్లీ ప్రజల్లో ఆదరణ చూరగొన్నారు. ఆ ప్రయాణం చాలా ఆసక్తిగా అనిపిస్తోంది’ అని సైఫ్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.తాను రాజకీయ నాయకుడిని కాదని, భవిష్యత్తులోనూరాజకీయాల్లో చేరాలనుకోవడం లేదని పైఫ్ తెలిపారు. అలాగే ఎవరికి మద్దతిస్తానన్న నిర్దిష్ట ప్రశ్నకు సమాధానం చెప్పలేననని పేర్కొన్నారు.అయితే తనకు ఏదైనా విషయంలో బలమైన అభిప్రాయాలు ఉంటే కచ్చితంగా వాటిని అందరితో పంచుకుంటానని చెప్పారు. అలాగే భారతదేశంలో ప్రజాస్వామ్యం సజీవంగా ఉందని, అది ఇంకా అభివృద్ధి చెందుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు -
‘దేవర’ మూవీ రివ్యూ
టైటిల్: దేవరనటీనటులు: జూ.ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, శృతి మారాఠే, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, చైత్ర రాయ్ తదితరులునిర్మాణ సంస్థ: ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ ,యువసుధ ఆర్ట్స్నిర్మాతలు: నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని,కొసరాజు హరికృష్ణదర్శకత్వం- స్క్రీన్‌ప్లే: కొరటాల శివసంగీతం: అనిరుధ్ రవిచందర్సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలుఎడిటింగ్: అక్కినేని శ్రీకర్ ప్రసాద్విడుదల తేది: సెప్టెంబర్ 27, 2024ఎన్టీఆర్ అభిమానుల ఆరేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆయన సోలో హీరోగా నటించిన ‘దేవర’ మూవీ ఎట్టకేలకు నేడు(సెప్టెంబర్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, ఆచార్య లాంటి అట్టర్ ఫ్లాప్ తర్వాత డెరెక్టర్ కొరటాల శివ కలిసి చేసిన సినిమా ఇది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘దేవర’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం ఎలా ఉంది? కొరటాల శివకు భారీ బ్రేక్ వచ్చిందా? ఎన్టీఆర్‌కు ఇండస్ట్రీ హిట్ పడిందా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఆంధ్ర - తమిళనాడు సరిహద్దు ప్రాంతం రత్నగిరి లోని ఎర్ర సముద్రం అనే గ్రామంలో జరిగే కథ ఇది. కొండపై ఉండే నాలుగు గ్రామాల సమూహమే ఈ ఎర్ర సముద్రం. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ( సైఫ్ అలీ ఖాన్), రాయప్ప( శ్రీకాంత్), కుంజర(షైన్ టామ్ చాకో) ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకుని అధికారుల కంట పడకుండా తీసుకొచ్చి మురుగ(మురళీ శర్మ)కి ఇవ్వడం వీళ్ల పని. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవర ఫిక్స్ అవుతాడు. దేవర మాట కాదని భైరవతో పాటు మరో గ్రామ ప్రజలు సముద్రం ఎక్కేందుకు సిద్ధం అవ్వగా... దేవర వాళ్లకు తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు. దీంతో దేవరని చంపేయాలని భైరవ ప్లాన్ వేస్తాడు. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఎర్ర సముద్రం ప్రజలు సముద్రం ఎక్కి దొంగ సరకు తీసుకురాకుండా ఉండేందుకు దేవర తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? అతని కొడుకు వర(ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైరవ మనుషులని చంపేస్తుంది ఎవరు? తంగం( జాన్వీ కపూర్)తో వర ప్రేమాయణం ఎలా సాగింది? గ్యాంగ్‌స్టర్ యతితో దేవర కథకు సంబంధం ఏంటి అనేదే మెయిన్ స్టోరీ.ఎలా ఉందంటేదాదాపు ఆరేళ్ల గ్యాప్ తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రం కావడంతో దేవర పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్ ఓ మాదిరిగి ఉన్నా... సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుంది. లేకపోతే ఎన్టీఆర్ ఒప్పుకోరు కదా అని అంతా అనుకున్నారు. కానీ కొరటాల మరోసారి రొటీన్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు ట్రెడింగ్లో ఉన్న ఎలివేషన్ ఫార్ములాని అప్లై చేస్తూ కథనాన్ని నడిపించడం కొంతవరకు కలిసొచ్చే అంశం. యాక్షన్ సీన్లు కూడా బాగానే ప్లాన్ చేశారు. అయితే ఇవి మాత్రమే ప్రేక్షకుడికి సంతృప్తిని ఇవ్వలేవు. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో స్థాయికి తగ్గట్టుగా కథను తీర్చిదిద్దడంతో కొరటాల సఫలం కాలేదు.గతంలో కొరటాల తీసిన సినిమాల్లో ఆచార్య మినహా ప్రతి దాంట్లో కొన్ని గూస్బంప్స్ వచ్చే సీన్లతో పాటు ఓ మంచి సందేశం ఇచ్చేవాడు. ఒకటి రెండు పవర్ఫుల్ డైలాగ్స్ ఉండేవి. కానీ దేవరలో అలాంటి సీన్లు, డైలాగ్స్ పెద్దగా లేవు. స్క్రీన్‌ప్లే కూడా కొత్తగా అనిపించదు.ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న ఎలివేషన్ ఫార్ములాతో కథను ప్రారంభించాడు. గ్యాంగ్‌స్టర్‌ని పట్టుకునేందుకు పోలీసు అధికారి(అజయ్) ఎర్రసముద్రం రావడం.. అక్కడ ఓ వ్యక్తి (ప్రకాశ్ రాజ్) దేవరకు భారీ ఎలివేషన్స్ ఇస్తూ పన్నెడేంళ్ల క్రితం ఆ ఊరిలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. ఆ తర్వాత కథంతా ఎర్రసముద్రం, దేవర చుట్టు తిరుగుతుంది. ప్రేక్షకుల్ని మెల్లిగా దేవర ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. ఎర్ర సముద్రం నేపథ్యం, వారు దొంగలుగా మారడానికి గల కారణాలు, దేవర చూపించే భయం, ప్రతిది ఆకట్టుకుంటుంది. చెప్పే కథ కొత్తగా ఉన్నా తెరపై వచ్చే సీన్లు పాత సినిమాలను గుర్తుకు తెస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం బాగా ప్లాన్ చేశాడు. ఫస్టాఫ్ అంతా దేవర చుట్టు తిరిగితే.. సెకండాప్ వర చుట్టూ తిరుగుతుంది. రెండో ఎన్టీఆర్ ఎంట్రీ వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత కథ సాగదీతగా అనిపిస్తుంది. జాన్వీ కపూర్ ఎపిసోడ్స్ అతికినట్లుగా అనిపిస్తాయి. పాట మినహా ఆమెతో వచ్చే సీన్లన్ని బోరింగ్‌గానే సాగుతాయి. ప్రీ క్లైమాక్స్‌లో సముద్రం లోపల ఎన్టీఆర్‌తో వచ్చే యాక్షన్ సీన్లు అదిరిపోతాయి. పార్ట్ 2కి లీడ్ ఇస్తూ కథను ముగించారు. క్లైమాక్స్ కొంతవరకు ఆసక్తికరంగా సాగినా.. ట్విస్ట్ పాయింట్ బాహుబలి సినిమాను గుర్తు చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. ఎన్టీఆర్ నటనకు ఏం వంక పెట్టగలం. ఎలాంటి పాత్రలో అయినా జీవించేస్తాడు. ఇక దేవర, వర(వరద) అనే రెండు విభిన్న పాత్రలో కనిపించిన ఎన్టీఆర్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్ తో మాస్ ఆడియన్స్‌ను అలరించటంలో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక డ్యాన్స్ కూడా ఇరగదీశాడు.ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. పల్లెటూరి అమ్మాయి ‘తంగం’ పాత్రలో ఒదిగిపోయింది. తెరపై అచ్చం తెలుగమ్మాయిలాగే కనిపించింది. కాకపోతే ఈమె పాత్ర నిడివి చాలా తక్కువనే చెప్పాలి. ఇందులో సైఫ్ అలీఖాన్ భైరవ అనే ఓ డిఫరెంట్ పాత్రను పోషించాడు. నిడివి తక్కువే అయినా..ఉన్నంతలో చక్కగా నటించాడు. పార్ట్ 2 ఆయన పాత్ర పరిధి ఎక్కువగా ఉంటుంది. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో, చైత్ర రాయ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. అనిరుధ్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. చుట్టంమల్లే పాటకు థియేటర్స్‌లో ఈలలు పడతాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సీన్‌ని తెరపై చాలా రిచ్‌గా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆరేళ్ల గ్యాప్.. రికార్డుల మోత.. ‘దేవర’ గురించి ఈ విషయాలు తెలుసా?
‘దేవర’..ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రమిది. జనతా గ్యారేజ్‌తో ఎన్టీఆర్‌కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించాడు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు నెట్టింట వైరల్ అతున్నాయి. గతంలో ఎన్టీఆర్ ఏ సినిమాకు రానంత బజ్ దేవరకు క్రియేట్ అయింది. దానికి గల కారణం ఏంటి? దేవర ప్రత్యేకతలు ఏంటి? ఒక్కసారి చూద్దాం.→ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చివరి చిత్రం ‘ఆరవింద సమేత వీరరాఘవ’. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆరేళ్ల క్రితం విడుదలైంది. ఆ తర్వాత రామ్ చరణ్‌తో కలిసి ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించాడు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు ‘దేవర’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ కావడం.. ఆరేళ్ల గ్యాప్ తర్వాత సోలో హీరోగా వస్తుండడంతో ‘దేవర’పై భారీ అంచనాలు పెరిగాయి.→ ఈ చిత్రంలో అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని చాలా రోజుల క్రితమే పుకార్లు వచ్చాయి. విజయ్ దేవరకొండ సినిమాతో ఎంట్రీ ఇస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ సరసన నటించే చాన్స్ రావడంతో జాన్వీ వెంటనే ఓకే చెప్పిందట. ‘దేవరలో నటించాలని జాన్వీ కూడా అనుకుందట. మేకు కూడా అనుకోకుండా ఆమెనే అప్రోచ్ అయ్యాం. సెట్లో ఆమెను చూస్తే అచ్చం తెలుగమ్మాయిలాగే అనిపించేంది. ప్రతి సీన్, డైలాగ్ ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేసి సెట్‌పైకి వచ్చేది’అని ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివ అన్నారు. ఇందులో ఆమె ‘తంగం’అనే పాత్ర పోషించారు.→ జాన్వీతో పాటు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మరో నటుడు సైఫ్ అలీఖాన్. ఇందులో ‘భైర’ అనే పాత్రలో నటించాడు. ఎన్టీఆర్ పాత్రకు ధీటుగా సైఫ్ అలీఖాన్ పాత్ర తీర్చిదిద్దారట కొరటాల. పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఆయన పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని టాక్→ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమా నెరేషన్ చేయడానికి దాదాపు నాలుగు గంటల సమయం పట్టిందట. మొదట్లో ఒకే పార్ట్‌గా సినిమా తీయాలని భావించారట. అయితే కొంత షూటింగ్ పూర్తయిన తర్వాత ఇంత పెద్ద కథను మూడు గంటల్లో చెప్పడం కష్టమని భావించి రెండు భాగాలు రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారట.→ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్న నాలుగో సినిమా ఇది. అంతకు ముందు ‘ఆంధ్రావాలా’, ‘అదుర్స్’, ‘శక్తి’ సినిమాల్లో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేశాడు. దేవరలో దేవర, వర అనే రెండు పాత్రల్లో ఎన్టీఆర్ నటించాడు.→ హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమాను తీర్చిదిద్దాడట కొరటాల. ‘‘దేవర’ సినిమా చూస్తున్నప్పుడు మీకు ‘అవెంజర్స్’, ‘బ్యాట్‌మ్యాన్’ వంటి హాలీవుడ్ సినిమాలు చూసిన అనుభూతి కలుగుతుంది’ అని సంగీత దర్శకుడు అనిరుధ్ చెబుతున్నాడు.→ చివరి 40 నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు గూస్బంప్స్ తెప్పిస్తాయట. అండర్ వాటర్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ అని మేకర్స్ చెబుతున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణ కోసం ఎన్టీఆర్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారట.→ ఈ సినిమా కోసం 200చదరపు గజాల్లో సముద్రం సెట్ వేశారట. 35 రోజుల పాటు అక్కడే షూట్ చేశారట. ట్రైలర్లో చూపించిన షార్క్ షాట్ తీయడానికి ఒక రోజు సమయం పట్టిందని కొరటాల చెప్పారు.→ ఈ సినిమాలో వాడిన పడవలను ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అప్పటి కాలంనాటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ పడవలను తీర్చిదిద్దారు. నిజమైన సముద్రంలోనూ ఈ పడవలలో ప్రయాణం చెయ్యొచ్చట.→ ఈ సినిమాలో ఎన్టీఆర్ తన పాత్రకు నాలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పారు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్లో స్వంతంగా డబ్బింగ్ చెప్పారు.→ ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను షూట్ చేయడం కోసం సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చాలా కష్టపడ్డారట. ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్ కోసం అతి తక్కువ వెలుతురులో షాట్స్ తీయడం చాలా కష్టమైందని రత్నవేలు చెప్పారు.→ ఇందులో దేవర భార్యగా మరాఠి నటి శ్రుతి మరాఠే నటించింది. అయితే ఆమె పాత్రను మాత్రం ప్రచార చిత్రాల్లో చూపించకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు.→ ఇక విడుదలకు ముందే ఈ చిత్రం చాలా రికార్డులను క్రియేట్ చేసింది. ఓవర్సీస్లో ప్రీసేల్‌లో అత్యంత వేగంగా ఒక మిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన చిత్రమిదే. లాస్ ఏంజిల్స్‌లో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్‌లో ప్రదర్శితం కానున్న తొలి భారతీయ చిత్రం దేవర. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో అత్యధిక సంఖ్యలో డాల్బీ అట్మాస్ షోలను ప్రదర్శించనున్న తొలి భారతీయ చిత్రంగానూ నిలిచింది. ఇక యూట్యూబ్‌లో అత్యంత వేగంగా 100 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకున్న పాటగా ‘చుట్టమల్లే..’ నిలిచింది.→ ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.400 కోట్లు. ఎన్టీఆర్ రూ.60 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకున్నారట. ప్రీరిలీజ్ బిజినెస్, ఓటీటీ అమ్మకంతో దాదాపు రూ. 350 కోట్ల వరకు రికవరీ అయిందట. ఇంకా శాటిలైట్ అమ్మకాలు జరగనట్లు తెలుస్తోంది. -
జూనియర్ ఎన్టీఆర్‌కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా?
ఉత్తరాది, దక్షిణాది వంటలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. వారి ఆహార శైలి, జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలు అన్నీ కూడా విభిన్నంగా ఉంటాయి. దివంగత నటి శ్రీదేవిది సౌత్ అయితే ఆమె భర్త బోనీకపూర్ది నార్త్. దీనివల్ల ఉదయం అల్పాహారం చేసేటప్పుడు అమ్మ ఎప్పుడూ నాన్నతో గొడవపడేదని చెప్తోంది హీరోయిన్ జాన్వీ కపూర్.టిఫిన్ దగ్గర గొడవదేవర ప్రమోషన్స్‌లో భాగంగా జాన్వీ కపూర్, జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ 'ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో'లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాన్వీ మాట్లాడుతూ.. ఉదయం ఆలూ పరాటా తినే నాన్న... అమ్మ వల్ల ఇడ్లీ సాంబార్ అలవాటు చేసుకున్నాడు. ఈ విషయంలో అమ్మ ఎప్పుడూ నార్త్ ఇండియన్లా గొడవపడేది అని పేర్కొంది. నార్త్‌లో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరన్న ప్రశ్నకు తారక్.. శ్రీదేవి అని టక్కున సమాధానమిచ్చాడు. ఫేవరెట్ హీరోయిన్ ఆవిడే!అలాగే జాన్వీ గురించి ఓ చాడీ చెప్పాడు. ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటి భోజనం తినిపించాను. నేను ముంబై వచ్చినప్పుడు మాత్రం ఆమె ఒక్కసారి కూడా ఇంటి భోజనం లేదా హోటల్ ఫుడో పంపించలేదని తారక్ అనడంతో జాన్వీ పగలబడి నవ్వేసింది. అటు సైఫ్.. సౌత్‌లో ఫేవరెట్ హీరోయిన్ ఎవరన్న ప్రశ్నకు శ్రీదేవి అని బదులిద్దామని రెడీగా ఉన్నానన్నాడు. ఈ ఫన్ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. పూర్తి ఎపిసోడ్ నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 28న ప్రసారం కానుంది. -
దేవర యాక్షన్ సీక్వెన్స్.. ఆ సీన్‌కు ఏకంగా పది రోజులు: సైఫ్ అలీ ఖాన్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం దేవర పార్ట్-1. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్- శివ కొరటాల కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. సముద్ర బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో దేవర టీమ్ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ నిర్విహంచారు.ఈ సందర్భంగా దేవర నటుడు సైఫ్ అలీ ఖాన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దేవరలో ఫైట్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నాయని అన్నారు. మైథలాజికల్ సెంటిమెంట్, దేవతలకు రక్త అర్పించడం లాంటి వయొలెన్స్ సీక్వెన్సెస్ ఉన్నాయని సైఫ్ అన్నారు. క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ నాలుగు గ్రామాల మధ్య జరిగే యుద్ధమని తెలిపారు. దేవరలో ఒక ఫైట్ సీక్వెన్స్ కోసం ఏకంగా పది రోజులు షూటింగ్ చేశామని సైఫ్ అలీ ఖాన్ వెల్లడించారు.(ఇది చదవండి: దేవర మూవీ క్రేజ్.. రిలీజ్‌కు ముందే రికార్డులు!)కాగా.. ఇప్పటికే దేవర ట్రైలర్ రిలీజ్ కాగా.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఓవర్సీస్లోనూ టికెట్ ప్రీ బుకింగ్స్‌లో దేవర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. A fight between the heads of 4 different villages.⁰Ancestral weapons.⁰So much blood. Sacrifices to the gods. Prayers.And so much more… #Devara 💥💥💥#DevaraOnSep27th pic.twitter.com/AZR03wYW8P— Devara (@DevaraMovie) September 15, 2024 -
దేవర రికార్డ్
ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘దేవర:పార్ట్ 1’ అరుదైన ఘనతని సొంతం చేసుకుంది. లాస్ ఏంజెల్స్‌లోని ఈజిప్షియన్ థియేటర్లో ప్రీమియర్ కానున్న తొలి భారతీయ సినిమాగా అరుదైన ఘనత సాధించింది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దేవర’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మించారు. రెండు భాగాలుగా రానున్న ‘దేవర:పార్ట్ 1’ ఈ నెల 27న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.ఈ చిత్రం గ్రాండ్ ప్రీమియర్ షోను ఈ నెల 26న సాయంత్రం ఆరు గంటలకు హాలీవుడ్లో ప్రదర్శించనున్నారు. ‘‘హాలీవుడ్లో బియాండ్ ఫెస్ట్ అనేది ఘనమైన చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మకమైన సినిమా వేదిక. లాస్ ఏంజెల్స్‌లోని ఐకానిక్ ఈజిప్షియన్ థియేటర్లో ప్రీమియర్ కానున్న తొలి ఇండియన్ సినిమాగా ‘దేవర:పార్ట్ 1’ అరుదైన ఘనతను సొంతం చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ రెడ్ కార్పెట్ ఈవెంట్‌కు హాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు’’ అని యూనిట్ పేర్కొంది. -
ఎన్టీఆర్ ‘దేవర’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ముంబై : ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం (ఫొటోలు)
-
'దేవర' విలన్ వచ్చేశాడు.. గ్లింప్స్ వీడియో రిలీజ్
ఎన్టీఆర్ 'దేవర' నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ కాగా.. ఇప్పుడు విలన్ ఎంట్రీ ఇచ్చేశాడు. భైర అనే పాత్ర చేసిన సైఫ్ అలీ ఖాన్ గ్లింప్స్ వీడియోని తాజాగా రిలీజ్ చేశారు. బాలీవుడ్ స్టార్ అయిన ఇతడికి తెలుగులో ఇదే తొలి మూవీ. 52 సెకన్లు ఉన్న వీడియోలో యంగ్ లుక్ చూపించారు. గతంలో రిలీజ్ చేసిన పోస్టర్లో మాత్రం ఓల్డ్ లుక్ చూపించారు.(ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?)దీనిబట్టి చూస్తే ఎన్టీఆర్ మాత్రమే కాదు విలన్ భైర కూడా రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తాడని గ్లింప్స్ వీడియోతో క్లారిటీ వచ్చేసింది. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా భలే అనిపించింది. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సిరీస్‌లో ఐరన్ థ్రోన్ని పోలినట్లు 'దేవర'లోనూ ఓ సింహాసనం చూపించారు.జాన్వీ కపూర్‌తోపాటు సైఫ్ అలీ ఖాన్.. తెలుగులోకి 'దేవర'తో అడుగుపెడుతున్నారు. సెప్టెంబరు 27న వీళ్ల జాతకం ఏంటో తెలియనుంది. 'ఆచార్య' లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల చేస్తున్న మూవీ ఇది. ఇతడికి ఇది హిట్ కావడం చాలా ముఖ్యం. త్వరలో పూర్తిస్థాయి ప్రమోషన్స్ షురూ చేసే అవకాశముంది.(ఇదీ చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే) -
నా భర్త మొదటి భార్య అంటే అభిమానం: కరీనా కపూర్
బాలీవుడ్ మోస్ట్ పాపులర్ జంటల్లో కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఒకరు. కొన్నేళ్ల డేటింగ్ తర్వాత 2012లో ముంబయిలో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే గతంలో కరీనా కపూర్.. తన భర్త మొదటి భార్యపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను అమృతా సింగ్‌కు అభిమానిని అని తెలిపింది. అంతేకాకుండా సైఫ్‌తో స్నేహం చేయాలని ఆమె కోరుకున్నట్లు వెల్లడించింది. సైఫ్ జీవితంలో అమృతకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకొచ్చింది.గతంలో కరీనా మాట్లాడుతూ..'సైఫ్‌కు ఇంతకు ముందే వివాహం అయిందని నాకు తెలుసు. అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతన్ని కుటుంబాన్ని నేను గౌరవిస్తా. నేను కూడా ఆయన మొదటి భార్య అమృతా సింగ్‌కి అభిమానినే. నేను ఆమెను ఎప్పుడూ కలవలేదు. కానీ నాకు ఆమె గురించి సినిమాల ద్వారా తెలుసు. ఆమెకు ఎప్పుడు సైఫ్ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే ఆమె కేవలం మొదటి భార్యనే కాదు.. అతని పిల్లలకు తల్లి కూడా. సైఫ్లాగే నేను ఆమెను గౌరవిస్తా. ఇది నా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నా.' అని అన్నారు.కాగా.. సైఫ్ అలీ ఖాన్ మొదట నటి అమృతా సింగ్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరు 2004లో విడిపోయారు. వీరిద్దరి కూడా సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. కరీనా, సైఫ్ అక్టోబర్ 16, 2012న వివాహం చేసుకున్నారు. వీరికి తైమూర్ అలీ ఖాన్, జహంగీర్ అలీ ఖాన్ అకా జెహ్ అనే కుమారులు ఉన్నారు. -
నెలకు రూ.2.5 లక్షలా! మౌనం వీడిన సెలబ్రిటీ నానీ
ఇదిగో పులి అంటే.. అదిగో తోక అంటారు. ఇదీ ప్రస్తుతకాలంలో సోషల్ మీడియా మహిమ. బాలీవుడ్ స్టార్‌కపుల్ సైఫ్ అలీ ఖాన్-కరీనాకపూర్ల ముద్దుల తనయుడు తైమూర్ అలీ ఖాన్ ఆయా జీతం నెలకు రూ. 2.5 లక్షలు అంటూ ఆ మధ్య ఒక వార్త తెగ వైరల్ అయింది. అయితే తాజాగా ఈ వార్తలపై తైమూర్ నానీ, లలితా డిసిల్వా, తొలి సారి స్పందించారు.కరీనా కపూర్ పెద్ద కొడుకు తైమూర్ నానీగా లలితా డిసిల్వా ఇంటర్నెట్లో బాగా ప్రాచుర్యం పొందారు. టాప్ సీఈఓల కంటే లలిత ఎక్కువ సంపాదిస్తున్నారని పలు నివేదికలు తెలిపాయి. ఈ రూమర్స్‌పై ఎట్టకేలకు ఆమె మౌనం వీడారు. హిందీ రష్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, నెలవారీ జీతం రూ. 2.5 లక్షలు ఉందా అని అడిగినప్పుడు, లలిత ‘రూమర్స్’కి నవ్వుతూ, ‘‘ మీ నోట్లో చక్కెర పొయ్య! నిజంగా నేను రూ. 2.5 లక్షలు కోరుకుంటున్నాను.’’ అంటూ సమాధానమిచ్చారు. తద్వారా అవన్నీ పుకార్లే అని తేల్చారు. అంతేకాదు కరీనా , ఆమె కుటుంబ సభ్యులు ‘సింపుల్ పీపుల్’ అని కూడా ప్రశంసించారు. సిబ్బందితో ప్రేమగా ఉంటారు. అందరమూ ఒకటే ఆహారం తింటాం. చాలా సార్లు అందరం కలిసి భోజనం చేస్తాం అని కూడా ఆమె తెలిపారు.లలితా డిసిల్వా లలితా డిసిల్వా ముంబైలో ఉన్న ప్రముఖ పీడియాట్రిక్ నర్సు, ఆమె సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ల ఇద్దరు కుమారులను పుట్టినప్పటి నుంచి దగ్గరుండి చూసుకుంది. అంతకుముందు డిసిల్వా ఆసియా అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ ఇంట్లో పనిచేశారు. యువ అనంత్ అంబానీని చూసుకున్నారు. ఇటీవల అనంత్అంబానీ, రాధిక మర్చంట్ వివాహానికి లలితను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. -
ఆ విషయంలోనే మాకు తరచూ గొడవలు: కరీనా
బాలీవుడ్ జంట కరీనా కపూర్- సైఫ్ అలీ ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు చిన్నారులు జన్మించారు. పెళ్లి తర్వాత తాను ఎంతగానో మారిపోయానంటోంది కరీనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'వివాహం నన్ను మార్చివేసింది. బాధ్యతగా ఉండటం తెలిసొచ్చింది. మేము ఒకరికొకరం తినిపించుకునేవాళ్లం. పోట్లాడుకునేవాళ్లం. కానీ మాకంటూ పెద్దగా సమయం కేటాయించుకోకపోయేవాళ్లం. ఒకే ఇంట్లో ఉన్నా..సైఫ్ ఒక్కోసారి ఉదయం 4.30 గంటలకు వచ్చి నిద్రపోయేవాడు. తను లేచేసరికి నేను షూట్‌కు వెళ్లిపోయేదాన్ని. నేనొచ్చేసరికి తను ఉండేవాడు కాదు. ఒకే ఇంట్లో ఉన్నా ఇద్దరం మాట్లాడుకునే పరిస్థితి లేకపోయేది. ఒక ఇంట్లో ఇద్దరు నటులు ఉంటే ఇలాగే ఉంటుంది. నేను తన సినిమాలన్నీ చూస్తాను. కానీ ఆయన మాత్రం నేను నటించిన క్రూ మూవీ కూడా ఇంతవరకు చూడలేదు. ఎప్పుడూ షూటింగ్స్ అంటూ తిరుగుతూనే ఉంటాడు.ఏసీ దగ్గరే గొడవమా ఇద్దరికీ ఏసీ గురించే గొడవలవుతుంటాయి. తనకేమో కూలింగ్ ఎక్కువ కావాలంటాడు. నేనేమో 20 డిగ్రీలు చాలంటాను. ఇద్దరి మాటా కాదని 19 డిగ్రీల టెంపరేచర్ సెట్ చేస్తాడు. నా సోదరి కరిష్మా వచ్చినప్పుడు ఏసీ 25 డిగ్రీల నెంబర్లో పెట్టేస్తాం. అప్పుడైతే.. తనకంటే నేనే నయమని ఫీలవుతాడు. అలాగే టైం విషయంలో గొడవడపతాం. డబ్బు, వస్తువుల కోసం మేము పోట్లాడుకోం. ఇద్దరం కలిసి కాసేపు సరదాగా మాట్లాడుకుంటే చాలని భావిస్తాం. కాస్త సమయం దొరికితే కలిసుండాలని ఆరాటపడతాం' అని చెప్పుకొచ్చింది. సినిమా..కాగా సైఫ్ అలీ ఖాన్ గతంలో అమృత సింగ్‌ను పెళ్లాడగా వీరికి సారా అనే కూతురు, ఇబ్రహీం అనే కుమారుడు సంతానం. అమృతకు విడాకులిచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత 2012లో కరీనాను పెళ్లాడాడు. ఇకపోతే సైఫ్ ప్రస్తుతం 'దేవర' సినిమాలో నటిస్తుండగా కరీనా 'ద బకింగ్‌హామ్ మర్డర్స్' మూవీ చేస్తోంది.చదవండి: ఆ హీరోయిన్‌కు యాక్టింగ్ రాదు, తీసుకోవద్దన్నారు: డైరెక్టర్ -
‘ఆదిపురుష్’లో రావణుడిని వీధి రౌడీలా చూపించడం బాధేసింది: ‘రామాయణ్’సీత
రామాయణం ఇతిహాసం ఆధారంగా ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్’. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారణంగా బోల్తా పడింది.అంతేకాదు ఈ మూవీలోని ప్రధాన పాత్రలను తీర్చిదిద్దిన విధానంపై అనేక విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సైఫ్ అలీఖాన్ పోషించిన రావణాసూరుడు పాత్రపై ఎన్నో వివాదాలు వచ్చాయి. రామాయణ ఇతిహాసాన్ని అపహాస్యం చేసేలా చిత్రాన్ని తెరకెక్కించారని ఓ వర్గం మండిపడింది. తాజాగా ‘రామాయణ్’ సీరియల్లో సీతగా నటించిన దీపికా చిఖ్లియా కూడా ‘ఆదిపురుష్’సినిమాపై తీవ్ర విమర్శలు చేసింది. ఈ సినిమాలో రావణుడిని వీధి రౌడీలా చూపించారని మండిపడ్డారు. ‘ఆదిపురుష్ సినిమా చూసి నేటి తరం పిల్లలు రామాయణం అంటే ఇలానే ఉంటుందని భావించే అవకాశం ఉంది. అది భవిష్యత్తుకే ప్రమాదకరం. ఇందులో చూపించినట్లుగా రావణుడు మరీ అంత చెడ్డవాడు కాదు. ఆయన గొప్ప శివ భక్తుడు. ఆయనలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. మాంసాహారం తినడు. సీతాదేవిని అపహరించడమే ఆయన చేసిన పెద్ద తప్పు. సీతాదేవి కూడా అలా ఉండదు. ఈ సినిమాలో చూపించినట్లుగా రావణుడు ఉండడని పిల్లలకు ఎవరూ వివరించడం లేదు. నేను ఈ సినిమాను థియేటర్లో చూడలేదు. టీవీలో కొంచెం చూడగానే నచ్చలేదు. సృజనాత్మకంగా ఏదో కొత్తగా చూపించాలనే తాపత్రయంలో రామాయణం గొప్పతనాన్ని తగ్గించేస్తున్నారు’ అని దీపికా చిఖ్లియా ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతీశెట్టి సీతగా నటించారు. -
నిద్రమాత్రలు వేసుకున్న హీరో.. భార్యే ఇచ్చింది.. ఎందుకంటే?
బాలీవుడ్‌లోని క్లాసిక్ చిత్రాల్లో 'హమ్ సాత్ సాత్ హై' ఒకటి. ఇప్పుడు చూసినా ఎంతో ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఈ మూవీలో సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, కరిష్మా కపూర్, టబు, సోనాలి బింద్రె, మోనిశ్ బాల్ తదితరులు పటించారు. దర్శకుడు సూరజ్ బార్జాత్యాతో కలిసి పని చేసి ఈ మాస్టర్‌పీస్‌ను అందించారు. అయితే ఈ సినిమాలోని 'సునోజి దుల్హాన్..' పాట షూటింగ్ సమయంలో సైఫ్ అలీ ఖాన్ సరిగా యాక్ట్చేయలేదట.నిద్రమాత్రలు వేసుకుని..తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు సూరజ్ ఆనాటి విషయాలను పంచుకున్నారు. 'సైఫ్ అలీ ఖాన్ సహజ నటుడు. అలాంటి వ్యక్తి ఒకానొక సమయంలో రీటేకులు తీసుకుంటూనే ఉన్నాడు. అసలేమైంది? అని అతడి భార్య అమృత సింగ్‌ను(ప్రస్తుతం విడాకులు తీసుకున్నారు) అడిగాను. పగలూరాత్రీ తేడా లేకుండా మెళకువతో ఉంటే తను ఎలా పర్ఫెక్ట్గా నటించగలడు? అని చెప్పింది. తనకేదైనా మెడిసిన్ ఇవ్వమన్నాను. అలా అతడికి నిద్ర మాత్రలు ఇవ్వడంతో ఆ రోజు హాయిగా పడుకున్నాడు.నేచురల్ యాక్టర్తెల్లారి సెట్లో సింగిల్ టేక్‌లో తన షాట్ పూర్తి చేశాడు. ఒక్క టేక్‌లో ఎలా పూర్తయింది? అని ఆశ్చర్యంగా నన్నే తిరిగి అడిగాడు. నువ్వు కంటి నిండా నిద్రపోతేనే నేచురల్‌గా నటించగలవని బదులిచ్చాను. పెద్ద స్టార్స్‌తో కలిసి నటించడం సైఫ్‌కు అదే తొలిసారి కావడంతో కొంత బెరుకుగా కూడా ఉండేవాడు. తన డైలాగులను ఎప్పటికప్పుడు రిహార్సల్స్ చేసేవాడు' అని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ దేవర సినిమాలో నటిస్తున్నాడు.చదవండి: ‘సత్యభామ’ మూవీ రివ్యూ -
నాకు సపోర్ట్ చేసేందుకు ఆ హీరో భార్య ఒప్పుకోలేదు
దీపక్ తిరోజి.. ఆషిఖి, ఖిలాడీ, జో జీతా వోహి సిఖిందర్, ఘులామ్, బాద్షా వంటి హిందీ చిత్రాల్లో సహాయక పాత్రలతో గుర్తింపు పొందాడు. పెహ్లా నషా మూవీతో హీరోగానూ మారాడు. ఊప్స్ చిత్రంతో దర్శకనిర్మాతగా అవతారం ఎత్తాడు. ఆయన చివరగా 2018లో వచ్చిన టామ్, డిక్ అండ్ హ్యారీ 2 అనే సినిమాకు డైరెక్టర్‌గా వ్యవహరించాడు.అతిథి పాత్రలోదాదాపు ఆరేళ్ల తర్వాత టిప్సీ చిత్రంతో మరోసారి దర్శకుడిగా మారాడు. ఈ మూవీ మే 10న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన దీపక్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. '1993లో జరిగిందీ సంఘటన.. అప్పుడు నేను పెహ్లా నషా సినిమా చేస్తున్నాను. ఆ మూవీలో అందరు సెలబ్రిటీలు అతిథి పాత్రలో కనిపించాల్సి ఉంది. షారుక్, సైఫ్ అలీ ఖాన్, ఆమిర్ ఖాన్.. అందరూ ఒప్పుకున్నారు. చిన్నపాటి సీన్షూటింగ్ కోసం సైఫ్ ఇంటి దగ్గర రెడీ అవుతున్నప్పుడు అతడి భార్య అమృత (ప్రస్తుతం విడాకులు తీసుకున్నారు) ఎక్కడికి వెళ్తున్నారని అడిగింది. అందుకాయన దీపక్ సినిమా కోసం వెళ్తున్నాను. చిన్నపాటి సీన్ చేసి వస్తానని చెప్పాడు. అందుకామె ఆశ్చర్యపోతూ నిజంగానే మీరందుకు ఒప్పుకున్నారా? మేమైతే అలాంటి పనులు ఎప్పుడూ చేయలేదు. నిజానికి ఆ సమయంలో..ఇలా ఒకరికి సపోర్ట్ చేసేందుకు ఎవరైనా వెళ్తారా? అని ఆగ్రహించింది. నిజానికి ఆ సమయంలో అందరూ ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నారు. ఇప్పుడైతే అలాంటి పరిస్థితులు పెద్దగా కనిపించడమే లేదు' అని చెప్పుకొచ్చాడు. ఇక పెహ్లా నషా సినిమాలో షారుక్, సైఫ్‌తో పాటు రవీనా టండన్, పూజా భట్, పరేశ్ రావల్, జూహీ చావ్లా, సుదేశ్ బెర్రీ ఇలా తదితరులు నటించారు.చదవండి: ఓటీటీలో 100 సినిమాలు.. ఎంచక్కా ఇంట్లోనే చూసేయండి -
సెకనుకు రూ.7 లక్షలు.. తెలుగు హీరోలకంటే ఎక్కువే!
పైసా..పైసా.. మంచి స్క్రిప్ట్ ఉంటే సరిపోదు. దాన్ని క్వాలిటీగా తీయాలంటే పైసా కావాల్సిందే! అయితే సినిమా నిర్మించడం కంటే అందులో నటించినవారికి ఇవ్వాల్సిన పారితోషికాలే తడిసి మోపెడవుతున్నాయి. సినిమా బడ్జెట్ అంతా ఒకెత్తు.. స్టార్స్ రెమ్యునరేషన్స్ మరో ఎత్తు అన్నట్లు మారింది పరిస్థితి! ఈ మధ్య ప్రాంతీయ సినిమా పాన్ ఇండియా సినిమాగా మారడంతో ఇతర భాషా ఇండస్ట్రీల నుంచి సెలబ్రిటీలను తీసుకొస్తున్నారు. అలా బాలీవుడ్ స్టార్స్ సౌత్ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. హిందీలో కంటే కూడా ఇతరత్రా భాషల్లోనే భారీగా అందుకుంటున్నారు. బీటౌన్ చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. దక్షిణాది సినిమాల కోసం బాలీవుడ్ తారలు అందుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో చూసేద్దాం.. జాన్వీ కపూర్ దివంగత తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు తీసుకుంటుంది. తెలుగులో ఈమె దేవర సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మూవీ కోసం రూ.5 కోట్లు పుచ్చుకుంటోందట. రామ్‌చరణ్ సినిమా కోసం ఏకంగా రూ.6 కోట్లు అందుకోనున్నట్లు తెలుస్తోంది. సైఫ్ అలీఖాన్ తెలుగు సినిమా అనగానే జాన్వీ తన రెమ్యునరేషన్ డబుల్ చేసింది. సైఫ్ అలీ ఖాన్ అయితే ఓ అడుగు ముందుకేసి ఏకంగా మూడు రెట్లు డిమాండ్ చేస్తున్నాడు. దేవరలో విలన్‌గా నటిస్తున్నందుకు ఏకంగా రూ.13 కోట్లు తీసుకుంటున్నాడట! బాబీ డియోల్ బ్లాక్‌బస్టర్ మూవీ యానిమల్‌లో విలన్‌గా నటించినందుకుగానూ నటుడు బాబీ డియోల్ రూ.4 కోట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం ఇతడు సూర్య 'కంగువా'లో నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం డబల్ అంటే ఎనిమిది కోట్లు తీసుకుంటున్నాడు. ఇమ్రాన్ హష్మీ ఇమ్రాన్ హష్మీ ఈ మధ్యే బాలీవుడ్లో తన రేటు పెంచేశాడు. దీంతో తెలుగులో కూడా అదే రెమ్యునరేషన్ కంటిన్యూ చేస్తున్నాడు. పవన్ కల్యాణ్ ఓజీ సినిమాకుగానూ ఇతడు రూ.7 కోట్లు డిమాండ్ చేశాడు. సంజయ్ దత్, రవీనా టండన్ సంజయ్, రవీనా.. ఇద్దరూ కేజీఎఫ్ సినిమాలో అద్భుత నటన కనబర్చారు. రవీనా పాత్ర చిన్నది కావడంతో ఆమె రూ.2 కోట్లతో సరిపెట్టుకుంది. కానీ కల్నాయక్(సంజయ్) తన పాత్రకు తగ్గట్లు రూ.10 కోట్లు అందుకున్నాడు. అజయ్ దేవ్‌గణ్, ఆలియా భట్ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిన ఆలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో కనిపించింది. కాసేపు మాత్రమే ఉండే ఈ పాత్ర కోసం రూ.10 కోట్లు తీసుకుంది. అజయ్ దేవ్‌గణ్ స్వాతంత్య్ర సమరయోధుడిగా నటించాడు. సినిమా మొత్తంలో కేవలం ఎనిమిది నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. ఇందుకుగానూ అతడు రూ.35 కోట్లు తీసుకున్నాడు. అంటే సెకనుకు రూ.7.2 లక్షలన్నమాట! ఈ లెక్కన పారితోషికం విషయంలో అందరికంటే అజయే ఎక్కువ అందుకున్నట్లు కనిపిస్తోంది. చదవండి: మహానటి స్థానంలో ప్రియమణి.. ఎందుకంటే?