హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ‘వార్ 2’. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం హృతిక్ రోషన్–ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఓ మాసీ సాంగ్‌ను ముంబైలో వేసిన ఓ సెట్‌లో చిత్రీకరించారని బాలీవుడ్‌లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హృతిక్, ఎన్టీఆర్ కాంబోలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు రెడీ అవుతున్నారట దర్శకుడు అయాన్ ముఖర్జీ.
డిసెంబరు రెండో వారంలో చిత్రీకరించే ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో హృతిక్, ఎన్టీఆర్ ఢీ అంటే ఢీ అన్నట్లు ఫైట్ చేస్తారట. ఇది క్లైమాక్స్ ఫైట్ అని, దాదాపు పదిహేను రోజుల పాటు చిత్రీకరించడానికి ప్లాన్ చేశారని, ఈ ఫైట్ కోసం ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో భారీ సెట్ రూపొందించారని టాక్. ఆదిత్యా చో్రపా నిర్మిస్తున్న ‘వార్ 2’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న కియారా అద్వానీ పాత్రకూ కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయని తెలిసింది. వచ్చే ఏడాది ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment