
తెలుగమ్మాయి స్నేహకు నాలుగు పదుల వయసు దాటినా అందం మాత్రం తగ్గడం లేదు. ఈమె పుట్టింది ముంబాయిలో అయినా పెరిగింది దుబాయ్‌లో.. నటిగా ఎదిగింది దక్షిణాదిలో. ప్రియమైన నీకు చిత్రంతో టాలీవుడ్‌లో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే సక్సెస్‌ను అందుకున్నారు. అదేవిధంగా తమిళంలో ఎన్నవళే చిత్రంతో పరిచయం అయ్యారు. ఆ తర్వాత నటిగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు. రెండు దశాబ్దాలకు పైగా నటిగా కొనసాగుతున్నారు.
చాలా తక్కువ సినిమాల్లో గ్లామర్ ప్రదర్శించినా స్నేహ పక్కింటి అమ్మాయి గానే ముద్ర వేసుకున్నారు. పలు విజయవంతమైన చిత్రాలను ఈమె తన ఖాతాలో వేసుకున్నారు. 2010లో నటుడు ప్రసన్నకు జంటగా అచ్చముండు అచ్చముండు చిత్రంలో నటించారు. ఆయనతో ఆ పరిచయం ప్రేమగా మారింది. 2012లో ప్రసన్నను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. రెండో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత స్నేహం నటనకు గ్యాప్ ఇచ్చి సంసార జీవితంలో మునిగిపోయారు. ఇటీవల కొన్ని వదంతులను ఎదుర్కొన్నారు.
స్నేహ ప్రసన్న మనస్పర్థల కారణంగా విడిపోయారని ప్రచారం జోరందుకుంది. అలాంటి వార్తలపై స్పందించిన ఈ జంట తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని, అదంతా అవాస్తమని స్పష్టం చేశారు. కాగా, 40 ప్లెస్‌లో ఉన్న స్నేహ తాజాగా రీఎంట్రీకి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. మధ్యలో కాస్త బొద్దు గా తయారైన స్నేహ ఇప్పుడు సన్నబడి మరింత అందంగా తయారయ్యారు. ఆమె లేటెస్ట్‌గా తీయించుకున్న ఫొటోలను మీడియాకు విడుదల జేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే నటిగా రీఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment