sneha
-
బెస్ట్ కపుల్స్‌గా స్నేహ దంపతులు.. ఫ్రెండ్స్‌తో వెకేషన్ ప్లాన్ (ఫోటోలు)
-
చిరునవ్వుకు చిరునామా ఈ బ్యూటిఫుల్ కపుల్, దిష్టితగిలేను! (ఫోటోలు)
-
‘స్నేహాపై ఇలాంటి అపవాదులను ఆపండి’
చరిత్ర మిగిల్చిన చీకటి రోజుల్లో అమెరికా వణికిన రోజు 2001 సెప్టెంబర్ 11. నాడు ఉగ్రవాదులు ట్విన్ టవర్స్‌పై చేసిన దాడి యావత్ ప్రపంచాన్ని ఉలికిపడేలా చేసింది. అయితే నిజానికి ఆ విధే పనికట్టుకుని, స్నేహా ఫిలిప్ అనే భారతీయ డాక్టరమ్మ కథను, నాటి అమెరికావాసుల వ్యథలతో ముడిపడేలా ముందే లిఖించింది కాబోలు!అది సెప్టెంబర్ 11, సాయంత్రం 5 అవుతోంది, రోడ్లపై లక్షల్లో జనాలు, వేలల్లో పోలీసులు. ఇంకా అమెరికా షాక్ నుంచి తేరుకోలేదు. ఒకవైపు బాధిత కుటుంబాల రోదనలు, మరోవైపు ఆగకుండా మోగుతున్న అంబులెన్స్ సైరన్లు. ఆ సమయంలో ఎటు చూసినా విలాపమే, ఏం విన్నా విషాదమే! చాలామంది అధికారులు కనిపించకుండా పోయిన వారి వివరాలను నమోదు చేసుకునే పనిలో పడ్డారు. అప్పుడే అన్సు, ఫిలిప్ అనే కేరళ దంపతులు తమ అమెరికన్ అల్లుడు రాన్ లైబర్మాన్ని వెంటబెట్టుకుని కన్నీళ్లతో పోలీస్ స్టేషన్‌కి వచ్చారు. ‘పేరు స్నేహా ఫిలిప్, భారత మహిళ, ఆమె డాక్టర్, బ్లాక్ హెయిర్, బ్రౌన్ ఐస్, హైట్ 5.6, వయసు 31, గత ఏడాదే పెళ్లైంది, నిన్నటి (సెప్టెంబర్ 10) నుంచి కనిపించడం లేదు’ అంటూ వారు.. ఒక్కొక్కటిగా వివరాలిచ్చారు. స్నేహా కేరళలో పుట్టింది. తన చిన్నప్పుడే, ఆ కుటుంబం న్యూయార్క్‌లో సెటిల్ అయ్యింది. స్నేహా మెడిసిన్ చదువుతున్నప్పుడు రాన్ ఆమెకు జూనియర్‌గా పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారిన తర్వాత, అతడి కోసం స్నేహా ఏడాది చదువు ఆపుకుని, రాన్తో కలసి పట్టభద్రురాలైంది. మెడిసిన్ ఇంటర్న్‌షిప్‌కి ఆహ్వానం అందుకోగానే, 2000 సంవత్సరంలో పెళ్లితో ఒక్కటయ్యారు. అదే ఏడాది ట్విన్ టవర్స్‌కి 5 నిమిషాల దూరంలో ఉన్న బ్యాటరీ పార్క్‌లో అపార్ట్మెంట్ కొనుక్కుని అక్కడికి షిఫ్ట్ అయిపోయారు. ఇద్దరూ డాక్టర్స్, కావాల్సినంత డబ్బు, రోజుకో పార్టీ, వారానికో ట్రీట్. ఆనందకరమైన జీవితానికి తామే ఉదాహరణ అన్నట్లుండేది ఆ జంట. డ్యూటీకి వెళ్లాలంటే అరగంటలోపు.. బంధువులు, స్నేహితులతో పాటు ఫిలిప్ ఇంటికి వెళ్లాలన్నా గంటలోపు ప్రయాణం చేస్తే సరిపోయేది. షాపింగ్స్‌కి, పార్టీస్‌కి వెళ్లడాన్ని బట్టి ఎవరిల్లు దగ్గర్లో ఉంటే వాళ్లింట్లో రాత్రుళ్లు ఉండిపోవడం, మరునాడు డ్యూటీస్‌కి అటునుంచే వెళ్లడం స్నేహా, రాన్లకు అలవాటైపోయింది.సెప్టెంబర్ 10న స్నేహా డ్యూటీకి లీవ్ పెట్టింది. ‘ఎల్లుండి మనింట్లో ఫ్యామిలీ పార్టీ ఉంది కాబట్టి ఇల్లంతా క్లీన్ చేస్తా. షాపింగ్ చేస్తా, అందుకే సెలవు పెట్టా’ అని భర్తతో చెప్పింది స్నేహా. ఆ రోజు ఉదయం భర్తతో కలసి బయటికి వెళ్లి, 11 అయ్యేసరికి అతడితో బ్రేక్‌ఫాస్ట్ చేసి, తిరిగి ఇంటికి బయలుదేరింది. రాన్ అటు నుంచి అటే డ్యూటీకి వెళ్లిపోయాడు. అయితే అదే రాత్రి రాన్ డ్యూటీ నుంచి ఇంటికొచ్చేసరికి స్నేహా ఇంట్లో లేదు. అత్తింటికో, స్నేహితుల ఇంటికో వెళ్లుంటుందిలే అనుకున్న రాన్.. ఆ రాత్రి ప్రశాంతంగానే నిద్రపోయాడు. మరునాడు (సెప్టెబర్ 11) ఉదయం ఆరు గంటలకే లేచి, రెడీ అయ్యి డ్యూటీకి వెళ్లిపోయాడు. అయితే ఆ రోజు 8.40 దాటేసరికి వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని నార్త్ టవర్ (ట్విన్ టవర్స్‌లో ఒక బిల్డింగ్)లో ఉగ్రవాదులు విమానాన్ని కూల్చారన్న వార్త అతడ్ని వణికించింది. వెంటనే స్నేహాకు కాల్ ట్రై చేస్తే, కలవలేదు. మరో పావుగంటలో పక్కనే సౌత్టవర్లో మరో విమానం కూలిందని తెలియగానే రాన్‌కు స్నేహా గురించి భయం మొదలైంది. అప్పుడు కూడా స్నేహా ఫోన్ కలవకపోయేసరికి ఆమె కోసం తెలిసినవారికి, అత్తింటివారికి వరసగా కాల్స్ చేశాడు. ముందురాత్రి స్నేహా మా ఇంటికి రాలేదంటే మా ఇంటికి రాలేదన్నారంతా. దాంతో రాన్ కంగారుగా తమ అపార్ట్మెంట్కి వెళ్లాడు. అప్పటికే కుప్పకూలిన ట్విన్‌టవర్స్ నుంచి దట్టమైన పొగ కమ్మేయడంతో అక్కడ ఎక్కువసేపు ఉండొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. దాంతో వారిని రిక్వస్ట్ చేసి, అపార్ట్మెంట్ సెక్యూరిటీ సాయంతో బిల్డింగ్ సీసీ ఫుటేజ్‌ని పరిశీలించాడు. ముందురోజు ఫుటేజ్‌లో సాయంత్రం 5:30కి స్నేహా ఇంటి నుంచి బయటికి వెళ్లడం కనిపించింది. మరో 2 గంటలకు ట్విన్ టవర్స్ సమీపంలోని డిజైనర్ స్టోర్‌లో స్నేహా తనకోసం షూస్, ఇన్నర్ వేర్స్ కొనుక్కొన్నట్లు పరిచయమున్న సేల్స్‌మన్ ఒకరు రాన్తో చెప్పాడు. ‘నిన్న రాత్రి ఏడున్నరకు స్నేహా మేడమ్ మరో భారతీయురాలితో కలసి మా స్టోర్‌కి వచ్చింది. ఇద్దరూ మంచి స్నేహితుల్లా కనిపించారు. ఆ మహిళను అంతకు ముందెప్పుడూ నేను చూడలేదు’ అని వివరించాడు. వెంటనే రాన్.. ఫిలిప్స్ ఇంటికి వెళ్లి విషయం చెప్పాడు. రాన్ మాటలకు స్నేహా తల్లి అన్సు షాక్ అయ్యింది. ‘అదేంటి నిన్న మధ్యాహ్నం ట్విన్ టవర్స్, హోటల్లో తింటూనే నాతో చాలా సేపు చాటింగ్ చేసిందిగా?’ అంది అయోమయంగా. ‘నిన్న రాత్రి వేరే ఇండియన్ మహిళతో కలిసి షాపింగ్ కూడా చేసిందట ఆంటీ, పోనీ రాత్రి ఆమెతో పాటు ఉందనుకుంటే, మరునాడైనా ఇంటికి రావాలి కదా? ఒకవేళ ట్విన్ టవర్స్ దాడిలో ఇరుక్కుని..?’ మాట పూర్తి చేయలేకపోయాడు రాన్. ఆ అనుమానమే స్నేహా కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ దాకా రప్పించింది.స్నేహా డాక్టర్ కాబట్టి.. 11న జరిగిన మొదటి దాడిలో గాయపడిన వారికి సేవలు చేయడానికి వెళ్లినప్పుడు ఇతర దాడుల్లో ఆమె ప్రాణాలు కోల్పోయి ఉంటుందని చాలామంది నమ్మారు. అయితే ఈ కేసు కోర్టుకెక్కినప్పుడు ఎన్నో అభిప్రాయాలు వినిపించాయి. రాన్తో స్నేహాకున్న పర్సనల్ తగాదాల దగ్గర నుంచి ఆల్కహాల్, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లు ఉన్నాయా? అనేంత వరకూ ప్రతిదీ ఆరా తీసిన అధికారులు.. స్నేహా లెస్బియన్ అయ్యుండొచ్చని అనుమానించారు.డిజైనర్ స్టోర్‌లో స్నేహాతో ఉన్న అజ్ఞాత భారతీయ మహిళతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి, పేరు మార్చుకుని, మిస్సింగ్ డ్రామా ఆడుంటుందని భావించిన న్యాయస్థానం 2004లో.. 9/11 మిస్సింగ్ జాబితా నుంచి స్నేహా పేరును తొలగించేసింది. అయితే ఫిలిప్ దంపతులతో పాటు రాన్ కూడా ఆ తీర్పును ఖండించాడు. ‘స్నేహాను వెతికిపెట్టండి’ అనే పోరాటాన్ని పక్కన పెట్టి.. ‘స్నేహాపై ఇలాంటి అపవాదులను ఆపండి’ అనే పోరాటం మొదలుపెట్టాల్సి వచ్చింది ఆ కుటుంబానికి. నిజానికి ట్విన్ టవర్స్ దాడిలో కొన్ని వందల మంది క్షణాల్లో కాలి బూడిదైపోయారు. వారిలో చాలామంది వివరాలు నేటికీ తేలలేదు.చివరికి 2008లో న్యూయార్క్ కోర్టు స్నేహాపై వచ్చిన వదంతులను కొట్టి పారేస్తూ, 9/11 దాడుల బాధితురాలిగా స్నేహా పేరును ఆ జాబితాలో చేర్చింది. అయితే నేటికీ ఆమె అవశేషాలు దొరక్కపోవడంతో ఈ కేసు మిస్టరీగానే మిగిలిపోయింది.∙సంహిత నిమ్మన -
జల రథ సారథులు
మన హైదరాబాద్‌లో మెట్రో రైల్ ఉంది. కొచ్చిలో కొత్తగా మెట్రో ఫెర్రీ మొదలైంది. కొచ్చిలో ట్రాఫిక్‌ను, కాలుష్యాన్ని కట్టడి చేయడానికి అక్కడి ప్రభుత్వం ‘మెట్రో వాటర్ ఫెర్రీ’ వ్యవస్థను దక్షిణాసియాలోనే మొదటిసారిగా మొదలెట్టింది. 100 మంది పాసింజర్లను మోసుకెళ్లే ఫెర్రీలను నడిపేందుకు ముగ్గురు మహిళా పైలట్లు సెలెక్ట్ అయ్యారు. దేశంలోనే వీరు ప్రథములు. జల రవాణాలో ఇది మహిళా శకం.మొన్నటి సాయంత్రం కొచ్చిలోని హైకోర్టు నుంచి ఫోర్ట్ కొచ్చికి ఫెర్రీ బయలు దేరింది. బ్యాక్‌వాటర్స్‌లో రాత్రి పార్టీలకు కొన్ని హౌస్ బోట్లు బయలుదేరాయి. బెస్త పడవలు వెనుకకు మరలుతున్నాయి. వాటి మధ్య హుందాగా మృదువుగా కదిలింది నీలి రంగు ఫెర్రి. తండ్రి చేయి పట్టుకుని ఫెర్రీ ఎక్కిన ఒక పదేళ్ల అమ్మాయి ఫెర్రీ పైలెట్‌కు సహాయంగా నిలబడి ఉన్న మహిళా పైలెట్‌ను చూస్తూ ఉండిపోయింది. కాసేపటి తర్వాత తండ్రితో అంది ‘నాన్నా... నేను కూడా ఇలా అవుతా’. తండ్రి చిరునవ్వు నవ్వి ఆ మహిళా పైలెట్‌తో ‘ఇలా మా అమ్మాయి కావాలంటే ఏం చదవాలమ్మా’ అని అడిగాడు. ఆ ప్రశ్న ప్రస్తుతం కొచ్చిలో ఫెర్రీలలో ప్రయాణిస్తున్న చాలామంది తల్లిదండ్రులతో. అంతగా స్ఫూర్తినిస్తున్నారు కొత్తగా నియమితులైన ముగ్గురు మహిళా పైలట్లు.అరుణిమ, లక్ష్మి, స్నేహఈ ముగ్గురు యువ సారథులు ‘కొచ్చి వాటర్ మెట్రో లిమిటెడ్’లో ట్రెయినీలుగా నియమితులయ్యారు. ఫెర్రీలలో అసిస్టెంట్లుగా సేవలు అందిస్తున్న వీరు సంవత్సరం తర్వాత పూర్తిస్థాయి పైలట్లుగా విధులు నిర్వర్తిస్తారు. జనరల్ పర్పస్ రేటింగ్ (జిపిఆర్) కన్వర్షన్ కోర్సు పూర్తి చేసిన వారికే ఈ ఉద్యోగం దొరుకుతుంది. కేరళలో ఈ కోర్సు లభ్యమవుతోంది. కొల్ల్లంకు చెందిన అరుణిమ, తిరువనంతపురంకు చెందిన లక్ష్మి, అలెప్పికి చెందిన స్నేహ వివిధ ఇంజినీరింగ్ డిప్లమాలు చేశాక ఫెర్రీ పైలెట్ ఉద్యోగాల పట్ల ఆసక్తి చూపారు. అయితే జేపీఎస్ కోర్సు పూర్తి చేశాకనే వారికి ట్రెయినీలుగా అవకాశం వస్తుంది. ఆ కోర్సును కూడా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడంతో ట్రెయినీ పైలట్లు నియమితులయ్యారు.75 ఫెర్రీలు 33 వేల పాసింజర్లుకొచ్చి చుట్టూ లంక గ్రామాలు ఉన్నాయి. కొచ్చిలో కూడా ఒకచోట నుంచి మరో చోటకు వెళ్లడానికి మైట్రో రైలు ఉన్నా ట్రాఫిక్ సమస్య తీరడం లేదు. దీంతో ఫ్రభుత్వం దాదాపు లక్షా పదమూడు వేల కోట్ల ఖర్చుతో వాటర్ మెట్రో సర్వీసును మొదలెట్టింది. ఇందులో భాగంగా 75 హైబ్రీడ్ ఫెర్రీలు అందుబాటులోకి రానున్నాయి. వీటి రాకపోకల కోసం 38 జెట్టీలు నిర్మించారు, 15 రూట్లు ఖరారు చేశారు. దీంతో 33 వేల మంది పాసింజర్లకు మేలు జరుగుతుంది. టికెట్ 20 రూపాయల నుంచి 40 రూపాయలు ఉంటుంది. 100 మంది పాసింజర్లున్న ఫెర్రీ గరిష్టంగా 23 కిలోమీటర్లు గంటలో ప్రయాణిస్తుంది.పురుష ప్రపంచంలో మహిళా సారథులుకేరళలో టూరిజం కోసం ఉపయోగించే హౌస్బోట్లు, ఇతర ఫెర్రీలలోగాని పురుషులే డ్రైవర్లుగా ఉంటారు. మెట్రో ఫెర్రీలలో కూడా పురుష పైలట్లే ఉన్నారు. కాని స్త్రీలు ఈ ఉపాధిలో తప్పక ఉండాలని ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసింది. ‘మేము విధులు నిర్వర్తిస్తుంటే అందరూ మా యూనిఫామ్‌లు చూసి మెచ్చుకోలుగా మాట్లాడుతున్నారు’ అంటుంది అరుణిమ. ‘ఉద్యోగంలోకి బెరుగ్గా అడుగుపెట్టాను. కాని మెట్రో ఉద్యోగులు నా బెరుకును కొద్ది రోజుల్లోనే పోగొట్టారు. మేము కలిసి పని చేసే ఒక వాతావరణం ఇక్కడ ఉంది’ అంది లక్ష్మి. ‘ఫెర్రీ పైలట్ అంటే ఫెర్రీని నడపడమే కాదు... క్రౌడ్‌ను కూడా మేనేజ్ చేయాలి. ఫెర్రీ కదులుతుంటే కొంతమంది అంచుల్లో నిలబడతారు. వారిని హెచ్చరించాలి’ అంటుంది స్నేహ. ‘మొదటిసారి మేము ఫెర్రీ లోపలికి వచ్చి చూస్తే ఇదో షిప్పేమో అనిపించేంత ఆధునికంగా ఉంది. అన్ని సాంకేతిక రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఇందులో వైఫై కనెక్టివిటీ ఉంటుంది. సీటింగ్ ఏరియా అంతా ఏసి ఉంటుంది’ అని తెలిపింది అరుణిమ.విమానాలు, మెట్రో రైళ్లు, మైట్రో ఫెర్రీలు.... దూసుకుపోతున్న మహిళలకు అభినందనలు. -
ఓటీటీలో విజయ్ 'ది గోట్' సినిమా.. అధికారిక ప్రకటన
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన సినిమా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ (ది గోట్). ఓటీటీ విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు తాజాగా గుడ్‌న్యూస్ వచ్చింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న రిలీజ్ అయింది. భారీ అంచనాలతో విడుదలై ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ వచ్చినా సుమారు రూ. 400 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది.ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ (ది గోట్) సినిమా ఓటీటీలో విడుదల కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 3 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుందని ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ చిత్రంలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తే.. త్రిష ఒక స్పెషల్ సాంగ్‌లో మెరిసింది.కథేంటంటే.. గాంధీ(విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ టీమ్‌లో పని చేస్తుంటాడు. ఈ విషయం ఆయన భార్య అను(స్నేహ)కూడా తెలియదు. సునీల్(ప్రశాంత్), కల్యాణ్ సుందర్(ప్రభుదేవా), అజయ్(అజ్మల్) అతని టీమ్ సభ్యులు. నజీర్ (జయరాం) అతని బాస్. ఓ సీక్రెట్ మిషన్ కోసం గర్భవతి అయిన భార్య, కొడుకు జీవన్‌తో కలిసి గాంధీ థాయిలాండ్ వెళ్తాడు. మిషన్ పూర్తి చేసే క్రమంలో కొడుకు జీవన్ మరణిస్తాడు. కొడుకు చావుకు తానే కారణమని భావించి, గాంధీ తన ఉద్యోగాన్ని వదిలేస్తాడు.అయితే కొన్నేళ్ల తర్వాత గాంధీ ఓ పని మీద రష్యాకు వెళ్లగా అక్కడ అతనికి కొడుకు జీవన్(విజయ్) కనిపిస్తాడు. చనిపోయాడనుకున్న కొడుకు మళ్లీ తిరిగి రావడంతో గాంధీ సంతోషంగా అతన్ని ఇండియాకు తీసుకెళ్లాడు. భార్య, పిల్లలతో కలిసి లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న క్రమంలో.. తన బాస్ నజీర్(జయ రామ్)ని ఎవరో చంపేస్తారు. తనకు ఓ సీక్రెట్ చెప్పాలని అనుకున్న సమయంలోనే హత్య జరగడంతో గాంధీ అప్రమత్తం అవుతాడు. దీని వెనుక ఉన్నదెవరని ఎంక్వేరీ చేయడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో తన సన్నిహితులు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. మరి ఆ హత్యలు చేస్తున్నదెవరు? చనిపోయాడనుకున్న జీవిన్ తిరిగి ఎలా వచ్చాడు? మీనన్(మోహన్) ఎవరు? అతనికి గాంధీకి మధ్య ఉన్న వైరం ఏంటి? కన్న తండ్రిపై జీవన్ ఎందుకు పగ పెంచుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
The Goat Review: విజయ్ ‘ది గోట్’ మూవీ రివ్యూ
టైటిల్: ది గోట్(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)నటీనటులు: దళపతి విజయ్, స్నేహ, మీనాక్షి చౌదరి, ప్రభుదేవా, ప్రశాంత్, జయరామ్, అజ్మల్, వైభవ్ తదితరులునిర్మాతలు: కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్తెలుగు విడుదల: మైత్రీ మూవీ మేకర్స్ దర్శకత్వం: వెంకట్ ప్రభుసంగీతం: యువన్ శంకర్ రాజావిడుదల తేది: సెప్టెంబర్ 5, 2024దళపతి విజయ్ పాలిటిక్స్ కి ఎంటర్ అయ్యే ముందు చేసిన చివరి సినిమా ‘ది గోట్’. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ చివరి చిత్రం ఇదేనని ప్రచారం జరగడంతో ‘ది గోట్’పై భారీ హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు డీ ఏజింగ్ కాన్సెప్ట్ ద్వారా విజయ్ యంగ్ లుక్‌లో చూపించడంతో సినిమా ఎలా ఉండబోతుందోనని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఓ రకమైన ఆసక్తి పెరిగింది. ఇన్ని అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. గాంధీ(విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ టీమ్‌లో పని చేస్తుంటాడు. ఈ విషయం ఆయన భార్య అను(స్నేహ)కూడా తెలియదు. సునీల్(ప్రశాంత్), కల్యాణ్ సుందర్(ప్రభుదేవా), అజయ్(అజ్మల్) అతని టీమ్ సభ్యులు. నజీర్ (జయరాం) అతని బాస్. ఓ సీక్రెట్ మిషన్ కోసం గర్భవతి అయిన భార్య, కొడుకు జీవన్‌తో కలిసి గాంధీ థాయిలాండ్ వెళ్తాడు. మిషన్ పూర్తి చేసే క్రమంలో కొడుకు జీవన్ మరణిస్తాడు. కొడుకు చావుకు తానే కారణమని భావించి, గాంధీ తన ఉద్యోగాన్ని వదిలేస్తాడు. అయితే కొన్నేళ్ల తర్వాత గాంధీ ఓ పని మీద రష్యాకు వెళ్లగా అక్కడ అతనికి కొడుకు జీవన్(విజయ్) కనిపిస్తాడు. చనిపోయాడనుకున్న కొడుకు మళ్లీ తిరిగి రావడంతో గాంధీ సంతోషంగా అతన్ని ఇండియాకు తీసుకెళ్లాడు. భార్య, పిల్లలతో కలిసి లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న క్రమంలో.. తన బాస్ నజీర్(జయ రామ్)ని ఎవరో చంపేస్తారు. తనకు ఓ సీక్రెట్ చెప్పాలని అనుకున్న సమయంలోనే హత్య జరగడంతో గాంధీ అప్రమత్తం అవుతాడు. దీని వెనుక ఉన్నదెవరని ఎంక్వేరీ చేయడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో తన సన్నిహితులు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. మరి ఆ హత్యలు చేస్తున్నదెవరు? చనిపోయాడనుకున్న జీవిన్ తిరిగి ఎలా వచ్చాడు? మీనన్(మోహన్) ఎవరు? అతనికి గాంధీకి మధ్య ఉన్న వైరం ఏంటి? కన్న తండ్రిపై జీవన్ ఎందుకు పగ పెంచుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..వెంకట్ ప్రభు దర్శకత్వం వహించడం, విజయ్ చివరి చిత్రమని ప్రచారం జరగడంతో తమిళ్లో ‘ది గోట్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ రిలీజ్‌కి ముందు తెలుగులోనూ విజయ్ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే డీ ఏజింగ్ ఎఫెక్ట్‌తో తీసిన సీన్స్ ట్రైలర్లో చూపించడం..వాటిపై ట్రోల్స్ రావడంతో తెలుగులో పెద్ద అంచనాలు లేకుండానే సినిమా రిలీజ్ అయింది. ఇంకా చెప్పాలంటే..విడుదల తర్వాత వెంకట్ ప్రభు చేసిన డీ ఏజింగ్ కాన్సెప్ట్ పక్కా ట్రోల్ అవుతుందని అంతా భావించారు. కానీ ట్రోలర్స్‌కి వెంకట్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. జూనియర్ విజయ్ పాత్రను చక్కగా రాసుకోవడమే కాదు.. తెరపై అంతే చక్కగా చూపించాడు. ఈ విషయంలో విజయ్ అభిమానులు ఊపిరి పీల్చుకోవచ్చు. ఇక కథ విషయానికొస్తే మాత్రం.. ఇది రొటీన్ సినిమా అని చెప్పొచ్చు. హీరో ఓ సీక్రెట్ ఏజెన్సీలో పని చేయడం..అతని పని వల్ల ఫ్యామిలీకి ఇబ్బంది రావడం..సొంత మనుషులే నమ్మక ద్రోహం చేయడం.. చివరికి హీరో అసలు విషయాన్ని కనిపెట్టి శత్రువుని ముట్టుపెట్టడం..ఈ కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. అలాగే తండ్రి కొడుకుల మధ్య శత్రుత్వంపై కూడా సినిమాలు వచ్చాయి. ఈ రెండు కాన్సెప్ట్‌లను మిక్స్ చేసి ‘ది గోట్’ సినిమాను తెరకెక్కించాడు వెంకట్ ప్రభు. రొటీన్ కథే అయినా తనదైన స్క్రీన్‌ప్లేతో ఆసక్తికరంగా కథనాన్ని నడిపించాడు. కావాల్సిన చోట హీరోకి ఎలివేషన్ ఇస్తూ విజయ్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సినిమా ప్రారంభం నుంచి ప్రీ ఇంటర్వెల్ వరకు కథనం రొటీన్‌గా సాగుతుంది. ఈ మధ్యలో వచ్చే ట్విస్టులు కూడా ఈజీగానే ఊహించొచ్చు. ఇంటర్వెల్ ముందు మెట్రో ట్రైన్లో వచ్చే యాక్షన్ సీన్ అదిరిపోతుంది. ఇక ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ చాలా బెటర్. కథనం ఆసక్తికరంగా సాగడంతో పాటు మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. అయితే ఇంటర్వెల్ సీన్‌తోనే సెకండాఫ్‌లో కథనం ఎలా సాగుతుంది? క్లైమాక్స్ ఎలా ఉంటుందనేది ఊహించొచ్చు. కానీ భారీ యాక్షన్, ఎలివేషన్స్ కారణంగా క్లైమాక్స్ సీన్ బోర్ కొట్టదు. ఐపీఎల్ మ్యాచ్ ఫుటేజీని, ధోనీ ఇమేజ్‌ని చక్కగా వాడుకున్నాడు. ఊహకందేలా కథనం సాగడం, ట్విస్టులు కూడా ముందే తెలిసేలా ఉండడంతో పాటు నిడివి కూడా ఎక్కువగా ఉండడం సినిమాకు మైనస్. ఎవరెలా చేశారంటే.. విజయ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన హీరోయిజం ఎలా ఉంటుందో చాలా సినిమాల్లో చూశాం. ది గోట్లో స్పెషల్ ఏంటంటే విజయ్‌లోని విలనిజాన్ని చూడొచ్చు. గాంధీగా హీరోయిజాన్ని తనదైన స్టైల్లో చూపిస్తూనే.. జీవన్ అలియాస్ సంజయ్గా అద్భుతమైన విలనిజాన్ని తెరపై పండించాడు. హీరోగా కంటే విలన్‌గా విజయ్ చేసిన కొన్ని సీన్స్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తాయి. స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ టీమ్‌లో పనిచేసే ఆఫీసర్స్‌గా ప్రశాంత్, ప్రభుదేవా, ఆజ్మల్ , జయ రామ్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. హీరో భార్య అనుగా స్నేహ చక్కగా నటించింది. మీనాక్షి చౌదరి తెరపై కనిపించేది కాసేపే అయినా..ఉన్నంతలో చక్కగా నటించింది. సినిమా ప్రారంభంలో ఏఐ ద్వారా కెప్టెన్ విజయ్ కాంత్‌ని తెరపై చూపించడం ఆకట్టుకుంటుంది. యోగిబాబు కామెడీ పర్వాలేదు. తమిళ్ హీరో శివ కార్తికేయన్ తెరపై కనిపించేంది కొన్ని క్షణాలే అయినా.. సందడిగా అనిపిస్తుంది. సాంకేతికపరంగా సినిమా పర్వాలేదు. యువన్ శంకర్ రాజా సంగీతం యావరేజ్‌గా ఉంది. పాటలు ఆకట్టుకోకపోవడమే కాకుండా ఇరికించినట్లుగా అనిపిస్తాయి. బీజీఎం జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. డీ ఏజింగ్ కాన్సెప్ట్ వర్కౌట్ అయింది. ఏఐ టెక్నాలజీని చక్కగా వాడుకున్నారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
విజయ్ ‘ది గోట్’ మూవీ HD స్టిల్స్
-
కట్టుకున్న చీరకే అందాన్ని తెచ్చిన స్నేహ (ఫోటోలు)
-
హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ డైరెక్టర్.. క్రేజీ సాంగ్ వచ్చేసింది
పవన్ కుమార్ కొత్తూరి, స్నేహా మాలవ్య, సాహిబా భాసిన్, వివియా సంత్లు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్ నాని’. ఈ సినిమాతో పవన్ కుమార్ హీరోగా పరిచయమవుతున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మెరిసే మెరిసే చిత్రంతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ను ఇచ్చారు. ‘సారా సారా’ అంటూ సాగే ఓ మెలోడీ పాటను విడుదల చేశారు. ఈ పాటకు శివకృష్ణచారి ఎర్రోజు లిరిక్స్ అందించగా.. పద్మలత, అనుదీప్ దేవ్ ఆలపించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించారు. ఈ సినిమాలో ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి కీలక పాత్రలు పోషించారు. -
ప్రాణమున్నగోడలు
బయటి గోడలు ఎలా ఉంటే ఏంటి అనుకుంటారు చాలామంది.అరె.. ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అనేలా చేస్తుంది స్నేహ చక్రవర్తి. ఎత్తుగా ఉండే గోడలపై భారీ మ్యూరల్స్ గీయడం సవాలు.మహిళా ఆర్టిస్ట్‌గా ఆ సవాలును ఎదుర్కొంది స్నేహ.దేశంలో గొప్ప కుడ్య చిత్రకారిణిగా ఉన్నఆమె జీవన విశేషాలు.కూర్గ్ కాఫీ తోటల్లో పనిచేసే కార్మికులు, కొచ్చిలో చేపలు పట్టే బెస్తవారు, బెంగళూరులో ఇడ్లీ హోటల్ నడిపే ముసలామె, తమిళనాడులో తిరిగే జడలు గట్టిన సాధువులు, కష్టజీవులు, శ్రామిక మహిళలు... వీరిని భారీ బొమ్మలుగా ఎప్పుడైనా గోడల మీద చూశామా? స్నేహ చక్రవర్తి ‘మ్యూరల్స్’ (కుడ్య చిత్రాలు– గోడ బొమ్మలు) చూస్తే వీరే కనపడతారు. ‘దేశంలో ఎవరూ గమనించని జీవన ΄ోరాట యోధులు వీరంతా. వీళ్లను బొమ్మల్లో చూపడమే నా లక్ష్యం’ అంటుంది స్నేహ చక్రవర్తి. గత సంవత్సరం ఆమె ‘ట్రావెల్ అండ్ పెయింట్ ఇండియా’ పేరుతో భారత దేశ యాత్ర చేసింది. కూర్గ్‌తో మొదలెట్టి హిమాచల్ ప్రదేశ్ వరకూ అనేక రాష్ట్రాల్లో తిరుగుతూ గోడల మీద భారీ చిత్రాలు గీసింది. వాటిలో ప్రధాన అంశం సామాన్యులు, సామాన్య జీవనం... దానిలోని సౌందర్యం. ‘దేశమంటే వీళ్లే’ అంటుంది స్నేహ.సొంత ఊరు ఢిల్లీఢిల్లీలో పుట్టి పెరిగిన స్నేహ అక్కడ చదువు పూర్తి చేసింది. ఆమె తండ్రి ఇంజినీర్, తల్లి గృహిణి. ‘నాకు ఏడేళ్ల వయసున్నప్పుడు చేతుల మీద మెహందీ వేసే ఒక మహిళ వచ్చింది. ఆమె వేసిన డిజైన్లు నన్ను ఆకర్షించాయి. ఆమె మా పక్కింటికి వెళితే అక్కడకు కూడా వెళ్లి ఆమె మెహందీ వేయడం చూశాను. మరుసటి రోజే అమ్మను అడిగి మెహందీ తెచ్చి ట్రై చేశాను. నాకు మెహందీ వేయడం వచ్చేసింది. ఎనిమిదేళ్లకు మా ఏరియాలో గిరాకీ ఉన్న మెహందీ ఆర్టిస్ట్‌ను అయ్యాను. అయితే కళ అన్నం పెట్టదు అనే భావనతో ఏదైనా పని చేయమని నన్ను మా తల్లిదండ్రులు కోరారు. వారి కోసమని ఒక ఎయిర్‌లైన్స్ సంస్థలో ఇంటీరియర్ డిజైనర్‌గా చేశారు. కాని ఇలా ఒకరి కింద పని చేయడం నాకు నచ్చలేదు. నా మనసు అక్కడ లేదు. నేను రంగుల కోసం పుట్టాను. రంగుల్లో మునుగుతాను. నా బొమ్మలు అందరూ చూడాలి. అంటే నేను మ్యూరలిస్ట్‌గా, స్ట్రీట్ ఆర్టిస్ట్‌గా పేరు గడించాలి. ఆ విషయం ఇంట్లో చెప్పి 2018 నుంచి మ్యూరలిస్ట్‌గా మారాను’ అని తెలిపింది స్నేహ చక్రవర్తి.జటిలమైన చిత్రకళకాన్వాస్ మీద బొమ్మ గీయడం వేరు... ఒక పెద్ద గోడను కాన్వాస్‌గా చేసుకోవడం వేరు. కాగితం మీద వేసుకున్న బొమ్మను పదింతలు ఇరవై యింతలు పెంచి గోడ మీద గీస్తారు. దొంతీలు కట్టుకుని గోడ మీద బొమ్మ వేస్తే మళ్లీ కిందకు దిగి దూరం నుంచి చూసుకుంటూ బొమ్మను అంచనా కడుతూ గీయాలి. సాధారణంగా మగవారు ఈ ఆర్ట్‌లో ప్రావీణ్యం సం΄ాదిస్తారు. మ్యూరలిస్ట్‌లుగా ఉన్న మహిళలు తక్కువ. వారిలో స్నేహ చక్రవర్తి పేరు పొందింది. పూణె, ముంబై స్లమ్స్‌లో ఆమె గీసిన బొమ్మలు ఆ మురికివాడలకు జీవం, ప్రాణం ΄ోశాయి. ‘అందమైన బొమ్మ ఉన్న గోడ దగ్గర ఎవరూ చెత్త వేయడానికి ఇష్టపడరు. ఉమ్మివేయరు’ అని చెప్పింది స్నేహ. స్త్రీలు– సందేశాలు‘నా మ్యూరల్స్‌తో స్త్రీల సాధికారతను చూపిస్తుంటాను. స్వేచ్ఛాభావనను చూపుతుంటాను. సరైన సందేశాలు కూడా ఇస్తుంటాను. ఒకసారి ఒక పెద్ద స్త్రీ బొమ్మ గీచి ఫర్ సేల్ ఫర్ సేల్ అని చాలాసార్లు ఆ స్త్రీ బొమ్మ చుట్టూ రాశాను. ΄ోర్నోగ్రఫీ వల్ల స్త్రీ దేహం అమ్మకానికి సులువుగా దొరుకుతుందన్న భావన పురుషులలో ఉంటుంది. అలాంటి భావజాలం ఎంత దుర్మార్గమైనదో తెలిసొచ్చేలా ఆ బొమ్మ గీశాను. దానికి మంచి స్పందన వచ్చింది. గోడలు లేని ప్రపంచం లేదు. అందుకే నేను ప్రపంచమంతా తిరిగి బొమ్మలు వేస్తాను. నా బొమ్మ ప్రతి దేశం గోడ మీద మన ప్రజలను, సంస్కృతిని చూ΄ాలన్నదే నా కోరిక’ అని తెలిపింది స్నేహ. View this post on Instagram A post shared by Sneha Chakraborty (@lbc_sneha) -
నా భర్త మరో అమ్మాయిని ప్రేమించాడు: స్నేహ
అందం, అమాయకత్వంతో అలరించిన హీరోయిన్లలో స్నేహ ముందువరుసలో ఉంటారు. ప్రియమైన నీకు సినిమాతో తెలుగువారికి పరిచయమైన ఈ బ్యూటీ హనుమాన్ జంక్షన్, వెంకీ, సంక్రాంతి, రాధాగోపాలం, శ్రీరామదాసు, ఏవండోయ్ శ్రీవారు, పాండురంగడు.. ఇలా అనేక చిత్రాల్లో కథానాయికగా నటించింది. 2009లో అచ్చముందు అచ్చముందు అనే తమిళ సినిమాలో నటుడు ప్రసన్నతో జోడీగా నటించింది. ఆ సమయంలో వీరు ప్రేమలో పడ్డారు. 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప, బాబు సంతానం. అతి ఉండకూడదు పెళ్లి తర్వాత స్నేహ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయింది. తెలుగులో చివరగా వినయ విధేయ రామలో కనిపించింది. ఇటీవలే చీరల బిజినెస్‌లోకి దిగింది స్నేహ. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'పొజెసివ్‌నెస్ ఉండాలి.. కానీ అతిగా ఉండకూదు. అది ఎక్కువైతే నమ్మకాన్ని బ్యాలెన్స్ చేయలేం. ఉదాహరణకు.. బయటకు ఎందుకు వెళ్తున్నావు? ఈ సమయంలో వెళ్లి ఏం చేస్తావు? ఇలాంటి ప్రశ్నలు తలెత్తకూడదు. మనల్ని అవతలి వ్యక్తి సరిగా అర్థం చేసుకుంటే ఈ ప్రశ్నలు రావు. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. అదే నమ్మకాన్ని పెంచుతుంది ఒకరు మనల్ని అడిగేముందే.. నేను ఫలానా చోటుకు వెళ్తున్నాను.. ఈ సమయంలోపు వచ్చేస్తాను అని సమాచారం ఇవ్వాలి. అక్కడికి వెళ్లాక కూడా మీకు టైముంటే ఒకసారి మీ భాగస్వామికి ఫోన్ చేసి నేను చేరుకున్నాను, నువ్వు భోజనం చేశావా? అని ఆరా తీయాలి. ఇలాంటి చిన్నచిన్నవే ప్రేమను, నమ్మకాన్ని పెంచుతాయి. పెళ్లయిన కొత్తలో నేను కూడా పొజెసివ్‌గా ఉండేదాన్ని. అలా అని తనపై నమ్మకం లేదని అర్థం కాదు. బ్రేకప్ మంచే చేసింది! గతంలో నా భర్త ఓ అమ్మాయిని ప్రేమించాడు. కానీ వారికి బ్రేకప్ అయింది. దానివల్ల నాకెలాంటి సమస్యా లేదు. ఎందుకంటే ఆ బ్రేకప్ జరిగి ఉండకపోతే నాకు ప్రసన్న భర్తగా దొరికేవాడే కాదు! అప్పుడు నాకు ఇంకో సమస్య వచ్చిపడటంతో ఆ ఏడాదంతా ఎంతో కష్టంగా నడిచింది. మానసిక ఒత్తిడికి లోనయ్యాను. సరిగ్గా అప్పుడే నేను ఉత్తమ నటిగా తమిళనాడు ఫిలిం అవార్డు అందుకున్నాను అని చెప్పుకొచ్చింది. చదవండి: నువ్వు వర్జినా..? ముందు నీ పెళ్లి గురించి చెప్పమన్న హీరోయిన్ తనయుడు -
బ్లాక్‌బస్టర్ వెంకీ సినిమా మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరంటే?
మాస్ మహారాజ.. రవితేజకు ఇప్పుడంటే సరైన హిట్లు రావట్లేదు కానీ ఒకప్పుడు బ్లాక్‌బస్టర్ హిట్లతో చించేశాడు. చంటి, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, ఖడ్గం, వెంకీ.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలానే ఉంది. ముఖ్యంగా వెంకీ సినిమాలో ట్రైన్ సీన్ అయితే ఎవర్గ్రీన్.. సినిమా అంతా ఒక ఎత్తయితే ఆ రైల్లో నడిచే కామెడీ సన్నివేశం మరో ఎత్తు. ఇప్పటికీ మీమ్స్‌లో దీన్ని వాడుతుంటారు. వెంకీ సినిమాతోనే మొదలు ఈ సినిమా రిలీజై రేపటికి (మార్చి 26 నాటికి) 20 ఏళ్లు కావస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనువైట్ల తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. 'నేను ప్రతి సినిమాకు నాగార్జునసాగర్ వెళ్లి అక్కడే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుంటూ ఉంటాను. అది వెంకీ సినిమాతోనే మొదలైంది. అయితే ఈ చిత్రానికి మొదట అసిన్‌ను హీరోయిన్గా అనుకున్నాను. కానీ కుదరకపోవడంతో స్నేహను సెలక్ట్ చేశాం. రైలు కామెడీ సీన్లో ఎమ్మెస్ నారాయణ కూడా ఉండాలి.. కానీ మిస్సయ్యారు. అదే బెస్ట్ కాంప్లిమెంట్ చాలామంది ఈ రైలు సీన్ వర్కవుట్ అవుతుందా? అని కూడా అన్నారు. రిలీజయ్యాక మాత్రం మేము ఊహించినదానికంటే రెట్టింపు రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నచ్చిందని చిరంజీవి ఫోన్ చేసి చెప్పడటమే నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్' అని గుర్తు చేసుకున్నాడు. వెంకీ సినిమాకు శ్రీనువైట్లతో పాటు కోన వెంకట్, గోపిమోహన్ రచయితలుగా పని చేశారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా అట్లూరి పూర్ణచంద్ర రావు నిర్మించారు. చదవండి: మొన్నేమో పెళ్లిచప్పుడే లేదంది.. ఇప్పుడేకంగా రహస్య వివాహం! -
Actress Sneha ‘సిల్వర్ స్క్రీన్’ అందాల నటి స్నేహ స్టైలిష్.. ఫొటోలు
-
వధూవరులకు సీఎం జగన్ ఆశీస్సులు
సాక్షి, అమరావతి/కంకిపాడు: మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) మేనకోడలు వివాహ వేడుకలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. కోనేరు లీలాప్రసాద్, రాజ్యలక్ష్మి విజయ చాముండేశ్వరిదేవి కుమార్తె డాక్టర్ స్నేహ, డాక్టర్ అనురాగ్ దీపక్‌ల వివాహం గురువారం కృష్ణా జిల్లా కంకిపాడులోని అయాన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. ఈ వేడుకకు హాజరైన సీఎం వైఎస్ జగన్ నూతన వధూవరులకు ఆశీస్సులు అందించారు. ఈ వేడుకలో మంత్రి జోగి రమేశ్, కలెక్టర్ పి.రాజాబాబు, ఎస్పీ జాషువా, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, కైలే అనిల్‌కుమార్, దూలం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
జూనియర్ సౌందర్యగా గుర్తింపు తెచ్చుకున్న ఈ క్యూట్ బేబీని గుర్తుపట్టారా?
సినీ హీరో హీరోయిన్ల పర్సనల్ విషయాలపై అభిమానులకు చాలా ఆసక్తి ఉంటుంది. వాళ్లకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి నెట్టింట్లో తెగ వెతుకుతారు. అలానే హీరో, హీరోయిన్లకు సంబంధించిన చిన్నప్పటి ఫొటోలు కూడా తెగ వైరల్ అవుతాయి. ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. తాజాగా ఓ క్యూట్ బేబీ ఫొటో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? సినిమా హీరోయిన్ అంటే స్కిన్ షో చేయాల్సిందే అన్నది చాలామందికి ఉన్న అభిప్రాయం. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. కానీ వెండితెరపై ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండానే స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారి చర్చరాగానే మొదట సావిత్రి, సౌందర్య వంటి తారలు గుర్తుకు రావడం సహజం. ఈ జాబితాలో మరో భామ కూడా చేరుతుంది. ఆమె ఎవరో కాదు స్నేహ.. ఈ ఫోటోలో క్యూట్‌గా ఉన్నది జూనియర్ సౌందర్యగా పిలుచుకునే స్నేహనే.. తెలుగులో స్నేహ ‘తొలివలపు’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చినా.. తరుణ్‌తో కలిసి ‘ప్రియమైన నీకు’ సినిమాతో ఆమెకు స్టార్ ఇమేజ్ వచ్చింది. ప్రస్తుతం విజయ్ 68వ చిత్రంలో స్నేహ ఒక కీలకపాత్రలో నటించనుంది. -
పెళ్లికి ముందు ఆ నిర్మాత ప్రేమలో స్నేహ.. నటుడి సంచలన వ్యాఖ్యలు
సినిమా హీరోయిన్ అంటే స్కిన్ షో చేయాల్సిందే అన్నది చాలామందికి ఉన్న అభిప్రాయం. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. కానీ వెండితెరపై ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండానే స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారి చర్చరాగానే మొదట సావిత్రి, సౌందర్య వంటి తారలు గుర్తుకు రావడం సహజం. ఈ జాబితాలో మరో భామ కూడా చేరుతుంది. ఆమె మరెవరోకాదు.. తెలుగుతోపాటు సౌత్‌లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న స్నేహ. హోమ్లీ బ్యూటీగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందింది. పెళ్లి అనంతరం సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చిన ఆమె రామ్ చరణ్ వినయ విధేయ రామతో రిఎంట్రీ ఇచ్చింది. ఇక తమిళ నటుడు ప్రసన్న కుమార్‌ను స్నేహ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నటి స్నేహ తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి. ఆమె పూర్వీకులు ఏపీలోని రాజమండ్రిలో నివసించారు. కానీ ఆమె తల్లిదండ్రులు రాజారామ్, పద్మావతి వ్యాపార రిత్యా ముంబాయికి వెళ్లారు. హీరోయిన్ స్నేహ కూడా అక్కడే జన్మించారు. నిర్మాతతో ప్రేమలో కోలీవుడ్‌లో స్థిరపడిన స్నేహ, ప్రసన్నలకు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే కితాబు చాలామంది ఇస్తుంటారు. పదకొండేళ్ల వైవాహిక జీవితంలో ఇప్పటికీ ఎలాంటి పొరపచ్చాలు లేకుండా జీవితాన్ని గడుపుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. సినీ పరిశ్రమలో విడాకులు తరచు పెరుగుతున్న పరిస్థితుల్లో స్నేహ, ప్రసన్నల కుటుంబ జీవితం అందరికీ ఉదాహరణగా చెప్పుకుంటారు కూడా. పెళ్లయ్యాక ఇద్దరూ సినీ పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్నారు. అయితే ప్రసన్న కంటే ముందే స్నేహ మరోక వ్యక్తిని ప్రేమించారని తమిళ నటుడు, సినీ విమర్శకుడు బైల్వాన్ రంగనాథన్ వెల్లడించాడు. (ఇదీ చదవండి: Skanda Review: ‘స్కంద’ మూవీ ట్వీటర్ రివ్యూ) ఆ ప్రేమ విఫలం కావడంతోనే స్నేహ ఇక పెళ్లి చేసుకోదనే నిర్ణయానికి కూడా వచ్చినట్లు ఆయన చెప్పుకొచ్చాడు. ప్రసన్నతో ప్రేమలో పడకముందే స్నేహ ఓ సినీ నిర్మాతతో ప్రేమలో పడిందని, అది విఫలమైందని బెయిల్వాన్ రంగనాథన్ పేర్కొన్నాడు. 'స్నేహ ప్రసన్నతో ప్రేమలో పడకముందే నిర్మాత రవితో ప్రేమలో ఉన్నారని, కొంతకాలం తర్వాత వారి ప్రేమ పెళ్లి దాకా కూడా వెళ్లిందని ఆయన చెప్పాడు. అంతేకాకుండా వారిద్దరూ డైమండ్ రింగ్స్ మార్చుకుని నిశ్చితార్థం కూడా చేసుకున్నారని తెలిపాడు. నిశ్చితార్థం తర్వాత, స్నేహ తన ప్రియుడు రవికి తన పట్ల చిత్తశుద్ధి, నిజమైన ప్రేమ లేదని గ్రహించిన ఆమె అతన్ని పెళ్లి చేసుకోవడం సరికాదని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పాడు. అలా రవితో తన ప్రేమకు స్నేహ స్వస్తి చెప్పినట్లు ఆయన గుర్తుచేశాడు. ఈ సంఘటన తర్వాత ప్రసన్నతో పరిచయం ఆమెకు పరిచయం ఏర్పడింది. కానీ ప్రేమ పట్ల తనకు నమ్మకం లేకపోవడంతో మొదట ప్రసన్నకు కూడా ఆమె దూరంగా ఉండేదని తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని ఆయన అన్నాడు. వారికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారని బైల్వాన్ రంగనాథన్ తెలిపారు. త్వరలో స్నేహ, ప్రసన్న విడిపోవాలని యోచిస్తున్నట్లు తమిళనాట వార్తలు బాగా వచ్చాయి. అయితే ఆ తర్వాత వారిద్దరూ వాటికి బ్రేక్ వేసి హ్యాపీ లైఫ్‌ను గడుపుతున్నామని వెల్లడించారు. వాళ్లిద్దరూ మంచి కపుల్స్ అని బైల్వాన్ కితాబు ఇచ్చారు. ప్రసన్న, స్నేహ మొదట 2009 థ్రిల్లర్ అచ్చబేడులో వెండి తెరపై జంటగా నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా వారి పెళ్లి అనంతరం స్నేహ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ కొంత కాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ రోల్స్ చెస్తుంది. కొన్నిసార్లు స్నేహ రియాల్టీ షోలలో న్యాయనిర్ణేతగా కనిపిస్తుంది. ప్రసన్న చివరిసారిగా దుల్కర్ సల్మాన్ చిత్రం కింగ్ ఆఫ్ కొత్తలో నటించాడు. ఆయన పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. -
నేను శరత్ బాబును రెండో పెళ్లి చేసుకోలేదు.. ఆ ఫోటోలపై స్పందించిన నటి!
స్నేహ నంబియార్ మలయాళీ అయినప్పటికీ.. ఆమె పుట్టి పెరిగింది బెంగళూరులోనే. స్నేహా ఎక్కువగా కన్నడ సినిమాలు, టీవీ సీరియల్స్‌లో కూడా నటించారు. మలయాళ కుటుంబం నుంచి వచ్చిన స్నేహ బెంగళూరులో పుట్టి పెరిగడంతో కన్నడ భాష సులభంగానే నేర్చుకుంది. అంతే కాకుండా ఆమెకు తమిళ భాషపై కూడా పట్టుంది. దక్షిణాది భాషలపై ఆమెకున్న ప్రావీణ్యం కారణంగా తమిళం, మలయాళం, కన్నడ సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు పొందింది. అలా స్నేహ తమిళ ఇండస్ట్రీకి వెళ్లినప్పుడు ఆమెపై అప్పట్లో కొన్ని వార్తలు వ్యాపించాయి. ప్రముఖ నటుడు శరత్‌బాబును స్నేహ రెండో పెళ్లి చేసుకుందన్న వార్త అప్పట్లో వైరల్‌గా మారింది. అంతేకాదు కొంతకాలానికి వీరు విడాకులు సైతం తీసుకున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: సినిమా అగ్రిమెంట్ సంతకం పెట్టాక కాస్టింగ్ కౌచ్‌కు తెరలేపేవారు) నా ఫోటోలు ప్రచారం చేశారు అయితే శరత్ బాబు రెండో భార్యగా స్నేహ నంబియార్ ఫోటోలకు బదులుగా తన ఫోటోలు ప్రచురించారని వాపోయింది మరో నటి స్నేహ. ఓ తమిళ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెపై వచ్చిన రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది. 'నా పేరుతో సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెట్టారు. శరత్ బాబు రెండో భార్యగా నా ఫొటో పెట్టారు. శరత్ బాబు రెండో భార్య స్నేహ నంబియార్ అని.. కుటుంబ సభ్యులకు చెప్పకుండానే శరత్ బాబు రెండో పెళ్లి చేసుకున్నారంటూ నా ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అప్పుడు కూడా వదల్లేదు ఆ వార్తలు నాకు చాలా ఇబ్బంది కలిగించాయి. ఆయన చనిపోయినప్పుడు కూడా శరత్ బాబు రెండో భార్యను నేనే అని ప్రచారం చేశారు. కానీ నేను ఆయన భార్యను కాదు. అసలైన స్నేహ నంబియార్ నాకంటే పెద్దది. తను ప్రముఖ నటుడు నంబియార్ కూతురు. మా ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో ప్రతిసారి నా ఫోటోలు పెట్టేవారు. నిజానికి నా పేరు కేవలం స్నేహ మాత్రమే! అయితే స్నేహ అనే పేరుతో చాలామంది నటీమణులు ఉన్నందున నా పేరు పక్కన మా నాన్న పేరును చేర్చారు. స్నేహ పేరు పక్కన నంబియార్ చేర్చడానికి కారణం.. పైగా నంబియార్ అనేది కేరళలోని కన్నూరులో ఓ చిన్న వర్గం. అందుకే తన పేరు తర్వాత మా వర్గమైన నంబియార్‌ను జత చేశారు. అలా నన్ను స్నేహ నంబియార్ అని పిలిచారు. అప్పట్లో అది కూడా పెద్ద వార్తే. ఎందుకంటే నేను ప్రముఖ తమిళ నటుడు ఎంఎన్ నంబియార్ కుమార్తె అని చెప్పుకుంటున్నాననీ విమర్శించారు. నేను శరత్‌బాబును రెండో పెళ్లి చేసుకోలేదు. నంబియార్ కుమార్తెను కూడా కాదు' అని ఇన్నేళ్ల తర్వాత ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది నటి. (ఇది చదవండి: పెళ్లిలో ఆలియా భట్‌ను ఫాలో అయిన పరిణీతి చోప్రా, ఫోటోలు వైరల్) రమాప్రభతో పెళ్లి-విడాకులు సీనియర్ నటి రమాప్రభతో ఆయన ప్రేమాయణం అప్పట్లో ఇండస్ట్రీలో ఓ సంచలనం. శరత్ బాబు కంటే రమాప్రభ ఇండస్ట్రీలో సీనియర్ నటి. అప్పటికే ఆమె ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు దశాబ్దం తర్వాత శరత్ బాబు సినీ నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఇద్దరికి తెలిసిన ఓ స్నేహితుడి ద్వారా వీళ్లు ఒకరికొకరు పరిచయమయ్యారు. కొన్ని సినిమాల్లో కలిసి నటించారు కూడా. 14 ఏళ్ల తర్వాత విడాకులు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. దాదాపు 14 ఏళ్ల పాటు వీరి సంసారం సజావుగానే సాగింది. అంతలా అన్యోన్యంగా కలిసున్న వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ నటుడు నంబియార్ కుమార్తె స్నేహ నంబియార్‌ను రెండో పెళ్లి చేసుకోగా వీరి బంధం కూడా ఎక్కువకాలం నిలవలేదు. -
నీ వెంటే..
సాఫ్ట్వేర్ ఇంజినీర్లు బాలు–స్నేహ జంటగా నటించిన లవ్‌స్టోరీ ఫిల్మ్ ‘నీ వెంటే నేను’. అన్వర్ దర్శకత్వంలో వెంకట్రావు మోటుపల్లి నిర్మించారు. ‘సినీ బజార్’ అనే డిజిటల్ థియేటర్లో ఈ చిత్రం అక్టోబరు 6న 177 దేశాల్లో విడుదల కానుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో సినీబజార్ సీఈవో రత్నపురి వెంకటేష్ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘నీ వెంటే నేను’తో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
స్నేహకు క్రేజీ ఆఫర్.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ స్టార్ హీరోకి జోడిగా!
తమిళసినిమా: ఒకపక్క లియోకి సంబంధించిన వార్తలు, మరోవైపు తన కొత్త చిత్రానికి సంబంధించిన వార్తలతో నటుడు విజయ్ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ప్రస్తుతం లియో చిత్రానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక వార్త ప్రచారంలో ఉంటునే ఉంది. అదేవిధంగా విజయ్ నటించిన 68వ చిత్రానికి సంబంధించిన విశేషాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తూ ఆయన అభిమానులను ఆనందంలో ముంచేస్తున్నాయి. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో విజయ్ ద్వి పాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రంలో విజయ్ నటించనున్న యువ పాత్ర గెటప్ కోసం ఆయనతోపాటు చిత్ర యూనిట్ ఇటీవల అమెరికాలో మకాం పెట్టినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ గెటప్ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ లుక్ టెస్ట్ చేసినట్లు తెలిసింది. అదేవిధంగా ఇందులో నటుడు ప్రశాంత్, ప్రభుదేవా ముఖ్యపాత్రలు పోషించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయాల గురించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. ఇకపోతే ఈ చిత్రంలో ఇద్దరు కథానాయకలు ఉంటారని అందులో ఓ పాత్రలో నటి స్నేహ నటించనున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇక తాజాగా దర్శకుడు వెంకట్ ప్రభు స్నేహ కలిసి తీసుకున్న ఓ ఫొటోను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. దీంతో దళపతి కొత్త చిత్రంలో స్నేహ కచ్చితంగా ఉంటుందనే ప్రచారం జోరందుకుంది. కాగా 20 ఏళ్ల క్రితం విజయ్ సరసన స్నేహ వశీకర చిత్రంలో నటించారు. మళ్లీ ఇప్పుడు విజయ్‌తో జత కట్టే అవకాశం వచ్చింది. -
హీరోయిన్ స్నేహకు గోల్డెన్ ఛాన్స్.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ..!
నటుడు విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లియో షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. తదుపరి తన 68వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో విజయ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7'లో తొలిరోజే గొడవ? నామినేషన్లలో ఉన్నది వీళ్లే!) కాగా ఇందులో కొడుకు పాత్రకు జంటగా నటి ప్రియాంక మోహన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇకపోతే తండ్రిగా నటించనున్న విజయ్ సరసన నటించే హీరోయిన్ గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ పాత్రకు ముందుగా నటి జ్యోతిక నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తరువాత కారణాలు ఏమైనా ఆమె నటించడం లేదని తెలిసింది. ఆ తరువాత నటి సిమ్రాన్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరిగినట్లు ప్రచారం జరిగింది. తాజాగా నటి స్నేహ పేరు వెలుగులోకి వచ్చింది. ఆమెతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. కాగా 20 ఏళ్ల క్రితం విజయ్ సరసన స్నేహ వశీకర చిత్రంలో నటించారు. మళ్లీ ఇప్పుడు విజయ్‌తో జత కట్టే అవకాశం వచ్చింది. మరి మరోసారి విజయ్‌తో జత కట్టడానికి సై అంటారా? లేదా? అన్నది చూడాలి. కాగా విజయ్ 68వ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు లండన్‌లో జరుగుతున్నాయి. అవి ముగియగానే చిత్ర షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం. -
వీడియో షేర్ చేసిన స్నేహ.. అలా చేయొద్దంటున్న ఫ్యాన్స్
ఆమె చీరకట్టుకుంటే చందమామే నేలకు దిగివచ్చినట్లుగా ఉంటుంది. తను నడుస్తుంటే హంస సైతం కుళ్లుకుంటుంది. హావభావాలు ఒలికించడంలో ఆమెను మించినవారే లేరు.. ఇలా హీరోయిన్ స్నేహ గురించి శతకోటి వర్ణనలు చేసే అభిమానులు చాలామందే ఉన్నారు. తన నటనతో ఎంతోమంది మనసులు గెలుచుకున్న స్నేహ ఆ మధ్య భర్తతో విడాకులు తీసుకోనుందంటూ రూమర్స్ వచ్చాయి. దీంతో హీరోయిన్ తన భర్తతో కలిసి దిగిన ఫోటో షేర్ చేసి ఈ పుకార్లకు చెక్ పెట్టింది. అంత బరువులు ఎత్తడం అవసరమా? ఎప్పుడూ అందమైన ఫోటోలు షేర్ చేసే స్నేహ తాజాగా ఓ వర్కవుట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇందులో ఆమె బరువు ఎత్తుతూ ఎక్సర్సైజ్ చేసింది. అది చాలా బరువుగా ఉందని స్నేహ ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థమవుతోంది. అలాంటప్పుడు ఇంత బరువు మోయడం ఎందుకని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇటువంటి ఎక్సర్సైజ్ల వల్ల గుండెపోటు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని, చాలామంది సెలబ్రిటీలు ఇదే కారణంతో చనిపోతున్నారని పేర్కొంటున్నారు. ఈ బరువులు ఎత్తడానికి బదులుగా యోగా చేయొచ్చు కదా అని సూచిస్తున్నారు. భారీ బరువులు ఎత్తడం వల్ల గుండెపోటు ప్రమాదాలు పెరుగుతున్నందున ఇలాంటివి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు. ప్రియమైన నీకు చిత్రంతో టాలీవుడ్ ప్రయాణం స్నేహ సినిమాల విషయానికి వస్తే.. ప్రియమైన నీకు (2001) చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. హనుమాన్ జంక్షన్, వెంకీ, సంక్రాంతి, రాధా గోపాలం, శ్రీరామదాసు, రాజన్న.. ఇలా అనేక హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ యాక్ట్ చేసింది. ఆమె తెలుగులో చివరగా 2019లో వచ్చిన వినయ విధేయ రామ చిత్రంలో కనిపించింది. View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) చదవండి: మొదట్లో పెళ్లంటేనే కోపమొచ్చేది, కానీ ఇప్పుడు.. -
మేన కోడలిని చూడడానికి వచ్చిన అల్లు అర్జున్, స్నేహ...
-
తల్లి కాబోతున్న హీరో జీవా ఆన్‌స్క్రీన్ సిస్టర్
కొందరు అలా వచ్చి ఇలా వెళ్లిపోతారు. కానీ వారు పోషించిన పాత్రలను మాత్రం జనాలు ఇట్టే గుర్తుపెట్టుకుంటారు. అలా శివ మనసులో శక్తి సినిమాలో హీరో జీవా సోదరిగా నటించిన స్నేహ మురళి ఇప్పటికీ తమిళ మీమ్స్‌లో ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటుంది. చేసింది ఒక్క సినిమానే అయినా ఆమెకు బోలెడంత పాపులారిటీ వచ్చింది. 2009లో వచ్చిన శివ మనసులో శక్తి ఆమె తొలి చిత్రం. దాదాపు 14 ఏళ్ల తర్వాత గుడ్‌న్యూస్ చెప్పింది నటి. త్వరలో ఐడీ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను సొంతం చేసుకుంది. ఇకపోతే స్నేహ మరో శుభవార్త కూడా చెప్పింది. తను తల్లి కాబోతున్న విషయాన్ని వెల్లడించింది. గతేడాది సిద్దార్థ్ అనే వ్యక్తిని పెళ్లాడిన ఆమె అందుకు సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో పంచుకుంది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ అభిమానులతో మాత్రం నిత్యం టచ్‌లో ఉంది స్నేహ. View this post on Instagram A post shared by Sneha Murali🧿 (@snehamuralii) View this post on Instagram A post shared by Sneha Murali🧿 (@snehamuralii) చదవండి: రైలు ప్రమాదం.. కమెడియన్ అనుచిత ట్వీట్ -
ఇంటి పనంతా మాతోనే.. ప్రశ్నిస్తే ‘మేం మగాళ్లం’ అనేవాళ్లు: స్నేహ
గత దశాబ్దంలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన స్నేహ బాల్యంలో ఎన్నో ఛీత్కారాలను, వేదనలను అనుభవించారట. ఈ విషయాన్ని తనే ఇటీవల ఓ ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు. వివరాలు..ఈ బ్యూటీ 2000 సంవత్సరంలో మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమయ్యారు. అదే ఏడాది ఎన్నవళే అనే చిత్రంతో మాధవన్‌కు జంటగా కోలీవుడ్లోకి రంగప్రవేశం చేశారు. ఆ తరువాత 2001లో ఆనందం చిత్రంలో అబ్బాస్‌కు జంటగా నటించారు. ఆ చిత్రం 200 రోజులు ఆడింది. అదే విధంగా తెలుగులోనూ పలు చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా తమిళంలో కమలహాసన్, సూర్య, ధనుష్, విజయ్ వంటి స్టార్ హీరోలతో నటించిన ప్రముఖ కథానాయకిగా రాణించారు. అలా ప్రముఖ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే 2012లో నటుడు ప్రసన్నను ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. ఇంతవరకు స్నేహ గురించి చాలామందికి తెలిసిందే. అయితే ఆమె కుటుంబం, బాల్యం గురించి ఎవరికీ చెప్పలేదు. అలాంటిది తొలిసారిగా ఇటీవల ఒక భేటీలో తాను బాల్యంలో అనుభవించిన కష్టాల గురించి ఏకరువు పెట్టారు. తన తల్లిదండ్రులకు నలుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు అని చెప్పారు. కూతుర్లలో తాను చివరి దానినని, తనకు బదులు కొడుకు పుట్టాలని తన బామ్మ గట్టిగా కోరుకుందని దీంతో ఆమె తన ముఖాన్ని చూడటానికి మూడు రోజుల వరకు ఇష్టపడలేదని తెలిపారు. ఇక చిన్నతనంలో మంచి నీళ్లు పక్కనే ఉన్నా వాటిని.. సోదరులకు తామే అందించాల్సి వచ్చేదన్నారు. అదేమని ప్రశ్నిస్తే మేం మగాళ్లం. ఆడపిల్లలైన మీరే ఇంటి పనులు చేయాలని కండీషన్లు పెట్టేవారని వాపోయింది. ముఖ్యంగా తన పెద్ద సోదరుడు తనను చాలా ఇబ్బందులు పెట్టేవాడని, అన్ని పనులు తననే చేయమని ఆదేశించేవాడని పేర్కొంది. -
నా సంపాదన రెండు వేలే.. వాటితోనే రోజులు గడిపా: బుల్లితెర నటి
సాథ్ నిభానా సాథియా -2తో బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న నటి స్నేహా జైన్. ఆమె ప్రస్తుతం 'జనమ్ జనమ్ కా సాత్ షో'లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నటి తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాని తెలిపారు. మొదట్లో సరైన అవకాశాలు ఎన్నోసార్లు మానసికంగా దెబ్బతిన్నానని చెప్పుకొచ్చింది. స్నేహా ఇప్పటికే క్రైమ్ పెట్రోల్, కృష్ణదాసి, క్రైమ్ పెట్రోల్ డయల్ 100 లాంటి సిరీస్‌ల్లో కనిపించింది. (ఇది చదవండి: రాధికా శరత్‌కుమార్‌కు గోల్డ్ రింగ్ గిఫ్టుగా ఇచ్చిన లారెన్స్) స్నేహా జైన్ మాట్లాడుతూ.. 'నాకు చిన్న చిన్న పాత్రలు వచ్చేవి. మొదట యాక్టింగ్ సర్టిఫికేట్ కోర్స్ చేశా. ఆ తర్వాత క్రాఫ్ట్ బాగా నేర్చుకునేందుకు థియేటర్ కోర్సు కూడా చేశా. నా పాత్రలు ప్రేక్షకులను మెప్పించేలా సిద్ధం చేసుకోవాలనుకున్నా. మొదట కొన్ని పాత్రలు నాకు మంచి గుర్తింపునిచ్చాయి. కెరీర్ ప్రారంభంలో నాకు స్నేహితుల పాత్రలు వచ్చినందున డైలాగ్ చెప్పే అవకాశం రాలేదు. టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాక ప్రారంభంలో చాలా ఇబ్బందులు పడ్డా. నాకు రోజుకు కేవలం రూ.2 వేలే ఇచ్చేవారు. నలుగురైదుగురు అమ్మాయిలతో కలిసి గదిని పంచుకునేదాన్ని. ఆ రోజులు నాకు జీవితమంటే చాలా నేర్పించాయి. ఇప్పటికీ నేను ఇంకా కష్టపడుతూనే ఉన్నా. ఈ పరిశ్రమలో అంతులేని పోరాటంగా భావిస్తున్నా.'అని చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: బుల్లితెర నటి సూసైడ్ కేసు.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!) -
‘ఆమె నా జీవితాన్ని తలకిందులు చేసింది, అందుకే..’
సమస్యలు లేని మనిషంటూ ఉండడు. కానీ, అనుజ్ సింగ్ మాత్రం తన సమస్యలను మోయలేని భారంగా భావించాడు. చిన్నవయసు నుంచి కాలేజీ రోజుల దాకా ఎదురైన పరిస్థితులతో మానసికంగా కుంగిపోయాడతను. ఆ టైంలోనే స్నేహ చౌరాసియా పరిచయం అయ్యింది. ఆమె ప్రేమలో జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతుందని ఫీలయ్యాడతను. కానీ, అది అతనికి ఎంతో కాలం దక్కలేదు. ఆఖరికి.. ఆ ప్రేమ వెనుక మోసం దాగుందని గుర్తించి మాజీ ప్రేయసిని చంపడంతోనూ పాటు తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించేసుకున్నాడా యువకుడు. గురువారం(మే 18) గ్రేటర్ నోయిడా(యూపీ) పరిధిలోని శివ్ నాడార్ యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఏ సోషియాలజీ మూడో సంవత్సరం చదువుతున్న స్నేహ చౌరాసియాను.. అదే సెక్షన్‌కు చెందిన అనుజ్ సింగ్ కసితీరా పిస్టోల్‌తో కాల్చి చంపాడు. ఆపై హస్టల్ గదికి చేరుకుని తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే.. అఘాయిత్యానికి పాల్పడే ముందు రికార్డ్ చేసినట్లు భావిస్తున్న ఓ వీడియోను అనుజ్ జీమెయిల్ అకౌంట్ నుంచి పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. అందులో స్నేహ చౌరాసియా తన జీవితాన్ని ఎలా మార్చేసింది, తన మనసును ఎంత క్షోభ పెట్టిందనేది 23 నిమిషాలపాటు మాట్లాడాడతను. వీడియోలో ఏముందంటే.. ‘‘నా పేరు అనుజ్. నేను ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. ఎవరినీ బాధపెట్టలేదు. ఒకప్పుడు నా జీవితం అల్లకల్లోలంగా ఉండేది. మానసికంగా కుమిలిపోయేవాడిని. జీవితంలో ఎన్నో ఎగుడు దిగుడులు చవిచూశా. నేను అమ్మాయిలకు దూరంగా ఉండేవాడిని. నా గతంలో జరిగినవే అందుకు కారణం. నా సోదరిని ఆమె భర్త తగలబెట్టి చంపేశాడు. మా మామయ్య ఆయన భార్య వదిలేసి వెళ్లిపోయిందని గుండెపోటుతో చనిపోయాడు. అప్పటి నుంచి ఆడవాళ్ల వంక చూడకూడదని నిర్ణయించుకున్నా. కానీ.. ఆమె పరిచయం నాలో సంతోషాన్ని నింపింది.. నాలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అందుకే ఆమె లవ్ ప్రపోజ్‌ను అంగీకరించా. ఇద్దరం ఏడాదిన్నరకాలం ఎంతో ఆనందంగా గడిపాం. హఠాత్తుగా ఒకరోజు తాను మానసికంగా కుమిలిపోయానని, కాబట్టి తనకు దూరంగా ఉండమని బ్రేకప్ చెప్పేసింది స్నేహ. అది నమ్మి ఆమె సంతోషం కోసం దూరంగా ఉన్నా. కానీ, కాలేజీలో పని చేసే ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకుందని తర్వాతే తెలిసింది. ఆమె వల్ల నా జీవితం తలకిందులు అయ్యింది. నాకు ఎంతో టైం లేదు. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నా. చేసిందానికి ఆమె ప్రతిఫలం అనుభవించాల్సిందే. అందుకే చంపాలని నిర్ణయించుకున్నా.. స్నేహ మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుంది అనడానికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని అనుజ్ ఆ వీడియోలో చెప్పాడు. హస్టల్ సీసీటీవీ ఫుటేజీలు, ఆమె సెల్‌ఫోన్ ఛాటింగ్‌లను పరిశీలిస్తే.. స్నేహ అఫైర్ నిజమో కాదో తెలుస్తుందని చెప్పాడతను. ‘‘తన(స్నేహ) ప్రవర్తన మీద మొదటి నుంచి అనుమానాలు ఉండేవి. ఫోన్‌ను ఇచ్చేది కాదు. వాట్సాప్ ఛాటింగ్ నేను చూస్తానని ఎప్పటికప్పుడు డిలీట్ చేసేది. గట్టిగా అడిగితే.. నమ్మకం లేదా? అనేది. కానీ, ఒకానొక టైం వచ్చేసరికి విడిపోదామని చెప్పేసింది. బాధేసినా.. తను బాగుండాలని సరేనన్నా. కానీ, స్నేహ చేసిన మోసం నన్ను గుండెల్లోతుగా బాధించింది. అందుకే చంపాలని నిర్ణయించుకున్నా. స్నేహ తల్లిదండ్రులకు నా క్షమాపణలు.. మీ కన్నకూతురు బతకడానికి అర్హురాలు కాదు. మొన్న నన్ను.. ఇవాళో రేపో ఆ వ్యక్తిని, ఆపై మరొకరిని.. మోసం చేస్తుందని నా నమ్మకం. అలాంటి అమ్మాయికి బతికే హక్కు కూడా లేదు అంటూ వీడియోలో అనుజ్ మాట్లాడాడు. మధ్యాహ్నం 1గం.30ని. సమయంలో క్యాంపస్‌లోనే స్నేహ చౌరాసియాను నాటు తుపాకీతో కాల్చి చంపాడు అనుజ్ సింగ్. అయితే ఘటనకు ముందు వాళ్లిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. అంతేకాదు యూనివర్సిటీ డైనింగ్ హాల్ వద్ద ఇద్దరూ కౌగిలించుకుని కూడా కనిపించినట్లు సీసీటీవీలో రికార్డ్ అయ్యిందని పోలీసులు అంటున్నారు. ఆ తర్వాతే తనతో తెచ్చిన పిస్టోల్‌ను బయటకు తీసి.. స్నేహను కసితీరా కాల్చి చంపాడు అనుజ్. ఆపై హస్టల్ గదికి వెళ్లి తనను తాను కాల్చుకుని అక్కడిక్కడే చనిపోయాడు. అది వీడియోగా వైరల్ అయ్యింది కూడా. గురువారం మధ్యాహ్నం ఘటన జరిగితే.. ఇప్పటిదాకా స్నేహ తల్లిదండ్రులు ఆమె మృతిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. అలాగే క్యాంప్‌లో విచారణ కోసం వెళ్లిన పోలీసులను.. స్నేహ స్నేహితురాళ్ల మౌనం సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో.. అనుజ్‌కు దేశీవాళీ తుపాకీ ఎలా వచ్చింది? దానిని క్యాంపస్‌లోకి ఎలా తీసుకొచ్చాడు అనే కోణాల్లో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ వెబ్‌సిరీస్‌లో విలన్‌గా మారిన హీరోయిన్ స్నేహ భర్త
తమిళ సినిమా: ఇరు దురువం ఈ వెబ్ సిరీస్ కరోనా లాక్డౌన్ సమయంలో సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అయ్యి విశేష ప్రేక్షకుల ఆదరణ పొందింది. దీంతో తాజాగా దానికి సీక్వెల్‌ను రూపొందించారు. తొలి వెబ్ సిరీస్‌కు కుమరన్, రెండవ భాగానికి అరుణ్ ప్రకాష్ కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. నటుడు నందా, ప్రసన్న, నటి బిగ్ బాస్ అభిరామి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.ఇది సోనీ లీవ్ ఓటేటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా యూనిట్ వర్గాలు చెన్నైలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నటుడు ప్రసన్న మాట్లాడుతూ తాను ఇందులో ప్రతి నాయకుడిగా వైవిధ్య భరిత కథాపాత్రను పోషించినట్లు చెప్పారు. తన పాత్రలో చాలా లేయర్స్ ఉంటాయన్నారు. ఇక కాగా నటుడు నందా ఈ వెబ్ సిరీస్ తొలి భాగంలో కథానాయకుడుగా నటించారు. దీంతో ఇప్పుడు సీక్వెల్లో నటించడం సులభం అయిందని చెప్పారు. ఇందులో ఈయన సిన్సియర్ పోలీస్ అధికారిగా నటించారు. దర్శకుడు అరుణ్ ప్రకాష్ మాట్లాడుతూ ఇరు దురువం వెబ్ సిరీస్‌కు ఇది సీక్వెల్ అన్నారు. తొలి భాగంలోని విక్టర్ (నందా) పాత్ర తనను బాగా ఆకట్టుకుందన్నారు. దాన్ని మెయిన్‌గా తీసుకొని 10 ఎపిసోడ్స్ ఈజీగా రూపొందించవచ్చని భావించారన్నారు. అలా పది నెలల పాటు ఈ వెబ్ సిరీస్ కథను తయారు చేసినట్లు చెప్పారు. దీనికి మూడో సీక్వెల్ కూడా ఉంటుందని చెప్పారు. ఇందులో కిడ్నాప్ గురైన యువతిగా, ఒక బిడ్డకు తల్లిగా, భర్తకు దూరమైన భార్యగా తాను నటించినట్లు నటి అభిరామి పేర్కొన్నారు. -
అంతకన్నా ఆనందం ఏముంటుంది? అదే నాకిష్టమైన ప్లేస్ : స్నేహారెడ్డి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బన్నీకి ఎంత క్రేజ్ ఉందో స్నేహారెడ్డికి కూడా సోషల్ మీడియాలో వీపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కూతురు, కొడుకుతో కలిసి బన్ని చేసే అల్లరి ఫొటోలు, వీడియోలను తరుచుగా షేర్ చేసే స్నేహారెడ్డి ఈ మధ్యకాలంలో ఫోటోషూట్స్‌తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా గ్లామరస్ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది. స్టైలిష్ కపుల్‌గా ఇండస్ట్రీలో ఈ జంటకు పేరుంది. స్టార్ హీరోయిన్లకు దీటుగా మాంచి ఫిట్నెస్ మెయింటెయిన్ చేస్తున్న స్నేహరెడ్డి తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ వీడియోను షేర్చేస్తూ.. 'మన చుట్టూ మొక్కలు ఉంటే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది. వాటిని చూస్తే ప్రేమలో పడిపోతాం. మొక్కల పోషణ మనసుకు ఎంతో ఆనందాన్నిస్తుంది. అందుకే నర్సరీ నాకు ఎంతో ఇష్టమైన ప్రదేశం' అంటూ మొక్కలపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. అయితే ఈ వీడియోలో ఎప్పటిలాగే స్నేహారెడ్డి యంగ్ అండ్ స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ఇది చూసిన నెటిజన్లు.. మేడమ్ సర్.. మేడమ్ అంతే. హీరోయిన్‌కి ఏమాత్రం తగ్గట్లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
Sneha- Prasanna: వివాహ బంధానికి గుడ్ బై!.. రూమర్స్‌కు నటి స్నేహ సమాధానం
నటి స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సహజ నటనతో తెలుగు, తమిళం తదితర భాషల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో కమలహాసన్, విజయ్, అజిత్, ధనుష్ వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేశారు. తెలుగలోనూ నాగార్జున, వెంకటేష్, రవితేజ వంటి ప్రముఖ నటుల సరసన నటించారు. నటుడు ప్రసన్నకు జంటగా అచ్చముండు అచ్చముండు చిత్రంలో నటించారు. భర్త ప్రసన్నతో స్నేహ ఆ సమయంలోనే వారి మధ్య పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లు తమ మధ్య ప్రేమను రహస్యంగా ఉంచిన ఈ జంట చివరకు 2012లో పెళ్లి పీటలు ఎక్కారు. వీరికి ఇద్దరు పిల్లలు. వివాహానంతరం స్నేహ నటనను కొనసాగిస్తున్నారు. అలా ప్రసన్న, స్నేహల దాంపత్య జీవితం సంతోషంగా సాగుతోంది. అలాంటిది రెండు నెలలుగా వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని, వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అయితే అదంతా అబద్ధమని స్నేహ సన్నిహితులు కొట్టిపారేశారు. ఈ వదంతులకు ఇదే తమ సమాధానం అన్నట్లు ప్రసన్న, స్నేహ ప్రత్యేకంగా ఫొటో షూట్ నిర్వహించి దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. ఆ ఫొటోల్లో స్నేహ ఇప్పటికీ తాను హీరోయిన్నే అన్నట్లుగా కొత్త అందాలతో మెరిసిపోతోంది. చదవండి: (Sneha: తగ్గేదేలే.. 40 ప్లస్‌లోనూ అదే అందం) -
రెడ్ మిర్చిలాంటి శిల్పా.. హాట్లుక్స్లో పూజాహెగ్డే
► పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే హాట్ లుక్స్ ► ఫ్యామిలీ ఫోటో షేర్ చేసిన బాలాదిత్య ► భర్తతో రీల్స్ చేసిన నటి అష్మిత ► అల్లువారి అబ్బాయి బాబీకి భార్య బర్త్‌డే విషెస్ ► రెడ్సారీలో మిర్చిలాంటి అందంతో శిల్పాశెట్టి హోయలు ► క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో మిహీకా బజాజ్ ► భర్తతో హీరోయిన్ స్నేహ బ్యూటిఫుల్ ఫోటోషూట్ View this post on Instagram A post shared by Sai Pavani Raju (@nayani_pavani) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Ashmita karnani (@ashmita_9) View this post on Instagram A post shared by Allu Neela Shah (@alluneelushah) View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Aditya Yanamandra (@actor_balaaditya_official) View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) -
Sneha: తగ్గేదేలే.. 40 ప్లస్‌లోనూ అదే అందం
తెలుగమ్మాయి స్నేహకు నాలుగు పదుల వయసు దాటినా అందం మాత్రం తగ్గడం లేదు. ఈమె పుట్టింది ముంబాయిలో అయినా పెరిగింది దుబాయ్‌లో.. నటిగా ఎదిగింది దక్షిణాదిలో. ప్రియమైన నీకు చిత్రంతో టాలీవుడ్లో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే సక్సెస్‌ను అందుకున్నారు. అదేవిధంగా తమిళంలో ఎన్నవళే చిత్రంతో పరిచయం అయ్యారు. ఆ తర్వాత నటిగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు. రెండు దశాబ్దాలకు పైగా నటిగా కొనసాగుతున్నారు. చాలా తక్కువ సినిమాల్లో గ్లామర్ ప్రదర్శించినా స్నేహ పక్కింటి అమ్మాయి గానే ముద్ర వేసుకున్నారు. పలు విజయవంతమైన చిత్రాలను ఈమె తన ఖాతాలో వేసుకున్నారు. 2010లో నటుడు ప్రసన్నకు జంటగా అచ్చముండు అచ్చముండు చిత్రంలో నటించారు. ఆయనతో ఆ పరిచయం ప్రేమగా మారింది. 2012లో ప్రసన్నను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. రెండో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత స్నేహం నటనకు గ్యాప్ ఇచ్చి సంసార జీవితంలో మునిగిపోయారు. ఇటీవల కొన్ని వదంతులను ఎదుర్కొన్నారు. స్నేహ ప్రసన్న మనస్పర్థల కారణంగా విడిపోయారని ప్రచారం జోరందుకుంది. అలాంటి వార్తలపై స్పందించిన ఈ జంట తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని, అదంతా అవాస్తమని స్పష్టం చేశారు. కాగా, 40 ప్లెస్‌లో ఉన్న స్నేహ తాజాగా రీఎంట్రీకి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. మధ్యలో కాస్త బొద్దు గా తయారైన స్నేహ ఇప్పుడు సన్నబడి మరింత అందంగా తయారయ్యారు. ఆమె లేటెస్ట్గా తీయించుకున్న ఫొటోలను మీడియాకు విడుదల జేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే నటిగా రీఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
హీరోయిన్ స్నేహ భర్తతో విడిపోనుందా? ఇన్‌స్టా పోస్ట్ వైరల్
నటి స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సౌందర్య తర్వాత ఆ స్థాయిలో స్నేహ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. హోమ్లీ పాత్రలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న స్నేహకు 2011లో నటుడు ప్రసన్నకుమార్‌తో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వీరిది ప్రేమ వివాహం. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన స్నేహ వినయ విధేయ రామ సినిమాతో మళ్లీ టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే స్నే తన ఫ్యామిలీకి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్‌ని షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. అయితే గత కొద్దిరోజులుగా ఆమె వైవాహిక జీవితం గురించి రకరకాల రూమర్స్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఆమె భర్త ప్రసన్న కుమార్‌కు దూరంగా ఉంటుందని, మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడివిడిగా ఉంటున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే తాజాగా ఈ రూమర్స్‌కి చెక్ పెట్టింది స్నేహ. భర్తతో కలిసి దిగిన ఓ అందమైన ఫోటోను షేర్ చేసుకుంటూ ట్విన్నింగ్ అంటూ పోస్ట్ చేసింది. ఈ ఒక్క పోస్టుతో డివోర్స్ రూమర్స్‌కి చెక్ పెట్టినట్లయ్యింది. -
భర్తకు దూరంగా ఉంటున్న నటి స్నేహ?
నటి స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హోమ్లీ బ్యూటీగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందింది. సౌందర్య తర్వాత ఆ స్థాయిలో స్నేహకు ప్రేక్షకుల ఆదరణ దక్కింది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. అయితే ప్రస్తుతం వెండితెరపై ఆమె సందడి కరువైంది. పెళ్లి అనంతరం సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చిన ఆమె రామ్ చరణ్ వినయ విధేయ రామతో రిఎంట్రీ ఇచ్చింది. మళ్లీ సినిమాకు విరామం ఇచ్చింది. ఇక తమిళ నటుడు ప్రసన్న కుమార్‌ను స్నేహ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ఆసక్తిగా గీతూ రాయల్ పారితోషికం.. 9 వారాలకు ఎంత ముట్టిందంటే! 2012లో పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకుంది ఈ జంట. అప్పటి నుంచి కోలీవుడ్ క్యూట్ కపుల్‌గా ఫ్యాన్స్ చేత మన్ననలు అందుకుంటున్నారు. ఎంతో అన్యన్యంగా తమ వైవాహిక బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఎక్కడికి వెళ్లిన మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ అందరి చేత ప్రసంశలు అందుకుంటున్నారు. అంతేకాదు భర్తతో, పిల్లలతో కలిసి తీసుకున్న ఫ్యామిలీ ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో పంచుకుంటూ స్నేహ మురిసిపోతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఓ షాకింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చదవండి: తన స్థానంలోకి కొత్త యాంకర్ ఎంట్రీ.. స్పందించిన రష్మీ గౌతమ్ స్నేహ కొద్ది రోజులుగా తన భర్త ప్రసన్న కుమార్‌కు దూరంగా ఉంటుందనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. భర్తతో వచ్చిన మనస్పర్థల కారణంగా ఆమె మరో ఇంట్లో వేరుగా ఉంటోందంటూ పలు తమిళ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య విభేధాలు వచ్చాయని, ప్రస్తుతం స్నేహ భర్త మీద కోపంతో ఉందని.. అందువల్లే భర్తకు దూరంగా ఉంటుందంటూ ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపస్తున్నాయి. అయితే ఈ రూమర్స్‌పై ఇంతవరకు ఈ జంట స్పందించలేదు. ఇక ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే స్నేహ స్పందించే వరకు వేచి చూడాల్సిందే. -
చీరకట్టులో మెస్మరైజ్ చేస్తున్న అందాల స్నేహ (ఫొటోలు)
-
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న నటి స్నేహ ఫ్యామిలీ ఫోటోలు
తన సహజ నటనతో దక్షిణాదిలో మంచి పేరు తెచ్చుకున్న నటి స్నేహ. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం అచ్చముండు అచ్చముండు చిత్రంలో నటుడు ప్రసన్నతో జత కట్టి, ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఆయన్నే జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. అలా వారి ప్రేమ పెళ్లికి ప్రతిఫలం ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, ఒక కూతురు. పిల్లల విషయంలో స్నేహ, ప్రసన్న స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) పిల్లలకు సంబంధించి ప్రతి విషయాన్ని అందమైన వేడుకగా నిర్వహించి వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటారు. అదే విధంగా సంసార జీవితంలో దశాబ్ద కాలాన్ని పూర్తి చేసుకున్నారు. కాగా గురువారం ప్రసన్న, స్నేహ కొడుకు పుట్టిన రోజు. ఈ బాబుకు ఇప్పుడు ఏడేళ్లు. దీంతో పిల్లలను రెడీ చేసే పనిలో భాగంగా స్నేహ తన ఇద్దరు పిల్లలతో స్విమ్మింగ్ పూల్‌లో కాసేపు జలకాలాడారు. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) చదవండి: (తెలుగు పరిశ్రమ అలా ముందుకెళ్లాలి) -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు (ఫొటోలు)
-
చెక్కు చెదరని స్నేహ అందం.. ఇప్పటికి అలాగే (ఫోటోలు)
-
పోలీసులను ఆశ్రయించిన నటి స్నేహా
Actress Sneha Files Complaint Chennai Kanathur Police Station: ప్రముఖ నటి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ స్నేహా పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరు వ్యాపారవేత్తలపై చెన్నైలోని కానత్తూర్ పోలీసు స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ తాజా సమాచారం ప్రకారం.. చెన్నైలోని ఓ ఎక్స్పోర్ట్ కంపెనీకి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు తమ బిజినెస్ కోసం డబ్బు అప్పుగా తీసుకున్నారని, వారికి వడ్డీ కింద 26 లక్షల రూపాయలు ఇచ్చినట్లు ఆమె పోలీసులకు తెలిపారు. అయితే ఇప్పుడు వారు తనని మోసం చేశారని, వడ్డీ చెల్లించమని అడిగినందుకు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులకు ఆరోపించారు. చదవండి: కృతిశెట్టి లుక్ షేర్ చేసిన చై, కొడుకును ఇలా ప్రశ్నించిన నాగ్ అలాగే తాను ఇచ్చిన రూ. 26 లక్షలు తిరిగి ఇచ్చేందుకు వారు నిరాకరిస్తున్నారని స్నేహా తన ఫిర్యాదు పేర్కొన్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. తన ఫిర్యాదు మేరకు దీనిపై దర్యాప్తు చేపట్టాలని, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్నేహా పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. కాగా స్నేహా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఒకప్పుడు తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్గా రాణించిన స్నేహా ఆ తర్వాత తన చిరకాల స్నేహితులు, నటుడు ప్రసన్నను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంటకు ఒక కుమారుడు, కూమార్తె ఉన్నారు. పెళ్లి తర్వాత స్నేహా పలు వాణిజ్య ప్రకటనలతో పాటు సినిమాల్లో సహాయ నటిగా, హీరోలకు వదిన, అక్క వంటి పాత్రలు చేస్తూ వస్తున్నారు. చదవండి: నయన్‌కు సామ్ బర్త్‌డే విషెస్, లేడీ సూపర్‌స్టార్‌పై ఆసక్తికరంగా పోస్ట్ 46 ఏళ్లకు తల్లైన స్టార్ హీరోయిన్, కవలలకు జననం -
ఇంటికి నిప్పు పెట్టి ఆర్పుతున్నట్లు నటన
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సమావేశంలో భారత యువదౌత్యవేత్త స్నేహ దుబే పాకిస్తాన్ నోరుమూయించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. నెటిజన్లు ఆమె ప్రసంగంలో పటిమకు జేజేలు కొడుతున్నారు. యూఎన్ వేదికపై పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ప్రసంగానికి స్నేహ గట్టిగా బదులిచ్చారు. ‘‘పాకిస్తాన్ ప్రధాని భారత్ అంతర్గత విషయాలను ప్రస్తావించారు. అవాస్తవాలు ప్రచారం చేయడానికి అంతర్జాతీయ వేదికపై విషం చిమ్మడం ఇది మొదటిసారి కాదు. పదే పదే తానే ఉగ్రవాద బాధిత దేశమని పాక్ చెప్పుకుంటుంది. తనే ఇంటికి నిప్పు పెట్టి, మళ్లీ దానిని ఆర్పడానికి ప్రయత్నిస్తున్నట్టుగా నాటకాలు ఆడుతూ ఉం టుంది. పాక్ విధానాలతో యావత్ ప్రపంచం ఇ బ్బందులు ఎదుర్కొంటోంది. పాకిస్తాన్లో ఉగ్రవా దులు చాలా స్వేచ్ఛగా తిరుగుతారు. ఆ దేశం ఉగ్రవాదులకి శిక్షణ ఇచ్చి, వారికి నిధులు సమకూ ర్చి పెంచి పోషిస్తోంది. ఒసామా బిన్ లాడెన్ లాంటి వారికి ఆశ్రయం ఇచ్చింది’’అని ఫస్ట్ సెక్రటరీ స్నేహ దుబే దుయ్యబట్టారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో తన సందేశాన్ని వీడియో ద్వారా పంపించిన పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ మృతి వంటి అంశాలను ప్రస్తావిస్తూ భారత్‌లో ఇస్లాం వ్యతిరేకులు పరిపాలకులుగా ఉన్నారని, ముస్లిం లపై ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. దీనికి స్నేహ దుబే సమాధానమిస్తూ జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లు ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగంగానే ఉంటాయని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న ప్రాంతాలన్నీ తక్షణమే ఖాళీ చేయాలని ఆమె అల్టిమేటమ్ జారీ చేశారు. ఎవరీ స్నేహ దుబే? స్నేహ దుబే తన 12 ఏళ్ల వయసు నుంచే దేశానికి ప్రాతినిధ్యం వహించి విదేశాలు చుట్టి రావాలని కలలు కన్నారు. ఆమె కన్న కలకి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తోడైంది. గోవాలో పాఠశాల విద్య అభ్యసించారు. ఉన్నత విద్య పుణెలో చదివారు. ఢిల్లీలోని జేఎన్‌యూలో ఎంఫిల్ చేశారు. 2011లో యూపీఎస్సీకి మొదటి ప్రయత్నంలోనే పాసయ్యారు. అంతర్జాతీయ వ్యవహారాలు, విభిన్న సంస్కృతులు తెలుసుకోవడంపై మక్కువ ఎక్కువ. ప్రయాణాలంటే ఆసక్తి ఉన్న ఆమె ఫారెన్ సర్వీసులో చేరితే ప్రపంచ దేశాలు చుట్టి రావచ్చునని ఆశపడ్డారు. దానికి తగ్గట్టే ఆమెకి అవకాశం వచ్చింది. మొదట విదేశాంగ శాఖలో పని చేసిన స్నేహ ప్రస్తుతం ఐరాసలో భారత్ ఫస్ట్ సెక్రటరీగా ఉన్నారు. భారత్‌లో ఫాసిస్ట్ ప్రభుత్వ పాలన పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ అమెరికా ధోరణితో తమకు ఎంతో నష్టం జరిగిందని ఐక్యరాజ్య సమితి వేదికగా చెప్పారు. అమెరికా కనీస కృతజ్ఞత లేకుండా ప్రవర్తించడం, అంతర్జాతీయ సమాజం ద్వంద్వ ప్రమాణాలతో తమ దేశం ఎన్నో ఇబ్బందులు పడిందన్నారు. ముందుగా రికార్డు చేసిన ఇమ్రాన్‌ఖాన్ ప్రసంగం వీడియోను శుక్రవారం ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రదర్శించారు. వాతావరణ మార్పుల దగ్గర నుంచి ఇస్లాం వ్యతిరేకత వరకు ఎన్నో అంశాలపై ఆయన మాట్లాడారు. భారత్‌ని పదునైన మాటలతో తూలనాడారు. భారత్‌లో మోదీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్‌గా అభివర్ణించారు. ఇస్లాం వ్యతిరేక ధోరణితో విషం కక్కుతోందని ఆరోపించారు. అఫ్గాన్‌లో పరిణామాలతో పాకిస్తాన్‌ను అందరూ దోషిగా చూస్తున్నారని అన్నారు. ‘అమెరికాపై సెప్టెంబర్ 11 దాడుల తర్వాత ఉగ్రవాదులపై జరిపిన యుద్దంలో ఆ దేశంతో చేతులు కలిపి మేమే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అఫ్గానిస్తాన్‌తో పాటు పాకిస్తాన్‌కి ఎక్కువ నష్టం జరిగింది’’అని పేర్కొన్నారు. -
కేవలం 'యాడ్స్'తో స్నేహ దంపతులు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?
స్నేహ..తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ప్రియమైన నీకు చిత్రంతో తెలుగునాట ఎంట్రీ ఇచ్చిన స్నేహ తొలి చిత్రంతోనే బంపర్ హిట్ అందుకుంది. దీంతో తెలుగులో వరుస అవకావాలు ఆమెను వరించాయి. ‘శ్రీ రామదాసు’, ‘సంక్రాంతి’,‘రాధా గోపాలం’ వంటి వరుస విజయాలతో స్నేహ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. మొదట్నుంచి గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ తన అభినయం, చీరకట్టుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న స్నేహను చాలామంది సౌందర్యతో పోల్చేవారు. ఇక అదే సమయంలో తమిళంలో ఆపర్లు వస్తుండటంతో కోలీవుడ్‌కు వెళ్లిన స్నేహ ఆ తర్వాత టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పింది. తమిళంలో ‘అచ్చాముందు అచ్చాముందు’ అనే సినిమా షూటింగు సమయంలో హీరో ప్రసన్నతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అలా పెద్దల అంగీకారంతో 2012లో వీరు వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే ఇద్దరూ జంటగా పలు అడ్వర్టైజ్మెంట్లలో మెరిశారు. ఇక స్నేహ-ప్రసన్న జోడీకి ప్రత్యేకంగా అభిమానులున్నారు. దీంతో పలు యాడ్ కంపెనీలు కూడా వీరిని తమ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకున్నాయి. అలా ఇద్దరూ జోడీగా ఇప్పటికే పలు యాడ్ షూట్లలో నటించారు. కేవలం యూడ్స్ రూపంలోనే వీరు రూ. 3.50కోట్లు సంపాదించినట్లు టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు యాడ్ షూటింగ్‌లోనూ ఎంతో డెడికేషన్‌గా పనిచేస్తారని స్నేహ కపుల్స్‌కు మంచి పేరుంది. దీంతో వీరితో యాడ్స్ తెరకెక్కించేందుకు కంపెనీలు కూడా ఆసక్తిని చూపిస్తాయని సమాచారం. మొత్తానికి స్నేహ-ప్రసన్న దంపతులు అటు సినిమాలతో పాటు యాడ్ షూటింగ్స్‌లతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. -
‘రాజావారు రాణిగారు’ ఫేం స్నేహ మాధురి శర్మ క్యూట్ ఫోటోలు
-
స్నేహ అబ్బాయిలతో ఫోన్ ఎక్కువగా మాట్లాడుతోందని..
సాక్షి, బెంగళూరు: ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడవద్దన్నందుకు యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దొడ్డబళ్లాపుర పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. పట్టణంలోని ప్రైవేటు కళాశాలలో ద్వితీయ పీయూసీ చదువుతున్న స్నేహ (18) ఫోన్లో ఎక్కువగా అబ్బాయిలతో మాట్లాడుతుండటంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన స్నేహ వారం క్రితం ఇంట్లో పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. తీవ్రఅస్వస్థురాలైన స్నేహను ఆస్పత్రికి తరలించగా చికిత్స ఫలించక శనివారం ఉదయం మృతి చెందింది. చదవండి: (ఘోరం: అందరూ చూస్తుండగానే...) -
ఎప్పటికీ ఆనందంగా...
భర్త ప్రసన్న పుట్టినరోజు సందర్భంగా తమ కుమార్తె ఆద్యంత ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు స్నేహ. 2012లో తమిళ నటుడు ప్రసన్న, హీరోయిన్ స్నేహ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2015లో స్నేహ ఓ బాబుకి జన్మనిచ్చారు. బాబు పేరు విహాన్. ఈ ఏడాది జనవరిలో పాపకు జన్మనిచ్చారు స్నేహ. శుక్రవారం ప్రసన్న పుట్టినరోజుని పురస్కరించుకుని పాప ఆద్యంత ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు స్నేహ. అలాగే ‘‘నా సోల్‌మేట్ (ప్రసన్నని ఉద్దేశించి)కి పుట్టినరోజు శుభాకాంక్షలు. నా జీవితాన్ని ఆనందమయం చేసిన నా లవర్ బాయ్, నా గార్డియన్ ఏంజిల్ తను. మేం ఆనందంగా ఉండాలని దీవిస్తున్న అందరికీ ధన్యవాదాలు. మా జీవితం ఎప్పటికీ ఇలా ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాను’’ అని రాసుకొచ్చారు స్నేహ. -
కుమార్తెని పరిచయం చేసిన నటి
కుటుంబ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు నటి స్నేహ. చెరగని చిరునవ్వుకి కెరాఫ్ అడ్రస్‌గా నిలుస్తారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కథానాయకిగా రాణించారు. నటిగా ఫుల్ క్రేజ్‌లో వుండగానే నటుడు ప్రసన్నను ప్రేమించి, పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో రెండో సంతానంగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు స్నేహ. పాప పుట్టి ఏడు నెలలకు పైనే అవుతున్నా ఇంతవరకు చిట్టితల్లి ఫోటోలు ఎక్కడా షేర్ చేయలేదు. ఈ క్రమంలో భర్త, నటడు ప్రసన్న 38వ పుట్టిన రోజు సందర్భంగా కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేశారు స్నేహ. పాప పేరు ఆద్యంత. తల్లిదండ్రులు, అన్న విహాన్‌తో కలిసి ఉన్న చిన్నారి ఆద్యంత ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు స్నేహ. (చదవండి: స్నేహలోని కొత్త కోణం) ‘హ్యాపీ బర్త్‌డే టూ మై సోల్ మేట్.. మై లవర్ బాయ్.. గార్డియన్ ఏంజిల్.. సూపర్ డాడా. ఈ లడ్డులతో(పిల్లలు) నా జీవితాన్ని అందంగా మలిచినందుకు ధన్యవాదాలు. సదా మనం ఉన్నతంగా ఉండాలని దీవించి.. శుభాకాంక్షలు తెలిపే వారికి ఈ రోజు నా చిట్టితల్లి ఆద్యంతను పరిచయం చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ కుమార్తె ఫోటోలు షేర్ చేశారు స్నేహ. ప్రస్తుతం ఇవి తెగ వైరలవుతున్నాయి. View this post on Instagram Happy birthday to my soul mate my lover boy my guardian angel 😇 n my super dada. Thanx for making my life beautiful with these laddos. Love you somuch. And very happy to introduce our little laddo #Aadhyantaa to all the lovely people who have always blessed us and wished us the best. @prasanna_actor @mommyshotsbyamrita @perfektmakeover A post shared by Sneha Prasanna (@realactress_sneha) on Aug 27, 2020 at 8:50pm PDT -
వంటగది అన్నం పెడుతోంది
స్నేహ సిరివర... ఈ అమ్మాయి ముఖం చూస్తే అమ్మ చేసిన సాంబార్‌ను అన్నంలో కలుపుకుంటూ ‘అమ్మా! సాంబార్ ఏ పిండితో వండుతారు?’ అని అడిగేటట్లు ఉంది. ఈ అమ్మాయే కాదు, ఈ తరంలో చాలామంది అమ్మాయిల పరిస్థితి ఇలాగే ఉంది. మూడేళ్లు నిండేలోపు ప్లే క్లాస్, ఆ తర్వాత నర్సరీ, ఎల్‌కేజీతో మొదలైన విద్యా ప్రస్థానం మినిమమ్ బీటెక్ దగ్గర ఆగుతోంది. ఈ మధ్య కాలమంతా పిల్లలు వంటగదిలోకి అడుగుపెట్టేది అమ్మ సర్దిన లంచ్‌బాక్స్ తీసుకోవడానికి మాత్రమే. ఇలా తయారైన తరానికి పెళ్లయిన వెంటనే వంటగది భూతంలా భయపెడుతుంది. స్నేహ సిరివర మాత్రం ‘‘నాకు రుచిగా భోజనం చేయడం చాలా ఇష్టం. అందుకోసం జీవితకాలమంతా వంటగదిలోనే గడిపేస్తాను. ఇతర ఉద్యోగాలు– వ్యాపారాల్లో బిజీగా ఉండే వాళ్లకు సహాయంగా ఉంటాను. జీవితం వంటగదికి బానిసైపోతోందని బాధపడే గృహిణులకు కావలసినంత వెసులుబాటు ఇచ్చి వాళ్లు తమకు ఇష్టమైన వ్యాపకాన్ని కొనసాగించుకునే సౌకర్యం కల్పిస్తాను. నాకు ఇష్టమైన వంటగదితోనే ఉపాధి పొందుతాను’’ అంటోంది. ఇంజనీర్ ఉద్యోగం వద్దు స్నేహ సిరివర ఈ మాటలు అనడమే కాదు. ఆచరణలో నిరూపించింది కూడా. కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ చేసిన స్నేహ ఒక ఏడాదిపాటు విప్రో కంపెనీలో ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేసింది. ‘‘ఆ ఏడాది కాలంలో తరచుగా నా కెరీర్ ఇది కాదు... అనిపిస్తుండేది. దాంతో మా అమ్మానాన్నలను ఒప్పించి 2013లో మా కారు గ్యారేజ్‌లోనే నా యూనిట్‌ని ప్రారంభించాను. నా తొలినాటి ఉత్పత్తులు సాంబార్ పొడి, రసం పొడి, బిసిబేళాబాత్ మసాలా, పులియోగరే మిక్స్. వీటినే ఎంచుకోవడానికి కారణం ఉంది. నా ఫ్రెండ్స్, బంధువులు చాలా మంది విదేశాల్లో ఉన్నారు. వాళ్లకు అక్కడ ఇండియా ఉత్పత్తుల దుకాణాల్లో ఇండియన్ మసాలా పొడులంటే ఉత్తరాది రాష్ట్రాల మసాలా పొడులే దొరుకుతాయట. అక్కడి దుకాణాల వాళ్లకు దక్షిణాది రుచులు వేరే ఉంటాయనే సంగతే తెలియదని చెప్తూ ఇక్కడ నుంచి ఏడాదికి సరిపడిన పొడులు చేయించుకుని వెళ్లేవాళ్లు. అలా తొలుత మా కన్నడ రుచులతో కెరీర్ ప్రయోగం చేశాను. సక్సెస్ అయింది. తర్వాత చట్నీపొడి, పచ్చళ్లు, పదిహేను శాతం చికోరీతో ఫిల్టర్ కాఫీ పొడి కూడా సొంతంగా చేశాను. తమిళ కోడలు నేను తమిళ కోడల్ని కావడం అనుకోకుండా జరిగిపోయింది. మా అత్తగారి దగ్గర మోర్ కొళంబు, మురుకు, అప్పళం, నిప్పట్టు వంటి గ్రామీణ రుచులను నేర్చుకుని నా ఉత్పత్తులలో చేర్చాను. ఈ ఏడేళ్లలో నేను గ్రహించినదేమిటంటే... ప్రతి వంటకానికీ దానికంటూ ప్రత్యేకమైన రుచి ఉంటుంది. మనం వేసే మసాలా పొడి ఆ రుచిని పరిరక్షించగలగాలి. నేను ముడిసరుకుగా ఉపయోగించే దినుసులు యాభై రకాలకు మించవు. వాటి నిష్పత్తులను, కాంబినేషన్లను మారుస్తూ వందల రకాల ఘుమఘుమలను, రుచులను తీసుకురావచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే... భోజనానికి రమ్మని వంటగది పిలవాలి. మసాలా పొడులు ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఎటువంటి రంగులనూ వాడకపోవడం కూడా నా ఉత్పత్తులకు మంచి పేరు తెచ్చి పెట్టింది’’ అని చెప్పింది స్నేహ సిరివర. స్నేహ ‘సాంబార్ స్టోరీస్’ అనే తన చిన్న యూనిట్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా అందుకునే నెల జీతంకంటే మంచి రాబడినే చూస్తోంది. అయితే ఆమెకు యూనిట్ నిర్వహణలో సవాళ్లేమీ ఎదురు కాలేదనుకుంటే పొరపాటే. కుటుంబంలో ఎవరూ వ్యాపార రంగంలో లేకపోవడంతో ముడిసరుకు ఎక్కడ దొరుకుతుందో సూచించేవాళ్లు కూడా లేరు. తల్లిదండ్రులు ఇంట్లో ఆమెకు సహాయంగా ఉండేవాళ్లు. ముడిసరుకు సేకరణ నుంచి ఉత్పత్తులను ప్యాకింగ్ చేయించి, కొరియర్ చేయించడం వరకు ఆమె సొంతంగా చేసుకునేది. ఇప్పటికీ అలాగే యూనిట్‌ని ఒంటి చేత్తో నిర్వహిస్తోంది. ‘వన్ మ్యాన్ ఆర్మీ’ అని వింటుంటాం. ‘ఒన్ ఉమన్ ఆర్మీ’ని స్నేహలో చూస్తున్నాం. -
స్నేహలోని కొత్త కోణం
చిరునవ్వులకు చిరునామా నటి స్నేహ అనడం అతిశయోక్తి కాదు. తన నవ్వులతో దక్షణాది సినీ ప్రేక్షకులను వశపరచుకున్న నటి ఈ బ్యూటీ. కుటుంబ కథా చిత్రాల నటిగా పేరు తెచ్చుకోవడం స్నేహ ప్రత్యేకత. అలా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కథానాయకిగా రాణించింది. ఆ విధంగా నటిగా క్రేజ్ లో వుండగానే నటుడు ప్రసన్నను ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నటనకు కొంత గ్యాప్ ఇచ్చిన నటి స్నేహ మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడు కథానాయిక కాకుండా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. చదవండి: వయసు 87 ఇమేజ్.. సినిమాస్టార్ కాగా నటి స్నేహ, ప్రసన్నలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తీవ్ర కసరత్తులు చేస్తూ బాడీని ఫిట్ గా తయారు చేసుకుంటున్నారు. సాధారణంగా ఇలాంటి కసరత్తులు హీరోలు చేస్తుంటారు. అలాంటిది ఇద్దరు పిల్లల తల్లి అయిన నటి స్నేహ చేస్తుండడం విశేషం. దీంతో ఆమె నేటి యువ హీరోలకు సవాల్ విసురుతున్నరా లేక ఆమె సహా నటీమణులకు తన సత్తాను చాటుతున్నారాఅన్న ప్రశ్న సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మొత్తం మీద నటి బాడీ బిల్డ్ దృశ్యాలు ఇప్పుడు సామాద్యక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చదవండి: హ్యాపీ గార్డెనింగ్ -
అప్రమత్తం చేసే ఐడెంటిటీ కార్డు
సిరిసిల్ల: కరోనా నియంత్రణలో భాగంగా భౌతిక దూరం పాటించడం ఇప్పుడు అనివా ర్యమైంది. కొందరు ఆదమరిచి సమీపిస్తే అప్రమత్తం చేసే ఐడెంటిటీ కార్డును సిరిసిల్ల విద్యార్థిని స్నేహ రూపొందించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన స్నేహ ఎలక్ట్రానిక్ సెన్సార్ ఐడెంటిటీ కార్డును తయారు చేశారు. ఆ కార్డును ధరించి మనం ఎటువెళ్లినా మీటర్ దూరం ఉండగానే ఎవరి దగ్గరికైనా మనం వెళ్లి, మన దగ్గరికి ఎవరు వచ్చినా వెంటనే ఐడీ కార్డు బీప్ సౌండ్ చేస్తుంది. దీంతో అప్రమత్తమై భౌతిక దూరం ఉండేందుకు అవకాశం ఉంటుంది. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్S చదువుతున్న స్నేహ ఇప్పటికే సెన్సార్ స్మార్ట్‌వాచ్ రూపొందించి పలువురి అభినందనలు పొందారు. ఇప్పుడు అప్రమత్తం చేసే ఐడీ కార్డు రూపొందించి పలువురి మన్ననలు పొందారు. -
ఓయూ మహిళల టెన్నిస్ జట్టుకు స్వర్ణం
భువనేశ్వర్: తొలిసారి నిర్వహిస్తున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడల్లో ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్) జట్టుకు మొదటి స్వర్ణ పతకం లభించింది. టెన్నిస్ ఈవెంట్లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) మహిళల జట్టు చాంపియన్‌గా అవతరించింది. గుజరాత్ యూనివర్సిటీతో జరిగిన ఫైనల్లో చిలకలపూడి శ్రావ్య శివాని, కొండవీటి అనూష, నిధిత్రలతో కూడిన ఓయూ జట్టు 2–1తో గెలిచింది. తొలి మ్యాచ్‌లో అనూష 4–6, 6–7 (3/7)తో దీప్షిక షా చేతిలో ఓడింది. రెండో మ్యాచ్‌లో శ్రావ్య 6–0, 7–6 (9/7)తో ఈశ్వరి గౌతమ్ సేథ్‌ను ఓడించి స్కోరును 1–1తో సమం చేసింది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో శ్రావ్య–అనూష 6–4, 6–2తో దీప్షిక–ఈశ్వరిలను ఓడించి ఓయూ జట్టుకు స్వర్ణాన్ని అందించారు. స్నేహకు కాంస్యం అథ్లెటిక్స్ మహిళల 100 మీటర్లలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఆంధ్రప్రదేశ్) అథ్లెట్ ఎస్.ఎస్.స్నేహ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. స్నేహ 12.08 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో ఒడిశాకు చెందిన అంతర్జాతీయ అథ్లెట్ ద్యుతీ చంద్ (కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ) స్వర్ణం గెలిచింది. ద్యుతీ చంద్ 11.49 సెకన్లలో రేసును ముగించి విజేతగా నిలిచింది. ఎస్.ధనలక్ష్మి (11.99 సెకన్లు–మంగళూరు యూనివర్సిటీ) రజత పతకాన్ని దక్కించుకుంది. -
కుర్రాడు లోకల్
తమిళ ప్రాచీన యుద్ధ విద్య అడిమురై నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘లోకల్ బాయ్’. ధనుష్ హీరోగా, మెహరీన్, స్నేహ హీరోయిన్లుగా తెలుగు నటుడు నవీన్ చంద్ర విలన్‌గా నటించారు. ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ‘పటాస్’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి తమిళంలో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్టై¯Œ మెంట్స్ పతాకంపై సీహెచ్ సతీష్‌కుమార్ ‘లోకల్ బాయ్’ పేరుతో ఈ నెల 28న తెలుగులో విడుదల చేస్తున్నారు. సీహెచ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ– ‘‘మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా కోసం ధనుష్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ప్రాచీన యుద్ధవిద్య అడిమురై గొప్పదనం వివరించే చిత్రమిది. గతంలో ధనుష్, సెంథిల్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘ధర్మ యోగి’ చిత్రాన్ని తెలుగులో మేమే విడుదల చేశాం.. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా కూడా అంతకంటే పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు. -
దేవత వచ్చింది
శుక్రవారం నటి స్నేహ ఇంట్లో ఆనందం రెండింతలయింది. ఆమె రెండోసారి తల్లి కావడమే అందుకు కారణం. శుక్రవారం ఓ పాపకు జన్మనిచ్చారు స్నేహ. ‘దేవత వచ్చింది’ అంటూ ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలియజేశారు స్నేహ భర్త ప్రసన్న. 2012లో తమిళ నటుడు ప్రసన్న, స్నేహ ప్రేమ వివాహం చేసుకున్నారు. 2015 ఆగస్ట్‌లో స్నేహ ఓ బాబుకి జన్మనిచ్చారు. కుమారుడికి విహాన్ అని పేరు పెట్టారు. -
పాపకు జన్మనిచ్చిన నటి స్నేహ..
ప్రముఖ నటి స్నేహ రెండోసారి తల్లయ్యారు. శుక్రవారం రోజున ఆమె పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త నటుడు ప్రసన్న ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఏంజెల్ వచ్చేసిందని అన్నాడు. దీంతో పలువురు సినీ ప్రముఖులు స్నేహ-ప్రసన్న దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తమిళ చిత్రం అచ్చముండు అచ్చముండు షూటింగ్ సమయంలో నటుడు ప్రసన్నతో స్నేహ ప్రేమలో పడ్డారు. 2012 వీరిద్దరి విహహ బంధంతో ఒకటయ్యారు. వీరికి ఇప్పటికే విహాన్ అనే బాబు ఉన్న సంగతి తెలిసిందే. కాగా, బాబు పుట్టిన తర్వాత సినిమాల గ్యాప్ ఇచ్చిన స్నేహ.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇటీవల ధనుష్ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం పటాస్‌లో ఆమె నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. -
స్నేహ సీమంతం వేడుక...
నటి స్నేహా రెండోసారి తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె సీమంతం వేడుక ఇటీవల చెన్నైలో కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రుల సమక్షంలో జరిగింది. 2012లో తమిళ నటుడు ప్రసన్నను ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు స్నేహ. వీరికి ఇప్పటికే కుమారుడు నిహాస్ ఉన్నాడు. సీమంతం వేడుక ఫోటోలను స్నేహా షేర్ చేయడంతో ...ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వివాహం అయిన తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆమె... ఓ బిడ్డకు జన్మినిచ్చారు. ఆ తర్వాత స్నేహా నటనలో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం సీమంతం ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. -
మళ్లీ తల్లి కాబోతున్నారు
కొన్ని రోజులుగా కంగ్రాచులేషన్ మెసేజ్‌లు, ఫోన్లతో బిజీ బిజీగా ఉన్నారు స్నేహ. రెండోసారి తల్లి కానుండటమే అందుకు కారణం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మరోసారి తల్లి కాబోతున్నట్టు ప్రకటించారు స్నేహ. తమిళ నటుడు ప్రసన్న, స్నేహ ‘అచ్చముండు అచ్చముండు’ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. 2012లో వివాహం చేసుకున్న ఈ జంటకు విహాన్ అనే నాలుగేళ్ళ బాబు కూడా ఉన్నాడు. -
బిగ్‌బాస్.. అందుకే హిమజ సేఫ్!
బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన తరువాత కన్నీరు పెట్టిన మొట్టమొదటి కంటెస్టెంట్ హిమజ. సున్నితమైన మనస్తత్వం గల హిమజకు సోషల్‌మీడియాలో ఫుల్ క్రేజ్ నెలకొంది. శ్రీముఖి-హేమ-హిమజ గొడవలో హిమజ కంటతడి పెట్టడం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మానిటర్‌గా ఉన్న హేమ.. శ్రీముఖిని సేవ్ చేసి హిమజను నామినేట్ చేసింది. శ్రీముఖి చెప్పిన కారణాలు సైతం సరైనవి కాకపోయినా.. హిమజను కావాలనే టార్గెట్ చేశారని చాలా మంది నెటిజన్లు భావించారు. హిమజకు ముందు నుంచీ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉండటం.. ఇంకా పలువురు సెలబ్రెటీలు హిమజకు మద్దతు పలకడంతో ఎలిమినేషన్ నుంచి ఈజీగా బయటపడింది. ఈసారి పదిహేను మంది కంటెస్టెంట్లు ఇంట్లోకి వచ్చే ముందే అంతా సెట్ చేసుకుని వచ్చారు. వారికి సంబంధించిన పీఆర్ టీమ్‌లు బయట ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. హౌస్‌లో వారు చేసే యాక్టివిటీస్‌ను సోషల్ మీడియాలో వదులుతూ ఓట్లు వేయాలని కోరుతున్నారు. వీటికి తోడు ఆర్మీల గోల ఎక్కువైంది. ప్రతీ కంటెస్టెంట్‌కు ఓ ఆర్మీ తోడైంది. దీంతో ఎవరి డప్పు వారు కొట్టుకున్నట్లు అవుతోంది. అయితే అందరి కంటే భిన్నంగా హిమజకు మాత్రం.. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది, శ్రద్దా దాస్, స్నేహ, శివబాలాజీ సతీమణి మధుమితలాంటి వారు బహిరంగంగా మద్దతు పలికారు. జబర్దస్త్ వేదిక మీద ఆదితో కలిసి హిమజ నవ్వులు పూయించడంతో అతను మద్దతు పలికాడు. ఇటీవలె వచ్చిన వినయవిధేయరామ చిత్రంలో రామ్ చరణ్‌కు వదినగా హిమజ నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ సమయంలో ఏర్పడిన స్నేహంతో నటి స్నేహ హిమజకు మద్దతుగా నిలిచింది. తనకు బిగ్‌బాస్ హౌస్‌లో నచ్చిన కంటెస్టెంట్ హిమజ అని శ్రద్దాదాస్ పేర్కొనడం.. హిమజకు ఓటు వేయాలని మధుమిత కోరడంతో ఓట్ల విషయంలో భారీగా మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన ఐదుగురి కంటే కంటే హిమజకే ఎక్కువ ఓట్లు పోల్ అయినట్లు సమాచారం. తనకు ఏర్పడిన ఈ ఫాలోయింగ్‌ను చివరి వరకు నిలుపుకునేలా హౌస్‌లో హిమజ ఎలాంటి గేమ్ ఆడుతుందో చూడాలి. చదవండి : బిగ్‌బాస్.. హేమ అవుట్! బిగ్‌బాస్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తమన్నా? -
‘ఆస్కార్’ ఎంత పని చేసింది!
జీవితమే ఒక సినిమా అంటుంటారు. ఒక్కోసారి జీవితం కూడా సినిమాలా సాగుతుంటుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్నేహ, సుమన్ అనే యువతుల జీవితాలు ఒక్క సినిమాతో మారిపోయాయి. మూడు నెలల క్రితం సెలబ్రిటీ స్టేటస్ అనుభవించిన ఈ ఇద్దరిని ఇప్పుడు పట్టించుకునేవారే కరువయ్యారు. సినీమాయాజాలం ఇదే కామోసు! ఫ్లై (ఊ y) అనే స్వచ్ఛంద సంస్థ 2017లో కాథిఖేరా గ్రామంలో శానిటరీ ప్యాడ్ తయారీ యూనిట్ పెట్టింది. వీటి గురించి ఏమాత్రం అవగాహన లేని గ్రామస్తులు శానిటరీ ప్యాడ్స్ తయారీని వింతగా చూశారు. 28 ఏళ్ల సుమన్, 22 ఏళ్ల స్నేహ ధైర్యంగా ముందడుగు వేశారు. ఎవరేమన్నా పట్టించుకోకుండా ప్యాడ్స్ తయారీకి వెళ్లేవారు. ఈ ధైర్యమే వారికి సినిమా అవకాశం తెచ్చిపెట్టింది. శానిటరీ ప్యాడ్ తయారీ యూనిట్ ఏర్పాటు, తదనంతర పరిణామాలపై 26 నిమిషాల నిడివితో డాక్యుమెంటరీని ఇరానియన్–అమెరికన్ దర్శకురాలు రేఖ జెహతా బచ్చి తెరకెక్కించారు. ఇందులో సుమన్, స్నేహ నటించారు. ఈ డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు దక్కడంతో వీరిద్దరూ అమెరికా వెళ్లి అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని ఈ ఏడాది మార్చిలో సొంతూరికి తిరిగొచ్చిన స్నేహ, సుమన్‌లకు ఘన స్వాగతం లభించింది. వారిని స్వాగతించేందుకు ఊరు మొత్తం కదిలొచ్చింది. మరుసటి రోజుకు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడిపారు. తమ ఊరి పేరును ప్రపంచమంతా మార్మోగిపోయేలా చేశారంటూ వీరిని ఘజియాబాద్ జిల్లా హాపూర్ తాలుకాలోని కాథిఖేరా గ్రామస్తులు పొగడ్తలతో ముంచెత్తారు. కాథిఖేరా గ్రామం పేరు కూడా ప్రసార సాధనాల్లో ప్రముఖంగా కనబడింది. ఆ తర్వాత వీరిద్దరి జీవితం తలకిందులైంది. ఆర్థిక సమస్యలు చట్టుముట్టడం, ఉన్న ఉపాధి కోల్పోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. ‘మేము మంచి సినిమాలో నటించాం. కానీ ఈరోజు మేము ఎక్కడ ఉన్నామో చూసుకుంటే బాధ కలుగుతుంది. ఆస్కార్‌తో తలరాత మారుతుందని అనుకున్నాం కానీ అప్పుల్లో కూరుకుపోతామని ఊహించలేదు. ఎవరో ఒకరు మమ్మల్ని ఆదుకోవాల’ని సుమన్ దీనంగా వేడుకుంటోంది.ఏదో ఒకరోజు ఢిల్లీ పోలీసు దళంలో చేరాలని చేరాలని కలలు కన్న స్నేహ డబ్బుల్లేక కోచింగ్ క్లాసులు మానుకుంది. ‘నెలకు రూ. 2500 ఇచ్చే ఫ్లై సంస్థ నాకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. ఇక నుంచి పనులకు రావొద్దని సంస్థ ప్రతినిధి చెప్పారు. నాకు రావాల్సిన జీతం డబ్బుల గురించి అడిగితే ముందే లక్ష రూపాయలు ఇచ్చామని, ఇక ఇవ్వాల్సిన అవసరం లేదన్నార’ని వాపోయింది. ఆస్కార్ అవార్డు దక్కించుకున్నందుకు సుమన్, స్నేహలకు ఉత్తరప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్.. చెరో లక్ష రూపాయలు రివార్డుగా ఇచ్చారు. గవర్నర్ రామ్‌నాయక్ 50 వేల చొప్పున బహూకరించారు. అయితే ఈ సొమ్ము తమకే చెందుతుందని వాదిస్తూ ఫ్లై సంస్థ తమను ఇబ్బంది పెడుతోందని సుమన్ తెలిపారు.సుమన్, స్నేహ ఆరోపణల్లో వాస్తవం లేదని, చేతులారా వారి జీవితాన్ని వారే దిగజార్చుకున్నారని ఫ్లై సంస్థ వాదిస్తోంది. అమెరికా నుంచి వచ్చిన తర్వాత వీరిద్దరూ పనిని నిర్లక్ష్యం చేశారు. రెండు నెలలుపైగా పనిలోకి రాలేదు. ఆరుగురు మనుషులతో నడిచే చిన్న యూనిట్లో ఇద్దరు పని మానేస్తే ఎంత కష్టమవుతుంది. పనిలోకి చాలాసార్లు చెప్పినా వారు వినిపించుకోలేదని సదరు సంస్థ వివరించింది. మరోవైపు రుతుక్రమంపై అవగాహన పెరగడం, శానిటరీ ప్యాడ్ లభ్యత స్థానికంగా పెరగడంతో వీరు తయారు చేసే వాటిని డిమాండ్ కూడా తగ్గింది. సుమన్, స్నేహల పరిస్థితి ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. వీరిద్దరూ ఎలా గట్టెక్కుతారో చూడాలి! – పోడూరి నాగ శ్రీనివాసరావు సాక్షి వెబ్ డెస్క్ -
హ్యాపీగా ఉండాలి
మంచు కొండల్లో ఫ్యామిలీతో కలిసి చల్లగా చిల్ అవుతున్నారు హీరో అల్లు అర్జున్. భార్య స్నేహ, కుమారుడు అయాన్, కుమార్తె అర్హలతో కలిíసి వేసవిని ఎంజాయ్ చేయడానికి స్విట్జర్లాండ్ వెళ్లారు అల్లు అర్జున్. అక్కడ గడుపుతున్న తమ ఆనందపు క్షణాలను ఫొటోస్‌లో బంధించి అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘లైఫ్‌లో ఎలా ఉండాలి? అని నేను వాళ్లను (కుమార్తె, కుమారుడిని ఉద్దేశించి) అడిగితే ‘హ్యాపీగా’ అన్నారు’’ అని పేర్కొన్నారు అల్లు అర్జున్. అన్నట్లుగానే బన్నీ ఫ్యామిలీ ఫుల్ హ్యాపీగా వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. సమ్మర్ వెకేషన్‌ను పూర్తి చేసుకున్న తర్వాత హైదరాబాద్‌లో జరగనున్న ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారు అల్లు అర్జున్. ఈ సినిమా కాకుండా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా, వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. -
బస్సు ఢీకొని విద్యార్థిని దుర్మరణం
ఉప్పల్: రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థిని మృతిచెందిన సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బోడుప్పల్ అన్నపూర్ణనగర్ కాలనీకి చెందిన సత్యం కుమార్తె ఇంజినీరింగ్ చదువుతోంది. శుక్రవారం స్నేహ (21) శుక్రవారం తన స్నేహితురాలు శృతితో బైక్‌పై అమీర్‌పేట నుంచి బోడుప్పల్‌కు వస్తుండగా ఉప్పల్ గాంధీ బొమ్మ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వెనుక నుండి ఢీ కొనడంతో బైక్ వెనుక కూర్చున్న స్నేహ కిందపడటంతో బస్సు చక్రాలు ఆమెపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. వాహనం నడుపుతున్న శృతికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితులు మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య సమీప బంధువులని సమాచారం. శృతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వీరి కుటుంబానికి కులం... మతం లేవు..!
తిరుపత్తూర్‌లో ప్రముఖ న్యాయవాది ఆమె. దేశంలో కుల, మత భేదాలు లేకుండా అందరికీ సమ న్యాయం చేయాలనే పట్టుదల కలిగిన మహిళ. దీనిపై ఆమె పోరాటం దేశానికి మార్గదర్శకం చేసింది. ఆదేంటో చూడాలంటే తమిళనాడులోని వేలూరు జిల్లా తిరుపత్తూర్... ఆనంత కృష్ణన్, మణిమొళి దంపతులకు పెద్ద కుమార్తె ఆమె. పోలీసులచే చిత్రహింసలకు గురై, వారికి వ్యతిరేకంగా పోరాడి జైల్లోనే ప్రాణాలు విడిచిన స్నేహలతకు గుర్తుగా ఆమెకు స్నేహ అని పేరు పెట్టారు. ఆమె తన ఇంటిపేరుగా తల్లి పేరులోని మొదటి అక్షరం ఎం, తండ్రి పేరులోని మొదటి అక్షరం ఏ రెండు కలిపి ఎంఎ.స్నేహ అయ్యింది. పాఠశాలలో ఒకటో తరగతిలో చేరేటప్పుడు మొదటిసారి నీది ఏ క్యాస్ట్? అని అడిగారు. నాకు కులం లేదని మా తల్లిదండ్రులు చెప్పారు అని చెప్పిందామె. పోనీ మతం అయినా చెప్పమన్నారు. ‘మాకు కులం, మతం లేవని చెప్పారు మా తల్లిదండ్రులు’ అని సమాధానం ఇచ్చిందామె. అలా మొదలైన స్నేహ జీవితంలో పాఠశాల, కళాశాల వరకు ఎక్కడా కులం, మతం అనే ఆప్షన్ లేదు. ఆమె సోదరీమణులు ముంతాజ్, జెన్నిఫర్ కూడా అలాగే కులం, మతం అనే ఆప్షన్ లేకుండా విద్యాభ్యాసం ముగించారు. కుల, మతభేదాలు లేకుండానే పార్తిపరాజాతో ఆమెకు వివాహం జరిగింది. ఆమె పిల్లలు నజ్రీన్, ఆతిల జరీన్, ఆరీఫా జోసిలకు కూడా కులమతాలు అంటకుండా పెంచుతున్నారు. కులం, మతం అంటూ కొట్టుకునే ఈ సమాజానికి స్నేహ దంపతులు మార్గదర్శకులుగా నిలిచారు. కులాలు, మతాలతో కొట్టుకునే ఈ సమాజానికి భిన్నంగా అవేవీ వారికి లేవని నిరూపించుకునే ప్రయత్నంలో వారు తమకు కులం, మతం లేవనే ప్రభుత్వ సర్టిఫికెట్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే అధికారులు పలుమార్లు వారిని నిరాశపరిచారు. వారు ఫలానా మతం, ఫలానా కులం అంటూ సర్టిఫికెట్ ఇచ్చే ప్రభుత్వాలు, అధికారులు, వారు ఏ కులానికీ, మతానికీ చెందిన వారు కాదనే సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వరనే న్యాయపోరాటం ప్రారంభించారు స్నేహ దంపతులు. అలా అలుపెరగకుండా వారు చేసిన పోరాటానికి న్యాయం జరిగింది. ఆర్డీవో ఆదేశాల మేరకు తిరుపత్తూర్ తహసీల్దారు సత్యమూర్తి స్నేహ కుటుంబం ఏ కులానికీ, మతానికి చెందినవారు కాదంటూ సర్టిఫికెట్ అందచేయటం కొసమెరుపు. అలా స్నేహ దంపతులు తాము ఏ కులానికో, మతానికో చెందినవారం కాదని, తమది మానవజాతి అంటూ ప్రభుత్వ పత్రం పొందిన మొదటి కుటుంబంగా రికార్డులకెక్కారు. – సంజయ్ గుండ్ల, ప్రత్యేక ప్రతినిధిసాక్షి టీవీ, చెన్నై బ్యూరో -
ఆమెకు కులం, మతం లేదు!
పొద్దున లేస్తే చాలు కుల, మత, వర్గ రహిత సమాజం కావాలంటూ లెక్చర్లు దంచే ‘మహానుభావుల’ను చాలా మందినే చూస్తుంటాం. అందులో ఎంత మందికి నిజంగా సమసమాజ స్థాపన పట్ల చిత్తశుద్ధి ఉందని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం చాలా కష్టం. అయితే తమిళనాడుకు చెందిన స్నేహ అనే న్యాయవాది మాత్రం ఇందుకు మినహాయింపు. మాటలకు పరిమితమై పోకుండా ఏళ్ల పాటు కృషి చేసి.. ‘నో కాస్ట్, నో రిలిజియన్’ సర్టిఫికెట్ సంపాదించి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారామె. ఎవరి హక్కులనో ప్రశ్నించేందుకు తాను ఈ సర్టిఫికెట్ పొందలేదని.. భవిష్యత్ తరాలకు కుల, మత రహిత సమాజాన్ని అందించే మహత్కార్యంలో తనకున్న బాధ్యతను ఈ విధంగా నెరవేర్చుకున్నానన్న ఆమె వ్యక్తిత్వం అందరికీ ఆదర్శనీయం. బుధవారం సాయంత్రం నుంచి స్నేహ (35), ఆమె భర్త పార్తీబ రాజా ఫోన్ మోగుతూనే ఉంది. కొందరు స్నేహకు శుభాకాంక్షలు చెబుతుంటే.. మరికొంత మంది మాత్రం స్నేహలాగే తాము కూడా కుల, మతరహిత సమాజంలో భాగస్వామ్యం కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ‘నో కాస్ట్, నో రిలిజియన్’ సర్టిఫికెట్ పొందాడానికి అనుసరించాల్సిన విధానాల గురించి అడుగుతూ సందేహాలు తీర్చుకుంటున్నారు. గర్వంగా ఉంది... ఈ విషయం గురించి స్నేహ మాట్లాడుతూ... ‘నా జీవితంలోని ముఖ్య లక్ష్యం ఒకటి నెరవేరింది. నా తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్ల ప్రభావంతో చిన్ననాటి నుంచే నాలో కుల, మతాలకతీతంగా ఉండాలనే కోరిక బలపడింది. అనేక అవాంతరాల అనంతరం ఈ రోజు నా చేతిలో నో కాస్ట్, నో రిలిజియన్ సర్టిఫికెట్ ఉంది. అలా అని నేను రిజర్వేషన్‌కు వ్యతిరేకం కాదు. రిజర్వేషన్ విధానాన్ని సమర్థిస్తాను. వెనుకబడిన వర్గాలు అభివృద్ధి చెందేందుకు ఇలాంటివి అవసరం. అయితే ఇందుకు కులమో, మతమో ప్రామాణికం కాకూడదు. ఈ సర్టిఫికెట్ పొందడం ద్వారా ఎవరి హక్కులను లాక్కోవడం లేదు. సమాజ శ్రేయస్సు కోసం, వివక్షకు గురవుతున్న వ్యక్తుల హక్కులను కాపాడాలని ప్రతీ ఒక్కరికీ విఙ్ఞప్తి చేస్తున్నా. ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తుంటే 2017 నుంచి నాకు సానుకూలత లభించింది. ఇప్పుడు సర్టిఫికెట్ వచ్చింది. చాలా గర్వంగా ఉంది. కాస్ట్ సర్టిఫికెట్ ఫార్మాట్లోనే నా సర్టిఫికెట్ రూపొందించమని అడిగాను’ అని తిరుపత్తూరు తహశీల్దార్ టీఎస్ సత్యమూర్తి నుంచి నో కాస్ట్, నో రిలిజియన్ సర్టిఫికెట్ అందుకున్న స్నేహ తన ఉద్దేశాన్ని తెలియజేశారు. తండ్రి చూపిన బాటలో...భర్త ప్రోత్సాహంతో స్నేహ స్వస్థలం వేలూరు జిల్లాలోని తిరుపత్తూరు. ఆమె తండ్రి కుల, మతాలకు వ్యతిరేకం. అందుకే తన ముగ్గురు కూతుళ్లకి స్నేహ, ముంతాజ్, జెన్నిఫర్ అనే పేర్లు పెట్టారు. తండ్రి ప్రభావంతో స్నేహ కూడా తన సంతానానికి వివిధ మతాచారాలకు సంబంధించిన పేర్లు పెట్టారు. ఈ విషయంలో స్నేహ భర్త పార్తీబ రాజా ఆమెకు పూర్తి మద్దతుగా నిలిచారు. తన పెద్ద కుమార్తెకు ‘అధిరై నస్రీన్’ అనే బుద్ధిస్టు, ముస్లిం సంప్రదాయాల కలయికకు చెందిన పేరు పెట్టడం గురించి పార్తీబ రాజా మాట్లాడుతూ.. ‘ కుల, మత రహిత సమాజం గురించి ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకే మా కూతురికి ఈ పేరు పెట్టాం. తన పేరు వినగానే ప్రతీ ఒక్కరూ మీ అమ్మానాన్నలు ముస్లింలా అని అడుగుతారు. అప్పుడు మా కూతురు మా ఇద్దరి పేర్లు చెప్పడంతో పాటుగా తనకు ఆ పేరు పెట్టడానికి గల కారణాలు, తన పేరు వెనుక ఉన్న కథను వివరిస్తుంది. ఈ రకంగా వారికి అవగాహన కలుగుతుంది. ప్రసుతం స్నేహ నో కాస్ట్, నో రిలిజియన్ సర్టిఫికెట్ పొందడం ఒక సానుకూల దృక్పథానికి నాంది. ఈ విషయం గురించి చర్చ మొదలైంది. చాలా మంది తమకు కూడా ఇలాంటి సర్టిఫికెట్ కావాలని అడుగుతున్నారు. బహుశా దేశంలోనే ఇలాంటి సర్టిఫికెట్ పొందిన తొలి మహిళ తనేనేమో. ప్రస్తుతం ఆమె సోదరీమణులు కూడా తన బాటలోనే నడిచే ప్రయత్నం చేస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు. ప్రశంసల జల్లు నో కాస్ట్, నో రిలిజియన్ సర్టిఫికెట్ పొందడం ద్వారా స్నేహ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘భారతీయుల్లో నిగూఢంగా ఉండే కోరికను మీరు నెరవేర్చుకున్నారు. మనకు అనవసరమైన, సంబంధం లేని విషయాలను త్యజిద్దాం. కులాన్ని పక్కన పెట్టేద్దాం’ అంటూ లోకనాయకుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, కమల్‌హాసన్ ట్వీట్ చేశారు. అదేవిధంగా సినీ నటుడు సత్యరాజ్, నటి, హక్కుల కార్యకర్త రోహిణి స్నేహను ప్రశంసించారు. -సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్ Dear Sneha, You have actuated a long dormant desire among Indians. Let’s discard what never belonged to us. Let’s caste away Caste. From this point, a better tomorrow will be more accessible. Bravo daughter. Lead India forward. https://t.co/tdjngFiHWl — Kamal Haasan (@ikamalhaasan) February 13, 2019 -
పిల్లోడి హెయిర్ సెట్ చేస్తున్న చెర్రీ!
‘వినయ విధేయ రామ’ షూటింగ్ సెట్లో అందరం కలిసి ఓ కుటుంబంలా ఉండే వారమని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు నటీమణులు. రామ్‌చరణ్‌కు వదినగా నటించిన స్నేహ తనయుడికి, చెర్రీకి మంచి స్నేహం కుదిరిందట. విహాన్ చెర్రీకి పెద్ద అభిమాని అని, రామ్‌లో ఉన్న చిన్నపిల్లల మనస్తత్వం వల్ల తాను విహాన్‌ను షూటింగ్‌కు తీసుకువెళ్లిన ప్రతీసారి ఇద్దరు కలిసి ఆడుకునే వారంటూ షూటింగ్ లొనేషన్లో తీసిన పిక్‌ను స్నేహ షేర్ చేశారు. విహాన్ హెయిర్‌ను సెట్ చేస్తున్న చెర్రీ పిక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. View this post on Instagram A throwback from #VVR sets. Vihaan has a huge RC fan in him and Ram had a kid in him to play with vihaan everytime I took him to the sets. Sweethearts.....😊 A post shared by Sneha Prasanna (@realactress_sneha) on Jan 19, 2019 at 2:53am PST -
మల్లూకి అతిథిగా అల్లు
అల్లు అర్జున్‌కు కేరళలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మల్లు (మలయాళీ) అభిమానులు అల్లు అర్జున్‌ని ముద్దుగా ‘మల్లు అర్జున్’ అని పిలుచుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లోలానే కేరళ లో కూడా అల్లు అర్జున్ సినిమాలు అదే స్థాయిలో సందడి చేస్తాయి. తాజాగా కేరళలో జరుగుతున్న 66వ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్‌కు కేరళ ప్రభుత్వం అల్లు అర్జున్‌ని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఈ ఈవెంట్‌కు భార్య స్నేహాతో కలసి హాజరయ్యారు బన్నీ. కేరళ గవర్నర్ పళనిసామి సదాశివన్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మలయాళ వస్త్రధారణలో అలరించారు అల్లు అర్జున్. ‘‘ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు, నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్‌ను తెల్ల జెండా ఊపి, ఆరంభించే గౌరవాన్ని ఇచ్చినందుకు కేరళ ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు అల్లు అర్జున్. ఇటీవలే కేరళ భారీ వరదలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. బాధితులకు అల్లు అర్జున్ ఆర్థిక సహాయం కూడా చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయబోయే సినిమా డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. -
స్క్రీన్ టెస్ట్
‘స్టార్స్ లైఫ్’ ఎప్పుడూ ఆసక్తిగా ఉంటుంది. అసలు వాళ్లు స్టార్స్ కాకముందు ఏం చేసేవారో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా చాలా ఉంటుంది. కొందరు స్టార్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. నేను హీరో కాకముందు చేపల చెరువుల వ్యాపారం చేసేవాణ్ణి. ప్రతి సంవత్సరం నష్టాలే తప్ప ఒక్కసారి కూడా లాభం రాలేదు. ఆ తర్వాత హీరో అయ్యాను అని చెప్పే ప్రముఖ హీరో ఎవరో తెలుసా? ఎ) ్రçపభాస్ బి) కృష్ణంరాజు సి) చిరంజీవి డి) గోపీచంద్ 2. హీరో కాకముందు ఆయన వైజాగ్‌లో షూమార్ట్ నడిపేవారు. ఆ బిజినెస్ నష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేయాలో తోచక ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించారు. తర్వాత హీరో అయ్యారు. ఎవరా హీరో? ఎ) జె.డి. చక్రవర్తి బి) జగపతిబాబు సి) వెంకటేశ్ డి) శ్రీకాంత్ 3. ఇప్పుడామె ప్రపంచమంతటికీ హీరోయిన్గా తెలుసు. కానీ ఒకప్పుడు కెమెరా అసిస్టెంట్. ఎవరా హీరోయిన్? ఎ) స్నేహ బి) విజయశాంతి సి) రాధిక డి) సుహాసిని 4 జర్నలిస్ట్ అవుదామని జర్నలిజమ్ చదువుకుంది. అయితే తన ఐడియాలను జర్నలిజమ్ ద్వారా చెప్పలేనని పుణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో సినిమాటోగ్రఫీ చేద్దామని వెళ్లినప్పుడు ఓ డైరెక్టర్ పరిచయం అయ్యి, నువ్వు యాక్ట్ చే స్తే బావుంటుంది అనటంతో మనసు మార్చుకుని హీరోయిన్ అయ్యింది. ఎవరా హీరోయిన్ తెలుసా? ఎ) రాధికా ఆప్టే బి) నిత్యా మీనన్ సి) మాళవికా అయ్యర్ డి) మాళవికా నాయర్ 5. నాని హీరో కాకముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారని అందరికీ తెలుసు. కానీ అంతకుముందు మరో శాఖలో కూడా పని చేశారు. ఆయన గతంలో ఏ శాఖలో పని చేశారో తెలుసా? ఎ) సినిమాటోగ్రఫీ బి) డబ్బింగ్ సి) రేడియో జాకీ డి) సింగర్ 6. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘భద్ర’ చిత్రానికి కథారచయితగా చేసిన అతను ఇప్పుడు తెలుగు చిత్రసీమలో ప్రామిసింగ్ డైరెక్టర్. ఆ టాలీవుడ్ ప్రామిసింగ్ డైరెక్టర్ ఎవరబ్బా? ఎ) వంశీ పైడిపల్లి బి) కొరటాల శివ సి) వక్కంతం వంశీ డి) కల్యాణ్‌కృష్ణ 7. ఒక ఆడియోగ్రాఫర్‌గా సినీ పరిశ్రమలో జీవితం ప్రారంభించారు ఈయన. భారత దేశంలోని గొప్ప దర్శకుల్లో ఒకరుగా పేరు సంపాందించారు. ఎవరా దర్శకులు? ఎ) కె.విశ్వనాథ్ బి) బాలచందర్ సి) మణిరత్నం డి) కె. రాఘవేంద్ర రావు 8 . మణిరత్నం దగ్గర దర్శకత్వ శాఖలో శిష్యరికం చేశారీయన . శంకర్ సినిమా ద్వారా నటునిగా పరిచయమయ్యారు. ఎవరా హీరో? ఎ) సిద్ధార్థ్ బి) కార్తీ సి) మాధవన్ డి) అజిత్ 9. అతనో సింగర్. సినిమాల్లో పాటలు పాడక ముందు అనేక ఉద్యోగాలు చేశారు. ప్రస్తుతం ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ నోవార్టిస్‌లో ప్రాజెక్ట్ హెడ్‌గా పనిచేస్తున్న సింగర్ ఎవరో కనుక్కోండి? ఎ) శ్రీకృష్ణ బి) కారుణ్య సి) సింహా డి) హేమచంద్ర 10. యస్.యస్ తమన్ సంగీత దర్శకునిగా స్థిరపడక ముందు ఓ సినిమాలో లీడ్ క్యారెక్టర్లో నటించి, నటునిగా మంచి మార్కులే సంపాదించాడు. అతను నటునిగా చేసిన చిత్రానికి దర్శకుడెవరో తెలుసా? ఎ) శంకర్ బి) యన్.శంకర్ సి) జయ శంకర్ డి) హరీశ్ శంకర్ 11. కోటగిరి వెంకటేశ్వరావు చిత్ర పరిశ్రమలో చాలా పేరున్న ఎడిటర్. ఆయన దగ్గర ఎడిటింగ్ శాఖలో శిక్షణ పొందిన దర్శకుడెవరో తెలుసా? ఎ) వీవీ వినాయక్ బి) చంద్రశేఖర్ యేలేటి సి) శ్రీను వైట్ల డి) యస్.యస్. రాజమౌళి 12. నిర్మాతగా సినీరంగంలోకి అడుగుపెట్టారు ఈయన. తర్వాత కాలంలో రచయితగా బ్లాక్ బాస్టర్ విజయాలను సొంతం చేసుకున్నారు. ఎవరాయన? ఎ) గోపీమోహన్ బి) కోన వెంకట్ సి) అబ్బూరి రవి డి) సతీశ్ వేగేశ్న 13. హీరో అర్జున్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన ప్రముఖ హీరో ఎవరో తెలుసా? ఎ) విజయ్ బి) విశాల్ సి) ధనుశ్ డి) శివకార్తికేయన్ 14 హీరో అవ్వకముందు ఆయన రోజూ 80 కిలోమీటర్లు బైక్‌పై వెళ్లి 1800 రూపాయల జీతానికి బట్టలు తయారుచేసే కంపెనీలో పని చేసిన హీరో ఎవరో తెలుసా? ఎ) అల్లు అర్జున్ బి) విక్రమ్ సి) సూర్య డి) శింబు 15. భక్తవత్సలం నాయుడు సిల్వర్ స్క్రీన్ కోసం మోహన్‌బాబుగా మారక ముందు ఏం చేసేవారో తెలుసా? ఎ) డ్రిల్ మాస్టర్ బి) మ్యాథ్స్ టీచర్ సి) లెక్చరర్ డి) ఆర్టీసీ కండక్టర్ 16. ప్రస్తుతం క్యారెక్టర్ నటుడుగా బిజీగా ఉన్న కాశీ విశ్వనాథ్ గతంలో దర్శకుడు. ఆయన ఏ సంస్థ ద్వారా దర్శకునిగా పరిచయమయ్యారు? ఎ) సురేశ్ ప్రొడక్షన్స్ బి) వైజయంతి మూవీస్ సి) గీతా ఆర్ట్స్ డి) అన్నపూర్ణ పిక్చర్స్ 17. దాసరి నారాయణరావు దర్శకులు కాకముందు రైటర్‌గా పనిచేశారు. అంతకంటే ముందు ఆయన ఏం పనిచేసేవారో తెలుసా? ఎ) బ్యాంక్ ఉద్యోగి బి) నాటక రచయిత సి) పోస్ట్ మాస్టర్ డి) రైల్వే ఎంప్లాయి 18. నటుడు కాకముందు ఫైర్ మ్యాన్‌గా పనిచేసిన ఆ నటుడెవరు? ఎ) యస్వీ రంగారావు బి) గుమ్మడి సి) రాజనాల డి) కాంతారావు 19 . గౌతమ్ మీనన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన ఇప్పటి హీరో ఎవరో తెలుసా? ఎ) ఆది పినిశెట్టి బి) సందీప్ కిషన్ సి) తనీష్æ డి) ప్రిన్స్ 20. హీరో కాకముందు బ్యాడ్మింటన్ క్రీడలో పుల్లెల గోపీచంద్‌తో కలిసి భారతదేశం తరఫున ఎన్నో టోర్నమెంట్స్‌లో పాల్గొన్న ఆ నటుడెవరో కనుక్కోండి? ఎ) సుధీర్‌బాబు బి) నవీన్‌చంద్ర సి) రాహుల్ రవీంద్రన్ డి) అఖిల్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) బి 3) డి 4) బి 5) సి 6) బి 7) ఎ 8) ఎ 9) సి 10) ఎ 11) డి 12) బి 13) బి 14) సి 1 5) ఎ 16) ఎ 17) బి 18) ఎ 19) బి 20) ఎ నిర్వహణ: శివ మల్లాల -
కేకో కేక...
రామ్‌చరణ్ అండ్ టీమ్ లొకేషన్లో కేక్ కట్ చేశారు. ఏంటీ? అప్పుడే షూటింగ్ పూర్తయ్యిందా? అని ఆశ్చర్యపోకండి. అందుకు టైమ్ ఉంది. నటి స్నేహ బర్త్‌డే సెలబ్రేషన్ కోసం సెట్లో కేక్ కట్ చేశారు. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాణంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. స్నేహ, ఆర్యన్ రాజేశ్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి ‘విజయ విధేయ రామ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోందనీ, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. శుక్రవారంతో 37వ వసంతంలోకి అడుగుపెట్టారు స్నేహ. ఈ సందర్భంగా సెట్లోనే ఆమె బర్త్‌డే వేడుకలు జరిగాయి. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ షెడ్యూల్ కంప్లీటైన తర్వాత వైజాగ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని టాక్. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. -
ఒక అమ్మాయి.. ఇద్దరు ప్రేమికులు
సూర్య, మనీష్ హీరోలుగా, స్నేహ హీరోయిన్గా ఎల్.వి. రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఫ్రెండ్షిప్ వెర్సస్ లవ్’. లోలుగు సుజయ్ నాయుడు సమర్పణలో నయన్ షా ఫిలిమ్స్ పతాకంపై గుండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఎల్.వి.రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘ఒకే అమ్మాయిని ఇద్దరు స్నేహితులు ప్రేమిస్తే ఎదురయ్యే పరిణామాలేంటి? స్నేహానికి సవాలుగా నిలిచిన ప్రేమలో ఎవరు విజయం సాధించారు? అనే నేపథ్యంలో రూపొందిన మా చిత్రం యువతరం ప్రేక్షకులతో పాటు అందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. ‘‘ముక్కోణపు ప్రేమ కథా చిత్రమిది’’ అన్నారు గుండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: ఘంటసాల విశ్వనాథ్. -
యూరోప్ పోదాం చలో చలో
హైదరాబాద్‌లో విలన్స్ అందర్నీ చితకబాదిన తర్వాత హీరోయిన్‌తో ఓ డ్యూయెట్ పాడనున్నారట రామ్‌చరణ్. ఆ డ్యూయెట్ కూడా ఫారిన్లో పాడుకోనున్నారు. అందుకే హీరోయిన్‌తో కలసి యూరోప్ వెళ్లనున్నారని సమాచారమ్. రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, ఆర్యన్ రాజేశ్, ప్రశాంత్, స్నేహా ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించి హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇంటర్వెల్ సీన్స్‌కు సంబంధించిన ఈ ఫైట్‌లో 200మంది ఫైటర్స్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆగస్ట్‌లో ఓ ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట బోయపాటి శ్రీను. దానికి సంబంధించిన లొకేషన్స్ కూడా ఫిక్స్ చేశారట. ఈ షెడ్యూల్లో సాంగ్స్‌తో పాటు హీరో హీరోయిన్‌పై కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించనున్నారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. -
కొత్త ఇంట్లోకి...
మరో మూడు రోజుల్లో కొత్త ఇంట్లోకి అడుగుపెడుతున్నారు రామ్‌చరణ్. గృహప్రవేశం తేదీ కూడా ఫిక్స్ అయిపోయింది. ఈ నెల 21న కుటుంబ సభ్యులు, బంధువులందరితో కలిసి కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోతారట. ‘రంగస్థలం’ సినిమా సూపర్ సక్సెస్‌తో రామ్‌చరణ్ కొత్త ఇంటికి మారిపోయారని అనుకుంటే పొరబాటే. ఈ గృహప్రవేశం రియల్‌గా కాదు... రీల్‌గా. విషయం ఏంటంటే.. బోయపాటి శ్రీను డైరెక్షన్లో చరణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్లో చరణ్ ఈ నెల 21 నుంచి పాల్గొంటారట. ఇప్పటివరకు ఇతర చిత్రబృందంతో సీన్స్ తెరకెక్కించారు. ఈ సినిమా సెట్లోకి చరణ్ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడే. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ఓ భారీ ఇంటి సెట్ రూపొందించారట. ఆ ఇంటి సెట్లో రామ్‌చరణ్‌తో పాటు ఇతర కీలక తారాగణంతో ముఖ్య సన్నివేశాలు తీయడానికి ప్లాన్ చేశారట. ‘రంగస్థలం’ సినిమాలో పల్లెటూరి కుర్రాడిలా కనిపించిన చరణ్ ఈ సినిమాలో ఫుల్ స్టైలిష్ మేకోవర్‌లో కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, స్నేహా, ఆర్యన్ రాజేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో పాటు బోయపాటి మార్క్ యాక్షన్‌తో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. -
పుట్టినిల్లు... మెచ్చినిల్లు
స్నేహ తన పుట్టినింట్లో గౌరవం అనే పుట్టుమచ్చ. ఏ మచ్చ లేకుండా ఎదగడమే పుట్టినింటి వైభవం. పెళ్లయ్యాక మెట్టినింటిని మేటి ఇల్లుగా చక్కదిద్దిన ఈ స్నేహ.. అత్తకు స్నేహితురాలు.. భర్తకి ప్రియనేస్తం. బిడ్డకు అమృతహస్తం.. మెట్టినిల్లు మెచ్చిన కోడలు. చాలా కూల్‌గా.. ఇంతకుముందుకన్నా ఇంకా అందంగా కనిపిస్తున్నారు.. మంచి స్పేస్‌లో ఉన్నారనిపిస్తోంది? స్నేహ: దేవుడు నా విషయంలో కైండ్‌గా ఉన్నాడు. ఇప్పుడనే కాదు నేనెప్పుడూ ఇలానే అంటుంటా. ఎందుకంటే మ్యారేజ్‌కి ముందు ఆ తర్వాత నా లైఫ్ స్మూత్‌గా ఉంది. ఇప్పుడైతే ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంది. దానికి కారణం మా అబ్బాయి ‘విహాన్’. మా (భర్త ప్రసన్న) లైఫ్‌లోకి విహాన్ వచ్చాక మా హ్యాపీనెస్ డబుల్ అయింది. మ్యారీడ్ లైఫ్ గురించి ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నారు. ఒక వివాహ బంధం సక్సెస్ అవ్వాలంటే మీరిచ్చే సలహా? అది చెప్పడం కష్టం. ఎందుకంటే ఒక్కో కపుల్ ఒక్కోలా ఉంటారు. మా ఫ్యామిలీలోనే చూడండి నేనొకలా, ప్రసన్న ఒకలా ఉంటాం. ‘ఇది చేస్తే మ్యారేజ్ సక్సెస్ అవుతుంది, ఇలా చేస్తే అవ్వదు’ అని రూల్స్ చెప్పలేం. మా పెళ్లయి జస్ట్ ఆరేళ్లే అయింది. ఈ ఆరేళ్లలో నేను తెలుసుకున్నది ఒకటే. మ్యారీడ్ లైఫ్ సక్సెస్‌ఫుల్‌గా సాగాలంటే ‘గివ్ అండ్ టేక్ పాలసీ’ ఉండాలి. మా మ్యారేజ్‌లో బెస్ట్ థింగ్ ఏంటంటే భార్యా భర్తలు కావడానికన్నా ముందు మేం మంచి ఫ్రెండ్స్. మేం ఎప్పుడూ గొడవపడలేదనను. ప్రతీ భార్య భర్త గొడవపడతారు. ఆ గొడవ తర్వాత మళ్లీ ఎలా కలుస్తాం అన్నది ముఖ్యం. కొన్నిసార్లు ఒక పూటలో మాట్లాడుకుంటాం. ఇంకోసారి రెండు రోజులు పడుతుంది. అయితే వారాలు, నెలలు సాగనివ్వకూడదు. ‘క్షమించడం– మర్చిపోవడం’ అన్నది చాలా ముఖ్యం. లవర్స్ నుంచి ‘మిస్టర్ అండ్ మిసెస్’ అవ్వాలనుకున్నాక ‘మ్యారేజ్ లైఫ్’ గురించి మీ ఇద్దరూ మాట్లాడుకున్న ముఖ్యమైన విషయం ఏంటి? ‘ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎంత గొడవపడ్డా మనం మాత్రం విడాకులు తీసుకోకూడదు’ అని మాట్లాడుకున్నాం. అది కేవలం ఒక మాటగా అనుకోవడం కాదు.. మా స్ట్రాంగ్ డెసిషన్ అది. మేమిద్దరం ఎంతో కష్టపడి మా అమ్మా నాన్నల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. అంత కష్టపడి ఒప్పించి, పెళ్లి చేసుకొని చిన్న గొడవ కోసం విడిపోతే ఇక ఆ కష్టానికి అర్థం ఏముంటుంది? నా భర్త 100% పర్ఫెక్ట్ అని ఎవ్వరూ చెప్పలేరు. నా భార్య 100% కరెక్ట్ అని ఎవరూ చెప్పలేరు. కొన్నిసార్లు భర్తది తప్పు అవ్వొచ్చు, కొన్నిసార్లు భార్యది అవ్వొచ్చు. తప్పులను క్షమించుకోవాలి. ఒక బంధం ఏర్పడాలంటే ఎన్నో కుదరాలి. అందుకే ఆ బంధాన్ని ఈజీగా తుంచేసుకోకూడదు. ఇంతకీ మీరు ‘అత్త ఉన్నా ఉత్తమ కోడలు’ అనిపించుకోగలిగారా? ఒకసారి మా మామయ్యగారు మా నాన్నగారితో ‘ఒకవేళ మా అబ్బాయికి మేం ఏరికోరి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసి, పెళ్లి చేసినా మీ స్నేహ అంత మంచి అమ్మాయిని తీసుకురాలేకపోయేవాళ్లమేమో’ అన్నారట. ఆ మాటలు విని, అత్తింట్లో తన కూతురు మంచి పేరు తెచ్చుకున్నందుకు నాన్నగారు చాలా ఆనందపడ్డారు. నిజానికి నన్ను ప్రసన్న పెళ్లి చేసుకోవడానికి వాళ్ల నాన్నగారు ఒప్పుకోవడానికి చాలా టైమ్ పట్టింది. అలాంటి ఆయన నా గురించి అలా అన్నారని మా నాన్నగారు చెప్పగానే ఆనందపడ్డాను. ఏ కోడలికైనా అత్తింటి నుంచి ఇంతకన్నా బెస్ట్ కాంప్లిమెంట్ ఏం ఉంటుంది? ఆ మాట నిలబెట్టుకోవడానికి నేను ట్రై చేస్తుంటాను. అత్తా–కోడళ్లంటే గొడవలే అని కాకుండా అత్తింట్లో ఇలా మంచి పేరు తెచ్చుకుంటే లైఫ్ స్మూత్‌గా ఉంటుంది కదా.. అవును. అత్తగారిలో అమ్మను చూడక్కర్లేదు. అలా చూడలేం కూడా. అయితే పెళ్లయిన కొన్నేళ్లకు ఇది సాధ్యపడుతుంది. అప్పుడు అత్తను కోడలు అమ్మలా.. కోడలిని అత్త కూతురిలా అంగీకరించగలుగుతారు. అత్తింట్లోకి వెళ్లేటప్పుడే ‘అత్త మనకు శత్రువు’ అనే ఫీలింగ్‌తో కోడలు వెళ్లకూడదు. ‘కొడుకుని మన నుంచి దూరం చేయడానికి ఓ అమ్మాయి వచ్చింది’ అని అత్త ఫీల్ అవ్వకూడదు. మంచి, చెడు ఏం జరిగినా కుటుంబంలో అందరూ కలసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే కాబట్టి.. అత్తింటి బంధంలో మంచిని చూడటం అలవాటు చేసుకోవాలి. ఓ ఇంటర్వ్యూలో ‘స్నేహ నన్ను చాలా మార్చింది’ అని ప్రసన్నగారు అన్నారు. ఏం మార్చారు? చాలా. డ్రెస్సింగ్ నుంచి వాకింగ్ వరకూ అన్నీ మార్చేశాను. ప్రసన్న గారి వాకింగ్ స్టైల్ బావుండదా? బావుండదని కాదు. ఇలా అయితే ఇంకా బావుంటుందని. ‘నేను చాలా మారాను. అంతా నీవల్లే. ఈ మార్పు చాలా బాగుంది’ అని ప్రసన్న నాతో చాలాసార్లు అన్నాడు. ఐ యామ్ హ్యాపీ. తనకోసం మీరేమైనా మారారా? ఏమీ లేదు (నవ్వుతూ). జన్రల్‌గా భర్తకి తగ్గట్టు మారే భార్యలే ఎక్కువ. అలాంటి ప్రెజర్ లేదంటే మీరు లక్కీయే? ఐ యామ్ హ్యాపీ. అలాగని మార్పు విషయంలో నేనూ ప్రసన్నను ఒత్తిడి చేయలేదు. నేను చెప్పింది కరెక్ట్ అనిపించి, మారాడు. పెళ్లి తర్వాత సినిమాలు మానేసి ఇంట్లోనే ఉండాలనుకున్నాను. ‘నో నో. ఎక్కువ సినిమాలు కాకపోయినా అప్పుడప్పుడు సినిమాలు చేస్తుండాలి’ అన్నాడు. ఏ పని చేసినా చాలా ఎంకరేజ్ చేస్తాడు. ఒక యాడ్‌లో ప్రసన్నగారు మీ కాలి గోళ్లకు నెయిల్ పాలిష్ వేస్తూ ఉంటారు. రియల్ లైఫ్‌లో అలా చేస్తారా? పాలిష్ మాత్రమే కాదు కాళ్లకు ఆయిల్ మసాజ్ కూడా ఇస్తుంటారు (నవ్వుతూ). భవిష్యత్తులో మీరు కూడా ఒక అమ్మాయికి అత్తగారే. అప్పుడు మీ కోడలితో ఎలా ఉండాలనుకుంటున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? నేను వెరీ కూల్ అత్త. కొందరు అత్తల్లా ‘ఈ టైమ్‌లో ఎక్కడికి వెళ్తున్నావు? ఏ డ్రెస్ వేసుకుంటున్నావు? ఏం తింటున్నావు’ అంటూ ప్రతిదీ ప్రశ్నించే అత్తలా ఉండను. మా అబ్బాయి తనతో హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ. ‘నేనెక్కువా? నీ భార్య ఎక్కువా?’ అనే సిచ్యుయేషన్స్ మా అబ్బాయికి క్రియేట్ చేయను. అసలు ఏ ఇంట్లో అయినా ఈ విషయంలోనే ఎక్కువ ప్రాబ్లమ్ వచ్చేది. మావాడికి తన భార్యే ఎక్కువ కావాలి. ఎందుకంటే వాడి జీవితాంతం నేను ఉండలేను. భార్య మాత్రం వాడి జీవితం ఆఖరి వరకూ ఉంటుంది. ఈ విషయం అర్థం చేసుకుంటే అందరి లైఫ్ చాలా బావుంటుంది. బాగా చెప్పారు. ఇక సినిమాల గురించి మాట్లాడుకుందాం.. ఎలాంటి రోల్స్ చేయాలనుకుంటున్నారు. డ్రీమ్ రోల్స్ ఏమైనా? అలాంటివి ఏమీ లేవు. ఇంకా మంచి రోల్స్ చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. ఇప్పటిదాకా తెచ్చుకున్న పేరును పోగొట్టుకోకూడదు. నెగటివ్ క్యారెక్టర్ చేయాలని ఉంది. మిమ్మల్ని నెగటివ్‌గా చూడటం కష్టమేమో? ఆ ఇమేజ్ బ్రేక్ చేయాలనుకుంటున్నాను (నవ్వుతూ). పాజిటివ్ క్యారెక్టర్స్ చాలా చేశాను. ఒక నెగటివ్ క్యారెక్టర్ కూడా ట్రై చేయాలని ఉంది. గ్లామర్ ఫీల్డ్‌లో క్లీన్ ఇమేజ్ తెచ్చుకోవటం చాలా కష్టం. కానీ మీరది అచీవ్ చేయగలిగారు. ఈ ఇమేజ్ ‘రెస్పాన్సిబుల్‌గా ఉండాలి’ అని ఎప్పుడూ గుర్తు చేస్తుంటుంది కదా? అవును. యాక్చువల్‌గా నాది ట్రెడిషనల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్. మా ఇంట్లో స్లీవ్‌లెస్ వేసుకోవడం అంటే పెద్ద విషయం. మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్. నేను ఇండస్ట్రీలోకి రావడం మా ఫ్యామిలీకి పెద్ద షాక్. మా నాన్నగారు నాతో రెండు నెలలు మాట్లాడలేదు. ఆ తర్వాత నేను రెస్పాన్సిబుల్‌గా ఉండటం చూసి, మాట్లాడటం మొదలుపెట్టారు. నా ఫస్ట్ మూవీలో ఒక సీన్లో స్లీవ్‌లెస్ వేసుకోవల్సి వచ్చింది. అప్పుడు మా నాన్నకు ఫోన్ చేసి ‘డాడీ నేను స్లీవ్‌లెస్ వేసుకున్నా.. ఐయామ్ సారీ’ అన్నాను. ‘నువ్వు కంఫర్ట్ అంటే ఓకే’ అన్నారు.. కానీ ఇప్పుడాయన గర్వంగా ఫీల్ అవుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను గ్లామరస్ రోల్ చేయలేదు. ఇప్పుడు అసలే చేయను. ఎందుకంటే మా అబ్బాయి చూస్తుంటాడు, మా అత్తగారు చూస్తారు. నేనెలా చేస్తాను? ఇప్పుడింకా రెస్పాన్సిబులిటీ పెరిగింది నాకు. మీ కెరీర్లో కాంట్రవర్శీ లేదు. కానీ ఈ మధ్య కొందరు హీరోయిన్లు ‘క్యాస్టింగ్ కౌచ్’ ఉందని, కొందరు లేదని అంటున్నారు. మరి.. మీరు? నమ్మరేమో.. ఫస్ట్ టైమ్ మీ నుంచే ‘క్యాస్టింగ్ కౌచ్’ అనే వర్డ్ వింటున్నా. వేరేవాళ్లు చెబుతున్న విషయాల గురించి నేను కామెంట్ చేయలేదు. నా కెరీర్ మాత్రం సాఫీగానే సాగుతోంది. కొత్త హీరోయిన్స్ మీతో ఫ్రెండ్లీగా ఉంటారా? నేను చాలామంది కొత్త హీరోయిన్స్‌ని చూశాను. వాళ్లను కలిసినప్పుడో, ట్రావెల్ చేస్తున్నప్పుడో నవ్వితే.. తిరిగి నవ్వరు కూడా. షాకింగ్‌గా అనిపిస్తుంది. నన్ను స్నేహాలాగా గుర్తించాల్సిన అవసరం లేదు. ఒక అమ్మాయి నవ్వినప్పుడు తిరిగి నవ్వితే ఏమవుతుంది? అంత యాటిట్యూడ్ ఎందుకు? వాళ్ల దగ్గరికి వెళ్లి ‘మీ సినిమాలు ఇచ్చేయండి’ అని అడగం కదా. మరి.. ఆ యాటిట్యూడ్ వాళ్లను ఎక్కడికి తీసుకెళుతుందో? పెళ్లి చేసుకున్న హీరో సినిమాలకు దూరమయ్యే ప్రసక్తే లేదు. మీలా పెళ్లి చేసుకున్న హీరోయిన్లు సినిమాలు తగ్గించాల్సిందేనా? అలా అని కాదు. నన్ను సినిమాలు మానేయమని నా అత్తింటివాళ్లు అనలేదు. ప్రసన్న కూడా ఎప్పుడూ ఆ మాట అనలేదు. మంచి రోల్స్ అనిపిస్తేనే చేస్తు్తన్నాను. ఎందుకంటే నెలలో 15–20రోజులు యాక్ట్ చేస్తూ మిగిలిన పది రోజులు విహాన్‌కి ఇచ్చేయాలనుకున్నా. విహాన్‌కి కేటాయించాల్సిన టైమ్‌ని ఓ సినిమాకి ఇచ్చానంటే ఆ సినిమా, నా క్యారెక్టర్ ఎంతో గొప్పవై ఉండాలని ఫిక్స్ అయ్యాను. మీరు షూటింగ్స్‌కి వెళ్లినప్పుడు విహాన్ని ఎవరు చూసుకుంటారు? మా అత్తగారు లేకపోతే అమ్మగారు. వాడికి జస్ట్ రెండున్నరేళ్లే. ఈ వయసు పిల్లలకు ఎక్కువ కేర్ అవసరం. నేను, అమ్మ, అత్తయ్య.. ఎవరో ఒకరు వాళ్లతో పాటు ఉండాల్సిందే. ఇంట్లో ఆడవాళ్లెవ్వరికీ వీలు పడకపోతే అప్పుడు విహాన్‌తో పాటు ప్రసన్న ఉంటాడు. ‘న్యూ జర్నీ స్టార్ట్ చేశా’ అంటూ ఈ మధ్య జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న ఫొటోలు ట్వీటర్లో షేర్ చేశారు. ఈ కొత్త జర్నీ దేనికోసం? నేనెప్పట్నుంచో జిమ్ చేస్తున్నాను. కానీ హెవీ వెయిట్స్ చేయలేదు. వాటివల్ల ఇంకా ఫిట్‌గా ఉండొచ్చనిపించింది. అందుకే మొదలుపెట్టాను. కొంత గ్యాప్ తర్వాత తెలుగులో సినిమా సైన్ చేయడంతో మీ ఫ్యాన్స్ హ్యాపీ. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో మీ పాత్ర? క్యారెక్టర్ని రివీల్ చేయలేను. అయితే నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే.. ఆడియన్స్ ఇంకా నన్ను ప్రేమగా వెల్కమ్ చేస్తున్నారు. ‘ఏ సినిమా చేస్తున్నారు? ఏ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు?’ అని ఆసక్తిగా అడుగుతున్నారు. ఈ ప్రేమ చూస్తుంటే ఎప్పటికీ మంచి రోల్స్ చేయాలనిపిస్తోంది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో నా రోల్ చిన్నదైనా ఒప్పుకోవడానికి కారణం ఆ పాత్ర బాగుంటుంది. ఆ మూవీలో ‘సూపర్ మచ్చీ...’ సాంగ్ పెద్ద హిట్టయిన విషయం గుర్తుండే ఉంటుంది. యాక్చువల్లీ ‘సూపర్ మచ్చీ..’ మీ స్టైల్ సాంగ్ కాదు. ఆ సాంగ్ షూట్ చేసే అప్పుడు ఎలా అనిపించింది? కరెక్టే. పైగా ఆ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు నేను ఫైవ్ మంథ్స్ ప్రెగ్నెంట్. అందుకే ‘సూపర్ మచ్చీ..’ నా మనసుకి చాలా దగ్గరైంది. ప్రెగ్నెన్సీ తాలూకు స్వీట్ మెమొరీస్‌లో ఈ సాంగ్ ఒకటి. ఫైనల్లీ మీ అల్లరి పిల్లాణ్ణి హీరోని చేస్తారా? హీరో అయితే హ్యాపీనే. చూద్దాం ఏమవుతాడో (నవ్వుతూ). – డి.జి. భవాని -
సిరిమల్లె పువ్వల్లె నవ్వు..
సినీతారలు గురువారం సిటీలో తళుక్కుమన్నారు. స్నేహ బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో వస్త్ర సంబంధ ఉత్పత్తులను ఆవిష్కరించింది. లావణ్య త్రిపాఠి, మాధవీలత ఏఎస్‌రావునగర్‌లోని వస్త్ర దుకాణంలో సందడి చేశారు. ఏఎస్‌రావునగర్: హీరోయిన్లు లావణ్య త్రిపాఠి, మాధవీలతఏఎస్రావునగర్లో గురువారం సందడి చేశారు. ఇక్కడఏర్పాటు చేసిన ‘అరిహంట్ ఫ్యాషన్ వరల్డ్’ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఫొటోలకు పోజులిచ్చి న్యూ కలెక్షన్స్ ప్రదర్శించారు. కార్యక్రమంలో నిర్వాహకులు సుమిత్జైన్, అమిత్‌జైన్, డీసీపీ రాధాకిషన్‌రావు, ఏసీపీ విద్యాసాగర్, కార్పొరేటర్ పావనీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శారీ సోయగం మాదాపూర్: చీరకట్టు మగువ అందానికి మరింత వన్నె తెస్తుందని సినీ నటి భవ్రశ్రీ అన్నారు. మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన సిల్క్ ఇండియా వస్త్ర ప్రదర్శనను ఆమెగురువారం ప్రారంభించారు. 21 రాష్ట్రాలకు చెందిన కళాకారులు రూపొందించిన చేనేత ఉత్పత్తులు, డ్రెస్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు మంజునాథ్తెలిపారు. సోషలైట్ స్నేహాచౌదరి తదితరులు పాల్గొన్నారు. స్నేహసౌందర్యం జూబ్లీహిల్స్:సినీ నటి స్నేహ సిటీలో మెరిశారు.హిందుస్థాన్యూనిలివర్నూతనంగా రూపొందించిన కంఫర్ట్ ప్యూర్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్కండిషనర్ను తాజ్‌కృష్ణా హోటల్లోగురువారం నిర్వహించిన కార్యక్రమంలోఆవిష్కరించారు. కార్యక్రమంలో చర్మ సంరక్షణ నిపుణురాలు డాక్టర్ రోహిణి వాద్వాని, పిల్లల వైద్య నిపుణులు ఉదయ్‌పాల్, కంపెనీ మార్కెటింగ్ హెడ్వందనసూరి తదితరులుపాల్గొన్నారు. -
స్నేహ సారీ!
తమిళసినిమా: నటి స్నేహకు దర్శకుడు మోహన్‌రాజ్ సారీ చెప్పారు. ఏమిటి నమ్మశక్యంగా లేదా నటి స్నేహ ఆవేదన వ్యక్తం చేశారు. మోహన్‌రాజా క్షమాపణ కోరారు. అర్థం కాలేదు కదూ! వివరంగా చెప్పాలంటే మోహన్‌రాజా తెరకెక్కించిన తాజా చిత్రం వేలైక్కారన్. శివకార్తికేయన్, నయనతార జంటగా నటించిన ఈ చిత్రంలో నటి స్నేహ కీలకపాత్రలో నటించారు. ఇటీవల విడుదలైన వేలక్కారన్ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. మార్కెట్లో విక్రయిస్తున్న నకిలీ పోషక పదార్థాల కారణంగా బిడ్డను పోగొట్టుకున్న పాత్రలో స్నేహ నటించారు. అవి నకిలీ పదార్థాలని నిరూపించి కార్పొరేట్ సంస్థలపై చర్యలు తీసుకునేలా పోరాటంలో భాగంగా స్నేహ మూడు నెలల పాటు తన బిడ్డకు ఇచ్చిన ఆహార పదార్థాలనే తింటూ మరణానికి దగ్గరగా తల్లి పాత్రలో చాలా సహజంగా నటించారు. అయితే చిత్రంలో తనకు సంబంధించిన సన్నివేశాలను చాలా వరకు తొలగించారని స్నేహ చిత్ర యూనిట్‌పై ఆరోపణలు చేశారు. స్పందించిన దర్శకుడు మోహన్‌రాజా చిత్రంలో స్నేహది చాలా కీలక పాత్ర అన్నారు. చిత్రంలో స్నేహ పాత్ర 90 రోజులు సాగేలా ఉంటుందన్నారు. వేలైక్కారన్ చిత్రంలో స్నేహ పాత్రకే ముందుగా మంచి పేరు వచ్చిందని తెలిపారు. అయినా ఆమె పాత్ర విషయంలో తాము తప్పు చేశామని భావిస్తే క్షమాపణలు చెపుతున్నామని దర్శకుడు మోహన్‌రాజా పేర్కొన్నారు. -
అత్త ఉన్న కోడలు ఉత్తమురాలు
మెట్టినిల్లు మెచ్చిన కోడలు ఆమె! మెట్టెల సవ్వడి కాదు ఆ ఇంట్లో వినపడింది... మెడల్స్ హోరు!! మొట్టికాయలు వేసే అత్తగారు కాదు... వీపు తట్టిన తల్లి ఆవిడ! కోడలు గొప్పది! ఆమె దీక్ష అనంతమైంది!! ఇంట గెలిచింది అత్తగారు... రచ్చ గెలిచింది కోడలు!! ‘‘అంట్లు తోమే చేతులు కావు... మెడల్స్ మోసే చేతులు ఇవి. పెళ్లయిందని నీ లక్ష్యాన్ని మార్చుకోనక్కర్లేదు అనేది నా అభిప్రాయం.. తర్వాత నీ ఇష్టం’’ అంటూ వంటింట్లో గిన్నెలు కడుగుతున్న కొత్త కోడలికి చెప్పారు అత్తగారు. ఆలోచనలో పడింది కోడలు. ఏవో భయాలు, ఇంకేవో బెదురు ఊహలతో ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన ఆమెకి ఆ ఇంటి వాతావరణం, అత్తగారి స్పందన చాలా చిత్రంగా అనిపించాయి. నిజం చెప్పాలంటే తెలియని భరోసా కలిగించింది. చాలా రోజులుగా అలాంటి ఆసరా కోసం చూస్తోంది. ఇల్లు ఊడ్వడం, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, వంట చేయడం... కోడలు పని కాదు అని అర్థం చేసుకుంది అత్తగారు! అవును... తన అత్తగారు సాక్షాత్తు అత్త రూపంలో ఉన్న అమ్మే! ఇన్నాళ్లూ నిస్సత్తువగా ఉన్న తన కాళ్లకు శక్తినిచ్చాయి ఆవిడ మాటలు. ఆవిడ ఆదరణ తన ఆశయాలకు జీవం పోసింది. ఆ ఆదరణతో! ఎస్.. తను పరుగెడుతుంది. ట్రాక్ తన ప్రపంచం! అది చుట్టేస్తుంది! నిర్ణయం తీసుకుంది. నిశ్చయమైపోయింది! ఇది స్నేహా జైన్ కథ. కోడలి సామర్థ్యాన్ని తెలుసుకుని, ఆమెను వంటింటికి పరిమితం చేయకుండా, ప్రపంచానికి పరిచయం చేసిన ఓ అత్తగారి కథ! స్నేహా జైన్ రాజస్థాన్ అథ్లెట్. వంద మీటర్ల స్ప్రింట్, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్ పోటీల్లో జాతీయ, ఆసియా ట్రాక్, ఫీల్డ్ రికార్డుల సృష్టికర్త. మాస్టర్స్ టోర్నమెంట్లలో 149 బంగారు పతకాలు సాధించిన బంగారు లేడి. 40 ఏళ్ల స్నేహా పరుగుల కెరీర్ పెళ్లి తర్వాతే వేగం పుంజుకుంది. అయిదేళ్ల వయసులో... స్నేహ ఐదో ఏట నుంచి పరుగే ఆమె వాహనం. వీధి చివర ఉన్న కిరాణా కొట్టుకు వెళ్లాలన్నా, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బడికి వెళ్లాలన్నా ఉరకడమే! నడక అనే మాటే లేదు. మధ్యలో వచ్చే చిన్న చిన్న దిబ్బలు, పిల్ల కాల్వల మీదుగా తేలికగా జంప్ చేయడమే.. జాగ్రత్తగా దాటడమనే ఊసే లేదు. ఆమెలోని ఈ ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు, బడిలో టీచర్స్... స్నేహను ప్రోత్సహించడం ప్రారంభించారు. అలా ఆమె రన్నింగ్ ట్రాక్ 1989లో రాజస్థాన్ పక్షాన నేషనల్స్‌లో పరుగులు తీసేవరకు వెళ్లింది... 1996 వరకు సాగింది. షాక్ అండ్ బ్రేక్ ఆ ఏడు (1996) బెంగళూరులో జరుగుతున్న నేషనల్ అథ్లెటిక్స్ స్క్వాడ్‌లో భాగమయ్యే భాగ్యం దొరికింది స్నేహకు. ఎంతో ఉత్సాహం గా ఉంది. అంతలోకే స్నేహ తల్లి మరణించిందనే విషాద వార్త స్నేహను హతాశురాలిని చేసింది. ఉన్నపళంగా నేషనల్ స్పోర్ట్స్ క్యాంప్ నుంచి బయలుదేరింది. అక్కడితో ఆమె పరుగు ఆగిపోయింది. అప్పటికే క్యాన్సర్ పేషెంట్ అయిన తల్లిని చూసుకోవడం కోసం ఇంటర్ మొదటి సంవత్సరంతోనే చదువు ఆపేసింది స్నేహ. అమ్మను ముంబైకి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించడం మొదలుపెట్టింది. ఆమె ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడమే కాకుండా, తన కంటె చిన్నవారైన తమ్ముళ్ల ఆలనాపాలనా కూడా స్నేహ మీదే పడింది. ఈ బాధ్యతలు చదువు మీదే కాకుండా ఆట తీరు పైనా ప్రభావం చూపాయి. అయినా సమయం చిక్కినప్పుడల్లా ప్రాక్టీస్ చేసేది. తల్లిని చూసుకోవడానికి అక్క వచ్చినప్పుడల్లా పోటీలకు వెళ్లేది. అలాగే బెంగళూరు వెళ్లింది. తల్లి మరణంతో షాకై ఇల్లు చేరింది. అప్పటి నుంచి కోలుకోలేదు. ట్రాక్ ఎక్కలేదు. పెళ్లి... దిగులుగా, ఏదో పోగొట్టుకున్నట్టుగా చెల్లెలు రోజులు వెళ్లదీస్తుంటే చూసి చలించిపోయింది స్నేహ అక్క. పెళ్లి చేస్తే కొత్త జీవితంలోకి అడుగు పెడుతుందని చెల్లికి పెళ్లి సంబంధం కుదిర్చింది. చెల్లెలి గురించి ఆ ఇంటి వాళ్లకు అంతా చెప్పింది. ఆమె పరుగుల రాణి అని, ఎక్కుపెట్టిన బాణంలా రివ్వున దూసుకెళ్తుందని, చెల్లి అందుకున్న పతకాలను చూపించింది. అవన్నీ స్నేహ అత్తగారి మెదడులో చెరగని ముద్ర వేశాయి. అలా 2000లో మూడు ముళ్లతో స్నేహ అత్తింటికి వచ్చింది. పెళ్లయిన తెల్లవారే కోడలిగా ఆ ఇంటి పనులు పంచుకోవడానికి వంటింట్లోకి వెళ్లింది. అప్పుడే అత్తగారు ఆ సలహా ఇచ్చింది. పరుగుల ట్రాక్ పైకి మళ్లీ... నాలుగేళ్లుగా పరుగు మరిచిపోయిన కాళ్లను సమాయత్తం చేయడం కష్టమని ప్రాక్టీస్‌లో తేలింది స్నేహకు. అయినా వెనకడుగు వేయలేదు. కాని పూర్వపు ఫామ్ రాలేకపోయింది. పోటీల్లో పతకాలు సాధించలేకపోయింది. అత్తగారు అంత ఎంకరేజ్ చేస్తున్నా తాను ఖాళీ చేతులతో ఇంటికి వస్తుంటే ఆమె ఏమనుకుంటుందోనని చాలా ఒత్తిడికి లోనైంది స్నేహ. ఇక్కడా ఆ అత్త అమ్మ మనసుతో ఆలోచించింది. ‘‘పతకాలు సాధించడం అనుకున్నంత తేలిక కాదని నాకు తెలుసు. శక్తి వంచన లేకుండా ప్రయత్నించడం మన ధర్మం. ఫలితం ఆ భగవంతుడి ఇష్టం. అధైర్యపడకు. నమ్మకం కోల్పోకు’’ అని కోడలి భుజం తట్టింది. అప్పటిదాకా భరించిన ఒత్తిడి మాయమైపోయింది స్నేహలో. ఈలోపే ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి కావడంతో మళ్లీ బ్రేక్. మళ్లీ ప్రాక్టీస్. మళ్లీ పోటీలు వచ్చేసరికి స్నేహకు 35 ఏళ్లు వచ్చేశాయి. నేషనల్ అథ్లెటిక్ కాంపిటీషన్‌కు ఆ వయసు వాళ్లకు అనుమతి లేదని తేల్చేశారు. నిరాశ పడుతుండగా, అత్తగారి చిరునవ్వు స్నేహలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అప్పుడే... అంటే 2007లో మాస్టర్స్ కాంపిటీషన్స్ ఉంటాయని, ఆ వయసు వాళ్లూ అందులో పాల్గొనొచ్చని స్నేహకు తెలిసింది. ఫస్ట్ మాస్టర్స్ టోర్నమెంట్‌లోనే లాంగ్‌జంప్ నేషనల్ రికార్డ్ సాధించింది. ఫుల్ ఫామ్‌లోకి వచ్చింది. పతకాల వేట ప్రారంభమైంది. పెళ్లి తర్వాత పాల్గొన్న ఈవెంట్స్‌లో 149 గోల్డ్ మెడల్స్ సాధించింది. అత్తగారి ఆశీర్వాదం ఫలించింది. 37వ మాస్టర్స్ నేషనల్ గేమ్స్‌లో 100 మీటర్ల రన్నింగ్, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, నాలుగు వందల మీటర్ల, పదహారు వందల మీటర్ల రిలే పోటీల్లో అయిదు బంగారు పతకాలు సొంతం చేసుకుంది. తన కూతురు ఆర్చి, కొడుకు వంశ్లకు రోల్‌మోడల్‌గా నిలిచింది. ‘‘పిల్లలకే కాదు ఈ దేశానికే రోల్ మోడల్ నా కోడలు’’అంటారు స్నేహ అత్తగారు. ‘‘కితాబు నాకివ్వడం ఆమె గొప్పతనం. ఆమె లేనిదే నేను లేను. అమ్మపోయిన దుఃఖంలో నా క్రీడలను పూర్తిగా మర్చిపోయాను. అలాంటి నన్ను మళ్లీ క్రీడాకారిణిగా నిలబెట్టారు అత్తమ్మ. ఆమెతో పాటు నా భర్త, మామగారు అందరూ నాకు అండగా నిలిచారు. నా సామర్థ్యాన్ని నిరూపించుకుని మంచి క్రీడాకారిణిగా నిలబడటానికి చేయూతనిచ్చారు. మన దేశంలో ఇలాంటి మెట్టినిల్లు దొరకడం నా అదృష్టం’’ అంటారు స్నేహా జైన్ చెమ్మగిల్లిన కళ్లతో. అయితే 2016లో మాస్టర్స్ టోర్నమెంట్లో 150వ మెడల్ కోసం శ్రీలంక వెళ్లినప్పుడు 1996లో సంఘటన స్నేహకు పునరావృతం అయింది. కార్డియాక్ అరెస్ట్‌తో మామగారు చనిపోయారని సమాచారం అందింది. హుటాహుటిని తిరుగుప్రయాణమైంది స్నేహ. అలా ఆమె కెరీర్లో 150 గోల్డ్‌మెడల్ మైలురాయిని దాటలేకపోయింది. కాని ఆమె వెనక అత్తగారున్నారు. ఆ విశ్వాసంతోనే స్నేహా జైన్ కసరత్తు మొదలుపెట్టింది. ఆల్ ద బెస్ట్ టు స్నేహ. – శరాది -
అమ్మతో అల్లువారి అమ్మాయ్
నో డౌట్... అల్లువారి అమ్మాయి కూడా స్టైలిష్ స్టారే! కావాలంటే... ఫొటో కోసం అమ్మ ఒడిలో చక్కగా నిలబడి అమ్మాయి ఇచ్చిన లుక్కుపై ఓ లుక్కేయండి! ఇప్పుడా అమ్మాయి వయసెంతో తెలుసా? జస్ట్... ఎలెవన్ మంత్స్! కానీ, ఆ నవ్వులోనూ... చూపులోనూ... ఎక్స్ప్రెషన్లోనూ... మంచి స్టైల్ ఉన్నట్టుంది కదూ! ఈ నెల 21న అర్హ (అల్లు అర్జున్–స్నేహ దంపతుల కుమార్తె) పుట్టినరోజు. ఈ సందర్భంగా స్పెషల్ ఫొటోషూట్ చేసినట్టున్నారు. అప్పుడప్పుడూ పిల్లలతో ఇటువంటి స్పెషల్ ఫొటోషూట్స్ చేసి, సోషల్ మీడియాలోని అభిమానులతో పంచుకోవడం అల్లు అర్జున్‌కి అలవాటు. ఈ ఫొటోనూ అదే విధంగా ఫేస్ బుక్‌లో అప్లోడ్ చేశారు. అభిమానుల నుంచి ఈ ఫొటోకి విపరీతమైన స్పందన వచ్చింది... ఒక లక్షా డబ్బై వేల రియాక్షన్లు, పన్నెండు వేల షేర్లు, బోల్డన్ని కామెంట్స్! -
రూ. 20 లక్షలు సాయం ప్రకటించిన నటి
టీనగర్(చెన్నై): ఢిల్లీలో ఆందోళన చేపట్టిన పదిమంది తమిళ రైతులకు నటి స్నేహ దంపతులు రూ. 20 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 41 రోజులుగా ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద తమిళ రైతులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం వారు తాత్కాలికంగా తమ ఆందోళనను విరమించారు. ఢిల్లీ ఆందోళనలో పాల్గొన్న పదిమంది రైతులకు రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. వారు ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమిళనాట నెలకొన్న కరువు పరిస్థితుల కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు. రైతులకు తమకు తోచిన సాయం అందజేసేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు. అలాగే అన్ని వర్గాలవారు రైతులను ఆదుకోవాలని కోరారు. -
టార్గెట్ @10
ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మహిళలు బరువు పెరగడం సహజమే. నటి స్నేహ కూడా బరువు పెరిగారు. తర్వాత కాస్త బరువు తగ్గారు కూడా. ఇప్పుడు ఇంకా బరువు తగ్గే పనిలో ఉన్నారు. ఏదో ప్రెగ్నన్సీ వల్ల పెరిగిన బరువో? డెలివరీ తర్వాత పెరిగిన బరువునో ఆమె తగ్గించాలనుకోవడంలేదు. అసలు తగ్గాలన్న ఉద్దేశం కూడా స్నేహకు లేదు. అయితే క్యారెక్టర్ డిమాండ్ చేసిందని తగ్గుతున్నారు. మొత్తం పది కిలోలు తగ్గాలన్నది ఆమె టార్గెట్. ఆల్రెడీ ఏడు కిలోలు తగ్గారు స్నేహ. మరో మూడు కిలోలు తగ్గాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే... ఆమెకంటే వయసులో ఏడాది చిన్నోడైన ఫాహద్ ఫాజిల్‌కి జోడీగా కనిపించనున్నారు స్నేహ. ‘ధృవ’ తమిళ మాతృక ‘తని ఒరువన్’ తర్వాత దర్శకుడు మోహన్ రాజా తీస్తున్న సినిమా ‘వేలైక్కారన్’. శివ కార్తికేయన్, ఫాహిద్ ఫాజిల్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో నయనతార, స్నేహ హీరోయిన్లు. ‘‘ఫాహిద్తో ఓ మలయాళ సినిమా చేశా. కానీ, అందులో మా కాంబినేషన్లో ఎక్కువ సీన్లు లేవు. ‘వేలైక్కారన్’ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా? అని ఎదురు చూస్తున్నా’’ అన్నారు స్నేహ. ఈ సినిమాలో వీలైనంత సన్నగా కనిపించాలని ఇంట్లోనే ఉదయం కార్డియో, సాయంత్రం వెయిట్ ట్రైనింగ్ వర్కౌట్స్ చేస్తున్నారామె. -
మలయాళం మనసిలాగునుండో!...కేరాఫ్ మాలీవుడ్!
నేంద్రమ్‌పళమ్ చిప్స్.. సూపర్ ఉళున్ను వడ.. అబ్బో దడదడ అవియల్... అదరహో కేరళ కుట్టి... కేక అర్థం కావడంలేదు కదూ.. నేంద్రమ్‌పళమ్ అంటే అరటికాయ చిప్స్.. ఉళ్లున్ను వడ అంటే మినప గారెలు.. అవియల్ అంటే కొన్ని రకాల కూరగాయలతో చేసే కూర.. కేరళ కుట్టి అంటే అర్థమయ్యే ఉంటుంది.. కేరళ అమ్మాయి అని. ఇప్పటివరకూ చాలామంది కేరళ కుట్టీలు తెలుగు తెరకు వచ్చారు. ఇప్పుడు సీన్ రివర్శ్. తెలుగులో ఇరగదీస్తున్న కుట్టీలు కేరళ వెళుతున్నారు. అది మాత్రమే కాదండోయ్... మన నటులు కూడా వెళుతున్నారు. మరి.. వీళ్లందరికీ ‘మలయాళం మనసిలాగునుండో’? అదేనండి.. మలయాళం అర్థమవుతుందా అని. మనసిలవకపోతే ఏంటి? అయితే ఏంటి? కళాకారులకు భాషతో పనేంటి? ఇక్కడివాళ్లు అక్కడ.. అక్కడివాళ్లు ఇక్కడ... మనం ఆర్టికల్ చదువుతూ ఇక్కడ... యువరానర్... షి ఈజ్ ద లాయర్! పుట్టింది కలకత్తాలో... పేరొచ్చింది తెలుగు సినిమాల్లో. అమల తల్లిది ఐర్లాండ్.. తండ్రిది బెంగాల్. అక్కినేని ఇంటి కోడలిగా అడుగుపెట్టిన మరుక్షణమే... చక్కటి చీరకట్టు, బొట్టు, చెరగని చిరునవ్వుతో తెలుగింటి కోడలు అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ అనేట్టు నిలిచారు. నాగార్జునతో పెళ్లి తర్వాత అమల నటనకు ఫుల్స్టాప్ పెట్టేశారు. మళ్లీ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. అయితే... ఈ ఇన్నింగ్స్‌లో భాషతో సంబంధం లేకుండా భావోద్వేగభరిత కథలకు ఓటేస్తున్నారు. ఇప్పుడామె ‘కేరాఫ్ సైరాభాను’ అనే మలయాళ సినిమా చేస్తున్నారు. సుమారు ఇరవైయేళ్ల తర్వాత అమల నటిస్తున్న మలయాళ చిత్రమిది. తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అమల అక్కినేని లాయర్ పాత్రలో నటిస్తున్నారు. మలయాళ సీనియర్ హీరోయిన్ మంజూ వారియర్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో అమల పాత్ర ఆమెతో సమానంగా ఉంటుందని చిత్రబృందం తెలిపింది. గతంలో అమల రెండు మలయాళ సినిమాలు చేశారు. రెండూ హిట్టే. ‘కేరాఫ్ సైరాభాను’తో ముచ్చటగా మూడో హిట్ అందుకోవాలని ఆశిద్దాం. కమాండర్... బియాండ్ ద లాంగ్వేజ్! అల్లు అర్జున్ స్ట్రయిట్ మలయాళ సినిమా ఒక్కటీ చేయలేదు. కానీ, అక్కడి స్టార్ హీరోలతో సమానంగా బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఉన్నాయి. ఈ సై్టలిష్ స్టార్ ప్రతి సినిమా మలయాళంలో డబ్బింగ్ కావడం కామన్. ఎప్పట్నుంచో బన్నీ ఓ మలయాళ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. అన్నయ్య కంటే ముందు తమ్ముడు అల్లు శిరీష్ మలయాళ సినిమా చేస్తున్నారు. మోహన్‌లాల్ హీరోగా చేస్తున్న ‘1971: బియాండ్ బోర్డర్స్’లో ఇండియన్ ఆర్మీ ట్యాంక్ కమాండర్‌గా అల్లు శిరీష్ నటిస్తున్నారు. ఇందులో శిరీష్‌పై ఓ పాట కూడా చిత్రీకరించారు. సినిమా విడుదలకు ముందే కేరళలో ఎక్కడికి వెళ్లినా.. అల్లు అర్జున్ తమ్ముడిగా శిరీష్‌ను గుర్తుపడుతున్నారట! దాంతో అన్నయ్య అర్జున్‌లా నాకూ మలయాళంలో మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నారు శిరీష్. ‘‘అన్నయ్య (అల్లు అర్జున్)పై కేరళ ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత చూసి, మలయాళ సినిమాలు, ఆ కల్చర్‌తో నేను ప్రేమలో పడ్డాను. అందుకే, మలయాళ సినిమా ఛాన్స్ రాగానే అంగీకరించా. ‘1971: బియాండ్ బోర్డర్స్’ వంటి దేశభక్తి సినిమా చేసే ఛాన్స్ మళ్లీ వస్తుందనుకోవడం లేదు. మా యూనిట్లో తెలుగు ఆర్టిస్ట్‌ని నేనొక్కడినే. అందరూ ఫ్రెండ్లీగా చూసుకుంటున్నారు. మనతో పోలిస్తే వాళ్ల యాక్టింగ్ సై్టల్ డిఫరెంట్‌గా ఉంటుంది. మోహన్‌లాల్‌గారు మొదలుకుని మలయాళ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు మన తెలుగులోకి వస్తున్నారు. నేను మలయాళ సినిమాలో నటించడం హ్యాపీ’’ అన్నారు అల్లు శిరీష్. స్నేహ.. ద గ్రేట్ మామ్! తెలుగమ్మాయి స్నేహ కూడా ఇప్పుడో మలయాళ సినిమా చేస్తున్నారు. మమ్ముట్టి హీరోగా నటిస్తున్న ఆ సినిమా పేరు ‘ద గ్రేట్ ఫాదర్’. ఇందులో హీరో వైఫ్‌గా, ఓ అమ్మాయికి తల్లి పాత్రలో స్నేహ నటిస్తున్నారట! ఆల్రెడీ స్నేహ పలు మలయాళ సినిమాలు చేశారు. గతంలో మమ్ముట్టితో రెండుసార్లు కలసి నటించారు. మరి, ఈ ‘గ్రేట్ ఫాదర్’ ప్రత్యేకత ఏంటంటే... తల్లైన తర్వాత స్నేహ చేస్తున్న తొలి చిత్రమిది. సినిమాలోనూ ఆమె తల్లిగానే నటిస్తున్నారు. చిన్న బ్రేక్ తర్వాత స్నేహ నటిస్తున్న సినిమా కావడంతో క్రేజ్ ఏర్పడింది. ఇందులో స్నేహ క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట! ‘ద గ్రేట్ ఫాదర్’ విడుదల తర్వాత స్నేహ కెరీర్ ఎలాంటి మలుపులు తీసుకుంటుందో ఎదురు చూడాలి. తమిళ హీరో ప్రసన్నతో వివాహానంతరం స్నేహ చెన్నైలో సెటిల్ అయ్యారు. ‘‘విహాన్ (స్నేహ కుమారుడు) జన్మించిన తర్వాత యాక్టింగ్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నాను. మధ్యలో కొన్ని మంచి అవకాశాలు వచ్చినా అంగీకరించలేదు. దర్శకుడు హనీఫ్ ‘ద గ్రేట్ ఫాదర్’ స్క్రిప్ట్ వినిపించిన తర్వాత నో చెప్పలేకపోయాను. చాలా పవర్ఫుల్ మదర్ క్యారెక్టర్. ఓ తల్లిగా, ఈ సినిమాలో ప్రస్తావిస్తున్న సమస్య గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం నా బాధ్యతగా భావించా. ఈ మలయాళ సినిమాతో పాటు ఓ తమిళ సినిమా కూడా చేస్తున్నా. మంచి ఛాన్సులొస్తే తెలుగులోనూ నటిస్తా’’ అన్నారు స్నేహ. 125 నాటౌట్... న్యూ ఇన్నింగ్స్! సెంచరీ ఎప్పుడో కొట్టేశారు శ్రీకాంత్. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా 125కు పైగా సినిమాల్లో నటించారాయన. తెలుగు ఇండస్ట్రీతో పాతికేళ్ల అనుభవం ఆయనది. ఇప్పుడు నటుడిగా మళ్లీ కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా నటించనున్న సినిమాతో శ్రీకాంత్ మలయాళ తెరకు పరిచయం అవుతున్నారు. శ్రీకాంత్‌తో పాటు తమిళంలో మంచి హీరోగా పేరు తెచ్చుకున్న తెలుగబ్బాయి విశాల్‌ను కూడా కీలక పాత్రకు ఎంపిక చేశారు. భారీ బడ్జెట్‌తో యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమా శ్రీకాంత్, విశాల్... ఇద్దరికీ మలయాళంలో మొదటిది. ఈ సినిమాతో మలయాళంలో ఎంట్రీ ఇస్తున్న మరో స్టార్ రాశీఖన్నా. తెలుగులో హీరోయిన్గా మంచి స్టార్ స్టేటస్ దక్కించుకున్న ఈ ఢిల్లీ డాల్, మోహన్‌లాల్ సినిమా కావడంతో ఓకే చెప్పారట. ఇందులోనే విశాల్‌కి జోడీగా హన్సిక నటించనున్నారని సమాచారం. ఒక్క సినిమాతో ఇంతమంది పరభాషా నటీనటులను మలయాళ తెరకు పరిచయం చేస్తున్న మోహన్‌లాల్‌పై అక్కడ సరదాగా జోకులు వేస్తున్నారు. ‘‘సినిమాలో ఆయా పాత్రలకు ప్రాముఖ్యత ఉంది కాబట్టే... తెలుగు, తమిళ స్టార్స్ శ్రీకాంత్, విశాల్ మా సినిమాలో నటించడానికి అంగీకరించారు. వాళ్ల స్క్రీన్ టైమ్ కూడా ఎక్కువే ఉంటుంది. అంతే కానీ, రెండు మూడు భాషల్లో సినిమా తీసే ఆలోచన మాకు లేదు. ఇది మల్టీ–లింగ్వల్ సినిమా కాదు. ప్రస్తుతం మలయాళంలో మాత్రమే తీస్తున్నాం. ఇతర భాషల్లో డబ్బింగ్ చెయ్యొచ్చా? లేదా? అనే నిర్ణయం తర్వాత తీసుకుంటాం’’ అని చెప్పారు చిత్ర దర్శకుడు బి. ఉన్నికృష్ణన్. గత ఏడాదే ఎంట్రీ ఇచ్చిన జగపతిబాబు ఫ్యామిలీ జానర్ కథానాయకునిగా పేరు తెచ్చుకుని, ఇప్పుడు విలన్‌గా జగపతిబాబు వీర విహారం చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాదే ఆయన కేరళ తెరకు పరిచయమయ్యారు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన ‘పులి మురుగన్’లో జగపతిబాబు విలన్‌గా నటించారు. ఆయన పాత్ర పేరు ‘డాడీ గిరిజ’. తెలుగులో ‘మన్యంపులి’గా విడుదలై ఇక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా, ‘పులి మురుగన్’ విడుదల తర్వాత జగపతిబాబు కేరళ వెళ్లినప్పుడు ఆయన పేరుతో కాకుండా ‘డాడీ గిరిజ’ అని పిలిచారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. ‘‘పొరుగు రాష్ట్రంలో అభిమానులను సంపాదించుకోవడం చాలా హ్యాపీగా ఉంది’’ అని జేబీ అన్నారు. మాలీవుడ్ నుంచి ఆయనకు మంచి అవకాశాలు వస్తున్నాయట. – సత్య పులగం -
శ్రీవారి మొక్కు తీర్చుకున్న అల్లు అర్జున్
తిరుమల: ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అల్లు అర్జున్, స్నేహ దంపతుల కూతరు అర్హ తలనీలాలలను స్వామివారికి సమర్పించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపం వద్ద వేద పండితులు బన్ని దంపతులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. -
బన్నీ ముద్దుల కూతురు 'అర్హా'
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రిస్టమస్ సందర్భంగా తన అభిమానులకు గిఫ్ట్ ఇచ్చాడు. తన ముద్దుల కూతురి ఫొటోను తొలిసారిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బన్నీ, తన కూతురి పేరు అర్హా అంటూ అభిమానులకు పరిచయం చేశాడు. అంతేకాదు తనకు ఆ పేరు ఎందుకు పెట్టారో కూడా వివరించాడు బన్ని. Arjun లో AR, Sneha లో HA లను కలిపి ARHA (అర్హా) అని పేరు పెట్టినట్టుగా వివరించాడు. అంతేకాదు ఆ పేరుకు హైదవంలో శివుడు అని ఇస్లాంలో శాంతి, నిర్మలం అనే అర్ధాలు వస్తాయని వివరించాడు. గతంలో క్రిస్టమస్ సందర్భంగా కొడుకు అయాన్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే బన్నీ.., ఈ సారి తన కూతురి ఫొటోను పోస్ట్ చేశాడు. బన్నీతో పాటు మరో యంగ్ హీరో ఆది కూడా తన ముద్దుల కూతురి ఫొటోలతో అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశాడు. Our newly arrived angel Ꭿllυ Ꭿrhα. Hindu meaning : Lord Shiva . Islamic meaning : Calm& Serene. "AR" jun & Sne "HA" together ARHA #AlluArha pic.twitter.com/eD40TFhMgh — Allu Arjun (@alluarjun) 25 December 2016 -
భర్త బ్యాటింగ్‌కు బౌలింగ్ చేసిన స్నేహ
భర్త ప్రసన్న బ్యాటింగ్ చేస్తే ఆయన భార్య నటి స్నేహ బౌలింగ్ చేశారు. ఈ క్రీడ చూపరులకు మహదానందాన్నిచ్చిందని వేరే చెప్పాలా? భార్యాభర్తలు ప్రసన్న, స్నేహ క్రికెట్ ఆడడమేమిటనేగా మీ కుతూహలం. స్టూడియో 9 సంస్థ అధినేత ఆర్కే.సురేశ్‌తో కలిసి 18 చిత్రాలకు పైగా డిస్ట్రిబ్యూషన్ చేసిన నాజర్ అలీ తాజాగా నారోమీడియా పేరుతో నూతన సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థ సీఈఓ అయిన ఆయన సీఓఓ అయిన రోఫినా సుభాష్ కలిసి హెచ్ఐవీ బాధితుల సహాయార్థం వారిని సంరక్షిస్తున్న స్వచ్ఛంద సంస్థల కోసం నిధిని సేకరించే కార్యక్రమంలో భాగంగా జస్ట్ క్రికెట్ పేరుతో క్రీడా పోటీలను నిర్వహించారు. నవంబర్ నుంచి డిసెంబర్ నాలుగు వరకూ జరిగిన ఈ పోటీల్లో చెన్నైకి చెందిన 32 జట్లు పాల్గొననున్నాయి. కాగా ఈ క్రికెట్ క్రీడ ఫైనల్ పోటీ ఈ నెల 11వ తేదీన స్థానిక నందనంలోని వైఎంసీఏ మైదానంలో జరిగింది. ఈ పోటీల ద్వారా వచ్చి నిధిని హెచ్ఐవీ బాధిత పిల్లల సంరక్షణ స్వచ్ఛంద సంస్థలకు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల కార్యక్రమాలకు ప్రసన్న, స్నేహలతో పాటు దర్శకుడు వెంకట్ ప్రభు, చెన్నై–28 చిత్రం నటుడు శ్యామ్, భరత్, నరేన్, బోస్‌వెంకట్ తదితర పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్ని క్రీడాకారులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా నటుడు ప్రసన్న బ్యాటింగ్ చేయగా నటి స్నేహ బౌలింగ్‌తో అదరగొట్టారు. అదే విధంగా స్నేహ బ్యాట్ పట్టగా ప్రసన్న బౌలింగ్ చేశారు. ఈ దృశ్యం చూపరులకు కనువిందు చేసింది. -
నయన చిత్రంలో స్నేహ
స్నిగ్ధ మనోహరి నటి స్నేహను మళ్లీ వరుసగా తెరపై చూడబోతున్నామన్నది సంతోషకరమైన సమాచారం. ఇంతకు ముందు పక్కింటి అమ్మాయిగా మనందర్నీ అలరించిన స్నేహ ఆ తరువాత భక్తిరస పాత్రల్లోనూ అద్భుత నటనతో రక్తికట్టించారు.అలాంటి మంచి నటి మూడేళ్ల క్రితం నటుడు ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకుని నటనకు దూరం అయ్యారు. ఇది ఆమె అభిమానులకు నిరాశ కలిగించిన అంశమే అవుతుంది. అలాంటి వారికి స్నేహ మళ్లీ చిన్న గ్యాప్ తరువాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారన్నది తాజా వార్త. గత ఏడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్నేహ మళ్లీ రీఎంట్రీ అవుతున్నారు. ఇప్పటికే మలయాళంలో అక్కడి సూపర్‌స్టార్ మమ్ముట్టికి జంటగా గ్రేట్ఫాదర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా తమిళంలో నటించడానికి పచ్చజెండా ఊపారన్నది తాజా సమాచారం. అయితే ఇందులో స్నేహ కథానాయకిగా నటించడం లేదట. లేడీ సూపర్‌స్టార్ నయనతార నాయకిగా నటించనున్న ఈ చిత్రంలో స్నేహ ఒక ముఖ్యపాత్రను పోషించనున్నారట. వివరాల్లోకెళితే తనీఒరువన్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించిన దర్శకుడు మోహన్‌రాజా తాజాగా శివకార్తికేయన్ హీరోగా చిత్రం తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని ప్రస్తుతం రెమో చిత్రాన్ని నిర్మిస్తున్న 24 ఏఎం.స్టూడియోస్ అధినేత ఎండీ.రాజా నిర్మించనున్నారు. ఇందులో శివకార్తికేయన్, నయనతార జంటగా నటించనున్నారు. ఈ చిత్రంలో నటి స్నేహ ఒక కీలక పాత్రను పోషించనున్నారట. దీని గురించి నిర్మాత తెలుపుతూ ఇందులో స్నేహ అక్కగానో, చెల్లెలిగానో నటించడం లేదన్నారు. చాలా ముఖ్యమైన పాత్రను చేస్తున్నారని, చిత్రం అంతా ఉండే ఈ పాత్ర ఆమె కెరీర్లో లైఫ్‌టైమ్ పాత్రగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఇందులో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, సతీష్, ఆర్జే.బాలాజి ముఖ్యపాత్రలను పోషించనున్నారట. త్వరలో చిత్రం సెట్‌పైకి వెళ్లనుంది. -
అమ్మ అవార్డులు
-
రీ ఎంట్రీ కలిసొస్తుందా?
హీరోయిన్లకు వివాహానంతరం అవకాశాలు రావడమే గగనంగా మారింది. అలాంటిది ఒక వేళ వచ్చినా అవి ఏ అక్కో, అమ్మో పాత్రలుగా ఉంటాయి. దక్షిణాదిలో పెళ్లి అయిన తరువాత నటీమణులు కథానాయకిలుగా రాణించడం అన్నది అరుదే. ఇటీవల భర్త నుంచి విడాకులకు సిద్ధమైన అమలాపాల్‌కు కోలీవుడ్‌లో అవకాశాలు ఎండమావిగా మారుతున్నాయని చెప్పవచ్చు. అంతకు ముందు అవకాశాలిస్తామన్న వారు కూడా ఇప్పుడు ముఖ చాటేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా నటి స్నేహ నాయకిగా రీఎంట్రీ అవుతున్నారు. ఈ భామ నటుడు ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు పండంటి బిడ్డ కూడా ఉన్నారు. వివాహనంతరం ఒకటి రెండు తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన స్నేహ ఆ తరువాత హీరోయిన్ పాత్రలు అయితేనే చేస్తానని తేల్చి చెప్పారు. దీంతో కోలీవుడ్, టాలీవుడ్ లలో అలాంటి అవకాశాలివ్వడానికి దర్శక నిర్మాతలు ముందుకు రాకపోయినా మాలీవుడ్ మాత్రం స్నేహ నటనా ప్రతిభను వాడుకోవడానికి ముందుకొచ్చింది. గ్రేట్ ఫాదర్ అనే మలయాళ చిత్రంలో మమ్ముట్టికి జంటగా నటించడానికి స్నేహ సిద్ధం అవుతున్నారు. తను ఇంతకు ముందు మమ్ముట్టితో రెండు చిత్రాలు చేశారన్నది గమనార్హం. అయితే వివాహానంతం నాయకిగా నటిస్తున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. ఇందులో మమ్ముట్టికి విలన్‌గా నటుడు ఆర్య నటించనుండడం విశేషం. మలయాళం మాతృభాష అయిన ఆర్య ఇంతకు ముందు అక్కడ కొన్ని చిత్రాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించారు. ఈ గ్రేట్ ఫాదర్ చిత్రంలో పవర్ఫుల్ విలన్‌గా నటించనున్నారట. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రంతో తన రీఎంట్రీ ముడిపడి ఉందని అంటున్నారట నటి స్నేహ. ఇది విజయం సాధిస్తేనే తదుపరి నటించే విషయం గురించి నిర్ణయం తీసుకుంటానని స్నేహ అంటున్నట్లు సమాచారం. అయితే ఈ రీఎంట్రీ తనకు మళ్లీ స్టార్‌డమ్‌ను తీసుకొస్తుందనే నమ్మకంలో ఉన్నారట. చూద్దాం స్నేహ ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తారో.