climax shooting
-
ఢీ అంటే ఢీ
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ‘వార్ 2’. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం హృతిక్ రోషన్–ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ మాసీ సాంగ్‌ను ముంబైలో వేసిన ఓ సెట్లో చిత్రీకరించారని బాలీవుడ్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హృతిక్, ఎన్టీఆర్ కాంబోలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు రెడీ అవుతున్నారట దర్శకుడు అయాన్ ముఖర్జీ.డిసెంబరు రెండో వారంలో చిత్రీకరించే ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో హృతిక్, ఎన్టీఆర్ ఢీ అంటే ఢీ అన్నట్లు ఫైట్ చేస్తారట. ఇది క్లైమాక్స్ ఫైట్ అని, దాదాపు పదిహేను రోజుల పాటు చిత్రీకరించడానికి ప్లాన్ చేశారని, ఈ ఫైట్ కోసం ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో భారీ సెట్ రూపొందించారని టాక్. ఆదిత్యా చో్రపా నిర్మిస్తున్న ‘వార్ 2’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న కియారా అద్వానీ పాత్రకూ కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయని తెలిసింది. వచ్చే ఏడాది ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కానుంది. -
వెయ్యి మందితో ఫైట్
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎన్కేఆర్ 21’ (వర్కింగ్ టైటిల్) క్లైమాక్స్ షూటింగ్ పూర్తయింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి, సోహైల్ ఖాన్, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ శివార్లలో వేసిన సెట్లో ముప్పై రోజులపాటు క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరించారు. ‘‘క్లైమాక్స్ కోసం బ్రహ్మ కడలి అద్భుతమైన సెట్స్‌ని రూపొందించారు. పతాక సన్నివేశాల షూట్లో ప్రముఖ తారాగణంతోపాటు దాదాపు వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులుపాల్గొన్నారు. ఈ క్లైమాక్స్‌కే రూ. 8 కోట్లు ఖర్చు చేశాం. రామకృష్ణ యాక్షన్ కొరియోగ్రఫీని పర్యవేక్షించారు’’ అని యూనిట్ పేర్కొంది. -
యాక్షన్.. ఎమోషన్
వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘సైంధవ్’ సినిమా క్లైమాక్స్ షెడ్యూల్ పూర్తయింది. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, సారా కీలక పాత్రలు చేస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా క్లైమాక్స్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా యూనిట్ వెంకటేష్ లుక్‌ని రిలీజ్ చేసింది. ‘‘వెంకటేష్ కెరీర్లో 75వ చిత్రంగా ‘సైంధవ్’ రూపొందుతోంది. హీరోతో పాటు ఎనిమిది మంది ముఖ్య నటీనటులపై 16 రోజుల్లో కీలకమైన హై యాక్షన్– ఎమోషనల్ క్లైమాక్స్ షెడ్యూల్‌ను పూర్తి చేశాం. యాక్షన్ ఎపిసోడ్‌ను రామ్–లక్ష్మణ్ మాస్టర్స్ సూపర్వైజ్ చేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22న ఈ మూవీ రిలీజ్ కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు, కెమెరా: ఎస్.మణికందన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం (వెంకట్). -
క్లైమాక్స్ కాదు.. క్లై‘మ్యాక్స్’
భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను హీరో రామ్ కంప్లీట్ చేశారు. హీరో రామ్, దర్శకుడు బోయపాటి శీను కాంబినేషన్లో ఓ యాక్షన్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శ్రీ లీల హీరోయిన్. ఇటీవల మొదలైన ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తయింది. ‘‘24 రోజుల చిత్రీకరణతో ఈ సినిమా క్లైమాక్స్ పూర్తయింది. ఇది క్లైమాక్స్ కాదు.. క్లైమ్యాక్స్’’ అని ట్వీట్ చేశారు రామ్. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 20న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సంతోష్ డిటాకే. -
1200 మంది ఫైటర్స్‌తో గేమ్ చేంజర్...
-
ఒక్క షాట్ కోసం..ఎన్నిరోజులు షూట్ చేసామంటే...
-
Radhe Shyam : బాప్రే.. ఒక్క క్లైమాక్స్ కోసమే అన్ని కోట్లా..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా కె. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రాధేశ్యామ్’. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 23న ‘రాధే శ్యామ్’ టీజర్ రిలీజ్ చెయ్యబోతున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ - ప్రమోద్ - ప్రశీద నిర్మిస్తున్న ఈ చిత్రం 2022 జనవరి 14న సంక్రాంతి కానుకగా సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ క్లైమాక్స్ కోసం కళ్లు చెదిరేలా ఖర్చు పెట్టారట. దాదాపు 15 నిమిషాల పాటు ఉత్కంఠ భరితంగా సాగే ఈ క్లైమాక్స్‌కి దాదాపు రూ. 50 కోట్ల బడ్జెట్ కేటాయించారట మేకర్స్. 'రాధే శ్యామ్'లో క్లైమాక్స్ చాలా ప్రత్యేకంగా నిలుస్తుందని నమ్మకంగా చెబుతున్నారు నిర్మాతలు. అందుకే క్లైమాక్స్‌కి భారీ బడ్జెట్ కేటాయించారట. ఒక క్లైమాక్స్‌కే ఈ రేంజ్లో ఖర్చు పెట్టారంటే.. ఇక సెట్స్‌కి, సాంగ్స్‌కి ఎంతలా ఖర్చు చేసుంటారో అర్థం చేసుకోవచ్చు. -
దుమ్ము రేపనున్న ‘సాహో’ క్లైమాక్స్!
బాహుబలితో రికార్డులన్నీ కొల్లగొట్టిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ‘సాహో’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌లు నిర్మించారు. ఇప్పటికే చిత్ర యునిట్ విడుదల చేసిన ఫస్ట్‌లుక్, టీజర్లతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టుగానే క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా సాహోను చిత్ర నిర్మాతలు భారీగానే నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ సినీ వర్గాలతో పాటు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘సాహో’క్లైమాక్స్‌ను చరిత్రలో ఎవరూ ఊహించని విధంగా భారీగా తీసేందుకు సుజిత్ అండ్ గ్యాంగ్ రెడీ అయింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వందమంది అంతర్జాతీయ ఫైటర్స్‌తో క్లైమాక్స్ సీన్లు చిత్రీకరిస్తున్నారట. ఈ ఫైట్ కోసం భారీ సెట్‌ను కూడా రూపొందించారట. కేవలం క్లైమాక్స్ సీన్ కోసమే నిర్మాతలు ఏకంగా 70 కోట్ల బడ్టెట్‌ను వెచ్చిస్తున్నారట. పెంగ్ జాంగ్ ఈ ఫైట్‌ని కంపోజ్ చేశారు. చలనచిత్ర చరిత్రలోనే క్లైమాక్స్ కోసం ఇంత భారీ బడ్జెట్ కేటాయిస్తున్న సాహో అంటూ చిత్ర యునిట్ ప్రకటించింది. ముందుగా ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఈ భారీ ఫైట్, గ్రాఫిక్స్ కారణంగా చిత్రాన్ని ఆగస్ట్ 30కి వాయిదా వేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటించారు. -
8 నిమిషాలు 60 కోట్లు!
సన్నివేశాల ప్రాముఖ్యతను బట్టి కొన్ని సార్లు భారీగా ఖర్చు పెడుతుంటారు. ‘సైరా: నర సింహా రెడ్డి’ క్లైమాక్స్ భాగానికి కూడా సుమారు 60 కోట్లు వరకూ ఖర్చు పెడుతున్నారట చిత్రబృందం. చిరంజీవి టైటిల్ రోల్లో సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సైరా: నరసింహా రెడ్డి’. రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా కథానాయికలు. ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ చిత్రీకరిస్తున్న యుద్ధ సన్నివేశాలు సుమారు 8 నిమిషాల పాటు ఉంటాయని సమాచారం. దీని కోసం ఏకంగా 60 కోట్లు వరకూ ఖర్చు పెడుతున్నారట. చిరంజీవి, జగపతిబాబు, సుదీప్ మరికొందరు నటీనటులు ఈ షూటింలో పాల్గొంటున్నారు. వీరితో పాటు ఈ భారీ క్లైమాక్స్ పోర్షన్లో 600 మంది జూనియర్ ఆర్టిస్ట్స్ పాల్గొంటున్నారట. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీత దర్శకుడు. -
క్లైమాక్స్ షూటింగుకు ఐదుగురు డైరెక్టర్లు!
చెన్నై ఒక్క సినిమాకు ఎంతమంది డైరెక్టర్లు ఉంటారు.. సాధారణంగా అయితే ఒక్కరే కదా. కానీ తమిళంలో క్రికెట్ ప్రధానాంశంగా వస్తున్న 'చెన్నై 600028' సీక్వెల్ సినిమా క్లైమాక్స్‌కు మాత్రం ఏకంగా ఐదుగురు దర్శకత్వం వహిస్తున్నారట. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా... 2007లో ఇదే దర్శకుడు తీసిన సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది. ఇప్పటి సినిమా క్లైమాక్స్‌కు దర్శకత్వం వహిస్తున్న ఐదుగురు కూడా ఒకప్పుడు వెంకట్ ప్రభు దగ్గర అసిస్టెంట్లుగా చేసినవాళ్లే. సినిమా ఇతివృత్తం మొత్తం స్నేహం గురించే ఉంటుందని, చివరకు ఈ మైత్రీబంధం సినిమా క్లైమాక్స్ తీసే విషయంలో కూడా బాగా కనిపిస్తోందని సినిమా వర్గాలు అంటున్నాయి. వెంకటేష్ రామకృష్ణన్, శరవణ రాజన్, శ్రీ పతి, చంద్రు, నాగేంద్రన్ ఆర్.. ఈ ఐదుగురూ కలిసి క్లైమాక్స్ తీస్తారట. జై హీరోగా చేస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. -
బాహుబలి క్లైమాక్స్‌కు 30 కోట్ల వ్యయం?
భారతీయ సినిమా రికార్డులను తిరగరాసిన బాహుబలి రెండో భాగం.. బాహుబలి ద కన్‌క్లూజన్ సినిమా క్లైమాక్స్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం బాగోకపోవడం.. వేడి చాలా ఎక్కువగా ఉండటంతో కొన్నాళ్ల పాటు షూటింగుకు బ్రేక్ ఇచ్చిన జక్కన్న.. ఇటీవలే మళ్లీ క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభించారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీస్తున్న ఈ సినిమా క్లైమాక్సు ఒక్కదానికే దాదాపు రూ. 30 కోట్ల వరకు వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. బాహుబలి తొలి భాగంలో కూడా క్లైమాక్స్ సీన్ కీలకం కావడంతో.. ఆ షూటింగుకు రూ. 10 కోట్లు వెచ్చించారు. మొదటి భాగానికి దాదాపు రూ. 600 కోట్ల వరకు వసూలైంది. భారీ అంచనాలు ఉండటంతో రెండో భాగం బడ్జెట్ కూడా బాగా పెరుగుతోందని అంటున్నారు. 2017లో విడుదల కావాల్సిన ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
బాహుబలి విశేషాలు కావాలా..?
తెలుగు సినీ చరిత్ర రికార్డులను తిరగరాసిన బాహుబలి సినిమా రెండో భాగం షూటింగ్ ముమ్మరంగా సాగుతోంది. ప్రస్తుతం క్లైమాక్స్ భాగాన్ని షూట్ చేస్తున్నట్లు నిర్మాతలలో ఒకరైన శోభు యార్లగడ్డ తెలిపారు. ఈనెల 13 నుంచి 10 వారాల పాటు బాహుబలి రెండో భాగం క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా.. అంతా కలిసి అద్భుతంగా ఈ షూటింగ్లో పాల్గొంటున్నారంటూ బ్యాక్‌గ్రౌండ్ వర్క్‌కు సంబంధించిన ఓ ఫొటోను కూడా ట్వీట్ చేశారు. రాజమౌళి, రమారాజమౌళి తదితర బృందం మొత్తం డిజైన్లు రూపొందిస్తున్న ఫొటోను షేర్ చేశారు. స్నాప్‌చాట్‌లో ఇక మీదట తాము అందుబాటులో ఉంటామని, సినిమాకు సంబంధించిన అన్ని వివరాలు తెలియజేస్తామని అన్నారు. తమను ఫాలో అవడం ఎలాగో కూడా ట్విట్టర్లో వెల్లడించారు. తమన్నా కూడా ఇప్పటికే స్నాప్‌చాట్‌లో ఉందని తెలిపారు. క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ కోసం జాతీయ అవార్డు విజేత అయిన ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ప్రత్యేకంగా సెట్లను డిజైన్ చేశారు. ఆగస్టు నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేసి, అప్పటినుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా అయితే.. 2017 ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా దీన్ని విడుదల చేస్తారు. The most complex & challenging schedule for climax of @BaahubaliMovie has been finally put in place! 10 weeks of madness starting June 13th! — Shobu Yarlagadda (@Shobu_) 5 June 2016 Months of pre-visualisation, action choreography, practice & rehearsals, multiple sets, 100's of props, VFX come together! @BaahubaliMovie — Shobu Yarlagadda (@Shobu_) 5 June 2016 And of course our cast lead by #Prabhas @RanaDaggubati, #Anushka @tamannaahspeaks and our superb crew! Well you get the picture! :) — Shobu Yarlagadda (@Shobu_) 5 June 2016