breaking news
Chiranjeevi
-
Global Summit: నేను చిరంజీవిగా ఇక్కడకు రాలేదు
సాక్షి, ఫ్యూచర్ సిటీ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని చిత్రపరిశ్రమలు హైదరాబాద్‌కు వచ్చేలా కృషి చేస్తామని సీఎం రేవంత్ నాతో చెప్పారు.. చెప్పిన కొన్నిరోజులకే ఎందరో ప్రముఖులను ఇక్కడికి తీసుకొచ్చారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మంగళవారం సాయంత్రం ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొని ప్రసంగించారు. వేదిక పై ఒక్కో రంగం నుంచి ఒక్కరు ఉన్నారు. నన్ను వేదికపై ఉంచడం సినిమా పరిశ్రమ కు ఇచ్చిన గౌరవం గా భావిస్తున్నా. సీఎం రేవంత్ రెడ్డికి సినీ పరిశ్రమ అంటే ఎంతో గౌరవం. నేను చిరంజీవిగా రాలేదు. సినిమా ఇండస్ట్రీ తరుపున వచ్చా. సీఎం రేవంత్‌రెడ్డి ‘బ్రెయిన్ చైల్డ్’ చూడాలని సమిట్‌కు వచ్చా. ప్రభుత్వం ఏర్పాటు జరిగిన మొదట్లోనే హైదరాబాద్‌ను ఫిల్మ్ హబ్‌గా చేయాలని ఆయన మాతో అన్నారు. చెప్పినట్లుగానే.. సీఎం ప్రాక్టికల్‌గా ముందుకెళ్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని చిత్రపరిశ్రమలు హైదరాబాద్‌కు వచ్చేలా కృషి చేస్తామని సీఎం రేవంత్ నాతో చెప్పారు. చెప్పిన కొన్ని రోజులకే ఎందరో ప్రముఖులను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఈ సమిట్ చూసిన తర్వాత.. సీఎం అనుకున్నది సాధిస్తారనే విశ్వాసం వచ్చింది. వినోద రంగం పరంగా ప్రపంచం తెలంగాణ వైపు చూసేలా కృషి చేస్తామని నమ్మకంగా చెప్పారు. మా సలహాలతో ముందుకు వెళ్తాం అన్నారు. అన్నట్లుగానే చేసి చూపిస్తున్నారు. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ లాంటి వారు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. వ్యసనాలకు అలవాటు పడ్డ యువతను వినోదం వైపు మల్లించాలి. చదువే ప్రమాణికం కాదు , డిగ్రీ లేని వారు కూడా జాతీయ స్థాయి సినిమా లు తీస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలంటూ ఇండస్ట్రీ వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఫ్యూచర్ సిటీలో స్టూడియోలకు స్థలాలు ఇస్తామని చెప్తున్నారు.. నేను దీనిపై ఆలోచన చేస్తున్నా... ఇండస్ట్రీ కూడా చేయాలి. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కి నా సపోర్ట్ ఉంటుంది’’ అని చిరంజీవి అన్నారు. -
చిన్నారికి మెగా దంపతుల ఖరీదైన గిఫ్ట్.. గోల్డ్ చైన్‌తో పాటు..!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మనశంకర వరప్రసాద్ గారు మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న ఈ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో వెంకీమామ కూడా నటించారు. ఇటీవలే తన పాత్రకు సంబంధించిన షెడ్యూల్ పూర్తయిందని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మెగాస్టార్‌తో కలిసి నటించాలన్న తన కోరిక ఈ మూవీతో నెరవేరిందన్నారు.అయితే మెగాస్టార్ ఇటీవలే తన మేనేజర్ స్వామినాథ్ కుమార్తె నామకరణ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తన సతీమణి సురేఖతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా పాపకు అలేఖ్య అని చిరంజీవి పేరు పెట్టారు. మెగాస్టార్ తమ కూతురికి పేరు పెట్టడంతో మేనేజర్ దంపతులు ఎమోషనలయ్యారు.ఈ సందర్భంగా చిరు దంపతులు తమ ప్రేమను చాటుకున్నారు. ఆ చిన్నారికి ఖరీదైన బహుమానం అందించారు. ఆ చిట్టి తల్లికి మెడకు గోల్డ్ చైన్ బహుకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతే కాకుండా దాదాపు కోటి రూపాయల విలువైన ల్యాండ్ బహుకరించారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా మెగాస్టార్ దంపతులు తమ మేనేజర్ కుటుంబానికి జీవితంలో మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. Megastar @KChiruTweets Garu and Surekha Garu graced the naming ceremony of Manager Swamynath’s daughter today and blessed the baby girl with their warm wishes✨ pic.twitter.com/Tix55I0Dk1— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) December 5, 2025 -
చిరంజీవితో వెంకటేశ్.. రన్ టైమ్ ఇదే: అనిల్ రావిపూడి
మెగాస్టార్ చిరంజీవి, నయనతార కలిసి నటిస్తున్న సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’.. సంక్రాంతికి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతానికి ఫ్యాన్స్ ఫీదా అవుతున్నారు. ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ వస్తుంది. అయితే, ఈ మూవీలో వెంకటేశ్‌కు ఎంత సమయం పాటు స్క్రీన్ స్పేష్ ఇచ్చారనేది దర్శకుడు క్లారిటీ ఇచ్చారు.దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెంకటేష్ క్యామియో రోల్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. 'ఈ మూవీలో ఒక ప్రధాన పాత్ర ఉందని చిరంజీవితో నేను చెప్పాను. దీంతో వెంకటేశ్‌ను ఎంపిక చేయాలని ఆయన పట్టుబట్టారు. ఆయన ఇమేజ్‌కు తగ్గకుండా ఆ పాత్ర కోసం మరింత లోతుగా పనిచేశాను. వెంకీ దాదాపు 20 నిమిషాల పాటు తెరపై కనిపిస్తారు. చిరంజీవి, వెంకటేశ్ కలిసి నటించిన క్లైమాక్స్ సీన్స్ అభిమానులను తప్పకుండా అలరిస్తాయి. వారిద్దరూ కలిసి చేసే డ్యాన్స్, పంచే కామెడీకి ఫిదా అవుతారు' అని పంచుకున్నారు.చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టమని వెంకటేశ్ గతంలో పంచుకున్నారు. తన ఫేవరెట్ నటుడితో కలిసి పని చేయడం ఆనందంగా ఉందన్నారు. చిరంజీవి కూడా వెంకీపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో కలిసి నటించినందుకు థాంక్స్ అంటూనే.. వెంకీ రాకతో ఈ చిత్రానికి ప్రత్యేకత తీసుకొచ్చారని చిరు పేర్కొన్నారు. వెంకీతో కలిసి వర్క్ చేసిన పది రోజులు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. డిసెంబర్ 15 నుంచి ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రమోషన్స్లలో దూకుడు పెంచనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. -
సంక్రాంతి మూవీ ఫెస్టివల్.. ఈ సారి మాములుగా ఉండదు
-
'శశిరేఖ' పూర్తి సాంగ్.. చిరు, నయన్ మ్యాజిక్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా నుంచి శశిరేఖ అంటూ సాగే పూర్తి సాంగ్‌ను విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో సంగీతానికి చిరు, నయనతార వేసిన క్లాసిక్ స్టెప్పులకు ఫిదా కావాల్సిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ 2026 సంక్రాంతికి విడుదల కానుంది. చాలా కలర్‌ఫుల్ లోకేషన్స్‌లో ఈ సాంగ్‌ను షూట్ చేశారు. ఈ పాటకు లిరిక్స్ అనంత్ శ్రీరామ్ అందించగా.. భీమ్స్ సిసిరోలియో, మధుప్రియ ఆలపించారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదావరి గట్టు సాంగ్‌కు ఎంత క్రేజ్ వచ్చిందో ఈ పాటకు కూడా అంతే క్రేజ్ రావచ్చు. ఈ మూవీలో చిరంజీవి–నయనతార భార్యాభర్తలుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల..’పాట ఏ స్థాయిలో శ్రోతలను అలరించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇందులో వెంకటేశ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. -
జోరుగా... హుషారుగా...
ఆడుతుపాడుతూ పని చేస్తుంటే అలుపూ సొలుపేం ఉండదు అంటూ... బిజీ బిజీగా షూటింగ్ చేసేస్తున్నారు స్టార్స్. జోరుగా షూటింగ్స్ జరుగుతుంటే స్టూడియోలు కూడా కళకళలాడుతున్నాయి. కొన్ని స్టూడియోస్‌లో కలర్‌ఫుల్ సెట్స్ కనువిందు చేస్తున్నాయి. సీన్‌కి తగ్గట్టు సహజమైన లొకేషన్స్‌లో మరికొన్ని షూటింగ్స్ జరుగుతున్నాయి. ఇక... ఏ స్టార్ ఎక్కడెక్కడ షూటింగ్ చేస్తున్నారో చూద్దాం...దౌలతాబాద్ టు అన్నపూర్ణ... చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ఉపశీర్షిక. నయనతార హీరోయిన్ . ఈ సినిమాలో హీరో వెంకటేశ్ ముఖ్యపాత్రపోషిస్తున్నారు. కేథరిన్, సచిన్ ఖేడేకర్ ఇతరపాత్రల్లో నటిస్తున్నారు. వెంకటేశ్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రం కీలక షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. హైదరాబాద్‌లోని దౌలతాబాద్ అసెంబ్లీ పబ్‌లో రెండు రోజులపాటు పలు సన్నివేశాల చిత్రీకరణ జరిపారు. ఆ తర్వాత తిరిగి అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ ఆరంభించారు. ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్లో చిరంజీవితోపాటు చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం ఇది.ఈ మూవీలో చిరంజీవి–నయనతార భార్యాభర్తలుగా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల..’పాట ఏ స్థాయిలో శ్రోతలను అలరించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ మూవీలో తనపాత్రకు సంబంధించిన చిత్రీకరణ బుధవారంతో పూర్తయినట్లు వెంకటేశ్ పేర్కొన్నారు. ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కోఠిలో... వరుసపాన్ ఇండియా చిత్రాలతో జెట్ స్పీడ్‌లో దూసుకెళుతున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన మారుతి దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’, హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ వంటి ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా ఉన్నారు. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ మూవీలో ‘యానిమల్’ మూవీ ఫేమ్ త్రిప్తీ దిమ్రి హీరోయిన్. సీనియర్ నటి కాంచన, ప్రకాశ్‌రాజ్, బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ ఇతరపాత్రలుపోషిస్తున్నారు.భద్రకాళి పిక్చర్స్ప్రోడక్షన్ ్స, టీ–సిరీస్ బ్యానర్స్‌పై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, కృషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారి ఓపోలీసాఫీసర్గా కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని కోఠిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్పాల్గొనడం లేదు. అయితే ఈ చిత్రంలోని ప్రధాన తారాగణంపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు సందీప్ రెడ్డి. నాన్ స్టాప్‌గా జరగనున్న ఈ మూవీ షూటింగ్లో తర్వాతి షెడ్యూల్లో ప్రభాస్ జాయిన్ అవుతారట.ప్రభాస్ మొదటిసారిపోలీసాఫీసర్గా నటిస్తుండటం.. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ వంటి హ్యాట్రిక్ మూవీస్ తర్వాత సందీప్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండటంతో ‘స్పిరిట్’ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో ఇటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు డాన్ లీ విలన్‌గా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ‘స్పిరిట్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది భాషల్లో విడుదల కానుంది.ఆర్ఎఫ్సీలో... ‘ఆర్ఆర్ఆర్’ (2022) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్). మహేశ్‌బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ సినిమా కోసం మహేశ్‌బాబు ΄÷డవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయిన సంగతి తెలిసిందే.అమేజాన్ అడవుల నేపథ్యంలో భారీ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ మూవీ కోసం ఆర్ఎఫ్సీలో ప్రత్యేకంగా సెట్ వేశారు మేకర్స్. ప్రస్తుతం అక్కడ మహేశ్‌బాబుతోపాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట రాజమౌళి. మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నవంబరులో నిర్వహించిన ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. దయాదాక్షిణ్యం లేని, కరడుగట్టిన, కమాండింగ్ ప్రతినాయకుడు కుంభపాత్రలో పృథ్విరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. ఆయన లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి ఈ నినిమాకి సంగీతం అందిస్తున్నారు. ముచ్చింతల్‌లో... నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ (2023) వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. హిట్ కాంబోలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. ఈ మూవీ కోసం ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో జరుగుతున్న ఈ షెడ్యూల్లో నానితోపాటు చిత్రంలోని ప్రధాన తారాగణంపాల్గొంటోంది. ఈ చిత్రంలో నానిపాత్ర పేరు జడల్. ఇప్పటికే విడుదల చేసిన స్టిల్‌లో నాని రెండు జడలు వేసుకుని, పక్కా మాస్ లుక్‌లో కనిపించగా మంచి స్పందన వచ్చింది. నాని లుక్, స్టోరీ, టేకింగ్... ఇలా ప్రతిదీ వైవిధ్యంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారట శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమాని తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో 2026 మార్చి 26న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.అయితే ఆ తేదీకి ఈ మూవీ రిలీజ్ ఉండకపోవచ్చనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రామ్‌చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ‘ది ΄్యారడైజ్’ చిత్రం విడుదల ఉంటుందా? లేదా? లేకుంటే మరో తేదీ ఫిక్స్ అవుతుందా? అన్నది ఆసక్తిగా మారింది. ఈ విషయాలపై స్పష్టత రావాలంటే వేచి చూడాలి. దండు మైలారంలో... విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘వీడీ 14’ (వర్కింగ్ టైటిల్). ‘ది ఎండ్, టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్’ చిత్రాల ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ దేవరకొండ–రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘టాక్సీవాలా’ 2018 నవంబరు 17న విడుదలై, మంచి హిట్‌గా నిలిచింది. ‘టాక్సీవాలా’ వంటి హిట్ మూవీ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తోన్న ద్వితీయ చిత్రం ‘వీడీ 14’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని దండు మైలారంలో జరుగుతోంది. 19వ శతాబ్దం నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా భారీపాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపొందుతోంది. బ్రిటీష్‌పాలన కాలం నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీని ఇప్పటివరకూ ఎవరూ తెరకెక్కించని కథాంశంతో పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుతున్నారట రాహుల్ సంకృత్యాన్.దండుమైలారంలో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతోంది. పతాక సన్నివేశాల్లో విజయ్ దేవరకొండతోపాటు ఇతర నటీనటులుపాల్గొంటున్నారని సమాచారం. ఈ సినిమాలో హాలీవుడ్ దిగ్గజ నటుడు (‘మమ్మీ’ సినిమా విలన్) ఆర్నాల్డ్ వస్లూ నటిస్తున్నారనే వార్తలు వచ్చాయి. బ్రిటిష్ అధికారిపాత్రలో ఆర్నాల్డ్ వస్లూ నెగటివ్ క్యారెక్టర్లో నటిస్తుండటంతో వీరి మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో... వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వీటీ 15’ (వర్కింగ్ టైటిల్). ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మేర్లపాక గాంధీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రితికా నాయర్ హీరోయిన్గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్ ్స, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్స్‌పై ‘వీటీ 15’ రూపొందుతోంది. ఇండో కొరియన్ హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సమీపంలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటోంది.హీరో హీరోయిన్లతోపాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట దర్శకుడు. వరుణ్ కోసం తనదైన శైలిలో అద్భుతమైన వినోదాత్మక కథను సిద్ధం చేశారు మేర్లపాక గాంధీ. గత కొన్నాళ్లుగా వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ వస్తోన్న వరుణ్... జస్ట్ ఫర్ ఛేంజ్ అన్నట్లు ఈసారి ఆడియన్స్‌కి వినోదాలు అందించేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే... అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో ఇటీవల ఓ ప్రత్యేక సాంగ్‌ని చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ‘జాంబి రెడ్డి, బంగార్రాజు’ చిత్రాల ఫేమ్ దక్షా నగార్కర్, వరుణ్ తేజ్‌లపై ఈపాట తెరకెక్కించారు. ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మరి... అదే టైటిల్‌ని ఫిక్స్ చేస్తారా? లేకుంటే మరేదైనా నిర్ణయిస్తారా? అన్నది వేచి చూడాలి. తుక్కుగూడలో... సాయిదుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలకపాత్రలుపోషిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై ‘హను–మాన్’ (2024) వంటిపాన్ ఇండియన్ హిట్ అందుకున్న కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోపాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.ఇదిలా ఉంటే... ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్లో గత కొన్నాళ్లు నుంచి లాంగ్ షెడ్యూల్ జరుపుతున్నారు మేకర్స్. ఈ షెడ్యూల్లో హీరో, హీరోయిన్లతోపాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట రోహిత్. అక్టోబరు 15న సాయి దుర్గాతేజ్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ‘అసుర ఆగమన’ పేరుతో ఈ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేయగా, మంచి స్పందన వచ్చింది.భూత్ బంగ్లాలో... అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రదర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ΄÷డవాటి జుట్టు, గెడ్డంతో ఫుల్ మాస్ లుక్‌లోకి మారిపోయారు అఖిల్. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని భూత్ బంగ్లాలో జరుగుతోంది. శరవేగంగా సాగుతోన్న ఈ చిత్రీకరణలో హీరో, హీరోయిన్లతోపాటు చిత్రంలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని తెలిసింది. రాయలసీమ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చింది. ‘‘గతాన్ని తరమడానికిపోతా... మా నాయన నాకో మాట సెప్పినాడు... పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాది రా... పేరు ఉండదు, అట్నేపోయేటప్పుడు ఊపిరుండదు... పేరు మాత్రమే ఉంటాది. ఆ పేరు ఎట్టా నిలబడాలంటే...’’ అంటూ రాయలసీమ యాసలో అఖిల్ చెప్పిన డైలాగ్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే ఈ మూవీపై మంచి క్రేజ్ నెలకొంది. రామానాయుడులో క్లైమాక్స్... ‘పెదకాపు’ (2023) చిత్రం ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న రెండో చిత్రం ‘నాగబంధం’. ‘ది సీక్రెట్ ట్రెజర్’ అన్నది ట్యాగ్‌లైన్ . నిర్మాత అభిషేక్ నామా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. నభా నటేశ్ ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు, జయప్రకాశ్, మురళీ శర్మ, బీఎస్ అవినాష్ కీలకపాత్రలుపోషిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని కిశోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది.పతాక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ‘‘పాన్ ఇండియా ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘నాగబంధం’. నానక్‌రామ్‌గూడలోని రామానాయుడు స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. కేవలం క్లైమాక్స్ సెట్ కోసమే రూ.20 కోట్లు ఖర్చు చేశాం. ఓ మహద్వారం చుట్టూ రూపొందించిన ఈ క్లైమాక్స్‌లోని భావోద్వేగం, డ్రామాను విజువల్‌గా అద్భుతంగా చూపించేలా ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ ఈ సెట్‌ని డిజైన్ చేశారు.థాయ్ స్టంట్ మాస్టర్ కేచా ఖాంఫాక్‌డీ అద్భుతమైన టేకింగ్ యాక్షన్ కొరియోగ్రఫీతో సీక్వెన్స్‌ని గ్రాండ్‌గా తీర్చిదిద్దితున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమా కోసంప్రోడక్షన్ డిజైనర్ అశోక్ కుమార్ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కేరళలోని అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్లో విరాట్ కర్ణతోపాటు 5000 మంది నృత్య కళాకారులతో ఓపాటని చిత్రీకరించడం విశేషం. పై చిత్రాలే కాదు.. మరికొన్ని సినిమాల షూటింగ్స్ కూడా హైదరాబాద్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌లు జరుపుకుంటున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
'శశిరేఖ' కోసం చిరంజీవి స్టెప్పులు
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ మూవీ నుంచి కొద్దిరోజుల క్రితం విడుదలైన 'మీసాల పిల్ల' సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, తాజాగా 'శశిరేఖ..' అంటూ కొనసాగే రెండో పాటకు సంబంధించిన ప్రోమోను షేర్ చేశారు. డిసెంబర్ 8న పూర్తి పాటను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పాటకు లిరిక్స్ అనంత్ శ్రీరామ్ అందించగా.. భీమ్స్ సిసిరోలియో, మధుప్రియ ఆలపించారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదావరి గట్టు సాంగ్‌ను మధుప్రియ ఆలపించిన విషయం తెలిసిందే. -
చిరంజీవి & శ్రీకాంత్ న్యూ మూవీ..ఫ్యాన్స్ కోసం క్రేజీ అప్డేట్!
-
వచ్చే సంక్రాంతికి చిరుతో వెంకటేష్ మల్టీస్టారర్..
-
నామకరణ వేడుకలో చిరంజీవి దంపతులు.. వీడియో వైరల్
మెగాస్టార్ చిరంజీవి తన మేనేజర్ కుమార్తె నామకరణ వేడుకకు హాజరయ్యారు. సతీమణి సురేఖతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మేనేజర్ స్వామినాథ్ కుమార్తెకు మెగాస్టార్ పేరు పెట్టారు. చిన్నారికి అలేఖ్య అని నామకరణం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ ప్రస్తుతం అనిల్ రావిపూడితో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మనశంకర వరప్రసాద్‌గారు వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించింది. ఇప్పటికే విడుదలైన మీసాల పిల్ల సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో హీరో వెంకటేశ్ సైతం కీలక పాత్రలో నటించారు. దీంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి మరో బ్లాక్‌బస్టర్ తన ఖాతాలో వేసుకుంటాడో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. Megastar @KChiruTweets Garu and Surekha Garu graced the naming ceremony of Manager Swamynath’s daughter today and blessed the baby girl with their warm wishes✨ pic.twitter.com/Tix55I0Dk1— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) December 5, 2025 -
శశిరేఖకి వేళాయె
‘ఓయ్ మీసాల పిల్ల... నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలె పిల్ల...’ అంటూ ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం నుంచి విడుదలైన తొలి పాట ఎంత బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందో తెలిసిందే. చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో హీరో వెంకటేశ్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘శశిరేఖ...’ అంటూ సాగే ద్వితీయ పాట ప్రోమోను ఈ నెల 6న, పూర్తి వీడియో సాంగ్‌ని 8న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. -
500 మంది డ్యాన్సర్స్‌తో చిరు, వెంకీ డ్యాన్స్
చిరంజీవి, వెంకటేశ్ కలిసి చేస్తున్న సెలబ్రేషన్ సాంగ్ చిత్రీకరణ మొదలైంది. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకరవరప్రసాద్‌గారు’. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, వెంకటేశ్, క్యాథరిన్, వీటీవీ గణేశ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో వేసిన ఓ సెట్లో జరుగుతోంది. చిరంజీవి, వెంకటేశ్‌తోపాటు 500 మందికి పైగా డ్యాన్సర్స్పాల్గొంటుండగా ఓ స్టైలిష్ మాస్ డ్యాన్స్ సాంగ్ షూట్‌ను ఆరంభించారు.సంగీతదర్శకుడు భీమ్స్ సిసిరోలియో స్వరపరచిన ఈపాటకు పొలకి విజయ్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ‘‘చిరంజీవి, వెంకటేశ్ కలిసి చేస్తున్న ఈపాట ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు అసలు సిసలైన విందులా ఉంటుంది. అలాగే చిరంజీవి–నయనతారలపై చిత్రీకరించిన ఓ మెలోడియస్ రొమాంటిక్ సాంగ్‌ను త్వరలోనే రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ తెలిపింది. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. -
డేట్ ఫిక్స్ చేసుకున్న సినిమాలు
తెలుగు చిత్ర పరిశ్రమకు అతి పెద్ద పండగ ఏది అంటే సగటు సినిమా ప్రేక్షకుడు సైతం టక్కున సంక్రాంతి అని చెబుతాడు. చిత్రపరిశ్రమకే కాదు... తెలుగు ప్రేక్షకులకు కూడా అత్యంత ముఖ్యమైన పండగ అంటే సంక్రాంతి. ఈ పండగ సమయంలో కుటుంబ సమేతంగా సినిమాలకు వెళ్లి సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు ప్రేక్షకులు. ఈ సమయంలో తమ సినిమాలను రిలీజ్ చేస్తే మంచి వసూళ్లు రాబట్టుకోవచ్చన్నది మేకర్స్ ఆలోచన. సంక్రాంతి సమయంలో దాదాపు అన్ని సినిమాలకు ప్రేక్షకాదరణ ఉంటుంది. అయినప్పటికీ ఫలానా సినిమా బాగుందనే టాక్ వచ్చిందంటే ఇక బ్లాక్‌బస్టరే. అందుకే సంక్రాంతికి తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు హీరోలు, దర్శకులు, నిర్మాతలుపోటీ పడుతుంటారు. స్టార్ హీరోల దగ్గర నుంచి యువ హీరోల వరకూ సంక్రాంతి బరిలో తమ సినిమాలను నిలిపేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఈ కోవలోనే 2026 సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రసవత్తరపోరు నెలకొంది. చిరంజీవి, ప్రభాస్, రవితేజ, శర్వానంద్, నవీన్ పొలిశెట్టి చిత్రాలు పండగకి విడుదల కానున్నాయి. మరోవైపు విజయ్, శివ కార్తికేయన్ వంటి తమిళ హీరోలు సైతం తెలుగు హీరోలతో పాటు సంక్రాంతి బరిలో నిలుస్తున్నారు. ఈ సంక్రాంతి బరిలో నిలిచేదెవరు? ప్రేక్షకుల మనసులు గెలిచేది ఎవరు? బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించే సినిమా ఏది? అనే ఆసక్తి ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఈ సంక్రాంతికి సందడి చేయనున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం... డబుల్ ఫెస్టివల్ 2026 సంక్రాంతికి అందరి హీరోల కంటే ముందుగా కర్చీఫ్ వేశారు చిరంజీవి. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ట్యాగ్‌లైన్. ఈ ఏడాది వెంకటేశ్ హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బిగ్టెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ‘మన శంకర వరప్రసాద్‌గారు’కి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ఆరంభం నుంచే 2026 సంక్రాంతి లక్ష్యంగా షూటింగ్ ΄్లాన్ చేసి, శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, కేథరిన్ కీలక పాత్రపోషిస్తున్నారు.అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో వెంకటేశ్ ముఖ్యమైన పాత్రపోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలైన చిరంజీవి, వెంకటేశ్ కలిసి ఒకే సినిమాలో కనిపించనుండటంతో ‘మన శంకర వరప్రసాద్‌గారు’ పై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. ట్రేడ్ వర్గాల్లోనూ మంచి జోష్ నెలకొంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల...’ పాట ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.‘‘బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. వినోదం, భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ సినిమా సంక్రాంతి పండగ సీజన్‌కు పర్ఫెక్ట్ ట్రీట్. పైగా చిరంజీవి–వెంకటేశ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించనుండటం అభిమానులకు డబుల్ ఫెస్టివల్. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో వేసిన భారీ సెట్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది’’ అని చిత్రబృందం తెలిపింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నప్పటికీ తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. రాజా సాబ్ ఫిక్స్ వరుస పాన్ ఇండియా సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్‌గా సంక్రాంతి రేసులో నిలిచింది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న విడుదల కావాల్సి ఉండగా సంక్రాంతికి వాయిదా పడింది.భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి సీజన్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది మేకర్స్ ఆలోచన. అందుకే ‘ది రాజా సాబ్’ని జనవరి 9న విడుదల చేయనున్నట్లు టీజీ విశ్వప్రసాద్ ప్రకటించారు. ప్రభాస్‌కి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకించి ‘ది రాజా సాబ్’ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రభాస్ వింటేజ్ లుక్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ మూవీపోస్టర్స్, టీజర్, గ్లింప్స్‌తో పాటు తాజాగా విడుదలైన పాటకి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జూలై 29న ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన సంజయ్ దత్ ప్రత్యేకపోస్టర్కి కూడా మంచి స్పందన వచ్చింది. పైగా ప్రభాస్ నటిస్తున్న తొలి హారర్, కామెడీ మూవీ కావడంతో ఈ మూవీపై ట్రేడ్ వర్గాల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో ఇప్పటికే ఫుల్ క్రేజ్ నెలకొంది. ‘‘మా పీపుల్స్ మీడియా నుంచి వస్తున్న బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ప్రభాస్‌గారిని ‘బుజ్జిగాడి’ సినిమా స్టైల్లో వింటేజ్ లుక్‌లో చూపిస్తున్నాం. 40 నిమిషాల క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ మూవీకి హైలైట్‌గా నిలుస్తుంది’’ అని చిత్రనిర్మాణ సంస్థ పేర్కొంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి మాస్ మహారాజా రవితేజ మరోసారి తన ఫ్యాన్స్‌కి, ప్రేక్షకులకు సంక్రాంతి కానుకగా తనదైన శైలిలో వినోదం అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ‘నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి, ఆడవాళ్ళు మీకు జోహార్లు’ వంటి చిత్రాలను తెరకెక్కించిన కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి ఇటీవల ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్‌ని ఖరారు చేసి, టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అంతేకాదు... ఈ మూవీని 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందకు తీసుకు రానున్నట్లు తెలిపారు. ‘నా జీవితంలోని ఇద్దరు ఆడవాళ్లు రెండు ప్రశ్నలు అడిగారు... సమాధానం కోసం చాలా ప్రయత్నించాను.గూగుల్, చాట్ జీపీటీ, జెమినీ, ఏఐ... ఇలా అన్నింటినీ అడిగాను.. బహుశా వాటికి పెళ్లి కాకపోవడం వల్ల ఆన్సర్ చెప్పలేకపోయాయేమో. అనుభవం ఉన్న మగాళ్లని ముఖ్యంగా మొగుళ్లను అడిగాను. ఆశ్చర్యపోయారే త΄్పా ఆన్సర్ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడవాళ్లు అడగకూడదని, పెళ్లయిన వాళ్లకి నాలాంటి పరిస్థితి ఎదురవకూడదని కోరుకుంటూ మీ ఈ రామ సత్యనారాయణ చెప్పేది ఏమిటంటే... భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్స్ గ్లింప్స్‌లో ఆకట్టుకున్నాయి. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టైటిల్‌ని బట్టి చూస్తే ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతోందని అర్థమవుతోంది.సున్నితమైన అంశాలను తనదైన భావోద్వేగాలతో తెరకెక్కించే కిశోర్ తిరుమల ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో భార్య, భర్తల మధ్య జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్ను వినోదాత్మకంగా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ‘‘ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిశోర్ తిరుమల టచ్‌తో ఈ చిత్రం ఉంటుంది. రవితేజ చాలా రోజుల తర్వాత ఓ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్టైనర్ చేయడం ప్రేక్షకులకు రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఇందులో వినోదంతో పాటు మనసుని హత్తుకునే భావోద్వేగాలు కూడా ఉంటాయి. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని హై ్రపొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు’’ అని చిత్రయూనిట్ తెలిపింది. నారీనారీ నడుమ మురారి హీరో శర్వానంద్ మరోసారి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 2017లో ‘శతమానం భవతి’ సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచిన ఆయన ఘన విజయం అందుకున్నారు. ఇప్పుడు ‘నారి నారి నడుమ మురారి’ చిత్రంతో మరోసారి సంక్రాంతికి ఆడియన్స్ ముందుకొస్తున్నారు శర్వానంద్. శ్రీవిష్ణుతో ‘సామజవరగమన’ (2023) వంటి విజయవంతమైన సినిమా తెరకెక్కించిన రామ్ అబ్బరాజు ‘నారి నారి నడుమ మురారి’కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సాక్షీ వైద్య, సంయుక్త హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. షూటింగ్ ఆలస్యం వల్ల ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడిన ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘శర్వానంద్ నటిస్తున్న ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘నారి నారి నడుమ మురారి’. ఇప్పటికే విడుదలైన మా మూవీ ఫస్ట్ లుక్, ప్రమోషనల్‌పోస్టర్లు బజ్ క్రియేట్ చేశాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ ‘దర్శనమే...’ కూడా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.దీపావళి సందర్భంగా సంప్రదాయ పంచె కట్టుతో ఉన్న శర్వానంద్ లుక్‌ని విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. గతంలో ‘శతమానం భవతి’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందించిన శర్వానంద్‌కి సంక్రాంతి లక్కీ సీజన్ అని చెపొ్పచ్చు. అందుకే మా ‘నారి నారి నడుమ మురారి’తో కుటుంబ ప్రేక్షకులను అలరించడంతో పాటు మరో హిట్‌ని ఆయన తన ఖాతాలో వేసుకుంటారనే నమ్మకం ఉంది. జ్ఞానశేఖర్, యువరాజ్ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అని చిత్రయూనిట్ తెలిపింది. అనగనగా ఒక రాజు... ‘జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు తనదైన శైలిలో వినోదాలు పంచిన నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న మరో కామెడీ చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న విడుదల కానుంది. ‘అనగనగా ఒక రాజు’ చిత్రం పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందుతోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ‘భీమవరం బల్మా..’ అంటూ సాగే మొదటి పాట విడుదల వేడుకని భీమవరంలో ఘనంగా నిర్వహించారు.సంక్రాంతి పండగను కాస్త ముందుగానే తీసుకొచ్చినట్టుగా నవీన్ పొలిశెట్టి వేదిక వద్దకు ఎద్దుల బండిపై రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే నవీన్, మీనాక్షి కలిసి ‘భీమవరం బల్మా...’ పాటకు వేదికపై డ్యాన్స్ చేయడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పైగా ‘భీమవరం బల్మా...’ పాటతో నవీన్ పొలిశెట్టి మొదటిసారి గాయకుడిగా మారడం మరింత విశేషం. ‘‘ఒక బైక్ ప్రమాదంలో గాయాలు కావడం వల్ల నేను కొంతకాలం షూటింగ్‌కి దూరమయ్యాను.ఆ సమయంలో ప్రేక్షకులకు ఎలా వినోదం అందించాలని ఆందోళన చెందాను. మీ అందరి ప్రేమ, అభిమానం వల్ల కోలుకొని ‘అనగనగా ఒక రాజు’ సినిమా షూటింగ్ చేసి, పండగకు మీ ముందుకు రాబోతున్నాను. ఈ సినిమాలో వినోదం, మాస్, కమర్షియల్ సాంగ్స్, అద్భుతమైన ప్రేమకథ వంటి అంశాలన్నీ ఉంటాయి. మీనాక్షి కామెడీ టైమింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ‘అనగనగా ఒక రాజు’ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. జనవరి 14న థియేటర్లలో అందరం హాయిగా నవ్వుకుందాం’’ అని నవీన్ పొలిశెట్టి పేర్కొన్నారు.ఈ సంక్రాంతికి తెలుగు హీరోల మధ్యపోటీ తీవ్రంగా ఉంది. పాంచ్ పటాకా అంటూ ఐదుగురు హీరోలు సంక్రాంతి రేసులో నిలవనుండటం ఒక విశేషం అయితే... మరోవైపు విజయ్, శివ కార్తికేయన్ వంటి తమిళ హీరోలు కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తెలుగులో సంక్రాంతి ఎంత పెద్ద పండగో... తమిళ్లో పొంగల్ కూడా అంత పెద్ద ఫెస్టివల్. అందుకే విజయ్ ‘జన నాయగన్’, శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ సినిమాలు పొంగల్ బరిలో నిలుస్తున్నాయి. ఈ సినిమాలు ఎలాగూ తెలుగులోనూ విడుదలవుతాయని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ⇒ తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చివరి తమిళ చిత్రం ‘జన నాయగన్’ (తెలుగులో జన నాయకుడు). హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విజయ్ కెరీర్లో 69వ మూవీ. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కేవీఎన్ ్రపొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. తమిళ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ ‘జన నాయగన్’ తర్వాత సినిమాల నుంచి విరామం తీసుకుంటుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. ‘‘విజయ్ చివరి చిత్రంగా ‘జన నాయగన్’ రాబోతోంది. విజయ్ చేసిన సేవా కార్యక్రమాలు, సినీ పరిశ్రమలో సాధించిన విజయాలకు చిహ్నంగా ఈ టైటిల్ ఉంటుంది. ఈ మూవీ విజయ్‌కి ఫేర్‌వెల్‌గా ఉండబోతోంది. ఆయన అభిమానులు ఈ సినిమాను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేలా ఉంటుంది. అనిరుధ్ సంగీతం ఈ చిత్రానికి ప్లస్ అవుతుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ⇒ శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పరాశక్తి’. ‘గురు, ఆకాశమే నీ హద్దురా’ చిత్రాల ఫేమ్ సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. రవి మోహన్, అథర్వ, శ్రీలీల ఇతర ప్రధాన పాత్రలుపోషిస్తున్నారు. రెడ్ జెయింట్ మూవీస్ ఉదయనిధి సమర్పణలో ఆకాశ్ భాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ జనవరి 14న సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు టీజర్‌కి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘రత్నమాల...’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. శివ కార్తికేయన్, శ్రీలీలపై చిత్రీకరించిన ఈ మెలోడీకి మంచి స్పందన వచ్చింది. జనవరి టు జూన్... ‘ఆర్ఆర్ఆర్’, ‘దేవర’ వంటి వరుస విజయాల తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. 2024లో పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2025లో ్రపారంభమైంది.ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బాగా బరువు తగ్గడంతో పాటు పూర్తి స్థాయి గడ్డంతో స్టన్నింగ్ లుక్స్‌లో దర్శనమిస్తున్నారు. ఈ చిత్రంలో ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాల కోసమే ఆయన ఈ లుక్‌లోకి మారారనే వార్తలు వినిపించాయి. ఇప్పటివరకు చూడనటువంటి మాస్ లుక్‌లో ఎన్టీఆర్‌ని ప్రెజంట్ చేయనున్నారట ప్రశాంత్ నీల్. ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్.ఇదిలా ఉంటే... తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాల్లో తొలుత ప్రకటించిన చిత్రం కూడా ఇదే. అయితే ఆ తర్వాత ఈ చిత్రం సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ సినిమా విడుదల కాస్తా జనవరి నుంచి జూన్‌కి మారింది. – డేరంగుల జగన్ మోహన్ -
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌కు కేంద్రం గుడ్‌న్యూస్
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (CCT)కు కేంద్ర హోంశాఖ గుడ్‌న్యూస్ తెలిపింది. సుమారు 27 ఏళ్లుగా ఛారిటబుల్ ట్రస్టు కింద బ్లడ్ బ్యాంక్‌తో పాటు ఐ బ్యాంకు కూడా చిరంజీవి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (Chiranjeevi Charitable Trust)ను ఎఫ్సీఆర్ఏ కింద నమోదుకు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకనుంచి విదేశీ విరాళాలు తీసుకునే వెసులుబాటును ట్రస్టుకు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొద్దిరోజుల క్రితమే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం 2010 ప్రకారం ఎఫ్సీఆర్ఏ అనుమతి తీసుకోవాలని నిబంధనల్లో మార్పు చేశారు. దీంతో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఎఫ్సీఆర్ఏ అనుమతి కోసం కేంద్రాన్ని కోరింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఆమోద ముద్రవేసినట్టు తెలుస్తోంది. -
ఏఐ వీడియో.. ప్రభాస్-అనుష్క పెళ్లి.. చిందులేసిన బన్నీ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)..ఇప్పుడు ప్రపంచాన్ని కింగ్‌లా శాసిస్తుంది. విద్య, వైద్య.. ఇలా అన్ని రంగాల్లోనూ ఇది ప్రవేశించింది. సాధారణ ప్రజలు కూడా వారి దైనందిన జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఏఐ రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో సాధ్యం కానిది ఏమున్నది అన్నట్లుగా తమ ఆలోచనలకు నెటిజన్లు రూపమిస్తున్నారు. తాము కోరుకున్నది నిజజీవితంలో కాకపోతే.. ఏఐ రూపంలో అది నెరవేర్చుకుంటున్నారు. ముఖ్యంగా తమ అభిమాన నటీనటులు విషయంలో ఈ టెక్నాలజీని బాగా వాడేస్తున్నారు. తమ ఫేవరేట్ హీరోలను ఎలా చూడాలనుకుంటున్నారు..అలా ఫోటోలను ఎడిట్ చేస్తున్నారు. అంతేకాదు తమకు నచ్చిన హీరోహీరోయిన్లకు ఈ టెక్నాలజీతో పెళ్లిళ్లు కూడా చేస్తున్నారు. గతంలో ఈ టెక్నాలజీ ఉపయోగించి ప్రభాస్‌కి పెళ్లి జరిగి..పిల్లలు పుడితే వాళ్లు ఎలా ఉంటారనేది చూపించారు. ఆ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఏఐ టెక్నాలజీతో వెండితెరపై సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న ప్రభాస్-అనుష్కలకు పెళ్లి జరిపించారు. అంతేకాదు ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ స్టార్ హీరోలంతా తలో ఓ పని చేశారు.ప్రభాస్-అనుష్కల పెళ్లికి నాగార్జున-నాని సన్నాయి వాయించగా.. అల్లు అర్జున్, రవితేజ చిందులేశారు. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటలు చేయగా..గోపిచంద్ వడ్డించాడు. చిరంజీవి, పవన్ కల్యాణ్ బంతి భోజనం చేశారు. కాజల్, తమన్నా పెళ్లి మండపంలో డ్యాన్స్ చేస్తుండగా.. మహేశ్ బాబు, వెంకటేశ్ పంచ కట్టుతో పెళ్లికి హాజరయ్యారు. ప్రభాస్-అనుష్కల పెళ్లి ..అందరూ ఆహ్వానితులే అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇది వాస్తవం అయితే ఎంత బాగుండేదో.. అని ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. Prabhas weds Anushka🥰అందరు ఆహ్వానితులే 🙏🏻#Prabhas #AnushkaShetty pic.twitter.com/7tsH0vVrRN— 🧚 NIMMI 💫✨🐦 (@AlwaysNirmala_) November 26, 2025 -
పొంగల్ పోరులో ఏడు చిత్రాలు .. లిస్ట్ పెరుగుతుందా? తగ్గుతుందా?
తెలుగులో సంక్రాంతి పండక్కి సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు? టాలీవుడ్‌కు సంబంధించి ఇదే అతిపెద్ద సీజన్. ఈ టైంలో టాక్ బాగుంటే మామూలు రోజుల్లో కంటే ఎక్కువ వసూళ్లు వస్తుంటాయి. యావరేజ్ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉండే సీజన్ ఇది. అందుకే స్టార్ హీరోలలో చాలా మంది తమ సినిమా ఒకటి సంక్రాంతి బరిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ప్రతి సంక్రాంతి మాదిరే ఈ సారి కూడా బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. ఈ పండక్కీ తెలుగులో మొత్తంగా ఆరేడు సినిమాలు బరిలోకి దిగబోతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే వచ్చే సంక్రాంతి సీజన్‌పై కొన్ని సినిమాలు కర్చీఫులు వేశాయి. అయితే వాటిల్లో ఏది రిలీజ్ కానుంది? ఏ సినిమా వెనక్కి తగ్గనుంది అనేది మరో వారం రోజుల్లో క్లారిటీ రానుంది.ప్రస్తుతానికి సంక్రాంతి బరిలో ఉన్న చిత్రాలివే..మన శంకర వర ప్రసాద్ గారురాజాసాబ్భర్త మహాశయులకు విజ్ఞప్తిఅనగనగా ఒక రాజునారీ నారీ నడుమ మురారీజననాయగన్పరాశక్తి‘రాజాసాబ్’పై క్లారిటీ వచ్చేదిఈ సంక్రాంతి(Sankranthi 2026)కి బరిలో ఉన్న సినిమాలో తొలుత రిలీజ్ డేట్ ప్రకటించిన పెద్ద సినిమా ది రాజాసాబ్(The Raja Saab). మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే గతంలో కూడా పలుసార్లు రిలీజ్ డేట్ ప్రకటించి..వాయిదా వేయడంతో మరోసారి కూడా ఈ సినిమా వెనక్కి తగ్గిందనే రూమర్స్ వచ్చాయి. దీంతో పలు చిన్న సినిమాలు సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అయ్యాయి. అయితే తాము తప్పుకోవడం లేదని ది రాజాసాబ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పడమే కాకుండా.. ప్రమోషన్స్ కూడా స్టార్ చేయడంతో కొన్ని సినిమాలు బరి నుంచి తప్పుకోవాలని చూస్తున్నాయి.రాజుగారు రావడం లేదా?సంక్రాంతి పోటీలో ఉన్నామని గట్టిగా చెబుతూ వచ్చిన నవీన్ పొలిశెట్టి..అందరికంటే ముందుగానే తప్పుకునే అవకాశం ఉంది. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju) వచ్చే ఏడాది జనవరి 14న రాబోతున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే.. ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉంది. బాక్సాఫీస్ బరిలో చాలా చిత్రాలు ఉండడంతో నిర్మాత నాగవంశీ వెనక్కీ తగ్గాడట. అన్ని కుదిరితే రిపబ్లిక్ డేకి రిలీజ్ చేయాలని నిర్మాత నాగవంశీ ఆలోచిస్తున్నాడట.ఇక శర్వానంద్ హీరోగా నటిస్తున్న నారి నారి నడుమ మురారి(Nari Nari Naduma Murari) చిత్రం కూడా ఈ సంక్రాంతికి వచ్చేలా లేదు. డిసెంబర్లో ఆయన బైకర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ చిత్రం కూడా వెనక్కి తగ్గేలా ఉంది. రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’పై కూడా అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం సమాచారం ప్రకారం.. ఈ చిత్రం కూడా కచ్చితంగా పొంగల్ పోరులోకి రాబోతుంది.చిరు క్లారిటీ ఇస్తే.. డేట్ ప్రకటించలేదు కానీ.. సంక్రాంతి పండగకి పక్కా రాబోతున్న చిత్రం మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’(Mana Shankara Vara Prasad Garu). ‘పండగకి వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్ పెట్టుకొని మరి ఈ చిత్రం తెరకెక్కుతోంది. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్‌ని షేక్ చేసిన అనిల్ రావిపూడి.. ఈసారి చిరంజీవి మూవీతో రాబోతున్నాడు. మరో వారం రోజుల్లో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. చిరంజీవి సినిమా రిలీజ్ డేట్‌పై స్పష్టత వస్తే కానీ సంక్రాంతి రిలీజ్ సినిమాలపై క్లారిటీ రాలేదు. ఒక వేళ చిరు సినిమా వాయిదా పడితే..కచ్చితంగా చిన్న సినిమాలన్నీ బరిలోకి దిగుతాయి. అయితే ఆ అవకాశం అయితే దాదాపు లేనట్లే. వీటితో పాటు ఈ పొంగల్ పోరులో తమిళ్ నుంచి రెండు భారీ చిత్రాలు నిలిచాయి. అందులో ఒకటి..విజయ్ చివరి చిత్రం ‘జననాయగన్’. హెచ్. వినోద్ దర్వకత్వం వహించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుంది. దీంతో పాటు శివకార్తికేయన్-సుధా కొంగర కాంబినేషన్లో తెరకెక్కిన ‘పరాశక్తి’ కూడా సంక్రాంతి పండక్కే రాబోతుంది. జవవరి 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది. మొత్తంగా ఈ పొంగల్ పోరులో ఎన్ని చిత్రాలు ఉంటాయనేది డిసెంబర్ మొదటి వారంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
ప్రకటించిన నాలుగేళ్లకు ప్రభాస్ 'స్పిరిట్' లాంచ్
సాధారణంగా ఓ సినిమా గురించి ప్రకటించిన తర్వాత కొన్నాళ్లకే లాంచింగ్, షూటింగ్ లాంటివి పెట్టుకుంటారు. కానీ ప్రభాస్ 'స్పిరిట్'కి మాత్రం ఏకంగా నాలుగేళ్లు పట్టింది. అవును మీరు విన్నది నిజమే. 2021 అక్టోబరు 7న ఈ ప్రాజెక్ట్ గురించి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అనౌన్స్ చేశాడు. తర్వాత నుంచి అప్పుడు ఇప్పుడు అనుకుంటూ ఆలస్యమైపోయింది. ఇన్నాళ్లకు పూజా కార్యక్రమంతో అధికారికంగా లాంచ్ అయింది.(ఇదీ చదవండి: తెలిసిన విషయాలే కానీ మనసుని మెలిపెట్టేలా.. ఓటీటీ రివ్యూ)హైదరాబాద్ వేదికగా సందీప్ రెడ్డి వంగా ఆఫీస్‌లోనే పూజా కార్యక్రమంతో ఈ సినిమా మొదలైంది. చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్ కూడా వచ్చాడు గానీ ఆయనకు సంబంధించిన ఒక్క ఫొటో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. బహుశా లుక్ ఏంటో తెలియకూడదని సందీప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.స్వయంగా సందీప్.. 'స్పిరిట్' లాంచింగ్ కార్యక్రమానికి ప్రభాస్ వచ్చిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ప్రభాస్ అన్న చేతులు మీకు చాలు అనుకుంటా, అంచనాలు పెంచడానికి అని రాసుకొచ్చాడు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ తృప్తి దిమ్రి, నిర్మాత భూషణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచే షూటింగ్ కూడా మొదలైపోయింది. ప్రస్తుతం ఈ లాంచ్ ఈవెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: హ్యాపీ బర్త్‌డే లవర్.. శోభిత లవ్లీ విషెస్) View this post on Instagram A post shared by Sandeep Reddy Vanga (@sandeepreddy.vanga) -
ఎన్నో హిట్ సాంగ్స్ ఇచ్చిన 'రాజ్-కోటి' ఎలా విడిపోయారు..?
మెగాస్టార్ చిరంజీవి నటించిన కొదమసింహం 35 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ అయింది. కౌబాయ్ పాత్రలో చిరు దుమ్మురేపితే.. సంగీతంతో రాజ్- కోటి అదరగొట్టేశారు. కొదమసింహం కోసం ఈ జోడీ ఇచ్చిన పాటలు 'జపం జపం జపం, కొంగ జపం', 'చక్కిలిగింతల రాగం', 'గుం గుమాయించు కొంచెం' ఇప్పటికీ పాపులర్‌గానే ఉన్నాయి. 1990 నాటి సినిమాల్లో రాజ్ - కోటి (Raj - Koti) ద్వయం పేరు పోస్టర్‌పై పడిందంటే.. ఆ సినిమా మ్యూజికల్ హిట్ అయ్యేది. టాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ ఉన్న వీరిద్దరూ అనుకోని కారణాలతో సుమారు పదేళ్లకు పైగా దూరంగానే ఉన్నారు. అయితే, కొంత కాలం తర్వాత మళ్లీ కలిసిపోయినప్పటికీ వర్క్ పరంగా ఒక్కప్రాజెక్ట్ కూడా చేయలేదు. ఇంతకూ వీరిద్దరూ ఎందుకు విడిపోయారు.మంచి స్నేహితులుగా గుర్తింపుప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద రాజ్, కోటి అసిస్టెంట్స్‌గా పనిచేశారు. వారి స్నేహానికి తొలి అడుగు అక్కడే పడింది. అయితే, ‘ప్రళయగర్జన’ (1982) చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా రాజ్‌కు మొదట ఛాన్స్ దక్కింది. కానీ, తన స్నేహితుడు కోటితో పాటు ఎంట్రీ ఇవ్వాలని ఆయన అనుకున్నారు. వారి స్నేహబంధం బలంగా ఉండటం వల్ల ఆ సినిమాతో పరిశ్రమలోకి ఒకేసారి అడుగుపెట్టారు. అయితే, ఆ సినిమా భారీ విజయం దక్కడంతో ఈ జోడీ వెనుతిరిగి చూడలేదు. ఆ సమయంలో ఉన్న స్టార్ హీరోల సినిమాలకు రాజ్- కోటి సంగీతం ఉండాల్సిందే అనేంతలా ఇమేజ్ పెంచుకున్నారు. యముడికి మొగుడు, లంకేశ్వరుడు, ముఠా మేస్త్రి, బాలగోపాలుడు, కర్తవ్యం, పెద్దరికం, మెకానిక్ అల్లుడు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, అన్న-తమ్ముడు లాంటి విజయవంతమైన చిత్రాలకు వీరే సంగీతాన్ని సమకూర్చారు. సుమారు 200 సినిమాలకు వీళ్లు కలిసే పనిచేశారు. ఏఆర్ రెహమాన్, తమన్, యువన్ శంకర్ రాజా వంటి టాప్ సంగీత దర్శకులు కూడా రాజ్- కోటి దగ్గర వర్క్ చేసినవారే కావడం విశేషం.విడిపోయాక రాజ్ ఒక్కడే..కొన్ని కారణాలతో రాజ్- కోటి విడిపోయారు. ఆ తర్వాత రాజ్ ఎక్కువ చిత్రాలు చేయలేదు. రాజ్ ఒక్కడే చేసిన సినిమాల్లో "సిసింద్రీ" ఒక్కటే చెప్పుకోదగినది. కాకపోతే కొన్ని టీవి షోలకు న్యాయమూర్తిగా వ్యవహరించారు. కోటి మాత్రం ఇంకా చిత్రాలు చేస్తూనే ఉన్నారు. కోటి ఒంటరిగా పనిచేసి పెద్ద హీరోలతో హిట్లు ఇచ్చాడు. చిరంజీవితో హిట్లర్, బాలకృష్ణతో పెద్దన్నయ్య, వెంకటేశ్ తో నువ్వు నాకు నచ్చావ్, ఆరుంధతి,రిక్షావోడు మొదలైనవి ఉన్నాయి.ఎందుకు విడిపోయారంటే..రాజ్‌తో ఎందుకు విడిపోయారో ఓ ఇంటర్వ్యూలో కోటి ఇలా చెప్పారు. కాలమే మమ్మల్ని కలిపింది.. కాల ప్రభావం వల్లనే మేము విడిపోయాం. మంచి స్నేహితులుగా మొదలైన మా ప్రయాణంలో ఎక్కువగా సంగీతం గురించే మాట్లాడుకునేవాళ్లం. ఈ క్రమంలో రాజ్‌కు మొదటిసారి సంగీత దర్శకుడిగా అవకాశం వచ్చింది. అప్పుడు కలిసి చేద్దామని అడగడంతో నేను సరే అని మ్యూజిక్ కంపోజింగ్ చేయడం మొదలుపెట్టాం. మా జోడీ సుమారు పదేళ్ల పాటు ఎన్నో సూపర్‌హిట్ ఆల్బమ్స్ ఇచ్చింది. దీంతో ఇండస్ట్రీలో మాకు మంచి పేరుతో పాటు గౌరవం వచ్చింది. అయితే, కొన్ని కారణాల వల్ల కాలమే మమ్మల్ని విడదీసింది. మా మ్యూజిక్ టీమ్‌లో ఆర్కెస్ట్రాకు సంబంధించిన ట్యూనింగ్ వర్క్‌ను రాజ్ చూసేవారు. చిత్ర యూనిట్‌తో అనుసందానంగా నేను ఉండేవాడిని. ఈ విషయంలో కొంతమంది వ్యక్తులు మా స్నేహంలోకి ఎంట్రీ ఇచ్చారు. వారు చెప్పిన మాటలు విన్న రాజ్ ఓసారి నా వద్దకు వచ్చి విడిపోదామని కోరారు. ఆ సమయంలో నేను వద్దని చెప్పాను. మన మధ్యలో ఎవరో చిచ్చు పెట్టేందుకే ఇలా చెప్పారని సూచించాను. కలిసి పనిచేద్దామని చాలా ప్రయత్నించాను. కానీ, రాజ్ వినకపోవడంతో విడిపోయాం. మేము విడిపోయినప్పటికీ స్నేహితులగానే కొనసాగాము. ఆ సమయంలో బాల సుబ్రహ్మణ్యం చాలా బాధపడ్డారు. మళ్లీ కలిసి వర్క్ చేయమని ఆయన ఎన్నోసార్లు చెప్పారు. ఫైనల్‌గా ఆయనే మమ్మల్ని కలిపారు. కలిసి వర్క్ చేద్దామని అనుకున్నాం. కానీ, మాకు ప్రాజెక్ట్ రాకపోవడంతో కుదరలేదు.' అని కోటి పంచుకున్నారు. 68 ఏళ్ల వయసులో రాజ్ (తోటకూర సోమరాజు) గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన నివాసంలో 2023 మే 21న తుదిశ్వాస విడిచారు. -
మంచి క్వాలిటీతో రీ రిలీజ్ చేస్తున్నాం
చిరంజీవి హీరోగా, రాధ, సోనమ్, వాణీ విశ్వనాథ్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కొదమసింహం’. కె. మురళీమోహన రావు దర్శకత్వంలో కైకాల నాగేశ్వర రావు నిర్మించిన ఈ చిత్రం 1990 ఆగస్టు 9న విడుదలై, ఘనవిజయాన్ని సాధించింది. ఈ సినిమాని 4కే కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్‌తో ఈ నెల 21న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీమియర్ షో ఏర్పాటు చేసి, నిర్వహించిన ప్రెస్ మీట్లో కైకాల నాగేశ్వర రావు మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారు ఒకవైపు ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా చేస్తూనే మరోవైపు ‘కొదమసింహం’ చేశారు. ఈ సినిమాని మంచి క్వాలిటీతో రీ రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘కొదమసింహం’ అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మీకు తెలుసు. రీ రిలీజ్‌ను కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను’’ అని మురళీమోహన్ రావు తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి, రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, సత్యానంద్ మాట్లాడారు. ఆ క్యాసెట్ పెడితేనే చరణ్ భోజనం చేసేవాడు: చిరంజీవి వీడియో ద్వారా చిరంజీవి మాట్లాడుతూ– ‘‘కొదమసింహం’ నా ఫేవరెట్ మూవీ. నాకంటే రామ్‌చరణ్‌కి ఎక్కువ ఇష్టం. చిన్నప్పుడు వాళ్ల అమ్మ ఈ సినిమా క్యాసెట్ పెడితేనే భోజనం చేసేవాడు. కృష్ణగారు చేసిన ‘మోసగాళ్లకు మోసగాడు’ పెద్ద హిట్ అయింది. అలాంటి కౌబాయ్ సినిమా మళ్లీ చేయడం సాహసమే అవుతుంది. అయితే నాగేశ్వరరావు గారు, మురళీమోహన్ రావు వచ్చి నాకు ‘కొదమసింహం’ కథ చెప్పగానే వెంటనే అంగీకారం తెలిపాను. ఈ సినిమాలో నాకు నచ్చిన క్యారెక్టర్ మోహన్‌బాబు గారు చేసిన సుడిగాలి క్యారెక్టర్. ఆయన కాకుండా మరో నటుడైతే ఈ పాత్రను ఇంత బాగా ఒప్పించి, మెప్పించి ఉండేవారు కాదు’’ అని చె΄్పారు. -
కౌబాయ్ సినిమా చేస్తానని అసలు ఊహించలేదు: మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి 35 ఏళ్ల క్రితం నటించిన యాక్షన్, అడ్వెంచర్ చిత్రం ‘కొదమసింహం’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. 1990లో విడుదలైన ఈ సినిమా ఈ నెల 21న రీ–రిలీజ్ కానుండటంతో హైదరాబాద్‌లో ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు. షో అనంతరం జరిగిన ప్రెస్మీట్లో దర్శకుడు మురళీ మోహన్ రావు, సంగీత దర్శకుడు కోటి తో పాటు చిత్ర బృందం అందరు పాల్గొన్నారు.కాగా స్పెషల్ వీడియో ద్వారా స్పందించిన చిరంజీవి మాట్లాడుతూ.. "కౌబాయ్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. కానీ అలాంటి పాత్రలో నేను నటిస్తానని అసలు ఊహించలేదు" అని అన్నారు. ‘కొదమసింహం’ తన సినీ కెరీర్లోనే ఒక ప్రత్యేక చిత్రం అని, ఆ కాలంలో ఒక కొత్త జానర్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన మూవీగా పేర్కొన్నారు. ‘కొదమసింహం’ ఈసారి కూడా థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణ పొందాలని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. రీమాస్టర్ చేసిన విజువల్స్, మెరుగైన సౌండ్ క్వాలిటీతో ఈ రీ–రిలీజ్ థియేటర్లలో ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని నిర్వాహకులు తెలిపారు. -
రజనీ, చిరంజీవి యాక్టింగ్ గురువు కన్నుమూత
ఎన్నో కోట్లమంది అభిమానం సంపాదించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలకు నటనలో ఓనమాలు నేర్పించిన గురువు, డైరెక్టర్ కేఎస్ నారాయణస్వామి (92) మరణించారు. వయసు రీత్యా గత కొన్నాళ్ల నుంచి ఇబ్బంది పడుతున్న ఈయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా రజనీకాంత్ స్వయంగా నారాయణస్వామి ఇంటికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. సంతాపం వ్యక్తం చేశారు.ఈయన పేరు నారాయణ స్వామి అయినప్పటికీ ఇండస్ట్రీలో మాత్రం ఈయన కేఎస్ గోపాల్ అనే పేరుతో ఫేమస్. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, మద్రాస్ దూరదర్శన్ కేంద్రానికి డైరెక్టర్‌గానూ పనిచేశారు. రజనీకాంత్‌కి యాక్టింగ్ నేర్పడంతో పాటు దిగ్గజ దర్శకుడు బాలచందర్‌కి రజనీని పరిచయం చేసింది ఈయనే. అలా రజనీ-బాలచందర్ కాంబోలో 'అపూర్వ రాగంగళ్' సినిమా వచ్చింది. దీంతో రజనీ కెరీర్ మారిపోయింది. అలాంటి నారాయణస్వామి ఇప్పుడు చనిపోవడంతో ఆయన సేవలు స్మరించుకుంటూ పలువురు ప్రముఖులు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
ఐబొమ్మ నిర్వాహకుడు వందలాది మంది కష్టాన్ని దోచుకున్నాడు
-
'దమ్ము ఉంటే పట్టుకోండి' అన్నాడు.. పైరసీపై చిరంజీవి వ్యాఖ్యలు
ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహుకుడు ఇమ్మడి రవి అరెస్ట్‌పై హైదరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చిరంజీవితో పాటు నాగార్జున, రాజమౌళి, దిల్‌రాజు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పైరసీ వల్ల సినీ రంగం చాలా నష్టం పోయిందని సజ్జనార్ తెలిపారు. ఆపై అతను 'దమ్ము ఉంటే పట్టుకోండి చూద్దాం ' అన్నాడు దీంతో అతన్ని అరెస్ట్ చేయాలని గట్టిగానే అనుకున్నట్లు సజ్జనార్ చెప్పారు. ఈ క్రమంలోనే చిరంజీవి, దిల్ రాజు కూడా పైరసీ గురించి పలు వ్యాఖ్యలు చేశారు.దమ్ము ఉంటే పట్టుకోండి అంటూ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి చేసిన సవాల్‌ను ఒక ఛాలెంజ్‌గా స్వీకరించిన తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి చూపించారని చిరంజీవి కొనియాడారు. ఈ క్రమంలోనే పైరసీ అనేది ఇండస్ట్రీకి పెద్ద సవాల్‌గా మారిందని ఇలా చెప్పారు. 'సినిమాను నమ్మకుని కొన్ని వేల కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాయి. గత సీపీ సీవీ ఆనంద్‌తో పాటు ప్రస్తుత సీపీ సజ్జనార్ కలిసి పైరసీ భూతాన్ని పట్టుకున్నారు. చాలా ఏళ్ల నుంచి చిత్రపరిశ్రమను పైరసీ అనేది పీడిస్తూనే ఉంది. ఎన్నో కష్టాలను తట్టకుని ఇండస్ట్రీలో సినిమాలను నిర్మిస్తున్నారు.' అని చిరు అన్నారు.సినిమా పైరసీకి సంబంధించిన కీలక సూత్రధారి రవిని అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులకు నిర్మాత దిల్ రాజు ధన్యవాదాలు చెబుతూ ఇలా పేర్కొన్నారు. 'మూడు నెలల క్రితమే పైరసీ గురించి అరెస్ట్‌లు మొదలయ్యాయి. ఇలాంటి వెబ్సైట్ల వల్ల మీ వ్యక్తిగత డేటా కూడా చోరి అవుతుంది. మేము చాలా కష్టపడి సినిమాలు తీస్తున్నాం. ప్రేక్షకులు కూడా ఇలాంటి వెబ్సైట్లను ఎంకరేజ్ చేయకండి. మీకు కూడా నష్టం జరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం నెలరోజుల్లోనే ప్రతి సినిమా ఓటీటీలోకి వస్తుంది. సంతోషంగా ఇంట్లోనే చూసేయండి. ఇలాంటి పైరసీ వెబ్‌సైట్స్‌లను ఎంకరేజ్ చేసి పరిశ్రమకు నష్టం చేకూర్చకండి.' అంటూ దిల్ రాజు తెలిపారు. -
ఫ్యామిలీ స్టార్స్!
కుటుంబ కథా చిత్రాలకు ఎప్పుడూ తిరుగు ఉండదు. మంచి కథ, క్యాస్టింగ్, డైరెక్టర్ కుదిరితే ఆ ఫ్యామిలీ మూవీ సూపర్ హిట్ అవుతుంది. ఈ ఏడాది సంక్రాంతికి పండక్కి విడుదలైన ఫ్యామిలీ డ్రామా సినిమా పెద్ద చిత్రాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’, చిన్న చిత్రాల్లో వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కోర్టు’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఈ తరుణంలో ఫ్యామిలీ డ్రామా సినిమాలపై, కుటుంబ భావోద్వేగాలపై కొందరు స్టార్ హీరోలు ఫోకస్ పెట్టారు. మరి... ప్రస్తుతం కుటుంబ కథా చిత్రాలు చేస్తున్న టాలీవుడ్ ఫ్యామిలీ స్టార్స్‌పై మీరూ ఓ లుక్ వేయండి.రాజీ పడదామే... మాజీ ఇల్లాలా! శంకర వరప్రసాద్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఫుల్లీ వర్క్ మైండెడ్. దీంతో పర్సనల్ లైఫ్‌కి, వర్కింగ్ లైఫ్‌కి మధ్య బ్యాలెన్స్ తప్పిందట. మరి... ఈ రెంటినీ మళ్లీ శంకరవరప్రసాద్ ఎలా బ్యాలెన్స్ చేశాడు? అన్నది ‘మన శంకరవరప్రసాద్’ లో చూడొచ్చట. చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ మిళితమైన సినిమాగా ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా ఉండబోతోందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి, నయనతార భార్యా భర్తలుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి ‘మీసాల పిల్ల’ అనే పాట విడుదలైంది. ఇందులో ‘రాజీ పడదామే మాజీ ఇల్లాలా’ అనే లిరిక్స్ ఉన్నాయి.దీన్నిబట్టి, ఈ చిత్రంలో భార్యాభర్తలుగా చిరంజీవి–నయనతారల మధ్య ఫ్యామిలీ గొడవలు, అలకలు ఉంటాయని అర్థం అవుతోంది. ఈ సన్నివేశాలు థియేటర్స్‌లో ఆడియన్స్‌కు వినోదాన్ని పంచుతాయని ఊహించవచ్చు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వెంకటేశ్, క్యాథరీన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తు న్నారు. సాహు గారపాటి, సుస్మితా కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా సంగతి ఇలా ఉంచితే... చిరంజీవి హీరోగా నటించిన మరో సినిమా ‘విశ్వంభర’. ఈ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ మోతాదు కాస్త ఎక్కువగానే ఉంటుందని సమాచారం.ఈ సినిమాలో చిరంజీవికి ఐదుగురు సిస్టర్స్ ఉంటారని, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి వంటి హీరోయిన్స్ చిరంజీవికి సిస్టర్స్‌గా నటించారని తెలిసింది. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం వచ్చే వేసవిలో రిలీజ్ కానున్నట్లుగా చిత్రయూనిట్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.అబ్బాయిగారు 60 ప్లస్ ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాలు వెంకటేశ్ కెరీర్లో ఎంతటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అప్పట్లో ఈ రెండు సినిమాలకు రైటర్‌గా పని చేశారు ఇప్పటి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్. ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్లోనే వెంకటేశ్ హీరోగా ఓ సినిమా రానుంది. ఆల్రెడీ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. వెంకటేశ్ కెరీర్‌లోని ఈ 77వ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్‌కు చాన్స్ ఉందని, త్వరలోనే ఈ హీరోయిన్ పేరు కూడా మేకర్స్ రివీల్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు... ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాల కథలు వైజాగ్ నేపథ్యంలో మొదలై, హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతాయి. వెంకటేశ్–త్రివిక్రమ్ తాజా చిత్రం కూడా వైజాగ్ నేపథ్యంలోనే ఉంటుందనే టాక్ తెరపైకి వచ్చింది.ఇంకా ఈ సినిమాకు ‘వెంకటరమణ, ఆనంద నిలయం, వెంకటరమణ కేరాఫ్ ఆనందనిలయం, అబ్బాయిగారు 60 ప్లస్’ అనే టైటిల్స్ కూడా తెరపైకి వచ్చాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుందని, టైటిల్‌ను కూడా అతి త్వరలోనే రిలీజ్ చేసే ఆలోచనలో చిత్రయూనిట్ ఉందని ఫిల్మ్‌నగర్ సమాచారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్న ఈ ఫ్యామిలీ డ్రామా వచ్చే వేసవిలో రిలీజ్ కానుంది.మరోవైపు ఇంటెన్స్ క్రైమ్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్ అయిన ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాలు రాగా, ఈ రెండు చిత్రాల్లోనూ వెంకటేశ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి ముచ్చటగా ‘దృశ్యం 3’ కూడా రానుందని ఇటీవల జరిగిన ఓ వేడుకలో వెంకటేశ్ కన్ఫార్మ్ చేశారు. అలాగే తాను, మీనా హీరో హీరోయిన్లుగా నటించనున్న విషయాన్ని కూడా వెంకటేశ్ చెప్పారు. ఇక ‘దృశ్యం 3’ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభం కానున్నట్లుగా తెలిసింది.రామసత్యనారాయణ విజ్ఞప్తి! ‘నా జీవితంలోని ఇద్దరు ఆడాళ్లు నన్ను రెండు ప్రశ్నలు అడిగారు. సమాధానం కోసం చాలా ఆలోచించాను. గూగుల్... ఏఐ... జెమిని..చాట్‌జీపీటీ.. ఇలా అన్నింటినీ అడిగాను. మే బీ వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేశాయి. అనుభవం ఉన్న మగాళ్ళని.., ముఖ్యంగా మొగుళ్ళని అడిగాను. ఆశ్చర్యపోయారే తప్ప ఆన్సర్ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడవాళ్లు ఆడగకూడదని, పెళ్లయిన వాళ్ళకి నాలాంటి పరిస్థితి ఎదురవకూడదని కోరుకుంటూ... మీ ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏమిటంటే.. భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి డైలాగ్స్ రవితేజ కొత్త చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంలోనివి. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు పెద్ద పీట వేసే దర్శకుడు కిశోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.రామసత్యనారాయణగా హీరో రవితేజ నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇటీవల ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టైటిల్ గ్లింప్స్‌లోనే పైన పేర్కొన్న సంభాషణలు ఉన్నాయి. ఈ డైలాగ్స్‌ని బట్టి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా పూర్తి స్థాయి ఫ్యామిలీ డ్రామాగా ఉండబోతోందని తెలుస్తోంది. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది. తాత–మనవడి కథ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘ది రాజాసాబ్’ సినిమా ఒకటి. సోషియో ఫ్యాంటసీ హారర్ కామెడీ జానర్లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ఇది. ఇందులో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, సంజయ్‌దత్ తాత–మనవడి పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. అంతేకాదు...ఈ సినిమాలో కామెడీ, హారర్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగానే ఉంటాయట.ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో బలమైన ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్‌ను ప్రేక్షకులకు చూపించనున్నారట ఈ చిత్రదర్శకుడు మారుతి. ఇంకా... ఈ సినిమాలో ఓ ఘోస్ట్‌గా సంజయ్ దత్ కనిపిస్తారు. సెకండాఫ్‌లో ప్రభాస్ పాత్రను సంజయ్ దత్ ఆత్మ ఆవహిస్తుందని, ఈ సీన్స్ థియేటర్స్‌లో అదిరిపోతాయని టాక్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ‘ది రాజాసాబ్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 9న రిలీజ్ కానుంది.విశ్వనాథన్ అండ్ సన్స్ ‘రంగ్ దే, లక్కీ భాస్కర్’ వంటి సూపర్‌హిట్ కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించిన వెంకీ అట్లూరి తాజాగా తనదైన మార్క్‌తో ఈ జానర్లోనే మరో మూవీ తీస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య హీరోగా నటిస్తున్నారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ డ్రామా సినిమా ఇది. మమితా బైజు హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే యూరప్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ షూటింగ్ షెడ్యూల్‌ను జరిపారు మేకర్స్. అంతేకాదు... ఈ సినిమాకు ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని, త్వరలోనే ఈ సినిమా టైటిల్ గురించి అధికారిక ప్రకటన రానుందని తెలిసింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది.మూడు తరాల కథ మోటర్ రేసింగ్ స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే మల్టీ జనరేషన్ ఫ్యామిలీ డ్రామా ‘బైకర్’. 1990– 2000 మధ్య కాలంలో సాగే ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో శర్వానంద్ హీరోగా నటించారు. ఈ సినిమా కథకు రేసింగ్ బ్యాక్‌డ్రాప్ ఉన్నప్పటికీ, మూడు తరాల ఫ్యామిలీ కథగా ‘బైకర్’ మూవీ ఉంటుంది. ఈ చిత్రంలో శర్వానంద్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారని తెలిసింది. ఇందులో మాళవికా నాయర్ హీరోయిన్గా నటించగా, రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ ‘బైకర్’ చిత్రం డిసెంబరు 6న రిలీజ్ కానుంది.మరోవైపు ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలోనే శర్వానంద్ హీరోగా రూపోందుతున్న తాజా చిత్రం ‘నారీ నారీ నడము మురారి’. ఈ చిత్రంలో సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. లవ్, ఫ్యామిలీ డ్రామా ప్రధాన అంశాలుగా ఈ చిత్రకథనం సాగుతుంది. వచ్చే సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.లెనిన్ అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్కినేని నాగార్జున, నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ కూడా మొదలైంది. సగానికి పైగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లుగా తెలిసింది. రాయలసీమ నేపథ్యంలో సాగే ‘లెనిన్’ సినిమాలో లవ్‌స్టోరీతో పాటు బలమైన ఫ్యామిలీ భావోద్వేగాలు ఉండబోతున్నట్లుగా తెలిసింది. తండ్రీ–కొడుకుల భావోద్వేగంతో కూడిన ఓ ఎపిసోడ్ కూడా ఈ సినిమాలో ఉందని, ఈ సీన్స్ ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటాయని టాక్. అయితే ఈ సినిమాలోని తండ్రి పాత్రలో ఎవరు యాక్ట్ చేస్తున్నారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో తొలుత హీరోయిన్గా శ్రీలీల కన్ఫార్మ్ అయ్యారు. కానీ కాల్షీట్స్ కేటాయింపుల్లో ఇబ్బందులు తలెత్తడం వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల తప్పుకున్నారని, ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం.ఫ్యామిలీ కథ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు హీరో కిరణ్ అబ్బవరం. కిరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘చెన్నై లవ్‌స్టోరీ’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. కాగా, కుటుంబ కథా చిత్రాలను చక్కగా తెరకెక్కించే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, ఇటీవల ఓ ఫ్యామిలీ స్టోరీని కిరణ్‌కు వినిపించారని, కథ నచ్చడంతో ఈ యువ హీరో కూడా ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌కు శ్రీను వైట్ల మరిన్ని మెరుగులు దిద్దుతున్నారని, త్వరలోనే ఈ మూవీపై మేకర్స్ నుంచి ఓ ప్రకటన రానుందని తెలిసింది. ఇలా కుటుంబ కథలతో సినిమాలు చేస్తున్న తెలుగు హీరోలు మరి కొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది హీరోలు ఈ ఫ్యామిలీ జానర్ సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. -
మాస్ డ్యాన్స్‌కి రెడీ
మాస్ డ్యాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారట చిరంజీవి, వెంకటేశ్. ఈ స్టార్స్ ఇద్దరితో ఓ సెలబ్రేషన్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట అనిల్ రావిపూడి. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపోందుతున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా, ముఖ్య పాత్రల్లో వెంకటేశ్, క్యాథరీన్, వీటీవీ గణేశ్ నటిస్తున్నారు.ఆల్రెడీ చిరంజీవి, వెంకటేశ్ కాంబినేషన్లో గత నెలాఖర్లో ఈ సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. కాగా ఈ చిత్రంలో ఓ సెలబ్రేషన్ సాంగ్ ఉందని, ఈ పాటలో చిరంజీవి, వెంకటేశ్‌తో పాటు నయనతార, క్యాథరీన్ కూడా డ్యాన్స్ చేస్తారని టాక్. ఈ పాటను ఈ నెలాఖరున చిత్రీకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. -
టాలీవుడ్లో రాబోతున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలివే
సైన్స్ ఫిక్షన్ స్టోరీస్ భలే ఉంటాయి. అందుకే అలాంటి కథలకు చాన్స్ వచ్చినప్పుడు స్టార్ హీరో నుంచి స్మాల్ హీరో వరకూ వెంటనే ‘సై’ అనేస్తారు. ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలు పది వరకూ ఉన్నాయి. ఆ సైన్స్ ఫిక్షన్స్ గురించి తెలుసుకుందాం.సత్యలోకం నేపథ్యంలో...చిరంజీవి హీరోగా రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాట నిర్మించారు. సోషియో ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందిన ‘విశ్వంభర’ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని ఫిల్మ్‌నగర్ టాక్. ‘‘మనకి తెలిసినవి 14 లోకాలు. కింద 7 లోకాలు, పైన 7 లోకాలు. ఆ 14 లోకాలకు పైన ఉన్న లోకమే సత్యలోకం. యమలోకం, స్వర్గం, పాతాళలోకం.. అన్నీ చూసేశాం. ‘విశ్వంభర’ కోసం వాటన్నింటిని దాటి నేను పైకి వెళ్లాను. బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకాన్ని మా సినిమాలో చూపించాం. ఆ లోకంలో ఉండే హీరోయిన్ను వెతుక్కుంటూ హీరో 14 లోకాలు దాటి వెళ్లి తిరిగి భూమి మీదకు ఆమెను ఎలా తీసుకొచ్చాడు? అనేది ఈ చిత్రకథ’’ అంటూ ఓ ఇంటర్వ్యూలో ‘విశ్వంభర’ స్టోరీ లైన్ చెప్పారు డైరెక్టర్ వశిష్ట. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విడుదల కావాల్సి ఉండగా 2026 వేసవిలో విడుదలకు వాయిదా వేశారు మేకర్స్. ‘‘విశ్వంభర’ ఒక చందమామ కథలా సాగిపోయే అద్భుతమైన కథ. చిన్నపిల్లలకు, పెద్దవాళ్లలో ఉండే చిన్న పిల్లలను సైతం ఇది అలరిస్తుంది.. వినోదపరుస్తుంది. ‘విశ్వంభర’లో సెకండ్ హాఫ్ మొత్తం వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ మీద ఆధారపడి ఉంది. ప్రేక్షకులకు అత్యున్నతమైన ప్రమాణాలతో బెస్ట్ క్వాలిటీ అందివ్వాలని మేం కష్టపడుతున్నాం’’ అని హీరో చిరంజీవి తెలిపిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ’సంక్రాంతికి రాజాసాబ్‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నారు ప్రభాస్ . ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత ‘సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడీ..’ ఇలా వరుసగా భారీ పాన్ ఇండియా సినిమాలు చే స్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ హారర్ కామెడీ, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రభాస్ స్టైల్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, హారర్, కామెడీ అంశాల సమ్మిళితంగా ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లుక్స్, టీజర్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండస్ట్రీలోనూ మంచి బజ్ నడుస్తోంది. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తుందని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘‘ప్రభాస్‌గారిని ‘బుజ్జిగాడి’ సినిమా స్టైల్లో ‘ది రాజా సాబ్’ ద్వారా వింటేజ్ లుక్‌లో చూపిస్తున్నాం’’ అంటూ మారుతి తెలిపారు. ‘‘మా సంస్థ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ఈ సినిమా కోసం బిగ్గెస్ట్ ఇండోర్ సెట్ వేశాం. 40 నిమిషాల కై్లమాక్స్ ఎపిసోడ్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది’’ అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. హాలీవుడ్ స్థాయిలో...‘పుష్ప: ది రైజ్, పుష్ప 2: ది రూల్’ వంటి చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు అల్లు అర్జున్. అంతేకాదు... ‘పుష్ప: ది రైజ్’కి గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారాయన. ‘పుష్ప’ ఫ్రాంచైజీ తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న ‘ఏఏ 22 ఏ 6’(వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని కళానిధి మారన్ సమర్పణలో సన్‌పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా కోసం లాస్ ఏంజిల్స్ వెళ్లి అక్కడ వీఎఫ్ఎక్స్ కంపెనీలతో, వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టులతో సమావేశం అయింది చిత్రయూనిట్. సైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందుతోన్న ఈ సినిమా కోసం హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఓ కొత్త ప్రపంచం క్రియేట్ చేస్తోందట యూనిట్. పాన్ ఇండియా కాదు,.. పాన్ వరల్డ్ స్కేల్లో ఈ మూవీ రూపొందనుందనే వార్తలూ వినిపించాయి. ‘‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఎలా ఉంటుంది? అనే ఆత్రుత అందరిలోనూ నెలకొంది. కొన్ని రోజులు వెయిట్ చేయండి. మీకు మేం ఓ కొత్త ప్రపంచం చూపించడానికి వర్క్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మీరు చూడనిది వెండితెరపై చూపిస్తామని భరోసా ఇవ్వగలను. చాలా మంది హాలీవుడ్ టెక్నీషియన్లతో మేం వర్క్ చేస్తున్నాం. వాళ్లు సైతం తమకు ఈ సినిమా సవాల్‌గా ఉందని చెబుతున్నారు. అంటే మేం ఓ భారీ సినిమా చేస్తున్నామని అర్థం’’ అంటూ అట్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘‘అల్లు అర్జున్ తిరుగులేని ఎనర్జీ, అట్లీ విజన్, దీపికా పదుకోన్ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్‌లతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు ఐకానిక్‌గా ‘ఏఏ 22 ఏ 6’ సినిమాను రూపొందిస్తున్నాం’’ అని సన్ పిక్చర్స్ సంస్థ పేర్కొంది. ఈ మూవీకి సాయి అభ్యంకర్ స్వరక్తర. జనవరిలో ఆరంభంకన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ చిత్రంతో నటుడిగా, దర్శకుడిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు రిషబ్ శెట్టి. ఆ సినిమాకి ప్రీక్వెల్‌గా రూపొందిన ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం ఈ అక్టోబర్ 2న పలు భాషల్లో రిలీజ్ అయి సూపర్ హిట్‌గా నిలిచింది. ‘కాంతార’కు మించి వసూళ్లు సాధించింది ఈ మూవీ. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న స్ట్రైట్ తెలుగు చిత్రం ‘జై హనుమాన్’. ‘హను–మాన్’ మూవీతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హనుమంతుడి పాత్ర పోషిస్తున్నారు రిషబ్ శెట్టి. ‘‘కాంతార : చాప్టర్ 1’ విడుదలకు ముందే మరో సినిమాకు సైన్ చేయాలనుకోలేదు. కానీ, ప్రశాంత్ వర్మ చెప్పిన ‘జై హనుమాన్’ కథ నన్ను ఎంతలా ఆకట్టుకుందంటే, వెంటనే ఆయనకు ఓకే చెప్పాను. స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది, కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పటికే ఫొటోషూట్ పూర్తి చేశాం’’ అంటూ ఇటీవల ఓ సందర్భంలో రిషబ్ శెట్టి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో రానా కూడా నటించనున్నారే వార్తలు వస్తున్నాయి. రిషబ్ శెట్టి, రానాతో కలిసి ఉన్న ఫొటోని ప్రశాంత్ వర్మ గతంలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. హనుమంతుడి పాత్ర పోషిస్తున్న రిషబ్ శెట్టిలాంటి నటుడికి ధీటుగా నిలబడాలంటే ఆ స్థాయి దేహం, ఆహార్యం ఉండాలంటే రానా కరెక్ట్ అని దర్శకుడి ఆలోచన అట. ‘బాహుబలి’లో ప్రభాస్‌కు ధీటుగా భళ్లాలదేవుడి పాత్రలో రానా నటనను ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోలేరు. మరి... ‘జై హనుమాన్’లో రానా పాత్ర ఏంటి? ఎలా ఉంటుంది? అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.సరికొత్త అనుభూతినాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్?సీ 24’ (వర్కింగ్ టైటిల్). ‘తండేల్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకోవడంతో పాటు తొలిసారి వంద కోట్ల క్లబ్లో చేరారాయన. ‘తండేల్’ వంటి విజయవంతమైన సినిమా తర్వాత ఆయన నటిస్తున్న చిత్రమిది. సాయిదుర్గా తేజ్‌తో ‘విరూపాక్ష’ (2023) వంటి హిట్ మూవీ తర్వాత కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్న చిత్రం కూడా ఇదే. ఇలా... సూపర్ సక్సెస్‌లు అందుకున్న తర్వాత నాగచైతన్య, మీనాక్షీ చౌదరి, కార్తీక్ దండు కాంబినేషన్లో రూ΄÷ందుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. బాపినీడు సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘తండేల్’లో ఫుల్ మాస్ లుక్‌లో కనిపించిన నాగచైతన్య.. ‘ఎన్సీ 24’లో నాగచైతన్య నెవర్ బిఫోర్ లుక్‌లో కనిపించబోతున్నారు. మిథికల్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్‌గా రూ΄÷ందుతోన్న ఈ చిత్రంలో దక్ష అనే ఆర్కియాలజిస్ట్‌గా సరికొత్త ΄ాత్రలో కనిపిస్తారు మీనాక్షీ చౌదరి. ఇటీవల విడుదల చేసిన ఆమె ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ కథలో ఆమె ΄ాత్ర చాలా క్రూషియల్‌గా ఉండబోతోందట. ఎమోషన్స్, పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉండే దక్ష క్యారెక్టర్ ఆమె కెరీర్లో ఓ మైలురాయిగా నిలవనున్నట్లు చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని మేకర్స్ తెలి΄ారు. ఈ సినిమాకి అజనీష్ బి. లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘కార్తికేయ’ (2014), ‘కార్తికేయ 2’ (2022) చిత్రాలు ఎంత సూపర్ హిట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒకదానికి మించి ఒకటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ‘కార్తికేయ 2’తో వందకోట్లకు పైగా వసూళ్లు సాధించారు నిఖిల్. కృష్ణతత్వం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ , అనుపమ్ ఖేర్, హర్ష, శ్రీనివాసరెడ్డి కీలక పాత్రలు పోషించారు. కృష్ణతత్వాన్ని ఉద్దేశించి అనుపమ్ ఖేర్ చెప్పే డైలాగ్స్ సినిమాకే హైలైట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ సూపర్‌హిట్ అందుకుంది. అంతేకాదు... కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ‘కార్తికేయ 2’ నిలిచింది. ఈ సినిమాకి కొనసాగింపుగా ‘కార్తికేయ 3’ చిత్రం ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘‘సరికొత్త అడ్వెంచర్‌ను సెర్చ్ చేసే పనిలో డాక్టర్ కార్తికేయ నిమగ్నమయ్యారు. త్వరలో రానున్నాం’’ అంటూ నిఖిల్ సిద్ధార్థ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం విదితమే. సైన్స్ ఫిక్షన్‌గా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ‘కార్తికేయ, కార్తికేయ 2’ చిత్రాలతో పోలిస్తే ‘కార్తికేయ 3’ మరింత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందనుందని ఫిల్మ్‌నగర్ టాక్. ఇదిలా ఉంటే... నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ జానర్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సైన్స్ ఫిక్షన్ని కూడా జోడించారట మేకర్స్. ఈ చిత్రం 2026 వేసవిలో విడుదల కానుందని టాక్. ఏటిగట్టుపై అద్భుతం‘విరూపాక్ష, బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటించిన తాజా చిత్రం ‘ఎస్వైజీ’(సంబరాల ఏటిగట్టు). నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్. ప్రైమ్‌షో ఎంటర్టైన్ మెంట్‌పై ‘హను–మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళంలో విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. అక్టోబరు 15న సాయిదుర్గా తేజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ‘అసుర ఆగమన’ పేరుతో విడుదల చేసిన ఈ మూవీ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘‘నా జీవితంలో ‘ఎస్వైజీ’(సంబరాల యేటిగట్టు) చిత్రం చాలా ముఖ్యమైనది. ఈ సినిమా కోసం నా సర్వస్వం ధారపోశాను. అద్భుతమైన క్వాలిటీతో సినిమా ఇవ్వాలని చాలా కష్టపడుతున్నాం. నిరంజన్, చైతన్యగార్లు ఖర్చుకి వెనకాడకుండా సపోర్ట్ చేశారు. డైరెక్టర్ రోహిత్ తీసిన ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది.. అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇది నా ప్రామిస్’’ అంటూ ఇటీవల సాయిదుర్గా తేజ్ పేర్కొన్నారు. ఈ మూవీకి బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీత దర్శకుడు. పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాలు కూడా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ప్రేక్షకులను అలరించేందుకు సమాయత్తం అవుతున్నాయి. -
'ఆ దేవుడే దిగి వచ్చినట్లుగా ఉంది'.. ఆట సందీప్ ఎమోషనల్ పోస్ట్!
టాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ పేరు తెలియనివారు ఉండరు. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' ద్వారా ఫేమ్ సంపాదించారు. మొదటి సీజన్లోనే విన్నర్‌గా నిలిచారు. అందువల్లే అతని పేరుతోనే ఆట సందీప్‌గా అభిమానుల్లో ముద్ర వేసుకున్నారు. తెలుగు బిగ్‌బాస్ సీజన్-7లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు.తాజాగా సందీప్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. సందీప్ తన సతీమణి జ్యోతిరాజ్తో కలిసి మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా ఆట సందీప్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. నా జీవితంలో ఇది మరచిపోలేని రోజని పోస్ట్ చేశారు. ఆ దేవుడే దిగి వచ్చి మాకు వరం ఇచ్చినట్లుగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఆయనే స్వయంగా ఇంటికి పిలిచి కొరియోగ్రఫీ ఛాన్స్ ఇచ్చారని సందీప్ వెల్లడించారు. ఆ క్షణం నాకు సాక్షాత్ పరమశివుడు ఆశీర్వాదం చేసినట్టుగా అనిపించిందని ఎమోషనలయ్యారు. నా హృదయమంతా ఆనందంతో నిండిపోయిందని ఇన్‌స్టాలో పంచుకున్నారు. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) -
'కొదమ సింహం' రీరిలీజ్.. ఈ రికార్డ్ గురించి తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి నటించిన కొదమసింహం రీరిలీజ్ కానుంది. 1990లో విడుదలైన ఈ చిత్రంలో కౌబాయ్‌గా చిరు కనిపించారు. ఈనెల 21న సరికొత్త హంగులతో పాటు 4కే విజువల్స్‌తో రీరిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను షేర్ చేశారు. దర్శకుడు కె.మురళీమోహనరావు తెరెక్కించిన ఈ చిత్రంలో సోనమ్, వాణీ విశ్వనాథ్,రాధ,సుజాత,అన్నపూర్ణ నటించగా మోహన్‌బాబు ముఖ్యపాత్ర పోషించారు. ఈ మూవీని కైకాల నాగేశ్వరరావు నిర్మించారు. ఇప్పుడు కూడా ఆయనే ఈ చిత్రాన్ని 5.1 డిజిటల్ సౌండింగ్‌తో చేయించి మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషం. ఇది 'హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజరీ' అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించబడిన మొట్టమొదటి దక్షిణభారత చలనచిత్రంగా కొదమసింహం రికార్డ్ క్రియేట్ చేసింది. కౌబాయ్ పాత్రలని అంతకు ముందు ఎక్కువగా ఘట్టమనేని కృష్ణ పోషించేవారు. ఈ చిత్రంతో చిరంజీవి మొట్టమొదటి సారిగా పూర్తి నిడివి కౌబాయ్ పాత్రని పోషించారు. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ 20 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది. ఇందులోని పాటలు 'జపం జపం జపం, కొంగ జపం', 'చక్కిలిగింతల రాగం', 'గుం గుమాయించు కొంచెం' బాగా పాపులర్ అయ్యాయి. -
‘స్పిరిట్’లో చిరు, డాన్ లీ..? క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న చిత్రం ‘స్పిరిట్’. అయితే ఇటీవల స్పిరిట్ గురించి వస్తున్న రూమర్స్‌పై సందీప్ రెడ్డి స్పష్టత ఇచ్చాడు. తాజాగా ‘జిగ్రీస్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందంతో కలిసి చిట్ చాట్‌లో పాల్గొన్న ఆయన మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.సందీప్ వంగా మాట్లాడుతూ.. “మెగాస్టార్ చిరంజీవి ‘స్పిరిట్’లో నటిస్తున్నారన్న వార్తలు నిజం కాదు. మా ఇద్దరి మద్య అలాంటి చర్చలు జరగలేదు. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే” అని తెలిపారు. కాగా “ఎప్పుడైనా చిరంజీవితో సినిమా చేసే అవకాశం వస్తే మాత్రం అది తప్పకుండా సోలో ఫిలిం రూపంలో ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. అయితే అది ఏ జానర్లో, ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేను” అని అన్నాడు.మరోవైపు సౌత్ కొరియన్ నటుడు డాన్ లీ కూడా ‘స్పిరిట్’ సినిమాలో నటిస్తున్నాడని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కూడా సందీప్ స్పందించాడు. అది కూడా రూమర్ మాత్రమే అని స్పష్టం చేశాడు. -
చిరంజీవికి క్షమాపణలు చెప్పిన ఆర్జీవీ
నాగార్జునను స్టార్‌గా మార్చిన సినిమా శివ. ఈ చిత్రంతోనే రామ్‌గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఫస్ట్ సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేశాడు. తర్వాత ఎన్నో సినిమాలు చేసినప్పటికీ శివ మూవీకి ఆయన కెరీర్లోనే ప్రత్యేక స్థానం ఉంది. ఇక ఈ చిత్రం దాదాపు 36 ఏళ్ల తర్వాత రీరిలీజ్ అవుతోంది. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.చిరంజీవి స్పెషల్ విషెస్ఈ క్రమంలో అల్లు అర్జున్, ప్రభాస్, మహేశ్‌బాబు.. తదితర హీరోలు ఆల్‌ద బెస్ట్ చెప్తూ వీడియోలు చేశారు. తాజాగా చిరంజీవి (Chiranjeevi) సైతం ఓ వీడియో వదిలారు. శివ సినిమా చూసి నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను. అది సినిమా కాదు, ఒక విప్లవం, ఒక ట్రెండ్ సెట్టర్.. తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం చెప్పడంతో కొత్త ఒరవడికి నాంది పలికిన మూవీ. ఆ సైకిల్ చైన్ సీన్ అయితే ఇప్పటికీ జనాల మనసుల్లో అలాగే నిలిచిపోయింది.ఆర్జీవీపై ప్రశంసలునాగార్జున నటనలోని తీవ్రత, శక్తి ఫెంటాస్టిక్. అమల, రఘువరన్.. ప్రతి ఒక్కరూ ప్రతి ఫ్రేమ్‌కి ప్రాణం పోశారు. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి రామ్‌గోపాల్ వర్మ.. ఆయన విజన్, కెమెరా యాంగిల్స్, లైట్స్, సౌండ్ ప్రజెంటేషన్.. అన్నీ కొత్తగా వావ్ అనిపించాయి. ఈ యువ దర్శకుడు తెలుగు సినిమా భవిష్యత్తు అని అప్పుడే అనుకున్నాను. హ్యాట్సాఫ్ రామ్‌గోపాల్ వర్మ.. తెలుగు సినిమా ఉన్నంతకాలం 'శివ' చిరంజీవిలా చిరస్మరణీయం. శివ టీమ్‌కు ఆల్ ద బెస్ట్ అని పేర్కొన్నాడు.బాధపెట్టి ఉంటే క్షమించండిఈ వీడియోను ఆర్జీవీ (Ram Gopal Varma) ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేస్తూ.. చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపాడు. అనుకోకుండా బాధపెట్టి ఉంటే క్షమించమని కోరాడు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆర్జీవీ - చిరంజీవి కాంబినేషన్లో గతంలో వినాలని వుంది అనే సినిమా ప్లాన్ చేశారు. 20% షూటింగ్ కూడా పూర్తి చేశారు. కానీ, సడన్‌గా ఆ సినిమాను అటకెక్కించారు. అప్పటినుంచే వైరం మొదలు?ఆ సమయంలో సంజయ్ దత్ జైలు నుంచి రిలీజవడంతో ఆయనతో ఓ సినిమా చేస్తానని చిరు ప్రాజెక్ట్‌ను వర్మ మధ్యలోనే వదిలేసి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. కథలో హీరో జోక్యం చేసుకోవడం వల్లే సినిమా ఆపేశాడన్న ప్రచారమూ ఉంది. అలా ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అప్పటినుంచే చిరు- వర్మ మధ్య వైరం మొదలైందని అంటుంటారు. సమయం దొరికినప్పుడల్లా వర్మ.. చిరంజీవిపై సెటైర్లు వేస్తుంటాడు. అలాంటిది ఇప్పుడు సడన్‌గా చిరుకు సారీ చెప్పడంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు. Thank you @KChiruTweets gaaru, Also on this occasion I want to sincerely apologise to you if I ever unintentionally offended you ..Thank you once again for your large heartedness 🙏🙏🙏 pic.twitter.com/08EaUPVCQT— Ram Gopal Varma (@RGVzoomin) November 9, 2025చదవండి: ఓటీటీలో 'తెలుసు కదా' మూవీ.. అఫీషియల్ ప్రకటన -
సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న మెగాస్టార్.. మెగాపవర్ స్టార్
ఈ ఇద్దరు తండ్రీకొడుకులు తెలుగు సినీ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చిరంజీవి తన 46 ఏళ్ల కెరీర్లో ఎన్నో మైలురాళ్లు సాధించగా, రామ్ చరణ్ తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నారు. తాజాగా 'మీసాల పిల్ల' పాటలో చిరంజీవి డాన్స్ మూవ్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.ఇక ఈ పాట పెద్ద హిట్ అవడంతో అభిమానులు సోషల్ మీడియాలో ఈ పాటపై రీల్స్,ఫ్యాన్ ఎడిట్స్‌తో ఉత్సాహంగా రాణిస్తున్నారు.భీమ్స్ సంగీతం అధించిన ఈ పాట నంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగింది. అలా ఈ పాట తాజాగా 50 మిలియన్ వ్యూస్‌తో రికార్డు కొల్లగొట్టింది.ఇక రామ్ చరణ్ 'పెద్ది' నుంచి 'చికిరి చికిరి' పాట తాజాగా విడుదలైంది. అయితే ఈ పాట ఒక్క రోజులోనే 4 భాషల్లో కలిపి 46 మిలియన్ వ్యూస్ సాధించింది. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ రిలీజైన గంటల వ్యవదిలోనే 30 మిలియన్ వ్యూస్‌తో ఆల్‌టైమ్ రికార్డ్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. చరణ్ డాన్స్ మూవ్స్‌తో అభిమానులు రీల్స్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. ఇలా తండ్రీకొడుకులు ఇద్దరూ తమ సినిమా పాటలతో సోషల్ మీడియాను రఫ్ ఆడిస్తున్నారు. -
ఫైట్ చేసేద్దాం
నువ్వా... నేనా తేల్చేసుకుందాం... ఫైట్ చేసేద్దాం అనే టైపులో విలన్లకు సవాల్ విసిరి, రంగంలోకి దిగాడు శంకరవరప్రసాద్. అందర్నీ రఫ్ఫాడించడం మొదలుపెట్టాడు. చిరంజీవి హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’కి సంబంధించిన షూటింగ్ అప్డేట్ ఇది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్నారు.ఓ కీలక పాత్రలో హీరో వెంకటేశ్, హీరోయిన్గా నయనతార నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. చిరంజీవి, ఫైటర్స్ పాల్గొనగా ఫైట్ చిత్రీకరిస్తున్నారు. ‘‘ఈ స్టైలిష్ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ విజువల్‌గా అద్భుతంగా ఉంటుంది. ఫైట్ మాస్టర్ వెంకట్ పర్యవేక్షణలో రూపొందిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. -
బాలకృష్ణే చేయిస్తున్నాడా? చిరంజీవిపై DeepFake వెనుక టీడీపీ
-
నెక్లెస్‌రోడ్డులో ఏక్తా రన్.. పాల్గొన్న చిరంజీవి, సజ్జనార్ (ఫొటోలు)
-
నా వీడియోలు ఎడిట్ చేస్తారా.. సజ్జనార్ కి చెప్పా.. ఇక మీ పని అయిపోయింది
-
డీప్ ఫెక్పై స్పందించిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తాజాగా డీప్ ఫేక్ ఫోటోల విషయంపై స్పందించారు. కొద్దిరోజుల క్రితం తన ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా క్రియేట్ చేశారని సీపీ వీసీ సజ్జనార్‌కు ఆయన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. డీప్ ఫెక్ అనేది పెద్ద గొడ్డలి పెట్టు లాంటిదని ఆయన అన్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినట్లు మీడియాతో చిరు చెప్పారు. డీజీపీతో పాటు హైదరాబాద్ సీపీ సజ్జనార్ డీప్ ఫేక్ ఫోటోల విషయంలో చాలా సీరియస్‌గా తీసుకున్నారని చిరు ఇలా చెప్పారు. 'ఈ కేసును సజ్జనార్ స్వయంగా పర్యవేక్షస్తున్నారు. పోలీసు వ్యవస్థ చాలా బలంగా ఉంది. ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారు. ఎవరూ డీప్ ఫెక్, సైబర్ నేరాలకు భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీని అందరం ఆహ్వానించాలి. కానీ, దాని వల్ల ముప్పు కూడా ఉంది. ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. లేదంటే భవిష్యత్‌లో మరిన్ని ఇబ్బందులు ఎదురుకునే అవకాశం ఉంటుంది.' అని చిరంజీవి అన్నారు. -
‘చిరంజీవి’ కేసులపై ప్రత్యేక దృష్టి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు, కేంద్ర మాజీమంత్రి కొణిదెల చిరంజీవి ఫిర్యాదు మేరకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో నమోదైన రెండు కేసులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన ఫిర్యాదు మేరకు డీప్‌ఫేక్‌పై శనివారం, అభ్యంతరకర వ్యాఖ్యపై మంగళవారం కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లోని నిందితులను గుర్తించడానికి దర్యాప్తు అధికారులు సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు. -
నేను కూడా అప్పట్లో అనుకున్నా.. కానీ అది అబద్ధం
చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకరవరప్రసాద్ గారు' అనే సినిమా చేస్తున్నారు. ఇది కాకుండా 'విశ్వంభర' కూడా లైన్లో ఉంది. లెక్క ప్రకారం విశ్వంభర ఈ పాటికే థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా చాలా ఆలస్యం చేసేశారు. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు కాకుండా మరో రెండు ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి.చిరు.. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. కొన్ని నెలల క్రితం దీని గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. వచ్చే ఏడాది ప్రారంభమయ్యే ఈ చిత్రంలో తమిళ హీరో కార్తీ నటించనున్నాడని, ఏకంగా రూ.23 కోట్ల రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేశాడనే రూమర్స్. సరే ఇదంతా పక్కనబెడితే ఈ ప్రాజెక్టులో చిరంజీవి సరసన మాళవిక మోహనన్ నటిస్తుందనే టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు ఈ విషయమై స్వయంగా మాళవికనే స్పందించింది. క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేసింది.(ఇదీ చదవండి: ఎట్టకేలకు రజనీకాంత్ షాకింగ్ నిర్ణయం?)'డైరెక్టర్ బాబీ తీయబోయే 'మెగా 158' ప్రాజెక్టులో నేను ఉన్నానని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. నేను కూడా చిరంజీవి సర్‌తో నటించాలని ఓ దశలో అనుకున్నా. కానీ ఇప్పుడు క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను. ఈ ప్రాజెక్టులో నేను లేను. వినిపిస్తున్న రూమర్స్ నిజం కాదు' అని మాళవిక మోహనన్ ట్వీట్ చేసింది.మాళవిక చెప్పేసింది కాబట్టి ఈ ప్రాజెక్టులో హీరోయిన్ ఎవరనేది తేలాల్సి ఉంది. బాబీ కాకుండా యువదర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా చిరంజీవితో ఓ మూవీ చేయనున్నాడు. దీని గురించి కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడో వచ్చేసింది. ఇది వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మొదలయ్యే అవకాశముంది.(ఇదీ చదవండి: హీరోయిన్గా మహేశ్‌బాబు మేనకోడలు ఎంట్రీ) -
మరోసారి పోలీసులను ఆశ్రయించిన చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మరోసారి పోలీసులను ఆశ్రయించారు. తనపై ఎక్స్ (ట్విటర్)లో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారంటూ దయా చౌదరి అనే వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. ఇటీవల హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఇంకా ఇలాంటి పోస్టులు పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.డీప్ ఫేక్ వీడియోలుఇటీవల చిరంజీవి డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలపై పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే! ఏఐ సాయంతో కొందరు ఆయన ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు సృష్టించి.. వాటిని పలు వెబ్సైట్లలో వైరల్ చేశారు. దీనిపై ఆగ్రహించిన చిరు.. సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే కోర్టును సైతం ఆశ్రయించారు. చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటోలు, వాయిస్‌ను ఎవరూ ఉపయోగించకూడదని సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.చదవండి: టాస్కుల్లో పవన్‌ను కొట్టేవాడే లేడు.. ఆస్పత్రిలో భరణి! -
మీసాల పిల్ల.. 13 రోజులుగా ట్రెండింగ్.. ఏకంగా ఎన్ని వ్యూస్ అంటే?
హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ఏడాది పొంగల్‌కు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయం అందుకున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి మన శంకరవరప్రసాద్‌గారు మూవీతో బ్లాక్‌బస్టర్ అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదారి గట్టు మీద రామచిలకవే.. పాట ఎంత వైరలయిందో ఇప్పుడు చిరంజీవి మూవీ (Mana Shankaravaraprasad Garu Movie)లోని మీసాల పిల్ల కూడా అంతే వైరలవుతోంది.36 మిలియన్ల వ్యూస్(Meesaala Pilla Song) యూట్యూబ్‌లో టాప్‌లో దూసుకుపోతోంది. 13 రోజులుగా ఫస్ట్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటివరకు 36 మిలియన్ల వ్యూస్ అందుకుంది. ఈ సాంగ్‌లో చిరు వేసే స్టెప్పులు సింపుల్‌గా కనిపిస్తూనే చాలా స్టైలిష్‌గా ఉంటాయి. లిరికల్ సాంగ్‌కే ఈ రేంజ్లో రెస్పాన్స్ వస్తే ఇక వీడియో సాంగ్ రిలీజ్ చేస్తే ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో!సినిమాభీమ్స్ సంగీతం అందించిన మీసాల పిల్ల పాటను ఉదిత్ నారాయణ్, శ్వేత మోహన్ ఆలపించారు. భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ రాశాడు. పోలకి మాస్టర్ కొరియోగ్రాఫీ చేశాడు. మన శంకరవరప్రసాద్‌గారు సినిమా విషయానికి వస్తే.. చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. The unanimous chartbuster continues to be the audience’s favourite song of the season ❤️🔥#MeesaalaPilla Trending #1 on YouTube for 13 days with 36MILLION + views 🔥🔥🔥-- https://t.co/4dgILT40kG #ManaShankaraVaraPrasadGaru Sankranthi 2026 RELEASE Megastar @KChiruTweets… pic.twitter.com/8sbxhs7BrY— Shine Screens (@Shine_Screens) October 27, 2025 చదవండి: కల్యాణ్‌ను పొడిచేసిన శ్రీజ.. నామినేషన్స్‌లో ఎవరున్నారంటే? -
చిరంజీవి ప్రతిష్ఠ దెబ్బతీసేలా 'డీప్‌ఫేక్' ఫోటోలు.. కేసు నమోదు
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటోలు, వాయిస్‌లను ఎవరూ ఉపయోగించకూడదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా క్రియేట్ చేశారు. వాటిని పలు వెబ్సైట్లు, సోషల్ మీడియాలలో కొందరు వైరల్ చేశారు. ఈ విషయం చిరు దృష్టికి చేరడంతో ఆయన వెంటనే సీపీ వీసీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. ముఖ్యంగా AI మార్ఫింగ్ ద్వారా డీప్‌ఫేక్ వీడియోలు రూపొందించి తన పేరు, ప్రతిష్ట దెబ్బతీసేలా పనిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చిరు కోరారు.డీప్ ఫేక్ ఫోటోల వల్ల ఇబ్బంది ఎదుర్కొన్న చిరంజీవి కొద్దిరోజుల క్రితమే సివిల్ కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం కూడా చిరుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. చిరంజీవి అనుమతి లేకుండా ఆయన ఫోటోలను తమ వాణిజ్య ప్రయోజనాల కోసం ఎవరూ వినియోగించవద్దని హెచ్చరించింది. ఈ క్రమంలోనే AI ద్యారా మార్ఫింగ్ చేసిన డిజిటల్ వేదికలపై ఆంక్షలు విధిస్తూ సైబర్‌క్రైమ్ పోలీసులుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే చిరుపై తప్పుడు పోస్టులు, వీడియోలను క్రియేట్ చేసిన 30 మందికి పైగానే నోటీసులు జారీ చేసింది. కోర్టు సూచనతో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
అదే ఫార్ములా ఫాలో అవుతున్న చిరు?
రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి వరస సినిమాలైతే చేస్తున్నారు గానీ ఎందుకో అనుకున్నంతగా వర్కౌట్ కావట్లేదు. చాన్నాళ్ల క్రితం రూట్ మార్చిన చిరు.. వీలైనంత వరకు యువ దర్శకులతోనే కలిసి పనిచేస్తున్నారు. అలా ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు మూవీస్ ఉన్నాయి. సెట్స్ పైన మాత్రం రెండింటి పనినడుస్తోంది. ఇప్పుడు ఓ క్రేజీ రూమర్ బయటకొచ్చింది.(ఇదీ చదవండి: మహాభారతాన్ని అద్భుతంగా చూపించిన సిరీస్.. ఓటీటీ రివ్యూ)ప్రస్తుతం 'విశ్వంభర'తో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకరవరప్రసాద్ గారు' అనే మూవీ చేస్తున్నారు. ఇది సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. ఇందులో చిరుతో పాటు వెంకటేశ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ మేరకు కొన్నిరోజుల క్రితమే వెంకీ షూటింగ్‌లోనూ పాల్గొన్నారు. ఇది పూర్తయిన తర్వాత బాబీ దర్శకత్వంలో చిరు మరో మూవీ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఓ రూమర్ వినిపిస్తుంది.చిరు-బాబీ కాంబో ప్రాజెక్ట్ గురించి కొన్నాళ్ల క్రితం అనౌన్స్మెంట్ వచ్చింది. వచ్చే ఏడాది ఇది సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ మూవీలో తమిళ హీరో కార్తీ.. కీలక పాత్రలో నటించబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. ఇది నిజమే కావొచ్చు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా చిరు సినిమాల్లో ఎవరో ఓ హీరో అతిథి పాత్రల్లో కనిపిస్తూనే ఉన్నారు. 'ఆచార్య'లో రామ్ చరణ్, 'గాడ్ ఫాదర్'లో సల్మాన్ ఖాన్, 'వాల్తేరు వీరయ్య'లో రవితేజ.. ప్రస్తుతం చేస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు'లో వెంకటేశ్‌తో ఇలా ఫార్ములా ఫాలో అయిపోతున్నట్లు కనిపిస్తుంది. అలా కార్తీతో త్వరలో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారట. మరి ఇది నిజమా కాదా అనేది కొన్నాళ్లు ఆగితే తెలుస్తుంది.(ఇదీ చదవండి: ఈ పాన్ ఇండియా నటుడిని గుర్తుపట్టారా? బయోపిక్ కోసం ఇలా) -
అనుమతి లేకుండా చిరంజీవి పేరు, ఫొటోలు వాడొద్దు
సిటీ కోర్టులు: ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అనుమతి లేకుండా ఇతర వ్యక్తులు లేదా సంస్థలు ఆయన పేరు, ఫొటోలు, స్వరాన్ని (వాయిస్) వాడొద్దని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. తన అనుమతి లేకుండా పలువురు వ్యక్తులు, సంస్థలు తన పేరును వాడుతున్నారని, దాని వల్ల తన పరువుకు భంగం కలిగే అవకాశం ఉన్నందున అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్‌లో కూడా ఇలాంటివి జరుగకుండా ఆదేశాలు జారీ చెయ్యాలని సిటీ సివిల్ కోర్టులో చిరంజీవి పిటిషన్ దాఖలు చేశారు. తన పేరు/చిత్రం/ప్రసిద్ధ సినీ శీర్షికలను అనుమతి లేకుండా వాడుకోవడం, ఆ¯న్‌లైన్ ప్లాట్‌ఫాంలపై వినియోగించడం, కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా మార్పులు చేసిన తన చిత్రాలు, వీడియోలను ప్రచారం చేయడం ఆపేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపైన విచారణ చేపట్టిన కోర్టు.. వ్యక్తులు లేదా ఏ సంస్థలైనా చిరంజీవి వ్యక్తిత్వ, ప్రచార హక్కులను ఉల్లంఘించే విధంగా ఆయన పేరు, ఫొటోలు, వాయిస్ తదితర వాటిని అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించరాదని శనివారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా చిరంజీవి పిటిషన్లో ప్రతివాదులుగా పేర్కొన్న పలువురికి కోర్టు నోటీసులు జారీచేస్తూ అక్టోబర్ 27న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఏ రూపంలోనైనా, ఏ మాధ్యమంలోనైనా, వ్యక్తిగత లేదా వాణిజ్య లాభం కోసం నేరుగా గానీ పరోక్షంగా గానీ చిరంజీవి పేరును ఉపయోగించొద్దని స్పష్టంచేసింది. చిరంజీవి వ్యక్తిత్వ/ప్రచార హక్కుల ఉల్లంఘనలు గాని పరువు నష్టం చర్యలుగాని జరిగితే, సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. టెలివిజన్ చానళ్లు, డిజిటల్ ప్లాట్‌ఫాంలు, మీడియా సంస్థలు తదితర అన్నిరకాల వ్యక్తులు/సంస్థలు లాభాలను పొందే ఉద్దేశంతో చిరంజీవి పేరు, చిత్రం, వాయిస్ లేదా ఇతర వ్యక్తిత్వ లక్షణాలను అనుమతి లేకుండా ఉపయోగించడం, తప్పుగా చూపించడం లేదా వక్రీకరించడం చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. -
నాగార్జున రూట్లోనే చిరంజీవి.. కోర్ట్ ఆదేశాలు
మెగాస్టార్ చిరంజీవి ఫొటోలు, గొంతు లాంటివి ఇకపై ఎవరైనా సరే అనుమతి లేకుండా ఉపయోగిస్తే అంతే సంగతులు. ఎందుకంటే చిరు వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్.. శనివారం (అక్టోబరు 25) మధ్యంతర ఉత్తర్వులు మంజూరు చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పిటిషన్లో పేరు పొందిన పలువురితోపాటు ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ అయినా చిరంజీవి వ్యక్తిత్వ, ప్రచార హక్కులను ఉల్లంఘించే విధంగా ముందస్తు అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఆయన పేరు, గాత్రం తదితర అంశాల్ని వినియోగించడాన్ని న్యాయస్థానం నిషేధించింది.అలానే కృత్రిమ మేథస్సు (ఏఐ)తో తయారు చేసిన మార్ఫ్ ఫొటోలు, వీడియోలు వినియోగించడాన్ని కూడా ఆపివేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు దృష్టికి చిరంజీవి తీసుకువచ్చారు. ఆయన పేరుతో వీడియో, మీమ్స్ చేసి అనుమతి లేకుండా వినియోగిస్తున్నారని.. తద్వారా ఆయన ఖ్యాతి, గౌరవానికి నష్టం కలుగుతోందని చిరంజీవి తరఫు న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు. (ఇదీ చదవండి: నా దొంగ మొగుడు.. ప్రశాంత్ నీల్ భార్య పోస్ట్ వైరల్)ఈ ఆదేశాల ప్రకారం చిరంజీవి పేరు, స్టేజ్ టైటిల్స్, గొంతు, ఆయనకు మాత్రమే సొంతమైన ఇతర వ్యక్తిత్వ లక్షణాలని ఏ రూపంలోనైనా ఏ మాధ్యమంలోనైనా ఉపయోగించొద్దని న్యాయస్థానం ఆదేశించింది. గతంలో నాగార్జున కూడా ఇలానే న్యాయస్థానం నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు.ప్రస్తుతం చిరంజీవి రెండు సినిమాలు చేస్తున్నారు. వీటిలో 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. వచ్చే వేసవిలో 'విశ్వంభర' థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.(ఇదీ చదవండి: 'కాంతార' రిషభ్ ఇంట్లో ఇన్ని కార్స్ ఉన్నాయేంటి?) -
మాస్ హీరోతో.. క్లాస్ హీరో.. సంక్రాంతికి మెగా విక్టరీ
-
స్టార్ హీరోల సినిమా.. హీరోయిన్స్ వీళ్లేనా?
‘ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకా... నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపికా’.. ఈ పాట మహేశ్‌బాబు హీరోగా చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘మురారి’ లోనిదని ప్రత్యేకించి చెపక్కర్లేదు. ఇప్పుడు ఈ పాటను సరదాగా కొందరు తెలుగు హీరోలు పాడుకుంటున్నారట... ఎందుకంటే ఈ హీరోలు కమిట్ అయిన తాజా చిత్రాల్లో ఇంకా హీరోయిన్ ఫైనలైజ్ కాలేదు. అయితే ఫలానా హీరో సరసన ఫలానా హీరోయిన్ నటించనున్నారంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మరి... ఈ కొత్త ఊహా తారల కహానీ ఏంటో మీరూ ఓ లుక్ వేయండి. గ్యాంగ్‌స్టర్ డ్రామాలో... చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా, ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాగానే దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) తెరకెక్కించనున్న గ్యాంగ్‌స్టర్ డ్రామాలో చిరంజీవి హీరోగా నటిస్తారు. కేవీన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి సూపర్‌హిట్ తర్వాత చిరంజీవి, బాబీల కాంబినేషన్లో రూపొందనున్న ఈ మూవీపై మెగా అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ వర్క్స్‌లో భాగంగానే దర్శకుడు బాబీ ఈ చిత్రంలోని ఇతర నటీనటుల ఎంపికపై కూడా దృష్టి పెట్టారని తెలిసింది. కథ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కు చాన్స్ ఉందట. ఈ హీరోయిన్స్ రోల్స్‌కు మాళవికా మోహనన్, రాశీ ఖన్నాలను సంప్రదించారట బాబీ. అలాగే ఈ మూవీలో ఓ పవర్ఫుల్ రోల్ కూడా ఉందని, ఈ పాత్ర కోసం చిత్రయూనిట్ మోహన్‌లాల్ వంటి యాక్టర్స్‌తో చర్చలు జరుపుతోందనే టాక్ తెరపైకి వచ్చింది. మరి... చిరంజీవి సినిమాలో మాళవికా మోహనన్, రాశీ ఖన్నా భాగం అవుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ సినిమా 2027 సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్. జోడీ రిపీట్ నాగార్జున కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్). నాగార్జున కెరీర్లో ఇది వందో సినిమా. తమిళ దర్శకుడు ఆర్ఏ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌కు చాన్స్ ఉందట. ఇప్పటికే అనుష్కా శెట్టి, టబు భాగమయ్యారనే టాక్ తెరపైకి వచ్చింది. 2005లో వచ్చిన ‘సూపర్’ సినిమా కోసం నాగార్జున, అనుష్క తొలిసారి కలిసి నటించారు. ఆ తర్వాత ఈ ఇద్దరూ హీరో హీరోయిన్లుగా ‘డాన్’, ‘రగడ’, ‘ఢమరుకం’ చిత్రాల్లో నటించారు. అలాగే ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రంలో నాగార్జున, అనుష్కా శెట్టి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇంకా నాగార్జున ‘కింగ్, ఊపిరి, సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి చిత్రాల్లో అనుష్క అతిథిగా నటించారు. మరి... ‘కింగ్ 100’లో కూడా అనుష్కా శెట్టి భాగం అవుతారా? అయితే హీరోయిన్గా నటిస్తారా? లేక ఏదైనా ఇంపార్టెంట్ రోల్ చేస్తారా? అనే అంశాలపై ఓ స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ‘నిన్నే పెళ్లాడతా.., ఆవిడా మా ఆవిడే!’ వంటి సినిమాల్లో నాగార్జున – టబు హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే ‘కింగ్ 100’ సినిమాలో టబు కూడా కనిపిస్తారా? ఈ జోడీలు రిపీట్ అవుతాయా? వేచి చూడాలి. ఇక ‘కింగ్ 100’ సినిమా పొలిటికల్ డ్రామా నేపథ్యంలో సాగుతుందని, ఇందులో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కబురు వెళ్లిందా? ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో రామ్‌చరణ్(Ram Charan), దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమా రానుంది. ఈ మూవీ అధికారిక ప్రకటన వచ్చి ఏడాదిన్నర పైనే అవుతున్నా ఇంకా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. రామ్‌చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతనే సుకుమార్‌తో చేయాల్సిన మూవీని సెట్స్‌కు తీసుకువెళ్లాలని అనుకుంటున్నారట రామ్‌చరణ్. ఈలోపు ఈ సినిమా స్క్రిప్ట్‌కు సంబంధించిన పనులపై దర్శకుడు సుకుమార్ మరింత ఫోకస్ పెట్టారట. అలాగే ఇందులోని నటీనటుల ఎంపిక గురించి కూడా సుకుమార్ ఆలోచిస్తున్నారట. ఆల్రెడీ సమంత, రష్మికా మందన్నా, మృణాల్ ఠాకూర్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కృతీ సనన్ పేరు కూడా వినిపిస్తోంది. గతంలో మహేశ్ బాబు హీరోగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ‘వన్: నేనొక్కడినే’ చిత్రంలో కృతీ సనన్ హీరోయిన్గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మరి... రామ్‌చరణ్‌తో సుకుమార్ చేయబోయే సినిమా గురించిన కబురు కృతీ సనన్‌కు వెళ్లిందా? ఈ సినిమాలో ఆమె హీరోయిన్గా నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. అంతర్జాతీయ స్థాయిలో... అల్లు అర్జున్( Allu Arjun) హీరోగా అట్లీ దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్‌కు చాన్స్ ఉందట. ఆల్రెడీ దీపికా పదుకోన్ ఈ చిత్రంలో భాగమయ్యారు. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, ఆలియా.ఎఫ్, భాగ్యశ్రీ బోర్సే కూడా ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తారనే ప్రచారం టాలీవుడ్లో తెరపైకి వచ్చింది. అయితే ఆల్రెడీ మృణాల్ ఠాకూర్ ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారని తెలిసింది. ఇక మిగతా హీరోయిన్స్ ఎంపికలపై కూడా త్వరలోనే ఓ ప్రకటన రానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. అంతర్జాతీయ స్థాయిలో 2027లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని, ఈ దిశగా అల్లు అర్జున్, అట్లీ అండ్ టీమ్ సన్నాహాలు చేస్తున్నారని టాక్. జూలియట్ ఎవరో! ‘ది ప్యారడైజ్’ సినిమా చిత్రీకరణతో ప్రస్తుతం నాని బిజీగా ఉన్నారు. ‘దసరా’ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. అయితే నాని హీరోగా సుజిత్ డైరెక్షన్‌లోని సినిమా ప్రారంభోత్సవం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ‘ది ప్యారడైజ్’ సినిమా చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత సుజిత్‌తో చేసే చిత్రం షూటింగ్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారట నాని. ఈ సినిమాకు ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని, ఇదో గ్యాంగ్‌స్టర్ సినిమా అనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు తొలుత ప్రియాంకా అరుళ్ మోహన్ పేరు వినిపించింది. నాని – ప్రియాంక ‘నానీస్ గ్యాంగ్‌లీడర్, సరిపోదా శనివారం’ చిత్రాల్లో జోడీగా నటించారు. కానీ ‘బ్లడీ రోమియో’ సినిమాలోని హీరోయిన్గా పూజా హెగ్డే కనిపిస్తారనే ప్రచారం లేటెస్ట్గా ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఫైనల్‌గా ఈ ‘బ్లడీ రోమియో’ సరసన జూలియట్‌గా ఎవరు కనిపిస్తారనే విషయంపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. 2026 చివర్లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి... ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ సినిమాల్లో విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ కాంబినేషన్ ముచ్చటగా మూడోసారి రిపీట్ కానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ‘టాక్సీవాలా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో ఓ హిస్టారికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. రాయలసీమ నేపథ్యంలో స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిసింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఈ చిత్రంలోనే విజయ్–రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా నటించనున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. మరి... విజయ్–రష్మిక మందన్నాల జోడీ మళ్లీ స్క్రీన్‌పై మ్యాజిక్ చేస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. దేవి సరసన.... సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఓ సినిమా రానుందనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ‘బలగం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత దర్శకుడు వేణు యెల్దండి ‘ఎల్లమ్మ’ అనే ఓ రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో హీరోగా నటిస్తారంటూ నాని, నితిన్, శర్వానంద్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఫైనల్‌గా ఈ చాన్స్ దేవిశ్రీ ప్రసాద్‌కు లభించిందని, కథ నచ్చడంతో దేవిశ్రీ కూడా ‘ఎల్లమ్మ’ సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్‌నగర్ సమాచారం. అలాగే ఈ సినిమాలో దేవి సరసన హీరోయిన్గా కీర్తీ సురేష్ దాదాపు ఖరారు అయ్యారని, త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ‘దిల్’ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. డబుల్ ఎంట్రీ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సోదరుడు, దివంగత నటుడు రమేష్‌బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేయనున్నారు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని టాక్. ఈ సినిమాలో రవీనా టాండన్ కుమార్తె రాషా టాండన్ హీరోయిన్గా నటిస్తారని, త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన ఫొటోషూట్ కూడా జరిగిందట. ఈ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ సినిమాను వైజయంతీ మూవీస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంస్థలు నిర్మించనున్నాయని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఇక జయకృష్ణకు యాక్టర్‌గా ఇది తొలి చిత్రం అయితే, రాషాకు తెలుగులో ఇది తొలి మూవీ అవుతుంది. అయితే ఈ చిత్రం గురించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఇలా హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కావాల్సిన మరికొన్ని సినిమాలు ఉన్నాయి. -
కవలలకు జన్మనివ్వనున్న ఉపాసన.. చిరంజీవి ఆశ నెరవేరేనా?
మెగా ఫ్యామిలీలో మరోసారి ఆనందాలు వెల్లివిరాశాయి. హీరో రామ్‌చరణ్ (Ram Charan), ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. దీపావళి పండగ సందర్భంగా చిరంజీవి ఇంట్లో సెలబ్రేషన్స్ జరిగాయి. అప్పుడే ఉపాసనకు సీమంతం వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో మెగా కుటుంబ సభ్యులంతా పాల్గొని సందడి చేశారు. రామ్‌చరణ్-ఉపాసన 2012 జూన్ 14న వివాహం చేసుకోగా 2023 జూన్‌లో తొలి సంతానంగా క్లీంకార పుట్టిన సంగతి తెలిసిందే! కవలలు రాబోతున్నారుమళ్లీ రెండేళ్ల తర్వాత మెగా కుటుంబంలో రెండింతల సంతోషం (కవలలు) రాబోతోంది. ఈ విషయాన్ని ఉపాసన తెలుపుతూ తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేసి.. ఈ దీపావళి డబుల్ సంతోషాన్ని తెచ్చింది. డబుల్ ప్రేమ, డబుల్ బ్లెస్సింగ్స్ అని పేర్కొన్నారు. ఇలా డబుల్ అని ఉపాసన పేర్కొనడం వెనక కారణం ఉంది. ఆమె కవలలకు జన్మనివ్వనున్నారు.చిరంజీవి కుటుంబంచిరంజీవి (Chiranjeevi Konidela)- సురేఖ దంపతులకు రామ్‌చరణ్, సుస్మిత, శ్రీజ.. అని ముగ్గురు సంతానం.. సుష్మితకు విష్ణుప్రసాద్‌తో పెళ్లవగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. శ్రీజకు శిరీష్ భరద్వాజ్‌తో పెళ్లవగా వీరికి నివృతి పాప పుట్టింది. తర్వాత వీళ్లు విడాకులు తీసుకున్నారు. అనంతరం కల్యాణ్ దేవ్‌ను పెళ్లాడగా.. ఈ జంటకు కూతురు నవిష్క జన్మించింది. కొంతకాలానికి శ్రీజ, కల్యాణ్ దేవ్ మధ్య అభిప్రాయపభేదాలు రావడంతో విడిపోయారు. రామ్‌చరణ్-ఉపాసన దంపతులకు క్లీంకార పాప పుట్టింది. అలా మొత్తంగా చిరంజీవికి ఐదుగురు మనవరాళ్లు ఉన్నారు.చిరంజీవి కోరిక నెరవేరేనా?దీంతో ఓ ఈవెంట్లో చిరు.. ఇంట్లో ఉంటే నాకు మనవరాళ్లతో ఉన్నట్లుగా లేదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్‌లా ఉన్నట్లు అనిపిస్తోంది. చుట్టూ ఆడపిల్లే.. ఒక్క మగాడు కూడా లేడు. చరణ్.. ఈసారైనా ఒక అబ్బాయిని కనరా.. నా వారసత్వం ముందుకెళ్లాలని కోరిక.. మళ్లీ ఇంకో అమ్మాయిని కంటాడేమోనని భయంగా ఉందన్నారు. ఈ వ్యాఖ్యలపై వివాదాస్పదమయ్యాయి. అందరూ ఆడపిల్లలే ఉన్నారు, కాబట్టి ఓ మగపిల్లాడిని కోరుకోవడం తప్పు లేదని, కానీ ఆడపిల్ల పుడుతుందని భయపడటమే తప్పని పలువురూ అభిప్రాయపడ్డారు. మరి ఈసారి పుట్టే కవలల్లో ఒక్కరైనా మగపిల్లాడు ఉంటాడేమో చూడాలి! View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) చదవండి: హీరోగా ఎంట్రీ ఇస్తున్న బ్లాక్‌బస్టర్ డైరెక్టర్! -
వెల్కమ్ వెంకీ
‘వెల్కమ్ వెంకీ... మై బ్రదర్!’ అంటూ వెంకటేశ్‌ని ఆప్యాయంగా సెట్స్‌కి ఆహ్వానించారు చిరంజీవి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ట్యాగ్‌లైన్. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, కేథరిన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో వెంకటేశ్ కీలక పాత్ర పోషించనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ షూటింగ్లో జాయిన్ అయ్యారు వెంకటేశ్. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించి, ఓ వీడియోను విడుదల చేసింది. ‘వెల్కమ్ వెంకీ... మై బ్రదర్...’ అంటూ చిరంజీవి ఆప్యాయంగా వెంకటేశ్‌ని పిలవగా, ‘చిరు సార్... మై బాస్...’ అంటూ చిరంజీవిని హత్తుకున్నారు వెంకటేశ్. ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. వినోదం, భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ సినిమా సంక్రాంతికి పర్ఫెక్ట్ ట్రీట్. చిరంజీవి– వెంకటేశ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ఫ్యాన్స్‌కి డబుల్ ఫెస్టివల్. ఈ సినిమాలో వెంకటేశ్ లెంగ్తీ, క్రూషియల్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్లో చిరంజీవి–వెంకటేశ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది. కాగా.. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది. -
బుద్ధిలేదా ..? తాగి అసెంబ్లీకొచ్చి
-
మెగాస్టార్ మన శంకర వరప్రసాద్ గారు.. తెలుగు సినీ చరిత్రలో తొలిసారి!
మెగాస్టార్ - అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న ఈ మూవీపై రోజు రోజుకు అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజైన మీసాల పిల్ల సాంగ్ ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. మొదటిసారి వీరిద్దరి మూవీ కోసం టాలీవుడ్ సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫుల్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారుకి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది.ఈ మూవీలో వెంకీమామ సైతం నటిస్తున్నట్లు మేకర్స్ రివీల్ చేశారు. ఈ విషయాన్ని మెగాస్టార్((Chiranjeevi) ) సైతం ట్వీట్ చేశారు. వెల్కమ్ టూ మన శంకర వరప్రసాద్ గారు ఫ్యామిలీ అంటూ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో వెంకటేశ్‌ను చిరంజీవి మై బ్రదర్ అని పిలవగా.. చిరుసర్.. మై బాస్ అంటూ వెంకీ మామ ఆప్యాయంగా హత్తుకున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు ఓకే మూవీలో నటించడం తెలుగు సినీ చరిత్రలో ఇదే మొదటిసారి అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. Welcoming my dear friend, Victory @VenkyMama to our #ManaShankaraVaraPrasadGaru Family 💐💐💐Let’s celebrate the joy this Sankranthi 2026 in theatres 🤗 pic.twitter.com/3kITC2RlBU— Chiranjeevi Konidela (@KChiruTweets) October 23, 2025 -
చిరు-బాలయ్య ఎపిసోడ్‌పై స్పందించిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సినిమా వాళ్లను పిలిచి మరీ అవమానించారంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఈ అంశం మొదలుపెట్టగా.. ఆ వెంటనే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దానిని కొనసాగించారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి మీద కాస్త దురుసు వ్యాఖ్య చేశారు. ఇది అటు అభిమానుల మధ్యే కాదు.. ఇటు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది కూడా. అయితే తాజాగా ఈ ఎపిసోడ్‌పై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్లు.. పవన్ కల్యాణ్ మౌనంపై ఓ రిపోర్టర్ వైఎస్ జగన్‌ను స్పందన కోరారు. ‘‘అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి? ఆయన మాట్లాడింది ఏంటి?. పనిపాట లేని సంభాషణ చేశారు. బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారు. తాగి వచ్చిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుతించారు?. అలా మాట్లాడేందుకు అనుమతించినందుకు స్పీకర్‌కు బుద్ది లేదు. బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో అక్కడే అర్థమవుతోంది. అలా మాట్లాడినందుకు సైకలాజికల్ ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలి’’ అని జగన్ అన్నారు. ఇదిలా ఉంటే..శాసనసభలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడిన అంశంపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ తన ప్రస్తావన తీసుకురావడంపై స్పందిస్తూ చిరంజీవి ఆనాడే ఓ ప్రకటన విడుదల చేశారు. సినిమా వాళ్లకు ఎలాంటి అవమానం జరగలేదని, ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనను సాదరంగా ఆహ్వనించారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
'ఉపాసన' సీమంతం.. సందడిగా మెగా ఫ్యామిలీ (ఫోటోలు)
-
చిరంజీవి ఇంట్లో నయనతార ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్స్..ఫొటోలు వైరల్
-
తెలుగు చిత్ర పరిశ్రమలో దీపావళి సందడి
తెలుగు చిత్ర పరిశ్రమలో దీపావళి సందడి జోరుగా కనిపించింది. ఫస్ట్ లుక్, కొత్త పోస్టర్స్, రిలీజ్ డేట్స్, వీడియో గ్లింప్స్, ప్రెస్మీట్స్... ఇలా సినిమా లవర్స్‌కి కావల్సినన్ని అప్డేట్స్ ఇచ్చింది ఈ పండగ. ఆ విశేషాల్లోకి...డేట్ ఫిక్స్⇒ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన చిత్రం ‘కాంత’. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. తెలుగు, తమిళ భాషల్లో సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మించారు. ఈ సినిమాను నవంబరు 14న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు. 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో స్టార్ హీరో చంద్రన్‌గా దుల్కర్, దర్శకుడు అయ్యా పాత్రలో సముద్ర ఖని కనిపిస్తారు. ⇒ శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారి నారి నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ⇒ భూమిక చావ్లా ప్రధాన పాత్రలో, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత కీలక పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘యుఫోరియా’. గుణశేఖర్ దర్శకత్వంలో రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్త గుణ నిర్మించారు. ఈ సినిమాను డిసెంబరు 25న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ⇒ పతంగుల పోటీ నేపథ్యంలో రూపొందిన కామెడీ స్పోర్ట్స్ డ్రామా ‘పతంగ్’. వంశీ పూజిత్, ‘జీ సరిగమప’ రన్నరప్ ప్రణవ్ కౌశిక్, ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి పగడాల ప్రధాన పాత్రధారులుగా, సింగర్ ఎస్పీ చరణ్ కీలక పాత్రలో నటించారు. ప్రణీత్ పత్తి పాటి దర్శకత్వంలో విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించారు. ఈ సినిమాను డిసెంబరు 25న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలి పారు.అప్ డేట్స్⇒ చిరంజీవి ఇంట్లో దీ పావళి సంబరాలు ఘనంగా జరిగాయి. హీరోలు నాగార్జున, వెంకటేశ్, సతీసమేతంగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో నీరజ (వెంకటేశ్ భార్య), అమల (నాగార్జున భార్య)లతో పాటు చిరంజీవి తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’లో హీరోయిన్గా నటిస్తున్న నయనతార కూడా పాల్గొన్నారు. ఈ వేడుకల్లోని ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. మరోవైపు చిరంజీవి, నయనతార హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సుస్మిత కొణిదెల, సాహు గార పాటి నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది.⇒ విశాల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మకుటం’. ఈ సినిమా సెకండ్ లుక్‌ను రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమాకు తానే దర్శకత్వం వహిస్తున్నట్లుగా కూడా విశాల్ తెలి పారు. ‘‘పరిస్థితులు నన్ను ఈ సినిమాకు దర్శకత్వం వహించాలనే నిర్ణయం తీసుకునేలా చేశాయి. ఈ నిర్ణయం బలవంతం వల్ల కాదు, బాధ్యతగా తీసుకోవడం జరిగింది’’ అంటూ ఓ లాంగ్ నోట్‌ను విశాల్ షేర్ చేశారు. విశాల్‌కు దర్శకుడిగా ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో దుషారా విజయన్, అంజలి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ సినిమాకు తొలుత దర్శకుడిగా ఉన్న రవి అరసు ఇప్పుడు ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్బి చౌదరి నిర్మిస్తున్నారు. ⇒ హీరో వెంకటేశ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా రూ పొందనున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్నారు. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రలో శ్రీనిధి శెట్టి నటించనున్నారు. మంగళవారం (అక్టోబరు 21) శ్రీనిధి శెట్టి బర్త్ డే సందర్భంగా ఈ చిత్రంలో ఆమె హీరోయిన్గా నటించనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా తెలి పారు.⇒ నవీన్ పొలిశెట్టి, మీనాక్షీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’. మారి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా స్పెషల్ ్ర΄ోమో వీడియోను రిలీజ్ చేశారు చేశారు మేకర్స్. అలాగే త్వరలోనే ‘అనగనగా ఒక రాజు’ సినిమా నుంచి పాటను రిలీజ్ చేయనున్నట్లుగా కూడా తెలి పారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది.⇒ ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫ్యాంటసీ ఎంటర్టైనర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ యేలేటి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ్ర పారంభమైంది. ‘‘తొలి షూటింగ్ షెడ్యూల్ నవంబరు 8 వరకు కొనసాగుతుంది. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.ఫస్ట్ లుక్⇒ మోటార్ సైకిల్ రేసర్‌గా హీరో శర్వానంద్ నటిస్తున్న చిత్రానికి ‘బైకర్’ టైటిల్ ఖరారు చేసి, లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. 1990, 2000ల నేపథ్యంలో రేసింగ్ డ్రీమ్స్, ఎమోషన్స్ ప్రధానంగా ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూ పొందుతోంది.⇒ రష్మికా మందన్నా నటిస్తున్న ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మైసా’. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలోని రష్మిక లుక్ విడుదలైంది. గోండు తెగల నేపథ్యంలో ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూ పొందుతున్న ఈ చిత్రం గ్లింప్స్ త్వరలో విడుదల కానుంది.⇒ సంయుక్త నటిస్తున్న తొలి ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్‌కి ‘ది బ్లాక్ గోల్డ్’ టైటిల్‌ని ఖరారు చేసి, లుక్‌ని విడుదల చేశారు. యోగేష్ ఏఎంసి దర్శకత్వంలో ఈ యాక్షన్ మూవీని రాజేశ్ దండ నిర్మిస్తున్నారు. హాస్య మూవీస్, మాగంటి పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్న ఆరవ సినిమా ఇది. ఈ చిత్రంలో నటించడంతో పాటు సంయుక్త సమర్పకురాలిగానూ వ్యవహరిస్తుండటం విశేషం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది.⇒ ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో కీర్తన నరేశ్, టీఆర్ ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్న చిత్రం ‘కాగితం పడవలు’. వర్ధన్, కృష్ణప్రియ జటంగా నటిస్తున్న ఈ ప్రేమకథా చిత్రం గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఓ తీరంలో ప్రేమికులు మాట్లాడుకోవడంతో ఈ వీడియో సాగుతుంది. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది.⇒ గ్రామీణ నేపథ్యంలో రూ పొందుతోన్న ఎమోషనల్ మూవీ. ‘రోలుగుంట సూరి’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. నాగార్జున పల్లా, ఆధ్యారెడ్డి, భావన నీలిపి హీరో హీరోయిన్లు. చక్కని భావోద్వేగాలతో, జీవిత సత్యాలు మిళితమైన కథతో అనిల్ కుమార్ పల్లా దర్శకత్వంలో సౌమ్య చాందిని పల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
మీసాల పిల్ల సాంగ్ క్రేజ్.. యూట్యూబ్‌లో సరికొత్త రికార్డ్!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మన శంకరవరప్రసాద్‌గారు (Mana Shankara Vara Prasad Garu Movie). అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి హిట్ కొట్టిన అనిల్ మరో బ్లాక్ బస్టర్ కోసం రెడీ అయిపోయాడు.ఇటీవలే ఈ మూవీ నుంచి మీసాల పిల్ల అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌కు అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం ఈ పాట 30 మిలియన్ల వ్యూస్, 30 వేల రీల్స్, 300 మిలియన్ల రీల్స్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. అంతేకాకుండా అన్ని మ్యూజిక్ ఫ్లాట్‌ఫామ్స్‌లో 50 మిలియన్లకు పైగా ఈ పాటను ప్లే చేశారు.కాగా.. ఈ రొమాంటిక్ సాంగ్‌కు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. ఈ పాటను ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ ఆలపించారు. ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ అందించారు. కాగా.. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. There’s no stopping the MEGA GRACE of #ManaShankaraVaraPrasadGaru 🔥🔥🔥#MeesaalaPilla is trending #1 on YouTube with 30M+ Views, 30K+ Reels on insta, 300M+ Reel Views and 50M+ Plays across all music platforms 💥💥💥AN UNANIMOUS MUSICAL SENSATION IN INDIA ❤️🔥❤️🔥❤️🔥--… pic.twitter.com/6rqiuAUop5— Shine Screens (@Shine_Screens) October 21, 2025 -
అంబరాన్నంటిన దీపావళి.. సెలబ్రిటీల సెలబ్రేషన్స చూశారా? (ఫొటోలు)
-
మెగాస్టార్ ఇంట దీపావళి వేడుక.. హాజరైన టాలీవుడ్ ప్రముఖులు
మెగాస్టార్ చిరంజీవీ ఈ దీపావళిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఏడాది హైదరాబాద్‌లోని తన నివాసంలో టాలీవుడ్ ప్రముఖులతో జరుపుకున్నారు. ఈ వేడుకల్లో విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగార్జున, నయనతార సైతం పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను చిరంజీవి ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులతో పాటు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.కాగా.. మెగాస్టార్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే మనశివశంకరవరప్రసాద్‌గారు మూవీ నుంచి సూపర్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. మీసాల పిల్లా అంటూ సాగే పాటను విడుదల చేయగా..యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. Very delighted to have celebrated the Festival of Lights with my dear friends, @iamnagarjuna, @VenkyMama and my co-star #Nayanthara, along with our families 🤗✨Moments like these fill the heart with joy and remind us of the love, laughter, and togetherness that make life truly… pic.twitter.com/qJHpVkk9og— Chiranjeevi Konidela (@KChiruTweets) October 20, 2025 -
చిరుతో రామ్ చరణ్ మరో భారీ ప్లాన్..
-
బండ్ల గణేశ్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్.. సినీ ప్రముఖుల సందడి (ఫోటోలు)
-
బండ్ల గణేశ్ దీపావళి పార్టీ.. హాజరైన టాలీవుడ్ స్టార్స్
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) ఇంట దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ దీపావళి సెలబ్రేషన్స్ కోసం పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలను తన ఇంటికి ఆహ్వానించాడు. ఆయన ఆహ్వానం మేరకు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, సిద్ధు జొన్నలగడ్డ, శ్రీకాంత్, రోషన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తేజ సజ్జ, జేడీ చక్రవర్తి, తరుణ్, మౌలి, దర్శకుడు హరీశ్ శంకర్, నిర్మాత నవీన్ యెర్నేని తదితరులు శనివారం నాడు ఈ పార్టీకి హాజరయ్యారు.అందుకోసమే ఈ పార్టీ!ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో చిరంజీవి, శ్రీకాంత్ ఒకే కారులో నుంచి దిగారు. చిరు కారు దిగగ్గానే బండ్ల గణేశ్ ఆయన పాదాలకు నమస్కరించాడు. తర్వాత చేతులు పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లాడు. ప్రత్యేకమైన కుర్చీలో కూర్చోబెట్టాడు. కాగా కొంతకాలంగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు బండ్ల గణేశ్. మళ్లీ ఇండస్ట్రీలో యాక్టివ్ అయ్యే క్రమంలోనే శనివారంనాడు దీపావళి పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Bandla Ganesh (@bandlaganesh_official) View this post on Instagram A post shared by Bandla Ganesh (@bandlaganesh_official)చదవండి: Bigg Boss: ఇదేం ట్విస్టు! మాధురి 200% కరెక్ట్ అన్న నాగ్.. -
ఆసియా కప్ హీరో తిలక్ వర్మకు చిరంజీవి సత్కారం (ఫొటోలు)
-
చిరంజీవి సినిమాలో...
చిరంజీవి సరసన మాళవికా మోహనన్ నటించనున్నారా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ (2023) వంటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ తర్వాత హీరో చిరంజీవి, దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర)ల కాంబినేషన్లో ఓ సినిమా రానుంది. కెవిన్ ప్రోడక్షన్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. చిరంజీవి కెరీర్‌లోని 158వ సినిమా ఇది. కాగా ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్‌కు చాన్స్ ఉందని, ఒక హీరోయిన్గా మాళవికా మోహనన్, మరో హీరోయిన్గా రాశీ ఖన్నా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది.గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమా కథనం ఉంటుందని, అతి త్వరలోనే ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై ఓ స్పష్టత రానుందని సమాచారం. మరి... చిరంజీవి సరసన రాశీ ఖన్నా, మాళవికాలకు హీరోయిన్లుగా నటించే చాన్స్ లభిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.మరోవైపు ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు మాళవికా మోహనన్. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, రిద్ది కుమార్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. -
ఆసియా కప్ హీరోకు మెగా సన్మానం.. కేక్ కట్ చేయించిన చిరు
ఆసియా కప్ హీరో తిలక్ వర్మను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సన్మానించారు. ప్రస్తుతం మనశంకరవరప్రసాద్గారు మూవీలో నటిస్తోన్న చిరు.. ఈ టీమిండియా క్రికెటర్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా మూవీ సెట్లో కేక్ కట్ చేసిన తిలక్ వర్మకు.. ఆసియా కప్ ఫైనల్ నాటి ఫోటోను బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో నయనతార, అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి, సుష్మిత కొణిదెల పాల్గొన్నారు.కాగా..ఇటీవల దుబాయ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ అదరగొట్టాడు. ఈ విజయం కీలకమైన సమయంలో రాణించాడు. దీంతో తిలక్ వర్మపై పలువురు క్రీడా ప్రముఖులు, రాజకీయ నాయకులు ప్రశంసలు కురిపించారు. కాగా.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల మీసాల పిల్ల అంటూ సాగే పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. Megastar #Chiranjeevi Garu met young cricket sensation #TilakVarma on the sets of #ManaShankaraVaraPrasadGaru and felicitated him for his stellar contribution to India’s glorious win against Pakistan. 🏏💫A proud moment as the Megastar appreciated the Hyderabad boy’s talent,… pic.twitter.com/9HVOg2ZRy4— Team Megastar (@MegaStaroffl) October 16, 2025 -
మరోసారి చిరు - రామ్ చరణ్ మూవీ ఫిక్స్..!
-
రెండు..మూడు..ఏడు..ఇంకోసారి మేజిక్!
సిల్వర్ స్క్రీన్‌పై కొన్ని జంటల మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. ఆ జంటను మరిన్ని సినిమాల్లో చూడాలనేంతగా వారి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అవుతుంది. పైగా ఈ పెయిర్ నటించిన సినిమా హిట్ అయితే... ‘హిట్ జోడీ’ అనే పేరు కూడా వస్తుంది. అలా వెండితెరపై తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు హిట్ కూడా అందుకున్న కొన్ని జంటలు మళ్లీ కలిసి నటిస్తున్నాయి. ఒకరు రెండోసారి జత కడితే... మరొకరు మూడోసారి... ఇంకొకరు ఏకంగా ఏడో సారి... ఇలా హిట్ మేజిక్‌ని రిపీట్ చేయడానికి రిపీట్ అవుతున్న జోడీల గురించి తెలుసుకుందాం. ఎన్నాళ్లకెన్నాళ్లకు... హీరో చిరంజీవి(Chiranjeevi), హీరోయిన్ త్రిష కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘స్టాలిన్’. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2006 సెప్టెంబరు 20న విడుదలై, హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వీరి కాంబోలో మరో సినిమా రాలేదు. 19 ఏళ్ల తర్వాత వీరి జోడీ ‘విశ్వంభర’(Vishwambhara) సినిమాతో రిపీట్ అవుతోంది. ‘బింబిసార’ మూవీ ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. విక్రమ్ రెడ్డి సమర్పణలో వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష మెయిన్ హీరోయిన్ కాగా ఆషికా రంగనాథ్ మరో హీరోయిన్. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్‌గా రూ΄÷ందుతోన్న ‘విశ్వంభర’ 2026 వేసవిలో విడుదల కానుంది. రెండోసారి... హీరో చిరంజీవి– హీరోయిన్ నయనతార(Nayanthara) కాంబినేషన్ రెండోసారి రిపీట్ అవుతోంది. వీరిద్దరూ తొలిసారి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 అక్టోబరు 2న రిలీజైంది. ఆ తర్వాత చిరంజీవి, నయనతార కలిసి ‘గాడ్‌ఫాదర్’ (2022) చిత్రంలో అన్నా–చెల్లెలుగా నటించారు. తాజాగా వీరిద్దరూ జంటగా నటిస్తున్న సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ మూవీ నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ సినిమా నుంచి చిరంజీవి–నయనతార సందడి చేసిన ‘మీసాల పిల్ల...’ అంటూ సాగే తొలి పాట ప్రోమోని విడుదల చేయగా అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. 27 ఏళ్ల తర్వాత... కొన్ని జంటలు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. హీరో నాగార్జున(Nagarjuna Akkineni), హీరోయిన్ టబు జోడీ కూడా అలాంటిదే. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో తొలిసారి కలిసి నటించారు నాగార్జున–టబు. 1996 అక్టోబరు 4న విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత నాగార్జున–టబు కలిసి నటించిన రెండో చిత్రం ‘ఆవిడా మా ఆవిడే’. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1998 జనవరి 14న విడుదలైంది. ఈ చిత్రంలోనూ తమదైన నటనతో సందడి చేసిన వీరిద్దరూ ముచ్చటగా మూడోసారి కలిసి నటించనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. నాగార్జున కెరీర్లో 100వ సినిమాగా రూపొందుతోన్న చిత్రానికి తమిళ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగార్జున ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కింగ్ 100’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్. ఈ చిత్రం కోసం 27 ఏళ్ల తర్వాత మరోసారి జోడీగా నటించనున్నారట నాగార్జున–టబు. నాగార్జున కెరీర్లో మైలురాయిలాంటి ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు నటించనున్నారని, వారిలో టబు ఓ కథానాయికగా ఎంపికైనట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. ‘సిసింద్రి’ (1995) సినిమాలో నాగార్జున– టబు ‘ఆటాడుకుందాం రా అందగాడా...’ అంటూ సాగే స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసిన విషయం తెలిసిందే. ఏడోసారి... హీరో వెంకటేశ్(Venkatesh), హీరోయిన్ మీనాలది ప్రత్యేకమైన జోడీ. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే ‘చంటి, సుందరకాండ, అబ్బాయిగారు, సూర్యవంశం, దృశ్యం, దృశ్యం 2’ వంటి అరడజను సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఆ సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో వీరి జోడీపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. ఇప్పుటికే డబుల్ హ్యాట్రిక్ విజయాలు అందుకున్న వీరిద్దరూ ‘దృశ్యం 3’ సినిమా కోసం మరోసారి జోడీగా నటించనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘దృశ్యం’ (2014), ‘దృశ్యం 2’ (2021) సినిమాలు అద్భుతమైన హిట్స్ అందుకున్నాయి. ఈ సిరీస్‌లో రానున్న తాజా చిత్రం ‘దృశ్యం 3’. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్‌లాల్, మీనా జోడీగా మలయాళంలో ‘దృశ్యం 3’ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. తెలుగులోనూ రూపొందనున్న ‘దృశ్యం 3’లో వెంకటేశ్–మీనా మరోసారి జంటగా నటించి, ప్రేక్షకులను అలరించనున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం పూర్తయ్యాక ‘దృశ్యం 3’ సెట్స్‌పైకి వెళ్లనుంది. థియేటర్లలో జాతర హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల కలిసి థియేటర్లలో ‘మాస్ జాతర’ చూపించేందుకు సిద్ధం అయ్యారు. వీరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ధమాకా’. నక్కిన త్రినాథరావ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2022 డిసెంబరు 23న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో రవితేజ–శ్రీలీల డ్యాన్సులు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ‘ధమాకా’ వంటి హిట్ మూవీ తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన ద్వితీయ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. రవితేజ కెరీర్లో 75వ చిత్రంగా ‘మాస్ జాతర’ రూ΄÷ందడం.. రవితేజ–శ్రీలీల హిట్ జోడీ రిపీట్ అవుతుండటం.. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతానికి ఇప్పటికే అద్భుతమైన స్పందన రావడం... వంటి కారణాలతో ఈ చిత్రంపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. సలార్: శౌర్యాంగపర్వంలో... ‘బాహుబలి’ చిత్రం తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన ‘ది రాజా సాబ్, ఫౌజి, స్పిరిట్’ వంటి చిత్రాలు చేస్తున్నారు. ఆ తర్వాత ‘సలార్: శౌర్యాంగపర్వం’ మూవీ చేస్తారు. ప్రభాస్, శ్రుతీహాసన్ జోడీగా నటించిన తొలి చిత్రం ‘సలార్: పార్ట్ 1 సీజ్ఫైర్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ మూవీ 2023 డిసెంబరు 22న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రభాస్ యాక్షన్... ప్రశాంత్ నీల్ టేకింగ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘సలార్: పార్ట్ 2 శౌర్యాంగపర్వం’ రూపొందనున్న సంగతి తెలిసిందే. తొలి భాగంలో అలరించిన ప్రభాస్– శ్రుతీహాసన్ జోడీ ద్వితీయ భాగంలోనూ అలరించబోతుందని ఫిల్మ్‌నగర్ టాక్. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ‘ఎన్టీఆర్‌నీల్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ నీల్. ఈ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారాయన. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాతే ‘సలార్: పార్ట్ 2 శౌర్యాంగపర్వం’ పై దృష్టి పెడతారట. ‘సలార్: ΄ార్ట్ 1 సీజ్ఫైర్’ చూసిన వారందరూ ‘సలార్: ΄ార్ట్ 2 శౌర్యాంగపర్వం’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోసారి... నాని హీరోగా నటించిన ‘నానీస్ గ్యాంగ్‌లీడర్’ (2019) చిత్రం ద్వారా తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు ప్రియాంకా మోహన్. ఆ తర్వాత మరోసారి వీరిద్దరూ ‘సరి΄ోదా శనివారం’ (2024) సినిమాలో నటించారు. ఇప్పటికే రెండు సినిమాల్లో సందడి చేసిన ఈ జంట మరోసారి జోడీగా కనిపించనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ‘సాహో, ఓజీ’ చిత్రాల ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో నాని హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ్ర΄ారంభమైంది. ఈ సినిమాలో నానీకి జోడీగా ప్రియాంకా మోహన్ నటించనున్నారట. పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వం వహించిన ‘ఓజీ’ చిత్రంలో హీరోయిన్గా నటించారు ప్రియాంక. తాజాగా నాని సినిమాలో ఆమెని హీరోయిన్గా తీసుకోనున్నారట సుజీత్. పైగా నాని–ప్రియాంక కాంబినేషన్‌కి కూడా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉండటంతో వీరు మూడోసారి నటించడం పక్కా అనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ముచ్చటగా మూడోసారి... హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికా మందన్నా కలిసి ముచ్చటగా మూడోసారి జోడీగా నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘గీత గోవిందం’. పరశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018 ఆగస్టు 15న విడుదలై సూపర్ హిట్‌గా నిలవడంతో ΄ాటు వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ మూవీ తర్వాత విజయ్–రష్మిక నటించిన ద్వితీయ చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 జూలై 16న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ సినిమా విడుదలైన ఆరేళ్ల తర్వాత వీరిద్దరూ మూడోసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘వీడీ 14’ (వర్కింగ్ టైటిల్’). గతంలో విజయ్ దేవరకొండతో ‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్ మూవీ తెరకెక్కించిన రాహుల్ సంకృత్యాన్ ‘వీడీ 14’కి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలోనే మరోసారి విజయ్–రష్మిక పెయిర్‌గా మారారు. ఇదిలా ఉంటే రీల్ లైఫ్‌లో జోడీగా నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక రియల్ లైఫ్‌లో ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నెల 3న వీరి నిశ్చితార్థం జరిగింది. 2026 ఫిబ్రవరిలో విజయ్–రష్మికల వివాహం జరగనుంది. ఎనిమిదేళ్ల తర్వాత... హీరో శర్వానంద్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి జోడీగా నటిస్తున్నారు. వీరిద్దరూ తొలిసారి నటించిన చిత్రం ‘శతమానం భవతి’. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ సినిమా 2017 జనవరి 14న రిలీజై, సూపర్ హిట్‌గా నిలవడంతో ΄ాటు జాతీయ అవార్డు అందుకుంది. ఈ సినిమాలో క్యూట్ జోడీగా ఆకట్టుకున్న శర్వానంద్, అనుపమ మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘శర్వా 38’ (వర్కింగ్ టైటిల్). సంపత్ నంది దర్శకత్వంలో లక్ష్మీ రాధా మోహ¯Œ సమర్పణలో కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1960ల కాలంలోని ఉత్తర తెలంగాణ– మహారాష్ట్రల సరిహద్దు ్ర΄ాంతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రూ΄÷ందుతోంది. కాగా ఈ మూవీలో హీరోయిన్ డింపుల్ హయతి ఓ కీలక ΄ాత్ర చేస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవీ చైతన్యలది క్రేజీ కాంబినేషన్ అనే చె΄్పాలి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘బేబీ’. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023 జూలై 14న విడుదలై కల్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మొదటి చిత్రంతోనే వంద కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన వీరి జోడీ రెండో సారి ప్రేక్షకులను అలరించనుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జంటగా ‘90స్’(ఎ మిడిల్ క్లాస్ బయోపిక్) వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాస¯Œ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఓ మధ్య తరగతి యువకుడి ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం రూ΄÷ందుతోంది. ‘బేబీ’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న ఆనంద్–వైష్ణవి రెండోసారి కలిసి నటిస్తున్న ఈ సినిమాపై యువతలో మంచి ఆసక్తి నెలకొంది. రెండోసారి... హీరో శ్రీవిష్ణు, హీరోయిన్ రెబా మోనికాజాన్లది హిట్ పెయిర్. వీరిద్దరూ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘సామజ వరగమన’. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 జూన్ 29న విడుదలై, ప్రేక్షకులను నవ్వించింది. ఆ మూవీ తర్వాత శ్రీవిష్ణు, రెబా మోనికాజాన్ కలిసి నటించిన ద్వితీయ చిత్రం ‘మృత్యుంజయ్’. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. రమ్య గుణ్ణం సమర్పణలో సందీప్ గుణ్ణం, వినయ్ చిలక΄ాటి నిర్మించారు. తొలి చిత్రం ‘సామజ వరగమన’తో నవ్వులు పంచిన శ్రీవిష్ణు, రెబా ‘మృత్యుంజయ్’తో మాత్రం భయపెట్టనున్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫొటోషూట్ (ఫొటోలు)
-
80'స్ రీ యూనియన్.. వీడియో వైరల్
1980ల్లో దక్షిణాది భాషల్లో హీరోహీరోయిన్లుగా నటించిన స్టార్స్.. ప్రతి ఏడాది ఒక్కచోటకు చేరి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా చెన్నైలో రీయూనియన్ జరిగింది. రెండు రోజుల క్రితం ఫొటోలు బయటకు రాగా ఇప్పుడు వీడియో బయటకొచ్చింది. అందరూ దీన్ని తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఇది 12వ రీ యూనియన్ అని నటుడు నరేశ్ పోస్ట్ పెట్టాడు. ఈ ఏడాది వీరంతా చిరుత థీమ్‌ని ఎంచుకున్నారు. చిరుత థీమ్‌లో దుస్తులు ధరించి సందడి చేశారు. చిరంజీవి, వెంకటేశ్, జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, రాజ్‌కుమార్ సేతుపతి, నరేశ్, సుప్రియ, నదియ, రాధ, రమ్యకృష్ణ, సుమలత, జయసుధ, శోభన తదితరులు ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తూ ఆడిపాడుతూ కనిపించారు.All about 80’s Reunion ❤️ pic.twitter.com/U0yUq9NbAP— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) October 7, 2025 -
దుర్గాష్టమి వేడుకల్లో మెగా ఫ్యామిలీ (ఫోటోలు)
-
రచయిత కోన వెంకట్ కూతురి రిసెప్షన్.. హాజరైన చిరంజీవి
ప్రముఖ సినీరచయిత కోన వెంకట్ (Kona Venkat) ఇంట పెళ్లి బాజాలు మోగాయి. రచయిత రెండో కూతురు శ్రావ్య వివాహం ఘనంగా జరిగింది. ఈ వెడ్డింగ్ రిసెప్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, రామ్ పోతినేని, అంజలి, రామ్‌గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, బాబీ, కోర్ట్ జంట శ్రీదేవి- హర్ష్ రోషన్ తదితర సెలబ్రిటీలు హాజరయ్యారు. పూరీ జగన్నాథ్- చార్మి ఒకే కారులో వచ్చి కొత్త జంటను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.కోన వెంకట్ జర్నీకోన వెంకట్ సినిమా ఇండస్ట్రీలో కథా, సంభాషణల రచయితగా కెరీర్ ప్రారంభించాడు. ఢీ, రెడీ, దూకుడు, అదుర్స్, గీతాంజలి, అల్లుడు శీను, నిన్ను కోరి వంటి పలు హిట్ చిత్రాలకు రచయితగా వ్యవహరించాడు. చివరగా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమాకు కథ అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. సత్య, దిల్సే, కౌన్, జంగల్, కంపెనీ వంటి కొన్ని హిందీ సినిమాలకు తెలుగు డబ్బింగ్ రైటర్‌గానూ పని చేశాడు. MEGASTAR #Chiranjeevi garu at Kona Venkat daughter’s wedding@KChiruTweets #MegastarChiranjeevi pic.twitter.com/XvYz3tk3t0— Chiruholic (@chiruholicc) October 6, 2025 చదవండి: ఆ కారణం వల్లే మాస్క్ మ్యాన్ ఎలిమినేట్! రెమ్యునరేషన్ -
80's రీయూనియన్.. స్టార్ సెలబ్రిటీలంతా ఒకేచోట (ఫోటోలు)
-
80's స్టార్స్ రీయూనియన్.. 31 మంది నటులందరూ ఒకేచోట!
స్టార్ హీరోలందరూ ఒక్కచోటకు చేరారు. 80వ దశకంలో వెండితెరపై సందడి చేసిన అగ్రనటులందరూ ఒకేచోట కలిసి ఎంతో ఘనంగా రీయూనియన్ (The 80s Stars Reunion) పార్టీ చేసుకున్నారు. 80's రీయూనియన్ అంటూ ప్రతి ఏడాది సెలబ్రిటీలందరూ ఒకేచోటకు చేరి సంతోషంగా గడుపుతారన్న విషయం తెలిసిందే! ఈ ఏడాది అక్టోబర్ 4న చెన్నైలో ఘనంగా గెట్ టు గెదర్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈసారి కోలీవుడ్ స్టార్ జంట రాజ్‌కుమార్ సేతుపతి- శ్రీప్రియ తమ ఇంట్లోనే ఈ పార్టీని ఏర్పాటు చేశారు.31 మంది స్టార్స్టాలీవుడ్ నుంచి చిరంజీవి (Chiranjeevi Konidela), వెంకటేశ్, నరేశ్ ఈ పార్టీలో పాల్గొన్నారు. కోలీవుడ్, మాలీవుడ్, సాండల్‌వుడ్, అలాగే బాలీవుడ్ నుంచి కూడా స్టార్స్ వచ్చారు. జాకీ ష్రాఫ్, మీనా, శరత్‌కుమార్, నదియా, రాధ, సుహాసిని, రమ్యకృష్ణ, జయసుధ, సుమలత, ఖుష్బూ, లిస్సీ, శోభన, మేనక, సురేశ్, భాను చందర్, ప్రభు, రెహ్మాన్, రేవతి తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు. దాదాపు 31 మంది నటీనటులు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈసారి చిరుత థీమ్ ప్లాన్ చేశారు. అందరూ చీతా ప్రింట్స్ ఉన్న డ్రెస్సులోనే మెరిశారు. మొదటిసారి కలిసినట్లే ఉంది: చిరు80s స్టార్స్ రీయూనియన్‌కు సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 80's స్నేహితులతో ప్రతి రీయూనియన్ మధుర జ్ఞాపకాల వీధిలో ఒక నడకలా ఉంటుంది. నవ్వులు, ఆప్యాయత, పాత జ్ఞాపకాలు తలుచుకుంటూ ఆనందం, ప్రేమతో గడుస్తుంది. ఎన్ని సార్లు కలిసినా, ప్రతి సారి కొత్తగా, మొదటిసారి కలిసినట్టే సంతోషంగా అనిపిస్తుంది అన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.అప్పుడు మొదలైంది80's స్టార్స్ రీయూనియన్ 2009లో ప్రారంభమైంది. లిస్సీ, సుహాసిని తొలిసారి ఈ పార్టీ ఏర్పాటు చేశారు. 2019లో మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో 10వ రీయూనియన్ పార్టీ నిర్వహించారు. 2022లో చివరిసారి గెట్ టు గెదర్ జరిగింది. అప్పుడు బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, నటి పూనమ్ ధిల్లాన్ పార్టీ హోస్ట్ చేశారు. 2023లో రీయూనియన్ జరగలేదు. 2024లో చెన్నైలో వరదల కారణంగా పార్టీ వాయిదా వేశారు. ఇన్నాళ్లకు మళ్లీ పార్టీ చేసుకుని ఎంజాయ్ చేశారు. పార్టీలో సరదా ఆటలు, పాటలు, డ్యాన్సులు ఉండనే ఉంటాయి. ఇలా ప్రతి ఏడాది జరగే ఈ “80s Stars Reunion” స్నేహం, ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం విలువలకు ప్రతీకగా నిలుస్తోంది. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) చదవండి: ట్రెండింగ్‌లో దెయ్యం సినిమా..'సుమతి వలవు' మూవీ రివ్యూ -
చిరంజీవి-అనిల్ రావిపూడి విలన్‌గా సరైన నటుడు!
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) రీఎంట్రీ ఇచ్చాక ఆరు సినిమాలు చేశారు. కానీ, ఆయన రేంజ్‌కు తగిన విలన్ ఏ సినిమాలో కనిపించలేదని చెప్పవచ్చు. కానీ, వాల్తేరు వీరయ్యలో ప్రకాష్ రాజ్ మాత్రమే కాస్త మ్యాచ్ చేశారని చెప్పాలి. ఇప్పుడు ఆయన కొత్త సినిమా 'మన శంకర వరప్రసాద్‌గారు'(Mana ShankaraVaraPrasadGaru)లో విలన్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఇందులో చిరు డ్రిల్ మాస్టర్‌గా కనిపించనున్నట్లు టాలీవుడ్ టాక్.ఈ మూవీ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో విలన్ పాత్ర కూడా కాస్త బ్యాలెన్స్‌గా ఉండాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే మలయాళ నటుడు షైన్ టామ్ చాకో(Shine Tom Chacko) పేరును సెలక్ట్ చేశారని తెలుస్తోంది. దసరా చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆయనకు మంచి గుర్తింపే ఉంది పవర్ఫుల్ విలన్‌గా మాత్రమే కాదు మంచి కామెడీ టైమింగ్‌తో కూడా నటించగలడు. అందుకే అతన్ని ఫైనల్ చేశారని టాక్..సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో మంచి అంచనాలే ఉన్నాయి. ఆయన కేవలం కామెడీ జోనర్ చిత్రాలే కాదు పవర్ఫుల్ యాక్షన్ సినిమాలు కూడా తీయగలడు. అయితే, 'మన శంకర వరప్రసాద్‌గారు' మూవీ మాత్రం కామెడీ, ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్‌తో రానుంది. నయనతారతో పాటు వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ మూవీని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. -
డబుల్ సెలబ్రేషన్స్
ఇక్కడున్న ఫొటోలో మంచి జోష్‌తో ఫుల్ ఖుషీగా కనిపిస్తున్నారు చిరంజీవి, వెంకటేశ్. ఇంతకీ ఈ జోష్‌కి కారణం ఏంటంటే... స్నేహితులను కలవడానికి వెళ్లారు. ప్రతి ఏడాది ‘క్లాస్ ఆఫ్ 80స్’ అంటూ 1980స్కి చెందిన నటీనటులందరూ కలిసి, సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఒక్కోసారి ఒక్కో థీమ్, ప్లేస్ ఉంటుంది. ఈసారి రీ యూనియన్‌కి చెన్నై వేదికైంది.ఇందు కోసమే చిరంజీవి, వెంకటేశ్ శనివారం హైదరాబాద్ నుంచి చెన్నై ప్రయాణం అయ్యారు. ఇదిలా ఉంటే... చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మన శంకర వరప్రసాద్‌గారు’లో ఓ కీలకపాత్రలో వెంకటేశ్ నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ వచ్చే వారం ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో చిరంజీవి, వెంకటేశ్‌లపై కీలక సన్నివేశాలను, ఓ సెలబ్రేషన్ సాంగ్‌ను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట.‘‘చిరంజీవి, వెంకటేశ్గార్లను కలిసి సెట్స్‌లో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు అనిల్ రావిపూడి. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ఇటు రీ యూనియన్ సెలబ్రేషన్స్ అటు సెట్స్‌లో సెలబ్రేషన్ సాంగ్... ఇలా ఈ నెల చిరంజీవి, వెంకటేశ్‌కు డబుల్ సెలబ్రేషన్స్ అని చెప్పుకోవచ్చు. -
ముగిసిన ఓజీ ప్రమోషన్స్! మళ్లీ పొలిటికల్ మోడ్‌లోకి..
హైదరాబాద్/అమరావతి, సాక్షి: జ్వరంతో రాజకీయాలకు, తన విధులకు స్వల్ప విరామం తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తిరిగి బిజీ అయ్యారు. ఏపీ కేబినెట్ సమావేశం నేపథ్యంలో స్పెషల్ ఫ్లైట్‌లో హైదరాబాద్ నుంచి ఆయన విజయవాడకు చేరుకున్నారు.వైరల్ ఫీవర్ కారణంగా మెరుగైన వైద్యం కోసం ఆయన హైదరాబాద్ వచ్చారని ఆయన సిబ్బంది అధికారికంగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇక్కడికి వచ్చాక ఆయన జ్వరం ఎగిరిపోయినట్లు తెలుస్తోంది. అందుకే ఎలాగూ వచ్చా కదా అని.. హైదరాబాద్‌లో అన్నయ్య చిరు అండ్ మెగా ఫ్యామిలీతో కలిసి ఓజీ స్పెషల్ ప్రివ్యూ వేసుకుని చూశారు. అంతేకాదు.. ఓజీ సక్సెస్ మీట్లలో హుషారుగా పాల్గొని సందడి చేశారు. అఫ్కోర్స్.. ఈ మధ్యలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా వచ్చి పవన్‌ను పరామర్శించారు అది వేరే విషయంలేండి. మరోవైపు.. అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే కామినేని.. ‘వైఎస్ జగన్ సీఎంగా ఉన్న టైంలో సినిమా వాళ్లను పిలిపించుకుని మరీ అవమానించారంటూ’’ చేసిన వ్యాఖ్యలు.. వాటిపై స్పందించే క్రమంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. జగన్ తనను సాదరంగా ఆహ్వానించారంటూ చిరు ఒక బహిరంగ ప్రకటనతో తేల్చేయడంతో బాలయ్యపై అటు మెగా అభిమానులు, ఇటు వైఎస్సార్సీపీ నేతలు భగ్గుమన్నారు. ఆ వ్యాఖ్యలపై పవన్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. పవన్ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోవడాన్ని ఇటు చిరు ఫ్యాన్స్‌తో పాటు అటు జనసేన కార్యకర్తలే ఒకానొక దశలో భరించలేకపోయారు. మరి జ్వరం తగ్గింది కదా.. పొలిటికల్ అవతార్‌లోకి మారిపోయారు కదా.. ఇకనైనా స్పందిస్తారేమో చూడాలి అంటున్నారు పలువురు నెటిజన్లు. -
ఏయ్.. మీసాల పిల్ల.. నయన్‌ను ఆటపట్టించిన మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం మన శంకరవరప్రసాద్‌గారు (Mana Shankara Vara Prasad Garu Movie). సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్‌బస్టర్ కొట్టిన అనిల్.. వచ్చే ఏడాది సూపర్ హిట్ కొట్టేందుకు రెడీ అయిపోయాడు. వీరిద్దరి కాంబినేషన్లో మూవీ కావడంతో అభిమానుల్లోనూ అదే రేంజ్లో అంచనాలు పెరిగిపోయాయి.ఇటీవలే నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్.. ఆమె పాత్ర పేరును శశిరేఖగా పరిచయం చేశారు. తాజాగా దసరా సందర్భంగా ప్రోమోను విడుదల చేశారు. మీసాల పిల్ల పేరుతో ఈ ప్రోమోను రిలీజ్ చేయగా.. ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో నయనతారను చిరంజీవి ఆటపట్టిస్తూ కనిపించారు. మా ఊర్లో కుర్రోళ్లు పొగరుమోతు పిల్లని క్యూట్‌గా… మీసాల పిల్ల అని పిలుస్తారు అంటూ ఆటపట్టించారు. ఈ హిలారియస్ కామెడీ ప్రోమో మీరు కూడా చూసేయండి. కాగా.. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తైనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు థియేటర్లలో సందడి చేయనున్నారు. -
నవంబరులో కొదమసింహం
చిరంజీవి కెరీర్‌లోని సూపర్ హిట్ చిత్రాల్లో ‘కొదమసింహం’ ఒకటి. కె. మురళీ మోహనరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాధ, సోనమ్, వాణీ విశ్వనాథ్ హీరోయిన్లుగా, మోహన్‌బాబు విలన్ పాత్రపోషించారు. కె. నాగేశ్వర రావు నిర్మించిన ఈ చిత్రం 1990 ఆగస్టు 9న విడుదలై, ఘన విజయాన్ని సాధించింది. ముప్పైఐదేళ్ల తర్వాత ఈ సినిమాని నవంబరు 21న రీ రిలీజ్ చేయనున్నట్లు రమా ఫిలింస్ అధినేత కైకాల నాగేశ్వరరావు తెలిపారు.‘‘చిరంజీవి కౌబాయ్‌గా నటించి, ప్రేక్షకుల్ని అలరించిన చిత్రం ‘కొదమసింహం’. రాజ్–కోటి సంగీతం, మోహన్‌బాబు వినోదం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రాన్ని 4కే కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్‌తో సరికొత్తగా నవంబరు 21న రీ రిలీజ్ చేయబోతున్నాం’’ అని కైకాల నాగేశ్వర రావు చెప్పారు. -
చిరంజీవి సీరియస్ బాబు, పవన్‌కు చెంప చెల్లు
-
హైదరాబాద్ సీపీ 'సీవీ ఆనంద్'ను కలిసిన సినీ ప్రముఖులు (ఫోటోలు)
-
చిరంజీవి పిలుపుతో వెనక్కి తగ్గిన మెగా ఫ్యాన్స్
-
1,050 సినిమాల పైరసీ.. రూ.22,400 కోట్ల నష్టం
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: దేశంలోనే అతిపెద్ద సినీ పైరసీ గుట్టురట్టు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. పైరసీకి సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. ఈ వ్యవహారం జరుగుతున్న విధానం, మార్కె టింగ్, ఆర్థిక లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఐదేళ్లలో 1,050 సినిమాలను పైరసీ చేసిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సోమవారం ప్రకటించారు. వీరిలో ఓ నిందితుడు మూడేళ్లలో 550 సినిమాలు పైరసీ చేయగా... నలుగురితో కూడిన ముఠా ఐదేళ్లలో 500 సినిమాలు చేసినట్లు గుర్తించామన్నారు. ఈ పైరసీతో చిత్ర పరిశ్రమకు రూ.22,400 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. ఈ మేరకు ఫిల్మ్ డెవల్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో కలిసి సీవీ ఆనంద్ తన కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. ఈ అశ్వని కుమార్ మామూలోడు కాదు... బిహార్‌కు చెందిన అశ్వినీ కుమార్ పదో తరగతి వరకు చదివాడు. ఆన్లైన్ ద్వారానే హ్యాకింగ్ నేర్చుకున్న ఇతగాడి దృష్టి సినిమా పైరసీపై పడింది. విడుదలకు సిద్ధమైన చిత్రాన్ని నిర్మాతలు కొన్ని డిజిటల్ మీడియా సంస్థలకు అందిస్తారు. దాన్ని తమ సర్వర్లలో నిక్షిప్తం చేసుకునే ఈ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఆయా థియేటర్లకు శాటిలైట్ ద్వారా పంపిస్తాయి. ఇలాంటి సంస్థలపై కన్నేసిన అశ్వినీ కుమార్ వాటి సర్వర్లను హ్యాక్ చేసి, విడుదలకు సిద్ధంగా ఉన్న, తాజాగా విడుదలైన చిత్రాలను తస్కరిస్తాడు. మూడేళ్లలో వివిధ భాషలకు చెందిన 550 సినిమాలను పైరసీ చేసి కొన్నింటిని విడుదలకు వారం రోజుల ముందే తస్కరించాడు. ఇలాంటి వాటిలో పుష్ప–2 కూడా ఉంది. పైరసీ ద్వారా లక్ష డాలర్లు (సుమారు రూ.88 లక్షలు) ఆర్జించినట్లు పోలీసులు గుర్తించారు. పటా్నలోని సంపత్ చక్‌లో ఇతడి ఇల్లు 80 గజాల్లో ఉంటుంది. ఈ ఇంటి చుట్టూ ఏకంగా 22 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నాడు. బెట్టింగ్ యాప్స్‌తో ఒప్పందాలు చేసుకుని... పైరసీ చేసిన సినిమాలను మార్కెటింగ్ చేసుకోవడానికి అశ్వినీ కుమార్ వివిధ టెలిగ్రాం చానల్స్ అడ్మిన్లతోపాటు గేమింగ్, బెట్టింగ్ వెబ్సైట్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. వీరి నుంచి ఒక్కో చిత్రానికి 10 వేల నుంచి 25 వేల డాలర్ల వరకు వసూలు చేస్తున్నాడు. టెలిగ్రాం చానల్స్‌లో నేరుగా సినిమా లింకు పెడుతుండగా... వెబ్‌సైట్స్‌లో యాడ్స్ రూపంలో ఈ లింకు ఇస్తున్నారు. పగటి పూట నిద్రపోయి, రాత్రి వేళల్లో మేల్కొనే ఇతడు తన హ్యాకింగ్ సత్తాను పరీక్షించుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘంతోపాటు బిహార్, జార్ఖండ్‌కు చెందిన వివిధ ప్రభుత్వ వెబ్సైట్లు, సర్వర్లను హ్యాక్ చేశాడు. దీనికోసం నెదర్లాండ్స్‌కు చెందిన ఐపీ అడ్రస్ వినియోగించాడు. ఇతడు చిత్రాలను నేరుగా సర్వర్ల నుంచి పైరసీ చేస్తుండటంతో అవన్నీ హెచ్డీ ప్రింట్‌తో ఉంటున్నాయి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన క్రిప్టో కరెన్సీ ఇతగాడికి అషి్మత్ సింగ్ ద్వారా చేరినట్లు పోలీసులు గుర్తించారు. ఇతడి హ్యాకింగ్ టాలెంట్ చూసి అవాక్కైన సీవీ ఆనంద్ నెలకు రూ.10 లక్షల జీతం ఇచ్చి అతడి సేవలు వినియోగించుకోచ్చన్నారు. క్యామ్ కార్డర్‌తో థియేటర్లలో... తమిళనాడుకు చెందిన సిరిల్ ఇన్ఫంట్ రాజ్ అమలదాస్ క్యామ్ కార్డర్ ద్వారా థియేటర్లలో సినిమాలు రికార్డు చేసి పైరసీ చేస్తున్నాడు. దీనికోసం వనస్థలిపురంలో ఉంటున్న జాన కిరణ్ కుమార్, తమిళనాడుకే చెందిన సుధాకరన్, గోవాకు చెందిన అర్సలాస్ అహ్మద్‌లతో ముఠా ఏర్పాటు చేశాడు. పైరసీ సినిమాలను హోస్ట్ చేయడానికి అమలదాస్ రెండు సర్వర్లను ఖరీదు చేశాడు. కిరణ్ కుమార్ మిగిలిన ఇద్దరితో కలిసి సినిమా విడుదలైన రోజు థియేటర్లలో మధ్యలో ఉండే వరుసల్లో టిక్కెట్లు బుక్ చేసుకుంటాడు. తమతోపాటు చుట్టు పక్కల ఉన్న సీట్లను బుక్ చేస్తాడు. క్యామ్ కార్డర్లు లేదా సెల్ఫోన్లో ప్రత్యేక క్యామ్ కార్డర్ యాప్‌ల సహకారంతో వీరు సినిమా రికార్డు చేస్తారు. ఈ ప్రింట్‌ను అమలదాస్ కొన్ని టోరెంట్స్తోపాటు ఇతర వెబ్సైట్లలో హోస్టు చేస్తున్నాడు. వారి నుంచి ఒక్కో సినిమాకు 3 వేల డాలర్ల వరకు వసూలు చేస్తూ అనుచరులకు వాటా ఇస్తున్నాడు. వీళ్లు ఐదేళ్లలో 500 సినిమాలు పైరసీ చేయగా... కొన్నింటిని హైదరాబాద్‌లోని థియేటర్లలో రికార్డు చేశారు. ఇలా ఇప్పటివరకు రూ.2 కోట్లు సంపాదించారు. హిట్, సింగిల్, కుబేర, హరి హర వీరమల్లు చిత్రాల పైరసీపై నమోదైన కేసుల్ని దర్యాప్తు చేసిన పోలీసులు ఈ ఐదుగురినీ అరెస్టు చేశారు. వీరికి సహకరించిన ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు. సినీ ప్రముఖులతో సీపీ భేటీ సినిమా పైరసీ పూర్వాపరాలు, నిరోధానికి తీసుకుంటున్న చర్యల్ని వివరించడానికి హైదరాబాద్ పోలీసులు సినీ ప్రముఖులతో భేటీ అయ్యారు. పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి ప్రముఖ నటులు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు హాజరయ్యారు. సినీ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ భాగస్వాములు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని పోలీసులు వివరించారు. క్యామ్ కార్డర్ పైరసీని నిరోధించడానికి థియేటర్లలో అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. థియేటర్ యజమానులు నిఘా పెంచాలని కోరారు. పైరసీ ముఠాలను పట్టుకోవడంలో కీలకంగా వ్యహరించిన ఏసీపీ ఆర్జీ శివమారుతితోపాటు ఇన్స్పెక్టర్లు ఎస్.నరేష్, సతీష్‌రెడ్డి, ఎన్.దిలీప్ కుమార్, కె.మధుసూదన్ రావులను అభినందించారు. -
బాలకృష్ణ వ్యాఖ్యలపై మరోసారి 'చిరు' కామెంట్
కేంద్ర మాజీమంత్రి, మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశిస్తూ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శాసనసభ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో విదేశాల్లో ఉన్న చిరంజీవి ఆ కామెంట్లపై స్పందిస్తూ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. అయితే, తాజాగా చిరు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలో మీడియా వారు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని కోరారు.చిరంజీవి తన వెకేషన్ పూర్తి చేసుకుని హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగారు. ఈ సందర్భంగా బాలకృష్ణ వ్యాఖ్యలపై మాట్లాడాలని మీడియా వారు కోరారు. అయితే, విలేకరులు అడిగే ప్రశ్నలను ఆయన దాటవేశారు. ఇప్పటికే తాను చెప్పాల్సింది చెప్పేశానని క్లారిటీ ఇచ్చారు. ఇక మాట్లాడాల్సింది ఏం లేదని అక్కడి నుంచి వెళ్లిపోయారు. చిరు హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకి వస్తున్నారనే విషయం తెలిసి అభిమానులు భారీగానే వచ్చారు. వారితో సెల్ఫీలు ఇస్తూ దిగి ఆయన వెళ్లిపోయారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై ఇప్పటికే మీడియాకు లేఖ రాసిన చిరంజీవి.బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి అభిమానులతో పాటు కాపు సామాజికవర్గీయుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే చిరుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో జనసేన అభిమానులు మండిపడుతున్నారు. మరోవైపు బాలకృష్ణ వ్యాఖ్యల వల్ల చిరంజీవి అభిమానులు, కాపు సామాజికవర్గాల్లో టీడీపీపై వ్యతిరేకత పెరగకుండా ఉండేందుకే పవన్‌కళ్యాణ్‌ను చంద్రబాబు పరామర్శించారన్న చర్చ కూడా జరుగుతోంది. -
అన్నకు తమ్ముళ్ల వెన్నుపోటు..!
-
అన్నను మరచిన తమ్ముళ్లు!
అవాకులు చెవాకులు పేలడం.. అభిమానంతో దగ్గరకొచ్చిన వారికి చెంపదెబ్బలు తగిలించడం ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు కొత్తేమీ కాదు కానీ.. అసెంబ్లీ వేదికగా ఆయన సహనటుడు చిరంజీవి, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ పార్టీ అధినేత జగన్‌పై చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆయన వ్యక్తిత్వాన్ని మరోసారి బట్టబయలు చేసింది. కొందరి బలహీనతలు, కొందరి అహంకారం, ఇంకొందరి విచక్షణ, విజ్ఞతలను ప్రజల ముందుంచింది. అంతేకాదు.. తరచూ రాజకీయ విన్యసాలు సాగిస్తూ, ఏది వాస్తవమో, ఏది అబద్దమో తెలియని స్థాయిలో మాట్లాడే నేతలు కొందరి నిజరూపం కూడా వెల్లడించింది.తనను కలిసేందుకు వచ్చిన సినీ పరిశ్రమ వారిని సీఎం హోదాలో జగన్ ఎంత గౌరవంగా చూసింది ప్రపంచానికి తెలిసినట్లయింది. జగన్ విజ్ఞత అందరికి తెలిస్తే, చిరంజీవి కాస్త లేటుగా అయినా స్పందించి తన వ్యక్తిత్వాన్ని కొంతవరకైనా నిలబెట్టుకున్నారనిపిస్తుంది. మొత్తం ఎపిసోడ్లో సోదికి వెళితే ఏదో బయటపడిందన్నట్లుగా సోషల్ మీడియా పుణ్యమా అని అనేక పాత విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయినా బాలకృష్ణ క్షమాపణ చెప్పకపోవడం, సారీ చెప్పాలని కూటమి నేతలు కోరలేకపోవడం గమనించాల్సిన అంశాలే.శాసనసభలో జగన్‌ను, చిరంజీవిని అవమానిస్తుంటే ప్రేక్షకపాత్ర పోషించిన గౌరవ సభ్యులు, గౌరవ ఉప సభాపతి గురించి ఏమనగలం? బాలకృష్ణ సంస్కార రహితంగా వ్యాఖ్యలు చేసినా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు నోరు విప్పలేకపోవడంతో వారు బాగా ఎక్స్పోజ్ అయ్యారు. జగన్‌ను సైకో అనడం ద్వారా బాలకృష్ణ తన పాత చరిత్ర అంతా తవ్వించుకున్నారు. బాలకృష్ణ ఏ రకంగా సైకోనో వివరించే అనేక దృష్టాంతాలు వెల్లడయ్యాయి. అసెంబ్లీ సమావేశాలలో కొందరు టీడీపీ సభ్యులు ప్రజల సమస్యలను ప్రస్తావిస్తే ప్రభుత్వ పరువు తీస్తారా అంటూ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు తన బావమరిది బాలకృష్ణను మాత్రం ఒక్క మాట అనలేకపోయారు.మెగాస్టార్ చిరంజీవిని అలా అనడం తప్పు అని చంద్రబాబు చెప్పలేకపోయారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిస్థితి మరీ దారుణం. ఆయన మరో సోదరుడు నాగబాబు నోరు పెగలలేదు. జనసేన కేడర్, సామాజిక వర్గం, సాధారణ ప్రజలు బాలకృష్ణ వైఖరిని తీవ్రంగా నిరసించినా పవన్, నాగబాబులు మాత్రం కనీసం కిమ్మనలేకపోయారు. పదవిలో ఉన్న మజా అలాంటిదేమో!బాలకృష్ణ జనసేన కార్యకర్తలను అలగా జనం అన్నారని ఒకసారి వాపోయిన పవన్ ఆ తరువాత ఆయనతోనే చెట్టాపట్టాలేసుకుని తిరగడం అందరూ గమనించే ఉంటారు. లేపాక్షి ఉత్సవాల సందర్భంలో బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి మా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అంటూ కామెంట్ చేసినా వీరు ఎవరూ పెద్దగా ఫీల్ అయినట్లు లేదు. నాగబాబు కొంతవరకూ దీటుగా సమాధానం చెప్పినప్పటికీ ఆ తరువాత టీడీపీ పదవుల ఆశతో అన్నీ మరచిపోయారు.చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో అరెస్టైతే రోడ్డుమీద పడి నానా యాగీ చేసిన పవన్ కళ్యాణ్ సొంత అన్నకు అవమానం జరిగితే జ్వరం పేరుతో హైదరాబాద్ వెళ్లి బెడ్‌పై ఉండిపోయారన్న విమర్శలు వస్తున్నాయి. బాలకృష్ణ మాటలను ఖండిస్తే ఎక్కడ తన ఉప ముఖ్యమంత్రి పదవి పోతుందో అని పవన్ బెంగపట్టినట్టుందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు ఏమీ చేసినా భరించాల్సిందే అని పవన్ గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.సమస్యంతా బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు అసందర్భ ప్రేలాపనతో మొదలైంది. ఆయన ఏ పార్టీనో ఆయనకే గుర్తుండదు. చంద్రబాబు మెప్పుదల కోసం జగన్‌పై లేని పోని అభాండాలు మోపి, చిరంజీవి వద్ద మార్కులు కొట్టేయాలనుకుని బోల్తాపడ్డారు. చిరంజీవి తదితర నటులు జగన్‌ను కలిసినప్పుడు ఏదో అవమానం జరిగిందని అచ్చం టీడీపీ నేత మాదిరి ఒక కల్పిత కథ సృష్టించే యత్నం చేసి దెబ్బతిన్నారు. చివరికి శాసనసభ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తను మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగించాలని ఆయనే స్వయంగా కోరుకున్నారు. అయినా అప్పటికే జరగవలసిన డామేజీ జరిగిపోయింది.ఆ కల్పిత కథలో చిరంజీవిని పొగడడం విని తట్టుకోలేకపోయిన బాలకృష్ణ మైకు అందుకుని సభా మర్యాదలతో సంబంధం లేకుండా నెత్తిపై గాగుల్స్, ఫ్యాంట్ జేబుల్లో రెండు చేతులు పెట్టుకుని మాట్లాడిన తీరు ఆయన అహంకారం బయటపెట్టిందన్న విమర్శ వచ్చింది. ఎందుకంటే బావ ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి, తానేమో ఎన్టీఆర్ కుమారుడిని అన్న గర్వం ఆయనలో ఉందన్న భావన ఏర్పడింది. చిరంజీవిని ఎవడు అనడం, జగన్ ఇంటిలో గట్టిగా మాట్లాడే ధైర్యం చిరంజీవికి లేదన్నట్లుగా మాట్లాడడం అందరిని విస్మయపరిచింది. జగన్‌ను దూషిస్తున్నప్పుడే స్పీకర్ ఛైర్లోఉన్నవారు వారించగలిగితే ఇది ఆగి ఉండేది. సీఎం బావమరిది కావడంతో అలా చేయలేకపోయారు అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటు వైఎస్సార్ కాంగ్రెస్, ఇటు చిరంజీవి అభిమానులు బాలకృష్ణపై మండిపడ్డారు. పేర్నినాని వంటివారు అసలు సైకో బాలకృష్ణే అంటూ ఆయనకు ఉన్న మెంటల్ సర్టిఫికెట్ తో సహా పలు అంశాలను గుర్తు చేసి పరువు తీశారు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి.అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు బాలకృష్ణ జరిపిన కాల్పుల వల్ల నిర్మాత బెల్లంకొండ సురేష్, జ్యోతిష్కుడు సత్యనారాయణలు తీవ్రంగా గాయపడ్డారు. ఆ కేసులో బాలకృష్ణ జైలుకు వెళ్లకుండా మెంటల్ సర్టిఫికెట్‌ను తీసుకుని కాపాడినట్లు ప్రముఖ వైద్యులు, దివంగత కాకర్ల సుభ్బారావు చెప్పిన విషయం వీడియోలలో నిక్షిప్తమై ఉంది.ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. రక్తపు మరకల సాక్ష్యాధారాలు చెరిపి వేశారని అప్పట్లో బాలకృష్ణ భార్య వసుంధరపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆమె కోర్టులో సరెండరై బెయిల్ కూడా పొందారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్‌పై అనవసరంగా నోరు పారేసుకునే చంద్రబాబు తన సమీప బంధువు నిజంగా అలా సాక్ష్యాలు చెరిపేసిన విషయాన్ని మాత్రం కప్పిపుచ్చుతూంటారని ఇప్పుడు ప్రజల దృష్టికి వచ్చింది.చట్టపరంగా కాల్పుల కేసులో బాలకృష్ణను జైలులో పెట్టాలి. అలా చేయలేదు. బాలివుడ్ నటుడు సంజయ్ దత్ వద్ద తుపాకులు దొరికితేనే జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అదే బాలకృష్ణ కాల్పులు జరిపితే కూడా జైలుకు వెళ్లలేదని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వచ్చాయి. ఎన్టీఆర్ కుమారుడు అన్న సానుభూతి, ఆ రోజుల్లో కాంగ్రెస్‌లో ఉన్న దగ్గుబాటి దంపతులు, తదితరుల విజ్ఞప్తిని గమనంలోకి తీసుకుని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఈ కేసును తేలికగా వదలి వేసిందని అంటారు. చట్టప్రకారం అలా చేయకూడదు.అయినా చేశారు.ఆ కృతజ్ఞత కూడా బాలకృష్ణకు ఆ తర్వాత కాలంలో లేకపోయింది. సినిమాల పరంగా, ఇతరత్రా సాయం, గౌరవం పొందినప్పటికీ జగన్‌ను పట్టుకుని బాలకృష్ణ పిచ్చి వ్యాఖ్య చేయడం ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. వైఎస్సార్ కాబట్టి రాజకీయంగా ఆలోచించకుండా బాలకృష్ణకు, ఆయన భార్యకు సాయం చేశారని, అదే పరిస్థితి వైఎస్సార్ సన్నిహితులు ఎవరికైనా వచ్చి అప్పుడు చంద్రబాబు సీఎంగా ఉండిఉంటే, రాజకీయంగా ఎంతగా వాడుకునే వారో అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.మెంటల్ సర్టిఫికెట్ ఉన్నా, బాలకృష్ణకు టీడీపీ ఇక్కెట్ ఇవ్వడం, హిందుపూరం ప్రజలు ఎన్నుకోవడం విశేషమే. ఆ తర్వాత కాలంలో ఆయన తన అభిమానులపై దురుసుగా వ్యవహరించిన ఘట్టాలు కూడా ఉన్నాయి. అయినా ఆయనను ఎవరూ మందలించలేదు. ఆయన కూడా తాను తప్పు చేశానని అనుకోవడం లేదు. అమ్మాయిలపై బాలకృష్ణ చేసిన ఒక వ్యాఖ్య తీవ్ర కలకలం రేపింది. ఆ కామెంట్ చేసినప్పుడు అక్కడ ఉన్న సినీ ప్రముఖులు కాని, సభలో పాల్గొన్నవారు ఎవరూ బాలకృష్ణను ఏమీ అనలేదు. పైగా అంతా నవ్వుతూ కూర్చున్నారు. తదనంతర కాలంలో ఆయనకు పద్మభూషణ్ బిరుదు రావడం కూడా మరో విశేషం. ప్రధానమంత్రి మోడీని పట్టుకుని అనుచిత వ్యాఖ్యలు చేసినా బాలకృష్ణకు ఏమీ ఇబ్బంది రాలేదు. పైగా బిరుదు కూడా వచ్చింది. బీజేపీ నేతలు ఇందుకు సిగ్గుపడినట్లు కనిపించలేదు.చంద్రబాబుకేమో తన బావమరిది జోలికి వెళితే ఇంకేమవుతుందో అన్న భయం ఉండవచ్చని, అందుకే ఆయన కూడా దీనిపై స్పందించలేదేమో అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక చిరంజీవి మూడేళ్లపాటు ఈ అంశంపై మౌనంగా ఉండి తన తమ్ముడికి రాజకీయంగా సాయపడ్డారని, ఇప్పుడు బాలకృష్ణ చేసిన అవమానాన్ని తట్టుకోలేక బయటకు వచ్చారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు, పవన్‌లు అబద్దపు ప్రచారం చేస్తున్నప్పుడే జగన్ తమను గౌరవంగా చూసుకున్నారని చిరంజీవి చెప్పి ఉంటే ఎంతో మర్యాదగా ఉండేదన్న భావన ఉంది. ఇప్పటికైనా చిరంజీవి స్పందించడం బాగానే ఉంది కాకపోతే సొంత తమ్ముళ్ల నుంచే ఆయనకు మద్దతు కొరవడడం కాస్త అప్రతిష్టే. కొద్ది మంది చిరంజీవి అభిమానులు తమ నిరసన చెప్పారు. మరో ప్రముఖ నటుడు ఆర్.నారాయణ మూర్తి అసెంబ్లీలో జరిగిన ఘట్టాన్ని ఖండిస్తూ సినిమా ప్రముఖులందరిని జగన్ గౌరవంగా చూశారని, చిరంజీవి రాసిన లేఖలో ఉన్న అంశాలు వాస్తవమైనవని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియాలో మాత్రం బాలకృష్ణను ఉతికి ఆరేశారు. పవన్ నుంచి సానుభూతి దక్కకపోయినా, వైసీపీ వారు మాత్రం చిరంజీవికి ఎంతొకొంత మద్దతు ఇచ్చారు. ఈ రకంగా బాలకృష్ణ ఉదంతంలో ఆయనతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ,నాగబాబుల అసలు రంగు బయటపడినట్లయిందా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మెగాస్టార్‌కు ఇంత అవమానమా?
సాక్షి, అమరావతి: కేంద్ర మాజీమంత్రి, మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశిస్తూ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శాసనసభ సాక్షిగా ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ తమ రాజకీయ డ్రామాలో భాగంగానే ఆదివారం హైదరాబాద్‌లో ఇరువురూ కలుసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి అభిమానులు, కాపు సామాజికవర్గీయుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండడంతో దానిని కవర్ చేసుకునేందుకు, రాజీ కుదుర్చుకునేందుకే చంద్రబాబు పరామర్శ పేరుతో హైదరాబాద్‌లోని పవన్‌కళ్యాణ్ ఇంటికి వెళ్లినట్లు జోరుగా చర్చ నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లోనే బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు సభలోనే ఉన్న చంద్రబాబుగానీ, జనసేన ఎమ్మెల్యేలుగానీ కనీసం స్పందించలేదు. పవన్‌కళ్యాణ్ అయితే.. చిరంజీవికి జరిగిన తీవ్ర అవమానంపై ఇప్పటివరకూ నోరువిప్పకపోగా ఆదివారం తన ఇంటికొచ్చిన చంద్రబాబుకు పుష్పగుచ్ఛంతో ఎదురేగి ఘనంగా స్వాగతం పలికారు. ఇదంతా చూస్తుంటే చిరంజీవిని ఉద్దేశపూర్వకంగా అవమానించినట్లుగా ఉందని చిరు అభిమానులు, కాపు సంఘాల నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. నిజానికి.. ఈ ఏడాది రెండు, మూడుసార్లు పవన్ అనారోగ్యానికి గురైనప్పటికీ అప్పుడెప్పుడూ ఆయన ఇంటికి వెళ్లి మరీ పరామర్శించని చంద్రబాబు ఈసారి హైదరాబాద్‌కు ప్రత్యేకంగా వెళ్లి మరీ పలకరించడాన్ని చూస్తుంటే ఇదంతా రాజకీయ డ్రామానేనని వారు ఆరోపిస్తున్నారు. పైగా.. పవన్‌కళ్యాణ్ గతంలో అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న సమయంలో.. చంద్రబాబు ఓ అధికారిక సమావేశంలో జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్‌తో పవన్ ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ.. తాను పలకరిద్దామని ఫోన్‌చేసినా ఆయన అందుబాటులోకి రాలేదని బాబు అప్పట్లో వ్యాఖ్యానించినట్లు వచ్చిన వార్తలను చిరు అభిమానులు, కాపు నేతలు గుర్తుచేస్తున్నారు. పవన్‌పై చిరు అభిమానులు, కాపు వర్గీయుల్లో అసంతృప్తి.. ఇదిలా ఉంటే.. బాలకృష్ణ వ్యాఖ్యల ఎపిసోడ్లో పవన్‌కళ్యాణ్ వ్యవహారశైలిపై చిరంజీవి అభిమానులు, కాపు సామాజికవర్గీయుల్లో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడల్లా పవన్‌కళ్యాణ్ ఆయనకు ఏదో విధంగా అండగా ఉంటున్నారన్న వ్యాఖ్యలు ఆ వర్గీయుల నుంచే వస్తున్నాయి. ఎందుకంటే.. బాలకృష్ణ కామెంట్లపై ఎక్కడో విదేశాల్లో ఉన్న చిరంజీవి స్పందిస్తూ మీడియాకు ప్రకటన విడుదల చేశారుగానీ పవన్‌కళ్యాణ్ ఇప్పటివరకు ఈ అంశంపై కనీసం నోరువిప్పలేదని.. ఇది పరోక్షంగా బాబుకు మేలు చేయడమేనని వారు గుర్తుచేస్తున్నారు. జ్వరంతో బాధపడుతున్నందున పవన్‌కళ్యాణ్ స్పందించలేదని అనుకున్నా.. డీఎస్సీ నియామకాల అంశంలో లోకేశ్‌ను అభినందిస్తూ పవన్ ప్రకటన జారీచేశారు. అంతేకాకుండా తమిళనాడులో విజయ్ సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపైనా విచారం వ్యక్తంచేశారు. కానీ చిరంజీవిపై బాలకృష్ణ వ్యాఖ్యల అంశంలో మౌనం దాల్చడంపై ఆ వర్గీయుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. ఎమ్మెల్సీ కాకముందు వరకు చిరంజీవిపై ఎవరు విమర్శలు చేసినా విరుచుకుపడే నాగబాబు కూడా టీడీపీ మద్దతుతో ఎమ్మెల్సీ అయ్యాక ఆయన కూడా తన నోటికి తాళాలు వేసుకోవడంపై సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు పేలుతున్నాయి. పవన్ త్వరగా కోలుకోవాలని.. ఇక పవన్ నివాసానికి చంద్రబాబు రాకపై జనసేన పార్టీ ఆదివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. పవన్‌కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ సీఎం చంద్రబాబు పరామర్శించారని పేర్కొంది. ఈ సందర్భంగా.. మెగా డీఎస్సీ నియామకాలపైనా, అక్టోబరు 16న ప్రధాని రాష్ట్ర పర్యటనపైన, 4న ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అందజేసే ఆర్థిక సహాయంపైనా ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలిపింది. టీడీపీపై కాపుల్లో వ్యతిరేకత పెరగకుండా ఉండేందుకే.. బాలకృష్ణ తాజా వ్యాఖ్యలతో చిరంజీవి అభిమానులు, కాపు సామాజికవర్గాల్లో టీడీపీపై వ్యతిరేకత పెరగకుండా ఉండేందుకే చంద్రబాబు పవన్‌కళ్యాణ్‌ను పరామర్శించారన్న చర్చ కూడా జరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్‌కళ్యాణ్ ఇందుకు తనవంతుగా బాబుకు తోడ్పాటు అందిస్తున్నారని చర్చించుకుంటున్నారు. అలాగే, చంద్రబాబే స్వయంగా వచ్చి తనను పరామర్శించారన్న సానుభూతి కాపు సామాజికవర్గంలో కలిగించాలన్నది వీరిరువురి వ్యూహమని వారంటున్నారు. -
'స్పిరిట్' వైరల్.. ప్రభాస్ తండ్రిగా 'స్టార్ హీరో'!
హీరో ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం ‘స్పిరిట్’... ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటన వచ్చిన సమయం నుంచి ఎలాంటి వార్త వచ్చినా సరే క్షణాల్లోనే వైరల్ అయిపోతుంది. అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ మూవీలో ప్రభాస్ తండ్రిగా మెగా హీరో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.సోషల్ మీడియాలో వస్తున్న తాజా నివేదికల ప్రకారం.. స్పిరిట్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కోసం ఇప్పటికే ఆయన డేట్స్ ఇచ్చారని, ఈ సినిమాలో ప్రభాస్ తండ్రిగా ఆయన కనిపిస్తారని సమాచారం. ఇందులో ఆయన పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని టాక్. సందీప్‌రెడ్డి యానిమల్ సినిమాలో కూడా తండ్రి పాత్రకు చాలా ఎక్కువ ప్రాధాన్యతే ఉంటుంది. ఇదే క్రమంలోనే స్పిరిట్ మూవీలో ప్రభాస్ ఫాదర్ పాత్రకు కూడా ఎక్కువ స్పేస్ ఉంటుందని ఇండస్ట్రీలో ప్రచారం ఉంది. సందీప్ రెడ్డికి ఇష్టమైన నటుడు చిరంజీవి ఆయనతో ఒక ఫుల్ లెన్త్ సినిమా ఛాన్స్ వస్తే చేయాలని ఉందని కూడా చెప్పారు. ఇంతలో ఇలా స్పిరిట్‌లో చిరు భాగమైతే ఆయన సంతోషానికి హద్దులు ఉండవని చెప్పవచ్చు. సందీప్ ఆఫీస్‌తో పాటు తన ఇంట్లో కూడా చిరు ఫోటో ఉంటుంది. అంతలా మెగాస్టార్‌ను సందీప్‌రెడ్డి ఇష్టపడుతాడు.చిరంజీవి కూడా సందీప్, ప్రభాస్ ఇద్దరినీ చాలా ఇష్టపడుతారు. ఈ కాంబినేషన్ సెల్యులాయిడ్‌పై స్థిరపడితే.. ఇంకేముంది బాక్సాఫీస్ కలెక్షన్స్ మోత మోగాల్సిందే.. ఈ కాంబినేషన్ సినిమా వ్యాపారం పరంగా కూడా పాన్ ఇండియా రేంజ్లో చాలామందిని ఆకర్షిస్తుంది. అదనంగా, ఈ చిత్రంలో ప్రభాస్, సంజయ్ దత్ అన్నదమ్ములుగా కనిపిస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. వారిద్దరూ ఇప్పటికే రాజా సాబ్ కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు, అందరి మనస్సులో వచ్చే పెద్ద ప్రశ్న ఏమిటంటే, చిరంజీవి ఈ చిత్రంలో భాగం కావడానికి ఖచ్చితంగా అంగీకరిస్తారా? ఇదే సందేహం చాలామందిలో ఉంది. నిజమే అయితే, ఫ్యాన్స్‌కు పండగే అవుతుంది. ప్రస్తుతానికి విశ్వంభర, మన శంకర వర ప్రసాద్ సినిమాలతో చిరంజీవి బిజీగా ఉన్నారు. రామ్ చరణ్, సందీప్ కాంబినేషన్లో ఒక సినిమా రానుందన కూడా కొద్దిరోజులుగా ప్రచారం ఉంది. అయితే, పెద్ది సినిమా తర్వాత ఈ మూవీ ఉంటుందని టాక్. -
మెగాస్టార్ 47.. రామ్ చరణ్ 18.. బుచ్చిబాబు స్పెషల్ విషెస్!
మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే తన సినీ ప్రయాణంలో 47 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి మెగాస్టార్‌గా ఎదిగిన చిరు.. తన మొదటి సినిమా ప్రాణం ఖరీదును గుర్తు చేసుకుంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. నేటికి సరిగ్గా 18 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు చెర్రీకి అభినందనలు చెబుతున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌కు స్పెషల్ డే కావడంతో పెద్ది మూవీ మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సినీ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్‌కు 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.. అరంగేట్రం నుంచి మీ సినీప్రయాణం అద్భుతమంటూ డైరెక్టర్ బుచ్చిబాబు సనా ట్వీట్ చేశారు. ఈ అద్భుతమైన జర్నీలో నేను కూడా భాగం కావడం చాలా సంతోషంగా ఉందని పోస్ట్ చేశారు. రామ్ చరణ్ కెరీర్లో పెద్ది ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందని చెర్రీ అభిమానులకు బుచ్చిబాబు హామీ ఇచ్చారు. ఈ ప్రత్యేక పోస్టర్ మెగా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.కాగా.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న పెద్ది చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే పీరియాడికల్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా అలరించనుంది. మెగా హీరో రామ్ చరణ్.. చిరుత మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 18 YEARS OF “MEGA POWER STAR” IN CINEMA ❤🔥From the most awaited debut to one of the most celebrated actors, your journey in cinema has been sensational @AlwaysRamCharan Sir ❤️I'm so happy to be a part of this incredible journey Sir ❤️🤗🙏Dear @AlwaysRamCharan fans, #Peddi… pic.twitter.com/QCLQFCRGqt— BuchiBabuSana (@BuchiBabuSana) September 28, 2025 -
రోషం లేదా పవన్! సొంత అన్నను తిడితే మౌనమా? నువ్వు OG కాదు SG..
-
జగన్ పై ఆరోపణలు.. చెక్ పెట్టిన చిరంజీవి, నారాయణ మూర్తి
-
నా గుండె వణికిపోయింది.. కరూర్ ఘటనపై 'కమల్, రజనీ' రియాక్షన్
తమిళనాడు కరూర్‌లో సినీ నటుడు విజయ్ రాజకీయ ప్రచార ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ అంశం గురించి సినీ నటులు రజనీకాంత్, కమల్‌హాసన్ స్పందించారు. ఈ ఘటనలో ఇప్పటికే 40 మంది మరణించగా.. 60 మందికి పైగానే తీవ్రంగా గాయపడ్డారు. విజయ్ మాట్లాడుతున్న సమయంలో ఆభిమానులు ఒక్కసారిగా ఆయన దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నం చేయడంతోనే తొక్కిసలాట జరిగినట్లు విచారణలో తేలింది. వాస్తవంగా షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు రావాల్సిన విజయ్ పలు కారణాల వల్ల రాలేకపోయారు. సుమారు ఆరు గంటలు ఆలస్యంగా కరూర్‌కు ఆయన చేరుకున్నాడు. దీంతో ఎవరూ ఊహించిన విధంగా జనాలు గుమికూడారు. ఇలా అనేక కారణాల వల్ల ఈ తొక్కిసలాట జరిగింది.విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట గురించి రాజ్యసభ సభ్యులు, నటుడు కమల్ హాసన్ ఇలా స్పందించారు 'కరూర్‌లో ఇంతమంది చనిపోయారని తెలిశాక నా గుండె వణికిపోయింది. అక్కడి నుండి వస్తున్న వార్తలు తెలుసుకుంటుంటే షాక్ అవుతున్నాను. అవన్నీ నాలో దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. తొక్కిసలాటలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలకు సానుభూతి చెప్పేందుకు కూడా నాకు మాటలు రావడం లేదు. గాయాలతో చికిత్స పొందుతున్న వారికి సరైన సహాయం అందేలా ప్రభుత్వమే చూడాలి. మరణించిన వారి కుటుంబ సభ్యలను తమిళనాడు ప్రభుత్వం ఆదుకోవాలి.' అని ఆయన కోరారు.'కరూర్ సంఘటనలో చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త నా హృదయాన్ని కలచివేసింది. నాకు తీవ్ర దుఃఖాన్ని కలిగిస్తోంది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. ఇలాంటి సమయంలో భగవంతుడు అండగా నిలివాలని కోరుతున్నాను.' - రజనీకాంత్'ర్యాలీలో జరిగిన విషాదకరమైన తొక్కిసలాట నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎవరూ భర్తి చేయలేని నష్టాన్ని అనుభవిస్తున్న ఆ కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి. ఈ క్లిష్ట సమయంలో వారికి బలం చేకూరాలని కోరుకుంటున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి.' -చిరంజీవి -
‘కరూర్ తొక్కిసలాట’ ఘటనపై స్పందించిన చిరంజీవి!
తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటన మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ) స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘తమిళనాడులోని కరూర్‌లో జరిగిన ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకోవడం చాలా విషాదకరం, ఈ విషయం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ భరించలేని నష్టాన్ని అనుభవిస్తున్న కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో వారికి బలం చేకూరాలని కోరుకుంటున్నాను, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి’ అని చిరంజీవి ట్వీట్ చేశాడు.కాగా,తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు హీరో విజయ్(Vijay ) నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన ఈ తొక్కిసలాటలో ఇప్పటి వరకు 39 మంది మరణించారు. 25 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో 10 మంది వరకు చిన్నపిల్లలు, 16 మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.Deeply saddened by the tragic stampede at the rally in Karur, Tamil Nadu. My sincere condolences to the families who are living through this unbearable loss. I wish them strength in this difficult time and pray for the speedy recovery of those injured.Om Shanti 🙏— Chiranjeevi Konidela (@KChiruTweets) September 28, 2025 -
చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందించని పవన్
-
మౌనం వీడలేదు.. నోరు పెగల్లేదు సైలెన్స్.. గంభీరా!
సాక్షి, అమరావతి: చిరంజీవిని ‘ఎవడు’ అంటూ పూచికపుల్లలా తీసివేస్తూ అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అధికారంలో ఉండి కూడా డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ స్పందించకపోవడంపై మెగాస్టార్ అభిమానులు, కాపు సామాజిక వర్గం రగిలిపోతోంది. ఓ వైపు బాలకృష్ణపై మండిపడుతూనే.. పవన్‌కళ్యాణ్ సైతం తన సొంత సోదరుడిని దారుణంగా అవమానించి 48 గంటలు గడిచిపోయినా నోరు విప్పకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎక్కడో విదేశాల్లో ఉన్న చిరంజీవే స్వయంగా స్పందించి బాలయ్య వ్యాఖ్యలను ఖండించినా పవన్ మాత్రం కిమ్మనకపోవడం ఏమిటని తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వైరల్ జ్వరంతో బాధపడుతూ కూడా గురువారం నిర్వహించిన డీఎస్సీ సభకు సంబంధించి మంత్రి నారా లోకేష్ ను అభినందిస్తూ ప్రకటన జారీ చేసిన పవన్‌కళ్యాణ్... బాలయ్య వ్యాఖ్యలపై పూర్తి మౌనం పాటించడాన్ని తప్పుబడుతున్నాయి. ఆ విష ప్రచారాన్ని ఖండించిన ‘చిరు’.. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించేందుకు గత ప్రభుత్వ హయాంలో చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు అప్పటి సీఎం వైఎస్ జగన్‌ను కలిసినప్పుడు సాదరంగా ఆహ్వానించి గౌరవిస్తే.. ఎన్నికల ముందు కూటమి నేతలు పవన్‌తో జతకట్టి దు్రష్పచారం చేయటాన్ని పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. ఈ విష ప్రచారాన్ని తాజాగా స్వయంగా చిరంజీవే ఖండించటాన్ని గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలను చిరంజీవి విదేశాల్లో ఉండి కూడా తీవ్రంగా తప్పుబడుతూ ప్రకటన చేశారని పేర్కొంటున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు తనను సాదరంగా భోజనానికి ఆహ్వానించి గౌరవించారని, అనంతరం కొద్దిరోజులకు సినీ ప్రముఖులతో కలిసి మరోసారి వైఎస్ జగన్ నివాసానికి వెళ్లి తామంతా చర్చించామని చిరంజీవి అందులో స్పష్టం చేశారు. ఆ సమావేశం కారణంగానే నాడు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమా టిక్కెట్ రేట్లు పెరిగాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మెగాస్టారే స్వయంగా విడుదల చేసిన ప్రకటన ద్వారా ఎన్నికల ముందు పవన్‌కళ్యాణ్, చంద్రబాబు, టీడీపీ నేతలు వైస్ జగన్‌పై చేసిన దుష్ప్రచారంలో నిజం లేదని తేటతెల్లమైందని చిరంజీవి అభిమానులు చర్చించుకుంటున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం నాడు చంద్రబాబు అంత దు్రష్పచారం చేయగా.. ఇప్పుడు బాలకృష్ణ నేరుగానే చిరంజీవిని కించపరిచినా పవన్‌కళ్యాణ్ కనీసం ఖండించకపోవడాన్ని చిరంజీవి అభిమాన సంఘాలు, కాపు సామాజిక సంఘాల నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.రాజకీయాల కోసం కుటుంబ గౌరవం తాకట్టా?గతంలో తన తల్లిని అవమానించేలా నారా లోకేశ్ పోస్టులు పెట్టించారని స్వయంగా విమర్శలు చేసిన పవన్‌కళ్యాణ్.. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ‘ఎవడు’ అంటూ తన సోదరుడు చిరంజీవిపై బాలకృష్ణ అంత తీవ్ర వ్యాఖ్యలు చేసినా స్పందించడం లేదంటే చంద్రబాబు అంటే భయమా లేక నెల నెలా అందే ప్యాకేజీయే కారణమా.. అని సోషల్ మీడియాలో చిరంజీవి అభిమానులు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ బాబు కుటుంబానికి దాసోహమవడం కారణంగా మెగాస్టార్ కుటుంబం ఇలాంటి అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తోందని చిరంజీవి అభిమానులు, కాపు సంఘాల నేతలు చర్చించుకుంటున్నారు. పవన్‌కళ్యాణ్ తీరు చూస్తుంటే కుటుంబం, జనసేన ప్రయోజనాల కన్నా చంద్రబాబు, లోకేశ్ రాజకీయ లబ్ధి కోసం ఆరాట పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ ఆ వ్యాఖ్యలు చేసే సమయంలో సభలో జనసేన ఎమ్మెల్యేలు ఉండి కూడా అభ్యంతరం చెప్పకపోవడాన్ని చిరంజీవి అభిమానులు, కాపు సంఘం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో చిరంజీవినుద్దేశించి బాలకృష్ణ ‘మా బ్లడ్ వేరు.. మా బ్రీడ్ వేరు’ అని వ్యాఖ్యలు చేసినప్పుడు స్పందించిన నాగబాబు.. ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యాక తాజాగా చిరంజీవినుద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ఎమ్మెల్సీ పొందినంత మాత్రన ప్రస్తుతం నాగబాబు ఇంతలా దిగజారాలా అనే వ్యాఖ్యలు చిరంజీవి అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి. చిరంజీవి ఏంది..? మా బ్లడ్ వేరు..! బాలకృష్ట గతంలోనూ పలు సందర్భాల్లో చిరంజీవిని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు దీనిపై పలు పోస్టులు పెడుతున్నారు. గతంలో చిరంజీవి రాజకీయాల్లోకి రావడంపై బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘రాజకీయాల్లో విజయం సాధించడం ఒక్క రామారావు వల్లే అయింది. చిరంజీవి ఏంది...? మేం వేరు... మా బ్లడ్ వేరు... మా బ్రీడ్ వేరు... సస్టెయిన్బులిటీ ఉంది మాకు..!’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరో సందర్భంలో ‘సంకరజాతి..’ ‘అలగా జనం..’ అంటూ బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కూడా చర్చ జరుగుతోంది. ఇవన్నీ చిరంజీవి కుటుంబాన్ని ఉద్దేశించినవేనని బాలకృష్ణపై మండిపడుతున్నారు. -
ఈ దుర్యోధన దుశ్శాసన పర్వంలో...
మహాభారత కథలోని గాంధారీ సుతుల్లో ఒకడికి దుశ్శాసను డనే పేరు పెట్టారు వేదవ్యాస మహర్షి. శాసనాన్ని ఖాతరు చేయనివాడని దాని అర్థం. విడమర్చి చెప్పాలంటే సంఘం కట్టుబాట్లను లెక్క చేయనివాడు, పరిపాలనా నియమాలంటే పట్టింపులేనివాడు. ఒక్క మాటలో సంఘ విద్రోహి. నేటి ప్రజా స్వామ్య వ్యవస్థలో ఇటువంటి దుశ్శాసనుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ‘గజానికో గాంధారీసుతుడు... గాంధీ పుట్టిన దేశంలో’ అనే డైలాగ్ చాలా కాలం నుంచే తెలుగునాట బాగా పాపులరయింది. ఇప్పుడీ తొండ ముదిరి ఊసరవెల్లిగా మారింది. శాసనాలు చేయవలసిన వారు, పాలకులుగా ఎన్నికైనవారు కూడా దుశ్శాసనావతారాలు ఎత్తుతున్నారు. రాజ్యాంగ నియమాలకూ, చట్టాల సంరక్షణకూ కాపుకాయవలసిన కంచే చేను మేస్తున్నది. ఈ పరిణామానికి కలత చెందినవారు ‘మన స్వాతంత్య్రం మేడిపండు, మన ప్రజా స్వామ్యం రాచపుండై’ందని కన్నీరు పెడుతున్నారు.పౌరుల ప్రాథమిక హక్కులకు అండగా నిలబడవలసిన రక్షకభటులే, వాటి భక్షక భటులుగా మారడంపై ఏపీ హైకోర్టు నిన్న ఒక అసాధారణ నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చింది. సవీందర్ రెడ్డి అనే ఒక సోషల్ మీడియా యాక్టివిస్టును మఫ్టీ పోలీసులు అరెస్ట్ చేసి, తాము అరెస్టు చేయలేదని సాక్షాత్తూ ఉన్నత న్యాయ స్థానాన్నే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. హైకోర్టులో ఆ విధంగా బుకాయించిన పోలీసులు అదే రోజు సాయంత్రం ఆయన్ని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. అది కూడా హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసే విధంగానే! రిమాండ్ రిపోర్టులోనూ అతని అరెస్ట్ సమయాన్ని రకరకాలుగా నమోదు చేసి హైకోర్టుకు అడ్డంగా దొరికి పోయారు. గడచిన సంవత్సర కాలంగా పోలీసులు చేస్తున్న అక్రమ అరెస్టులపై కనీసం డజను సార్లు హైకోర్టు హెచ్చరికలు చేసింది. అయినా తీరు మారని పోలీసుల వైఖరిపై ఆగ్రహంతో ఉన్న న్యాయస్థానం సవీందర్ రెడ్డి సతీమణి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై చేసిన విచారణలో కూడా వారి దొంగాట తేటతెల్లమవడంతో తీవ్రంగా స్పందించింది. ఈ అరెస్ట్ వ్యవ హారంపై సీబీఐ జాయింట్ డైరెక్టర్ విచారణ జరపాలని ఆదేశించింది. రాజ్యాంగం 226వ అధికరణం కింద సంక్రమించిన అధికారం మేరకు ఈ ఆదేశాన్నిస్తున్నామని న్యాయస్థానం స్పష్టం చేసింది.పౌరుల ప్రాథమిక హక్కులకు ప్రభుత్వం నుంచి గానీ, మరోవిధంగా గానీ ప్రమాదం వాటిల్లిందని హైకోర్టు భావించినప్పుడు జోక్యం చేసుకునే అధికారాన్ని అధికరణం 226 కల్పిస్తున్నది. దాన్ని ఉపయోగించడం ద్వారా రాష్ట్రంలో ప్రాథమిక హక్కులకు రక్షణ లేదనే అభిప్రాయం న్యాయ స్థానానికి కలిగిందని భావించవచ్చు. ఇటువంటి కేసులోనే గతంలో కేరళ ముఖ్యమంత్రి కరుణాకరన్ రాజీనామా చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఎమర్జెన్సీ సమయంలో కేరళ పోలీసులు రాజన్ అనే యువకుడిని నక్సలైట్ సంబంధాలు న్నాయనే అనుమానంతో మఫ్టీలో వెళ్లి అపహరించారు. అరెస్ట్ చూపలేదు. చిత్రహింసలు పెట్టి అతడిని చంపేశారు. ఎమర్జెన్సీ ముగిసిన వెంటనే రాజన్ తండ్రి కేరళ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు.హోంమంత్రి ఆదేశాలతోనే తన కుమారుణ్ణి పోలీసులు అపహరించారని ఆయన ఆరోపించారు. ఆ సమయంలో కరుణాకరన్ హోంమంత్రిగా ఉన్నారు. రాజన్‌ను తాము అపహరించలేదని కోర్టులో పోలీసులు తప్పుడు అఫిడవిట్ వేశారు. అప్పటికే రాజన్‌ను చంపేసిన ఆధారాలు జన సామాన్యంలో ప్రచారంలో ఉన్నాయి. ఎమర్జెన్సీ తర్వాత ముఖ్యమంత్రి పీఠమెక్కిన కరుణాకరన్ ప్రభుత్వానికి హైకోర్టు డెడ్‌లైన్ విధించి ఫలానా రోజులోగా రాజన్‌ను హాజరు పరచాలని ఆదేశించింది. చనిపోయిన వ్యక్తిని తీసుకురాలేక పోవడం, ప్రజాగ్రహం వెల్లువెత్తడం, హైకోర్టు తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో గద్దెనెక్కి నెల తిరక్కుండానే కరుణాకరన్ రాజీనామా చేయవలసి వచ్చింది. తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన పోలీసు అధికారుల ప్రాసిక్యూషన్‌కు కూడా హైకోర్టు ఆదేశించింది. అదే తరహాలో ఇప్పుడు సవీందర్రెడ్డి కేసులో కూడా న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం పోలీ సులు చేశారని స్పష్టమైంది.ఏపీ ప్రభుత్వం పోలీసుల్ని ఉసిగొల్పుతున్నది ఒక్క సోషల్ మీడియా యాక్టివిస్టులపైనే కాదు, రాజకీయ ప్రత్యర్థులపైన మాత్రమే కాదు – ‘సాక్షి’ వంటి మీడియా సంస్థపై కూడా! దేశంలో మిలియన్ కాపీల సర్క్యులేషన్ దాటిన అగ్రశ్రేణి దినపత్రికల సంఖ్య అన్ని భాషల్లో కలిపి డజన్‌కు మించి లేదు. వాటిలో ‘సాక్షి’ ఒకటి. ఈ లెక్క ‘సాక్షి’ చెప్పేది కాదు. దిన పత్రికల సర్క్యులేషన్ల లెక్కలు తీసే ‘ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్’ (ఏబీసీ) అనే ప్రామాణిక సంస్థ చెప్పే లెక్క. అటువంటి ప్రతిష్ఠాత్మక సంస్థ కార్యాలయాల్లో అర్ధరాత్రి చొరబడి అల్లరి చేయడం, ఎడిటర్ ఇంట్లో దూరి సోదాలు చేయడం, ఎడిటర్‌తో సహా సీనియర్ సిబ్బందిపై అక్రమ కేసులు బనాయించి భయపెట్టాలని చూడటాన్ని ఎలా అర్థం చేసు కోవాలి? ఈ వైఖరిని ఫాసిజమనాలా? నాజీయిజమనాలా? అధికారం తలకెక్కడమనుకోవాలా అనేది ప్రజలే నిర్ణయిస్తారు.ఇక పవిత్రంగా ఉండవలసిన శాసనసభల నిర్వహణ తీరు ఎంత శోభాయమానంగా ఉన్నదో కనిపిస్తూనే ఉన్నది. మార్గ దర్శకంగా ఉండవలసిన రూల్ బుక్ అమలులో ఉన్నదా అటక మీద ఉన్నదా అర్థం కాని పరిస్థితి. అన్ రూలీ కామెంట్స్ విశృంఖలతకు అడ్డు చెప్పే పరిస్థితే లేదు. గురువారం నాటి సభలో చంద్రబాబునాయుడు బావమరిదీ ప్లస్ వియ్యంకుడు, సినీ నటుడైన బాలకృష్ణ ఆంగిక వాచికాభినయాలు చూసిన వారికి దిగ్భ్రాంతి కలిగించాయి. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడైన జగన్‌ను ఉద్దేశించి తూలిన మాట కేవలం అన్ పార్లమెంటరీ మాత్రమే కాదు. పత్రికల్లో రాయడానికి కూడా అభ్యంతరకరమైనది. ఆయనట్లా య«థేచ్ఛగా మాట తూలుతుంటే పాలకపక్ష సభ్యులు హర్షధ్వానాలు చేయడం, నవ్వడం, ముఖ్యమంత్రితో సహా పెద్దలెవరూ వారించకపోవడం, సభా ధ్యక్ష స్థానంలో ఉన్నవారు కూడా మిన్నకుండటం చూసిన తర్వాత మెదళ్లను తొలిచే మొదటి ప్రశ్న: రూల్ బుక్ ఎక్కడ?సభలో లేని ప్రతిపక్ష నేతనుద్దేశించి అవమానకరమైన రీతిలో కామెంట్లు చేస్తూ, వాటికి హర్షామోదాలు వ్యక్తం చేస్తున్న కూటమి సభ్యులు మరోపక్క ప్రతిపక్ష నేత హోదా లేకుండానే జగన్ అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేయడం వెనుక ఉన్న గూడుపుఠాణీ అర్థం కావడం లేదా? ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అవకాశమివ్వకుండా రన్నింగ్ కామెంటరీతో అవమానించాలనే ఎత్తుగడ కాదా? లేకుంటే బాలకృష్ణ చేసిన అభ్యంతరకరమైన కామెంట్స్‌ను రికార్డుల నుంచి తొలగించా లని సభ్యులెవరూ ఎందుకు కోరలేదు? స్వయంగా సభాధ్యక్షులే అప్పటికప్పుడు ఆ నిర్ణయాన్ని ఎందుకు తీసుకోలేదు? అలాంటి నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు గతంలో కోకొల్లలుగా లేవా?బాలకృష్ణ మాట్లాడటానికి ముందు బీజేపీ సభ్యుడు కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. బీజేపీలో ఉంటూ చంద్రబాబు కోసమే పనిచేసే నాయకులు కొందరున్నారని అందరికీ తెలిసిందే! వారిలో కామినేని శ్రీనివాస్ ముఖ్యులు. ‘సినిమా పరిశ్రమ నుంచి మాట్లాడటానికి వచ్చినవాళ్లను కలవకుండా జగన్ అవమానించారు, చిరంజీవి గట్టిగా అడగడంతో వచ్చి కలిశార’ని శ్రీనివాస్ ఆరోపించారు. దీనిపై బాలకృష్ణ స్పందిస్తూ జగన్‌పై అభ్యంతరకర పదప్రయోగం చేశారు. పనిలో పనిగా చిరంజీవిపై తనకున్న వ్యతిరేకతను కూడా బయటపెట్టుకున్నారు. ‘ఎవడూ’ గట్టిగా నిలదీయలేదంటూ ఆయన్ను కూడా అవమానించే విధంగా మాట్లాడారు. దీనిపై స్పందించిన చిరంజీవి... జగన్ తమను సాదరంగా ఆహ్వానించారనీ, ఆయనతో తాము జరిపిన చర్చల ఫలితంగానే అప్పట్లో తన సినిమా, బాలకృష్ణ సినిమాతోపాటు పరిశ్రమకు మేలు జరిగిందనీ ఒక లేఖ ద్వారా తెలియజెప్పారు. ఈ వివరణ తర్వాత విధిలేని పరిస్థితుల్లో కామినేని శ్రీనివాస్ తన వ్యాఖ్య లను రికార్డుల నుంచి తొలగించాలని శనివారం నాడు కోరవలసి వచ్చింది. కానీ, జగన్‌ను ఉద్దేశించి తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ అలా కోరలేదు. సభా నాయకుడు గానీ, సభాధ్యక్షులు గానీ అటువంటి నిర్ణయం తీసుకోలేదు. జగన్‌ను అవమానించాలనే ఎత్తుగడతో పాలక కూటమి పని చేస్తున్నదనడానికి ఇవి నిదర్శనాలే కదా!ఇక్కడ ఆశ్చర్యం కలిగించే మరో విషయం ఏమిటంటే చిరంజీవిపైన బాలకృష్ణ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను జనసేన నేతలు ఎవ్వరూ ఖండించకపోవడం! పవన్ కల్యాణ్ జ్వరంతో విశ్రాంతి తీసుకుంటున్నారని వార్తలొచ్చాయి. మిగిలిన వారెందుకు మాట్లాడలేదని జనంలో చర్చ మొదలైంది. ఆ సమయంలో సభలో ఉన్న జనసేన పార్టీకి చెందిన మంత్రి కందుల దుర్గేశ్ కూడా ఏమీ స్పందించలేకపోయారు. పైగా ఎఫ్డీసీ ఆహ్వాన పత్రికలో తన పేరును తొమ్మిదో పేరుగా ‘ఎవడు’ వేశాడని దుర్గేశ్ పట్ల కూడా బాలకృష్ణ దురుసుగానే మాట్లాడారు. సినిమా రంగంలో స్వశక్తితో ఉన్నత శిఖరాలకు చేరుకున్న చిరంజీవి ప్రస్థానంపై తొలినుంచీ బాలకృష్ణకు ఎంతో కొంత అసహనం ఉన్నదనే విషయం దాచేస్తే దాగేది కాదు.మహానటుడిగా విశ్వవిఖ్యాతి గాంచిన తండ్రిగారు ముఖ్య మంత్రి అయిన తర్వాతనే సోలో హీరోగా బాలకృష్ణ సినిమా కెరీర్ ప్రారంభమైంది. అంతకుముందు కొన్ని సినిమాల్లో నటించినా అవి సోలో హీరో పాత్రలు కావు. దాదాపు బాలకృష్ణ నటజీవితంతో సమాంతరంగానే చిరంజీవి ప్రయాణం సాగింది. సినిమా పరిశ్రమలో ఎవరి అండాదండా లేకుండా, కేవలం స్వయం ప్రతిభతో దూసుకెళ్లి ఎనభయ్యో దశకం చివరి నాటికే అగ్రహీరోగా చిరంజీవి ఎదిగిపోయారు. అప్పటినుంచి ఆయన రాజకీయాల్లో ప్రవేశించే వరకు దాదాపు పదిహేను పదహారేళ్ల పాటు చిరంజీవికి గట్టి పోటీగా బాలకృష్ణే కాదు, మరే హీరో కూడా నిలవలేకపోయారు. కారణం ఏదైనాగానీ, చిరంజీవి ప్రస్తావన వచ్చిన సందర్భాల్లో వెటకారంగానో, అసహనంగానో, అతిశయంతోనో బాలకృష్ణ స్పందించడం జనం గమనించారు. ‘రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి ఏమయ్యాడు?’ ‘మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు’ అంటూ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘లేపాక్షి ఉత్సవానికి చిరంజీవిని పిలుస్తున్నారా’ అని ఎవరో అడిగితే ‘ఎవర్నో తెచ్చి నెత్తిన పెట్టుకుంటామా?’ అని రుసరుస లాడారు. పవన్ కల్యాణ్ అభిమానుల్ని ‘అలగా జనం’గా సంబోధించడం కూడా వివాదాస్పదమైంది.అసెంబ్లీలో జగన్‌ను ఉద్దేశించి బాలకృష్ణ చేసిన అభ్యంతర కరమైన వ్యాఖ్యల తర్వాత బాలకృష్ణ ‘సైకో సర్టిఫికెట్’ ఉదంతం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల ఉదంతం అందరికీ గుర్తుండే ఉంటుంది. బాలకృష్ణ జరి పిన కాల్పుల్లో నిర్మాత బెల్లంకొండ సురేశ్, ఆస్థాన జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరి తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత కొద్దిరోజులకు అనుమానాస్పద పరిస్థితుల్లో ఓ సెక్యూరిటీ గార్డు చనిపోయాడు. ఆ కేసు సందర్భంగా తనకు మానసిక పరిస్థితి బాగాలేదనే ఒక ‘సైకియాట్రీ’ సర్టిఫికెట్‌ను కోర్టుకు సమర్పించారు. ఈ సర్టిఫికెట్‌ను ఏర్పాటు చేసిన డాక్టర్ కాకర్ల సుబ్బా రావును ఆ తర్వాత కాలంలో ఏబీఎన్ ఛానల్ అధిపతి రాధా కృష్ణ ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో బాలకృష్ణకు మీరు సాయం చేశారట గదా?’ అని రాధాకృష్ణ ప్రశ్నించారు. ‘అవును సాయం చేశాను. చాలా పెద్ద సాయం. అతడిని (బాలకృష్ణను) ఎలా బయటపడేయాలా అని ఆలోచిస్తే ‘సైకియాట్రీ’ ఆలోచన వచ్చింది. ఇద్దరు నిపుణులతో చర్చించి, ఆ సమయంలో అలా చేయకపోయి ఉంటే తనను తాను కాల్చుకునే పరిస్థితి ఉండేది అనే విధంగా సర్టిఫికెట్ ఇచ్చాం. లేకపోతే ఈ కేసులలో బయట పడేవాడు కాద’ని డాక్టర్ కాకర్ల స్పష్టం చేశారు.ఇప్పుడు ఇంకో సమస్య ముందుకు వస్తున్నది. బాలకృష్ణకు సైకో సర్టిఫికెట్‌ను వైద్యులు ఇచ్చిన మాట నిజం. దాన్ని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు పరిగణనలోకి తీసుకొని వెంటనే బెయిల్ మంజూరు చేసిన సంగతి నిజం. భారత రాజ్యాంగం 326వ అధికరణం ప్రకారం మతిస్థిమితం లేని వాళ్లకు ఓటు హక్కును నిరాకరించవచ్చు. ఓటు వేసే హక్కే లేనప్పుడు పోటీచేసే అవకాశం ఎలాగూ ఉండదు. ఆర్టికల్ 102 (1బి) ప్రకారం మతిస్థిమితం లేని ప్రజా ప్రతినిధులను అనర్హులుగా ప్రకటించవచ్చు. అయితే ఇందుకు మెడికల్ సర్టిఫికెట్ ఒక్కటే సరిపోదు. ఆమేరకు న్యాయస్థానం నిర్ధారించాలి. బాలకృష్ణ కేసులో మెడికల్ సర్టిఫికెట్ ఉన్నది. దాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకున్న ఉదంతం కూడా ఉన్నది. ఆ తర్వాత కాలంలో చికిత్స అనంతరం ఆయన మానసిక స్థితి మెరుగైందని మళ్లీ ఓ మెడికల్ సర్టిఫికెట్ తీసుకున్నారా? అది న్యాయస్థానం దృష్టికి కూడా వెళ్లిందా అనే విషయాలపై సమాచారం లేదు. ఒకవేళ అటువంటిదేమీ జరక్కపోయుంటే ఎవరైనా పిటిషన్ వేస్తే బాలకృష్ణ శాసనసభ్యత్వం రద్దవుతుందా అనే విధంగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నది. ఏదో అవసరార్థం సర్టిఫికెట్లు తప్ప బాలకృష్ణకు మతిస్థిమితం లేదని ఎవ్వరూ అనుకోరు. కాకపోతే ఆ ప్రచారంలో ఆయనకూ, ఆయన పార్టీ అధినేతలకూ ఓ సౌలభ్యం ఉన్నది. ఆ ముసుగులో ఎవరినైనా ఏమైనా అనేయవచ్చు. అధినేతలు అనలేని మాటలు బాలయ్య నోట అనిపించవచ్చు. ఇప్పుడు జరిగింది కూడా అదే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మల్టీస్టారర్ చేసేద్దాం మిత్రమా...
ప్రతి ఇండస్ట్రీలోనూ మల్టీస్టారర్ చిత్రాలు రూపొందుతూనే ఉంటాయి. ఓ సీనియర్ హీరో, ఓ రైజింగ్ హీరో కలిసి చేసిన మల్టీస్టారర్ చిత్రాలు ఉన్నాయి. అలాగే ఇద్దరు స్టార్స్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ వంటి మల్టీస్టారర్ సినిమాలూ ఉన్నాయి. కానీ ఇండస్ట్రీలో సుధీర్ఘమైన సక్సెస్ఫుల్ కెరీర్‌తో రాణించిన తర్వాత కొంత గ్యాప్ తీసుకుని, ఇద్దరు సీనియర్ హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేస్తుండటం, చేసేందుకు ఆసక్తి చూపిస్తుండటం ప్రజెంట్ ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారింది. ‘మల్టీస్టారర్ చేసేద్దాం మిత్రమా’ అంటూ రెడీ అయిన కొంతమంది సీనియర్ హీరోలు చేస్తున్న మూవీస్‌పై ఓ లుక్ వేయండి.46 సంవత్సరాల తర్వాత... కెరీర్ తొలినాళ్ళలో ‘అపూర్వ రాగంగాళ్, మూండ్రు ముడిచ్చు, అంతులేని కథ’... ఇలా దాదాపు ఇరవైకి పైగా సినిమాల్లో కలిసి నటించారు రజనీకాంత్, కమల్‌హాసన్. కానీ 1979లో వచ్చిన ‘అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్’ తర్వాత రజనీకాంత్, కమల్‌హాసన్ కలిసి నటించింది లేదు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటించే అవకాశం ఉంది. రజనీకాంత్‌తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే హ్యాపీ అని ఇటీవల ఓ సందర్భంలో కమల్‌హాసన్ చె΄్పారు.ఇలా కమల్ చెప్పిన తక్కువ రోజుల్లోనే కమల్‌హాసన్‌తో తాను సినిమా చేస్తున్నానని, రెడ్ జెయింట్ మూవీస్–కమల్‌హాసన్ ప్రోడక్షన్ హౌస్ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తాయని రజనీకాంత్ స్పష్టం చేశారు. దీంతో రజనీకాంత్, కమల్‌హాసన్ కలిసి సినిమా చేయనున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో ఊపందుకుంది.కాగా, ఈ చిత్రానికి తొలుత దర్శకుడు లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం జరిగింది. కమల్‌తో ‘విక్రమ్’ వంటి హిట్ మూవీ తీశారు లోకేశ్. అలాగే రజనీకాంత్‌కు ‘కూలీ’తో తమిళనాట మంచి విజయాన్ని అందించారు లోకేశ్. దీంతో కమల్–రజనీకాంత్ కాంబినేషన్ సినిమాకి లోకేశ్ దర్శకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మంచి కథ, స్క్రీన్ ప్లే కుదిరితేనే లోకేశ్‌తో సినిమా చేయాలని భావిస్తున్నారట కమల్–రజనీ. అంతేకాదు... మరికొంత మంది యువ దర్శకులను కూడా మంచి కథల కోసం అ్రపోచ్ అవుతున్నారట.తాజాగా ప్రదీప్ రంగనాథన్ పేరు తెరపైకి వచ్చింది. దర్శకుడిగా ‘కోమలి’ సినిమాతో తొలి ప్రయత్నంతోనే హిట్ అందుకున్న ప్రదీప్ రంగనాథ్ ఆ తర్వాత ‘లవ్ టుడే’ సినిమాతో దర్శకుడితో పాటు హీరోగానూ సక్సెస్ అయ్యారు. రజనీకాంత్–కమల్‌హాసన్ కాంబినేషన్‌కు తాజాగా ఈ యువ దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. ఫైనల్‌గా 46 సంవత్సరాల తర్వాత కమల్‌హాసన్–రజనీకాంత్ కాంబోతో రానున్న సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయంపై సస్పెన్స్ వీడాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.పండక్కి వస్తున్నారు సిల్వర్‌స్క్రీన్‌పై ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, వెంకటేశ్ కనిపిస్తే తెలుగు ఆడియన్స్‌కు పండగే. అదీ ఈ ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమా పండక్కి రిలీజైతే, ఈ పండగ సంక్రాంతి అయితే... ఇక చెప్పేది ఏముంది? వినోదాల సంబరాలు రెట్టింపు అవుతాయి. వచ్చే సంక్రాంతికి ఈ వినోదాల సంబరాలను సిల్వర్ స్క్రీన్‌పై చూపించనున్నారు ‘మన శంకర వరప్రసాద్‌గారు’. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, వెంకటేశ్, కేథరీన్, వీటీవీ గణేశ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఓ ఇన్వెస్టిగేషన్ డ్రామాకు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోందని తెలిసింది. చిరంజీవి పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌లో వెంకటేశ్ కూడా పాల్గొననున్నారు. చిరంజీవి – వెంకటేశ్ కాంబినేషన్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్. అలాగే చిరంజీవి–వెంకటేశ్–నయనతార– కేథరీన్‌ల కాంబినేషన్లో ఓ సెలబ్రేషన్ సాంగ్‌ను కూడా ప్లాన్ చేశారట అనిల్ రావిపూడి. సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై కూడా స్పష్టత రానుంది. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.మరో మల్టీస్టారర్! మల్టీస్టారర్ మూవీస్ చేయడంలో సీనియర్ హీరో వెంకటేశ్ ముందు వరుసలో ఉంటారు. ‘ఎఫ్ 2, వెంకీమామ, గోపాల గోపాల’... ఇలా వెంకీ కెరీర్లో మల్టీస్టారర్ మూవీస్ మెండుగానే ఉన్నాయి. అయితే లేటెస్ట్గా వెంకటేశ్ మరో మల్టీస్టారర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ సీనియర్ హీరోతో కలిసి సినిమా చేయనున్నట్లు వెంకటేశ్ తెలిపారు. అయితే ఈ చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’ కాదు. దీంతో వెంకటేశ్ చేయనున్న లేటెస్ట్ మల్టీస్టారర్లోని తాజా చిత్రంలో బాలకృష్ణ హీరోగా నటించే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.పేట్రియాటిక్ మూవీలో...మలయాళ స్టార్ హీరోలు మోహన్‌లాల్, మమ్ముట్టీ కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు. కానీ 2008లో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ ‘ట్వంటీ 20’ తర్వాత మమ్ముట్టీ, మోహన్‌లాల్ కలిసి మరో సినిమా చేయడానికి పదహారేళ్లు పట్టింది. మహేశ్ నారాయణ్ దర్శకత్వంలోని ‘పేట్రియాట్’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో మమ్ముట్టీ, మోహన్‌లాల్ మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నట్లుగా తెలిసింది.ఫాహద్ ఫాజిల్, కుంచాకో బోబన్ ఈ చిత్రంలోని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా కోసం ఓ లాంగ్ షూటింగ్ షెడ్యూల్ చిత్రీకరణ శ్రీలంకలో ముగిసింది. అయితే మమ్ముట్టీ ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఈ సినిమాకు తాత్కాలిక బ్రేక్ పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం అవుతుందనీ అజర్ బైజాన్, యూకే, మిడిల్ ఈస్ట్ దేశాల లోకేషన్స్‌లో చిత్రీకరణను ప్లాన్ చేశారని తెలిసింది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.పఠాన్ వర్సెస్ టైగర్! షారుక్ ఖాన్ హీరోగా చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘పఠాన్’లో సల్మాన్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ చేశారు. సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన ‘టైగర్ 3’ చిత్రంలో షారుక్ ఖాన్ గెస్ట్ రోల్ చేశారు. ఈ రెండు సినిమాల్లోనూ సల్మాన్ ఖాన్–షారుక్ ఖాన్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించినప్పుడు ఆడియన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ ఈ ఇద్దరూ కలిసి లీడ్ రోల్స్‌లో నటించి, దాదాపు 30 సంవత్సరాలవుతోంది. 1995లో వచ్చిన ‘కరణ్ అర్జున్’ సినిమా తర్వాత సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్లు కలిసి లీడ్ రోల్స్‌లో మరో సినిమా చేయలేదు. అయితే గత ఏడాదిగా సల్మాన్, షారుక్ హీరోలుగా ఓ సినిమా ప్లానింగ్ జరుగుతోందని బాలీవుడ్ సమాచారం.‘పఠాన్’, ‘టైగర్ 3’... ఈ రెండూ వైఆర్ఎఫ్ (యశ్‌రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లోని చిత్రాలే. కాబట్టి ఈ స్పై యూనివర్స్‌లో భాగంగానే ‘పఠాన్ వర్సెస్ టైగర్’ అనే సినిమా రానుందని, యశ్‌రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్యా చోప్రా ఈ సినిమాను నిర్మిస్తారని టాక్. ‘పఠాన్, వార్’ సినిమాలకు దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తారని, కాకపోతే ఈ సినిమా అనౌన్స్మెంట్ రావడానికి కొంత సమయం పడుతుందనే వార్త బాలీవుడ్లో ప్రచారంలోకి వచ్చింది.అలాగే ‘వార్’ సినిమా కూడా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగమే కనుక హృతిక్ రోషన్ కూడా ఈ ‘పఠాన్ వర్సెస్ టైగర్’ చిత్రంలో గెస్ట్ రోల్ చేసే అవకాశం లేకపోలేదని, ఇదే నిజమమైతే అప్పుడు సల్మాన్, షారుక్, హృతిక్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూడొచ్చని బాలీవుడ్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. మరి... ఫ్యాన్స్ ఆశలు నిజమౌవుతాయా? లెట్స్ వెయిట్ అండ్ సీ.17ఏళ్ల తర్వాత... బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్‌ల కాంబినేషన్లో బాలీవుడ్లో ‘హైవాన్’ అనే మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ హిందీ థ్రిల్లర్ సినిమాకు ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సయామీ ఖేర్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. వెంకట్ కె. నారాయణ, శైలాజా దేశాయ్ ఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ కూడా మొదలైంది. కొచ్చి, ఊటీ లొకేషన్స్‌లో కొంత భాగం చిత్రీకరణ జరిపారు మేకర్స్. తాజా షూటింగ్ షెడ్యూల్ చిత్రీకరణ ముంబైలో జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది.ఇక ఈ చిత్రదర్శకుడు ప్రియదర్శన్‌కు మోహన్‌లాల్‌తో మంచి అనుబంధం ఉంది. దీంతో ఈ ‘హైవాన్’లో మోహన్‌లాల్ ఓ గెస్ట్ రోల్ చేసేందుకు అంగీకరించారట. ఇక ఈ చిత్రంలో మోహన్‌లాల్‌నే ఎందుకు గెస్ట్ రోల్‌కి తీసుకోవాలనుకున్నారంటే.. ‘ఒప్పం’కు హిందీ రీమేక్‌గా ‘హైవాన్’ సినిమా తెరకెక్కుతోందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. మోహన్‌లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందిన ‘ఒప్పం’ సినిమా 2016లో విడుదలై, బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది. మరోవైపు ‘తషాన్’ చిత్రం తర్వాత 17 ఏళ్లకు సైఫ్ అలీఖాన్, అక్షయ్ కుమార్ కలిసి నటిస్తున్న చిత్రం ‘హైవాన్’యే కావడం విశేషం. ముగ్గురు డాన్లు బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ డాన్స్ ముగ్గురూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించే అవకాశం కనిపిస్తోంది. రణ్వీర్ సింగ్ హీరోగా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో బాలీవుడ్లో ‘డాన్ 3’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను 2023 ఆగస్టులోనే ప్రకటించినప్పటికీ ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అయితే 1978లో వచ్చిన ‘డాన్’ సినిమాలో నటించిన అమితాబ్ బచ్చన్, 2006, 2011లో వచ్చిన ‘డాన్, డాన్ 2’ చిత్రాల్లో నటించిన షారుక్ ఖాన్ సైతం ‘డాన్ 3’లో భాగం కానున్నారని, ఆ దిశగా ఫర్హాన్ అక్తర్ ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ టాక్.మరి... రణ్వీర్ సింగ్, షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్లు కలిసి ఒకే ఫ్రేమ్‌లో హిందీ సిల్వర్‌స్క్రీన్‌పై కనిపిస్తే, అంతకుమించిన ఆనందం హిందీ సినీ లవర్స్‌కి ఏముంటుంది. ఇక ‘డాన్ 3’లో హీరోయిన్గా కియారా అద్వానీ నటించనున్నారు. విలన్‌గా విజయ్ దేవరకొండ, విక్రాంత్ మెస్సే, అర్జున్ దాస్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్‌గా ‘డాన్ 3’ చిత్రంలో ఎవరు విలన్‌గా నటిస్తారనే విషయంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 2027లో ‘డాన్ 3’ చిత్రం థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే చాన్సెస్ కనిపిస్తున్నాయి.కథే హీరో కన్నడ స్టార్ హీరోలు శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర ప్రధాన పాత్రధారులుగా ఆర్.బి. శెట్టి మరో ప్రధాన పాత్రధారిగా నటించిన సినిమా ‘45’. వందకు పైగా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేసిన అర్జున్ జన్యా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఎం. రమేశ్ రెడ్డి, ఉమా రమేశ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది.సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలు ఈ సినిమాలో ఉంటాయని చిత్రయూనిట్ పేర్కొంది. అలాగే ఈ సినిమాలో ప్రత్యేకంగా హీరోలంటూ ఎవరూ లేరని, కథే ఈ సినిమాకు హీరో అని శివ రాజ్‌కుమార్ ఓ సందర్భంలో చె΄్పారు. ఇక ఉపేంద్ర దర్శకత్వంలో శివ రాజ్‌కుమార్ హీరోగా నటించిన ‘ఓం’ (1995) సినిమా సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర కలిసి మళ్లీ అసోసియేట్ కావడం ఇదే అని టాక్. కొంత గ్యాప్ తర్వాతనో లేక సరికొత్తగానో మల్టీస్టారర్ సినిమాలు చేసే సీనియర్ హీరోలు మరికొందరు ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
మెంటల్ ఫెలో.. చిరంజీవిని వాడు వీడు అంటావా
-
జగన్, చిరంజీవిపై బాలకృష్ణ వ్యాఖ్యలు.. సంచలన నిజాలు బయటపెట్టిన ఆర్ నారాయణ మూర్తి
-
సినిమా వాళ్లని జగన్ అవమానించలేదు: ఆర్. నారాయణమూర్తి
రీసెంట్గా అసెంబ్లీ సాక్షిగా నటుడు బాలకృష్ణ.. చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై వెంటనే చిరంజీవి కూడా ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో చిరంజీవి vs బాలకృష్ణ అన్నట్లు సాగుతోంది. ఇప్పుడు ఈ వివాదంపై ప్రముఖ నటుడు దర్శక నిర్మాత ఆర్. నారాయణమూర్తి స్పందించారు. గత ప్రభుత్వం.. సినిమా వాళ్లని అస్సలు అవమానించలేదని కుండబద్ధలు కొట్టారు.'ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్స్‌పై చిరంజీవి స్పందన 100 శాతం నిజం. జగన్‌ని కలిసిన వాళ్లలో నేను కూడా ఉన్నాను. జగన్ గవర్నమెంట్ ఎవరినీ అవమానించలేదు. చిరంజీవి ఆధ్వర్యంలో మేము జగన్మోహన్రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన ఎంతో గౌరవం ఇచ్చారు. గత గవర్నమెంట్ చిరంజీవిగారిని అవమానించారనే ప్రచారం తప్పు. గత గవర్నమెంటు మా సినిమా వాళ్లని అవమానించలేదు. చిరంజీవి గారు నాకు స్వయంగా ఫోన్ చేశారు అది ఆయన సంస్కారం. అందరూ చిరంజీవి నివాసంలో కలిశాం. అనంతరం పరిశ్రమ పెద్దగా చిరంజీవి.. జగన్‌తో మాట్లాడారు''చిరంజీవి వల్లే ఆ రోజు సమస్య పరిష్కారం అయింది. ఇంకా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నాను. నేను బాలకృష్ణ గురించి మాట్లాడదల్చుకోలేదు. సినిమా టికెట్ ధరలు పెంచకూడదు. సామాన్యుడికి కూడా వినోదాన్ని పంచేది కేవలం సినిమా మాత్రమే. అలాంటి సినిమా టికెట్ ధరలు పెంచితే సామాన్యుడు ఇబ్బంది పడతాడు. ఆ రోజు మమ్మల్ని జగన్ ఎంతో గౌరవించారు' అని ఆర్.నారాయణ మూర్తి క్లారిటీ ఇచ్చారు.‘బాలయ్య అంతేసి మాటలన్నా స్పీకర్ పట్టించుకోరా?’ -
‘నా వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించండి..’ కామినేని శ్రీనివాస్
సాక్షి, అమరావతి: సినిమా వాళ్లను పిలిచి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అవమానించారంటూ బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్(Kamineni Srinivas) అబద్ధపు ప్రకటన రాజకీయ దుమారం రేపింది. అయితే ఈ ప్రకటనపై ఆయన యూటర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలంటూ స్పీకర్‌కు శనివారం విజ్ఞప్తి చేశారు. ‘‘మొన్న సభలో నేను చేసిన వ్యాఖ్యలు అపార్థానికి దారి తీశాయని భావిస్తున్నాను. అందుకే రికార్డుల నుంచి తొలగించాలని కోరుతున్నా’’ అని స్పీకర్, డిప్యూటీ స్పీకర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో చిరంజీవి సహా.. హీరోలను జగన్ అవమానించినట్లు మాట్లాడిన మాటలను తొలగించాలని కోరారు.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవిని, సినిమా వాళ్లను అవమానించినట్టు కామినేని అసెంబ్లీలో ఓ ప్రకటన చేశారు. ‘‘వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్‌ను కలవడానికి వెళ్లినప్పుడు, వారికి సరైన గౌరవం ఇవ్వలేదు. జగన్ వారిని కలవడానికి ఆసక్తి చూపలేదు. చివరికి చిరంజీవి గారు ఒత్తిడి చేయడంతోనే జగన్ కలవడానికి అంగీకరించారు’’ అని అన్నారు. కామినేని వ్యాఖ్యలను బాలకృష్ణ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ క్రమంలో చిరుపై బాలయ్య నోరు పారేసుకున్నారు. అయితే.. కాసేపటికే కామినేని అబద్ధాలు చెప్పారంటూ స్వయంగా చిరంజీవి ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. వైఎస్ జగన్ తనను సాదరంగా ఆహ్వానించారంటూ అందులో పేర్కొన్నారు. దీంతో.. వివాదం మరింత రాజుకుంది. ఇంకోవైపు వైఎస్ జగన్‌పైనా అనుచిత వ్యాఖ్య చేయడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు సైతం బాలయ్యపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. అయితే కామినేని మాటలు టీడీపీ మెగా అభిమానుల మధ్య మాటల యుద్ధానికి దారితీయగా.. పవన్ జనసేన మాత్రం సైలెంట్‌గా చూస్తూ ఉండిపోయాయి. అయితే ఈ వ్యవహారంపై టీడీపీ, స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు మౌనంగా ఉండిపోవడం గమనార్హం. -
Magazine Story: మెంటల్ కృష్ణ.. తలపై విగ్గు.. కడుపులో పెగ్గు
-
బావను ప్రశ్నించే దమ్ములేక ఆక్రోశంతో రెచ్చిపోయిన సర్టిఫైడ్ సైకో బాలయ్య
-
‘బాలయ్య అంతేసి మాటలన్నా స్పీకర్ పట్టించుకోరా?’
సాక్షి, అమరావతి: రాజ్యాంగబద్ధమైన చట్ట సభలను ప్రభుత్వం గౌరవించి తీరాల్సిందేనని ఏపీ శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) అన్నారు. మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజుకు జరిగిన అవమానంపై నల్లకండువాలతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు శనివారం సమావేశాలకు హాజరయ్యారు. ఈ అంశంపై చర్చకు బొత్స పట్టుబడడంతో శనివారం మండలి హీటెక్కింది. ‘‘రాజ్యాంగబద్ధమైన చట్ట సభలను గౌరవించాలనేది మా డిమాండ్. రాజ్యాంగం ప్రకారం సభను, ప్రభుత్వాన్ని నడపాలి. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో చట్టాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు. ప్రభుత్వం సభ్యులకు ఇచ్చే గౌరవాన్ని ఇచ్చి తీరాలి. సభాపతికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. కానీ, ఇంతవరకు వాళ్ళ వైపు నుంచి స్పందన కూడా రాలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ జరగలేదు. ఇది రాజ్యాంగబద్ధమైన అంశం అన్నట్లు కాకుండా వ్యక్తిగత విషయంలా చూడటం ఆక్షేపనీయం.... బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం చైర్లో కూర్చున్న వారికే కాదు ఎవరికి కులాలు ఆపాదించకూడదు. శాసనసభలో నందమూరి బాలకృష్ణ ప్రవర్తన సభలో అందరూ చూశారు(Balayya Comments). ఒక మాజీ ముఖ్యమంత్రిని, మాజీ కేంద్ర మంత్రిని ఎలా మాట్లాడారో అందరూ చూశారు. ఈ అంశంపై ప్రభుత్వ పెద్దలు, సభాపతి స్పందించి ఇప్పటికే మాట్లాడాలి. కానీ.. మొన్న ఘటన జరిగితే ఇప్పటిదాకా స్పీకర్(Assembly Speaker Silence On Balayya Comments) స్పందించలేదు. ఆయన తనకేం సంబంధం లేని విషయం అన్నట్లుగా ఉన్నారు. ఇటు సంబంధిత అధికారులను పిలిచి మండలి చైర్మన్ అవమానం విషయంలో ఏ జరిగిందో కనుక్కునే ప్రయత్నం చేయాలి. సామరస్యపూర్వకంగా ముందుకు వెళ్లాలనేదే మా ఉద్దేశ్యం. నిబంధనల ప్రకారం సభ్యులంతా గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి’’ అని బొత్స అన్నారు.తప్పు ఒప్పుకున్న పయ్యావుల!శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు(Koyye Moshenu Raju)కు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాల్సిందేనని వైఎస్సార్సీపీ ఇవాళ కూడా ఆందోళన కొనసాగించింది. దీనికి సభా నాయకుడు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేసింది. ‘‘మండలి చైర్మన్ అవమానం పై ముందు తేల్చండి. ప్రభుత్వం ఎందుకు జరిగిన తప్పు పై స్పందించడం లేదు’’ అని బొత్స ప్రశ్నించారు. దీనికి మంత్రి పయ్యావుల సమాధానమిస్తూ.. ప్రభుత్వానికి ఎక్కడ చైర్మన్‌ను చిన్నచూపు చూడాలనే ఉద్దేశం లేదన్నారు. ‘‘మొదటి నుంచి పార్టీలో క్రమశిక్షణ నేర్పుతారు. చైర్ గౌరవానికి తగ్గట్లుగా నడుచుకుంటాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం. ముఖ్యమైన బిల్లులు ఉన్నాయి.. మండలి నిర్వహణకు సహకరించాలని’’ అని వైఎస్సార్సీపీ సభ్యులను కోరారు. అయితే.. ప్రభుత్వ కార్యక్రమాలకు చైర్మన్‌కు ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. రిపీట్‌డెడ్‌గా ఇలా జరుగుతోందని బొత్స అన్నారు. ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం కలిగించే బిల్లులకు మేం వ్యతిరేకం కాదు. మండలి చైర్మన్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. మండలి సభ్యులంటేనే మరీ చిన్నతనంగా చూస్తున్నారు’’ అని బొత్స అన్నారు. ఈ ఆందోళల నడుమ మండలి కాసేపు వాయిదా పడింది. ఏం జరిగిందంటే.. అసెంబ్లీ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మండలి చైర్మన్ మోషేన్ రాజుకు ప్రభుత్వం ఆహ్వానం పంపలేదు. ఈ పరిణామంపై వైఎస్సార్సీపీ ఆందోళనకు దిగింది. ‘‘మండలి చైర్మన్‌గా దళిత వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నారు. అలాంటి వ్యక్తిని వరుసగా అవమానించడం దారుణం. గతంలో స్పోర్ట్స్ మీట్ సందర్భంలో కూడా చైర్మన్‌ను అవమానించారు. దీనిపై సీఎం, మంత్రి క్షమాపణ చెప్పాలి” అని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. అయితే.. తిరుపతి సదస్సుకు చైర్మన్ రానని అధికారులు తెలిపారని మంత్రి అచ్చెన్నాయుడు వివరణ ఇవ్వగా.. తాను అలా చెప్పలేదంటూ మండలి చైర్మన్ మోషేన్ రాజు చెప్పడంతో మండలి ఒక్కసారిగా వేడెక్కింది.ఇదీ చదవండి: చైర్మన్‌కు అవమానం..తీవ్ర రాజ్యాంగ ఉల్లంఘనే! -
మెగా బ్రదర్స్ ఏమయ్యారు?
ఏపీ శాసనసభలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.. మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవిపై చేసిన కామెంట్లు రాష్ట్రంలో.. ఇంకా చెప్పాలంటే తెలుగువారు ఉన్న అన్ని ప్రాంతాల్లో చర్చకు తెర లేపాయి. చిరంజీవిని అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏమాత్రం గౌరవించలేదని.. సినీ పరిశ్రమ సమస్యలను కష్టాలను వైఎస్ జగన్ పట్టించుకోలేదని ఇంకా ఏవేవో మాట్లాడుతూ చిరంజీవి తన స్థాయి దిగి మరి వైఎస్ జగన్ వద్ద మోకరిల్లారు అన్నట్లుగా బాలకృష్ణ మాట్లాడారు. బాలకృష్ణ ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు కానీ ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడి వివాదాలకు విద్వేషాలకు నిప్పు రాజేస్తుంటారు. ఈ అంశంపై నిన్ననే మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘమైన వివరణ ఇస్తూ అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనను ఎంతో ఆత్మీయంగా రిసీవ్ చేసుకుని విందుకు ఆహ్వానించి సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలన్నీ కూలకుషంగా విని వాటి పరిష్కారానికి తోడ్పాటును అందించారు అంటూ ఓ లేఖ విడుదల చేశారు. వాస్తవానికి చట్ట సభలో లేని వ్యక్తుల గురించి సభలో మాట్లాడకూడదు అన్నది నిబంధన. కానీ బాలకృష్ణ నోటి దురుసు, అహంకారంతో చిరంజీవిని మెగాస్టార్ అభిమానులు అందరిని గాయపరిచేలా నోటికి వచ్చినట్లు మాట్లాడేసి వెళ్లిపోయారు. ఈ అంశంపై మెగాస్టార్ అభిమానులు సోషల్ మీడియాలో అక్కడక్కడ పోస్టులు పెడుతున్నప్పటికీ చిరంజీవి తమ్ముళ్లు పవన్ కళ్యాణ్ నాగేంద్రబాబు ఇద్దరు చట్టసభలో సభ్యులు అయినప్పటికీ ఎవరు దానిపై ఏమాత్రం స్పందించకపోవడం వారి బానిసత్వానికి ప్రతీకగా నిలుస్తుందని కాపు సామాజిక వర్గం నుంచి ఆవేదన వెల్లువెత్తుతుంది. తన అన్నను ఎందుకు పనికిరాని వాడిగా బాలకృష్ణ కామెంట్ చేసినా... పవన్ కళ్యాణ్ నాగేంద్రబాబు ఇద్దరూ వినీ వినట్లు ఊరుకున్నారు. వాస్తవానికి గతంలో కూడా మెగాస్టార్ అభిమానులందరినీ బాలకృష్ణ అలగా జనం అంటూ కామెంట్ చేశారు.. దీనిపై కూడా అప్పట్లో మెగా ఫ్యాన్స్ స్పందించారు తప్పితే మెగా బ్రదర్స్ ఎవరు? కనీసం తమ అసంతృప్తిని వ్యక్తం చేయలేదు. గతంలో పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ సభల్లో మాట్లాడుతూ తన తల్లిని దూషించిన తెలుగుదేశం పార్టీతో మళ్ళీ కలుస్తానా అంటూ ప్రజలనే ప్రశ్నించారు. కానీ మళ్లీ అదే పార్టీతో చేతులు కలిపి ఇంకో 15 ఏళ్లపాటు తెలుగుదేశంతో పొత్తులో ఉంటాను అని ప్రకటన చేయడం పవన్ కళ్యాణ్ అసమర్థతను వ్యక్తం చేస్తుందని మెగా ఫ్యాన్స్ లోలోన ఆవేదన చెందుతున్నారు.తమ కుటుంబ పెద్ద అయినా మెగాస్టార్ చిరంజీవి విషయంలో బాలకృష్ణ చేసిన లేకి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ నాగబాబులను కనీసం కదిలించకపోవడం వారి దౌర్భాగ్యాన్ని సూచిస్తుందని కాపు యువతతో పాటు మెగా అభిమానులు సైతం లోలోన బాధపడుతున్నారు. ఇంత గోల జరుగుతున్న నాగబాబు కనీసం మాట్లాడకపోగా బిగ్ బాస్.. ఆట వంటి టీవీ కార్యక్రమాల గురించి కామెంట్లు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని.. నాగబాబుకు పవన్ కళ్యాణ్‌కు ఈ పదవులు ఆటవిడుపు లాంటివి అనే భావన కలిగిస్తున్నారని ఫ్యాన్స్ లో వినిపిస్తోంది.రాజకీయంగా పదవులు వస్తే చాలు.. ప్రోటోకాల్ ఇతర సౌకర్యాలు వస్తే చాలు అనుకొని ఇద్దరు అన్నదమ్ములు ఎంజాయ్ చేస్తున్నారు తప్ప పెద్దన్నయ్య చిరంజీవికి చట్టసభలో బాలకృష్ణ చేసిన అవమానం గురించి ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం వారి రాజకీయ అవకాశవాదానికి నిర్వచనం అన్నట్లుగా అభిమానులు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలోని కాపు నేతలు భావిస్తున్నారు. బాలకృష్ణకు మొదటి నుంచి కూడా మెగాస్టార్ అభిమానులు.. చిరంజీవి కుటుంబం అంటే చిన్న చూపు ఉన్నది. పలు సందర్భాల్లో బాలకృష్ణ తన దుగ్ధను .. అహంకారాన్ని బయటకు వెలిబుచ్చారు. ఈసారి ఏకంగా చట్టసభలోనే బాలకృష్ణ అలా మాట్లాడడం మెగా అభిమానులను తీవ్రంగా కలిసి వేస్తుంది. కానీ దీనిపై మెగా కుటుంబం నుంచి కనీసం స్పందన రాకపోవడం వారిని మరింతగా బాధిస్తోంది. సిమ్మాదిరప్పన్నబాలయ్య వ్యాఖ్యల వేళ.. హైదరాబాద్‌కు పవన్! -
చిరుపై బాలకృష్ణ వ్యాఖ్యలపై ప్యాన్స్ తీవ్ర ఆగ్రహం
-
బాలయ్య వ్యాఖ్యల వేళ.. హైదరాబాద్‌కు పవన్!
హైదరాబాద్, సాక్షి: ఏపీ రాజకీయాలతో పాటు సినీ పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు(Balayya Comments On Chiru) తీవ్ర అలజడి రేపుతున్నాయి. గత ప్రభుత్వంలో సినీ ప్రతినిధుల బృందం సీఎంను కలవడాన్ని ప్రస్తావిస్తూ.. అసెంబ్లీలో బాలయ్య అభ్యంతరకర, అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇటు వైఎస్సార్సీపీ, అటు మెగా అభిమానులు ఆయనపై మండిపడుతున్నారు. ఇక ఈ పరిణామాలపై టీడీపీ ఏమో మౌనంగా ఉండిపోయింది. చిరుపై ‘ఎవడు’ అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చిరు అభిమానులు తీవ్ర అభ్యంతరాలు(Chiru Fans Fire On Balayya) వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ గతంలోనూ చిరును ఉద్దేశించి ఈ తరహాలోనే అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు క్షమాపణలు చెప్పకపోతే ప్రజా క్షేత్రంలో నిరసనలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో జనసేన స్పందించకపోవడంపైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కలకలం వేళ.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) హైదరాబాద్‌కు వస్తుండడం చర్చనీయామైంది. అయితే ఆయన కేవలం వైద్యం కోసమే వస్తున్నట్లు ఆయన సిబ్బంది స్పష్టం చేసింది. తీవ్ర జ్వరంతో, దగ్గుతో బాధపడుతున్న ఆయన గత నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్నారని, మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు చేసిన సూచన మేరకు ఆయన హైదరాబాద్ వస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.ఇదిలా ఉంటే.. పవన్ కల్యాణ్ సభలో లేనిది చూసి కామినేని ఈ అంశం ప్రస్తావించడం.. దానికి బాలయ్య దురుసుగా మాట్లాడడం.. ఆ టైంలో స్పీకర్ స్థానంలో ఉండి కూడా రఘురామ కృష్ణంరాజు ఉండి కూడా వారించకపోగా నవ్వుతూ చూస్తూ ఉండిపోవడం.. వీటన్నింటిని నాటకీయ పరిణామాలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో అప్పటికే సభలో జనసేన ఎమ్మెల్యేలు, మంత్రి ఉన్నారని, అయినా కూడా వాళ్ల నుంచి కనీస స్పందన లేకపోవడంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన పెద్దన్నయ్య చిరు తనకు తండ్రితో సమానం అంటూ పవన్(Pawan About Chiru) తరచూ చెబుతూ వస్తుంటారు. తల్లిని తిట్టించారని ఆవేదన వ్యక్తం చేసిన పవన్.. తర్వాత అదే టీడీపీతో పొత్తులో ఉండిపోయారు. కానీ గతంలో ఎవరైనా చిరును ఒక్క మాట అన్నా ఊరుకున్న దాఖలాలు లేవు. అలాంటిది ఇప్పుడు బాలయ్య చిరుపై నోరు జారారు. మరి ఈ వ్యాఖ్యలపై జనసేనాని ఎలా స్పందిస్తాడో చూడాలంటూ సినీ, రాజకీయ వర్గాలు కుతుహలంగా ఎదురు చూస్తున్నాయి(Will Pawan Reacts Balayya Comments).ఇదీ చదవండి: బాలయ్య వ్యాఖ్యలను తోసిపుచ్చిన చిరంజీవి -
‘విశ్వాసం లేని వ్యక్తి బాలకృష్ణ.. ఆయనే పెద్ద సైకో’
సాక్షి, తాడేపల్లి: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలపై ఇటు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. మెగా అభిమానులు కూడా బాలయ్యను టార్గెట్ చేసి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.విశాఖలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘సంస్కారం లేని వ్యక్తి బాలకృష్ణ. మందు తాగి అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. చిరంజీవి తనతో సమానమని బాలకృష్ణ అనుకుంటారు. చిరంజీవి కాలిగోటికి బాలకృష్ణ పనికిరారు. స్వశక్తితో చిరంజీవి హీరోగా ఇండస్ట్రీలో స్థానం సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ మీద చంద్రబాబు చెప్పులు వేయించిన రోజే బాలకృష్ణ చచ్చిపోయారు. బాలకృష్ణను కాల్పుల ఘటనలో కాపాడింది వైఎస్సార్. బాలకృష్ణ సినిమాలకు రేట్లు పెంచమని ఆదేశాలు ఇచ్చింది వైఎస్ జగన్. విశ్వాసం లేని వ్యక్తి బాలకృష్ణ. మెంటల్ సర్టిఫికెట్ ఉన్న వాళ్లకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదు. చిరంజీవి ప్రకటన ద్వారా బాలకృష్ణ చెప్పిందంతా అబద్ధమని తేలిపోయింది. చిరంజీవి దంపతులను వైఎస్ జగన్ దంపతులు ఎంతో గౌరవించారు. చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై జనసేన ఎలా స్పందిస్తుందో చూడాలి అని కామెంట్స్ చేశారు.వైఎస్సార్ జిల్లా...మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ..‘అసెంబ్లీలో బాలకృష్ణ జులాయిగా వ్యవహరించాడు. బాలకృష్ణ ఇంట్లో గన్ ఫైర్ ఘటనలో నిన్ను కాపాడింది వైఎస్సార్ మరిచిపోయావా?. వైఎస్ జగన్ సినీ పరిశ్రమ పట్ల స్పందించిన తీరును స్వయాన చిరంజీవి లేఖ రూపంలో తెలిపారు. నాడు వైఎస్ జగన్ చిరంజీవిని ఎంత ఆప్యాయంగా వ్యవహరించారో అందరికీ తెలుసు. సినీ ఇండస్ట్రీని ఇంటికి పిలిచి వైఎస్ జగన్ సమస్యలను పరిష్కరించారు. అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్‌ని అప్రతిష్ట పాలు చేసేలా కూటమి నాయకులు విమర్శించే పనిగా పెట్టుకున్నారు. బసవతారక క్యాన్సర్ ఆసుపత్రికి కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధికి డబ్బులు మంజూరు చేసింది జగన్ అని తెలిపారు.కాకినాడ..వైఎస్సార్సీపీ నాయకురాలు వంగా గీతా మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై బాలకృష్ణ, కామినేని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. మాజీ సీఎం పట్ల అసెంబ్లీలో బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సభను అగౌరపరచడమే. అసెంబ్లీ అనేది ఎంతో పవిత్రమైన స్ధలం. కేవలం 175 మందికి మాత్రమే ఆ పవిత్రమైన స్ధలంలోకి వెళ్ళే అవకాశం వస్తుంది. చంద్రబాబు హయంలో టీడీపీ అధికారంలోకి వచ్చాకా.. ఎన్టీఆర్ పేరును ఒక జిల్లాకైనా పెట్టారా?. వైఎస్ జగన్ మాత్రమే ఎన్టీఆర్ పేరును ఒక జిల్లాకు పెట్టారు. వైఎస్ జగన్‌కు ప్రజలంటే అభిమానం. చిరంజీవి చాలా సౌమ్యమైన వ్యక్తి. ఎప్పుడు ఒక్క అడుగు తగ్గే ఉంటారు. వైఎస్ జగన్, చిరంజీవి ఎదుట వారిని గౌరవించే వ్యక్తులు. ఎవర్ని తక్కువ చేయాలనుకునే వ్యక్తులు కాదు. అలాంటి ఆ ఇద్దరు వ్యక్తులను చాలా తేలికగా మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పు. ఇక ముందు వైఎస్ జగన్, చిరంజీవిని తక్కువగా చేసి మాట్లాడవద్దు అని హితవు పలికారు.విశాఖ..మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ..‘బాలకృష్ణ పెద్ద సైకో. బాలకృష్ణను మించిన సైకో మరొకరు లేరు. వైఎస్ జగన్‌కు బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి. అసెంబ్లీలో బాలకృష్ణ తాగి మాట్లాడారు. చిరంజీవిని చూసి బాలకృష్ణ ఓర్వలేకపోతున్నారు. చిరంజీవి ఆధ్వర్యంలో సినీ బృందాన్ని వైఎస్ జగన్ ఎంతో ఆప్యాయంగా గౌరవించారు. తాగుబోతు బాలయ్యకు నోరే సరిగా తిరగదు. బాలకృష్ణ నటనకు ఏనాడు అవార్డుల రాలేదు. రికమండేషన్లతో అవార్డులు సాధించిన వ్యక్తి బాలకృష్ణ అని చెప్పారు.వైఎస్సార్ జిల్లా.. నందమూరి బాలకృష్ణపై మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంజాద్ బాషా మాట్లాడుతూ..‘అసెంబ్లీని బాలకృష్ణ అపహాస్యం చేశారు. మందు తాగి వచ్చిన వ్యక్తిలా నందమూరి బాలకృష్ణ ప్రవర్తించాడు. ఆయన వ్యాఖ్యలను వైఎస్సార్ పార్టీ పూర్తి ఖండిస్తుంది. బాలకృష్ణ వ్యాఖ్యలను చిరంజీవి సైతం ఖండించారు. బాలకృష్ణ వ్యాఖ్యలను డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కనీసం ఖండించలేదు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
అధికార మదం తలకెక్కింది.. బాలయ్యపై మెగా అభిమానులు ఆగ్రహం
బాలకృష్ణపై చిరంజీవి అభిమాన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్‌ను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారు. బాలకృష్ణ వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. ‘బాలకృష్ణ గతంలో కూడా అనేకసార్లు అమమానకరంగా మాట్లాడడం జరిగింది. వివాదాలకు దూరంగా ఉండే చిరంజీవి వాటిపై ఎప్పుడు స్పందించలేదు. అభిమానులుగా మేము కూడా ఆయన సంయమనం పాటించాం. బాలకృష్ణ కుటుంబం అధికారంలోకి రావడానికి మెగా ఫ్యామిలీ అహర్నిశలూ కృషి చేసిది. ఆ విజ్ఞత మరిచి, అధికార మదంలో బాలకృష్ణ మాట్లాడుతున్నాడు. చట్టసభల్లో సైతం చిరంజీవి ప్రతిష్టను దిగజార్చేవిధంగా మాట్లాడేందుకు తెగించారు. ఈ వ్యాఖ్యలు మా దైవం చిరంజీవి గారిని సైతం బాధించాయని ఆయన ప్రతిస్పందన ద్వారా అర్ధమవుతోంది.మెగా కుటుంబం అండగా నిలవకపోయుంటే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఒక్కసారి ఊహించుకుంటే మంచిదని హితవు పలుకుతున్నాం. మరోసారి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే మెగా అభిమానుల తీవ్ర ఆగ్రహాన్ని చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంటుందని విన్నవిస్తున్నాం.చిరంజీవి అభిమానులుగా మేము సైతం బాలకృష్ణ వైఖరిని, వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. లేని యెడల బాలకృష్ణ ప్రజాక్షేత్రం తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం’ అని అఖిల భారత చిరంజీవి యువత పేర్కొంది.కాగా, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. చిరంజీవిని ఏకవచనంతో సంబోధిస్తూ ‘ఎవడు’ అంటూ మాట్లాడాడరు. శాసనసభలో గురువారం శాంతిభద్రతల అంశంపై చర్చ సందర్భంగా బీజేపీ సభ్యుడు కామినేని శ్రీనివాస్ మాట్లాడిన విషయాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు చిరంజీవిని అవమానించారని, ఆయన్ను కలవడానికి వెళితే కలవకుండా సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమన్నారని శ్రీనివాస్ చెప్పారు. దీనిపై జోక్యం చేసుకున్న బాలకృష్ణ.. కామినేని శ్రీనివాస్ చెప్పినదంతా అబద్ధమని కొట్టిపడేశారు. చిరంజీవి గట్టిగా అడిగితే సీఎం వచ్చాడనేది అబద్ధమని, అక్కడ గట్టిగా ఎవడూ అడగలేదని బాలకృష్ణ అన్నారు. గట్టిగా అడిగితేనే ఆయన కలవడానికి వచ్చాడని, లేకపోతే సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమన్నారనేది అసత్యమని, ఆయన గట్టిగా చెబితే దిగొచ్చాడంట.. అని వ్యంగ్యంగా అన్నారు. ‘గట్టిగా అడిగారా.. ఎవడు అడిగాడు గట్టిగా, అడిగితే వచ్చాడా వీడు కలవడానికి. నాన్సెన్స్’ అంటూ బాలకృష్ణ వ్యాఖ్యలు చేశారు. -
అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు
-
చెంప చెళ్లుమనిపించిన చిరు
-
బాలకృష్ణది సైకో బుద్ధి, సైకో ఆలోచనలు: పేర్ని నాని
సాక్షి, మచిలీపట్నం: టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ పెద్ద సైకో అంటూ ఘాటు విమర్శలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ఎన్టీఆర్, బసవ తారకమ్మ కడుపున పుట్టి అసెంబ్లీలో నీచపు మాటలా? అని ప్రశ్నించారు. చిరంజీవి ఆనాడే లేఖ రాసి ఉంటే పవన్ కల్యాణ్ నోరు కూడా మూత పడేది అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ప్రజల తరఫున గొంతుక వినిపించడం వైఎస్సార్సీపీ బాధ్యత అని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘బాలకృష్ణ ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో అర్థమైందా?. అసెంబ్లీలో బాలకృష్ణ లాంటి వారి కోసం బ్రీత్ అనలైజర్ పెట్టాలి. తప్పతాగి, కళ్లు నెత్తికెక్కి బాలకృష్ణ మాట్లాడుతున్నాడు. మందు వేస్తే బాలకృష్ణ ఏం మాట్లాడుతున్నారో తెలియదు. చిరంజీవిని కామినేని శ్రీనివాస్ పొడిగితే బాలకృష్ణ ఉండబట్టలేకపోయాడు. సైకో బుద్దులు, సైకో ఆలోచనలు బాలకృష్ణవే. అఖండ సినిమాకు సాయం చేయమని సీఎం హోదాలో వైఎస్ జగన్ చెప్పారు.సొంత అన్నలా చిరంజీవిని వైఎస్ జగన్ చూసుకున్నారు. చిరంజీవి ఆనాడే లేఖ రాసి ఉంటే పవన్ కల్యాణ్ నోరు కూడా మూత పడేది. చిరంజీవి తక్షణం స్పందించడాన్ని వైఎస్సార్సీపీ స్వాగతిస్తుంది. మీ కాళ్ల దగ్గరకు సినిమా వాళ్లు రావాలని ఎందుకు కోరుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాం నాటి జీవోనే కూటమి పాలకులు కొనసాగిస్తున్నారు. సినిమా పేదోడికి దగ్గరగా ఉండాలని ఆరోజు మీటింగ్‌లో వైఎస్ జగన్ చెప్పారు. వైఎస్సార్ సాయం చేయకపోతే బాలకృష్ణకు జీవిత ఖైదు పడేది. చంద్రబాబు హయంలో క్యాన్సర్ ఆసుపత్రి బిల్లులు ఆగిపోయాయని బాలయ్య చెప్పారు.గొంతుక వినిపించడం వైఎస్సార్సీపీ బాధ్యత..వైఎస్సార్సీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష హోదా కల్పించాలని వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రజల తరఫున గొంతుక వినిపించడం వైఎస్సార్సీపీ బాధ్యత. కైకలూరు సమస్యల గురించి ఏనాడూ కామినేని శ్రీనివాస్ మాట్లాడరు. సినిమాలు, సినిమా రేట్లు, సినిమా మనుషుల గురించి కామినేని మాట్లాడతారు. కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పారు. విచక్షణ, ఇంగితజ్ఞానం లేకుండా కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. మంత్రి పదవి కోసం కామినేని పచ్చి పాపపు మాటలు మాట్లాడారు. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. మామిడి రైతులకు నష్ట పరిహారం కింద నాలుగు పైసలు ఇచ్చారా?.ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారు..మెరిట్ లిస్టు ప్రకటించకుండా నియామక పత్రాలు ఎలా ఇస్తారు?. వైఎస్ జగన్ సీఎం అయ్యే వరకూ 1998 డీఎస్సీకి దిక్కుందా?. డీఎస్సీ ప్రశ్నాపత్నంలో అన్నీ తప్పులే.. విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలి. కూటమి ప్రభుత్వం అంటే హంగూ, ఆర్భాటం, హడావుడి ఉంటుంది. అలాగే, కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారని ప్రశ్నించారు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.. ఏమైంది?. కూటమి పాలకులు హెలికాప్టర్లు, విమానాల్లో ఉంటారు.. ప్రజలు ఎవరిని అడగాలి అని ప్రశ్నల వర్షం కురిపించారు. డీఎస్సీ ప్రశాపత్నంలో అన్నీ తప్పులే.. విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలని నాని డిమాండ్ చేశారు. -
అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందన
-
జనసేన బానిసత్వం ఇంకెన్నాళ్లు?: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో బసవతారకం ఆస్పత్రికి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎంతో సహకరించారని, అలాంటి వ్యక్తిపై నోరు పారేసుకుని నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) తప్పు చేశారని వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ, వైఎస్ జగన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యపై శుక్రవారం నిరసన చేపట్టారాయన. శుక్రవారం బాడవ పేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం సమర్పణలో దేవినేని అవినాష్(Devineni Avinash) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు మంచి చేసిన వ్యక్తి వైఎస్ జగన్. అలాంటి వ్యక్తిపై అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు(Balayya Comments On YS Jagan) సభ్యసమాజానికి సిగ్గుచేటు. ఎన్టీఆర్, వైఎస్సార్.. ఇద్దరూ మాకు దైవ సమానులే. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై కూడా మీకు గౌరవం ఉండేది. కానీ, ఈ వ్యాఖ్యలతో బాలకృష్ణపై ఉన్న గౌరవం పోయింది. గతంలో తాను అధికారంలో ఉండగా చంద్రబాబు ఏ ఒక్క పథకానికైనా ఎన్టీఆర్ పేరు పెట్టారా?. కనీసం అలాంటి ఆలోచనైనా చేశారా?. ఈ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన దమ్ము వైఎస్ జగన్‌ది. ఆయన అధికారంలో ఉండగా బాలకృష్ణ సినిమాలకే కాదు.. బసవతారకం ఆస్పత్రికి కూడా సహకరించారు. మంచి చేసిన వారిని తూలనాడటం బాలకృష్ణకు అలవాటు. బెజవాడ సాక్షిగా మోదీ తల్లిని తిట్టి మళ్లీ వాటేసుకున్న వ్యక్తి బాలకృష్ణ. అలాంటి వ్యక్తి ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు.. ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. వైఎస్సార్, జగన్ వల్ల మీ కుటుంబానికి జరిగిన మేలును బాలకృష్ణ ఓసారి గుర్తు చేసుకోవాలి. సభలో లేని.. అసలు సంబంధంలేని చిరంజీవిని కూడా బాలకృష్ణ తూలనాడారు. చిరంజీవిని తులనాడినా(Balayya on Chiru).. జనసేన తరఫు నుంచి కనీసం స్పందన లేదు. సభలో ఉన్న జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆ వ్యాఖ్యలను ఖండించలేదు. ఎందుకు ఇంకా మీకు ఇంతటి బానిసత్వం?. నిండు సభలో చిరంజీవిని అవమానిస్తే ఏమైపోయారు మీరంతా?. మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారంతో తిరిగి ఏమీ అనలేకపోతున్నాం. కూటమి ఎమ్మెల్యేలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని అంబేద్కర్ ను కోరుకున్నాం. బాలకృష్ణ తక్షణమే జగన్ మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి అని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. ఈ నిరసనల్లో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పాటు విజయవాడ డిప్యూటీ మేయర్లు బెల్లందుర్గ , అవుతు శైలజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: చిరు.. ఎవడు?? -
ఇటు వైఎస్సార్సీపీ.. అటు మెగా ఫ్యాన్స్.. బాలయ్యకు బంతాటే!
సాక్షి, అమరావతి: అగ్రనటుడు చిరంజీవిని అసెంబ్లీ సాక్షిగా టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ అవమానించడంపై మెగా ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. అదే సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడడంపైనా వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో బాలయ్యను ఇరు వర్గాలు బంతాట ఆడుకుంటున్నాయి.అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ రెచ్చిపోయారు. మెగాస్టార్ చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాడెవడు అంటూ నోరుపారేసుకున్నారు. అయితే, బాలకృష్ణ మాట్లాడుతున్న సమయంలో సీఎం చంద్రబాబు సహా జనసేన ఎమ్మెల్యేలు కూడా స్పందించకపోవడంపై మెగా అభిమానులు మండిపడుతున్నారు. దీనిపై స్పందించాలంటూ చిరంజీవి అభిమానులు పవన్ కల్యాణ్‌ను సైతం కోరుతున్నారు. సోషల్‌మీడియాలో బాలయ్యను ట్రోల్ చేస్తున్నారు.మరోవైపు.. అసెంబ్లీలోనే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌పై కూడా బాలకృష్ణ అనుచితంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు.. బాలకృష్ణపై మండిపడుతున్నారు. నోరు అదుపులోకి పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిస్తున్నారు. బాలకృష్ణ మానసిక స్థితిని పరీక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీకి, సినిమా ఫంక్షన్‌కు తేడా తెలియకుండా మాట్లాడారు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు మీదున్న కోపాన్ని వైఎస్ జగన్ మీద చూపిస్తే ఎలాగంటూ ప్రశ్నించారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన బుద్ధి చెబుతామంటూ హెచ్చరించారు . -
మెగాస్టార్ చిరంజీవిపై అసెంబ్లీ వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
-
గట్టిగా ‘ఎవడూ’ అడగలేదు
సాక్షి, అమరావతి: మెగాస్టార్ చిరంజీవిపై హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ శాసన సభలో గురువారం అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని ఏకవచనంతో సంబోధిస్తూ ‘ఎవడు’ అంటూ మాట్లాడారు. శాసనసభలో గురువారం శాంతిభద్రతల అంశంపై చర్చ సందర్భంగా బీజేపీ సభ్యుడు కామినేని శ్రీనివాస్ మాట్లాడిన విషయాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు చిరంజీవిని అవమానించారని, ఆయన్ను కలవడానికి వెళితే కలవకుండా సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమన్నారని శ్రీనివాస్ చెప్పారు.దీనిపై జోక్యం చేసుకున్న బాలకృష్ణ.. కామినేని శ్రీనివాస్ చెప్పినదంతా అబద్ధమని కొట్టిపడేశారు. చిరంజీవి గట్టిగా అడిగితే సీఎం వచ్చాడనేది అబద్ధమని, అక్కడ గట్టిగా ఎవడూ అడగలేదని బాలకృష్ణ అన్నారు. గట్టిగా అడిగితేనే ఆయన కలవడానికి వచ్చాడని, లేకపోతే సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమన్నారనేది అసత్యమని, ఆయన గట్టిగా చెబితే దిగొచ్చాడంట.. అని వ్యంగ్యంగా అన్నారు. ‘గట్టిగా అడిగారా.. ఎవడు అడిగాడు గట్టిగా, అడిగితే వచ్చాడా వీడు కలవడానికి. నాన్సెన్స్’ అంటూ బాలకృష్ణ వ్యాఖ్యలు చేశారు. జగన్‌పైనా పరుష పదజాలం ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి బాలకృష్ణ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘ఇండస్ట్రీ వాళ్లు సైకో గాడిని కలవడానికి వెళ్లినప్పుడు..’ అంటూ పరుష పదజాలాన్ని వాడటమేకాక వాడు, వీడు అంటూ సభ్యత లేకుండా మాట్లాడారు. ఆయన మాట్లాడిన తీరును బట్టి ఆయన మామూలుగా లేరనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కూటమి పాలనలోనూ అవామనం అంటూ ఆగ్రహంకూటమి ప్రభుత్వంలోనూ తనకు అవమానం జరిగినట్టు బాలకృష్ణ ఫైర్ అయ్యారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కి లిస్ట్ తయారు చేయమని ఈ ప్రభుత్వంలోనూ తనకు ఆహా్వనపత్రం వచ్చిందని, అందులో తనది తొమ్మిదో పేరు వేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అది వేసింది ఎవడని సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్‌ని అడిగానని చెప్పారు. -
జగన్ నన్ను సాదరంగా ఆహ్వానించారు: చిరంజీవి
సాక్షి, అమరావతి: సినీ పరిశ్రమలో సమస్యలపై చర్చించేందుకు గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనను సాదరంగా ఆహ్వనించినట్లు సినీ నటుడు చిరంజీవి స్పష్టం చేశారు. అసలు వైఎస్ జగన్ ఆహ్వానం మేరకే ఆయన నివాసానికి వెళ్లినట్లు తెలిపారు. భోజనం చేస్తున్న సమయంలోనే తాను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని అప్పటి సీఎం జగన్‌కు వివరించినట్టు స్పష్టం చేశారు. గురువారం శాసనసభలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడిన అంశంపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ తన ప్రస్తావన తీసుకురావడంపై స్పందిస్తూ చిరంజీవి ఓ ప్రకటన విడుదల చేశారు.‘‘అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ చెప్పినట్లు చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం. గట్టిగా ఎవడూ అడగలేదు అక్కడ. ఆయనంత గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట. లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టరును కలవండన్నాడట.. అంటూ బాలకృష్ణ ఒకింత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ చానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను. ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చినందుకు నేను ప్రజలకు వివరణ ఇవ్వాలనుకుంటున్నా’’ అంటూ చిరంజీవి స్పందించారు. ఆ ప్రకటనలో చిరంజీవి ఇంకా ఏం చెప్పారంటే.. నన్ను చొరవ తీసుకోమన్నారు.. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం చాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చారు. సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్, ఎన్టీ రామారావు, డీవీవీ దానయ్య, మైత్రి మూవీస్.. ఇంకా ఇద్దరు, ముగ్గురు ప్రముఖులు నా దగ్గరకు వచ్చారు. వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఫోన్లో మాట్లాడాను. టికెట్ల ధరల విషయం సీఎంతో మాట్లాడి చెబుతానన్నారు. నా చొరవతోనే టికెట్ ధరల పెంపు సాధ్యమైంది సినీ ప్రముఖుల అందరి సమక్షంలోనే నాటి సీఎం వైఎస్ జగన్‌కు పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించి సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యం. నేను ఆ చొరవ తీసుకోవడం వల్లే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది. ఆ నిర్ణయంతో మీ వీరసింహారెడ్డి సినిమాకైనా, నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్లు పెంచడానికి కారణమైంది. తద్వారా ఇటు నిర్మాతలకు, అటు డి్రస్టిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకొనే విధానంలోనే మాట్లాడతా. నేను ఇండియాలో లేను. అందుకే ప్రకటన విడుదల చేస్తున్నాను. సీఎం ఆహ్వానం మేరకే ఇంటికి వెళ్లాను అప్పటి మంత్రి పేర్ని నాని ఓ రోజు ఫోన్ చేసి ‘ముఖ్యమంత్రి ముందు మీతో వన్ టు వన్ కలుస్తానని చెప్పారు. భోజనానికి (లంచ్‌కి) రావాలని చెప్పారు’ అంటూ అపాయింట్మెంట్ ఇచ్చారు. సీఎం జగన్ ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్లాను. నన్ను ఎంతో సాదరంగా ఆహ్వానించారు. భోజనం చేస్తున్న సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వారికి వివరించాను. ఇండస్ట్రీకి, మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను.కొన్ని రోజుల తర్వాత మంత్రి నాని నాకు ఫోన్ చేసి కోవిడ్ రెండో దశ కొనసాగుతున్నందున ఐదుగురు మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పారు. నేనప్పుడు ఓ పది మంది వస్తామని చెబితే సరేనన్నారు. డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణను ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నిస్తే అందుబాటులోకి రాలేదు. జెమిని కిరణ్‌ను వెళ్లి బాలకృష్ణను కలవమని చెప్పాను. ఆయన మూడుసార్లు ప్రయత్నించినా బాలకృష్ణను కలవలేకపోయారు. దీంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్.నారాయణమూర్తితో సహా కొంత మందిని తీసుకుని వెళ్లి సీఎం జగన్‌ను కలిశాం. -
బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందన
హైదరాబాద్ ఏపీ అసెంబ్లీలో నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) స్పందించారు. అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ఆహ్వానం మేరకు కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లామని చిరంజీవి స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను జగన్ దృష్టికి తీసుకెళ్లడం కొరకే వెళ్లినట్లు తెలిపారు చిరంజీవి. ఈ రోజు(గురువారం, సెప్టెంబర్ 25) అసెంబ్లీ వేదికగా మాట్లాడిన బాలకృష్ణ.. గత ప్రభుత్వం సమయంలో సినిమా ఇండస్ట్రీ పెద్దలు తనకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ప్రధానంగా వైఎస్ జగన్‌కు కలిసేందుకు వెళ్లిన సమయంలో తనను సినీ పెద్దలు పట్టించుకోలేదన్నారు బాలకృష్ణ. దీనిపై స్పందించిన చిరంజీవి లేఖ రూపంలో వివరణ ఇచ్చారు. ఇండస్ట్రీలో సమస్యల కొరకు వైఎస్ జగన్‌కు కలిసేందుకు వెళ్లాం. ఆయన ఆహ్వానం మేరకే వెళ్లాం. ‘మేము పదిమంది వస్తామంటే జగన్ కూడా ఓకే చెప్పారు. సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని జగన్‌కు వివరించాం. అసమయం వస్తే అందరం కలిసి వస్తామని చెప్పాం. జగన్ నన్ను సాదరంగా ఆహ్వానించారు. కోవిడ్ వల్ల ఐదుగురు రావాలన్నారు. పదిమంది వస్తామన్నా సరేనన్నారు వైఎస్ జగన్. ఆ సమయంలో బాలకృష్ణకు ఫోన్ చేస్తే ఆయన స్పందించలేదు. బాలకృష్ణను కలవాలని జెమినీ కిరణ్‌కు చెప్పా. మూడుసార్లు ప్రయత్నించినా బాలకృష్ణ కలవలేకపోయారు. నారాయణమూర్తి సహా కొందరు జగన్‌ను కలిశాం. నా చొరవ వల్లే టికెట్ల ధరల పెంపునకు అంగీకరించారు. దీనికి సమావేశంలో ఉన్నవారంతా సాక్షులే. ప్రభుత్వ నిర్ణయం వల్ల సినీ పరిశ్రమకు మేలు జరిగింది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య టికెట్ ధరలు పెరిగాయి. సీఎంతోనైనా, సామాన్యుడితోనైనా నా సహజ ధోరణిలో గౌరవం ఇచ్చిపుచ్చుకునేలా మాట్లాడుతా. నేను గట్టిగా మాట్లాడితే వైఎస్ జగన్ దిగివచ్చారన్నది అంతా అబద్ధం. ఈరోజు అసెంబ్లీలో నా పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టే వివరణ ఇస్తున్నా’ అని లేఖ ద్వారా వివరణ ఇచ్చే యత్నం చేశారు చిరంజీవి. -
'కొణిదెల శివ శంకర వరప్రసాద్' అనబడే నేను..!
సినీ రంగంలో స్టార్ అనే హోదా చాలామందికి వస్తుంది. కానీ ఆ గుర్తింపును కెరీర్ మొత్తం కొనసాగించాలంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇక ఇండస్ట్రీలో మెగాస్టార్ అనిపించుకునే అదృష్టం కొందరికే ఉంటుంది. మన తెలుగు సినీరంగంలో అలాంటి ఘనత సొంతం చేసుకున్న హీరో ఆయనొక్కరే. మన టాలీవుడ్లో ఇప్పటికీ.. ఎప్పటికీ ఆయనే మెగాస్టార్. ఆయనే మన కొణిదెల శివ శంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి.చిరంజీవి తన కెరీర్ మొదలుపెట్టి 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. 22 సెప్టెంబర్ 1978న ప్రాణం ఖరీదు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యానని ట్వీట్ చేశారు. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి మీ ముందు మెగాస్టార్‌గా నిలబెట్టిందన్నారు. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటానని పోస్ట్ చేశారు.(ఇది చదవండి: హౌస్‌లో తనే నెం.1, ఇచ్చిపడేసిండు.. ప్రియపై బిగ్‌బాంబ్ వేసిన మనీష్)చిరంజీవి తన ట్వీట్లో రాస్తూ..'22 సెప్టెంబర్ 1978 'కొణిదెల శివ శంకర వరప్రసాద్' అనబడే నేను.. ప్రాణం ఖరీదు.. చిత్రం ద్వారా 'చిరంజీవిగా' మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.. మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్‌గా.. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను. నేటికి 155 సినిమాలను నేను పూర్తి చేసుకున్నాను అంటే... అందుకు కారణం నిస్వార్ధమైన మీ ప్రేమే కారణం. ఈ 47 ఏళ్లలో నేను పొందిన ఎన్నో అవార్డులు, గౌరవమర్యాదలు నావీ కావు, మీ అందరివీ, మీరందించినవి. మనందరి మధ్య ఈ ప్రేమానుబంధం ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ... కృతజ్ఞతలతో మీ చిరంజీవి' అంటూ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.కాగా.. మెగాస్టార్‌గా అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్న చిరంజీవి.. ప్రస్తుతం విశ్వంభర, మనశివశంకర వరప్రసాద్ గారు అనే సినిమాలు చేస్తున్నారు. 70 ఏళ్ల వయసులో తన యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా రాణిస్తున్నారు. ఇవాళ తన తొలి సినిమా పూర్తై 47 ఏళ్లు కావడంతో ఆ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.22 సెప్టెంబర్ 1978'కొణిదెల శివ శంకర వరప్రసాద్' అనబడే నేను “ప్రాణం ఖరీదు” చిత్రం ద్వారా 'చిరంజీవిగా' మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.., మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్ గా.. అనుక్షణం… pic.twitter.com/1VSVTu9Kkz— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2025 -
దసరాకి పాట?
చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ట్యాగ్‌లైన్. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.2026 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే కొన్నిపాటలను సిద్ధం చేశారట భీమ్స్. ప్రమోషన్లలో భాగంగా దసరా సందర్భంగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి తొలిపాటను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.వినాయక చవితి పండగని పురస్కరించుకుని ప్రత్యేకపోస్టర్ని విడుదల చేసిన యూనిట్.. ఇప్పుడు దసరాకి తొలిపాట రిలీజ్ చేసి, సినిమాపై మరింత క్రేజ్ పెంచాలన్నది ఆలోచనట. మరి... దసరా పండగకిపాట విడుదల చేస్తారా? లేదా? లేకుంటే మరేదైనా అప్డేట్ ఉంటుందా? అన్నది వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వం వహించిన ‘విశ్వంభర’ సినిమా 2026 వేసవిలో రిలీజ్ కానుంది. -
చిరు మూవీలో విలన్ గా మంచు మనోజ్
-
'మిరాయ్' విలనిజం తెచ్చిన మెగా అవకాశం?
తెలుగు సినిమాల్లో విలన్ అంటే దాదాపు నార్త్ ముఖాలే కనిపిస్తుంటాయి. కానీ రీసెంట్ టైంలో తెలుగు హీరోలు కూడా ప్రతినాయక పాత్రలు చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా జగపతిబాబు.. స్టార్ హీరోల సినిమాల్లో విలన్‌గా చేసి ఆకట్టుకున్నారు. రీసెంట్గా వచ్చిన 'మిరాయ్'తో మంచు మనోజ్ విలనిజం చూపించాడు. మంచి పేరు కూడా సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే పలు సినిమాల్లో ఈ తరహా రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే 'మిరాయ్'లో మనోజ్ చేసిన విలనిజం ఇప్పుడు మెగా అవకాశం తెచ్చినట్లు తెలుస్తోంది. ఏకంగా చిరంజీవి మూవీలో మనోజ్ విలన్‌గా చేయబోతున్నాడని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడితో 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా చేస్తున్న చిరు.. తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'జూనియర్'.. స్ట్రీమింగ్ డేట్ ప్రకటన)చిరు-బాబీ గతంలో 'వాల్తేరు వీరయ్య'తో హిట్ కొట్టారు. ఇప్పుడు తీయబోయే సినిమా యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఉండబోతుందని పోస్టర్‌తోనే అర్థమైంది. ఇందులో చిరంజీవికి విలన్‌గా మంచు మనోజ్‌ని తీసుకునే ఆలోచన చేస్తున్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉందని, త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ రావొచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే మనోజ్ దశ తిరిగినట్లే.మనోజ్ ఒకప్పుడు హీరోగా సినిమాలు చేశాడు. చాన్నాళ్ల నుంచి యాక్టింగ్ పక్కనబెట్టేశాడు. ఈ ఏడాది 'భైరవం'తో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ మూవీ ఫెయిలైంది. కానీ 'మిరాయ్' హిట్ కావడం ఇతడికి కలిసొచ్చినట్లు కనిపిస్తుంది. ప్రతినాయక పాత్రలు చేస్తే మాత్రం స్టార్ హీరోలకు మనోజ్ ఓ ఆప్షన్ అవుతాడేమో?(ఇదీ చదవండి: మౌళి.. రౌడీ టీ షర్ట్, మహేశ్ ట్వీట్.. ఇవన్నీ ఫేక్: బండ్ల గణేశ్) -
పక్కా లోకల్.. పాన్ ఇండియా వద్దు..!
-
చిరంజీవితో 'మిరాయ్' దర్శకుడు సినిమా
తేజ సజ్జా, మంచు మనోజ్, శ్రియ కీలక పాత్రల్లో నటించిన ఫాంటసీ అడ్వెంచర్ మూవీ మిరాయ్... దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందాడు. సుమారు పదేళ్లుగా సినీ రంగంలో ఉన్న ఆయన మిరాయ్తో భారీ హిట్ అందుకున్నారు. అయితే, తాజాగా మెగాస్టార్ చిరంజీవితో కార్తీక్ సినిమా ఛాన్స్ దక్కించుకున్నాడు. కానీ, దర్శకుడిగా కాదు.వాల్తేరు వీరయ్య విజయం తర్వాత చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో మరో సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే అవకాశముంది. త్వరలోనే సెట్స్ మీదకు ఈ ప్రాజెక్ట్ వెళ్లనుంది. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా కార్తిక్ ఘట్టమనేని చేయబోతున్నారు. మెగాస్టార్‌తో తొలిసారి ఆయనకు ఛాన్స్ రావడంతో ఆయన సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిన్ను కోరి, ఎక్స్‌ప్రెస్ రాజా,ధమాకా, కార్తీకేయ, చిత్రలహరి వంటి సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. తాజాగా విడుదలైన మిరాయ్ మూవీ సినిమాటోగ్రాఫర్ కూడా కార్తిక్ కావడం విశేషం. సినిమాటోగ్రాఫర్‌గా కార్తీక్‌కు మంచి గుర్తింపు ఉంది. దర్శకుడిగా పనిచేస్తూనే ఆయన తన కెమెరాకు కూడా పని చెప్తారు. డైరెక్టర్‌గా తొలిచిత్రం సూర్య వర్సెస్ సూర్య తర్వాత మిరాయ్తో భారీ హిట్ అందుకున్నారు. -
చిరు- బాబీ మూవీకి ముహూర్తం ఫిక్స్..!
-
సందడే సందడి
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో జరుగుతోంది. చిరంజీవి, నయనతారలపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు. ఇదే స్టూడియోలో మరో కాంప్లెక్స్‌లో విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో సంయుక్త, టబు, విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూట్లో భాగంగా విజయ్ సేతుపతి, టబుతో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు పూరి. రెండు సినిమాల షూటింగ్స్ ఒకే స్టూడియోలో జరుగుతుండటంతో షాట్ గ్యాప్‌లో ‘మన శంకరవరప్రసాద్ గారు’ యూనిట్‌ని కలిసి, సందడి చేసింది పూరి అండ్ టీమ్. ఇక ‘మన శంకరవర ప్రసాద్ గారు’ 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే విజయ్ సేతుపతి– పూరి జగన్నాథ్ చిత్రం కూడా 2026 ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘లిటిల్ మ్యాన్’ అంటూ కొడుకు ఫోటో షేర్ చేసిన వరుణ్.. చిరంజీవి పోస్ట్ వైరల్
మెగా ఫ్యామిలీలో సందడి వాతావరణం నెలకొంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జంట తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. ఈ రోజు ఉదయం (సెప్టెంబర్ 10) హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో లావణ్య త్రిపాఠి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా ఈ విషయాన్ని వరుణ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. ‘మా లిటిల్ మ్యాన్’ అంటూ ఒళ్లో బిడ్డను ఎత్తుకొని ఉన్న లావణ్య నుదిటిపై ముద్దు పెడుతున్న ఆయన ఫోటోని షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7)మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. వరుణ్ జంటకు కంగ్రాట్స్ చెప్పారు. ‘కొణిదెల ఫ్యామిలీలోకి మరోవ్యక్తి వచ్చాడు. వరుణ్, లావణ్యకు శుభాకాంక్షలు. నాగబాబు, పద్మజ గ్రాండ్ పెరెంట్స్గా ప్రమోట్ అయినందుకు ఆనందంగా ఉంది’అంటూ బాబుని తన చేత్తుల్లో ఎత్తుకొని ఉన్న ఫోటోని షేర్ చేశాడు. చిన్నారికి అభిమానుల ఆశీస్సులు ఉండాలి అని చిరంజీవి కోరారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela)కాగా, లావణ్య, వరుణ్లది ప్రేమ వివాహం. మిస్టర్ (2017) సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. కొంతకాలం డేటింగ్ చేసి, 2023 నవంబర్‌లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. గర్భం దాల్చిన విషయాన్ని ఈ ఏడాది మేలో సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు మెగా ఫ్యామిలీ చెబుతోంది. -
అల్లు కనకరత్నం పెద్దకర్మ... చిరు, రామ్ చరణ్ సహా (ఫొటోలు)
-
మాస్ డ్యాన్స్?
మాస్ డ్యాన్స్ చేస్తారా? రొమాంటిక్ సాంగ్ పాడుకుంటారా? ఇంతకీ చిరంజీవి–నయనతార ఏ తరహా పాట చేయనున్నారు? అనే చర్చ జరుగుతోంది. ఈ చర్చకు కారణం ఈ ఇద్దరూ పాల్గొనగా ఒక పాట చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తోంది ‘మన శంకరవరప్రసాద్ గారు’ యూనిట్. చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గార పాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’.ఇటీవల ఆరంభమైన ఈ చిత్రం కొత్త షెడ్యూల్లో చిరంజీవి, నయనతార, ఇతర ముఖ్య తారలు పాల్గొనగా టాకీ పార్ట్ షూట్ చేశారు. నేటి నుంచి చిరంజీవి, నయనతార పాల్గొనగా హైదరాబాద్‌లో ఒక పాట చిత్రీకరించనున్నట్లు యూనిట్ పేర్కొంది. ‘‘భీమ్స్ సిసిరోలియో ఈ సినిమా కోసం అద్భుతమైన ఆల్బమ్ రూపొందించారు.చిరంజీవి–నయనతారపై చిత్రీకరించే పాటకు డ్యాన్స్ మాస్టర్ విజయ్ పోలంకి కొరియోగ్రఫీ చేస్తారు’’ అని యూనిట్ తెలియజేసింది. అయితే... ఇది మాస్ నంబరా? రొమాంటిక్ సాంగా? అనేది తెలియాల్సి ఉంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి. -
జోరుగా హుషారుగా షూటింగ్‌కి పోదమా
ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపూ సొలుపూ ఉండదన్నట్లు జోరుగా షూటింగ్స్ చేస్తారు స్టార్స్. అలాంటివారికి హఠాత్తుగా బ్రేక్ వస్తే... ఓ నాలుగైదు రోజులు బాగానే ఉంటుంది. కానీ దాదాపు 20 రోజులు బ్రేక్ వస్తే... ఎప్పుడెప్పుడు షూటింగ్స్‌కి పోదామా అని వెయిట్ చేస్తారు. తెలుగు చలన చిత్ర కార్మికుల సమ్మె కారణంగా ఆ మధ్య దాదాపు 20 రోజులు బ్రేక్ రావడం, ఈ మధ్యే మళ్లీ షూటింగ్స్ మొదలు కావడంతో ‘జోరుగా హుషారుగా షూటింగ్‌కి పోదమా’ అంటూ భాగ్యనగరంలో కొందరు స్టార్స్ షూటింగ్స్‌తో బిజీ అయ్యారు. ఆ విశేషాలు...స్పీడుగా శంకరవరప్రసాద్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ‘సైరా: నరసింహారెడ్డి, గాడ్‌ఫాదర్’ చిత్రాల తర్వాత హీరో చిరంజీవి, హీరోయిన్ నయనతార కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఇంకా ఈ చిత్రంలో వెంకటేశ్, వీటీవీ గణేశ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. క్యాథరిన్ మరో కీలక పాత్రలో కనిపిస్తారని తెలిసింది. కాగా ఆగస్టు 5న ప్రారంభం కావాల్సిన ఈ చిత్రం కొత్త షూటింగ్ షెడ్యూల్ సినీ కార్మికుల సమ్మె కారణంగా వాయిదా పడింది.తాజాగా ఈ షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ప్రారంభమైంది. చిరంజీవితో పాటు ఈ చిత్రంలోని కీలక తారాగణం పాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. కాగా ఈ షెడ్యూల్లోనే చిరంజీవి–వెంకటేశ్ కాంబినేషన్లో కూడా కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని, వీరి కాంబినేషన్లోనే ఓ సెలబ్రేషన్ సాంగ్‌ను కూడా చిత్రీకరించాలని ఈ చిత్రదర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేశారని తెలిసింది. సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.అయితే కార్మికుల సమ్మె కారణంగా ఒక షెడ్యూల్ చిత్రీకరణ ఆలస్యమైంది కనుక ఇకపై పెద్దగా బ్రేక్స్ లేకుండా స్పీడ్‌గా షూటింగ్ పూర్తి చేసి, సంక్రాంతి బరిలోనే ఈ సినిమాను నిలపాలని ఈ చిత్రయూనిట్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇక ఈ చిత్రంలో శంకరవరప్రసాద్ పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు. ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఆయన పాత్ర ఉంటుంది. చిరంజీవి–నయనతార భార్యాభర్తలుగా నటిస్తున్నారు. వెంకటేశ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. చలో గ్రీస్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న హారర్ కామెడీ సినిమా ‘ది రాజాసాబ్’. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, రిద్ధీ కుమార్, నిధీ అగర్వాల్ హీరోయిన్లు్లగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రభాస్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. ఈ షూటింగ్ షెడ్యూల్ పూర్తి కాగానే గ్రీస్ వెళ్లనుందట ‘ది రాజాసాబ్’ చిత్రయూనిట్. అక్కడ పాటలు చిత్రీకరించనున్నారట.ఆల్రెడీ ఈ చిత్రదర్శకుడు మారుతి అక్కడి లొకేషన్స్ చూసొచ్చారట. ఈ గ్రీస్ షెడ్యూల్‌తో ‘ది రాజాసాబ్’ చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందని సమాచారం. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 5న విడుదల కావాల్సింది. అయితే ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ చేయనున్నట్లుగా విశ్వప్రసాద్ ఇటీవల వెల్లడించారు. ఇక ‘ది రాజాసాబ్’ సినిమాలో సంజయ్ దత్, వీటీవీ గణేశ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో తాత–మనవళ్లుగా సంజయ్ దత్–ప్రభాస్ కనిపిస్తారని టాక్.విదేశాలకు డ్రాగన్హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూ పొందుతున్న సినిమా ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్). ఈ పీరియాడికల్ యాక్షన్ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగు తోందని తెలిసింది. ఎన్టీఆర్ షూట్లో పాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. కొంత టాకీ పార్టుతో పాటు ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారట ప్రశాంత్ నీల్. అయితే ఈ సినిమా నెక్ట్స్ షూటింగ్ షెడ్యూల్‌ను ప్రశాంత్ నీల్ విదేశాల్లో ప్లాన్ చేశారని, ఈ దిశగా ఏర్పాట్లు కూడా మొదలై పోయాయనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇంకా ఈ సినిమా ప్రధాన కథకు ఇంటర్నేషనల్ టచ్ ఉంటుందని, ప్రధాన కథాంశం 1969 నేపథ్యంలో ఉంటుందని, ముఖ్యంగా కోల్కత్తా ప్రస్తావన ఉంటుందని తెలిసింది. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ–సిరీస్ ఫిల్మ్స్ పతాకాలపై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది. మాస్ జడల్... ఒక హిట్ కాంబినేషన్లో మళ్లీ సినిమా రూ పొందితే ఎన్ని అంచనాలు ఏర్పడతాయో అన్నీ ‘ది ప్యారడైజ్’ సినిమాపై ఉన్నాయి. ‘దసరా’ వంటి హిట్ మూవీ తర్వాత ఆ చిత్రకథానాయకుడు నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో రూ పొందుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ చిత్రంలో నాని పాత్ర పేరు జడల్. ఇప్పటివరకు విడుదల చేసిన స్టిల్‌లో ఓ లుక్‌లో నాని రెండు జడలు వేసుకుని కనిపించారు. హీరో లుక్, స్టోరీ, టేకింగ్... ఇలా ప్రతిదీ డిఫరెంట్‌గా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది.కాగా... సినిమాలో నాని వేసుకునే జడలకు, ఈ చిత్రదర్శకుడు శ్రీకాంత్ ఓదెల జీవితానికి చిన్న కనెక్షన్ ఉందట. శ్రీకాంత్ ఐదో తరగతి వరకూ అతని తల్లి ఇలా రెండు జడలు వేసి స్కూల్‌కి పంపించేవారట. ఇది మాత్రమే కాదు... నాని క్యారెక్టర్‌కి జడలు వేయడం వెనక వేరే కారణం ఉందట. అది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అని ఆ మ«ధ్య ఓ సందర్భంలో శ్రీకాంత్ పేర్కొన్నారు. ఇక జడల్ పాత్రలో నాని ఫుల్ మాస్‌గా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో జరుగుతోంది. టాకీ పార్ట్ చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో విడుదల చేయనున్నారు. శంకర్‌పల్లిలో... హీరో రవితేజ వరుస సినిమాలతో బిజీ బిజీగా దూసుకెళుతుంటారు. ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో రెండు మూడు సినిమాలు కమిట్ అవడంతో పాటు సెట్స్‌పైకి తీసుకెళుతుంటారాయన. రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆర్టీ 76’ (వర్కింగ్ టైటిల్). కిశోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూ పొందుతోన్న ఈ సినిమాలో రవితేజ ట్రేడ్‌మార్క్ కామిక్ టైమింగ్, మాస్ అప్పీల్ మిస్ కాకుండా ఉండేలా కథను సిద్ధం చేశారట కిశోర్ తిరుమల.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌కి సమీపంలోని శంకర్‌పల్లిలో జరుగుతోంది. ఈ చిత్రం కోసం వేసిన ప్రత్యేకమైన సెట్లో షూటింగ్ కొనసాగుతోందట. రవితేజతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట కిశోర్ తిరుమల. శరవేగంగా ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రోడక్షన్ పూర్తి చేసి, 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉందట యూనిట్. ఇదిలా ఉంటే... రవితేజ హీరోగా నటించిన 75వ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహించారు.‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రవితేజ–శ్రీలీల ఈ సినిమాలో రెండోసారి జోడీగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ పోస్ట్ పోన్ అయిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుందనే వార్తలు ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్నాయి. ముచ్చింతల్‌లో... రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ ఫేమ్ పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర, రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబరు 28న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది.ఈ సినిమాలో ఉపేంద్ర ఓ స్టార్ హీరోగా నటిస్తుండగా, ఆయన వీరాభిమాని పాత్రలో రామ్ నటిస్తున్నారు. రాజమండ్రిలో 34 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తర్వాతి షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు యూనిట్. గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కొద్ది రోజులు షూటింగ్స్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం ముచ్చింతల్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. హీరో హీరోయిన్లతో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట పి. మహేశ్‌బాబు. వివేక్–మెర్విన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘పప్పీ షేమ్...’ అంటూ సాగే పాటని ఈ నెల 8న విడుదల చేయనున్నారు. మిస్టిక్ థ్రిల్లర్... ‘తండేల్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు హీరో నాగచైతన్య. అంతేకాదు... తొలిసారి ఆయన వంద కోట్ల క్లబ్లో చేరారు. అలాంటి హిట్ మూవీ తర్వాత నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్సీ 24’ (వర్కింగ్ టైటిల్). ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాని తన ఖాతాలో వేసుకున్న మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. ‘విరూపాక్ష’ (2023) వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది.బాపినీడు సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మిస్టిక్ థ్రిల్లర్‌గా రూ పొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఇందుకోసం ఓ ప్రత్యేకమైన సెట్ రూ పొందించారు మేకర్స్. ఈ సినిమాలో నాగచైతన్య సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఈ లుక్ కోసం ఆయన శారీరకంగా కొత్తగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు కూడా. అలాగే మీనాక్షీ చౌదరి కూడా సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఇక ప్రస్తుతం నాగచైతన్య, మీనాక్షీ చౌదరితో పాటు ఇతర ముఖ్యమైన నటీనటులపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట కార్తీక్ వర్మ. మాదాపూర్‌లో... ‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ వంటి చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఈ సినిమాలతో ఆయనకంటూ ప్రత్యేకమైన మేనరిజమ్‌ని, యూత్‌లో మాంచి ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్నారాయన. సిద్ధు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. ఈ మూవీలో రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా, వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు.ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరుగుతోంది. సిద్ధు శైలి వినోదంతో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూ పొందుతోన్న ఈ చిత్రంలో మనసుని హత్తుకునే భావోద్వేగాలు, అనుబంధాలు కూడా ఉంటాయట. దీపావళి కానుకగా అక్టోబర్ 17న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే... ఈ దీపావళికి సిద్ధు జొన్నలగడ్డ నవ్వుల మతాబులు పేల్చనున్నారన్నమాట. కొనసాగుతున్న సంబరాలు సాయిదుర్గా తేజ్ కథానాయకుడిగా రూ పొందుతున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. రోహిత్ కేపీ ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘హనుమాన్’ (2024) సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ‘ఎస్వైజీ’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది.ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. ‘బ్రో’ సినిమా 2023 జూలై 28న విడుదలైంది. అప్పటి నుంచి ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాతో బిజీగా ఉన్నారు సాయిదుర్గా తేజ్. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఈ సెప్టెంబర్ 25న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం షూటింగ్ పూర్తి కానందున మరోసారి విడుదల వాయిదా పడే అవకాశం ఉందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బూత్ బంగ్లాలో... అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ‘ఏజెంట్’ సినిమా (2023) తర్వాత రెండేళ్ల గ్యాప్ అనంతరం అఖిల్ నటిస్తున్న ఈ సినిమాకి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూ పొందుతోన్న ఈ సినిమా కోసం పొడవాటి హెయిర్, గెడ్డంతో ఫుల్ మాస్ లుక్‌లోకి మారి పోయారు అఖిల్.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని బూత్ బంగ్లాలో జరుగుతోంది. అఖిల్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు మురళీ కిశోర్. కాగా ఈ సిని మాలో హీరోయిన్గా తొలుత శ్రీలీల ఫిక్స్ అయ్యారు. కార ణాలు తెలియదు కానీ ఆమె స్థానంలో ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారని టాక్. ముచ్చింతల్‌లో మహా కాళి ‘హను–మాన్’ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుని, అదే స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో 12 సూపర్ హీరోస్ సినిమాలను తెరకెక్కించనున్నట్లు గతంలో ప్రకటించారాయన. ఈ యూనివర్స్‌లో వచ్చిన తొలి చిత్రం ‘హను–మాన్’ బ్లాక్‌బస్టర్‌గా నిలవగా, తాజాగా రూ పొందుతోన్న సినిమా ‘మహా కాళి’. ప్రశాంత్ వర్మ కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్కేడీ స్టూడియోస్‌పై రివాజ్ రమేశ్ దుగ్గల్ నిర్మిస్తున్న ఫిమేల్ సూపర్ హీరో మూవీ ఇది.ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. మహాకాళి అమ్మవారి చుట్టూ అల్లుకున్న కథతో బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో ఈ సినిమా రూ పొందుతోంది. నటీనటుల వివరాలను మేకర్స్ ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఆ మధ్య విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ఒక అమ్మాయి తన తలను పులి తలకు ప్రేమగా తాకుతున్న లుక్ వైరల్‌గా మారింది. మరి... ఈ చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాలంటే చిత్రయూనిట్ ప్రకటించే వరకు వేచి ఉండాలి. పైన పేర్కొన్న చిత్రాలే కాదు.. మరికొన్ని సినిమాలు కూడా హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో సందడి సందడిగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
పాడె మోసిన అల్లు అర్జున్, రామ్‌చరణ్.. వీడియో
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ (94) ఇక లేరు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్త తెలిసిన వెంటనే ముంబై నుంచి అల్లు అర్జున్, మైసూర్ నుంచి రామ్ చరణ్ హుటాహుటిన హైదరాబాద్ వచ్చేశారు. ముగిసిన అంత్యక్రియలునానమ్మ పార్థివదేహాన్ని చూసి అల్లు అర్జున్ (Allu Arjun) భావోద్వేగానికి లోనయ్యాడు. పలువురు సినీ ప్రముఖులు అల్లు అరవింద్ నివాసానికి వచ్చి కనకరత్నమ్మ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. కాగా కోకాపేటలోని అల్లు వ్యవసాయ క్షేత్రంలో అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు జరిగాయి. అల్లు అర్జున్, అల్లు అయాన్, చిరంజీవి, రామ్‌చరణ్... కనకరత్నమ్మ పాడె మోశారు. అల్లు అరవింద్.. తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. pic.twitter.com/TrESutLN43— C/o.AlluArjun (@CareOfAlluArjun) August 30, 2025 -
'అత్తయ్య' అని చిరంజీవి ఎమోషనల్.. అల్లు అరవింద్ ఇంటికి సెలబ్రిటీలు
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ (94) కన్నుమూశారు. దీంతో ఇప్పటికే వారి కుటుంబాన్ని ఓదార్చేందుకు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది ప్రముఖులు వారి ఇంటికి చేరుకున్నారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న తర్వాత ముంబై నుంచి అల్లు అర్జున్, మైసూర్ నుంచి రామ్ చరణ్ వెంటనే హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో చిరంజీవి తన అత్తయ్యను గుర్తు చేసుకుంటూ సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఆమె అంత్యక్రియలు కోకాపేటలో నేడు సాయింత్రం నిర్వహించనున్నారు.చిరంజీవి ఎమోషనల్మా అత్తయ్య గారు.. దివంగత అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ శివైక్యం చెందటం ఎంతో బాధాకరమని చిరంజీవి అన్నారు. ఇరు కుటుంబాలపై ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ తమకు ఆదర్శంగా ఉంటాయని చెప్పారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ సోషల్‌మీడియాలో చిరంజీవి పంచుకున్నారు.'శ్రీమతి అల్లు కనకరత్నమ్మ కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను. చెన్నైలో ఉన్నప్పటి నుంచి ఎంతో ఆప్యాయత చూపేవారు. చుట్టూ ఉన్నవారిపట్ల అమిత ప్రేమాభిమానాలు కురిపించేలా తన కుమార్తె, మా వదినమ్మ సురేఖను తీర్చిదిద్దారు. కనకరత్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. అల్లు అరవింద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.' - పవన్ కల్యాణ్అరవింద్ ఇంటికి టాలీవుడ్ ప్రముఖులుఅల్లు అరవింద్ ఇంటి వద్దకు అందరికంటే ముందుగానే చిరంజీవి తన సతీమణి సురేఖతో చేరుకుని నివాళులు అర్పించారు. ఆపై పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ పార్థివ దేహానికి వెంకటేష్, త్రివిక్రమ్, వరుణ్ తేజ్, అది శేషగిరిరావు, శ్యామల దేవి , మెహర్ రమేష్, జీవిత, నిర్మాత నాగవంశీ, నాగచైతన్య, బోయపాటి శీను, వంటి సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. -
చిరంజీవి, బన్నీ, చరణ్‌లతో 'అల్లు కనకరత్నమ్మ' (ఫోటోలు)
-
జైజై గణేశా.. హారతిచ్చిన చిరంజీవి, ఒంటరిగా హన్సిక పూజ
వినాయక చవితి అంటే పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన పండుగ. నేడు (ఆగస్టు 27) గణపయ్యను ప్రతిష్టించి పూజ చేస్తారు. భక్తిశ్రద్ధలతో పూలు, పండ్లు, నైవేద్యాలు సమర్పించి భగవంతుడిని పూజిస్తారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి నటి అనసూయ వరకు పలువురు తారలు గణపతి పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి హారతి పడితే.. నాని కుమారుడు గణపతి పాట పాడాడు, హన్సిక భర్తతో కాకుండా ఒంటరిగా పూజ చేసింది. ఇంకా ఎవరెవరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింది పోస్టుల్లో మీరే చూసేయండి.. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Nani (@nameisnani) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
‘అన్నయ్య’ రెండు..‘అబ్బాయ్’ ఒకటి.. మెగా ఫ్యాన్స్‌కి పండగే
ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. చివరిగా వచ్చిన భోళాశంకర్ (2023) కూడా డిజాస్టర్ అయింది. దీంతో మెగాఫ్యాన్స్ తీవ్ర నిరాకు లోనయ్యారు. కొన్నాళ్ల తర్వాత ఆ బాధ నుంచి తేరుకొని ‘అన్నయ్య’ నుంచి సినిమా రాకున్నా పర్లేదు..‘అబ్బాయ్’ నుంచి వస్తుంది కదా అనుకొని ‘గేమ్ ఛేంజర్’పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే అది ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై రామ్ చరణ్ కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఇలా ఈ ఏడాది అటు చిరు..ఇటు చరణ్ తమ అభిమానులను డిసప్పాయింట్ చేశారు. కానీ వచ్చే ఏడాది మాత్రం మెగా ఫ్యాన్స్‌కి పండగ అనే చెప్పాలి. 2026లో చరణ్ ఒక చిత్రంతో పలకరిస్తే.. మెగాస్టార్ రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. పండగకి వచ్చేస్తున్నాడుమెగాస్టార్ చిరంజీవి ఖాతాలో హిట్ పడి చాలా కాలం అయింది. నిజం చెప్పాలంటే ఈ మధ్యకాలంలో చిరు స్థాయికి తగ్గ విజయమే లేదు. అందుకే 2026వ సంవత్సరాన్ని పక్కా ప్లాన్‌తో సెట్ చేసుకున్నాడు. సంక్రాంతి నుంచే అభిమానులను అలరించబోతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కి అదిరిపోయే స్పందన వచ్చింది. చిరంజీవి నుంచి పుల్ ఫన్ మూవీ వచ్చి చాలా కాలమైంది. అనిల్ రావిపూడి మూవీ అంటే కామెడీ కచ్చితంగా ఉండాల్సింది. ఇందులో కూడా చిరుతో కామెడీ చేయించినట్లు తెలుస్తోంది. పండగ వేళ వస్తున్న చిత్రం... కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ చేసే బాధ్యతను మెగా అభిమానులు తీసుకోవడం గ్యారెంటీ. సమ్మర్ స్పెషల్ఇక ఇదే ఏడాది చిరంజీవి నుంచి మరో సినిమా రాబోతుంది. అదే విశ్వంభర. చాలా కాలం తర్వాత చిరంజీవి నటించిన సోషియో-ఫాంటసీ చిత్రమిది. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ సంక్రాంతికే రిలీజ్ కావాల్సింది. అయితే గతంలో విడుదైన టీజర్‌లోని వీఎఫెక్స్ సీన్లపై విమర్శలు రావడంతో రిలీజ్‌ని వాయిదా వేశారు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పెద్ది’ తో అబ్బాయ్.. ఇక 2026లో మెగా ఫ్యాన్స్‌కి ‘అబ్బాయ్’(రామ్ చరణ్) కూడా ఒక బ్లాక్ బస్టర్ సినిమాను ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. గేమ్ ఛేంజర్‌తో భారీ అపజయాన్ని అందుకున్న చరణ్.. ‘పెద్ది’తో సూపర్ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. ఇదొక పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ డ్రామా. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 27న విడుదల కానుంది. ఇలా వచ్చే ఏడాది చిరంజీవి రెండు, చరణ్ ఒక చిత్రంలో ఫ్యాన్స్‌ని అలరించబోతున్నారు. -
అధికారిక ప్రకటన.. 'వాల్తేరు వీరయ్య' కాంబో మరోసారి
'భోళా శంకర్' వచ్చి రెండేళ్లు దాటిపోయింది. ఆ సినిమా ఫలితం వల్ల ఆలోచనలో పడిపోయిన చిరంజీవి రూట్ మార్చారు. 'విశ్వంభర' మొదలుపెట్టారు. అయితే ఇది భారీ బడ్జెట్ చిత్రం కావడంతో లేట్ అవుతూ వస్తోంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలోనూ ఓ చిత్రం చేస్తున్నారు. దీనికి 'మన శంకర వరప్రసాద్ గారు' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అలానే శ్రీకాంత్ ఓదెలతోనూ ఓ మూవీ కమిట్ అయ్యారు. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది.(ఇదీ చదవండి: లండన్ నుంచి చెన్నై వచ్చి..దళపతి విజయ్ భార్య బ్యాక్ గ్రౌండ్ తెలుసా?)రెండో ఇన్నింగ్స్‌లో చిరు సినిమాలు చేస్తున్నారు గానీ సరైన ఫలితాలు రావట్లేదు. ఈ క్రమంలోనే వచ్చి మంచి కమర్షియల్ హిట్ అయిన సినిమా 'వాల్తేరు వీరయ్య'. ఈ చిత్రానికి బాబీ దర్శకుడు. ఇప్పుడు మరోసారి చిరుని డైరెక్ట్ చేసే ఛాన్స్ బాబీ అందుకున్నాడు. యష్ 'టాక్సిక్', దళపతి విజయ్ 'జననాయగన్' చిత్రాల్ని నిర్మిస్తున్న కెవిఎన్ ప్రొడక్షన్.. చిరు-బాబీ కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.'మెగా 158' పేరుని ఈ ప్రాజెక్టుకి వర్కింగ్ టైటిల్‌గా నిర్ణయించారు. నెత్తురు-గొడ్డలిని పోస్టర్లో చూపించారు. చూస్తుంటే ఇది యాక్షన్ మూవీలా అనిపిస్తుంది. మరి షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారు. హీరోయిన్, సంగీత దర్శకుడు ఎవరనేది త్వరలో వెల్లడిస్తారేమో?(ఇదీ చదవండి: చిరంజీవి లుక్‌లో VFX లేదు.. 95% ఒరిజినల్: అనిల్ రావిపూడి)It’s the #ChiruBobby2 STATEMENT that sends shivers down the spine 🔥‘The Blade that set the BLOODY BENCHMARK 💥’A MEGASTAR @KChiruTweets hysteria in @dirbobby’s presentation ❤️Produced by @KvnProductions & @LohithNK01 ✨#HBDMegastarChiranjeevi #MEGA158#ABC - AGAIN' BOBBY… pic.twitter.com/yCLmtNcRzX— KVN Productions (@KvnProductions) August 22, 2025 -
రావిపూడి దర్శకత్వంలో చిరు మూవీ... గ్లింప్స్ రిలీజ్
-
నువ్వు నా హీరో.. తండ్రి పుట్టినరోజు సెలబ్రేట్ చేసిన రామ్‌చరణ్
తండ్రే తనకు ఇన్స్పిరేషన్ అంటున్నాడు మెగా హీరో రామ్‌చరణ్ (Ram Charan). నేడు (ఆగస్టు 22) చిరంజీవి (Chiranjeevi Konidela) 70వ పుట్టినరోజు. ఈ సందర్భంగా తండ్రితో కేక్ కట్ చేయించి, బర్త్‌డే సెలబ్రేట్ చేశాడు చరణ్. తండ్రి పాదాలకు నమస్కరించి ఆయన్ను మనసారా హత్తుకున్నాడు. అనంతరం చిరంజీవికి కేక్ తినిపించాడు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.నా హీరో..నాన్నా.. ఈరోజు కేవలం నీ పుట్టినరోజు మాత్రమే కాదు. నీలాంటి మనిషిని సెలబ్రేట్ చేసుకునే రోజు. నా హీరో, నా గైడ్, నా ఇన్స్పిరేషన్.. అన్నీ నువ్వే! నా ప్రతి విజయం, నేను పాటించే విలువలన్నీ నీ నుంచి వచ్చినవే.. 70 ఏళ్ల వయసు వచ్చినా నీ మనసు మాత్రం చిన్నపిల్లాడిలా మారిపోతోంది. నువ్వు సంపూర్ణ ఆరోగ్యంతో, సుఖ సంతోషాలతో మరెన్నో యేళ్లు గడపాలని కోరుకుంటున్నాను. ఉత్తమ తండ్రిగా ఉన్నందుకు థాంక్యూ నాన్న.. అంటూ రామ్‌చరణ్ ఎమోషనల్ అయ్యాడు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) చదవండి: వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్.. చిరుకు అల్లు అర్జున్ బర్త్‌డే విషెస్ -
చిరంజీవి లుక్‌లో VFX లేదు.. 95% ఒరిజినల్: అనిల్ రావిపూడి
గతంలో సినిమాని సినిమాగా చూసి ఎంటర్టైన్ అయ్యేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గ్రాఫిక్స్, లాజిక్కులు, హీరో లుక్.. ఇలా అన్నింటినీ పరిశీలిస్తున్నారు. ఏ మాత్రం తేడా అనిపించినా సరే సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. రీసెంట్ టైంలో హరిహర వీరమల్లు, వార్ 2 చిత్రాలు ఇలాంటి అనుభవాల్ని ఎదుర్కొన్నాయి. గతేడాది 'విశ్వంభర' కూడా టీజర్‌తో చాలానే విమర్శలు ఎదుర్కొంది.అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి.. తన కొత్త సినిమా విషయంలో ముందే జాగ్రత్త పడుతున్నట్లు అనిపిస్తుంది. ఈ డైరెక్టర్.. చిరంజీవితో ఓ కామెడీ మూవీ చేస్తున్నాడు. చిరు బర్త్ డే సందర్భంగా తాజాగా టైటిల్ రివీల్ చేశారు. 'మన శంకర వరప్రసాద్ గారు' అని టైటిల్ పెట్టినట్లు చెబుతూ ఓ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో సిగరెట్ తాగుతూ సూట్ వేసుకుని చిరంజీవి స్టైలిష్‌గా కనిపించారు.(ఇదీ చదవండి: బాగా చూసుకుంటా.. కిరణ్ అబ్బవరం గురించి భార్య పోస్ట్)అయితే చిరు లుక్‌పై ట్రోల్స్ వస్తాయని భయపడ్డాడో ఏమో గానీ అనిల్ రావిపూడి.. 'చిరంజీవి సూట్లో ఎలా ఉంటారో చూడటం నాకు చాలా ఇష్టం. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ఇంకా చాలా లుక్స్ ఉన్నాయి. చిరంజీవి లుక్‌కి VFX ఏమి లేదు.. 95 శాతం ఒరిజినల్' అని చెప్పుకొచ్చాడు. ఈ మూవీ కోసం జిమ్‌కి వెళ్లి సన్నబడ్డారని చెప్పుకొచ్చాడు. అనిల్ స్పీచ్ చూస్తుంటే ట్రోల్స్ వచ్చి తర్వాత క్లారిటీ ఇవ్వడం కంటే ముందే జాగ్రత్తపడుతున్నాడేమో అనిపిస్తుంది.ఈ సినిమాలో నయనతార హీరోయిన్ కాగా భీమ్స్ సంగీతమందిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ ప్లాన్ చేశారు. లెక్క ప్రకారం చిరంజీవి 'విశ్వంభర' ఈ మూవీ కంటే ముందు రిలీజ్ కావాలి. కానీ వీఎఫ్ఎక్స్ వర్క్స్ కారణంగా వచ్చే ఏడాది వేసవికి వాయిదా వేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ కొత్త సినిమా.. తెలుగులోనూ) -
'మన శంకరవరప్రసాద్ గారు' టైటిల్ గ్లింప్స్ ఈవెంట్ (ఫొటోలు)
-
చిరంజీవి- అనిల్ రావిపూడి సినిమా టైటిల్ ఇదే (గ్లింప్స్)
చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న చిత్రం టైటిల్‌ను ప్రకటించారు. నేడు మెగాస్టార్ బర్త్‌డే సందర్బంగా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. 'మన శంకరవరప్రసాద్ గారు' అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఆపై పండగకి వస్తున్నారు అంటూ ఒక ట్యాగ్‌లైన్ ఇచ్చారు. చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్‌తో ఈ చిత్రం పేరు ముడిపడేలా ఉండటంతో అభిమానులో సంతోషిస్తున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతుంది.చిరంజీవికి జంటగా లేడీ సూపర్‌స్టార్ నయనతార నటిస్తుంది. ఈ సినిమా భార్యాభర్తల రిలేషన్‌పై ఆధారంగా ఉంటుందని అనిల్ రావిపూడి గతంలో అన్నారు. దీనిలో 70 శాతం కామెడీ, 30 శాతం ఎమోషనల్ డ్రామా ఉంటుందన్నారు. చిరంజీవిని ఇటీవలి కాలంలో ఎవరూ చూపించని కొత్త లుక్‌లో ప్రజెంట్ చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. -
వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్.. చిరుకు అల్లు అర్జున్ బర్త్‌డే విషెస్
మెగాస్టార్ చిరంజీవి (Konidela Chiranjeevi) నేడు (ఆగస్టు 22న) 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తన డ్యాన్స్, స్టైల్, యాక్టింగ్, యాక్షన్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఏడు పదుల వయసులోనూ తగ్గేదేలే అంటూ యాక్షన్‌కు సై అంటున్నారు. అలాంటి మెగాస్టార్‌కు సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు.వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్తాజాగా అల్లు అర్జున్ (Allu Arjun).. తన మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవిగారికి హ్యాపీ బర్త్‌డే అని ట్వీట్ చేశాడు. దీనికి చిరుతో కలిసి డ్యాన్స్ చేస్తున్న ఫోటో జత చేశాడు. మెగాస్టార్‌పై తనకున్న అభిమానం, గౌరవాన్ని ఇలా ట్వీట్ రూపంలో వ్యక్తం చేశాడు బన్నీ. వెంకటేశ్, సాయిదుర్గ తేజ్, తేజ సజ్జా, నారా రోహిత్.. ఇలా తదితరులు మెగాస్టార్‌కు సామాజిక మాధ్యమాల్లో బర్త్‌డే విషెస్ చెప్పారు. Happy Birthday to our one and only Mega Star Chiranjeevi garu. ⭐️ @KChiruTweets pic.twitter.com/0n9veF0l9X— Allu Arjun (@alluarjun) August 22, 2025 Happy Birthday, dear @KChiruTweets! Wishing you abundant health, happiness, and many more wonderful years ahead✨ pic.twitter.com/5QO1ZKOpgj— Venkatesh Daggubati (@VenkyMama) August 22, 2025 View this post on Instagram A post shared by Teja Sajja (@tejasajja123) Happiest b’day to the one & only Megastar @KChiruTweets garu ❤️🎊 A true crowd-puller & legend who inspires on & off screen 😊 Best wishes for #Vishwambhara, #Mega157 & all upcoming projects 🔥 #HBDMegastarChiranjeevi pic.twitter.com/qj7XBFHSz7— Vijaya Durga Productions (@VijayaDurgaProd) August 22, 2025 చదవండి: నా కూతురి ఆరోగ్యం కోసం రోజూ ఈ ఫుడ్ తప్పనిసరి: ఉపాసన -
#HBDChiranjeevi : 70 ఏళ్ల గాడ్ ఫాదర్.. 'చిరంజీవి' బర్త్‌డే స్పెషల్ (ఫోటోలు)
-
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే.. ఇవి మీకు తెలుసా? (ఫొటోలు)
-
చిరంజీవి బర్త్‌డే ట్రీట్.. విశ్వంభర గ్లింప్స్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela) ప్రధాన పాత్రలో నటిస్తున్న అడ్వెంచర్ మూవీ విశ్వంభర (Vishwambhara Movie). బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించారు. త్రిష కథానాయికగా నటించగా ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. రేపు (ఆగస్టు 22) చిరంజీవి బర్త్‌డే సందర్భంగా విశ్వంభర గ్లింప్స్ వదిలారు. ఊపిరి పోసేవాడి కోసం ఎదురుచూపులు'ఈ విశ్వంభరలో అసలేం జరిగిందో ఈరోజైనా చెప్తావా?' అన్న పిల్లాడి డైలాగ్‌తో వీడియో ప్రారంభమైంది. 'ఒక్కడి స్వార్థం యుద్ధంగా మారి అంతులేని భయాన్నిచ్చింది. అంతకుమించిన మరణ శాసనాన్ని రాసింది. కొన ఊపిరితో బతుకున్న ఓ సమూహం తాలూకు నమ్మకం.. అలిసిపోని ఆశయానికి ఊపిరిపోసేవాడు ఒకడొస్తాడని.. ఆగని యుద్ధాన్ని యుగాలపాటు పిడికిలి బిగించి చెప్పుకునేలా చేస్తాడని గొప్పగా ఎదురుచూస్తోంది..' అంటూ మెగాస్టార్‌ను చూపించారు. విలన్లను చిత్తు చేస్తున్నట్లు యాక్షన్ సీన్స్ జత చేశారు. ఇది చూసిన అభిమానులు.. గ్లింప్స్ బాగున్నాయ్.. అని కామెంట్లు చేస్తున్నారు.వచ్చే ఏడాది రిలీజ్సినిమా విషయానికి వస్తే.. విశ్వంభర ఈ ఏడాది జనవరిలోనే రిలీజవ్వాల్సింది. కానీ, వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా పెండింగ్‌లో ఉండటంతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాదిలో సినిమా రావడం కష్టమేనని స్వయంగా మెగాస్టారే వెల్లడించారు. 2026 సమ్మర్లో విశ్వంభర ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.చదవండి: కార్తీకదీపం సీరియల్ నటి కూతురి పెళ్లి -
‘విశ్వంభర’ రిలీజ్‌పై చిరు అప్డేట్.. వామ్మో అంత లేటా?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రాల్లో విశ్వంభర ఒకటి. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే రిలీజ్ కావాల్సింది కూడా. అయితే వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తకాకపోవడంతో వాయిదా వేశారు. అప్పటి నుంచి రిలీజ్ డేట్‌పై చిత్రబృందం క్లారిటీ ఇవ్వలేదు. సమ్మర్, దసరా, దీపావళి, సంక్రాంతి అంటూ నెట్టింట చర్చలు జరిగినా..మేకర్స్ మాత్రం విడుదల తేదిపై స్పందించలేదు. తాజాగా ఈ సినిమా రిలీజ్‌పై మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చాడు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రం విడుదల అవుతుందని చెప్పారు. ఆలస్యానికి గల కారణాన్ని వివరిస్తూ ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేశాడు(Vishwambhara Update) ‘విశ్వంభర ఎందుకు ఆలస్యం అవుతుందని చాలా మందికి అనుమానం ఉంది. ఆ జాప్యం సముచితమని నేను భావిస్తున్నాను. ఈ సినిమా సెకండాఫ్ మొత్తం వీఎఫ్ఎక్స్ మీద ఆధారపడి ఉంది. దీన్ని అత్తుత్తమంగా మీకు అందించాలనే ప్రయత్నమే ఈ జాప్యానికి కారణం. ఎలాంటి విమర్శలకు చోటివ్వకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ సినిమా చందమామ కథలా సాగిపోతుంది. చిన్నాపెద్దా తేడా లేకుండా ఈ సినిమా అందర్నీ అలరిస్తుంది. దీని గ్లింప్స్‌ను ఆగస్టు 21 సాయంత్రం 6.06కు విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాను అందరూ ఎంజాయ్ చేసేలా దీన్ని ప్రేక్షకుల ముందుకుతీసుకువస్తారు. 2026 సమ్మర్లో ఎంజాయ్ చేయండి’ అని చిరంజీవి తెలిపారు.విశ్వంభర విషయానికొస్తే.. చిరంజీవి హీరోగా నటించిన సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ మూవీ ఇది. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహించారు. త్రిషా కృష్ణన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. MEGASTAR @KChiruTweets shares a personal note to his fans and the audience about #Vishwambhara ❤️Check out the MEGA BLAST ANNOUNCEMENT now ⚡-- https://t.co/RQ9is0OQCcLet us celebrate the MEGA BIRTHDAY with #MEGABLASTTEASER out today at 6.06 PM ❤🔥MEGA MASS BEYOND… pic.twitter.com/dtJ2Jo0l1m— UV Creations (@UV_Creations) August 21, 2025 -
కాసేపట్లో ఫిల్మ్ ఫెడరేషన్ సంఘాల సర్వసభ్య సమావేశం
-
టాలీవుడ్ సమ్మె.. ‘మెగా’ ప్రయత్నం ఫలించేనా?
వేతనాలు పెంచాలంటూ గత కొద్ది రోజులుగా సినీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో గత 16 రోజులుగా తెలుగు సినిమాల షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. ఇప్పటికే ఈ సమస్యల పరిష్కారం కోసం ఫిల్మ్ చాంబర్ అటు నిర్మాతలతో, ఇటు కార్మికులతో చర్చలు జరిపింది. కార్మికులు కోరినట్లుగా 30 శాతం జీతాలు పెంచేందుకు నిర్మాతలు ఒప్పుకోవట్లేదు. కార్మికులు సైతం మొట్టు దిగడం లేదు. పలు దఫాల చర్చల అనంతరం తాము పెట్టిన కండీషన్లకు ఒప్పుకుంటే రూ. 2 వేలలోపు జీతాలు ఉన్న వారికి పర్సంటేజీల ప్రకారం పెంచుతామని నిర్మాతలు ప్రకటించారు. ఇందుకు కార్మికులు విముఖత వ్యక్తం చేశారు. దీంతో ఈ సమస్య చివరకు అగ్రహీరో చిరంజీవి(Chiranjeevi) ఇంటికి చేరింది. (చదవండి: భారీగా రోడ్డెక్కిన సినీ కార్మికులు.. స్తంభించిన టాలీవుడ్)పరిష్కారం చూపాలంటూ అటు నిర్మాతలు, ఇటు ఫెడరేషన్ నాయకులు చిరంజీవిని కలిశారు. ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని, ఫెడరేషన్ కార్యదర్శి అమ్మిరాజు తో పాటు 20 క్రాఫ్ట్స్ నుంచి వచ్చిన 72 మందితో చిరంజీవి భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో అన్ని సమస్యలపై చర్చించారు. యూనియన్ నాయకులు చెప్పిన సమస్యలను ఓపికతో వినడమే కాకుండా స్వయంగా వాటిని నోట్ చేసుకున్నాడు. తన దృష్టికి వచ్చిన విషయాలను ఫెడరేషన్ నాయకులతో చర్చించి, క్లారిటీ తీసుకున్నారు. ఇక త్వరలో మరోసారి చిరంజీవి అటు నిర్మాతలు, ఇటు కార్మిక సంఘాల నాయకులతో కలిసి భేటి కానున్నారు. ఈ సమావేశంతో ఈ సమస్యకు ముగింపు పలకాలని చిరంజీవి భావిస్తున్నారట. ఇండస్ట్రీకి పెద్దన్న కాదని చిరంజీవి చెబుతున్నప్పటికీ.. దాసరి నారాయణ మరణం తర్వాత ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా అందరూ చిరంజీవి దగ్గరకే వెళ్తున్నారు. చిరంజీవి కూడా తాను పెద్దన్నను కాదంటూనే సమస్య వచ్చినప్పుడు మాత్రం ఆ పాత్ర పోషిస్తున్నాడు. టాలీవుడ్ సమ్మె విషయంలోనూ అందరి చూపు చిరంజీవి వైపే వెళ్లాయి. ఆయన రంగంలోకి దిగడంతో అటు నిర్మాతలు, ఇటు కార్మికులు తమకు న్యాయం జరుగుతుందని ఆశతో ఎదురు చూస్తున్నారు. చిరంజీవి ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని ఫెడరేషన్ చెప్పింది. నేడో , రేపో చిరంజీవి ఇరు వర్గాలతో సమావేశం నిర్వహించి, సమ్మెకు ముగింపు పలకాలని భావిస్తున్నాడట. మరి ‘మెగా’ ప్రయత్నం ఫలిస్తుందా? లేదా? చూడాలి. -
చిరంజీవికి మా సమస్యలు చెప్పాం: ఫిలిం ఫెడరేషన్
సాక్షి, హైదరాబాద్: వేతనాలు పెంచాలంటూ సినీకార్మికులు కొద్దిరోజులుగా సమ్మె (Tollywood Film Worker Strikes) చేస్తున్నారు. జీతాలను 30% మేర పెంచేవరకు షూటింగ్స్‌లో పాల్గొనేదే లేదని ఘంటాపథంగా చెప్తున్నారు. పద్నాలుగు రోజులుగా షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 2 వేల లోపు జీతాలున్నవారికి 25% జీతాలు పెంచుతామని నిర్మాతలు ముందుకొచ్చారు. కానీ కొన్ని కండీషన్లున్నాయంటూ మెలిక పెట్టారు. దీనికి కార్మికులు ఒప్పుకోకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. అటు నిర్మాతలతో, ఇటు యూనియన్స్‌తో భేటీఈ క్రమంలో ఆదివారం నాడు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్‌లోని కొందరు నిర్మాతలు చిరంజీవి (Chiranjeevi Konidela)ని కలిసి మాట్లాడారు. ఈ భేటీ అనంతరం నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ.. సమస్య పరిష్కారానికి తనవంతుగా కార్మికులతో మాట్లాడతానని చిరంజీవిగారు చెప్పారు. ఓ పెద్దమనిషిగా ఇరు వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఉన్నారు అని తెలిపారు. సోమవారం (ఆగస్టు 18న) ఫిలిం ఫెడరేషన్ సభ్యులతో చిరంజీవి సమావేశమయ్యారు. త్వరలోనే పరిష్కారంఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని, ఫెడరేషన్ కార్యదర్శి అమ్మిరాజు తదితర యూనియన్ నాయకులు చిరంజీవిని కలిసి తమ సమస్యలను వివరించారు. భేటీ అనంతరం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ.. 24 క్రాఫ్ట్స్ నుంచి 72 మందితో చిరంజీవి మాట్లాడారు. నిర్మాతలు మా మాట వినకుండా మాపై నిందలు వేస్తున్నారు. మాకు కుదరని నిబంధనలు పెడుతున్నారు. మేము బాగుండాలి, అలాగే నిర్మాతలూ బాగుండాలి.చిరంజీవికి అన్నీ చెప్పాంనిర్మాతలు పెట్టిన 2 కండీషన్స్‌కు ఒప్పుకుంటే మేమేం నష్టపోతామో చిరంజీవిగారికి వివరించాం. ఆదివారం నాడు డబుల్ కాల్ షీట్ గురించి కూడా చెప్పాం. మాకు ఏ సమస్య ఉన్నా తన దగ్గరకు రమ్మని చిరంజీవి గారు చెప్పారు. రేపు మేము జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయనున్నాం. ఛాంబర్‌తో కూడా సమావేశం కానున్నాం. చర్చలకు పిలిచారు కాబట్టి మేము నిరసన కార్యక్రమం ఆపేశాం. మేం అడిగినట్లుగా మాకు వేతనాలు వస్తాయని భావిస్తున్నాం అన్నారు.నిర్మాతల మీటింగ్మరోపక్క నిర్మాతలు ఫిలిం ఛాంబర్లో సమావేశమై కార్మికుల వేతనాల పెంపు డిమాండ్లపై చర్చించారు. అనంతరం నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ.. నిర్మాతలందరూ సమస్య పరిష్కార బాధ్యతను ఛాంబర్‌కే అప్పగించారు. ఛాంబర్ త్వరలో తుది నిర్ణయం తీసుకుంటుంది. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది అని పేర్కొన్నారు.చదవండి: కొత్తింట్లో గృహప్రవేశం చేసిన బిగ్‌బాస్ మానస్ -
చిరంజీవిని కలవనున్న ఫెడరేషన్ నాయకులు
-
ఆ సినిమా.. క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు: టాలీవుడ్ నిర్మాత
పాన్ ఇండియా స్థాయికి మన ఇండస్ట్రీ ఎదిగిపోయింది అని అనుకుంటున్నాం కానీ నిర్మాతల పరిస్థితి ఘోరంగానే ఉంది. ఒకప్పటితో పోలిస్తే సినిమాల్లో సరైన కంటెంట్ ఉండట్లేదు. దీంతో ప్రేక్షకులు కూడా థియేటర్లకు వచ్చి చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. దానికి తోడు స్టార్ హీరోలు కూడా రీమేక్స్ చేయడం, అవి డిజాస్టర్ కావడం అడపాదడపా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఓ నిర్మాత.. తను తీసిన ఓ రీమేక్ వల్ల ఎదురైన అనుభవాన్ని బయటపెట్టారు.అప్పట్లో దూకుడు, లెజెండ్, వన్ నేనొక్కడినే తదితర సినిమాలు తీసిన అనిల్ సుంకర.. గత కొన్నాళ్లలో మాత్రం ఘోరమైన నష్టాల్ని చవిచూశారు. మహాసముద్రం, ఏజెంట్, భోళా శంకర్ తదితర చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఈయనకు నష్టాల్ని మిగిల్చాయి. ప్రస్తుతం నిర్మాణాన్ని పక్కనబెట్టి 'షో టైమ్' పేరుతో ఓ రియాల్టీ షో తీస్తున్నారు. దీని లాంచ్ శనివారం జరగ్గా.. ఇందులోనే మాట్లాడుతూ చిరంజీవితో తీసిన 'భోళా శంకర్' గురించి పరోక్షంగా కామెంట్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ... తెలుగులోనూ) 'ఏదైనా ఫ్లాప్ సినిమా రాగానే అసలు కథ వినే తీశారా? అని నన్ను అడుగుతుంటారు. కథలు వినకుండా మూవీస్ ఎందుకు చేస్తారు అని కూడా అడుగుతారు. ఓసారి నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్‌కి వెళ్తే.. అక్కడ పనిచేస్తున్న ఓ క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు. ఎందుకండీ స్టోరీ లేని సినిమాలు చేస్తున్నారు అని అన్నాడు. నేను తీసింది రీమేక్ అని చెప్పినా అతడికి అర్థం కాలేదు. రీమేక్ ఆడలేదు నేనేం చేస్తాను? అని చెప్పాను. ఈ పాటికే మీకు సినిమా ఏంటనేది అర్థమై ఉంటుంది కదా!' అని తనకు ఎదురైన విచిత్ర అనుభవాన్ని బయటపెట్టారు.మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన 'భోళా శంకర్'లో చిరంజీవి హీరోగా నటించారు. అనిల్ సుంకర నిర్మించారు. తమిళంలో హిట్ అయిన 'వేదాళం' అనే మూవీ రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు. అయితే రిలీజ్‌కి ముందే విమర్శలు ఎదుర్కొన్న 'భోళా శంకర్'.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత మరిన్ని ట్రోల్స్‌కి గురైంది. చిరంజీవి ఇలాంటి మూవీ ఎందుకు చేశారా? అని అందరూ మాట్లాడుకున్నారు. అలాంటిది ఇప్పుడు స్వయంగా నిర్మాతనే పరోక్షంగా ఈ సినిమాని మరోసారి గుర్తుచేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: కోకాపేటలో ఇల్లు కొన్న బేబక్క.. పిల్లి కోసం స్పెషల్‌గా..) -
Tollywood Strike: చిరంజీవి ఇంటికి టాలీవుడ్ పంచాయితీ
వేతనాలు పెంచాలంటూ టాలీవుడ్ సిసీ కార్మికులు చేపట్టిన సమ్మె 14వ రోజుకు చేరింది. గతంలో చెప్పినట్లుగా 30 శాతం వేతనాలు పెంచితేనే సమ్మె విరమిస్తామని కార్మికులు అంటుంటే.. ‘పెంచేదే లే’ అని నిర్మాతలు చెబుతున్నారు. కార్మికుల యూనియన్లతో నిర్మాతలు చర్చలు జరిపినా.. సమస్యకు పరిష్కారం లభించలేదు. అటు యూనియన్ లీడర్లు, ఇటు నిర్మాతలు..ఎవరూ తగ్గడం లేదు. దీంతో ఈ సమస్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరింది.(చదవండి: కార్మికుల సమ్మె.. అక్కడివరకు పరిస్థితి రానివ్వొద్దు: నారాయణమూర్తి)ఈ రోజుల సాయంత్రం నిర్మాతల బృందం మరోసారి చిరంజీవిని కలువనున్నారు. అలాగే సోమవారం సాయంత్రం ఫెడరేషన్ నాయకులతో చిరంజీవి భేటీ కానున్నారు. మంగళవారం రోజు నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులతో కలిసి చిరంజీవీ సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. చిరంజీవితో భేటీ తర్వాత ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


