
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) దుండగుడి చేతిలో తీవ్రంగా గాయపడిన రోజు ఏం జరిగిందో మొదటిసారి ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. దొంగతనం కోసం వచ్చిన వ్యక్తితో తనను కత్తితో పొడిచిన సమయంలో తాను పెద్దగా కంగారుపడలేదని చెప్పారు. అయితే, కొంత సమయం తర్వాత ఎక్కువ నొప్పి రావడంతో ఆ గాయం తీవ్రత ఎంతో తెలిసింది. ఆ సమయంలో తన కుమారుడు తైమూర్ మాటలను సైఫ్ గుర్తు చేసుకున్నారు.
'నాపై దాడి జరిగిన తర్వాత తీవ్రమైన నొప్పితో బాధపడ్డాను. నా వెన్నులో బలమైన కత్తితో దాడి చేశాడని తెలిసింది. ఆ సమయంలో కరీనా చాలా కంగారు పడింది. ఏం చేయాలో తనకు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. మా కుటుంబ సభ్యలకు అందరికీ కాల్స్ చేస్తూ ఉంది. కానీ, అర్ధరాత్రి కావడంతో ఎవరూ రెస్పాన్స్ కావడం లేదు. అప్పుడు ఇద్దరం ఒకరినొకరం చూసుకున్నాం. వెంటనే ఆసుపత్రికి బయలుదేరాలని ఆమె పిచ్చిగా కాల్స్ చేస్తూ ఉంది. కరీనా పరిస్థితి గమనించే నేనే తనకు ధైర్యం చెప్పాను. నాకు ఏం కాదని తెలిపాను.
ఆ సమయంలో తైమూర్ నా దగ్గరకు వచ్చి.. నాన్నా.. నువ్వు చనిపోతావా..? అని అడిగాడు. అప్పుడు నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. అలాంటిది ఏమీ జరగదు అమ్మ ఉంది కదా అని చెప్పాను. చికిత్స కోసం వెళ్తుండగా నేనూ వస్తానంటూ తైమూర్ కూడా ఆసుపత్రికి వచ్చాడు. ఆ సమయంలో నేను కూడా వాడిని తీసుకొని వెళ్లాలని అనుకున్నాను. నాకు ఏమైనా జరిగితే నా కుమారుడు నా పక్కనే ఉండాలని ఆ సమయంలో అనిపించింది.' అని ఆయన అన్నారు.
ముంబై బాంద్రాలోని సైఫ్ అలీఖాన్ నివాసంలో జనవరి 16న తెల్లవారుజామున 2.30 గంటలకు ఆయనపై దాడి జరిగింది. దుండగుడు సైఫ్ చిన్న కుమారుడు జేహ్ గదిలోకి వెళ్లడం గమనించిన కేర్‌టేకర్ కేకలు వేయగా సైఫ్ అక్కడికి చేరుకున్నాడు. ఆ సమయంలో పెనుగులాట జరిగింది. ఈక్రమంలోనే సైఫ్ గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment