సైఫ్‌ అలీఖాన్‌పై దాడి.. షాకయ్యా: జూనియర్‌ ఎన్టీఆర్‌ | Jr NTR And Chiranjeevi Wishes Speedy Recovery For Saif Ali Khan Over Attacked Incident, More Details Inside | Sakshi
Sakshi News home page

Jr NTR, Chiranjeevi: సైఫ్‌ అలీఖాన్‌పై దాడి.. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా

Published Thu, Jan 16 2025 10:31 AM | Last Updated on Thu, Jan 16 2025 12:18 PM

Jr NTR Wishes Speedy Recovery for Saif Ali Khan

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌(Saif Ali Khan)పై దాడి జరగడం కలకలం రేపుతోంది. ముంబైలోని ఆయన ఇంట్లో గురువారం తెల్లవారుజామున ఓ వ్యక్తి సైఫ్‌ను కత్తితో పలుమార్లు పొడిచి పారిపోయాడు. ఈ దాడిలో ఆయనకు ఆరుచోట్ల గాయాలయ్యాయి. అందులో రెండు చోట్ల లోతైన గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆనయ్ను లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ‍వెన్నెముక పక్కనే తీవ్రగాయం కావడంతో వైద్యులు నటుడికి సర్జరీ చేస్తున్నారు. 

దొంగతనం చేసే క్రమంలోనే..
ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుడు దొంగతనానికి వచ్చాడా? లేదా పక్కా మర్డర్‌ ప్లాన్‌తోనే సైఫ్‌పై దాడి చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటనపై కరీనా కపూర్‌ (Kareena Kapoor) టీమ్‌ ఓ లేఖ విడుదల చేసింది. సైఫ్‌- కరీనా ఇంట్లో ఓ దుండగుడు చోరీకి ప్రయత్నించాడు. అతడిని అడ్డుకునే క్రమంలో సైఫ్‌ చేతికి గాయమైంది. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంట్లోని మిగతా సభ్యులు క్షేమంగానే ఉన్నారు. పోలీసుల విచారణ జరుగుతోంది అని లేఖలో పేర్కొన్నారు.

షాక్‌కు గురయ్యా
ఇదిలా ఉంటే సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడిపై టాలీవుడ్‌ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) స్పందించాడు. సైఫ్‌ సర్‌పై జరిగిన దాడి గురించి విని షాక్‌కు గురయ్యాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అంటూ సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశాడు. చిరంజీవి (Chiranjeevi) సైతం సైఫ్‌ పరిస్థితిపై విచారం వ్యక్తం చేశాడు. సైఫ్‌ అలీఖాన్‌పై జరిగిన దాడి నన్నెంతగానో కలిచివేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని ట్వీట్‌ చేశాడు.

హీరో నుంచి విలన్‌గా..
సైఫ్‌ అలీఖాన్‌ ఒకప్పుడు హీరోగా బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు చేశాడు. కానీ ఇటీవల మాత్రం ఎక్కువగా నెగెటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలతోనే మెప్పిస్తున్నాడు. హీరోకి సమానంగా ఉండే విలన్‌ పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్ర పోషించిన దేవర చిత్రంలో విలన్‌గా నటించాడు. ఈ చిత్రంలో భైరవ పాత్రలో యాక్ట్‌ చేశాడు. వచ్చాయి. ప్రస్తుతం సైఫ్‌ ఓ భారీ ప్రాజెక్ట్‌కి సైన్‌ చేసినట్లు తెలుస్తోంది.

 

చదవండి: ఇంట్లో దోపిడీయత్నం.. హీరో సైఫ్‌ అలీఖాన్‌పై కత్తితో దాడి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement