క్లైమాక్స్ షూటింగుకు ఐదుగురు డైరెక్టర్లు! | Five directors to shoot climax of Chennai 600028 sequel | Sakshi
Sakshi News home page

క్లైమాక్స్ షూటింగుకు ఐదుగురు డైరెక్టర్లు!

Published Sat, Jun 18 2016 2:58 PM | Last Updated on Mon, Sep 4 2017 2:49 AM

క్లైమాక్స్ షూటింగుకు ఐదుగురు డైరెక్టర్లు!

క్లైమాక్స్ షూటింగుకు ఐదుగురు డైరెక్టర్లు!

చెన్నై
ఒక్క సినిమాకు ఎంతమంది డైరెక్టర్లు ఉంటారు.. సాధారణంగా అయితే ఒక్కరే కదా. కానీ తమిళంలో క్రికెట్ ప్రధానాంశంగా వస్తున్న 'చెన్నై 600028' సీక్వెల్ సినిమా క్లైమాక్స్‌కు మాత్రం ఏకంగా ఐదుగురు దర్శకత్వం వహిస్తున్నారట. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా... 2007లో ఇదే దర్శకుడు తీసిన సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది.

ఇప్పటి సినిమా క్లైమాక్స్‌కు దర్శకత్వం వహిస్తున్న ఐదుగురు కూడా ఒకప్పుడు వెంకట్ ప్రభు దగ్గర అసిస్టెంట్లుగా చేసినవాళ్లే. సినిమా ఇతివృత్తం మొత్తం స్నేహం గురించే ఉంటుందని, చివరకు ఈ మైత్రీబంధం సినిమా క్లైమాక్స్‌ తీసే విషయంలో కూడా బాగా కనిపిస్తోందని సినిమా వర్గాలు అంటున్నాయి. వెంకటేష్ రామకృష్ణన్, శరవణ రాజన్, శ్రీ పతి, చంద్రు, నాగేంద్రన్ ఆర్.. ఈ ఐదుగురూ కలిసి క్లైమాక్స్ తీస్తారట. జై హీరోగా చేస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement