కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన సినిమా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‍టైమ్ (ది గోట్). ఓటీటీ విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు తాజాగా గుడ్‌న్యూస్ వచ్చింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న రిలీజ్ అయింది. భారీ అంచనాలతో విడుదలై ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ వచ్చినా సుమారు రూ. 400 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది.
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‍టైమ్ (ది గోట్) సినిమా ఓటీటీలో విడుదల కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 3 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుందని ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ చిత్రంలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తే.. త్రిష ఒక స్పెషల్ సాంగ్‌లో మెరిసింది.
కథేంటంటే..
గాంధీ(విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ టీమ్‌లో పని చేస్తుంటాడు. ఈ విషయం ఆయన భార్య అను(స్నేహ)కూడా తెలియదు. సునీల్(ప్రశాంత్), కల్యాణ్ సుందర్(ప్రభుదేవా), అజయ్(అజ్మల్) అతని టీమ్ సభ్యులు. నజీర్ (జయరాం) అతని బాస్. ఓ సీక్రెట్ మిషన్ కోసం గర్భవతి అయిన భార్య, కొడుకు జీవన్‌తో కలిసి గాంధీ థాయిలాండ్ వెళ్తాడు. మిషన్ పూర్తి చేసే క్రమంలో కొడుకు జీవన్ మరణిస్తాడు. కొడుకు చావుకు తానే కారణమని భావించి, గాంధీ తన ఉద్యోగాన్ని వదిలేస్తాడు.
అయితే కొన్నేళ్ల తర్వాత గాంధీ ఓ పని మీద రష్యాకు వెళ్లగా అక్కడ అతనికి కొడుకు జీవన్(విజయ్) కనిపిస్తాడు. చనిపోయాడనుకున్న కొడుకు మళ్లీ తిరిగి రావడంతో గాంధీ సంతోషంగా అతన్ని ఇండియాకు తీసుకెళ్లాడు. భార్య, పిల్లలతో కలిసి లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న క్రమంలో.. తన బాస్ నజీర్(జయ రామ్)ని ఎవరో చంపేస్తారు. తనకు ఓ సీక్రెట్ చెప్పాలని అనుకున్న సమయంలోనే హత్య జరగడంతో గాంధీ అప్రమత్తం అవుతాడు. దీని వెనుక ఉన్నదెవరని ఎంక్వేరీ చేయడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో తన సన్నిహితులు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. మరి ఆ హత్యలు చేస్తున్నదెవరు? చనిపోయాడనుకున్న జీవిన్ తిరిగి ఎలా వచ్చాడు? మీనన్(మోహన్) ఎవరు? అతనికి గాంధీకి మధ్య ఉన్న వైరం ఏంటి? కన్న తండ్రిపై జీవన్ ఎందుకు పగ పెంచుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment